pss: suvarth pending : 25th dec 2025, validate once
లూకా సువార్త,, 21వ అధ్యాయము, 17వ వచనము.
(17) నా నామము నిమిత్తము మీరు మనుషుల చేత ద్వేషించు బడుదురు.
భగవంతుడు లేక దేవుని కుమారుడు తెల్పిన జ్ఞానము సాతాను అవహించి ఉన్న ప్రజలందరికీ వ్యతిరేఖముగా ఉండును. సాధారణ ప్రజలకు అర్థముగాక చెప్పెడి జ్ఞానము అపార్థమగు అవకాశము గలదు. అంతో ఇంతో జ్ఞానులయి బోధకులుగానున్న గురువులవలె చలామణి అగువారికి పూర్తి వ్యతిరేఖతగా కనిపించును. దేవుని నామమును బోధించువారి యొక్క వాక్యములు దేశములోని పండితులకు, బోధకులగు గురువులకు సరిపడవు. వారికి దేవుని వాక్యములన్నీ వ్యతిరేఖముగా కనిపించుట వలన వారును, వారిని అనుసరించు మనుషులును దైవమార్గమును బోధించు వారిని ద్వేషించుటకు మొదలు పెట్టుదురు. అందువలననే పై వాక్యములో దేవుడు “నా నామము నిమిత్తము మనుషుల చేత ద్వేషింపబడుదురన్నాడు.”
--------------------
మార్కు సువార్త, 8వ అధ్యాయము, 38వ వచనము.
(38) నన్ను గూర్చియు, నా మాటను గూర్చియు సిగ్గపడు వాడెవడో వానిని గూర్చి మెనుష్య కుమారుడు తని తండ్రి మహిమగలవాడై ఏచ్చెనప్పుడు సిగ్గుపడును.
కొందరు నమాజములో జ్ఞానమును తెలుసుకొనుచూ తాను అలా తెలుసుకోవడము ఎవరికీ తెలియకూడదనుకుంటారు. జ్ఞానము తెలుసు కోవడము ఏదో తప్పువని చేసినట్లు లెక్కించుకొని రహస్యముగా తెలుసుకొనుచుండురు. కొందరు గురువు దగ్గరకు పోయి జ్ఞానము తెలుసుకోవడము చిన్నతనముగా భావించి అది ఎవరికీ కనిపించనట్లు జాగ్రత్తపడుచుందురు. కొందరు గురు శిష్యులనిపించుకోవాలని తపన ఉండియు మేము ధనికులము, హోదా కల్గినవారము గురువు బీదవాడైతే బాగుండదు గురువు కూడా ధనికుడుగా ఉండవలయునని తలచి బీద గురువు దగ్గరకు పోయేదానికి సిగ్గుపడి జ్ఞానము సరిగా లేని ధనిక గురువునే ఎన్నుకొందురు. కొందరు గురువు వద్ద జ్ఞానము తెలుసుకొనుచున్నప్పటికీ తమ గురువుకు తమను శిష్యులుగా చెప్పుకోవడము ఇష్టము లేనివారై ఉందురు. ఇట్లు ఎందరో జ్ఞాన విషయములలో సిగ్గుపడుచూ తమ విషయము బయటికి తెలియకుండునట్లు జాగ్రత్తపడువారు గలరు.
