pss book:సిద్ధి బోధ readreview pending. 5th july 24

 యోగీశ్వరుల వారి రచనల సారాంశము

1) త్రైత సిద్ధాంత గ్రంథములలో అక్షర సముదాయమే, ఆత్మ సమాచారమై ఉన్నది. త్రైత సిద్ధాంత గ్రంథములలో క్షయ అక్షయ సమాచారము,

పరమాత్మ సమాచారము ఉన్నది.

(2) త్రైత సిద్ధాంత సంబంధ గ్రంథములను భౌతికముగా వ్రాసినది యోగీశ్వర్లు. త్రైత సిద్ధాంత అనుబంధ గ్రంథములలో అభౌతికముగా యోగశక్తి ఉన్నది. 

3) త్రైత సిద్ధాంతము ఇందూ (హిందూ) ధర్మములలో విప్లవాత్మకమైనది.

త్రైత సిద్ధాంత గ్రంథములలోని జ్ఞానము సంచలనాత్మకమైనది, చదివి చూడండి.

4) త్రైత సిద్ధాంతము లోకములో అన్నిటికంటే గొప్పది. త్రైత సిద్ధాంత గ్రంథములు అన్ని గ్రంథములను మించినవి, దాని రచయిత యోగులకు ఈశ్వరుడైన యోగీశ్వరుడు.

5) త్రైత సిద్ధాంత గ్రంథములు కనిపిస్తే దుష్టశక్తులు భయముతో వణికిపోతాయి. త్రైత సిద్ధాంత గ్రంథములను దగ్గర ఉంచితే యోగశక్తికి తాళలేక భయపడిపోతాయి.

6) త్రైత సిద్ధాంత జ్ఞానము భగవద్గీత తరువాత చెప్పబడిన అతి గొప్ప జ్ఞానము. త్రైత సిద్ధాంత గ్రంథములలో కృష్ణుడు ముందు చెప్పని జ్ఞానమును కూడా యోగీశ్వర్లు చెప్పారు.

7) త్రైత సిద్ధాంత జ్ఞానము మానవ జీవితమునకు గొప్ప వెలుగు.త్రైత సిద్ధాంత వెలుగులోనికి పోయిన వానికి అది దైవశక్తి అని తెలియును. 

8) త్రైత సిద్ధాంత భగవద్గీతను వ్రాసినది యోగీశ్వర్లు. అందువలన త్రైత సిద్ధాంతము అంటే ఏమిటో, అది ఎంత గొప్పదో తెలియబడినది. 

9) త్రైత సిద్ధాంతమును గురించి తెలియగలిగితే, యోగీశ్వరుల గ్రంథములను చదువగలిగితే, ఏ మతస్థుడైనా ఒప్పుకొని తీరును, దానిని ఆచరించును. 

10) త్రైత సిద్ధాంతము ప్రత్యక్షముగా భగవంతుడు చెప్పినది. అందువలన అన్ని మతముల సారాంశము త్రైత సిద్ధాంత గ్రంథములలో కలదు.

11) త్రైత సిద్ధాంత గ్రంథములు వ్యక్తి వ్రాసినవి కావు, వ్యక్తిలోని శక్తి వ్రాసినవి. అందువలన అన్నీ రహస్యములే చదివి తెలుసుకోండి.

12) త్రైత సిద్ధాంతము భగవద్గీత, బైబిలు, ఖురాన్ గ్రంథములలో కలదు. అయినా హిందువులకుగానీ, క్రైస్తవులకుగానీ, ముస్లీమ్లకుగానీ ఆ విషయము

తెలియదు.

-------------------------------------

సిద్ధి బోధ

---

93. మూడు నిర్మాణాలు ఒక పరిశుభ్రత

తేది: 16.03.2014

సర్వ జీవరాసులయందు ఆత్మగా ఆవహించి యుండి, అన్ని జీవరాసులకు సక్రమమైన జ్ఞానాన్ని అందివ్వమని ఆత్మను, పరమాత్మను కోరుతూ ప్రారంభిస్తున్నాము.


ఈ రోజు మీకు ఒక గ్రంథము అందింది. రెండో గ్రంథము కూడా రెడీగా మీకు బుస్టాల్లో ఉంది. మీరు తీసుకోవచ్చు ఇప్పుడు అది “ధర్మ శాస్త్రము ఏది?” అనేది ఒక గ్రంథం, “ప్రథమ దైవగ్రంథము భగవద్గీత” అనేది ఒకటి వచ్చేసింది. మీకు తీసుకోకపోతే తీసుకోండి. “ధర్మశాస్త్రము ఏది?” అనేది కూడ వచ్చింది. మీరు అందుబాటులో ఉంటుంది తీసుకోవచ్చు. దీనిలో ఉండే సారాంశాన్ని కొంత వివరించి, "ప్రథమ దైవగ్రంథము భగవద్గీత” అనేది ఇంతకుముందు కూడ కొంత చెప్పుకున్నాము. ఒక గ్రంథంలో కూడ మనం వ్రాసుకున్నట్టుంది. "ధర్మశాస్త్రము ఏది?” అనేది మనం చెప్పాలనుకొని దాని గురించి ఈ 64 పేజీల గ్రంథంలో 'ధర్మాలు మొట్టమొదట ప్రపంచంలో సృష్టి ఆదిలోనే తెలియబడినాయి' అని చెప్పాము. సృష్టి ఆదిలోనే దేవుడు వాణి ద్వారా (ఆకాశవాణి అను శబ్దము ద్వారా) తెలియజేశాడు అని ఉంది. ఆ తెలియజేసిన ధర్మాలను శూన్యంలో ఉన్నటువంటి సూర్యునికే చెప్పబడింది. ఆ సూర్యుడు తెలుసుకొని తరువాత ఇట గ్రహాలకు, అటు భూమి మీద ఉండే జీవరాసులకు, ఈ గోళం మీదనే కాకుండా మిగతా గోళాలలో ఉండే జీవరాసులకు, తర్వాత శూన్యంలో ఉన్నటువంటి గ్రహాలకు అందరికీ జ్ఞానాన్ని అందివ్వడం జరిగింది. విధంగా సూర్యుడు అందించినటువంటి జ్ఞానం కృతయుగములో ప్రజలకందరికీ తెలిసిపోయి, మళ్లీ ద్వాపర యుగ చివరికి అది మాయా


-----


ప్రభావం వలన ఎవరికీ తెలియకుండాపోయింది. ఆ తెలియకుండా పోయిన దానిని మళ్లీ తిరిగి చెప్పేదానికి దేవుడు ఒక మనిషిగా వచ్చాడు.


మనిషి కాదు కానీ మనిషివలె మనిషిగా ఉన్నటువంటి వాడు వచ్చి అతను “భగవంతుడు” అనే హోదాలో వచ్చి మనకు జ్ఞానాన్ని తిరిగి తెలియజేసి పోయాడు. ఇప్పుడు మనకు మూడు రకాలుగా జ్ఞానం తెలిసింది. మొట్టమొదట ఆకాశవాణి ద్వారా తెలిసింది. తర్వాత రెండవసారి సూర్యుడు ప్రజలకు, గ్రహాలకు చెప్పాడు. మూడవసారి జ్ఞానము తరించి పోయిన తర్వాత, ఏమాత్రం లేకుండా నాశనమైన తర్వాత, అప్పుడు మళ్ళీ తెలియని స్థితిలో భగవంతుడు చెప్పాడు. భగవంతుడు మనిషివలె ఉంటాడు, కాబట్టి మనిషి మాదిరి ఉండే భగవంతుడు వచ్చి తిరిగి జ్ఞానాన్ని మనకు చెప్పడం జరిగింది. ఈ విధంగా మూడు రకాలుగా జ్ఞానం బోధించబడింది. దేవుడు మనకు మూడు రకాలుగా జ్ఞానం తెలియజేశాడు కానీ ప్రత్యక్షంగా ఎవరితోనూ మాట్లాడలేదు, ఎవరికీ ఆయన కనిపించలేదు. ఎందుకంటే ఆయనకు ఆకారం లేదు, ఎవరితోనూ మాట్లాడడు, ఆయన పని చేయడు. పని చేయడు కాబట్టి ఎవరితోనూ మాట్లాడడు. ఆయనకు రూప, నామ, క్రియలు లేవు అనేవి ముఖ్యమైన ధర్మము, ఆ రూప, నామ, క్రియలు లేకుండా ఉండి తన జ్ఞానాన్ని తాను ప్రత్యక్షంగా ఎవరితో మాట్లాడకుండా, ఒకటి వాణి ద్వారా, రెండు గ్రహము ద్వారా, మూడు మనిషివలెనున్న భగవంతుని ద్వారా, మూడు విధముల తెలియజేశాడు.

మొదట జ్ఞానము సృష్టి ఆదిలోనే వాణి ద్వారా తెలియబడింది. తర్వాత రెండవసారి సూర్యగ్రహం ద్వారా తెలియబడింది. మూడవసారి భగవంతుని రూపములో వచ్చి తెలియజేశాడు. కృష్ణుడు 5000 సంవత్సరాల పూర్వము వచ్చి చెప్పిపోయాడు. కృష్ణుడు సాధారణ మనిషే. మన మాదిరిగానే

------

కాళ్లు, చేతులు గల మనిషివలె వచ్చి, సూర్యుడు మనువుకు చెప్పిన జ్ఞానాన్ని చెప్పాడు. పూర్వము సూర్యుడు చెప్పిన జ్ఞానము మీకు తెలియకుండా పోయింది. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఇప్పుడు మీకు చెప్పుచున్నానని సూర్యుడు చెప్పిన జ్ఞానాన్నే చెప్పడం జరిగింది. మనిషివలె ఉండి చెప్పేది ఒకటి, గ్రహము ద్వారా చెప్పినది ఒకటి. ఆకాశవాణి శబ్దము ద్వారా చెప్పినది ఒకటి. ఈ విధముగా మూడు పద్ధతులలో చెప్పాడు.


భగవద్గీత కృష్ణుడు ఒకడే చెప్పాడంటే లేదు అంతకుముందే చెప్పబడింది. అంతకుముందు సూర్యుడు చెప్పాడు. సూర్యునికి ఆకాశవాణి చెప్పింది. అంటే ఒకటే జ్ఞానమే మనకు సూర్యుని ద్వారా ఒకసారి, భగవంతుని ద్వారా ఒకసారి మనకు చేర్చబడింది. ఇద్దరూ చెప్పిన జ్ఞానమంతా భగవద్గీత గ్రంథం అయింది. అక్కడ అరబ్ దేశంలో ఒక గ్రహం చెప్పింది. దానికంటే ముందు ఒక ‘ఏసు' అను భగవంతుడు చెప్పాడు. భగవంతుడు చెప్పింది కూడా గ్రంథం అయింది, గ్రహం చెప్పింది కూడ గ్రంథం అయింది. ఇద్దరూ చెప్పినవి రెండు గ్రంథాలు అయినాయి. భగవంతుడు చెప్పినప్పుడు బైబిల్ అయింది. గ్రహం చెప్పినప్పుడు ఖురాన్ అయ్యింది. అంటే గ్రహం చెప్పినా, భగవంతుడు చెప్పినా రెండూ ఒకటే కదా. మనకు ఒకటి భగవద్గీత, రెండోవది బైబిల్, మూడవది ఖురాన్. ఇప్పుడు ప్రతి దేశంలో ఎక్కడైనా కానీ ఒక మతస్థుడు తమ గ్రంథాన్నే చెప్పుకుంటాడు, వాని మతాన్ని గురించే చెప్పుకుంటాడు కానీ ఇక్కడ మాత్రం అలా ఉండదు, అన్ని గ్రంథాలను చెప్పుతాము. ఏ గ్రంథంలో అయినా దేవుని జ్ఞానం ఏదైతే ఉందో అదే చెప్పబడుతుంది. ఇక్కడ చెప్పేవి మూడు దైవ గ్రంథాలున్నాయి, భగవద్గీతను ప్రథమ దైవ గ్రంథము అంటున్నాము. ఇదే ఇజ్రయేల్ దేశంలో భగవంతుడు చెప్పిన జ్ఞానమే బైబిల్ అయింది.


----

రెండు అక్కడ, ఒకటి ఇక్కడ. మూడు గ్రంథాలలో ఉండేటటువంటిది ఒకటే జ్ఞానమే, మొట్టమొదట ఆ వాణి ద్వారా వచ్చినటువంటి జ్ఞానమే. ఇంకొకటి ఏమీ లేదు. మనం వేరువేరుగా లెక్కేసుకొని, అది వేరు ఇది వేరు మతం అని పేరు పెట్టుకొని, అర్థాలు వేరు చేసుకొని గందరగోళ పరిస్థితిలో మానవుడు జ్ఞానం మార్గంలో పోకుండా అజ్ఞాన మార్గంలో పోతున్నాడు. కానీ వాస్తవంగా లెక్కేస్తే అంతా ఒకటే జ్ఞానమే, వేరు జ్ఞానం లేదు. ప్రథమ దైవ గ్రంథంలో జరిగిపోయింది. అంతిమ దైవ గ్రంథంలో ఇలా ఉంది అని చెప్పారు, ప్రథమ దైవ గ్రంథంలో ఆకాశవాణి చెప్పింది, దానిని సూర్యుడు చెప్పాడు దాన్నే నేను చెప్తున్నాను అని మూడు విధానాలున్నాయి.


మూడు విధానాలు ఒకటి వాణి చెప్పినేది, రెండు గ్రహం చెప్పినేది, మూడు భగవంతుడు చెప్పినేది మూడున్నాయి కదా. అదే ఖురాన్ గ్రంథంలో 42వ సూరా 51వ ఆయత్లో “దేవుడు ప్రత్యక్షంగా ఎవరితోనూ మాట్లాడడు అయినా అయన మీకు మూడు విధాలుగా జ్ఞానం తెలియజేస్తాడు. ఒకటి వాణి ద్వారా, రెండు తెరచాటు నుంచి, మూడు దూత ద్వారా”. వీళ్లకు వాణి ద్వారా అంటే ఆకాశవాణి అని అర్థమైపోయింది. ఇంక రెండోవది ఏముంది తెరవెనుక నుంచి అని ఉంది. ఇప్పుడు మనం రవ్వంత అర్థం చేసుకుందాం. మీ ఇంట్లో ఒకరికి దయ్యం పట్టిందనుకో, వాడేమి చెప్పాడంటే ఇంతకు ముందు బ్రతికినవాడు చచ్చిపోయి, నేను ఫలానా అని చెప్తాడు. అప్పుడు మాట్లాడేవాడు ఎవరయినది మనకు తెలిసిపోతుంది. మాట్లాడేవాడు మనకు కనపడ లేదు, ఇంకొకరి శరీరంలో దూరుకొని మాట్లాడుతున్నాడు. వాడు తెరవెనుకున్నాడు వాడు ప్రత్యక్షంగా కనపడలేదు, మాట్లాడేది వాడే, గుడ్డ అడ్డం పెట్టుకొని మాట్లాడితే ఏమైతాది గుడ్డ కనిపిస్తావుంటాది. అట్లగానే


----

శరీరం వేరే వాళ్లది మాట ఇంకొకనిది, వాడు మాట్లాడే పద్ధతి వాని విధానం వాడు మాట్లాడతాడు. తెరవెనుక వాడు మాట్లాడతాడు కానీ శరీరం మాత్రం వేరేది.


తెరవెనుక నుంచి మాట్లాడడం జిబ్రయేల్ చేసిన పనే అయినా ఆయన ఇతరుల శరీరము లేకుండానే మాట్లాడి యుండవచ్చునని అనుకుంటాము. అయినా కనిపించక మాట్లాడినాడు కావున జిబ్రయేల్ తెరవెనుక నుండి మాట్లాడినట్లేయని చెప్పుచున్నాము. తర్వాత మూడవ విధానం దూత ద్వారా, దూత అంటే ప్రత్యక్ష సమాచారాన్ని తీసుకొచ్చేవాడు. సమాచారాన్ని మోసుకొచ్చి వచ్చేవాడిని దూత అంటాము. దేవుని జ్ఞానాన్ని మోసుకొచ్చి చెప్పే వానిని దూత అంటాము. దేవుని జ్ఞానాన్ని ప్రత్యక్షంగా ఉండి చెప్పేవాడు భగవంతుడు, దేవుని జ్ఞానాన్ని చెప్పాలంటే వాడు భగవంతుడై ఉండాలి, వాడు మనిషివలె ఉన్నాడు కానీ మనిషి మాత్రం కాదు. ఆ రకంగా మనకు ఈ దేశంలో, ఇజ్రయేల్లో ఇద్దరు వచ్చారు. ఈ దేశంలో కృష్ణుడు, ఆ దేశంలో ఏసు. దూత అంటే సమాచారం తీసుకొచ్చినోడు, సమాచారం తీసుకొచ్చిన వాడు ఏసు, ఇక్కడ కృష్ణుడు. వీళ్లిద్దరినే దూత అనాలి కానీ మామూలుగా గ్రహాన్ని దూత అనకూడదు. వాళ్లు గ్రహం, ఇదంతా మీకు తెలిసిన కథయే.


దూత రెండుసార్లు చెప్పినాడు. గ్రహం కూడ రెండుచోట్ల చెప్పింది అంటే ఇక్కడ ఒక గ్రహం అక్కడ ఒక గ్రహం అంటే వేరువేరు గ్రహాలు, మనిషి కూడ ఇక్కడో మనిషి అక్కడో మనిషి, అంటే ఈయన ఏసు, ఈయన కృష్ణుడు కానీ వీళ్లిద్దరూ వేరు వేరుగా కనిపించారు, వేరు వేరు పేర్లున్నాయి, కానీ చెప్పినవాడు ఒకడే, ఒకే జ్ఞానమే, ఇంకో తేడా లేదు, వేషం మార్చుకొని వచ్చినాడు ఆయన, ముందు ఒక వేషంతో వచ్చాడు. తర్వాత ఇంకో


----

వేషంతో వచ్చాడు. ఒకసారి షావుకారిగా వచ్చినాడు, మరొక సారి బీదవానిగా వచ్చినాడు. ఒకసారి ఎనిమిదిమంది భార్యలను పెట్టుకొని వచ్చినాడు, ఇంకొకసారి పెళ్లే కాకుండా వచ్చినాడు. ఆయన తెలియకూడదు అనే వచ్చాడు. మూడు రకాలుగా ఏమాత్రం తెలియకుండా జ్ఞానం చెప్పబడింది.


సూర్యుడు వచ్చి మనువుతో మాట్లాడినాడు కదా! తర్వాత జిబ్రయేల్ వచ్చి మహ్మద్ ప్రవక్తతో మాట్లాడినాడు. ప్రవక్తగారు మొదట భయపడినాడు. నేను దేవుని జ్ఞానం నీకు చెప్పాలనే చెప్తున్నాను. నువ్వు భయపడాల్సిన పని లేదు అని జిబ్రయేల్ చెప్పగా ప్రవక్తగారు ధైర్యముగా విన్నాడు. 23 సంవత్సరాలు జ్ఞానాన్ని జిబ్రయేల్ చెప్పినాడు. పర్మనెంట్గా ఇక్కడనే లేడు, ఆయన అప్పుడప్పుడు వచ్చి పోయేవాడు ఎవరు? జిబ్రేయల్. 23 సంవత్సరాలు వచ్చి ఒకరోజు చెప్పితే మనకు ఖురాన్ గ్రంథమేనా అంటే కొంత పోగొట్టుకున్నారు, కొంత ఒలకపోసుకున్నారు, కొంత ఎత్తుకున్నారు, దాంట్లో కొంత ఉంది కొంత లేదు. దేవుడు చెప్పిన జ్ఞానమే అందులో ఉంది. కొంత అది ప్రక్కకు చేరినాకానీ చెప్పినది మాత్రం దాంట్లో ఉంది. ఈ రకంగా మనకు దేవుని జ్ఞానము మూడు గ్రంథాల రూపంలో వచ్చింది, మూడు గ్రంథాల రూపంలో వచ్చిన దానిని భగవంతుడు వచ్చి చెప్పినాడు. లేని ధర్మాలను తెలియజేసేదానికి దేవుడే రావాలి, దేవుడే చెప్పాలి అయితే ఎవరికీ తెలియకుండా భగవంతుడు వచ్చి చెప్పినాడు.


మనం వాస్తవంగా లెక్కేసుకుంటే భగవంతునికి తప్ప ఎవరికీ తెలియదు. దేవుడు చెప్పినాడా? అంటే కాదు భగవంతుడు చెప్పాడు. భగవంతుడు చెప్పినాడా అంటే కాదు మనిషి చెప్పినట్టే, మనిషి చెప్పినాడా? అంటే దేవుడు చెప్పినట్టే. అంటే దిక్కు తెలియకుండా ఎవరికీ అర్థం కాకుండా


----

ఉండేదానికి, ఆ రకంగా ఇటు మనిషి కాకుండా, అటు దేవుడు కాకుండా మధ్యలో భగవంతుని రూపంలో వచ్చినాడు, దేవుడు ఆ రకంగా చెప్పి పోయినాడు. వచ్చినేది నేనే అని చెప్పినాడు భగద్గీతలో, ఒకవేళ మనిషికి అర్థంకాకుండా దేవుడు కాదు, మనిషి కాదు దయ్యం క్రిందికి లెక్కేసుకుంటారని, దేవుడు ప్రపంచానికంతా అధిపతిని నేనే, అటువంటి నేను మానవ శరీరం ధరించి వస్తే, నన్ను కనుక్కోకుండా, నా మహత్యాన్ని తెలియకుండా, నా యొక్క గొప్పతనాన్ని అర్థము చేసుకోకుండా ప్రపంచానికంతా దేవున్ని అయినా నన్ను అవమానంగా మాట్లాడతారు అని చెప్పినాడు.



అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ !

పరం భావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్ !!


నేను సర్వజీవరాసులకు మహేశ్వరుడనైనా కానీ నర శరీరం ధరించిన నన్ను చూసి, ఈ మనుషులు నన్ను గుర్తుపట్టక, నా గొప్పతనాన్ని తెలుసుకోలేక, దేవున్ని అని తెలియక, నన్ను కూడా అవమానము చేస్తారు అని చెప్పాడు. ఆయననే నేను ఇట్లా వస్తాను అని చెప్పాడు కదా! కాబట్టి అది ఒక సాక్ష్యం. ఈ రకంగా ఆయన మానవునిగా వచ్చి కూడ చెప్పి పోయినాడు, ఇప్పుడు లెక్కేసుకుంటే అట్ల ఎందుకు చెప్పాలి? అని మనకు ప్రశ్న వచ్చింది.

గ్రహం వచ్చి చెప్పవచ్చు కదా! గ్రహముతోనే చెప్పించొచ్చు కదా. ఆయనే 'మమ భూత మహేశ్వరుడు' అంటే సర్వజీవరాసులకు నేనే దేవున్ని, “మానుషీం తనుమాశ్రితం” మానవ శరీరాన్ని నేను ధరించి వస్తే “పరంభావ మజానన్తో” నా యొక్క పరం అయినట్టి గొప్పది అయినట్టి దైవత్వాన్ని


----

గుర్తించలేక ‘అవజానంతి' అంటే అవమానిస్తారు మనుషులు అని చెప్పినాడు. ఆయన మళ్ళీ అంత అవమానం పడి వచ్చి చెప్పాల్సిన పని ఏం వచ్చింది? అని ప్రశ్న వస్తుంది మనకు అంతేగదా, గ్రహంతో చెప్పించొచ్చు కదా లేకపోతే ఇంకోసారి లేదా 10 మార్లు గ్రహంతో చెప్పించొచ్చు. ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి మళ్ళీ ఇంకోచోట చెప్పించోచ్చు కదా? యని ప్రశ్న రావచ్చు. ఇపుడు ఇంతవరకు చెప్పినది మూడు విధానాలే, దేవుడు మీకు చెప్పాడు. ఇంకో విధానం కూడ ఉంది, మీకు అవసరం లేదు అని చెప్పలేదు. ఇపుడు మనము భగవద్గీత తీసుకొని మాట్లాడుకొందాము. భగవద్గీత జ్ఞానయోగం అనే అధ్యాయములో 7వ శ్లోకము తీసుకొని చూస్తాము. 7వ శ్లోకములో ఒకటుంది, 8వ శ్లోకములో ఇంకో విధానముంది. ఇపుడు 8వ శ్లోకాన్ని ముందు చూస్తాము...


శ్లో ॥8: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతామ్ ! ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే !!

అని చెప్పినాడు ఆయన, అంటే ధర్మసంస్థాపన కొరకు యుగ యుగములోనూ నేను వస్తాను అని చెప్పాడు, దాన్ని తెలుగులో మనం చెప్పుకుంటే “సాధుజనులనెల్ల సంరక్షణము జేయ, దుష్టజనులను ద్రుంచి వైవ, సకల ధర్మంబులను సంస్థాపన మొనర్ప, యుగయుగంబునందు నేనుద్భవింతు” సంస్థాపన అంటే క్రొత్తగా ప్రతిష్టించడం, స్థాపించడం అంటారు. లేని దాన్ని మనం నెలకొల్పితే దాన్ని స్థాపించడం అంటారు. అంటే ధర్మాలు ఎప్పుడైతే లేకుండా పోయాయో అప్పుడు దానిని స్థాపిస్తాను అన్నాడు. దేవుడే స్థాపించాలి. గ్రహం చెప్పవచ్చు కదా అంటే గ్రహం తాను విన్నది చెప్తాది, కానీ కొత్తది చెప్పలేదు, కాబట్టి అవసరాన్ని బట్టి దేవుడే వచ్చి చెప్పవచ్చు. ఇంతకుముందు కూడ చెప్పినాను, పురుషోత్తమ

----

మహరాజు దగ్గరికి ఒక వ్యక్తి దూతగా పోయినాడు. మామూలుగా దూత పోవాలి సమాచారం తీసుకుపోయే పోవాలి, కానీ అలెగ్జాండర్ చక్రవర్తే పోయినాడు. పోయి దూతగా మాట్లాడినాడు. ఆయన అక్కడ అవసరాన్ని బట్టి మాట్లాడవచ్చు. అదే దూతను పంపిస్తే ఏమి చెప్పితే అదే చెప్పును. అవసరాన్ని బట్టి మనకు చెప్పవచ్చు అనే ఉద్దేశ్యముతో దేవుడే భగవంతునిగా వచ్చాడు. దేవుడు భగవంతునిగా వచ్చేదానికి ఇంతకుముందు ఒక శ్లోకం మనం చెప్పుకున్నాము. సర్వజీవరాసులకు దేవుడైనాగానీ నర శరీరము ధరించి వస్తే ఎవరూ తెలియలేరు అని ఆ విధంగా ఆయన వచ్చాడు. ఆయన వచ్చేది జ్ఞానం చెప్పేదానికి, లేని ధర్మాలను స్థాపించే దానికోసం వచ్చాడు. ఇప్పుడు ఖురాన్లో చెప్పిన మూడవ విధానం సరిపోతుంది. దూతగా వచ్చి మనకు చెప్పాడు అనేది కదా, భగవంతుడు వచ్చి చెప్పాడు అనే విధానం మూడవది సరిపోయింది. భగవద్గీత జ్ఞాన యోగం 8వ శ్లోకంలో దూతగా వచ్చే విధానము సరిపోయింది.


శ్లో॥8: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కుతామ్ ! ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే !!


అనే శ్లోకము ధర్మాలను సంస్థాపన చేసే దానికోసం ఏ యుగము లోనైనా నేను వస్తాను అన్నాడు. చెడువాళ్ళను అందరిని లేకుండా చేసి, జ్ఞానులను పెంపొందింప చేసే దానికోసం వస్తానన్నాడు. ఆ రకంగా మంచోళ్ళ సంఖ్య పెంచడానికి చెన్డోళ్ళ సంఖ్య లేకుండా చేసేదానికి నేను భూమి మీదకి వచ్చి ధర్మసంస్థాపన చేస్తాను అని చెప్పాడు. ఇది మూడవ విధానం, మూడు విధానాలు తెలుసు కానీ ఈ మూడు విధానాలు ఎందుకు చెప్పినాడు అనేదానికి జవాబుగా అవసరాన్నిబట్టి చెప్పవచ్చు అనే ఉద్దేశ్యంతో ఆయన స్వయంగా వచ్చినాడని తెలిసింది. భగవంతుడు ఎప్పుడైనా రావచ్చు,

-----

అంతకుముందు కూడా వచ్చి ఉండవచ్చు, కృష్ణునికంటే ముందు తర్వాత రావచ్చు, కృష్ణుడు తర్వాత మళ్ళీ ఏసుప్రభువు వచ్చినాడు కదా! 3000 సంవత్సరాలకు ఆయన వచ్చి పోయాడు. తర్వాత ధర్మసంస్థాపన చేసే దానికోసం ఆయన ఎప్పుడయినా రావచ్చు, వస్తాడు. 7వ శ్లోకంలో ఏమి చెప్పినారంటే...


శ్లో॥ 7: యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత !

అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్


ఇక్కడ ఈ శ్లోకములో ప్రత్యేకమైనట్టి ఒక పదం వాడబడింది. ఇక్కడ సంస్థాపన చేస్తానని చెప్పలేదు, 8వ శ్లోకములో సంస్థాపనే చేస్తాను అని చెప్పినాడు, బాగా గమనించండి. భగద్గీతలో పై శ్లోకానికి కింది శ్లోకానికి ఏమి తేడా ఉంది మీరు గమనిస్తే ఇంకో విధానముంది.


"ఎప్పుడెప్పుడు ధర్మమునకు ముప్పు కలిగి, పృథివియందు అధర్మము వృద్ధిజెందు, అప్పుడప్పుడు నేను భూమినవతరింతు, నన్ను నేను సృజించుకొని” అని చెప్పినాడు. అంటే నన్ను నేను సృజించుకోని పుడతాను అని చెప్పినాడు. ఎప్పుడైతే ధర్మాలకు ముప్పుకలుగుతావుందో అని చెప్పినాడు. ఇక్కడ తెలుగులో వ్రాయడం ముప్పు అని వ్రాసినారు. సరైనపదం వాడలేదు, శ్లోకంలో గ్లాని అనేది ఉంది. “యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత” అని చెప్పాడు. గ్లాని అనే పదం ఉపయోగించబడింది, గ్లాని అంటే ఏమి? మీరు ఉన్నారు, పని చేస్తున్నారు, పని చేయంగా చేయంగా అలసట వస్తుంది. మొట్టమొదట బాగా ఎత్తి పెడుతున్నారు. తర్వాత ఎత్తి పెట్టలేక రవ్వంత సేపు విశ్రాంతి తీసుకుందాం అనుకుంటారు. అంటే శరీరం కండరాల్లో గ్లాని ఏర్పడింది, బలహీనత ఏర్పడింది, బలము తగ్గిపోయింది, ఆ బలము


------

తగ్గిపోయే దానినే బలహీనత అంటాము, దానిని గ్లాని అంటాము. పూర్తి లేకుండా పోలేదు ఉంది, కానీ చేయలేని పరిస్థితి, విశ్రాంతి కావాలి నీకు అక్కడ కాలుష్యం ఏర్పడింది. కండరాల్లో, కాలుష్యం చమట రూపములోనూ, శ్వాస రూపంలోనో పోతే అప్పుడు నీకు మళ్ళీ తిరిగి కొత్త బలం వస్తుంది. అక్కడ నువ్వు మళ్ళీ తిరిగి పని చేయగలవు, బలముంటుంది.

అయినా శరీరంలో గ్లాని ఏర్పడుతుంటుంది ఆ గ్లాని పోయే దానికోసం విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి తీసుకుంటే నువ్వు బలము పుంజుకుంటావు, మళ్ళీ పని చేయగలవు, ఆ విధముగా ధర్మాలకు గ్లాని ఏర్పడుతుంది, అంటే బలహీనత ఏర్పడుతుంది, బలహీనత ఏర్పడినప్పుడు కాలుష్యం ఏర్పడుతుంది. ఎట్లయితే ఈ కాలుష్యాన్ని మనం శ్వాస ద్వారా, చమట ద్వారా విశ్రాంతి తీసుకొంటే పోతుందో ఆ రకంగా ధర్మాల్లో ఏర్పడిన కాలుష్యాన్ని తీసివేసే దానికోసం ఆయన భగవంతునిగా వస్తాడు. కాబట్టి అక్కడ 'గ్లానిర్భవతి భారత ధర్మస్య గ్లాని' అంటే ధర్మాల్లో ఉండేటటువంటి గ్లానిని తీసేస్తాడు. అంటే పూర్తి లేకుండా పోయినట్టి ధర్మాలు సంస్థాపన చేస్తానని ఎక్కడా చెప్పలేదు, 8వ శ్లోకములో చెప్పినాడు ఆ మాట మొదటిది 7వ శ్లోకములో ఏమి చెప్పినాడు ఈ విధానం కూడ ఉంది. ఏ విధానం, బలహీనపడినటువంటి ధర్మాలను ఆ బలహీనం లేకుండా చేస్తాను, ఎట్లా బలహీనమైంది? భగవద్గీతలో ఉంది.


ఉదాహరణకు భగవద్గీతలో కొన్ని కల్పిత శ్లోకాలు వచ్చి కలిసినాయి. ఆ శ్లోకాలు దేవుని మాటలు కాదు, దేవుని ధర్మాలున్నాయి, మనుషుల మాటలు కూడ ఇందులో కలిసాయి. అంటే కాలుష్యం ఏర్పడింది. ఆ కాలుష్యాన్ని తీసివేయాలంటే అది దేవునికే తెలుసు, అవి ఏవి దేవునివి? ఏవి మనుషులవి? అని మనము తెలియలేము. కాబట్టి ఆ మనుషులు


----

చెప్పిన మాటలు ప్రక్కకు తీసివేసి స్వచ్ఛమైన దేవుని జ్ఞానాన్ని నీకు అందియ్యడమే కాలుష్యాన్ని తీసివేసినట్లు. అదే విధముగా మన త్రైతసిద్ధాంత భగవద్గీతలో తీసివేయడం జరిగింది. ఇవి మనుషులు చెప్పిన శ్లోకాలు, దేవుడు చెప్పినవి కానే కాదు, ఒకసారి ధర్మాలు సంస్థాపన చేసేదానికి వస్తాను అన్నాడు. ఎక్కడ ధర్మాలను సంస్థాపన చేస్తున్నాడో, ఎక్కడ కాలుష్యాన్ని తీసివేసే దానికి వస్తున్నాడో ఎవరికీ తెలియదు. ధర్మాలు ఎప్పుడైతే సంపూర్ణంగా లేకుండా పోతాయో అప్పుడు ధర్మసంస్థాపన చేసేదానికి వస్తాను అన్నాడు, అట్ల కాకుండా ధర్మాలకు గ్లాని ఏర్పడి, కాలుష్యం ఏర్పడిందనుకో, ధర్మాలకు ఆ కాలుష్యాన్ని తీసివేసే దానికి కూడా వస్తానన్నాడు, రెండు రకాలుగా వస్తాడు.


కానీ ఏది ఉండాలో ఏది ఉండకూడదో నిర్ణయం చేసేవాడు ఆయనే, అట్ల అజ్ఞానమును ఏదన్నా మనుషులు కలిపితే దానిని తీసివేస్తాడు. కానీ ఇప్పుడు ఎక్కడ కలిసింది ఎక్కడ లేదు అని ఎట్లా తెలుస్తుంది. దానికి మనం ఒక ఉదాహరణ తీసుకుంటే రెండవసారి భగవంతుడు వచ్చాడు. భగవంతుడు వచ్చి జ్ఞానం చెప్పిపోయినాడు. రెండవసారి అంటే ఏసుగా వచ్చి చెప్పిపోయినప్పుడు, ఆయన వచ్చి చెప్పినటువంటిదే జ్ఞానము, ఆయన వచ్చి చెప్పినటువంటిదే ధర్మము. మనుషులు చెప్పినది ధర్మం కాదు అని చెప్పినాము. మనుషులు చెప్పినేది దేవుని జ్ఞానం కాదు. దేవుడు చెప్పినదే దేవుని జ్ఞానం. దేవుడే ఏసుగా వచ్చి జ్ఞానం చెప్పిపోయినాడు, అది బైబిల్ అయింది. ఆ బైబిల్లో ఏసు మాటలే స్వచ్ఛమైన బైబిల్. బైబిలులో 66 భాగాల్లోనూ ఏది ఈయన ఏసు చెప్పినాడు, ఏది చెప్పలేదు అని లెక్కవేస్తే, నాలుగే నాలుగు పాఠాలున్నాయి దాంట్లో, ఆ 66 లో 62 ప్రక్కన పెడితే అప్పుడు తెలుస్తుంది. స్వచ్ఛమైన బైబిల్, నాలుగు సువార్తలు మత్తయి,


-----

మార్కు, లూకా, యోహాన్ అనేటటువంటి నాలుగు సువార్తలనే ప్రభువు చెప్పినది. ఆ నాలుగు సువార్తలలో ఒక సువార్తే ముఖ్యము. ఎందుకంటే నలుగురు వ్రాసినారు ఆయన చెప్పిన దానినే అంతా ఒకటే ఉంది కానీ, మనము లెక్కేసుకుంటే ఒక సువార్త చదివినా ఒకటే, నాలుగు సువార్తలు చదివినా ఒక్కటే. తెలుసుకునే దానికి ఒక సువార్తను లెక్కవేసుకుంటే అంతా 10 కాగితాలకంటే ఎక్కువ ఉండదు నీకు. భగవద్గీత ఉంది ఇది మహా భారతములో ఒక భాగము, 18 పర్వాలలో యుద్ధకాండ అని ఒక పర్వముంది.


యుద్ధరంగములో ఆయన జ్ఞానము ఎక్కడైతే బోధించినాడో దానినే చెప్పుకుంటున్నాము. దానిని భగవద్గీత అంటున్నాము. కానీ అక్కడ ఏమి చెప్పినారు, ఏసుకంటే ముందు 39 పాఠాలు చెప్పినారు. మళ్ళీ తరువాత కూడా 23 పాఠాలు చెప్పారు. ఆ రెండు భాగముల మధ్యలో 4 పాఠములు చెప్పారు. కానీ చదివేదంతా ప్రక్కవే, మనుషులు చెప్పినేటివే చదువుతారు. కానీ ఈ నాలుగు సువార్తలను చెప్పడము చాలా తక్కువ. మనము ఏమి చెప్తాము అంటే, ధర్మశాస్త్రాన్ని దేవుడు తప్ప ఎవడూ చెప్పడు అని చెప్పాము. దేవుని శాస్త్రమే ధర్మశాస్త్రము, దేవుని ధర్మాలు దేవునికే తెలుసు.


దేవుని ధర్మాలు దేవునికి తప్ప ఎవరికీ తెలియదు అనేది ఒక ఆధారము మనకు. దేవుడేమి చెప్పినాడు బైబిల్లో యోహాను సువార్త అనే దానిలో 6వ అధ్యాయము 32వ వచనములో ఏమి చెప్పినారు అంటే జీవాహారమును మోషేకి ఇవ్వబడలేదు. దేవుడు తన జీవాహారమును మోషేకి ప్రసాదించలేదు. అంటే ఈ జ్ఞానాన్ని ఇవ్వలేదు ఆయనకి అని చెప్పినారు. అంటే మోషే చెప్పింది ధర్మశాస్త్రము కాదు అని


----

చెప్పేదానికి అక్కడ వచ్చేసింది మనకు. మళ్ళీ ఆయన చెప్పినేది ఏమిటిది? ధర్మశాస్త్రము లేఖనములు నెరవేరును అని ఉంది. ఆయనను కట్టేసి, ములుకులు కొడతారు అంటే ముందే వ్రాసిపెట్టారు. ఇది ధర్మశాస్త్రములో ఒక లేఖనము, నెరవేరింది. ఇది భవిష్యత్తు, ఏసుప్రభువు గురించి చెప్పినేది, భవిష్యత్ ఏమని? ఇది జరుగుతుంది అని చెప్పితే అట్ల జరిగింది. లేఖనాలు నేరవేర్చబడినాయి అమలు జరిగింది. అంటే వాస్తవమే అది జ్యోతిష్య శాస్త్రమైతుంది కానీ ధర్మశాస్త్రము ఎట్లా అవుతుంది? కానీ అది ధర్మశాస్త్రము కాదు. అది వ్రాసుకున్నారు తప్పు అది జ్యోతిష్యము అవుతుంది.


ఇప్పుడు మన గురించి కూడా బ్రహ్మముగారు వ్రాశారు ఏమని? “ప్రబోధాశ్రమము ఉన్నతమైన జ్ఞానము కలది. ప్రబోధాశ్రమము వారు శయనాధిపతి గుణములు కలిగియున్నారు” అని చెప్పారు. అంటే మనల్ని గురించి ముందే వ్రాశాడు ఆయన. అంటే ధర్మశాస్త్రము అంటామా? మనము, మనమే కాదు ఆయన కూడా అనలేదు. ఆయన కాలజ్ఞానము అన్నాడు. అది జ్యోతిష్య శాస్త్రము కాబట్టి దానిని మనము ధర్మశాస్త్రము అనేదానికి వీలులేదు. ఒకరి జీవితములో ముందే జరుగబోయేటి విషయాలు చెప్పితే, అది ఎవరి జీవితములో అయినా కానీ భగవంతుని జీవితములో చెప్పినా కానీ, మనిషి జీవితములో చెప్పినా కానీ అది భవిష్యత్తుకు సంబంధించిన విషయమైతుంది కానీ ధర్మము కాదు. కాబట్టి ఇది ధర్మశాస్త్రము అని పొరపాటుగా అనుకుంటున్నాము కానీ వాస్తవముగా అది ధర్మశాస్త్రము కాదు. ఆ రకంగా ధర్మశాస్త్రము ఏది? అంటే దేవుడు చెప్పినేది ధర్మశాస్త్రము అవుతుంది. మన ధర్మశాస్త్రము ఏదో తెలియనప్పుడు మనకు జ్ఞానమే సరిగా అర్థము కాదు. దేవుని విధానమే సరిగా అర్థము కాదు.


----

నేను కొంత బోధిస్తే ఆ బోధ మీరు వినగలిగితే నేను చెప్పిన దానిలో మీకు 20%, 30%, 40% అర్థమైతాది పూర్తి అర్థము కాదు అని చెప్పినాము. అర్థమైంది మళ్ళ నువ్వు ఇంకొకచోట చెప్పితే దానిలో సగము విడిచిపెట్టి సగము చెప్తావు. అంతేగానీ పూర్తి చెప్తావు అని నమ్మకము లేదు. దేవుడు చెప్పినేది ధర్మశాస్త్రము అది నూటికి నూరుపాళ్ళు కరెక్టుగా ఉంటుంది, కానీ దానిని తిరిగి మనిషి చెప్పుకుంటే ఎట్లుంటుంది అంటే వీనికే సగము సగము అర్ధమై ఉంటుంది మళ్ళీ చెప్పుకోవడము కూడా సగము సగము విడిచిపెట్టి చెప్తాడు. అంటే ఇంకోటి కలిపేసి చెప్తాడు. అంటే అది ధర్మము అధర్మము రెండు కలిసుంటాయి. దానిలో ఏది ధర్మము ఏది అధర్మము అని తెలుసుకోకుండా రెండింటిని కలుపుకుంటారు.


మనకు బియ్యము కావాలి. బజారుకు పోయి బియ్యము తెచ్చుకోవాలి. మనము అక్కడికిపోతే వాళ్ళు ఏమి చేస్తారు రాళ్ళు బియ్యము రెండూ కలిపి అమ్ముతారు. ఉత్త బియ్యము అమ్ముతారా నీకు? దానిలో రాళ్ళుంటాయి, నూకలుంటాయి, పొట్టు కూడా ఉంటుంది. వాడు ఇచ్చేటివి బియ్యము వండుకుంటే నీకు గందరగోళమే, పళ్లు పోతాయి నీకు. కాబట్టి దానిని మళ్ళ నువ్వు క్లీన్ చేసుకోవాలి. శుభ్రము చేసుకుంటే కానీ నీకు పనికి రాదు. ఆ రకంగానే మనుషులు చెప్పినటువంటిది పూర్తి ధర్మాలు కావు. దేవుడు చెప్పినేది పూర్తి ధర్మము అవుతుంది. కాబట్టి మీరు దేవుడు చెప్పిన ధర్మాలనే వినండి, నమ్మండి, ఆచరించండి. మనుషులు చెప్పిన దానిని నమ్మవద్దండి. మీకు క్రొత్తగా వచ్చిన గ్రంథము ఒకటుంది “ధర్మశాస్త్రము ఏది?” చిన్న గ్రంథము.


ఇంత చిన్న దానిని పట్టుకొని గ్రంథము అంటున్నాడు. అనుకోవద్దండి. దీని పేరు గ్రంథము అంటాము. గ్రంథము అంటే


----

గ్రంథిని ఉత్తేజపరిచేది గ్రంథము. చదివినావు అనుకో కళ్ళకు నీళ్ళు వస్తాయి నీటి గ్రంథి

ఇది గ్రంథే కదా! ఇక్కడ. కళ్ళ దగ్గర ఉండేది గ్రంథే. అంటాము ఆటోమేటిక్గా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి అనుకో, పుస్తకము వలన వచ్చినాయి? అప్పుడు దీనిని ఏమనాలి? గ్రంథము అంటాము. గ్రంథిని ఉత్తేజపరిచింది కాబట్టి గ్రంథము అంటాము. అన్ని బుక్కులు చదివితే కళ్ళకు నీళ్ళు రావు. కానీ ఏదో ఒక బుక్కు చదివితే కళ్ళకు నీళ్ళు వస్తాయి. అంటే దానిని గ్రంథము అనవచ్చు. శరీరములో ఉండే గ్రంథిని ఉత్తేజ పరుస్తుంది. అంటే స్రవింపజేస్తుంది నీకు కళ్ళ గుండా నీరు కారేటట్టు చేస్తుంది అది గ్రంథము. ఆనందము ఎక్కువైపోయి ఆనంద భాష్పాలు రాలుతాయి. ఆ ఆనందాన్ని పుట్టిస్తుంది నీలో కదిలిస్తుంది. అది గ్రంథము ఇప్పుడు ఈ గ్రంథములో అంటే గ్రంథము అనేదానికి

శాస్త్రమును. శాస్త్రమును గ్రంథము అంటాము. ఇది ధర్మశాస్త్రము, ధర్మశాస్త్రమైన దీనిని ఏమంటాము గ్రంథము అంటాము. దేవుడు చెప్పినేదే ధర్మశాస్త్రము, అది నేను చెప్పితే గ్రంథము అయ్యింది. మళ్ళీ నేను చెప్పితే శాస్త్రము కాదు. నేను చెప్పినేది గ్రంథము. దేవుడు చెప్పినేది శాస్త్రము, దేవుడు చెప్పినేది ధర్మశాస్త్రము నేను చెప్పినేది కేవలము గ్రంథము. నీకు ఆనందాన్ని తెప్పిస్తుంది. కంట్లో నీరు కారేటట్టుగా చేస్తుంది అంతే. ఆ రకంగా గ్రంథము అని చెప్పాము.


దీనిలో ధర్మము ఏ రకంగా అధర్మముగా మారుతుంది అని మనము చెప్పుచూ పోయి ఒక స్టోరీ చెప్పాము ఏమని? ఒక గురువు ఉన్నాడంట, ఒక గురువు స్వచ్ఛమైన జ్ఞానాన్ని పద్ధతి ప్రకారము చెప్పేవాడంట, జ్ఞానానికి విలువ తగ్గిపోకుండా దేవుని జ్ఞానానికి ఎంత విలువ ఇవ్వాలో ఆ విలువను


----

ఇస్తూ, ఎక్కడా కానీ లోటు కలుగకుండా ఉండేటట్టుగా ప్రజలు ఎవరికైతే జ్ఞానము కావాలని అనుకుంటారో, ఎవనికైతే శ్రద్ధ ఉందో, ఎవడు తెలుసుకోవాలని వస్తే వాడికి స్వచ్ఛమైన జ్ఞానము చెప్పేవాడట. గురువు తాను ఏమాత్రము ఎవరినీ ఆశించేవాడు కాదు. ఇది నేను సేవ చేయాలి అని అనుకున్నాడు. మేము కూడా చెప్పాము. మీరు సేవ చేయండి. దేవుని సేవ అంటే ఏది? దేవుని జ్ఞానాన్ని ఇతరులకు చెప్పడమే దేవుని సేవ అని చెప్పాము మనము. దేవునికి పూజ చేసినా దేవునికి ఇష్టము లేదు. ఆయన ధర్మాలను బయటికి తెలియజేస్తే ఆయనకు ఇష్టము. అదే నిజమైన సేవ.


ఈ రకంగా గురువు ఒక ధర్మాన్ని బోధించి, అంటే ఒక సేవ బోధిస్తే ఇట్లా చేసుకొండి అని, ఆ సేవను ఉల్టాగా చేసి ధర్మాన్ని అధర్మముగా మార్చేస్థితికి వచ్చారన్నమాట. ఈ రకంగా అవంతకు అవే మారిపోతాయి. మారిపోయినప్పుడు మళ్ళీ దానిని సవరించాల్సింది ఏమి? గ్లాని ఏర్పడితే మళ్ళీ దేవుడే వచ్చి సవరించాలి దానిని. ఈ రకంగా 7వ శ్లోకములో గ్లాని ఏర్పడితే నేను వచ్చి సరి చేస్తాను అన్నాడు. యుగయుగములోనూ నేను వచ్చి సరిచేస్తాను అన్నాడు. ఆ తరువాత ఇంకా యుగయుగములోనూ ధర్మసంస్థాపన చేస్తాను అన్నాడు. నేను వస్తాను గ్లాని ఏర్పడితే వస్తాను. తర్వాత యుగయుగములోనూ మళ్ళీ ధర్మసంస్థాపన కోసము వస్తానన్నాడు. ధర్మసంస్థాపన వేరు, గ్లాని వేరు. అంటే గ్లాని అంటే ఉన్నది తగ్గితే దానిని మళ్ళీ తిరిగి యథాస్థానానికి చేర్చేటట్టుగా అని. అంటే భగవద్గీతలో కాలుష్యము ఏర్పడినా తీసివేసేదానికి కానీ, బైబిల్లో కాలుష్యము చెప్పిన ఇంతకుముందు రవ్వంతే ఉండేది బుక్కు చాలా ఉంది అంతా కాలుష్యము అని తర్వాత ఖురాన్లో కాలుష్యము ఉండవచ్చు మనకు తెలియదు. ఒకవేళ

---

దేవుడు వస్తే ఏమి చేస్తాడు? దానిలో కూడా తీసేస్తాడు. మనుషులు కలిపేది ఇది మనుషులు చెప్పినేది ఇది దేవుడు చెప్పినేది అని చూపిస్తాడు మనకు.


ఈ రకంగా కాలుష్యాన్ని తీసివేసేదానికి నేను వస్తా అన్నాడా? బోధించేదానికి వస్తా అన్నాడు అక్కడ. బోధించే దానికి వస్తా అన్నాడు మూడవ విధానములో. ఒకటి వాణి ద్వారా రెండవది తెరచాటు నుంచి మూడవది దూత అంటే మనిషి ద్వారా చెప్పించేది అన్నాడు కదా! అవి కాకుండా నాల్గవది ఉన్నది అని చెప్పుచున్నాను. నాల్గవది ఏమిటి? అంటే కాలుష్యాన్ని తీసివేసేదానికి కూడా ఆయనే వస్తాడు. అది భగవద్గీతలో శ్లోకము ఉంది. భగవద్గీతలో నేను చెప్పేది సత్యము. ఆ శ్లోకము సాక్ష్యము మీకు. కాబట్టి నాల్గవ విధానము కూడా ఒకటుంది. నాల్గవ విధానముగా వస్తే ఏమి చేస్తాడు? మూడవ విధానముగా వచ్చినప్పుడు ధర్మసంస్థాపన చేస్తాడు. ధర్మసంస్థాపన ఎట్లా చేస్తాడు? ఎవరు చేసేది? దేవుడు ఆత్మగా ఉండి బోధిస్తాడు. దేవుడు ఆత్మగా నటిస్తూ, దేవుడు అంటే పరమాత్మ, ఆత్మ నటిస్తూ భగవంతుని శరీరములో, ఎక్కడా మనిషి శరీరములో సాక్ష్యాత్తూ దేవుడే ఆత్మగా ఉంటూ పలికించి మాట్లాడించి జ్ఞానాన్ని బోధిస్తాడు. అది ధర్మసంస్థాపన చేయడము, క్రొత్త ధర్మాలు తెలియజేయడము, లేని ధర్మాలు తెలియజేయడము.


కానీ కాలుష్యాన్ని తీసివేసేదానికి దేవుడు చేయాల్సిన పని లేదు. పరమాత్మ ఆత్మవలె చేయవలసిన పని లేదు. ఆత్మే పరమాత్మవలె చేస్తుంది. ఇంతకుముందు చెప్పాము. నటించే ఆత్మ అని ఆత్మ జీవునిగా నటిస్తుంది అని చెప్పాము. జ్ఞాపకము ఉందో లేదో మీకు. ఒక 7, 8 నెలల క్రింద


----

చెప్పియుంటాము ఇది. ఆత్మ జీవునిగా నటిస్తుంది, దేవునిగా కూడా నటిస్తుంది. కానీ ఆత్మగా మాత్రము ఎక్కడా కనిపించదు. అది ఆత్మలాగా మాత్రము ఇంతవరకు ప్రపంచములో ఎక్కడా కనిపించలేదు ఎవరికీ తెలియదు. దేవునిగానైనా నటిస్తుంది. జీవునిగానైనా నటిస్తుంది. నీ ఆత్మగా తాను ఒక ఆత్మనని ఎవరికీ తెలియబడలేదు, ఇంతవరకు ఆ రకంగా ఆత్మ ఉంది అని చెప్పాము. కానీ నటించే ఆత్మ అదే. ఆడించే ఆత్మ అదే పాలించే ఆత్మ అదే, మొత్తము అన్ని పనులు చేపించే ఆత్మ అదే అన్నమాట. ఆత్మ ఏమి చేస్తావుంది? పరమాత్మవలె కాలుష్యాన్ని తీసివేస్తా వుంది. అప్పుడు పరమాత్మ ఆత్మవలె ఉండి ధర్మసంస్థాపన చేస్తున్నాడు అంటే ఎవరు పరమాత్మ. ఎవరు మనిషే? మనిషిలో ఆత్మ ఉంటాడు, జీవాత్మ ఉంటాడు. ఆత్మ జీవాత్మగా పని చేయవచ్చు, పరమాత్మగా పని చేయవచ్చు. కానీ భగవంతునిలో అయితే పరమాత్మ ఉంటుంది. అది ఆత్మవలే పని చేస్తాది. ఇప్పుడు ఎవరిని ఎట్లా కనుక్కోవాలి అంటే ఎవరితోనూ చేతకాదు కనుక్కునే దానికి. ఎవరికీ చేతకాదు. పరమాత్మ ఆత్మవలె పనిచేస్తాడు అనే విధానము ఫలానా వ్యక్తిలో ఉంది అని కనుక్కునేదానికి ఎవరి తరము కాదు. అయిపోయింది అది. ఒక రూల్, ఇంకొకటి కాలుష్యము తీసివేసేటప్పుడైనా కానీ ఆత్మ పరమాత్మవలే పని చేస్తుంది అని కనుక్కోనేదానికి ఎవరి తరము కాదు. ఎవరితోనూ కాదు. ఇవి లోపలుండే విధానాలు ఆత్మ విధానాలు. కానీ అవి బయటికి తెలియవు. పరమాత్మంటే అది అసలుకు ఎవరికీ అర్థము కాదు. ఎవరు కనుక్కునే దానికి కూడా వీలులేదు.


ఆత్మంటే ఇంతవరకు ఎవరికీ అర్థము కాకుండా ఉంది. రెండూ అట్లాంటివే. ఈ రెండు విధానాలు ఒకే వ్యక్తిలో ఉంటాయా, వేరువేరు వ్యక్తులలో ఉంటాయా అట్లా చెప్పేదానికి కూడా కాదు. ప్రశ్న వేసుకోవచ్చు


----

కానీ జవాబు ఎక్కడా దొరకదు. దానికి జవాబు ఎవరూ చెప్పేదానికి అవకాశము లేదు. అంటే ఇదంతా ఎట్లా నమ్మాలి అంటే నమ్మేదానికోసము దేవుడు భగవంతునిగా వచ్చినా కానీ, కనుక్కోవచ్చు అనే దానికోసము భీష్ముడు ఒకరోజు కనుక్కున్నాడు ఆయనను. భీష్ముడు అదేపనిగా ఆయనకు తెలియబరిచి కనుక్కునేటట్టు చేసి నిరూపణ కోసము ఆయన్ని పెట్టాడు. భీష్మునికి కృష్ణుడు ఎవరో తెలుసు. ఆయన కిందపడిపోయినా కూడా చివరిలో కృష్ణున్నే రమ్మని చెప్పాడు, దగ్గరికి వచ్చి ఆయనతోనే మాట్లాడతాడు. తన బంధువులంతా చాలామంది ఉన్నారు. కృష్ణుడు బంధువు కాదు ఆయనకు, దూర బంధువు. అంటే ఆయనకు కావాల్సిన బంధువులంతా, మనవళ్ళు అంతా దగ్గర ఉన్నా ఎవరినీ పిలచలేదు, కృష్ణున్నే పిలుస్తాడు. ఆయనతోనే మాట్లాడినాడు. భీష్ముడంటే చాలా గొప్ప వ్యక్తి. అతన్ని యుద్ధములో ఎవరూ జయించలేరు. 18 రోజులు యుద్ధము జరిగితే 8 రోజులు యుద్ధములో ఒక రవ్వ ముందుకు పోలేకపోయినారు పాండవులు.ఆ భీష్ముడు సేనాధిపతిగా ఉండి ఎవరినీ కదలనియ్యకుండా చేసినాడు. అంత గొప్పగా యుద్ధము చేసినాడు ఆయన. చివరకు ఏమైందంటే ఆ భీష్ముడు వేసే బాణాలకు అర్జునుడు తట్టుకోలేకపోయాడు. కృష్ణుని రథము కూడా గందరగోళము అయిపోయింది. ఒకరోజు కృష్ణునికే కోపము వచ్చి "భీష్మున్ని చంపడము నీతో కాదు నేనే చంపుతాను” అని రథము దిగినాడు.


అప్పుడు నీ చేతిలో ప్రాణము పోతే నాకు అంతకన్నా ఏమి కావాలి అని, ఆయన చేతులు జోడించుకొని వస్తున్నాడు. ఈయన యుద్ధరంగములో నువ్వు మాట తప్పిపోయినట్టు అవుతుంది. ఆ రోజు కత్తి పట్టను, యుద్ధము చేయను, ఏమీ చేయను ఎవరి ప్రక్కనా ఏమీ చేయను, ఊరికే మాట్లాడతాను అని చెప్పినావు. ఇప్పుడు చంపితే మనకు చెడ్డపేరు వస్తుంది అని అర్జునుడు


---

గట్టిగా పట్టుకున్నాడు. కృష్ణుడు దేవుడు అని తెలుసు భీష్మునికి, చివరిలో యుద్ధమందు క్రింద పడిపోయినప్పుడు కూడా భీష్ముడు చేతులు జోడించి "నన్ను నీ లోనికి ఐక్యము చేసుకో” అన్నాడు. ఆయన అన్నమాట ఆ సందర్భము ఎవరికీ అర్థము కాలేదు. ఈయన ఏమి అడుగుతున్నాడు? ఆయన ఏమి అంటున్నాడు. అప్పుడు కృష్ణుడు ఇంకో 10 రోజులు ఉండు అన్నాడు. ఎందుకంటే ఉత్తరాయణము రావాలి. ఉత్తరాయణము వస్తేనే దేవునిలోకి ఐక్యము అయ్యేదని మనకు ఒక శ్లోకములో తెలిసింది. అక్షర పరబ్రహ్మయోగములో ఒక శ్లోకములో పగటి పూటనే, సూర్యరశ్మి బాగా ఉన్నప్పుడే శుక్లపక్షములో ఉత్తరాయణములోనే చనిపోయినట్టి వానికే దేవునిలోకి ఐక్యము అయ్యే విధానముంది.


పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణములో కాకుండ చనిపోతే ఎంతపెద్ద యోగి అయినా కానీ వాడు మళ్ళీ జన్మకు పోవలసిందే. చంద్రతేజస్సు అంటే జ్ఞానతేజస్సు కలిగి మళ్ళీ ఇంకో జన్మకు పోతాడు. కానీ దేవునిలోకి ఐక్యమయ్యే దానికి వీలులేదు. కాబట్టి ఇంకో 10 రోజులు ఆగు ఉత్తరాయణము వస్తాది అన్నాడు. అట్లే ఆయన అన్ని బాణాలు కుచ్చుకున్నా కానీ ప్రాణము పట్టుకున్నాడు. ఆయన మాట ప్రకారమే 10 రోజులుండి చనిపోయినాడు. దేవునిలోనికి ఐక్యమైనాడు. ఆ విధముగా దేవునిలోకి ఐక్యము అయిన ఒకే ఒక వ్యక్తి. అడిగి, అంటే మనిషి దేవుడని గుర్తు పట్టగలిగినట్టి వ్యక్తి భీష్ముడు. ఇంతవరకు చరిత్రలో ఆయన ఒక్కడే సాక్ష్యానికి అంటే దేవుడు మనిషిగా వస్తాడు అన్న సాక్ష్యానికి దేవుడు పెట్టుకున్నాడు. ఆ రకంగా లేకపోతే నమ్మరు. పునర్జన్మ ఉంది అంటే నమ్మరు. కాబట్టి ఎవనికో ఒకనికి పునర్జన్మ జ్ఞాపకము వచ్చేటట్టు చేసి వెనుకల జరిగిన, పోయిన జన్మలో జరిగినదంతా చెబితే అది నిజమని


----

అర్థమైతే ఓ పునర్జన్మ ఉంది అని అప్పుడు సాక్ష్యము దొరుకుతుంది. అట్లయితే నమ్ముతారు అని ఆ రకంగా పునర్జన్మ ఉంది అని చెప్పేదానికి దేవుడు ఎవనికో ఒకనికి జ్ఞాపకము వచ్చేటట్టుగా చేస్తాడు. అది మనము “పునర్జన్మ రహస్యము”లో చెప్పాము. కొంతమందికి జ్ఞాపకము వచ్చింది. ఆ రకంగా దేవుడు చేసిన విధానములో ఉంది. ఇలా మనకు మూడు రకాలుగా దేవుడు జ్ఞానాన్ని బోధిస్తాడు అనేది వాస్తవమే, నాల్గవ రకములో కూడా కాలుష్యాన్ని తీసివేస్తాడు అనేది కూడా వాస్తవమే. కాలుష్యాన్ని తీసివేసేది నీకు సంబంధము లేదు, కాబట్టి బోధించేంత వరకే నీకు సంబంధము కాబట్టి ఆ విధానము చెప్పలేదు. ఆ విధానము నాల్గవ విధానము చెప్పలేదు. వాస్తవముగా నాలుగు విధానాలు ఉన్నాయి. ఆ విధానము చెప్పలేదు.


ఆ విధానము ఏ గ్రంథములోనూ చెప్పలేదు. అంటే భగవద్గీతలో ఉంది. అంటే నాల్గవ విధానము అని తెలియదు అది. ధర్మసంస్థాపన అనేది మాత్రము మూడవ విధానమే కరెక్టు అది సరిపోతుంది. కానీ గ్లాని ఏర్పడితే దానిని తీసివేస్తానని అది ధర్మసంస్థాపన చేసినట్టు కాదు కదా! గ్లానిని మాత్రము తీసివేస్తాడు ఆయన. కాలుష్యాన్ని మాత్రము తీసేస్తున్నాడు. కాబట్టి అది మూడవ విధానము కాదు. ఖురాన్లో చెప్పినట్టు అది మూడవ విధానము కాదు. కాబట్టి మనము లెక్కవేసుకుంటే వాస్తవముగా నాలుగు విధానాలున్నాయి. మనకు తెలియని విధానము అంటూ ఒకటుంది. అది కాలుష్యాన్ని తీసివేయడమే. ఆ కాలుష్యాన్ని తీసివేసేదానికి ఆయన చేసే కృషి ఆయన చేశాడు. ఇప్పుడు మేము కూడా కృషి చేశాము అనుకోండి. నన్ను తిట్టుకున్నా ఇంకొక రకంగా అన్నా చెడ్డవాడు అనుకున్నా మంచోడు అనుకున్నా మా ముందరే కాలుష్యము జరుగుతా వున్నది. ఎందుకు? ఈ


---

జ్ఞానాన్ని బయటికి పోయి చెప్పడము తెలుసుకొన్న జ్ఞానాన్ని పెంపొందించడము ఎట్లుంది చూడండి? నా దగ్గరికి ఒక చావు బ్రతుకుల సమస్యలో ఒక వ్యక్తి వస్తే అతన్ని “నువ్వు జ్ఞానాన్ని ఆశ్రయించు నువ్వేమి భయపడవలసిన పని లేదు” అని హామి ఇచ్చాము. హామి ఇస్తే అతను సరేలే అని మీరు ఎట్ల చెప్పితే అట్ల అంటే, ఎట్ల చెప్పేది ఏముంది అట్లే చెప్పేది నేను. దేవుడు కూడా అట్లే చెప్పినాడు. దేవుడు చెప్పినట్లే నేను చెప్పుచున్నాను. నువ్వు జ్ఞానాన్నే గొప్పగా పెట్టుకో. నువ్వు బాగుపడుతావు. అంటే అతను బాగుపడడము జరిగింది. చచ్చిపోతాడు అనే సమస్య కూడా పోయింది. మేము హాయిగా ఉన్నాము అని వాళ్ళ నోటిగుండా వాళ్ళే అన్నారు. అంటే మంచిదే, మీ వలన మేము హాయిగా ఉన్నాము అంటే నా వలన అనుమాట తప్పుమాట. నేను ఏమీ చేయలేదు, నేను ఇలా ఉండండి అని చెప్పినాను. మీరు ఉన్నారు కాబట్టి, దేవుని జ్ఞానాన్ని ఆశ్రయించినారు, కాబట్టి జ్ఞానమే మిమ్మల్ని కాపాడింది అని చెప్పాము. అంతటి పరిస్థితిలో నా దగ్గరికి వచ్చి మేలు పొందినా కూడా వెనుకల మేలు చేసినానో, కీడు చేసినానో నేను చెప్పినది ఇంతే బయటికి, లోపల ఏమి చేసినారో వాళ్ళకు తెలియదు, నాకు తెలియదు. కానీ నేను చెప్పినది అంతే. ఈ రోజు ఆదివారము కదా! కరెక్టుగా పోయిన ఆదివారము ఆయన ఒక మీటింగ్లో చెప్పుచున్నాడు అంట ఏమని? అక్కడ ఇద్దరు మనుషులు ఉండి, ఉన్నవాళ్లు విని నాకు చెప్పడము అది సాక్ష్యము. ఏమని చెప్పుచున్నాడో చూడు. చావుబ్రతుకుల్లో ఉండేవాడు చావు నుంచి బయటపడి నాకు ఇది గొప్ప జ్ఞానము అబ్బింది మనకు ఈయన ద్వారా తెలిసింది అనుకోవచ్చు కదా! ఎవరి ద్వారా జ్ఞానము తెలిసిందో నువ్వు అది మరిచిపోకూడదు. ఇప్పుడు నేను చెప్పుచున్నాను. నేను చెప్పే జ్ఞానము


----

ఎవరు చెప్పుచున్నారు? నాకు అందించేది ఆత్మ అందిస్తుంది అని చెప్పినాను. ఇప్పుడు నాల్గవ విధానము అనేది ఎవరు చెప్తారు దానిని? మామూలుగా చెప్పేదానికి అవుతుందా? ఎవరికీ మూడు విధానాలే కనుక్కునేదానికి చేత కాలేదు. ఏ మతములోనూ ఇంతవరకు కనుక్కునే దానికి కాలేదు, మూడు విధానాలు ఇవి ఉన్నాయియని. రెండవ విధానాన్ని మూడవ విధానముగా చెప్పుకున్నారు.


జిబ్రయేల్ దూత వచ్చి చెప్పినాడు అనుకున్నారు. జిబ్రయేల్ ఒక గ్రహము. అది రెండవ విధానము. తెరచాటు నుంచి చెప్పిన విధానము అది. దూత అనేది మూడవది, ఎదురుగా వచ్చి చెప్పేది, కానీ రెండవ వానిని మూడవది అనుకున్నారు. చూడండి ఎట్లుందో. ఖురాన్ గ్రంథములో చెప్పినట్టి (42-51) వాక్యాన్ని రెండవ విధానాన్ని మూడవ విధానము అనుకున్నారు. వాళ్ళకు అర్థము కాలేదు అక్కడ. ఇంక హిందూమతములో దేవుడెవరో, భగవంతుడెవరో వాళ్ళకే తెలియదు. మనిషిగా వచ్చిన వాళ్ళనంతా మనిషే అనుకున్నారు. మళ్ళ కనపరానివాడు దేవుడంటే అది ఒక రకము. అంతా రాళ్ళను, గుళ్ళను పట్టుకున్నారు. వీళ్ళు దేవుళ్ళని వీళ్ళ చావు వీళ్ళది. ఎవరి చావు వాళ్ళది. అసలైన విధానము ఎవరికీ తెలియకుండా పోయింది. కానీ మేము ఏమి చెప్పుచున్నాము అంటే అంత పెద్ద రహస్యాన్ని చెప్పినా కానీ ఎవరూ గ్రహించడము లేదు. నాకు తెలిసింది నేను చెప్పుచున్నాను. నాలోని ఆత్మే నాకు చెప్పింది కాబట్టి నా ఆత్మ చెప్పినట్టి విషయాలను నేను చెప్పుచున్నాను. నా ఆత్మ ఏమి చెప్పిందో అదే విషయాన్నే మీకు చెప్పుచున్నాను. నాలో ఉండే ఆత్మ మీకు కూడా ఆ విషయాన్ని అర్థము చేయించాలన్న ఉద్దేశ్యముతో మొట్ట మొదటనే ప్రార్థన చేశాము. నాలో ఉండే ఆత్మే అందరిలోనూ ఉంది. నాకు తెలియజేసినట్టే


----

అందరికీ వాళ్ళకు కూడా అందించమని అడిగినామా లేదా మొట్టమొదటనే? అడిగినాము. ఆత్మ ఒకటుంది అని మరచిపోయారు. అదే మనకు జ్ఞానము అందించింది.


ఇప్పుడు నేను ఎంతో రహస్యాన్ని చెప్పినాను, మీకు తెలుసు చాలా రహస్యాలు చెప్పాము ఇక్కడ. ‘హేతువాదము' గ్రంథము వ్రాశాము. ‘హేతువాదము’ గ్రంథములో ఏముంది? పురుష సంపర్కరము లేకుండా స్త్రీలకు గర్భము వస్తుంది అని చెప్పాము. ఇది ఎక్కడా లేదే సైన్సులో అంటే, సైన్సు అవునో కాదో నాకు తెలియదు, సత్యాన్ని చెప్పుచున్నాము. ఏదైతే సత్యమో అదే సైన్సు. ఏదైతే సైన్సో అదే సత్యము. నేను సత్యము చెప్పుచున్నాను. అది సైన్సు అవుతుంది. నువ్వు సైన్సు చదువుకున్నాక సైన్సు అంటున్నావు. నువ్వు చెప్పినేది మళ్ళ ఏమైతదో నాకు తెలియదు, కానీ నేను చెప్పినది సైన్సు ఆ ధైర్యము నాకు ఉంది. నేను చెప్పినేదే సైన్సు అని చెప్పినాము. పురుష సంపర్కము లేకుండా స్త్రీలకు గర్భము వస్తుంది. ఎక్కడైనా జరిగే విధానమేనా? అని హేళనగా మాట్లాడవచ్చు. నేను గ్రంథము వ్రాసిన తర్వాత నెలన్నరకో, రెండు నెలలకో పేపర్లలో న్యూస్ వచ్చింది. అమెరికాలో ఒక యూనివర్సిటీలో శాస్త్రవేత్తలు పరిశోధన చేసి 200 మందిని వాళ్ళు గుర్తించినారు ఏమని? పురుష సంబంధము లేకుండా స్త్రీలకు గర్భము వచ్చిందని చెప్పారు. వాళ్ళు 200 మందిని గుర్తించినారు. వాళ్ళు ఎట్ల చెప్పినారు? అంటే అది సైన్సు. కొన్ని ఏళ్ళు కష్టపడి కోట్లు ఖర్చుపెడితే అది సైన్సు. నేను ఒకమాట చెప్పితే ఇది మొరటు మాట. నేను చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పితే అది సైన్సు అంటారు. వాళ్ళు చెప్పిన తర్వాత నేను చెప్పితే దానికి విలువవుండదు. కానీ నేను చెప్పిన తర్వాత వాళ్లు చెప్పినారు. చూడు ఎట్లుందో? మీకు తెలుసు గ్రంథము వచ్చిన తరువాతనే ఆ న్యూస్పేపర్లో వచ్చింది.


----

నేను 40 సంవత్సరాల క్రిందటనే చంద్రునిలో నీళ్ళుండాయని చెప్పితే, 7 ఏళ్ళ క్రింద పరిశోధకులు చెప్పినారు. ఏడు సంవత్సరాల క్రింద పరిశోధన చేసి చంద్రునిలో నీళ్ళుండాయని కనుగొన్నారు. కొన్ని కోట్లు ఖర్చుపెట్టి పరిశోధకులు చెప్పారు. నేను 40 సంవత్సరాల క్రింద చెప్పాను. ఆ రోజు నాది సైన్సు కాదా? నేను చెప్పినదానినే ఇంకో 15 ఏళ్ళకు కానీ 1000 ఏళ్ళకు కానీ పరిశోధకులు చెప్పితే అప్పుడు దానిని సైన్సు అంటారు. మనిషికి నాలుగు రకాల చావులుంటాయి అని చెప్పినాము. సర్వ సాధారణంగా మూడు ఉన్నాయి, మనము అందులో ఒకటి తాత్కాలిక మరణము ఉంది. దానిలో చచ్చిపోయి కొంతసేపు తర్వాత మనిషి బ్రతుకుతాడు అని చెప్పినాము. చచ్చిపోయిన తర్వాత మనిషి ఎట్ల బ్రతుకుతాడు? అని అందరికి ప్రశ్న వచ్చింది. నీకు తెలియదు కాబట్టి నేను చెప్పినాను. చనిపోయిన వాడు బ్రతుకుతాడు అని అంటే ఎవ్వరూ నమ్మలేదు అది. అది సైన్సు కాదు అన్నారు అంటే చాలాచోట్ల చచ్చిపోయిన వాళ్ళు బ్రతికినారు. ఒకడు కట్టెల మీద పెట్టి అగ్గి పెట్టేటప్పుడు బ్రతికినాడు తమిళనాడులో, అంటే అది పొరపాటేనా? నిన్న సాయంత్రము చచ్చిపోతే రాత్రంతా అట్లే పెట్టుకొని, ఎవరో వాళ్ళ బంధువులు రావాలని చూచారు. తర్వాత పగలు వాళ్ళ బంధువులు వచ్చేంతవరకూ ఉండి, వారు వచ్చిన తర్వాత చూడు అని గుడ్డ తీసి చూపించారు. చనిపోయిన వాని చెల్లెలు వచ్చి ఏడుస్తావుంది, చెల్లెలు ఏడ్పు విని వాడు బ్రతికినాడు, ఏమి ఏడుస్తున్నావు అని కట్టెల మీద పడుకోబెట్టిన వాడు అడిగాడు. ఇది జరిగింది కదా! ఇట్ల బ్రతుకుతారు అని మనము చెప్పినాము కదా! మొన్న 20 రోజుల క్రిందట పేపరులో ఒక న్యూస్ వచ్చింది. అది కటింగ్ చేసి పెట్టినాము. అమెరికాలోనో ఎక్కడనో హాస్పిటల్లో చచ్చిపోయిన వాళ్ళను ఒక బ్యాగ్ వేసి జిప్ వేస్తారట. జిప్ వేసి ప్రక్కన పెట్టేసి స్మశానానికి పంపిస్తారు.


----


అట్లా జిప్ వేసి పెట్టిన ఒక మనిషికి తెల్లవారుజామున కొంచెము కొంచెము బ్యాగులో కదులుతున్నాడంట. వేరేవాళ్ళు బంధువులు చూసి ఏమి కదలుతున్నాడు అని తీస్తే వాడు బ్రతికినాడంట. ఏమి ఇట్ల మూసి పెట్టినారు దీనిలో వేసి? అని అడిగాడట. నేను ఇవన్నీ ముందే చెప్పిన విషయాలే కదా! అయితే నాకు ఇవన్నీ ఎవరు చెప్పారు? ఏ గ్రంథములో ఉంది? అంటే ఒకే ఒక ఆత్మ చెప్పింది. దానికి తెలియని రహస్యాలంటూ ఏవీ లేవు అని చెప్పుచున్నాను.


ప్రపంచాన్నంత ఆడించేది ఆత్మే, సైన్సు అని శాస్త్రవేత్తలకు జ్ఞాపకము తెప్పించి ఇట్ల చెయ్యి, అట్ల చెయ్యి, ఇట్లయితాది చూడు అని వానికి ఐడియా ఇచ్చి చేయించేది ఆత్మే. ఆత్మ చేపిస్తే శాస్త్రవేత్త నేను కనిపెట్టినాను అంటాడు. నీకు వెనుకల చూపించినాడు, నాకు ముందే చూపించినాడు. నాకుముందు చూపితే నేను చెప్పినాను, నువ్వు వెతుకులాడిన తర్వాత చూపించినాడు నీకు, నాకు వెతకకుండా చూపించినాడు, అదే చెప్పినా నేను. మళ్ళీ ఇవన్నీ చెప్పినా కదా! ఈ రోజు నాల్గవ విధానముంది అని అట్లే చెప్పాను నేను. ఈ గ్రంథములో కూడా అదే చెప్పాము. "ధర్మశాస్త్రము ఏది?” అనేది ఇంతకుముందు ఈ రోజు ప్రొద్దున వచ్చింది గ్రంథము ఒకటి. "ప్రథమ దైవగ్రంథము భగవద్గీత” అని. దానిలో కూడా అదే చెప్పినాము దానిలో రహస్యాలున్నాయి. మళ్ళీ ఈ రహస్యాలు అన్ని ఎట్ల తెలిసినాయి నీకు? అని ప్రశ్నించవచ్చును. అందరూ మోషే ధర్మశాస్త్రము అంటే నేను ఒక్కడినే ఎందుకు వ్యతిరేఖించాను? అది కాదు అని నేను ఎందుకు చెప్పుచున్నాను. ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా! స్వామీజీలు, బోధకులు, ప్రవక్తలు, వక్తలు వాళ్ళంతా ఒప్పుకున్న దానిని నేను ఎందుకు ఒప్పుకోలేదు?


----

నా ఆత్మ నాకు ఒప్పుకోనివ్వలేదు. అది సత్యము కాదు అని చెప్తావుంది. ఇది సత్యము అని చెప్తావుంది. దేవుడు చెప్పినేది ధర్మము అని చెప్తావుంది. కాబట్టి నేను ఒప్పుకోవడము లేదు. నేను ఏమాత్రము ఒప్పుకొనే అవకాశము లేదు. నేను ఒప్పుకోను. లోపల ఆత్మ అందించిన విధానము ఏదైనాగానీ సత్యముగానే చెప్తా నేను. మోషేది ధర్మశాస్త్రము కాదు. ఇప్పుడు ఇందులో కూడా చెప్పాము. నాకు ఆత్మ అందించిన విధానాన్ని నేను చెప్పుచున్నాను. నాల్గవ విధానము ఉంది అది ప్రపంచములో ఎవ్వరూ చెప్పలేదు, ఇంతవరకు అంటే ప్రపంచములో చెప్పలేని విధానము నువ్వు అంత గొప్పగా చెప్పుతున్నావు. అంటే నేను చెప్పేది ఏందయ్యా చెప్పేవాడు చెప్తాడు గొప్పగా, మీకు అదృష్టం ఉంటే వినండి లేకపోతే విడిచిపెట్టండి. మీకు శ్రద్ధ ఉంటే వినండి తెలుసుకోండి. కాలుష్యాన్ని తీసివేసేదానికి 'నేను వస్తాను' అన్నాడు. మరి ఏ రకంగానో ఒక రకంగా వస్తాడు. మనకు తెలియజేస్తాడు.

క రకంగా*

మా జీవితములో కష్టాలలో మునిగి తేలడమే సరిపోయింది. బ్రతుకుతెరువు కోసమే ప్రాకులాడడము సరిపోయింది. కాబట్టి నేను ఎక్కడా కాలాన్ని జ్ఞానము తెలుసుకునేదానికి ఉపయోగించలేదు. ఏ స్వామీజీ దగ్గరికి పోలేదు, ఏ ఆశ్రమము దగ్గరికి పోలేదు. ఎక్కడా పోయి వినలేదు. ఒకవేళ గ్రంథము చదువుకునే దానికి కూడా అవకాశము లేదు. ఎందుకంటే నేను పని చేసుకొని బ్రతుక్కోవాలి. అట్లాంటి పరిస్థితిలో నేను వచ్చాను. మరి నేను ప్రశ్నిస్తూ పరిశోధన చేస్తూ వచ్చాను. నా పరిశోధనలో లోపల నుండి ఏదైతే నాకు తోచిందో, ఏదైతే అందివ్వబడిందో దానినే మీకు అందిస్తున్నాను. నాకు ఉచితముగా అందివ్వబడింది నేను డబ్బులు పెట్టలేదు, కష్టపడలేదు, ఇంకొక చోటికి పోలేదు. ఉచితముగా నాకు ఏదైతే దొరికిందో మీకు ఉచితముగా దానిని ఇస్తున్నాను. డబ్బులు


-------

అడుగలేదు మిమ్ములను నేను, మీ నుండి డబ్బులు ఆశించలేదు. నాకు ఇది ఇయ్యండి, నేను చెప్పినదానికి కూలి ఇయ్యండి అని అడుగలేదు నేను. నాకు ఉచితముగా ఇవ్వబడింది. మీకు నేను ఉచితముగా ఇస్తున్నాను. నాకు ఉచితముగా తెలియబడింది, అంత పెద్ద రహస్యాన్ని మీకు ఉచితముగా తెలియజేస్తున్నాను. పెద్ద రహస్యాన్ని మీకు ఉచితముగా తెలియజేస్తున్నాను. మీకు కావాలంటే తెలుసుకోండి. లేకపోతే వదిలిపెట్టండి. మీరు చెప్పిన దానిని మేము ఎట్ల నమ్మాలి? అంటే ఎవరు నమ్మమన్నారు నిన్ను. నాకు తెలిసింది నేను చెప్పుచున్నాను, నిన్ను నమ్మమని నేను ఏమీ చెప్పలేదు. నాకు తెలిసింది ఇది సత్యము అని చెప్పుచున్నాను. నీకు అవసరము ఉంటే నమ్ము. లేదనుకుంటే విడిచిపెట్టు, ఇంకొకరిది నమ్ము, నేను ఏదైతే నాకు అందిస్తున్నారో వాళ్ళ విషయమే చెప్పుచున్నాను.


ఈ రోజు భగవద్గీత ఉంది కదా! భగవద్గీత ఎవరు చెప్పారు? కృష్ణుడు అర్జునునికి యుద్ధరంగములో ఎవరికీ తెలియకుండా చాటుగా ప్రక్కకు తీసుకపోయి చెప్పాడు. ఏమి చెప్పేది ఎవరికీ తెలియదు. ఎవ్వరూ వినకుండా పోయి చెప్పినాడు, ఏమి చెప్పాడో ఏమో దానినే వ్యాసుడు వ్రాశాడు. వ్యాసుడు వ్రాసినప్పుడు నేనే వ్రాస్తున్నాను అని వ్రాసి ఉంటే వ్యాసుడు వ్రాసినేదే భగవద్గీత అని అనుకునేవాళ్ళము అంతే గదా! అంత వివరముగా ఆయన వ్రాసినప్పుడు అన్ని శ్లోకాలు వ్రాసినప్పుడు అక్కడ రెండు నిమిషాలు మాట్లాడిన దానిని అంత పెద్దగా ఆయన వ్రాసినప్పుడు ఆ రెండు నిమిషాలు ఆయన మాట్లాడినాడు అని చెప్పుకోకుండా ఆ మాట వదిలేసి నేను చెప్పుచున్నానని వ్యాసుడే చెప్పియుంటే అప్పుడు భగవద్గీత వ్యాసుడు చెప్పినాడు అనే మనకు తెలిసేది. కానీ వ్యాసుడు ఆ రకంగా చెప్పలేదు. చెప్పవచ్చు ఆయన. 18 పురాణాలు వ్రాసినాడు, నాలుగు


----

వేదాలు వ్రాసినాడు, భగవద్గీత ఎందుకు చెప్పియుండడు అని నమ్మేవారము. అయితే వ్యాసుడు నేను చెప్పలేదు దీనిని కృష్ణుడే చెప్పినాడు అని 'భగవానువాచ భగవంతుడే చెప్పినాడు' అని చెప్పి వ్రాశాడు. వ్యాసుడు తన మీద పెట్టుకోలేదు, అట్లే నేను కూడా నా ఆత్మే చెప్పిందని నా మీద పెట్టుకోలేదు. నా ఆత్మ మీద చెప్పుచున్నాను. ఎప్పుడూ నా మీద నేనేమి పెట్టుకోలేదు, నాకు ఏదైతే తెలియబడిందో దానినే చెప్పుచున్నాను మీకు.


కృష్ణుడు చెప్పినాడని వ్యాసుడు చెప్పాడు, ఆత్మ చెప్పినది నేను చెప్పాను. కానీ నేను చెప్పినది ప్రబోధానందస్వామి చెప్పినాడు అని మీరు చెప్పినా ఫరవాలేదు. అట్లుకాకుండా నా దగ్గర విన్న వాళ్ళు ప్రక్కకు పోయి స్వయముగా మేమే చెప్పుచున్నామని అహముతో చెప్పితే అది తప్పు అవుతుంది. స్వయముగా మీరు చెప్పినట్లు చెప్పుకొని మీ లాభము కోసము, మీ మర్యాద కోసము ప్రాకులాడితే అది తప్పు అవుతుంది. జ్ఞానమును నేను కూడా చెప్తాను, నేను కూడా గురువు కాదు. నాకు ఒక గురువు ఉన్నాడు. ఆయన అందించినది నేను మీకు చెప్పుచున్నాను. మీరు ఏమని చెప్పాలి వేరే వాళ్ళకు చెప్పితే, ఫలానాయన చెప్పితే నేను మీకు చెప్పుచున్నాను అని చెప్పాలి. కానీ లేదు మీ అంతకు మీరు సొంతముగా చెప్పుకుంటే మంచిది కాదది. జ్ఞానాన్ని సక్రమముగా తెలుసుకోవాలంటే ఏమవుతుంది. జ్ఞానము ఎవరి ద్వారా తెలుసుకున్నామో వాళ్ళ పేరే చెప్పాలి. కానీ మనము సొంతము చెప్పుకోకూడదు. నేను సొంతము చెప్పినాను అంటే ఈయనే భగవంతుడు అని ఈ రోజు అంటారు. అట్ల అనిపించు కున్నానా నేను. మళ్ళీ నేను చెప్పిన రహస్యాలు చాలా ఉన్నాయి కదా! నేనేమన్నా సొంతము చెప్పినానా, ఎక్కడన్నా చెప్పినానా? నాకు తెలియబడితే చెప్తాను లేకపోతే లేదు అని చెప్పినాను.


----


ఈ గ్రంథములో మీకు చాలా విషయాలు ఉన్నాయి. ఇది ధర్మశాస్త్రము ఏది అంటే? చివరకు ధర్మశాస్త్రము అంటే దేనికి వ్యతిరేఖము? అంటే హెచ్చింపుకు వ్యతిరేఖము అని చెప్పిన్నాము. ధర్మము అంటే తగ్గింపు. ధర్మము అంటే నాశనము. గుణము అంటే గుణించేది. గుణించబడేది అంటే హెచ్చించబడేది. మీరు గుణాలతో ఉన్నారు కాబట్టి మీరు హెచ్చించబడుతున్నారు. జీవితాలు జన్మలు వ్యాపించుకుంటా పోతున్నారు. నువ్వు ధర్మములోకి పోతే జీవితము లేకుండా పోయి దేవునిలోకి ఐక్యము అవుతావు. కాబట్టి ధర్మము అంటే ఏమిటి? అంటే చాలా సులభమైన పద్ధతిలో చెప్పబడింది. ధర్మము అంటే 'ధ' అనేటటువంటి పదము నుంచి పుట్టింది. ఆయుధం అంటే ఆయుష్షును 'ధం' అంటే లేకుండా చేసేది నాశనము చేసేది 'ధం' అంటే నాశనము అని. ఏదైనా నాశనమైతాదంటే 'ధం' అని పేలిపోతాది అని చెప్తారు చూడు. అంటే ధం అంటే నాశనము అని, ఆయుధం అంటే ఆయుష్షును లేకుండా చేసేది ఆయుధం. కాబట్టి 'ధం' అంటే నాశనము. నీవు లేకుండా పోవుటను చూయించేది ధర్మము. దేవున్ని “నువ్వు ఎవ్వరు?” అని భగవద్గీతలో అర్జునుడు అడిగినప్పుడు ఏమన్నాడు “క్షయ” అన్నాడు. అంటే “నాశనము కలిగించేవాన్ని నేను” అని చెప్పినాడు. నాశనము కలిగించడము అంటే ధర్మయుక్తున్ని ధర్మముతో కూడుకున్నటి వాన్ని. ధర్మము అంటే ఏమిటిది? నాశనము. ఏమిటిది నాశనము? నువ్వే లేకుండా పోతావు. నువ్వేమయితావు జీవునిగా లేకుండా పోయి దేవునిగా మారిపోయేది. అటువంటిది ధర్మము. ఇది ధర్మము, అధర్మము అని చెప్పి దీనిని మనము చిన్న గ్రంథముగా మీకు అర్థమయ్యేటట్టుగా చేశాము. ఇది మీకు ఇంతవరకు అందుబాటులో లేదు. అంటే మీటింగ్కు వచ్చేంతవరకు కూడా అందుబాటులో లేదు. ఇప్పుడు


----

ఈ మీటింగ్కు వచ్చిన తర్వాత మీకు ఈ గ్రంథము అక్కడ ఉంది. ఈ గ్రంథము కూడా మీరు తీసుకోవచ్చు, చదువుకోవచ్చు.


ఈ రెండు గ్రంథాలు చదివిన తరువాత దీనిలో ఉండే ప్రత్యేకత మీరు తెలుసుకోవచ్చు. ఈ చిన్న గ్రంథము అయినా కానీ, కొన్ని కోట్లు విలువ చేసేటి జ్ఞానాన్ని మీకు ఇది అందిస్తుంది. ఈ జ్ఞానాన్ని తెలుసుకొని, మీరు శ్రద్ధ పెంచుకొని తరువాత కూడా జ్ఞానము తెలుసుకుంటారని ఆశిస్తూ మాయ అనే దానిలో పడొద్దండి అని చెప్పినాము. మాయను గురించి కూడా దీనిలో బాగా విఫులంగా చెప్పడము జరిగింది. మాయంటే ఏమి, గుణాలు అంటే ఏమి, దేవుడు అంటే ఏమి, ధర్మము అంటే ఏమి ఇవన్ని విషయాలు ఈ చిన్న గ్రంథములో వచ్చాయి. దీనిని చదువుకొని మీరు అసలైన జ్ఞానాన్ని తెలుసుకుంటారని ఆశిస్తూ, అదే విధానాన్ని ఆత్మ మీకు తెలియజేస్తాదని కోరుతూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.

---------------------------

94. ఆడించే ఆత్మ

తేది: 17.12.2013

ఈ దినము కనిపించేటటువంటి వస్తువులు కాకుండా కనిపించ కోకుండా ఉండే సూక్ష్మాన్ని గురించి చెప్పాలనుకున్నాను. ఇది మీకు కొత్తదనాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. అంటే సూక్ష్మము, స్థూలము అనేది మీకు తెలుసు. అయినా దానిని ఇంకా కొంత వివరముగా చెప్పదలచుకున్నాము. దాని గురించే ఈ రోజు చెప్పుతాము. జాగ్రత్తగా వినండి. స్థూలము అంటే కంటికి కనిపించునది. సూక్ష్మము అంటే కనిపించనటువంటిదని అర్థము. అంటే ఒకటి "అక్షి” అనేది ఉంది అంటే


----

చూచేటటువంటిది. చూచేదానికి కనిపించేదానిని ఏమంటాము “స్థూలము” అంటాము. చూచేదానికి కనిపించేది స్థూలము అంటే చూచేది దేనినైన చూడవచ్చు. స్థూలాన్ని అయినా చూడవచ్చు. సూక్ష్మాన్ని అయినా చూడవచ్చు. అంటే ‘కన్ను' స్థూలాన్ని చూడగల్గితే, 'చూపు' మాత్రము సూక్ష్మాన్ని అయినా చూడగలదు. ఎందుకంటే కన్ను స్థూలమైనటువంటిది, చూపు సూక్ష్మమైనటు వంటిది. కన్ను కనిపిస్తుంది, కన్నుకు ఉండేటటువంటి చూపు కనిపించదు కాబట్టి అది సూక్ష్మమైనది. ‘స్థూలముతో స్థూలాన్ని చూడవచ్చు, సూక్ష్మముతో సూక్ష్మాన్ని చూడవచ్చు.' ఇది ఒక సూత్రము. మన చూపు సూక్ష్మమైనది కాబట్టి చూపుతో దేనినైనా చూడవచ్చు. చూపు నుండి కన్ను ద్వారా స్థూలాన్ని అయినా చూడవచ్చు లేకపోతే కన్ను లేకుండా కేవలము చూపు నుండే సూక్ష్మాన్ని కూడా చూడవచ్చు. చూచేది ఏదైనాగాని స్థూలమైనదిగాని, సూక్ష్మమైనదిగాని 'అక్షి' అంటాము దానిని. అంటే కన్ను అని. కన్ను అంటే స్థూలముగ ఉండవచ్చు, సూక్ష్మముగ ఉండవచ్చు. బాగా చూచేదాన్ని ఏమంటాము అంటే 'స'+'అక్షి' = 'సాక్షి' అంటాము. 'స' అంటే బాగా అని. సాక్షి అంటే బాగా చూస్తుంది, అది దేనిని వదలకుండా చూస్తుంది.


ఈ సాక్షి అనేది ఎక్కడ చూసినా ఉంది. బయట కూడా ఉంది. సూక్ష్మముగ ఉంది, స్థూలముగ కూడా ఉంది. ఒకడు ఇంకొకరిని హత్య చేస్తుంటే చూస్తే ఏమయితుంది? చూచినవాడు సాక్షి అయిపోతాడు. కాని ఎవరూ చూడకపోతే ఏమయితుంది? అంటే వ్యక్తి స్థూలముగ ఉండేవాడు సాక్షి కాకపోయినాగాని సూక్ష్మముగా ఉండేవాడు ఎవడో ఒకడు చూసి ఉంటాడు. వాడు సాక్షిగా ఉంటాడు. ఇప్పుడు నీవు ఉన్నావు, నీవు చేసే పనులన్నీ ఇతరులు చూసినారు అనుకోండి వాడు సాక్షి, అయినా ఏమీ ప్రయోజనము లేదు, వాడు నీకు శిక్ష విధించలేడు. వీడు తప్పు చేసినాడు


---

అని నిరూపించలేడు, శిక్ష ఏపించలేడు. ఎక్కడ బయట అయితే ఏమన్నా చేయవచ్చు కాని లోపల జన్మలకు తగినటువంటి శిక్షను మాత్రము ఎవరూ ఏపించలేరు. కాని నీవు చేసే ప్రతి పనిని గమనించేవాడు ఒకడు ఉన్నాడు. వాన్ని మన శరీరములో ఉండే సాక్షి అంటాము. మనకు సాక్షులు ఎంతమంది ఉన్నారు? అంటే ఒకడే ఉన్నాడు అని మనము అనుకుంటాము కదా! కాని విశ్వానికంతా సంబంధించినటువంటి సాక్షి ఒకడు ఉన్నాడు. నీకు మాత్రము సంబంధించినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. సాక్షి అంటే దేవుడు సాక్షిగా ఉన్నాడు అని చెప్పుతున్నాము. దేవుడు సాక్షిగా ఉన్నాడు అంటే ఏం చేస్తావు? ఆయన సాక్షిగా ఉండి కూడా ఏమి ప్రయోజనము లేదు కదా! ఆయన ఏమీ చేసేవాడు కాదు కదా. ఆయన ఏమీ చేసేవాడు

కాదు కాబట్టి నీకు సాక్షిగా ఉన్నా కూడా ఏమి ప్రయోజనము లేదు. నీ మీద ఏమన్నా చర్యలు ఉంటే, ఆయన సాక్షిగా ఉన్నాడని, నీకు భయము ఉంటుంది, ఆయన చూశాడు కాబట్టి నాకు ఏమన్నా ఇబ్బందిగా ఉంటుంది అని నీవు అనుకోవచ్చు. ఆయన ఏమీ చేయడు కాబట్టి, ఆయన వల్ల నీకు ఎటువంటి భయము లేదు కాబట్టి, ఆయన సాక్షిగా పేరుకు ఉన్నాగాని నీకు ఏమీ నష్టము లేదు.


కాని నీవు భయపడాల్సింది ఇంకొక సాక్షికి, అయితే ఒక సాక్షినే మనము విని ఉంటాము గాని ఇంకొక సాక్షిని మనము వినివుండము. ఆ సాక్షి మీ శరీరములోనే ఉంటాడు. ఆ సాక్షి ప్రతి ఒక్కటీ చూస్తూ ఉంటున్నాడు. తరువాత దానిని నమోదు చేసుకోవడము కూడా ఉంటుంది. నీవు ఏమి మంచి పని చేసినా, చెడుపని చేసినా దానిని చూడడము ఉంటుంది. దానిని మళ్ళీ తిరిగి వ్రాసుకోవడము ఉంటుంది. ఈ రకముగ నీ శరీరానికి, నీకు ఒక సాక్షి ఉన్నాడు. నీ శరీరములో నీకి మాత్రము ఒకడు సాక్షిగా


----

ఉన్నాడు. శరీరము అనేది ఒక నివాస స్థలము జీవునికి. ఆ నివాస స్థలములో ఎంతమంది ఉన్నారు? అంటే ఆత్మ స్వరూపమైనటువంటి వాళ్ళు ఇద్దరే ఉన్నారు. మిగతావి అన్నీ ప్రకృతి స్వరూపమైనటువంటివే. జడపదార్థముతో కూడుకొన్నటువంటివే. ఆత్మ స్వరూపమైనటువంటివి రెండు ఎవరు అని చూస్తే, అందులో ఒకరు జీవాత్మ అయిన నీవు, ఇంకొకరు ఆత్మయున్నదని తెలియుచున్నది. ఆత్మ అని పేరు గల వాళ్ళు ఇద్దరే ఉన్నారు. అందులో ఒకరు జీవాత్మ, రెండవవాడు ఆత్మ. మూడవవాడు కూడా పురుషుడే అయినా ఆయనకు పేరు లేదు. అందువలన గుర్తింపుకు ఆయనను ఆత్మకంటే వేరయిన వాడు పరమాత్మ అని అంటున్నాము. అంటే ఉండేది ఇద్దరే పురుషులు శరీరములో, మిగతా వాళ్ళంతా స్త్రీకి సంబంధించి నటువంటివాళ్ళు. ఒకవేళ ఏదైనా ఉన్నాగాని ప్రకృతికి సంబంధించి నటువంటివాళ్ళేగాని పురుషులకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు. అంటే  స్త్రీ

సంబంధించిన వారేయని అర్ధం.


పురుషులంటే ఆత్మకు సంబంధించినటువంటి వాళ్ళు. ఆత్మకు సంబంధించినటువంటి వాళ్ళు కేవలము ఇద్దరే నీ శరీరములో ఉన్నారు. జీవాత్మ, నీకు తోడు ఉన్నటువంటి ఆత్మ. ఈ ఇద్దరు కాక ఇంకొక పురుషుడు ఉన్నాడు. ఆయన నీ ఒక్క శరీరములోనే కాకుండా అన్ని శరీరాలలోను వ్యాపించి కూడ ఉన్నాడు. అన్ని శరీరాలలోనే కాకుండా బయట కూడా అణువణువునా వ్యాపించి ఉన్నాడు. మూడవ ఆత్మను గురించి తెలుసుకొంటే ఆయనను పురుషోత్తముడు అని అంటాము. రెండో ఆత్మకంటే గొప్పవాడు, ఉత్తమమైనటువంటి వాడు, అతను ప్రపంచమంతా అణువణువునా వ్యాపించి ఉన్నాడు. ఆ రకంగా వ్యాపించినటువంటి ఆ పురుషోత్తముడు ప్రపంచాని కంతటికి సాక్షిగ ఉన్నాడు. సర్వజీవరాసులకు సాక్షిగ ఉన్నాడు. నీకు


----

సాక్షిగ వుండే వానిని నీకు ప్రత్యేకముగ ఆత్మ అని చెప్పుతున్నాము. అందరికీ, అన్నిటికీ సాక్షిగాయున్న వానిని పరమాత్మ అని అంటున్నాము.


నేడు “కర్మ పత్రము” అనే ఒక చిన్న గ్రంథము వ్రాసినాము. 64 పేజీలది మీకు ఈ రోజు అది చదివితే ఈ కర్మ అనేది మనుషులు ఎట్ల సంపాదించుకుంటున్నారు అని తెలిసిపోతుంది. ఆత్మ ఇంతమందిని ఎట్లా ఆడిస్తుంది అని తెలిసిపోతుంది. అంటే ఇంత భయంకరమైన కర్మ మనుషులు ఎందుకు తప్పించుకోలేకవున్నారు అని కూడా మీకు అర్థమైపోతుంది. ఇటువంటి కర్మలు మనకు తగిలిస్తూ, ఆ కర్మానుసారమును మనలను ఆడించేవాడు నీలో ఉండేటటువంటి, నీకు తోడుగా వున్నటువంటి ఆత్మ, వానిని నీకు 'స్నేహితుడు' అంటాము. తరువాత నీకు జోడుగ ఉన్నవాడు అంటాము. 'నీకు తోడుగా ఉన్నటువంటి ఆత్మ' అంటాము. లేకపోతే 'సహవాసి' అని అంటాము. ఈయనను చాలా పేర్లతో చెప్పుకుంటాము. వాడే నీకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వాడు. అతను తప్ప ఎవ్వరూ లేరు. ఒకచోట చెప్పుతాడు, ఏమని? “నేను తప్ప నీకు సహాయము చేసేవాడు ఎవ్వడూ లేడు.” “నేను తప్ప” అంటే “ఇంకొకడు లేడు” అని లెక్క. ఒకవేళ ఎవడైనా చేస్తాడేమో అనే దానికి అవకాశమే లేదు. అందువల్ల ఒకే ఒకడు ఉన్నాడు, నిన్ను నడిపించువాడు అతనే, నడిపిస్తూ ఏం చేస్తున్నాడు. నీకు పర్యవేక్షకుడుగా ఉంటూ, నీ శరీరములో పరిశీలకుడిగా ఉంటూ, నీవు ఏమి చేస్తున్నావో అదంతా వ్రాస్తున్నాడు. ఇప్పుడు మీరు ప్రశ్న అడగవచ్చు కదా, మళ్ళీ వ్రాసుకుండేది ఏంది? రెండు రకాలు చెప్పినట్లు అవుతుంది జీవాత్మ ఏమీ చేయలేదు కదా, మళ్ళీ అతను ఎందుకు వ్రాసుకుంటాడు. అతనే చేస్తున్నాడు కదా అన్నీ! అని మీరు ప్రశ్న అడుగవచ్చు.


----

ఒకవేళ తెలివైనవాళ్ళు అడుగుతారు అనుకోండి. అప్పుడు జవాబు కావాలి కదా మనకు, జవాబు కూడా ఉంటుంది. ఎందుకంటే, వాస్తవముగ జీవుడు చేయలేదు. ఆత్మ చేస్తూవున్నాడు. ఆత్మ చేసి జీవుని మీద తప్పు వ్రాస్తున్నాడు. అది చాలా అన్యాయము కదా అనవచ్చు. దానికి “నేను ఎవరికి ఎటువంటి అన్యాయము చేయను” అని ఆత్మ అంటాడు. న్యాయముగ ప్రవర్తిస్తున్నాడు, లోపలవుండే ఆత్మ అన్నీ నీవు చేసినపుడు ఖుర్ఆన్ గ్రంథములో ఏమి వ్రాసారు ఒకచోట. 50వ సూరా 18వ ఆయత్లో “అతను మాట్లాడే విషయము కంఠము నుంచి బయటికి రాకముందే, అంటే గొంతు నుంచి బయటికి రాకముందే వ్రాసుకుంటాడంట.” పర్యవేక్షకుడిగా ఉండే ఆత్మ అంటే జీవాత్మ పూర్తి మాట్లాడకనే ముందే తెలిసి వ్రాసుకుంటాడంట. కాని అనేది ఆత్మే, జీవుడు ఏమీ మాట్లాడేవాడు కాదు.ఆ రెండోవాడు, ని నీలో ఉండే ఆత్మే. మాట్లాడిచ్చేది వాడే, పాట పాడించేది వాడే, ఆట ఆడించేది వాడే, యుద్ధము చేయించేది వాడే, నాట్యము చేయించేది వాడే, ఏమి ఉన్నాయో అన్ని పనులు చేయించేదంతా ఆత్మే. ఒకరికొకరు తిట్టుకుండేది కూడా ఆత్మే, జీవునికి ఏమీ చేత కాదు. జీవుడు మాట అనకముందే ఆత్మ వ్రాసుకుంటాడంట, అనేది ఎవరు? ఆత్మ వ్రాసుకుండేది ఎవరు? మళ్ళీ ఆత్మయే. ఎవరి మీద తప్పు వ్రాసేది? ఊరికినే ఉండే జీవాత్మ మీద న్యాయమేనా అది? న్యాయము కాదు కదా! జీవుడు ఏమీ ఆడ లేదు, ఆట ఆడుకోకున్నా నువ్వే ఆడిచ్చి, ఇట్ల ఎగిరినాడు, అట్ల దూకినాడు అని వ్రాస్తే, ఏమి బాగుంటుంది.



ఆత్మ ఎవరికీ అన్యాయము చేయలేదు, నేను న్యాయము చేసినాను. అంటే మనము నీది ఏమి న్యాయము? ఇది ఎక్కడి న్యాయము? నీవు చేసి చేయని జీవుని మీద చేసినట్లు వ్రాయడము న్యాయమా? అని అడుగవచ్చు.


----

“నేను చేస్తున్నాను” అని నీవు అంటా ఉన్నావు కాబట్టి నేను వ్రాసు కుంటున్నాను. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? చేసేది నేను, ఆట్లాడిచ్చేది నేను, మాట్లాడిచ్చేది నేను, కొట్టిచ్చేది నేను, చంపిచ్చేది నేను, అన్నీ నేను చేసినప్పుడు “నేను చేశాను” అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు అనుకుంటున్నావు కదా, నీ పేరే వ్రాస్తాను అని ఆత్మ అంటున్నాడు.


నాకు ఆత్మ యొక్క జ్ఞానము ఉంది. కావున నాకు జ్ఞాపకము ఉంది నేను మాట్లాడలేదు అని, మాట్లాడించేది వేరేవాడు అని తెలుసు, ఒకరోజు మంచిగా చెప్పుతాను, ఒకరోజు ఏమీ చెప్పలేను. నన్ను ఎంతవరకు చెప్పించాలో అంతవరకే చెప్పిస్తాడు ఇక్కడ నుంచి. మళ్ళీ చివరికేమో జ్ఞానమే చెప్పుతాడు. నేను చెప్పిన జ్ఞానమే మీరు ఇంకొక చోటుకి పోయి నాకంటే బాగా చెప్పొచ్చు, నాకంటే కూడా మీతో బాగా చెప్పిస్తాడు. చెప్పినేది నేనే అన్నట్లు దానిని మొదట చెప్పినప్పుడు కూడ బాగా చెప్పలేను. కాని దీనికంత ఎవరు కారణము? ఆత్మ ఒక్కడే. వాడు ఎలా చెప్పించినా, ఏమి చేయించినా వాడే చేయాలి. వాన్ని జ్ఞాపకము పెట్టుకుంటే ఏమయితుంది? నీవు చేసినట్లు నా మీద వ్రాయలేడు. అన్నీ నీవే చేస్తూ వున్నావని మనము అనుకుంటే అప్పుడు నేనే చేస్తూ వున్నానని ఆయన అనుకొంటాడు, మళ్ళీ మన మీద తప్పేమి వ్రాయడు. అందుకే భగవద్గీత మోక్షసన్యాస యోగములో 17వ శ్లోకమున...

శ్లో॥ 17: యస్య నాహంకృతోభావో బుద్ధి ర్యస్య న లిప్యతే |

హత్వాపి స ఇమాన్ లోకాన్న హర్తి ననిబధ్యతే ॥

(కర్మయోగము)


---

భావము :- ఎవని భావములో అహంకారము కలుగదో అతడు ఈ లోకములో యున్నవారిని అందరినీ చంపినా వానికి పాపము రాదు. వాడు హంతకుడు కాడు.


ఈ విధముగా చెప్పాడు. అందువలన 'నేను' అను అహము లేకపోతే వాడు (జీవాత్మ) ఆ పని చేయనట్లేయగును. ఎంతమందిని చంపినా కూడ, వాడు హంతకుడు కాదు. ఎవరు? చంపినోడు. హత్యా పాపము వానికి రాదు. ఇంతమందిని చంపినాగానీ, ఘోరపాపమైనాగానీ ఆ పాపము పనికిరాదు, వాడు అసలుకు హంతకుడు కాదు. కంటితో చూస్తున్నా, వాడు చంపుతున్నాడు కదయ్యా! అంటే నువ్వు చూస్తున్నావు. చంపినోడు హంతకుడు అని నీవు ఎట్లా అంటావు? అనేదానికి వీల్లేదు. శరీరము లోపల ఇద్దరున్నారు ఎవరు చంపినారని? చంపినోడు హంతకుడు అవుతాడు కానీ వీడు (జీవుడు) చంపలేదు కదా!


జీవుడు ఒకవేళ నేను చంపినాను అనుకుంటే హంతకుడు అయితాడు, వాడు తప్పిపోతాడు, ఎవడో ఒకడు హంతకుడు కావాలి! కాని జ్ఞాపకము ఉండి, నేను చంపలేదు అనే ధ్యాస వీనికి వుంటే, నన్ను ఆడిచ్చేవాడు ఒకడున్నాడు అని అనుకుంటే, శరీరములో నా బలము ఏమి లేదు అంతా వాడే ఆక్రమించుకున్నాడు, వాడే అధిపతి శరీరానికి, నేను ఒక్కచోట ఉన్నాను, నా పాత్ర ఏమీ లేదు, నేను ఏమీ చేసేవాన్ని కాదు అని అనుకుంటే, ఉన్న సత్యము తెలుసుకుంటే, ప్రతి నిత్యము శరీరములో జరిగేటువంటి వాస్తవికతను తెలుసుకోగల్గితే నీకు ఏ పాపము లేదు. కాని అన్నిటిని చేపించేవాడు ఉన్నాడని తెలియక, మనము 'నేనే చేస్తున్నాను' అని అనుకునే దానివల్ల దానికి మనము బాధ్యులము అవుతున్నాము. కాబట్టి నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో అప్పుడే ఆత్మ వ్రాసుకుంటాడు. అంటే


---

మనసులో అనుకున్నా వ్రాసుకుంటాడు, ఒక గ్రంథములో చెప్పుతాడు. “నీవు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినాగాని అంతరంగములో వ్యభిచారము చేసినట్లే” అని చెప్పినాడు. అంటే చేయకున్నా కాని ఆ భావము ఎవరికి ఉందో వాడు పనిచేయకున్నా, పాపము వస్తుంది అని చెప్పాడు. అక్కడ భగవద్గీతలో ఏమి చెప్పాడు?


లోకములో ఉండే అందరిని చంపినా ఏమాత్రము పాపము రాదు అన్నాడు. అంటే కార్యము చేసినా పాపము రాదు అక్కడ భగవద్గీతలో. ఇక్కడ బైబిలులో చేయకున్నా పాపము వస్తుంది చూడు! రెండిటి మీనింగ్ ఒక్కటే! కాని వేరు వేరుగా చెప్పినారు, అర్థము కాదు, వేరువేరుగా ఉన్నాయి కదా! అది వేరే వాక్యము, ఇది వేరే వాక్యము అనుకుంటారు. కాని రెండూ ఒకే భావమున్న వాక్యాలే. భావము ముఖ్యము. భావాన్ని బట్టే పాపము వస్తుంది, కార్యాన్ని బట్టి కాదు అనేది "కర్మ పత్రము” అనే గ్రంథములో ఈ రోజు స్పష్టముగ చూపడము జరిగింది. మీకు అర్థమయ్యేదానికి రెండు కథలను వ్రాసి, అందులో ఏ రకంగా మనకు ఈ పాపపుణ్యాలు అంటుకుంటున్నాయో చెప్పాము. ఈ రకంగా పాప పుణ్యాలు మనకు అంటుకునే దానివలన ప్రపంచములో ఒకడు బీదవాడుగా, ఒకడు మధ్య తరగతి వాడుగా, ఒకడు ధనికుడుగా, ఇంకోడు చాలా సుఖాలు అనుభవించే వానిగా ఇలా రకరకాలుగా, అంచెలు అంచెలుగా బ్రతుకు తున్నారు, మనుషులంతా. ఒకటే స్థాయిలో ఎవరూ బ్రతకలేదు. ఇన్ని రకాల స్థాయిలో బ్రతుకుతున్నారు అంటే, కారణము కర్మ, మనము చేసుకున్నటువంటి ఫలితము. మళ్ళీ ఈ కర్మ ఎక్కడినుంచి వస్తావుంది? అంటే నీ భావములో నుండి పుట్టుతా వుంది. జ్ఞానము అనేది అర్థము కాదేమో అనుకుంటారుగాని ఇది చాలా సులభము.


---

ఒకే ఒక భావాన్ని తెలుసుకోగల్గితే కర్మను మొత్తం విడనాడవచ్చు. అహం భావాన్ని అర్థము చేసుకోలేకపోతే కర్మను మొత్తము తగిలించు కుంటారు. మోక్షము కావాలంటే, దేవునిలోకి ఐక్యము కావాలంటే, ఏమి చేయాలి? ఏమాత్రము కర్మ లేకుండా, శేషము లేకుండా అయిపోతే, ఏమి అనుభవించేది లేకుండా వుంటే, ఇక్కడ ఒక శరీరములో ఉండాల్సిన పని లేదు. కర్మ అనుభవించే పని ఉంటే శరీరములో ఉండాల్సిన అవసరము ఉంది. కర్మ అనుభవించేది లేకపోతే శరీరము అవసరము లేదు, అపుడు దేవునిలోకి ఐక్యమైపోవచ్చు. కాబట్టి మోక్షము పొందాలి అనేటువంటి వాళ్ళు ఏమి చేయాలి? భావములో మార్పు తెచ్చుకుంటే చాలు. అది తెలియక మెడిటేషన్లు, దీక్షలు, ఉపవాసవ్రతాలు, ఆ ధ్యానాలు, ఈ ధ్యానాలు, రకరకాల ధ్యానాలు పట్టుకొని, జుట్టు మీద ధ్యాస, ముక్కు మీద ధ్యాస, మోకాలు మీద ధ్యాస, మోచేయి మీద ధ్యాస, ఇన్ని ధ్యాసలు పెట్టుకున్నారు. ఏ ధ్యాస వద్దు. నీ మీద, ఆత్మ మీద ధ్యాస పెట్టుకో. ఎందుకంటే ఇద్దరే కదా మీరు ఉండేది, ఇంకొకని మీద అంటే పక్కవాని మీద పెట్టుకో, నీ మీద పెట్టుకో చాలు! ఏమి లేకుండా పోతాయి. ఇవన్నీ ఎవడయ్యా నడి మధ్య చెప్పినేది! దేవుడు ఏమన్నా చెప్పినాడా భగవద్గీతలో? ఎక్కడా ఏ ధ్యాస చెప్పలేదు. ఇవన్నీ అధర్మము అని చెప్పినాడు. ఇవన్నీ అంటే నీవు చేసే కార్యాలన్నీ అధర్మమే! యజ్ఞములు, దానములు వేదాధ్యయనములు, తపస్సులు అంటే మెడిటేషన్లు. ఇవన్నీ అధర్మాలతో కూడుకున్నటువంటివి. దీనివల్ల దేవుడు ఏమాత్రము తెలియబడడు అని విశ్వరూప సందర్శన యోగములో 48, 53 వ శ్లోకములలో చెప్పినాడు. ఇప్పుడు మనము చెప్పిన దాని ప్రకారమే తెలియబడేది.


---

"కర్మవుంటే నీవు శరీరములో ఇరుక్కుంటావు, కర్మ లేకపోతే మోక్షానికి పోతావు" ఒకటే సూత్రము. కర్మ లేకుండా ఎలా పోతుంది నీకు? అంటే "నేను కాదు, ఇంకోడు చేస్తున్నాడు” అన్న సత్యము తెలిసినపుడు పోతుంది. అది తెలియక, నీవు ఏమనుకుంటున్నావు? నేనే చేస్తున్నానని అనుకుంటున్నావు అప్పుడు. అది నీ పేరుతో వ్రాయబడుతా వుంది. కాని చేసేవాడు ఒకడు, ఆత్మ అన్నీ నేను చేస్తున్నాను అని పబ్లిక్గా చెప్పుతున్నాడు. దీనికి ఎవరూ కారణము కాదు, కేవలము నేనే కారణము అని అన్నప్పుడు నీకేమి సంబంధము లేదు కదా!


నీ శరీరములో నువ్వు చేరినప్పటి నుంచి శరీరాన్ని వదిలేంత వరకు పనిచేసేవాడు ఆయన (ఆత్మ) అర్థమైందా! నీవు మాత్రము ఏ పని చేయలేదు, కానీ ఇంతకుముందు సంపాదించుకున్న కర్మనుబట్టి అనుభవిస్తున్నావు. ఈ విధముగా నీకు జరుగుతావుంది. ఇప్పుడు చూసేవాడు వాడే, చేసేవాడు వాడే. ఆయనకు రెండు పాత్రలు ఉన్నాయి. కేవలము చేసేవాడేనా? చేసేవాడు మళ్ళ అక్కడే ఉన్నాడు కదా, చూసేవాడు కూడా ఆయనే, వ్రాసుకుండే వాడు కూడా ఆయనే, నీకు ఏమీ సంబంధము లేదు.


మీరు ఒకచోట ఆత్మను సాక్షిగా చెప్పినారు, ఇంకోచోటేమో పరమాత్మను సాక్షిగా చెప్పినారు? అని అంటే సందర్భాన్ని బట్టి చెప్పవలసిన పని వచ్చింది. శరీరములో ఉన్న ఒక్కనికి మాత్రము సాక్షి 'ఆత్మ' అయితే ప్రపంచానికి అంతా సాక్షి 'పరమాత్మ'. ఇట్ల సందర్భాన్ని బట్టి ఆ మాట చెప్పవలసివచ్చింది.


నీ శరీరములో, నీ ప్రక్కనే, అన్ని పనులు చేస్తున్నటువంటివాడే నీకు తెలియలేదే! సర్వప్రపంచము అంతా అందరిని సృష్టించి నీకు, నీ


---

ఆత్మకు మొత్తము ప్రపంచానికంతా పెద్ద అయినవాడిని నీవు ఎక్కడ తెలుసుకుంటావు చెప్పు? ఎక్కడా తెలుసుకోలేవు. మళ్ళీ అంత పెద్ద వానిని నీవు తెలుసుకోవాలంటే ఏమి చేయాలి? ముందు రెండవవాన్ని తెలుసుకుంటే మళ్లీ ప్రక్కన ఉండేవాడు అంటే మూడవవాడు తెలుస్తాడు నీకు. ఆయన ఓ చోట ఏమి చెప్పినాడంటే “నేనే మార్గము” అన్నాడు. 'నేనే మార్గము' అంటే 'నా మార్గము ద్వారానే మీరు తెలుసుకోవాలి'. ఎవరిని? దేవున్ని. దేవున్ని తెలుసుకోవాలంటే ఎవరి ద్వారా తెలుసుకోవాలి? ఆత్మ ద్వారానే తెలుసుకోవాలి. అర్థమయిందా! నీవు జీవాత్మవు మూడు (3), ఆత్మ ఆరు (6), పరమాత్మ అంటే దేవుడు తొమ్మిది (9). ఇపుడు నీవు తొమ్మిది (9) కావాలంటే ఏమి చేయాలి? నీవు ఇంకో ఆరుని కలుపుకుంటేనే తొమ్మిది అయ్యేది, అంతవరకు తొమ్మిది కావు నీవు. పెద్ద సంఖ్య ఏది? తొమ్మిది. దేవుడు పెద్ద సంఖ్య. ఆయనను పెద్ద సంఖ్యతో పోల్చుకున్నాము. సంఖ్యాశాస్త్రములో తొమ్మిదే కదా పెద్ద సంఖ్య! జీరో (0) నుంచి లెక్కవేస్తే, తొమ్మిది పెద్ద సంఖ్య అవుతుంది. మళ్ళ ప్రక్కన చేర్చుకొన్నవవి సంబంధము లేదు. ఏక సంఖ్యలలో తొమ్మిది (9) పెద్ద సంఖ్య. అర్థమయిందా! నిన్ను జీవుడిగా ‘3' తో పోల్చినాము. ఆత్మని ఏమిటితో పోల్చినాము? '6' సంఖ్యతో పోల్చినాము అంటే ఆత్మకు గుర్తుగ. మళ్ళ ఇపుడు నీవు ‘9’ కావాలంటే ఏమి చేయాలి? నువ్వేమో మూడు కాబట్టి ఆరు అయిన ఆత్మతో కలిస్తే నువ్వు తొమ్మిది అయిపోతావు. అంటే తొమ్మిదితో సమానమవుతావు, దాంట్లోకి కలసిపోతావు లేకపోతే కావు. అందువల్ల నీ ప్రక్కలో వుండేవాన్ని నీవు తెలుసుకోగల్గితే, అపుడు దేవుడు తెలియబడతాడు. ఆత్మ తెలియబడనిది, దేవున్ని తెలుసుకోవడానికి అవకాశము లేదు. మళ్ళ ఈ ఆత్మను తెలియాలి అంటే ఏమి చేయాలి? ద్యానము చేస్తే రాదు, ముక్కు మీద ధ్యాస పెట్టుకుంటే రాదు, చెవి మీద ధ్యాస పెట్టుకుంటే రాదు. అర్థమయిందా!

ఈ*


---

ఇవన్నీ తెలియని విధానాలు. ఎవరిమీద పెట్టుకుంటావు? నీ ఆత్మ మీద పెట్టుకోవయ్యా! ముక్కు, చెవుల మీద పెట్టుకొని ఏమి చేస్తావు? అవి మూడు రోజులు వుండి పోతాయి. నీ శరీరమే పోతుంది, దాంతో నీకేం పని చెప్పు. లేదు, ముక్కు మీద కాదు నేను శ్వాస మీద పెట్టుకొన్నాను అంటాడొకడు. వాడు (ఆత్మ) ఇగ్గుతా వుంటే ఆడుతావుంది ఈ శ్వాస. లోపలివాడు అల్లాడిస్తుంటే ఇది అల్లాడుతుంది శ్వాస. కాబట్టి దానిని పట్టుకుంటే ఏమి ప్రయోజనము? దానిని నడుపు వానినే పట్టుకోవాలి. 'నిన్ను తోలేవాడు' అని అంతిమ దైవ గ్రంథములో చెప్పాడు. దానినే మనకు తెలుగులో వ్రాస్తూ వాక్యాన్ని ఏమి చేశారంటే 'నిన్ను నడిపించేవాడు’ అన్నారు. అంటే నిన్ను నడిపిస్తున్నాడు. వాన్ని 'తోలేవాడు' అన్నారు. తోలేవాడు అన్నా, నడిపించేవాడు అన్నా, పరిగెత్తిచ్చేవాడన్నా అంతా ఒకడేలే. ఎందుకంటే వాడు అన్ని పనులు చేస్తావున్నాడు ఒకడే. వాడు ఎవడు? ఒకడే, నీ పర్యవేక్షకుడు, నీ పరిశీలకుడు, నిన్ను నడిపించేవాడు, నిన్ను తోలేవాడు అంతా ఒకడే. వాడు ఏమి చేస్తున్నాడో తెలుసునా? ఇంకో సాక్షిగ ఉండేవాని క్రింద ఉండి, నిన్ను నడుపుతున్నాడు. నీకు దేవుడికి మధ్యలో ఒకడున్నాడే, వాడు తోలుతుంటే నీవు తోలబడుతున్నావు. అర్థమయిందా!


నడిపించేవానిని తెలుసుకుంటే వాడు ఎలా తోలుతావుంటే అట్ల నేను పోతున్నాను అనుకుంటే వాడు సక్రమముగా వాని వెనుకల వుండే దేవుని దగ్గరికి తోలుకుపోతాడు నిన్ను. లేకపోతే ఇటు చావుకు, అటు బ్రతుకుకు, తోలుతానే వుంటాడు. ఇక్కడ చచ్చేంతవరకు తోలుతాడు, మళ్ళీ పుట్టేంత వరకు తోలుతాడు, మళ్ళీ చచ్చేంత వరకు తోలుతాడు, ఇట్లా తోలుతానేవున్నాడు, సృష్ఠి ఆది నుంచి మనము తోలిచ్చుకుంటూనే



----

ఉన్నాము. మంచి చోటుకి తోలు అని, గప్చి* కూర్చున్నామా! లేదు.

నీవు ఊరక వుంటే దేవుని దగ్గరికి తోలుతాడు. పోరా నాయన! ఇంక

విడిచి పెట్టినాను నిన్ను అంటాడు. అందుకే వీన్ని తెలుసుకుంటే దేవుడు

కానీ వీనిని తెలుసుకొనేది ఎప్పుడు అనే ఆయన తెలుస్తాడు మనకు. మనము? ఈయనను (ఆత్మను) తెలుసుకొనేదే పెద్ద కష్టము అయింది మనకు. అంటే స్థూలముగా ఉండేదాని మీదనే మన చూపు ఉందిగాని సూక్ష్మముగ ఉండేదాని మీద మనకు చూపులేదు. ఈ ఆత్మ ఎక్కడైనా కనిపిస్తుందా, ఎవరికైనాగాని? కనిపించదు. ఆత్మ నడిపించేటటువంటి వ్యక్తులు కనిపిస్తున్నారు కాని ఈ వ్యక్తిని నడిపించే ఆత్మ కనిపించలేదు ఎవ్వరికి. ఇప్పుడు నేను మీకు కనిపిస్తున్నాను, మాట్లాడిచ్చేది ఆత్మ కాని ఆత్మ కనిపించలేదు, వ్యక్తి కనిపిస్తున్నాడు. వ్యక్తి కనిపిస్తున్నాడు కాబట్టి ఏమంటున్నారు. ఓహో! ఈ వ్యక్తి బాగా జ్ఞానము చెప్పుతున్నాడు అని అనుకుంటారు.


కానీ మేము ఏమంటున్నాము అంటే మీరు పొరపాటు పడుతున్నారు. నాకు ఏమీ తెలియదు. చెప్పేవాడు ఇంకోడు అని చెప్పుతున్నాము. మేము గ్రంథాలలో వ్రాస్తూ వ్రాస్తూ ఏమి వ్రాసినాము అంటే "మేము ఈ విధంగా చెప్పుతున్నాము వినండి” అన్నాము. "మేము చెప్పుతున్నది ఏమనగా!” అంటే కొందరు ఏమన్నారంటే 'మేము మేము అని అంటున్నావు' మేము అంటే ఎంతమంది అని అడిగారు, మేము అను మాట స్థూలముగ కనిపించింది. అందులోని సూక్ష్మము కనిపించలేదు. అట్లా కాదు, మీరు పొరపాటు అట్ల అనుకోవచ్చు. మేము పది మంది ఇరవైమందికి అని కాదు కనిపించే నేను ఉన్నాను. కనిపించక నా లోపల అన్నీ తెలిసినవాడు ఒకడున్నాడు. అందువలన మేము ఇద్దరము ఉన్నాము.


----

నాకు స్నేహితునిగా పైకి చెప్పేవాన్ని నేను, లోపల పలికించే వాడు ఆత్మే కావున 'మేము' అని చెప్పాము. ఇప్పుడు కూడా మీరు అడిగిన ప్రశ్నకు వాడే జవాబు చెబుతున్నాడు. నేను వాడి ప్రక్కన ఉండి వాడు కదిలిస్తుంటే కదులుతున్నాను. ఇలా ఇద్దరము ఉన్నాము కాబట్టి ఇద్దరము కలిసి చెప్పుతున్నామని చెప్తున్నాను. ఇప్పుడు కూడా మేము ఇద్దరము కలిసి చెప్పుతున్నాము. నన్ను ఒకన్ని అనుకుంటే మీరు పొరపాటుపడినట్లే.


నేను ఒకన్ని ఎప్పుడూ చెప్పలేదు. ఒకన్ని చెప్పాలంటే ఒక విషయము కూడా చెప్పలేను. ఇద్దరము అయితే ఏమయినా చెప్పగలము. ఇప్పుడు మీకు వ్రాసిన గ్రంథములో ఒకచోట ఏమి చెప్పినాను అంటే, మీరు అడిగిన ప్రశ్న మాకు దిక్కు తెలియదుగానీ నాకెందుకు ఈ ఆయణము? వాడు (ఆత్మ) చెప్పుతాడు వినండి అని చెప్పినాము. నన్ను ఆయన ఏమి చెప్పినాడంటే మీరు పొరపాటు పడుతున్నారు. వాన్నని (జీవుడని) ఎందుకు అనుకుంటారు, చెప్పేది నేను అని అన్నాడు. అని ఆత్మ ఏమి చెప్పినాడంటే ఏదేదో అర్థము కాకుండా చెప్పాడు. నీవు చెప్పేది! మాకు అర్థము కాలేదు. నేను అడిగిన ప్రశ్న ఏంది? నువ్వు చెప్పిన జవాబు ఏంది? మాకు ఏమీ అర్థము కాలేదు అంటే 'మూడు' చెప్పితే నీకు అర్థము కాలేదు, 'ఆరు' చెప్పితే నీకు ఎందుకు అర్థము కాదురా అన్నాడు. మూడేంది, ఆరేంది? మాకు అసలు తెలియదు అన్నాను. మూడు అంటే వీడు ఎదురుగా ఉండేవాడు జీవాత్మ, ఆరు అంటే నేను కనపరాని వాన్ని, ఆత్మను నేనే స్వయముగా చెప్పినపుడు నీకు ఎందుకు అర్థము కాలేదు. చెప్పవలసింది నేనే. ఎక్కడ చెప్పినా నేనే చెప్తాను అని చెప్పినాడాయన, అయినా అర్థము కాలేదు వాళ్ళకు. అంటే ఇప్పుడు మీరు కూడా అర్థము చేసుకోండి. ఇది వినేదానికి బాగుంది తరువాత అంతా నేనే అనుకోవద్దండి మీరు. మీరే


---

అనుకుంటే మిమ్ములను వ్రాసుకుంటూ ఉంటాడు. మీ వెనకనే వున్నాడు రాసుకుండే దానికి. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తపడి, మీరు వ్రాయించు కోవద్దండి. వ్రాయించుకొంటే మళ్ళీ అనుభవించాల్సిన పని వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తపడి మా వెనుకల ఇంకోడు వున్నాడు అని అనుకోండి. వెనకాల ఉన్నవాడు? అంటే నీకు ఏమైనా కనిపించినాడా? లేదు. వాడు కనపడరాని వాడు మరి అంతగట్టిగ చెప్పుతున్నావు ఆయనను నీవు చూసినావా? అంటే చూసేదానికి కనిపించడు. మరి అంత గట్టిగ చెప్తున్నావే? అంటే అంత గట్టిగ చెప్పుతున్నావే అని ఈ మాటను అడుగుతున్నది కూడ వాడే. నేను అడుగుతున్నాను బాగ తెలివిగా అని మీరు అనుకోవద్దండి.


ఆ రకంగా వాడు చెప్పేది ఏమంటే నేను ఉన్నాను, నేనే చెప్పుతున్నాను, నేనే మాట్లాడుతున్నాను, మాట్లాడేది నేనే, చేసేది కూడా నేనే, మీరు ఏమన్నా కనుక్కుంటారా? అని అడుగుతున్నాడు. కనుక్కుంటారా ఎవరన్నా? (ప్రతి రోజు) అదే చెప్పుతున్నాను, ఎవరూ కనుక్కోలేదు ఇంతవరకు? ప్రొద్దున లేచినప్పటి నుండి అన్ని నేనే అనుకుంటున్నారు. వాడు ఎవడో మాకు తెలియదులే అనుకున్నారు మీరు. కాని మిమ్మల్ని అంతా నడిపించేవాడు, ఏడిపించేవాడు, నవ్వించేవాడు, ఒకటి కాదు అన్నీ చేస్తున్నది వాడే, ఎవరు? ఆత్మే. ఒకడు వచ్చినాడు, నాకు ఒంటికి సరిగ రాలేదు అని. ఒంటికి సరిగ రాలేదు అంటే ఎవడేం చేస్తాడు దానికి, పోపించేవాడు పోపిస్తే పోస్తావు, నాకేమి? ఒంటికి సరిగ రాలేదు అంటే దానికి కారణము నేనా ఏమన్నా? లేక నీయంతకు నీవు కారణమా? నీవు పోయాలనుకుంటే పోస్తావా? లేదు. ఒకడు బాగ పోస్తాడు, ఒకడు పోయలేడు. వాడు ముక్కి ముక్కి ముక్కి పోస్తావుంటే చుక్క చుక్క చుక్క వస్తావుండాయంట! ముక్కోకుండా పోసేవాళ్ళు ఉన్నారు, ముక్కి పోసే వాళ్ళు ఉన్నారు.


----

ఒకవేళ నీవు తప్పు చేసి ఉంటే నీకు ఆ శిక్ష వేసినాడు. అంతేకదా! కనిపిస్తావుంది నీవు చెప్పేదాన్ని బట్టి. లేకపోతే ఎందుకు రావు ఫ్రీగా? అందరికి వస్తున్నపుడు నీకు ఎందుకు రాలేదు? నీవు ఏదో తప్పు చేసినావు. ఏమి తప్పు అంటే? ఎవరికి తెలుసు? వ్రాసుకున్నవానికి తెలుసు. కాబట్టి ఈ చెప్పుకుండేటి తిప్పలు ఏవన్నా ఉండనీ, అవి నీకు తప్పదు. నిన్ను కష్ట పెట్టినేది ఆత్మ. వాడు ఎందుకు కష్టపెడతాడు? అన్యాయముగ ఏమీ పెట్టడు. నువ్వు ఒప్పుకుని ఉంటేనే వాడు పెట్టివుంటాడు. మరి నీవు ఎందుకు ఒప్పుకున్నావు మొట్ట మొదట. సరే, అప్పుడు తెలిసో తెలియకో ఒప్పుకున్నావు. మరి ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడూ ఒప్పుకోవద్దు. తెలిసో తెలియకో ఒప్పుకున్నావు, అవి రికార్డు అయినాయి వాటిని అనుభవించక తప్పదు కానీ ఇప్పటి నుండి ఒప్పుకోవద్దు నీవు. నాకు అలవాటు అయింది కదా! అంటే వాడు కూడ వ్రాసుకుంటాడు, వానికి కూడ వ్రాసుకోవడము అలవాటు. వానికి అది అలవాటే నీకు ఇది అలవాటే కాబట్టి నీవు ఎందుకు అట్లా అనుకోవాలి? కాబట్టి నీవు అలవాటు తప్పించుకో. తెలియనపుడు నీకు అది వుండవచ్చు, తెలిసింది కాబట్టి ఇప్పటి నుండి అయినా జాగ్రత్త పడు నీవు. ఆ గుడి చుట్టూ 10 ప్రదక్షిణలు తిరిగితే కుదరదు. లేదా ఒక గంట సేపు ధ్యానము చేస్తానంటే నీకు తిప్పలే అవన్నీ. దానివలన నీకు ఏమీ రాదు. మీరు చేసేవాళ్ళంతా ఏమనుకోవద్దండి! మేము ఇంత కాలము చేశాము అంటే అంత కాలము వృథానే మీకది, కానీ ఉండే సూక్ష్మము శరీరము లోపల ఉంది. దానిని తెలుసుకుంటే నీవు బాగుపడగలవు, తెలుసుకోకపోతే అజ్ఞానములో ఉండిపోగలవు. నీవు వెతకవలసింది నీ శరీరములో, బయట కాదు. పూసలు తిప్పి, తిప్పి, తిప్పి పెడితే ఎన్ని పూసలు తిప్పినా కూడ ఏమీ కుదరదు, పూసల్లో కూడా ఏమీ లేదు.


----

అంతరంగములో ఉండేటువంటి విషయాలను మీరు తెలుసుకోండి. అప్పుడైతే మీకు సత్యము తెలుస్తుంది, లేకపోతే కుదరదు అంటే సత్యము తెలియదు.


ఇంతవరకు మనము ఏమి చేసినాము అంటే ఏమి చేసినావు? పొరపాటు పడినావు నువ్వు, తప్పుదారి నడిచావు. కొన్ని సంస్థలు ఉన్నాయి. జ్ఞానము, దేవుడు అని వాళ్ళు చెప్పేది అంతా దాంట్లో ఒక పైసా జ్ఞానము ఉండదు. వాళ్ళేమో అబ్బబ్బబ్బ పెద్ద సంస్థలు, పెద్ద జ్ఞానము అనుకుంటారు. దానిని నమ్ముకొని ఎంతోమంది అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినట్లు వంగమంటే వంగి, లేవమంటే లేచి, లేనిపోని తిప్పలు పడి, చివరికి ఏమీ అర్థము కాలేదు అంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తరువాత కొంతమందికి తెలిసింది. మాకు ఏమీ అర్థము కాలేదు అని, చూడండి మళ్ళీ ఇంత తిప్పలు ఎందుకు! దేవుడు మనకు దగ్గరి దారి ఇచ్చాడు, ఆ దగ్గరి దారిలో మీరు పోండి అని మేము చెప్పుతున్నాము. దగ్గరి దారి

అంటే ఏమిటిది? అంటే లోపల పరిశోధన చేసి తెలుసుకోవడమే. ఆలోచన చేసుకో. బుర్ర ఉంది కదా నీకు. బయటి విషయాలన్నీ కావలసిందేనా, నీకు లోపలి విషయాలు అవసరము లేదా? అవసరమే. మా దగ్గరకు ఒకాయన వచ్చి దేవుని పూజకని ప్రతిరోజు 350 రూపాయలు ఇచ్చిపోతున్నాడంట. నేను దేవున్ని తెలుసుకోవాలి, దేవుని జ్ఞానము కావాలి అని ఆయన అలా చేసేవాడు ఆ విషయము ఒకరోజు మాకు తెలిసింది. ఏమి ఇది అని అంటే ప్రతిరోజు దేవుని పూజ చేస్తున్నాను అన్నాడు. అంటే మేము మంచి పద్ధతే అన్నాము. అంటే నీవు కర్మ లేకుండా పోవాలని, నీవు బాగుపడాలని, జ్ఞానము తెలుసుకోవాలని, దేవునికి దగ్గర కావాలని అనుకున్నావా అని అడిగితే, దానికోసమే పూజ చేస్తా వుండేది అని అన్నాడు. అట్ల అయితే పూజ చేయవద్దు, ఆ డబ్బులు ఖర్చు పెట్టవద్దు.


---

నాకు డబ్బు ఖర్చు పెట్టి చేస్తే మీ పాపాలన్నీ క్షమిస్తానా నేను? ఎప్పుడూ క్షమించను. నేను వ్రాసుకుండేది వ్రాసుకున్నట్లే వుంటుంది అని దేవుడు అంటాడు. ఈ రకంగా నీ శరీరములో ఉండేటటువంటి ఆత్మ నిన్ను శిక్షిస్తుంది, నువ్వు సక్రమముగ వుంటే తరువాత రక్షణ కూడా ఇస్తుంది. శిక్షించడమే కాదు రక్షణ కూడా ఇస్తుంది. ఇదంతా నీ సూక్ష్మగ్రాహిత శక్తి మీద ఆధారపడి వుంటుంది. ప్రపంచ విషయాలు గ్రహించుకోవడానికి ఒకవేళ బుద్ధి నీకు ఉపయోగపడినాగాని, దేవుని విషయాలు గ్రహించు కోవడానికి నీకు ధ్యాస ఉన్నప్పుడే అది గ్రహించుకునేది. నీకు శ్రద్ధ ఉన్నపుడే గ్రాహితశక్తి అనేది ఉపయోగపడుతుంది. దేవుని మీద శ్రద్ధ లేనపుడు ఎంత జ్ఞానము నీ దగ్గరకి వచ్చినా, ఆ జ్ఞానాన్ని ఒలగపోసుకుంటావుగాని నీ తలలోకి ఎక్కించుకోలేవు. ఈరోజు మనము ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అర్హత పొందాలంటే దేవుని మీద శ్రద్ధ పెంచుకోవాలి. శ్రద్ధ పెంచుకోగల్గితే, మనము అసలైన జ్ఞానమార్గములోనికి ప్రవేశించవచ్చు. జ్ఞానమార్గములోకి, ముందుకి పోతే, మనము అసలైన దేవున్ని తెలుసుకోవడానికి అవకాశము ఉంది. దేవుడు ఎప్పుడూ సూక్ష్మమైనటు వంటివాడే. స్థూలమైనటువంటి వాడు కాదు. స్థూలమైనటువంటి వాడు అని అనుకుంటే పొరపాటు పడుతావు. కాని దేవుని విషయాలన్నీ సూక్ష్మతతో కూడుకొని వుంటాయి. దేవుని జ్ఞానమంతా సూక్ష్మముగ వుంటుంది అంటే సూక్ష్మమైన వివరముతో ఉంటుంది. అందువల్ల భగవద్గీతలో ఎన్నో సూక్ష్మమైన విషయాలు ఉన్నాయి. అటువంటి సూక్ష్మాన్ని గ్రహించుకునే శక్తి లేని దానివలన అందులోని విషయాలు మన హిందువులకు తెలియలేదు. క్రైస్తవుల వారి విషయములోకి పోతే అందులో కూడ ఎన్నో సూక్ష్మమైన విషయాలు ఉన్నాయి. అవి కూడా వారికి తెలియనిదానివలన, స్థూలదృష్టే


----

ఉంది కాని సూక్ష్మదృష్టి లేనిదానివలన, ఆ విషయాలు కూడా వారికి తెలియకుండా పోయినాయి. అందువలన అక్కడి జ్ఞానము వారికి తెలియ లేదు.


ఇప్పుడు ఖుర్ఆన్లోకి పోతే అక్కడ కూడా వాళ్ళకు ఎన్నో సూక్ష్మమైన విషయాలు ఉన్నాయి. సూక్ష్మమైన విషయాలను 'ముతషాబిహాత్' అనేటటు వంటి ఒక పదాన్ని చెప్పినారు. ఈ వాక్యాలు చాలావరకు ఎవరికీ అర్థము కావు అని చెప్పాడు. అర్థము కావు అని చెప్పినాడు కదా! అని ముస్లీమ్లు మొత్తానికే వాటిని వదిలి వేసి, స్థూల విషయాలే తీసుకుంటున్నారు. అందువలన దేవుని విషయం మనకు ఏమీ అర్థముకాకుండా పోయింది. దేవుడు సూక్ష్మమైనటువంటి వాడు. సూక్ష్మముగ అర్థము చేసుకుంటేనే మనకు తెలియబడతాడు లేకపోతే ఏమాత్రము తెలియబడడు. ఇంకా మనిషికి అనేక సమస్యలు ఉండుట వలన దేవుడు, దేవుని జ్ఞానము అర్థము కాలేదు. ఒకడు బాకీల్లో ఇరుక్కున్నాడు, ఒకడు రోగాల్లో ఇరుక్కున్నాడు, చాలా కష్టపడి ఉద్యోగములో పడి బాధపడుతున్నాడు, అన్నీ బాగున్నాయి ఇంట్లో భార్యతో బాధపడుతున్నాడు, ఇంకా ఒకరిని అడిగితే ఇంకో బాధ, ఇంకో బాధ, రకరకాల బాధలతో ఇరుక్కున్నాడు. ఇన్ని చిక్కులలో మనిషి తనకులాడు తున్నాడు అంటే దీనికంతా కారణము కర్మ. కర్మ అంటే నీవు చేసుకొన్నది, ఆత్మ వ్రాసినది ఒక గ్రంథ రూపములో ఉంది. దానినే కర్మ చిట్టా అంటారు. నీవు చేసినది ఆయన వ్రాసినది ఎన్నో రకాలుగా ఉంది? అది పెద్ద గ్రంథముగా ఉంది. అది 324 పేజీల గ్రంథముగా యున్నది.


ఒకవేళ ఒక పేజీ అంతా అయిపోయింది అనుకుంటే ఇంకో ప్రక్క పేజీలో చేరుతాది అది. అది ఎప్పటికీ 324 పేజీలుగానే ఉంటుంది.


---

ఒక్క పేజీ కూడా తగ్గదు. కాబట్టి నీ కర్మ అనేది 324 పేజీలుగా ఉంది, 3 అధ్యాయాలుగా 12 అంశాలుగా ఉంది, 36 పాఠాలుగా ఉంది. అర్థమయిందా! దీని మీద ధ్యాస పెట్టుకుంటే, నీ గ్రంథము నీవు చూసుకుంటే, నీ గ్రంథము ప్రత్యేకముగా తెలుస్తుంది. బయట ఎన్ని గ్రంథాలు చదివినా ఈ గ్రంథము నీకు కనపరాదు. అర్థమయిందా! నువ్వు బయట ఎంత చదువు చదివినాగాని దీంట్లో ఉండేటువంటి విషయము తెలియదు నీకు. చిట్ట చివరకు నీ బుద్ధి అంతా ఉపయోగించి, నీ తెలివి అంతా ఉపయోగించి, నీ స్వంత గ్రంథము కర్మపత్రము లేక కర్మ గ్రంథము ఏదైతే వుందో దానిని చదువుకో. దాంట్లో అధ్యాయాలు మూడు, అంశములు 12, పాఠాలు 36, సమాచారాలు 324 ఉన్నాయి. మనకు తెలియకుండా, కర్మ గ్రంథము చాలా పెద్దగ ఉందే అనుకోకుండా చాలా చెప్పిరి వీళ్ళు! అనుకొని, మీరు ఆ గ్రంథము వివరము ము తెలుసుకుంటే నువ్వు కర్మల నుండి బయటపడే అవకాశము ఉంది. లేకపోతే తేనెలో చిక్కుకున్న ఈగ మాదిరి కర్మలో ఇరుక్కోవలసిందే తప్ప బయటపడే దానికి అవకాశమే లేదు. అందువలన మేము ఏమి చెప్పుతున్నాము అంటే సూక్ష్మముగా ఉండేటువంటి కర్మను మీరు తెలుసుకోండి. దానికోసమే మీకు చాలా దగ్గరగా అర్థమయ్యేదానికి “కర్మ పత్రము” అనే గ్రంథాన్ని వ్రాసి ఇచ్చాను. మీరు ప్రతి ఒక్కరు చదవండి. అది చాలా దగ్గరగా అర్థమవుతుంది. చాలా సులభముగ వుందని అనిపిస్తుంది మీకు. దానివలన మీరు జ్ఞానులు అయ్యే అవకాశము ఉంది అని చెప్తూ, మీరు అటువంటి శ్రద్ధ పొందుతారని ఆశిస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.



---

95. అర్థము-అపార్థము

తేది: 02.06.2015

ఈ ప్రాంగణములో ఉన్నటువంటి మనుషులంతా ఇక్కడ చెప్ప బోయేటి విషయాన్ని సక్రమముగా గ్రహించుకోగలరని ఆశిస్తూ, ఇప్పుడు మా ప్రవచనమును ప్రారంభిస్తున్నాము. నేను చాలాసార్లు మీకు అనేక కొత్త విషయాలు చెప్పడము జరిగింది. కానీ అవి నమ్మదగినవిగా కొన్ని ఉన్నాయి, నమ్మలేనట్లుగా కూడా కొన్ని ఉన్నాయి. నమ్మలేని విధముగా కూడ కొన్ని విషయాలు ఉన్నా కానీ, వాటిని నమ్మి తీరవలసిందే, వేరే దారి లేదు. మేము నమ్మము అంటే నమ్మకుండా ఎన్ని సంవత్సరాలైనాగానీ, ఎన్ని యుగాలైనాగానీ అక్కడ ఉండిపోవాల్సిందే. అది నమ్మినాము అంటే మీకు దారి దొరుకుతుంది, వేరే దారి లేనటువంటి విధానాన్నే మేము చెప్పాము ఇక్కడ. తరువాత ఎవరూ చెప్పనటువంటి ఉపమానాలతో (ఉదాహరణలతో) న్నో వివరిస్తూ పోయాము. ఇప్పటికి 102 గ్రంథాలు వ్రాయడము జరిగింది. 102 గ్రంథాల్లోనూ ఏ గ్రంథానికి ఆ గ్రంథము ప్రత్యేకముగా ఉంటూ వచ్చింది.


ఒక గ్రంథములోని విషయము ఇంకో గ్రంథములో ప్రస్తావించు కోకుండా ఆ గ్రంథానికి గల పేరుకు తగినటువంటి విధముగా మీకు అక్కడ అన్నీ కొత్త విషయాలు చెప్పడము జరిగింది. కాని ప్రతిసారి మేము చెప్పుతున్నాము. గ్రహించుకోవడములో మీరు, మేము అనుకున్నంత వేగాన్ని పుంజుకోలేదు అనుకుంటున్నాము. ఎందుకంటే కొందరు చెప్పింది చెప్పినట్టు గ్రహించుకుంటున్నారు, చాలా అరుదుగ కొంతమంది మాత్రమే. మిగతా వారంతా చెప్పిన దాన్ని గ్రహించుకోలేకపోతున్నారు. గ్రహించుకోలేనప్పుడు


----

దానిని గ్రహించుకునే దానికి ప్రయత్నము చేయాలి. నేను ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు చెప్పబడే విషయము ఒకసారి చెప్తాను, రెండవసారి దానిని చెప్పను నేను. దాని తరువాత ఇంకో కొత్త విషయానికి వెళ్ళిపోతాము. మీకు ఆ విధముగా కొత్త విషయాలు అందిస్తూ ఉండాలనేదే మా ఉద్దేశ్యము. కాని చెప్పిందే చెప్పుకుంటూ మేము కాలము గడపము. మీరు వినిందే వినాలి అనేటటువంటి ఉద్దేశ్యము మాకు లేదు. అందువలన మీరు ఒకసారి చెప్పినది గాలికి కలిసిపోదు, రికార్డ్ రూపములో ఉండిపోతుంది, కొంత గ్రంథరూపములో కూడా ఉండిపోతుంది. దానిని మీకు అర్థము చేసుకోగలరని చాలాసార్లు చెప్పాను, కానీ అర్థము చేసుకుండేటటువంటి పరిస్థితుల్లో మీరు లేరు. ఎందుకంటే కొందరు నా దగ్గరకు వచ్చి ప్రశ్నించడము చూస్తే, ఇంక వీళ్ళకు ఎప్పటికీ అర్ధము కాదేమో అనిపిస్తుందన్నమాట.


నేను చాలా గ్రంథాల్లో చెప్పాను. దేవుడు అనే ఆయన ఒకడు ఉన్నాడు. ఆయన ఏమీ చేయడు, మాట్లాడడు కానీ తనకు కావలసిన పనులను మాత్రము నెరవేరేటట్టుగా చేస్తాడు అని చెప్పాము. ఇదే విషయమే ఖుర్ఆన్ గ్రంథములో కూడా ఉంది. ఆయన ఏమనుకుంటే అది అయిపోతుంది, ఆయన ఏమీ చేయడు అని ఉంది. అదే భగవద్గీతలో కూడా ఉంది. అదే బైబిల్లో కూడా ఉంది. ఎక్కడ చెప్పినా ఒకటే మాట ఉంది. కానీ అర్థము చేసుకుంటే అది ఎప్పటికీ ఒకటే మాటగా ఉంటుంది. అర్థము చేసుకోకపోతే వేరే మాటలుగా చలామణి అయిపోతుంది. అందువలన మేము ఏమి చెప్తున్నామంటే ఒకే గ్రంథములో ఒకే విషయమే రెండు రకాలుగా కూడా చెప్పబడింది. ఎక్కడైతే దేవుడు అనుకుంటే వెంటనే అయిపోతుంది, ఆయన ఏమీ చేయడని వ్రాయబడి ఉందో, దాని ప్రక్కనే


---

ఏమి వ్రాయబడి ఉందంటే దేవుడు కొన్ని రోజులు పనిచేసాడు, పని చేసి ఈ సృష్టినంతా తయారు చేసాడు అని కూడా ఉంది. ఈ రెండూ ఒకదానికొకటి భిన్నముగా కనిపించే వాక్యాలు.


ఈ భిన్నముగా కనిపించే వాక్యాలు మీరు పొరపడి ఇక్కడ ఇలా చెప్పినాడు, అక్కడ అట్ల చెప్పినాడు, జ్ఞానమంతా ఇట్లే చెప్పాడేమో! అని అనుకుంటారేమో అట్ల ఉండేదానికి అవకాశము లేదు, ఒకే విధముగా ఉంటుంది. కాని ఇక్కడ కనిపించేది రెండు రకాల వాక్యాలు కనిపిస్తున్నాయి మీకు. దేవుడు పనిచేయడు, దేవుడు పని చేస్తాడు అని. మరి దీనిని ఎట్ల అర్థము చేసుకోవాలంటే, మీరు సూక్ష్మజ్ఞానముతో అర్థము చేసుకోవాలి అని చెప్పాము. దేవుడు కనిపించనటువంటి వాడు. దేవుని జ్ఞానము కూడ కనిపించకుండానే ఉంటుంది. మనము అర్థము చేసుకొనే శక్తిని బట్టి ఉంటుంది. ఎదురుగా ఉండేదయితే మనము దోచుకొని మనము మూట కట్టుకోవచ్చు కానీ జ్ఞానము ఎదురుగా కనిపించేది కాదు. జ్ఞానముంటుంది, మనముందరే ఉంటుందది. అది నీవు గ్రహించుకునేకొద్ది నీకు ఎక్కుతుంది. అందువలన "శ్రద్ధ, బుద్ధి ఉన్నటువంటివాడే దీనిని గ్రహించుకోగలడు” అని అంతిమ దైవ గ్రంథములో చెప్పబడింది. ఒకాయన వచ్చి నన్ను ప్రశ్న అడుగుతున్నాడు అంటే వాళ్ళకు ఏమి అర్థము కాలేదు అనేదానికి ఒక నిరూపణ ఇది.


దేవుడు పని చేయడు అని ఫలానా పేజీలో మీరు వ్రాసారు. పేజీ నంబర్ గుర్తు చేయాల్సిన అవసరము లేదుకానీ, దేవుడు పనిచేయడు అని వ్రాసారే? అని మమ్ములను అడిగితే మేము ఒప్పుకుంటామన్నమాట. నేను ఒప్పుకుంటానో ఒప్పుకోనో అని ఒకాయన ఏమన్నాడంటే, ఒక ప్రశ్న అడుగుతున్నాను నిన్ను? అని, మీరు ఫలాన పేజీలో దేవుడు పని చేయడు,


---

కార్యరహితుడు, ఏమీ చేయనటువంటి వాడు అని చెప్పారు. తర్వాత దేవుడు ఇట్ల చెప్పినాడు, అట్ల చెప్పినాడు అని మిగతా చోట్ల వ్రాసారు. ఇదంతా దేవుడు తయారు చేసినేదే అని అన్నారు. మళ్ళీ అక్కడ చేయడు అని చెప్పారు. మరి ఇక్కడేమో మాట్లాడతాడు పని చేస్తాడు అంటారు. మరి మీ మాట మేం ఎట్లా నమ్మాలి? అని ప్రశ్న వేశారు. మళ్ళా ఆయన ఏమి అడుగు తున్నాడంటే నేను చాలా శ్రద్ధగా వచ్చి అడుగుతున్నాను. మీరు విడి దినాల్లో నా దగ్గరకు వచ్చి కలిస్తే మాట్లాడే దానికి అవకాశముంటుంది, పౌర్ణమిరోజు వచ్చి కలిస్తే నాకు అవకాశము ఉండదు అని చెప్పారు. కాబట్టి నేను విడి దినాల్లోనే వచ్చి మాట్లాడుతున్నానని అన్నాడు. నీకు అవకాశముంది. నీవు అడుగు, ఏమి నీకు అర్థముకాలేదు? అడుగు అంటే, ఆయన ఈ ప్రశ్న అడుగుతున్నాడు, “దేవుడు పని చేయడు అని మీరు అన్నారు. అయితే పని చేస్తాడు అన్నట్లే చెప్పారు కదా! రూప, నామ, క్రియారహితుడని మీరే చెప్పారు. మళ్ళీ ఇంకోచోట దేవుడు ఇట్ల చెప్పినాడు అని మీరే అంటున్నారు. మీరు చెప్పే మాటల్లో ఏది నమ్మాలి? మీరు చెప్పే రెండు విధముల మాటలు అసత్యముగా ఉన్నాయే” అని అడిగాడు. దానికి మేము ఏమంటున్నాము అంటే నా మాట రెండు రకాలుగా కనిపిస్తూ ఉండుట వాస్తవమే. అయితే బాగా అర్థము చేసుకొంటే రెండు విధముల మాటలు సత్యమేయని తెలియుచున్నది.


నేను చెప్పినదే సత్యము అని కాదు, నువ్వు అర్థము చేసుకునే దానినిబట్టి ఉంటుంది. సత్యాసత్యాలు కనిపించవచ్చు కానీ దానికి నేను చెప్పే వివరము ఏమంటే అట్లే చెప్పాలి. దేవుడు పని చేయనటువంటి వాడే. అయితే ఏ దేవుడు అని ప్రశ్నించుకోవాలి. అట్లే దేవుడు పని చేస్తాడు అనుట సత్యమే. అక్కడ కూడా ఏ దేవుడు అని ప్రశ్నించుకోవాలి.


---

దేవుడు అన్న పదము ఒక్కటే అయినా ఆ పదమునకు గల అర్థము ప్రకారము ఇద్దరు దేవుళ్ళు గలరు. అట్లు వివరముగా చూస్తే అందులో

'పెద్ద దేవుడు ఒకడు, చిన్న దేవుడు ఒకడు గలరు. పెద్ద దేవుడు అయిన సృష్టికర్త మాట్లాడడు, పని చేయడు. దేవుడు అనబడే రెండవ వాడు అన్ని పనులు చేస్తాడు. పనులు చేయని దేవున్ని పరమాత్మ అని అంటున్నాము. పనులు చేయు దేవున్ని ఆత్మ అని అంటున్నాము. ఒక దేవుడు పని చేయడు అనుట వాస్తవమే. మరియొక దేవుడు పనిని చేస్తాడు అనుట కూడా వాస్తవమే.


ఏ గ్రంథము చదవకముందు, దైవ గ్రంథములో ఈ విషయము ఉందని తెలియకముందు కూడా నేనదే చెప్పినాను. దేవుడు గొప్పవాడు, దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఎవరికీ తెలియదు. ఆ దేవుడు చెప్పితేనే మనకు తెలుస్తుంది అని చెప్పాము అంటే దేవుడు చెప్తాడా? దేవుడు చెప్పే పరిస్థితిలో లేడు, ఆయన మాట్లాడే పరిస్థితిలో లేడు. ఇంతకు ముందు కూడ చెప్పాము. ఆయన స్వయముగా మాట్లాడడు, మాట్లాడింపచేస్తాడు. ఆయన గుమస్తాల చేత మనకు చెప్పిస్తాడు. అది కూడ ఎట్లా? అని అంటే మూడు రకాలుగానే అని మనము విభజించి కూడ చెప్పాము. అంతిమ దైవగ్రంథములో ఆ మూడు విధానాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అర్థము చేసుకోలేక మేము చెప్పిందాన్ని మీరు ఫలాన చోట ఇట్ల చెప్పారే, ఫలాన చోట అట్ల చెప్పారే అని అంటే అప్పుడు మేము చెప్పేది సరిగా లేదా? మీరు అర్థము చేసుకోవడములో సరిగా లేదా? అంటే మేము చెప్పేది ఖచ్చితముగా శాస్త్రబద్ధముగ ఉన్నది. మీరు తెలుసుకోవడములో సక్రమముగా లేదు, మీ బుద్ధి సరిగా ఉపయోగింపబడలేదు. మీ బుద్ధి సరిగా గ్రహించుకోలేదు. గ్రాహితశక్తి లేదు. గ్రాహిత శక్తి లేనప్పుడు అన్ని ఇటువంటి ప్రశ్నలే వస్తుంటాయి.


----

మేము ఇక్కడ ముందే చెప్పాము. నా దగ్గరికి ప్రశ్న అడిగేదానికి వస్తే, నేను సమాధానము చెప్తాను, చెప్పకుండా ఏమి కాదు. ఇంత జ్ఞానము చెప్పినప్పుడు మీ ప్రశ్నకు మేము జవాబు చెప్పలేమా? ఒక చిన్న పేరును పెట్టి, ఒక గ్రంథమే వ్రాసినప్పుడు, నువ్వు అడిగే ప్రశ్నకు నేను ఎందుకు జవాబు చెప్పలేను? ఒక గ్రంథములో ఎన్నో కొత్త విషయాలు చెప్పగలిగి నప్పుడు, నువ్వు అడిగే చిన్న ప్రశ్నకు జవాబు చెప్పలేనా? చెప్పగలను. అయినాగాని మీరు అన్ని గ్రంథాలు చదివి, అందులో ఏమైనా ప్రశ్న మిగిలి ఉంటే అడగండి అని చెప్పాను. నేను ముఖ్యముగా మరియొక మాట కూడ చెప్పాను, మీరు ఏదైనాగానీ అన్ని గ్రంథాలు చదివిన తర్వాత ఏ ప్రశ్నకైన అందులో జవాబు లేదు అంటే, అటువంటి జవాబు లేని ప్రశ్నను మీరు లేవదీస్తే, ప్రశ్నకు 1000 రూపాయలు ఇస్తాను అని చెప్పినాను. చేతనైతే చూడండి, ఏమన్నా ప్రశ్న కొత్తగా ఉందేమో వెతకండి అని చెప్పాను. ఎక్కడ వెతికినా మీకు ప్రశ్న దొరకదు. ఎందుకంటే ప్రతి ప్రశ్నకు అందులో జవాబు ఉంటుంది. మీ బుర్రకు అందనటువంటి ప్రశ్నలు కూడా నేనే వేసి, అందుకు జవాబు వ్రాసి ఉంటాను. ఆ ప్రశ్న వేయడము కూడా ఎదుటి మనిషి ఎట్ల అడుగుతాడో, జవాబు చెప్పేవాడు ఇబ్బందిపడేటట్లు, ఏ రకంగా అడుగుతాడో, ఆ రకంగానే ప్రశ్న అడిగి, మళ్ళీ దానికి జవాబు చెప్పడము

కూడా జరిగింది.


అటువంటి క్లిష్టమైన ప్రశ్నలు వేసి, దానికి జవాబు చెప్పడము జరిగినపుడు మీరు అడిగిన చిన్న ప్రశ్నకు నేను ఎందుకు జవాబు చెప్పలేను? చెప్పగలను. కానీ అడిగే విధానము సక్రమముగా ఉండాలి. భగవద్గీతలో ఒకచోట దేవుడు ఏమి చెప్పాడంటే, ఈ వాక్యములో దేవుడు అన్నచోట


---

భగవంతుడు అని వ్రాయాలి. కానీ అక్కడ దేవుడు చెప్పలేదు, భగవంతుడు చెప్పాడు. భగవంతుడు ఏమి చెప్పినాడంటే అని చెప్పడము కూడా పొరపాటే. భగవంతుడు కనిపించేవాడే కానీ భగవంతుని లోపల ఆత్మ చెప్పింది అని చెప్పాలి. ఇంతకుముందు ప్రశ్న జవాబుల్లో మీకు అట్లే చెప్పానన్న మాట. గురువు జ్ఞానము చెప్పాడంటే, గురువు అని చెప్పకూడదు లోపల ఉండే ఆత్మ చెప్పింది అని చెప్పాలి. అంటే “నేనే మార్గము, నేనే సత్యము, నేనే గమ్యము” అని ఒక వ్యక్తి చెప్పాడు ఆ మాట, గ్రంథములో చెప్పారు, ఆ మాట ఎవరు చెప్పారు అని ప్రశ్న అడిగితే, ఆ ప్రశ్నకు జవాబుగా మీరు ఆ వ్యక్తి పేరు వ్రాస్తే, అట్ల వ్రాయకూడదు అని చెప్పా నేను. అంటే అప్పటికి ఆ ప్రశ్నకు జవాబు సరిపోతుంది కానీ, ఇంకా లోతుగా ఆలోచన చేసి మీరు ఏమి వ్రాయాలంటే, 'ఆత్మ' అని వ్రాస్తే కరెక్టు అయితుంది, ఆ మనిషి పేరు వ్రాస్తే కరెక్టు కాదు అని చెప్పాను.


ఈ రకంగా మీరు ఏ ప్రశ్నకు అయినా గానీ లోతుగా ఆలోచన చేసి చెప్పమని చెప్పినాను. అట్లే మీరు ప్రతి ప్రశ్నకు జవాబు వెతుక్కోవాలంటే, అర్థము చేసుకోవాలంటే లోతుగా అర్థము చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కూడ ‘దేవుడు ఏమి చెప్పినాడంటే' అని అన్నప్పుడు దేవుడు ఎప్పుడు చెప్పినాడు అని మీరు ప్రశ్న వేసుకోకూడదు. భగవంతుడు చెప్పినాడు అని అనుకోవాలి. భగవంతుడంటే అత్మ చెప్పింది అని అనుకోవాలి. ఇవన్ని లెక్కేసుకుంటే దేవుడు నుండి భగవంతుడనీ, భగవంతుని నుండి ఆత్మ వరకు వెనక్కి పోవాలి, కరెక్టుగా ఆత్మ చెప్పింది అని చెప్పాలి. కానీ అక్కడ ఆత్మే అనుకోకుండా లాస్ట్కు ఎవరు దీనికంతటికీ మూలకర్త, కారకుడు అంటే దేవుడు. ఎప్పుడైతే జ్ఞానము తెలియజేయాలో


--

నేను వచ్చి తెలియజేస్తాను అని అన్నాడు. తరువాత ఇంకో సూత్రము ప్రకారము దేవుని జ్ఞానము దేవునికే తెలుసు, ఇతరులకు ఏ మానవునికి తెలియదు అని చెప్పాము. భగవద్గీతలో ఎప్పుడైతే అజ్ఞానము చెలరేగిందో, ఎప్పుడైతే అధర్మాలు చెలరేగిపోయి, ధర్మము తెలియకుండా పోయిందో, అప్పుడు నేను తిరిగి ధర్మాలను తెలియజేస్తాను అన్నాడు. ఆయన రూప, నామ, క్రియలు లేనటువంటివాడు కదా! అటువంటి ఆయన ఎట్ల తెలియజేస్తాడు? అని ప్రశ్న వస్తుంది. అక్కడ అర్థము చేసుకునే శక్తి ఉండాలి. ఆయన డైరెక్టుగ (నేరుగ) దేవుడు దేవుడిగా వచ్చి ఏం చెప్పలేదు. దేవుడు ఒక మనిషిగా వస్తున్నాడు. అంటే మనిషి వస్తాడా దేవుడు? అని మళ్ళీ ప్రశ్న వస్తుంది.


మనిషి అంటే మనిషి అని కాదుగాని మనిషి ఆకారములో భగవంతునిగా వస్తాడు. మనిషిగానే వస్తాడు, కాని ఆయన మామూలు మనిషి కాదు, వచ్చిన వానిని భగవంతుడు అనాలి. ఎందుకంటే, ప్రపంచములో ఉండేటువంటి జీవరాసులంతా పుట్టేది తల్లిగర్భము నుండే, కానీ బయటికి వచ్చిన తరువాత శ్వాసను పీల్చుకొని అందులో జీవుడు చేరుతున్నాడు తప్ప, ఎవడూ కూడ తల్లి గర్భములో నుంచి సజీవముగా పుట్టలేదు. అది శాసనము. అది భగవద్గీతలో ఉంది. “వాసాంసి జీర్ణాని” అనేటటువంటి శ్లోకములో ఆ విషయము సంపూర్ణముగా ఉంది. తరువాత ఖుర్ఆన్ గ్రంథములో కూడా ఇది 6వ సూరా 95వ ఆయత్లో ఉంది. ఎక్కడ చెప్పినా ఒకటే మాట చెప్తాడు, వేరే చెప్పడు. కానీ ఇక్కడ "దేవుడు చెప్పినాడు” అనే దానిని మనము అర్థము చేసుకుంటే, ఏమని చెప్పినాడు దేవుడు? అని అంటే ఒక సందర్భములో భగవద్గీత జ్ఞానయోగము అనే దాంట్లో ఒకమాట చెప్తాడు.


---

* 34:

తద్ద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ।

 ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానిన స్తత్వ దర్శినః ||


అని అంటాడు. అంటే ఎవరైనాగాని మీరు జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటే “తద్ద్విద్ధి ప్రణిపాతేన" అని అంటాడు. అంటే తన్ను తాను తెలుసుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి పోయి, అంటే యోగి దగ్గరికి పోయి, (తత్వవేత్తలైనటువంటి వాళ్ళదగ్గరికి పోయి “పరిప్రశ్నేన సేవయా” అనగా! వినయ విధేయతలతో నువ్వు సేవలు చేసి, వాళ్ళదృష్ఠి నీ మీదికి మళ్ళించుకొని, ఓ! వీడు నాకు సేవలు చేస్తున్నాడు, నేను వీడికి రుణపడి ఉండకూడదు, వీనికి ఏదో జ్ఞానము చెప్పాలి అనిపించుకొని, నువ్వు వినయ విధేయతలతో ప్రశ్నలు అడుగు అని చెప్పారు. జ్ఞానాన్ని గురించి తెలుసుకునే ప్రశ్నలు అడగాలి. జ్ఞానము దగ్గరికి వస్తే అంత పెద్ద విధానముంది. నీకు జ్ఞానము సక్రమముగా అర్థము కావాలి అంటే మొదట సేవలు చేయి. తర్వాత విధేయతను చేకూర్చుకొని విధేయతతో ప్రశ్నలు అడుగు. అట్ల కాకుండా నువ్వు వేరే రకంగా అడిగితే నీకు వాళ్ళు చెప్పినా అర్థము కాదది, ఫలానా పేజీలో అట్ల వ్రాసినావు మళ్ళీ దీనికి ఎట్ల సరిపోతుంది, నువ్వే అబద్ధము చెప్పినావు కదా! అని నన్నే అడుగుతున్నారు. వాళ్ళకు అర్థము కాకపోయి ఆ రకంగా అడిగితే ఎట్ల చెప్పండి? మీకు అర్థము కానప్పుడు దీనిని మేము ఎట్ల అర్థము చేసుకోవాలి? అని అడగాలి. దేవుడు ఏమి చెప్పాడంటే తాను చెప్పే బోధలు స్థూలముగా ఉంటాయి, సూక్ష్మముగా

ఉంటాయి.


కానీ అర్థము చేసుకునే శక్తిలేనప్పుడు, అర్థము కానపుడు ఎటూ అర్థము కాదది. ఒకచోట ప్రథమ దైవగ్రంథములో ఉండే జ్ఞాన విషయాన్ని ఇంతకు ముందు నేను చెప్పాను. ఇప్పుడు అంతిమ దైవ గ్రంథములో


---

ఉండే జ్ఞానవాక్యము ఒకటి చెప్తాను. 6వ సూరా 91వ ఆయత్లో ఒక విషయము ఉంది. అంటే మీరు హిందువులు కదా! ఆ చెప్పేదేదో భగవద్గీతలోది చెప్పండి అని అంటే నాకు అందరూ సమానమే, అందరిని మనుషులు అని అనుకుంటాను, నేను హిందువులు అని అనుకోలేదు. ఇక్కడుండే వాళ్ళంతా మనుషులు, వాళ్ళు ఏ మతస్థులైన ఉండవచ్చు, వాళ్ళందరికి అర్థము కావాలి. దేవుని జ్ఞానము ప్రపంచానికంతా ఒకటే, మనుషులకు అంతా ఒకటే, కానీ ఒక్కోరికి ఒకటి లేదు. కాబట్టి దేవుడు ఎక్కడ చెప్పినా ఒకటే విధానము చెప్పింటాడు. ఆ పద్ధతి ప్రకారము అంతిమ దైవ గ్రంథములో ఇంతకుముందు నేను చెప్పినట్టే “దేవుడు ఏ మానవుని మీద తన జ్ఞానాన్ని ప్రసరింపచేయలేదు.” అంటే ఏ మనిషి దేవుని జ్ఞానాన్ని చెప్పలేడు అన్నది శాసనము. మనిషి ఎవడూ దేవుని జ్ఞానాన్ని చెప్పలేడు శాసనము అయిపోయిందది. అంటే మళ్ళ ఇక్కడ ఆ గురువున్నాడు, ఇంకోచోట ఇంకో గురువు ఉన్నాడు, ఇంకోచోట ఇంకొకడు ఉన్నాడు, వాళ్ళంతా చెప్పుచున్నారు. ప్రతి దినము జ్ఞానము టీవీలో చెప్తున్నారు, ఇంకోచోట చెప్పుచున్నారు. పెద్ద పెద్ద సభల్లో చెప్తున్నారు, చెప్పలేడని మీరు అంటున్నారే? అని మీరు ప్రశ్న వేయవచ్చు. చూడు, మళ్ళీ ఈ ప్రశ్న కూడ నేనే వేస్తున్నా. కానీ దానికి ఏమి జవాబు అంటే చెప్పిన జ్ఞానాన్ని కంఠాపాఠము చేసుకొని ఎవరైనా చెప్పవచ్చుగానీ కొత్తగా ఎవడూ చెప్పలేడు. చెప్పిన జ్ఞానాన్ని, వినిన జ్ఞానాన్ని లేకపోతే చదివిన జ్ఞానాన్ని కంఠాపాఠము చేసుకొని, తిరిగి జ్ఞాపకము చేసుకొని, ఎవరైనా మళ్ళీ ఇతరులకు బోధించవచ్చు కాని, మామూలుగా మనుషులు మనుషులకు చెప్పవచ్చుకానీ, తనకు తెలియనటువంటి జ్ఞానాన్ని స్వయముగా ఎవ్వడూ చెప్పలేడు. మానవునికి తెలియనటువంటి జ్ఞానము, ధర్మాలతో


----

కూడుకున్నటువంటి జ్ఞానము, శాస్త్రబద్ధమైన జ్ఞానము చెప్పేది ఒకే ఒక దేవుడు. దేవుడు చెప్పినదే ఇంతవరకు మనిషికి అర్థము కాలేదు. అటువంటి మనిషి క్రొత్తగా ధర్మములను చెప్పగలడా?


మొదట దేవుడు చెప్పితే అది మనకు తెలియబడుతుంది. తెలియబడిన తరువాత అది మనకు తెలియకుండా పోయిందనుకోండి, మళ్ళీ ఆయనే చెప్పాలి, ఇంకొకరు చెప్పేదానికి అవకాశము లేదు. అందువలన అక్కడ ఏమి చెప్పినాడంటే “ఏ మానవమాత్రుని మీద దేవుని జ్ఞానము ప్రసరింపచేయలేదు.” ఏ మానవుడు మీకు జ్ఞానాన్ని అందివ్వడు. అక్కడికి శాసనమది. ఇదే విషయమ 3వ సూరా 7వ ఆయత్లో చెప్పబడింది. మళ్ళ ఇదే విషయాన్నే అక్కడ 6వ సూరా 91వ ఆయత్లో కూడ చెప్పారు. 3వ సూరా 7వ ఆయత్లో ఏం చెప్పారంటే “దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మానవునికి తెలియదు”. అంటే ఏ మనిషి చెప్పలేడు అని చెప్పేసినాడు. అయితే మనిషి చెప్పలేనప్పుడు, ఇప్పుడు మీరంతా మనుషులే కదా! అంటే మనమంతా మనుషులమే. మనము చెప్పుకుండేది జ్ఞానము అయితాది కదా! అని అంటే అది కాదనే కదా నేను చెప్పుతావుండేది. ఎక్కడైతే క్రొత్త జ్ఞానము తెలియబడుతుందో అక్కడ మనిషి రూపములో ఉండే దేవుడు చెప్తాడు కానీ మనిషి చెప్పలేడు. మనిషి రూపములో ఉండే దేవుడు చెప్తాడు. వాడు ప్రత్యేకముగా వచ్చిన మనిషి, అతను మామూలు మనిషి కాదు. ఆయనను “భగవంతుడు” అని ప్రత్యేకమైన పేరు పెట్టి మనము పిలుస్తాము. భగవంతుడు ఏ జ్ఞానాన్ని అయినా కొత్త జ్ఞానాన్ని చెప్పగలడుగాని మనిషి ఎవడూ చెప్పలేడు. మరి అక్కడ దేవుడు చెప్పినాడా? అంటే దేవుడు నేరుగా చెప్పలేదు. భగవంతునిగా వచ్చి చెప్పుచున్నాడు.


---

నా జ్ఞానము నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు అన్నప్పుడు, దేవుడు తరపున చెప్పేవాన్ని పెట్టాడు. చెప్పేవాన్ని ఎవరిని పెట్టాడో మనకు తెలియదుకాని అక్కడి నుంచి ఒక మనిషి వచ్చి చెప్తాడు మనకు. వచ్చేవాడు మనిషే. ఎందుకంటే మనము మనుషులము కాబట్టి వాడు మనిషిగ ఉండి, మరి మనుషులు మాట్లాడే భాషలో మాట్లాడితేనే మనకు అర్థమయ్యేది లేకపోతే అర్థము కాదు కాబట్టి ఆ రకంగా వస్తే మనిషే వచ్చి చెప్పాల్సిన పని వస్తుంది. అట్లా వచ్చిన మనిషి, వాడు మనిషేనా? అంటే మనిషి కాదు. వాడు దేవుడా? అంటే దేవుడు కాదు, మనిషి కాదు. మరి ఏమనాలి వాన్ని? అంటే భగవంతుడు అనే ముచ్చటైన పేరు పెట్టాము మనము. ఎందుకు అంటే మనుషులు పుట్టినట్టు వాడు పుట్టలేదు. వాడు మనుషులు వచ్చినట్లు బయటికొచ్చిన తరువాత ప్రాణము రాలేదు, తల్లిగర్భములో నుంచి సజీవముగా వచ్చినాడు కాబట్టి భగము నుంటి పుట్టినటువంటి వాడు భగవంతుడు అని పేరు పెట్టాలి. మనుషులెవరూ భగము నుండి పుట్టలేదు, ఏ జీవరాసి పుట్టలేదు కాబట్టి భగవంతుడు అని ఎవరినీ అనేదానికి అవకాశము లేదు. ఎవరిని భగవంతుడనాలి? దేవుడు తన ఆత్మను ఊది తన ప్రతినిధిని పంపించినప్పుడు మనము అట్ల చెప్పాలి. 15వ సూరా 29వ ఆయత్లో ఇదే విషయము చెప్పినాడు. నా ప్రతినిధిని పంపిస్తున్నాను. ప్రతినిధి అంటే? ఒక పేపరును జిరాక్స్ మిషన్లో పెట్టి తీస్తే ఏమైతాది? అంటే ప్రతి కాపీ వస్తుంది, అది వేరు ఇది వేరు. ఒరిజినల్ ఉంటుంది, ఒరిజినల్ మాదిరే ఇంకోటి వస్తుంది, కలిపితే ఏదో కనుక్కోలేము మనము. ఒరిజినల్ మాదిరే ఉంటుంది కానీ ఒరిజినల్ కాదది. ఇది డుప్లికేటే, ఇది జిరాక్స్ కాపీనే, కాని ఉండేదంతా? అందులో ఉండేదే ఇందులో ఉంటుంది, వేరేది ఏముండదు, అందులో ఏ సమాచారము ఉందో ఇందులో అదే

లేదు.*

---

సమాచారము ఉంటుంది. అప్పుడు మనము ఏం అనాలి? అది ఇది రెండు సమానమే అని చెప్పాలి. దానిని చదివినా ఒకటే, దీనిని చదివినా ఒకటే, ఏమంటే ఒరిజినల్ కనపరాదు, ఇది మనకు కనిపిస్తుంటుంది.


ఆ రకంగానే దేవుడు కనిపించడు, దేవుని తరుపున వచ్చినటువంటి వ్యక్తి కనిపిస్తాడు. ఆ దేవుని తరుపున ఎవరు వచ్చినారు? అంటే ఇంకొకడంటూ లేడు కాబట్టి, దేవుడంతటి వాడు ఎవడూ ప్రపంచములో లేడు కాబట్టి, దేవునితో సమానము ఎవడూ లేడు కాబట్టి, ఇంకొకడు వచ్చేదానికి అవకాశము లేదు, దేవుడే వస్తాడు అని చెప్పాలి. దేవుడే వస్తాడు అని చెప్పడానికి ఆయనను మనము కనుక్కుంటామా అంటే కనుక్కునే దానికి లేదు, ఎందుకంటే, వాడు మారువేషములో వస్తాడు. వాడు ఫలానోడు దేవుడు అని నువ్వు చెప్పేదానికి అటువంటి అవకాశము కూడ లేదు. కానీ ఎట్ల వస్తాడో వస్తాడు. ఏదో ఒక రూపములో వస్తాడు. నువ్వు గుర్తు పట్టని విధముగ ఆయన తన జ్ఞానాన్ని మనకు చెప్పిపోతాడు. ఎవడూ గుర్తించలేడు. భగవంతుడు తనంతకు తాను నేను దేవున్నేరా! నిన్న గాక మొన్న వచ్చినాను! అన్నా కూడా ఎవరూ నమ్మరు. నేను వస్తానని భగవద్గీతలో చెప్పినాను, ఇంకోచోట చెప్పినాను అట్లే నేను వచ్చినానని చెప్పినాగాని ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నాకు తెలుసులేవయ్యా! మొన్న మూడేండ్ల కిందట నేను నిన్ను చూసినా, అక్కడ గుడ్డలు లేకపోతే నీవు పంచె మాత్రము కట్టుకొని తిరగలేదా, నువ్వు దేవునివా? అంటారు. భగవంతునికి అటువంటి పరిస్థితి వచ్చి ఉంటాది, అది చూసింటాడు వీడు, ఇంక అది పెద్ద లోటుగా కనిపించింది, ఇంక అయిపాయ, ఆ సంఘటనతో వీడు దేవుడు కాదు అని కొట్టేసి ఉంటాడు. ఈయన అట్లే చేస్తాడు కనుక్కోకుండా, ఏదైతే వానికి గట్టిగా కనిపిస్తాదో అదే చేసి ఉంటాడు. అట్లాంటిది కనిపించింది అనుకో,


---

వాడు ఎలా నమ్ముతాడు ఇంక. వానికేమన్నా చెప్పు. వాడు నమ్మడు. మనుషులలో ఇటువంటి పరిస్థితి ఉంటుంది.


