pss book : దీపావళి part2

దీపావళి.

ప్రపంచంలో ఇంతవరకు ఎవరి చేత గుర్తింపబడనిది, ఎవరూ కనుగొననిది, ఎవరికీ తెలియనిది పరమాత్మ. పరమాత్మనే దేవుడు అనికూడా అనవచ్చును. దేవుడు అనినా ఎవరికీ తెలియనివాడేనని అర్థము. వివరముగా చెప్పుకొంటే దేవుడు అనగా, దేవులాడబడేవాడు లేక వెతకబడే వాడు అని అర్ధము. వెతకబడేవాడు అని అంటే కనిపించనివాడని అర్ధము. దేవుడు అనబడేవాడు ఎవడో, ఎట్లుంటాడో, అతని పేరేదో, అతని స్థానమేదో, ఆయన పనేమిటో ఎవరికీ తెలియదు. అటువంటి వానితో మనకేమి పనిss అనుటకు వీలులేదు. భూమిమీద బ్రతికే ప్రతి జీవరాశికీ, ప్రతి మనిషికీ శక్తి అవసరము. శరీరములో శ్వాస పీల్చుటకు శక్తి కావాలి. ఆహారము జీర్ణమగుటకు శక్తి కావాలి. శరీరములోని ప్రతి కదలికకూ, ప్రతి భాగమునకు శక్తి అవసరము. శరీరములో ఎక్కడ శక్తి లేకపోతే అక్క వ్యాధి ఏర్పడుతుంది. వ్యాధి ఏర్పడినప్పుడు శక్తి ఉండదనీ, బలహీనముగా ఉండునను విషయము అందరికీ తెలుసు. శరీరములో ఎక్కడైనా వ్యాధి లేకుండా పోవాలంటే, శరీరమునకు శక్తి అవసరము. ఎప్పుడు శక్తి ఉందో, అప్పుడు వ్యాధి ఉండదు. మనిషి శరీరమునకు శక్తి ఎక్కడనుండి లభించుచున్నది? అని ప్రశ్నించుకొని చూస్తే, ప్రపంచములోనున్న ఏ జీవరాశికిగానీ, శక్తి అనునది ప్రకృతినుండి లభించు చున్నదని చెప్పవచ్చును. ప్రకృతి శక్తి నిలయమా? అని అడిగితే శక్తి ప్రకృతి యొక్క సొంతము కాదని తెలియుచున్నది. ప్రతి జీవరాశి శరీరము ప్రకృతి చేత తయారు చేయబడినది. అయినా శరీరమునకు ఇచ్చు శక్తి ప్రకృతి దగ్గరలేదు. ఇక్కడ ప్రకృతినుండి అందరికీ శక్తి లభించుచున్నదని పై వాక్యములలో చెప్పి, ఇప్పుడు నిమిషము కూడా గడువకనే ప్రకృతి దగ్గర శక్తే లేదని అసత్యము చెప్పితే ఎలాగ అని ఎవరైనా మమ్ములను ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! శక్తి ప్రకృతినుండి లభించుట వాస్తవమేగానీ, శక్తి ప్రకృతిదిగాదు. వాస్తవానికి శక్తి పరమాత్మది (దేవునిది). ఇక్కడ ముఖ్యముగా గమనించవలసిన విషయమేమనగా పరమాత్మకు అడ్రస్ లేదు. ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. అందువలన ----------------- శక్తి తనదే అయినా దేవుడు తాను ఎక్కడా తెలియబడకుండ తన శక్తిని ప్రకృతి ద్వారా అందించుచున్నాడు. ప్రకృతి తనకు లభించిన శక్తిని మనిషికి ఇస్తున్నది. దేవుడు లేడు అనుకొనువారందరూ శక్తి అంతయూ ప్రకృతిదే అని చెప్పుచుందురు. దేవుడు ఏ మనిషికీ తెలియకుండుటకు, తనకూ మనిషికీ మధ్యలో ప్రకృతిని పెట్టుకొన్నాడు. తాను ఏమీ చేయకుండా ప్రకృతి చేత అంతా చేయిస్తున్నాడు. ప్రకృతి వెనుకయుండు వాడు దేవుడే, అయినా దేవుడు ఎక్కడా ఎవరికీ తెలియదు, తెలియునదంతా ప్రకృతియే. ప్రపంచమంతా శక్తితోనే నడుస్తున్నది. అయినా శక్తి దేవునిదని ఎవరికీ తెలియదు. స్త్రీలింగమైన దేవతదే ప్రకృతిదే) అని అందరూ అనుకొనునట్లు మనలోని మాయ భ్రమింపచేసినది. శక్తికలవాడు దేవుడు, తాను పొందిన శక్తిని ఇచ్చునది దేవత (ప్రకృతి). దేవుడు అను పదమునుండి దేవత అను పదము పుట్టినది. అలాగే పరమాత్మ ప్రకృతిలాగ ఉన్న మరియొక జోడీని చూస్తాము. దీపము అనునది వెలుగునిచ్చునది అని అందరికీ తెలుసు. వెలుగునిచ్చునది ఏదైనా తాను ప్రకాశిస్తూ, తన ప్రకాశము ద్వారా ఇతరులకు వెలుగునిచ్చుచున్నది. ఎక్కడ వెలుగుయున్నా అక్కడ దీపముందని చెప్పవచ్చును. వెలిగేది దీపమైనప్పుడు చిన్న కాంతి ముక్కను కూడా దీపము క్రిందికే జమకట్టి చెప్పాలి. ఇక్కడ కొందరికి అనుమానము వచ్చి ఒక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! చిన్న నిప్పు కణము కూడా కొద్దిపాటి వెలుగును ఇచ్చుచున్నది కదా! అలాంటప్పుడు దీపమే వెలుగు నిచ్చును అనుటను అటుంచి, నిప్పు కూడా వెలుగునిచ్చును అని చెప్పవచ్చును కదా! అని ప్రశ్నించవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! దీపముగానీ, నిప్పుగానీ వెలుగు నిచ్చుట వాస్తవమే! ఇక్కడ ఒక సూత్రమును అనుసరించి చెప్పుకొంటే వెలుగు నిచ్చునది ఏదైనా దీపము అన్నాము. వెలుగు దీపముదేనని అందరూ ---------------------- శక్తి తనదే అయినా దేవుడు తాను ఎక్కడా తెలియబడకుండ తన స్మ ప్రకృతి ద్వారా అందించుచున్నాడు. ప్రకృతి తనకు లభించిన శక్తిని మన్ని ఇస్తున్నది. దేవుడు లేడు అనుకొనువారందరూ శక్తి అంతయూ ప్రకృతి అని చెప్పుచుందురు. దేవుడు ఏ మనిషికీ తెలియకుండుటకు, శన మనిషికీ మధ్యలో ప్రకృతిని పెట్టుకొన్నాడు. తాను ఏమీ చేయకుండా (ప్రకృతి చేత అంతా చేయిస్తున్నాడు. (ప్రకృతి వెనుకయుండు వాడు దేవుడే అయినా దేవుడు ఎక్కడా ఎవరికీ తెలియడు, తెలియునదంతా ప్రకృతిశే, (ప్రపంచమంతా శక్తితోనే నడుస్తున్నది. అయినా శక్తి దేవునిదని ఎవరికీ తెలియదు. స్త్రీలింగమైన దేవతదే (ప్రకృతిదే) అని అందరూ అనుకొనునట్లు మనలోని మాయ (్రమింపచేసినది. శక్తికలవాడు దేవుడు, తాను పొందిన శక్తిని ఇచ్చునది దేవత (ప్రకృతి). దేవుడు అను పదమునుండి దేవత అను పదము పుట్టినది. అలాగే పరమాత్మ ప్రకృతిలాగ ఉన్న మరియొక జోడీని చూస్తాము. దీపము అనునది వెలుగునిచ్చునది అని అందరికీ తెలుసు. వెలుగునిచ్చునది ఏదైనా తాను ప్రకాశిస్తూ, తన (ప్రకాశము ద్వారా ఇతరులకు వెలుగునిచ్చుచున్నది. ఎక్కడ వెలుగుయున్నా అక్కడ దీపముందని చెప్పవచ్చును. వెలిగేది దీపమైనప్పుడు చిన్న కాంతి ముక్కను కూడా దీపము క్రిందికే జమకట్టి చెప్పాలి. ఇక్కడ కొందరికి | అనుమానము వచ్చి ఒక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! చిన్న నిప్ప కణము కూడా కొద్దిపాటి వెలుగును ఇచ్చుచున్నది కదా! అలాంటప్పుడు దీపమే వెలుగు నిచ్చును అనుటను అటుంచి, నిప్పు కూడా వెలుగునిచ్చును అని చెప్పవచ్చును కదా! అని ప్రశ్నించవచ్చును. దానిక అనుసరించి చెప్పుకొంటే వెలుగు 4 వెలుగు దీపముదేనని అందరూ --------- అనుకోవడము సహజమే. ప్రకృతినుండే శక్తి లభించుచున్నదని అందరూ అనుకొని శక్తి దేవునినుండి లభించుచున్నది. అలాగే దీపము నుండి వెలుగు వస్తే అది వాస్తవముగా దీపముది కాదు. దీపమునకు వెనుక ఎవరికీ తెలియకుండా ఉన్న అగ్నిది. అగ్ని వేరు, వెలిగే దీపము వేరు. మండే దానిని మంట లేక దీపము అన్నట్లు దీపమునకు కారణమైన దానిని అగ్ని అంటున్నాము. నిప్పురవ్వను లేక నిప్పు కణికను అగ్ని అనవచ్చును కదా! అంటే, సూత్రము ప్రకారము అది వెలుగునిచ్చుచున్నది. కావున దానిని అగ్ని అనకూడదు. వెలిగే దీపము అనాలి. దేవుడు ఎక్కడైనా అంతా వ్యాపించి ఉన్నాడు, కానీ శక్తి మాత్రము ప్రకృతి ద్వారానే లభిస్తుంది. అలాగే అగ్ని ఎక్కడైనా ఉంది, కానీ వెలుగు మాత్రము దీపము లేక రగిలే నిప్పు ద్వారానే వస్తున్నది. కాంతి కిరణము అగ్నిదే అయినా, అది దీపము ద్వారానే వచ్చుచున్నది. శక్తి దేవునిదే అని తెలిసినా, దేవుడు ఎవరికీ తెలియకుండా ప్రకృతిని ఎలా తన ముందరుంచుకొన్నాడో, అలాగే వెలుగు అగ్నిదేనని అందరికీ తెలిసినా అగ్ని కనిపించక దాని వెలుగును ముందుంచు కొన్నది. దేవునికి అడ్డముగా ప్రకృతియున్నట్లు, అగ్నికి అడ్డముగా వెలిగేది ఏదైనా ఉండవచ్చును. దానినే చిన్నదైతే దీపమని, పెద్దదయితే మంట అని అంటున్నాము. దేవుడు అను పదమును మనము నిత్యమూ వాడినా, దేవుడు ఎలా ఎవరికీ తెలియలేదో, అలాగే అగ్నిని మనము చూచామను కొని, అగ్ని అను పదమును మనము ప్రతి దినము అనుచుండినా, 5. వాస్తవముగా అగ్ని ఎలాంటిదో ఎవరికీ తెలియదు. దేవుడు ఇంతవరకూ ఎవరికీ తెలియనట్లే, అగ్ని కూడా ఇంతవరకూ ఎవరికీ తెలియదు. దేవుడు అందరినీ సృష్టించుచున్నాడు, చివరకు అందరినీ హరించు చున్నాడు అని ఎవరు చెప్పినా, ఆ మాట వాస్తవమే అయినా, దేవుడు ఎవరో ఎవరికీ తెలియదు. అందరికీ తెలియునట్లు అందరినీ సృష్టించు ---------- చున్నది, హరించుచున్నది ప్రకృతియే. అదే విధముగా అగ్ని అన్నిటిని దహించుచున్నదనీ మరియు వెలుగును కూడా ఇచ్చుచున్నదనీ ఎవరు చెప్పినా ఆ మాట వాస్తవమే అయినా, అగ్ని ఏమిటో ఎవరికీ తెలియదు. కొన్నిటిని తెలిసినట్లే మనము మాట్లాడినా, వాస్తవానికి వాటి పూర్తి విషయము తెలియ దనియే చెప్పవచ్చును. ఇక్కడ కొందరు ఆశ్చర్యమును వ్యక్తము చేస్తూ, మేము పొరపడినామా లేక మమ్ములను మీరు తప్పుదారి పట్టిస్తున్నారా? అని అడుగవచ్చును. దానికి మా జవాబు మీరు అలా అనడములో తప్పులేదు. ఎందుకనగా ఎవరికైనా తమమీద తమకుగానీ, లేక మామీద గానీ అనుమానము రావచ్చును. వాస్తవముగా దేవున్ని గురించి ఎన్ని సమాచారములు నేను చెప్పినా నిజంగా నాకు దేవుడు తెలియదు. అలాగే ఒక శాస్త్రమును అందులో ఒక సూత్రమును అనుసరించి మాట్లాడకపోతే, ఆ మాట మూఢనమ్మకముగా మాట్లాడినట్లగును. అలా కాకుండా వెలిగేది దీపము అను సూత్రమును అధారము చేసుకొని చెప్పితే, నేను కూడ ఇంత వరకు దీపమునే చూచానుగానీ నిజముగా