ఆడించే ఆత్మ [Meeting on17-12-2013]

  ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః

ఈ దినం కనిపించే వస్తువు కాకుండా కనిపించకుండా ఉండే సూక్ష్మ గురించి చెప్పాలనుకుంటున్నాను. కన్ను కనిపిస్తుంది.కన్నుకు ఉన్న చూపు సూక్ష్మమైనది. ఇది మీకు కొత్తదనం ఇస్తుందని అనుకుంటున్నాను. మీకు సూక్ష్మ స్థూలము  గురించి తెలుసు, అయినా కానీ ఇంకో కొత్త వివరంగా చెప్పాలని అనుకుంటున్నాము. దాని గురించి ఈరోజు చెబుతాము జాగ్రత్తగా వినండి.

స్థూలము అంటే కంటికి కనిపించినది. సూక్ష్మ అంటే కంటికి కనిపించనటువంటిది.  అంటే ఒకటి అక్షి  అనేటిది ఉంది చూచేటువంటిది, చూసేదానికి కనిపించడానికి ఏమి అంటాము? స్థూలం అంటాము . మనము స్థూలమును చూడవచ్చు సూక్ష్మమును చూడవచ్చు. అంటే కన్ను స్థూలము చూడగలిగితే, చూపు మాత్రము సూక్ష్మమును  కూడా చూడగలదు. ఎందుకంటే కన్ను స్థూలము అయినటువంటిది, చూపు సూక్ష్మము అయినటువంటిది. కన్ను కనిపిస్తుంది, కన్నుకు ఉన్న చూపు కనిపించదు, కాబట్టి అది సూక్ష్మమైనది. స్థూలంతో స్థూలమును చూడవచ్చు,  సూక్ష్మముతో సూక్ష్మమును చూడవచ్చును. ఇది ఒక సూత్రము. మన చూపు సూక్ష్మమైనది కాబట్టి, చూపుతో దేనినైనా చూడవచ్చును.  చూపు నుండి కన్ను ద్వారా స్థూలము చూడవచ్చును, కేవలం చూపుoడే సూక్ష్మము కూడా చూడవచ్చు. చూసేది ఏది అయినా గాని దానిని అక్షి అంటాము దానిని కన్ను అని ( ఇది స్థూలంగా ఉండవచ్చు సూక్ష్మంగా ఉండవచ్చు ) బాగా చూసేదాన్ని ఏమని అంటాము? అంటే సా + అక్షి =సాక్షి. సాక్షి అంటే దేనిని వదలకుండా చూస్తూ ఉంటుంది.

 ఈ సాక్షి అన్నది ఎక్కడ చూచినా ఉంది బయట లోపల ( సూక్ష్మంగా, స్థూలంగా ఉంది).

            ఒకడు ఇంకొకడిని హత్య చేస్తున్నాడు చూస్తే ఏమవుతుంది వాడు సాక్షి అవుతాడు, కానీ ఎవరూ చూడకపోతే ఏమవుతుంది అంటే వ్యక్తి  " స్థూలంగా ఉండేవాడు సాక్షి కాకపోయినా గానీ సూక్ష్మంగా ఉండేవాడు చూచి ఉంటాడు, వాడు సాక్షిగా ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావ్ నువ్వు చేసే పనులు అన్నీ ఇతరులు చూసినారు అనుకోండి సాక్షిగా, అయినా ఏమి ప్రయోజనం లేదు. వాడు నీకు శిక్ష వేపించలేడు. వీడు తప్పు చేశాడని నిరూపించలేడు. శిక్ష వేపించలేడు.  బయట ఏమో కానీ, లోపల జన్మలకు తగిన శిక్ష ఎవడు ఏపించలేడు. కానీ నీవు చేసే ప్రతి పనిని గమనించేవాడు ఒకడు ఉన్నాడు. వాణ్ని మన శరీరంలో ఉన్న సాక్షి అంటాము. అంటే సాక్షులు ఎంతమంది ఉన్నారు? ఒకటి అనుకున్నాం కదా, కానీ విశ్వం అంతటా ఒక సాక్షి ఉన్నాడు, నీకు మాత్రం సంబంధించిన వాడు ఒకడు ఉన్నాడు.

      ఇప్పుడు సాక్షి అంటే కొన్నిచోట్ల దేవుడు సాక్షిభూతుడు . అంటే దేవుడు సాక్షిగా ఉన్నాడు అని చెబుతున్నాము.  దేవుడు సాక్షిగా ఉన్న, మనకు ప్రయోజనం లేదు కదా! ఆయన ఏమీ పని చేసేవాడు కాదు కదా! ఆయన ఏమీ చేయడు కాబట్టి నీకు సాక్షిగా ఉన్న ఏమి ప్రయోజనం లేదు. నీ మీద చర్యలు తీసుకుంటే ఆయన అంటే భయం ఉంటుంది, శిక్ష ఏమైనా వేస్తాడని. ఆయన ఏమి చేయడు కాబట్టి ఏ శిక్ష వేయడు కాబట్టి ఆయన పేరు కు సాక్షిగా ఉన్నా గాని నీకు ఏమీ భయం లేదు.  కానీ నువ్వు భయపడవలసింది ఇంకో సాక్షి ఉన్నాడు.  అంటే రెండో సాక్షి.  ఇంకో సాక్షి ఒకటవ సాక్షి గురించి మనము విని ఉంటాము కానీ రెండవ సాక్షి గురించి మనం విని ఉండము. ఆ సాక్షి మన శరీరంలోనే ఉంటాడు. ( ఆ సాక్షి పని ఏమిటి అంటే ప్రతి ఒక్కటి చూసుకోవడంతో పాటు, నమోదు చేసుకోవడం ఉంటుంది ). నీవు మంచి పని చేసినా , చెడు పని చేసినా దానిని చూడడం ఉంటుంది, దానిని తిరిగి రాసుకోవడం ఉంటుంది.

            ఈ విధముగా నీ శరీరమునకు నీకు మాత్రం ఒక సాక్షిగా ఉన్నాడు. ఆ రెండవ సాక్షి ఎట్లా ఉన్నాడంటే, మనం నాటకంలో ఒకే వ్యక్తి పాట పాడుతాడు, ఒకే వ్యక్తి డాన్స్ వేస్తాడు ఒకే వ్యక్తి మ్యూజిక్ కూడా కొడతాడు.  అలా అన్ని రకముల ఒకే వ్యక్తి పని చేసినట్లు నీ శరీరంలో ఉండే ఒకడు ఉన్నాడు, "నువ్వు కాక" "ఇంకొకడు ఉన్నాడు".  ఇద్దరే ఉండేది శరీరంలో. శరీరం అనేది ఒక నివాస స్థలం జీవునికి(3), ఆ నివాస స్థలంలో చైతన్య స్వరూపం గల ఆత్మ స్వరూపులు ఇద్దరు కలరు. మిగతావి అన్ని ప్రకృతి(24+గుణాలు) స్వరూపం. జడ పదార్థముతో కూడుకొని ఉంటుంది. ఆత్మ స్వరూపంలు రెండు. నీవు(3) + ఇంకొకరు(6), నీవు జీవాత్మ(3) అనబడుతున్నావు, ఇంకొకరు కేవలం ఆత్మ(6) అనబడుతున్నాడు.  ఆత్మా అని పేరు కలిగిన వారు ఇద్దరే. ఇద్దరు కంటే ఉత్తముడు ఇంకొకడు ఉన్నాడు వాడిని పురుషోత్తముడు(9). నీ శరీరంలో ఇద్దరు ఆత్మకు సంబంధించిన వారు మిగతావారు ప్రకృతి సంబంధించిన వారు, వీరితో పాటు ఇంకొకడు పురుషుడు ఈ ఒక్క శరీరంలో కాక అన్ని శరీరంలో బయట లోపల వ్యాపించి ఉన్నాడు, బయట అణువణువునా కూడా వ్యాపించి ఉన్నాడు.  ఆయన ఈ ఇద్దరు ఆత్మల కంటే గొప్పవాడు, ఉత్తమమైన వాడు. ఆయన ప్రపంచమంతా అణువణువునా  వ్యాపించి ఉన్నాడు.  ఈ రకంగా వ్యాపించిన పురుషోత్తముడు ప్రపంచమంతుడికి సాక్షిగా ఉన్నాడు. సర్వ జీవరాశికి సాక్షి గా ఉన్నాడు.

