pss book : జ్యోతిష్యము draft 28th june 24 100 pages review done.

1) జ్యోతిష్యము అంటే ఏమిటి?

జ్యోతిష్యము అను పదమును విడదీసి చూచితే 'జ్యోతి' మరియు ‘ఇష్యము' అను రెండు శబ్దములు కలవు. ఆ రెండు శబ్దములను కలిపితే జ్యోతి+ఇష్యము=జ్యోతిష్యము అను శబ్దము ఏర్పడుచున్నది. జ్యోతిష్యము లోని మొదటి శబ్దమును పరిశీలించి చూచితే 'జ్యోతి' అనగా వెలుగుచున్న దీపము అని అర్ధము. వెలుగుచున్న దీపము కాంతి కల్గియుండునని అందరికీ తెలుసు. చీకటి గృహములో దీపము లేకపోతే ఇంటిలోని వస్తువు ఒక్కటి కూడా కనిపించదు. ఇంటిలోని వస్తువులు ఎన్ని ఉన్నవీ? ఏమి వస్తువులు ఉన్నవీ? ఆ వస్తువులు ఖరీదైనవా? కాదా? వస్తువులు నగలైతే ఏ లోహముతో చేసినవి? కట్టెలైతే ఏ జాతి చెట్టు కట్టెలు? పాత్రలైతే మట్టివా? ఇత్తడివా? గుడ్డలైతే నూలువా? పట్టువా? కాయలు అయితే ఏ జాతి చెట్టు కాయలు? మొదలగు విషయములను దీపకాంతితోనే తెలుసుకోగలము. ఆ విధముగా చీకటిలో ఉపయోగపడునది దీపము. వివిధ రకముల వస్తువుల వివరమును తెలుసుకోవడమును 'ఇష్యము' అంటున్నాము. దీపము వలన వస్తువుల వివరము తెలియబడడమును 'జ్యోతిష్యము' అంటాము. ఉదాహరణకు ఒకడు చీకటితో నిండిన తన ఇంటిలో ఏమున్నది తెలియకున్నపుడు, తనవద్ద దీపము లేకపోయినా, లేక తాను గ్రుడ్డివాడైనా, మరొకని సహాయమడిగి అతని వలన తెలుసుకోవడము జరుగుచున్నది. ఎదుటివాడు మన ఇంటిలో వస్తువుల వివరము మనకు తెలుపాలంటే, అతను కూడా తన దీపమును ఉపయోగించి చూడవలసిందే అట్లు చెప్పడమును ‘జ్యోతిష్యము' అంటున్నాము.


ఇక్కడ కొందరు భాషా పండితులు ఒక ప్రశ్న అడుగవచ్చును. 'జ్యోతి' అనగా దీపము అని అర్థము కలదు. కానీ 'ఇప్యము' అనగా 'తెలుసుకోవడము' అని అర్థము ఎక్కడా లేదే అని అడుగవచ్చును. దానికి


----

జవాబు ఏమనగా! బయట దేనిని తెలుసుకొనినా దానిని తెలుసుకోవడము, గ్రహించడము అనియే అనుచుందుము. కానీ 'ఇష్యము' అను పదము ఎక్కడా వాడడము లేదనుట నేను కూడా ఒప్పుకొందును. ఒక్క శరీరములోని కర్మను తెలుసుకొనునపుడు మాత్రము 'ఇష్యము' అను పదమును ఉపయోగించెడివారు. 'ఇష్యము' అను పదము లేక శబ్దమును ఒక పాప పుణ్యములను తెలుసుకొనునపుడు మాత్రము ఉపయోగించుట వలన, ఆ పదము ప్రత్యేకమైనది. అలాగే 'జ్యోతి' అను పదమునకు ఇక్కడ దీపము అని అర్థము చేసుకోకూడదు. 'జ్యోతి' అంటే జ్ఞానము అని భావించవలెను. ఇది ఒక్క ఆధ్యాత్మికములోనే 'జ్యోతిని' జ్ఞానము అని అంటున్నాము. ఆత్మ జ్ఞానముగల మనిషి తన జ్ఞానముతో ఎదుటి మనిషి శరీరములోని కర్మను తెలుసుకొని, వానికి తెలుపడమును 'జ్యోతిష్యము' అంటాము. ఇక్కడ జ్యోతిష్యము అంటే దీపముతో వస్తువును తెలుసుకొనేది కాదు, జ్ఞానముతో కర్మను తెలుసుకోవడమని అర్థము. ఇపుడు జ్యోతిష్యము అంటే దైవజ్ఞానము కల్గిన వ్యక్తి, ఒక మనిషి కర్మలోని పాపపుణ్యములను తెలుసుకొని పాప ఫలితమునూ, పుణ్యఫలితమునూ వివరించి చెప్పడము అని పూర్తిగా అర్థమగుచున్నది. ఇక్కడ ముఖ్యముగా గమనించవలసిన విషయమేమనగా! శరీరాంతర్గత కర్మ ఫలితమును చెప్పు దానిని 'జ్యోతిష్యము' అనవచ్చును. కానీ బయటి ప్రపంచ వస్తువులను గురించి చెప్పునది జ్యోతిష్యము కాదు. ఉదాహరణకు జరుగబోవు ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుందనడముగానీ, లేక నేను దాచిపెట్టిన వస్తువేది అని అడగడముగానీ, మూసిన బోనులోని జంతువేది అని అడగడముగానీ, నా ప్యాకెట్లోని వస్తువు ఏదో చెప్పు అని అడగడముకానీ, జ్యోతిష్యమునకు సంబంధించిన ప్రశ్నలు కాదు. దానికి సమాధానము చెప్పడము జ్యోతిష్యము కాదు. ఎందుకనగా! ఇటువంటి


---

ప్రశ్నలన్నీ ఏవైనా కానీ శరీరాంతర్గత కర్మకు సంబంధించినవి కావు. వ్యక్తి కర్మను చూచి చెప్పునవి కావు, కావున అది జ్యోతిష్యము కాదు.

ఏది జ్యోతిష్యమో, ఏది జ్యోతిష్యము కాదో తెలియని పరిస్థితి నేడు కలదు. అదే విధముగా జ్యోతిష్యుడు అను పేరు పెట్టుకొన్న వారిలో ఏది జ్యోతిష్యమునకు సంబంధించిన ప్రశ్నో, ఏది ప్రశ్న

చాలామంది

కాదో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. అటువంటి గందరగోళములోనే కొందరు వాస్తును కూడా జ్యోతిష్యము అంటున్నారు. వాస్తుద్వారా మనిషికి భవిష్యత్తు చెప్పవచ్చు అంటున్నారు. వాస్తవానికి, వాస్తు జ్యోతిష్యము కాదనీ, వాస్తు శాస్త్రమే కాదనీ, జ్యోతిష్యశాస్త్రమునకు సంబంధము లేదనీ చాలామందికి తెలియదు. ఇటువంటి పరిస్థితిలో నెరవేరని వాస్తు ఫలితములను చూచి, అదే విధముగ ప్రశ్నగాని జ్యోతిష్యమును చూచి, వాస్తును నిరూపిస్తే ఐదు కోట్లూ, జ్యోతిష్యము ద్వారా మా ప్రశ్నకు జవాబు చెప్పితే, అది నిజమైతే, పదికోట్లు ఇస్తామని పందెమునకు దిగే నాస్తికులూ, హేతువాదులూ తయారైనారు. ఇదంతయూ చూస్తే ఇటు వాస్తును శాస్త్రమని చెప్పే వారికీ, బయటి దానికి జవాబు చెప్పడమునే జ్యోతిష్యశాస్త్రమనే జ్యోతిష్యులకూ, అటు నాస్తికులకూ, హేతువాదులకూ జ్యోతి తెలియదు, జ్యోతిష్యమూ తెలియదు. జ్యోతిష్యము అంటే ఏమిటో తెలియనపుడు దాని పేరు పెట్టుకొని చెప్పే జ్యోతిష్యశాస్త్రులుగానీ, అదేమిటని ప్రశ్నించే నాస్తికవాదులుగానీ ఇద్దరూ ఒక కోవకు చెందినవారేనని చెప్పవచ్చును. జ్యోతిష్య శాస్త్రులు, నాస్తికవాదులూ ఇద్దరూ అసలైన జ్యోతిష్యమంటే ఏమిటో తెలియాలనికోరుచున్నాము.


-------

2 జ్యోతిష్యము శాస్త్రమా?

జ్యోతిష్యము శాస్త్రమా? కాదా? అని చాలామందికి ప్రశ్నగానే ఉన్నది. కొందరు శాస్త్రమంటున్నారు, కొందరు శాస్త్రము కాదంటున్నారు. చెప్పినది నెరవేరినది కదా అందువలన జ్యోతిష్యము శాస్త్రమే అని కొందరు అంటున్నారు. చెప్పినవి చాలా నెరవేరలేదనీ, అందువలన జ్యోతిష్యము శాస్త్రము కాదు అని చాలామంది అంటున్నారు. ఎవరి మాట నిజమని యోచిస్తే, వీరు జ్యోతిష్యము కాని దానిని పట్టుకొని ఒకటి నెరవేరింది కావున శాస్త్రమనీ, పది నెరవేరలేదు కావున శాస్త్రము కాదనీ అంటున్నారు. చీకటిలో పాముకాని తాడును చూచి వంకరగ ఉన్నది కాబట్టి పాము అంటే, కదలలేదుకదా పాము కాదేమో అని మరొకడు అన్నట్లు, అసలు జ్యోతిష్యము కాని దానిని పట్టుకొని నేనన్నది నెరవేరింది కదా! అందువలన ఇది శాస్త్రమే అని ఒకడూ, మేము అడిగింది నెరవేరలేదు కదా! అందువలన ఇది శాస్త్రము కాదని మరికొందరు అన్నట్లున్నది. చీకటిలో పాము అనుకొన్నది అసలు పామో కాదో, అలాగే జ్యోతిష్యము అనుకొన్నది జ్యోతిష్యమో కాదో చూడవలసిన అవసరమున్నది. అలా చూస్తే మనమనుకొన్నది జ్యోతిష్యము కాదు కనుక, దానిని శాస్త్రమా కాదా అని చూడవలసిన పనేలేదు. జ్యోతిష్యమన్నది ఆత్మజ్ఞానమున్నవారూ, కర్మ విధానము తెలిసిన వారూ, పాపపుణ్య ఫలితములను తెలిసినవారూ, చెప్పునదని తెలియుచున్నది. కర్మంటే ఏమిటో తెలియనివారు, ఆత్మంటే ఏమిటో తెలియనివారు చెప్పునది జ్యోతిష్యము కానేకాదు. ఎలాగైతే ఏమి, ఆత్మజ్ఞానులు, కర్మజ్ఞేయులు తెలిసిన జ్యోతిష్యమనునది ఒకటున్నదని తెలియుచున్నది. ఇపుడు జ్ఞానులు చెప్పు జ్యోతిష్యమును శాస్త్రము అనవచ్చునా! అని అడిగితే తెలియు వివరము

ఏమనగా!


----

శాస్త్రములు మొత్తము ఆరు గలవు. వాటినే షట్ శాస్త్రములని పూర్వమునుండి పెద్దలు చెప్పుచున్నారు. షట్శాస్త్రములలో అతి పెద్దది లేక అతిముఖ్యమైనది 'బ్రహ్మవిద్యాశాస్త్రము'. బ్రహ్మ అంటే ఎవరో దేవుడనుకోవద్దండి. బ్రహ్మ అనునది పేరేకాదు బ్రహ్మ అంటే పెద్ద అని అర్ధము. బ్రహ్మవిద్య అనగా పెద్దవిద్య అని అర్థము. బ్రహ్మవిద్యా శాస్త్రమునే ‘యోగశాస్త్రము’ అనికూడా అంటారు. బ్రహ్మవిద్యాశాస్త్రము తర్వాత రెండవ స్థానములో గల శాస్త్రము జ్యోతిష్యశాస్త్రము. వీటి తర్వాత మిగతా నాలుగు శాస్త్రములు కలవు. ఆరుశాస్త్రములలో రెండవ స్థానములోనున్నది జ్యోతిష్యశాస్త్రము, కావున జ్యోతిష్యమును శాస్త్రమే అంటున్నాము. ఇక్కడ కొందరికి శాస్త్రము అంటే ఏమిటి? అను ప్రశ్నరావచ్చును. దానికి జవాబు ఏమనగా!

శాసనములతో కూడుకొన్నది శాస్త్రము అని చెప్పవచ్చును. శాసనము అనగా తూచ తప్పకుండ నెరవేర్చబడునదని అర్థము. చెప్పినది లేక వ్రాసినది ఏదైనా తప్పక జరుగు సత్యమైనపుడు, దానిని 'శాసనము’ అంటాము మరియు శాస్త్రము అని కూడా అంటాము. చెప్పిన దానిని శాసనము అనీ, వ్రాసిన దానిని శాస్త్రము అనీ అనుట జరుగుచున్నది. వ్రాసినది శాస్త్రము కావాలంటే, వ్రాయకముందే తాను పరిశోధన చేసిన పరిశోధకుడై కనుగొనినదై ఉండాలి. అలాగే చెప్పినది శాసనము కావాలంటే, చెప్పకముందే తాను అధికారము కల్గినవాడై నెరవేరునట్లు చెప్పినదై ఉండాలి. కానీ ఇక్కడ గమనించదగిన విషయమొకటున్నది. ఇటు పరిశోధన లేకుండా, అటు అధికారము లేకుండా చెప్పినది జరుగు విధానము ఒకటి కలదు. దానినే 'శాపము' అంటున్నాము. శాస్త్రము, శాసనము రెండూ వేరు వేరుగా ఉండినా, శాసనముతో కూడుకొన్నది శాస్త్రమని చెప్పినట్లే,


----


శాస్త్రముతో కూడుకొన్నది శాసనమని కూడా చెప్పవచ్చును. పరిశోధనకానీ, అధికారము గానీ లేని శాపము, శాస్త్రము, శాసనముతో సమానమైనదే. అందువలన శాపము, శాసనము, శాస్త్రము మూడు సమానపదములని చెప్పవచ్చును. జ్యోతిష్యము మొదట శాపమునుండి వచ్చినది కావున చివరకు శాస్త్రమైనది.


ఉదాహరణకు ఇటు అధికారముగానీ, అటు పరిశోధనగానీ లేని ఒక ఆత్మజ్ఞాని పాపము గల వానిని అనగా తప్పు చేసిన వానిని శపించాడు. ఆ శాపము తప్పక నెరవేరింది. అలా మొదట ఒక జ్ఞాని చేత ముందే చెప్పబడిన వాక్కు, తర్వాత నెరవేరడమును జ్యోతిష్యము అని కొందరన్నారు. ముందు చెప్పినది జరిగితేనే కదా! దానిని జ్యోతిష్యమనేది. మనకు అర్థమగుటకు మరొక ఉదాహరణను వివరించుకొందాము. ఒకడు ఒక హీనమతిగల స్త్రీని ఊరికి దూరముగానున్న నిర్జన ప్రదేశమునకు తీసుకపోయి బలవంతముగ ఆమె మీద అత్యాచారము చేసి, ఆ విషయము ఎవరికీ తెలియకుండుటకు ఆమెను హత్య చేశాడు. అతడు చేసినది మంచిపని కాదు, చెడుపని. ఆ చెడుపనికి అతనికి పాపము వచ్చియుంటుంది. పాపమునకు శిక్ష అంటూ ఒకటి ఉంటుంది. ఆ శిక్షను అతడు తప్పక ఎప్పుడో ఒకప్పుడు అనుభవించవలసిందే. కానీ ఆ శిక్ష ఏమిటి? అన్నది మనకు తెలియదు. కానీ అక్కడ జరిగిన విషయమేమంటే ఆ సంఘటన జరిగిన కొద్దిరోజులకే, ఆ తప్పుచేసిన వ్యక్తి మత్తు పానీయమును త్రాగి, మత్తు ఎక్కినవాడై దారిలో పోతున్న ఒక ఆత్మజ్ఞానిని ఎదురుగా తగలడమేకాక, అతనినే కళ్ళు కనిపించడము లేదా? అని దూషించెను. అట్లు వాడు తగలడమేకాక మత్తులో ఉండి దూషించడమూ, కళ్ళు కనిపించలేదా అనడమూ అన్నీ ఆ ఆత్మజ్ఞానికి కోపమును తెప్పించాయి. అప్పుడు ఆత్మజ్ఞాని


---

“నీవు జీవితాంతము కళ్ళు కనిపించని గ్రుడ్డివాడవై పోవుదువు గాక” అని శపించాడు. ఆ విధముగ శపించిన ఆత్మజ్ఞాని తన దారిన తను పోయాడు. ఆ శాపమును అక్కడున్న కొందరు విన్నారు. "వీడు శాపము పెట్టితే నాకు తగిలేదానికి వీడేమైనా దేవుడా!" అని త్రాగినవాడు అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇదంతయు గమనిస్తే ఒకడు హత్యచేసి తప్పు చేశాడు, తర్వాత కొద్ది రోజులకే దారిలో మరొకరిని తగిలాడు, తగిలింది పెద్దతప్పు కాకపోయినా అనుభవించవలసిన శిక్షను అతను శాపము రూపములో పొందాడు. జరుగబోవు శిక్ష ఏమిటో దానిని మిగతా కొందరు కూడా విన్నారు. ఇక్కడ తప్పు చేసినవానికి జరుగబోవు శిక్ష ముందే చెప్పబడినది. అలా జరుగబోవు దానిని ముందే చెప్పడము జ్యోతిష్యము అయినది, చెప్పినవాడు ఆత్మజ్ఞాని, తప్పు చేసినవాడు ఎంత తప్పుచేశాడని యోచించకనే, వానిని గూర్చిన పరిశోధన చేయకనే, వాని మీద అధికారము లేకుండనే, ఆత్మజ్ఞాని చెప్పిన దానిని శాపము అంటున్నాము. శాపము రూపములో జరుగబోవు దానిని ముందే చెప్పడము వలన దానిని జ్యోతిష్యము అంటున్నాము. అట్లు జ్ఞానినోట వచ్చిన మాట ప్రకారము లేక జ్యోతిష్యము ప్రకారము మరుజన్మలో వాడు పుట్టు గ్రుడ్డివాడైపోయి జీవితాంతము అంధుడుగానే ఉండెను. ఇట్లు తప్పక జరుగునది శాపము, కావున దానిని శాస్త్రము అంటున్నాము. ఈ విధముగ తప్పుచేసిన వానిని గూర్చి చెడు జరుగునని చెప్పిన శాపమను మాటగానీ, మంచిచేసిన వానిని గూర్చి మంచి జరుగునని చెప్పిన 'దీవెన' అను మాటగానీ తప్పక జరుగునవే కావున శాస్త్రమనీ, ముందే చెప్పడము వలన జ్యోతిష్యము అనీ అనడము జరిగినది. అందువలన జ్యోతిష్యము జ్యోతిష్యశాస్త్రమైనది. మొదట ఈ విధముగ మొదలైన జ్యోతిష్య శాస్త్రము కొంత పరిశోధన రూపములో


