pss book: Chapter 1 త్రైత సిద్ధాంత భగవద్గీత: సాంఖ్యయోగం
Part1 Part2 త్రైత సిద్ధాంత భగవద్గీత: సాంఖ్యయోగం శ్లోకం 11 యొక్క భావము: ( ప్రకృతి , పరమాత్మ గురుంచి ): శోకింపతగని వాటిని గూర్చి నీవు శోకించుచున్నావు. మరియు నీ ప్రజ్ఞ (బుద్ధి) నెల్లనుపయోగించి మాట్లాడుచున్నావు. పండితులు గతులు కల్గిన మరియు గతులు లేని వాటిని గూర్చి బాధపడరు. శ్లోకం 12 యొక్క భావము: (జీవాత్మ గురుంచి ): నేను లేకుంటిననుట ఎప్పటికీ లేదు. నీవు ఎప్పటికీ ఉందువు. ఈ ధరణి పాలించు రాజులు కూడ ఎప్పటికీ ఉందురు. ఇక ముందు కూడ మనమందరము లేకపోవుటనునదే లేదు. శ్లోకం 13 యొక్క భావము: (జీవాత్మ గురుంచి ): దేహికి దేహమునందు బాల్యము, యవ్వనము,కౌమారము, ముసలి తనము వరుసగ ఎట్లు కల్గునో, అట్లే శరీరమును వదలిపోవడమను మరణము కూడ కల్గుచున్నది. శ్లోకం 14 యొక్క భావము: ( జీవాత్మ గురుంచి ): పంచతన్మాత్రలచేత, శీతోష్ణములు సుఖదుఃఖములు మానవులకు కల్గుచుండును. శీతోష్ణములు సుఖదుఃఖములు ఎప్పటికి ఉండునవి కావు. అశాశ్వతములైనవి. వచ్చిపోయెడు వాటిని ఆ కొద్దికాలము ఓర్చుకోవలయును. శ్లోకం 15 యొక్క భావము: ( జీవాత్మ గురుంచి ): ఎవడు సుఖదుఃఖ భేదములెంచుకొనడో, ఎవనికి వాని వ్...