important points from kaliyuga grandam

. దేవుని సృష్ఠిలో మొదట పుట్టినది స్త్రీ స్వరూపమైన ప్రకృతి. తర్వాత

పురుషస్వరూపమైన ఆత్మను పుట్టించాడు. ప్రకృతి ఆత్మలు అక్క తమ్ముడు అని అర్థము చేసుకోవలెను. తర్వాత ప్రకృతి

పరమాత్మలకు పుట్టినవాడు జీవాత్మ. ఆ లెక్క ప్రకారము జీవునికి ప్రకృతి తల్లికాగా, ఆత్మ మేనమామ అగుచున్నాడు.

దేవునికి మంచి పుత్రుడుగా, అక్షయునిగా పేరు గాంచిన వానిని సంవత్సరము అంటున్నాము. 108 కోట్ల సంఖ్యను

సంవత్సరములలో కలుపగా 108 కోట్ల సంవత్సరము లైనది. 108 కోట్ల సంవత్సరములు దేవుని పగలుగా గుర్తించారు.

-----------

ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణను

చెప్పుకొందాము.

భర్తకు విధేయతను చూపు భార్య, భార్యకు స్వతంత్రతను ఇచ్చిన భర్త, ఇరువురు కాపురము చేయుచుండగా

వారికి కొందరు మంచివారు, కొందరు చెడువారు సంతానమున్నారు. భర్త భార్యను పోషించగా, ఇంటిలోని భార్య తమ

పిల్లలకు అన్ని వసతులు కల్పించి, పిల్లల అన్ని పనులు చేయుచుండెను. ఒక ప్రక్క పిల్లలను సక్రమముగా చూచుకొంటూ,

మరొక ప్రక్క భర్తకు అనుకూలముగా అన్ని సేవలు చేయుచుండెను. రాత్రిపూట భర్త నిదురించు సమయమునకు

ముందే తమ పిల్లలను నిద్రపుచ్చుచుండెను. పిల్లల అల్లరి ఉంటే భర్తకు నిద్రపట్టదని, భర్తకు అసౌకర్యము కలుగకుండా

భర్త నిద్రకు ఉపక్రమించక ముందే పిల్లలను నిద్రపుచ్చి ఎవరినీ లేవకుండ చేయుచుండెను. అప్పుడు భార్య చేసిన

పనికి భర్త మెచ్చినవాడై, ఏ దిగులు లేకుండా నిద్రించుచుండెను. ఇదే విధముగనే ప్రకృతి భార్యగా, పరమాత్మ

భర్తగావుంటూ విశ్వమను గృహములో కాపురము చేయుచున్నారు. భర్తయిన పరమాత్మ ఏదీ పట్టించుకోకుండా

సంసారముతో సంబంధములేనట్లు ఉన్నాడు. భార్య అయిన ప్రకృతి తమ సంతానమైన జీవరాసులను అన్నీ తానై

చూచుకొంటున్నది. పిల్లల యొక్క అన్ని పనులను ప్రకృతియే చూచుకొంటు పరమాత్మకు ఏ సంబంధములేనట్లు

పిల్లలను పోషించుచున్నది. భర్త ఇంటికి వచ్చి నిద్రపోయే సమయానికి అనగా పరమాత్మకు రాత్రి సమయము వస్తూనే

సకల జీవరాశులను ప్రకృతియే నిద్ర పుచ్చినట్లు లేకుండా చేయుచున్నది. ప్రకృతి తన సంతానమైన జీవరాసులను

అవ్యక్తము చేయుచున్నది. ప్రకృతి ప్రళయమును సృష్టించి జీవరాసులను అంత మొందించుచున్నది. ప్రళయములో

చనిపోయిన జీవులు తర్వాత జన్మకు పోకుండా అవ్యక్తముగా ఉండిపోవుదురు. దేవుని రాత్రిలో ప్రపంచము ఉండదు.

