FP ramprasad 46.చిట్ వేద్దామా.. ఎస్ఐపీ చేద్దామా..

46. చిట్ వేద్దామా.. ఎస్ఐపీ చేద్దామా..

చిట్ మంచిదా? మ్యూచువల్ ఫండ్స్
ఉత్తమమా? చాలామందిని ఈ ప్రశ్న
తొలుస్తూ ఉంటుంది. దీర్ఘకాలిక
పెట్టుబడులకు దేన్ని ఎంచుకోవాలి?
తాత్కాలికమైన అవసరాలకు ఏది
మంచిది? చిట్లో రిస్క్ ఎంత?
మ్యూచువల్ ఫండ్స్లో సమస్యలు
ఉండవా? ఈ సందేహాలు తలెత్తడం
సహజం. అయితే, ఈ రెండిట్లో ఏది
మేలు, ఎవరు దేన్ని ఎంచుకోవాల
న్నది వ్యక్తిగత ఆర్థిక వెసులు బాటు,
అవసరాలపై ఆధారపడి ఉంటుంది.



ప్రతి మనిషికీ ఆర్థికంగా కొన్ని లక్ష్యాలు ఉంటాయి. వాటిని చేరుకోవడానికి
రకరకాల మార్గాలు అన్వేషిస్తూ ఉంటాడు. కొన్ని పెట్టు బడులు భవిష్యత్
అవసరాల కోసమైతే, మరికొన్ని దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం. అయితే, ఈ
రెండిటినీ ఒకే గాటన కడితే మదుపు అదుపు తప్పే ప్రమాదం ఉంది. ఈ ధర్మ
సూక్ష్మం తెలియక చాలామంది పెట్టుబడి పక్కదారి పడుతుంటుంది. ఈ క్రమంలో
వేతన జీవుల వెతలు షరా మామూలే! అన్ని ఖర్చులూ పోగా మిగిలిన కొద్ది
మొత్తంలో చీటీలు కట్టడం రివాజు. అయితే, ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించే చిట్స్
ప్రమాదమని తెలిసినా దీన్ని నిలువరించలేకపోతున్నారు. ఈ ప్రశ్నే అడిగితే రిస్క్
లేనిది ఎక్కడ అని బదులిస్తారు. కానీ, ఎందరో చిట్ నిర్వాహకులు రాత్రికి రాత్రి
బోర్డు తిప్పేసిన ఉదంతాలు పూటకో చోట చోటుచేసుకుంటూనే ఉంటాయి.

తెలిసి మరీ...

సాధారణ ప్రజలు ప్రైవేట్ చిట్స్ వైపు మొగ్గు చూపడానికి కారణాలు కోకొల్లలు. అవసరానికి
డబ్బు చేతికి అందుతుందన్న ఒకే ఒక కారణం చిట్స్ నిర్వాహకులకు బలం చేకూరుస్తున్నది.
దీనికి చీటీ కాలపరిమితి తక్కువ. గరిష్ఠంగా 60 నెలల వరకు ఉంటుంది. మన ఆర్థిక
సామర్థ్యానికి తగ్గట్టుగా 20,000 మొదలుకొని కోటి రూపాయలు ఇంకా ఎక్కువ మొత్తం చిట్స్ కూడా
ఉన్నాయి. తెలిసిన వ్యక్తులే నిర్వాహకులుగా ఉండటంతో, అత్యవసర సమయాల్లో చీటీ
పాడుకునే అవకాశం ఉంటుందని చాలామంది వీటిని ఎంచుకుంటారు. ఆర్బీఐ నిబంధనలకు
లోబడి, ప్రభుత్వ అనుమతులతో పలు సంస్థలు చిట్స్ నిర్వహిస్తున్నాయి. అయితే, వీటిలో
చిట్స్ వేయడానికి ఆలోచించే ప్రజలు పూచీకత్తు గొడవలు ఉండవనే సాకుతో వ్యక్తిగత చిట్స్
వైపు చూస్తుంటారు. పైగా అసంఘటిత రంగంలో ఉన్నవారికి బ్యాంకు రుణాలు తేలిగ్గా
మంజూరు కావు. సంస్థలు నిర్వహించే చిట్స్ గురించి పూర్తిస్థాయి అవగాహన కూడా
ఉండదు. దీంతో ప్రైవేట్ వ్యక్తుల చిట్ పాటలకు వంత పాడుతుంటారు. తీరా నిర్వాహకులు
చేతులు ఎత్తేశాక.. మోసపోయామని లబోదిబోమంటారు. ఇంత రిస్క్ ఉందని తెలిసినా..
చాలామంది తమ ఆలోచన మార్చుకోరు. అవసరానికి డబ్బు అందుతుందన్న ఆశ, పరిస్థి
తులు బాగాలేకపోతే నెలవారీ వాయిదా ఆలస్యంగానైనా చెల్లించవచ్చనే నమ్మకమే ఇందుకు
కారణం.

