pss book: వేదములు మనిషికి అవసరమా? completed , 2nd review needed reading?
వేదములు మనిషికి అవసరమా?
భూమిమీద పన్నెండు (12) మతములు గలవు. అందులో కొన్ని రెండు, మూడు దేశములకే పరిమితము కాగా, కొన్ని ప్రపంచ వ్యాప్తముగా యున్నవి. అందులో మూడు మతములు మాత్రమే పెద్దవి. పన్నెండులో పదకొండు మాత్రము కలియుగములో పుట్టుకొచ్చాయి. మొదటిది అయిన 'హిందూ మతము' అనునది కూడా కలియుగములోనే ఆ పేరును తెచ్చు కొన్నది. మొదట 'ఇందూ' అను సమాజముగా యున్న భారతదేశ ప్రజలు కలియుగములో క్రైస్థవ మతము పుట్టిన తర్వాత 'ఇందూ సమాజము’, 'ఇందూ మత'మను పేరును పెట్టుకోవడము జరిగినది. అలా దాదాపు రెండు వేల సంవత్సరములప్పుడు ఇందూ మతముగా మారిన ఇందూ సమాజము, ఇందూ మతముగా 150 సంవత్సరముల క్రిందటి వరకు పిలువబడేది. 150 సంవత్సరముల నుండి ఇందూ మతము కాస్త మార్పుచెంది అక్షరము వ్రాయడములో అచ్చుపోయి హల్లు వచ్చి చేరినది. దానితో ఇందూ శబ్దము పోయి హిందూ శబ్దముగా మారిపోయినది. అప్పటి నుండి చరిత్ర తెలియని వారందరూ హిందూ పదమునే వాడుచూ, తమది హిందూ మతము అని చెప్పుకొంటున్నారు.
ఆధ్యాత్మిక విద్యను అనుసరించి మరియు జ్యోతిష్యమును అనుసరించి పూర్వము జ్ఞానమును 'ఇందు' అని పిలిచెడివారు. మనుషులకు జ్ఞానము నిచ్చువాడు చంద్రుడు అయినందున చంద్రుని పేరును జ్ఞానమునకు చెప్పుచూ, జ్ఞానులయిన వారిని ఇందువులు అని అనెడివారు. సృష్ట్యాదిలో ఆకాశము ద్వారా జ్ఞానము చెప్పబడినది. ఆకాశము శూన్యముగా యున్నా అప్పుడప్పుడు అక్కడక్కడ మేఘరూపముగా కనిపించేది. మనకు కనిపించు మేఘములు ఆకాశము యొక్క రూపములేయని తెలియవలెను. మేఘములు
-----
సృష్ట్యాదిలో ఉరుముచూ తమ శబ్దము ద్వారా జ్ఞానమును తెలియజేయగా, ఆ శబ్దములోని జ్ఞానమును ఆకాశములోని సూర్యుడు గ్రహించాడు. సూర్యుడు గ్రహించిన జ్ఞానమును కొంతకాలము గడచిన తర్వాత భారతదేశములో దక్షిణ భాగమున యున్న 'మనువు' అను వ్యక్తికి దేవుని జ్ఞానమును తెలియజేశాడు. మనువు అను వ్యక్తి ద్వారా ఇతరులకు జ్ఞానము తెలియజేయబడి, చివరకు అది భారతదేశమంతటా వ్యాపించిపోయినది. దైవజ్ఞానమును కృత యుగములో మనుషులందరూ తెలియుట చేత భారతదేశ ప్రజలనందరినీ మిగతా దేశ ప్రజలు ఇందువులు (జ్ఞానులు) అని అనెడివారు. ఆ కాలములో మిగతా దేశములకంటే భారతదేశము ఒక్కటి సంపూర్ణ జ్ఞానమును తెలిసియుండుట చేత, మిగతా అన్ని దేశ ప్రజలు భారతదేశమువారిని ఇందువులు అని అనెడివారు. అట్లే భారతదేశమును ఇందూ దేశము (జ్ఞానుల దేశము) అని పిలిచెడివారు. పూర్వము కృతయుగము నుండి యున్న ఇందూ అను పదము 200 సంవత్సరముల నుండి మారుతూ వచ్చి 150 సంవత్సరములప్పుడు పూర్తి హిందూ పదముగా మారిపోయినది.
దాదాపు 1500 సంవత్సరములప్పుడు కృష్ణదేవరాయలు కాలములో దేవాలయములను నిర్మించినప్పుడు “తాటిపత్రి” యను పేరుగల ఊరు నాకు తెలిసి 50 సంవత్సరముల నుండి “తాడిపత్రి”గా మారిపోయినది. నాకు ఇప్పుడు 69 సంవత్సరములు. నేను 50 సంవత్సరముల క్రితం తాటిపత్రిగా యున్న రైల్వేస్టేషన్ బోర్డును చూచాను. తర్వాత తాడిపత్రిగా మారిపోయినది కూడా చూచాను. అట్లే ఒకప్పుడు కృతయుగము నుండి వచ్చిన ఇందూ అను పేరు కలియుగములో 150 సంవత్సరములప్పుడు హిందూగా మారిపోయినది. ఈ మధ్య కాలములో పుట్టిన వారందరూ
----
మేము హిందువులమే అనీ, మాది హిందూమతము అని పూర్తి నమ్మియున్నారు. గతచరిత్రను ఏమాత్రము తెలియనివారికి మన దేశము ఇందూదేశము, మనకు ఇందువులను పేరుండేది యని చెప్పినా వారు నమ్మే స్థితిలో లేరు. నేడు మతాల మత్తులో మునిగియున్న వారిలో హిందూ అను శబ్దము ఇమిడి పోయినది. మాలాంటి వారు మనము ఇందువులము అని చెప్పితే క్రొత్త మతమును సృష్టిస్తున్నావు అని అంటున్నారు. ఆనాడు కృతయుగము నుండి జ్ఞానము ఆధారముతో ఇందువులు అని పిలువబడు చుండగా, నేడు మత ఆధారముతో హిందువులు అని పిలువబడుచున్నారు. ఇటు బోధకులకు గానీ, అటు బోధలు వినువారికి గానీ 'ఇందూ' అను పదము యొక్క అర్థమే తెలియకుండా పోయినది. దానివలన మనుషులలో జ్ఞానము పోయి అజ్ఞానముతో కూడుకొన్న మతము మిగిలినది. నేడు హిందూమతములో జ్ఞానమున్నట్లు మనుషులు అనుకొనుచున్నా, అది జ్ఞానము కాదని వారికి తెలియదు. నేటి కాలములో హిందువులు యజ్ఞములు చేయుట, వేదాధ్యయణము చేయుట, ధ్యానములు (తపస్సు) చేయుట, దానములు చేయుట దైవకార్యములుగా పెట్టుకొన్నారు. కృతయుగములో మొదట దేవుడు చెప్పిన జ్ఞానమునకు చాలా దూరముగా యున్నారు. నేడు బ్రాహ్మణులు, బ్రాహ్మణుల నుండి తయారయిన స్వామీజీలు పీఠములను స్థాపించుకొని ప్రజలకు తమ బోధలను చెప్పుచున్నారు. దానివలన వారు చెప్పునట్లు మిగతా ప్రజలు వింటున్నారు. అన్నిటికీ వేదములే ప్రమాణములని చెప్పుచూ, మనమంతా హిందువులమే అని అంటున్నారు.
1) ప్రశ్న :- నేడు హిందువులందరికీ జ్ఞానమునకు వేదములే ప్రమాణము అని చెప్పుచుండుట వాస్తవమే. వేదములంటే
----
ఏమిటి? అవి ఎప్పుడు పుట్టుకొచ్చినవి? అను విషయమును కొంత వివరముగా చెప్పవలెనని కోరుచున్నాము?
జవాబు :- వేదము అను పేరు మొదట లేదు. గ్రుడ్డు నుండి పురుగు పుట్టి తర్వాత కొంత కాలమునకు చిలుకగా మారినట్లు, యాతన అను పదము మొదట ఉండగా, యాతన అను పదము నుండి 'వేదన' అను పదము పుట్టినది. వేదన అను పదము నుండి 'వేదము' అను పదము పుట్టినది. గ్రుడ్డునుండి పురుగు, పురుగు నుండి చిలుక పుట్టినట్లు, యాతన నుండి వేదన, వేదన నుండి వేదము పుట్టినది. మొదట ఒక పదము ఉండగా ఆ పదము మార్పు చెందుచూ చివరకు వేదము అయినది. దీనిని బట్టి వేదము నేరుగా ఒకేమారు పుట్టిన పదము కాదు, పట్టు పురుగు చివరకు పట్టు చిలుకగా మారినట్లు, యాతన 'వేదము'గా మారినది. యాతన అను పదమునకు అర్థము 'బాధ లేక కష్టము' యని చెప్పవచ్చును. వేదము అనినా అదే అర్థము అని తెలియవలెను. వేదము వలన మనుషులు బాధ పడవలసిందేయని తెలియవలెను.
2) ప్రశ్న :- వేదములు అనగా గ్రంథములు కదా! సంస్కృత భాషలో యుండే గ్రంథములు కదా? అవి ఎలా పుట్టాయి?
జవాబు :- వేదములు అనగా యాతన లేక వేదనతో కూడుకొనియున్నవి అని చెప్పుమాట వాస్తవమే. వేదములు అను పదములో అర్థము మేము చెప్పినది వాస్తవమే. అయితే వేదములు రెండు రకములు గలవు. వేదములు బాహ్యముగా గ్రంథరూపములో, వ్రాతల కూడలిగా యున్నవి. బయట గ్రంథరూపముగా యున్న వేదములు నాలుగు రకములు, అవి వరుసగా 1) ఋగ్వేదము 2) యజుర్వేదము 3) స్సామ వేదము 4) అధర్వణ వేదము.
----
ఈ నాలుగు వేదములు గ్రంథరూపముగా యున్నవి. వీటిని అందరూ చదవకున్నా కొందరు మాత్రము చదవగల్గినారు. నాలుగు వేదములు సంస్కృత భాషలో వ్రాయబడియున్నవి. నాలుగు కనిపించు వేదములు ద్వాపర యుగములో వ్యాసుని చేత వ్రాయబడినవి. గ్రంథరూపముగా వ్రాసినవాడు వ్యాసుడు. అయితే నాలుగు వేదములను స్వయముగా వ్యాసుడు రచించలేదు. ముందే ఇతరుల చేత వ్రాయబడిన వ్యాసములను వ్యాసుడు గ్రంథ రూపము చేశాడు. వేదములనునవి అనేకమంది చేత వ్రాయబడినవని తెలియవలెను. కృతయుగము చివరనుండి ద్వాపర యుగము చివరివరకు విద్యావంతులయినవారు అప్పుడొకరు, అప్పుడొకరు వ్రాసియుంచిన సమాచారములను వ్యాసుడు సంస్కృతములో వ్రాయడము జరిగినది. కృతయుగము చివరనుండి మొదలయి, త్రేతాయుగము, ద్వాపరయుగము చివరవరకు అనేకమంది కొద్ది కొద్దిగా వ్రాసిన సమాచారములన్నీ సేకరించి వ్యాసుడు నాలుగు గ్రంథములుగా వ్రాయడము జరిగినది. ఆ నాలుగు గ్రంథములే నాలుగు పేర్లు గల వేదములుగా ఉన్నవి. కృతయుగ చివరి నుండి త్రేతాయుగము, ద్వాపరయుగము చివరివరకు దాదాపు పది వేలమంది తమకు తోచిన విషయములను వ్రాసి పెట్టారు. అలా వ్రాసిన విషయములే నేడు వేదములుగా కూర్చబడి మనముందర యున్నవి.
పూర్వము భారతదేశ జనాభా చాలా తక్కువగా యుండేది. కృత యుగములో దాదాపుగా చెప్పితే కోటికి లోపల, కొన్ని లక్షల మందే యుండేవారు. త్రేతాయుగములో కొంత పెరిగి దాదాపు కోటికి పైగా జనాభా యుండవచ్చును. తర్వాత ద్వాపర యుగము చివర వరకు చూస్తే దాదాపు మూడుకోట్ల జనాభా యుండవచ్చును. అంతతక్కువ జనాభాలో 99 శాతము ప్రజలు పనులు చేసుకొని బ్రతకడమునకే కాలము సరిపోయేది.
----
అయితే ఒక్క బ్రాహ్మణ కులమువారు మాత్రము పనులు చేయకుండా బ్రతికేదానికి అలవాటుపడినారు. అందువలన బ్రాహ్మణులు మాత్రమే విద్యాభ్యాసము చేసెడివారు. అప్పటి కాలములో రాజులుగా యున్నవారు కూడా బ్రాహ్మణుల వద్ద విద్య నేర్చినవారే. దేశమంతా వందమంది రాజులుంటే వారికి మాత్రము విద్య అబ్బినది. రాజుల వద్ద గురువులుగా, మంత్రులుగా, పండితులుగా, కవులుగా యున్న వారందరూ బ్రాహ్మణులే యని చెప్పవచ్చును. మూడు యుగముల నుండి బ్రాహ్మణులుగా యున్నవారే విద్యను నేర్చారు. మిగతా కులములన్నీ విద్యలేనివారుగా యుండేవారు. అదే పరిస్థితి కలియుగము మొదటిలో దాదాపు రెండు వేల సంవత్సరముల వరకు యుండేది. తర్వాత అక్కడొకరు అక్కడొకరు మిగతా కులముల వారు విద్యను కొంతవరకు నేర్చేవారు. కలియుగములో రెండు, మూడు వేల సంవత్సరములు గడచు వరకు విద్య అంటే కేవలము అక్షరాభ్యాసము వరకే యుండేది. తర్వాత కొంతకాలము విద్య అంటే బాండు వ్రాయుట, జాబులు వ్రాయుట వరకే నేర్పించెడివారు. తర్వాత కొన్ని పట్టణములలో మాత్రము హైస్కూలు చదువులు కాలేజీ చదువులు వచ్చాయి. గత 200 సంవత్సరముల వరకు భారతదేశములో ఉన్నత విద్యలు లేవు. ఉన్నత విద్య కావాలంటే విదేశములకు పోయి చదువవలసి వచ్చేది. కలియుగములో వంద (100) సంవత్సరముల నుండి విద్య అభివృద్ధి చెందుతూ వచ్చినది. నేడు 90 శాతము అందరూ ఉన్నత విద్యను అభ్యసించినవారే గలరు.
*కృత్యుగ, త్రేతాయుగ, ద్వాపర యుగములలో విద్యావంతులు అంటే బ్రాహ్మణులు తప్ప ఇతరులు ఉండేవారు కాదు. అప్పటి కాలములో దైవ జ్ఞానమును తెలిసినవారు ఎవరు అంటే బ్రాహ్మణులేయని చెప్పవచ్చును. బ్రాహ్మణులే పంచాంగమును వ్రాసెడివారు, జ్యోతిష్యమును చెప్పెడి వారు.
---
బ్రాహ్మణులు అన్ని విధములా తెలివైనవారుగా ఉండేవారు. అందువలన విద్యలేని మిగతా ప్రజలందరూ బ్రాహ్మణుల చుట్టూ తిరుగుచూ, ప్రతి విషయములోను వారి సలహా తీసుకొనెడివారు. ప్రతి పనికి ముహూర్తమును బ్రాహ్మణులే చెప్పెడివారు. బ్రహ్మ జ్ఞానము కల్గినవారు బ్రాహ్మణులు అని అర్ధముండుట వలన ఆనాడు వారికి తోచిన సమాచారమును వ్యాసములుగా వ్రాసి, వాటికి మంత్రములు, బ్రాహ్మణములు, కొన్నిటికి ఉపనిషత్లని పేరు పెట్టారు. బ్రాహ్మణులలో జ్ఞానులు అని పేరు పొందినవారు తమ వ్యాసములను తాటియాకుల మీద వ్రాసిపెట్టారు. ఆనాడు కాగితములు లేవు కావున తాటియాకులే పేపర్లుగా వ్రాయబడేవి.
మూడు యుగముల నుండి పది వేలమందిచే వ్రాయబడిన విషయములను కొన్ని మంత్ర భాగములుగా, కొన్నిటిని బ్రాహ్మణ భాగములుగా, కొన్నిటిని ఉపనిషత్లుగా చెప్పియుండగా అవి అన్నియూ చిన్న సమాచారములయి ఉండుట చేత, విడివిడిగా వేరు వేరు ప్రాంతములలో ఉండుట చేత ఏవియూ గ్రంథముగా వ్రాయబడలేదు. ద్వాపర యుగములో వ్యాసుడు మంచి విద్యావంతుడు అయినందున గ్రంథములు వ్రాయు స్థోమత గల వ్యాసుడు, తమ కులస్థులయిన బ్రాహ్మణులు వ్రాసిన విడివిడిగా యున్న సమాచారమును వృథా కానివ్వ కుండా గ్రంథముగా వ్రాయదలచాడు. దాదాపు పది వేలమంది వ్రాసిన వాటిలో ముఖ్యమైన వాటిని మాత్రము తీసుకొని గ్రంథములుగా చేయడమైనది. అలా వ్రాసినవి కేవలము 1108 మంది వ్రాసినవి మాత్రమే గలవు. అందరూ వ్రాసిన మంత్రములను, బ్రాహ్మణములను కలిపి వ్రాసినా వారి పేర్లు చిరస్థాయిగా గుర్తింపుగా యుండునట్లు ఉపనిషత్తులను విడివిడిగా కలుపకుండా వ్రాసి, ఆ ఉపనిషత్లకు వ్రాసినవారి పేర్లు పెట్టడము జరిగినది. అలా వ్రాయబడిన
----
1108 ఉపనిషత్తులలో 108 మాత్రము ముఖ్యమైనవని వాటి పేర్లను మాత్రము చెప్పడమైనది. అవి ఇలా వరుసగా యున్నవని వాటి పేర్లను మాత్రము క్రింద వరుసగా చెప్పడమైనది.
1) ఈశావాస్యోపనిషత్తు 2) కేనోపనిషత్తు
3) కఠోపనిషత్తు 4) ప్రశ్నోపనిషత్తు
5) ముండకోపనిషత్తు 6) మాండూక్యోపనిషత్తు
7) తైత్తిరీయోపనిషత్తు 8) ఐతరేయోపనిషత్తు
9) చాందోగ్యోపనిషత్తు 10) బృహదారణ్యకోపనిషత్తు
11) బ్రహ్మోపనిషత్తు 12) కైవల్యోపనిషత్తు
13) జాబాలోపనిషత్తు 14) శ్వేతాశ్వతరోపనిషత్తు
15) హంసోపనిషత్తు
16) ఆరుణికోపనిషత్తు 17) గర్భోపనిషత్తు 18) నారాయణోపనిషత్తు 19) పరమహంసోపనిషత్తు
20) అమృతబిందూపనిషత్తు 21) అమృతనాదోపనిషత్తు 22) అధర్వశిరోపనిషత్తు 23) అధర్వశిఖోపనిషత్తు
24) మైత్రాయణ్యుపనిషత్తు
25) కౌషీతకీబ్రాహ్మణోపనిషత్తు 26) బృహజ్జాబాలోపనిషత్తు
27) 1) నృసింహతాపిన్యుపనిషత్తు 27 2) నృసింహత్తరతాపిన్యుపనిషత్తు
28) కాలాగ్నిరుద్రోపనిషత్తు
29) మైత్రేయోపనిషత్తు
30) సుబాలోపనిషత్తు
31) క్షురికోపనిషత్తు
32) మంత్రికోపనిషత్తు 33) సర్వసారోపనిషత్తు 34) నీరాలంబోపనిషత్తు
----
35) శుకరహస్యోపనిషత్తు
36) వజ్రసూచికోపనిషత్తు
37) తేజోబిందూపనిషత్తు
38) నాదబిందూపనిషత్తు
39) ధ్యానబిందూపనిషత్తు
40) బ్రహ్మవిద్యోపనిషత్తు
41) యోగతత్త్వోపనిషత్తు
42) ఆత్మబోధోపనిషత్తు
43) నారదపరివ్రాజకోపనిషత్తు 44) త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్తు
45) సీతోపనిషత్తు 46) యోగచూడామణ్యుపనిషత్తు
47) నిర్వాణోపనిషత్తు 48) మండల బ్రాహ్మణోపనిషత్తు
49) దక్షిణామూర్త్యుపనిషత్తు 50) శరభోపనిషత్తు
51) స్కన్దోపనిషత్తు 52) త్రిపాద్విభూతిమహానారాయణోపనిషత్తు
53) అద్వయతారకోపనిషత్తు
54) రామరహస్యోపనిషత్తు
55) రామతాపిన్యుపనిషత్తు
56) వాసుదేవోపనిషత్తు
57) ముద్గలోపనిషత్తు 58) శాండిల్యోపనిషత్తు
59) పైఙ్గలోపనిషత్తు 60) భిక్షుకోపనిషత్తు
61) మహోపనిషత్తు 62) శారీరకోపనిషత్తు
63) యోగశిఖోపనిషత్తు
64) తురీయాతీతోపనిషత్తు 65) సన్న్యాసోపనిషత్తు
66) పరమహంస పరివ్రాజకోపనిషత్తు 67) అక్షమాలికోపనిషత్తు
68) అవ్యక్తోపనిషత్తు
69) అన్నపూర్ణోపనిషత్తు
70) సూర్యోపనిషత్తు
71) ఏకాక్షరోపనిషత్తు
72) అక్ష్యుపనిషత్తు
73) ఆధ్యాత్మోపనిషత్తు 74) కుండికోపనిషత్తు
75) సావిత్ర్యుపనిషత్తు
76) ఆత్మోపనిషత్తు
----
77) పాశుపతబ్రహ్మోపనిషత్తు 78) పరబ్రహ్మోపనిషత్తు
79) అవధూతోపనిషత్తు 80) త్రిపురాతాపిన్యుపనిషత్తు
81) దేవ్యుపనిషత్తు 82) త్రిపురోపనిషత్తు
83) కఠరుద్రోపనిషత్తు 84) భావనోపనిషత్తు
85) రుద్రహృదయోపనిషత్తు 86) యోగకుండల్యుపనిషత్తు
87) భస్మజాబాలోపనిషత్తు 88) రుద్రాక్షజాబాలోపనిషత్తు
89) గణపత్యుపనిషత్తు
90) దర్శనోపనిషత్తు 91) తారసారోపనిషత్తు
92) మహావాక్యోపనిషత్తు
93) పంచబ్రహ్మోపనిషత్తు
94) ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు
95) గోపాలతాపిన్యుపనిషత్తు 96) కృష్ణోపనిషత్తు
97) యాజ్ఞవల్యోపనిషత్తు 98) వరాహోపనిషత్తు 99) శాట్యాయనీయోపనిషత్తు 100) హయగ్రీవోపనిషత్తు
101) దత్తాత్రేయోపనిషత్తు 102) గారుడోపనిషత్తు103) కలిసంతరణోపనిషత్తు 104) జాబాల్యుపనిషత్తు
105) సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్తు
106) సరస్వతీరహస్యోపనిషత్తు
107) బహ్వృచోపనిషత్తు
108) ముక్తికోపనిషత్తు
ఇక్కడ 108 ఉపనిషత్తుల పేర్లు ఉన్నాయి. ఉపనిషత్తులు సాధారణమే అయినా వాటి ముందర యున్న పేర్లు వాటిని వ్రాసిన వారి పేర్లు అని తెలియవలెను. మొత్తము వ్రాసినవారు పది వేలమంది కాగా, అందులో ముఖ్యమైనవియని 1108 వ్రాతలను తీసుకోగా, ఇంకా కొందరు అందులో కొన్నిటియందు లోపములున్నవని, లోపము లేనివి ముఖ్యమని
----
చెప్పుచూ కేవలము 108 వ్రాతలను మాత్రము తీసుకొన్నారు. పది వేల మంది వ్రాతలలో సక్రమమైనవి 1108 అని కొందరు చెప్పగా, అందులో కూడా పూర్తి సక్రమమైనవని 108 ని మాత్రము తీసుకోవడము జరిగినది. 108 ని వ్రాసినవారి పేర్లను వారు వ్రాసిన ఉపనిషత్తుల ముందర చెప్పడమైనది. ఉదాహరణకు 'తైత్తరీ' అను వ్యక్తి వ్రాసిన దానిని 'తైత్తరీయోప నిషత్తు' అని అన్నారు. అలాగే 'మండూక్యుడు' అను ఒక మహర్షి వ్రాసిన దానిని 'మండుకోపనిషత్' అని పేరు పెట్టారు. ఈ విధముగా ప్రతి ఉప నిషత్తు ముందు భాగములో దానిని వ్రాసినవారి పేరు కలదని గ్రహించ వలెను.
వేదములు నాలుగుగా వ్రాయబడినవి. మూడు యుగముల నుండి కొంత జ్ఞానము గలవారు వారికి తెలిసినది వారు వ్రాశారు. పది వేల మంది వ్రాయగా, అందులో 1108 మందివి మాత్రము సరియైనవనీ, మిగతా వాటియందు లోపములున్నవని 1108 ఉపనిషత్తులను మాత్రము తీసుకోవడము జరిగినది. అందులోనూ 108ని మాత్రము సక్రమమైనవని ఎన్నుకోవడము జరిగినది. ఉపనిషత్తులు ఎన్ని అయినా వేదములు మాత్రము నాలుగే గలవు.