కావున మొదట ప్రకృతిలో పుట్టిన జీవరాసులన్ని చివరిలో ప్రకృతి లోనే చనిపోయి ప్రకృతిలోనే అణిగిపోవుచున్నవి.

----------

ఈ విధముగా ప్రపంచము వేయియుగముల (యోగముల) కాలము ఉండుటకూ, వేయియుగముల కాలము

లేకుండుటకు, మొత్తము రెండువేల యుగముల కాలము ఒక కల్పముగా నిర్ణయింపబడుటకు మూలము మనిషి తలలోనే

కలదు. మనిషి తలలో బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములు నాలుగు బ్రహ్మనాడిలోని శక్తిని ఇరుసుగా చేసుకొని

తిరుగుచున్నవి. బ్రహ్మనాడి శక్తిని పరిశీలించి చూడగా అందులో ఆత్మశక్తి పైకి తెలిసినా, దానిలో కూడ పరమాత్మ శక్తి

వ్యాపించియున్నది. ఇప్పుడు మూడు ఆత్మల స్థానములను వివరించుకొంటే, జీవాత్మ గుణచక్రములోని మూడు భాగము

లలో ఏదో ఒక దానియందు అతి స్వల్పమైన సూక్ష్మబిందువుగా ఉన్నది. రెండవదైన ఆత్మ బ్రహ్మనాడిని కేంద్రముగా

చేసుకొని నాడుల ద్వారా శరీరమంతా వ్యాపించి ఉన్నది. ఆత్మ శరీరములో మాత్రమే ఉన్నది. శరీరము బయట లేదని

జ్ఞాపకముంచుకోవలెను. మూడవదైన పరమాత్మ మాత్రము శరీరములోపలా, శరీరము బయటా అణువణువునా వ్యాపించి

యున్నది. ప్రతి శరీరములోనూ పరమాత్మశక్తి రెండువేల చైతన్య శక్తులుగా మారి ఆత్మయందు చేరిపోయినది. ఆత్మ

చైతన్యశక్తి పరమాత్మ శక్తియేనని తెలియవలెను. రెండువేల చైతన్యములుగానున్న శక్తి జీవశరీరములోనున్నది. రెండువేలలో

ఐదువందల (500) యూనిట్లశక్తి జీవాత్మలో చేరియున్నది. (ఒక చైతన్యశక్తిని ఒక యూనిట్గా చెప్పడమైనదని

గమనించవలెను.) రెండువేల యూనిట్లశక్తిలో 500లు జీవాత్మయందుండగా, బ్రహ్మనాడిలోని ఆత్మయొక్క ఏడునాడీ

కేంద్రములలో మొదటి స్థానమైన సహస్రారమునందు 500ల యూనిట్ల శక్తియుండగా, రెండవ స్థానమైన ఆగ్నేయ

నాడీకేంద్రమున ఆత్మశక్తి 500 యూనిట్లు ఉన్నది. తర్వాత మూడవ నాడీకేంద్రమైన విశుద్ధమందు 250 యూనిట్లు

ఉండగా, నాల్గవ స్థానమైన అనాహత స్థానమందు 125 యూనిట్ల శక్తి ఉన్నది. తర్వాత ఐదవ నాడీకేంద్రమైన

మణిపూరకమందు 62.1/2 యూనిట్లు ఉండగా, ఆరవ నాడీకేంద్రమైన స్వాధిష్ఠానమునందు 31.1/4 చైతన్యముల శక్తి

ఉన్నది. ఇక చివరి నాడీకేంద్రమైన ఆధారస్థాన మందు 31.1/4 యూనిట్లే ఉన్నది. ఈ విధముగా పరమాత్మశక్తి ఒక

సజీవ శరీరములో రెండువేల చైతన్యముల (యూనిట్ల) శక్తిగా ఉంటూ ఏడునాడీ కేంద్రములందు విభజింపబడి ఉన్నది.