మళ్ళి ఏదన్నా కిందపడినప్పుడు మోకాలుకి దెబ్బ తగిలి ఉంటుంది, మళ్ళి నువ్వు క్రింద పడినది చూసాను, మోకాలుకు దెబ్బ తగిలింది చూసాను, ఆసుపత్రికి పోయినది చూసినా, అన్ని చూసినా, నువ్వు దేవునివి అంటే ఎట్ల నమ్ముతా నేను అంటాడు. ఇట్లా ఎవని చట్టము ప్రకారము వాడు మాట్లాడుతాడు కాని వాడు తెలుసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. కాని దేవుడు ఏమి చెప్పాడు, ఏ మానవ మాత్రుని మీద నా జ్ఞానాన్ని ప్రసరింపజేయను అని అన్నప్పుడు ఏ మనిషి జ్ఞానము చెప్పడని మనము అర్థము చేసుకోవాలి. ఈ విషయాలు చాలాసార్లు చెప్పాను నేను, మళ్ళీ ఇప్పుడు లోతుగా చెప్పుతున్నాను, వినండి. ఇటువంటి సమస్యే వచ్చింది. ఈ మధ్య కాలములో, ఒకచోట తర్కము వచ్చిందన్నమాట. దేవుడు పుట్టడు అని వాళ్ళంటే, పుడతాడు అని మనము అన్నాము. అక్కడ తర్కము జరిగినపుడు అక్కడ ఏమి జరిగిందని చెప్పాల్సిన పని వస్తుంది. అందుకు వాళ్ళ గ్రంథములో ఉండేటి ఈ విధానాన్ని చెప్పాల్సిన పని వచ్చింది. ఏం చెప్పినాము? 6వ సూరా 91వ ఆయత్లో ఉండేటువంటి జ్ఞానము ప్రకారము “దేవుడు ఏ మానవ మాత్రుని మీద తన జ్ఞానాన్ని ప్రసరింప చేయలేదు.” తన జ్ఞానాన్ని ఏ మనిషి చెప్పేదానికి అవకాశము లేకుండా చేశాడు. ఏ మనిషీ దేవుని జ్ఞానాన్ని చెప్పలేడు, అయిపోయిందింక. ఇంకది వ్రాసుకొని, ఏ మనిషి దేవుని జ్ఞానాన్ని చెప్పలేడని దేవుడే చెప్పినాడు కదా! కాబట్టి మనిషి చెప్పేదంతా దేవుని జ్ఞానము కాదు అనంటే ఎవడేం చేస్తాడు దానికి? అట్లే అనుకో పో, మాకేమి? మీకు అట్ల అర్థము కావాలని ఉంది, అట్లే అర్థమైంది.


--

ఏ మనిషి చెప్పినా దేవుని జ్ఞానము కాదు అనంటే కరెక్టే. మేము చెప్పేది కూడా అదే. మళ్ళ కృష్ణుడు చెప్పినేది దేవుని జ్ఞానము ఎట్ల అయితాది? ఆయనా మనిషే కదా అంటే, ఆయన మనిషే. మరి ఆయన చెప్పినేదే జ్ఞానము, మీరు అది వినండి, అదే ప్రథమ దైవ గ్రంథము అని మీరు ఎందుకు చెప్పుచున్నారు? అని ప్రశ్న వేస్తే ఎవరేం చేస్తారు దానికి? ఈ ప్రశ్న వేసేవాడెట్లుంటాడంటే వానికి తెలియదు, వాడు తెలుసుకోవాలనే ఉద్దేశ్యముతో వచ్చి అడిగితే, ఫరవాలేదంట. కానీ, అట్ల కాదు, ఎదుటి వాన్ని తప్పులే పట్టాలి అన్న ఉద్దేశ్యముతో వస్తారంట కొంతమంది. ఎదుటి వాన్ని నువ్వు తప్పు చెప్పినావు అని నిరూపణ చేయాలి కదా! అలా చేయరు. నేను తెలుసుకోవాలి అని కాదు, వాన్ని తప్పుపట్టి చూపించాలి. వాని తప్పు నేను పట్టుకున్నాను అని తెలియాలి. వాని తప్పును పట్టుకునే అంతటి వానిని నేను, అని తప్పును పట్టుకునే దానికి, తప్పునే వెతుక్కుంటూ వస్తాడు

అంటారు.


అందుకే ఒక కవి చెప్పినాడు. నేను ఈ సభలో చెప్పొచ్చో చెప్పకూడదో కాని నాకేమి బిడియము లేదు, నేను చెప్తాను అది. 'నక్కలు బొక్కలైతుకు, కుక్కలు కుండలెతుకు, తప్పుడు నా లంజ కొడుకులు తప్పులే వెతుకు' అని ఒక పద్యమును కవి చౌడప్ప చెప్పాడు. వానికి ఏమి పని లేదంట. నక్కలు బొక్కలు వెతికినట్టు అంటే ఇక్కడ పదము సరిపోలేదుకాని కొన్ని ప్రాంతాలకు, బొక్కలు అంటే రంధ్రాలు అని. అంటే పద్యము అట్లే ఉంటుంది. రంధ్రాలు అని అర్థము చేసుకోండి మీరు, ఇంకో రకంగా అర్థము చేసుకోవద్దండి. ఎందుకంటే, ఉత్తరాంధ్ర ప్రాంతములోకి పోతే ఈ మాట చెప్పినాము అంటే ఇంకో రకంగా బూతు పదము అయిపోతుంది కానీ బూతు పదంగ అర్థము చేసుకోవద్దండి, రంధ్రము అని దాని అర్థము.


---

నక్కలు రంధ్రాలు వెతుకుతాయి అనే బదులు ఆ రకంగా చెప్పారు నక్కలు రంధ్రాలు వెతుకుతాయంట. కుక్కలు ఏమి చేస్తాయంటే అవి ఎక్కడ ఏమి దొరుకుతాయని కుండలు వెతుకుతాయంట. ఇక తప్పుడు ముండా కొడుకులు తప్పులే వెతుకుతా ఉంటారంట, ఇంకా ఏమి లేదు వానికి పని. ఆ రకంగానే కొంతమంది ఏమి చేస్తారంటే తప్పులు వెతికేదానికే వస్తారు. నిజము తెలుసుకోనేదానికి రారు.


అందువలన మేము ఏమి చెప్తున్నామంటే దేవుడు చెప్పిన విషయాన్ని అర్థము చేసుకోండయ్యా! ఇక్కడ చెప్పే జ్ఞానము ఎంతో ఉన్నతమైన జ్ఞానము, వేరేచోట చెప్పేదంతా ఉన్నతమైన జ్ఞానము కాదు. అక్కడ 'వాలి' తోక దగ్గర పుట్టాడు. ద్రోణుడు గిన్నెలో పుట్టినాడు, కర్ణుడు చెవిలో పుట్టినాడు, ఇంకోడు ఇంకోచోట పుట్టాడు, ఇంకోడు ముక్కులో పుట్టాడు, కంట్లో పుట్టాడు అన్ని నమ్మేస్తారు. మేము ఒరిజినల్గా ‘జనన మరణ సిద్ధాంతము’ చెప్పితే నమ్మరు. మనిషి బయటికి వచ్చిన తర్వాతనే జీవము వస్తుంది అంటే నమ్మరు సత్యము మేము చెప్పితే నమ్మరు. ఇంకోచోట ఏమి చెప్తారంటే, ఒక గురువు వస్తాడు ఒక స్టేజీ మీదికి ఒక కుక్కను పెట్టి, ఇది పంది అంటాడు దానిని, కనిపిస్తా ఉండేది కుక్కే, మా గురువు చెప్పినాడుగా కాబట్టి పందే అంటారు వాళ్ళంతా. కుక్కను పంది అని చెప్పితే పంది అని నమ్ముతారు. పందిని తీసుకొచ్చి ఏనుగు అని చెప్పితే అది కూడా నమ్ముతారు. మా గురువు అంత లేనిది చెప్పడు, అది ఏనుగే అంటారు. మేము ఉన్నది ఉన్నట్టు సత్యము చెప్పితే ఎందుకు నమ్మరయ్యా మీరు! మళ్ళీ ఇన్ని ప్రశ్నలు ఎందుకు వేస్తారు, ఎందుకు అర్థము కాదు అని అంటే, దానికి జవాబుగా ఇలా కలదు. దేవుడు ఆ రకంగా వాళ్ళను తీర్పు తీర్చి పంపాడు. వీళ్ళకు జ్ఞానము అర్థము కాకూడదు అనే ఉద్దేశ్యముతోనే అలా చేశాడు. అంతిమ


---

దైవగ్రంథములో! వాళ్ళకు అర్థము కాకుండా చేస్తాను అని చెప్పినాడు. భగవద్గీతలో చెప్పలేదా? దైవాసుర సంపద్విభాగ యోగములో "జ్ఞానము యొక్క గట్టు కూడ దొరకకుండా చేస్తాను” అని చెప్పినాడు.


ఏమాత్రము అర్థము కాకుండా చేయాలనే ఉద్దేశ్యముతో వాళ్ళకు ఆ రకంగా అర్థమయ్యేటట్లు చేసి, మనవన్ని తప్పులే అనేటట్లుగా చేస్తాడు, వానికి ఏమాత్రము జ్ఞానము అర్థము కాదు. అందువలన వానికి ఆ రకంగానే గ్రహించుకునేటట్లు చేస్తాను అని చెప్పినాడు. ఇప్పుడు దేవుడు గ్రంథములో ఒక వాక్యము చెప్పితే ఆ వాక్యము మనము గ్రహించుకోవడములో చాలా పొరపాటుపడుతున్నాము అనే దానికి గుర్తుగా ఇంతకుముందు ఉదాహరణగా ఒక విషయాన్ని చెప్పాము. ఒక గురువు చెప్తున్నాడంట ఇద్దరు శిష్యులను పిలిచి. వాళ్ళకు జ్ఞానమంతా చెప్పిన తరువాత మీరు జ్ఞానము వినేదంతా అయిపోయింది. కొన్ని సంవత్సరాల నుంచి నా దగ్గరున్నారు మీరు, జ్ఞానమంతా తెలుసుకున్నారు, క్రొత్తగా వచ్చినవాళ్ళు తెలుసుకోవాల్సిందే కానీ మీరు సంపూర్ణముగా తెలిసినటువంటి జ్ఞానులైపోయారు. రేపు రండి మీకు సెలవు దినము ప్రకటిస్తాను అన్నాడంట. అంటే మీకొక శుభదినము చూసి ఇక్కడికి రావాల్సిన పని లేదు అని చెప్తానన్నాడు అంటే అప్పుడు ఇక్కడి నుండి మీరు పోవచ్చు అని చెప్పినాడంట.


సరే, గురువు గారు పొమ్మని చెప్పుచున్నారు. మనము పోదాము అని చెప్పి, వీళ్ళు ఏమి చేసినారంటే కరెక్టుగా గురువు గారు చెప్పిన సమయానికి వీళ్ళు వచ్చారంట. మంచి సమయము చూసి చెప్తా అన్నాడు కదా ఆయన. ఉదయము 6 గంటలకు రమ్మంటే, వాళ్ళు 6 గంటలకు వస్తే, ఉదయము ఆరు గంటలకు సమయము చూసుకొని, వాళ్ళిద్దరిని పిలిచి, ఆయన ఏం చెప్పినాడంటే “పో రా పో” అన్నాడంట. అంటే ఇద్దరు


---

పోయినారు. పోయిన తరువాత ఒకరికి ఏమి అర్థమైందంటే ఒకే మాటే 'పోరా పో, ఇంక రావద్దు ఇక్కడికి' అని గురువు అన్న తరువాత వాడు గురువు దగ్గరికి మళ్ళీ రాలేదు. అందులో ఒకడేమన్నాడంటే ఇన్ని రోజులు జ్ఞానము తెలుసుకున్నాము కదా! ఏం, అప్పుడప్పుడు వచ్చి పొమ్మని చెప్పొచ్చు కదా! “పో రా పో” అని గద్దించి పంపించినాడు అని ఒకడనుకున్నాడు. ఇంకొక శిష్యుడు ఏమనుకున్నాడంటే మొదట 'పో' అన్నాడు, తరువాత 'రా' అన్నాడు, మళ్ళీ 'పో' అన్నాడు. ఇట్ల మూడు అక్షరాలు చెప్పినాడు కదా! పోవాలా, మళ్ళీ రావాలా, మళ్ళీ పోతుండాలి, ఇదే మన పని అనుకున్నాడు. వాడేమి చేసాడంటే ఈ రోజు పోయినవాడు మళ్ళీ మరునాడు గురువు దగ్గరికి పోయినాడు, మళ్ళీ అవతల మరునాడు పోయినాడు. ఈ విధముగా ఒకడు రావడము పోవడము, రావడము పోవడము చేస్తున్నాడు. ఇంకొకడు మాత్రము రాలేదు. గురువు ఏమి అనుకున్నాడంటే, ఒకడేమో

కరెక్టుగా వస్తున్నాడు, నేను అంత జ్ఞానము చెప్పితే వాడు అసలు నా దగ్గరికి రాకుండా పోయినాడు అని, ఆ గురువు ఏమి చేసాడంటే, ఓ 30 ఏళ్ళ తరువాత తీరిక చూసుకొని నేను ముసలోణ్ణి అయిపోయినాను, నా శిష్యున్ని చూడక చాలా రోజులైంది అన్ని రోజులు జ్ఞానము చెప్పితే వాడు రాలేదు, పోని నేనన్నా పోదాము అని వెతుక్కుంటూ పోయి, శిష్యున్ని అడిగినాడన్నమాట. ఏరా నీకింత జ్ఞానము చెప్పితే నువ్వు మళ్ళీ రాకుండా పోయినావు. వాడేమో నా దగ్గరికి వచ్చి పోతున్నాడు, నీవు ఏమాత్రము రాకుండా పోయినావే! అని అడిగాడు. అప్పుడు ఆ శిష్యునికి కోపము వచ్చిందంట. ఆ రోజు 'పో రా పో' అని చెప్పి, మళ్ళీ ఇప్పుడు నన్ను రాలేదని అడుగుతావా నువ్వు అని వానికి కోపము వచ్చి, ఒకటే వేటు గుద్దినాడు,


----

గురువు చచ్చిపోయినాడు. ఏమి అంటే వానికి కోపము వచ్చిందంట. ఎందుకూ అనంటే నన్ను రావద్దు అని చెప్పి మళ్ళీ రమ్మన్నాడు అని. రావద్దని చెప్పినాడా?పోయి రమ్మన్నాడా! పొమ్మన్నాడు రమ్మన్నాడు. మళ్ళ నా దగ్గరుంటే నువ్వు కాపురము చేసుకునేది ఎట్ల? అందుకనే 'పో' అన్నాడు, మళ్ళీ 'రా' అన్నాడు. అలా 'పో రా పో' అన్నాడు. ఆ మూడు అక్షరాలకు అర్థము తెలియకుండ, వాడు ఇంకో రకంగా అనుకున్నాడు. వీనికి ఇంకో రకంగా అర్థమైంది అంటే మనిషి అర్థము చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది. అంటే ఒక శబ్దమే వానికొక రకముగా అర్థమైంది, వీనికో రకముగ అర్థమైంది. అంటే మనిషి అర్థము చేసుకునే దానిని బట్టి ఉంటుంది. అంటే ఒకే శ్లోకమే ఒక్కోనికి ఒక రకముగా అర్థమవుతుంది. ఒకే వాక్యమే ఒక్కోరికి ఒక్కో రకముగ అర్థమవుతుంది. ఇప్పుడు మనము తిరిగి ఇక్కడికి వస్తాము. ఎక్కడికి? 6వ సూరా 91వ ఆయతిలో దేవుడు ఎం చెప్పాడు అంటే ఏ మానవునికి జ్ఞానము చెప్పలేదు. అంటే ఏ మనిషి కూడా దేవుని జ్ఞానాన్ని చెప్పలేడు అని మనకు అర్థమైపోయింది. తరువాత ఇంకొక వ్యక్తి ద్వారా మీకు ఒక గ్రంథాన్ని ఇచ్చాను అని అన్నాడు. అంటే మూసా అనే వ్యక్తి మీకు తౌరాత్ అనే గ్రంథాన్ని ఇచ్చాడు. దాంట్లో జ్ఞానము ఉంది, మార్గదర్శకత ఉంది. మానవుడు ఎలా నడవాలో దారి చూపించే విధానము అందులో ఉంది. కాని మీకుగాని, మీ పెద్దలకుగాని ఈ విషయము అర్థము కాలేదు. ఆయనే చెప్పాడు అర్థము కాలేదు


అందులో జ్ఞానజ్యోతి ఉంది, మార్గదర్శకత ఉంది అయినా మీకు అర్థము కాలేదు. అందుకని దానిని మీరు కాగితాలు కాగితాలుగా చించుకొని చదువుకుంటున్నారు. మూసా ఇచ్చినటువంటిది ఒక గ్రంథమే. తౌరాత్ అనే గ్రంథాన్ని చించుకొని చదువుకుంటున్నారు. నా కాగితము ఇది, నీ


-----


కాగితము అది అని. కాని దానిలో జ్ఞానము ఉంది అది నీకుగాని, నీ పెద్దలకుగాని అర్థము కాలేదు అని చెప్పి తరువాత ప్రశ్న వేశాడు ఆయన. దానిని ఎవరు ఇచ్చినట్టు? అని అన్నాడు. ఎవరిచ్చినట్టు ఏంది? ఇంతకు ముందే చెప్పినాము మూసా ఇచ్చినాడు. మళ్ళీ ఆ గ్రంథాన్ని మీకు ఎవరు ఇచ్చినట్టు? అని ప్రశ్న వేసాడు. అక్కడేమో మొదట ఏ మనిషి జ్ఞానము చెప్పలేడని చెప్పాడు. రెండో పదములో మూసా అనే వ్యక్తి తౌరాత్ గ్రంథాన్ని ఇచ్చాడు అంటే ఇస్తే ఇచ్చుకోనిలే దండిగా ఇస్తుంటారు ప్రజలకు అని మనము అనుకునేదానికి అలా కూడ కాకుండా అందులో జ్ఞానము ఉంది, మార్గదర్శకత ఉంది, దానిని మీరు చింపుకొని చదువుకుంటున్నారు, మీకుగానీ, మీ పెద్దలకుగానీ ఎవరికీ అర్థము కాలేదు అని చెప్పినారు. అంటే మనుషులు చెప్పిన జ్ఞానములే మనకు అర్థము కాకపోయినా ఫరవాలేదు అని మనము అన అందుకనే అక్కడ అదే వాక్యములోనే మళ్ళీ ఆయనే ఈ గ్రంథాన్ని మీకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్న వేసాడు. అల్లాహ్ మీకు ఇచ్చాడు అని అక్కడ వ్రాయబడి ఉంది అంటే దేవుడే మీకు ఇచ్చినాడు అని. ఇక్కడేమో దేవుడే ఇచ్చినాడు అని అన్నాడు కదా, అక్కడేమో 'మనుషులకు ఎవ్వరికీ ఇవ్వను అని చెప్పినాడు కదా, మరి ఇచ్చినది మూసా అనే మనిషికే కదా, దానిని మీరు ఎట్లా అర్థము చేసుకోవాలి? నన్ను ప్రశ్న వేసిన వాళ్ళు ఎవరైతే వున్నారో వాళ్ళు ఈ వాక్యాన్ని అర్థము చేసుకోండి చూస్తాము. మీరు ఎంత ప్రయత్నము చేసినా అర్థము కాదు.


ఒకవేళ మేము చెప్పినా కూడా మీకు అర్థము కాదు. ఎందుకంటే దేవుడు ఏ మనిషికి జ్ఞానము ఇవ్వను అన్నాడు కదా! మళ్ళీ మనిషికి ఇచ్చిన దానిని నేనే ఇచ్చినాను అని అన్నాడు కదా! అంటే దేవుడే ఆ గ్రంథాన్ని

---

ఇచ్చినాడు అని అన్నాడు. ఇప్పుడు ఆ మనిషిని అంటే 'మూసా'ని ఎవరని అనుకోవాలా? మనము. 'దేవుడు' అని అనుకోవాల్సిందే ఇంక వేరే దారి లేదు. మనిషి దేవుడు కాదు కదా! అంటే కాదు. కరెక్టే ఆ మాట. మూసాను 'దేవుడు కాదు' అని అనుకోవాల్సిందే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ‘అతను దేవుడే' అని అనుకోవాల్సిందే. అదేందయ్యా! ఇక్కడేమో కాదు అంటావు, అక్కడేమో అవునంటావు అంటే అక్కడే ఉంది సందిగ్ధము. జ్ఞానము అక్కడే ఉండేది. నువ్వు ఎట్లు అర్థము చేసుకుంటావో ఇట్లే అర్థము చేసుకో, రెండు దారుల్లో పెట్టి ఇరికించి, నీ ఇష్టాన్ని బట్టి నిన్ను రప్పించేటట్టు చేయించినారు. దారులు నేనే కల్పించా. ఏ మానవ మాత్రునికి జ్ఞానాన్ని అందివ్వను అన్నప్పుడు మనిషి ఇచ్చిన జ్ఞానమే నాది అన్నాడు, నేనే ఆ జ్ఞానాన్ని ఇచ్చాను అన్నాడు. అప్పుడు మనము ఈ మాటను నమ్మితే మూసా దేవుడు అయితాడు, మళ్ళీ ఆ మాటను నమ్మితే మూసా దేవుడు కాడు. ఒకే వాక్యములో ఉంది ఈ విషయము ఉందా? లేదా? చెప్పండి. కావాలనే రెండు రకాలుగా అర్థము కావాలనే చెప్పాడు. రెండు రకాలుగా అర్థంకావాలి? ప్రశ్న రావాలి మీకు? అప్పుడు గ్రహించుకునేటువంటి బుద్ధి ఉండగల్గినవాడు ఎవడైతే ఉంటాడో దానిని గ్రహించుకొని నా మార్గములోకి రాగలడు. గ్రహించు కోలేనోడు పక్క దారిలోకి పోతాడు, అని దేవుడు ఏమి చేసాడంటే ముందే నేను మంచి మార్గములోకైనా పంపగలను, చెడు మార్గములోకైనా పంపగలను మిమ్ములను అంటే మళ్ళీ ఎందుకు దేవుడు అంత కక్షకట్టుకొని చేస్తాడు? అని అంటే నాకు కక్ష లేదయ్యా! మీ ఇష్టాన్ని బట్టి మీకు ఎంత శ్రద్ధ ఉందో ఆ శ్రద్ధను బట్టి. మీరు గ్రహించుకునే శక్తిని బట్టి. మీకు ఇస్తాను. మీకు స్వయంగా ఇచ్చాను. అర్థము చేసుకోమని నేను చెప్పుచున్నాను. మీరు అర్థము చేసుకోకుండా ఇష్టము వచ్చినట్టు మీరు అనుకుంటే, మీకు ఇష్టము వచ్చినట్టే పోతారు.


---

కానీ ఒక శాస్త్రబద్ధతను ఆధారము చేసుకొని మీరు గ్రహించుకో గలిగితే, నేను చెప్పినదంతా సత్యమని మీకు అనిపిస్తుంది. ఒకే వాక్యములో రెండు అర్థాలు వచ్చేటట్టుగా చేసాను. మీరు ఇట్లన్నా అనుకోండి, అట్లన్నా అనుకోండి. కాని మేము ఏమి చెప్తున్నామంటే రెండూ వాస్తవమే అంటున్నాము రెండు ఎట్ల వాస్తవము? అంటే వాస్తవమేనయ్యా! చెప్పినోడు మనిషి కాదు. మనిషైతేనే కదా నీవు అనుమానపడాల్సింది. చెప్పినోడు మనిషి కాదు. మనిషి రూపములో వచ్చిన దేవుడు. కాబట్టి దేవుడు చెప్పాడు. ఇంక నీకు ఏమి వచ్చింది అక్కడ అనుమానము? కనిపించేది మనిషి కదా అంటే, కనిపించేది మనిషే కాదని ఎవడు చెప్పినాడు? వానికి కాళ్ళు, చేతులు అన్ని ఉండాయి. లోపలుండేది ఎవడు? నువ్వు పైన ఒకటే చూసుకుంటే అయిపాయేనా? లోపలుండే వానిని అర్థము చేసుకో. పైనుండే వాడు మనిషే. కాదని నేను చెప్పలేదు, లోపలుండే వాడు ఎవడో నీకు తెలుసునా? తెలియదు. ఆయన జ్ఞానమే మనకు, మన పెద్దలకు అర్థము కాలేదు. ఇంక లోపలుండే వాడు చెప్పినోడు మనకు అర్థమౌతాడా చెప్పు. ఆయన చెప్పిన జ్ఞానమే మనకు, మన పెద్దలకు అర్థము కాలేదని చెప్పినాడే, అయితే ఆయనను అర్థము చేసుకునే దానికి మనకు చేతనైతుందా? కాదు. ఉండేది ఒకడే అని నీవు నమ్మకము పెట్టుకో. ఉండేది ఒకడే అయినప్పుడు ఇద్దరు ఎట్లుంటారు చెప్పు? ఇద్దరుండేదానికి అవకాశము లేదు. రూపములో కనిపించినా కపనిపించకపోయినా ఉండేది ఒకడే. దేవుడే ఉండేది, ఇంకొకడు లేడు. చెప్పినేది దేవుడే కాని నేను కాదు అనే విధముగా మనిషి మాదిరి కనిపించాడు. మళ్ళీ మనిషా? అంటే మనిషి కాదు. నువ్వు పొరపాటు పడేదానికి ఆయన అట్ల కనిపించినేది. వాడు మనిషి కాదు. ఎందుకు కాదు? అంటే మనిషికి ఉండే లక్షణాలు వానికి లేవు.


----

మనిషికి ఉండే లక్షణాలు ఏంటివి లేవు అంటే, మనకి ఏవి అయితే ఉండాయో వానికి లేవు. వాడూ బువ్వ తింటాడు, వాడూ నీళ్ళు తాగుతాడు అంటే అవన్నీ ఉంటాయి మామూలుగా. ఒకటి లేదు. ప్రకృతిని శాసించే శక్తి వానికి ఉంది, మనకు అది లేదు. ఆత్మ అన్నీ ఆడిస్తావుంది వానిలో, మనకి అది లేదు. మనకు కూడా ఆడిస్తా ఉంది. మనమూ ఏడుస్తాము వాడూ ఏడుస్తాడు, కాని బాధ లేదు వానికి, మనము బాధ ఉండి ఏడుస్తాము చూడు అది తేడా. అది ఎట్ల కనిపిస్తాది నీకు? దేవుడు మనిషిగా రాడు అనేదానికి, మానవుడు చెప్పేదానికి అవకాశము లేదని ముందే చెప్పాడు కాబట్టి మనిషి చెప్తున్నాడా? అంటే అవకాశము లేదు. వాడు మనిషి కాదు అని అర్థము చేసుకో నువ్వు. ఈ రకంగా మనము అర్థము చేసుకోవడములో పొరపాటు పడి, ఆడ అట్ల చెప్పాడు ఈడ ఇట్ల చెప్పాడంటే, అట్ల చెప్పేది ఇట్ల చెప్పేది ఏముంది? ' ఇప్పుడు దీనికి చెప్పు ఈ వాక్యానికి ఏం చెప్తావో? నేను చెప్పేది ఏముంది? మీకే అర్థము కాదది. మరి అలాంటప్పుడు, మేము ప్రత్యేకించి చెప్పినప్పుడు కూడా మీరు అర్థము చేసుకోలేకుండాపోతే మేమేం చేస్తాము దానికి? ఇటువంటి వాక్యాలేవి అర్థము కావు. ఇటువంటి వాక్యాలు గ్రంథములో చాలా ఉన్నాయి. అవి అర్థము కాకనే చాలామంది మతాలుగా చీలిపోయారు. కాగితాలుగా చింపుకున్నారు ఒకే గ్రంథాన్నే. నాది ఈ కాగితము, నీది ఆ కాగితము అని అనుకుంటున్నారు.


భగవద్గీత ఒకటే జ్ఞానము. అది మూడు రకాలుగా ఈ రోజు ఉంది. కృష్ణుడు చెప్పిన భగవద్గీతగా, ఏసు చెప్పిన బైబిలుగా, జిబ్రయేల్ చెప్పిన ఖుర్ఆన్గా ఉంది. మూడిట్లో ఎవరు చెప్పారు? ఆదిలోనే ఆకాశవాణి ద్వారా దేవుడు చెప్పించాడు ఆ రోజు, మళ్ళీ ఆ జ్ఞానమే ఇప్పుడు నేను చెప్పుచున్నా అని ద్వాపర యుగములో కృష్ణుడు చెప్పాడు. అది భగవద్గీత


----

అయింది. అదే జ్ఞానమే బైబిలు అయింది. అదే జ్ఞానమే ఖుర్ఆన్ అయింది. మూడు ఒకటే జ్ఞానమే. కాని ముగ్గురికి మూడు రకాలుగా కనిపించింది. దానిని మూడు రకాలుగా విభజించుకొని చదువుకుంటున్నారు. మూసా ఇచ్చినటువంటి తౌరాత్ గ్రంథాన్ని చింపుకొని చదువుకుంటున్నారు మీరు. అంటే మూడు రకాలుగా విభజించుకొని ఒకదానిని భగవద్గీతగా, ఇంకోదానిని బైబిలుగా, ఇంకోదానిని ఖుర్ఆన్గా చదువుకుంటున్నారు. కానీ అది ఇంతవరకు మీకుగానీ, మీ పెద్దలకుగానీ అర్థము కాలేదు. అర్థము చేసుకునే శక్తి ఉంటే అర్థమైతాది, కాని అర్థము కాలేదు. భగవద్గీతలో “తద్ద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా" అనే శ్లోకము చెప్పాడు. వినయ విధేయలతో ప్రశ్నలు అడిగి తెలుసుకోండి అంటే మనము వినయ విధేయతలతో అడుగుతున్నామా? అడగలేదు. హక్కుదారుడుగా అడుగుతున్నాము. మేము అడుగుతాము మీరు చెప్పాల్సిందే అని. మేము ఏమి అంటున్నామంటే ఇంతకు ముందు పబ్లిక్ గా ఒక మీటింగ్లో చెప్పాను. ఏమనంటే నేను చెప్పేటివన్ని సత్యము కాదు, అబద్ధాలు కూడా చాలా ఉన్నాయి. నేను చెప్పేటివన్ని సత్యము అని మీరు నమ్మొద్దండి అని పబ్లిక్గా చెప్పినానా లేదా చెప్పండి. నేను చెప్పేటివన్ని నిజము అంటే మీరు నమ్మాలి. నేను చెప్పేటివి అబద్దాలు కూడా ఉన్నాయి అని చెప్పాను. ఇంకా మీరు నమ్మొద్దండి అని కూడా చెప్పాను నేను. ముందే తప్పించుకున్నాను. నేను ముందే చెప్పేసినాను. నేను చెప్పేటివన్ని సత్యము అని చెప్పి ఉంటే నేను ఇప్పుడు ఇరుక్కునేవాడిని. ముందే చెప్పిన కదా నేను చెప్పేటివి అబద్దాలుంటాయని మీరు ఎట్ల నమ్మారు? నమ్మొద్దండి.


నేను చెప్పేది అబద్దమైనా నిజమని నమ్మేవాళ్ళు ఉంటే నమ్మండి అట్ల కూడ. నేను చెప్పేవి అబద్దము అని నమ్మినా నమ్మండి. అబద్ధాన్ని


---

నిజము అని నమ్మినా నమ్మండి. మీరు నమ్మేదాన్ని బట్టి ఉంటుంది కానీ, నేను చెప్పేటివన్ని సత్యాలు అని నేను చెప్పలేదు. నేను చెప్పేవాటిల్లో కొన్ని సత్యాలు ఉన్నాయి అలాగే కొన్ని అసత్యాలు కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడు సత్యము చెప్పాలో, ఎప్పుడు అసత్యము చెప్పాలో నాకు తెలుసు. అట్లే చెప్తాను. కాని నేను చెప్పేవాటిల్లో సత్యాలున్నాయి, అసత్యాలున్నాయి. నేను చెప్పేటివన్ని సత్యాలు అని నమ్మాల్సిన పని లేదు. నమ్మొద్దండి. నేను చెప్పినేటివి నిజము అని ప్రశ్న వేసారు అనుకో, మీకు అర్థముకాక? ఏమంటాను నేను. నేను ముందే చెప్పినాను కదయ్యా! నేను చెప్పినేటివి అన్నీ నమ్మొద్దండి అని. మీరు ఎందుకు నమ్మినారు? మళ్ళీ ప్రశ్న ఎందుకు వేస్తావు అంటా! మీరు అర్థము కావాలి అని ఒకవేళ వినయ విధేయతలతో అడిగితే నీకు వివరము చెప్తాము. లేకపోతే ఇట్ల చెప్పేస్తాము, సరిపోతాది వాటికి. ఈ రకంగా ఉంటుంది కాబట్టి మనము ఏమి చేయాలంటే జ్ఞానాన్ని మనము తెలుసుకునేదానికి శ్రద్ధ వహించినపుడే, దాని మీద ధ్యాస పెట్టినపుడే అది అర్థమవుతుంది. కానీ మళ్ళీ నాకు జ్ఞానము తెలుసు, వాళ్ళకంటే ఎక్కువ తెలుసు, నేను ప్రశ్న వేయగలను, వాళ్ళ తప్పు పట్టుకోగలను అనుకుంటే మీతో కానే కాదు ఆ పని. ఎందుకంటే ఒకరిని ఒకరు ప్రశ్నించేది ఉంది


దేవుడనే వాడు మనిషి రూపములో వస్తాడు, అప్పుడు నువ్వు ప్రశ్న వేసేదానికి కాదు. ప్రశ్న వేసినా జవాబు దొరకదు. దొరికినా నీకు అర్థము కాదది. అక్కడ మాత్రము కుదరదు. అందుకే మీకు ఏమి చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ నెలలో రెండు గ్రంథాలు ఇచ్చాను. ఈ రెండు గ్రంథాల్లోనూ ఒకటి సాహసోపేతమైనటువంటి విషయాన్ని చెప్పాము. ఏది (అంటే) ఉగ్రవాదము గురించి చెప్పిన విషయము, ఎవరూ ముట్టుకోరు దానిని,


----

ఎవరూ చెప్పరు. దానిని తలచుకుంటేనే భయపడతారు. ఆ భయపడే విషయాన్ని మేము భయపడకుండా చెప్పాము. మళ్ళీ ఇంత ధైర్యముగా చెప్పుతున్నానని ఆలోచన చేసుకోండి, ఒకవేళ అట్లైనాగానీ సరే, మేము చెప్పినాము అయిపోయింది. ఈయనేం మొండోడు, ఒకవేళ తెలివితక్కువోడు ఇవన్నీ అర్థం తెలియక మాట్లాడినాడు అని అంటే, అట్లన్నా అనుకోండి ఫరవాలేదు, కానీ నేను చెప్పేది చెప్పినాను తరువాత ఇంకో గ్రంథము వ్రాసినాము. ఇదే నెలలోనే. ఆ సెక్షన్ అంతా వేరు ఆ గ్రంథము, ఈ సెక్షన్ అంతా వేరు. దానికి దీనికి ఏమాత్రము పొత్తు కుదరదు. సంబంధపడదు జ్ఞానములో. ఒకటి పెద్ద గ్రంథము, ఒకటి చిన్న గ్రంథము రాస్తే అది అదే ఇది ఇదే. ఏమాత్రము కలువకుండా ఉంది కానీ మీకు ఒక కొత్త రహస్యము చిన్న గ్రంథములో 48 పేజీల గ్రంథము అయినాగాని అందులో మీకు చాలా కొత్త విషయాలున్నాయి. మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అంతకు ముందు గ్రంథములో తెలిసిన విషయాలే స్పష్టముగా చెప్పబడినా గానీ, తెలిసిన విషయాలే మీకు వివరించి చెప్పినాగానీ ఈ చిన్న గ్రంథములో కొత్త విషయాలు చెప్పడము జరిగింది. దాని పేరు “వార్తకుడు- వర్తకుడు” అని పేరు పెట్టినాము. ఆ పేరులోనే తేడా వచ్చేసింది. ఇట్లా 5 పేర్లు చెప్పి, 5 పేర్లకు విపరీతమైన జ్ఞానాన్ని చెప్పాము.


ఆ గ్రంథములో మొట్టమొదట సృష్ఠి ఆదిలోనే సూర్యునికి ఆకాశవాణి జ్ఞానము చెప్పింది అని చెప్పినాము. ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఏమని ప్రశ్నిస్తున్నా రంటే ఆకాశము ఎట్ల చెప్పింది? అంటే ఆకాశములోని ఆత్మ చెప్పింది అని చెప్పినాము. మళ్ళ సూర్యునిలోని ఆత్మ చెప్పిందని చెప్పినారే ఫలానా పేజీలో మీరు? అని అడుగుతారు. అంటే మళ్ళ అక్కడ అట్ల వ్రాసినారు ఇక్కడ ఇట్ల వ్రాసినారు తప్పుకదా! అంటే నేనేం చెప్తాను ఎప్పుడు


---

చెప్పినా అబద్దము కూడా చెప్తానని చెప్పాను కదా! మీరు ఎందుకు అర్థము చేసుకోకూడదు. జ్ఞాపకము తెచ్చుకోండి, చెప్పినా కదా నేను! నా మాటలన్ని ఎందుకు నమ్మాలి మీరు? అట్ల ప్రశ్నించేవానికి ఇట్లే అడుగుతా నేను. నన్ను ప్రశ్నించాలి అని అడిగితే అట్ల చెప్తా. నేను చెప్పినేది అబద్దమేనయ్యా! అబద్దము చెప్తా అని చెప్పినాను కదా! అక్కడ ఆకాశములో ఉండే ఆత్మ చెప్పింది అని చెప్పినాను. ఇక్కడ సూర్యునిలోని ఆత్మే చెప్పింది అని చెప్పినాను. రెండు రకాలుగా ఆప్షన్లు పెట్టుకున్నా నేను. ఇది నిజము, ఇది అబద్దము అనేదానికి. ఎందుకంటే నేను వ్రాసిన గ్రంథములో ఉన్నాయి అవి. నన్ను ఎదురు ప్రశ్న వేసి, నీది తప్పు అని నిరూపణ చేయాలని అడిగినోనికి, అట్లే చెప్తాము. నాది కరెక్టు కాదు, అది నాకు జ్ఞాపకము ఉండదు. ఒక్కోసారి అట్ల చెప్పింటాను, నేను చెప్పినేదంతా నిజమని ఏమీలేదు, అది పొరపాటు, నమ్మొద్దు అని చె అని చెప్తాను, దానితో వాడింక ఈయనకు తెలియదులే అని పోతాడు. కాని తెలుసుకోవాలి, ఈయన చెప్పేది సత్యము, అంతలేనిది చెప్పిండడు, ఏదో రహస్యము ఉంటుందని ఆత్రుతతో తెలుసుకోవాలని ధ్యాసతో, శ్రద్ధతో అడిగితే దానికి వివరము చెప్పగలను. ఏమని చెప్పగలను అంటే ఆకాశములో ఉండే ఆత్మే చెప్పినది వాస్తవమే. అక్కడ ఆ మాట వ్రాసాము. ఇంతకుముందు వ్రాసిన దాంట్లో సూర్యునిలోని ఆత్మే చెప్పింది. అందుకే సూర్యునికి అర్థమైంది అని కూడా చెప్పాను. ఇది కూడ వాస్తవమే. అంటే రెండూ ఎట్ల వాస్తవమవుతాయి అనే సందిగ్ధములో మీరు పడవచ్చు. కాని "ప్రపంచానికంతా ఒకటే ఆత్మ ఉంది" అని చెప్పాము.


సూర్యునిలో ఉండే ఆత్మ ఒకటే, పంచభూతాల్లో ఉండే ఆత్మ కూడా ఒకటే. జీవరాసులు వేరు, జీవుడు వేరు కాని అందరిలో ఉండే ఆత్మ ఒకటే. ఆత్మ మాత్రము అందరి శరీరములో వేరు వేరు వున్నాగాని అది ఒకటే


---

అంశ అని ముందే చెప్పాము, కాబట్టి ఇప్పుడు ఆకాశములో ఉండే ఆత్మ చెప్పింది అన్నా ఒకటే, తర్వాత సూర్యునిలో ఉండే ఆత్మ చెప్పింది అన్నా ఒకటే. ఎందుకంటే ఆకాశములో ఉండే ఆత్మే సూర్యునిలో ఉంది కదా! కాబట్టి ఆకాశములో ఉండే ఆత్మే చెప్పాల్సిన అవసరము లేదు. ఆకాశము చెప్పిన విషయమే సూర్యుడు చెప్పినా, సూర్యునిలోనున్న ఆత్మే చెప్పింది. కానీ ఇక్కడ మనమేమి చెప్పామంటే గ్రహించుకునే వాళ్ళకు సూర్యునిలో ఆత్మే చెప్పింది అని చెప్పాము. ఈ విషయము అటుంచి ఇంకో విషయము చెప్తా నేను. ఇప్పుడు మీకు చివరిలో అందించబడినటువంటి గ్రంథము ఒకటుంది అది “వార్తకుడు-వర్తకుడు" అని. టైమ్ లేదు గాని స్పీడ్గా చెప్తాను, మీరు తొందరగా అర్థము చేసుకోండి. దేవుడు కొంతే కాలాన్ని గములో 

నాకు కేటాయించాడు. దాంట్లో కృతయుగములో జరిగిన విషయము నీకెట్లా  తెలుసయ్యా! నిన్న, మొన్న మీరు పుట్టారు, ఈరోజు మా ముందుండి మాట్లాడుతున్నారు. కృతయుగములో అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితము అలా జరిగింది ఇలా జరిగింది అని చూసినట్లు చెప్తున్నారు. ఎట్లు చెప్పగలుతున్నారు? అని ప్రశ్న వేసినాడు ఒకాయన. అంటే చూసినది చూసినట్లు చెప్తున్నా, అబద్దము ఎందుకు చెప్తా నేను? జరిగినది జరిగినట్టే ఉన్న సత్యాన్ని చెప్తున్నాను. అసత్యము చెప్పాల్సిన అవసరము నాకు లేదు. అని చెప్పినాము. మళ్ళ అక్కడేమో అబద్దాలు కూడ చెప్తాను నేను అన్నావు, ఇక్కడేమో అబద్దము చెప్పాల్సిన అవసరమే లేదు నాకు అని చెప్తున్నావు, చూడు రెండు మాటలున్నాయి అంటారు.


అవునయ్యా! అసత్యము చెప్పాల్సిన అవసరము నాకు లేదు. ఏం అవసరము నాకు? నేను మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నానా? నేను అబద్దము చెప్పి, మోసము చేసి, గుంజుకునే దానికి. నాకు అవసరమే


---

ఆ*

లేదు. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, నేను ఎట్లైనా బ్రతకగలను. ఒకరికి అబద్దము చెప్పి మోసము చేయవలసిన అవసరము నాకేమి వచ్చింది. నేను ఎవరి మీద ఆధారపడి బ్రతకలేదు కాబట్టి నేనెందుకు చెప్తా అబద్దము అని నేనంటే దానికి కొందరు “మీరు సత్యమే చెప్తున్నారా? మళ్ళ ఆ రోజుది మీకెట్ల తెలిసింది?” అని అడిగారు. దానికి నేను చెప్పినది ఏమంటే ఆ రోజు జరిగినేది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, అంటే ఈ రోజు జరిగిన విషయము ఇప్పుడు చెప్పగలవు. కానీ ఆ రోజు జరిగింది ఎట్ల చెప్పగలవు? అని అడిగారు. దానికి కొంత వివరము చెప్పాము. అంటే కాలము అనేది మూడు రకాలుగా విభజింపబడి ఉంది. ఒకటి 'భవిష్యత్ కాలము' అంటాము జరగబోయేదాన్ని. జరుగుతున్న దానిని 'వర్తమాన కాలము' అంటాము. జరిగిపోయినదాన్ని 'భూతకాలము' అంటాము అని మూడు రకాలుగా చెప్పారని ఈ చిన్న గ్రంథములో చెప్పాము. కాని మనము అనే మాటలన్ని సొట్ట మాటలే, కరెక్టు మాట ఏదీ లేదు. చాలా మాటలు పూర్వము ఒక రకంగా ఉంటే ఇప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నాము. మాట్లాడుతూ మాట్లాడుతూ 'పప్పులో కాలేసినాడు' అంటారు, ఏమన్నా పొరపాటు పడినప్పుడు, పప్పులో కాలేసినాడు అంటారు. పప్పులో కాళ్ళు ఎట్ల వేస్తారు పప్పు కుండలో ఉంటుంది. తప్పులో వేసినాడంటే సరిపోతాది. తప్పులో కాలేసినాడంటే వాడు తప్పు చెప్తున్నాడని లెక్క 'తప్పు' అనేది పోయి 'పప్పు' అన్నాడు.


ఒకడు పప్పు అంటే అందరూ పప్పు అంటున్నారు. పప్పులో కాలు వేయడము అసలుకు జరుగుతుందా? రవ్వంతైన ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు. అట్ల ఎక్కడనో ఒకచోట భాష మారిపోయి ఉంటుంది, మాట్లాడుతుంటారు. అట్లగానే వర్తమానకాలము అనేది లేనే లేదు. దాని


---

పేరు “వ్యక్తమాన కాలము” అయినా వ్యక్తమాన కాలము పోయి వర్తమానకాలము అయిపోయింది. ఇది పొరపాటు పడినారు చూడు అని చెప్పినాము. భవిష్యత్ కాలము అనేది ఉంది. వ్యక్తమాన కాలము, తెలియబడేటటువంటి కాలము ఒకటుంది. తరువాత జరిగిపోయినది భూతకాలము ఒకటుంది. దానిని వర్ణిస్తూ ఒకమాట చెప్పాము మేము. గర్భస్థ శిశువుగా ఉన్నటువంటిది అంటే గర్భములో శిశువుగా ఉన్నాడు అనుకోండి. ఆడ పిల్లా? మగ పిల్లా? ఆ శిశువు ఎట్లాంటిది? మనకు తెలియదు. కాబట్టి దానిని ఏమంటాము అంటే జరగబోయే భవిష్యత్తు ఎవరికీ తెలియదు కాబట్టి గర్భస్థ శిశువుతో దానిని సమానముగా పోల్చవచ్చు అని చెప్పినాము. ప్రసవింపబడే శిశువుతో వ్యక్తమానకాలముగా పోల్చొచ్చు. 'వ్యక్తము' అంటే 'కనిపించే కాలము' అని ఇప్పుడు ప్రసవింపబడే శిశువు కనపిస్తావుంది కదా! అంటే ఆడ శిశువా? మగ శిశువా? అనేది కనిపిస్తా వుంది కదా! దానికి ప్రాణము వచ్చిన తరువాత ఏమైతాది? అది మామూలుగా సజీవము నుండి నిర్జీవ పదార్థముగా పుడుతుంది అని అంతిమ దైవ గ్రంథములో చెప్పినట్టు, ఆ తర్వాత ప్రథమ దైవ గ్రంథములో కూడా చెప్పినట్టు, మనకు సజీవమైన తల్లిగర్భము నుంచి నిర్జీవమైనట్టి శిశు శరీరము పుడుతుంది.


పుట్టిన తరువాత ప్రథమ శ్వాసతోనే అందులోనికి జీవుడు చేరుతాడు. జీవుడు చేరిన తర్వాత దానిని ఏమంటాము "భూతము” అంటాము. “జీవరాసి” అంటాము. ఉండేటటువంటి జీవరాసులనంతా "భూతములు” అంటాము. ఆ రకంగానే జరుగబోయే కాలము తెలియదు, జరుగుతుండే కాలము తెలిసింది, జరిగిపోయిన తరువాత పూర్తి తెలిసిపోయింది. ఓ హెూ! ఇది జరిగిపోయిందని కాబట్టి అది ప్రాణము వచ్చిన శిశువుతో సమానము


---

అంటే జీవుడు చేరిన శిశువుతో సమానము దానిని అందువలన భూతకాలము అన్నారు. చూడు 'భూత' అంటే ఏమని జీవుడనే కదా! దానికి ఒక జీవముంది ఆ కాలానికి. నేను ఇంతకుముందే చెప్పాను 'మేఘము ఒక భూతము-రోగము ఒక భూతము' అని చెప్పుకుంటూ వచ్చాము. చెప్పుకుంటూ వచ్చి అది వాస్తవము అనేటట్టుగా, మనకు రోగాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ రోగాలు మనము శాసించి చెప్పినప్పుడు అంటే రోగాలను మనము ఇట్ల ఉండండి అని చెప్పినప్పుడు అవి వినగలిగినాయి. ఆ భూతాలు వినగలిగినాయి. క్యాన్సర్ భూతము ఒకటుంది. మా లెక్కలో క్యాన్సర్ కూడా ఒక భూతమే, వేరే వాళ్ళ లెక్కలో ఎట్లైనా అనుకోవచ్చు కాని మా లెక్కలో భూతమే. ఒకాయన జ్ఞానము కోసము ప్రాకులాడేటప్పుడు ఈ క్యాన్సర్ వానికి ఆటంకమై ఉంటే అప్పుడు మేము సలహా చెప్పాము. వాడు జ్ఞానము తెలుసుకోవాలి అనుకుంటున్నాడు, జ్ఞానము తెలుసుకునే దానికి మీరు ఆటంకము ఎందుకు చేస్తారు. మీరు ఆటంక పరచకుండ, జ్ఞానము తెలుసుకుండేటట్లు చేయండి, అంతకంటే ముఖ్యమైన పని ఏముంది! అని అయితే మా మాట విని వాళ్ళు ఆ వ్యక్తి నుండి దూరము పోవడము జరిగింది. అంటే వానిలో క్యాన్సర్ కణాలు లేకుండ పోవడము జరిగింది, క్యాన్సర్ రోగమే లేకుండ పోవడము జరిగింది.


ఆ భూతము పక్కకు పోవడము జరిగింది అంటే మా మాట విన్నారు. కాబట్టి మా మాట వింటున్నారని మేము అంటున్నాము. మా మాట భూతాలు వింటున్నాయి, ఎందుకంటే మేం జ్ఞానము తెలుసుకున్నాము కాబట్టి వాళ్ళకు ఆ విషయము తెలిసింది, ఓ హెూ! ఈయన జ్ఞానము తెలిసిన వ్యక్తి, జ్ఞానము తెలిసినోళ్ళు అంటే మనకు ముఖ్యమైనోళ్ళు, మన తండ్రి


---

(దేవుని) జ్ఞానము తెలిసినోళ్ళంతా మనకు గౌరవనీయులే కాబట్టి వాళ్ళ మాటను గౌరవించాలి అను ఉద్దేశ్యముతో, వాళ్ళు ఏమి చేసారంటే, మా మాటను గౌరవించి వాళ్లు పక్కకు పోవడము జరిగింది. అది వాస్తవము, జరిగిన సత్యము. అప్పుడు మనము ఏమి చేశామంటే ఆ భూతము నా మాట విన్న తరువాత ఇంకో భూతము కూడ నా మాట వింటుంది కదా! సరే, ఇంకో భూతము కూడ నా మాట వినడము జరిగింది. సరే, అట్లగానే కొన్ని భూతాలు నా మాట వినేటప్పుడు, కాలము కూడ భూతమే కదా! ఈ భూతకాలాన్ని కూడా అడిగితే అది ఏమి చెప్పిందంటే, అది తన కాలములో ఉండే సత్యము చెప్పింది కాబట్టి ఆ రోజు ఇట్ల జరిగిందని నేను చెప్పగలిగినాను ఈ గ్రంథములో. ఇప్పుడు ఈ అడిగే మనిషి ఎట్ల ప్రశ్న వేస్తున్నాడు అంటే మళ్ళ మీరు అప్పుడు ఆ భూతకాలములో భూతము చెప్పిందంటున్నారే భూతము ఏమన్నా ఒక మనిషా? అని అడుగుతున్నారు. దానికి జవాబుగా మనిషి కాదయ్యా అని చెప్పాము. 'చెప్పింది' అంటే అర్థము కాదని 'చెప్పదు', 'తెలియబరుస్తుంది' అని కూడ వ్రాసారు చూడండి అని చెప్పాము. అంటే 'ఎట్ల తెలియబరుస్తుంది'? అంటే లోపలనే తెలియబరుస్తుంది. లోపల అంటే ఆత్మే కదా చెప్పేది అంటే, ఔను! ఆత్మే చెప్పేది, కాదని ఎవరు చెప్పారు నీకు! మళ్ళ ఆత్మ చెప్పితే భూతము చెప్పిందటున్నారుగా మీరు? అంటే ఆ భూతము యొక్క ఆత్మ చెప్పింది, కాదని ఎవరు చెప్పినారు? అంటే నీలో ఉండే ఆత్మే కదా! అంటే నాలో ఉండే ఆత్మే చెప్పింది, కాదని ఎవరు చెప్పినారు! మరి నీలో ఉండే ఆత్మే చెప్పితే, ఆ భూతము పేరు ఎందుకు పెడుతున్నారు? అంటే నిజమే! నాలో ఉండే భూతము చెప్పినా కాని ఈ భూతము ఆ భూతము నుండి సమాచారము తెచ్చింది కాబట్టి ఆ పేరే చెప్పాలి నేను.


---

సూర్యునిలో ఉండే ఆత్మ చెప్పింది కాబట్టి సూర్యునిలో ఆత్మ చెప్పినా కాని ఆ ఆత్మ ఎక్కడ నుండి సమాచారము అందించింది? అంటే ఆకాశములో ఉండే ఆత్మ అందించినటువంటి సమాచారాన్నే ఈ ఆత్మ అందించింది. కాబట్టి రెండూ ఒకటే ఆత్మలే కాబట్టి ఇది కూడ మనము ఈ ఆత్మే అందించినది అని చెప్పినాగానీ, ఆకాశములో ఉండే ఆత్మే అందించింది అని చెప్పాలి మనము, ఇది వివరించి చెబితే. వివరించకుండ చెప్పితే ఆత్మే చెప్పింది. నాలో ఉండే ఆత్మే చెప్పింది ఆ విషయము. జరిగిపోయిన సమాచారాన్ని ఆత్మే తెలియబరిచింది. తెలియబరిచిన దానిని చివరికి ఎవరి వరకు చెబుతున్నాను నేను, ఆ భూతము వరకు చెబుతున్నాను, ఆ భూతము తెలియజేసింది. ఆ భూతములో ఉండే ఆత్మే తెలియజేసింది. భూతములోని ఆత్మ ఎక్కడ ఉంది? నాలో కూడ ఉంది. కాబట్టి నాలో ఉండే ఆత్మ తెలియజేసినా గానీ నేను పేరు ఎవరి పేరు పెట్టాను? ఆ భూతము యొక్క పేరే పెట్టా నేను.



ఈ రకంగా వివరించుకుంటూ పోతే సత్యము తెలుస్తుంది. అందువలన మీరు ప్రశ్న వేయడము ముఖ్యము కాదు కాని అర్థము చేసుకోవడము ముఖ్యము. ప్రశ్న వేసేది ఏముంది? ఆడ పిల్లలైనా వేస్తారు, చిన్న పిల్లలైనా వేస్తారు, ఎవరైనా అన్ని అడ్డ ప్రశ్నలు వేస్తారు. కాని ప్రశ్న వేయడము కాదు ముఖ్యము, మీరు దానిని అర్థము చేసుకోవడము ముఖ్యము. ఇప్పుడు నేను చెప్పాను అంటే భూతకాలములో భూతము చెప్పింది నాకు. సత్యమే నేను వ్రాసాను, కృతయుగములో మాట నేను వ్రాసాను. నేను వ్రాసినమాట సత్యమో కాదో మీరు ఆ గ్రంథము చదవండి తెలుస్తుంది. అక్కడ జరిగిపోయిన పేర్లన్ని ఉన్నాయి. జరిగిపోయిన పేర్లు నమూనాగా ఈ రోజు గుర్తుగా మిగిలినాయి ఉన్న పేర్లు. కారణము ఎవరైనా చెప్పగలరా

ఆ*


---

ఉన్న పేర్లకు? జరిగిపోయిన పేర్లు ఏమున్నాయంటే జ్ఞానముతో కూడుకున్న పేర్లు అని నేను చెప్పినాను. అవి జ్ఞానముతో కూడుకున్నాయో లేదో? మీరు చూసుకోండి. కరెక్టుగా జ్ఞానానికి సరిపోయే పేర్లు అవి. మధ్యలో ఎవరన్నా కలిపించేటివా? కలిపించినేటివి కానే కావు అవి. ఒక పేరుంది చివరిలో చివరి పేరు ఆరవ పేరు. అది మనుషులు పెట్టిన పేరు, అది అజ్ఞానముతో కూడుకుంది, దానికి అర్థమే లేదు అని చెప్పినాము. వాస్తవముగా జ్ఞానము యొక్క అర్థము లేదు. జ్ఞానము యొక్క పదమే లేదు దాంట్లో, 5 పేర్లకు అర్థమే లేదు అని చెప్పాము. ఆ రోజు ఉన్న సత్యాన్నే చెప్పినాము. అది సత్యము అని మనము తెల్సుకోవాల్సిందే. అది ఇంక ఎక్కడా దారి లేదు, సత్యమే అది. మళ్ళ ఆ సత్యాన్నే ఇప్పుడు నేనెలా తెలుపగలిగినాను అంటే ఎక్కడ పోయి అడగలేదు. కూర్చొని వ్రాసేటప్పుడు, మేము వేడుకుంటాము. ఏమని వేడుకుంటాము? నాకు ఏమి వ్రాయాలో నా చేత ఏమి వ్రాయించాలో మీరు అదే వ్రాయించండి అని. ఏమంటే ఖుర్ఆన్ గ్రంథములో 50వ సూరాలో 21వ ఆయత్లో ఒకటే మాట చెప్పారు.


నిన్ను ఆడించేవాడు ఒకడున్నాడు, చూసేవాడు మరొకడున్నాడు, ఆడేవానివి నువ్వు. అంతే గదా! నిన్ను నడిపించేవాడు ఒకడున్నాడు, వాడే ఆత్మ. నడిచేవాడు నువ్వు, నిన్ను చూసేవాడు ఒకడు గలడు వాడే పరమాత్మ ఎట్ల వ్రాసినా ఒకటే తోలేవాడన్నా, ఆడించేవాడన్నా, నడిపేవాడన్నా అంతా ఒకటే కదా! తోలేవాడు ఆత్మ, తోలబడేవానివి నువ్వు, జీవాత్మను సాక్షిగా చూసేవాడు పరమాత్మ. మీరు మళ్ళా దీన్ని ప్రశ్న వేసి అక్కడ తోలేవాడు అన్నాడు. ఇక్కడ నడిపేవాడు అన్నాడు రెండు రకాలుగా అన్నారు? అంటే తోలేవాడన్నా నడిపేవాడన్నా రెండూ ఒకటే కదా. ఇంక అదీ అర్థము


----

చేసుకోకపోతే ఏమీ ప్రయోజనము లేదు. ఆడించేవాడన్నా, తోలేవాడన్నా, నడిపేవాడన్నా అంతా ఒకటే అర్థము వస్తుంది. ఆ విధముగా నేను తోలబడేవానిని, నువ్వు తోలేవానివి నువ్వు ఎట్ల తోలితే అట్ల పరిగెత్తుతాను అని నేను కూర్చుంటే ఆయన ఏం అందిస్తే నేను అదే వ్రాయగలుగుతున్నాను. లోపలుండేవాడు (ఆత్మ) అందిస్తాడు అది ఎక్కడి నుంచి మొట్టమొదట సమాచారము వచ్చిందో ఆ విషయము వాడు అందిస్తాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను. ఈ చెప్పిన విషయము ఫలాన చోటనే నేను ముందే చెప్పాను. ఫలాన వ్యక్తిలోనిది కాబట్టి ఆ వ్యక్తి పేరు చెప్పాలి ఇప్పుడు. మనువుకు సూర్యుడు చెప్పినాగాని సూర్యుడు చెప్పినేది ఎవరి జ్ఞానము? అంటే ఆకాశభూతములో నుండి వచ్చిన జ్ఞానము అని ఆ పేరునే చెప్పాలి.


కాబట్టి ఇంత వివరముగా జ్ఞానము చెబితే అందుకోలేక పోతే ఏమీ ప్రయోజనము లేదు. అందువలన జ్ఞానము వినడమే కాదు, జ్ఞానాన్ని గ్రహించుకునే దానికి శక్తి పుంజుకోవాలి మీరు. అందరికి గురువున్నట్టు నాకూ ఉన్నాడు, అందరు తెలుసుకున్నట్లు నేనూ జ్ఞానము తెలుసు కుంటున్నాను, అయితే అందరి మాదిరి నేను లేను, నాకు ఏదో ప్రత్యేకత

ఉంది, నేను కొంత జ్ఞానము తెలుసుకుంటున్నాను, నా వలె మీరు కూడా తెలుసుకోవడములో ప్రత్యేకత కలిగి ఉండండి. బుద్ధిని పూర్తి ఉపయోగించు కోండి, తెలుసుకోండి. అట్లైతే సక్రమమైన మార్గము దొరుకుతుంది లేకపోతే సక్రమమైన మార్గము దొరకదు. తప్పుదారిలో, తప్పు ఆలోచనలో మనము తప్పు జ్ఞానాన్నే అంటించుకుంటాము. తప్పు జ్ఞానాన్ని పొందకుండా సక్రమమైన మార్గాన్ని పొందాలంటే ఒకటే ఒకటి చెప్తున్నా. చెప్పిన జ్ఞానాన్ని సత్యమా?కాదా? అని ఆలోచన చేయండి. శాస్త్రబద్దమా? కాదా? అని ఆలోచన చేయండి. ఈ చెప్పేది ఎక్కడ నుండి వస్తుంది? అని ఆలోచన

----

చేయండి. ఇది దేవుని జ్ఞానమని గుర్తు తెలిసి మీరు జ్ఞాపకము పెట్టుకోండి. అనవసర ప్రశ్నలు వేయవద్దండి. అన్ని గ్రంథాలు చదివిన తర్వాత మా దగ్గరికి వచ్చి అడగండి. ఇంతటితో ఈ జ్ఞానాన్ని ముగిస్తున్నాము.

----------------

96. ఆట-దోబూచులాట

తేది : 22.02.2016

ఈ నెలలో మీకు మేము మూడు గ్రంథాలు అందించడము జరిగింది. తరువాత మా జ్ఞానాన్ని సూపర్ సైన్స్ ధన్వంతరి అను ఒక జ్ఞాని వ్రాసి చెప్పడము కూడా జరిగింది. ఈ నాలుగు గ్రంథాలు మీరు బహుశ ఈ రోజు చూసి ఉంటారు అని అనుకుంటాను. ఈ నాలుగు గ్రంథాలలో ప్రతి గ్రంథములోనూ అంటే క్రొత్త విషయమే మీకు తెలియబడింది. కానీ విశేషముగ చెప్పితే 'లేఖ' అనేది ఒక రకము, 'ఒక మాట-మూడు గ్రంథములు' అనేది ఒక రకము, తరువాత వచ్చి “లు అంటే ఏమిటి? (తెలుగు)” అనే పదానికి అర్థము చెప్పడము జరిగినది. ఈ మూడు గ్రంథాలలో సారాంశము మూడు మతాలకు సంబంధించిన సారాంశము ఉంది, ఒక మతానికి ఏమాత్రమూ సంబంధము లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళు హిందువులు, హిందువులకు సంబంధించిన జ్ఞానము వ్రాస్తారు అనుకొంటారు. కానీ అట్ల ఎక్కడా ఉండదు ఇక్కడ. మేము ఏ గ్రంథము వ్రాసినాగాని మూడు దైవగ్రంథాలలో ఉండే విషయాన్నే మేము కల్పుకొని వ్రాస్తుంటాము. ఎందుకంటే “దేవుడు చెప్పిన జ్ఞానము ఒక్కటే” ఆ ఒక్క జ్ఞానము మూడు దైవగ్రంథాలలో ఉంది. కాబట్టి ఇవి మూడు మతాలకు సంబంధించిన విషయాలు దీనిలో


----

సంపూర్ణముగా ఉంటాయి. కానీ మేము చెప్పే జ్ఞానాన్ని మనుషులే ఓర్చుకోలేక నాకు కూడా ఏదో ఒక మతాన్ని అంటగట్టి, వీళ్ళు హిందువులు కాదు క్రైస్తవులు, క్రైస్తవుల బోధలు చెబుతున్నారు అని అసూయతో మాట్లాడుతున్నారు.


ఇంకా కొంతమంది ఏమి చేస్తున్నారు అంటే వీళ్ళు ముస్లీమ్ల బోధ మాట్లాడుతున్నారు, ముస్లీమ్ విషయమే చెబుతున్నారు అని కొంతమంది అసూయతో మాట్లాడుతున్నారు. హిందువులకే అర్థము కాకుండా పోయిందికానీ, మిగతా మతస్థులకు కూడా మేము చెప్పే జ్ఞానము బాగా అర్థమైందని మేము అనుకుంటున్నాము. ఇక్కడ ముఖ్యముగా చెప్పవలసిన విషయము ఏమి అంటే! ఇప్పటికి మేము 100 గ్రంథాలు వ్రాశాము. 100 గ్రంథాల తరువాత 101వ గ్రంథము వ్రాయాలని ప్రయత్నము చేసి దానిని మొదలు పెట్టినాము. అది “సత్యార్థ ప్రకాశికలో సత్యమెంత?" అను గ్రంథము. ఇంతకుముందు ముస్లీమ్ గ్రంథము ఖుర్ఆన్లోని వాక్యాలను తీసుకొని వ్రాశాము. ఈ గ్రంథము వ్రాసిన తరువాత మాకు ఏమనిపించిందంటే ఎంత మేము జ్ఞానము చెప్పినాగానీ, కొంతైనా మనుషుల్లో అజ్ఞానము ఉండి, ఇది పరమత బోధ చెప్తున్నాడు. అని అనిపిస్తుంది. దాంట్లో సూర్యుడు, మేఘాలు వేరే మేము చెబుతున్నాము, ఇది ఎక్కడ ఖురానులో లేని విషయము వీళ్ళకు. మనము ఇది చెప్పితే హిందువుల బోధ మనకు అంటగడుతున్నాడు అని అనుకుంటారని ఇది వద్దు అని కట్ చేసి, దానికి వేరే పేరు పెట్టి, దానిని విడుదల చేశాము. అదే “ఒక మాట-మూడు గ్రంథములు”. దీనిలో సారాంశము ఏమి అంటే దేవుడు చెప్పిన జ్ఞానము పూర్వము ఉండేది, అది మూడు యుగాల తరువాత మూడు గ్రంథాలుగా తయారైందని చెప్పాము.


---

ఆ చెప్పే వివరమంతా ముస్లీమ్లకు పూర్తి అర్థమవుతుందో లేదో అని అర్థమయ్యేరకముగా ఇంకొక రకముగా వ్రాస్తామని దానిని కట్ చేసి, ఈ చిన్న గ్రంథము విడుదల చేయడము జరిగింది. ఏది? “ఒక మాట- మూడు గ్రంథములు” అనేది. ఇప్పుడు అది చదివిన తరువాత మళ్ళీ మీకు మేము రెండో గ్రంథము వ్రాయాల్సిన పని వచ్చింది. అంటే అదే అంతిమ దైవగ్రంథములోని జ్ఞానవాక్యములు మళ్ళీ ప్రారంభించాము. ప్రారంభించి మళ్ళీ అరవై పేజీలు వ్రాసిన తరువాత ఏమనిపించిందంటే ఇది కూడా సరిగా లేదు, ఇంకా బాగా వ్రాస్తే బాగుంటుంది, ఇది కూడా అర్థము చేసుకునే పరిస్థితిలో ఉండరు ముస్లీమ్లు, మళ్ళీ హిందువులు హిందువుల జ్ఞానమే వ్రాసినారు అని అనుకుంటారు అనే ఉద్దేశ్యముతో మళ్ళీ దానిని తీసి “లు అంటే ఏమిటి?” అనే గ్రంథముగా మనము చీల్చి ప్రక్కకు పెట్టడము జరిగింది. అంటే ఖురాను వ్రాసేదానికి మొదలు పెట్టిన తరువాత ఆ మొదలే రెండు గ్రంథములుగా వచ్చింది మీకు. అది నేను ప్రత్యేకముగా ఈ గ్రంథములు వ్రాయాలని అనుకోలేదుగానీ, వ్రాసిన తరువాత మీకు ఈ పేర్లు పెట్టి ఆ గ్రంథాలు అందివ్వడము జరిగింది. సరే, ఇప్పుడు మళ్ళీ మేము అదే ఖురాను వ్రాయాలనుకుంటున్నాము. అప్పటికి ఏమైంది 68వ గ్రంథము పోయింది, 69వ గ్రంథము పోయింది, 70వ గ్రంథము ఇప్పుడు తయారవుతుంది, ఏది? ఖురాను గ్రంథము. 70వ గ్రంథముగా వ్రాయాలని మళ్ళీ అరవై పేజీలు, ఇప్పుడు అరవై పేజీలు వ్రాయలేదు గాని ముప్పై పేజీలు వ్రాశాము. ముప్పై పేజీలు వ్రాసిన తరువాత ఇది కూడా సరిగా లేదు. వీళ్ళకు అర్థమయ్యే స్థితిలో లేదు, నేను చెప్పే జ్ఞానమంతా దైవికానికి సంబంధించినదే అయినా వీళ్ళు మతాలకు అంటగడుతున్నారు, అజ్ఞానము ఉండేదానివలన ఏదో ఒక మతానికి అంటగట్టేస్తారు, వద్దు అట్ల కూడా ఉండకూడదు అనే ఉద్దేశ్యముతో దానిని


----

కూడా మళ్ళీ ఇప్పుడు మేము ఆ పేరును మార్చి 'ఆదిత్య' అని పేరు పెట్టడము జరిగింది. 'ఆదిత్య' అనే పేరుతో మీకు ఇంకొక గ్రంథము రిలీజు అవుతుంది. అంటే ఈ మూడు గ్రంథాలు ఎక్కడ నుంచి వచ్చాయి?


అంతిమ దైవ గ్రంథము ఖురానులో భాగంగానే వచ్చాయి. అంటే ఈ మూడు గ్రంథాలను మీరు ఒకవేళ చదివివుంటే ఆ గ్రంథాలలో ఎంత ఔన్నత్యమైనటువంటి జ్ఞానము ఉందో మీకు అర్థమౌతుంది. అది చదవకపోతే చెప్పలేముగానీ చదివితే మాత్రము అద్భుతముగా అర్థమవుతుంది. ఒకమాట మూడు గ్రంథాలలో మేము ఇంతకు ముందు మేఘాల గురించి చాలాసార్లు చెప్పాము. కానీ మేఘాల నుంచి వచ్చే ఉరుముల గురించి చెప్పలేదు, మెరుపుల గురించి చెప్పలేదు, పిడుగుల గురించి చెప్పలేదు. కేవలము మేఘాల గురించే చెప్పినాము. ఇపుడు ఈ గ్రంథములో ప్రత్యేకించి ఉరుములు, మెరుపులు, పిడుగులు, వర్షము ఈ నాలుగు మేఘాల నుంచి ఎందుకు వస్తున్నాయి? అనే విషయాన్ని మీకు క్షుణ్ణంగా చెప్పడము జరిగినది. వాస్తవముగా ఇది ప్రత్యేకమైన గ్రంథము అయినాగాని మేము మొదలు పెట్టినేది ఎక్కడ? అంతిమ దైవగ్రంథముగానే మొదలు పెట్టినాము. కానీ ఆ పేరు ప్రక్కన పెట్టి ఈ పేరు దీనికి పెట్టినాము. పేరు పెట్టినాగాని మీరు దానికైనా (ఎటాచ్) కలిపి చదువుకోండి. తెలిసినోళ్ళు అయితే దానికి మొదట వచ్చింది అనుకోండి. తరువాత రెండో గ్రంథము ‘లు' అనే దానిని మొదలు పెట్టినాము, అది కూడా మీరు చదివి ఉంటారు. దాంట్లో ఏమి చెప్పాము? అంటే సూర్యుని గురించి ఎక్కువ చెప్పాము. తరువాత సూర్యుడు చెప్పిన జ్ఞానాన్ని గురించి చెప్పినాము. సూర్యుడు మొట్టమొదట ఎవరికి జ్ఞానము చెప్పినాడు? అని చెప్పినాము. ఖురానులో ఉండే వాక్యాలు అందులో ఉన్నాయి, మొదట మూడు గ్రంథాలలోని మాటలు ఉన్నాయి.


---

తరువాత రెండవ గ్రంథములో కూడా ఖురాను వాక్యాలు ఉండడము జరిగిందన్నమాట.


ఇపుడు ఈ రెండో గ్రంథములో "లు అంటే ఏమిటి? (తెలుగు)” అనేటటువంటి గ్రంథములో ప్రత్యేకించి దేవుడు వహీ ద్వారా అందిస్తానని చెప్పినటువంటి జ్ఞానాన్నే అక్కడ చెప్పడము జరిగింది. ఖురానులో 42వ సూరా 51వ ఆయత్లో ఏం చెప్పబడింది అంటే “దేవుడు ఎవ్వరితోనూ ప్రత్యక్షముగా మాట్లాడడు” ఏ మనిషి మాట్లాడేదానికి వీలులేదు. దేవుడు మాట్లాడడు, మనిషి కూడా మాట్లాడేదానికి వీలులేదు. ఎందుకంటే దేవుడు కనిపించేవాడు కాదు, ఆయనకు ఒక ధర్మము ఉంది. దేవునికి ఆకారము లేదు, ఆయనకు పేరు కూడా లేదు, ఆయనకు రూపము లేదు, పేరు లేదు, క్రియా లేదు, పని కూడా లేదు, ఊరకనే ఉండేవాడే ఆయన. రూప, నామ, క్రియలు లేనివాడు అనేది దేవునికి సిద్ధాంతము. ఆ లెక్క ప్రకారము దేవుడు ఏమి చేస్తాడు అంటే ఆయన జ్ఞానము చెప్పాలి అనుకున్నా కూడా చెప్పడు, చెప్పితే అది పని అవుతుంది. మళ్ళ దేవుని జ్ఞానము దేవునికి మాత్రమే తెలుసు తెలియదు. ప్రపంచములో దేవుని జ్ఞానము దేవునికే తెలిసినప్పుడు, ఎవ్వరికీ తెలియనపుడు, మళ్ళీ దేవుడు చెప్పనప్పుడు ఎట్ల తెలుస్తుంది మనకు అనేది ప్రశ్న, కావున మానవులకు తెలిసే రకంగా మూడు ఏర్పాట్లు చేసి పెట్టాడు దేవుడు. ఒకటి ఆకాశము నుండి జ్ఞానము చెప్పబడుతుంది నీకు. ఆకాశము నుంచి వాణి అంటే శబ్దము. శబ్దము ద్వారా జ్ఞానము చెప్పబడుతోంది అని చెప్పారు. తరువాత రెండవది తెరచాటు నుండి చెప్పబడుతుంది అని చెప్పాడు. తరువాత మూడవది తన ప్రతినిధి ద్వారా చెప్పబడుతుంది అని చెప్పాడు. ఈ మూడు రకాలుగా చెప్పియున్నాడు.


---

మొట్టమొదట సృష్ఠిఆదిలోనే ఆకాశవాణి సూర్యునికి జ్ఞానము చెప్పినట్లు మనకు తెలిసింది. అంటే ఖురాను గ్రంథము ద్వారానే తెలిసింది అది. ఖురాను గ్రంథము బయటికి వచ్చేంత వరకు మనకు తెలియదు. సూర్యుడు జ్ఞానము విన్నాడు మొట్టమొదట. ఎక్కడనుంచి విన్నాడు? ఆకాశములో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఆకాశములోనే విన్నాడు అంటే వాణి ద్వారా విన్నాడు. 'వహీ' ద్వారా విన్నాడు. అదే జ్ఞానాన్ని తరువాత కొంతకాలానికి భూమి మీదకు వచ్చి ప్రజలకు చెప్పడము జరిగింది. అప్పుడు మనుషులకు తెలిసింది. అంతవరకు దేవుని జ్ఞానము తెలియదు. శబ్దము ద్వారా వచ్చిన జ్ఞానము శబ్దము ద్వారానే ఉండిపోయింది గానీ గ్రంథ రూపములోకి కాలేదు. దానికి ఒక పేరు పెట్టబడింది ‘జపర' అనే పేరు

ఉంది. ఆ 'పర' అనే పేరు క్రమమున 'జబుర' అనే పేరుగా మారిపోయింది. సరే, పేరు ఎట్ల మారినాగానీ మొట్టమొదట చెప్పినటువంటి జ్ఞానము మాత్రము ఒకటి ఉంది. అది మొదటి దైవ గ్రంథముగా తయారయినది. దానినే భగవద్గీత అంటున్నాము. దానినే తౌరాత్ అని కూడా అంటున్నాము, అర్థమయిందా! తరువాత 'ఇంజీలు' అనే గ్రంథము ఇంకొకటి తయారు అయింది. 'ఇంజీలు' అంటే 'బైబిలు' అని అర్థము. తరువాత అదే జ్ఞానమే ఖురాన్ అనేటటువంటి గ్రంథముగా కూడా తయారు అయినది. అంటే భగవద్గీత మొదటి దైవగ్రంథము, బైబిలు రెండో దైవగ్రంథము తరువాత అంతిమ దైవగ్రంథము ఖురాన్ మూడో దైవ గ్రంథముగా వచ్చేసిందన్నమాట. ఈ మూడు భాగాలుగా గ్రంథాలు తయారయినాగానీ, జ్ఞానము మాత్రము ఒకటే. మొట్టమొదట ఆకాశము ద్వారా వచ్చినటువంటి జ్ఞానమే అందులో ఉంది. జపర అనేటువంటి జ్ఞానము ఏదైతే ఉందో ఆ “జపర” జ్ఞానము మూడు గ్రంథాలుగా రూపు


---

దిద్దుకుంది. ఇంతకుముందు కూడా అదే చెప్పాము, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము.


ఈ మూడు దైవగ్రంథాలలోనూ ఆత్మ అనేటటువంటిది ఒకటి నిగూఢముగా చెప్పబడింది. అది ఎవ్వరికీ అర్థము కాని రకంగా ఉంది. మొట్టమొదట ప్రథమ దైవగ్రంథము భగవద్గీతలోనే చెప్పబడింది. అది ఎవరికీ అర్థము కాలేదు. భగవద్గీతను కనీసము మూడు వందల మంది స్వామీజీలు గ్రంథరూపములో వివరముగా వ్రాసినా గానీ, ఆత్మను పూర్తి ప్రస్తావించ లేకపోయారు. అది ఏ మానవునికి సరిగా అర్థము కాలేదు. భగవద్గీతలో జీవుడు, దేవుడు, మధ్యలో ఒక ఆత్మ ఉంది. దానిని “మధ్యాత్మ” అనవచ్చు లేక “ఆత్మ” అనవచ్చు. ఈ ఆత్మ ఎవరికీ తెలియబడకుండా పోయింది. ఆ తెలియబడకుండా ఇన్ని సంవత్సరాలుగా వుండిపోగా, తెలియబడకుండా పోయినటువంటి ఆత్మను గురించి మేము తెలియజేయాలి అనుకున్నందున ఆ విధానముతోనే మీకు ఈ జ్ఞానాన్ని మొదలు పెట్టి 'త్రైతసిద్ధాంతము' అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి, మూడు ఆత్మలు ఉన్నాయని చెప్పడము మొదలుపెట్టినాము. అది దేవుడు, ఆత్మ, జీవుడు అని మూడుగా చెప్పాము. జీవునికి కొన్ని ధర్మాలున్నాయి, వాడు బాధ పడడము జరుగుతుంది. దేవునికి కూడా కొన్ని ధర్మాలున్నాయని చెప్పాము కదా ఇంతకుముందు. ఆయన ధర్మము ప్రకారము ఆయన ఏమీ మాట్లాడడు. కానీ మధ్యలో ఉన్న ఆత్మకు మాత్రము ధర్మాలు లేవు అని మీకు కొత్త విషయముగా ‘లు' అనే గ్రంథములో మీకు తెలియజేయడము జరిగినది. దేవునికి ధర్మాలు ఉన్నాయి, జీవునికి ధర్మాలు ఉన్నాయి కానీ ఆత్మకు మాత్రము ధర్మాలు లేనేలేవు. అది ఎట్ల అయినా ఏమైనా చేయగలదు. దానికి ఏ కండిషన్లు లేవు అనేది మీకు కొత్త విషయము ఇది ఇంతకుముందు గ్రంథాలలో ఉండే విషయమే, కానీ అది ఎవరికీ తెలియని రకముగా ఉండిపోయింది.


----

'దేవుడు' అంటే 'వెతకబడేవాడు' అనే అర్థముతో మనము చెప్పుకున్నాము. సరే, దేవుని తరువాత ఉండేటటువంటి ఆత్మను మనము అణిగివున్నది అని చెప్పుకున్నాము. ఆయన వెతకబడేవాడు కాబట్టి నీవు ఎన్ని రోజులు వెతికినా ఆయన కనిపించడు, దొరకడు నీకు, ఎటువంటి పరిస్థితిలో కూడా దేవుడు తెలియబడేవాడు కాదు. సరే, ఆత్మను తెలుసుకోగలుగుతామా మనము? అని అంటే ఆత్మ ఎటువంటి పరిస్థితిలో కూడా అది నీకు కనిపించదు, అది అణిగివుంది, నీకు తెలియదు అది ఎప్పటికీ అణిగి ఉండేదే. దేవుడు పని చేయడు. అట్లే జీవుడు పని చేయలేడు, చేతకాక చేయలేడు. దేవుడు చేతనయి కూడా ఆయన చేయడు. అది జీవునికి ఉండే ధర్మము, దేవునికి ఉండే ధర్మము ఆత్మకు పని చేయవలసిన అవసరము ఏమి లేనేలేదుకానీ, ఆత్మ తన ఇష్టప్రకారము ఏమైనా చేయగలదు. ఆత్మ ఏమి చేస్తుంది? అంటే ఇటు జీవుని పనిని, అటు దేవుని పనిని రెండు పనులను చేయగల్గుతావుంది అని చెప్పవచ్చును. దేవుడు చేయడు, జీవుడు చేయలేడు మరి ఈ ప్రపంచములో పనులు ఎట్లా జరుగుతావున్నాయి? అని ప్రశ్న వేస్తే ఎవడో ఒకడు చేసేవాడు ఉన్నాడు. ఆ చేసేవాడు ఎవడు? అంటే ఈ మధ్యలో ఉండే ఆత్మే. అణిగివుండేటటువంటి ఆత్మే, ఎవనికీ తెలియనటువంటి ఆత్మే, మనము సృష్టి ఆదిలో ఆకాశము నుంచి జ్ఞానము చెప్పబడింది అని అనుకున్నాము కదా! మళ్ళీ అప్పుడు ఎవరో ఒకరు జ్ఞానము చెప్పియుండాలి కదా! భగవద్గీతలో నేను సూర్యునికి మొదట జ్ఞానము చెప్పియుంటిని అన్నాడు. దేవుడు చెప్పాడా? అంటే దేవుడు కాదు, దేవుడు చెప్పలేదు, దేవుడు మాట్లడడు, దేవుడు చెప్పడు. మరి చెప్పినటువంటి వాడు ఎవడు? అనే ప్రశ్నకు జవాబు రావాలి కదా మనకు? మధ్యలో ఉన్న ఆత్మే దానికి జవాబు. మధ్యలో ఉన్న ఆత్మ ఏమి చేస్తావుంది అంటే

అక్కడ జ్ఞానము చెప్పింది, ప్రపంచములో ఉండే పనులన్నీ చేసింది.


----

సిద్ది బోధ

మొట్టమొదట జ్ఞానము చెప్పేవాటి నుంచి చివరి పని ఏదైతే ఉందో, మధ్యలో పనులు ఎన్నైతే ఉన్నాయో అన్ని పనులు ఆత్మే చేస్తావుంది. నీవు ప్రొద్దున్నే లేచినావు, బ్రష్షు వేసుకున్నావు, ముఖము కడుక్కున్నావు. అద్దము ముందు నిలబడి షేవింగు చేసుకుంటున్నావు, అయితే జీవుడు ఏమీ చేయలేనటువంటి వాడు, ఏ పని చేతకాదు, జీవుడు ఏ పనీ చేయలేడు. ఇపుడు ఆ షేవింగు చేసుకునేది ఎవరు? ఇంతకుముందు బ్రష్షు వేసుకున్నది ఎవరు? అని అడిగితే ఆత్మయని చెప్పవచ్చును. ఇపుడు మీరు రూట్లోకి వచ్చారు అంటే దారిలోనికి వచ్చారు. మీరు చేయలేదు, మీలో అణిగి వున్నటువంటి ఆత్మే చేస్తున్నా మీరేమనుకుంటున్నారంటే మేమే చేసుకుంటున్నాము అని అనుకుంటున్నారు. అయితే అట్లు అనుకోవడము పెద్ద పొరపాటు. మీరు ఏమీ చేయలేదు. మిమ్ములను చేయించేవాడు అనగా మీలో ఉండి చేసేవాడు ప్రత్యేకముగా తెలియకుండా ఉన్నాడు. వాడే ఆత్మ అను దేవుడు. అందువలన అంతిమ దైవగ్రంథము ఖురానులో మిమ్మల్ని తోలేవాడు ఒకడున్నాడు అని చెప్పాడు. మీరు తోలబడేవాళ్ళు, మిమ్మల్ని తోలేవాడు మీ వెనుక ఒకడున్నాడు. అతనే మధ్యాత్మే. చూచేవాడు ఒకడు ఉన్నాడు. వాడే మూడవ పరమాత్మ. 50 వ సూరా 21వ ఆయత్లో ఏమి వ్రాసినారు? తోలబడేవాడు తోలేవాడితో సహా, సాక్ష్యము ఉండేవానితో సహా మీరు వస్తావున్నారు. అక్కడికి ముగ్గురు కలిసి వస్తున్నారు. ఎవరెవరు? తోలబడేవానివి నీవు జీవాత్మవు, తోలేవాడు ఆయన అంటే రెండో ఆత్మ, చూచేవాడు మూడవ ఆయన అంటే పరమాత్మ లేదా దేవుడు లేదా అల్లాహ్ అర్థమయ్యిందా! నీవు దేవుడు అనుకో, అల్లాహ్ అనుకో అంతా ఒకటే.


ఇపుడు ఈ ముగ్గురిలో తోలేవాడు ఎవడు? అంటే మధ్యలో ఉండేవాడే. ఇపుడు షేవింగ్ చేసేవాడెవడు? మధ్యాత్మ. ఇపుడు ఒక డాక్టర్


----

రోగికి సూది వేస్తున్నాడు? వేసేవాడు మధ్యాత్మే. ఒకడు ఇంట్లోవున్నవన్నీ అక్రమముగా దొంగతనము చేస్తావున్నాడు, ఇప్పుడు ఆ దొంగతనము చేస్తున్నదెవరు? మధ్యాత్మ. ఒకడు చైను దొంగతనము చేస్తున్నాడు అంటే మెడలో గొలుసును లాగుకొని పోతున్నాడు వాడెవడు? మధ్యాత్మే. ఇవన్నీ పనులు చేస్తావున్నాడు, మంచి పనులు-చెడ్డ పనులు, అన్నీ ఆత్మయిన ఆయనే చేస్తావున్నాడు. ఇపుడు కొద్ది కొద్దిగా మీకు అర్థమయింది అంటే మధ్యాత్మ ఎంత పనికి మాలినవాడు, ఎంత పనికి వచ్చేవాడు అని. ఆయన పనికి మాలినవాడే, పనికి వచ్చేవాడే. ఉత్తమమైన పనులు చేసేవాడే అతనే జీవునికి దేవునికి మధ్యలో యున్న ఆత్మయని చెప్పుచున్నాము. ఈయనను గురించి ఖుర్ఆన్ గ్రంథములో సూరా 2, ఆయత్ 255లో ఇలా వ్రాశారు. “ఆయన తప్ప వేరే ఆరాధ్య దైవము లేనే లేడు. ఆయన స జీవుడు (జీవునితో కూడా ఉన్నవాడు) అన్నిటికి మూలాధారము. ఆయనకు కునుకు గానీ, నిద్రగానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన ఆధీనములో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షములో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు, వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానములోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోనికి రాదు. ఆయన కుర్చీ వైశాల్యము భూమ్యాకాశాలను చుట్టిముట్టివుంది. వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు”. “పాపము వస్తుందని నువ్వు ఎందుకు ఏడుస్తున్నావయ్యా” అని అర్జునున్ని భగవద్గీతలో కృష్ణుడు అడిగినాడు. నాకు పాపము వస్తుంది వాళ్ళని చంపితే అని అర్జునుడు అంటే దానికి నువ్వు ఎక్కడ చంపుతున్నావు? చంపేవాడు వాడు, చచ్చేవాడు వాడు, ఆ పడిపోయేవాడు వాడే, మధ్యలో నీకు పాపము ఎందుకు వస్తుంది? నీకు ఏమీ రాలేదు, నేను చేస్తున్నాను అని అనుకుంటున్నావు నీవు, కానీ


----

నీవు ఏమీ చేయలేదు. చేసేవాడు మధ్యాత్మ. ఇపుడు భోజనము ముందర కూర్చున్నారు, భోజనము తింటున్నారు ఎంత రుచిగా ఉంది అని అనుకుండేది జీవాత్మ. ప్లేటులోని ఆహారమును చేతితో తీసుకొని నమిలి మ్రింగేవాడు ఆత్మ. రుచిని అనుభవించేవాడు జీవాత్మ. కానీ నోరు కదిలించి తినేవాడు ఆత్మ. నమిలి మింగేవాడు మధ్యాత్మ అయితే రుచి చూసేవాడు జీవాత్మ. అనుభవములను మాత్రము జీవాత్మ పొందగా కార్యములను మాత్రము ఆత్మ చేస్తూ ఉంది, దానినే చేయిస్తావుంది అంటున్నారు.


ఈ ఇద్దరిని చూసేవాడు ఎవడు? మూడోవాడు చూస్తున్నాడు, పరమాత్మ ఇద్దరిని చూస్తూవున్నాడన్నమాట. కాబట్టి నువ్వు లేచింది మొదలు పడుకునేంత వరకు ఏమి చేస్తున్నావు? అని తెలిసేదంతా మధ్యాత్మకే. “రహస్యములలోకెల్లా రహస్యము అతనికి తెలుసును” అని ఖురాను గ్రంథములో ఒక ఆయత్ ఉంది. మీకు జ్ఞాపకము ఉందో లేదో అంటే ఖురాను గ్రంథము చదివివుంటే తెలుస్తుంది. రహస్యములలోకెల్లా రహస్యము ఆయనకు తెలుసు, చీకటిలో చేసే పనులన్నీ ఆత్మకు తెలుసు. ఎవ్వరూ చూడలేదులే అని చేస్తున్నావు కదా! నువ్వు చేయలేదు. ఆయనే (ఆత్మే) చేస్తావున్నాడు. కాబట్టి వానికి ఎందుకు తెలియదు. ఆ పనులు కూడా వాడే చేస్తావున్నాడు, నిన్ను మభ్యపెడుతున్నాడు. కాబట్టి అది కూడా ఆయనకు తెలుసు. ఆయన తెలిసే చేస్తున్నాడు అన్నీ. ఈ రకముగా లెక్కవేసుకుంటే "ఏక్ కా కామ్ నహీ దో కా కామ్ కర్తా హై వో. కిత్నా ఆద్మీ కా కామ్ కర్తా హై? దో ఆద్మీ కా కామ్ కర్తా హై. ఇసీలియే క్యా బోలా ఉస్కో ఆట ఆడతా హై”. ఆత్మ ఆట ఆడుతుంది కానీ దో బూచాట ఆడతా హై. ఏక్ బూచ్ నహీ. దో బూచ్, బూచ్ అంటే కనిపించనటువంటి వాడు అర్థమయిందా! బూచోడు అంటే కనిపించనటువంటివాడు అని


----

అర్థము. కానీ నేను ఏమనుచున్నానంటే ఆత్మ బూచాట ఆడుతున్నాడు, కనిపించకుండా ఆడుతున్నాడు, ఒకసారి జ్ఞానము చెప్తాడు దేవునిగా. దేవుడు చెప్పే పని అది, దేవుడు చేసే పని ఈయన (ఆత్మే) చేస్తాడు. జ్ఞానము ఎవరు చెప్పాలా? దేవుని పనే కదా అది, దేవునికే కదా జ్ఞానము తెలుసు, ఆ దేవుని పని ఈయనే చేస్తాడు. దొంగతనము ఎవరు చేయాలి? జీవుడు చేయాలి, పరమాత్మ చేయడు. ఆ పని కూడా ఆత్మే చేస్తాడు. జీవుని పనిని మధ్యలోవాడే చేస్తున్నాడు, దేవుని పని కూడా మధ్యలోవాడే చేస్తున్నాడు కాబట్టి వో దో కా కామ్ కర్తా హై అంటే ఇద్దరి పనులు చేస్తావున్నాడు. అందుకే దో బూచులాట అన్నారు.


ఆత్మ ఆడేది ఉత్త-బూచులాట కాదు, దో-బూచులాట ఆడుతున్నాడు. ప్రతి నిత్యము మీలో దోబూచులాట ఆడుతున్నాడు, ఏక్-బూచులాట నై. ఇపుడు సరిపోయిందా ! ఇపుడు దో-బూచులాట ఆడినాడు ఆయన. కొంతసేపు నిలబెట్టి, కొంతసేపు కదిలించి, రెండు ఆటలు నేనే ఆడుతున్నాను అని అన్నాడు. ఆయన పని, మనకు అర్థము కాదు. ఇదంతా మన తప్పే మనమే చేస్తున్నాము అని అనుకుంటాముకానీ మన తప్పు ఏమీ లేదు. ఒకడు గడ్డము పెంచినాడంటే ఎవరిది తప్పు? ఆత్మదే తప్పు, మన తప్పుకాదు. ఒకడు గుండుకొరిగించుకొన్నాడంటే ఎవరిది తప్పు? మధ్యాత్మదే. ఒకడు దొంగతనము చేసినాడంటే ఎవరిది తప్పు? ఆయనదే. ఒకడు హత్య చేసినాడంటే ఎవరిది తప్పు? మధ్యాత్మదే. ఇపుడు అర్థమయిందా! నీ తప్పు ఏమీ లేదు, నీవు ఏడ్వవలసిన పని లేదు. నీకు పాపము రాదు అని చెప్పినాడు, భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు ఏమి చేసినాడు ఏడుస్తున్నాడు కదా! నాకు పాపము వస్తుందని. వీడు మా చిన్నాయన, వాడు మామ, వీడు మేనమామ అని. సరే, ఇపుడు


----

ప్రతిదానికి కారణము ఆయనే అనుకున్నాము కదా! నాకు బాగా తెలుసు మంచి చెడు రెండు ఆటలు ఆయనే ఆడుతున్నాడని కాబట్టి అన్ని ఆటలు ఆయనవే కాబట్టి మనకు ఏమీ సంబంధము లేకుండ ఉండడము మంచిది. నేనైతే నాకేమి సంబంధము లేకుండవున్నాను. అందరూ అట్లు కాకుండ అన్ని మేమే చేస్తున్నాము అని అనుకుంటున్నారు.


పొద్దున్న లేచినప్పటి నుంచి అంటే మేము రాత్రి 12 గంటలప్పుడు జీవితము మొదలుపెడుతాము. అంటే రాత్రి 12 గంటలకు లేచి ప్రారంభిస్తాము, 11 గంటలకు ముగుస్తుంది మా జీవితము, 12 గంటలకు ప్రారంభమైతాది. అంటే ఒక గంటసేపు మాత్రము లేకుండా పోతాది అనుకున్నాము, అప్పుడు అది ప్రళయము అనుకుంటాము. అంటే రాత్రి పూట లేచి మేము స్టాట్ చేసేటప్పుడు ఏమి చేస్తాము అంటే ఇప్పుడు నేను ఏమి చేయడము లేదు, నేను చేస్తున్నాను' అని అందరూ అనుకుంటారు ప్రపంచములో, ఏమి చేయలేదు అని నాకు తెలుసు, అన్నీ చేసేవానివి నీవే, ఈ చేసే పనులు ఏమిటివో మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ మంచేమిటిది? అంటే ప్రజలకు జ్ఞానము తెలియాలని కోరుకుంటున్నాను. నువ్వు ప్రజలకు జ్ఞానము _ అందించమని వేడుకుంటున్నాను అని మొదలు పెడుతున్నాము. కానీ ఆయన ఏమి చేస్తున్నా డంటే నువ్వు మంచే అడిగినావు. నన్ను కనుగొని అడిగినావు నేను నీకు కరెక్ట్ చెప్పుతాను చూడు అని, ఎక్కడ ఎక్కడ జ్ఞాన రహస్యాలన్నీ చెప్పుతున్నాడు. అంతేకదా లేకపోతే మెరుపుల కథ మనకేమి తెలుసయ్యా! తెలుసునా? ఏమన్నా ఊహలో అన్నా వచ్చిందా మీకు అది? ఉరుముల కథ తెలియదు, మెరుపుల కథ తెలియదు, పిడుగుల కథ తెలియదు, కానీ ఆయన చెప్పినాడు. ప్రతిదానికి అర్థము చెప్పినాడు. “నీకు నా లేఖ” అనే


---

గ్రంథములో “దరిద్రుడు” అంటే ఏమో అర్థము చెప్పినాడు? మనము దరిద్రుడు అనుకుంటా ఉంటాము కదా మరి దరిద్రుడు అనే పదానికి అర్థము మనకు తెలియదు. ఇట్ల ప్రతిదానికి వివరము అందించి మనలను జ్ఞానానికి దగ్గరగా తీసుకొని పోయినాడు ఆయన. ఇప్పుడు మీరు గ్రంథాలన్నీ చదువుతూ వస్తే మీరు ఉండే స్థితి నుండి దేవునికి దగ్గరగా వచ్చినట్లు అర్థమౌతావుంటుంది. అర్థముకావడమే కాకుండా మీకు ఏమి తెలుస్తుంది అంటే ఒక ఆనందము ఉత్పత్తి అవుతుంది శరీరములో మీకు.


జ్ఞానము తెలిసేకొద్ది ప్రపంచములో ఎప్పుడూ లేని ఆనందము మీలో పుట్టుకువస్తుంది. అదే జ్ఞానము యొక్క చిహ్నము లేదా జ్ఞానము యొక్క గుర్తు. దానిని ఆనందము అంటాము. ఆ ఆనందము ఎక్కడా ఉండదు. ఏ ఆనందాన్ని చవిచూసినా కూడా ఆ ఆనందమునకు తక్కువదే. అన్నిటికంటే పెద్ద ఆనందము కాబట్టి దానిని 'బ్రహ్మానందము' అన్నాము అంటే 'బ్రహ్మ' అంటే 'పెద్ద' అని, అందుకే దానిని బ్రహ్మానందము అని అన్నాము. ఈ జ్ఞానాన్ని బ్రహ్మానందముతో పోల్చి చెప్పాము అంటే అంత రుచించేది. కానీ ఇది ఆనందము అని చెప్పేదానికి అయితుందా అంటే కొంతమంది వేరేవాళ్ళు చూస్తే దానిని ఏడుపు అంటారు అంతే కదా. నువ్వు నిజంగా ఏడుస్తున్నావా లేదా? ఆనందముతో నీ కండ్లకి నీళ్ళు వస్తున్నాయి. అలా వస్తుంటే మీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే నువ్వు ఏడుస్తున్నావు అని అనుకుంటారు. ప్రక్కవాళ్ళు చూసి అలా అనుకోవడానికి అవకాశము ఉంది. కాని నీవు ఏడ్చలేదు. నీ ఆనందమే కండ్లలో అలా నీళ్ళుగా పొంగుకొని వస్తున్నాయి. అది ఏడ్చినా, నవ్వినా రెండింటికి చిహ్నముగా అంటే బాధకుగానీ, సంతోషానికిగానీ రెండింటికి కండ్లలో నీళ్ళు మనుషులకు


----

వస్తాయన్నమాట, కాబట్టి దేనికి వస్తున్నాయి తెలియదు. అది ఎక్కువ దుఃఖము కల్గినప్పుడు వస్తాయి, ఎక్కువ సంతోషము కల్గినప్పుడు కూడా వస్తాయి అంటే జ్ఞానము తెలిసేకొద్ది ఎక్కువ సంతోషము కల్గుతావుంది కాబట్టి నీకు కండ్లలో నీళ్ళు మెదలడము, కండ్లలో నీళ్ళు రావడము జరుగుతుందన్నమాట.


సరే, ఈ “దో-బూచులాట” ఆడేవాడు ఎవడు? ఎక్కడ ఉన్నాడు? అని మిమ్మల్ని నేను ప్రశ్న వేస్తున్నాను. జీవుల శరీరములో ఉన్నాడు అని చెప్పాలి? ఎవరి శరీరములో వాళ్ళకున్నాడు. పూర్వము ఆకాశములో మేఘాల శబ్దాలు పుట్టినప్పుడు, కొంతమంది తెలిసిన పెద్దలు మేఘము జ్ఞానము చెప్పుతూవుంది అని అనేవాళ్ళు. ఓహో! సృష్టి ఆదిలో ఏ రకముగా చెప్పిందో ఇప్పుడు కూడా ఆ రకముగానే చెప్పుతావుంది అని అనుకునే వాళ్ళు. ఇలా కొంతమంది మేఘము జ్ఞానము చెప్పుతావుంది అని బోధించారు. ఇప్పుడు నేను చెప్పిన బోధ ఆనాడు పెద్దవాళ్ళు చెప్పినారు ఒక రోజు. మేఘము జ్ఞానము చెప్పుతావుంది మనమంతా శ్రద్ధగా విందాము, ఒకవేళ అర్థము కాకపోతే వేరేవాళ్ళని అడిగి తెలుసుకుందాము ఆ శబ్దాలకు అర్థము అని అనుకున్నారు. అంటే అర్జునుడికి కృష్ణుడు కదా జ్ఞానము చెప్పినది. అర్జునుడికి చెప్పిన జ్ఞానము ఏది? వాణి చెప్పిన జ్ఞానము చెప్పినాడు కదా! ఆ జ్ఞానము అర్జునుడికి కదా చెప్పినేది! కాబట్టి మేఘాలు ఢమ్... ఢమ్... అంటూనే అర్జునా.. అర్జునా.. నీకే అంటారు. నీకే మాకు కాదు, నీకే మాకు కాదు అని. అర్జునా.. అర్జునా..! నీవు ఎక్కడ ఉన్నావో చూసుకో, నీకే చెప్పుతుండేది మేఘాలు జ్ఞానము, మాకు కాదు అని అర్జునా అంటారు. మనకే చెప్పినది అను ఆలోచన లేదుకాని అర్జునునికే అని చెప్పుతారు.


----

ఆ రకంగా ఇప్పుడు ఆత్మ ఎక్కడవుంది? అని అడుగుతుంటే జీవరాశుల శరీరములో ఉంది అంటున్నారు. జీవరాశుల శరీరములో ఏందయ్యా! మీ శరీరములో ఉంది కదా! నా శరీరములో ఉంది అని అందరూ అనుకోండి సరిపోతుంది. నీ శరీరములో ఉందా లేదా? ఉంది, నీ శరీరములో ఉంది. మళ్ళ అది ఎట్లుంది, ఇంత గొప్పదా? అని అనుకోకుండా ఏమి చేస్తాడంటే నిద్రలోనే ఒంటికి పోషిస్తుంది. అది గుడ్డల్లోనే ఒంటికి పోపిస్తుంది మధ్యాత్మ. నేను మధ్యాత్మ అన్ని పనులు చేస్తుందంటే ఏం? ఒంటికి కూడా పోపిస్తుందా? అని అనుమానము వస్తుంది మీకు. కొందరు మధ్యాత్మ ఉండదులే మనమే పోసివుంటాము అని అనుకుంటారు. కానీ నీవు ఏమీ చేయలేని వానివి అనే జ్ఞాపకము బాగా పెట్టుకోండి. ఎవ్వడూ ఏమీ చేయలేడు, ఖురాను గ్రంథము ఒక మాట చెప్పింది. ఏమని? "నేను రేపు ఈ పని అని నీవు చెప్పవద్దు ఎందుకంటే నీవు ఏమీ చేయలేవు, రేపు చేయలేవు, ఎల్లుండి చేయలేవు, ఎల్లప్పుడు చేయలేవు. కానీ చేసేవాడు ఒకడున్నాడు వాడు చేస్తే ఏ పనైనా జరుగుతుంది ప్రపంచములో ఇప్పుడు నాకు జ్ఞానము కావాలి అని అనుకో నీవు. జ్ఞానము ఇస్తాడు నీకు. ఇచ్చేవాడు ఆత్మ. అనుకునేవాడు జీవాత్మ. మళ్ళీ రెండూ వానికే అంటగట్టేరు మీరు. అనుకునేవాడు కూడా వాడేనని అనుకోవద్దు. ఇష్టము నీది, శ్రద్ధ నీకుంటే ఆయనిస్తాడు నీకు జ్ఞానము.


అందువలననే "శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్" అని భగవద్గీతలో చెప్పడము జరిగినది. ఎవనికి శ్రద్ధ ఎంత ఉంటే అంత జ్ఞానము నీకు లభిస్తుంది. ఒకాయన చెప్తున్నాడు, నాకు చాలా శ్రద్ధ ఉంది అయినా నాకు ఈ జ్ఞానము ఏమీ అర్థము కాలేదు అని అంటున్నాడు. శ్రద్ధ ఉంటే ఎందుకు అర్థము కాదయ్యా! మిగతా విషయాల మీద నీకు శ్రద్ధ ఉంది.


----

కాబట్టి నీకు ఈ జ్ఞానము అర్థము కాలేదు. మిగతా విషయాల మీద ఎంత శ్రద్ధ అయితే ఉందో అంత శ్రద్ధను ఈ దేవుని విషయము మీద నీవు పెట్టుకో, ఎందుకు అర్థము కాదు! నేనూ మీలాంటి మనిషినే, ఏమీ ప్రత్యేకత లేదు. మీకూ మాకూ తేడా ఏమంటే, మీకంటే నాకు ఎక్కువ శ్రద్ధ ఉంది కాబట్టి మీకంటే ఎక్కువ జ్ఞానము ఉంది. నేను ప్రొద్దున్నే చెప్పుతాను నీవు ఆడించినట్లు ఆడుతాను, ఈ ఆట నీదేకాని నాది కాదు, చూసుకో మళ్ళీ నాకు అంటగట్టేవు నీవు. నాకు బాగా తెలుసు ఏ ఆట ఆడినా నీవే ఆడుతున్నావు. ఆ ఆట ఏదో ప్రజలకు జ్ఞానము తెలిసేటట్లుగా చెయ్యి అని చెప్తున్నాను. ఆయన ఏమి చెపుతాడంటే మొట్టమొదటనే కనుక్కున్నాడు వీడు అని అనుకున్నాడు. కాఫీ త్రాగకనే కనుక్కున్నాడు. ముఖము కడుక్కొనకనే కనుక్కున్నాడు. లేస్తే కళ్ళు పులుముకుంటూనే కనుక్కున్నాడు. కళ్ళు పులుముకుండేది కూడా ఆయనే, మనము కాదు. శరీరములో ప్రతి కదలిక ఆయన వలననే జరుగుతావుంది తెలుసునా లేదా మీకు? ఎవరి వలన? నీలో ఉండే మధ్యాత్మ వలన. మొదటి ఆత్మ ఏమీ చేయదు, చివరి ఆత్మ ఏమీ చేయదు, ప్రతి పని ఆత్మనే చేస్తున్నాడు. ప్రతి అనుభవము జీవాత్మ అనుభవిస్తున్నాడు. చేసేవాడు అంతా ఆయన (ఆత్మ). క్రింద పడుతూనే పళ్ళు ఊడిపోయేటట్లు చేస్తాడు. ఈ పన్ను బాధ అనుభవించేది ఎవరు? జీవాత్మ. ప్రతి విషయములో పని, అనుభవము అనేవి రెండు ఉన్నాయి. అనుభవము జీవాత్మది, పని ఆత్మది.


ప్రపంచములో అతి చిన్న పనిగానీ, అతి పెద్ద పనిగానీ, ఏ పని అయినాగానీ ఎవరు చేస్తున్నారు? ఆత్మ. ఇపుడు బాగా రూఢీగా మీకు అర్థమయిపోయిందా. దేవుడు చూచేవాడు. దేవునితో మనకు ఏమి పని? నీవు ఏమి అనుకుంటున్నావని, ఆయన ఏమి చేపిస్తున్నాడని చూస్తూ


----

వుంటాడు దేవుడు సాక్షిగా. నేను డైరెక్టుగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. దేవునితో మీకేమైనా పనుందా? ఏమీ పని లేదు. నేనేమంటున్నానంటే ఒకాయన వచ్చి స్వామీ! మీ దగ్గర ఉపదేశము తీసుకోవాలనుకుంటున్నాను, ఉపదేశము ఇవ్వండి అని అన్నాడు. చాలామంది పోయి గురువుల దగ్గర ఉపదేశము ఇప్పించుకుంటుంటారు, చాలామంది మా ఊర్లో నూటికి తొంబై తొమ్మిదిమంది ఉపదేశము తీసుకున్నారు, నేనొక్కన్నే ఉపదేశము తీసుకోలేదు ఇంతవరకు, ఆ గురువులంతా నాకు సరిపోలేదు కానీ జ్ఞానము నాకు బాగా నచ్చింది, నీవు ఉపదేశము ఇస్తే నేను తీసుకొనిపోవాలనుకొని వచ్చినాను అని అన్నాడు. చాలామంది ఇట్లే అడుగుతుంటారు, నా దగ్గర కూడా చాలామంది ఇట్లే అడిగినారు. నేనేమన్నానంటే అదేదో ఒకవేళ వస్తువు అయితే గట్టిగా ఇస్తావుంటిని నేను, అది ఏది నాకు కనపడనే కనపడలేదు, నీకు ఎట్ల ఇచ్చేది నేను అని తిరిగి అడిగినాను.


నాకు కనిపిస్తే కదా నీకు ఇచ్చేది అది ఏమిటిదో నాకేమీ తెలీదు, ఇచ్చేది ఎవరో ఎట్లా ఇస్తారో నాకేమీ తెలీదు, నా దగ్గర మాత్రము ఒక్కటి కూడా లేదు ఇచ్చేదానికి నీకు. అయితే నేను అతన్ని నీకు కావాల్సింది జ్ఞానమా? ఉపదేశమా? అని అడిగినాను. ఆయన జ్ఞానము ఇంటికి పోయిన తరువాత చూసుకుంటాను, ఉపదేశము ఇవ్వు అన్నాడు. ఒకవేళ ఉపదేశము అనేది నా జేబులోదో లేదా ఇంట్లోదో అయితే ఎట్లో గట్లా ఇస్తావుంటి, అది ఏదో నాకు తెలియనే తెలియదు, ఇప్పుడు జ్ఞానము తెలుసుకో నీవు, కావలసింటే జ్ఞానము చెప్పుతాను అని అన్నాను. అది ఉపదేశములాగా ఒక రోజుతో వచ్చేది కాదు ఉపదేశమయితే ఇంటికి పోయి ప్రతిరోజు ప్రాక్టీసు చేసుకునేది అన్నాడు. ఎట్ల చేసుకుంటారు ప్రాక్టీసు అని అడిగినాము మేము. ఉపదేశములో మంత్రము చెప్తారు స్వామీ! మీరు కూడా నాకు


---

అలానే మంత్రము చెప్పితే నేను ఇంటికి పోయి జపము చేసుకుంటాను. మీకు అంతమటుకు తెలియదా? మీరు గురువైవుండి ఏమి చెప్తున్నావు ఇంతమందికి? ఎవరికీ ఉపదేశము ఇవ్వలేదా? అని అడిగినాడు. దానికి నేను గురువుననే విషయము నాకే తెలియదు. నేను ఇంతవరకు ఎవ్వరికీ ఉపదేశము ఇవ్వలేదు. ఎవ్వరికన్నా ఉపదేశము ఇచ్చి ఉంటే ఒకవేళ నేను గురువును అనుకుందును, నాకు ఇంతవరకు తెలియదు నేను గురువునని అని చెప్పినాము.


ఏదో పెద్ద జ్ఞానము తెలుసని నీ దగ్గరికి వస్తే ఉపదేశము కథే తెలియదే నీకు, నీవు ఏమిస్తావులే అని వెళ్ళిపోయాడాయన. ఇట్ల కొంతమంది ఏమి చేస్తున్నారంటే దేవునితో మాకు పనే అంటున్నారు. ఏమి చేస్తున్నావు రా? అంటే మనసులో జపిస్తున్నాను దేవునిని అని అన్నాడు. అంటే ఫలానావాడు దేవుడు అని తెలిస్తే గదా నీవు జపించేది అని అడిగినాము. ఫలానావాడు అని తెలిస్తే వానిని మనము జపించేదో, తపించేదో ఏదో ఒకటి చేస్తాము. ఫలానావాడు తెలియనప్పుడు నీవేమి చేస్తావు. నేనెవరికీ దొరికేవాడిని కాదు, వెతకబడేవాడిని, దేవులాడబడే వాడిని దేవునిని అని చెప్పే అర్థముతో ఉండేటటువంటి వానిని, ఎవరికీ తెలియనివానిని నీవు ఎట్లా జపిస్తావు? ఏమని అనుకుంటావు? నీవు అనుకునేదానికి అవకాశమే లేదు. దీనినిబట్టి వీడు చెప్పేమాట అంతా పూర్తి అబద్దము అని తెలిసిపోయింది. దేవున్ని నేను మనసులో ఎప్పుడూ మతికి చేసుకుంటా ఉన్నాను, ఎప్పుడూ నేను దేవున్ని చూస్తానే ఉన్నాను అని అంటాడు. నీకు కనిపించేది దేవుడే, అంటే నీవు అలా అనుకొని భ్రమిస్తూవున్నావు, ఆ మాట అసత్యము అని తెలిసిపోతుంది. మనకు కావలసినటువంటి వాడు దేవుడే అయినాగానీ నీకు దేవునితో పని లేదు.


----

ఈ మాట ఎవరూ చెప్పలేదు, మేమే చెప్తున్నాము దేవునితో పనిలేదు అని, మరి ఎవరితో పని? ఇప్పుడు మనము భగవద్గీతలోకి పోదాము. భగవద్గీత అంతా దేవుడే చెప్పినాడు అంటున్నాముకానీ దేవుడు చెప్పలేదు అక్కడ. దేవుని పేరుని మనము చెప్పుచున్నాము. "భగవాన్ ఉవాచ” అని అంటున్నాము అక్కడ. 'భగవాన్' అంటే 'భగవంతుడు' అని అర్థము. అంటే కనిపించేటటువంటి వ్యక్తి. “భగము” నుంచి పుట్టినటువంటివాడు, తల్లిగర్భము నుంచి పుట్టినటువంటి వాడు అని లెక్క. తల్లి గర్భము నుంచి పుట్టినటువంటి వాడు ఒక శరీరము ధరించి వచ్చి పుట్టాడు. అతనినే మనము భగవంతుడు అని అంటాము. కృష్ణుడిని కనిపించేటటు వంటి వ్యక్తిగా భగవంతుడు అని అన్నాము. ఆ భగవంతుడు అంటే కృష్ణుడు అనే భగవంతుడు మనకు జ్ఞానాన్ని తెలియజేశాడు. ఇపుడు మనకు దేవుడు తెలియజేసినాడా? భగవంతుడు తెలియజేసినాడా? అంటే పేరేమో దేవునిదే దేవుడు చెప్పినాడు ఇట్లా అంటాము.


అంతిమ దైవగ్రంథములో దేవుడు ఇట్లా చెప్పినాడు, ప్రథమ దైవగ్రంథములో దేవుడు ఇట్లా చెప్పినాడు అని అంటాము. కానీ రూలు ప్రకారము దేవుడు చెప్పినాడా? ఏమాత్రము చెప్పడు. చట్టము ప్రకారము దేవుడు చెప్పలేదు. ఎందుకంటే దేవుడు మాట్లాడేవాడు కాదు, ఏమి చేసేవాడు కాదు, దేవుడు చెప్పలేదు. మరి ఎవరు చెప్పారు? నా ప్రతినిధి చెప్తాడు అని ఒకచోట చెప్పాడు ఆయన. ఖుర్ఆన్ గ్రంథములోనే 42వ సూరా 51వ ఆయత్లో ఏమి చెప్పినాడు “నా ప్రతినిధి ద్వారా మీకు చెప్ప బడుతుంది” అని చెప్పినాడు. ఆయన చెప్పకుండా ఆయన ప్రతినిధి అంటే భగవంతునిగా వచ్చి మనకు చెప్పుతాడు. కనిపించే వ్యక్తిగా వచ్చి చెప్పుతాడు. ఆయన చాలా వివేకవంతుడు. ఆయన ఎవరు? 42వ సూరా 51వ ఆయత్


----

సిద్ది బోధ

లో చెప్పిన వాక్యము చిట్టచివరిలో “ఆయన వివేకవంతుడు” అని ఉంది. ఏమని ఉంది? దేవుని వాక్యము చెప్పేటటువంటి ప్రతినిధి భగవంతుడు, అతను వివేకవంతుడు. కానీ ఇక్కడ ఏమంటారంటే దేవుడు వివేకవంతుడు అంటారు. దేవుడే వివేకము. మళ్ళీ వివేకవంతుడు ఏమిటి? దేవుడు ఫలానా అని చెప్పేదానికి వీలులేదే. ఆయనను ఫలానా అని ఎవరూ చెప్పలేరు. దేవుడిని ఆయన వివేకవంతుడు అంటే నీవు పరిమితి చేస్తావు.


కానీ ఆయన ప్రతినిధిగా వచ్చినటువంటి వాడు వివేకవంతుడు. అక్కడ ఆయత్లో ఆ వాక్యములో ఉండేటటువంటి ప్రతి సూక్ష్మాన్ని గ్రహించుకుంటే ఎంతో గొప్ప రహస్యము ఉంటుంది. కానీ వివేకవంతుడు అని జ్ఞానమును చెప్పే మనిషికి చెప్పాలిగానీ దేవునికి ఆ పేరు పెట్టకూడదు. వివేకవంతుడు అని దేవుడిని అనలేము మనము, ఎందుకంటే ఆయనను పరిమితి చేసి మాట్లాడినట్లు అవుతుంది. దేవుడు పరిమితి లేనటువంటివాడు, ఆయనను మనము ఇంత అంత అని కొలత వేసి చెప్పలేము. సరే, ఇప్పుడు దేవునితో మనుషులకు పనా? అని అడిగితే దేవునితో మనుషులకు ఏమాత్రము పని లేదు. మనుషులకు ఆత్మతో పని, ఎక్కడుంది ఆ ఆత్మ? అంటే ఇపుడు చెప్పేది ఆత్మే? మా శరీరములోంచి చెప్పేది ఆత్మే అట్లే మాట్లాడేవారు మీరు కాదు. చూడు, ఎంత మోసము చేస్తుందో. దో-బూచులాట ఆడతావుంది. ఇట్లా ఆడతావుంది అట్ల ఆడతావుంది. ఈ ప్రక్క ప్రశ్న వేస్తాంది, ఆ ప్రక్క జవాబు చెప్పిస్తావుంది. దీనిని దో-బూచులాట అంటారా లేదా? ఆత్మ ఆట ఆడతావుంది. ప్రతి ఆట ఆయనదే (ఆత్మదే). 'స్నానము ఆడుట' అని అంటాము. స్నానము అనేది కూడా ఒక ఆటే. స్నానము ఆడుట అంటే ఆటే కదా. నీళ్ళు పోసుకునేది కూడా ఒక ఆటే, స్నానము చేసేది ఒక ఆట. ప్రతి పనికి 'ఆట' అనేది తగులుకొని వుంటుంది.

-----

'పోట్లాట' అంటే కొట్లాడే దానిని కూడా కొట్లాట అంటాము, అది కూడా ఒక ఆటే. ఆ ఆట ఆడేది ఎవరు? ఆత్మే. కొట్లాడేది ఆత్మే, స్నానమాడేది ఆత్మే, ప్రతి దానిని మనము ఆట ఆట అని చెప్పుకుంటున్నాము గానీ ఈ ఆటంతా ఆడేది ఎవరు? ఆత్మ అనబడే ఆయనే. రెండు ప్రక్కల ఆడేది కూడా ఆయనే. ఇటు జీవుని ప్రక్కన అటు దేవుని ప్రక్కన. దేవుని ప్రక్క నుంచి జ్ఞానము చెప్తాడు, జీవుని ప్రక్కన నుంచి ఏడ్చే విధముగా తన్నులు తినిపిస్తాడు రెండు రకాలుగా చేస్తాడు ఆయన, కాబట్టి ఆయనను గుర్తు పట్టాలంటే చాలా కష్టము. కానీ మనము ఒక విషయము చెప్పుకుంటాము. భగవద్గీతలోకి పోతే ఇపుడు “లు' అంటే ఏమిటి? (తెలుగు)” అనే గ్రంథములో 6 శ్లోకాలను ప్రత్యేకించి చెప్పడము జరిగినది. అంటే భగవద్గీతలో మోక్షసన్యాసయోగము 78 శ్లోకాలుగా ఉంది.


కానీ ఆ భగవద్గీత దేవుడు చెప్పినటువంటి భగవద్గీత మోక్షసన్యాస యోగములో సారాంశమంతా 66 శ్లోకాలకే అయిపోయింది. ఆ చెప్పినటువంటి ఎక్స్ట్రా శ్లోకాలు అవన్నీ దిక్కు తెలియనివి. అవి మనుషులు చెప్పినవేగాని దేవుడు చెప్పినేది కాదు. ప్రథమ దైవగ్రంథము భగవద్గీతలో కూడా మనుషులు చెప్పిన వాక్యాలు చాలా ఉన్నాయి. నేను స్వచ్ఛమైన బియ్యము కొనుక్కొని తెచ్చుకుంటే దాంట్లో కొన్ని రాళ్ళు ఉండనే ఉంటాయి. స్వచ్ఛమైన బియ్యము కావాలంటే దానిని వేరేసుకొని తిను, అట్లాగనే “ప్రథమ దైవగ్రంథము భగవద్గీత” అని అంత పెద్ద పేరు పెట్టుకున్నాగానీ దాంట్లో కూడా మనుషుల మాటలు ఉన్నాయి. ఇప్పుడు నేను చివర్లో చెప్పిన మోక్ష సన్న్యాసయోగము అనే దాంట్లో 78 శ్లోకాలలో 66 శ్లోకాలకే భగవద్గీత అయిపోయింది, ఇంక అవతల లేదు భగవద్గీత. కానీ 66 శ్లోకాలకు ముందు 61, 62 శ్లోకాలు ఒక సెట్టు, 63, 64 శ్లోకాలు ఒక సెట్టు, 65, 66


----

శ్లోకాలు ఒక సెట్టుగా మూడు భాగాలుగా ఉన్నాయి. ఇలా మూడు భాగాలుగా ఉన్నప్పుడు ఒక భాగము అంటే మొదటి భాగము వదిలివేస్తాము. ఈ మధ్యలో ఉన్న భాగములో ఏమి చెప్పినాడని చూస్తాము. అంటే మిమ్మల్ని ఆత్మ, ఆత్మ అని అరిపిచ్చినాము కదా. ఇప్పుడు ఈ భగవద్గీతలో చిట్టచివరిలో ఏదో గొప్ప సారాంశము ఉంటుంది కదా! ఆ సారాంశమును గురించి చెప్పాలి అంటే ఇప్పుడు భగవద్గీతలోకి పోయి అక్కడ ఈ 6 శ్లోకాల విషయాన్ని మనము గమనిస్తాము. అట్ల గమనిస్తే ఈ 6 శ్లోకాలలో ఉండే రహస్యము కొంతకు కొంత మనకు తెలుస్తుంది. అలా తెలిస్తే మేము చెప్పేది అక్కడ భగవద్గీతలో ఉందని మీరు అనుకొని నా మాటను నిజమనుకుంటారు లేకపోతే నన్ను పూర్తి అబద్దాలు చెప్పేవానిగా అనుకుంటారు. అంటే అబద్దాలు కాకుండా సత్యము అనేదానికి దూరముగా ఉన్నట్లు మీరు అనుకోవచ్చు. అట్ల మీకు ఇప్పుడు భగవద్గీతలో ఉండేటటువంటి 6 శ్లోకాల గురించి మేము కొంత జ్ఞాపకము చేసి చెప్పుతాము చూసుకోండి. ఇప్పుడు సభలో చాలా పెద్ద పెద్ద పండితులు ఉండవచ్చు, మంచి చదువరులు ఉండవచ్చు, ఉన్నారు కూడా, ఇంకా నోటికి భగవద్గీతను అంతా కంఠా పాఠముగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు.


ఇప్పుడు దేవుడు మనకు అంటే దేవుడు ఏమి చేయలేదుగాని, మధ్యమధ్యలో దేవుడు అని అనుకుంటుంటాము మనము. ఈ మధ్యలో ఆత్మ చాలా కుతంత్రమైన ఆత్మ ఇది. చాలా కుఠిల ఆత్మ, ఇంకో ఆత్మ, జఠిల ఆత్మ ఎన్ని పేర్లన్న పెట్టు దానికే, నీకేమీ లేవు. అర్థమయిందా! ఇపుడు మాకు ఏమి చేసిందంటే ఒరేయ్ ! నన్ను గురించి ఇంతగా చెప్తవా! నీకు ఒక్క శ్లోకము కూడా రాదని బయటికి చెప్తచూడు. నీవు శ్లోకము చెప్పాలంటే బుక్కు చూసుకొని చెప్పాలి, బుక్కు తీసుకొని చెప్పితే దాంట్లో


---

కూడా తప్పులు చెప్తావు, నీవు చెప్పితే నీ మాట ఎట్లా వింటారో చూస్తాము వాళ్ళు. అనేరకంగా ఏమి చేసిందంటే నన్ను బుక్కు తీసుకొని చెప్పేటట్లు చేసినది. కావున నేను బుక్కు తీసుకొని చెప్తాను, ఏమనుకోవద్దండి వినండి మీరు. మోక్ష సన్యాసయోగము 63వ శ్లోకము "ఇతితే జ్ఞాన మాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా” అంటే ఈ శ్లోకములో గుహ్యములలో కెల్లా గుహ్యమైనటువంటిది, రహస్యములలో కెల్లా రహస్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నానని జాగ్రత్తపరుస్తున్నాడన్న మాట. ఏదో రహస్యమంటే ఎవరన్నా జాగ్రత్తగా వింటారు కదా! చాలా రహస్యము ఎవరికీ తెలియదు.


ఈ రహస్యము నీకు చెప్పుతున్నాను అంటే శ్రద్ధగా వింటారు కదా! చూడు ఎంత బాగ చెప్పుతున్నాడో! ఆయన ఈ శ్లోకములో ఒక్క ముక్క జ్ఞానము చెప్పలేదు. ఒరేయ్! నేను చెప్పేది చాలా రహస్యమైనది, ఎవరికీ తెలియదు, నీకు ఒక్కనికే చెప్పుతున్నాను చూడు అన్నాడు అంటే చాలా జాగ్రత్తగా వింటాము కదా! ఆత్మ ఎంత తెలివైనోడో చూడు అదే చెప్తున్నాను. 'గుహ్యములలోన అత్యంత గుహ్యమైన జ్ఞానమిది నీకు నేను చెప్పుతా” చూడు. ఈ రహస్యములలో కెల్లా రహస్యమైన జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను. నిశ్శేషముగా, వివరముగా అంటే నిశ్శేషముగా, అన్ని రకాలుగా విడదీసి చెప్తున్నాను. ఎట్లు నీకు ఇష్టమో అట్లు చేయుము. నీవు విన్న తరువాత నీకు ఎట్లా ఇష్టమో అట్ల చేసుకో అని చెప్పినాడు. అంటే నేను చాలా రహస్యమైన జ్ఞానము చెప్తున్నాను, ఇంటికి పోయినా కూడా నీవు మతికి పెట్టుకో అని చెప్పినాడు. అదే విషయాన్నే ఇంకొక శ్లోకములో చెప్తున్నాడు.

64 శ్లో : సర్వ గుహ్యతమం భూయశృణుమేపరమంవదః |

ఇప్టోసి మే దృఢమితి తతో వక్ష్యామితే హితమ్ ॥

ఇక్కడ ఏమి చెప్తున్నాడు అంటే ముందు చెప్పినట్లే ఇంకా గాఢముగా, ఇంకా


---

లోతుగా చెప్తున్నాడు. జ్ఞానము ఏమీ చెప్పలేదు, మీరు గ్రహించుకోండి. మిమ్మల్ని ఒక దారికి తీసుకువచ్చి చెప్తున్నాడు. గుడికి పోతే ఒక గంట కొడతాము. గంట కొడితే మేము ఏమి చెప్పినామంటే గణ...గణ...అని కొట్టొద్దండి. ఒకసారి గంట కొట్టండి అని చెప్పినాము దేవాలయ రహస్యాలలో. ఒక్కసారి గంటకొట్టి, ఆ శబ్దాన్ని వినండి చాలు అని చెప్పినాము. ఆ శబ్దాన్ని వింటే ప్రక్కన పోయినట్టి మన మనస్సు అంతా ఏకతాటి లోనికి తెచ్చుకుంటాము అంటే శబ్దస్థాయిలోనికి తెచ్చుకుంటాము, అప్పుడు మనస్సు అంతా ఒకే స్థాయిలోనికి వస్తుంది.


అప్పుడు నీవు దేవున్ని చూసినాగాని నీకు దేవుని మీద మనస్సు ఉంటుందనే ఉద్దేశ్యముతో ఆ గంటను అక్కడ ఏ విధముగా పెట్టినారో అట్లే గుడి ముందు గంటగా ఈ శ్లోకాలు చెప్పినాడు. అంటే మీ ధ్యాస అంతా చెప్పేటువంటి శ్లోకాల (జ్ఞానము) మీదకే వచ్చే రకముగా చెప్పినాడుకానీ ఇది జ్ఞానము కాదు. అతి ‘రహస్యముల కెల్ల ఉత్తమంబగుటన్ జేసి' అంటే 'రహస్యములలోకెల్ల ఉత్తమమైన రహస్యము’. ఇంతకుముందు రహస్యము అని చెప్పినాడు మళ్ళీ దానినే చెప్తున్నాడన్నమాట. "పరమ వచన సమితి మరల వినుము” అంటే రహస్యములలో కెల్లా రహస్య మైనటువంటి మాటల యొక్క సారాంశాన్ని విను అన్నాడు. నీకు ఎందుకు చెప్తున్నాను అంటే నీవు నాకు మిగుల ఇష్టుండవగుటచే, మనకు ఇష్టమేమి ఉండదు ఆయన మీద, అయినా పిలుచుకొని వచ్చి చెప్తున్నాడు. అర్జునుడు ఏమైనా జ్ఞానము అడిగినాడా? ఏమీ అడగలేదుకానీ వాడు తెలుసుకోవాలనే ఉద్దేశ్యముతో నీవు నాకు మిగుల ఇష్టుండవగుటచే హితము కోరి చెప్పుచుంటి, నీ మంచి కోరి చెప్పుతున్నాను అని చెప్పాడు, సరే ఇంతవరకు జ్ఞానమేమి చెప్పలేదు, తెలుసుకో, నీకు పనికి వచ్చేది, రహస్యమైనది, నీవు చాలా


---

నాకు ముఖ్యమైన వాడివి, సొంత బావమరిదివి అందువలన చెప్పుతాను విను అన్నాడు, ఇప్పుడు ఏమి చెప్పుతున్నాడు? పెద్ద జ్ఞానము అని చెప్పినాడు కదా! చిట్టచివరి రెండో శ్లోకములో ఎంత పెద్ద జ్ఞానము ఉందో చూడండి. 65 శ్లో:

మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు | 

మామేవైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే ||

అని అన్నాడు, అంటే “నన్ను దలంపుము, సలుపుము నాదు భక్తి" అంటే నన్నే అనుకో, నీ భక్తి అంతా నా మీదే చూపు. “నన్నే మ్రొక్కుము నాదు పూజ చేయుము” అంటే నన్నే మ్రొక్కు, నా పూజే నీవు చెయ్యి అన్నాడు. “నన్ను చేరుదువు నాలో ఐక్యమై పోతావు. నాకు ప్రియుడవగుదువు అని ప్రతిజ్ఞ చేసి చెప్పుచుంటి” అని అన్నాడు అంటే నాకు చాలా ఇష్టుడవు కాబట్టి నీకు ప్రతిజ్ఞ చేసి చెప్పుతున్నాను, ఏమని చెప్పుతున్నాను? ఏమి చెప్పలేదు, నన్నే మ్రొక్కు అని చెప్పినాడాయన అంతే కదా! ఏమి చెప్పినాడు, రహస్యములలో కెల్ల రహస్యము, అది, ఇది అని చెప్పి మళ్ళీ ఈ రకంగా చెప్పినాడు. ఈ రకంగా నన్ను మ్రొక్కు అని చెప్పినాడు, ఏమీ చెప్పలేదు. ఎందుకాయన అట్ల చెప్పినాడు అంత పెద్ద రహస్యమా? ఇదేమైనా జ్ఞానమా అని మనము ప్రశ్న వేసుకుంటే దానికి జవాబుగా చిట్టచివరి శ్లోకము చెప్తున్నాడు, ఏమి చెప్తున్నాడు. ఆ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా విందాము.

సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |

అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః ॥

అంటే “సర్వ ధర్మములను సంపూర్ణముగ వీడి, నన్ను మాత్రమే నీవు నమ్ము కొనుము నిన్ను నేను పాపనియచంబునుండి ముక్తుంజేతు, దుఃఖమును త్యజింపు” అన్నాడు. “ఎన్నో పాపాలను చేసుకున్నావు. ఆ పాపాలను


---

అనుభవించాలంటే వందల జన్మలు నీకు ఎత్తాల్సిన పని వస్తుంది. ఆ వందల జన్మల పాపాలను కూడా నేను లేకుండా చేస్తాను.” అన్నాడు. ఇది చాలా అన్యాయము కదా! వాడు వందల జన్మలు సరిపోయేటటువంటి పాపము చేసుకుంటే నేను ఇప్పుడే లేకుండా చేస్తానన్నాడు. ఇంకా “నీవు సర్వ ధర్మములను విడిచిపెట్టి నన్నుమాత్రము నమ్ముకుంటే” అని అన్నాడు. ఇది సులభమే కదా, ఎన్ని జన్మలకు సంబంధించిన కర్మ అయినా లేకుండా చేస్తానని చెప్పినాడు. ఇది భగవద్గీతలో చిట్టచివరి శ్లోకము, అతి రహస్యమైన శ్లోకము, చాలా గొప్ప జ్ఞానముతో ఇముడుకొని ఉన్న శ్లోకము. ఇందులో జ్ఞానము ఏముంది? అని మీకు ప్రశ్న రావచ్చు.


ఇది సులభముగా ఎవరికీ అర్థము కాకుండా పోయిన శ్లోకము. అంటే చిట్టచివరిలో 6 శ్లోకాలు ఎవరికీ అర్థము కాలేదు. నేను చెప్పినది

నాలుగు శ్లోకాలే ఏమి చెప్పినాము అంటే దేవునికి ఒక నియమము ఉంది. ఆయన కనిపించేవాడు కాదు, పని చేసేవాడు కాదు, ఆయనకు రూపము లేదు, ఆయన చూసేవాడు మాత్రమే, ఏది చేసేవాడు కాదు. జీవునికి ఒక నియమము ఉంది వాడు అనుభవించేవాడు మాత్రమే, చేసేవాడు కాదు, అన్నీ అనుభవించాల్సిందే, వాడు ఏమి చేయలేడు. ఇట్ల వీడు ఒకసారి ఒక శరీరము తీసుకోవాలి మరోసారి శరీరమును విడిచిపెట్టాలి అంటే చావు మరణాలకు లోనవుతుంటాడు జీవుడు. జీవుడు శరీరము ధరిస్తుంటాడు, శరీరము వదులుతుంటాడు. ఈ రకంగా జీవునికి కొన్ని నియమాలు ఉన్నాయి, దేవుడు కూడా ఒక గీత గీసుకొని కూర్చొని ఉన్నాడాయన. కానీ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి వానికి ధర్మాలు లేవు. మనము తెలుసు కోవాల్సింది ఎవరిని? ధర్మాలు లేనటువంటి వానినే, కాబట్టి ధర్మాలన్నీ విడిచిపెట్టి నీవు నన్ను నమ్ముకో. మీరు ఇంతవరకు ధర్మాలు ఆచరించాలి,


---

ధర్మాలు తెలుసుకోవాలి, మాకు ఈ ధర్మము ఉంది, హిందువులకు ఈ ధర్మము, ముస్లీమ్లకు ఆ ధర్మము, పాకిస్థానీ వాళ్ళకు ఆ ధర్మము, ఇండియా వాళ్ళకు ఈ ధర్మము అంటున్నాము కదా! ఈ ధర్మాలు ఏమిటివో ప్రక్కన కట్టకట్టి పెట్టు. అప్పుడైతేనే నేను నీకు అర్థము అవుతాను అని పెద్ద దేవుడు అయిన పరమాత్మ చెప్పాడు.


ఈ ధర్మాలన్నిటినీ విడిచిపెట్టు నన్ను నమ్ముకుంటే ఏమి చేస్తాను నిన్ను. నీకు గల ఎన్ని జన్మల పాపము అయినాగానీ లేకుండా చేసి, నిన్ను జన్మల నుండి బయటికి వేస్తాను. నీవు బాధ పడవలసిన పనే లేదు. ఎంత పాపాత్మునవైనాగాని నిన్ను దీని నుండి బయటికి వేస్తాను అని చెప్పినాడు. ఇదే విషయాన్నే జ్ఞాన యోగయు 36, 37వ శ్లోకములలో ఒక రకంగా చెప్పినాడన్నమాట. ఏమి చెప్పినాడు? నీవు పాపాత్ముల్లో చాలా గొప్ప పాపాత్ముడు అయినాగానీ, అంటే చాలా పెద్ద పాపాత్ముడవు అయినాగానీ నిన్ను నేను సులభముగా బయటికి వేయగలను అని అన్నాడు. ఎట్ల అంటే ఎంత మురికి నీళ్ళలో అయినాగానీ, మురికి కాళ్ళకు అంటకుండ చిన్న ఓడను వేసుకొని మురికి నీటిని దాటిపోవచ్చు కదా! ఆ విధముగా జ్ఞానమనే ఓడతో నీవు పాపము అను మురికి సముద్రాన్ని దాటగలవు అని చెప్పినాడు. ఎట్ల దాటగలడు? అని ప్రశ్న వేసుకొంటే నువ్వు భయపడవలసిన పని లేదు జ్ఞానము తెలుసుకో అన్నాడు. ఎట్లా మనము తెలుసుకుండేది అంత సులభముగా ఎట్లయితుంది అంటే దాని ప్రక్కనే 37వ శ్లోకములో ఏమి చెప్పినాడంటే జ్ఞానము అనేది ఒక అగ్నిలాంటిది, కర్మలు అనేవి అంటే పాపపుణ్యాలు అనేవి కట్టెల లాంటివి, ఈ జ్ఞానమనే అగ్నిలో కట్టెలు కాలిపోతాయి, ఏమి లేకుండా పోతాయి, కాబట్టి అవన్నీ లేకుండాపోతే నీవు బయటపడవచ్చు. ఏ పాపాన్ని అనుభవించకుండా తప్పించుకునేదానికి అవకాశము ఉంది అని చెప్పడము జరిగింది.


---

అప్పుడు నీవు జ్ఞానము తెలుసుకోవయ్యా, నీ భారము అంతా లేకుండా చేసి బయటకు వేస్తాను, అని చెప్పితే జ్ఞానము తెలుసుకోవాలని ఏమాత్రము ధ్యాసలేకుండా, ప్రపంచ విషయాలలో పడిపోయి డబ్బులు సంపాదించుకోవాలని మనము చూస్తున్నాము. డబ్బులు సంపాదించుకునేది ఏమన్నా మన చేతిలో ఉందా! అట్లన్న గాని నువ్వు ఏమీ చేతకానివాడివి, అన్ని నేనే చేసేది, అంటే ఇచ్చేది వాడే, లేకుండ చేసేది వాడే (ఆత్మే). ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. కానీ మనము ఏమి చేస్తున్నామంటే నా తెలివితో నేను ధనికున్ని అయినాను అనుకుంటున్నాము. దేవుడు ఒకవేళ డబ్బులు ఇచ్చినాడనుకో మనిషి నా తెలివే అనుకుంటాడు, పోయిందనుకో నా తెలివి అనకోకుండ కర్మ అని అంటాడు, నా కర్మ కొద్ది పోయిందంటాడు. ఈ రకముగా రెండు రకాలుగా మాట్లాడుతాడు మనిషి. అందువలన ఇవన్నీ మానుకొని మనల్ని ఇట్ల ఏడ్పించేవాడు, అట్ల ఏడ్పించేవాడు రెండు రకాల ఒకడు ఉన్నాడు. ఆయన దోబూచులాట ఆడుతున్నాడు. ఎన్ని బూచులాట అంటే రెండు బూచులాట. నేను సగము తురకము చెప్పుతున్నాను, సగము తెలుగులో చెప్పుతున్నాను, ఏమను కోవద్దండి మీరు. దో బూచులాట ఆడుతున్నాడు. అది తురక పదము కాదు, తెలుగు పదమే దో బూచులాట అనేది. దో అనేది రెండే, దో అనేది తెలుగు పదము. ప్రపంచ భాషలలో మొట్ట మొదట ఉండేది తెలుగే కాబట్టి ఇది తెలుగు పదమే. కానీ మన శరీరములో దోబూచులాట ఆడేవాడు ఒకడు ఉన్నాడు. ఇప్పటి నుండి ప్రతి నిత్యము ప్రొద్దున లేచినప్పటి నుండి ఆయనను తలుచుకోండి, ఆయనే చేస్తున్నాడని అనుకోండి. నేను చెప్పినేది బాగా జ్ఞాపకము పెట్టుకోండి. ఇంతటితో ముగిస్తున్నాము.


---

తేది : 29.08.2015

సర్వ జనులలో వ్యాపించివున్నటువంటి ఏకైక ఆరాధ్య దేవుడైనటు వంటి ఆత్మను ప్రార్థిస్తూ నా ద్వారా ఇపుడు మంచి జ్ఞానాన్ని మీకు అందించాలని నేను కోరుకుంటున్నాను. నేను ఒక్కన్ని జ్ఞానము చెప్పేవాన్ని కాదు. ఏ మనిషి కూడా దేవుని జ్ఞానాన్ని చెప్పలేడు. దేవుని జ్ఞానాన్ని అందించేవాడు ఆత్మయిన దేవుడే అందించాలిగానీ మరి ఎవరి చేత కాదది. ఆత్మ దేవుడు అందిస్తే ఇక్కడ బయటికి నేను పలుకుతాము. కాబట్టి అందించేవాడు ఒకడు, మాట్లాడేవాడు ఒకడు. మాట్లాడించేవాడు ఒకడు, ఆత్మజ్ఞానము ప్రకారము చూస్తే మాట్లాడేవాడు ఒకడు, ఇపుడు పల్కించేటటువంటి జ్ఞానము స్వచ్ఛమైన జ్ఞానమును పలికించమని, అది అందరికి అర్థము కావాలని కోరుకుంటూ, సభను ప్రారంభించుచున్నాము.


ప్రత్యేకముగా ఉండే దేవుడు అయిన ఆత్మను కోరుకుంటూ ఇది మొదలుపెడుతున్నాము. ఏమని మొదలు పెడతున్నాము అంటే ఇక్కడ మేము చెప్పేటటువంటిది ఒక మతానికి సంబంధించిన జ్ఞానము కాదు అని మొదటనుంచి మేము చెప్పుతున్నాము. ఏ గ్రంథము వ్రాసినాగాని ఏ మతానికి సంబంధించి ఉండదు, అందులో. మేము మూడు మత గ్రంథాలను గౌరవిస్తాము, దానిని అనుసరిస్తాము. అక్కడ ఉండే వాక్యాలు తప్పనిసరిగా మేము అన్వయించుకొని నడుచుకుంటుంటాము. ఒకవేళ ఎవరైనాగాని ఎక్కడైనా ఆ వాక్యాలలో తప్పుభావాన్ని పొంది, తప్పు నడక నడుస్తూ ఉంటే అంటే తప్పు మార్గములో పోతూవుంటే ఇది మంచి పద్ధతి కాదు అని మేము హెచ్చరిక చేస్తూ తెలియజెప్పుతుంటాము. కానీ వినమని మేము


----

చెప్పలేదు. మా మాటే వినండి, తప్పనిసరిగా మేము చెప్పినట్లే నడుచుకోమని ఎవరికీ మేము చెప్పలేదు. మేము జ్ఞానాన్ని గుర్తు చేస్తున్నాము. ఇది వాస్తవము, ఇది అవాస్తవము అని గుర్తు చేస్తున్నాము. ఒకవేళ మేము చెప్పినటువంటి మాట మీకు అర్థమయి వింటే వినవచ్చు లేకపోతే వినకపోవచ్చు. ఈ మధ్య ఒక గ్రంథాన్ని వ్రాశాము మేము. “అజ్ఞానములో ఉగ్రవాద బీజాలు” అని. 'అజ్ఞానములో ఉగ్రవాద బీజాలు' అని వ్రాసినేది ఎక్కువ ముస్లీమ్ మతములో ఉండేవాళ్ళను గురించే వ్రాశాము. దాంట్లో వ్రాయడము అట్లే ఉంది రాతంతా. కానీ వ్రాస్తూ వ్రాస్తూ మధ్యలో ఒక మాట అన్నాము ఏమంటే ఇది ఒక ముస్లీమ్ మతానికి సంబంధము లేదు. అన్ని మతాలలోను ఈ అజ్ఞానము ఉంది. అన్ని మతాలలోనూ ఉగ్రవాదము ఉందని చెప్పాము.

అన్ని మతాలలోనూ ఉగ్రవాదము ఉందని ఒకమాట అంటే కొంతమందికి ఏమయిందంటే మేము ఎక్కువ ముస్లీమ్లను ఉద్దేశించి చెప్పినది. ఎక్కువ ముస్లీములే ఉగ్రవాదులుగా మారుతున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు. కానీ ఎక్కువ కనిపించేది వాళ్ళు కనిపిస్తున్నారు కానీ ఉండేది అన్ని మతాలలోనూ ఉగ్రవాదము ఉంది, కనిపించని ఉగ్రవాదము అని చెప్పాము. హిందువులలో కూడ ఉగ్రవాదము ఉంది అని చెప్పాము. కానీ హిందువులలో ఉండే ఉగ్రవాదము గ్రుడ్డి ఉగ్రవాదము అని అన్నాము. దానికి ఒక పేరు పెట్టాము. ఇది గ్రుడ్డి ఉగ్రవాదము. అంటే ఎవరి మీద ఉగ్రవాదము చేయాలి అనేది తెలియదు దానికి. వాడు కొట్టాలి, కానీ ఎవరిని కొట్టాలో తెలియదు. వానిని వాడే కొట్టుకుంటాడు. అట్లుకాక ముస్లీమ్లకు ఒక ఉద్దేశ్యము ఉంది. మనకు వ్యతిరేఖముగా ఉండే వాళ్ళని కొట్టాలి అనేది ఒక ఉద్దేశ్యము. హిందువులకు


----

కూడా అదే ఉంది కానీ ఎవరు వ్యతిరేఖమో తెలియదు. హిందువులు హిందువులనే కొట్టుకుంటారు. హిందువులు హిందువుల మీదనే ఉగ్రవాదము చేసుకుంటారు. ఇది గ్రుడ్డి ఉగ్రవాదము అని చెప్పాము. ఎందుకంటే మా ఎడల జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మేము ఏమి చెప్పుతున్నాము అంటే మేము సర్వమతాలకు సంబంధించిన బోధ చెప్పుతున్నాము. ఒక మతానికి సంబంధము లేదు. మేము మూడు మతాలను గౌరవిస్తున్నాము. మూడు గ్రంథాలను గౌరవిస్తున్నాము. వాటిలో ఉండే వాక్యాల ప్రకారమే మేము నడుచుకుంటున్నామని చెప్పుచున్నాము కదా


కానీ ఇక్కడికి వచ్చి చూస్తే 'ఓం' ఉంది, కృష్ణుడు ఉన్నాడు, అన్నీ కనిపిచ్చేది హిందు మతానికి సంబంధించినేటివే. ఇంక ఏముంది? మూడు మతాలకు సంబంధించినది ఏముంది? ఏమి లేదు అని మీరు అనుకోవచ్చు. అయినా ఎందుకు పెట్టాము ఇదంతా అంటే ఇదొక డ్రామా! అర్థమయిందా! ఇట్లపెట్టకపోతే కుదరదు. ఇలా పెట్టి చెప్పుతావుంటేనే కుదర్లేదు. ఓం ను పెట్టకపోతే ఎట్లుంటదో చూడండి! పెట్టి చెప్పుతావుంటేనే హిందువులకు కోపము వస్తావుంది. ముస్లీమ్ సోదరులనుండి ఎటువంటి వ్యతిరేఖము లేదు మాకు. క్రైస్తవుల నుంచి ఎటువంటి వ్యతిరేఖము లేదు. కేవలము ఒకే ఒక హిందువుల నుంచి ఉంది. మేము వ్రాసిన గ్రంథాన్ని చూసి, ఉలిక్కిపడి మమ్మల్ని ఉగ్రవాదులుగా పోల్చి చెప్పినారు మీరు. అంటే ఎవరిని ఉగ్రవాదులుగా పోల్చి చెప్పినాము? అన్ని మతాలలో ఉగ్రవాదము ఉంది అని చెప్పినాము. అంటే మిమ్మల్ని ఒకరినే చెప్పినామా? మేము దీనిమీద కేసు వేస్తాము అంటే వేసుకోమని చెప్పినాము. ఏమని వేస్తావు? హిందువులది గ్రుడ్డి ఉగ్రవాదము అని వేసుకుంటావు. అంతేకదా! మేము చెప్పినేది అదేకదా! అది కూడ సొట్ట ఉగ్రవాదము మీది, సరియైన ఉగ్రవాదము కాదు.


---

ఉగ్రవాదము అంటే కరెక్ట్ గా ఉండాలి అన్నాను గాని. గ్రుడ్డి ఉగ్రవాదము వద్దు అని చెప్పాము. ఇట్ల ఏమి చేస్తారు అంటే ప్రతి ఒక్కచోట మేము వేరే మతాన్ని బోధిస్తున్నామని మమ్ములను ఆరోపణ చేస్తూ ఏదో ఒకటి అడ్డము మాట్లాడేది అలవాటు అయిపోయింది హిందువులకు. అంటే మేము పుట్టడము హిందువులలోనే పుట్టాము. నేను మొట్టమొదట చదివిండేది భగవద్గీతే. ఎప్పుడు నేను చదివిండేది? యుక్తవయస్సు వచ్చిన తరువాత కొన్ని సంవత్సరాలకు చదివినాను నేను, అంతవరకు భగవద్గీత ఏమిటో తెలియదు నాకు. చాలామంది ఆశ్రమాలకు పోయి జ్ఞానము నేర్చుకొన్నారు ఇంకోటి ఇంకోటి చాలా చేశారు. నేను ఏ ఆశ్రమానికి పోలేదు. ఏ గురువుని ఆశ్రయించలేదు. ఎవరి దగ్గర జ్ఞానము తెలుసుకోలేదు. కేవలము ఒక భగవద్గీత చదివినాము. దాని తరువాత ఏమయింది అంటే భగవద్గీతలో దేవుడు ఒకడే అని ఉంది. దేవతలనందరిని ఎదురుగా పెట్టుకొని ఎందుకు పూజ చేస్తున్నారని ఒక ప్రశ్న వచ్చింది. సరే భగవద్గీతలో ఒకటి చెప్తే వీళ్ళు ఇంకోటి చేస్తున్నారు. మిగతా మతాలలో ఏముంది అని చూస్తే, మిగతా మతాలలో కూడా ఒకటే దేవుడు అని ఉంది. ప్రపంచానికంతా ఒకటే దేవుడని ఉంది, ఇంకొక దేవుడు లేనే లేడు.


కానీ మళ్ళీ ఈ దేవతలంతా ఎవరు? అంటే చచ్చిపోయిన వాళ్లు కొన్నాళ్ళకు దయ్యములుగా మారి ఇంకొకరి శరీరములోకి దూరుకొని మాట్లాడుతుంటారు చూడు! అట్లా వాళ్ళు దేవతలు అంటే దయ్యములను గ్రహాలు అంటాము. దయ్యము పట్టింది అనుటను “గ్రహ పట్టింది” అంటాము. అంటున్నాము కదా! 'గ్రహ పట్టింది' అంటాము దయ్యము పట్టినోన్ని. గుళ్ళో దేవుళ్ళని “విగ్రహములు” అని అంటాము. 'వి అనేది ఒక అక్షరము ఉంది. విశేష అర్థము ఉంది. అంటే దయ్యాలు ఉత్త గ్రహాలే,


---

దేవతలు విగ్రహాలు. అంటే ఇవి దయ్యాలు అయితే అవి పెద్ద దయ్యాలు అని అర్థము వస్తుంది. ఇదే అర్థాన్ని మేము వ్రాశాము గ్రంథములో. అంటే ఇవి చిన్న దయ్యాలు, అవి పెద్ద దయ్యాలు. దయ్యాలను మ్రొక్కితే మీకు ఏమి రాదు, దేవున్ని మొక్కండి అని చెప్పినాము. అంటే ఉన్న వాస్తవము చెప్పాము. అర్థమయిందా! ఎందుకంటే నా సమక్షములో మామూలు మనుషులు చచ్చిపోయి మాట్లాడే దయ్యాలను చూశాను. గుడిలో ఉండే దేవతలు మనుషులలో ప్రవేశించి మాట్లాడేది చూశాను. వాళ్ళు చేసిన తప్పుడు పనులు చూశాను. వాళ్ళను దండించడము కూడ జరిగింది. వాళ్ళు నన్ను బెదిరించడము జరిగింది. మీరు ఏమి చేసుకోలేరు పొండి అని చెప్పాము. నేను బెదిరిస్తే వాళ్ళు భయపడినారు, నేను శిక్ష వేస్తే వాళ్ళు అనుభవించారు. కాబట్టి వాళ్ళు ఎట్లైనా నా లెక్కలో మాత్రము దయ్యాలవంటి వారే. ఈ రోజు అదే మాట చెప్పుతున్నాను, ఆ రోజు కూడా అదే మాట చెప్పాను. కానీ ఇక్కడ మళ్ళీ దేవుడు అంటే ఎవరు? అని ప్రశ్న వేసుకుంటే ఆయన ఎవరికీ తెలియబడడు. మరి ఎవరికీ తెలియబడకపోతే పెద్ద పెద్ద స్వామీజీలంతా ఉన్నారు కదా! వాళ్ళకన్నా తెలుసునేమో? వాళ్ళంతా చెప్పుతుంటారు కదా దేవున్ని గురించి! అంటే వాళ్ళు అందాసుగ చెప్పేవాళ్ళేగానీ ఖచ్చితముగా కొలత వేసి చెప్పేవాళ్ళు కాదు.


దేవుడు ఎంతున్నాడు? ఎట్లున్నాడు? ఎంత పొడుగున్నాడు? ఎంత లావున్నాడు? ఏ విధముగ ఉన్నాడు? అనేది ఎవ్వరికీ తెలియదు ప్రపంచములో. 'దేవుడు' అంటే దేవులాడబడేవాడని అర్థము. అంటే వెదకబడేవాడని అర్థము, తెలియబడడు అని అర్థము, తెలియబడేవాడు కాదని అర్థము. దేవుడు ఎప్పటికీ ఎవరికీ తెలియబడడు. మళ్ళి


----

తెలియబడనటువంటి వానితో మనకేం పని? అని అనుకుంటే మనకు పనే. మనకు ఏమి పని? అంటే మన కర్మలను పోగొట్టుకొని, మన కష్టాలు నుండి బయటపడి, మన పాపాలనుండి బయటపడాలంటే ఆయనతో మనకి పనే. అయితే ఆయన తెలియబడడు కదా! ఆయనను నువ్వు ఎట్ల వేడుకుంటావు? ఆయన కటాక్షం ఎట్ల పొందుతావు? ఆయన దయ నువ్వు ఎట్ల పొందుతావు? తెలియనపుడు ఎట్ల పొందుతావు అని ప్రశ్న వేసుకుంటే దేవుడు నేను ఏమి చేస్తాను అని చెప్పలేదు. దేవుడు ఒక సూత్రము చెప్పినాడు. నా జ్ఞానము ఏదైతే ఉందో నా జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి, నా జ్ఞానాన్ని తెలుసుకుంటే అదే ఒక శక్తి అవుతుంది మీకు, మీ కర్మలను కాల్చేస్తుంది అని చెప్పాడు. అర్థమయిందా! ఏమని చెప్పినాడు? నా జ్ఞానాన్ని మీరు తెలుసుకుంటే అది ఒక అగ్ని అయితుంది, అది ఒక శక్తి అయితుంది, ఆ శక్తి మీ కర్మలను కాల్చివేస్తుంది. ధ్యాస నా జ్ఞానము మీద పెట్టుకోండి పక్క ధ్యాస ఉండకూడదు. దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నము

చేయాలి.


ఆయన నన్ను తెలుసుకోమని చెప్పలేదు ఏ గ్రంథములోనూ, నా జ్ఞానాన్ని తెలుసుకోమని చెప్పినాడు ప్రతి గ్రంథములోను. భగవద్గీతలో అదే చెప్పాడు, బైబిలులో అదే చెప్పాడు, ఖుర్ఆన్ గ్రంథములో అదే చెప్పాడు. ఏమి చెప్పాడు? నా జ్ఞానాన్ని తెలుసుకోండి, నేను చెప్పినదాన్ని వినండి, నేను చెప్పిన దానిని అనుసరించండి. మీరు నా మార్గములోకి వచ్చినట్లే. నా మార్గములోకి వస్తే చివరకు గమ్యానికి వస్తే నేను అక్కడ ఉంటా, అప్పుడు నేను కనపడతా. నా మార్గాన్ని చెప్తున్నాను గాని నేను ఇట్లా వానిని అని చెప్పలేదు అని చెప్పాడు. అంటే మనము దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నము చేస్తున్నాము. దేవుని జ్ఞానము మనకు


---

మూడు గ్రంథాలలో ఉంది. తౌరాత్, ఇంజీలు, ఖుర్ఆన్ గ్రంథములలో ఉంది అని మనము అనుకుంటున్నాము. ఇంకా కొంతమంది ఏమి చెప్పుతున్నారు అంటే జబుర అనే గ్రంథము, తౌరాత్ అనే గ్రంథము, ఇంజీలు అనే గ్రంథము, ఖుర్ఆన్ అనే గ్రంథము నాలుగు గ్రంథాలు ఉన్నాయి మనకు అని చెప్తున్నారు. కాని ఏదో రకముగా చెప్పినా కానీ చరిత్ర తెలిసి చెప్పితే మంచిది, చరిత్ర తెలియకుండా చెప్పితే ఏమీ ప్రయోజనము లేదు. దేవుడు 40వ సూరా 35వ ఆయత్లో ఇదే చెప్పినాడు. ఏమి చెప్పినాడంటే ప్రమాణము లేకుండా మీరు మాట్లాడవద్దండి. శాస్త్ర ప్రమాణము తీసుకొని చూడండి. ఒక గ్రంథ ణము తీసుకొని చూడండి. 


ఆ గ్రంథ ప్రమాణముతో మీరు మాట్లాడండి. దేవుడు చెప్పిన వాక్యాన్ని ఆధారము చేసుకొని మీరు మాట్లాడండి. దేవుడు చెప్పిన వాక్యము లేకుండ మీ ఇష్టము వచ్చినట్లు మీరు మాట్లాడవద్దండి అని మనకు చెప్పాడు. కానీ మనము ఏమి చెప్తున్నాము అంటే సృష్ఠిఆదిలో దేవుడు మనకు జ్ఞానము చెప్పినాడు. సృష్ఠిఆదిలోనే మన ప్రపంచాన్నంతా సృష్టించాడు. తర్వాత ఆత్మ ద్వారా మనుషులందరిని పుట్టించినాడు. పుట్టించిన తరువాత వీరికి ఒక జ్ఞానాన్ని చెప్పాలి కదా! లేకపోతే అధోగతి పాలయిపోతారు. కాబట్టి తను ఈ ప్రపంచములో కష్టసుఖాలు కల్పించినాడు, దానినుండి బయటపడే విధానాన్ని కూడా కల్పించినాడు. రెండూ చెప్పినాడు, రెండు రూట్లు ఇచ్చాడు. ఇటు దేవుని వైపు పోయేదానికి ఇచ్చాడు, ఇటు ప్రపంచము వైపు పోయేదానికి ఇచ్చాడు, రెండు మార్గాలు కల్పించి చూపించాడు. ఆ సృష్ఠి ఆదిలోనే దేవుడు తన జ్ఞానాన్ని సంపూర్ణముగా చెప్పినాడు, ఏమాత్రము కొదవ లేకుండా ఆ రకముగా చెప్పినటువంటిది గ్రంథ రూపము కాలేదు. ఎవరూ దానిని వ్రాయలేదు. ఆకాశవాణి ద్వారా వచ్చినటువంటిది. అంటే


----

శబ్దము ద్వారా వచ్చినటువంటిది. వహీ ద్వారా వచ్చినటువంటిది అంటాము మనము దాన్ని. ఈ రకముగా వచ్చినటువంటి జ్ఞానము ఎక్కడా గ్రంథ రూపము కాలేదు. అది మాటల రూపములో ఉండేది, పద్యాల రూపములో ఉండేది, పాటల రూపములో ఉండేది, శ్లోకాల రూపములో ఉండేది. ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్ళు ఒకరికొకరు చెప్పుకొనే వాళ్ళు. ఈ రకముగా ఒకరి నుంచి ఒకరికి జ్ఞానము ప్రాకింది. మన భారతదేశము నుంచి పడమటి దేశాలకు కూడ ప్రాకి పోయింది.


ఈ రకముగా ప్రాకిపోయిన తరువాత ఈ జ్ఞానానికి ఒక్కొక్కరు ఒక్కో పేరు పెట్టుకున్నారు. మనము ఏమి పేరు పెట్టుకున్నాము? అంటే అప్పుడు చెప్పినటువంటి జ్ఞానానికి ఒక పేరు ఉంది. ఆ పేరు ఎవరికీ తెలియదు ఇంతవరకు. మనకు చెప్పిన జ్ఞానాన్నే మరచి పోయినాము ఇంక అది ఎక్కడ మతికి ఉంటుంది మనకు. తరువాత ఈ జ్ఞానము మరచి పోతున్నారు వీళ్ళంతా అని దేవుడు ఏమి చేశాడు? అంటే తిరిగి తెలియజేసే నిమిత్తము మళ్ళా ఆయన వచ్చి మనకు తెలియజెప్పాడు. ఎవరు చెప్పాలి జ్ఞానము? దేవుడే చెప్పాలి. అంటే దేవుడు ప్రత్యక్షముగ ఎవరితోనూ మాట్లాడడు, ఇది జ్ఞాపకము పెట్టుకోండి. ముఖ్యమైన ఒక సూత్రము ఉంది దేవునికి. ఏమని? దానికి రూపము లేదు, పేరు అంతకూ లేదు, క్రియారహితుడు. అంటే పని ఏమాత్రము చేయడు, ఏ పని చేసేవాడు కాదు ఆయన. పని లేనివాడు, పేరు లేనివాడు, అసలు రూపము లేనివాడు. ఎట్లా పోల్చుకొనేదానికి వీలులేదు. ఎవ్వడూ ఇలా అని దేవున్ని చెప్పేదానికి అవకాశమే లేదు. ఎవని అంచనాకు దొరకడు. అటువంటివాడు దేవుడు. తరువాత ఆయన ఏమి చెప్పాడు అంటే అంతిమ దైవగ్రంథములో అంటే మనకు మూడు గ్రంథాలు ఉన్నాయి. మూడు దైవగ్రంథాలే. ఒకటి భగవద్గీత,


----

రెండోది బైబిలు, మూడవది ఖుర్ఆన్. దానిని అంతిమ దైవగ్రంథము అని అంటాము, దైవగ్రంథము అది


ఆ దైవగ్రంథములో 42వ సూరాలో 51వ ఆయత్లో ఏమి చెప్పాడు అంటే “దేవుడు ప్రత్యక్షముగా ఎవరితోనూ మాట్లాడడు” కానీ తన జ్ఞానాన్ని మనుషులకు తెలియజేస్తాడు. ఎట్లా తెలియజేస్తాడు అంటే 3 రకాలుగా తెలియజేస్తాడు అని చెప్పాడు. ఒకటి వహీ ద్వారా అంటే శబ్దము ద్వారా. సరే, ప్రపంచము సృష్ఠిఆదిలోనే తెలియజేశాడు అయిపోయింది అది, మనకు. ఆ తెలియజేసినటువంటి జ్ఞానము మాటల రూపములో ఉంది, పద్యాల రూపములో ఉంది అని చెప్పుకున్నాము కదా మనము! అది కొన్ని యుగాలు గడిచి పోయిన తరువాత చివరికి ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది. జ్ఞానమంతా మరచి పోయినారు. దేవుడు చెప్పిన జ్ఞానమంతా మరచిపోయి, దేవుని ధర్మాలన్ని మరచిపోయి, చివరకు దేవుడు అనేటటువంటి వానిని రకరకాలుగా ఊహించుకొని, వీళ్ళు ఏమి చేసినారంటే దేవున్ని ఆరాధించే క్రమమునే అనేక రకాలుగా మలుచుకున్నారు. ఎలా చేసుకొన్నారు అంటే ఒకటి యజ్ఞాలు చేయడము మొదలు పెట్టినారు. రెండు వేదాలు చదవడము మొదలు పెట్టినారు, వేదాల వల్ల దేవుడు తెలుస్తాడు అని, అంటే దేవున్ని తెలియడము సులభము అయితుంది అని. తరువాత దానాలు చేయడము మొదలు పెట్టినారు. తపస్సులు చేసేదానికి మొదలు పెట్టారు కూర్చొని. ఈ నాలుగు రకాల పనులు చేశారు.


ఈ నాలుగు రకాలు దేవునికి ఇష్టము లేకుండా పోయినాయి, ఇవి అధర్మాలు అని దేవుడు తెలియజేసాడు. భగవద్గీత గ్రంథములో మనకు విశ్వరూప సందర్శన యోగములో 48, 53వ శ్లోకములలో చెప్పేంతవరకు మనకు అవి అధర్మాలు అని తెలియవు. అంటే యజ్ఞాలు చేసేవాళ్ళని చూసి


----

చాలా గొప్ప జ్ఞానులు అనుకొనేవాళ్ళము. ఎక్కడన్నా చూడండి! ఒక పెద్ద స్వామీజీ ఉంటే వాడు యజ్ఞము పెట్టి ఉంటాడు, ఇంక ఏమీ చేయడు. గుంతను త్రవ్వి దాంట్లో కట్టేలు వేసి కాల్చడమే, మంత్రాలు చెప్పుకుంటూ! మళ్ళ లేనిపోని ఖర్చులన్ని పెట్టిస్తారన్నమాట. పట్టు చీరలు దాంట్లో వేస్తారు, బంగారు దాంట్లో వేస్తారు, ఇంకోటి వేస్తారు, ఇంకోటి వేస్తారు, నానా రకాలన్ని వేస్తే, వీళ్ళ తాటంతా ఊడదీసి దాంట్లోకి వేస్తే, అప్పుడు వీళ్ళకు యజ్ఞము అయితాది. అంతవరకు యజ్ఞము కాదు. భగవద్గీత తెలిసిన తరువాత, శుద్ధ పనికి మాలిన పనులు అని అర్థమయినది. అవి పూర్తి అధర్మాలు అని అర్థమయిపోయినది. అపుడు ధర్మాలు ఏంటివి? అని మనకు అర్థము కాలేదు. అధర్మాలు ఇవి అని తెలిసిన తరువాత దేవున్ని తెలుసుకునే ధర్మాలు ఏవి? అవి మనకు అర్థము కావాలి కదా! మళ్ళ దేవున్ని తెలుసుకొనే ధర్మాలను గురించి మనము ఆలోచన చేస్తే మూడే మూడు అని తెలిసినాయి మనకు. ఒకటి కర్మయోగము, రెండు బ్రహ్మయోగము, మూడు భక్తియోగము.


ఈ మూడు యోగాలు ఉన్నాయి అని తెలిసింది. యోగము అంటే కలయిక అని అర్థము. కలయిక అంటే ఏమని అర్థము? దేవునితో కలిసిపోవడము, దేవుని దగ్గరకు చేరిపోవడము. దానికి మూడు పేర్లు పెట్టినారు. వాటి యొక్క విధానము అంతా భగవద్గీతలో చెప్పారు. సరే బ్రహ్మయోగము ఒకటి ఉంది. కర్మయోగము ఒకటి ఉంది. తరువాత భక్తియోగము ఒకటి ఉంది. అయితే మనము ఈ యోగాలు ఆచరిస్తున్నామా అంటే లేదు. యజ్ఞాలు చేయడము కానీ, దానాలు చేయడము కానీ, వేదాధ్యయనము చేయడము కానీ, తరువాత తపస్సులు చేయడము కానీ, ఇవి ఏమన్నా దేవుని ధర్మాలలోనికి సంబంధించినవా? అంటే ఇవి అధర్మాలు అని దేవుడు చెప్పేశాడు. నన్ను తెలుసుకొనే దానికి శక్యము కాదు అని


---

చెప్పాడు. మళ్ళీ ఆయనను తెలుసుకొనే దానికి శక్యము కానపుడు దాంతో మనకు ఏమి పని? వదిలేయాలి. సరే, వదిలేసినామనుకోండి. మళ్ళీ మనము

ఏమిటిని తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి? అంటే తరువాత దానిని ప్రత్యేకముగా ఆయన చెప్పాడు. ఈ మార్గాలైతే మీకు సరిపోతాయి లేకపోతే లేదు అని చెప్పాడు. సరే ఆ మార్గాలనే అనుసరించే దానికి మనము మొదలు పెడుతున్నాము. ఆ మార్గాలు మన భగవద్గీతలో కొంత అర్థమయినది. సరే భగవద్గీత ప్రకారము ఎవరైనా నడుచు కుంటున్నారా? భగవద్గీత శ్లోకాల ప్రకారము ఎవరన్నా జ్ఞానాన్ని అర్థము చేసుకున్నారా? పెద్ద పెద్ద స్వామీజీలకే అర్థము కాలేదు!


'చాతుర్వర్ణము' అంటే నాలుగు కులాలు అని చెప్పారు. ఇంకోటి అంటే ఇంకోటని చెప్పారు. ముగ్గురు పురుషులు అంటే మూడు ఆత్మలు ఉన్నాయని క్షరుడు, అక్షరుడు, పురుషోత్తమడు. ఇద్దరు పురుషులు ఉన్నారు, తరువాత మూడో పురుషుడు ఒకడు ఉన్నాడు. ఇద్దరిలో ఒకడు నాశనము అయ్యేవాడు, ఒకడు నాశనము కానివాడు, ఇంకొకడు ఉత్తముడు అని గ్రంథములో చెప్పితే, ప్రకృతియైన స్త్రీ సంబంధమైనటువంటి శరీరాన్ని తీసుకొని వచ్చి దాంట్లోకి కలిపేసి క్షరుడు శరీరమన్నారు. మొత్తము మన భారతదేశములో వ్రాసిన భగవద్గీతలు అన్నిటిలోనూ అది సొట్టపోయింది అంటే వక్రమార్గము పట్టిపోయింది. ముగ్గురు పురుషులు ఎవరో ఇంతవరకు తెలియలేదు. 320, 330 భగవద్గీతలు మన భారతదేశములో రచించ బడినాయి అనేక భాషలలో, కానీ ఏ భాషలో కూడా దీనికి వివరము సరిగా ఇవ్వలేదు. 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగములో 15, 16 శ్లోకాలకు ఎక్కడ కూడ వివరము లేదు, కప్ప దాటు వేసేసినారు. ఒకడు జీవుడు, ఒకడు దేవుడు అనేశారు. ఇంకొకటి శరీరము అని అన్నారు.

---

సిద్ది బోధ

శరీరము నాశనము అయ్యేది కదా! కాబట్టి క్షరుడు శరీరము అన్నారు, చూడు ఎంత సులభముగా చెప్పేసారో! ఆయనేమి చెప్పాడు? పురుషులకు అని చెప్పాడు, స్త్రీలకు అని చెప్పలేదు. ప్రకృతి స్త్రీ స్వరూపమైనది అని చెప్పాడు. అందులో ఉన్న ఆత్మ పురుష స్వరూపమైనది అన్నాడు. ఆ ఉండే ఆత్మ మూడు రకాలుగా ఉన్నాయని చెప్పాడు. అది భగవద్గీతలో ఉంది, బైబిలులో ఉంది, ఖుర్ఆన్ కూడా ఉంది. ఒకడు క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అని భగవద్గీతలో చెప్పినారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని బైబిలులో చెప్పినారు.


తోలేవాడు, తోలబడేవాడు, సాక్షిగా ఉండేవాడు అని ఖుర్ఆన్ గ్రంథములో 50వ సూరా 21వ ఆయత్లో ఇదే విషయము చెప్పారు. “నువ్వు తోలేవానితో సహా సాక్ష్యము ఉండే వానితో సహా నువ్వు వస్తావు.” అంటే నువ్వు తోలబడేవానివి అని. అది కూడా మనకు అర్థము కాలేదు అక్కడ. ఇప్పుడు మనము చెప్పే ముగ్గురు పురుషులు అని అర్థము కాలేదు అక్కడ. భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగములో 19 చదవండి, 18 చదవండి మీకు అర్థమయితాది, 3 పురుషులు అని చెప్పుతావున్నారు. అసలుకు మీరంతా, మీ భగవద్గీత తీసి చెప్పుతున్నారు. భగవద్గీతలోది నేను చెప్పలేదు కాని, ఖుర్ఆనే చెప్పుతావుంది నేను భగవద్గీతలోనిదే చెప్పుతావున్నానని. 5-43, 5-44, 5-48, 5వ సూరాలోని ఇన్ని వాక్యాలలో నేను తౌరాత్ గ్రంథాన్ని ధృవీకరించే జ్ఞానాన్ని చెప్పుతున్నాను. అక్కడ చెప్పిన జ్ఞానాన్నే నేను చెప్పుతున్నాను అని చెప్పారు. అనేకచోట్ల ఆవిధంగానే చెప్పినారు. కానీ మనము తప్పుగా అర్థము చేసుకున్నాము. కానీ ఈ తౌరాత్ గ్రంథములో ఉండేదే ఖుర్ఆన్లో ఉంది. అదేవిధముగా ఖుర్ఆన్లో ఉండేదే భగవద్గీతలో ఉంది కాని అంతా మిక్స్ అయి ఉందన్నమాట, అంటే


---

అక్కడ చెప్పినేది ఇక్కడ, ఇక్కడ చెప్పినేది అక్కడ ఉంది. అదీకాక మూడు ప్రాంతాలలో మూడు సమయాలలో విడివిడిగా చెప్పిన దానివలన మనము ఏమి చేసినాము, మూడు గ్రంథాలుగా చించుకొని చదువుకుంటున్నాము. 6వ సూరా 91వ ఆయత్లో ఏముంది అంటే ఇదే చెప్పినారు. నేను ఇచ్చిన తౌరాత్ గ్రంథాన్ని 3 ముక్కలుగా చింపుకొని చదువుకుంటున్నారు మీరు అని. లేదా? ఉంది. ఖుర్ఆన్ గ్రంథములో దేవుడు ఇట్లే చెప్పినాడు. ఏం చెప్పినాడు?


నేను మీకు ఇచ్చిన తౌరాత్ గ్రంథాన్ని మూడుగా చింపుకొని చదువుకుంటున్నారు. విడిభాగాలుగా చింపుకొని చదువుకుంటున్నారు. విడి భాగాలు ఇవే మన ముందర ఉండేటివే ఈ రోజు, వేరేటివి ఏమి కాదు. సరే ఎట్లయితే ఏముందిలే దేవుని జ్ఞానాన్ని మూడు భాగాలుగ మనము చేసుకున్నాము. మూడు భాగాలలో ఉండేది ఒకటే జ్ఞానమే కదా! ప్రపంచానికంతా ఒకటే దేవుడే కదా! అయితే ఆ దేవున్ని మనము ఏమన్నా ముక్కలు ముక్కలు చేసుకునే దానికి అవుతుందా? నీకు ఒకడు నాకు ఒకడు అని. అట్ల చేసుకొనే దానికి కాదు. నువ్వు ఎట్ల చూసినాగాని ఆయన ఒకడే. నువ్వు ముందర చూసి ఓ హెూ! ఇట్లే ఉంటాడు దేవుడు అనుకోవచ్చు. వెనకాల చూసి ఇట్లే ఉంటాడు అనుకోవచ్చు. ప్రక్కలచూసి ఇట్లే ఉంటాడని అనుకోవచ్చు. నీ చూపుని బట్టి నువ్వు అనుకోవచ్చుగాని అంతా మొత్తము చూస్తే దేవుడు ఒకడే ఉండేది. ఈ రకముగా ప్రపంచాన్ని సృష్ఠించినటువంటి సృష్టికర్త (పరమాత్మ) ఒక్కడే ఉన్నాడు. అట్లే నిన్ను సృష్టించిన సృష్టికర్త (ఆత్మనే) ఆరాధించాలిగాని ఎవరినీ ఆరాధించకూడదు అనేది ప్రతి గ్రంథములోనూ ఉంది. మళ్ళీ భగవద్గీతలో అంతగా చెప్పితే, భగవద్గీతను మడిచి ప్రక్కనబెట్టి అనవసరముగా మిగతావి అంటే పురాణాలు,


---

వేదాలు, ఉపనిషత్తులు తీసుకొని వాటిని అనుసరిస్తూ మీరు తప్పుదారి ఎందుకు పట్టిపోయారు? అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అంతకుముందే ఇవి ప్రపంచములో ప్రాకిపోయి ఉన్నాయి. ఈ పనులన్ని యజ్ఞ యాగాదులు, వేదాధ్యయనాలు, తపస్సులు ఇవన్నీ చేసేటివన్ని ప్రాకిపోయివుంటే ఇవి ఉండకూడదు, ఇవన్ని అధర్మాలు అని, ఆయనవచ్చి చెప్పినాడు భగవద్గీత. వ్యాసుడు అంతకు ముందే వ్రాశాడు నాలుగు వేదాల గురించి, 18 పురాణాల గురించి వ్రాసినాడు


ఈ యజ్ఞయాగాదుల గురించి వ్రాసినాడు, ఉపనిషత్తుల గురించి వ్రాసినాడు, ఇవన్నీ వ్రాసిపెట్టినేటివే. అందరూ దానినే అనుసరించే వాళ్ళు, ఆయనే గొప్పవాడు, ఆయన చెప్పినేదే గొప్ప అని. వీళ్ళంతా గొప్ప వాళ్ళు కాదు, మిమ్ములను మోసము చేసేవాళ్ళు వీళ్ళంతా అని. ఇప్పుడు మనము ఏమంటాము వ్యాసుడు గొప్ప మహర్షి అనుకుంటున్నాము కదా! ఆయనకు పెద్ద పేరు పెట్టుకున్నాము. కాని భగవంతుడు ఏమి చెప్పినాడంటే మీరు మోసపోతున్నారు. నేను వచ్చి జ్ఞానాన్ని చెప్పుతున్నా చూడు విను అని అప్పుడు జ్ఞానము చెప్పడము జరిగింది. ఆ చెప్పిన జ్ఞానమే మనకు భగవద్గీత. అందులో ఏమని ఉంది? ఇవి ఏవీ చేయవద్దండి మీరు. వీటివలన మీకు ఏమాత్రము దేవుడు తెలియబడడు. అంటే దేవుడైన నేను ఏమాత్రము తెలియబడను. ఎందుకు అనవసరముగా ఆ విషయాలలోకి మీరు పోతారు అని చెప్పినాడు. మళ్ళీ భగవద్గీత చెప్పి ఇప్పటికి 5150 సంవత్సరములకు అయింది. అయితే ఏమన్నా వాటిని మనము విడిచిపెట్టినామా? ఏ గురువు దగ్గరకు పోయినా ఏమి చేస్తాడు ఆ గురువు? ముందు మంత్రము చెప్పుతాడు, ఆ తరువాత జపించుకోమంటాడు, అదే తపస్సు. జపించి జపించి తపించి తపించి జపించడము తపించడము అంతా ఒకటే. తపించి తపించి తపించి


---

తపస్సు అయిపోతాది, అది పనికి రాదు. ఎన్ని యేండ్లు గొణిగినాగానీ, నన్ను తపించినాగానీ దానివల్ల దేవుడు తెలియబడడు, వృథా ప్రయాస. ఈ రకముగా మనకు భగవద్గీత తెలియబడింది. తెలిసినాగానీ మనమెందుకు అట్ల పోతున్నాము? అంటే మనకు తెలియదు. అంటే భగవద్గీతలో ఇంతపెద్ద రహస్యము ఉందని చెప్పే వాళ్ళు లేరు. ఎవరన్నా చెప్పాలంటే స్వామీజీలు, గురువులు వీళ్ళు చెప్పాలి. వాళ్ళు ఏమి చెప్పుతారు? పోతానే ఉపదేశము అని కరిపించుకుంటారు.