కొంతమంది అడగవచ్చు సాక్షి అంటే దేవుడు మాత్రం సాక్షి అన్నారు కదా! మరి కొన్ని సందర్భంలో ఆత్మ(6) ను  సాక్షి అంటున్నారే, కొన్ని సందర్భంలో : అవును. కొన్ని సందర్భంలో చెప్పవలసిన పని వచ్చింది. ఆత్మసాక్షిగా ఉంది ఈ విషయం చెప్పక పోతే, మీరు ఆత్మ సాక్షి కాదు అని కొట్టివేస్తారు. సందర్భము అనుసారము నీకు మాత్రము చూసేవాడు, నమోదు చేసేవాడు, పని చేసేవాడు, సాక్షిగా ఉండేవాడు కూడా వాడే. శరీరం చేత పనిచేపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, నిన్ను పరిగెత్తిస్తున్నాడు. యుద్ధ రంగంలో నీవు కాల్పులు జరిపిస్తే నీ చేత కాల్పులు జరిపించేవాడు ఎవడు? నీలో ఉండేవాడు(6), అది టెన్షన్, భయం, ఎవరు బ్రతుకుతారో చస్తారో కూడిన సమయం అది. రెండు ప్రక్కల కాల్పులు జరుగుతున్నాయి, నీవు కాల్పులు జరుపుతున్నావంటే? అని ప్రశ్న వేసుకుంటే, కానీ, నీవు(3) కాల్పులు జరపలేదు . అటుపక్క గాని ఇటుపక్క గాని ఎవడు కాల్పులు జరపలేదు. కానీ ఆ శరీరంలో ఉంటూ ఆ శరీరమును కదిలించి అటు నుండి ఇటు, ఇటు నుండి ఆటు,కాల్పులు జరిపించే వాడు, ఒకడు ఉన్నాడు, ఎవరు? ఆత్మ(6) అనేవాడు. అందరిని నాటకం ఆడిస్తున్నాడు.

   ఈరోజు చూడు, దేశం అంతటికి కొట్లాట పేట్టించాడు, కొట్లాటకు పొండి అని,నా స్టేట్ నీ స్టేట్ అని, అది ఎవరు విడిపించడానికి కాదు. ఒకవేళ కుటుంబం తగదా అయితే పంచాయతీ లేదా ఇంకొకటి అని. మొత్తం దేశానికి కొట్లాట. ఆ రకంగా లోపల ఇవన్నీ రేకెత్తించేవాడు?ఎవడు నడిపించేవాడు ఎవడు? శరీరంలో ఉన్న ఆత్మ, వాడు నడిపిస్తున్నాడు, తెలియక మనమే నడుస్తున్నాము అనుకుంటున్నాడు ప్రతి మనిషి. అది చాలాసార్లు చెప్పాము . మీరు చాలా పొరపడుతున్నారు అని. ( "పొరపాటు ఏమి?", "పడేది అంతా అదే "). అది పొరపాటు కాదు సహజత్వం అనుకుంటున్నారు, కానీ అది పెద్ద పొరపాటు. అటువంటి పొరపాటు పడకూడదు అని "కర్మ పత్రము" అని, చిన్న గ్రంథము రాసి ఇచ్చినాము. 64 పేజీలు ఉన్నది ఈరోజు దాని చదివితే ఎట్లా ఉంటుంది అంటే ఈ కర్మ అంతటినీ మనుషులు ఎట్లా సంపాదించుకుంటున్నారు, అని తెలిసిపోతుంది. అది ఇంతమందిని ఎట్లా ఆడిస్తుంది అని తెలిసిపోతుంది. అంటే ఇంత భయంకరమైన కర్మ నుండి మనుషులు ఎందుకు తప్పించుకోలేకపోతున్నారు, అన్న విషయం తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇటువంటి కర్మను మనకు తగిలిస్తూ , ఆ కర్మను అనుసారము మనల్ని ఆడించేవాడు, నీ లో తోడుగా ఉండేటువంటి ఆత్మ. వాడిని   వాడిని   నీకు స్నేహితుడు అంటాము, తర్వాత నీకు జోడు ఆత్మ, తోడు ఆత్మ అంటాము లేకపోతే ఇంకొక విధముగా సహవాసి అంటాము.  ఇంకా చాలా పేర్లతో మనము చెప్పుకుంటాము వాడు నీకు అత్యంత దగ్గరగా ఉండేవాడు. ఆయన తప్ప ఇంకొకరు ఎవరూ లేరు.  నీకు ఒక చోట చెబుతారు,  నీకు సహాయం చేసేవాడు,  నీకు నేను తప్ప ఇంకొకడు లేడు. 

ఒకవేళ ఎవరైనా సహాయం చేస్తానంటే, అవకాశం లేదు. అందువలన ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆయన నిన్ను నడిపించేవాడు నడిపిస్తూ ఏం చేస్తున్నాడు.  నీకు పర్యవేక్షకుడు గా ఉంటూ, నీ శరీరంలో  పరిశీలకుడుగా ఉంటూ, నీవు ఏమి చేస్తున్నావో అది  అంతా రాస్తూ ఉన్నాడు.

   ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేయవచ్చు. ఏమి అడగవచ్చు తెలివిగా? నేను చెప్పే దానికి, మీరు వెంటనే పరుగు పెట్టవద్దు , ఆలోచన చేయండి. ఏమి చేపిస్తున్నాడో, అతడు చేపిస్తున్నాడు అంటున్నాము.  అన్ని అతనే  చేపిస్తున్నాడు అంటున్నాము కదా! మళ్లీ ఏమి చెబుతున్నాము, పరిశీలకుడు ఉన్నాడు అంటున్నావు అంటే అతనే పరిరక్షకుడు అన్నా అతనే. అతను ఏమి చేస్తున్నాడు అంటే నీవు ఏమి చేస్తున్నా అని చెప్పు రాసుకుంటున్నాడు.

       వీడు ఏమి చేసేది. వీడు ఏమి చేయలేదు కదా, మరి రాసుకునేది ఏమిటి? "నవ్వు " రెండు రకాలుగా రెండు రకాలు చెబుతున్నాము మీకు. వీడు ఏమి చేయలేదు కదా మల్ల అతడు ఎందుకు రాసుకుంటున్నాడు? అతడే చేస్తున్నప్పుడు? అని మీరు ప్రశ్న అడగవచ్చు. కానీ మీరు తెలివైన వారు అయితే అడుగుతారు అనుకోండి. అప్పుడు జవాబు కావాలి కదా మనకు. జవాబు కూడా ఉంటుంది ఎందుకంటే "వాస్తవముగా ఇతడు(3) చేయలేదు, అతడే చేస్తున్నాడు.  అతడు చేసి, ఇతను మీద తప్పు రాస్తున్నాడు". చాలా అన్యాయం కదా! అన్యాయం కాదు న్యాయం అది. ఎవరికి ఎటువంటి అన్యాయము నేను చేయను అని అంటాడు ఒకచోట కదా! కానీ న్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరు? లోపల ఉండేవాడు.