శరీరములో పరమాత్మశక్తి ఆత్మ భాగములుగానున్న విధానములను చిత్రరూపములో ప్రక్క పేజీలలో చూడండి.

--------

 ****స్థూలముగా జీవునికి వర్తించు విషయములనే సూక్ష్మముగా దేవుని విధానములో చెప్పబడి

ఉన్నవి. ఉదాహరణకు ప్రకృతి పరమాత్మలు భార్యా భర్తలుగా ఉన్నారని చెప్పుచున్నాము. అయితే ఆ విషయము

సూక్ష్మముగా జ్ఞాన సమాచారముగా ఉన్నది. అదే విషయమే స్థూలముగా ఒక పురుషుడు, ఒక స్త్రీ భార్యాభర్తలుగా

ఉండడముగా కనిపిస్తుంది. ప్రకృతి పురుషులకు జీవులు సంతతిగా ఉన్నారని చెప్పడము సూక్ష్మముగా ఉన్న జ్ఞాన

సమాచారము కాగా, అదే సమాచారము ప్రత్యక్షముగా స్థూలముగా భూమిమీద అందరికి తెలియునట్లు కలదు. ప్రకృతి

ఒక్కటే, దేవుడు ఒక్కడే, వారికి పుట్టిన జీవులు అనేకము (ఒక్కటి కాదు.) అదే విధముగా తల్లి ఒక్కతే, తండ్రి ఒక్కడే.

జంటకు పుట్టిన బిడ్డలు ఎక్కువమంది అని బయటప్రపంచములో ప్రత్యక్షముగా కనిపిస్తున్నది. ఈ విధముగా కొన్ని

దేవున్ని ఉద్దేశించి చెప్పిన జ్ఞాన విషయములు అందరికీ అర్థమగునట్లు ప్రత్యక్షముగా ఉన్నాయనీ, వాటిని ఎవరూ

కాదనలేరనీ చెప్పవచ్చును.

------------------

అయినా ప్రకృతిని కొంతవరకు అంచనా వేయవచ్చును. అంతేకానీ ప్రకృతిని కూడా పూర్తి తెలియలేము. ఆకాశము

హద్దే తెలియదు. దగ్గరున్న మేఘము యొక్క విషయమే పూర్తి ఎవరికీ తెలియదు. పొగరూపములోనున్న మేఘము

ఘనరూపములోనున్న ఎన్నో జీవరాసులను, ఎన్నో వస్తువులను, ఎన్నో నీళ్ళను, ఎన్నో జలచరము లను కనిపించకుండ

దాచియుంచుకొన్నదను విషయము ఎవరికీ తెలియదు. చిన్న మేఘము యొక్క విషయమే మనకు తెలియనపుడు****

అంతపెద్ద ప్రకృతి విషయము ఎప్పటికీ తెలియలేము. ప్రకృతికంటే పెద్ద అయినవాడు, ప్రకృతికి భర్త స్థానములోనున్నవాడు

అయిన దేవుడు మాకు తెలుసు అనినా, దేవున్ని మేము చూచాము అనినా, మేము దేవుడైపోయాము అనినా

మాటలన్నిటిని విని నవ్వవలసిందే తప్ప ఏమీ చేయలేము. అలా అన్నవారిని చూచి ప్రకృతి కూడా నవ్వుకుంటుదనియే

చెప్పవచ్చును. ప్రకృతియే గుణరూపములో మాయ అను పేరుతో మనిషి శరీరములో ఉన్నది.

స్థూలముగా బయట కనిపించు ప్రకృతి, సూక్ష్మముగా కనిపించని మాయగా శరీరములో ఉంటూ***, నన్నే తెలియలేని

వానివి నాభర్తను తెలియ గలవా? నన్ను దాటిపోవడమే ఎవరికీ సాధ్యముకాదే, అలాంటిది దేవున్ని చూచాను అంటావా?