అగ్నిని చూడలేదు. ఒకప్పుడు నేను కూడా అగ్నిని చూచానని, మండకుండా కొంతకాలి ఎర్రగ కనిపించు కొరివిని అగ్ని అని అనుకొనియుంటిని. ఇప్పుడది మూఢనమ్మకమనీ, ఇలా ఎన్నో వాస్తవముగా నేను అగ్నిని చూడలేదని తెలిసిపోయినది. మనకు తెలియని విషయములను తెలిసినామని మనము అనుకొంటున్నట్లు ఇప్పుడు కొంత అర్థమైనది. ఇక్కడ కొందరు ఒక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! ప్రకృతి వేరు, దేవుడు వేరు. కనిపించనివాడు దేవుడు, కనిపించునది ప్రకృతి అని చాలామార్లు మీరే చెప్పారు కదా! ఇప్పుడు ప్రకృతిలో భాగమైన అగ్నిని కూడా కనిపించదు అంటున్నారేమిటి? అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! పరమాత్మ (దేవుడు) కనిపించడు. అలాగే ప్రకృతిలోని ------- ఆకాశం, గాలి, అగ్ని మూడు భాగాలు కూడా కనిపిస్తాయి. ఆకాశంను గాలిని ఎవరూ చూడరు. అలాగే అగ్నిని కూడా ఎవరూ చూడరు. కానీ చాలామంది పొరపాటుగా అగ్నిని చూసారని అనుకుంటున్నారు. వాస్తవంగా ఆకాశం, గాలి, అగ్ని మూడు కనిపిస్తున్నాయి నవి కావు. నీరు, భూమి రెండు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ మాటను అప్పుడే ఎందుకు చెప్పలేదు అని అడిగితే, ఇప్పుడు చెప్పవలసి యున్నది. కావున అప్పుడు చెప్పలేదని తెలుపుచున్నాను. చెట్టుకు పుట్టే ఆకును పుట్టిన వెంటనే తినవచ్చును. అయితే అదే చెట్టుకు పుట్టే కాయను పుట్టిన వెంటనే తినలేము. అలాగే ఆధ్యాత్మికములో కొన్ని విషయములను అప్పుడే చెప్పినా అర్థమగును. కొన్ని విషయములు కొంత కాలము తర్వాత చెప్పితేనే అర్థమగును. ఆకాశం, గాలి కనిపిస్తదు అంటే చెప్పిన వెంటనే ఎవరైనా వినగలరు. వాటితోపాటు అప్పుడే అగ్ని కనిపిస్తదు అంటే అతని మాటను అసత్యముగా లెక్కిస్తారు. అందువలన మేము కూడా అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్పుచున్నాము. మాకు తెలుసు అనుకొనిన దేవున్నిగానీ, అగ్నినిగానీ మనముగానీ ఎవరుగానీ చూడలేదని ఒప్పుకోక తప్పదు. మొదట దేవుని విషయములో తెలియదని కొందరు ఒప్పుకొనినా, అగ్ని విషయములో తెలియదని ఒప్పుకొనుటకు కొందరు కొంత వెనకడుగు వేసినా, కొంత వివరముగా ఆలోచించిన తర్వాత ఒప్పుకొందురు. దేవుని విషయము మొదటిదికాగా, అగ్ని విషయము రెండవది. ఇటువంటిదే మరొక్క విషయము కలదు. మూడవ విషయములో కూడా మనుషులందరూ పొరబడియున్నారని చెప్పవచ్చును. మొదటిదైన దేవుని విషయమును మనము చూడలేదని సులభముగా ఒప్పించవచ్చును. రెండవదైన అగ్ని విషయములో మనము పొరబడియున్నామని ఒప్పించుటకు కొంత కష్టమగును. ఇప్పుడు మూడవ ----------- విషయములో ఒప్పించుటకు చాలాచాలాచాలా కష్టముగా ఉండునని. చెప్పవచ్చును. ఆ మూడవ విషయము ఏమిటో, ఇప్పుడు చూస్తాము. సుఖము, ఆనందము రెండూ సంతోషమునకు సంబంధించిన సమాన పదములే, అయినా సుఖము వేరు ఆనందము వేరని చెప్పవచ్చును. ఇంద్రియముల ద్వారా వచ్చునది సుఖము. మనోభావము