      ఇదేమి న్యాయమయ్యా! అన్ని నువ్వే(6) చేసి ఉదాహరణ :కాల్పులు చంపేది నువ్వే.ఆపక్క, ఈ ప్రక్క, చంపేది నువ్వే. వీడు(3) కూని కోరు అని పాపము రాసేది నువ్వే(6). ఇది ఎట్లా? వీడు(3) ఏమి చేసేవాడు కాదు కదా! మరి ఏమి చేస్తున్నాడని ప్రతి ఒక్కటి రాసుకుంటున్నాను నువ్వు? అన్నీ నువ్వే చేస్తున్నప్పుడు. కురాన్ గ్రంథంలో 4:117 కంఠము నుంచి బయటకు రాకముందే (గొంతు ముందు బయటకు రాకముందే) నమోదు. ఎవరు? పర్యవేక్షకుడిగా ఉన్నవాడు(6).

 అంటే పూర్తిగా అనక ముందే, అంటాడు అని తెలుసు కదా ! రాసుకుంటాడట. కానీ అనేది ఎవరు? వాడు(3) ఏమి చేసేది కాదు కదా! అనేది ఎవరు ఈయనే, నీలోనే ఆత్మ(6).  మాట్లాడించేది వాడే, పాట పాడించేది వాడే, ఆట ఆడించేది వాడే యుద్ధం చేయించేది వాడే, నాట్యం చేయించేది వాడే ఏ పనులు ఉన్నా ఆ పనులు చేయించేది వాడే. ఒకరికొకరు తిట్టుకునేది కూడా వాడే, జీవుడు (3)కి ఏమీ చేతకాదు. ఇక మరి వీడు ఏదో తిట్లు తిడుతున్నాడో అనుకో, అంటే వాడు మాట్లాడుతున్నాడు. ఆ మాట అనకు ముందే వాడు రాసుకుంటున్నాడు. 3కి రాసుకుంటున్నాడు.

   అనేది ఎవరు? ఈయన(6),రాసేది ఎవరు(6), ఎవరికి? ఊరకనే ఉండేవాడు పక్కన ఆడించేవాడు ఈ ఆట ఆడాడు. 3 అనే వాడు , ఆ ఆట ఆడాడు, అని రాయడం న్యాయమా? న్యాయం కాదు కదా! మా వాడు ఏమి ఆడలేదు. ఆటలు నువ్వే ఆడించి వాడు ఇలా ఎగిరిన్నాడు, అలా ఎగిరినాడు అని రాస్తే ఏం బాగుంటుంది చెప్పు. అది తప్పే!( జీవుడి లెక్కలో)

కానీ ఆయన లెక్కలో, అది ఎట్లా తప్పు అవుతుంది అయ్యా! "నేను రాసినాను కాబట్టి కరెక్ట్.ఎవరికీ నేను అన్యాయం చేయలేదు, నేను న్యాయం చేసినాను."   అంటే మనం అడగవచ్చు ఏమి న్యాయమని ఇది ఎక్కడి న్యాయం. అన్ని నేనే చేసేది అంటావు, నువ్వు ఏమి చేయలేదంటావు, "మళ్లీ నువ్వు ఏమి చేసినా నేను రాసుకుంటాను అంటావు".ఇది ఎక్కడ! "నువ్వు చేస్తున్నావా చేయలేదా " చేయలేదు........

   "Ans 6: నువ్వు చేస్తున్నావు అంటున్నావు కాబట్టి రాసుకుంటున్నాను. నువ్వు ఎందుకు అంటున్నావు? చేసేది నేను, ఆట ఆడేది నేను, కొట్టించేది నేను, మాట్లాడించేది నేను, చంపించేది నేను కొట్టించేది నేను, అన్నీ నేను చేస్తుంటే, "నేను" అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? కాబట్టి నీ పేరు రాస్తా."

ఈ రకంగా మనకు రాసి పెట్టేవాడు ఒకడు ఉన్నాడు.  ఎవడు మన శరీరంలో నీతో పాటు నీ సహవాసం చేసేవాడు, సహవాసి అంటే నీతో పాటు ఉండేవాడు. వాసి అంటే నివాసం చేసేవాడు. సహవాసి అంటే సమానంగా ఉన్నాడు.  నీ శరీరంలో. వాడు ఎటువంటి వాడు నీకు చెడ్డవాడా అంటే? కాదు, మంచివాడు, హితుడు, స్నేహితుడు,  హితుడు అంటే మంచివాడు. మరి మంచివాడు ఏంటి? నీ తప్పులు రాసిపెట్టి నీకు శిక్షలు వేయించడం ఏమిటి?

  Ans: అంటే మంచివాడు. “అతడు వాడు చేసే పనులు అన్ని అక్రమంగా నువ్వు(3) ఒప్పుకుంటున్నావ్. వాడివి వాడికి విడిచి పెడితే సరిపోతుంది కదా! నువ్వు అక్రమం చేస్తున్నావు.  ఎవడో జాగా కొనుక్కుంటే వాడిది నాది అంటే, తప్పు నీది కాదా! ఎవడో ఏదో మాట్లాడితే ఆ కీర్తి నాది అంటే తప్పు కాదా! కాబట్టి చేయని పని నువ్వు ఒప్పుకుంటున్నావ్ కాబట్టే శిక్ష రాయాల్సిన పని వస్తుంది. ఈ రకంగా నీ శరీరంలో ప్రతి పని జరుగుతుంది.

మీరు ఉన్నారు, మీకు చూపు చూపించేవాడు ఒకడు ఉన్నాడు. చూపు ఇచ్చినది వాడే. ఈ మాట నీ శరీరంలో దూరి నీకు అర్థం అయినట్లు చేసేది వాడే. ఒకవేళ ఆయనకి ఇష్టం లేదు అనుకో, ఆయన చెప్పేది ఇంకోరకంగా అర్థం అవుతుంది, అట్లా కూడా అని చేపిస్తాడు. ఆయన ఏమైనా చేస్తాడు, ఆయన మంచే చేస్తాడు మనకు, కానీ మనము ఏమి అనుకోవాలి అంటే.    "ఆయన చేస్తున్నాడు అనుకోకుండా నేను చేస్తున్నాను అని అనుకోవడమే పెద్ద పొరపాటు ". అప్పుడు ఆయనది న్యాయం, మనది(3) అన్యాయం అవుతుంది.  కానీ ఆయన ఏమి చేస్తున్నాడంటే, మేము చెప్పాము "ఇక్కడ మాట్లాడే మాట కూడా నాది కాదు నేను స్వయంగా మాట్లాడలేను. వేరే వాళ్ళు మాట్లాడిపిస్తే మాట్లాడుతున్నాను". మీకు కనిపించేది నేను, నాకు కనిపించేది ఇంకొకరు. స్వయంగా నేను కూడా మాట్లాడలేను, కానీ నాకు జ్ఞాపకం ఉంది నేను మాట్లాడలేదు అని.  మాట్లాడించేది వేరేవాడు అని తెలుసు. ఒక్కరోజు మంచిగా చెబుతాను,  ఇంకొక రోజు ఏమీ చెప్పలేను కానీ ఎంతవరకు చెప్పించాలో అంతవరకే చెప్పిస్తాడు ఇక్కడినుంచి.  చివరికి ఏమో, జ్ఞానమే చెబుతాడు. నేను చెప్పిన జ్ఞానమే, మీరు ఇంకా బాగా చెప్పొచ్చు. నాకంటే కూడా మీతో బాగా చెప్పిస్తాడు.  కానీమొదట చెప్పినట్లు మళ్లీ చెప్పలేను.  దీనికంత ఎవరు కారణము, వాడొక్కడే, వాడు ఎలా చెప్పినా వాడే చేయాలి. వాడు నీకు జ్ఞాపకం పెట్టుకుంటే ఏమవుతుంది అన్ని నువ్వే చేస్తున్నావ్, నేను ఏమీ చేయలేదు శరీరంలో. అనుకుంటే నీ తప్పు ఏమీ రాయడం అన్నమాట.