పెండ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఎక్కడికి పోదు కదా! మెడలో తాళబొట్టు కడితే ఉంటుంది కదా! అట్లే ఉపదేశము వానికి ఇస్తే వాడు శిష్యుడు అయిపోతాడు, వాడు ఫలానావాడు నా గురువు అని చెప్పుకుంటా వుంటాడు, వాడు ఎక్కడికి పోయినా వీనికి గురువే వాడు శిష్యుడే. ఇంకొక చోటుకి పోకుండా ఉండాలంటే ఏమి చేయాలి? వానికి ఉపదేశము ఇవ్వాలి. ఉపదేశము ఇస్తే వాడు అటాచ్ అయిపోతాడు. రైల్వే బోగీలు కరిపించుకొన్నట్లే. అంటే ఎంతమంది శిష్యులు అంటే 2000 మంది శిష్యులు ఉన్నారు అంటే ఓహ్! పెద్ద గురువు అని అనుకుంటారు. ఇట్లా కరిపించుకొని వేల సంఖ్యను శిష్యులుగా చేసుకున్నారు వీళ్లు. కానీ అసలైన జ్ఞానము మాత్రము వీళ్ళకు తెలియదు, వాళ్ళకు తెలియదు. గురువులకు తెలిస్తేనా శిష్యులకు చెప్పేది. భగవద్గీతలో చెప్పిన విషయమే అర్థము కాకుండ పోయింది. మళ్ళ భగవద్గీతలో ఇంత పెద్ద స్వామీజీలకు ఈ రోజు అర్థము కాలేదా? అని మనము నిలదీసి అడుగుతున్నాము. చెప్పుకుంటుంటే వాళ్ళకి ఇప్పుడు జవాబు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితిలో కొంతమంది వేరే మతస్థులు నేర్చుకొని, దానిని చదివి చెప్పి ఈ భగవద్గీతలో ఇట్ల ఉంది చూడండి అని మళ్ళీ దానినే సాక్ష్యముగ తీసుకుంటున్నారు.


---

తప్పు భావములో ఉండే భగవద్గీతను తీసుకొని ఆ తప్పును వారు చెప్పుతున్నారు. ఈ రోజు చాలామంది ముస్లీమ్లను నేను చూశాను. భగవద్గీతను కంఠాపాఠము చేసుకొని శ్లోకము చెప్పి, దానిలో ఉండేటువంటి వివరము చెప్పి, ఇది ఖుర్ఆన్ గ్రంథములోకి సరిపోతావుంది అని చెప్పుతున్నారు. ఖుర్ఆన్ గ్రంథము మీకు అర్థమయిందా? అర్థము కాలేదు. మళ్ళీ దానికి దీనికి ఎట్ల పోలిక చేసుకుంటున్నారు? చేసుకుంటున్నారు. మేము చెప్పేదే కరెక్ట్ అని అంటున్నారు. అదే ఇప్పుడు ప్రతి చోట మేము చెప్పుతూ ఉంటే అర్థముకాని పరిస్థితిలో మీరు అజ్ఞానాన్ని బోధిస్తున్నారు మాకు అని కొందరు ముస్లీమ్లు చెప్పుతున్నారు


నేను జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటే, తెలియక అజ్ఞానాన్ని బోధిస్తున్నారని మమ్మల్ని ఆరోపణ చేస్తావున్నారు. ఇంక చూసినంతసేపు చూసి మేము ఏమి చెప్పుతున్నాము అంటే నేను అజ్ఞానమే బోధిస్తున్నాను. కానీ నేను మిమ్మల్ని వినమని చెప్పలేదు కదా! నేను చెప్పేది మీకు నచ్చితే తలలోకి చేర్చుకోండి. నచ్చకపోతే ప్రక్కన పారేయండి. ప్రవక్త కూడా అట్లే చెప్పినాడు. హెచ్చరించే దానికి మాత్రమే నేనొచ్చాను. మీరు ఇట్లే నడుచుకోండి అని చెప్పలేదు. నీవు మంచి మార్గములో పోతావో చెడ్డమార్గములో పోతావో అది అల్లాహ్ ఇష్టము. అల్లాహ్ నిన్ను ఎట్లా కావలసింటే అట్లా పంపిస్తాడు. అది అల్లాహ్ ఇష్టము మీద ఆధారపడి ఉంది. నేను చెప్పితే నీకు అది రాదు. ఇప్పుడు నేను అదే చెపుతున్నాను. ఈ రోజు నేను జ్ఞానము చెపుతున్నాను. మిమ్మల్ని హెచ్చరిక చేసేదానికి, జ్ఞాపకము చేసేదానికి. దేవుడు చెప్పిన స్థితి ఇది, దేవుని మాట ఇది అని జ్ఞాపకము చేస్తా ఉన్నానుగానీ నా మాట విని ఇట్లే నడుచుకోండి అని నేను చెప్పలేదు. ఎవరినీ శాసించలేదు. ఈ మధ్యకాలములో పోయిన నెలలో ఒక ముస్లీమ్


----

తన అబ్బాయికి ‘గురుపౌర్ణమి' అని గురువు వేషము వేసి, నామము పెట్టి, నాకు చూపిస్తే వెంటనే నేనేమి చెప్పినానంటే ఈ మూడు నామాలు ఇందువుల గుర్తు అవుతుందయ్యా ఇది! దానిని చూస్తే మిమ్ములను ఇందువు అంటారయ్యా. అప్పుడు మనము మళ్ళీ ఒక మతాన్ని సూచించినట్టు అవుతుంది. గురువు అనేవాడు ఏ మతానికి సంబంధించినటువంటివాడు కాదు.


గురువు అనేవాడు దేవునితో సమానముగ ఉంటాడు. దేవుని భావాలతో సమానముగా ఉంటాడు. దేవుని జ్ఞానము చెప్పేవాడు దేవుని పద్ధతి ప్రకారము ఉంటాడుగానీ ఒక మతానికి సంబంధించి చెప్పుతాడా? గురువు అనేవాడు అందరికీ గురువే. కాబట్టి ఆయన దేవుని జ్ఞానాన్నే చెప్పుతాడుగానీ ఒక మతానికి సంబంధించి చెప్పుతాడా? నీవు పెట్టుకొనేది మతము గుర్తు పెట్టుకొన్నావు. అది మంచి పద్ధతి కాదు అని చెప్పినాము. అయితే మళ్ళీ గుర్తు అంటే ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా! అని అన్నాడు. 'దేవుని గుర్తు' పెట్టుకో అని చెప్పినాము మేము. 'దేవుని గుర్తు' అంటే ఏమిటి? అన్నాడు. ఖుర్ఆన్ గ్రంథములో ఉంది చూడలేదా? అని అడిగినాము. ఎక్కడ ఉంది? అంటే 5వ సూరా 2వ ఆయత్లో ఉంది, 22వ సూరా 32వ ఆయత్లో కూడా ఉంది. అక్కడ చూస్తే ఉంది. దేవుని చిహ్నాన్ని అగౌరవపరచవద్దండి అని 5వ సూరా 2వ ఆయత్లో ఉంది. 22వ సూరా 32వ ఆయత్ లో కూడా దేవుని చిహ్నాన్ని ఎవడైతే గౌరవ పరుస్తున్నాడో వాని భక్తి భావము అర్థమవుతుంది. వానిలో ఉండే భక్తిని బట్టి వాడు గౌరవిస్తున్నాడు అని చెప్పాడు. అలా చెప్పినోడు ఆయనేమి చేసినాడో తెలుసునా! ఫలానిది దేవుని చిహ్నము అని చెప్పలేదు. చూడు దేవుడు ఎంత బాగ చెప్పినాడో! ఫలానిది దేవుని చిహ్నము అని చెప్పినాడా?


----

చెప్పలేదన్నమాట. అక్కడ ఏమి చేసినాడు మళ్ళ 'దేవుని చిహ్నము' అని అంటున్నాము కదా! 'చిహ్నాలు' అని బహువచనము చెప్పినాడు ఆయన. చిహ్నాలు అని బహువచనము చెప్పితే ఒక 5, 6 ఏరుకుంటే సరిపోతాదని వీళ్ళే ఇష్టము వచ్చినట్లు ఏరుకున్నారన్నమాట, ఏవో ఒకటిలే అని. ఇట్ల ఏరుకొని దీన్ని తీసి, భగవద్గీతలో ఒక శ్లోకము చెప్పి దాంట్లోనే ఉండాయి చూడు అంటే ఎట్ల సరిపోతాది. ముందే భగవద్గీత వీళ్ళకి తెలియదు. తెలియని దానినే నువ్వు మళ్ళ పట్టుకొని ఇగ్గులాడుతుంటే దానికి దీనికి పోలిక ఎట్ల సరిపోతుంది? సరిపోదు. ఈ రకముగా దేవుడు ఏమి చెప్పినాడు అంటే స్వచ్ఛమైన జ్ఞానాన్ని మనిషికి అందించాడు.


దేవుడు ఎప్పుడు ఏది అందించినాగాని దేవుడు మూడు (3) విధానాలతో నా జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. ఎప్పుడు మూడు విధానాలలో ఎక్కడ ఏ విధమైన జ్ఞానము చెప్పినాగాని అసలైన జ్ఞానాన్ని చెప్పినాడు, సత్యబద్దమైనటువంటి జ్ఞానాన్ని చెప్పినాడు, నిదర్శనమైన జ్ఞానాన్ని చెప్పినాడు, పరమార్థము అయినటువంటి జ్ఞానాన్ని మనకు చెప్పినాడు. ఇప్పుడు మనము దానిని ఎందుకు కాదు అని అంటున్నాము? దానికి మనకు ఒక నిరూపణ ఉంది, వాళ్ళది సత్యము కాదు అని చెప్పేదానికి. ఏమో వాళ్ళకి తెలిసినదంతా మనకు తెలుసునా! వాళ్ళదే సత్యమేమో, మనది అసత్యమేమో అనే అనుమానము ఏమాత్రము నాలో లేదు. కానీ మిగతా వాళ్ళకు ఉండవచ్చు, కొందరు అంచనాతో మాట్లాడుతున్నారు, పది మంది చెప్పుతావుంటే వారు చెప్పుతావున్నాము, అసలు నిజమో కాదో? వానికే తెలియదు అది. అందరూ అంటావుంటే వారు అంటూవున్నారు. అందరూ అసత్యాన్ని సత్యము అంటే అది సత్యమవుతుందా కాదు. అట్లే సత్యాన్ని అసత్యమంటే అది అసత్యమవుతుందా కాదు. సత్యము సత్యమే అసత్యము


----

అసత్యమే. ఈ రకముగా దేవుడు ఏమి చేసినాడంటే మూడు గ్రంథాలలోను దైవవాక్కులను మనకు అందజేశాడు. ఎక్కడ చెప్పినా ఒకటే అర్థము, ఒకటే పద్ధతి ఉంటుంది గాని వేరువేరు అర్థాలు ఎక్కడా ఉండవు. ఒకే భావము ఉంటుంది. చెప్పినేది ఒక్కడే. ఒకడే చెప్పినపుడు ఎక్కడైనాగాని ఒకటే మాట చెపుతాడు. రెండు మూడు అర్థాలతో చెప్పవలసిన అవసరము ఆయనకు లేదు కదా! తరువాత నాకు చెప్పినా, నీకు చెప్పినా, ఇంకొకరికి చెప్పినా, 10 వేల సంవత్సరముల క్రితము చెప్పినా, లేకపోతే అంతకు ముందు చెప్పినా, ఎప్పుడు చెప్పినా గానీ, మనకు ఒకటే గ్రంథాన్నే చెప్పడము జరిగింది. ఒకటే గ్రంథములో విషయాన్నే చెప్పడము జరిగింది గానీ వేరువేరు విషయాలు ఎక్కడా లేవు. అర్థమయ్యిందా!


ఈ రకముగా మనము చూసుకుంటే ఈ రోజు “దేవుని చిహ్నము” అనే ఒక గ్రంథము మీకు వచ్చింది. ఆ దేవుని చిహ్నము అనే గ్రంథములో మేము కొన్ని క్రొత్త క్రొత్త విషయాలు మీకు అందించడము జరిగింది. దాంట్లో దేవుడు ఎక్కడా చెప్పని చిహ్నాన్ని మీరు ఎలా చూపించగల్గినారు అని మీరు ప్రశ్న వేయవచ్చు. ఆ ప్రశ్నకు జవాబు సంపూర్ణముగా ఇవ్వబడింది. అంటే దేవుడు ఖుర్ఆన్లోనే మనకు ఏమి చెప్పినాడు? గ్రంథ ప్రమాణము లేకుండా ఎవడూ ఏమీ చెప్పకూడదు అని చెప్పాడు. అంటే మేము చెప్పేది అంతా గ్రంథ ప్రమాణముతోనే చెప్పుతున్నాము. ఏ గ్రంథ ప్రమాణముతో చెప్పుతున్నాము మనము? ఏ గ్రంథాన్ని సాక్ష్యముగా తీసుకొని చెప్పుతున్నాము? అంటే మూడు గ్రంథాలను కూడా సాక్ష్యముగా తీసుకొని చెప్తున్నాము. సరే ఇప్పుడు మూడు గ్రంథాలను సాక్ష్యముగా చెప్పితే భగవద్గీతలో సాక్ష్యముగా తీసుకొని చెప్పొచ్చు, బైబిలులోనూ సాక్ష్యముగా తీసుకొని చెప్పొచ్చు, ఖుర్ఆన్లో ఉన్న దానిని కూడా సాక్ష్యముగ తీసుకొని


---

చెప్పొచ్చు. ఖుర్ఆన్ గ్రంథములో ఏ వాక్యము ఉంది? అని కొందరు అడిగితే ఇంతకు ముందు చెప్పాము రెండు మూడు వాక్యాలు ఉన్నాయని చెప్పాము. అక్కడ దైవ చిహ్నాలు అని పేరు ఉంది గానీ ఫలానావి అని దేవుడు సూచించినాడా? సూచించలేదు. మరి అట్లాంటప్పుడు మనము ఎట్లా నిర్ణయము చేసుకోగల్గినాము? అనేది ఒక ప్రశ్నే మనకు. అదొక ప్రశ్నే కదా! ఇప్పుడు మనము దానిని విడదీసి చూసుకుంటే, మనకు భక్తి అనేది ఒకటుంది. భక్తి అంటే విశ్వాసము అంటాము మనము. దేవుని ఎడల విశ్వాసము, దేవుని మీద భక్తి. భక్తి చాలామందికి ఉంది, అయితే కొంతమందిలో కొంత ఉంది, కొంతమందిలో ఇంకా కొంత ఉంది, కొంతమందిలో ఇంకా ఎక్కువవుంది, కొంతమందిలో పూర్తిగా ఉంది. ఇప్పుడు ప్రపంచములో ఉండే సమాజాలలో మనుషులలో ఎవరిలో ఎక్కువ ఉంది?


మనము సమాజపరముగా గుర్తించి చెప్పితే విశ్వాసము అనేది ఎవరిలో ఎక్కువవుంది? అంటే నెంబర్వన్ ముస్లీమ్లలో ఉంది అని చెప్పవచ్చు. అది అందరికి తెలిసిన సత్యమే. మాకు కూడా తెలిసిన సత్యమే. ముస్లీములలో దేవుని మీద విశ్వాసము ఉంది. మిగతా వాళ్ళలో కూడా ఉంది కానీ అంతటి విశ్వాసము ఉన్నది అని మనము చెప్పలేము. ఎట్లయినా కొంచెము తక్కువగా ఉంటుంది, కొద్దిగన్నా తక్కువ ఉంటుంది. సరే పూర్తి తక్కువ ఉన్నవాళ్ళు ఉన్నారు. కొద్దిగ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో సమాన విశ్వాసము కూడా ఉండవచ్చు అంటే అంత విశ్వాసము ఉండే వాళ్ళు కూడ ఉండవచ్చు. ఒకవేళ లెక్కలు మనము పర్సంటేజీల్లో చెప్పితే ఎక్కువ విశ్వాసము ఉండేది ముస్లీములకే అని చెప్పవచ్చు. ముఖస్తుతి కోసము చెప్పేది కాదు. ఇది వాస్తవము. సరే నీకు డబ్బు ఉంది మనకు. దీనికి ఒక


---

చిన్న ఉదాహరణ చెప్పుతా నేను. డబ్బుకి ఇంత విలువ అని తెలుసు మీకు, ఆ డబ్బు బజారుకు తీసుకుపోతే మనకు పని జరుగుతుంది అని తెలుసు. అంటే డబ్బుకు ఉండే మహత్యము చాలా గొప్పదని తెలుసు. డబ్బు తెలుసు, డబ్బుకుండే మహత్యము ఇట్లా అని తెలుసు. నీ దగ్గర డబ్బు లేదనుకో, లేకున్నా తెలుసు నీకు డబ్బుకుండే మహత్యము, డబ్బుంటే ఏమైనా జరుగుతుంది అని. డబ్బుకు ఉన్న విలువ ఏ దానికి లేదనీ, డబ్బు ప్రపంచములో గొప్పదని, దానికి అందరూ లొంగిపోతారు అని, దానికి అందరూ దాసోహం అంటారు అని. సరే ఇప్పుడు మనకు తెలుసు డబ్బు ఇంత గొప్పది అని. దానినే విశ్వాసము అంటాము. అంటే ఇంత గొప్పది అని నీవు తెలుసుకోవడము విశ్వాసము. ప్పది అని నమ్మకముంది కదా!


ఆ నమ్మకమే విశ్వాసము. అర్థమయిందా! ఆ విశ్వాసము ప్రకారము డబ్బును సంపాదించేది నీకు తెలియదు. విశ్వాసము పనికి రాదు అక్కడ చూడండి చిన్న లిటికేషన్. విశ్వాసము ఉంది అది గొప్పదే అయినా డబ్బును ఎలా సంపాదించుకోవాలి అని తెలియకపోతే నువ్వు ఆకలిగొంటావు, కష్టపడతావు. డబ్బు విలువ తెలిసినా నీకు దానివలన సుఖము లేదు, ప్రయోజనము ఏమాత్రము లేదు. అదే విధముగా దేవుడు గొప్పవాడు, దేవుడు ఏకైక స్వరూపుడు, అద్వితీయుడు ఇంక రెండోవాడు లేడు, ఆయన స్థానములో ఎవరినీ కూర్చోపెట్టకూడదు. ఆయనను మించినవాడు లేడు ప్రపంచములో, ఆయన ఒక్కడే, ఆయన స్థానము ఒక్కటే పెద్దది అని నాకు పూర్తి విశ్వాసము ఉంది. ముస్లీములకు కూడా పూర్తి విశ్వాసము ఉంది. ఉంటే ఏమి చేయాలి మనము ఇప్పుడు? దేవునిపై విశ్వాసము మనకు ఉంది, దేవుడు గొప్పవాడు అని తెలుసు. కానీ దేవునిశక్తి మనకు ఏమైనా ఉపయోగపడుతుందా? డబ్బు గొప్పదని తెలుసు నువ్వు సంపాదించుకుంటే


----

అది ఉపయోగపడుతుంది నీకు. నీవు సంపాదించుకోగల్గితే అది నీకు ఉపయోగపడుతుంది. నీ కష్టాలు పోతాయి, సుఖాలు వస్తాయి అన్ని వస్తాయి. నువ్వు ఏమైనా చేసుకోవచ్చు దానితో, ఆ డబ్బు శక్తి ఏదో నీకు ఉపయోగపడుతుంది. డబ్బు విలువ నీకు ఉపయోగపడుతుంది. దానిని తీసుకొని ప్రపంచములో ఏమైనా చేయవచ్చు, ఎంత గొప్పవానివి అయినా కావచ్చు. కాని డబ్బు లేకపోతే ఏమిచేస్తావు? ఇప్పుడు తెలుసు ఈయనకు, డబ్బు గొప్పదని తెలుసు, తెలిసినంత మాత్రమున డబ్బు వస్తుందా? రాదు. డబ్బుకంటే మించినేది లేదు, అది నాకు తెలుసు పూర్తి నమ్మకము ఉంది, నాకు విశ్వాసము ఉంది అంటావు. అయినా ఏమి ప్రయోజనము? డబ్బు మాత్రము పైసా రాదు నీకు. తెలిసేంతవరకే కాని పైసా రాదు. మరి ఏం చేయాలి మనము? సంపాదించుకోవాలి. ఎట్ల సంపాదించుకోవాలి? దానికి ఉన్నాయి వ్యాపారాలు సాపారాలు, ఇంకోటి ఇంకోటి వగైరా వగైరా ఉన్నాయి.


దేవుడు ఏమి చెప్పినాడు ఒరేయ్! నేను పెద్దోన్నేరా! నువ్వు చెప్పినా పెద్దోన్నే, చెప్పకపోయినా పెద్దోన్నే! నీ మీద విశ్వాసము ఉంది నాకు అంటే, ఉంది. నేను లేదు అంటున్నానా? ఉంటే ఏమి చేస్తావు, నీ విశ్వాసముతో నాకేం పని? విశ్వాసము ఉంది, నేను గొప్పోడు అనుకుంటున్నావు. అంతే కదా! అట్లకాదు నన్ను గొప్పోడని అనుకున్నంత మాత్రమున ఏమి ప్రయోజనము లేదు. నన్ను గురించి తెలుసుకొని, నన్ను అనుసరించు, నా శక్తి ఏమిటో నీకు వస్తుంది. నా బలము ఏందో నీకు వస్తుంది. అపుడు నా బలమును ఉపయోగించుకో. డబ్బులు వస్తే నీకు పనికి వస్తుంది. అపుడు డబ్బు నీకు ఉపయోగపడుతుంది. అలానే నా శక్తి నీకు వస్తే ఉపయోగపడుతుంది. నీవు ఏమైనా చేయవచ్చు, ఎంత సుఖము అయినా


---

అనుభవించవచ్చు, నీ కష్టాలు ఏవైనా పోగొట్టుకోవచ్చు, నువ్వు ఎట్లైనా బ్రతుకవచ్చు. దేవుని శక్తి నీవు సంపాదించుకో. నా శక్తి నీవు సంపాదించుకో. అంతేగానీ నన్ను గొప్పవాడు అని విశ్వసించినంత మాత్రమున నీకేమీ రాదు. నేను చెప్పాను, అక్కడ కృష్ణుడు ఉన్నాడు. మీరు అక్కడికి పోయి ప్రార్థన చేస్తారు, మ్రొక్కుతారు, పూజలు చేస్తారు, కొబ్బరికాయలు కొడతారు, ఏమేమో చేస్తారు, చేయండి. ఆయన ఏమనుకుంటాడంటే, వీళ్లంతా మోసము, దేవుడు నన్ను కాకాపడుతున్నాడు అని అనుకొంటాడు. వీడు ప్రక్కకు పోతే తరువాత మన దిక్కు కూడా చూడడు.


ఇక్కడ ఉన్నప్పుడు మాత్రము రెండు చేతులు జోడించి కదలకుండ వంగుకొని ఉంటారు. వీళ్ళ మాటలు నమ్మకూడదు. వీళ్ళు ఎంతైనా పొగుడు, ఆయన దగ్గర శ్లోకాలు చెప్పు, పద్యాలు చెప్పు, ఏమన్నా చెప్పు. వాళ్ళు మాత్రము అనుకుండేది అంతే. నేను మొదటినుంచి చెప్పుతున్నాను, నీవు ఎంత ప్రార్థన చేసినా ఏ ప్రయోజనము లేదు. ఆయన జ్ఞానాన్ని తెలుసుకోండి, అది ప్రయోజనము. ఆయన చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకోండి ప్రయోజనము. అట్ల పొగిడేటట్లు ఉంటే, పూజలు చేసేటట్లు ఉంటే, ఆయన జ్ఞానము మనకు చెప్పాల్సిన పనే లేదు. భగవద్గీత ఎందుకు చెప్పాలి? ఇట్లే మ్రొక్కుకుంటూ ఉండండి సరిపోతుంది అనవచ్చు కదా? ఖుర్ఆన్ ఎందుకు చెప్పాలాయన? మీరు ఇట్లే నమాజ్ చేసుకుంటూ ఉండండి రోజు అని చెప్పితే సరిపోతుంది కదా! ఒక్క నమాజ్ ఒకటి సరిపోతుంది కదా! వీళ్ళు కూడా అదే చేస్తూ ఉన్నారు. నమాజ్-జకాత్ అంటారు ఇంక కొంత ఓపిక ఉంటే హజ్ అంటారు. ఇంక కొంత ఓపిక ఉంటే రోజా అంటారు. సరే ఈ నాలుగే మనము చేసేది. నాలుగిటికే దేవుడు పరిమితా? మీరు అవి చేసినారు అనుకోండి నాకేమి లాభం వస్తుంది అని అడుగుతాడు


---

ఆయన. మీరు పూజలు చేసినారనుకో, మీరు ఇవన్నీ ఆచరించినారనుకో నాకేమి లాభము వస్తుంది? ఇలా అవి చేస్తే సరిపోయేటపుడు నేను ఖుర్ఆన్ గ్రంథము చెప్పాల్సిన పని లేదు. ఇట్లుండండి, ఇట్లుండండి అని చెప్పాల్సిన పనే లేదు, అంత భగవద్గీత హిందువులకు, బైబిల్ క్రైస్తవులకు చెప్పాల్సిన పనే లేదు. జ్ఞానము ఎందుకు ఇంక? నువ్వు పూజలు చేసుకొని కొబ్బరి కాయలు కొట్టి నమస్కారము చేసి, పొర్లు దండాలు చేస్తే, భక్తి అయిపోతే, ఇక అదే చాలు అనుకుంటే భగవద్గీత చెప్పాల్సిన పని లేదు. క్రైస్తవులు చర్చీలకు పోయి రెండు ప్రార్థనలు చేసి ఇంకా చాలులే అదే అనుకుంటే బైబిలు చెప్పాల్సిన అవసరము లేదు. ఈ దైవ గ్రంథాలతో మనకు పనేలేదు. సరే దైవగ్రంథాలలో ఏమి చెప్పారు మనకు?


నన్ను తెలుసుకోండి, నా జ్ఞానాన్ని తెలుసుకోండి అని చెప్పారు. చెప్పలేదా చెప్పండి? ప్రతి దైవగ్రంథములోనూ అదే ఉంది. నన్ను తెలుసుకోండి, నా జ్ఞానాన్ని తెలుసుకోండి, నా జ్ఞానాన్ని అనుసరించండి. ఒకచోట చెప్పాడు “నా గ్రంథాన్ని మీరు పవిత్రులు అయితేనే ముట్టుకోగలరు లేకపోతే ముట్టుకోలేరు” అని చెప్పాడు. పవిత్రుడు అయితేనే నా గ్రంథాన్ని తాకగలుగుతారు లేకపోతే తాకలేరు అని చెప్పాడు. ఏందయ్యా! భగవద్గీత దైవగ్రంథము, మేము ముట్టుకున్నాము కదా! అని అనవచ్చు. లేకపోతే బైబిలు, దైవగ్రంథము! నేను ముట్టుకున్నాము. ఖుర్ఆన్ కూడా దైవగ్రంథము! దండిగా ఉన్నాయి ఖుర్ఆన్లు! మేము కూడా ముట్టుకున్నాము, మేము ముట్టుకున్నాం కదా! మరి ముట్టుకున్నవాళ్లంతా పవిత్రులేనా? అంటే నేను పవిత్రుడేనా? అని కొందరు ప్రశ్న వేయవచ్చు. కాని ఆయన ఏమి చెప్పినాడు? భౌతికముగా గ్రంథమును కాదు, దానిలో ఉండే జ్ఞానాన్ని ముట్టుకోలేవు అని చెప్పినాడు. సూక్ష్మముగా ఉన్న నా జ్ఞానము అపవిత్రునికి


---

ఎవరికీ అర్థము కాదు. పవిత్రముగా ఉండే వానికే నా జ్ఞానము అర్థము అయితుంది, అప్పుడు వాడు నన్ను ముట్టుకొన్నట్లు. నా గ్రంథాన్ని ముట్టు కొన్నట్లు, నా గ్రంథాలలో ఉండే జ్ఞానాన్ని ముట్టుకొన్నట్లు అగును. అర్థము కానంత వరకు నా జ్ఞానము అర్థము కాలేదు కదా! వాడు ఎట్ల ముట్టుకొంటాడు, వాడు ముట్టుకోనట్టే! వానికి అది చేరనట్లే! అని దేవుడు చెప్పినాడు.


కాబట్టి ఇప్పుడు మనకి ఏమి కావాలి? అంటే ఏ మతస్థునికైనాగాని అంటే హిందువుకుగాని, ముస్లీమ్కుగాని, క్రైస్తవునికి గాని విశ్వాసము ఉంది, సంపూర్ణ విశ్వాసులు ఉన్నారు, అసంపూర్ణ విశ్వాసులు ఉన్నారు, కొద్దిమాత్రము విశ్వాసులు ఉన్నారు. సరే కొద్దిగా ఉన్నోళ్ళు విశ్వాసమును పెద్దగా చేసుకోండి, పెద్దగా ఉండేవాళ్ళు విశ్వాసమును ఇంకా పెద్దగా పెంచుకోండి, పూర్తి విశ్వాసులుగా ఉండండి, అయినాగాని లాభము లేదు. విశ్వాసముతోనే మన పని అయిపోదు. విశ్వాసముతోనే దేవుడు ఒప్పుకోడు. నేను పూర్తి విశ్వాసిని అని ఒక ముస్లీమ్ అంటే అంతమాత్రమున ఖుర్ఆన్ గ్రంథముతో నీకు పనిలేదు అని చెప్పలేము. విశ్వాసమున్నా తప్పక ఖుర్ఆన్ గ్రంథాన్ని పఠించాలి, అందులో ఆయన ఏమి చెప్పినాడో మనము అనుసరించాలి. అదే విధముగా భగవద్గీత పూజలతో సరిపోయేటట్లు ఉంటే భగవద్గీతను చదవాల్సిన పని లేదు. భగవద్గీత చదివిన తరువాత పూజలు చేయమన్నాడా! అక్కడ ఏమి చేయమన్నాడు చూసుకో. నీవు ఈ రోజు ఏమి చేస్తున్నావో అవన్నీ పనికి రావనే చెప్పినాడు ఆయన. భగవద్గీతలో అదే కదా చెప్పినేది. ఈ రోజు స్వామీజీలు పెద్ద పెద్ద వాళ్ళు గురువులు చేస్తున్న యజ్ఞ, వేద, తపస్సులు పనికి రావని చెప్పారు. కొంతమంది పెద్ద స్వామీజీలు అయితే హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తావుంటారు. ఈ


---

ప్రాంతములో చేస్తే దేవుడు ఒప్పుకోడు. ఆ చలికి పోయి అక్కడ బాగా వణుక్కుంటూ చేస్తే అప్పుడు ఒప్పుకుంటాడు అని కొందరంటారు. తపస్సు ఎక్కడ చేసినా ఒకటే. మంచుగడ్డలలో చేసినా ఒకటే, ఇంట్లో కూర్చోని చేసినా ఒకటే, ఎక్కడ చేసినా తపస్సు తపస్సే అవుతుంది. కానీ తపస్సును దేవుడు ఒప్పుకోను అని చెప్పినాడు.


తపస్సు వలన నన్ను తెలుసుకొనేదానికి శక్యము కాదు అని చెప్పినాడు. దానివలన నా జ్ఞానము రవ్వంత కూడ మీకంటుకోదు అని చెప్పినాడు. నా శక్తి మీకు కొంత కూడా రాదు అని చెప్పాడు. చెప్పినాడు కదా! మరి ఆయన శక్తి మనకు రానప్పుడు, ఆయన జ్ఞానము మనకు తెలియనపుడు, ఆయన జ్ఞానము మనకు అంటుకోనప్పుడు, ఆయన జ్ఞానమును మనము తాకలేనపుడు అవన్నీ ఎందుకు చేయాలి? అవి పనికి రావని ఆయన చెప్పిన తరువాత దాన్ని ఎందుకు చేయాలి? అని ప్రశ్న వేసుకోండి. దేవుని మీద మాకు నమ్మకము ఉంది. కాదని మేము చెప్పలేదు. మీకు నా మీద నమ్మకము ఉంది కదా! మీరు. మీ నమ్మకము నామాట వినేదానికే కదా! నేను గొప్పవాన్ని అని చెప్పినపుడు నా మాట వినాలి కదా! మీరు, నా గ్రంథాన్ని ముట్టుకోండి అని నేను అంటే, మీరు పట్టుకొంటూనే అయిపోతుందా? ముట్టుకున్నట్లా? నిజముగా దానిలో ఉండే సారాంశాన్ని మీరు గ్రహించగల్గినపుడు మీరు ముట్టుకున్నట్లు. ఈ రకముగా దేవుని జ్ఞానము మనకు తెలియాలంటే మీకున్న విశ్వాసము పనికి రాదు. మరి ఏమి చేయాలి మనము? ఇప్పుడు అసలైన పాయింట్కు వస్తాము.


ఇప్పుడు మన లక్ష్మినారాయణాచారి ఉన్నాడు. ఆయన నాకు అందరికంటే దేవుని మీద ఎక్కువ విశ్వాసము ఉంది. ముస్లీమ్లకంటే


----

కొంచెము ఎక్కువ ఉంది అని అన్నాడు. ముస్లీమ్లకంటే ఎక్కువుంది కాబట్టి దేవుడు నిన్ను ఒప్పుకుంటాడంటావా? అని అడిగినాము. ఆ.. నన్ను ఒప్పుకుంటాడు అన్నాడు. దేవుడు ఎందుకు ఒప్పుకుంటాడు? ఏమని ఒప్పుకుంటాడు? విశ్వాసము ఉంది అని ఒప్పుకుంటాడంటావు అంతేకదా! ఆయన “నేను చెప్పినట్లు వింటే నిన్ను పూర్తి ఒప్పుకుంటాను” అని అన్నాడు. ఆయన చెప్పినట్లు నువ్వు విన్నావా? ఆయన చెప్పినట్లు నువ్వు వినలేదు. ఎవరి లెక్కలో వాడు నాకు చాలా విశ్వాసము ఉంది అనుక సుకుంటున్నాడు. నీకు దేవుని జ్ఞానము తెలియబడదు, దేవుని జ్ఞానములో శక్తి నీకు రాదు. దేవుని జ్ఞానములో శక్తి వచ్చింది అంటే నీ కర్మలన్ని క్షమించబడుతాయి. దేవుడు క్షమాశీలుడు, దయామయుడు. కర్మలన్నీ లేకుండా చేసి నిన్ను క్షమించి వేస్తాడు కాబట్టి, ఆయన క్షమాశీలుడు. అర్థమయిందా! నా జ్ఞానము తెలుసుకున్న రోజు నేను క్షమాశీలున్ని అయితా! అంతేగానీ నువ్వు నన్ను క్షమాశీలుడవు కృపాశీలుడవు అని పొగిడితే నేనెందుకు అయితాను అంటాడు. పొగడ్తలకు లొంగే వాడు కాదు దేవుడు. ఏ పొగడ్తలకు లొంగడు. అర్థమయిందా!


కాబట్టి దేవుడు ఏమి చెప్తాడంటే నా జ్ఞానాన్ని తెలుసుకోండి అని చెప్పినాడు. జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఏమి చేయాలి? ఖుర్ఆన్ గ్రంథములో చాలా స్పష్టముగా ఉంది, శ్రద్ధ ఉండాలి అని. భగవద్గీతలో కూడ అదే చెప్పినారు, శ్రద్ధ ఉండాలి. బైబిలులో కూడా అదే చెప్పారు, శ్రద్ధ ఉండాలి. విశ్వాసము అనేది కాకుండా దానికి తోడు ఒక శ్రద్ధ ఉండాలి. 'శ్రద్ధవాన్ లభతే జ్ఞానమ్' అని భగవద్గీతలో ఒక వాక్యము, 'దేవుని జ్ఞానము మీద ఎవనికైతే శ్రద్ధ ఉందో వానికి జ్ఞానము లభిస్తుంది.’ జ్ఞానము లభించింది అనుకో. "నహిజ్ఞానేన సదృశ్యం పవిత్రమిహవిద్యతే”


---

అంటే దీనికంటే సమానమైనది లేదు. దీనికంటే పవిత్రమైనది లేదు. నీ కర్మలు పటాపంచలై కాలిపోతాయి. పెద్ద కర్మను నీవు అనుభవించాలని ఉంది, అంత బాధను దేవుడు (పరమాత్మ) క్షమించినాడనుకో, అపుడు ఏమనాలి ఆయనను? క్షమాశీలుడు అని అనాలి. ఆయన కాల్చివేయడు, ఆయన ఏమీ చేయడు, అయితే ఆయన జ్ఞానము కాల్చివేసింది. దేవుని జ్ఞానమే కాల్చివేసింది. దేవుని జ్ఞానానికి అంతశక్తి ఉంది. దేవుని జ్ఞానమే నీ కర్మనంతా కాల్చివేసింది. క్షమాశీలుడు, దయామయుడు అను పేరు అపుడు ఆయనకు వర్తిస్తుంది. ఆయన ఎప్పటికీ దయామయుడే ఎప్పటికీ క్షమాశీలుడే. నేను దేవున్ని బాగా నమ్ముకున్నా అని దూరం దూరం ఉంటే ఎట్లవుతుంది! ఆయన వాక్యము ప్రకారము నువ్వు నడుచుకో, అపుడు

సరిపోతాది.


నాకు భగవద్గీత శ్లోకాలన్ని కంఠాపాఠముగా వచ్చు! మీకు వచ్చునా అంటే మాకు రావు. నీకు వస్తాయి కరెక్టే. అయితే ఏమి లాభము? ఆయన శ్లోకాలు ఎవడు బాగా చదివితే వాడిని ఒప్పుకుంటాను అని దేవుడు చెప్పినాడా? ఖుర్ఆన్ వాక్యాలు వరుసగా అన్ని జ్ఞాపకము పెట్టుకొని చెప్పితే ఒప్పుకుంటానన్నాడా? ఆయన. ఆయత్లు, సూరాలు అన్ని వరుసగా చెప్పినావనుకో అప్పుడు ఒప్పుకుంటాడా అంటే ఒప్పుకోడు. నేను చెప్పినదాన్ని నువ్వు జ్ఞాపకము పెట్టుకొని నడుచుకో అపుడు ఒప్పుకుంటాను. అది నిజమైన జ్ఞానము, అది నిజమైన విశ్వాసము. విశ్వాసము ఉన్నంత మాత్రమున ఏ ప్రయోజనము లేదు. విశ్వాసముతో పాటు దేవుని మీద శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉన్నపుడే నీకు జ్ఞానము లభిస్తుంది. జ్ఞానము లభించినపుడు, దేవుడు ఎంతవాడు ఎట్లవాడు అని ఆయన వివరము తెలుస్తుంది. డబ్బు మన దగ్గర ఉన్నదనుకో, దానితో నువ్వు బజార్లో


---

పోయి ఏమి పనైనా చేసుకోవచ్చు. డబ్బు లేదనుకో, డబ్బు పెద్దదే అని నీవు అనినా, దానికి గొప్ప విలువ ఉంది అనినా, అది ఉంటే గదా నీకు పనికి వచ్చేది, కానీ నీ దగ్గర లేదు. నాకు అది గొప్పదని తెలుసు, తెలిస్తే ఏమి ప్రయోజనము చెప్పు? అందరికి తెలుసు గొప్పదని. దేవుడు గొప్పోడని అందరికి తెలుసు. మనము గట్టిగా అనొచ్చు, ఎట్లాన్న ఆయన గొప్పవాడే. నువ్వు అన్నా గొప్పవాడే, నువ్వు అనుకున్నా గొప్పవాడే. డబ్బు తెలిసినా గొప్పదే తెలియకున్నా గొప్పదే. అన్ని పనులు జరుగుతాయి దానివలన కానీ అది నీ దగ్గర ఉండాలిగదా! ఉన్నప్పుడే కదా పని జరిగేది, లేనపుడు

పని జరుగదు.


ఆ రకంగానే ఖుర్ఆన్లో ఉండే వాక్యాన్నిగానీ, భగవద్గీతలో ఉండే వాక్యాన్ని గానీ, బైబిలు గ్రంథములో ఉండే వాక్యాన్నిగానీ నువ్వు చదువుకొని, దాని ప్రకారము నువ్వు నడుచుకోగల్గితే అది నీకు ఉపయోగపడుతుంది. భగవద్గీతలో చాతుర్వర్ణమ్ మయాసృష్టం గుణకర్మ విభాగశః” అని ఒక శ్లోకము చెప్పితేనే తప్పు భావములోకి వెళ్ళిపోతారు. అక్కడ చెప్పినేది ఒకటి, అర్థము చేసుకొన్నది ఒకటి. నాలుగు కులాలు అని చెప్పుతున్నాడు. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు అని అంటున్నారు. ఆ పేర్లు అక్కడ శ్లోకములో లేవు. ఇష్టము వచ్చినట్లు నువ్వు అనుకుంటున్నావు. కులాల గురించి దేవుడు చెప్పినాడని అనుకుంటున్నావు. కులాల, మతాల గురించి చెప్పుకుంటూ వస్తాడా దేవుడు? ఆయన అన్నిటికి అతీతుడు. ఆయన ఏమీ చెప్పడు. నువ్వు తప్పు భావములోకి పడిపోయినావు. అలాగే భగవద్గీతలో మొత్తము చాలా శ్లోకాలున్నాయి. తప్పుభావములోకి పడిపోయినేటివి చాలా ఉన్నాయి. ఒక్కోటి తీసుకొని వ్రాసుకుంటూ వచ్చాము. వాటి విషయము మీకు తెలుసు కొంత, ఎక్కడ తప్పు భావములో పడినాము అని “త్రైతసిద్ధాంత భగవద్గీత”లో చూపించాము.


----

అదే విధముగా మనము బైబిలులోకి పోయి చూసినా, ఖుర్ఆన్ గ్రంథములోకి పోయి చూసినా అట్లే ఉంది. మనిషి దేవుని జ్ఞానాన్ని అర్థము చేసుకోవాలను ఆకాంక్షతో సరిగా అర్థము తెలుసుకోవాలని, దానిప్రకారము నడుచుకోవాలని మేము చెప్పుతున్నాము. కానీ ఫలానా గ్రంథాన్నే ఫాలో కమ్మని మేము చెప్పలేదు. నువ్వు ముస్లీవ్వా? ఖుర్ఆన్ను తప్పనిసరిగా అనుసరించు, దానిలోనున్న సత్యమంతా తెలుసుకో, నీకు ఎంతకావాల్సింటే అంత కనపడుతుంది. నువ్వు హిందువా? అయితే భగవద్గీత చదువుకో. నువ్వు క్రైస్తవునివా? బైబిలులో కూడా ఉంది తెలుసుకో నువ్వు. ఈ మతములో నుండి ఆ మతములోకి పో, ఆ మతములో నుండి ఈ మతములోనికి రా అని మేము చెప్పలేదు. దాంట్లో గొప్పగ ఉంది, దీంట్లో గొప్పగా లేదు అని మేము చెప్పలేదు. అంతా సమానమే. దేవుడు అందరికి ఒకటే, దేవుని జ్ఞానము అంతటా ఉంది తెలుసుకో. ఒక వాక్యములో దేవుడు ఒక విషయము చెప్పుతాడు. చెప్పుతూ చెప్పుతూ చివరకు వచ్చిన తరువాత కూడా అదే చెప్పుతాడు. అంటే మొదలు పెట్టినేది అదే, అంతిమము చేసినేది అదే, ఒకే విషయాన్ని చెప్పినాడు. కాని దానిని అర్థము చేసుకోలేక ఇంకొక విషయములోనికి పోయినాము మనము. దేవుడు మూడు గ్రంథాలలో జ్ఞానము చెప్పితే దానిని అర్థము చేసుకోవడములో ఇంకొక విషయములోనికి పోతాము. కానీ మొదట గ్రంథములో అర్థము అదే అయితుంది, రెండో గ్రంథములో అర్థము అదే అయితుంది, చివరలో అర్థము అదే ఉంటుంది. మొదట ప్రారంభము చేసినపుడు కూడా అర్థము అదే అయితుంది, కాని మధ్యలోకి వచ్చినాక మారిపోతాము, మారిపోయి చివరిది వదిలివేస్తాము, మొదటిది వదిలి వేస్తాము, మధ్యలో ఒక ముక్కను పట్టుకొని ఆ వాక్యాన్నంతా వ్యత్యాసము చేసుకొని చెప్పుకుంటాము, లేకపోతే భగవద్గీత శ్లోకాన్నంతా వ్యత్యాసము చేసి చెప్పుకుంటాము.


---

అప్పుడు దేవుని జ్ఞానాన్ని నువ్వు ఎట్లా అనుసరించినట్లు అవుతుంది? నువ్వు తప్పి పోయినావనుకో, నీ వెనుకల నిన్ను అనుసరించే వానికి కూడా నువ్వు అదే చెప్పుతావు, వాడూ తప్పిపోతాడు. వాడు ఇంకొకనికి చెప్పుతాడు, వాడూ తప్పిపోతాడు. ఇట్ల మొత్తము ఒక సమాజమంతా చెడిపోయేదానికి అవకాశము ఏర్పడుతుంది. ఈ రకముగ హిందూ సమాజము పూర్తి దేవుని జ్ఞానానికి చాలా దూరముగా ఉంది. భగవద్గీత గొప్పదే! భగవద్గీతలో జ్ఞానము గొప్పదే కాని మనము దానికి దూరముగ ఉన్నాము. అదే క్రైస్తవులకు ఏమైనా ఒక ముక్క అయినా అర్థమయిందా! అని ఒక ప్రశ్నవేసినాను ఒకన్ని. బైబిలులో ఒక వాక్యము అడుగుతాము చెప్పండి అని. అంటే దానికి సరియైన సమాధానము చెప్పలేకున్నారు. ప్రశ్నించి ప్రశ్నించి చాలాసార్లు చూశాము. చివరికి ఇట్లకాదని మేమే వ్రాయాలనుకున్నాము. అంటే ముస్లీమ్ సోదరులను కూడ మేము ప్రశ్నించినాము. వాళ్ళంత స్థూలముగా ఉండే విషయాలనే చెప్పుకున్నారు. సూక్ష్మముగ ఉండే విషయాలు ఏమాత్రము తెలియదు. 99 శాతము ముస్లీములు అందరు ఎవరో ఒకరు చెప్పితే విని, వాళ్ళని ఫాలో అయ్యే దానివల్ల, వాళ్ళు ఏమి చెప్పితే అదే రకముగా వీళ్ళు నడుచుకోవడము వల్ల తప్పుదారి పట్టిపోవాల్సిన పని వచ్చింది. చెప్పేవారు ఏమి చేస్తారంటే, ఇట్లే మీరు వినాలి! వినకుండా పోయేదానికి లేదు, ఇదే మీకు హద్దు. ఇట్లే ఉండాలి. లేకపోతే షరియత్ ప్రకారము మీరు ముస్లీములే కాదు అని అనేస్తారు. అప్పుడు భయపడిపోయి వీళ్ళు ఏమి చేశారంటే వాళ్ళు చెప్పినేదే వినాలి అనే ఉద్దేశ్యముతో వాళ్ళు చెప్పినేదే వినుకుంటూ వస్తున్నారు. అది తప్పా ఒప్పా అని ఆలోచన చేసే స్థితిలో లేరు. మొత్తము సమాజమంతా అలాగే ఉంది.


ఒకవేళ ఎవడైనా వివరము అడిగే స్థితిలోకి వస్తే, వాన్ని నువ్వు సరియైన ముస్లీమ్ కాదని అంటారన్నమాట. వాళ్ళకు ఎదురు లేకుండా


----

వారి పెద్దలు కండ్లకు గుడ్డ కట్టేసి నడిపిచ్చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నవేస్తే జవాబు చెప్పరు, అంతే ఇంక అడగకూడదు దాన్ని అంటారు. ఖుర్ఆన్లో దేవుడు విడదీసి చెప్పుతున్నాను నేను అని ప్రతి వాక్యములో చెప్పాడు. ఎక్కడ దాపరికము లేకుండా నీకు విడదీసి, విడదీసి చెప్తున్నాను అని ఉంది. ప్రతిచోట సమాధానము ఉంది. మనము దానిని అర్థము చేసుకోలేని పరిస్థితిలోకి వచ్చాము. ఖుర్ఆన్లో సత్యబద్దముగా అని ఒక వాక్యము ఉంది.


ఒకవేళ మీరు ఒక ఆయత్ను పొరపాటుగా అర్థము చేసుకున్నా వనుకో. ఈ ఆయన్ను పొరపాటుగా అర్థము చేసుకున్నావు, ఇది తప్పు, దేవుడు ఇట్ల చెప్పలేదు అని నేను చెప్పుతున్నాను. అప్పుడు నేను చెప్పినేది కరెక్టా? నువ్వు అనుకొనేది కరెక్టా? అన్న సందిగ్ధములోకి వచ్చేస్తావు. ఆ సందిగ్ధము పోవాలంటే ఏమి చేయాలి? దేవుడు నీకు ఒక ఆయుధము ఇచ్చాడు, నా వాక్యము సత్యబద్దముగా ఉంది అని. ఎక్కడైతే సత్యముగా అది ప్రాక్టికల్గా నిరూపించబడుతుందో అది సత్యము. ఎక్కడైతే ప్రాక్టికల్గా జరుగుతావుందో, అది సత్యబద్దము అంటారు. సత్యబద్దము అంటే జరిగితీరునది అని అర్థము.

'నా జ్ఞానము సత్యబద్దమై ఉంది.' ఖుర్ఆన్లో ఏకైక వచనము అది. ఖుర్ఆన్లో ఉండే ఏకైక వచనము నా జ్ఞానము సత్యబద్ధమై ఉంది. అంటే సత్యముతో నిరూపించబడుతావుంది. అసత్యముగ లేదు అని అర్థము. సరే ఇప్పుడు మనము ఒక విషయమును తీసుకుందాము. పునర్జన్మల విషయము అని చెప్పుతాము. పునర్జన్మల విషయము వచ్చేసరికే అవి లేనే లేవు మా పెద్దలు లేవని చెప్పారు అని అంటారు. మీ పెద్దలు చెప్పనీ, ఇంకోరు చెప్పనీ, నువ్వు దేవుని మాటలను మాత్రమే నమ్ము అని మనము


---

అంటున్నాము. దేవుడు ఏమి చెప్పినాడో అది విను. “నీకు ఇప్పుడు నేను ఎట్ల జన్మ ఇచ్చినానో రెండో జన్మ కూడా అట్లే ఇస్తున్నానని” అన్నాడు. ఆయన ప్రళయ కాలములో నిన్ను సమాధి నుండి లేపుతున్నాను అని అన్నాడు. అది నూటికి నూరుపాళ్ళు నిజము. కానీ ప్రళయ కాలము అంటే నువ్వు ఏదో పొరపాటుగా తప్పు అర్థము చేసుకున్నావు, సమాధి అంటే తప్పు అర్థము చేసుకున్నావు. ఇప్పుడు నేను చెప్పేది తప్పా? నువ్వు చెప్పేది తప్పా? అది ఎట్లా అర్థమవుతుంది. అర్థము కాదు కదా! అర్థము కానపుడు నువ్వు తప్పునే కరెక్ట్ అని అనుకుంటున్నావు. కాదు నువ్వు అనుకొనేది కరెక్టు కాదు.


దేవుడు తన వాక్యము సత్యబద్దముగ ఉంటుంది అని చెప్పినాడు కదా! సత్యబద్దముగా అంటే ఎట్లాంటిది? అని అంటే ఒక ముస్లీమ్ చనిపోయి, ఇంకొక చోట ముస్లీమ్ ఇంట్లోనే పుట్టి, వానికి మళ్ళా జ్ఞాపకము వచ్చి, నేను ఫలానా అపుడు ఫలానా ప్రమాదములో ఇట్లా చనిపోయింటి, ఫలానా దినమున చచ్చిపోయింటి అని మళ్ళ దానిని విడదీసి చెప్పి ముస్లీమ్ ముస్లీమ్లోనే పుట్టినాడు అని నిరూపణకు వచ్చినపుడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కనుక్కున్నపుడు, వీడు పాత ఇంటిలో వాళ్ళందరిని గుర్తించ గల్గినపుడు మరి అది సత్యబద్దమా కాదా? చెప్పినది జరిగినపుడు దేవుని మాట ప్రకారము పునర్జన్మ ఉందని నమ్మాలా? లేదని నమ్మాలా? ఉందని నమ్మాల్సిందే, అది సత్యబద్దము. ఖుర్ఆన్ గ్రంథములో 53వ సూరా 46వ ఆయత్లో "మొదటి జన్మ ఎట్ల కల్గిందో రెండో జన్మ కూడ నీకు అట్లే ఇస్తున్నాను” అన్నాడు. అంటే "వీర్యబిందువుతోనే నీకు జన్మ కల్గుతుందని” చెప్పినాడు. అంటే తల్లిగర్భము నుంచి నువ్వు పుట్టాల్సిందే అని చెప్పినాడు కదా!


----

మళ్ళీ ఇప్పుడు ఒకడు చనిపోయి, ఇంకోచోట పుట్టి, మళ్ళీ జ్ఞాపకము వచ్చి, నేను పుట్టినాను అని చెప్పాడు, ఇట్ల అన్ని నిరూపణకు వచ్చినపుడు, దానిని ఏమనాలి? దేవుడే వానికి జ్ఞాపకము తెప్పించినాడు లేకపోతే నువ్వు నమ్మవు. దేవుడే వానికి జ్ఞాపకము తెప్పించి, వానికి ఇంతకు ముందు ఉన్న తల్లితండ్రులను చూపించి, ఇంతకు ముందు అక్కగార్లను, చెల్లెల్లను చూపించి, ఇంతకుముందు జరిగిన ప్రమాదాన్ని చూపించి ఇట్లే చచ్చిపోయినావు నువ్వు అని చూపించి, అన్నీ కరెక్టే అని నిరూపణకు వచ్చేటట్లు చూపించినాడు. అది అంతయు దేవుడు చేసినాడు. ఇది సత్యమని మీరు నమ్మాలి అంటే దానికి ఆధారము కావాలి. అట్లాంటివి ఇపుడు మనకు ఎన్నో నిరూపణలకు వచ్చాయి. కాబట్టి తప్పనిసరిగా దానిని మనము సత్యబద్దముగా తీసుకోవాలి. సత్యబద్దముగనున్న వాటిని తీసుకొన్నప్పుడు జ్ఞానము అర్థమౌతుంది. గ్రంథములోనైనా, ఏ మతములోనైనా సత్యముగా ఉండే విషయాన్ని తీసుకోగల్గితే, అపుడు నీకు జ్ఞాన సారాంశము ఏదో ఖచ్చితముగా తెలుస్తుంది. లేకపోతే అది అశాస్త్రీయత అయిపోతుంది, శాస్త్రబద్ధము కాదది. అందుకే ఏ శాస్త్ర ప్రమాణము లేకుండా ఎవరూ మాట్లాడకూడదు అని, ఖుర్ఆన్లో 40వ సూరా 35వ ఆయత్లో చెప్పబడిందన్నమాట. ఈ రకముగా మనము శాస్త్ర ప్రమాణముతో చెప్పాలి. గ్రంథ ఆధారముతోనే చెప్పాలి, గ్రంథ ఆధారము లేకుండా ఎవరూ మాట్లాడ కూడదు. మాట్లాడితే దేవుని మాటను అతిక్రమించినట్లవుతుంది. అందువలన మనము ఇప్పటి నుంచి ఏ మతములో ఉండేవాళ్ళు ఆ మతము గ్రంథాలను తీసుకోవాలి. అంటే ముస్లీమ్లు ఖుర్ఆన్ను తీసుకోండి, క్రైస్తవులు బైబిలును తీసుకోండి, హిందువులు భగవద్గీతను తీసుకోండి. దానిలో చెప్పిన వాక్యము ప్రకారము మీరు చూసుకోండి. దానిలో సత్యమేదో మీరు చూసుకోండి. ఎక్కడయితే చెప్పినది ప్రాక్టికల్గా జరుగుతావుందో



----

అదే నిజమైన జ్ఞానము అని తెలుసుకోండి. భగవద్గీతలో కూడా "నాది నిరూపణ జ్ఞానము” అని చెప్పినాడు. నిరూపణకు ఎక్కడైతే వస్తుందో, ఎక్కడైతే నిరూపించబడుతుందో అదే నేను చెప్పిన జ్ఞానము అని అన్నాడు. కాబట్టి దైవ గ్రంథములలో నిరూపించబడినదే జ్ఞానము. అందువల్ల నువ్వు అపోహలకు పోవద్దు. ఎవరో కల్పించి చెప్పినేది వినవద్దు. నువ్వు స్వంతంగా, అనుభవించి తెలుసుకో. ఈ రోజు మనము ఏ గ్రంథములోనైనా ప్రతి వాక్యాన్ని సత్యాన్ని గ్రహించే జ్ఞానమని ఈ రోజు నుండి మనము ఒక రూఢీకి వచ్చేస్తాము. దాని ప్రకారమే తెలుసుకొనే దానికి ప్రయత్నము చేస్తామని దృఢముగా నిశ్చయము చేసుకొని జ్ఞానాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.

తేది: 12.01.2017

ఈ సమావేశములో ఉన్నటువంటి ప్రజలందరికి ఇప్పుడు వినబోయే జ్ఞానము సక్రమముగా వారి తలలో అంటుకోవాలని ఆత్మను కోరుచూ మనము ప్రారంభము చేసుకుందాము. ఇప్పుడు చెప్పబోయే విషయము ఇంతకుముందు మీకు తెలిసే ఉంటుంది. అయినా “భౌతికము - అభౌతికము" అనేటటువంటి పేరుతో చెప్పుచున్నాము. భౌతికము అంటే కనిపించే శరీరము. అభౌతికము అంటే కనిపించనటువంటిది అని అర్థము. మనము ప్రతి నెలలోను క్రొత్త విషయాలే చర్చించుకోవాలనే ఉద్దేశ్యము మనకు ఉంది. మనము ఇన్ని సంవత్సరాలుగా చెప్పుకుంటున్నాము. ఇన్ని సంవత్సరాలు అయినాగానీ క్రొత్త విషయాలు ఎక్కడి నుంచి వస్తాయి అనే


----

అనుమానము మనకు రావచ్చు. అయినా జ్ఞానము సముద్రములాంటిది. ఎంత తోడుకున్నా వస్తూనే ఉంటుంది. ఇది గనిలాంటిది. గనిలో ఖనిజాలు ఎంత తోడినా వస్తుంటాయి.


ఆ రకంగానే జ్ఞానము కూడా వస్తుంటుంది. మనము తోడకపోతే అవి రావుకాని తోడుకుంటే తప్పనిసరిగ వస్తాయి. అందువలన ఇప్పుడు మనము సరికొత్త జ్ఞానము తెలుసుకుందామను ఉద్దేశ్యముతోనే ప్రారంభిస్తున్నాము. మీరూ ఆ ఉద్దేశ్యముతోనే జాగ్రత్తగా వినవలెనని మరొకసారి చెప్పుచున్నాము. ఇప్పుడు చెప్పబోయే విషయము “భౌతికము- అభౌతికము”. దీనినే ఖుర్ఆన్ గ్రంథములో అరబ్బీ భాషలో ఏమి చెప్పారంటే “ముహ్కమాత్-ముతషాబిహాత్" అని చెప్పారు. అంటే “స్థూలము-సూక్ష్మము” అని చెప్పినమాట ‘స్థూలము' అంటే 'భౌతికము' అని అర్థము. 'సూక్ష్మము’ అంటే 'అభౌతికము’ అని అర్థము. ఇది మామూలుగా మనకు దేవుడిచ్చినటు వంటి మూడు దైవ గ్రంథాలలోనూ ఈ స్థూల సూక్ష్మ జ్ఞాన విషయాలు ఉన్నాయి. స్థూల స్థూల విషయము కనిపిస్తుంది గానీ, సూక్ష్మ విషయము కనిపించదు. దైవగ్రంథములలో కనిపించనటువంటిది ఎక్కువగా ఉంటుంది. కనిపించే విషయము తక్కువ ఉంటుంది. మొట్టమొదట కనిపించేది చెప్పితే దాని నుండి కనిపించనటువంటి దానిని మనము తీసుకొని చూడవచ్చును.


ఒక ఇల్లు ఉందనుకొండి, ఆ ఇంటికి భూమిలో పునాది ఉంటుంది, తర్వాత పైన గోడలు ఉంటాయి, పునాది అనేది కనిపించని సూక్ష్మముగా ఉండే విషయము, మొత్తము ఇల్లు అంతా అంటే స్థూలముగా ఉండే విషయము. ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది కాని పునాది కనిపించదు. కనిపించే విషయాలే స్థూలముగ, కనిపించని విషయాలే సూక్ష్మముగ ఉన్నాయి. పైన


----

ఉండేటటువంటి గోడలకు ముందు పునాది అవసరమున్నట్లు, స్థూలానికి ముందు కనిపించని సూక్ష్మాన్ని చెప్పుకుంటే మీకు అర్థము అవుతుందనే ఉద్దేశ్యముతో వాళ్ళు ఆ రకముగా చెప్పడము జరిగింది. కానీ ఇపుడు మనము ఉదాహరణగ ఒక విషయాన్ని తెలుసుకుందాము. ఒక మనిషిని నిలబెట్టి చూస్తాము, వాడు హిందువుకానీ, ముస్లీముకానీ, క్రైస్తవుడుకానీ ఎవరైనాకానీ మనిషిని నిలబెట్టినపుడు మనకు కనిపించేది స్థూలము. దానినే ముహ్కమాత్ లేదా భౌతికము అంటాము. ఇది ఇంటికి పునాదివంటిది. సూక్ష్మము ఉంది కదా! అది కనిపించనటువంటిది అంటే అది మొత్తము బిల్డింగ్కు ఆధారము.


ఇప్పుడు భౌతికమనే ఒక శరీరమును మనము తీసుకొని చూస్తే దానికి పునాదిలాంటిది సూక్ష్మశరీరము కూడా నా ఉన్నది. పునాది నాలుగు అడుగులో, ఐదు అడుగులో లేక ఆరు అడుగుల లోతు ఉంటుంది. భూమిలో కనిపించని పునాది ఉంటే, కనిపించే ఇల్లు పైకి పది అడుగులు ఉంటుంది. మూడు గ్రంథాల్లో చెప్పినట్లు స్థూలశరీరము ఉన్నది. లోపలికి పోతే సూక్ష్మము ఉంది. పైకి కనిపించేది స్థూలము, పైకి కనిపించేటటువంటి శరీరము పది భాగాలు స్థూలముగా ఉన్నది. ముక్కు, నోరు, కండ్లు మొదలగు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలను మనము కలుపుకొని చూస్తే అవి మొత్తము పది భాగాలు మాత్రమే మనకు స్థూలముగ ఉన్నాయి. ఈ పది భాగాలకంటే లోపల సూక్ష్మము ఎక్కువ ఉన్నది. సూక్ష్మ శరీరము పదిహేను భాగాలుగా ఉన్నదని మనము చెప్పుకునేదానికి అవకాశము ఉంది. ఇపుడు పదిహేను భాగాలు సూక్ష్మము, పది భాగాలు స్థూలము అని ఒక మనిషిలో చూసుకున్నాము. సూక్ష్మముగ ఉండేటివే ఎక్కువగ ఉన్నాయి, స్థూలముగ ఉండేటివి తక్కువ ఉన్నాయి. స్థూలముగ ఉండే


----

ముక్కు ముఖము ఇవన్ని కనిపిస్తున్నాయి. కాళ్ళు, చేతులు కనిపిస్తున్నాయి. ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు ఏ మనిషికైనా ఉన్నాయి, మనిషి హిందువుల్లో పుట్టనీ, ముస్లీములలో పుట్టనీ, క్రైస్తవుల్లో పుట్టనీ కనిపించేటటువంటి శరీరము మాత్రము ఒకటే ఉంటుంది.


ఒక ముస్లీమ్్క ఒక ముక్కు ఉంటే మిగతా మతస్థులందరికి అలాంటి ముక్కులే ఉంటాయి, రవ్వంత హెచ్చు తగ్గులుగ. ముక్కు అనేది తప్పనిసరిగా ఉంటుంది. కళ్ళు మనిషికి అవసరము, అందరికి అవే ఉన్నాయన్నమాట. దేవుడు శరీరాన్ని ఒకటే రకముగా పుట్టించినాడు. పుట్టించిన తరువాత మనకు బుద్ధి వచ్చిన తరువాత, ప్రపంచ జ్ఞానము కలిగిన తరువాత, మనము ఎవరి ఇంట్లో పుట్టింటే ఆ మతము నాదే అనుకున్నాము గాని, మతము, కులము మొట్టమొదట అంటుకొని రాలేదు. మనిషి ముస్లీముల ఇంట్లో పుట్టింటే నేను ముస్లీమును అని అనుకుంటున్నాడు. హిందువుల ఇంట్లో పుట్టింటే హిందువును అనుకుంటున్నాడు. క్రైస్తవుల ఇంట్లో పుడితే క్రైస్తవున్ని అని అనుకుంటున్నాడు. కానీ అది పుట్టుకతో కర్చుకొని ఎక్కడా రాలేదు. పుట్టుకతో దేవుడు ఎవ్వరినీ ఒక మతస్థుడుగా పుట్టించలేదు, ఒక మనిషిగ పుట్టించినాడు. మనిషిని మనము చూసుకుంటే కనిపించేటటువంటివి పది భాగాలు గల శరీరము మాత్రమే. దానిని భౌతికము అంటాము కానీ అభౌతికము అనేది కనిపించదు. దానినే మనము ఇస్లామ్లో ముతషాబిహాత్ అంటామన్నమాట. అంటే కనిపించనటువంటిది అని అర్థము. ఇప్పుడు నీకు బుద్ధి ఉంది, కనిపిస్తుందా? కనిపించదు. మనస్సు ఉంది, కనిపిస్తుందా? కనిపించదు. అసలు నీవు ఉన్నావు, శరీరములో నీవు కనిపిస్తున్నావా? నీవు ఎక్కడా కనిపించవు. నీ ముఖము కనిపిస్తుంది, నీ తల కనిపిస్తుంది, నీ కాళ్ళు చేతులు మొత్తము కనిపిస్తున్నాయి, నీ శరీరము మొత్తము


---

కనిపిస్తుంది కానీ నీవు ఎవరో నీకు నువ్వు చూసుకోలేదు. నీవు ఏ అద్దములో చూసుకున్నా నువ్వు కనపరావు నీకు నీ శరీరము కనిపిస్తుంది. కానీ నీవు ఎవరవో నీకు తెలియదు, నీవు ఏ ఆకారములో ఉన్నావో తెలియదు.


పైన స్థూల శరీరము మాత్రము తెలుసు అందరికి. ఆ స్థూలములోనే మనుషులందరు 12 మతాలుగా ఉన్నారు. వాటిలో మూడు మతాలు ముఖ్యమైనవి ఇందూ, ఇస్లామ్, క్రైస్తవ అను ముఖ్యమైన మూడు మతాలుగా మనము ఉన్నాము. ఈ మూడు మతాలే ఎక్కువ ఉన్నాయి భూమి మీద. పెద్దవి, సారాంశమైనవి కూడ ఈ మూడు మతాలే. ఈ మూడు మతాల్లోనే మనము నిమగ్నము అయిపోయినాము. నేను హిందువునని ఒకరు, నేను క్రైస్తవున్ని అని ఒకరు అంటే, నేను ముస్లీమ్ను అని ఒకరు అంటున్నారు. కానీ ఇక్కడ నేను చేసిన పరిశోధనలో నేను ఏమి కనుగొన్నానంటే, మధ్యలో మనము పెట్టుకున్నటువంటివే ఇవన్ని. దేవుడు ఒక్కడే, జీవుడూ ఒక్కడే. జీవుడు అనేవాడు దేవున్ని తెలుసుకోవాలి. ప్రపంచానికంతా ఒకడే దేవుడున్నాడు. ఒక్కొక్కమతానికి ఒక్కొక్క దేవుడు లేడు. జీవుడు అనేవాడు ఒకే దేవున్ని ఆరాధించాలి అనేది సూత్రమన్నమాట. దేవుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఆరాధించాలి. కాని మతము, మత సాంప్రదాయాలు అనేటివి ఈ మధ్యకాలములో అందరిలో ఉండి ఒక్కొక్క మతమునకు ఒక్కొక్క దేవుడు అని నా దేవుడు వేరు, నీ దేవుడు వేరు అని అంటున్నారు. వాళ్ళను ప్రక్క ప్రక్క దారులకు పంపించి ఒక్కొక్కనికి ఒక్కొక్క ఆరాధన, దేవుని పేర్లు, ఇట్లా మనము పెట్టుకున్న దానివల్ల ప్రక్కదారి పట్టిపోయినాడు. అసలైన దేవున్ని కనుగొనలేక పోయినాడు, అసలైన దేవున్ని ఆరాధించలేక పోయినాడు.


---

మనము హిందువుల గ్రంథము ప్రకారము చూస్తే అక్కడ భగవద్గీతలో ఏమి చెప్పినాడంటే ఒకే దేవున్ని మీరు ఆరాధించండి. ఇతర దేవతలను ఆరాధిస్తే మీరు ఆ దేవతల్లోకి పోయి పుడతారు కానీ, నా దగ్గరకు రారు అని అన్నారు. మీరు నా వద్దకు రావాలంటే నన్నే పూజించండి. నన్నే ఆరాధించండి. మీరు వేరే దేవుళ్ళంటే వేరే దేవుళ్ళలోనికే పోతారు. “యాంతి దేవవ్రతాన్ దేవాన్” అని చెప్పాడు. దేవతలను పూజించే వాళ్ళు దేవతల్లోకే పోతారు పోండి, నా దగ్గరకు రారు అని చెప్పాడు. మళ్ళీ మనము ఎవరిని పూజిస్తున్నాము? రకరకాల దేవతలను వారానికొకటో, నెలకొకటో పండుగ వస్తే ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క దేవున్ని సెలెక్ట్ చేసుకొని ఆ పండుగ రోజు ఆ దేవున్నే సీజన్ ప్రకారము మ్రొక్కుతున్నారన్నమాట. అర్థమయిందా! ఇపుడు సంక్రాంతి పండుగ సమయము, మళ్ళీ ఏ దేవున్ని మొక్కుతారో నాకు తెలియదు, కొందరు సూర్యున్ని అన్నారు. సూర్యుడు కూడ దేవుడని మాకు తెలియదు. నేనొక గ్రహము అనుకున్నా. సరేలే, మేము చదువుకున్న చదువు అట్లాంటిది, మీరు చదువుకున్న చదువు అట్లాంటిది. అందువల్ల ఆ చదువుకు ఈ చదువుకు చాలా తేడా ఉంది. మా లెక్కలో అసలు భగవద్గీత ప్రకారము సూర్యుడు దేవుని జ్ఞానాన్ని విని ఆయన దేవుని జ్ఞానము మనిషి అయిన మనువుకు చెప్పాడు. మొట్టమొదట సృష్టి ఆదిలో దేవుడు ఆకాశవాణి ద్వారా జ్ఞానము చెప్పితే ఆ జ్ఞానాన్ని సూర్యుడు విన్నాడు. సూర్యుడు కృతయుగములోనే భూమి మీద మనువు అనే అతనికి చెప్పాడు.


సృష్ఠి ఆదిలోని జ్ఞానము సూర్యునికి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఆయన ఇతరులకు చెప్పితే తెలిసింది. భూమి మీద మనుషులకు చెప్పే అవకాశము సూర్యునికి మాత్రమే ఉంది. ఆ సూర్యుడే 1400 సంవత్సరాల


----

పూర్వము, కలియుగములో పేరు మార్చుకొని కూడ దేవుని జ్ఞానము చెప్పాడు. అయినా ఆయన సూర్యుడు అని మనకు తెలియదు. సృష్టి ఆదిలో చెప్పిన జ్ఞానాన్నే ఆ రోజు మనువుకు చెప్పాడు, తరువాత ఇప్పుడు కలియుగములో ఒక వ్యక్తికి కూడా చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరు అన్నది మా వరకు తెలుసు. బయటకు చెప్తే ఆయనకు ఈయనకు ఏమి సంబంధము? అని అంటారు. అదంతా ఎందుకు? జ్ఞానము చెప్పినాడు, అంతే మనకు కావాలి, ఆ వ్యక్తుల పేరుతో పనిలేదు. ఇపుడు మనకు జ్ఞానము ఎలా వచ్చింది? అంటే సూర్యుని ద్వారా భూమి మీదకు ప్రాకింది. సూర్యుడు మనకు

తెలియజేశాడు. ఆ జ్ఞానము మనకు తెలిపిన జ్ఞానమే ఈ రోజు భగవద్గీతలో ఉంది. అదే జ్ఞానమే ఈ రోజు ఖుర్ఆన్లో వ్రాయబడి ఉంది. చెప్పినవాడు ఒక్కడే కాబట్టి రెండూ ఒక్కటే! ఎక్కడా పొరపాటుపడకూడదు. అది మాకు తెలుసు. మొదట సూర్యుడు మనువుకు జ్ఞానము చెప్పితే, మనువు ఒకరికొకరు చెప్పాడు. ఇలా దేశమంతా ప్రాకిపోయి అందరికి తెలిసిపోయింది. అయితే తర్వాత ద్వాపరయుగము చివర్లోకి వచ్చే సమయానికి తెలియకుండా పోయింది. మళ్ళీ అదే జ్ఞానాన్ని నీకు చెప్తున్నా చూడు అని కృష్ణుడు చెప్పాడు. "సూర్యుడు మనువుకు చెప్పిన జ్ఞానాన్ని తిరిగి నీకు చెప్తున్నా చూడు అని చెప్పాడన్నమాట. కృష్ణుడు తాను 90 సంవత్సరాల వయస్సులో జ్ఞానము చెప్పాడు. 


చూచేదానికి ఇతనిలో గొప్పతనము ఏమి లేదు అనేటట్లుగా ప్రవర్తించినాడు. మోసము చేసినాడు, అబద్దాలు చెప్పినాడు తరువాత ఆయన చేయని పనంటూ లేదు. మంచీ చేశాడు, చెడూ చేశాడు. కాబట్టి మంచోడు అనేదానికి, చెడ్డాడు అనేదానికి వీలులేదు. ఆయన ఎవరు అని చెప్పేదానికి వీల్లేదన్నమాట. కానీ భగవద్గీత జ్ఞానము చెప్పిపోయినాడు.


---

చెప్పినేది కూడ 10 నిమిషాల లోపలే చెప్పేసినాడంతా. ఆ 5, 6 నిమిషాల్లో చెప్పిన జ్ఞానమంతా ప్రజలకు ఎక్కాలి అంటే దానిని విన్నటువంటి వ్యక్తి చేత (అర్జునుని చేత) వ్యాసుడుకి చెప్పిస్తే, వ్యాసుడు గ్రంథరూపములో వ్రాశాడు. దానినే మనము భగవద్గీత అంటున్నాము. ఏదో ఒక రకముగా భగవద్గీత గ్రంథముగా తయారయింది. అంటే కృష్ణుడు చెప్పిన జ్ఞానము శ్లోకాల రూపములో వ్రాయబడినది. ఆ శ్లోకాల రూపములో ఉండేటటువంటి అర్థము మనకు ఈ రోజు చాలామందికి తెలియకుండ పోయింది. "కర్మణ్యే వాధికారస్తే” అనే శ్లోకము ఉంది. ఆ శ్లోకము చాలా ముఖ్యమైనది అని అంటారు. అది కర్మయోగానికే ముఖ్యమైనది. ఆ శ్లోకానికి మనము వివరము చెప్పుకుంటే, ఎంతమటుకు మనకు తెలుసు అని మనము లెక్కేసుకుంటే, ఆ శ్లోకముల యొక్క వివరము ప్రపం దానికంతా ఒక రకముగా తెలిసింది, మనకు మాత్రము ఒక రకముగ తెలిసింది. అంటే ఇపుడు మనము వ్రాసుకున్న విధానము వేరు, ప్రపంచానికి అర్థమైన విధానము వేరు. ప్రపంచమంతా మనము పనులు చేస్తే మనకు ఫలితము ఉంటుంది అని అనుకున్నారు. అంటే పనులు చేస్తే మనకు డబ్బులో లేక ఏదో ఒక ఫలితము వస్తుంది అనుకున్నారు


మేము ఏమి చెప్తున్నామంటే అట్లకాదు ఇంకొక రకముగా దాని అర్థము ఉంది అని చెప్పాము. ఆ అర్థము ఇంతవరకు ఎవ్వరూ వ్రాసుకోలేదు. ఇపుడు "త్రైత సిద్ధాంత భగవద్గీత” లోనే మనము వ్రాయడము జరిగింది. సరే, అది అట్ల ఉండనిస్తాము. ఇపుడు భగవద్గీత టోటల్ మీద ఏమి చెప్పినారంటే ఆరాధ్య దేవుడు ఒక్కడే ఉన్నాడు. అతన్ని ఒక్కన్నే ఆరాధించండి, అతనొక్కన్ని ఆరాధిస్తే నీవు మోక్షాన్ని పొందగలుగుతావు. జన్మలు లేకుండపోతాయి అని స్వయముగ దేవుడే చెప్పాడు. కృష్ణుడు అనే పేరు


---

మనకు పైకి ఉన్నాగాని లోపల స్వయముగా దేవుడే చెప్పాడు. అప్పుడు ఏమి చెప్పినాడో మనకు తెలియదు. అర్జునుడు వ్యాసునికి చెప్పింటే అతను గ్రహించుకొని దానిని గ్రంథముగా వ్రాసింటే మనకు తెలిసింది. ఈ ప్రపంచానికి అంతా ఆదికర్తను నేనే, ఈ ప్రపంచానికి అంతా అధిపతిని నేనే, దేవున్ని నేనే అయినా నర శరీరాన్ని ధరించి నేను వస్తే నా యొక్క గొప్పతనాన్ని, నా యొక్క మహత్యాన్ని తెలుసుకోలేక ఈ మూఢులు అయినటు వంటి మనుషులు నన్ను అవమానిస్తున్నారని కృష్ణుడు చెప్పినాడు. “అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్” అన్నాడు. తనువును ఆశ్రయించినటువంటి నన్ను చూసి మూఢులు నన్ను అవమానిస్తున్నారు. “మమ భూత మహేశ్వరమ్” అంటే నేను సర్వభూతాలకు ఈశ్వరున్నని తెలియదు వాళ్ళకు అని చెప్పాడు. అక్కడ ఒకచోట ప్రకటించుకొన్నట్టు మన భగవద్గీతలో ఉంది.


మీరు దేవున్ని ఒక్కన్నే ఆరాధించండి అని చెప్పాడు. ఆ చెప్పిన వాడు ఎవడు? సర్వజీవరాసులకు పెద్ద ఎవరైతే ఉన్నారో, సర్వ జీవులను

సృష్ఠించినవాడు ఎవడైతే ఉన్నాడో, వాడు ఒక శరీరాన్ని ధరించి వచ్చి, దేవున్ని ఒక్కన్నే మీరు ఆరాధించండి అని చెప్పాడు. ఆత్మయిన దేవుడు మనిషి రూపములో వచ్చి జ్ఞానము చెప్పితే మనకు తెలిసింది లేకపోతే తెలిసేది కాదు. దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఇతరులకు ఎవ్వరికీ తెలియదు అని ఖుర్ఆన్ గ్రంథములో 'అలి ఇమ్రాన్' అనే 3వ సూరా 7వ ఆయత్లో చెప్పబడి ఉంది. ఏమని ఉంది? “దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మానవునికీ తెలియదు”. ఏ మానవునికి తెలియనపుడు ప్రపంచములో జ్ఞానమును ఎవరన్నా చెప్పేదానికి అవకాశము లేనే లేదు. దేవుని జ్ఞానము బయటికి తెలియబడాలంటే దేవుడే చెప్పాలి. ఈ విషయమై నేను ప్రత్యక్షముగ


----

ఎవరితోను మాట్లాడను అని 42వ సూరా 51వ ఆయత్తో ఖుర్ఆన్ గ్రంథములో చెప్పాడు. "దేవుడు ప్రత్యక్షముగ ఎవరితోను మాట్లాడడు.” కానీ మూడు విధాలుగ జ్ఞానము తెలియజేస్తాడు. ఒకటి ఆకాశవాణి ద్వారా అంటే వహీ ద్వారా, రెండు తెరచాటు నుంచి, మూడు తన ప్రతినిధిని పంపించి తెలియజేస్తానన్నాడు. సరే, ఈ మూడు రకాలుగ ఏదో ఒక విధానముతో మనకు జ్ఞానము తెలియజేస్తాడు. ఇపుడు 'తన ప్రతినిధిని పంపించి' అన్నపుడు, కృష్ణున్ని 'ఆయన ప్రతినిధి' అని మనము అనుకోవచ్చు కదా! అంటే దేవుడు మనిషిగ పుట్టడు అని కొంతమంది క్రైస్తవులుగానీ, ముస్లీమ్లుగానీ అంటారు. అంటే హిందువులు తము దేవుడు పుడతాడని చెప్తారు.


హిందువులు దేవుడు పుడతాడు అంటారు. రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు, ఆంజనేయుడు పుట్టాడు అని అంటారు. హిందువులకు దేవతల గురించి తెలుసుకానీ, దేవుడంటే ఎవరో వారికి తెలియదు. ఇపుడు వీళ్ళు చెప్పేది నమ్మకము లేని పద్ధతి, శాస్త్ర పద్ధతి కాదు. అయితే నమ్మకము ఉండే శాస్త్రపద్ధతి ఒకటి గలదు. ఖుర్ఆన్లోను, బైబిలులోను, భగవద్గీతలోను చెప్పింది నమ్మకమైన పద్ధతి. అక్కడ ఏమి చెప్పారంటే దేవుడు పుడతాడనే చెప్పినాడు, కాని పుట్టడు అని చెప్పలేదు. కానీ అందరికీ 'పుట్టడు' అని అర్థమయిందన్నమాట. ఖుర్ఆన్ అనేది చాలా అద్భుతమైన గ్రంథము. కానీ అది అర్థము చేసుకోవాలంటే చాలా కష్టము అని చెప్పాము. మేము ఖుర్ఆన్ మొదటి భాగము గ్రంథము వ్రాశాము. ఇపుడు రెండవ భాగము

వ్రాస్తున్నాము. “అంతిమ దైవ గ్రంథములో జ్ఞాన వాక్యములు” అని మొదటి భాగాన్ని వ్రాశాము. “అంతిమ దైవ గ్రంథములో వజ్ర వాక్యములు” అను రెండవ గ్రంథము కూడా వ్రాస్తున్నాము. ఖుర్ఆన్ గొప్ప జ్ఞానము అని


----

చాలామంది హిందువులు తెలుసుకున్నారు. ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత హిందువులకు ఎట్ల తెలిసిందంటే, మేము వ్రాసిన ఖుర్ఆన్ జ్ఞానవాక్యములు అనే గ్రంథము ద్వారా తెలిసింది. మేము వ్రాసిన గ్రంథాలను ముస్లీమ్లు ఎవరూ చూడలేదులే, ఎందుకంటే మేము అరబ్బీ భాషలోనే చదవాలి, తెలుగు భాషలో చదవకూడదు అని అంటారు.



భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ ఇక్కడ అన్ని సమానముగా గౌరవించబడతాయని ముందునుండి చెప్తున్నాను. నేను ఎట్లైతే “త్రైతసిద్ధాంత భగవద్గీత” ను వ్రాశానో ఆ రకముగా ఖుర్ఆన్ గ్రంథమును వ్రాయాలంటే రెండు భాగాలుగా వ్రాయాల్సిన పని వచ్చింది. రెండు భాగాలుగ అంటే ఒకటి జ్ఞాన వాక్యాలుగా వ్రాశాము 700 పేజీల గ్రంథమది. తర్వాత ఇపుడు 1000 పేజీల గ్రంథము అవుతుందేమో చెప్పలేముగాని ఇపుడు 280 పేజీలు పూర్తి అయింది. "అంతిమ దైవ గ్రంథములో వజ్ర వాక్యములు” అని వ్రాశాము. అంటే వజ్రాలు ఎట్ల ఉంటాయో అటువంటి వాక్యాలు తీసి వ్రాస్తున్నాము. కానీ నిన్న రాత్రి, నేను వ్రాసినపుడు ఒక ఆయత్లో ఉండే విధానాన్ని చూసి నేను ఒక మాట వ్రాశానన్నమాట. "ఖుర్ఆన్ గ్రంథములో మనిషి జీవితమునకు దగ్గరగ ఉన్న జ్ఞానము ముందు వచ్చిన రెండు గ్రంథములకంటే ప్రత్యేకముగ ఉన్నట్లు కలదు. ఖుర్ఆన్ గ్రంథములో ఉండేటటువంటి జ్ఞానము ముందువచ్చినటువంటి భగవద్గీత, బైబిలుకంటే గొప్పగ ఉంది, ప్రత్యేకముగా ఉంది. అయితే అది ఎందరికి అర్థమవుతుంది అని చూస్తే ముస్లీమ్లకంటే ఇతర మతముల వారికే బాగా అర్థము కాగలదని చెప్పవచ్చును. ముస్లీములకంటే మిగతావాళ్ళే బాగా అర్థము చేసుకోవచ్చు. అలాంటి విశిష్ఠత ఖుర్ఆన్ గ్రంథములో ఉందని చెప్పక తప్పదు” అని వ్రాశాను.


----

ఈ ఖుర్ఆన్ గ్రంథము మిగతా రెండు మతస్థులకు దేవుడిచ్చిన వరములాంటిది. చదువుకుంటే మీకు వరమే. చదువుకోకపోతే ఏమి చెప్పలేము. అయితే మా గ్రంథము అని చెప్పుకొను ముస్లీమ్లు దీనిని అర్థము చేసుకోవడములో అందరికంటే వెనక ఉన్నారని చెప్పవచ్చును. ఎందుకంటే వాళ్ళకు మత సాంప్రదాయము అడ్డమొచ్చింది. చాలామంది ఖుర్ఆన్ను చదివితే అరబ్బీ భాషలోనే చదవాలని నియమము ఉంది. ఆ అరబ్బీ భాష చాలామందికి రాదు. ఇక్కడ భారతదేశములో ఉన్న వాళ్ళందరిలో చాలామందికి రాదు. కొంతమంది ముస్లీమ్లు.

అరబ్బీ భాష నేర్చుకొని చదివినాగాని దాని వివరము (అర్థము) వారికి తెలియడము లేదు. దాంట్లో ఉండే సారాంశము ఏదో పూర్తి వాళ్ళకు అర్థము కాలేదు. ఈ రోజు అరబ్బీ ఖుర్ఆన్ను తెలుగులో వ్రాసినారు, అది తెలుగులో దొరుకుతుంది. అది చదివినాము కాబట్టి మనకు బాగా అర్థమయింది. అయితే ముస్లీములు తెలుగులో చదువుకోవచ్చు గదా! అంటే తెలుగులో చదవకూడదు అనే సాంప్రదాయము వాళ్ళకు అడ్డము ఉంది. వాళ్ళు అర్ధము చేసుకోవడానికి అవకాశము లేదు. దేవుడు మిగతా మతాలకు అర్థము చేసుకుండేదానికి తెలుగులో ఇచ్చినాడు కాబట్టి బాగా అర్థము చేసుకునే దానికి అవకాశము ఉంది. చాలా చాలా గొప్ప వాక్యాలు కూడా ఉన్నాయని మేము చెప్పడము జరిగింది. ఒక ఖుర్ఆన్ గ్రంథాన్నే కాదు, బైబిలు గ్రంథము, భగవద్గీత ఇవన్ని చూసుకుంటే దేవుని విషయము సంపూర్ణముగా తెలుస్తుంది. ఇపుడు మనము “భౌతికము-అభౌతికము” అనే సబ్జెక్టు తీసుకొని చెప్పుచున్నాము. దాంట్లోకే మనము పోదాము.


భౌతికము అంటే కనిపించేది. అభౌతికము అంటే కనిపించనిది అని చెప్పినాము. నిన్ను నువ్వు చూసుకో. నీ శరీరము కనిపిస్తావుంది అది


---

భౌతికము. భౌతికము అందరికి తెలుస్తావుంది. అద్దము తీసుకొని చూసినాగాని నీ శరీరము నీకే కనిపిస్తుంది. కన్ను కనిపిస్తుంది, ముక్కు కనిపిస్తుంది అన్ని కనిపిస్తాయి. అయితే నీవు ఏ అద్దము పెట్టి చూసినా గానీ నీ లోపల ఉండే బుద్ధి కనపరాదు. నీ లోపల ఉండే మనస్సు కనపరాదు. నీ లోపల ఉండేది ఏదీ కనపరాదు. కన్నును చూస్తాము కాని కన్నుకు చూపు ఎంత ఉందో తెలియదు. చెవి ఉండాది కానీ చెవికి వినికిడి ఎంత ఉందో తెలియదు. ఒక మనిషికి వినికిడి ఎక్కువ ఉంటుంది. ఇంకొక మనిషికి వినికిడి తక్కువ ఉంటుంది. ఈ రకముగా ఈ ఐదు జ్ఞానేంద్రియాలకు ఐదు శక్తులు ఉన్నాయి. తర్వాత నాలుగు అంతఃకరణాలు ఉన్నాయి. తర్వాత మిగతా పదిహేను భాగాలు లోపల శరీరములో నీతో కూడా అనగా! జీవునితో సహా ఉన్నాయి. లెక్కేసుకుంటే. నీవు కాక 24, నీతో లెక్కేస్తే 25 భాగాలు కలవు. "ధర్మచక్రము” అని పేరు పెట్టుకొని ఈ రోజు ఒక గ్రంథము వ్రాసుకున్నాము. దానిని మీరు చదివి ఉంటారు. దానిలో ఎంత జ్ఞానము ఉందో మీకు తెలిసిపోయినది. ఆ గ్రంథము చదువుతుంటే ఈ రోజు నాకు చెప్పుచున్నారన్న మాట.


బెంగుళూరు జైల్లో ఈ గ్రంథము చదువుతూ కళ్ళకు నీళ్ళు పెట్టుకుంటా చదివినోళ్ళు ఉన్నారు అని చెప్పుచున్నారు. మళ్ళీ అంటే దాంట్లో మహత్యము ఉంది చూస్తే. అంత అద్భుతముగా ఉంది. ముస్లీమ్ల కళ్ళకు నీళ్ళు వస్తున్నాయంట వాళ్ళు చదువుతుంటే. క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు చదువుతుంటే కూడ కళ్ళకు నీళ్ళు వస్తున్నాయంట. అంటే ఈ రకముగా వాళ్ళు కళ్ళకు నీళ్ళు కార్చుకుంటూ చదువుతున్నారంటే దాంట్లో ఉండే గొప్పతనము అర్థమయింది. “దేవుని ముద్ర” గ్రంథము చదివినపుడు అట్లే అయింది. దాని తర్వాత వచ్చిన గ్రంథము 'ధర్మచక్రము'. 'ధర్మచక్రము’


----

చదివినపుడు అట్లే అయింది. ఈ రెండు గ్రంథాలు చాలు ప్రపంచాన్నే మార్చేస్తాయి. ఇవి రెండే రెండు. మేము ఇప్పటికి వ్రాసినేటివి 85 గ్రంథాలు, 85 గ్రంథాల్లో ఈ రెండు గ్రంథాలు చదివితే మనిషి పూర్తి మారిపోతాడు. అంటే 85 గ్రంథాల సారాంశము అందులో వచ్చిందన్నమాట. అంటే మీకు ఒక గ్రంథము తర్వాత ఇంకొక గ్రంథము వస్తూ ఉంటుంది. ప్రతి గ్రంథములో కొంత ప్రత్యేకత ఉంటుంది. ఇంతకంటే గొప్ప గ్రంథము లేదు అని మీరు ఇంతకు ముందు “విశ్వ విద్యాలయము” వ్రాసినపుడు అన్నారు. ఇన్ని గ్రంథాలకంటే ఇది చాలా ప్రత్యేకమైనది అని చెప్పారు. దాని తర్వాత గ్రంథము వచ్చింది దానిని అట్లే చెప్పారు. దాని తర్వాత ఇంకొకటి వచ్చింది దాన్నీ అట్లే చెప్పారు. సరే 'దేవుని ముద్ర' అని మరొకటి వచ్చింది. అదే ఇంతకు ముందు 'దేవుని చిహ్నము' అనే పేరుతో వ్రాశాము. అంటే 'దేవుని చిహ్నము' అనే గ్రంథము వేరు, 'దేవుని ముద్ర' అనే గ్రంథము వేరు


ఆ రెండు గ్రంథాలు చదివిన వాళ్ళకు ఈ దేవుని ముద్ర అంటే ఏమో అర్థమయింది. దేవుని ముద్రను చూసి చాలా సంతోషపడినారు. ఇది చాలా గొప్ప రహస్యమైనటువంటిది అని చెప్పారు. తర్వాత ధర్మచక్రము అనే గ్రంథము ఈ నెలలో మీకు ఇపుడు వచ్చింది, మీ ముందర ఉంది. ఆ ధర్మచక్రమును ఇంతకు ముందు చదివేశారు చాలామంది. చదివిన తర్వాత దేవుని ముద్రకంటే గొప్పగ ఉందని కూడ చెప్పుకున్నారు. మేము ఏమి చెప్పినామంటే గ్రంథములో అక్షరాలు కనిపిస్తాయి కానీ దాంట్లో ఉండే జ్ఞానము కనిపించదు


ఈ జ్ఞానము విన్నవాళ్ళకు మాత్రము కొంత తెలిసి ఉంటే అర్థమయి ఉంటుంది. మిగతా క్రొత్తగా వచ్చినవాళ్ళకు ఇది ఏమీ అర్థము కాదు.


----

మనము స్థూలప్రపంచము, మనము అందరు మనుషులు కనిపిస్తూవున్నా గాని సూక్ష్మప్రపంచము అంటూ ఒకటి పెద్దది ఉంది అని చెప్పాను. దానినే కనపరాని ప్రపంచము ఉంది అని చెప్పాను. ఇంతకు ముందు చాలా సంవత్సరాల నుంచి కూడ చెప్తున్నాము. ఇపుడు మనము ప్రపంచ జనాభా ఇంత లేదా దేశ జనాభా ఇంత అని అనుకుంటున్నాము. సరేలే, 120 కోట్లో 130 కోట్లో మన భారతదేశ జనాభా అనుకుంటున్నావు. అది కనిపించే జనాభా మాత్రమే నీకు. కనిపించని జనాభా దీనికి రెండింతలు ఉంది. అంటే 130 కోట్లు నీకు కనిపించే ఈ జనాభా ఉంటే కనిపించని జనాభా 220 కోట్లో 240 కోట్లో ఉంది. అంతమంది ఉన్నారా? అంటే అంతమంది ఉన్నారు. తర్వాత వీళ్ళను పరిపాలన చేసేవాళ్ళు కొన్ని కోట్లమంది ఉన్నారు. మనుషులకు దేవుని పరిపాలన అంటే అర్థము కాదు. మనమే బువ్వ పండుకొని తింటావున్నాము. మనమే కష్టపడి డబ్బులు సంపాదించు కుంటున్నాము. అంగడికి పోయి కొనుక్కొనొచ్చి తింటూ వున్నాము. మనమే బ్రతుకుతున్నాము అని అనుకుంటున్నారు మీరు. మీ కష్ట సుఖాలను ఏర్పరచేటటువంటి తెలియని పరిపాలన ఒకటి ఉంది. అదే దేవుని పరిపాలన. అది కనిపించదు దేవుని పరిపాలన ఉండే దానికోసము దేవుని పాలకులు ఉన్నారు. వాళ్ళు కొన్ని కోట్లల్లో ఉన్నారు. ఈ విషయమును నేను ఇంతకు ముందు గ్రంథాల్లోనే చెప్పాను.


దేవుని ముద్ర గ్రంథములో వాళ్ళ ఆకారాలు ఇట్ల ఉన్నాయి. చూసుకోండి అని చెప్పాము. ఇదే బైబిల్లో చూసుకోండి వాళ్ళ ఆకారాలు ఇట్లా ఉండాయి అని చెప్పినారు. “దయ్యాల - భూతాల యదార్థ

సంఘటనలు” అనే గ్రంథములో అంటే ఒక 10 సంవత్సరాల క్రితము వ్రాసిన గ్రంథములోనే ఈ ఆకారాల గురించి కొద్దిగా చెప్పాను. కొన్ని వేల


---

చేతులు వాళ్ళకు ఉన్నాయి, కొన్ని వందలు చేతులు వాళ్ళకు ఉన్నాయి, కొన్ని కోట్ల చేతులు వాళ్ళకు ఉన్నాయి అని కూడ చెప్పాము. జంతువులు, మనుషులు, పక్షులు, పాములు ఏవైతే జీవరాసులు ఎన్ని ఉన్నాయో అన్ని ఆకారాలు ఉన్నాయి అని చెప్పాము. ఒక మనిషి ఉన్నాడు అంటే వాని మీద దృష్టి పెట్టినవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కడు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కూడ ఉండవచ్చు అవసరాన్ని బట్టి. వాళ్ళకు ఆజ్ఞలు ఇవ్వబడతాయి అని చెప్పాము. అవన్ని ఇప్పుడు కొత్తగా వచ్చిన గ్రంథములో ఉన్నాయి.


ఆజ్ఞలు ఇద్దరి ద్వారానే వస్తాయి. గ్రహాలకు సూర్యుని ద్వారా, భూతాలకు భూమి ద్వారా వస్తాయి అనే క్రొత్త విషయాన్ని మీకు తెలియజేశాము. సరే ఇదంతా మీరు లోతుగ పోతేగాని అర్థము కాదు. కానీ స్థూలమూ, సూక్ష్మమూ ఉంది అనే విషయము మనకు ఎవ్వరికీ అర్థము కాలేదు. దానిని అర్థము చేసుకోగలిగితే ఎన్నో క్రొత్త విషయములు తెలుస్తాయి. ఈ మధ్య వచ్చే క్రొత్త గ్రంథాల్లో భూతాలు కూడా చేరుతున్నాయి అని చెప్పాము. కనీసము 80 గ్రంథాల తరువాత వచ్చిన మన గ్రంథాల్లో ఇపుడు భూతాలు కూడ చేరివున్నాయి అని చెప్పినాము. గ్రహాలంటే నిన్ను కష్టాల పాలు చేసేంతవరకే వాటి పనితనము. భూతాలు అంటే నిన్ను చంపేంతవరకు కూడ వాళ్ళకు శక్తి ఉంది. దేవునికి తెలియకుండా ఏమీ లేదన్నమాట. ప్రపంచాని కంతటికి ఉండేది ఒకే దేవుడే. ఆ ఒక్క దేవుని ఆజ్ఞతోనే ఇవన్ని చేయబడుతున్నాయి. దేవుని గురించి ఖుర్ఆన్ గ్రంథములో ఒక ఆయత్ వ్రాయబడి ఉంది. ఆయన ఏమీ చేసేవాడు కాదు. ఆయన “అయిపో” అంటే అయిపోతుంది. 'అయిపో' అంటే ఎట్ల అయిపోతుంది? అంటే ఇంతమంది చేసేవాళ్ళు ఉంటే ఎందుకు అయిపోదు! అయిపోతుంది.


---

దేవుని క్రింద పాలన పెద్దగ ఉంది. ఆ పరిపాలన మీకు తెలియదు, అది కనిపించదు.


అందువల్ల నీకు కనిపించని పాలన ఎంతోవుంది అని చెప్తున్నాము. కనపరాని పాలన ఏదో కొంత ఉంది అని ఇపుడు మీకు కొంత అర్థమైవుంటుంది. పూర్తి అర్థము కావాలంటే మనకు పూర్తి జ్ఞానము తెలియాలి. ఇది దేవుని జ్ఞానము దేవునికే తెలుసు కదా మనకెట్ల తెలుస్తుంది? అంటే దేవుడు మూడు అవకాశములు ఇచ్చాడు. మీకు నా ప్రతినిధి ద్వారా తెలియజేస్తాను. తరువాత తెరవెనుక నుంచి తెలియజేస్తాను. ఆ తరువాత వహీ ద్వారా అంటే వాణి ద్వారా తెలియజేస్తాను అని చెప్పాడు. ఇపుడు మనము ఏదో ఒకదాని ద్వారా తెలియాలి. అయితే మనకు ఇపుడు తన ప్రతినిధి ద్వారా తెలియాలి. ఎందుకంటే మనము మనుషులము కాబట్టి, మనుషుల భాష మనకి తెలుస్తుంది కాబట్టి, వేరే మనిషి ఆకారములో వచ్చిన దేవుని ప్రతినిధి చెప్తేనే మనకు అర్థమయ్యేది. దేవుని ప్రతినిధి ఎవరు? అని అంటే అంతిమ దైవగ్రంథములో 5వ సూరా 68వ లో చూడండి. (5-68) “ప్రతి ఒక్కరు మూడు గ్రంథాలను మీ జీవితాలలో నెలకొల్పమని, లేకుంటే నీవు ఏ ధర్మములో లేనట్లేయని” చెప్పియున్నారు.


మూడు గ్రంథాలలో కూడా దేవుడు మనిషిగా వస్తాడని సూచించారు. ఖుర్ఆన్ గ్రంథములో 15వ సూరా 28వ ఆయత్ చదవండి చూస్తాము. “బాగ ఎండిపోయిన నల్లని మట్టితో నేను ఒక మానవున్ని సృష్టించబోతున్నాను. నేను అతన్ని పూర్తిగ తయారు చేసి అతనిలో నా ఆత్మను ఊదినపుడు మీరంతా అతని ముందు సాష్టాంగ పడండి. దూతలందరు సాష్టాంగపడ్డారు, ఒక్క ఇబ్లీసు తప్ప. సాష్టాంగపడే వారితో చేరడానికి వాడు నిరాకరించాడు”. ఇక్కడ ఏమని ఉంది? నేను మట్టితో



----

ఒక బొమ్మను చేసి పంపుతున్నాను. అంటే ఒక ప్రత్యేకమైన మానవున్ని తయారు చేస్తున్నాను అని చెప్పాడు. ఏదో రకముగ మట్టితో తయారు చేయాలి ఒక బొమ్మను చేసి పంపుతాను అని చెప్పాడు. అతనిలోకి నా ఆత్మనే ఊది పంపుతాను అన్నాడు. ఆయన ఆత్మను ఊది పంపినపుడు అది సజీవమై ఆయన వస్తాడు. ఆ బొమ్మ సజీవమై భూమి మీదికి వస్తే అపుడు దేవదూతలైనటువంటి వాళ్ళు, వాళ్ళు మహా జ్ఞానులు. వాళ్ళకు తెలుసు ఇతను దేవుడు పంపించిన ప్రతినిధి అని. కాబట్టి ఆయనకు దేవదూతలు సాష్టాంగ నమస్కారము చేశారు. దేవుడు కూడ వాళ్ళను చెయ్యమని చెప్పాడు. వాళ్ళూ దేవుని ఆజ్ఞ ప్రకారమే సాష్టాంగ నమస్కారము చేశారు కాని ఒక్క ఇబ్లీసు అంటే మాయతో కూడుకున్నటువంటి వాడు

చేయలేదు.


సరే, ముఖ్యమైన సమాచారము ఇందులో ఏముంది? అంటే దేవుడు తన ప్రతినిధిని పంపుతాడు. తన ఆత్మనే ఊది తన ప్రతినిధిని పంపుతాడు. దానికోసము ఒక ప్రత్యేకమైన ఒక మట్టితో ఒక బొమ్మను తయారు చేయబోతున్నాను అని చెప్పాడు. చేసిన తరువాత నా తరపున ఈయనను ఇది ఖుర్ఆన్ గ్రంథములో ఉంది. మనము బాగా చూసుకుంటే. అర్థము అవుతుంది. నేను ఒక మనిషిని పంపబోతున్నాను అని దేవుడు చెప్పాడు. మనము ఏమంటున్నామంటే అలాంటి మనిషే భూమి మీదకు వచ్చి దేవుని జ్ఞానము మనకు చెప్పితే మనకు తెలుస్తుంది. దేవుని జ్ఞానము దేవుని ప్రతినిధికి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఆ ప్రతినిధిగ వచ్చినవాడు దేవుడే. ఎందుకంటే ఆయన ఆత్మే కాబట్టి దేవుడే అవుతాడు. కాబట్టి బయట ఏ మానవుడు చెప్పినట్టు దానిని లెక్కేసుకోకూడదు, దేవుడే చెప్పినట్టు మనము లెక్కేసుకోవాలి. ఈ రకముగా వచ్చినటువంటి కొందరు


---

గతములో మన దగ్గరికి వచ్చిపోయినారు. అయితే అప్పుడు మనము వాళ్ళను కేవలము మానవులుగానే అనుకున్నాము. మనుషులుగానే వాళ్ళను పోల్చుకున్నాము. వచ్చిన దైవ ప్రతినిధులు మనుషుల ముసుగులో వచ్చారు. అతనెవరో అతని నిజ స్వరూపమేమో కనిపించలేదు. అపుడు వచ్చిన వానిని మామూలు మనిషిగానే లెక్కేసుకున్నాము. కృష్ణుడు అట్లే వచ్చాడు. ఆయనను మామూలు మనిషిగనే లెక్కేసుకున్నాము. ఆయన సాధారణ మనిషిలాగే వచ్చాడు. సాధారణ మనిషికంటే హీనముగ కనిపించాడు. ఆయన మంచోడు కాదు, చెద్దోడు కాదు అని ఎవరూ తేల్చి చెప్పలేరు. అట్ల చేశాడు కాబట్టి ఆయన్ను దేవుడని చెప్పేదానికి అవకాశము లేదు.


ఒకవేళ మళ్ళీ పొరపాటుపడి నన్ను కనుక్కోలేకుండ పోతారేమోనని, నేను సాక్ష్యముగ ఉండాలని ఆయన ఎవరికీ తెలియకుండ అర్జునున్ని తీసుకొని పోయి రహస్యముగా “నేనే దేవున్ని” అని చెప్పాడు. నేనే ప్రపంచానికంతా ఆదికర్తను. నేను భూమి మీదికి వచ్చినపుడు నేను ఎవ్వరికీ తెలియబడను. అంటే నన్ను ఎవరూ తెలుసుకోలేరు. తెలుసుకోలేకుండ పోయిన దానివలన నన్ను అవమానము పాలు చేస్తారు అయినా నేను అవమానము పొందుతాను కాని ఎక్కడా బయటపడను. నేను దేవున్ని అని ఎవ్వరికీ తెలియదు. అయిపోయింది కానీ ఆయన వచ్చి మనకు జ్ఞానము చెప్పిపోతాడు. ఆయన వచ్చిన ఉద్దేశ్యము ఏమి? ఆయన జ్ఞానము చెప్పిపోవడమే. అలా చెప్పిన జ్ఞానము దేవుని జ్ఞానము అని మనకు అపుడు తెలుస్తుంది. అలా తెలిసింది భగవద్గీతలో, అట్లే తెలిసింది బైబిల్లో, అట్లే తెలిసింది ఖుర్ఆన్లో. ఇప్పుడు బైబిల్లో ఏసు చెప్పినాడు. భగవద్గీతను కృష్ణుడు చెప్పాడు. మళ్ళీ ఖుర్ఆన్లో ఎవరు చెప్పినారు? అని ప్రశ్న వస్తే ఖుర్ఆన్లో ప్రత్యేకముగ ఒక మనిషి వచ్చి చెప్పినట్లు లేదు కాని, 'జిబ్రయేల్'


----

వచ్చి చెప్పితే ‘మహమ్మద్ ప్రవక్త' గారు విని ఆ జ్ఞానాన్ని ప్రజలకు చెప్పితే అది మనకు ఈ రోజు గ్రంథ రూపములో వచ్చింది, ఖుర్ఆన్ గొప్పతనము ఈ రోజు బయటకు వస్తావుంది. ఇంతవరకు ఎవ్వరికీ తెలియలేదు. ఈ రోజు మనము చెప్పుకుంటున్నాము. ఇపుడు మేము చెప్పితే చాలామందికి తెలిసింది దాని గొప్పతనము. ఖుర్ఆన్ జ్ఞానాన్ని తెలుసుకునేటంత అదృష్టము, దేవుడిచ్చినటువంటి వరము ఇది, అందుకే ఖుర్ఆన్ గ్రంథము మీకు అందజేశాము.


క్రైస్తవుల చేతిలో ఇపుడు ఖుర్ఆన్ గ్రంథము ఉంది. ఇపుడు బయట ప్రపంచము ఎట్లుందంటే ముస్లీమ్లంటే క్రైస్తవులకు ఏవగింపు. క్రైస్తవులంటే ముస్లీమ్లకు ఏవగింపు. హిందువులంటే అందరికి ఏవగింపు. ఇట్లు ఒకరికొకరు ఏమాత్రము పొందిక లేకుండ పోయారు. ఈ రోజు ఉదయము మీటింగ్ జరిగింది. బైబిలు చదివి, బైబిలులో వాక్యాన్ని ముస్లీమ్లు వివరము చెప్తున్నారు. ఆ తరువాత ఖుర్ఆన్ చదివి ఖుర్ఆన్ వాక్యాన్ని వివరించి క్రైస్తవులు చెప్తున్నారు. ఇది ఎక్కడైనా ఉందా ప్రపంచములో? ఎక్కడా లేదు. ఇపుడు మళ్ళ వీళ్ళిద్దరు ఐక్యమైపోయి ఒకటిగా కనిపిస్తున్నారా లేదా? ఇపుడు వీళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు, వాళ్ళ జ్ఞానాన్ని వీళ్ళు అర్థము చేసుకున్నారు. ఇట్లు ఇద్దరూ ఏకమై పోయినారు. ముస్లీమ్లు కొంతమంది మాదంతా ప్రత్యేకమైన జ్ఞానము అని అంటున్నారు. అయితే మనము దానిని కాదని భగవద్గీతలో, బైబిల్లో ఉన్న జ్ఞానమే అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్లో కూడ ఉంది అని చెప్పేదానికి ఒక సాక్ష్యముగా అందరిని కలిపి మూడు గ్రంథాల జ్ఞానాన్ని ఒక్కటే అని తెలియునట్లు చేశాము.


3వ సూరా 48వ ఆయత్ చదవండి. “అతనికి అక్షర జ్ఞానాన్ని, వివేకాన్ని, తౌరాత్ ఇంజీలు గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు అని కూడ


---

దైవదూతలు తెలిపారు” అని కలదు. ఇపుడు ఎవరైతే ముస్లీములు ఉన్నారో వాళ్ళకు కేవలము ఖుర్ఆన్ గ్రంథము ఒకటే తెలుసు. ఆ ఖుర్ఆన్ గ్రంథము తెలిసినటువంటి వాళ్ళకు అని ఉంది. “అల్లాహ్ అతనికి అక్షర జ్ఞానాన్ని, వివేకాన్ని, తౌరాత్, ఇంజీలు గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు”. అక్షరజ్ఞానాన్ని, వివేకాన్ని అంటే బుద్ధిని పెంచి, వానికి తౌరాత్, ఇంజీల్ గ్రంథాల జ్ఞానాన్ని కూడా తెలియజేస్తాడు. నీవు ముస్లీము అయినా అంతిమ దైవగ్రంథములో జ్ఞానము ఒక్కటే కాదు నీకు కావాల్సింది, ఇంజీల్ (బైబిలు) గ్రంథము కూడ అవసరము, అట్లే తౌరాత్ గ్రంథము కూడా అవసరము. అంటే రెండు గ్రంథాలలో ఉండేటటువంటి జ్ఞానము నీకు చెప్తున్నాను అని అన్నాడు అర్థమయిందా! ఇపుడు ఈ రెండు గ్రంథాల్లో ఉన్నటువంటి జ్ఞానము తెలుసుకుంటే అనగా భగవద్గీత (తౌరాత్) లోది, బైబిలు (ఇంజీలు) లోది తెలుసుకుంటే అంతిమ దైవగ్రంథము సులభముగ అర్థమయిపోతుంది.


5వ సూరా 48వ ఆయత్ చూడండి. “ఓ ప్రవక్తా! మేము నీ వైపుకి ఈ (ఖుర్ఆన్) గ్రంథాన్ని సత్యసమేతముగ అవతరింపచేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది. వాటిని పరిరక్షిస్తుంది.” నీకిపుడు సత్యసమేతముగ నీ దగ్గరకు ఖుర్ఆన్ గ్రంథము వచ్చింది. ఇది ఒకటే కాకుండ అంతకుముందు వచ్చినటువంటి తౌరాత్, ఇంజీల్ గ్రంథాలను కూడ పరిరక్షిస్తుంది. వాటిలో ఉండేటటువంటి జ్ఞానము సత్యమని ఖుర్ఆన్ గ్రంథము నీకు నేర్పుతుంది. ఈ మూడు గ్రంథాల విషయాలను నీవు తెలుసుకున్నపుడే నీవు ఒక ధర్మములో ఉన్నట్లు అని 5వ సూరా 68వ ఆయత్లో ఉంది “ఓ ప్రవక్తా! వారికి చెప్పు ఓ గ్రంథవహులారా! మీరు తౌరాత్ను ఇంజీలును మీ ప్రభువు తరపున మీ వద్దకు పంపబడిన దానిని (ఖుర్ఆన్ను) మీ జీవితాలలో నెలకొల్పనంత


----


వరకు మీరు ఏ ధర్మము పైనా లేనట్లే." ఇపుడు నీకు సత్యసమేతముగ నీ వద్దకు పంపినటువంటి ఖుర్ఆన్ గ్రంథము ఒకటుంది. తరువాత బైబిలు, భగవద్గీత ఈ రెండు గ్రంథాలను, తరువాత నీ వద్దకు పంపినటువంటి ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని నువ్వు అనుసరించకపోతే నీవు ఏ ధర్మములో లేనట్లే అని చెప్పాడు. నేను ఒక ముస్లీమ్ అనుకుంటున్నావు కదా! మూడు గ్రంథములు చదవనంత వరకు నీవు ముస్లీమ్ కాదు. ఎందుకనగా!


ముందు వచ్చిన రెండు గ్రంథాలు తెలిసిం నీవు ముస్లీమ్ అవుతావు. తౌరాత్, ఇంజీల్ గ్రంథాలను ఖుర్ఆన్ గ్రంథము పరిరక్షిస్తావుంది, ధృవీకరిస్తావుంది. వాటిలో ఉండే జ్ఞానము సత్యమని చెప్తావుంది. కాబట్టి ఆ రెండు గ్రంథాల జ్ఞానము నీవు తెలుసుకొని వాటిలో ఉండేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకొంటే అపుడు నీవు ఒక

వ ఒక ధర్మములో ఉన్నట్లే అంటే ముస్లీమ్ ధర్మములో ఉన్నట్లే లేకపోతే నీవు ఏ ధర్మములో లేనట్లే. ఆ వాక్యము ఒక ముస్లీమ్లకే కాదు అందరికీ వర్తిస్తుంది. నీవు హిందువు అయితే నీవు భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ అను మూడు దైవ గ్రంథాలను చదవాలి. ముస్లీమ్లకు ఆ రెండు చదవమని దేవుడు చెప్పినాడంటే హిందువులకు మిగతా రెండు కూడ చదవమని చెప్పినట్లే. అలాగే ఇది ఆ క్రైస్తవులకు కూడా మిగతా రెండు గ్రంథాలను చదవమని చెప్పినట్లే లెక్క. ఈ విధముగా మీరు తెలుసుకోగల్గితే మీకు మూడు గ్రంథాల్లో ఉండే సారాంశము ఒకటే అని తెలుస్తుంది. తరువాత ఇంకొకటి వాక్యమును చెప్తున్నాము.


6వ సూరా 91వ ఆయత్ చదవండి చెప్తా. “ఏ మానవమాత్రుని పైనా ఎలాంటి విషయాన్ని అవతరింపజేయలేదు అని పలికినప్పుడు ఈ అవిశ్వాస జనులు అల్లాహ్ ను అర్థము చేసుకోవలసిన విధముగ అర్థము చేసుకోలేదు. వారిని అడుగు మరి మూసా తెచ్చిన ఈ గ్రంథాన్ని ఎవరు


---

అవతరింపచేసినట్లు? ఆ గ్రంథము ఒక జ్యోతి, మానవుల కొరకు మార్గదర్శకత్వము. మీరు దానిని వేరు వేరు కాగితాలుగా విభజించి చూపుతున్నారు. ఎన్నో విషయాలను దాచేస్తున్నారు. మీకుగాని మీ పెద్దలకుగాని తెలియని ఎన్నోవిషయాలు ఇందుమూలముగ మీకు నేర్పబడ్డాయి." ఇపుడు మూసా తెచ్చినటువంటి తౌరాత్ గ్రంథములో మీకు కాని, మీ పెద్దలకుకాని తెలియనటువంటి జ్ఞానము ఉంది. దానిని ఈ రోజు కాగితాలు చించుకొని చదువుకుంటున్నారు. అంటే ఒకటే జ్ఞానాన్నే మీరు మూడు గ్రంథాలుగా చేసుకొని చదువుచున్నారు. దేవుడు ఏ మానవుని మీద తన జ్ఞానాన్ని ప్రసరింపచేయలేదు. దేవుడు స్వయముగ తన జ్ఞానాన్ని తానే చెప్పాడు. అంటే మూసా ప్రవక్త ద్వారా చెప్పించినాడు. మూసా ఎవరు? దేవుని యొక్క ప్రతినిధే మూసా. ఆ మూసా చెప్పినటువంటి జ్ఞానమే తౌరాత్. దాంట్లో మార్గదర్శకత్వము, జ్ఞానజ్యోతి అన్నీ ఉన్నాయి. ఆ మూసా తెచ్చినటువంటి తౌరాత్ గ్రంథము గొప్పది, దానిని మనము మూడుగ చించుకొని మూడు మతాలుగ, మూడు గ్రంథాలుగ పెట్టుకొని చదువుకుంటున్నాము. కానీ అది మీకుగానీ మీ పెద్దలకుగానీ తెలియకుండ పోయింది. అంటే ఇపుడు మీరేమనుకుంటున్నారంటే, లేదు మాకు తెలియదు మా పెద్దలు చెప్పినట్లు మేము వింటున్నాము అనుకుంటారు. కాని మీ పెద్దలకు కూడ తెలియదు తౌరాత్లో ఉండే రహస్యాలు, అవి చాలా గొప్పగ ఉన్నాయి అని చెప్తున్నాడన్నమాట. ఎందుకంటే ఇపుడు మేము చూసినంతటిలో ఇపుడు ఒక వాక్యము తీసుకుందాము మామూలుగ.


ఒక వాక్యములో ఏముందంటే నువ్వు నీ తల్లిదండ్రులకుగానీ తర్వాత వచ్చి నీ బంధువులకుగానీ తర్వాత పేదవారికి గానీ తర్వాత అనాథలకుగానీ దానము చేయాలనుకున్నప్పుడు ఏమి ఇవ్వదలుచుకున్నావు? అని క్వశ్చన్


----

(ప్రశ్న) వేశాడు అల్లాహ్. అల్లాహ్ అడుగుతున్నాడు నిన్ను. ఏమని అడుగు తున్నాడు? నీవు ఏమి ఇవ్వదల్చుకున్నావు వాళ్ళకు? అని అడిగినాడు. అంటే మనము ఏమనుకుంటున్నామంటే బీదవాళ్ళకు డబ్బు దానము చేస్తే వాళ్ళకు మంచిది కదా! అని అనుకుంటున్నాము. కాని అల్లాహ్కు నీవు చేసే ప్రతి పని తెలుసు. నీవు ఏమి ఇస్తున్నావో అల్లాహ్కు తెలుసు. నీవు ఏమి ఇవ్వదలుచుకున్నావ్? ఒకవేళ అంతో ఇంతో డబ్బులు ఇవ్వదలుచు కుంటావు అంతేకదా! నీవు చేసేది. అల్లాకు నీవు చేసే పని ఏదో తెలుసు. అది సక్రమమైన పనికాదు అని తెలుసు. అంటే సక్రమమైన పనే అని మనము చేస్తుంటే పండుగ రోజుల్లో బీదలకు దానము చేస్తున్నాము. అల్లాహ్ అది కాదురా అంటున్నాడు. నీవు మీ అమ్మకుగాని, మీ నాయనకుగాని, నీ బంధువులకుగాని, ఇంకొకరికి గాని దానము చేయాల్సింది జ్ఞానము. జ్ఞానధనమునే వానికి దానము చేయి, ప్రపంచ ధనము కాదు అని చెప్పాడు.


అయితే ఆ వాక్యములో చూస్తే ప్రపంచధనమే అని అందరు పొరపడి దానము చేస్తున్నారు. దానము చేయాలని బీదవాళ్ళకు దానము చేస్తున్నారు. ఈ రోజు చాలామంది బీదవాళ్ళకు దానము చేయాలని ముస్లీమ్లు అంటున్నారు. బీదవాళ్ళకు దానము చేయాలని వాక్యము ఉంది. అని చెప్తున్నారు. కానీ ఆ వాక్యములో ఏముంది మొట్టమొదట? అల్లాహ్ నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఏమి ఇవ్వదల్చుకున్నావు అని క్వశ్చన్మార్క్ వేసి అడిగినాడన్నమాట. ఆ క్వశ్చన్ అనే దానిని ఏమాత్రము చూడకుండ మనిషి డబ్బులు అనుకున్నాడు పొరపాటుగ.

ఈ రకముగా ప్రతి వాక్యము చాలా నిగూఢమైనటువంటి వివరాన్నిస్తావుంది. అంటే భగవద్గీత చాలా లోపలికి లోతైన జ్ఞానము చెప్పింది. బైబిలు ఒక రకమైన జ్ఞానమును చెప్పింది. ఖుర్ఆన్ దగ్గరికి


----

వస్తే ఎంతో గొప్పగా అంతా మొత్తము చెప్పేసినాడు. కాని దానిని అర్థము చేసుకోలేకుండ పోతున్నాము మనము. ఇపుడు ముస్లీమ్లు ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళందరు మూడు సమాజములుగ ఉన్నారు. హిందువులకు భగవద్గీత అర్థము కాలేదని ఏమాత్రము సంశయము లేకుండా చెప్పవచ్చు. ఇక క్రైస్తవుల్లోకి వస్తే వాళ్ళు మాకు అర్థమైంది అనుకున్నారేమోగాని అర్థము కాలేదనే చెప్తున్నాము. ఎందుకంటే ఒకచోట “ఇది నా రక్తము” అని ఒక గిన్నెలో రసము ఇచ్చాడాయన. ఇచ్చి ఇది నా రక్తము అని చెప్పి, ఒక రొట్టె ఇచ్చి ఇది నా శరీరము అని చెప్పి “నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని తాగండి” అన్నాడు. ఇపుడు ప్రతి ఒక్క క్రైస్తవుడు ఏమి చెప్తున్నాడంటే ఏసు రక్తము వలన పాప క్షమాపణ ఉంది అంటున్నారు. దానిని నూటికి నూరుపాళ్ళు సత్యమని మేము కూడ ఒప్పుకుంటాము. అయితే ఏసు రక్తము ఎక్కడుందని వెతకాలి? ఎవడైతే ఏసును ఒప్పుకున్నాడో వాడు ఏసు రక్తముతో కడిగివేయబడతాడు అంటారు. రక్తము ఏది కనపరాలేదుగా! ఊరికనే అనుకుంటే ఎలా?


ఇపుడు మనము మామూలుగ లెక్కేసుకుంటే ఆయన రక్తము ఏమిటో మనకు అర్థము కాలేదు. ఆ రొట్టె ఏమిటిదో అర్థము కాలేదు. 'రక్తము’ అంటే సరేలే ఆయన చెప్పిన 'జ్ఞానము' అనుకుంటాము. రొట్టె అంటే ఏమిటి అంటే దానికి జవాబు లేదు. ఇపుడు మనకు శరీరము ఉంది. శరీరానికి రంధ్రము పెడితేనో లేకపోతే కొంత గాయపరిస్తేనో అందులో నుండి రక్తము కారుతుంది. అపుడు మనము దాంతో కడుక్కుండేదో, పూసుకుండేదో, తాగేదో ఏదో ఒకటి చేస్తాము. ఏసు బ్రతికుంటే అట్లే చేసేవాళ్ళము. ఎందుకంటే ఆయనుంటే ఓ! ఏసు రక్తము వలన మన పాపము పోతుందట అని ఆయన శరీరానికి రంధ్రము పెట్టి రక్తాన్ని పూసుకొనేవాళ్ళు. ఆయన


----

గొప్పోడు అనే భావము లేకుండ ఆయన బాధపడితే మనకేంలే అని రంధ్రము పెట్టి ఆ రంధ్రము ద్వారా వచ్చిన రక్తాన్ని మనము పూసుకొనేటటువంటి పరిస్థితి ఏర్పడిందన్నమాట. కాని ఆయన లేడు కాబట్టి సరిపోయింది. ఇపుడు ఈ రంధ్రము ఎవరికి పెడితే రక్తము వస్తుంది? ఏసు ప్రభువుకు పెడితే రక్తము వస్తుంది. ఆయనేమి చెప్పాడు? క్రైస్తవ సమాజము ఉంది నీకు ఎపుడైనా కానీ నా రక్తముతో నీవు శుద్దికావచ్చు అని చెప్పాడు. ఎప్పుడైనా ఆయన రక్తాన్ని మనము వాడుకోవచ్చు. ఇపుడు కూడ మీరు అదే చెప్తున్నారు. అయితే రక్తము ఏమిటో ఆలోచించాలి.


ఏసు వలన ఇపుడు పాపక్షమాపణ జరుగుతుంది అని అంటే మేము నూటికి నూరు పాళ్ళు ఒప్పుకుంటున్నాము. కానీ పాపక్షమాపణ ఎట్ల జరుగుతుంది? ఎక్కడుంది ఏసు రక్తము? అది నీకు అర్థము కాలేదు. నీవు రక్తమును ఎక్కడి నుండి తీసుకుంటావు. సత్యమును పరిశోధించి చూస్తే బైబిలు గ్రంథమే ఆయన శరీరము. బైబిలు గ్రంథములోకి నీవు దూరి చూస్తే అందులోని జ్ఞానమే ఆయన రక్తముగా ఉంది, నీవు పూసుకో అది, అప్పుడు తెలుస్తుంది. ఆయనేమి చెప్పినాడంటే నా రక్తాన్ని త్రాగండి అని చెప్పినాడు గాని కడుక్కోండి అని చెప్పలేదు పూసుకోండి అని చెప్పలేదు. "పాపము రక్తముతో కడిగి వేయబడుతుంది" అని చెప్పాడు. బైబిలు గ్రంథమే ఆయన శరీరము. ఆ గ్రంథములో ఉన్నటటువంటి జ్ఞాన సారాంశమే ఆయన రక్తము అని మనము అర్థము చేసుకోలేదు. అంటే స్థూలముగ చెప్పినట్టే మనము అర్థము చేసుకొన్నాము. కాని సూక్ష్మమైనటువంటి వాక్యాలు అందులో మనము గ్రహించడము లేదు. ఈ లెక్కకు పోతే ఈ సూక్ష్మము- స్థూలము అనే దానిని మనము పూర్తి గ్రహించుకోలేక పోతున్నాము. ఆ సూక్ష్మ వివరము ఏమాత్రము తెలియదు. స్థూలము మాత్రమే మనకు తెలుసు.


----

నేను ఒకసారి ఒక ఆశ్రమానికి పోయాను. ఒక గురుజీ ఉండేవాడు ఆ ఆశ్రమములో. ఆయన సన్యాసి. ఆయనకు పెద్ద పేరు ఉంది. చాలామందికి ఉపదేశము ఇచ్చారు


కర్ణాటక రాష్ట్రములో చాలా జిల్లాలో ఆయన గురువు. ఆయనకు చాలామంది శిష్యులు ఉన్నారు. ఆయన ఏమి చేసేవాడంటే ఎప్పుడూ అస్తమానము అద్దము పెట్టుకొని ముఖము చూసుకుండేవాడు. దానిని నేను గమనించి గమనించి ఒక రోజు “ఇదేం స్వామి! మీరు ఎప్పుడూ ఈ అద్దాన్నే చూసుకుంటా ఉంటారే!” అని అడిగినాము. “ఒరే తిక్కోడా! నీకేమి తెలియదు. నేను చెప్తా చూడు పెద్ద రహస్యము! అన్నాడు. అప్పుడు చెవులు నిక్క పొడుచుకొని విన్నాము. "తన్ను తాను చూసుకుంటే జ్ఞానము కలుగుతుంది, మోక్షానికి పోవచ్చు” అన్నాడు. తన్ను తాను చూసుకోవడము అంటే అద్దములో చూసుకుండేదంట. ఎట్లుందో చూడండి తన్ను తాను చూసుకోవడము అంటే అద్దములో చూసుకోవడమా? అద్దములో అందరు చూసుకుంటారు, అది జ్ఞానము అవుతుందా? ఇంక ఆయనకు తెలిసింది ఆయన చెప్పాడు. సరేలే, మనము నమస్కారము స్వామి మంచిది, మీకు తెలిసింది మీరు చెప్పినారు. రేపటి నుంచి నేను కూడ పండుకున్నా కనిపించేటట్లుగ, నిలబడినా కనిపించేటట్లుగ ఒక పెద్ద అద్దము పెట్టుకుంటా! అని చెప్పి వచ్చాము. అద్దము చూసుకుంటే ఎట్లొస్తుంది జ్ఞానము? సరే, ఆయనకు అది అర్థమయినది. ఇపుడు వాస్తవముగ జ్ఞానము తెలియకుండ పోయింది. తెలిసివుంటే ఇట్ల ఉండే వాళ్ళము కాదు.


ఈ రోజు మనకు కంటికి కన్పిస్తావుంది. ఒక ఇంట్లో నలుగురు చిన్నపిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు వ్యాధిగ్రస్థులయినారు. వాళ్ళు వ్యాధితో


----

బాధపడుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు పడే బాధ చాలా ఎక్కువగ ఉంది. ఎందుకంటే ముగ్గురు పిల్లలను చూడలేక బాధపడుతున్నారు. వాళ్ళకు పెద్ద నరకము కనిపిస్తావుంది. వాళ్ళ ఇంట్లో కొన్ని రోగాలున్నాయి, వాళ్ళను చాలా భయంకరముగ బాధిస్తున్నాయి, చాలామంది బాధపడుతున్నారు. రకరకాల సమస్యలు, రకరకాల చిక్కులు, రకరకాల బాధలు ఈ రకముగా మనషులంతా బాధపడుతున్నారు. ఎందుకు ఈ రకముగ బాధపడుతున్నారు? అంటే కేవలము జ్ఞానము తెలియకుండ పోయిన దానివలనే. ఇప్పుడు ఒకామె వచ్చింది. ఆమె ఎవరో టీచర్ అని చెప్పింది కాని నాకేమి సరిగా జ్ఞాపకము లేదు.


ఆమె ఏదో ఒక రోగముతో వచ్చింది. బహుశ క్యాన్సర్ అనుకుంటా. డాక్టర్లు చేతులెత్తేశారు అది నయము కాదు అని చెప్పారు. ఆమెను బ్రతికిన శవములాగ తీసుకొచ్చారు. ఇక్కడికి చాలామంది వస్తుంటారు క్యాన్సర్ పేషెంట్లు మరియు టి.బి., రకరకాల పేషెంట్లు. డాక్టర్లంతా చేతులెత్తేసి మాతో కాదు ఇంక ఎత్తుకొనిపోండి ఇక్కడినుంచి అన్నపుడు వాళ్ళను తీసుకొని ఇక్కడికి వస్తారు. అపుడు మందిరము, మేము మతికి వస్తుంది. ఇక్కడికి వస్తే ఒకవేళ ఏదన్నా స్వామి దీవించేదో లేదో ముట్టుకుండేదో లేకపోతే ఇంకొకటో ఏమన్నా చేస్తాడని చూస్తే స్వామి ఎవరికీ కనపరాడు. ఎందుకంటే స్వామి 63 యేండ్ల వయస్సు అప్పుడే కనపరాకుండ పోయినాడు లేడు. ఇపుడు మీతో మాట్లాడేది బొమ్మ మాత్రమే. అర్థమయిందా! స్వామి 63 సంవత్సరాల వయస్సులోనే లేకుండా పోయినాడు. మీకు కనపరాడు. మీకు జ్ఞానము చెప్పేటపుడు మాత్రమే డ్రస్సు వేసుకొని గోడ మీద కనిపిస్తున్నాడు అంతే. అంతవరకూ మామూలుగ కనపరాడు. మేము చూడాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాని చూసేదానికి అవకాశము లేదు.


---

63 సంవత్సరాల వయసున్నప్పుడు అయితే చూసేవాళ్ళుగాని, ఇపుడు చూసేదానికి అవకాశము లేదు. ఒకవేళ ఎవరినన్నా పిలుచుకొని

వచ్చి నేనే స్వామిని అని చెప్పినా, నన్ను మామూలుగ మీరు అర్థము చేసుకోలేరు. ఎందుకంటే అర్థము చేసుకుండే అవకాశమూ ఉండదు. ఈయన స్వామియా! ఈయన జ్ఞానము చెప్పిన స్వామియా! అని అనుమానము వస్తుంది. నేను ఇంతకుముందు పబ్లిక్ గా మీ ముందర కూర్చొని మాట్లాడేవాన్ని. చాలామంది నా జ్ఞానము చదివి ఇక్కడికి నన్ను చూడాలనుకొని వచ్చినోళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను చూడకపోతేనే బాగుంటుంది, చూస్తే వున్న మర్యాద పోతాది అని చెప్పాను. ఉన్న మర్యాద కాదు ఉన్న నమ్మకము పోతాది అని చెప్పా నేను. కానీ ఇక్కడికి వచ్చిన తరువాత ఈయన గ్రంథాలు వ్రాశాడా? ఈయన జ్ఞానము చెప్తున్నాడా? అని చాలామందికి అనుమానము వచ్చింది. ఇన్ని గ్రంథాలు వ్రాసినోడు ఈయన కాదు అని నమ్మకముగ నిర్థారణ చేసుకున్నారు. అంతకుముందు నమ్మకముగ చదివేవాళ్ళు. ఇక్కడ వచ్చిన తరువాత ఆ నమ్మకము పోయింది. అందువలన నన్ను చూడందే మంచిది అని నేను చెప్తున్నాను. మీకు కావాల్సింది జ్ఞానము, మీకు జ్ఞానాన్ని అందిస్తాను, మీరు తెలుసుకోండి.


ఇక్కడ జ్ఞానము తెలుసుకునే వాళ్ళందరికి జ్ఞానాన్ని ముందుకు ముందుకు తీసుకొనిపోతున్నాము అని తెలుసు. ప్రపంచములో ఇన్ని ఆశ్రమాలు ఇంతమంది స్వామీజీలు ఇన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాకాని, ఎక్కడా చెప్పనటువంటి జ్ఞానము ఇక్కడ చెప్పబడతావుంది.

2000 సంవత్సరాల పూర్వము ఏసు ప్రభువు శిష్యులంతా సంఘాలుగా ఏర్పడి, ఆ సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. సంఘము పెరిగి మతము అయింది. "తొండ ముదిరితే ఊసరవెల్లి


---

అవుతుందన్నట్టు”, సంఘము ముదిరిపోయి పెద్దదై గుంపు అయినంక 'మతము' అని పేరు పెట్టుకున్నారు. ఆ రకముగా క్రైస్తవ మతము తయారయినది. క్రైస్తవ మతము తయారైన తర్వాత అది మతమైనపుడు మాది మతమే కదా! అని హిందువులు ఏమన్నారంటే మేము ఇందువులము అన్నారు. అసలు ఇందువనేది మతమే కాదది. క్రైస్తవ మతము అని పేరు పెట్టుకున్నాక ఇందూమతము అని పేరు పెట్టుకున్నారు. తర్వాత పుట్టింది ముస్లీమ్ మతము. ఇట్ల మతాలు పెట్టుకున్నారుగాని జ్ఞానరీత్య మతము అనేది ఎక్కడా లేదు. ఒక మతము అనేది పూర్తిగా తయారైపోతే దానికి తోడుగ ఇంకొకటి, దానికి తోడుగ ఇంకొకటి, తయారై మతము అనేది వచ్చింది.


ఈ మతము అనే అధర్మము మనకు క్రొత్తగ వస్తుంది. మొత్తము అధర్మాలు నాలుగు ఉంటే ఇపుడు ఐదు అయినాయి. భగవద్గీతలో దేవుడు చెప్పినాడు కాబట్టి దానిప్రకారము మీరు నడుచుకోండి. ధర్మాలేవో దేవుడు చెప్పాడు. ఆ ధర్మాల ప్రకారము పొమ్మని కూడ చెప్పాడు. కర్మయోగము ఉంది, బ్రహ్మయోగము ఉంది, భక్తి యోగము ఉంది ఏదో ఒక యోగాన్ని సాధించండి. దేవున్ని సాధన చేసే మూడు యోగాలు ధర్మాలు చెప్పాడు. ఇంక అధర్మాలు వద్దు, యజ్ఞాలు చేసేది వద్దు, వేదాలు చదివేది వద్దు, దానాలు వద్దు. తపస్సులు చేసేది వద్దు అని చెప్పాడు. వీటి వలన ఏమాత్రము నేను తెలియబడను అని చెప్పాడు. భగవద్గీతలో ఇవన్ని వద్దని చెప్పినారు కదా! అది హిందూ ధర్మము కాదా!

మేము చెప్పేది దేవుని ధర్మమే, అది హిందూ జ్ఞానములో ఉంది అని తెలియక, వేరే మతాలను గురించి చెప్తున్నారని కొందరు అంటున్నారు. మనుషులందరికి ఒకే దేవుడే, ఒకే జ్ఞానమే. గీత, బైబిలు, ఖుర్ఆన్ గ్రంథాల్లో


----

ఉండేది కూడ ఒకే జ్ఞానమే అని చెప్తున్నాము మేము. ఇంతకుముందు అధర్మాలు నాలుగు ఉండేటివి. యజ్ఞాలు, వేదాలూ, దానాలూ, తపస్సులు నాలుగే ఉండేటివి. ఇపుడు ఐదవది మతము, నేడు సమాజములో పూర్తి బలముగ ఉండేది మతము, మత సాంప్రదాయాలు. ఈ రెండూ అట్లే ఉన్నాయన్నమాట. ఇపుడు హిందువులు మత సాంప్రదాయమును ఆచరిస్తూ ఇది మా మత ధర్మము అంటారు.


దేవుడు మనిషిగా వచ్చి ధర్మాలనే తెలియజేస్తాడు. కొందరు దేవుడు మనిషిగా రాడు అంటున్నారు. నాకు అర్థమైన జ్ఞానము ప్రకారము నేను చెప్తున్నాను. నీవు జ్ఞానము తెలుసుకో నీకు అర్థమవుతుంది. దేవుడు “మట్టితో మానవ బొమ్మను తయారు చేయబోతున్నాను” అని ముందే చెప్పాడు. ఆ బొమ్మలోనికి నా ఆత్మనే ఊది పంపిస్తాను అని చెప్పాడు. పరమాత్మ భగవంతున్ని పంపించినాగానీ భగవంతున్ని మనము నమ్మలేదు, మ్రొక్కలేదు. మనము దేవుడు చెప్పిన ఆ వాక్యాన్ని తీసుకొని చూస్తే దేవుడు పంపిస్తానని చెప్పినాడు. కొందరు దేవుడు మనిషిగా రాడు అంటున్నారు కదా! వస్తాడని చెప్తున్నాడు అని మనము చూపిస్తే, ఇది ఆదామ్ అలైహివస్సలామ్ గురించి చెప్పినారు అని చెప్తున్నారు ముస్లీమ్లు. ఆదామును గురించి చెప్పిన వాక్యము ఇది, ఆదాము వస్తాడని చెప్పినాడు అని అంటున్నారు. ఇపుడు దానికి మనము ఏమి ప్రశ్న అడుగుతున్నామంటే ఆదాము అనేది సృష్ఠి పూర్వము మొట్టమొదట పుట్టినాడు. ఆదాము తర్వాత విశ్వమంతా ఆయన ద్వారా తయారయిందని మీరే చెప్తున్నారు కదా! ఖుర్ఆన్ గ్రంథములో. మనుషులందరూ తయారైన తరువాత ప్రత్యేకముగా ఒక మనిషిని తయారు చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఆదాముది ఎపుడో పూర్వము గడిచిపోయిన సమస్య అది. ఇప్పుడు జరుగుతా ఉండేది ప్రెజెంట్ (వర్తమానము) లో


----

చెప్తున్నాడు చూడండి! మీరు అర్థము చేసుకోండి. ఇపుడు ప్రెజెంట్లో చెప్పేదానికి మళ్ళీ ఆదాము అలైహివస్సలామ్ అని ఎందుకు చెప్తున్నారు మీరు? అది తప్పు కాదా? ఎందుకు మీరు అట్ల చెపుతున్నారనగా మీకు ఖుర్ఆన్ గ్రంథములోని వాక్యము అర్థము కాలేదు. ఆదాము గురించి చెప్పినాడంటే ఆదాము సృష్ఠి ఆదిలో ఉన్నటువంటి వాడు. ఆయన్ను పుట్టించిన తరువాత మళ్ళీ ఆయన ద్వారా మిగతా మనుషులంతా పుట్టినారు. ఆయన అందరికి తండ్రిలాంటివాడు అని మీరే చెప్పినారు. ఇపుడు మనుషులంతా పుట్టిన తరువాత మనుషులకు అల్లాహ్ చెప్తున్నాడు.


“ఇపుడు నేను ప్రత్యేకమైన ఒక మనిషిని పుట్టించి తయారు చేస్తాను” అని చెప్తున్నాడు. తయారు చేసిన తరువాత నేను పంపుతాను మీ మధ్యలోకి మీరు మ్రొక్కండి అని చెప్పాడు. అంటే ఆ దేవదూతలంతా నమస్కారము చేసుకుంటారు. మీరు కూడ చేసుకోండి అన్నాడు. మీరు చేసుకోండి అంటే నీకు దేవదూతలంతా నమస్కారము చేస్తున్నారు అని తెలిస్తేనే కదా నీవు చేసుకొండేది. దేవదూతలంతా ఎవరో అని తెలిస్తేనే కదా నీవు చేసేది. అదీ కనపరాదు, ఇదీ కనపరాదు, దేవుడు పంపిస్తానన్నాడు. అట్లగానే దేవుడు అవతరిస్తాడు అని కూడ ఖుర్ఆన్లో 89-22లో చెప్పినాడు. ఎట్ల అవతరిస్తాడు అంటే? దేవదూతలంతా ప్రత్యక్షముగ ఉంటే అవతరిస్తాడు. దేవదూతలు ఉన్నపుడు అవతరిస్తే దేవదూతలంతా ఆయనకు నమస్కారము చేస్తారు. అదే వాక్యము ఇక్కడ ఉంది. 89వ సూరాలోను, 15వ సూరాలోను రెండు వాక్యాలు ఒక్కటే. కానీ ఆ రెండిటిని మనము అర్థము చేసుకోలేదు. దేవుడు రాడు అని ఎవరో కొందరు చెప్పారనుకోండి, ఇంక వాళ్ళ మాటలు పట్టుకొని దేవుడు రాడు అంటున్నాము. దేవుడు నేను ఊది పంపుతాను అని చెప్పినాడు. సరే పంపిస్తాడు. ఇపుడు పంపినాడని మనము ఎందుకు


---

అనుకోకూడదు. సరే మీకు ఇంకొకటి ఏమి చెప్తానంటే ఇపుడు క్రైస్తవులు బైబిలులో ఏసుప్రభువు చెప్పినాడు ఆదరణకర్త వస్తాడని, పరిశుద్ధాత్మ వస్తాడని చెప్పినాడు. “నేను” అని చెప్పకుండ “పరిశుద్ధాత్మ" అని పేరు పెట్టి చెప్పినాడాయన. మాయ చేసి మనలను మభ్యపెట్టి ఆయన వస్తాడు అని చెప్పాడు. సరే ఇపుడు మనము వస్తాడు, వస్తాడు వస్తాడు అనుకుంటూ ఇట్లే ఉండేదేనా? ఎపుడో ఒకసారి రావాలి కదా ఆయన? ఎట్ల తెలుసుకుంటావు నీవు? తెలుసుకునేదానికి అవకాశము లేదు.


మీకు నేను జ్ఞానాన్ని చెప్తున్నాను కాబట్టి నేను ఎక్కువ పరిశోధన చేయాలి, ఆ పరిశోధనలో ఉండే సారాన్ని మీకు చెప్పాలి. ఆ శ్రమ నాకు ఉంది కాబట్టి నేను దానికోసమే జీవిస్తున్నాను కాబట్టి మీకు తెలియజేసేది ఏమంటే “ఆయన వచ్చియున్నాడు” అని చెప్తున్నాము. అంటే ఎట్ల తెలుస్తుంది? అని ప్రశ్న వేసుకుంటే ఒక విధానము ఉంది దీనికి. ఈ ప్రకృతి ఐదు భాగాలుగ ఉంది. ఐదు భాగాలుగ ఉండేటటువంటి శరీరాన్ని ఆయన ధరించి రావాలి. ప్రకృతితో తయారైన శరీరాన్ని ధరించే రావాలి. ప్రకృతిలో ఎపుడో ఒకసారి అపుడపుడు మీకు తోకచుక్కలు కనిపిస్తూ ఉంటాయి. తోకచుక్కలు కనిపించినపుడు ఒక మార్పు వస్తుంది అని గుర్తు అది. ప్రపంచములో తోకచుక్క కనిపిస్తే ఒక మార్పు వస్తుంది అని గుర్తు. ఏ మార్పు అని మనకు తెలియదు. తోకచుక్క వచ్చిన ఐదు వందల రోజులకు అంటే 5 రోజులకుగాని, 50 రోజులకుగాని, 500 రోజులకుగాని మీకు ఈ ప్రతినిధి ఎవడైతే వస్తాడో ఆ దైవప్రతినిధి వస్తాడు. అంటే ఇపుడు మనము మూడు భాగాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము కాబట్టి ఐదుకుగాని, యాభైకిగాని లెక్కచేయకుండా 500 దినాలకు ఖచ్చితముగా వస్తాడు అని మనము లెక్కేసుకుంటున్నాము. అంటే తోకచుక్క వచ్చిన


---

500 రోజులకు ఆయన వస్తాడు. ఒకటి వచ్చింటే మనము లెక్కేసుకోవచ్చు. ఇప్పటికి చాలానే వచ్చినాయి, ఒక వంద సంవత్సరాల వెనక్కిపోయి చూస్తే కనీసము ఒక 70, 80 తోక చుక్కలు ఉన్నాయి. చిన్నదిగాని పెద్దదిగాని లెక్కేసుకుంటే ఏ తోకచుక్క వచ్చినపుడు మనము భగవంతుడు వచ్చినాడని లెక్కేసుకోవాలి?


అందుకే దేవుడు ఏమి చేసినాడంటే ఒక అవకాశము ఇచ్చినాడు తెలుసుకునే దానికి. ప్రపంచములో మార్పు వస్తుంది అని. అది ఏ మార్పో

మనకు తెలియదు. ఐదు వందల రోజులకు ఆయన వస్తాడు అని మనకు అర్థమయితావుంది. సరే ఐదువందలు అంటే ఏ తోకచుక్క నుంచి మనము లెక్కేసుకోవాలి? అది ఎవ్వరికి అర్థము కాకుండా చేసినాడు, కానీ ఒక నమ్మకము ఆయన వచ్చినాడని మనకు ఉంది. ఎందుకంటే ఎపుడైతే ఈ తెలియని జ్ఞానము మనకు తెలియబడతావుందో అపుడు దేవుడు వచ్చాడని మనకు తెలుస్తావుంది.


ఎవ్వరూ చెప్పని జ్ఞాన విషయాలు కూడ మేము చెప్తున్నాము. నేను ఒకే ఒకటి ధృఢముగా చెప్తున్నాను మీకు. నాకు తెలియజేసే వాడు గొప్పవాడు. నాకు తెలియజేసేవాడు ఎవడో నాకు తెలుసు. కాబట్టి నాకు తెలియజేసే జ్ఞానమంతా సత్యసమేతమైనదే. నాకు తెలిసిన జ్ఞానమంతా మూడు గ్రంథాల సారాంశమైన జ్ఞానము. కాబట్టి నేను ధైర్యముగా చెప్తున్నా మీకు ఎక్కడా సంశయము లేదు. ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది. కాని ఈ రోజు ఒక ఖుర్ఆన్ విషయముగానీ, ఒక బైబిలు విషయముగానీ, ఒక భగవద్గీత విషయముగానీ ప్రశ్న వేస్తే దాంట్లో సరియైన జవాబు హిందువు చెప్ప లేకున్నాడు, సరైన జవాబు ముస్లీమ్ చెప్పలేకున్నాడు, సరైన జవాబు క్రైస్తవుడు చెప్పలేకున్నాడు. వాళ్ళకు తెలిసింది వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళకు తెలిసిన


----

దానిలో మళ్ళీ తిరిగి ప్రశ్న వేస్తే ఇంక జవాబు లేదు. అక్కడ ఏదో మూసివేస్తున్నారు, దాచేస్తున్నారు, దాటేస్తున్నారు. భగవంతుడు వస్తాడని దైవగ్రంథాలలో దేవుడు చెప్పాడు. నా ప్రతినిధిని పంపుతాను అంటే ఆదామ్ అలైహివస్సలామ్ అని చెప్పినారు. ఆదామ్ అలైహివస్సలామ్ ఎప్పుడో సృష్ఠి ఆదిలోని వాడు. ఇపుడు దీనికి దానికి సంబంధము లేదు. వాళ్ళు పొరపాటు పడి మాట్లాడుతున్నారు. వాళ్ళ పెద్దలు చెప్పినేది చెప్పుచున్నారు.


ముస్లీములతో మాట్లాడేటప్పుడు ఇది జరిగింది చర్చ. అంటే ఇది చాలా కష్టమైన జ్ఞానము. ఇపుడు ఒక్కసారిగా అర్థము కాదు మనకు. కొన్నాళ్ళు చర్చించుకుంటే అర్థమవుతుంది, చర్చించుకోవాల్సిన పనిలేదు. నీకు స్వయముగా నీకు హక్కుగ నీకు గ్రంథాన్ని ఇచ్చాడు దేవుడు. నీ గ్రంథాన్ని నీవు చదువుకో. నీవు క్రైస్తవునివా! నీకు సంపూర్ణమైన జ్ఞానాన్ని అందించాడు బైబిలులో, నీవు చదువుకో.. లేదు నీవు ముస్లీవ్వా! సత్యసమేతమైన జ్ఞానాన్ని మీకందించాడు ఖుర్ఆన్, నీవు చదువుకొని తెలుసుకో. లేదు నేను అరబ్బీ భాషలోనే చదవాలి అంటే అది అయ్యేది కాదు పొయ్యేది కాదు. తెలుగు భాషలో చదువుకోవయ్యా! దేవుడు ఆ కండిషన్ పెట్టలేదు, మీరు మత సాంప్రదాయము ప్రకారము పెట్టుకున్నారు. మతాన్ని అడ్డము పెట్టుకొని ఎందుకు తనకలాడతారు? దేవుని జ్ఞానానికి ఎందుకు దూరము అవుతారు? దేవుడు నీకు జ్ఞానము ఇస్తే, ఈ భాషలోనే అని ఏముంది? మీకు తెలిసిన భాషలో, మీ పరిసర ప్రాంతాల్లో, మీ ప్రాంతీయములో ఉండేటటువంటి ప్రవర్తనే మీకు పంపిస్తాను అని చెప్పినపుడు మరి నీవు ఏదో వేరే భాషలోనే చదవాలనడము పొరపాటు. నీవు ప్రార్థన చేసేది కావాల్సింటే అరబిక్ భాషలో చేసుకో. నీవు కావాల్సింటే ఏ భాషలోనైనా నీవు గ్రంథాలు చదవచ్చు అని చెప్పితే గ్రంథాలు చదివేదానికి కూడ భయపడుతున్నారు. వాళ్ళ పెద్దలు అట్లా భయ పెట్టారన్నమాట.


----

అటువంటి షరతులు అన్ని వదిలిపెట్టి నీవు దేవుని జ్ఞానాన్ని తెలుసుకో, దేవుని జ్ఞానము చాలా దగ్గరవుంది నీకు. ఇంకొకని మీద ఆధారపడాల్సిన పనిలేదు. మా పెద్దలు చెప్పినట్లే వింటా నేను అని అనుకుంటే ఖుర్ఆన్ గ్రంథములో 6వ సూరా 91వ ఆయత్లో ఏమి చెప్పినాడు? "మీకుగానీ, మీ పెద్దలకుగానీ ఈ జ్ఞానము తెలియదు” అని చెప్పాడాయన. తౌరాత్ గ్రంథములో జ్యోతి ఉంది, జ్ఞానము ఉంది అని చెప్పినాడాయన. ఆ తౌరాత్ జ్ఞానము మీకుగానీ, మీ పెద్దలకుగానీ తెలియదు అని చెప్పాడు. ఇంకా కొంతమంది ఏమి చేస్తున్నారంటే ఏలూరులో మన గ్రంథాలను ప్రచారము చేస్తుంటే కొంతమంది ముస్లీమ్లు అడ్డుపడి అయ్యా మీరేందో ఖుర్ఆన్ గ్రంథములోవి వ్రాశారు. అసలుకు మా ఆయత్లు వ్రాయకూడదు మీ గ్రంథములో అని చెప్పారు. దానికి ఏముందయ్యా దేవుని గ్రంథము కదా! మేము వ్రాసిన దానివల్ల ఇప్పుడు 20, 30 వేల మంది హిందువులు చదివినారు. ఖుర్ఆన్ హిందువులకు తెలిసింది ఈ రోజు, మేము వ్రాయకపోతే తెలిసేది కాదు కదా! అంటే లేదు, మా గ్రంథాన్ని మా ఆయత్లను చదవకూడదు అని వారు అన్నారు. దానికి మేము చదవకూడదని నియమము ఏముందయ్యా చదవమనే దేవుడు చెప్పినాడు. ఈ రోజు చదవకపోతే హిందువులకు ఖుర్ఆన్ గ్రంథము ఎట్లు అర్థమవుతుంది? అది అంత సులభముగా అర్థమయ్యేది కాదు కదా! అని అంటే, లేదు లేదు మా ఊర్లో ప్రచారము చేయవద్దండి అని అడ్డుకున్నారు. సరేలే మీరు వద్దన్నారు కదా! మాకేమి? మేము మీకు కాదు చెప్తావుండేది, జ్ఞానము హిందువులకు చెప్పేది. అది హిందువులకు అర్థమయ్యేటట్లుగా “అంతిమ దైవగ్రంథములో జ్ఞాన వాక్యములు” అని తెలుగులో వ్రాసినాము. దానిని హిందువులకు అందిస్తున్నాము, మీరు వద్దంటున్నారు కాబట్టి సరే మేము పోతాములే అని వచ్చారపుడు.


----

సరే ఇక్కడ మన గ్రంథాలను చదివే క్రైస్తవులకు తెలిసింది. వాళ్ళు ప్రస్తుతము ఇక్కడ కూడా ఉన్నారు. కాబట్టి క్రైస్తవులు, ముస్లీమ్లను ఇలా అడిగారు.

క్రైస్తవులు :- ఏమయ్యా మీరు జ్ఞాన ప్రచారమును ఎందుకు అడ్డుకున్నారు? :- మా తౌరాత్ గ్రంథమును వారి భగవద్గీతగా పేరుమార్చి చెప్పారు.



క్రైస్తవులు  :- తౌరాత్ గ్రంథము భగవద్గీత కాదని మీరు ఎలా చెప్పుచున్నారు? 

ముస్లీమ్ :- తౌరాత్ గ్రంథము మాది, మా పెద్దలది.


క్రైస్తవులు : :- మాకు తెలిసిన సత్యము మేము చెప్పుచున్నాము. తౌరాత్ గ్రంథమే భగవద్గీత, అట్లే ఇంజీలు గ్రంథమే బైబిలు. మీరు మా మాటను కాదని అనేదానికి ఏమైనా అవకాశముంటే తౌరాత్ గ్రంథమును తీసుకొని వచ్చి చూపండి.


ముస్లీమ్లు :- మా తౌరాత్ గ్రంథమును మేము తెచ్చి చూపుతాము. ఒక నెల లోపల తీసుకొస్తాము.


అలా అని చెప్పిపోయిన ముస్లీమ్లు తిరిగి రాలేదు. తౌరాత్ ప్రత్యేకముగా యున్న ఇస్లామ్ గ్రంథమని చూపలేక పోయారు. వాస్తవానికి మనుషులందరికి చెప్పినది తౌరాత్ గ్రంథము. పూర్వము వ్రాయబడినప్పుడు గ్రంథ రచయితయిన వ్యాసుని చేత పెట్టబడిన పేరు భగవద్గీత. అది దేవుడు పెట్టిన పేరు కాదు. మనుషులు పెట్టిన పేరు. అదే భగవద్గీతను దేవుడు మోషే ప్రవక్తకు ఇచ్చినప్పుడు “తౌరాత్” అను పేరుతో ఇచ్చాడు. తౌరాతు అప్పటి మోషే తప్ప ఎవరూ చూడలేదు. అదే గ్రంథమే నేడు భగవద్గీతగా ప్రచారమయినది. తౌరాత్ గ్రంథాన్ని ప్రపంచములో ఒక్క


---

మూసా తప్ప ఏ మనిషి చూడలేదు, అది మూసాకు మాత్రమే తెలుసు. "ఏ మానవమాత్రుని మీద నేను ఈ జ్ఞానాన్ని ప్రసరింపచేయలేదు” అని అల్లాహ్ 6వ సూరా 91వ ఆయత్లో చెప్పాడు. అది ఏ మానవునికి తెలియదు మూసా ప్రవక్తకు మాత్రమే తెలుసు. మూసా ప్రవక్త దేవుడిచ్చిన దానిని తౌరాత్ అని చెప్పాడు. మూసానే మోషే అనేటటువంటి పేరుతో క్రైస్తవులు చెప్పుకుంటున్నారు. మోషే చెప్పిన జ్ఞానాన్నే ధర్మశాస్త్రము అని చెప్పుకుంటున్నారు. ఆ ధర్మశాస్త్రాన్నే క్రైస్తవులు తౌరాత్ అని చెప్పు కుంటున్నారు కానీ భగవద్గీత అనే పేరు ఎవ్వరికీ తెలియదు.



ఇది ఇజ్రాయిల్ దేశములో చెప్పినపుడు మోషే ప్రవక్తకు, ఇక్కడ మూసా, మోషే ఇద్దరు ఒక్కటే. భగవద్గీత తయారయిన తర్వాత ఆ ప్రవక్తకు ఈ గ్రంథాన్ని స్వయముగా కృష్ణుడే అందించాడు. ఈ రోజు మనము హిందువులంతా భగవద్గీత అని ఏ గ్రంథాన్నైతే మనము పిలుస్తున్నామో ఆ గ్రంథము కృష్ణునికి భగవద్గీత అని చెప్పడము ఇష్టము లేదు. ఎందుకు ఇష్టము లేదు అని అంటే భగవద్గీత అంటే భగవంతుడు చెప్పినేది అనే అర్థము వస్తావుంది. కాబట్టి కృష్ణుడు మనిషిగానే ఉండిపోవాలనుకున్నాడు కానీ ఆయన భగవంతుడు అని ప్రజలకు తెలియకూడదు. కాబట్టి అక్కడ ఏదో రకముగా భగవద్గీత అని పేరుపెట్టి వ్రాసినాగానీ దానిపేరు అక్కడ మూసా ప్రవక్తకు ఇచ్చినపుడు దాన్ని భగవద్గీత అని పేరు పెట్టకోకుండా తౌరాత్ అనే పేరుతోనే ఆయనకు ఇవ్వడము జరిగింది. తౌరాత్ అనే పేరుతోనే ఆయన చదవడము జరిగింది. ఆయన ఒక్కనికే తెలుసు ఆ గ్రంథము. ఆయనతో ప్రపంచానికి అది తెలియకుండా పోయింది. ఆయనతోపాటు వెళ్ళిపోయిందది. ఆ గ్రంథాన్ని తరువాత రెండవ మనిషి ఎవరూ చూడలేదు. తౌరాత్ గ్రంథము జ్ఞానమని మనకు ఈ రోజు

----

తెలుసుగానీ తౌరాత్ గ్రంథము అనేది ఎక్కడాలేదు. ఈ రోజు మేము తౌరాత్ గ్రంథాన్ని తెచ్చి చూపిస్తాము అని అనుకుంటే ఎక్కడి నుండి చూపిస్తారు? గతము తెలియక మాట్లాడుతున్నారు.


ఇంతకు ముందు నేను చూశాను. చిన్న చిన్న విద్యార్థులు వచ్చి ఇక్కడ మూడు జ్ఞానాలు ఒక్కటే! మూడు మతాలు ఒక్కటే అని వాళ్ళు ఈ రోజు చెప్తున్నారంటే మూడు మతాలు కలిసిపోయే భవిష్యత్ ఉంది. అందరు ఐకమత్యముగా బ్రతికే భవిష్యత్ ఉంది అని మనకు అర్థమైతావుంది. ఇంతవరకు అది లేదు. ఒకరి మీద ఒకరు ద్వేషాలుగ బ్రతుక్కుంటూ వచ్చారు. ఇపుడు చిన్నపిల్లలకు కూడ అర్థమయిపోయింది మూడూ ఒక్కటే జ్ఞానమని. ఇక్కడికివచ్చి చిన్నపిల్లలు ఏకధాటిగా చెప్తున్నారు, మనకంటే బాగా చెప్తున్నారు. నేనంటే తడబడి చెప్తున్నాను, వాళ్ళు తడబడకుండ చెప్తున్నారు. మళ్ళీ అంత గొప్పగా చెప్తున్నారంటే మూడు మతాలు ఒక్కటే మూడు జ్ఞానాలు ఒక్కటే అని అంత ధైర్యముగ చెప్తున్నారు. అందువల్ల మనము ఏమంటున్నామనగా! రాబోయే రోజుల్లో మనకు రాబోయే సమాజము ఏక సమాజముగా ఉంటుంది, ఏ మనస్పర్థలు ఉండవు. ఒకే దేవుడు అనేటటువంటి భావము అందరిలోనూ ఉంటుంది. ఈ మూడు గ్రంథాలు కలిసి ఒకే గ్రంథము అనే భావము ఉంటుంది. మూడు గ్రంథాలను అందరూ స్వీకరించి అందరి దగ్గర పెట్టుకుంటారు. ఇది జరగబోయే కాలములో ఉండేటటువంటి పద్ధతి. తర్వాత ఇపుడు ఆదరణకర్త వచ్చియున్నాడు కాబట్టి మనకు ఇది నెరవేరుతుంది అనే ధైర్యముతో చెప్తున్నాను. సమాజమంతా ఒకే దేవున్ని ఆరాధించవలెనని, ఒకే దేవుడని చెప్పుకోవాలని, ఒకే దేవుడు తప్ప మిగతా దేవుడు లేడని, అందరూ గుర్తు పెట్టుకునేటటువంటి ఒకరోజు వస్తుంది. ఆ రోజు తొందరగ రాబోతుంది. ఇపుడు ఉండే అజ్ఞానమంతా పటాపంచలు అయిపోతుందని మేము అనుకుంటున్నాము.


---

అదే ఖుర్ఆన్ గ్రంథములో 3వ సూరా 18వ ఆయత్లో అల్లాహ్ ఏమి చెప్పాడంటే “ఈయనొక్కడే ఆరాధ్య దైవము. ఈయన తప్ప వేరే దేవుడు లేడు” అని చెప్పాడన్నమాట. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. తర్వాత దేవదూతలు చెప్పారు, తరువాత జ్ఞాన సంపన్నులైనటువంటి వారు చెప్పారు. ఒకసారి 3వ సూరా 18వ ఆయత్ చదవండి మీరు. మేము చూస్తాము. (ఆదినారాయణ పాస్టర్గారు ఖుర్ఆన్లోని 3వ సూరా 18వ ఆయత్ చదువుతుండగా, మేము ప్రతి ఆయత్కు ఇచ్చిన వివరమును క్రింద చూడగలరు. )


పాస్టర్ : అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదైవము లేడు అని "స్వయముగ అల్లాహ్ అన్నాడు”

మేము : ఆ..! స్వయముగా అల్లాహ్ చెప్పాడు, మీరందరు చదవడములో ఈ విషయాన్ని బాగ జ్ఞప్తికి పెట్టుకోండి ఆ తర్వాత ఏముందో చదవండి. పాస్టర్ : ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులు కూడ సాక్ష్యము ఇస్తున్నారు. 

మేము : ఆ..! అది కరెక్టు. కాబట్టి ఇపుడు మనము అంతో ఇంతో జ్ఞానము తెలిసినోళ్ళము. మనము ఏమని సాక్ష్యము ఇస్తున్నాము? దేవుడు ఒక్కడే అని సాక్ష్యము ఇస్తున్నాము.

తరువాత దేవదూతలు ఎట్లాగో దేవుడు ఒక్కడే అని సాక్ష్యము ఇస్తారు. వాళ్ళకు తెలుసు. మనకు కనపరాని వాళ్ళు ఉన్నారనే విషయాన్ని మనము ఇంతకు ముందే చెప్పుకున్నాము. దానిలో కూడ ఉన్నారనే చెప్తున్నారు. తరువాత స్వయముగా అల్లాహ్ యే ఈయన ఒక్కడే మీకు ఆరాధ్యదైవము అని చెప్పాడు. సరే అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవము కాని ఆ విషయాన్ని చెప్పిందెవరు? అల్లాహ్. ఏ అల్లాహ్? సృష్టికి పూర్వము


---

అల్లాహ్. అక్కడే ఉంది పెద్ద సమస్య. ఈ సృష్ఠికి పూర్వము అల్లాహ్ గురించి ముస్లీము సమాజానికి మొత్తానికి తెలియకపోయినది. 112వ సూరాలో 4 ఆయత్లలో ఏముందంటే “దేవుడు ఏ అక్కరా లేనటువంటి వాడు, ఏ అవసరమూ లేనటువంటి వాడు, ఆయన ఎవ్వరికీ పుట్టలేదు, ఆయనకు ఎవరూ సంతానము లేదు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరే వాళ్ళు లేరు. ఆయన ఏ అక్కరా లేనివాడు" ఏ అవసరము లేదయ్యా! దేవునికి నీవు నమాజ్ చేస్తావు అనిగాని, నీవు ఆరాధన చేస్తావు అనిగాని, నీవు మ్రొక్కుతావు అనిగాని ఇంకొకటి ఏదీ మనుషులతో పనే లేదు. నీవు మ్రొక్కు, మ్రొక్కకపో నీతో పనిలేదు దేవునికి. కానీ మన మ్రొక్కులన్నీ ఎవరికి? అల్లాహ్కు. ఏ అల్లాహ్కు? ఆయన ఎవరిని చూపించినాడో ఆయనకు. ఇపుడు ఖుర్ఆన్ గ్రంథములో అల్లాహ్ అనే పదము ఉందిగాని ఇద్దరు అల్లాహ్ లు ఉన్నారని ఎవ్వరికీ తెలియదు.


సృష్ఠి పూర్వము ఉండే అల్లాహ్, సృష్ఠి తర్వాత అల్లాహ్ అని తెలియదు. ఏ అక్కరా లేనివాడు ఒకడు, అక్కర ఉండేవాడు ఒకడు అని తెలియదు. ఏ పని చేయనివాడు ఒకడు, అన్ని పనులు చేసేవాడు ఒకడు అని తెలియదు. 2వ సూరా 255 లో ఏమి చెప్పినాడంటే “ఒక్క క్షణము కూడ ఆయన నిద్దురపోడు, ఒక్క క్షణము కూడ ఆయనకు కునుకు రాదు, అహర్నిశలు పని చేస్తున్నాడు ఏమాత్రము అలసిపోడు” అని చెప్పాడు అంటే ఒక్క నిమిషము కూడ ఆగకుండ పని చేస్తున్నాడు. 3వ సూరా 47వ ఆయత్లో ఏమి చెప్పినాడంటే “ఆయన ‘అయిపో' అంటే అయిపోతుంది” ఏ పనీ చేయడు. ఆయన సంకల్పించుకుంటే అయిపోతుంది. మరి ఇక్కడ పని చేయని వాడు ఎవడు? అక్కడ పని చేసేవాడు ఎవడు? అనే వ్యత్యాసము మనకు తెలియలేదు. అంతెందుకు 112వ సూరాలో ఏ అక్కర లేనివాడు


---

ఎవడు? ఆ దేవుడు ఎవరో అర్థము కాలేదు. ఇపుడు ముస్లీమ్ సమాజానికి ఇద్దరు దేవుళ్ళు ఉన్నారన్న విషయము తెలియలేదు. అంటే దేవుడు ఒక్కడే, మీరు ఆరాధించాల్సింది ఒక్కన్నే, ఒక్కడిని మాత్రమే ఆరాధించమని పెద్ద దేవుడు చెప్పాడు. ఎవడైతే నేను నా దూతను పంపుతున్నాను అని చెప్పినాడో, నేను ఎవరితో ఏమీ మాట్లాడను అని చెప్పినాడో, నేను ఎవరికి ఏమి చెప్పను అని చెప్పినాడో, నేను చేసేవాన్ని కాదని అన్నాడో, ఏ అక్కరా లేనివాడు ఎవడైతే ఉన్నాడో వాడు నిజమైన పెద్ద దేవుడు. ఆయనతో మనకు పనిలేదు. నీవు ఆరాధించాల్సిన దేవుడు వేరే. ఆయనకు నీవు నమాజ్ చేయాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే, పూజ చేయాల్సిందే, నీవు ఏమి చేస్తావో అది చేయి. అందరికీ ఒక్కడే ఆరాధ్య దేవుడు ఉన్నాడు. అదే దేవున్నే భగవద్గీతలో ఆత్మ అని చెప్పారు కానీ అనేకచోట్ల ఆత్మ అని చెప్పలేదు. అదే బైబిలు గ్రంథములో తండ్రి అని చెప్పినాడుగాని ఏ తండ్రి అని చెప్పలేదు. దేవుడు అనే పదము దగ్గరకు వచ్చినపుడు “తండ్రి” అనే పదము వాడినారు. బైబిలులో ఇద్దరిని రిని కలిపి తండ్రి అని చెప్పేసినారు. భగవద్గీతలో ఇద్దరిని కలిపి ఆత్మ అని చెప్పేసినారు. అదే విధముగా ఖుర్ఆన్లో ఇద్దరిని కలిపి అల్లాహ్ అని చెప్పేసినారు.


మూడు గ్రంథాల్లోనూ బాగా లోతుగ చూస్తే అర్థమవుతుంది. ఈ సూక్ష్మమును మీరు తెలుసుకోగల్గితే మీకు సంపూర్ణమైన జ్ఞానము తెలిసినట్లే. అంటే ఇంత లోతుగ మీకు తెలియదు కాబట్టి దేవుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి చెప్తే గాని మీకు అర్థము కాదు. భగవద్గీతలో 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము వరకు ఆత్మ ఆత్మ ఆత్మ అని చెప్పబడింది. తర్వాత మెలిక విడదీశాడు క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అని మూడు ఆత్మలు ఉన్నాయి అని చెప్పాడు. ఆ పేర్లు ఏ ఆత్మకు చెప్పినాడో మీరు


---

అక్కడికి వెళ్ళి లెక్కేసుకోవాలి. అంతవరకు అర్థము కాదన్నమాట. అక్కడికి పోయినా మూడు ఆత్మలు ఉన్నాయని అర్థము కాలేదు వీళ్ళకు. సత్యము అర్థముకాక దేవుడు జీవుడు అన్నారు. అసలు భగవద్గీత మొత్తము అర్థము కాలేదు హిందువులకు, సరే వీళ్ళను విడిచిపెడదాము. బైబిలులోకి పోతే తండ్రి అనే పదము వాడినారు. ఇపుడు ఎవరు ఎవరికి తండ్రి అనేది అర్థము కాలేదు. ఇపుడు మనకు ఎవరు తండ్రి? ఆ వచ్చిన ఏసుకు ఎవరు తండ్రి? ఆయనే తండ్రి అన్నపుడు మనము ఎవరిని తండ్రి అనాలి. మీ తండ్రి అని మనకు అంటాడు. నా తండ్రి అని మళ్ళ ఆయన అంటాడు. ఇద్దరికీ ఎవరు తండ్రి, ఎట్లా అనే వ్యత్యాసము మనకు తెలియకుండ పోయింది. ఈ ఖుర్ఆన్లోకి వచ్చేసరికి అల్లాహ్ అనే పదము వాడినారుగానీ అల్లాహ్ అనే పదము ఎక్కడ విభజించుకోవాలి?


112వ సూరాలో ఏమి చెప్పారు? 2-255 లో ఏమి చెప్పారు? అక్కడ ఎంత వ్యత్యాసము ఉంది, ఏ అక్కరా లేనివాడు, ఏ పనీ చేయనివాడు, ఏమాత్రము నాకు సంబంధము లేనోడు అని అక్కడ చెప్పి, ఇక్కడ ఒక్క క్షణము కూడ ఊరికనే ఉండడు, ఆయనకు కునుకూ రాదు, నిద్రా రాదు, అలసిపోడు, అహర్నిశలు పని చేస్తున్నాడు. ఇక్కడ ఈయన ఎవరు? అక్కడ ఆయన ఎవరు? ఆయనకు ఈయనకు గల వ్యత్యాసము తెలుసునా? ఇద్దరూ ఒక్కటే అయితే ఎట్లో చెప్పండి? ఇక్కడ బాగా కనిపిస్తావుంది కంటికి తెలిసేటట్లే. మళ్ళీ ఖుర్ఆన్ గ్రంథములో ప్రత్యక్షముగ ఉంది. మళ్ళీ ఎందుకు ఆలోచన చేయలేక పోయినారు. దేవుడు చెప్తున్నాడు నేనే వీళ్ళకు జ్ఞానమార్గములోనైనా పంపిస్తాను అజ్ఞాన మార్గములోనైనా పంపిస్తాను. ప్రతి మానవునికి వాని శ్రద్ధనుబట్టి, వానికి జ్ఞానము అర్థమయ్యేటట్లు చేస్తాను. శ్రద్ధ లేదనుకో జ్ఞానము అర్థము కాకుండ చేస్తాను. నిన్ను అజ్ఞాన


---

మార్గములోనైనా పంపిస్తాను. జ్ఞాన మార్గములోనైనా పంపిస్తాను. నీవు శ్రద్ధ పెంచుకోవయ్యా నీకు జ్ఞానము వస్తుంది. నేను జ్ఞాన మార్గములో పంపిస్తా నిన్ను. నీకు శ్రద్ధ లేదు. ఊరికే నామ్కావాస్తే (పేరుకు మాత్రమే) దేవుడు అన్నావంటే నీకు నామ్కావాస్తే (పేరుకు మాత్రమే) జ్ఞానమే తెలుస్తుంది. అంతంత మాత్రమే నీవు ఉంటావు. నీకు పూర్తి జ్ఞానము

తెలియబడదు.


నీవు శ్రద్ధ ఎంత పెంచుకుంటే అంత నీకు జ్ఞానము తెలుస్తుంది. శ్రద్ధ పెంచుకోకపోతే తెలియదు. నేనే నిన్ను ఆ దారిలోకి పంపించేవాన్ని అని అన్నాడు. ఇపుడు ఇంత జ్ఞానము మనకు అర్థము కాలేదు. రెండుగా ఉన్నటువంటి ఆ విభేదము మనకు తెలియలేదు. ఎవరిని ఆశ్రయించాలి మనము? అల్లాహ్ ఒక్కడే. ఒక్కన్నే ఆరాధించాల్సింది మనము. ఆ ఒక్కడు ఎవరు అనేది టోటల్గా తెలియదు. నీవు నమాజ్ చేయి అంటారు ఎవరిని గురించి నమాజ్ చేయాలి? వంగాల, లేయాల, నమస్కారము చేయాల, ప్రార్థన చేయాల నీవే మాకు దిక్కు అని చెప్పాల. నేను ఎవరికీ దిక్కులేదు, నాకెవరూ సంబంధము లేదు అని అల్లాహ్ అంటున్నాడు. నీవు ఆయనను పట్టుకునేది ఎలా? అక్కడనే చూడు మనము ఎవరిని పట్టుకోవాలో, పట్టుకోకుండ పొరపాటుపడితే, భావములో మార్పిడి గందరగోళము అయిపోతుంది. ఈ బైబిలులో కూడ అంతే! తండ్రి అని ఎవరిని అనాలి నీవు. అసలుకు మనకు గ్రంథములో ఉండే సారాంశము తెలియదు. రక్తమూ తెలియదు, రొట్టె తెలియదు. ఇట్ల అయిపోయింది మన పరిస్థితి. మళ్ళీ ఇపుడు అన్నీ తెలుసుకుంటే ఎట్లుంటుంది? సంతోషము పెరిగిపోతుంది. దేవుని జ్ఞానము తెలిసేకొద్ది సంతోషము పెరిగిపోతుంది. ఇంక నేను జీవించకోకున్నా ఫరవాలేదు నేను చచ్చిపోయినా ఫరవాలేదు. ఇంతటితో




---

అయిపోతే చాలు నా జీవితము అనిపిస్తుంది మీకు. మళ్ళీ అట్లాంటి జ్ఞానము ఇపుడు మీకు తెలియబడతావుంది . ఇపుడు మళ్ళ ఇంత ప్రపంచము ఉంది, ఇంత పెద్ద స్వామీజీలుండారు, ఇంత పెద్ద ధర్మ సంస్థలు ఉన్నాయి, ఆధ్యాత్యిక సంస్థలు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళంతా జ్ఞానము చెప్తున్నారు కానీ అక్కడ లేని జ్ఞానము ఇక్కడ చెప్పబడతావుంది మీకు. ప్రత్యేకముగా మీరు ఆలోచన చేసుకోండి. గ్రంథాలు చదవండి చూడండి.


ఇపుడు ఇక్కడ వ్రాసినేటివి 100 గ్రంథాలు ఉన్నాయి. ఇంకా కొన్ని వ్రాయబడతాయి. “త్రైత సిద్ధాంత భగవద్గీత” వ్రాయబడింది. ఇక మీకు ఖుర్ఆన్ రెండు భాగాలుగ ఉంది. "అంతిమ దైవగ్రంథములో జ్ఞానవాక్యాలు”, “అంతిమ దైవగ్రంథములో వజ్ర వాక్యాలు”గా వుంది. ఇక ఏసు చెప్పిన జ్ఞానము "ద్వితీయ దైవగ్రంథములో రత్నవాక్యాలు”గా ఉంది. అక్కడికి మూడు మతాల జ్ఞానాలు ఇక్కడ మేము వ్రాస్తున్నాము కాని హిందువులు హింసించేదానికి మొదలు పెడుతున్నారు. ఇది ఒక మతము ఇంకోమతము అని హింసలతో కూడుకున్నవి అయిపోయాయి. మమ్ములను కూడ ఎక్కిరిస్తున్నారు కాని మేము ఎవ్వరికీ భయపడే ప్రసక్తి లేదు. మేము దేవునికి మాత్రమే భయపడతాము. దేవుడు ఏమి చేసినా జరుగుతుంది అని నమ్ముతాము. కొంతమంది బెదిరిస్తున్నారు అంటే మీ ఆశ్రమము మూసేపిస్తాము. మీ జ్ఞానము చెప్పకుండ చేసేస్తాము అని బెదిరిస్తున్నారు. సరే అట్లే చేయండి ఎవరొద్దన్నారు! అది దేవుడు చేస్తే అయితుంది. దేవుడు మీ రూపములో చేయిస్తే అయితుంది. ఇంతకుముందు 25 సంవత్సరాల క్రిందట కొందరు మిమ్ములను చంపేస్తాము అని బెదిరించినారు. మేము ఏమి చెప్తున్నామంటే దేవుడు ఒకవేళ లేకుండా చేయాలనుకుంటే చెయ్యనీలే అనుకున్నాము. అది దేవుని ఇష్టము. మాకు


---

సంతోషమే, తప్పు ఏమి లేదు. ఎవనితో ఒకనితో చంపేయాల కదా! ఎట్లోకట్ల పంపివ్వాల కదా! అట్లేకానీ దేవునికి ఇష్టమైతే మాకు సంతోషమే అని చెప్పాము. కానీ దేవుడు ఇష్టపడకపోతే ఎవడూ చంపలేడు మమ్మల్ని అని చెప్పినాము. దేవుడు ఇష్టపడితే మేము సంతోషముగ చిక్కుతాము. మేము ఏమీ చేయలేము. మేము ఏ ప్రయత్నమూ చేయము. దేవుడు ఇష్టమైతే పెట్టుకుంటాడు లేకపోతే పంపిస్తాడు. మేము దేవుని జ్ఞానము చెప్పేదానికి ఉన్నాము, కాబట్టి దేవుని జ్ఞానమే మేము చెప్తున్నాముగానీ ఇంకొక ప్రసక్తి మాకు లేదు.


ఒకడు ఆశ్రమానికి వస్తే వాడు మీ ఆశ్రమానికి ఎందుకు వచ్చినాడు? మీరు రాజకీయము చేస్తున్నారు అని అంటే మాకేం పట్టిందయ్యా రాజకీయముతో. మేము జ్ఞానము చెప్తున్నాము. నీవు రా ఇంకొకరు రండి ఎవరైనా రండి, మాకేమి సంబంధము లేదు. కానీ ఈ రాజకీయము వాళ్ళు ఏమి చేస్తారంటే అన్ని కుట్రలతో కూడుకున్నవే చేస్తారు. ఎవడో వాడు వస్తే వానికి వీళ్ళు మద్దతు పలుకుతున్నారంట! అంటున్నాడు. మాకేమి పట్టింది మద్దతు పలకను. ఇపుడు జ్ఞానము తెలుసుకొనేదానికి ఎంతోమంది వచ్చినారు. వీళ్ళందరికి మద్దతు పలుకుతున్నామా మేము రాజకీయములో, మీ రాజకీయము ఏముందో మాకెందుకు. నేను ఏమి చెప్తాను నా రాజకీయము వినండి మీరు. నేను చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకోండి అని చెప్తున్నాను. నా రాజకీయము మీకు అంటిచ్చేదానికే సరిపోయింది. మీ రాజకీయము నాకెక్కడ అంటిస్తారు మీరు. మీ రాజకీయము నాకు అవసరము లేదు. అది కొంతకాలము ఉండేదే. నాకు నా రాజకీయము శాశ్వితమైనది. నేను “రాజకీయము” అనే గ్రంథము వ్రాయబోతున్నా అపుడు చూడండి తెలుస్తుంది, రాజకీయము అంటే ఎట్లాంటిదో! నిజమైన రాజకీయము ఏదో!