ప్రపంచ విషయములలో సిగ్గుపడవచ్చును కానీ, పరమాత్మ జ్ఞాన విషయములలో సిగ్గుపడకూడదు. ఒక ఉదాహరణ చూస్తాము. ఒక దారిలో ఇద్దరు వ్యక్తులు పోతున్నారు. ఒకడు అందమైనవాడు, రెండవవాడు అందము లేనివాడు. అందమైనవాడు తెలివి తక్కువవాడు మరియు బీదవాడు, అందము లేనివాడు తెలివైనవాడు ధనికుడు. ఇద్దరూ దగ్గర సంబంధమైన బావ బావమరుదులే. దారిలో ఎదురగువారికి కనిపించునది వారి పైతందమే కాని లోపలి బుద్ధి కనిపించదు కదా! కొంతసేపటికి ఒక వ్యక్తి ఎదురుపడి అందమైన మొదటి వ్యక్తిని, రెండవ వ్యక్తి ఎవరు? అని అడిగాడు. రెండవవాడు అందముగా లేడు కదా! అటువంటి వానిని నా దగ్గర బంధువంటే ఏమి బాగుండునని నా బంధువని చెప్పుటకు సిగ్గుపడి ఇద్దరము పరిచయస్తులమని దారిలో పరిచయమేర్పడినట్లు ఎదుటి వానికి అర్థమయేలా చెప్పాడు. ఆ మాట రెండవవాడు విని నేను అందముగా లేనని ఇతను కూడా బావ అని చెప్పుటకు సిగ్గుపడి ఇలా పరిచయస్థుడని చెప్పుచున్నాడు కదా! అని అనుకున్నాడు. కొంత దూరము పోయాక మరియొకడు ఎదురుపడి రెండవ వానిని నీ ప్రక్కవాడెవడని అడిగాడు అప్పుడు రెండవవాడు తెలివైనవాడు కనుక మొదటివాడు చెప్పినట్లు ఇతను పరిచయస్థుడని చెప్పాడు ఆ మాట విని మొదటివాడు సంతోషపడినాడు నా బావమరిది అని రెండవవాడు చెప్పేదానికంటే పరిచయస్తుడని చెప్పడమే మంచిదని అనుకొన్నాడు. నేను అందముగా లేనని నన్ను బావని చెప్పే దానికి వీడు సిగ్గుపడ్డాడు కావున ఇంత తెలివి తక్కువవానిని నా బావమరిది అని చెప్పేదానికి సిగ్గుపడవలసిందేనని మొదటివాడు కూడా అనుకొన్నాడు. మొదటివానిని బట్టి రెండవవాడు నడచుకోవలసి వచ్చినది.
రెండవ మారు ఎదురుపడి రెండవవానిని అడిగినవాడు చాలా సంవత్సరముల నుండి ఒక నియమము పెట్టుకొని ఉండెను. ఎవరయినా దగ్గర బంధువులు ఎదురైతే వారికి పదివేల వరహాలు దానమియ్యవలెననెడిది వాని నియమము. వీరిద్దరూ బావ బావమరుదులైనప్పటికీ వారు బంధువుల మని చెప్పుకోక పరిచయస్తులని చెప్పడము వలన వారికి వచ్చే పదివేల వరహాలు రాకుండా పోయాయి. దానివలన బీదవాడైన మొదటివానికే వచ్చే ఆస్తి పోయినది. రెండవవాడు ధనికుడు కనుక వారికి ధనము వచ్చినా రాకపోయినా ఫరవాలేదు. మొదట సిగ్గుపడి పై చూవుతో అబద్ధము చెప్పుట వలన నష్టపోయినది మొదటివాడే. అలాగే జ్ఞానము బయటివారికి బాగా కనిపించదని జ్ఞానము పట్ల నీవు సిగ్గుపడితే జ్ఞానము కూడా నీ పట్ల సిగ్గుపడును అందువలన రాభోయే మోక్షమును లాభము రాకుండా పోవుచున్నది. దీనిప్రకారమే ప్రభువు కూడా “నన్ను గూర్చి నా మాటను గూర్చి ఎవడు సిగ్గుపడునో వానిని గూర్చి నేను కూడా సిగ్గుపడుదునని చెప్పెను.” ప్రభువు మాటలోని అర్థము తెలిసినవారమై ప్రపంచ విషయములో సిగ్గుపడినా ఫరవాలేదని పరమాత్మ పట్లుగానీ, పరమాత్మ జ్ఞానము పట్లుగానీ సిగ్గుపడకూడదని తెలియాలి.
