Posts

Showing posts from March, 2025

pisala mutchatlu book draft

ఆరోగ్య ప్రాప్తిరస్తు. సగటు ఉద్యోగి అల్ప సంతోషి, చిన్న హైకొస్తే చాలు సంబరపడతాడు. కొద్దిపాటి ప్రశంసకే ఉబ్బితబ్బిబ్బవు తాడు. కుటుంబంతో నెలకో సినిమా, ఏడాదికో తీర్థయాత్ర. చాలీచాలని సంపాదనలోనే అందీ అందని సంతోషాలెన్నో వెతుక్కుంటాడు. కానీ, చిన్న ఆరోగ్య సమస్య అతని జీవితాన్నే మార్చేస్తుంది. పట్టాలు తప్పిన జీవిత రైలును మళ్లీ ట్రాక్ కి తేవడానికి ఏండ్లు పట్టొచ్చు. మనుషులు ఆచరించే ఆర్థిక విధానాలే వారి కుటుంబ స్థితిగతులను నిర్దేశి స్తాయి. సాధారణంగా మధ్యతరగతి ఉద్యోగుల్లో చాలామంది ఉన్నం తలో ఉన్నతంగా బతకాలని ఆశిస్తుంటారు. తమ కలలను నెరవేర్చుకోవడానికి రూపాయి, రూపాయి కూడబెడుతుంటారు. రాత్రికి రాత్రి లాభాలు గడించాలనే దురాశతో అధిక వడ్డీల ఉచ్చులో చిక్కుకునే వాళ్లూ ఎందరో ఉంటారు! అయితే, వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక రూపొందించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి తనకు, తనను నమ్ముకున్న కుటుంబానికి రక్షణ కల్పించిన తర్వాతే.. ఇతర పెట్టు బడుల గురించి ఆలోచించాలి. ఆరోగ్య బీమాతో ధీమా. ప్రతి కుటుంబానికి కావాల్సిన కనీస భద్రత ఆరోగ్య బీమా. ప్రతి ఖర్చునూ మనం నియంత్రిం చవచ్చు. సంపాదనకు తగ్గట్టుగా అద్దె ఎంత కట్టాలో నిర్ణయించు...