----

సాగినది. అలా కొందరి చేత పరిశోధన చేయబడి, వారి చేత కనుగొన్న జ్యోతిష్య సిద్ధాంతములు గ్రంథరూపములో వ్రాయబడినవి. అలా సిద్ధాంత రూపములో ఉన్న గ్రంథమును జ్యోతిష్య గ్రంథము అంటున్నాము. ఆరు శాస్త్రములలో పెద్దదైన బ్రహ్మవిద్యా శాస్త్రమును స్వయముగా దేవుడే చెప్పగా, మిగతా ఐదు శాస్త్రములు మనిషి చేత చెప్పబడినవి. మొత్తము ఆరు శాస్త్రములు పూర్వమునుండి ఉన్నవే, అయినా కాలక్రమమున కొన్ని భావములు మారిపోయిన దానివలన, మనుషులు వాటిని పూర్తి అసలైన భావముతో అర్థము చేసుకోలేక పోతున్నారు. బ్రహ్మవిద్యాశాస్త్రము తర్వాతనున్న జ్యోతిష్యశాస్త్రముపై పూర్తి అవగాహన లేకపోగా, మిగత ఖగోళశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయన శాస్త్రము, గణితశాస్త్రము అను నాలుగు శాస్త్రములు ఎంతో అభివృద్ధి చెంది మనిషికి బాగా అవగాహనలో ఉన్నాయి. పెద్దవైన బ్రహ్మవిద్యాశాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము రెండూ మనిషి అవగాహనలో లేకుండా పోవడము వలన వాటిలోని శాస్త్రీయత అనునది తెలియకుండా పోయినది. శాస్త్రీయతను చూడకుండా, మనిషి తనకిష్ట మొచ్చినట్లు చెప్పుకోవడము వలన, జ్యోతిష్యమును శాస్త్రమే కాదని కొందరంటుండగా, బ్రహ్మవిద్యాశాస్త్రమనునది అసలుకే లేదని నాస్తిక వాదులు అంటున్నారు. నేటికాలములో నాస్తికులకుగానీ, ఆస్తికులకుగానీ బాగా కనిపించే శాస్త్రములు 1) గణిత, 2) ఖగోళ, 3) రసాయన, 4) భౌతిక శాస్త్రములే! అందువలన ఆ నాలుగు, బహుళ ప్రచారములో ఉండగా, శాస్త్రీయత లోపించినవిగా జ్యోతిష్యము, బ్రహ్మవిద్య రెండూ కనిపిస్తున్నవి. ఎవరికి ఎట్లు కనిపించినా, ఈ రెండు స్వచ్ఛమైన శాస్త్రములే. బ్రహ్మవిద్యనూ, జ్యోతిష్యమునూ పూర్వమువలె చెప్పుకొంటే అవి రెండూ శాస్త్రములని ఇటు నాస్తికులకు, అటు ఆస్తికులకు, శాస్త్రపరిశోధకులకు తెలియగలదు.


---

ఎవడు జ్యోతిష్యుడు?.

ఏ మనిషికైనా జరిగిపోయిన కాలము, జరుగుచున్న కాలము, జరుగబోవు కాలము అని మూడు కాలములు కలవు. జరిగిపోయిన కాలమును 'భూతకాలము' అంటున్నాము. జరుగుచున్న కాలమును ‘వర్తమానకాలము’ అంటున్నాము. జరుగబోవు కాలమును 'భవిష్యత్ కాలము’ అంటున్నాము. జరిగి పోయిన భూతకాలమును మనలోని మనస్సు యొక్క జ్ఞాపకము చేత తెలుసుకోవచ్చును. దానినే మనోనేత్రము చేత భూత కాలమును తెలుసుకోవచ్చునని పెద్దలన్నారు. ఒకని భూతకాలమును మరియొకడు తెలుసుకొనుటకు వీలులేదు. ఎవని భూతకాలమును వాడు మాత్రము వాని మనస్సు చేతనే తెలుసుకోవాలి. జరుగుచున్న వర్తమాన కాలము అందరి కళ్ళముందర ప్రత్యక్షముగ జరుగుచున్నది. కావున ఎవరి కన్నుల ద్వారా వారు తెలుసుకోగల్గుచున్నారు. వర్తమానకాలమును అందరూ సులభముగా తెలుసుకొంటున్నారు. జరిగిపోయిన భూతకాలమును మనో బలహీనత కల్గినవారు మరచిపోవచ్చును. భూతకాలమును వాని మనస్సు జ్ఞప్తి తేలేకపోతే, దానిని తెలుసుకొను అవకాశము లేకుండా పోవచ్చును. కానీ వర్తమాన కాలమును ఎంత తెలివి తక్కువ వాడుగానీ, మనో బలహీనత

కలవాడుగానీ తెలుసుకొనుటకు అవకాశము గలదు.

జరుగబోవు భవిష్యత్ కాలమును తెలుసుకొనుటకు, అంతరంగము లోని మనోనేత్రముగానీ, బాహ్యరంగములోని ప్రత్యక్ష నేత్రముగానీ పనికి రాదు. భవిష్యత్ కాలమును తెలియుటకు జ్ఞాననేత్రము కావలెను. జ్ఞానజ్యోతి వలన తెలియునది కావున దానిని 'జ్యోతిష్యము' అంటున్నాము. దీనిని బట్టి జ్ఞాననేత్రమను జ్యోతిష్యము ద్వారానే, భవిష్యత్తు కాలమును తెలియవచ్చును. మనిషికిగల భూత, వర్తమాన, భవిష్యత్ అను మూడు కాలములను మూడు నేత్రముల ద్వార చూడవచ్చునని తెలియుచున్నది.


---

భూతకాలమును తెలుసుకొను మనోనేత్రము యొక్క చూపు (జ్ఞాపక శక్తి) కానీ వర్తమాన

కొందరికుండవచ్చును, కొందరికి ఉండకపోవచ్చును. కాలమును తెలుసుకొను బాహ్యనేత్రముల యొక్క చూపు అందరికీ ఉందనియే చెప్పవచ్చును. ఇకపోతే భవిష్యత్ కాలమును తెలుసుకొను జ్ఞాననేత్రము, నూటికి తొంభై మందికి లేదనియే చెప్పవచ్చును. కేవలము పదిశాతము మందికి జ్ఞాన నేత్రముండినా, అది చూపులేని గ్రుడ్డిదై ఉన్నది. అందువలన భవిష్యత్ కాలము ఎవరికీ తెలియకుండా పోయినది. జ్ఞానులమనుకొన్న కొన్ని వేలమందిలోనో, లేక కొన్ని లక్షలమందిలోనో ఒకనికి జ్ఞాననేత్రము చూపు కల్గినదై ఉండును. అటువంటివానికి మాత్రమే జ్యోతిష్యము తెలియును. అట్టివాడు మాత్రమే భవిష్యత్ను తెలుసుకోగల్గును. మూడు కాలములకు మూడు నేత్రములు అవసరమని, అందులో జ్ఞాననేత్రము చాలా ముఖ్యమైనదని తెలిసి, చూపున్న జ్ఞాననేత్రమును కల్గినవాడు నిజమైన జ్యోతిష్యుడని తెలియవలెను. జ్ఞాననేత్రము లేకుండా పంచాంగములను తెలిసినవాడు జ్యోతిష్యుడు కాదు.

జ్యోతిష్యము మనుషులకేనా?.

జంతువులకు కూడా వర్తిస్తుందా?.

జరుగబోవు కాలములో జీవులకు సంభవించు కష్టసుఖములను ముందే తెల్పునది జ్యోతిష్యము. జీవులు భౌతిక శరీరముతో ఉన్నపుడుగానీ, సూక్ష్మశరీరముతో ఉన్నపుడుగానీ అనుభవించు కర్మను ముందే తెల్పునది జ్యోతిష్యము. జీవులు స్త్రీశరీరముతోనున్నపుడుగానీ, పురుషశరీరముతో నున్నపుడుగానీ అనుభవించు వాటిని గురించి సూచనగా ముందే తెల్పునది జ్యోతిష్యము. అలాగే జీవులు మానవ ఆకారములోనున్నపుడుగానీ, జంతువు

--

ఆకారములో ఉన్నపుడుగానీ, అనుభవించు పాపపుణ్య మిశ్రమ ఫలితములను తెల్పునది జ్యోతిష్యము. అంతేకాక జీవులు అండజ, పిండజ, ఉద్భిజ రూపములో ఎక్కడ జన్మించినా, జన్మించినది మొదలు మరణించు వరకు జరుగు కాలములో, కష్టసుఖ రూపముతో అనుభవించు పాప పుణ్యములను పసికట్టి, ముందే చెప్పునది జ్యోతిష్యము. అందువలన జ్యోతిష్యము సర్వజీవరాశులకు వర్తించునని చెప్పవచ్చును.


5. జాతకము అంటే ఏమిటి?


జ్యోతిష్యశాస్త్రములో వ్రాసుకొన్న సిద్ధాంతముల ప్రకారము, ఒక మనిషి యొక్క భవిష్యత్తును జ్యోతిష్యముగా చూడాలంటే, వాని జాతకము తప్పక ఉండాలి. జాతకముతోనే ప్రారంభమౌతుంది జ్యోతిష్యము, కావున జాతకమునకు, జ్యోతిష్యమునకు అవినాభావ సంబంధమున్నది. ఇంతకీ జాతకమంటే ఏమిటో, ఈ కాలపు మనుష్యులకు చాలామందికి తెలియ దనుకుంటాను. ఈ కాలములో కూడా జాతకమును గురించి కొంతమంది

తెలిసినవారుండినా, వారికి కూడా జాతకములోని యదార్థము తెలియదు. దీనినిబట్టి జాతకము అను శబ్దము అర్థహీనమైనదని తెలియుచున్నది. జాతకము యొక్క నిజమైన శబ్దము ఆదికాలమందు ఎలాగుండెడిదో, అది నేడు పలుకుచున్న జాతకముగా ఎట్లు మారినదో కొంత వివరించి చూచుకొందాము.


'జా' అనగా పుట్టడమని అర్థము. పుట్టిన జీవుడు ఏ సమయములో పుట్టాడో, ఆ సమయములో ఖగోళమున గ్రహములు భూమికి ఏయే దిశలలో ఉన్నాయో, వాటి స్థానములను గుర్తించుకోవడమును జాతకము


---

అంటుంటారు. కానీ మేము చెప్పునదేమనగా! ఒక జీవుడు పుట్టకముందే అతను పుట్టిన తర్వాత చనిపోవువరకు ఏవిధముగ నడుచుకోవాలి? ఏయే కష్టసుఖములు అనుభవించాలి? ఏమి తినాలి? ఏమి మాట్లాడాలి? ఎప్పుడు పడుకోవాలి? అను మొదలగు అన్ని పనులను ఒక్కక్షణము కూడా వదలకుండ అన్ని కాలములలో ఒక ఫతకము ప్రకారము నిర్ణయించి పెట్టడమును 'జాఫతకము' అంటాము. పుట్టినపుడే నిర్ణయించబడియున్న ఫతకము కావున, ఆ ఫతకమును 'జాఫతకము' అంటున్నాము. ఇంగ్లీషుభాషలో 'బర్త్న్' అంటున్నాము. ఒక జన్మకు కావలసిన పనుల ఫతకమును పూర్వము జాఫతకము అని అనెడివారని తెలిసినది. కాలము గడుస్తూరాగా, కొంతకాలమునకు జాఫతకము అను పదములోనున్న ఐదక్షరములలో ‘జా’ ప్రక్కనగల 'ఫ' అను రెండవ అక్షరము ఎగిరిపోయినది. మనుషులు ‘ఫ' అక్షరమును పలకడములేదు. చివరకు నాలుగు అక్షరముల పదము ‘జాతకము’ గా మిగిలిపోయినది. ఐదక్షరముల జాఫతకములోని అర్థము జాతకము అను పదములో లేకుండా పోయింది. చివరకు జాతకము అర్థము లేనిదైపోయి ఉన్నది. ఈనాటి జ్యోతిష్యులు ఎందరుండినా పూర్వమున్న 'జాఫతకము'ను తెలియక, అందరూ దానిని జాతకము అని అంటున్నారు.


ఒక జీవుడు శరీరము ధరించి పుట్టిన సమయమును జననము అంటున్నాము. పుట్టడమును 'జ' అని, మరణించడమును 'గతి' అని కూడా అంటున్నాము. పుట్టినప్పటినుండి మరణించువరకు గల కాలమును 'జీవితము' అంటున్నాము. పుట్టడమును, చావడమును కలిపి 'జగతి' అంటున్నాము. 'జ' నుండి 'గతి' వరకు మధ్యకాలములో గల జీవితమును నిర్ణయించి ఆడించు కర్మను ప్రారబ్ధకర్మ అంటున్నాము. ఒక జీవితమునకు ముందుగానే సంచితకర్మ అను కర్మ కూడలినుండి, కొంతకర్మను


--

కేటాయించడమును 'జాఫతకము' అంటున్నాము. కేటాయించిన కర్మ పేరు ప్రారబ్ధము అయితే, కేటాయించిన పద్ధతిని జాఫతకము అంటున్నాము. ఒకని జీవితమునకు పుట్టుకలోని జాఫతకమును చూస్తే, ఆ జన్మకు సంబంధించిన ప్రారబ్ధము ఫలానా అని తెలియును. ప్రారబ్ధము తెలిస్తే వాని జీవితములోని కష్టసుఖములు తెలియును. ఈ పద్ధతి ప్రకారము జాతకము ద్వారా ప్రారబ్ధమును తెలియడమునే 'జ్యోతిష్యము' అంటున్నాము.


6) కాల, కర్మచక్రములు.

ఒక జీవుడు తన జీవితములో అనుభవించవలసిన ప్రారబ్ధకర్మను, ఒక ఫతకము ప్రకారము పుట్టినపుడే నిర్ణయించి ఉండడమును, జాఫతకము అన్నాము కదా! ఆ జాఫతకము పండ్రెండు విధములుగా విభజింపబడి ఉండును. విభజింపబడిన జాఫతకములోని ప్రారబ్ధము, పండ్రెండు భాగములుగానున్న కర్మచక్రములో ఉండును. ఎవని కర్మచక్రము వాని తలలో ఉండును. తల మధ్యభాగములో ఫాలభాగమున (నుదుటి భాగమున) గల నాలుగు చక్రముల సముదాయములో, క్రిందినుండి రెండవ చక్రము

కర్మచక్రమై ఉన్నది. కర్మచక్రములోని ప్రారబ్ధకర్మను జీవితకాలములో మనిషి చేత అనుభవింప చేయునవి గ్రహములు. గ్రహములు కూడా కర్మ చక్రమును ఆనుకొని, పైనగల కాలచక్రములో గలవు. పుట్టిన సమయములో గల జాఫతకము ద్వారా మనిషి జీవిత ప్రారబ్ధమును తెలుసుకోవచ్చని చెప్పుకొన్నాము కదా! జాఫతకములో కర్మ ప్రత్యక్షముగా కనిపించదు. జాఫతకములో ప్రత్యక్షముగ గ్రహములు కనిపించును. కాలచక్రములోని గ్రహములను చూచి, వాటి ద్వారా అవి పాలించు ప్రారబ్ధమును తెలుసు


----

కోవచ్చును. అందువలన జ్యోతిష్యములో ఇటు గ్రహములు, అటు కర్మ ఆచరణ (ఆచారము) అను రెండు భాగములు ఉన్నవి. రెండిటిని కలిపి గ్రహచారము (గ్రహచారణ) అంటున్నాము. ఎవని గ్రహచారము ఎట్లుందో, వాని కాల, కర్మచక్రములను బట్టి తెలియును. కాలచక్రము పండ్రెండు భాగములు విభజింపబడి పండ్రెండు పేర్లుండును. వాటిని క్రింద 1వ చిత్రపటరూపములో చూస్తాము.

image;

కాలచక్రము - 1వ పటము.

1) మేషము 2) వృషభము 3) మిథునము 4) కర్కాటకము 5) సింహము 6) కన్య 7) తుల 8) వృశ్చికము 9) ధనస్సు 10) మకరము 11) కుంభము 12) మీనము.


ఈ పండ్రెండు కాలచక్రభాగములలోనున్న గ్రహములు నిర్ణీతమైన వేగముతో గతి తప్పక ప్రయాణించుచూ తమ కిరణములను కర్మచక్రము మీద ప్రసరింపజేయుచుండును. ఇపుడు చక్రముల వివరము పూర్తిగా తెలుసుకొందాము. ప్రతి మనిషి తలలో బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములను నాలుగుచక్రముల సముదాయము గలదు. ఈ నాలుగు చక్రముల


----

సముదాయము విశ్వములోని జీవులందరికీ ఆధారమైయున్నది. ఈ నాల్గుచక్రముల సముదాయము తెలియకపోతే మనిషికి దైవజ్ఞానము ఏమాత్రము తెలియదని చెప్పవచ్చును. నాల్గుచక్రములు అటు బ్రహ్మవిద్య లోనూ (ఆధ్యాత్మిక విద్యలోనూ), ఇటు జ్యోతిష్యశాస్త్రములోనూ ప్రాధాన్యత కల్గియున్నవి. ఈ నాల్గుచక్రముల వివరము కూలంకషముగా తెలియాలంటే త్రైతసిద్ధాంత భగవద్గీతలోని, అక్షర పరబ్రహ్మయోగమను అధ్యాయమును చదవండి. అక్కడే మన శరీరములోని నాల్గు చక్రముల వివరము తెలియగలదు. ఈ నాల్గుచక్రముల వివరము తెలియకపోయిన దానివలన, ఇటు బ్రహ్మవిద్యాశాస్త్రమైన ఆధ్యాత్మికములోనూ, అటు కర్మ విధానమైన జ్యోతిష్యరంగములోనూ మనుషులు వెనుకబడిపోయి యున్నారు. నాల్గు చక్రములంటే ఏమిటి? అవి ఎక్కడున్నవి? అని తెలియనంత వరకు సంపూర్ణమైన దైవ జ్ఞానమునుగానీ, సంపూర్ణమైన జ్యోతిష్యమునుగానీ తెలియలేము. కళ్ళు లేనివానికి దృష్టి ఏమాత్రములేనట్లు, బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రముల వివరము తెలియని వానికి జ్ఞానదృష్టి ఏమాత్రముండదు. ప్రతి శరీరములో నుదుటి భాగమున లోపల గల నాల్గు చక్రముల సముదాయమును తర్వాత పేజీలోని 2వ చిత్రపటమునందు చూడవచ్చును.


పై నుండి రెండవ చక్రమే కాలచక్రము. కాలచక్రము గుండ్రముగా వుండి పండ్రెండు భాగములు కల్గియుండగా, కొందరు జ్యోతిష్యులు దానికి ‘జాతకచక్రమనీ’ లేక ‘జాతకకుండలియనీ' పేరుపెట్టి చతురస్రముగ చిత్రించు కొన్నారు. దానికి ‘లగ్నకుండలియని' పేరుకూడా పెట్టారు. లగ్నకుండలి, జాతకకుండలి, జాతకచక్రము అనబడు కాలచక్రము యొక్క చతురస్రముగా నున్న చిత్రమును తర్వాత పేజీలోని 3వ చిత్రపటమునందు చూడవచ్చును.