    భగవద్గీతలో ఏం చెప్పారంటే, నేను ఇంకొకరిని చంపుతాను. చంపడం ఏమిటి? ఇది చిన్న సమస్య కాదు పెద్ద సమస్య, పదిమందిని చంపాను, అంటే పెద్ద పాపం. వెయ్యి మంది అంటే ఇంకా పెద్ద పాపం లక్ష మంది ఉంటే గోర పాపమే. పిల్లలను కూడా చంపడం అంటే అది పెద్ద పాపం. చంపబడేవారిలో చిన్న పిల్లలు(దయ లేకుండా), ఇంకా ...   ఇంకా. ఎంతమందినైనా చంపేస్తాను.  అయినా ఎంతమందికి చంపినా కూడా వాడు హంతకుడు కాదు.  చంపిన వాడికి హత్య పాపం రాదు(హంతకుడు కాదు),. నీ శరీరం లో 6 గా  చంపుతున్నాడు, 3 ఏమి చేయలేదు. ఒకవేళ 3 చంపాడు అనుకుంటే 3 హంతకుడు అవుతాడు, ఆరు తప్పిపోతాడు.  కానీ జ్ఞాపకం ఉండి నేను చంపలేదు అనే జ్గ్యాపకం  ఉంటే నన్ను ఆడించేవాడు ఒకడు ఉన్నాడు అనుకుంటే, శరీరంలో నా(3) బలం ఏ మాత్రం లేదు, వాడే ఆక్రమించుకున్నాడు శరీరం అంతటికి, నేను ఒక చోట ఉన్నాను. [ నుదుటి భాగంలో దేవుని చిహ్నంలో గుణ చక్రంలో వున్నాను, కష్టసుఖాలు మాత్రమే అనుభవిస్తున్నాను ] నా పాత్ర ఏమీ లేదు [ ఏ పని యందు కూడా, నేను ఏమి చేసే వాడిని కాదు  ] [ అనుకోవడం కాదు ఉన్న సత్యాన్ని గ్రహించడం ], అన్న సత్యం తెలుసుకుంటే, ప్రతినిత్యం శరీరంలో జరిగే వాస్తవం తెలుసుకోగలిగితే, నీకు ఏ పాపమూ లేదు. కానీ అన్నింటిని చేపించేవాడు ఉన్నాడు. అని తెలియక, మనమే చేస్తున్నాము అంటే, నేను చేస్తున్నాను అనుకోవడం వల్ల అది మనకు బాధ్యులు అవుతున్నాం కాబట్టి.

అందువల్ల శరీరంలో ఆడించేవాడు: “జీవుడు ఎప్పుడైతే అనుకున్నాడో, అప్పుడు రాసుకుంటున్నాడు. బయటికి చెప్పి అనుకున్నా  లేదా మనసులో అనుకున్నా”.   ఒక గ్రంథంలో చెబుతాడు,” నీవు ఒక స్త్రీని మోహపు చూపు చూచిన గాని, అంతరంగంలో వ్యభిచారచేసినట్లే” . ఆ గ్రంధంలో చెప్పాడు నీవు చేయకున్నా కానీ! ఆ బావం ఎవరికి ఉంది? అనుకునేది ఎవరు? నేను అంటే జీవుడు(ఆలోచన చేశాను, కాని బాహ్యం గా కార్యం జరగలేదు అన్నభావంచేశానని భావం పుట్టినా, 6 రాస్తాడు. మూడు పని చేయనప్పటికీ. పాపం వస్తుందని చెప్పాడు. 

 అక్కడ భగవద్గీతలో “లోకంలో ఉన్న వారందరిని చంపిన, మొత్తం అందరిని చంపిన, చిన్న పిల్లల,పెద్దలు లి చంపిన.....పాపం రాదు”. గీత లో కార్యం  చేసిన పాపం రాదు, సువార్త: కార్యం చేయకున్నా పాపం .

    ఇక్కడ యేసు : నీవు జీవుడుగా మనసులో అనుకున్నా, పని చేయనప్పటికీ పాపం వస్తుంది.[ మంచి,చెడ్డ ఆలోచనలు కూడా, నిర్ణయాలు కూడా 6వి ]

      ఇక్కడ రెండు ఒకటే, కానీ చెప్పిన మాటలు ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి, కానీ బావం ఒకటే తెలియజేస్తుంది. కానీ మనకు రెండు డిఫరెంట్ వాక్యాలుగా కనబడతాయి." భావం బట్టి పాపం వస్తుంది, కార్యం బట్టి కాదు". అన్న విషయం కర్మ పత్రం అనే గ్రంథం నుండి మీకు స్పష్టంగా చెప్పడం జరిగినది "

      మీకు అర్థం అయ్యేదానికి, రెండు కథలు రాయడం జరిగినది. ఏ విధముగా పాపం అంటకుంటుంది అన్నవిషయం చెప్పాము . ఈ రకంగా మనకు ఈ పాప,పుణ్యం అంటుకోవడం వలన, ప్రపంచంలో ఒకడు పేదవాడుగా, మధ్యతరగతివాడుగా కూడా, ధనికులు,ఇంకా చాలా సుఖాలను అనుభవించే  పురుషుడిగా మనకు మనుషులు అంచలంచలుగా బ్రతుకుతున్నారు. ఒకటే స్థాయిలో ఎవరు బతకలేదు, రకరకాల స్థాయిలో బతుకుతున్నారు. ఎన్ని రకాల స్థాయిలో బ్రతుకుతున్నారు అంటే కారణం ఏమిటి? కర్మ మనము చేసుకున్న ఫలితము. మరి ఈ కర్మ ఎక్కడ నుంచి వస్తూ ఉంది?అంటే మీ భావంలో పుడుతుంది. జ్ఞానం అంటే చాలా అర్థం కాదేమో? అని అంటారు కానీ, చాలా సులభం. ఒకే ఒక భావం తెలుసుకుంటే కర్మను మొత్తము విడనాడవచ్చు. ఆ ఒక్క భావం అర్థం చేసుకోకపోతే మొత్తం తగిలించుకుంటారు.

దేవుని లోనికి ఐక్యం కావాలంటే ఏమి చేయాలి? ఏ మాత్రం కర్మ లేకుండా అనుభవించే కర్మ లేకుండా పోతే శరీరంలో ఉండ వలసిన పని లేదు. కర్మ అనుభవించేది ఉంటే శరీరంలో ఉండాలి, కర్మ అనుభవించేది లేకపోతే శరీరం అవసరం లేదు నీకు. నీవు దేవుని లోనికి ఐక్యము అయిపోవచ్చు. కాబట్టి మోక్షం పొందాలి అన్న అటువంటి వారు ఏమి చేయాలి? ((భావంలో మార్పు తెచ్చుకుంటే చాలు )). అది తెలియక మెడిటేషన్లు, ఇంకొకటి ఇంకొకటి, దీక్ష,ఉపవాసాలు, వ్రతాలు,ధ్యానం,జుట్టు మీద ద్యాస, ముక్కు మీద ద్యాస, మోకాళ్ళ మీద ద్యాస, మో చేయి మీద ధ్యాస, ఎన్నో ద్యాస పెట్టుకుంటున్నారు.

