దేవుని ముద్ర 101_176 part2 3rdNov 24_updated
రాజు శాసనములకు గుర్తుగా రాజముద్ర ఉన్నట్లు, దేవుని ధర్మములకు గుర్తుగా
దేవుని ముద్ర లేక దేవుని చిహ్నము కలదు. దేవుని చిహ్నము, దేవుని
జ్ఞానమునకు ప్రతిరూపముగా ఉండుట వలన అందులో దైవశక్తి కలదని
చెప్పవచ్చును. దైవశక్తి ఎక్కడవుండునో అక్కడ కర్మ కాలిపోవును. అగ్ని
ఎక్కడుంటే అక్కడ మండే వస్తువులు ఏవున్నా అగ్నిచేత కాలిపోవునట్లు,
దైవశక్తి ఉన్నచోట ఏ కర్మలున్నా జ్ఞానాగ్నికి అంటుకొని కాలిపోవును.
ప్రశ్న :- మీరు దృశ్యరూపముగా చూపిన దేవుని చిహ్నమునకు నిజముగా
దైవశక్తి ఉంటుందంటారా?
జవాబు :– దైవ జ్ఞానములోని ముఖ్యమైన వాటిలో (1) భూమి ఆకాశముల
సృష్ఠి విషయము. 2) మూడు ఆత్మల విషయము. 3) కర్మల యొక్క
విషయము. 4) కాల నిర్ణయము యొక్క విషయ జ్ఞానములు ఉండుట
వలన దేవుని గుర్తుకు దేవుని శక్తి అంటుకొనియున్నది. ఈ నాలుగు
జ్ఞానముల మినహా ఆధ్యాత్మిక జ్ఞానము లేదు. దేవుని జ్ఞానములో ఏది
చెప్పినా ఈ నాలుగు అంశముల జ్ఞానమే ఉండును. ఆధ్యాత్మిక జ్ఞానములో
పై నాలుగు జ్ఞానములే ముఖ్యమైనవగుట వలన, దేవుని ముద్రగా చూపబడిన
చిత్రమునకు లేక ఆకారమునకు దైవశక్తియుండునని చెప్పుచున్నాము.
ఇప్పుడు “దేవుని చిహ్నము” అను పేరుతో కాకుండా "దేవుని
ముద్ర” అను పేరుతో చెప్పు విధానమును చూడండి. దేవుని చిహ్నముగా
యున్న బొమ్మను చూచారు కదా! ఇక్కడ అదే బొమ్మనే దేవుని ముద్రగా
చెప్పుచున్నాము. మనుషులు ఆరాధించవలసిన దేవుడు ఒక్కడే. అదే
విషయమును ఖుర్ఆన్ గ్రంథములో సూరా మూడులో, ఆయత్ 18లో
అల్లాహ్ యే స్వయముగా “ఈయనే మీరు ఆరాధించవలసిన దేవుడు” అని
తనకంటే వేరుగాయున్న వానిని చూపించాడు. ఆరాధించవలసిన దేవుడు
ఒక్కడేయని ఆ ఒక్కనిని చూపించినవాడు స్వయముగా అల్లాహ్.
ముస్లీమ్లు అందరూ ఆరాధించ వలసినది ఒక్క అల్లాహ్ను మాత్రమే కదా!
అటువంటప్పుడు అల్లాహ్ ఎవరిని చూపాడు? అను విషయమునే ఇంతవరకు
ఈ గ్రంథములో వివరించాము. అల్లాహ్ మనుషులకు తండ్రిగాయున్నాడు
మరియు తాతగాయున్నాడు. తాతగా యున్న అల్లాహ్, తండ్రిగాయున్న
అల్లాహ్ ఇద్దరూ ఒక్కటే. అయితే అల్లాహ్ ఇంకా దగ్గరగా అర్థమగుటకు
అలా విడదీసి చూపించవలసి వచ్చినది. పవిత్ర ఖుర్ఆన్ గ్రంథములోని
సూరా 3, ఆయత్ 18లో అల్లాహ్ చెప్పిన వాక్యమును మరువకూడదు.
జ్ఞాన సంపన్నులైనవారు, దేవదూతలు మరియు స్వయముగా అల్లాహ్
చెప్పినది ప్రతి మనిషి తప్పనిసరిగా ఒప్పుకోవలసియున్నది. ఎవడయినా
ఒప్పుకోకపోతే వాడు అల్లాహ్ మాటనే ధిక్కరించిన వాడగును. అప్పుడు
వాడు అల్లాహ్కు (దేవునికి) ఎట్లు విశ్వాసియగును? అల్లాహ్ ఎడల నిజమైన
విశ్వాసి ఎవడయితే యున్నాడో వాడు తప్పనిసరిగా అల్లాహ్ మాటను
(ఆయత్ను) వినును.
'దేవుని చిహ్నము' కంటే వేరుగా యున్నది 'దేవుని ముద్ర' అను
గ్రంథము. దేవుని ముద్ర గ్రంథములోని ప్రతి విషయము దేవుని చిహ్నము
లోని విషయముకంటే వేరుగా చెప్పుచూ వచ్చినా 'దేవుని చిహ్నము' అను
చిత్రము అట్లే 'దేవుని ముద్ర' అను చిత్రము రెండూ ఒక్కటే. అయితే
దేవుని చిహ్నము చిత్రపటమును ఆ గ్రంథములో ఎట్లున్నది ఈ గ్రంథములో
చూపాము. దేవుని చిహ్నము బొమ్మను దానికి సంబంధించిన
సమాచారమును ఆ గ్రంథమునుండి తీసి చూపాము. అలా చూపడము
వలన దేవుని ముద్ర, దేవుని చిహ్నము రెండూ ఒక్కటేయని ప్రత్యక్షముగా
అర్థమగును. 'దేవుని చిహ్నము' అను గ్రంథమునుండి దేవుని చిహ్నము
యొక్క చిత్రపటమును చూడడమేకాక అందులోని కొంత సమాచారమును
కూడా చూచారు. ఆ సమాచారము ఇంతవరకు వ్రాసిన దేవుని ముద్ర
గ్రంథములోని సమాచారము అంతా వేరుగా యున్నట్లు తెలిసిపోయినది.
సమాచారము ఎట్లు వేరుగా యున్నదో అట్లే దేవుని చిత్రపటము యొక్క
అర్థము కూడా వేరుగా యుండును. ఇప్పుడు దేవుని ముద్ర యొక్క
వివరమును తెలుసుకొందాము.
సృష్ట్యాదిలో మొట్టమొదట దేవుడు ఎన్ని భాగములుగా విభజింప
బడ్డాడు? అను ప్రశ్నకు చాలామంది మూడు భాగములని జీవాత్మ, ఆత్మ,
పరమాత్మయని వ్రాశారు. దేవుడు మూడు ఆత్మలుగా తయారయినది
వాస్తవమే. అయితే మొదట ప్రపంచము తయారయిన తర్వాత దేవుడు
మూడు ఆత్మలుగా చీలిపోయాడు. అందువలన మొట్టమొదట దేవుని
నుండి ప్రపంచము అను ప్రకృతి బయటికి వచ్చినది. ప్రకృతిచేత పంచ
భూత నిర్మితమైన ప్రపంచము ఏర్పడిన తర్వాత దేవుని నుండి రెండు
ఆత్మలు బయటికి వచ్చాయి అని ఆ విధముగా మొట్టమొదట దేవుడు
నాలుగు భాగములుగా విభజింపబడ్డాడు అని గ్రంథ ప్రారంభములోనే
చెప్పుకొన్నాము. మొదట పుట్టిన ప్రకృతి మూడు ఆత్మల నివాసమునకు
ఆధారమైనది. ఒక పాత్రను ఉదాహరణగా చెప్పుకొని మొదట పాత్ర
తీసుకొని అందులో మూడు రకముల నీళ్ళను పోసినాము. ఆ మూడు
రకముల నీళ్ళకు పాత్ర ఆధారముగా యున్నదని చెప్పుకొన్నాము. దానిని
దృశ్యరూపములో చిత్రించుకొని చూస్తాము. దేవుని నుండి బయల్పడిన
మొదటి భాగమయిన ప్రకృతిని తర్వాత పేజీలో చిత్రరూపము చూడండి.
మొదట ప్రకృతి తయారుకాగా అది మూడు ఆత్మలకు నిలయము
కాకముందే ప్రకృతి ఏడు రంగులుగా కనిపించినది. దానినే ఇంద్రధనస్సు
దేవుని ముద్ర చిత్రమును 104 పేజీ లో చూడండి.
రంగులని నేడు ప్రత్యక్షముగా కనిపించే రంగులను చెప్పుచుంటాము.
ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఉండడము సహజము. ఏడు రంగులను
బట్టి ఏడు దినముల పేర్లను తయారు చేయడము జరిగినది. జీవాత్మ
ఆత్మ తయారు కాకముందే దేవుడు కాలస్వరూపుడుగా యుండుట వలన
ప్రకృతి పుట్టినప్పుడే కాలమున్నది. ఆదిలో ప్రకృతి పుట్టినప్పుడున్న దేవుడు
కాలముగాయుంటూ ప్రకృతిలో ఏడు పేర్లుగా పిలువబడ్డాడు. ఆ ఏడు
పేర్లే ఏడు వారములుగా మనకు పరిచయమైనవి. దీనినిబట్టి ప్రకృతి
పుట్టిన తర్వాత ఏ జీవరాసి పుట్టకముందే కాలమున్నది, కాలమునకు
ఏడు వారముల పేర్లు ఉన్నవి. కాలము ఆదివారముతో మొదలయినది.
మొదట ప్రకృతి, తర్వాత జీవుల ఉత్పత్తి ఆత్మతో సహా జరిగినది. జీవుల
మొదటి పుట్టుక దినము ఆదివారమేనని తెలియవలెను. అందువలన
జీవరాసులు ఆదివారముతో మొదలయినవని చెప్పుచున్నాము. ఆదివారము
దినమున జీవుల ఉత్పత్తి ప్రారంభమయినది. అందువలన దృశ్యరూపములో
యున్న ప్రకృతి, ఆకర చిత్రములో ఏడు వారములను గుర్తించడము
జరిగినది. మనిషి శరీరములో ప్రకృతియను చక్రముండగా, పైన ప్రకృతి
చక్రము రెండు భాగములుగా చర, అచర ప్రకృతియని తయారయినది.
శిరస్సులోని మెదడు రెండు భాగములుగా యున్నది. శరీరము ప్రకృతితో
తయారయినది కావున మెదడు రెండు భాగములుగా, రెండు భాగముల
చక్రమువలె కనిపించుచున్నది. రెండు భాగములుగా యున్న మెదడు
నుండి ప్రారంభమయిన బ్రహ్మనాడి లేక వెన్నుపాము అను నరము పై
నుండి క్రింది వరకు ఏడు భాగములుగా యున్న విషయము అందరికీ
తెలిసినదే.
సృష్ట్యాదిలో పరమాత్మనుండి ప్రకృతి పుట్టగా పరమాత్మ, ప్రకృతి
రెండు ‘నాటకము’ అను ఆటలోనికి ఒక ప్రక్కకే సరిపోవుదురు. అందువలన
రెండవ ప్రక్క ఇద్దరు ఉండునట్లు తలచిన పరమాత్మ ఆత్మను, జీవాత్మను
తన నుండి బయటికి తీశాడు. అప్పుడు మొత్తము నలుగురు కనిపించారు.
మూడు ఆత్మలు ఒక ప్రకృతి తయారయినది. మొదట తయారయిన
ప్రకృతి దేవుని ముద్ర అను బొమ్మలో లేక చిత్రపటములో పై భాగమున
రెండు భాగములుగా చర, అచర ప్రకృతిగా యున్నది. దానిక్రింద పరమాత్మ
దాచిపెట్టుకొన్నట్లు ప్రకృతి వెనుక భాగములో అనగా ప్రకృతియను చక్రము
క్రింద రెండవ చక్రముగా ఇమిడి పోయినది. ప్రకృతిగానీ, పరమాత్మగానీ
ఒకచోట ఆగువారు కాదు. ఎప్పటికీ చక్రమువలె ముందుకు దొర్లుచూ
పోవుచుందురు. ఇవి రెండు ఎంత కాలమయినా దొర్లవచ్చును, ఎంత
కాలమయినా గడువవచ్చును. ఒకచోట ఆగునవి కావు అయినందున
ప్రకృతిని, పరమాత్మను చక్రమువలె చిత్రపటములో చూపించడము జరిగినది.
కాలము గమనముతో (చలనముతో) కూడుకొన్నది. అందువలన ప్రకృతి,
పరమాత్మ ఎల్లప్పుడు ముందుకు పోవు 'గమనులు'గా చెప్పబడుచుందురు.
అందువలన వీరిని చక్రములుగానే చిత్రించడము జరిగినది. ఈ విషయము
నకు సంబంధించిన సమాచారము భగవద్గీత రాజవిద్యా రాజ గుహ్య
యోగమున 10వ శ్లోకమందు ఇలా చెప్పారు చూడండి.
శ్లో॥ 10.
మయాధ్యక్షేణ ప్రకృతి స్సూయతే సచరాచరమ్ |
హేతునా నేన కౌంతేయ! జగ ద్విపరివర్తతే ॥
(పరమాత్మ)
భావము :- “ప్రకృతికి నేను అధ్యక్షత వహించుట వలన ప్రపంచములో
జీవరాసులన్నియు పుట్టుచున్నవి. నేను ఇరుసుగా యుండగా ప్రకృతి
చక్రములో చావుపుట్టుకల జగత్తు చక్రమువలె తిరుగుచున్నది". అలా
పరమాత్మ ప్రకృతి క్రింద చాటుగా దేవుని ముద్రయను చిత్ర
పటములో కనిపించుచుండుటను ప్రత్యక్ష బొమ్మగా చూస్తాము.
చూపుతో చూడుట వలన కొంతవరకు దేవుని విధానము మనిషికి అర్థము
కావచ్చును. ఆదివారము బ్రహ్మనాడిలో ఎక్కడ గలదో అక్కడే ప్రకృతి
చక్రము గలదు. అట్లే సోమవారము ఎక్కడగలదో అక్కడే పరమాత్మ చక్రము
గలదు.
దేవుని ముద్రలో రెండు చక్రములను చూడవచ్చును. దేవుని ముద్ర
మొత్తము నాల్గుచక్రములుగల చిత్రపటము. అయితే ప్రకృతి పరమాత్మల
వరకు అలా ఉండేది. సృష్ఠి కార్యములో వెంటనే పరమాత్మనుండి ఆత్మ,
జీవాత్మ రెండూ బయటికి రావడము జరిగినది. ఆ రెండు ఆత్మలు రెండు
చిత్రములుగా తయారయి ప్రకృతి సంబంధ బ్రహ్మనాడిని ఆశ్రయించినవి.
అప్పుడు చూచు దృశ్యము తర్వాత పేజీలో చూపబడినది చూడండి.
దేవుని ముద్ర చిత్రమును 107 పేజీ లో చూడండి.
ఈ విధముగా దేవుని ముద్ర తయారు చేయబడినది. దేవుని
చిహ్నములో పై నుండి బ్రహ్మ, కాల, కర్మ, గుణ చక్రములు దృశ్యరూపముగా
ఉండగా దేవుని ముద్రలో పై నుండి ప్రకృతి, పరమాత్మ, ఆత్మ, జీవాత్మలు
నాల్గు చక్రములుగల దృశ్య రూపముగా యున్నవి. దేవుని చిహ్నము,
దేవుని ముద్రలోని తేడాలను గమనించవలెను.
దేవుని చిహ్నములో నాలుగు చక్రముల పేర్లు పై నుండి క్రిందికి
వరుసగా బ్రహ్మచక్రము, కాలచక్రము, కర్మచక్రము, గుణచక్రము అని
చెప్పుచున్నాము. అదే చిత్రపటమునే దేవుని ముద్రగానే చెప్పితే దేవుని
ముద్రలో కూడా అదే చిత్రపటమున్నా, అందులో కూడా నాలుగు
చక్రములున్నా, ఆ నాలుగు చక్రములను పై నుండి క్రిందికి వరుసగా ఇలా
చెప్పవచ్చును. పైన ఉన్నది ప్రకృతికి గుర్తు, తర్వాత యున్నది పరమాత్మకు
గుర్తు, ఆ తర్వాత మూడవది ఆత్మకు గుర్తు, చివరిలో క్రిందగల నాల్గవ
చక్రము జీవాత్మకు గుర్తుగా కలదు. బ్రహ్మనాడి శరీరమునకు (ప్రకృతికి)
దేవుని ముద్ర చిత్రమును 108 పేజీ లో చూడండి.
గుర్తుగా యున్నదని చెప్పవచ్చును. ఇక్కడ దేవుని ముద్రగాయున్న
నాల్గుచక్రములను లోతుగా గమనించితే పైకి గల ప్రకృతి చక్రము, చర
అచర ప్రకృతి అను రెండు భాగములుగా యున్నది. దానికంటే క్రింద
పరమాత్మ గుర్తు అయిన రెండవ చక్రము 12 భాగములుగా యున్నది.