వేదములు హిందువులకు, హిందువుల జ్ఞానమునకు ప్రమాణ గ్రంథములని కొందరు చెప్పుచున్నారు. వేదముల సమాచారమును వ్రాసినవారు బ్రాహ్మణులే. అక్కడక్కడా విడి విడిగా యున్న అందరి వ్రాతలను సేకరించి, గ్రంథరూపము చేసినవాడు వ్యాసుడు. వ్యాసుడు బ్రాహ్మణుడే అయినందున తమవారు వ్రాసిన వాటిని గ్రంథముగా చేయాలను పట్టుదలతో వ్యాసుడు అందరి సమాచారములను ఒక్కచోట చేర్చి గ్రంథముగా వ్రాశాడు. అంతటితో వ్యాసుడు ఊరక ఉండక అతనిలో మోహ గుణము ప్రేరణ వలన తన కులము వారే గొప్పగా ఉండవలెనని
----
తలచి, తనవారు వ్రాసిన వ్యాసములన్నిటినీ ఒకచోట చేర్చి వ్రాయడమే కాక, తాను వ్రాసిన వేదములే సర్వమానవులకు దైవమార్గ విషయములో ప్రమాణ గ్రంథములని చెప్పాడు. వేదములను వ్రాయకముందు వ్యాసుని పేరు వేరే ఉండేది. అనేకమంది బ్రాహ్మణులు వ్రాసిన వ్యాసములను ఒకచోట చేర్చి గ్రంథ రూపముగా వ్రాయడము వలన వ్యాసములను వ్రాసినవాడు వ్యాసుడు అని పేరు వచ్చినది. వేదముల వ్యాసము లను వ్రాశాడు కావున 'వేద వ్యాసుడు' అను పేరు ఆయనకు రావడము జరిగినది. వేదములు ప్రమాణ గ్రంథములని చెప్పడము వలన, తమ గ్రంథములు ప్రజలలో ప్రచారము కావలెనని మిగతా బ్రాహ్మణులు వేదముల పఠనము చేసెడివారు. వ్యాసునికి ఏమాత్రము దైవజ్ఞానము తెలియని కాలములో ఆ విధముగా వేదములను వ్రాయడము, అందరికీ దేవుని భక్తి మార్గములో వేదములే ప్రమాణ గ్రంథములని చెప్పడము జరిగినది. వేదములు వ్రాసిన తర్వాత వాటిని పూర్తిగా నమ్మునట్లు వేదములలో చెప్పిన దేవతలను గురించి పదు నెనిమిది పురాణములను వ్రాయడము జరిగినది. నాల్గు వేదములు, పదునెనిమిది పురాణములను వ్రాసి ప్రజలలోనికి పంపడము వలన ప్రజలు వేద, పురాణములను చదివి వాటిని గొప్పగా అనుకోవడమూ, వాటిని వ్రాసిన వ్యాసున్ని పొగడడమూ జరిగినది.
ద్వాపర యుగములో వేదములను, పురాణములను సాధారణ ప్రజానీకము చదువుట వలన, వాటికి ప్రభావితులై పురాణములలోని దేవతలను నమ్మడము, వేదముల వలన యజ్ఞములను చేయడము, యజ్ఞములలో వేదములను చదవడము జరిగెడిది. ఆనాడు ప్రజలు యజ్ఞములను చేయాలనుకొన్నప్పుడు ఆ కార్యములను బ్రాహ్మణులే చేసెడి వారు. అలా అన్ని భక్తి కార్యములను బ్రాహ్మణులే చేయుచూ వచ్చారు.
----
తెలియవలసిన బోధను చెప్పాడు. ఆ బోధలో ధర్మములు సంపూర్ణముగా చెప్పబడినవి. అట్లే అధర్మములను కూడా చెప్పి, వాటి వలన దేవుడు తెలియబడడు, అధర్మముల వలన అజ్ఞానము తప్ప ఏమీ లేదని చెప్పాడు. అలా రహస్యముగా చెప్పబడిన జ్ఞానమును యుద్ధము అయిపోయిన నెల తర్వాత అర్జునుడు వ్యాసునికి తాను విన్న విషయమును అంతా చెప్పడము జరిగినది. అర్జునుడు చెప్పిన దానిని వినినప్పుడు వ్యాసునిలో తాను తప్పు చేశాను అను ఆందోళన కనిపించినది. అర్జునుడు తనకు చెప్పిన జ్ఞానమంతయూ ధర్మములతో కూడియుండడము, తాను గతములో నాల్గు వేదములలో, పదునెనిమిది పురాణములలో వ్రాసిన వాటిలో పూర్తి అధర్మములు ఉండడము వలన, వేదవ్యాసునిలో వేదనతో కూడిన మార్పు
కనిపించినది.
వేదవ్యాసుడు తాను అధర్మములను బోధించి తప్పు చేయడము వలన తనకు పాపము అమితముగా వచ్చియుంటుందని అనుకున్నాడు. తాను చేసిన పాపకృత్యములకు విరుగుడుగా కృష్ణుడు చెప్పిన బోధను గ్రంథ రూపములో వ్రాయాలని అనుకొన్నాడు. అప్పటి నుండి కాలమును వృథా చేయక తాను అర్జునుని ద్వారా విన్నదంతా గ్రంథరూపము చేసి ఆ గ్రంథమునకు ‘భగవద్గీత’ యను పేరును పెట్టాడు. ఈ విధముగా భగవద్గీత తయారయినది. భగవద్గీత వ్రాసిన తర్వాత వ్యాసుడు ఎప్పుడుగానీ, అధర్మములను బోధించడముగానీ, అధర్మములను ఆచరించడము గానీ చేయలేదు. తాను గతములో వేదములు, పురాణములు వ్రాసి చాలా తప్పు చేశానని కృంగిపోయి ఆ విషయమును ప్రక్కవారితో "తాను వ్రాసిన భగవద్గీతను చదవండనీ, దానికంటే ముందు వ్రాసిన వేదములను, పురాణములను చదవద్దండని” చెప్పెడివాడు. అయినా బ్రాహ్మణులు
----
వేదములను, పురాణములను స్వయముగా ప్రచారము చేయుచూ, తమకు వ్యతిరేఖముగా యున్న భగవద్గీతను ప్రజలకు తెలియకుండా చేశారు. ప్రజలకు ఏమి చెప్పినా విద్యావంతులయిన బ్రాహ్మణులే చెప్పవలెను. అందువలన వారి బోధలలో భగవద్గీతను లేకుండా చేశారు. దానితో ప్రజలకు ధర్మములు తెలియకుండా పోయి, అధర్మములే నేటి వరకు ప్రచారములో యున్నవి, అధర్మములే ఆచరణలో యున్నవి.
దేవుడు అదే పనిగా ధర్మములను తెలియజేయు నిమిత్తము మనిషిగా జన్మను తయారు చేసుకొని వచ్చి, ఎంతో శ్రమించి సమయము వచ్చు వరకు వేచియుండి, సందర్భానుసారముగా యుద్ధరంగములోని అర్జునునకు ధర్మయుక్తమైన జ్ఞానమును తెలియజేశాడు. పరమాత్మ సంకల్పము చేత వేదవ్యాసుడు కృష్ణుడు చెప్పిన జ్ఞానమును గ్రంథరూపముగా వ్రాసి దానికి భగవద్గీతయని పేరు పెట్టాడు. బ్రాహ్మణుడయిన వేదవ్యాసుడు వేదములకు వ్యతిరేఖముగా ధర్మములను తెలుపుచూ వ్రాసిన గ్రంథము మిగతా బ్రాహ్మణులకు సరిపోలేదు. తమకు అలవాటయిన వేదములను, యజ్ఞము లను, ధ్యానములను, దానములను అధర్మములని వ్రాసిన భగవద్గీతను పూర్తి వ్యతిరేఖించి, ప్రజలకు దానిని తెలియకుండా చేయవలెనని అందరూ కలిసి మాట్లాడుకొన్నారు. ప్రజల వద్ద ఎక్కడయినా భగవద్గీత ఉందని తెలిసినా దానిని చదువకూడదను ఉద్దేశ్యముతో "భగవద్గీత యుద్ధములో చెప్పినది. ఆ గ్రంథము ఇంట్లో ఉంటే పోట్లాటలు వస్తాయి. దానివలన నష్టము కష్టము జరుగుతుందని చెప్పి, గ్రంథమును ఏటిలో గానీ (నదిలోగానీ), సముద్రములోగానీ వదలి వేయవలెనని అట్లు చేయుట వలన రాబోవు విపత్తులు పోవునని” చెప్పేవారు. అలా అన్నీ తెలిసిన బ్రాహ్మణులు చెప్పితే ప్రజలు వారి మాటలను విని ఇంటిలో ఉన్న భగవద్గీతను నదిలో వేసి వచ్చేవారు. నదులు లేని చోట దేవాలయములలో పెట్టి వచ్చేవారు.
----
భగవంతుడు చెప్పిన భగవద్గీతలో దైవజ్ఞానము చెప్పబడినది, అందులో ధర్మములు, అధర్మములను దేవుడు తెలియజేశాడు కదా! భగవద్గీతను చదవడము వలన ముక్తిని చేరవచ్చును కదా! యని ఎవరయినా అడిగితే దానికి జవాబుగా “భగవద్గీతకంటే ముందు వేదములు పుట్టినవి. వేదము సనాతనమైనది. ముక్తి కావాలనుకొనువారు వేదములనే చూడవలెను, వేదములు అన్నిటికి ప్రమాణములుగా యున్నవి. వేదముల వలననే దేవున్ని చేరవచ్చును. అందువలన భగవద్గీతను వదలి వేదములను చదవండి” యని బ్రాహ్మణులు చెప్పుచున్నారు. వేదములు సంస్కృతములో యుండుట వలన వేదములను ప్రజలు చదవలేకపోవుచున్నారు. అంతేకాక తమ ఇంటిలో జరుగు శుభకార్యములయందు బ్రాహ్మణుల చేత వేదమంత్రములను చదివించుకొనుచున్నారు. నాలుగు వేదములను మిగతా బ్రాహ్మణులందరూ చదవలేరు. వారి పనికి అవసరమైన వేదమంత్రములను మాత్రము నేర్చుకొన్నారు. బ్రాహ్మణులలో అరుదుగా అక్కడక్కడా కొందరు మాత్రము వేదములను చదివినవారుండవచ్చును. అంతేగానీ బ్రాహ్మణులు అందరూ వేదములను చదవలేదు. భగవద్గీత వంద సంవత్సరములప్పుడు కూడా సంస్కృత భాషలోనే ఉండేది. ప్రజలకు అప్పుడు తెలుగు చదువే సరిగా లేనప్పుడు సంస్కృత భాషలో యున్న భగవద్గీతను ఎవరు చదువగలరు? ఈ మధ్య కాలములో దాదాపు 80 సంవత్సరముల కాలము నుండి భగవద్గీతలు ప్రాంతీయ భాషలో వ్రాయబడినవి. అయితే భగవద్గీతను చదివే అవకాశము లేకుండా బ్రాహ్మణులు భగవద్గీతకంటే ముఖ్యము వేదములేయని చెప్పారు.
ఈ విధముగా ప్రజలు భగవద్గీతకు దూరముగా యుండునట్లు చేయడమేకాక, మొదట వ్యాసుడు వ్రాసిన తాటి ఆకుల గ్రంథము కొన్ని
---
సంవత్సరములకు శిథిలావస్థకు వచ్చినప్పుడు, తిరిగి దానిని వేరొక గ్రంథముగా ఆనాడు విద్యావంతులైన బ్రాహ్మణులే వ్రాశారు. అప్పుడు అదే అదనుగా కొన్ని కల్పిత శ్లోకములను, వారికి అనుకూలముగా యున్న శ్లోకములను భగవద్గీతలో చేర్చడము జరిగినది. ఆ శ్లోకములుండుట వలన వాటిని గుర్తించలేనివారు భగవద్గీతను చదివినా సంశయములే ఎక్కువ ఏర్పడుచున్నవి గానీ, సంశయరహిత జ్ఞానము అందులో ఎవరికీ దొరకడము లేదు. అలా వారికి అనుకూలమైన శ్లోకములను చేర్చినప్పటికీ వాటిని నేను పసిగట్టగలిగాను. అందువలన నేను వ్రాసిన త్రైత సిద్ధాంత భగవద్గీతలో వాటిని కల్పిత శ్లోకములుగా శ్లోకముల ప్రక్కనే చూపించాము. మేము అలా వ్రాయడము వలన కలియుగము మొదటిలోనే భగవద్గీత మీద వారు చేసిన కుట్ర భగ్నమైపోయినదనీ, దానివలన దేవుని నిజ భావమును నేడు ప్రజలు తెలియుటకు అవకాశమున్నదని చెప్పుచున్నాను. మొదట భగవద్గీత సక్రమముగా పుట్టి, తర్వాత కొంత సంకరమై పోయి నేడు త్రైత సిద్ధాంత భగవద్గీత ద్వారా తిరిగి సక్రమమై పోయినది. ఈ విధముగా భగవద్గీత పుట్టి పెరిగినా, నేడు కూడా బ్రాహ్మణులు వేదములనే భగవద్గీతకంటే గొప్పగా చెప్పుచున్నారు.
3) ప్రశ్న :- భగవద్గీత పుట్టుకను, పెరుగుదలను, అక్రమ మయిన విధానమును, తిరిగి ఇప్పుడు సక్రమమైన విధానమును తెలిపారు. అంతేకాక భగవద్గీతకంటే వేదములు గొప్పవియని చెప్పడము విషపూరితమైన కుట్రయని అన్నారు. నేటికినీ బ్రాహ్మణులు వేదములనే గొప్పగా చెప్పుచున్నా మీరు వ్రాసిన త్రైత సిద్ధాంత భగవద్గీతలో భగవద్గీత మీద జరిగిన కుట్రను
----
తెలిపి కల్పిత శ్లోకములను ప్రకటించడము వలన తమరు వ్రాసిన భగవద్గీత వలన ప్రజలు జ్ఞానమును పొందుచున్నారా?
జవాబు :-మేము వ్రాసిన "త్రైత సిద్ధాంత భగవద్గీత” ద్వారా చాలామంది దైవజ్ఞానమును సంశయరహితముగా తెలుసుకొంటున్నారు. అయితే త్రైతము అనినా, త్రైత సిద్ధాంతము అనినా క్రైస్థవులకు సంబంధించిన బైబిలు బోధలతో కూడుకొన్నదని కొందరు బ్రాహ్మణులు రహస్యముగా ప్రచారము చేశారు. నేడు ధర్మరక్షణ అని పేరు పెట్టుకొని మతరక్షణ చేయు హిందూ నాయకులను, కొందరు స్వామీజీలను రెచ్చగొట్టి మేము హిందువు ముసుగులో క్రైస్థవమును ప్రచారము చేయువారిగా చిత్రీకరించుట వలన కొంతమందిని త్రైత సిద్ధాంత భగవద్గీతను చదవకుండా అడ్డుకోగలిగారు. అయితే వారిని నమ్మని వారందరూ నా భగవద్గీతను చదవడము జరిగినది. అలా చదివిన వారు ఎవరంతకు వారు భగవద్గీత చాలా గొప్పగా యున్నదని ప్రచారము చేయుట వలన నేడు చాలావరకు హిందువులు భగవద్గీతను చదువగలిగారు. అంతేకాక మేము చెప్పు మతసామరస్య బోధలను విని చాలామంది క్రైస్థవులు, ముస్లీమ్లు త్రైత సిద్ధాంత భగవద్గీతను ఇష్టముగా చదివారు. భగవద్గీతలోని బోధలు బైబిలులోను, ఖుర్ఆన్లోను ఉన్నవని చూపించి, వాటి వివరములను కూడా వ్రాయడము వలన నన్ను త్రిమత ఏకైక గురువుగా పేర్కొనడమే కాక దేవుడు ఒక్కడే, దేవుని జ్ఞానము ఒక్కటేయని మూడు మతములవారు తెలియగలిగి, మావద్ద మూడు మతములవారు సామరస్యముగా ఉండుట ప్రత్యక్షముగా చూడవచ్చును. మా బోధలలో తెలిసిన జ్ఞానము వలన మూడు మతములవారు వారి నుదిటి మీద ఒకే చిహ్నమును ధరించి, తిరగడమును ఎవరయినా చూడవచ్చును. మిగతా రెండు మతముల వారు నన్ను, నా గొప్పతనమును అర్థము చేసుకొని,
----
నన్ను గౌరవించుచుండగా, కేవలము హిందువులలో కొందరు, బ్రాహ్మణులచే ప్రేరేపింపబడి నన్ను వ్యతిరేఖించుచున్నారు.
4) ప్రశ్న :- సృష్టి ఆదిలో సోమకాసురుడు వేదములను దొంగలించుకు పోతూయుంటే విష్ణువు మత్స్యావతారమును ధరించి సోమకాసురుని చంపి వేదములను కాపాడి సముద్ర గర్భమునుండి బయటికి తెచ్చి దేవతలకు ఇచ్చాడు అని చెప్పు చుందురు. కృతయుగము మొదటిలోనే వేదములు ఉన్నట్లు తెలియుచున్నది కదా! మీరు ద్వాపరయుగము చివరిలో వ్యాసుడు వేదములను వ్రాశాడు అని చెప్పుచున్నారు. వాస్తవముగా వేదములు కృతయుగములోనివా? లేక ద్వాపరయుగములోనివా? మా ప్రశ్నకు సరియైన జవాబును ఇవ్వమని కోరుచున్నాము.
జవాబు:- కృతయుగము చివరినుండి మేము జ్ఞానులము అనుకొన్నవారు కొందరు, వారికి తెలిసిన సమాచారమును వ్యాసముల రూపములో వ్రాశారు. అలా కొందరు మహర్షులు, ఋషులు, జ్ఞానులము అనువారు వ్రాస్తూ వచ్చిన వ్యాసములు ద్వారపయుగము చివరికి పదివేలుకు పైగా యున్నవి. ఆ కాలములో గ్రంథములు వ్రాయు స్థోమత ఒక్క వ్యాసునికే ఉండేది. అంతవరకూ యున్న పది వేల వ్యాసములలో పదవవంతు అయిన 1108 వ్యాసములను గ్రంథరూపముగా వ్రాసి, వ్యాసములు వ్రాసినవాడు వ్యాసుడు అని పేరు పొందాడు. వేదములు అంతవరకు గ్రంథరూపములో లేవు. గ్రంథరూపమైన వేదములు నాలుగు ద్వాపర యుగము చివరిలో వ్యాసుని
----
ద్వారా బయటికి వచ్చినవి. అంతవరకూ లేని వేదములను ప్రచారము చేయాలను స్వార్థబుద్ధితో, తన వారిమీద గల మోహబుద్ధితో పురాణములను వ్రాసి అందులో కథల ద్వారా వేదములకు విలువ తెచ్చాడు. అప్పుడు ఆయన వ్రాసిన పురాణములు పదునెనిమిది. అందులో 'భాగవతము' అను పురాణములో ఒక కల్పిత కథయందు హిరణ్యాక్షుని విషయమును వ్రాశాడు. హిరణ్యాక్షుని చంపినది విష్ణువు అని వ్రాశాడు. వేదములను కాపాడినవాడు విష్ణువు అని చెప్పారు. భాగవతములోని కథలన్నీ కల్పిత కథలే. పదునెని మిది పురాణములు ఊహించి, కల్పించి వ్రాసినవేగానీ వాస్తవములు కావు. అందువలన భగవద్గీతను వ్యాసుడు వ్రాసిన తర్వాత, భగవద్గీతలోని జ్ఞానమును వ్యాసుడు తెలిసిన తర్వాత తాను వ్రాసిన పురాణములను "పుక్కిడి పురాణములని” తానే అన్నాడు. అబద్దములైతే పుక్కిడి నుండి వచ్చినవనీ, వాస్తవమైనవి అయితే బొడ్డు దగ్గరనుండి వచ్చినవనీ (బొడ్డు గ్రంథములనీ) పోలికతో చెప్పేవారు. పురాణములను వ్రాసిన వ్యాసుడే వాటిని అసత్య పురాణములని, పుక్కిడి పురాణములనడము జరిగినది. అందువలన విష్ణువు, హిరణ్యాక్షుడు అందరూ కల్పితమనీ, కృతయుగములో వేదములు లేవని తెలియవలెను.
5) ప్రశ్న:- విష్ణువు, ఈశ్వరుడు, బ్రహ్మయను త్రిమూర్తులు ఉన్నమాట వాస్తవమే కదా! మీరు విష్ణువునే కల్పితమని చెప్పుచున్నారు. మీరు ఏ ఆధారముతో చెప్పుచున్నారు? మీరు రామాయణము జరిగిన చరిత్రయని చెప్పుచూ, అందులో సీత రావణుని పెంపుడు కూతురుయని చెప్పారు. రామాయణము లో మేము విన్నవాటిని సత్యము కాదన్నారు. రావణుడు సీతను
-----
తీసుకుపోయినది వాస్తవమేయని, అయితే సీతను తన బిడ్డగా తీసుకపోయాడని చెప్పారు. ఇదే విషయమునే మీరు ఏ ఆధారముతో వ్రాశారని ఇతరులు కూడా మీ భక్తులను ప్రశ్నించారు. మీరు చెప్పినవి ఏ ఆధారముతో వ్రాశారని మేము కూడా అడుగుచున్నాము? జవాబు చెప్పండి.
జవాబు :- నేను చిన్న పిల్లప్పుడు నుండి అసలు, నకిలీ అని రెండు పదములను వింటున్నాను. దానినే ఇంకొక భాషలో ఒరిజినల్, డూప్లికేట్ అని కూడా అనుచుందురు. ఒకప్పుడు వంద రూపాయల నోటును బ్యాంకులో నకిలీ నోటుయని తేల్చివేశారు. దాని ప్రక్కనేయున్న మరొక వంద రూపాయల నోటును అసలు నోటుగా చెప్పుచున్నారు. బ్యాంకు వారికి ఆ రెండు నోట్లలో ఏమి తేడా కనిపించినదో నాకు తెలియదు. నేను చూస్తే రెండునోట్లూ ఒకే విధముగా కనిపించుచున్నవి. నాకు రెండూ ఒకే రకముగా యున్నా, బ్యాంకువారు అందులో యున్న చిన్న తేడాను గుర్తించగలిగారు. ఆ తేడాను నేను గుర్తించలేకపోయాను. దాని ప్రకారము డబ్బు విషయములో బ్యాంకువారికున్న నిఘాగానీ, తెలివిగానీ నాకు లేవని తెలిసినది. అదే విధముగా దైవజ్ఞాన విషయములో కూడా అసలు, నకిలీ ఉండడము గలదు. ఆధ్యాత్మికమును జ్ఞాన ధనముగా పోల్చి చెప్పవచ్చును. ప్రపంచ ధనములో అసలు నకిలీ యున్నా బ్యాంకువారు తప్ప మిగతా ప్రజలు గ్రహించలేనట్లు ‘జ్ఞాన ధనము' అను ఆధ్యాత్మికమును ప్రజలందరూ ఏది అసలో, ఏది నకిలో తెలియని స్థితిలోయున్నారు. ప్రస్తుత కాలములో నకిలీ ధనమును అసలు ధనముగా నమ్మి అందరూ దానినే చలామణి చేసుకొంటున్నారు. ప్రపంచ ధనములో బ్యాంకువారు రహస్యముగా యున్న
----
కొన్ని గుర్తులను చూపి ఇవి దొంగనోట్లుయని చెప్పినా, ఆ గుర్తులను తెలియలేనివారు దొంగనోట్లనే మంచి నోట్లుగా నమ్ముచున్నారు. చివరకు బ్యాంకు దగ్గరకి పోయేటప్పటికి, ఆ ధనమును బ్యాంకువారు మంచి దానిగా ఆమోదించరు. వారివద్ద దానిని జమ చేసుకోరు. బ్యాంకుకు పోయిన మనిషి వెనుతిరిగి రావలసిందే.
అదే విధముగా జ్ఞానధనము ఆధ్యాత్మికము కానిదీ, ఆధ్యాత్మికము అయినదీ రెండు రకములు గలదు. ఆధ్యాత్మికము అయినది అయితే ఆత్మకు సంబంధించినది. ఆధ్యాత్మికము కానిది అయితే ఆత్మకు సంబంధించినది కాదు. ఆధ్యాత్మికము అయినది మంచి నోటు అయినట్లు మంచి జ్ఞానము అనీ, ఆధ్యాత్మికము కానిది దొంగనోటు అయినట్లు దొంగ జ్ఞానము అని చెప్పబడును. అసలు, నకిలీ రెండు నోట్లు ప్రపంచ ధనములో యున్నట్లు అసలు ఆధ్యాత్మికము, నకిలీ ఆధ్యాత్మికము అని రెండు యున్నవని చెప్పవచ్చును. అసలు ఆధ్యాత్మికములో మూడు ఆత్మలు ఉండగా, ఆధ్యాత్మికము కాని నకిలీ ఆధ్యాత్మికములో ముగ్గురు మూర్తులు గలరు. నిజమైన ఆధ్యాత్మికములో పరమాత్మ, ఆత్మ, జీవాత్మయని మూడు ఆత్మలు ఉండగా, అబద్దపు ఆధ్యాత్మికములో అనగా ఆధ్యాత్మికము కాని దానిలో విష్ణు, ఈశ్వర, బ్రహ్మయని ముగ్గురు దేవతలు గలరు. నిజమైన ఆధ్యాత్మికము లో పరమాత్మ పెద్దకాగా, నకిలీ ఆధ్యాత్మికములో విష్ణువు పెద్దగా యున్నాడు. నేడు ఆధ్యాత్మికములోయున్నామనుచూ ఆధ్యాత్మికము కానటువంటి దేవతలను అందరూ ఆరాధించుచున్నారు.