---

నిజమైన రాజకీయము జ్ఞానమయ్యా! నేను దీంట్లో ఉన్నాను. నాది శాశ్వతమైన హోదా నాకు. నేను బయటకుపోతే విసనకర్ర తీసుకొని విసురుకుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు. నీకెవడు వస్తాడు? నీకు ఐదేండ్ల వరకే, పోస్ట్లో ఉన్నంత వరకే ఇసిరేది ఎవడైనాగాని. నీకెవరు ఇసురుతాడు? నాకు ఎపుడైనా ఇసురుతారు. నాకెపుడైనా గౌరవము ఉంటుంది మీకెక్కడుంది. అధికారములో ఉంటే మీకు గౌరవము ఉంటుంది. మీకు అధికారము లేకపోతే కుక్కలు కూడా పలకరించవు మిమ్మల్ని. మాకు శాశ్వతముగా ఉంటుంది గౌరవము. అర్థమయిందా! కాబట్టి ఇక్కడ ఏ రాజకీయము లేదు . దేవుని స్వచ్ఛమైన దేవుని జ్ఞానము ఉంది. ఏ మతానికి సంబంధించిన జ్ఞానము లేదు. మత రాజకీయాలు లేవు. రాజకీయము

రాజకీయాలు లేవు. ఇంకో రాజకీయాలు లేవు. ఏమీ లేవు. మీరంతా దేవుని బిడ్డలు కావాలని, దేవున్ని దగ్గరగ తెలుసుకోవాలని, నీవు ఏ మతములో ఉన్నాగానీ దేవునికి దగ్గరగ పోవాలని నేను కోరుకుంటూ ఈ సమావేశాన్ని మీరు ఇంతవరకు శ్రద్ధగ విన్నందుకు సంతోషిస్తూ ముగిస్తున్నాము.


తేది: 13.01.2015

సర్వ శరీరములయందు ఆత్మగా నివసిస్తూ, సర్వశరీరములకు శక్తి నిచ్చి, పోషించేటటువంటి అధినేత ఎవరైతే ఉన్నాడో, ఆ శరీర అధినేతను జీవునికి కొంత జ్ఞానము అర్థమయ్యేలాగ చేయాలని కోరుతూ ఈ సభను ప్రారంభిస్తున్నాము. వినేవాళ్ళము మనము జీవుళ్ళము. చెప్పేవాడు దేవుడు (ఆత్మ) అని అంటాము కాని దేవుడు (పరమాత్మ) కాదు, ఆత్మ. పరమాత్మ


---

ప్రత్యేకమైనవారు. పరమాత్మ మాట్లాడడు, ఆయన ఏమీ చేయడు, ఆయనను ఎవరూ చూడలేదు. ఆయన ఉన్నాడు అంటున్నాముగానీ, అంత వరకే నువ్వు చెప్పుకోవాల్సిందిగాని నువ్వు చూడలేదు. నీతో ఎప్పుడు ఆయన ప్రత్యక్షముగా మాట్లాడలేదు. కానీ మనము గౌరవార్ధము "ప్రతి మాట దేవుడు చెప్పాడు ఇలా” అంటున్నాము. “ఫలానా గ్రంథములో దేవుడు ఈ విధముగ చెప్పాడు” అంటున్నాము. కానీ ఏ గ్రంథములో అన్నా దేవుడు చెప్పాడా అంటే చెప్పలేదు. అయినాగాని మనము ఏమి చెప్తున్నామంటే దేవుని పేరు చెప్తున్నాము. ఎందుకు చెప్తున్నాము? గౌరవార్థముగ చెప్తున్నాము.


అన్నిటికీ పెద్ద ఎవరు? దేవుడు. అన్నిటికీ పెద్ద ఏదైతే ఉంటుందో దాన్ని ‘పెద్ద’ అంటాము. దాన్నే తెలుగులో “బ్రహ్మ” అని అంటారు. 'బ్రహ్మ’ అంటే 'పెద్ద' అని. బ్రహ్మ అంటే ఒక దేవుడు కాదు. బ్రహ్మ అంటే పెద్ద, అన్నిటికీ పెద్ద అని అర్థము. అన్నిటికీ పెద్ద ఎవడైతే ఉన్నాడో వాడే దేవుడు. ఆ దేవుడు ఎక్కడున్నాడు? అంటే దానికి అంతటా ఉన్నాడు అని చెప్పవచ్చుగాని ఇక్కడున్నాడు (ఫలానా చోట ఉన్నాడు) అని జవాబు చెప్పలేము. ఆ దేవుడు మనకు ప్రతి విషయాన్ని తెలియజేస్తున్నాడు అని అంటున్నాముగానీ ఏ విధముగా తెలియజేస్తున్నాడు అనే వివరములోకి పోతే ఆయన మాత్రము ప్రత్యక్షముగా ఎవరితోనూ మాట్లాడడు. ఒక దైవగ్రంథములో ఇదే విషయము వ్రాయబడివుంది. అంతిమ దైవగ్రంథము 42వ సూరా 51వ ఆయత్లో “దేవుడు ప్రత్యక్షముగా ఎవరితోనూ మాట్లాడడు” అంటే దేవుడు నేరుగా ఎవరితోనూ మాట్లాడడు. కానీ తన జ్ఞానాన్ని మూడు విధానాల ప్రకారము తెలియజేస్తాడు. ఆయన ప్రత్యక్షముగ ఎవరితోను మాట్లాడడు. ఆ విధముగ దేవుడు మనకు జ్ఞానాన్ని తెలియజేసాడు, తెలియజేస్తూవున్నాడు.

ఇంతకుముందు కూడా


----

తెలియజేసాడు. "ఇప్పుడు కూడా తెలియజేస్తూ ఉన్నాడు" కానీ ఎట్లు తెలియజేస్తున్నాడు? అంటే తెలియజేసేవాడు దేవుడే, కానీ తన ఆత్మ ద్వారా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు అంతిమ దైవగ్రంథము అనేదాన్ని గురించి చెప్పుకుంటున్నాము. 'దైవగ్రంథము' అనే ఒక పదాన్ని తీసుకుందాము దానిలో ఇంకా ‘దైవగ్రంథము' అనే పదముకంటే 'దైవము' అనే పదము తీసుకుందాము.


దైవము అంటే, ‘దైవము' ఎంతమంది ఉన్నారు? ప్రపంచానికంతా ఒక్కడే ఉన్నాడు. వేరే దైవాలు ఇద్దరు, ముగ్గురు ఎవ్వరు లేరు. ఉండేది ప్రపంచానికంతా సృష్ఠికర్త ఒక్కడే. ఆ సృష్టికర్త ఎవడు? అంటే అతనే దేవుడు. అతనొక్కడే దేవుడు. అతను తప్ప ఎవ్వరు లేరు. ఆయన తెలియజేసి నటువంటిదే జ్ఞానము. ఆయన తెలియజేసినటువంటిదే దైవగ్రంథము. ఆ దైవగ్రంథాలు మూడు విధాలుగ మనకు చేరాయి. అంటే ఒక్కటి చెప్పినా, మూడు చెప్పినా సారాంశము ఒక్కటే! అవి ఒక్కటేగాని, చెప్పడము వేరువేరుగ చెప్పినాము. సమయము వేరు, జాగాలు వేరు అయినా ఇక్కడ చెప్పినేది ఒక దేవుడు, అక్కడ చెప్పినేది వేరే దేవుడు అనేదానికి అవకాశము ఉందా? అంటే లేదు. ఎక్కడ చెప్పినా ఒక దేవుడే చెప్పాడు. అందువల్ల దానిని ‘దైవగ్రంథము' అన్నాము. 'దైవగ్రంథాలు' ఎన్ని రకాలుగ ఉన్నాయి? అంటే మనము మూడు రకాలుగ అని చెప్పుకున్నాము. మూడు రకాలు అంటే చిట్టచివరిలో ఉన్నటువంటి దైవగ్రంథాన్ని 'అంతిమ దైవగ్రంథము’ అని పేరు పెట్టుకున్నారు తప్ప, దానికంటే ముందర ఉన్న మిగతా రెండు గ్రంథములకు 'దైవగ్రంథము' అని పేరు ఎవరూ పెట్టలేదు. భగవద్గీత ఉంది, దానికి దైవగ్రంథము అని పేరు పెట్టలేదు. తర్వాత బైబిలు ఉంది, దానికి దైవగ్రంథము అని పేరు పెట్టలేదు. మా లెక్కలో ఈ రెండు కూడా


---

దైవగ్రంథాలే! కానీ చివర్లో వచ్చినదానిని మాత్రము దైవగ్రంథము అని అన్నారు. అట్ల ఎందుకన్నారంటే, ముందర ఒక పేరు, మధ్యలో ఒక పేరు, వెనుకొక పేరు పెట్టేదానికంటే, అంతటికీ కలిపి ఒక పేరు పెట్టితే బాగుంటుందని 'దైవగ్రంథము' అన్నారు. దైవగ్రంథము ముందర అంతిమ దైవ గ్రంథము అన్నాము.


గ్రంథములో అంతిమ దైవగ్రంథము అంటే చివరి దైవగ్రంథము అని అర్థము. చివరి దైవగ్రంథము అయినపుడు మొదటిది ఉంటుంది, మధ్యలోనిది కూడ ఉంటుంది. ఆవు తోక అంటే తల కూడ ఉంటుంది. ఆవు తోక అన్నపుడు ఆవు తల కూడ ఉంటుంది. ఆవు తల ఉన్నపుడు మధ్యలో కూడ ఉంటుంది. అంతా ఒకటే ఆవే! కాని 'దైవగ్రంథము' అనేది ఒకటే! అంతిమది ఉన్నపుడు ప్రథమది ఉంటుంది. ప్రథమది ఉన్నపుడు మధ్యలోనిది కూడ ఉంటుంది. ఈ రకముగా దైవగ్రంథాలు మనకు మూడు విధములుగా విభజించుకొని చెప్పవచ్చు. ఎందుకు అట్ల చెప్పాలి? అంతా ఒకటే దైవగ్రంథము అని చెప్పకూడదా? అని అంటే, అట్ల చెప్పేదానికి అవకాశము లేదు. ఎందుకు లేదు? అని అంటే, ఒక ఆవు పుట్టిందనుకోండి. ఆవు పుట్టినపుడు దానికి పొదుగు లేదు. దానికి కొమ్ములు లేవు. కాని అపుడు కూడ ఆవే అంటాము దానిని. అర్థమయిందా! ఈ ఆవు పుట్టిన కొంతకాలానికి కొమ్ములు వస్తాయి. అవి ఆవుకు వచ్చిన కొమ్ములే! కొమ్ములు వచ్చినా దానిని ఆవే అంటాము. ఇంకా కొంతకాలానికి దానికి పొదుగు వస్తుంది. అపుడు కూడ దానిని ఆవే అంటాము. దానిని పొదుగు రాకముందు ఒక రకముగ, కొమ్ములు రాకముందు ఒక రకముగ పిలిచి, కొమ్ములు వచ్చిన తర్వాత ఇంకొక రకముగ పిలిచేదానికి అవకాశము లేదు. కాబట్టి వెనకాల ఆవు తోక అని ఎట్లైతే పేరు పెట్టినామో, ఆవు పొదుగు అని


----

ఎప్పుడు పేరు పెట్టినామో, ఆవుకు పొదుగు ఉంటే కొమ్ములుంటాయి, ఆవుకు కొమ్ములుంటే ఆవుకు తల కూడ ఉంటుంది మొత్తము ఉంటుంది. ఆవు అని మనము అర్థము చేసుకోవాలి. ఆ రకముగ దైవగ్రంథము అని అన్నపుడు 'దైవగ్రంథము' ఒక్కటే. అంతిమ దైవగ్రంథము అని అంటే, అది అంతిమది అయి ఉండవచ్చు కానీ మొదటిది కూడ ఉంటుంది అని మనకు లెక్క ఇపుడు ఇలా మూడు రకాలుగ దైవగ్రంథాలు ఉన్నాయి.


ముందు వచ్చిన గ్రంథాలను సమర్థించేదానికే ఖుర్ఆన్ గ్రంథము వచ్చింది. ముందు తల ఉంటేనే నేను తోకను ఉండేది అని చెప్తూ ఉంది. అంతేకదా! తల లేనిది, అది గడ్డి తినంది, పొదుగుగా ఉండి పాలిచ్చేదానికి అవకాశమే లేదు. అక్కడ సక్రమముగ అంతా ఉంటే నా దగ్గర పాలు కూడా ఉంటాయి అని చెప్పింది పొదుగు. అంతే కదా! ఆవు అంతా సక్రమముగ ఉంటే, అది సక్రమముగ పెరిగితే, అది సక్రమముగ తిండి తింటే, తర్వాత నా దగ్గర పాలు కూడా ఉంటాయి. ఆవు అంతా సక్రమమైనది కాదు, పాలు మాత్రమే సక్రమమైనవి అంటే, నా దగ్గర ఎట్లా వస్తాయి పాలు? పాలు కూడా ఉండవు నా దగ్గర. కాబట్టి ముందు వచ్చిన గ్రంథాలు ఏవైతే సక్రమముగ ఉంటే, వాటిలోని సారాంశమే నా దగ్గర ఉన్నది అని అంతిమ దైవగ్రంథము ఏమి చేసిందంటే, భగవద్గీతలో అర్థము కాని విషయాన్ని, బైబిలులో అర్థము కాని విషయాన్ని సారాంశముగ పిండి ఇచ్చింది నీకు పాల రూపములో. నువ్వు ఆవుని ఎట్లున్నా ఫరవాలేదని ఒక సూదితో పొడిస్తే రక్తము వస్తుంది, ఎక్కడ పొడిచినా రక్తము వస్తుంది. కాని పొదుగు దగ్గర పిండి చూడు పాలే వస్తాయి. అంటే ఆవులో ఉండే సారాంశాన్ని తీసుకొచ్చి నీకు తినేదానికి యోగ్యముగ, నువ్వు తాగేదానికి యోగ్యముగ, నీకు జీర్ణమయ్యే రకముగ అందించింది పొదుగు. ఇపుడు


---

ఆవులో పొదుగులాంటిది ఖుర్ఆన్ గ్రంథము, అదియే అంతిమ దైవ గ్రంథము. ఖుర్ఆన్ గ్రంథానికే అంతిమ దైవగ్రంథము అని పేరు పెట్టినాము సరే, ఆ ఖుర్ఆన్ అనే దాంట్లో ఎన్ని వాక్యాలున్నాయి అంటే, 6236 వాక్యాలున్నాయి. అవి ఎన్నైనా ఉండనీ మనకు సంబంధము లేదు. నీకు అర్థమయ్యేదాన్ని తీసుకో దాని ప్రకారము నువ్వు నడుస్తా పోతావు, నీకు నీళ్ళు దప్పిక అయితున్నాయి. ముందుకు పోతే, మంచి ఒక నది ప్రవహిస్తుంది. నది పారేటప్పుడు అక్కడ తాగేదానికి నీళ్ళు కావాలి కదా! ఆ నదిలో నీళ్ళన్నీ నీకు అవసరమా? నీకు ఎంత దప్పిక తీరాలో అంతే అవసరము. ఒక దోసెడు తాగుతావా, రెండు దోసెళ్ళు తాగుతావా, లేకపోతే చెంబుడు తాగుతావా, రెండు గ్లాసులు తాగుతావా, మూడు గ్లాసులు తాగుతావా కడుపు నిండా తాగు. కడుపు నిండిందా చాలు, నీకు కడుపు నిండాలంతే! నదిలో నీళ్ళు అయిపోవాలనేది కాదు ముఖ్యము, నీకు కడుపు నిండాలనేది ముఖ్యము. నీకు దప్పిక తీరాలనేదే ముఖ్యము.


ఆ విధముగా నువ్వు అక్కడికి పోయి దప్పిక తీర్చుకో. అంతే! ఆవు పొదుగులో కూడ దండిగ పాలు ఉంటాయయ్యా! అవన్ని నీకు అవసరమా. నీకు కడుపు నిండేంత వరకే నీకు కావాల్సింది. ఎక్కువ త్రాగితే వాంతికి వస్తుంది. కాబట్టి నీకు ఎంతకావాలో అంత తీసుకో. భగవద్గీతలో ఒక మాట చెప్తాడు. "నిండి నిభిడీకృతముగ ఉండేటటువంటి కాసారము దగ్గరకు పోయి” అంటే ఒక చెరువు దగ్గరకు పోయి, నీకు ఎన్ని నీళ్ళు కావాలో అన్నే తీసుకుంటావు తప్ప, అధికముగ తీసుకుండేదానికి అవకాశము లేదు. నదిలాగే ఖుర్ఆన్ ఉంది, బైబిలు ఉంది, భగవద్గీత ఉంది. నువ్వు అర్థము చేసుకోవాల్సింది ఏమిటో అర్థము చేసుకో, అంతా నీకు అవసరము లేదు. అంతా నీకు అవసరము లేదనేది ముఖ్యము. నీకు ఎంత అవసరమో అంత


---

తీసుకునేదే ముఖ్యము. సరే ప్రథమ దైవగ్రంథము దగ్గరికి పోదాము. మొట్టమొదట పుట్టినేది ఆదే కదా! దాని అర్థము. ఆవులాగ భగవద్గీత ఉంది. ఆవుకు కొమ్ములు పుట్టినట్లే భగవద్గీతకు బైబిలు పుట్టింది. అంటే భగవద్గీతలో ఉండేటటువంటి సారాంశమే బైబిలులో వచ్చేసింది. అలాగే ఖుర్ఆన్గా కూడా వచ్చేసింది. ఈ మూడింటిని కలిపి మనము ఆవు అంటాము. కొమ్ములు వేరు, పొదుగు వేరు, ఆవు వేరు అంటే అది దేనికి పనికిరాదు. అన్నీ కలిపితేనే ఆవు అవుతుంది.


ఈ రోజు భగవద్గీత అని పేరు పెట్టినారు కొంతమంది. భగవద్గీత అంటే ఏమిటి? అని అడిగినాను నేను. ఇంతకు ముందు భగవద్గీతను జాతీయ గ్రంథము చేయాలని చాలామంది పోట్లాడినారు టీ.వీ.లలో కూర్చొని. పెద్ద పెద్ద రాద్ధాంతము చేసుకున్నారు. ఒకరికంటే ఒకరు మించి అరిచినారు. ఏమి ప్రయోజనము? కంఠశోష. దానికి సరైన నిర్వచనము చెప్పమనండి చూస్తాము! నేను చెప్పానన్నమాట, మా దగ్గరికి వచ్చి ఎవరూ అడుగలేదు. కానీ అది 'నా గ్రంథము' కాబట్టి నేను చెప్పాల్సిన పని వచ్చింది. గీత ఒక ఆవు. ముందు కొమ్ములు లేవు దానికి, పొదుగు లేదు. తర్వాత కొమ్ములు వచ్చినాయి, దాని తర్వాత పొదుగు వచ్చింది. అలాగే భగవద్గీత ముందు పుట్టింది. మొట్టమొదట బైబిలు లేదు, ఖుర్ఆన్ లేదు. కొంతకాలానికి బైబిలు దాంట్లోంచి పుట్టుకొచ్చింది. తరువాత దాంట్లోంచి పుట్టుకొచ్చింది ఖుర్ఆన్. 'ఒక ఆవు' అంటే మూడింటిని కలిపి 'ఆవు' అంటాము. నువ్వు వెనుకల పుట్టిన కొమ్ములు పనికిరావు, వెనుక పుట్టిన పొదుగు పనికి రాదు అని తీసేసేదానికి అవకాశము లేదు. కాబట్టి భగవద్గీత అంటే ఆధ్యాత్మిక గ్రంథము మూడింటిని కలిపి ఆధ్యాత్మిక గ్రంథము అన్నాము. బైబిలును కలుపుకొని, ఖుర్ఆన్ను కలుపుకొని అపుడు నువ్వు భగవద్గీత అను.


---

ఈ రెండింటినీ కలుపుకోకుండా నువ్వు కేవలము భగవద్గీత అంటే నీవు దానిని ముక్కలు చేసి మాట్లాడినట్లే. మీరు జాతీయ గ్రంథముగా భగవద్గీతను చేయాలి అని అంటున్నారు. చేయండి, ఎవరొద్దన్నారు భగవద్గీతను జాతీయ గ్రంథముగ చేయాలి అంటే ఏమని చేయాలి, భగవద్గీతతో పాటు బైబిలును చెయ్యి, ఖుర్ఆన్ను చెయ్యి. మూడింటిని కలిపి జాతీయ గ్రంథముగా చెయ్యి. ఎవనికి ఏది అవసరమో దానిని తీసుకుంటాడు. దూడ ఉంది దానికేమి కావాలి? పాలు కావాలి. అది పొదుగు దగ్గరే పాలు తాగుతుంది. అట్లా ఎవరికి ఏది కావాలో అది తీసుకుంటాడు. నువ్వు కావాలంటే మూడింటిని కలిపి జాతీయ గ్రంథము అని చెప్పు. విడగొట్టేదానికి అవకాశము లేదు. ఎందుకు విడగొట్టేదానికి అవకాశము లేదంటే ఇది మాతృగ్రంథము. భగవద్గీతలో ఉండేటటువంటి సారాంశమే బైబిలులో ఉంది. అలాగే ఖుర్ఆన్లో ఉంది. ఖుర్ఆన్ ఏమి చెప్తుంది? నాకంటే ముందు వచ్చిన గ్రంథాలను నేను ధృవీకరిస్తున్నాను, సమర్థిస్తున్నాను, దానికి సాక్ష్యము చెప్తున్నాను అని చెప్పింది. అంటే ఆ జ్ఞానము నిజమైన జ్ఞానము అని నేను చెప్తున్నాను. ఆ జ్ఞానమే నాలో ఉంది అని చెప్పింది.


ఈ విధముగా లెక్కేసుకుంటూ పోతే మనము మూడింటిని కలుపుకొని ఒక గ్రంథము అంటున్నాము. మూడింటిని కలపకుండా ఒక దాన్ని ప్రత్యేకిస్తే అది సంపూర్ణమైన గ్రంథము కాదు. మన మాటల్లోనే ఒకదానిని అంతిమ దైవగ్రంథము అంటున్నాము. ఇంకొకదానిని ప్రథమ దైవగ్రంథము అంటున్నాము. ఇంకోదానిని మధ్యమ దైవగ్రంథము అంటున్నాము. అంటే మొదటి భాగాన్ని తలకాయ అంటున్నాము. చివరి భాగాన్ని తోక అంటున్నాము. మధ్య భాగాన్ని నడుము అంటున్నాము.


----

ఇవన్నీ వేరు వేరు కదా? మొత్తముగా మూడిటిని కలిపి ఆవు అని చెప్పు అపుడు సరిపోతుంది. మూడిటిలో ఉండే జ్ఞానము ఒక్కటే ఉంది వేరేది లేదు. అపుడు నువ్వు మూడింటిని కలిపి ఒకటిగా చెప్పుకోవాలిగానీ వేరు వేరుగా చెప్పుకొనేదానికి అవకాశము లేదు. అట్ల చెప్పుకున్నాడు అంటే వాడు జ్ఞానహీనుడు అని అర్థము, వాడు పూర్తి జ్ఞాని కాదు అని అర్థము. ఏ ముస్లీమయినా బైబిలును, భగవద్గీతను తీసేసి మా ఖుర్ఆన్ గ్రంథమే గొప్ప అన్నా అతనికి కూడా జ్ఞానము లేదు. ఏ హిందువయినాగానీ ఖుర్ఆన్ ముస్లీమ్లది, ఈ బైబిలు క్రైస్తవులది, భగవద్గీత ఒక్కటే మాది అని అనుకుంటే, ఇది పూర్తి జ్ఞానములేని మాటేగాని జ్ఞానము ఉండేమాట కాదు.


ఈ రోజు ప్రతి ఒక్కరు నా మతము, నా మతము, నా మతము అని భేదాలు పెట్టుకొని మాట్లాడుతున్నారు. నా మతము అన్నపుడు నువ్వు ఎవరు? నువ్వు ఎవరి తరపున వచ్చినావు? నిన్ను ఎవడు పంపినాడు? నిన్ను ఎవడైతే పంపించాడో వాని ప్రక్కన ఉండి నువ్వు మాట్లాడాలి. నువ్వు ఒక గుమాస్తావు. నీకు ఒక యజమాని ఉన్నాడు. యజమాని పంపించి ఉంటే నువ్వు వచ్చినావు. యజమాని సొమ్మును నాది అంటావు నువ్వు. యజమాని దేవుడు. యజమానిది ఏదైతే ఉందో అదంతా నీది కావాలి గానీ ఒకటి మాత్రము నాది, మిగతావి నావి కావు అంటే యజమాని ఎట్లా ఒప్పకుంటాడు? కాబట్టి దేవుడు అనేవాడు సర్వులకు ఒక్కడే! జ్ఞానము ఒక్కటే! తర్వాత గ్రంథము కూడ ఒక్కటే! నువ్వు చదువుకో. ఎట్లు చదువుకున్నా ఫరవాలేదు. దానిలోని సారాంశము మాత్రము ఒక్కటే! ఒక అధ్యాయములో ఒక వాక్యములో ఒక విషయము ఉంది. అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్లో “గ్రంథాన్ని పవిత్రుడు తప్ప, అపవిత్రుడు ఎవ్వడూ తాకలేడు" అని ఉంది. పవిత్రుడు తప్ప, అపవిత్రుడు ఎవ్వడూ దాన్ని ముట్టుకోను కూడా


----

ముట్టుకోలేడు అని ఉంది. అని మన ఎదుటనే మనము ఒక ఖుర్ఆన్ గ్రంథాన్ని వేరేవాళ్ళకి ఇచ్చాము. అంటే ఒకరు మాకు ఖుర్ఆన్ గ్రంథము తెలుగులో కావాలి, దానిని మేము చదువుతాము అంటే తెలుగులో ఉండే గ్రంథాన్ని నేను ఇచ్చాను. ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకుంటే ఇంకో ఆయన నేను చూస్తానని దానిని తీసుకున్నాడు, మళ్ళీ ఆయన దగ్గరి నుండి ఇంకొకాయన నేను చూస్తానని ఇలా ఒక పదిమంది ఆ గ్రంథాన్ని ముట్టుకున్నారు.


ఇపుడు వీళ్ళు ముట్టుకున్నోళ్ళంతా పవిత్రులేనా? గ్రంథములో ఏమని చెప్పారు? ఖుర్ఆన్ గ్రంథాన్ని అపవిత్రుడు ఎవ్వడూ ముట్టుకోలేడు, తాకను కూడ తాకలేడు, పవిత్రుడు మాత్రమే తాకగలడు అని ఉంది. వాస్తవమే! నూటికి నూరుపాళ్ళు వాస్తవమే అది! అపవిత్రుడు ముట్టుకోను కూడా ముట్టుకోలేడు, తాకలేడు మనము ఇచ్చిన గ్రంథాన్ని అపవిత్రులు కూడా తాకినారే! మరి దానికెట్ల జవాబు? అంటే దేవుని మాట ఎప్పటికీ పొల్లుపోదు అది దేవుడు చెప్పినమాట. అది అసత్యము కాదు. ఎందుకంటే వాడు గ్రంథాన్ని, పైన ఉండే కాగితాలను, అట్టలను ముట్టుకున్నాడు. కానీ లోపల ఉండే సారాంశాన్ని ముట్టుకోలేదు. ఎవడైనాగానీ దానిలో ఉన్న సారాంశము ఏదైతే ఉందో అది బుర్రకు అర్థమైతే వాడు ముట్టుకున్నట్లు. వాని బుద్ధికి అర్థమైతే వాడు ముట్టుకున్నట్లు. అర్థము కానపుడు ఏం చేస్తావు? ముట్టుకోనట్లే! తౌరాత్ గ్రంథాన్ని తెలియకుండ, దానిని చదవకుండ, దాని సారాంశము తెలియకుండ మిగతా ఏ గ్రంథాలు చదివినప్పటికీ వాడు గ్రంథాలను మోసే గాడిదతో సమానమే అని ఖుర్ఆన్ గ్రంథములోనే ఉంది. అర్థమయిందా! గ్రంథాలు మోసే గాడిదతో సమానమే అంటే ఎంత గొప్పదనము ఉంది చూడు దాంట్లో మనకు.


----

అందువలన మనము ఏమి చెప్పుచున్నామంటే ఈ తౌరాత్లో, 'రాత్' అంటే ఏమిటో మీకు తెలుసు. చీకటితో కూడుకొన్నటువంటిది అని. 'తౌ” అంటే “మూడు” అని తెలుసు. 'తౌరాత్' అంటే “మూడు రాత్రులు” అని అర్థము. 'మూడు రాత్రులు' అంటే 'మూడు కనిపించనటువంటివి'. మూడు రాత్రులు అంటే మూడు ఆత్మలే మనకు మూడు రాత్రులుగా ఉన్నాయి. ఇవి ఎవ్వరికీ కనిపించవు, ఎవ్వరికీ తెలియబడవు. ఈ మూడు రాత్రుల (ఆత్మల) సారాంశాన్ని కల్గి ఉన్నటువంటి గ్రంథాన్ని తౌరాత్ గ్రంథము అని అన్నాము. ఈ మూడు ఆత్మల సారాంశము కల్గినటువంటి గ్రంథము మొట్టమొదట వచ్చింది. తర్వాత అదే మూడు ఆత్మల సారాంశము కల్గినటువంటి గ్రంథము రెండోది కూడా వచ్చింది. మళ్ళీ అదే మూడు ఆత్మల సారాంశము కల్గినటువంటి గ్రంథము మూడోది కూడా వచ్చింది. ఆ మూడోదానిని మనము అంతిమ దైవగ్రంథము అన్నాము. ఈ అంతిమ దైవ గ్రంథములో ఏదైతే ఉందో అదే మొదటి దైవగ్రంథములో ఉంది. మొదటి దైవగ్రంథములో ఏదైతే ఉందో అదే మధ్యమ దైవగ్రంథములో వుంది. ఈ రకముగా మూడు దైవగ్రంథాల్లోనూ ఒకే సారాంశము ఉంది. ఇప్పుడు ఒక హిందువు ఒక గ్రంథము చదివేదానికే మాకు తీరిక లేదు, ఓపిక లేదు, అర్థము కాలేదు. మా మతములో ఉండేదే మేము చదవలేకున్నాము అని అంటాడనుకో. మా భగవద్గీతే మేము చదవలేదు. ఇంక వేరే గ్రంథాలను మేము ఎక్కడ చదివేది! అవి చదివినా మాకు అర్థము కాదు అని అన్నాడనుకో. అంటే నువ్వు అవి చదవకున్నా ఫరవాలేదు. నీ గ్రంథము ఒకటి అర్థమయితే మూడు అర్థమయినట్లే నీకు. ఎందుకంటే ఒకటి అర్థమైందనుకో మూడు అర్థమైనట్టే! ఒకటి అర్థము కాలేదనుకో మూడు అర్థము కానట్లే.


----

తౌరాత్ గ్రంథాన్నిగాని, ఇంజీలు గ్రంథాన్నిగాని, అంత్యములో మీకిచ్చినటువంటి ఖుర్ఆన్ గ్రంథాన్నిగానీ మీరు అర్థము చేసుకోలేకపోతే ఈ మూడు గ్రంథాలను అంటే భగవద్గీతను గానీ, బైబిల్నిగానీ, ఖుర్ఆన్నిగానీ, మీరు అర్థము చేసుకోలేక పోతే మీరు ఏ ధర్మములోనూ లేనట్లే! అని ఖుర్ఆన్ 5వ సూరా, 68వ ఆయత్లో చెప్పారు. నాకు భగవద్గీత తెలుసు అని ఒకడన్నాడనుకో, వాడే చెప్పుకుండే దానికి హిందువు కూడ కాదు. నాకు బైబిలు ఒక్కటే తెలుసు మిగతా ఖుర్ఆన్, భగవద్గీత నాకు తెలియదు అన్నావనుకో నువ్వు అసలు క్రైస్తవుడివే కాదు. అలానే ఒక ముస్లీమ్ నాకు ఖుర్ఆన్ ఒక్కటే తెలుసు, మిగతా గ్రంథాలు నాకు తెలియదు అంటే అతను ముస్లీమే కాదు. ఎందుకంటే నీ గ్రంథానికే మాతృగ్రంథము అయిన భగవద్గీత తెలియకపోతే ఎట్ల ముస్లీమ్ అవుతావు నువ్వు? కాబట్టి ఈ రకముగ లెక్కేసుకుంటే దేవుడు అనేవాడు సంపూర్ణముగ మూడు గ్రంథాల్లోనూ ఉన్నాడు. దేవున్ని గురించి సంపూర్ణముగ తెలుసుకోకపోతే నువ్వు సంపూర్ణమైన ముస్లీమ్ కాదు. పేరుకు ముస్లీమే, పేరుకు హిందువే, పేరుకు క్రైస్తవుడే! వాడు నిజముగా సంపూర్ణమైన హిందువు కాదు, సంపూర్ణమైన ముస్లీమ్ కాదు. మరి ఎట్లా మనకు? నువ్వు మూడు గ్రంథాల విషయము తెలుసుకో! సరిపోతుంది. మూడు గ్రంథాల విషయము ఎలా తెలుసుకోవాలి? భగవద్గీతలోనేమో 18 అధ్యాయాలు ఉన్నాయి, బైబిలులోనేమో చిన్న చిన్న బుక్కులు 66 కలిపి దానిని బైబిలు అంటాము. ఖుర్ఆన్లోకి వచ్చేసరికి 6236 వాక్యములు అని చెప్పారు. ఒకటి అర్థము కావాలంటేనే కష్టమే, మేము ఎప్పుడు చదివేది ఇవన్ని అని నువ్వు భయపడవచ్చు. దానికి నేనేమి చెప్పుచున్నానంటే, ఇప్పుడు భగవద్గీత 18 అధ్యాయాలు ఉంది. అది ఉండేది 17 అధ్యాయాలే అని చెప్పాము.


----

భగవద్గీత 18 అధ్యాయాలు కాదు. ప్రపంచమంతా 18 అధ్యాయాలు అని పేరు పెట్టింది కదా! నువ్వు 17 అధ్యాయాలే అంటావు ఎందుకు? అని అడుగవచ్చు.


ఇపుడు పేషెంట్ వైద్యుని దగ్గరకు పోతాడు వైద్యము కోసము. పేషెంట్ తన గోడు ఏమిటో చెప్పుకుంటాడు. నాకు దగ్గుంది, జ్వరము ఉంది, రోగము ఉంది అని చెప్పాడు. వాడు చెప్పుకుంటున్నది రోగము. మనకు వైద్యము ఏది? అంటే డాక్టర్ చెప్పిందే వైద్యము. ఇపుడు  మందుల పట్టి డాక్టర్ ఇస్తాడు. డాక్టర్ ఏది వ్రాసి ఇచ్చినాడో దానిని మనము వాడుకోవాలన్నమాట. దానిని వైద్యము అంటాము. వైద్యము అని దేనికి పేరు పెట్టినాము? డాక్టర్ వ్రాసి ఇచ్చిన దానిని వైద్యము అంటాము. ఇప్పుడు మనకు కావల్సింది వైద్యము, రోగము కాదు. ఆ రకంగానే భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో 17 అధ్యాయాలే నీకు పనికి వచ్చేటివి. అయితే బైబిలులోకి వచ్చేసరికి 66 లో 4 (నాలుగే) నీకు పనికి వచ్చేటివి, 62 నీకు పనికి రావు.


కాబట్టి మేము బైబిలు నుండి నాలుగే నాలుగు తీసుకున్నాము దాంట్లోనుండి. 62 ప్రక్కన పెట్టినాము. బైబిలులో 66 ఉంటే 62 తీసి ప్రక్కన పెట్టినావు నువ్వు! అని అంటే అవి నాకు తెలియవయ్యా! నాకు తెలిస్తే కదా! నేను చెప్పేది, నాకు తెలిసినేది నాలుగే. నేను ఆ నాలుగు గురించి చెప్తా. నువ్వు మోక్షము పోకపోతే అడుగు. తరువాత మేము ఏమంటున్నాము అంటే ఖుర్ఆన్ గ్రంథములోకి వస్తాము. అవి ఆరువేల చిల్లర ఉన్నాయి. ఇపుడు అన్నిటికి నేను వ్రాశానా అంటే 6236 లో కేవలము దగ్గర దగ్గర మేము 350 లకే వివరము వ్రాశాము. 750 పేజీల గ్రంథములు రెండు అయినవి. అన్ని వాక్యాలకు వ్రాస్తే, చాలా పెద్ద గ్రంథము అవుతుంది.


---

పెద్ద బుక్కు అయితే మనము చదవలేము, అయ్యేపని కాదది. అంత అవసరము లేదు మనకు. నేను ముందే చెప్పాను ఒక మాట, "నిండి నిభిడీకృతమైనటువంటి కాసారము దగ్గరకు పోయి, నీకు తగినన్ని నీళ్ళే నువ్వు తాగుతావుగానీ అనవసరముగ నీవు అన్నీ తీసుకోవు." గ్లాసు అవసరమా రెండు గ్లాసులు అవసరమా అంతే తాగుతావు. కడుపు నిండుతుంది. ఇంక అవి వద్దు నాకు అని వస్తావు. గ్రంథములో కూడా అవసరమైనవే తీసుకోవాలి.


ఆ రకముగానే నువ్వు భగవద్గీతలోకి పో, బైబిలులోకి పో, ఖుర్ఆన్లోకి పో, ఎక్కడన్నాపో నీకు అవసరమైన జ్ఞానాన్ని నువ్వు స్వీకరించు చాలు. నువ్వు బయటపడతావు. నీకు దేవుడు ఎంత అందించినాడో అంత చాలు. నీవు కొంతైనా తెలుసుకొని నువ్వు తృప్తిపడు. కొంత తిన్నా కడుపు నిండుతుంది, చాలా తినవలసిన పని లేదు. ఖుర్ఆన్ గ్రంథములో నాకు ఇష్టమైనటువంటి సూరా ఒకటుంది అని నేను చెప్పా. 112వ సూరా నాకు ఇష్టమైంది. అందులో నాలుగే నాలుగు వాక్యాలున్నాయి. నాలుగు వాక్యాలు చాలు. దాంట్లో నుండి బయటపడొచ్చు. అట్లాగనే ఒక్కొక్క గ్రంథములో ఇష్టమైంది ఒకటి ఉంటుంది, దాంట్లో చాలా పెద్ద సారాంశము ఉంటుంది. అందరికి అర్థమై, అందరూ బయటపడాలంటే ఒక్కొక్క దాంట్లో నుండి ఎంతెంత అవసరమో అంత ఇవ్వాలి. ఆ రకముగా నేను అవసరాన్ని ఏర్పరిచి భగవద్గీతలో మీకు జ్ఞానాన్ని అందించడము జరిగింది. అదే రకముగా ఖుర్ఆన్ గ్రంథములో కూడ కొన్ని వాక్యాలకే అందించాము. కానీ అందించిన వాక్యాలు చదువుకుంటే ఇంక వేరేవి మీకు అవసరము లేదు. ఆ వాక్యాలు చదువుకుంటే బైబిలులో ఉండేది ఉంది దాంట్లో. భగవద్గీతలో ఉండేది కూడా ఉంది. ఖుర్ఆన్లో ఉండేది అందులో ఉంది.


----

మూడు గ్రంథాల సారాంశము అందులో ఉంది. ఏదైతే ఖుర్ఆన్లో చెప్పబడిందో అది భగవద్గీతలోని సారాంశమే!


అది మీకు “అంతిమ దైవగ్రంథములో జ్ఞాన వాక్యాలు” అనే పేరుతో మీకు ఇచ్చామన్నమాట. కానీ మనకు అది ఒక జ్ఞాననిధి. దానినుండి మనము ఎంతవరకు తెలుసుకొనేవాళ్ళు ఉన్నారు, తెలుసుకోలేనోళ్ళు ఉన్నారంటే రకరకాల వ్యక్తులు ఈ రోజు ఉన్నారు. కానీ అందరు తెలుసుకుండే దానికి అవకాశము ఉందా అంటే లేదు. దేవుడు ఒకమాట చెప్పినాడు ఎవడైతే నాకు ఇష్టుడో, వానికి మాత్రము నా జ్ఞానము అర్థమయ్యేటట్లు చేస్తాను. మిగతా వాళ్ళకు నా జ్ఞానము అర్థము కాకుండ చేస్తాను. వేరే రకముగా అర్థమయితుంది వానికి, వాడు చదువుకున్నాగానీ, వాడు వేరే రూట్లో పోతాడు. తప్పుదారిలో పంపిస్తాను వాళ్ళని నేను. నా దారిలోనికి రానివ్వను, అజ్ఞాన మార్గములోనికి పంపిస్తాను అని చెప్పాడు. అజ్ఞాన మార్గములోనికి ఎందుకు పంపిస్తాడు? అంటే ఆయనకు ఇష్టము లేదు. ఎందుకు ఇష్టము లేదు అంటే వాని భావాలు సరిగా లేవు. దేవునికి దగ్గరగ ఉండే భావాలు కాదు. అవి దేవునికి వ్యతిరేఖమైన భావాలు. లోపల భావాలన్నీ దేవునికి వ్యతిరేఖమైన భావాలే! కాబట్టి నాకు వాడితో సంబంధము లేదు, నా జ్ఞానము వానికి అంటుకోదు. మీరు తీసుకొని పోయి అట్లాంటివానికి నా గ్రంథము ఇవ్వండి వాడు తీసుకోడు. 'గురువు' అనే గ్రంథాన్ని చూపిచ్చి ఇది మంచి జ్ఞానము బాగుంది అని చెప్పి ఇవ్వండి. వాడు నాకు వద్దు అంటాడు. నాలుగు రోజులు పెట్టుకొని ఐదవ రోజు నీకిచ్చేస్తాడు. ఏమీ లేదు దాంట్లో అంటాడు. వాడు ముట్టుకొని కూడ ఉండడు దానిని అసలుకు చదివి ఉండడు. చదివినాను ఏమీ లేదు దాంట్లో, నీకు ఎలా కన్పించిందో ఏమో! దాంట్లో ఏమి లేదుపో! అని ఇచ్చేస్తాడు.


---

ఆ రకముగా దేవుడు వాళ్ళని తీర్చిదిద్దింటాడు. అందువల్ల అటువంటి వాళ్ళను గురించి మనము వదిలేస్తాము. ఆ రకముగా మనిషి ఏమి చేస్తున్నాడంటే, దేవుడు నిన్ను పుట్టించి, మంచి హార్ట్ ఇచ్చి, మంచి కిడ్నీలు ఇచ్చి, మంచి కన్నులు ఇచ్చి, మంచి చెవులు ఇచ్చి, ఇన్ని 25 పరికరాలు, అన్ని ఒకదానికొకటి అతికిచ్చి, ఒక మనిషిగా నువ్వు బ్రతుక్కోరా అని నిలబెట్టినాడు.

ఇపుడు మనకు దేవుడు మూడు గ్రంథాల రూపములో జ్ఞానాన్ని ఇచ్చి, మీరు ఈ జ్ఞానాన్ని తెలుసుకోండని తెలియజెప్తే మూడు గ్రంథాల జ్ఞానాన్ని మనము వాడుకుంటున్నామా? దానిని చెప్పుకుంటున్నామా? దాన్ని ఉపయోగించుకుంటున్నామా? ఏమాత్రము లేదు. దాన్ని రాజకీయము చేస్తున్నాము. ఒక గ్రూపు ఉంటుంది ఏయ్! ఇదే జ్ఞానము, ఇట్లే చెప్పాలి, వేరుగ చెప్పకూడదు అంటారు. గ్రంథములో ఉన్నది కదా! అని మనమంటే, గ్రంథములో ఉండేది చెప్పకూడదు, మేము చెప్పినేది చెప్పాలి అని వాళ్ళంటారు. ఈ మధ్యన ఒక సినిమా P.K. అని వచ్చింది. వివాదస్పదమై పోయింది. అది కాన్సిల్ చేయండి ఆ సినిమాను వేయకూడదు అని కొందరు అన్నారు. ఎందుకు వేయకూడదు? అని ఒకరు అడిగినారు. దానిలో కథ మా మనోభావాలను దెబ్బతీస్తున్నాయి అన్నారు. మేమేమంటున్నా మంటే, ఏముంది దాంట్లో మనోభావాలు దెబ్బతీసేదానికి? సత్యము చెప్పినారు. అంతేగదా!



ఒక వ్యక్తి వచ్చినాడు. దేవుడు అంటే ఎవరు? అని ప్రశ్న వేసుకున్నాడు. వానికి దేవుడు ఎవరో అర్థము కాలేదు. ఇంకొకడు చెప్పినాడు. దేవుడంటే ఈ దేవుడు కాదుపోరా, ఆ చర్చిలోకి పో అని చెప్పినాడు. అక్కడికి పోయి చూస్తావుంటే అక్కడా లేడు. అక్కడ ప్రక్కకు పో అన్నారు.


---

ఇంకొక చోటికి పోయినాడు, ఎక్కడికి పోయినా దేవుడు అర్థము కాలేదు వానికి చర్చీకి పోలేదా, మసీదుకు పోలేదా, ఇంకొకదానికి పోలేదా, గురువు దగ్గరికి పోలేదా? అన్నిచోట్లకి పోయి చూసినాడు. ఎక్కడా దేవుడు కన్పించలేదు నాకు అంటాడు. నేను నమ్మకముగా చేస్తున్నాను కదా! నాకు ఎవ్వడూ కన్పించలేదే అంటాడు.


దేవుడు అనేవాడు ఎవడైతే ఉన్నాడో, మీరందరు ఎవరినైతే పూజ చేస్తున్నారో, వాళ్ళందరి దగ్గరికి పోవడము జరిగింది. అందరిని ప్రశ్నించడము జరిగింది. ఎక్కడా కన్పించలేదు. అట్లకాదు, భక్తి విశ్వాసాలతో ఉండాల అని చెప్పితే సరేలే మసీదుకు పోయి వాళ్ళ దగ్గర నమాజ్ చేస్తాడు. వంగి చేయలేదా? చేసినాడు. క్రైస్తవుల దగ్గరికి పోయి నీళ్ళలో బాప్తిస్మము తీసుకుంటాడు. మామూలు గురువుల దగ్గర ఉపదేశము తీసుకుంటాడు. అన్నీ చేస్తాడు మళ్ళీ. అన్ని చేసినా అట్ల కూడా కనపడలేదు. ఒక్క దేవున్ని ఏమన్నా ప్రశ్నించి అడిగి ఒక దేవున్ని ఏమన్నా

కించపరిచినారా? హిందువులు ఏమి చేసినారు అంటే ఆ సినిమాని రిలీజ్ చేయకుండా ఆపి వేయాలి అన్నారు. అది పెద్ద తగాదా చేసినారు. మా మనోభావాలు దెబ్బతినేటట్లుగా ఉన్నాయి అంటే, మనోభావాలకి ఈ జ్ఞానానికి ఏమి సంబంధము అని ప్రశ్న వేస్తున్నాము మేము. మనోభావాల వెంట మనిషి పోతే బాగుపడతాడా ఎవడైనాగాని? ఒక దొంగకు మనోభావము ఏముంటుంది? పొద్దున లేచినప్పటినుండి వాని చింత దొంగతనము చేయాలని. వాని మనోభావము అది. పోలీసోళ్ళు ఏమి చేస్తారంటే తీసుకొని పోయి జైల్లోకి వేసినారు వానిని. వాడు ఏమని కొట్లాడాలా? మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు అని కొట్లాడేదానికి అవుతుందా, ఆ విధమైన మనోభావాలు పనికి రావు అంటాము మనము.


---

కొంతమంది పనికి వచ్చే మనోభావాలు పట్టుకొని, పనికిరాని మనోభావాలు అంటారు. ఈ రకముగా ఏవి పనికొచ్చేవి, ఏవి పనికిరానివి చూసుకొని వాటిని వాడుకోవాలి కానీ అన్నీ మనోభావాలు అనడము తప్పు కదా!



ఒక చర్చావేదికలో ఓ స్వామీజీ దానిని సమర్థిస్తూ తప్పు ఏముంది ఆ సినిమాలో? అది మంచిదే. దానికి ట్యాక్స్ లేకుండా చేసి ప్రజలందరు చూసేటట్లు చేయాలని అన్నాడు. దానికి కొందరు ఆయన మీదికి ఏకధాటిగా గట్టిగ మాట్లాడి ఆయనను ప్రశ్నలేస్తున్నారు. ఏమని? నేను ప్రతిమను పెట్టుకొని పూజ చేస్తాను, నీకేమైనా ఇబ్బందా? అని అడిగారు. ఎవరికేమి ఇబ్బంది నీ ఇష్టము ఎట్లన్నా పో. ఇబ్బంది ఏమి అంటే, నువ్వు మూర్తిని పెట్టుకొని పూజ చేయి. మేము వద్దని చెప్పలేదు. ఇపుడు స్కూలుకు పోతాను మీకేమైనా ఇబ్బందా? అంటే ఎందుకు వద్దంటాము మేము. స్కూలుకు పో! మాకేమి ఇబ్బంది లేదు. చదువు నేర్చుకునేదానికి కదా పోయేది నువ్వు. కాని పదేండ్లు ఒకటే క్లాసులో కూర్చుంటే ఏమంటాము వానిని? బుద్ధిలేని వాడు అని అంటాము. ఎవడైనా తిడతాడు. మీ ఇంట్లో వాడే తిడతాడు. నిన్ను. పదేండ్లు ఒకటే క్లాసులో కూర్చుంటే! ఎట్లా? దానికంటే ముందు స్టేజికి పో, తరువాత క్లాసుకు పో, నువ్వు ముందుకు పో. దేవుడు అనేదానికి గుర్తింపుకోసము నువ్వు ఒక ప్రతిమను పెట్టుకొని మొక్కు. చిన్న పిల్లోళ్ళకి మనమేమి చెప్తామంటే నీకు ఒక బూచోడు ఉన్నాడు అని భయము చెప్తాము. బూచోడు అనేవాడు ఉన్నాడా? లేడు. అయినా లేనోన్ని తీసుకొని వచ్చి పెట్టి చూపిస్తారు. వానికి కొమ్ములున్నాయి, కోరలున్నాయి, గోర్లున్నాయి పట్టుకొని పోతాడు అదీ ఇదీ అని అంటాము. దానిని చిన్న పిల్లవాడు నమ్ముతాడు. పెద్ద అయిన తరువాత ఏయ్ అదంతా లేదు. అది తెలివితక్కువ అపుడిది. చిన్నపిల్లలపుడు చెప్పి ఉంటారు. పెద్ద అయిన తర్వాత అది


----

అవసరము లేదు. బూచోడు లేడు, ఎవడూ లేడు. అదంతా అబద్దాలు అని చెప్తాము.


ఆ రకముగా ఒక మూర్తిని పెట్టి నమ్ముకోండయ్యా! పురాణాల్లో వ్రాసినారు పిల్లపుడు. తరువాత ఎన్నేండైనా దాన్ని పట్టుకొని ఊగులాడడ మేందయ్యా! భగవద్గీత ఏమి చెప్పింది? బైబిలు ఏమి చెప్పింది? ఖుర్ఆన్ ఏమి చెప్పింది? భగవద్గీత మొక్కమని చెప్పిందా? చెప్పలేదు కదా అట్ల! మేము ఇట్లే ఉంటాము, మేము హిందువులము, మేము ఒక దేవున్ని పెట్టుకొని పూజ చేస్తాము. మా హిందుత్వములో మీరు ఎందుకు చెయ్యి పెడుతున్నారు? మా హిందుత్వాన్ని ఎందుకు నాశనము చేస్తున్నారు? అంటారు కొందరు హిందుత్వము అంటే అదా అని అడుగుతున్నాము? హిందుత్వానికి ఒక భగవద్గీత గ్రంథము ఇచ్చాడు దేవుడు. దానిలో అలా చెప్పారా? అని అడుగుతున్నాము. అంటే ప్రప్రథమములో ఏమి దేవుడు అనేవాడు తెలియదు కాబట్టి, సృష్టి ఆదిలోనే మొట్టమొదటనే ఒక శివలింగాన్ని పెట్టి దేవుడు ఇట్లుంటాడు అని చూపించినారు మీకు. దానికి ముక్కు ముఖము లేదు శివలింగానికి. అంటే రూపములేనటువంటి వాడు దేవుడు అని చూపించారు, శివలింగాన్ని పెట్టి. దానికి కూడ రూపము పెట్టి మళ్ళీ దేవున్ని చేసినారు పేరు శివుడు అని అన్నారు. వాస్తవముగ రూపములేని దేవుడాయన. తర్వాత ఒక ప్రతిమను పెట్టి చూపించారన్నమాట. అంటే రూపము లేని దేవుడున్నాడు. ఆ రూపములేని దేవుడు ఏమి చెప్తాడంటే తన జ్ఞానాన్ని తెలియజేసేదానికి రూపము తీసుకొని వచ్చి మీకు చెప్పిపోతాడు. అది భగవద్గీతలో ఉంది. బైబిలులో ఉంది. ఖుర్ఆన్ గ్రంథములో కూడ ఉంది. ఖుర్ఆన్ గ్రంథములో 15వ సూరాలో 29వ ఆయత్లో ఏమనుంది? మట్టితో బొమ్మను చేసి అందులో “నా ఆత్మనే ఊది, నా ప్రతినిధిని పంపిస్తాను” అని చెప్పినాడు.


----

నా ప్రతినిధిని ఎట్ల పంపిస్తాను? ఒక బొమ్మను తయారు చేసి నా ఆత్మనే అందులో నింపి పంపిస్తాను. పంపించినపుడు నా పరిపాలన ఉంది కదా! ప్రపంచమంతా నా దూతలున్నారు కదా! అపుడు నా దూతలకు తెలుసు నా అత్మ ఎవరో! నేను వస్తున్నాని తెలుసు. వచ్చినోడు నేను కాదు అని తెలుసు. కానీ మారువేషములో నేను వస్తున్నానని తెలుసు. కాబట్టి యజమాని వస్తున్నాడంటే సేవకులంతా ఎట్లుంటారు? భయభక్తులతో ఉంటారు. నమస్కారము చేస్తారు. ఆ రకముగనే బారులు తీరి నమస్కారము చేస్తారు. దేవదూతలంతా బారులు తీరి నమస్కరిస్తారు. సాష్టాంగ నమస్కారము చేస్తారు. ఖుర్ఆన్ గ్రంథములో సాష్టాంగ నమస్కారము అనేది అక్కడొచ్చింది. దేవదూతలు సాష్టాంగ నమస్కారము చేస్తారు. నా ప్రతినిధి. ప్రతి అంటే జిరాక్స్ లాంటి వాడు. అంతేకదా! ఒరిజినలే జిరాక్స్ అయి వస్తుంది. నేను కాకుండ నా ప్రతినిధి వస్తాడు. అంటే ఆ సమాచారమంతా నేనే. పేపరు వేరే. అంతేకదా! జిరాక్స్ పేపరు ఉన్నట్లు ఉంటాది. ఒరిజినల్ పేపరు వేరే కాని సమాచారము అదే. ఆ రకముగా శరీరముతో దేవుడు వస్తాడు. అతన్ని ప్రతినిధి అంటాము. ఆయనను 'భగవంతుడు' అని పేరు పెట్టుకున్నాము మనము.



ఖుర్ఆన్ గ్రంథములో భగవంతుడు వస్తాడని? ఉంది. వచ్చినపుడు దేవదూతలంతా నమస్కారము చేస్తారు అని ఉంది. దేవుడు రాడని ఎక్కడా లేదు. వస్తాడనే ఉంది. మీరు కూడ నమస్కారము చేయండి మీకు తెలిస్తే. తెలిసి మీరు నమస్కారము చేయలేదనుకో! ఇబ్లీసులు మీరు అని చెప్పినాడాయన. ఇబ్లీసు అని పదము పెట్టినారు దాంట్లో. ఇబ్లీసు అంటే మాయతో కూడుకొని ఉన్నటువంటి వాళ్ళు అని. అజ్ఞానముతో కూడుకున్న మనుషులు మీరు అని చెప్పినారు. 15వ సూరా 30వ వచనములో


---

చెప్పారు. మీరు నమస్కారము చేయాలి. మీరు నమస్కారము చెయ్యకపోతే ఇబ్లీసులతో సమానము అన్నారు. 29వ ఆయత్లో నా ప్రతినిధి వస్తాడు. నా ప్రతినిధిలో నా ఆత్మను నింపి పంపిస్తాను. నా ఆత్మతో వచ్చిన నా ప్రతినిధికి దేవదూతలంతా నమస్కారము చేస్తున్నారు. వాళ్ళకు తెలుసు. ఒకవేళ మీకు తెలిస్తే మీరు నమస్కారము చేయండి అని ఉంది. దేవుడు 3వ సూరాలో 7వ ఆయత్లో ఈ గ్రంథములో 'ముహ్కమాత్' అనేటటువంటి స్థూలమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. 'ముతషాబిహాత్' అనేటటువంటి సూక్ష్మమైన వాక్యాలు కూడ ఉన్నాయి. ఎన్నో సూక్ష్మమైన వాక్యాలకు వివరము నాకు తప్ప ఏ మానవమాత్రునికి తెలియదు. దేవునికి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఖుర్ఆన్ వుండేటటువంటి కొన్ని వాక్యాలకు ఆయనే తెలియదు అన్నపుడు మనకెలా తెలుస్తాయి అంటే, బుద్ధి, శ్రద్ధ ఉన్నోడు తెలుసుకుంటాడు, గ్రహించగల్గుతాడు. గ్రహించగల్గుతాడు అంటే, చెప్తేనే కదా గ్రహించేది. చెప్పేవాడుంటే గ్రహిస్తాడు ఎవడైనాగాని. చెప్పేవాడున్నాడు, నా ప్రతినిధి వస్తాడు అని చెప్తున్నా కదా! నా ప్రతినిధి వస్తాడు చెప్తాడు మీరు గ్రహించుకోండి. బుద్ధి ఉన్నోడు గ్రహించుకుంటాడు. శ్రద్ధ ఉన్నోడు గ్రహించుకుంటాడు. లేనోడు గ్రహించుకోలేడు అని అన్నాడు దేవుడు.


కానీ వచ్చి చెప్పేది మనిషి కాదు, నా ప్రతినిధి. మానవ మాత్రులకు తెలియదు ఇది. నా ప్రతినిధికే తెలుసు, ఆయనే చెప్పుతాడు. కాబట్టి ఎంత పెద్ద వాక్యమైనాగాని మీకు సులభముగ తెలియబడుతుంది. ఖుర్ఆన్ గ్రంథములోని ముతషాబిహాత్ అనే వాక్యాలు తెలియబడతాయి మీకు. కాని ఖుర్ఆన్ గ్రంథములోని ఒక వాక్యము ఉందనుకోండి. దానిని తీసుకొని బాగా తర్ఫీదు పొందినటువంటి శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు పరిశోధన చేసి వేయి సంవత్సరాలకైనా రిజల్ట్ చెప్పలేరు ఒక వాక్యానికి. అటువంటి


----

వాక్యాలు సులభముగా మీకు తెలియబడతాయి. అర్థమయిందా! 6వ సూరాలో 95వ వాక్యము ఉంది. జీవమున్నది జీవము లేనిదాని నుండి బయటపడుతుంది. అలాగే జీవము లేనిది జీవమున్న దాంట్లో నుండి బయటపడుతుంది. దానికి ఇంతవరకు కరెక్టు జవాబు ఎవరూ చెప్పుకోలేదు. ఖుర్ఆన్ గ్రంథములో సరైన జవాబు వ్రాసుకోలేదు. అట్ల జవాబు లేనటువంటి ప్రశ్నలు ఖుర్ఆన్ గ్రంథములో చాలా ఉన్నాయి. ఇంతకు ముందు మీటింగ్ లో కూడ చెప్పుకున్నాము. ఏడు ఆకాశాలు ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఉన్నాయి అని. ఎక్కడున్నాయి ఏడు ఆకాశాలు? అంతా ఒక్కటే ఆకాశము ఉంది. సైంటిస్టులు ఎవరూ దాన్ని నిరూపించలేరు కానీ జ్ఞానములో మాత్రము సూక్ష్మముగా తెలియబడతాయి. ఈ రకముగా లెక్కేసుకొని చెప్పుకొంటే మనకు జ్ఞానమనేది మహోన్నతమైనటువంటిది. మహోన్నతమైనదని దేవుడే పేరు పెట్టినాడు. మనము చెప్పుకొనేది కాదు. మొట్టమొదటే దేవుడే చెప్పాడు. నేను మొట్టమొదట మీకు ఏడు ఆయత్లను ఇచ్చాను. తర్వాత మహోన్నతమైన ఖుర్ఆన్ గ్రంథాన్ని కూడ ఇచ్చాను. ఏడు ఆయత్లు మాటిమాటికి ప్రస్ఫుటమైతున్నాయి అని చెప్పాడు. ఇపుడు మనము ఏమనుకున్నామంటే అక్కడ కూడా పొరపాటుపడినాము. సూక్ష్మమైనటువంటి విషయము తెలియకపోతే మనము పొరపాటు పడేదానికి అవకాశము ఉంది. ఎక్కడైతే పొరపాటు పడేదానికి అవకాశము ఉందో అక్కడ ఒక హెచ్చరిక చేసి ఉంచాడాయన. మీరు ఎటువైపు పోతున్నారు? మీ దృష్ఠి ఎటుంది? మీరు ఏ మార్గములోకి వెళుతున్నారు? మీరు అసలు అర్థము చేసుకోగలిగారా దీన్ని? అని ఎంతో చిన్న వాక్యాన్ని ఇచ్చింటాడు ఖుర్ఆన్ గ్రంథములో. ఆ వాక్యాన్ని ఇచ్చిన చోటల్లా ఇది అర్థము కాదని తెలుసు కోవాల్సిందే! అటువంటి వాక్యాలున్నాయి. అటువంటి ఖుర్ఆన్

--

గ్రంథము ఈరోజు దేవుడు మనకు కొంత అర్థమయ్యేటట్లు చేశాడు. అంటే అది మనము చేసుకున్న అదృష్టము.


ఒక హిందూ గురువుగ ఉండి ఖుర్ఆన్ గ్రంథాన్ని పొగుడుతున్నాడు. అని అనుకోవద్దండి మీరు. ఎంత ఆవు అయినా పాలు-పాలే, ఆవు- ఆవే. మనము ఆవునుండి పాలను ఆశించాల్సిందే! అర్థమయిందా! అవసరము వచ్చినపుడు నీవు ఏది కావాలో అది కోరుకోవయ్యా నీకు వస్తుంది. పాలను తీసుకో-పాలకోవ చేసుకో! పాలను తీసుకో-మజ్జిగ చేసుకో! పాలను తీసుకో-పెరుగు చేసుకో! పాలను తీసుకో- నెయ్యి కూడా చేసుకో! ఎట్ల ఉపయోగించుకోవాలంటే అట్ల ఉపయోగించుకో నీకు అవసరమైనవి పాలు. ఎక్కడి నుంటి తీసుకోవాలి? పొదుగు నుండే తీసుకోవాలి. ఆవు అంతా నీది, పొదుగు అంతా ఇంకొకనిది అనుకోకూడదు. పొదుగు మొన్న వచ్చింది అది దాంతో నాకేం సంబంధము అంటే మొన్న వచ్చినదాంతోనే నీకు పని. అట్లగానే మనము అది వేరు, ఇది వేరు అనే భావము లేకుండా ఈ మూడు గ్రంథాలు ఒకటే అనే భావము వచ్చిందంటే ప్రపంచములో మనము బాగుపడగలము. ఈ మతద్వేషాలు ఉండవు.


ఈ రోజు ఒక జ్ఞానము అర్థము కాకపోయిన దానివలనే ఒకరికొకరు చంపుకొంటున్నారు. పాకిస్థాన్లో చిన్నపిల్లలను 142 మందిని చంపినారు. __చంపలేదా? నిలబెట్టి కాల్చేసినారు. ఈ రోజు మిగతా దేశాల్లో ఇదే ఉగ్రవాదము జరుగుతోంది. కానీ ఉగ్రవాదులు ఏమంటున్నా రంటే 9వ సూరా 5వ ఆయత్లో గొంతులు కోయమని చెప్పారు అని చెప్పినారు. కాబట్టి మేము గొంతులు కోస్తున్నాము. దేవుని ఆజ్ఞ ప్రకారము గొంతులు కోస్తున్నాము. దేవుని సేవే ఇది అంటున్నారు. అంటే ఆ వాక్యము ఉండేది నిజమే! గొంతులు కోయండని, నిర్బంధించండి. ఎక్కడ కావాలంటే

--

అక్కడ పట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ చంపేయండి అని ఉండేది నిజమే! ఎవరికి చెప్పినాడు? అని అడుగుతున్నాము మేము. నీకు చెప్పినాడా? అని అడుగుతున్నాము. దేవుడే చెప్పినాడయ్యా ఎవరికి చెప్పినాడు? దేవదూతలకు చెప్పినాడు. తన దూతలకు ఆజ్ఞ వేశాడు. తన పరిపాలన చేసేవారున్నారు. వాళ్ళు ఎట్ల కావలిసింటే అట్ల చంపుతారు. పాపులను వణికించి చలిపెట్టి చంపాలంటే అలాగే వణికించి చంపుతారు. తుఫాన్ వచ్చి చంపమంటే తుఫాన్లో చంపుతారు. ఏ రకముగా కర్మవుంటే ఆ రకముగా చంపుతారు. వాళ్ళు దేవ దూతలున్నారు. ఎంతమందినైనా చంపేస్తారు. అది వాళ్ళకు చెల్లును. దేవుని ఆజ్ఞ అది. ఎవడు పాపము చేసింటే వాళ్ళని చంపుతారు. మనిషికి నీకెందుకయ్యా శ్రమ. దేవుడు అలా చేయమని నీకేమన్నా చెప్పినాడా? నా జ్ఞానము తెలుసుకోండిరా అని మీకు చెప్పాడు. ఆయన జ్ఞానము తెలుసుకోమని చెప్పితే ఆయన జ్ఞానము తెలుసుకోకుండ ఈ తప్పు పనులు చేస్తే ఎట్లా? ఈ పొద్దు ఈ ప్రభుత్వాలు అన్ని కలసి ఈ ఒక్క జ్ఞానాన్ని ప్రజలకు అందించి నేర్చుకోమని చెప్పితే ఒక్క ఉగ్రవాది కూడ ఉండడు దేశములో. ఏ దేశములోనూ ఉండరు, జ్ఞానము తెలుసుకోగలిగితే. జ్ఞానము తెలుసుకోకపోయిన దానివలన, జ్ఞానము అర్థము కాకపోయిన దానివలన ఈ రోజు ఉగ్రవాదము ఉంది.



జ్ఞానము అర్థమైతే ఎందుకుంటాది చెప్పండి. ఖుర్ఆన్ గ్రంథము ఒక్కటి అర్థమైందా మనిషికి, ఇస్లామ్లో ఉగ్రవాదము ఏమీ ఉండదు. ఒకరికొకరు చంపుకోరు వాళ్ళకు తెలుసు వాళ్ళు కూడా చనిపోతారని. వాళ్ళు పదిమందిని చంపితే, మనలో ఒక్కడు చచ్చిపోతాము అని వాళ్ళకు తెలుసు. ఉగ్రవాదులు చచ్చిపోవాలనే నిర్ణయముతోనే వస్తున్నారు. మేము ఎప్పుడైతే దేవునికి వ్యతిరేఖముగా వుండే వాళ్ళనంతా చంపుతాపోతే, ఒక్కరిని

--


చంపినా, ఇద్దరిని చంపినా, ముగ్గురిని చంపినా, ఎంతమందిని చంపినాగానీ మాకు చావు వస్తే మేము డైరెక్టుగా స్వర్గానికి పోతాము. స్వర్గానికి పోతే అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు, బాగా సుఖాలు అందించేవాళ్ళు. ఆ సుఖాల కోసము పోవాలి. ఇక్కడెందుకు ఊరికినే బువ్వ, నీళ్ళు లేకుండా ఉండి ఇబ్బందిపడుకుంటూ ఉండాలి. ఇక్కడ అన్ని కష్టాలు ఉన్నాయి. అక్కడికి పోతే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. గాలి ఉంది, నీళ్ళు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, సేవకురాండ్లు అందమైనవారు అందరూ ఉన్నారు, స్వర్గములో సుఖముగ ఉంటాదని ఎపుడెపుడు చచ్చిపోవాలి అని వాళ్ళు తయారై ఉంటే, వారికి తలా ఒక గన్ ఇచ్చి హిందువులను చంపి, మీరు చచ్చిపోండి అని అంటే వాళ్ళు వచ్చి వీళ్ళను చంపి వాళ్ళు కూడా చచ్చిపోతారు. ఉగ్రవాదము అలా తయారైవుంది. ఉగ్రవాదము లేకుండా పోవాలంటే ఏమి చేయాలో చెప్పమను. ఒకే ఒక సూత్రము ఖుర్ఆన్ గ్రంథములో అసలైన వాక్యాలను తెలియజేయమను ప్రజలకు.


అప్పుడు ఏ మనిషిలోనూ ఉగ్రవాదము ఉండదు. మనిషికి దేవుని నము అర్ధమైతే ఎక్కడా ఉగ్రవాదము ఉండదు. మనిషిలో ఎపుడైతే అజ్ఞానము ఉందో అపుడు అన్ని అనర్థాలు ఉంటాయి. ఎవరిలో లేదు ఈ ఉగ్రవాదము? అందరిలోనూ ఉంది. ఇపుడు 'P.K' సినిమా మీద దాడి చేయడము ఉగ్రవాదము కాదా? ఒక మతము వాళ్ళే చేస్తున్నారా ఇవన్నీ, వేరే మతము వాళ్ళు చేయడము లేదా? ఇంకొక మతములో లేవా ఇవన్ని? వాళ్ళతో పాటి వీళ్ళు కూడా చంపుతున్నారు. హిందువులు క్రైస్థవులను చంపుతున్నారు. క్రైస్తవులు హిందువులను చంపుతున్నారు. ఒకరికొకరు చంపుకొంటూనే ఉన్నారు. ఇదంతా జ్ఞానము అర్థంకాకనే కదా! జ్ఞానము అర్థము అయితే ఏముండదు కదా! ఈ రోజు ఎన్నో కోట్ల డబ్బులు ఖర్చు


---

పెట్టి, ఆ ఉగ్రవాదుల కోసము పోలీసోళ్ళను పెట్టి, వీళ్ళు చచ్చిపోయి, వాళ్ళు చచ్చిపోయి, ఒకరికొకరు కాల్చుకొని, ఏముంది ఇక్కడ నూరుమంది చస్తే వాడు ఒకడు వస్తాడు పుటుక్కున పేల్చుకుంటాడు. వీళ్ళు నూరుమంది పోతారు, వాడు పోతాడు. వాడు చచ్చిపోవాలనే వచ్చినాడు. ఇంకేముంది? ఈ రకముగా ఉగ్రవాదము తయారైతాంది. ఇవన్ని తయారు కాకుండ పోవాలంటే, ఒకే ఒక జ్ఞానము మనుషులకు అర్థమైతే సరిపోతుంది. ప్రజలకు అర్థమయ్యేదాని కోసము మనము 'జీహాద్ అంటే యుద్ధమా?' అనే ఒక గ్రంథము వ్రాసినాము. అలాగే 'స్వర్గము-నరకము' అనే గ్రంథము కూడ వ్రాశాము.


ఇది చదివిన తర్వాత, ఇంకా అర్థముకాకపోతే బాగుండదని సంపూర్ణమైన ఖుర్ఆన్ గ్రంథాన్నే వ్రాశాము. మనము వ్రాసినేది 350 వాక్యాలకు జవాబు అయినాగానీ ఆ 350 వాక్యాలు చదివితే ఏమైతుంది అంటే మొత్తము ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివినట్లే అయితుంది. ఎందుకంటే పది అడుగుల పాము ఉందనుకోండి. తలమాత్రము రెండు ఇంచిలే ఉంటుంది దానికి. పది అడుగుల పాములో ఏమీ లేదు. కానీ 2 ఇంచుల తలలోనే విషమంతా ఉంటుంది. ఇపుడు 10 అడుగుల పామును జయించకున్నా ఫరవాలేదు. 2 ఇంచులు ఉండే తలకాయని జయిస్తే మనము దాని విషాన్ని జయించినట్లే. నువ్వు పామునంతా జయించినట్టే. 10 అడుగుల పాములో నువ్వు కొట్లాడాల్సిన పని లేదు. ఆ రెండు ఇంచుల్లో ఉండే ఆ విషాన్ని జయిస్తే పామునంతా జయించినట్టే. విషానికి విరుగుడు కనుక్కొన్నామనుకో. అది కాటేసిందనుకో దానివలన మనకేమి కాదు దానిని జయించినట్లే మనము. అదేమి చేయదు మనల్ని. ఈ తలకాయను విడిచిపెట్టి తోక, నడుము అన్నీ పరిశోధన చేసినాగానీ అది ఎప్పుడు కరిచినా మనము


----

సిద్ధ బోధ


చచ్చిపోతాము. ఏమి ప్రయోజనము లేదు. ఆ రకముగనే ఖుర్ఆన్ గ్రంథము అర్థమయితే దానిలోని జ్ఞానము వలన ఉగ్రవాదము అనే పామును జయించ గలము. ఉగ్రవాదములో ఉండే విషాన్ని దైవజ్ఞానము విరిచివేయగలదు.


కాబట్టి ఈ ఒక్క 700 పేజీల జ్ఞానాన్ని చదువుకుంటే అర్థమౌతుంది. ఈ అంతిమ దైవ గ్రంథము అని దేనికైతే పేరు పెట్టామో దానిని వేరే మతానిది అనుకోకుండ, అది మన మతానికి సంబంధించిందే అనుకొని, అది భగవద్గీతకు సంబంధించినదే అనుకొని, భగవద్గీతలో ఒక భాగమే అనుకొని చదవగలిగితే భగవద్గీతలో ఉండే విషయాలే అందులో ఉన్నాయి అని తెలిసిపోతుంది. ఎపుడైతే భగవద్గీతలో ఉండే విషయము దాంట్లో ఉన్నాయని తెలిసిపోయిందనుకో, ఖుర్ఆన్ గ్రంథములో భగవద్గీతను గురించి ఇంత గొప్పగా చెప్పినారా! అని హిందువులకు అర్థమయితాది. ముస్లీములకు అర్థమైతాది. దాంట్లో ఒకటే మాట చెప్పినాడు. తౌరాత్ గ్రంథము, ఇంజీలు గ్రంథము, నేను అంతిమములో ప్రసాదించినటువంటి ఈ గ్రంథము అంటే ఖుర్ఆన్, ఈ మూడు గ్రంథాలు తెలియకపోతే వాడు ఏ ధర్మములో లేనట్లే! అని 5వ సూరా 68వ ఆయత్లో చెప్పారు. ఒక గ్రంథము కాదు, మూడు గ్రంథాలు తెలియకపోతే ఏ ధర్మములో లేనట్లే. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది మాతృగ్రంథము అయినటువంటి భగవద్గీత ఉంది గదా! దానిని తెలియకుండా ఎన్ని గ్రంథాలు నువ్వు చదివినాగానీ గ్రంథాలను మోసే గాడిదలాంటివాడే అని ఒక ఆయత్లో చెప్పినట్లు నాకు జ్ఞాపకము ఉంది.

ఇంతకుముందు ఒక ముస్లీమ్ కుటుంబములో వాళ్ళు వచ్చి దైవ జ్ఞానమును తండ్రి-బిడ్డ చెప్పుకుంటుంటే వాళ్ళ యొక్క ఆకాంక్ష చూస్తే, ఎంతో గొప్పగా ఉంది. వారు ముస్లీములలో ఉండి అంత గొప్పగా ఉండారంటే మనము సంతోషించాల్సిందే! అది మన హిందువుల్లో ఎవరైనా


---

ఉన్నారా అని ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు. ఈ వయసులో మీకెందుకు అని అడిగే వారున్నారు ఈ కాలములో. బిడ్డ జ్ఞానము కొరకు ఉద్యోగము విడిచిపెట్టి వస్తే సంతోషిస్తున్నాడు ముస్లీమ్ ఆ తండ్రి. హిందువులో అయితే నీకెందుకు ఈ వయసులో అని ఇంట్లో నుండి బయటకు తరిమేసినోళ్ళు ఉన్నారు. ఉద్యోగము చేస్తావుంటూ జ్ఞానము తెలుసుకుంటాను అంటే కూడ ఒప్పుకోని వాళ్ళున్నారు. దైవజ్ఞానము అనేదాన్ని మనము తెలుసుకోనేదానికి ప్రయత్నము చేస్తే ఇది ఎన్నో జన్మల సంస్కార బలము వలననే మనకు దొరుకుతుంది అనే ఉద్దేశ్యముతో ఇప్పటినుండి అయినాగానీ బాగా కనువిప్పు కలిగి, మన జ్ఞానాన్ని తెలుసుకుంటారని కోరుతూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.


తేది: 21.05.2016


ఈ సమావేశములో ఉన్నటువంటి వాళ్ళందరికి ఇప్పుడు చెప్పబోయే జ్ఞానము ఆత్మ ద్వారా అర్థమవుతుందని ఆత్మను వేడుకొంటూ ఈ సమావేశాన్ని ప్రారంభిస్తున్నాము. ఇక్కడ ఒక మతానికి సంబంధించిన జ్ఞానం ఉండదు, మనుషులకు సంబంధించినది ఉంటుంది. మనుషులు ఏ మతము వాళ్ళయినా కావచ్చు. మనుషుల్లో అన్ని రకాల మతాలకు సంబంధించినటువంటి వాళ్ళున్నారిక్కడ. నేను ఫలానా మతము అనే సంబంధము లేకుండా మనుషులకు చెప్పే విషయము ఏమంటే! ప్రతి ఒక్కరు చనిపోయిన తరువాత బ్రతికినంత కాలము ఎట్లన్నా ఉందురుగానీ చనిపోయినపుడు నువ్వు మళ్ళీ జన్మకు పోకుండ దేవునిలోనికి ఐక్యము కావాలని కోరుకుంటు ఈ జ్ఞానాన్ని మీకు అందించడము జరుగుతావుంది.


--

హిందువులేమో “దేవుడు” అంటారు. క్రైస్తవులేమో “యెహెూవా” అనే పేరుతో పిలుస్తారు. ముస్లీమ్హమో "అల్లాహ్" అంటారన్నమాట. ఎవరు ఎట్ల పిలిచినాగానీ ఈ పేర్లు ఇప్పుడు వచ్చినేటివి కాదు, సృష్ఠి ఆదిలోనే ఇవన్నీ వచ్చాయన్నమాట. మనము ఏమనుకుంటామంటే 1400 సంవత్సరాల పూర్వము ఇస్లామ్ మతము పుట్టినప్పుడు “అల్లాహ్” అనే పేరు వచ్చిందనుకుంటారు. కానీ ఈ 'అల్లాహ్' అనే పేరు ఇప్పుడిదిగాదు సృష్టి ఆదిలోనే వచ్చిందని, మనము పోయిన నెల గ్రంథములో వ్రాసుకున్నాము. అంతేకాకుండ తెలుగు పదాలు ప్రతి భాషలోను, ప్రపంచ భాషలన్నిటిలో ఇమిడి ఉన్నాయి అని చెప్పాము. ఇప్పుడు “అల్లాహ్” అనే పదము తెలుగుపదము. అది అరబ్బీలో ఉన్నా, ఇంకోచోట ఉన్నా, ఎక్కడ ఉన్నాగానీ దానికి అర్థము తెలుగులోనే చెప్పుకుంటే 'అల్లాహ్' అంటే 'అంతులేనటువంటివాడు', ఎవరికీ అంతుపట్టనటువంటివాడు అని చెప్పుకున్నాము. ఇంతవరకు ఎవరికీ అంతుపట్టనివంటివాడు దేవుడు. ఆ దేవుని గురించి మనము ఇప్పుడు చెప్పుకుంటున్నాము. ఆయన గురించి తెలుసుకొనే ప్రయత్నము చేస్తున్నాము. ఆ ప్రయత్నములో ఈ మతము ఆ మతము అనుకోకుండా మనము ప్రయత్నము చేయాలని చెప్పుతున్నాము. దానికోసము శరీరము లోపలికి పోయి మనము జ్ఞానము చెప్పు కుంటున్నాము. శరీరము బయట అయితే మతాలు ఏమన్నా అడ్డమొస్తాయేమో గాని, ఆచరణలు ఏమన్నా అడ్డమొస్తాయేమోగానీ నువ్వు శరీరము లోపలికి పోయిన తరువాత మతము లేదు, ఆచరణ లేదు. ఊపిరి ఆడుతావుంది, శరీరము లోపలి నుంచి వస్తావుంది. శ్వాసకు మతము ఉందా? లేదు. ఫలానా మతస్థులకే ఊపిరి ఆడుతుందని అనుకుంటున్నామా? లేదు, అన్ని మతస్థులకు ఊపిరి ఉంది. ఇప్పుడు


---

మనము దీనిని మతముగా డివైడ్ చేయలేము. శ్వాస అందరికి ఆడతావుంది కాబట్టి, ఈ మతస్థులకు శ్వాస ఉంది, ఆ మతస్థులకు శ్వాస లేదు అని చెప్పేదానికి లేదు. ఈ రకముగా శరీరాంతర్గతములోకి పోయి చూస్తే, మతము అనేది పైదేగాని లోపలిది కాదు. ఆచరణ చేసేటివన్ని శరీరము పైవేగాని లోపలివి కాదు. అల్లాహ్ దగ్గరికి పోవాలనేటటువంటి ఉద్దేశ్యముతోనే ముస్లీములు ప్రయత్నిస్తున్నారు. ముస్లీములే కాదు, కొంతమంది హిందువులు కూడ ప్రయత్నిస్తున్నారు. మిగతా క్రైస్తవులు కూడా అదే పని చేస్తున్నారు. అంటే అందరికి అర్థము కాకపోయినా కొంతమందికి అయినాగాని దేవుని వైపు పోవాలనే ఉద్దేశ్యము ఉంది.


ప్రథమ దైవగ్రంథము భగవద్గీతలోనే దేవుడు ఆ ఉద్దేశ్యాన్ని కల్గియుండండి అని చెప్పాడు. దేవుడు ప్రతిమాటను శరీరాంతర్గతముగా ఉండేటువంటి విషయాన్నే చెప్పుకుంటూ వచ్చాడు. ఆ లెక్కకుపోతే ఇప్పుడు మనము ముందు భగవద్గీతలో అల్లాహ్ చెప్పినటువంటి వాక్యాన్ని చూస్తాము. భగవద్గీతలో ఏమిటి, అల్లాహ్ చెప్పడమేంది? అంటే భగవద్గీతలో చెప్పినోడు ఒక్కడే, ఖుర్ఆన్లో చెప్పినోడు ఒక్కడే. కాబట్టి భగవద్గీతలో అల్లాహ్ చెప్పినటువంటి, అంటే అంతు లేనటువంటివాడు చెప్పినటువంటి, ఒకటి రెండు శ్లోకాలు జ్ఞాపకము చేసుకుందాము. భగవద్గీతలో ఉండే శ్లోకాలు జ్ఞాపకము చేసుకుంటే ఇది ఒక మతానికి సంబంధించిన జ్ఞానము కాదు, అన్ని మతాలకు సంబంధించింది, ఇది శరీరాంతర్గతముగా ఉండేటటువంటి విషయము. దేవునిలోనికి మీరు ఐక్యము కావాలంటే బ్రతికున్నప్పుడే ఐక్యమయితామా మనము? లేకపోతే తెల్లవారుజామునో లేదా సాయం కాలమో ఐక్యమైతామా? లేదు. చనిపోయినప్పుడు ఐక్యము కావాలి, అంతవరకు బ్రతికే ఉంటాము. చనిపోయినప్పుడు ఐక్యము కావాలంటే


---

సిద్ది బోధ

ఏమి చేయాలి? అని అంటే ఇప్పుడు దాని గురించి మనము భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగము అనేటటువంటి అధ్యాయములో ఒక శ్లోకాన్ని తీసుకొని చదువుకుందాము.


దేవుడు ప్రపంచమంతా వ్యాపించినటువంటివాడు. ప్రపంచమంతే కాదు, విశ్వమంతా వ్యాపించినటువంటివాడు, అతను నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీకు నాకు మధ్యలో కూడ ఉన్నాడు. నీకు వినిపించే శబ్దముగా ఉన్నాడు, కనిపించే రూపముగా ఉన్నాడు, అది ఒకటే కాదు, ఆయన ఎటూకాకుండ కూడా ఉన్నాడు. దేవుడు కనిపించడు, వినిపించడు. ఈ మధ్యకాలములో జ్ఞానులు చాలామంది తయారయినారు. పాలల్లో డిగ్రీ పెట్టి అంటే ఒక పుల్లాలాంటిది పెట్టి దాంట్లో ఇంత శాతము నీళ్ళు ఇంత శాతము పాలు ఉన్నాయని మీరు చెప్పవచ్చు. అట్లాంటి డిగ్రీపెట్టి దేవుడు ఇవ్వలేదు మనకు. కాబట్టి ఇప్పుడు అందరు జ్ఞానులమయి పోయినాము. నేను పెద్ద జ్ఞానినంటే నేను పెద్ద జ్ఞానినని కొట్లాడుకుంటున్నారు. కానీ దేవుడు జ్ఞానము డిగ్రీ పుల్లను ఎక్కడో ఒకచోట పెట్టేఉంటాడు కానీ మనకు తెలియదది. ఎవరిలో ఎంత జ్ఞానము ఉందో తెలిసేదానికి కూడ అవకాశము ఉంది.


ఈ మధ్యకాలములో టీ.వీ.లో ఒక ప్రోగ్రామ్ చూస్తూవున్నాము.

సాయిబాబా దేవుడు కాదని కొంతమంది, దేవుడని కొంతమంది కొట్లాడుతున్నారు. మధ్యలో ఒకరికొకరు ప్రశ్నలు వేస్తున్నారు. మధ్యలో ప్రశ్న వేసినపుడు సాయిబాబా దేవుడు కాదని పోట్లాడే ఒక స్వామీజీని ఒక ప్రశ్న అడిగినారు. ఈ మనుషులను, జంతువులను, ఈ సర్వప్రపంచాన్ని పుట్టించినది ఎవరు? అని ఒక మంచి ప్రశ్న వేసారు. మళ్ళీ అంత పెద్ద స్వామి ఏమి చెప్పినాడంటే అటు ఇటు చూసి భగవంతుడు అన్నాడాయన.


---

సిద్ది బోధ

భగవంతుడో కాదో మీకు తెలుసు. భగవంతుడు అనగానే మీరు ఫక్కున నవ్వుతున్నారు. అంత పెద్ద స్వామి ఇంత పెద్ద అజ్ఞానా! అని. ఇక్కడ ఎనిమిదేండ్ల పిల్లోనికి కూడా తెలుసు ప్రపంచాన్ని ఎవరు సృష్టించినారనేది. దేవుడు సృష్టించినాడని ఒక్కమాట అనకుండా, ఆయన భగవంతుడు అంటున్నాడు. అంటే దేవునికి భగవంతునికి కూడ తేడా తెలియనటువంటి ఆయన సాయిబాబా దేవుడు కాదు అని అంటున్నాడంటే, ఆయన లెక్కలో దేవుడు ఎవరో సరే, వాళ్ళ సమస్య ఎట్లన్నా ఉండని. మనకు తెలిసిందేమంటే ఇంత పెద్ద స్వామీజీకి దేవుడు ఎవరో, భగవంతుడు ఎవరో తెలియదు. సరే, ఇప్పుడు వాళ్ళకు తెలియని విషయము ఇక్కడ 8 సంవత్సరముల పిల్లవానికి తెలుసు. కొద్ది సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చే మీ అందరికి కూడా తెలుసు. తరువాత ఈ కొద్దికాలముగా వస్తున్నటువంటి ముస్లీములకు కూడా తెలుసు ఆయన చెప్పినది పొరపాటని, తప్పని తెలిసిపోయింది. మళ్ళీ ఈ రకముగా చూసుకుంటే ఇట్ల చాలామంది జ్ఞానులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలియని తనము వాళ్ళ దగ్గర ఉండి మాట్లాడుతున్నారు. " ఇది పెద్ద సమస్య అయింది. ఈ సమస్యలన్నిటిని అధిగమించి మనము అసలైన జ్ఞానము తెలుసుకోవాలంటే అది మనకు శరీరము బయట లేదు, శరీరము లోపల ఉంది. అందువలన దేవుడు మనలను శరీరము లోపల చూసుకోండి అని హెచ్చరిస్తూ మనకు ఒక శ్లోకము చెప్పాడు.


ఆ శ్లోకాన్ని ఇపుడు జ్ఞాపకము చేసుకుందాము. ఇవి చెప్పిన తరువాత అంటే దేవుడు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకము చేసుకుంటే ఇది ఒక మతానికి సంబంధించినది కాదు అని మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు భగవద్గీతలో అక్షర పర బ్రహ్మయోగము 5వ శ్లోకములో ఏముందంటే!





____

అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరమ్ |

య: ప్రయాతి స మద్భావం యాతి నాస్త్వత్ర సంశయః ॥ 


భావము :- "అంత్య కాలమందు నవని నన్నెవ్వండు స్మరణ చేసికొనుచు మరణ మొందు, వాడు పిదప నాదు భావంబునే పొందు. నిందు సంశయంబు జెందవలదు.” దీంట్లో ఏమాత్రము అనుమానము లేదు. ఎప్పుడో దేవునిలోకి ఐక్యమయితావనేటటువంటి భావము వద్దు. ఒకే ఒక చిన్న ఉపాయము. చనిపోయే సమయములో ఎవడైతే నన్ను స్మరించు కుంటూ, ఎవడైతే శరీరాన్ని వదులుతున్నాడో అప్పుడు వాడు దేవునిలోకి ఐక్యమయ్యేదానికి అర్హుడు అయితాడు. దాంట్లో ఏమాత్రము అనుమానమే లేదు. ఇదేదో పెద్ద జ్ఞానము! అట్ల ఇట్ల అని, మీరు ఏమేమో ఊహించుకుంటున్నారు కదా! ఎంత పెద్ద జ్ఞాని అయినా దేవునిలోకి ఐక్యము కావాలంటే చాలా సులభము. చిట్టచివరిలో అంటే ప్రాణము పోయేటప్పుడు ఏమనుకోవాలి మనము? దేవుని గురించి జ్ఞాపకము చేసుకోవాలి.


“అంతకాలే చ” చివరిలో చనియేటప్పుడు “మామేవ స్మరన్” అంటే నన్నే స్మరించుకుంటూ చనిపోయేటటువంటి వాడు నాలోనికే ఐక్యమయి తాడని ఈ వాక్యములో చెప్పబడింది. ఇప్పుడు శరీరములో ముస్లీములేనా స్మరించుకొండేది? హిందువులేనా? క్రైస్తవులేనా? అందరికి మనస్సు ఉంది, అందరికి జ్ఞాపకశక్తి ఉంది, ఎవరికి వాళ్ళు స్మరించుకోవచ్చు. అంటే చనిపోయేటప్పుడు సులభమే కదా! స్మరించుకోవచ్చు అనుకుంటే, మనకు ఏవైతే ముందు నుంచి ఉన్నాయో అవే జ్ఞాపకము వస్తాయి కానీ దేవుడు జ్ఞాపకము రాడు. రకరకాల సమస్యలుంటాయి కదా మనము ఆ సమస్యలనే అనుకుంటు పోతా ఉంటాము. వీడెట్ల కాపురము చేసుకుంటాడో ఏమిటో అని కొడుకు మీద ఒకడు దిగులు పెట్టుకుంటే, బిడ్డకు పెండ్లి కాలేదని


----

బిడ్డ మీద ఒకడు దిగులు పెట్టుకుంటే, ఉన్న డబ్బులంతా ఎవడు వచ్చి దోచుకొని పోతాడో, బీరువా కూడ తెచ్చిపెట్టలేదు అని ఒకడనుకుంటే, ఇట్లు రకరకాలుగ అనుకుంటూ చనిపోవడము జరుగుతావుంది. దేవుని ధ్యాస అప్పుడు రానుకూడ రాదు. అంటే అంత్యకాలములో వాడు తనకు సంబంధించిన విషయాల గురించే పోతాడుకానీ దేవునికి సంబంధించిన విషయాలు ఎవ్వరూ జ్ఞాపకము చేసుకోవడము లేదు. అది మనకు తెలుసు. దేవుడైతే సులభముగా చెప్పేసినాడు. అయితే మనము •

ఆప్రాంతం

నువ్వు ఏదో మతాన్ని పట్టుకొని ఊగులాడి ఊగులాడి ఊగులాడి ఈ మతములో ఉండాను అనుకొని, ఇంకోడు మరొక మతము పెట్టుకొని, ఇంకోడు ఇంకో మతము పెట్టుకొని, అది చెప్పి, ఇది చెప్పి, ఇంత శ్రమ పడేదానికంటే చివరిలో నన్ను అనుకుంటే నువ్వు నాలోనికి సులభముగ వచ్చేస్తావు కదా. నువ్వు ఎవరన్నగానిలే నాకు సంబంధము లేదు. నువ్వు విభూతి పెట్టుకో, నామాలు పెట్టుకో, టోపి పెట్టుకో నాకు సంబంధము లేదు. నువ్వు నన్ను అనుకో, నా దగ్గరికి వస్తావు అని చెప్పినాడు. చాలా సులభమైన విషయము కదా ఇది. చాలా సులభములో చాలా సులభము. తరువాత ఏమి చెప్పినాడంటే దాని ప్రక్క విషయము చూస్తాము.



యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరమ్ | తం తమేవైతి కౌంతేయ సదా తధ్భావభావితః ॥


చూడు! “యం యం వాపి స్మరన్ భావం" ఎవడెవడు ఏ ఏ జ్ఞాపకము పెట్టుకొని చనిపోతున్నాడో, “తం తమేవైతి" అంటే దాంట్లోనికే వాడు చేరుకుంటాడుగానీ ప్రక్క దాంట్లోకి పోడు. నువ్వు నా మీద జ్ఞాపకము పెట్టుకున్నావా నాలోకే చేరుకుంటావు, అని చెప్పుతు "ఎట్టి భావంబు


----

మనసునందెంచుకొనుచు జనుడు దేహంబు విడుచుట సంభవించు నట్టి భావంబునే యతడందుచుండు వాని కెల్లప్పుడు అది యభ్యాసమగుట వలన” అన్నాడు. వానికి ఏదైతే అభ్యాసముందో అదే వస్తాదిరా నాయనా! అని చెప్పినాడు. పూర్వము ఒక మాట వినేవాళ్ళము. “బ్రతికిన బ్రతుకంత చచ్చే చావులో తెలుస్తుందని.” అంటే ఇదేందిరా! అనుకున్నాము. వాడు ఏదైతే అనుకుంటావుంటాడో అదే జ్ఞాపకము వస్తాది దానిలోనికి పోతాడు అని అర్థము. అంటే వీడు మోక్షము పోయినాడా, జన్మకు పోయినాడా అని సులభముగా తెలిసిపోయేదంట. ఎందుకంటే వాడు అనుకుండేది జ్ఞాపకము ఉంటాది చివరిలో. ఆ చివరిలో అనుకుండే దాని దానినిబట్టి వాడు చనిపోతాడు. ‘బ్రతికిన బ్రతుకంత చచ్చే చావులో తెలుస్తుంది' అని సూక్ష్మముగ, చాలా సులభముగా చెప్పినారు పెద్దలు.


ఆ రకముగ పోతే ఎవడెవడు ఎట్టెట్టి భావముతో చనిపోతాడో అటువంటి దానిలోనికే వాడు ఐక్యమైపోతాడు. ఎప్పుడు అభ్యాసము ఏదైతే ఉంటుందో వానికి అదే జ్ఞాపకము వస్తుంది. సారాయి త్రాగేవానికి చివరిలో ఒక గుటుకు సారాయి త్రాగింటే బాగుండేదని సారాయి జ్ఞాపకము వస్తుంది. వాడు సారాయి అంగటిలోనే పుడతాడు, కొదవలేకుండా త్రాగేటట్లుగ. ఈ రకముగా ఇప్పుడు ఇక్కడ మతము ఏమన్నా ఉందా చెప్పండి? ఎక్కడా మతానికి సంబంధించినేది లేదు. అంటే ఏ మతస్థుడైనా ఏమైనా అనుకోవచ్చు, వాడనుకున్న దాంట్లోకే పోతాడు వాడు. నువ్వు అల్లాహ్ను గురించి అనుకో, అల్లాహ్ దగ్గరికే పోతావు. ఎల్లప్పుడు ఏదైతే అభ్యాసము ఉందో అదే నీకు చివరిలో జ్ఞాపకము వస్తుంది కాబట్టి నీవు దానిని ఇప్పటి నుండి అభ్యాసము చేసుకో. నీకు జ్ఞాపకము వచ్చేది ఏమిటి అని అడిగితే ఎల్లప్పుడు దేనిలో అయితే నువ్వు మునిగి తేలుతున్నావో నీకు


----

చివరిలో ఆ విషయము వస్తుంది. అప్పుడు నీకు ఏ విషయము జ్ఞాపకము వస్తుందో దానిలోనికి పోతావు. దేవుడు జ్ఞాపకము వస్తే దేవుని దగ్గరకు పోతావు.


ప్రపంచము జ్ఞాపకము వస్తే ప్రపంచములోకి పోతావు. ఇప్పుడు మేము ఏమి చేయాలి అంటే చిన్న ఉపాయము చెప్పుతున్నాడు ఆయన, కాబట్టి నీవు ఏమి చేస్తావు అంటే ఎల్లప్పుడూ దేవుని గురించే అనుకో, చివరిలో దేవుడే మతికి వస్తాడు. మళ్ళీ దాని గురించి ఏమి చెప్పుతున్నాడంటే! 

7శ్లో : తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ|

మయ్యర్పిత మనో బుద్ధి: ర్మామే వైష్యస్య సంశయః ॥


భావము :- “సర్వకాలములలో నీ మనసునందు నన్ను స్మరియించు చుండుము నయచరిత్ర! మనస్సు బుద్ధియు మత్సమర్పణ మొనర్చి చేరగల్గుదు నన్నె నిశ్చింతతోడ”. “నీ మనసు, బుద్ధి రెండింటిని నా మీద పెట్టుకొని, నువ్వు ఎల్లప్పుడు నన్నే స్మరించుకుంటూ ఉండు అంటే నన్నే జ్ఞాపకము చేసుకుంటూ ఉండు.” దానివల్ల నువ్వు మరుజన్మకు పోకుండ నా లోనికే దీనికి తెలుగులో ఒక పదము ఉంది, మళ్ళీ ఇంకొక

మతములోనిది అనుకుండేరు. తెలుగులో ఒరిజినల్ పదము (స్వచ్ఛమైన పదము) ఉంది. నేను పుట్టకూడదు, ఎక్కడికి పోవాలి? దేవునిలోకి ఐక్యమైపోవాలి. విశాలముగా ఉన్న దేవునిలోనికి ఐక్యమైపోతే కలిసిపోతావు విశాలముగా నువ్వు. మళ్ళీ జన్మ ఎత్తేదుండదు, కాబట్టి 'జ' అంటే పుట్టుట, ‘మ’ అంటే నేను, పుట్టకుండ పోవాలంటే 'న'. ఈ మూడిటిని కలిపి చెప్పితే ‘న’ అంటే వద్దు, ‘మ’ అంటే నేను, 'జ' అంటే పుట్టకూడదు. ఏమయితాది మూడు కలిపితే? 'నమాజ్'. అర్థమయిందా! తెలుగులో కొత్త పదము అనుకోవద్దండి ఇది.


----

ఇది పూర్వము నుంచి ఉన్న పదమే. పూర్తి తెలుగులో ఉండేటువంటి పదము. సంస్కృతము కూడ సంబంధము కాదు. 'న' అంటే వద్దు లేదా లేదు, 'మ' అంటే నా, 'జ' అంటే పుట్టుక. నాకు జన్మలు లేకుండా చేసేటటువంటి స్థితిని ఏమంటాము అంటే “నమాజ్" అంటాము. ఆ నమాజ్ ఇప్పటి నుంచి చెయ్యి. నమాజ్ అంటే ఏమిటి? నీకు జన్మ కలగకుండ పోవాలంటే దేవున్ని స్మరించుకో. మళ్ళ ఎప్పుడు చేస్తావు నువ్వు నమాజ్? తెల్లవారుజామున చేసుకో, పొద్దు మునిగినపుడు చేసుకో, బయటికి పోయినపుడు చేసుకో, బువ్వ తినేటప్పుడు చేసుకో, నీళ్ళు తాగేటప్పుడు చేసుకో. అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. అర్థమయిందా! లేదు, మేము ఇన్నిసార్లే చేస్తాము అంటే అన్నిసార్లే చేసుకో ఎవరొద్దన్నారు? సరే, నీకు ఓపిక ఉంది నీవు ఒకసారే చేస్తావు. ఇంకోనికి ఓపిక ఎక్కువ ఉంది వాడు 5 సార్లు నమాజ్ చేస్తాడు. నీకు ఇంకా ఓపిక ఉందనుకో, పగలంతా చేసుకో. ఇక్కడ ఏమి చెప్పినాడు “యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరమ్” అన్నాడు. ఏ భావములో నీవు చనిపోతావో అటువంటి భావమే నీవు పొందుతావు అని చెప్పినాడు కదా! కాబట్టి ఇప్పుడు నువ్వు ఏమి చేయాలి? “సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ” సర్వేషు కాలేషు అంటే ఎల్లకాలములయందు నన్నే స్మరించుచుండు. అప్పుడు నువ్వు నా లోనికే ఐక్యమవుతావు అని చెప్పినాడు. మళ్ళీ ఎల్లకాలము స్మరించుకుంటూ ఉంటే దేవునిలోకి ఐక్యమవుతావు. మళ్ళీ జన్మకుపోవు కదా! మళ్ళ జన్మకు పోకుండ ఉండేటటువంటి స్థితిని ఏమంటాము? నమాజ్. నాకు జన్మలు లేకుండ పోవాలి అనే ఉద్దేశ్యము కల్గి ఉండడమే నమాజ్. అర్థమయిందా! ఇది తెలుగులో ఉండేటువంటిది ఉద్దేశ్యము. అరబ్బీలో ఇంకో ఉద్దేశ్యము ఉండవచ్చు. ఏదైనాగాని దేవునిలోనికి ఐక్యమయ్యేటటువంటి విధానమేగానీ ఇంకోటి ఏమీ కాదు.


---

ఒకవేళ ముస్లీములు నమాజ్ చేస్తావుంటారు అంటే వాళ్ళ గొడవ వాళ్ళది మనదేందో మనమే యజ్ఞయాగాలు చేసుకుంటామని మీరు అనుకోవచ్చుగానీ యజ్ఞయాగాలకంటే మించినది ఏది? నమాజ్. నమాజ్ అంటే నిజమైన యోగము. దేవునిలోకి ఐక్యమయ్యేటటువంటి యోగము. ‘యోగము’ అంటే 'కలయిక'. విడిపోవడమును 'వియోగము' అంటాము.

కలిసిపోవడమును ‘యోగము' అంటాము. మళ్ళ యోగము అనేటువంటి పదము తెలుగులో ఉంది. ఇదే యోగమునే కలయిక అంటాము. దేవునిలోనికి కలయిక కావాలంటే నీవు జన్మకు పోకూడదు. నువ్వు జన్మకు పోకూడదంటే నీకు జన్మలు వద్దు అని అనుకోవాలి. మరి జన్మలు వద్దు అని ఎట్ల అనుకుంటావు? దేవున్ని స్మరించుకుంటూ ఉంటే జన్మలు లేకుండా పోతాయి కాబట్టి, దేవుని స్మరణ ఎప్పుడైతే ఉందో అప్పుడు నిజమైన నమాజు నువ్వు చేసినట్లే. ఎప్పుడన్న చెయ్యి ఫరవాలేదు. అంటే ఈ మధ్య కాలములో బయట ఒక ముస్లీమ్ అతను, ఇక్కడికి వచ్చే ఇంకో ముస్లీమును అడిగారంట. మీరు స్వామి వద్దకు పోతుంటారు కదా! అక్కడ ఏముంది జ్ఞానము? అని అడిగితే, అక్కడ అన్ని మతాలకు సంబంధించిన జ్ఞానము చెప్పుతారు, ఖుర్ఆన్లో ఉండే జ్ఞానము కూడ చెప్తారు అని అన్నాడంట ఈయన. అయితే మీ గురువు 'అల్లాహ్ ' ను గురించి చెప్తాడా? అంటే అల్లాహ్ ను గురించే చెప్పేది మా గురువు అని అన్నాడు. అంటే మళ్ళీ ఏమని అడిగినాడంటే నమాజ్ చేస్తాడా మీ గురువు అని అడిగినాడంట. అంటే చేస్తాడు అని అన్నాడంట ఈ మనిషి. ఎన్నిసార్లు చేస్తాడు? అంటే ఎల్లవేళల చేస్తావుంటాడు అని చెప్పాడు ఈయన. ఒకసారి కాదు కదా ఆయన ఎల్లప్పుడూ చేస్తావుంటాడు. అటువంటప్పుడు ఇన్నిసార్లే చేస్తాడని చెప్పడానికి కెట్లా అయితాది అని చెప్పినాడంట.


----

నా దగ్గరికి వచ్చి నేను ఇట్ల చెప్పినాను అన్నాడు. అంటే కరెక్టే, నూటికి నూరుపాళ్ళు కరెక్టే చెప్పినావు. నేను చేసేది అదే కదా! ఇంకోటి ఏమి కాదు. జన్మలకు పోకుండా మిమ్మలను చేసుకోమంటున్నాను. నేను చేస్తా ఉన్నాను. మీకు జ్ఞాపకము చేసేది కూడా నమాజ్నే, ఇంకోటి ఏమి కాదు. ఒకవేళ నమాజ్ అనే దానికి తప్పు భావము చెప్పుకుంటుంటే తప్పు అయితుందికానీ ఇది మంచిగ చెప్పుకుంటున్నాము. అల్లాహ్ లోనికి ఐక్యమయ్యేటువంటి విధానమే నమాజ్. మీకు దీంట్లో సంశయము ఏమన్నా ఉందా? ఏమి లేదు, మంచిది. ఇప్పుడు మనము ఈ మూడు శ్లోకాలను ఎక్కడ చెప్పినాము బయట చెప్పినామా? లోపల చెప్పినామా? శరీరము లోపల చెప్పినాము. ఇప్పుడు శరీరము లోపల అయితేనే జ్ఞానము తెలిసేది అని ఒక క్లారిటీ వచ్చింది మనకు. ఒక నిర్ధారణ ఏర్పడింది మనకు. మనిషి ముస్లీముగానీ, హిందువులుగానీ, క్రైస్తవులుగానీ, ఎవరన్నాగానీ ఇప్పుడు మేము ఏమి అంటున్నామంటే ఇప్పుడు మనము శరీరము లోపల ఉండేదాన్నే చెప్పుకుంటున్నాము కాబట్టి ఇది ఒక మతానికి సంబంధించిన జ్ఞానము కాదు. శరీరము బయట చెప్పుకుంటే ఏదో మతానికి సంబంధించినదై ఉండాలది. కాని ఇక్కడ మతానికి సంబంధించిన జ్ఞానము కాదు కాబట్టి మనము ఏమి చేయాలి? శరీరము లోపల చెప్పుకోవాలి. శరీరము బయట చెప్పుకుంటే ఏమయితాది అంటే మళ్ళ ఏదో ఒక మతానికి సంబంధించినదై ఇరుక్కుంటారు దాంట్లో మీరు.


కాబట్టి మనము ఇక్కడ చెప్పేదంతా శరీరము లోపలకు సంబంధించిన జ్ఞానమే చెప్పుకుంటాము. బయట చెప్పేదానికి అవకాశము లేదు. ఇప్పుడు మనము ఏమి చెప్పుకుంటున్నాము జీవుడు అనేవాడు నువ్వుగా ఉన్నావు. నువ్వు శరీరములో ఇరుక్కొని ఉన్నావు. ఇరుక్కొని ఉండి కొన్ని


----

సంవత్సరములుగా పుట్టి, కొన్ని సంవత్సరములకు నీకు వయస్సు వచ్చింది. ఇంకా కొన్ని సంవత్సరముల తరువాత నీవు ముసలి వాడయిపోతావు. శరీరమంతా ముసలిది అయిపోతుంది. అనారోగ్యము పాలు అయిపోతుంది దాంట్లో అవయవాలు పని చేయకుండ పోతాయి. ఎప్పుడైతే చినిగిన గుడ్డ ధరించేదానికి అయోగ్యముగా ఉంటాదో ఆ రకంగానే శరీరములో నువ్వు ఉండేదానికి అవకాశము ఉండదు, అంటే జీవుడు ఉండేదానికి అవకాశము ఉండదు. జీవుడు లేనపుడు ఏమయితాది శరీరాన్ని విడిచిపెట్టి పోవాల్సిన పని వస్తుంది. శరీరము శవము అయిపోతుంది. నువ్వు ఇంకో జన్మకు పోతావు నీ కర్మ ఎట్ల ఉంటాదో అట్ల పోతావు నువ్వు. ఇప్పుడు పుట్టినాము అది జరిగిపోయింది. చనిపోవడము అంటూ నిర్ణయము ఉంది. ఈ రెండే ముఖ్యమైనేటివి జీవితానికి మొదలు, చివర. మధ్యలోదంతా జీవితము అంటాము. మనము ఒకరోజు పుట్టాము, ఒకరోజు చనిపోవాల్సిందే కాని అది మాత్రము తప్పదు, ఎవరు తప్పించుకొనే దానికి అవకాశము లేదు. దాన్ని 'అంతము' అంటాము. ‘అంతము’ అంటే చివర. సరే, ఇప్పుడు మనము ఏమి చేస్తామంటే స్థూలముగా కొద్దిగా అర్థమయ్యేటట్లు చెప్పుకుందాము. స్థూలముగా చెప్పుకుంటే కొద్దిగా అర్థమయితుంది జ్ఞానము, మళ్ళీ సూక్ష్మముగా చెప్పుకుందాము. అంటే జ్ఞానమనేది స్థూల, సూక్ష్మముతో కూడుకొని ఉంటుంది.


కానీ సూక్ష్మముగ ఉండేటువంటిది నిజమైన జ్ఞానము. దానిని అర్థమయ్యేదానికి కొద్దిగ మనము స్థూలముగా చెప్పుకోవచ్చు. ‘అంతము’ అంటే నాశనము అని అర్థము. సరే, మనము ఆహారము తింటాము, అది అంతము అయిపోతుంది. జీర్ణము అయిపోతుంది అని అంటాము దాన్ని. 'జీర్ణము' అంటే నాశనము. ఆ జీర్ణించేది ఎక్కడ నుండి మొదలైతుంది.


----

నోట్లో ముద్ద పెట్టుకున్నప్పటినుండి మొదలైతుంది. అంతే కదా! మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు నోట్లో అన్నము పెట్టుకుంటాము. ఒక రొట్టో, అన్నమో ఏదో ఒకటి పెట్టుకుంటాము. నోటి నుంచి జీర్ణము మొదలవుతుంది. జీర్ణము నోటి నుండి ఎట్ల మొదలయితుంది? అంటే అది నశించేదానికి మొదలయితుంది. నువ్వు రొట్టె పెట్టుకున్నావు లేకపోతే అన్నము పెట్టు కున్నావు నోట్లో నములుతాము. నమిలితే సగము నాశనము అయిపోతుంది, ఆకారమంతా కోల్పోతుంది అది, మిక్స్ అయిపోతుంది, నువ్వు తిన్న ఆహారము ఫలానిది అని మనము విడదీసి చూపలేము. అంతకు ముందు ఇది పప్పు, ఇది చారు, ఇది బువ్వ అని చెప్పుతాము. నమిలిన తరువాత పప్పు చూపలేము, చారు చూపలేము, అన్నము చూపలేము మిక్స్ అయిపోతుందన్నమాట. నమిలేసరికే నోట్లోనే సగము నాశనము అయిపోతుంది. అప్పుడు అంతమై పోవడానికి ఇక్కడ మొదలు పెడుతుంది కాబట్టి ఇక్కడ ఆ నమిలేటివి పళ్ళున్నాయి మనకు. దానిని ఏమంటాము అంటే ‘దంతము' అంటున్నాము. 'అంతము', 'దంతము' దగ్గర దగ్గర ఉన్నాయి కదా, అన్నదమ్ముల మాదిరి. 'అంతము' అనే పదము నుంచి 'దంతము' అనే పదము పుట్టింది. దంతము ఎవరికుండే దని? ముస్లీముల కేనా ఉండేది? క్రైస్తవులకేనా? హిందువులకేనా? అందరికి ఉన్నాయి.


ఇప్పుడు ఇది అందరికి సంబంధించినది దంతాలు. ఇప్పుడు దంతము అంటే అంతము అని. అంతము నోటి నుండి మొదలయితుంది. నోటి నుండి మొదలై జీర్ణాశయములో పడుతుంది. తరువాత జీర్ణాశయములో ఇంకా కొన్ని రసాలు కలుస్తాయి. అవి ఇవి కలిసి నాశనము చేస్తాయి. మొత్తము పానకము అయిపోతుంది. నువ్వు చికెన్ తిన్నావో, మటన్ తిన్నావో, బిరియాని తిన్నావో, తెల్ల అన్నము తిన్నావో, నల్ల అన్నము తిన్నావో, పచ్చ


----

అన్నము తిన్నావో ఏదో కాని అక్కడ మాత్రము పానకము అయిపోతుంది. దానిని "అమాశయ పాకము" అని అంటారని మనము పూర్వము చదువుకున్నాము. ఆ పాకము ఏమయితాది అంటే జీర్ణము అయిపోతుంది. ప్రేవులలోకి పోయి సారము పీల్చుకోబడుతుంది అంతేకాని అక్కడ జీర్ణమయ్యేది ఏమి లేదు. జీర్ణాశయములోనే మొత్తము జీర్ణము అయి పోతుంది. ఇక్కడ దంతాలు దగ్గర మొదలవుతుంది అంతము. అందువలన మనము ఏమి చెప్పినామంటే దీన్ని 'దంతము' అనే పేరు పెట్టినాము. ఈ అంతము ఏమిటికి అయితుంది? తిన్న ఆహారానికి అంతము అయితావుంది. అది మాములుగా నమిలేయబడుతావుంది. చివరకు మెత్తగా చేయబడుతా వుంది. దాని రూపురేఖలు మారిపోతున్నాయి. నలిపివేయబడుతుంది. చివరకు పిప్పి కూడ బయటపడుతావు ఉన్న సారము పీల్చబడుతుంది.


ఈ రకముగా జీర్ణము అయిపోతావుంది. ఆ జీర్ణము ఎక్కడ మొదలయింది? నీ నోట్లోనే మొదలయ్యింది. నోట్లో ఎక్కడ నుంచి మొదలయ్యింది? దంతము దగ్గర నుంచి మొదలయ్యింది. 'దంతము' అనే పదము ఎక్కడ నుంచి పుట్టింది? 'అంతము' అనే పదము నుంచి పుట్టింది. మీకు దంతాలున్నాయా? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 32. అంటే పైన 16 కింద 16. ఎవరో చెప్పియున్నారు ఈ మాట, వాడు కొట్టింటే నీ పదహారు పళ్ళు ఊడి పోయినాయి. పైన 16, క్రింద 16 మొత్తము 32 ఊడి పోయినాయి అని అంటా ఉంటారు. ఊడిపోవు కానీ. ఏదో మాట చెప్పినారు మనకు మతికి ఉండాలని. పైన 16 పళ్ళు క్రింద 16 పళ్ళు ఉన్నాయంట మనకు. ఇప్పుడు నువ్వు ఏమిటో జ్ఞానము చెప్పుతా అని భోజనము అంటావు, నీళ్ళు త్రాగమంటావు, నమలమంటావు, ఇది జ్ఞానమా అని మీరు ప్రశ్న ఒకరన్నా వేయరేమయ్యా? చెప్పేదంతా వినుకుంటా పోయేదేనా.


----

ముస్లీములకున్నాయి అంటావు, పిల్లోళ్ళకున్నాయి అంటావు, పెద్దోళ్ళకున్నాయి, కుక్కలకున్నాయి, నక్కలకున్నాయి అంటావు. పళ్ళు అందరికి ఉన్నాయి, అన్నీ తింటానే ఉన్నాయి. ఇది రోజు జరిగేపనే కదా, కొత్త జ్ఞానము ఏమన్నా ఉందా! వాళ్ళు వేదాలు చెప్పుతారు, అది చెప్పుతారు, ఇది చెప్పుతారు, శ్లోకాలు చెప్పుతారు పెద్ద పెద్ద జ్ఞానమంతా చెప్పుతావుంటే నువ్వు కూర్చుపెట్టుకొని కథ చెప్పుతున్నావే! అని అడగవచ్చు మీకు ఏమని ఉంటుందో అదే అడిగినాను ఎటు తిరిగి చివరకు జ్ఞానమే చెప్పుతాడు అని మీకు అంచనా ఉంటుంది, మీరు చూసుకోండి. పళ్ళున్నాయి కదా మీకు! అక్కడివరకు గ్యారెంటీ. తరువాత నమలడము ఉంది. పైన 16, కింద 16 పళ్ళు ఉన్నాయి కదా.


ఈ మధ్యకాలములో ఒక డెంటల్ ల్ డాక్టర్ దగ్గరికి పోయినాము అంటే పళ్ళ డాక్టర్ దగ్గరికి పంటినొప్పి వచ్చి. ఆయన అంతకుముందే అప్పుడొకటి అప్పుడొకటి తీసివేసినాడు 7, 8 యేండ్ల నుంచి అంటే 3,4 పళ్ళు పెరికేసినాడు. మళ్ళీ నొప్పి వచ్చింటే మళ్ళీ పోయినాము. ఈ సారి ఆయన ఏమి చెప్పినాడంటే ఇంతకుముందు పళ్ళు పెరికేసి వేరే పళ్ళు పెట్టినాము ఆ స్థానములో ఖాళీ లేకుండా. కానీ ఇప్పుడు చివరకు చివరి పన్ను డ్యామేజి అయింది. దీనిని పెరికేస్తే పెట్టేదానికి కాదు అన్నాడు. అన్ని పెట్టిన తర్వాత ఆ చివరి పళ్ళు ఎందుకు పెట్టలేరు మీరు అని మేము అడిగినాము. దానికి ఆయన అది ఏందనుకున్నావు 'జ్ఞానదంతము' అన్నాడు. ఓయమ్మ ఇక్కడ కూడ ఉందా జ్ఞానము! అనుకున్నాము. అక్కడ లింక్ వచ్చింది చూడండి. జ్ఞానదంతమేందయ్యా అసలుకు మామూలు దంతాలే కదా ఉంటాయి అందరికి, జ్ఞానదంతాలుంటాయా! అని అడిగితే, ప్రతి ఒక్కరికి ఉంటుంది జ్ఞానదంతము అన్నాడు. ఎక్కడ ఉంటాది అంటే


----

చిట్టచివరిది జ్ఞానదంతము అన్నాడు. చిట్టచివరిదే మాకు కూడా కావాల్సిండేది అని మేమన్నాము. చిట్ట చివరిది జ్ఞానదంతము అయితే నాలుగు చివరలు ఉన్నాయి కదా! ఏ చిట్టచివరిది జ్ఞానదంతము అని అడిగితే నాలుగు చివరిలో ఉండేటివి కూడా జ్ఞానదంతాలే అని చెప్పాడాయన. అప్పుడు వచ్చింది ఓహెూ ఏదో ఉన్నది దీనిలో జ్ఞానము అనుకున్నాను. దంతములో వారికి తెలియకుండానే, మళ్ళ జ్ఞానదంతమే అని ఎందుకు అంటారు? అని అడిగితే డాక్టర్లు చెప్పిన పేరేగాని అది ఏమిటిదో మాకు తెలియదు, జ్ఞానదంతము అంటారని మాత్రము తెలుసు అన్నారు. నేర్చుకొన్నది చెప్పినారు వాళ్ళు. సరే, ఇంటికి వచ్చి ఆలోచన చేసాము. మనకు ఒక ఆయన ఉన్నాడు కదా గురువు. గురువుతో ఆలోచన చేసాము. ఏందయ్యా! జ్ఞానదంతము అంటారు. దంతాలలోను జ్ఞానదంతము అంటా ఉన్నారు. అది నాశనము చేసేది కదా! మళ్ళ నాశనము చేసే దానిని జ్ఞానదంతము అంటాడు అంటే భగవద్గీతలో చెప్పినేది అదే కదరా నీకు! దేవుడు అంటే నాశనము చేసేవాడే కదా! దేవుడు అంటే అర్థము ఏమి? నాశనము చేసేవాడు అని అర్థము. నువ్వు నాశనము అయ్యిపో అని చెప్పేవాడు అని అర్థము. నీకు భగవద్గీత అంతా చెప్పినేది ఎందుకు నీవు నాశనము అయిపోయేదానికి చెప్పినేది, ఇంకోదానికేమి కాదు. అంటే బాగా ఆలోచన చేసుకోండి.


భగవద్గీత చెప్పినా, ఖుర్ఆన్ చెప్పినా నీవు లేకుండా పోయేదానికే గానీ నీవు ఉండే దానికి కాదు. అది కూడ కరెక్టే అనుకున్నాము. చెప్పినేది ఎవరు స్వామి! ఎవడో మనకు తెలియదు. నడిమధ్యవాడు. నడి మధ్య ఆయన ఏమి చెప్పినాడంటే పూర్తి దేవున్ని అడిగేదానికి లేదు కదా! ఆయన మాట్లాడడు, కనపరాడు. దేవునికి రూపము లేదు. పేరు లేదు. అంటే


----

మీరు ఒక ప్రశ్న అడగవచ్చన్నమాట. ఏమని? ఆయన ఏ పని చేసేవాడు కూడ కాదు. ఇంకో రవ్వంత వెనకకు పోయి ఇంతకు ముందు మీరు ఏమి చెప్పినారు స్వామి! ఈ ప్రపంచాన్ని అంతా సృష్ఠించినేది ఎవరు? అని ఎవరో ప్రశ్న వేసింటే, మీరేమన్నారు? ఆయన భగవంతుడు అని అన్నాడు. భగవంతుడు మామూలుగ కనిపించే మనిషి కదా! కనపరాకుంటే దేవుడు అయితాడు. ఆయన కనిపిచ్చేటట్టుగా పుట్టి మాట్లాడితే భగవంతుడు అయితాడు. కానీ భగవంతుడు ఎవరో మనకు తెలియదు. కాని కనిపించే టటువంటి వాడు ఏ దాన్ని సృష్టించలేదు. కనిపించనటువంటి దేవుడే కదా సృష్ఠించినేది అని మీరు అన్నారు.


ఇప్పుడు మళ్ళీ మీరేమి చెప్తున్నారు? దేవుడు మాట్లాడడు, కనపరాడు, ఏ పని చేయడు. రూప నామ క్రియలు లేనివాడు అని మళ్ళ మీరు జ్ఞాపకము చేస్తున్నారు. మళ్ళ ఏమీ చేయనోడు ఈ ప్రపంచాన్ని ఎట్లు సృష్ఠించినాడు? అని మీరు ప్రశ్న వెయ్యొచ్చు. అంటే ఇంతమంది మనుషులను ఎలా సృష్ఠించినాడు అని మీరు ప్రశ్న వేయవచ్చు. సరే, ఎప్పుడో సృష్ఠించినాడు అంటే అట్ల కాదు. మేము చూసినాము, 20 ఏళ్ళ తరువాత చూస్తే పిల్లోళ్ళంతా పెద్దోళ్ళయినారు, క్రొత్త క్రొత్త పిల్లోళ్ళు పుడతావున్నారు. వాళ్ళంతా పెద్దోళ్ళయితావున్నారు. కొత్త సమాజము ఏర్పడుతావుంది. పెద్దోళ్ళంతా చచ్చిపోతున్నారు. అట్లని వీళ్ళంతా కొత్త కొత్తగా పుడతావున్నారు కదా! వీళ్ళందరిని ఎవడు పుట్టిస్తున్నాడు? ఎప్పుడో పూర్వము పుట్టినోళ్ళ గురించి మాకు తెలియదు కానీ ఇప్పుడు మన కళ్ళముందర పుడుతున్నారు కదా. మరి దేవుడు ఎట్ల పుట్టిస్తున్నాడు పని చేయనోడయితే? అని అడగవచ్చు. మీరు అడగవలసిన ప్రశ్నే కదా అది. అడగవలసిన ప్రశ్నే కానీ మీరు అడగడము లేదు. మేమేమంటామంటే మనిషినిగాని, మనిషిగా


----

ఉన్నటువంటి భగవంతుడినిగాని ఎవర్ని ఎవ్వరూ పుట్టించలేదు. అందరిని పుట్టించినేది దేవుడే అని చెప్పుతున్నాము. మళ్ళీ ఇంకా రవ్వంత వెనకకుపోతే ఓరేయ్! నిజముగా దేవుడు కూడ కాదు, ఇప్పుడు నీకు చెప్పితే ఒప్పుకోవు నువ్వు, తరువాత చెప్పుతాలే అంటున్నాము. ఏమంటున్నాము? దేవుడు కూడా పుట్టియ్యలేదు నిన్ను అని చెప్పుతున్నాము. ఇది ఏంది! అప్పుడేమో దేవుడు అన్నాడు, ఇప్పుడేమో దేవుడు కూడా కాదు, ఇప్పుడు చెప్పితే వినవులే మళ్ళీ చెప్పుతానులే అంటున్నాడు. ఇది ఏందో మోసము చేస్తున్నాడని అనుకుంటారు మీరు. అట్లా అనుకోవాల్సిందే కదా! అబద్దముగా చెప్పితే దేవుడు పుట్టించినాడు. నిజము చెప్పితే దేవుడు కూడ పుట్టించలేదు మనలను. మళ్ళీ ఎవరు పుట్టించినారు అనేది ఇంకా కొంచెము ముందుకు పోతే తెలుస్తుంది మీకు. అప్పుడు ముందు చెప్పినేది, వెనుకల చెప్పినేది అన్ని కరెక్టే, తప్పు ఏమి లేదు అని తెలుస్తుంది మీకు.



సరే ఇప్పుడు ఆ సమస్యను వదిలివేసి ఈ సమస్యలోకి వస్తాము. 'ఏమి చెప్పుతున్నాము మీకు? జ్ఞానదంతము అని. సరే, ఇప్పుడు ఈ జ్ఞానదంతము అంటే ఏమిటి అని మనము ఆలోచన చేశాము. మళ్ళీ అది కూడా మనము ఇంకొకరిని అడగవలసిన పని వచ్చింది. మనకు తెలియదు కదా! మనకు దంతాలే తెలియవు, జ్ఞానదంతము గురించి మనకు ఏమి తెలుసు? ఇక్కడా కనపరాని ఆయన ఏమి చెప్పుచున్నాడంటే ఇది ప్రపంచములో ఎక్కడ రాని సమస్య, ఎక్కడ లేని సమస్య, ఎవరు ఏ గ్రంథములోగాని, ఏ ఉపనిషత్తులోగాని, లేకపోతే వేదాల్లోగానీ లేకపోతే దైవగ్రంథాలలోగానీ పళ్ళను గురించి వ్రాయలేదు స్వామి! భగవద్గీతలో వ్రాసినారా? ఖుర్ఆన్లో వ్రాసినారా? బైబిలులో వ్రాసినారా? మరి ఎవ్వరు వ్రాయనేటివి నువ్వు చెప్పుతావున్నావు. అంతేకదా! సరే ఏదో ఒకటి మనము


----

-

చెప్పుకుంటున్నాము. ఏమని చెప్పుకుంటున్నాము? దంతము అంతము అని. దంతమన్నా అంతమన్నా రెండు ఒకటే. దంతము అంటే నమిలేది, అంతము అంటే 'మోక్షము'. మనమెట్ల మోక్షము పొందుతామో ఈ పళ్ళను చూసి తెలుసుకోవాలి అని దేవుడు లింక్ పెట్టినాడిక్కడ. అందువలన జ్ఞానదంతము అని పేరు పెట్టినాడు. అప్పుడన్నా రవ్వంత మీరు ఆలోచన చేయండి అని. డాక్టర్ చెప్పిన తరువాత నాకు ఆలోచన వచ్చింది, ఏమిటో ఇది చూస్తాము అని. మేము ఏమంటామంటే! పడుకొని లేచిన తరువాత ప్రతి నిత్యము బ్రతుకు తెరువు కోసము మనము పని చేస్తూవున్నాము. అంతేకదా! 


ఒకరు డాక్టర్ పనిచేస్తూ వున్నారు, ఇంకోరు కూలీ పనిచేస్తూ వున్నారు, ఇంకోరు హమాలి పని చేస్తావున్నారు, ఇలా రకరకాల పనులు చేసి మనము బ్రతుకుతున్నాము. ఆ పనులు చేయాలి అంటే నిద్ర నుండి లేచిన తరువాత మొట్టమొదట నువ్వు 'హస్తాన్ని చూసుకో” అని పెద్దలు చెప్పినారు. ప్రతి ఒక్కరికి హస్తము ఉంది. అరచెయ్యి ఉంది. అరచెయ్యిలో మూడు గీతలు ఉన్నాయి. దానిని చూసుకోమని చెప్పినారు. ముస్లీములకేనా అంటే అందరికి సంబంధించిన సమస్య ఇది. ఈ రోజు క్రైస్తవులు గానీ, ముస్లీములుగానీ, హిందువులుగానీ ఎవ్వరు కూడా చెయ్యి చూసుకోవడము లేదు. అరచెయ్యి చూసుకోమని ఎందుకు చెప్పారంటే? నీ చేతుల్లో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అనేటటువంటివి మూడులైన్లు గీయబడి ఉన్నాయి. నీవు జీవాత్మవని గుర్తు చేస్తున్నది భగవద్గీత. జీవాత్మతో పాటు కలిసియున్న రెండో గీత నీతో పాటి కలసి ఉండేటటువంటి ఆత్మని గుర్తు చేస్తుంది. ఈ రెండు గీతలకు పైన ఇంకొక గీత రెండింటికి సంబంధము లేకుండా ఉన్న మూడో ఆత్మను గుర్తు చేస్తుంది. దానినే మనము పరమాత్మ అంటాము.


----

అంటే వీటికంటే వేరుగ ఉంది అని అర్థము. ఆ మూడు గీతలు నీ హస్తములో ముద్రించబడి ఉన్నాయి. మీ చేతులు ఎవరు చూసుకొన్నగానీ అవి

ఉంటాయి.


ఆ రకముగా ఈ మూడు గీతలు అన్ని మతాలకు సంబంధించి నటువంటి విషయమైనప్పటికీ ఎవరూ దానిని పట్టించుకోవడము లేదు. ఇది దేవునికి సంబంధించిన విషయము. అది మనము గ్రహిస్తే బాగుంటుంది గానీ ఆచరించడము లేదు, చూసుకోవడము లేదు. చూసుకుంటే మనకు మొట్టమొదట అర్థమయ్యేది త్రైతము అర్థమవుతుంది. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అనేటువంటి మూడు ఆత్మలు అర్థమయితాయి. నువ్వు ప్రతి పని దేనితో చూసి చేస్తున్నావు? కంటితో చూసి చేస్తున్నావు. మరి పనులు చేసుకొనే దానికి నువ్వు కన్ను ఉపయోగించుకుంటున్నావుగానీ జ్ఞానము తెలుసుకొనే దానికి నీ కన్ను ఉపయోగించుకోలేదు. నువ్వు కన్నుని ఉపయోగించుకొని పనిచేస్తున్నావు. పని చేతులతో చేస్తున్నావు. ప్రపంచ విషయాన్ని తెలుసుకొనే దానికి మొట్ట మొదట పని చేసేది ఏది, కన్ను. అది దృశ్యము చూసిన తరువాతే నువ్వు పని చేయగలవు. చూడకుండా ఎవరన్నా పని చేస్తున్నారా ప్రతి ఒక్కరు చూసే పనిచేస్తూ ఉన్నారు. ఒక టీచర్ చదువు చెప్పాలంటే చూసే చెప్పాలి. ఒక వ్యయసాయదారుడు (ఒక రైతు) సేద్యము చేయాలంటే కన్నుతో చూసే చేయాలన్నమాట. తరువాత చేసేది చేతులు. ఇప్పుడు మనము జ్ఞానేంద్రియము అంటాము కన్నును. ఈ జ్ఞానేంద్రియము ఒకటి అయిపోయిందా అంటే ముఖ్యమైనది ఇది. ఇప్పుడు రెండోది, పని చేసేది హస్తము అంటే చెయ్యి. ఈ చెయ్యికి ఐదు వ్రేళ్ళు ఉన్నాయి, ఆ ఐదు వేళ్ళతో పట్టుకొని ఏదైనాగాని బిగించగలవు, ఎత్తగలవు, దించగలవు, అన్నీ ఆ చేతితోనే చేస్తున్నావు. అంటే జ్ఞానేంద్రియ


----

ములు, కర్మేంద్రియములు పని చేయగల్గితే ఒక పని చేయగల్గుతున్నావు. ఆ పని చేయడము వల్ల నువ్వు బ్రతికేదానికి అవకాశము వస్తా ఉంది.


ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కదిలించకోకుండ ఎవడన్నా బ్రతుకగల్గుతాన్నాడా భూమి మీద? ఎవ్వరూ బ్రతికేదానికి అవకాశము లేదు. వాళ్ళు హిందువులు గానీ, ముస్లీములు గానీ, ఇంకొకరుగానీ ఏ మతస్థులైన గానీ జ్ఞానేంద్రియాలు ఉపయోగించుకోవాలి. కర్మేంద్రియాలు ఉపయోగించుకోవాలి. జ్ఞానేంద్రియములలో నయనమ్ ప్రధానమ్ అని అంటారు. “జ్ఞానేంద్రియానాం నయనం ప్రధానం” అంటే ఈ జ్ఞానేంద్రియా లలో కన్ను ప్రధానమైనది అని అర్థము. కన్ను ప్రధానమైనది ఎందుకంటే అది చూస్తేనే కదా చేసేది! కన్ను ప్రధానమని ఎందుకు అన్నారు? అంటే నీ కంటిలో మూడు భాగాలున్నాయి. ఒకటి తెల్లగుడ్డు, రెండు నల్లగుడ్డు, దానిలోపల ఇంకా చిన్న నల్లగుడ్డు ఉంది. ఈ మూడు భాగాలను ఏమంటాము అంటే చిన్నగా ఉండేదాన్ని జీవాత్మ అంటాము, దానికంటే పెద్దగ ఉండేదాన్ని ఆత్మ అంటున్నాము. ఈ రెండు నల్లగానే ఉంటాయి చూడు! అంటే ఒకే జాతి అని రెండు జోడు ఆత్మలు అని. చిన్నగ ఉండేది పెద్దగ ఉండేది రెండూ నల్లగానే ఉంటాయి. నల్లగ ఉండే దాంట్లో ఇంకా నల్లగా ఉంటుంది, దానిని కంటిపాప అంటాము. అప్పుడు కంటిపాప, నల్లగుడ్డు రెండు ఆత్మలే అంటే జీవాత్మ, ఆత్మగ మనము పోల్చుకుంటే బయట వెడల్పుగా అంతా వ్యాపించి తెల్లగా ఉండేదాన్ని పరమాత్మ అంటున్నాము. పరమాత్మలో ఆత్మ ఉండగా ఆత్మలో జీవాత్మ అణిగి ఉంది అని చెప్పుచున్నాము. ఇప్పుడు మధ్యలో ఉండేది ఆత్మ. మొట్టమొదట లోపల చిన్నగ ఉండేది అంటే అన్నిటికంటే చిన్నది జీవాత్మ. అన్నిటికంటే పెద్దది పరమాత్మ.


----

సిద్ది బోధ

ఈ రకముగా నీ కంటిలో మూడు ఆత్మలు ఇమిడి ఉన్నాయి కాబట్టి నువ్వు జ్ఞానము తెలుసుకొనేదానికి కన్ను ప్రధానమైనది. కన్నుతో చూసి పని చేయగల్గుతున్నావు. ఈ కన్ను వల్ల నువ్వు ప్రతీది తెలుసుకోగల్గుతున్నావు. ఆ కంటిలో ఏమున్నదో అద్దము చూసి తెలుసుకో ఒకసారి అంటే నీ కంటిలో నీకు త్రైతము కనిపిస్తావుంది. త్రైతము తెలియబడుతావుంది. ప్రతి ఒక్కరు ఎవరైనా చూసుకోవచ్చు. కంటిలోనేనా త్రైతము ఉండేది అంటే పనులను చేసేదానికి చేతిలోనికి వచ్చేసరికి చేతిలో కూడ మూడు రేఖలు ఉన్నాయి. ఈ కంటిలో ఏవైతే మూడు భాగాలున్నాయో అవే మూడు భాగాలు మూడు రేఖలుగా దేవుడు చేతిలో తీర్చిదిద్దినాడు. అంటే చూసే దాంట్లో త్రైతము ఉంది. చేసేదాంట్లో త్రైతము ఉంది.


నోటితో తింటాము, కంటితో చూస్తాము, చేతితో చేసి సంపాదించు కొంటాము, జ్ఞానేంద్రియములో త్రైతము ఉంది. కర్మేంద్రియములో త్రైతము ఉంది. ఇప్పుడు ఈ నోరు కూడా కర్మేంద్రియములలోకి వస్తుంది చూసుకో నీకు! క్రింద 16 పళ్ళు ఉండాయి కదా! 16 పళ్ళను సగము డివైడ్ చెయ్యి ఒక ప్రక్కకు. అంటే ఎనిమిది మాత్రమే ఉంటాయి. అంటే ముందర నువ్వు చూసుకో రెండు పళ్ళు పెద్దవి ఉంటాయి. ఒకటి ఒక ప్రక్కకి, మరొకటి ఒక ప్రక్క డివైడ్ చేసుకో. ఈ పెద్దపన్ను, దాని తరువాత రెండో పన్ను, దాని తరువాత మూడో పన్ను చూసుకోండి, చేయి పెట్టి చూసుకోండి మీరు. ఒకటి, రెండు, మూడు. కోరపన్ను కొస్సిగ ఉంటుంది. మిగతా రెండు పళ్ళకంటే కొస్సిగ ఉంటుంది. మూడు పళ్ళు ఉన్నాయి కదా! సగము నుండి ఇవతలకు తీసుకోండి. పెద్ద పళ్ళు ఉండాయి కదా! ఒకటి రెండు మూడు. కోరపళ్ళు ఇప్పుడు మనము ఏమి చేస్తాము అంటే మనుషులకు మామూలుగ ఉన్నాగాని ఈ పెద్ద పన్నును జీవాత్మగా తీసుకో. రెండో పన్నును మధ్య ఆత్మగా తీసుకో.


----

కానీ కోర పళ్ళు ఉన్నాయి చూడు దానిని పరమాత్మగా తీసుకో. అంటే చీల్చివేసేదది, ఏమిటినైనా చీల్చివేస్తుంది, అంటే జంతువులకైతే ఇంకా పొడవుగా ఉంటుంది మనుషులకు అంతే పెట్టినాడు దేవుడు. వద్దులే నాయన! నీవు చీల్చుకుంటు పోతే దేశాన్నే చీల్చేస్తావని సన్నగా పెట్టినాడు దేవుడు. జంతువులకు చాలా పెద్దగ పెట్టినాడు. జంతువు కడుపునిండుతానే ఊరక అయితాది. మనిషి కడుపునిండినా ఊరకనే ఉండేవాడు కాదు. కాబట్టి సన్నగ పెట్టి విడిచిపెట్టినాడు. ఈ మూడు పళ్ళలో అర్థము జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అని తెలుసుకొన్నాము. పరమాత్మను కోరపన్నుగా తీసుకుంటే మధ్య ఆత్మను రెండో పన్నుగా తీసుకుంటే మొదటిది వెడల్పుగా ఉండే పన్నును జీవాత్మగా తీసుకుంటాము. ఈ రకముగ మూడు పళ్ళను నువ్వు లెక్కవేసుకో. ఎవరికన్నా ఏమన్నా హెచ్చుతగ్గులున్నాయా? లేవు. అందరికీ సమానముగ ఉన్నాయి అవి. క్రైస్తవులకు? ముస్లీమ్లకు హిందువులకు సమానముగా ఉన్నాయి. సరే, మనుషులకు జ్ఞానము అవసరము కాబట్టి ఈ రకముగా మనుషులకు చేతిలో పెట్టినాడు, కంటిలో తరువాత నోట్లో కూడా మూడు ఆత్మలను సూచిస్తూ పెట్టినాడు. దానినే త్రైతము అంటున్నాము.


మూడు ఆత్మలు యొక్క వివరము. ఈ మూడు పళ్ళు సరి పోయినాయి అవతల ఐదు పళ్ళు ఉన్నాయే! ఐదు పళ్ళను లెక్కవేస్తే, ఆ కోరపన్ను ప్రక్కన ఉండేది తామస గుణము, దాని ప్రక్కన ఉండేది రాజన గుణము, దాని ప్రక్కన ఉండేది సాత్విక గుణము, దానిప్రక్కన నాల్గోది గుణరహితము, ఆత్మకు సంబంధించినదది. మూడు గుణాలు అయి పోయినాయి కదా! మూడు గుణాల మధ్యలో ఏముంది? ఏ గుణము లేకుండా ఉండేది గుణరహితము కదా! ఈ రకముగా మొత్తము గుణ భాగాలు ఎన్ని


----

ఉన్నాయి? “చాతుర్వర్ణము” నాలుగు రకాలున్నాయి. మొదటిది తామసము, రెండోది రాజసము, మూడోది సాత్వికము, నాలుగోది గుణరహితము. నాలుగోది గుణములు లేకుండా ఉండేది ఖాళీ, ఆత్మ భాగము. గుణాలు ఏమిటికి గుర్తు? మాయకు గుర్తు. దేవుడు మూడు రకాలుగ ఉన్నాడు. అంటే జీవాత్మ, ఆత్మ, పరమాత్మగ మూడు రకాలుగా చీలిపోయినాడు. మాయ ఎన్ని రకాలుగా చీలిపోయింది? నీ శరీరములోనే తామస, రాజస, సాత్విక గుణముగా ఉంది, తరువాత గుణాలు లేని రకముగా కూడ ఉందన్నమాట. జీవుడు తామస గుణములో ఉంటే 'తామసుడు' అంటాము. రెండో దాంట్లోకి పోతే 'రాజసుడు' అంటాము. మూడవ దాంట్లోకిపోతే ‘సాత్వికుడు' అంటాము. ఇప్పుడు గుణము లేని దాంట్లోకి వస్తే, ఏమంటాము వాన్ని? యోగి అంటాము.


ఈ గుణచక్రములో జీవుడు ఉంటూ గుణాలు మారుతూ ఉన్నాడు. యోగము చేసే సమయములో గుణరహితములోకి వస్తాడు. కాబట్టి భగవద్గీతలో కూడ “చాతుర్వర్ణము” అని ఒకచోట చెప్పినాడు. “గుణ కర్మ విభాగశ:” అని చెప్పినాడు. దాంట్లో ఈ నాల్గు రకాల గుణాలు ఉన్నాయి అని చెప్పినారు. మనము ముఖాన పెట్టుకున్న చక్రాలలో ఈ క్రింద గుణచక్రములో కూడ ఈ నాలుగు ఉంటాయి. మూడు రౌండ్లు ఉన్నాయి, అదే గుణచక్రము. మధ్యనాడిలో ఉండేది ఆత్మ అంటే గుణాలు లేనటువంటి దానిని సూచించినది. దేవుడు మూడు భాగాలుగా తెలిసిపోయినాడు నీ పళ్ళలో, నాలుగు మాయగా తెలిసి పోయినది. అర్థమయిందా! అంటే మూడు గుణాలు, ఒకటి గుణము లేనిది. సరే ఇప్పుడు జీవాత్మ, ఆత్మ, పరమాత్మలను నోటిలో మనము తెలుసు కోగల్గినాము. ఈ మూడు గుణాలను జయించి, నాలుగవదైన ఆత్మ అనేటువంటి దానిలోకి


----

పోతే, అంటే నువ్వు యోగము చేయగల్గితే అది బ్రహ్మయోగముగానీ, కర్మయోగముగానీ, ఏదో ఒక యోగము చేయగల్గితే అప్పుడు నీవు దేవునిలోకి ఐక్యమైపోతావు ఈ విషయమును తెలియునట్లు చివరి దంతమును “మోక్ష దంతము” అని అంటాము. అది ఎన్నోది? ఐదోది. ఇవన్ని తెలుసుకోగల్గితే ఏమౌతుంది, నీవు మోక్షము పొందుతావురా అని దేవుడు ఐదవ పన్నును గట్టిగ గూటము పెట్టినట్టు పెట్టినాడు. అది పెరికితే మళ్ళీ పెట్టేదానికి కాదు. అట్ల ఈ రకముగా నీకు 8 పళ్ళు ఒక సైడ్ ఇచ్చినాడు. సరే కుడిప్రక్కన చూసుకో ఎడమ ప్రక్కన చూసుకో. ఎడమ ప్రక్కన కూడ అవే ఉన్నాయి. లేదు క్రింద చూసుకో పైన చూసుకుంటే పైన క్రింద కూడ అవే ఉన్నాయి. ప్రపంచము మొత్తము చూసుకో ఈ త్రైతము తప్ప ఏమీ లేదు. అందువలన ఎక్కడన్నా ఇదే ఉంది అని చెప్పే దానికోసము నాలుగు ప్రక్కల పెట్టినాడు నీకు. చివరిలో మోక్షదంతాన్ని పెట్టినాడు. ఏమన్నాగానీ నువ్వు ‘తైత సిద్ధాంతము' ద్వారానే మోక్షము పొందాలి అనే గుర్తు పెట్టి మీ పళ్ళు తయారు చేశాడు దేవుడు.

 

ప్రతి ఒక్కరికి మూడో పన్ను కోరపన్నుగ ఉందో లేదో చూసుకోండి. కోరపన్నుగా ఉంది. ఇది మనుషులకు అవసరము కాబట్టి ఈ రకముగా మనకు పెట్టినాడు దేవుడు. అదే సింహము నోరు తెరిచి చూస్తాము. సింహము నోరు తెరిచి చూస్తే, మొదటి రెండు పళ్ళు మామూలుగా మధ్యలో ఉంటాయి. తరువాత మూడో పన్ను అంటే మనకు కోరపన్ను ఉంది కదా! అది చిన్న కోరపన్నుగా ఉంటుంది దానికి. మామూలుగా రెండు పళ్ళు చిన్న కోరపన్ను ఇటు ప్రక్క ఒకటి, అటు ప్రక్క ఒకటి ఉంటుంది. మనకు ఉన్నట్టే ఉంటుంది అది కూడ. కోరపళ్ళే అవి. అంటే పూర్తిగా కొస్సిగ బయటికి వచ్చిండదు, కొద్దిగ వచ్చివుంటుంది. కానీ దాని ప్రక్కన నాలుగో


---

పన్ను ఉంది కదా, అది నాలుగు ఇంచులు పొడవుంటుంది సింహానికి. అంటే మనకేమో మూడో పన్ను కోరపన్నుగా పెద్దగ ఇచ్చి, దానికి నాలుగో పన్ను కోరపన్ను ఎందుకు ఇచ్చినాడంటే? దానికి జ్ఞానము అవసరము లేదు, నీకే జ్ఞానము అవసరము. అర్థమయిందా! వాటికి జ్ఞానము అంతో ఇంతో ఉంది, అవి జ్ఞానపద్ధతి ప్రకారమే పని చేస్తూ ఉన్నాయి. జ్ఞానము మీకు తెలియదు. కానీ పూర్తి అజ్ఞాని ప్రపంచములో ఎవరు అంటే మనిషి. కాబట్టి మనిషికి జ్ఞానము తెలియాలి అని కంటిలోనూ, చేతిలోనూ, పళ్ళలోనూ త్రైతము పెట్టాడు. దానికి పళ్ళలో పెట్టలేదు జ్ఞానము. దానికి నాల్గవ పన్ను కోరపన్నుగా ఉంది, కాని నీకు మూడో పన్నునే కోరపన్నుగా ఇచ్చాము. నీకు త్రైతము అర్థము కావాలి. దానికి త్రైతము తెలుసు. అంటే ఎట్ల తెలుసు అంటే అది జంతువు కాబట్టి దాని భాషలో దానికి జ్ఞానము తెలుసు. జంతువులవి మనకంటే ఉత్తమ జన్మలు అని ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. అన్నిటికంటే పాపము చేసుకున్న జన్మ, అజ్ఞాన జన్మ మానవుని జన్మే అని ఇంతకు ముందు కూడ చెప్పుకున్నాము. ఎందుకంటే పుట్టుకతోనే ఆ విషయము తెలుస్తుంది. చెట్లు పైకి పెరుగుతున్నాయి. జంతువులు అడ్డముగా పెరుగుతున్నాయి. మనుషులు క్రిందికి పెరుగు తున్నారు. మనుషులు ఒక్కటే క్రిందికి పెరిగేది అంటే అజ్ఞానములోకి పెరిగి పోతున్నాడు కాబట్టి, వీనికే జ్ఞానము అవసరము ఈ జ్ఞానము అనేది ఎవరికి అవసరమో వాళ్ళకు జ్ఞానచిహ్నాలు మన శరీరములో ఎక్కువ పెట్టాడు.


ఇప్పుడు దంతము అనే విషయానికి వస్తే, చివరిది నీ శరీరములో మోక్షము అనే దానిని సూచిస్తా ఉంది. అందుకే దానికి జ్ఞానదంతము అని పేరు పెట్టారు. జ్ఞానదంతము అన్నా ఒకటే మోక్షదంతము అన్నా ఒకటే. నీవు జ్ఞానములోకి చేరుకోవాలి కాబట్టి నీకు ఆ పేరు పెట్టారు. దానిని


----

“మోక్షదంతము” అని మనము కూడా అనవచ్చు. అంటే మోక్షము పొందేటటువంటిది అని అర్థము. నీ శరీరములో ఒక వరుస 8 పళ్ళలో నీకు జ్ఞానాన్ని సంపూర్ణముగా విడిచాడు. దేవుడు, మాయ ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు కాకపోతే, నువ్వు జీవునిగా ఉండి మాయను జయిస్తే, మోక్షము పొందుతావు. కాబట్టి చిట్టచివరిలో మోక్షదంతము పెట్టినాడు. ఎనిమిదే పళ్ళు అవసరము. అంతకంటే ఎక్కువ అవసరము లేదు. అంటే ఒక ప్రక్క ఎనిమిది ఇంకొక ప్రక్క ఎనిమిది. ఈ రకముగా క్రింద 16 పళ్ళు పెట్టినారు. ఇదే రకముగ 16 పళ్ళు పైన కూడా పెట్టినారు. ఒకవేళ ఈ దేశములో ఈ జ్ఞానము సరిపోతుంది, ఇంకొక దేశములో ఇంకొక జ్ఞానము ఉంటాది. ఆ జ్ఞానము దీనికంటే పెద్దది. ఆ మతములో ఉన్న అనుకుంటే మతములోనైనా ఈ  ఉందిగానీ దీనికిమించి జ్ఞానము లేదు. సృష్ఠితి నలువైపుల ఇదే జ్ఞానము ఉంది. నీవు ఎక్కడ పోయినా ఇదే జ్ఞానము తెలుసుకోవలసిందే. దీనికి మించి ఇంక ఎక్కడా లేదు అనేదానికి గుర్తుగ నీకు నాలుగు ప్రక్కలా ఇవే పెట్టి చూపించారు.



ఈ రకముగా క్రింద 8 పళ్ళు ఒక ప్రక్క 8 పళ్ళు ఒక ప్రక్క పెట్టాడు. అట్లాగే పైన కూడా 8 ఒక ప్రక్క, 8 ఒక ప్రక్క పెట్టాడు. మొత్తము 16 క్రింద, 16 పైన పెట్టాడు. దానికి అర్థము ఎటుపోయినాగానీ ప్రపంచములో, నువ్వు నలుదిశలు తిరిగినాగానీ, ఈ జ్ఞానము తప్ప వేరే జ్ఞానము లేదు అని దేవుడు రూఢి చేసి, ఈ జ్ఞానము మనకు అందించినాడు. దంతము, కన్ను, చేయిని గురించి మనకు భగవద్గీతలో చెప్పలేదు. ఖుర్ఆన్లో చెప్పలేదు. బైబిల్లో చెప్పలేదు. ఇది జ్ఞానము అని ఎట్ల అంటారు మీరు? అంటే దానికి జవాబు ఏమనగా ప్రత్యక్షముగా కనిపిస్తుంది కదా మీకు!


---

జ్ఞానముగా కనిపిస్తే నీవు తెలుసుకో. జ్ఞానముగ కనపరాకుండ జ్ఞానానికి ఏమన్నా వ్యతిరేఖముగా ఉంటే వదిలిపెట్టు. జ్ఞానానికి ఏమన్నా ఇందులో వ్యతిరేఖత ఉందా? లేదు. భగవద్గీతలో ఏవైతే చెప్పబడినాయో అవే మూడు ఆత్మలు ఇక్కడ కూడ చెప్పబడినాయి. భగవద్గీతలో ఏవైతే నీకు గుణాలు చెప్పబడినాయో అవే ఇక్కడ చెప్పబడినాయి. భగవద్గీతలో ఏదైతే మోక్షము చెప్పబడిందో అదే ఇక్కడ చెప్పబడింది. మొత్తము భగవద్గీతలో జ్ఞానమంతా ఇక్కడే ఉంది. భగవద్గీతలో జ్ఞానమే కాకుండా మిగతా దైవగ్రంథాలలోని జ్ఞానము కూడ నీ పళ్ళలోనే ఇమిడ్చినాడు. ఇక్కడున్న ముస్లీములు, ఇంటికి పోయి పళ్ళు చూసుకో అదే ఉంది. క్రైస్తవులు పళ్ళు చూసుకోండి అవే ఉన్నాయి. హిందువులుగా ఉండే వారు మీరు చూసుకోండి మీకు ఇవే ఉన్నాయి. ఒక మతానికి సంబంధించినది ఏమాత్రము లేదు. అన్ని మతాలకు ఒకటే జ్ఞానము కాబట్టి, ఒకటే పద్ధతి కాబట్టి, దేవుడు అందరికీ 16 పళ్ళు ఇమిడ్చిపెట్టినాడు. నీ హస్తములో దైవచిహ్నాలుగా మూడు ఆత్మలు

ఉన్నాయి.


ఎక్కడయినా మూడు ఆత్మల వరకే మనకు తెలుస్తా ఉంది. కంటిలో మూడు ఆత్మల గుర్తు ఉంది. కంటిలో నీవు చూసుకుంటే మూడు ఆత్మల వరకే నీకు గుర్తు తెలుస్తా ఉంది. కానీ దంతాలలో మాత్రము చివరిగా యున్న పళ్ళును చూపిస్తూ ఇది మోక్షదంతము అని అన్నారు. అన్నింటికి అంతము అదే కదా! అంతము అంటే చివరిది, మోక్షము అని ఇంతకు ముందు మనము చెప్పుకున్నాము. నీవు చనిపోయేటపుడు ఎట్ల చనిపోవాలి? ఏ ఉద్దేశ్యముతో చనిపోవాలి అంటే దేవున్ని స్మరించుకుంటూ చనిపోతే మనము దేవునిలోనికి ఐక్యము అయితాము అని అక్కడ చెప్పాడు. ఎల్లప్పుడు ఏది జ్ఞాపకము ఉంటే అదే వస్తుంది కానీ వేరేది రాదు. కాబట్టి మనము


---

జ్ఞానముగా కనిపిస్తే నీవు తెలుసుకో. జ్ఞానముగ కనపరాకుండ జ్ఞానానికి ఏమన్నా వ్యతిరేఖముగా ఉంటే వదిలిపెట్టు. జ్ఞానానికి ఏమన్నా ఇందులో వ్యతిరేఖత ఉందా? లేదు. భగవద్గీతలో ఏవైతే చెప్పబడినాయో అవే మూడు ఆత్మలు ఇక్కడ కూడ చెప్పబడినాయి. భగవద్గీతలో ఏవైతే నీకు గుణాలు చెప్పబడినాయో అవే ఇక్కడ చెప్పబడినాయి. భగవద్గీతలో ఏదైతే మోక్షము చెప్పబడిందో అదే ఇక్కడ చెప్పబడింది. మొత్తము భగవద్గీతలో జ్ఞానమంతా ఇక్కడే ఉంది. భగవద్గీతలో జ్ఞానమే కాకుండా మిగతా దైవగ్రంథాలలోని జ్ఞానము కూడ నీ పళ్ళలోనే ఇమిడ్చినాడు. ఇక్కడున్న ముస్లీములు, ఇంటికి పోయి పళ్ళు చూసుకో అదే ఉంది. క్రైస్తవులు పళ్ళు చూసుకోండి అవే ఉన్నాయి. హిందువులుగా ఉండే వారు మీరు చూసుకోండి మీకు ఇవే ఉన్నాయి. ఒక మతానికి సంబంధించినది ఏమాత్రము లేదు. అన్ని మతాలకు ఒకటే జ్ఞానము కాబట్టి, ఒకటే పద్ధతి కాబట్టి, దేవుడు అందరికీ 16 పళ్ళు ఇమిడ్చిపెట్టినాడు. నీ హస్తములో దైవచిహ్నాలుగా మూడు ఆత్మలు

ఉన్నాయి.


ఎక్కడయినా మూడు ఆత్మల వరకే మనకు తెలుస్తా ఉంది. కంటిలో మూడు ఆత్మల గుర్తు ఉంది. కంటిలో నీవు చూసుకుంటే మూడు ఆత్మల వరకే నీకు గుర్తు తెలుస్తా ఉంది. కానీ దంతాలలో మాత్రము చివరిగా యున్న పళ్ళును చూపిస్తూ ఇది మోక్షదంతము అని అన్నారు. అన్నింటికి అంతము అదే కదా! అంతము అంటే చివరిది, మోక్షము అని ఇంతకు ముందు మనము చెప్పుకున్నాము. నీవు చనిపోయేటపుడు ఎట్ల చనిపోవాలి? ఏ ఉద్దేశ్యముతో చనిపోవాలి అంటే దేవున్ని స్మరించుకుంటూ చనిపోతే మనము దేవునిలోనికి ఐక్యము అయితాము అని అక్కడ చెప్పాడు. ఎల్లప్పుడు ఏది జ్ఞాపకము ఉంటే అదే వస్తుంది కానీ వేరేది రాదు. కాబట్టి మనము


---

రోగాలు, బాధల గురించి చెప్తావుంటారు. శరీరములో బాధలు చెప్పితే మేము శరీరములో ఉండే వానిని వేడుకోండి అని చెప్పుతాము. బయట ఉండే గుడిలోనికి పోయి మ్రొక్కినా, ఇంకొక చెట్టును మ్రొక్కినా ఏమీ కాదు. బయట ఉండే ఎవరిని మ్రొక్కినా ఏమి కాదు. ఎవ్వరూ ఏమీ చేయలేరు.


శరీరములో ఒక అధిపతి ఉన్నాడు. ఆ శరీరములో ఉండేటటువంటి అధిపతిని వేడుకోండి అని చెప్పాము. నీకు శరీరములోనే కదా బాధ. కాబట్టి శరీరములో ఉండేవాన్ని వేడుకో! అని, వాళ్ళకు చిన్న ఉపాయము చెప్పితే వాళ్ళు ఏమి చేస్తారంటే వాళ్ళు అట్లే వేడుకుంటారన్నమాట. ఎందుకంటే తప్పదు ఇంక, అన్నీ కాదనుకొనే ఇక్కడికి వచ్చి ఉంటారు. ఇంక మేము చెప్పినట్లు వినాల్సిందే! మనము ఒకటే మాట చెప్తున్నాము. అధిపతి ఒకడున్నాడు శరీరానికంతా! ఏమి చేసినా ఆయనే చేయాలి. కాబట్టి ఆయన ఏమి చెప్తాడో అది చేయండి. ఆయన గురించి మీరు తెలుసుకోండి. ఆయన ఉన్నాడని అర్థము చేసుకోండి. అంటే అంతవరకు శరీరములో దేవుడు ఉన్నాడు అనే విషయము కూడ తెలియని వాళ్ళకు కొద్దిగ శరీరములోకి చూపు వస్తుంది. ఎందుకంటే వారికున్న బాధ తట్టుకోలేక. ఆ చూపు వచ్చినపుడు కొద్దిగ జ్ఞానము కలుగుతుంది వాళ్ళకు. జ్ఞానము కల్గినపుడు ఏమైతుందంటే, కొద్దికొద్దిగా కొద్దికొద్దిగా ఈ జ్ఞానము తెలుసుకున్నాడంటే ఇది ఒక రుచి ఏర్పడుతుందన్నమాట. సజ్జలుంటాయి అవి మొదట గింజలు నమిలినామనుకో రవ్వంత రుచి వస్తుందన్న మాట. మళ్ళ నమిలితే ఇంకా రుచి వస్తుంది. అట్ల నములుకుంటూ ఉండాలని పిస్తుంది. అట్లగానే ఈ జ్ఞానము కొద్దిగా తెలుసుకుంటే దీనిని ఎవడూ వదిలిపెట్టడు. ఇక్కడ చెప్పే త్రైతసిద్ధాంత జ్ఞానానికి దీనికి అలవాటుపడితే ఎవడూ వదిలిపెట్టడు. ఈ జ్ఞానాన్ని సంపూర్ణముగా తెలుసుకొనేంతవరకు


----

వాడు వెనక్కి తిరిగి చూడడు. ఇపుడు ఆయన అలీగారు చెప్పినారు, కొన్ని గ్రంథాలు తీసుకొని ఏమాత్రము కాలము తెలియకుండ చదివేశానని. ఆ రకముగానే కాలము తెలియకుండ మీరు చదివేస్తారు. కొత్త కొత్త విషయాలు ఇందులో తెలుస్తుంటాయి. ఏమాత్రము మతానికి సంబంధించి విషయా లంటూ ఇక్కడ ఉండవు. కాబట్టి మీరు దీనిని తెలుసుకుంటూ పోతే, శరీరములో ఉండేటటువంటి బాధలు కూడా పోతాయి. ఆ బాధలు పోయేదానికి ఒకే ఒక మార్గము చెప్తున్నాను. శరీరానికంతా ఎవరైతే అధిపతి ఉన్నారో ఆ అధిపతిని మీరు వేడుకోండి అని చాలామందికి చెప్తుంటాము. చాలామంది అట్లే చేస్తుంటారు. నేను ఇక్కడ మీకు బాగా చేస్తాననిగాని, ఇంకొకటిగానీ ఏమీ చెప్పము. ఇక్కడికి చాలామంది వస్తుంటారు రోగము ఉన్నవారు. చాలామంది వారం, పది, పదిహేను రోజులు ఉంటారు. వాళ్ళ రోగము బాగైపోతానే పోతారు. కానీ వాళ్ళకు రోగము ఎట్ల బాగైంది అంటే "నేను చెప్పిన మాటతప్ప ఇంకొకటి ఏమీ ఉండదు” అది ఇక్కడ గ్రంథాల్లో ఉంది.


ఒకాయన క్యాన్సర్ పేషెంట్ వచ్చాడు నా దగ్గరకు. అతను ఒక ముస్లీము, నెల్లూరు నుంచి వచ్చాడాయన. ఆయన చాలా డబ్బులు ఖర్చు పెట్టినాడు, దండిగా ఉన్నవాడు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టినాడు. సుధాకరాచారి అని ఆయనను పిలుచుకొని వచ్చాడు. మా భక్తుని ద్వారా జ్ఞానము తెలుసుకొని, ఒక గ్రంథము పెట్టుకున్నాడు కడుపు మీద 8 గంటలసేపు అది కడుపుకు కర్చుకుందంట. 8 గంటలసేపు కర్చుకొని ఆయనలో ఉన్నటువంటి ఆ కాన్సర్ కణాలను అన్నిటిని లేకుండా చేసింది. ఆ తర్వాత ఆయన బాగుపడడము జరిగింది. ఒక ముస్లీమ్ వారము రోజులు ఇక్కడ ఉండి నిద్దుర చేసి పోయినాడు. ఆయన మామూలుగా


---

కృష్ణుని పూజలో పాల్గొనేవాడు. ఆయన్ను కూడా మేము చూస్తుంటాము. అంటే నువ్వు ఎందుకు కృష్ణుని పూజలో పాల్గొంటున్నావయ్యా? నువ్వు ముస్లీమ్ కదా! అల్లాహ్ ను తప్ప ఎవ్వరినీ కొలచకూడదు అంటే ఈయన (కృష్ణుడు) అల్లాహ్ అని నమ్మినానంటున్నాడు ఆయన. ఈ రకముగా అంటే నాకు ఇది నయమైంది కాబట్టి అల్లాహ్ అంటున్నాను. ఇదెట్ల నయమైంది అంటే ఈ గ్రంథము ప్రభావము వలన నాకు ఇట్ల అయింది. గ్రంథములో ఉండేది పరమాత్మ శక్తే కాబట్టి నయమైందని చెప్తే, సరేలే అని ఒప్పుకున్నాము. ఇది వరకే ఎంతోమంది బాగుపడి పోతుంటారు. నేను 20 సంవత్సరములు నుంచి చాలామందికి చెప్తున్నాను. చాలామందికి బాగైంది. కానీ ఈ మధ్యకాలములో ఒకరొచ్చారు. పాపము నెల, నెలన్నర, రెండు నెలలు ఉన్నారనుకుంటా పది సంవత్సరముల క్యాన్సర్ పేషంట్. కానీ ఆమె చనిపోవడము జరిగింది. వాళ్ళకు ముందే తెలుసు జాతకము బాగలేదు వాళ్ళకు అని. నేను ఏమి చెప్పినానంటే ఉదయము పిలిచి చెప్పాను వాళ్ళకు. మామూలు డాక్టర్లు అయితే ఇంటికి పొమ్మంటారు! ఎవరూ పెట్టుకోరు.


ఒకవేళ మేము కూడా ఇంటికి పొమ్మంటే మీరు నిరాశ పడిపోతారు. డాక్టర్లు ఇంటికి పొమ్మని చెప్పివుంటేనే మీరు ఇక్కడికి వచ్చారు, ఏదో దేవుని మీద నమ్మకముతో! కానీ దేవుడు ఏమి చేస్తాడో నాకు తెలియదు. నేను ముందే నిర్ణయము చెప్పేవాన్ని కాదు. కానీ మిమ్మల్ని నేను పొమ్మని చెప్పను. మీకు దేవుని మీద విశ్వాసము ఉంటే మీరు ఉండండి. నేనేమి పొమ్మనను. దేవుడే అన్ని చేస్తాడు. అన్నింటికి ఆయనే పెద్ద అని చెప్పినాము కానీ నేను ఉదయము చెప్పితే సాయంకాలానికి ఆ అమ్మాయి చనిపోవడము జరిగింది. ఆ ఒక్క సంఘటన తప్ప ఇంతవరకు ఏమి జరగలేదు. అది ఏమని


----

అర్థమైందంటే మనకు, క్షమించరాని పాపము కూడా ఉంటుంది అని తెలిసింది. అంటే మూడు గ్రంథాల్లోనూ అదే చెప్పినారు. అంటే క్షమించ బడనటువంటి పాపము, దేవునికి వ్యతిరేఖముగా చేసిన పాపము ఏదైనాగానీ, క్షమించబడదు. క్షమాశీలత చెందదు.


ఆ రకముగా నేను శాయశక్తులా జ్ఞానము వల్ల ఈమె కర్మ కాలిపొమ్మని చెప్పినాగానీ, ఈ జ్ఞానము వలన కొంత కర్మ కాలిపోయింది కానీ, మిగతా కర్మ కాలిపోలేదు. కొంత కర్మ కాలిపోయింది అనేదానికి గుర్తుగా ఆమె శరీరము మీద ఉండే గడ్డ నల్లగా మాడి పోయిందది. అంటే చర్మమంతా కాల్చినట్లు మాడిపోయింది. అంటే జ్ఞానశక్తి వల్ల ఆ కర్మ కాలిపోయింది అని తెలుస్తా ఉంది. అంటే కొంత కర్మ కాలిపోయి కొంతకర్మ మిగులుతా వచ్చింది. అది కొన్ని రోజులకు ఆ మనిషిని చంపి వేయడము జరిగింది. అక్కడ ఇంటి దగ్గర ఉంటే రెండు రోజులకు చనిపోయేది. ఇక్కడ రెండు నెలలు బ్రతకగలిగింది. సరే, అదైనాగాని క్షమాశీలత జరిగిందా అంటే, జరగలేదు. దేవునికి వ్యతిరేఖమైన పనులు చేయవద్దండి. దేవునికి వ్యతిరేఖమైన భావాలు పెట్టుకొనిగానీ మీరు ప్రవర్తించవద్దండి. అట్ల ప్రవర్తిస్తే దేవునికి వ్యతిరేఖమైన పాపము వస్తుంది. అది క్షమించరాని పాపము అవుతుంది.. అటువంటి పాపాలు మీరు పొందకూడదని మేము ఆశిస్తున్నాము. తరువాత, మీరు ఈ జ్ఞానము తెలుసుకునే దానివల్ల ఏమవుతుందంటే చాలామంది ఈ రోగాల నుంచి బయటపడుతున్నారు. అదే ప్రచారము అయిపోయి ఆ ఆశతో రోగాలనుంచి బయటపడతామని చాలామంది ఇక్కడికి వస్తున్నారు. నేనేమి చెప్తున్నానంటే! రోగాలనుంచి బయటపడేది వాస్తవమే! ఎక్కడాలేని శక్తి మా గ్రంథాల్లో ఉండేది వాస్తవమే! నా గ్రంథాలు శరీరానికి అతుక్కుండేది వాస్తవమే!


----

ఒక గ్రంథము పట్టుకుంది, ఆ రోగమునంతా తీసేసిందని ఒకరు చెప్పారు. అది ప్రపంచములో ఎక్కడా జరగని సమస్య. జనవిజ్ఞాన వేదిక వాళ్ళు మూఢత్వము అని, మూఢనమ్మకాలు అని ప్రచారము చేస్తుంటారు చాలామంది. వాళ్ళకు కూడా చెప్పారు ఈ గ్రంథాలు ఎందుకు అతుకు కున్నాయో చెప్పండయ్యా అంటే, వాళ్ళు ఇంతవరకు జవాబు చెప్పలేదు. దీనికి. అన్నిటిని వాళ్ళు ఏమి చేస్తారంటే మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు అంటుంటారు. ఇవి పబ్లిక్గా శరీరానికి కర్చుకున్నాయి కదా! దీనికేమైనా గమ్ వేసి అతికించినామా? మూఢనమ్మకము అనేదానికి. మీరే చూసి చెప్పండి అంటే, వాళ్ళు దానికి కారణము చెప్పలేకపోయినారు. మళ్ళ వేరేచోట అయితే ఏమేమో చేస్తుంటారుకానీ, దీనికేమి చెప్పలేక పోయినారు కదా! ఇవి ఏమన్నా కర్చుకోకుండ ఉన్నాయా, అట్ల కూడ? లేదు, కర్చుకుంటున్నాయి. ఇక్కడ తయారైన గ్రంథము ఏదైనాగానీ, ఏ మతానికి సంబంధించినది అయినాగానీ దానికి శక్తి ఉంటుంది. అంటే ఆ శక్తి ఎట్లు వస్తుంది? అని మీరు ప్రశ్న వేయవచ్చు. మిగతా గ్రంథాల్లో లేని శక్తి మీ గ్రంథానికే ఎందుకు వచ్చింది. అంటే, నేను పెద్ద అని ఎప్పుడూ చెప్పలేదు కానీ, నాకంటే పెద్దోడు ఒకడున్నాడు నా వెనుక. వాడు వెనకాల ఉన్నాడు, ముందర ఉన్నాడు. వాడు గొప్పోడు కాబట్టి ఆ శక్తి అందులో ఉంది కాబట్టి, మీ కర్మలు కాలిపోతాయి. ఇక్కడికి వచ్చే డాక్టర్గారు ఒకాయన హైదరాబాద్ నుంచి ప్రయాణము చేస్తూ వస్తున్నాడు. ఆయనకు కడుపునొప్పి వచ్చింది. కడుపునొప్పి వచ్చి ఆయన చాలా విపరీతముగ బాధపడుతున్నా డంట. చిన్న పిల్లోళ్ళు బాధపడినట్లు బాధపడుతున్నాడు. కానీ అపుడు అదే బస్సులో నా భార్య కూడ రావడము జరిగింది. ఎవరో బాధపడుతున్నారు అనుకున్నదిగాని, మనకు తెలిసిన వ్యక్తి అనుకోలేదు. సరే, చిట్టచివర ఊరికి


----

వచ్చిన తరువాత లేచి చూస్తే, మనకు తెలిసిన వ్యక్తే, ఇక్కడికి వచ్చే వ్యక్తే, మందిరములో ఉండే వ్యక్తే. సరే, ఈయన చాలా బాధపడుతున్నాడు అని మనవాళ్ళు కూడ చెప్పారు ఇక్కడికి వచ్చాక, మా భార్య కూడా చెప్పింది. సరే ఆయన్ను పిలిచి అడిగితే, విపరీతమైన బాధపడినా నేను, విపరీతమైన నొప్పి ఉంది, ఇపుడు కూడ నొప్పి ఉంది అన్నాడు. అంటే కొంత తగ్గింది, కొంత ఉంది అని చెప్పాడు. అంటే నేనేమి చెప్పానంటే, సరేలేయ్య! నీ మీద నీకు నమ్మకము లేదు.


ఎపుడైతే త్రైతసిద్ధాంత జ్ఞానము దగ్గరికి వచ్చారో, ఎపుడైతే మీ నుదిటి మీద ఈ దేవుని చిహ్నాన్ని ధరించారో, పుడు మీలో కొంత జ్ఞానశక్తి ఉంది. మిమ్ములను చూస్తే దయ్యాలు పారిపోతున్నాయి. దయ్యాల దగ్గరికి పోయి మిమ్మల్ని చూడమని చెప్పండి చూస్తాయేమో అవి! చూడలేవు. అంత శక్తి ఉంది మీ దగ్గర. కానీ నువ్వు ఒక చిన్న కర్మకు బాధపడుతున్నావు. ఆ కర్మను కాల్చివేసుకుండే శక్తి నీ దగ్గర ఉంది. నీకు తెలియదు. సరే, నేను ఇపుడు చెప్తాను. నీవు ఒక చిన్న పని చేయి అని చెప్పాము. నీ కడుపు మీద ఎక్కడ నొప్పి ఉందో అక్కడ చెయ్యి పెట్టుకొని, నాలో ఉండే జ్ఞానశక్తి ఈ కర్మ మీద పనిచేసి దానిని కాల్చివేయి అనుకో, చూడు అని చెప్పితే ఆయన చిన్న పిల్లోడేమి కాదు. పెద్ద వయస్సు వాడే, పైగా డాక్టర్ ఆయన చెయ్యి పెట్టుకోవడము జరిగింది. పెట్టుకుంటే అంత బాధ అనుభవించి నాయన, అంత బాధ ఒక క్షణములో పోవడము జరిగింది. నేనేమన్నా చేశానా? నేనేమి చేయలేదు. నీలో శక్తి ఉంది. దైవము ఉన్నాడు. నీవు నీ మీద, దైవము మీద నమ్మకము పెట్టుకో! పోతుంది అని చెప్పాము. ఆయన వేలు పెట్టుకుంటే పోయింది. మీకు సాధ్యము కాదా? మీకు కూడా సాధ్యము అవుతుంది. మీ మీద మీకు నమ్మకము లేదు. మీరు పెట్టుకున్నా పోతుంది.


----

మా దగ్గరకు వచ్చి నమస్కారము పెట్టినాగానీ, నేను మీ మాదిరి మనిషినే, ఏమాత్రము తేడా లేదు అని చెప్తున్నా. మీరు ఏమనుకుంటారు? స్వామి అంటే చాలా గొప్పోడు అనుకుంటారు. కానీ మీరు అనుకోవాల్సిందే గానీ, నేను ఏమికాను.


మీ మాదిరి మీకు ఏ అవయవాలు ఉన్నాయో నాకు అవే అవయవాలు ఉన్నాయి. మీరు ఏదైతే తింటున్నారో నేను అదే తింటున్నాను. ఇంక నువ్వన్నా ఆరోగ్యముగా ఉన్నావు, నేనే ఆరోగ్యవ లేను. ఈ నెలంతా అనారోగ్యముతో మంచము మీదనే పడిపోయినాము. పైకి లెయ్య లేదు. ప్రతి నెల ఒక గ్రంథము అందించాలని మీకు చెప్పా నేను, కాని మాట తప్పిపోయినాను. వ్రాయలేకపోయినాము, ఓపిక లేదు. ఇపుడు కూడ ఈ మీటింగ్ చెప్తున్నా గదా! నాకు జ్వరము వస్తే నేను కూర్చోలేను, చెప్పలేను నేను ప్రొద్దునే చెప్పాను. కానీ ఇపుడు జ్వరము రాలేదు కాబట్టి మీతో మాట్లాడుతున్నాను. అంటే నెల రోజులుగా బాధపడుతున్నాము. మీకు గ్రంథము కూడ అందివ్వలేకపోయినాము. ఇదే కొనసాగకూడదు, రేపు నెలన్నా మీకు ఒక గ్రంథము రావాలని కోరుకుంటున్నాము. ఈ గ్రంథము వస్తే మీకు క్రొత్త విషయము తెలుస్తుంది. సంపూర్ణముగా జ్ఞానము తెలుస్తుంది. ఆ రకముగా మిమ్ములను ముందుకు నడిపివ్వాలనే ఉద్దేశ్యముతో మేము ప్రయత్నము చేస్తున్నాము. ఇపుడు మాకెందుకు ఈ జబ్బు వచ్చింది అని అంటే మీరు మాకు నమస్కారము చేయడము వల్లే వచ్చిందను కుంటున్నా. అందువలన నమస్కారము చేయవద్దండి మీరు. మీరు నమస్కారము చేస్తావుంటే మీ జబ్బులన్నీ నాకు వస్తాయి.


కాబట్టి మీరు నమస్కారము చేయకుండ దూరముగా ఉండి, మీరు గొప్పోడు అనుకోండి, ఏమన్నా అనుకోండి. నమస్కారము మాత్రము


----

పెట్టొద్దండి నాకు. దేశములో అంతా పిలిపించి మ్రొక్కించుకుండేవాళ్ళు ఉన్నారు. డబ్బు ఇచ్చి మ్రొక్కించుకుండే వారున్నారు. పొగిడిచ్చుకుండే వాళ్ళున్నారు. భజన చేపించుకునే వాళ్ళున్నారు. ఏమేమో చేస్తారుగాని నాకు అవన్నీ సరిపోవు. అందరూ సమానమే అని చెప్పుచున్నాము. నాతో పాటు సమానముగ కూర్చొని మాట్లాడండి అని చెప్తున్నాను. మీరు అట్ల కూడ కూర్చోవడము లేదు, క్రింద కూర్చుంటున్నారు. కానీ అది నాకేమి ఇష్టము లేదు. అందరూ సమానమే అనే భావము నాకు ఉంది. నేను మీలాంటి మనిషినే. కాని ఈ జ్ఞానము మాత్రము మీరు చెప్పలేరు. నేను ఇపుడు చెప్పిన జ్ఞానము ఏదైనా మతానికి సంబంధించినదా? ఎప్పుడు చెప్పినా మతానికి అతీతమైనదే చెప్పుతాను. ఒక మతానికి సంబంధించిన జ్ఞానము చెప్పలేదు. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగవచ్చు. “ఇంతకుముందు మొట్టమొదటనే భగవద్గీత తీసుకొని చెప్పారు కదా! ముందు శ్లోకాలు చెప్పి భగవద్గీత హిందూమతానికి సంబంధించినదే కదా! అటుపోయి ఇటుపోయి మళ్ళీ హిందూమతానిది చెప్పి మళ్ళీ మిగతావి చెప్పుచున్నావు”.


మతానికి సంబంధించినది మొదట చెప్పినావు కదా! అంటే హిందూమతమే పెద్దదనా?” అని అడగవచ్చు. దానికి నేనేమంటున్నానంటే ఈ మధ్య టీ.వీ.లో ఒక ప్రశ్న వేసినారు సాయిబాబా హిందువు కాదు, ముస్లీమ్. ఆయన మళ్ళీ పకీరు. ఆయన హిందువు కాదు మళ్ళీ ఆయన దేవుడు ఎట్లా అయితాడు? అని అడిగితే, హిందువు అంటే ఎవరు? అనే ప్రశ్న అడగాల్సింది కానీ వీళ్ళు అడగలేదు. హిందువు అంటే ఎవరు? అని అంటే అక్కడ ఎదురుగా ఉండేవాడు చెప్పలేడు, వెనకాల కూర్చొని ఉన్న వాడు చెప్పలేడు, ముందర కూర్చొని ఉన్నవాడు చెప్పలేడు, ఎవ్వడూ


----

చెప్పలేడు. హిందువు అంటే ఎవ్వరికీ తెలియదు. ఇపుడు మనము పేరు పెట్టినాము. దేవునికి విధేయుడిగా ఉన్నవాన్ని 'ముస్లీమ్' అంటాము. మామూలుగా ఉండేవాడు ఎవడైనాగానీ దేవునికి విధేయునిగా ఉంటే వాడు ముస్లీమ్ అవుతాడు. నేను దేవునికి విధేయునిగా ఉన్నాను కాబట్టి నన్ను ముస్లీమ్ అంటారు. నేను ముస్లీమ్ కాకపోతే కదా! 'నమాజ్' అంటే ఏదో పూర్తి అర్థము తెలిసి నేను చేస్తున్నాను కాబట్టి నేను నిజముగా నమాజ్ చేస్తున్నాను, మీరే చేయలేదు. చాలామంది సరిగా చేయలేదు. చాలామందికి నమాజ్ అర్థము తెలియదు. నమాజ్ అంటే దేవున్ని పొగడడము కాదు. నువ్వు దేవున్ని జ్ఞాపకము చేసుకో! యోగము చేయి. యోగము అనేదే నమాజ్. మళ్ళీ యోగము ఇలాంటివన్ని మీరు భగవద్గీతలో ఉండేటివి చెప్తున్నారు అని అంటే భగవద్గీతలోని జ్ఞానమే బైబిలులో ఉంది. బైబిలులోని జ్ఞానమే ఖుర్ఆన్లో ఉంది. మూడూ ఒకే దేవుడు చెప్పినాడు. ఒకే గ్రంథము నుంచి వచ్చినేటివే ఇవి. ఒకే గ్రంథముగా మేము చూస్తున్నాము గానీ మూడు గ్రంథాలుగా మేము చూడలేదు.