అదే దేవుని చిహ్నములో కాలచక్రముగా చెప్పబడినది. అందులోని 12
భాగములను పన్నెండు నెలలకు గుర్తుగా చెప్పుకొన్నాము. ఇక్కడ అదే
చక్రమే దేవుని ముద్ర పేరులో పరమాత్మకు గుర్తుగా చెప్పబడినది. దానికంటే
క్రిందగల మూడవ చక్రము ఆత్మకు గుర్తుగా చెప్పడమైనది. పరమాత్మ
గుర్తుగా యున్న రెండవ చక్రము, ఆత్మకు గుర్తుగా యున్న మూడవ
చక్రము రెండూ 12 భాగములుగా యుండడము తెలిసిన విషయమే. ఈ
పన్నెండు భాగములు దేవుని చిహ్నములో కాల, కర్మచక్రముల విభజన
ప్రకారము కాలచక్రములోని పన్నెండు భాగములు పన్నెండు నెలలకు,
కర్మచక్రములోని పన్నెండు భాగములు మనిషి యొక్క పన్నెండు కర్మ రాశు
లకు సరిపడు విభజనలాగా కలవు. అదే దేవుని ముద్రయందు పరమాత్మ,
ఆత్మ రెండు చక్రములలో పైన క్రింద పన్నెండు భాగములు ఉండుట వలన
పరమాత్మతో సమానమైనవాడు ఆత్మయని తెలియబరచబడుచున్నది. దేవుడు
స్వయముగా తనవలె తన ఆత్మను అధికారిగా నిర్ణయించాడు. కావున
పైనగల భాగములే క్రిందకలవని అర్థము చేసుకోవచ్చును.
ఒక సంపూర్ణ బిందువు 360 డిగ్రీల కోణములో ఉండును. అనగా
ఒక చక్ర ఆకారము ఏదయినా 360 డిగ్రీల వృత్తముగా ఉండును. దేవుడు
అయిన పరమాత్మను ఒక చక్రముగా చూపడమైనది. ఆ చక్రమును అనగా
ఆ వృత్తమును 30 డిగ్రీల కోణముగా 12 భాగములను చేయుట వలన
360 డిగ్రీల కోణము సరిపోవుచున్నది. దేవుడు మూడు ఆత్మలుగా
యుండుట వలన మూడు పదుల డిగ్రీలను ఒక కోణముగా విభజించి 12
భాగములను చేసి 12x30=360 డిగ్రీల వృత్తము సరిపోవునట్లు ఉన్నదని
చెప్పవచ్చును. పైనగల పరమాత్మ చక్రము, క్రిందగల ఆత్మచక్రము రెండూ
సమాన భాగములుగా ఉండుట వలన రెండూ సమానముగా ఉన్నవని
చెప్పవచ్చును. చూచుటకు చెప్పుటకు వేరువేరు చక్రములుగా యున్నా
రెండూ ఒక్కటిగానే యున్నవి. రెండూ ఒకే అధికారము గలవిగా యున్నవి.
రెండు అన్నిటియందు సమాన అధికారము కలవిగా యుండుట వలన
రెండింటినీ ఒకటిగా చెప్పవచ్చును. అందువలన ఇంజీలు (బైబిలు)
జ్ఞానములో యోహాను సువార్త 10వ అధ్యాయములో 30వ వచనములో
ఇలా చెప్పబడియున్నది చూడండి.
(యోహాను 10-30) “నేనును నా తండ్రియును ఏకమై
యున్నామని వారితో చెప్పెను."
ఈ వాక్యమును గమనించితే నా తండ్రి (12) పన్నెండు అయితే
నేను పన్నెండుగానే యున్నానని, “నేను నా తండ్రి ఏకమైయున్నాము”
అన్నాడు, “ఒకటిగానే యున్నాము” అని అన్నాడు. మధ్యలో రెండు
చక్రములుగా యున్న తండ్రి కుమారుడు ఇద్దరూ సమానముగా యుండుట
వలన రెండు చక్రములయందు పన్నెండు భాగములనే చూపారు. క్రింద
నాల్గవ చక్రము జీవాత్మకు గుర్తుగా యున్నది. క్రిందగల జీవాత్మ పైన
మోక్షముగాయున్న పరమాత్మను చేరాలంటే మధ్యలో గల ఆత్మచక్రము
ద్వారానే పోవలసి యున్నది. అందువలన ఇంజీలులో యోహాన్ 14వ
అధ్యాయము ఆరవ వాక్యములో ఇలా చెప్పియున్నారు చూడండి.
(యోహాన్ 14-6) “యేసు నేనే మార్గమును, సత్యమును,
జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు”.
ఇక్కడ దేవుని ముద్ర చిత్రపటమును చూచిన ఈ వాక్యమునకు సరిపడు
జ్ఞానము కలదని తెలియుచున్నది. దేవుని చిహ్నము అను చిత్రపటమును
భగవద్గీతనుండి గ్రహించి మేము దాదాపు 40 సంవత్సరముల క్రిందటే
వ్రాశాము. ఆ దేవుని చిహ్నమును గురించి రెండు ఆయత్ల (5-2),
(22-32) ప్రత్యక్షముగా “దేవుని చిహ్నము” అని పేరు పెట్టి చెప్పడమైనది.
అంతేకాక పరోక్షముగా ఖుర్ఆన్ వాక్యములలో ఎక్కువ చోట్ల దేవుని
చిహ్నమును గురించి చెప్పబడినది. ప్రత్యక్షముగా 22వ సూరాలో 32వ
ఆయత్నందు గల వాక్యములో “దేవుని చిహ్నమును గౌరవించండి” అని
ప్రత్యక్షముగా చెప్పియున్నా, ముస్లీమ్లకు నేటి వరకు దేవుని చిహ్నమును
గురించి తెలియదనియే చెప్పవచ్చును. దేవుని చిహ్నమును గురించి దైవ
గ్రంథమయిన ఖుర్ఆన్లో చెప్పియున్నా అది ఏమిటో ప్రత్యక్షముగా గానీ,
పరోక్షముగాగానీ అర్థము కాలేదు.
దేవుని చిహ్నమును గురించి అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్
గ్రంథములో ఎక్కువగా చెప్పియున్నట్లు, దేవుని ముద్ర గురించి దైవ
గ్రంథమయిన ఇంజీలు గ్రంథములో ఎక్కువ చెప్పినట్లు కలదు. బైబిలు
(ఇంజీలు) గ్రంథములో పరోక్షముగా కొన్నిచోట్ల, ప్రత్యక్షముగా కొన్నిచోట్ల
చెప్పియున్నారు. అదే ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీతలో దేవుని
ముద్రను లేక దేవుని చిహ్నమును గురించి ప్రత్యక్షముగా లేదుగానీ
పరోక్షముగా చెప్పబడియున్నది. మొదట నేను భగవద్గీతలో పరోక్షముగా
యున్న విషయమును చూచి 'దేవుని చిహ్నము' యొక్క చిత్రపటమును
అందరూ కళ్ళతో చూచునట్లు దాని ఆకారమును మేము వ్రాసి
చూపించడము జరిగినది. మేము చూపించిన దేవుని చిహ్నము బొమ్మనే
(చిత్రమునే) ఖుర్ఆన్ గ్రంథములో (22-32) లో “దేవుని చిహ్నమును
గౌరవించవలెను” అని వ్రాసినా ఎలా గౌరవించవలెనో వారు ఆలోచించ
లేకపోయారు. దేవుని చిహ్నము నాల్గు చక్రముల ఆకారముగా యున్నదని
కూడా గ్రహించలేకపోయారు. వారు వారి పెద్దలు చెప్పిన ప్రకృతి
జంతువులను, ప్రకృతి దృశ్యములను దేవుని చిహ్నములుగా పోల్చుకొన్నారు.
దేవుడు చెప్పినది ప్రకృతి సంబంధమైనది కాదని తెలియలేకపోయారు.
ఇంజీలు గ్రంథములో అనగా బైబిలు గ్రంథములోని నాలుగు
సువార్తలలో పరోక్షముగా దేవుని ముద్రను గురించి చెప్పడమైనది. మేము
దేవుని చిహ్నముగా చెప్పిన గుర్తునే దేవుని ముద్రగా ఇప్పుడు వ్రాయడమైనది.
దేవుని ముద్రను గురించి బైబిలు గ్రంథములోని సువార్తలలో పరోక్షముగా
చెప్పడమేకాక, గ్రంథము చివరిలో గల యోహాను వ్రాసిన 'ప్రకటన గ్రంథము’
అను దానిలో తొమ్మిదవ అధ్యాయమున నాల్గవ వచనము నుండి ఆరవ
వచనము వరకు ప్రత్యక్షముగా 'దేవుని ముద్ర' అను పేరుతోనే చెప్పడమైనది.
ఆ విషయమును ఇప్పుడు చూస్తాము. (ప్రకటన 9-4,5,6)
" నా సళ్లయందు దేవునిముద్ర లేని మనుష్యులకే తప్ప భూమిపై
నున్న గడ్డివైనను, ఏ మొక్కలకైననూ మరి ఏ వృక్షమున కైననూ
హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. మరియు
వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదుగానీ ఐదు నెలల
వరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్య బడెను. వాటి
వలన కలుగు బాధ తేలు మనుష్యునికి కుట్టినప్పుడుండు బాధవలె
ఉండును. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదుకుదురు
గానీ అది వారికి దొరకనే దొరకదు. చావవలెనని ఆశపడుదురు
గానీ మరణము వారి వద్దనుండి పారిపోవును".
యోహాన్ ప్రకటన గ్రంథములోగల మూడు వాక్యములను చూస్తే
దేవుని ముద్ర ఎంత గొప్పదో, దేవుని ముద్ర నొసళ్ళ మీద ధరించడము
వలన ఎంతటి విపత్తు తొలగిపోవునో, ఆ విపత్తుల వలన మనుషులు
ఎంత బాధపడవలసియుండునో గమనించిన, దేవుని ముద్రను ధరించక
ఎందుకు ఇంత అజ్ఞానములో ఉన్నామనిపిస్తుంది. యోహాన్ ప్రకటన
గ్రంథములో వ్రాసినట్లు అలా పీడించు దేవదూతలున్నారాయని అనుమానము
రావచ్చును. ఈ మాటను నమ్మకుండా ఉండిపోవుటకు, దేవుని ముద్రను
గౌరవించకపోవుటకు అవకాశము గలదు. అందువలన ఇంతవరకు చెప్పిన
దేవుని ముద్రను, ఒకమారు ప్రక్క పేజీలో చూచి తర్వాత దానిమీద గల
ఉద్దేశ్యమును చెప్పుకొందాము.
ఇప్పుడు మీకు చూపిన నాలుగు చక్రములు ప్రకటన గ్రంథములో
చెప్పిన అసలయిన దేవునిముద్ర యగును. దేవుని ముద్రను ధరించని
మనుష్యులను కాకుండా వృక్షములు, గడ్డి మొక్కలకు హాని కలుగజేయ
దేవుని ముద్ర చిత్రమును 113 పేజీ లో చూడండి.
కూడదని ఆజ్ఞ ఇవ్వబడెను అని ఉన్నది. ఆజ్ఞ ఎవరు ఇచ్చారు? ఎవరికి
ఇచ్చారు? అను విషయము కొంత అర్థమయితే పైన చెప్పబడిన వాక్యముల
మీద నమ్మకము ఏర్పడును. అప్పుడు దేవుని ముద్రను ఎవరయినా
గౌరవింతురు మరియు ధరింతురు. దేవుని ముద్ర జ్ఞానరీత్యా విడదీసి
చెప్పుకొన్నాము. అట్లే దేవుని చిహ్నమును జ్ఞానపద్ధతిలో వివరించి
చెప్పుకొన్నాము. ఇంతవరకు మేము చెప్పిన దేవుని చిహ్నము లేక దేవుని
ముద్రను గురించి ఇటు ముస్లీమ్లకు గానీ, అటు క్రైస్థవులకుగానీ తెలియదు.
హిందువుల విషయానికి వస్తే వారు ధరించే నామాలు, విభూతి రేఖలు,
కుంకుమ బొట్లు ఈ ముద్రకు ఏమాత్రము సంబంధము లేనివి. అందువలన
హిందువులకు కూడా దేవుని ముద్రను గురించి ఏమాత్రము తెలియదు.
ఇంతవరకు ఈ ముద్ర ఏ మతముల వారికి తెలియదు. దేవుని ముద్రను
గురించి ముఖ్యముగా మూడు మతముల వారికి తెలిసి యుండవలసినది.
అయితే ఇందూ, ఇస్లామ్, క్రైస్థవులు ముగ్గురు ఈ ముద్రను గురించి
ఏమాత్రము తెలియనివారైయున్నారు. ఈ ముద్ర మూడు మతములకు
సంబంధించినదై యున్ననూ, దేవుడు తన మూడు గ్రంథములలో ఈ
ముద్రను గురించి చెప్పియున్ననూ, మూడు మతముల వారు దేవుని
ముద్రను విస్మరించారు. దేవుడు చెప్పిన బోధను మనుషులే కాక
మనుషులతో పాటు పుట్టిన దేవుని పరిపాలనలోని పాలకులుగాయున్న
మహా భూతములు, భూతములు, గ్రహములు, ఉపగ్రహములు మొదలయిన
వారందరూ దేవుని జ్ఞానమును తెలుసుకొంటున్నారు. దేవుని పాలనలోని
వారందరూ దేవుని జ్ఞానమును ఎంతో ఇష్టముతో తెలుసుకోవడమేకాక
తమకు వచ్చు ఆజ్ఞలను తప్పనిసరిగా నెరవేర్చుచున్నారు. ఇక్కడ వాక్యములో
'ఆజ్ఞ ఇవ్వబడింది' యని చెప్పారు కదా! ఆజ్ఞను దేవుని పాలకులయిన
వారికి ఇవ్వబడినది. ఇచ్చిన వారు ఎవరు? అన్నది ఇప్పుడు మనకు
ముఖ్యమైన ప్రశ్న. ఆజ్ఞ ఇచ్చిన వారిని గురించి తెలియుటకు ముందు
ఆజ్ఞను గ్రహించి ఆజ్ఞను అమలు చేయు పాలకులు ఎంతమంది యున్నారు?
ఎట్లుయున్నారు? అను విషయము మనుషులకు కొంత అర్థము
కావలసియున్నది. అందువలన ముందు పాలకుల విషయము సూచన
ప్రాయముగా తెలుసుకొందాము.
భూమిమీద రెండు రకముల జీవరాసులు గలవు. ఒకటి పాలించ
బడువారు, రెండు పాలించువారు. పాలించబడువారు మనుషులు మరియు
సమస్త జీవరాసులు. పాలించువారు భూతములు, గ్రహములు అను రెండు
రకముల వారు గలరు. పాలించబడు మనుషుల, జీవరాసుల ఆకారములు
పేర్లు కొంతవరకు తెలిసే ఉన్నాయి. అయితే పాలించు భూతములు,
గ్రహములు, ఉపగ్రహముల ఆకారములు ఏమాత్రము మనుషులకు
తెలియవు. వారి ఆకారములను సమగ్రముగా కాకుండా సూచన
ప్రాయముగా చెప్పదలచాము. పాలకుల సంఖ్య భూతములుగా,
గ్రహములుగా, ఉపగ్రహములుగా మూడు రకముల వారు కొన్ని కోట్ల
సంఖ్యలో ఉంటారని చెప్పవచ్చును. కోట్లాదిగా యున్న గ్రహములుగానీ,
భూతములుగానీ ఎవరికీ తెలియదనియే చెప్పవచ్చును. వాటి ఆకారము
జంతువులను, కీటకములను, పక్షులను, మనుషులను, సర్పములను కలిపి
చేసినట్లుండును. మనుషులు జంతువులు కలిసి పుట్టినట్లు కొన్నియుండగా,
జంతువులు పక్షులు కలిసి పుట్టినట్లు కొన్ని ఉండును. పక్షులు సర్పములు
కలిసి పుట్టినట్లు కొన్ని గలవు. ఇట్లు మనుషుల ఊహకు అందని
రూపములలో పాలకులున్నారని చెప్పవచ్చును. కొందరు పాలకులు రెండు
మూడు జాతులు కలిసి పుట్టిన ఆకారములుండగా, కొందరు పాలకులు
ఒకే ఆకారముతో పుట్టియున్నారు. ఏవి ఏ ఆకారములో యున్నా అవి
కొన్ని వందల కోట్లలో వేల కోట్లలో ఉన్నాయని చెప్పవచ్చును. భూమిమీద
ప్రస్తుత జనాభా 700 కోట్లమంది యుండవచ్చుననుకొందాము. 700
కోట్లమందికి 7000 కోట్ల పాలకులుండవచ్చునని అంచనా గలదు.
ఒక్క మనిషికి దాదాపు పదిమంది పాలకులయితే మిగతా
జీవరాసులన్నిటికీ కలిపి ఎంతమంది పాలకులుందురో చెప్పుటకు శక్యము
కాదు. మనుషులను పాలించు వారి వరకు అర్థము చేసుకొనినా మనిషి
ఎంతో జ్ఞానమును సంపాదించినట్లగును. మనుషులను పాలించు పాలకులు
దైవజ్ఞానములో మొదటి జ్ఞానులుగాయున్నారు. వారికి దేవుడంటే మహా
ఇష్టము. దేవున్ని దూషించు వారన్నా, దేవుని జ్ఞానమును దూషించు వారన్నా
చాలా కోపము. అయినా వారు తమకు ఇవ్వబడిన ఆజ్ఞప్రకారము పని
చేస్తారు. జ్ఞాన విషయములలో అజ్ఞానముగా నడచువారుగానీ, దేవున్ని
గౌరవించక దేవతలను, మనుషులను గౌరవించువారు, పూజించు వారి
మీద కూడా కోపముగా యుందురు. అయినా వారి ఇష్టానుసారముగా
పని చేయక వారికి ఇవ్వబడిన ఆజ్ఞప్రకారము పని చేయుదురు. ముఖ్యముగా
వారి ఆకారములను గురించి చెప్పితే మా మాటను నమ్మని వారుండవచ్చును.
అలాగే యుందురని చెప్పుటకు ఆధారమేమియని కూడా అడుగవచ్చును.
దానికి మా సమాధానము ఈ విధముగా కలదు. నేను ప్రత్యక్షముగా
ఎవరినీ చూడలేదుగానీ కొంత నాకున్న జ్ఞానము వలన, దైవగ్రంథములలో
చెప్పిన ఆధారముల వలన మాత్రమే చెప్పాను.
