pss all questions , podupukadalu పొడుపు కథల జ్ఞానము
1. ఇంటికి కాపలా కాస్తుంది, కానీ కుక్క కాదు?
2. ఇల్లుంది కానీ తలువు లేదు. మనిషి ఉన్నాడు కానీ మాటలేదు?
3. ఒక రాజు ఎక్కుతుంటే, ఒకరాజు దిగుతుంటాడు ఎవరు?
4. ఉద్యోగం సద్యోగం లేదు. ఊరంతా వ్యాహామే, ఏది?
5. అక్కడ మాట్లాడితే ఇక్కడ వినబడతా,ఇక్కడ మాట్లాడితే అక్కడ వినబడతా ఏది?
6. ఆకాశాన అరవై ఆరు కొడవళ్ళు , ఏవి?
7. ఊరంతా తిరిగాచ్చి మూలన నిలబడ్డది, ఏది?
8. ఎక్కడికెళ్లినా వెంటపడేది, ఏది?
9. ఎందరు ఎక్కినా విరగదు ఏది?
10. ఏటిలోని ఎద్దు ఎన్ని పగ్గాలు వేసినా రాదు, ఏది?
11. ఒసే నీవు వండాలేదు, వార్చాలేదు, ముక్కుకెందుకు మసయ్యింది?
12. ఏ పాటు తప్పినా ఈ పాటు తప్పదు
13. ఏడాకుల మర్రిచెట్టు ఎక్కరాదు, దిగరాదు. ఎక్కడుంది?
14. ఒక పెట్టెలో ఇద్దరు దొంగలు, ఎవరు వారు?
15. రంగడు, పింగడు, రోట్లోవేస్తే మెదగరు. ఎవరు?
16. రెండు కొడతాయి , ఒకటి పుడతాది. కొట్టేది ఏది? పుట్టేది ఏది?
18. వెయ్యికళ్ళ జంతువు వేటకెళ్ళి వేటాడును. ఆ జంతువేది?
19. రెక్కలు మూయని పక్షి ఏది?
20. కన్నుగాని కన్ను ఏది?
21. తల్లి దయ్యం, పిల్ల పగడము, పిల్ల ఏది? తల్లి ఏది?
22. తలయు తోకయు కలదు. నాలుకయే లేదు.పట్టిచూచిన ప్రాణంబు లేదు. ఏది?
23. నట్టింట్లో నలుగురు దొంగలు కలరు. ఎవరు వారు?
24. పచ్చని ఇంట్లో పుట్టాడు, పలువురి చేతుల్లో పడ్డాడు. పలు రకాలుగా మారాడు, పలుకకుండా ఉంటాడు. ఎవడు?
25. పచ్చని పెట్టెలో విచ్చుకుంటుంది. తెచ్చుకోబోతే ముచ్చుకుంటుంది, ఏది?
26. సావిడిలో జుట్టన్న తల విరబోసుకున్నాడు. ఎవరు?
27. మూడు మోములుగల జగత్స్పూజ్యుడు ఎవరు?
28. వస్తా నీతో ఎప్పుడూ, కలలోనైనా వదలను నిన్ను, అన్నది ఎవరు?
29. ఒక కాయ, కాయకు మూఢు పప్పులు, పప్పుకు ఒక గింజ. కాయ ఏది? గింజ లేవి?
30. రెండు మోములు గల వాడెవడు?
31. తోక ఉందిగానీ కోతికాదు , ఎగిరి పోతుంది గానీ పక్షిగాదు. ఏది?
32. ఒక చెట్టుకు రెండు కాయలు, నాలుగు కొమ్మలు, అంతా పూత ఉంది. ఎక్కడ? ఏది?
33. సిగ్గుపడేవాడు ఒకడు, సిగ్గుపడనివాడు ఒకడు. ఇద్దరూ కలిసి గ్రుడ్ణివానివద్ద జీతమున్నారు. ఎవరు?
34. వారు వట్టి ఇరవై ఐదు, ఇరవై ఆరు. వారు ఎవరు?
35. నలుగురితో చావు పెళ్ళితో సమానము, అంటే ఏమిటి?
36. చేసేది ఒకడైతే, మేసేది ఇంగాకడు. ఎవడు?
37. నాకూ లేదు, నీకూ లేదు , ఊరూకో దేవరా! వీరు ఎవరు?
38. ఉన్నోళ్ళలోకెల్ల చిన్నోడే మేలు, ఎవడు వాడు?
39. నీవు దంచు, నేను ప్రక్క లెగుర వేస్తాను. అన్నది ఏది?
40. నీకు ఎక్కడ సంశయమో, నాకు అక్కడే సందేశము. ఈ మాటను ఎవరు చెప్పారు?
41. యోగికీ, రోగికీ , భోగికీ నిద్రలేదు. యోగి, రోగి, భోగి ఎవడు?
42. ఏడు కాండల అవతల ఎరైద్దు రంకెలేసును. ఎరైద్దు ఏది?
43. నోరు మంచిదైతే, ఊరు మంచిదవుతుంది. ఊరు ఏది? నోరు ఏది?
44. బిక్షాధికారి అయినా కావాలి, లక్షాధికారి అయినా కావాలి. భిక్షాధికారి ఎవరు? లక్షాధికారి ఎవరు?
45. మంత్ర జలముకంటే మంగళి జలమెచ్చు
46. నీ కూడు తిని, నీ బట్టకట్టి, నాకు కాపురము చేయమన్నాడట. ఎవరు?
47. నీకు మూతికి మీసాలుంటే, నాకు ముంచేతికి వెంట్రుకలున్నవన్నదట. ఎవరు?
48. కష్టాలు మనుషులకు కాకుండా, మానులకు వస్తాయా?