అందువలన మూడు గ్రంథాల జ్ఞానము మేము చెప్తున్నాము. అంటే కొందరు ఇలా ప్రశ్నించారు “మీరు గురువు కాదు అని చెప్పి, గురువు అని ప్రకటించుకున్నారే మీ దగ్గర చాలా తప్పులు ఉంటాయి, అబద్దాలు చాలా చెప్తున్నారు” అంటే జగద్గురువు అని, గురువును అని నేను ఎపుడూ చెప్పలేదు. అంటే మీరు “త్రిమత ఏకైక గురువు" అని గ్రంథము మీద ప్రింట్ చేసినారే! అని కొందరు అడిగారు. దానికి "నేను త్రిమత ఏకైక గురువు అని చెప్పినాగానీ గురువు అని చెప్పినానా" అని అడిగినాము. అంటే మూడు మతాలకు గురువునుగాని దేశములో 12 మతాలు ఉన్నాయి, ఆ 12 మతాలకు కలిపి గురువైతే జగద్గురువు అయితాడు. ఇప్పుడు 12 మతాలు


----

ఉన్నాయి, 12 మతాలకు నేనెప్పుడు గురువు అయినాను? నేను మూడు మతాలకే కదా చెప్పేది! కాబట్టి నేను గురువును కాదు అని చెప్పాను. 'గురువు' అనే గ్రంథము చూసుకోండి, కనిపించేవాడే గురువు కాదని చెప్పినాము. ఇంకా ఎవరికీ తెలియడు గురువు అని కూడా చెప్పాము. అట్లాంటపుడు నేనెట్లా గురువును అయితాను?


జగతికంతా గురువు అయితే వాడు జగద్గురువు అయితాడు, నేను కాదు జగద్గురువు అనే ఒకాయన ఉన్నాడు. జగద్గురువు ఎవరైనా కావచ్చు, నేను మాత్రము జగద్గురువును కాదు. మామూలు గురువును కూడ కాదు. చచ్చిపోతే నేను మోక్షానికి పోతానా? స్వర్గానికి పోతానా? నరకానికి పోతానా? నాకే తెలియదు అంటే మళ్ళ జన్మకు పోతామా అని మనకు తెలియదు. కాబట్టి ముందు జరిగిన విషయము ఏమీ తెలియదు కాబట్టి, కర్మ ప్రకారము జరిగేదే కాబట్టి, మనము పెద్ద అని అనుకోకూడదు. ఒకాయన అంటున్నాడు. మిమ్ములను మేము దేవునిగా భావించు కుంటున్నాము అని, అంటే నువ్వు దేవునిగా భావించుకుంటే నెల నుండి నాకెందుకు జ్వరము వస్తావుంది! అని అడిగినాము. ఇపుడు దేవుని జ్ఞానము అని వచ్చినారు మీరు, ఏదో ఒక జ్ఞానము చెప్పాలి కదా మీకు! కానీ నాకు నెల నుంచి జ్వరము వస్తావుంది, నువ్వు 15 రోజులు జ్వరము వచ్చేవాడివి నా దగ్గరికి వచ్చి మ్రొక్కితే, నేను నెల నుంచి జ్వరము వచ్చేవాన్ని, నేనెవరిని మ్రొక్కాలి? అందరికి ఒకడున్నాడు పెద్ద, వానిని మ్రొక్కండి అని చెప్పినాను.


ఇట్లగా ప్రతి మనిషి భూమి మీద పుట్టిన తరువాత కర్మలు చేసుకొని పుట్టాము. ఆ కర్మలు వేరు, మనము వేరు, దేవుని జ్ఞానము వేరు. కర్మ ప్రకారము కార్యములు వస్తుంటాయి. దానిని నువ్వు లెక్కపెట్టుకోకుండా దేవుని గురించే చింత చేయి, దేవుని వద్దకే పోగలవు. అందువలన ఎల్లప్పుడు


----

నన్ను స్మరించుకుంటూ ఉండు అంటున్నాడు. “సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ” అన్నాడు. “సర్వకాలాలలో నన్ను స్మరించుకుంటు ఉండేవాడికి నేనే జ్ఞాపకము వస్తాను, వాడు నాలోనికి చేరవచ్చును” అని భగవద్గీతలో చెప్పినాడు. అదే సారాంశము ఖుర్ఆన్ గ్రంథములో ఉంది. అదే విషయము బైబిలు గ్రంథములో కూడ ఉందన్నమాట. ఈ మూడు గ్రంథాల సారాంశాన్ని లెక్కబెట్టి చూస్తే అది ఏ మతానికి సంబంధించింది లేదు.


నీ శరీరములోకి నువ్వు తొంగి చూసుకో అని చెప్తున్నాము. మన శరీరములోకి తొంగి చూసుకుంటే ఏముంది నిన్ను నడిపించే శక్తి ఒకటుంది. ఖుర్ఆన్లో 50వ సూరాలో 21వ ఆయత్లో ఏం చెప్పారంటే “నిన్ను తోలేవాడు ఒకడున్నాడు” అని చెప్పాడు. నువ్వు తోలబడేవానివి. నువ్వు తోలబడేవానివి అని తెలుస్తుంది, తోలేవాడు ఇంకొకడు ఉన్నాడని తెలుస్తుంది. అది తెలుసుకుండే దానికే ఇంత రామాయణము! నువ్వు శరీరములోకి తొంగి చూస్తేగానీ ఆ ఖుర్ఆన్ అర్థము కాదు నీకు. ఖుర్ఆన్లో ఉండే వాక్యము అర్థము కాదు. ఊరికనే పై పైన నమాజ్ చేసుకుంటూ పోతే, పై పైన ఖుర్ఆన్ చదువుకుంటే, ఖుర్ఆన్ అర్థమవుతుందా చెప్పండి!


"ఎవరికైనా ప్రపంచములో ఇంతవరకు ముస్లీమ్ దేశాల్లోగానీ, హిందూదేశాల్లోగానీ, భారత దేశములోగానీ, పాకిస్తాన్లో గానీ, ఏ దేశములో నైనాగానీ 50వ సూరా 21వ ఆయత్కు అర్థము తెలిసిందా చెప్పండి!” అది ఫలానాది అని తెలిసిందా చెప్పండి! బయట వెతుకులాడతారేమోగాని ఇంకొకటి ఏమీ లేదు. ఇంకా ఏమి చెప్తున్నారంటే గొంతుకు ఇటువైపు అటువైపు ఒకడున్నాడని చెప్తారు. గొంతుకు అటువైపు ఇటువైపు ఎందుకు? గొంతులోకి పోయి చూడు! ఎవరొద్దన్నారు? శరీరములోకి పొమ్మనే కదా


----

చెప్తావుండేది! వివరముగా 50వ సూరా 21వ ఆయత్ తెలుసుకుంటే, నీకు ఖుర్ఆన్ అంతా తెలిసినట్లే, జ్ఞానము అంతా తెలిసినట్లే, నీవే నిజముగ మోక్షము పొందినోనివి, నీవే జ్ఞానదంతము అయిపోతావు. అర్థమయిందా! అట్ల ముస్లీములే కాదు, హిందువులకు కూడా అదే చెప్తావుండేది. ఎపుడైతే భగవద్గీతలో ఒక్క శ్లోకానికి అర్థము చేసుకోగలిగితే నీవు దేవునిలోకి మోక్షము పొందుతావు. కానీ ఈ రోజు పెద్ద పెద్ద స్వామీజీలు కూడా మోక్షము పొందకుండ జన్మకు పోతున్నారు. ఎందుకు పోతున్నారంటే వాళ్ళు శ్లోకాలు కంఠాపాఠము చేసి, వివరము చెప్పి, పెద్ద ధీమంతులుగ పేరు పొంది తరువాత వాళ్ళు బిరుదులు కూడా పొందినారన్నమాట. వీళ్ళు పెద్ద స్వాములు వీళ్ళకు మించిన స్వాములు లేరని అంటారు. ఏమి చేస్తావ్, చచ్చిపోయినపుడు వాడు పోయేది మళ్ళి మామూలు జన్మకే! అంటే వాళ్ళకు నిజమైన జ్ఞానము తెలియలేదు. భగవద్గీతలో ఒక్క శ్లోకానికి కూడా వివరము అర్థము కాలేదు. అందువల్ల మేము ఏమి చెప్తున్నామంటే భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని అర్థము చేసుకున్నా వాడు స్వామీజీ అని అనిపించుకున్నందుకు సార్థకము ఏర్పడుతుంది.


నీవు భగవద్గీతలో ఒక్క శ్లోకానికి కూడ అర్థము తెలియకుండ నేను పెద్ద స్వామీజీ అని అనుకున్నా ఏమి ప్రయోజనము ఉంది చెప్పండి. వాళ్ళు టీ.వి.లో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడేటపుడు వీళ్ళు వేసే ప్రశ్నలు అట్లే ఉన్నాయి, అడిగే యాంకర్ అట్లే ఉన్నాడు, చెప్పే జవాబు అట్లే ఉంది. మేమడిగిన ప్రశ్న వేసివుంటే వాళ్ళు అందరు కూర్చొని ఒక గంటసేపు ఆలోచన చేసినా జవాబు చెప్పలేరు. అంటే వాళ్ళకు వాస్తవము తెలియదు అన్నమాట. ఇట్ల తెలియని రకముగా వాళ్ళు మాట్లాడుకుంటుంటే మాకు నవ్వు వస్తూవుంటుంది. జ్ఞానము తెలిసిన తరువాత మీకు కూడ


----

నవ్వు వస్తుంది, ఇంత అజ్ఞానులా! అని. ఆ రకంగానే హిందువుల్లో పెద్ద పెద్ద స్వామీజీలు కూడా అజ్ఞానులుగా ఉన్నారు అంటే, మీరు హిందువులను కించపరుస్తున్నారు అని అనవచ్చుగాని, నేను సత్యము చెప్తున్నాను కానీ ఎవరినీ కించపరచడము లేదు. సత్యము ఎవ్వరికైనా సత్యమే. మీకే కాదు ప్రతి మతములోను ఇట్లే ఉంది పరిస్థితి. నేను జ్ఞానము తెలుసుకోమని చెప్తున్నాము, ఇంకొకటి ఏమీ కాదు. ఇపుడు మీరు ఇంతగా చెప్తున్నారు మీరేమి ఆరితేరినారా? అంటే నేను ఆరలేదు తేరలేదు. ఏమంటే మీకంటే రవ్వంత నేను మేలు. ఎందుకంటే త్రైతసిద్ధాంతము గురించి చెప్తున్నాను కాబట్టి అని చెప్పగలను.


మీకు త్రైతసిద్ధాంతము అంటే ఏమిటో తెలియదు. చెయ్యిలో గీతలు తెలియవు. కంట్లో రంగులు తెలియవు. నోట్లో దంతాలు తెలియవు. అందువల్ల మీకంటే నేను కొద్దిగ మేలు. కానీ ఆ లెక్కకుపోతే మీరు నన్ను అసూయతో చూడొద్దండి. నన్ను అసత్య ప్రచారము చేయవద్దండి. చాలా మంది అసత్య ప్రచారము కూడ చేశారు. ఆయనకు జ్ఞానమే తెలియదు అని కొంతమంది, వేరే మతాన్ని బోధిస్తున్నాడని కొంతమంది అన్నారు. అసలు మతము అనేది ఎక్కడ ఉందో చూపమను నేను చెప్తాను. అసలు మతము అనేదే ఇక్కడ లేదు, ఇంక వేరే మతాన్ని గురించి బోధించేది ఏముంది. ఇంకా కొందరు ఏమంటారంటే ఇట్లే చెప్తారు, ఇట్లే జ్ఞానము చెప్పి చివరకు ఒక మతాన్ని బోధిస్తారు, అపుడు మిమ్ములను కూడా మార్చేస్తాడు చూడు అంటారు. మార్చేసేదేమో ఖాయమే! ఎందుకంటే ఇ ఉండేవాళ్ళని ఇంకొక రకముగ మార్చాలి కదా మనము! మార్చేదాన్ని ఒప్పుకుంటాము కాని నేను మార్చేది అజ్ఞానిని జ్ఞానిగా మాత్రమే. మేము దేవునిలోనికి మారండి అని చెప్తున్నాము గానీ, మతములోకి మారండి అని


----

చెప్పలేదు. మీరు మతాలను విడిచిపెట్టి దీంట్లోకి రండి అని చెప్తున్నాను. మీకు ఈ రోజు ఎవ్వరూ ఎక్కడా ఏ గ్రంథాలలో లేనటువంటి జ్ఞానము చెప్పినాము. అంటే వీళ్ళు మసి పూసి మారేడు కాయ చేస్తారు, ఏంటేంటో చెప్తున్నారు అనుకోవద్దండి. నేను చెప్పినేది సత్యము. మీ ఇంటికి పోయి చూసుకోండి. ఎనిమిది పళ్ళకు అర్థము ఉంది. ముందర మూడు ఆత్మలు తీసేయండి. తర్వాత మూడు గుణాలు తీసేయండి, ఒకటి గుణరహితము తీసేయండి. చివర మిగిలేది మోక్షమే. మొత్తము ఏమౌతుంది చివరికి? మోక్షము అనేదానికి గుర్తు జ్ఞానదంతము. దానికి పేరు కూడ పెట్టినాము జ్ఞానదంతము అని. చివరకు పోతే జ్ఞానదంతము, జ్ఞానము పొందుతావు నువ్వు అని. మనకు ఆ జ్ఞాన దంతమునకు అర్థము తెలియదు, కోరపళ్ళకు అర్థము తెలియదు, ముందర పళ్ళకు అర్థము తెలియదు. ముందర పళ్ళు ఏ దానికి? అంటే కొరుక్కుండే దానికి అంటారు. వెనుక పళ్ళు ఏదానికి? అంటే నమిలేదానికి అంటారు. ఇదేందయ్యా జంతువులు కూడా చేస్తున్నాయి ఆ పని. కాబట్టి జంతువుకు లేని విధానము మన శరీరములో పళ్ళకు అమర్చినాడు దేవుడు. ఇది క్రొత్తగా ఉంది. ఎక్కడా లేని సబ్జెక్టు. మీరు చూసుకొని ఈ జ్ఞానము తెలుసుకుంటారని మరిమరి కోరుతూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.



తేది: 15.04.2014

మీకు పోయిన పౌర్ణమి నుంచి ఇప్పటి వరకు మూడు గ్రంథాలు వచ్చాయనుకుంటాను. ఆ మూడు గ్రంథాలు బహుశా చాలామంది చదివే


---

వుంటారు, కొందరు చదవలేదనుకుంటా, దాంట్లో చివరి గ్రంథము “ఇందువు క్రైస్తవుడా?” అని ఉంటుంది. తరువాత “ప్రథమ దైవగ్రంథము భగవద్గీత” అని ఒకటి ఉంది. మధ్యలో ఈ రెండు గ్రంథాలకంటే చిన్న గ్రంథము “ధర్మశాస్త్రము ఏది?” అని ఒకటి వచ్చింది. మీరు చదివి ఉంటే వాటి విషయము బాగా అర్థమయి ఉంటుంది. ఈ రెండు గ్రంథములను క్రాస్ చేసింది చిన్న గ్రంథము “ధర్మశాస్త్రము ఏది?” అనేది. అర్థము చేసుకుంటే చాలా బాగుంటుంది. ‘ధర్మశాస్త్రము' అనేది ప్రతి మనిషికి అవసరము అని అక్కడ చెప్పాను నేను. మనిషి ఏ మతములో పుట్టినాగానీ వానికి ఒక ధర్మము అవసరము. ధర్మాన్ని మనిషి ఉపయోగించుకుంటే అది దేవుని వద్దకు చేర్చగలదు. ధర్మము శాస్త్రరూపకముగా ఉంటుంది. దానిని శాస్త్రము అనవచ్చును లేదా ధర్మము అనవచ్చును. మనకు శాస్త్రాలు ఆరు ఉన్నాయి. ఆరు శాస్త్రాల్లో గొప్పది, అన్నిటికంటే పెద్దది, సారాంశమైనటువంటిదీ “బ్రహ్మవిద్యాశాస్త్రము” అని మనము ముందే చెప్పుకున్నాము.


"బ్రహ్మవిద్యా శాస్త్రము” అని దేనినైతే అంటున్నామో దానినే “ధర్మశాస్త్రము” అని కూడా అనవచ్చును. ధర్మశాస్త్రము అంటే ఏది? అని అర్థము కాకపోతే దేవుని విద్యకు సంబంధించిన శాస్త్రము చెప్పుచున్నాము. ఇంకా బాగా అర్థము చేసుకొంటే పెద్ద విద్యకు సంబంధించినది అని చెప్పాము. బ్రహ్మవిద్య అంటే పెద్ద విద్య అని అర్థము. ‘బ్రహ్మ అంటే 'పెద్ద' అని అర్థము. ప్రపంచములో పెద్దది ఏదైతే ఉందో దానిని మనము బ్రహ్మ అంటాము. ప్రపంచములో ఏది పెద్ద? అంటే ఒకదానికంటే ఒకటి అన్నీ పెద్దగానే ఉన్నాయి, ప్రపంచములో కనిపించేటి వన్నీ, ఇంకా పెద్దగా కనిపించనటువంటివి కూడా ఉన్నాయి, ఇంకా ఇంకా చివరకు పోతే అన్నిటికంటే పెద్ద 'దేవుడే' అని తెలుస్తుంది. మళ్ళ ఆ దేవున్ని


---

తెలుసుకునేదాన్నే మనము పెద్ద శాస్త్రము అంటున్నాము. దానిని బ్రహ్మ విద్యాశాస్త్రము అంటున్నాము. దాన్ని ఇంకొక రకముగ చెప్తే 'ధర్మశాస్త్రము’ అని కూడా అంటున్నాము. ధర్మశాస్త్రము అనేది ప్రతీది లెక్కాచారముగా ఉంటుంది. ఎక్కడగాని గ్రుడ్డిగ చెప్పేది కాదు. ఆ లెక్కాచారముగా ఉండేదానినే మేము ప్రతిదీ మీకు విపులీకరించి చెప్పుచున్నాము. గ్రుడ్డిగాగానీ, అశాస్త్రీయముగా గానీ, మూఢనమ్మకముగా గానీ ఎక్కడా చెప్పలేదు. దానిని శాస్త్రముతో జోడించే చెప్తున్నాము. ఇపుడు మీరు కొన్ని విషయాలు ప్రశ్నించవచ్చును. మీకు కొంత వరకు కొన్ని అనుమానాలు ఉండవచ్చును.


'మీరు చెప్పింది శాస్త్రము' అని అంటున్నారు కదా! అంటే మీరు భగవద్గీత శాస్త్రాన్ని చెప్తున్నారు లేకపోతే భగవద్గీతలోగానీ, బైబిల్లోగానీ, ఖురాన్లోగానీ ఏదో ఒకటి మీరు ఆ మూడింటిని కలిపి ధర్మశాస్త్రము అంటున్నారు, మూడింటిలోనూ ధర్మశాస్త్రము ఉంది, మూడింటిలోనూ బ్రహ్మవిద్యాశాస్త్రము ఉంది అంటున్నారు. కాని వాటిలో లేని విషయము కూడా మీరు చెప్తున్నారు కదా! అని కొంత మంది ప్రశ్నించవచ్చును. అంటే “ఇపుడు కృష్ణుడు భగవద్గీత చెప్పినరోజు అది ఏ శాస్త్రములో ఎక్కడుందని నిరూపణ చేశాడాయన?”. ఆయన చెప్పిన తరువాత శాస్త్రము అవుతుంది, అర్థమయిందా! దానిని మనము ఈ రోజు ఆధారము చేసుకొని చెప్తున్నాము. ఏదైతే శాస్త్రము ఉందో అది మనకు తెలియదు. ఒకసారి మనకు శాస్త్రము తెలియబడుతుంది. ఎవరి ద్వారా తెలియబడుతుంది? శాస్త్రము తెలిసిన వాళ్ళ ద్వారానే తెలియబడుతుంది. శాస్త్రము ఎవరికి తెలుసు? ధర్మశాస్త్రము లేదా బ్రహ్మవిద్యా శాస్త్రము. ఎవరికి తెలుసు అంటే దేవుని శాస్త్రము దేవునికి ఒక్కనికే తెలుసు కాబట్టి దేవుడు చెప్పిన తరువాత అది మనకు శాస్త్రము అని తెలుస్తుంది. దేవుడు ఇంకొకటి ఆధారమని చూపించి


---

చెప్పవలసిన పని లేదు, ఆ రకంగానే ఇక్కడ మీకు కొన్ని సంశయాలు ఉండవచ్చును. ఇది ఏ శాస్త్రములో ఉంది అని బైబిలులో ఉందా? భగవద్గీతలో ఉందా? ఖురాను గ్రంథములో ఉందా? అని అంటే అన్ని విషయాలు వాటిలో చూపుతూ, కొన్ని మాత్రము వాటికి అతీతముగా చెప్పిన విషయాలు కూడా ఇక్కడ ఉన్నాయి.


కాల, కర్మచక్రాలు ఏ గ్రంథములో ఉన్నాయి? అని మీరు అడిగితే మేము చెప్పలేము, దానిని గురించి భగవద్గీతలో చెప్పలేదు. మనస్సుకు ఆకారము ఉంది అని భగవద్గీతలో చెప్పలేదు. జీవునికి ఆకారము ఉంది. అని చెప్పినారా? అంటే అది కూడా చెప్పలేదు. మళ్ళీ, మీరు అతిక్రమించి కొన్ని చెప్తున్నారే? మళ్ళ మీ మాటలు ఎట్ల నమ్మేది? మూఢనమ్మకము కాదా? అంటే శాస్త్రబద్దముగా ఉండే విషయాలు అయితే మేము నమ్ముతాము, శాస్త్రబద్దము లేనివి మేము ఎలా నమ్మాలి? అని మీరు అంటే ఆ విషయాలు దేవుడు చెప్పాడు కాబట్టి వాటిని మేము నమ్ముతాము అది శాస్త్రమే. కానీ మధ్యలో మీరు చెప్తున్నారు కదా! మళ్ళ ఇవన్నీ లేవు కదా! మళ్ళ ఇవన్నీ మీరు కల్పించి చెప్పినారు కదా? అని కొందరు ప్రశ్నిస్తే దానికి ఏమి జవాబు చెప్తున్నామంటే, ఒక మనిషిగా అంటే మీరంతా మేము మనుషులమే అనుకుంటున్నారు, నేను కూడా ఒక మనిషినే అనుకుంటున్నాను. కానీ దీంట్లో వివరము చెప్పుకుంటే “ఒక మనిషిగా ఎవడూ ఏమీ చెప్పలేడు” అంటే ఇప్పుడు నేను ఒక అసత్యము చెప్పినాగానీ అది మనిషిగా వాడు చెప్పలేడు, సత్యము చెప్పినాగానీ మనిషిగా వాడు చెప్పలేడు. వానిలో కదిలించి నడిపించే శక్తి ఒకటి ఉంది అని చాలాసార్లు నేను చెప్పాను. ఆ శక్తి ఎలా మాట్లాడిస్తే అలా మాట్లాడగలడు మనిషి. ఎలా ఆడిస్తే అలా ఆడగలడు. అన్నిటినీ నడిపించేది ఒకటుంది అది 'కదలిక శక్తి' లేదా


----

'చైతన్యశక్తి' లేదా నీలో ఉన్నటువంటి 'ఆత్మశక్తి' అని చెప్పాను. అది సత్యమైనా చెప్పవచ్చు, అసత్యమైనా చెప్పవచ్చు. సత్యమా? అసత్యమా? అని తరువాత తెలుస్తుంది మనకు. నేను ముందే చెప్పాను, నేను చెప్పినేటివన్ని సత్యాలు అని నమ్మవద్దని చెప్పాను.


నన్ను నేను పొగుడుకోలేదూ, నేను సత్యమనీ చెప్పలేదు. కాని మీరు యోచించండి. మీకు బుద్ధి ఉంది కదా! బుద్ధి మనము ఆలోచన చేసే దానికి. ఇంకా కూడా గొప్పగా చేస్తే యోచన కూడా చేస్తుందది. యోచన, ఆలోచన అని రెండు రకాలు ఉంటాయి. మీరు యోచించండి, ఆలోచించండి. రెండు రకాలుగా మీకు ఏది అర్థమయిందో దానిని నిర్ణయము చేసుకోండి. మరి నేను చెప్పిందంతా వినండి, విన్న తరువాత ఇది సత్యము అనుకోవద్దండి, మీకు సత్యము అనిపిస్తే నమ్మండి. కాని మీకు సత్యము అనిపించి చాలామంది నమ్ముతున్నారు, సత్యము కాదని కూడా కొంతమంది వదిలి వేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు సత్యమా? అసత్యమా? అని నేను నిర్ణయము చేసుకొని చెప్పాలా? అంటే నేను చెప్పవలసిన పని లేదు. సత్యము వస్తుందో, అసత్యము వస్తుందో నేను ఏమాత్రము వెను తిరిగి చూసుకోవలసిన పని లేదు. ఎందుకంటే నేను చెప్పలేదు కదా. కాబట్టి నేనెందుకు చూసుకోవాలి? నేను చూసుకోవలసిన పని లేదు. అది సత్యముగానీ, అసత్యముగానీ, కీర్తిగానీ, అపకీర్తిగానీ చెప్పేవానికి చెందుతుంది. అది నాకు సంబంధము లేదు అని మొదట్లోనే చెప్పాను. ఈ మూడు గ్రంథాలు వ్రాశాను నేను ఇప్పుడు మూడు గ్రంథాలు బహుశా చూసే ఉంటారు. ప్రపంచములో ఎవరైనా మీకు ఇంతవరకు అటువంటి గ్రంథాలు వ్రాసి చూపించారా? లేదు.


----

ఏ మనిషి చెప్పినా ఎటో ఒకవైపుకు చెప్తారు. కాని ఎటూ కాకుండా చెప్పేవాడు ఎవడూ లేడు. అన్ని వైపులనుంచి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. “ఇందువు క్రైస్తవుడా?” అనే గ్రంథములో హిందువుపాత్ర నేనే వ్రాశాను. అట్లే క్రైస్తవునిపాత్ర కూడా నేనే వ్రాశాను. రెండుపాత్రలు సమవుజ్జీగా ఉన్నాయి. ఒక క్రైస్తవుడు హిందువును ఎలా అడుగుతాడో అలానే అడిగినాను, ఒక హిందువు క్రైస్తవున్ని ఎలా మాట్లాడిస్తాడో అలాగే మాట్లాడాను. కానీ ఒకరి ప్రక్కే ఎక్కడా చెప్పకుండా ఇద్దరిలోనూ తప్పులు చూపించి, ఇద్దరిలోనూ తెలియని విధానము ఏదైతే ఉందో, తెలుసుకుండే విధానము ఏదైతే ఉందో దానిని చూపించాము. అర్థము చేసుకుంటే సత్యము తెలుస్తుంది. మళ్ళ అది మాకు చేతనై చేశామా? అంటే ఆ గ్రంథము మొదలుపెట్టినప్పుడు కనీసము 32 పేజీలు అవుతుందో లేదో కూడా మాకు నమ్మకము లేదు. ఇంత అవుతుందని నమ్మకముతో మేము వ్రాయలేదు, ఎంతైనా కానీలే అనుకున్నాము, మొదలు పెట్టినాము, అది నూరు (100) పేజీలు దాటింది. తరువాత అంతకు ముందు "ప్రథమ దైవగ్రంథము భగవద్గీత” కూడా అలాగే మొదలు పెట్టాము, అది 164 పేజీలు అయింది. ఈ రకంగా మనకు ఏదైతే చెప్పబడతావుందో అదే మేము చెప్తున్నాము. సత్యమా? అసత్యమా? అని చూసుకోలేదు. మీరు దాన్ని చూసుకున్న తర్వాతగానీ, మేము దానిని చదివిన తర్వాతగానీ మేము ఇది సత్యమని గ్రహించుకుంటున్నాము


ఒకవేళ ఆ గ్రహింపు మీకు ఉండవచ్చు, ఉండకపోవచ్చు అంటే కొంతమందికి అసత్యము అని అర్థము కావచ్చు, కొంతమందికి సత్యము అని కూడా అర్థము కావచ్చు. ఎందుకు అది అలా అర్థమైతుంది? ఇప్పుడు ఒక మనిషికి సత్యము అని అర్థమైన తర్వాత ఇంకొక మనిషికి అసత్యమని


---

ఎందుకు అర్థమైంది అని మనము లెక్కేసుకుంటే, ఒక ఉదాహరణ తీసుకుందాము. బాగా ఎండిన దంటు (కాడ) తీసుకొని, దానిపై ఉన్న దబ్బను తీసివేస్తే బెండు వస్తుంది. బెండు తీసుకొని అంటే ఒకే పరిమాణములో, ఒకే కొలతలో ఉండేటటువంటి రెండు బెండ్లు తీసుకుందాము. ఒకే పొడువు, ఒకే వెడల్పు, ఒకే మందము ఉండేదానిని తీసుకొని రెండిటినీ తక్కెడలో పెట్టి తూస్తాము. తూచితే ఏమైతుంది? ఇది ఎంత బరువుందో అదీ అంతే బరువు ఉంటుంది. రెండూ బెండ్లే, రెండూ ఒకేసారి ఒలిచి, రెండిటిని కరెక్టుగా కట్చేసి, కరెక్టు కొలతలతో తూకము చేస్తే, ఏముంది? రెండూ ఒకటే బరువు తూగుతాయన్నమాట, ఏది హెచ్చు తగ్గు తూగదు. మనము ఏం చేసినామంటే ఇప్పుడు ఒక బెండును ఏ.సి. (AC) రూములో పెట్టి, ఒక బెండును అలాగే బయట పెట్టి మళ్ళీ ఒక గంట తర్వాత తూకము చేస్తే ఏమైతాది అంటే ఏ.సి.లో పెట్టిన బెండు కొంత బరువై క్రిందికి పోతుంది అంటే బరువు ఎక్కువైతుంది, ఇంకోదాని బరువు తక్కువ ఉంటుంది అంటే బరువు అప్పుడే హెచ్చు తగ్గులు అయిపోయింది కదా! అవే బెండ్లే మొదట తూకము చేసినపుడు ఒకటే బరువులో ఉన్నాయి. మళ్ళీ తూకము వేస్తే మళ్ళా వేరు వేరు బరువులు వచ్చినాయి, అంటే అక్కడ ఏం మారింది? ఇదీ బెండే అదీ బెండే. దీంట్లోకి తేమ ఎక్కింది, దాంట్లోకి తేమ ఎక్కలేదు. తేమ ఎక్కింది కాబట్టి బరువైంది, తేమ ఎక్కలేదు కాబట్టి అది ఎట్లుండేది అట్లే ఉంది. అట్లగానే వీడూ మనిషే, వాడూ మనిషే. ఇద్దరూ ఒకటే మాట వింటున్నారు. ఒకనికి సత్యము ఎందుకు అనిపించింది? ఇంకొకనికి అసత్యము ఎందుకు అనిపించింది? అంటే వాడు ఉండే వాతావరణము వేరు, వీడు ఉండే వాతావరణము వేరు. వానిలో భావాలు వేరు, వీనిలో భావాలు వేరు. భావాన్ని బట్టి నీకు ఈ జ్ఞానము అర్థమైతుంది అని మొదటలోనే చెప్పాను.


----

ఇంతకు ముందు వ్రాసిన మూడు గ్రంథాల్లోనే ఒక గ్రంథములో ఏమి వ్రాసానంటే, ఒక్కొక్కనికి ఒక్కొక్క రకముగా అర్థమవుతుంది. ముగ్గురు వ్యక్తులున్నారు. వారిలో మొదటివాడు రెండోవానికి తేనె వేస్తుంటే, మూడోవాడు ప్రక్కన నిలబడుకొని “నాకు” అన్నాడు. అంటే నాకు కూడా తేనె వెయ్యి అన్న భావముతో మూడవ వాడు ఆ మాట అంటే రెండోవాడు ఏం చేసినాడంటే ‘నాకెయ్యమని' చెప్పినాడని వాడు 'నాక్కున్నాడు'. మొదటి వానికి కూడా ఏమీ అర్థము కాలేదు. తర్వాత మళ్ళ ఈ మూడోవాడు రెండోసారి ‘నాకు' అన్నాడు. దానికి జవాబుగా రెండోవాడు 'నాకు' అంటే నేను 'నాకినాను' కదా అని వాడన్నాడు. అరేయ్! నువ్వు కాదురా, నాకు కావాలి అని అడుగుతున్నాను. అంటే అప్పుడు మొదటోనికి మూడోవాడు తేనె తనకు కూడా వెయ్యమని అడుగుతున్నాడని అర్థమైనది. ఇట్ల మూడు రకాల భావాలు ముగ్గురిలో శ్రీ ఉన్నాయన్నమాట. అట్లగానే మనలో ఉండే భావాలను బట్టి ఏ విషయమైనా మనకు అర్థమైతుంది. ఒకే విషయమే ఒకే సంఘటనలోనే మనకు ఇన్ని రకాలుగా అర్థమైతుంది. ఈ రకంగ మనము చూసుకుంటే ఇక్కడ చెప్పేటటువంటి జ్ఞానము కూడా ధర్మశాస్త్రము లోని ధర్మమే అయినాకానీ కొందరికి అధర్మముగా కనిపిస్తుంది, కొందరికి ధర్మముగా కనిపిస్తుంది.


నేను అంగము, లింగము అని రెండు రకాల భాగాలు ఇంతకు ముందు ఒక మీటింగ్లో కూడా చెప్పాను. అంగము అంటే శరీరము, శరీరములో ఉండేది లింగము అని అంటే 'ఆత్మ' అని. శరీరము వేరు, ఆత్మ వేరు అని చెప్పాము అంటే కొంతమంది ఏమంటారంటే అది తప్పు అంగము అన్నా లింగమే అన్నారు. అంటే అంగము అంటే ఆత్మే అని అంటున్నారు. అది వేరు కాదు, ఇది వేరు కాదు అంటారు, రెండు ఒకటే


----

అంటారు. వాళ్ళకు అలా అర్థమైంది. నేను చెప్పేది అసత్యము అనిపించింది. ఇంకా ఏమని చెప్తున్నామంటే అంగము అంటే శరీరము. శరీరము అనేది పంచభూతాలతో నిర్మాణమై ఉంది, ఐదు భాగాలతో తయారైంది, ప్రపంచముతో తయారైంది అంటే ప్రకృతితో తయారైంది అని చెప్పాము. అంగము అనేది ఐదు భాగాలుగా ఉంది. లింగము అనేది మూడు భాగాలుగా మూడు ఆత్మలుగా ఉంది అని అంటే అది కూడా తప్పే అని చెప్పే వాళ్ళు ఉన్నారు. దాన్ని తప్పు అని, అది కొన్ని సమయాల్లోనే ఐదుగా ఉండేది, అన్ని సమయాల్లో ఐదుగా ఉండదు అంటారు. బాగా పరిగెత్తినపుడు గస వచ్చినపుడు గాలి వస్తుంది కదా! అపుడే గాలి ఉండేది, మిగతా సమయములో గాలి ఉండదంట. మిగతాటప్పుడు ఊపిరి ఆడతావుంది కదా! అంటే అది ఉన్నా లేనట్లేనంటా. బాగా గట్టిగ బయటకు వస్తే అపుడు వచ్చినట్లంట. బాగా పరిగెత్తి నిలబడినపుడు చెమట కారుతుంది కదా! అపుడు నీళ్ళంట, అంతవరకు నీళ్ళు లేనట్టేనంట. చూడు ఎట్లుందో ఇది. బాగా ఆకలి అయినపుడు కడుపులో మంటపుడితే అపుడు అగ్గి ఉన్నట్లంట, మిగతాటపుడు అగ్గి లేనట్టేనంట. మామూలుగా ప్రతి మనిషికి కొలత కొలిస్తే ఫారన్ హీట్ డిగ్రీలలో 98.4 డిగ్రీలు ఉంది. 98.4 ఫారన్ హీట్ డిగ్రీలు మన శరీరములో కొలతన్నమాట. దానికంటే కొంత ఎక్కువైనా తక్కువైనా జ్వరమన్నా అయితాది, శీతలమన్నా అయితాది. అర్థమయిందా! ఒకవేళ 10 డిగ్రీలు ఎక్కినా, 10 డిగ్రీలు తగ్గినా మనిషి చచ్చిపోతాడు. వాడు మిగలడు అట్లుంది మన విధానము. కానీ వాళ్ళు ఏమంటారో చూడు, అగే లేదంటున్నారు అసలుకు. ఇపుడు అదే వాళ్ళ మాటే కరెక్టు అని నమ్ముతున్నారు కొంతమంది, కాదు ఈయన చెప్పినదే కరెక్టు అని కొంతమంది అంటున్నారు. ఇక్కడ మేము చెప్పేది శాస్త్రబద్దము. అక్కడ శాస్త్రబద్ధము లేకున్నాగానీ అదే కరెక్టు అంటున్నారు కొందరు.


---


ఈ రకంగా మేము చెప్పినదానిని అవును, కాదు అని మీలోనే కొంతమంది ఏర్పడి, మళ్ళీ తిరిగి బోధించేవాళ్ళు ఉన్నారు. 'గురువు' అనేవాడు ప్రపంచములో లేడు. ఒకవేళ ఉన్నా కూడా తెలియబడడు అని నేను చెప్పాను. తెలియబడనప్పుడు లేనట్టే కదా, ఉన్నా లేనట్టే కదా! కాబట్టి మీరు నన్ను గురువు అనుకోవద్దండి అని కూడా చెప్పాను. నేను ఎవరికీ గురువును కాదు. ఇప్పుడు నా జ్ఞానాన్ని మీరు అనుసరిస్తుంటే మీరు నాకు అనుచరులు అవుతారు కానీ, భక్తులు కారు. మీరు చెప్పుకోవచ్చు నాకు భక్తులు అని, కానీ నాకు భక్తులు ఎవరూ లేరని చెప్తున్నాను. మనము అందరము దేవునికి భక్తులము అవుతాము. చాలామంది వస్తారు ఇక్కడికి వచ్చి మీకు నమస్కారము చేస్తాము అంటారు. నాకు నమస్కారము చెయ్యొద్దు అటువంటి గొప్పదనము నాలో లేదు, మీరు పోయి దేవున్ని మ్రొక్కండి అని చెప్పినాము. బలవంతంగా మ్రొక్కుతారయ్యా మీరు చెప్పినా వినరసలుకు అని మేము విసిగించుకుంటుంటాము, చాలాసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది. చాలామందికి చెప్పాను నేను, నాకు మ్రొక్క వద్దండి అని, మ్రొక్కించుకుండే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళను మ్రొక్కో పోండి పోయి అని కూడా చెప్పాము. దేవునికి మ్రొక్కండి, ఇది మంచి పద్ధతి అని చెప్పా నేను. మ్రొక్కించుకోకపోతే ఆయన మ్రొక్కించుకోలేదు చూడు, ఎంత అహంకారమో! అని అనేవాళ్ళున్నారు. మ్రొక్కించుకోకపోతే అహంకార మంట. నేను మ్రొక్కాలని పోతే నాకు మ్రొక్కద్దు అక్కడికి పోయి మ్రొక్కుపో అని చెప్పినాడు. నేను మ్రొక్కాలని పోతే మ్రొక్కించుకోలేదు, ఎంత అహంకారమో చూడు! అంటున్నారు. వాళ్ళకు అట్ల కన్పిస్తావుంది. నన్ను నేను తగ్గించుకొని, వద్దు, నన్ను మ్రొక్కొద్దు, నేను చిన్నోన్ని, నాకంటే పెద్దోడు దేవుడు ఉన్నాడు పోయి మ్రొక్కుపోండి అని చెప్పడము కూడ


----

వాళ్ళకు విరుద్ధముగా కనిపించిందన్నమాట. అటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు.


ఈ రకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతావుంటుంది. వాళ్ళు రకరకాలుగా మేము చెప్పి దానిని తిరిగేసి మల్లేసి కూడా చెప్తుంటారు. తరువాత ఈ రకముగా అర్థమయ్యేదానికి కారణము ఏమి? అంటే నేను చెప్పాను మాయ అనేది ఒకటుంది. ఆ మాయ అనేది మిమ్మల్ని వదలదు భగవద్గీతలో భగవంతుడు “ఏ మామేవ యే ప్రపద్యంతే” అంటాడు. ఎవడైతే నన్ను ఆరాధిస్తాడో వానిని తప్ప మిగతావాన్ని వదలదు. “ఏ మామేవ యే ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే” అంటాడు. ఎవడైతే నన్ను ఆరాధిస్తున్నాడో వాడే మాయను దాటగలడు, మిగతా వాడు దాటలేడు అని చెప్పాడు. అంటే దేవుని మీద నమ్మకము ఎవనికైతే లేదో అటువంటి వానిని మాయ వెంబడిస్తుంది. వెంబడించి దేవుని బోధ మీకు అర్థము కాకుండా తన బోధ అర్థమయ్యేటట్టు చేస్తుందన్నమాట. దేవుడు ప్రపంచవ్యాప్తముగా ఉన్నాగాని ఆయన కన్పించడు. మాయ కూడ ప్రపంచవ్యాప్తముగా ఉంది. ఎందుకంటే మనుషుల్లో గుణాలు ఉన్నాయి కదా! గుణాలే మాయ, మనిషి ఎక్కడైతే ఉన్నాడో అక్కడంతా ఉంది మాయ. కాబట్టి అది ఎవరినీ వదలదు. అది ఏం చేస్తుందంటే ఏ రకంగానైనా చేయగలదు. ఒకరు సుమారుగా 25 యేండ్ల క్రిందట ఒక మనిషి ఒక ప్రశ్న అడిగినాడు. ఏమని అడిగినాడంటే? మాయ అంటే ఎట్లుంటుంది? దాని ప్రభావము ఎట్లుంటుంది? అన్నాడు. దానికి చాలా సంవత్సరాలు నేర్చుకుంటేగానీ మనకు మాయను గురించి అర్థము కాదయ్యా. ఒకవేళ దేవుని గురించి అయితే రెండు ముక్కల్లో చెప్పొచ్చు, ఎట్లోకట్ల ఆయన పెద్దోడని. మాయ ఎంత పెద్ద, ఎంత లోతు అని చెప్పేదానికి కూడా


----

కాదు. నీకు సులభముగా అర్థము కావాలంటే ఒక విషయము చెప్తా చూడు అన్నాము. ఇప్పుడు నీవు నా వైపు తిరిగి కూర్చున్నావు కదా, నేను చెప్పేది గొప్పది ఏదో వినాలని కూర్చున్నావు కదా! నిన్ను ఒక్క నిమిషములో మార్చి, నాకు వ్యతిరేఖ దిశలో తిప్పి కూర్చోపెట్టగలదు మాయ. మాయ అనుకుంటే ఇటు మల్లుకున్న వాళ్ళను తిప్పి అటు వైపు మళ్ళించి కూర్చోబెట్టగలదు. అటువంటి శక్తి మాయకు ఉంది అని చెప్పాము. మాయను గురించి అంతే చెప్పేది అంతకంటే ఏమి చెప్పలేము? అని చెప్పాము. మాయలో పడకముందు మనము జాగ్రత్తపడి దేవుని మార్గములో నడవాలి అని చెప్పుచున్నాను. మేము దేవుని మార్గములో నడుస్తున్నాము, మీరు దేవుని మార్గములో నడవండి అని చెప్పుచున్నాము.


నేను ఒక స్వామీజీతో కలిసి రాత్రి 2 గంటల వరకు మాట్లాడుట జరిగినది. నేను అడిగే ప్రశ్నలకు ఆయన చెప్పేమాటలకు పొంతన లేకుండా పోయింది. ఇక్కడ భగవద్గీతలో ఇట్ల చెప్పినారు, మళ్ళీ మీరు అట్ల చెప్తున్నారేంటి సార్ అని అడిగితే ఆయన ఏమీ మాట తిరగక ఓ మాట అన్నాడు. అవన్నీ వద్దుగానీ నేను ఒక ముఖ్యమైన మాట చెప్తా చూడు అన్నాడు. అంటే అన్నిటికంటే ముఖ్యమైన మాట ఏమోనని జాగ్రత్తగా వింటే, “నిజముగా చెప్తున్నా, వాస్తవముగా చెప్తున్నా, నీకు తెలియని విషయము ఒకటే ఒకటి ఉంది. నిజముగా దేవుడూ లేదు, దయ్యమూ లేదు" అన్నాడు. ఆ మాట విని నాకు ఆశ్చర్యమైంది. ఆయన కాషాయగుడ్డలు వేసుకొని, చాలా ఊర్లల్లో ఉపన్యాసాలు చెప్పి, పెద్ద స్వామీజీ అని బాగా పేరుగాంచినాడు. అంత పేరుగాంచినోడు 'దేవుడే లేడు' అంటే ఆశ్చర్యము కాదా! దేవుడు ఉన్నాడనేగా ఆయన ఉపన్యాసము చెప్పేది, ఒక రోజు ఆయన ఉపన్యాసము విన్నాను. ఆ ఉపన్యాసములో బస్సులో కూర్చున్నవాడు


---

తన మూట తన మీద పెట్టుకొని కూర్చున్నాడంట. వాని మూట క్రిందపెట్టినా బస్సు మోస్తుంది, వాని మీద పెట్టుకున్నా బస్సే మోస్తుంది. ఆయన చెప్పిన ఉదాహరణ చూడండి, వాడు తెలివి తక్కువై తనమూట తన మీద పెట్టుకున్నాడంట, వాడు ఎక్కడికి పోయినా వాన్ని, వాని మూటని మోసేది బస్సే కదా! వాడు ప్రక్కన పెట్టినా బస్సే మోస్తుంది, తనమీద పెట్టుకున్నా బస్సే మోస్తుంది. నాది నా దగ్గర పెట్టుకుంటానని మీద పెట్టుకున్నాడంట వాడు, అట్ల బస్సులాగా అందరినీ దేవుడే కాపాడుతున్నాడు, అందరినీ దేవుడే రక్షిస్తున్నాడు. వాని మూట నాది అని నెత్తిన పెట్టుకున్నట్లు, మనము మనల్ని రక్షించుకొంటామని ప్రయత్నము చేస్తారు అని చెప్పడము విన్నా నేను. మళ్ళీ అక్కడ అంత గొప్పగా చెప్పి, ఇక్కడ దేవుడే లేడు అంటున్నాడు, అంటే బస్సే లేదంటున్నాడు ఆయన ఒకటేసారి.


మీరు చెప్పే జ్ఞానము అంతా దేవున్ని గురించే చెప్తున్నారు కదా! మళ్ళీ మీరు దేవుడు లేడని చెప్పినపుడు, అంత గొప్పగా దేవున్ని గురించి ఎందుకు చెప్పినారు అని అడిగితే దానికి ఆయన “వాళ్ళకు జ్ఞానము కావాలి, దేవుడి భక్తి కావాలి, వాళ్ళకు కావలసినది మనము చెప్తే, వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు. ఇప్పుడు మనము డ్రామాలో పోతాము. నాటకములో హరిశ్చంద్ర అనే పాత్ర వేస్తాము. మనము ఏమైనా అబద్దాలు చెప్పకుండా ఉన్నామా? అక్కడ హరిశ్చంద్రుడిగానే ఉంటాము మనము. అక్కడ వాళ్ళకు అట్లే నటించాలి. నేను అబద్దము చెప్పనే చెప్పను, ఎంతకష్టమైనాగానీ అబద్దము చెప్పననేటట్లుగానే నటించాలి, దాని పాత్రకు (portion) తగినట్టు మాట్లాడాలి. అంతేనయ్యా! అంతమటుకు తెలియదా మీకు. స్వామి అన్నాక స్వామిగానే ఉండాలి, జ్ఞానమే చెప్పాలి వాళ్ళకు అంతవరకే, వాళ్ళు చెప్పినట్లు మనమెందుకు ఉండాలి? వాళ్ళకు చెప్పినట్లే దేవుడున్నాడని మనకేం


---

నమ్మకము? దేవుడున్నాడని నీవు ఎందుకు అనుకోవాలి? వాళ్ళకు దేవుడున్నాడని నమ్మకము కాబట్టి ఉన్నాడని అట్లే చెప్పుదాము అంతేకదా! మనల్ని స్వామి అంటారు, డబ్బులు ఇస్తారు, గౌరవిస్తారు అంతేకదా! మనకు కావాల్సింది ఇది, వాళ్ళకు కావాల్సింది అది. వాళ్ళకు అది కావాలి, మనకు ఇది కావాలి అంతేకదా! వారికి నచ్చినట్లు చెప్పితే ఏమి పోతుంది. వాళ్ళకు కావాల్సింది వాళ్ళకు చెప్తాము” అన్నాడు.


శంకరాచార్యులు వ్రాసినేదో, ఇంకొకరు వ్రాసిన ఆ పుస్తకాల్లోని వివరము చెప్పినాను అంతేకదా! ఇవన్ని ఉపమానాలు ఉన్నాయి. ఇది ఎవరు చెప్పినారు? ఇది రామక్రిష్ణ పరమహంస చెప్పినటువంటి ఉపమానము అదే నేను చెప్పినాను అన్నాడు. నేను మీరు తెలుసుకున్న జ్ఞానము ప్రక్కన వాళ్ళకు చెప్పండి అంటే మనోళ్ళు కూడా జ్ఞానము చెప్తున్నారు. ఎట్లుందంటే ఆ స్వామీజీ చెప్పినట్లు ఉంది. ఈ జ్ఞానము మనకు అవసరము లేదు, వాళ్ళకు అవసరము. మనకు ఏమి అవసరము? మన హెూదా పెంచు కోవడము, మన పలుకుబడి పెంచుకోవడము. ఆ రకంగా చెప్తున్నారన్న మాట. అట్లే వాళ్ళ పలుకుబడి పెంచుకునేదానికి, వాళ్ళ హోదా పెంచుకునే దానికి ప్రయత్నము చేస్తూ చెప్తున్నారు. ఇప్పుడు మంచిగా జ్ఞానము చెప్పేవాడు ఒకడున్నాడనుకోండి, వాడికి ఇంకొకడు బోధిస్తాడు. "ఒరేయ్! మన స్వామి ధనికుడు అయినాడు కదా! ఈ జ్ఞానము చెప్పి చెప్పి, నీవు బీదోనిగానే ఉంటావు. ఆయన జ్ఞానము అని చెప్పి ధనికుడు అయినాడు కదా! నీవు జ్ఞానము చెప్తే ఇట్లే ఉంటావు. అట్ల కాదు నీవు కూడా సంపాదించుకో అని ఒకడు చెప్పినాడు


ఇంతకుముందు ఒకన్ని ఆరు సంవత్సరాల క్రితము ఊరకాయ అని ప్రక్కన పారెక్కినాము వాన్ని. ఊరగాయ అని ఒక ఉపన్యాసము


---

చెప్పినాము. మీరు విన్నారో లేదో, మీరు యూట్యూబ్లో చూచి ఉంటారు. ఊరకాయ అంటే అది ఎప్పటికీ కాయే, ఇంక మాగదు అంటే మారదు అది. అది కుళ్లిపోయినా దానిని ఊరగాయే అంటారు. ఇంక పండు కాదు అది, ఎప్పటికీ ఊరపండు అని ఎవరూ అనరు దానిని, ఊరగాయే అంటారు. నిమ్మపండును నిమ్మపండుగా ఉన్నపుడు దాన్ని మళ్ళీ కోసి, ఉప్పులో నాన వేస్తే ఏమైతాది అంటే పండుపోయి కాయ అవుతుంది అది. అలాగే కొంతమంది జ్ఞానులైనాగానీ ఈ మాయ చేకూరేసరికి ఏమైతాది అంటే మళ్ళీ నిమ్మపండు పోయి నిమ్మకాయ ఊరగాయ అయినట్టు, వీళ్ళు ఊరగాయగా మారిపోతారంట అట్ల మాయలో పడిపోయి, ఇంకవారు పనికిరారు అని ప్రక్కకు వేసినాము, ఆరు సంవత్సరాల క్రిందటనే ప్రక్కకు నూకేసినాము, వద్దు మీరు పనికిరారు పోండి అని. అట్లాంటివారు ఇక్కడ అంతో ఇంతో జ్ఞానము చెప్పేవాళ్ళకు ఏమి చెప్పారు అంటే ఒరేయ్! నీవు ఇట్ల ఉంటే ఇట్లే ఉంటావు, నీవు కూడా ధనవంతునిగా మారిపో అని ఇరవైయేండ్ల క్రిందట ఏమీ లేదు. మళ్ళీ స్వామి ఇప్పుడు బాగున్నాడు. ఆయన సంపాదించుకుంటూ నువ్వు మాత్రము ఇట్లే ఉంటే ఎట్లనుకున్నావు. ఆయన మిమ్మల్ని ఉపయోగించుకొని, ఆయన సంపాదించు కుంటున్నాడు. మీరంతా జ్ఞానము చెప్పుచూ ఉంటే ఆయన ధనవంతుడు అవుతాడు. అట్లొద్దు, మీరు జ్ఞానము చెప్పి, మీరూ ధనవంతునివి అయ్యేదానికి ప్రయత్నము చెయ్యి. ఎట్ల చెయ్యాలంటే, నేను చెప్తా చూడు నీకు ఉపాయము. నీకు ఎవరు పరిచయము ఉన్నారో వాళ్ళను స్వామికి తెలియనివ్వద్దు, నీవే పరిచయము చేసుకో. ఆయన నాలుగు వేల రూపాయలు ఎవ్వరికైనా జీతము ఇచ్చి మనిషిని పెట్టుకుంటే, నీవు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చి ఎవరినైనా జీతానికి పెట్టు, లేకపోతే నీవైనా పెట్టుకో, నీవు పెట్టుకోవడానికి చేతకాకపోతే

కదా.


---

ఎనిమిది వేల రూపాయలు జీతము ఇప్పించు. అపుడు నీవు పెద్దగా కన్పిస్తావు కదా.


కొందరు బోధిస్తే, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా అట్లే విని ఒకరు గురువు కావాలనుకున్నారన్నమాట. గురువును కావాలనుకొని వాళ్ళు ఏమి చేసినారంటే నేను చెప్పాను కదా! నేను ఉత్తమాటలు చెప్తే, వాళ్ళు ప్రక్కన పోయి పాటలు, పద్యాల రూపములో కూడా చెప్పినారంట ఇదే జ్ఞానాన్ని. అంటే వీళ్ళు పాటలు పద్యాల రూపములో చెప్పినేది ఎప్పుడు వినలేదు కదా. ఓ ఆయన చెప్పేది ఉత్తమాటలు చెప్పితే, ఈయన పాట పద్యము రెండూ చెప్తున్నాడని ఆకర్షితులైనారంట కొంతమంది. ఈ విధముగా పాట, పద్యములుగా చెప్పిన జ్ఞానమును ఆయనే చెప్పినారంటారుగానీ మొదటోడు చెప్పినట్లు తెలియదు. ఈ రకంగా మారిపోయి కొంతమంది మాయ అనే దానిలో పడిపోయి, మేము కూడ గురువులము కావాలని ప్రయత్నము చేసేదానికి మొదలుపెట్టినారు. అవి అంతా ఇక్కడే జరిగినాయి.


నాకు మీకంటే ఎక్కువ శ్రద్ధ ఉంది కాబట్టి మీకంటే ఎక్కువ జ్ఞానము నాకు తెలియబడింది అంతేకదా! మళ్ళా అటువంటి శ్రద్ధ మీరూ పెట్టుకోండి మీకూ తెలియబడుతుంది అని చెప్పినాను. అంటే ఎక్కడా లేని జ్ఞానమే నాకు తెలియబడినది. మీకు తెలుస్తావుంది కదా! నేను చెప్పేది అట్లే ఉంది కదా. మరి నిన్నటి మొన్నటి వరకు కూడా తెలియనటువంటివి నిన్న ఉపన్యాసములో ఏమి చెప్పాము మేము. భగవద్గీతలో జ్ఞానయోగములో 7, 8 శ్లోకాల్లో కూడా తేడా ఉంది అని చెప్పా నేను. ఇంతకుముందు ఆ తేడాను ఎవరైనా గుర్తించి చెప్పారా? లేదు. "గ్లానిర్భవతి” అని ఒకచోట చెప్పినారు. ఒకటి “సంస్థాపనార్థాయ” అని “సంస్థాపనము” అనే పేరు పెట్టినారు. సంస్థాపన, గ్లాని అని రెండు విధానాలు ఉన్నాయి చూడండి. గ్లాని వేరు, సంస్థాపన వేరు అని కూడా చెప్పాను.


----

మళ్ళీ ఈ రకంగా విడదీసి చెప్పాము కదా, మళ్ళీ ఆ విడదీసి చెప్పుకోవడము ఇంతకుముందు ఎవ్వరికి ఎందుకు రాలేదు? వాళ్ళకు అటువంటి శ్రద్ధ లేదు, రాలేదు. జ్ఞానము చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. ఉంటే ఎక్కడి వరకు ఉంది వాళ్ళ జ్ఞానమంతా? మొదట రవ్వంత జ్ఞానము ఉంటుంది, రవ్వంత రుచి మరుగుతానే ఏమైతాది? డబ్బు మీదకి పోతాది. ఇంక డబ్బు మీద పోతాది, డబ్బుల కోసమే కాబట్టి జ్ఞానము కట్ అయిపోతుంది. జ్ఞానము తెలియబడదు ఎంతవరకు తెలిసింటే అంతవరకు ఉంటుంది. కర్మరీత్యా డబ్బులు చేకూరుతాయి. కాబట్టి దాని గురించి చింత చేయాల్సిన పని లేదు అని చెప్తున్నాను. మీకే కాదు, నాకే కాదు ఎవ్వరికైనా అంతే, ప్రపంచములో ఎవ్వరికైనా అంతే. కర్మరీత్యానే మీకు ఏమి చేకూరాలో అవే చేకూరుతాయి. కాబట్టి దానిని గురించి మీరు చింత చేయాల్సిన చింత చేయను. నేనేమి చేస్తున్నాను? దేవుని పని చేస్తున్నాను.ఆ దేవుని పనిలోనే  అంటే గ్రంథాలు వ్రాస్తున్నాను. ఆ గ్రంథము ఖర్చు అడుగుతున్నాను. గ్రంథములో ఉండే జ్ఞానానికి (జ్ఞాన విలువ) అడగలేదు. ఒక గ్రంథములో ఉండే జ్ఞానము కొన్ని కోట్ల విలువ అవుతుంది. ఆ జ్ఞానానికి ఒక్క పైసా కూడా మీరు ఇవ్వలేదు. ఆ పేపర్లకు, ఆ పైన కవరేజీకి గ్రంథముకే మీరు ఇస్తుండేది. మేము ఖర్చు పెట్టినది మాత్రము అడుగు చున్నాము. మేము చేసిన పనికి కూలి తీసుకొంటున్నాము. ఆ కూలి మాత్రమే మాకు కొంత మిగులుతావుంది. ఆ కూలిలోనే మేము ఇంకా ఖర్చుపెట్టి దేవుని పని చేస్తున్నాను.


2003లో ఇక్కడ కృష్ణమందిరము స్థాపించాము. 2003లో మీరంతా పరిచయమా నాకు? లేదు. నాకొచ్చి ఆదుకొంటారని ఏమన్నా


---

మొదలు పెట్టినానా దీనిని? లేదు. మేము వస్తాము నీవు మొదలు పెట్టు అని మీరు చెప్పినారా నాకు లేదు. ధైర్యముగా నేను చేశాను. అప్పుడు ఏమని చేశాను? ఇది జరుగగలదు అనే ఉద్దేశ్యముతో చేశాను. దేవుని పని కాబట్టి అది అవుతుంది. ప్రపంచపు పని అయితే అది కర్మరీత్యా ఉంటుంది. అది చేస్తానో చెయ్యలేనో చెప్పలేను. ఇది దేవుని పని, కర్మ దీనికి లేదు. నీవు ఎంత అనుకొంటే అంత జరుగుతుంది. అదెట్ల జరుగుతుంది? అని ఒకరు ప్రశ్నించారు. మీరు గ్రుడ్డిగా చెప్పితే మేము గ్రుడ్డిగా నమ్మాలా? అని కూడా ప్రశ్నించారు నన్ను. నేను అప్పుడు చెప్పాను. నాకు వంద రూపాయలు కర్మరీత్యా వస్తే ఆ వంద రూపాయలు కర్మరీత్యా ఖర్చు కావాలని ఉంటుంది. అంతే కదా! నీవు పని చేస్తే యాభై రూపాయల భోజనము నీకు కావాలి. యాభై రూపాయలు ఎట్ల సంపాదించుకోవాలనేది కూడా ఉంటుంది. ఆ రకంగా కష్టపడి సంపాదించుకొంటావు. సంపాదించు కొన్నది కూడా ఈ రకంగా ఖర్చు అయ్యేటట్లుగా పెట్టింటాడు దేవుడు. అది మాత్రము ప్రపంచరీత్యా వాస్తవము. కాని అక్కడే ఉంది తతంగము. కర్మరీత్యా సంపాదించుకొంటున్నావు, కర్మరీత్యా ఖర్చు పెడుతున్నావు. కర్మరీత్యానే కదా అది. దేవుని విషయములో ఖర్చుపెట్టేది నీకు లెక్కలేదు. ఎంత ఖర్చపెడతావో అని ఎక్కడా వ్రాసిపెట్టలేదది. ప్రపంచరీత్యా నీవు ఎంత ఖర్చు పెడతావో వ్రాసిపెట్టబడి ఉంది, ఎంత సంపాదించుకొంటావో వ్రాసి పెట్టబడి ఉంది. ఖర్చు ఎక్కువైతే బీదోనివి అవుతావని వ్రాసిపెట్టబడి వుంది. సంపాదన ఎక్కువైతే ధనవంతుడు అవుతావని వ్రాసిపెట్టబడివుంది.


ఆ రకంగా నీవు బీదోడో లేక ధనవంతుడో అవుతావని వ్రాసిపెట్టబడి ఉంది. కానీ ఇక్కడ మాత్రము నీవు దేవునికి ఎంత సేవ చేస్తావు? ఎంత ఖర్చు పెడతావు? ఎంత శ్రద్ధ వుంది? అనేది మాత్రము వ్రాసి పెట్టబడలేదు.


----


అది నీ స్వంత శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది, సొంత హక్కు అది కాబట్టి ఆ హక్కు ఏమిటో నేను తెలుసుకున్నాను. శ్రద్ధ అనేది నా హక్కు దేవుడిచ్చిన హక్కు నాకు. నేనెంత శ్రద్ధ పెట్టుకుంటే అంత నాకు జ్ఞానము తెలియబడుతుంది. ఎంత శ్రద్ధ పెట్టుకుంటే అంత చేయగలను కాబట్టి ఆ రోజు శ్రద్ధ ఉంది కాబట్టి నేను మందిరము నిర్మించుకున్నాను. ఆ రోజు మందిరము నిర్మించేటప్పుడు డబ్బులు స్టాకు ఉండి చేశామా ఆ పని? అంటే లేదు. డబ్బులతో అయ్యేపని కాదిది. డబ్బులతో ప్రపంచ పనులు అవుతాయి. నీకు శ్రద్ధతో అయ్యేపని అనే ఉద్దేశ్యముతో మేము ఆ రోజు మొదలు పెట్టాను. ఆ రోజు మొదలు పెట్టినప్పటి నుండి వెనక్కి తిరిగి చూడకుండా పనులు చేస్తున్నాను. కానీ నేను ఏమి చెప్తున్నాను, ఇవన్నీ ఎవరో నన్ను ఆదుకొంటారని నేను చేయలేదు. ఈ రోజు కూడా ఎవ్వరినీ నేను అడగలేదు. మీరు చేసుకొంటారు అంటే చేసుకోండి అని చెప్పినాను నేను. దేవుని సేవగా చేసుకొంటారా? పాల్గొంటారా? పాల్గొనండి. నాకు డబ్బు ఒక్క రూపాయి ఇచ్చినా ఉపయోగపడదు. ఎందుకంటే దానికే ఖర్చుపెట్టేవాన్ని నేను. నా దగ్గర ఉండేదే తీసుకొని పోయి ఖర్చుపెడతా నేను. మీరిచ్చినా నా దగ్గర ఉండదు అది కూడా దేవుని సేవలోకి పోతుంది.


సంపాదించుకుండేది ఎక్కువై ఖర్చు అయ్యేది తక్కువైతే మిగుల బాటులోకి వస్తావు, ధనికుడవు అవుతావు, అర్థమయిందా! నేను ఒక ప్లాటు కొన్నాను అంటే ఎట్ల కొంటావు నీవు. ముందే కర్మరీత్యా సంపాదించేది ఎక్కువై, ఖర్చు పెట్టేది తక్కువైతే అది కొంత మిగిలితే ఆ మిగిలినది తీసుకొనిపోయి ప్లాటు కొంటావు. ఆ ప్లాటు వలన షావుకారివి అవుతావు. అది కర్మరీత్యా వ్రాసిపెట్టబడివుంది లేకపోతే అది కాదు. కానీ దేవుని సేవ ఎంత చేయాలి అనేది ముందే వ్రాసి పెట్టబడి ఉంటుందా? దేవుని జ్ఞానము


----

ఎంత తెలుసుకోవాలని ముందు కర్మరీత్యా వ్రాసిపెట్టబడి ఉంటుందా? అది వ్రాసిపెట్టబడేది కాదు, రికార్డు రూపములో లేదు అది, నీవు ఎంతైనా తెలుసుకోవచ్చు అని చెప్పా నేను. నీవు ఎంత జ్ఞానమైనా తెలుసుకోవచ్చు అంటే, ఇప్పుడు మేము పది రూపాయలు వచ్చిందయ్యా. పది రూపాయలు నేను కష్టపడి పని చేస్తున్నాను, కష్టపడి అన్నము తింటున్నాను, నాకు ఇంక సరిపోయింది దేవుని సేవ నేను ఎట్ల చేయాలి? నీవు మిగులు బాటు ఉంది కాబట్టి నీవు చేస్తున్నావు అని కొందరు అంటున్నారు. నేను కూడా ఒకానొక రోజు బీదోన్నే, మీ మాదిరి. నాకు పది రూపాయలు కూడా లేదు ఆ రోజు, తొమ్మిది రూపాయలే ఉంది. | తొమ్మిది రూపాయలకు కూడా తినాల్సిందే చివరకు నాకు మిగిలేది పైసా కూడా ఉండదు. మళ్ళీ ఈ పని ఎట్ల చేసినాను అంటే వేరే వాళ్ళను అడగలేదు. నేను ఎవరినీ డిమాండ్ చేయకుండా, ఎవరినీ అడగకుండా, ఏమీ చేయకుండా ఏమీ సంపాదించుకోకుండా స్వచ్ఛముగా నేను బ్రతుకుతున్నా అంటాను.


మొట్టమొదట ఎవరినీ అడగకోకుండా ఏ లాభము లేకుండా ఎట్ల చేస్తారయ్యా ఏదో ఒకటి ఉంటే కదా! పెట్టుబడి చేసేది అని మీరు ప్రశ్నించవచ్చు. నా దగ్గర శ్రద్ధ అనే పెట్టుబడి ఉంది. వ్రాసిపెట్టబడినది ఏది లేదు. వ్రాసిపెట్టినేది కర్మరీత్యా ఉండేదే. అది ముందే అందరికీ అదేగా చెప్తుండేది నేను. నాకు అంతే, మీకు అంతే, ప్రపంచానికి అంతా ఒకటే రూలు. ఏ మతస్థుడికైనా ఒకటే రూలే ఇది. కానీ నాకు తొమ్మిది రూపాయలు వస్తే ఆ తొమ్మిది రూపాయలు నేను ఏమి చేసేవాన్నో తెలుసునా? తొమ్మిది రూపాయలు నాకు సాయంకాలానికి ఖర్చుకావాలి కదా! లేకపోతే మరు నాటికి ఖర్చు కావాలి కదా లేకపోతే నెల లోపల వందరూపాయలు ఖర్చుకావాలి లేదా వెయ్యి రూపాయలు ఖర్చు కావాలి కదా నాకు. దాంట్లో


----

వెయ్యి రూపాయలు ఈ నెలకు కేటాయించబడితే సంపాదించుకుంటే రేపు నెల అంతా ఖర్చుకావాలి మళ్ళీ సరుకులు తెచ్చుకొని తినాలి. ఆ వెయ్యి రూపాయలు ఏమి చేసినానని తొమ్మిది వందల రూపాయలు నేను దేవునికి ఖర్చు పెట్టేవాన్ని. అది ఎవరి చేతిలో లేదు కదా! ఏ కర్మలో లేదు కదా!


దేవునికి ఇంత ఖర్చుపెట్టాలని లెక్కాచారము ఉందా? లేదు. లేదు కాబట్టి నేను దేవునికి తొమ్మిది వందల రూపాయలు ఖర్చు పెట్టేసేవాన్ని, దేవునికి ఇంతే ఖర్చుపెట్టాలు ఇట్ల అని వ్రాసిపెట్టబడి ఉందా? లేదు. వ్రాసిపెట్టబడలేదు కాబట్టి అది మన ఇష్టము వచ్చినట్లు చెయ్యొచ్చు, నీ ఇష్టముతో చెయ్యొచ్చు. కాబట్టి నా ఇష్టముతో నేను 900 రూపాయలు ఖర్చుపెట్టినాను. ఖర్చుపెడితే వేయి రూపాయల్లో వంద రూపాయలే మిగిలింది. రేపు నెలకు 900 రూపాయలు తక్కువ వచ్చింది, లెక్కాచారము చూసుకోండి మీరంతా. ఇది మీరు గమనించేదానికి కాదు, ఉన్న పరిస్థితి చెప్తున్నా నేను. అంటే తొమ్మిది వందల రూపాయలు రేపు నెలకు తక్కువ వచ్చింది. మళ్ళీ తొమ్మిది వందల రూపాయలు భర్తీ ఎలా కావాలి? కర్మరీత్యా వెయ్యి రూపాయలు ఖర్చు కావాలి. కర్మరీత్యా వెయ్యి రూపాయలు ఖర్చు కావాలి కాబట్టి కర్మరీత్యా వెయ్యి రూపాయలు వచ్చింది, ఈ వెయ్యి రూపాయల్లో నేను తొమ్మిది వందలు దేవునికి ఖర్చుపెట్టినాను. అది కర్మకు ఖర్చు పెట్టాలి కదా, కర్మ ఎక్కడ నుండి ఖర్చు పెడుతుంది? నూటికి నూరు రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే అది. ఏది తప్పినా అది తప్పదు. నాకేమి నేను దేవునికి ఖర్చు పెట్టేసినాను. దానికి లెక్కాచారము లేదు, నా ఇష్ట ప్రకారము నేను చేసేసినాను. దేవుని విషయములో ఇష్ట ప్రకారము నీవు చేసుకోవచ్చు. నీ ఇష్టప్రకారము నీవు జ్ఞానము తెలుసుకోవచ్చు. నీకు ఎంత శ్రద్ధవుంటే అంత జ్ఞానము తెలుసుకోవచ్చు అని ఉంది. కాబట్టి నాకు శ్రద్ధ


---

ఉంది, నేను జ్ఞానము తెలుసుకొనే దానికి ఉపయోగించినాను. తొమ్మిది వందలు ఖర్చు అయిపోయింది.


ఈ తొమ్మిది వందలు ఎట్ల వస్తుంది, ఏదో రూపకముగా వచ్చి తీరాలి నీకు తెలియకుండా. తెలిసే వస్తుంది, తెలిసి వచ్చినాగాని అది ఒక దారి ఏర్పడుతుంది. ఈ మధ్యన ఒక చిన్న సంఘటన జరిగింది. అంటే మీకు ఎవరికో ఒకరికి ఇద్దరికి చెప్పాముగానీ అందరికి చెప్పలేదు ఈ విషయము. అంటే మా ఇంట్లో తెలుసు. మాకు ఒకసారి ఒక ఐదు లక్షల రూపాయలు అవసరము వచ్చింది, ఎవరిని అడగాలా? అని ఆలోచన చేస్తున్నాము. ఎవరిని అడిగినా ఇవ్వరు ఇంక. ఎందుకంటే అన్నిచోట్ల తెచ్చుకున్నాము, మాకు ఎక్కడెక్కడ పుడతాయో అన్ని చోట్లా తెచ్చేసుకున్నాము. ఇంకొక చోట పుట్టవన్నమాట. అంటే సరేలే అని, మళ్ళీ మా వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏమి చేసినారంటే బీరువాలో ఏదో కావాల్సింటే పోయి వాకిలి తీస్తే ఆ బీరువాలో ఒక బ్యాగ్ దొరికింది, అంటే అది బ్యాగ్ ఇంతకుముందు మనము పెట్టిన బ్యాగే. ఆ బ్యాగ్లో ఆరు లక్షల రూపాయలు ఉన్నాయి. ఎప్పుడు పెట్టినామో మాకే తెలియదు అది. ఆరు లక్షల రూపాయలు మేము ఎందుకు పెట్టినామో అర్థము కాలేదు. దేనికి పెట్టినామో ఎప్పుడు మరిచి పోయినామో దానిని. సరేలే, ఆరు లక్షల రూపాయలు దొరికినవి. మనకు ఐదు లక్షల రూపాయలు ఇప్పటికి అవసరానికి పనికి వచ్చినాయి.


దేవుని పరీక్ష నిమిత్తము ఏదీ చేయకూడదు. పరీక్ష నిమిత్తము చేస్తే నీకే ఇబ్బంది అవుతుంది. దేవున్ని పరీక్షించకూడదు. నేను ఒక గ్రంథములో కూడా వ్రాసినాను. 'ప్రథమ దైవగ్రంథము భగవద్గీత' అనేదాంట్లో ఆత్మ అబద్దాలు కూడా చెప్పుతుంది. ఆత్మ మోసాలు కూడా చేస్తుంది అని చెప్పినాను. ఆత్మ మోసము, అబద్దాలు చెప్పినప్పుడు ఆత్మను మనము

-----

ఎందుకు తెలుసుకోవాలి. ఆత్మ ఎక్కడన్నా జ్ఞానము చెప్పాలి కానీ అబద్ధాలు ఎందుకు చెప్తుంది అసలుకు, ఆయన చెప్పేదంతా తప్పు అంటారు. వాళ్ళ లెక్కలోగానీ, ఎవరైనా విన్నాగానీ నిజమే గదా, దేవుడు మంచి చేస్తాడంటే ఒప్పుకుంటాము. దేవుడు అబద్దము చెప్తాడు, దేవుడు మోసము చేస్తాడు అంటే ఎట్ల వింటాము అంటారు. మిమ్మల్ని అన్నీ చేయించి, అన్ని నాటకాలు ఆడించేది నేనే అని ఆత్మ అంటున్నాడు. అయినా అది ఎవరికీ అర్థము కాలేదు.


బొమ్మను ఆడించినట్లు ఆడిస్తున్నాను మిమ్మల్ని అని చెప్పినాడాయన. ఆయన చెప్పినాగానీ మళ్ళీ ఇవి నేను చేస్తున్నాను, అవి చేస్తున్నాను అంటారు. మోసాలు నేనే చేస్తున్నాను, అబద్దాలు నేనే చెప్తున్నాను అని అందరూ అంటున్నారు. భగవద్గీత వ్రాసినపుడు కూడా దేవునికి మంచి, చెడు అనేవి ఏమీ లేవు. నీవు ఎంత దుర్మార్గుడవు అయినాగానీ దేవుని లెక్కలో నీవు జ్ఞానివి అయితే, జ్ఞానిగానే లెక్కించుకుంటాడు నిన్ను అని చెప్పినాను. ప్రపంచములో చెడు మంచి అనేవి ప్రపంచరీత్యా కర్మకు వదిలేస్తాడాయన. కానీ ఆయన దృష్ఠిలో ఎవరినీ ఇటు చెడు, మంచి అనుకోడు. ఒకడు దుర్మార్గుడై ఒకనిని హత్య చేస్తే, ఒకడు దొంగతనము చేస్తే వానిని ఏమనుకుంటాడు? వాని కర్మరీత్యా వానికి ఆ విధముగా జరగాల్సివుంది కాబట్టి జరిగింది అని అనుకుంటాడు. కర్మే కారణము నేనే చేశాను అనుకుంటాడుగానీ, నిన్ను కారణము అనుకోడు దేవుడు. ఈ రకంగా ఆయనకు జ్ఞానము తెలుసు కాబట్టి ఎవరిని ఎట్ల ఆడించాలో ఆ కర్మ ప్రకారము ఆడించేవాడు కూడా ఆయనే అని చెప్పినాను. ఇప్పుడు ఒకడు ఇంకొకన్ని చంపినాడు అంటే చంపేవాడు ఆయనే, చంపించే వాడూ ఆయనే, చంపబడేవాడు ఆయనే. ఈ రకంగా జరుగుతా ఉంది అని నేను చెప్పినాను.


----

భావాన్ని బట్టి మనుషులకు జరుగుతావుంది అని చెప్పినాను. ఈ రకముగా జరుగుతూ దేవుడే అన్ని చేస్తున్నాడు అని తెలియకుండా దేవుడు చేయలేదు మనమే చేస్తున్నామని మాట్లాడుతున్నారు. మనము చేస్తున్నాము అనుకోవడమే పెద్ద పొరపాటు అని ఇంతకుముందు చెప్పా చాలాసార్లు. నేను అలా చెప్పితే కొందరు స్వాములు ఇది తప్పుడు జ్ఞానము అసత్యమైన జ్ఞానము అని ప్రచారము చేసుకొని వాళ్ళవైపు కొంతమందిని తిప్పుకున్నారు. వాళ్ళకు అనుకూలమైన జ్ఞానము చెప్పి తమవైపుకు తిప్పుకునే దానికి ప్రయత్నము

చేశారు.


మేము ఏమి చెప్పినామంటే సరే మీరు ఎట్లైనా పోండి మీ కర్మ ప్రకారము ఉంటుంది ప్రపంచరీత్యా పోతే, జ్ఞానము ప్రకారము వస్తే జ్ఞానరీత్యా ఉంటారు మీరు. ఏది మంచో, ఏది చెడో ఆలోచన చేసేటటువంటి శక్తి మీకు ఉంటుంది. • బుద్ధికి కొంత శక్తి ఉంది. ఆ శక్తిని ఇచ్చేవాడు కూడా ఆత్మే, బుద్ధిని ఎలా ప్రయోగించాలో అలా ప్రయోగము చేసి, నిన్ను మంచి మార్గములో పంపివ్వాలన్నా ఆత్మే, చెడు మార్గములోకి పంపివ్వాలన్నా ఆత్మే చేస్తుంది. "ఇప్పుడు మంచి మార్గములో నడుస్తూ ఉన్నాము అనుకొని చెడు మార్గములో నడిపించేది కూడా వాడే. ఈ రకంగా అన్నీ చేసేది వాడే అంటే ఆ..! ఆయన ఎట్ల చేస్తాడు? అని మీరు అనుకుంటే, అలా అనిపించేది కూడా వాడే. అట్ల అనిపించి, మా నుండి మిమ్మల్ని దూరము చేశాడు. ఈ రకముగా ఒక్కొక్కరిగా కొంతమందిని చాలా దూరము చేశాడు. తరువాత మీరు గమనించుకుంటారేమో అనుకుంటే పుట్టినరోజు పండుగను రద్దు చేసుకొని నేను చెప్పితే, ఓహెూ! ఈయన చేసినదంతా చాలా తప్పు పని చేశాడు. ఏదో అడ్డము పెట్టుకొని ఏదో చేశాడు. ఇతరులు జ్ఞానము చెప్పకూడదు, నేనే జ్ఞానము చెప్పాలి అనే అసూయతో చేశాడు అనుకొన్నారు.

----

అటువంటి ఉద్దేశ్యములు మాకు ఉండవు. ఈ రోజు నా పుట్టిన రోజు పండుగ సందర్భముగా మీకు మూడు మంచి గ్రంథములు ఇచ్చాము. మూడు శాస్త్రబద్ధమైనవే అయినందున వాటిలోని గొప్పతనాన్ని అర్థము చేసుకొంటారని కోరుచూ, ఈ సమావేశమును ముగించుచున్నాను.


తేది: 06.12.2014


ఈ దినము "ప్రళయము” అనే విషయాన్ని గురించి చెప్పు కుందాము. ఈ ప్రళయము అనే మాట మీరు చాలాచోట్ల వినే ఉంటారు. ప్రళయము వస్తుంది, ఇదంతా పోతుంది అనే మాట కూడా మీరు వినే ఉంటారు. అటువంటి భయాలు కూడా చాలాసార్లు మనము చూశాము. కానీ మేము ఇంతకు ముందు ఒక గ్రంథము వ్రాశాము. అంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాము. ఆ 'ప్రళయము' రాదు, ఇదంతా ఎప్పటికీ పోదు” అని. ఆధ్యాత్మిక సంస్థలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఏమి చెప్పినారు అంటే ప్రళయము వస్తుంది, తరువాత ఇది నాశనము అయిపోతుంది, ఏమీ మిగలదు అని చాలాసార్లు చెప్పడము జరిగింది. తరువాత వాళ్ళ మాటలు ఏమాత్రము జరుగకొకుండా పోవడము కూడా జరిగింది. అంటే వాళ్ళ మాటలన్నీ ఫెయిల్ అయిపోయినాయి, ఒకటి కూడా వాస్తవము కాదు అని తెలిసిపోయింది. మేము మొదట ఏమి చెప్పామో అదే సత్యమైనది, ప్రళయము ఎప్పటికీ రాదు అనేదే సత్యమైనది. అంటే ప్రళయము రాదు అని మీరు ఎలా చెప్పారు? అంటే నాకు శాస్త్రబద్దముగా విషయము తెలుసు కాబట్టి నేను చెప్పాను.


---

శాస్త్రబద్ధమైన విషయము వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్లు ప్రళయము వస్తుంది అని ఈ రోజు కూడా వారికి నమ్మకము ఉంది. రెండు మూడుసార్లు చెప్పినా రాలేదు, తరువాత ఎప్పుడైనా ఓసారి వస్తుంది అనే నమ్మకము కూడా వాళ్ళకు ఉంది. కానీ 'ప్రపంచములో ఎప్పటికీ రాదు' అని మేము అంటున్నాము. శాశ్వితముగా ఎప్పటికీ రాదు. ఇప్పుడు ఎట్లా ఉందో అట్లే ఉంటుంది. అంటే ఇంకా కొంతకాలానికి, కొన్ని యుగాలకు, ఇంకా వేల యుగాలకు వస్తుందా అనుకుంటే ఇది అట్ల వచ్చేది కాదు. అంత ధైర్యముగా ఎలా చెప్పుతున్నారు? అని మీరు నన్ను ప్రశ్నిస్తే, "ప్రళయము లేదా ప్రలయము” అనే దాంట్లో విభజించి చూస్తే ‘ప్ర' అనేది ఒకటి ఉంది, 'ళయము లేదా లయము' అనేది ఒకటి ఉంది. 'ళయము లేదా లయము' అంటే 'నాశనము' అని. 'ప్ర' అంటే 'పుట్టినటువంటిది' అని. ‘ప్రళయము' ' 'పోవడము' అని అర్థము. ఇప్పుడు మనకు రెండు రకాల ప్రకృతులు ఉన్నాయి. ప్రకృతిని 'ప్రపంచము’ అంటాము. ప్రకృతిని విభజిస్తే అంటే “ప్రపంచము” ని విభజిస్తే ‘పంచము’ అంటే 'ఐదు', 'ప్ర' అంటే 'పుట్టినది' అని. 'ప్రపంచము' అంటే 'ఐదు వలన పుట్టినటువంటిది' అని అర్థము. అయితే బయట ప్రపంచము మనము చూస్తూవున్నాము.


ఆకాశము, గాలి, అగ్గి, నీరు, భూమి ఇవన్నీ ఐదు ఉన్నాయి. ఈ ఐదీటి వల్ల ప్రపంచము ఉంది అని మీ అందరికీ తెలుసు. ఇంకో విషయము ఏమి అంటే బయట ఏవైతే ఉన్నాయో వాటివల్లే మన శరీరము కూడా తయారయింది అని చెప్తున్నాము. బయట ఏవైతే ఐదు భూతాలున్నాయో అవన్నీ మన శరీరములో ఉన్నాయి. అవి అన్నీ కలిసి మన శరీరము తయారయిందని మనము చెప్పుతున్నాము. ఇపుడు 'పంచము' అనేటువంటివి


---

శరీరము లోపల ఉన్నాయి, శరీరము బయట ఉన్నాయి. శరీరము బయట ఉండేటివి మార్పు చెందవు అవి ఎప్పటికీ ఉంటాయి. పిల్లప్పుడు చూసినా అట్లే ఉన్నాయి ఇప్పుడు చూసిన అట్లే ఉన్నాయి. కానీ ఈ శరీరములో ఉండేటివి నీవు చిన్నప్పుడు బాల్యముగా ఉన్నావు, ఇప్పుడు మధ్య వయస్సుకు వచ్చినావు, ఇంకా వృద్ధాప్యము వస్తుంది, చివరకు ఒకరోజు చనిపోవడము కూడా జరుగుతుంది. ఈ రకంగా ఈ ప్రకృతులు రెండు రకాలు అయితే, శరీరములో ఉండే ప్రకృతి ఒకటి, బయట ఉండే ప్రకృతి ఒకటి ఈ బయట ఉండే ప్రకృతి మారకుండా ఎప్పటికీ శాశ్వతముగా అట్లే ఉంది. మన తాతలు చూశారు, మన ముత్తాతలు చూశారు, అంతకంటే ముందు వాళ్ళు చూశారు, కొన్ని వేల సంవత్సరముల నుండి, కొన్ని లక్షల సంవత్సరముల నుండి, కొన్ని కోట్ల సంవత్సరముల నుండి ఇదే ఉంది, తరువాత కూడా ఇది ఉంటుంది. ప్రకృతి యొక్క ఐదు భూతాలతో ఈ శరీరము తయారయింది. అయిన తరువాత ఇది కొంత కాలమే ఉంటుంది. ఎంతకాలము ఉంటుంది కరెక్టుగా చెప్పలేముగాని, ఒక్కొక్కరికి ఒక కాలము నిర్ణయమై ఉంటుంది. ఆ నిర్ణయము ప్రకారము ఉంటుంది. శరీరము పొయినప్పుడు ‘మరణము' అంటాము. మరణములో ఏమి జరుగుతుంది? అంటే శరీరములో ఉండే ప్రకృతి అంతా 'లయము' అయిపోతుంది. అంటే  ‘నాశనము’ అయిపోతుంది. ఈ తయారు అయిందంతా నాశనము అయిపోతే

శరీరములో నివాసయోగ్యము కాకుండా ఉండిపోయే దానివల్ల జీవుడు శరీరాన్ని వదిలి పెట్టిపోవడము జరుగుతుంది.


ఇది మామూలుగ ప్రపంచములో మొదటి నుంచి జరుగుతూనే ఉంది. ఎంతోమందిని చూశాము. పుడతా ఉండేవాళ్ళను చూశాము. బ్రతుకుతు ఉండే వాళ్ళను చూశాము. చనిపోయే వాళ్ళని కూడా మనము


---

చూస్తూవున్నాము. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఇక్కడనే జరుగుతూ ఉన్నాయి. మన కళ్ళ ముందరే జరుగుతుంది. ఈ శరీరములోనే ప్రకృతి మార్పు వస్తూవుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ పుట్టుక వచ్చినప్పుడు పంచభూతాల వలననే నీ శరీరము తయారవుతావుంది. అందులో నీవు చేరుకొని, కొంతకాలము బ్రతుకుతున్నావు. బ్రతికిన తరువాత చివరికి ఎప్పుడో ఒక రోజు ఒక గడువు ఉంది, ఆ గడువు రోజు నీవు చనిపోవాలి. చనిపోయిన రోజు నీ శరీరములో ఉండే ప్రకృతి నాశనము అయిపోతుంది, దాని స్థితిగతులన్నీ కోల్పోతుంది. దాని స్థితిగతులన్నీ కోల్పోవడము వలన అందులో జీవుడు ఉండేదానికి అవకాశము లేకుండా పోయింది. కాబట్టి మరణము వస్తావుంది. ఈ మరణము వలన శరీరములో ఉండే ప్రకృతి అంతా పోయింది అని లెక్కాచారము వస్తావుంది. అంటే అది 'లయము' అయిపోతావుంది.


శరీరములో ఉండేది అంతా నాశనము అయిపోతావుంది. గాలి గాలిగా ఉండదు, నీరు నీరుగా ఉండదు, భూమి భూమిగా ఉండదు, ఏదీ అదిగా ఉండకుండా, శరీరము తయారయినదంతా చివరకు నశించి పోతుంది కాబట్టి, దీనిని మనము ఏమంటున్నాము అంటే 'లయము' అని అంటున్నాము. అంటే మరణము వచ్చినప్పుడు శరీరము లయము అయిపోతుంది. అది కొన్నాళ్ళ తరువాత శరీరము భూమిలో పూడ్చిపెడితే మొత్తము ఏమీ లేకుండా పోతుంది. ఇదంతా జరుగుతావుండే ప్రక్రియే. తరువాత ‘ప్రళయము' అంటే ఏమిటి? అని మనము లెక్కేసుకుంటాము. ‘లయము’ ఒకటి అయిపోయింది కదా! 'ప్రళయము' అంటే ఏమిటి? అంటే ఈ పుట్టినదంతా పోయేదానిని 'ప్రళయము' అంటున్నాము. ఇప్పుడు శరీరములో మనకు పుట్టినేటివన్నీ ఏమైపోతున్నాయి? లయము


---

అయిపోతున్నాయి. దానిని ప్రళయము అని కూడా మనము అంటున్నాము. లయము అంటే నాశనము అయిపోతావుండేది తెలుసు కదా! మళ్ళీ ఇంకో పేరుతో దానిని ప్రళయము అని కూడా అంటున్నాము. ‘ప్ర’ అనేది ఎందుకు చేకూర్చినాము దానికి? అంటే ఇది ఒకసారి పుట్టింది, పుట్టిన తరువాత లేకుండా పోతావుంది కాబట్టి పుట్టినేది లేకుండా పోతావుంది అని చెప్పుతున్నాము. పుట్టినేది లేకుండాపోతే ప్రళయము అని అంటున్నాము. ‘లయము’ అంటే నాశనము అయిపోయేది. 'ప్రలయము' అంటే పుట్టినేదంతా నాశనము అయిపోయేది అని అర్థము.


ఇప్పుడు శరీరము పుడుతావుంది, పుట్టిన శరీరము నశించి పోతావుంది కాబట్టి ప్రళయము ఎక్కడ జరుగుతావుంది? అని అంటే శరీరములో జరుగుతావుంది అని మనము చెప్పాలి. సరే ఇప్పుడు మనము ప్రళయము, లయము అనేది రెండు రకాలుగా విభజించుకొని చెప్పినాము కదా! అంటే ఏమి నాశనము అయితాదంటే పుట్టినదంతా నాశనము అయితావుంది అని దాన్ని ప్రళయము అని చెప్పినాము కదా! ఇప్పుడు ఇది ప్రళయము అయిన తరువాత ఇంకా లయము అనేది ఏమైనా ఉందా? అని ప్రశ్న వేసుకోవచ్చు. అంటే మనము ఏమంటాము అంటే లయము, ప్రళయము అంతా ఒకటే. పుట్టినేదంతా పోవడాన్నే మనము ప్రళయము అని అంటున్నాము. విభజన చేసుకొని చెప్పితే 'లయము' అంటే 'నాశనము', ‘ప్రళయము' అంటే 'పుట్టినేదంతా పోవడము' అని అర్థము. అంతా ఒకటే అర్థమే, కానీ ఈ ప్రపంచము కూడా ఒకరోజు పుట్టింది, ఇదంతా పోతుంది అని కొందరు అంటున్నారు. దానికి మనమేమి అంటున్నామంటే ప్రళయము అనేది ఒకటే చోట జరుగుతుందికాని, ఈ పుట్టుండేది పోతుందికాని, ఈ ప్రపంచము ఎట్ల పుట్టిండేది తెలియదు. కాబట్టి నీవు దాన్నిపోతుంది.


---

అనుకోవడమే పెద్ద పొరపాటు. అది ఎట్ల పుట్టిండేది తెలియదు నీకు, ఎప్పుడు పుట్టిండేది తెలియదు, ఇది ప్రళయము కాదుకాని లయము కావచ్చు కొంత. అంటే కొంత నాశనము కావచ్చు. విశాలముగ ఉండే ప్రపంచములో కొంత ఏరియా (Area) లో ఉండేది కొంత లయము కావచ్చు.


ఉదాహరణకు ఇప్పుడు విశాఖపట్నములో ఒక పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినపుడు ఏమయింది? కొన్ని నాశనము అయి పోయినాయి. చెట్లు లేకుండ పోయినాయి, కరెంట్ పోల్స్ లేకుండ పోయినాయి, చాలా భీభత్సము జరిగింది, అంటే చాలా నాశనము అయిపోయినాయి అక్కడ. మళ్ళీ దీనిని ఎవరు చేశారు నాశనము? అని అంటే మనకు నాశనము చేసినేది కూడా కావాలి కదా! ఇప్పుడు శరీరము నాశనము అయిపోతుంది, దీనిని ఎవరు నాశనము చేసినారు? అని శరీరము

వరకు మనము లెక్కించుకొని చూస్తే, శరీరములో ఉండే ఆత్మే ఈ పంచభూతాలను నాశనము చేసింది. ఆ శరీరము అంతా పనికి రాకుండా పోయింది. శరీరములో నుంచి నీవు చనిపోవడము కూడా జరిగింది. అయితే ఇక్కడ ఒక పెద్ద తుఫాను వచ్చింది, మరి అక్కడ ఎవరు చేశారు? అని ప్రశ్న వస్తుంది. అక్కడ ఐదు భూతాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ పని చేసాయి, దాని వెనుకల ఆత్మే పని చేసింది కానీ కనిపించే విధముగ అవే పని చేశాయి. గాలి పని చేసింది, నీరు పని చేసింది, ఈ రెండు పని చేసిన దాని వలన ఏమైనది ఉధృతమైనటువంటి గాలి, ఉధృతమైనటువంటి వర్షము వచ్చింది. వచ్చిన దానివలన పెద్ద తుఫాను ఏర్పడింది. సునామీలు ఏర్పడుతాయి ఆ రకంగా. భీభత్సము జరిగి చెట్లు అన్నిటిని కూల్చి వేసింది. కరెంట్ పోల్లన్నీ పెరికి వేసింది. గాలి, వర్షము కూడా విజృంభించి, ఎన్నో సెంటీ మీటర్ల వర్షము కురిసింది, అందరిని తడిపివేసింది.


---

ఇక్కడ ఎవరు చేసారు ఈ పని? అంటే ప్రకృతిలోని భాగాలు చేశాయి. ప్రకృతికి బలము ఉంది. గాలికి ఎంత బలము ఉందో తెలియదు. నీటికి ఎంత బలము ఉందో తెలియదు. తరువాత మిగతా పంచభూతాలకూ ఎంత ఎంత బలము ఉందో ఎవ్వరికీ తెలియదు. ఆ తెలియని బలము ఏమి చేసింది? అంటే కొంత ఏరియాను నాశనము చేసింది. అది నాశనము చేస్తే, కొంత ఏరియా నాశనము అయిందికాని, అవి నాశనము అయిపోలేదు. ప్రళయము అంటే ఏమని అర్థము? అంటే పుట్టినదంతా పోతుంది అంటే మన శరీరములో పోయిండేది వాస్తవమే. కాని ప్రపంచములో ప్రళయము జరుగుతుందా? అంటే ఇంతవరకు ఎప్పుడు జరుగలేదు. జరిగిండేది. ఏమిటిది? అంటే లయము జరిగింది. లయము ఎక్కడ జరిగింది? అంటే ఎక్కడన్నారానీ లయము జరుగుతుంది. ఒక అగ్ని పర్వతము పగిలి పోయిందనుకోండి. అగ్ని ప్రేరణతో అగ్ని విజృంభించింది అనుకోండి. దానికి ఎంతబలము ఉందంటే దాని బలము అంతా కాల్చివేసేదే. భూమిలో నుంచి అగ్గి బయటికి వచ్చేసి, నీళ్ళమాదిరి ప్రవహించి, ఏ దాని మీద పడితే అది మొత్తము కాలిపోతుంది, అది ఎక్కడ ఏది మిగలకుండా కాల్చివేస్తుంది. దానికి అంత బలము ఉంది, మొత్తము కాల్చి వేసే బలము ఉంది. గాలి చెలరేగిందనుకో! ఏమిటిని లేకుండ ఊడ్చి వేస్తుంది. వర్షము చెలరేగిందనుకో! ఉత్తరాఖండ్లో మనకు జరిగింది కేదార్నాథో, ఒకటే రోజే కొన్ని వందల సెంటీమీటర్ల వర్షము వచ్చింది, కొన్ని గంటలలోనే, మొత్తము అంతా కొట్టుకుపోయేటట్లుగా చేసింది.


ఇట్లా ఒక్కొక్క దానికి ఒక శక్తి ఉంది. అవన్నీ విజృభించినాయి అంటే మనము ఏమాత్రము వాటి ముందర తట్టుకోలేము, అవి ఎట్లయినా ముంచేస్తాయి, చంపివేస్తాయి. అవి మనలను నాశనము చేస్తున్నాయిగాని,


---

ఎప్పటికీ అవి నాశనము కావు. నాశనము కాకుండా ఉంటూ, స్థిరస్థాయిగ ఉంటూ అవి లయము చేస్తున్నాయి. బయట అది లయము అంటున్నాము. శరీరాన్ని లేకుండా చేస్తున్నాయి, దానినే ప్రళయము అంటున్నాము. శరీరములో జరిగేది ప్రళయము. బయట జరిగేది లయము. కానీ బయట ప్రకృతి ఒకటన్నా పోయిందా ఎక్కడన్నా ఇంతవరకు? అంటే ఇంతవరకు ఎక్కడా పోలేదు. అది పోదు, దానిని ఎవరన్నా పంపిచ్చే దానికి చేతనవుతుందా? అంటే మనలాంటివాళ్ళము ఎంత ప్రయత్నము చేసినా, వాటిని పంపివ్వలేము. ఎందుకంటే దాని బలము ఎక్కువ. మన శరీరములో ఆత్మ ఉంది. మళ్ళ వాళ్ళలో ఎవరు ఉన్నారు? అంటే వాళ్ళను ఏమంటున్నాము మనము? పంచభూతాలు అంటున్నాము. 'భూతము' అంటే ఏమిటి ‘కనిపించనటువంటిది' అని అర్థము, శక్తితో కూడుకున్నటువంటి ‘ఒక జీవుడు' అని అర్ధము. భూతము అంటే ఏందో ఇంకొకటి లెక్క వేసుకోవద్దండి మీరు. మన శరీరములో కూడా భూతాలు ఉన్నాయి. ప్రపంచమంతా కోటానుకోట్ల భూతాలు ఉన్నాయి, కోటానుకోట్ల గ్రహాలు కూడా ఉన్నాయి. అంటే గ్రహాలు, భూతాలు అనేటువంటివి దేవుని పాలనలో అంతర్భాగముగా ఉన్నాయి, దేవుని పాలకులుగా ఉన్నాయి, మనందరిని పాలించే రకంగా ఉన్నాయి.


మనము ఈ రోజు జీవిస్తున్నాము అంటే మన వెనకాల ఎంతో మంది పని చేస్తూవున్నారు కనిపించకుండా. నీ శరీరములో ఎంతమంది ఉన్నారు? అంటే ఒక గ్రంథములో చెప్పారు, ‘19 మంది దూతలు' ఉన్నారంట, నీకు కాపల! నీవు ఏమి చేస్తూవున్నావని చూచేదానికి. 19 మంది ఎక్కడ ఉన్నారు? అంటే అది మీకు ఇంతవరకు నేను చెప్పలేదు కాని ఖుర్ఆన్ గ్రంథములో అదేవుంది. 19 మంది నీకు దూతలు


---

ఉన్నారు. ఒక మనిషికి 19 మంది ఉంటే ఇంతమంది మనుషులకు ఎంతమంది ఉండాలా! చాలామంది అవుతారు. దేవుని సైన్యము ఎంత ఉందో ఎవరికీ తెలియదు. దేవుని సైన్యములో 19 మంది నీకు తెలియకుండా నీ దగ్గర ఉన్నారు. అంటే నీవు ఒకనివే ఉన్నావని అనుకొంటారు మీరు. నేను కూడా ఈ విషయము ఎప్పుడూ చెప్పలేదు. ఖుర్ఆన్లో ఉండే విషయము ఇది. ఖుర్ఆన్ కూడా దైవగ్రంథమే. భగవద్గీత ప్రథమ దైవగ్రంథము, ఖుర్ఆన్ అంతిమ దైవగ్రంథము. భగవద్గీతలో చెప్పిన విషయాలే ఖుర్ఆన్లో ఉంటాయి. వేరేది ఏమీ ఉండదు? కానీ భగవద్గీతలో ఇంతమంది ఉన్నారు అని ఆయన చెప్పలేదుకాని 19 భాగాలు' అని చెప్పారు అక్కడ. ఖుర్ఆన్లో ఏమి చెప్పినారు అంటే ఒక్కొక్క భాగము ఒక వ్యక్తిగా పని చేస్తావుంది నీలో అని చెప్పారు. నీకు కన్ను ఉంది, ఆ కన్ను కూడా ఒక దూతే నీకు. చెవి ఉంది, చెవి కూడా ఒక దూతే. ఇట్ల లెక్క వేసుకుంటే మొత్తము 19 మంది ఉన్నారు నీకు, వాస్తవమే! 19 మంది ఉండేది వాస్తవమే. ఇట్ల దేవుని సైన్యము ఎంతవుంది? అంటే ఒక్కొక్క శరీరములో 19 మంది ఉంటే బయట ఎంతోమంది ఉన్నారు. ఆ లెక్కకుపోతే దేవుని సైన్యము ఎంత ఉందో, మనకెవరికీ తెలియదు. అది ఒక శాసనము. కాబట్టి దేవుని సైన్యము దేవునికే తెలుసు, అది ఎవరికీ తెలియదు.


ఈ రకంగా దేవుడు ఏమి చేసినాడంటే లయాన్ని పెట్టాడు, ప్రళయాన్నీ పెట్టాడు. లయాన్ని బయట పెట్టాడు, ప్రళయాన్ని శరీరము లోపల పెట్టినాడు. అంటే ఇప్పుడే చాలామందికి ఈ శరీరము లోపల, శరీరము బయట అనేది అర్థము కాదు. అందరిచూపు ఎట్ల ఉంటుందంటే బయట మాత్రమే ఉంటుందికాని, లోపల దృష్టి ఎవరికీ లేదు. ముందు నిన్ను నీవు ఎలా తయారైనావో, నీవు ఎట్లా సృష్ఠింపబడినావో నీవు


---

చూసుకున్నావా? నిన్ను నీవు ఎలా తయారైనావో నీవు చూసుకున్నావా? అంటే చూసుకోలేదు. నీవు అంతా చూసేది? బయట ఎట్ల తయారు అయిందో చూస్తువున్నావు. బయట ఏదైనాగాని ఎట్ల తయారైంది అని చూస్తూవున్నారు, ఎట్ల మనము బ్రతుకుతున్నాము అనేది చూస్తువున్నాము గాని, నిన్ను నీవు ఎప్పుడు చూసుకోలేదు. నిన్ను నీవు చూసుకోగలిగినావా? అని అంటే లేదు. అంటే మనకు ఆ ధ్యాస రాలేదు. ఒకచోట చెప్పుతాడు. భూమిని, ఆకాశమును మధ్యలో ఉన్నటువంటి సమస్తమును దేవుడు సృష్ఠించాడు. అది అందరికీ తెలుసు. మనము కూడ చెప్పుకుంటున్నాము ప్రపంచాన్నంతటినీ దేవుడు సృష్టించాడని. ఎట్ల సృష్టించాడు? భూమిని, ఆకాశమును మధ్యలో ఉన్నటువంటి సమస్తమును సృష్టించాడు. అర్థమయిందా!


ఈ సమస్తమును సృష్టించడమే కాకుండా దీనికి ఒక గడువును ఇచ్చి సృష్టించాడు. శాశ్వతముగా ఉండకుండా ఒక గడువును ఇచ్చి సృష్ఠించాడు. అది నీవు చూసుకోగల్గినావా? నీకు అర్థమయిందా? అంటే మనకు అర్థము కాలేదు. భూమిని, ఆకాశమును మధ్యలో ఉండే సమస్తమును సృష్టించినాడు అనేది తెలుసు, ఎవరో దేవుడు సృష్టించినాడని, కాని మనకు అర్థము కాలేదు అది. ఇంకా ఒకమాట చెప్పుతాడు. అది ఖుర్ఆన్ గ్రంథములో ఉండే విధానాన్ని చెప్పుతాడు మీకు. ఏమి చెప్పుతున్నాడు? మీలో మీరు ఎప్పుడూ ఆలోచించలేదా? ఆకాశమును, భూమియును వాటి మధ్య ఉన్నదంతయును దేవుడు సత్యముతో ఒక నిర్ణీత గడువు కొరకు సృష్టించాడు. అయినా మీరు దానిని గ్రహించుకోలేకవున్నారు అని చెప్పినాడు. అది చెప్పడమేకాకుండా ఇంకొకచోట ఏమి చెప్పుతున్నాడంటే, దేవుడు ఒకదానిపై ఒకటి ఏడు ఆకాశములను సృష్టించాడు. ఎన్ని ఆకాశములను


---

సృష్టించాడు? ఏడు ఆకాశములను సృష్టించాడు. దేవుని (ఆత్మ) సృష్ఠిలో నీవు ఎలాంటి లోపాన్ని చూడలేవు. ఇపుడు మీరు ఏమని అనుకుంటారంటే ఏడు ఆకాశాలు సృష్ఠించాడు అంటే ఏదో అబద్దము అనుకుంటారు కానీ దేవుని సృష్ఠిలో ఏది అసత్యము లేదు.


ఏడు ఆకాశాలు ఉన్నాయి. దాంట్లో ఎటువంటి లోపాన్ని నీవు కనిపెట్టలేవు. కావాలంటే మరోసారి చూచుకో. నీకు అర్థము కాకపోతే ఒకసారి చూసుకో. నీకేమైనా లోపము కనిపిస్తుందా? చూసుకో. ఏమి లోపము కనపరాదు. అంటే ఏంది కనపరాదయ్యా! నీవు చెప్పేది దిక్కు తెలియకుండా ఉంది. ఏడు ఆకాశాలు సృష్టించినావు. ఒకదాని మీద ఒకటి అన్నావు. మనము ఇక్కడ నుంచి రాకెట్లో పోయినా, విమానములో పోయినా ఒకటే ఆకాశము ఉంది, క్రిందికి, మీదికి, ఏడు పొరలు లేవు, ఏడు ఆకాశాలు లేవు, ఒకదానిపై ఒకటి సృష్టించినావు అని చెప్పుతున్నావు? ఎక్కడన్నా లోపము ఉందా? అని అడుగుతున్నావు. నీవు చెప్పే మాటే లోపము? అని అందరూ అడుగవచ్చు. ఒకవేళ అట్ల ఏమన్నా కనిపిస్తే, ఇంకోసారి చూసుకో అన్నాడు. ఇంకోసారి చూసుకునేదేముంది. కనిపిస్తా వుంది కదా! ఇంకోసారి చూసుకునేది ఏమీ లేదు. కనిపిస్తుంది ఇది పచ్చి అబద్దము అని మనము అనుకుంటాము. అంతే కదా! నీకు ఏమన్నా లోపము కనిపిస్తుందా? అని మళ్ళీ అడిగినాడు? మనకు లోపము కనిపిస్తావుంది. ఈ మాట అబద్దము అని. సరే ఇప్పుడు ఎట్ల అబద్దము అయ్యింది అని మనము ప్రశ్నించుకొని చూస్తే “ఏడు ఆకాశాలు అసత్యము. ఆకాశము అనేది ఒకటి ఉంటుంది. కానీ ఏడు ఆకాశాలు ఎట్ల వచ్చినాయి” అని అడుగుతున్నాము మనము. అంటే ఏడు ఆకాశాలు ఉన్నాయి అని చెప్పాడు. ప్రకృతి ఉంది అని చెప్పాడు. ప్రకృతి ఉంది అని చెప్పినప్పుడు ఏమి


---

చెప్పినాము మనము? ప్రకృతి బయట ఉంది, ప్రకృతి లోపల ఉంది అని చెప్పాము. ఇది మరచిపోవద్దండి మీరు. ఇంతకుముందు అందుకే ఆ స్టోరీ చెప్పినేది నేను. ప్రకృతి అనేది లోపలా ఉంది, బయటా ఉంది. వాటినే చేతనా ప్రకృతి, అచేతనా ప్రకృతి అంటాము. మార్పుచెందే ప్రకృతి, మార్పు చెందని ప్రకృతి అంటాము.


మన శరీరము మార్పు చెందే ప్రకృతి. మీ శరీరము ఎప్పుడైనా శాశ్వితముగా ఉందా? పోయిన సంవత్సరము ఉన్నట్లు ఈ సంవత్సరము ఉందా! ఈ సంవత్సరము ఉన్నట్లు రేపు సంవత్సరము ఉంటుందా? లేదు, పది సంవత్సరముల క్రితము ఉన్నట్లు ఇప్పుడు ఉందా? ప్రాక్టికల్గా మీకు తెలుసు ఇది మార్పు చెందుతావుంది అని. ప్రత్యక్షముగా తెలుసు. చిన్న వయస్సులో ఒక రకంగా ఉన్నారు, మధ్యవయస్సులో మరొక రకంగా ఉన్నారు, ఇంకా వృద్ధాప్యము వస్తే ఇంకొక రకంగా ఉంటారు. శరీరము మార్పుచెందే ప్రకృతి. మార్పుచెందని ప్రకృతి బయట ఎప్పుడూ ఎట్ల ఉందో అట్లే ఉంది. అది మార్పుచెందని ప్రకృతి. రెండు ప్రకృతులు ఉన్నాయి. ఈ రెండు ప్రకృతులలో నేను ఏమి చెప్పుతున్నానో మీరు గ్రహించుకోండి. నీ పుట్టుకను నీవు చూసుకున్నావా? చూసుకోలేదు. నీవు ఎలా సృష్ఠింపబడినావో నీవు చూసుకున్నావా ? చూసుకోలేదు. మనచూపు అంతా బయటే ఉంది కానీ ఇక్కడ ఏమి చెప్పుతున్నాము, అంటే ఒకదాని మీద ఒకటి ఏడు ఆకాశాలు పేర్చబడివున్నాయి, అంటే ఏడు ఆకాశాలు పేర్చబడివున్నాయి అన్నప్పుడు మనము ఎన్ని లెక్కేసుకోవాలా? భూమి, ఆకాశము మధ్యలో ఉన్నటువంటి సమస్తము సృష్టింపబడినాయని ఇంకో చోట చెప్పాము.


---

భూమి అంటే కాళ్ళు, ఆకాశము అంటే తల, మధ్యలో ఉండే సమస్తము ఉంది అంటే ఒక శరీరాన్ని గురించి మనము చెప్పుకుంటున్నాము. దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు బయటా ఉన్నాడు, శరీరము లోపలా ఉన్నాడు. బయట విశాలముగా ఉన్నాడు మనము తెలుసుకోలేము, ఎంత వెదికినా ఆయన కనిపించడు. నీవు ఏమి తెలుసుకున్నా నీ శరీరములోనే తెలుసుకోవాలని భగవద్గీతలో చెప్పినారు. భగవద్గీతలో ఏముంది? నీవు దేవున్ని తెలుసుకోవాలనుకుంటే నీ శరీరములోనే తెలుసుకోవాలి. బయటకు పోతే నీవు ఎంత వెదికినా దేవుడు కనిపించడు. నీ శరీరములోనే ఆత్మ (దేవుడు) ఉన్నాడు. నీ శరీరములోనే నీవు కూడా ఉన్నావు. కాబట్టి శరీరములో ఉండే వానిని, దగ్గరగా శరీరములోనే నీవు తెలుసుకో అని చెప్పాడు. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానములో ఏమి చెప్పినాగాని శరీరము లోపలికే లెక్కవేసుకోవాలి గాని శరీరము బయటికి లెక్క వేసుకోకూడదు. ఇప్పుడు నేను చెప్పినేది ఖుర్ఆన్ గ్రంథము, భగవద్గీత కాదు. ఖుర్ఆన్ గ్రంథములోనే ఏముంది? నీ శరీరములో నీవు చూసుకో అని ఉంది. వాళ్ళు బయట తప్ప లోపలికి ఎప్పుడూ చూడలేదు. మనము లోపలికి చూసుకో అని చెప్పుతున్నాము. ముస్లీమ్లకు లోపలి దృష్ఠి రాదు. కావున ఇక్కడ భూమి అంటే కాళ్ళు, తల అంటే ఆకాశము, వారికి తెలియదు. ఈ తల ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఉంది? వెన్నుపాము గుండా నీకు మధ్యలో వీపు భాగములో అంతా ఉంది. వెన్నెముకలో ఈ మెదడు తల పై భాగము నుంచి వీపులో క్రింది వరకు ప్రాకివుంది ఒక పెద్ద నాడి. దానిని 'బ్రహ్మనాడి' అంటాము. బ్రహ్మనాడి మెదడు నుంచి వీపు క్రింది వరకు ఉంది. ఈ నాడి ఎన్ని భాగాలుగా ఉంది? మనకు తెలుసు ఏడు భాగాలుగా ఉంది అని. ఏడు భాగాలుగా ఉంది అని అందరికీ తెలుసు. మరి ఏడు భాగాలలో ఏడు నాడీకేంద్రాలను ఏమంటున్నాము? ఏడు ఆకాశాలు అంటున్నాము


---

మనము. ఒకదాని మీద ఒకటి పేర్చబడివున్నాయని చెప్పినాడు. చూసుకుంటే కరెక్టే. చూసుకో ఒకసారి ఏమైనా లోపముందేమో? అని అన్నాడు. లేదు, లోపమే లేదు, కరెక్టే. మనలో ఏడు నాడీకేంద్రాలు ఉండేది కరెక్టే.


ఏడు నాడీకేంద్రాలు నీ శరీరములో ఉన్నాయి. కాబట్టి ఏడు ఆకాశాలు ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఉన్నాయి అని అన్నారు. నాడీ కేంద్రాలకు, ఆకాశానికి తీసుకువచ్చి ఎందుకు ముడివేస్తున్నావు నీవు? అని మీరు ప్రశ్న వేయవచ్చు. అంటే ఏదో కవిత్వము చెప్పి సరిచేయవచ్చు, దీనికి ప్రాక్టికల్గా ఏమన్నా మీ దగ్గర ఆధారము ఉందా? అని మీరు అడగవచ్చు. ఇంక నేను ఏమి చెప్తున్నాను అంటే 'ఆకాశము' అన్నా ఒకటే, ‘నాడీ’ అన్నా ఒకటే అని చెప్పినాము. 'ఆకాశము' అని దేనిని అయితే అంటున్నామో 'నాడీ' అని దానిని అంటున్నాము. 'ఆకాశము' అంటే 'శూన్యము' అని తెలుసు కదా మనకు! 'నాడి' అంటే కూడా 'శూన్యమే'. ఇప్పుడు మన చేతిని ఆకాశములో ఎటువైపు తిప్పినా ఏదీ తగలదు అంటే ఏదీ ఢీ కొట్టదు. “ఢీ” కొట్టనటువంటిది 'నాఢీ లేదా నాడి'. ‘నాఢీ' అంటే 'ఢీ కొట్టదు' కాబట్టి ఇది ఆకాశము. ఆకాశమునకు చూడు ఎంత బాగా పేరు ఉందో! అంటే ఢీ కొట్టదని. ఆకాశము ఢీ కొట్టదు లేదా ఢీ కొట్టనటువంటిది ఆకాశము కాబట్టి 'ఏడు ఆకాశాలు' అంటే 'ఏడునాడులు' ఉన్నాయి నీకు. ఆకాశము అన్నా ఒకటే, నాడీ అన్నా ఒకటే, ఆకాశము అంటే శూన్యము. నాడీ కూడా శూన్యమే, దానికి ఏమి ఢీ తగలదు. శూన్యములో నీవు కత్తి తీసుకొని ఎటు వైపు తిప్పినా దానికి ఢీ కొట్టేది ఏదీ లేదు, తెగేది ఏదీ లేదు కాబట్టి నాఢీ అంటే ఆకాశము అని అర్థము.


ఈ నాడీకేంద్రాలు ఏడు ఉన్నాయి కాబట్టి ఏడు ఆకాశాలు అని సులభముగ చెప్పినారు. దీంట్లో ఏమాత్రము పొరపాటు లేదు. ఎక్కడన్నా


---

లోపము కనిపిస్తావుందా? అంటే ఏ లోపము కనిపించదు, శరీరములోకి అన్వయించుకుంటే సరిపోతుంది. బయట చూస్తే, అన్నీ లోపాలే. బయట చూస్తే తప్పే. బయటికి పొమ్మని ఎవరు చెప్పారు మీకు? ఆధ్యాత్మికము అంటే ఆత్మను గురించి తెలుసుకోవడము, శరీరము లోపల తెలుసు కోవడము అవుతుంది. దీనిని బయట చూడమని నేను చెప్పలేదు. భగవద్గీత గ్రంథమూ ఉంది. భగవద్గీత గ్రంథమును “గీత” అని అన్నారు. గీత అంటే శరీరము కాళ్ళ దగ్గర నుంచి తల వరకు అంతా గీయబడిన గీత అని అర్థము. శరీరము లోపలే ప్రతి యొక్క శ్లోకానికి అర్ధము ఉంది అని చెప్పాము మనము. శరీరము బయట ఏమీ చెప్పలేదు అని చెప్పాము. తరువాత ఖుర్ఆన్ గ్రంథము ఉంది. ఖుర్ఆన్ గ్రంథము ఏమి చెప్పుతుంది అంటే ఖుర్ఆన్ గ్రంథము ఈ భగవద్గీత ఒకటే అని చెప్పినాను కదా! నేను భగవద్గీతలో ఉండేదే ఖుర్ఆన్లో ఉంది అని చెప్పినాను కదా! ఖుర్ఆన్ గ్రంథము నాకు మాతృగ్రంథము ఒకటి ఉంది అని చెప్పింది. మాతృగ్రంథము అంటే తల్లిగ్రంథము ఒకటి ఉంది అని అర్థము. అంటే నేను అక్కడి నుంచే పుట్టుకొచ్చాను అని చెప్పింది. ఏ గ్రంథము? తల్లి గ్రంథము? భగవద్గీత. భగవద్గీత నుంచి నేను పుట్టుకొచ్చాను కాబట్టి భగవద్గీతలో ఉండేటివే నాలో ఉంటాయి. మా అమ్మ లక్షణాలే నాకూ ఉన్నాయి. మా అమ్మ ఒకరు ఉన్నారు. ఆమే 'భగవద్గీత', అంటే ఖుర్ఆన్ అంటే వేరేది అనుకోవద్దండి. ఖుర్ఆన్ అంటే కొంతమంది ముస్లీమ్లు అది మా గ్రంథము మీరు తీసుకొని ఎందుకు చెప్పుతున్నారు? అని ప్రశ్నించవచ్చు. మీ గ్రంథము మీ అని ఎక్కడన్నా ఉందా? లేదు. “ఖుర్ఆన్ సమస్త మానవాళికి సంబంధించిన గ్రంథము” అని ఖుర్ఆన్లోనే ఉంది.


అప్పుడు మీ గ్రంథము అని మీరు ఎట్ల చెప్పుతున్నారు? మీ గ్రంథము అనేదానికి సాక్ష్యము ఏముంది? అది ఒకరి గ్రంథము కాదు, సమస్త


---

మానవాళికి సంబంధించినది, సమస్త జీవరాసులకు సంబంధించినది, సమస్త మనుషులకు సంబంధించినది కాబట్టి నీకు ఎంత హక్కు ఉందో నాకూ అంతే హక్కు దాని మీద. నీవు ఎక్కడైనా పొరపాటు చెప్పితే, మేము దానిని తప్పని చెప్పి, దానికి నిజమైన వివరమును వివరించి చెప్పుచున్నాము. కాబట్టి మీరు చెప్పేదాన్ని మేము తప్పు అని చెప్పడములో తప్పేమీ లేదు. సత్యాన్ని బయటికి చెప్పడములో తప్పేమీ లేదు. ఇప్పుడు ఖుర్ఆన్ గ్రంథము లోనిదే వాక్యము ‘సప్త ఆకాశములు ఒకదాని మీద ఒకటి పేర్చబడివున్నాయి' అన్నారు. ఇది 67వ సూరాలో 3వ ఆయత్లో ఉంది. కాబట్టి మీరు ఆ రకంగా చూసుకుంటే ఏ లోపము కనిపించదు. అంటే ఏడు ఆకాశాలు ఉండేది నిజమే. ఏడు ఆకాశాలు చూసుకుంటే వాస్తవమైనది నిజమే. ఇంక మనము ఇంకోచోట ఏమి చెప్పుకున్నాము అంటే భూమియును, ఆకాశమును మధ్యలో ఉన్న సమస్తమును దేవుడు మహోన్నతముగా సృష్టించాడు. ఎట్ల సృష్ఠించాడు? అని అంటే కొంత పరిమితి పెట్టి సృష్ఠించాడు. భూమిని, ఆకాశాన్ని మధ్యలో ఉండే సమస్త జీవరాసులను సృష్టించాడని అనుకొంటాము, పైకి క్రిందికి లెక్కవేసుకుంటే. కాని దీనికి పరిమితి

ఉందా?

మన ముత్తాతల కాలములో ఉంది, మన తాతల కాలములో ఉంది, ఇప్పుడుంది, ఇంకా తరువాత భవిష్యత్తులో ఉంటుంది కాబట్టి పరిమితి లేదు బయట ప్రపంచానికి. ఇంతకుముందే చెప్పినాము బయట ప్రపంచానికి పరిమితి లేదు, కానీ పరిమితమైనటువంటి గడువు పెట్టి సృష్టించాడు శరీరాన్ని, ఇక్కడ ఏమనుకుంటారు? చూసుకో! నీ సృష్టి ఎలా జరిగిందో నీవు జ్ఞాపకము చేసుకున్నావా! నిన్ను నీవు చూసుకున్నావా! భూమియును, ఆకాశము మధ్యలో ఉండే సమస్తాన్ని దేవుడు సృష్టించాడు, పరిమితిగా


---

చేసి సృష్టించినాడు. నీవు దేవున్ని తెలుసుకొనేది మరచిపోయినావు అని చెప్పారు ఖుర్ఆన్. అంటే ఇప్పుడు మనము శరీరములోనికి పోయి మనము చూసుకుంటే ఇదంతా అర్థమవుతుంది, బయట చూసుకుంటే ఏమాత్రము అర్థము కాదు. 'భూమి' అంటే 'క్రింద కాళ్ళు', 'ఆకాశము’ అంటే ‘తల’, ‘మధ్యలో ఉండే సమస్తము’ అంటే ‘మధ్యలో శరీరము అంతా’. ఈ శరీరము అంతా దేవుడు సృష్టించాడు, ఇది కొంతగడువు పెట్టాడు. అంటే ఒక మరణము అనేది టైమ్ కూడా పెట్టాడు. ఆ మరణములో ఇది చనిపోవడము జరుగుతుంది. కానీ నువ్వు చనిపోవు, ప్రకృతి చనిపోతుంది. అంటే ప్రకృతి నాశనము అవుతుంది, ప్రకృతి ప్రళయము అయిపోతుంది, పుట్టేదంతా పోతుంది. బయటి ప్రకృతి బయట ఉండి అన్నిటినీ చంపుతా ఉంది కాని అది మాత్రము పోదు. కానీ శరీరములో ఉండే ప్రకృతి మాత్రము పోతుంది.


ఈ రకంగా మనము శరీరమును చూసుకుంటే ప్రళయము మన ప్రతి శరీరములోనూ జరుగుతుంది. ఇంతకు ముందు ఎన్నోసార్లు జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని కోల్పోయి, మళ్ళీ క్రొత్త ప్రకృతిని ఆశ్రయించి నాము మనము. ఆశ్రయించిన తరువాత ఒక శరీరము మనకు దొరికింది. ఈ శరీరములో మనము పుట్టి, పెరిగి, మళ్ళీ కొంత కాలము ఉండి, కొంతకాలము గడిచిపోయిన తరువాత మళ్ళీ మనము పోతున్నాము. దానినే మనమేం చెప్తున్నాము ఇక్కడ. మీరు తమలో తాము ఎన్నడూ ఆలోచించ లేదా? మిమ్ములను మీరు చూసుకోలేదా? ఆకాశమును, భూమియును మరియు వాటిమధ్య ఉన్న సమస్తమును దేవుడు సత్యముతో ఒక నిర్ణీత గడువు కొరకు మాత్రమే సృష్టించాడు. ఒక నిర్ణీత గడువు కొరకు మాత్రమే సృష్టించాడు. ఆకాశాన్ని, భూమిని వాటి మధ్యలో ఉన్నదాన్నంతా ఒక


---

నిర్ణీత గడువు అంటే ఎక్కడ లెక్కేసుకోవాలా? బయట లెక్కేసుకోవాలా? లోపలకు లెక్కేసుకోవాలా? నీ శరీరములోనికి లెక్కేసుకోవాలి. నిర్ణీత గడువు నీకే ఉంది. అంటే మరణము అనేది ఒకటి ఉంది. ఆ ప్రళయము వచ్చిన రోజు ఈ శరీరము పోతుంది. ప్రళయము ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రభవము కూడా జరుగుతుంది. ఇంతకు ముందు మనము చెప్పుకున్నాము. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో అప్పుడు మళ్ళీ తిరిగి వాడు పుట్టడము జరుగుతుంది. ఏమాత్రము ఎప్పుడు ప్రళయము జరుగుతుందో అప్పుడు ప్రభవము ఉంటుంది తప్పనిసరిగా అని చెప్పాము. అంటే ఏదైతే మరణించే రోజో దానిని మనము పుట్టిన రోజుగా లెక్కిస్తున్నాము.


దేవుడు ఏమి చెప్పినాడు అంటే? అంతిమదినము నీకు వస్తుంది అని చెప్పినాడు? ‘అంతిమదినము' అంటే ఏది? 'చనిపోయేరోజు'. అంతిమ దినమున నీవు చేసుకున్న పాపపుణ్యాలన్ని లెక్కించబడుతాయి. నిజమే! చనిపోయిన రోజు మన పాపపుణ్యాలన్ని లెక్కించబడుతాయి. మళ్ళీ జన్మకు కావలసినంత కోటా మనకు వస్తుంది. దానిని తీసుకొని మళ్ళీ తిరిగి పుట్టడము జరుగుతావుంది. ఇది ఎన్నోసార్లు జరిగింది. కానీ ఎన్నిసార్లు జరిగుండేది మనకు జ్ఞాపకము లేదు. ఇప్పుడు ఇక్కడ మనము ఉన్నాము కాబట్టి ఇక్కడ ఉన్నాము అని అనుకుంటున్నాము. ఇప్పుడు 50 సంవత్సరముల వయస్సు అనుకుందాము మనకు. 50 సంవత్సరముల నుంచి ఇక్కడ ఉన్నావు, ఏదో ఒక అడ్రస్సులో. 70 సంవత్సరముల క్రితము నీవు ఉన్నావా? అంటే నేను ఎక్కడ ఉన్నాను? 70 సంవత్సరముల క్రితము కూడా నీవు ఉన్నావు. 70 సంవత్సరముల క్రిందట ఉన్న విషయము నీకు తెలియదు. 70 సంవత్సరముల క్రిందట మీ తాత ఒకడు ఉన్నాడనుకో. వాడు చనిపోయినాడు. చనిపోయిన తరువాత నీవు పుట్టినావు. నీవు పుట్టిన


---

తర్వాత నీవు ఎక్కడ ఉంటివి అంటే? మీ తాతగా నీవు ఉన్నావు. లేవు అని ఏమైనా గ్యారెంటీ ఉందా నీకు? నీవు మీ తాత ఫోటో చూచుకొని ఈయన మన తాత అనుకుంటున్నావు. కానీ అది అప్పుడు నీ ఫోటోనే, అయినా అది మనకు జ్ఞాపకము లేదు. కాబట్టి నీ ఫోటో నీవు చూచుకొని ఇది మా తాత ఫోటో అనుకుంటున్నావు. కానీ అది నీ ఫోటో అని నీకు తెలియదు. కాబట్టి నీవు అప్పుడూ ఉన్నావు, ఇప్పుడూ ఉన్నావు. కాని అప్పుడు ఎట్ల ఉండేది తెలియదు, ఇప్పుడు ఎట్ల ఉండేది మాత్రము నీకు తెలుస్తావుంది. ఇదే ఇక్కడనే నీకు గ్యారెంటీ అనుకోవద్దండి.


రావణబ్రహ్మ కాలములో, రాముని కాలములో కూడా మనము ఏమి చేశాము అంటే? ఆ ప్రక్క రాముని సైన్యములోనో, ఈ ప్రక్క రావణుని సైన్యములోనో మనము ఉండి కొట్లాడుంటాము. అంతేకదా! అక్కడ నుండి ఆడచస్తివి ఈడ పుడితివి, చివరకు ఇక్కడికి వచ్చినావనుకో. ఈ రోజు కథ చెప్పుకుంటాము "ఆ రోజు రావణబ్రహ్మ బాగా కొట్లాడినాడు, రాముడు కూడా బాగా కొట్లాడినాడు” అని చెప్పుకొంటున్నాము. ఆ రోజు కోతులు ఉన్నాయని అంటున్నావు. అయితే వాళ్ళలో నీవు ఒకనిగా ఉంటావు. కానీ ఆ విషయము తెలియదు. నీకు ఆ విషయము తెలియక దానిని కథగా చెప్పుకుంటున్నావు. కానీ అది జ్ఞాపకము లేదు కాబట్టి ఇక్కడికి వచ్చినాము మనము. ఇక్కడికి వచ్చిన తరువాత ఇది జ్ఞాపకము ఉంది కాబట్టి దాన్ని అంతా మరచిపోయినావు. ఎప్పటికీ ఇట్లే జరుగుతా వుంటుంది అని అనుకోవడము లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న దానినే నీవు లెక్కేసుకుంటున్నావు, నాకు ఇంత ఆస్తి ఉంది అని. ఇంతకుముందు ఇంతకంటే పెద్ద ఆస్తి ఉండవచ్చు, దానిని విడిచిపెట్టి వచ్చేసినావు. ఇప్పుడు ఇంతకుముందు దానికంటే తక్కువ ఆస్తి ఉంది, అయినాగానీ పెద్ద ఆస్తి ఉంది అని


---

అనుకుంటున్నావు. దీనికంటే ఇంక పెద్ద ఆస్తి ఉండవచ్చు లేకపోతే ఇంతకుముందు లేకుండ ఉండవచ్చు, ఇప్పుడే పెద్ద ఆస్తి ఉండవచ్చు కానీ

మనకు ఏమి తెలియకుండా పోయినాయి.


ఈ చావు పుట్టుకలు అనేవి ప్రతి మనిషికి వాస్తవముగా జరిగేటివే. కానీ దానిమీద గమనము లేదు, దృష్ఠి లేనప్పుడు తెలియకుండా ఇంతకాలము గడిచిపోతావుంది. కొంతకాలము జరుగుతూ ఉన్నట్లు ఉండి ఒకరోజు మరణము వస్తుంది, ఎవ్వరికీ కూడా నేను ముందు చనిపోతాను అనే విషయము తెలియదు. ఠక్కున వాడు చనిపోవడము జరుగుతుంది. నిన్న ఉన్నవాడు ఈ రోజు లేకుండా పోతాడు. మనము మనిషిగా పుట్టి ఎన్నో గ్రహించుకోగల శక్తి ఉండి, మనము మరణమును గురించి ఏమీ తెలుసుకో లేదు. ఇంతకుముందు ఎట్ల బ్రతికినామో ఇప్పుడూ అట్లే బ్రతుకుతున్నాము. ఇంతకుముందు ఇంతకంటే తెలివిగా బ్రతికి ఉండవచ్చు నువ్వు. ఇంతకు ముందు ఒక పెద్ద శాస్త్రవేత్తగా ఉండి ఉండవచ్చు, ఇప్పుడు మామూలుగా ఉన్నావు, కూలివానిగా. కానీ ఇంతకు ముందు పెద్ద జన్మలో వుండి, ఇప్పుడు తక్కువ జన్మలోకి వచ్చి ఉండవచ్చు. లేకపోతే ఇంతకుముందు తక్కువ జన్మలలో ఉండి, ఇప్పుడు పెద్ద జన్మలలోకి వచ్చివుండవచ్చు.


ఈ విధముగా రకరకాలుగా జన్మలు మారుతూ ఈ స్టేజికి వచ్చినాము. దీనిని ఎవరూ మరచిపోకూడదు. మళ్ళీ మరచిపోకుండా ఏమి చేయాలి? అంటే చేసేది ఏమి లేదు, నిన్ను ఎవడయితే పుట్టించినాడో వాని దగ్గరకు నీవు పోవాలని ప్రయత్నము చేయి. ఎవరు పుట్టించినాడు? ఎవరో కనపరానివాడు దేవుడు పుట్టించినాడు. ఆ కనపరానివాడు ఎక్కడ ఉన్నాడు? కనిపించే నువ్వు ఎక్కడ ఉన్నావో కనపరాని వాడు కూడా (దేవుడు కూడా) అక్కడే ఉన్నాడు. నిన్ను నువ్వు చూసుకున్నావా ఎప్పుడైనా? నిన్ను నీవు


---

చూసుకుంటే నీకు కనిపిచ్చేది నీ శరీరమే, కాబట్టి నీ శరీరము లోపల నీవు ఉన్నావు. నిన్ను నువ్వే ఎప్పటికీ చూసుకోలేదు ఇంతవరకు, దేవున్ని ఎట్ల చూస్తావు, చెప్పు? నువ్వు ఎట్ల ఉన్నావో నీకు తెలియదు. ముందు నిన్ను నువ్వు తెలుసుకో! తరువాత దేవుడు ఎట్ల ఉండేది నీకు తెలుస్తుంది. నిన్ను నువ్వు తెలుసుకొనే దానికి ప్రయత్నము చేయి. మన ముఖాన పెట్టుకునే నాలుగుచక్రాలలో, క్రింది చక్రమైన గుణచక్రములో నీవు ఉన్నావు. అక్కడ గుణాలు ఉన్నాయి. ఎన్ని గుణాలు ఉన్నాయి? 12 గుణాలు ఉన్నాయి. 6 మంచివి, 6 చెడ్డవి. మంచి గుణాలలో ఉంటే మంచి బుద్ధులు వస్తాయి. చెడ్డ గుణాలలో ఉంటే చెడ్డ బుద్ధులు వస్తాయి. అంతే కదా! గుణచక్రములో నేను ఎందుకు ఉండాలి అనుకుంటే? పైన కర్మ ఉంది, ఆ కర్మప్రకారము ఉన్నావు.


నేను మంచి గుణములో ఎందుకు లేను? చెడ్డ గుణమే నాకు ఎందుకు ఉంది? అంటే అది నీకు సంబంధము లేదు పైన దానిని నడిపించేది కర్మ ఉంది, ఆ కర్మప్రకారము నీవు ఉన్నావు. లేదు, మరి నేను మంచిపనే నవ్వు చేసేది ఏమి? నీకు ఏమీ చేత కాదు, నీవు చేసే వానివి కాదు. చేపిచ్చేవాడు చేపిస్తే, ఆ పని జరుగుతా ఉంది, కానీ నీవు ఏమీ చేయలేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఏమని? నువ్వు గ్రుడ్డివాడివి, చెవిటివానివి, పూర్తి అవిటివానివి. శరీరములో ఉండి ఆత్మ చేయిస్తూ

ఈ పనులు జరుగుతూ వుంటే, నేను చేశాను అని నీవు అనుకుంటున్నావు. అంతే కదా! కర్మప్రకారమే జరుగుతావుంది అని మనము చెప్పితే ఒక ఆయన ప్రశ్నిస్తాడు. మీరు చెప్పేదంతా, ఏదో మ్యాజిక్ చేసి చెప్పుతావున్నారు, తల ఊపేతట్టుగా. అట్లంత ఏమి లేదు కానీ నేను చెప్పుతాను చూడు! ఇప్పుడు నేను హోటల్లోకి పోతాను, హోటల్లోకి పోతే


----

దాంట్లో ఒక పట్టీ ఉంటుంది, ఫలానా ఫలానా తినేటివి ఉన్నాయని, దాంట్లో 12 పదార్థాలు ఉంటే 12 పదార్థాలలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని నేను ఫలానాది తీసుకురా అంటే వాడు తీసుకువచ్చి ఇస్తాడు, నేను తింటాను, ఇక్కడ నా ఇష్టప్రకారము నేను చేసినాను గానీ ఏ కర్మ వచ్చి అక్కడ చెప్పింది అంటాడు. కరెక్టే నీవు చెప్పేది, నీ ఇష్టప్రకారమే నీవు అడిగినావు వాళ్ళు తెచ్చినారు, నీ ఇష్టప్రకారమే నీవు తిన్నావు, ఆ సెలెక్ట్ చేసుకొనేది 12 దాంట్లలో దానినే ఎందుకు సెలెక్టు చేసినావు? అంటే నీ కర్మప్రకారమే చేసినావు, అది అర్థము కాలేదు కాని నేనే సెలెక్ట్ చేసినా, అంటే నువ్వు చేసేది ఏమి లేదురా నాయనా! నిన్ను నడిపిస్తావుంది కర్మ, కర్మవ్రాత ప్రకారమే సెలెక్ట్ చేసినావు, నీవు కర్మప్రకారమే చేసినాను అనుకోవడము లేదు. మనుషులు అందరు అట్లే అనుకుంటున్నారు.


ఒకాయన ఏమి చెప్పుతాడు, ఒరేయ్! నేను ఇప్పుడు పై అధికారిని, పైన సీటులో కూర్చున్నాను, నీవు క్రింద ఉన్నావు, నేను ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష అమలు జరుగుతుంది, నేను అడిగిన ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పు అన్నాడాయన. అంటే ఈ క్రింద ఉండే ఆయన ఏమి చెప్పినాడు అంటే వాస్తవమే, నువ్వు శిక్ష వేస్తే నాకు అమలు జరిగేది వాస్తవమే, కానీ శిక్ష వేసేవాడు ఇంకోడు ఉన్నాడు, వాడు ఎట్ల చెప్పితే నీవు అట్ల వింటావు అని చెప్పినాడు. శిక్ష చెప్పేవాడు ఇంకోడు ఉన్నాడు నీ లోపల. నీపై అధికారి ఒకడు ఉన్నాడు. ఆ అధికారి ఏమి చెప్పితే అదే చెప్పుతావు నాకు, అదే నాకు అమలు జరుగుతాది, నువ్వు చెప్పేది ఏమి లేదు పో! అన్నాడు ఆయన. వాస్తవముగా నేను కూడా అదే చెప్పుతా ఉన్నాను. మనము ఏమీ చేయలేదు, మన చేత చేయించే వాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఏమి చెప్పితే అది జరుగుతుంది. భ్రమలోపడినావు, నేను ఎట్ల అనుకుంటే అట్ల జరుగు


----

తుందని. నేను ఇప్పుడు హోటల్లోకి పోయి పూరి సెలెక్ట్ చేసుకొని పూరీ తీసుకొని రా అంటే పూరీ తెస్తాడు, ఇడ్లీ తీసుకొని రా అంటే ఇడ్లీ తెస్తాడు, వడ తీసుకొని రా అంటే వడ తెస్తాడు, నా ఇష్టము కదయ్యా! మధ్యలో ఎవరున్నారు? కర్మ అనేది ఏముంది? ఇప్పుడు వద్దనుకుంటే వద్దు, కావాలను కుంటే కావాలి అని నీవు అనుకుంటే నీవు భ్రమపడుతున్నావు. నీ ఇష్టము ఏమీ లేదు, ఆ ఇష్టము కూడా అక్కడ ఉండేవాడు కల్పించింటేనే జరిగింది. టోటల్గా (మొత్తానికి) ఒక సూత్రము ఉంది ప్రపంచ విషయాలు ఏవైనా కానీ అది కర్మప్రకారమే జరుగుతుంది. నీ ఇష్టము ఏమీ లేదు. ఆ ఇష్టము కూడా కర్మప్రకారమే ఉంటుంది, దేవుని విషయము తప్ప.


దేవుని విషయము నీవు ఎట్లన్నా అనుకో, నీవు ఎంతైనా సాధించ వచ్చు, ఎంతైనా ముందుకు పోవచ్చు, ఏమైనా చేయవచ్చు, అది కర్మకు ఆధీనములో లేదు, కర్మకు అతీతముగా ఉంటుంది. నీవు ఎంత జ్ఞానము సంపాదించుకోవాలి అనుకుంటే అంత జ్ఞానము సంపాదించుకోవచ్చు. నీకు చేతనయితుంది నేను సంపాదించుకుంటానని ధైర్యముగా చెప్పు, సంపాదించుకో ఫరవాలేదు. కానీ ప్రపంచ విషయాలలో మాత్రము కాదు. ఒకాయన చెప్పుతాడు, నాకు 12 మంది భార్యలు ఉన్నారు అని. ఉండేది వాస్తవమే 12 మంది భార్యలు. అంటే 12 మంది భార్యలలో నేను ఒక్కొక్కరి దగ్గర ఒక్కోరోజు ఉండాలనుకుంటే ఒకవేళ ఈ భార్య దగ్గరికి పోతే ఆ భార్యకు కోపము వస్తాది, ఆ భార్య దగ్గరికి పోతే ఈ భార్యకు కోపము వస్తాది, మళ్ళా నేను ఏమి చేసినాను అంటే ఒక పని చేసినాను. ఏమి పని? అంటే నా తెలివి కొద్ది నేను చేసినాను అన్నాడు. ఏమయ్యా నీ తెలివి చెప్పు! ఎట్లో గట్ల మేము కూడా ఒకవేళ 7, 8 మందిని పెట్టుకొని ఎట్లో గట్ల చేస్తాములే అని అడిగితే ఆయన ఏమి చెప్పినాడంటే చీటీలు వ్రాసి,


----

ఒక డబ్బాలో వేసి, అల్లాడిచ్చి ఒక చీటిని తీసుకుంటాడంట. ఎవరి పేరు వస్తే వాళ్ళు ఆ రోజు ఈయన దగ్గర ఉండాలంట. ఇది ఒక పద్ధతి. ఇది 'నా తెలివి కొద్ది' అన్నాడు. ఆ తెలివి కూడా అదేరా నాయనా! కర్మ నిన్ను అట్ల ఆడించింది, చేపించింది. ఇది నీ తెలివి అని నీవు అనుకొని ఉండవచ్చు. కాని ఈ ఐడియా నీకే ఎందుకు వచ్చింది చెప్పు? ఎవరికీ రాని ఐడియా! లోపల ఆ కర్మ ఉంటేనే నీకు ఆ రకంగ ఐడియా తీసిపెట్టిచ్చింది.


ఈ రకంగా ఏమి చేస్తారంటే, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తతంగము చేసి, ఇవన్నీ నా బుద్ధితో నేను చేస్తూవున్నాను, నా తెలివితో నేను చేస్తూవున్నాను అని అనుకోవడములో పొరపాటు పడుతున్నాడు. ఎవ్వరి తెలివి ఏమీ లేదు. బుద్ధి అనేది ఒకటి ఉంది మనకు. బుద్ధి అనేది పని చేస్తావుంది వాస్తవమే. కానీ ఎవరి ఆజ్ఞలో పని చేస్తావుంది. ఆత్మ ఆజ్ఞలో పని చేస్తావుంది. ఆత్మ ఏ ఆజ్ఞ ప్రకారము పని చేపిస్తావుంది? కర్మ ఎట్ల ఉంటే అట్ల పని చేయిస్తుంది. బుద్ధి అనేది కూడా ఒక దూతే, నీ ప్రక్కలో ఉండేవాడే. వాడు (బుద్ధి) చేస్తావున్నాడు కదా! బుద్ధి నీది కాదు అని చెప్పుతున్నాము కదా! బుద్ధి నీలాంటిదే అని అనుకో బుద్ధిని కూడా. ఆ లెక్కప్రకారము లెక్కించుకొంటే 19 మంది దూతలు ఉన్నారు నీకు, నీవు తప్ప. ఈ 19 మంది సైన్యమును దేవుడు నీకు ప్రక్కన పెట్టాడన్నమాట. ప్రతిదానిని చేసేటట్లు చేశాడు. మళ్ళీ ఆత్మ అనేది ఒకటి ఉంది, అదియే దేవుడు, ఆత్మే నిన్ను నడిపిస్తావుంది. ఆ ధ్యాసను మర్చిపోయి నీవు ఏమి చేస్తావున్నావు అంటే? నా తెలివిని నేను ఉపయోగించుకొంటున్నాను అని అంటున్నావు. కానీ నీ తెలివిని నీవు ఉపయోగించుకోలేదు. పని జరుగుతా ఉంది నీ శరీరములో ఏడు నాడీకేంద్రాల ద్వారా నీవు కదిలించబడు తున్నావు. అంతేకదా! ఏడు నాడీకేంద్రాలలో ఆత్మ శక్తి ఉంది. ఏడు నాడీ


----

కేంద్రాల ద్వారా కదిలించబడుతున్నావు. ఆత్మ శక్తిని ఇస్తే శరీరములో ఆ భాగము అక్కడ పని చేస్తువుంటుంది. చేతులకు బలము ఇస్తే చేతులు పని చేస్తాయి. కాళ్ళకు బలము ఇస్తే కాళ్ళు పని చేస్తూవున్నాయి. ఏమీ లేదనుకో ఏవీ పని చేయవు. కానీ నీకు స్వతంత్రము ఏమీ లేదు. ఈ లెక్క ప్రకారము పోతే మనము వాస్తవముగా స్వతంత్రులు కాదా? అంటే కాదు. మళ్ళీ మనము స్వతంత్రులు కాకపోతే మనము ఎందుకు బ్రతకాలి? అంటే ఎవరు బ్రతకమన్నారు నిన్ను? బ్రతికిచ్చేవాడు ఒకడువున్నాడు. వాడు ఈడుస్తావుంటే నీవు ఈడ్చబడుతున్నావు.


నిన్ను తోలేవాడు ఒకడు ఉన్నాడు, నీవు తోలబడుతున్నావని చెప్పాను. తోలేవాడు ఆత్మ, తోలబడేవానివి నీవు. నీవు ఏమీ పరుగెత్తలేదు, నిన్ను పరుగెత్తిచ్చేవాడు ఒకడు ఉన్నాడు. నీవు స్వంతము పరుగెత్తుతున్నావు అని అనుకుంటున్నావు, పెద్ద పొరపాటు. స్వంతము పరుగెత్తేదానికి చేతకాదు. సరే ఇప్పుడు మనము ఈ లెక్క ప్రకారము పోతే దేవుడు ఏమి చెప్పినాడు అంటే? క్లుప్తముగా జ్ఞానాన్ని, రహస్యముగా చెప్పినాడన్నమాట. ఏమని చెప్పినాడు? ఏడు ఆకాశాలను నీలో ఒకదాని మీద ఒకటి పేర్చాను అని అన్నాడు. అంటే మనలోనే పేర్చబడివున్నాయి. ఆకాశము అనేదానికి ఇప్పుడు అర్థము తెలిసింది కదా! 'నాడీ' అంటే అర్థమయిందా! 'న' అంటే లేదు అని, 'ఢీ' అంటే ఎదురు తగలనటువంటిది. ఆకాశములో ఏదైనా ఢీ కొట్టుకుంటుందా? ఏది 'ఢీ' కొట్టుకోదు, సాఫీగా ఉంటుంది అంతా కాబట్టి దీనిని నాడీ అంటాము. నాడీకేంద్రాలు ఎన్ని ఉన్నాయి మనకు? 7 ఉన్నాయి. 7 ఆకాశాలు ఉన్నాయి అనే మాట వాస్తవమే. మనకు 7 నాడీ కేంద్రాలు ఉన్నాయని భగవద్గీతలో చెప్పితే 7 ఆకాశాలు అని ఖుర్ఆన్లో చెప్పినారు. ఖుర్ఆన్లో చెప్పిన మాట భగవద్గీతలో చెప్పినమాట రెండూ


----

ఒకటే. అంటే సమన్వయము చేసుకోకపోతే వేరు వేరుగా కనిపిస్తాయి. కానీ సమన్వయము చేసుకుంటే అంతా ఒకటే. అంటే మాతృగ్రంథములో ఏది అయితే ఉందో తరువాత ఇంకొక గ్రంథములో అదే ఉంది. భగవద్గీతకు అనుసంధానముగా ఖుర్ఆన్ వుట్టింది. ఖుర్ఆన్ ఏమి చేస్తుంది అంటే భగవద్గీతను ధృవీకరిస్తూవుంది. ఇది సత్యమైనది, ఇది వాస్తవమైనది, ఈ జ్ఞానము వాస్తవము అని ఖుర్ఆన్ భగవద్గీతను ధృవీకరిస్తావుంది.


ఈ గ్రంథము వేరు కాదు, ఆ గ్రంథము వేరు కాదు. ఒక ఆయన ముస్లీమ్ ఏమయ్యా! మా గ్రంథములోకి వచ్చి మీరు పడినారు అసలుకు. మా గ్రంథాన్ని మీరు ఎందుకు తీసుకున్నారు? అని అంటే మీ గ్రంథము అనేది ఏమి కాదు. “ఇది సమస్త మానవులకు సంబంధించిన గ్రంథము” అని ఆ విధముగ వ్రాసిపెట్టబడినది. మీకు ఒక్కరికే హక్కు కాదు, అందరికీ హక్కు ఉంది. దేవుడు అందరికీ హక్కు ఇచ్చాడు ఈ గ్రంథము మీద. ఖుర్ఆన్ మీద హక్కు ఉంది, ఖుర్ఆన్ దానికంటే ముందు వచ్చిన గ్రంథాలను ధృవీకరిస్తావుంది. భగవద్గీతను ధృవీకరిస్తావుంది. భగవద్గీత గ్రంథములో మాకు అర్థము కానిది ఏదన్నవుంటే ఖుర్ఆన్ చూస్తాము, ఖుర్ఆన్లో అర్థము కానిది ఉంటే గీతలో చూస్తాము, రెండు దాంట్లో ఒకటే ఉన్నాయి. కాబట్టి రెండూ ఒకటేయని మేము తెలుసుకోగల్గుతున్నాము. రెండు వేరువేరు కాదు. సరే, వేరు వేరు అనేదానికి ఎక్కడన్నా అవకాశము ఉందా? అంటే ఏ అవకాశము లేదు. అవకాశము లేకుండా మనకు జ్ఞానము చెప్పబడింది. ఇప్పుడు మనము ప్రతిచోట చూస్తూవున్నాము, ఖుర్ఆన్ గ్రంథములో ఉండే వాక్యము భగవద్గీతలో ఉందా అంటే ఉంది. అట్లే భగవద్గీతలో ఉండే వాక్యము ఏదన్నా ఖుర్ఆన్లో ఉందా? అంటే ఉంది. లేదు అనేదానికి అవకాశమే లేదు. అంతటా అవే ఉన్నాయి.


----

ఇప్పుడు మీకు 55 గ్రంథములను వ్రాశాము. తరువాత 56వ గ్రంథమును ఖుర్ఆన్ గ్రంథముగా వ్రాస్తూవున్నాము. ఇప్పటికి 565 పేజీలు అయినాయి. రెండు మూడు రోజుల్లో 600 దాటిపోతాయి. 600 నుండి 700 పేజీల లోపల దానిని ముగిస్తాము. రేపు నెల మీకు వస్తుంది. అప్పుడు ఖుర్ఆన్ అంటే ఎటువంటిదో మీకు తెలుస్తుంది. ఇదేదో ముస్లీమ్ గ్రంథము అనుకొనివుండొచ్చు మీరు, కానీ మనకు సంబంధించినదే అది. ఖుర్ఆన్ గ్రంథములో కూడా దేవుని మాటలే ఉన్నాయి. భగవద్గీత వాక్యాలే ఉన్నాయి కాబట్టి మీరు నిర్భయముగా చదువుకోవచ్చు. మనకు తెలిసివుంటే ఎవరికన్నా కావాల్సింటే వినేవాళ్ళకయితే చెప్పొచ్చు. కొంతమంది వినకుండ మాకు చెప్పుతారా మీరు? అంటారు. అందువలన మీరు వినేవాళ్ళకైతే దీని విషయాన్ని చెప్పండి లేకపోతే చెప్పొద్దండి. మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకున్న దానివలన మీకు సాఫల్యము ఏర్పడుతుంది, మీకు దారి ఏర్పడుతుంది. దేవుని దగ్గరకు పోయే దారి. దైవమార్గము మనకు తెలుస్తుంది. దైవమార్గము మనకు తెలిసేదానివల్ల మనకు దేవుని దగ్గరకు పోయేదానికి అవకాశము ఉంది. మనము ఏమీ చేయలేము కదా! అని కొందరికి ప్రశ్న రావచ్చును. దేవుని విషయములో నీవు ఏమైనా చేయగలవు అని నేను ఇంతకుముందే చెప్పాను. ప్రపంచ విషయాలలో ఏమీ చేయలేవు, అది ఎవరికీ చేత కాదు. కానీ దేవుని విషయములో నీవు ఏమన్నా చేయవచ్చు. ముందుకు పోవాలనుకున్నా కూడా పోవచ్చు. ఇతరులకంటే నేను ముందుకు పోగలనా? అంటే దానికి ఒకటి పరిధి ఉంది. అక్కడ కూడా నీవు పోవాల్సిన శ్రమ నీకు లేదు. నీకు ఎంతవరకు ధ్యాస ఉందో, అంటే ఎంతమటుకు భావము ఉందో, ఆ భావాన్నిబట్టి దేవుడే నిన్ను పంపిస్తాడు వేగముగా. నీకు వేగాన్ని తగ్గించేది, వేగాన్ని ఇచ్చేది అంతా దేవుడే చేస్తావున్నాడు.


----

నీకు దేవుని మీద శ్రద్ధ ఉండగల్గితే, దేవున్ని తెలుసుకోవాలని ధ్యాస ఉంటే, ఆ ఉండేటటువంటి భావము ఎంతమటుకు బలముగా ఉందో, ఆ బలాన్ని బట్టే, నిన్ను ఆ మార్గములో దేవుడు పంపిస్తాడు. దేవుడే అంటే సరిపోలేదు అనుకో, ఇంకోదారి కూడా పట్టిస్తాడు. ఏమీ తెలియకుండ చేస్తాడు నీకు. తెలియకుండ చేసేవాడు ఆయనే. తెలిసే విధముగా చేసేవాడు ఆయనే. అన్ని అవకాశాలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఆయన అన్నిటికీ బలవంతుడు, అన్నీ చేతనయినవాడు, అన్నిటికీ అధికుడు. కావున నీవు వినయ విధేయతలతో దేవున్ని తెల్సుకోగల్గితే ముందుకుపోగలవు లేకపోతే ముందుకు పోయేదానికి అవకాశమే లేదు. అందువలన మనము దేవున్ని తెలుసుకునే దానికోసము ప్రయత్నము చేస్తే ఇంతమంది ఇక్కడికి వచ్చాము. దేవుడు అవసరము లేదు అనుకొనేవాళ్ళు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు. మీరు ఎక్కడో విశాఖపట్నము నుంచి వచ్చినవాళ్ళు ఉన్నారు ఇక్కడికి. కాని ఇక్కడ 10 అడుగుల దూరములో ఉండేవాళ్ళు ఇక్కడికి రాలేదు. ఎందుకంటే వాళ్ళకు అవసరము లేదు. మీకు అవసరము ఉంది. అవసరము లేని వాళ్ళని ఏమి చేస్తాడు? అంటే ప్రక్కప్రక్కన పంపి వేస్తున్నాడు. ఏమాత్రము జ్ఞానము అర్థము కాకుండ చేసి. ఈ దారి అనేది ఏమాత్రము తెలియకుండా చేస్తాను అని ఖుర్ఆన్ గ్రంథములో చెప్పాడు. కానీ అవసరము వచ్చే వాళ్ళకు, ఏమి అర్థము కాలేదో చెప్పు, నేను తెలియజేస్తాను అని చెప్పినాడు. ఇక్కడ ఏడు ఆకాశాలు అంటే ఏమిటో అర్థము కాదు, అయితే తెలుసుకోవాలనే ధ్యాస మనకుంది కావున సులభముగా తెలియజేశాడు. ఒకప్పుడు ఏడు ఆకాశాలు అంటే ఎక్కడ ఉన్నాయని వెతుకులాడాల్సిన పని వచ్చింది. అప్పుడు ఏడు ఆకాశాలు అంటే ఎక్కడా లేవు, నీలోనే ఉన్నాయి చూసుకో! అని చెప్పినాడు. ఆకాశము అంటే 'నాడి' అది నీలోనే ఉంది చూసుకో అని చెప్పినాడు.


----

నేను ఇప్పుడు చెప్పితే మీకు తెలిసింది కదా! మీకు నేను ఎట్ల చెప్పినానో నాకు అట్ల ఇంకోరు చెప్పేవాళ్ళు ఉంటారు కాబట్టి నాకు తెలిసింది. ఎవరు చెప్పినారు? లోపలవుండేవాడు చెప్పుతాడు. అంటే ఆత్మ అనే దేవుడే చెప్పాడు. మీరు చెప్పేదేదో నేరుగా చెప్పవచ్చు కదా! లోపల ఉండేవాడే చెబుతున్నాడు అని ఇంకొకరి మీద ఎందుకు చెప్పుతున్నారు అంటే ఇంకొకరి మీద చెప్పాలనే చెప్పుతున్నాను. ఏదీ నీ మీద ఎప్పటికీ మోసుకోవద్దనే చెప్తున్నాము. పిల్లప్పటి నుంచి నేనే నేనే అని అలవాటు అందరికి అయింది. ఆ అలవాటు తప్పించుకొని ఇంకొకరి మీద పెట్టేది నేర్చుకోమనే చెప్పుతా వున్నాను. మీకు ఆ పద్ధతి నేర్పించేవాన్ని నేనే చెప్తున్నాను' అని ఎట్ల చెప్తాను మీకు. నేను కూడా చెప్పేదానికి కాదు కాబట్టి 'ఇంకోడు చెప్పుతాడు' అనే చెప్పాలి నేను. అది మీ అందరికి నేర్పిస్తున్నాను కదా! కాబట్టి 'నాడి' అనేది నాకు కూడ తెలియదు. పోయిన నెలలో అడిగితే నాకు కూడా తెలియదు అని చెప్పేవాన్నే. ఇప్పుడు నాకు తెలిసింది, ఏడు ఆకాశాలు ఒకదాని మీద ఒకటి ఉన్నాయి అంటే ఏడు ఆకాశాలు ఎక్కడ ఉన్నాయబ్బా, మనము విమానములో పోయినా కనపడదు, రాకెట్లో పోయినా కూడా కనపరాలేదు. ఎక్కడ ఉన్నాయి? అని అడిగితే నిన్ను నువ్వు చూసుకో! ఏమన్న లోపము ఉందా? ఏమీ లేదు. ఒకవేళ అనుమానము ఉంటే ఇంకొకసారి చూసుకో, ఏడు ఉండాయో లేదో! మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రారము అని ఉన్నాయి కదా!

ఈ నాడీకేంద్రాలతోనే నీవు బ్రతుకగల్గుతున్నావు. కాళ్ళూ చేతులు ఆడుతున్నాయి, గుండె కదలుతూ ఉంది. నీకు ఊపిరితిత్తులు ఆడుతున్నాయి. అంటే ఏడు నాడీకేంద్రాల ద్వారానే ఆడుతున్నాయి, కాబట్టి ఆకాశాల వలనే


---

నీవు బ్రతుకుతున్నావు. నీలో ఏడు ఆకాశాలు ఒకదాని తరువాత ఒకటి పేర్చబడివున్నాయి. మనకు బయటి ధ్యాస తప్ప లోపలి ధ్యాస లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికి లోపలి ధ్యాస పెంచుకోండి అని చెప్పుతున్నాము. ఈ బోధలు ఎక్కడా ఉండవు. మీరు బయటికిపోయి చూడండి. ఒక పాటో, పద్యమో, ఇంకోటో ఇంకోటో చెప్పి బయటి ధ్యాసలు చేసి, బయట పూజలు చేసి, ఈ దేవునికి ఇట్లే మ్రొక్కాలి, ఆ దేవునికి అట్లే మ్రొక్కాలి, ఈయనకు ముందు నుంచి పోవాలి, ఆయనకు వెనకాల నుంచి రావాలి అని చెప్పుతారు. బయట నియమాలు తప్ప నీ శరీరములోకి పోండి, శరీరములో చూసుకోండి అని ఎవరూ చెప్పడము లేదు. మాదీ జ్ఞానమే, మా జ్ఞానములో మేము కరెక్ట్ గా ఉన్నాము అని వాళ్ళు అంటున్నారు. ఎవరికి వాళ్ళు ఏమి చెప్పుతున్నారంటే మేము కరెక్టుగా ఉన్నాము, మేమే సక్రమమైన పద్ధతిలో లో ఉన్నాము, మీది సక్రమమైన పద్ధతి కాదు అని అనుకుంటున్నారు. కానీ ఎవరిది సక్రమమైన పద్ధతి? ఎవరిది సక్రమమైన పద్ధతి కాదు? అని లోపల ఉన్న దేవునికి తెలుసు. భక్తిలో నడిచే నడక అంతా శరీరము లోపలే పోవాలి, దేవుని దగ్గరకు పోవాలంటే, బయట పోలేము. బయట ఎంత దూరము పోయిన దేవుడు కనపరాడు, ఆ ప్రకృతి కనిపిస్తుంది. లోపల కూడా ఎట్ల పోవాలి? మనకు పోయేదానికి అవకాశము ఉందా? అంటే నీవు ఏమీ పోవద్దు, నీవు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండి, ఆలోచన చేయి, నీకు తెలుస్తుంది.


నిన్ను నీవు చూసుకోవాలి అనుకో, కనిపిస్తుంది. నీవు ఎంత తెలుసుకోవాలంటే అంత తెలుస్తుంది. ఇప్పుడు నీకు తెలిసిన జ్ఞానమంతా లోపల తెలిసిందా? బయట తెలిసిందా? లోపలనే తెలిసింది, శరీరము లోపల ఆత్మ ఉంది. నీకు అన్నీ తెలియజేస్తుందది, నిన్ను నడిపిస్తావుంది


----

నేను

అని తెలుసు, శరీరములోనే మార్పులు వున్నాయని తెలుసు, శరీరములోనే ఆకాశాలు ఉన్నాయని తెలుసు, శరీరములోనే భూమి ఉంది అని తెలుసు, సమస్తము శరీరములోనే ఉన్నాయని తెలుసు, సమస్తాన్ని పాలించే దేవుడు కూడా శరీరములో ఉన్నాడని తెలుసు. అంటే అతనిని మనము ఎట్లా చేరుకోవాలి? అంటే నీవు ధ్యాస పెట్టుకో ఇంక ఏమి వద్దు. కొంతమంది ఏమంటారు అంటే? కొంతసేపు ధ్యానము చేయాలి అంటారు. ఇంతవరకు ఎక్కడ ధ్యానము చేయలేదు, నీకు ఎట్ల చెప్పుతాను ధ్యానము చేయమని నేను, ధ్యానము చేయకుండానే ఇంతమటుకు జ్ఞానము వచ్చింది నాకు. ధ్యానము చేస్తే అసలు జ్ఞానము వచ్చేది కాదు. అక్కడే ఉండేవాన్ని ధ్యానము, ధ్యానము అనుకుంటా. కాబట్టి ధ్యానము చేయవద్దు, జ్ఞానము తెలుసుకో అని చెప్పాము. అంటే ఎక్కడన్నా పోనీ అందరూ ధ్యానము చేయమంటారే! వాళ్ళకు తెలి

తెలుసు? ధ్యానము ఏమి, నిన్ను నీవు తెలుసుకో, దేవునికి దగ్గర అవుతావు ఎక్కడ ఉంటే అక్కడే ఉండు. నీవు గ్రహించుకో, చదివే విషయాన్ని గ్రహించుకో, అప్పుడు నీకు వాస్తవము తెలుస్తుంది. అప్పుడు ఏమౌతుంది? నువ్వు ఆ ప్రకృతి నుండి బయటపడి పరమాత్మలోనికి చేరవచ్చు నీవు.


నీవు పరమాత్మలో ఒక అంశవే “మమైవాంశో జీవభూతే” అంటే నా యొక్క అంశే జీవునిగా ఉన్నాది అని చెప్పాడు దేవుడు. కానీ నీవు ప్రకృతిలో ఇరుక్కున్నావు అంటే గుణాల మధ్యలో ఇరుక్కున్నావు. దీంట్లో నుంచి తప్పించుకొని దేవుని దగ్గరకు పోవాలంటే ఏమి చేయాలి? అందరికి దేవుని మీద ఇష్టమే ఉంది, దేవుని దగ్గరికి పోవాలని ఉంది, ఏమి చేయాలి? అంటే ఏమి చేయవద్దు, ఏ ధ్యానము చేయవద్దు, ఏ తపస్సు చేయవద్దు, ఇంకోటి ఏమి చెయ్యొద్దు. భావము సక్రమముగా పెట్టుకొని చెప్పిన


---

విషయాలను గ్రహించుకోండి. చదివిన విషయాన్ని గ్రహించుకోండి. జ్ఞానాన్ని ఎంత తొందరగా తెలుసుకోగల్గుతావో అంత తొందరగా నీవు తెలుసుకోగల్గుతావు. దేవుని దగ్గరకు పోగల్గుతావు అంటే ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా పోగలవు. బయట విషయాలలోకి పోతే మాత్రము ఎంతసేపు ధ్యానము చేసినా ఏమి కాదు. 30, 40 సంవత్సరాల నుండి ధ్యానము చేసిన వాళ్ళు ఉన్నారు కానీ వారికి ఏమి తెలియబడలేదు అని నీవు గ్రహించుకో. ఇప్పటి నుండి లోపల పెంచుకోండి. ఆకాశము, భూమి, అగ్ని, నీళ్ళు, గాలి అన్నీ లోపలే ఉన్నాయని తెలుసుకొని, నీవు కూడా లోపలే ఉన్నావని తెలుసుకొని, అన్నిటిని పాలించేవాడు లోపలే ఉన్నాడని, లోపలే కనుగొనేదానికి ప్రయత్నము చేయండి అని ఇంతటితో ముగిస్తున్నాము.


తేది:13.12.2016


ఇప్పుడు ఈ సమావేశములో కూర్చున్న వారందరికి జ్ఞానము సక్రమముగా అర్థము కావాలనీ ఆత్మను కోరుచూ, ఈ సమావేశాన్ని మనము ప్రారంభించుకుందాము. ప్రారంభించే ముందు భగవద్గీతలో మనకు ఇపుడు సందర్భము కాకున్నా భగవద్గీత రాజవిద్యారాజగుహ్య యోగములోని మొదటి రెండు శ్లోకాలు చదువుకొని ఈ సమావేశాన్ని ప్రారంభిస్తే తృప్తిగా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ సమావేశము పేరు మీకు తెలిసే ఉంటుంది, “గ్రాహిత శక్తి”. దాని గురించి ఇపుడు మాట్లాడుకుందాము. ఇప్పుడు ముందు


----

భగవద్గీతలో ఒక శ్లోకాన్ని ముందు చెప్పుకుందాము. రాజవిద్య - రాజగుహ్య

యోగము మొదటి శ్లోకము...


శ్లో॥ 1 : ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయలే ।

జ్ఞానం విజ్ఞాన సహితం యద్ జ్ఞాత్వా మోక్షసేశుభాత్ ॥


తెలుగులో చెప్పితే “దీనినతిరహస్యమైన జ్ఞానమును విజ్ఞాన

సహితముగ విషదమొనర్తు. అట్టి తెఱంగునెల్ల నిన్ను అశుభంబులు బాయు. వినుము నీవు అసూయ లేక” జాగ్రత్తగా అసూయ పడకుండా విను అని చెప్పారిక్కడ. సరే, ఇప్పుడు రెండవ శ్లోకాన్ని చెప్పుకుంటే...


శ్లో॥ 2 : రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ |

ప్రత్యక్షావగమం ధర్యం సుస కర్తుమవ్యయమ్ ॥


“అతులవిద్యలయందు గుహ్యములయందు రాజమై ఉత్తమము పవిత్రంబునగుచు అవని ప్రత్యక్ష విషయికమైన ధర్మ్యమవ్యయంబు అనుష్ఠాన సౌఖ్యప్రదంబు” అని చెప్పినారు.

ఇప్పుడు ఈ రెండు శ్లోకాల విషయము చెప్పుకుంటే ఇపుడు చెప్పేటువంటిది చాలా రహస్యమైనటువంటి జ్ఞానము జాగ్రత్తగా విను అని చెప్పాము. తరువాత అసూయ లేకుండా కూడా విను అని చెప్పాము. ఈ విధముగా ఈ చెప్పేటటువంటి జ్ఞానమును ఇప్పుడు నేను క్రైస్తవున్ని, నేను ముస్లీము, నేను భగవద్గీతలో జ్ఞానము ఎందుకు వినాలా? అనేటటువంటి ఆ భేదమును (ఆ అసూయను) తీసివేసి వినండి అని చెప్తున్నాము. ఇక ముఖ్యముగా చెప్పేది ఏమంటే, ఈ చెప్పేటటువంటి జ్ఞానము నీవు ఏ విద్యలైతే నేర్చుకున్నావో అన్ని విద్యలకంటే గొప్పవిద్య ఇది. అంటే రాజవిద్య


---

అంటారు దీనిని. నీవు ప్రపంచములో ఎన్ని విద్యలైన నేర్చుకొని ఉండు. ఆ విద్యల అన్నిటికంటే రాజు అంటే పెద్దది. దానిని 'రాజవిద్య' అంటాము. దైవజ్ఞానమే గొప్పవిద్య. నేనిపుడు ఒక యూనివర్సిటీకి పోయి పెద్ద డిగ్రీ తీసుకున్నాననుకోండి అయినా ఏమీ ప్రయోజనము లేదు దానివల్ల. అది ప్రపంచ విద్యేగానీ, నీకు బ్రతుకు తెరువుకోసమేగానీ నీవు బ్రతికున్నంత వరకు నిన్ను బ్రతికించే దానికో, ఉపాధి కల్పించే దానికోసమేగానీ, ఇంకొక దానికి పనికి రాదు. జన్మ జన్మలకు పనికొచ్చేటటువంటి విద్య ఏదైతే వుందో, అదే ఇది. అందువల్ల దీనిని “రాజవిద్య” అంటారు. తర్వాత రహస్యములలో కెల్లా రహస్యమైనటువంటిది కావున 'రాజగుహ్య' అని కూడ అంటారు దీనిని. అన్ని రహస్యములకంటే చాలా రహస్యమైనటువంటిది అని

దీనిని చెప్తారు కాబట్టి ఈ రహస్యమైనటువంటి దానిని, అన్నిటికంటే గొప్ప విద్య అయినటువంటి దానిని మనము తెలుసుకోవాలి అంటే చాలా జాగ్రత్తగా వినాల్సిన పని వస్తుంది. సరే, మనము జాగ్రత్తగానే వినాలనుకొంటే దానికి 'గ్రాహితశక్తి అవసరము' అని మేము చెప్తున్నాము.

'గ్రాహితశక్తి' అనేది ఈ రోజు మనకు సబ్జెక్టు. ఆ గ్రాహితశక్తి అనేదాన్ని గురించే మనము మాట్లాడుకుంటున్నాము. గ్రాహితము అనేది ఏమిటి? అంటే నీ బుర్ర గ్రహించుకొనేదానిని గ్రహితము అని అంటాము. మేము నలభై సంవత్సరాలుగా ఏకధాటిగా జ్ఞానము చెబుతున్నాను. అంటే ఇప్పుడు చాలామందిలో చెప్తున్నాను, అప్పుడు మొట్టమొదట కొంతమందిలో చెప్పేవాణ్ణి. జ్ఞానము 40 సంవత్సరాల నుండి బయటికి వస్తూ వుంది. కానీ బయట ప్రపంచములో కొంత ప్రాకింది. ఈ రోజు చాలామంది దీనిని తెలుసుకోగలిగారు. కానీ తెలుసుకోని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు తెలుసుకుందాము అని ప్రయత్నము చేయడము లేదు కానీ దీనిని


----

వారు అసూయతో చూస్తూ, ఈ జ్ఞానము వేరు, మన దేవుడు చెప్పిన జ్ఞానము వేరు అని అనుకుంటున్నారు. మన దేవుడు, మన మతము, మన జ్ఞానము అనుకోవడము పెద్ద పొరపాటు. అందరికి ఒకటే దేవుడు ఉన్నాడు. ప్రపంచానికంతా ఒకడే సృష్టికర్తయని ఎప్పుడో చెప్పాము, ప్రపంచములో మానవులందరూ ఒకే దేవున్ని ఆరాధించాలి, ఒకే దేవున్నే మ్రొక్కాలి అని మనము మొదటి నుంచి చెప్తున్నాము. హిందువులైతే చాలామంది దేవతలను మ్రొక్కుతారు, హిందువులు ఆ విధముగా అలవాటు పడినారు కానీ భగవద్గీత జ్ఞానము మాత్రము ఆ రకముగా చెప్పలేదు. భగవద్గీత అన్నిటికీ పుట్టినిల్లు. బైబిలుకు, ఖుర్ఆన్క అన్నిటికీ ఇందులో ఉండే సారాంశమే వాటిలో ఉంది, కాబట్టి ఖుర్ఆన్లో ఏ జ్ఞానముందో అది భగవద్గీతలో ఉంది. బైబిలులో ఏ జ్ఞానముందో అది కూడ భగవద్గీతలో ఉంది.


ముస్లీమ్లు, క్రైస్తవులు అందరూ 'ఏకేశ్వరోపాసన' చేస్తున్నారు. భగవద్గీతలో ఏకేశ్వరోపాసనే ఉంది. కాని అది తెలియక కొంతమంది నానా రకాల దేవతలను ఆరాధిస్తున్నారు. అది అజ్ఞానులు చేసేటటువంటి పని అనుకోండి. కొంతమంది స్వామీజీలు కూడా భగవద్గీతను చెప్తారు. భగవద్గీత శ్లోకాన్ని చాలా వర్ణిస్తారు. తర్వాత వాళ్ళు ఇతర దేవతలను మ్రొక్కుతున్నారు. అంటే వాళ్ళు డ్రామా ఆడినట్లు ఏదో ఒకటి చేస్తున్నారు. అంతేగానీ నిజమైన జ్ఞానాన్ని వాళ్ళు బోధించడము లేదని మనకు అర్థమైతావుంది. సరే, గ్రాహితశక్తి అనేది వాళ్ళకు చాలా తక్కువే ఉంది, తక్కువ ఉండబట్టే వాళ్ళు ఆ రకంగ తప్పటడుగు వేస్తున్నారు. అసలైన గ్రాహితశక్తి మనిషికి ఉంటే రెండో అడుగు వాడు తప్పటడుగు వేయడు. దేవుడు ఏమి చెప్పాడో అదే చేస్తాడు. దేవుడు ఏ విద్య గొప్పది అని చెప్పాడో ఆ విద్యనే మనము


----

గొప్పగా చెప్పుకుంటాము. ఈ మధ్యన కొందరు ముస్లీమ్లు మా మత గ్రంథాన్ని గురించి వ్రాసేదానికి వాళ్ళు ఎవరు? అని అంటున్నారు. దానికి మీ మతగ్రంథమని ఎక్కడైనా ఉందా? అని మేము అంటున్నాము.


మీ మత గ్రంథమని ఎక్కడైనా వ్రాశారా? ఇది ఎవని అబ్బని ఘంటు కాదు. అందరి సొమ్ము ఇది. మీరు ఏదైతే మాది అనుకుంటున్నారో అది మాది కూడా. ఖుర్ఆన్ గ్రంథము మాది అనుకుంటున్నారు మీరు, అది మీదే అనుకోవడము పొరపాటు, మాది భగవద్గీత అనుకోవడము మాది పొరపాటు అవుతుంది. భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ అందరిది. సర్వ మానవులకు అని అందులో చెప్పారు. సర్వమానవులకు హితోపదేశము ఇది అని చెప్పారు. సర్వమానవులకు హితోపదేశము అన్నప్పుడు ఇది మాది అని ఎట్లంటున్నారు? మీరు అజ్ఞానముతో అంటున్నారు. సరే, మీది అంటున్నారు గదా! మీది ఎంతమటుకు అవగాహన వచ్చింది మీకు అని మేము అడుగుతాము. అవగాహన కావడమే గ్రాహితశక్తి.


ఇప్పుడు మనము ఆ ఖుర్ఆన్లోకి వెళ్ళి పోతాము. ఇంతవరకు భగవద్గీత శ్లోకాలు చెప్పి, మళ్ళీ ఖుర్ఆన్లోకి పోతాడేం అనుకోవద్దండి. అంతా ఒక్కటే జ్ఞానమే అని మా లెక్కలో మేము చెబుతున్నాము. కాబట్టి మాకు ఏ మతమూ, ఏ మత గ్రంథమూ అనేది ఏమీ లేదు, అందరికీ ఒకటే గ్రంథమే! అని మా ఉద్దేశ్యము. ఆ ఒక్కటే గ్రంథములో ఉండేదాన్ని కాగితాలుగా చింపుకొని మాది ఖుర్ఆన్, మాది బైబిలు, మాది భగవద్గీత అంటున్నారు. అంతా ఒకే గ్రంథమే అని మేము అంటున్నాము. ఖుర్ఆన్ అనే పేరు పెట్టినటువంటి గ్రంథములో '6'వ సూరాలో ‘102’వ ఆయత్ తీసి చూడండి మీరు ఒకసారి. 6వ సూరా 102వ ఆయత్ చూస్తే ఏముందంటే "ఆయనే మీకు అల్లాహ్, ఆయన ఒక్కడే తప్ప వేరే అల్లాహ్


----

లేడు, ఆయనే మీకు ఆరాధ్యదైవము, ఆయన్నే మీరు ఆరాధించాల్సింది, వేరే ఆరాధ్య దైవము లేనే లేడు” అని చెప్పారు. ఆయనే సర్వానికి సృష్ఠికర్త అని చెప్పారు, ఇంకా కొంత చెప్పారు. ఆయన మీకు కార్యకర్త అని కూడా చెప్పారు. అంటే ఇప్పుడు దేవుడు సృష్టికర్త సరే తర్వాత ఆయన సర్వాన్ని సృష్ఠించినాడు. ఆయన అధిపతి. ఆయన దేవుడు మీరు మ్రొక్కాల్సింది. ఆయన ఒక్కన్నే, ఇంక వేరే దేవుడు లేడు. ఆయనకంటే మించిన దేవుడు లేడు.


మీకు ఆరాధ్యదైవము ఆయన ఒక్కడే, వేరే అతను అర్హుడు కాదు అని చెప్పినపుడు, ఆ దేవుడు మీకు సేవ చేసి, పనులు చేసిపెట్టేటటువంటి వాడు అని కూడా చెప్పారు. ఇది మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏమంటే దేవుడంటే ఆయన గొప్పవాడు, ఆయన పైనే ఉంటాడు, ఆకాశములో ఉంటాడు, ఆయన క్రిందికి రాడు, క్రింద కూడా లేడు. పైనే ఉన్నాడు అని అంటున్నారు ముస్లీమ్లు చాలామంది. అంతటా ఉంటాడనేటువంటి ధ్యాస కూడా లేదు, పైనే ఉన్నాడనే భ్రమలో ఉన్నారు. కానీ ఇక్కడ ఏమి చెప్తున్నా అంటే మరియు ఆయన మీకు కార్యకర్త అని చెప్పినారు. అంటే ఇప్పుడు ఆయన పని చేసేవాడు కూడా అని చెప్పారు. ఇప్పుడు ఆ వాక్యము మీకు అర్థమయిందా? ఎట్ల పని చేస్తున్నాడాయన? అంటే ఇప్పుడు ఆ వాక్యము నకు సంపూర్ణముగా జవాబు ఉండదు. మరి ఇప్పుడు ఒక మతానికి ఒక గ్రంథము పెట్టుకొని, ఆ గ్రంథములో ఎన్నో వాక్యాలు పెట్టుకొని, ఒక్క వాక్యాన్ని సూటిగా అడిగితే దానికి సరియైన సమాధానము చెప్పలేని పరిస్థితిలో మనము ఉన్నాము. ఒకరికి చెప్పొద్దు, నీకు అర్థమైతే చాలు. నీకు అర్థమైందా? నీకు అర్థమయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దేవుడు నీకు కార్యకర్త అంటే దానిని నీవు ఒప్పుకునే పరిస్థితిలో లేవు. ఒప్పుకోక


---

పోయినా, ఒప్పుకున్నా దేవుడే వ్రాశాడు ఆ మాట. అది ఖుర్ఆన్లో ఉంది. నీకు నేను కార్యకర్తను అని. ఇంతకుముందు మామూలుగా హైదరాబాదులో ఆటో మీద వెనకాల “యెహోవా నా కాపరి” అని ఒకడు వ్రాసినాడు. “యెహోవా దేవుడు” అనకుండ యెహెూవా నా కాపరి అని వ్రాసుకున్నారు క్రైస్తవులు. అంటే ఈయన కాపలా ఉండేవాడా? ఈయన గుమస్తానా? అని కొంతమంది అడిగినారు. అంటే ఆయన దేవుడూ తర్వాత గుమస్తానూ. గుమస్తా అంటే ఇప్పుడు నీవు ఊరకే ఉంటేనే కదా నీకు పని చేసి పెట్టేది ఆయన. అంటే నువ్వు ఉన్నావు మనిషివి, నీకు పని చేసి పెట్టేవాడు దేవుడే, నువ్వు ఏమీ చేసేవానివి కాదు. నీ పనులన్నీ ఆయనే చేసి పెట్టుచున్నాడు. వాస్తవముగా నీవు పని చేసేవానివి కాదు అనే గ్రంథాలలో చెప్పినారు. ఆ విషయము మనకు అర్థము కాలేదు, అక్కడనే గ్రాహితశక్తి అనేది కొరబడినది

మనకు.