దేవుని పాలకులలో గ్రహముల క్రింద ఉపగ్రహములుగా యున్న
వారి ఆకారమును అదే ప్రకటన గ్రంథములో వ్రాసిన విధానమును చూచి
అర్థము చేసుకొందాము. ప్రకటన 9వ అధ్యాయము, ఏడవ వచనము
నుండి పదవ వచనము వరకు చూస్తాము. (యోహాన్ ప్రకటన 9-7,
8, 9, 10) “ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచ
బడిన గుఱ్ఱములను పోలియున్నవి. బంగారమువలె మెరయు
కిరీటములవంటివి వాటి తలల మీద యుండెను. వాటి
ముఖములు మనుష్యుల ముఖముల వంటివి. స్త్రీల తల
వెంట్రుకల వంటి తల వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి
పండ్లు సింహపు కోరలవలె నుండెను. ఇనుప మైమరువులవంటి
మైమరువులు (కవచములు) వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని
యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల
ధ్వనివలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలును, కొండ్లును వాటికి
ఉండెను. ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుష్యులకు
హాని చేయుటకు వాటికి అధికారముండెను". ఈ విధముగా
మనుష్యులను బాధించు దూతల ఆకారములను గురించి కొద్దిగా ఇక్కడ
చెప్పబడినది. నేను గతములో చాలామార్లు దేవుని పాలనలోని పాలకుల
గురించి చెప్పియున్నాను. వారికి వందల వేల చేతులు కూడా ఉన్నాయని
ఎక్కువ చేతులుగల పాలకులను గురించి కూడా చెప్పియున్నాము. వారి
ఆకారములు ఇక్కడ చెప్పినట్లు మిశ్రమ ఆకారములుగా యున్నవి. వాటి
బలమును అంచనా వేయలేము. దేవుని జ్ఞానము ఎడల ఎంతో ఇష్టతతోనూ,
భక్తితోనూ ఉన్న పాలకులు అయినందున వారి ముందు దేవున్నిగానీ,
దేవుని జ్ఞానమునుగానీ దూషించిన వారిని శిక్షించుటకు ఆజ్ఞ కోసము
చూచుచుందురు.
దేవుని పాలనలో గల ఎన్నో కోట్ల సంఖ్యలో యున్న పాలకులు
తమ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించక తమకు వచ్చు ఆజ్ఞ ప్రకారమే నడుచు
కొందురని తెలియుచున్నది. (ప్రకటన 9-5) లో "వారిని చంపుటకు
అధికారము ఇవ్వబడలేదుగానీ ఐదు నెలల వరకు బాధించుటకు
వాటికి అధికారము ఇయ్యబడెను". అట్లే పదవ వాక్యములో కూడా
“మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను” అని
చెప్పబడియున్నది. దీనిప్రకారము పాలకులందరు తమకు ఇవ్వబడిన ఆజ్ఞ
ప్రకారము పని చేయుచుందురని తెలియుచున్నది. కొన్ని సందర్భములలో
మనుషులు చేసుకొన్న పాపములను బట్టి వారిని చంపుటకు కూడా ఆజ్ఞ
ఇవ్వబడుచుండును. తమకు వచ్చిన ఆజ్ఞ ప్రకారము పాలకులుగా
యున్నవారు పని చేయుచుందురు. పాలకులు అనేక రూపములలో యున్నా,
అనేక చేతులతో యున్నా ఎక్కడగానీ, ఏ సందర్భములోగానీ మనుషులకు
కనిపించిన దాఖలాలులేవు. అందువలన మనుషులు పాలకుల వలన
శిక్షలు అనుభవించుచున్నా ఎవరి వలన వారికి ఆ బాధలు ఏర్పడుచున్నవని
తెలియదు. గొప్ప రోడ్డు ప్రమాదములకు కారకులు పాలకులే అయినా
ఆ విషయము మనుషులకు తెలియదు. అనేక రోగములకు కారకులు
పాలకులేయని చాలామందికి తెలియదు. చిన్న సంఘటనలు మొదలుకుని
పెద్ద పెద్ద తుఫానుల వరకు, సునామీల వరకు, భూకంపముల వరకు
అనేక ప్రకృతి విపత్తులుగా వచ్చు ప్రమాదములు కూడా పాలకులవల్ల
కల్గుచున్నవేయను విషయము చాలామందికి తెలియదు. ఇదంతా
మనుషులు చేసుకొన్న పాపముల వలననే జరుగుచున్నవి. మనుషుల
పాపములనుబట్టి పాలకులకు ఆజ్ఞ ఇవ్వబడుచున్నది. పాలకులకు వచ్చిన
ఆజ్ఞప్రకారము దేవుని సైనికులుగా యున్న పాలకులు వారి పనిని వారు
చేయుచుందురు. ఈ తతంగమంతా తెలియుటకు దైవజ్ఞానము అవసరమని
చెప్పుచున్నాము.
పాలకులు ఆకాశమునుండి భూమివరకు యున్నారు. వారు
ఎక్కడికయినా పోగలరు, ఎక్కడయినా ఉండగలరు. మనుషులను పాలించు
పాలకులు బయట ప్రపంచములో కొన్ని వందల కోట్లలో యున్ననూ
మనుషులకు వారి విషయము తెలియదు. ప్రకృతియంతా తిరుగుచూ
మనుషుల కర్మలనుబట్టి ప్రవర్తించుటకు ప్రకృతి చేతనే ఆజ్ఞలు ఇవ్వబడు
చున్నవి. ప్రకృతి నుండి వచ్చు ఆజ్ఞను పాలకులుగా యున్న గ్రహములు,
భూతములు నెరవేర్చుచున్నవి. ప్రకృతి వెనుకయుండి ప్రకృతిని
నడిపించువాడు పరమాత్మ. పరమాత్మ ప్రకృతికి ఎలా తన సూచనలను
తెల్పునో మనకు తెలియదు. ప్రకృతి దేవుని సూచన ప్రకారము పాలకులకు
ఆజ్ఞ ఇవ్వగా, పాలకులు అట్లే పని చేయుచున్నారు. మనిషి పుట్టినప్పటినుండి
చనిపోవు వరకు రెండు విధముల పాలించబడుచున్నాడు. ఒకటి బయటి
పాలన ద్వారా, రెండు లోపలి పాలన ద్వారాయని చెప్పవచ్చును. లోపలి,
బయట అనడములో శరీరము బయట, శరీరము లోపలయని చెప్పవచ్చును.
శరీరము బయట ప్రకృతిచే ఆజ్ఞలురాగా, ఆ ఆజ్ఞల మేరకు పాలకులు పని
చేయగా, శరీరము లోపల స్వయముగా ఆత్మే మనిషిని కష్టసుఖములు
అనుభవింపజేయుచున్నది. బయట ప్రకృతి తప్ప పరమాత్మ పని చేయడు.
ప్రకృతి నుండి వచ్చు ఆజ్ఞలు స్వయముగా ప్రకృతి ఇచ్చునట్లే యుండును.
అయినా గౌరవప్రదముగా ప్రకృతికి పరమాత్మ సూచనల ద్వారా ప్రకృతి
ఆజ్ఞలను ఇచ్చుచున్నదని చెప్పుచున్నాము. అయినా ప్రకృతికి పరమాత్మ
సూచన చేయుచున్నాడని చెప్పుటకు శాస్త్రాధారము ఏమీ లేదు.
శరీరములో ఆత్మ దేవుడుగాయుంటూ మరియు కార్యకర్తగా
యుంటూ రెండు విధముల పని చేయుచూ జీవులను పాలించుచున్నాడు.
ఆత్మ శరీరములో ఒకవైపు దేవుడుగాయున్నా మరొకవైపు కార్యకర్తగా అనగా
గుమస్తావలె పని చేయువాడుగా యుండి, పని చేయుచూ జీవరాసులను
(మనిషిని) కష్టసుఖములను అనుభవింపజేయుచున్నాడు. శరీరములో గల
జీవుడు చేసుకొన్న ప్రారబ్ధ కర్మప్రకారము కష్టసుఖములను అనుభవింప
జేయుటకు శరీరములోని ఆత్మే స్వయముగా పనిని చేయుచు కష్టసుఖ
అనుభవములను పొందునట్లు చేయుచున్నాడు. కర్మప్రకారమే నడుచు
ఆత్మ కర్మప్రకారమే జీవున్ని నడుపుచున్నది. అట్లే కర్మప్రకారమే జీవున్ని
చంపుచున్నది. అట్లే జీవున్ని మరొక శరీరములో పుట్టించుచున్నది.
కష్టసుఖములను, చావు పుట్టుకలను కలుగజేయు ఆత్మ జీవుని శ్రద్ధనుబట్టి
జ్ఞానమును కల్గించుచున్నది. మనిషి ఇష్టమునుబట్టి జ్ఞానమును కల్గించినట్లే,
అయిష్టమునుబట్టి అజ్ఞానమును కూడా కల్గించుచున్నది. శరీరములోపల
ఆత్మ పాలించగా, శరీరము బయట పాలకులు పాలించుచూ జీవున్ని
నడుపుచున్నారు. శరీరము బయట పాలకులు పెట్టు ఇబ్బందులను, కష్ట
సుఖములను ఓర్చుకోలేక మనిషి అయిన వాడు చావును వెదకుకొనును
అని గలదు. కర్మ ప్రకారమే అన్నీ జరుగును కనుక వాడు అనుభవించవలసి
యున్నది, అనుభవించక తప్పదు. అందువలన బాధలకు తట్టుకోలేక
మరణము కొరకు వెదకినా మరణము రాదు. శరీరములో ఆత్మే అన్నీ
చేయుచున్నది. కావున ఆత్మకు తెలియకుండా చావురాదు. శరీరములో
పరిపాలన క్షణక్షణము జరుగుచుండగా, శరీరము బయట పాలన
అప్పుడప్పుడు జరుగుచుండును. బయట అనుభవమునకు అయినా, లోపలి
అనుభవమునకు అయినా కర్మే కారణమయి ఉండుట వలన అన్నీ కర్మ
వలననే కర్మప్రకారమే జరుగుచున్నవి. అయితే మనిషి లోపలి ఆత్మ పాలనను
తెలియగలిగితే, తర్వాత కొద్దికొద్దిగా బయటి పాలన అర్ధము అగును.
శరీరములో ఆత్మే దేవుడు, ఆత్మే పాలకుడు, ఆత్మే కార్యకర్తగా
యున్నాడు. బయట దేవుడు పరమాత్మయున్నా ఆయన లేనట్లే ఉన్నాడు.
పరమాత్మ ఏమీ చేయకున్నా బయటనే యున్న ప్రకృతియే బయటనే గల
పాలకుల చేత మనిషిని పాలించుచున్నది. దేవుడు అయిన పరమాత్మ
ప్రకృతి వెనుకయుండి ఎవరికీ తెలియకుండా యున్నాడు. మూలకర్త,
ఆది దేవుడు పరమాత్మే అయినా మనుషులందరికీ శరీరములో గల ఆత్మనే
దేవునిగా ప్రకటించి, తనకున్న అధికారములన్నీ ఆత్మకు ఇచ్చి, ప్రజలకు
ఆరాధ్యదైవముగా ఉండునట్లు స్వయముగా దేవుడే నిర్ణయించాడని ఖుర్ఆన్
గ్రంథములో (3-18) లో చెప్పడమైనది. ఒక్క ఖుర్ఆన్ గ్రంథములోనే
కాకుండా మిగతా భగవద్గీతలోనూ, బైబిలులోనూ ఆత్మనే ఆరాధ్యదేవుడుగా
చెప్పియున్నారు. ఆత్మ దేవుడేకాక, శరీరములో కార్యకర్తగా కూడా యున్నదని
అదే ఖుర్ఆన్ గ్రంథములో (6-102) వ వాక్యములో చెప్పియున్నారు.
ఆత్మ మనిషి చేసుకొన్న కర్మప్రకారము పనిచేయుచూ పాపపుణ్యములను
అనుసరించి కష్టసుఖములను కలుగజేయుచుండును. ఆత్మ శరీరములో
కలుగజేసిన ప్రతి పాపమునుగానీ పుణ్యమునుగానీ జీవుడు అనుభవిస్తున్నాడు.
అయితే బయట ప్రపంచములో ప్రకృతి తన పాలకుల చేత మనిషిని
కొన్ని ప్రమాదములకు గురి చేయునట్లు తెలుసుకొన్నాము. అది కూడా
మనిషి చేసుకున్న పాపము వలన జరుగునదే కదా! శరీరములో యున్న
ఆత్మ పాపపుణ్యములను తన శరీరమునందే పాలించగా బయట
అనుభవించ వలసిన పాపపుణ్యములను బయటి దేవుడయిన పరమాత్మ
ప్రకృతికి సూచనలివ్వగా, ప్రకృతి పాలకులకు సూచనలు ఇవ్వగా, పాలకులు
మనిషిని కష్టసుఖములకు గురి చేయుచున్నారు.
మనిషి శరీరము బయట అనుభవించినా, శరీరము లోపల
అనుభవించినా మనిషి తలలో కర్మచక్రములోగల కర్మప్రకారమే అనుభవ
ముండును. బయట అనుభవించవలెనని ముందే నిర్ణయించబడి యున్న
కర్మలను ప్రకృతి బయట అనుభవింపజేయును. శరీరము లోపల
అనుభవించవలసిన కర్మలను ఆత్మ బయట అనుభవించునట్లు చేయును.
శరీరము బయట పాలకులయిన భూతములు, గ్రహములు తమకు వచ్చిన
ఆజ్ఞప్రకారము కర్మను అనుభవింపజేయడమేకాక కర్మను అనుభవింప
చేయకుండా కర్మను లేకుండా చేయగల సామర్థ్యము గలవిగా యున్నవి.
దేవుని మీద విశ్వాసమున్న వాని కర్మలను ఆత్మ శరీరములో క్షమించును
అని తెలుసుకొన్నాము. భగవద్గీతలో చెప్పిన ప్రకారము జ్ఞానముగల మనిషికి
జ్ఞానశక్తి యుండుననీ, జ్ఞానశక్తియే జ్ఞానాగ్నిగా మారి మనిషిలోని కర్మను
దహించి వేయుచున్నదని చెప్పారు. భగవద్గీతలో జ్ఞానయోగము అను
అధ్యాయమున 37వ శ్లోకమున ఈ విషయమును చెప్పారు చూడండి.
శ్లో। యధంసి సబట్టోగ్ని రససాత్కురుతేర్జున
జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా |
(కర్మయోగము, బ్రహ్మయోగము).
భావము :- “అగ్నిలో ఎన్ని కట్టెలైనాగానీ కాలి బూడిద అయినట్లు జ్ఞానమను
అగ్నిలో సర్వకర్మలు కాలిపోవును. ఇందులో ఏమాత్రము అనుమానము లేదు.”
అని చెప్పియున్నారు. ఆ మాట ప్రకారము శరీరము లోపల అనుభవమునకు
వచ్చు కర్మలు శరీరములోనే జ్ఞానము చేత క్షమించబడును. దానినే
కాలిపోవును అని అర్థమగునట్లు చెప్పారు. శరీరములో గల ఆత్మే
శరీరములోని కొన్ని కర్మలను క్షమించి వేయుచున్నాడు. అనగా లేకుండా
చేయుచున్నాడు. ఏ మనిషి అయినా దేవుని సత్యమైన జ్ఞానమును తెలిసి
ఆచరించిన ఎడల, స్వచ్ఛమయిన దేవుని జ్ఞానము తెలిసి అదే భావము
కల్గియుండడము వలన అతని కర్మలు లేకుండా పోవును, అనగా క్షమించ
బడును. దైవజ్ఞానము గల మనిషి లోపల అనుభవించవలసిన కర్మలనుగానీ,
బయట అనుభవించవలసిన కర్మలనుగానీ అనుభవించకుండా శరీరము
లోపల ఆత్మయిన దేవుడు చేయుచున్నాడు. శరీరము బయట పరమాత్మయైన
దేవుడే చేయుచున్నాడు. అయితే ఆయన పని చేయనివాడైనందున తాను
స్వయముగా ఏదీ చేయక తన పాలకుల చేత చేయించును. అందువలన
దేవుడు క్షమాశీలుడు, కరుణామయుడు అని దైవగ్రంథములలో చెప్పారు.
దేవున్ని విశ్వసించిన వానికి, దేవుని జ్ఞానమును తెలిసిన వానికి దేవుడు
క్షమాశీలుడు, కరుణా మయుడు. అంతేతప్ప అందరికీ దేవుడు క్షమాశీలుడు
కాడు. పాపమును క్షమించుటలోనే ఆయనకు కరుణయున్నది
కరుణామయుడుగానీ, అజ్ఞానులు యెడల కరుణామయుడు కాదని
తెలియవలెను.
దైవగ్రంథముల ప్రకారము జ్ఞానమును తెలియగలిగి అదే
భావములో యుండువానికి వాని శరీరములోని ఆత్మే వాని కర్మలను
కాల్చి వేయుచున్నది. శరీరము బయట అనుభవించవలసిన కర్మలను
శరీరము బయటగల పాలకులే అనుభవింపజేయుటకుగానీ, అనుభవించ
కుండా కర్మను లేకుండా చేయుటకుగానీ అర్హులుగాయున్నారు. శరీరము
లోపల ఆత్మ చేయు పనిని, శరీరము బయట ప్రకృతిలోని పాలకులు
శిక్షించడముగానీ, క్షమించడముగానీ చేయుచున్నారు. ఇదంతయూ కంటికి
కనిపించు విషయము కాదు. జ్ఞానమునకు మాత్రమే తెలియు విషయము.