అని వానికి దేవుని ధ్యాస, దేవుని జ్ఞానము తెలియ కుండా చేయును. వాని తలలో వానికి నాకు దేవుడు తెలుసునను

జ్ఞప్తినే యుంచి నాకు జ్ఞానముతో పనిలేదనుకొనునట్లు చేయును. శరీరము బయట ప్రకృతి రూపములో, శరీరము

లోపల గుణరూపములో మాయకలదు. ఈ సృష్ఠిని సృష్టించేది సృష్ఠికర్త దేవుడేకాగా, సృష్టించబడిన దానినంతటిని

నడిపించుచూ పాలించునది ప్రకృతి (మాయ). దేవుడు ఎప్పటికీ ఉండువాడే, అయితే ప్రకృతి మాత్రము దేవుని పగలు

మాత్రముంటూ, దేవుని రాత్రిలో మాత్రము అదృశ్యమై దేవునియందే అణిగిపోవును. ప్రకృతి ఉంటే జీవరాసులు వాటి

మనుగడ ఉంటుంది

-----------

************

 నేను సత్యమునే చెప్పుచున్నాను అంటే దానికంటే ముందు నేను జీవున్ని కాదు అని చెప్పాలి.

నేను జీవుడనని చెప్పితే ఇంతవరకు ఎవరికీ తెలియవని చెప్పిన రహస్యములు అన్నీ అందరికీ అసత్యములుగా కనిపించును.

చెప్పిన జ్ఞానమంతా అసత్యము కాదు సత్యమే అంటే, నేను జీవుడను కాదు అని చెప్పవలసివస్తుంది. ఇటువంటి కష్ట

పరిస్థితిలో దారి తెలియక ఇబ్బందిపడకుండుటకు కొన్ని నిమిషములు ఆలస్యమైనా నా నుండి సరియైన జవాబే

బయటకు వచ్చింది. ఆ జవాబు ఇలా కలదు. ప్రతి మనిషిలోనూ జీవాత్మ, ఆత్మ రెండు గలవు. జీవాత్మ అన్నిటిని

శరీరములో అనుభవించువాడుకాగా, అనుభవింపజేయునది ఆత్మ కలదు. జీవునికి శరీరములో అనుభవమునకు

వచ్చిన విషయములే తెలుసు. అయితే ఆత్మకు శరీరములో జీవుని అనుభవమునకు రాని అన్ని పనుల వివరము

తెలుసు. వివరముగా చెప్పితే మరణములోగానీ, జననములోగానీ, అట్లే ప్రళయ ప్రభవములలోగానీ, జీవునికి తెలియనిది

ఏదైనా అన్నీ శరీరములోని ఆత్మకు తెలుసు. ఇంతవరకు చెప్పిన జ్ఞానమంతా మేము చెప్పినదే, కానీ నేను చెప్పినది

కాదు. నా ఆత్మ చెప్పితే నాకు తెలిసింది, కానీ నాకు స్వయముగా తెలియదు. అందువలన వ్రాసిన గ్రంథములు,

చెప్పిన జ్ఞానము అంతా నాదికాదనీ, నా ఆత్మదనీ తెలియవలెను. మీ శరీరములో కూడా ఆత్మ కలదు. దానికి కూడా

అన్నీ తెలుసు. అయితే మీ ఆత్మను మీరు ఏమీ అడగలేదు. మీ శరీరములో మీతోపాటు ఒక ఆత్మ ఉందని మీకు

తెలియదు. మీ శరీరములో ఆత్మ ఎక్కడున్నదో, ఎలా ఉన్నదో, దాని పనేమిటో, దానితో ఎలా మాట్లాడాలో నీవు

తెలియగలిగితే నాకు నా ఆత్మ చెప్పినట్లే, నీతో కూడా నీ ఆత్మ చెప్పగలదు. నీవంటే ఎవరో నీకే తెలియదు.

