పొడుపు కథల జ్ఞానము కథలు వేరు, పొడుపు కథలను వేరు. కథలు, చెప్పే వారిద్వారా వినవచ్చును. కథలో ప్రశ్నలుండవు పొడుపు కథలు చెప్పేవారికి, వినేవారు తిరిగి జవాబు చెప్పవలసి ఉండును. పొడుపు కథలలో ప్రశ్నలు ఉండును. పాఠశాలలో నున్న తెలివితక్కువ పిల్లల కొరకు, పొడుపు కథలను సృష్టించారు. పొడుపు కథలోని ప్రశ్నకు జవాబును కథవిన్నవారు చెప్పవలసి ఉంటుంది. దానివలన విన్న కథకు, జవాబు ఏమి అని ఆలోచించుట వలన, పిల్లలకు బుద్ధి బలము పెరుగునని, ఆనాటి ఉపాధ్యాయుల ఉద్దేశ్యము. పొడుపు కథలు ద్వంద్వ అర్థములు కలిగివుండును. ఒకటి ప్రపంచ అర్ధము ఇమిడి ఉండగా, మరొకటి పరమాత్మ అర్ధము ఇమిడి ఉండును. పొడుపు కథలోని ప్రశ్నకు ప్రపంచ అర్ధముతో జవాబు చెప్పితే, అది కాదని పరమాత్మ అర్ధమును చూపవచ్చును. ఒకవేళ జవాబు చెప్పువాడు పరమార్థ అర్థమును చెప్పితే, అది కాదని ప్రపంచ అర్ధమునూ చూపవచ్చును. ఈ విధముగా ఎదుటి వ్యక్తిని అధిగమించుచూ, వాని బుద్ధికి పదును పెట్టవచ్చును. ఉదాహరణకు “పండుగాని పండు ఏది” అని ఒక పొడుపు కథను అడిగినప్పుడు, దానికి జవాబు ప్రపంచ సంబంధముగా విభూదిపండు అని చెప్పితే, అది కాదని దైవసంబంధమైన జవాబుగా తలపండు అని చెప్పవచ్చును. ఈ విధముగా ప్రతి పొడుపు...