ఈ రకంగా మనము లెక్కేసుకుంటే ఒక గ్రంథములోనే కాదు ఏ గ్రంథములోనైనాగానీ మనకు సరైన అవగాహన లేదు. ఆ అవగాహన గురించే మనము ఇప్పుడు చెప్పుకునే దానికి పూనుకుంటున్నాము. క్రైస్తవుల్లోకి వెళ్ళి చూస్తే మేము మా ప్రభువు వ్రాసిన గ్రంథాలు తప్ప మేము వేరేటివి ఏవీ చదవము అంటున్నారు. ప్రభువు ఏమైనా అలా వ్రాశాడా? ప్రభువు వ్రాసినది తప్ప మనుషులు వ్రాసిన గ్రంథాలు ఏవీ చదవము అని నిక్కచ్చిగా చెప్పేశారు. మేము ఏమని అడుగుతున్నాము. ప్రభువు ఏ గ్రంథమూ వ్రాయలేదు, అంతా మనుషులు వ్రాసినేటివే కదా! మళ్ళ మీరు చదివే బైబిలు కూడా మనుషులు వ్రాసినదే కదా! దానిని మీరు చదివినప్పుడు గీతను ఎందుకు చదువకూడదు? అంటే దానికి మావే చదువుతాము మేము అంటారు.


----

బైబిలులో ఉండే వాక్యమే చెప్పుకుంటే, దాంట్లో సరైన అవగాహన ఉందా? అంటే దాంట్లో కూడా ఏ వాక్యము తీసుకున్నాగాని మనకు సరైన అవగాహన లేకుండా పోయింది. తండ్రి కుమారుడు అంటే మనకు తెలియడము లేదు. ఎవరికి తండ్రి? ఎవరికి కుమారుడు? కుమారుడు ఎవరు? తండ్రి ఎవరు? అనే విషయము కూడా మనకు తెలియలేదు. ఆ విధానము తెలియనపుడు ఆ చెప్పిన వాక్యాలు ఎవరికీ అర్థము కావు, అనే విషయము తెలియకుండా పోయింది. ఇప్పుడు బైబిలులో మనకు ఒక వాక్యము ఉందనుకోండి. తండ్రి కుమారుడు అని. ఆ తండ్రి ఎవరో కుమారుడెవరో తెలియకపోతే బైబిలు ఎలా అర్థమౌతుంది? ఏమాత్రము అర్థమయ్యేదానికి అవకాశము లేనే లేదు. చిన్న ఉదాహరణ తీసుకుందాము మనము. మత్తయి సువార్త 26వ అధ్యాయములో 26, 27, 28 వచనాలు చూడండి. “వారు భోజనము చేయుచుండగా ఏసు ఒక రొట్టెను పట్టుకొని,దాన్ని ఆశీర్వదించి, విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరము అని చెప్పెను మరియు ఆయన గిన్నె పట్టుకొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధనా రక్తము” అన్నాడు. ఇప్పుడు మనము ఆపేస్తాము ఇక్కడికి. ఇక్కడ బాగా అర్థము చేసుకుంటే ఇది “చిందించ బడుచున్న రక్తము” అని ఉంది. "నిబంధన రక్తము” అని ఉంది. తరువాత ఏమని ఉంది? ఒక రొట్టెను ఇచ్చి 'ఇది నా శరీరము' అన్నారు.


నిబంధన రక్తము గురించి ఉదయము కూడా మీలో చర్చ జరిగింది. అది విన్నాను, ఇప్పుడు ఇది ఎంత అవగాహనా లోపము ఉంది అని మనము చూసుకుంటే, మనము ప్రొద్దున్న చర్చించుకున్న దానినిబట్టి చూస్తే


---

ఇక్కడ ఎంతో అవగాహనా లోపము ఉంది అని తెలుస్తావుంది. రక్తాన్ని తీసుకున్నప్పుడు మనము ఏమి చేశామంటే కొద్దిగా ఒక అడుగు ముందుకు వేసి నిబంధన రక్తము అన్నాము. సామాన్యమైన క్రైస్తవులు ఏమంటున్నారు? ఏసు ప్రభువు రక్తముతో మన పాపాన్ని కడిగేసుకోవాలి అని అంటున్నారు. ఏసుప్రభువు ఎప్పుడో చనిపోయాడు, ఆయన రక్తము ఎప్పుడో కారిపోయింది. ఆ కారినది కూడా కొద్దిగే, మనము కడుక్కునే దానికి అవకాశమే ఉండదు. కాని వాళ్ళెట్లా చెప్తున్నారంటే ఆ రక్తముతోనే ఇప్పుడు కూడా కడుక్కోవాలి అంటున్నారు. అంటే అట్ల స్థూలముగా చెప్పుకుంటే ఏమాత్రము ప్రయోజనము లేదు. సూక్ష్మమైన అర్థముతో చెప్పుకుంటేనే మనకు అందులో లాభము ఉండేది. వాస్తవముగా వాక్యమునకు కూడా ప్రాణము వస్తుంది. సూక్ష్మమైన వాక్యముతో చెప్పుకుంటే నిబంధన రక్తము అంటే ఆయన చిందించేది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా నోటి నుండి చిమ్మ బడుతున్నాయి వాక్యాలు. నేను చెప్పేమాట నీకు బయటకు వస్తావుంది. ఎట్లా వస్తావుంది? ఫోర్స్ బయటకు వస్తావుంది. ఇది చిమ్మడము కాదా? ఇది ఈ చిందించబడేటటువంటి జ్ఞానము అని చెప్పినాడాయన. తన నోటి గుండా వచ్చేటటువంటి జ్ఞానమే నా శరీరము నుండి చిమ్ముతున్న రక్తము, నేను చిమ్మించుచున్న రక్తము, నిబంధన రక్తము. జ్ఞానమనేటటువంటి రక్తము చేత మీరు శుద్ధి అయితే మీ కర్మలు (మీ పాపాలన్నీ) లేకుండా కాలిపోతాయి, క్షమించబడుతాయి అని చెప్పాడు. అక్కడ ద్రాక్షరసము చూసి దానిని ఇది ఆయన చేత చిందించబడుతున్న రక్తము అని పోల్చుకున్నాము. అప్పటికి ఆయన చనిపోలేదు, ఆయనకు ములుకులు కొట్టలేదు. ముందే చెప్పినాడాయన 'చిందించబడుతున్న' అని. ఇప్పుడు కూడా నేను చిందిస్తున్నాను. చిందింపబోవు అని చెప్పలేదు, చిందించబడుతున్న రక్తము


----

“ఇది నేను మీకు అందించేటువంటి జ్ఞానము, నేను మొదటినుండి అందిస్తున్నాను, ఇప్పుడు కూడా అందిస్తున్నాను”.


ఈ జ్ఞానము వలన మీ పాపాలన్నీ క్షమించబడుతాయి. మీరు తెలుసుకొని, అర్థము చేసుకొని, ఆచరించగలిగితే మీ పాపాలన్నీ పోతాయి అన్నాడు. ఇది సర్వమానవులకూ వర్తించేటటువంటి విధానము. దేవుడు మనకు జ్ఞానాన్ని నిత్యము అందిస్తున్నాడు. కాని అది మనకు అవగాహనకు రాలేదు. ఇప్పుడు మనము ఇక్కడకు వచ్చిన తరువాత చిందించబడుతున్న రక్తము, నిబంధన రక్తము అని గట్టిగా వత్తి చెప్పి 'నిబంధన' అంటే 'జ్ఞానము’ లేదా ‘బంధనము లేనటువంటిది' అని చెప్తున్నాము. మామూలుగా రక్తానికి నిబంధన అనే పేరు ఉండదు, అది మామూలు రక్తమే! ఇది మామూలు రక్తము కాదు. నిబంధన రక్తము అంటే వేరుగా ఒక విశేషతతో కూడుకొని

ఉంది. దీనికి విశేషమైన పదాన్ని చేర్చినాము కాబట్టి మీరు జ్ఞానము అని అర్థము చేసుకోండి అని చెప్పాము. కానీ శరీరము నుండి కారేది కాదు అది, చిమ్మబడేది. ఇప్పుడు కూడా చిమ్మబడుతావుంది. ఇప్పుడు మేము చెప్పేమాటలన్నీ మా శరీరము నుండి మేము చిమ్ముతున్న రక్తము అనుకోండి. దీనిని కూడా ఒక లెక్కలో నిబంధన రక్తము అనే అంటాము. అంటే ఇప్పుడు చెప్పేటి మాటలన్ని రక్తము కాదుగానీ నిబంధన అనే పేరుతో వచ్చేటటువంటి రక్తము, జ్ఞానము అనే పేరుతో వచ్చేటటువంటి రక్తము. మరి దీనివల్ల మీకేమౌతాది అంటే "కర్మలు కాలిపోయే అవకాశము ఉంది, పాపాలు క్షమించబడే అవకాశము ఉంది" అని ఆ రోజు ఆయన చెప్పాడు.


అదే రూలు ప్రకారము మేము కూడా చెప్పాలి. తర్వాత ఇంకొక మాట ఏమి చెప్పినాడంటే రొట్టెను ఇచ్చి ఇది నా శరీరము అన్నాడు. పానీయాన్ని ఇచ్చి ఇది నా నిబంధన రక్తము అని చెప్పినప్పుడు, నేను


---

చిమ్ముచున్న నిబంధన రక్తము అని చెప్పినప్పుడు మనకు అవగాహన రాలేదు అనుకోండి. ప్రక్కన్నే ఒక రొట్టెను ఇచ్చి ఇది నా శరీరము, దీనిని మీరు తినండి అన్నాడు. దానికి కొంతమంది ప్రక్కన ఉండేవాళ్ళు ఈయనేమి ఇట్లా మాట్లాడుతున్నాడు. తినండి అంటే ఎట్ల తినాలి? ఆయన శరీరాన్ని తింటే మనము జ్ఞానులము అవుతామా? ఆయన అసలుకు మతి చెడిపోయి చెప్తున్నాడు. ద్రాక్షరసాన్ని చూపి నా రక్తాన్ని త్రాగండి అంటాడు. రొట్టె నిచ్చి నా శరీరాన్ని తినమంటాడు అని అనుకున్నారు. మనకు అర్థము కానప్పుడు మనము ఏ రకంగనైనా అనుకోవచ్చు. ఆయనేమి చెప్పినాడంటే ఇది ‘చిమ్ముచున్న రక్తము’ అంటే ఈ రోజు ఆ రోజు ఎప్పుడూ చిమ్మబడతానే ఉంది. మరి ఈ రోజు ఆయన ఇచ్చిన రొట్టె లేదే మనకు. ఈ రోజు మనము జ్ఞానము చెప్పుకుంటున్నాము. ఇదీ ఆయన రక్తమే, ఆయన చిమ్ముచున్న రక్తమే అని నేను అనుకుంటున్నాను.


మళ్ళీ ఆయన ఇచ్చిన రొట్టె? ఎప్పటికీ ఉంటుంది కదా మనకు! ఇది మీకు ఇస్తున్నా ఇది నా శరీరము అని చెప్పినాడు కదా! దీనిని మీరు తినండి అన్నాడు, తింటే ఏమౌతుంది తింటే అందులో ఉండే రక్తము కూడా చిమ్మబడుతుంది. శరీరము నుండి ఊరికనే చిమ్మబడుతుందా రక్తము? నీవు ఏదో కత్తితో పొడిస్తేనే లేకపోతే రాతితో కోస్తేనో లేదా నోటితో కొరికితేనో వస్తుంది రక్తము. లేకపోతే ఊరికినే రాదు. ఇప్పుడు మనము రొట్టె ఇచ్చి ఆయన ఇది నా శరీరము అన్నాడు. ఇప్పుడు నా శరీరము అన్నప్పుడు దానిని ఏ విధముగా పోల్చుకోవాలి? సరే శరీరముగానే పోల్చుకుంటే శుద్ధపొరపాటు అయితాది, జ్ఞానమంతా చాటుగా చెప్పినటు వంటిది, ప్రత్యక్షముగా ఎక్కడా చెప్పరు. నీవు అర్థము చేసుకునేదాన్ని బట్టి నీ అవగాహన ఉంటుంది. నీకు పూర్తి శ్రద్ధ ఉంటే పూర్తి అర్థమౌతుంది.


---

శ్రద్ధ లేకపోతే అర్థము కాదు. బ్రహ్మము గారు తత్త్వాలు కూడ అట్లే చెప్పాడు. వేమన యోగి పద్యాలు కూడా అట్లే చెప్పాడు. ఖుర్ఆన్లో వాక్యాలు చాలా ఉన్నాయి ఇందులో ఎంతో నిదర్శనము ఉంది, ఎంతో గ్రహించుకోవాల్సినది ఉంది అని చాలా వాక్యాల్లో చెప్పారు. అట్లగానే బైబిలులో కూడా మనకు ఈ చిన్న వాక్యము రొట్టె నా శరీరము అన్నాడాయన, అంటే రొట్టె వేరు ఆయన శరీరము వేరు. ప్రత్యక్షముగా చూస్తే ఆయన శరీరము కాదు కానీ నా శరీరముతో పోల్చుకోండి, ఇది నా శరీరము దీనిని మీరు తినండి అన్నాడు. అప్పుడు మనకు ఈ రోజు ఆయన ఉన్నా లేకున్నా చిందింప బడుతున్న రక్తము అంటే ఆ రోజు చిందించబడతా వుంది మరియు ఈ రోజు చిందించబడతావుంది, ఎప్పటికీ చిందించబడతావుంది. ఎప్పటికీ ఆయన ఉన్నట్టే, ఎప్పటికీ ఆయన జ్ఞానము బయటికి ప్రవాహము లాగా చిందించబడతావుంది. కాని ఆ రోజు ఒక్క రోజుకే చెప్పిండేది కాదు. ఆ రోజు పోయిన తరువాత ఎప్పటికీ చిందించబడతావుంది జ్ఞానము. అది ఎప్పటికీ ఇట్లే ఉంటుంది ప్రజల మధ్యలో, కానీ ఆ రోజు చిందించబడుతుంది అని చెప్పినటువంటి జ్ఞానము ఏదైతే రక్తమో, ఈ రోజు కూడా చిందించ బడతావుంది అంటే బయటకు వస్తావుంది. ఎట్ల చిందించబడుతుంది? అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది రక్తము అంటే అది ఆకాశము నుండి రాదు. 


మనము బజారులోకి పోతే గొర్రెను కోసి, రక్తమును గిన్నెలో పట్టిస్తారు నీకు. కానీ ఇది అట్ట పట్టించేది కూడా కాదు. నీవై నీవు తీసుకునే దానికి ప్రయత్నము చేస్తే వస్తుంది. ఎట్ల తీసుకోవాలి? నీకు శరీరము చూపిస్తున్నాను, శరీరములో రక్తము ఉంది, తీసుకో అని చెప్తున్నాడు. శరీరములో రక్తము ఉంది. దోమలు శరీరమును తొండముతో కుచ్చి


----

సిద్ది బోధ

రక్తమును పీల్చుకుంటాయి. అప్పుడు ఎక్కడ నుండి దొరుకుతుంది దానికి రక్తము? శరీరము నుంచే దొరుకుతుంది. ఇంతకుముందు పూర్వము నల్లులుండేటివి అంటే మీరు చూసినారో లేదో కానీ మేము చూశాము. అవి కూడా శరీరము నుండి రక్తాన్ని పీల్చేటువంటివి. దోమలు, నల్లులు, జలగలు ఇవన్నీ శరీరము నుంచి దేని ఉపాయము కొద్ది అది రక్తము పీల్చుకునేవి. అది శరీరము నుంచి వాటికి పీల్చుకునేదానికొద్దీ వస్తావుంది. అలాగే నీవు ఎంత పీల్చుకుంటావో పీల్చుకో. అట్లగానే నల్లి ఉంది ఎంత తాగుతావో తాగు, దోమ ఉంది ఎంత తాగుతావో తాగు, అట్లగానే జలగ ఉంది ఎంత తాగుతావో తాగు, ఎంత లావు అవుతావో అవ్వు, ఎంతైనా రక్తము ఉంది. కానీ నీవు పీల్చుకో. తల్లి ఒడిలోకి పోయి ఎద మీద కూర్చుని పాలు పీల్చుకొని తాగితే వస్తాయి లేకపోతే రావు. నీకు ఆకలి తీరేదానికి పాలున్నాయి తల్లి దగ్గర. అవి నీవు పీల్చుకుని త్రాగితే వస్తాయి. తల్లి ఏమి

చేస్తుంది? ఇందులో పాలున్నాయి అని చూపించి త్రాగు అని నోటి వరకు పెట్టుతది కాని నేను త్రాగనంటే ఎవరేమి చేస్తారు దానికి? నీవు త్రాగే విధానము నీకుండాలి. నీవు ఆకలికొన్నానని నీ ప్రయత్నము నీకుండాలి.


ఆ రకంగానే దేవుడు ఏమి చేసినాడంటే చిందించబడే రక్తము నా శరీరములో ఉంది. మళ్ళీ నా శరీరాన్ని మీరు తినగలిగితే అంటే రంధ్రము పెట్టుకోగలిగితే రక్తము వస్తుంది. శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి ఈ రెండు ఎల్లకాలము జరిగేవే ఇవి. ఆ రోజు ఒక్క రోజుకే చెప్పాడా? ఆ రోజు ఒక్క రోజు చెప్పేదానికి ఆయన శరీరాన్ని తినమని చెప్పలేదు కదా! బ్రతికేవున్నాడు కదా ఆయన! నా రక్తము చిందించ బడుతున్నది, నా శరీరాన్ని మీరు తినండి, మీకు దొరుకుతుంది రక్తము అని చెప్పినాడా రోజు. నిగూఢ అర్థమును చెప్పాడు, ఇంకొక అర్థము


----

ఏమి లేదు. కాని ఆయన శరీరము ఏమిటి అంటే? ఈ రోజు కూడా మన మధ్యలో ఉంది. నీవు పీల్చగలిగితే దోమగా పీల్చుతావో, నల్లిగా పీల్చుతావో, జలగగా పీల్చుతావో చేతనైతే చేయి. నీవు క్రైస్తవునివైతే బైబిలు గ్రంథము, ముస్లీమైతే ఖుర్ఆన్ గ్రంథము, హిందువైతే భగవద్గీత. ఇప్పుడు నేను ముస్లీమును కాదు, క్రైస్తవుడిని కాదు, ఏ మతమూ నాకు లేదు. మరి నాకు? మూడు గ్రంథాలు కలిపిన గ్రంథము పెద్ద గ్రంథము. మీరు వేరువేరుగా చించుకున్నారు నేను చించలేదు. నాకు ఒకటే గ్రంథముగా ఉంది నేను అందులోనుండి సారమును తీసుకుంటున్నాను. అంటే నేను జలగగా తాగగలను, నల్లిగా పీల్చగలను, దోమగా రుచి చూడగలను. మీకేదీ చేతకాదు. అవుతుందా ఏమన్నా? శరీరములో రక్తములాగా గ్రంథములో జ్ఞానము ఉంది, దానిని పీల్చాలన్న విషయము కూడా

తెలియదు.


ఏసుప్రభువు రొట్టెను తన శరీరముగా పోల్చి, శరీరమును గ్రంథముగా పోల్చుకోమని నిగూఢముగా చెప్పాడు. గ్రంథాన్ని చెప్పినాడు, రక్తాన్ని దేనితో గ్రంథములోని జ్ఞానము రక్తము అని మనకు తెలియదు. శరీరములోని రక్తము గ్రంథములోని జ్ఞానమును అని తెలియదు. గ్రంథము నుండి జ్ఞానము రావలిసిందే కదా! ఇప్పుడు నీకు జ్ఞానమునకు మధ్యలో గ్రంథము ఉంది, నీకు గ్రంథమును దేవుడిచ్చిపోయినాడు. నీకు నీ గ్రంథము నుంచైనా జ్ఞానము రావాలి. గ్రంథము నుంచే నీకు జ్ఞానము రావాలంటే శరీరము నుంచే నీకు రక్తము రావాలి. శరీరము ఏది? గ్రంథము. మీరు ప్రొద్దున్న ఆ విషయమే చర్చించుకోలేదు. గ్రంథమనే మాటే రాలేదు. ఓ సందర్భములో ఆ విషయము చెప్పినాముగానీ మీరు నేను చెప్పిన జ్ఞానమును మర్చిపోయినారు. దేవుడు మనకు గ్రాహితశక్తి ఇచ్చినాడుకాని మనకు


---

ఎంత గ్రాహితశక్తి ఉంది అంటే ఒకరికి ఐదు పైసాలు, ఒకరికి పది పైసాలుంది, ఒకరికి పైసా ఉంది ఇట్లా పది పైసలు ఐదు పైసల దగ్గరే ఉన్నాము గానీ అర్థరూపాయి వరకు మనము పోలేదు. ఇంక ఎట్ల తెలుస్తుంది దేవుని జ్ఞానము. ఈ విధముగా మనము ఇక్కడికి వచ్చిన తరువాత కూడా, ఇంత జ్ఞానము తెలుసుకున్న తరువాత కూడా, మనము ఇన్ని గ్రంథాలు చదివిన తర్వాత కూడా, ఇప్పుడు మీకిది కొత్త విషయమే. నేను “దేవుని ముద్ర” అనే గ్రంథమును వ్రాశాము అదీ కొత్త విషయమే. అంతకుముందు “దేవుని చిహ్నము” అనే గ్రంథము వ్రాశాము, అదీ మీకు కొత్త విషయమే. ఇట్ల ఈ రకముగా మీకు కొత్త విషయములే తెలియబడుతున్నాయి పాత విషయాలేమీ చెప్పబడలేదు. ఎన్ని విషయాలు చెప్పినా గానీ ఇంకా చెప్పబోయేది ఉందిగాని ఇంతటితో ముగింపు అనేది లేదు. దేవుని జ్ఞానము సముద్రములాంటిది. తొందరగా అయిపోదు.


ఈ రోజు చాలామంది బోధకులు ఉన్నారు, వాళ్ళు తెలుసుకొని, ఇతరులకు బోధిస్తున్నారు. మళ్ళీ వాళ్ళు తెలుసుకొని ఇతరులకు బోధిస్తున్నా రంటే మనము బోధించేది తప్పా? రైటా? అని చూసుకుంటే సరే. ఇప్పుడు మనము బోధ ఎక్కడి నుండి చెప్తున్నాము 'గ్రంథము' నుండి చెప్తున్నాము. వాళ్ళు కూడా వినేది ఏదైనా ఎక్కడి నుండి వింటున్నారు? గ్రంథము నుండే వినాలి, అది వాళ్ళకు కూడా గ్రంథము నుండే దొరకాలి. నీవు చెప్తున్నావు సూచిస్తున్నావు గ్రంథములో ఉంది ఈ వాక్యము అని అంతేగాని ఇంకోటి ఏమి లేదు. అట్లగానే బైబిలు తీసుకున్నా, ఖుర్ఆన్ తీసుకున్నా, గీత తీసుకున్నా అందులో ఉండేటువంటి వాక్యాలతోనే నీవు జ్ఞానము తెలుసుకోవాలిగాని ఇంకొకటి ఏమీ కాదు. ఇప్పుడు నేను స్వయముగ జ్ఞానము చెప్పడము లేదు. భగవద్గీత శ్లోకాన్ని తీసుకొని చెప్తాను, బైబిలు వాక్యాన్ని తీసుకొని


---

చెప్తాను, ఖుర్ఆన్లోని ఆయతును తీసుకొని నేను జ్ఞానమును చెప్తున్నాగానీ స్వయముగా నా ఉద్దేశమును నేను చెప్పడము లేదు. ఎందుకంటే చెప్పే జ్ఞానము రక్తము. మీకు నేను రుచి చూపిస్తున్నాను. ఇట్ల చేయండి ఇట్ల చేయండి అని. నేను జ్ఞాన (రక్తాన్ని) ఇట్ల పీల్చ గలుగుతున్నాను మీరు కూడా ఇట్ల పీల్చండి అని చెప్తున్నాను. అది పీల్చేది ఏదో మీరు పీల్చాల్సిందే. నేనింకో రకంగా ఏమి చేసేదానికి లేదు, ఎవరంతకు వాళ్ళు పీల్చాల్సిందే జ్ఞానాన్ని, అంటే ఎక్కడి నుండి పీల్చగలుగుతారు? గ్రంథము నుంచి పీల్చాలి. అయితే మీకు ఆ గ్రంథములో ఉండే వాక్యాలేవో అంతూ పంతూ దొరకలేదు. అదే గ్రాహితశక్తి, అది కూడా దేవుడే ఇవ్వాలి.


ఇంతకుముందు మనము 'రాజవిద్య' అని చెప్పుకున్నాము కదా! రాజవిద్య అంటే గొప్పవిద్య, పెద్దవిద్య, అదే జ్ఞానము అని చెప్పుకున్నాము. సరే, ఇప్పుడు ఈ జ్ఞానము ప్రకారము మనము చెప్పుకుంటే ఇప్పుడు విద్యను నేర్పించేటటువంటి లిపి కూడా ఒకటుంటుంది. ఏ విద్యకైనా లిపి ఒకటుంటుంది. మనకు మొట్టమొదటి భాష తెలుగు భాషగా వచ్చింది అని చెప్పాము. అంటే ఆదిలో పుట్టినటువంటి భాష. తరువాత ఈ తెలుగు భాష ప్రపంచ వ్యాప్తముగ ఉండి, కుంచించుకుంటూ కుంచించుకుంటూ తగ్గుతా పోతా వచ్చింది అది. "ధర్మశాస్త్రము ప్రకారము ఏదైనాగాని అణిగిపోతా వస్తుందన్నమాట, పుట్టింది పుట్టినట్లు ఉండదు”. సరేలే, తర్వాత ఎన్నో భాషలు పుట్టాయి. ఇన్ని భాషల్లో పెద్ద భాష ఏది? అని మనము లెక్కేసుకుంటే ఏదో ఒక భాష ఉండాలి. ఇప్పుడు ఇన్ని విద్యల్లో గొప్పవిద్య ఏది? అని మనము లెక్కేసుకుంటే ఏది ఇన్ని విద్యల్లో? దేవుని విద్యయే పెద్దది, దేవుని జ్ఞానమే పెద్దది. కాబట్టి ఇప్పుడు మనము దేవుని జ్ఞానానికంటే పెద్ద జ్ఞానము లేదని, ఆ విద్యకంటే పెద్ద విద్య లేదని అనుకుంటున్నాము.


---

మనము దాంట్లో ఇప్పుడు ప్రపంచములో కూడా మనము జ్ఞానమా, అజ్ఞానమా అని పోల్చుకొని చూస్తే ఇప్పుడు ప్రపంచములో విద్యలు అంటే చదువులు ఉన్నాయి. మనకు లెక్కేసుకుంటే భాషలు ఉన్నాయి. విద్య అంటే ఇదే జ్ఞానమే అనుకోండి. భాషలుండాయి ఈ భాషల్లో ఏది పెద్ద భాష? అంటే పూర్వము అంతో ఇంతో జ్ఞానము తెలిసినోడు, భగవద్గీతలో జ్ఞానయోగములో ఒక శ్లోకము చెప్పినాడు. శ్లోకములో దేవుడు నేను నాలుగు విధముల మనుషులను తయారు చేసినాను అనుచు "కర్మ గుణ విభాగశః" అన్నాడు. కర్మలనుబట్టి, గుణాలను బట్టి విభజిస్తే నాలుగు రకాలుగా నేను జీవరాసులను సృష్టించాను అని చెప్పాడు. కానీ అక్కడ నాలుగు రకాలు అన్నాడు, కాబట్టి నాలుగు రకాలుగా ఉండే భాషను మనము సృష్టిస్తే అది రాజ భాష అవుతుంది అని ఒక ప్లాన్ వచ్చింది మనిషికి. సరేలే, ఏమి చేసినాడంటే మొట్టమొదట ఆ భాషను కనిపెట్టడములో కొన్ని అక్షరాలు వ్రాసి ఈ అక్షరాలన్నీ ఒక రకము అని పెట్టాడు. మళ్ళ అదే అక్షరాలనే ఇంకొక రకముగా మార్చి వ్రాశాడు. ఈ అక్షరాలన్నీ ఒక రకము అని పెట్టినాడు.. అంటే ఇది తిక్క వ్యవహారము ఏమి కాదుకాని ఇప్పుడు మనమంతా దాంట్లోనే ఉన్నాము. మళ్ళ తరువాత మూడు రకాలుగా వ్రాసిన తరువాత నాలుగవ రకము కూడా వ్రాశాడు. అంటే మాకు తెలియదు నీవు చెబుతున్నావు అని మీరు అనుకోవచ్చు.


మనము వింటున్నాము. A,B,C,D లు ఉన్నాయి. ఒక రకము "అది. అదే A,B,C,D లు రెండో రకమున్నాయి. అదే A, B, C, D లు మూడో రకమున్నాయి. అదే A,B,C,D లు నాలుగో రకమున్నాయి. మీకందరికీ తెలుసు కానీ కొన్ని ముఖ్యమైన పేర్లకంతా పెద్ద అక్షరాలు మొదటి రకము వాడతాము. అచ్ఛుకంతా రెండో రకము వాడతాము. చేతి


-----

వ్రాత అంతా నాలుగో రకము వాడుతాము. ఈ రకంగా వాడుతున్నా మన్నమాట. ఈ ఒకే భాష లిపి నాలుగు విధాల వుంది కాబట్టి ఇది రాజభాష అయిపోయింది. ప్రపంచమంతా ఉంది. అంటే నా ప్లాన్ సక్సెస్ అయింది అనుకున్నాడు మనిషి. ఇప్పుడది ఆ దేశము ఈ దేశము అనుకోకుండా ప్రతి మనిషి అంతో ఇంతో దానిని పట్టుకొని ఊగులాడుతున్నాడు. ప్రతి దేశము దానిని పట్టుకొని ఊగులాడుతావుంది అదే ఆంగ్లభాష, ఆంగ్ల భాషలో అన్ని నాలుగు రకాల అక్షరాలున్నాయి. ఏ భాషకైనా ఉన్నాయా అట్ల? లేవు. ఏ భాషలో ఆ రకముగా పోల్చలేదు. తయారు చేసినోడు జ్ఞాని. నాలుగు రకాలుగా తయారు చేస్తే బాగుంటుంది అని విభజన చేసి చేశాడు. దేవుడు నాలుగు భాగాలుగా ఉన్నాడని జ్ఞానము తెలిసి, నాలుగు భాగాలుగా ఉండేటటువంటి దేవుని భాగాలను మనము నాలుగు భాగాలుగా భాషను తీర్చితే ఆ భాష దేశానికంతా ప్రాముఖ్యము అవుతుంది. ఈ జ్ఞానము ఎట్లైతే ప్రపంచానికంతా ప్రాముఖ్యముగా ఉందో, పెద్దదిగా ఉందో ఆ భాష కూడా ప్రపంచానికంతా పెద్దగా ఉంటుంది అనే ఉద్దేశ్యముతో ఆ రకముగా వ్రాయడము జరిగినది అతను. ఆ రకముగా ఈ రోజు అది ప్రపంచ వ్యాప్తముగా ఉంది మనకు. మనకు తెలియకున్నా దాని వెంటబడి నేర్చుకుంటున్నాము దానిని మన దేశములోనే ఎన్నో భాషలు లిపిలో ఉన్నాయి. మళ్ళీ ఈ భాషల్లో ఎందుకు వ్రాసుకోవడము లేదు? మిగతావాటిని పెద్ద భాష అని ఎందుకు అనడము లేదు? ఒకే ఒక ఆంగ్ల భాషనే ఎందుకు పెద్దది అంటున్నాము? దానివెంట ఎందుకు పడుతున్నాము మనము?


ఈ రకంగ మనము లెక్కేసుకొని చూస్తే ఒక ప్రతిపాదిక మీద దేవుని జ్ఞానాన్ని ఆధారము చేసుకొని దేవుడు నాలుగు భాగాలుగా ఉన్నాడు అని ఎక్కడైతే సృష్ఠి నాలుగు రకాలుగా ఉంది అని చెప్పినాడో సర్వులనూ


---

నేను నాలుగు రకాలుగా సృష్టించినానని ఆ రకంగానే దేవుడు కూడా నాలుగు భాగాలుగా ఉన్నాడని, అదే ప్రకారమే ఈ అక్షరాలను కూడా నాలుగు రకాలుగా తయారు చేస్తాము అని తయారు చేశారు. నాలుగు రకాల అక్షరాలు అవసరము లేదు మనిషికి. ఒక జాతి అయితే సరిపోతుంది కదా! సరిపోతుంది కాని అది రాజ భాషగా ఉండాలంటే, ప్రపంచవ్యాప్తముగా ఉండాలంటే దానిని నాలుగు రకాలుగా తీర్చిదిద్దితే సరిపోతుందని నాలుగు రకాలుగా తయారు చేయడము జరిగింది. ఆ పవర్ ఆ భాషకు వచ్చి ఈ రోజు ఆ భాష ప్రపంచవ్యాప్తముగా ఉంది. ఇట్ల మనము లెక్కేసుకుంటే యోచనాశక్తి ఒక మనిషిలో వచ్చిన దానివలన ఈ భాషకు కూడా కొంత ప్రాధాన్యత వచ్చింది. ఆ రకంగానే మన దైవ గ్రంథములలో ఉండేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే కూడా మనకు కొంత అవగాహనా శక్తి రావాలి. అవగాహనాశక్తి మనలో ఎట్ల లోపించింది అని చూస్తే ఎప్పుడైతే రొట్టె ఇచ్చి నా శరీరము అన్నప్పుడు దాన్ని ఇంతవరకు మనము గుర్తించలేదు. ఇంతవరకు ప్రపంచము అంటే క్రైస్తవ మతము తయారైనప్పటి నుండి శరీరము అంటే గ్రంథము అనేటటువంటి మాటే మనకు అర్థము కాలేదు. రక్తము అంటే జ్ఞానము అనేది కూడా తెలియలేదు. ఈ మధ్యన నేను ఏమి చేశామంటే అట్ల రక్తము కాదురా నాయనా! ఇది మీరు పొరపాటు పడుతున్నారు అని చెప్పడము జరిగింది. కొంతవరకు కొంతమందికి దాని ధ్యాస వచ్చింది ఇది రక్తము కాదు జ్ఞానము అని అట్లగనే ఇది రొట్టె కాదు ఆయన శరీరము కాదు అది గ్రంథము అనేటటువంటి జ్ఞాపకాన్ని మీరు తెచ్చుకోండి. అట్ల అవగాహన మనము ఏర్పరచుకొన్నప్పుడు అక్కడ చెప్పినటువంటి వాక్యములోని సత్యము తెలిసిపోతుంది. ఇప్పుడు మనకు ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయములో 26, 27, 28 వాక్యాలు మీరు


--

చదివినారు కదా! ఒకసారి చదివి దానికి అర్థము మీరు చెప్పండి “వారు భోజనము చేయుచుండగా, ఏసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరము” అని చెప్పెను.


ఇప్పుడు మీరెంతమటుకు అర్థము చేసుకున్నారు దానిని? ఇప్పుడు గ్రంథము అని అర్థము చేసుకున్నారు గ్రంథము ఎప్పటికీ ఉంటుంది. దానిలో జ్ఞాన రక్తము ఎప్పటికీ ఉంటుంది. ఇది ఆ ఆ రోజు అప్పుడు ఇచ్చినది కాదు. ఎప్పటికీ ఆయన ఇచ్చినట్టే ఉంటుంది. మీరు దీనిని గ్రహించవచ్చును అనే ఉద్దేశ్యముతో చెప్పాడాయన. 'చిందించుచున్న రక్తము' అనే పదము ఎప్పుడైతే చెప్పుచున్నాడో అప్పుడు జ్ఞానము 'ఇచ్చుచున్న గ్రంథము' అని అనుకోవాలి. అదే గ్రాహితశక్తి అంటే. ఆ గ్రాహితము అనేదే మనకు లేకపోతే మనము ఏమనుకుంటామంటే దానిని రొట్టె అనో లేకపోతే ఆయన శరీరమనో అనుకుంటాము. అట్లే అది పానీయమనో రక్తమనో అనుకుంటాము. కాని పానీయమూ కాదు రక్తము కాదు. "పానీయాన్ని రక్తముతో పోల్చి చెప్పినాడు జ్ఞానాన్ని, రొట్టెను శరీరముగా పోల్చి చెప్పినాడు గ్రంథాన్ని” అనేటటువంటి చూపుతో ముందుకు పోవాలి. అదే ముందు చూపు అంటాము. ఇంతకుముందు కొంతమంది శిష్యులు అక్కడ ప్రక్కన ఉండేవాళ్ళు ఈయన శరీరాన్ని తినమంటాడు, రక్తాన్ని తాగమంటాడు అని అనుకున్నారు కదా! అంటే అర్థము కాని పరిస్థితుల్లో అట్లే అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా! ఇప్పుడు అర్థము చేసుకున్నాక ఎట్లుంది? మీకు సంతోషమైతుందా లేదా చెప్పండి? ఇది ఇప్పుడు మీ దగ్గర ఉండే గ్రంథాన్ని ఏమంటాము. భగవంతుని శరీరమయ్యా! నీవు పట్టుకున్నావు. నీ దగ్గర ఉంది అది. అందులో ఆయన రక్తము ఉంది. నీవు ఎట్ల తీసుకుంటావో తీసుకో. అంటే ఆయన ఇచ్చిన గొప్పతనము చూడు ఎంత బాగుందో!




నా రక్తము నా శరీరము అని చెప్పినప్పుడు ఆయన రక్తము అదే. ఆయన శరీరము అదే. ఆయన శరీరములో రక్తము లోపల ఉంది. నీవు గ్రహించుకుంటే ఉంది లేకపోతే లేదు. అంటే గ్రహించుకుంటేనే కదా వచ్చేది అది. అక్షరాల రూపములో ఉంది కానీ అది గ్రహించుకుంటే నీకు దాని రుచి దొరుకుతుంది. ఇప్పుడు నాకు ఆ రుచి దొరికింది. నేను చెప్తున్నాను. ఒరేయ్! నేను జ్ఞాన రక్తమును గ్రంథమను శరీరము నుండి జలగవలె త్రాగుతున్నాను, మీరు త్రాగండి అని చెప్తున్నాము. సరేలే, మీకు కూడ తొండాలుండాయి. మీరు వాటిని మడిచి పెట్టుకున్నారు తొండాలను. మీరు పదునుపెట్టి గ్రంథములో కుచ్చి చూడండి. కుచ్చి చూస్తే అందులో ఉండే సారాంశము అర్థము అవుతుంది. గ్రంథములో ప్రతి వాక్యము జ్ఞానముతో కూడబడివుంది. మెయిన్ సబ్జెక్టు అక్కడ ఏమి చెప్పినాడు? ఇది నా శరీరము ఇది నా రక్తము అని ఎప్పుడో ఏసుప్రభువు వారి శిష్యులను కూర్చొబెట్టి చెప్పినాడు అనుకోవద్దండి. ఇప్పుడు మిమ్మల్ని కూర్చొబెట్టి కూడా చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు మీ దగ్గర ఉండేది నా శరీరము. అందులో రక్తము ఉంది చూడండి అని. అంతకంటే ఏమి కావాలి మనకు? ఆ రోజు నేను చెప్పిపోతే మీరు అర్థము చేసుకోలేదేమోనని మనకు ఈ రోజు జ్ఞాపకము చేసినాడు. చేయలేదా? చేశాడు. ఇప్పటినుండి ఆ దృష్టితో మీరు చదవండి, మీకు జ్ఞానము ఎందుకు గ్రాహితము కాదో!


ఇప్పుడు మనము ఖుర్ఆన్లోకి వచ్చి చూస్తాము అది ఒక మతము, ఒక గ్రంథము అనుకోకూడదు. మనకు అన్నీ సమానమే. ఖుర్ఆన్లోకి వచ్చిన తరువాత 3వ సూరా 18వ ఆయత్లో మీకు ఆరాధ్యదైవము' అని చెప్తున్నాడు. అని ఎవరు చెప్తున్నారు? స్వయానా దేవుడే స్వయముగా అల్లాహ్ ‘ఈయనే ఈయనే మీకు ఆరాధ్యదైవము చెప్తున్నాడు. మీరు గమనించు



కోండి బాగా. మీ బుర్రలు వెనక్కి తిప్పి చూసుకోండి. దేవుడు ఏమి చెప్తున్నాడు? ఈయనే ఆరాధ్యదైవము అని చెప్తున్నాడు. ఇంకా దేవదూతలు ఏం చెప్తున్నారు? ఈయనే మీకు ఆరాధ్యదైవము అని వాళ్ళు కూడా చెప్తున్నారు. సరే, జ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు జ్ఞానాన్ని సంపూర్ణముగా ఆర్జించి, పెద్ద ధనికులుగా ఉండేటటువంటి వాళ్ళు కూడా అదే చెప్పారు. స్వయానా అల్లాహ్ ఏమి చెప్తున్నాడంటే "ఈయనే మీకు ఆరాధ్యదైవము, ఈయన తప్ప వేరే ఆరాధ్యదైవము లేనే లేడు ఈయనే మీకు సర్వమును సృష్టించిన సృష్టికర్త. ఈయనను తప్ప ఎవరిని ఆరాధించవద్దండి” అని చెప్పాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు నన్ను కూడా ఆరాధించవద్దండి, ఈయననే మీకు ఆరాధ్యదైవము, ఈయన ఒక్కడే మీకు ఆరాధ్యుడు, ఈయనను తప్ప ఎవరినీ ఆరాధించ వద్దండి అని స్వయానా అల్లాహ్ చెప్పాడు. ఏ అల్లాహ్ ఏ అల్లాహ్ను గురించి చెప్పాడు? ఇక్కడ ఇద్దరు అల్లాహ్ లు ఉన్నారు కదా! అయితే ముస్లీమ్లు ఇంతవరకు ఒకే దేవుడు అంటున్నారు.


ఆరాధించ వలసిన ఒకే దేవుడు ఎవరు? అట్లు ఆరాధించమని చెప్పిన దేవుడు ఎవరు? అల్లాహ్ ఎవరిని ఆరాధించమని చెప్పాడు? ఇప్పుడు అందరికీ గందరగోళమే! అట్లుందా? అని హిందువులనుకుంటారు. ఇట్లుందే అని ముస్లీమ్లనుకుంటారు. ఇట్లా ఉంది అని క్రైస్తవులు కూడా అనుకుంటారు. క్రైస్తవులు ఆశ్చర్యపడాల్సిన పని లేదు ముందే చెప్పినాడు ఆయన. 1400 సంవత్సరాల పూర్వము ఖుర్ఆన్ పుట్టితే, 2000 సంవత్సరాల పూర్వము బైబిలు పుట్టింది. అందులో ముందే చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనము నుంచి చూడండి (ఆదినారాయణ పాస్టర్గారు బైబిలులోని వాక్యము చదువుతుండగా, మేము తెలిపిన వివరమును క్రింద చూడగలరు.)



---

పాస్టర్ : “తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తన కిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడుగాని, తండ్రిని ఘనపరచునట్టుగా అందరునూ కుమారున్ని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు” 


మేము : సర్వాధికారము కుమారునికి ఇచ్చాడు, తీర్పు తీర్చే సర్వాధికారము కుమారునికి ఇచ్చాడు తనవలె తన కుమారుడు ఉండవలెననే ఉద్దేశ్యముతో పరిశుద్ధాత్మ చేసినాడు. చదువు ఇంకా చదువు.


పాస్టర్ : "కుమారునిని ఘనపరచని వాడు ఆయన పంపిన తండ్రిని ఘనపరచడు.”

మేము : అంటే ఆయన చూపించిన దేవున్ని మ్రొక్కకపోతే నన్ను మ్రొక్కనట్లే! నన్ను ఆరాధించనట్లే! నేను చూపించిన మీ దేవున్ని మీరు మ్రొక్కాలి అని కూడా పెద్ద దేవుడు చెప్పాడు.


పాస్టర్ : "నా మాట విని మీరు నన్ను పంపిన వానియందు విశ్వాసము ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి” పోతారు.


మేము : వాడు మోక్షము పొందుతాడని చెప్పారక్కడ.


అక్కడ ఏముంది అంటే తండ్రికి ఇచ్చినటువంటి గౌరవము ఏదైతే ఉందో అలాగే కుమారునికి ఇవ్వమని చెప్పాడు. ఎవరు చెప్పినేది? స్వయానా తండ్రే చెప్పాడు. “నన్ను ఘనపరచినట్లు నా కుమారున్ని ఘనపరచవలెను” అని. నన్ను మీరు ఆరాధ్యదైవము అనుకుంటున్నారు కదా! నన్ను ఆరాధించవద్దండి. నా కుమారున్ని ఆరాధించండి అని చెప్పాడు. ఎవరు చెప్పినేది? తండ్రి. అసలైన దేవుడు ఏమి చెప్పాడంటే నన్ను ఘనపరచినట్లే


---

నా కుమారున్ని ఘనపరచండి, నా కుమారున్ని ఘనపరచనివాడు నన్ను ఘనపరచనట్లే అంటే నా కుమారున్ని ఆరాధించకపోతే నన్ను ఆరాధించనట్లే, నా కుమారున్ని ఆరాధిస్తే నన్ను ఆరాధించినట్లే అని చెప్పాడు. ఇప్పుడు అల్లాహ్ అదే వాక్యమే ఇక్కడ చెప్పినాడు 3వ సూరా 18వ ఆయత్లో స్వయానా అల్లాహ్ ఏమి చెప్తున్నాడంటే “ఈయనే మీకు ఆరాధ్యదైవము, ఈయన్నే మీరు ఆరాధించండి” అన్నాడు. ఈ ఆయత్ ముస్లీమ్ లోకానికి అర్థమయిందా? ఇప్పుడు మనమేమి చెప్తున్నామంటే ఇది మనము తెలుసుకొని ముందుకుపోవాలి ప్రతి మనిషి. దేవుని జ్ఞానము అర్థము కావాలని చెప్తున్నాను కాని ఇంకొక రకంగా ఏమి కాదు. ఈ మతము పెద్దది. ఈ మతము తక్కువ అని కాదు. అన్ని మతాల్లోనూ దేవుడు ఉన్నాడు. అన్ని మతాల్లోనూ వాక్యము ఒకటేనూ. ఈ మతములో ఇక్కడ చెప్పిన వాక్యము ఒకటే, అక్కడ చెప్పిన వాక్యము ఒకటే అనే ఉద్దేశ్యముతో నేను చెప్తున్నాను. అంటే ఇక్కడ చెప్పినేది వీళ్ళకు అర్థము కాలేదు, అక్కడ చెప్పినేది వాళ్ళకు అర్థము కాలేదు. ఇప్పుడు ఇది క్రైస్తవులకు అర్థము అయ్యిందా? నన్ను ఘనపరచినట్లే నా కుమారున్ని ఘనపరచండి అంటే ఎవరిని ఘన పరుస్తున్నారు? ఒక్కరినే వీళ్ళు ఘనపరుస్తుండేది. ఒక్కరిని ఘనపరుస్తున్నారా? ఇంకొకరిని ఘనపరుస్తున్నారా?


మీ దృష్ఠిలో ఇద్దరు దేవుల్లున్నారా? లేరు. అందరూ ఒకడే దేవుడు అంటున్నారు. ఇంతవరకు, క్రైస్తవుల్లో ఎవరైనాగానీ. యెహోవా దేవుడు ఒకడే అంటున్నారు. అల్లాహ్ దేవుడు ఒకడే అంటున్నారు ముస్లీమ్లు. ఇప్పుడు అక్కడ ఇద్దరు అల్లాహ్ లు అయినారు. ఇప్పుడు ఏ అల్లాహ్ కు మీరు మ్రొక్కుతున్నారు? అని ఇప్పుడు క్రైస్తవులను అడిగితే సందిగ్ధములో పడుతున్నారు. ఇప్పుడు యెహోవా అని ఎవరినైతే అంటున్నామో యెహెూవా


---

దేవుడు ఏమి చెప్పాడు? “నన్ను ఘనపరచినట్లే నా కుమారున్ని ఘనపరచండి, నా కుమారున్ని ఘనపరచనటువంటి వాడు నన్ను ఘనపరచనట్లే” అని చెప్పినాడు కదా! అప్పుడు ఏమని అర్థము అయింది? ఆయన కుమారున్ని ఘనపరచమనే కదా చెప్పినేది! రెండో అర్థమేమి లేదు కదా! ఇక్కడ కూడా అదే గదా చెప్పినేది! ఇప్పుడు అవగాహన లోపము ఏర్పడి పూర్తి విచక్షణ మనకు రాలేదు. గ్రాహితశక్తి మనకు తక్కువ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు 3వ సూరా 18వ ఆయత్ మీ ఇంటికి పోయి, ఖుర్ఆన్ గ్రంథము తీసుకొని, ఒక్కసారి కాదు పదిసార్లు చింత చేయండి. ఇక్కడ నేను చెప్పినేదే కరెక్టు అని అనుకోవద్దండి మీరు. ఇంటికి పోయి మీరు ఆలోచన చేయండి ఏమి అర్థమౌతుందో మీరు చూడండి. అట్లాగనే మీరు కూడా (క్రైస్తవులు) మీ ఇంటికి పోయి యోహాను సువార్త 5వ అధ్యాయములో 21 నుండి 27 వరకు ఉండే వచనాలు చూడండి. మీకు అర్థమౌతుంది అక్కడ ఏమి చెప్పినారో. తండ్రి ఎవరు? కుమారుడు ఎవరు? అని తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ అల్లాహ్ ఏ అల్లాహ్ ను గురించి చెప్పినాడు? అనేది మీకర్థమౌతుంది. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకు దేవుడు గ్రంథము ఇచ్చాడు. ఇది నా శరీరము నా రక్తము ఇందులో ఉంది, మీరు త్రాగండి మీకు ఎంత

కావలసివుంటే అంత త్రాగండి, నా రక్తమే మీ పాప క్షమాపణ చేస్తుంది. మీ పాపాలను పోగొట్టుకోవాలంటే నా రక్తము అవసరము.


గ్రంథము నుండి మీకు జ్ఞాన రక్తము చిందించబడుతుంది, మీకు దొరుకుతుంది. నా జ్ఞానములో మీ కర్మలు పోయేటటువంటి రక్తము ఉంది, మీరు త్రాగండి అని అంటే మీకు అర్థము కాలేదు. నీవు ప్రయత్నము చేయి గ్రంథము నుండి రక్తము చిందుతావస్తుంది. నీవు అసలు గ్రంథము అనేది దేవుని శరీరము అని, గ్రంథములో ఉండే జ్ఞానమే దేవుని రక్తము


---

అని అదియే క్షమాపణ రక్తము అని మనకు తెలియకపోతే ఎట్లా? దేవుడు క్షమాశీలుడు అని చాలాచోట్ల చెప్పాడు. ఆయన దయ ఏమి? ఆయన క్షమాశీలత ఎక్కడ ఉంది? గ్రంథములో ఉంది. నీవు నా జ్ఞానము తెలుసుకుంటే క్షమాశీలత దొరుకుతుంది అన్నాడు. గ్రంథములో చూస్తే ఈ గ్రంథాన్ని అర్థము చేసుకుంటే ఈ గ్రంథములో ఉన్నది చూసి తెలుసుకుంటే దీంట్లోనే నీకు దొరుకుతుంది అన్నాడు. మళ్ళీ గ్రంథములో చూస్తున్నామా? ఎక్కడ చూస్తున్నాము? ఆ క్షమాశీలత ఏందో గ్రంథములోనే దొరకాలి కదా మీకు! ఇక్కడ కూడా నీకు ఆ క్షమించబడే రక్తమైనా గ్రంథములోనే దొరకాలి కదా మీకు! మళ్ళ గ్రంథాన్ని ప్రక్కన పెట్టి చూపాకారానికి గ్రంథాన్ని పెట్టుకొని, ప్రార్థన చేస్తే సరిపోతుందా? నీకు ప్రార్థన ముఖ్యమా? గ్రంథములోనున్న వాక్యము ముఖ్యమా? వాక్యాన్ని అర్థము చేసుకోవయ్యా! పదిసార్లు ప్రార్ధన చేసేదానికంటే ఒక్కసారి వాక్యాన్ని అర్థము చేసుకో, నీకు ఎంత జ్ఞానము వస్తుందో చూద్దాము. మీరు ప్రార్థన చేసేదానికంటే అల్లాహ్ ఇచ్చినటువంటి ఆయన్ను ఒక్కమారు అర్థము చేసుకోండి చాలు.


మీరు అల్లాహ్ ఇచ్చిన ఆయత్నే ఈ భాషలో చదవకూడదని, అర్థముకాని భాషలో చదివి, అర్థము కాకుండా శాపము పెట్టుకున్నారు మీకు మీరే. అర్థముకాని భాషలో చదవాలని మీ పెద్దలు చెప్పితే వారి మాటలు ఎందుకు వినాలి? దేవుని జ్ఞానము అర్థము కావాలని ఉందా? పెద్దల మాటలు అర్థము కావాలని ఉందా? మన జీవితము ఇది. ఈ పొద్దు ఉంటాము, రేపు చచ్చిపోతాము. ఇప్పుడు పుట్టినాము, కొన్నాళ్ళకు మనము చచ్చిపోతాము. ఇప్పుడు చెప్పిన పెద్దలు మన వెంట వస్తారా? ఎవరూ రారు. ఈ దేవుని జ్ఞానాన్ని నీవు తెలుసుకునే దానికి ప్రయత్నము


---

చేయి ఎవరో వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు. ఇట్ల చదవకూడదు, అట్ల చదవకూడదు అని అంటే ఎలా? మీరు అసలుకు ముట్టుకోనే ముట్టుకోకూడదు గ్రంథాన్ని అని అంటే నీకెట్లా వస్తుంది జ్ఞానము? నీవు ఎట్ల క్షమించబడతావు? దేవుడు ఏమి చెప్పినాడు? నీకు క్షమాపణ గ్రంథములో ఉంది. గ్రంథములోని జ్ఞానము వల్ల క్షమించబడుతుంది. మళ్ళ ఇవన్నీ తెలుసుకునే నిమిత్తము దేవుడు మనకు మూడు గ్రంథాలు వచ్చినాయి. అయితే మూడు గ్రంథాలూ అర్థము కాలేదు. దాని గురించి మళ్ళ ఇప్పుడు చెప్పితేగానీ కుదరదు. అంటే ఎవరో ఒకరు చెప్పాలి, మాలాంటి వాళ్ళు చెప్తే అర్థమౌతుంది.


మేము ఇప్పుడు చెప్పుమాట ఒకనికి మంచిగా కనిపిస్తుంది, ఒకనికి చెడ్డగా కనిపిస్తుంది. నీవు మా మతమే కాకుండా వేరే మతము బోధిస్తున్నావు అనుకుంటున్నారు. రకరకాలు అనుకుంటున్నారు. ఇక్కడేమన్నా మతాన్ని బోధిస్తున్నానా నేను? అన్ని మతాలకు సంబంధించిన విషయమును (జ్ఞానమును) చెప్తున్నాను. ఈ మతము పెద్దది, ఈ మతము చిన్నది అని చెప్పలేదు. మూడు గ్రంథాలు కలిపి ఒకటే గ్రంథమే అని చెప్తున్నాను. మూడు గ్రంథాల్లో ఉండేది ఒకటే జ్ఞానము అని చెప్తున్నాము. మీరు అర్థము చేసుకుంటే మీకు క్షమాపణ దొరుకుతుంది అని చెప్పాను. మీరు రోగాలు అనుభవిస్తున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ పాపాలతో కూడుకున్నటువంటి శ్రమలు. ఈ పాపాలతో కూడుకున్నటువంటి శ్రమలు తప్పిపోవాలంటే మీకు జ్ఞానము కావాలి. నీవు జ్ఞానము తెలుసుకుంటే ఈ కర్మలు నీకు అడ్డము లేకుండాపోతే నేరుగా దేవుని దగ్గరకు చేరొచ్చు. దేవుని దగ్గరకు చేరేదానికి ఇది మార్గము.


---

నా

దేవుని దగ్గరకు చేరాలంటే కర్మలు లేకుండా పోవాలి. కర్మలు లేకుండా పోవాలంటే జ్ఞానము కావాలి. జ్ఞానము కావాలంటే గ్రంథము నుంచే కావాలి. ఇప్పుడు నేను చెప్పినా, మా నాయన చెప్పినా, మా తాత చెప్పినా, ఎవరు చెప్పినా గ్రంథములోనిది చెప్పాల్సిందే గాని ఇంకొకటి చెప్పేదానికి కాదు. ఇప్పుడు నేను గ్రంథములోదే చెప్పుచున్నాను. ఇక్కడ వ్రాసే గ్రంథాలన్నీ దేనిని గురించి చెప్తున్నాయి. నేను దేవుని గ్రంథమును శరీరముగా, దేవుని రక్తాన్ని జ్ఞానముగా చేసి చెప్తున్నాగాని ఇంకొకటి కాదు. ఇప్పుడు నా గ్రంథాల్లో ఉండేదంతా దేవుని శరీరములో ఉండేదే. గ్రంథాలన్నీ దేవుని శరీరమే. నా గ్రంథాలలో ఉండేదంతా దేవుని శరీరములో ఉండేటటువంటి రక్తమే ఉంది, ఇంకొకటి ఏమి లేదు, నీకు అక్కడ అర్థము కానిదేదైతే ఉందో ఎక్కడైతే దారితప్పి పోయినా నిన్ను ఆ దారి మళ్ళించడానికోసమే ఇవి వ్రాయబడినాయి. నీవు అలా అర్థము చేసుకుంటే నీకు లాభము ఉంది. అర్థము చేసుకోకపోతే ఏమి ప్రయోజనము లేదు. నీవు ఎట్లుండేవాడివో అలాగే ఉంటావు. పుట్టావు, పెరుగుతున్నావు, దినాలు గడిచిపోతున్నాయి, వయస్సు అవుతోంది, సంవత్సరాలు సంవత్సరాలు గడిచి పోతున్నాయి, ఇంకాకొన్నాళ్ళు అయ్యాక ముసలోళ్ళమౌతాము, ఇంకా కొద్ది రోజులు పోయాక ఒకరోజు చనిపోతాము. అది మామూలుగా అందరికీ జరిగే పనే, కొత్తదేమి కాదు.


ఎవ్వడు పుట్టినాగానీ, దేవుడు వచ్చి పుట్టినాగానీ చనిపోవలసిందే. కానీ దైవగ్రంథాలలో ఉండేటటువంటి విషయము ఎందుకు తెలియకుండా పోయింది. మనకు అంటే దేవుని మీద ధ్యాస లేదు. దేవుని మీద శ్రద్ధ లేదు. మరి మన శ్రద్ధ అంతా ప్రపంచ విషయాల మీద, ప్రపంచ ధనము మీద ఉంది. మనము బ్రతికేదానికి ప్రాకులాడుచు, దానిని గురించి


---

చింతిస్తున్నాము తప్ప ఇంకొకటి ఏమీ లేదు. మనము బ్రతికేదానికి ముందే కర్మ నిర్ణయమై ఉంది. దానిప్రకారము మనము బ్రతుకుతున్నాము అనేటటువంటి ధ్యాస మనకు తెలియకుండా పోయింది. జ్ఞానము ద్వారా మనము తెలుసుకుంటే సత్యము తెలుస్తుంది. జ్ఞానము తెలుసుకునేదానికి మనము ప్రయత్నము చేస్తాము. అప్పుడు మనము ముందుకు ముందుకు పోయేదానికి అవకాశము ఉంటుంది లేకపోతే అవకాశము ఉండదు. ఈ గ్రాహితశక్తి లోపము వలననే మనము ఇట్ల వెనకబడిపోయినాము అనే విషయము మనకు ఇప్పుడు అర్థము అయినది. మళ్ళీ మనము ముందుకు పోవాలంటే నీకై నీవు ఆలోచన చేయాలి. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ సమాజానికి తెలుసునా? మీకు తెలియదు, వాళ్ళకు తెలియదు.


మా పెద్దలుండారు, మా పెద్దలు చెప్తారు, బోధకులకే ఆ అవగాహన లేనప్పుడు, ఎట్ల చెప్తారు మీకు? నీవు బోధకులను పట్టుకున్నావంటే వాడేమి చెప్తాడంటే శరీరము శరీరమే అంటాడు, అది రక్తము రక్తమే అంటాడు. అంతెందుకు మీకింత వరకు ఏమర్థమైంది? ఏసుప్రభువు రక్తముతో కడగాలి అని చెప్తున్నారు తప్ప ఇంకొకటి ఏమి లేదు. అభిషిక్తుడు కావాల, అభిషిక్తుడు అంటే కడగబడినటువంటి వాడు. ఏసుప్రభువు రక్తముతో మనము కడిగివేయబడాలి. అది నీవు ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడు ఏసుప్రభువు రక్తముతో కడిగినట్లే అని అంటున్నారు తప్ప ఇంకొకటి చెప్పలేదు. జ్ఞానములో అర్థము కానివి చాలా ఉన్నాయి. ఇవి అవగాహన చేసుకోవాలంటే మనము బాగా ఆలోచన చేసే స్థితిలోకి రావాలి. చెప్పిన విషయాన్ని అర్థము చేసుకోవాలి. అది గ్రహితా శక్తి అంటాము. ఎప్పుడో నెలకొకసారి గంట, గంటన్నరసేపు మేము ఇక్కడ కూర్చుని తీరిగ్గా చెప్తాము. ఎప్పుడూ ఇట్లే చెప్తుంటామా? ఈ నెల చెప్తాము, రెండు నెలలు చెప్తాము, మూడు


---

నెలలు చెప్తాము, సంవత్సరము చెప్తాము, రెండేళ్ళు, మూడేళ్ళు చెప్తాము, ఆఖరుకు మాకు కూడా ఒక ఫుల్స్టాప్ ఉంటుంది. మేము కూడా పోవాలి. మేము మళ్ళ చెప్పేదానికి ఉండదు. ఇప్పుడు చెప్పిన విషయాలు అప్పుడు మళ్ళ ఎవ్వరూ చెప్పరు. ఎప్పటికీ శాశ్వతముగా ఉండేటట్లుగా గ్రంథాలు ఇచ్చాడు. మీ గ్రంథాల్లో శాశ్వితముగా ఉంది ఆ విషయము. మళ్ళ శాశ్వితముగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. ప్రపంచ జ్ఞానమును నీవు పుట్టినప్పటి నుండి చదువుతున్నావు దానిని. నీ గ్రంథములో నీవు

మార్కులు తెచ్చుకున్నావు. పాసైనావు, ఒక డిగ్రీ తెచ్చుకున్నావు. ఈ గ్రంథాలలో ఇంత చదివినాను నాకు ఇంత వచ్చు అని ఒక బిరుదు వుంది. అయినా దానివల్ల మీకు లాభము లేదు. అది అంతా ప్రపంచ జ్ఞానము.

ముందోళ్ళు ఏమి చెప్పినారో వెనకోళ్ళు అదే చెప్తున్నారు. వెనక వాళ్ళు ఏమి చెప్పినారో తర్వాత వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అంటే ఒకరి తరువాత ఒకరు చెప్పుకోవడము సరిపోయింది కాని ఇక్కడ నిలబెట్టి ఇది కాదు ఇది అవును అను విచక్షణ మనము చేసుకోవడము లేదు. అంటే గ్రాహితశక్తి మనకు పని చేయలేదు. మేము “దైవగ్రంథములో సత్యాసత్యవిచక్షణ" అనే ఒక గ్రంథము వ్రాశాము ఇంతకుముందు. విచక్షణ ఉన్నప్పుడు గ్రంథములోని మాట తెలుస్తుంది అని చెప్పాము. విచక్షణ ఉంటే కదా తెలిసేది లేకపోతే తెలియదు అని. ఆ 'విచక్షణ'నే మనము 'గ్రాహిత శక్తి' అంటున్నాము.

మనము ఏమి చెప్తున్నామంటే ఈ మత ఆచారాలు వదిలిపెట్టి, దేవుడు చెప్పిన ఆచారాలు అవగాహన చేసుకోండి. దేవుడు చెప్పినటువంటి మాటలను వినండి. దేవుడు చెప్పిన గ్రంథములో ఉండేటటువంటి విషయాలు మీరు అర్థము చేసుకోండి. ఈ మతము అనేది మధ్యలో వచ్చింది. పుట్టి



---

సిద్ది బోధ

పెరిగి కొంత వయస్సు వచ్చిన తరువాత నీవు ఫలానా మతస్థుడు అని తెలిసి టోపి పెట్టుకున్నాము. మతస్థుడు మత ఆచారాలు చేస్తున్నాడు. ఈ రకంగా కొంతమంది పెద్దలు వాళ్ళ గుంపు కోసము, వాళ్ళ మాట చెలామణి కోసము, వాళ్ళ ఆధిపత్యము కోసమూ, వాళ్ళు ఒక గుంపును తయారు చేసుకున్నారు. మేము చెప్పినట్లే వినండి, మా మాటే వినండి అని ఆచారాలు చెప్పారు గానీ వాస్తవముగా దైవ గ్రంథాల్లో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు లేవు. వాళ్ళు చెప్పినట్లు దైవగ్రంథము లేదు. దైవగ్రంథము అనేది చాలా స్వచ్ఛముగా ఉంటుంది. దేవుని జ్ఞానము అనేది చాలా గొప్పగా ఉంటుంది. మీరు ఇప్పటి నుండి ఒక్కొక్క విషయాన్ని మీరు మార్పు చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ వస్తే, మీకు జ్ఞానము బాగా అర్థమౌతుంది.


మేము ఇంతవరకు ప్రతి గ్రంథములోనూ మార్పు చేసి కొత్త కొత్త విషయాలు అందిస్తూ వచ్చాము. మేము వ్రాసిన గ్రంథ గ్రంథానికి తేడా ఉంది. ఇంతకుముందు 'దేవుని చిహ్నము' అనే గ్రంథము వ్రాశాము. ఇదే మీరు నుదుట పెట్టుకున్నటువంటి గుర్తునే “దేవుని చిహ్నము” అని వ్రాశాము. ఇదే దేవుని చిహ్నాన్నే “దేవుని ముద్ర” అని కూడా వ్రాశాము. ఇప్పుడు ‘దేవుని ముద్ర' అని ఒక పేరు, 'దేవుని చిహ్నము' అని ఒక పేరుంది. కాని ఈ గ్రంథము ఆ గ్రంథము ఏమాత్రము కలవదన్నమాట. ఒక అక్షరము కూడా కలవకుండా వచ్చింది. అంటే అది వేరుగా వచ్చింది, ఇది వేరుగా వచ్చింది. దాని అర్థాలు వేరుగా వచ్చినాయి, భావాలు వేరుగా వచ్చినాయి, అన్నీ వేరు వేరుగా వచ్చాయన్నమాట. సరే, బైబిలులో 'దేవుని ముద్ర' అన్నారు. ఖుర్ఆన్లో 'దేవుని చిహ్నము' అన్నారు. అయినా దాని వివరము కూడా చెప్పాము. దేవుని చిహ్నమని ఇక్కడ ఇట్లా అన్నారు. దేవుని ముద్ర


----


అని అక్కడ అన్నారు. దేవుడు గుద్దోడు కాదు. రెండు రకాలుగా ఆయన పేరు పెట్టి చెప్పినాడు. రెండు వాక్యాలుగా చెప్పాడు. ఖుర్ఆన్లో మూడు రకాలుగా మూడు ఆయత్లలో ఉంది, 22వ సూరా 32వ ఆయత్లో ఉంది. 5వ సూరా 2వ ఆయత్లో ఉంది 2వ సూరా 158వ ఆయత్లో ఉంది. ఈ మూడుచోట్ల దేవుని చిహ్నమని చెప్పారు, దేవుని ముద్ర అని చెప్పలేదు. ఈ దేవుని చిహ్నమనేది ఎప్పుడైతే మనము అక్కడ చదువుకున్నామో అక్కడ 'దేవుని చిహ్నము' అనే గ్రంథములో దాని వివరమంతా ఇచ్చాము. తరువాత ‘దేవుని ముద్ర' అని బైబిలులో ఉంది. అప్పుడు దానిని గురించి కూడా వ్రాశాము. ఇది ఏ మతానికి సంబంధించినది కాదు అని చెప్పి వ్రాస్తూ ఆ రెండు వివరాలు చెప్పాము. ముద్రకు, చిహ్నానికి ఉండే తేడాని చెప్పినాము. రెండూ ఒకటే కాని పేర్లు వేరుగా పెట్టి వేరే అర్థాలతో చెప్పినాము. రెండూ ఒకటేనూ అని చెప్పాము. ఇది ఏ మతానికి సంబంధించినది కాదు అని చెప్పాము. తరువాత అది పెట్టుకుంటే ఎంత శక్తి ఉంటుంది, పెట్టుకోకపోతే ఏముంటుంది అని కూడా చెప్పాము. అది నేను చెప్పినేది కాదు, బైబిలు గ్రంథములోనే ఉంది. పెట్టుకుంటే వాళ్ళకు ఇట్లుంటుంది పెట్టుకోకపోతే వాళ్ళకు ఇట్లుంటుందని బైబిలు గ్రంథములోనే చెప్పినారు. తరువాత మీకు క్రొత్త విషయము ఏమంటే దేవుని పాలకులు ఉన్నారు, దేవుడు ఏది పరిపాలించలేదు. దేవుడు ఊరికినే కూర్చున్నాడు, ఆయన పాలకులే బయట ప్రపంచములో పాలిస్తున్నారు అని చెప్పాము. లోపలి ప్రపంచములో శరీరమంతా ఆత్మ దేవునిగా ఉన్నాడు. బయట ప్రపంచములో పాలకులు పాలిస్తున్నారు ఈ ప్రపంచాన్నంతా అని చెప్పాము.


ఈ రోజు జరిగేటువంటి పెద్ద పెద్ద భూకంపాలుగానీ, పెద్ద పెద్ద సునామీలుగానీ, పెద్ద పెద్ద తుఫానులుగానీ, పెద్ద పెద్ద విషయాలు


----

జరిగేదంతా మనకు ఈ పాలకులవల్లే జరుగుతావుంది. ఈ గ్రహాల వల్లగానీ, భూతాల వల్లగానీ జరుగుతావుంది అని చెప్పాము. మళ్ళీ ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహా శక్తివంతులని కూడా చెప్పాము. మీకు ఇది క్రొత్త విషయముగా ఉంటుంది. మామూలుగా క్రైస్తవులకు క్రొత్త విషయమే, ముస్లీమ్లకు కూడా క్రొత్త విషయమే, హిందువులకు కూడా క్రొత్త విషయమే. మన వెనకాల జరిగే విషయాలన్నీ ఎవరికీ తెలియవు. దేవుని దూతలు మనల్ని పరిపాలిస్తున్నారు. వాళ్ళు దేవుని జ్ఞానము సంపూర్ణముగా కలిగియున్నారు. వాళ్ళు దేవుని జ్ఞానము కలిగివున్న వాళ్ళకే విలువ ఇస్తారు. దేవుని జ్ఞానము లేని వాళ్ళకు విలువ ఇవ్వరు. నుదుటి మీద ముద్రను వాళ్ళు ధరించారు మొట్ట మొదట వాళ్ళు ధరించిన తర్వాత మనము ధరిస్తున్నాము ఇప్పుడు. మనము ఆ గుర్తును పెట్టుకుంటే వీళ్ళు మా వాళ్ళు అని గుర్తు పట్టి, వాళ్ళ జోలికి పోరు లేకపోతే పెద్ద పెద్ద ప్రమాదాలకు గురి చేస్తారు అని కూడా చెప్పాము. ఒకవేళ అటువంటి ప్రమాదాలు ఏమన్నా గురి కావాల్సిన పని ఉన్నా, అక్కడ ఈ చక్రాలు పెట్టుకున్న వాడు ఒకడున్నాగానీ, ఈ జ్ఞానము తెలిసినోడు ఒక్కడున్నాగానీ, అక్కడ ప్రమాదాలు జరుగవు అని చెప్పాము. నిన్న ఒకాయన చెప్తున్నాడు. పైకి లేచిపోయిందంట కారు గాలిలో, పైకి లేచి తిరిగి వెనక్కి పడేది పోనిచ్చి మళ్ళ మామూలుగా క్రింద కూర్చుంది టైర్ల మీద. అది కేవలము ఒకే ఒకటి దేవుని జ్ఞానము కలిగివున్న దానివలన, చక్రాలు పెట్టుకున్నదాని వలన. మిగితా కార్లన్నీ గాలికి కొట్టుకొని పోయినాయి. ఆయిల్ టాంకర్ గాలికి కొట్టుకొని పోయి, బస్సులు గాలికి క్రింద పడిపోయినాయి. కార్లు చెత్త లేచిపోయినట్లు లేచిపోయినాయి. చెన్నైలో తుఫాను, టీ.వీ.లో కూడా చూశాము మేము. చెన్నై నుండి ఇక్కడికి వచ్చే మనిషి ఈ రోజు రాలేదు. ఆయన కారు పైకి లేచిందంట. ఆయన కారు పైకి లేచి క్రింద పడిపోయింది. చెన్నై నుంచి



మామూలుగా వచ్చే వారు. ఆయన ఒక ముస్లీమ్. ఆయన కారు పైకి లేచి మళ్ళ క్రింద కూర్చుంది అట్లే! క్రింద కూర్చుంటానే కారు దిగిపోయి ఇంటికి పోయాడాయన. కారు దిగిపోయి రాత్రి ఫోను చేశాడు. అంతా ఖాళీ చేసి పోతున్నారు. 120 సెం.మీ. వర్షము వస్తుందంట. చెన్నై అంతా మునిగిపోతుందంటా. అంతా ఖాళీచేసి పోతున్నారు. మేము కూడా చెన్నై నుండి నెల్లూరుకు పోతాము అన్నాడు. నెల్లూరు పోయేదానికి రెడీ అయ్యాము. పోవాలా వద్దా? అని ఫోను చేసి అడిగితే, బయటికి పోతే మరీ ప్రమాదము, ఇంట్లోనే కూర్చో ఏమీ కాదు నీకు అని మేము చెప్పాము.


“దేవుని ముద్ర” గ్రంథము ఉంది. ఆ గ్రంథము చదువుతా కూర్చో. తుఫాన్ లేపేవాళ్ళు దేవుని ముద్రను పెట్టుకున్నోళ్ళే నీ దగ్గరకు వచ్చేది. వాళ్ళు నిన్నేమి చేయరు. నీకు సంబంధము లేదు. నువ్వు గ్రంథము చదువుతూ కూర్చో హాయిగా, గ్రంథమన్నా అయిపోతుంది అని చెప్పాము. ఆ రకంగా అంత ధైర్యముగా ఎందుకు చెప్పాము? అవతలి వాళ్ళు కూడా ఆ ముద్రను ధరించిన వాళ్ళే. ఆ పని చేసేవాళ్ళు కూడా దేవుని పాలకులే, కాబట్టి దేవుని పాలకులు ఆ జ్ఞానము నీవు కలిగివుంటే నిన్ను ఏమీ చేయరు అని ధైర్యముగా చెప్పాము. ఆయన ధైర్యముగా ఉన్నాడు, ఆయనకు ఏమి కాలేదు, ఇప్పుడు కూడా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. ఈ విధముగా ధైర్యముతోనే చాలామంది చిహ్నము పెట్టుకుంటున్నాము. ఈ రోజు ముస్లీములు పెట్టుకుంటున్నారు, క్రైస్తవులు పెట్టుకుంటున్నారు. జ్ఞానము తెలియని కొందరు ముస్లీములు హేళన చేస్తున్నారు. నువ్వు మా మతములో ఉండకూడదు. మా గోరీలలో పూడ్చము, మా నీళ్ళు ఇవ్వము, మా బావి నీళ్ళు త్రాగొద్దు అని ఏమేమో చెప్తున్నారు. అట్లగానే క్రైస్తవులను బెదిరిస్తున్నారు, ముస్లీంలను బెదిరిస్తున్నారు. ఈ బొట్టు హిందువులది



అంటున్నారు. ఇది హిందువుల్లో ఎక్కడన్నా ఉందా? చూశారా ఈ బొట్టు (చక్రాలు) హిందువులు ఎవడన్నా పెట్టుకుంటున్నాడా? చెప్పండి. ఇక్కడ తప్ప ప్రపంచములో ఎక్కడా లేదు. ఇది ఒక్క హిందూ మతానికి సంబంధించినది కాదు. సర్వమతాలకు సంబంధించినటువంటి చిహ్నము.


దీనిని ‘దేవుని ముద్ర' అని బైబిలులో చెప్పారు. 'దేవుని చిహ్నము’ అని ఖుర్ఆన్అ చెప్పారు. మీ గ్రంథాల్లో ఉన్నా కూడా దాన్ని గౌరవించక పోతే ఎట్లా? మామూలుగా 22వ సూరా 32వ ఆయత్లో ఏముందో ఒకసారి చదవండి. “అల్లాహ్ చిహ్నాలను ఎవరైనా గౌరవిస్తున్నారంటే అది వారి హృదయములోని భక్తి భావన వలననే సుమా!” ఎవరైనా గానీ చిహ్నాన్ని గౌరవిస్తున్నారు అంటే అది వాళ్ళ హృదయాల్లో ఉండే భక్తి భావము వలననే గౌరవిస్తున్నారు. మళ్ళ మీరు దేవుని చిహ్నాన్ని గౌరవిస్తున్నారా? దేవుని చిహ్నమంటే ఏదో తెలుసునా? లేదు. వేరే ప్రకృతికి సంబంధించిన విషయాలు చెప్పుకుంటారు. కాని ఇక్కడ లెక్కేసుకొని చూస్తే పబ్లిక్గా ఉంది. భగవద్గీతలో ఉంది, బైబిలులో ఉంది, ఖుర్ఆన్లో కూడా ఉంది దేవుని చిహ్నము అనేది. ఇప్పుడు ఇది దేవుని చిహ్నము కాదా? అవుతుంది. మళ్ళ ఈ చిహ్నాన్ని ఎక్కడైనా హిందువులు పెట్టుకున్నారా? లేదు. హిందువులకు సంబంధము లేదు. తరతరాల నుండి చూడండి ఎక్కడైనా ఉందేమో! ఎక్కడా లేదు. మరి అలాంటప్పుడు హిందువులది అని పేరు ఎట్లా పెడతారు మీరు? మాది అని ఎందుకు అనుకోలేదు మీరు. మేము మతాచారములో ఉన్నాము, మేము ఇది పెట్టుకోము అని అంటున్నారు. కానీ దేవుడేమన్నా పెట్టుకోవద్దని చెప్పాడా? ఏమీ చెప్పలేదు. నీవు భక్తి భావము వలననే దీనిని గౌరవిస్తున్నావు అని చెప్పాడు. నీకు దేవుని మీద భయము, భక్తి భావము ఉన్నప్పుడు నీవు ఆచరించు. గౌరవము వల్లే



ఆచరిస్తున్నావు దానిని కాబట్టి ఆచరించు. నన్ను ఒకాయన అడిగాడు ఏమి స్వామీ! దేశమందరికి నామాలు పెట్టావు, నీవు ఒకనివి పెట్టు కోలేదేమని? అంటే నేను ఒక్క మీటింగు చెప్పే రోజునే పెట్టుకుంటాను, మిగతా రోజులలో పెట్టుకోను అని చెప్పా. మళ్ళ మీరెందుకు పెట్టుకోరు? అని అడిగినాడు. నేను మీకంటే చిన్నన్నయా! మీరే పెద్దోళ్ళు నాకంటే, నేను చిన్నోన్ని అనేటట్టు గుర్తు నాకు ఉండాలి, నేను అజ్ఞానిని అనేటటువంటి భావము నాకు ఉండాలి. ఇంకా నేను అంత ఎదుగు ఎదగలేదు. మీరంతా పెట్టుకున్నారు, పెట్టుకోండి. ఎందుకంటే మీరు జ్ఞానులు.


మీరు జ్ఞానము తెలుసుకుంటున్న వారు కాబట్టి పెట్టుకోండి నేను అంత ఎదగలేదు అనే ఉద్దేశ్యముతో నన్ను నేను తగ్గించుకునే దానికి నేను పెట్టుకోలేదు అని చెప్పేశాను. సర్వసాధారణముగా ఉండాలనే ఉద్దేశ్యముతో ఉన్నాను నేను అట్ల. ఆ అలవాటు మొదటి నుండి ఉంది నాకు. అందువలన నేను మొదటి నుంచి పెట్టుకోలేదు. ఏమంటే ఈ పౌర్ణమి రోజు మీటింగ్ చెప్పేటప్పుడు మాత్రము పెట్టుకొంటాను. అలా పెట్టుకోకపోతే హిందువులు వీడు క్రైస్తవుడేమోనని నన్ను అంటారు. పెట్టుకుంటే పీడపోతుంది కదా! అని పెట్టుకుంటున్నా నేను ఇంకొకటి ఏమీ లేదు. ఇప్పుడు వాస్తవముగా నేను చెప్పే జ్ఞానము అర్థమయిందా? అర్థమయి ఉంటుంది. బహుశా! కానీ దీనిని ఎట్లా ఒప్పుకోవాలా? అనేదే మీకు పెద్ద సందిగ్ధముగా ఉంటుంది. నేను ఒప్పించడము లేదు. మీ గ్రంథమే మిమ్మల్ని ఒప్పిస్తుంది.


ముస్లీమ్లు ఖుర్ఆన్ తీసుకోండి. అక్కడేముంది 22వ సూరా 32వ ఆయత్లో చదవండి, చదివి మీరు దానిని ఎట్లా అర్థము చేసుకోవాలో అట్ల అర్థము చేసుకోండి. క్రైస్తవులు బైబిలు తీసుకొని దానిలో ప్రకటన గ్రంథమును చూడండి, చివరలో 9వ అధ్యాయము 4వ వాక్యములో



ఏముందో చూడండి. ఇంకా అక్కడ పోయిన తరువాత ఇంకో విషయము చెప్పాను. ఇక్కడ మీకు ఆ దేవదూతలు ఉన్నారు అని చెప్పా కదా! ఈ దేవదూతలు పరిపాలన చేస్తున్నారు మిమ్మల్నందరినీ అని చెప్పాను. మిమ్మల్ని చూసి శిక్షిస్తున్నారు అని చెప్పాను. ఘోరముగా చంపుతున్నారని చెప్పాను. ఘోరంగా యాక్సిడెంట్ రూపములో చంపుతున్నారు. రకరకాల వేదనలతో వేదిస్తున్నారు. సామూహికముగా చంపుతున్నారు. మళ్ళీ అంత పెద్దగ ఎట్లా చేస్తున్నారంటే ఇంతకు ముందు “దయ్యాల భూతాల యథార్థ సంఘటనలు” అనే గ్రంథములో చెప్పాము. వాళ్ళకు వేల చేతులు కోట్ల చేతులు ఉన్నా యని కూడా చెప్పాను. వారి ఆకారాలు మన ఆకారాలలాగా ఉండవు అని కూడా చెప్పాము. ఇంకా ఈ “దేవుని ముద్ర” గ్రంథములో భూతాల గురించి, గ్రహాల గురించి ఏమి చెప్పామంటే! ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులు, జంతువులు, చెట్లు, పాములు ఇవి ఏవైతే ఉన్నాయో అన్ని రకాల ఆకారాలు వాళ్ళు పోలి ఉన్నారని చెప్పాము. వాళ్ళు సింహాలవలె కోరలు కలిగివున్నారు. తేలుకొండి గల్గిన పెద్ద తోక కలిగివున్నారు. జంతువులవలె శరీరము కలిగివున్నారు, ఇంకా మనుషులవలె తల కలిగి ఉన్నారు. ఇట్లా ఇది చెప్పడము జరిగింది. అంటే ఇన్ని రకాల పోలికలు చెప్పితే నీవు చూసినావా? అని నన్ను ప్రశ్నించవచ్చు. నేను చూడలేదు. అది గ్రంథములో ఉన్న విషయము మీరు చదవండి.


ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 7, 8 వాక్యాలలో ఏముంది చూడండి. “ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలివున్నవి. బంగారువలె మెరయు కిరీటములవంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనిషి ముఖరూపముల




వంటివి. స్త్రీల తల వెంట్రుకలవంటి వెంట్రుకలు వాటికుండెను. వాటి పళ్ళు సింహపు కోరలవలె ఉండెను. ఇనుప మైమరువులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల ధ్వనివలె ఉండెను. తేళ్ళ తోకవంటి తోకలునూ, కొండ్లునూ వాటికుండెను.” ఇట్లా ఆకారాలు మీరెప్పుడైనా చూశారా? ఊహలోనైనా ఎప్పుడైనా ఊహించుకున్నారా? ఇప్పుడు నేను చెప్పేదే కాదు, ప్రకటన గ్రంథములో కూడా వ్రాయబడివుంది ఇది. వాస్తవముగా ఉండేటటువంటి విధానము ఇది. మీకు కనిపించలేదుగాని ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళంతా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికున్నారు. గ్రహాలంతా ఇన్ని ఆకారాలతో కల్గివున్నారని మీకు అర్థమయిందా ఇప్పుడు! ఇన్ని ఆకారాలు కలిసి ఒకే వ్యక్తిలో ఉన్నాయి అంటే స్త్రీల వెంట్రుకలవలె వెంట్రుకలు ఉన్నాయి, మనుషులవలె తలలు ఉన్నాయి, కోరలవలె కోరలు ఉన్నాయి, తేలు కొండీల మాదిరి తోకలు ఉన్నాయి, గుఱ్ఱపు డెక్కల మాదిరి కాళ్ళు ఉన్నాయి. ఈ రకంగా ఈ గ్రహాలు, భూతాలు ఆకారము కల్గి ఉన్నారు అని నేను చెప్పడమే కాకుండా గ్రంథాల్లో కూడా అక్కడ ఉంది. ఈ గ్రంథాల్లో ఇది చెప్పినేది ఒక క్రైస్తవులకే కాదు.


ప్రపంచానికి అంతటికీ వర్తించేటటువంటి విధానము ఇది. ఈ విధానము ప్రకారము మనము లెక్కేసుకొని చూస్తే అంటే మనకు తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి, మళ్ళ ఇప్పుడు ఈ తెలియని రహస్యాలు చాలా ఉండడములో మనకు ఏమి అర్థమౌతుంది అంటే, మనకు అవగాహన లోపము చాలా ఉంది అని అర్థమయింది . అవగాహన లోపము చాలా ఉండేదాని వల్ల మనకు ఈ విషయాలన్నీ సరిగా అర్థము కాలేదు. మళ్ళ మనకు జ్ఞానము అర్థము కావాలంటే ఏమి చేయాలి? గ్రాహితశక్తి అనేది


కావాలి. మొత్తము మీద గ్రాహితశక్తి తక్కువుంది అని మనకు అర్థమౌతుంది. కాబట్టి ఈ గ్రాహితశక్తి ప్రకారము మనము బాగా గ్రహించుకోగల్గితే ముందర ఉన్నటువంటి గ్రంథమే ప్రభువు శరీరము, అదియే అల్లాహ్ శరీరము. గ్రంథములో ఉండేటటువంటి జ్ఞానమే ఆయన అందించేటటు వంటి రక్తము. నీవు ఎట్ల స్వీకరిస్తావో అట్ల స్వీకరించు. అది అందరికీ సంబంధించిన వాక్యము. హిందువులకు, క్రైస్తవులకు, ముస్లీమ్లు అందరూ దీనిని అర్థము చేసుకోవచ్చు. కాబట్టి బైబిలు వాక్యాలే మీకు జ్ఞానము. ఖుర్ఆన్ వాక్యాలే మీకు జ్ఞానము. భగవద్గీతలో శ్లోకాలే మీకు జ్ఞానము. ఇంకొక గ్రంథముతో మీకు పని లేదు. కాబట్టి క్రైస్తవులు బైబిలును బాగా అర్థము చేసుకోండి. ముస్లీమ్లు ఖుర్ఆన్ గ్రంథములో ప్రతి ఆయతుకు వివరము జాగ్రత్తగా తెలుసుకోండి. అట్లనే భగవద్గీతను హిందువులుగా ఉండేవాళ్ళు చదువుకోండి.

ంది. ఇక్కడ మూడు మతాలకు సంబంధించినటువంటి విధానము ఒక్కటే ఉందిగానీ వేరు వేరు లేదు. మా విధానము వేరు, మా విధానము వేరు అని అనుకుంటే అది దేవునికి కూడా సరిపోదు. ఆయనకు కూడా ఇష్టము లేదు అది. అందువలన నేనేమి చెప్తున్నానంటే ఇప్పటి నుండి మీరు సక్రమమైన జ్ఞానము తెలుసుకుంటారని, మంచి అవగాహనలో ఉంటారని కోరుతూ ఇంతటితో నేను ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను.


తేది: 03-07-2012

పౌర్ణములలో ప్రత్యేకమైన పౌర్ణమి గురు పౌర్ణమి. ఇటువంటి పౌర్ణములు చాలా వచ్చాయి. ప్రతి గురుపౌర్ణమిలోనూ గురువు యొక్క



విశిష్టతను గురించి మనము చెప్పుకున్నాము. ఈ రోజు కూడా ప్రత్యేకించి గురువు యొక్క ప్రత్యేకత గురించి నేను తెలియజేయాలనుకొన్నాను. గురువును నమస్కరిస్తూ “గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ” అని మనము చెప్పుకున్నాము. దీనినిబట్టి గురువు అనేవాడు విష్ణువుగా ఉన్నాడు, బ్రహ్మగా ఉన్నాడు, ఈశ్వరునిగా ఉన్నాడు తరువాత సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపముగా ఉన్నాడని అనుకుంటే గురువు నలుగురు అవుతారు. గురువు ఒకడే ఉంటాడు ఎప్పటికైనా ప్రపంచములో, “గురుసాక్షాత్ పరబ్రహ్మ" అంటే ఇంక ఆయన్ను మించినటువంటి వాడు ఎవడూ లేడు. ఆయనను మించినటువంటి వాడు ఎవడూ లేనపుడు, వీళ్ళందరిని పెట్టుకోవడము పొరపాటే కదా! అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి బ్రహ్మకు గురువే, విష్ణువుకు గురువే, మహేశ్వరునికి గురువే. ఎవరు?సాక్షాత్ పరబ్రహ్మ. ముగ్గురికి గురువైనటువంటి వాడు అని మనము లెక్కేసుకోవాలిగానీ ఈ ముగ్గురిని గురువులుగా చెప్పుకోవడము మనకు పొరపాటు అవుతుంది. అట్ల కూడ చాలామంది చెప్పుకోవడము మంచిది కాదు గానీ, మనము ఏమి చెప్పుకోవాలంటే అందరికి మించినటువంటివాడు గురువు అని చెప్పుకోవాలి. అట్ల ముగ్గురికి కూడ ఎవరు గురువు? పరబ్రహ్మ అనే దేవుడనేవాడే గురువు. వీళ్ళు ముగ్గురు కూడ ఆ గురువును తెలుసుకోవాలనే ప్రయత్నము చేస్తున్నారు.


గురువును ఇంకొక రకముగా చెప్పుకుంటే 'తండ్రి' అనే పేరుతో కూడ మనము పిలవచ్చు. ఈ తండ్రి అని ఎక్కడైతే గురువు అనే శబ్దము వినిపించాలో అక్కడ తండ్రి అనే శబ్దాన్ని వినిపించుకున్నాము. అందరికీ తండ్రి అయినటువంటి వాడు ఒకడు ఉన్నాడు, వాడు దేవుడు. అందరికీ పితృ స్వరూపుడు. ఆయన మాత్రమే తండ్రి అవుతాడు. ఇపుడు తండ్రి



అనే శబ్ధము, గురువు అనే శబ్ధము రెండు కూడా సమానమైనపుడు, తండ్రి అన్నా గురువు అన్నా ఒకటే. గురువులను ఎక్కడైనాగానీ చాలాచోట్ల దేవుడు అని పిలిచేదానికంటే ఎక్కువ శాతము తండ్రి అని పిలిచేవాళ్ళు. ఇపుడు మనము కొన్ని గ్రంథాలలో కూడ అదే వ్రాసుకున్నాము. “గురువు” అనే పదము వ్రాయాల్సిన చోటంతా “తండ్రి” అనే పదాన్నే మనము కొన్నిచోట్ల వ్రాసుకున్నాము.


ఈ గ్రంథములో సర్వులకు తండ్రి అయినటువంటి వాడు ఒకడున్నాడు అన్నారు. సర్వులకు తండ్రి అయినవాడు ఎవడైతే ఉన్నాడో వాడే ఈ ప్రపంచానికంతా గురువు. గురువుకు, మనిషికి ఏమి సంబంధము అని అంటే ఒకే ఒక జ్ఞానవిషయములో మాత్రమే సంబంధము ఉంటుంది. గురువు ప్రపంచములోకి మనిషికి జ్ఞానము తెలియజేసే దానికోసమే వస్తాడు. గురువు భూమిమీదికి రావడము ఒక మానవ జన్మలోనే జరిగినట్టు మనకు తెలుసు. మానవ జన్మలోనే జరిగిందా లేక వేరే జన్మల్లో గురువు అవతారము ఎత్తి వచ్చాడా? అని అంటే, ఇంతవరకూ అటువంటిది ఎక్కడా శాస్త్రబద్దముగా కన్పించలేదు. వేరే జన్మల్లో ఎక్కడైనా గురువు అనేటటువంటి వాడు వచ్చి జ్ఞానాన్ని తెలియజేశాడా? అని ప్రశ్నించుకొంటే, ఇంతవరకు అటువంటి దాఖలాలు ఎక్కడా కన్పించలేదు. మనము కథల రూపములో చెప్పుకున్నాముగానీ, శాస్త్రీయముగా ఎక్కడా లేదు. ఒకే ఒక మానవ ఆకారములో మాత్రమే గురువు వచ్చి, తన జ్ఞానాన్ని చెప్పాల్సిన పని వచ్చింది. సర్వజీవరాసుల్లోకెల్లా ఒకే ఒక మానవ జన్మలోనే గురువు రావడము ఎందుకు జరిగింది? అంటే, సర్వజీవరాసులలోకెల్లా పూర్తి అజ్ఞానవంతమైనటువంటి జీవితము, మానవుని జీవితము. చాలా పాపాలు చేసుకుంటే గానీ ఈ జన్మలో మనిషి పుట్టడు.



మనము ఇంతవరకు ఏమి విన్నాము చాలామంది చెప్పడములో, మానవ జన్మ చాలా ఉతృష్టమైన జన్మ, చాలా గొప్ప జన్మ, ఎంతో పుణ్యము చేసుకుంటేగానీ ఈ జన్మ మనకు రాదని, మన పెద్దలంతా చెప్పుకున్నారు. కానీ వాస్తవము అవాస్తవము ఎంత? అని చూస్తే మానవుడు చాలా అధమ జన్ముడుగా ఉన్నాడు. కాబట్టి ఈ అన్నిటికంటే అధమ జన్మ అయినటువంటి మానవ జన్మకే జ్ఞానము అవసరము. అందువల్ల దేవుడు కూడా మానవ జన్మలోనే పుట్టి మానవులకు జ్ఞానాన్ని తెలియజేయడము జరిగింది. ఇతరత్రా వాళ్ళకు ఎవరికీ అవసరము లేదు, జ్ఞానము అంత అవసరముగా ఉందంటే, మనిషి అనేవాడు ఎంత అజ్ఞానములో కూరుకొనిపోయినాడో! మనిషి ఏమను కుంటున్నాడంటే నేను చాలా గొప్పవాన్ని, సర్కస్లో సింహాన్ని ఆడిస్తున్నాను, పులిని ఆడిస్తున్నాను, అన్నిటినీ వశము చేసుకొనేటటువంటి స్థోమత నా దగ్గర ఉంది అని అనుకుంటున్నాడు. దానికి ఒప్పుకుంటాము. అన్నిటినీ వశము చేసుకొనే స్థోమత ఉంది. అన్ని యుక్తులకు యుక్తులు చేసే స్థోమత ఉంది. అది నీ బుద్ధి యొక్క కుశలత. అంటే నీ బుద్ధి యొక్క గొప్పతనము. నీ బుద్ధి యొక్క గొప్పతనము తప్ప, నీలో ఏ గొప్పతనమూ లేదు. ఈ బుద్ధి యొక్క గొప్పతనము ఇవన్నీ చెయ్యగల్గినాగానీ, నీకు కర్మలే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి, మనిషి పాపము గల అధమ జన్ముడు.


బుద్ధి ఇతరత్రా జీవరాసులకంటే మనిషికి ఎక్కువ ఉపయోగపడు తుంది, దానివలన ఏమి వస్తుంది నీకు లాభము అంటే, ఎక్కువ పాపాలే వస్తున్నాయిగానీ, ఇంకేమీ లాభము లేదు. ఒకవేళ బయట వేరే జీవరాసులకు నీకు తేడా కన్పించవచ్చు. నీకు వాటికంటే నీవు గొప్పవానిగా అనుకోవచ్చు, కానీ పాపము సంపాదించుకోవడములో కూడా వాటికంటే నీవు గొప్ప. ఇపుడు ఒక చెట్టు ఉంది, తర్వాత ఒక జంతువు ఉంది, తర్వాత ఒక



మనిషి ఉన్నాడు. ఒక చెట్టును తీసుకుందాము. వృక్షము ఎక్కడ పుట్టింటే అక్కడే ఉంటుంది, అక్కడే బ్రతుకుతుంది. దాని జీవితమంతా ఒకటే చోట ఉంటుంది. ఏదీ అవసరము లేదు దానికి. కష్ట సుఖాలు అనుభవించడములో మనకంటే చాలా తక్కువ, కర్మను సంపాదించుకోవడములో కూడా మనకంటే తక్కువ. చెట్టు ఏమి చేస్తుందంటే విత్తనము నుంచి పైకి పెరుగుతా ఉంది. ఉన్నస్థితి నుండి పైకి పెరుగుతా ఉంది. విత్తనము క్రింద ఉంటే పైకి పెరుగుతా ఉంది. అది ఉన్నత స్థితికి వస్తా ఉంది అని తెలుస్తుంది మనకు, స్థూలముగ కూడా. ఒక జంతువును చూస్తే అడ్డముగా పెరుగుతా ఉంది. చెట్టేమో పైకి పెరుగుతావుంది. మనిషిని చూస్తే క్రిందికి పెరుగుతున్నాడు. తలలో బీజముంది “ఊర్ధ్వమూల” అని చెప్పాడు భగవంతుడు. నీ వేర్లు పైన ఉన్నాయని చెప్పినాడు. మూలము తలలో ఉంది అని చెప్పాడు.


అశ్వర్థము అనే నీ శరీర చెట్టు క్రిందికి పెరుగుతా ఉంది. ఈ రకముగా ఇది క్రిందికి పెరుగుతా ఉంది. చెట్టు పైకి పెరిగి ఉన్నత స్థితికి పోతా ఉంది. అధోస్థితికి పోతా ఉంది మానవ జన్మ. ఈ రకముగా పుట్టుకలోనూ, పెరగడములోనే మనకు స్థూలముగా కన్పిస్తా ఉంది, మనిషిది అధో జన్మ, పాపాలు చేసుకోవడములో కూడ ఇది ఎక్కువే. మనిషి ఎక్కువ పాపాలు సంపాదించుకోవడములో మొదటి రకములో ఉన్నాడు. మానవ జన్మ ఈ రకముగా పాపాలు చేసుకోవడములో, కర్మను సంపాదించు కోవడములో మొదటికి ఉంది. తరువాత జ్ఞానము విస్మరించి ప్రపంచ జ్ఞానములో పడింది. ప్రపంచ జ్ఞానములో ఎక్కువ కూరుకొని పోయింది. కాబట్టి ప్రపంచ జ్ఞానము నుంచి వదిలించి దైవజ్ఞానానికి వాళ్ళను జత చేయాలంటే దేవుడే వచ్చి చేయాలి. ఆ దేవుడు వచ్చి చెప్పడమే గురువు యొక్క రాక అంటాము. దేవుడు వచ్చి చెప్తేనే, అప్పుడు గురువు వచ్చి



చెప్పినట్టు మనకు లెక్క. దేవుడు కనిపించనటువంటివాడు, తెలియనటు వంటివాడు, వెతికితే కూడ ఎవరికీ తెలియడు. అటువంటివాడు భూమిమీదికి వచ్చి పుడితే ఒక ఆకారాన్ని తీసుకొని పుట్టాలి. అంటే మానవాకారాము తీసుకొని పుట్టాలి. పుడితే ఆయనను మనము పద్ధతిగా చెప్పుకుంటే భగవంతుడు అంటాము. భగవంతుడు వస్తే దైవ జ్ఞానాన్ని బోధిస్తాడు. దైవజ్ఞానాన్ని బోధించేవాడు గురువే కాబట్టి ఆయనను గురువు అంటాము. దేవుడు వస్తే భగవంతుడు అయితాడు. భగవంతుడు గురువు అయితాడు. అంతేకదా! గురువు తన జ్ఞానాన్ని సంపూర్ణముగ తెలియజేసి పోతాడు.


ఎపుడో వచ్చే గురువు, ఒకసారి జ్ఞానాన్ని చెప్పగలిగితే అతడు గురువు అని అందరికి తెలియబడతాడు, దేవుడు ఎవ్వరికీ తెలియబడనటు వంటివాడు. స్థూలముగా వచ్చినాగానీ, కనిపించినాగానీ ఎవరికీ తెలియబడడు. ఆయనలో దైవత్వము ఉంది కాబట్టి తెలియబడని రకముగానే ఉంటాడు. తెలియబడకుండ ఉండాలంటే ఏమి చేయాలి? ఆ గురువుగా లేక భగవంతునిగా వచ్చినపుడు ఎవ్వరికీ తెలియబడడు. మళ్ళీ భగవంతునిగా వచ్చినపుడు తెలియబడకుండ ఉండవచ్చు. కానీ జ్ఞానము బయటకు చెప్పినపుడు గురువు అవుతాడు కదా ఆయన! అపుడు తెలియబడతాడు కదా మనకు. మళ్ళ అపుడు తెలిసిపోయినట్టే కదా! అపుడు తెలియకుండ ఉండాలంటే ఏమి చేయాలి? అంటే ఇపుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాము. ఒక ఇంట్లో ఒక దొంగోడు ఉన్నాడు. ఆ దొంగోన్ని పట్టుకోవాలని ఒక పదిమంది తోడైనారనుకో. పదిమందేంది ఓ వందమంది తోడైనారనుకో. ఇప్పుడెక్కడికి పోతాడు ఆ దొంగోడు! దొరికిపోతాడు. ఉండేదేమో ఖాయమే! ఖచ్చితముగా ఉన్నాడు. అందరికీ తెలుసు. చూసినారు దొంగ ఉన్నాడు లోపల అని. ఇంక ఇపుడేమి చేయాలి? లోపలికి పోయి



పట్టుకోవాలి. పట్టుకోవాలని తలుపు తీసి అందరు లోపలికి గబగబ పరిగెత్తినారు. వాడు తలుపు చాటున ఉండి వీళ్లతోపాటి పోయినాడు. తలుపు చాటున ఉండి వీళ్లంతా దూరినపుడు వాడు వాళ్ళల్లో కలుసుకొని అందరు దొంగ పట్టుకో పట్టుకో అంటే, వీడు పట్టుకో పట్టుకో అంటున్నాడు.


ందాలంటే,*


అపుడు ఎవరు దొంగ అని వీళ్ళు ఇల్లంతా వెతికినారు కాని ఇల్లంతా ఖాళీ. ఎక్కడికి పోయినాడు దొంగ అంటే ఎక్కడికీ పోలేదు, ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు దొంగ ఎందుకు దొరకలేదు అంటే ఇంట్లో ఉండేవాడు దొంగ అంటే, అంతా ఇంట్లోనే కదా ఉండేదిపుడు. కాబట్టి అపుడేమనాలి మనము అందరూ దొంగలే! అసలైన దొంగ ఎవడని? తెలియకుండా పోయింది. అట్ల అయోమయ స్థితి ఏర్పడిందన్నమాట. అట్లగానే దేవుడు తాను గురువు అని తెలియబడకుండా ఉండాలంటే, భూమి మీద ఆయన పరిపాలన ఉంది కదా! ఆ పరిపాలన ముందే ఒక అమరిక చేశాడు. తనలాంటి గురువులను చాలామందిని తయారుచేసి పెట్టాడు. ఇపుడు ఇంట్లోకి పోయినపుడు ఎవడు దొంగోడు అని అర్థముకాకుండ ఉండేదానికి తనలాంటి వాళ్ళను చాలామందిని తయారు చేసిపెట్టాడు. ఒక ఏరియాలో ఒకడు గురువు అయితాడు. ఇంకొక ఏరియాలో ఇంకొకడు గురువు అయితాడు. ఇంక అన్ని పరిసరాల్లోనే కాకుండ ఒక ఏరియాలోని వాడే ఇంకొక ఏరియాకు పోయి గురువు అయితాడు. ఆ ఏరియా వాడు, ఈ ఏరియాకు వచ్చి గురువు అని చెప్పుకుంటాడు. ఈ రకముగా దేశమంతా గురువులుండారన్నమాట, లెక్కేస్తే అడుగు అడుగునా గురువులే ఉన్నారు. ఆ గురువుల్లోకి ఒక గురువు వస్తే, ఏముంది కలిసిపోతాడు కదా! ఇపుడు అందరూ జ్ఞానమే చెప్తున్నారు. ఆయన కూడ జ్ఞానమే చెప్తాడు. ఏ జ్ఞానము కరెక్టో ఈ ప్రజలకు తెలియదు కదా! జ్ఞానము చెప్పేవాళ్ళంతా గురువులే



అని అనుకున్నపుడు, అందరూ జ్ఞానము చెప్తున్నారు తరువాత వచ్చినాయన కూడా జ్ఞానమే చెప్తున్నాడు.


కాబట్టి అపుడు ఇతను గురువు అని ప్రత్యేకించి తెలుసుకునే దానికి అవకాశము లేకుండా పోయింది. దేవుడు భగవంతునిగా వస్తే, భగవంతునిగా వచ్చినటువంటి వాడు జ్ఞానము చెప్పితే గురువుగా తెలియబడతాడు కాబట్టి, అదే విధముగా జ్ఞానము చెప్పేవాళ్ళను చాలామందిని తయారు చేసిపెడితే భూమి మీద ఉండే చాలామంది గురువుల్లోకి కలిసి పోయినపుడు, ఈయన ప్రత్యేకమైన వాడు, ఇతను గురువని తెలియకుండా పోయింది. ఆ విధముగా దేవుడు భూమిమీదకు గురువు వచ్చినాగానీ, ఎవ్వరికీ తెలియబడడు. ఈ ఉండే గురువులంతా నేను గురువును, నేను గురువును అని బోర్డు పెట్టుకున్నాగానీ, ఆయన అసలుకు ఎవ్వరికీ తెలియకూడదు అనుకున్నపుడు ఆయనెందుకు పెట్టుకుంటాడు బోర్డ్? ఆయన పెట్టుకోడు. ఆయన మాత్రము నేను గురువునని కూడ చెప్పుకోడు. ఆయన గురువుగా ఎక్కడా ప్రవర్తించడు. గురువుగా కనిపించాలని వేషధారణలో చాలా రకాలుగా కనిపించాలని, చాలామంది ఆర్భాటపడి బయటకు కనిపించినా గానీ, ఆయన మాత్రము ఎక్కడా కన్పించే ఏర్పాట్లు చేసి పెట్టుకోడు. కనిపించకోకుండా ఉండే ఏర్పాట్లే చేసిపెట్టుకుంటాడు. ఈ రకముగా గురువు భూమి మీదకు వచ్చినాకానీ తాను ఏమాత్రము తెలియబడకోకుండ ప్రజలను మభ్యపెట్టి పోతాడు.


కానీ తన విషయము మాత్రము గుర్తుంచుకొనేదానికి, తాను చెప్పిన జ్ఞానము చిరస్థాయిగా ఉండేటట్లు చేసిపోతాడు. ఏ జ్ఞానమైనా, ఎంతమంది చెప్పిన జ్ఞానము అయినాగానీ కొన్నాళ్ళు ఉంటుంది తరువాత ఉండదది. కానీ దేవుడు చెప్పిన జ్ఞానము మాత్రము శాశ్వితముగా కొన్ని లక్షల సంవత్సరాలు నిలబడుతుంది. అది మళ్ళా కొంత కాలప్రభావము వల్ల



కొంత మారినాగానీ, ఉండే జ్ఞానములో అది దీపమై వెలుగుతుంది. మిగతాటివన్నీ ఆ వెలుగును ఇయ్యవు. నేను చెప్పాను తండ్రి అనే పదాన్ని ఉపయోగిస్తాము అని. దేనినైనా సృష్టించినటువంటివాడు తండ్రి అవుతాడు. సృష్టించే స్వభావము అతనిలో ఉంటుంది. చిన్న ఆధారమును మనము తెలుసుకోగల్గితే అతని విధానము కొంత అర్థమౌతుంది. అతని విధానములో ఆయన సృష్ఠికర్త. సృష్ఠికర్త అంటే తండ్రి, పుట్టించేవాడు. ఆయన పుట్టించే వాడు కాబట్టి, ఆయన ఏది సృష్టించినా సజీవముగా సృష్టించగల్గుతాడు. మానవులు బొమ్మను తయారు చేస్తే, అది జీవము లేని బొమ్మగా ఉంటుంది. దేవుడు బొమ్మను తయారు చేస్తే జీవముండే బొమ్మగా అయితుంది. అది మనిషికిని దేవునికిని మధ్య ఉండే ప్రత్యేకత. ఆయన సృష్టికర్త కాబట్టి ఆయనకు అటువంటి శక్తి ఎల్లప్పుడూ ఉంది. ఇపుడు అతడు ఏదైనా సృష్ఠించాడు అనుకోండి. లేని దానిని తయారు చేసి పెట్టాడనుకోండి. అందులోనికి జీవము వస్తుంది. మామూలుగా మన మాదిరి చచ్చిపోయి బ్రతికే వాళ్ళు కాదు. చావకోకుండ, పుట్టకుండా ఉన్నటువంటి శక్తులు ఉన్నాయే ఖగోళములో, దేవుని పరిపాలనలో ఉండేటటువంటి వాళ్ళు.


ఆయన చేతులో ఏదైనా తయారు చేసాడంటే అందులో సజీవమైన శక్తి వస్తుంది. ఆ శక్తి తాను ఏమి చేయాలో అది చేస్తుంది. ఈ రకముగా ఇపుడు మనము ఉన్నాము. నాకు ఇంతమంది కొడుకులు ఉన్నారు అని చెప్పుకుంటాము. నలుగురు కొడుకులకు నేను తండ్రిని అని నా భావములో ఉంటుంది. నలుగురు కొడుకులకు నేను తండ్రిని అని అనుకుంటుంటాము. అంతేకదా! కానీ ఇక్కడ తండ్రి అనేటటువంటి హక్కు ఎవరికి ఉంది? అటువంటి స్థోమత ఎవరికి ఉంది? అంటే దేవునికి ఉంది అని మనము చెప్పుకున్నాము. ఇపుడు దేవునికి ఉంటే మనకు కూడా ఉంది కదా! మనము



ఇదేమి

కూడ తండ్రి అవుతున్నాము కదా! నలుగురి కొడుకులకి నేను తండ్రి అయినపుడు నేను కూడ తండ్రినే కదా! నలుగురిని నేను కూడ పుట్టించినాను కదా! అని అనుకొంటే అది పూర్తి పొరపాటు అవుతుంది. కనిపించేదానినే అబద్దము అంటారే మీరు! అని అడగవచ్చు. కనిపించేది సత్యమని మీ లెక్కలో ఉన్నాగానీ, అది సత్యముగ కనిపించినాగానీ అది నూటికి నూరుపాళ్ళు అసత్యము. అయినా అది సత్యముగా కనిపించాలనే మీకు ఆ రకముగా దేవుడు చేస్తున్నాడు. అంటే మీరు తండ్రులుగా కనిపించాలి, మీరు తండ్రులుగా అనుకోవాలనే మిమ్మల్ని ఆ రకముగా లోపల బుద్ధి పుట్టిస్తున్నాడు.



ఆ రకముగా నేను తండ్రిని అనుకుంటే, ఇంకొకడు తండ్రి ఉన్నాడని అనుకోవు కదా నీవు! నేనే తండ్రిని అనుకున్నపుడు ఇంక లోకానికంతా ఒక తండ్రి ఉన్నాడని అనుకోవు కదా! ఒకవేళ ఉంటే ఉండనీలే ఎవడన్నా ఉండనీ మాకేందని, నేనేమో నలుగురు కొడుకులకు తండ్రే అని అనుకుంటావు, కానీ తండ్రి అనే భావము ఎవరికి ఉంటుంది? ఒకే ఒకరికి ఉంటుంది. ఒకే ఒకడు తండ్రి ఉన్నాడు ప్రపంచానికంతా. వానిని ఏమంటాము మనము? సృష్టికర్త అంటాము. ఇపుడు మళ్లీ మనందరినీ సృష్టించినటువంటి వాడు దేవుడు. నలుగురి కొడుకులను అడిగితే మా నాయన అంటారు. అందరినీ అంటే దేవుడు అనవచ్చు టోటల్గ. కానీ ఇపుడు నలుగురికిగానీ, అందరికిగానీ వేరు వేరు తండ్రి ఉన్నాడా? వేరు వేరు తండ్రి అని మనము బయటకు చెప్పుకున్నాగానీ రూల్ ప్రకారము దేవుడే అందరికీ తండ్రి. ఎందుకు అంటే ఆయన దేవుడు. సర్వజీవరాసులకు బీజదాతనై ఉన్నానని భగవద్గీతలో చెప్పాడు. అంటే "సర్వయోనిషుకౌంతేయ మూర్తయ సంభవంతియా:” అని గుణత్రయ విభాగ



యోగము అనే అధ్యాయములో 4వ శ్లోకములో చెప్పాడు. “సర్వయోనిషు” అంటే ఏ గర్భములో నీవు పుట్టినాగానీ, ఏ యోనులందు నీవు పుట్టినాగానీ దానికి నేను బీజదాతను కాబట్టి నేను తండ్రినని చెప్పాడన్నమాట. అంటే నీవు కనిపించే తండ్రికి కొడుకుగా పుట్టినాగాని, ఏ తల్లికి బిడ్డగా పుట్టినాగాని, నీవు నా కొడుకువే! అని దేవుడు చెప్పినాడు. ఇంత మోసమా? అని మనము అనుకుంటే, ఇప్పుడు నీది మోసమా? ఆయనది మోసమా? అని ఎట్ల కనుక్కొంటావు నీవు? ఆయన “నేను బీజదాతను” అని అ అన్నపుడు, ఆయన 'బీజదాత కాదు' అని చెప్పేదానికి ఎక్కడైనా నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మేము పెండ్లి చేసుకుంటే నాకు సంవత్సరానికి ఒక కొడుకు పుట్టినాడు అని నీవు అనుకున్నాగాని, పదేండ్లకు ఒక కొడుకు పుట్టాడు. అనుకున్నాగానీ, నా ఇష్టప్రకారము నేను అనుకుంటే పుడతారు, నీ ఇష్ట ప్రకారము పుట్టరు అని ఆయన చెప్తున్నాడు.


ఇవన్నీ లెక్కేసుకొని చూస్తే మళ్ళీ తండ్రి అనేటటువంటి పదము ఎవరికి వర్తిస్తుంది? అంటే దేవునికే వర్తించాలి, మనుషులకు వర్తించదు. నలుగురు కొడుకులకి నేను తండ్రిని అని నీవు అనుకున్నాగాని, నా కొడుకులకు నాకు ఒక తండ్రి ఉన్నాడని అనుకోవడము ఉత్తమమైన పని. నీవు ఎప్పుడూ కొడుకువే, తండ్రివి కాలేవు. ఈ కొడుకులను మర్చిపోయి మీ నాన్నను మతికి చేసుకో. నేను ఎప్పుడూ అతనికి కొడుకునే అనుకో. నేను ఒకనికి పుట్టినవానినే అని జ్ఞాపకము పెట్టుకుంటే, ఇంకొకన్ని పుట్టించినాను అనేటటువంటి జ్ఞాపకము రాదు నీకు. నీవు తండ్రిగా ఎదగాలి అంటే, సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని నీవు కూడ ఆయనలోనికి ఐక్యమయితే నీవు అపుడు తండ్రివి అయ్యేదానికి అవకాశము ఉంది. ఆ తండ్రి అనే పేరు నీకు వస్తుంది. ఆయనకు వచ్చింది



కదా ఆల్రెడి మళ్ళా నాకెందుకు వస్తుంది, ఆయనకే కదా తండ్రి అని పేరుండేది, నాకు రాదు కదా! అని మీరు అనుకోవాల్సిన పనిలేదు. నీవు మోక్షమును పొందితే ఆయన నీలోకి దూరుకుంటాడు, ఇద్దరూ ఒకటి అవుతారు. అందరికి కలిపి ఒకటే తండ్రివి అపుడు అవుతావు.


ఆ రకముగా తయారైతాది కాబట్టి, ఇప్పుడు ఈ తండ్రి అనే పదము దగ్గర మనము మోసపోకుండా ఉండాలి అని అంటే, జాగ్రత్తగా జ్ఞానాన్ని తెలుసుకుని, మనము ఎవరు? కొడుకులమా తండ్రులమా అని ఆలోచన చేసుకుంటే సరిపోతుంది. దేవుడు భూమి మీదికి వస్తే జ్ఞానాన్ని తెలియ జేస్తాడు. జ్ఞానాన్ని తెలియజేసినటువంటి సందర్భాలు ఏవైనా ఒకటైనా ఉందా? అని అంటే, మనకు బాగా అర్థమయితా ఉంది. భగవద్గీతలో చెప్పిపోయినాడన్నమాట. చెప్పిపోయినాడంటే ఎట్ల చెప్పినాడు? ఆయన ఉన్నపుడు ఈయన గురువు అని తెలియకుండ ఉండేదాని కొరకు ఆయన పోయిన తరువాత తెలిసినా ఫరవాలేదు అనేటటువంటి ప్లాన్తో తాను చెప్పేటటువంటి జ్ఞానాన్ని, ఎవ్వరికి తెలియకుండ, ఎవ్వరు వినకుండ ఒకే ఒక వ్యక్తికి కృష్ణుడు చెప్పిపోయినాడు. కృష్ణుడు భగవంతునిగా వచ్చి తాను గురువు అని తెలియకుండ ఉండేదాని కొరకు తన జ్ఞానాన్ని పబ్లిక్గా ఎక్కడా చెప్పలేదు. అర్జునుడికి జ్ఞానాన్ని చెప్పినాడు. అర్జునుడు తన జీవితములో ఎపుడైనా జ్ఞానాన్ని తెలుసుకోవాలని అనుకున్నాడా? ఎప్పుడూ అనుకోలేదు. ఇపుడు మనము ఏమనుకుంటున్నాము. శ్రద్ధ ఉన్నవానికే అంటే జ్ఞానాన్ని తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకే జ్ఞానము తెలిసేది లేకపోతే జ్ఞానము తెలియబడదు అంటున్నాము.


భగవద్గీతలో కూడ అదే చెప్పారు. అర్జునుడు ఒకరోజు కూడ జ్ఞానాన్ని తెలుసుకోవాలని అనుకోలేదు.

కృష్ణుడు ఆయనకెందుకు



చెప్పినాడు? విశ్వరూపము ఆయనకు ఎందుకు చూపినాడు? అని ప్రశ్న వేసుకొని చూస్తే అతను కావాలనుకోలేదు, నేను చెప్పినాను. అతను 'జ్ఞానము కావాలి' అని అనుకొనివుంటే అతనికి జ్ఞానము వస్తుందా లేదా అని మీరు ఆలోచన చేయాలి. అతను నాకు జ్ఞానము కావాలి అని అనుకోనేలేదు అసలు అలాంటప్పుడు ఆయనకు జ్ఞానము వస్తుందా? లేదా? అనే ప్రశ్ననే లేదు. నేను చెప్పాను ఆయనకు, అంతే! నేను చెప్తే ఆయనకు ఉంటుందా? లేదా? అనేది అది వేరే విషయము. అతను కావాలనుకుంటే ఉంటుంది జ్ఞానము. నేను చెప్పితే ఉండదది. జ్ఞానము కావాలని అనుకున్నోనికే జ్ఞానము ఉంటుంది. జ్ఞానము కావాలని ఆసక్తి కల్గినటువంటి వానికే జ్ఞానముంటుందిగానీ, ఆసక్తి లేనటువంటి వానికి జ్ఞానముండదు. వానికి చెప్పినాగానీ జ్ఞానము బుర్రకు ఎక్కదు. అది నిలబడదు. కాబట్టి అర్జునుడు జ్ఞానము కావాలి అని ఏ రోజూ అనుకోలేదు. జ్ఞానము కావాల అని అనుకున్నవానికి చెప్పితే వాడు జ్ఞానమును తెలుసుకుంటాడు, భగవంతుడు కొంత బయటపడేదానికి అవకాశము వస్తుంది.


కాబట్టి కృష్ణుడు చాలా తెలివిగా ఏమాత్రము జ్ఞానాన్ని కోరుకోకుండా ఉండేవాన్ని పట్టుకొని వచ్చి, చాటుకు పిల్చుకొని పోయి ఎవ్వరు వినకుండ చెప్పిపోయినాడు. ఇపుడు జ్ఞానము పదిమందికి తెలియాలి, మనము తెలిసేటట్లు చేయాలి అని అనుకుంటున్నాము. ఎవ్వరికి తెలియకుండ ఎందుకు చెప్పిపోయినాడు అని అంటే, 90 సంవత్సరాల వయస్సులో కూడ ఆ రకముగా చెప్పినాడు. తరువాత ఈ చెప్పిన జ్ఞానము కూడ అర్జునుని దగ్గర నిలబడదు కాబట్టి అలా చెప్పడము జరిగింది. ఆయన ఏమి చెప్పినాడనేది బయటకు తెలియకుండా ఆ రకముగా చెప్పడము జరిగింది. తనను ఎవరూ గుర్తుంచుకోకుండా ఉండే దానికోసము ఆ విధముగా ఆయన



--


చెప్పిపోవడము జరిగింది. ఆయన చెప్పిపోయిన తరువాత అది బయటకు వచ్చేదానికి దగ్గర దగ్గర 5000 సంవత్సరాల పైన అయింది. 5000 సంవత్సరాల పైన అయినాగాని దేవుడు వచ్చి జ్ఞానాన్ని చెప్పిపోయినాడు భూమిమీదికి అని ఎవరైనా అనుకుంటున్నారా?


మేము జ్ఞానులమని కట్టెలు పట్టుకొని కూర్చున్నారు కదా చాలామంది! వాళ్ళకైనా తెలుసునా? అని అంటే కాషాయ వస్త్రాలు వేసుకొని, మేము సన్నాసులము అని పేరు పెట్టుకొని, మేము గురువులము అని రకరకాలు గురువులుగా ఉండేటటువంటి వాళ్ళు, పీఠము అని ప్రత్యేకమైన పీఠము పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళందరు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడ కృష్ణుడు వచ్చి జ్ఞానము చెప్పిపోయినాడు, ఆయనే నిజమైన దేవుడు అనే విషయము తెలియలేదు. హైదరాబాద్లో భక్తి టీ.వీ. వాళ్ళు 5 సంవత్సరాలు పూర్తి అయిందని వాళ్ళు పెద్ద ఫంక్షన్ చేసి, ఈ గురువులందరిని ఆహ్వానించి వాళ్ళతో జ్ఞానము చెప్పించి, వాళ్ళకు పెద్ద సన్మానము చేసినారు. ఉదయము పూట 5 గంటలసేపు వాళ్ళతో మాట్లాడించినారు ఒక్కొక్కర్ని ఒక్కో రకముగా. 5 గంటలసేపు అంతమంది మాట్లాడితే అంతా తెలిసినటువంటి వాళ్ళు, మరి అంత పెద్దోళ్ళు మాట్లాడితే భగవద్గీత అనే పదము వాళ్ళ నోటి గుండా ఎక్కడా రాలేదు. సనాతనధర్మము, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇంకొకటి, ఇంకొకటి, అని చెప్పుకుంటానే వస్తున్నారుగానీ, భగవద్గీత అనే పదము 5 గంటల సేపు వాళ్ళు మాట్లాడినా ఎవ్వరి నోటి గుండా రాలేదు. అది పెద్ద విచిత్రము అనిపించింది మాకు. ఇంత పెద్ద స్వామీజీలు ధర్మాలు ఎక్కడైతే తెలియబడినాయో ఆ దాన్ని గురించి ఒక్కమాట కూడ బయటకు రాకుండా వాళ్ళ సొంత భావములో, సొంత యోచనల గురించి చెప్పుకుంటూపోతున్నారు. ఈయన ఫలానాయన



చెప్పినాడు చూడండి ఇది మనకు ఆధారము అని అట్ల కూడ చెప్పుకోలేదు. భగవద్గీతలో ఉండేటటువంటి ఒక్క ఆధారాన్ని కూడా వాళ్ళు బయటికి చెప్పుకోలేదు.


ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అలా రావాలనే దేవుడు చేశాడు. అదేపనిగా! గురువు అంటే రహస్యమైనటువంటివాడు. దేవుడంటే రహస్యమైనటువంటి వాడు అయినపుడు గురువు కూడా రహస్యమైనటువంటి వాడే అవుతాడు. గురువు అనేవారు తెలియాలంటే బయట ఎక్కువగా ఉన్నారు. మనిషికి ఫలానా వాడు గురువు అని తెలిస్తే తర్వాత జ్ఞానము తెలుస్తుంది. కొందరు నాకు గురువు కావాలి అంటారు. మీకు జ్ఞానము కావాలా? గురువు కావాలా? ఎవరు కావాలి అంటే?

కొంతమంది గురువు కావాలంటారు. చాలామందిని చూశా నేను. మాకు గురూపదేశము కావాలి స్వామి! ఉపదేశము ఇస్తారా? అని వస్తారు. నీకు జ్ఞానము కావాలా? ఉపదేశము కావాలా అంటే? ఉపదేశము కావాలి, జ్ఞానము తర్వాత చూస్తాములే, ముందు ఉపదేశము తీసుకొనిపోతే తర్వాత జ్ఞానమును చూస్తాను అంటాడు. అందరూ ఉపదేశము తీసుకున్నారు మా ఊర్లో, నేను ఒకన్నే కొదవ ఉండేది, నాకు కూడ ఉపదేశము కావాలి. అంటాడు. ఉపదేశము ఒకవేళ ఇచ్చేదానికి నా దగ్గర లేదు. గురువులు ఎక్కువగా ఉన్నారు కదా! మీ ఊరికి కూడ వచ్చి ఇస్తారు అక్కడే ఇప్పించుకో అని చెప్పి పంపించినాము మేము. అంటే ఉపదేశము ఇస్తారని చాలామంది వచ్చారు కానీ ఎవ్వరికీ ఇంతవరకు నేను ఇవ్వలేదు. వాళ్ళకు జ్ఞానము కావాలని రావడము లేదు, ఉపదేశము కావాలని వస్తున్నారు.


ఈ రకముగా ప్రజలు దేవున్ని తెలుసుకోవాలి అని అనుకోవడము లేదు, కానీ వీళ్ళకు కావాల్సింది గురువు. వీళ్ళు జ్ఞానము కావాలని



అనుకోలేదు. దేవున్ని తెలుసుకోవాలని అనుకోలేదు. ఎవరో ఒకరు గురువు దొరికితే సరిపోతుంది అని అనుకుంటారు. కొందరిలో గురువులు కూడా చాలా దూరము అయితే బాగుండదు దగ్గర్లో ఉంటే బాగుంటుంది అని కూడా ఒక కోరిక ఉంది. ఒక గుడి దగ్గరకు పోయి ఏమని అడుగుతారంటే నాకు వయసు అయింది, ఇంతవరకు నేను ప్రపంచ విషయాలలో చాలా మునిగి తేలినాను. ఇప్పటికి 60 యేండ్లకు పైన అయింది. ఇపుడు జ్ఞానము తెలుసుకోవాలని అనుకున్నాను. నాకు ఒక గురువు కావాలి స్వామి అని, గురువును ఏదో ఒక విధముగా నాకు దొరికేటట్లు చేయి అని దేవున్ని మ్రొక్కుకుంటాడు, గుడి దగ్గర ఆ మ్రొక్కుకుండే వాడు చాలాదూరము అయితే పోలేను, దగ్గరలో ఉండేటట్లు చూడు అని చెప్తాడు. గురువు కూడ దగ్గరలో ఉండేటట్లు ఏర్పాటు చేయి అని చెప్తాడు. ఆ రకముగా ఇంకా కొంతమంది ఏమి చేస్తారంటే నేను చూశాను.


ఒక సంస్థలో ఒక గురువు అయిన తర్వాత మళ్ళీ అతని దగ్గరికే పోయి ఉపదేశము తీసుకోవాలని ఏమి లేదు. శిష్యుడు అయినవాడు మళ్లీ నాలుగైదు యేండ్లకు గురువై ఇతను ఉపదేశము ఇవ్వవచ్చు. అట్ల శిష్యుడు కూడ గురువుగా మారి ఉపదేశము ఇస్తాడు. గురువు అనే హోదా మీకు కూడా ఇస్తున్నాము, నేనొకన్నే కాదు గురువును కాబట్టి మీరంతా గురువులుగా ఉండాల, మీరంతా ఉపదేశము ఇవ్వాలి, నేను చెప్పినేది చెప్తా ఉండాలి అని చెప్పుచున్నాడు. దేవుడు భూమిమీద చాలామంది బోధకులను తయారు చేసి పెట్టినాడు. అటువంటి గురువులు చాలామంది ఉన్నారు. ఒక ఊరికి ఒక గురువు లేకపోయినాగానీ పది ఊర్లకు ఒక గురువైనా ఉంటాడు. లేకపోతే ఒక తాలుకాకు ఒక గురువు లేక తాలుకాకు ఒక పదిమంది అయినా ఉంటారు. ఈ లెక్కకు పోతే జిల్లాకు ఒక



నూరుమంది అయినా ఉంటారు. ఇట్ల చాలామంది గురువులు ఉన్నారు. కాబట్టి, ఎవరికి ఎవరు ఇష్టమో వారు ఆ గురువును ఎన్నుకొని నాకూ గురువు ఉన్నాడు, నేనూ జ్ఞానము తెలుసుకుంటున్నాను అని అనుకుంటున్నాడు కానీ నేను తెలుసుకునే జ్ఞానము సరైనదా? కాదా? నేను ఎన్నుకున్నటువంటి గురువు, గురువా కాదా? అనేటటువంటి ఆలోచన ఎవ్వరూ చేయడము లేదు.


అందువలన గురువు అనేటటువంటి వాడు మనకు తెలిసినా, నిజ గురువు తెలియని స్థితిలో ఉన్నాడు. నాకు గురువు తెలియాలి, దేవుడు తెలియాలి, దేవున్ని తెలిపే గురువు కావాలి అని నీకు ఆసక్తి ఉంటే తప్పనిసరిగా తెలియబడుతుంది. అటువంటి ఆసక్తి మనకు లేదు కాబట్టి,

ఆయన తెలియబడకూడదు కాబట్టి స్టూలముగా, వచ్చినరోజు కూడ ఎవ్వరికి

తెలియకుండా ఒకే ఒక అర్జునుడికి చెప్పి పోవడము జరిగింది. ఆ అర్జునుడికి చెప్పిన విషయము చివరికి వ్యాసుని వరకూ ప్రాకి, వ్యాసుడు దానిని గ్రహించిగలిగి అతని ద్వారా నేడు భగవద్గీత ఒక గ్రంథరూపములో మనవద్దకు వచ్చింది. ఏదో రకముగా మన వద్దకు వచ్చింది. ఐదువేల సంవత్సరాలు అయినాగానీ మనము దేవుడు చెప్పినటువంటి జ్ఞానము ఫలానిది అని తెలుసుకోగల్గినామా? అంటే పెద్దపెద్ద స్వామీజీలే ఈ రోజు దానిని గుర్తించలేకుండా, దాని పేరు కూడ ఉచ్ఛరించలేనటువంటి స్థితిలో ఉంటే సామాన్యమైన మానవులకు ఎలా తెలుస్తుంది? దానిని గురించి పట్టించుకోవడము లేదు. తనకు తెలిసిందేదో అదే జ్ఞానము అని మనిషి అనుకుంటున్నాడు. ధర్మాలను అధర్మాలుగా, అధర్మాలను ధర్మాలుగా పోల్చుకుంటున్నాడు.



ఈ మధ్య ఒక మూడు గ్రంథాలు వచ్చాయి. ఆ గ్రంథాల్లో ధర్మాలంటే ఇవి, అధర్మాలంటే ఇవి అని తేల్చి చెప్పడమైనది. అంటే లెక్కాచారము ప్రకారము ఇవే ధర్మాలు, ఇవే అధర్మాలు అని ఒక శాస్త్రీయతను చేకూర్చి చెప్పడమైందన్నమాట. దానికంటే మించి ఇంక లేవు అని చెప్పడమైంది. ఇప్పుడు అందరూ ఏవైతే ధర్మాలు అనుకుంటున్నారో అవన్ని అధర్మాలుగా కన్పించాయి. మళ్ళీ అవన్నీ అధర్మాలైతే మేము చేసేటివంతా అధర్మ కార్యాలేనా? అని ప్రశ్న వస్తుందేమో అని దేవుడే ఇట్లు చెప్పినాడు చూడు, ఈ కార్యాలన్ని అధర్మ కార్యాలని శ్లోకాన్ని మేము చూపించాము. మేము చెప్పినట్లు కాకుండా దేవుడు చెప్పిన శ్లోకాన్నే చూపించాము. దేవుడు చెప్పిన శ్లోకము ప్రకారము కూడ అవన్నీ అధర్మ కార్యాలు అని తెలిసి పోయినవి. మేము వ్రాసిన గ్రంథాలలో కూడ ముందే చెప్పాను. అంటే ఈ రోజు చెప్పే విషయము కాదది. 5, 6 సంవత్సరాలు క్రితమే ఒక గ్రంథాన్ని తయారు చేశాను. ఒక గ్రంథము తయారైతే ఎంతో తృప్తి నాకు. ఒక గ్రంథము తయారైంది అంటే నాకు ఒక కొడుకు పుట్టిన దానితో సమానము అని ఇంతకుముందే చెప్పినాను. నాకు ఎంతమంది కొడుకులు అంటే ఇపుడు మొత్తము నూరుమంది ఉన్నారు. ఇది నిజమా? అబద్దమా? అని అనుకోవద్దండి. అంటే ఒక గ్రంథము తయారైతే ఒక కొడుకు క్రిందికి లెక్కేసుకుంటున్నాము కదా!


ఆ లెక్కప్రకారము ఒక గ్రంథము మనకు తయారైతే నాకు ఒక కొడుకు తయారైనట్టే అని ఇంతకుముందు చెప్పాను. నూరుమందేకాక ఇంకా ఎక్కువ కూడా అవుతారు. ఈ మధ్యన ఒక చిన్న పుస్తకము వచ్చింది, చిన్న పుస్తకము అన్నిటికంటే చిన్న పుస్తకము 48 పేజీల పుస్తకమే దాని పేరు “మంత్రము-మహిమ”. 'మంత్రము-మహిమ' అనే దాంట్లో ఏమి



చెప్పినామంటే మంత్రాల గురించి, జ్ఞానాన్ని గురించి చెప్పినాము. మంత్రాలు ఈ రకముగా పని చేస్తాయి, జ్ఞానము ఈ రకముగా పని చేస్తాది. కానీ మంత్ర శక్తి ఉంది, యంత్ర శక్తి ఉంది, దైవశక్తి ఉంది, అన్ని శక్తులు ఉన్నాయి. అయితే ఏది గొప్ప వీటిల్లో అంటే దైవశక్తి గొప్ప అని కూడ చెప్పినాము. ఒక గ్రంథము తయారైంది ప్రింటింగ్ ప్రెస్లోంచి బయటకు వచ్చిన తర్వాత గ్రంథాల కట్టలన్ని నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక గ్రంథాన్ని చూసి నా దగ్గర పెట్టుకుంటాము, అది గుర్తుకు. గ్రంథాన్ని మాకు చూసినపుడు ఓహెూ! నాకు ఈ గ్రంథము తయారైంది అని ఎట్లైతే అనుకుంటామో అట్లే ఈ కొడుకు నాకు పుట్టినాడు అనుకుంటాము. ఈ 48 పేజీల కొడుకు కూడా ఈ మధ్యన ఏమి చేసినాడంటే, ఒకరికి తేలు కుడితే వాడు ఆ మందు, ఈ మందు వేసుకున్నా తగ్గలేదు. నేను అడిగితే ఇట్ల తేలుకుట్టిందంట స్వామి! బాధపడతా ఉన్నాడు అన్నారు. ఈ గ్రంథము తీసుకొని పోయి పెట్టుపోండి అని చెప్పితే ఆ గ్రంథము తీసుకొని పోయి తేలు కుట్టిన చోట పెడితే అది కరెంట్ పెరికేసినట్టు పెరికేసింది ఒకేసారి ఒక నిమిషములో ఏమి లేకుండ చేసింది. అంటే ఆ నొప్పి ఏమాత్రము లేకుండ చేసింది. అంటే ఇప్పుడు దాంట్లో మంత్రము ఉంది కాబట్టి, దానివల్ల పోయింది అనుకున్నారు. తేలుమంత్రాన్ని ఇన్ని పదివేలసార్లు జపిస్తే నీకు శక్తి వస్తుంది అని చెప్పినాముగానీ అది వ్రాసినంత మాత్రాన శక్తి వస్తుంది అని చెప్పలేదు. కానీ ఇక్కడ మంత్రమును జపించుకోకుండానే గ్రంథాన్ని చూస్తేనే పోయింది. గ్రంథాన్ని చూసి తేలు విషము భయపడి ఆటోమాటిక్గా పోయింది. అంతేకదా! ఇక్కడ మంత్రశక్తి పని చేయలేదు కాని, ఏదో ఒక శక్తి పని చేసింది కాబట్టి అది పోయింది.


ఒక పని జరిగింది అంటే ఒక శక్తి పనిచేసినట్టే కదా అక్కడ. ఏ శక్తో ఒక శక్తి పని చేసింది అది పోయింది. కాని కొందరు ఏమనుకున్నారంటే



మంత్రము వ్రాసినోళ్ళు బాగా శక్తివంతముగా వ్రాసింటారు. ఆ మంత్రము ఉండేదాని వల్లే అది పోయింది అని అనుకున్నారు. మరుసటిరోజే వేరేవాళ్ళకు తలనొప్పి వచ్చింది. తలనొప్పి వస్తే వాళ్ళు ఇంక ఏమీ దిక్కుతెలియని పరిస్థితిలో గ్రంథము తీసుకొని పోయి తల దగ్గర పెట్టుకుంటే తలనొప్పి పోయింది. మరి గ్రంథములో తలనొప్పి మంత్రము లేదు కదా! తేలు మంత్రము ఉంది కాబట్టి తేలు నొప్పి పోయింది అనుకోవచ్చు. మరి తలనొప్పి పోయేదానికి తలనొప్పి మంత్రము లేదు కదా మరి తలనొప్పి కూడ పోయింది కదా! అప్పుడు వాళ్ళకు నొప్పులు పోతాయి ఈ గ్రంథముతో అని తెలిసింది. అంటే గ్రంథముతో నొప్పులు పోతున్నాయిలే ఇదేదో బాగా పనికొస్తుంది ముప్పై రూపాయలే కదా! గ్రంథము కొని పెట్టుకుంటే పర్మనెంటుగా ఉంటుంది కదా అని చాలా మంది అనుకున్నారు. ఒకనికి కడుపునొప్పి వచ్చిందంట. కడుపు నొప్పి వస్తే ఆ గ్రంథము పెట్టుకున్నాడంట. గ్రంథము పెట్టుకొంటే పోయింది. కానీ మళ్ళ వెనకాల నొప్పి వచ్చిందంట అప్పుడు గ్రంథాన్ని వెనుక పెట్టుకుంటే నొప్పి ముందరకొస్తుందంట, ముందర పెట్టుకుంటే వెనకాల వస్తుందంట. ఇట్ల ముందర పెట్టుకుంటే వెనకాల, వెనకాల పెట్టుకుంటే ముందు వస్తుందని ఏమి చేయాలో తెలీక నా దగ్గరికి వచ్చి విషయము చెప్పాడు.


నేను ఒరేయ్! నీకు కడుపు నొప్పి పోయేదానికా నేను గ్రంథము తయిరుచేసినేది? జ్ఞానము తెలుసుకొనేదానికి అని అంటే వానికి మాత్రము నాకు నొప్పి పోయేదానికే పనికి వస్తుంది అంటాడు. సరే దేనికో ఒకదానికి పనికి వస్తుందిలే ఎట్లోకట్ల నీ ఇష్టము వచ్చినట్లు చేసుకో! నడుము చుట్టూ కట్టుకో సరిపోతుంది అని చెప్పినాము. వాడు అదే పని చేసినాడు. నడుముచుట్టూ కట్టుకోవడము జరిగింది అపుడు ఏమీ లేకుండా పోయింది.



----------


ఇది బాగా పని చేసింది అనుకున్నాడు. అంటే ఈ రకముగా ఒక చిన్న పుస్తకములో అంత శక్తి ఉంటే పెద్ద పుస్తకాల్లో కూడ చాలా శక్తి ఉంటుంది. ఈ రకముగా చూసుకుంటే పుస్తకాలల్లో శక్తి ఉంది అని మనకు కొంత అర్థమైందిపుడు. వ్రాసినందుకు మనకు తెలియక పోయినా గానీ, ఈ కడుపు నొప్పి, కాళ్ళు నొప్పులు పోగొట్టుకున్న వాళ్ళు చెప్తావుంటే మనకు శక్తి ఉంది అని అర్థమైతావుంది.


మేము జ్ఞానులమని, మాదే గొప్ప జ్ఞానమని, నేను చెప్పినట్లు నేను చెప్పే జ్ఞానాన్ని కూడ ఎక్కిరించి మీరు మాట్లాడుతున్నారు. అంతేకాక మీరు చెప్పేది పరమత జ్ఞానమని కొందరు నిందించి మాట్లాడుతున్నారు. జ్ఞానాన్ని సంపాదించుకుంటే మీకు కూడ ఇటువంటి శక్తులు వస్తాయి అని ఈ రోజు గ్రంథాలలో కూడ అటువంటి శక్తి ఉంది అని గర్వముగా మనము చెప్పుకుంటున్నాము. నాది సరైన జ్ఞానము కాదు అని నిందించే వాళ్ళను ఏమడుగుతున్నామంటే సరే, నాది సరైన జ్ఞానము కాదు, నేను నీకు సరిలేనటువంటి మనిషినే, నీతో సమానమైన వానిని కాదు. నా గ్రంథానికైనా నీవు సమానము అవుతావా? అని అడిగినా నేను. నా గ్రంథానికన్నా సమానమైన శక్తి ఉందా? నీ దగ్గర అని అడిగినాము. శక్తి అనేటటువంటిది ఎవరిలోకైనా రావచ్చు. ఎందుకు వస్తుంది అంటే గురువు అనేటటువంటి వానిని మనము దర్శించుకోకున్నా, కనీసము తెలుసుకోగల్గినా గానీ, మనకు ఆ విధమైన శక్తి ప్రాకుతుంది. ఇపుడు కృష్ణుడు భగవంతుడు అని తెలుసు. దేవుడు భగవంతునిగా వచ్చినాడు అని చెప్పుకున్నాము. సజీవముగా పుట్టినటువంటి వాడు భగవంతుడు అని చెప్పుకున్నాము. గర్భము నుంచి ఎవరైతే సజీవముగా పుడతాడో వాడు భగవంతుడే అని చెప్పుకున్నాము. కృష్ణుడు సజీవముగా పుట్టినాడా లేదా అనేదానికి ప్రసవించేటప్పుడు గర్భములో ఉండగనే కాళ్ళు అల్లాడించి పుట్టాడు అని చెప్పుకున్నాము.




ఈ రకముగా పుట్టినటువంటి భగవంతుడు గురువుగా అవుతాడు ఆయన వచ్చినేది జ్ఞానము చెప్పేదానికి కదా! మళ్ళీ కృష్ణుడిగా పుట్టినటువంటి వాడు ఏమి చేసినాడంటే 90 సంవత్సరాలకు తన జ్ఞానాన్ని చెప్పిపోయినాడు. ఆ రోజు ఎవ్వరూ గుర్తుంచుకోకుండ వెళ్ళిపోయినాడు కాబట్టి ఆయన గురువు అని ఎవ్వరికి తెలియదు. ఈ రోజు మనము చెప్పుకుంటావున్నాము వేరేవాళ్ళు కృష్ణుడు గురువు అంటే ఒప్పుకోరు వాళ్ళు వేరే గురువులను చెప్పుకుంటారు. కానీ ఆయనను గురువుగా చెప్పుకోరు. ఆయన ప్రపంచానికంతా గురువు అని మనము అంటున్నాము, వేరేవాళ్ళు ఆ మాట అనడము లేదు. ఒకరు అన్నా అనకపోయినా ఆయన మాత్రము గురువే! ఆయన తెలియకూడదు అనుకున్నాడు కాబట్టి తెలియలేదు కానీ అది వాళ్ళకు అర్థము కాలేదు. ఆయన చేసిన సంకల్పమేగాని ఇంకొకటి ఏమి కాదు. అంటే అందరికి తెలియకూడదు అనుకున్నాడు. మరి మనకెందుకు తెలిసింది? అంటే నీకు శ్రద్ధ ఉంటే తెలుస్తా నేను అన్నాడు. నీకు శ్రద్ధ ఉంటే నేను తెలియబడతాను. నాకు నీవు ఇష్టుడవు అయితే నేను నీకు తెలియబడతాను లేకపోతే తెలియబడను అన్నాడు. ఎందుకు తెలియబడడు? అంటే నేను ఒక మాయను తయారుచేసి పెట్టుకున్నాను. నా మాయ నన్ను ఏమాత్రము గుర్తించేదానికి అవకాశము లేకుండా చేస్తుంది. ఇతను ఫలానా వ్యక్తి అని గుర్తించేదానికి అవకాశము లేకుండా చేస్తుంది. ఏ రకముగా చేస్తుంది? వాని తలలో గుణాలే ఆ రకముగ వానిని మారుస్తాయి.


అందుకే భగవద్గీతలోని విజ్ఞానయోగములో ఒకమాట చెప్పాడు. "గుణమయి మమ మాయా దురత్యయా” అన్నాడు. అంటే నా మాయ గుణములతో కూడుకొని ఉంటుంది. అది ఎవ్వరిని తనను దాటి రానివ్వదు. 'దురత్యయా' అంటే దుస్సాధ్యము అని అర్థము. అది అందరిని కట్టేసి



ప్రక్కన పెడుతుంది. దేవుడు ఎవరు అని తెలియకుండ చేస్తుందన్నమాట. నేనెవరు అని తెలిస్తే కదా! నీవు నా వరకు వచ్చేది. కాబట్టి ప్రపంచములో గురువు ఎవరు? అని తెలియకుండ చేస్తుంది కాబట్టి, గురువును కనుక్కోకుండ చేస్తుంది. మాయ ఎంతోమంది సాధారణ గురువులను తయారు చేసి పెట్టింది. వాళ్ళనే గొప్పగా చూపుతుంది కానీ అసలైన గురువును గొప్పగా చూపదు. ఇపుడు ఈ రకముగా లెక్కేసుకొంటే అసలైన గురువు వచ్చి ప్రయోజనము ఏమి? ఆయన జ్ఞానాన్ని తెలియజేసేదానికి నేను గురువుగా వస్తానన్నాడు. నేను గురువుగా జ్ఞానము చెప్పుతానన్నాడు. గురువుగా తెలియబడనపుడు ఆయన చెప్పిన జ్ఞానము మాత్రము మనకెట్ల తెలుస్తుంది? ఆయన గురువు అని తెలిసినపుడు కదా! ఆయన చెప్పిన జ్ఞానము గొప్పదని మనకు తెలిసేది. లేకపోతే ఆయన జ్ఞానము గొప్పదని మనము కనుక్కోగల్గినపుడైనా ఆయన గురువు అని మనము తెలుసు కోగలుగుతాము. అట్ల తెలుసుకొనే దానికి అవకాశమే లేకుండ నా మాయ పని చేస్తుంది అని చెప్పినాడు కదా? అని ప్రశ్నించుకొంటే దానికి జవాబుగా ఎవడైతే నన్ను ఆరాధిస్తాడో వాడు మాత్రము మాయను సులభముగ దాటగల్గుతాడు, నన్ను తెలుసుకోగల్గుతాడు. 'ఏమామేవ యే ప్రపద్యంతే” ఎవడైతే నన్నే ఆరాధిస్తాడో, నన్నే విశ్వసిస్తాడో, నా మీదనే శ్రద్ధ ఉందో, "మాయా మేతాం తరంతితే” అంటే వాడు ఈ మాయను సులభముగ దాటిరాగలడు, తరించిరాగలడు అని ఉంది. అంటే మాయ అనే గొప్పదానిని అడ్డము పెట్టుకొని, ఆయనను కనుక్కోకుండ చేసుకున్నాగాని నీవే నాకు దిక్కు అన్నపుడు ఈ మాయ కూడ దారి విడిచి అతన్ని కనుక్కుండేతట్టు చేస్తుంది అన్నాడు.


ఇపుడు దేశములో ఉండే వాళ్ళకంటే మనము గొప్పవాళ్ళము అని చెప్పుకుండే దానికి, కృష్ణుడు గురువు అని మనము కనుక్కోగలిగినాము.



కాబట్టి వాళ్ళంతా కృష్ణుడు గురువు అని, భగవద్గీతను గొప్పగా చెప్పుకోకుండ వేదాలు, ఉపనిషత్లు అది ఇది ఇంకొకటి ఇంకొకటి అని చెప్పుకున్నారు. మనము అవన్నీ చెప్పుకోలేదు, కేవలము ఒకే ఒక భగవద్గీత గొప్పది. ధర్మాలు అడుగంటి పోయినపుడే భగవంతుడు వచ్చి తెలియజేసి పోయినాడు. వాస్తవమైన ధర్మాలు అందులో మనకు తెలియబడినాయి అని మనము చెప్పుకుంటున్నాము. కాబట్టి ఈ రోజు మనకు భగవంతుడు గురువు అని తెలియబడినాడు. మనము అదృష్టవంతులము. ఇపుడు మళ్ళ ఆ గురువును మనము అందరూ తెలుసుకోవాలంటే ఏమి చేయాలి? శ్రద్ధ ఉంటే మీకు గురువు తెలియబడతాడు. ఇపుడు ఆయన లేడు గదా! ఎప్పుడో లక్షల సంవత్సరాలకు ఒకసారి వచ్చేది కదా గురువు! అపుడు వచ్చినపుడు చూసుకుందాములే! ఇపుడు శ్రద్ధ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని అనుకోవద్దు. నీకు శ్రద్ధ ఉంటే తెలియబడతాను అన్నాడు, నీకు ఫలానప్పుడు ఇప్పుడు అప్పుడు అని భగవద్గీతలో చెప్పినాడా? శ్రద్ధ ఉంటే తెలియబడతాడు. ఎప్పుడైనా తెలియబడతాడు దాందేముంది. మీరాబాయికి శ్రద్ధ ఉంది కాబట్టి లేనపుడు కూడ తెలియబడినాడు. ఆమెతో మాట్లాడినాడు. ఆ మాటలు కూడ ప్రక్కన వాళ్ళు విన్నారు కాని ఆ పొద్దు ఉన్నాడా? లేడు ఆయన, భౌతికముగనే లేడు. మళ్ళీ కృష్ణుడిగానే కన్పించినాడు, కృష్ణుడిగానే మాట్లాడినాడు. ఆయన ఏ రకముగా ఉన్నాగానీ గురువు మనకు

తెలియబడతాడు.


మనకు శ్రద్ధ అనేది ఎపుడైతే ఉందో అపుడు తెలియబడతాడు. కానీ గురుపౌర్ణమి అని మనకు ఈ రోజు వచ్చింది, కాబట్టి గురువు అని ఎవర్నెవర్నో పట్టుకొని దేవాలయాల్లో గందరగోళపడుతున్నారు చాలామంది. అసలైన గురువు దేవుడు (భగవంతుడు) అనేటటువంటి విధానము



తెలియకుండ ఈ రోజు ఏ టీ.వీ.లోనైనా చూసుకోండి. వాళ్ళు దేనినో పట్టుకొని దేన్నో అనుకుంటున్నారు. ఈ గురుపౌర్ణమి సందర్భముగా మనము అసలైన గురువును గుర్తించాలి అనే ఉద్దేశ్యముతో అదే భావముతో ఉంటే మనము గుర్తించగలము. ఇప్పుడు గురువు లేడు అని అనుకున్నా, నీ కోసము వస్తాడు నీవు గుర్తించవచ్చు. అటువంటి చింత లేకుండ గురువును తెలుసుకోవాలనే ఉద్దేశ్యముతో గట్టిగ ఉండండి. అదే గురుపౌర్ణమి యొక్క ఉద్దేశ్యము అని అనుకోండి. ఇపుడు ఇన్ని రోజులు అనుకున్నా అనుకోక పోయినా ఇది గుర్తింపు దినము కదా! కాబట్టి ఇప్పటినుండైనా గురువును తెలుసుకోవాలని అనుకోండి. గురువును తెలుసుకోవాలి అనుకున్నపుడు మీరు బుద్ధితో యోచించండి. మీకు గురువు తెలియబడతాడు. లేని గురువు ఎట్ల వస్తాడు అంటే ఏ ఆకాశము నుంచైనా దిగిరావచ్చు దాందేముంది! నీకు తెలియజేస్తాను అన్నాడుగానీ, నేను ఎప్పుడు వస్తానని నీకు చెప్పలేదు కదా! ఎప్పుడొస్తాడో ఎవ్వరికీ తెలియదు. మీరు గురువు అనేటటువంటి వానిని బాగా జాగ్రత్తగా పరిశీలించండి. అన్నిటిని గురువు అనేటటువంటి దాంతో ముడి వేసుకోవద్దండి. ఆయన తెలియకుండ వచ్చి దాచిపెట్టుకొని పోతాడు ఎవ్వరికి కనపడకుండ. మీ బుద్ధి కూడ ఈయన కాదు ఈయన కాదు అని చెప్తుంది. కానీ అక్కడనే మీరు పొరపాటు పడుతుంటారు. జాగ్రత్తగా చూసుకోండి. తండ్రి అర్హత ఎవ్వరికీ లేదు. ఒక్కరికే ఉంటుంది. ఆ తండ్రి అర్హత ఉండేటటువంటి వాడే మీకు గురువు అని మూల గ్రంథాల్లో కూడ చెప్పారు. ఇంతటితో ఈ ప్రవచనమును ముగిస్తున్నాము.



తేది: 09.06.2017


ఈ సభా ప్రాంగణమున కలిసిన ప్రతి వ్యక్తికి దేవుడు (ఆత్మ) వారి బుద్ధికి సక్రమమైన జ్ఞానాన్ని అందించాలని, వినే ప్రతి అక్షరాన్ని వివరముగా అర్థమయ్యేటట్టుగా చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుంటున్నాము. మొదట ఆత్మను స్మృతించాము కాబట్టి మనందరికీ అర్థమవుతుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చెప్పేది ‘ల-లా-జలము'. ఇది ఎక్కడుంది? అంటే మన శరీరములోనే ఉన్నది. ఆత్మజ్ఞానాన్ని చెబుతానని నోట్లో వుండే ఎంగిలిని గురించి చెబుతున్నారే అని అనుకోవద్దండి. నోట్లో ఊరేదాన్నే 'ఎంగిలి' అంటాము మనము. దాన్నే ఇంకో పదము మార్చి చెబితే 'లాజలము' అంటాము. కానీ కొంతమంది మొదటి రెండు అక్షరాలకూ దీర్ఘము చెప్పి లాలాజలము అంటుంటారు. ఒరిజినల్ పదము ఏది అని అంటే తెలుగు భాషలో 'లలాజలము' దానిని అంటాము. మొదటిది 'ల' తరువాతది 'లా' తరువాత

'జలము' అని ఉంటుంది. 'లలా' అనే ఈ రెండు అక్షరాలకు అర్థము బాగానే ఉందిగాని ఈ 'జలము' అనేదానికి ఏమి అర్థము? అని మీకొక ప్రశ్న రావచ్చు. 'ము' అనేది ముగింపు అక్షరము దానికేమి విలువ లేదుగాని 'జల' అనేదానికే విలువ ఉంటుంది. దీని గురించి మనము వివరముగ చెప్పుకుంటాము.


ఈ శరీరములో ఉండేటటువంటి విషయము మనము ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనము దేవుడు అని ఎవరినైతే అంటున్నామో, దేవుడు అనే భక్తి భావాన్ని మనము ఎవరిమీదైతే చూపుతున్నామో, ఆ



సిద్ది బోధ

దేవుడు మన శరీరములోనే ఉన్నాడు. కాని చాలామందికి దేవుడు ఎక్కడో బయట ఉన్నాడు అనే భావము ఉంది. తరువాత ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే దేవుడు ఏడు ఆకాశాల పైన ఉన్నాడు అని అంటున్నారు. ఏడు ఆకాశాల పైన అయితే ఒక జాగా ఉంటుంది. ఆ జాగాలో ఆయన ఉన్నాడంటే అయన ఒక జాగాకు పరిమితి అయినటువంటివాడు అని మనము అనుకోవాల్సిన అవసరము ఏర్పడుతుంది. కాని బయటగల దేవుడు ఒక జాగాకు పరిమితి అయిన వాడు కాదు. ఆయన అంతటా ఉన్నటు వంటివాడు. అప్పుడు ఏడు ఆకాశాల పైన ఉన్నాడు అనుకోవడము చాలా పొరపాటు. కానీ ఇపుడు మనము ముఖ్యముగా చెప్పుకోవడము ఏమంటే, మూడు గ్రంథాలలో ఉండేటటువంటి వచనాలను ఏకభావముతో తెలుసుకో గలిగినపుడు మనకు నిజమైన జ్ఞానము అర్థమయితుంది. అంటే భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ ఈ మూడు గ్రంథాలలో ఏ వాక్యము తీసుకున్నా వాక్యము మీకు మిగతా రెండు గ్రంథాలతో కూడా అనుసంధానమై ఉండాలి. మిగతా రెండు గ్రంథాలతో అనుసంధానము కాకుండ నీ గ్రంథానికి ఒక్కదానికే నువ్వు భావము చెప్పుకోగలిగితే ఆ భావము మిగతా రెండు గ్రంథాలతో ఏకీభవించకపోతే, అపుడు ఏమైతుందంటే అది నిజమైన జ్ఞానము కాదు. ఏడు ఆకాశాలు అని ఒకే ఒక అంతిమ దైవగ్రంథము అయిన ఖుర్ఆన్లో ఉంది. మరి ఖుర్ఆన్ గ్రంథము సామాన్యమైన గ్రంథమా అంటే అది మాకు తెలుసు దైవగ్రంథము అని ఎవరికి ఎటువంటి అభిప్రాయమున్నాగాని బైబిలు గురించి తెలుసు, భగవద్గీత గురించి తెలుసు, ఖుర్ఆన్ గురించి తెలుసు, మూడూ ఒకే దేవున్ని గూర్చి చెపుతున్నాయి, వేరే ఇతర దేవుళ్ళ గూర్చి చెప్పలేదు. అందులో అపుడు అక్కడ ఏ వాక్యమున్నాగానీ ఈ మిగతా రెండు గ్రంథాలతో కూడా సంబంధపడి



ఉంటాయి. ఇపుడు మనము ఏమనుకుంటాము అంటే, ఈ ఖుర్ఆన్ గ్రంథములో ఉండే వాక్యము భగవద్గీతలోగాని బైబిలులోగాని లేదు కదా! ఆ భావము లేదు కదా! అని అనుకుంటాము. అంటే ఖుర్ఆన్లో ఏముంది? ఏడు ఆకాశాల మీద దేవుడున్నాడు అనేది ఒకటి ఉంది. కానీ అది బాహ్యముగా చూసుకుంటున్నారు, ఏడు ఆకాశాలున్నాయని అంటున్నారు, ఏడు ఆకాశాల పైన ఉన్నాడని చెబుతున్నారు. అంతటా ఉన్నాడని మనమంటున్నాము. బైబిలులోను అంతటా ఉన్నాడు, అని చెప్పబడినది. భగవద్గీతలో కూడ అదే చెప్పబడినది. మళ్ళీ అట్లు అన్నప్పుడు ఏడు అకాశాల పైన అంటే భగవద్గీతకు సంబంధపడదు, బైబిలుకు సంబంధపడదు. అటువంటపుడు ఏమయితాది? ఈ రెండు గ్రంథాలతో ఏకీభవించకపోతే అది నిజమైన జ్ఞానము కాదు అని చెప్పవచ్చును. ఖుర్ఆన్లో చెప్పినది నిజమైన జ్ఞానము కాదా? అంటే నూటికి నూరుపాళ్ళు నిజమైన జ్ఞానమే, అది దైవవాక్కు కానీ అక్కడ అర్థము చేసుకోవడములో పొరపాటు పడి, ఏడు ఆకాశాలున్నాయని అంటున్నారు. ఏడో ఆకాశము ఒకటి ఉందంటున్నారు.


ఖుర్ఆన్లోనే 3వ సూరా 7వ అయత్లో ఏమి చెప్పినాడంటే, సూక్ష్మమైన వాక్యాలు ఈ ఖుర్ఆన్ గ్రంథములో ఉన్నాయి అని చెప్పాడు. ఒక్క ఖుర్ఆన్ గ్రంథములోనే కాకుండ భగవద్గీతలోగానీ, బైబిలులోగానీ సూక్ష్మమైన భావాలతో కూడిన వాక్యాలు ఉన్నాయి అని చెప్పబడింది. సూక్ష్మమైన భావాలు అంటే స్థూలమైనవి కావు. కానీ ఏ ఒక్క ముస్లీమ్ కూడ సూక్ష్మముగా ఉండేదానిని తీసుకోకుండ ప్రతిదానిని స్థూలముగ తీసుకుంటున్నారు. వాళ్ళ పెద్దలు ఏమి చెప్పినారంటే సూక్ష్మముగ ఉండే భావాన్ని ఎవరూ చెప్పుకోవద్దండి, అవన్ని తప్పు భావాలయితాయి,


----

మనమంతా స్థూలముగనే తీసుకోవాలని, సూక్ష్మ భావాల్ని చెప్పుకోకూడదూ అని అన్నారు. సరే, నువ్వు చెప్పుకోకపోతే దేవుడు చెప్పిన విషయాలు అబద్దము అవుతాయా? అలి ఇమ్రాన్ అనే 3వ సూరా 7వ అయత్లో ఒకటి సూక్ష్మమైన వాక్యాలూ, రెండోది స్థూలమైన వాక్యాలు ఇట్లు రెండు రకాల వాక్యాలున్నాయని ఖుర్ఆన్లో చెప్పారు. అయితే సూక్ష్మమైన వాక్యాలు ఏవి అని తెలియకుండ నువ్వు అన్నిటికీ స్థూలముగా చెప్పుకుంటే ఎలా? ఏడు ఆకాశాలు ఎవరన్నా చెప్పగలుగుతారా? ఏ సైంటిస్టు అయినా చెప్ప గలుగుతాడా? లేక మీరు చెప్పగలుగుతారా? ఉండేదొకటే ఆకాశమే. ఎవరికి బుద్ధి, విచక్షణ ఉన్నాగానీ వారు ఏమి చెబుతారు అంటే, ఒకే ఆకాశము ఉంది అని చెబుతారుగానీ ఏడు ఆకాశాలు ఉన్నాయని చెప్పరు. ఎవరో మా పెద్దలు చెప్పారు, మేము చెబుతాము అని అనుకుంటే వాడు తప్పుదారి పట్టినట్టే. ఈ రోజు ఉదయము మా ఆశ్రమము యందు ‘క్రైస్తవులు ముస్లీముల జ్ఞానసమావేశము'లో వారికి ఖుర్ఆన్ గ్రంథములో 8వ సూరా 8వ ఆయత్లో ఇవ్వబడింది. ఒకసారి చదవండి చూస్తాము. (క్రైస్తవ సమాజము నుండి యాదర్ పాస్టర్ గారు ఖుర్ఆన్ 8వ సూరా 8వ ఆయత్ చదువుతుండగా, మేము ఆయత్కు అందించిన వివరమును క్రింద చూడగలరు.)

అని అనుక పాస్టర్గారు : "అపరాధులకు ఎంతగా సహించరానిదైనా సరే, సత్యము సత్యముగా అసత్యము అసత్యముగా నిగ్గుతేలాలన్నది ఆయన అభిమతము”. మేము : ఆ..! ఎవరి అభిమతమది? దేవుని అభిమతము. అసత్యవాదులు ఎంతమంది ఉన్నా, అపవాదులు ఎంతమంది ఉన్నా అసత్యాన్ని వాళ్ళు ఎంత ప్రేమించినాగానీ మనము మాత్రము సత్యాన్నే ప్రేమించాలి, సత్యాన్నే నిగ్గుతేల్చి చెప్పాలి అని ఆయన అభిమతము. ఇంకోసారి చదవండి వాక్యము.


పాస్టర్గారు : ‘అపరాధులకు ఎంతగా సహించరానిదైనా సరే'

మేము : అంటే వాళ్ళకు సత్యము సహించదు. మనము ‘ఏడు ఆకాశాలు లేవు' అంటే వాళ్ళు సహించరు. 'ఏడు అకాశాలు ఉన్నాయి' అంటే వాళ్ళు సహిస్తారు. అది వాళ్ళకు అట్లే అర్థమయ్యింది. వాళ్ళకు ఏడు ఆకాశములు సూక్ష్మమైన జ్ఞానము అని తెలియదు, 'ఏడు ఆకాశములు' అనేది బయట లేదు, ఉండేది ఒకే ఆకాశము అనే సత్యాన్ని చెప్పితే వాళ్ళకు అది సహించబడదు. 


పాస్టర్గారు : సహించరానిదయినా గాని సత్యాన్ని నిగ్గుతేల్చి చెప్పడమే మనవంతు.


మేము : అట్లు చెప్పడమే ఆయనకు ఇష్టము. కాబట్టి మనము సత్యమే చెప్పాలి. సత్యము చెప్పాలనేది మన అభిమతము కాబట్టి మనము సత్యమే

చెబుతాము.


పాస్టర్గారు : "సత్యము సత్యముగా అసత్యము అసత్యముగా నిగ్గుతేలాలన్నది ఆయన అభిమతము”.

మేము : ఆ..! సత్యాన్ని సత్యముగనే చెప్పాలి, అసత్యాన్ని అసత్యముగనే చెప్పాలి.

ఇపుడు ఖుర్ఆన్లోని వాక్యము తీసుకుందాము. ఏడు ఆకాశాలు ఉన్నాయా అని ఎవరైనా అంటే, ముస్లీమ్లు ఏమంటారు? ఖుర్ఆన్ ప్రకారము ఏడు ఆకాశాలు ఉన్నాయి, ఏడు ఆకాశాల పైన దేవుడు ఉన్నాడు అంటారు. అప్పుడు మనము ఏమంటున్నామంటే, ఏడు ఆకాశాలు ఉండేది వాస్తవమే! అక్కడ చెప్పిన వాక్యము వాస్తవమే! అక్కడ చెప్పినది


---

దైవగ్రంథములోని వాక్యమది. దైవగ్రంథములోనిది మీకు అర్థముకాక బయట ఏడు ఆకాశాలు ఉన్నాయనుకుంటున్నారు. అది పెద్ద పొరపాటు. శరీరములో ఏడు గ్రంథులు ఉన్నాయి. ఏడు నాడీకేంద్రాలు ఉన్నాయి. ఏడవ గ్రంథిలో, ఏడవ నాడీకేంద్రములో ఆత్మ నివాసము ఉంది. అక్కడ దేవుడున్నాడు. నీ శరీరములోనే ఏడు ఆకాశాలు ఉన్నాయి. ఆ కనిపించని వాటిని ఆకాశాలని చెప్పారు. ఆ నాడీకేంద్రాలను ఆకాశములని చెప్పారు. నీ ఏడో నాడీకేంద్రము శిరస్సు. ఆ శిరస్సు నీ తలలోనే దేవుడున్నాడు అని అక్కడ చెప్పబడింది. అంటే ఖుర్ఆన్ గ్రంథములో నీ శరీరములోనే ఏడు ఆకాశాలున్నాయి. ఆ ఏడో ఆకాశము నీ తల. ఆ తలలోనే పిట్యూటరీ గ్లాండ్ అనేది ఒకటి ఉంది. ఆ గ్లాండ్ దగ్గరే ఏడో నాడీకేంద్రము కూడా ఉంది. రెండూ ఒకేచోట ఉన్నాయి, అక్కడే ఆత్మ నివాసము ఉంది. సూర్యుడు ఒక్కడే ఈ లోకమును ప్రకాశింపజేసినట్లు నీ తలలో ఉన్న ఆత్మ నీ శరీరాన్నంతటిని ప్రకాశింపజేస్తావుంది. అందువల్ల నీ శరీరమంతా బ్రతికి బట్టగట్టుకొనడము జరుగుతావుంది.


ఈ విధముగా ఏడో ఆకాశము నీ శరీరములో ఉంది అని చెప్పడమే అక్కడ ఉన్న సత్యము, ఆ సత్యాన్ని నిగ్గుతేల్చి చెప్పటమే మనవంతు. ఏడో ఆకాశము బయట లేదు, లోపల ఉంది అని మనము సత్యము చెబుతున్నాము. అట్ల సత్యము చెప్పడమే దేవునికి ఇష్టము ప్రజలు చాలామంది అజ్ఞానులు. సత్యాన్ని ఎంత ఇమిడ్చుకోలేకపోయినా, ఎంత ఓర్చుకోలేక పోయినాగాని సత్యాన్ని సత్యముగా నిగ్గుతేల్చి చెప్పడమే మా అభిమతము. ఈ రకముగ ఏడు ఆకాశాలు ఉన్నాయి అనేది వాస్తవమే. కాని ఇది సూక్ష్మమైన వాక్యము. ఇది సూక్ష్మముగ తీసుకుంటే ఏడు ఆకాశాలు నీ శరీరములో ఉన్నాయి, ఏడో ఆకాశము నీ తలలో ఉంది. ఆ ఏడో ఆకాశము ఆత్మ



----

నివాసకేంద్రము. అక్కడ ఆత్మ ఉండి, నీ శరీరమంతా వ్యాపిస్తావుంది. సూర్యుడు ఎక్కడో ఆకాశములో ఉన్నాడు. ఆయన అక్కడి నుంచి తన కిరణాల ద్వారా భూమండలమంతా వ్యాపిస్తున్నాడు. అయన సూర్యరశ్మిని భూమండలమంతా ప్రకాశింపజేయుచున్నాడు అట్లాగనే ఆత్మ యొక్క వెలుగు మన శరీరమంతా ప్రాకుతావుంది. ప్రాకి మన శరీరమంతా బ్రతకగలిగేటట్టు చేస్తావుంది. ఈ రకముగ సూక్ష్మమైన వాక్యము అక్కడ చెప్పారు. కాని కొంతమంది ఏమంటున్నారంటే ప్రబోధానంద స్వామి మా ఖుర్ఆన్కు వ్యతిరేఖముగా చెబుతున్నారని కొందరు ముస్లీమ్లు అనడము జరిగింది. కానీ నేనొకటే జవాబు ఇచ్చాను.


నేను ఒక్క గ్రంథములోనే కాదు. నేను చాలా గ్రంథాలు వ్రాశాను. ఖుర్ఆన్ గ్రంథములో చెప్పిన ఏ వాక్యానికయినా గానీ నేను అసత్యముగా వ్రాసి ఉంటే మీరు చూచి చెప్పండి నేను ఒప్పుకుంటాను. మీకు చేతకాక, మీకు అర్థము చేసుకునే శక్తిలేక, మీ బుద్ధిహీనతతో మీరు పొరపడి మాట్లాడుతున్నారు. మీరు ఖుర్ఆన్ గ్రంథాన్ని సరిగ్గా అర్థము చేసుకోలేదు. మీరు ముస్లీమ్లు అయ్యి ఉండి సరిగ్గా అర్థము చేసుకోకుండా, నేను వివరము చెప్పితే, మా గ్రంథాన్ని వివరము చెప్పేందుకు మీరెవరు? అని అంటున్నారు. మా గ్రంథము అని మీకు ఎవరు అనమని చెప్పారు? దేవుడు అనమని చెప్పినాడా మీకు? ఎవరిచ్చారు మీకు మీ గ్రంథము మీద హక్కు? “సర్వజీవరాసులకు, సర్వమానవులకు ఇది హితోపదేశము” అని చెప్పినాడు. ఖుర్ఆన్ గ్రంథములో సర్వమానవులకు ఖుర్ఆన్ గ్రంథము హితోపదేశము అని చెప్పినపుడు, ఇది మీ గ్రంథము అనే దానికి ఏమి హక్కు ఉంది? అని నేను ప్రశ్న వేస్తున్నాను. మీరు దైవసాక్షిగా చెప్పండి, ఖుర్ఆన్ గ్రంథము సాక్షిగ చెప్పండి, ఇది మీ గ్రంథమా? అందరికీ సమానమైన గ్రంథము,


---

అందరికీ అధికారము ఉండే గ్రంథము, అందరూ దీన్ని చెప్పుకోవచ్చు, అందరికీ సమానమైన గ్రంథమని మీరే ఓ వాక్యములో చెప్పినారు. ఇది మా గ్రంథము, మా గ్రంథములోని వాక్యాలు హిందువులు చెప్పకూడదు అంటే ఖుర్ఆన్ గ్రంథములో లేని హద్దుని మీరెందుకు ఏర్పరుస్తున్నారు? అని నేను ప్రశ్నిస్తున్నాను. ఒకరి సొత్తు కాదది. ఏ విధముగా గాలిని, నీళ్ళను, సూర్యరశ్మిని మనము వాడుకుంటున్నామో, ఏ విధముగా గాలిని అందరూ సమానముగ పీల్చుకుంటున్నారో, ఆ విధముగా ఒక్క ఖుర్ఆన్ గ్రంథమే కాదు మూడు దైవగ్రంథాలు అందరికీ సమానమే, అందరూ దాంట్లోటివి చదువుకోవచ్చు తెలుసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు గాలి పీల్చుకుంటున్నావు, వేరేవాడు మా ఊరిలో గాలి నువ్వు పీల్చుకోవద్దు అనేదానికి అవుతుందా చెప్పు? వేరే ఊరికి ఎప్పుడయినా పోయినపుడు ఏయ్! మా ఊరిలోని గాలి పీల్చుకోకూడదు హిందువులు రాకూడదు మా ఊరికి అని అనేదానికి అవుతుందా?


ముస్లీమ్ ఊళ్ళు కొంతమందివి ఉన్నాయి. ఉదయగిరిలో అంతా ముస్లీవ్లో ఉన్నారు. రాయచోటి దగ్గర కలకడ అనే చోట ఊరంతా ముస్లీములే. ఒకవేళ అక్కడికి హిందువులు పోతే ముస్లీములు “ఇది మా ఊరు, మీరేమో హిందువులు! కాబట్టి మా ఊరిలో గాలి పీల్చుకోకూడదు. ఈ గాలి మాకు మాత్రమే” అని చెప్పేదానికి వీలవుతుందా? లేదు. గాలి అందరికి ఎట్ల సమానముగ ఉందో, అట్ల దేవుని వాక్కు కూడ అందరికీ సమానముగా ఉంది. బైబిలుగాని, ఖుర్ఆన్గానీ, భగవద్గీతగానీ అందరికీ సమానమే అని నేను మొదటి నుండి చెబుతూ వస్తున్నాను. అదే విధానములోనే నేను ఏమి చెబుతున్నాను అంటే ఒక్క వాక్యము ఏదైతే ఉందో బైబిలులోగానీ, ఖుర్ఆన్లోగానీ, భగవద్గీతలోగానీ ఆ వాక్యము


---

మూడు గ్రంథాలకు అన్వయించినపుడే, మూడు గ్రంథాలలోను ఇది ఉంది అని తెలుసుకోగలిగినపుడే, నువ్వు సంపూర్ణ జ్ఞానివి అవుతావుగానీ ఇది నా గ్రంథములోని వాక్యము అనుకుంటే మిగతా గ్రంథాలు ఏమి కావాలి? అవి దైవ వాక్యాలు కాదా? ఖుర్ఆన్ గ్రంథములోని 5వ సూరా 68వ ఆయత్లో ఏమి చెప్పారు? మూడు గ్రంథాల సారాంశము తెలిసినప్పుడే నువ్వు నిజమైన జ్ఞానివి అయితావు, నిజమైన ధర్మములో ఉన్నట్లు అని అల్లాహ్ చెప్పాడు. కానీ అక్కడ విధానాన్ని మరిచిపోయి, ఎవరి ఇష్ట మొచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరో ఒకరు చెప్పితే, వారు చెప్పినట్లు ఏ దారిలో నడవమంటే ఆ దారిలో నడిచేదేనా? విచక్షణ లేదా ప్రతి ముస్లీముకు విచక్షణ ఉండాలి. అది సత్యమా? అసత్యమా? వీడేమి చెబుతున్నాడు, పెద్ద అయినంతమాత్రాన సక్రమమైన దారిలో నడిపిస్తున్నాడా లేక తప్పుదారిలో నడిపిస్తున్నాడా అని అనుకోవాలి. సరే, మీ పెద్దలు ఏమని చెప్పినారు? ఏడో ఆకాశము ఉంది అక్కడ ఉన్నాడు దేవుడు అంటే దానిని నమ్మేదేనా? ఏడో ఆకాశము నువ్వు చూడగలిగినావా? వాళ్ళు చూసినారా? వాళ్ళు అబద్దము చెబుతున్నారు, నిన్ను అబద్దములోనికి తోసేస్తున్నారు. కానీ మీరెవరైనా ప్రశ్నించారా ఏడో ఆకాశము ఎక్కడ ఉంది? ఉండేది ఒకే ఆకాశము అని, మీరెందుకు ప్రశ్నించలేకపోయినారు? మీరు పెద్ద అయినపుడు, వాళ్ళు చెప్పింది మీరు వినగలిగనపుడు, ప్రశ్నించే హక్కు కూడ మీకు ఉంది, అయినా ప్రశ్నించకూడదు, వాళ్ళు ఏమి చెప్పితే అది వినాలి అంటారు.


మేము ఏమి చెబుతున్నామంటే వాళ్ళే పెళ్ళిళ్ళు చేస్తారు, వాళ్ళే పంచాయితీ చేస్తారు, వాళ్ళమాట వినకపోతే మమ్మల్ని ముస్లీములుగా ఉండనివ్వరు అనుకుంటారు. నువ్వు ముస్లీముగా ఉండాలనుకుంటే ఖుర్ఆన్


---

గ్రంథమును చదువు, దాంట్లో దైవజ్ఞానమును తెలుసుకో. ఎన్నో సూక్ష్మమైన విషయాలున్నాయి. మేము ఈ మధ్యలో ఓ గ్రంథము వ్రాస్తున్నాము. 'అంతిమ దైవగ్రంథములో వజ్రవాక్యాలు' అని. వజ్రవాక్యాలు అంటే అవి చాలా గొప్ప వాక్యాలు అని అర్థమా లేకపోతే హేళనగ వ్రాస్తున్నామా? వజ్రవాక్యాలు అని పేరు పెట్టినపుడు అవి గొప్ప వాక్యములనేగా అర్థము. మా ఖుర్ఆన్ గురించి ఎట్లంటే అట్ల వ్రాసినారు, అంతా అమర్యాదగ వ్రాసినారు, మా ప్రవక్తను, ఖుర్ఆన్ గ్రంథాన్ని హేళనగా వ్రాశారు అంటే హేళనగా వ్రాసేటప్పుడు వజ్రవాక్యాలు అని పేరు పెడతారా ఎవరైనా? బుద్ధి ఉన్నవాళ్ళు ఎవరైనాగాని? ఇదంతా ఇంకొక మనిషిని విమర్శించేదానికి పనికొచ్చేమాటలేగాని దైవజ్ఞానము ప్రకారము సత్యమైన వాక్కుకాదు. దేవుడు ఏమి చెబుతున్నాడు అపవాదులు సత్యాన్ని విసిగించుకుంటారు, వాళ్ళు ఓర్చుకోలేరు. వాళ్ళు ఓర్చుకోకున్నాగానీ నువ్వు సత్యాన్ని నిగ్గుతేల్చి చెప్పు అని మనకు 8వ సూరా 8వ ఆయత్లో చెప్పియున్నారు కాబట్టి, ఆ వాక్యము ప్రకారము నేను ఏమి చేస్తున్నాను అంటే సత్యాన్నే చెప్పదలచుకున్నాను, కాబట్టి మీకు సత్యాన్నే చెబుతున్నాను. ఆ సత్యములో భాగముగా శరీరములో ఉండే జ్ఞానాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పగలుగుతున్నాను. పోయిన నెల అక్షర జ్ఞానాన్ని అందించాను మీకు. ఇప్పుడు అక్షర జ్ఞానము కూడ మీకు బయట అక్షరాలను చూపి లోపల ఆత్మ జ్ఞానానికి సంధించి చెప్పడము జరిగింది. జీవాత్మ, ఆత్మ, పరమాత్మకు మూడాత్మలకు సమకూర్చి, వాటిని సరిచేసి చెప్పడము జరిగింది. బయట మీరు విద్య నేర్చుకున్నారు, ఆ విద్య ఇట్లు చూడండి అని, అవి సరిపోయినాయా లేదా, ఇప్పుడు కాదనడానికి ఎవరికయినా అవకాశము ఉందా? లేదు. అక్షర జ్ఞానమంతా సత్యముగ ఉంది.