ద్వారా వచ్చునది ఆనందము. నాలుక ద్వారా 'మంచి ఆహారమును తింటూ ఎంత సుఖమును అనుభవించినా, ముక్కుల ద్వారా ఎంతో మంచి సువాసనను పీల్చుతూ సుఖమును ఆస్వాదించినా, కంటిద్వారా ఎంతో మంచి దృశ్యమును చూచినప్పుడు జీవుడు ఎంత సుఖమును అనుభవించినా వాని కంటిలో నీరు రాదు. అయితే మనోభావములో అనుభవమునకు వచ్చు ఆనందమును పొందినప్పుడు ఎవనికైనా కంటిలో నీరు వచ్చును. మనో ఆనందము వేరు, ఇంద్రియ సుఖము వేరు అని దీనినిబట్టి సులభముగా తెలియుచున్నది. మనిషి ఐదు ఇంద్రియముల ద్వారా ఎంత సుఖము అనుభవించినా కంటిలో ఆనంద బాష్పములు రావు. అలాగే మనిషి తన ఇంద్రియముల ద్వారా మంచి జ్ఞానమును విన్నప్పుడు, లేక చదివినప్పుడు మనోభావములో ఆనందము కల్గుట వలన కళ్ళలో ఆనంద బాష్పములు వచ్చును. చలన చిత్రమును (సినిమాను) చూచినప్పుడు కొన్ని దుఃఖ సంఘటనలలో, చూచే మనిషి కూడా అక్కడి భావముతో ఏకమై పోవుట వలన, చూచేవాని కళ్ళకు నీరు రావడము జరుగుచుండును. దీనినిబట్టి మనిషి మనోభావమును పొందినప్పుడు పొందిన భావము ఆనందమైనా, దుఃఖమైనా మనిషి కళ్ళలో నీరు రావడము జరుగుచుండును. ఇంద్రియ కష్టసుఖములలో ఎవరికీ కళ్ళలో నీరు రావు. మనోభావములైన ఆనంద దుఃఖములలోనే మనిషి కళ్ళలో నీరు వచ్చును. --------- ఇంతవరకు చెప్పినవన్నీ అందరికీ తెలుసు. ఇంద్రియముల కష్ట సుఖములు, మనోభావ ఆనంద దుఃఖములు అందరి అనుభవములో ఉండును. అయితే ఇంద్రియ సుఖములకు, మనో భావ ఆనందమునకు పెద్ద వ్యత్యాసమేమి ఉండదనియే చెప్పవచ్చును. సుఖమూ, ఆనందమూ రెండు అనుభవములే. అయితే నీళ్ళపాలు, చిక్కనిపాలు అన్నట్లు, సుఖమునకు ఆనందమునకు కొంత తేడా మాత్రము గలదు. సుఖములో కళ్ళనీళ్ళు రావు, ఆనందములో కళ్ళనీళ్ళు రావడము మాత్రమే తేడా కలదు. అయితే ఇక్కడ ప్రత్యేకముగా చెప్పవలసిన విషయమొకటిగలదు. ప్రపంచ భావములలో పొందే ఆనందమునకంటే ఎన్నో రెట్లు ఎక్కువ పొందగలుగు ఆనందము కూడా కలదు. అటువంటి ప్రత్యేకమైన ఆనందము ఒక్క దైవ జ్ఞాన విషయములలో మాత్రము లభించును. ప్రపంచ సంబంధమైన భావ ఆనందములను ఎన్నో పొందినవాడైనా, ఒక్కమారు ఆత్మానంద భావమును పొందినప్పుడు, ఆ ఆనందము ఎంత గొప్పదో అప్పుడు తెలియును. ఆత్మా నందమునకు హద్దులుండవు. మనిషి ఆత్మానంద భావమును పొందినంత సేపు అతని కళ్ళలో ఆనంద బాష్పములు వస్తూనే ఉండును. అటువంటి ఆనందమును మనిషి తన జీవితములో ఎప్పుడూ చవిచూచియుండడు. ప్రపంచ విషయములలో భావ ఆనందము ఏర్పడినా, ప్రపంచ ఆనందము నకూ ఆత్మ ఆనందమునకూ ఎన్నోరెట్లు తేడాయుండును. ప్రపంచములో ఎప్పుడూ ఎక్కడా పొందని ఆనందమును పొందానని మనిషి తృప్తి పొందును. అటువంటి ఆనందము కొన్ని కోట్లు డబ్బు ఖర్చుచేసినా రాదని దానిని అనుభవించిన వానికి తెలిసిపోవును. అంతపెద్ద ఆనందము మాకు ఎక్కడ లభించునని ఎవరైనా అడిగితే, అది ఒక్క ఆత్మజ్ఞానములో మాత్రము లభించునని చెప్పవచ్చును. ఈ మాటకు ప్రతి