శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా. నేటి ప్రజలందరికి తెలిసిన ప్రకారము దేవుడనినా, భగవంతుడనినా రెండు ఒకటే అను భావముతో ఉన్నారు. చాలామంది స్వామీజీలు కూడ తమ తమ ఉపన్యాసములలో సృష్టికర్త అయిన పరమాత్మను గురించి తెలుపునపుడు ఒకప్పుడు దేవుడని, మరొకప్పుడు భగవంతుడని పలుకుచు చెప్పుచుందురు. దీనినిబట్టి ఇటు ప్రజల దృష్టిలోను, అటు బోధకులైన స్వామీజీల దృష్టిలోను దేవునికీ, భగవంతునికీ ఏమీ తేడా లేదనీ, అందువలన వారు ఇలా ఆ పదములను వాడుచున్నారని తెలియుచున్నది. ఆధ్యాత్మిక రంగములో ఇది చాలా ముఖ్యమైన విషయం అందరికి అవసరమైన విషయము. కావున దేవుడు మరియు భగవంతుడు అను పదములకు శాస్త్రీయత ఉందా? లేదా? అని యోచించవలసిన అవసరమున్నది. అంతేకాక ఒక పనిని చేయుటకు ఒక కారణముంటుంది. అలాగే ఒక పదమును పలుకుటకు కూడ కారణముంటుంది. అటువంటి కారణమునే హేతువు అంటాము. ఇక్కడ 'దేవుడు అనుటకు, భగవంతుడు అనుటకు హేతువును చూపకపోతే అది హేతుబద్దము కాదు. హేతువాదులు ఒప్పుకోరు. నాస్తికవాదులు ఒప్పుకోక పోయినా ఫరవాలేదు. కానీ హేతువాదులు తప్పక ఒప్పుకోవలసియున్నది. ఎక్కడైతే శాస్త్రీయత ఉంటుందో అక్కడ హేతువాదమునకు జవాబు ఉన్నట్లే. ఎక్కడైతే శాస్త్రీయత లేదో అక్కడ హేతువాదమున...