శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా. నేటి ప్రజలందరికి తెలిసిన ప్రకారము దేవుడనినా, భగవంతుడనినా రెండు ఒకటే అను భావముతో ఉన్నారు. చాలామంది స్వామీజీలు కూడ తమ తమ ఉపన్యాసములలో సృష్టికర్త అయిన పరమాత్మను గురించి తెలుపునపుడు ఒకప్పుడు దేవుడని, మరొకప్పుడు భగవంతుడని పలుకుచు చెప్పుచుందురు. దీనినిబట్టి ఇటు ప్రజల దృష్టిలోను, అటు బోధకులైన స్వామీజీల దృష్టిలోను దేవునికీ, భగవంతునికీ ఏమీ తేడా లేదనీ, అందువలన వారు ఇలా ఆ పదములను వాడుచున్నారని తెలియుచున్నది. ఆధ్యాత్మిక రంగములో ఇది చాలా ముఖ్యమైన విషయం అందరికి అవసరమైన విషయము. కావున దేవుడు మరియు భగవంతుడు అను పదములకు శాస్త్రీయత ఉందా? లేదా? అని యోచించవలసిన అవసరమున్నది. అంతేకాక ఒక పనిని చేయుటకు ఒక కారణముంటుంది. అలాగే ఒక పదమును పలుకుటకు కూడ కారణముంటుంది. అటువంటి కారణమునే హేతువు అంటాము. ఇక్కడ 'దేవుడు అనుటకు, భగవంతుడు అనుటకు హేతువును చూపకపోతే అది హేతుబద్దము కాదు. హేతువాదులు ఒప్పుకోరు. నాస్తికవాదులు ఒప్పుకోక పోయినా ఫరవాలేదు. కానీ హేతువాదులు తప్పక ఒప్పుకోవలసియున్నది. ఎక్కడైతే శాస్త్రీయత ఉంటుందో అక్కడ హేతువాదమునకు జవాబు ఉన్నట్లే. ఎక్కడైతే శాస్త్రీయత లేదో అక్కడ హేతువాదమున...
విషయ సూచిక. 1. గురు ప్రార్థనామంజరి 2. గురువు అంటే ఏవరు? 3. గురువును గురించి పెద్దలు ఏమి చెప్పారు? 4. గురువు యొక్క జ్ఞానమును ప్రజలు గుర్తించగలరా? 5. గురువును మనుషులు గౌరవిస్తారా? 6. గురువును దూషించిన వారిని గురువేమి చేయును? 7. గురువు అడవిలో ఉంటాడా లేక ఊరిలో ఉంటాడా? 8. గురువుకు శిష్యులుంటారా? 9. గురువుకు మహత్యములుండునా? 10. గురువుకు రోగాలు వస్తాయా? 11. గురువును ఎవరూ గుర్తించలేరా? 12. గురువు అందరివలె చనిపోవునా? 13. గురుపౌర్ణమి 14. గురువు-పౌర్ణమి 15. గురు 16. గురువులేని విద్య గ్రుడ్డివిద్య 17. గురుప్రార్థన శ్లోకములు -- గురు ప్రార్థనామంజరి. నేటి మానవులను మరియు కేవలము యాభైసంవత్సరముల వెనుకటి కాలపు మానవులను గమనిస్తే, ఇటు ప్రపంచపద్ధతిలోగానీ, అటు పరమాత్మ పద్ధతిలో గానీ ఎంతో గణనీయమైన తేడా కనిపిస్తున్నది. ప్రపంచ పద్ధతిలో చూస్తే ఒక నాగరికతే కాక, మానవుని జీవితములో ఎన్నో పరికరములూ, యంత్రములూ చోటు చేసుకొని మానవుని జీవితము సుఖవంతమైనట్లు కనిపిస్తున్నది. ఉన్నతమైన చదువులూ, అధునాతన యంత్రములూ, వేగవంతమైన వాహనములూ, సరిక్రొత్త పరిశోధనలు, ఖండాతర మారణా యుధములూ మనిషి జీవితములో ఎంతో ఉన...
దయ్యాల కోన అది ఒక భయంకరమైన అడవి. ఎత్తయిన చెట్లు, చిక్కుగ అల్లుకొనిన తీగలు, గుడ్లగూబలకు నిలయమైన మర్రిమాన్లు, భయంకర సర్పములకు నిలయమైన పొదలుకల్గి ఎటువైపు నరసంచారములేని అడవి మధ్యభాగములో పురాతన దేవాలయము ఒకటి కలదు. అది ఈశ్వర దేవాలయమైనప్పటికి అక్కడ పూజారిలేడు, పూజలు జరుగవు. కాని శివరాత్రి రోజు మాత్రము అక్కడికి జనముచేరి పూజలు చేయుట ఆనవాయితీగ కలదు. ఆ ఒక్క దినము తప్ప మానవ సంచారము ఆ అడవిలో ఉండెడిది కాదు. సంవత్సరమునకు ఒక రోజు పూజ జరుగు ఆ దేవాలయమునకు ఆ ఒక దినము లక్షల సంఖ్యలో మనుషులు వస్తారు కావున అందరి సౌకర్యార్థము దేవాలయము వరకు అడవిలో తారు రోడ్డును ప్రభుత్వమువారు నిర్మించారు. సంవత్సరమునకు ఒకమారు ఆ రోడ్డు వెంట మనుషులు ప్రయాణించెడివారు. అడవి ప్రారంభ మొదటి భాగమునుండి మధ్యలోగల దేవాలయమునకు అరవైమైళ్ల దూరము ఉండెడిది. అడవి మొదటి భాగములో రోడ్డు మీద పోలీస్ చెకో పోస్టు కూడ ఉండెడిది. శివరాత్రి రోజు కాకుండ విడి దినములలో ఆ రోడ్డు మీద ఎవరు ప్రయాణించకుండ పోలీస్ వారు చూచుకొనెడివారు. అడవిలో కౄరమృగములు సహితము విచ్చలవిడిగ ఉండుట వలన వాటి రక్షణ నిమిత్తము కూడ పోలీస్ వారుండెడివారు. శివరాత్రి రోజు తప్ప రోడ్డు వెంబడి...