---

ప్రతిదీ మనము సత్యాన్నే తెలుసుకోవాలి అనే పట్టుదల ఉన్నపుడు, అసత్యాన్ని మనము వదిలేస్తా వస్తాము. మేము ప్రొద్దున ముస్లీములకు ఒక వాక్యము, తరువాత క్రైస్తవులకు ఒక వాక్యము ఇచ్చాము. ఆ రెండు వాక్యములు మంచి సారాంశమైన వాక్యాలే. కానీ వాళ్ళు కొత్తగా చూశారు ఈ వాక్యాలను నేను కూడా బైబిలు, ఖుర్ఆన్ మొదట చదివినపుడు నాకు కొత్తగానే ఉన్నాయి వాక్యాలన్ని. నేనెప్పుడు ఇంతకుముందు వాటిని చదవలేదు. కానీ నాకు భగవద్గీత జ్ఞానము తెలిసింది కాబట్టి అవన్ని నాకు సులభముగ అర్థమయినాయి. అలాగే ఇప్పుడు ప్రొద్దున కొత్తగా ఒక వాక్యాన్ని ఇచ్చాను. ఆ వాక్యాన్ని ఎంతో బాగా చెప్పారు. అంటే వాళ్ళు కొత్తగా చూసినాగానీ ఆ వాక్యములోని సారాంశాన్ని బాగా విపులముగ చెప్పారు క్రైస్తవులు. దానికి నేను సంతోషించాను. ఎందుకంటే ఈ జ్ఞానము వారికి బాగా అర్థమయ్యింది. అర్థమయివుంటేనే చెప్పేది లేకపోతే చెప్పలేరు. దాంట్లో 'పెళ్ళి కుమారుడు' అనే పదము వచ్చింది. 'ఉపవాసాలు' అనే పదము వచ్చింది. ఆ పెళ్ళికుమారుడు, ఉపవాసాలకు మంచి వివరము ఇచ్చారు. అంటే బయట స్థూలముగా కాకుండా సూక్ష్మముగా ఉండేటటువంటి వివరాన్ని బాగా అందించారు. ఆ సూక్ష్మముగా ఉండే వివరాన్ని కొత్తగా చదివినాగానీ ఆ వాక్యానికి సూక్ష్మముగానే వివరము చెప్పారు. బాగా అద్భుతముగ చెప్పారు అంటే ఇప్పుడు మేము చెప్పే జ్ఞానము వాళ్ళకి అర్థమయ్యింది కాబట్టి వాళ్ళు సులభముగా చెప్పగలిగినారు. వాళ్ళకేమి కష్టము అనిపించలేదు. కానీ అది సత్యము. ఇప్పుడు మేము సత్యము అని ఎందుకు చెబుతున్నాము? సత్యాన్ని సత్యమని ఒప్పుకోవాల్సిందే. వాళ్ళు చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఎవరు చెప్పినా, నేను చెప్పినా అది సత్యము సత్యముగానే ఉంటుందిగాని అసత్యము కాదు. యాదర్ పాస్టర్ గారు బాగా చెప్పినారు తరువాత


---

ఆదినారాయణ పాస్టర్ కూడ చాలా బాగా వివరముగా చెప్పారు. అంటే వాళ్ళకు మా జ్ఞానము అర్థమయ్యింది కాబట్టి వాళ్ళు చెప్పగలిగినారు అని అనుకుంటున్నాను. 'పెళ్ళి' అంటే 'దేవుడు' అనే మాట వచ్చింది. 'పెళ్ళి కుమారుడు’ అంటే ‘దేవుని కుమారుడు' అనే వాక్యము వచ్చింది. తరువాత 'ఉపవాసము' అనేదాన్ని బాగా వివరముగా చెప్పినారు. ఉపవాసము ఎప్పుడు ఉండాలి? అనేదానికి కూడ చెప్పారు. నిజముగ దేవుడు మన సమక్షములోకి వచ్చినప్పుడు ఉపవాసముతో నీకేమి పని? ఇంకా వాళ్ళేమి అంటున్నారంటే కొంతమంది ముస్లీమ్లు మా అనుమతి లేనిది మీరు వ్రాయకూడదు, మా అనుమతి లేనిది మీరు చెప్పకూడదు అన్నారు. చాలా ముస్లీమ్ సంస్థలు భగవద్గీతను, బైబిలును గురించి చాలాచోట్ల చెప్పారు. చెప్పలేదా వారి ప్రకారమైతే మా భగవద్గీత గురించి మీరెందుకు మాట్లాడుతున్నారని గురించి మీరెందుకు మాట్లాడుతున్నారని క్రైస్తవులు మేమడగాలి? మా బైబిలు గురించి మీరెందుకు మాట్లాడుతున్నారని క్రైస్తవులు అడగాలి. ఇవన్ని గీచులాట పెట్టుకునే పద్ధతి తప్ప ఇంక రెండో పద్ధతి లేదు. సామరస్యముగా గా పోయే పద్ధతి కాదిది. దీనిని అజ్ఞాన పద్ధతి అంటారు. సామరస్యముగా పోయే జ్ఞానపద్ధతి ప్రకారము అన్నీ ఒకటే. మనమందరము ఒక్కటే, మనుషులంతా ఒక్కటే అనే భావము వస్తుంది.



దేవుడు అందరికీ ఒక్కడే. సృష్టికర్త ఒకడే ఉన్నాడు, రెండోవాడు లేడు అనే భావము మీకు ఉన్నపుడు వాళ్ళను వేరు, వీళ్ళను వేరు అని మాట్లాడే పనేముంది? ఆ గ్రంథము వేరు ఈ గ్రంథము వేరు అనే పనేమి ఉంది. అటువంటి అవసరము రాదు కదా! ఇప్పుడు ఇక్కడకు వచ్చి క్రైస్తవులు, ముస్లీములు, హిందువులు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఎక్కడయినా భేదాభిప్రాయాలు వచ్చాయా? రాలేదు. క్రైస్తవుల గ్రంథము బైబిలులోని వాక్యము ముస్లీములు చెబుతున్నారు. ఖుర్ఆన్ వాక్యము


---

అద్భుతముగా క్రైస్తవులు చెప్తున్నారు. మతసామరస్యానికి ఇది మంచి ప్రతీక కాదా? చెప్పండి. మా గ్రంథములోనిది మీరు చెప్పకూడదు అని అన్నపుడు మేము ఒక ప్రశ్న వేస్తాము. మీరు ఖుర్ఆన్ను మా గ్రంథము అని అన్నపుడు, మరి భగవద్గీత మా గ్రంథము కదా! మా గ్రంథాన్ని గురించి మీరెందుకు చెబుతున్నారు? మరి ఖుర్ఆన్ గురించి తప్పుగా వ్రాశారు, దేవుడు పుడతాడు అని వ్రాశాడు అని అంటే పుడతాడు కాబట్టి మేము పుడతాడు అని వ్రాశాము. ఖుర్ఆన్లోనే దానికి సంబంధించిన వాక్యాలు ఉన్నాయి, ఆ వాక్యాల ప్రకారమే మేము చెప్పాము. నువ్వు భగవద్గీత చదివినపుడు, భగవద్గీతలో దేవుడు నేను మనిషిగా వచ్చి పుడతాను అని అన్నపుడు, మీరు పుట్టడు అని ఎందుకు చెబుతున్నారు? మా ఖుర్ఆన్న తప్పుగా వ్రాశారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని మీరన్నపుడు, మీరు దేవుడు పుట్టడు అని చెప్పినపుడు మా మనోభావాలు దెబ్బతినవా? మీకు ఒక్కరికేనా మనోభావాలు ఉండేవి? మాకు లేవా? మాకు ఉన్నాయి.

ఉంది,*


భగవద్గీతలో దేవుడు పుడతాడు అని చెప్పినపుడు మీరు పుట్టడు అని చెప్పేదానికి మీకేమి హక్కు ఉంది? ఖుర్ఆన్లో కూడ పుడతాడు అనే మీకు అర్థము కాలేదు, అంతే! ఎక్కడలేదో, చెప్పండి? మీరు అన్ని విషయాలు చదవలేదు కాబట్టి, చదివినా మీకు సూక్ష్మజ్ఞానము అర్థము కాలేదు కాబట్టి మీరు అట్లు అనుకుంటున్నారు. మీకు ముందే చెప్పాను నేను, ఒక ప్రత్యేకమైన మనిషిని తయారుచేసి పంపుతాను అని. 15వ సూరాలో 27, 28, 29, 30వ ఆయత్లలో ఇదే వాక్యము చెప్పాడు. అంటే ప్రత్యేకమైన మనిషిని తయారుచేస్తానన్నాడు. దానికోసరము మట్టితో ఒక బొమ్మను తయారు చేసి, అందులో నా ఆత్మనే ఊది పంపినాను అన్నాడు. నా ఆత్మనే ఊది పంపినపుడు సమస్త దేవదూతలు అతనికి


---

నమస్కారము చేశారు. ఎందుకు నమస్కారము చేశారు? అల్లాహ్కు నమస్కారము చేయాలి కాబట్టి నమస్కారము చేశారు. వాళ్ళకు తెలియదా అల్లాహ్ ఎవరనేది? ఆ వచ్చినటువంటివాడు నిజమైన అల్లాహ్, ఆయన దేవుని ఆత్మతో కూడుకున్నటువంటివాడు అని వాళ్ళు నమస్కారము చేశారు. ఇబ్లీసు నమస్కారము చేయలేదు అన్నాడు. ఇబ్లీసు అంటే అజ్ఞాని అని అర్థము. ఇపుడు నువ్వు నమస్కారము చేయలేదు అంటే నువ్వు ఇబ్లీసుతో సమానమయితావా? మనిషితో సమానమయితావా? జ్ఞానము తెలిసిన మనిషి అయితే దేవుడనే నమస్కారము చేస్తాడు. అతను దేవునిగా ఒప్పుకుంటాడన్నమాట. అక్కడ పుడతాడు అనే చెప్పాడు, పుట్టడు అని ఏమి చెప్పలేదు. ఇంకోచోట కూడా దేవుడు అవతరిస్తాడు. సమస్త దేవదూతల సమక్షములో బారులు తీరి ఉండగా, దేవుడు అవతరిస్తాడు అని ఉంది. అప్పుడు దానికి ఏమి చెబుతారు? ఇవన్నింటికి వివరము చెప్పుకోకుండా మూసిపెట్టి ఎవరో ఒకరు చెప్పినమాటనే పట్టుకొని దేవుడు పుట్టడు పుట్టడు అంటున్నారు. మళ్ళ మీరు మా భగవద్గీతను “అజోపి సన్నవ్యయాత్మా భూతానామ్ ఈశ్వరోపిసన్” అంటే చావుపుట్టుకలు లేనటువంటి దేవుడు మళ్ళీ పుడతాడు మనిషిగా అని చెప్పినపుడు, అతడు దేవుడై ఉన్నాడు అని చెప్పినపుడు, మరి దానిని ఏమంటారు? ఆ శ్లోకానికి అర్థము ఏమి చెబుతారు? ఇంకో శ్లోకము ఉంది రాజవిద్య రాజగుహ్య యోగములో. “అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ పరం భావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్" అని. అంటే నర శరీరాన్ని ధరించిన నన్ను చూసి, నేను ఈ సమస్త జీవరాసుల అందరికీ, ఈ సమస్త ప్రపంచానికంతా దేవుడిని అని తెలియక, నన్ను మనుషులు అవమానిస్తారు అని చెప్పబడి వుంది. మళ్ళీ అప్పుడు ఏమి చెబుతావు? నేను మానవ శరీరము ధరించి వచ్చినపుడు అంటే నేను మనిషిగా పుట్టినపుడు అనేగా అర్థము. తర్వాత


----

“మమ భూత మహేశ్వరమ్” అన్నాడు. నేను “సర్వజీవరాసులకు ఈశ్వరుడిని, దేవుడిని అని తెలియక నన్ను 'అవజానన్తి మాం మూఢ' అన్నాడు మూఢులు నన్ను అవమానిస్తున్నారు” అని చెప్పినాడు. మరి దానికేమంటావు? పుట్టడనా పుడతాడనా? భగవద్గీతలో పుడతాడు అంటే పుట్టడు పుట్టడు అని మీరంటే మా మనోభావాలు దెబ్బతినవా? మీకో దేవుడు మాకో దేవుడున్నాడా? మాకేమో పుట్టే దేవుడు మీకేమో పుట్టని దేవుడున్నడా? మేము అడగమా?


ఈ రకముగా అడిగితే ఒక్క ప్రశ్నకు మీ వద్ద జవాబు ఉండదు. అడిగే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఇందువులు, స్వామీజీలు ఉన్నారు. వీళ్ళకేముందీ! ఏదో ఒక గోసి పెట్టుకోవడము, ఒకటి కండువ కప్పుకోవడము, ఏదో ఒక దేవుడికి నమస్కారము చేయడము, పూజ చేయడము. అట్ల చేస్తావుంటే వాళ్ళ వెంట ఇంకా కొంతమంది వచ్చి పూజలు చేస్తారు. అంటే విగ్రహారాధన మనిషికి పనికిరాదు అనేటటువంటి భావాన్ని తెలియజేయకుండా ప్రతి ఒక్కరూ విగ్రహారాధన చేసే దానివలన అది మూడు దైవ గ్రంథాలకు వ్యతిరేఖమైన భావము అయిపోతా వుంది. అది నీకేమయినా సరిపోతుందేమో కాని, ఎవరి మతములో వారికి సరిపోతుందేమో కానీ, ముస్లీము మతములో వారు విగ్రహారాధన చేయరు, అది గ్రంథము యొక్క అనుకరణ, అది వాస్తవమే! అట్లాగనే క్రైస్తవులు కూడ విగ్రహారాధన చేయరు అది వాస్తవమే, కానీ ఒక హిందువులు మాత్రమే విగ్రహారాధన చేస్తున్నారు అని అంటే, అది భగవద్గీతలో ఉందా? అంటే భగవద్గీతలో విగ్రహారాధనకు వ్యతిరేకముగా చెప్పబడినటువంటి భావాలు ఉన్నాయి కాని విగ్రహారాధన చేయమని ఎక్కడా చెప్పలేదు. ఈ విషయము తెలియకుండ, అందరికీ సమానమైనటువంటి భావాన్ని జ్ఞానాన్ని అందించు కోకుండ, మాకు మా మతము, మీకు మీ మతము అని అనుకోవడము


----

వల్ల అందరూ విడివిడిగా అయిపోయినారు. ఒక్కొక్కరు మేము ముస్లీములు, మేము హిందువులము మాది క్రైస్తవము అని విడివిడిగా అయిపోతున్నారు. మనమంతా మనుషులము అనే మాట మరచిపోయినారు. ఇపుడు ఆ లెక్క ప్రకారము పోతే ఒక స్వామీజీ చెబుతున్నాడు. నిన్న నేను టీ.వీ.లో ఒక ఉపన్యాసము వింటున్నాను. ధర్మము అంటే ఏమిటి? అని వేరేవారు ప్రశ్న వేశారు. ధర్మము అంటే దేశ కాలానికి అనుగుణముగ మారుతూ ఉంటుంది అని చెబుతున్నారు. అంటే ఇంక దేవుడు కూడా మారుతూ ఉండాలి ఆ లెక్కకుపోతే, ధర్మము ఎప్పటికీ మారదు అని మేము అనేకమార్లు చెప్పాము.


ధర్మము అనేది ఎప్పటికి ఒకటే, నీకైనా ఒకటే, నాకైనా ఒకటే, ఆకాశము మీదైనా ఒకటే, భూమి మీదైనా ఒకటే. ఒకే ఒక ధర్మము అది. దేవుని ధర్మము ఎప్పటికీ మారదు. దేవుడు ఎప్పుడు ఒకే రీతిలో ఉంటాడు కాని ఇంకోరకముగా ఎప్పటికీ ఉండడు. దేవుడి ధర్మము మారేది కాదు. మనుషులు మారొచ్చుకాని ధర్మము మారేది కాదు అని చెప్పాము. వాళ్ళేమి చెప్పినారంటే ధర్మము మారుతుంది అన్నారు. ధర్మము మారితే ఇంక విలువేముంది దానికి? నీ ఇష్టము వచ్చినట్టు నువ్వు మార్చుకుంటావు, ఇంకోని ఇష్టము వచ్చినట్టు ఇంకోడు మార్చుకుంటాడు. మా దేశానికి సరిపోయేటట్టుగా మేము మా ధర్మాన్ని మార్చుకున్నాము అంటాడు. మా కాలానికి అనుగుణముగ మేము ధర్మాన్ని మార్చుకున్నాము అని ఇంకొకడు అంటాడు. ఇష్టమొచ్చినట్లు ఎవరంతకు వాళ్ళు ధర్మాన్ని మార్చుకుంటే, దేవుడు చెప్పిన ధర్మము ఏమి కావాలి? దేవుడు చెప్పిన ధర్మము అందరికీ ఒకటేనా? లేకపోతే ఒక ఊరికి, ఒక దేశానికి ఒక్కో ధర్మము ఉంటుందా? అట్లు ఎప్పటికీ ఉండదు. ప్రపంచానికంతా ఒకే ధర్మము ఉంటుంది.


----


మనుషులకందరికీ ఒకే ధర్మము ఉంటుంది. ముస్లీములకు ఓ ధర్మము, క్రైస్తవులకు ఓ ధర్మము, హిందువులకు ఓ ధర్మము ఉండదు. అందరికీ ఒకటే ధర్మము ఉన్నపుడు మారుతుంది అని నువ్వు చెప్పుకోవడము, సమంజసమా! హిందువులలో ఒక పెద్ద స్వామీజీ చెబుతున్నాడు ధర్మాలు మారుతాయి అని. ఇట్లు వీళ్ళు మారుతాయి అంటారు, మా ఇష్టము వచ్చినట్లు మేము పెట్టుకుంటాము అని వాళ్ళు అంటారు. ధర్మము అనేది నీ ఇష్టప్రకారము ఉండదు. దేవుడు నిర్ణయము చేసి చెప్పినటువంటి ధర్మము, అవి తెలియవని ఆయన తన గ్రంథము ద్వారా తెలియజేశాడు. ఒక కాలములో భారత దేశములో భగవద్గీత, మరికొంత కాలానికి ఇంకో ప్రదేశములో బైబిలు, ఇంకో ప్రదేశములో ఖుర్ఆన్ గ్రంథముగా చెప్పాడు. ఈ మూడు గ్రంథాలలో ఒకే ధర్మము ఉంది. ఒకే శాసనము ఉంది. దేవున్ని తెలుసుకోవాలంటే ఒకే జ్ఞానమును నేను చెబుతున్నాను. మూడు గ్రంథాల జ్ఞానాన్ని ఏకీభవించి చదువుకున్నపుడే, ఒకే భావాన్ని అర్థము చేసుకోగలిగినపుడే నీకు జ్ఞానము తెలుస్తుంది. అదే నిజమైన జ్ఞానము అని చెప్పాము. ఇదే విషయమే ఖుర్ఆన్ గ్రంథములో 5-68 లో "తౌరాత్ (భగవద్గీత), ఇంజీలు (బైబిలు), ఖుర్ఆన్ మూడు గ్రంథాలను చదవనివాడు ఏ ధర్మములో లేనట్లే” అని చెప్పారు.


జ్ఞానము _ అర్థమయ్యేదానికి ఇది ఒక పద్ధతి, అట్లకాకుండ నా గ్రంథాన్ని నేను అర్థము చేసుకున్నా, మా గ్రంథము ఇదే అని నీ ఇష్టము వచ్చినట్టు నువ్వు చదువుకుంటే, ఇంకో గ్రంథము ఇంకొకరు చెబుతారు. 'తండ్రి-కుమారుడు-పరిశుద్ధాత్మ' అని వాళ్ళంతకు వాళ్ళు చెప్పుకుంటారు ఎవరినో ముగ్గురిని చెప్పుకుంటారు. 'తోలేవాడు, తోలబడేవాడు, సాక్షిగా ఉండేవాడు' అని ఇంకొకరు చెబుతారు. వీళ్ళు ముస్లీములు ఏమంటారంటే


---

అసలుకు వీళ్ళెవ్వరూ లేరు మధ్యలో, నువ్వు చచ్చిపోయిన తరువాత సమాధి నుండి కొంతకాలానికి లేపబడతావు చూడు! అప్పుడు నీ వెంట ఇద్దరు వస్తారంట. ఇద్దరెవరు? దూతలు. ఈ దూతలే వాళ్ళిద్దరూ అని చెబుతున్నారు. ఇప్పుడు నీ వెంట ఎవరున్నారో తెలియదు. నిన్ను నడిపించేవాడు ఎవడో తెలియదు. ఆ లెక్కకుపోతే ఇప్పుడు ఏమవుతుంది? బైబిలులో వాక్యము ఒకటి తప్పు అయిపోతుంది. భగవద్గీతలో ఒకవాక్యము తప్పు అయిపోతుంది. నా వల్లనే నీకు స్మృతి, జ్ఞానము, ఊహ అన్నీ కలుగుతున్నాయి. మీలో చైతన్యము కలుగుతావుంది. నువ్వు మాట్లాడేదానికి మాట వస్తావుంది. పని చేసేదానికి చేయి కదులుతావుంది. నా చైతన్యమే నీ శరీరాన్ని కదిలిస్తావుంది అని భగవద్గీతలో చెప్పిన మాట వ్యర్థమైపోతుంది. బైబిలులో చెప్పిన మాట ఏమవుతుంది? "నువ్వు మాట్లాడే ప్రతి మాట నువ్వు మాట్లాడలేదు. నీ తండ్రి అయిన ఆత్మ మాట్లాడుతున్నాడు తప్ప నువ్వు ఏమి మాట్లాడలేదు” అని చెప్పిన వాక్యము ఏమయితుంది? అది తప్పు అయిపోతుంది.


ఇప్పుడు మీ లెక్కప్రకారము మీ ఇష్టము వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు, ఇష్టము వచ్చినట్లు మీరు చేస్తున్నారు. చచ్చిపోయిన తరువాత ఎప్పుడో వాళ్ళు వస్తారు దేవదూతలు. అంటే ఇది నిజము ఇది అబద్దము అని చెప్పేదానికి వాళ్ళు వస్తారు అని మీరు చెప్పుకుంటున్నారు. అట్ల చెప్పుకుంటే ఏమవుతాది చెప్పు? ఇప్పుడు మీరు ఒకరైనట్టు, మీరు స్వయంకర్తలు అన్నట్టు మీరు అనుకోవాల్సిందేగాని, మిమ్మల్ని నడిపేవాడు ఒకడు ఉన్నాడు అనే భయము మీకు లేకుండాపోయింది. మిమ్మల్ని నడిపిస్తున్నవాడు ఒకడున్నాడు, ఇంకొకడు సాక్షిగా ఉన్నాడు అనేది మీకు తెలియలేదు. నిన్ను తోలుతున్నాడు ఒకడు. ఎట్ల తోలుతుంటే అట్ల పోతున్నావు. బుద్ధిని ఎట్లు తిప్పితే అట్ల పోతున్నావు. కాని మనిషిని

---

ప్రతిక్షణము నడిపించేటి శక్తి ఒకటి ఉంది. అదే దైవము అని తెలియలేదు. ఇప్పుడు ఆ లెక్కకు పోతే మూడు గ్రంథాలలోను ఏ వాక్యము తీసుకున్నా అది మూడు గ్రంథాలకు సంబంధించి ఉండాలి. భగవద్గీతలో వాక్యము తీసుకుంటే అది చిట్టచివరికి ఖుర్ఆన్ను అనుసరించాలి తరువాత బైబిలును కూడ అనుసరించాలి. అదే విషయము ఖుర్ఆన్లో చెప్పినారన్నమాట. తౌరాత్ గ్రంథాన్ని, ఇంజీలు గ్రంథాన్ని అనుసరించిన జ్ఞానమే అంతిమ దైవగ్రంథములో ఉందని ఖుర్ఆన్ గ్రంథము సాక్ష్యము చెబుతావుంది అని ఉంది దానికి ఏమంటారు? 'తౌరాత్ గ్రంథము' అది ఒక జ్యోతి, అది మార్గదర్శకము అని ఖుర్ఆన్ గ్రంథము చెబుతావుంది వేరే గ్రంథమును గురించి, మరి దానిని ఏమనాలి? దానిని మీరు మూడు భాగాలుగా చించుకొని, మూడు కాగితాలుగా చించుకొని చదువుకుంటున్నారు, దానిని

ఏమనాలి? ఒక్కటే గ్రంథము కాదా ఇదంతా? ఆ లెక్క ప్రకారము పోతే ఉండే జ్ఞానము ఒకటే, మీరు చదువుకునే గ్రంథము ఒకటే కాని మూడు పేర్లు చెప్పుకుంటున్నారు. దాంట్లో ఉండే జ్ఞానమంతా ఒకటే. ఇప్పుడు మాకు ఆ విధానము తెలిసింది కాబట్టి నన్ను త్రిమత ఏకైక గురువు అన్నారు. 


త్రిమత ఏకైక గురువు" అని పేరు పెట్టుకున్నాడని నన్నంతా వెక్కిరిస్తున్నారు. సరే నేనే పేరు పెట్టుకున్నాననుకో, నేనే పెట్టుకున్నా. నాకు ఆ ధైర్యము ఉంది 'త్రిమత ఏకైక గురువు' నని. 'నేను ఒకే ఒక్కడిని ఉన్నా ప్రపంచములో, మూడు గ్రంథాల గురించి చెప్పే గురువును'. మీరు ఎవరైనా ఉన్నారా చెప్పుకోండి చూస్తాము, చెబుతారా? మీకు ధైర్యము ఉందా? ఏ వాక్యమైన చెప్పడానికి చాతనవుతుందా మీకు? మీకు చేత కాదు. అందుకని మీరు పెట్టుకోలేరు. నా అంతకు నేను పెట్టుకున్నాను అంటే నా అంతకు నేను పెట్టుకోకపోతే మీరు పెట్టేదానికి ఉందా? నాకంటే మీరు పెద్దోళ్ళు


----

ఇక నా అంతట నేను

కాదు కదా! నాకు పెద్దోళ్ళు ఎవరూ లేరు. పెట్టుకోకపోతే నీకెట్లా అర్థమవుతాది? వంకాయల గంప ఒక్కటే కాదు, నా దగ్గర కాయగూరలు అన్నీ ఉన్నాయి అని చెబుతున్నాను. కాయగూరలు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను కాయగూరల వ్యాపారము అని చెబుతున్నాను. నేను వంకాయల వ్యాపారము అని ఒక్కటే చెప్పలేదే! నాయంతకు నేనే కాయగూరల వ్యాపారము అని పెట్టుకున్నాడు అనవచ్చు. నా దగ్గర అన్ని కాయగూరలు ఉన్నాయి కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాను. నేను వంకాయలు ఒక్కటే పెట్టుకుంటే, వంకాయలు ఒక్కటే అని చెబుతాను. నా దగ్గర వంకాయలున్నాయి, టమాటా పండ్లున్నాయి, పచ్చి మిరప కాయలున్నాయి అన్ని ఉన్నాయి కాబట్టి అన్నీ ఉన్నాయనే కాయకూరలని చెబుతున్నాను. ఇప్పుడు నేను మూడు మతాల గురించి చెప్పగలుగుతున్నాను.


ఏ గ్రంథములో వాక్యమైన చక్కగా వివరము తెలుసు నాకు. స్థూలముగా ఉంటే మీరు చెప్పుకోగలుగుతారు. నేను సూక్ష్మ భావము వివరముగా చెబుతున్నాను. 'అంతిమ దైవగ్రంథములో వజ్రవాక్యాలు' అనే గ్రంథములోని జ్ఞానము చదవండి మీరు. ఇపుడు నేను వ్రాసినది 800 పేజీలే. 800 పేజీలు చదివి అద్భుతముగా ఉంది అంటున్నారు. వజ్ర వాక్యముల గ్రంథమును చాలామంది చదివినారు. ఇక్కడే కాదు అమెరికా వరకు కూడ చదివినారు దానిని. అమెరికాలో చదివి, ఖుర్ఆన్ గ్రంథములో ఇంత అద్భుతమైన వాక్యాలు ఉన్నాయా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళకెందుకు అంత ఆశ్చర్యమయ్యింది? ఎందుకంత సంతోషము కలిగింది? అంటే అది నిజముగా వజ్రముల మాదిరి కనిపించాయి. ఖుర్ఆన్ గ్రంథములో వజ్రవాక్యాలకు ఆ వజ్రము అనేటి పేరు కూడ తక్కువే అని చెప్పవచ్చును. మేము మంచిగా ఉందనేగా అంతపెద్ద పేరు పెట్టినది.

---

చెడుగా చెబుతాంటే ఆ పేరు పెడతామా? మా ఖుర్ఆన్ గ్రంథము గురించి తప్పుగ వ్రాశారు అంటే, తప్పుగా వ్రాసినప్పుడు తప్పు పేరు తక్కువ పేరు చెప్పవచ్చును. అలా చెప్పలేదు కదా! ఏడు ఆకాశాలు ఉన్నాయి అని నువ్వు అంటావు, ఒక్కటే ఆకాశము బయట ఉంది అని నేను అంటాను. తప్పు నీదా? నాదా? ఎవరినైనా చూసుకోమను. బుద్ధి ఉన్నోడు ఎవడు చూసినా ఒక్కటే ఆకాశము ఉంది అని అంటాడు. ఏడు ఆకాశాలు నీ లోపల ఉన్నాయి అది నీకు తెలియలేదు.


ఇప్పుడు నీ శరీరములో ఉండేటి జ్ఞానమును నీకు చెప్పదలచుకొని, నేను ఎక్కడ ఏ గ్రంథములో లేని విషయాలను చెప్పుచున్నాను. నేను చెప్పే జ్ఞానము గ్రంథములో అయినా ఉందా? ఖుర్ఆన్లో ఉందా? బైబిలులో ఉందా? భగవద్గీతలో ఉందా? లేదు. నేను మీకు జ్ఞానము అర్థమవ్వాలి అని వివిధ రకాల జ్ఞానము మీకు చెబుతున్నాను. లేని జ్ఞానము మీకు చెబుతున్నాను. సృష్ఠించి మీకు కొత్తరకముగా జ్ఞానము చెబుతున్నాను. అదే అక్షర జ్ఞానము అని మీకు చెప్పాను. అది ఇంతవరకు ఎవ్వరికీ తెలీదు.

మీకు చెప్పితే అర్థమయ్యింది ఇదే మొదటి మారు ఇంకెక్కడ వినివుండరు దానిని. ఎందుకంటే కొత్తగా చెప్పింది కాబట్టి. ఇప్పుడు లలాజలము కూడ అట్లే చెబుతున్నాము, 'ల' అంటే జీవాత్మ, 'లా' అంటే నీ వెనకనే, పక్కనే ఉండే ఆత్మ, 'లలా' అంటే ఒరేయ్! నువ్వు జీవునిగా ఉన్నావు, నీ పక్కన దీర్ఘముగా నేను ఉన్నాను. నీకంటే పెద్దోనిగా నేను ఉన్నాను అని “లలా” అని పేరు పెట్టబడింది. ఇంకొకటి, మళ్ళీ మూడో ఆత్మ కూడా ఒకటి ఉంది. అది లోపల, బయట అంతటా ఉంది. నీ శరీరములో ఒక్కచోట ఉండేది నువ్వు జీవాత్మ అయితే, నీ శరీరమంతా వ్యాపించినటువంటిది ఆత్మ. అదే దేవుడు అని చెప్పినాను. ఇంకొకడు


---

దేవుడు అని చెప్పేదానికి అవకాశము లేదు. శరీరము లోపల శరీరము బయట ఇంకొక ఆత్మ వ్యాపించి ఉంది. అది శరీరము లోపల ఉంది, శరీరము బయట ఉంది, అణువణువున వ్యాపించి ఉంది. దాన్నేమన్నారంటే ఎక్కడా చేతగాక పరమాత్మ అన్నారు. ఈ ఆత్మకంటే పరముగా ఉండేది పరమాత్మ అన్నారు. భగవద్గీతలో జీవాత్మ ఆత్మ ఇద్దరు పురుషులు అయితే మూడవ వానిని పురుషోత్తముడు అని పేరుపెట్టి భగవద్గీతలో చెప్పబడింది.


పురుషోత్తమ ప్రాప్తియోగము అనే అధ్యాయములో పురుషోత్తముడు అనే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనను దేవుడు అనే అనాలి కాని ఇంకొకటి అనే దానికి లేదు. కానీ వాస్తవముగా నువ్వు మ్రొక్కాల్సింది, నువ్వు ఆరాధించాల్సింది, నువ్వు నమస్కరించాల్సింది ఒకే ఒక్క దేవున్ని. నీ శరీరమంతా వ్యాపించియున్న ఆత్మనే నువ్వు దేవునిగా ఆరాధించాలిగానీ బయట ఉండేటటువంటి వానిని ఆరాధించే దానికి అవకాశము లేదు. ముస్లీములు ఒకే దేవుడు అని మా గురువు చెప్పినారు అని అంటున్నారు. ఒకే దేవుడు కాదు అని నేను చెప్పినానా? లేదు. “ఒకే దేవుడు” అని నేను మా ఖుర్ఆన్ 5-73 ఆయత్లో ముగ్గురు దేవుళ్ళు అని చెబుతున్నారు. మూడవవాడు దేవుడు అంటున్నారు. మూడవవాడు దేవుడు కానే కాదు అంటున్నారు. నేను కూడ అదే చెబుతున్నాను మూడో వాడు దేవుడు కాదు. వాడు ఈ ఇద్దరికంటే అతీతుడు. వానికి ఏ పేరు పెట్టేందుకు అవకాశము లేదు. వానిని మ్రొక్కకూడదు. వాన్ని మ్రొక్కేదానికి అవకాశము లేదు. మూడవవాడు దేవుడు కాని దేవుడు రెండవవాడే దేవుడు అని చెబుతున్నాను. రెండవవాడిని చెబుతున్నాను మూడవవాడిని నేను మీకు దేవుడని చెప్పలేదు. రెండవవాడినే మీరు


----

ఆరాధించాలని చెబుతున్నాను. అక్కడ ఆయత్లో కూడా అదే మూడోవాడు దేవుడు కాదు అని ఉంది. మూడవవాడు దేవుడు కాదు, ఆయన సాక్షి. నిన్ను తోలేవాడు ఎవడయితే ఉన్నాడో వాడే దేవుడు. నువ్వు తోలబడేవాడితో సహా వస్తున్నావు అని 50-21 ఆయత్లో చెప్పారు. అంటే ఎక్కడికి వచ్చావు? ఇక్కడ భూమి మీదికి వచ్చావు నువ్వు. మనిషిగా వచ్చావు. ఈ శరీరములో నువ్వు ఉన్నావు. నువ్వు తోలబడుతున్నావు. నిన్ను తోలేవాడు ఒకడున్నాడు. వాడే దేవుడు (ఆత్మ) నీ శరీరములో. ఆయన ఎట్లు తోలితే అట్ల వెళతావు. అందుకే కష్టసుఖాలు పడుతున్నావు. ఆ తోలేవాడే నీ ఆత్మ ఆయనే నీ దేవుడు. ఇంక తోలబడేవాడివి నువ్వు, సాక్షిగా ఉండేవాడు ఒకడున్నాడు చూడు! వాడు మూడవవాడు, వానితో మనకు పనిలేదు అని చాలాసార్లు చెప్పానేను. ఆయన దేవుడు కాదు అని మీరు అంటే, అయన దేవుడు అని నేను కూడా దేవుడు అంటున్నాను. రెండవవాడు దేవుడు కాదు అని ఏమైనా ఖుర్ఆన్లో చెప్పినారా అట్లన్నాగానీ చెప్పండి? అతనొక్కడే దైవము అని పెద్దాయనే చెప్పినాడు. ఈ మూడో ఆయన ఉన్నాడని చెబుతున్నాగా, ఆయనేం చెప్పినాడంటే 3-18 ఆయత్లో “ఆరాధ్యదైవము ఒకడే ఒకడున్నాడు ఆయనే అల్లాహ్” అని చెప్పాడు. అంటే అంతులేనటువంటి వాడు అని. ఆయనే అల్లాహ్, అంటే నీ శరీరములో ఉండే రెండోవాడు నిన్ను నడిపేవాడే అని చెప్పినాడు.


*డా చెప్పలేదు. కాదనే చెబుతున్నా. రెండవవాడినే  **


ఇపుడు ఆత్మ మనకు గుర్తుకు చేసింది. ఏమని? మీరు ఇష్టము వచ్చినట్లు చేసేది ఏమీ లేదు. నా ఇష్టము వచ్చినట్లు నేను బందేస్తే బందేస్తాను. నేను ఊరకుండమంటే ఊరకుండాల్సిందే, మాట్లాడమంటే మాట్లాడాల్సిందే అని. ఇప్పుడు మనల్ని నడిపించేవాడు ఒకడున్నాడు కదా!

---

కాబట్టి ఆయన చేసిన నాటకములో ఇదొక భాగము. మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి నడుస్తున్నాము. అప్పుడు ఊరకుండమన్నపుడు ఊరకున్నాము, నిల్చిపోయినాము కొంచెము సేపు తర్వాత మళ్ళీ ప్రారంభిస్తున్నాము. అంటే ఈ ప్రారంభించేవాడు ఎవరు? ఆయనే. ఆపేసినదెవరు? ఆయనే. మనమేమనుకుంటామంటే మనమే చేస్తాము అనుకుంటున్నాము. చాలామంది మొత్తము అదే ధ్యాసలో ఉన్నారు. కాబట్టి అన్ని ధ్యాసలను మనము ప్రక్కన కట్టిపెట్టి జ్ఞానము ప్రకారము చూస్తే మన ఇష్టము ఏమీ లేదు. ఆయన ఇష్టప్రకారము మనము ఆడాల్సిందే. మనలో ఏమీ స్వతంత్రముగా నడిచేది ఏమీ లేదు అని తెలుస్తావుంది. ఇప్పుడు ముఖ్యముగా చెప్పితే, ఈ బయట రాద్ధాంతాలు అజ్ఞానులు ఏ విధముగా అనుకున్నా జ్ఞానము జ్ఞానపద్ధతిగానే ఉంటుంది. మనము అర్థము ఎట్ల చేసుకున్నా అది మాత్రము దాని పద్ధతి ప్రకారమే ఉంటుంది. నువ్వు తప్పుగా అర్థము చేసుకోవచ్చు, మంచిగా అర్థం చేసుకోవచ్చు. అంటే నేను మొట్టమొదటనే, సభ ప్రారంభమైనప్పుడే చెప్పాను. అందరి శరీరములోని ఆత్మ అందరికీ మంచి జ్ఞానాన్ని అందించండి. వాళ్ళకి మంచిగా అర్థము అయ్యేటట్టు చేయమని ఆత్మను కోరుకుంటూ ప్రారంభము చేశాను. అందరిలో ఒకే ఆత్మ ఉన్నాగాని ఒక్కొక్కరికి ఒక్కో విధముగా అర్థమయ్యేలాగా చేస్తుంది. ఎందుకంటే మీ భావాన్ని బట్టి ఆత్మ నీకందిస్తుంది. ఒక దృశ్యాన్ని మనము చూస్తే ఆ దృశ్యాన్ని ఒకడు ఒకరకముగ అనుకొంటే ఇంకొకడు

ఇంకో రకముగ అనుకుంటాడు. ఒకడు ఒకరకముగ అనుకొని ఇంకొకడు

ఇంకోరకముగ అనుకోవడానికి కారణం ఏమి? అంటే అది వాని బుద్ధి వానికందించే దానినిబట్టి ఉంటుంది. ఆ బుద్ధికి ఎవరు అధిపతి అంటే, అతని శరీరములో ఉండే ఆత్మే అధిపతి.


---

కాబట్టి మీకు మేము చెప్పే జ్ఞానము మంచిగ అర్థము కావాలన్నా లేక చెడుగ అర్థము కావాలన్నా లేక ఇంకో రకముగా అర్థము కావాలన్నా మీలో ఉండే ఆత్మ అందించడమును బట్టి ఉంటుంది. అందువల్ల నువ్వు ఉన్నావు అంటే నీకు పొరుగువాడు ఒకడు ఉన్నాడు. నీ పొరుగువాడు ఎవరు అంటే నిన్ను నడిపించేవాడే నీ పొరుగువాడు. కాని నీకు తెలియలేదు. దేవుడు (ఆత్మ) నడిపిస్తున్నా నేనే నడుస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు హత్య చేసావు, హత్య చేస్తే అబ్బ ఎవ్వరూ చేయలేని హత్య నేను చేశాను అనుకుంటున్నావు. కాని ఆ హత్య చేసింది ఎవరు? నీలో ఉన్న ఆత్మ. నీకేది చేత కాదు, నువ్వు స్వతంత్రునివి కాదు. ఆ ప్రకారము నేను చెప్పిన జీవాత్మ అనేవాడు గ్రుడ్డివాడు, చెవిటివాడు, అవిటివాడు, వాడికి ఏ పని చేతకాదు అని చెప్పాము. వాని పక్కన ఉన్న ఆత్మ నడిపిస్తేనే అయ్యేది, లేకపోతే ఏ పని చేయలేడని చెప్పాము. ఒక మంచి పని చేసినప్పుడు సరే.. అది మంచి పని అని సంతోషించవచ్చుగానీ చెడు పని చేసినపుడు అది కూడ నేనే చేసినాను అనుకుంటావు. కాని చెడ్డపనీ నువ్వు చెయ్యలేదు. మంచిపనీ నువ్వు చేయలేదు. లోపలుండేవాడు అన్ని పనులూ చేయిస్తున్నాడు అనే ధ్యాస నువ్వు పెట్టుకుంటే అది నిజమైన జ్ఞానము అయితుంది లేకపోతే అది నిజమైన జ్ఞానము కాదు. అల్లాహ్ నిన్ను నడిపిస్తున్నాడు. ఈ విషయమై (2వ సూరా 255వ) ఆయత్లో ఏమి చెప్పినాడు అంటే ఆయన కార్యకర్తగా ఉన్నాడు. అహర్నిశలు పని చేస్తున్నాడు. నీ శ్వాసను ఆడిస్తున్నాడు, గుండెను కదిలిస్తున్నాడు. ఊపిరితిత్తులను కొట్టుకునేట్టు చేస్తున్నాడు. తరువాత ప్రతికార్యము ఆయనే చేస్తున్నాడు అని ఉంది. మళ్ళీ ఆయన చేస్తున్నప్పుడు సాక్షిగ చూసేవాడు ఎవరు? అని అర్థము కాలేదు మీకు. అంటే ప్రత్యక్షముగా ఇప్పుడు నువ్వు చేస్తున్నావు అని అనుకుంటున్నావు కదా! మళ్ళీ ఖుర్ఆన్


---

గ్రంథము ప్రకారమే ఆ కార్యాలన్ని చేసేవాడు ఎవడు? జీవుడు కాదు, ఇంకోవాడు అని చెప్పినాడు కదా! 6వ సూరా 102వ ఆయత్లో 'ఆత్మ లేక అల్లాహ్ కార్యకర్తగా ఉన్నాడు' అని ఉంది.


(6వ సూరా 102వ) ఆయత్ చదవండి. “ఆయనే అల్లాహ్. ప్రభువు. ఆయన తప్ప మరెవరూ ఆరాధ్యులు కారు. సమస్త వస్తువులను సృష్టించినవాడు ఆయనే కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. అన్ని విషయాల కార్యసాధకుడు ఆయనే. ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రము అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మదృష్టి కలవాడు, సర్వము తెలిసినవాడు”. అక్కడ చిట్ట చివరలో ఏముందంటే ఆయనే కార్యకర్త అని ఉంది. అంటే అన్ని పనులు అయనే చేస్తున్నాడు. అందరి చేతులను ఆయన అందుకోగలడు. నువ్వు ఆయనను అందుకోలేవు. ఇక్కడ అర్థము చేసుకుంటే అందరి చేతులను కదిలించేవాడు ఆయనే అని అర్థము. ఆయనే అల్లాహ్. అంటే నీ శరీరములో ఉండే దేవుడు. ఆయనే అందరికీ అధిపతి. ఆయనే నిన్ను కదిలిస్తున్నాడు, ఆయనే కార్యకర్తగా ఉన్నాడు. సర్వకార్యములను ఆయనే చేస్తున్నాడు. ముస్లీములు ఏమి అనుకుంటున్నారు? ఆయన చేస్తున్నాడు అనుకోవడము లేదు, నేనే చేస్తున్నాను అనుకుంటున్నారు. అల్లాహ్ ఎక్కడో ఏడోదాంట్లో పైన కూర్చున్నాడు అనుకుంటున్నారు. ఏడో ఆకాశములో అల్లాహ్ లేడు, నీ శరీరములో అల్లాహ్ ఉన్నాడు. నీ శరీరములో ఉండి కదిలిస్తావుంటే నువ్వు కదులుతున్నావు. నువ్వు నిద్రపోయినాగానీ, నీ శరీరములో ఊపిరిని బయటికి పంపించేవాడు, లోపలికి పంపించేవాడు ఆయనే. నీ గుండెను కొట్టుకునేటట్టు చేసేవాడు ఆయనే. ఆయనే ఏకైక అల్లాహ్. ఆయనే సర్వకార్యములు చేస్తున్నాడు అని ఉంది.


----

ఈ రకముగా లెక్కేసుకుంటే ఆ రెండో ఆత్మగా ఉండే దేవుడు నీ శరీరములో అన్ని పనులను చేస్తున్నాడు. నువ్వు చెయ్యలేదు. కాని నేడు ముస్లిములంతా ఏమి అనుకుంటున్నారు? దేవుడు ఎక్కడో ఉన్నాడు అన్ని పనులు మనమే చేస్తున్నాము. మనము చేసే తప్పులకు ఆయన శిక్ష వేస్తున్నాడు. “నేనే చేశాను" అనుకుంటే నువ్వు చేసినట్టు అవుతుంది కాబట్టి, మరణించినప్పుడు శిక్ష వేస్తాడాయన. నేను చెయ్యలేదు ఆయనే చేస్తున్నాడు అంటే నీకు సంబంధమే లేదు. అదే బైబిలులో చెప్పినది, భగవద్గీతలో చెప్పినది, ఖుర్ఆన్లో చెప్పినది. 'నేను గుడ్డివాడినని' అనుకొంటే నీకు పాపము లేదు, 'నేను చూస్తున్నాను' అంటే నీకు పాపము ఉంది అని ఏసు చెప్పినాడు బైబిలులో. నువ్వు అసలు గ్రుడ్డివానివి. అయినా నేను చూస్తున్నా అనుకుంటున్నావు పొరపాటుగా. ఈ రకముగా మూడు గ్రంథాలలో ఒకే జ్ఞానము ఉందని అర్థము చేసుకోగలిగితే, నీవు జ్ఞానివి అవుతావు. అది చేతకాక, అర్థముకాక, ఒక్కో గ్రంథములో ఒక్కోజ్ఞానము ఉందని అనుకుంటున్నారు. అట్లకాదు అని ఖుర్ఆన్ గ్రంథము ఏమని చెబుతుందంటే, తౌరాత్ గ్రంథాన్ని, ఇంజీలు గ్రంథాన్ని నిజమైన జ్ఞానము అని ధృవీకరిస్తుంది అని 5వ సూరా 44, 46, 48, ఆయత్లలో చెప్పబడింది. ఖుర్ఆన్ గ్రంథము ఎందుకు తౌరాత్, ఇంజీలు గ్రంథము పేరెత్తింది? మతవాదుల దగ్గర దానికి జవాబు లేదు ముస్లీమ్లు ఖుర్ఆన్లో చెప్పిన దానిని చూడరు, దానిని బయటికి చెప్పరు. ఇంకో గ్రంథము పేరు చెప్పరు. మాదే అంతిమ గ్రంథము, ఇదే అందరికి అవసరము, ఇదే లేటెస్ట్ గ్రంథము, దీని ప్రకారము అందరూ పోండి అంటారు. ఖుర్ఆన్ గ్రంథము ఏమి చెబుతాంది? తౌరాత్ గ్రంథాన్ని ఎవరు అందించారు? అల్లాహ్నే అందించాడని చెప్తుంది. తౌరాత్ గ్రంథము జ్యోతి అని చెప్పింది. తౌరాత్ గ్రంథాన్ని మార్గదర్శకము అని


----

చెప్పింది. మానవులకు మార్గదర్శకము అని ఖుర్ఆన్ గ్రంథమే చెప్పింది. 6వ సూరా 109వ ఆయత్లో ఏమి చెప్పినారు? ఇదే చెప్పినారు చూడండి. అంటే తౌరాత్ గ్రంథమును గురించి.


6వ సూరా, 109వ ఆయత్ “వీళ్ళు అల్లాహ్ పై అతి గట్టిగా ప్రమాణం చేస్తూ, తమవద్దకు ఏదైనా సూచన గనక వస్తే తప్పకుండా విశ్వసిస్తామని అన్నారు. సూచనలన్నీ అల్లాహ్ అధీనంలో ఉన్నాయి అని వారికి చెప్పు. నీకేమి తెలుసు? ఒకవేళ ఆ సూచనలు వచ్చినప్పటికీ వీళ్ళు మాత్రం విశ్వసించే వారు కారు.”


ఈ రకముగా చెప్పుకుంటే ఇంజీలు, తౌరాత్, ఖుర్ఆన్ మూడు గ్రంథాలను ఏకీభవించి చెప్పుకోగలిగినప్పుడు నిజమైన జ్ఞానము అవుతుంది. అట్లుకాకుండ వాళ్ళది నిజమైన జ్ఞానము కాదు అని ఒక ముద్రవేసుకొంటే మీరు జ్ఞానులు కాలేరు. అప్పుడు మీది నిజమైన జ్ఞానమో కాదో తెలియబడుతుంది. 62 వ సూరా 5వ ఆయత్ ప్రకారము మీరు లెక్క వేసుకోండి. దేవుడు ఇచ్చిన తౌరాత్ గ్రంథమును అనుసరింపకపోతే వాడు ఎన్ని గ్రంథాలు చదివినాగానీ గ్రంథాలు మోసే గాడిదతో సమానము అని చెప్పినారు. మళ్ళ నువ్వు మూడు గ్రంథాలు చదువుకోకుండా పోతే, నువ్వు ఏ మత ధర్మములో కూడ లేనట్టే అని చెప్పినారు. మళ్ళ మూడు గ్రంథాలు చదవకుండా ఒకే గ్రంథము చదివి, నాకింతే జ్ఞానము తెలుసు అని అనుకుంటే ఎట్లా అవుతాది? ఇంకొకరు మా గ్రంథము చదవకూడదు అంటే ఎట్లైతాది? నీ గ్రంథము అని ఎక్కడైనా ముద్రవేసి పెట్టబడివుందా? నీ ఇష్టమొచ్చినట్లు చెప్పుకుంటున్నావు. ఏ న్యాయస్థానము కూడ దీనిని ఒప్పుకోదు. మీరు 'ఇది నా గ్రంథము' అనంటే దేవుడే ఒప్పుకోడు ఖురాన్


----

గ్రంథములో 6-90వ ఆయత్ ప్రకారము “సమస్త మానవాళికి హితోపదేశము కొరకు ఈ గ్రంథము చెప్పబడింది” అని ఉంది. ఇపుడు మనము శరీరములోనే దేవుడు (అల్లాహ్) ఉన్నాడు అనేదానికి సాక్ష్యముగ నేను మీకు కొత్త అంశాన్ని లేవనెత్తి చెబుతున్నాను "లలాజలము” అని. “లలాజలము”లో ఏముందంటే మొట్టమొదట 'ల' ఉంది, మళ్ళ 'లా' ఉంది.


నేను ఇంతకుముందు చెప్పినాను, “అఆ” అంటే “అ” అంటే నువ్వు (జీవాత్మవు) ‘ఆ' అంటే ఆత్మ అని.

జీవాత్మను ఒక అక్షరముతో, ఆత్మను ఒక అక్షరముతో పోల్చి చెప్పారు. అంటే జీవాత్మ కంటే ఆత్మ పెద్ద అని చెప్పుతూ వచ్చాము. ఆ రకముగా చాలాసార్లు చెప్పి చివరిలో పరమాత్మ కూడా ఒకడున్నాడు అని చెప్పినాము. పరమాత్మ, ఆత్మ రెండూ ఒకే అంశ అని చెప్పేదానికి అం, అః అని కూడా చెప్పినాను చివరిలో. ఇదంతా మనము అక్షర జ్ఞానములో కొంతవరకు తెలుసుకోగలిగాము. ఈ రోజు 'ల' అంటే జీవాత్మ, 'లా' అంటే ఆత్మ అని చెప్పాము. అంటే నువ్వు, నీ శరీరములో ఉండే దేవుడు. నువ్వు ఆరాధించే దేవుడు ఎవరు? 'లా' నీ కంటే పెద్దోడు ఆయన కాబట్టి నువ్వు ఆరాధించాల్సింది ఆ దేవున్నే. ఖుర్ఆన్లో 50-21లో తోలబడేవాడు జీవాత్మ, తోలేవాడు ఆత్మ అని చెప్పుకున్నాము. తోలబడేవాడు 'ల', తోలేవాడు 'లా' అని చెప్పుకున్నాము. వాళ్ళిద్దరు నీ శరీరములో ఉన్నారనే దానికి గుర్తుగా, నీ నోట్లో ఈ “లలాజలము” ఊరుతావుంది. అందరూ మనుషులే. హిందువులకి మాత్రమే నోట్లో ఊరి, క్రైస్తవులకు ఊరలేదా? లేదా క్రైస్తవులకు, హిందువులకు మాత్రమే ఊరి, ముస్లీములకి ఊరకుండ ఉందా? అది మీకు ఊరితేనే ఆహారము అరిగేది లేకపోతే తిన్నది కూడ అరగదు మీకు. కాబట్టి అందరికి లలాజలము


---

ఊరుతావుంది అంటే అందరు దేవుని దృష్టిలో సమానమే. లాలాజలాన్ని అర్థముచేసుకోండి. లాలాజలము అంటే కొందరు ఆ పేరు వినకపోయి ఉండొచ్చు కొంతమందికి తెలిసి ఉండొచ్చు. నోట్లో ఊరే ఎంగిలినే “లలాజలము” అంటాము. లలా అంటే జీవాత్మ, ఆత్మ అని లెక్క ఇంకో ఆయన ఉన్నాడు. సాక్షిభూతుడు అని ఖుర్ఆన్లో చెప్పాడు. బైబిలులో పరిశద్ధాత్మ అని, ఆత్మ అని చెప్పారు. బైబిలులో ఆత్మ అని చెప్పిన చోటల్లా లావు అక్షరాలతో వ్రాశారు. కాని ఈ ఆత్మ అనేదేకాకుండ పరిశుద్ధాత్మ కూడ ఒకటుంది అని చెప్పాడు. ఆత్మను, పరిశుద్ధాత్మను ఒకటిగా లెక్కేస్తున్నారు కొంతమంది క్రైస్తవులు. వారికి పరిశుద్ధాత్మ వేరు, ఆత్మ వేరు అని తెలియలేదు. కొంతమంది ఏమి అనుకున్నారు, ఆత్మ అంటే మనుషులమని అనుకున్నారు, పరిశుద్ధాత్మ అంటే దేవుడు అని అనుకున్నారు. కానీ ఆత్మే దేవుడు, నిజమైన దేవుడు. పరిశుద్ధాత్మ అంటే ఈ అత్మకంటే శుద్ధముగ ఉండేది. అంటే ఆయన ఆత్మకంటే వేరుగా ఉండేవాడని లెక్క ఆ మూడో ఆయననే సాక్షి అని ఖుర్ఆన్ గ్రంథములో 50-21లో చెప్పారు.


పరమాత్మ లేక పరిశుద్ధాత్మ చూసేవాడు మాత్రమే చేసేవాడు కాదు. ఇప్పుడు మనము ఈ లెక్క ప్రకారము పోతే 'లలా' అన్నపుడు ఇంక రెండే ఉన్నాయి కదా? మూడో అయన ఎట్లా? అంటే నోట్లో ఊరేదాన్ని మనము ‘జలము’ అంటాము. అంటే నోట్లో ఊరేది జలమే, లలాజలమే అది. లలా అంటే జీవాత్మ, ఆత్మ అని తెలిసింది. ఇంకోదానికి పోతే మూడు ఆత్మల గురించి ఏమి చెప్పినారంటే జలము అన్నారు. 'ము' అంటే ముగింపు అక్షరము. ము అనేదానికి విలువ లేదుగానీ 'జల' అనే దానికి మాత్రమే విలువ ఉంది. ‘జ’ అంటే 'పుట్టుట' అని మీకు అనేకసార్లు చెప్పాను. అనేక గ్రంథాలలో కూడ వ్రాశాము. 'జ' అంటే సృష్టింపబడుట, పుట్టుట అని


---


అర్థము. ‘ల’ అంటే లయము, నాశనమగుట. అంటే సృష్ఠి, లయ రెండింటిని ఎవరు చేసేది? మూడవ వాడున్నాడు ఒకాయన, ఒక శాసనకర్త, అందరికీ పెద్ద, పరమాత్మ. ఆయన ఎటువంటి వాడు అంటే నాశనానికి కర్తే, తరువాత సృష్ఠికి కూడా కర్తే. ఆయన పేరు సృష్ఠికర్త అన్నాము మనము. సమస్త ప్రకృతిని సృష్టించినవాడు పరమాత్మ, సమస్తము అంటే ఈ భూమండ లాన్నంతా సృషించినవాడు ఒకడున్నాడు. ఆయనే సాక్షిగా ఉన్నాడు. ఆయన తరువాత కుమారునిగా ఉన్న ఆత్మకు అన్ని అధికారాలను అప్పగించినాడు, నువ్వు ఈ పనులన్ని చెయ్యి అని చెప్పాడు. చివరకు మనిషి మరణించి నప్పుడు తీర్పు తీర్చే అధికారము పరిశద్ధాత్మకు ఉంది. కానీ ఆయన తీర్పు తీర్చడు. పాపము సంపాదించుకున్నాడని తీర్పు చెప్పి వాన్ని, మళ్ళ జన్మకు పంపే అధికారము ఎవరికి ఉంది? తీర్పు తీర్చే అధికారము ఎవరికి ఉంది? పరమాత్మ చేత సృష్ఠింపబడి కుమారుడైన ఆత్మకు ఉంది. మొదటి సృష్టికర్త మూడో పరిశుద్ధాత్మకు లేదు (పరమాత్మకు లేదు). ఆయనే బైబిలు గ్రంథములో యోహాన్ 5వ అధ్యాయము 21 నుండి 26 వరకు ఏమని చెప్పినాడంటే “నేను నా కుమారునికి తీర్పు తీర్చే అధికారము ఇచ్చాను” అని చెప్పాడు.


మనము ఇంతకుముందు కూడ అనేకమార్లు చెప్పుకున్నాము. ఆయన ‘జ’ అంటే పుట్టుట, ‘ల’ అంటే లయము. అంటే సృష్ఠికి, నాశనానికి అంతటికీ కర్త అయినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఆయన మూడోవాడు, ఆయన పెద్ద దేవుడు అని చెప్పాము. అంటే ఆయన కూడ దేవుడే, పరమాత్మను పేరుకు దేవుడు అనవల్సిందే కాని నీ దేవుడు ఆత్మే. జీవాత్మకు ‘ల’, ఆత్మకు ‘లా', పరమాత్మకు 'జల' అంటే 'జ' అంటే పుట్టుట, సృష్ఠి. ‘ల’ అంటే లయము, నాశనము. ఆ ముగ్గురు ఆత్మలు నీ శరీరములో


---

ఉన్నారు కాబట్టి నీ శరీరములో ఊట ఊరతాంది. నీకు జ్ఞాపకము తెచ్చుకొనేదానికి. ఎట్లైతే అక్షరాల ద్వారా నువ్వు జ్ఞానాన్ని తెలుసుకోగలిగినావో అలాగనే నీ నోట్లో ఊరే లలాజలము ద్వారానే నువ్వు జ్ఞానము తెలుసుకొనే దానికి, మూడు ఆత్మల విషయము తెలుసుకునేదానికి దీని పేరు లలాజలము అని చెప్పారు. లాలాజలము అంటే ఎవరైనాగానీ ఎప్పుడైనా దాని గురించి ఆలోచన చేశారా? ఇది ఎందుకు ఊరుతాంది అని ఆలోచన చేశారా?లేదు. అది లోపలికి పోయి నువ్వు తిన్నదాన్నంతా నాశనము చేస్తుంది. శరీరములో జలాలున్నాయి, ఈ జలాలను రసాయనాలు అంటాము వీటిని, వాటిలో ఏదో శక్తితో కూడుకొని ఉన్నది. శక్తితో కూడుకొన్నవి. రసాయనములు అవి లోపల ఆహారమును భస్మీపటలము చేస్తావున్నవి. తిన్న ఆహారాన్ని జీర్ణము చేసే లలా జలము నోట్లో ఎందుకుంది? అని మనము ఆలోచన చేయలేదు. శరీరములో దేవుడు ఉన్నాడనే విషయము అందరికి తెలియదు. ఆ విషయము నీకు గుర్తుచేసేదానికే నీ నోట్లో నీరు ఊరుతావుంది. జలము ఊరుతావుంది. ఆ జలానికి ఏమి పేరు పెట్టినా మంటే, మూడు ఆత్మలు కలిసి ఉండేటట్టుగా, జ్ఞాపకమొచ్చేటట్టుగా పెద్దలు ఆలోచనచేసి, దాన్ని “లలాజలము” అన్నారు.


ఇప్పుడు అర్థమయిందా మీ శరీరములో లలాజలము ఎందుకు ఊరుతావుంది అనేది? మీరు నోట్లో ఊరే లలాజలాన్ని ఎంగిలి అంటున్నారు. ఎంగిలిని చాలా తక్కువ భావముతో చూస్తున్నారు. తక్కువ భావముతో చూసి తక్కువగా మాట్లాడుతున్నారు. తక్కువగా దానిని అంచనా వేస్తున్నారు. ఎక్కడంటే అక్కడ ఉమ్మేస్తున్నారు. ఇంకా మాట్లాడాలంటే నీ మొఖాన ఎంగిలి మూస్తా అంటున్నారు. అంటే ఏదో చెడ్డగా, ఏదో అపరిశుద్ధమైనదాన్ని మొఖానికి మూస్తా అన్నట్టుంది. లాలాజలము ఎంత శుద్ధమైనది, ఎంత


---

పవిత్రమైనది లలాజలము అంటే అర్థము కాలేదు. ఒక గురువు ఒక శిష్యుడిని ఇలా అన్నాడంట. ఒరేయ్ నీ మొఖాన ఎంగిలి మూస్తాను నా దగ్గరకి రావద్దు అన్నాడు. దానికి నేను మూపించుకోడానికి వస్తానని శిష్యుడు అన్నాడట. మనం వింటే వాడేమో ఎంగిలి మూస్తానన్నాడు, వీడేమో మూపించుకుంటాను అంటున్నాడు, సిగ్గులేనోడు అనుకుంటాము మనము. శిష్యుడు వాస్తవముగ గురువు దగ్గరికి పోయినాడట. గురువు దగ్గరికి పోయి నువ్వు మూస్తే మూస్తివిగాని నాకు జ్ఞానము చెప్పు అన్నాడట. జ్ఞానము చెప్పేటప్పుడు ఈయన స్పీడ్ స్పీడ్గా చెబుతావుంటే ఏమయిందంటే గురువు నోట్లో తుంపర్లు పోయి (లలాజలము పోయి) శిష్యుని మొఖాన పడతావుంది. వాస్తవముగా గురువు మూయడము లేదు లోపలుండే ఆత్మ మూస్తున్నాడు శిష్యుని మొఖాన. అది పడతావుంది అప్పుడప్పుడు. కానీ ఆ విషయము వానికి అర్థము కాలేదు. వాడు చూసుకోలేదు.

తావుంది.


ఆ రకముగా జరుగుతావుంటుంది. స్పీడ్గా మాట్లాడేటప్పుడు నోట్లో తుంపర్లు ఎగిరిపోతావుంటాయి, అవి పోయి ఎదురుగా ఉండేవాని మొఖము మీద పడతావుంటాయి. కానీ అంతగా మనము గమనించుకోము. గమనించుకుంటే అర్ధమయితాది. అట్లగానే "నీ మొఖాన ఎంగిలి మూస్తాను” అని గురువు అంటే "నీకు జ్ఞానము చెబుతాను” అని అర్థము. శిష్యుడే మన్నాడు? "నేను మూపించుకోడానికే వస్తాను” అంటే “జ్ఞానము చెప్పించుకోవడానికే నేను వస్తాను” అని అర్థము. మనము ఏమి అనుకుంటా మంటే శిష్యుడు సిగ్గులేనోడు, సిగ్గులేకుండా అక్కడికి ఎలా పోతున్నాడో అని అనుకుంటాము కానీ ఇది సూక్ష్మభావాలతో కూడుకున్న అర్థము. లాలాజలము అంటే చాలా పవిత్రమైనది, విలువైనది. కానీ మన శరీరములోనే ఇంత జ్ఞానము ఉందని చాలామందికి తెలియదు. ఏ బుక్లో


---

చదివినా ఉండదది. ఇది బుక్కుల్లో ఉండే విషయము కాదు. మీకు కొత్తకోణములో జ్ఞానము చెబుతున్నాను. మీకు అనేకరకాలుగా జ్ఞానము అర్థము కావాలని చెబుతున్నాను. ఇంతకుముందు చెప్పినట్లు “అక్షరజ్ఞానము” ఏ బుక్లోను లేదు అట్లాగే “లలాజలము” అనేది ఏ బుక్లోనూ లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పినదంతా ఉన్నట్టుండి చెప్పడమేగాని ఇంకోటి ఏమీ లేదు. ఒకవేళ నేనేమన్నా ఇంకొక బుక్ లో ఉండేది చదువుకొని వచ్చి చెప్పేదానికి అట్లా కూడ లేదు. ఎందుకంటే ఇది ఏ బుక్లోనూ వ్రాయలేదు . 


ఒకవేళ నేను చెబుతున్నానా? అనేదానికి నేను చెప్పేవాన్ని కాదు అన్నాను. మరి చెప్పేవాడు ఎవరు అంటే ప్రతిమాట వాడే మాట్లాడుతున్నా డని చెపుతున్నాను. ఆయనే మాట్లాడుతున్నాడని నాకు తెలుసు కాబట్టి ఆయన ఏమి మాట్లాడుతాడో మాట్లాడుకోని మనకెందుకు అని హాయిగ కూర్చోని మీకు మీటింగ్ చెప్పాలనే ధ్యాస కూడ లేకుండ టైమ్ అయినప్పుడు ఇక్కడకు వచ్చి కూర్చుంటాను. ఇక్కడ కూర్చుంటే, ఏమి వస్తాయో నేను వింటుంటాను. మీరు వింటూవున్నారు కదా! నేను కూడ అట్లే జీవునిగా

నీకు నాకు అత్మయైన దేవుడే చెబుతున్నాడు. అత్మ అయిన దేవుడే పలకరిస్తున్నాడు. మూడు గ్రంథాలలో ఉండే జ్ఞానమే ఇది, కొత్త జ్ఞానము కాదు. మీరు ఈ జ్ఞానాన్ని జ్ఞాపకము పెట్టుకోవాలనే లలాజలము, అక్షర జ్ఞానమూ ఇవన్ని చెప్పాము. ఈ విధముగ మీకు ఏదో ఒకటి కొత్త కొత్తగా ఒక గంటా గంటన్నరసేపు జ్ఞానాన్ని అందించాలి అన్న ఉద్దేశ్యముతో చెప్పుచూ పోతున్నాము. చెప్పుచూ పోతున్నాగాని సత్యాన్నే చెబుతున్నాను. ఆ సత్యాన్ని జీవాత్మగా నేనేమి చెప్పలేదు, గాని అత్మగా సత్యాన్నే చెప్తున్నాను. ఆత్మకు సత్యమంతా తెలుసు.


----

ఇప్పుడు ఎట్లు ఉందంటే ఇదేదో బూచోడి ఆట ఆడినట్టు ఉందన్నమాట. పైకి కనిపించేది ఒకడు, మాట్లాడేది ఒకడు. నాకేమో నేను చెబుతున్నా అన్నట్టు ఉంటుంది కానీ నేను చెప్పలేదన్నట్టూ ఉంటుంది. ఇప్పుడు వాస్తవము ఏమిటిది అంటే నేను చెప్పలేదు అనేదే సత్యము. చెప్పినాను అనేది అసత్యము. రేపు పొద్దున మీరు అడిగినాగానీ నువ్వు అట్లు చెప్పినావు కదా! అంటే నేనెప్పుడు చెప్పినా అనొచ్చు. మీరు ఎట్లా అడగాలంటే మీలోని ఆత్మ ఇట్లు చెప్పింది అంటే అప్పుడు జవాబు చెబుతా నేను. కరెక్టే ఇది అప్పుడు చెప్పినాను అని. నువ్వు చెప్పినావు అంటే నేను దానికి ఒప్పుకోను, నాకు సంబంధము లేదు అని చెబుతున్నాను. కాని వాస్తవమైన జ్ఞానము ఇక్కడ మీకు చెప్పబడుతుంది, రెండో జ్ఞానము ఏదీ లేదు. మీరు మంచి జ్ఞానులు కావాలని ప్రతీ విషయము చెబుతున్నాము. మూడు గ్రంథాలలో ఉండేటటువంటి సారాంశాన్ని వివరిస్తూ, ఆ వివరణ నీ శరీరములోనే ఉంది అని తెలియజేసే నిమిత్తమే ఈ లలాజలము అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చి చెప్పాము. రాబోయే కాలములో కూడా అంటే మేము ఎంతకాలము బ్రతికి ఉంటామో అంతకాలము కూడ ఇటువంటి జ్ఞానాన్నే దేవుడు అయిన ఆత్మ మనకు అందించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ పరమాత్మ కాదు బాగా జ్ఞాపకము పెట్టుకోండి. పరమాత్మ ఏదీ అందించడు. ఆయన కేవలము చూసేవాడే. ఆత్మయే ఇటువంటి జ్ఞానము అందించాలని కోరుచున్నాను. మా లెక్కలో దేవుడు, మీ లెక్కలో అల్లాహ్. అల్లాహ్ అన్నా, ఆత్మ అన్నా, తండ్రి అన్నా అంతా ఒక్కటే. కానీ మనకు ఈ సమన్వయము చేసుకునే దాంట్లో పెద్ద కష్టము అయిపోయింది. నా గ్రంథము వేరే అని ఒకరు అంటే, నా గ్రంథము వేరు అని ఇంకొకరు అంటున్నారు, వారిలో సమన్వయము లేదు. సమన్వయము


---

చేసుకొని మాట్లాడితే చాలా బావుంటుంది. మేము సమన్వయము చేసి చెబుతున్నాము, అందరికి ఐకమత్యముగ చెబుతున్నాము, మూడు గ్రంథాలు ఒక్కటే అని చెబుతున్నాము.


6వ సూరా 91వ ఆయత్లో చెప్పినట్టు తౌరాత్ గ్రంథములోనే మూడు భాగాలుగా చేసుకొని చదువుతున్నారు అని చెప్పాము. ఈ తౌరాత్, ఇంజీలు, ఖుర్ఆన్ మూడు గ్రంథాలు తెలిసినప్పుడే నిజమైన జ్ఞానములో, నిజమైన ధర్మములో నువ్వు ఉన్నట్టు లేకపోతే నువ్వు ధర్మములోనూ లేనట్టే అని 5వ సూరా 68వ ఆయత్లో ఉంది కదా! మరి 5వ సూరా 68వ ఆయత్ ప్రకారము మనము లెక్కేసుకుంటే, మీరు మూడు గ్రంథాలు చదివినారా? నేను మూడు గ్రంథాలు చదివినాను కాబట్టి చెప్తున్నాను. అంటే కొంతమంది మేము చదివాము అంటున్నారు. ఖుర్ఆన్ చదివాను అని ఒప్పుకుంటున్నాడు ఓ ముస్లీము. ఇంజీలు చదివినాను. ఇంజీలు అంటే బైబిలు, ఇంజీలు చదివాను తౌరాత్ కూడా చదివాను అంటున్నారు. తౌరాత్ గ్రంథమును నువ్వు ఎప్పుడయినా చూసినావా అని అడిగితే, వాడు చదివినాను అని ఒప్పుకుంటున్నాడు. తౌరాత్ అనేదానిని ఎవ్వరూ చూడలేదు. ముస్లీమ్ పెద్దలు చూసినారా? లేకపోతే వాళ్ళకంటే పెద్దలు చూసినారా? ఎవ్వరు చూసినారు దానిని అని అడిగితే, వాస్తవముగా ఎవ్వరూ చూడలేదు దానిని. అది ఉంటేగా అసలుకు ఫలానాచోట ఉంది అని చెప్పగలుగుతారా? లేదు. తౌరాత్ గ్రంథము మూసాకు చెప్పబడింది అని సమాచారము ఉంది. సరే, మూసాకు చెప్పబడింది. మేము దాన్ని కూడా ఒప్పుకుంటాము. జబుర గ్రంథము కూడ ఇంకొకరికి చెప్పబడివుంది. దానిని కూడ ఒప్పుకుంటాము. కానీ జబుర అనే గ్రంథాన్నిగానీ, తౌరాత్ గ్రంథాన్నిగానీ ఎవరైనా చూపగలరా? లేదు. ఎవ్వరూ చూపలేరు. అసలు


---

తౌరాత్ గ్రంథము అంటే ఏమిటో తెలియదు. ఇప్పుడు నన్ను ప్రశ్న వేయ్యొచ్చు. మూడు గ్రంథాలు చదివితేనే కదా నిజమైన జ్ఞాని అంటే ఓ ధర్మములో ఉన్నట్టని ఖుర్ఆన్ 5-68లో ఉంది కదా!


ఖుర్ఆన్ గ్రంథము ప్రకారము నువ్వు మూడు గ్రంథాలు చదివినావా? అని మీరు నన్ను ప్రశ్నవేయ్యొచ్చు. ప్రశ్న వేస్తే నేను మూడు గ్రంథాలు చదివినాను అనే చెబుతున్నాను. అట్లగానే మూడు గ్రంథాలను నేను చదివినాను. నాకు తెలుసు తౌరాత్ గ్రంథము ఏమైవుండేది. ఎక్కడ ఉండేది తెలుసు. అది మారుపేరుతో ఉంది. తౌరాత్ అనే పేరును ఒకాయన చాలా పెద్దాయన పెట్టినాడు. చాలా పెద్దాయన అంటే 'లా' అని అంటున్నాంలే, ఆ దీర్ఘము ఉండే ఆయన ఆ పేరు దానికి తౌరాత్ అని పెట్టినాడు. కాని మనుషులు కూడా పేరు పెట్టారు దానికి మనుషులు పెట్టిన పేరు మనకి తెలుసు, ఆ గ్రంథము మన దగ్గర ఉంది. అంటే మూడు గ్రంథాలు నేను చదివినాను. ఆ మూడు గ్రంథాలలో సారాంశము నాకు బాగా తెలుసు. తౌరాత్, ఇంజీలు, ఖుర్ఆన్ మూడు చదివినాను కాబట్టి మూడు గ్రంథాల విషయాలు నేను చెప్పగలుగుతున్నాను. ఎక్కడా కూడ అసత్యాన్ని ఏమాత్రము ఒప్పుకోకుండా, సత్యాన్నే దేవుడు ప్రకటించేటట్టుగ మనము ప్రార్థన చేశాము. ఆయన ఆత్మే మనకు సత్యాన్ని చెబుతుంది. వేరే విషయము ఏదీ చెప్పదు. అసత్యము ఎక్కడా చెప్పడము లేదు. కానీ తప్పుగా అర్థము చేసుకునేటువంటివాళ్ళకు దేవుడే ఆ రకముగ అర్థము అయ్యేటట్టుగ చేసినాడు. వాళ్ళను పక్కదారిలో పంపించేసాడు. ఒకనికి దారిలో చీకట్లో ఓ తాడు పడి ఉంటుంది. దానిని చూస్తే వాడు పాము అని భ్రమిస్తాడు. అంటే అది భ్రమ. ఇంకొకడు ఏమని అనుకుంటాడు అంటే లేదు లేదు అది తాడే అనుకుంటాడు.


----

99 మంది పాము అనుకుంటే ఒకడు మాత్రము తాడు అనుకుంటాడు. మరి 99 మందికి లోపల ఉండే బుద్ధికి ఆత్మ ఏమని అందించింది, అది పామే అనే భ్రమ కలిగించింది. అంటే మరి సత్యమేమిటి? తాడు సత్యము. కానీ పాము అసత్యము. అయినాగానీ పాము అనేదే వాళ్ళకు సత్యముగా తోచింది. వారు తాడును పాము అనుకుంటున్నారు. అట్ల అనుకునేదానికి కారణము ఏమిటి అంటే లోపలుండేవాడు వాడి బుద్ధికి అది అందించాడు. అట్లు అందించినప్పుడు వాడు తప్పు ద్రోవ పట్టాడు. దానివలన నీకు దేవుని జ్ఞానము అర్థముకాకుండా పోయింది, నీకు తప్పుగా అర్థమయ్యింది, నీ లోపల ఉండే అల్లాహ్ ఆ పని చేశాడు. నీకు అర్థము కాకూడదనే ఆ పని చేశాడు. నువ్వు అల్లాహ్ ను వేడుకో నాకు నిజమైన జ్ఞానాన్ని అందించు అని అందిస్తాడు. 99 మంది తాడుని పాము అనుకుంటే ఒక్కడు మాత్రము తాడును తాడు అనుకోవడము బుద్ధి ఇచ్చిన పని కాదా అట్ల ఆ రకముగనే, నీ బుద్ధికి ఆత్మ శక్తిని ఇచ్చి, దానికి ఒక నిర్ధారణ చేసేటటువంటి విచక్షణ కలుగజేస్తావుంది. అటువంటి ఆత్మ నీ శరీరములో ఉంది. నువ్వు ఆత్మను వేడుకో, అంటే ముస్లీమ్ భాషలో అల్లాహు వేడుకోండి.


సక్రమమైన జ్ఞానాన్ని నీకు అందిస్తాడు లేకపోతే తప్పు జ్ఞానాన్ని అందించి పక్కదారిలో పంపించేస్తాడు. అల్లాహ్ తప్పుదారిలో అయినా పంపిస్తాడు, సక్రమమైన దారిలో అయినా పంపిస్తాడు. అల్లాహ్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు. కాబట్టి చాలామందిని పక్క దారిలో పంపిస్తున్నాడు. తనకు ఇష్టము లేనటువంటి వాళ్ళని పక్కకి పంపించాడు అని అర్థము. తనకు ఇష్టమైన వారిని మాత్రము తన దగ్గరికి పిలుచుకొని నిజమైన జ్ఞానాన్ని అందిస్తున్నాడు. మీరు ధన్యులు. ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి


----


ముస్లీములుగానీ, క్రైస్తవులుగానీ, హిందువులుగానీ అందరూ ధన్యులే అని నేను చెప్పగలను. ఈ రకముగా మీకు ఒకే ఒక సూత్రము ప్రకారము మూడు గ్రంథాలు నేను అందించాను. నాకు ఖుర్ఆన్ మీద అసూయ అయితే హిందువులందరికీ ఖుర్ఆన్ ఎందుకు ఇస్తాను? హైదరాబాద్ నుంచి ఉచితముగ ఖుర్ఆన్ తెలుగు బుక్కులన్ని ఇప్పించుకొని వచ్చి ఇక్కడ వెయ్యిమందికి నేను దానము చేశాను. అట్లే 1000 మందికి బైబిలు కూడ ఉచితముగ ఇచ్చాను.


ప్రతి ఒక్కరి దగ్గర బైబిలు, భగవద్గీత, ఖుర్ఆన్ మూడు ఉండాలని. నాకు ముస్లీమ్ మతము మీద దురభిప్రాయము ఉంటే, ఖుర్ఆన్ గ్రంథము మీద దురభిప్రాయము ఉంటే హిందువులకును క్రైస్తవులకును నేను ఖుర్ఆన్ ఎందుకిస్తాను? ఖుర్ఆన్ మీద నాకు దురభిప్రాయము ఉందని, చెడుగా వ్రాశానని ప్రచారము చేస్తున్నారు కదా మీరు! చెడుగా వ్రాసిందైతే వజ్ర వాక్యాలు అన్న పేరు ఎందుకు పెడతాను చెప్పండి? దేవుడు వాళ్ళకు పెద్ద శిక్ష వేసాడు అని చెప్తున్నాము. అందుకే బైబిలులో ఒకచోట ఏమి చెప్పాడంటే మీకు రెండు యుగాల పర్యంతము శిక్ష పడుతుంది అని చెప్పాడు. ఒక యుగముగాదు, రెండు యుగాల పర్యంతము. ఈ యుగమందును రాబోవు యుగమందును అని చెప్పాడు. ఈ యుగమే కాకుండా మళ్ళ వచ్చే యుగములో కూడ మీరు శిక్షార్హులైతారు. అందువల్ల ఈ గ్రంథములో చెప్పిన మాటైనాగానీ, వేరే గ్రంథములో చెప్పిన అన్ని మాటలు ఒకటేగా ఉంటాయి కాబట్టి తప్పు భావముతో మాట్లాడితే మీరు నిజముగా శిక్షార్హులైతారు. మేమేదో గొప్ప పని చేస్తున్నాము, వేరే వాళ్ళను విమర్శిస్తున్నాము అని ఒకరిని విమర్శించాలన్న బుద్ధితో మీరు మాట్లాడితే దానిని చెడుగా లెక్కేసుకుంటాడు అల్లాహ్. చెడుగా లెక్కేసుకొని వ్రాసి

-


పెట్టుకుంటాడు. మిమ్ములను తప్పనిసరిగా తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో మీరు శిక్షార్హులౌతారు. తప్పకుండ శిక్ష అనుభవించాల్సిన పని వస్తుంది. మంచి జ్ఞానము అందించినా, చెడు జ్ఞానము అందించినా అల్లాహ్ నే అందియ్యాలి మాకు అని మేమనుకుంటున్నాము.


ఆయన మాకు మంచి జ్ఞానాన్నే అందిస్తున్నాడు. మూడు గ్రంథాలను సమన్వయము చేసి, ఏ వాక్యమయినా మూడు గ్రంథాల్లోనూ ఇట్లే ఉంది చూడు అని చూపిస్తున్నాడు. అదే మాకు గొప్పతనము, అదే మాకు సంతోషము, అదే మాకు లాభదాయకము. మీరు కూడ అదే ఉద్దేశ్యముతోనే మూడు గ్రంథాలు చదవండి. ఒక గ్రంథము పెద్ద, ఒక గ్రంథము చిన్న అని నేను చెప్పలేదు. మూడు గ్రంథాలు సమానమే అంటున్నాను. ఎందుకంటే అన్ని కలిసి ఒకే గ్రంథములోనివే ఇవి. కాకపోతే దానిని మూడు భాగాలుగా చింపుకొని చదువుకుంటున్నారని ఖుర్ఆన్లోనే 6-91లో చెప్పబడింది. కాబట్టి మీరు ఇప్పటినుంటి ఏ గ్రంథము చదివినాగానీ, అందులో ఉండే వాక్యము ఏ వాక్యమైనా గానీ, మిగతా రెండు గ్రంథాల్లో అన్వయింప చేసుకుంటే అది సరైన మార్గమైతుంది. నేను బైబిలు చదివినప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని చెప్పారో, అప్పుడే భగవద్గీతలోని 15వ అధ్యాయము 16, 17 శ్లోకాలలోని “క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు” అని చెప్పాము. అదే ఖుర్ఆన్లోకి పోతే 50-21 లో "తోలేవాడు, తోలబడేవాడు, సాక్షిగా ఉండేవాడు" అని చెప్పాను. మళ్ళీ మూడు వాక్యాలు ఒకేరూట్లో అన్వయించి చెప్పినాము కదా, ఒకే అర్థమని! ఆ రకముగ మీరు ప్రతి వాక్యాన్ని అర్థము చేసుకోగలిగితే నిజమైన జ్ఞానము మీకు అర్థమైతుంది. ఈ రోజు మీకు లలాజలము అనేది కొద్దిగా అర్థమై ఉంటుందనుకుంటాను. అది మీ శరీరములో ఉండేదే. మీ శరీరములో


----

ఉండే జ్ఞానాన్ని తెలియజేసేదానికే లాలాజలము అనేదాన్ని నోట్లో పుట్టించినాడు దేవుడు. కానీ శరీరములోనే ఎంతో జ్ఞానము ఉంది. అవన్ని నిదానముగ మనకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయన తెలియబరిచే కొద్ది మనకు తెలియబడతాయి. తర్వాత భవిష్యత్లో కూడ మంచి జ్ఞానాన్ని దేవుడు మనకు అందించాలని కోరుకుంటూ, ఈ సమావేశాన్ని ముగిస్తున్నాము.


తేది : 25.11.2015


ఈ రోజు మతాల గురించి మనోళ్ళు ముస్లీమ్, క్రిష్టియన్స్ చాలా చెప్పారు. ఇప్పుడు నేను కూడా అదే విషయమే చెప్పదల్చుకున్నాను. ఇప్పటికిప్పుడు ఈ విషయాన్ని సెలెక్ట్ చేసుకోలేదుకానీ, రెండు రోజుల ముందే ఈ విషయాన్ని చెప్పాలనే నిర్ణయానికి వచ్చాము. ఎందుకంటే సి.డి.లు తయారు చేసుకునేదానికి ముందే పేరు పెట్టుకోవాల్సిన పని వస్తావుంది. ఆ పేరు పెట్టుకోవడములో “మతద్వేషము” అని పేరు పెట్టాము. ఇపుడు మతద్వేషమును గురించి చెప్పడము జరుగుతుంది. ఎందుకంటే ఏ మతములో ఎంత మతద్వేషమున్నదో మనకు తెలిస్తే మరీ బాగుంటుందనే ఉద్దేశ్యముతో ఇది చెప్పడము జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య నేను చెప్పిన బోధలను కొంతమంది అపార్థం చేసుకొని వాళ్ళు మతద్వేషముతో నిందించడము కూడా జరిగిందన్నమాట. మీకు తెలుసు నేను ఎటువంటి బోధలు చెప్తున్నాననేది. ప్రపంచములో ఎవ్వరూ చెప్పనటువంటి విషయాలు ఇక్కడ తెలియబడుతున్నాయి. ఆ విషయాలు తెలిసినా కూడా కొంతమంది


---

అసూయతో మాట్లాడుతున్నారు. అందువలన ఒకాయన ఏమి చెప్పాడంటే దేవుడు భగవంతునిగా భూమి మీదకు రాకపోతే మీకు పాపము తక్కువ ఉండేది, నేను భూమి మీదకు వచ్చిన తరువాత మీకు పాపము ఎక్కువ అయింది అని చెప్పినాడంట. ఎందుకంటే భగవంతుని గురించి విరుద్ధముగా మాట్లాడుకుంటారు కదా! విరుద్ధముగా మాట్లాడుకున్నప్పుడు పాపము పెరుగుతుందిగాని తరగదు. కొంతమంది భగవంతుని (ఆయన) వలన

పాపము తరిగిపోయింది అంటున్నారు. జ్ఞానము తెలుసుకుంటే తరిగి పోతుంది, జ్ఞానము తెలుసుకోకుండా ఆయన గురించి అజ్ఞానముగా మాట్లాడితే పాపము పెరిగిపోతుంది, రెండూ ఉంటాయి. ఇప్పుడదే చెప్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానము శక్తివంతమైనది. అది అందరికీ తెలిసే రకంగానే ఉంది. ఇది ఒక మతానికి సంబంధించినది కాదు. మానవులందరికి సంబంధించినది.


పూర్వము సృష్టి ఆదిలో దేవుడు చెప్పినటువంటిది. అపుడు ఏ మతమని పేరు పెట్టి చెప్పలేదు. సర్వమానవులకు సంబంధించినటువంటి జ్ఞానము చెప్పబడింది, దానినే జపర అంటున్నాము. ఆ జ్ఞానము కొంత కాలము తరువాత మొట్టమొదట 5000 సం॥ పూర్వము గ్రంథముగా తయారయింది, అదే “భగవద్గీత”. ప్రపంచములో ప్రథమ దైవగ్రంథము అని ఏది పేరుగాంచింది అంటే అది భగవద్గీత. భగవద్గీత తరువాత 3000 సం||లకు ద్వితీయ దైవగ్రంథము వచ్చిందన్నమాట. తర్వాత 600 సం||లకు అంతిమ దైవగ్రంథము వచ్చింది. ఈ మూడు దైవగ్రంథాలే! ఈ మూడింటిలోనూ సంపూర్ణమైన జ్ఞానము ఉంది. కాని మనము వాటిలో తెలుసుకొనే విధానము మాత్రము తేడాలు తేడాలుగా ఉందన్నమాట. ఒకే గ్రంథాన్నే మూడు భాగాలుగా, మూడు కాగితాలుగా మీరు చించుకొని


---

చదువుతున్నారని ఖుర్ఆన్ దైవగ్రంథములో చెప్పబడింది. 'ఒకే గ్రంథమే’ అంటే అది ఏది? అని ప్రశ్నిస్తే మొట్టమొదట వచ్చినది భగవద్గీత అని చెప్పవచ్చును. ఆ ఒక్క గ్రంథమే మొదట మనకుండేది. 5000 సంవత్సరముల పూర్వము అది ఒకటే తయారైనది. ఆధ్యాత్మికమునకు సంబంధించిన గ్రంథము మొట్టమొదట తయారైనది భగవద్గీతే. అంతకు ముందు ఆధ్యాత్మికమునకు సంబంధించిన గ్రంథము లేదు, కానీ జ్ఞానము ఉండేది. ఇంతకుముందు మేము చెప్పాము. 'జబుర' అనేటటువంటి జ్ఞానము ఉండేదని. దానినే 'జపర' అనే జ్ఞానముతో పిలిచేవాళ్ళని. దాని తరువాత 'జబుర' అనే జ్ఞానముగా పలకబడినది అని. కొంత కాలము తరువాత అది మనకు గ్రంథరూపమైనప్పుడు అది భగవద్గీతగా పేరు పెట్టబడింది. ఆ భగవద్గీతగా మారినటువంటి గ్రంథాన్ని ఇతర దేశాలలో వేరే పేరుతో పిలుచుకున్నారు. భగవద్గీతను "తౌరాత్ గ్రంథము” అని పిలిచారన్న మాట. తౌరాత్ గ్రంథము అంటే ఏమి? ఇది చాలామందికి తెలియదుగానీ, తౌరాత్ గ్రంథము మాది అని చెప్పుకునే వాళ్లున్నారు. తౌరాత్ గ్రంథము అంటే దాన్ని ఎవరూ చూడలేదు, ఏ భాషలో వ్రాశారో వాళ్లకు తెలియదు, కానీ ముస్లీమ్లు ఇది మా గ్రంథము అంటున్నారు. దానిని ఎవరి గ్రంథమని వారు చెప్పుకున్నా ఫరవాలేదుగానీ, తౌరాత్ గ్రంథము అనేది భగవద్గీత.


భగవద్గీతలో ఉన్న విషయాలే మిగతా రెండు గ్రంథాల్లోనూ ఉన్నాయి అని మేము మొదటి నుండి చెబుతున్నాము. ఇక్కడ విషయమేమంటే ఒకే భగవద్గీతలోని జ్ఞానమే ప్రపంచమంతా వ్యాపించి, బైబిలు, ఖుర్ఆన్ అను రెండు గ్రంథాలుగా ఉంది. అందువలన మిగతా రెండు గ్రంథాల్లో చెప్పినది కూడా ఈ భగవద్గీత జ్ఞానమే! కానీ దాన్ని చీల్చుకొని మతాలుగా చెప్పుకున్నారు మిగతా వాళ్లంతా. ఆ మతాలుగా చెప్పుకునే దానివలన


---

ఏమైందంటే మా జ్ఞానము వేరు, మా జ్ఞానము వేరు అని, మా దేవుడు వేరు, మా దేవుడు వేరు అనే భావము వచ్చి మనుషుల్లో, వేరు వేరుగా దాన్ని చీల్చుకొని చెప్పుకుంటున్నారు. కానీ మేమేమి చెప్పుచున్నామంటే అటువంటి భావము ఇక్కడ ఉండకూడదు. దేవుడు మనుషులను తయారు చేశాడు. మనుషులందరికీ ఒకే తల ఇచ్చాడు. ఒకే బుద్ధి ఇచ్చినాడు. మన బుద్ధి ఎట్లా ఆలోచన చేస్తుందో మిగతా వాళ్ల తలల్లోని బుద్ధి కూడా అట్లే ఆలోచన చేస్తుంది. ఈ రకంగా సర్వమానవులూ సమానమైనటువంటి అవయవాలు కలిగివున్నారు. మొత్తము మీద, సర్వమానవులూ సమాన మైనటువంటి శరీర భాగాలతో జీవిస్తున్నారు. అందువలన అందరికీ సమానమైనటు వంటి జ్ఞానాన్నే దేవుడు చెప్పాడు. అటువంటపుడు మీరు దీనిని, చీల్చుకొని వేరు వేరు మతాలుగా చెప్పుకోవద్దండి అని చెప్పాను.అయినా చెప్పుకోవద్దంటే వినేవాళ్లు ఎవరూ లేరుగాని ఆటోమెటిక్ గా ముందే చెప్పబడివుంది, మా మతము అని ఒకరు, మా మతము అని ఒకరు ఈ రకంగా చెప్పుకుంటున్నారు



ఈ రోజు మానవులు 12 మతాలుగా చీలిపోయారు. అందులో ముఖ్యమైనవి మూడు మతాలుగా ఉన్నాయి. ఆదిలో నుండి సర్వ ప్రపంచమంతా ఇందుత్వము (హిందూమతము) ఒక్కటే ఉండేది అని చెప్పాము. కొన్ని వేల సంవత్సరాల పూర్వము, కొన్ని లక్షల సంవత్సరాల పూర్వము ఈ తెలుగు భాషే ప్రపంచమంతా వ్యాపించి ఉండేది అని కూడా చెప్పాము. దానికి ఆధారము కూడా చూపాము. చాలా సూచనలు కూడా చూపించాము. తెలుగు భాష ప్రపంచవ్యాప్తముగా ఉండేది అని, తరువాత మారిపోయిందని చెప్పాము . అంటే ఎట్ల మారిపోయిందో? కొంత సూచనలు కూడా చెప్పినాము. కానీ వాటిని పెడచెవిన పెట్టి ఇదంతా అసత్యము అని


----

అనుకునేవాళ్లూ ఉన్నారు. శాస్త్రబద్ధతతో కూడుకొని ఉండేదాన్ని మనము సత్యము అంటాము కానీ, శాస్త్రబద్దము కాని దానిని అసత్యము అంటాము. ఇపుడు సత్యము ఏది? అసత్యము ఏది? అని చూడాలంటే నీవు శాస్త్రాన్ని ఆధారము చేసుకొని చూస్తేనే సరిపోయేది లేకపోతే కాదు. 'శాస్త్రము' అంటే ఏది? దాన్ని 'గీటురాయి' అంటాము. అంటే బంగారు నగను ఏ రకంగా గీసి చూస్తామో రాయితో, అది బంగారు అని ఏరకంగా తెలుసుకోగల్గుతామో ఆ రకంగా ‘గీటురాయి’ అనేది మనకు ఒకటి ఉంది. అదే దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి జ్ఞానము. ఆ జ్ఞానము ద్వారా మనము చూస్తే ఏది సత్యము? ఏది అసత్యము? అని మనకు తెలుస్తుంది. ఆ లెక్కప్రకారము ఈ రోజు మూడు మతాలుగా చీలిపోయినటువంటి ఈ మానవ సమాజములో ద్వేషాలు ఎక్కువ అయిపోయినాయి. స్వమతము మీద అభిమానము ఎక్కువై పోయింది. పరమతము మీద అసూయ ఎక్కువ అయింది. ఈ రకంగా స్వమతము మీద అభిమానము ఉన్నా ఫరవాలేదు కానీ, పరమతం మీద ద్వేషము లేకపోతే బాగుంటుంది. అయినా అది ఎవ్వరిలోనూ అట్ల కన్పించలేదు. ఇపుడు ఉండేది మనకు మొత్తము ప్రపంచ వ్యాప్తంగా 12 మతాలైనా మిగతా తొమ్మిది మతాలు పెద్ద లెక్కలేనటువంటివి, చాలా చిన్న మతాలు, అవి గుర్తింపు లేనటువంటివిగా ఉన్నాయి. కొన్నిచోట్ల కొద్దిగా ఉన్నాయి అవి. కాని పెద్ద మతాలు మనకు మూడే మూడు. అవే హిందూ మతము, క్రైస్తవ మతము, తరువాత వచ్చిన ఇస్లామ్ మతము.


ఈ మూడు మతాల్లో జనసంఖ్య ఎక్కువ ఉంది. తరువాత జ్ఞానము కూడా దేవుడు చెప్పిన జ్ఞానమే ఉంది. మిగతా వాటిలో దేవుడు చెప్పిన జ్ఞానము లేదు. ఎందుకంటే ఒకే జ్ఞానమే మూడు భాగాలుగా చీలిపోయి, మూడు గ్రంథాలుగా ఉంది, కాబట్టి ఈ మూడు గ్రంథాలలో ఉండే జ్ఞానము


----

దేవుని జ్ఞానముగా మనము చెప్పుకుంటున్నాము. కాని ఇందులో కూడా కొంత కల్తీ ఏర్పడింది. భగవద్గీతలో కల్తీ ఏర్పడింది. మిగతా వాటిలో కూడా కల్తీ ఏర్పడింది. కొన్ని మనుషులు చెప్పిన జ్ఞానాలు కూడా గ్రంథ రూపములో వచ్చి కలిసిపోయినాయి. అంటే పొలములో ధాన్యము పండినపుడు స్వచ్ఛముగా పండుతుంది. అది ఇంటికి తెచ్చుకొనేలోపు కల్లములో దానిని తయారు చేసేటప్పుడు దాంట్లో కొంత రాళ్ళు, మన్ను ఇవన్ని కలిసిపోతాయి. ఇంటికి తెచ్చుకున్న తరువాత అవి కూడా తీసేసి, మనము వండుకొని తినాలిగాని, శుభ్రపరచకుండా వండుకొని తినేదానికి వీల్లేదు. దేవుడు చెప్పినది స్వచ్ఛమైన జ్ఞానమే అయినా అది గ్రంథ రూపమైనపుడు మనుషులే వ్రాస్తున్నారు కాబట్టి అందులో కొంత కాలుష్యము ఏర్పడింది. అది ఏది నిజమైన జ్ఞానము? ఏది నిజమైన జ్ఞానము కాదో తెలుసుకొని, అందులో నుండి మనము తెలుసుకోవాల్సిన విషయాలు తెల్సుకుంటే సరిపోతుంది. ఈ రకంగా మనము అందులో తెలుసుకుండే విషయాలు మాత్రమే గ్రహించుకొని, అవసరము లేని విషయాలు వదిలి పెట్టామనుకోండి అప్పుడు మనకు స్వచ్ఛమైన జ్ఞానము తెలుస్తుంది. అపుడు ఏ మతములో కూడా అసూయ అనేది ఉండదు. కానీ ఈ రోజు ఎక్కడ చూసినా హింసతో కూడుకొని ఉన్న అసూయలు చెలరేగిపోయినాయి.


ఇప్పుడు కొంతమంది హింసావాదులుగా తయారైపోయినారు, ఉగ్రవాదులుగా తయారైపోయినారు, ఒకరినొకరు హింసిస్తున్నారు. అంటే ఇదంతా ఎందుకొచ్చిందంటే, ఎక్కడ పుట్టింది ఈ రోగము? అంటే ఈ మతద్వేషము దగ్గరనే పుట్టింది. ‘ద్వేషము' అంటే 'అసూయ' అని అర్థము. 'అసూయ' అనేది మన శరీరములోని మన గుణాలలో ఒక భాగము. అంటే మన శరీరములోని తలలో గుణచక్రము ఉంది అని మనము


----

చెప్పుకున్నాము. ఆ గుణచక్రములో మొత్తము 12 గుణాలున్నాయి. అందులో 6 గుణాలు మంచివి, 6 గుణాలు చెడువి. ఆ చెడు గుణాలలో అసూయ ఒకటి. చెడు గుణములు ఆరు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అనేటువంటి ఆరు గుణాలున్నాయి. మొట్టమొదటిది కామము. 'కామము’ అంటే 'ఆశ' అని అర్థము. ఈ ఆశ అనే గుణము మొదటిది. తరువాత 'మత్సరము' అంటే 'అసూయ', ఈ అసూయ అనేది చివరిది. ఈ చెడు గుణాలలో ఏవి ఎక్కువ బలమైనటువంటివి? అంటే ఈ మధ్యలో నాలుగు గుణాలను వదిలి పెట్టేసి, ఇటుపక్క మొదటిది అటుపక్క చివరిది ఈ రెండు చాలా బలమైనటువంటివి. చివర్లో ఉండే అసూయ బలమైనదే, మొదట్లో ఉండేటటువంటి ఆశ బలమైనదే! ఎక్కడైనాగానీ ఈ రెండింటిలోనే చిక్కుకొని మనిషి బాధపడుతుంటాడు. ఆ విధానాల్లో ఆశ వదిలిపెడితే అసూయ ఉంటుంది. అసూయ వదిలిపెడితే ఆశ ఉంటుంది. మధ్యలో అప్పుడప్పుడు మిగతా నాలుగు గుణాలు పని చేస్తూ ఉంటాయి ఆశ, అసూయ రెండు మాత్రము మనిషికి ఎల్లప్పుడూ తగులుకొని ఉంటాయి. అంటే మతద్వేషము అన్నప్పుడు మత, అసూయ అనేది ఏర్పడుతుంది కదా! అపుడు ఈ ఆశకంటే ఇది మించిపోయి, ఇదేమి చేస్తుందంటే ఈ ద్వేషము కోపముగా మారేదానికి తయారైందన్నమాట. ఆశ తరువాత ఉన్నటువంటి క్రోధము అనేటువంటి గుణము ఉంది. ఆ క్రోధము అనే గుణముగా ఇది తయారైపోయి అంటే దాన్ని ఉత్తేజపరిచి మనుషుల్లో ఒక మనిషి మీద ఇంకొక మనిషికి కోపము తెప్పించి, దానిని ఎక్కువ చేసేదాని వలన, మనిషి పూర్తి హింసామార్గములోకి పోయి, ఆ కోపము చేత ఇంకొకనిని చంపేదానికి కూడా తయారవుతున్నాడు. ఇది మనకు శరీరములో ఉండేటటువంటి విధానము.


ఈ విధానము ప్రకారము అందరూ నడుచుకుంటున్నారు. గుణాల వలన ప్రతి మనిషి వాటి ప్రభావములో చిక్కుకొని, అవి ఆడించినట్టల్లా


---

ఆడుతున్నాడు. కాబట్టి ప్రతి మనిషిలోనూ మతద్వేషము చాలా ఉంది అని మనము చెప్పుకుంటున్నాము. ఈ మతద్వేషము తగ్గిపోవాలంటే ఏమి చేయాలి? నిజమైన జ్ఞానము మనిషికి అవసరము. నిజమైన జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? హిందువులకైతే భగవద్గీతలో దొరుకుతుంది. క్రైస్తవులకైతే బైబిల్లో దొరుకుతుంది. ముస్లీమ్లకైతే ఖురాన్లో గ్రంథములో దొరుకుతుంది. ఈ మూడు గ్రంథాలలోని విషయాలు ఒకదానికొకటి సమానమే అయినాగానీ, ఒకదానికొకటి ఒప్పుకుంటున్నా గానీ, మనిషి మా గ్రంథములో ఉండే విషయము వేరు అని అంటున్నాడు. దైవ జ్ఞానము మనిషికి అర్ధము కాని స్థితి ఏర్పడినప్పుడు ఒక విషయాన్ని ఇంకొక రకముగ అర్థము చేసుకుంటున్నాడు. అర్థము చేసుకొని ఇతను ఉంది అంటే అతను లేదు అంటాడు. అతను కాదు అంటే ఇతను అవును అంటున్నాడు. ఈ

రకంగా అభిప్రాయభేత్రాలు ఒకరికొకరికి ఏర్పడుతున్నాయి. ఇపుడు  భగవద్గీతను హిందువులు అనుసరించి ఏమి చెప్తున్నారు? పునర్జన్మలున్నాయి అంటున్నారు. అదే ఈ మిగతా రెండు గ్రంథాల్లో కూడా పునర్జన్మలున్నాయనే చెప్తున్నాయి, పునర్జన్మలు లేవని ఎక్కడా చెప్పలేదు.


భగవద్గీతలో ఒక్క చోట ‘జాతస్యహిద్రువో మృత్యువు' అని చెప్పాడు. 'పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు పుట్టక తప్పదు' అని దేవుడు భగవద్గీతలో చెప్పితే, మిగతాచోట్ల దాని ప్రస్తావన లేకుండా జ్ఞానమంతా ముందు ముందుకు పోయింది. చనిపోయినటువంటి వాడు తిరిగి పుడతాడు అనే విషయము ఖురాన్ గ్రంథములో దాదాపు ఇరవైచోట్ల చెప్పబడినది. అంటే ఇక్కడ భగవద్గీతలో ఒక్క చోట చెప్పిన జ్ఞానము ఖురాన్ గ్రంథములో చాలాచోట్ల చెప్పినాగానీ దానిని వాళ్ళు గుర్తించక జన్మలు లేవు అంటున్నారు. 'జన్మలు లేవు' అనేదానికి ఏదైనా ఆధారము ఉందా?


----

అంటే ఏమాత్రము ఆధారము లేదు. అయినాకానీ గ్రుడ్డిగా జన్మలు లేవు అంటున్నారు. మా గ్రంథములో ఈ రకంగా ఉంది కదా. మా గ్రంథము అని చెప్పుకున్నటువంటి మీ గ్రంథములో దేవుడు ఈ విధముగా చెప్పినాడు కదా! పునర్జన్మలున్నాయనే చెప్పినాడుగాని, లేవు అని ఏమి చెప్పలేదు కదా! 53వ సూరాలో 44, 45, 46, 47 వాక్యాల్లో ఏముంది? పునర్జన్మ ఉంది అని వరుసగా చెప్పినారు. చివరి వాక్యములో ఏమి చెప్పినాడు, వీర్యబిందువుతోనే మీకు తొలి జన్మ ఎట్ల ఉందో మలిజన్మ కూడా అట్లే ఉంది. వీర్యబిందువుతోనే నీ జన్మ మళ్ళీ తయారైవస్తుంది అని చెప్పినాడు కదా! దీనిప్రకారము "వీర్యబిందువుతో” మ "తల్లి గర్భములోనే నీవు పుడతావు” అని అర్థము.


ఈ రకముగా చెప్పినప్పటికీ కూడా పునర్జన్మ లేదు అని కొందరు అంటున్నారు. పునర్జన్మలు లేకపోతే చనిపోయిన వారు ఎక్కడికి పోతారు అని అడిగారు. మేము చనిపోయిన వాళ్ళంతా భూసమాధి చేయబడతారు. చనిపోయిన వాళ్ళంతా భూసమాధులలోనే ఉంటారు. సమాధులలో ఉండి ఉండి ఉండి చివరిలో ప్రళయము వచ్చినపుడు, దేవుడు వచ్చి వాళ్ళందరిని లేపి, వారు చేసుకున్న పాపపుణ్యాలకు శిక్ష వేస్తాడు. అపుడు వాళ్ళు స్వర్గానికి, నరకానికి పోతారు. ప్రళయము వచ్చేంతవరకు వీడు గుంతలోనే పడుకొని ఉంటాడు అని చెప్తున్నారు. ఇది ఒక విచిత్రమైనమాటగా మనకు కనిపించినాగానీ, అక్కడ అది ఏమాత్రము శాస్త్రబద్దమైనటువంటి మాటగా లేకున్నాగానీ, అది నమ్మశక్యముగ లేని మాటగా ఉన్నాగానీ వాళ్ళు దానినే నమ్ముతున్నారు. మరి ఎందుకు అట్ల జరుగుతుంది అంటే దేవుడు నేను ఎవరికి ఎంత జ్ఞానము ఇవ్వాలో అంతే ఇస్తాను. నాకు ఇష్టమైన వాళ్ళకే సంపూర్ణమైన జ్ఞానాన్నిస్తాను. జ్ఞానము సంపూర్ణముగా తెలియజేస్తాను అని


---

ఒకమాట చెప్పాడు. ఆ మాటప్రకారమే వాళ్ళకు ఆ విధముగా అర్థమైందేమో గాని మనకు మాత్రము జన్మలు ఉన్నాయనే అర్థమయ్యింది. జన్మలు లేవు అని ఎక్కడా దేవుడు చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఈ తౌరాత్ గ్రంథము అంటే భగవద్గీత గ్రంథములో ఉన్నటువంటి విషయాలనే ఇంజీల్ గ్రంథము ధృవీకరిస్తుంది అని ఖురాన్లో చెప్పినారు. ఇంజీల్ గ్రంథము అంటే బైబిలు. బైబిలు గ్రంథముగాని తరువాత వచ్చిన ఖురానుగానీ ఈ రెండు గ్రంథాలు తౌరాత్లో ఉండేటటువంటి విషయాలనే ధృవీకరించి చెప్పుతున్నాయి అని అన్నాడు.


ఖుర్ఆన్లో 5వ సూరాలో 46, 47, 48 వాక్యాలలో భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలనే నేను ధృవీకరిస్తున్నాను. అందులో ఉండేటటు వంటి జ్ఞానమే నిజమైన జ్ఞానమని నేను సాక్ష్యము చెప్తున్నాను అని కలదు. ఖురాన్ గ్రంథములో ఇప్పుడు చూసినాగాని ఆ వాక్యాలు అందులో ఉన్నాయి. అయినాగానీ ఆ గ్రంథము వేరు, ఈ గ్రంథము వేరు. అసలు దాంట్లో ఉండేదంతా జ్ఞానము కాదు. ఇది మాత్రమే జ్ఞానము అంటున్నారు కొంతమంది తెలియనటువంటి వాళ్ళు. అక్కడ చెప్పిన దేవుని వాక్యము ఏమి కావాలి? దేవుని వాక్యము ఉండేది సరే, ఈ రోజు ఈ తౌరాత్ గ్రంథము గొప్పది అని ఖురాన్ చెప్పినట్లు ఒప్పుకుంటే మేము ఇతర మతాన్ని ఒప్పుకున్నట్లు అవుతుంది కదా! ఆ మాటను అణచివేసి దానిని ఏమాత్రము ఎవ్వరికి తెలియకుండా చేసుకున్నారు. తెలియకుండా చేసిందే కాకుండా అసత్యమైనటువంటి జ్ఞానాన్ని ప్రచారము చేసుకుంటున్నారు. తరువాత నీకు ఈ జ్ఞానము తెలియదు వాస్తవముగా మాకు తెలిసిన జ్ఞానమే సత్యము అని కూడా అంటున్నారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే దేవుడు చెప్పిన వాక్యము ఎప్పటికి సత్యముగానే ఉంటుంది. కాని 'అసూయ' అనే గుణముతో


----

మీరు ఏమి చేస్తున్నారంటే ఆ దేవుని జ్ఞానాన్ని కూడా అణచివేసి, మూసిపెట్టి మీ స్వంత జ్ఞానాన్ని చెప్తున్నారు. భగవద్గీతను ఒప్పుకోకపోయినా ఫరవాలేదు గానీ, ఖురాన్ గ్రంథమును కూడా ఒప్పుకోకుండా మీరు తప్పుగా మాట్లాడడము జరుగుతావుంది. ఖుర్ఆన్లో చెప్పిన దానిని అణచివేసి, మూసిపెట్టి చెప్పడము జరుగుతావుంది.


ఖురాన్ గ్రంథములో ఒక ఆయత్ను ప్రజలకు తెలియకుండా చేస్తే, చాలా పాపములో పడిపోతాడు. వానికి నరకము తప్ప ఇంకొకటి ఏమీ ఉండదు అని దేవుడు ఖురాన్లో చెప్పినాడు. అల్లాహ్ చెప్పిన మాటంటే మీకు లెక్కలేదా? అల్లాహ్ చెప్పినమాట మాకు లెక్కేకానీ, మీకు చెప్పినట్లు మాకు చెప్పలేదు అని కొందరు అంటారు. పబ్లిక్గా ఇక్కడ ఫలానా సూరాలో, ఫలానా ఆయత్లో ఈ విషయము ఉంది కదా! అని అంటే, మీకట్లా అర్థమయ్యిందేమో మాకు అట్ల అర్థము కాలేదు అంటారన్నమాట. ఇట్లు మొండిగా వాదన చేసి కొంతమంది వాళ్ళ అజ్ఞానాన్నే సమర్థించుకుంటున్నారు తప్ప, జ్ఞానమార్గములోకి రావడము లేదు మేము ఒక్క మతాన్ని గురించే చెప్పలేదుగానీ, అన్ని మతాల్లోనూ ఇట్లే అజ్ఞానము ఉంది అని చెప్తున్నాము. జ్ఞానము తెలుసుకొంటే మానవుడు మానవునిగా బ్రతుకుతాడు లేకపోతే మనిషి రాక్షసిగా మారిపోతాడు, ఒకరినొకరు హింసించుకుంటారు, ఇది మంచిపద్ధతి కాదని మేము మొదటినుంచి చెప్తున్నాము. మేము నలభై సంవత్సరాల నుండి జ్ఞానము చెప్పినా అదే విషయాన్నే చెబుతున్నాము. మేము ఎంత చెప్పినా, మమ్మల్ని హీనముగా మాట్లాడే వ్యక్తులు తయారైనారు. ఎవరు ఏమి మాట్లాడినా మేము ఓర్చుకొని, ఓపిగ్గా జ్ఞానము చెప్తున్నాము, ఎందుకంటే మాకు తెలిసిన జ్ఞానము గొప్ప అని మనకు తెలుసు కదా! వాళ్ళకు తెలిసిన జ్ఞానము గొప్ప కాదని మాకు తెలిసినపుడు దానిని గురించి


----

వాళ్ళు ఏమంటే మనకేముంది? ఏమి అవసరము లేదు. మనశక్తి మనకుంది. మన జ్ఞానము మనకుంటుంది. నా జ్ఞానము నాకు గొప్పది కాబట్టి నేను నా గొప్పదనము నాకు తెలుసు కాబట్టి ధైర్యముగా ఈ జ్ఞానాన్ని చెప్పగల్గుతున్నాను. ఇంకా మిగతా జ్ఞానము తప్పు అని నాకు తెలుసు కావున అది తప్పు అని కూడా ధైర్యముగా చెప్తున్నాను.


మేము భగవద్గీతను వ్రాయడము జరిగింది. భగవద్గీతను పూర్వము ఎప్పుడో సృష్ఠి ఆదిలోనే దేవుడు చెప్తే, వ్యాస మహర్షి దానిని సంస్కృతములో, శ్లోకాల రూపములో వ్రాసిపోయినాడు. ఈ శ్లోకాల రూపములో వ్రాయకముందు, భగవద్గీతకంటే ముందు ఆయన 4 వేదాలు వ్రాశాడు, 18 పురాణాలను వ్రాశాడు. తరువాత ఈ భగవద్గీత తెలిసింది. అంటే కృష్ణుడు చెప్పిన భగవద్గీత ఆయనకు తెలిసింది. ఎందుకంటే ఆ కాలములో 4 వేదాలు, 18 పురాణాలు వ్రాసిన తరువాత కృష్ణుడు వచ్చి, ఇపుడు అజ్ఞానము పెరిగిపోయింది. అధర్మాలన్నీ పెరిగిపోయినాయి, ధర్మాలు లేకుండా పోయినాయి, నేను తెలియజేసే దానికోసము వచ్చాను. ధర్మ సంస్థాపన చేసేదానికి నేను వచ్చినాను అని చెప్పినాడు. అంటే నీవు మనిషివే కదయ్యా! అని అనుకుంటారేమో అని! ఆయన ఏమి చెప్పినాడంటే "నేను మనిషిని కాదు. నేను దేవుణ్ణి. ఈ సర్వప్రపంచానికి అధిపతిని. సర్వజీవరాశు లకు నేను ఈశ్వరుడినే" అయినా మానవశరీరము ధరించి వచ్చినాను. ఈ జ్ఞానము నాకే తెలుసు కాబట్టి నేనే ఈ విషయాన్ని చెప్పాల్సిన పని ఉంది. నేనే ధర్మసంస్థాపన చేయాలి. ధర్మస్థాపన ఎవ్వరికీ చేత కాదు. అందువల్ల నేను వచ్చాను అని భగవద్గీతలో స్పష్టముగా చెప్పాడు. నేను ఈ విధముగా వచ్చినాగాని, నన్నుగానీ, నా మహత్యాన్నిగానీ తెలుసు కోలేకుండా నన్ను అవమానముపాలు చేసేవాళ్లు కూడా ఉన్నారు అని చెప్పాడు.


----

ఆ రకముగా భగవద్గీతలో ఆయన చెప్పినట్లు మేము ఈ రోజు ఎంత జ్ఞానము చెప్పినా ప్రయోజనము లేదు. భగవంతున్నే అవమానము చేసినపుడు మనల్ని ఎందుకు విడిచిపెడతారు మనుషులు? వీళ్ళ గుణాలు వీళ్ళకు ఉంటాయి కదా! కాబట్టి మమ్ములను కూడా అజ్ఞాని, మూఢుడు, మూర్ఖుడు అని నానారకాల మాటలు మాట్లాడినారు! అయినా మేము దానికి ఏమి చలించలేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినంత మాత్రమున నేను అజ్ఞానిని కాను, మూర్ఖున్ని కాను, ఇంకొకటి కాను “నేను మాట్లాడిన మాటలు దేవతలందరూ ఆలకిస్తున్నారు, నేను మాట్లాడిన మాటలు గ్రహాలు ఆలకిస్తున్నాయి, నేను మాట్లాడిన మాటలు భూతాలు ఆలకిస్తున్నాయి, రోగాలు ఆలకిస్తున్నాయి'. ఇంకా ముఖ్యమైనటువంటి కనిపించని శక్తులన్నీ వింటున్నాయి. వీరి అందరికి నా జ్ఞానము ఇష్టమైనప్పుడు అజ్ఞానులు అనిన మాటలను నేనేందుకు లెక్కపెట్టుకోవాలి? ఆ రకంగా నా జ్ఞానము మంచిది కాదు అన్నంతమాత్రమున నష్టము లేదు. అది కూడా ఎవడన్నాడు? విలువైన మనిషా? విలువ కాని మనిషా? జ్ఞానియా? అజ్ఞానియా? అని మనము ఆలోచన చేయాలి కదా! ఏ జ్ఞానము తెలియనివాడు అంటే వాని మాటను లెక్కేసుకోవాల్సిన పని లేదు.


ఆ రోజు ఇటువంటిదే శ్రీరాముడు పొరపాటుపడినాడు, శ్రీరాముడు గొప్ప మహారాజు. ఆ రోజు పెళ్ళి, పేరంటం అన్నీ అయి భార్యను ఇంటికి తీసుకువచ్చిన తరువాత, ఎవరో తీసుకుపోయిన సీతను తెచ్చి వీడు పెట్టుకున్నాడని, ఎవడో ఒక అజ్ఞాని త్రాగినవాడు మాటలంటే, ఆ మాటలను లెక్కపెట్టుకొని ఈయన భార్యను అడవిలో వదిలి వచ్చాడు. భార్య అయిన సీతను అన్నోడు ఎటువంటివాడు, విలువైనోడా? జ్ఞానియా? అజ్ఞానియా? అని ఆలోచన చేయకుండ శ్రీరాముడు అక్కడ పొరపాటుపడినాడు, అది


----

అయిపోయింది. తర్వాత ఆయన సీత కొరకు బాధపడినాడు. చివరకు నిజము తెలుసుకొని ఆమెను పిలుచుకువచ్చేదానికి పోయినాడు. ఆ రోజు అడవికి పంపింది ఎందుకు? మళ్ళీ పోయి పిలుచుకొచ్చేది ఎందుకు? ఇటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి నన్ను గురించి ఎవడో అజ్ఞాని అంటే నేనెందుకు అజ్ఞాని అవుతాను. "నా దగ్గర జ్ఞానము ఉంది జ్ఞాన శక్తీ ఉంది”. నాకు ఎంత శక్తి ఉందో నాకు తెలుసు కాబట్టి వాళ్ళ మాటలు నేను లెక్కపెట్టు కోలేదు. “నా జ్ఞానము నేను చెప్తూనే ఉన్నాను”. కొంతమంది ఏమంటున్నారంటే హిందువులకేమో భగవద్గీత సరిగా రాదని, సరిగా తెలియలేదని, సరిగా అర్థము చెప్పుకోలేదని మీరు “త్రైత సిద్ధాంత భగవద్గీత” అని వ్రాశారు. తరువాత ముస్లీమ్లకేమో ఖురాన్ సరిగా అర్థము కాలేదని “అంతిమ దైవగ్రంథములో జ్ఞాన వాక్యములు” అని, “వజ్ర వాక్యములు” అని మీరు వాళ్ళ గ్రంథాన్ని కూడా వ్రాశారు. తరువాత క్రిస్టియన్స్కు కూడా మీరు జ్ఞానము చెప్పినారు. “రత్న వాక్యములు” అని గ్రంథము వ్రాశారు. మీరు జ్ఞానములో పొరపాటు పడినారు చూడు అని పాస్టర్లకు కూడా చెప్పారు మీరు. పాస్టర్లకు కూడా తప్పు అని మీరు చెప్తున్నారంటే, మీకు ఏమి తెలుసు? అని కొందరు అడిగినారు. మీకు తెలియంది నాకు తెలుసు

కాబట్టే నేను చెప్తున్నాను అని చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏమిచెప్పినారంటే నీకంటే సరిగా చదువురాదు, ఒక శ్లోకము చదివేది రాదు, ఒక వాక్యము చెప్పేది రాదు, ఒకవేళ చెప్పినా, నీవు బుక్ చూసి చదువుతావు, చదివినాగాని దాంట్లో రెండు,మూడు తప్పులుంటాయి మేము పండితులము, మేము ప్రతి శ్లోకానికి అర్థము చెబుతాము, మేము చూడకుండా శ్లోకాలను చదువుతాము. ప్రతి అక్షరానికి కూడా అర్థము చెబుతాము, మాకు మీరు తెలియదంటారా? అని అంటున్నారు.


---

వాస్తవమే నాకు భాష తెలియదు, పాండిత్యము తెలియదు గానీ భావము మాత్రము బాగా తెలుసు, అయితే మీరు చెప్పేది ఒప్పో, తప్పో మాత్రము నాకు తెలుసు అని చెప్పాము. నాకు భాష అవసరము లేదు. నేను మాట్లాడేది తప్పులే మాట్లాడతా ఉంటాము. ఇంతకుముందు మీటింగులో ఇక్కడ మాట్లాడినారు, కొంతమంది ఎంతో స్వచ్ఛముగా మాట్లాడినారు, భాషను బాగా ఉచ్ఛరించినారుకానీ అటువంటి భాష నాకు రాదు. అటువంటి స్వచ్ఛతా నా భాషలో ఉండదు. నా మాటల్లో ఆకర్షించుకునేటువంటి పదములు ఉండవు, కానీ చెప్పే విషయము మాత్రము సత్యముగా ఉంటుంది, నూటికి నూరుపాళ్ళు సత్యముగా ఉంటుంది. "మీకు తెలియని రహస్యమంతా నాకు తెలుసు. కాబట్టి నేను చెప్పేటివన్నీ రహస్యాలే” అని చెప్పేశాము. శాస్త్రబద్ధముగా నేను చెప్పేటివన్నీ రహస్యాలే “ఎవరూ ప్రపంచములో చెప్పని విషయాలే ఉన్నాయి” ఇంతవరకు వ్రాసిన గ్రంథాలన్నీ అట్లే ఉన్నాయి. ఈ మధ్యలో మీకు తొందర తొందరగా గ్రంథాలను కూడా ఇస్తున్నాము. ప్రతి గ్రంథములోనూ ఏదో ఒక కొత్తదనము ఉంది. ఇంత కొత్తదనము పెట్టుకొని, ఇంత జ్ఞానము పెట్టుకొని, ఎవరో మీకు జ్ఞానము తెలియదు అంటే నేనెందుకు ఉలిక్కిపడాలి?


కాబట్టి నా పని నేను చేసుకొంటూ పోతున్నాను. నేనేమి చెప్తున్నా నంటే ఈ మతాలలో ద్వేషము ఇప్పటికే ఎక్కువ అయిపోయింది. ఇది మంచి పద్దతి కాదు. ఇది వినాశనానికే దారి తీస్తుందికానీ, మంచికి దారి తీయదు అని చెప్తున్నాము. ఇప్పుడు విదేశాల్లో జరుగుతుందంతా అదే కదా! మొన్న ఉగ్రవాదులు ఈ దేశము మీద దాడి చేశారు. కొంతమందిని చంపేసినారు. మాకు చంపేదే వృత్తి అని అనుకుంటున్నారు. వాళ్ళు చంపి మూట కట్టుకునేదేముంది? పాపము తప్ప ఇంకొకటి ఏమీ లేదు.


---

వారు సాధించేది ఏమి లేదు. ఈ రకంగా వాళ్ళు తయారైపోయినారు. వాళ్ళ మనసులో ఏముందో ఏమో గానీ, వారు పూర్తి అజ్ఞానములో నిండి పోయి, ఆ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అయితే మేము చెప్పే జ్ఞానమంతా స్వచ్చముగా ఉంటుంది. అసూయ అనేది ఏమాత్రము ఉండదు. అసూయతో కూడుకున్నటువంటి జ్ఞానము ఇక్కడ ఉండదు. మేము అందరికి సమన్వయము చేసి చెప్తున్నాము. మా జ్ఞానము మీకెట్లా తెలుసు? అంటున్నారు కొందరు. దానికి జవాబుగా నీ జ్ఞానమూ, నా జ్ఞానమూ అనేది ఇంకొకటి లేదు, ఉండే జ్ఞానమంతా ఒకటే! పూర్వము సృష్ఠి ఆదిలో ఆకాశవాణి ద్వారా దేవుడు ఒకే జ్ఞానము చెప్పినాడు. ఆ జ్ఞానము సూర్యునికి తెలియబడింది. సూర్యుడు తర్వాత భూమి మీద ప్రజలకు చెప్పాడు. ఈ రోజుకు మనవరకు దేవుని జ్ఞానము చేరింది అని చెప్పాము. అంటే కృష్ణుడు భగవద్గీత చెప్పిన రోజు ఏమి చెప్పినాడో? ఇప్పుడు అదే నీకు నేను చెప్తున్నాను. ఈ జ్ఞానము ఇప్పుడు నేను చెప్పేది కాదు. ఇది పూర్వము సృష్ఠి ఆదిలోనే ఇప్పుడు చెప్పినదే కాకుండా అప్పుడే నేను చెప్పినాను అన్నాడు శ్రీకృష్ణుడు. ఈ జ్ఞానము సూర్యునికి కృష్ణుడు చెప్పగా, సూర్యుడు మనువుకి చెప్పినాడు. మనువు ఇక్ష్వాకునికి చెప్పినాడు. ఇక్ష్వాకుడు ఇంకొక రాజుకు చెప్పినాడు. ఆ రాజు ఇంకొక రాజుకు చెప్పినాడు. ఇట్లా ఒకరికొకరు పరంపరగా తెలుస్తూ పోయి చివరకు అందరికి తెలిసింది. చివరకు ఇప్పుడు అది కూడా భూమి మీద లేకుండా పోయి నేడు పూర్తి అజ్ఞానము మిగిలి పోయింది. అధర్మాలు మిగిలిపోయినాయి. అన్నీ అధర్మాలు అయి

పోయినాయి.


వ్యాసుడు గీతను వ్రాయకముందు పురాణాలను, వేదాలను వ్రాశాడు. ఈ రోజు వేదాలు గొప్పవని మనము అనుకుంటున్నాము కదా!


----

మళ్లీ వేదాలను వ్యాసుడు వ్రాసినపుడే అధర్మాలు చెలరేగి పోయినాయని భగవంతుడు తన గీతలో చెప్పినాడు. అక్కడ వేదాలను దేవుడు ఒప్పుకోలేదు, కృష్ణుడు మనిషి, కృష్ణుడుగా వచ్చినవాడు దేవుడు. ఆ దేవుడు వేదాలను ఒప్పుకోలేదు. పురాణాలను ఒప్పుకోలేదు. అది జ్ఞానము కాదు అని చెప్పినాడు. నా జ్ఞానము కాదు అని చెప్పడమే కాకుండా ఒకచోట భగవద్గీత యందు "విశ్వరూప సందర్శన యోగము” లో “నన్ను తెలుసుకునేదానికి ఇవేమి పనికి రావు” అన్నాడు. యజ్ఞాలుగానీ, వేదాలుగానీ, దానాలుగానీ, తర్వాత మీరు చేసేటి మెడిటేషన్లు (తపస్సులు), ఏవి కూడా పనికి రావు అని చెప్పాడు. ఏవైతే నన్ను తెలుసుకునే దానికి శక్యము కాదు అని దేవుడు చెప్పినాడో, వాటినే మనము ఆచరిస్తున్నాము. స్వామీజీలంతా దాన్నే చెప్తున్నారు. ఇవే మనకు పెద్ద ఆరాధనలని అందరూ వాటినే ఆచరిస్తున్నారు. యజ్ఞములు, వేదములు, తపస్సులు చెప్పినాడు కదా! అంటే దానికి మాకు అజ్ఞానాన్ని బోధిస్తున్నారు మీరు. దేవుడు చెప్పినాడని మీరు ఈ మాటలు చెప్తున్నారు. పెద్దపెద్ద స్వామీజీలంతా యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద స్వామీజీలంతా మన గ్రంథాలు వేదాలు అని చెప్తున్నారు. మీరేమో భగవద్గీత అని చెప్తున్నారు. వాళ్ళు వేదాలు అని చెప్తుంటే వేదాలు కాదు అని మీరు భగవద్గీత చెప్తున్నారని నన్ను ప్రశ్నించుచున్నారు. దానికి నేను జవాబుగా వ్యాసుడు ఉన్న రోజే, కృష్ణుడు అధర్మాలు చెలరేగిపోయినాయి, ధర్మాలు తెలియకుండా పోయినాయి. వాటిని తెలియజేప్పేదానికే నేను వచ్చానని చెప్పి అధర్మాలయిన వాటి ద్వారా దేవుడు తెలియబడడు అని చెప్పాడు.

అందరూ వాటినే ఆచరిస్తున్నారు.


దానికి కొందరు ఇప్పుడు వేదాలను మీరు ఖండిస్తున్నారే, కాదంటున్నారే మీది జ్ఞానమా? మీరు హిందువులేనా? అని కొంతమంది


---

హిందువులు మమ్మల్ని దూషించి ప్రశ్నిస్తున్నారు. దానికి నేను హిందువై, హిందూ జ్ఞానము చెబుతున్నాను. భగవద్గీతలోని జ్ఞానము చెప్తున్నాను. కృష్ణుడు చెప్పిన జ్ఞానాన్ని చెప్తున్నాను. కాబట్టి నేను స్వచ్ఛమైన జ్ఞానినై, స్వచ్ఛమైన ఇందువును (హిందువును) దానివలన నా దగ్గర శక్తి ఉంది. తపస్సులు, యజ్ఞాలు చేసేవాళ్ళ దగ్గర, వేదాలు చదివేవాళ్ల దగ్గర ఏ శక్తి అయిన ఉందా? "మీ దగ్గర లేని శక్తులన్నీ నా దగ్గర ఉన్నాయి”, ఎందుకున్నాయి? నేను స్వచ్ఛమైన జ్ఞానములో ఉన్నాను. ఏమి చెప్పినా స్వచ్ఛమైన జ్ఞానమే! అయినందున దానికి శక్తి ఉంది. నేను చెప్పేది ఏ మతములోనైనా దేవుని జ్ఞానము చెప్తున్నాను. నాకు భగవద్గీత తెలుసు కాబట్టి మిగతా మతాల్లో ఉండే జ్ఞానమంతా నాకు తెలిసినట్టే. ఎందుకంటే భగవద్గీతలో ఉండేదే వాటిలో ఉంది. కాబట్టి బైబిల్గానీ, ఖురాన్గానీ నాకు చాలా సులభము. వాటిలో ముస్లీమ్లకు, క్రైస్తవులకు తెలియని రహస్యాలన్నీ నాకు తెలుసు, కాబట్టి వాటిని సులభముగా నేను వ్రాయగలి గాను, సులభముగా చెప్పగలిగినాను. దానికి మీరు చెప్పిన దాంట్లో జ్ఞానము ఉందని నిరూపణ ఏమి? అని కొంతమంది నాకు ప్రశ్న వేసినారు. అప్పుడు నా గ్రంథాలను ముట్టుకొని చూడు తెలుస్తుంది. ఎవనికైనాగానీ శరీర బాధలు ఉంటే ఆ కర్మలను కాల్చివేసే శక్తిగా ఈ గ్రంథాలున్నాయి అని నేను చెప్పాను. మీ హిందూమతములో ఉండే గ్రంథాల్లో మీరు మంత్రించి ఏదో చేసి పెట్టినారు. అక్కడ ఏమి చేసినారో ఏమోగానీ భగవద్గీతగాని, ఏ గ్రంథమైనా గానీ, మీరు వ్రాసిన గ్రంథములన్ని మనుషులను అతుక్కుంటున్నాయి. వాళ్ళల్లో ఉండేటువంటి బాధలను తీసి వేసేంతవరకు లాగినా బయటకు రావడము లేదు అని కొంతమంది అంటున్నారు. నేను ఇందు (హిందు) మతములో ఉండే గ్రంథాలకే శక్తి ఉంది అని చెప్పలేదు.


----

మేము అన్ని మతాల్లో ఉండేటటువంటి దైవజ్ఞానానికి దైవశక్తి ఉంది అని చెప్పాము. మేము ఏ గ్రంథము వ్రాసినా దానిలో స్వచ్ఛమైన జ్ఞానము ఉంటుంది. దానిలో శక్తి ఉంటుంది అని చెప్పాము. ఆ విధముగనే మేము ముస్లీమ్లకు సంబంధించిన గ్రంథములు రెండు, మూడు వ్రాశాము. ఆ ముస్లీమ్లకు సంబంధించిన గ్రంథాలు కూడా ఇతర మనుషులకు అతుక్కున్నాయి. అంటే ముస్లీమ్ల గ్రంథాలు ఏవి కూడా ఇంతవరకు మనుషులను అతుక్కున్నటువంటి దాఖలాలు ఎక్కడా కన్పించలేదు. కానీ ఇక్కడ అవి అతుక్కున్నాయి కాబట్టి అందరికీ ఆశ్చర్యముగా ఉంది. ఆశ్చర్యముగా ఉండవలసిన పని ఏమి లేదు. శక్తి మీలో కూడా ఉంది. మీరు అధైర్యపడుతున్నారు. మా దగ్గర శక్తి లేదేమో అని మీరనుకుంటున్నారు. కానీ మీ దగ్గర కూడా ఆ శక్తి ఉంది. నా జ్ఞానము వ్రాసిన ఆ గ్రంథములలో ఆ శక్తి ఉంటే, నా జ్ఞానము తెలుసుకున్న మీ తలల్లో ఎంత శక్తి ఉండాలో ఆలోచించండి. కాని మీకు అది తెలియలేదు. అందుకే ఈ మధ్యన ఒకాయన కడుపునొప్పితో బాధపడుతూ నా దగ్గరకు వచ్చాడు అప్పుడు ఆయనతో ఇలా చెప్పాను. “నీవు నా జ్ఞానాన్ని కొంతవరకు విన్నావు. కొంతవరకు చదువుకున్నావు. కొంతవరకు తెలుసుకున్నావు. ఈ జ్ఞానము నీ బుర్రలోకి ఎక్కింది. ఈ జ్ఞానము అగ్నితో సమానమని భగవద్గీతలో చెప్పారు. సర్వకర్మలను కాల్చేటువంటి శక్తి దానికి ఉంది అని కూడా చెప్పారు. ఆ శక్తి ఉన్నప్పుడు మీరు ఎందుకు దానిని ఉపయోగించుకోలేదని” అడిగినాము. దానికి ఆయన “మా దగ్గర ఏమి శక్తి ఉంది?” అని అడిగాడు. అప్పుడు నీ చేతి వ్రేలిని తీసి నీ కడుపు మీద పెట్టుకో, ఏమౌతుందో చూడు అని చెప్పాము.


ఆయన చేయి తీసి ఆయన కడుపు మీద పెట్టుకున్న క్షణమే వెంటనే కడుపునొప్పి లేకుండా పోవడము జరిగింది. ఆయన ఏ అనామకుడో,


---

ఒకవేళ మొరటు మనిషో, తెలివి తక్కువ మనిషో, చదువురాని మనిషో, ఏదో పొరపాటు పడిపోయి అలా అన్నాడా? అట్లు ఏమీ లేదు. ఆయన చదువుకున్న వ్యక్తి, పెద్ద ఉద్యోగము చేసే వ్యక్తి, ఒక హైస్కూల్లో హెడ్మాస్టర్గా ఉండే వ్యక్తి, హిందూ సమాజములో R.S.S లో ముఖ్యమైన పాత్ర పోషించే వ్యక్తి, ఆయనేమి తప్పు చెప్పడు కదా! ఈ జ్ఞానము మీకు అర్థమయింది కదయ్యా అని అడిగితే అర్థమైందని చెప్పాడాయన. “నా వరకు రావలసిన పని లేదు. నా జ్ఞానానికి వారసత్వముగా మీరంతా ఉండాలి. నా జ్ఞానము ఎవరైతే తెలుసుకున్నారో వాళ్లందరికీ ఇటువంటి శక్తి ఉంటుంది, నా జ్ఞానము ఎక్కడైతే వ్రాసినారో ఆ గ్రంథాలకంతా శక్తి ఉంది” మళ్ళ ముస్లీమ్ గ్రంథము కూడా ఒకటి “అంతిమ దైవగ్రంథములో వజ్రవాక్యాలు” అనే ఒక గ్రంథము ఇక్కడి నుంచి పోయింది. ఆ గ్రంథమును తలనొప్పి ఉండేవానికి పెట్టుకుంటే తలకు అతుక్కుంది. దానిని చూచి ముస్లీమ్లకు ఆశ్చర్యము అయ్యింది. ఖురాను గ్రంథము అతుక్కుంది. వేరే గ్రంథాలను తెచ్చిపెడితే అవి అతుక్కోలేదు. దానికి దీనికి ఏమి తేడా? అంటే ఇందులో జ్ఞానశక్తి ఉంది. అక్కడ వ్రాసిన విధానము ఆత్మకు సంబంధించిన విధానము కాదు. ప్రకృతికి సంబంధించిన విధానము ఉంది. కాబట్టి అక్కడ ఆత్మ శక్తి లేకుండా పోయింది. ఇక్కడ అంతా ఆత్మశక్తితో కూడుకున్న జ్ఞానము ఉంది, ఇది స్వచ్ఛమైనటువంటి జ్ఞానముగా ఉంది. కావున గ్రంథాలలో శక్తి ఉంది. ఇప్పుడు మతద్వేష విషయమును చూస్తే ప్రతి మతములోనూ ఉంది. హిందువులను చూస్తే క్రైస్తవులకు సరిపోదు. క్రైస్తవులను చూస్తే హిందువులకు సరిపోదు. ఇంకొకరిని చూస్తే ముస్లీమ్లకు సరిపోదు.


ఈ రకంగా ప్రతిమతము మనుషులు దురభిప్రాయముతోనే ఉన్నారు. మా మతాన్ని పెంచుకోవాలని అందరూ అనుకుంటున్నారు.


---

ఇతరుల మతము పెరిగిపోతుందని అసూయ పడుతున్నారు. హిందువులని మీరు చెప్పుకుంటున్నారు కదా! మీరు హిందువులైన దానివలన మీకు కూడా ఈ ద్వేషము అనేది ఉంటుంది కదా! మతద్వేషము అనగా ఇతర మతస్థులను ద్వేషించేది, మీకు స్వమతము మీద అభిమానము ఉంటుంది కదా! అని అడిగారు. నాకు అది లేకనే హిందువులంతా నా మీదకు కొట్లాటకు వస్తున్నారయ్యా ఇపుడు, చాలామంది నాతో కొట్లాడినారు. నన్ను నీవు హిందువే కాదన్నారు. కానీ నేను హిందువును అయ్యిండేది లేనిది దేవుడికి తెలుసు. కానీ నేను మాత్రము ఎవరు తప్పు చేసినా వాళ్లలో ఉండే తప్పును ఎత్తి చూపి, ఇది మంచిది కాదు అని, సక్రమమైన మార్గములో నడవండి అని చెప్తున్నాను, నేను ఏ మతాన్ని ప్రోత్సహించలేదు. ఏ మతాన్ని ద్వేషించలేదు. ఏ మతములోకి చేరండి అని చెప్పలేదు. ఒక మతాన్ని విడిచిపెట్టమని చెప్పలేదు. నీవు ఏ మతస్థుడివైనా ఆ మతములోనే ఉండు, ఆ మతములో ఉండే జ్ఞానాన్నే తెలుసుకో, దేవుని జ్ఞానాన్ని నీవు పొందు అని చెప్తున్నాముగానీ, నేను హిందువుగా పుట్టాను. అయితే నా మతము వైపు రమ్మని నేను చెప్పలేదు. ఈ రోజు ఈ జ్ఞానానికి ఆకర్షితులైనవారంతా, ఎవరి మతములో వారు ఉండి, ఈ జ్ఞానము వైపు వస్తున్నారు, మూడు మతములవారు నా జ్ఞానాన్ని పొగుడుతున్నారు. ఈ రోజు క్రైస్తవులు వాళ్ల మతగురువులైనటువంటి పాస్టర్లను వ్యతిరేఖిస్తున్నారు. మీరు చెప్పిన జ్ఞానము సరైనది కాదు, ఇప్పుడు మాకు తెలిసిన జ్ఞానము సరైనదని వాళ్ళు ధిక్కరిస్తున్నారు. ఇప్పుడు "మతధిక్కారము కాదు సత్యగ్రహితము” అనే ఒక గ్రంథము వచ్చింది చూడండి. అది ఒక క్రైస్తవుడు వ్రాసినటువంటి గ్రంథము, అంటే మన జ్ఞానాన్ని గొప్పగా చెప్తూ, వాళ్ల జ్ఞానములో ఉన్నటు వంటి పాస్టర్లను ఫాదర్లనూ తప్పుగా ఉన్నారు అంటున్నారు. మరియు


----

అక్రమాలు చేస్తున్నారని చెప్పి వ్రాశారు. వాళ్ళు చెప్పినది సత్యమేగాని, మతాన్ని ధిక్కరించినట్లు కాదు అని చెప్పాము. ఈ విధముగా ప్రతి మతములోను సత్యాన్ని వాళ్ళు తెలుసుకొని బాగుపడుతున్నారు తప్ప, ఇంకొకటి ఏమీ లేదు. ఇక్కడ మతాల మార్పిడి అనేది ఏమీ లేదు. మతద్వేషమంటూ ఏమీ లేదు. అన్ని మతాలకు సంబంధించిన సమన్వయము ఇక్కడ ఉంటుంది.


ఒకవేళ ఎవరికైనా జ్ఞానములో తెలియని విషయము ఉంటే ఇక్కడ మేము చెప్తుంటాము. నేను ఏది చెప్పినా శాస్త్రబద్దముగా చెప్తున్నాను. మీ తలలో గుణాలున్నాయి. నా తలలో కూడా గుణాలున్నాయి. వాటిలో అసూయ అనే ఒక గుణము ఒకటి ఉంది. అది అందరిని పట్టుకుని పీడిస్తుంది. నన్ను కూడా పీడించేదానికి మొదలు పెడుతుందికానీ, “నాకు మీకు ఉండే ప్రత్యేకత ఏమి అంటే మీకు ఎయిడ్స్ రోగము అంటుకుంటుంది, అది బాధిస్తుంది. నేను చెప్పితే అది మిమ్మల్ని వదిలి పెట్టి పోతుంది. నా మాట వినేటటువంటి విధానము నా వద్ద ఉంది" మీకు రోగాలు రాలేదా అంటే వచ్చినాయి కానీ “నన్ను గౌరవిస్తూ వచ్చినాయి” మిమ్మల్ని గౌరవించ లేదు. హింసిస్తూ వచ్చినాయి. మిమ్మల్ని బాధపెడుతూ వచ్చినాయి. నాకు ఇంతకుముందు ఒక ఐదారేళ్ళ కిందట అనుకుంటా బహుశా, ప్రతి ఒక్కరు ఇబ్బందిపడినారు కీళ్ళ నొప్పులు వచ్చి, చాలామంది ఇబ్బందిపడినపుడు చూస్తూనే ఉన్నాము అపుడు. నాకు కూడా ఒకరోజు నైటు మెడల నొప్పులు వచ్చినాయి అంటే నాకు వచ్చిందనుకున్నామది. మళ్ళీ ఉదయము లేస్తానే పోయింది. అది ఎందుకు వచ్చి పోయిందంటే నేను పాద నమస్కారము చేసుకుని పోతున్నాను అని చెప్పిపోయినట్లుంది. అది వచ్చినపుడు మనకు గుర్తుగా తెలియాలి కదా! అందువలన కొద్దిసేపు కాళ్ళు నొప్పించాయి.


---

పెద్ద పెద్ద రోగాలు మిగతా వాళ్ళను హింసించి నన్ను ఎందుకు హింసించలేదు. అంటే మీకు ఉన్నటువంటి అసూయ నా దగ్గర లేదు, మీకు లేనటువంటి జ్ఞానము నా దగ్గర ఉంది అని చెప్పుచున్నాము. దేవుడు చెప్పిన జ్ఞానములో స్థూలజ్ఞానము, సూక్ష్మజ్ఞానము అని రెండు రకములు ఉన్నాయి. ముఖ్యముగా సూక్ష్మజ్ఞానము అందరికీ తెలియని దానివలన వారిని రోగములు హింసించుచున్నాయి. సూక్ష్మ విషయములను (జ్ఞానమును) తెలుసుకునేదానికి మీరు ప్రయత్నము చేస్తేగాని నిజ భావము అర్థము కాదు అని చెప్పారు. అందువలన మీకు ఈ సూక్ష్మాలు చాలామందికి అర్థము కాలేదు. ఇంకా ఏమి చెప్పుచున్నామంటే ప్రపంచవిషయమే మీకు అర్థము కాలేదు, ఈ జ్ఞాన విషయము ఎట్లు అర్థమైతాది? ఇది సూక్ష్మముతో కూడుకున్నటువంటి జ్ఞానము. ఇది కనిపించనటువంటి జ్ఞానము. కనిపించని శక్తితో కూడుకున్నటువంటి జ్ఞానము. ప్రపంచ విషయమే మీకు అర్థము కానప్పుడు ఇది ఎట్ల అర్థమౌతుంది? అని మేము అంటే దానికి జవాబుగా ప్రపంచ విషయము మాకెందుకు అర్థము కాలేదయ్యా! ప్రపంచ విషయము మాకు ఎక్కువగా తెలుసు అని మీరు అనుకోవచ్చు. అయినా మీకు ఒక కథ చెప్తాను చూడండి. ఎంతమటుకు మీకు జ్ఞానము ఉందో అని చూచుకోవచ్చు, ఇప్పుడు ప్రపంచ విషయమే చెప్తాము చూడండి అని చెప్పాము. ఏమని చెప్పామంటే! ఓ పల్లెటూరులో ఏమి తప్పు జరిగినాగానీ వాళ్ళు కోర్టుకు పోయేవాళ్ళు కాదు. ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి ఉండేవాడు. ఆ పెద్ద మనిషి దగ్గరికి పోయి పరిష్కారము చేసుకొనే వాళ్ళు, ఏ సమస్య వచ్చినాగానీ. చిన్న సమస్యగానీ, పెద్ద సమస్యగానీ, ఏ దానికి బయటికి పోయేవాళ్ళు కాదు. కోర్టు వ్యవహారాలకు పోయేవాళ్ళు కాదు. మరియు పోలీస్ స్టేషన్లకు కూడ పోయేవాళ్ళు కాదు. చాలా వరకు ఆ ఊర్లో


----

ఎటువంటి సమస్య తలెత్తేదే కాదు. ఒక సమస్య తలెత్తిందనుకోండి. ఆ ఊరి పెద్ద దగ్గరకు పోతే ఒక రోజు రెండు రోజుల్లోనే ఆ సమస్యను తెంచేసి, ఇది న్యాయము ఇది అన్యాయము అని చెప్పేవాడు. ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు కాబట్టి అందరికి ఆమోదయోగ్యముగా ఉండేది ఆ తీర్పు. అందరూ దానిని ఒప్పుకునే వాళ్ళు, ఆయన ఎట్లు చెప్పితే అట్లు నడుచుకునేవాళ్ళు. సరే, ఒకానొక రోజు ఆ ఊర్లోనే కాకుండా చుట్టు ప్రక్కల ప్రజలు కూడా న్యాయము చెప్పే వ్యక్తి దగ్గరకు వచ్చి న్యాయా

న్యాయాలు కోరేవారు. అపుడు వాళ్ళ విషయాలన్నీ ఈయన పరిష్కారము చేసి చెప్పేవాడు. ఆ చెప్పిన విషయాలన్నీ కూడా బాగా వాళ్ళకు అర్థమయ్యేవి.


అట్లే తప్పు, ఒప్పులు అర్థమయ్యేటివి. ఆయన చెప్పిన శిక్షగానీ, తర్వాత ఏదైనాగానీ వాళ్ళు అమలు పరుచుకునేవాళ్ళు. ప్రక్క ఊర్లో ఒకాయన ఒకరోజు ఈ ఊరికి రావడం జరిగింది. ఎందుకంటే ఆ ఊర్లో ఏ సమస్యలు లేవు. ఏమివున్న పరిష్కారము అవుతున్నాయి అని చెపుతున్నాము కదా! ఆ ఊర్లోకి ప్రక్క ఊరు నుంచి ఒక వ్యక్తి బంధువుల ఇంటికి రావడము జరిగింది. ఆ బంధువుల ఇంటికి వచ్చినపుడు ఆయన ఒక కోతిని వెంట పెట్టుకొని వచ్చినాడు. చిన్నపిల్లప్పటి నుండి ఆ కోతిని పెంచేవాడు. మూడు సంవత్సరాలు పెంచినదానివలన మంచి అనుబంధము ఏర్పడింది ఆ కోతికి. ఆ వ్యక్తిని విడిచిపెట్టి ఆ కోతి ఉండలేదు, ఆ కోతిని విడిచిపెట్టి ఈయనా ఉండలేడు. అటువంటప్పుడు వేరే ఊరికి తప్పనిసరి ప్రయాణము చేయాల్సి వచ్చినప్పుడు కోతిని కూడా వెంట తీసుకొని వచ్చాడాయన. అలవాటు అయింది కాబట్టి కోతి కూడా వెంట వచ్చేసింది. ఊరు మధ్యలోకి వచ్చిన తరువాత ఆ ఊర్లో కుక్కలుంటాయి కదా! ఆ కోతిని చూసి కుక్క మొరిగింది. ఒక కుక్కకు కోతి భయపడి ఈయన భుజం మీదకు ఎక్కింది. తర్వాత


----

కుక్క కోతిని కరిచేలాగ దూరము నుండి పరుగెత్తుకు వచ్చింది. కోతి భుజము మీద ఉంది, దానిని ఆ కుక్క ఏమీ అనలేదు. కోతిని బెదిరించే నిమిత్తము కుక్క పరిగెత్తుతూ వస్తే, ఈయన నా కోతిని ఈ కుక్క కరుస్తుంది అనే భయముతో కట్టెతో కుక్కను కొట్టాడు. అప్పుడు కుక్కకు కాలు విరిగిపోయింది. ఆ కుక్క యజమాని అదంతా దూరము నుండి చూసినాడు. అన్యాయముగా నా కుక్క కాలును విరగ్గొట్టినావు కదయ్యా! అని అడిగితే దానికి నా కోతి మీదకు వచ్చింటే నేను కొట్టినా అన్నాడు. సరే ఇది ఒక తగాదాగా సమస్య ఏర్పడింది.


ఈ సమస్యను ఆ ఊరి పెద్ద దగ్గరకు తీసుకొని పోయినారు. నా కుక్క కాలు విరగ గొట్టినాడని వీడంటే, నా కోతిని కరిచేదానికి వచ్చింది అని ఆయన అంటాడు. ఈ రకంగా ఆ పెద్ద మనిషి దగ్గరకు పోతే చిన్నసమస్యలు పెద్ద సమస్యలకు అన్నిటికి పరిష్కారము చెప్తున్నాడు. అపుడు పెద్ద మనిషి ఆ విషయాన్ని అంతా విని, సరే నీవు నీ కోతి దగ్గరకు కుక్క పరిగెత్తుతా వచ్చింది అంటున్నావు. మొరిగింది అంటున్నావు వాస్తవమే. కానీ అది కోతిని చూసి కుక్కలు మొరగడము సహజమే, అది మొరిగింది. దాని తరువాత పరిగెత్తి వచ్చిన దానివలన నీవు అది కరుస్తుందేమో అని నీవు దానిని కొట్టినావు, కానీ కొట్టకుండా ఊరికినే బెదిరించినాగాని అది వెనక్కి పోయేది కదా. నీ భుజము మీద ఉన్న కోతిని కరవలేదు కదా! నీవు దానిని కొట్టిన దానివలన కాలు విరిగిపోయింది, ఒక రకంగా నీది అన్యాయమే అని చెప్పాడు. వాస్తవముగా అతనిది అన్యాయమే, ఎందుకంటే ఆయన కట్టెను తీసుకుని బెదిరించినా అది వెళ్ళి పోయేది. ఆయనను కాదని భుజము మీదకి ఎక్కి ఉన్న కోతినేమి కరవలేదు కదా! కోతి యజమాని కుక్కేలే అని కొట్టినాడు. దాని కాలు విరిగిపోయింది కుక్క యజమాని


----

వచ్చి పట్టుకున్నదాని వలన అది కేసు అయింది. ఆ పెద్దాయన (తీర్పు చెప్పేవాడు) కోతి యజమానికి నీవు కొట్టినేది తప్పే. కుక్క మొరిగినట్లు నీవు కూడా గట్టిగా అరిచింటే అది పోయుండేది కదా! అంతమాత్రము దానికి నీవు మళ్ళీ కొట్టడము ఎందుకు? నీది తప్పే కదా! ఈ తప్పుకు జరిగిన శిక్షకు ఈ కుక్కను తీసుకొని పోయి దాని కాలు బాగయ్యేంతవరకు నీ సంరక్షణలోనే పెట్టుకొని, మంచి ఆహారము పెట్టి, కాలు అంతా బాగై నడిచేంతవరకూ నీవు పోషించి అంతా బాగైనప్పుడు వీళ్ళ ఇంటికి పంపివ్వు అని చెప్పినాడు. అప్పుడు ఆ కుక్కను తీసుకునిపోయి కట్టుకట్టించి ఓ మూడు నెలలు నయమైపోయేంత వరకు పెట్టుకుని, కాలు నయమైపోయిన తరువాత దాన్ని తీసుకుని వచ్చి వాళ్ళ యజమానికి అప్పజెప్పి పోయాడు.


సరే ఇది జరిగిన తరువాత ఒక నెలకు ఇంకొక సంఘటన జరిగింది అదే ఊర్లోనే! ఏమి జరిగిందంటే ఒక డాక్టర్ దగ్గరకు మందులకని పేషెంట్లు పోయేవాళ్ళు. ఒక గర్భిణి మనిషి డాక్టర్ దగ్గరికి పోయింది. పోతే ఆ డాక్టర్ ఇంజెక్షన్ చేసినాడు. అయినా ఆమెకు రోగము పోలేదు అంటే జ్వరము పోలేదుగానీ ఆయమ్మకుండే కడుపు పోయింది. అపుడు వాళ్ళు ఏమి చెప్పినారంటే నాకు ఉండే కడుపు పోయింది. జ్వరము వచ్చింది అని నేనొస్తే, నీవు ఇంజెక్షన్ వేస్తే నా కడుపుపోయింది అని డాక్టర్ మీద తప్పు పట్టినారు. ఆ తప్పును ఆ గ్రామ పెద్ద దగ్గరకు తీసుకొని పోయినారు. నాకు జ్వరము వచ్చిందని పోతే ఈయన ఇంజెక్షన్ వేసి నాకు ఉండే 3 నెలల కడుపును పోగొట్టినాడు. ఇప్పుడు మీరు న్యాయము చెప్పండి అని అన్నారు. గ్రామ పెద్ద మంచి పేరు తెచ్చుకున్నాడు, ఆ గ్రామ పెద్ద సక్రమమైన న్యాయము చెప్తారని, ఎవ్వరికీ ఏ అన్యాయము చెప్పడని. అట్లే నాకు న్యాయము చేస్తాడులే అని ఈయమ్మ పోయింది. ఏ ఉద్దేశ్యముతో


----

పోయిందో అంతో ఇంతో డబ్బులు ఇప్పిస్తారని పోయిందో, ఏదో ఒక ఆశ పెట్టుకొని పోయింది. చెప్పాలి కదా! గ్రామ పెద్ద ఇద్దరికి సమానముగా న్యాయము

అన్ని ఆలోచన చేసి గ్రామ పెద్ద ఏమి చెప్పినాడంటే "నేనింతకు ముందు కుక్కకు కాలు విరిగింటే, నీవు కాలు బాగు అయ్యేంతవరకు నీ దగ్గర పెట్టుకొని పంపివ్వు అని తీర్పు చెప్పినా గదా! అట్లగనే ఈయమ్మను తీసుకొని మీ ఇంట్లో పెట్టుకొని, 3 నెలలు నిండు మనిషి అయిన తర్వాత పంపివ్వు” అన్నాడు. గ్రామ పెద్ద ఆ మాట చెప్పితే అందరికి సరిపోలేదది. కుక్కనంటే కాలు బాగు చేసి పంపించినాడు. ఈమెను తీసుకొని పోయి డాక్టర్ ఎట్లు కడుపు చేస్తాడు అని కోపము వచ్చింది వీళ్ళకు. 3 నెలలుగానీ, 4 నెలలుగానీ, 6 నెలలు గానీ అని చెప్పినాడు. ఇంక పెద్ద మనిషి చెప్పినట్లు వినాల్సిందే కదా! అట్లే కానీలే అని డాక్టరు ఒప్పుకున్నాడు. అంటే ఈ ప్రక్కన ప్రజలు ఏమి చెప్పినారంటే ఇదేం తీర్పయ్యా! నీవేదో బాగా న్యాయము చెప్తావని ఇక్కడికి వస్తే నీ న్యాయము ఏమి న్యాయము.  కుక్కకంటె కాలు సరిచేసి పంపివ్వమని చెప్పినావు సరిపోయింది. ఈ

ఆడోళ్ళను తీసుకొని పోయి కడుపు చేసి పంపివ్వమని చెప్పడము ఏమి బాగుంటుంది అని చాలా అన్యాయమైన మాట అని కోపముతో అన్నారు. ఊళ్ళో వాళ్ళంతా తిరగబడినారు. నీవు పెద్ద మనిషివి అని నీ దగ్గరకు వస్తే ఈయమ్మను తీసుకొని పోయి నీ దగ్గర పెట్టుకోమని చెప్తావా? నీకు బుద్ధి ఉందా అని తిట్టినారు. అప్పుడు ఆ పెద్ద మనిషి ఏమి చెప్పినాడంటే "నేనేమో వాని కుక్కకు న్యాయము చెప్పినపుడేమో కరెక్టుగా న్యాయము చేసినాడని నన్ను బాగా పొగిడినారు. ఇప్పుడు ఈయమ్మకు న్యాయము చెప్పితే నన్నెందుకు తిడుతున్నారయ్యా” అని అడిగినాడు. అప్పుడు “తిట్టక


----

ఏమి చేస్తామయ్యా, నీవు ఈయమ్మను తీసుకొని పోయి కడుపు వచ్చేంతవరకు పెట్టుకోపో మీ ఇంట్లో అంటే ఎట్లని అసలుకు? లోకము ఒప్పుకుంటుందా” అని వీళ్ళు అడిగినారు. లోకము ఒప్పుకోకపోవడమేమి? నేను చెప్పినేది ఏమి? ఆయమ్మను తీసుకొని పోయి నేను ఇంట్లోనే పెట్టుకోమనే చెప్పినాను. సరే పెట్టుకొని కడుపు వచ్చిన తర్వాత పంపివ్వమని చెప్పినాను. అందులో తప్పేముంది అని అడిగి ఆయన కథ చెప్పినాడు.


ఇంతకు ముందు సావిత్రి పురాణమని ఒకటి ఉన్నది. ఆ సావిత్రి పురాణములో సావిత్రి భర్త ప్రాణమును యమధర్మరాజు తీసుకొని పోయేటప్పుడు సావిత్రి వెంటపడింది. సావిత్రి వెంటపడితే నేను పో నీ భర్త ప్రాణము ఇవ్వను అని మరీ మరీ యమధర్మరాజు చెప్పాడు. ఈయమ్మ మరీ మరీ వెంటపడి చివరకు ఏమి చేసిందంటే, మా అత్త, మామ గుద్దోళ్ళు, వాళ్ళకు కళ్ళన్నా ఇవ్వు అని అడిగితే, సరే ఇస్తా పో అని చెప్పి ఇచ్చేసినాడు. కళ్ళచూపు ఇచ్చినాడని ఒప్పుకుందిగానీ, ఆమె మళ్ళీ ఆశపడి వెంటపడింది. మళ్ళీ ఏమి వెంటపడినావు అంటే నా మొగుని ప్రాణము కావాలి అని అడిగితే అట్లు ఎట్లు అవుతుంది. నీ మొగుడి ప్రాణము తప్ప నీవు ఏమన్నా కోరుకో అని అడిగినాడు. అప్పుడు ఆమె నాకు సంతతి కావాలని అడిగింది. అలాగే అట్లే కానీపో అని చెప్పినాడాయన. చెప్తే ఆమె ఏమని ప్రశ్నించిందంటే నాకు సంతతి కావాలంటే నా మొగుడు ఉండాలి కదా! అని అడిగితే యమధర్మరాజు పొరపాటుపడినానని చెప్పి మళ్ళీ భర్తను వెనక్కి పంపించినాడు. ఆమెకు సంతతి కావాలంటే భర్త కావాలి కదా! అందుకని వెనక్కి పంపించినాడు కదా!


ఇపుడు ఈ కథ అంతా అందరికి అర్థమయింది కదా! అట్లే ఇక్కడెందుకు అర్థము కాలేదు. ఈయమ్మను తీసుకొని పోయి, కడుపు


---

వచ్చేంతవరకు నీ ఇంటి దగ్గర పెట్టుకో అంటే భర్తను కూడా పిలుచుకొని పొమ్మనేగా అర్థము, భర్తను కూడా పిల్చుకొని పోయి, ఇద్దరిని పెట్టుకొని, ఆయమ్మకు భర్త ద్వారా కడుపు వచ్చేంత వరకు ఇద్దరినీ నీవే పోషించి, ఇంటికి పంపివ్వమని చెప్పినా. నేను న్యాయమే చెప్పినా కదా! మీరెందుకు ఇట్లా అర్థము చేసుకున్నారు అని అడిగినాడు. అంటే అక్కడ చెప్పినేది ఒకటైతే వీళ్ళకు అర్థమైంది మరొకటి. అదేవిధముగా దేవుడు మనకు ఒక జ్ఞానము చెప్పింటే మనకు ఇంకొక రకంగా డాక్టర్నే ఆయమ్మకు కడుపు చేయమని చెప్పినట్లు అర్థము చేసుకున్నారు. ఇట్లు ప్రపంచ విషయాలే మీకు అర్థము కాలేదు. అప్పుడు కుక్క కాలు ఒకటే విరిగిపోయింది కాబట్టి దానికి యజమాని అవసరము లేదు. కుక్క కాలు నీవైనా బాగు చేయవచ్చు. ఇపుడు ఈయమ్మకు కడుపు రావాలంటే భర్త తప్పనిసరిగా ఉండాల్సిందే, కాబట్టి నీవు భర్తతో సహా పిలుచుకొని పొమ్మని నేను చెప్పినాను. ఆయమ్మను ఒక దానినే పిలుచుకొని పొమ్మని నేను చెప్పలేదు కదా! అన్నాడు.


ఈ రకముగా తీర్పు చెప్పితే వాళ్ళు వేరొక రకముగా అనుకున్నారు కదా! ఇట్ల మనుషులు ప్రపంచ విషయాలు కూడా అర్థము కాని స్థితిలో ఉన్నారు, అంటే వాళ్ళ తలలు అట్ల ఉన్నాయి. అట్లున్నప్పుడు ఎన్నో సూక్ష్మాలతో కూడుకొని ఉన్నటువంటి దేవుని జ్ఞానము ఎట్లా అర్థమవుతుంది? అర్థము కాక ఇబ్బంది పడిపోయి నేను ఒకటి చెప్పితే నీవు మరొకటి అనుకోవడము జరుగుతుంది. ఈ రకంగా వేరు వేరు భావాల్లో ఉండిపోయిన దానివల్ల మనుషుల్లో అభిప్రాయబేధాలు వచ్చాయి. ఎప్పుడైతే అభిప్రాయ బేధాలు వచ్చినాయో అక్కడనే అసూయలు పుట్టినాయి. ఎప్పుడైతే అసూయ వలన క్రోధము వచ్చిందో అది పెరిగిపోయి చివరకు హింస వరకు పోతుంది. హింస ఎప్పుడైతే మొదలైందో ఎక్కడా ఏదీ మిగలదు.


----

ఈ ప్రొద్దు ఈ ప్రక్క ఇద్దరు చచ్చిపోతే ఆ ప్రక్క ముగ్గురు చచ్చిపోతే మళ్ళీ ఆ ప్రక్క ఇద్దరు చనిపోతే ఉండే వాళ్ళంతా లేకుండా పోతారు చివరకు. హింసకు అంతు అనేది ఉండదు. కొంతమంది మాతో ఏమన్నారంటే, మిమ్మల్ని హిట్లిస్ట్లో పెట్టుకున్నాము. మిమ్మల్ని చంపేస్తాము అని బెదిరించినారు. ఆ..! సరే మంచిదే అని చెప్పినాము మేము. అంటే మంచిదే కదా! ఇప్పుడు లేనిపోని తిప్పలుపడి ఏదో ఒక రోగము వచ్చి, మంచాన పడి చచ్చిపోయే దానికంటే ఒక్కసారి చచ్చిపోయేది మంచిదే కదా! అనుకొంటే ఇంకొకటి ఉంది. దేవుడు నాకు తెలియకుండా ఏమీ జరగదు అని చెప్పినాడు. మళ్ళీ దేవునికి తెలియకుండా ఏది జరగదు కదా!


“రేపు ఈ పని చేస్తానని చెప్పవద్దురా, నీ చేత కాదు” అని చెప్పినాడు ఖురాన్ గ్రంథములో. నేను చేపిస్తేనే అది నీ చేతనైతాది. నీవే సొంతము ఏదీ చేయలేవు అని దేవుడు అంటున్నాడు. దీనినిబట్టి రేపు ఈ పని నేను చేస్తాను అని చెప్పడము పొరపాటే కదా! చిన్న పనిని కూడా చేస్తానని ఒప్పుకోవద్దు అని చెప్పినపుడు, ఒకేసారి చంపుతాను అంటే అది పెద్దపని అవుతుంది కదా! మరి నువ్వు ఎట్లా చంపుతావు. దేవుడు ఒప్పుకుంటేనే కదా! చావాల్సింది. దేవుడు ఒప్పుకుంటేనే వాడు చస్తాడు. మనిషి ఏమి చేస్తున్నాడంటే నేను చేస్తాను, నాకు చేతనైతుంది ఏదైనా అని అనుకుంటున్నాడు తప్ప, “నేను చేయలేను” దేవుడయిన ఆత్మే చేస్తుందని అనుకోవడము లేదు. మిమ్మల్ని హిట్లిస్ట్ పెట్టుకున్నాము అంటే హిట్లిస్ట్లో కాకపోతే ఏ లిస్ట్లోనైనా పెట్టుకో పో! మాకు ముందే ఒక లిస్ట్ తయారైంది. అదే కర్మ అనే లిస్ట్. ఆ లిస్ట్ ప్రకారము జరుగుతుంది. నీకు కూడా అదే లిస్ట్ ఉంటుంది. నీ లిస్ట్లో ఎట్టుంటే అట్లే నీకు జరుగుతుంది. నా లిస్ట్లో ఎట్లుంటే నాకు అట్లే జరుగుతుంది. నీవు నా పేరు హిట్లిస్ట్ల


----

వ్రాసుకున్నా సరిపోదు, నీవు వ్రాసుకోకపోయినా ఏది ఎట్ల జరుగవలయునో అట్లే జరుగుతుంది.


ఇంతకు ముందు భగవద్గీత వ్రాసినపుడు కర్మయోగములో ‘35’వ శ్లోకములో ఒకమాట వ్రాసినాను. నన్ను చంపుతామని చాలామంది బెదిరించారు. ఇంక వారము రోజులే నీకు టైమ్ అని చెప్పినారు. సరేలే, అట్లే కానీలే, మరీ మంచిదిలే అని చెప్పినాము. వారము రోజుల్లో వాళ్ళే చనిపోయారు. నేను మిగిలి పోయాను. మళ్ళీ అట్ల జరిగింది. అట్ల దేవుడు ఎవరిని చంపుతాడో, ఎవరిని మిగిలిస్తాడో మనకేమీ తెలియదు. ఇప్పటికి కూడా నాకు ఎటువంటి భయము లేదు. ఎందుకంటే “నా చావు నా చేతిలోనేవుంది, ఎవరి చేతిలోనూ లేదు మీ చావు వేరేవాళ్ళ చేతిలో ఉంటుందేమోగాని ‘నా చావు నా చేతిలో ఉంది. ఎందుకంటే 'నా జ్ఞాపకము నా మనస్సుకు ఉంటుంది. నాకు జ్ఞాపకము లేకుండా పోతే కదా! నేను చచ్చిపోయేది. చావు అంటే మరుపు వస్తేనే చావు. జ్ఞాపకము ఉంటే చావు ఎప్పటికీ రాదు. అందువలన నాకు మతికి లేకుండాపోతే చచ్చిపోతా, మతికి ఉన్నప్పుడు నేను చచ్చిపోయేదానికి అవకాశము లేదు. 'నా చావు నా చేతిలో ఉంది’ మీరు చంపినాగాని చచ్చిపోయేదానికి అవకాశము లేదు. అది ముందే దేవుడు వ్రాసి పెట్టి ఉంటాడు. దాని ప్రకారమే జరుగుతుంది. ఈ విధముగా చెప్పుకుంటూ పోతే, మనిషికి ధైర్యము అనేది తప్పనిసరిగా అవసరము, అదే స్వధర్మము అని భగవద్గీత కర్మయోగములో చెప్పినారు. 'ధైర్యము లేకపోతే ఏమి ప్రయోజనము లేదు' అని ఇంతకు ముందు కూడా చెప్పాము. జ్ఞాన విషయాల్లో మరీ ధైర్యముగా ఉండాలి.


ఇప్పుడు మాకు ఆ ధైర్యము లేకపోతే హిందూ (ఇందూ) జ్ఞానాన్ని హిందువులకు (ఇందువులకు) కూడా చెప్పలేము. కొంతమంది ఇందూ


----

ధర్మ విషయములో తప్పుచేస్తే మేము వారిని దండించుచున్నాము. దానికి వాళ్ళు మీరు హిందువులేనా? 'ఇందువు' అని పేరు పెట్టినారు, హిందువులై ఉండి మీరు అసలుకు మతాని పేరే మార్చినారు. మీరు హిందువులు కాదు కొత్త మతాన్ని ప్రచారము చేస్తున్నారు అని కొంతమంది మమ్మల్ని అంటున్నారు. ఈ మధ్యకాలములో ఒక న్యూస్ వచ్చింది. మధ్యప్రదేశ్లో గౌర్ అనే వ్యక్తి సమాచార శాఖకు ఒక లెటర్ వ్రాసినాడు. హిందువు అనేదానికి నిర్వచనము (అర్థము) ఉందా? అని లెటర్లో అడిగాడు. దానికి కేంద్ర ప్రభుత్వము హోంశాఖ 'హిందూ' అనే పదానికి నిర్వచనము లేదు అని ఒప్పుకున్నారు. అయితే మా దేశములో ఇంతమంది హిందువులున్నారని మీరెట్లు చెప్పగల్గుతున్నారు? ఆ హిందూ అనే పదాన్ని ఎట్లు వాడుతున్నారు? అని గౌర్ ప్రశ్నించాడు. దానికి కేంద్ర ప్రభుత్వము హోంశాఖే జవాబు ఇవ్వలేక ఈ పదానికి నిర్వచనము లేదు అని ఒప్పుకుంది. ఈ విషయము ఈ మధ్యన సాక్షి పేపర్లో వచ్చింది, ఆ న్యూస్పేపరులో అచ్చువేయబడిన దానిని దాంట్లో అది మీరు చదువుకోవచ్చు.


మనిషిలో మతద్వేషము పెరిగినంత కాలము దేవున్ని తెలుసుకొనే దానికి అవకాశము లేదు, ఎందుకంటే మతద్వేషము అనేది చీకటి లాంటిది. మతమును గురించి దేవుడు ఎక్కడా చెప్పలేదు. జ్ఞానాన్ని గూర్చి చెప్పినాడు. మీరు మతాన్ని పట్టుకుంటే జ్ఞానము తెలియదు. జ్ఞానాన్ని పట్టుకుంటే మీకు మతము వదిలి పెట్టాల్సిన పని వస్తుంది. మీరు మతాన్ని పట్టుకున్నారు కాబట్టి మీరు ఎప్పటికీ ముందుకు పోలేరు. నీవు నీ మతమును చెప్పుకొన్నా, ఇతర మతాల మీద ద్వేషము పెంచుకోవద్దు, నీవు మతములో ఉన్నా నీ మతములో ఉండే జ్ఞానాన్ని తెలుసుకో. నీవు హిందువు అయితే హిందువులకు ఒక జ్ఞానము ఉంది, భగవద్గీత అను దైవగ్రంథము ఉంది, దాంట్లోని


----

విషయాలను నీవు తెలుసుకొంటే నీవు స్వచ్ఛమైన హిందువు అయితావు లేకపోతే ఇందువు కానే కావు నీవు. పేరుకు హిందువైనాగాని ఇందూధర్మాలు నీలో లేనట్లే. ఏమాత్రము హిందూ ధర్మము తెలియని వాళ్ళు ఈ రోజు మేము హిందువులము అని చెప్పుకుంటున్నారు. మీరు హిందువులము అనుకొనే దానికంటే ధర్మము తెలిసి నేను హిందువు అని ధైర్యముగా చెప్పొచ్చు కదా! ధైర్యముగా పదిమందికి చెప్పవచ్చు ఎంతమందికైనా చెప్పవచ్చు కాని దేవుని విషయాన్ని మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. దేవుని విషయమంతా శరీరము బయట లేదు, దేవుని విషయమంతా శరీరము లోపలే ఉంది. శరీరము లోపల అందరికి సమానముగా దేవుడు


ఆ విధముగా నీవు మేము దేవుని దృష్టిలో సమానులము. దేవునికి మేమందరము సమానముగా ఉన్నాము అని ఎపుడైతే తెలుసుకోగలవో అప్పుడు మతద్వేషము పోతుంది, ఒకరికొకరు మీరు ఆప్యాయముగా చూసు కోగల్గుతారు, ఇతర దైవగ్రంథములో ఉన్న విషయాలు చూస్తూనే సంతోష పడతారు. నేను హిందువునయినా నాకు ఈ రోజు ఆ బైబిలు గ్రంథములో ఉండే వాక్యాలు చూస్తే ఎంతో సంతోషము. అట్లే ఖురాను గ్రంథములో ఉండే ఆయతులు చూస్తే కూడా చాలా సంతోషము. ఎందుకంటే మా ఇందువు జ్ఞానము అందులో ఉంది అని చెప్తున్నాను. ఈ రోజు అదే విషయమే ఒక గోడ మీద వ్రాశాము. భగవద్గీతను ఖురాన్ గ్రంథము సమర్థిస్తుంది. ఫలానా సూరాలో ఫలానా ఆయత్లో ఈ విధముగా వ్రాశారు చూడండి అంటే ఈ భగవద్గీతను ప్రశంసిస్తూ ఫలానా ఖురాన్ గ్రంథములో ఈ విధముగా ఉంది అని మేము వ్రాస్తే, హిందువులలో అజ్ఞానులుగా ఉన్నవారు ఆ వాక్యమును కొట్టేసినారు. ఆ వాక్యము హిందువులకు ఎందుకు అర్థము కాలేదు? భగవద్గీతను ఖుర్ఆన్ గొప్పగా చెప్పితే హిందువులు


----

కొట్టేసినారు. తరువాత ముస్లీమ్లు ఏమని వచ్చినారంటే మా తౌరాత్ గ్రంథాన్ని మీరు భగవద్గీతగా ఎట్ల పోల్చినారని వాళ్ళు ప్రశ్నిస్తు వచ్చినారు. హిందువులేమో ఇట్ల మాట్లాడతారు. ముస్లీమ్హమో అట్ల మాట్లాడతారు. ఇద్దరు అజ్ఞానులు ఉన్నారని తెలియుచున్నది.


కాబట్టి ఎవ్వరికీ జ్ఞానము అర్థము కాలేదు. అజ్ఞానము తీసివేసుకొని చూస్తే సరైన జ్ఞానము మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే సరైన జ్ఞానము మనకు తెలుస్తుందో అప్పుడు కర్మలు కాలిపోయే శక్తి మీకు వస్తుంది. ఎప్పుడైతే కర్మలు కాలిపోయే శక్తి మీకు వస్తుందో అపుడు నిజమైన జ్ఞానము మీకు తెలిసినట్లే, అంతవరకు తెలియనట్లే. ఇప్పటి నుండి మీరు ప్రయత్నము చేయండి. మీరు ఇప్పుడు తెలుసుకునే జ్ఞానము అసలైన జ్ఞానమో కాదో, మీ కర్మలు కాలుతున్నాయో లేదో, మీరు చూసుకోండి. చూసుకుంటే మీకు తెలుస్తుంది. అంటే ఈ జ్ఞానము తెలుసుకున్నోళ్ళకు ఎవరికైనా కర్మలు కాలుతున్నాయి. ఇక్కడ ఏ గ్రంథాలకు అయినా గాని వాటిలో జ్ఞానముంది, శక్తి ఉంది. మిగతా జ్ఞానములో శక్తి లేదు అని చెప్తున్నాము. ఈ జ్ఞానాన్ని బాగా అర్థము చేసుకొని ముందుకు పోతారని మేము అనుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.


తేది: 06.11.2014

ఈ దినము ఒక సరికొత్త విషయాన్ని చెప్పుకోవాలని దేవున్ని ప్రార్థిస్తూ ఈ సభను ప్రారంభిస్తున్నాము. దేవుడు మనకు ఏమి అందిస్తే


----

అది మనమిక్కడ చెప్పడము జరుగుతుంది. మా స్వతంత్రత కొద్ది మేమేమి చెప్పేది లేదు. కానీ మేము మీకు అహర్నిశలు కొత్త విషయాలు అందించాలనే చూస్తున్నాము. అవి ఒక్కోసారి మీకు మేము చెప్పడములో ఇంతకుముందు చెప్పినటువంటి విషయాలు ఒకవేళ వస్తే, వాటిని కూడా మీరు శ్రద్ధగా వినాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా మరి ఏమి చెప్తున్నామంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళల్లో అంతా జ్ఞానాసక్తులు ఉన్నారు అనేదానికి అవకాశము లేదు. జ్ఞానము మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళూ ఉంటారు. జ్ఞానము మీద ఆసక్తి లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆసక్తి ఉన్నా కొంత తక్కువ ఉంటుంది. ఇంతకుముందే నేను చాలాసార్లు చెప్పాను. వాళ్ళ యొక్క శ్రద్ధనుబట్టి ఈ జ్ఞానము అర్థమైతుంది. శ్రద్ధ లేకపోతే జ్ఞానము అర్థము కాదు. శ్రద్ధ ఎంత శాతము ఉంటే అంత శాతము ప్రకారము అర్థమైతుంది. శ్రద్ధ తక్కువుంది అనుకోండి తక్కువ జ్ఞానమే అర్థమైతుంది. ఇక్కడికి వచ్చి పోయి, కొన్ని రోజులు ఉండి, జ్ఞానము విన్నట్లు నటిస్తూ వింటున్నారు. వాళ్ళు అందరితో పాటు వింటుండి కూడ వాళ్ళకు జ్ఞానము ఏమాత్రము ఎక్కలేదు అంటే వాళ్ళలో శ్రద్ధ లేదు అని అర్థమైపోతుంది. అందరితో పాటు విన్నప్పుడు అందరికీ అర్థమైనట్టు అర్థమవ్వాలి కదా! కాని అట్ల చాలామందికి అర్థము కాకుండా పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందువలన అటువంటి పరిస్థితి ఎవరికీ రాకుండా అందరు శ్రద్ధగా జ్ఞానము తెలుసుకోవాలని కోరుతున్నాము మేము.


మీరంతా శ్రద్ధగా వినండి. దేవుడు మనకు జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశ్యముతో మనకు మూడు మూలగ్రంథాలు ఇచ్చాడు. మూడేనా? అంటే ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి కానీ వాటితో మనకు సంబంధము లేదు. మనకు సంబంధము ఉండేటివి మూడే. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచములో


----

మొత్తము 12 మతాలున్నాయి. 12 మతాల్లోనూ దేవుడు స్వయముగా చెప్పినటువంటివి మాత్రము మూడే ఉన్నాయి. మనుషులు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మతాలుగా మనము స్వీకరించడము లేదు. అంటే మనుషులు చెప్పినటువంటి మతాలు 9 ఉన్నాయి. దేవుడు చెప్పినట్టి జ్ఞానముతో కూడుకున్న మతాలు 3 ఉన్నాయి. అర్థమైందా! ఇప్పుడు ఈ మూడిటిలో గొప్పది హిందూమతము. మొదట దీనికి మతము అనే పేరు లేదు కానీ మధ్యలో మతము అనే పేరు వచ్చింది. దాని విషయము మనము తర్వాత మాట్లాడుకుందాము. కానీ ఇప్పుడికి మాత్రము ఉండేది భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ అను మూడు ములు మాత్రమే.


ఇప్పుడు హిందూమతము అనేది మనకు ఉంది. ఈ హిందూ మతమనేది పూర్వము ఈ ప్రపంచములో మొట్టమొదటి మతముగా, అన్నిటికంటే పెద్ద మతముగా ఉండేది. మొట్టమొదటి మతము అనేది వాస్తవమే. ఏ మతము పుట్టిన దానికొక తేది ఉంది, దానికొక ప్రవక్త ఉన్నాడు. కానీ హిందూమతానికి ఒక తేది లేదు, ఒక ప్రవక్తా లేడు, ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు అది. కాబట్టి ఇది పురాతనమైనది, చాలా రహస్యమైనది అని కూడ మనము భగవద్గీతలో వినడము జరిగింది. సరే, మళ్ళ అంత పెద్ద మతము ఇప్పుడు మూడో స్థానములోకి జరిగి వచ్చింది. మొట్టమొదట స్థానములో క్రైస్తవ మతము నిలబడి పోయింది. రెండవస్థానములో ఇస్లామ్ మతము నిలిచి పోయింది. మూడవస్థానములో హిందూ మతము ఉంది. ఈ రెండు ఎప్పుడు పుట్టాయంటే 2000 సంవత్సరాల పూర్వము క్రైస్తవ మతము పుట్టింది. అది ఇప్పుడు ప్రపంచములో మొట్టమొదటి స్థానములో ఉంది. దాంట్లో క్రైస్తవ మతములో ఉన్నంత జనాభా ఏ మతములోనూ లేరు. ఈ మూడు మతాల్లో ఎక్కడా


----

లేరు. సరే, రెండవది ఇస్లామ్ మతములో క్రైస్తవులకంటే తక్కువ జనాభా, హిందువులకంటే ఎక్కువ జనాభా ఉంది. ఈ హిందువులు మూడవ స్థానములోకి దిగజారిపోయినారు. సరే, ఎందుకు ఇట్ల జరిగింది? అనే విషయము తరువాత చూసుకుందాము. ఈ మూడు మతాలకు దేవుడు మూడు గ్రంథాలు ఇచ్చాడు. హిందువులకు భగవద్గీత ఇచ్చాడు, క్రైస్తవులకు బైబిలు ఇచ్చాడు, ముస్లీములకు ఖుర్ఆన్ గ్రంథము ఇచ్చాడు.