అందువలన జ్ఞానముగలవారే ఈ విషయములను సులభముగా గ్రహించ
గలరు. జ్ఞానము లేనివారు, దేవుని మీద విశ్వాసము లేనివారు మేము
చెప్పిన విషయములను నమ్మలేరు. మీరు చెప్పేదానికి ఆధారమున్నదా,
శాస్త్రాధారమున్నదా? యని ప్రశ్నింతురు. భగవద్గీతలో జ్ఞానయోగమున చెప్పిన
37వ శ్లోకము యొక్క ఆధారముతో మేము ఈ మాట చెప్పుచున్నామనినా,
అదే మాకు శాస్త్రాధారము అని చెప్పినా ప్రత్యక్షముగా మేము చూస్తేగానీ
నమ్మము అనువారు గలరు.
అటువంటి వారికి శరీరము లోపల జరుగు కర్మ క్షమాపణ ఎటూ
తెలియదు. అందువలన బయట జరుగు కర్మ క్షమాపణ విషయములోనే
ప్రత్యక్షముగా కనిపించునట్లు చేయాలని మనకు తాతయైన పరమాత్మ
అనుకోవడము వలన అజ్ఞానులు సహితము విశ్వసించునట్లు, వారు కూడా
జ్ఞానులుగా మారునట్లు, హేతువాదులను, నాస్తికవాదులను ఆలోచింప
జేయునట్లు, పాలకులచేత పాపక్షమాపణ జరుగుచుండడము నేడు
ప్రత్యక్షముగా కనిపించునట్లు దేవుడు చేశాడని చెప్పవచ్చును. బయటి
దేవుడు ఏమీ చేయక స్థబ్దతగాయుంటూ అన్నీ తన కార్యకర్తలైన ప్రకృతిలో
పాలకులుగా యున్న వారిచేత చేయించుచున్నాడు. బయట పాలకులు
ఎన్నో కోట్లమంది యుంటూ, పెద్ద ప్రమాదములను ఒకరికి ఇద్దరికికాక
సామూహికముగా మనుషులున్న చోట కలుగజేసి, వందలు వేలమందిని
మరణించునట్లు చేయుచున్నారని చెప్పుకొన్నాము. వారికి కర్మను
పాలించడమే కాక కర్మను కాల్చివేయడము కూడా చేయుచున్నారు. దేవుని
మీద, దేవుని జ్ఞానము మీద విశ్వాసమున్న వారికి బయట పాలకులు
కర్మను ఎలా కాల్చివేశారో (లేకుండా చేశారో) ఒక ప్రత్యక్ష సంఘటన
ద్వారా తెలుసుకొందాము. శరీరము లోపల ఆత్మ దేవుడు కర్మను లేకుండా
చేసినా అది ఎవరికీ అర్థము కాదు. అది ఇలా జరిగిందియని తెలియదు.
తగలబోయే దెబ్బ తగలకుండా పోయినా, వచ్చిన రోగము నెలరోజులు
పీడించునది ఒక రోజులో లేకుండా పోయినా అదంతా సహజంగానే
జరిగింది అనుకుంటారు. ఒకనికి శరీరములో కడుపునొప్పి నెలరోజులు
అనుభవించు కర్మ అమలుకు వచ్చినది. అయితే వాడు దేవుని ఆశ్రయించి
(దేవుని జ్ఞానమును ఆశ్రయించి) ఉండడము వలన అతనికి కడుపునొప్పి
ఒక రోజు మాత్రము ఉండి మిగతా 29 రోజులు లేకుండా పోయినది.
అప్పుడు అతను తనకున్న జ్ఞానము ప్రకారము అది పోయిందనిగానీ,
శరీరము లోపల దేవుడు తన కర్మను క్షమించాడని గానీ అనుకొనే దానికి
వీలులేదు. అతను వాడిన మాత్రతో కడుపునొప్పి తగ్గిపోయినదని
అనుకొనును. అతనికి ప్రత్యక్షముగా మింగిన టాబ్లెట్ (మాత్ర) కనిపించును
తప్ప జ్ఞానము వలన క్షమాపణ జరిగినదని అనుకొను వీలేలేదు.
అదియునూగాక అతనికి తన కడుపునొప్పి నెల రోజులు అనుభవించ
వలసియున్నదను విషయము కూడా తెలియదు. అందువలన తన నొప్పి
ఒక గంటలో పోయినా లేక ఒక దినములో పోయినా మన లెక్కలో అది
కర్మ క్షమాపణ లేక కర్మదహనము అని చెప్పవచ్చును. ఆ విషయము
కడుపునొప్పియున్న వానికి తెలియదు. అతడు తననొప్పి తాను మింగిన
టాబ్లెట్ (మాత్ర) ద్వారా పోయింది అనుకొనును. తాను నమ్మిన జ్ఞానము
ద్వారా పోయింది అనుకోడు.
ఈ విధముగా కర్మ దహనము జరిగినా అది మనిషికి తెలియుటకు
అవకాశము లేదు. అందువలన దేవుని మాట అసత్యముగా కనిపించు
అవకాశము గలదు. అట్లే శరీరము బయట కర్మలు పాలకులు శిక్షించకుండా
దహించివేసినా, అవి దేవుడు క్షమించుట వలన పోయాయి అనిగానీ, దైవ
గ్రంథములో చెప్పినట్లు కర్మ దహించబడినదని గానీ అనుకొనుటకు
వీలులేదు. తనకున్న కర్మ కొంతేయని అనుకొంటాడు. ఈ విధముగా
సత్యము తెలియకుండా పోవుటకు అవకాశము గలదు. మనిషి ప్రత్యక్షముగా
స్థూలముగా ఉన్న దానినే గమనిస్తాడుగానీ, పరోక్షముగా సూక్ష్మముగా జరుగు
విషయములను గ్రహించలేడు. దానివలన మనిషి జ్ఞానములోనికి వచ్చు
అవకాశము తగ్గిపోవును. అజ్ఞానులుగా మారుటకే అవకాశము ఎక్కువ
ఉండును. అటువంటప్పుడు స్థూలముగా జరుగు కర్మదహనము
మనుషులకు తెలియునట్లు చేయమని కోరాము. అలా తెలియుట వలన
మనిషి కర్మదహనమును గ్రహించి భగవద్గీత జ్ఞానయోగము 37వ
శ్లోకములో చెప్పిన 'కర్మదహనము' అనుమాట సత్యమని తెలియును. అలాగే
బైబిలు గ్రంథములో చెప్పిన 'పాపక్షమాపణ' అను వాక్యమును నమ్మును.
అట్లే ఖుర్ఆన్ గ్రంథములో చెప్పిన 'దేవుడు క్షమాశీలుడు' అనుమాటను
విశ్వసించును.
మానవుడు దేవుని జ్ఞానమును తెలియునట్లు కర్మదహన విషయము
సూక్ష్మముగా కాకుండా స్థూలముగా తెలియునట్లు దేవుడు చేయదలచాడని
అందువలన కర్మదహనము స్థూలముగా జరుగునట్లు దానిని మనిషి
గ్రహించునట్లు చేశాడు. తమ కర్మనుండి బయటపడినట్లు తెలిసిన కొందరు
దేవుడు తమ కర్మను క్షమించాడనీ, తమ కర్మను లేకుండా చేశాడని
చెప్పుకోవడము చూచి మేము ఎంతో సంతోషించాము. మనిషి ప్రపంచ
సంబంధ కోర్కెలను కోరకుండా దైవ సంబంధ కోర్కెలను కోరవచ్చును.
దైవికమైన కోర్కెలు కోరువారినే దేవుడు ఇష్టపడును. నేను కర్మ దహనము
స్థూలముగా తెలిస్తే బాగుంటుంది, మనుషులకు జ్ఞానము యొక్క విలువ,
పవిత్రత తెలుస్తుంది. ఆ విషయము దేవునికి కూడా తెలుసు కావున నా
కోర్కెను ఆలకించిన దేవుడు బయట కర్మలు దహించడము స్థూలముగా
తెలియునట్లు చేశాడు. స్థూలముగా ఎలా తెలియును? అని కొందరు ప్రశ్నించ
వచ్చును. అందువలన నాకు తెలిసిన, నేను చూచిన ఒక యదార్థ సంఘటన
గురించి ఇప్పుడు చెప్పుకొందాము. అంతకు ముందు నేను కొన్ని వందల
సంఘటనలను గురించి ఇతరులు నాకు చెప్పగా విన్నానుగానీ, ప్రత్యక్షముగా
నేను చూడలేదు. చాలామంది నాకు చెప్పుటకంటే దృశ్యరూపముగా చూపుట
మంచిదని వీడియో చిత్రములు, ఫోటోలు తెచ్చి చూపారు. అయితే నేను
దానిని గురించి ఎక్కువ ఆలోచించ లేకపోయాను. నేను ఎక్కువ కాలము
గ్రంథరచనలో గడుపుట వలన నేను చూచిన వీడియో చిత్రములను గురించి,
ఫోటో చిత్రముల గురించి కారణమునుగానీ, శాస్త్రీయతనుగానీ, వాస్తవికతను
గానీ ఆలోచించలేకపోయాను. ఒక దినము ఒక ముస్లీమ్ వ్యక్తి నాకు
పరిచయమున్న మరొక మనిషితో కలిసి రావడము జరిగినది. వచ్చిన
ముస్లీమ్ వ్యక్తి ఐదు రోజులుగానీ లేక తొమ్మిది రోజులుగానీ ఇక్కడే ఉండి
పోయాడు. ఎన్ని రోజులు ఉన్నాడన్నది నాకు ఇప్పుడు జ్ఞాపకము లేదు.
బహుశా ఐదు రోజులే అనుకుందాము.
శరీర ఆరోగ్యములు సరిగా లేనివారు, అనేక ఆరోగ్య సమస్యలున్న
వారు కృష్ణమందిరములో 3, 5, 9 రోజులు నిద్ర చేసి పోవుచుందురు.
కొన్ని రోజులు ఇక్కడే ఉండి ఇక్కడ పని సేవరూపములో చేయుట వలన
వారి ఆరోగ్య సమస్యలు లేకుండా పోవునని నమ్మకము. అదే నమ్మకముతో
ముస్లీమ్ కుటుంబము అనగా దాదాపు 60 సంవత్సరములున్న అతను,
అతని భార్య ఇద్దరూ రావడము జరిగినది. అప్పుడు నేను మందిరములోనే
యున్నా నా గదిలో నేను ఉంటాను. నా వద్దకు ఎవరూ రారు. నేను
బయటికి పోను. ముస్లీమ్ వ్యక్తిని పిలుచుకొని వచ్చిన వ్యక్తి నాతో కలిసి
మాట్లాడుటకు అనుమతిని అడుగగా నేను అనుమతి ఇవ్వడము, ఆయన
నా దగ్గరకు వచ్చి మాట్లాడడము జరిగినది. అప్పుడు అతని వెంట వచ్చిన
ముస్లీమ్ను గురించి చెప్పడము జరిగినది. నా దగ్గరకు వచ్చిన వ్యక్తి
ఉన్నత పాఠశాల (హైస్కూలు) లో టీచర్గా పని చేయుచున్నాడు. అతని
వెంట వచ్చిన అతనిది కూడా టీచర్ ఉద్యోగమే, అదే స్కూల్లో చేయుట
వలన ఇద్దరికి పరిచయమున్నది.
ఆ ఇద్దరు టీచర్లు నెల్లూరు జిల్లా, ఆత్మకూరులో ఉద్యోగము
చేయుచున్నారు. ముస్లీమ్కు దాదాపు కొన్ని సంవత్సరముల నుండి కడుపులో
క్యాన్సర్ రోగమున్నట్లు, అతను మూడు, నాలుగు సంవత్సరములనుండి
అనారోగ్యముతో బాధపడుచూ ఆస్పత్రులలో చికిత్స చేయించుకోవడము,
ఇప్పటికి దాదాపు 15 లక్షల రూపాయలు అయిపోయాయని, అయినా
అది నయము కాలేదని అతను స్కూల్కు వచ్చి కూర్చొనే ఓపిక లేక
పడుకొని పోయేవాడని, అతని పరిస్థితి చూచిన అందరూ ఆయనకు
సహకరించే వారనీ, స్కూల్కు వచ్చి పోయినా అటెండెన్స్ వేసి జీతము
ఇచ్చేవారనీ, ఆయన రోగముతో బాధపడుచుంటే చూడలేక నావద్దకు
వచ్చిన మనిషి నేను వ్రాసిన ఒక గ్రంథమును అతనికి బాధయున్న చోట
కడుపు మీద పెట్టగా, ఆ గ్రంథము పొట్టకు అతుక్కొని పోయిందని చెప్పారు.
కడుపుకు అంటుకొని పోయిన గ్రంథము ఏకధాటిగా ఎనిమిది గంటలసేపు
అతుక్కోవడము జరిగినది. ఎనిమిది గంటల తర్వాత అతనికి కడుపులో
నొప్పి పోయినది. కడుపు నొప్పి పోయిన తర్వాత గ్రంథము కడుపునుండి
ఊడి వచ్చినది. అదంతా గ్రంథము ఇచ్చిన సుధాకరాచారికి, గ్రంథము
అంటుకొన్న ముస్లీమ్కు ఆశ్చర్యముగా కనిపించినది. ప్రతి దినము క్యాన్సర్
రోగముతో బాధపడే మహబూబ్ భాషా గారికి అప్పటినుండి కడుపులో
నొప్పి రాలేదట. ప్రత్యక్షముగా గ్రంథము కడుపు మీద ఏకధాటిగా ఎనిమిది
గంటలు అతుక్కొని యుండి లోపల బాధగాయున్న కర్మను లేకుండా
చేయడము వారికి ఆశ్చర్యము మరియు అద్భుతముగా కనిపించినది. అతని
కడుపుకు నా గ్రంథము అంటుకొని యున్న ఫోటోను నాకు చూపారు.
కడుపులోని బాధ కనిపించకుండా పోయిన నెల తర్వాత వారు
ఆశ్రమములో నిద్రచేస్తే మంచిదని ఇక్కడకు రావడము జరిగినది.
విషయమంతా నావద్దకు వచ్చి మాట్లాడిన వ్యక్తి చెప్పగా నేను విన్నాను.
తర్వాత అతను తిరిగి తన ఊరికి పోవు దినమున అతనిని పిలిచి
మాట్లాడాను. అప్పుడు అతని పేరు మహబూబ్ భాషాయని చెప్పి తనకు
జరిగిన విషయమంతయూ చెప్పాడు. దానితో వారు చెప్పినదంతా వాస్తవమని
నాకు అర్థమయినది. అంతవరకు ఆ విషయము మీద దృష్టి సారించని
నేను కొంత ఆలోచన, కొంత లోచన చేయగా మరికొంత యోచనగా
తెలిసినది. ముస్లీమ్ నాకు చూపిన ఫోటో మాటిమాటికి గుర్తుకు వచ్చేది.
అందువలన నేను ఆ విషయమును లోచన యోచన వరకు తీసుకుపోయాను.
ఆ ఫోటోను 129వ పేజీలో మొదటనే చూడవచ్చును. 129వ పేజీ నుండి
144వ పేజీ వరకు మరికొన్ని ఫోటోలను కూడా మీరు చూడవచ్చును.
నేను చూచిన ఫోటో ఒక ముస్లీమ్, తగులుకొన్న గ్రంథము
హిందువులది. దేవునికి మతములేదు. మనుషులమయిన మనము
మతమును పెట్టుకొన్నాము. మనుషులందరూ దేవుని దృష్ఠిలో ఒక్కటే.
దేవుడు మనుషుల మతమును చూడలేదు. వారి విశ్వాసమును చూస్తున్నాడు.
ఒక ముస్లీమ్ దేవుని మీద విశ్వాసముతో దేవుని జ్ఞానముగల గ్రంథమును
తన కడుపుకు ఆనించుకోగా, అది బంకవేసి అతికించినట్లు అతుక్కొన్నది.
అది అందరికీ కనిపించు దృశ్యమే. అలా కనిపించు దృశ్యములలో మూడు
మతములవారి ఫోటోలు కలవు. ఇది ఒక గ్రంథము మనిషికి అతుక్కోవడము
వరకే అయితే దానిని మంత్రమో, తంత్రమోయని సరి చేయవచ్చును.
అలా అతుక్కోవడమే కాక ఆ కార్యము వెనుక ఆధ్యాత్మిక రహస్యము
ఇమిడియున్నది. ఏ మనిషికయితే గ్రంథము అంటుకొని అలాగే
నిలిచిపోయినదో ఆ దృశ్యము వెనుక అందరి బుద్ధికి అందని ఒక ఘన
కార్యము జరుగుచున్నది. గ్రంథము అతుక్కోవడము బయటి ప్రపంచములో
ఒక విచిత్రమే. చిన్న గ్రంథమయితే ఏదో అనుకోవచ్చును. అట్లు కాకుండా
800 పేజీల గ్రంథములు కనీసము ఒక కేజీ నుండి దాదాపు రెండు కేజీల
బరువుండు గ్రంథములు భూమి ఆకర్షణకు క్రిందపడకుండా,
భూమ్యాకర్షణకు వ్యతిరిక్తముగా నిలబడడము ఎవరికయినా ఆశ్చర్య
విషయముగా కనిపించును. దీనికి హేతువాదులను నాస్తికవాదులు
మోసము, దగాయనియో ప్రచారము కొరకు దేని చేతనో అతికించి చూపు
చున్నారని అనుకోవచ్చును. సరే వారి మాటప్రకారమే కనిపించే దృశ్యము
మోసము, దగా కావచ్చును. అయితే అక్కడ కనిపించక జరుగు కార్యమును
గురించి ఎవరూ ఏ వివరణ ఇవ్వలేరు. అక్కడ కనిపించక జరుగు
కార్యమును గురించి మేమే స్వయముగా ఆలోచించడము జరిగినది. మా
గ్రాహితశక్తి లోచన యోచనవరకు పోతేగానీ మాకే అర్థము కాలేదు.
అందువలన ఈ విషయమును ఎవ్వరూ ఆరోపించలేరు.
