అంతిమ దైవగ్రంథములో వజ్ర వాక్యములు part 1, 2,3,4
అంతిమ దైవగ్రంథములో వజ్ర వాక్యములు part1 -a 1:17. శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు . "అంతిమ దైవ గ్రంథములో వజ్రవాక్యములు" అను ఈ గ్రంథ రచయిత అయిన శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి ముందు మాట వాస్తవముగా చెప్పాలంటే ప్రథమ దైవగ్రంథము, ద్వితీయ దైవగ్రంథము, అంతిమ దైవగ్రంథము అని మూడే మూడు గ్రంథములు దేవుని ద్వార మనుషులకు ఇవ్వబడినవి. ఈ మూడింటియందు ఒకే దైవజ్ఞానము ఉండుట వలన వాటికి ముందు వెనుక దైవగ్రంథములను పేర్లు వచ్చినవి. మూడు దైవగ్రంథములలో ఆధ్యాత్మికమే ఉండుట వలన గ్రంథములలో ఆధ్యాత్మికము రహస్యముగా దాచిపెట్టబడి ఉన్నదని చెప్పవచ్చును. అందువలననే మూడు సమాజములవారికి మూడు గ్రంథముల వాస్తవికత అర్థముకాలేదని, వారికి అర్థమైనది అంటే అది మతములకు సంబంధించినదే అర్థమైనదని తెలియుచున్నది. గంధమారుతము అంటే వాసనను లేకుండ చేసినది అన్నట్లు గ్రంథము అనగా రహస్యముతో కూడుకొన్నది అని అర్థము గలదు. గంధమారుతము నుండి వాసనను ముక్కులద్వారానే తెలియదగును. అలాగే గ్రంథములోని ఆధ్యాత్మికము బుద్ధి ద్వారనే తెలియబడును. గ్రంథములోని విషయమును ఆత్మ తెలియజేసినప్పుడు మాత్రమే తమ బుద్ధి ద్వార గ్రహించవచ్చును. ఆత్మ తె...