అసలయిన ఆధ్యాత్మికములో పెద్దగాయున్న పరమాత్మ ఎవరి చేతా సృష్ఠింపబడనివాడు. అదే నిజమైన ఆధ్యాత్మికముకానీ, నకిలీ ఆధ్యాత్మికములో చెప్పబడు పెద్ద దేవుడు అయిన విష్ణువు సృష్టింపబడినవాడు. అదే విధముగా
---
సృష్ఠింపబడని పరమాత్మను బ్రహ్మయనియూ, పరమాత్మను తెలియు విద్యను బ్రహ్మవిద్య అనియూ అంటున్నారు. బ్రహ్మవిద్యలో ఆత్మను ఆరాధించడము ఉండును. సృష్ఠింపబడిన విష్ణువును గూర్చి తెలియు దానిని జ్ఞానము అని కొందరు చెప్పుకొనినా, విష్ణువును గురించి తెలియునది పురాణము యని చెప్పవచ్చును. పురాణములో (వేదవిద్యలో) విష్ణువును ఆయన క్రిందయున్న దేవతలను ఆరాధించడము యుండును. నేడు స్వామీజీలు అని చెప్పుకొను వారు, బోధకులమని చెప్పుకొను గురువులు, పీఠాధిపతులమని చెప్పుకొను వారు అందరూ కలిసి 99 శాతము మంది వేదవిద్యను ఆశ్రయించి దేవతలను ఆరాధించు వారే గలరు. 'నూటికి ఒక్కడు' అని ఈ పరిస్థితిలో చెప్పలేము గానీ, భగవద్గీతలో చెప్పినట్లు 'వేయింటికి ఒకడు' కూడా ఆత్మ జ్ఞానమును తెలియుచున్నాడని చెప్పుటకు వీలులేదు. కొన్ని వేలమందికో, లేక కొన్ని లక్షలమందికో అసలయిన ఆధ్యాత్మికము ప్రకారము పరమాత్మను, ఆత్మను తెలియవలెననువారు అరుదుగా యున్నారని చెప్పవచ్చును. కొన్ని లక్షలమందికి అదియూ అరుదుగా ఆత్మజ్ఞానమును తెలియువారుండగా, మిగతావారందరూ నకిలీ ఆధ్యాత్మికములో యుంటూ వేదవిద్య మీదనే ఆధారపడి, దేవతలనే ఆరాధించుచున్నారు.
బ్రహ్మవిద్య ప్రకారము ఆత్మజ్ఞానముతో కూడుకొన్నదే అసలయిన ఆధ్యాత్మికము అని మేము మొదటి నుండి చెప్పుచునే యున్నాము. వేదములు, వేదములను ప్రచారము చేయు పురాణములు, వేదముల ప్రకారము గొప్పగా చెప్పబడు విష్ణు, ఈశ్వర మొదలగు దేవతలు కల్పితమని చెప్పుచునే యున్నాము. దేవతలు సృష్ఠింపబడినవారనీ, వారిని గొప్పగా చెప్పడము అంతయూ కల్పితమనీ, నేను భగవద్గీతను ఆధారము చేసుకొని చెప్పుచున్నాను. బ్రహ్మవిద్యను ఆశ్రయించిన నేను ఆత్మవాదిని, మిగతా
---
స్వాములు వేదవిద్య ఆశ్రయించినవారై దేవతావాదులుగా యున్నారు. ఆత్మను ఆరాధించువారే నేను నిజమైన జ్ఞానులని వారి ప్రక్కనే వాదించు చుందును. మిగతా స్వాములు దేవతలను ఆరాధించువారే నిజమైన జ్ఞానులు అని అంటున్నారు. త్రేతాయుగములోని రావణబ్రహ్మను గురించి నేను కొన్ని సత్యములను చెప్పాను. అయితే నేను చెప్పిన మాటలు కొందరికి జీర్ణము కాక నేను ఆధారరహితముగా మాట్లాడుచున్నానని అంటున్నారు. నాకు అలా మాట్లాడవలసిన అవసరము లేదు. నేను ఏమి మాట్లాడినా అది శాస్త్రబద్దతతోనూ, హేతుబద్ధతతోను కూడుకొనియుండును. నేను ఎవరికీ తెలియని రహస్యములను చెప్పినప్పుడు నన్ను అదే పనిగా విమర్శించువారు ఎవరికీ తెలియనిది మీరు ఎలా చెప్పారు? ఏ ఆధారముతో చెప్పారని అడుగుచున్నారు.
ఒక క్రొత్త రహస్యము చెప్పినప్పుడు చెప్పినవాడే దానికి ఆధారము. చెప్పబడినది రహస్యమైనప్పుడు దానికి ఇంకొక ఆధారమంటూయుండదు. అలా ముందే అది ఆధారముతో కూడుకొనియుంటే చెప్పబడినది రహస్యము కాదు. మొదట మార్కోని అనునతడు రేడియోను కనుగొన్నాడు. అంతవరకు రేడియో ఎవరికీ తెలియదు. అయితే మార్కోని అనునతడు రేడియోను గురించి ఏ ఆధారముతో చెప్పుచున్నాడు. ఏ ఆధారముతో కనుగొన్నాడు అని ప్రశ్నించితే అది తెలివితక్కువ ప్రశ్నయగును. రేడియోను గురించి ముందే ఆధారము యుంటే అది రహస్యమయినది కాదు. అంతవరకు ఎవరికీ తెలియని రేడియోను తయారు చేసినవాడే రేడియోకు ఆధారము అని చెప్పవచ్చును. అంతేగానీ రేడియోకు అంతకుముందు ఆధారము లేదు కదా! కృష్ణుడు భగవద్గీతను చెప్పాడు, అంతవరకూ తెలియని ఆత్మల వివరమును కృష్ణుడు చెప్పడము జరిగినది. అయితే కృష్ణుడు ఏ ఆధారముతో
--
ఆత్మయుందని చెప్పాడు అంటే “అంతకుముందు తెలియనిది తెలియ బడినప్పుడు మొదట చెప్పినవాడే దానికి అసలైన ఆధారము” అని చెప్పవచ్చును. ఏది అడుగవచ్చును, ఏది అడుగకూడదను పరిజ్ఞానము ఉన్నప్పుడే ప్రశ్నించ వచ్చును. అట్లుకానిది అనవసర ప్రశ్న వేస్తే అది చొప్పదంటు ప్రశ్న అగును. 'దూడ మూరెడు, దంటు బారెడు' ఉన్నప్పుడు దూడ దంటును తిన్నదంటే దూడ వెనుక బయటికి రాలేదే అని అడిగినట్లుండును. అది చొప్పదంటు ప్రశ్నయని చెప్పబడును. అందువలన అడిగేవానికి విచక్షణ మరియు వివేకము ఉండవలెనని పెద్దలు చెప్పుచుందురు.
రావణబ్రహ్మ 99 సంవత్సరముల వయస్సులో అడవిలో యున్న సీతను తీసుకపోయినది వాస్తవమే. సీతాదేవి రావణుడు పిలుస్తూనే మారుమాట చెప్పకుండా ఆయన వెంటపోయినది వాస్తవమే. సీతను రావణబ్రహ్మ పుత్రికా వాత్సల్యముతో లంకకు తీసుకపోయాడు. కొంత ఎత్తుగా యున్న పుష్పక విమానమును సీత ఎక్కలేదని సీత కాళ్ల క్రిందయున్న భూమితో సహా ఎత్తి విమానములో పెట్టాడు అని మేము చెప్పియున్నాము. దానికి ఒక బ్రాహ్మణుడు 99 సంవత్సరముల ముసలివాడు అయిన రావణుడు భూమితో సహా ఎత్తిపెట్టినాడని వ్రాశారు కదా! భూమితో సహా ఎత్తిన బలము గల రావణునికి మగతనములో కూడా బలముండును కదా! ఆమెను కామగుణముతోనే ఎత్తుకపోయాడని వాల్మీకి రామాయణములో ఉన్నది. వాల్మీకి రామాయణ ఆధారముగా ఆమెను కామగుణముతోనే ఎత్తుకు పోయాడని చెప్పుచున్నాము అని అన్నారు. అంతేకాక మీరు వ్రాసిన దానిలో 99 సంవత్సరముల వయస్సులో భూమిని ఎత్తే బలమున్నప్పుడు, సీతను అనుభవించాలను బలము ఎందుకు ఉండదు? అని అంటున్నారు.
---
శరీర బలమునకు, గుణ బలమునకు ముడిపెట్టి మాట్లాడడము తెలివితక్కువ కాదా!యని అంటున్నాను.
ముసలివారయినప్పటికీ ఎందరో బలమైన శరీరము గలవారుండ వచ్చును. బలమున్నంత మాత్రమున శరీరములో శృంగార సామర్థ్యము ఉన్నట్లేనా? ఈ మాట అడిగినది ఒక టీవీ యాంకర్గా పనిచేయు బ్రాహ్మణుడు. ఈ ప్రశ్న అడుగడములోనే వారి దుర్బుద్ధి బయటపడుచున్నది. మేము చెప్పినదే మీరు వినాలి. మేము చెప్పినదే సత్యము అని చెప్పుచూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. వారు చెప్పేది వాల్మీకి రామాయణములో చెప్పిన విషయమునే చెప్పుచున్నారు. అడవిలో నివసించు వాల్మీకికి బయట ప్రపంచములో ఏమి జరిగినది తెలియదు. సీత తన ఆశ్రమమునకు వచ్చిన తర్వాత రాముని విషయము కొంత సీత ద్వారా తెలిసినది. రామునిది తప్పని తెలిసిన వాల్మీకి తెలుసు సీత, రాముని పుత్రులయిన లవకుశ అను ఇద్దరికి రాముడు తమ తండ్రియను విషయము తెలియకుండా పెంచారు. రాముడు ఒక రాజు అని తెలిసినా, ఆయనే తమ తండ్రియని తెలియదను విషయము రాముడు అశ్వమేథయాగము చేసినప్పుడు, రాముని అశ్వమును బంధించినప్పుడు, లవకుశులు రామున్ని ఎదిరించి మాట్లాడి నప్పుడు మనకు తెలిసినది. వాల్మీకి మహర్షికి కొంత సత్యము సీత ద్వారా తెలిసినా, ఆ విషయములను రామాయణ గ్రంథములో వ్రాయకుండా తాము చెప్పినట్లు బలవంతము చేసి వాల్మీకి ద్వారా వ్రాయించినవారు ఎవరో బయటి ప్రపంచమునకు తెలియదు. అది తెలియవలసిన అవసరము కూడా ఇప్పుడు మనకు లేదు. అయినా ఆ కాలములో ప్రపంచములోనే గ్రంథములు వ్రాయు స్థోమతగల కవి వాల్మీకి ఒక్కడే. అంతేకాక ప్రపంచమునకంతటికీ ఆది కవి వాల్మీకి ఒక్కడే. వాల్మీకి వల్మీకములో (పుట్టలో) కొంతకాలము
---
తపస్సు చేశాడు, కనుక ఆయనకు వాల్మీకి అను పేరు వచ్చినది. వాల్మీకి బోయకులములో పుట్టినవాడు.
బోయకులములో పుట్టిన వాల్మీకి తప్ప ఆ రోజులలో ఇతర కవి అనువాడు లేడు. అటువంటి సందర్భములో రాముని చరిత్రను వాల్మీకి చేత వ్రాయించి, రాముని తప్పులు బయటపడకుండా చూచినవాడు ఆనాటి విశ్వామిత్రుడని కొందరికి తెలుసు. తాను పెళ్లి చేస్తే రాముడు సీత ఎడల అనుచితముగా ప్రవర్తించుట వలన, పెళ్లి చేసిన తనకు చెడ్డ పేరు వస్తుందని ఆలోచించిన విశ్వామిత్రుడు, వాల్మీకి చేత ఒప్పించి ఆయనమును రాముని వైపు త్రిప్పిన రామాయణములో కొన్ని అసత్యములను వ్రాయించాడు. రామాయణమును గురించి ఆలోచిస్తే రామాయణములో కొన్ని సత్యములు, మరికొన్ని అసత్యములు ఉన్నట్లు బుద్ధియున్న వారికి ఎవరికైనా తెలియ గలదు. రామాయణమును వ్రాసిన వాడు వాల్మీకియని ప్రచారము చేసిన వారు బ్రాహ్మణులే. తర్వాత వాల్మీకి బోయవాడని అసూయపడినవారు బ్రాహ్మణులే. తర్వాత రామాయణము వ్రాసినవాడు వాల్మీకి ఒక్కడే కాదుయని ద్వాపరయుగములో విద్యావంతులైన బ్రాహ్మణులు తమ పేరుమీద ప్రత్యేకముగా రామాయణ చరిత్రలు వ్రాశారు. అటువంటి రామాయణములు దాదాపు రెండు పదుల సంఖ్యలో గలవు. ఇరువది గ్రంథములుగాయున్న రామాయణములకు వేరువేరు పేర్లు పెట్టుకొని వారి గుర్తింపులు వచ్చునట్లు చేసుకొన్నారు. అటువంటి రామాయణములో జైన్ లేక జైని రామాయణము అను గ్రంథములో సీత, రావణబ్రహ్మ కూతురు అని వ్రాశారు. అది వాస్తవమైన విషయమే, సీత రావణబ్రహ్మకు స్వయానా కన్న కూతురు కాదు, భూమిలో దొరికిన బిడ్డయని కూడా వ్రాశారు.
----
నా లెక్క ప్రకారము సీత భూమిలో దొరికిన బిడ్డయని వ్రాసినా, అందులో ఇతరులకు తెలియని ఒక సత్యము గలదు. అది ఏమనగా! సీత ఎవరికి పుట్టిన బిడ్డయో ఆ దేవునికే తెలియాలిగానీ ఇతరులకు ఎవరికీ తెలియదు. మనుషులు ఎవరూ భూమిలో పుట్టరు. సీత మనుషులకు పుట్టిన బిడ్డయే. అయితే ఆమె కన్నతల్లి ఎవరయినది తెలియదు గానీ, ఆమె తల్లితండ్రులు లంకలోని వారే, రావణుడున్న పట్టణములోని వారేయని తెలియుచున్నది. సీత ప్రసవింపబడిన సమయములో ఆమె శరీరములోనికి జీవుడు ప్రవేశించలేదు. మొదటి శ్వాస రానందున ఆత్మ, జీవాత్మ శిశు శరీరములో ప్రవేశించనందున, చనిపోయిన బిడ్డ పుట్టిందని అనుకొన్న తల్లి తండ్రులు శిశు శరీరమును ఊరి ప్రక్కన లోతైన గుంతలో పారవేసి పోయారు. అలా పారవేసిపోయిన కొంతసేపటికి శిశువుకు ప్రాణము వచ్చి ఏడుస్తుండగా చూచిన సైనికులు, ఆ విషయమును నిమిషముల వ్యవధిలో రావణబ్రహ్మకు చేరవేయగా, లంకకు చక్రవర్తియైన రావణుడు వెంటనేపోయి లోతైన గుంతలో నుండి శిశువును తెచ్చుకొని ఆమెకు సీతయని పేరు పెట్టి బిడ్డవలె పోషించే వాడు. అలా నాలుగు సంవత్సరములు గడచిన తర్వాత రావణబ్రహ్మకు శిష్యుడు అయిన జనక మహారాజు తనకు సంతతి లేదని, సీతను తాను బిడ్డవలె పెంచి పెద్ద చేస్తానని రావణబ్రహ్మను కోరగా, ఆ విధముగానే రావణబ్రహ్మ సీతను జనకునకు దత్తతకు ఇచ్చాడు. అప్పటి నుండి సీత జనక మహారాజు పెంపుడు కూతురుగా పెరిగినది. సీత పెద్దదయిన తర్వాత మొదట రావణబ్రహ్మ వద్ద నాలుగు సంవత్సరములు పెంచబడ్డానని తెలుసుకొన్నది. అంతేకాక తన తండ్రియైన జనకునికి రావణబ్రహ్మ ఆధ్యాత్మిక గురువని కూడా జనకుని ద్వారా తెలియగల్గినది. అప్పటి నుండి రావణబ్రహ్మ దర్శనము కొరకు ఎదురు చూచెడిది. వనవాస
-----
సమయములో రావణబ్రహ్మ తన విమానములో సీతవద్దకు రావడము సీతకు సంతోషమైనది. ఆయన దర్శనము వలన ఆమె సంతోషపడడమేకాక చేతులెత్తి భక్తి పూర్వకముగా నమస్కారము చేసినది. దానికి రావణుడు కూడా సంతోషించి సీతను లంకకు తీసుకపోవుచున్నానని చెప్పి తీసుకు పోవడము జరిగినది. రామునికి చెప్పకుండానే తీసుకుపోవాలని కూడా చెప్పి సీత సమ్మతితోనే తీసుకపోవడము జరిగినది. జరిగిన వాస్తవమును వక్రీకరించి వాల్మీకి రామాయణములో వ్రాయించడము జరిగినది.
వాల్మీకి రామాయణములో కొన్ని సత్యములు కొన్ని అసత్యములు రెండూ ఉన్నవి. త్రేతాయుగములోనే ఆర్యుల ప్రభావము భారతదేశములో ఉండుట వలన రామునికి లంక యుద్ధములో ఉపయోగపడి యుద్ధము చేసిన గిరిజనులను మనుషులుగా చూడక, మనుషులకంటే హీనముగా కోతులుగా చిత్రించి రామాయణములో వ్రాయించారు. మనుషులను కోతులు అని చెప్పిన రామాయణమును గ్రుడ్డిగా నమ్మునట్లు బ్రాహ్మణులే చేశారు. దానిలోని అసత్యములను ఎక్కడయినా, ఎవరయినా ప్రశ్నించితే వానిని రాముడు దేవుడు కాదన్నాడని ఆరోపణ చేసి, అందరికీ శత్రువగునట్లు చేయుచున్నారు. అదే ఉద్దేశ్యముతోనే నన్ను కూడా ప్రజలకు శత్రువుగా చూపాలని చేయు ప్రయత్నములో రాముడు దేవుడు కాదన్నానని నన్ను దుష్ప్రచారము కూడా చేశారు. రాముడు దేవుడో కాదో నాకు తెలియదు కానీ నేను అసలు ఆధ్యాత్మికమును బోధించుచున్నాను. నకిలీ ఆధ్యాత్మికమును బోధించు వారందరూ కనిపించే రామున్నే కాకుండా, కనిపించని దేవతలను కూడా దేవునిగా చిత్రించి చూపుచున్నారు. దేవుడు మనిషిగా వచ్చినా అసలయిన ఆధ్యాత్మికము ప్రకారము ఆయనను దేవుడు అని అనకూడదు. దేవుని అవతారమైన మనిషిని 'భగవంతుడు' అని
---
అనాలి. అంతేగానీ ఏ మనిషినీ దేవుడను పేరుతో చెప్పకూడదు. మనిషిని దేవుడు అనకూడదు అనీ, దేవుడే మనిషిగా వచ్చినా ఆయనను భగవంతు డనాలనునది ఆధ్యాత్మిక సిద్ధాంతము, ఆ సిద్ధాంతమును మేము చెప్పాము గానీ ప్రత్యేకించి రామున్ని గురించి చెప్పలేదు.
వేదవాదము అసలయిన ఆధ్యాత్మికమును సూచించదని, వేద వాదులు సుఖములను స్వర్గమును గురించి చెప్పుచుందురు గానీ, మోక్షమును గురించి కాదని, అసలయిన ఆధ్యాత్మికము తెలియాలంటే గుణ విషయము లతో కూడుకొన్న వేదములను వర్ణింపవలయునని (వదలి వేయవలెనని) భగవద్గీతలో సాంఖ్యయోగమున వరుసగా 41, 42, 43, 44, 45, 46 శ్లోకములందు చెప్పియున్నారు చూడండి.
శ్లో॥ 42.
యామిమాం పుష్పితాం వాచం ప్రవద న్వవిపశ్చితః |
వేదవాదరతాః పార్థ! నాన్య దస్తీతి వాదిన ః ।
వివరము :- స్వర్గముతో సమానమైన సౌఖ్యము లేదుయని వేదములను తెలిసినవారు, వేదమును తెలుపు వేదవాదులు చెప్పుచుందురు. అటువంటి వారు జ్ఞానము లేనివారై పుష్పములలోని తేనెవలె తీయని మాటలు చెప్పు
చుందురు.
శ్లో॥ 43.
కామాత్మాన స్స్వర్గ పరా జన్మ కర్మఫల ప్రదామ్ |
క్రియావిశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి ॥
వివరము :- స్వర్గ సుఖములయందు ఆశ కల్గిన వేదములను మాట్లాడు వారి, బోధించువారి మాటలు జన్మ కర్మములను కలుగజేయునవి, అనేక కార్యములను చేయించునవి, సుఖభోగములను ఇచ్చునవిగా ఉండును.
---
శ్లోకము 44.
భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పహృత చేతసామ్ ।
వ్యవసాయాత్మికా బుద్ధి స్సమాధాన విధీయతే ॥
వివరము :- అటువంటి కోర్కెల చేత నిండిన మనస్సు గలవారు సుఖమునే కోరుకొను కార్యములను చేయుచుందురు. వారి మనస్సుకు ఎప్పటికీ ఆత్మను తెలియు జ్ఞానము రుచించదు. వారికి వేదములే జ్ఞానముగా
కనిపించుచుండును.
శ్లో॥ 45.
త్రైగుణ్య విషయా లేదా నిసైగుణ్యో భవార్జున! ।
నిర్ద్వంద్వో నిత్య సత్వజ్ఞ నిర్యోగ క్షేమ ఆత్మవాన్ ॥
వివరము :- 'వేదములనగా మూడు గుణముల విషయములని తెలియుము. మూడు గుణ విషయములయిన వేదములు సూచించు ద్వంద్వములు అయిన సుఖదుఃఖ, లాభనష్టములను వదలియుండవలెను.
ఈ విధముగా నాల్గు శ్లోకములలో వేదములను బోధించు వారి విషయమును భగవంతుడు చెప్పాడు. వేదముల వలన సుఖముల ఆశ తప్ప ఏమీ లేదని చెప్పారు. వేదముల వలన ఆత్మజ్ఞానము మనిషి ఏమాత్రము తెలియడని చెప్పాడు. అంతేకాక వేదములు అనేక గుణముల విషయములను ప్రేరేపించి వాటి కార్యములనే చేయునట్లు చేయును అని కూడా చెప్పాడు. తర్వాత చివరిలో 46వ శ్లోకమున ఈ విధముగా చెప్పారు చూడండి.
శ్లోకము 46.
యావానర్ధ ఉదాపానే సర్వత స్సంపుతోదకే । తావాన్ సర్వేషు వేదేషు బ్రహ్మణస్య విజానత ః |
భావము :- సమృద్ధిగా యుండు చెరువులోని నీరును మనిషి అవసరమునకు తగిన విధముగా వాడుకొనునట్లు, వేదములలోని సర్వ విషయములందును
----
జ్ఞానియైన మనిషి తనకు కావలసిన దానిని మాత్రము అవసరమునకు తగినట్లు తీసుకొనును.
ఇక్కడ ఈ శ్లోకములో ప్రపంచములో వ్యవహరించు మనిషి, పెద్ద చెరువునుండి తనకు అవసరమున్న కొద్దిపాటి నీరును తీసుకొని ఉప యోగించుకొనునట్లు, అనేక విషయములతో నిండిన వేదముల నుండి తనకు అవసరమైన విషయమును మాత్రము స్వీకరించును. చెరువులోని నీటినంతటినీ మనిషి వాడుకోనట్లు, జ్ఞాని అయినవాడు వేదముల విషయములన్నిటినీ చూడక (తీసుకొనక) తనకు ప్రపంచములో ఉప యోగపడు కొద్దిపాటి విషయమును స్వీకరించును. వేదముల ఎడల తెలివిగా ప్రవర్తించి అజ్ఞానమును కలుగజేయువాటిని వదలి ఆధ్యాత్మికమును కలుగజేయు వేదాంతములోనికి పోవును. వేదముల అంతములో అనగా మూడు గుణముల తర్వాత యున్న ఆత్మ నిలయమైన ఆత్మజ్ఞానమును తెలుపునది అని అర్థము.
ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీతలో వేదమును గురించి దేవుడు (భగవంతుడు) చెప్పిన విధానమును సాంఖ్యయోగము అను అధ్యాయములో వరుసగా ఐదు శ్లోకములందు చూచాము కదా! వేదముల వలన జ్ఞానము కలుగదు అని చెప్పియున్నా, దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేఖముగా నేటికినీ వేదములను విడువకుండా యుండు బ్రాహ్మణులు, మాలాంటివారు వేదములను కాదని ఆత్మవిద్యను చెప్పితే, అట్లు చెప్పువారు హిందువులు కాదని, హిందువులకు వ్యతిరేఖముగా బోధించు అన్యమత ప్రచారకులని ఆరోపించుచూ హిందువులలోని కొంతమందిని ప్రేరేపించి మాలాంటి దైవజ్ఞానమును, ఆధ్యాత్మికమును బోధించువారి మీదికి పంపి దాడులు చేయిస్తున్నారు. అటువంటి బ్రాహ్మణుల ఉచ్చులో పడినవారు హిందూ
---
ధర్మములను రక్షించువారిగా చెప్పుకొనునట్లు తెలివిగా బ్రాహ్మణులే తయారు చేశారు. నేడు హిందూ ధర్మరక్షణ అను పేరుతో ఏ సంఘములు తయారయినా వాటి వెనుక మూలాధారముగా బ్రాహ్మణులే యున్నారు. బ్రాహ్మణులు హిందూ సమాజములోని వారందరినీ తమ చెప్పు చేతులలో పెట్టుకొను నిమిత్తము అనేక పేర్లు గల హిందూ సంస్థలను తయారు చేసి, జ్ఞానము తెలిసిన గురువుల మీదికి, వేదములకు వ్యతిరేఖముగా బోధించు ఆధ్యాత్మికవాదుల మీదికి ఉసిగొల్పుచూ, హిందువుల చేతనే హిందూ గురువులను అణచివేస్తూ వారి దారికి అడ్డము లేకుండా చేసుకొంటున్నారు. అటువంటివారి ప్రయత్నములో భాగముగా హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ లోయుండు మా భక్తుల మీద, మీరు అన్యమత ప్రచారకులని ధీరజ్ రెడ్డి అను వ్యక్తి అతని గుంపుతో వచ్చి దాడి చేసిపోయాడు. అతని పరిచయము ఏమీ తెలియని మేము అతను ఎవరు అని విచారించగా, తప్పుడు ఆరోపణతో ఎందుకు దాడి చేశాడు అని తెలియగా, అతను హిందూ ధర్మరక్షణ చేయు ఒక సంఘములో పని చేయుచున్న ఒక నాయకుడు అని తెలిసినది. దాడి చేసినవాడు రెడ్డియే (ధీరజ్ రెడ్డి, దాడి చేసినది రెడ్డి మీదికే (భాస్కర్ రెడ్డి మీదికి). ఒక రెడ్డి ఇంకొక రెడ్డిని కొట్టాడు అంటే రెడ్డి వేలుతో రెడ్డి కన్నును పొడిచినట్లున్నది. అలా ఒక రెడ్డి ఇంకొక రెడ్డిని అన్యమత ప్రచారమనే సాకుతో దాడిచేయడము వెనుక వేదవాదులయిన బ్రాహ్మణుల హస్తమున్న దని మేము గ్రహించాము. ఈ విధముగా వేదములను కాదని ఆధ్యాత్మికము వైపు పోవువాడు హిందువే అయివున్నా అతనిని హిందువు చేతనే వేదించుచూ, భౌతిక దాడులు చేయుచూ, వారి చేతికి మన్ను అంటకుండా, వారి పేరు బయటికి రాకుండా కొందరు బ్రాహ్మణులు ప్రవర్తించుచుందురు. ఇదే విషయమునే (10 టీవీ) ఛానల్లో తేది
---
28.12.2017 రాత్రి 8.00 గంటల సమయములో “మల్లన్న ముచ్చట్లు” అను కార్యక్రమములో చెప్పిన విషయమును చూద్దాము.
“మల్లన్న ముచ్చట్లు”.
(తేది : 28.12.2017 - రాత్రి 8.00 గంటలకు)
యాంకర్ :- మనుధర్మశాస్త్రము గురించి చెప్పినా కదా! మన దేశములో కులాలను తయారు చేసిన పవిత్ర గ్రంథము గురించి. అదో ఆ దాని గురించి పంచాయితీ గట్టిగనే అయితావున్నది తెలంగాణలో. మనిషిని మనిషిగా గుర్తించలేని శాస్త్రాన్ని తలగ బెట్టుడుగాదు, పాతిపెట్టాలని అంటున్నడు తమ్మినేని వీరభద్రం సారు. భారతదేశములో మనుధర్మశాస్త్రం మనుగడలో ఇంకా ఎందుకు ఉన్నదనే ముచ్చట ఒకటి చూడండి.
తమ్మినేని వీరభద్రం :- మనుధర్మశాస్త్రాన్ని ద్వేషించాలి. వాస్తవమైన హిందువులు కూడా మనుధర్మశాస్తాన్ని ద్వేషించాల్సిన అవసరము ఉంది. ఎందుకంటే హిందూ మతము అంటే కేవలము బ్రాహ్మణ, వైశ్య లేక అగ్ర కులాల పెత్తనమే కాదు. మిగతా కులాల అందరినీ హిందువులు అన్నప్పుడు ఆ కులాలను ద్వేషించే శాస్త్రాన్ని హిందూ ధర్మ శాస్త్రం అని ఎట్ల అంటారు?
----
యాంకర్:- అదే కదా వచ్చిన అసలు పంచాయితీ BC, SC, ST ప్రజలారా! మిమ్ములను అంటరానోళ్ళని చేసిన మనుధర్మశాస్త్రాన్ని తలగబెట్టిండ్రని BJP వాళ్ళు, RSS వాళ్ళు పంచాయితులు చేస్తున్నరు. మనుధర్మశాస్త్రము ఏమి చెప్పింది. బాపనోళ్లు గొప్పోళ్లు అని చెప్పింది. కానీ భారతదేశములో బాపనోళ్ల జనాభా ఎంతవున్నది. బహుజనులు గట్టిగా తుమ్మితే కొట్టుకపోతరు గాలికి. అంత తక్కువ వున్న వాళ్లు ఇంకా ఎట్లా ఈ శాస్త్రాన్ని కాపాడు తున్నరో తెలుసా మనదేశములో? వాళ్లకు బహుజనులను ఎదురించే ధైర్యము లేక ఇదే BC, SC, ST పిల్లలకు హిందూ ధర్మము అని తగిలించి మనుధర్మశాస్త్రాన్ని రక్షించు కొనేటందుకు బహుజన పిల్లలనే సైన్యంగా మలచుకొని బహుజనుల మీదికే దాడులు చేపిస్తావుంటరు. ఇండ్ల ఒక్క బాపనాయనకు కూడా దెబ్బతాకదు. వాళ్ళు గడ్డమీద కూర్చొని మన వేళ్ళతోనే మన కన్నునే పొడుస్తావుంటా రన్నట్టు. మన పిల్లలకు కనుక మనుధర్మశాస్త్రంలో వున్న అసలైన ముచ్చట తెలిస్తే అప్పుడు RSS, BJP దిక్కు నిలబడ రన్నట్టు. కానీ మన పోరగాళ్లకు అది తెల్వనివ్వరు. కేవలము బాపనోళ్లు బ్రతుకు తెరువుకోసము మన పోరగాళ్లను పావులను చేసి ఆడిస్తావున్నరు. BC, SC, ST బిడ్డల్లారా! మీకు తెల్వకుండానే మీరు బాపనోళ్ల ట్రాకులో పడి మీ జాతులకు అన్యాయము చేస్తున్నరు. ఇప్పటికన్నా మేల్కోండి!
----
నీ నుదిటికి కులాన్ని రాసినోన్ని భరతం పట్టాల్సింది పోయి వాని మాయలో పడి వాడు కొట్టుకపోవుడంటే నీ శవాన్ని నువ్వే భుజాన వేసుకొని మోసుక పోతున్నట్లే అనే ముచ్చట యాది పెట్టుకోండ్రి.
పాట :-
సమతా మమతల రాజ్యం పంచే
హృదయం మాకుంది
కులాల మతాల ఎల్లలు ఎరగని
స్ఫూర్తి బహుజనులది!
అరే! మనువా! దానికి మరణశాసనం
రాస్తున్నాము ఇదిగో!
కౌటిల్యానికి పాడికట్టెలు మోస్తూ....
పిల్లి కళ్లు మూసుకొని పాలు త్రాగి నన్ను ఎవరూ చూడలేదన్నట్లు ప్రవర్తించినా, ఆ దొంగపనిని ఇతరులు ఎవరో ఒకరు చూచియుందురు. అదే విధముగా అజ్ఞాన భూయిష్టమైన, విషయములతో కూడిన, ఆధ్యాత్మికము నకు వ్యతిరేఖమయిన, ఇందూ (హిందూ) ధర్మమును తెలియకుండా చేసి అధర్మములను ప్రచారము చేయు వేదములను బ్రాహ్మణులు ఇష్టముగా స్వీకరించి దేవుడు చెప్పిన దైవ గ్రంథమునకు కూడా వ్యతిరేఖమయినారు. ఆ విషయమును కప్పిపుచ్చుకొనుటకు అనేక మంది బ్రాహ్మణులు స్వామీజీలుగా మారిపోయి, వేదములు హిందువుల ప్రమాణ గ్రంథములనీ, వేదములలో సనాతన ధర్మమున్నదని చెప్పుచూ, అధర్మములను ధర్మములుగా చూపుచున్నారు. వారి దారికి అడ్డు వచ్చిన మాలాంటివారిని హిందువులే దూషించునట్లు ప్రేరేపించుచున్నారు. అదే కుట్ర నేటికినీ మా మీద
----
జరుగుతున్నది. హిందువులలో అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతములను ప్రతిపాదించిన సిద్ధాంతకర్తలవలె నేను త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించడమే కాక, ఒకే సిద్ధాంతము మీద వంద (100) గ్రంథములకు పైగా వ్రాసిన నన్ను, హిందువుల చేతనే ఆరోపణలను చేయించడమే కాక, ప్రతిరోజు ఏదో ఒక ఆరోపణను సృష్టించి సోషల్ మీడియా అయిన ఫేస్బుక్లో పెట్టడము జరుగుచున్నది. ఇతరులతో డబ్బు తీసుకొని నా మీద ఆరోపణలు చేయుచూ మాట్లాడు హిందువులు నేడు కలరు. దీనికి పూర్తి పుణాదిగా యున్నవారు స్వామీజీ వేషములో యున్న బ్రాహ్మణులేయని నాకు బాగా తెలుసు. వారివలె నేను వేదాలను చెప్పను, ఉపనిషత్తులను చెప్పను. నేను చెప్పినది స్వచ్ఛమయిన ఆధ్యాత్మికము.
నా గ్రంథములను చదివినవారు ఎవరూ నన్ను ఆరోపించడము లేదు. నా గ్రంథములోని ఆత్మజ్ఞానమునకు ఎందరో ప్రజలు ఆసక్తులై సంపూర్ణ జ్ఞానులుగా మారియున్నారు. సంపూర్ణమైన ఆత్మజ్ఞానము తెలిసిన తర్వాత వేదవాదులు ఎంతగా నన్ను విమర్శించినా అవన్నియూ తప్పుడు ఆరోపణలని ప్రజలే గ్రహించుచున్నారు. మావద్ద స్వచ్ఛమయిన జ్ఞానుల సంఖ్య ప్రతి నెలా పెరుగుచునే యున్నది. నేను బోధించు ఆత్మజ్ఞానము మూడు మతముల వారిని ఆకర్షించుచున్నది. మిగతా మతములవారు కూడా వారి గ్రంథములలో యున్నది నేను చెప్పుచున్న జ్ఞానమేయని తెలిసి నన్ను మూడు మతముల వారు గురువుగా భావించి గౌరవించుచున్నారు. వేదములను బోధించుచూ, వేదములను ఆధ్యాయణము చేయువారిని ఆధ్యాత్మిక జ్ఞానము తెలిసిన హిందువులే ఒప్పుకోవడము లేదు. వారిని ఇతర మతముల వారు కూడా ఏమాత్రము ఒప్పుకోవడము లేదు. దేవుడు చెప్పిన ధర్మముల ముందర వేదములను బోధించువారు పాపాత్ములై అనేక
-----
కర్మ పీడితులై పోవుచున్నారు. దానికి కారణము వారు అధర్మములను బోధించడమేయని చెప్పవచ్చును. మా జ్ఞానము ధర్మములతో కూడుకొన్నది, శాస్త్రబద్దమైనది. వేదములలో శాస్త్రబద్దత లేదు, దైవ ధర్మములు లేవు. 6) ప్రశ్న :- వేదములు భారతదేశ ప్రజలకేనా, ఒక హిందూమతమున కేనా, ఇతర దేశముల వారికి వర్తించవా? ఇతర మతముల వారికి ఉపయోగపడవా? వేదములు మానవులందరికీ సంబంధించినవి కావా?
జవాబు :- బాగా అర్థమగుటకు చెప్పితే దేవుడు సూక్ష్మమైనవాడు. అనగా కనిపించడు. ధర్మసంస్థాపనకు దేవుడు అవతరించి వస్తే ఆయనను దేవుడు అని అనకూడదు, భగవంతుడు అని అనాలి. ఒకే దేవుడే కనిపించకపోతే దేవుడు, కనిపిస్తే భగవంతుడు. ఒకటి సూక్ష్మము రెండవది స్థూలము. అలాగే వేదములు సూక్ష్మముగనూ, స్థూలముగనూ రెండు రకములు గలవు. సూక్ష్మముగా మనిషి తలయందు గుణముల రూపములో వేదములు యున్నవి. అట్లే గుణ విషయములతో కూడుకొన్న సమాచారము వేదములు అను గ్రంథముల రూపములో యున్నవి. సూక్ష్మముగా మూడు గుణ భాగములుగా యున్న వాటినే బయట స్థూలముగా నాలుగు వేదములవలె యున్నవి. లోపల మూడు, బయట నాలుగుగా విభజించబడియున్నా రెండిటియందు ఒక్కటే యున్నది. మనిషి తలయందు గుణచక్రములో యున్న మూడు గుణ భాగములను 'మాయ' అని అంటున్నాము. మూడు గుణ భాగములుగా యున్న మాయ ఆత్మజ్ఞానమునకు వ్యతిరేఖమైనది. అలాగే బయట వేదముల రూపములో యున్న నాలుగు గ్రంథముల సమాచారమును కూడా మాయ అని అంటున్నాము. అందువలన వేదములు ఆత్మజ్ఞానము కాదు అనియు,
----
వేదములు కొందరికి ఆత్మజ్ఞానమువలె కనిపించు అజ్ఞానము అనియు తెలియవలెను. అటువంటప్పుడు లోపల గుణముల జోలికిగానీ, బయట వేదముల జోలికిగానీ మనిషి పోకూడదు. అట్లుకాక బయట కనిపించునట్లు వేదములు వెంటబడి, వేదములే ధర్మములనిగానీ, సనాతన ధర్మములని గానీ అనినా, లేక లోపల గుణముల వెంటబడియున్నా, వానికి ఆధ్యాత్మిక జ్ఞానము ఏమాత్రము పట్టుబడదు అని భగవద్గీతలో చెప్పారు.
పైన చెప్పిన ప్రకారము భారతదేశ ప్రజలకుగానీ, కేవలము హిందూ సమాజమునకుగానీ, ఇతర మతముల వారికిగానీ, ఇతర దేశముల వారికి గానీ, ఎవరికీ వేదములు ఉపయోగపడవు. వేదములు మానవులకు సంబంధించినవే, మనిషి శరీరములో సూక్ష్మముగా యున్న అంతర్భాగములే. వేదముల పేరుతో గ్రంథములుగా బయట, గుణముల పేరుతో విషయములుగా లోపల యున్నవని చెప్పవచ్చును. బయటగానీ, లోపలగానీ వాటి జోలికి పోవు మనిషి ఏ మతస్థుడుగానీ, ఏ దేశస్థుడుగానీ అజ్ఞానమువైపు పోయినట్లేయని చెప్పవచ్చును. వేదములు అను పదము వేదనలు అను పదము నుండి వచ్చినదని మొదటే తెలుసుకొన్నాము. మనిషి వేద విషయముల వలన అజ్ఞానములోనికి పోవడమేకాక, సుఖముల ఆసక్తితో అనేక పనులు చేయుటకు వాని బుద్ధి ఎన్నో విధముల శాఖోపశాఖలుగా చీలి ఆలోచించుచుండును. దానివలన వానికి కర్మ రావడము, కర్మ వలన జన్మలు రావడము జరుగుచున్నది. వేదముల జోలికి పోనివానికి శ్రద్ధతో ఆధ్యాత్మికమును తెలియుట వలన అతనికి ఆత్మ మీద, మోక్షము మీద ధ్యాస తప్ప వేరు ధ్యాసలు ఉండవు. మోక్షము మీద ధ్యాస కల్గినవాని బుద్ధి ఆత్మమీదనే నిల్చినదై యుండును. ఈ విషయమును ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలో సాంఖ్యయోగమను అధ్యాయమున 41వ శ్లోకమున చూడుము.
----
శ్లోకము 41.
వ్యవసాయాత్మికా బుద్ధి రేకేహ కురునందన ! |
బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్ధయో వ్యవసాయినామ్ ॥
భావము :- మనుషులలో మోక్షమందే ఆశయము కల్గు వారి బుద్ధి ఒక్కటినే ఆలోచించుచుండును. వారికి దేవుని (ఆత్మ) ధ్యాస తప్ప ఏమీ యుండదు. వేరు అభిప్రాయములతో గుణముల విషయములలో (వేద విషయములలో) చిక్కుకొన్న వారి బుద్ధి శాఖోపశాఖలై ఆలోచించుచుండును.
ఈ విధముగా వేదములనాశ్రయించినవానికి ఉండునని ఇక్కడ 41, 42, 43, 44, 45, 46 శ్లోకముల వరకు చెప్పారు.
7) ప్రశ్న :- మీరు దైవగ్రంథమని చెప్పబడుచున్న భగవద్గీతలో దేవుడు (భగవంతుడు) వేదములకు వ్యతిరేఖముగా చెప్పాడని అంటున్నారు కదా! భగవద్గీతలో వేదముల పేరు చెప్పి, ఎన్నిచోట్ల వేదములకు వ్యతిరేఖముగా చెప్పాడు?
జవాబు :- భగవద్గీత సర్వమానవులకు చెప్పిన గ్రంథము. అధర్మములను అణచివేయుచూ ధర్మములను తెలియజెప్పడము దైవగ్రంథములలో జరిగినది. వేదవ్యాసుడు తన కులమువారు వ్రాసిన అనేక వ్యాసములను సేకరించి గ్రంథరూపము చేశాడు. ఆ గ్రంథములే వేదములు. వ్యాసములు వ్రాసిన వాడు కావున వ్యాసుడు అని పేరు అతనికి రావడము జరిగినది. వ్యాసుడు అధర్మములతో కూడిన వేదములను, పురాణములను వ్రాయుట వలన బ్రాహ్మణులు విద్య కలవారై యుండి విద్యలేని ఇతర కులములవారికి చెప్పి వారిని వేదములను గౌరవించువారిగా తయారు చేశారు. విద్యగల
----
బ్రాహ్మణులు ప్రజల శుభకార్యములయందు పెద్దలుగా యుండి కార్యక్రమములను వేద మంత్రములతో చేయుచూ, వేదమంత్రముల వలన అశుభములు పోవునని ప్రజలను నమ్మించేవారు. ఆ విధముగా ప్రజలు కూడా అధర్మముల వెంట పోవుచున్నారని, ప్రజలకు ధర్మములు తెలియకుండాపోయినవని, తెలిసిన దేవుడు తన ధర్మములను తానే భగవంతునిగా వచ్చి సందర్భానుసారము ద్వాపర యుగములో అర్జునునకు చెప్పిపోవడము జరిగినది. అలా చెప్పిన బోధను వినిన వ్యాసుడు, వేదములను వ్రాసి తప్పు చేశానని గ్రహించి, ప్రాశ్చాత్తాపమును చెంది, చివరకు శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మయుక్తమైన బోధను గ్రంథరూపముగా వ్రాశాడు. దానికే భగవద్గీతయని వ్యాసుడు పేరు పెట్టాడు. అట్లు గ్రంథ రూపముగా మారిన భగవద్గీతలో సాంఖ్యయోగము అను అధ్యాయమున 41వ శ్లోకము నుండి 46వ శ్లోకము వరకు వేదములను గురించి చెప్పాడు.
వేదముల వలన అజ్ఞానిగా మారుటకు అవకాశము కలదనీ, వేదముల వలన సుఖములందాసక్తి పెరిగి అనేక కార్యాచరణ జరుగుననీ, అలా కార్యములను చేయడము వలన కర్మలు, జన్మలు వచ్చుచుండునని చెప్పాడు. వేదముల ధ్యాస లేనివారికి ఆధ్యాత్మికము తెలియునని కూడా చెప్పాడు. అక్కడ అలా చెప్పడమే కాక విజ్ఞానయోగము అను అధ్యాయమున 14వ శ్లోకమందు ఇలా చెప్పాడు.
శ్లోకము 14.
దైవీర్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా |
మామేవ యే ప్రపద్యస్తే మాయా మేతాం తరన్తితే ॥
భావము :- “దేవుడనయిన నేను తయారుచేసిన గుణములతో కూడుకొన్న నా మాయను దాటగల్గుట దుస్సాధ్యమైన పని. అయితే నన్ను శరణుజొచ్చిన మనుషులు మాయను సులభముగా దాటి పోగలరు” అని చెప్పాడు.
----
భగవద్గీతలో ఇంకొకచోట అక్షర పరబ్రహ్మ యోగమను అధ్యాయమున 28వ శ్లోకములో కూడా వేద ప్రస్తావన వచ్చినది చూడండి.
శ్లోకము 28. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దినేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టమ్। అత్యేతి తత్సర్వమిదం విదిత్వాయోగీ పరంస్థానముపైతి చాద్యమ్।।
భావము :- నేను చెప్పిన ఈ జ్ఞానమును తెలిసినవాడు వేదములను, తపములను, యజ్ఞములను, దానముల వలన వచ్చు పుణ్య ఫలములను అతిక్రమించి జ్ఞానియై మోక్షమును పొందును.
అక్షర పరబ్రహ్మ యోగములో వేదముల వలన, యజ్ఞముల వలన, తపస్సుల వలన, దానముల వలన పుణ్యము వచ్చుననీ, వాటి సంబంధము లేకుండా ఆత్మజ్ఞానము తెలిసినవాడు ముక్తిని పొందుననీ, చెప్పడమేకాక విశ్వరూప సందర్శన యోగము అను అధ్యాయమున 48, 53వ శ్లోకములలో ఈ విధముగా చెప్పడము జరిగినది చూడండి.
శ్లోకము 48. నలేదయజ్జద్యయనైర్నదానన్న చక్రియాభిర్న తపోభిరుగై
ఏవం రూప శ్శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర! ॥
భావము :- భూమిమీద నీవు తప్ప ఈ విశ్వరూపమును చూచినవారు లేరు అర్జునా, అనేక యజ్ఞ క్రియల వలనగానీ, వేదముల ఆధ్యాయణ ముల వలనగానీ, దానముల వలనగానీ, తపస్సుల వలనగానీ ఎవరూ నన్ను చూచుటకు శక్యము కాదు.
శ్లోకము 53.
నాహం వేదైర్న తపసాన దానేన న చేజ్యయా ।
శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవా నసి మాం యథా॥
భావము :- తపస్సు చేతగానీ, దానము చేతగానీ, యజ్ఞముల చేతగానీ,
----
వేదముల చేతగానీ ఇప్పుడు నీవు చూచిన ఈ రూపమును చూచుటకు సాధ్యము కాదు.
భగవద్గీతలో (1) సాంఖ్య యోగమున (2) విజ్ఞాన యోగమున (3) అక్షర పరబ్రహ్మ యోగమున (4) విశ్వరూప సందర్శన యోగమున మొత్తము నాలుగు చోట్ల వేదములను గురించి, వేదాధ్యయణమును గురించి చెప్పడమైనది. నాలుగు చోట్ల కూడా "వేదముల వలన దేవుడు తెలియబడడు” అని చెప్పడమైనది. “వేదములే మాయ” అని కూడా చెప్పడమైనది. ఇన్ని విధముల వేదముల గురించి దేవుడు చెప్పినా, అంతకంటే మించినవి లేవు అని చెప్పుచూ వాటి వెంటపడువారిని ఏమనాలో మీరే చెప్పండి!
8) ప్రశ్న :- విజ్ఞాన యోగము అను అధ్యాయమున 14వ శ్లోకమందు "దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా" అని చెప్పియున్నారు కదా! ఆ మాట ప్రకారము “దైవ నిర్మితమైనది, గుణములతో కూడుకొన్నది అయిన నా మాయను జయించుట దుస్సాధ్యము" అని అన్నారు కదా! అటువంటప్పుడు మాయ కూడా దేవుని సృష్టియనీ దేవుడే చెప్పినప్పుడు దేవుడు తయారు చేసిన మాయను విశ్వసించినా దేవున్ని విశ్వసించినట్లే కదా! మాయలోని భాగములే వేదములయి నప్పుడు వేదములను గౌరవించితే మాయను గౌరవించినట్లు కాదా! మాయను గౌరవించితే దేవున్ని గౌరవించినట్లు కాదా! అటువంటప్పుడు వేదములను అధర్మములని ఎందుకు అనాలి?
