విషయ సూచిక. 1. గురు ప్రార్థనామంజరి 2. గురువు అంటే ఏవరు? 3. గురువును గురించి పెద్దలు ఏమి చెప్పారు? 4. గురువు యొక్క జ్ఞానమును ప్రజలు గుర్తించగలరా? 5. గురువును మనుషులు గౌరవిస్తారా? 6. గురువును దూషించిన వారిని గురువేమి చేయును? 7. గురువు అడవిలో ఉంటాడా లేక ఊరిలో ఉంటాడా? 8. గురువుకు శిష్యులుంటారా? 9. గురువుకు మహత్యములుండునా? 10. గురువుకు రోగాలు వస్తాయా? 11. గురువును ఎవరూ గుర్తించలేరా? 12. గురువు అందరివలె చనిపోవునా? 13. గురుపౌర్ణమి 14. గురువు-పౌర్ణమి 15. గురు 16. గురువులేని విద్య గ్రుడ్డివిద్య 17. గురుప్రార్థన శ్లోకములు -- గురు ప్రార్థనామంజరి. నేటి మానవులను మరియు కేవలము యాభైసంవత్సరముల వెనుకటి కాలపు మానవులను గమనిస్తే, ఇటు ప్రపంచపద్ధతిలోగానీ, అటు పరమాత్మ పద్ధతిలో గానీ ఎంతో గణనీయమైన తేడా కనిపిస్తున్నది. ప్రపంచ పద్ధతిలో చూస్తే ఒక నాగరికతే కాక, మానవుని జీవితములో ఎన్నో పరికరములూ, యంత్రములూ చోటు చేసుకొని మానవుని జీవితము సుఖవంతమైనట్లు కనిపిస్తున్నది. ఉన్నతమైన చదువులూ, అధునాతన యంత్రములూ, వేగవంతమైన వాహనములూ, సరిక్రొత్త పరిశోధనలు, ఖండాతర మారణా యుధములూ మనిషి జీవితములో ఎంతో ఉన...