pss book:gt2 త్రైత సిద్ధాంత భగవద్గీత : కర్మ యోగము
త్రైత సిద్ధాంత భగవద్గీత : కర్మ యోగము అర్జునుడిట్లనియె :- శ్లోకం 1: జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన!| తత్కిం కర్మణి ఘోరేమాం నియోజయసి కేశవ!|| (కర్మ, బ్రహ్మయోగములు) భావము :పాపపుణ్య కర్మలగు పనులు చేయుటకంటే బ్రహ్మయోగమే శ్రేష్ఠమైనదని నీ అభిప్రాయమైన, భయంకరమగు కర్మలు కలుగు పనులనే చేయమని నన్ను ఎందుకు నియమించుచున్నావు. వివరము : సాంఖ్యయోగమను మొదటి అధ్యాయములో మొదట కర్మయోగమును గూర్చి చెప్పడము,తర్వాత చివరిలో బ్రహ్మయోగమును గురించి చెప్పడము జరిగినది. మొదట కర్మయోగమును విన్న అర్జునుడు తర్వాత విన్న బ్రహ్మయోగమే బాగున్నదని అనుకున్నాడు. శ్రీకృష్ణుడు పలానా యోగము మంచిదని గాని, గొప్పదని గాని, చెప్పకున్నప్పటికి అర్జునుడు తన భావములో పనులు చేయు యోగముకంటే పనులు చేయని యోగమే గొప్పదనుకొనుట వలన, ముఖ్యముగా శ్రీకృష్ణుడు చెప్పినంత వివరముగా కర్మయోగము అర్థము కాకపోవడము వలన, మరియు బ్రహ్మయోగమే బాగున్నదనుకొనుట వలన, ఏ పనులు చేయక ఊరకుండడమే మంచిదైనపుడు పాపము సంభవించు యుద్ధమును చేయుటకు నన్ను ఎందుకు నియమించావు అన్నాడు. అర్జునునికి కర్మయోగ విధానము అర్థము కాలేదనుటకు నిదర్శనముగా క్రింది శ్లోకము చెప్పబడియున్న...