అటువంటపుడు నీ ప్రక్కనే ఉన్న ఆత్మ ఎలా తెలుస్తుంది? నాకు తెలిసినట్లు ఆధ్యాత్మిక రహస్యములు తెలియాలంటే

ముందు నిన్ను నీవు తెలుసుకో, శరీరములో నీవు ఎక్కడున్నావో తెలుసుకో, అక్కడ నీ పనేమిటో తెలుసుకో, ఆ తర్వాత

నీ ఆత్మ నీకు తెలుస్తుంది. అప్పుడు నా అంతటివానివి నీవు కూడా కావచ్చును.

--------

యోగమున 16,17, శ్లోకములలో చెప్పినట్లు దేవుడు మూడు భాగములుగా ఉన్నాడు. దానినే ముగ్గురు పురుషులుగా

అక్కడ చెప్పడము జరిగినది. క్షర పురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అను ముగ్గురు పురుషులుగా దేవుడున్నాడు.

ఆ ముగ్గురు పురుషులనే జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అని మూడు ఆత్మలుగా కూడా చెప్పుచున్నాము. దేవుడు చెప్పిన

జ్ఞానమును అనుసరించి దేవుని హెూదాకు తగినట్లు సూచన పదములను దేవునిపట్ల వాడెడివారు. కృత్ అనగా చేసిన

వాడని అర్థమునిచ్చు సూచన పదముగానీ అది ఒక పేరుకాదు. వాస్తవముగా దేవునికి పేర్లుండవు. క్షర, అక్షర

పురుషులకంటే ఉత్తమమైనవాడు అను సూచనతో పురుషోత్తముడు అన్నారు. అలాగే జీవాత్మ, ఆత్మలకంటే వేరైన వాడు

అను అర్థమునిచ్చు పదముతో పరమాత్మ అని అన్నారు. పురుషోత్తమ అనినా, పరమాత్మ అనినా అవి అర్థమునిచ్చునవే

గానీ పేర్లు మాత్రము కావు. అలాగే దేవుడు అనినా దేవులాడబడేవాడు (వెతకబడే వాడు) అని అర్థమేగానీ అది పేరు

కాదు. అట్లే రెండవయుగము ముందర దేవుని విధానమును తెలుపు పదమును ఉపయోగిస్తూ త్రైతా అన్నారు. త్రైతా

అనగా మూడవది. దేవుడు మూడవ పురుషుడు లేక మూడవ ఆత్మ కావున కాలమును త్రేతాయుగము అన్నారు.

అయితే కాలక్రమమున అజ్ఞానము పెరిగిపోయి, త్రేతాయుగము కాస్త త్రేతాయుగముగా మారిపోయినది. త్రేతా అంటే

అర్థములేదు. త్రైతా అంటే మూడవవాడు అని అర్థము గలదు. నేడు జ్యోతిష్యపండితులు, స్వామీజీలు, అందరూ

త్రేతాయుగమనియే చెప్పుచున్నారు. ఊరంతా ఉత్తరమంటే మేము ఒక్కరు దక్షిణమన్నట్లున్నది. అందరూ త్రేతాయుగము

అంటూవుంటే మేము ఒక్కరూ త్రేతా కాదు త్రైతా అని చెప్పినా బుర్రలేని మనుషులు వినే స్థితిలోలేరు. ఇప్పటికైనా

దేవుని గొప్పతనమునకు, విధానమునకు భంగము కలుగకుండా, అర్థహీనము కాకుండా కృతయుగమును వదలి కృత్


యుగమనీ, అలాగే త్రేతాయుగమును త్రేతాయుగమని పిలుచునట్లు తెలుపుచున్నాము. కృత్ అను శబ్దముగానీ, త్రైత

అను శబ్దముగానీ కాలమునకు పూర్తిగా సరిపోవునని తెలియవలెను. కాలక్రమములో అజ్ఞానము పెరిగిపోయి కొన్ని

విషయములు తెలియక పోయినా, వాటిని గురించి వివరముగా తెలుపువారు వచ్చి తెలిపినపుడు, అందులోని సారాంశమును

గ్రహించి, ఏది సత్యమో ఆలోచించి దాని ప్రకారము నడుచుకోవడము విజ్ఞుల లక్షణము.