మార్కు సువార్త, 9వ అధ్యాయము, 7వ పదవము.
(7) మేఘం ఒకటి వచ్చి వారిని కమ్ముకొనుగా "ఈయన నా ప్రియ కుమారుడు ,ఈయన మాట వినుడని" ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను.
ఆకాశములోనున్న మేఘముల గురించి చాలామందికి తెలియ దనియే చెప్పవచ్చును. వర్షాకాలములో మేఘములు ఉరుములను పుట్టించి పెద్ధ శబ్దమును చేయుచుండును. మేఘములు సజీవమైనవి. అవి చేయు పనులు చాలాయున్నవి. అయినా మేఘముల కార్యములు ఎవరికీ తెలియవు. సృష్టి ఆదిలో మొదట మేఘములే దేవుని జ్ఞానమును చెప్పగా, దానిని సూర్యుడు విన్నాడు అని చరిత్ర చెప్పుతున్నది. భూమిమీద మేఘములకు తెలియని రహస్యము ఏదీ లేదు. మేఘాల రూపములో మేఘముల చాటున ఉన్న దేవుడు ఏసును గురించి అక్కడి ప్రజలకు “ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినండి” యని చెప్పడమైనది. అలా చెప్పడము వలన ఏసు చెప్పే దేవుని జ్ఞానమును ప్రజలు వినవలెనని దేవుని అభీష్టము. దేవుడు మనిషివలె చెప్పునది దేవుని జ్ఞానమే అయినా, మనిషి చెప్పునది మనుషులు వినవచ్చుడు దేవుడే మేఘముల నుండి చెప్పడమైనది. అలా చెప్పుట వలన ఎదురుగా చెప్పు మనిషికి విలువ ఇవ్వకున్నా, మేఘములు చెప్పుమాటకు మనుషులు విలువ ఇచ్చుట వలన దేవుడు ఆకాశములోనున్న మేఘముల నుండి చెప్పాడు.
మార్కు సువార్త, 10వ అధ్యాయము, 17, 18వ వచనములు.
(17) ఏసు బయిలుదేరి మోర్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తుకాని వచ్చి ఆయనే ఎదుట మోకాళ్ళూని “సద్బోధకుడా, నిత్య జీవనమునకు వారనుడేనుగుటకు నేనేమి చేయవలెనని ఆయనేను అడిగెను.”.
(18) ఏసు “నన్ను సత్పురుషుడు డని ఏల చెప్పమన్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు.”
ఈ గ్రంథము తెలుగులోనికి అనువాదము చేసిన గ్రంథము. బైబిలు గ్రంథమును మొదట ఏ భాషలో వ్రాశారో నాకు తెలియదు. కొందరు క్రైస్తవ పెద్దలు ఈ గ్రంథమును మొదట హెబ్రీ భాషలో వ్రాశారు అని అంటున్నారు. హెబ్రీ భాష నుండి అనేక భాషలలోనికి అనువదింపబడుచూ వచ్చి, తెలుగు భాషలోనికి కూడా అనువాదము చేయబడినది. అనువదించిన వారు తెలుగు భాషా పండితులు కాదనీ, అందువలన కొన్ని పదములను సరిగా వ్రాయలేకపోయారనీ తెలియుచున్నది. ఈ వాక్యములో పైన ‘సద్యోధకుడా యని’ చెప్పి, క్రింద ‘సత్పురుషుడా యని’ చెప్పినట్లు వ్రాశారు. తర్వాత ఏను అడిగిన దానినిబట్టి “దేవుడు ఒక్కడే సత్‌పురుషుడు” అన్న దానినిబట్టి అక్కడ ఉండవలసిన పదము సద్బోధకుడు కాదు, సత్పురుషుడు కాదు అని తెలియుచున్నది. జ్ఞానమును బాగా బోధించవానిని ‘సద్బోధకుడు’ అని అనవచ్చును. అలాగే మంచి పనులను చేయు మంచి వానిని ‘సత్పురుషుడు’ అని చెప్పుదురు