---

image

image2

బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రము 2వ పటము.

కాలచక్రమును జ్యోతిష్యులు పై విధముగా చతురస్రముగా చిత్రించుకొన్నారు. విచిత్రమేమంటే మేష, వృషభ మొదలగు పండ్రెండు

---------

భాగములుగా గీచుకొన్నది కాలచక్రమని వారికి తెలియదు. దానిని లగ్నకుండలి అంటున్నారు తప్ప, అది తలలోని కాలచక్రమని తెలుసు కోలేకపోయారు. అంతేకాక తలలో కర్మచక్రమొకటున్నదనీ, దానికి ఒక ఆకారమున్నదనీ ఇప్పటి జ్యోతిష్యులకు తెలియదు. కర్మ అయిన పాపపుణ్యములను తెలియకుండ, కేవలము ప్రపంచ కష్ట సుఖములనూ, వస్తు వాహనములనూ, ధన కనకములనూ, స్థిర చరాస్తులను, పుత్ర, కళత్రముల ఫలితముల గురించి చెప్పుచున్నారు. వాటిని కూడా లగ్నకుండలి నుండియే చూస్తున్నారు. కర్మచక్రమనునది ప్రత్యేకముగా ఉన్నదని వారికి తెలియదు. ఏ పండ్రెండు భాగములలో గ్రహములను చూస్తున్నారో, అదే లగ్నములలోనే ఫలితములను చూస్తున్నారు. దీనిని బట్టి కాల,కర్మచక్రముల గురించి తెలియదని అర్థమగుచున్నది. వాటి వివరము తెలియకనే, పూర్వము ఎవరో చెప్పిన పండ్రెండు లగ్నముల పేర్లను మాత్రము జ్ఞాపకము పెట్టుకొని చెప్పుకొనుచున్నారు. అందువలన నేటి జ్యోతిష్యము గాడి తప్పినదై పోయినది. దానివలన జ్యోతిష్యము శాస్త్రము కాదేమోనని కొందరు అంటున్నారు, కొందరు మూఢనమ్మకమనీ, కొందరు శాస్త్రముకాదనీ అంటున్నారు. జ్ఞానజ్యోతి కల్గినవారై మన శరీరములోనే, శిరస్సుయందు కాల, కర్మ అను రెండు చక్రములున్నవని తెలిసి, కాలచక్రములో గ్రహములు, కర్మచక్రములో పాప పుణ్యములున్నాయని తెలిస్తేనే జ్యోతిష్యము గాడిలో పడుతుంది మరియు ఇది శాస్త్రమని తెలియబడుతుంది. ఇపుడు తలలోని నాల్గుచక్రముల సముదాయములోని కర్మచక్రమును గురించి వివరించు కొందాము. నాల్గు చక్రములలో క్రిందినుండి రెండవచక్రము కర్మచక్రముగా ఉన్నది. కర్మచక్రమును తర్వాత పేజీలోగల 4వ చిత్రపటమునందు చూడవచ్చును.


----

కర్మచక్రము - 4వ పటము.

పై చక్రము బాగా అర్థమగుటకు కర్మచక్రమును కూడా చతురస్రా కారములో గీచి చూచుకోవచ్చును. కాలచక్రమునకు పేర్లు గలవు, కానీ కర్మచక్రమునకు పేర్లుండవు. కర్మచక్రములోని భాగములను అంకెల తోనే గుర్తుంచుకోవాలి. ఇందులోని మొదటి భాగమును ప్రథమ స్థానము అంటాము. మిగతా భాగములను వరుసగా రెండవ భాగమును ద్వితీయ స్థానము, మూడవ భాగమును తృతీయస్థానము, నాల్గవ భాగమును


---

చతుర్థస్థానము, ఐదవ భాగమును పంచమస్థానము, ఆరవభాగమును షష్ఠమస్థానము, ఏడవ భాగమును సప్తమస్థానము, ఎనిమిదవ భాగమును అష్టమస్థానము, తొమ్మిదవ భాగమును నవమస్థానము, పదవభాగమును దశమస్థానము, పదకొండవ భాగమును ఏకాదశస్థానము, పండ్రెండవ భాగమును ద్వాదశస్థానము అని అంటున్నాము. కర్మచక్రమునూ, దాని భాగములనూ చతురస్రాకారములో చూపుతూ, అందులో కర్మ భాగములను కూడా చూపు చిత్రమును క్రిందగల 5వ పటమునందు చూడుము.


----

7) కర్మంటే ఏమిటి?

'కర్మ' అను మాట చాలామంది నోట పలుకబడుచుండును. సాధారణ ప్రజలు, ఏమాత్రము జ్ఞానము తెలియనివారు కూడా అనేక సందర్భములలో కర్మయనీ, అది వాని కర్మయనీ, ఇది నాకర్మ అనీ తెలియకనే

అంటున్నాము. అంతేకాక కర్మయని అంటూ చేయిని తన తలవైపు చూపడమూ, తలవ్రాతయని తలలోని ఫాలభాగమును చూపడమూ జరుగుచున్నది. ఇవన్నీ మనిషికి తెలియకనే మాట్లాడడము, చేయి చూపడము జరుగుచున్నదంటే, కర్మ అనునది ఒకటున్నదనీ, అది తలలో నుదుటి భాగములోనే ఉన్నదనీ అందరికి తెలియునట్లు, శరీరములోని ఆత్మే మనిషిని కదిలించి, మాట్లాడించుచున్నదనీ అర్థమగుచున్నది. కానీ మనిషి, కర్మ అని ఎందుకంటున్నాననిగానీ, తలవైపే చేయినెందుకు చూపుచున్నానని గానీ ఏమాత్రము అనుకోవడము లేదు. శరీరములోని ఆత్మ తెలిపినట్లు, కర్మచక్రము తలమధ్యలో ఉన్నదని తెలుసుకొన్నాము. కర్మచక్రములోని కర్మంటే ఏమిటో యోచించి చూద్దాము.



'మర్మముగా ఉన్నది కర్మము' అని పెద్దలంటుంటారు. ఎవరికీ తెలియకుండా మర్మముగా వచ్చి, మనిషిలో చేరునది కర్మ, కావున కర్మను మర్మము అన్నారు. కర్మను 'చేసుకున్న ఫలితము' అని కూడా అన్నారు. ఫలితమునకు ఉదాహరణ చెప్పుకుంటే, ఒక ఉద్యోగి చేయు పనికి ఫలితము జీతము రూపములో ఉండును. అట్లే ఒక కూలివాడు చేయు పనికి ఫలితము దినకూలి రూపములో ఉండును. ఈ విధముగా మనిషి చేయు ప్రతి పనికీ ఫలితముండును. మనిషి ఒక పని చేస్తే దానిలో వచ్చు ఫలితము రెండు రకములుగా ఉండును. ఒక రకము అందరికీ తెలిసినదే. దానిని డబ్బురూపములో గానీ, వస్తురూపములోగానీ, ధాన్యరూపములోగానీ,


---

చేసిన పనికి దినకూలి రూపములోగానీ, నెలజీతము రూపములోగానీ తీసు కొంటున్నాము. ఇది కనిపించెడి ఫలితము. మనిషి చేయు ప్రతి పనికీ కనిపించని ఫలితము కూడా వచ్చుట గలదు. ఆ కనిపించని ఫలితమునే 'కర్మ' అంటాము. దానినే విడదీసి చెప్పుకొంటే, పాపము మరియు పుణ్యము అంటాము. ప్రతి మనిషీ భూమిమీద నిత్యము ఏదో ఒక పనిని చేస్తున్నాడు. కనిపించెడి ఫలితమునూ, కనిపించని ఫలితమునూ రెండిటినీ పొందు చున్నాడు. ఉదాహరణకు ఒక పోలీస్ ఉద్యోగి, తన ఉద్యోగరీత్యా పోలీస్ స్టేషన్లో ఒక దొంగనో లేక నేరస్థుడినో కొట్టవలసి వచ్చినపుడు కొట్టక తప్పదు. దానిని ఉద్యోగ ధర్మము అంటారు. ఆ ఉద్యోగము చేసినందుకు ఫలితముగా, నెల జీతము తీసుకోవడము జరుగుచున్నది. ఉద్యోగము చేయడము కనిపించే పనియే. దానికి కనిపించే ఫలితమును డబ్బురూపములో జీతముగా తీసుకొంటున్నాడు. అయినా ఆ పోలీస్కు కనిపించని ఫలితమైన కర్మ, అతను తీసుకోకనే వెంటవచ్చుచున్నది. కనిపించే జీతము ఉద్యోగి తీసుకొని జేబులో పెట్టుకుంటే, కనిపించని కర్మ దానంతటదే వచ్చి, తలలోని కర్మచక్రమును చేరుచున్నది. కనిపించే జీతమును గ్రహించి తీసుకొని, పై జేబులో పెట్టుకోవాలా, క్రింది జేబులో పెట్టుకోవాలా అని ఆలోచించి మనము పెట్టుకొన్నట్లు, కాలచక్రములోని గ్రహములు కర్మను గ్రహించి, కర్మచక్రములోని ఏ భాగములో పెట్టాలో ఆ భాగములోనే పెట్టును. ఇట్లు మనిషికి తాను చేసిన పని యొక్క ఫలితము ప్రత్యక్షముగా ఉన్నట్లు, కార్యమునకు కర్మ పరోక్షముగా ఉన్నది. పనిలో కనిపించు డబ్బు వచ్చినట్లే, కనిపించని కర్మ కూడా వచ్చుచున్నదని ఎవరూ అనుకోవడము లేదు. ఆ కనిపించని కర్మ విధానము ఎవరికీ తెలియదు.


----

అందువలన కర్మము మర్మమైనదని పెద్దలన్నారు. కార్యము కనిపించి ప్రత్యక్షమైనదైతే, కర్మ కనిపించక పరోక్షమైనదనీ, దానిని తెలుసుకోవడమే మనిషికి ఆధ్యాత్మికములో ముఖ్యమైనదని తెలియాలి.


8 కర్మ ఎన్ని రకములు?

కర్మ విధానమును బాగా ఆధ్యాయనము చేస్తే, మనిషి పుట్టినప్పటి నుండి ఒకటి సంపాదించే కర్మ, రెండు అనుభవించేకర్మ అని రెండు రకములు గలవు. ఇవి రెండూకాక సంపాదించేది ఎక్కువై, అనుభవించేది తక్కువైనపుడు శేషముగా (బ్యాలెన్సుగా) మిగిలే కర్మ కొంతవుంటుంది. అలా మిగిలిన శేషము యొక్క నిల్వను 'సంచితకర్మ' అని అంటున్నాము. ఒక జన్మలో సంపాదించిన కర్మను ‘ఆగామికర్మ' అని అంటున్నాము. అట్లే ఒక జన్మలో అనుభవించే కర్మను ‘ప్రారబ్ధకర్మ' అని అంటున్నాము. బ్రహ్మవిద్యా శాస్త్రము ఆగామికర్మ యొక్క వివరమును తెలియజేయును. జ్యోతిష్యశాస్త్రము ప్రారబ్ధకర్మ యొక్క వివరమును తెలియజేయును. ఆగామికర్మను సంపాదించుకోకుండా ఉండే వివరమును తెలుపునది 'బ్రహ్మవిద్యాశాస్త్రము'. అలాగే ప్రారబ్ధకర్మలోని అనుభవములను వివరించి తెల్పునది 'జ్యోతిష్య శాస్త్రము'. ఇపుడు మనము జ్యోతిష్యమునకు సంబంధించిన ప్రారబ్ధమును

గురించి తెలుసుకొందాము.


ప్రారబ్ధకర్మ ఎలా పుట్టుచున్నదో అని చూస్తే, పొగ పుట్టుటకు నిప్పుకారణమన్నట్లు, ప్రారబ్ధకర్మ పుట్టుటకు మనిషి తలలోని గుణములు కారణము. తల మధ్యలోగల నాల్గుచక్రముల సముదాయములో, క్రిందనున్న చక్రము పేరు గుణచక్రము. గుణచక్రము మూడు భాగములుగా విభజింపబడి


----

వున్నది. గుణచక్ర చిత్రమును ఈ క్రిందగల 6వ పటమునందు చూడవచ్చును.


గుణచక్రము-6వ పటము.

గుణచక్రములోని మూడు భాగములకు మూడు పేర్లు గలవు. మూడు పేర్లు బయటనుండి వరుసగా తామస, రాజస, సాత్త్వికము అని గలవు. మధ్యలోనున్న బ్రహ్మనాడి ఇరుసు భాగములో ఆత్మ ఉండును. అందువలన దానిని ‘ఆత్మభాగము’ అంటాము. మధ్యలోని ఆత్మ భాగము గుణచక్రమునకే కాక అన్ని చక్రములకూ ఉండును. ఇక్కడ మధ్యలోని ఆత్మభాగమును వదలివేస్తే, మిగిలిన గుణభాగములు మూడు మాత్రమే ఉండును. బ్రహ్మవిద్య ప్రకారము _ గుణచక్రమును ఆత్మ భాగముతో కలిపి నాల్గుభాగములని చెప్పవలెను. కానీ జ్యోతిష్యశాస్త్రము ప్రకారము మనకు అవసరమైనవి మూడు భాగములు మాత్రమే. అందువలన ఇక్కడ గుణచక్రమును, మూడు భాగములుగానే చెప్పుకోవలెను. మూడు భాగములలోనూ గుణములు ఉండును. మనకు అర్థమగుటకు ముందు ఒక గుణభాగమును తీసుకొని చూచెదము. తామస గుణ భాగమును చూస్తే, అందులో రెండు గుంపులుగానున్న గుణములు ఉండును. ఆ రెండు గుంపులలో ఒక గుంపు

--- 

గుణములు చెడు గుణములనీ, రెండవ గుంపులోని గుణములు మంచి గుణములనీ పేరుగాంచి ఉన్నవి. చెడు గుణములు మొత్తము ఆరు గలవు. అట్లే మంచిగుణములు మొత్తము ఆరు గలవు. చెడు గుణముల పేర్లు వరుసగా 1) కామము 2) క్రోధము 3) లోభము 4) మోహము 5) మదము 6) మత్సరము అని గలవు. వీటినే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు అంటాము. మంచి గుణముల పేర్లు వరుసగా 1) దానము 2) దయ 3) ఔదార్యము 4) వైరాగ్యము 5) వినయము 6) ప్రేమ అని గలవు. వీటినే దాన, దయ, ఔదార్య, వైరాగ్య, వినయ, ప్రేమలు అంటాము. మొదటి ఆరు చెడు గుణములు ఒక గుంపుగా, రెండవ ఆరు మంచి గుణములు మరియొక గుంపుగా గలవు. అంతేకాక మొదటి గుంపులోని ఆరు చెడు గుణములకు వ్యతిరేఖగుణములుగా, రెండవ గుంపులోని ఆరు మంచి గుణములు గలవు. శరీరములోని జీవునికి ఆరు చెడు గుణములు శత్రువులనీ, ఆరు మంచి గుణములు మిత్రులని పేరుగాంచి ఉన్నవి.


జీవునికి చెడు ఆరు గుణములు శత్రువులుగా ఉండి, ఆ గుణము లలో దేనిద్వారా బయటిపని జరిగినా, దానిద్వారా జీవునకు పాపము వచ్చునట్లు చేయుచున్నవి. ఇక్కడ సూత్రమేమనగా! ఒక గుణ ప్రేరణ వలన జరిగే పనిలో ఒక కర్మ పుట్టుచున్నది. చెడు గుణము వలన జరిగిన పనిలో పాపమూ, మంచి గుణము వలన జరిగిన పనిలో పుణ్యమను పుట్టుక వచ్చుట సహజము. దీనినిబట్టి పాపపుణ్యముల పుట్టుక స్థానము గుణ చక్రమని తెలియుచున్నది. ఒక తామసగుణభాగములో మంచి, చెడు గుణములు మొత్తము పండ్రెండు ఉన్నట్లు, రాజసగుణభాగము లోనూ పండ్రెండు గుణములు గలవు. అట్లే సాత్విక గుణభాగములోనూ పండ్రెండు గుణములు గలవు. మొదటి తామస గుణభాగములో మిత్ర, శత్రువులు


----

అను రెండు గుంపుల గుణములున్నట్లే, మిగతా రెండు గుణభాగములలోను గలవు. దీని ప్రకారము మూడు భాగములలో మొత్తము గుణముల సంఖ్య '36' గా తెలియుచున్నది. ఒక భాగములోని 12 గుణములకు మరొక భాగములోని 12 గుణములకు పేర్లు ఒకే విధముగా ఉన్నవి. కానీ ఒక భాగములోని 'ఆశ' అను గుణమునకు, మరొక భాగములోని 'ఆశ' అను గుణమునకు కొంత తేడా ఉండును. ఇట్లు ఒక భాగములోని గుణమునకు మరొక భాగములోని గుణమునకు కొంత భేదము ఉన్నట్లు, మిగతా అన్ని గుణములకు భేదము ఉండునని తెలియవలెను. అదే విధముగా ఒక భాగములోని క్రోధము వలన వచ్చు పాపమునకు, మరొక గుణభాగములోని క్రోధము వలన వచ్చు పాపమునకు కొంత తేడా ఉండును. ఒకే పేరు కల్గిన గుణములు, మూడు భాగములలో ఉండినప్పటికీ, అవి కొంత భేదము కల్గియున్నట్లు, వాటి వలన వచ్చు పాపపుణ్యములను కర్మ కూడా కొంత భేదము కల్గియుండునని గుర్తుంచుకోవలెను. ఈ విషయము అర్థమగుటకు క్రింది చిత్రము కొంత ఉపయోగపడును. కావున 7వ పటమును చూడుము.


---

ఒక భాగములోని గుణములకు, మరొక భాగములోని గుణములకు పేర్లు ఒకే విధముగా ఉండినా, అవి ఒకే విధముగా లేవనీ, వాటి వలన వచ్చు కర్మకూడా ఒకే విధముగా లేదనీ తెలుసుకొన్నాము కదా! ఇపుడు ముఖ్యముగా తెలుసుకోవలసినది ఏమనగా! ఒక భాగములోని ఒకే పేరున్న గుణము, తాను ఒకటే కాక, తన జాతి గుణముల సముదాయముగా ఉన్నది. ఉదాహరణకు తామస గుణభాగములోని క్రోధము ఒక్కటేగాక, అది తొమ్మిది క్రోధముల గుంపుగా ఉన్నది. ఒక భాగములోని తొమ్మిది సంఖ్యలోనున్న ఒకే పేరుగల గుణములు సమానముగా లేకుండా, పరిమాణములో తేడా కల్గియున్నవి. ఎట్లనగా! ఒక పేరున్న క్రోధము లేక కోపము యొక్క గుణముల గుంపులో మొదటిది పెద్దగా ఉండగా, దాని తర్వాత రెండవది మొదటి దానికంటే పరిమాణములో కొంత చిన్నదిగా ఉండును. తర్వాత రెండవ దానికంటే మూడవది పరిమాణములో కొంత తక్కువగా ఉండును. ఆ విధముగా ఒకదానికొకటి చిన్నదిగా ఉంటూ, చివరి తొమ్మిదవది అన్నిటికంటే చిన్నదిగా ఉండును. తామసభాగములో కోపము తొమ్మిది రకములుగా ఉన్నట్లు, మిగతా రెండు భాగములలో కూడా కోపము తొమ్మిది భాగములుగా ఉన్నది. దీనినే చిన్న కోపము, పెద్ద కోపము, కొంత కోపము అంటున్నాము. ఒక భాగములో ఒక గుణము తొమ్మిది గుంపుగా ఉండుట వలన, చెడు గుణములైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అను ఆరు గుణములు గుంపు మొత్తము యాభై నాలుగుగా ఉన్నవి. 6x9=54 ఒక చెడు గుణముల గుంపు ఉండగా, మరొక మంచి గుణములు కూడా 6x9=54 గుంపుగా ఉన్నవి. ఈ విధముగా లెక్కించి చూచితే ఒక గుణ భాగములో పెద్ద గుణములు మొత్తము పండ్రెండు కాగా, వాటి గుంపులోని చిన్న గుణములను కూడా లెక్కించి

---

చూచితే 12x9=108 మొత్తము నూటఎనిమిది గుణములుగా ఉన్నవి. ఒక తామస భాగములోనున్నవి 108 గుణములు కాగా, రాజన భాగములోనూ 108 గుణములు కలవు. అట్లే సాత్త్విక భాగములోనూ గుణముల సంఖ్య 108 గానే కలదు. మూడు భాగములలోనూ మొత్తము గుణముల సంఖ్య 108x3=324 గా ఉన్నది. గుణముల గుంపు చిత్రమును ఈ క్రిందగల 8వ పటములో చూడుము.


గుణచక్రము 8వ పటము.

తామస భాగములో గుణముల సంఖ్య 108 కదా! వాటివలన ఉత్పన్నమయ్యే కర్మ కూడా 108 రకములుగా ఉండును. అందులో 54 గుణముల వలన వచ్చునది పాపము కాగా, మిగతా 54 గుణముల వలన వచ్చునది పుణ్యమై ఉన్నది. ఈ విధముగా ఒక తామస భాగములోనే కర్మ 108 రకములుగా తయారుకాగా, మొత్తము మూడు భాగములలో 324 రకముల పాపపుణ్యములు తయారగుచున్నవని చెప్పవచ్చును. ఇపుడు,

----

కర్మ ఎన్ని రకములు? అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఒక గుణ భాగములో అయితే 108 రకములనీ, మూడు గుణ భాగములలో మొత్తము 324 రకములు అని సులభముగా చెప్పవచ్చును. కర్మ విధానమూ, కర్మయొక్క విభాగముల విధానమూ, భూమిమీద ఒక ఇందూమతములోనే కలదు. మిగతా మతములలో కర్మ విధానముగానీ, దాని విభజనగానీ ఎక్కడా కనిపించదు. ఇది బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారమున్నది. కానీ ఇప్పటి కాలమున జ్యోతిష్య శాస్త్రములో కూడా కర్మ విధానమును ఎవరూ వ్రాసుకోవడము జరుగలేదు.


9 కర్మను అనుభవించు వాడు ఎవడు?


ఇంతవరకు కాలచక్రమునూ, కర్మచక్రమునూ, గుణచక్రమునూ గురించి వరుసగా తెలుసుకొన్నాము. ఇపుడు కర్మను అనుభవించు జీవున్ని గురించి తెలుసుకొందాము. కర్మను పరిపాలించుటకు కాలచక్రములోని గ్రహములున్నాయి. కర్మను పుట్టించుటకు గుణచక్రములోని గుణములు ఉన్నాయి. కర్మను అనుభవించుటకు జీవుడు గుణచక్రములోనే ఉన్నాడు. జీవుడు కర్మను అనుభవిస్తూ, కాలమును గడపడమునే 'జీవితము’ అంటాము. “నహి కశ్చిత్ క్షణమపి” అని భగవద్గీతలో అన్నట్లు, ఒక్క క్షణము కూడా వృథా కాకుండా, జీవుడు జీవితములో కర్మను అనుభవిస్తున్నా డని తెలియుచున్నది. జీవుడు అనుభవించబోవు కర్మను తెలుసుకోవడమే “జ్యోతిష్యము” అంటున్నాము. జ్యోతిష్యమును సమగ్రముగా తెలుసుకో వాలంటే, కర్మను అనుభవించే జీవున్ని గురించి పూర్తిగా తెలుసుకోవలసి యుండును. కర్మను అనుభవించు జీవుడు, తలలోని కర్మచక్రము క్రిందనున్న గుణచక్రములోనే ఉండును. గుణచక్రము యొక్క మూడు భాగములలో ఏదో ఒక భాగములో జీవుడుండి, ఆ గుణముల ప్రవర్తనల వలన కలుగు


---

సుఖదుఃఖములను అనుభవించుచుండును. తామసములో నున్న జీవున్ని ఈక్రిందగల 9వ పటములో చూడవచ్చును.


తామస భాగములో జీవుడు.

గుణచక్రము - 9వ పటము.

తామసములో జీవుడున్నపుడు మిగతా రాజస, సాత్త్వికములలో జీవుడుండడు. ఒక్కోసారి జీవుడు తామసమును వదలి రాజసభాగములోనికి కూడా చేరును. అపుడు మిగతా తామస, సాత్త్వికములలో జీవుడు లేడని తెలియుచున్నది. రాజసగుణముల మధ్యలో జీవుడున్న చిత్రమును క్రిందగల 10వ పటములో చూడుము.

గుణచక్రము 10వ పటము.

రాజస భాగములో జీవుడు.

-----

ఈ విధముగా జీవుడు మూడు గుణముల భాగములను మారుటకు ఒక కారణము కలదు. అదేమనగా! ప్రారబ్ధకర్మను బట్టి జీవుడు అస్వతంత్రుడై గుణముల భాగములను మారవలసియున్నది. ఆ విధముగా మారుచున్న జీవుడు ఒక్క సమయములో, ఒక్క గుణభాగములో, ఒక్క గుణమునందు లగ్నమగుచుండును. ఏ గుణ భాగములోనున్న జీవున్ని ఆ గుణభాగము పేరుతో పిలువడము జరుగుచున్నది. తామస భాగములోనున్నపుడు తామసుడనీ, రాజస భాగములోనున్నపుడు రాజసుడునీ, సాత్విక భాగములో నున్నపుడు సాత్త్వికుడనీ పిలుస్తున్నాము. ఇపుడు సాత్వికములోనున్న సాత్త్వికుణ్ణి క్రింది 11వ పటములో చూస్తాము.


సాత్త్విక భాగములో జీవుడు.

గుణచక్రము - 11వ పటము.

జ్ఞానదృష్ఠితో బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములను నాల్గుచక్రముల చట్రమును చూడవచ్చును. అదే విధముగా క్రింద గుణచక్రములోని ఏదో ఒక భాగములోనున్న జీవున్ని చూడవచ్చును. దీనినిబట్టి గుణములకూ, జీవునికీ కూడా ఆకారము కలదని తెలియుచున్నది. ఇంతవరకు, భూమిమీద ఎక్కడా తెలియని విధానమునూ, గుణముల యొక్కయు మరియు జీవుని యొక్కయు ఆకారములనూ మనము తెలుసుకోగలిగాము.

------

సమగ్రముగా చూస్తే జీవుని ఆకారము ఈ విధముగా గలదు. జీవుడు మూడు పొరల మధ్యన బంధింపబడిన ఖాళీ స్థలము అని తెలియుచున్నది. జీవుని ఆకారమును క్రింది 12వ పటములో చూడవచ్చును.


జీవుని ఆకారము - 12వ పటము.

ఇంతవరకు కాలచక్రమును, కర్మచక్రమును, గుణచక్రమును అందులోనున్న జీవున్ని గూర్చి తెలుసుకొన్నాము. ఇక మూడు చక్రములకంటే పైన గల బ్రహ్మచక్రమొకటి గలదు. బ్రహ్మచక్ర వివరము ఇక్కడ జ్యోతిష్యమునకు అవసరము లేదు. అది ఒక బ్రహ్మవిద్యాశాస్త్రమునకు మాత్రమే పరిమితమైనది. కావున రెండు భాగములుగానున్న బ్రహ్మచక్రమును ఇక్కడ వివరించుకోక వదలి వేయుచున్నాము. జ్యోతిష్యమునకు కావలసినది కాల,కర్మ, గుణచక్రముల సమగ్ర సమాచారము మాత్రమేనని తెలుపు చున్నాము. గుణచక్రములోని గుణములను, జీవున్ని గురించి తెలుసు కొన్నాము. కర్మచక్రములోని కర్మను గురించి తెలుసుకొన్నాము. కానీ కాలచక్రములో గ్రహములను గురించి తెలుసుకోవడములో కొంత మిగిలి ఉన్నది.


----

(10) గ్రహములంటే ఏమిటి? అవి ఎన్ని గలవు?

ఇపుడు కొదువగా మిగిలియున్న కాలచక్రములోని గ్రహములను గురించి, వాటి పనిని గురించి, వాటి సంఖ్యను గురించి తెలుసుకొందాము. గ్రహము అనగా గ్రహించునదని అర్థము. నీరు ఉప్పును గ్రహించునట్లు, గాలి వాసనను గ్రహించునట్లు గ్రహము కర్మను గ్రహించును. గుణచక్రము లోని గుణము వలన జరిగిన కార్యములో, క్రొత్త కర్మ పుట్టుచున్నదని తెలుసుకొన్నాము. అలా పుట్టిన కర్మను కాలచక్రములోని గ్రహములు గ్రహించుకొని, కర్మచక్రమునందు నిలుచునట్లు చేయును. నిత్య జీవితములో కర్మను ఏ గ్రహము గ్రహించి కర్మచక్రములో నిలువయుంచుచున్నదో, అదే గ్రహము, అదే ప్రారబ్ధకర్మను సమయమొచ్చినపుడు జీవుని మీద ప్రసరింపజేయును. సృష్టికర్త అయిన దేవుని చేత తయారు చేయబడిన గ్రహములు, కాలచక్రములో ప్రతిష్ఠింపబడి అక్కడనుండి గుణచక్రములో తయారగు కర్మను గ్రహించి, కర్మచక్రములో నిలువ చేయుచున్నవి. అలా గుణములనుండి గ్రహములు గ్రహించు క్రొత్తకర్మను 'ఆ కర్మ' అంటున్నాము. కర్మచక్రములో నుండి గ్రహించి జీవుని మీద వదలబడు కర్మను ‘ప్రారబ్ధకర్మ' అంటున్నాము. జ్యోతిష్యమునకు ప్రారబ్ధకర్మ యొక్క విధి విధానము గలదు. గుణచక్రములో తయారగు క్రొత్తకర్మ 108 రకములు కాగా, గుణములు ముఖ్యమైనవి పండ్రెండు గలవు. కాలచక్రములోని 12 గ్రహములు, గుణచక్రములోని 12 గుణముల గుంపు నుండి గ్రహించిన కర్మను, కర్మచక్రములోనున్న 12 భాగములలో నిలువయుంచుచున్నవి. గుణచక్రములోని 12 గుణములు తయారు చేయు కర్మను, కర్మచక్రములో 12 భాగములలో నిలువ చేయు 12 గ్రహములు కాలచక్రములోని 12

---

భాగములలో గలవు. ఇక్కడ విచిత్రమేమంటే! ఇంతవరకు ఎవరికీ తెలియని గ్రహముల సంఖ్య మనకు తెలిసినది. కాలచక్రములోని 12 గ్రహములు అదే చక్రములోని 12 భాగములను తమ స్వంతస్థానములుగా ఏర్పరచుకొన్నవి.


గుణచక్రములోని రెండు వర్గముల గుణములనుబట్టి, పాపపుణ్య అను రెండు వర్గముల కర్మ తయారగుచున్నది. ఆ కర్మను కర్మచక్రములో రెండు వర్గములుగానే స్థాపించుటకు గ్రహములు కూడా రెండు వర్గములైనాయి. అలా ఏర్పడిన ఒక్కొక్క వర్గములో ఆరు గ్రహములుండగా, రెండు వర్గములలో 12 గ్రహములు గలవు. కష్టానికి వ్యతిరేఖమైనది సుఖము. అలాగే పాపమునకు వ్యతిరేఖమైనది పుణ్యము. వీటిని గ్రహించు గ్రహములు కూడా రెండువర్గములై, ఒకదానికి ఒకటి వ్యతిరేఖముగా ఉన్నవి. కర్మనుబట్టి రెండు వర్గములైన గ్రహములలో, ఒక్కొక్క వర్గమునకు ఒక్కొక్క గ్రహము ఆధిపత్యము (నాయకత్వము) వహించుచున్నవి. అలా ఏర్పడిన రెండు వర్గముల యొక్క అధిపతులు ఒకరు గురువు, మరొకరు శని. వీరిని బట్టి మిగతా గ్రహములను గురువర్గము (గురుపార్టీ) గ్రహములనీ, శనివర్గము (శని పార్టీ) గ్రహములనీ అనుచున్నాము. ఒక వర్గమునకు శని నాయకుడు కాగా, అతని ఆధీనములో మిగతా ఐదు గ్రహములుండును. అలాగే మరొక వర్గమునకు గురువు నాయకుడు కాగా, అతని ఆధీనములో మిగతా ఐదు గ్రహములుండును.


---

11. 12 గ్రహములు ఏవి?

గుణములు 12 రకములు గలవు. 12 గుణములలో వచ్చు కర్మలు

12 రకములు గలవు. 12 గుణములలో పుట్టు 12 రకముల కర్మలను గ్రహించు గ్రహములు కూడా 12 గలవు.

గ్రహములు నివశించు

కర్మచక్రము కూడా 12

కాలచక్రము కూడా 12 భాగములుగా ఉన్నది. రకముల కర్మలు నిలువయుండుటకు 12 భాగములుగానే ఉన్నది. కాలచక్రములోని 12 భాగములలో స్వంత స్థానములను ఏర్పరచుకొన్న 12 గ్రహముల పేర్లు వరుసగా ఈ విధముగా కలవు. 1) రవి 2) చంద్రుడు 3) కుజుడు 4) బుధుడు 5) గురువు 6) శుక్రుడు 7) శని 8) రాహువు 9) కేతువు 10) భూమి 11) మిత్ర 12) చిత్ర. సూర్యకుటుంబములోని గ్రహములలో భూమి కూడా కలదు. కావున దానిని అందరూ ఒప్పుకొనుటకు అవకాశము గలదు. కానీ ఎవరూ ఇంతవరకు విననివి మరియు తెలియనివి అయిన మిత్ర, చిత్ర అను రెండు గ్రహములు కూడా కలవు. ఇంతవరకు

ఖగోళశాస్త్ర పరిశోధకులకు కూడా ఈ రెండు గ్రహముల ఉనికి తెలియదు. ఖగోళ శాస్త్రపరిశోధకులు భవిష్యత్తులో ఈ రెండు గ్రహములను గూర్చి చెప్పవచ్చునేమో కానీ, ఇప్పటి వరకు వాటి వివరము ఏమాత్రము వారికి తెలియదు. ఈ రెండు గ్రహములను కనుగొనుట కొంత కష్టముతో కూడుకొన్న పనియేనని చెప్పవచ్చును. ఇక్కడ కొందరు మేథావులు మమ్ములను ఈ విధముగా ప్రశ్నించవచ్చును. ఇంతవరకు ఖగోళ శాస్త్రజ్ఞులకే తెలియని రెండు గ్రహముల వివరము మీకు ఏ పరిశోధన ద్వారా తెలిసినది? పైగా ఈ రెండు గ్రహములను కనుగొనుట కష్టముతో కూడుకొన్న పనియే అన్నారు. ఆ విషయమును మీరెలా చెప్పుచున్నారని అడుగవచ్చును.

దానికి మా జవాబు ఈ విధముగా కలదు.


----

ఉన్న విద్యను శోధించి తెలుసుకొనుచున్నవాడు విద్యార్థి అవుతాడు. పూర్తి విద్యను నేర్చినవాడు విద్యావేత్త అవుతాడు. విద్యార్థిని, విద్యావేత్తయని అనలేము. అలాగే ఉన్న శాస్త్రమును శోధించి తెలుసుకొనువాడు శాస్త్ర పరిశోధకుడవుతాడు, శాస్త్రవేత్తగాడు! మరియు శాస్త్రజ్ఞుడూగాడు. మా దృష్టిలో ఖగోళశాస్త్రపరిశోధకులున్నారు గానీ, ఖగోళశాస్త్రజ్ఞులు లేరు. పూర్తి శాస్త్రమును తెలియనంతవరకు, ఎవరూ శాస్త్రజ్ఞులు కాలేరు. నేడు ఖగోళమును పరిశోధించు శోధకులున్నారు గానీ, పూర్తి తెలిసిన శాస్త్రవేత్తలు లేరు. అందువలన భవిష్యత్తులో ఇంతవరకు చెప్పని రెండు గ్రహముల వివరమును ఎవరైనా చెప్పవచ్చునేమో అన్నాము. మిత్ర, చిత్ర అను రెండు గ్రహములను కనుగొనుట కొంత కష్టముతో కూడుకొన్నపని అని కూడా అన్నాము. అలా అనుటకు కారణము ఏమనగా! మిత్ర గ్రహము చీకటితో కూడుకొన్నది. దాని మీదికి ఏ వెలుగూ ప్రసరించదు. ఏ వెలుగూ దాని మీద ప్రతిబింబించదు. ఏ రేడియేషన్ కిరణములు దానిని తాకలేవు. ఇకపోతే రెండవ గ్రహమైన 'చిత్రగ్రహము' అనేక రంగులు కలదై, 24 గంటలలో కొన్ని నిమిషములు మాత్రమే గోచరించును. మిగతా సమయములో అదృశ్యమై ఉండును. కొన్ని నిమిషములు మాత్రమే అగుపించు అదృశ్యగ్రహమును చిత్రగ్రహము అంటాము. కావున కనిపించని చిత్ర గ్రహమును గానీ, చీకటి గ్రహమైన మిత్ర గ్రహమునుగానీ కనుగొనుట కష్టమన్నాము. మీరు ఏ పరిశోధన ద్వారా చెప్పుచున్నారని నన్నడిగితే, నా జవాబు ఏమనగా! నా పరిశోధన ఏదైనా బయటగానీ, బయటి పరికరముల ద్వారాగానీ ఏమాత్రముండదు. నా శోధనయంతా శరీరాంతరములోనే ఉండును. శరీరములోని బ్రహ్మనాడిలో సమస్త విశ్వము ఇమిడియున్నది. శరీరాంతర బ్రహ్మనాడిలోనే షట్ శాస్త్రములు ఇమిడియున్నవి. సకల


---

విద్యలూ బ్రహ్మనాడియందే గలవు. ఉదాహరణకు బయట విద్యను నేర్వని చిన్న వయస్సువారు కూడా, ఎంతో విద్యా ప్రావీణ్యులుగా కనిపించు చున్నారు. వారియందే విద్య ఉన్నదానివలన, అది లోపలే ప్రాప్తించిన దానివలన, వారు ఆ విద్యలో ప్రావీణ్యులుగా కనిపించుచున్నారు.


బయట కనిపించు సమస్తము మన బ్రహ్మనాడియందు ఉండడమే కాక, ఈ సమస్తమును సృష్టించిన దేవుడు కూడా మనయందే ఉన్నాడు. మనిషి బయట ఎక్కడ వెదకినా దేవుడు కనిపించడు. బయట కనిపించని దేవుణ్ణి కూడా మనిషి తన శరీరము లోపలే తెలియవచ్చును, పొందవచ్చును. చివరికి మోక్షమును పొందవలసినది కూడా శరీరములోనే. ప్రకృతిని సృష్టించిన దేవుడే శరీరములో ఉంటే, మిగతా వాటిని గురించి బయట వెదకవలసిన పనిలేదు. పూర్వము మహర్షులు, బయటి పరిశోధన లేకుండగనే సూర్య,చంద్ర,నక్షత్ర గతులనూ, గ్రహణములనూ చెప్పగలిగారని మరువ కూడదు. నేటి శాస్త్రపరిశోధకులు చెప్పని విషయములను ముందే ఏ పరిశోధన లేకుండా చెప్పిన ఘనత ఇందూదేశ జ్ఞానులకు గలదు. గతములో మేము చెప్పిన “జనన మరణ సిద్ధాంతము” గానీ, “ఆధ్యాత్మిక రహస్యములు” గానీ అంతరంగ పరిశోధనలోనివేనని తెల్పుచున్నాము. ఆ పద్ధతి ప్రకారమే ఇప్పుడు చెప్పిన 12 గ్రహముల వివరమని తెలియవలెను. చీకటి గ్రహమైన మిత్ర గ్రహముగానీ, అదృశ్య రూపముగా నుండి, కొన్ని క్షణములు మాత్రము కనిపించు చిత్రగ్రహము గానీ ఇప్పటికీ క్రొత్తవే. అయినా వీటి పాత్ర జ్యోతిష్యములో చాలా ఉన్నది. వీటి పాత్రను వదలివేసిన నేటి జ్యోతిష్యములో శాస్త్రీయత లోపించినదనియే చెప్పవచ్చును. జ్యోతిష్యము శాస్త్రముగా నిరూపించబడాలంటే గ్రహముల సంఖ్య 12 గానే ఉండాలి.


---

12.కాలచక్రములో 12 గ్రహముల స్వంత స్థానములు ఏవి?

బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రముల సముదాయముల చట్రములో క్రింది నుండి మూడవ చక్రము కాలచక్రమని ముందే చెప్పుకొన్నాము. కాలచక్రము 12 భాగములుగా ఉన్నదని చెప్పుకొన్నాము. ఆ పండ్రెండు భాగముల పేర్లు 1) మేషము 2) వృషభము 3) మిథునము 4) కర్కాటకము 5) సింహము 6) కన్య 7) తుల 8) వృశ్చికము 9) ధనస్సు 10) మకరము 11) కుంభము 12) మీనము అని చెప్పుకొన్నాము. కాలచక్రములోని మేషాది 12 లగ్నములను క్రింది 13వ పటములో గుండ్రముగా మరియు చతురస్రాకారముగా చూడవచ్చును.


----


కాలచక్రము - (b)13వ పటము.

ఇక్కడ కాలచక్రములోని మేషాది ద్వాదశ భాగములలో 12 గ్రహముల స్వంతస్థానములను క్రింది 14వ పటములో చూడవచ్చును.

----

ముందు పేజీలోని చిత్రమును బట్టి పండ్రెండు గ్రహముల స్వంత

స్థానములు క్రింద ఈ విధముగానున్నవి.

1) కుజ గ్రహమునకు

మేష భాగము స్వంత ఇల్లు

2) మిత్ర గ్రహమునకు

వృషభ భాగము స్వంత ఇల్లు

3)

చిత్ర గ్రహమునకు

మిథున భాగము స్వంత ఇల్లు

4)

చంద్ర గ్రహమునకు

కర్కాటక భాగము స్వంత ఇల్లు

5)

రవి (సూర్య) గ్రహమునకు

సింహ భాగము స్వంత ఇల్లు

6)

బుధ గ్రహమునకు

కన్య భాగము స్వంత ఇల్లు

7)

శుక్ర గ్రహమునకు

తులా భాగము స్వంత ఇల్లు

8)

భూమి గ్రహమునకు

వృశ్చిక భాగము స్వంత ఇల్లు

9)

కేతు గ్రహమునకు

ధనస్సు భాగము స్వంత ఇల్లు

10)

రాహు గ్రహమునకు

మకర భాగము స్వంత ఇల్లు

11)

శని గ్రహమునకు

కుంభ భాగము స్వంత ఇల్లు

12)

గురు గ్రహమునకు

మీన భాగము స్వంత ఇల్లు

మనలో కొందరికి స్వంత ఇల్లు ఉండిన, ఉద్యోగరీత్యా స్వంత ఇల్లు విడచి, వేరు ఊరిలో ఇతరుల ఇళ్ళలో కొంత కాలము కాపురముండు నట్లు, గ్రహములు కూడా వాటి కర్తవ్య నిర్వహణలో తమస్వంత స్థానములను విడిచి, ఇతర గ్రహముల స్వంత ఇళ్ళలో కొంత కాలము ఉండవలసిన పనియుండును. అందువలన శాశ్వితముగా గ్రహములు వాటి స్వంత ఇళ్ళలో ఉండవు.


----

(13) కాలచక్రములో మిత్రు, శత్రు గ్రహములు ఏవి?

జ్యోతిష్యము ఆధ్యాత్మికముతో ముడిపడియున్నదని ముందే చెప్పు కొన్నాము. ఆధ్యాత్మికము ప్రకారము పరమాత్మ మూడు ఆత్మలుగా విభజింప బడినది. ఆ మూడు ఆత్మలనే భగవద్గీతయందు పురుషోత్తమప్రాప్తి యోగమున క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడని చెప్పారు. క్షరుడు అనగా ప్రకృతిలో కలిసిన ఆత్మ కావున అది నాశనమగునదని అర్థము. అక్షరుడు అనగా నాశనము కానివాడని అర్థము. పురుషోత్తముడనగా క్షరునికంటేను అక్షరునికంటేను ఉత్తమమైనవాడని అర్ధము. ఈ మూడు ఆత్మలనే అద్వైతము, ద్వైతముకాని త్రైతము అంటున్నాము. ఈ త్రైతమును రెండు భాగములుగా విభజించవచ్చును. కర్మవున్న ఆత్మలు, కర్మలేని ఆత్మలు అని విభజించి చూస్తే, కర్మవున్న ఆత్మ క్షరుడు అనబడు జీవాత్మ అని తెలియుచున్నది. కర్మలేనివి రెండు ఆత్మలు గలవు. అవి అక్షరుడు అనబడు ఆత్మ, పురుషోత్తముడనబడు పరమాత్మ అని తెలియుచున్నది. ఈ రెండు భాగములలో కర్మలేని అక్షర, పురుషోత్తమ ఆత్మలు గొప్పవనీ, కర్మతో కూడుకొన్న క్షరాత్మ తక్కువదనీ తెలియుచున్నది. మూడు ఆత్మలలో గొప్పవి, తగ్గువి అని తెలియునట్లు 2:1 గా చెప్పకోవచ్చును. కర్మ విధానమును అనుసరించి వాటినే సరి, బేసి అంటాము. 2:1 అనినా, సరి బేసి అనినా, కర్మలేని పరమాత్మ ఆత్మలు రెండు అనియూ, కర్మయున్న జీవాత్మ ఒకటి అనియూ అర్థము. ప్రతి జీవరాసి శరీరములోను 2:1 ఉన్నదనీ మరియు సరి బేసి కలదనీ చెప్పవచ్చును. దైవమునకు జీవునకు గుర్తుగా 2:1 అని సరి బేసి అనవచ్చును. ఈ సరి బేసి జ్యోతిష్యములోనూ ఉపయోగ పడుచున్నది. అదెలా ఉపయోగపడుచున్నదనగా!

---

కాలచక్రములోని 12 భాగములలో 2:1 ప్రకారము, అనగా ఒక సరి సంఖ్య, ఒక బేసిసంఖ్య భాగములను తీసుకొని ఆ రెండు భాగములు ఏ గ్రహములకు స్వంత స్థానములో చూచుకోవలెను. ఈ సరి బేసి సూత్రము ప్రకారము, కాలచక్రములోని పండ్రెండు భాగములను విభజించి చూచితే, సరి బేసి రెండు భాగముల ప్రకారము మొత్తము ఆరు సరి, బేసి భాగములు వచ్చును. మొదట సరి, బేసి భాగములు రెండు ఒక పక్షములో పెట్టి, రెండవ సరి, బేసి భాగములను మరొక పక్షములో పెట్టి, అన్ని భాగములను చూచితే మొత్తము ఆరు గ్రహములు ఒక పక్షముకాగా, మిగతా ఆరు గ్రహములు మరొక పక్షమగుచున్నవి. ఈ రెండు పక్షములను మిత్రు శత్రు పక్షములు అంటున్నాము. 2:1 అను ఆత్మల నిష్పత్తి ప్రకారము కాలచక్రములో పండ్రెండు భాగములను విభజించి చూచితే, గ్రహముల రెండు వర్గములు తెలియును. ఈ విధానమును తర్వాత పేజీలో 15వ పటములో చూడుము.

15వ పటములో ఒక సరి, ఒక బేసి ఇళ్ళను తీసుకొని, విభజించడము జరిగినది. దాని ప్రకారము, కాలచక్రములో ఎక్కడ నుండి మొదలు పెట్టినా సరి బేసి సూత్రము మీదనే విభజించాలి. దాని ప్రకారము మొదటి 12వ మీన భాగమును 1వ మేష భాగమును తీసుకొని అందులోని రెండు గ్రహములను ఒక పక్షములో చేర్చి, తర్వాత 2వ వృషభ భాగమును 3వ మిథున భాగమును తీసుకొని, అందులోని రెండు గ్రహములను రెండవ ప్రతి పక్షములో చేర్చాలి. అలా చేస్తే 12వ మీన, 1వ మేష స్థానముల అధిపతులైన గురు, కుజులు ఒక పక్షముకాగా తర్వాత 2, 3 స్థానాధిపతులైన చిత్ర, మిత్ర గ్రహములు ప్రతి పక్షమైన శత్రుపక్షములో చేరి పోవుచున్నవి. అదే విధముగా 4, 5 స్థానాధిపతులైన చంద్ర, సూర్యులు, గురు కుజులు


---

కాలచక్రము 15వ పటము.

గల మొదటి పక్షములోనికి చేరుచున్నారు. 6, 7 స్థానాధిపతులైన బుధ, శుక్రులు రెండవ ప్రతిపక్షములో చేరుచున్నారు. ఇక 8, 9 స్థానములను చూచితే ఆ స్థానాధిపతులైన భూమి, కేతువు, గురు, కుజ, చంద్ర, రవి గ్రహముల పక్షమున చేరిపోవుచున్నారు. 10, 11స్థానముల అధిపతులైన రాహు, శని గ్రహములు; మిత్ర, చిత్ర, బుధ, శుక్రగ్రహముల పక్షములో చేరిపోవుచున్నారు. ఈ విధముగా 2:1 లేక సరి, బేసి అను సూత్రము ప్రకారము '12' గ్రహములలో ఆరు గ్రహములు శాశ్వితముగా ఒక పక్షములో ఉండగా, మిగతా ఆరు గ్రహములు శాశ్వితముగా ప్రతి పక్షములో ఉండును.


---


ఈ విధముగా రెండు వర్గములుగా 2:1 సూత్రము ప్రకారము విభజింపబడిన గ్రహములలో, ఒక వర్గమునకు గురువు, మరొక వర్గమునకు శని నాయకులుగ నియమింపబడినారు. అందువలన నాయక గ్రహములను బట్టి, ఒక వర్గమును గురువర్గమనీ, మరొక వర్గమును శనివర్గమనీ అంటున్నారు. వీటినే నేడు గురుపార్టీ, శనిపార్టీ గ్రహములని కూడా

అంటున్నారు.

గురువర్గము

1) గురు గ్రహము

1) శనివర్గము

1) శని గ్రహము

2) మిత్ర గ్రహము

2) రవి గ్రహము

3) చంద్ర గ్రహము

3) చిత్ర గ్రహము

4) కుజ గ్రహము

4) బుధ గ్రహము

5) కేతు గ్రహము

5) శుక్ర గ్రహము

6) భూమి గ్రహము

6) రాహు గ్రహము


----

ఈ గ్రహములు శాశ్వితముగా రెండు వర్గములుగా చేయబడినవి. ఒక వర్గములోని గ్రహములు, మరొక వర్గములోనికి ఎప్పటికీ మారవు.

(14) మేషలగ్నమునకు మిత్రు, శత్రు గ్రహములు ఏవి?

కాలచక్రములో పండ్రెండు భాగములలో మొదటిది మేషభాగము అంటాము. మొదటిది కావున అది బేసి సంఖ్యలో చేరిపోవుచున్నది. అది బేసిసంఖ్య కావున దానికంటే ముందున్న 12 అను సరిసంఖ్యను తీసుకోవలసి యుండును. ఎందుకనగా 2:1 అను సూత్రము ప్రకారము, ముందు సరి సంఖ్యతోనే గ్రహాల మిత్రు, శత్రువులను విభజించవలసి ఉండును. అందువలన మేషలగ్నమునకు మొదటి సరిసంఖ్యయైన మీనలగ్నమును తీసుకొని చూడవలెను. అపుడు మీన, మేష రెండులగ్నములు ఒక వర్గములో చేరిపోవును. అలా మొదట వచ్చిన రెండు లగ్నముల అధిపతులైన గ్రహములు ఒక పక్షముకాగా, తర్వాత గల వృషభ, మిథునముల అధిపతులైన రెండు గ్రహములు మరొక వ్యతిరేఖ పక్షములో చేరి పోవుచున్నవి. ఆ తర్వాత వచ్చు సరి బేసి సంఖ్య లగ్నముల అధిపతి గ్రహములు చంద్రుడు, సూర్యుడు ఇద్దరూ ఒక పక్షములోని గ్రహములవు చున్నవి. తర్వాతనున్న బుధ, శుక్ర గ్రహములు ప్రతిపక్షమగుచున్నవి. ఈ విధానము ముందు చిత్రించుకొనిన 16వ లగ్న పటములో చూచెదము.

మనిషిగానీ లేక ఏ జీవరాసిగానీ పుట్టినపుడు గుర్తించబడునది లగ్నము. మనిషి శిశువుగా పుట్టిన సమయములో కాలచక్రములోని సూర్యుడు కర్మచక్రము మీద ఎన్నో భాగములో ఎదురుగా నిలిచి ఉన్నాడో ఆ భాగము


----

త్రైతసిద్ధాంతములోని మూడు ఆత్మలను కర్మలేనివి, కర్మవున్నవి అనియూ, కార్యము చేయునవి కార్యము చేయనివి అనియూ రెండుగా విభజించి, దాని ప్రకారము 2:1 అను సూత్రమును అనుసరించి మిత్రు శత్రుగ్రహములను కనుగొన్నాము. మొదటి సరి బేసి గ్రహములు మిత్ర గ్రహములుకాగా, రెండవ సరి బేసి గ్రహములు శత్రుగ్రహములగునని కూడా చెప్పుకొన్నాము. దానిప్రకారము మేషలగ్నమునకు ద్వితీయ, తృతీయ స్థానాధిపతులైన మిత్ర, చిత్ర గ్రహములు, అలాగే షట్, సప్తమ స్థానాధిపతులైన బుధ, శుక్రులు మరియు దశమ, ఏకాదశ స్థానాధిపతులైన రాహువు, శని గ్రహములు ప్రతిపక్షగ్రహములగుచున్నారు. దీనిని బట్టి మేషలగ్నమునకు మిత్ర, చిత్ర, బుధ, శుక్ర, రాహు, శని ఆరుగ్రహములు శాశ్వితముగా శత్రు గ్రహములగుచున్నారు.

X

మిత్రులు:


గురుగ్రహము

కుజగ్రహము

చంద్రగ్రహము

సూర్యగ్రహము

భూమిగ్రహము

కేతుగ్రహము




శత్రువులు:

మిత్రగ్రహము

చిత్రగ్రహము

బుధగ్రహము

శుక్రగ్రహము

రాహుగ్రహము

శనిగ్రహము

---

మేషలగ్నమునకు ఎవరు మిత్రుగ్రహములగుచున్నారో, వారే మీన లగ్నమునకు కూడా మిత్రులగుదురు. అట్లే ఎవరు మేషమునకు శత్రు గ్రహములుగా పేరుగాంచియున్నారో, వారే మీనలగ్నమునకు కూడా శత్రువులగుచున్నారు. కాలచక్రములో చివరిదైన మీనము, మొదటిదైన మేషమును మొదట ఒక వర్గముగా గుర్తించుకొనవలెనని చెప్పుచున్నాము. ఈ విషయము జ్ఞప్తి యుండుటకు, ఎవడైనా బాగా ఆలోచించువానిని “మీన మేషములను లెక్కించువాడు” అని సామెతగా అంటుంటారు. బాగా యోచించువానిని మీన మేషాలను లెక్కించువాడని అంటున్నారంటే జ్యోతిష్యములో మీన మేషముల నుండి గ్రహములను లెక్కించవలెనని అర్థము. అదే విధముగా వృషభ మిథునములను ఈ క్రింద 17వ పటములో

చూచెదము.


----

15) వృషభము

వృషభలగ్నమునకు ఆ స్థానాధిపతియైన మిత్ర, మిథున లగ్న స్థానాధిపతియైన చిత్రగ్రహములు రెండు; అలాగే కన్య,తుల స్థానాధిపతులైన బుధ,శుక్రులు; మకర, కుంభ స్థానాధిపతులైన రాహు, శని అను ఆరు గ్రహములు మిత్ర గ్రహములుకాగా, చంద్ర, సూర్య, భూమి, కేతు, గురు, కుజులు అను ఆరు గ్రహములు శత్రుగ్రహములగుచున్నారు. వృషభ లగ్నమునకు ఎవరు మిత్రులగుదురో మిథున లగ్నముకు కూడా వారే మిత్రులగుదురు. అలాగే వృషభ లగ్నమునకు శత్రువులైన వారే మిథున లగ్నమునకు కూడా శత్రువులగుదురు. వీరు ఈ రెండు లగ్నములకు శాశ్వితముగా మిత్రు, శత్రువులుగ ఉందురని తెలియవలెను. వృషభ, మిథున లగ్నములకు శాశ్వితముగ మిత్రు, శత్రు గ్రహములు క్రింది విధముగ గలవు.