ఏ ద్యాస వద్దు, నీ మీద నీ ద్యాస పెట్టుకో . ఇద్దరు కదా ఉండేది శరీరం లో, నీ పక్క వాణి మీద పెట్టుకో. ఇంకో ధ్యాస వద్దు. భగవద్గీతలో ఏ ధ్యాస చెప్పలేదు. మిగతా ధ్యాసలు అధర్మాలు అని చెప్పాడు. యజ్ఞంలు, దానంలు,వేద అధ్యయనము తపస్సులు  (మెడిటేషన్ ). ఇవి అన్ని అధర్మలతో కూడుకున్నటువంటివి. దీనివల్ల దేవుడు ఏమాత్రం తెలియబడడు, అని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే "కర్మ ఉంటే నీ శరీరంలో ఇరుక్కుంటావు, కర్మ లేకపోతే మోక్షానికి పోతావు ". ఇది సూత్రము. మరి కర్మ లేకుండా ఎలా అవుతుంది నీకు? అంటే(( నేను(3) కాదు, ఇంకొకడు ఈ శరీరంలో అన్ని పనులు చేస్తున్నది అన్న సత్యం తెలిసినప్పుడు పోతుంది )). అది తెలియక నీవు ఏమి అనుకుంటున్నావో, నేనే(3), అది నీ పేరుతో రాయబడుతుంది. కానీ చేసేవాడు(6) ఒకడు, అన్ని నేను(3) చేస్తున్నాను  అంటున్నాడు.  పబ్లిక్ గా చెబుతున్నాడు అన్నిటికీ నేనే కారణం అని, మూడు దైవ గ్రంథములో ;  నీకు వాటిలో(ఆయన పనులు లో ) సంబంధం లేదు కదా! సరే శరీరంలో ఊపిరి ఆడించేది, ఆయన కాళ్లు, నోరు కదిలించేది ఆయనే, చెయ్యి కదిలించేది ఆయనే, కనురెప్ప కదిలించేది ఆయనే, జీర్ణాశయం జీర్ణం చేసేది ఆయనే, గుండె అహర్నిశలు కొట్టుకునేది కూడా ఆయనే.  ఎవరు ఆయన? నీతో పాటు ఉండే ఆయన, ఆయన అహర్నిశలు  పనిచేస్తున్నాడు. నీ శరీరంలో చేరినప్పటి నుండి, శరీరం వదిలే వరకు పనిచేసేది ఆయన . అర్థమైందా!

       నీవు ఏమాత్రం ఏ పని చేయలేదు కానీ కర్మను అనుభవిస్తున్నాం అవసరం బట్టి. ఇంతకుముందు సంపాదించిన కర్మ అనుభవిస్తున్నావు. నీవు పని చేయనప్పటికీ ఫలితములను అనుభవిస్తున్నాము. ఈ రకముగా నీకు పని జరుగుతూ ఉంది. ఈ విధముగా చూచేవాడు, పనిచేసేవాడు, రాసే వాడు కూడా వాడే. నీకు(3) ఏమీ మిగలలేదు చెప్పడానికి. పలానా పని అని. అంటే జీవునిగా నీకు,ఏమి మిగలలేదు. కానీ వాడే అన్ని చేస్తున్నాడు వాడే సాక్షిగా ఉంటూ వాడే రాసుకుంటున్నాడు.  ఇప్పుడు జరిగే సమస్య ఏమిటంటే ఎక్కడ ఈ ఇద్దరిని చూసేవాడు ఒకడు ఉన్నాడు నిన్ను, నీ పక్క వాడిని ఇద్దరిని చూస్తున్నాడు ఇంకొకడు, వాడు అసలైన సాక్షిగా(9) ఉంటూ, 6 కూడా సాక్షిగా ఉంటూ(నీ శరీరంలో వున్న నీకుమాత్రమే), నీవు చేసే పనికి రాసుకొని మళ్లీ రాసుకుని దానికి శిక్ష వేసేవాడు కూడా వాడే. మీ పక్కవాడు మీ శరీరంలో శిక్ష వేసేవాడు. ఎవరు? నీ ప్రక్క వాడు(6).

            “దేవుడు(9) ఆయనకి ఏ పని లేదు, ఆ రూలు అట్లా ఉండాలి. ఒక దగ్గర చేస్తున్నాడు, ఒక దగ్గర లేదు అనకుండా. దేవుడు వాస్తవంగా ఏమి పని చేయడు. మూడు నీ,ఆరు నీ, ఈ కర్మ తతంగము నీ, అంతా దేవుడు సృష్టించాడు కాబట్టి. మనం “దేవుడే “అన్నమాట అన్నా కానీ, దేవుడు చేయలేదు, దేవుడు కింద ఉన్న పరిపాలన చేస్తుంది. ఇప్పుడు క్రింద ఉన్న వారు ఎవరు? ఎవరి పాత్ర వారు చేస్తున్నారు అన్నమాట. కానీ దేవుడు చూస్తూ ఉంటాడు సాక్షిభూతుడుగా. ఆయన ఎవరి విషయంలో ఏమీ చేయలేదు.

