ఆడించే ఆత్మ [Meeting on17-12-2013]
“ ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః ” ఈ దినం కనిపించే వస్తువు కాకుండా కనిపించకుండా ఉండే సూక్ష్మ గురించి చెప్పాలనుకుంటున్నాను. కన్ను కనిపిస్తుంది.కన్నుకు ఉన్న చూపు సూక్ష్మమైనది. ఇది మీకు కొత్తదనం ఇస్తుందని అనుకుంటున్నాను. మీకు సూక్ష్మ స్థూలము గురించి తెలుసు, అయినా కానీ ఇంకో కొత్త వివరంగా చెప్పాలని అనుకుంటున్నాము. దాని గురించి ఈరోజు చెబుతాము జాగ్రత్తగా వినండి. స్థూలము అంటే కంటికి కనిపించినది. సూక్ష్మ అంటే కంటికి కనిపించనటువంటిది. అంటే ఒకటి అక్షి అనేటిది ఉంది చూచేటువంటిది, చూసేదానికి కనిపించడానికి ఏమి అంటాము? స్థూలం అంటాము . మనము స్థూలమును చూడవచ్చు సూక్ష్మమును చూడవచ్చు. అంటే కన్ను స్థూలము చూడగలిగితే, చూపు మాత్రము సూక్ష్మమును కూడా చూడగలదు. ఎందుకంటే కన్ను స్థూలము అయినటువంటిది, చూపు సూక్ష్మము అయినటువంటిది. కన్ను కనిపిస్తుంది, కన్నుకు ఉన్న చూపు కనిపించదు, కాబట్టి అది సూక్ష్మమైనది. స్థూలంతో స్థూలమును చూడవచ్చు, సూక్ష్మముతో సూక్ష్మమును చూడవచ్చును. ఇది ఒక సూత్రము. మన చూపు సూక్ష్మమైనది కాబట్టి, చూప...