ఇప్పుడు అసలు విషయమునకు వస్తాము. ఈ విషయమును
నేను వినినా కొన్ని ఫోటోలు చూచినా తేలికగా తీసుకొని, దానిని గురించి
ఆలోచించలేదు. ఇప్పుడు పరమతస్థుడని చెప్పుకొను మహబూబ్ భాషా
గారు అనారోగ్యమును గురించి, తాను ఖర్చుపెట్టిన దానిని గురించి
వివరముగా చెప్పగా నాకు కొంత వరకు దానిమీద ధ్యాస కల్గినది. కొన్ని
సంవత్సరముల నుండి యున్న రోగము ఒక ఆధ్యాత్మిక గ్రంథము అంటుకొని
కొన్ని గంటల వరకు వదలకపోవడము తర్వాత అతని రోగము లేకుండా
పోవడమునుబట్టి దీనివెనుక కనిపించని విధానము ఏమి జరుగుచున్నదని
చూడవలసి వచ్చినది. ముఖ్యముగా గమనించవలసిన విషయము ఏమనగా!
ఇక్కడ మాచే వ్రాయబడిన గ్రంథములు, మేము విడుదల చేసిన గ్రంథములు
మాత్రము అలా చేయుచున్నవి. మేము వ్రాసిన గ్రంథము ఏ మతమునకు
సంబంధించినదిగానీ, బాధపడు వ్యక్తి ఏ మతస్థుడయినాగానీ అతని ఎడల
ఆ గ్రంథము స్పందించి అతని కర్మ నివారణకు, కర్మ క్షమాపణకు, కర్మ
దహనమునకు పని చేయుచున్నది. మీరు ఫోటోలో చూచిన మహబూబ్
భాషా గారు తన అనుభవమును చెప్పగా విన్నాను. అంతవరకు ఆ
విషయమును గురించి చూడని మేము లోతుగా చూడవలసివచ్చినది.
ఈ విషయము నేను తెలిసినా తెలియకపోయినా ఫరవాలేదు. అయితే
ఇతరులకు ఏమి జరుగుచున్నదని తెలియుట అవసరము. మూడు దైవ
గ్రంథములలో దేవుడు కర్మ ఎడల ఎలా క్షమించును? అను విషయము
జ్ఞానరీత్యా అందరికీ తెలియవలెనంటే ఇందులో అందరికీ తెలియకుండా
జరుగు ప్రక్రియ యొక్క రహస్యమును విడదీసి అర్థమగులాగున చెప్పవలెను.
ఇంతకు ముందు వ్రాసిన వ్రాతలో మనిషి దేవుని మీద, దేవుని
జ్ఞానము మీద విశ్వాసము కల్గి యుంటే శరీరము లోపల, శరీరము బయట
పాపక్షమాపణ జరుగునని చెప్పాము. శరీరము బయట దేవుని రాజ్యమయిన
ప్రకృతిలో పాలకులుగా యున్న భూతములు, గ్రహములు ప్రత్యేకశక్తులు
కల్గి, ప్రత్యేకమయిన ఆకారములు కల్గియుండి కర్మలను అనుభవింప
చేయడమేకాక దేవున్ని, దేవుని జ్ఞానమును నమ్మిన వారి పాపకర్మలను
క్షమించి అనుభవానికి రాకుండా దహించివేయు స్థోమత, అధికారము
కల్గియున్నారని చెప్పాము. అయితే ఆ విధానము జరిగినా నమ్మదగినదిగా
లేదని అది ప్రత్యక్షముగా స్థూలముగా జరిగితే బాగుండునని అందరూ
దైవశక్తిని అర్థము చేసుకొనుటకు అవకాశముండునని దేవున్ని కోరడము
జరిగినది. నేను కోర్కెలు కోరువాడను కాను. అయితే నేను కోరినది
నాకు సంబంధించిన కోర్కె కాదు. దేవునికి సంబంధించిన జ్ఞానము ఇతరులు
సులభముగా తెలియు విధానమును కోరాను. అందువలన ఇది ప్రజలందరి
కోర్కెయనీ, దేవున్ని విశ్వసించు వారందరి కోర్కెయని తలచాము. ఇది నా
ఒక్కనిది కాదని భక్తులందరి కోర్కెయని తలచిన దేవుడు నా కోర్కెను నా
వద్దనే, నా గ్రంథముల వద్దనే చూపించడము, నెరవేర్చడము జరిగినది.
ఇది ప్రపంచ విషయము కాదు, దేవుని విషయము. అందువలన నా
కోర్కె నా గ్రంథములని చెప్పాను.
ప్రకృతియంతటా ఆకాశమునుండి భూమివరకు వ్యాపించిన
భూతములు గ్రహములలో ముఖ్యులయిన కొందరు వచ్చి నా వద్ద
ఉంటారు. నా హస్తము ద్వారా వ్రాయబడిన జ్ఞానము గల గ్రంథము
పూర్తిగా తయారయిన తర్వాత, ఆ గ్రంథము మొదటి ప్రతి నావద్దకు
వచ్చినప్పుడు నేను ఒకమారు ఆ గ్రంథమును చూచిన తర్వాత, నా
వద్దయున్న పాలకులు మొదట నేను చూచిన ప్రతియందు ప్రవేశించుదురు.
తర్వాత మిగతా వారందరూ నా వద్ద తయారయిన ప్రతి గ్రంథములోనూ
ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రంథములో ప్రవేశింతురు. ఈ తతంగము 1980వ
సంవత్సరమునుండి జరుగుచున్నా ఈ విషయము నాకు వాస్తవముగా
తెలియదు. ఒక గ్రంథము వేయి ప్రతులు తయారయితే వేయిమంది
పాలకులు వచ్చి గ్రంథములలో ప్రవేశించడము జరుగుచున్న కార్యమే.
2008వ సంవత్సరము "దయ్యాల-భూతాల యదార్థ సంఘటనలు” అను
గ్రంథమును వ్రాసి ఐదువేల ప్రతులను తయారు చేయడము జరిగినది.
అప్పుడు ఐదువేల మంది పాలకులు ఒక్కమారుగా ఆ గ్రంథములలో
చేరిపోవడము జరిగినది. అప్పుడు ఆ గ్రంథము ఎవరి ఇంటిలో చేరినా
ఎవరు చదివినా చదివిన వారికి అంతవరకున్న దీర్ఘకాల రోగములు
సహితము నయము కావడము జరిగినది. ఆ ఇంటిలో ఆరోగ్య సమస్యలు
కొన్ని తీరిపోయేవి. అప్పుడే చాలామంది ఈ విషయమును చెప్పుచూ
వచ్చారు. కొన్ని ముఖ్యమైన కర్మ నివారణ జరిగిన విషయములను నేను
వినినా అప్పుడు ఆ విషయముల మీద శ్రద్ధ చూపలేదు. నేను గ్రంథ
రచనల మీద లగ్నమయి ఉండడమే దానికి కారణము కావచ్చును.
ఈ మధ్యకాలములో మహబూబ్ భాషా, బహుశా మూడు
సంవత్సరములప్పుడు నాతో కలిసి మాట్లాడినప్పుడు పొందిన సంతోషమును
వ్యక్తము చేయగా వెనుక కాలములో చాలామంది తమ రోగములు పోయిన
విధానమును చెప్పిన విషయములన్నియూ నాకు జ్ఞాపకము రాసాగాయి.
ఈ మధ్యకాలములో గ్రంథములు అతుక్కొన్నది వీడియోలోనూ, ఫోటోల
లోనూ చూడడము తప్ప ప్రత్యక్షముగా చూడలేదు. అయితే నా ముందరే
మెడ నొప్పితో బాధపడు మనిషి మెడ క్రింది భాగములో
“మంత్రము-మహిమ” అను గ్రంథమును పెట్టగా అది అతుక్కోవడము
జరిగినది. మీరు చూచిన 32 ఫోటోలలో ఆ ఫోటో కూడా ఒకటి కలదు.
వీపు పై భాగమున మెడ క్రింది భాగమున సిద్ధాంతకర్తలు బొమ్మ పైకి
కనిపించు గ్రంథము అతుక్కోగా, దానిని నేను క్రింది భాగములో పట్టుకొని
లాగాను. అది ఊడి రాలేదు. మొదట కొద్దిగా లాగినవాడిని, తర్వాత
కొంతగట్టిగా లాగాను. అయినా రాలేదు. గ్రంథము అంతగట్టిగా అంటు
కోవడమేమిటని బహుశా 50 కేజీల బరువును ఎత్తే బలమును ఉపయోగించి
అనగా నా చేతులకున్న బలమంతయూ ఉపయోగించి క్రిందికి లాగాను.
గోడకు ఉడుము కరచుకొన్నట్లు అది అంటుకొని యున్నది గానీ అంత
బలము ఉపయోగించి లాగినా అది ఊడి రాలేదు. మొదటిమారు
అంతగట్టిగా గ్రంథము శరీరమునకు అంటుకోగా చూచి నాకే ఆశ్చర్యము
అయినది. ముందే చెప్పాము 'గ్రంథములలో పాలకులు ప్రవేశించారని',
వారి బలము చేత అది క్రిందికి పెరికినా (లాగినా) రాలేదని తెలిసినది.
ఇంకొక రకముగా గ్రంథమును శరీరమునుండి పైకి తీస్తే సులభముగా
మన చేతిలోనికి వస్తున్నది. పెట్టేటప్పుడు ఎలా పెట్టామో అలాగే తీస్తే ఏ
శ్రమలేకుండా శరీరమునుండి వేరయి వస్తున్నది. క్రిందికి లాగితే మాత్రము
చేతి వ్రేళ్ళనుండి గ్రంథము జారిపోవుచ్నుది గానీ అది మాత్రము క్రిందికి
దారము మందము కూడా జరుగలేదు. గతములో కూడా అలా క్రిందికి
లాగిన వారు కలరు. అప్పుడు కూడా ఎంత బలము ఉపయోగించినా
కొద్దిగా కూడా ఉన్న స్థలమునుండి కదలలేదన్నారు. క్రిందికి లాగితే రాని
గ్రంథము బయటికి తీస్తే సులభముగా ఊడి వస్తున్నది.
మరొక విచిత్రము ఏమనగా! కొందరికి కడుపు మీద అతుక్కొన్న
గ్రంథము శరీరములోని నొప్పి పైకి జరిగిపోతుంటే గ్రంథము కూడా
జరిగిపోయిన సంఘటనలు గలవు. క్రిందినుండి పోయి గొంతుకు
ఆనుకొన్నట్లు కూడా కొందరు చెప్పారు. కొందరికి శరీరములో నొప్పి
ప్రక్కకు కదలిపోయే కొద్దీ, గ్రంథము కూడా దానంతట అదే జరిగిపోవడము
జరుగుచున్నదని చాలామంది చెప్పారు. మోకాళ్ళ నొప్పులు గలవారు
మోకాళ్ళకు గ్రంథమును ఆనించగా అది అట్లే అంటుకొన్న దృశ్యములను
గ్రంథములో గల ఫోటోలలో చూడవచ్చును. వీపులకు, చేతులకు,
కడుపులకు, మెడలకు, తలలకు, చెంపలకు అంటుకొన్న గ్రంథముల
దృశ్యములు కనిపించుచున్నవి. మరియొక విచిత్రము ఏమనగా! ముఖాన
పెట్టుకొను 'దేవుని ముద్ర' (దేవుని చిహ్నము) యొక్క అచ్చు కూడా
నొసలు భాగములో అంటుకొని అలాగే ఉండిపోయిన దృశ్యము కూడా
కలదు. దానిని అంటించుకొన్న వ్యక్తి ఒక క్రైస్థవ మతస్థుడు అని ఫోటోలోనే
అర్థమగుచున్నది. మీరు గ్రంథములో మూడు మతస్థులకు గ్రంథములు
అంటుకొనియున్న దృశ్యములను చూడవచ్చును. అలా కనిపించిన
దానివలన దేవున్ని మనుషులు ఎవరయినా విశ్వసించవచ్చుననీ, తనను,
తన జ్ఞానమును విశ్వసించిన వాడు ఏ మతమునకు చెందినవాడయినా
దేవుని పాలకులు వాని కర్మను లేకుండా చేయుదురని తెలియుచున్నది.
గ్రంథములోని ఫోటోలలో చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు,
హిందువులు మొదలుకొని క్రైస్తవులు, ముస్లీమ్లు కూడా కనిపించుచున్నారు.
దీనినిబట్టి వ్యక్తికి భక్తి భావముంటే చాలు లేక కొద్దిగా విశ్వాసమున్నా
చాలు, వారు చిన్న వయస్సు వారుగానీ, పెద్ద వయస్సు వారుగానీ అలాగే
ఏ కులము, ఏ మతమువారయినా వారి కర్మలను పాలకులు దహించి
వారి బాధలనుండి విముక్తి పొందించి దేవుడు క్షమాశీలుడు, కర్మదహనుడు
అని నిరూపించుచున్నారు. ముఖ్యముగా గమనించవలసిన విషయమే
మనగా! మా చేతినుండి వెలువడిన, మా జ్ఞానముతో నిండుకొన్న
గ్రంథములన్నీ అలాగే యున్నవని చెప్పుచున్నాము. మా నుండి వ్రాయబడిన,
మా నుండి వెలువడిన, నేను ముట్టుకొని ఒకమారు చూచిన గ్రంథములోనికి
దైవ పాలకులు వచ్చి చేరిపోవుచున్నారని చెప్పుచున్నాను.
మీరు గ్రంథములో 129వ పేజీ నుండి 144వ పేజీ వరకు ఉన్న
ఫోటోలలో చిన్నపిల్లలు, మధ్యవయస్సు వారు, వృద్ధులు మూడు రకముల
వయస్సున్న వారిని చూడవచ్చును. అలాగే హిందూ, ఇస్లామ్, క్రైస్థవులను
చూడవచ్చును. అట్లే మూడు మతముల వారికి సంబంధించిన గ్రంథములను
చూడవచ్చును. నేను మూడు మతముల జ్ఞానమును ఏకముగా
చెప్పుచున్నాను. అందువలన కొందరు నన్ను "త్రిమత ఏకైక గురువు"
అని అంటున్నారు. కొందరు మతఛాందసవాదులకు మా విధానము
అనగా మూడు దైవ గ్రంథముల జ్ఞానమును చెప్పడము సరిపోక పోవచ్చును.
అయినా నేను చేయునది మంచి పనేయని నేను అనుకొంటున్నాను. నేను
అనుకోవడము కాదు మీరు నా గ్రంథాలను చదవండి, అప్పుడు నా
గ్రంథములలో ఉండే రుచి ఏమిటో తెలుస్తుంది. గ్రంథముల ఎడల
ప్రత్యక్షముగా దేవుని గొప్పతనము కనిపించుచున్నా, మతము వెంటబడి
నన్ను దూషించు వారికి పాపక్షమాపణ యుండదు. నేను ఏమి
దూషించకున్నా పాలకులు శిక్షించుదురని నా అనుభవముతో
చెప్పుచున్నాను. చాలామంది శిక్షకు గురియైన వారిని చూచాను కావున
చెప్పాను.
ఇప్పటికి ఈ గ్రంథముతో నేను వ్రాసినవి ఎలభై నాలుగు (84)
గ్రంథములు. తర్వాత మా వద్ద ప్రచురణ జరిగిన, మా భక్తులు మా
జ్ఞానమును అనుసరించి వ్రాసిన గ్రంథములు కూడా కొన్ని గలవు. ఆ
గ్రంథములలో కొన్నిటిని నేను చూడడము, వాటిని నా చేతి ద్వారా విడుదల
చేయడము జరిగినది. అలా నా వద్దనుండి వచ్చిన గ్రంథములకు కూడా
దైవశక్తి ప్రాకినది. పాలకులు అందులో చేరారని చెప్పుచున్నాను.
అటువంటివి ఐదారు గ్రంథములు గలవు. నా గ్రంథములు ఇప్పటికి 84
కాగా, రాబోవు కాలములో వంద గ్రంథములు పైన రావలెనని దేవుని
సంకల్పము గలదు. రాబోవు గ్రంథములలో ఇప్పటినుండి ప్రత్యేకమైన
పాలకులు రాగలరని అనుకొంటున్నాను. మేము చెప్పు విషయములను
చూచి కొందరు అసూయ పడి హేళనగా మాట్లాడవచ్చు. నేను చెప్పునదంతా
ప్రత్యేకముగా ఉండుట వలన కొందరు భక్తితో వినవచ్చును, కొందరు
అసూయతో మాట్లాడుట సహజమే. అర్థము కాకపోతే ఇంకొకమారు
చదివి తెలుసుకోవచ్చును లేకపోతే ఊరక ఉండడము ఉత్తమమైన
పనియగును. మేమెందుకు ఊరక ఉంటామని నన్ను దూషించితే ఆ
సమయములో, ఆ ప్రాంతములో కనిపించని గ్రహములుగానీ,
భూతములుగానీ అక్కడ ఉండి వారు వింటే దూషణ చేసిన వారిని ఊరక
వదలరు. ఇప్పటికి చాలామంది రోగముల పాలైనవారు గలరు. అట్లే
కారణము లేకుండా చనిపోయిన వారు గలరు. తర్వాత డాక్టర్లు హార్టు ఫెయిల్
అనడము సహజము. ఏ కారణము లేకపోతే చెప్పేది అదే. అంత
పనియెందుకు విని, ఊరక అయినా ఉండు లేక తెలుసుకొనే దానికయినా
ప్రయత్నించు. ఏదీకాక నిష్కారణముగా మాట్లాడుట వలన కారణము
లేని అవస్థలు, కారణములేని మరణములు జరిగిన వాటిని మేము
చూచాము. మేము వ్రాసిన "దయ్యాల - భూతాల యదార్థ
సంఘటనలు" అను గ్రంథములోనూ, "శ్రీకృష్ణుడు దేవుడా!