ఆ సాక్షి(9) కంటే,నీ శరీరంలో ఉన్న సాక్షిగా(6) ఉన్నవాడు చూచేవాడుగా,చేసేవాడిగా, రాసేవాడిగా,శిక్ష వేసేవాడుగా, యమధర్మరాజుగా  ఉన్నాడు. వాడు ఒక్కడే, నీ ప్రక్కన ఉన్న ఉండేవాడే. వాడు నీకు మిత్రుడే అయినా గాని తప్పనిసరిగా నీకు శత్రువుగా మారి శిక్షించే పని వచ్చి పడింది. నీకు ఆహారము, నీరు, రోగాల ద్వారా బాధించడం ద్వారా శిక్షవిదిస్తునాడు,  బాధపెటించి. రకరకములగా నీకు హింస పెట్టినప్పుడు, వాడు నీకు శత్రువే కదా. నాకు వాడు మిత్రుడు ఎట్లా అవుతాడు అని నువ్వు అడగవచ్చు అర్థమైందా? బాధించేది కూడా శత్రువే, కానీ నువ్వు బ్రతికే దానికి, కొనసాగించే దానికి అతనే ఊపిరి పిలుస్తున్నాడు, ఊపిరి వదులుతున్నాడు.  ఇంతమందిని ఆయనే ఆడించేది. ఎంతమంది అయినా, మీ శరీరంలో ఆహారం జీర్ణం చేసేది ఆయనే, కొన్నిసార్లు ఇబ్బంది పెట్టేది ఆయనే. అలా అన్ని పనులు చేస్తాడు. ప్రతిఒక్కటి శరీరంలో జరిగే పనులు అన్ని ఆయనే(6) చేస్తున్నాడు. నీవు(3) ఏమి చేయలేదు.  ఒకవేళ శరీరం ఆరోగ్యం పాడైతే బాగు చేసుకోలేవు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉందా? లేదు, అది శరీరంఅధికారి ఇష్టం. ఆయన ఏమైనా చేయగలడు ఒక్క నిమిషంలో బాధ పెట్టి, ఒక నిమిషంలో చంపేస్తాడు.  మనం కొన్ని మార్లు హార్ట్ఫెయిల్యూర్ అంటాము. ఎందుకో మనకు తెలియదు. ఈ రకంగా మనం చెప్పుకుంటే, సాక్షి అనేవాడు రెండు రకంగా ఉన్నారు. ఎందుకు చెప్పవలసి పని వచ్చింది అంటే, ఒకచోట ఆత్మ సాక్షి అన్నాము, ఇంకోసారి ఇంకో చోట పరమాత్మ సాక్ష్యం అన్నాము. అందువలన సందర్భాను బట్టి చెప్పవలసి పని వచ్చినది. శరీరంలో ఉన్న ఒక్కనికి మాత్రం సాక్షి ఆత్మ,  ప్రపంచమును కు అంతా సాక్షి పరమాత్మ. సందర్భమును బట్టి ఆ మాట చెప్పాము .  సాక్షి అంటే చూసేవాడు. చూసేవాడు అంటే వివరించి ఉంటే, దృష్టి కూడా స్థూలం, సూక్ష్మంగా ఉంది.   ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ప్రపంచము అంతా కనిపిస్తుంది. ఇదంతా స్థూలము, . కొంత కనిపించేవి, కనిపించనివి . ఈ స్థూలం మే , సూక్ష్మంగా ఉంది. ఎక్కడ? ఎక్కడైతే ఈ ప్రపంచంలో కనిపించే వస్తుజాలం  అంతా ఉందో, సూర్యుడు గ్రహాలు నక్షత్రాలు మొత్తం ప్రపంచమంతా నీ శరీరంలో అనిగి  ఉన్నాయి. కనిపించే అంతా సూక్ష్మంగా నీ శరీరంలో ఉన్నాయి అర్థమైందా? అంత పెద్దది ఎలా ఉన్నాయి? అనొచ్చు కానీ ఉన్నాయి. బయట సూర్యుడు పలానా  స్తానం లో అని  ఎలా ఉన్నాడో చెబుతున్నాము .  మన జాపతకములో కాల,కర్మ చక్రంలో ఇక్కడ అక్కడ అంటున్నాము. జ్యోతిష్యంలో ఒక వ్యక్తి ఈయన తలలో సూర్యుడు ఇక్కడ, చంద్రుడు ఇక్కడ ఈయనకి, ఈ కష్టం, ఈ సుఖం అని చెబుతున్నాము. భవిష్యత్తు గురించి కొంత చెప్పగలుగుతున్నాము. ఈ గ్రహాలు ఎక్కడ సూక్ష్మంగా? కాలచక్రంలో. మరి ఆ కాలచక్రం నీలో ఉంది.

ఇది అంతా గారడే కాదండి, వాస్తవం. కర్మ కాల చక్రములు, గ్రహాలు, నడిపించేవాడు, జీవులు, అనుభవము.  మీ శరీరంలో ఉన్నాయి, అనుభవం కూడా ఉంది. అంత పెద్ద ప్రపంచంము, మనలో కూడా సూక్ష్మంగా ఉంది. నీకు తెలిసిన,తెలియకున్నా సర్వ ప్రపంచము సూక్షముగా అణిగి వుంది.  ఇంకో విషయం ఏమిటంటే సర్వ ప్రపంచం సృష్టించినవాడు, ఆ సృష్టికర్త కూడా, దేవుడు కూడా నీలో ఉన్నాడు. అర్థమైందా? నీవు దేవుని తెలుసుకోవాలంటే, బయటకు పోతే కనిపించడు. చాలామంది ఏమి చేస్తున్నారు అంటే, మనము బయట తెలుసుకోనేది అని అనుకుంటున్నారు. కానీ బయట దేవుడు తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే స్థూలమైనవాడు కాదు.  స్థూలం అయితే మనం చూడవచ్చు. స్థూలమైనవాడు దేవుడు కాదు. సూక్ష్మముతో కూడుకున్నవాడు. కనిపించేవాడు కాదు, ఆయనకి ఆకారం లేదు. దృశ్య రూపంలో కనిపించేవాడు కాదు. దేవుడు అణువులోనా వ్యాపించి ఉన్నాడు. ఇంకో మాట చెబితే కాలం అయి ఉన్నాడు. నీవు ఎవరు అంటే గీతలో, నేను కాలం అని అన్నాడు ఒక మాటలో. ఒకే ప్రశ్న ఒకే జవాబు. అహంకాలోస్మీ అన్నాడు. ఆ కాలం ఎక్కడ ఉంది, నీ తలలో, ఆ కాలంలో ఉన్న గ్రహాలు ఎక్కడ ఉన్నాయి? నీ తలలో ఉన్నాయి. వారు పరిపాలన చేయు కర్మ అంతా ఎక్కడ ఉంది నీ తలలో, అందరికీ అధిపతి దేవుడు ఎక్కడ ఉన్నాడు? నీ తలలో ఉన్నాడు. మీ శరీరం అంతా వ్యాపించి ఉన్న అటువంటి ఆత్మను , ఒక్కచోటు ఉన్న నిన్ను, సర్వ ప్రపంచం వ్యాప్తి అయిన దేవుడు నీ శరీరంలో ఉండి చూస్తున్నాడు. కానీ ఆయన ఏమీ అనడు. మీ తిప్పలు కొద్ది మీరు పడండి, వాటితో సంబంధం లేదు నాకు . ముందు ఒక సిస్టం ఏర్పాటు చేసి పెట్టాను. దాని ప్రకారమే జరుగుతుంది. మల్ల జరిపేది ఏమీ లేదు.  సృష్టి పూర్వమే సిస్టం[ ఆటో స్క్రిప్ట్ ]డిజైన్ చేశారు. ఆ ప్రకారమే అన్ని జరుగుతూ పోతుంటాయి, అంతా ఆత్మకు అప్పచెప్పాడు. ఆయనకు(9) ఒకటే ధర్మం, పని చేసేవాడు కాదు. కనిపించేవాడు కాదు, పేరు అంతకు లేదు. ఈ మూడింటిని మనం వ్యతిరేకించామో ఆయన దేవుడు కాదు. కానీ ఈ సూత్ర ప్రకారము ఉన్నవాడు దేవుడు.  ఆయన ఎవరో కనుగొనలేరు. అటువంటి వాడిని ఎవరు కనుగొనలేరు. మీ శరీరంలో నీ పక్కనే అన్ని పనులు చేస్తున్న వాడే నీకు తెలియబడలేదు. దేవుడు సృష్టికర్త ఎలా తెలియగలవు. అంత దేవుడు తెలుసుకోవాలంటే ఏమి చేయాలి? ముందు మనం ఆరును తెలిస్తే తొమ్మిది తెలుస్తుంది.

ఒకచోట : నేనే మార్గం, జీవం, గమ్యం ; 3+6=9, తొమ్మిది తో సమానం ఐనప్పుడు 9 లో ఐక్యం. 3 = జీవుడు,6 = ఆత్మ; 9= దేవుడు; గుర్తుగా వాడుకుంటున్నాము, మరి ఆరు తెలియాలంటే ఏమిచేయాలి? పైన చెప్పిందానికి ప్రకారంగా బయట ద్యాస వదిలి ఆత్మ ధ్యాస పెట్టుకోవాలి . మీ శరీర అవయవాలు మీద కాదు. శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస ఎవరు చేపిస్తున్నారు? 6, కావున ఆరును పట్టుకో.  చెప్పుకునేవి చిన్నవి(ముక్కు,శ్వాస..), కానీ చాలా పెద్దగా చెప్పుకుంటారు, కానీ ఎవడో అల్లాడిస్తే ఆడుతున్నాయో అవి. జీవుడు, ఆరును(తోలేవాడు, 9 క్రింద పనిచేసేవాడు ) తెలుసుకుంటే, నన్ను ఈ విధంగా తోలుతున్నాడు అని జ్యప్తి పెట్టుకుంటే, ఆరు మూడిని   సక్రమంగా 9 దగ్గరికి తోలుకు పోతుంటాడు . లేకుంటే ఆరు 3ని చావు పుట్టుక మధ్య తోలుతుంటాడు .