భూమిమీద మనుషులలో మంచిగా బోధించు సద్బోధకులు ఉన్నారు, అట్లే మంచి ప్రవర్తన గల సత్పురుషులు ఉన్నారు. అందువలన వీరి స్థానములో దేవున్ని పెట్టి, దేవుడు ఒక్కడే సత్పురుషుడు అని చెప్పుట దేవున్ని తక్కువచేసినట్లుగును. అదియుకాక పైన చెప్పినది సద్బోధకుడనీ, క్రింద వాక్యములో చెప్పినది సత్పురుషుడనీ రెండిటికి పొంతన లేకుండా యున్నది. ద్వితీయ దైవగ్రంథమయిన బైబిలు మిగతా రెండు దైవ గ్రంథములకంటే ఎక్కువ భాషలలోనికి అనువదించబడినది. బైబిలు పదు నాలుగు వందల (1400) భాషలలోనికి అనువాదము చేయబడినది. అత్యధిక భాషలలోనికి అనువదింపబడిన గ్రంథము ద్వితీయ దైవ గ్రంథమయిన బైబిలు ఒక్కటేరుని చెప్పవచ్చును.
ద్వితీయ దైవగ్రంథమయిన బైబిలుకు, అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్కు అనుబంధము, అధారమయినది ప్రథమ దైవగ్రంథము. ప్రథమ దైవగ్రంథమైన తారాత్ (భగవద్గీత) గ్రంథములోని జ్ఞానమే మిగతా రెండు గ్రంథములలో కలదని సాక్ష్యము చెప్పుచున్నానని చివరి దైవ గ్రంథమయిన ఖుర్ఆన్ లో సూరా 5లో 44, 46, 48, 68 అయితేలలో చెప్పారు. అందువలన ఇక్కడ మార్కు సువార్తలో పదవ అధ్యాయములో 17, 18 వాక్యములయందు ఏ పదము వాడబడియుండును అని చూస్తే ప్రపంచములో సద్బోధకులు, సత్పురుషులు ఎందరియినా ఉండవచ్చును గానీ పురుషులలో ఉత్తమ పురుషుడు ఉండడు. అందువలన భగవద్గీతలో “దేవుడు ఒక్కడే పురుషోత్తముడు” అని చెప్పారు. దీనినిబట్టి పై వాక్యములో పురుషోత్తముడు అని ఉండవలసిన చోట మిగతా సంబంధము లేని పదములను వాడారు అని చెప్పవచ్చును. భగవద్గీత 15వ అధ్యాయము అయిన పురుషోత్తమ ప్రాప్తి యోగము అను అధ్యాయమున 16, 17, 18 శ్లోకములను చూస్తే ఈ విషయము బాగా అర్థమగును.
ప్రథమ దైవగ్రంథము ప్రకారము చూస్తే పురుషుడు అనువాడు ఒక్కడేయని చెప్పామా, పురుషుడు ఒక్కడే అయినా దేవుడు ముగ్గురుగా విభజింపబడినాడనీ, ఆ ముగ్గురి పేర్లు వరుసగా జీవాత్మ, అత్మ, పరమాత్మ యని కలవని చెప్పారు. అంతేకాక ముగ్గురి పురుషులలో మిగతా జీవాత్మ, అత్మకంటే ఉత్తముడయిన పురుషుడు పరమాత్మయని, అయననే పురుషోత్తముడు అని అంటున్నారని చెప్పారు. ఆ ముగ్గురు పురుషులు తప్ప మిగతా ఉన్నదంతా ప్రకృతియే అనియా, ప్రకృతియంతయా స్త్రీతత్త్వము కల్గియున్నదనియు, నేడు ప్రపంచములో యున్న మగవారు, ఆడవారు అందరూ స్త్రీతత్త్వమైన ప్రకృతికి సంబంధించినవారేయని చెప్పవచ్చును.