భగవంతుడా!!" అను గ్రంథములోనూ ఇటువంటి విషయములు
వ్రాయబడి యున్నవి. అందువలన మీ మేలు కొరకు మేము చెప్పునది
ఏమనగా! మేము ఇంతవరకు చెప్పిన విషయములు నమ్మశక్యము కానివిగా
ఉన్నవని నేనే స్వయముగా చెప్పుచున్నాను కదా! నా మాటనుబట్టి
తెలుసుకొనే దానికి ప్రయత్నించండి. లేకపోతే ఏమీ అంటనట్లు ఊరక
ఉండిపోండి.
ప్రశ్న :- మీరు “మేము వ్రాయబోవు గ్రంథములలో ప్రత్యేకమైన పాలకులు
వస్తారు” అని చెప్పియున్నారు. మీ గ్రంథాలలో పాలకులు ఉన్నారని
చెప్పడమే పెద్ద ప్రత్యేకత. ప్రపంచములో ఎక్కడాలేని విధానమును
ఇంతవరకు చెప్పారు. ఇప్పుడేమో రాబోవు గ్రంథములలో ప్రత్యేకమైన
పాలకులు వస్తారని చెప్పడము మాకు అర్థముకాని విషయమై పోయినది.
ఈ విషయమై మాకు అర్థమగునట్లు వివరముగా చెప్పవలెనని కోరు
చున్నాము?
జవాబు :- మేము దేవుని కర్మల నిర్మూలన మరియు పాలన పద్ధతిని
స్థూలముగా తెలియజేయాలని కోరినది ధర్మసమ్మతమైన విషయము.
అందువలన శరీరము బయట దేవుని పాలకులు కర్మను ఎలా పాలించు
చున్నది సూక్ష్మముగా అర్థమయినా, ఎలా నిర్మూలించుచున్నది స్థూలముగా
తెలియునట్లు చేశాడు. అది కూడా ఎక్కడో కాకుండా మా గ్రంథముల
ద్వారానే జరుగుచున్నదని చెప్పాము. గ్రంథములు శరీరమునకు
అంటుకోవడము స్థూలముగా కనిపించినా అది ఎలా జరుగుచున్నదో మాకు
కొంతవరకు అర్థమయినది. దానిని వివరముగా చెప్పితే ఇలా కలదు.
దేవుని పాలకులు రెండు రకములుగా యున్నారు. వారినే ఒకటి
భూతములు, రెండు గ్రహములు అని చెప్పవచ్చును. భూతములు,
గ్రహములు రెండు పాలకులే అయినా గ్రహములకంటే భూతములు కొంత
ప్రత్యేకత కల్గియున్నవి. గ్రహములకున్న శక్తికంటే భూతముల శక్తి మరీ
ఎక్కువగా ఉండును. గ్రహములనగా సూర్యుడు, చంద్రుడు, కుజుడు,
బుధుడు, గురువు, శుక్రుడు, శని మొదలగు గ్రహముల వారసత్వము
కల్గియున్నవి. గ్రహములకు ఏడు గ్రహములు వారసత్వ గ్రహములు. అలాగే
భూతములనగా ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు మహా
భూతములు వారసత్వము కల్గియున్నవి. ప్రకృతిలోని భాగములయిన ఐదు
శక్తులకు సంతతివలె వారసత్వము కల్గినవి. భూతములు, ఉపభూతములు
గలవు. ఐదు మహా భూతముల సంబంధ భూతముల జాతి కొన్ని వందల
కోట్లు గలవు. అట్లే ఏడు గ్రహముల సంబంధ గ్రహముల జాతి భూతముల
కంటే రెట్టింపుగా కొన్ని వందల కోట్లు గలవు. అంతేకాక వేయికి రెండు
వందల ప్రకారము గ్రహముల పాలకులలో కొన్ని కోట్లమంది ఎవరికీ
తెలియని, ఆకారములు లేని ఉపగ్రహములు కూడా కలవు. ఇదంతా
దేవుని పాలకుల వివరము కాగా, ఎల్లవేళలా మనుషుల శరీరములోనూ,
శరీరము బయట పాలన సాగుచునేయున్నది. శరీరము లోపల ఆత్మే
ఒకవైపు దేవుడైయుండి, మరొకవైపు కార్యకర్తయై యున్నది.
శరీరము బయట దేవుడు పరమాత్మయైనా తాను ఊరక ఉండి
పోయి తన ప్రకృతికి అప్పజెప్పి తాను ఏమీ చేయక ఊరక కూర్చున్నాడు.
ప్రకృతి ఐదు భాగములుగా ఉంటూ తన వారసత్వ పాలకులను నియమించు
కోగా, ఏడు గ్రహముల వారసత్వ గ్రహములను కూడా నియమించి పాలన
సాగించడము చేయుచున్నది. ప్రకృతి పరమాత్మ చేయవలసిన కార్యములు
చేయుచూ పరమాత్మకు పని లేకుండా చేసినది. ప్రకృతికి సంబంధించినవి
భూతముల జాతి పాలకులు, భూతములనుండి తయారయినవి గ్రహములు.
దీనినిబట్టి గ్రహములకంటే భూతములు కొంత ప్రత్యేకత కల్గియున్నాయని
చెప్పాము. గ్రహములు ప్రకృతి యొక్క ఆజ్ఞతోనే పనిచేయుచుండును.
వారికి అనగా గ్రహములకు 'బాధించు అధికారము' మాత్రమే కలదు గానీ
మనుషులను 'చంపు అధికారము' లేదు. ఒకమారు మనిషిని పట్టుకొంటే
ఐదు నెలల వరకు బాధించు అధికారమున్నదని, తేలు విషమువలె బాధ
వరకు బాధించు అధికారము కలదని బైబిలు ప్రకటన గ్రంథములో కూడా
చెప్పినట్లు కలదు. మనిషిని బాధించు ఏ బాధనయినా ప్రకృతి అనుమతి
లేనిదే గ్రహములు మనిషిని బాధించవు. ఇంతవరకు దాదాపు 80
గ్రంథముల వరకు మా గ్రంథములలో పాలకులయిన గ్రహములు మాత్రమే
గలరు. 80 గ్రంథముల నుండి ఇప్పుడు రాబోయే గ్రంథములలో కూడా
గ్రహములు కాకుండా ప్రత్యేకించి భూతములు ప్రవేశించునని చెప్పు
చున్నాము. భూతములు స్వయముగా ప్రకృతి వారసత్వమే అయినందున
పంచభూతములకున్న అధికారములు కొన్ని యుండును. అందువలన
ప్రకృతి ఆజ్ఞ కోసము ఎదురుచూడక అవసరమొచ్చినప్పుడు 'స్వయం
నిర్ణయము’ తీసుకొను అధికారము గలవిగా ఉండును. మనుషుల కర్మను
బట్టి గ్రహములవలె కాక, మనుషులను చంపు అధికారము కూడా
భూతములు కలవిగా ఉండును. మనుషులను బాధించుట తప్ప, చంపు
అధికారము గ్రహములకు లేదు. భూతములు అట్లు కాకుండా అవసరమును
బట్టి నిర్ణయము తీసుకోవడము, అవసరమును బట్టి చంపడము చేయు
అధికారము కలవిగా యున్నవి. ఇంతకుముందు మాకు వ్యతిరేఖముగా
మాట్లాడిన వారిని రెండవ రోజే భూతములు చంపిన విషయము కొందరికి
తెలుసు. ఆ రోజు దూషించిన వాని మరణమునకు కారణము భూతములే
యని చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ గ్రంథములోనికి కూడా
భూతములే ప్రవేశించబోతున్నాయి.
భూతములు, గ్రహములు దేవుని పాలనను సమన్వయముగా
నిర్వర్తించుచున్నవి. భూతములకు, గ్రహములకు ప్రకృతి వెనుకయున్న
దేవుడు తెలియడు. అయినా ప్రకృతి ఎంతగా దేవుని మీద భక్తి కల్గియున్నదో
అంతగానే భూతములు, గ్రహములు భక్తికల్గి దేవుని జ్ఞానముయందు
శ్రద్ధకల్గి జ్ఞానమును సంపూర్ణముగా కల్గియున్నవి. ఇప్పటికి 38 సంవత్సరము
లప్పుడు 'దేవుని చిహ్నము'ను గుర్తించి దాని ఆకారమును తయారు చేసి
చూపించిన తర్వాత మనుషులకంటే ముందు తమ నుదిటి భాగమున
‘దేవుని చిహ్నము'ను లేక 'దేవుని ముద్ర'ను ధరించిన వారు భూతములు
మరియు గ్రహములు. అప్పటి నుండి నిత్యము దేవుని చిహ్నము యొక్క
అర్థము, దేవుని ముద్ర యొక్క అర్థము రెండు విధముల అర్థములు తెలిసి
ధరించుచున్నారు. భూమిమీద మనుషులకంటే గొప్ప జ్ఞానులుగా యున్నారు.
భూమిమీద మనుషులుగా యున్న స్వామీజీలు, పండితులు, మతపెద్దలు
అనువారిలో ఎంతవరకు నిజమైన జ్ఞానమున్నదో గ్రహించి వారి జ్ఞాన
స్థోమత ఎంతో ఖచ్చితముగా కొలత వేయువారు పాలకులు. బయట
మనుషులలో ఎంతో పెద్ద జ్ఞానియని పేరున్నా, అతని వద్ద సరియైన జ్ఞానము
లేకపోతే వానిని ఏమాత్రము గౌరవించరు. వానిని గొప్పగా చూడరు.
వాని కర్మప్రకారము అనుభవింపజేతురు.
ప్రశ్న :- “పాలకులయిన భూతములు ఒక్కొక్కప్పుడు ప్రకృతి ఆజ్ఞ ఇవ్వక
ముందే స్వయం నిర్ణయం తీసుకొందురు” అని చెప్పారు. అటువంటి
నిర్ణయములు ఎక్కడయినా తీసుకొన్నట్లు మీకు ఎలా తెలుసు? ఎక్కడ
అలాంటి నిర్ణయాలు తీసుకొన్నారో కొంత వివరముగా చెప్పండి?
జవాబు :- నాకు ఎలా తెలుసునో నీకు చెప్పినా ప్రయోజనము లేదు.
ఒకవేళ చెప్పినా నీకు అర్థము కాదు. మీకు అర్థము కావాలంటే ముందు
భూతములంటే ఏమిటి? గ్రహములు అంటే ఏమిటి? అని ముందు తెలిసి
యుండవలెను. భూతములు అంటే దయ్యాలు కదా! యని కొందరు నన్ను
అడుగుచున్నారు. వారికి అలాగే అర్థమవుతుంది. అటువంటి వారికి
“అయ్యా! భూతములు అంటే అది ప్రత్యేకమైన జాతి అనుకో. దయ్యాలకు,
భూతాలకు ఏమాత్రము సంబంధము లేదు” అని నేను చెప్పితే నా మాట
పూర్తి అయిపోకముందే “మీరు “దయ్యాలు, భూతాలు" అను గ్రంథమును
వ్రాశారు కదా! అప్పుడు రెండూ ఒక్కటేయని అర్థము కదా!”యని
అంటున్నారు. నేను అక్కడ వ్రాసినది దయ్యాలు వేరు, భూతాలు వేరని
తెల్పుటకే అలా వేరువేరుగా ‘దయ్యాలు, భూతాలు' అని వ్రాసినట్లు చెప్పితే
“దయ్యాలన్నా, భూతాలన్నా ఒక్కటేయని మా పెద్దలు చెప్పారు” అని
అంటున్నారు. ఈ విషయము వారికిగానీ, వారి పెద్దలకుగానీ తెలియదను
విషయము వారికే తెలియదు.
గ్రహములకు మనుషులను బాధించు అధికారము ఇవ్వబడినది
తప్ప, చంపు అధికారము లేదు. అయితే బయట ప్రపంచములో కొన్ని
రోడ్డు ప్రమాదములలో కొంతమంది చనిపోవడము జరుగుచున్నది. అప్పుడు
వారిని ఎవరు చంపారు? అని ఆలోచిస్తే గ్రహములు మాత్రము కావుయని
చెప్పవచ్చును. అప్పుడు అక్కడ చంపినది భూతములేయని స్పష్టముగా
తెలియుచున్నది. భూతములకు ఆజ్ఞ ఇవ్వకున్నా అవి అలా చేయుచున్నవని
చెప్పాము. ఎందుకు అలా చేయుచున్నవనగా! భూతములు ప్రకృతి సంబంధ
మైనవే యగును. ప్రకృతిలో ఉండు నిర్ణయమును ప్రకృతి తమకు చెప్పకనే
గ్రహించుకొను స్థోమత కల్గియున్నవి. ప్రకృతియే భూతములుగా
విభజింపబడి భూతముల రూపములో యుండుట వలన ప్రకృతి నుండి
ప్రత్యేకించి ఆజ్ఞ అవసరము లేకుండానే చెప్పబోవు నిర్ణయమునకు సరిగా
సరిపోవు నిర్ణయమునే భూతములు తీసుకోవడము జరుగుచున్నది. అన్ని
వేళలా అట్లే జరుగలేదు. కొన్ని సందర్భములలో మాత్రము అట్లు
చేయుచున్నారు. కేవలము అజ్ఞానుల ఎడల మాత్రము భూతములు అలా
ప్రవర్తించుచున్నవి. జ్ఞానుల ఎడల అట్లే అజ్ఞానుల ఎడల భూతముల
ప్రవర్తన వేరువేరుగా యుండును. జ్ఞానుల విషయములో భూతములు
స్వయం నిర్ణయమును తీసుకోవు. జ్ఞానుల విషయములో ప్రకృతి ఎలా
నిర్ణయిస్తే అలా చేయును. అజ్ఞానుల విషయములో భూతములు ప్రకృతి
నిర్ణయము వరకు కాచుకొని ఉంటాయను నమ్మకము లేదు. అక్కడ
మాత్రము భూతాల స్వయం నిర్ణయములు జరుగుచున్నవి.
భూమిమీద దేవుని జ్ఞానమును తెలిసి మూడు గ్రంథముల
ప్రకారము దైవ ఆచరణ కల్గియున్న వానిని జ్ఞానిగా భూతములు,
గ్రహములు లెక్కించి వానిని గౌరవించుచున్నవి. వాని ఎడల గౌరవ భావము
కల్గియున్నవి. దైవజ్ఞానము లేనివారి ఎడల దేవుని పాలకులు విముఖత
కల్గి గౌరవభావము లేనివారై యుందురు. అజ్ఞానులయిన వారు అంతటితో
ఆగక దేవున్ని శరీరమందు గానీ, శరీరము బయటగానీ ఏమాత్రము
తెలియకపోగా, తెలియుటకు ప్రయత్నము చేయక, చిల్లర దేవుళ్ళను అనగా
దేవుడు సృష్టించిన అనేకమంది దేవతలను ఆశ్రయించి మ్రొక్కువారిని చూస్తే
గ్రహములకు, భూతములకు విపరీతమైన కోపమని చెప్పవచ్చును. ఇతర
దేవుళ్ళ దర్శనార్థము పోవువారిని మాత్రము ఎదుర్కొని రోడ్డు ప్రమాదములను
గ్రహములు, భూతములు కలుగచేయుచున్నవి. దేవతలకు పోవు
ప్రయాణములు పాలకులకు సరిపోదు. తమను పుట్టించిన దేవున్ని వదలి
దేవతలను ఆరాధించడము, దర్శించడము కొరకు చేయు ప్రయాణములే
ఎక్కువగా ప్రమాదమునకు గురియగుచున్నవి. ప్రమాదము చేసినవారు
భూతములయితే మనుష్యులను చంపడము, కేవలము గ్రహములే అయితే
చంపకుండా దెబ్బలు తగలడము వరకు చేయును. ప్రయాణములు ఎన్ని
జరుగుచున్నా ఎక్కువ శాతము దేవతల దర్శనమునకు పోవువారివే
జరిగియుండును.
దేవతల ప్రయాణమే కాకుండా తర్వాత ఎక్కువ రోడ్డు
ప్రమాదములు జరుగునది పెళ్లిల్ల విషయములోనే పెళ్లి కార్యము
అంతయూ దైవ సంబంధమైనదై యున్నది. ఆ విషయము మేము "ఇందూ
సాంప్రదాయములు" అను గ్రంథములో వ్రాసియున్నాము. పెళ్లిలో ప్రతి
కార్యము దేవుని జ్ఞానమునకు సంబంధించినదిగా యుండగా, నేడు ఎవరూ
ఆ విధముగా జ్ఞానపద్ధతిగా, జ్ఞానము తెలిసి పెళ్లిల్లు చేయడము లేదు.
అందువలన పెళ్లి కార్యములకు ముందుగానీ, పెళ్లిలోగానీ, పెళ్లి తర్వాత
గానీ, ప్రయాణము చేయునప్పుడుగానీ లేక మిగతా సమయములలోగానీ
దేవుని పాలకులు ప్రమాదములను కలుగజేయవలెనని చూచుచుందురు.
ఎప్పుడు అవకాశమొస్తే అప్పుడు ప్రమాదములను కలుగజేయుదురు. ఎక్కువ
పెళ్లికి సంబంధించిన, పెళ్లి వ్యవహారములో రోడ్డు ప్రమాదములు ఎక్కువ
జరిగినట్లు తెలియుచున్నది. ఇదంతా చూస్తే “మనుషులకు జ్ఞానము
లేకుండా పోవడమే మొదటి కారణము” అని తెలియుచున్నది. పెళ్లి
కార్యములోగానీ, పెళ్లి ప్రయాణములోగానీ ఎవరయినా జ్ఞాని అయిన
వాడుయుంటే అది పాలకులకు జ్ఞానము తెలియును కనుక జ్ఞానిని
గౌరవించి, అక్కడ ప్రమాదములు చేయకుండా ఉందురు. నుదిటి భాగమున
దేవుని గుర్తును ధరించి యున్నవారున్నా అక్కడ ప్రమాదము తప్పిపోవును.