ఒక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! మేము ఎన్నో- -------- ఆధ్యాత్మిక గ్రంథములు చదివాము. ఎన్నో ఆధ్యాత్మిక ఉపన్యాసములను విన్నాము. ఎన్నో తీర్థయాత్రలు చేశాము. బాబాలకు, మహర్షులకు సేవ చేశాము. ఎంతో కొంత జ్ఞానము మాకు తెలిసినదని అనుకొన్నాము. అయినా మీరు చెప్పే ఆనందము మాకు కలుగలేదే అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! మేము ప్రత్యేకించి చెప్పుచూ, నీటిలో మునిగిన వానికి శరీరమంతా తేమ అగును అని చెప్పాను. అయితే కొందరు నూనెలో మునిగి మాకు మీరు చెప్పిన తేమ కాలేదే అని అడిగితే, దానికి జవాబుగా మీరు మునిగినది నూనె, నేను చెప్పినది నీళ్ళు అని చెప్పగలను. అయితే చాలామంది పెద్ద తొట్టిలో నిల్వయుంచిన నూనెను చూచి, దానిలోనికి రాయివేసి, రాయి తాకిడికి అది కదలిన దానినిబట్టి నూనెను నీరేనని భ్రమించి, అందులో మునిగితే శరీరమునకు తేమ అయినా అది నీటి తేమ కాదు. నూనె జిడ్డు తగులుకొనుచున్నది. అందువలన మీరు చదివేటివన్నీ ఆధ్యాత్మిక గ్రంథములో కాదో చూచుకోండి. అలాగే మీరు వినేవన్నీ జ్ఞానవిషయములో కాదో పరిశీలించుకోండి. మీరు సేవించిన వారు జ్ఞానులో కాదో, జ్ఞానవేషములోనున్నవారో! జాగ్రత్తగా చూచుకోండి. మీకు ఆత్మానందము కలుగకపోతే మీరు చదివినది, మీరు విన్నది ఆత్మజ్ఞానము కాదని తెలుసుకోండి. నిజమైన దైవజ్ఞానము కొరకు అన్వేషించండి. మీరు విజ్ఞతతో శ్రమిస్తే తప్పక ఆధ్యాత్మిక జ్ఞానము లభించును. దానివలన ఆత్మానందమును పొందవచ్చును. అదియే పెద్ద ఆనందము, కావున దానిని బ్రహ్మానందము అని కూడా చెప్పవచ్చును. ఇప్పుడు అసలు విషయమునకు వస్తాము. మనిషికి అతి పెద్దదైన ఆనందము లభించాలంటే ఆత్మజ్ఞానము తెలియాలి. ఆత్మజ్ఞానము తెలియా లంటే గురువు చెప్పినప్పుడే తెలియును. దైవజ్ఞానము (ఆత్మజ్ఞానము) గురువు ద్వారా తెలియును. ప్రపంచములో గురువును సంపాదించు --------- కోవడము పెద్ద కష్టమైన పనేమీకాదు. ఎందరో గురువులు రకరకాల పేర్లతో ఉన్నారు. వారిలో కాషాయగుడ్డలు ధరించినవారు మొదలుకొని దిగంబరుల వరకూ, జుట్టు గడ్డము పెంచుకొన్నవారూ మొదలుకొని గుండు గీయించుకొన్న సన్న్యాసుల వరకూ, ఆది శంకరాచార్య మొదలుకొని అచల సిద్ధాంతుల వరకూ, చెవులో మంత్రమును చెప్పు స్వాములు మొదలుకొని ముక్కు మీద ధ్యాసను చూపే మహర్షుల వరకూ గురువులుగా ఎందరో కలరు. ఇంతమంది గురువులలో ఒక గురువును ఆశ్రయించి ఆత్మజ్ఞానము తెలియగల్గితే ఆనందము లభించునని చాలామంది అనుకోవచ్చును. అయితే మేము చెప్పునదేమనగా! గురువులమని పేరు పెట్టుకొన్నవారు ఎందరుండినా, వారిలో గురువు ద్వారానే జ్ఞానమూ, జ్ఞానము ద్వారా ఆనందము లభించునని చెప్పాము. ఇంతమందిలో బాగా బోధించువానినీ, పెద్ద పేరున్నవానినీ ఎంచుకొని అతనిని గురువుగా నీవు స్వీకరించినా ఫరవాలేదు. నీరని నమ్మి నూనెలో దూకి శరీరమంతా జిడ్డును పూసు కోకుండా, ముందే నీవు