మూడవది ద్వాపర అని కలదు. ఇంతకు ముందే దేవున్ని పరమాత్మ అని అంటారని చెప్పుకొన్నాము. ఆత్మకంటే

వేరుగా ఉండేవాడు కనుక పరమాత్మ అని అంటాము. జీవాత్మ, ఆత్మకానివాడు పరమాత్మ. అలాగే క్షరపురుషుడు,

అక్షరపురుషుడు కానివాడు పురుషోత్తముడు. మూడు ఆత్మలలో మూడవ ఆత్మ అయిన దానిని త్రైతాత్మ అంటాము.

అట్లే మూడింటిలో రెండూ కానిది దేవుడు అనుటకు ద్వాపర అని అంటాము. ద్వా అనగా రెండు అనీ, పర అనగా

వేరైనది అని అర్థము. ద్వాపర అనగా రెండిటి కంటే వేరుగా ఉన్నదని అర్థము. దేవుని హెూదాకు తగినట్లు ఉన్న

శబ్దము ద్వాపర. కావున పూర్వము పెద్దలు కాలమునకు ద్వాపర అని సూచనగా పిలిచారు. దానినే ద్వాపరయుగము

అని అంటాము. ఇది పూర్వము పెద్దలు నిర్ణయించిన పదము. అదృష్టవశాత్తు ఈ పదము, దాని అర్థము మారకుండా

అలాగే ఉన్నది. ఇది దేవుని గుర్తని మేము చెప్పుటకు సాక్ష్యముగా నిలిచింది. ఇక నాల్గవది కలియుగము. ఇది కూడా

పూర్వము పెద్దలు నిర్ణయించినట్లే అర్థము చెడకుండా ఉన్నది. భగవద్గీతలో నీవు ఎవరు అని అర్జునుడు దేవున్ని

అడిగినపుడు దానికి జవాబుగా “కాలోస్మి లోకక్షయ" అని అనడము జరిగినది. దాని అర్థము "లోకమును నాశనము

చేయు కాలమును" అని గలదు. దీనిప్రకారము కాలము సర్వులను నాశనము చేయుచున్నదని అర్థమగుచున్నది.

దేవుడు అందరిని, అన్నిటిని సృష్టించు సృష్టికర్తయేకాక, తాను సృష్టించిన అందరినీ, అన్నిటినీ నాశనము చేయగలడు.

అందువలన తనను లోకక్షయునిగా చెప్పాడు. క్షయము అనగా నాశనము. దేవున్ని ఆయన హెూదాకు తగినట్లు

పిలువడము ధర్మమగును. కావున అదే ఉద్దేశముతోనే కాలమునకు కలియుగము అని సూచించారు. కలి అనగా

నాశనమును కల్గించుయుద్ధము అని అర్థము. యుద్ధము అంటే నాశనమే అని అర్ధము, కావున దేవున్ని కలిపురుషుడు

అన్నారు. అదే ఉద్దేశముతో కాలమును కలియుగము అని అన్నారు. పూర్వము కొందరు జ్ఞానులు ఒకచోట కూర్చొని

కాలమునకు పేరుకాని పదములను నిర్ణయించారు. ఆ పదములు దేవుని ధర్మములకు తగినట్లు ఏర్పరచారు. వారు

సక్రమముగా ఏర్పరచినవి 1) కృతియ్యగము 2) త్రేతాయుగము 3) ద్వాపరయుగము 4) కలియుగము. అయితే

ముందరున్న రెండు పెద్ద పేర్లు కొంతమారిపోయి కృతయుగము కృత యుగముగా, త్రేతాయుగము త్రేతాయుగముగా

మిగిలి ఉన్నాయి.

Popular posts from this blog

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format

SAP CPI camel conditions and xpath conditions

oauth call to cpi integraiton suite from sap apim