దీర్ఘకాలమైతేనే..

చిట్స్లో రిస్క్ సంగతి పక్కన పెడితే... ఇది మంచి ఇన్వెస్ట్మెంట్. తక్కువ కాలపరిమితి కావ
డంతో 10 శాతం వరకు రిటర్న్ ఉంటుంది. ముందుగానే చిట్ ఎత్తుకున్నా వడ్డీ భారం 18
శాతం వరకు మాత్రమే! ఎప్పుడూ ఒక రన్నింగ్ చిట్ ఉండేలా చూసుకోవడం మంచిది.
అయితే, వ్యక్తుల దగ్గర కాకుండా సంస్థల్లో వేయడం మంచిది. ఇక మ్యూచువల్ ఫండ్స్ ను దీర్ఘ
కాలిక ప్రయోజనాల కోసం ఎంచుకోవాలి. ఒక్కోసారి ఏడాది నిడివిలోనే రిటర్న్స్ రెండింతలు
వచ్చే అవకాశం ఉంటుంది. కానీ, చాలా అరుదుగా ఇలాంటివి జరుగుతుంటాయి. రెండుమూ
డేండ్ల కాలపరిమితితో ఎస్ఐపీ (మ్యూచువల్ ఫండ్స్) ఎంపిక మంచి పెట్టుబడి అనిపించు
కోదు. మార్కెట్ ఒడుదుడుకులకు గురైతే పెట్టింది కూడా చేతికి అందని పరిస్థితి తలెత్తవచ్చు.
ఈ రంగాన్ని ఎంచుకుంటే మీ పెట్టుబడిని కనీసం ఎనిమిదేళ్లు కొనసాగించాలి. ఎనిమిదేళ్ల
తర్వాత మీ అవసరాలు ఏమిటి? అందుకు ఎంత మొత్తం కావాలో, దానికోసం నెలవారీగా
ఎంత చొప్పున ఇన్వెస్ట్ చేయాలో దాని ఆధారంగా ఎస్ఎస్ఐపీ కొనసాగించాలి. ఇక్కడా రిస్క్
ఉంటుంది. కానీ, మల్టీ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ కావడం, దీర్ఘకాలం ఉండటంతో మీ పెట్టుబడిపై
12-18 శాతం వరకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

రిస్క్ లేనిది ఎక్కడ? అని మొండిగా ముందుకు వెళ్తే చిట్స్
అయినా, ఎస్ఐపీ అయినా చివరికి తలకుమించిన
భారమే అవుతుంది. రుణబాధలు ఉన్నవాళ్లు చీటీ
ద్వారా వాటినుంచి బయటపడటం మంచిది. క్రెడిట్
కార్డు బిల్లు మినిమమ్ కడుతూ రకరకాలుగా ఇన్వెస్ట్
చేస్తామనడం హాస్యాస్పదం! మీ రాబడిలోంచి ఖర్చులు
పోను మిగిలిన మొత్తాన్ని సమయానుకూలంగా ఇన్వెస్ట్
చేయడమే సరైన ఆర్థిక విధానం.

Popular posts from this blog

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format

SAP CPI camel conditions and xpath conditions

oauth call to cpi integraiton suite from sap apim