మిత్రులు.

1) మిత్ర గ్రహము

2) చిత్ర గ్రహము

3) బుధ గ్రహము

4) శుక్ర గ్రహము

5) రాహు గ్రహము

6) శని గ్రహము

X శత్రువులు.

1) చంద్ర గ్రహము

2) సూర్య గ్రహము 3) భూ గ్రహము

4) కేతు గ్రహము

5) గురు గ్రహము 6) కుజ గ్రహము


----

16) కర్కాటకము

ఇపుడు కర్కాటక, సింహలగ్నములకు మిత్ర, శత్రు గ్రహములను క్రిందగల 18వ పటములో చూచెదము.

కర్కాటక లగ్నమునకు, అదే స్థానాధిపతియైన చంద్రుడూ, సింహ లగ్నాధిపతియైన రవి (సూర్యుడు) మరియు వృశ్ఛిక లగ్నాధిపతియైన భూమి, ప్రక్కనేయున్న ధనస్సు లగ్నాధిపతియైన కేతువూ, మీనలగ్నాధిపతి యైన గురువూ, మేషలగ్నాధిపతియైన కుజ గ్రహములు మొత్తము ఆరు మిత్రు గ్రహములుకాగా, మిగతా మిత్ర, చిత్ర, బుధ, శుక్ర, రాహు, శని గ్రహములు ఆరు శత్రుగ్రహములగుచున్నవి. కర్కాటకలగ్నమునకు ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులగుచున్నారో వారే ప్రక్కనున్న సింహలగ్నమునకు కూడా శాశ్వితముగా మిత్రు, శత్రువులుగా ఉన్నారు.


---

కర్కాటక, సింహలగ్నములకు శాశ్వితముగా శత్రు మిత్రులుగానున్న

గ్రహములు క్రింది విధముగాగలవు.


మిత్రులు (శుభులు)


1) చంద్ర గ్రహము

2) సూర్య (రవి) గ్రహము

3) భూ గ్రహము

4) కేతు గ్రహము

5) గురు గ్రహము

6) కుజ గ్రహము




శత్రువులు (అశుభులు)

1) బుధ గ్రహము


2) శుక్ర గ్రహము


3) రాహు గ్రహమ


4) శని గ్రహము


5) మిత్ర గ్రహము


6) చిత్ర గ్రహము



17) కన్య.

ఇపుడు కన్యాలగ్నమునకు ఎవరు మిత్రుగ్రహములో, ఎవరు శత్రు గ్రహములో తర్వాత పేజీలోనున్న 19వ పటములో చిత్రీకరించుకొన్నాము.


కన్యాలగ్నమునకు అదే లగ్నాధిపతిమైన బుధుడు, ప్రక్కనున్న తులా లగ్నాధిపతియైన శుక్రుడు మరియు మకర లగ్నాధిపతియైన రాహువు, కుంభ లగ్నాధిపతియైన శని, వృషభ లగ్నాధిపతియైన మిత్ర, మిథున లగ్నాధిపతియైన చిత్ర గ్రహములు ఆరు, శాశ్వితముగా మిత్రులుకాగా మిగతా చంద్ర, సూర్య, భూమి, కేతువు, గురు, కుజ గ్రహములు ఆరు


---

19వ పటము.

శాశ్వితముగా శత్రువులైనారు. అదే విధముగా కన్యా లగ్నమునకు ఎవరైతే శత్రు, మిత్రులుగా ఉన్నారో వారే శాశ్విత శత్రు మిత్రులుగా ఉందురు.


కన్య, తులా లగ్నములకు శాశ్విత శత్రు, మిత్రు గ్రహములు క్రింద

వరుసగా వ్రాయబడినవి.


శత్రువులు (అశుభులు) 

1) చంద్ర గ్రహము

2) సూర్య (రవి) గ్రహము

3) భూ గ్రహము

4) కేతు గ్రహము

5) గురు గ్రహము

6) కుజ గ్రహము




 మిత్రులు (శుభులు)

1) బుధ గ్రహము


2) శుక్ర గ్రహము


3) రాహు గ్రహమ


4) శని గ్రహము


5) మిత్ర గ్రహము


6) చిత్ర గ్రహము




----

కాలచక్రము - 20వ పటము.

గ్రహములగుచున్నవి. సూత్రము ప్రకారము మిగిలిన మకర లగ్నాధిపతియైన రాహువు, కుంభ లగ్నాధిపతియైన శని, వృషభ లగ్నాధిపతియైన మిత్ర, మిథున లగ్నాధిపతియైన చిత్ర మొత్తము ఆరు గ్రహములు శత్రుపక్షమున చేరిపోయినవి. వృశ్చిక లగ్నమునకు శాశ్వితముగా మిత్ర గ్రహములు ఆరు, శత్రు గ్రహములు ఆరు, పాపపుణ్యములను పరిపాలించుచుందురు. వీరు, సూత్రము ప్రకారము పుణ్య పాపములను పరిపాలించుచూ శుభులు, అశుభులని పేరుగాంచియున్నారు. వీరు తమ కర్తవ్యములను వదలి శత్రువులు మిత్రులుగా మారిపోవడముగానీ, మిత్రులు శత్రువులుగా మారడముగానీ జరుగదు. వృశ్చిక లగ్నమునకు ఎవరు శత్రువులో, ఎవరు మిత్రులో వారే ధనుర్ లగ్నమునకు కూడా శత్రు మిత్రులుగా ఉన్నారని

తెలియవలెను.


---

వృశ్చిక, ధనుస్సు లగ్నములకు శాశ్వితముగా మిత్రు శత్రు

వర్గములుగానున్న గ్రహములను వరుసగా క్రింద చూడవచ్చును.



  మిత్రులు (శుభులు)

1) చంద్ర గ్రహము

2) సూర్య (రవి) గ్రహము

3) భూ గ్రహము

4) కేతు గ్రహము

5) గురు గ్రహము

6) కుజ గ్రహము




శత్రువులు (అశుభులు)  

1) బుధ గ్రహము


2) శుక్ర గ్రహము


3) రాహు గ్రహమ


4) శని గ్రహము


5) మిత్ర గ్రహము


6) చిత్ర గ్రహము









పండ్రెండు గ్రహములు ఆరుకు ఆరు మిత్రు, శత్రువులుగా ఉండడమే కాక వీరిలో ప్రత్యేకముగా ఒక గ్రహమునకు ఒక గ్రహము బద్ధశత్రుత్వము కల్గియున్నది. ఆ విషయమును తర్వాత తెలిపెదము.

19) మకరము

ఇపుడు మకర లగ్నమునకు ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో తర్వాత పేజీలోని 21వ పటములో చూచెదము.

మకర లగ్నమునకు అదే లగ్నాధిపతియైన రాహువు, ప్రక్కనేగల కుంభ లగ్నాధిపతియైన శని మిత్రులు కాగా, మరియు వృషభ లగ్నాధిపతియైన మిత్రగ్రహము, మిథున లగ్నాధిపతియైన చిత్రగ్రహము, కన్యా లగ్నాధిపతి యైన బుధ గ్రహము, తులా లగ్నాధిపతియైన శుక్రగ్రహము మొత్తము


----

కాలచక్రము - 21వ పటము.

ఆరు గ్రహములు శాశ్వితముగా మిత్రులుగా ఉన్నారు. ఇక మిగిలిన మీన లగ్నాధిపతియైన గురువు, మేష లగ్నాధిపతియైన కుజుడు, కర్కాటక లగ్నాధిపతియైన చంద్రుడు, సింహ లగ్నాధిపతియైన సూర్యుడు, వృశ్చిక లగ్నాధిపతియైన భూమి, ధనుర్ లగ్నాధిపతియైన కేతువు అను ఆరు గ్రహములు మకరమునకు శాశ్విత శత్రుగ్రహములుగా వ్యవహరించు చున్నవి. అలాగే ప్రక్కనేయున్న కుంభ లగ్నమునకు కూడా మకరమునకు మిత్రు శత్రువులుగా ఉన్నవారే శాశ్వితముగా మిత్రు, శత్రువులుగా ఉన్నారని తెలుపుచున్నాము.


---

మకర, కుంభ లగ్నములకు శాశ్వితముగా మిత్రు, శత్రువులుగానున్న

గ్రహములను క్రింద వరుసగా చూడచ్చును.



 శత్రువులు (అశుభులు)  

1) చంద్ర గ్రహము

2) సూర్య (రవి) గ్రహము

3) భూ గ్రహము

4) కేతు గ్రహము

5) గురు గ్రహము

6) కుజ గ్రహము




 మిత్రులు (శుభులు)  

1) బుధ గ్రహము


2) శుక్ర గ్రహము


3) రాహు గ్రహమ


4) శని గ్రహము


5) మిత్ర గ్రహము


6) చిత్ర గ్రహము






ఇంతవరకు కాలచక్రములోని ఆరు లగ్నములను చిత్రించి, ఎవరు శత్రు గ్రహములో ఎవరు మిత్రు గ్రహములో చూపించాము. దాని ప్రకారమే ప్రక్కనగల అదే వర్గ ఆరు లగ్నములకు చిత్రించకనే వివరించి తెలిపాము. దానివలన మొత్తము పండ్రెండు లగ్నములకు శాశ్వితముగా మిత్ర, శత్రువులుగానున్న గ్రహములను తెలియజేయడమైనది.


---

ఒక గ్రహమునకు బద్ధశత్రువుగా

మరొక గ్రహమున్నదా?

కాలచక్రములోని గ్రహములు మొత్తము పండ్రెండుగలవని తెలుసు కొన్నాము. అందులో ఆరు ఒక గుంపుకాగా, ఆరు మరొక గుంపుగా ఉన్నవని తెలుసుకొన్నాము. ఇక్కడ మరొక సూత్రము ఏర్పడుచున్నది. ఆరు గ్రహములు మిత్రులైతే తర్వాత ఏడవ గ్రహమునుండే శత్రు గ్రహములు కలవు. అందువలన ఒక గ్రహమునుండి ఏడవ గ్రహము ఏదైతే, అది బద్ద శత్రువు అని తెలియుచున్నది. ఇంకా వివరముగా చెప్పుకుంటే, ఒకటవ స్థానాధిపతికి ఏడవ స్థానాధిపతి తీక్షణమైన శత్రువని తెలియుచున్నది. దీనినే జ్యోతిష్యశాస్త్రములో ఒక సూత్రముగా తీసుకొని, ఒకటికి బద్ద శత్రువు ఏడు అని తేల్చుకొన్నాము. ఒకటికి × ఏడుకి అను సూత్రము ప్రకారము ఏ గ్రహమునకు ఏ గ్రహము బద్ద శత్రువో తెలుసుకొందాము.


----

ఇక్కడ మేషలగ్నాధిపతియైన కుజ గ్రహమునకు, ఏడవస్థానమైన తులా లగ్నాధిపతి శుక్రగ్రహము పూర్తి బద్దశత్రువుగా వ్యవహరిస్తున్నది. అలాగే శుక్రగ్రహమునకు ఏడవస్థానములో కుజగ్రహమే అధిపతిగా ఉండుటవలన, సూత్రము ప్రకారము శుక్రునకు కుజుడు కూడా బద్దశత్రువే నని తెలియుచున్నది. పైనుంచి క్రిందికి చూచినా, క్రిందినుండి పైకి చూచినా ఎటుచూచినా, సూత్రబద్దముగా కుజునకు బద్ధశత్రువు శుక్రుడు, శుక్రునకు బద్దశత్రువు కుజుడుగా తెలియుచున్నది. ఒక వర్గములోని ఆరు గ్రహములు మరొక వర్గములోని ఆరు గ్రహములకు శత్రువులైనప్పటికీ, అందులో ఒక పేరుగల గ్రహమునకు, మరొక పేరుగల గ్రహము ప్రత్యేకించి పెద్ద శత్రువుగా ఉన్నదని తెలియుచున్నది. అందులో విచిత్రమేమంటే 1×7 అను సూత్రము ప్రకారము ఒకవైపునుండి ఒక గ్రహమునకు మరొక గ్రహము బద్దశత్రువైతే, మరొకవైపునుండి శత్రువైన ఏడవగ్రహమునకు మొదటి గ్రహమే తిరిగి బద్దశత్రువగుచున్నది. పండ్రెండు గ్రహములలో శత్రు మిత్రులను విడదీయుటకు 2:1 సూత్రము ఉపయోగపడితే, ఎవరు ఎవరికి బద్దశత్రువు అని తెలియుటకు 1×7 అను సూత్రమును ఉపయోగించి చూడాలి.


ఇపుడు వృషభ లగ్నమునకు అధిపతియైన మిత్ర గ్రహమునకు 1×7 అను సూత్రము ప్రకారము బద్ద శత్రువుగానున్న గ్రహమేదో తర్వాత పేజీలోగల 23వ పటములో తెలుసుకొందాము.


ఇక్కడ వృషభ లగ్నాధిపతియైన మిత్ర గ్రహమునకు బద్దశత్రువు భూమి అని తెలియుచున్నది. అలాగే భూమికి బద్దశత్రువు మిత్రగ్రహమనియే తెలియుచున్నది. 1×7 అను సూత్రము ప్రకారము ఒకమారు బద్ద శత్రువులుగా మారిన గ్రహములు వారు ధర్మబద్దముగా ఎల్లపుడు ఒకరికొకరు


----

23వ పటము.

చతురస్రాకారములోనున్న కాలచక్రము.

వ్యతిరేఖముగానే ప్రవర్తించుచుందురు. ఎటువంటి సందర్భములోను అధర్మముగా నడుచుకోరు.

ఇపుడు మిథునలగ్న అధిపతియైన చిత్రగ్రహమునకు 1x7 అను సూత్రము ప్రకారము బద్ద శత్రువుగానున్న గ్రహమేదో తర్వాత పేజీలోగల 24వ పటములో తెలుసుకొందాము.


ఇక్కడ మిథునలగ్నాధిపతియైన చిత్రగ్రహమునకు, బద్ద శత్రువు కేతు గ్రహము అని తెలియుచున్నది. అలాగే కేతు గ్రహమునకు బద్దశత్రువుగా చిత్రగ్రహమే అగుచున్నది. కాలచక్రములోని పండ్రెండు భాగములలో ఒక గ్రహమునకు 7వ స్థానములోని మరొక గ్రహము బద్ద శత్రువైతే, బద్దశత్రువైన ఏడవ గ్రహమునకు మొదటి గ్రహము తిరిగి బద్ద శత్రువగుచున్నది.


---

చతురస్రాకారములోనున్న కాలచక్రము 24వ పటము.

ఇపుడు కర్కాటక లగ్న అధిపతియైన చంద్రగ్రహమునకు 1x7 అను సూత్రము ప్రకారము బద్దశత్రువుగానున్న గ్రహమేదో తర్వాత పేజీలోగల 25వ పటములో తెలుసుకొందాము.


ఇక్కడ కర్కాటక లగ్నాధిపతియైన చంద్రునికి, అక్కడినుండి సప్తమ స్థానాధిపతియైన రాహువు బద్ద శత్రువుగా ఉన్నాడు. అలాగే రాహువుకు అక్కడినుండి సప్తమస్థానాధిపతియైన చంద్రుడు 1×7 అను సూత్రము ప్రకారము బద్ద శత్రువుగా ఉన్నాడు. ఈ విధముగా చంద్రునికి రాహువు, రాహువుకు చంద్రుడు తీవ్ర శత్రువులుగా ఉన్నారు.


----

చతురస్రాకారములోనున్న కాలచక్రము.

ఇపుడు సింహ లగ్న అధిపతియైన సూర్యునకు బద్దశత్రువుగానున్న గ్రహమును తర్వాత పేజీలో గల 26వ పటములో చూచి తెలుసుకొందాము.


ఇక్కడ సింహలగ్న అధిపతియైన సూర్యునికి, అక్కడినుండి సప్తమ స్థానములోనున్న శని బద్దశత్రువుగా ఉన్నాడు. అలాగే 1x7 అను సూత్రము ప్రకారము, శనికి కూడా సూర్యుడు బద్దశత్రువుగానే ఉన్నాడు. స్వంత స్థానములను బట్టి, వారి శత్రుత్వములను నిర్ణయించడము జరిగినది. స్వంత స్థానములను బట్టి, ఒకమారు శత్రువులుగా మారిన గ్రహములు, ఆ స్థానములను వదలి ఎక్కడ ఉండినా వారి శత్రుత్వమును మాత్రము వదలరు. పండ్రెండు స్థానములలో ఆరు స్థానాధిపతులకు శత్రువులను తెలుసుకుంటే, మిగత ఆరు స్థానములకు, చెప్పకనే శత్రువులు ఎవరైనది తెలిసిపోవుచున్నది.


---

చతురస్రాకారములోనున్న కాలచక్రము - 26వ పటము.

ఇపుడు చివరిగా కన్యాలగ్న అధిపతి బుధగ్రహమునకు 1x7 సూత్రము ప్రకారము బద్దశత్రువు ఎవరో తర్వాత పేజీలోగల 27వ పటములో చూచి తెలుసుకొందాము


ఇక్కడ కన్యాలగ్న అధిపతియైన బుధ గ్రహమునకు 1×7 అను సూత్రము ప్రకారము, అక్కడినుండి సప్తమస్థానాధిపతియైన గురు గ్రహము తీవ్ర శత్రుత్వము కల్గియున్నది. అలాగే గురు గ్రహమునకు కూడా సరిగా


---

చతురస్రాకారములోనున్న కాలచక్రము 27వ పటము.

బుధగ్రహమే బద్ద శత్రుత్వము వహిస్తున్నది. ఎవరికి ఎవరు బద్ద శత్రువులు

అన్నది క్రింద వరుసలో చూడండి.

1. గురువుకు

బద్దశత్రువు

బుధుడు

2.

కుజునకు

బద్దశత్రువు

శుక్రుడు

3.

మిత్రకు

భూమి

4.

చిత్రకు

కేతువు

5.

చంద్రునకు

బద్దశత్రువు

రాహువు

6.

సూర్యునకు

బద్దశత్రువు

శని

7.

బుధునకు

గురువు

8.

శుక్రునకు

బద్దశత్రువు

కుజుడు

---------

9.

భూమికి

బద్దశత్రువు

10.

కేతువుకు

బద్దశత్రువు

చిత్ర

11.

రాహువుకు

బద్దశత్రువు

చంద్రుడు

12. శనికి

బద్దశత్రువు సూర్యుడు.


గురువర్గమునకు శనివర్గము, శనివర్గమునకు గురువర్గము శత్రువు లైనప్పటికీ ఒక గ్రహమునకు అయిదు గ్రహములు సాధారణ శత్రువులుకాగా ఒక గ్రహము మాత్రము బద్ధశత్రుత్వము కలిగియున్నది.


(21) గుణచక్రములోని గుణముల వివరమేమి?