    ఎందుకు స్వామి ఈతొలుడు  అని, జీవుడు , నాకు నీ(6) పని లో ఏ సంబంధము లేదు , నాకు ఏ పని చేతకాదు అని ఊరక ఉంటే ,( 3 కేవలం సుఖ దుఃఖం లు అనుభవించడం తప్ప). అప్పుడు 6, 3 ని , 9 దగ్గరికి తెలుకుపోతాడు . అందుకే ఈయనును(6) తెలుసుకొంటే ,9 తెలుస్తాడు(6 తోలుకుపోవడం ద్వారా).    6 ని తెలుసుకొనేది ఎప్పుడు?చాల కష్టం అయింది ,  స్థూలం గా ఉండే దాని మీద మన(3) చూపు, సూక్షమమ్ గా వున్న దాని మీద మన చూపు లేదు .  ఈ 6 కనిపించదు , సూక్ష్మం ; 6 నడిపించే వ్యక్తులు కనిపిస్తారు కానీ, వ్యక్తి ని నడిపించే ఆత్మ కనిపించలేదు. ఇప్పుడు నేను కనిపిస్తున్నాను మాట్లాడించేది ఆత్మ , ఆత్మ కనిపించలేదు.  వ్యక్తి కనిపిస్తున్నాడు, ఈ వ్యక్తి బాగా జ్ఞానం చెబుతున్నాడు అని అనుకుంటున్నారు.  కానీ మేము ఏమి అంటున్నాము.  మీరు పొరపాటు పడుతున్నారు.నాకు ఏమీ తెలియదు, చెప్పేవాడు ఇంకొకడు.  మేము ఈ విధముగా చెబుతున్నాము అని గ్రంథంలో రాస్తున్నాము.  మేము చెప్పినది ఏమనగా మేము అంటే,బయటి వాడు ఈవిధంగా ప్రశ్న వేసాడు: మీరు  + మీ ఆశ్రమంలో ఉన్నవారు అందరూ చెబుతారా? అలా కాదు, నా శరీరంలో నా పక్కవాడు, నా స్నేహితుడు అన్నీ తెలిసిన వాడు ఆరు; మీరు అడిగిన ప్రశ్నకు నాకు  జవాబు తెలియదు అని, నా ప్రక్కవానికి  తెలుసు అని చెబుతుంటాను.నేను మూగ , గుడ్డి, చెవిటి, అవిటి, నాకు ఏమీ చేతకాదు అనుకుంటే సరిపోతుంది.  నేను అదే.  కానీ అన్ని పనులు చేసేది వాడు(6) అని తెలుసు.

మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఆరు చెబుతాడు.  ఆరు కదిలిస్తే నేను(3) కదులుతున్నాను. ఇప్పుడు అర్థమైందా మేము అంటే 3 + 6 అని.  ఇప్పుడు కూడా అదే, నేను ఒకడినే అనుకుంటే మీరు పొరపడినట్లే . నేను ఎప్పుడూ ఒక్కడు అని చెప్పలేదు.  ఒక్కడినే అంటే ఒకటి సమాధానం కూడా రాదు( జ్ఙానం). ఇద్దరం అయితే ఏమైనా చెప్పగలవు మీరు అడిగిన  ప్రశ్నలకు సమాధానం ఈ విధంగా చెబుతున్నాము. 3 + 6 ఉన్నాం కదా. సమాధానం ఇవ్వవలసినది 6 పని ,మూడుగా నాకు ఎరుక. 3,6,9 విషయం తెలియకపోతే ఏమీ అర్థం కాదు . ఇది ఏదో వినడానికి బాగుంది తర్వాత నేను(3) అనుకోవద్దు మీరు.  మీరు ఒకటి అనుకుంటే ఆరు రాస్తూ ఉంటాడు. కావున ఇప్పుడు అయినా జాగ్రత్తపడి ,మీరు రాయించుకోవద్దండి.  రాయించుకుంటే అనుభవించాల్సిన పని ఉంటుంది.  మరి జాగ్రత్త పడండి . నా వెనక ఒకడు  ఉన్నాడు ఆరు, మీరు చూడలేదు సూక్ష్మంగా ఉన్నది.  అంత గట్టిగా ఎలా చెబుతున్నావు? అవును అంత గట్టిగా అడిగిన  వాడు కూడా వాడే( నేను(3) అడుగుతున్నాతెలివిగా అని అనుకోవదు, ఆయనే(6) తిరిగి అడిగింది, [నీ పేరుచెప్పి(నీకు అంటగట్టి ,మాయలో పెట్టి )]పనిచేసేది).

ఒకడు ఒకటికి కూడా పోయించేది ఆరు. 3  పోయలేదు , ఇందులో కొన్నిసార్లు ఇబ్బంది పెడతాడు.  ఈ తిప్పలు ఎందుకు పెడతాడు?  కింద జన్మలో 6 చేసే పనులన్నీ మూడుగా నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి.  అన్ని పనులు చేసేది నేనే(6), అని  గ్రంథంలో చెబుతాడు.  మీరు ఏమి అయినా కనుక్కుంటారా?  అంటాడు; మూడుగా నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు , మొదట. (నేనే ఒకటికి పోసాను అని).

సరే  తెలుసో తెలియకో ఒప్పుకున్నావు.  ఇప్పుడు నుండి ఒప్పుకోవద్దు.  తెలుసో తెలియకో ఒప్పుకున్నావు అవి రికార్డు అయినాయి.  ఇప్పుడు తెలిసి, ఇప్పటి నుంచి ఒప్పుకోవద్దు అలవాటు అయింది అంటే 6 కూడా అలవాటుగా రాసుకుంటాడు.  కాబట్టి అలవాటు తప్పించుకో, భక్తి తో  గుడి చుట్టూ తిరుగుతా,  ముక్కు మూసుకుంటా, ఆ పనుల వల్ల ఉపయోగం లేదు(ఇబ్బందులు,వృధా). ఉండే విషయం అంతా లోపల ఉండే వాడే విషయం.  నీవు వెతక వలసింది నీ శరీరం బాహ్య విషయంలు కావు,లోపల(అంతరంలలో ఉండే విషయాలు తెలుసుకోండి ) . సత్యం తెలిస్తే నీవు పొరపాటు పడవు.  కానీ చాలా "ఆధ్యాత్మిక సంస్థలు" అని పేరు పెట్టి ,శరీరం లో వుండే సత్యం తెలియక పొరపాటు పడుతున్నారు.