----
జవాబు :- భగవంతుడుగా వచ్చిన దేవుడు మాయను “నా మాయ” అన్నమాట నిజమే. అది ఆయనకు సంబంధించిన విషయము. దేవుడు అనబడు పరమాత్మ సృష్టికర్తగా మొట్టమొదట జీవరాసులు లేని ప్రపంచమును సృష్టించాడు. తర్వాత ఆత్మగాయున్న దేవుడు మనుషులను సృష్ఠించాడు. మొత్తము మీద ఇద్దరు సృష్టికర్తలు గలరు. ఆ సృష్టికర్తలు ఇద్దరూ “దేవుడు” అను గుర్తింపుతోనే యున్నారు. రెండవ సృష్టికర్తయిన (ఆత్మ) దేవుడు గుణముల రూపములో యున్న మాయను తయారు చేసినది 'నేనే'యని చెప్పుచున్నాడు. అంతేకాక “మాయను సృష్టించిన నన్ను ఆరాధించినప్పుడే మాయను జయించిపోగలరు" అని చెప్పాడు. శరీరములో దేవుడయిన ఆత్మను ఆరాధించవలెనన్న శరీరములోని గుణముల ధ్యాస వదలి పెట్టవలసిందేయనే అంతర్గత విషయమును ఈ శ్లోకములో చెప్పారు.
శరీరములోని ఆత్మను జీవాత్మ ఆరాధించవలసిందే. మొదటి సృష్టికర్తయిన పరమాత్మను జీవాత్మ చేరినప్పుడు జీవునకు ముక్తి లభించును. ముక్తి లభించవలెనన్న అనగా విశ్వరూపమును పొందవలెనన్న, మూడవ పురుషుడయిన పరమాత్మను చేరవలెనన్న బయట వేదములను గానీ, లోపలి గుణములనుగానీ వదలివేయవలెను. బయటి వేదములకు, లోపలి గుణములకు అవినాభావ సంబంధమున్నది. విశ్వరూప సందర్శన యోగము అను అధ్యాయములో స్వయముగా పరమాత్మ (మొదటి దేవుడు) చెప్పిన 48, 53వ శ్లోకములలో “వేదముల వలన నన్ను చేరలేరని” బయటి వేదములను గురించి చెప్పాడు. విజ్ఞాన యోగమున 14వ శ్లోకములో "నేను తయారు చేసిన గుణములే శరీరములో మాయగా యున్నదనీ, మాయను జయించడము అనగా గుణములను జయించడము దుస్సాధ్యమనీ, ఆత్మను ఆరాధించినప్పుడే మాయను జయించుటకు సాధ్యమని” చెప్పడ
----
మైనది. ఇక్కడ చెప్పినది రెండవ దేవుడు అయిన ఆత్మ అని తెలియవలెను. ఆత్మ, పరమాత్మలలో అనగా ఇద్దరు దేవుళ్లలో ఏ దేవుడు ఏ శ్లోకమును గురించి చెప్పాడో తెలియవలెను. వేదములను గౌరవిస్తే దేవున్ని గౌరవించినట్లే కదా! అని అడిగినప్పుడు ఏ దేవున్ని గౌరవించినట్లో తెలిసి అడుగుచున్నారా? వేదముల వలన ఏ దేవున్ని చేరలేరో? కొద్దిగా అయినా తెలిసినదా యని ప్రశ్నించుచున్నాను. మనిషికి ముక్తి కావలసినప్పుడు ఏ దేవున్ని చేరవలసి యున్నదో తెలుసా? అని అడుగుచున్నాను. మీ మాట ప్రకారము వేదములను మాయ అని తెలియగలిగితే ఆత్మను తెలియుటకు దారి ఏర్పడును. ఆత్మను ఆరాధించినట్లు కాదు. ఆత్మను ఆరాధిస్తేగానీ లోపలి మాయను మనిషి దాటలేడు. లోపలి మాయ, బయటి వేదములు రెండు రకములుగా యున్నప్పుడు రెండూ స్థూల సూక్ష్మముగా యున్నట్లే. దేవుడు కూడా శరీరములో ఆత్మ ఒక దేవుడుగా, శరీరము లోపల బయట అంతటా యున్న పరమాత్మ మరియొక దేవుడుగా యున్నాడు. బయటి పరమాత్మను పొందాలంటే లోపలి ఆత్మను ఆరాధించవలసిందే. లోపలి ఆత్మను ఆరాధించుటకు బయటి వేదములను వదలివేయవలసిందే. అటు ముక్తి అయిన పరమాత్మ, ఇటు మాయ అయిన వేదములు రెండూ కావాలంటే కుదరదు. వేదములను పట్టుకుంటే ఆత్మ దొరకడు. ఆత్మను ఆరాధిస్తే వేదములకు దూరముగా ఉండవలసిందే. ఆత్మను ఆరాధించకపోతే పరమాత్మ దొరకడు. ఆత్మను ఆరాధించినప్పుడు పరమాత్మను చేరుటకు అవకాశముండును. దీనిని అంతా తెలియుటకు భగవద్గీతలో చెప్పిన శ్లోకములు ఆధారముగా యున్నవి. ఆ శ్లోకముల ఆధారముతో ఏ శ్లోకము ఏ దేవుడు చెప్పాడని గమనించి చూస్తే మోక్షము దొరుకుటకు అవకాశము గలదు. శరీరము లోపలి మాయకు బయటి వేదములకు, శరీరములోని
----
ఆత్మకు బయటి పరమాత్మకు గల అవినాభావ సంబంధము తెలిసినప్పుడే పూర్తి జ్ఞానము తెలియును.
9) ప్రశ్న:- భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము అను అధ్యాయమున మొదటి మూడు శ్లోకములు వేదములను గురించి చెప్పినవే గలవు. అట్లే అదే అధ్యాయమున పదిహేనవ శ్లోకములో కూడా వేదములను గురించి చెప్పియున్నారు. మీరు పురుషోత్తమ ప్రాప్తి యోగములో చెప్పిన విషయమును ప్రస్తావించలేదు. అక్కడ వేదములను గురించి చెడ్డగా చెప్పలేదు కదా! 'వేద ఫలదాతను, వేద విభుడను నేను' అని 15వ శ్లోకములో చెప్పాడు కదా! దీనికి మీరు ఏమి చెప్పగలరు?
జవాబు :- అంతిమ దైవగ్రంథములో ఇద్దరు అల్లాహ్ ను చెప్పియున్నా దానిని ముస్లీమ్లు గ్రహించుకోలేకపోయారు. వారికి ఇద్దరు అల్లాహ్ లు అని తెలియకపోవడము పెద్ద జ్ఞాన లోపమయినది. అందువలన వారు సంపూర్ణ జ్ఞానులు కాలేకపోయారు. వారు తమకు ఒక్కడే అల్లాహ్యని చెప్పుచున్నారు. ఆరాధించుటకు ఒక్కడే అల్లాహ్యనీ, తెలుసుకొనుటకు ఇద్దరు అల్లాహ్ లు కలరనీ, ఒక అల్లాహ్ను ఆరాధించవలెననీ, ఒక అల్లాహు భయపడవలెననీ 16వ సూరా, 51వ ఆయత్లో చెప్పినమాటను వారు గ్రహించుకోలేకపోయారు. ఇద్దరు అల్లాహ్ లు కలరని, ఆరాధించబడే అల్లాహ్ను సృష్టించిన అల్లాహ్ “ఇతనే మీ అల్లాహ్”యని చూపించాడని సూరా 3, ఆయత్ 18లో చెప్పిన వాక్యమును కూడా గ్రహించలేకపోయారు. ఇద్దరు అల్లాహ్ లు తెలియనంత వరకు వారి జ్ఞానములో లోపమున్నట్లేనని తెలియుము.
---
అట్లే క్రైస్థవులలో తమ గ్రంథమని చెప్పుకొను బైబిలులో కుమారుడు ఒక్కడేయని చెప్పుచుందురు. అయితే బైబిలులో ఇద్దరు కుమారులున్న విషయము వారు గ్రహించలేదు. ఒక కుమారుడేయని చెప్పుచున్నారు. తండ్రి ఒక్కడే పరిశుద్ధాత్మ ఒక్కడే. కుమారులు ఇద్దరు అనియు, ఒకరు తీర్పు తీర్చువాడు శాశ్విత కుమారుడు. మరొకడు జ్ఞానమును బోధించు వాడు అద్వితీయ కుమారుడు గలడను విషయము వారికి తెలియదు. అట్లే ముస్లీమ్లకు ఖుర్ఆన్లో ఏ అల్లాహ్ ఎప్పుడు మాట్లాడినాడని తెలియనట్లు, బైబిలులో ఏ కుమారున్ని గురించి ఎప్పుడు చెప్పారు అను విషయము క్రైస్థవులకు తెలియదు. ఇద్దరు కుమారులను గురించి తెలియకపోవడము క్రైస్థవులలో యున్న లోపము. అయినా వారి లోపము వారికి తెలియదు. చెప్పినా అర్థము చేసుకొను స్థితిలో లేరు.
అదే విధముగనే ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలో ఆత్మ, పరమాత్మ ఇద్దరు దేవుళ్లు ఉన్నారను విషయము పూర్తిగా తెలియదు. ఎంత తెలిసినవారయినా జీవుడు, దేవుడు అని ఒక్క దేవున్ని గురించి చెప్పుదురు గానీ మధ్యలో ఆత్మ రెండవ దేవుడుగా యున్నాడను విషయము తెలియదు. భగవద్గీతను చదివినా అందులో ముగ్గురు పురుషులు మూడు ఆత్మలుగా యున్నారనీ, ఒకరు జీవాత్మయిన మనముకాగా, ఇద్దరిలో ఒకర సృష్టికర్తయిన దేవుడు. ఇంకొకరు సృష్టింపబడిన దేవుడు అని తెలియదు. సృష్ఠింపబడిన దేవుడయిన ఆత్మ మనుషులను, సమస్త జీవరాసులను సృష్టించి మనుషులకు శాశ్విత దేవుడుగా యున్నాడని తెలియదు. భగవద్గీతలో సృష్టికర్తయిన పరమాత్మ మరియు సృష్టింపబడిన ఆత్మయను ఇద్దరు మాట్లాడి చెప్పిన విషయములు గలవు.
----
ఇప్పుడు మీరు అడిగిన పురుషోత్తమ ప్రాప్తి యోగములో మొదటి మూడు శ్లోకములను మరియు అదే అధ్యాయములోయున్న 15వ శ్లోకమును చూస్తే ఇలా గలవు.
శ్లోకము 1. ఊర్ధ్వ మూల మధశ్శాఖ మశ్వత్థం ప్రాహు రవ్యయమ్ | ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ॥
భావము :- పైకి వేర్లు క్రిందికి కొమ్మలు గల అశ్వర్థమనే వృక్షము అవ్యయ మైనదనీ, వేదములు ఆకులుగా యున్నవని ఎవడు తెలియునో వాడు వేదములను తెలిసినవాడని చెప్పవచ్చును.
శ్లోకము 2. అధశోర్ధ్వం ప్రసృతాస్తస్యశాఖా గుణప్రవృద్ధి విషయప్రవాలాః |
అధశ్చ మూలాన్యనుసన్త తాని కర్మాను బర్దీని మనుష్యలోకే ॥
భావము :- - అశ్వర్థ వృక్షము యొక్క శాఖలు గుణ విషయములచే వృద్ధియైనవై అనేక దిశలకు వ్యాపించి యున్నవి. ఇంకనూ దాని వేర్లు విస్తరించినవై మనుష్యలోకమున పూర్తి వ్యాపించి యున్నవి.
శ్లోకము 3. న రూప మస్యేహ తథోపలభ్యతే నాన్తో న చాది ర్నచసమృతిష్ఠా
అశ్వత్థ మేనం సువిరూఢమూలం మనంగ శస్త్రేణ దృఢన ఛిత్వా!!
భావము :- అశ్వర్థ వృక్షము యొక్క రూపముగానీ, దాని మొదలుగానీ, చివరగానీ, అది ఉన్న స్థితియు గానీ ఎవరికీ తెలియబడడము లేదు. దృఢమైన మూలములు (వేర్లు) గల ఈ వృక్షమును అసంగ శస్త్రముచే (యోగముచే) నరుకవలయును.
శ్లో॥ 15. సర్వస్య చాహంహృది సన్నిది మత్తః సృతిర్హిన మపోహనంద। వేదైశ్చ సర్వైరహ మేవ వేద్యో వేదాన్తకృ ద్వేదవి దేవ చాహమ్ |
----
భావము :- సర్వజీవరాసుల హృదిస్థానములో నేనున్నాను. స్మృతి, జ్ఞానము, ఊహ, దాని మరుపు నా వలననే కల్గుచున్నవి. వేద వేదాంతములు నన్నే తెల్పుచున్నవి. వేదములను తెలిసినవాడను నేనే.
ఇక్కడ ఈ నాల్గు శ్లోకములలో బాగా గమనించితే వేదములు శరీరములో ఈ విధముగా తయారై, ఈ విధముగా వ్యాపించి యున్నవని, అవి మనుషులలో పూర్తి విస్తరించినా వాటిని గురించి ఎవరికీ తెలియదనీ, వేదముల వలన బలముగా యున్న అశ్వర్థ వృక్షమును అసంగ శస్త్రము చేత (యోగము చేత) ఖండించవలెనని మొదటి మూడు శ్లోకములలో చెప్పి యున్నాడు. తర్వాత 15వ శ్లోకములో “నేను మనుషుల హృదయములలో యున్నాననీ, నా వలననే మనుషులకు స్మృతి, జ్ఞానము, ఊహ కల్గుచున్న వని” చెప్పడమేకాక, వేదములు శరీరములో మాయ రూపముగా తయారు చేసినవానిని నేనేనని, వేదములు నన్ను సృష్టికర్తగా తెల్పుచుండగా, వేదాంతము వలన నేను (ఆత్మను) తెలియబడడమేకాక, నేను సృష్ఠించిన వేదములు నాకు బాగా తెలుసుయని రెండవ దేవుడు చెప్పియున్నాడు. హిందూ సమాజము వారికి ఇద్దరు దేవుళ్లున్నారని తెలియదు. అందులో ఆత్మ దేవుడున్నాడని భగవద్గీతలో ఆత్మ దేవుడు గ్రంథమంతయూ చెప్పగా, విశ్వరూప సందర్శన యోగము అను అధ్యాయములో పరమాత్మ దేవుడు స్వయముగా 48, 53 శ్లోకములను చెప్పియున్నాడని తెలియలేక పోయారు. హిందువులు ఆత్మ, పరమాత్మయను వాస్తవమైన దేవుళ్లను వదలి, మనుషుల వలె సృష్ఠింపబడిన దేవతల జాతిలోని దేవుళ్లను గొప్పగా భావించి మ్రొక్కుచూ అజ్ఞాన మార్గములో పోవుచున్నారు.
మూడు మతములయందు సంపూర్ణ జ్ఞానమును తెలియక, ఇద్దరు దేవుళ్లున్నారను విషయము తెలియకపోవడము వలన, ఎవరు ఎప్పుడు
----
చెప్పుచున్నారని గుర్తించలేకపోవుచున్నారు. ఒకరు ఆరాధించతగిన దేవుడు కాగా, పెద్ద దేవుడయిన పరమాత్మను (పరిశుద్ధాత్మను) లేక సృష్టికర్తయైన అల్లాహ్ ను చేరవలసియున్నది. అలా చేరడమును ముక్తి పొందడము అని కొందరు, పరలోకమును పొందడము అని కొందరు, అల్లాహ్ వద్దకు చేరడము అని కొందరు చెప్పుచుందురు. ఎవరు ఎలా చెప్పినా అందరూ చెప్పునది మోక్షమును గురించియే అని తెలియవలెను. అట్లే భగవద్గీతలో వేదములు లేక మాయ అని చెప్పినా, బైబిలులో సాతాను లేక సర్పము అని చెప్పినా, ఖుర్ఆన్ సైతాన్ లేక ఇబ్లీసు అని చెప్పినా అన్నీ ఒక్కటేయని తెలియవలెను. సృష్టికర్తయిన మొదటి అల్లాహ్, సృష్టికర్తయిన పరమాత్మ, సృష్టికర్తయిన పరిశుద్ధాత్మ వేదములను వదల మంటున్నాడు. సృష్ఠింపబడిన అల్లాహ్ గానీ, (ఆత్మగానీ), (తండ్రిగానీ) వేదములను లేక మాయను గురించి వివరముగా చెప్పుచున్నాడు. భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమున మొదట గల మూడు (3) శ్లోకములను మరియు 15వ శ్లోకమును స్వయముగా ఆత్మ చెప్పినది. అక్కడ వేదముల (గుణముల) వివరమును ఆత్మ చెప్పినది. అదే విశ్వరూప సందర్శన యోగములో “వేదముల వలన నన్ను తెలియుటకు శక్యము కాదు” అని చెప్పినది సృష్టికర్తయిన పరమాత్మయని తెలియవలెను. ఈ వివరమును తెలియకపోతే వేదములు కొందరికి గొప్పవిగా కనిపించవచ్చును. ఈ విధముగా జీవితములో ఇద్దరు దేవుళ్ల విషయము తెలియకపోతే, దేవునికి మాయకు గల తారతమ్యము తెలియకుండా పోవును. అట్లు దేవుని విలువను, మాయ చెడును తెలియని వారు బయటి వేదములను ఆశ్రయించి యుందురు.
----
10) ప్రశ్న :- శరీరమంతా విషయముల ప్రభావము వ్యాపించియుండి, విషయములయందే మనిషి (జీవుడు) నివశిస్తున్నాడని చెప్పుటకు శరీరమును అశ్వర్థ వృక్షముగా పోల్చి, కొమ్మలు ఆకులు శరీరమంతా వ్యాపించి యున్నట్లు పోలికతో చెప్పారు. పోలిక గల వృక్షమును అశ్వర్థ వృక్షము అని భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగమున మొదటి శ్లోకములోనే చెప్పియున్నారు కదా! అశ్వర్థ వృక్షము అంటే రావిచెట్టు అని కొందరు చెప్పుచున్నారు. బయట రావి చెట్టును చూచి యున్నాము. బయటి రావిచెట్టును లోపలగల అశ్వర్థ వృక్షముగా ఎందుకు చెప్పారు? అలా చెప్పుటకు కారణము ఏమయినా గలదా? మేము ఈ విషయము అడుగగా దేవతలలో పెద్ద దేవుడు అయిన విష్ణువుకు నిలయము అశ్వర్థ వృక్షమని చెప్పుచున్నారు. వారు చెప్పునది ఎంతవరకు వాస్తవము? మాకు అర్థమగునట్లు చెప్పవలెను?
జవాబు :-''అశ్వర్థ' అను పదముతో చెప్పబడిన వృక్షము శరీర పోలికలోనే యున్నా, బయట రావిచెట్టుగా కనిపించునది వాస్తవమే. అయితే 'అశ్వర్థ' అను పదమునకు, రావిచెట్టు అను పదమునకు అర్థములో ఏమాత్రము సంబంధము లేదు. అయినా 'అశ్వర్థ' అను పేరుకు 'రావి' అను పేరుకు ఎందుకు ముడిపెట్టారో చెప్పేవారికే తెలియాలి. వాస్తవముగా వారికి కూడా తెలియదు. ఒకరిని చూచి ఇంకొకరు చెప్పుచున్నారు తప్ప అర్థము తెలిసి చెప్పలేదని తెలియుచున్నది. అర్థ అనగా ధనము లేక సారాంశమైనదని
----
తెలియుచున్నది. అశ్వ అనగా వేగముగా పరుగెత్తునది గుఱ్ఱము అని తెలియుచున్నది. తలలో యున్న గుణములు గుఱ్ఱములవలె విషయచింతన లలో శరీరమంతా పరుగెడుచున్నవని అర్థమగునట్లు చెప్పుటకు శరీరమును అశ్వర్థ వృక్షము అని అన్నారు. గుఱ్ఱములో ధనమయినది లేక సారమైనది వేగము. గుణములు వేగముగా చలించుచున్నవని చెప్పుటకు అశ్వర్థ అని పేరుపెట్టి, శరీరమును వృక్షముగా పోల్చి అశ్వర్థ వృక్షము అని అన్నారు.
'అశ్వర్థ వృక్షము' అని శరీరమునకు పేరుపెట్టి అదే వృక్షమును రావిచెట్టుగా చూపించారు. వాస్తవానికి రావిచెట్టుకు అశ్వర్థ వృక్షమునకు అర్థములో ఏమాత్రము పోలికలేదు. రావి చెట్టును పూర్వము 'పాము చెట్టు'గా పిలిచెడివారు. రావిచెట్టు ఆకులన్ని 'పాము పడగ' ఆకారమును పోలియుండును. రావిచెట్టు ఆకులన్ని ‘మనిషి ప్రాణమును లేకుండా చేయు విషమునకు సూచనగా' యున్నవి. మనిషిలోని గుణములు మనిషిని (జీవున్ని) కర్మలలో చిక్కుకొని బాధపడునట్లు చేయుట వలన మనిషిని బాధించు విషమునకు గుర్తుగా యున్న రావిచెట్టును అశ్వర్థ వృక్షము అని చెప్పారు. అంతతప్ప రావిచెట్టు వేరు, అశ్వర్థ వృక్షము వేరుగా యున్నవని చెప్పవచ్చును. గుణముల నుండి మనిషి రక్షింపబడితే అతడు మరణ రహితుడై మోక్షమును చేరిపోవును. అట్లే పాము విషము నుండి మనిషి రక్షింపబడితే వాడు మరణము నుండి బయటపడి జీవించునని పోలికతో చెప్పుటకు అశ్వర్థ వృక్షమును రావి చెట్టును ఒక్కటిగా చెప్పారు. లోపలి గుణములను బయటి పాములుగా చూపుచూ, పాము పడగ ఆకారమును పోలిన రావిచెట్టును అశ్వర్థ వృక్షము అని అన్నారు. 'రా' అనగా నాశనము అనియు, 'వి’ అనగా వికారములు అనియు, కర్మ వికారములు అనగా కర్మచేత చేయబడు కార్యములనియు చెప్పవచ్చును. కర్మల నాశనము చేయునదని కూడా
---
రావి అను పదమునకు అర్థమును చెప్పవచ్చును. రావిచెట్టు ఆకుల ద్వారా వైద్యము చేస్తే పాము కాటుకు గురైన వారి శరీరములోని విషమును కూడా లేకుండా చేయవచ్చును. అందువలన రావిచెట్టు విశేషము గలదనీ, ప్రత్యేకత కలదనీ పెద్దలు చెప్పుచుందురు.
11) ప్రశ్న :- బ్రాహ్మణులు అనగా 'బ్రహ్మజ్ఞానము తెలిసిన వారు' అని అర్థము కదా! అటువంటి బ్రాహ్మణులు వేదముల వెంట ఎందుకు పోవుచున్నారు? దేవుడు తన గ్రంథములో 'వేదముల వలన దేవుడు తెలియబడడు' అని చెప్పినా వేదములను ఎందుకు వదలడము లేదు?
జవాబు :-"బ్రహ్మజ్ఞానమును తెలిసినవారు బ్రాహ్మణులు” అని చెప్పుట కలదు. బ్రహ్మజ్ఞానము అనగా పెద్ద జ్ఞానము అని అర్థము. బ్రహ్మజ్ఞానము బ్రహ్మవిద్య వలన లభ్యమగును. బ్రహ్మవిద్య అనునది ఆరు శాస్త్రములలో ఒక శాస్త్రము. షట్ శాస్త్రములలో చివరిది, పెద్దది బ్రహ్మవిద్యా శాస్త్రము. షట్ శాస్త్రములలో అన్నిటికంటే పెద్దది అయినందున దానికి బ్రహ్మ అని పేరు వచ్చినది. బ్రహ్మ అనగా పెద్దయని అర్థమయినప్పుడు బ్రహ్మవిద్యను నేర్చినవారు పెద్దవారు అని చెప్పబడుదురు. అందువలన బ్రాహ్మణులు అను పేరున్నవారు, వారు నేర్చిన విద్యకు తగినట్లు ఉన్నతమైన భావము కల్గియుందురు. ఉన్నత భావము గలవానిని బ్రాహ్మణుడు అని అనినప్పుడు ఉన్నతమైన భావము లేనివానిని బ్రాహ్మణుడు అనుటకు వీలులేదు. పెద్ద భావము లేనివానిని చిన్న భావము గలవానిగా లెక్కించాలి. బ్రహ్మవిద్యను బట్టి బ్రాహ్మణుడు అని పూర్వము అనెడివారు. బ్రహ్మవిద్య లేనివానిని,
----
మిగతా ఐదు విద్యలు నేర్చినా వానిని స్వల్ప విద్యగలవాడు అని చెప్పాలి. స్వల్ప విద్యగలవాని భావములు స్వల్పముగానే యుండును అని అనెడివారు.