ఇంతవరకు బ్రహ్మ,కాల, కర్మ, గుణచక్రముల సముదాయములో కాలచక్రమును గురించీ, కర్మచక్రమును గురించీ కూలంకషముగా తెలుసు కొన్నాము. ఇక క్రింది చక్రమైన మరియు కర్మలకు కార్యములకు కారణమైన, 36 గుణములతో కూడి 'మాయచక్రమని' పేరుగాంచిన, గుణచక్రమును గురించి కొంత తెలుసుకొందాము. ఇవన్నియూ కల్పన అని అనుకోవద్దండి. బ్రహ్మవిద్యా శాస్త్రమైన భగవద్గీతను అనుసరించి తెలుపునవని చెప్పు చున్నాము. గీతలో అక్షరపరబ్రహ్మయోగమందు నాల్గుచక్రముల మూలము కనిపించగా, గుణత్రయ విభాగయోగమను అధ్యాయమందు గుణముల గురించిన సమాచారము సవివరముగా కలదు. గుణచక్రము మూడు భాగములుగా ఎట్లున్నది, అందులో జీవుడు ఏ భాగములో ఉన్నపుడు పేరు కల్గియున్నదీ. ఒక్కొక్క భాగములో గుణములు ఎట్లు చీలియున్నదీ చిత్రపటముల రూపములో చూచెదము.


----

images

---

images

---

ఈ విధముగా గుణచక్రము, మూడు భాగములుగా ఉంటూ అందులో పక్ష, ప్రతిపక్ష గుణములు 12 రకములుగా ఉన్నవి. వాటిలో ఒక్కో గుణము 9 రకముల పరిమాణముగా చీలి ఉన్నవి. ఈ 108 గుణములనే భగవద్గీతలో “మాయ” అని చెప్పారు. గుణముల మాయనుండి ఉత్పన్నమైన కర్మ అనునది కర్మచక్రమును చేరి, పైనున్న కాలచక్రములోని పండ్రెండు గ్రహముల చేత, తిరిగి మానవుని మీద కష్టసుఖముల రూపముతో ప్రసరింపబడుచున్నది. దానిని ముందుగా తెలుసుకోవడమునే జ్యోతిష్యము అంటున్నాము. ఇది జ్యోతిష్యశాస్త్రము కావున గుణములను, కర్మలను, గ్రహములను చెప్పుకోవలసివచ్చినది.


(22) గుణములను ప్రేరేపించునది కర్మనా? లేక కాలమా?)


గుణచక్రములోని గుణములను ప్రేరేపించునది కర్మయేనని చెప్పవచ్చును. కర్మను కదలించునది కాలమని చెప్పవచ్చును. నాలుగు చక్రముల అమరికలో బ్రహ్మచక్రము అన్నిటికీ గొప్పది, అన్నిటికీ అతీతమైనది. దానిని పేరుకు మాత్రము గుర్తుగా పెట్టుకొన్నాము. అందువలన ఏ మనిషికైనా క్రింది మూడు చక్రములే ముఖ్యములని చెప్పవచ్చును. ఆ మూడు చక్రములలో మధ్యలో గలది కర్మచక్రము. కర్మచక్రము పైన కాలచక్రమూ, క్రింద గుణచక్రమూ గలదు. మధ్యలోగల కర్మను అనుసరించియే క్రింద గుణచక్రమూ, పైన కాలచక్రము యొక్క నిర్మాణమున్నది. కావున ఈ మూడు చక్రములను కలిపి కాల, కర్మ, గుణ చక్రములని చెప్పినప్పటికీ, ఆధ్యాత్మిక విద్యలో మూడు చక్రములను కలిపి కర్మచట్రము అనియూ, కర్మ లిఖితము అనియూ, కర్మపత్రము అనియూ,


---


కర్మ ఫలకము అనియూ చెప్పుచుందురు. మనిషికి (జీవునికి) అనుభవము నకు వచ్చేది కర్మయే. జీవుడు గుణముల మధ్యలోయున్నా, గుణములను ఉపయోగించుకొని కర్మను అనుభవించుచున్నాడు. పైన కాలచక్రములో ద్వాదశగ్రహములున్నా జీవునికి కర్మను అనుభవింపజేయుటకేయున్నవి. అందువలన ప్రతి మనిషికీ, ప్రతి జీవరాశికీ కర్మచక్రమే ముఖ్యమని తెలియు చున్నది. కాల, కర్మ, గుణచక్రములలో కర్మచక్రమునకు ప్రాధాన్యత ఇస్తూ కర్మపత్రమనీ, కర్మలిఖితమనీ, కర్మఫలకమనీ చెప్పడము జరిగినది.


కాల, కర్మ, గుణచక్రముల నిర్మాణము మనిషి తలలోయున్నా దాని నాడి వీపులో క్రిందివరకు వ్యాపించియున్నది. అందువలన మూల గ్రంథములలో దేవుడు కర్మను వీపున వ్రేలాడదీసి పంపాడనీ, మెడలో కట్టి పంపాడనీ, ముఖాన వ్రాసిపంపాడనీ చెప్పడము జరిగినది. అందువలన బ్రహ్మ, కాల, కర్మ, గుణ అనబడు నాల్గుచక్రములను కలిపి కర్మ విధానమని, కర్మపత్రమని చెప్పడమైనది. ప్రతి మనిషియొక్క కర్మలిఖితములో (కర్మవ్రాతలో) తేడాలున్నాయి. ఏ విధముగా మనిషి యొక్క హస్తములోని వేలిగుర్తులు ప్రతి ఒక్కరికీ వేరువేరుగా ఉండునో, అలాగే ప్రతి మనిషియొక్క కర్మ లిఖితము వేరువేరుగా కొంతయినా తేడా కల్గియుండును. ప్రతి మనిషిలోనూ గుణ చక్రములోని గుణములుగానీ, కాలచక్రములోని గ్రహములుగానీ ఏమీ తేడా లేకుండాయున్నవి. గుణచక్రములోని మూడు భాగములలోగానీ, పన్నెండు గుణముల చీలికలైన 108 గుణముల భాగములలో గానీ తేడా లేకుండా అందరిలో సమానముగా ఉన్నవి. అలాగే కాలచక్రము లోని పన్నెండు గ్రహములలోగానీ ఏమాత్రము తేడా లేకుండా అందరిలో ఒకే విధముగా ఉన్నవి. నాల్గుచక్రముల సముదాయములో ఒక్క కర్మచక్రము తప్ప అన్నీ ఒకే విధముగా అందరిలో ఉండగా, కర్మచక్రము


---

లోని కర్మ మాత్రము మనిషి మనిషికీ తేడా కల్గియున్నది. ప్రతి మనిషిలోని కర్మభేదము వాని అనుభవములో కనిపించుచున్నది. దేవునికి సంబంధించిన బ్రహ్మచక్రమును ప్రక్కనయుంచి మనిషికి సంబంధించిన గుణ,కర్మ,కాల చక్రములను చూచితే మూడు చక్రములలో మధ్యన ఉండునది కర్మచక్రము. మధ్యనగల కర్మచక్రమే మూడు చక్రములలో ముఖ్యమైనదని చెప్పుకొన్నాము. కాలము గుణము అందరికీ సమానమే అయినా, కర్మ మాత్రము ఏ ఒక్కరిలో సమానముగా లేదు. ప్రతి మనిషిలోను వేరు వేరుగాయున్న కర్మ మనిషి యొక్క గుణములను ప్రేరేపించుచున్నది.


34వ పటము. కర్మపత్రము


---

పైన కాలచక్రములోగల గ్రహముల కిరణములు కర్మచక్రములోని కర్మమీద పడగా, కర్మయొక్క నీడ క్రింద గుణముల మీద పడుచున్నది. పడిన కర్మనీడనుబట్టి అప్పటికి ఏ గుణము అవసరమో ఆ గుణము ప్రేరేపింపబడుచున్నది. ఆ సమయమునకు ప్రేరేపింపబడిన గుణము చేత కార్యము చేయబడును. కర్మ కారణముచేత గుణము వలన జరుగు పని కొంత కాలము జరుగుచున్నది. ఎంత కాలము జరిగినదనుటకు కర్మను బట్టి కాలముండును. కర్మ కొద్దిగాయుంటే తక్కువ కాలములో అనుభవ ముండును. కర్మ చాలాయుంటే ఎక్కువకాలము అనుభవముండును. ఈ విధముగా కర్మనుబట్టి ఇటు గుణములూ, అటు కాలముండును. కావున కర్మనుబట్టి కాలమూ, కర్మనుబట్టి గుణములుండునని చెప్పవచ్చును.


(23) గుణచక్రములోని భాగములలో ఏది మంచిది?

గుణచక్రములో మూడు గుణములుగల భాగములు, ఒకటి గుణము లేని భాగము మొత్తము నాలుగు భాగములుండును. గుణములు ఏ భాగములోయున్నా వాటిని “మాయ” అనవచ్చును. మూడు గుణ భాగము లకు మధ్యలోనున్న గుణములేని భాగమును ఆత్మ భాగమనియూ, మాయా తీత భాగమనియూ, గుణరహిత భాగమనియూ, యోగ స్థానమనియూ అనవచ్చును. గుణచక్రము బయటి వరుసలో మొదటి భాగము తామస గుణభాగము, రెండవది రాజస గుణ భాగము, మూడవది సాత్విక గుణ భాగము అను పేర్లతో చెప్పుచున్నాము. మూడు భాగములలోని గుణములు వేరువేరు ఆలోచనలను రేకెత్తించి, ఆలోచనకు తగినట్లు ప్రవర్తింప జేయును. గుణ ఆచరణలో పాపపుణ్య కర్మలు తయారగుచున్నవి. జ్ఞాని అయినవాడు గుణాచరణ వలన వచ్చిన కర్మనుండి తప్పించుకోగలడు. జ్ఞానము లేనివాడు


----

కర్మ నుండి తప్పించుకోలేక దానిని తగిలించుకుంటున్నాడు. గుణరహిత భాగమైన నాల్గవభాగములో గుణములు లేవు. కావున దానిని బ్రహ్మయోగ మని చెప్పవచ్చును. బ్రహ్మయోగమున జీవుడున్నప్పుడు కర్మ ఆచరణ లేదు. అలాగే గుణ ఆలోచన లేదు. మొత్తానికి కర్మేలేదు. కావున కర్మలేని భాగమైన నాల్గవ భాగమే గుణచక్రములో మంచిదని చెప్పవచ్చును.

24) కర్మచక్రములో ఏ కర్మ ఎక్కడ చేరుతుంది?


నాలుగు చక్రముల సముదాయము ప్రతి మానవుని శిరస్సులో కలదు. నాలుగు చక్రములకు ఆధారమైన ఆత్మ తలనుండి వీపు క్రింది భాగము వరకు వ్యాపించియున్న బ్రహ్మనాడిలో (పెద్ద నరములో) కలదు. పై చక్రము దేవునికి సంబంధించినది, కావున ప్రతిమారు దానిని చెప్ప నవసరము లేదు. అందువలన పై చక్రమును వదలి మనిషికి సంబంధించిన మూడు చక్రములనే చెప్పుకొందాము. కాల, కర్మ, గుణ చక్రములు మూడుయున్నా వాటిలో ఎక్కువ ప్రాధాన్యత గలది కర్మచక్రమని చెప్పుకొన్నాము. అటు కాలచక్రము ఇటు గుణచక్రముల మధ్యన కర్మచక్రము యుండి ప్రాధాన్యత కల్గియున్న దానివలన, ఇతర మతగ్రంథము లని పేరుగాంచిన మూల గ్రంథములలో కూడా కర్మచక్ర ప్రస్థావన వచ్చినది. ఇక్కడ కర్మచక్రమని దేనినంటున్నామో దానినే కర్మపత్రమని మూల గ్రంథములలో చెప్పారు. మంచి చెడులున్న కర్మపత్రాన్ని మనిషి మెడలో వ్రేలాడదీశామని 17వ సురా, 13వ ఆయత్లో ఖుర్ఆన్ గ్రంథములో చెప్పబడినది. అక్కడ పాప పుణ్యములను చెడు మంచిలని చెప్పారు. అంతేగాక తలలో నాల్గుచక్రములు క్రిందికి బ్రహ్మనాడిగా వ్రేలాడబడి


---

యుండడమును కర్మపత్రాన్ని మెడలో వ్రేలాడదీశామని చెప్పారు. ఈ విధముగా కర్మచక్రము ఆధ్యాత్మిక రంగములో అన్ని మత గ్రంథములందు ప్రస్తావనకు వచ్చినది.


ప్రతి మనిషికీ కాల, కర్మ, గుణచక్రములు మూడు ముఖ్యమైనవని చెప్పుకొన్నాము. ఆ మూడు చక్రములలో కర్మచక్రము చాలా ముఖ్యమైనదని చెప్పాము. కర్మనుబట్టియే కాలమూ, కర్మనుబట్టియే గుణములని కూడా చెప్పుకొన్నాము. ఇప్పుడు మరికొంత ప్రత్యేకముగా చెప్పునదేమనగా! సృష్ట్యాది నుండియున్న కాలచక్రములోని గ్రహములుగానీ, గుణచక్రములోని గుణములు గానీ, మారకుండా ఎన్నియున్నవో, ఎలాయున్నవో, అన్నియూ అలాగేయున్నవి. కాలచక్రములోని పన్నెండు (12) గ్రహములు మారలేదు. గుణచక్రములోని గుణములు మారలేదు. నిమ్మకాయలోని పులుపు, మిరపకాయలోని కారము కొంత మారవచ్చునేమోగానీ, కాలచక్రము లోని గ్రహములుగానీ, గుణచక్రములోని గుణములుగానీ ఏమాత్రము కొంతయినా మార్పుచెందకుండా అలాగేయున్నవి. కాలచక్రములోని గ్రహములు, గుణచక్రములోని గుణములు మారకున్నా, కర్మచక్రములోని కర్మ మాత్రము నిత్యము జమ, ఖర్చు అగుచూ ఎల్లప్పుడూ మారుచునే ఉన్నది. ఎవరి కర్మచక్రములోని కర్మ స్థిరస్థాయిగా ఉండదు. అందువలన ఎప్పటికీ ఒకేలాగున ఆగామి పాపపుణ్యములుగానీ, ప్రారబ్ధ పాపపుణ్యములు గానీ ఉండక మారుచుండును. నిత్యమూ మారుచున్న కర్మచక్రము మూడు చక్రములలో ముఖ్యమైనదై ఉన్నది. ఎవడు ఎటువంటివాడో చూడవలసివచ్చి నప్పుడు వాని గుణములను ప్రేరేపించు కర్మనే చూడవలసివచ్చుచున్నది. కర్మ ప్రేరణవలననే గుణములు ఉండుట వలన గుణములకు కారణమైన కర్మనే చూడవలసివచ్చినది. అందువలన మనిషికి సంబంధించిన జీవన విధానమేదైనా ఎట్లున్నదనుటకు కర్మయే అద్దముగా, ప్రతిరూపముగా


---

ఉన్నది. ఏ జ్యోతిష్యుడైనా మనిషిలోని కర్మనే లెక్కించి చూచి వాని భవిష్యత్తు కొంతవరకు తెలియవచ్చును. జ్యోతిష్యము అంతయు జ్యోతితో ముడిపడి యున్నది. కావున జ్ఞానము (జ్యోతి) తెలియనివాడు సరియైన జ్యోతిష్యుడు కాడు. జ్ఞానమును తెలియుట వలననే కర్మలూ, వాటి బాధలూ తెలియును. దానినిబట్టి జ్యోతిష్యమును తెలియవచ్చును.


(25) అంగీ, అర్ధాంగి.


జ్ఞానమునుబట్టి ఏ కర్మ ఎక్కడ చేరుచున్నదో తెలియకున్నా, అది అంతయూ జ్యోతిష్యశాస్త్రమునుబట్టి తెలియును. బ్రహ్మవిద్యా శాస్త్రమును బట్టి ఏ కర్మ ఎంత తీవ్రమైనదో, దానివలన బాధ ఎంత తీక్షణముగా ఉండునో, దానిని అనుభవించకుండా తప్పించుకొనుటకు దారి ఏదో తెలియును. బ్రహ్మవిద్యా శాస్త్రముతో అనుసంధానమైనది జ్యోతిష్య శాస్త్రము. అందువలన బ్రహ్మవిద్యా శాస్త్ర సంబంధముతోనే మనిషి కర్మచక్రములో (కర్మపత్రములో) ఏ కర్మ ఎక్కడ లిఖితమైనదో తెలుసుకొందాము. మనిషి జననముతో అతని జీవితము ప్రారంభమగుచున్నది. తర్వాత ఎంతో కొంత కాలమునకు మనిషికి సంభవించు మరణముతోనే అతని జీవితము అంత్య మగుచున్నది. జీవితములో ఇటు మొదలు అటు అంత్యమునకు పుట్టుక చావులు రెండూ అందరికీ తెలిసిన సంఘటనలే. వాటి వివరము కర్మ రూపములో ఉండకపోయినా ఎక్కడినుండి కార్యములు మొదలగునో, ఎక్కడ అంత్యమగునో దానికి సంబంధించిన కర్మలు కర్మచక్రములో లిఖితమైనవి. కర్మచక్రములో పన్నెండు స్థానములుండగా, అందులో జీవిత ప్రారంభకర్మ మొదటిదైన ఒకటవ స్థానములోనూ, అలాగే జీవిత అంత్యములోని కర్మ చివరిదైన పన్నెండవ స్థానములోనూ వ్రాయబడియుండును.


---

35. చిత్రపటము.


మనిషి జీవితములో పెళ్ళికాని ముందు జీవితము ఒక విధముగా జరుగగా పెళ్ళి అయిన తర్వాత జీవితము మరొక విధముగా జరుగును. పెళ్ళి కార్యముతో వచ్చునది భార్య. భార్యను జీవిత భాగస్వామియనియూ, అర్థాంగి అనియూ అనడము జరుగుచున్నది. అర్థాంగి అను పదమును విడదీసి చూచితే అర్థ+అంగీ=అర్థాంగీ అని తెలియుచున్నది. అంగ అనగా శరీరము అనియూ, అంగీ అనగా శరీరమును ధరించినదనియూ అర్ధము. ‘అంగ’ అను పదమునుండి 'అంగీ' అను పదము పుట్టినది. అర్ధాంగి అను పేరు భార్యకుండుట వలన కర్మచక్రములోని 12 భాగములలో అర్థ భాగమును వదలి, మిగత అర్థభాగము ప్రారంభమగు ఏడవ స్థానములో భార్య యొక్క కర్మ వ్రాయబడియున్నదని తెలియవలెను. భార్య భర్తలో సగము శరీరముకలదని అర్ధనారీశ్వర చిత్రము తెలియజేయుచున్నది. అందువలన కర్మ పత్రములోని పన్నెండు భాగములలో సగము తర్వాత వచ్చు ఏడవ స్థానములో భార్యకు సంబంధించిన కర్మను లిఖించడమైనది.


----

36వ చిత్రపటమును చూడుము.