దేవుని జ్ఞానమంటే పాలకులకు ఎంతో అభిమానము, గౌరవము. అట్లే
అజ్ఞానము అంటే పాలకులకు ఏవగింపు అలాంటి వారిని చూస్తే శత్రువులను
చూచినట్లే ఉండును.
దేవుని గుర్తు ధరించని వారినే బాధించమని, దేవుని ముద్రను
ధరించని చెట్లనుగానీ, గడ్డిని గానీ బాధించవద్దని ప్రకృతినుండి అనగా
ప్రకృతి వెనుకయున్న దేవుని నుండి ఆజ్ఞ ఉన్నదని బైబిలు ప్రకటన
గ్రంథములో 9వ అధ్యాయమున 4వ వచనమున చెప్పియున్నమాటను
వినియున్నారు కదా! ఈ మాటను బట్టి దేవుని ముద్రను ధరించని వారిని
చూస్తే ప్రకృతికే సరిపోదని ఒక విధముగా అర్థమవుచున్నది. అట్లు కాకపోతే
దేవుని ముద్ర ధరించడము వలన వాని పాపము క్షమించబడుచున్నదని
అందువలన వారిని బాధించవద్దని చెప్పినట్లు గలదు. దీనినంతటినీ
గమనించితే దేవునికి (ప్రకృతికి) దేవుని పాలకులకు దేవుని ముద్ర అంటే
ఇష్టమని తెలియవలెను. ఇది దయ్యములకు లేక సూక్ష్మ శరీరములకు
అగ్నిగుండములాగా వేడిని వెదజల్లుచుండును. అందువలన చనిపోయిన
తర్వాత అనగా అకాల మృత్యువు పొందిన వారు దేవుని ముద్రను ధరించిన
వారిని చూచి భయపడి దూరముగా ఉందురు. దయ్యములుగా యున్నవారు
అజ్ఞానులుగా యుంటే దేవుని ముద్ర వేడి తగులుచుండును. దయ్యములుగా
యున్నవారు కొంతయినా దేవుని జ్ఞానము తెలిసియుంటే వారికి దేవుని
చిహ్నము వలన ఎటువంటి బాధ యుండదు.
దేవుని ముద్రను ధరించిన వారిని చూస్తే భయపడడము వలన,
దయ్యములు దేవుని ముద్ర ధరించిన వారిలోనికి చేరలేరు. ముందే వారి
శరీరములో దయ్యములున్నా, వారు దేవుని ముద్రను ధరించడము వలన
వారి శరీరములోని దయ్యమునకు ఇబ్బందిగా ఉండును. అందువలన
క్రొత్తగా ఆరునెలలు లేక సంవత్సరమునుండి ఉన్న దయ్యములయితే
శరీరమును వదలి పారిపోవును. సంవత్సరముకంటే ఎక్కువ కాలము
నుండి దయ్యములున్న వారికి వారి శరీరములనుండి దయ్యము బయటికి
పోలేక ఇబ్బంది పడుచుండును. సంవత్సరముకంటే ఎక్కువ కాలమునుండి
యున్న వారి పరిస్థితి శరీరములో అలాగయుండును. శరీరములో చిక్కుకొని
పోయి ఉండుట వలన వారు పోవాలని అనుకొన్నా పోలేని పరిస్థితిలో
ఉందురు.
దేవుని ముద్ర అనినా, దేవుని చిహ్నము అనినా రెండు ఒకటిగానే
చూడవలెను. మనిషి శరీరములో గల దేవుడు, శరీరము బయటి దేవుడు
అని రెండు విధముల జ్ఞానము తెలియవలసియున్నది. అయితే ఎవరికయినా
శరీరములోగల దేవుడే ఆరాధ్య దేవుడనీ, అతనొక్కడే ఆరాధ్య దైవమని
మూడు దైవగ్రంథములలో చెప్పబడినది. దేవుని జ్ఞానము సంపూర్ణముగా
తెలియగలిగితే, సృష్ఠి పూర్వమున్న దేవుడయిన పరమాత్మ, సృష్ఠి తర్వాత
దేవుడయిన ఆత్మయని రెండు విధములు గలడు. స్వయానా పరమాత్మయిన
దేవుడు ఆత్మయిన దేవున్నే ఆరాధించమని తెలిపియున్నాడు. అంతేకాక
మూడు దైవగ్రంథములలో శరీరములో గల ఆత్మయిన దేవున్నే ఆరాధ్య
దైవమని చెప్పియున్నట్లు గలదు. ఈ విధముగా యుండుట వలన సృష్ఠి
ఆది దేవుడనీ, సృష్ఠి తర్వాత దేవుడని ఒకే దేవున్నే చెప్పుకొంటున్నాము.
ఒకే దేవున్నే అలా చెప్పవలసి వచ్చినది. అందువలన ఒకే గుర్తునే రెండు
పేర్లతో చెప్పినా అవి రెండు ఒక్కటేయని తెలియవలెను. జ్ఞాన వివరము
కొరకు శరీరములోయుండే దేవుని నిమిత్తము ‘దేవుని చిహ్నము' అనియూ,
శరీరము బయట ఉండే దేవుని నిమిత్తము 'దేవుని ముద్ర'యని చెప్పు
చున్నాము. అయితే హిందువులు ముఖ్యముగా ముందు దేవుని చిహ్నమును,
తర్వాత దేవుని ముద్ర రెండూ తెలియవలసియున్నది. క్రైస్తవుల విషయానికి
వస్తే వారు దేవుని ముద్రను ఎక్కువగా తెలియవలసియున్నది. ఇక ముస్లీమ్ల
విషయానికి వస్తే వారు దేవుని చిహ్నమును తెలియవలసియున్నది.
ముస్లీమ్లు తమ గ్రంథమని చెప్పుకొను ఖుర్ఆన్ గ్రంథములో
ఐదవ సూరా, రెండవ ఆయత్ (5-2) లో మరియు (22-32) లో “దేవుని
చిహ్నము” అను పేరుతో వాక్యములు గలవు. అందువలన ముస్లీమ్లు
ముందు దేవుని చిహ్నమును గురించి తెలియవలెను. దేవుని చిహ్నమును
గురించి అర్థము చేసుకొన్న తర్వాత అదే చిత్రపటమును దేవుని ముద్రగా
కూడా తెలుసుకోవలసియున్నది. క్రైస్తవుల విషయానికి వస్తే క్రైస్థవులు
తమ గ్రంథమని చెప్పుకొంటున్న బైబిలు గ్రంథములో 'ప్రకటన గ్రంథము’
అను పాఠములో 'దేవుని ముద్ర'యని చెప్పబడి యుండుట వలన క్రైస్థవులు
దేవుని ముద్రను గురించి ముందు తెలిసి తర్వాత దేవుని చిహ్నమును
గురించి తెలియవలెను. హిందువుల భగవద్గీతలో దేవుని చిహ్నము అనిగానీ,
దేవుని ముద్రయనిగానీ ఎక్కడా పేరు పెట్టి వ్రాయబడలేదు. అయితే ఇక్కడే
రెండు విధానములను గురించి మాకు తెలియబడినది. మూడు మతముల
వారికి, మూడు గ్రంథములలో సమానమైన జ్ఞానము చెప్పబడియున్నది.
అంతేకాక ఏ గ్రంథము ప్రత్యేకించి ఏ మతముది కాదు. ఏ గ్రంథమయినా
అన్ని మతముల వారికి అని చెప్పబడియున్నది గానీ ఫలానా మతము
వారికి అని చెప్పియుండలేదు. అందువలన మూడు మతముల వారు
ఒకే దేవుని జ్ఞానమును తెలియుచున్నారు. ఒకే దేవుని జ్ఞానమునే దైవ
గ్రంథములలో చెప్పినట్లు రెండు రకముల గుర్తుగా చెప్పియున్న దేవుని
ముద్ర, దేవుని చిహ్నము యొక్క జ్ఞానము తెలిస్తే సంపూర్ణ జ్ఞానులయినట్లే.
ఆకాశములోనూ, భూమిమీదను వ్యాపించిన దేవుని పాలకులయిన
భూతములు, గ్రహములు ఇద్దరూ రెండు గుర్తులను తెలిసినవారై వారు
దేవుని గుర్తును ధరించుచున్నారు.
మొట్టమొదట భూమిమీద రెండు వేల సంవత్సరములప్పుడు
‘మతము' అను పేరుపెట్టుకొని పుట్టినది క్రైస్థవము. అంతవరకు సృష్ట్యాది
నుండి యున్న హిందూ సమాజము, క్రైస్థవ మతము పుట్టిన తర్వాత
హిందూమతముగా మారిపోయినది. క్రైస్థవ సమాజమును తమను క్రైస్థవ
మతముగా చెప్పుకొన్న తర్వాత మిగతా మతములకు అంకురార్పన
జరిగినది. నేడు భూమిమీద మొత్తము పన్నెండు మతములుండగా అందులో
పెద్దవి, ముఖ్యమైన జ్ఞానము గలవి మూడు మాత్రమే. అవే ఇందూ,
ఇస్లామ్, క్రైస్థవము అను మూడు మతములుగా యున్నవి. మూడు మతముల
వారు దేవుడు చెప్పిన జ్ఞానమును మతముల గ్రంథములుగా చీల్చుకొన్నారు.
ఎవరు ఎట్లు చెప్పుకొనినా, మూడు గ్రంథములలోనూ ఒకే దేవుడు, ఒకే
జ్ఞానము కలదు. మూడు గ్రంథములలోనూ మూడు ఆత్మలను చెప్పినదే
ముఖ్యమైన జ్ఞానముగా యున్నది. మూడు గ్రంథములలో గ్రంథమునకు
ఆధారమైన ముఖ్య జ్ఞానముగా మూడు ఆత్మల జ్ఞానమే కలదు. మూడు
గ్రంథములలోనూ గ్రంథముల మధ్యభాగమున మూడు ఆత్మలను గురించి
చెప్పారు. బాగా ఆలోచిస్తే మూడు గ్రంథములలో ఏ గ్రంథమునకయినా
ముఖ్య సూత్రము, ఆధారిత జ్ఞానము మూడు ఆత్మలను గురించి చెప్పిన
జ్ఞానమే. మూడు ఆత్మలకు సంబంధించిన అనుబంధ జ్ఞానమే మిగతా
గ్రంథమంతా యుండుట గమనించవచ్చును. ఈ మూడు ఆత్మలను
ఆధారము చేసుకొని దేవుని చిహ్నమును, అట్లే దేవుని ముద్రను చెప్పారని
తెలియుచున్నది. మూడు గ్రంథములలోనూ సృష్ఠి పూర్వము దేవుడు, సృష్ఠి
తర్వాత దేవుడు రెండు రకముల విభజింపబడి కనిపిస్తున్నాడు. ఆ రెండు
రకముల దేవుళ్ళను గురించి వ్రాసి చూపినవే “దేవుని చిహ్నము”,
“దేవుని ముద్ర” అని తెలియవలెను.
మనుషులకు దేవుడు ప్రసాదించిన మూడు దైవగ్రంథములలోనూ
మనిషి తిరిగి దేవున్ని చేరుకొను విధానమున్నా దానిని మనిషి గ్రహించ
లేకపోయాడు. అయితే మూడు మతముల వారు ఎవరికి వారు దేవున్ని
గురించి చెప్పుచున్నారు. మేము దేవుని మార్గములో అందరికంటే ముందు
ఉన్నామని చెప్పుకొంటున్నారు. వాస్తవముగా మూడు మతములవారు
దేవుని వైపే ప్రయాణము చేయుచున్నా, వారు ముందు వెనుక యున్నారని
చెప్పవచ్చును. హిందువులకంటే క్రైస్తవులు మేము దేవుని మార్గములో
ముందున్నామని చెప్పుకొంటున్నారు. అట్లే ముస్లీమ్లు హిందూ క్రైస్తవుల
కంటే మా జ్ఞానమే గొప్పది, వారికంటే మేమే నిజమైన జ్ఞానము కలవారము,
వారి దేవుళ్ళకంటే మా అల్లాహ్ గొప్ప అంటున్నారు. ఎవరికి వారు
గొప్పయని చెప్పుకోవడము సహజమే అయినా నిజముగా మూడు మతముల
వారిలో ఎవరు ముందున్నారని మనము చూచినట్లయితే ఇలా తెలియు
చున్నది. దేవుని జ్ఞానమునకు ఆధారము, ఇరుసు అన్నీ మూడు ఆత్మలే.
దేవుడు మూడు ఆత్మల రూపముగానే యున్నాడు, కావున జ్ఞానమంతయూ
మూడు ఆత్మలను ఆధారము చేసుకొనియే ఉండును. మూడు ఆత్మలను
ఆధారము చేసుకొనియున్న జ్ఞానమే మూడు దైవగ్రంథములయందు గలదు.
నేడు మూడు మతముల వారు వారివారి మత ఆచారముల మీద
చూపిన శ్రద్ధను దేవుడు గ్రంథములో చెప్పిన జ్ఞానము మీద చూపలేదు.
అందువలన సంపూర్ణమైన జ్ఞానము మూడు గ్రంథములలో యున్నా దానిని
మనుషులు తెలియలేకపోయారు. హిందూమతములో 'దేవుడు' అనే
పదమును మరచిపోయి, 'దేవతలు' అనే పదములో ఇమిడిపోయారు.
వారికి భగవద్గీతలో చెప్పిన ముగ్గురు పురుషుల జ్ఞానమే తెలియకుండా
పోయినది. దేవుని మీద విశ్వాసములో అందరికంటే ముందు గలవారు
ముస్లీమ్లో అయినా వారికి మూలాధారమైన ఆత్మజ్ఞానము తెలియదు.
ముస్లీమ్లలో ప్రార్థన, విశ్వాసము రెండూ గట్టిగా ఉన్నాయి. గమ్యము
తెలియని ప్రయాణములాగా వారు దేవుడు ఒక్కడేయని దేవుని మీద
విశ్వాసముతో దేవుని ప్రార్థన చేయుచుండినా వారు తమ గ్రంథములో
చెప్పిన జ్ఞానమును వదలి ఎంతకాలము ప్రార్థన చేసినా వృథా శ్రమ
యగును. ఇంటికి పోవాలని నడుస్తున్నా దారి తెలియనప్పుడు స్మశానానికి
పోయినట్లుండును. దైవజ్ఞానమునకు మూలాధారమైన వాక్యము ఖుర్ఆన్
గ్రంథములో సూరా 50, ఆయత్లో 21లో యున్న మూడు ఆత్మల
విషయము తెలియలేకపోవుట వలన వారిలో కూడా ఎవరూ సార్థకత
పొందలేక పోయారు. అయినా ఆ విషయము వారికి తెలియదు. మేము
అందరికంటే జ్ఞానులుగా ఉన్నామని అనుకొంటున్నారు. వారు ఏమాత్రము
వెనుతిరిగి చూచుకోలేదు.
మూడు ఆత్మల జ్ఞానము సకల జ్ఞానమునకు మూలాధారముగా
యున్నది. భగవద్గీతలో చెప్పిన క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు
తెలియనప్పుడు వారు ఎంత గొప్ప జ్ఞాని అయినా ఏమీ ప్రయోజనము
ఉండదు. అలాగే బైబిలు గ్రంథములో చెప్పిన తండ్రి, కుమారుడు,
పరిశుద్ధాత్మను గురించి తెలియని క్రైస్తవులు దారి తప్పి నడచినట్లగును.
ఎంత ప్రార్థన చేసినా ఫలితము లేకుండా పోవును. అయితే మిగతా
రెండు మతముల వారు మూడు ఆత్మల విషయము తలచకున్నా, ఒక్క
క్రైస్థవ మతము వారు మాత్రము మూడు ఆత్మల పేర్లు చెప్పుకొంటున్నారు.
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయని మూడు ఆత్మల పేర్లను చెప్పుట
వరకే పరిమితమయ్యారు. అదియు మత్తయి సువార్తలో 28వ
అధ్యాయములో 19వ వచనములో ఈ మూడు పేర్లు ఉన్నాయని చెప్పు
చుందురు. ఒక దినము ఒక క్రైస్తవ బోధకున్ని కలిసినప్పుడు అతనిలో
మూడు ఆత్మల విషయమును గురించి కొంతసేపు మాట్లాడడము జరిగినది.
ఆ విషయమును ఇప్పుడు చూడండి.
నేను :- మీరు క్రైస్థవ బోధకులు కదా! మీరు చెప్పే జ్ఞానమునే మిగతా
క్రైస్థవులందరూ వినుచుందురు. మీరు ఏసును మనుష కుమారుడు అని
అనుచుందురు కదా! ఏసు మనుష కుమారుడేనా? దేవుని కుమారుడు
కాదా!
బోధకుడు :- ఏసు మనము చూడంగా మనుష కుమారుడే. ఆయనను
మనము మనుష్య కుమారుడనియే చెప్పాలి. అయితే ఏసు కొన్ని
సందర్భములలో తనను తాను దేవుని కుమారునిగా చెప్పాడు.
నేను :- ఏసు దేవుని కుమారుడు కాదా?
బోధకుడు :- మనకు తెలిసినంత వరకు ఆయన తల్లి తండ్రి కలవానిగా
పుట్టాడు. అందువలన మనుష్య కుమారుడు అన్నాము.
నేను :- తండ్రి అంటే ఎవరు? ఏసుకు తండ్రి ఎవరు?
బోధకుడు :- ఏసుకు తండ్రి దేవుడేయని చెప్పాలి. తండ్రియని దేవున్నే
అనాలి.
నేను :- పరిశుద్ధాత్మ అంటే ఎవరు
బోధకుడు :- దేవుడనియే చెప్పాలి.