పూర్వము ఆత్మ విద్యను “బ్రహ్మవిద్య” అని చెప్పడమేగాక ఆత్మను పెద్దగా, ఆత్మకాని వాటిని చిన్నవిగా చెప్పెడివారు. ఆత్మను గురించి తెలిసిన వారిని బ్రహ్మవిద్య తెలిసినవారని, బ్రాహ్మణులని వారు నేర్చిన విద్యను బట్టి చెప్పెడివారు. అయితే నేడు బ్రాహ్మణుడు అనునది నేర్చిన విద్యను బట్టి కాక పుట్టిన కులమునుబట్టియని చెప్పుచున్నారు. పుట్టిన కులమును బట్టి వానికి బ్రహ్మవిద్య వచ్చినా రాకున్నా, ఉన్నతమైన భావమున్నా లేకున్నా, ఆత్మజ్ఞానమున్నా లేకున్నా బ్రాహ్మణుడు అని అంటున్నారు. విద్యను బట్టి కాక కులమును బట్టి బ్రాహ్మణుడు అని అన్నప్పుడు వానికి బ్రాహ్మవిద్యతో పనిలేదు అని చెప్పవచ్చును. పెద్ద కులము అని పేరు వచ్చిన తర్వాత చిన్న కులము అని చెప్పుటకు అవకాశము వచ్చినది. అలాగే అనేక కులములు భూమిమీద కృతయుగములోనే ఏర్పడినవని తెలియుచున్నది. మానవ జాతికి కులవ్యవస్థ ఒక తెగులు (చీడ) వలె పని చేయుచున్నది. ముందు మూడు యుగములలో భారతదేశమును కులము అనునది అజ్ఞాన స్థితికి తీసుకుపోగా, కలియుగములో మతము అనునది వచ్చి మొత్తము ప్రపంచమును ఉన్నతమైన భావము నుండి నీచభావము వైపుకు, జ్ఞానము వైపు నుండి అజ్ఞానమువైపుకు తీసుకపోయినది.
నేడు కుల, మత చీడల మధ్య పుచ్చిపోయిన భావములు గల మనిషికి బ్రహ్మవిద్య అంటే ఏమిటో, దైవజ్ఞానము అంటే ఏమిటో తెలియకుండా పోయినది. కులము అను మాయ వలన నీచ భావములున్న వారు కూడా బ్రాహ్మణులు అని చెప్పబడినట్లు, మతము అను మాయ వలన అజ్ఞానములో యున్నవారు కూడా మాది గొప్ప జ్ఞానముగల మతము
----
అని, ఇతరులది చిన్న జ్ఞానముగల మతము అని అంటున్నారు. మతము గొప్ప, నా మతము గొప్ప అను నేటికాలములో భారతదేశములో హిందూమతము గలదు. మిగతా మతములలో బ్రాహ్మణ కులము అనునది లేదు. హిందూ మతములోనే బ్రాహ్మణ కులమున్నది. బ్రాహ్మణ కులములో పుట్టినవారికి బ్రహ్మజ్ఞానము తెలియకున్నా వారు బ్రాహ్మణులుగా చలామణి అగుచున్నారు. దైవజ్ఞానముతో మొదలయిన బ్రాహ్మణులు చివరకు కులము వలన బ్రాహ్మణులు అని చెప్పబడుచున్నారు. వారు ఎలా చెప్పబడినా వారిలో బ్రాహ్మజ్ఞానము లేనిదానివలన అజ్ఞాన దారిలోనే యున్నారని చెప్పవచ్చును. అటువంటి తెలియని అజ్ఞాన స్థితిలో దైవ జ్ఞానము లేనివి, గుణ విషయములతో కూడుకొన్నవి అయిన వేదములను కుల బ్రాహ్మణులు ఆశ్రయించడము జరుగుచున్నది. “వేదము వలన వేదనలతో కూడుకొన్న కర్మలు వచ్చునని” భగవద్గీతలో సాంఖ్యయోగము నందు 43వ శ్లోకమున "జన్మ కర్మ ఫల ప్రదామ్" అనియూ "క్రియా విశేష బహుళాం" అనియు చెప్పియున్నారు. అదే బ్రహ్మ జ్ఞానములో అయితే జన్మ కర్మలు లేకుండా పోయి ముక్తి లభించును. పూర్వము కొన్ని కులముల వారికి కొన్ని పనులు కుల వృత్తిగా యుండేవి.
అట్లు అనేక కులములకు అనేక సాంప్రదాయ వృత్తులు ఉండేవి. ఉదాహరణకు కుమ్మరి కులమువారికి కుండలు తయారు చేయడము వృత్తిగా ఉండేది. అట్లే పూర్వము బోయ కులమువారు అడవిలో యుండి దారి దోపిడి చేసెడివారు. వాల్మీకి కూడా దొంగతనము చేసెడివారని చెప్పెడివారు. అయితే నేడు కుమ్మరి కుండలు చేయడము లేదు. బోయ వాళ్లు దొంగతనము చేయడము లేదు. అట్లే బ్రాహ్మణుల కులము వారు పూర్వము 'బ్రహ్మవిద్య' అను దైవజ్ఞానమును బోధించేవారు. అయితే కమ్మరి, కుమ్మరి కుల
----
వృత్తులను వదలుకొని సమాజములో కష్టపడి బ్రతుకుచుండగా, బ్రాహ్మణులు నేడు బ్రహ్మజ్ఞానమును ఏమాత్రము తెలియకుండా పోయారు. మిగతా కులముల వారు పని చేసి బ్రతికినట్లు, బ్రతుకుటకు వేదములను ఆశ్రయించి వేదములను చదువుచూ, యజ్ఞములను చేయుచూ, వేదములను చెప్పుచూ, పూజలు చేయుచూ ఆ పని వలన వచ్చు ఆదాయముతో బ్రతుకుతున్నారు. వేదములను చెప్పడమే కులవిద్యగా పెట్టుకొని, ఎక్కువ శాతము వేదములను ఆశ్రయించి, వేదములను చెప్పుచూ దానినే బ్రతుకుతెరువుగా చేసుకొన్నారు. కొందరు బ్రాహ్మణులు ఇతర పనులు, ఉద్యోగములు చేసి బ్రతుకుచున్నారు. దేవుడు తన దైవగ్రంథమైన భగవద్గీతలో “వేదము వలన దేవుడు తెలియబడడు” అని చెప్పినా, దేవున్ని తెలియుటకు కాకున్నా బ్రతుకుతెరువు కొరకు బ్రాహ్మణులు వేదములను ఆశ్రయించవలసి వచ్చినది. చివరకు వేదములను అధ్యాయనము చేసి, వేదములను చదివి పెళ్లిల్లు, పూజలు, యజ్ఞములు మొదలగునవి చేయుచూ ఆ పనినే కులవృత్తిగా చేసుకోవలసి వచ్చినది.
మనిషి బ్రతుకుటకు ఏదో ఒక పనిని కల్పించుకోవడములో తప్పు లేదు. అయితే తాము చెప్పు వేదముల వలన దైవజ్ఞానము కల్గునని, ముక్తి వచ్చునని చెప్పడము తప్పగును. ఎందుకనగా! దేవుడు తన గ్రంథములో 'వేదముల వలన నేను తెలియబడను' అని చెప్పియుండగా, వేదముల వలన దేవుడు తెలియబడును అని చెప్పడము న్యాయము కాదు. 'రంకు నేర్చినమ్మ బొంకు నేర్చును' అని సామెతను చెప్పినట్లు, తాను దేవునికి వ్యతిరేఖమయిన పనిని చేయుచూ, తన తప్పును సమర్థించు కొనుటకు అసత్యమును చెప్పడము అన్యాయమగును. నేడు బ్రాహ్మణ కులమువారికి బ్రతుకుతెరువుగా, కులవిద్యగా వేదములుండుట వలన వేదములను
---
బ్రాహ్మణులు వదలలేకున్నారు. అంతటితో ఆగక అసలయిన ఆధ్యాత్మిక వేత్తలను అసూయతో చూస్తూ, యోగులను, జ్ఞానులను గౌరవించక తామే నిజమైన జ్ఞానులము అన్నట్లు హేళనగా మాట్లాడుచున్నారు.
12) ప్రశ్న : ఒక చర్చావేదికలో ఒక బ్రాహ్మణుడు మాట్లాడుచూ "వేదములు అపౌరుషములు, వేదములను ఏ పురుషుడూ వ్రాయలేదు. వేదములను దేవుడే స్వయముగా తయారు చేసి పంపాడు. అందువలన వేదములు అపౌరుషములు అని చెప్పబడ్డాయి" అని అన్నారు. వేదములను మనుషులు వ్రాయకపోతే “ఏ పనినీ చేయను” అని చెప్పిన దేవుడు ఎలా వేదములను వ్రాయును? వేదములను దేవుడే వ్రాసియుంటే “తనను తెలుసుకొనుటకు వేదములు పనికి రావు” అని ఎందుకు దేవుడు చెప్పాడు? అంతేకాక సాంఖ్య యోగమున “వేదముల వలన వేదనలు కల్గునని" ఎందుకు చెప్పాడు?
జవాబు:-· పూర్వము ఒక సామెత ఉండేది, అది ఏమనగా! “పౌరుషమునకు మంగళ కత్తులు మింగినట్లు" అని చెప్పెడివారు. ఒక సందర్భములో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడుచూ “పౌరుషమునకు మంగళ కత్తులు మింగితే జీవితము లేకుండా చస్తావు" అని అన్నాడట. ఈ మాట బయట ప్రపంచ సంబంధముగా మాట్లాడినట్లు కనిపించుచున్నది. బయట సంబంధముగా చూస్తే రోషము గలవాడు కోపముతో మంగళ కత్తులను మింగితే వాటి వలన కడుపులో ప్రమాదము ఏర్పడి, కత్తులు తెగి మనిషి
----
చనిపోవును అని చెప్పినట్లు కలదు. అయితే ఈ మాటను పూర్వము ప్రపంచ సంబంధముగా చెప్పకుండా, ఆధ్యాత్మిక కోణములో చెప్పియున్నారని తెలియుచున్నది. ఆధ్యాత్మిక కోణముగా వివరమును చూస్తే, మంగళ కత్తులు అనగా జ్ఞానపు మాటలుయనీ, మింగితే అనగా జ్ఞానమును గ్రహించు కొంటేయని అర్థము గలదు. మంగళ అనగా మోక్షము అనియు, మంగళ కత్తులు యనగా మోక్షమును గురించి తెలియజేయు ధర్మములు అని అర్థము. పౌరుషము అనగా పురుషత్వము గలదియని అర్థము. పురుషత్వము గలది యనగా ఆత్మతత్త్వము గలది యని అర్థము. పురుషుడయిన పరమాత్మ కొరకు జ్ఞాన సంబంధ బోధలను గ్రహించవలెను అని అర్థము వచ్చుచున్నది. ఆధ్యాత్మికరీత్యా పౌరుషము అనగా దైవముగలది యనియూ, అపౌరుషము అనగా దైవము లేనిది అనియూ అర్థము వచ్చుచున్నది.
వేదములు అపౌరుషములు అనగా వేదములలో పురుషుడయిన ఆత్మగానీ, పరమాత్మగానీ లేడనీ, ప్రకృతి వలన తయారయిన మాయ తప్ప దైవము అందులో లేదని చెప్పడమును కొందరు తమ మాటలలో “వేదములు అపౌరుషములని” చెప్పారు. ఆ మాటకు వేదములు దేవున్ని తెల్పునవి కావు అని అర్థము గలదు. దేవుడు వేదములను ఎక్కడగానీ, ఎప్పుడుగానీ చెప్పలేదు. వేదములను అనేకమంది వ్యాసములుగా వ్రాసిపెట్టగా, వాటినన్నిటినీ సేకరించిన వ్యాసుడు గ్రంథములుగా చేశాడు. అలా మనిషి అయిన వ్యాసుడు వ్రాసినవి వేదములు అని తెలియుచున్నది. దీనినిబట్టి వేదములు ఐదువేల సంవత్సరములప్పుడు మనుషుల చేత వ్రాయబడినవని తెలియుచున్నది. అంతేగానీ మనుషులు వేదములను వ్రాయలేదని చెప్పడము పూర్తి అసత్యము. కొందరు బ్రాహ్మణులు తాము చెప్పు వేదములు గొప్పవని బొంకుటకు, ఆ విధముగా 'వేదములు అపౌరుషములు' అన్నారు. దాని
----
అర్థము ప్రకారము మనుషులు వ్రాయలేదని చెప్పారు. అలా చెప్పడము తప్పని తెలియవలెను. పురుషత్త్వము లేనివి వేదములనీ, దైవత్త్వము లేనివి వేదములని చెప్పుటకు వేదములు అపౌరుషములని జ్ఞానులు అన్నారు.
13) ప్రశ్న :- ఆధ్యాత్మికరీత్యా వేదము అనగా ఏమి? అట్లే వేదాంతము అనగా నేమి?
జవాబు :-- వేదము అనగా గుణములు అని అర్థము. వేదాంతము అనగా గుణములు లేకుండా పోవడము అని అర్థము కలదు. వేదములు గుణ విషయములతో కూడుకొని శరీరాంతర్గతములో ఎవరికీ కనిపించకుండా యున్నవి. శరీరములోనే గుణ విషయముల ప్రభావమును తగ్గించు కోగలిగితే, కొద్దిమాత్రము కూడా విషయచింతన లేకుండాపోతే దానినే 'అంతర్గత వేదాంతము' అని అందురు. శరీరములో కనిపించక సూక్ష్మముగాయున్న వేదములు మనుషులలో ఉండగా, వేదాంతము కూడా మనుషులలోనే యున్నది. పూర్వము యోగులయినవారు అంతర్గతములో వేదాంతమును సాధించగలిగి మోక్షమును పొందారు.
గుణముల
రూపములో యున్న వేదములను ఆత్మయే తయారు చేయగా, వేదాంతము వలన పరమాత్మను పొందవచ్చును. గుణములు అంతమైపోవడమును వేదాంతము అని అనవచ్చును.
14) ప్రశ్న : - ప్రకృతికి గుణములకు సంబంధమున్నదా?
జవాబు :- ప్రకృతి చర, అచర అను రెండు భాగములుగా యున్నది. వీటినే మార్పు చెందే ప్రకృతి, మార్పు చెందని ప్రకృతియని రెండు రకములుగా చెప్పుచున్నాము. ప్రకృతి మార్పు చెందకుండా కనిపిస్తే
----
ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు భాగములుగా యున్నది. ఈ ఐదు పేర్లు గలవి బయట తెలియబడుచున్నవి. అవే ఐదు భాగములు మార్పుచెంది శరీరముగా కనిపించుచున్నవి. ప్రకృతి జనితములైనవి గుణములు అని చెప్పవచ్చును. గుణములు శరీరములో 6+ 6 అని రెండు రకములుగా మొత్తము పన్నెండు గలవు. ఆరు మంచి గుణములుగా, ఆరు చెడు గుణములుగా గుణచక్రములో యుండి మనిషి (జీవుని) మీద ప్రభావమును చూపుచున్నవి. బయట ప్రకృతిలో కూడా ప్రకృతి వలన తయారయిన గుణములు అనేకముగా కనిపించు సమస్యలుగా, అనేక దృశ్యములుగా యుండి బయట మనిషి చూపును ఆకర్షించి శరీరములోని మాయలో జీవున్ని ముంచుతున్నవి. ఉదాహరణకు బయట దృశ్యరూపముగా అందమైన అమ్మాయి కనిపిస్తే శరీరములోని గుణములలో 'కామము' అను ఆశ మొదలగును. అంతటితో ఆగక 'మోహము' అను గుణము కూడా ప్రారంభమగును. మొదట ఈ రెండు గుణములు మనిషిలో మొదలై మనిషిని చిక్కులలో పడత్రోయును. అలా గుణముల ప్రభావములో చిక్కుకోవడమును ‘మాయలో పడిపోవడము' అని అనుచుందురు. మొదట కనిపించిన యువతి కావలెనను ఆశ పుట్టగా, ఆ యువతి పూర్తి తనది కావలెనను మోహము పుట్టును. ఇక్కడ ఒకే దృశ్యములో రెండు గుణములు పని చేయడము జరిగినది. బయట స్థూలముగా ఒక దృశ్యము కనిపిస్తే ఈ విధముగా శరీరములో కనిపించని రెండు గుణములు పని చేయుచున్నవి. బయటి ప్రకృతి, లోపలి ప్రకృతి అనగా చర, అచర ప్రకృతులు అవినాభావ సంబంధముగా యుండి, మనిషి శరీరములోని జీవున్ని గుణ విషయముల వైపు లాగుచున్నవి. గుణములను జయించుట దుస్సాధ్యమైన పనియగుట వలన గుణములను జయించుటకు శరీరములోని ఆత్మను ప్రార్థించాలి, బయట పరమాత్మను వేడుకోవాలి.
----
బయటి ప్రకృతి తమ దృశ్యముల చేత, లోపలి ప్రకృతి తమ గుణముల చేత మనిషిని ఏ విధముగా తమ స్వాధీనములోనికి తెచ్చుకొను చున్నవో నేను ఇప్పుడు చెప్పిన విధానమును భగవద్గీతలో కర్మయోగము అను అధ్యాయమున 27, 28 శ్లోకములలో చెప్పిన విషయమును చూద్దాము.
శ్లో॥ 27. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః |
అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే ॥
భావము :- ప్రకృతి చేత తయారయిన గుణముల వలన అనేక విధములుగా చేయబడు కార్యములన్నిటికీ కర్తను నేనేయని అహంకారము గలవాడు అజ్ఞానియై అనుకొనుచుండును.
శ్లో॥ 28. తత్త్వవిత్తు మహాబారో! గుణకర్మ విభాగయోః | గుణా గుణేషు వర్తక్త ఇతి మత్వాన సజ్జతే ॥
భావము :- కర్మల మరియు గుణముల భాగములను తెలియు ఆత్మజ్ఞాని యైనవాడు ‘తాను' అను తలంపు రాకుండా మూడు గుణముల కార్యములే కర్మములగుచున్నవని ఆత్మజ్ఞానము వలన తెలియుచుండును.
ఆధ్యాత్మిక జ్ఞానము వలన కర్మములు, వాటి కార్యములు, కార్యములను ప్రేరేపించు గుణములు, అన్నిటినీ తెలిసినవాడై గుణముల వలననే కార్యములు జరుగుచున్నవని తెలిసి, శరీరములో జరుగు కార్యములన్నిటితో తనకు సంబంధము లేనట్లుండును. లోపలి గుణములను బయటి కార్యములను తెలియగలిగి ఆత్మజ్ఞానము వలన అహంభావమును పొందకపోవడమునే కర్మయోగముగా చెప్పుచున్నాము.
----
15) ప్రశ్న :- వేదములకు బాగా అలవాటుపడిన స్వాములు నాలుగు వేదములకు నాలుగు వాక్యములను చెప్పుచూ వాటిని మహావాక్యములు అని చెప్పుచున్నారు. నాలుగు వేదముల సారము నాలుగు వాక్యములలో కలదని చెప్పుచుందురు. ఆ నాలుగు మహావాక్యములు ఈ విధమైన పేర్లతో గలవు. వాటిలో జ్ఞానమున్నదను వారి మాటలు సత్యమేనా అని ప్రశ్నించుచున్నాము? నాలుగు మహావాక్యములలో ఏది ముందో, ఏది వెనుకో చెప్పలేము. అవి ఇలాగ యున్నవి. (1) అహం బ్రహ్మాస్మి (2) అయమాత్మ బ్రహ్మ (3) ప్రజ్ఞానం బ్రహ్మ (4) తత్వమసి. వీటిలోని రహస్యమును చెప్పండి?
జవాబు :- వేదములు నాలుగు. వాటినుండి తీసిన మహావాక్యములు నాలుగు. ఒక్కొక్క వేదములో యున్న సారాంశమంతయూ కలిపి ఒక వాక్యమును చెప్పడము జరిగినది. అందులో ఒకటి “అహం బ్రహ్మాస్మి” అని ఉన్నది. అహం బ్రహ్మాస్మి అను వాక్యము యొక్క అర్థమును చూస్తే అహం అనగా నేను అనీ, బ్రహ్మ అనగా దేవుడు (పరమాత్మ) యనీ, అస్మి అనగా అయితిని అని తెలియుచున్నది. మొత్తము అర్థమును కలిపిచూస్తే “నేను దేవున్ని అయినాను” అని చెప్పినట్లగుచున్నది. మనిషి దేవుడులోనికి కలిసిపోతే అతడు దేవుడు అయినట్లే గానీ, మనిషి దేవునిగా మారిపోతే అతడు బయటికి ఏమీ చెప్పలేడు. దేవుడు మాట్లాడడు కావున ఈ వాక్యమును చెప్పుటకు వీలులేదు. అయితే మనిషి మనిషిగానే యుండి నేను దేవున్ని అయినాను అని చెప్పినా అది అసత్యమగును. మనిషి కనిపించే
----
వ్యక్తిగా యుంటూ, మాట్లాడి చెప్పుచున్నాడంటే అతను దేవుడు కాలేదనీ, అతను చెప్పునది అసత్యమని తెలియుచున్నది. ఈ వాక్యమును మనిషిగా యున్నవాడు చెప్పితే అసత్యము అని చెప్పవచ్చును. అట్లుకాక దేవుడుగా మారిపోయినవాడు ఆ విషయమును బయటికి చెప్పలేడు కావున అతడు చెప్పాడు అనుట కూడా అసత్యమేయగును. రెండు విధములా ఇది అసత్య వాక్యమేయని తెలియుచున్నది.
రెండవ మహావాక్యమును గమనించితే “అయమాత్మ బ్రహ్మ” అని ఉన్నది. ఈ వాక్యమును విడదీసి చూస్తే అయమ్ అనగా నా యొక్క అనియూ, ఆత్మ బ్రహ్మ అనగా “నా ఆత్మే దేవుడు” అని అర్థము రాగలదు. ప్రతి మనిషిని ఒక జీవాత్మగా చెప్పితే అతనిలో ఆత్మ ఒకటి, పరమాత్మ మరొకటి యున్నవి. ఆత్మ, పరమాత్మ ఇద్దరిని దేవుళ్లేయని చెప్పినా, అందులో ఒకరు సృష్ఠింపబడిన ఆత్మకాగా, మరొకరు ఆత్మనే సృష్టించిన పరమాత్మగా యున్నారని చెప్పవచ్చును. జీవాత్మ కాకుండా శరీరములో యున్న ఆత్మ, పరమాత్మలలో ఒక్క పరమాత్మకు మాత్రమే బ్రహ్మయను పేరు వర్తించును. మనిషి ఆత్మను హిందువులు దేవుడని చెప్పినా, క్రైస్తవులు తండ్రియని చెప్పినా, ముస్లీమ్లు అల్లాహ్ యని చెప్పినా ఆయనను సృష్టించినవాడు గలడు. మొదటి సృష్ఠికర్తను పరమాత్మయని హిందువులు, పరిశుద్ధాత్మయని క్రైస్థవులు, నిరాపేక్ష అల్లాహ్యని ముస్లీమ్లు అంటున్నారు. పరమాత్మ అనినా, పరిశుద్ధాత్మ అనినా, అల్లాహ్ అనినా ముగ్గురూ ఒక్కటే. అయితే మనిషి శరీరములోని మూడు ఆత్మలలో పరమాత్మను మాత్రము బ్రహ్మయని అంటున్నాము. అన్నిటికీ జీవాత్మకు, ఆత్మకు పెద్దగా యున్న పరమాత్మనే ఆధ్యాత్మికరీత్యా బ్రహ్మయని చెప్పుచున్నాము. అయితే ఇక్కడ జీవాత్మగా యున్న మనిషి తనలోగల ఆత్మను బ్రహ్మ అనడము తప్పుయగును. మనిషి
---
శరీరములో ఆత్మయున్నా అది పెద్దకాదు. కావున అయమాత్మ బ్రహ్మ, “నా ఆత్మ బ్రహ్మ” యని చెప్పడము తప్పుయగునని చెప్పవచ్చును. ఆధ్యాత్మికము ప్రకారము మనిషి శరీరములోని ఆత్మ కార్యకర్తగాయుండి నిత్యము అన్ని పనులు చేయుచున్నాడు. పరమాత్మ, ఆత్మ చేయు పనులను సాక్షిగా చూస్తూ ఉండి ఆత్మకు, జీవాత్మకు ఇద్దరికి పెద్దగాయున్నాడు. అందువలన ఆత్మను పెద్ద (బ్రహ్మ) యని చెప్పకూడదు. పరమాత్మను వదలి ఆత్మను బ్రహ్మగా చెప్పడము పూర్తి తప్పగును. ఆత్మల విధానమును తెలియనివారు అలా చెప్పవచ్చును గానీ, మూడు ఆత్మల విషయము తెలిసినవారు ఎవరూ తన ఆత్మను బ్రహ్మయని చెప్పరు. అయమాత్మ బ్రహ్మయని చెప్పడము ఆధ్యాత్మికమునకు వ్యతిరేఖమయిన మాట అని చెప్పవచ్చును. వేదములలో ఆత్మల వివరము పూర్తిగా లేదు, కావున వేదముల వాక్యములు తప్పుగా యున్నవి.
ఇక మూడవ వాక్యమును చూస్తే “ప్రజ్ఞానం బ్రహ్మ” అని చెప్పి యున్నారు. ఈ వాక్యమునకు అర్థమును చూస్తే “ముఖ్యమైన జ్ఞానమే దేవుడు” అని చెప్పినట్లున్నది. బ్రహ్మ అనగా మూడు ఆత్మలలో చివరిది పెద్దది అయిన పరమాత్మయని చెప్పుకొన్నాము కదా! పరమాత్మ, జ్ఞానము వలన తెలియబడేవాడు కాడు. జ్ఞానము వలన తెలియబడేది ఆత్మ మాత్రమే. అందువలన పరమాత్మ ధర్మములకు జ్ఞానమునకు అతీతుడని చెప్పవచ్చును. పరమాత్మను శరణుబొందవలసిందేగానీ, ఆయనను జ్ఞానము వలనగానీ, ధర్మముల వలనగానీ తెలియలేరు. అందువలన ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీతలో మోక్షసన్న్యాస యోగమున అరవై ఆరవ శ్లోకమున ఈ విధముగా చెప్పాడు.