అలాగే పైనగల 36వ చిత్రములో 12 భాగములను రెండు భాగములుగా విభజించి, అందులో మొదటి భాగమున ఒకటవ స్థానము తన శరీరమునకు సంబంధించినదనియూ, రెండవ భాగమున ఏడవ స్థానము తన భార్యకు సంబంధించినదనియూ గుర్తించాము. మొదటి భాగమున ఆరు స్థానములు దాటిన తర్వాత రెండవ అర్థ భాగము ఏడవ స్థానమునుండి ప్రారంభమగుట వలన, భార్యను అర్థాంగి అని చెప్పుచూ, కర్మచక్రములో (కర్మపత్రములో) ఏడవ స్థానములోనే భార్యకు సంబంధించిన కర్మను లిఖించడము జరిగినది. ఇంతవరకు 1, 12 స్థానములు జనన మరియు మరణములనూ, 1, 7 స్థానములలో 1వది తన శరీరమునకు సంబంధించిన కర్మను సూచించగా, 7వది తన భార్యకు సంబంధించిన కర్మను సూచించుచున్నది. ఇప్పటికి 1, 7, 12 స్థానములలో కర్మ ఏమి ఉండునో తెలిసిపోయినది. ఇక మిగతా స్థానములలో ఎటువంటి కర్మలుండునో చూద్దాము.


---

(26) కర్మచక్రములో కేంద్రములు.


కర్మచక్రములోని 12 భాగములను అంగీ, అర్థాంగీ అని రెండు భాగములుగా విభజించుకొన్నాము. అంగీ అను మొదటి భాగములో 1వ స్థానమూ, అర్ధాంగి అను రెండవ భాగములో 7వ స్థానము ప్రారంభమైనవి అగుటయేకాక, 1వ స్థానములో తన శరీరమునకు సంబంధించిన కర్మయూ, 7వ స్థానమున తన భార్యకు సంబంధించిన కర్మయూ నమోదు చేయబడిన దనీ మరియు నమోదు చేయబడుచున్నదనీ చెప్పాము. ఇప్పుడు అంగీ అర్ధాంగి అను రెండు భాగములలో ముఖ్యకేంద్రములుగా గుర్తింపబడిన స్థానములు రెండు గలవు. మొదటి భాగమున ఆరు స్థానములలో ముఖ్యమైనదిగా ఒక స్థానమూ, రెండవ భాగమున ఆరు స్థానములలో ముఖ్యమైనదిగా మరియొక స్థానమును గుర్తించడమైనది. ఈ రెండు ముఖ్య స్థానములు అంగీ, అర్ధాంగీ అను రెండు భాగములలో ఆయా భాగములకు కేంద్రములుగా గలవు. కేంద్రము అనగా ఆధారస్థానమనీ, ముఖ్యముగా గుర్తింపు పొందిన స్థానమనీ చెప్పవచ్చును. కర్మచక్రము యొక్క పన్నెండు స్థానములలోనే మనిషి (జీవుని) జీవితమంతా ఇమిడియున్నది. మనిషి జీవితమునకు సంబంధించి కర్మచక్రములో కేంద్రములుగాయున్న స్థానము లేవియని గమనించిన ఇలా తెలియుచున్నది. కర్మపత్రములో శరీరమూ, పుట్టుక ప్రారంభమునకు సంబంధించి ఒకటవ స్థానముండగా, అక్కడినుండి మొత్తము ఆరు స్థానములను అంగీ భాగము అనియూ, తర్వాత ఆరు స్థానములను అర్ధాంగి భాగమనియూ చెప్పుకొన్నాము కదా! ఇప్పుడు అంగీ భాగములోని ఆరు స్థానములలో ఒకటవ స్థానమును వదలి మిగతా ఐదు స్థానములను తీసుకొని వాటిలో మధ్యలో గల దానిని గమనించితే వరుసలో నాల్గవ స్థానము మధ్యదగును. ఒకటవ స్థానము తర్వాత రెండు, మూడు స్థానములకూ, ఐదు, ఆరు స్థానములకూ మధ్యలో నాల్గవ స్థానము కలదు.


---

మనిషికున్న ఆస్తి, రెండవది మనిషికున్న పేరు ప్రతిష్ఠలు. మనిషికున్న ఆస్తినిబట్టి మనిషికి గౌరవముగానీ, అగౌరవముగానీ ఉండును. అలాగే మనిషికున్న పేరుప్రతిష్టలను బట్టి కూడా గౌరవ అగౌరవములుండును. అందువలన ఇటు ఆస్తి, అటు కీర్తి మనిషి జీవితములో ముఖ్యమైనవనీ, అవియే మనిషి జీవితములో కర్మ కేంద్రములని చెప్పవచ్చును. మనిషికి గల ఆస్తి యొక్క కర్మనుబట్టి, అలాగే కీర్తినిబట్టి మిగతా కర్మలన్నియూ మిగతా ఎనిమిది స్థానములలో చేర్చబడియుండును. అందువలన మిగతా ఎనిమిది స్థానముల కర్మలకు 4, 10 స్థానములే కేంద్రములుగా యున్నవని చెప్పవచ్చును. క్రిందగల 38వ చిత్రపటములో అర్ధాంగి భాగములో 10వ స్థానమును కేంద్రముగా చూడవచ్చును.


38వ పటము. పదవ స్థానము కేంద్రము.


పై రెండు చిత్రపటములలో 4,10 స్థానములు కేంద్రములుగా కనిపించుచున్నవి. ఇదంతయూ మన తలలోని కర్మచక్రములోనున్న



----

విధానమని జ్ఞప్తికుంచుకోవలెను. ఇక్కడ జ్యోతిష్యులైన కొందరికి ఒక ప్రశ్న రావచ్చును. అది ఏమనగా! "మేము చదివిన జ్యోతిష్యశాస్త్రములో కేంద్రములు నాలుగు కలవనీ, అవియే 1,4,7,10 స్థానములనీ విన్నాము. మీరేమో కేంద్రములని పేరుపెట్టి 4,10 స్థానములను మాత్రము చెప్పు చున్నారు. ఒకటవ స్థానమును, ఏడవ స్థానమును మీరు వదలివేశారు. మిగతా గ్రంథములలో కేంద్రములు నాలుగు అని ఎందుకు చెప్పారు? మీరు రెండు మాత్రమే కలవని ఎందుకు చెప్పుచున్నారు?" అని అడుగ వచ్చును. దానికి మా జవాబు ఏమనగా! ఎవరు ఏ విధముగానైనా చెప్పవచ్చును. అయితే చెప్పబడిన విషయము సూత్రబద్ధముగా, శాస్త్రబదముగా ఉండవలయును. మేము చెప్పినదానికి శాస్త్రము ఆధారముగాయున్నది. అలాగే జ్యోతిష్యశాస్త్రములో ఒక సూత్రమును చెప్పుచూ రెండు కేంద్రములను చెప్పాము. నాలుగు కేంద్రములు ఎట్లున్నవో? ఎలా ఉన్నవో? నాకు తెలియవు. నాలుగు కేంద్రములు అశాస్త్రీయమగును.

కొందరు వ్రాసిన జ్యోతిష్య గ్రంథములలో కోణములు మూడు యనీ, కేంద్రములు కూడా మూడుయనీ వ్రాసియుండుట మేము కూడా చూచాము. వారు ఒక సంస్కృత శ్లోకమును ఆధారముగా చెప్పుచూ ఫలానా శ్లోకములో ఇలాగ ఉన్నది. అందువలన కోణములు మూడు, కేంద్రములు మూడుయని చెప్పారు. అయితే వారు చూపిన శ్లోకము శాస్త్రబద్దమైనదా కాదాయని వారు చూడలేదు. ఎవరో చెప్పిన దానిని గ్రుడ్డిగానమ్మి చెప్పడము జరిగినది. అలా నమ్మి చెప్పడమును మూఢనమ్మకము అని అనవచ్చును. ఇక్కడ మన బుద్ధిని ఉపయోగించి చూచినా మూడు స్థానములున్న దానిని కోణము అని అనవచ్చును. ఎప్పటికైనా మూడు స్థానములు కోణముగానే


---

ఏర్పడును. కేంద్రము ఒక భాగములో ఎప్పటికైనా ఒకే స్థానములో ఉండును. మూడుగాయుంటే అది ఎప్పటికైనా ఒకదానికొకటి కోణమే అగునుగానీ, ఎప్పటికీ కేంద్రము కాదు. ఉదాహరణకు కర్మచక్రములో కోణములు ఎలాగున్నవో 39వ చిత్రపటములో చూస్తాము.



39వ చిత్రపటము

మూడు స్థానములు ఎప్పటికైనా కోణాకారమగునని స్పష్టముగా తెలియుచున్నది. నాలుగు స్థానములు చతురస్రాకారమగును, ఒక్క స్థానమును కేంద్రము అనవచ్చును. కర్మచక్రములోని అంగీ, అర్ధాంగి అను రెండు భాగములలో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కేంద్రముగాయుండుట వలన, రెండు భాగములలో 4వ స్థానము ఒక ప్రక్క, 10వ స్థానము ఒక ప్రక్కకేంద్రములుగా ఉన్నవి. ఈ విధముగా కర్మచక్రము పన్నెండు భాగములు రెండు భాగములుగా విభజింపబడియుండగా, రెండు భాగములకు రెండు కేంద్రములువుండును. కొందరు కేంద్రములు మూడు అని, కొందరు నాలుగుయని చెప్పడము శాస్త్రమునకు విరుద్ధమగును.

---------

27) కర్మచక్రములోని కోణములు

కర్మచక్రములో శాస్త్రబద్ధముగా కేంద్రములు రెండుగలవని తెలుసు కొన్నాము. అంగీ, అర్ధాంగి అను భాగములలో మూడు స్థానములను ముఖ్యమైనవని చెప్పుట చేత, ఆ మూడు స్థానములు ఒకదానికొకటి సమ దూరములో ఉండుట వలన, ఆ మూడు స్థానములు త్రికోణాకృతిగా ఉండుట వలన వాటిని కోణస్థానములన్నారు. కర్మచక్రములో కేంద్రములు రెండు భాగములలో రెండు ఉన్నట్లు, మిత్ర స్థానముల కోణములు, శత్రు స్థానకోణములని రెండు కోణములు కలవు. వాటిని పుణ్యస్థాన కోణములనీ, పాపస్థాన కోణములనీ కూడా చెప్పవచ్చును. మిత్రస్థాన కోణములు మూడు ఒకదానికొకటి మూడు స్థానములు దూరముతో సమముగా ఉండగా, అలాగే శత్రుస్థాన కోణములు కూడా మూడు ఒకదానికొకటి మూడు స్థానములు సమదూరముతోనున్నవి. దీనినిబట్టి కర్మచక్రములో (కర్మపత్రములో) రెండు కేంద్రములూ, రెండు త్రికోణములూ కలవని తెలియుచున్నది. మిత్ర, శత్రు రెండు కోణములను క్రింద 40వ చిత్రపటములో చూచెదము.


--------

పైన కనబరచిన పుణ్య, పాప స్థానముల కోణములను గమనించితే 1×7 పూర్తి స్థాయి శత్రువు అను సూత్రమును అనుసరించి పుణ్యకోణము లకు పూర్తి ఏడవ స్థానములే పాప కోణములుగాయున్నవి. ఒకటికి ఏడు (1×7), ఐదుకు పదకొండు (5x11), తొమ్మిదికి మూడు (9×3) పూర్తి వ్యతిరేఖ కోణములుగా ఉన్నవి. వీటినిబట్టి కర్మపత్రములో ఆయా స్థానముల యందు మనిషియొక్క పాపపుణ్యములు చేరుచున్నవి. దీనినిబట్టి ఏ విధముగా చూచినా కోణములు 1,5,9 ఒక రకము అనియూ, 3,7,11 మరొకరకము అనియూ చెప్పవచ్చును. అట్లే కేంద్రము 4వ స్థానము ఒకటికాగా, రెండవది 10 స్థానముగా ఉన్నది. కర్మపత్రములోనున్న పన్నెండు స్థానములయందు మూడు స్థానములలో పుణ్యము లిఖించబడగా, మూడు స్థానములలో పాపము లిఖించబడినది. మిగతా ఆరుస్థానములలో పాపము మరియు పుణ్యము రెండూ లిఖించబడ్డాయి. మూడు స్థానములు పుణ్యము, మూడు స్థానములు పాపము, ఆరు స్థానములు పాపపుణ్యములు మొత్తము పన్నెండు స్థానములలో ప్రారబ్ధకర్మ వ్రాయబడియుండును. వెనుకటి జన్మలలో సంపాదించుకొన్న ఆగామికర్మ ప్రస్తుత జన్మలో ప్రారబ్ధముగా మారి, ఆ ప్రారబ్ధము ప్రస్తుత జన్మలో అనుభవమునకు వచ్చుచున్నది. 69 సంవత్సరముల 5 నెలల 10 దినములు సంపాదించబడిన ఆగామికర్మ ఒకమారు సంచితముగా మారిపోవును. ఆ సంచిత కర్మనుండి ప్రారబ్ధ కర్మ మరణములో ఏర్పడి జరుగబోవు జన్మకు కారణమగుచున్నది.

మరణము పొందిన మరుక్షణమే కర్మపత్రములో రహస్యముగా యున్న సంచితకర్మనుండి ప్రారబ్ధకర్మ తయారై కర్మచక్రములో 1,5,9 స్థానములయందు పుణ్యము చేరిపోగా, పాపము 3,7,11 స్థానములలో చేరిపోవుచున్నది. మిగతా సరిసంఖ్య అయిన ఆరు స్థానములలో పాప

--------

ఆరవ స్థానము కలదు. కావున ఆ స్థానములో బాధారహితమైన మరణము నకు వ్యతిరేఖముగా బాధను కల్గించు శత్రు, ఋణ, రోగ సమస్యల కర్మలు

---

కిరణములు ఏ కర్మను ప్రసరింప చేయునో ఆ కర్మకు సంబంధించిన గుణము జీవున్ని తగులుకొనును. అప్పుడు జీవునికి తగులుకొన్న గుణమును జీవుని ప్రక్కనే జీవున్ని అంటిపెట్టుకొనియున్న బుద్ధి ఆలోచిస్తూ జీవునికి చూపించును. ముందే నిర్ణయము చేయబడినట్లు చిత్తము మనస్సు ప్రవర్తించగా, కర్మ చివరకు కార్యరూపమై శరీరముద్వారా అమలు జరుగును. అలా అమలు జరిగిన కార్యములోని కష్ట, సుఖములనూ, ఆనంద దుఃఖము లనూ జీవుడు బుద్ధి ద్వారానే అనుభవించడము జరుగుచున్నది. విధముగా ఒక మనిషిగానున్న జీవుడు చివరకు సుఖదుఃఖమును అనుభ వించుటకు ఏర్పరచబడిన విధానమే కాల, కర్మ, గుణచక్రముల అమరిక అని తెలియవలెను. జీవుడు జీవితములో అనుభవించు కర్మను ముందే సూచాయగా తెలుసుకోవడమును 'జ్యోతిష్యము' అంటాము.

జ్యోతిష్యము శాస్త్రబద్దముగా ఉన్నప్పుడే దానిని సరిగా తెలుసు కోగలము. ఆ విధానములో ఇప్పుడు కర్మచక్రమందు ఎక్కడ ఏ కర్మ ఉంటుందో తెలుసుకొందాము. ఇంతవరకు తెలిసిన దానిప్రకారము 1వ స్థానములో శరీరమునకు సంబంధించిన కర్మయుండుననీ, అదియే జీవిత ప్రారంభస్థానమనీ తెలుసుకొన్నాము. శరీరము లభించిన జన్మ మొదలు కొని శరీర సంబంధ కర్మలన్నీ అందులో ఇమిడియుండును. దానినుండి 7వ స్థానము భార్యకు సంబంధించిన స్థానమని తెలుసుకొన్నాము. భార్య, భార్యనుండి ఎదురయ్యే సమస్యల కర్మలన్నీ అందులో లిఖించబడును. 1 మరియు 7వ స్థానములకు మధ్యలోగల అంగీ, అర్ధాంగి రెండు భాగములలో ఒకవైపు 4వ స్థానము మరియొక వైపు 10వ స్థానము కేంద్రములుగా యున్నవని తెలుసుకొన్నాము కదా! మొదటి భాగమైన అంగీ భాగములో కేంద్రమైన నాల్గవ స్థానమందు స్థూలమైన స్థిరాస్తులకు సంబంధించిన కర్మలు

---

చేర్చబడియుండును. అట్లే రెండవ భాగమైన అర్థాంగి వైపు కేంద్రమైన పదవ స్థానమందు కంటికి కనిపించని ఆస్తి అయిన కీర్తికి సంబంధించిన కర్మయూ, పేరు ప్రఖ్యాతులు లభించుటకు కారణమైనవి అయిన వృత్తి, ఉద్యోగముల కర్మలు మొదలగునవి లిఖించబడియుండును. దీనిని తర్వాత పేజీలోగల 42వ చిత్రములో చూడవచ్చును.

ఇంతవరకు కర్మచక్రములో గల ఒకటవ స్థానము, నాల్గవ స్థానము, ఏడవ స్థానము, పదవస్థానము, పన్నెండవ స్థానములలో ఏయే కర్మలు చేరుచున్నవో తెలిసినది. మొత్తము 12 స్థానములలో 5 స్థానముల కర్మలు తెలిసిపోయినవి. ఇక మిగిలిన మొత్తము ఏడు స్థానములలో ఏ కర్మలు చేరుచున్నవో కొద్దిగ గమనిద్దాము. కర్మపత్రములో చివరి స్థానమున శరీరము యొక్క అంత్యకర్మ ఉండునని తెలుసుకొన్నాము కదా! శరీరము అంత్యమునకు చేరుటను మరణము అంటున్నాము. మరణము కర్మచక్రము లోని 12వ స్థానమునుండే లభించును. అయితే 12వ స్థానమునకు ఎదురుగా వ్యతిరేఖ స్థానముగానున్న ఆరవ స్థానములో చావుకు వ్యతిరేఖ మైన కర్మ చేరును. చావుకు భిన్నముగాయుండి చావుకంటే ఎక్కువ బాధించు కర్మ ఆరవస్థానములో ఉండును. చావు కాకుండా మనిషి బ్రతికియున్నా చావుకంటే ఎన్నో రెట్లు వ్యతిరేఖముగా బాధించునవి రోగములు, బుణములు. చావులో ఏ బాధాయుండదు. కానీ ఆరవస్థానములోగల కర్మలో రోగ, ఋణముల కర్మలుండి మనిషిని చావుకు వ్యతిరేఖమైన బాధలను అనుభవింప జేయును. జీవిత అంత్యము మరణముతో జరుగును. అయితే మరణము ఏ బాధా లేనిది. బాధలు మొదలగునది జననముతో కాగా, బాధలు అంత్యమగునది మరణముతో, అయితే మరణము బాధారహితమైనది. దానికి వ్యతిరేఖముగా 12వ స్థానమునకు పూర్తి 7వ స్థానములో శత్రుస్థానమై


---

ఆరవ స్థానము కలదు. కావున ఆ స్థానములో బాధారహితమైన మరణము నకు వ్యతిరేఖముగా బాధను కల్గించు శత్రు, ఋణ, రోగ సమస్యల కర్మలు

----

images;

---


images;

---


Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024