ఆశ్రయించిన వ్యక్తి గురువో కాదో, కొంత చూచు కోవలసిన అవసరమున్నది. సూత్రము ప్రకారము గురువు వలననే జ్ఞానము లభించును. కావున గురువు విషయములో కొంత జాగ్రత్త పడవలసి యున్నది. గురువు విషయములో జాగ్రత్తపడేది ఏముంది, ఏ గురువు చెప్పినా దైవజ్ఞానమే కదా! అని కొందరనుకొంటే, మండేది ఏదైనా అగ్నే కదా అనుకొన్నట్లుండును. అగ్ని విషయములో పొరబడి అగ్నిని మేము చూచాము అనుకొన్నట్లు, భూమిమీద చాలామంది మేము గురువును చూచాము, మాకు గురువున్నాడు అని అనుకొనుచుందురు. వాస్తవానికి దేవుడు, అగ్ని తెలియనట్లే గురువు కూడా ఎవరికీ తెలియడు. గురువు తెలియకపోవడమేమిటి? మా ఊరిలో నలుగురు గురువులున్నారు. ప్రక్క ఊరిలో పదిమందియున్నారని కొందరు చెప్పవచ్చును. --------- ఎందరు జ్ఞానమును బోధించినా వారందరూ బోధకులే అవుతారు గానీ, గురువులుకారు. నేడు భూమిమీద ఎవరు ఏమి బోధించినా అతనిని మిగతా వారు గురువుగా భావించుచున్నారు. అయితే అతను చెప్పిన మాటలు ముందే చెప్పబడినవనీ, ఉన్నదానిని చెప్పువాడు బోధకుడే అవుతాడుగానీ, గురువుకాడని తెలియవలెను. గురువు అయినవాడు. ప్రత్యేకమైనవాడు. వీడు గురువు అని గుర్తించుటకు వీలుకాదు. జ్ఞానము ఎవర చేత చెప్పబడినా మొదట జ్ఞానము గురువునుండి వచ్చియుండును. శక్తి దేవునిదే అయినా ప్రకృతినుండి వచ్చునట్లు, వెలుగు అగ్నిదే అయినా దీపమునుండి వచ్చునట్లు, జ్ఞానము గురువుదే అయినా బోధకుని ద్వారా చెప్పబడుచున్నది. అందువలన బోధించువాడు గురువు కాదు అని చెప్పుచున్నాను. ఆ లెక్క ప్రకారము గురువును మనిషి ఎప్పటికీ తెలియలేదు. ఎప్పుడో ఒకప్పుడు ప్రపంచములో గురువు మనిషిగా వచ్చి బోధించును. గురువుగా వచ్చిన మనిషి ఎవరు అని తెలియుటకు వీలులేదు. బోధించువాడు బోధకుడు అను సూత్రము ప్రకారము, గురువు బోధించి నప్పుడు కూడా అతనిని బోధకుని క్రిందికే జమకట్టవలసివచ్చును. అందువలన భూమిమీద గురువును ఎవరూ గుర్తించలేరని చెప్పవచ్చును. దేవుని జ్ఞానము గురువుకు తప్ప ఏ మానవునికీ తెలియదు అను సూత్రము కలదు. మరియొక సూత్రము ప్రకారము దేవుని జ్ఞానము దేవునికే తెలుసు అనుట కూడా కలదు. గురువు దేవుడు ఒక్కరే అని తెలియగలిగినప్పుడే ఈ రెండు సూత్రములు సరిపోవును. దేవుడు తెలియబడువాడు కాదు. . కావున గురువు కూడా తెలియబడువాడు కాడు. గురువును తెలియగలిగితే దేవున్నే తెలిసినట్లగును. అందువలన గురువు ఎవడో తెలియదు, అట్లే దేవుడు ఎవడో తెలియదు. ఈ విషయము "గురువు" అను గ్రంథములో ముందే వ్రాసియున్నాము. భూమిమీద ఎవరైనా మేము గురువులమని --- చెప్పినట్లయితే, వారు వాస్తవంగా బోధకులే అగుదురు. ఇంతవరకు శక్తి, వెలుగు, ఆనందము ఎలా లభిస్తుందో తెలుసుకొన్నాము. 