---
శ్లో॥ 66 .సర్వధర్మాన్ పరిత్యజ్య మా మేకం శరణం వ్రజ | అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః ॥
భావము :-
సర్వధర్మములను సంపూర్ణముగా విడిచిపెట్టి, నన్ను (పరమాత్మను) మాత్రము నీవు శరణుపొందుము. నిన్ను నేను పాప బంధమును లేకుండా జేతును. నిన్ను ముక్తున్ని జేతును.
అని పరమాత్మ చెప్పినట్లు గలదు. దీనిప్రకారము ముఖ్యమైన జ్ఞానము వలన అనగా ప్రజ్ఞానము వలన బ్రహ్మ అయిన పరమాత్మ తెలియబడడు. అంతేగాక ఎంత గొప్ప జ్ఞానము అయినా అది ఆత్మ వరకే ఉండును. పరమాత్మను తెలియజెప్పునదిగా యుండదు. ప్రజ్ఞానము ప్రజ్ఞానముగానే యుండును. దేవుడు దేవునిగానే యుండును. జ్ఞానము దేవుడు కాదు. అందువలన “ప్రజ్ఞానము బ్రహ్మ”యని చెప్పడము కూడా తప్పుగా యున్నది.
నాల్గవ వాక్యము అయిన “తత్త్వమసి" అను వాక్యము అర్థమును చూస్తే 'తత్' అనగా అది, 'త్వమ్' అనగా ఇది అనియు, అసి అనగా ఒకటిగా కలిసిపోయాయి అని చెప్పవచ్చును. దీనికి మాత్రము అనేకమంది అనేక రకముల అర్థములు చెప్పుచుందురు. అది ఇది ఒక్కటే అనియు లేక అది ఇది కలిసిపోయాయి అనియు ఎక్కువగా చెప్పుచుందురు. ఏది ఏ దానితో కలిసినా మనకు ఏమీ ప్రయోజనము లేదు. ముఖ్యముగా జీవాత్మ పరమాత్మతో కలిసిపోవడమే ఆధ్యాత్మికము యొక్క ధ్యేయము. జీవుడు దేవునితో కలిసిపోతే ఇది అదియని చెప్పేదానికి ఉండదు. అంతేకాక ఇక్కడ ఏది దేనితో కలిసినది అని స్పష్టముగా చెప్పలేదు. ప్రకృతి వస్తువు ప్రకృతి వస్తువుతో సులభముగా కలిసిపోవచ్చును. అట్లు ఆ విధానమును చెప్పినా ప్రకృతి కలయికతో మనకు ఎటువంటి ఆధ్యాత్మిక ఆదాయము
---
ఉండదు. అందువలన ఈ వాక్యము కూడా వృథా వాక్యముగా యున్నది. నాలుగు వేదములు మనిషిని ఆధ్యాత్మికమువైపు తీసుకపోకుండా లోపల ప్రకృతి గుణములవైపు, బయట విషయములవైపు మనిషిని తీసుకొనిపోవుట చేత, ఆ నాలుగు వేదములతో మనిషికి ఏమీ ప్రయోజనము లేదని భగవద్గీతలో చెప్పడము జరిగినది. అటువంటి నాలుగు వేదముల నుండి వచ్చిన నాలుగు మహావాక్యములనబడే వాటిలో కూడా ఏ కోణములో చూచినా ఆధ్యాత్మిక లాభము లేకపోవడమును గమనించవచ్చును. అందువలన నాల్గు వేదముల మాయలోగానీ, నాలుగు మహా వాక్యముల వెంటగానీ పడక అసలయిన ఆధ్యాత్మికము వైపు పొండి. ఆధ్యాత్మికము కావాలంటే మూడు దైవ గ్రంథములను చదివినవాడు పూర్తి జ్ఞాని అగుటకు, ఆధ్యాత్మికవేత్త అగుటకు అవకాశము గలదు.
16) ప్రశ్న :- హిందూదేశములో హిందువులుగా ఎన్నో కులములవారు గలరు. అన్ని కులములలో అగ్రకులముగా బ్రాహ్మణులు చెప్పబడుచున్నారు. పూర్వము ఒకప్పుడు బ్రహ్మవిద్యను బట్టి బ్రాహ్మణులు అనుట సరియైనదయినా, వారే అందరికంటే గొప్పవారని పేరున్నా, నేడు బ్రహ్మవిద్య లేకున్నా కులమును బట్టి బ్రాహ్మణులుగా చలామణి అగుచున్నారు. పూర్వము నుండి అన్ని కులములకు అన్ని శుభకార్యములలో బ్రాహ్మణులే పాల్గొని వేదమంత్రములను చదివి దానికి కూలిగా కొంత డబ్బులు తీసుకోవడము ఇప్పటికీ అలవాటుగాయున్నది. అన్ని కులముల వారికి
---
బ్రాహ్మణులు డబ్బులకు పని చేయుచూ, వారి కార్యములను నెరవేర్చుచున్నారు. దీనినిబట్టి బ్రాహ్మణులకు ఎవరూ సేవ చేయకున్నా, ఎవరూ వారికి ఉపయోగపడకున్నా వారు మాత్రము మిగతా తక్కువ కులముల వారందరికీ ఉపయోగ పడుచున్నాము అని అంటున్నారు. దీనినిబట్టి అందరికీ సేవలు చేయువారు బ్రాహ్మణులు అని చెప్పవచ్చును. కనిపించే సత్యముగా వారే అందరికీ సేవ చేసినట్లు గలదు. బ్రాహ్మణులు వేదములను చదువుటను, శుభకార్యములను నెరవేర్చుటను కులవృత్తిగా పెట్టుకొని జీవించుచున్నారు. వారు బ్రతుకు తెరువు వృత్తిగా సంస్కృతమును నేర్వడము, వేదములను వల్లించడము నేర్చి ఆ పనినే చేయుచున్నారు. అది భుక్తి కొరకు చేసినా పరవాలేదు. దేవుడు చెప్పినట్లు వేదములు అధర్మము లని తెలిసి అనీలయిన ఆధ్యాత్మికమును తెలియవలసి యున్నది. అయితే అట్లుకాకుండా తాము చేయు పని అంతయు ధర్మయుక్తమైనదని బొంకుచూ, తాము చెడి పోవడమేకాక ఇతరులను చెడపెట్టుచున్నారు. దైవగ్రంథము లోని దేవుని మాటకు వ్యతిరేఖముగా వేదములను ప్రచారము చేయుచూ, వేదములనే ధర్మములుగా చిత్రించి చెప్పుచున్నారు.
సాధారణ బ్రాహ్మణులు వారి బ్రతుకు వృత్తి కొరకు వేదమంత్రములను, యజ్ఞ కార్యములను చేయుచున్నా, వారు
----
విధిలేని స్థితిలో అలా చేయవలసి వచ్చినదని ఒప్పుకోవచ్చును. కొందరు అలా కాకుండా ఒక అడుగు ముందుకు వేసి, స్వాములుగా, గురువులుగా, పీఠాధిపతులుగా అవతారమెత్తి, తాము చెప్పునదే జ్ఞానము, తాము చేయునదే ధర్మాచరణ అని అంటున్నారు. అటువంటివారు ఎక్కడయినా ధర్మములు బోధించువారుంటే, వాడు తమ కులమువాడు కాదని గ్రహించి, అసలయిన జ్ఞానము చెప్పవానిని అధర్మవరునిగా చిత్రించి చూపుచున్నారు. ఏమీ తెలియని ప్రజలు జ్ఞానమంటే ఏమిటో, అజ్ఞానమంటే ఏమిటో తెలియని ప్రజలు, ధర్మము అంటే ఏమిటో, అధర్మము అంటే ఏమిటో తెలియని అమాయక ప్రజలు పీఠాధిపతులుగా చలామణి అగుచున్న స్వాముల మాటలను విని, అసలయిన ధర్మాచరణ చేయువారిని అజ్ఞానులని అనుకొంటున్నారు. బ్రాహ్మణుల నుండి వచ్చిన స్వాములందరూ పీఠాధిపతులుగా పేరు పెట్టుకొని, ఐకమత్యముగా యుంటూ మాలాంటి అన్య కులములవారు బ్రాహ్మణ కులము కానివారు వచ్చి ధర్మములను చెప్పినా, జ్ఞానమును చెప్పినా, అధర్మములను చెప్పినట్లు అజ్ఞానమును చెప్పినట్లు ప్రచారము చేయుచూ, భూమిమీద తాము తప్ప మిగతా కులములవారు ఎవరూ స్వామీజీలుగా ఉండకూడదని చూస్తున్నారు. పూర్వము ద్వాపర యుగములో కృష్ణుడు
----
బ్రాహ్మణేతరుడుగా గొల్లవానిగా వచ్చి జ్ఞానమును చెప్పిపోయాడు. అంతకుముందు రావణుడు త్రేతా యుగములో ధర్మములను బోధించి ఆచరింప చేశాడు. అతడు కూడా పుట్టుకతో బ్రాహ్మణుడు కాడు. అటువంటివారు దైవ గ్రంథములను చెప్పినవారు, ధర్మములను బోధించి చూపిన వారిని కూడా బ్రాహ్మణులు అసూయతో సాధారణ మనుషులకంటే హీనముగా చిత్రించి చూపారు. అదే కోవలో అంతర్ముఖ ఆధ్యాత్మికమును బోధించిన వేమన యోగిని, వీరబ్రహ్మముగారిని తమ కులము వారు కారను అభిప్రాయము తో వారు చెప్పినవి తిక్కమాటలు యనీ, చోదెమాటలుయనీ ప్రచారము చేశారు. ఏ జ్ఞానమునూ చెప్పని తమను పీఠాధిపతులుగా ప్రచారము చేసుకొన్నారు. తాము చెప్పునదే నిజమైన జ్ఞానమని అంటున్నారు. హిందూ ధర్మములన్ని తమ చేతిలో ఉన్నట్లు, తామే హిందూ ధర్మములను శాశ్వితముగా రక్షించుచున్నట్లు చెప్పచున్నారు. ఇప్పుడు మీరు క్రొత్తగా తైత సిద్ధాంతమును ప్రతిపాదించి, ధర్మములంటే ఏమిటో తెలియజెప్పుచున్నారు. అయినా మీకు కూడా వారు వ్యతిరేఖముగా మాట్లాడుచూ, తాము నిజమైన ధర్మ ఆచరణ కల్గినవారమని చెప్పుచున్నారు. ఇప్పుడు మాకు ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో సరియైన వివరణ లేక ఆలోచించు
----
చున్నాము. ఇట్టి పరిస్థితిలో మానవ సమాజము నకు మీరిచ్చు సందేశమేమి అని అడుగుచున్నాము?
జవాబు :- ఆధ్యాత్మికము నేడు రెండు రకముల కనిపించుచున్నది. నేడు బ్రాహ్మణ స్వామీజీలందరూ తమదే అసలయిన ఆధ్యాత్మికము అంటున్నారు. వారిది బయటి ఆధ్యాత్మికము. మాది లోపలి ఆధ్యాత్మికము అని చెప్ప వచ్చును. బ్రాహ్మణ పీఠాధిపతుల ఆధ్యాత్మికము నిజమైనదా? లేక మేము ఆచరించు లోపలి ఆధ్యాత్మికము నిజమైనదా? అని ఆలోచిస్తే మీకు సమాధానము దొరకగలదు. ఆత్మను ఆధ్యాయనము చేయడమును ఆధ్యాత్మికము అని చెప్పవచ్చును. ఆత్మ అనునది శరీరములో ఉండును కావున శరీరములో ఆచరించునదే అసలైన ఆధ్యాత్మికము. అంత:ర్గత ఆధ్యాత్మికమును ఆచరించువాడు బయటి ఆరాధనా కార్యములను చేయడు. నేడు మేము పీఠాధిపతులము, ఆధ్యాత్మికులము, ధర్మరక్షకులము అను చెప్పు ఒక జాతి స్వామీజీలందరూ ఎంత చెప్పినా వారు బయటి ఆరాధన మీదనే ఆధారపడుచూ, వాటినే చేయుచూ దేవతలను ఆరాధించుచున్నారు. పగలంతా భగవద్గీత చదివి సాయంకాలము రాజరాజేశ్వరికో, దుర్గాదేవికో, ఏదో ఒక దేవతకు పూజలు చేసి మంగళహారతులు ఇస్తున్నారు. అటువంటి బయటి ఆరాధనలు చేయువారికి శరీరము లోపల యున్న ఆత్మజ్ఞానము ఏమాత్రము తెలియదు. ఆత్మ శరీరము లోపలయుండుట చేత బయటి ఆరాధనలు చేయువారిది నిజమైన ఆధ్యాత్మికము కాదుయని చెప్పవచ్చును. నేడు స్వామీజీయనియో, పీఠాధిపతియనియో చెప్పుకొనుచున్న బ్రాహ్మణ స్వామీజీలది ఆధ్యాత్మికము కాదు అని, బాహ్యాచరణలు చేయక లోపలి ఆత్మను ఆరాధించువారు నిజమైన ఆధ్యాత్మికులని తెలియవలెను.
----
బయట ఆరాధనలు చేయువారు యజ్ఞ, తపస్సులను చేయుచూ, వివిధ పూజలు చేయుచూ, అన్నిటియందు వేదములను ఆధ్యాయణము చేయుచుందురు. అటువంటివారు ఎంతపెద్ద స్వామీజీలుగా యున్నా వారికి ఏమాత్రము కూడా లోపలి ఆత్మ మీద ధ్యాసగానీ, దానిని ఆరాధించు యోగపద్ధతిగానీ తెలిసియుండదు. అలా తెలిసియుంటే బాహ్యారాధనలు, దేవతారాధనలు చేయరు. ఎన్ని చెప్పినా చివరకు వేదమంత్రములను చదువుచూ, బయటి ఆరాధనలు చేయువారికి ఆత్మ ధర్మములు తెలియవనీ, దైవగ్రంథములలో దేవుడు చెప్పిన జ్ఞానము తెలియదనీ చెప్పవచ్చును. బాహ్యాపూజలు చేయువారికి కర్మలను జయించు శక్తియుండదు. అంతర్గత ఆధ్యాత్మికమును తెలిసి ఆచరించువారికి జ్ఞానశక్తి అమితముగా యుండి ఇతరుల కర్మలను లేకుండా చేయు స్థోమత కల్గియుందురు. మేము వ్రాసిన ప్రతి గ్రంథములో అటువంటి జ్ఞానాగ్ని కలదనీ, దేవున్ని విశ్వసించినవారికి అది కర్మలను కాల్చుటకు ఉపయోగపడుచున్నదని చెప్పుచున్నాము. అంతేకాక వేమన యోగి తన పద్యములలో వేదములను గురించి తెలిపిన తన ఉద్దేశ్యమును మీరు క్రింద చూడవచ్చును.
పద్యము 1 :
వేదములను జదివి ఎవరేమి గాంచిరి?
యరిగి తిరిగి వత్తు రందరు కద!
బ్రహ్మమేమొ తెలిసి బ్రతుకుట నిజమయా
విశ్వదాభిరామ వినుర వేమా.
తాత్పర్యము :- వేదములను చదివితిమని బ్రాహ్మణులు గర్వించిన ప్రయోజనమేమి? వాని ఉపయోగమేమి? బ్రహ్మమును తెలిసికొన్నప్పుడే అతనికి బ్రాహ్మణత్వము సిద్ధించును
----
పద్యము 2 :
వేద విద్యలెల్ల వేశ్యల వంటివి
భ్రమలబెట్టి తేటపడగనీవు
గుప్త విద్య యొకటె కులకాంత వంటిది
విశ్వదాభిరామ వినుర వేమా.
తాత్పర్యము: వేదవిద్యలు వేశ్యలవలె భ్రమలు పెట్టి తత్త్వము తెలియ
నీయవు. బ్రహ్మమును తెలిసికొను విద్యయొక్కటె కులస్త్రీవలె ఉత్తమమై కీర్తి కలిగించి తరింపజేయును.
పద్యము 3 :
వేదశాస్త్రములను విరివిగా దా నేర్చి
వాదమాడువాడు వట్టివాడు
సారమైన గురుతు సాక్షిగా నెంచుము
విశ్వదాభిరామ వినుర వేమా.
తాత్పర్యము :- సర్వోత్కృష్టమైన గురుతును సాధించినవాడే సన్యాసి.
పద్యము 4 :
వేదము జదివియు విఱ్ఱవీగుటె గాని
యధమగతిని బడిరి వారలెల్ల
బ్రహ్మ మహిమ తెలిసి బ్రదికిన బ్రదుకయా విశ్వదాభిరామ వినుర వేమా.
తాత్పర్యము :- 'మేము బ్రాహ్మణులము, వేదములను చదివితిమి' అని విర్రవీగి, బ్రహ్మము మహిమను తెలిసికొనలేక మూఢులధోగతి పాలగుదురు. బ్రహ్మము నెరిగినవారి జీవనమే జీవనము.
పద్యము 5 :
వేనవేలు చేరి వెఱికుక్కలవలె
అర్థహీన వేద మఱచుచుంద్రు
కంఠశోషకంటే కలిగెడి ఫలమేమి?
విశ్వదాభిరామ వినుర వేమా.
----
తాత్పర్యము :- వేలకొలది గుంపుగా చేరి వెర్రికుక్కలరచినట్లు, అర్థము లేని వేదమును చదువుచుందురు. వీరికి కంఠశోషయే మిగులును.
17) ప్రశ్న :- వేదము అనగా వేదనతో కూడుకొన్నదనీ, ‘వేదన' అను పదము నుండి 'వేదము' అను పదము పుట్టినదని మీరు చెప్పారు. కానీ కొంతమంది విద్ అనే సంస్కృత పదము నుండి వేదము వచ్చినదనీ, విద్ అంటే తెలియుటయనీ, వేదము అనగా తెలుసుకోతగినదనీ అంటున్నారు. ఏది సత్యమో తెలియజేయాలని కోరుచున్నాము?
జవాబు :- విద్ అనగా తెలియుట అనునది వాస్తవమే అయినా 'విద్' అనే పదము నుండి 'విద్య' అను పదము పుట్టినది గానీ వేదము అను పదము పుట్టలేదు. విద్య ద్వారానే ఎవరయినా దేనినయినా తెలియవచ్చును. అందువలన విద్ అనగా తెలియుట సత్యమే. విద్ అనే దాతువు నుండి విద్య అను పదము పుట్టినది. దీనినిబట్టి విద్ అను పదమునకు, వేదము అను పదమునకు ఏమాత్రము సంబంధము లేదని తెలియుచున్నది.
18) ప్రశ్న :- హిందూమతములో సిద్ధాంతకర్తలుగా పేరుగాంచిన శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు గలరు. సంస్కృతములో వ్యాసుడు చెప్పిన భగవద్గీతకు మళీయాల భాషలో శంకరాచార్యుల వారు, తమిళ భాషలో రామానుజాచార్యుల వారు, కన్నడ భాషలో మధ్వాచార్యుల వారు వివరమును వ్రాశారు. వారు ముగ్గురు
----
భగవద్గీతలో చెప్పిన వేదములను అధర్మములని ఖండించినట్లు ఎక్కడాలేదు. అంత పెద్ద వారికి కనిపించని తప్పు మీకు మాత్రమే కనిపించినదా? నిత్యము భగవద్గీతను ఉపన్యసించు స్వామీజీలకు, పీఠాధిపతులకు, బ్రాహ్మణులకు వేదములు అధర్మములని తెలియకుండా ఉంటుందా? వారు దేవుడు చెప్పిన శ్లోకములకు వ్యతిరేఖముగా బోధిస్తున్నారా? మీరు జవాబు చెప్పండి.
జవాబు :- హిందూమతములో గతములో ముగ్గురు సిద్ధాంతకర్తలున్నది నిజమే. అయితే ఇప్పుడు దాదాపు 40 సంవత్సరముల నుండి "త్రైత సిద్ధాంతము” అను పేరుతో నాల్గవ సిద్ధాంతము వచ్చినది. క్రొత్తగా వచ్చిన త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించినది శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు. నేడు త్రైత సిద్ధాంతమును గురించి చెప్పడమేకాక త్రైత సిద్ధాంతముతో ఏది సత్యము, ఏది అసత్యము అని తేల్చి చెప్పడము జరుగుచున్నది. ఆ పద్ధతిలో ముగ్గురు సిద్ధాంతకర్తలు చెప్పని సత్యమును ఇప్పుడు చెప్పుట జరుగుచున్నది. గతములో ఎంతో పెద్ద పేరుగాంచిన ముగ్గురు సిద్ధాంతకర్తలకు వేదముల విషయములో మీకు కనిపించిన సత్యము కనిపించలేదా!యని కొందరు అడుగుచున్నారు. దానికి నేను నేరుగా సమాధానము చెప్పక చిన్న ఉదాహరణను చెప్పెదను. దానినిబట్టి వారికి వేదముల విషయములో ఏమి కనిపించినదో మీకే తెలియగలదు. ఇత్తడికి పుత్తడికి తేడా తెలియని వారిని ఎట్లు పోల్చుకోగలమో, వేదమునకు ధర్మమునకు తేడా తెలియని వారిని అట్లే పోల్చుకోవచ్చును. గతములో సిద్ధాంతకర్తలు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు వివరమును చెప్పిన
---
విధానమును ఇప్పుడు చూస్తాము. (ఆత్మసంయమ యోగము అను అధ్యాయములో మొట్టమొదటి శ్లోకము చూడము.)
శ్లోకము 1. అనాశ్రితః కర్మఫలమ్ కార్యం కర్మకరోతియః |
స సన్న్యాసీ చ యోగీచ ననిరగ్ని ర్నచాక్రియ ః |
భావము :- కర్మఫలమాశ్రయింపక పనులు చేయవలెనని తలచి ఎవడు చేయునో వాడే నిజమైన సన్నాసి, నిజమైన యోగి. కార్యములు చేయని వాడు, అగ్ని లేనివాడు యోగిగానీ, సన్నాసిగానీ కాడు.
ఈ శ్లోకము భగవద్గీతలో చాలా ముఖ్యమైన శ్లోకము. భగవంతుడైన కృష్ణుడు చెప్పిన ధర్మయుక్తమైన యోగములలో బ్రహ్మయోగము, కర్మయోగము అను రెండు యోగములు గలవు. అందులో సాధారణ మనుషులందరూ ఆచరింపతగినది కర్మయోగము. కర్మయోగమును ఒక్కమాటలో చెప్పిన శ్లోకము ఆత్మ సంయమయోగములో మొదటి శ్లోకమని చెప్పవచ్చును. అయితే ఈ శ్లోకములోని భావము బట్టబయలు చేసినట్లు అందరికీ అర్థమగులాగున కలదు. అయినా భగవద్గీతను వివరించి వ్రాసిన వారిలో మొదటి వానిని మొదలుకొని చివరివాని వరకు వ్రాసిన వివరమును గమనించితే తప్పుదారిని చూపినట్లు కలదు. అందులో మొట్టమొదట ఆది శంకరాచార్యులు రెండువేల సంవత్సరములప్పుడు వ్రాసినట్లు కలదు. తర్వాత మిగతా ఇద్దరు రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, చాలామంది స్వామీజీలు, పండితులు వ్రాయడము జరిగినది. వ్రాసిన వారందరూ వారి భావములో “ననిరగ్ని" అను మాటకు అగ్నిహోత్రము చేయనివాడు అని కొందరు, యజ్ఞములు చేయనివాడు అని కొందరు వ్రాయడము జరిగినది. అందరూ అదే విధముగా వ్రాసియుండడము వలన భగవద్గీత
----
మానవులందరికీ చెప్పినది కాదనీ, కేవలము యజ్ఞయాగాదులు చేయు బ్రాహ్మణులకేయని చెప్పినట్లయినది. సంస్కృత భాషలో చదువును నేర్చిన వారు, యజ్ఞములను చేయు విధానమును తెలిసినవారు బ్రాహ్మణులే అయినందున మిగతా ప్రజలకు భగవద్గీతను చదివేదానికి రాదు. అంతేకాక కొందరు భగవద్గీతను వేదములు తెలిసిన బ్రాహ్మణులే చదవాలి, మిగతావారు చదవకూడదు అని చెప్పుట వలన కూడా ప్రజలందరూ భగవద్గీతకు దూరమైపోయారు.