ఇప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చి వారి విషయము ఇది, అని తెలుసుకున్నారు . దేవుడు మనకు దగ్గర దారి ఇచ్చాడు.  లోపల విషయాలు మీద పరిశీలన చేయు, బుద్ధి ని ఇచ్చాడు కదా! దేవుడు. ఎప్పుడు బయట విషయాల్లనేనా ? లోపల విషయాలు వద్దా ? అవసరమే.  ఓ వ్యక్తి దేవుని పూజ కోసం 350 రూపాయలు ఇస్తారంట.  మాకు ఈ విషయం తెలిసింది, మేము అడిగాము. నీవు దేవుని జ్ఞానం తెలుసుకోవాలా? కర్మ లేకుండా పోవాలా ?మోక్షం అనుకుంటున్నావా? అడిగాను.  అవును దాని కోసమే పూజ చేస్తున్నాను అన్నాడు.  ఇక అయితే ఆ డబ్బులు నాకు ఇయ్యి .  3500రు , 10 నెలలు రుసుము మాకు తీసుకోవడం జరిగింది.  దేవుడు పూజ చేయడం అంటే, వీడు మోసం చేసేవాడు, వీడు నన్ను కాక పడుతున్నాడు అని అనుకుంటాడు దేవుడు .  నేను చెప్పిన మార్గం ఒకటి కూడా అనుసరించలేదు.  కొంత డబ్బులు పూజకి ఇస్తే, దేవుడు పని అని, అనుకుంటే ఎట్లా అవుతుంది? దాని వలన దేవుడు నిన్ను చెడ్డవాడు అనుకుంటాడు.  మంచివాడు అనుకోడు.  దేవుడు మంచివాడు అనుకోవాలంటే ఏం చేయాలి? మీ దగ్గర నుండి ఆ డబ్బు నాకు ఉపయోగపడాలి.  నువ్వు దేవుడికి పూజ చేపించుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు.  ఆయన సేవ చేస్తే ఆయనకి ఇష్టం.  ఆయన ధర్మాలు ప్రచారం చేపించుకుంటే ఆయనకి ఇష్టం.  ఆయన జ్ఞానము అందరికీ తెలియజేయడమే ఆయనకిష్టం.  మీరు చేయవలసిన పని, అది.  పూజ చేయడం కాదు.  దుర్మార్గులు కూడా పూజ చేస్తారు.  పూజ చేశానని కాపాడమని అనుకొంటే సరిపోతుందా? మీ పూజకు సంబంధం లేదు అంటాడు. మీ శరీరంలో ఉన్న ఆత్మ మిమ్మల్ని శిక్ష ఇస్తుంది . రక్షిస్తుంది, నువ్వు సక్రముగా ఉంటే ( 3,6,9 విషయము  తెలుసి , యోగం ద్వారా) .అది నీ గ్రాహ్యత శక్తీ మీద(సుక్మా విషయాలు)  ఆధారపడి ఉంటుంది, దేవుని మీద ధ్యాస ఉంటే వస్తుంది.

నీకు ప్రపంచ విషయాలు  మీద బుద్ధి ఉన్నా, దేవుని మీద ద్యాస  ఉంటేనే నీ బుద్ధి గ్రహించుకుంటుంది. శ్రద్ధ ఉన్నప్పుడే  నీ బుద్ధి యొక్క పనితనం ఉంటుంది.  దేవుని మీద శ్రద్ధ లైనప్పుడు ఎంత జ్ఞానం వచ్చినా నీకు అది ఉపయోగం లేదు.  మరి ఈ జ్ఞానం తెలుసుకోవాలంటే అర్హత పొందాలంటే ఏమి చేయాలి ?అంటే శ్రద్ధ దేవుని మీద పెంచుకోవాలి.  మనం అసలైన జ్ఞానం మార్గంలోనికి ముందుకు పోవచ్చు.  దాని ద్వారా అసలైన దేవుని తెలుసుకొనే అవకాశం వస్తుంది.  దేవుడు(9) సూక్ష్మమైనవాడు, ఆరు కూడా సూక్ష్మమైన వాడు.  స్థూలమైన వాడు అనుకుంటే పొరపాటు పడతావు.  దేవుని విషయాన్ని సూక్ష్మంగా ఉంటాయి. దేవుని జ్ఞానం  అంతా సూక్ష్మ వివరంగా ఉంటాయి. అందువలన భగవద్గీతలో ఎన్నో సూక్ష్మ విషయాలు(జ్ఞానం రహస్యం గా ఉంది) ఉన్నాయి. సూక్ష్మము ని గ్రహించుకునే  గ్రాహ్యతశక్తి  లేని దాని వలన మనము అందులో ఉన్న విషయాలు తెలుసుకోలేదు.  అదేవిధంగా క్రైస్తవుల సువార్త(నిగూడం గా అని) ,  ముస్లిం ల(  కురాన్ గ్రంథంలో కూడా ఇదే పరిస్థితి(ముత శ బిహాత్) .  ఇంకా మనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఒకడు బాకీలు , రోగాలు, ఉద్యోగ కష్టం, ఒకనికి భార్య వల్ల, ఇంకొకరికి ఇంకొకటి, అన్నిటికి కారణం కర్మ.  కర్మ అంటే 6 రాసిన విషయాలు,ఆయన వ్రాసిన గ్రంధం : కర్మ గ్రంధం 364 పేజీలు ఉన్నాయి.  అది మూడు అధ్యయాలు, 36 పాఠాలు, 324 సమాచారములు గా ఉంది.  ఈ గ్రంథం ఎప్పటికీ అవ్వదు చదవడానికి , చదివిన కొద్ది కొత్త పేజీలో వస్తుంటాయి.  నీ బుద్ధి ఉపయోగించి నీ సొంత గ్రంధమైన కర్మ పత్రం గురించి తెలుసుకోవాలి.  ఆ గ్రంథం చదువుకుంటే, నువ్వు కర్మ నుండి  బయటపడగలవు, అవకాశం వస్తుంది.  లేకుంటే తేనెలో ఉన్న ఈగ వలే, కర్మలో చిక్కి ఇరుక్కుంటావు. సూక్ష్మంగా ఉండే కర్మ ను తెలుసుకోండి. దగ్గర గా  అర్ధం అయ్యే కర్మపత్రం గురించి తెలుసుకుంటారని  అని  చెబుతూ, మీరు అటువంటి శ్రద్ధ పొందుతారని, ఈ సమావేశం ఇంతటితో ముగిస్తున్నాను.

                                             ----END----

additional points as devotee of krishna 

[1. దేవుడు, జీవుడి కి శ్రద్ధ మీద స్వతంత ఇచ్చాడు, శ్రద్ద ( 1 ఆత్మ , 2,స్వత్వగుణ భాగం,3. రజో గుణభాగం,4. తమోగుణభాగం ) ఉండవచ్చు. reference:gita

2. జీవుడి కి కర్మ మీద స్వతంత లేదు. reference:gita

3. జీవుడు , దేవుడి జ్గ్యానం తెలిసి , ఆప్రకారం ఉంటె కర్మ, దేవుడి ఇష్ట ప్రకారం కర్మ తొలగును. ref gita

4. దేవుడు(9) పని చేసేవాడు కాదు, కాని తన సంకల్పం ప్రకారం పాలకులు ,ఆత్మ పనులు చేస్తుంటాయి. reference: ఘనమైన రాత్రి 

5. దేవుడు మాయ ఎలా పని చేస్తుంది ; "నేను(3) అడుగుతున్నాతెలివిగా అని అనుకోవదు", పైన చెప్పిన విషయం బాగా గ్రహించండి.

6. కీ ఇచ్చిన బొమ్మ లో 'జీవుడు' ఉన్నాడు. బొమ్మ కదలిక , జీవుడు ప్రమేయం లేకుండా ఆడుతుంది మరియు ఈ ఆట జీవుడి ప్రమేయంతోనే జరిగింది అనే బ్రమ్మ ను ఇస్తుంది, ఈ బ్రమ్మను దేవుని జ్గ్యానం తో లేకుండా చేసుకోవచ్చు.  ]

https://www.youtube.com/watch?v=XT-Te24EdoY

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024