అందువలన ఏను పై వాక్యములో “నన్ను పురుషోత్తముడా (ఉత్తమ పురుషుడా)” యని అనవద్దు. దేవుడు ఒక్కడే ఉత్తమ పురుషుడని చెప్పెను. భూమిమీద మూడు ముఖ్యమైన మతములున్నవి. మూడు దైవ గ్రంథములను మూడు మతములవారు ఒక్కొక్క దానిని తీసుకొని ఇది మా గ్రంథము అని అంటున్నారు. వారి మతము వారిచేత అలా అనిపించుచున్నది. వాస్తవముగా మూడు గ్రంథములు ఏ మతమునకూ సంబంధించినవి కావు. మానవులందరికీ జ్ఞానమును అందించినవి మూడు గ్రంథములు, కావున అవి మూడు సమస్త మానవులకు చెప్పిన గ్రంథములుగా లెక్కించవలెను.
12 . మార్కు సువార్త, 16వ అధ్యాయము, 15, 16 వచనములు.
(15) నీరు నీర్వలగకమునకు వెళ్లి నీర్వ నీచ్చికి నువార్దను ప్రకటించుడి.
(16) నీన్ని బాప్పిన్నము పొందినవాడు రక్షింప బడును. నన్నుని పాదికి ఇక్క విధించబడును.
ఏను శిలువ వేయబడిన తర్వాత, ఆయన సమాధిలో పెట్టబడిన తర్వాత అదివారము తెల్లవారక మునుచే వేకువజామున ఏను సమాధి నుండి లేచి బయటికి రావడము జరిగినది. మొదట మద్దలేన మరియకు కనిపించడము జరిగినది. తర్వాత ఆయన శిష్యులకు కనిపించడము జరిగినది. మొత్తము ముచ్చది మూడుమార్లు ఏను సమాధి నుండి వచ్చిన తర్వాత కనిపించడము జరిగినది. అందులో ఒకమారు ఆయన పదకొండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు వారికి కనిపించి చెప్పిన మాటలలో పై రెండు వాక్యములు గలవు. ప్రపంచములోని మనుషులందరూ
అజ్ఞానములో మునిగియున్నారని, వారివద్దకు పోయి సువార్తయిన దేవుని జ్ఞానమును బోధించుమని చెప్పెను. అదే విషయమును 15వ వచనములో “మీరు సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి” అని చెప్పాడు. ఇక్కడ సర్వలోకములకు అని చెప్పి యున్నారు. సర్వలోకములు అనగా ఎక్కడోయున్న వేరు వేరు లోకములకు అని అర్థము చేసుకోకూడదు. భూమిమీద అనేక కార్యములు చేయుచూ, అనేక బాధలు పొందువారి వద్దకు పోయి అని అర్థము చేసుకోవలెను.
అంతేకాక “సర్వసృష్టికి సువార్తను ప్రకటించుము” అని అన్నాడు. సర్వసృష్టికి అనగా “పుట్టిన పెద్దవారికి గానీ, చిన్నవారికి గానీ అన్ని రకముల వయస్సు వారికి మంచి సమాచారమైన దైవజ్ఞానమును బోధించుము” అని చెప్పాడు. దైవజ్ఞానమును చెప్పడమేకాక వారు పరలోకమునకు పోవుటకు అనుమతియైన ‘బాప్తిస్మము’ను కూడా నా వాక్యమును గుర్తింపు పుట్టముగా ఇమ్మని చెప్పాడు. బాప్తిస్మము అనగా మోక్షమునకు (పరలోకమునకు) అనుమతిలాంటిది. అలా పరలోకమునకు అనుమతి పొందినవారు నా జ్ఞానము చేత రక్షణ పొంది పాప అనుభవముల నుండి తప్పించుకొందురు. అట్లు బాప్తిస్మము పొందనివారు పాపముల చేత రక్షణ లేక పాపముల వలన పచ్చ కష్టముల చేత శిక్షింపబడుదురని అని చెప్పాడు.