ఎక్కడయినా ఎవరయినా చదివినా ఈ శ్లోకములు తమకు కాదు కేవలము యజ్ఞములు చేయు బ్రాహ్మణులకే యని అర్థమగుచున్నది. వాస్తవముగా పై శ్లోకములో భగవంతుడు చెప్పిన సత్యమును చూస్తే "కర్మ ఫలములైన కనిపించని పాపపుణ్యముల మీదగానీ, కనిపించెడి లాభనష్టముల మీదగానీ ధ్యాస లేకుండా చేయవలసిన కార్యములను చేయవలెనని తలచి, నిమిత్తమాత్రుడుగా చేయవలెనను ఉద్దేశ్యముతో చేయువాడు నిజమైన సన్నాసి, నిజమైన యోగి" అని చెప్పవచ్చును. అట్లుకాకుండా “నేను పనులనే చేయను, సన్న్యసించినవాడు పనులు చేయకూడదు అని కార్యములను మానుకొన్న వాడుగానీ, అగ్ని లేనివాడు గానీ, నిజమైన సన్న్యాసి అనీగానీ, నిజమైన యోగి అనిగానీ చెప్పబడడు" అని తెలియుచున్నది.
ఈ శ్లోకములో ముఖ్యముగా విశేషముగా యున్న పదము “ననిరగ్ని” అనునదే. ననిరగ్ని అనగా అగ్ని లేనివాడు అని అర్థము గలదు. అగ్ని అను పదము వినిపించుతూనే, అక్కడ చెప్పినది ఏ అగ్నిని అని ఆలోచించ కుండా బయట కనిపించు అగ్నిని గురించి చెప్పుచూ, అగ్నిని రగిల్చి చేయు కార్యములయిన యజ్ఞయాగాదులు చేయనివారు అని చెప్పారు. ఈ
----
అలా వారు
విషయమును సిద్ధాంతకర్తలు చెప్పినట్లు కూడా వ్రాశారు. చెప్పియుంటే వారిది కూడా తప్పేయని ఈ శ్లోక భావమును పరిశోధించిన తర్వాత చెప్పక తప్పదు. ఎందుకనగా! భగవద్గీతలోని ఈ శ్లోకములో బాహ్య అగ్నిని గురించి చెప్పినట్లు ఏమాత్రము లేదు. అట్లు లేనిదానిని గురించి ఉన్నట్లు చెప్పడము ఎవరిదయినా తప్పగును. లేనిది ఉన్నట్లు కల్పించి ఒకరు చెప్పవచ్చును లేక ఇద్దరు చెప్పవచ్చును. అలా కాకుండా అందరూ ఎందుకు చెప్పియుందురు? అని ఎవరికయినా అనుమానము వచ్చును. అందరూ ఒకే భావమును చెప్పియుండడము వలన అదే సత్యము అని అందరూ నమ్ము అవకాశము గలదు. అలాగే అందరూ నమ్మారు. కానీ నేను అలా నమ్మలేదు. శాస్త్రబద్దమైన వివరమును తెలుసుకొని ఇతరులకు తెలుపాలని అనుకొన్నాను. అందువలన ఈ శ్లోకమును గురించి వివరించి మాట్లాడదలచుకొన్నాను. నా మాట ప్రజలకు నచ్చినా, నచ్చక పోయినా దేవుని లెక్కలో సక్రమముగా ఉండాలియన్నదే నా ఉద్దేశ్యము.
ప్రపంచములో ప్రతీదీ సూక్ష్మము, స్థూలము అని రెండు రకములు గలవు. అలాగే అగ్ని స్థూలముగా యుండి కట్టెలను కాల్చునదిగా యున్నది. ఏ వస్తువునయినా కాల్చు అగ్ని స్థూలముగానేకాక సూక్ష్మముగా కూడా యున్నది. స్థూలముగా యున్న అగ్ని మండేదానికి ప్రాణవాయువు (ఆక్సిజన్) అవసరము. అట్లే సూక్ష్మముగా యున్న అగ్ని మండేదానికి జ్ఞానము (నాలెడ్జ్) అవసరము. ప్రాణవాయువు లేనిచోట మండే అగ్ని ఉండదు. అలాగే జ్ఞానము లేనిచోట వెలిగే జ్ఞానాగ్ని ఉండదు. అగ్ని స్థూల, సూక్ష్మము అను రెండు రకములుగా యున్నది. సూక్ష్మముగా కనిపించనివాడుగా యున్న దేవున్ని గురించి భగవద్గీత చెప్పునది. కావున భగవద్గీతలో సూక్ష్మమైన జ్ఞానాగ్ని గురించే చెప్పియున్నాదని తెలియవలెను. అంతేగానీ, శ్లోకములో
---
లేని 'యజ్ఞము' అను పదమును తెచ్చి పెట్టుకోవడము తప్పు అగును కదా! శ్లోకములో యజ్ఞ యాగములు చేయు అగ్ని అని ఒక ముక్క అయినా చెప్పాడా! అంటే అది ఏమాత్రమూ లేదు. అందువలన ఈ శ్లోకములో చెప్పినది సూక్ష్మమైన జ్ఞానాగ్నిని గురించేయని తెలియుచున్నది.
యోగి లేక సన్యాసి అనునతనిని గురించి మాట్లాడునప్పుడు 'జ్ఞానము' అను అగ్నిని బట్టియే చూడాలిగానీ, బయట అగ్నిని బట్టి చూచుటకు వీలులేదు. బయటి అగ్ని కలవాడు యోగి అయితే చిన్న గుంతలో కొద్దిపాటి అగ్నితో యజ్ఞములు చేయువారికంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో గల పెద్ద పెద్ద బైలర్లను మండించువాడు, ఉక్కు కార్మాగారములో ఇనుమును కరిగించు చోట మండించు అగ్ని నిలయముల వద్ద పని చేయు వారిని పెద్ద యోగులుగా, పెద్ద సన్న్యాసులుగా లెక్కించవలసి యుండును. ఇంకనూ పశువుల మేతను ఒకచోట చేర్చిన గడ్డివాములను లేకుండా చేయవలెనని వామికి అగ్నిపెట్టు దుర్మార్గున్ని కూడా యోగిగానే లెక్కించవలసి యుండును. బొగ్గుల కొరకు అడవిని అంటించు వానిని కూడా యోగిగానే లెక్కించవలసియుండును. చిన్న అగ్నిగుండములో మంటను మండించువాడు యోగి, సన్న్యాసి అయితే కొన్ని వందల చదరపు మైళ్ల విస్తీర్ణములో గల అడవిని అంటించువాడు, ఇంకా పెద్ద యోగి అనుటకు అవకాశము గలదు. ఇట్లు బయట అగ్నిని బట్టి కాకుండా, లోపలి అగ్ని అయిన జ్ఞానాగ్నిని బట్టి యోగులు ఉందురని తెలిసి జ్ఞానాగ్ని లేనివానిని యోగి అనిగానీ, కార్యములు చేయని వానిని సన్న్యాసి అనిగానీ అనకూడదు యని శ్లోకములో 'ననిరగ్ని, నచాక్రియః' అని చెప్పడమే కాక 'సయోగి, ససన్యాసి' అని కూడా చెప్పియున్నారు.
----
సంస్కృత విద్యను బాగా నేర్చి, భగవద్గీతను అనేక భాషలలో చెప్పిన వారికి ఆ మాత్రము అర్థమయి ఉండదాయన్నదే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్నగా యున్నది. సంస్కృత భాష బాగా వచ్చినవారికి శ్లోకములోని విషయము బాగా అర్థమయి ఉండును. అయినా శ్లోకములో లేని విషయమును చెప్పారు అంటే అదే పనిగా అలాగే చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించ వలెనను ఉద్దేశ్యముతోనే చెప్పియుందురు. అలా చెప్పుటకు కారణము వారికి లోపలి ఆధ్యాత్మికము తెలియకపోవడము వలన, బయట చేయు ఆరాధనలను సమర్థించుకొనుటకు, అదే పనిగా అసత్యమును చెప్పి భావమును ప్రక్కదారి పట్టించారు. ఏది ఏమయినా తాము అలవాటు పడిన వేదములను, యజ్ఞములను సమర్థించుకొనుటకు ఈ శ్లోక భావమును తప్పుగా చెప్పారని తెలియుచున్నది. కొందరు 'ముందు చెప్పిన వారిని అనుసరించి మేము కూడా చెప్పుచున్నాము. నిజముగా ఆ శ్లోకమునకున్న భావము మాకు తెలియదు' అని అంటున్నారు. వంద సంవత్సరముల వరకు బ్రాహ్మణులు తప్ప విద్య నేర్చినవారే లేరు. అందులోను సంస్కృత విద్య బ్రాహ్మణులకు మాత్రమే తెలియుట వలన, వారు ఏమి చెప్పితే దానిని వినవలెనను భావము అందరిలో ఉండేది. దానివలన వారు చెప్పినదే విని అదే సత్యమనుకోవడము జరిగినది. ఈ విషయములో పూర్తి మోసము జరిగినదనీ, విద్యావంతులైన బ్రాహ్మణులు, స్వామీజీలు, పీఠాధిపతులు అదే పనిగా తప్పుదారి పట్టించి, ప్రజలకు ద్రోహము చేసి అసలయిన దేవుని జ్ఞానమును తెలియకుండా చేశారని మేము చెప్పుచున్నాము. ఇప్పుడిప్పుడే మా మాట సత్యమని కొందరు తెలుసుకోగలిగారు.
19) ప్రశ్న:- మీరు చెప్పునది మేము విని, కొందరు బ్రాహ్మణ స్వామీజీల వద్దకు పోయి, మీరు భగవద్గీతలోని శ్లోకముల
----
భావములు తప్పు వ్రాసి ప్రజలను తప్పుదారి పట్టించారు కదా! యని ఆత్మ సంయమయోగములోని మొదటి శ్లోకమును ఉదాహరణగా చూపి అడిగాము. దానికి బదులుగా వారు జవాబు చెప్పుచూ “మమ్ములను తప్పు అనుటకు మీవద్ద ఏమి ఆధారము కలదు? ఆ శ్లోకములో యున్నది అగ్ని అని మాత్రమే గలదుగానీ, బయటి అగ్ని అనిగానీ, లోపలి అగ్ని అనిగానీ లేదు కదా! అక్కడ జ్ఞానాగ్ని అను మాటేలేనిది మీరు ఎందుకు జ్ఞానాగ్ని అని అనుకొంటున్నారు. మీరు అనుకొను భావము తప్పుయై ఉండవచ్చును కదా!" అని అన్నారు. దీనికి మీరే
మంటారు?
జవాబు :- ఇది దేవుడు మనుషులందరికీ చెప్పిన జ్ఞానము. కేవలము బ్రాహ్మణులకు మాత్రమే చెప్పిన జ్ఞానము కాదు. మేము వారిని తప్పు పట్టవలెననీగానీ, తప్పువారిగా చూపవలెననీ గానీ చెప్పలేదు. అక్కడ చెప్పిన అగ్నిని జ్ఞానాగ్ని అని ఎందుకు అనుకోవాలని? బయటి అగ్ని అని ఎందుకు అనుకోకూడదని వారు ప్రశ్నించుచున్నారు అని మీరు అడిగారు. ఇక్కడ కూడా వారి తెలివిని ప్రదర్శించారని చెప్పవచ్చును. నేను ఆధారము లేకుండా వారిని తప్పు పట్టలేదు. భగవద్గీతలో జ్ఞానయోగమందు 37వ శ్లోకమున ప్రపంచ సంబంధ అగ్నిని మరియు దైవ సంబంధ అగ్నిని గురించి చెప్పియున్నారు. దానిని నాల్గవ అధ్యాయమున చదివినవాడు ఆరవ అధ్యాయమున యోగికి సంబంధించినది బాహ్య ప్రపంచ సంబంధ అగ్ని అని అనుకోడు. ఫలానా అగ్ని లేదు అని అనుచున్నారంటే అది అతితెలివిని ప్రదర్శించినట్లేయని చెప్పవచ్చును.
----
జ్ఞానయోగము, 37వ శ్లోకము :-
శ్లో॥ 37.
యథైధాంసి సమిద్ధాగ్ని రస్మసాత్కురుతేర్జున | జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ॥
భావము :- ఏ విధముగా అగ్నిలో కట్టెలు కాలిపోయి బూడిద అగుచున్నవో, అదే విధముగా జ్ఞానమను అగ్నిలో కర్మలు అను కట్టెలు కాలి బూడిద అయిపోవుచున్నవి. (ఇక్కడ బాహ్యాగ్నిని, అంతరమునగల జ్ఞానాగ్నిని రెండు అగ్నులను గురించి చెప్పియున్నారు. )
ఆత్మ సంయమ యోగములో మొదటి శ్లోకమునకు చెప్పిన భావము తప్పు అనుటకు మూడవ అధ్యాయమైన కర్మయోగములో తొమ్మిదవ శ్లోకములో చెప్పిన భావమును చూస్తే నిజమైన యజ్ఞము ఏదో దేనివలన కర్మలేకుండా పోవునో తెలియగలదు.
కర్మయోగము, తొమ్మిదవ శ్లోకము :-
శ్లో॥ 9. యజ్ఞార్థాత్కర్మణోన్య త్రలోకో యం కర్మబంధన : తదర్థం కర్మ కౌంతేయ! ముక్త సంగస్సమాచర ॥
భావము :- “యజ్ఞము యొక్క అర్ధముతో కూడిన కార్యములకంటే వేరు కార్యములను చేస్తే కర్మబంధములయిన పాపపుణ్యములు వచ్చును. కావున కర్మ ఫలముల మీద ఆశ లేకుండా కార్యములను చేయుము” (అని చెప్పారు కదా! ఇదే విషయమునే ఆత్మ సంయమ యోగములో “అనాశ్రితః కర్మఫలమ్ కార్యమ్” అని అన్నారు. ఈ శ్లోకములో అదే మాటనే “ముక్త సంగ సమాచర” అని అన్నారు)
----
వారు అసత్యమును చెప్పి కూడా మాది ఏమి తప్పు అని అనుచున్నా రంటే వారి తప్పును కప్పిపుచ్చుకొనుటకు తప్ప ఇతరము లేదని తెలియు చున్నది. మనిషి చేయు యజ్ఞములు రెండు రకములు గలవని అందులో ఒకటి ద్రవ్యయజ్ఞము అనీ, రెండవది జ్ఞానయజ్ఞమనీ విడదీసి ఆ రెండిటిలో ఏది గొప్పదో, ఏ అగ్ని చేత ఏది చేయబడుచున్నదో కూడా నాల్గవ అధ్యాయమైన జ్ఞానయోగములో 33వ శ్లోకమున చెప్పారు.
జ్ఞానయోగము, 33వ శ్లోకము :-
శ్లో॥ 33. *శ్రీయాన్ ద్రవ్యమయా ద్యజ్ఞిత్ జ్ఞాన యజ్ఞః పరంతప! ॥ సర్వం కర్ణాఖిలం పార్థ! అనే పరిసమాప్యతే |
భావము :- ద్రవ్యయజ్ఞముకంటే ఉత్తమమైనది జ్ఞానయజ్ఞము. జ్ఞాన యజ్ఞములో సర్వకర్మలు కాలిపోవును.
యజ్ఞము అనగా అగ్నిచేత రగల్చబడునది యని అర్థము. ప్రపంచములో బాహ్య వస్తువులు ఏవి దహింపబడినా దానిని యజ్ఞమనియే చెప్పవచ్చును. బాహ్య వస్తువులను ద్రవ్యములు అని అనుచున్నాము. బాహ్య వస్తువును కాల్చి చేయు యజ్ఞములను ద్రవ్యయజ్ఞములని చెప్పుచున్నాము. యజ్ఞములు రెండు రకములు గలవనీ, అందులో ఒకటి ద్రవ్యయజ్ఞము కాగా, రెండవది జ్ఞానయజ్ఞము అని చెప్పబడినది. ద్రవ్యయజ్ఞముకంటే జ్ఞానయజ్ఞము శ్రేష్ఠమయినదనీ, అందులో మనిషికి వచ్చు పాపపుణ్య కర్మలన్నీ కాలిపోవునని చెప్పియున్నారు. ఇట్లు ముందు అధ్యాయములలో చెప్పిన శ్లోకములను అనుసంధానము చేసి చూస్తే, ఆత్మసంయమ యోగములో బాహ్య అగ్నిని, బాహ్యయజ్ఞములను గురించి చెప్పడము, అదే పనిగా ప్రజలను తప్పుదారి పట్టించి మోసము చేసినట్లేయగును.
----
20) ప్రశ్న :- మీరు వేదములు మనిషికి పనికిరావు అని చెప్పుచూ చివరకు బాహ్యయజ్ఞములు (ద్రవ్యయజ్ఞములు) మనిషికి పనికి రావు అని చెప్పుచున్నారు. మీరు చెప్పవలసింది వేదములను గురించే కదా!
జవాబు :- ఏనుగుకు మొదట తొండము ఉంటే చివరిలో తోక ఉంటుంది. ఏనుగుకు తోక, తొండము రెండూ ఉండుట సహజము. వెనుక తోక ఉంది కదా! ముందర తొండము ఎందుకు అనిగానీ, ముందర తొండము ఉంది కదా! వెనుక తోక ఎందుకు అనిగానీ అనుటకు వీలులేదు. ఏనుగుకు తొండము, తోక రెండూ అవసరమే. ఏనుగుకు తోక, తొండము రెండు కనిపించునవై చూచుటకు ఒకటి పొడవుగా, మరొకటి పొట్టిగా ఉండును. ముందర తొండము యుంటే దానివలన ఏనుగు బ్రతకగలిగి వెనుక తోక క్షేమముగా ఉండును. అలాగే ఏనుగుకు బాహ్యముగా తోక, తొండము అవినాభావ సంబంధముగా యున్నట్లు, బాహ్య ఆచరణతో (ఆరాధనలలో) యజ్ఞము, వేదము రెండు అవినాభావ సంబంధము కల్గియున్నవి. బాహ్య ఆరాధనలలో మొదట యజ్ఞముండగా, దానికి అనుసంధానముగా వేదములు ఉండును. తోకలేని ఏనుగు లేనట్లు, వేదములు లేని యజ్ఞములు ఉండవు. అట్లని ఏనుగు ఒక్కదానికే తోక ఉన్నదని చెప్పుట లేదు. పొడవు మూతిగల గుఱ్ఱమునకు తోక ఉంటుంది. అలాగే కురుస మూతిగల కుక్కకు తోక ఉంటుంది. అందువలన ఒక్క యజ్ఞములలోనే కాకుండా అనేక ఆరాధన కార్యములలో మరియు అనేక శుభకార్యములలో వేదమంత్ర
ములుండుట చూడగలము.
----
ముందు యజ్ఞములను చెప్పి దానికి అనుసంధానముగా యున్న వేదములను చెప్పుచున్నాను. వేదములను ద్వాపరయుగములో వ్యాసుడు గ్రంథరూపముగా చేసి, యజ్ఞముల మనుగడ కొరకు, తాను వ్రాసిన యజ్ఞములు స్థిరస్థాయిగా ఉండుటకు, యజ్ఞములను అనేక బాహ్య కార్యముల యందు జోడించి, వేదములు లేనిదే ఆ కార్యములకు విలువలేదు అని చెప్పడము జరిగినది. కృతయుగము నుండి బాహ్య ఆరాధనలైన యజ్ఞ యాగాదులు, వ్రత క్రతువులు, వివాహాది శుభకార్యములు ఉండేవి. ఆ కాలములో ఎవరికి తోచిన మంత్రములను వారు చెప్పి బాహ్య కార్యములను చేసెడివారు. ఫలానా కార్యమునకు ఫలానా మంత్రమే అను నియమము లేకుండా ఎవరు ఇష్టము వచ్చినట్లు వారు చేసెడివారు. ద్వాపర యుగములో వేదములు గ్రంథరూపమైన తర్వాత ఫలానా కార్యమునకు ఫలానా మంత్రము చదువవలెనని వేదములలోని మంత్రములను చెప్పడము జరిగినది. అందువలన పెళ్లికి చెప్పిన మంత్రము దేవతా పూజలో చెప్పరు. దేవతా పూజలలో చెప్పిన మంత్రము యజ్ఞములకు చెప్పరు. ఇట్లు దేనికి మంత్రము చెప్పాలో ద్వాపర యుగములో వ్యాసుడే నిర్ణయము చేసి చెప్పడమైనది.
వేదములలో మంత్రములను వ్రాసినవాడు వ్యాసుడే, అలాగే వేదము చివరిలో ఉపనిషత్తులను వ్రాసినవాడు వ్యాసుడే. వ్యాసుడు బ్రాహ్మణు లందరికీ పూజ్యుడుగా యున్నాడు. అందువలన వ్యాసుడు మొదట చెప్పిన వేదములను, వేదమంత్రములను వదలక యున్నారు. బ్రహ్మజ్ఞానమైన భగవద్గీతను తెలిసిన వ్యాసుడు తాను ముందు చేసిన పనికి చింతించి, తాను వ్రాసిన భగవద్గీత గ్రంథములో వేదములను ఖండించుచూ వేదములే బాహ్యముగా యున్న మాయ అని, గుణ విషయములతో కూడుకొన్నవనీ
---
వాటి జోలికి పోవద్దని వ్రాశాడు. వ్యాసుడు ఆ విధముగా భగవద్గీతలో వ్రాయడము ఇష్టములేని బ్రాహ్మణులు కక్కలేక మ్రింగలేక వ్యాసుడు పోవు వరకు అట్లే అణిగియుండి వ్యాసుడు పోయిన తర్వాత భగవద్గీతలో యజ్ఞ సంబంధ శ్లోకములను అక్కడక్కడ కలిపి భగవద్గీతను కూడా కొంత కలుషితము చేశారు. దానిని ఇతరులు ఎవరూ గ్రహించకపోయినా మేము గ్రహించి, మేము వ్రాసిన “త్రైత సిద్ధాంత భగవద్గీత”లో ఆ శ్లోకములను బయట పెట్టడము జరిగినది. మొత్తము మీద వేదములను మనుషులకు అంటగట్టుటకు బ్రాహ్మణులు భారతదేశములో విశ్వప్రయత్నము చేశారు. వారు అనుకున్నది సాధించి భారతదేశములో వేదములు స్థిరస్థాయిగా ఉండునట్లు చేశారు. అంతేకాక భారతదేశమును వేదభూమి అని చెప్పి ప్రచారము చేశారు. పూర్వము నుండి భారతదేశము జ్ఞానభూమిగా ఉండగా, నేడు వేదభూమియై అజ్ఞానములో కూరుకపోయినది. చివరకు ఇందూ దేశమును హిందూ దేశముగా మార్చిన ఘనత కూడా బ్రాహ్మణులదే యని చెప్పవచ్చును. వెనుక ముందు చూడకుండా, మంచి చెడు యోచించ కుండా, మిగతా కులముల వారందరూ బ్రాహ్మణుల ఉచ్చులో చిక్కుకొని తమలో తాము పోట్లాడుకుంటూ, మంచి చెప్పిన వారినే చెడువారను చున్నారు. నా అనుభవములో తెలంగాణా, ఆంధ్రా రాష్ట్రములలో బ్రాహ్మణులు చెప్పినమాటలను విని హిందువులతో హిందువులే పొట్లాడుచున్నారు. జ్ఞానము చెప్పు ఇతర కులముల గురువులను మీకు జ్ఞానమే తెలియదు, మీరు హిందూ జ్ఞానులే కాదు అని అంటున్నారు.
భూమండలములో 194 దేశములున్నవి. అన్ని దేశములలో మనుషులే యున్నారు. అయితే 195వ దేశమయిన భారతదేశములో మాత్రము వేదములు అనుమాట వినిపించుచున్నది. ఇతర దేశములయిన
---
194 దేశములలో వేదములు లేవు, వేదమంత్రములు లేవు. అక్కడ కూడా దేవుడు, దేవుని జ్ఞానము చెప్పబడుచున్నది. భారతదేశములో మనుషులకు ముక్తి అవసరమైనట్లే అన్ని దేశముల ప్రజలకు దేవుడు తన దైవ గ్రంథములలో మోక్షమును చేరు మార్గమును చెప్పాడు. ప్రపంచములో 14 వందల భాషలలో వ్రాయబడిన ద్వితీయ దైవగ్రంథములోగానీ, ఒకే అరబ్బీ భాషలో ఎక్కువగా చెప్పబడి, మిగతా ప్రాంతీయ భాషలలో తక్కువగా వ్రాయబడిన అంతిమ దైవగ్రంథములోగానీ వేదముల ప్రసక్తి లేదు. అయినా మనిషి అన్న తర్వాత మాయ అన్నది తప్పదు అన్నట్లు, అన్యదేశముల వారికి మాయ రూపమైన వేదములు బాహ్యముగా లేకున్నా, మాయ వారికి మతము అను రూపములో బయటగలదు. లోపల అందరూ మాయలో ఉండుట వలన
దేవుడు వారికి దైవగ్రంథరూపములో జ్ఞానమును ఇచ్చాడు. అయినా మతము అను బాహ్య రూపమైన మాయలో నేడు 195 దేశములు చిక్కుకొని యుండగా, భారతదేశము మాత్రము వేదములు, యజ్ఞములు, తపస్సులు, దానములు అను వాటిలో ఇంకా ఎక్కువగా ఉంటూ మాయలో ఎక్కువగా కూరుకపోయినది. అందువలన మాయను జయించుటకు ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీతను, ప్రథమ దైవగ్రంథమును అనుసరించి యున్న బైబిలు, ఖుర్ఆన్ను చదివి అసలయిన దేవున్ని తెలియవలెనని తెల్పు చున్నాము.
సమాప్తము.
అసత్యమును వేయిమంది చెప్పినా, అది సత్యము కాదు,
సత్యమును వేయిమంది కాదనినా, అది అసత్యము కాదు.
----------------------