1. పరమాత్మ 2. అగ్ని 3. గురువు ప్రకృతి శక్తి X వ్యాధి. దీపము వెలుగు X చీకటి. → జ్ఞానము - ఆనందము X దుఃఖము అలా పూర్వము . మూడు యుగములలో తెలిసిన ఈ మూడు విధానములు కలియుగము ప్రారంభములోనే తెలియకుండాపోయాయి. తెలియకుండా పోయిన దానివలన, ఆత్మజ్ఞానమునకు ముప్పు ఏర్పడునను ఉద్దేశ్యముతో, కొందరు తెలిసిన పెద్దలు దేవుడు, గురువు అంటే ఎవరని అందరికీ తెలియునట్లు, అట్లే ప్రకృతి మరియు దైవజ్ఞానము ఏమిటో తెలియునట్లు, శక్తి ఆనందము ఎక్కడినుండి లభించుచున్నాయో అర్థమగునట్లు వాటికి ఉదాహరణగా, గుర్తింపుగా దీపమును చూపడము జరిగినది. ఈ విధానమంత తెలియుటకు ప్రత్యేకించి సంవత్సరములో ఒక రోజును ఎన్నుకొని, ఆ దినమున ఇంటిలోపల మరియు ఇంటి బయట దీపమును వెలిగించి దాని వివరమంతయు చెప్పడము జరిగినది. ఆ దినము అందరు ఇంటి లోపల ఒక దీపము, బయట ఒక దీపము వెలిగించి దాని అర్థమును చెప్పించుకొనెడివారు. మనిషిలోని అజ్ఞానమును తీసివేసి జ్ఞానమును కల్గించుటకు చేయు ఆచార క్రియ కావున, ఆ కార్యమును ఒక పండుగగా చేయడము జరిగినది. అజ్ఞానము చీకటికి గుర్తు, జ్ఞానము వెలుగుకు గుర్తు. కావున చీకటి రోజయిన అమావాస్య రోజున దీపమును పెట్టి చూపడము జరుగుచున్నది. ప్రతి సంవత్సరము ఆశ్వీయుజ 5 మాసములో వచ్చు అమావాస్య రోజున ఈ విధానము దీపావళి పండుగ చేసుకోవడము జరుగుచున్నది. --- మనిషి శరీరము లోపల, శరీరము బయట జ్ఞానమును కల్గియుండా లను ఉద్దేశ్యముతో, శరీరమును మనము నివసించు గృహముగా పోల్చి ఇంటిలోపల దీపము, ఇంటి బయట దీపము పెట్టునట్లు పెద్దలు చెప్పారు. జ్ఞానము యొక్క ఉద్దేశ్యమును తెలుపు సాంప్రదాయ పండుగ కావున పూర్వము ఇంటి లోపల ఒక దీపము, ఇంటి బయట ఒక దీపమును ఉంచెడివారు. నేడు పూర్వము ఏర్పరచిన అర్థము ఆచారము తెలియకుండా పోయి అలంకారము కొరకు ఎక్కువ దీపాలు పెట్టే దానికి మనుషులు అలవాటు పడిపోయారు. దీపము ద్వారా వెలుగు వస్తున్నదనీ, దీపము వెలుగుటకు కారణము అగ్నియనీ, అగ్ని దీపమునకు కారణమైనదిగా ఉండి ఎవరికీ తెలియనిదిగా ఉన్నదనీ, అలాగే శక్తికి కారణమైన దేవుడుగానీ, జ్ఞానమునకు కారణమైన గురువుగానీ ఎవరికీ తెలియకున్నారనీ, ఇటు దేవున్ని, అటు గురువును తెలియునిమిత్తము ఈ విధానమైన దీపావళి చేస్తున్నామని ఎవరూ నేడు అనుకోవడములేదు. దీపము వలన వెలుగు వచ్చి చీకటిని పారద్రోలినట్లు, జ్ఞానము వలన ఆనందము లభ్యమై దుఃఖము దూరమైపోవునని తెలియునట్లు, మంచి ఉద్దేశ్యముతో పూర్వము దీపావళి పండుగను ఏర్పరచారని మరువకూడదు. అయితే నేడు నాగులచవితి, వినాయకచవితి మారిపోయినట్లు దీపావళి అమావాస్య కూడా చివరకు పురాణకథగా మారిపోయి నరకాసురుని సంహరించిన దినముగా చెప్పబడు చున్నది. పూర్వము ప్రశాంతముగా జ్ఞానభావముతో చేసుకొను దీపావళి నరక చతుర్దశిగా మారిపోయి, ధమాకా శబ్దము (టపాకాయల శబ్దము) లతో ప్రశాంతతగానీ, జ్ఞానభావముగానీ లేకుండా పోయినది. ఇప్పటి నుంచయినా టపాకాయల శబ్దము లేకుండా ప్రశాంతముగా, అర్థముగల ఆచారముగా దీపావళి పండుగను చేసుకొందాము.

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024