నేను బోధకునితో జరిపిన సంభాషణలో తండ్రి, కుమారుడు, పరిశు
ద్ధాత్మ అను పదములకు అర్థము అతను ఏమాత్రము పొంతన లేకుండా
చెప్పాడు. తండ్రి, పరిశుద్ధాత్మ ఇద్దరూ ఒక్కటేయని చెప్పాడు. మనము
ఎలా చెప్పుకొన్నా ఫరవాలేదు. అయితే చెప్పినది సత్యమా కాదా!యని
చెప్పినవారు, విన్నది సత్యమా కాదా!యని విన్నవారు చూచుకోవడము
మంచిది. బోధకుడు కొంత హెచ్చుతగ్గులు చెప్పినా క్రైస్థవులలోనే మూడు
ఆత్మలను గురించి చెప్పుకోవడమైనా ఉన్నది. మిగతా రెండు మతములలో
మూడు ఆత్మలను మచ్చుకైనా అనుకోవడము లేదు. ఆధ్యాత్మికమునకు
మూలాధారము మూడు ఆత్మలయినప్పుడు, వాటిని తెలియకపోతే
ఆధ్యాత్మికము ఏమాత్రము తెలియదని చెప్పవచ్చును.
ఏసు శిలువ వేయబడిన తర్వాత, బాహ్య దృష్ఠికలవారు ఏసు
చనిపోయిన శిలువను, ఏసుకు గుర్తుగా పెట్టుకోవడము జరిగినది. ఏసును
పెట్టుకొంటే అది హిందువులవలె ఏసును దేవతలలోనికి కలిపినట్లవుతుందని
ఆయన గుర్తుగా శిలువను పెట్టుకోవడము జరిగినది. మేము ఏసు భక్తులము
అని శిలువను ధరించిన వారు కలరు. అట్లే ఇది ఏసు ప్రార్థనాలయము
అని తెలియునట్లు చర్చీల మీద శిలువను ఉంచడము కలదు. ఎక్కడయినా
శిలువ అంటే క్రైస్థవము అనీ, క్రైస్థవము అంటే శిలువయని తెలియునట్లు
చేశారు. ఇదంతా బాహ్యచూపు కలవారు చేసినది. కొంత సూక్ష్మ జ్ఞానము
గలవారు గ్రంథములోని జ్ఞానమును గ్రహించినవారై బైబిలు గ్రంథములో
చెప్పిన సారాంశమైన జ్ఞానమును, మూలాధారమైన జ్ఞానమును తెలిసినవారై,
తెలిసిన జ్ఞానమునకు గుర్తుగా దేవుని ముద్రను తయారు చేసి చర్చీల
ముందర, చర్చీల పైన పెట్టారు. కొందరు క్రైస్తవులు ఏసు చనిపోయిన
శిలువను ఏసుకు గుర్తుగా పెట్టగా, కొందరు మాత్రము దేవుని ముద్రను
పెట్టడమైనది. ఎక్కువమంది బాహ్యచూపు కలవారు 90 శాతము శిలువనే
పెట్టుకోగా, కేవలము పదిశాతము మంది దేవుని ముద్రను చర్చీల దగ్గర
పెట్టడమైనది. ఎక్కువమంది పెట్టిన శిలువ ఆకారము అందరికీ తెలుసు.
అయితే సూక్ష్మజ్ఞానముతో ఇమిడియున్న దేవుని ముద్ర చాలామందికి
తెలియదు. ఒకమారు శిలువకు, దేవుని ముద్రకు ఆకార నిర్మాణమును
క్రింద చూస్తాము.
శిలువ దేవునిముద్ర చిత్రమును 168 పేజీ లో చూడండి.
శిలువ రూపమును, దేవుని ముద్ర రూపమును చూచినట్లయితే
శిలువ బాహ్య అర్థముతో కూడుకొని యున్నది. ఏసును శిలువ ఆకారమున్న
మొద్దుమీద పెట్టి కాళ్ళకు, చేతులకు ములుకులు కొట్టారని చెప్పుచుందురు.
శిలువమీద గుర్తులు చూపిన చోట కాళ్ళకు, చేతులకు ములుకులు కొట్టారని
చెప్పుచుందురు. కొన్ని శిలువల మీద ఏసు శరీరము శిలువకు వ్రేలాడినట్లు
చూపియుందురు. కొన్ని శిలువలకు ఏసు లేకుండా దానిని చూస్తే ఆయనను
చూచినట్లు గుర్తుగా చెప్పుచుందురు. శిలువలో జ్ఞానము ఏమీ లేదు.
అదే క్రిందగల దేవుని ముద్రలో ఎంతో సారాంశమైన జ్ఞానము కలదు.
మొదట కొందరు బాహ్యార్థముగల శిలువలను చర్చీల దగ్గరపెట్టగా అందులో
జ్ఞానము ఏమీ లేదని కొందరు జ్ఞానులు మత్తయి సువార్త 28వ
అధ్యాయములో 19వ వచనములో గల తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ
యను అర్ధముతో కూడుకొన్న గుర్తును పెట్టారు.
మొదట జ్ఞానులయిన వారు దేవుని ముద్రలో మొదట పుట్టిన
ప్రకృతిని చేర్చి దేవుడు నాలుగు భాగములుగా యున్నాడని వివరముగా
తెలియునట్లు పెట్టారు. తర్వాత కొందరు జ్ఞానము తెలిసినవారు వాక్యములో
యున్న మూడు ఆత్మలనే గుర్తించి పెట్టితే ఆత్మల విషయమే ముఖ్యముగా
తెలియును, జ్ఞానములో ముఖ్యమైనవి, మూలాధారమైనవి మూడు ఆత్మలే
యని పైనగల మొదటి ప్రకృతిని తీసివేసి మూడు గుర్తులను మాత్రము
ఉంచారు. దేవుని ముద్ర మొదటగల సంపూర్ణమైన ఆకారమును ప్రక్కన
పేజీలో చూడండి.
చివరకు కొన్నిచోట్ల మాత్రము మిగిలినది మూడు చక్రముల గుర్తు.
బహుశా బ్రెజిల్ మరియు కొన్ని దేశములలో నేడు కూడా చర్చీల దగ్గర
శిలువలను ఉంచక మూడు గుర్తులు గల దేవుని ముద్రను గుర్తుగా
ఉంచడము జరుగుచున్నది. క్రైస్తవులలో ఎక్కువ సంఖ్య వారు ఏసు
దేవుని ముద్ర చిత్రమును పేజీ లో 170 చూడండి.
ప్రభువు చనిపోయిన శిలువ గుర్తును ఏసుకు గుర్తుగా పెట్టుకొనుచుండగా
కొన్ని దేశములలో కొంతమంది మాత్రము మూడు చెక్కల గుర్తును చర్చీల
ఉంచడము జరుగుచున్నది. క్రైస్తవులలో ఎక్కువ సంఖ్య వారు ఏసు
దగ్గర ఉంచడమైనది. కాలము గడువగా అర్థములు తెలియకుండా పోయి
ఆకారమునకు మాత్రము కొన్నిచోట్ల మిగిలి ఉన్నాయి. ముఖ్యముగా చెప్పితే
నేడు కూడా క్రైస్థవులకు పెద్దగాయున్న వాటికన్ సిటీలోని పోప్ కూడా
మూడు గీతలు గల గుర్తునే పట్టుకొని ఉండడము నేను ఒక ఫోటోలో
చూచాను. మూడు గీతల గుర్తుకు మూడు ఆత్మల పేర్లనే వ్రాసుకోవడము
విశేషము. దీనినిబట్టి మూడు ఆత్మల జ్ఞానము క్రైస్థవులలోనే అదియూ
కొన్నిచోట్ల మాత్రము కనిపిస్తున్నది. వాటికన్ సిటీలో పోప్ భుజము మీద
పెట్టుకొన్న నాల్గు చక్రముల గుర్తును చూడండి.
నేడు భూమిమీద మిగిలియున్న గుర్తులు ఇవి. వీటితో అయినా
గ్రంథములోని వాక్యము కొద్దిగా దృశ్యరూపములోనికి వచ్చినది. వీటితో
సంతృప్తి చెందక సంపూర్ణమైన నాల్గుచక్రములు దేవుని ముద్రను నుదిటి
భాగమున పెట్టుకొన్నవాడు నిజమైన క్రైస్తవుడుగా దేవుని దృష్ఠిలో లెక్కించ
బడును. దేవుడు, దేవుని జ్ఞానము మన శరీరములో యున్నది. అందువలన
దేవుని ముద్రను శరీరము మీదనే పెట్టుకొని దానిని గౌరవించవలెను.
"మేము క్రైస్తవులము నొసలు మీద గుర్తులు పెట్టుకొంటే హిందువులవలె
కనిపిస్తామేమో!” అని అనుకోకూడదు. ప్రతి క్రైస్థవుడు నొసలు మీద
నాలుగు చక్రముల గుర్తును ధరించవలెను. నొసలు మీద ధరించమనే
(ప్రకటన 9-4) లో దేవుడే చెప్పియున్నాడు. నీవు ధరించే దేవుని చిహ్నము
ప్రతి మనిషికీ సంబంధించినదిగాయున్నది. అందువలన దేవుని జ్ఞానము
ఎడల సిగ్గుపడకూడదు. ఇంతవరకు చెప్పిన మూడు ఆత్మల జ్ఞానమును
భయము కల్గి, భక్తి కల్గి తెలియవలెను. తెలియకపోతే తెలుసుకొనుటకు
ప్రయత్నించు. దేవుని ముద్రను ధరించు. దేవుని క్షమాశీలతను పొంది,
దేవునిలోనికే చేరిపోవలెనని దానికి “దేవుని ముద్ర” దారియని
చెప్పుచున్నాము.
మనుషులు సృష్ట్యాది నుండి ఉన్నారు. ఎన్నో లక్షల సంవత్సరములు
గడచిపోగా, దాదాపు రెండువేల సంవత్సరములనుండి 'మతము' అనునది
మనుషులలో చేరిపోయినది. మనిషి మొదటినుండి ఉన్న జ్ఞానమును
వదలి మతమును గట్టిగా పట్టుకొన్నాడు. 'ముందు మతము తర్వాత జ్ఞానము’
అను పద్ధతిలో ఉండిపోయాడు. ముస్లీమ్లు ఖుర్ఆన్ గ్రంథము మాదియని
చెప్పినా, వారు ఖుర్ఆన్కంటే హదీసు గ్రంథములకే ఎక్కువ ప్రాధాన్యత
నిచ్చుచున్నారు. ప్రతి మతములోనూ మతాచారములు దైవ జ్ఞానమును
వెనక్కి నెట్టివేయుచున్నవి. లేదు మేము జ్ఞానానికే విలువ నిచ్చుచున్నామని
బుకాయించువారు కూడా కలరు. నేడు ఏ మతములోగానీ మతము, మత
సాంప్రదాయములకు ఎక్కువ విలువను ఇచ్చుచున్నారుగానీ, దైవజ్ఞానమునకు
విలువ నివ్వలేదు. పైకి మేము జ్ఞానులము అనినా, వానిలో మతము 90
శాతము, దైవజ్ఞానము 10 శాతము మాత్రమే యున్నది. కొన్నిచోట్ల
పది శాతము కూడా కనిపించడము లేదు.
ఉదాహరణకు ఖుర్ఆన్ గ్రంథములో 15వ సూరాలో 28వ ఆయత్
నుండి 31 వరకు చూస్తాము. ఈ వాక్యములు చూచిన తర్వాత వారు
మతమునకు ఎంత శాతము, దేవుని జ్ఞానమునకు ఎంత శాతము విలువ
నిచ్చుచున్నారో తెలుస్తుంది. (15-28, 29, 30, 31) "నీ ప్రభువు
దేవ దూతలతో ఇలా అన్నాడు. "నిశ్చయముగా నేను మ్రోగేమట్టి,
రూపాంతరము చెందిన జిగట బురదతో మానవున్ని సృష్టించ
బోతున్నాను. (29) ఇక నేను అతనికి పూర్తిగా ఆకారమిచ్చి
అతనిలోనికి నా ఆత్మనే ఊదినప్పుడు మీరంతా అతని ముందు
సాష్టాంగ పడండి. (30) దూతలందరూ సాష్టాంగపడ్డారు. (31)
ఒక్క ఇట్లసు సాష్టాంగ పడేవారిలో చేరటానికి నిరాకరించాడు".
ఈ విధముగా అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములో చెప్పబడి
యున్నది. దేవుడు స్వయముగా 'నేను ఒక మనిషిని తయారు చేసి
పంపుతాను. ఆ మనిషిలో నా ఆత్మనే నింపి పంపుతాను' అని చెప్పినప్పుడు
వచ్చే వ్యక్తి గొప్పవాడనే కదా! అర్థము. దేవుడు తన ఆత్మనే ఊది పంపుట
వలన దేవుని శక్తి యున్నవాడే వచ్చును. దేవుని ప్రతినిధి వచ్చుచున్నాడని
నన్ను గౌరవించినట్లే నా ప్రతినిధికి సాష్టాంగ నమస్కారము చేయమని
దేవుడే చెప్పినప్పుడు, దేవదూతలందరూ సాష్టాంగ నమస్కారము
చేసినప్పుడు, మనిషిలో ఇగ్లీషు (మాయ) ఉండడము వలన దేవుని వద్దనుండి
వచ్చినవానికి మనిషి నమస్కారము చేయలేదు. ఇగ్లీషు (మాయ) ఉన్నవాడు
దేవుని ప్రతినిధియైన భగవంతునికి మనిషి గర్వము చేత నమస్కారము
చేయకపోయాడు. నేడు ముస్లీమ్లు నమస్కరించక పోవడమును సమర్థించు
చున్నారు. “తాము దేవునికి తప్ప ఇతరులకు నమస్కరించము” అని
అంటున్నారు.
దేవుడు సాధారణ మనుషులకు నమస్కారము చేయమని చెప్పలేదు.
'తాను పంపిన తన ప్రతినిధికి' అని చెప్పియున్నాడు. ఖుర్ఆన్ గ్రంథము
చెప్పబడి 1400 సంవత్సరములు అయినది. అప్పుడు 'నేను ఒక మానవున్ని
తయారు చేసి పంపుదును' అని అంటే అది ఖుర్ఆన్ చెప్పిన తర్వాతేనని
అర్థమగుచున్నది. 'దేవుడు అవతరించడు' అని ముస్లీమ్లు చెప్పుచున్నారు.
'నేను అవతరిస్తాను' అని (89-21, 22) లో చెప్పియున్నాడు. అంతేకాక
దేవుడు ప్రత్యక్షముగా ఎక్కడికీ రాడు. తన ప్రతినిధిగా తానే వస్తాడని ఈ
వాక్యములలో తెలిసిపోవుచున్నది. తన ప్రతినిధియంటే దాదాపు దేవుని
శక్తి కల్గియున్నవాడే అని కదా! అర్థము. అప్పుడు కూడా మేము
నమస్కరించము అంటే ఇబ్లీసు ప్రభావమేయని అనుకోక తప్పదు.
దేవుడు స్వయముగా నమస్కరించమని చెప్పాడు. దేవదూతలు కూడా
నమస్కరించారు. అయినా మనిషి నమస్కరించను అని అంటే అది
అజ్ఞానము కాదా! కొందరు ముస్లీమ్లు మా మత షరియత్ ప్రకారము
మేము ఎవరికీ నమస్కరించము అంటే దైవ గ్రంథములో దేవుడు
చెప్పినమాటను కూడా లెక్కచేయడము లేదనేగా అర్థము. గ్రంథములో
నా ప్రతినిధికి సాష్టాంగ నమస్కారము చేయమని చెప్పగా మనిషిలోని
దైవజ్ఞానమును చూచి అతనికి సాధారణ నమస్కారమయినా చేయకపోతే,
ఇది మా మత షరియత్ అంటే మతముతో దేవుని మాటను ధిక్కరించినట్లు
కాదా! దేవున్ని అగౌరవపరచినట్లు కాదా!
దీనినిబట్టి మనిషి మతమునకు ఎక్కువ గౌరవమునిచ్చుచున్నాడా
లేక దేవుని మాటకు గౌరవమునిచ్చుచున్నాడాయని ప్రత్యక్షముగా తెలియు
చున్నది. ఒక్క ముస్లీమ్ మతములో షరియత్ అనేకాదు, అన్ని మతముల
లోనూ మత ప్రాబల్యము ఎక్కువగా యున్నది. అందువలన మత
సాంప్రదాయములనే ఆచరించడములో తప్పిపోకూడదు అని దేవుని మాటను
గాలికి వదలివేస్తున్నారు. క్రైస్తవులలో కూడా ముఖము మీద దేవుని ముద్రను
ధరించకపోతే శిక్ష తప్పదని దేవుడు చెప్పినా, దేవుని ముద్ర అని తన
పేరును చెప్పుకొన్నా "మేము మా మతమునకు కట్టుబడియున్నాము.
మా మత సాంప్రదాయము ప్రకారము నొసలు మీద ఏ గుర్తును ధరించము”
అని అంటే దేవుని మాటను ధిక్కరించినట్లు కాదా! దైవగ్రంథములోని
దేవుని వాక్యమును అగౌరవపరచినట్లు కాదా! ఎవరంతకు వారు 'మతము’
అని దేవుని మాటను లెక్కచేయకపోతే దేవుడు మనుషులను ఏమీ అనకుండా
మౌనముగా ఉండినా, దేవుని పాలకులు ఊరకయుండరు. గ్రహములయితే
తేలుకుట్టిన బాధయంత ఐదు నెలలు బాధింతురు. భూతములయితే పూర్తిగా
చంపకమానవు. అందువలన మనుషులు మతమును వదలి, దేవుని మాట
ప్రకారము ఆచరించమని చెప్పుచున్నాము. "దేవుని మార్గమునకు
ఆటంకమయిన కన్నునైనా పెరికివేయి, చేయినయినా నరికివేయి” అని
దేవుడే చెప్పినప్పుడు నీ మత ఆచారములను వదలుకోలేవా? ఆలోచించుకో,
వాక్యము ప్రకారము దేవుని ముద్రను ధరిస్తావో! మతము అని అంటావో!!
పాలకులు చూస్తారు.
ఇట్లు,
యోగీశ్వర్.