ఈ మూడు గ్రంథాల్లోనూ దేవుని జ్ఞానమే ఉంది. దేవుని జ్ఞానము ఉన్నా వాళ్ళది వాళ్ళ జ్ఞానము, మనది మన జ్ఞానము, ఇంకొకరిది ఇంకో జ్ఞానము అనుకోకుండా, మూడు మతాల్లోనూ జ్ఞానముంది అని మనము చెప్పుకుంటున్నాము. అలా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ నెలలో మీకు 2, 3 గ్రంథములు ఒకటే సారి ఇచ్చాము. ఆ గ్రంథములలో పూర్వము సృష్ఠిఆదిలో చెప్పబడినటువంటి జ్ఞానము ఏదైతే ఉందో అదే ఈ మూడు మతాల్లో చెప్పబడింది అని చెప్పాము. 5000 సంవత్సరాల పూర్వము కృష్ణుని ద్వారా దైవజ్ఞానమే చెప్పబడింది. తరువాత 2000 సంవత్సరాల పూర్వము ఏసు ద్వారా అదే జ్ఞానము చెప్పబడింది. 1400 సంవత్సరాల పూర్వము జిబ్రయేల్ గ్రహము ద్వారా కూడా అదే జ్ఞానమే చెప్పబడింది. కాబట్టి ఆ మూడిట్లోను ఉండేది ఒకే ఒక దేవుని జ్ఞానము. ఒక గ్రంథములో ఉండే జ్ఞానము మూడు గ్రంథాల్లోనూ ఒకే విధముగా ఉంటుంది. అన్నిటికంటే ముందు పుట్టిన గ్రంథము భగవద్గీత. భగవద్గీతలో ఉండేటటువంటి ఏ జ్ఞానవాక్యమైన గాని అది మిగతా రెండు గ్రంథాల్లోనూ సమన్వయముగా ఉంటుంది, కానీ దానికి వ్యతిరేఖ వాక్యము ఎక్కడా ఉండదు. ఈ రకంగా మనము లెక్కేసుకుంటే మూడు గ్రంథాల్లోనూ దేవుడు జ్ఞానమే ఇచ్చినాకానీ మనిషి వాటిలో ఉండేది ఒకే జ్ఞానమే అని తెలియక


-----

మూడు భాగాలుగా విభజించుకున్నాడు, మూడు మతాలుగా పేర్లు పెట్టుకున్నాడు. సరే, ఏదో రకంగా ఎట్ల పేర్లు పెట్టుకున్నా కానీ తెలుసుకునే జ్ఞానము ఒకటే కదా! అని అంటే కాదు వేరుగా ఉన్నది అంటున్నారు. హిందువులు తూర్పుకు తిరిగి నమస్కారము చేస్తారు. ముస్లీమ్లు ఏమి చేస్తారంటే పడమటికి తిరిగి నమస్కారము చేస్తారు. అంటే మళ్ళ హిందువులు తూర్పుకు తిరిగి నమస్కారము చేసినప్పుడు ముస్లీమ్లు పడమటికి తిరిగి ఎందుకు చేయాలి? ఒకే జ్ఞానము అయినప్పుడు మళ్ళ ఎందుకు ఇట్ల చేస్తున్నారు? అంటే దేవుడు భగవద్గీతయందు తను జ్ఞానములో తూర్పుకు తిరగమని చెప్పలేదు, పడమటికి తిరగమని చెప్పలేదు. కాని నీవు తిరుగుతున్నావు తూర్పుకు, పడమటికి అని. దేవునికి తూర్పుగానీ, పడమరగానీ అన్ని దిక్కులు సమానమే.


మేము 10 సంవత్సరాల క్రితము ఈ మందిరము కట్టాలని ప్రారంభించిన రోజు వచ్చాము. ఇదంతా కంప చెట్లు ఉండేటివి. సరేలే, అక్కడ మాత్రము కొద్దిగా బయలు ఉంటే ఈ కృష్ణమందిరానికి పునాది వెయ్యమని చెప్పాము. తీరా ఇక్కడికి వచ్చి పునాదికి మార్క్ వేయించినాము. మార్క్ వేయించిన తరువాత ఆ రోజు ఆదివారము అమావాస్య అన్నారు కొంతమంది, మేము ఏమి చెప్పినాము అంటే దేవుని లెక్కలో అన్ని దినాలు సమానమే. ప్రపంచము లెక్కలు మీరు ఎట్లన్నా వేసుకోండి మాకు సంబంధము లేదు. దేవుని లెక్కలో అన్నీ సమానమే. ఇక్కడ మనము చేస్తుంది దేవుని పని కాబట్టి మీకు ఆదివారము లేదు అమావాస్య లేదు, అన్నీ సమానమే. కాబట్టి మీరు ప్రారంభము చేయండి అది సరిపోతుంది అని చెప్పినాము. ఆ రకంగనే చేయడము జరిగింది. ఇప్పటి వరకు ఏ ఆటంకము లేకుండా మనము ఏ ఉద్దేశ్యముతో దీనిని ప్రారంభించామో ఆ ఉద్దేశ్యముతోనే


----

జరుగుతావుంది. జ్ఞానము ఇతరులకు తెలియజేయాలి అనే ఉద్దేశ్యముతో మనము ప్రారంభించాము. అదే ఇక్కడ జరుగుతావుంది.

కానీ ఎన్ని ఆటంకాలు జరిగినాకానీ ఆ ఆటంకాలన్నీ తాత్కాలికమే కానీ ఏవి శాశ్వతముగా నిలబడలేదు. సరే, ఇప్పుడు మనమేమి చెప్తున్నామంటే దేవుడు ఒకచోట చెప్పిన జ్ఞానానికి, ఇంకొకచోట చెప్పిన జ్ఞానానికి ఏమాత్రము తేడా లేకుండా, ఒకదానికి ఒకటి వ్యతిరేఖము లేకుండా చెప్పాడు. అయితే చెప్పినదానిని కొందరు వ్యతిరేఖముగా మార్చు కుంటున్నాము. అంటే “పుట్టినటువంటివాడు చావక తప్పదు, చచ్చినటువంటి వాడు పుట్టక తప్పదు” అని భగవద్గీతలో చెప్పితే, ఇంకొక మతములోకి పోతే మనిషి చచ్చేది లేదు, పుట్టేది లేదు, ఒకసారే పుడతాడు, ఒకసారే చస్తాడు మళ్ళీ పుట్టేదే లేదు అంటున్నారు. ఒకటే సారి జన్మ, ఒకటేసారి మరణము మళ్ళీ పుట్టేది అవసరము లేనే లేదు అంటున్నారు. అప్పుడు ఇక్కడ చావు పుట్టుకలు ఈ రెండు అనివార్యముగా జరుగుతున్నాయి, చచ్చినటువంటివాడు పుట్టాల్సిందే, పుట్టినటువంటివాడు చావాల్సిందే అని ఏదైతే భగవద్గీతలో చెప్పినారో వేరే మతస్థులు దానికి వ్యతిరేఖముగా చెప్పుకొంటున్నారు. మా దేవుడు ఇట్లే చెప్పినాడు, మా గ్రంథములో ఇట్లే ఉంది అంటున్నారు. కానీ ఎప్పటికీ అట్ల ఉండదు. వాళ్ళ గ్రంథములో అలా ఏమైనా ఉందా? అని చూస్తే అక్కడ ఏమి అట్ల లేదు. భగవద్గీతలో (ఇందూ శాస్త్రములో) చెప్పినట్లు చచ్చేటటువంటివాడు తిరిగి పుట్టాల్సిందే, పుట్టినటువంటివాడు తిరిగి చనిపోవాల్సిందే అని ఎట్లైతే చెప్పినారో అదే రకంగానే బైబిలు, ఖుర్ఆన్లో కూడా జన్మలున్నాయనే చెప్పడము జరిగింది. అది అర్థము చేసుకోకుండా, అర్థము చేసుకునే శక్తి లేకుండా మనిషి ఏమి చేస్తున్నాడు అని చెప్పితే, మా గ్రంథములో పుట్టలేదు అని చెప్పినారు అని అనుకుంటున్నారు.

----

జరుగుతావుంది. జ్ఞానము ఇతరులకు తెలియజేయాలి అనే ఉద్దేశ్యముతో మనము ప్రారంభించాము. అదే ఇక్కడ జరుగుతావుంది.


కానీ ఎన్ని ఆటంకాలు జరిగినాకానీ ఆ ఆటంకాలన్నీ తాత్కాలికమే కానీ ఏవి శాశ్వతముగా నిలబడలేదు. సరే, ఇప్పుడు మనమేమి చెప్తున్నామంటే దేవుడు ఒకచోట చెప్పిన జ్ఞానానికి, ఇంకొకచోట చెప్పిన జ్ఞానానికి ఏమాత్రము తేడా లేకుండా, ఒకదానికి ఒకటి వ్యతిరేఖము లేకుండా చెప్పాడు. అయితే చెప్పినదానిని కొందరు వ్యతిరేఖముగా మార్చు కుంటున్నాము. అంటే “పుట్టినటువంటివాడు చావక తప్పదు, చచ్చినటువంటి వాడు పుట్టక తప్పదు” అని భగవద్గీతలో చెప్పితే, ఇంకొక మతములోకి పోతే మనిషి చచ్చేది లేదు, పుట్టేది లేదు, ఒకసారే పుడతాడు, ఒకసారే చస్తాడు మళ్ళీ పుట్టేదే లేదు అంటున్నారు. ఒకటే సారి జన్మ, ఒకటేసారి మరణము మళ్ళీ పుట్టేది అవసరము లేనే లేదు అంటున్నారు. అప్పుడు ఇక్కడ చావు పుట్టుకలు ఈ రెండు అనివార్యముగా జరుగుతున్నాయి, చచ్చినటువంటివాడు పుట్టాల్సిందే, పుట్టినటువంటివాడు చావాల్సిందే అని ఏదైతే భగవద్గీతలో చెప్పినారో వేరే మతస్థులు దానికి వ్యతిరేఖముగా చెప్పుకొంటున్నారు. మా దేవుడు ఇట్లే చెప్పినాడు, మా గ్రంథములో ఇట్లే ఉంది అంటున్నారు. కానీ ఎప్పటికీ అట్ల ఉండదు. వాళ్ళ గ్రంథములో అలా ఏమైనా ఉందా? అని చూస్తే అక్కడ ఏమి అట్ల లేదు. భగవద్గీతలో (ఇందూ శాస్త్రములో) చెప్పినట్లు చచ్చేటటువంటివాడు తిరిగి పుట్టాల్సిందే, పుట్టినటువంటివాడు తిరిగి చనిపోవాల్సిందే అని ఎట్లైతే చెప్పినారో అదే రకంగానే బైబిలు, ఖుర్ఆన్లో కూడా జన్మలున్నాయనే చెప్పడము జరిగింది. అది అర్థము చేసుకోకుండా, అర్థము చేసుకునే శక్తి లేకుండా మనిషి ఏమి చేస్తున్నాడు అని చెప్పితే, మా గ్రంథములో పుట్టలేదు అని చెప్పినారు అని అనుకుంటున్నారు.


----

కానీ అక్కడ చెప్పినటువంటి మూడు గ్రంథాల వాక్యాలలోగానీ, భావములోగానీ ఏమాత్రము తేడా లేదు. అయినా మనిషి అర్థము చేసుకోవడములో తేడా వచ్చింది. ఎందుకు అట్ల వచ్చింది? అంటే మనిషికి సరైన భావము లేదు, 'దేవుని జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలి' అని శ్రద్ధ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేవుని జ్ఞానము తెలియబడుతుంది. శ్రద్ధ లేకపోతే దేవుని జ్ఞానము కూడా నీకు అంతంత మాత్రమే తెలియబడుతుంది, అంటే ఇది కూడా సరిగా అర్థము కాదు. ఇప్పుడు మేము చూస్తే ఎక్కడా జన్మించడు అనేది గ్రంథాలలో ఎక్కడా లేదు. కానీ అందరికీ అదే కనిపించి మా దాంట్లో చావు పుట్టుకలు లేవు అంటున్నారు. ఈ రకంగా ఒక్క మతములో ఉండేదాన్ని ఇంకో మతము ఒప్పుకోవడము లేదు. ఒక్క గ్రంథములో ఉండే జ్ఞానాన్ని ఇంకో గ్రంథము ఒప్పుకోవడము లేదు అని అంటున్నారు. కానీ వాస్తవముగా లెక్క చూస్తే ఒక మతానికి ఇంకో మతములో వ్యతిరేఖ జ్ఞానము ఎక్కడా లేనే లేదు. బైబిలులోగానీ, ఖురానులోగానీ ఆ విధముగా లేదు. ఈ రెండు వెనక వచ్చిన గ్రంథాలు, మొట్టమొదట పుట్టిన గ్రంథము భగవద్గీత ఈ మొదటి గ్రంథములో ఏదైతే ఉందో ఆ రెండింటిలో అవే ఉన్నాయి. ఇంకా ఏమి చెప్పబడుతుందంటే ఖురాన్ గ్రంథము చివరి గ్రంథము అది మూడవది. ఖుర్ఆన్ ఐదవ సూరా 48వ ఆయత్లో ముందు వచ్చిన గ్రంథములో ఉండే జ్ఞానాన్ని ఇది సత్యము అని ధృవీకరించేదాని కోసమే ఇది పుట్టింది. ముందు వచ్చిన తౌరాత్, ఇంజీలు సత్యము అని సాక్ష్యము చెప్పే దానికోసమే ఆ ఖుర్ఆన్ గ్రంథము పుట్టింది తప్ప ఇంకో మతము కోసము పుట్టలేదు. ఖుర్ఆన్ చెప్పినేది వాస్తవము, అక్కడ చెప్పినేది తెలుసుకోండి అది వాస్తవము అని అక్కడ చెప్పినట్టు ఇక్కడ చూపిస్తూ మళ్ళీ దానినే ధృవీకరించింది అని


---

ఇక్కడ చెప్పడము జరిగిందంటే ఆ గ్రంథము వేరు ఈ గ్రంథము వేరు, అనే భావము మనుషుల్లో రాకూడదు. అట్లువస్తే అది కేవలము అజ్ఞాన భావము వలనే వచ్చిందికానీ జ్ఞానభావము వలన రాలేదు. ఈ రకంగా ఇప్పుడు మనము ప్రస్తుత కాలములో మూడు గ్రంథాల్లోనూ మూడు తేడాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక మతములో పోతే పుట్టరు అంటారు, ఇంకొక మతములో పోతే పుడతారు అంటారు, ఇంకో దాంట్లోకి పోతే ఇంకో రకంగా

అంటారు.


ఈ రకంగా క్రైస్తవులలోకి పోతే ఆదివారము ఒక్కరోజే మ్రొక్కాలంటారు, ముస్లీమ్లలోకి పోతే శుక్రవారము అంటారు. దినానికి 5 సార్లు మ్రొక్కాలంటారు. హిందువుల్లోకి పోతే ఎప్పుడు బుద్ధి పుట్టినట్లు వారు దేవతలను ఆరాధిస్తున్నారు. ఒక చట్టము, ఒక పద్ధతి, ఒక జ్ఞానము, ఒక ధర్మము అనేటటువంటి దానికి కట్టుబడకుండా మనుషులు ప్రవర్తిస్తున్నారు. సరే, వీళ్ళ ప్రవర్తనకు ఆ గ్రంథాల్లో ఉండేటటువంటి దానికి ఏమన్నా పోలిక ఉందా? అంటే గ్రంథాల్లో ఏమాత్రము అట్ల లేనే లేదు. హిందువులు ఇట్లే పెళ్ళి చేసుకోవాలి అని ఏమి లేదు. ముస్లీమ్లు ఇట్లే మాట్లాడాలి అని ఏమి లేదు. ఇంకొకరు ఇట్లే ఉండాలని చెప్పలేదు. ఈ రోజు ముస్లీములను చూస్తేనే వాళ్ళకు గడ్డము ఉంది, నెత్తిన టోపి ఉంటుంది, అవి చూస్తూనే ఓ హెూ! ఇతను ముస్లీమ్ అని మనము గుర్తుపట్ట వచ్చు. ఇప్పుడు మనము మొఖాన నుదుటి మీద నాలుగు చక్రాలు పెట్టుకున్నాము. ఈ చక్రాలు చూస్తూనే ఇది త్రైత సిద్ధాంతము వాళ్ళు అని కనుక్కుంటారు. భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగములో ఈ నాలుగు చక్రాల చట్రము ఉందికానీ మిగత గ్రంథములలో గడ్డము లేదు, టోపీ లేదు. ఖురానులో మీరు గడ్డము పెట్టుకోవాలని, టోపీ పెట్టుకోవాలని


---

ఏమాత్రము చెప్పలేదు. దైవ గ్రంథాలలో దేవుడు జ్ఞానాన్ని చెప్పినాడు. జ్ఞానాన్ని నీవు స్వీకరించి దానిప్రకారము నీవు అనుసరించాలి గానీ ఈ పైన వేషాలు పనికిరావు అనే ఉద్దేశ్యము దాంట్లో ఉంది ఇంకోటి ఏమి లేదు.


ఇప్పుడు భగవద్గీత ఉంది, బైబిలు ఉంది, ఖుర్ఆన్ ఉంది. హిందువులకు ఎంతమటుకు భగవద్గీత అర్థమైంది? అంటే కేవలము 10 శాతము కూడా అర్థము కాలేదని ముందే చెప్పుకున్నాము మనము. మళ్ళ అన్నిటికంటే గొప్ప గ్రంథము, అన్నిటికంటే జ్ఞానము ఎక్కువ ఉండే గ్రంథము, ముందు పుట్టిన గ్రంథము అని చెప్పవచ్చు. భగవద్గీతలో ఇంత పెద్ద జ్ఞానము ఉన్నది. ఇదే జ్ఞానమే మిగతా వాటిలో ఉంది అని చెప్పినప్పుడు మొదటి భగవద్గీత గ్రంథమే మనకు అర్థము కాకపోతే మిగితావి మనకేం అర్థమైతాయి. మిగితావి చూడను కూడ చూడము, మనకు సంబంధము లేదు అంటాము. మిగితావాళ్ళు కూడ మాకు సంబంధము లేదు, మాకు ఇదొక్క గ్రంథమే దేవుడిచ్చాడు అంటారు. మూడు గ్రంథాలు కూడా మనిషికి సంబంధించినవే కాని ఇంకోటేమీ కాదు, వేరు వేరు గ్రంథాలు ఏమి కాదు. అట్లే వేరు వేరు మతాలకు సంబంధించినేటివి కావు. మూడు గ్రంథాలు ఒక మనిషికి సంబంధించినేటివే, కానీ నువ్వు ఏ గ్రంథము నుంచి అయినా జ్ఞానము తెలుసుకోవచ్చు. మళ్ళ ఇప్పుడు విడివిడిగా ఉన్నారు మతాలు ఏర్పరుచుకొని, విడివిడిగా ఉన్నప్పుడు, నీ మతము నుంచి నీవు జ్ఞానము తెలుసుకో, అతని మతము నుంచి అతను జ్ఞానము తెలుసుకుంటాడు, ఇంకొకరి మతము నుంచి ఇంకొకడు తెలుసుకుంటాడు. అయితే అలా కూడ తెలుసుకోవడము లేదు. ఆ విధముగా కూడ ఎవరూ జ్ఞానము తెలుసుకోవడము లేదు. అంటే వాళ్ళ గ్రంథము పరిమిత జ్ఞానమైపోయింది,


---

మతానికి సంబంధించిన జ్ఞానము అయింది, దేవునికి సంబంధించిన జ్ఞానము కాలేదు, కేవలము మతానికి సంబంధించిన జ్ఞానమే అయింది. ఇప్పుడు మనము భగవద్గీతలోకి పోతే మత సంబంధమైనది ఏమి లేదు. ఈ పొద్దు బ్రాహ్మణులు తిరుపతికి పోతే నువ్వు ఈ డ్రస్సులో పోవాలి, పంచ కట్టుకొని రావాలి, ఇట్ల అయితేనే దేవుని దగ్గరికి రావాలి అని చెప్తున్నారు. కానీ దేవుడు ఎక్కడన్నా చెప్పినాడా పంచ కట్టుకోమని? నీకు గుడ్డల సమస్య ఏమి చెప్పలేదు. ఈ రోజు భక్తి దగ్గరికి వచ్చేసరికి నియమాలు ఉండాలంటారు. అంటే వీళ్ళ పిచ్చి వీళ్ళకు ఆనందము అయిపోయింది.


వీళ్ళ మాదిరే ఇంకో మతములోకి పోతే, వాళ్ళు ఒక ప్రత్యేకముగా డ్రస్సులు పెట్టుకున్నారు. వాళ్ళు ఒక ఆకారము పెట్టుకున్నారు. మేము ఈ ఆకారముతోనే ఉండాలి అంటారు. ఇంకో మతములో వాళ్ళను చూస్తూనే క్రైస్తవులు అని కనుక్కోవచ్చు. మనము మామూలుగ ఫాదర్లను చూస్తూ వుంటాము. పొడుగాటి తెల్లని జుబ్బా వేసుకొనివుంటారు, నడుముకు తాడు కట్టుకొని ఉంటారు, వీళ్ళను చూస్తూనే క్రైస్తవులు అనుకుంటాము మనము. ఇట్లు ఒక్కోరు ఒక్కోరకంగా ఉన్నారు. ఎట్ల ఉన్నాగానీ జ్ఞానము మాత్రము తెలియకుండా పోయిన దానివలన మనము ఆలోచించాల్సిన అవసరము వచ్చింది. _మూడు గ్రంథాల్లోనూ జ్ఞానము ఉన్నప్పుడు తెలియకుండా పోయేదానికి కారణము ఏమి అంటే భావము సరిగా లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికి భావము సరిగా ఉన్నదని నమ్మకము లేదు. కొంతమంది మంచి భావముతో ఉండొచ్చు, కొంతమంది చెడ్డ భావముతో ఉండొచ్చు, ఇంకొకరు వేరే దృష్టితో ఉండవచ్చు. మంచి భావముతో ఉండి జ్ఞానము తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు జ్ఞానమే తెలుస్తుంది. లేదు వేరు భావముతో ఉన్నపుడు జ్ఞానము తెలియదు. అందరికీ జ్ఞానము తెలియాలని, జ్ఞానాన్ని తెలియజెప్పాలని మేము మొదటి నుంచి కృషి చేస్తున్నాము.


---

ఇదే ఉద్దేశ్యముతో మేము ప్రయత్నము చేస్తున్నాముకానీ, ఇప్పుడు మిమ్మల్ని, మమ్మల్ని కూడ వీళ్ళు సక్రమమైన వాళ్ళు కాదు, వీళ్ళు ప్రపంచములో అందరికంటే పనికిమాలినోళ్ళు సోమరిపోతులు అని చిత్రీకరించి చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధముగా వాళ్ళకు అర్థము అయింది. మనము చెప్పే జ్ఞానము వాళ్ళకు అర్థము కాలేదు, మేము ప్రపంచముతో సంబంధము పెట్టుకోకుండా మేము జ్ఞానము చెప్తూ, ఎంతో జాగ్రత్తగా మేము గ్రంథము వ్రాసి ఇస్తున్నాము. ఇతరులతో సంబంధము పెట్టుకుంటే ఇంత జ్ఞానమును మీకు అందివ్వలేము. ప్రపంచముతో సంబంధము పెట్టుకోకుండా గ్రంథాలు ఇచ్చినాగానీ దాంట్లో జ్ఞానము తెలుసుకోనట్టి పరిస్థితిలో మానవుడు మిగిలిపోయినాడు. అంతేకాకుండ దేవుడు ఇచ్చిన గ్రంథాల జ్ఞానము కూడ మనిషి తెలుసుకోకుండా పోయినాడు. దేవుడు ఒక అవతారములో కృష్ణుడిగా వచ్చి భగవద్గీతను అందించి పోయినాడు. ఇంకో అవతారములో ఏసుగా వచ్చాడు, ఇంజీలు (బైబిలు) అందించి పోయినాడు. తర్వాత ఇంకో అవతారము లేదుగానీ పై నుండే గ్రహము వచ్చి ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని చెప్పిపోయింది. మొట్టమొదట నేను తెలుసుకున్నట్టి జ్ఞానము ఇది అని సృష్టి ఆదిలో తెలుసుకున్న జ్ఞానము అని చెప్పిపోయింది. అంటే ఇద్దరు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఇద్దరు వచ్చి చెప్పి పోయినారు, ఒకరు మాత్రము ఉండేటటువంటి గ్రహమే చెప్పింది. సరే, ఇప్పుడు ఆ భగవద్గీతలో ఒక వ్యక్తి చెప్పినప్పుడు, అది అర్థము కాకుండా పోయినప్పుడు, ఇంకొక వ్యక్తి వచ్చి చెప్పడము జరిగింది. అది కూడా అర్థము కాకుండా పోయినప్పుడు, ఇంకొక గ్రహము కూడ వచ్చి చెప్పడము

జరిగింది.


----

ఈ మూడు రకాలుగా మనకు మూడువైపుల నుంచి దేవుడు జ్ఞానాన్ని అందించాడు. అయినాగానీ జ్ఞానము మనకు దూరముగా ఉండి పోయింది, అజ్ఞానము దగ్గరగా ఉండిపోయింది. అటువంటి పరిస్థితిల్లో మనము ఏమి చేయాలి? దేవుడు చేసే పని చేసిపోయాడు. మనము చేయవలసిన పనే మిగిలి ఉంది. మనము ఏమి చేయాలి? అంటే శ్రద్ధను పెంచుకొని, జ్ఞానము తెలుసుకోవాలి. శ్రద్ధను పెంచుకుంటున్నామా అంటే కొందరు పెంచుకుంటున్నాము అంటున్నారు కానీ వారు నటిస్తున్నారు. శ్రద్ధను పెంచుకున్నట్టు, వింటున్నట్టు నటిస్తున్నారు. వేరే ఆలోచనలు చేస్తుంటారు. ఈ రకంగా ఒక్కొక్కరు ఒక రకంగా ఉండేదాని వలన వాళ్ళకు ఒక్కొక్కొరికి ఒక విధముగా జ్ఞానము అర్థమైతావుంది, సక్రమముగా అర్థము కావడము లేదు. ఒకరికి ఉన్నతముగా అర్థమైతూవుంది, ఇంకొకరికి తక్కువగా అర్థమైతూ ఉంది. ఈ పద్ధతి ప్రకారము చూస్తే ఈ రోజు జ్ఞానము పూర్తి ఏమి అర్థము కాని స్థితిలో నిలిచిపోయింది. దేవుడు మూడు గ్రంథాలు పంపించి, మనకు జ్ఞానాన్ని సంపూర్ణముగా ఇచ్చినాగానీ వాటి నుండి గ్రహించుకోలేని స్థితిలో ఉండిపోయినాము. వారు మూడు గ్రంథాల నుండి గ్రహించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మనము ఏమి చేసేదానికి వీలులేదు. వాని మెదడు తక్కువుంది, ఆసక్తి తక్కువ ఉంది. ఒకవేళ తెలుసుకుందాము అన్నాగానీ అర్థముకాని పరిస్థితి ఉంది. చెప్పిన వాక్యము ఏమిటో అర్థము కాకుండా ఉంటుంది. అప్పుడు తెలుసుకునేదానికి అవకాశము ఏమాత్రము లేదు. ఎవరి ద్వారా అయినాగానీ విని తెలుసుకుంటే అతనిని గొప్ప భావముతో చూడరు. గొప్ప భావముతో చూడనప్పుడు చెప్పే విషయము కూడా గొప్పగా అర్థము కాదు.


---

మూడు రకాలుగా

ఆ లెక్కప్రకారము ఏ విధముగా చూసినాగానీ, ఈ మూడు గ్రంథాల్లో నుంచి కొందరికి ఏమాత్రము జ్ఞానము అర్థము కావడము లేదు. మాకు అర్థమైంది అని ఎవరన్నాగానీ ప్రక్కనే ఒక ప్రశ్న ఉంటుంది, ఆ ప్రశ్నకు జవాబు ఉండదు. ఆ ప్రశ్నకు జవాబు ఉందనుకోండి, దాని ప్రక్కనే ఇంకో ప్రశ్న వస్తుంది. దానికైనా జవాబు లేకుండా పోతుంది. రెండు మనకు జవాబులు వచ్చినాగానీ లాస్ట్ నాలుగవ ప్రశ్నకుగానీ, ఐదవ ప్రశ్నకుగానీ జవాబు ఉండదు, అక్కడ నిలిచిపోతుంది వారి జ్ఞానము. మనిషికి జ్ఞానము సంపూర్ణముగా అర్థమవ్వాలి అంటే ఎక్కడా ప్రశ్న రాకుండా జవాబుండాలి. సంపూర్ణముగా జవాబుండాలి, దాన్ని నిజమైన జ్ఞానము అంటాము. అప్పుడైతే గాని నిజమైన జ్ఞానము కాదది. కానీ సంశయాలతో కూడుకున్నటువంటిది జ్ఞానము నిజమైన జ్ఞానము కాదు దేవుడు మూడు గ్రంథాలలో సంశయరహితముగా ఎక్కడగాని అనుమానము లేకుండా, ప్రశ్న రాకుండా, సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని నీకు అందించాడు. మనకు తెలుసునో తెలియదోకాని సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందించాడు, దేవుని జ్ఞానములో ఎక్కడా ఏ ప్రశ్న ఉద్భవించదు. అటువంటి జ్ఞానము ఈ రోజు ప్రశ్నలమయముతో కూడుకుంది, అర్థమై ఉంటే సంపూర్ణమైన జవాబు ఉంటుంది. అర్థము కాకపోతే జవాబు ఉండదు. సరే, ఇప్పుడు మనకు అటువంటి జవాబులు లేవు, అనేక ప్రశ్నలున్నాయి, సంశయాలతో కూడుకున్న జ్ఞానము అయిపోయింది, మరి ఇప్పుడు ఏమి చేయాలి? అంటే మనము ఏమి చేసేదానికి లేదు. దేవుడు ఇంకో ప్లాన్ (పథకము) వేసుకోవాలి, భగవద్గీత చూసుకుంటే మొట్టమొదటి గ్రంథము, మిగతా గ్రంథాలకు ఆధారమైన గ్రంథము. ఈ ఆధారమైన గ్రంథములో కూడా కొంత కలుషితము వచ్చి కలిసిపోయింది. దానిని


----

కూడ మనము తీసివేసుకుంటేగానీ మీకు అర్థము కాదు. అది తీసివేసుకునే శక్తి లేదు కాబట్టి మీకు ఎవరికి అర్థము కాకుండా పోయింది.


ఇంకోటి చివరిలో ఖుర్ఆన్ గ్రంథము ఉంది. దాంట్లో 6236 వాక్యాలున్నాయి టోటల్గా లెక్కేసుకుంటే. 6236 ఆయత్లు అంటారు వాటిని. సరే, వాటిలో ఎన్ని సారాంశమైనేటివి ఉన్నాయి అనుకుంటే కొన్నివేలు తీసేసినాగానీ చివరకు వందల్లోనైనా వాస్తవ జ్ఞానమున్నవి కలవు. 6000 పక్కన పెట్టినాగానీ, చివర ఇంకా 236 సరిపోతాయి. ఎంతో గొప్ప జ్ఞానమున్న వాక్యములయిన దానివలన 236 ను అర్థము చేసుకొన్నా సంపూర్ణ జ్ఞానమును మనిషి పొందవచ్చును. చివరకు 36 ఆయత్లను కూడ వీళ్ళు అర్థము చేసుకోలేకపోవుచున్నారు. అటువంటి పరిస్థితిలో మనిషి ఉన్నప్పుడు జ్ఞానము అర్థమయ్యేదానికి అవకాశము లేదు. బైబిలులో జ్ఞానము ఉంది. భగవద్గీతలో జ్ఞానము ఉంది. ఖుర్ఆన్లో కూడ జ్ఞానము ఉంది. కానీ ఆ జ్ఞానాన్ని ఎట్ల తీసుకోవాలి? అనేటువంటి విధానము తెలియక మనిషి దానిని అపార్థము చేసుకుంటున్నాడు. ఈ రకంగా ఉండేదానివలన దేవుడు ఏమి చేసాడంటే, మూడు గ్రంథాలను సమన్వయ పరిచి చెప్పేటటుంటి జ్ఞానము మనకు వస్తే సరిపోతుంది అనుకున్నాడు. దానికొరకు నా ప్రతినిధిని పంపిస్తాను అని అన్నాడు. పంపిస్తాడు. మూడో గ్రంథములో 42–51 ఆయత్లో 'ప్రతినిధిని పంపిస్తాను' అన్నాడు. తరువాత ఒక ప్రతినిధి వస్తాడు. ఆ ప్రతినిధి మనకు ఈ మూడు గ్రంథాల్లో ఉండే సారాంశము ఏదైతే ఉందో దానిని చెప్పగలుగుతాడు. మీకు అర్థము కాని వాక్యాలను విడదీసి చెప్తాడు.


ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాము. ఖుర్ఆన్ఆయందు 89వ సూరా 21వ ఆయత్లో “దేవుడు ఉద్భవిస్తాడు" అని ఉంది ఖుర్ఆన్


----

గ్రంథములో మరియు భగవద్గీతలో కూడా నాకు అవసరము వచ్చినప్పుడు ధర్మసంస్థాపన నిమిత్తము నేను వచ్చి పుడుతాను అని చెప్పినాడు. అయితే ముస్లీమ్లు ఏమంటారంటే దేవుడు పుట్టడు, పుడుతాడు అనేది అబద్ధము. మా మతములో దేవుడు ఎక్కడా చెప్పలేదు. దేవుడు ఉద్భవించేవాడు కాదు అని అంటున్నారు. భగవద్గీతలో “అజోపి సన్నవ్యయాత్యా" అని చెప్పాడు. 'అజోపి' అంటే 'నాకు పుట్టుక లేదు'. అట్లే 'వ్యయాత్మా' అంటే 'నాకు మరణము లేదు”. నేను చచ్చేవాన్ని కాదు, పుట్టేవాన్ని కాదు. అయినాకానీ నేను వస్తున్నాను. "ధర్మసంస్థాపనార్ధాయా”. ధర్మసంస్థాపన కోసము నేను వస్తున్నాను అని చెప్పాడు. అక్కడ వస్తాను అని చెప్పాడు. అట్ల రాడు అని వీళ్ళు అంటున్నారు. మా మతము వేరు, మా జ్ఞానము వేరు అని అంటున్నారు. మీ జ్ఞానము వేరు కాదు, మా జ్ఞానము వేరు కాదు. అక్కడుండే జ్ఞానమే ఇక్కడ ఉంటుంది. ఖుర్ఆన్ 89వ సూరా 21వ ఆయత్లో దేవుడు ఉద్భవిస్తాడు అని ఉంది అంటే వాళ్ళు దానికి దేవుడు ప్రళయములో ఉద్భవిస్తాడు అంటారు. మనుషులంతా ఎవరూ లేనప్పుడు ప్రళయములో ఉద్భవిస్తాడని మీరు ఎట్లు అంటున్నారు? ప్రళయములో ఏముంది? ఉద్భవించి ఎవరికి ఏమి చెప్పాలి? అందరూ చచ్చిపోయినాక ప్రళయములో ఎవరూ లేనప్పుడు వచ్చి ఇంతకుముందు చనిపోయిన వాళ్ళు సమాధుల్లో పండుకొని ఉంటారు కదా! అపుడు అందరినీ లేపి, లిస్ట్ అంతా చూసి, ఎవరిని స్వర్గానికి పంపించాలో, ఎవరిని నరకానికి పంపించాలో తేల్చి పంపిస్తాడంట. చచ్చిన మనుషులు అంతవరకు గుంతల్లోనే ఉంటారంట అని వాళ్ళు చెప్తున్నారు. సరే, వాళ్ళకు అది అలవాటు అయింది, వాళ్ళు అది చెప్పుకుంటున్నారు. కానీ అలవాటు జ్ఞానము మనకు అవసరము లేదుగానీ దైవ గ్రంథములో ఏముందో మనము చూస్తే 89వ సూరాలో


----

21వ వాక్యములో దేవుడు వస్తాడు అని ఉంది. భగవంతునిగా ఉద్భవిస్తాడు అని భగవద్గీతలో మనము చెప్పుకున్నాము.


భగవంతుడు అంటే తల్లిగర్భము నుంచి పుట్టినటువంటి వాడు అని మనము అన్నాము. సాధారణ మనిషిలాగే భగవంతుడు వస్తాడు అని చెప్పుకున్నాము. దేవుడు మనిషి మాదిరి వచ్చి మనకు జ్ఞానము చెప్పితే మనకు జ్ఞానము తెలుస్తుంది, అంతవరకు మనకు తెలియదు. దేవుడు భగవంతుడుగ వస్తాడు. భగవంతుడంటే భగము నుంచి పుట్టినట్టివాడు అని అర్థము. భగము అంటే తల్లిగర్భము. తల్లిగర్భము నుంచి సజీవముగా పుట్టిన వాడే భగవంతుడు. భగవద్గీతలో ఏదైతే ఉందో బైబిలులో అదే ఉంటుంది, ఖుర్ఆన్ లో కూడా అదే ఉంటుంది. ఈ రకంగా వేరు వేరు జ్ఞానము ఉండదు. ఈ వాక్యా వాక్యానికి వ్యతిరేఖ జ్ఞానము మిగితా రెండు గ్రంథాల్లో ఉండదన్నప్పుడు, దీంట్లోది దాంట్లో ఒకేమాట ఉంటుంది, కానీ కనుక్కోలేదు మనము. ఇప్పుడు నాకు ఎందుకు కనిపించింది? మీకు ఎందుకు కనిపించలేదు? అంటే అదే ఉండే ప్రత్యేకత. నాకు శ్రద్ధ ఉంది, మీకు శ్రద్ధ లేదు. నాకు శ్రద్ధ ఉంది కాబట్టి నాకు కనిపించింది. నాకొక శాసనము ఉంది. దీంట్లో ఉండేదే ఇంకో దాంట్లో ఖచ్చితముగా ఉంటుంది అని నాకు తెలుసు. కాబట్టి నేను ధృఢనిశ్చయముతో ఉన్నాను. ఆ ధృఢ నిశ్చయము ప్రకారము నాకు అది కనిపించింది. 89వ సూరా 22 వ ఆయత్లో “దేవదూతలు బారులు తీరియుండగా దేవుడు ఉద్భవిస్తాడు అని ఉంది. దేవుడు పుడతాడు అని దాని అర్థము.అంతేకాక 15వ సూరా 28, 29, 30 ఆయత్లలో 'దేవున్ని మనిషిగా పంపుతాను' అని పెద్ద

అల్లాహ్ చెప్పాడు.


---

మరి అక్కడ పుడతాడు అని ఉంది కదా! అంటే దానిపై వాక్యము 22 వాక్యము చదువు ఏముందో అని అన్నారు. 22 వాక్యములో పుడతాడు అని ఉంది. 21వ వాక్యములో ఏముందంటే "భూమిని ఎడా పెడా దంచి తుత్తునియలు చేసినప్పుడు, తునకలుగా కావించినప్పుడు, అప్పుడు నీ ప్రభువు ఉద్భవిస్తాడు అంటే నీ దేవుడు పుడతాడు” అని ఉంది. దైవదూతలంతా బారులు తీరియుండగా దేవుడు ఉద్భవిస్తాడు అని 22వ వాక్యములో ఉంది. 21, 22 రెండు జాయింట్ వాక్యాలు. 21వ వాక్యములో 'భూమిని ఎడా పెడా దంచి తుత్తినియలు చేసినప్పుడు అంటే తునకలు తునకలు చేసినప్పుడు', మళ్ళీ 22 వ వాక్యములో 'దేవదూతలంతా బారులు తీరియుండగా దేవుడు అవతరిస్తాడు' అని ఉంది. ఇప్పుడు అక్కడ భగవద్గీతలో ఏదైతే చెప్పినారో అదే వాక్యమే అక్కడ ఉంది కానీ వేరు కాదు అని మనము అంటున్నాము. ఇది ముస్లీమ్ సమాజానికంతా అది కనిపించలేదు. ఇస్లామ్ మతానికి అంతా అది కనిపించలేదు. భగవద్గీతలో మామూలుగా దేవుడు పుడతాడు అంటే మా దాంట్లో పుట్టడము లేదు అని ముస్లీమ్లు అంటున్నారు. మనకు కనిపించినది వారికి ఎందుకు కనిపించడము లేదంటే వారికి దాని మీద శ్రద్ధ లేదు. మరి వాళ్ళకు హదీసుల మీద శ్రద్ధ ఉంది? వాళ్ళ శ్రద్ధ వాళ్ళకు ఉంది. కానీ ఖుర్ఆన్ గ్రంథము మీద శ్రద్ధ భక్తి లేదు. మనము ప్రార్థనా మందిరాలలో పోయి చేసేటువంటి శ్రద్ధ ఎంత ఉందో, అంత శ్రద్ధ ఖుర్ఆన్ గ్రంథములో పెట్టుకోలేదు. దేవుడు అయిన అల్లాహ్ మీకు గ్రంథాన్ని ఇచ్చాను, అందులో జ్యోతిని ఇచ్చాను అన్నాడు, జ్యోతిని అంటే వెలుగును. మార్గదర్శకతను ఇచ్చాను అన్నాడు. నువ్వు ఎలా నడుచుకోవాలో ఆ మార్గదర్శకత ఖుర్ఆన్లో ఉంది.ఆ మార్గము ప్రకారము నడుచు నువ్వు. ఆ జ్యోతిని ఉపయోగించుకొని నడుచు నువ్వు అని చెప్పాడు.



----


కానీ మనము గ్రంథాన్ని ప్రక్కన పారేశాము. దానిని ముట్టుకోవడము లేదు, దానిని చదవడము లేదు, చూడడము లేదు. దాంట్లో వాక్యాలు అర్థము చేసుకోవడము లేదు. అర్థము చేసుకోకుండా మీ జ్ఞానము వేరు, మా జ్ఞానము వేరు అనేటటువంటి తేడాలు కల్పించుకున్నాడు మనిషి. అటువంటి తేడాలు పనికిరావు. దేవుని లెక్కలో అది వ్యతిరేఖము అయితుంది. దేవుడు చెప్పిన దానినిబట్టి ఆయన వాక్కులకు తిరుగుండదు. ఆయన మాటకు తిరుగుండదు. ఆయన ఎక్కడ చెప్పినా ఒకటే వాక్యము చెప్తాడు, కానీ రెండు మూడు మాటలు ఆయన చెప్పడు. ఈ మూడు దైవ గ్రంథాల్లో ఉండేది దేవునివాక్యాలే అని చెప్పినాము. సృష్టి ఆదిలో దేవుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని సూర్యుడు మనువుకు చెప్పితే 5000 సంవత్సరాల పూర్వము కృష్ణుడు అదే జ్ఞానాన్నే అర్జునునికి చెప్పాడు. ఎప్పటి జ్ఞానము అది? సృష్ఠి ఆదిలో దేవుడు చెప్పినటువంటి జ్ఞానము. 5152 సంవత్సరాల పూర్వము భగవంతుడు మనకు భగవద్గీత రూపములో చెప్పాడు. 2000 సంవత్సరాల పూర్వము బైబిలు గ్రంథములో మనకు జ్ఞానము చెప్పబడింది. బైబిలు గ్రంథములో కూడ మొత్తము బైబిలు అంతా పనికి రాదు. అందులో నాలుగు సువార్తలే పనికొచ్చేది. ఆ నాలుగు సువార్తల్లోనే చెప్పబడింది జ్ఞానము. తరువాత ఖుర్ఆన్ గ్రంథము ఉంది. ఆ ఖుర్ఆన్ గ్రంథమును జిబ్రయేల్ వచ్చి చెప్పాడు. జిబ్రయేల్ ఒక గ్రహము, సూర్యగ్రహము లాగా ఉండే ఒక గ్రహము, అప్పుడు సూర్య గ్రహము ద్వారా భూమి మీద తెలిసినట్టే ఖుర్ఆన్ జిబ్రయేల్ ద్వారా తెలియబడింది. ఈ జ్ఞానమును సూర్యగ్రహమే జిబ్రయేల్ అను పేరుతో 1400 సంవత్సరాల పూర్వము అరబ్ దేశములో మహమ్మద్ ప్రవక్త అనే వ్యక్తికి చెప్పడము జరిగింది. జిబ్రయేల్ అనే ఆయన తెరచాటు నుంచి చెప్పినటువంటి వాక్కులు అని మనము అర్థము


----

చేసుకున్నాము. వీళ్ళు ఇద్దరు వ్యక్తులు కనిపించి చెప్పారు. ఎవరు? కృష్ణుడును, ఏసు. వీళ్ళను భగవంతుడు చెప్పినటువంటి వాక్యాలు అంటాము. నిజముగా పరమాత్మ పంపించిన దూతలు చెప్పినటువంటి వాక్యాలు బైబిలు గ్రంథముగాను, భగవద్గీత గ్రంథముగా ఉన్నాయి.


సృష్టి ఆదిలో సూర్యుడు భూమిమీద మనువు అనే వ్యక్తికి చెప్పినట్లు, ఇప్పుడు కూడా సూర్యుడు జిబ్రయేల్ అను గ్రహము చెప్పినటువంటి వాక్యాలు ఖుర్ఆన్ గ్రంథముగా ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికే తారుమారైపోయింది. జిబ్రయేల్ని దూత అంటున్నారు. వాస్తవముగా దూత అనే పేరు కృష్ణునికి, ఏసుకు ఉండాలి. అయితే జిబ్రయేల్ దూత కాదు, దేవుని దగ్గర నుంచి పంపబడలేదు, ఉండేవాడే చెప్పాడు. అంతేగాని దేవుని దగ్గర నుంచి రాలేదు. దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వాడు దూత అయితాడు. దూత అంటే వార్తను తీసుకొచ్చినటువంటివాడు అని అర్థము. అది కూడా మనకు తెలియకుండా పోయింది. సరే ఈ రోజు మనము ఎట్ల తెలుసుకున్న గానీ అక్కడేముంది మళ్ళ దేవుడు భగవంతునిగా శరీరము ధరించి పుట్టి, అంటే తల్లిగర్భములో నుంచి పుట్టి, ఆయన మళ్ళీ ధర్మాలు తెలియజెప్తాడు, ఎప్పుడైతే అధర్మాలు చెలరేగిపోయినాయో ఆ రోజు ధర్మాలు తెలియజేస్తాడు అని ఉంది కదా! అదే విధముగానే మళ్ళీ మనకు జ్ఞానము తెలియకుండా పోయినప్పుడు దేవుడు అవతరిస్తాడు అని చెప్పాడు కదా! అంటే మళ్ళ ఇంకోసారి వస్తాడు. ఇప్పుడు మనకు రెండుసార్లు వచ్చినట్టు గ్యారెంటీ అయిపోయింది. ఒక గ్రహము చెప్పినట్టు ఒక గ్రంథము గ్యారెంటీ అయిపోయింది. మూడోసారి కూడ వస్తాడు అని ఒకటి గ్యారెంటీ వచ్చింది మనకు. ఎందుకంటే ప్రథమ దైవగ్రంథము ఏమో భగవద్గీత, మధ్యమ దైవగ్రంథము లేక ద్వితీయ దైవగ్రంథముగా బైబిలు, అంతిమ దైవగ్రంథముగా


---

ఖుర్ఆన్ గ్రంథము గలవు. ఈ మూడు గ్రంథాలే ఉండేది మనకు. అంతిమ దైవగ్రంథములో ఈ మాట చెప్పబడివుంది. మరి దాని ప్రకారము దేవుడు రావాలి. దేవుడు ఎట్ల వస్తాడు అంటే భగవద్గీతలో ఒకచోట చెప్పాడు. నేను భగవంతునిగా వస్తాను అని ఆయన! చెప్పినాడు కదా. తన తల్లిగర్భము నుంచి పుట్టిరావాల్సిందే. ఆ రకంగా వచ్చాడు కృష్ణుడు మరియు ఏసు. ఆయన వచ్చి జ్ఞానము చెప్పిపోయాడు కదా. సరే ఇప్పుడు ఈ రోజు మనకు వస్తే, ఎట్ల వస్తాడు? అంటే అట్లే రావాలి, ఇంక ఎట్ల వచ్చేదానికి అవకాశము లేదు. అయితే ఒకవేళ గ్రహము వచ్చి చెప్పిందనుకో అప్పుడు దానిని తెరచాటు నుండి చెప్పాడు అని అంటున్నాము. దూత అనము గ్రహమును, ప్రతినిధి అనము. నేను నా ప్రతినిధిని పంపిస్తాను అన్నప్పుడు ఏమైతుందంటే ఆయన దగ్గర నుంచి రావాల్సిందే. తిరిగి భగవంతుడు రావాల్సిందే.


ఉదాహరణకు ఖుర్ఆన్లోని ఒక వాక్యము చెప్పుకుందాము. దేవుడు మనిషిని మట్టితో తయారు చేశాడు అని ఉంది. అన్ని తిక్క తిక్క మాటలు మాట్లాడతారు? మట్టితో ఎట్ల తయారు చేస్తాడు? ఎముకలు కండలతో తయారుచేశాడు అని మనము అనుకుంటాము. కానీ ఖుర్ఆన్ గ్రంథములో అట్లే వ్రాసారు. మనిషిని దేవుడు మట్టితో తయారు చేశాడు. తయారు చేసి ఆ పైన వానికొక గడువును ఇచ్చాడు. తరువాత రెండవ గడువు కూడ ఆయన వద్దే ఉంది అని నాలుగే నాలుగు వాక్యములు ఉన్నాయి. చిన్న చిన్న వాక్యాలు ఉన్నాయి? అంటే అది ఎట్లు అర్థము కాకుండా పోతుంది అనేదానికి చిన్న ఉదాహరణ చెప్తున్నాను. దేవుడు మనిషిని మట్టితో చేసాడు. ఆ పైన ఒక గడువును ఇచ్చాడు, తరువాత రెండవ గడువు కూడ ఆయన వద్ద ఉంది. రెండవ గడువు ఆయనకు తెలుసు. మీరు సంశయములో పడి పోయినారు అని ఆయన గ్రంథములో


----

చెప్తున్నాడు. మీకు సంశయములో పడకుండా ఉండేటటువంటి శ్రద్ధ లేదు. శ్రద్ధ ఉంటే సంశయాలు లేకుండా జ్ఞానమర్థమౌతుంది. కానీ ఈ విషయము బ్రహ్మముగారు తత్త్వాలు చెప్పినట్టు ఉంది, మనకు అర్థము కాదు అనుకుంటారు. మనిషిని మట్టితో తయారు చేసాడు తరువాత గడువును ఇచ్చాడు, తరువాత రెండవ గడువు ఆయన దగ్గరే ఉంది, మీరు సంశయములో పడిపోయారు. మీకు ఏమి అర్థము కాలేదు అన్నాడు. మనము వివరము చెప్పుకుంటే ఇది గొప్ప జ్ఞానముగా తెలుస్తుంది.


ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటిది రహస్యముగా ఉన్నాగాని మాకు ఎందుకు అర్థమైంది? అంటే మాకు భగవద్గీత అర్థమైంది కాబట్టి ఇది కూడా అర్థమైంది. భగవద్గీతలో ఉండే జ్ఞానమే ఇది కావున అది సులభముగ అర్థమైంది. ఇటువంటి వాక్యాలే ఇప్పుడు మేము ఖుర్ఆన్ గ్రంథములో వివరముగా వ్రాస్తున్నాము. ఖుర్ఆన్ గ్రంథములో ఇటువంటి వాక్యాలు అన్ని చేకూర్చి, ఏరుకొని రాస్తున్నాము. అంటే 6236 వాక్యాలుంటే నేను నాకు అర్థమయిన కొన్ని వాక్యములనే వ్రాస్తున్నాను. నాకు అన్ని అర్థము కాక, నేను రాయలేదు. కొన్ని వాక్యములు నాకు అర్థమైనవి కాబట్టి వ్రాస్తున్నా.


ఒక వాక్యాన్ని విడదీసి చెప్పితే ఎంతో వివరము అర్థమైపోతుంది నీ తలకు వివరము అర్థమైనప్పుడు దేవుడు దగ్గరయిపోతాడు నీకు. అర్థము కానప్పుడు దూరము అయిపోతాడు. ఇప్పుడు నేను చెప్పిన వాక్యము ఉంది కదా! మట్టితో చేశాడా? అంటే మట్టితోనే చేశాడు అని చెప్పాము. మట్టితో చేయలేదని ఎవరు చెప్తారు చెప్పండి. ఒక కుమ్మరి ఉన్నాడు, కుమ్మరి ఒక బొమ్మను చేశాడు. ఏమిటితో చేశాడు? అంటే మట్టితో చేస్తాడు. మట్టితో ఎట్లు చేశాడు? ముందు మన్ను తెచ్చుకుంటాడు. తర్వాత మట్టిలో నీళ్ళు


---

కలుపుతాడు. అది నీళ్ళలో బాగా బంక వచ్చేటట్లు కలపాలి. ఇట్ల కొట్టి అట్ల కొట్టి ఇట్ల కుమ్మి అట్ల కుమ్మి కుమ్మి కుమ్మి దానిని మెత్తగా చేస్తాడు అందుకే అతనిని “కుమ్మరోడు" అంటారు. కుమ్మేదాని వలన “కుమ్మరోడు” అని పేరు వచ్చింది. ఈ రకంగా మట్టినంతా కుమ్మి మెత్తగా చేసి దానిని బొమ్మ చేస్తాడు. బొమ్మ చేసిన తరువాత గాలికి ఆరబెడతాడు. ఆరబెట్టిన తరువాత గట్టిగ అయిపోతాది. గట్టిగ అయిపోయినాగానీ మళ్ళీ వానపడితే నీళ్ళలోపల వేస్తే కరిగిపోతాది. అది అట్ల కరిగిపోకుండా శాశ్వితముగా ఉండాలంటే మట్టిని అగ్గితో కాలుస్తాడు. మన కుండలు కూడా తయారు చేసేటప్పుడు కుండంతా తయారై ఆరిపోయి తర్వాత ఆరబెట్టిన తరువాత పొయ్యిలో పెట్టి కాలుస్తారు. కాల్చినప్పుడు గట్టిగ అయిపోతది. మామూలుగా కాల్చకముందు మట్టితో చేసిన కుండను తీసుకుపోయి మళ్ళా నీళ్ళలో వేస్తే మొత్తము అంతా కరిగిపోతాది. అదే నీళ్ళు వేసినా గట్టిగా ఉండాలంటే అగ్గితో కాల్చాలి. ఇది ప్రకృతి సిద్ధాంతము. ఈ విధానము తెలియుటకు దేవుడు ఏమి చెప్పినాడంటే పంచభూత నిర్మితమైనవి బొమ్మలు అని చెప్పాడు. 'మనమంతా బొమ్మలమే ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి కలిసుంటే మనమున్నాము. అది కూడ ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి కలిసుంటే అవుతుంది బొమ్మ. మొట్టమొదట మన్ను తీసుకున్నామా, అక్కడికి భూమి అయిపోయిందా! దాంట్లోకి నీళ్ళు కలిపినామా, నీళ్ళు అయిపోయిందా! మళ్ళీ గాలికి ఆరబెట్టినామా, గాలి కూడ అటాచ్ (Attach) అయిందా దానికి! మళ్ళీ అగ్గి పెట్టి కాల్చినామా, అగ్ని అటాచ్ అయిందా! అంత అయిపోయినంక శూన్యములో నిలబెట్టి నామా, శూన్యము కూడ అటాచ్ అయింది! ఐదు కలిసిపోయాయి. కాబట్టి అది బొమ్మ అయింది.


----

ఒకవేళ దానిని గట్టిగా గీకినామనుకో ఏమొస్తుంది? మన్నే వస్తుంది. మట్టితో చేసిన బొమ్మ కాబట్టి మన్నే వస్తుంది. మన శరీరములో కూడా ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అన్ని ఉన్నాయి. వేడి లేదా? మనలో ఉంది. నీరు లేదా? ఉంది. మన శరీరములో మట్టి లేదా? ఉంది. శరీరము మీద ఎక్కడయినా రుద్దు మన్నే వస్తుంది. స్నానము చేసేటప్పుడు రుద్దుక్కున్నాగానీ అప్పుడు శుభ్రముగా ఉంది, ఏమి లేదు అనుకున్నాగానీ అప్పుడు కూడ మన్నే వస్తుంది. మట్టితోనే శరీరము తయారయింది అని గుర్తు. ఈ విధముగా పంచభూతాలు మనలో ఉన్నాయని, మనము పంచ భూతాలతో తయారు చేయబడినాము అని అర్థమయిందా! సాధారణ బొమ్మ ఎంతో మనము కూడా అంతే. మనము కదిలే బొమ్మ, అది కదలని బొమ్మ. మనకు ప్రాణముంది, బొమ్మలో లేదు అనుకోవద్దండి. దానిలో కూడా ప్రాణము ఉంది. పంచభూత నిర్మితమైనదానికి ఏ దానికైనా ప్రాణముంటుంది. మనకు ప్రాణము ఉంది, మనము కదులుతున్నాము. మనల్ని “గ్రహ” అంటాము. అంటే గ్రహించుకునే శక్తుంది కాబట్టి మనిషిని “గ్రహ” అంటాము. అట్లే గుడిలో బొమ్మలను 'విగ్రహ' అంటున్నాము.


నీవు చచ్చిపోయిన తర్వాత ఇంకొకనిలో చేరితే వీనికి గ్రహ పట్టింది అంటారు. గ్రహ అనే పేరు అట్ల వచ్చింది. మనిషికి గ్రహించుకునే శక్తి ఉంది. ఏమన్నా చెప్పితే మీరు గ్రహించుకుంటారు కదా. ఆ గ్రహించుకునే శక్తి ఉంది కాబట్టి గ్రహ అంటాము. ఈ బొమ్మల్లో ప్రాణము ఉంటే దానిని ఏమంటాము దానిని "విగ్రహ” అంటాము. మామూలుగా గుళ్ళల్లో ప్రతిమలుంటాయి. ఆ ప్రతిమల్లో జీవము ఉంటుంది. జీవము ఉంటే ఆ దేవున్ని ‘విగ్రహము’ అంటాము. బొమ్మను 'ప్రతిమ' అంటాము, బొమ్మలో ఉండే శక్తిని ‘విగ్రహము' అని అంటాము. ఆ విధముగా దేవుడు మనల్ని


---

బొమ్మలుగా ఎక్కువ శాతము మట్టితోనే తయారు చేశాడు. అందువలన ఖుర్ఆన్ గ్రంథములో సూరా 7, ఆయత్ 34లో మనిషిని మట్టితో తయారు చేశాడు, ఒక గడువు ఇచ్చాడు అని చెప్పాడు. ఎన్నాళ్ళు బ్రతకాలి అని ఒక గడువు ఇచ్చాడో అదే గడువు. ఒక మనిషిని తయారు చేసిన తరువాత వీడు ఇన్ని రోజులు బ్రతకాలి అని దేవుడు (ఆత్మ) ఒక గడువు నిర్ణయము చేసి పెట్టాడు. సరే, కొన్ని రోజులకు వీడు చనిపోతాడు అనుకో, రెండో గడువు కూడ ఆయన వద్ద ఉంది. రెండవ గడువు కూడా ఆయనకు తెలుసు. రెండవ గడువు కూడ నీకు రెడీగా పెట్టుకున్నాడు అంటే ఇంకా రెండవ జన్మ కూడ ఉంది. గడువు అంటే చచ్చిపోయేది. చచ్చిపోవాలంటే వీడు మళ్ళీ పుట్టాలి కదా! 'జాతస్య హిధృవోమృత్యు' అని గీతలో చెప్పినట్లు, ఒకసారి చచ్చిపోయినోడు మళ్ళీ పుట్టాలి కదా. కాబట్టి మళ్ళీ పుడతాడు. వీడు. అప్పుడు రెండవ

గడువు కూడా ఉంది. అంటే ఒకసారి పుడితే మళ్ళీ చనిపోవాలి. మళ్ళీ చనిపోవాలంటే ఇంకోసారి పుట్టాలి, ఈ విధానము క్రమేపి సాగుతూ ఉంటుంది.


ఇట్లు కంటిన్యూగా మనిషి పుడుతూ ఉండాల్సిందే, చచ్చిపోతూ ఉండాల్సిందే. మనిషికి జన్మలు ఉన్నాయి అని ఖుర్ఆన్ గ్రంథములో చెప్పారు. మళ్ళ మనిషికి జన్మలు లేవు అనడము చాలా పెద్ద పొరపాటు. కొందరు ఏమంటారు ఒకచోట మనిషి తిరిగి ఎట్లు పుడతాడు? అని అడుగుతారు. వీళ్ళు దైవానికి దూరముగా ఉండేటటువంటి వాళ్ళు అంటే అవిశ్వాసులు, దేవుని మీద విశ్వాసములేనివాళ్ళు ఏమంటారు? మనిషి తిరిగి పుడతాడా? అని ప్రశ్న వేస్తారంట. పుడతాడనే కదా దైవ గ్రంథములో చెప్పినది. భగవద్గీతలో ఏమి చెప్పారో అదే మనము చెప్తున్నాము. కాబట్టి తప్పనిసరిగా మనిషి మళ్ళ పుడతాడు. జన్మలున్నాయని భగవద్గీతలో ఏమైతే

----

చెప్పబడిందో ఖుర్ఆన్లో కూడా అదే చెప్పబడింది. అంటే భగవద్గీతలో ఏ వాక్యము అయితే ఉంటుందో ఆ వాక్యము దీనికి సమానముగా సమన్వయము అవుతుంది. దానికి దీనికి వ్యతిరేఖత ఎక్కడా ఉండదు. మరి అటువంటి పరిస్థితిలో మనము ఏ దైవ గ్రంథమును చదువు ఒకటే జ్ఞానమే ఉంటుంది. భగవద్గీతన్నా చదువు ఖుర్ఆన్, బైబిలు చదివినా ఒకే జ్ఞానమే ఉంటుంది. నేను క్రైస్తవుడిగా పుట్టాను, నేను బైబిలే చదువుతాను. అంటే బైబిలే చదువుకో, దానిలో కూడ మిగత రెండు గ్రంథాలలో ఉండే జ్ఞానమే ఉంది. నేను క్రైస్తవున్ని కాబట్టి, నేను మతములో ఉన్నాను కాబట్టి నేను బైబిలు చదువుతాను వేరే గ్రంథము ముట్టుకోను అనే అసూయతో క్రైస్తవులు మాట్లాడుచున్నారు. అన్నింటిలో ఒకటే జ్ఞానముంది అనే ఉద్దేశ్యముతో వాడు మాట్లాడడము లేదు. మా జ్ఞానము వేరు అనుకుంటే వాడు వేరుగానే ఉంటాడు. జ్ఞానము వేరుగానే కనిపిస్తుంది. నీకు అందులో ఉండే జ్ఞానము అర్థము కాదు. నిన్న మిర్యాలగూడలో మనకు చెప్పిన సమాచారము, ఒక ముస్లీమ్ ఆమె మన గ్రంథాలు తీసుకొని ప్రచారము చేస్తుంది. గ్రంథాలు బాగున్నాయి, ఖుర్ఆన్ వాక్యాలు కూడా దీంట్లో ఉన్నాయి అని ఆమె చెప్పింది. ముస్లీమ్లు ఏమి చేశారంటే మొహర్రము పండుగ రోజు నువ్వు హిందువుల జ్ఞానము తీసుకొచ్చి ముస్లీమ్లకు ప్రచారము చేస్తావా? అని ఆమెను గుండములోకి త్రోసి కొట్టినారంట. అక్కడ అన్ని ఒక్కటే జ్ఞానమని వాళ్ళకు అర్థము కాలేదు. అది వేరే జ్ఞానము ఇది వేరే జ్ఞానము అనుకున్నారు. సరే, బైబిలులోది ఖుర్ఆన్అది వేరే అని వారు అనుకోవచ్చునేమోగానీ ఇక్కడ మనము వ్రాసిన గ్రంథాల్లో మూడు కలిసి ఉంటాయి. అంతా ఒక్కటేనని అర్థము కాలేదు వాళ్ళకు. మూడు గ్రంథాలలో అర్థము కావాలంటే నువ్వు ఏ గ్రంథమైనా చదువుకో. దానిలో ఒకే జ్ఞానము ఉంటుంది. నేను క్రైస్తవున్ని వేరే గ్రంథము చదివితే మా


---

వాళ్ళు ఒప్పుకోరు నేను బైబిలు గ్రంథమే చదువుతాను. అంటే చదువు, ఎవరు వద్దన్నారు? మేం ఏమి చెప్పాము నాలుగు సువార్తలు చాలు. మిగతా 62 పాఠాల్లో ఒకటి కూడ నీకు అవసరము లేదు. నాలుగే నాలుగు సువార్తలు చాలు. నువ్వు జ్ఞానిగా మారిపోగలవు. సంపూర్ణమైన జ్ఞానము తెలుసుకోగలవు.


వివరముగా చెప్పితే, యోహాన్ సువార్త అని ఒకే ఒక సువార్త చదివినాగానీ సంపూర్ణ జ్ఞాని అయిపోవచ్చు. యోహాన్ సువార్త అని చిన్న పుస్తకము అదొక్కటి చదివినాగాని చాలు. అంటే మీరు హిందువులుగా ఉండి యోహాన్ సువార్త చదువు, బైబిల్ చదువు అంటున్నారే అని కొంతమంది నన్ను ప్రశ్నించవచ్చు. వీళ్ళు హిందువులు, బైబిల్ అంటే వీళ్ళకేమో అలర్జీ అయిపోతాది. భగవద్గీతలో ఉండే జ్ఞానము దానిలో ఉంది. బైబిలును "ఇంజీలు” అంటారు. ఇంజీలు గ్రంథము మొదట వచ్చినటువంటి ప్రథమ దైవగ్రంథము భగవద్గీతను ధృవీకరిస్తావుంది అని ఖుర్ఆన్ వ్రాశారు. మేము చదివిన దానివలన భగవద్గీతను గొప్పగా మిగతా రెండు చెప్పుచున్నాయి అని నాకు తెలిసింది. ఇతరులు మిగతా గ్రంథాలను చదవని దానివలన దాంట్లో వేరు, దీంట్లో వేరు, మనది వేరు అంటున్నారు. మిగతా బైబిలు, ఖుర్ఆన్ భగవద్గీతను ధృవీకరిస్తున్నాయి. ఇవి ధృవీకరిస్తున్నాయని ఖుర్ఆన్ సూరా 5, ఆయత్ 46,48లో సాక్ష్యము చెప్పినప్పుడు ఆ గ్రంథాలను ఎందుకు చూడకూడదు? చూడు మీ ఖుర్ఆన్ గ్రంథములో మా భగవద్గీతను గురించి గట్టిగా చెప్పినారు. ఇది వాస్తవమైన జ్ఞానము అని చెప్పినారు అని ఇతర మతముల వారికి ఎందుకు చెప్పకూడదు? వాళ్ళ జ్ఞానమును మనము ముట్టుకోకూడదు అని ఎందుకు అనుకోవాలి? వాళ్ళ జ్ఞానము, మన జ్ఞానమే అని అనుకోకూడదా! మన జ్ఞానమే అక్కడ ఉంది.


---

కొందరు క్రైస్తవులు, ముస్లీమ్లు నన్ను ఒక ప్రశ్న వేసారు. నువ్వు హిందువు కదా! ఖుర్ఆన్ జ్ఞానము, బైబిలులో జ్ఞానము నీకు ఎట్ల అర్థమైంది? అని అడిగారు. నేను హిందువునే. అక్కడ ఉండేది వేరే అయితే నాకు అర్థము కాదు అనుకోవచ్చు. ఇది అర్థమైనాక అది ఎందుకు అర్థము కాదు? సులభముగ అర్థమవుతాది. కాబట్టి నాకు అది ఇది అని భేదము లేదు. ఎక్కడ ఏమి చెప్పినా నాకు అర్థమైతుంది. నేను దాంట్లో వివరమే చెప్తున్నాను తప్ప నాకు ఇది చెప్పకూడదు, అది చెప్పొచ్చు అని నియమము ఏమి లేదు. నేను చెప్పిన దానివలన పదిమందికి తెలుస్తుంది కదయ్యా! ఇప్పుడు నేను చెప్తున్నాను. బైబిలును ఖుర్ఆన్ ధృవీకరిస్తావుంది. అదే బైబిలు గ్రంథమే మళ్ళ భగవద్గీతను ధృవీకరిస్తుంది. మరి ఇంతకుముందు మూడు గ్రంథాలు రాసిచ్చాము మీకు “స్వర్గము - నరకము”, “జీహాద్” అనే గ్రంథము తరువాత రాత “మూడు గ్రంథములు - ఇద్దరు గురువులు-ఒక బోధకుడు” అని వాటిలో చూడండి ఎంతో వ్రాశాము. వాటిలో రెండు గ్రంథాలు గీతను ధృవీకరిస్తున్నాయి అని చాలా వివరముగా ఉంది. ఈ విషయము తెలిస్తే మీరు వాళ్ళకైనా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ గ్రంథాలు చదివితే ముస్లీమ్లకు, క్రైస్తవులకు తెలియని జ్ఞానము మీకే తెలుసు. వాళ్ళకంటే మీరే ముందుంటారు. వాళ్ళకు మీరు చెప్పొచ్చు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఆసక్తిగా నేర్చుకోవచ్చు, అంత గొప్ప జ్ఞానము ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ మూడు గ్రంథాల్లో ఉండే జ్ఞానము ఒకటే అని తెలుసుకోగలిగితే మూడు ఒకటిగా కనిపిస్తాయి. లేదు వేరు వేరు అనుకుంటే వేరు వేరుగా కనిపిస్తాయి. మీకు అటువంటి పరిస్థితి రాకుండా, భవిష్యత్తులో మూడు గ్రంథాలు ఒకటే రకంగా ఉండాలనే ఉద్దేశ్యముతో భగవద్గీతను త్రైత సిద్ధాంత భగవద్గీతగా వ్రాశాము. ఇప్పుడు “ఖుర్ఆన్లో వజ్ర వాక్యాలు”


----

అని కూడ వ్రాస్తున్నాము. తరువాత "బైబిలులో రత్నవాక్యాలు” అని కూడా వ్రాస్తాము. ఈ మూడు గ్రంథాలు ఏకంగా ఉన్నాయని మీకు అర్థమైతాయి. రేపు ప్రొద్దున మీరు ఎవరికైనా చెప్పొచ్చు. ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.



తేది: 25-12-2015

ఈ నెలలో మీకు మూడు గ్రంథాలు కొత్తవి చేరినాయి. అందులో మేము వ్రాసినటువంటి గ్రంథము ఒకటి "ఏ మతములో ఎంత మత ద్వేషము ఉంది” అని వ్రాయడము జరిగింది. మీరు మీ వెనుక రావణబ్రహ్మ ఫోటోను పెట్టుకొన్నారు ఎందుకు? అని కొందరు అడిగారు. బహుశా ఇది ఒక అనుమానమే అనుకుంటాను. ఇది పెట్టుకోవడములో ఒక అర్థము ఉంది. అంటే ప్రతి దానికి ఒక అర్థము ఉంటుంది. మేము చేసే పని అంతా అర్థముతోనే కూడుకొని ఉంటుంది. ఏమి ఆ అర్థము? అంటే, నేను మీకు కన్పిస్తున్నాను, కన్పించుకోకుండా నా వెనుకల ఒకడున్నాడు, వాడే మాట్లాడుతున్నాడు, వాడే మీకు జ్ఞానాన్ని చెప్తున్నాడు అని ఇంతకు ముందు చెప్పాము. కనిపించే వ్యక్తిగా ఉన్న నేను మీకు ఏమి చెప్పడము లేదుగాని, కనిపించని వ్యక్తిగా ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి మీకు చెప్తున్నాడు. అతను నాలో ఉండేవాడు అని ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. కానీ అతను ఉన్నాడని మీకు రూఢీ కాలేదు కానీ నేనున్నానని మీకు తెలుస్తూవుంది. మీకు బయటకు కన్పించే నేను మాత్రమే మీకు కనిపిస్తున్నాను కానీ, నా వెనుకాల ఇంకొకరు ఉన్నాడని మీకు నమ్మకము కూడ కలగడము లేదు. నా విషయము అట్ల ప్రక్కన ఉంచితే, మీ విషయాన్ని


----

మీరు చూసుకున్నాగానీ, మీరు ఆయన్నే చూస్తున్నా నన్ను చూచునట్లు అనుకుంటున్నారు. ఆయన చెప్పే మాటలు వింటున్నారు. ఆయన చెప్పేది మాకు కొంత అర్థమవుతుంది, కొంత అర్థము కాలేదు అనుకుంటున్నారు మీరు. నేను ప్రశ్న బాగా అడగగలిగాను, నేను అడిగిన ప్రశ్నకు జవాబు వచ్చింది అని నీవు అనుకుంటున్నావుగానీ అది నువ్వేనా? నీ వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా? అని నీవరకు నీవు ఆలోచన చేసుకోలేదు. నా వెనకల ఎవరో ఒకరు ఉన్నట్లు, నీ వెనకల కూడా ఇంకొకరు ఉన్నారు. ఆ విషయము మనము జ్ఞాపకము చేసుకోవాలని ఇంతకుముందు చాలామార్లు నేను చెప్పడము జరిగింది. అయితే దానిని మనము మరచిపోయేటటువంటి స్థితిలో ఉన్నాము అని అనుకుంటున్నారు తప్ప, నేను ఉన్నాను, నన్ను ఆడించేవాడు కూడా ఒకడున్నాడు. విషయము మనము మర్చిపోయి

ప్రవర్తిస్తున్నాము.


ఒక మంచి పని జరిగినా లేక చెడు పని జరిగినా, అది నీ శరీరము ద్వారా ఎట్ల జరిగినాగానీ దాన్ని చేయించినవాడు (చేసినవాడు) ఇంకొకడు అని మనకు తెలుస్తావుంది. ఈ చేయించినవాడు ఎవడు? అనేటటువంటి ప్రశ్నకు వస్తే, మనకు దేవుడు ఇచ్చినటువంటి మూడు గ్రంథాల్లోనూ ఈ విషయము చెప్పబడి ఉంది. నీవు ఏమీ చేయలేదు. పైకి నీవు బొమ్మ మాదిరి కనిపించినా వాస్తవముగా లోపల ఉన్నావు, నిన్ను ఆడించేవాన్ని నేను అని గ్రంథాల్లో ఆత్మ (దేవుడు) చెప్పడము జరిగింది. అయినా అక్కడి మాటను మనము లెక్కపెట్టుకోవడము లేదు. అక్కడి మాటను మనము లెక్కపెట్టుకోకపోవడమే కాకుండా, ఎవ్వరూ మనల్ని ఆడించడము లేదు, ఇదంతా ఏదో భ్రమ, ఇది చెప్పుకోవడమే భ్రమ అని మనము అనుకోవడము జరుగుతావుంది. కానీ దైవగ్రంథాల్లో ఒక విషయము ఉంది అంటే, అది


----

అంత ఆషామాషీగా ఉండదు. అది నూటికి నూరుపాళ్ళు సత్యమై ఉంటుంది అనే నమ్మకము మనము కోల్పోతున్నామన్నమాట. మనకు చిన్నప్పటినుండి ఏదైతే అలవాటు ఉందో దానినే మనము నెమరువేసుకుంటు, నేను తప్ప ఇంకొకడు లేడు అని అనుకుంటున్నాము. కానీ ఆ విషయము మర్చిపోయి, నా వెనకాల ఇంకొకడు ఉన్నాడు అనే ఉద్దేశ్యముతో ఇపుడు నేను మీకు కనిపిస్తున్నా, నా వెనుకాల ఇంకొక ఫోటో ఉండనే ఉంది. ఆ ఫోటోనే రావణబ్రహ్మ ఫోటో అని మీరు అనుకున్నారు. అక్కడ కనిపిస్తుంటుంది కాబట్టి అదే అనుకుంటారు మీరు. కానీ మేమేమి చెప్తున్నామంటే, అది రావణబ్రహ్మ వేషములో ఉన్న నా ఫోటోనే అంటే నా ఆకారమే, ఆ ఆకారాన్ని నా వెనకాల పెట్టుకొని నేను మీ ముందు ఆకారములో ఉన్నాను. అంటే ఇపుడు ఉండే ఆకారము, కనిపించే ఆకారమే. ఈ ఆకారము, ఆ ఆకారమూ రెండూ ఒకటే అనేది మీకు తెలియకుండా అది ఇంకొక రకముగ ఉంది. చూస్తే ఆయన వేరు, ఈయన వేరు అని అనుకుంటాము. ఆయన, ఈయన ఇద్దరూ ఒకటే ఆకారమే అని తెలియదు. అంటే మీకు నా వెనకాల కనిపించే రావణబ్రహ్మ ఫోటోనూ, నా ఫోటోనూ రెండూ ఒకటే ఫోటోలే! కాని దానికి మీసాలున్నాయి, దీనికి మీసాలు లేవు. ఈ రెండు బొమ్మల్లో అంతే తేడా ఉంది. ఇక్కడ ఈ తేడాను పెట్టి చూపడములో అర్థము ఏమంటే, నీ వెనకాల ఇంకొకడు ఉన్నాడు అని నీవు గుర్తుచేసుకో! నా వెనకాల ఇంకొకడు ఉన్నాడని నేను గుర్తు చేసుకుంటున్నాను. అందుకే నా వెనకల ఎప్పటికీ ఒకన్ని పెట్టుకున్నాను. నా వెనుకాల ఎప్పుడూ ఇంకొకడు నన్ను ఆడిస్తున్నాడు. వాన్ని నేను ఎప్పటికీ మర్చిపోకుండ నా వెనకాల వాన్ని పెట్టుకున్నాను. అది మీకు జ్ఞాపకము ఉండాలనే ఉద్దేశ్యముతో మీకు కనిపించేటట్లుగా పెట్టుకున్నాను. లేకపోతే ఆ ఫోటోతో నాకు ఏమీ అవసరము లేదు. ఆ ఫోటో ఉంటే వచ్చే నష్టమూ లేదు, వచ్చే లాభమూ లేదు.


---

అందువలన మీకు ఈ విషయము తెలుసుకొనే దానికోసరమే ఈ ఫోటోను పెట్టడము జరిగిందికాని, ఇంకొకటి ఏమీ లేదు. అయినా ఆ రావణబ్రహ్మ ఫోటోను ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అని అంటే, సరే నేను కాకుండా ఇంకొకడు ఉన్నాడు అనే దానికోసము పెట్టుకొన్నాను. అది మీ ఫోటోనేగా అని కొంతమంది అడుగవచ్చు. కానీ అది మా ఫోటోనే అని చెప్పేదానికి కూడా అవకాశము లేకుండా, నేను కాకుండ ఇంకొకడు ఉన్నాడు అని చెప్పేదానికి దానికి ఇంకొక పేరు పెట్టాము. ఇట్లా మన వెనకాల ఇంకొకడు ఉన్నాడు అని చెప్పుకొనే దానికోసము మేము ఏమి చేశామంటే, ఇంకొకరి ఫోటోను పెట్టుకొని మీ ముందర కూర్చోవడము జరిగింది. మళ్ళ ఇపుడు ఈ వెనకల ఒకడు ఉన్నాడు అనే మాట మీకు చాలాసార్లు మీటింగ్లో చెప్పినాను. మీకు చెప్పినాగానీ దానిని మీరు మర్చిపోతున్నారు. ఆ జ్ఞాపకము ఉండే దానికోసమే ఈ ఫోటోను పెట్టుకున్నాను. ఇది పెట్టుకున్నా మీకు జ్ఞానము అభివృద్ధి అయ్యేందుకే పెట్టినామనుకోండి కానీ ఇంకొకరిని ఎవరినో రేకెత్తించి వాళ్ళను, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు వచ్చేదానికి చూపడములేదు. నా వెనకాల ఇంకొకడున్నాడు, వాడు ఎప్పటికీ ఉంటాడు, నా వెనకాల ఒకడున్నాడనే గుర్తింపుకోసము ఇది పెట్టుకొని చూపించాము అంతేగానీ ఇంకొకటి ఏమీ లేదు. నా వెనకాల ఉన్నట్లే, మీ వెనకాల కూడ ఒకడున్నాడు అని చెప్పాము. అతనే ఆత్మ, ఆత్మను దేవుడు అని కూడా అంటున్నాము. ఆత్మ అనే దేవుడే నన్ను నడిపించేవాడు, ఆడించే వాడు, మాట్లాడించేవాడు, పని చేయించేవాడు. అతనే నా వెనకాలవాడని చెప్పుచున్నాము. ఆయనకంటే వెనకాల వాడు వేరొకడు ఉన్నాడు. అతనిని కూడ దేవుడు అంటున్నాము. ఆయనే ఆత్మకంటే వేరయిన పరమాత్మ, జీవాత్మనయిన నాతో ముగ్గురు అవుతాము. ఆ ముగ్గురుగా ఉండే ఆత్మలను బట్టే మనము "త్రైత సిద్ధాంతము” అన్నాము.

---

“త్రైత సిద్ధాంతము” అంటే ఏదో ఇతర మతాలకు సంబంధించినది

అని మనము అనుకోవాల్సిన పనిలేదు. త్రైత సిద్ధాంతము అంటే హిందుత్వములో ఒక సిద్ధాంతమే అని మనము జ్ఞాపకము పెట్టు కోవాల్సిందిగా చెప్పుచున్నాము. ఈ సృష్ఠి ఆదిలో మనకు దేవుడు జ్ఞానాన్ని చెప్పడము జరిగింది. సృష్టి ఆదిలో మనకు దేవుడు జ్ఞానాన్ని చెప్పితే, ఆ జ్ఞానాన్ని మనము అప్పటికి తెలుసుకోగల్గినాము. అయితే తర్వాత మనము ఈ విషయమంతా మర్చిపోయినాము. పూర్తి తెలిసిన కొందరు తెలుసుకున్నో ళ్ళంతా మోక్షము పొందడము జరిగింది. వాళ్ళు మోక్షము పొందిన తరువాత ఎందరో అజ్ఞానులుగా మిగిలిపోతా వచ్చారు. అజ్ఞానులుగా మిగిలిపోయి, అజ్ఞానము పనులు చేస్తూ వచ్చారు. జ్ఞానము అనేది ఏమాత్రము తెలియకుండాపోయింది. జ్ఞానము తెలిసినోళ్ళంతా మోక్షానికి వెళ్ళి పోయినారు కదా! జ్ఞానము తెలియని వాళ్ళము మిగిలిపోయినాము. మళ్ళీ మనకోసము జ్ఞానాన్ని చెప్పాలంటే మళ్ళీ రెండోసారి మనకు గుర్తు చేస్తూ మొట్టమొదట చెప్పిన జ్ఞానాన్నే మనకు తెలియజేశాడు. ఆ చెప్పిన జ్ఞానములో ఏముంది అంటే, నీ శరీరములో మొత్తము మూడు ఆత్మలు ఉన్నాయి. ఒక ఆత్మ నీవుగా ఉన్నావు. నిన్ను నడిపించే ఆత్మగా ఇంకొకటి ఉంది. నీవు ఎట్లా నడవలేవు. నీవు ఎట్లా ఏమీ చేయలేవు. నీవు చేతకానివాడివి కానీ నీవు బొమ్మ మాదిరి ఉన్నావు. నిన్ను నడిపించే ఆత్మ ఇంకొకటి ఉంది అని దేవుడు చెప్పడము జరిగింది. మళ్ళీ వీటి వెనకాల అన్నిటినీ గమనిస్తూ ఉండేటటువంటి పరమాత్మ కూడా ఒకటుంది, ఆయనే దేవుడు. ముస్లీములేమో 'అల్లాహ్' అన్నారు. క్రైస్తవులేమో 'యెూవా' అన్నారు. మనమేమో 'పరమాత్మ' అన్నాము, 'దేవుడు' అన్నాము.


ఈ రకముగా ఉండే దేవున్ని మనము ఎట్లా ఆరాధించాలంటే, ఆయన ఎక్కడుంటాడో తెలియదు, ఎట్లుంటాడో అని తెలియదు, ఎంత


----

చిన్నగా ఉంటాడో తెలియదు, ఎంత పెద్దగా ఉంటాడో తెలియదు, ఏ దిక్కున ఉన్నాడని తెలియదు, పైన ఉన్నాడని తెలియదు, క్రింద ఉన్నాడని తెలియదు, ఏ ఆకారము లేదు, అటువంటివానిని మనము ఏమని పూజించాలి? పేరు పెట్టి పూజించేదానికి ఆఖరుకు పేరు కూడా లేదు. కాబట్టి ఆయనను మనము ఏమి చేయాలి అని అంటే, అటువంటి ఆయనను మీరు ఏమీ చేయలేరు. అటువంటి ఆయనను తెలుసుకోవాలి, అతనిలోనికి చేరి పోవాలంటే నీకు మధ్యవర్తి ఒకడున్నాడు అని, ఆయనకు మనకు మధ్యలో ఇంకొకరిని పెట్టడము జరిగింది. అదే నీ వెనుకవాడు. మనము ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పుకుంటే ఆయనను మనము 'ఆత్మ' అంటాము. దేవున్ని 'పరమాత్మ' అంటాము. మనల్ని మనము 'జీవాత్మ' అని చెప్పు కుంటున్నాము. జీవాత్మకు, పరమాత్మకు అంటే జీవునికి, దేవునికి మధ్యలో ఒక ఆత్మ ఉంది. అది ఇంతవరకు ఎవరికీ తెలియబడలేదు. అంటే మనకు ఎందుకు తెలియబడలేదు? మన పూర్వ సిద్ధాంతము ప్రకారము, మన ఆధ్యాత్మిక జ్ఞానము ప్రకారము చాలామంది ఎంతో జ్ఞానాన్ని చెప్పగలిగినారు కదా! మళ్ళీ వాళ్ళు ఇంతమంది జ్ఞానాన్ని చెప్పితే మనకు ఎందుకు తెలియబడలేదు? అంటే ఒక విధముగా వాళ్ళకే ఆ విషయము తెలియదు. జీవుని గురించి అంతో ఇంతో తెలుసు. తర్వాత దేవున్ని గురించి అంతో ఇంతో తెలుసు. కానీ మధ్యలో ఉండేటటువంటి ఆత్మను గురించి తెలియదు. వాళ్ళకు తెలియదు అని మనము ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన హిందూ మతములో సిద్ధాంతకర్తలు అనేవాళ్ళు మనకు ఆ విషయాన్ని తెలియ జేయలేదన్నమాట. ఒకరేమో దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఇంకొకడు లేనే లేడు, జీవుడని నీవు భ్రమిస్తున్నావు. నేను జీవున్ని అనుకుంటున్నావు, అలా నీవు అనుకోవడము అంతా భ్రమ అని ఒకరేమో అద్వైతాన్ని చెప్పారు. ఇంకొకరేమో విశిష్టాద్వైతాన్ని చెప్పారు. విశిష్టాద్వైతములో దేవుడు అనేవాడు


---

ఒకడున్నాడు కాని సాకారరూపములో ఉన్నాడు అని చెప్పాడు. అద్వైత రూపములో ఏమి చెప్పారు? నిరాకార రూపములో ఉన్నాడు దేవుడు, ఆయనకు ఆకారమే లేదు అని చెప్పారు. విశిష్టాద్వైతము అనే దాంట్లో లేదు, దేవునికి ఆకారము ఉంది. ఆకారముతో ఉన్నాడాయన అని ఇంకొక రకముగా చెప్పారు.


ఇట్లా ఒకరు సాకారము అంటారు. ఇంకొకరు నిరాకారము అంటారు. మనకు ఏమీ అర్థము కాని స్థితి ఏర్పడింది. ఎక్కడైనాగానీ మనము ఇంతవరకు నేర్చుకున్నటువంటి జ్ఞానము ప్రకారము ఆత్మ అనేది ఎక్కడా చెప్పబడలేదు. ఈ రకముగా ఆత్మ అనేది ఎక్కడా చెప్పబడనిదాని వలన తెలియకుండాపోయింది కాబట్టి మనము అదే పనిగా కేవలము ఆత్మను గురించి చెప్పుకొనే బోధలే మనము ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఎందుకంటే తెలియని విషయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశ్యముతో ఆత్మకు సంబంధించిన విషయాలే మనము ఇక్కడ చెప్పడము జరుగుతుంది. దానినే విశేషముగా చెప్తున్నాము. పరమాత్మ విషయము మనము ఇపుడు తెలుసుకున్నా నీకు అర్థము కాదు. నీవు ఎంత ప్రయత్నము చేసినా అర్థము కాదది. ఎవరికీ తెలియబడేది కాదు. నీ విషయముతో నీకు అంతకూ అవసరము లేదు. నీవు ఎట్లాంటివాడవైనా ఒకటే! నీవు కర్మలో నిండుకొన్న వాడివేకాని నిన్ను నీవు తెలుసుకున్నా ఏమీ ప్రయోజనము లేదు. నీవు తెలుసుకోవాల్సింది ఎవరిని? నీ వెనుక ఉండే వానిని మాత్రమే నీవు తెలుసుకోవాలి. అందువలన నీ వెనకవాడు ఎవరో చూచుకో నీవు! అని మనము ప్రశ్నిస్తూ ఈ విషయాలు మీకు చెప్తున్నాము. సరే, ఇప్పటికే చాలాసార్లు ఈయన చెప్పినాడు. మనమేదో కూర్చుని వినిపోతాము. ఇంక ఇది మామూలేలే. ఇది ప్రతిరోజు చెప్పేదే! వెనుకోడని, ముందరోడని అంటుంటాడు. ఈయనకు అంతకూ ఏమి లేదు.


----

మనమెందుకు ఆయన మాట వినాలి. మనము ఉండేది ఒకరే కదా! మాకు తెలుసు కదా! అని మీరు అనుకున్నా ఏమీ ప్రయోజనము లేదు. మేము చెప్పినమాటలు ఎందుకు మీరు అశ్రద్ధ చేస్తున్నారు. మీ వెనుక ఉండే వాడు ఇంకొకడు ఉన్నాడని మీరు ఎందుకు గమనించడము లేదు. నేనే కాదు ఇంతకుముందు పెద్దోళ్ళంతా ఆ విషయము చెప్పినారు. మళ్ళీ వాళ్ళమాటలనన్నా మీరు లెక్కపెట్టుకోవాలి కదా! అని అంటున్నామన్నమాట.


ఒకానొక రోజు క్రైస్తవ ప్రవక్త అయినటువంటి ఏసుప్రభువును, ఒక న్యాయస్థానములో నిలబెట్టి, ఆ న్యాయాధిపతి ఏమని అడుగుతున్నా డంటే, నేను అడిగిన ప్రశ్నకు నీవు జవాబు చెప్పు, మిగతా ప్రజలంతా నీ మీద ఆరోపణలు చేస్తున్నారు, నీవు చెడ్డవానివి అని. నీవు ఏమైనా చెప్పదలుచు కుంటే నాకు చెప్పు. నేను నిన్ను ఇపుడు క్షమించగలనూ లేకపోతే శిక్ష కూడా వేయగలను. అంటే నేను ఇపుడు తీసుకొనే నిర్ణయము మీద ఆధారపడివుంటుంది, నీవు శిక్షవేయబడేదో లేకపోతే వదిలిపెట్టబడేదో లేకపోతే ఏదైనాగాని నా నిర్ణయము మీద ఆధారపడివుంటుంది. నీవు నాకు నీ పరిస్థితి చెప్పుము. ఈ తప్పు చేసినావా లేదా అని అడుగుతాడు. అపుడు ఏసుప్రభువు ఏమి చెప్పినాడంటే నీవు అనుకుంటున్నావు, నేనేమైనా చెప్పగలనని, నీవు చెప్పినట్టే జరుగుతుందని అనుకుంటున్నావు. అది ప్రపంచములో అందరు అనుకుండే విషయమే అది. కానీ ఎవ్వరు అనుకొన్నట్లు కూడా జరుగదు. నీ లోపల ఇంకొకడు ఉన్నాడు. నీ అధికారి ఒకడున్నాడు. నీపై అధికారి ఒకడున్నాడు. నిన్ను నడిపించే అధికారి ఒకడున్నాడు. వాడు ఏమి చెప్పమని ఆర్డర్ ఇస్తే అదే చెప్తావుగాని నీవు సొంతముగా చెప్పేదానికి అవకాశము లేదు అని చెప్పాడు. సరే, ఆయన ఏమి చెప్పినా నాకు సమ్మతమే! నువ్వు అదే చెప్పు అని చెప్పాడు. అంటే ఆ


----

న్యాయాధిపతికి కూడా అనుమానము వచ్చింది. వాస్తవమే కదా! మన సొంతము ఏమీ లేదు. మనము అనుకొన్నట్లు ఏదీ జరుగదు. మన వెనకాల ఏదో శక్తి ఒకటి నడిపిస్తూ ఉంది. అది మన లోపల మనకు ఊహనిచ్చి, ఇట్ల చెయ్యి అంటే, మనము చేయగల్గుతున్నాము. మనము స్వయముగా ఏమీ చేయడము లేదు కదా! అని అనుకోవడము జరిగిందన్నమాట. అంటే ఆ రకముగా అతనికి జ్ఞాపకము వచ్చింది. మన లోపల ఇంకొకడు ఉన్నాడని. సరే, ఇన్ని రోజులుగా మేము చెప్తున్నాము. కానీ మీరు మీ వెనకాల ఇంకొకడు ఉన్నాడని గుర్తింపుకు తెచ్చుకోవడము లేదు. ఒకవేళ మేము ఎంతగా చెప్పినా మీరు ఇక్కడ మాత్రము ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మన వెనకాల ఇంకొకడు ఉన్నాడేమో అనుకుంటారేమో గానీ, తరువాత బయటకు పోతూనే మర్చిపోతున్నారన్నమాట. ఇపుడు మేము

ఇంత శ్రద్ధగా చెప్తున్నాగానీ కొంతమంది శ్రద్ధగా వింటున్నారు. మేము పూర్తి ధ్యాసతో మీరు తెలుసుకోవాలి, మీరు తెలుసుకోలేకపోతున్నారే అనేటటువంటి ఆవేదనతో మేము చెప్తున్నాగానీ, మీరు కొంతమంది అవును ఇది నిజమే! అని మనము కూడా తెలుసుకుందాము అనే ధ్యాసతో వింటున్నారు. కొంతమంది కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు. అంటే ఇది విలువైన సమయము. నిద్రపోయే సమయము చాలావుంది మీకు. ఆ నిద్రపోయే సమయములో మీరు నిద్రపోవచ్చు కానీ బాగా కళ్ళు తెరుచుకొని తూగకుండా, ఈ మాటలను వినాలని చెప్తున్నాము చూడండి.


ఇపుడేమి చెప్తున్నామంటే, మనకు పూర్వము పెద్దలంతా ఈ జ్ఞానాన్ని బోధించినారు, బోధించినా కానీ మనము అర్థము చేసుకోలేని పరిస్థితిలో ఉండిపోయినాము. అంటే ఈ జ్ఞానము సృష్టి ఆదిలో చెప్పిన బోధలో ఉంది. తర్వాత మూడు దైవగ్రంథాల్లోనూ ఈ విషయాలు ఉన్నాయి కాని

-------

మనకు వివరించి చెప్పేటటువంటి పెద్దలు ఈ మధ్యలో ఉండే ఆత్మను గురించి చెప్పలేదు. అందువల్ల మనము దాన్ని గురించి ఎక్కువ పట్టించు కోవడము లేదు. ఉండేది మనమే అనుకుంటున్నాము, ఇంకొకడు లేడని అనుకుంటున్నాము. ఒక కవిత్వము వ్రాస్తే నేనే వ్రాసినా అనుకుంటాడు. ఒక పాట పాడితే నేనే పాడినా అనుకుంటాడు. ఏ పని చేసినా నేనే చేసినా అని మనిషి అనుకుంటున్నాడు. అట్ల అనుకోవడములో ఆ పని చేసేటటు వంటి ఫలితము అతనికే దక్కుతుంది. ఆ ఫలితము అతను అనుభవించాల్సిన పని కూడా వస్తావుంది. అట్ల లేకుండా మేము ఏమి చెప్తున్నామంటే మీరు ఏమీ చేయడము లేదు. మీ వెనకలవుండే వాడే మంచి పనిని, చెడ్డపనిని చేయిస్తున్నాడు. అది మీరు జ్ఞాపకము పెట్టుకొని, నేను ఏమీ కాదు అని చేయండి. అలా అనుకొని చేస్తే మీరు పని చేసినాగాని పాపము రాదు అని చెప్పాడు. ఈ విషయము నేను ఇప్పుడే కాదు, ఆ రోజు ద్వాపరయుగ అంత్యములో కురుక్షేత్ర యుద్ధములో అర్జునుడు నేను యుద్ధము చేయను అన్నపుడు నీవు చేసేది ఏమీ లేదు, చేయించేవాడు ఇంకొకడు ఉన్నాడు అని ఆయన చెప్పడము జరిగింది. ఎవరు? కృష్ణుడు చెప్పడము జరిగింది అర్జునిడికి. చెప్పితే అపుడు చేసేది నేనే కదా! అనే ప్రశ్న ఈయనకు వచ్చినా గానీ, కృష్ణుడు చెప్పిన విధానాన్ని బట్టి ఓహెూ నేను కాదేమో! అని మళ్ళ అనుమానము వచ్చింది. ఆ తరువాత ఆ అనుమానము తీరేటట్లుగ ఆయన ఏమి చేశాడంటే పూర్తి జ్ఞానాన్ని వివరముగా చెప్పుచూ, చివరకు విశ్వమంతా దేవుడు ఎలా వ్యాపించి ఉన్నాడు? అనే విధానాన్ని కూడా ఆయన చూపించ గల్గినాడు, ఈయన తెలుసుకోగల్గినాడు.


ఆ రోజు చేసే వానివి నీవు కాదు, చేసేవాడు ఇంకొకడు ఉన్నాడు, ఆ పాపము, పుణ్యము నీకు సంబంధము లేదని చెయ్యి అంటే, ఓహెూ



----

అర్జునిడికి కృష్ణుడు ఈ విధముగా చెప్పినాడు కదా! మనము కూడా “మనము చేసేవాళ్ళము కాదు” అని అనుకొని చేస్తే సరిపోతుంది కదా! అని అనుకొంటున్నారు. వీళ్ళ లోపల భావము ఏముంది? “నేను చేస్తాను, నేను కాదు అని చేస్తే సరిపోతుంది కదా!" అని అంటే నీవు ఏమంటున్నా విక్కడ? “నేనే చేస్తాను కాని చేసేటప్పుడు మాత్రము నేను కాదు.” అంటే కృష్ణుడు “నేను కాదు అని చెప్పమన్నాడా?” లేకపోతే “నీవు కాదు అని చెప్పినాడా?” నీవు తాత్కాలికంగా 'నేను కాదు' అనుకున్నంత మాత్రాన ఏమీ కుదరదు, వాస్తవముగ నీవు కాదు అన్న సత్యము తెలుసుకోవాలి. సత్యము తెలుసుకున్నపుడు మాత్రమే నీవు చేయనట్టు. లేదు, ఏ పని చేసినాగానీ 'నేను కాదులే' అని, మళ్ళీ నేనే చేస్తానని అంటే ఏమైతాది? అదే అడుగుతున్నారు కొంతమంది మమ్ములను, ఏమనంటే? “అట్లైతే నేను కాదు అనుకొని ఏమి చేసినా ఫరవాలేదా నాకు?” అని అడుగుతున్నాడు. ఇపుడు ఫరవాలేదు కదా నేనే చేస్తున్నాను అనే ఉద్దేశ్యముతోనే కదా అడుగుతుండేది ఆ మాట! అట్ల కాదు, నీవు చేయలేదు ఏ పని అనే ధ్యాస నీకుండాలి. శరీరము లోపల ఏమి జరుగుతావుంది అనే సత్యము నీవు తెలుసుకోవాలి. అట్లైతేనే నీకు సత్యము తెలిసేది లేకపోతే ఎవరో చెప్పినారు, వాళ్ళు చెప్పినట్లు “మనము చేయలేదు అని అనుకుంటే పీడపోతుంది!” అనుకొంటే అది కాదు, సత్యము తెలుసుకోండి. సత్యము తెలియాలంటే ఏమి చేయాలి? జ్ఞానము కావాలి. జ్ఞానము తెలియాలంటే ఏమి చేయాలి? మనము ఎవరు? మన వెనుక ఉండేది ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలి. కానీ వెనకల ఒకడు ఉన్నాడు అని తెలియజేసే ఉద్దేశ్యముతోనే, నా వెనుక ఒక బొమ్మను పెట్టుకొని చెప్తున్నాము, లేకపోతే ఆ బొమ్మ అవసరము లేదు. ఇంతకుముందు మేము జ్ఞానము చెప్తున్నాము. అపుడు వెనకాల


----

ఏమి బొమ్మ లేదు. కానీ తరువాత ఈ మధ్యకాలములో ఈ ఆత్మను గురించి ఎక్కువ చెప్పుచూ వచ్చినపుడు, మీకు అర్థమయ్యే దానికోసము నా వెనకాల పెట్టుకున్నాను. నా వెనకాల ఎప్పటికీ ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ ఎవరు? అంటే సేమ్ నా ఆకారమే ఉంటుందది. అంటే అది కనుక్కోకుండ ఉండొచ్చుగానీ ఆ బొమ్మ నేనేనూ అని చెప్పొచ్చు. నేనేనూ అంటే చెప్పేవాడు ఎవడు? నేనే. మళ్ళ పలికేది ఎవడు? ఇంకోడు. కదిలేవాడు ఎవడు? ఇంకోడు. చెప్పేవాడు స్వయముగా నేనే అంటున్నాడు. ఈ కదిలేవాడు ఎవడు? అంటే వాడేమి కదల్లేదు, వాని శరీరము కదులుతూ ఉంది, దాంట్లో ఉండే అనుభూతిని వాడు అనుభవిస్తున్నాడు. ఆడించే వానిని నేను అని ఎవడు చెప్తున్నాడు? ఆ వెనుకుండేవాడు చెప్తున్నాడు. ఆ వెనుకుండే వాడు ఎవడు? అని ధ్యాస పెట్టుకోగలిగితే, నేనేమి చెప్పాను వాడు నీ శరీరమంతా వ్యాపించి ఉన్నాడు.


గాజు గ్లాస్ లో నీళ్ళు పోస్తే గ్లాసు ఆకారాన్నే ఆ నీళ్ళు అన్నీ ఆక్రమించుకుంటాయి కదా! ఆ ఆకారములోనే నీళ్ళు ఉంటాయి కదా! ఆ రకంగానే ఒక శరీరములో ఉండే మనిషిలో ఆత్మ నఖ, శిఖ పర్యంతము అంటే వెంట్రుకల మొదలుకొని వాని గోరు వరకు మొత్తము వ్యాపించి ఉంటుంది. వ్యాపించి ఉన్నపుడు ఆ శరీరము ఏ ఆకృతితో ఉందో అదే ఆకృతితో ఆ శరీరములోని ఆత్మ ఉంది అని చెప్పాము. ఇపుడు మళ్ళీ కనిపించేవాడు ఎవడు? పలికేవాడు ఎవడు? అంటే నీ శరీరము కనిపిస్తూ, పలుకుతూ, మాట్లాడుతూ పనులు చేస్తున్నా గానీ ఎవడు మొత్తము నిండుకొని ఉన్నవాడు. మొత్తము శరీరమంతా నిండుకొని ఉన్నవాడు ఎవడు? ఆత్మ. మీరు పలకండి స్వామీ? ఎవరు? ఆ... .. ఫరవాలేదు, బాగానే చెప్పారు, జ్ఞాపకము ఉంది. నిద్ర పోయేవాళ్ళు మేల్కొన్నారు కొంతమంది. ఇపుడు


----

కనిపించే శరీర ఆకారము ఎవరిది? నీ శరీరములో ఉండే ఆత్మదే! నీది కాదు. అర్థమయిందా? నీవు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడున్నావు? నేను ప్రశ్నవేస్తున్నా మిమ్మల్ని, చెప్పండి స్వామీ! ఎక్కడున్నావ్? ఆ... మీ ముఖాన పెట్టుకున్నటువంటి ఈ నాలుగు చక్రాల గుర్తులో, క్రింద గుణచక్రములో ఒక భాగముంది. మూడు భాగాలలో ఒక భాగములో ఎక్కడో ఒక్కచోట ఉన్నావు నీవు. అర్థమయిందా! అంటే అపుడు నీ రూపము ఎక్కడుంది? అక్కడుంది. నా ముక్కు కొస్సిగ ఉంది అని నీవంటే నీ ముక్కు కాదది, నీ ఆత్మ ముక్కు అది. అర్థమయిందా! ఓ హెూ నాకు బోడితల! అంటే బోడితల నీది కాదు నీ ఆత్మది. ఇంకొకటి ఏ రకముగా కున్నా, అది నీది కాదు.

నీ ఆత్మదే అర్థమయిందా!


ఇంతకు ముందు మీరు ఏమనుకున్నారంటే శరీరము నాది, లోపల ఆడించేవాడు ఇంకొకడు ఉన్నాడు అనుకున్నారు కదా! కాదు, లోపల ఆడేవాడు ఇంకొకడు ఉన్నాడు, పైన ఆడించేవాడు కనపడతున్నాడు నీకు. అర్థమయిందా! పైకి కర్తే కనపడతావున్నాడు. ఎవడైతే నీ వెనకాల ఉన్నాడు అన్నామో 'వాడు ముందరే ఉన్నాడు, వెనకాల లేడు. మీకు వెనకల ఉన్నాడు. వెనకాల ఉన్నాడు వెనకాల ఉన్నాడు అని కథ చెప్పుకుంటు వచ్చాము. వెనకాల ఉండేవాడు ముందరున్నవాడే. వెనకాల ఒకడు ఇట్లున్నాడు అని మీకు జ్ఞాపకము కోసమే వెనకాల పెట్టాము. ఆ వెనకాల ఉండేవాడే ముందర ఆకారముతో ఉన్నాడు. మళ్ళీ ముందర ఉండేవాడు ఎక్కడున్నాడు? అంటే ముందర ఉండేవాడు ఎక్కడో లోపల తలలో ఉన్నాడు మనకు. మీకు కూడా తెలుసు ఆ విషయము. జీవాత్మ అనేవాడు తల లోపల ఉన్నాడుకానీ, బయట లేడు. శరీరమంతా వ్యాపించినటువంటి వాడు ఆత్మ అని కూడా మీకు తెలుసు. కాబట్టి ఇపుడు కనిపించే ఆకారము


---

ఎవరిది? ఆత్మదే! పని చేసే ఆకారము కూడా ఆత్మదే. కాబట్టి నేను చేస్తున్నానని ఆ భ్రమను కూడా విడిచిపెట్టి, నేను ఎక్కడో మూల ఉన్నానని మీరు గుర్తుపెట్టుకోండి అంటే సత్యము తెలుసుకోండి. అపుడైతేనే నేను ఏమీ చేయలేదు అని వస్తుంది. లేదు పైకి కనిపించేది నేనే అనుకుంటే నేనేగదా చేస్తుండేది ఎట్ల అనుకోవాలబ్బా! అని అనుకుంటారు, మీకు భ్రమ వస్తుంది. అట్ల ఆ ప్రశ్న కూడా లేకుండా కనిపించేది కూడా ఆయనే, నేను కాదు అనుకోండి. అపుడేమౌతుంది? మీ శరీరములు కూడా మీవి కావు. మీ శరీరమంతా ఎవడైతే వ్యాపించి ఉన్నాడో వానివి ఈ శరీరాలు. అర్థమయిందా! దీనిని గురించి భగవద్గీతలో ఒకమాట చెప్పాడు దేవుడు.


నేను సాకారముగా ఉన్నాను, నిరాకారముగా ఉన్నాను అని. కనిపించేవానిగా ఉన్నాను, కనిపించని వానిగా కూడా ఉన్నానని. కనిపించేవానిగా ఎట్లున్నాడు? నువ్వు ఎట్లున్నావో అట్లే ఉన్నాడు. ఇంతకు ముందు చెప్పినాను. లోపల ఉండేవాడు ఎట్లున్నాడు అంటే సేమ్ నీ లెక్కేవుంటాడు చూసుకో అని చెప్పినాము. నీ లెక్క అంటే ఏమిటి? నీవు కనిపించే ఆకారమే వానిది. ఇపుడు నీవు అనుకుంటున్నావు. ఏమని? ఈ ఆకారము వేరు, లోపల ఉండేవాడు వేరని. లోపల ఎవరు ఉన్నారు? లోపల నీవు ఉన్నావు. ఇంతకుముందు చెప్పిన స్టోరీ అంతా అదే. ఇంతకుముందు చదువుకున్న జ్ఞానమంతా అదే. నీ శరీరము లోపల నీవు ఉన్నావు. నీవు శరీరము లోపల ఉన్నావని చెప్పినానా నేను? శరీరము బయట ఉన్నావని చెప్పినానా? శరీరము లోపల ఉన్నావు అని చెప్పినాము. కానీ మీరు ఏమనుకుంటున్నారు అంటే శరీరము బయట ఉండేవాన్ని నేనే కదా అనుకున్నారు. శరీరము నీది కాదు, ఇంకొకరిది, నీవు దాంట్లో బాడుగకు వచ్చి, అది కూడ ఎక్కడ? ఒక మూల. పూర్తి బాడుగకు కూడా


----

లేవు మళ్ళ ఒక మూల బాడుగకు ఉన్నావు నీవు. ఎక్కడున్నావు బాడుగకు? నీవు నుదుటి మీద పెట్టుకున్నటువంటి నాలుగు చక్రాల్లో, క్రింది చక్రములో ఒక మూల ఒకచోట ఉన్నావు నీవు. అంతేకాని ఇంకొక రకముగా ఏమీ లేవు. వాస్తవముగా ఈ కనిపించే రూపు కూడా నీది కాదు. అపుడేమైతాది ఈ పనిచేసేది కూడా నేను కాదు అని మీకు భావము వచ్చేస్తుంది. ఇంతవరకు మీరు “కనిపించేది నేనేకదా! అలాంటప్పుడు నేనే చేస్తున్నాను కదా! ఎవడో చేసినాడు అనుకొంటే వాడు చేస్తున్నాడో లేదో అనుకున్నారు కదా!” లేదు ఇప్పుడు చేసేవాడంతా వాడే. నువ్వు చేయనోనివి ఎక్కడున్నావు? కన్ను నీది కాదు, చెవి నీది కాదు, ముక్కు నీది కాదు, కాలు నీది కాదు, చేయి నీది కాదు, శరీరము మొత్తము నీది కాదు. అర్థమయిందా! కన్ను చూపకపోతే నీకు విషయము తెలియదు లోపల వుండేవానికి. కన్ను మూసుకో ఏమన్నా తెలుస్తుందా! బయట దృశ్యం? తెలియదు. చెవి వినిపించకపోతే బయట శబ్దము ఏమాత్రము వినిపించదు. కాబట్టి కన్ను, చెవి నీకు చూపుతుంటే లోపల ఉండేటటువంటి వానికి (జీవునికి) విషయము తెలుస్తావుంది. నీవు లోపల ఉన్నావు. శరీరములో ఉన్నటువంటి అవయవాలు పని చేయకపోతే, నీకు ఒక్క విషయము కూడా తెలియదు. మళ్ళీ ఎవరు పని చేస్తావుంటే తెలుస్తుంది? ఆత్మ పని చేస్తావుంటే తెలుస్తుంది.


శరీరము మొత్తము ఎవరు వ్యాపించి ఉన్నారు? ఆత్మ వ్యాపించి ఉంటే నీవు అందులో ఉన్నావు. ఆత్మ శరీరము మొత్తము వ్యాపించి ఉన్నది. మళ్ళీ ఎట్ల ఉంది ఆకారము ఆత్మది? అంటే నీవు ఎట్లు ఉన్నావో అట్లే ఉంది. పైన నీవు ఇట్లున్నానని అనుకుంటున్నావు కదా! నీ శరీరము ఎట్లుందో అట్లే ఉంది నీ ఆత్మ. ఎందుకంటే అది ఒక్క పొర కూడా తేడా లేకుండ అంతా శరీరమంతా వ్యాపించి ఉంది. నేను అందముగా ఉన్నాను


----

అని నీవు అనుకుంటే నీవు అందముగా లేవయ్యా, నీవు ఉండేది ఎక్కడో లోపల ఉన్నావు నీ అందము నీకెట్లా కనిపించింది? అని నేను ప్రశ్న వేస్తా. మీకు మీరు ప్రశ్న వేసుకోండి. ఎక్కడో నీవు లోపల ఉన్నపుడు నీ అందము నీకు కన్పిస్తుందా? ఇపుడు బయట ఉండే వానిదైతే కనిపిస్తుంది. బయట ఎవడున్నాడు? ఆ...నీ శరీరమంతా ఎవడైతే వ్యాపించి ఉన్నాడో వాడు ఉన్నాడు. నీకు కనిపించే అందము నీ ఆత్మది. మళ్ళ నీ ఆత్మ ఏ రకముగా ఉంది. నానా రకాల రూపాల్లో కన్పిస్తావుంది, నీకు నమ్మశక్యము కాకుండా. ఇట్లుంది, అట్లుంది అనుకోకుండా అన్ని ఆకారాలూ ఆయనవే. ఎవరివి? ఆత్మవే!! అన్ని ఆకారాలు మొత్తము ఆయనవే. ప్రపంచములో ఎన్ని ఆకారాలున్నాయో అన్ని ఆకారాలు ఆయనవే. మనుషుల ఆకారాలే కాదు, జంతువుల ఆకారాలతో సహా ఆయనే ఉన్నాడు. జంతువుల శరీరాల్లో కూడా ఆయనే నిండుకొని ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఈ దేవుడనేవాడు ఎవరు? అని ప్రశ్నరావచ్చు. దేవుడనేవాడు ఆయనకంటే పెద్దోడు ఇంకా! ఇపుడు ప్రపంచములో ఉండే ఆకారాలన్ని నీ మధ్యలోని ఆత్మవే అయితే, ఆ మధ్యలో ఆత్మకంటే పెద్దోడు ఇంకొకడు ఉన్నాడు. వాడు ఎంతుంటాడో చూసుకోండి. అర్థమయిందా! ఈయన శరీరాల వరకు మాత్రమే వ్యాపించి ఉన్నాడని చెప్పినాము. శరీరానికి, శరీరానికి మధ్యలో ఈయన లేడు, ఎవరు? ఆత్మ అనేవాడు. శరీరానికి, శరీరానికి మధ్యలో లేడు. శరీరములోనూ, శరీరమంతటా ఉన్నాడు అర్థమయిందా!


అన్ని శరీరాలను వ్యాపించినటువంటి వాడు ఆత్మే! కానీ, శరీరాలకు మధ్యలో, శూన్యములో లేడు. మళ్ళీ శూన్యములో ఎవడున్నాడు? దేవుడని ఎవడినైతే అంటున్నామో వాడు ఉన్నాడు. అంటే ప్రపంచమంతా అణు వణువునా వ్యాపించినటువంటి వాడు దేవుడు. దేవునికి, ఆత్మకు ఏమి


---

తేడా? అంటే, ఆత్మ శరీరము వరకూ వ్యాపించి ఉంది. దేవుడు శరీరము బయట కూడా వ్యాపించి ఉన్నాడు. మళ్ళీ ఆయన ఏమన్నా చేస్తాడా? ఆయన తటస్థుడిగా ఉంటాడు, ఏమీ చేసేవాడు కాదు, ఎవరు? దేవుడు. ఆయనకు రూపము ఉందా? రూపము లేదు. ఎవరికి? దేవునికి. కానీ ఆత్మకు రూపము ఉంది. దేవునికి రూపము చెప్పేదానికి కాదు ఎందుకంటే విశ్వరూపుడు ఆయన, ప్రపంచమంతా ఆయన రూపమే! ఇపుడు కనిపించే ఈ దృశ్యమంతా ఆయన రూపమే. అంటే ఒక మనుషుల రూపమే కాకుండా మనిషికి, మనిషికి మధ్యలో ఉండే సందు కూడా ఆయనే ఉన్నాడు. మనుషులే కాకుండా ప్రతి పదార్థములో ఆయనే ఉన్నాడు. రాయిలో ఉన్నాడు, నీళ్ళలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ప్రతి దాంట్లోనూ దేవుడు ఉన్నాడు. కానీ, దేవుడు ఎక్కడో పైన ఉన్నాడని చాలామంది అంటుంటారు. పైన అనేది ఏమి లేదు. ఆయనకు ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. అణువణువునా సందు లేకుండా ఎవరు ఉన్నాడు? దేవుడు ఉన్నాడు. అది దేవుని విధానము. నీ విధానము ఏమిటి? అంటే దేవుడు ఏ విధముగా పని చేయకుండా ఉన్నాడో, నీవు కూడా పని చేయవు కానీ నీవు ఉండేది లోపల ఉన్నావు.


దేవునికి ఏ విధముగా ఆకారము లేదో నీకు కూడా లేదు కానీ నీవు ఉండేది ఎక్కడున్నావు? ఒక్కచోట, ఒక్క పాయింటుగా, ఒక గుర్తింపుగా ఉన్నావు అంతే!! నీకు ముక్కు, ముఖము ఏమీ లేదు. ఎవరికి? జీవాత్మకు. ఏమీ లేని వానివి కాబట్టి నీవు ఏమీ తెలుసుకోకుండా ఉన్నావు. మళ్ళీ నీవు పనిచేసేవానివి కాదు, పని చేసేవాడు వేరేవాడు. ఆ పనిలో ఉండేటటువంటి సుఖాన్ని, దుఃఖాన్ని మాత్రమే నీవు అనుభవిస్తున్నావు. అని ఇంతకు ముందు చెప్పుకున్నాము మనము. అర్థమయిందా! ఇపుడు మళ్ళ ఆత్మ ఏ రకముగా


----

ఉంది? అని మనము అంటే, భగవద్గీతలో ఆత్మను గురించి చెప్పారు అని చెప్పాను కదా! భగవద్గీతలో పరమాత్మను గురించి కూడా చెప్పారు అని చెప్పాను కదా! భగవద్గీతలో జీవాత్మను గురించి కూడ చెప్పాము. అంటే భగవద్గీతలో జీవాత్మను గురించి, ఆత్మను గురించి, పరమాత్మను గురించి అంటే మూడు ఆత్మలను గురించి ఉంది. కానీ మీరు ఆత్మను గురించి ఎంతమటుకు అర్థము చేసుకున్నారు? అంటే మీరు అంటే మీరు కాదు కానీ, ఇపుడు మన మొదట్నుంచీ ఉండే పెద్ద పెద్ద స్వామీజీలంతా, ఈ భగవద్గీతను బోధించేవాళ్ళంతా ఈ ఆత్మను గురించి ఏమి అర్థము చేసుకున్నారంటే, ఆత్మ అనేదే వాళ్ళకు అర్థము కాలేదు. అది ఆబ్సెంట్ (Absent) చేసుకున్నారు, అసలుకు ఆత్మ అనేది ఒకటుంది అని కూడా వాళ్ళకు తెలియదు. మూడు ఆత్మల విధానాన్ని దేవుడు చెప్పితే రెండు ఆత్మల విధానాన్నే మనిషి అర్థము చేసుకోగల్గినాడు అంటే ఒకటి జీవుడు, రెండోది దేవుడు. ఈ రెండు తెలుసుగాని ఈ మధ్య నుండే ఆత్మ ఏమాత్రము

తెలియకుండపోయింది.


ఇపుడు ఈ భగవద్గీతలో ఒక విధానాన్ని ఒక శ్లోకాన్ని తీసుకొని చెప్పుకుందాము. ఇంతవరకు మనము ఏమి చెప్పినాము? శరీరమంతా వ్యాపించి, కాలు వరకూ, చేయి వరకూ, కన్ను వరకూ, ముక్కు వరకూ అన్ని అవయవాలు, కర్మేంద్రియములు వరకూ వ్యాపించి ఉండి, అది శరీరముతో పనిచేయడము వలన జరిగే పనిలో కష్టము, సుఖాన్ని లోపల ఉండే జీవుడు అనుభవిస్తున్నాడని మనము చెప్పుకున్నాము కదా! సరే, దేవుడు ఏమి చేయడని కూడా చెప్పుకున్నామన్నమాట. ఇపుడు ఈ ఆత్మ అనేది ఏ రకముగా మన శరీరములో ఉంది అనేదానికి 'పురుషోత్తమ ప్రాప్తియోగము' అనే అధ్యాయములో 15వ శ్లోకములో ఈ విధముగా

ఉంది.


----


శ్లో॥ 15ః సర్వస్య చాహం హృది సన్ని విష్ణో మత్త: సృతిర్ జ్ఞానమపోహనంచ | వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహమ్ ||


“నేను అఖిల భూతములనందు హృదయ పీఠి, నా వలన కల్గు స్మృతియు, జ్ఞానంబు, ఊహ ఎరుకపరచు వేదంబులెల్ల నన్నే, వేదఫలదాతను కూడ నేనే”


ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏమంటే నేను సర్వజీవరాసుల హృదయాలలోనూ ఉన్నాను. నా వలన ఊహ, స్మృతి, జ్ఞానము అన్నీ కల్గుతున్నాయి. తరువాత వేదాలు కూడా నన్నే తెలియజేస్తున్నాయి. వేదాలు అంటే ఏమిటివి? ఎన్ని ఉన్నాయి వేదాలు? ఎన్ని ఉన్నాయి? నాలుగు కరెక్టేనా? కాదు మూడే ఉండేది. మీరు పొరపాటు పడుతున్నారు. మన తలలోని గుణాలే వేదాలు. అర్థమయిందా! ఎన్ని? మూడు రకాలే ఉండేది. మనము పేర్లు పెట్టుకున్నాము నాలుగని. దాంట్లో రవ్వంత, దీంట్లో రవ్వంత తీసి, ఇంకొకటి ఉంటే బాగుంటుందని నాలుగు రకాల పేర్లు పెట్టుకున్నాము. కానీ వాస్తవముగా లెక్కేస్తే వేదాలన్ని కలిపి గుణాలనే వేదాలు అంటాము. ఎన్ని రకాల గుణాలున్నాయి మనకు? ఈ మూడు గుణాలు కూడా ఏమిటిని తెలియజేస్తున్నాయి అంటే, ఆ గుణాలను కూడా ఆత్మ కదిలిస్తే అవి కదులుతున్నాయి, ఆత్మ చేపిస్తేనే ఆలోచన చేస్తున్నాయి కాబట్టి, ఈ వేదాలు కూడా ఎవరిని తెలియజేస్తున్నాయి. ఆత్మనే తెలియజేస్తున్నాయి. అర్థమయిందా! మళ్ళీ వేదాలు అనే బుక్కుల్లో ఆత్మ ఉంది అనుకునేరు, అట్ల లేదు. మన శరీరములో తలలో ఉండేటటు వంటి గుణాల్లోనే ఆత్మ ఉంది. ఆ గుణాలు పని చేయాలంటే మన శరీరములో ఆత్మ కదిలించాలి. అర్థమయిందా! ఈ శరీరము మొత్తము అదే ఉంది కాబట్టి ఈ శరీరములో ఉండేదంతా ఆత్మకు సంబంధించినదే అని చెప్పడము జరిగిందన్నమాట


---

అర్థమయిందా! ఈ రకముగా మనము చెప్పుకుంటే ఈ ఆత్మ అనేది శరీరాల రూపములో ఉంది. అది కన్పించినట్లు ఉంది, కనిపించకుండా ఉంది. కనిపిస్తా ఉంది అంటే నీ రూపమే నీ ఆత్మ. అర్థమయిందా! ఇంతకు ముందు ఏమి చెప్పినాము? మీకు అర్థమయ్యే విధానము కోసము మొట్టమొదట ఒక్కసారిగా ఏమి చెప్పినా అర్ధము కాదని నీ వెనుక ఒకడున్నాడు. వాడు చేయిస్తా ఉంటే నీవు చేస్తున్నావు అని చెప్పాము. నీవు చేస్తున్నావు అంటే, శరీరమే నేను, కదులుతా ఉంది నా శరీరమే అనుకున్నాము మనము, కానీ ఇంకా లోతుగా మనము పోయి చెప్తే శరీరమంతా ఆత్మే వ్యాపించి ఉంది.


కాబట్టి మనము ఏమీ చేయలేదు అనే విషయము మనకు తెలిసిపోతుంది. కదిలే శరీరాలు కూడా ఆయనవే కాబట్టి, చేసే యోచన కూడా ఆయనదే కాబట్టి, వచ్చే ఊహ కూడా ఆయనదే కాబట్టి, చేసే మోసము కూడా ఆయనదే కాబట్టి, చేసే దొంగతనము కూడా ఆయనదే కాబట్టి, చేసే హత్యలు కూడా ఆయనవే కాబట్టి, నీకు ఏ పాపము రాదు అనే కదా భగవద్గీతలో చెప్పిండేది! అందరిని చంపు నువ్వు, నీకేమి పాపము రాదు అని చెప్పాడు. చంపు అంటే ఏంది చంపమంటున్నాడు! అనుకుంటారు కానీ వాస్తవముగా పనులు చేసేవాడు వేరు, నీవు కాదు అనే సత్యాన్ని మనము తెలుసుకోవాలనే ఉద్దేశ్యముతోనే ఆ రోజు భగవద్గీతలో విషయము చెప్పినేది. ఇపుడు అది అట్ల అర్థము కాలేదు అనుకోండి అంటే "నేను కాదు అనుకొని నేను చేస్తే సరిపోతుందా?" అంటారు. “నేను కాదనుకొని నేను చేస్తే” అంటే ఏముంది? నీవు చేసినట్టే కదా లెక్క ఊరికనే అనుకుంటే అయిపోతుందా! కానీ సత్యము ఏమి? అంటే వాస్తవముగా నేను ఏమీ చేయలేదు, నేను ఎక్కడనో లోపల ఉన్నాను, ఏమీ చేతకాని


---

వాన్ని, కానీ కర్మలు అనుభవించేదానికి మాత్రమే నేను ఉన్నాను, అనేటటువంటి ధ్యాస మీరు పెట్టుకోగలిగితే అది నిజమైనటువంటి ఆత్మ జ్ఞానము అయితుంది. అర్థమయిందా! ఈ ఆత్మ జ్ఞానము తెలియక చాలామంది పొరపాటు పడిపోయినారు. ఈ శరీరములో ఉండేటటువంటి విధానము తెలియక చాలామంది పొరపాటుపడినారు.

మనకు తెలిసి జ్ఞానము అంటే ఎక్కడ ఈ జ్ఞానాన్ని మనము తెలుసుకోగల్గుతున్నాము? అంటే, ఎపుడైతే శరీరాంతర్గతముగా ఉండేటటువంటి జ్ఞానాన్ని తెలుసు కుంటావో అపుడు నిజమైన జ్ఞానము నీకు తెలుస్తుంది. బయట పూజలు చేసినా, పునస్కారాలు చేసినా, లేకపోతే ఇంకొకటి చేసినా, ఇంకొకటి చేసినా, ఏమి చేసినాగానీ, ఎన్ని యాత్రలు తిరిగినాగానీ, ఆత్మ జ్ఞానము అనేది నీకు తెలియబడదు. అర్థమయిందా! ఇప్పుడు ఇప్పటినుండి ఏమి చేస్తారు? మీరేమి చేస్తారు? మీరు ఏమీ చేయమని ఒప్పుకోండి. అర్థమయిందా! మీరు ఏమి చేయనోళ్ళు అదే చెప్తా ఉండేది. మీరు ఏమి చేస్తామంటే గందరగోళమే! ఖుర్ఆన్ గ్రంథములో ఒక వాక్యాన్ని మేము వ్రాశాము. ఏమి వ్రాశాము? "నేను ఈ పని చేస్తానని నీవు అనొద్దురా నాయనా! నీవు ఏమీ చేయలేవు నీవు చేసేవానివి కాదు" అని కూడా దాంట్లో చెప్పారు. మీరు చదువుకునే వాక్యాల్లో ఒక వాక్యము ఉంది చూడండి. రేపు ఈ పని చేస్తానని నీవు చెప్పొద్దు, నీవు ఏమీ చేసేవాడివి కాదు, నీవు ఏమీ చేయలేవు. అర్థమయిందా! ఒకవేళ చేస్తేనో, గీస్తేనో ఒకవేళ ఏదైనా జరిగితే చేసినేది ఎవరు అది ఆత్మ. ఒకవేళ నేను ఏమి చేయలేదని చెప్పి ఏమైనా నేను చేస్తే జరుగుతాది కదా! అని నీవు అనుకుంటే, నీవు చేయలేదు. ఆ జ్ఞాపకము పెట్టుకోండి. అర్థమయిందా! ఇది మొదటి మన వరకు తీసుకొని ఆలోచన చేసే జ్ఞానమిది. ఏదో పుస్తకాలలో ఉండేటటువంటి జ్ఞానము కాదు.


---

చదువుకుంటే వస్తాది అని అనుకొండే జ్ఞానము కాదు. ఏదో కంఠాపాఠము చేస్తే వస్తాదనే జ్ఞానము కాదు.


ఇపుడు మనము శ్లోకాలు కంఠాపాఠము చేసుకోవచ్చు. దానివల్ల మనకు ప్రయోజనము లేదు. ఇంకోటి చెయ్యొచ్చు, ఇంకోటి చెయ్యొచ్చు అసలుకు నీవు ఏమీ చేయలేవు అనేదే నీకు గ్యారెంటీ. మీరేమి చేస్తారు ఇప్పటినుండి అంటే, మీరు ఏమని ఒప్పుకోవాలి? మేము ఏమీ చేయలేము అని చేతులెత్తేయడము మంచిది! మేము ఏమైనా చేస్తాము అంటే గందర గోళమే! మీరు చేయలేరనే కదా మేము చెప్పుచున్నాము. అందువల్ల నేను ఏమీ చేయలేను అనే ధ్యాస ఉండాలి. మళ్ళీ నీకు చేతనయింది ఏమిటి? అంటే లోపల తలలో నీవు శ్రద్ధ పెంచుకో. అంత తప్ప ఇంకొకటి ఏమీ లేదు. శ్రద్ధ అనేది ఒక పని కాదు, ఇంకొకటి కాదు. నీకు జన్మ హక్కు శ్రద్ధ అనేది. నీవు కావాలని ఆశించడము అది. అది ప్రపంచానికి సంబంధించిన ఆశ కాదుకానీ, దేవుని మీద ఆశ కాబట్టి ఆ శ్రద్ధను నీవు పెంచుకోగలిగితే నీకు దైవత్వము అనేది ఏమిటో అర్థమవుతుంది. అది కాకుండా బయట వ్యవహారాలు ఏవైతే దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారో, నీవు కానీ, నీకు ఉపదేశమిచ్చే గురువులుకానీ, ఇంకా ఎవరైనాకానీ, ఇంకా ఎవరైనాకానీ, వాళ్ళు చేసే పనంతా వ్యర్థము, అది జ్ఞానము కాదు. దైవత్వానికి సంబంధించింది కాదు. నీకు అసలుకే సంబంధము లేదు దాంతో నీవు ఎక్కడున్నావు? ఎక్కడో ఉండి ఎక్కడో ఉన్నట్టు నీవు అనుకొంటే ఎట్లైతాది? అర్థమయిందా! మళ్ళ నిన్ను నీవు తెలుకునేదానికి ప్రయత్నము చేస్తున్నావా ఎప్పుడైనాగానీ? చేయడము లేదు. సరే, ఇది మన విషయము వదిలేస్తాము. చివరకు మనము ఏమి చెప్పుకుంటామంటే పూర్వము మనకు అద్వైత సిద్ధాంతము అనేది ఒకటి 2500 సంవత్సరాల క్రిందటే బయటకు వచ్చింది.


---

ఆదిశంకరాచార్యులు బోధించినాడు. ఇపుడు మనము ఏమి చెప్పు కుంటున్నాము హిందువులంతా, ఆదిశంకరాచార్యుడు హిందుత్వాన్ని కాపాడినాడు లేకపోతే ఇప్పటికి హిందుమతము ఉండేది కాదు. ఆయన హిందూమతానికి గట్టి పునాది వేశాడు అంటున్నారు. అంటున్నారా లేదా ఈ రోజు? హిందువులంతా మొత్తము 90 శాతము అద్వైతము అనేటటు వంటి దాంట్లోనే ఉంది. అద్వైతము అంటే రెండు కావు. అంటే ద్వైతము కావు లేదా ద్వైతము లేదు. మళ్ళ నేను ఒక రోజు గుంతకల్లో ఒక ఆశ్రమానికి పోయాను. దాని పేరు అద్వైతాశ్రమము. ఒకాయన పెద్ద గురూజీ ఉన్నాడక్కడ. అక్కడ ఏమి జ్ఞానము చెప్తారో మనము తెలుసుకోవాలనే ఆకాంక్షతో పోయినాముగానీ, పరీక్షించాలనే ఉద్దేశ్యముతో పోలేదు. అంటే ఆశ్రమాలకు పోతే అంతో ఇంతో జ్ఞానము తెలుస్తుందని. అక్కడికి పోతానే ఏమి చేశాడంటే మమ్మల్ని ప్రశ్నించారన్నమాట. ఎక్కడినుంచి వచ్చినారు? అంటే ఫలానా ఊరి నుంచి వచ్చాము అని చెప్పాము. తర్వాత రెండో ప్రశ్న ఏమి అడిగినారంటే మీరేమి చేస్తారు? అని. అంటే వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకు విలువ ఇవ్వవచ్చునని. వాడు ఏమి ఆదాయము వచ్చే పని చేయలేదనుకో వానికి విలువ ఇవ్వరన్నమాట.


ఆదాయము వచ్చే పని అంటే పెద్ద ఆఫీసరు, ఇంకొకటి, ఇంకొకటి అంటే వానితో బాగా మాట్లాడి ప్రక్కన కూర్చోబెడతారు వాన్ని గౌరవముగా. మీరేమి పనిచేస్తారు? అంటే మేము ఏమీ పని చేయము. ఏదో ఒకటి చిన్న చిన్న పనులు చేసుకొంటాము అంటే, వీళ్ళతో మనకేమి పనిలే! లాభము వచ్చేవాళ్ళు కాదు అనుకున్నారు వాళ్ళు. సరేలే, మీరు దేనికి వచ్చారు అంటే మేము జ్ఞానము వినాలని వచ్చాము ఆశ్రమానికి. అంటే ప్రశ్నలు ఉన్నాయి, వాటిని గురించి తెలుసుకోవాలని వచ్చాము అంటే, ఆ... ఇపుడు


---

మేము చెప్పేదానికి లేదు, మీరు అడిగేదానికి లేదు. సాయంకాలము శ్రవణము ఉంటుంది అంటే వినేదుంటుంది అపుడు చెప్తాము, కావాల్సింటే అపుడు తెలుసుకోవచ్చు జ్ఞానము అని చెప్పారు. అంటే సాయంకాలము ఉపన్యాసము మాదిరి చెప్తాము, అపుడు వినండి అని. సరే, మనము ఏమంటే

సాయంకాలము వరకు చూసినాము. రెండు గంటలకు పోయి సాయం కాలము ఆరుగంటల వరకు అక్కడే కూర్చున్నాము. అంటే ఇంకా అక్కడ ఏమి చేయాలని, అట్లట్ల పోయి మళ్ళీ ఐదు గంటలకే అక్కడికి పోయి కూర్చున్నాము. అపుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అక్కడికి ఉపన్యాసము వినేదానికి రావడము జరిగింది ఆశ్రమములోకి. మేము మొదటనే ఉన్నాము కాబట్టి మొదట్లోనే కూర్చున్నామన్నమాట. మళ్ళీ అంతా రావడము, రావడము సుమారుగా కూర్చున్నారు. మళ్ళీ రవ్వంత సేపు ఉన్నాక ఒక గురూజీ వచ్చాడు అక్కడికి. వచ్చి ఆయనేమి చెప్పినాడంటే, ఇక్కడ ముందర కూర్చుండేవాళ్లు ప్రత్యేకముగ ఉంటారు. మీరు వెనక్కి పోయి కూర్చోండి కొత్తోళ్ళు అన్నారు. అంటే సరేలే, ముందర కూర్చుండే వాళ్ళు ప్రత్యేకముగా ఉంటారేమో అని మనము క్రొత్తగా వచ్చాము, మనకు తెలియదు కదా విషయము అని ఎక్కడో ఒకచోట పోయి కూర్చున్నామన్న మాట. వాళ్ళు ఏమి చెప్పినారంటే ఉపన్యాసము మొదలు పెట్టినారు, అద్వైతము అనేదాని గురించి. రెండు అనేది లేనేలేదు, అంతా పరబ్రహ్మ స్వరూపమే. నేను వేరు, వాడు వేరు అనుకోవడము అంతా పెద్ద పొరపాటు. అంతా పరబ్రహ్మ స్వరూపమే అనుకోవడము మంచిది. ఇది వాస్తవమే, ఇది ఇంతే! ఉండేదంతా పరబ్రహ్మ స్వరూపమే. వాడు వేరు, వీడు వేరు అని, వానిది ఆ పేరు, వీనిది ఈ పేరు అనడము అంతా భ్రమ మీది అని చెప్పినారు. మీరు అజ్ఞానములో ఉన్నారు కాబట్టి మీరు అట్ల అనుకుంటున్నారు అని ఆయన చెప్పారు.


----

సరేలే, మేము అజ్ఞానములో ఉన్నాము, అట్లే అనుకుంటున్నాము, మాకు మొదట్నుంచి అలవాటు అయింది. మనకేమి ప్రశ్న వచ్చిందంటే ముందర మేము కూర్చున్నాము కదా! మమ్మల్ని వెనక్కి పోయి కూర్చోపోండి అంటే ముందర ఒక పరబ్రహ్మ, వెనకాల ఒక పరబ్రహ్మ ఉంటాడా? అంతా ఒకటే అయినపుడు మమ్మల్ని వెనకకు ఎందుకు పొమ్మని చెప్పినారు? అని మళ్ళా ప్రశ్న వచ్చింది. అంటే మనము వినడము పొరపాటా? వాళ్ళు చెప్పడము పొరపాటా? వాళ్ళు చెప్పటమే పొరపాటు, మనము వినడము పొరపాటేమి! కాదు. లేపి వెనకాల కూర్చోపెట్టినారు కదా! అంతా పరబ్రహ్మ స్వరూపము అని నీవు చెప్పేవాడు, మాకంటే వినేవాళ్ళకంటే లేక పోతామానిలే, కానీ చెప్పేవాళ్ళకన్నా ఉండాలి కదా అది! కాబట్టి మనము ఏమనుకోవాలి దాన్ని? మమ్మల్ని లేపి ఎందుకు వెనక్కు పంపించినావు? ఇట్ల ప్రశ్నలు వచ్చేటటువంటి జ్ఞానమన్నమాట అది. దానికి జవాబులు ఉండవు. ఇట్లా అద్వైతము అన్నది విన్న తర్వాత, సరే వీళ్ళు చెప్పేది ఒకవేళ ఎట్లుందో ఏమి కథోగానీ, ఆ మొదట్నుంచి చెప్పినోళ్ళు ఉంటారు చూడు! అంటే పెద్దోళ్ళు వీళ్ళ గురువులు అంటే శంకరాచార్యుని గురించి చెప్పాడు. ఆయన చరిత్ర చదివితే, ఆయన బోధ ఏమిటో మనకు తెలుస్తుందని ఆయన జీవిత చరిత్ర చదవడము జరిగినది. 14 యేండ్ల వయస్సులోనే ఆయనకు సన్యాసత్వము ఇవ్వడము జరిగినది. 14 యేండ్ల వయస్సులో ఎంతమటుకు తెలిసి ఉంటుంది జ్ఞానము ఆయనకు! అంటే మీరే ఆలోచన చేసుకోండి, మీ ఇంట్లో ఓ 14 యేండ్ల పిల్లోడు ఉన్నాడనుకోండి. ఎంత మేధావి అయినా గానీ ప్రపంచ విషయాలైతే జ్ఞాపకము ఉంటాయి కానీ ఈ జ్ఞానము అంత తొందరగా తెలియాలంటే వెనకల జన్మ సంస్కారముతో ముడిపడి ఉంటుంది.


---

జ్ఞానము మాత్రము వాని వ్యక్తిత్వము వచ్చేంతవరకు వానికి రాదు. కనీసము అంటే 25 సంవత్సరాలు నిండితేగానీ వానికి లోపల నుండి జ్ఞానము రాదు. అపుడు ఆయనకు సన్యాసత్వము ఇచ్చి, ఆయనను ఉత్తర దేశమంతా తిప్పడము జరిగింది, దక్షిణ దేశము నుండి. శంకరాచార్యుడిది ఏ రాష్ట్రము భారతదేశములో కేరళ రాష్ట్రము అంటే చివరిలో ఉందది. అక్కడ నుండి తీసుకొని మొత్తము నాలుగు దిశలకు పోయి, నాలుగు పీఠాలను స్థాపించడము జరిగింది ఆయన చేత. అంటే నాలుగు వేదాలకు గుర్తుగా నాలుగు అద్వైత పీఠాలను స్థాపించడము జరిగింది. అంటే ఇపుడు శంకరాచార్యుడు 14 యేండ్ల వయస్సు నుంచి 24 యేండ్ల వయస్సు వరకు ఆయన తిరిగి ఇవి స్థాపించడము జరిగింది. 16 సంవత్సరాల వయస్సులో మొట్టమొదటి పీఠము ఆయన స్థాపించి వాడనుకోండి, నడిచిపోయి. అంటే 16 సంవత్సారాలకే ఆయనకు ఈ అద్వైతము అంటే తెలిసిందా? అంటే వాస్తవముగా ఆ అద్వైతము అంటే ఏమిటిదో ఆయనకు తెలుసు అని అనుకుంటున్నాము కదా! మాకు తెలిసినంతవరకు ఆయనకు ఏమీ తెలియదు. అద్వైతము అంటే ఆయనకు ఏమీ తెలియని స్థితిలో ప్రక్కన వాళ్ళు ఆయనకు పేరు పెట్టి, ఆయనను ఒక వ్యక్తిగా చూపి ఈ రకముగా అద్వైత పీఠాన్ని స్థాపించడము జరిగింది. వేదాలు అంటే ఏమిటివో ఆయనకు తెలియదు. కానీ వేదాలకు గుర్తుగా ఆ రోజు పీఠాన్ని స్థాపించడము జరిగింది. ఆయనను పొగుడుతున్నాము. చిన్న వయస్సులో వేదాలన్ని నేర్చుకున్నాడు, అన్ని విద్యలు నేర్చుకున్నాడని. కానీ మీరు చరిత్ర చూడండి ఎంతమటుకు ఉంటుందో! అది ఎవ్వరికీ సాధ్యము కాని పని అది. అదేందో వాళ్ళు చెప్పినారు మనము విన్నాము. కానీ అద్వైతము అనేది ఆయనకు కూడా అర్థము కాలేదు. అందువలననే వీళ్ళకు ఆయన చరిత్రలోనే అద్వైతము


---

సరిగా లేదు. ఇంకా తెలుసుకున్నటువంటి గురువులకు ఏమి అర్థమౌతుంది? వాళ్ళు సరిగా చెప్పలేకున్నారు. ముందు ఉండే వాళ్ళకు ఒక పరబ్రహ్మ, వెనకల ఉండే వాళ్ళకు ఒక పరబ్రహ్మ అని వాళ్ళ లెక్కలో ఉన్నాగానీ, వాళ్ళు ఏమి చేసినారంటే అంతా పరబ్రహ్మ స్వరూపమే అనుకోండి అని అంటున్నారు. తరువాత భగవద్గీతలో ఒక ప్రశ్న ఉంది. అంటే బ్రాహ్మణుల యందును తరువాత చండాలుడుయందును, ఏనుగులయందును సమ భావము కల్గినటువంటి వాడు జ్ఞాని అని దానిని తీసుకొని చెప్తున్నారన్నమాట. అద్వైతము అంటే ఎట్లుండాలంటే చూడు కుక్కయందు గానీ, ఏనుగుల్లోగానీ, పులులుగానీ, మనుషులుగానీ, బ్రాహ్మణులుగానీ, శూద్రులుగానీ అందరిని సమానముగా చూసేటటువంటి వాడు అద్వైతి అని చెప్పారు.


అపుడు మేము ఒక ప్రశ్న అడగడము జరిగింది. ఏమి అడిగినా మంటే, సరే మనము ఇక్కడ కూర్చున్నాము అనుకోండి. ఒక మనిషి వస్తాడు. వాన్ని పరబ్రహ్మ స్వరూపము అనుకుంటాము. వానిని దేవునిగానే భావించు కుంటాము అంటే అద్వైతసిద్దాంతము ప్రకారము. ఒక ఆవు వచ్చిందను కోండి. అది కూడా పరబ్రహ్మ స్వరూపమే అనుకుంటాము మనము. పైకి ఆవుగా కనిపించినాగానీ అది పరబ్రహ్మ స్వరూపమే అనుకుంటాము. తర్వాత పాము వచ్చిందనుకోండి. ఇంక అది కూడా పరబ్రహ్మ స్వరూపమే అనుకోవాలి కదా మనము! ఒకవేళ భయము ఎక్కువగా ఉన్నాగానీ కండ్లు మూసుకొని గట్టిగ కూర్చుంటే కదలకుంటే అదే పోతాదిలే అని. ఒకవేళ అది మనము గట్టిగ కండ్లు మూసుకొని అట్లే కూర్చుంటే, అది అటు తిరిగి ఎవరు లేడులే అని పోయిందనుకోండి. అబ్బ, అది కూడా పరబ్రహ్మ స్వరూపమే అనుకున్నాము. తర్వాత పులి వచ్చింది అనుకోండి. నీవు కండ్లు మూసుకున్నా అది విడిచిపెట్టదు. అపుడేమౌతుంది? అక్కడ నీవు


---

లేకుండాపోతావన్నమాట. అక్కడ నీ పరబ్రహ్మ స్వరూపమనేటువంటి సూత్రము పనిచేయదది. దాని ఆహారమే మాంసము కాబట్టి నీవు మాంసాహారముగా దొరుకుతావు. నిన్ను చంపందే వదిలి పెట్టదన్నమాట. ఇపుడు అక్కడ ఏమి జరుగుతావుంది అంటే పరబ్రహ్మ స్వరూపము అనేటటువంటి మాట వదిలిపెట్టి, ఇంకొక మాటకు పోవాల్సిందే! కాబట్టి ఈ అద్వైతము అనేది అక్కడ ఫెయిల్ అయిపోతుందన్న మాట. కానీ ఇంకొక విషయము ఏమంటే మనము చిన్నగా ప్రశ్న తీసుకున్నా గానీ రెండు కానిది అని మనము లెక్కేసుకొంటే సున్నా కానిది అంటే ఏమైతాది? ఒకటి అయితాది. ఒకటి కానిది అయితే రెండు అవుతుంది. రెండు కానిది అయితే

మూడు అవుతుందన్నమాట. అద్వైతము అంటే రెండు కానిది అని మనము చెప్పుకుంటున్నాము. రెండు కానిది అంటే ఏమవుతుంది? ఒకటి

చెపుతుందా? మీరు ఎందుకు కాకూడదు? మూడుకావచ్చు కదా  !


అద్వైతము అని పేరు దేనికి పెట్టవచ్చు? త్రైత సిద్ధాంతానికి పెట్టొచ్చు కదా మనము. అంటే పెట్టుకోవచ్చు అట్ల కూడా! అని అది ఖచ్చితముగ నిర్ధారణ చేసి ఒకటా? మూడా? చెప్పలేని పరిస్థితి. ప్రశ్న వేస్తే మూడు కావచ్చు. ఇంకొక రకముగా ప్రశ్న వేసి జవాబు చెప్పుకుంటే ఒకటి కావచ్చు. సరేలే, వాళ్ళు ఒకటే అన్నారు కాబట్టి మనము కూడా ఒకటే అంటాము.


ఈ రకముగా మనము చెప్పుకుంటూ పోతే ఈ అద్వైత సిద్ధాంతములో మనకు గ్యారెంటీ అయినటువంటి జ్ఞానము దొరకలేదు. తర్వాత ద్వైత సిద్ధాంతములోకి పోతాము. అంటే దాంట్లో కూడా మనకు రెండే చెప్పబడినాయి గానీ, ఈ మధ్యలో ఆత్మ చెప్పబడలేదు. సరే, విశిష్టా ద్వైతములోకి వెళ్ళుదాము. అద్వైతము తర్వాత విశిష్టాద్వైతము వచ్చింది. అద్వైతములోకి పోతే నిగుణము, నిరాకారము అని చెప్పారు,


---

విశిష్టాద్వైతములోకి పోతే సగుణము, సాకారము అని చెప్పారు. వాళ్ళు దేవుడనేవాడు ఒకడే అని చెప్పారుగానీ వాడు ఆకారముతో ఉన్నాడు అని చెప్పారు. ఇట్లా అక్కడ పేచీలు వచ్చినాయి వాళ్ళకు. సాకార, నిరాకార అని ఈ రకముగా పేచీలు వచ్చి వాళ్ళు ఒకరికొకరు పేచీ పడటము జరిగింది. తరువాత ఇంకొక విషయము ఏమంటే ఇది సరియైన విషయమని మనకు తెలియనపుడు, మనకు అర్థముకానపుడు, మనము రకరకాల భ్రమలలోకి పోయి అజ్ఞాన మార్గములోకి పోవాల్సిన పని వస్తుంది. కాబట్టి ఏది సరైన మార్గమో మనము తెలుసుకొని మనము అడుగు వేస్తే సరిగా ముందుకు పోతామన్నమాట. అద్వైత సిద్ధాంతము ప్రచారము అయిన రోజు ఆర్యులు నాలుగు వేదాల గురించి ప్రచారము చేశారు. అంటే వాళ్ళు సొంతము చెప్పితే ఆర్యులు చెప్పారు ఇది అని అంటారని, ద్రావిడులు నమ్మరు అనే ఉద్దేశంతో ద్రావిడ దేశానికి వచ్చి శంకరాచారాన్నిపిలుచుకొని, ఆ శంకరాచార్యులు చేతనే గొప్పగా ప్రచారము చేయించి, ఆయన గొప్పోడని ఆయనను ఊరేగించి, ఆ ప్రజలకంతా తెలియజేసేటట్లు చేసి, శంకరాచార్యుని పేరు పైకి వచ్చేటట్లు చేసి, ఆయన గొప్పోడు అని పేరు తెప్పించి, ఆయనకు ఏమీ తెలియకపోయినా ఆయన్ను గొప్పవాన్ని చేసి, ఆయన ద్వారా అద్వైతాన్ని ప్రచారము చేశారు. నాలుగు వేదాలను ఆర్యులు ప్రచారము చేయడము జరిగింది. ఇది అసలైన రహస్యము. శంకరాచార్యుడు చేశాడు అనేది లోపల అందరికి తెలిసినాగానీ, ఇపుడు మనము చేసినాము అన్నాగాని, మన వెనకల ఇంకొకడు చేస్తున్నాడు.


ఆ రకంగానే శంకరాచార్యున్ని పైకి కన్పించేటట్లు చేసి ఆర్యులు ఈ పని చేశారన్నమాట. అది చరిత్రకు తెలియని సత్యముగా నిలిచిపోయింది. తర్వాత ఏమి జరిగింది? అంటే 15 సంవత్సరాలు వీళ్ళు యాత్రలు మొదలు


---

పెట్టి, ఒక 10 సంవత్సరాలు మొత్తము భారతదేశమంతా యాత్రలు చేసి దక్షిణ దేశానికి వచ్చారు. వచ్చిన తరువాత శంరాచార్యునికి అనుమానము మొదలై నన్ను ఎందుకు ఇట్ల తిప్పినారు? ఏమీ తెలియని నా చేత అద్వైత సిద్ధాంతాన్ని ఎందుకు ప్రచారము చేసినారు? అని ఆయనకు అనుమానము వచ్చింది. ఆయనా కొంత తెలివైనవాడే! కానీ వీళ్ళు చేసిన దానినిబట్టి, వాళ్ళు ఎట్ల నడిపించింటే అట్ల చేశాడన్నమాట. ఈయనకు అనుమానము వచ్చి ఏమి చేసినాడంటే, వ్యాసుడు చిట్ట చివరిలో వేదాలకంటే భగవద్గీతే ముఖ్యము అని ఆయన వ్రాసినాడు కదా! ఆ రకముగా ఈయన వ్యాసుడు వ్రాసిన భగవద్గీతను చదవగల్గినాడు. చదివిన తరువాత వేదాలు ముఖ్యము కాదు అని ఈయనకు తెలిసింది. ఎవరికి? శంకరునికి. ఆ శంకరాచార్యునికి తెలిసిన తరువాత ఈయన ఏమి చేశాడంటే ఆ నాలుగు పీఠాలు వదిలేసి

తనకు ఒక ప్రత్యేకమైన పీఠము కట్టుకున్నాడు. ఏది కంచికామకోటి పీఠమని కంచిలో ఒక పీఠము కట్టుకున్నాడన్నమాట, ప్రత్యేకముగా. ఆ నాలుగు పీఠాలకు సంబంధము లేకుండ ఉండాలనే ఉద్దేశ్యముతో ఈయన వేరుగా మఠాన్ని స్థాపించుకొంటే అపుడు వీళ్ళకు సరిపోలేదు, ఎవరికి? ఆర్యులకు. అంటే మన చేతినుండి ఈయన విడిపోతున్నాడు, మనకంటే వేరుగా మారిపోతున్నాడు. మనము ఈయన ద్వారా చేయించిన పని అంతా వృథా అయిపోతుంది అని అనుకున్నారన్నమాట. అటువంటి సమయములో ఆయన్ను తిరిగి తమవైపుకు మార్చుకోవాలని చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు.


ఆ సందర్భములో ఈయన ఏమి చేసినాడంటే భగవద్గీతకు భాష్యము వ్రాసినాడు. ఎవరు? శంకరాచార్యుడు. శంకరాచార్య భాష్య భగవద్గీత అని ఒకటి ఉంటుంది మీకు. ఇపుడు మీరు చూడొచ్చు దానిని. శంకరాచార్యుడు


---

శ్లోకాలకు వివరము వ్రాశాడు. భగవద్గీతకు ఈ ఆర్యులకు ఏమాత్రము సరిపోని దానివలన, భగవద్గీతలో వేదాలే మాయ అని చెప్పిన దానివలన, వేదాలే గుణాలని చెప్పిన దానివలన, అపుడు ఈ భగవద్గీతను వీళ్ళు ప్రచారము చేయకూడదు అనే ఉద్దేశ్యముతో వాళ్ళు ఈ శంకరాచార్యుని ద్వారా వ్రాయబడింది కాబట్టి, శంకరాచార్యుని వాళ్ళు పూర్తి నమ్ముకోకుండా ఈ శంకరాచార్యుడు మన చేతి నుండి పోయినాడు, మన మాట వినకుండా పోయినాడు అని వాళ్ళు గట్టిగా నమ్మి, మళ్ళీ కొన్నాళ్ళు తరువాత ఈ శంకరాచార్యుడు స్థాపించిన పీఠాలన్ని మనకు సంబంధము లేకుండాపోతే, ఈయన ఈ పీఠాలు నాకు సంబంధము లేదు,

పోయినారు. ఇవి అంతా అబద్దము నేను చేయలేదు, నా చేత వేరేవాళ్ళు చేయించారు అంటే, అసలైన రహస్యము బయటపడుతుంది. అపుడు మనము శంకరా చార్యున్ని ముందర పెట్టుకొని చేసిన పని అంతా వృథా అవుతుంది అనే ఉద్దేశ్యముతో వాళ్ళు ఏమి చేశారు? శంకరాచార్యుడే ఆ పని చేశాడు అని నమ్మించే దానికోసము, శంకరాచార్యుడు ఇపుడు ఎట్లుంటే అట్లే ఉండాలనే ఉద్దేశ్యముతో, ఆయనపై కుట్ర చేశారన్నమాట. ఏమి కుట్ర చేశారు? ఈ శంకరాచార్యుడు ఉంటే రేపు ప్రొద్దున ఈ విషయము బయటకు వస్తుంది. వేదాలు సరైనవి కాదు అంటాడు. ఇది జ్ఞానము కాదు అంటాడు. తర్వాత నేను స్థాపించిన పీఠాలు నాకు సంబంధము లేదంటాడు. ఇవి నాకు తెలియకుండానే వేరేవాళ్ళు నా చేత స్థాపించారనే సత్యము చెప్పేస్తాడు, అపుడు మన పనంతా వృథా అవుతుంది కాబట్టి, శంకరాచార్యుడు ఆ మాట చెప్పకముందే చనిపోతే రేపు ప్రొద్దున్న మనకు బాగుంటుంది.


ఆయన ఎట్ల చనిపోతాడు? ఏమి చేయాలి అపుడు? చంపాలి. ఏమి చేయాలి? చంపే ప్రయత్నము చేయాలి. ఆ చంపే ప్రయత్నము


---

కోసము ఏమి చేసినారంటే రెండోసారి మనము పీఠాలను దర్శిస్తాము అని మళ్ళా ఉత్తర భారతదేశ యాత్రను మొదలు పెట్టారన్నమాట. అదే పనిగా ఈయనను తీసుకపోయినారు. సరే వీళ్ళ మాటలు వింటూ ఉందాము, నటిస్తూ ఉందాము కొన్ని రోజులు అని ఈ శంకరాచార్యుడు అనుకోవడము జరిగింది. ఆ నటిస్తూ ఈయన కూడా వాళ్ళ వెంట పోయినాడు. అంటే వాళ్ళ మీద ఈయనకు నమ్మకము లేదు. ఈయన మీద వాళ్ళకు నమ్మకము లేదు. అటువంటి పరిస్థితిలో చూపాకారానికి వాళ్ళ వెంట పోయినాడు. వాళ్ళు ఈయన వెనకాల ఎంత పెద్ద కుట్ర చేస్తున్నారో ఈయన గ్రహించలేక పోయాడు. చివరకు హిమాలయాల్లో ఉండే బద్రినాథ్కు పోయినాడు. అక్కడి నుండి 40 కి.మీ దూరములో ఉండే కేదార్నాథ్కు వచ్చాడన్నమాట. 2013లో కేదార్నాథాలో పెద్ద వరదలు వచ్చి అక్కడ గుడి అంతా కొట్టుకపోవడము, అక్కడ ఉండే నివాసాలు అన్ని కొట్టుకొని పోవడము, ముందే అక్కడికి దారులు సరిగా లేవు. ఇవన్నీ జరిగినాయి కదా! ఆ కాలములో అప్పుడు ఏమీ లేవు. 2500 సంవత్సరాల పూర్వము. అక్కడ దారులు కూడా సరిగా లేవు. అటువంటి జాగాలోకి ఈయనను పిలుచుకొని పోవడము జరిగింది. అక్కడ ఒక 10 రోజులు నివాసము చేశారు. ఆ పదిరోజుల్లో ఒక రోజు వాళ్ళ ప్లాన్ ప్రకారము ఆయనను హత్య చేయడము జరిగింది. ఇది ప్రపంచానికి తెలియని సత్యము. ఆయనను చంపేసి అక్కడనే సమాధి కట్టేశారు. ఆ సమాధి కట్టిన తరువాత ఏమైంది? అది 10 రోజులకు కాని క్రిందికి ఆ సమాచారము తెలియదు. అది అడవి, ఇప్పటికీ అడివే అది. దానికి దారులు ఇప్పటికీ సరిగా లేవు. అక్కడి నుంచి మనిషి వచ్చి చెబితేగానీ సమాచారము తెలియదు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి చెప్పేంత వరకు ఎట్ల తెలుస్తుంది? తెలియదు కాబట్టి చనిపోయిన సాయంకాలానికి


----

ఆ రోజు రాత్రికి చనిపోతే, మళ్ళీ మరుసటి రోజు సాయంకాలానికల్లా ఆయనను అక్కడనే సమాధి చేయడము జరిగింది. కేదార్నాథానే శంకరాచార్యుల సమాధి ఉండిపోయింది.


కానీ మొన్న వరదల్లో అది కూడా అడ్రసు లేకుండా పోయింది. అది కూడా కొట్టుకొని పోయింది, అది కూడా లేదు ఇపుడు. ఇట్ల జరిగిందన్నమాట. అంటే శంకరాచార్యున్ని బొమ్మగా చూపి, అద్వైతాన్ని ప్రచారము చేసి, ఈ రోజుకు కూడా అతన్నే పొగుడ్తూ ఆయన స్థాపించిందే అద్వైత సిద్ధాంతము అని వీళ్ళు పబ్బం గడపుకున్నారు, ఆర్యులు. అది ఎవరిచేత చేయించారు? అంటే దక్షిణ భారతదేశములో ఉన్నటువంటి శంకరునితోనే చేయించి ద్రావిడులంతా మా మాట వింటున్నారని నిరూపణ చేసుకున్నారు. అది తెలియక ముందే ఆయనను చంపేసి ఆయన ఏదో అకస్మాత్తుగా చనిపోయినాడు అని సృష్టించి వీళ్ళు చంపినారనేటటువంటి ధ్యాస ఎవరికీ రాకుండా ఆయన చనిపోయిన తరువాత కూడా ఎక్కువ ప్రచారము చేసినారు ఆయనను గురించి. ఎప్పుడూ ఎవరికీ ఆ అనుమానము రాలేదు. ఇపుడు భారతదేశములో అద్వైత సిద్ధాంతము 90 పాళ్ళు ఉందన్నమాట. విశిష్టాద్వైతము కొంత, ద్వైతము కొంతవరకు కొద్దిగా ఉంది. విశిష్టాద్వైతము ఒక 8 శాతము ఉంటే, 90 శాతము అద్వైత సిద్ధాంతమే. ఈ రోజు హిందువు అనే ప్రతివానిలోన అద్వైత సిద్ధాంతము ఇమిడ్చబడి ఉంది. కానీ దానిని మేము వ్యతిరేఖిస్తున్నాము. ఎందుకంటే వీళ్ళు “మసిపూసి మారేడు కాయ చేసినట్లు" వేదాలను మన మీదకు రుద్దాలనుకున్నారు.


ఈ రోజు కూడా మీకు అంటే హిందువులకు ప్రమాణ గ్రంథాలు ఏమిటివి? అంటే వేదాలు అని చెప్తున్నారు కానీ భగవద్గీత అని చెప్పడము


----

లేదు. అజ్ఞానము పెరిగిపోయింది. దేవుడే దిగివచ్చి, మనిషి ఆకారములోకి వచ్చి భగవద్గీత రూపములో జ్ఞానము చెప్పినాకానీ భగవద్గీతను మనము చదివే స్థితిలో లేము. వేదాల వెంటపడి పరిగెత్తే స్థితిలో ఉన్నాము. ఈ రోజు. ఇటువంటి స్థితి కల్పించి అజ్ఞానములోకే మనుషులను తోసేసినారు గానీ, జ్ఞానమార్గము పట్టించలేకపోయినారు. ఇటువంటి మోసము పెద్దది అని చెప్తున్నాము. తరువాత శంకరాచార్యుడు పోయిన తర్వాత 1500 సంవత్సరాలకు ఈ రామానుజాచార్యులు వచ్చారు. ఆయన విశిష్టాద్వైతాన్ని ప్రచారము చేశారు. ఇపుడు అద్వైతానికి వ్యతిరేఖముగా నేను ఏ విధముగా అంటున్నానో ఆ రకముగానే ఆయన అద్వైతానికి వ్యతిరేఖముగా మారిపోయి విశిష్టాద్వైతాన్ని ప్రచారము చేశాడు. మళ్ళీ ఆ రోజు అద్వైతానికి వ్యతిరేఖముగా ఉన్నటువంటి ఆయనను కూడా చంపడానికి ప్రయత్నము చేశారు. ఆయనను కూడా అడవికి తీసుకొనిపోయి చంపాలని ప్రయత్నము చేశారు రాత్రిపూట. ఆయన తప్పించుకొని రావడము జరిగింది. ఒకవేళ ఐదునిమిషాల ముందు ఆ విషయము తెలియకుండా ఆయన తప్పించుకోక పోతే ఈ ఆర్యుల చేతిలో ఆ రోజు ఈయన కూడా హత్య అయిపోయే వాడే. ఇప్పటికి ఆ రకముగా చచ్చిపోయినాడు అనుకొంటే ఇద్దరు సిద్ధాంతకర్తలు హత్యలో పోయేవాళ్ళుగా ఉండేవాళ్ళు. మనకు ఒక సిద్ధాంతకర్త పోయినాడు, ఒక సిద్ధాంతకర్త మిగిలినాడు. ఆయన 120 సంవత్సరాలు బ్రతికి చనిపోయినాడు. ఆయన చెప్పిన సిద్ధాంతము విశిష్టాద్వైత సిద్ధాంతము ఇప్పటికీ కూడా ఉంది. కానీ అన్నిటికీ మించినది ఈ త్రైత సిద్ధాంతము.


భగవద్గీతలోగానీ బైబిలులోగానీ, ఖుర్ఆన్లోగానీ ఎక్కడా వాళ్ళ సిద్ధాంతాలు లేవు. మూడు దైవగ్రంథాలలో ఉన్నటువంటి త్రైత సిద్ధాంతాన్ని మనము ఈ రోజు చెప్తున్నాము. ఆత్మ అనేది ఇది, పరమాత్మ అనేది ఇది,


---

జీవాత్మలము మనము అని చెప్తున్నాము. ఇపుడు మేము మూడు విడదీసి చెప్తున్నాము. మీకు తెలియని విషయాలన్నీ మేము కనిపించేటట్లు చేస్తున్నాము. నీవు అనుకుంటున్నావు కాని నీవు నీవు కాదు అని చెప్తున్నాము. నీవు వేరు, నీ ఆత్మ వేరు. నీవు కన్పించేది నీవు కాదు. నీవు ఎక్కడో కన్పించుకోకుండా శరీరము లోపల ఉన్నావు. ఒకసారి జ్ఞాపకము తెచ్చుకో! అని చెప్తున్నాము. జ్ఞాపకము తెచ్చుకొని నా మాటను నమ్ముతుంటే మీరు వినండి. మళ్ళీ ఇదంతా తెలుసుకుంటూ పోతే శరీరములో ఉండే జ్ఞానము తెలుసుకుంటే భగవద్గీతలో ఏమి చెప్పినాడో ఇప్పుడు అర్థమవుతుంది. భగవద్గీత జ్ఞానము అర్థమైతే వాస్తవమైనటువంటి దైవజ్ఞానము మీకు తెలిసినట్లు అవుతుంది. మళ్ళీ ఇవన్ని చెప్పనటువంటివాళ్ళు మన దగ్గర ఉండిపోయినారు కాబట్టి, వాళ్ళు చెప్పిన దారిలో మనము నడుస్తున్నాము

కాబట్టి ఇంతవరకు మనము మోసపోయినాము. అసలైన జ్ఞానము తెలియకుండా పోయింది. ఆత్మల జ్ఞానమే తెలియకుండా పోయింది మీకు.


ఇపుడు ఆత్మ అనేది ఏమిటి? అనే ప్రశ్న మీలో పూర్తి ఉంటే ఇపుడు నేను చెప్పినేది అంతా చాలా సులభము చూడండి! “నీవు నీవు కాదు అనుకో!". అనుకోవడము కాదు, “నీవు కాదు అసలుకు” నీవు ఎక్కడో శరీరములో ఒకచోట ఉన్నావు. ఈ విధానము ఎపుడైతే నీవు గుర్తుపెట్టుకో గల్గినావో ఆ ఉద్దేశ్యముతో నీవు జ్ఞానాన్ని తెలుసుకుంటే అపుడు ఏమైతుంది? సత్యము తెలుస్తుంది. అపుడు దేవునికి దగ్గరగా నీవు మారిపోతావు. భగవద్గీతను నీవు దగ్గరగా అర్థము చేసుకోగల్గుతావు. భగవద్గీతను ఒక్క దాన్నే కాదు దైవగ్రంథాలు ఏవైతే ఉన్నాయో మూడు దైవగ్రంథాలు నీకు బాగా అర్థమవుతాయి. అపుడు నీవు స్వచ్ఛమైన జ్ఞానమార్గములో పోయే దానికి అవకాశము ఉంటుంది. ఇదే మేము మీకు హెచ్చరిక చేస్తూ నిన్ను


----

నీవు కాదనుకో! ఇప్పటినుండి నీ జీవితములో మార్పు తెచ్చుకో. నీవు ఎక్కడో ఉన్నావు అనుకో! అనుకోవడము కాదు, నీవు అక్కడే ఉన్నావు. నీకు ముందర ఉండి కనిపించే వాని గురించి నీవు ఆలోచన చేసుకొని,

జ్ఞానము తెలుసుకొనేదానికి మొదలు పెట్టు. ఇప్పటినుండి జ్ఞానము అర్థమౌతుంది. నీకు జ్ఞానములో ఎక్కడ ప్రశ్న వచ్చినా జవాబు చెప్పేదానికి సంసిద్ధముగా ఉంటాము. అందువలన మేము తొందర తొందరగా మీకు జవాబులు వ్రాస్తున్నాము, గ్రంథాలు ఇస్తున్నాము. ఒకవేళ నేను బ్రతికేది కొన్ని రోజులే అయితే అంతలోపల మీకు తెలియజేయాలనే ఉద్దేశ్యముతో మేము వ్రాస్తునాము. ఇపుడు క్రొత్తగా వచ్చిన గ్రంథాలు చదువుకోండి. జ్ఞానాన్ని తెలుసుకోండి అని చెప్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.


తేది : 27-11-2011

ఇప్పుడు ఈ ప్రాంతములో ఇదే మొదటి ఆధ్యాత్మిక ఉపన్యాసము మాది. కానీ ఇక్కడ కొంతమంది కొత్తవాళ్ళు కూడా ఉండొచ్చు. నేను ఏమి

చెప్తున్నానంటే, ఈ ఆధ్యాత్మిక విద్య అనేటటువంటిది దేవునికి సంబంధించి నటువంటిది. దేవున్ని తెలుసుకొనేదానికి ప్రతి మానవుడు పని చేయాలి. ప్రతి మానవుని కర్తవ్యమది. ఆ దేవున్ని తెలుసుకునేదానికి చాలా విధానాలు ఉన్నాయి. మతాల పేరుతో ఉన్నాయి అవి. ఒక్కోటి ఒక్కొక్క మతము పేరుతో దేవున్ని అందరూ తెలుసుకునే ప్రయత్నము చేస్తున్నారు. కానీ ఏ మతములో ప్రజలైనా దేవుని వైపే పోతున్నారుకాని ఇంకొకటంటు ఆ


----

మతములో ఏమీ చెప్పలేదు, దేవుని వైపు పొమ్మనే చెప్పారు ఆ మతములో. ఇక్కడ హిందూమతములో కూడా దేవుని వైపు పోయేదానికి ఉత్తమమైన మార్గాలు ఎన్నో చూపించబడినాయి. అయినా అవి తెలియకపోయి, చూపించ బడినటువంటి మార్గాలన్ని ఎవరూ లెక్క చేయకుండా, వాటికి భిన్నముగా ప్రవర్తిస్తు, దేవుడు చెప్పినట్టు కాకుండా, వాళ్ళు స్వయముగా మనుషులు చెప్పినట్టు వింటూ ఆ విధముగా ప్రవర్తించే దానివలన, ఆధ్యాత్మిక విద్యంటే ఏమిటో తెలియకుండపోయింది. దాంట్లోనే రకరకాల పేర్లు పెట్టుకొని ముందుకు పోతున్నారు. ఆ దారులన్ని చివరికి మూసిపోతున్నాయికాని దేవుని వైపు పోవడము లేదు. దేవుడు భగవద్గీత అనేటటువంటి బ్రహ్మవిద్యా శాస్త్రములో, తనకు సంబంధించినటువంటి వివరాలన్ని చెప్పగలిగినాడు. అయినా మనిషి వాటిని వదిలిపెట్టి, కొత్త కొత్త మార్గాలు వెతుక్కొని, “ముందు పుట్టినటువంటి చెవులకంటే వెనక పుట్టినటువంటి కొమ్ములు వాడి” అన్నట్లు, ముందున్నవన్ని సరిగాలేవు, ఈ కొత్తగా వచ్చినేవి బాగున్నాయి అని చెప్తున్నారు.


కానీ అది సంపూర్ణత్వము ఉందా అంటే, వాళ్ళకు తెలియ కుండానే, ఉంది అని నమ్మి, అవి ఇతరులకు కూడా చెప్పడము జరుగుతా వుంది. 5000 సంవత్సరాల పూర్వము భగవద్గీత చెప్పబడింది. అందులో సంపూర్ణ మైనటువంటి జ్ఞానము ఉంది. ఒక మనిషి దేవున్ని తెలుకొనేదానికి ఏమేమి కావాలో అవన్ని ఉన్నాయి అందులో. కానీ అక్కడ దానిని వదిలిపెట్టి, తర్వాత తర్వాత అనేక మార్గాలు అన్వేషించుకొని, అన్నిటికంటే ఇది ఉత్తమమైన మార్గము అని చెప్తూ, అప్పుడు చెప్పిన దానికి విభిన్నముగా నడుచుకుంటూ ముందుకు పోతున్నారు, అంటే దేవుడు తెలియబడుతాడు అని. ఎవరికన్న ఆ విధముగా తెలియబడినాడా అంటే, ఎవ్వరికి ఆ విధముగా


----

తెలియబడినట్టు దాఖలాలు ఎక్కడా లేవు. ఎవరూ తెలుసుకునే దానికి అవకాశము లేదు. ఒక దారి ఉన్నప్పుడు, ఆ దారి గుండా పోతేనే ద్వారము ఏర్పడుతుందిగానీ, ఏ ద్వారాలు లేనప్పుడు ఎన్నో దారులు కల్పించుకొన్నా అక్కడ ద్వారము ఉండదు, గోడ ఉంటుంది అంటే దారి లేకుండ ఉంటుంది అంటే చివరకు ఎంట్రెన్స్ (entrance) ఉండదు. ఆ విధముగా మనము దేవునికి దగ్గర మార్గాలు అని అనుకుంటూ దేవునికి దూరముగ పోయేదానికి మొదలుపెట్టాము. తూర్పువైపు పోతే దేవుడు కనిపిస్తాడు అని ఒకరు చెప్పితే, తూర్పువైపు పోకుండ ఇంకో వైపు పోతే కూడ దేవుడు కన్పిస్తాడు అని పోతే ఏమైతుంది? అంటే తూర్పువైపు పోతే కనిపించేది సత్యము అనుకోండి, పక్కకు పోతే ఏమైతుంది? కుడి పక్కకో ఎడమ పక్కకో పోతే ఏమైతుంది? దక్షిణము వైపో ఉత్తరము వైపో పోతే ఏమైతుంది? ఎంత కాలము జరిగినాగాని దేవున్ని తెలుసుకునేదానికి కాదు. దానికి ఇంకో దిశలో పోయినా కూడ చాలా టైమ్ పడుతుంది. ఈ రకముగా దేవున్ని తెలుసుకోవ డానికి దగ్గరి మార్గము ఏది? దూర మార్గము ఏది? అని మనము ఒకసారి ఆలోచన చేస్తే, 5000 సంవత్సరాల పూర్వము, భగవద్గీతలో చెప్పబడిన విషయాలన్ని చాలా దగ్గర మార్గాలుగ కనిపిస్తున్నాయి.


5000 సంవత్సరాల పూర్వము చెప్పినటువంటి భగవద్గీతా శాస్త్రములో దగ్గర మార్గాలు కనిపిస్తే, అంతకు ముందు ఇంకా ఏమైనా ఉన్నాయేమో? అనేటటువంటి అనుమానము లేకుండా ఇది సృష్ఠి ఆదిలోనే చెప్పబడినటువంటి శాస్త్రము. సృష్టి ఆదిలో చెప్పబడినటువంటి శాస్త్రము మనుషులు మరిచిపోయి వాళ్ళ ఇష్టము వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. దాన్ని ఏమాత్రము లెక్క పెట్టుకోకుండ ఉన్నారు. అది తెలియకుండపోయింది. కాబట్టి తిరిగి అది చెప్పబడింది, ఎప్పుడు చెప్పబడింది? 5000 సంవత్సరాల


----

పూర్వము, భగవద్గీత రూపములో చెప్పబడింది. ఈ భగవద్గీత ఎప్పుడు పుట్టింది? 5000 సంవత్సరాల పూర్వము భారత యుద్ధములో పుట్టిందా? లేకపోతే సృష్ఠి ఆదిలో పుట్టిందా? అని ఒక ప్రశ్న వేసుకుంటే, ఇది సృష్ఠి ఆదిలోనే పుట్టింది. సృష్ఠి ఆదిలో దేవుడు అంటే దేవుడు సృష్టిని సృష్టించినపుడు తనను తెలుసుకునే విధానము కూడా దేవుడు తెలియజేశాడు. అది కూడ సృష్ఠి ఆదిలోనే తెలియజేశాడు. సృష్టిని ఎప్పుడైతే తయారు చేశాడో 'మళ్ళ తిరిగి మనుషులంతా తన వైపు వచ్చే దాని కోసము ఆయన ఏమి చేశాడు? ఒక మార్గాన్ని కూడా పూర్తి ఏర్పరిచి ఆ రోజే చెప్పడము జరిగింది. ఎప్పుడు? సృష్ఠి ఆదిలోనే. ఆ సృష్ఠి ఆదిలో చెప్పబడినటువంటి విషయాలన్ని మనము మరచిపోయినాము కాబట్టి, మళ్ళ 5000 సంవత్సరాల పూర్వము దానిని తిరిగి తెలియజేయబడింది. సరే, అందులో ఏముంది అని పరిశోధన చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు. అందులో విషయాలు అవగాహన కాకుండపోయి ఉండవచ్చు. అది ఎంతమందికి అవగాహన అయింది అనంటే, చాలామందికి దేవుడు చెప్పినటువంటి విషయాలు అవగాహన కాలేదు. అది ఇంకో మార్గములో అర్థమైనాయి.


అందువలన సంపూర్ణముగ ఫలితాన్ని మనము సాధించలేక పోయినాము. దేని నుంచి? భగవద్గీత నుంచి. సంపూర్ణ ఫలితము సాధించు కోకుండ పోయిన దానివలన, మనకు ఆధ్యాత్మిక విద్యంటే ఏమిటి అని తెలియకుండ పోయింది. ఇంతవరకు నేను ఓర్పుగా ఈ విద్యను చెప్తూ వచ్చాను. చాలామంది వింటూ వచ్చారు. కానీ క్రూరముగా ప్రవర్తించే వాళ్ళు కొంతమంది హిందూమతములో ఉన్నారు. వాళ్ళు ఏమి చేస్తున్నారంటే, ఈ విద్యను అణిచివేసి వాళ్ళ బ్రతుకుతెరువు కోసము వేరే మార్గాలు సృష్టించి, ఇదే దేవుడు ఇదే మార్గము అని దీన్ని అణిచివేసినటు


----

వంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పాపాలు మూటకట్టుకొని చివరికి రిక్షా తొక్కే వాళ్ళుగా, అడుక్కు తినే వాళ్ళుగా మారిపోయినారు. ప్రత్యక్షముగా కనిపిస్తుంది. 150 సంవత్సరాల పూర్వము వెనక్కి పోయి చూస్తే, 100 సంవత్సరాలు, 100 కంటే ఎక్కువ సంవత్సరాల కాలము వెనక్కి తిరిగి చూస్తే, మీ భూములన్ని ఎవరి పేరుతో ఉన్నాయో చూసుకోండి. ఇప్పుడు మీ పేరుతో ఉన్న భూములన్ని ఎవరి పేరుతో ఉన్నాయి? ఒకే ఒక్క కులము పేరుతో ఉండేటివి. అర్థమయిందా! విశాల భూములన్ని, వేల ఎకరాలు కొంతమంది పేరుతోనే భూములు ఉండేటివి. రాజుల వద్ద వాళ్ళు మంచి మాట, పలుకుబడి సంపాదించుకొని అప్పటినుండి వాళ్ళు భూములన్ని అనుభవిస్తూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు దాంట్లో వ్యవసాయము చేసి, అందులో పంటలు చేసుకోవడము లేదు. ఎవరితోనో చేపించే వాళ్ళు, హాయిగా కూర్చొని తినేవాళ్ళు, మాటలు చెప్పేవాళ్ళు, ప్రజలను తప్పు దారిలో నడిపిచ్చే వాళ్ళు.


ఈ దేవుని విషయములో తప్పు దారి నడిపిస్తూ పోతూ పోతూ వాళ్ళకు పాపము ఎక్కువై పోయి, చివరికి అవన్ని అమ్ముకున్నారు. అమ్ముకుంటే మీరు కొన్నారు. మీ తాతగారో, మీ నాన్నగారో ఎవరో ఒకరు కొనిండేటివి. మీ తాతగారే కొనుంటారు. అవన్ని మీ తాతగారి కాలములో చూసుకుంటే ఒకే ఒక కులానికి సంబంధించినటువంటివి ఆ భూములన్ని. ఇప్పుడు ఆ కులము సర్వనాశనము అయిపోయింది. ఎందుకైపోయింది ఆ విధముగా? దేవుని విషయములో తెలిసి ప్రజలను వక్రమార్గము పట్టించి దేవుని విషయము ఎవరికీ అర్థము కాకుండ చేశారు. ఈ రోజుకు కూడ అంతో ఇంతో మిగిలిండే వాళ్ళు, అదే పని చేస్తున్నారు. ఆ పని చేయడము వలన ఏమైందంటే దేవుని విషయము తెలియకపోయి, వాళ్ళు చెప్పినట్టే


----

మనము వినాలంటే, వాళ్ళు ఏదో చెప్తుంటే ఇట్లే ఉండాలి ఇట్లే ఉండాలి అంటే అవన్ని అర్థముకాకుండ పోయి? మీకు తెలియదు, మేము చెప్పితే వినాలి, మేము ఎట్ల చేస్తే అదే మీకు దారి అని చెప్తున్నారు. అటువంటప్పుడు ఇతర మతాల వాళ్ళు దీంట్లోకి ప్రవేశించి, మా మతాల్లోకి వస్తే మీకు చాలా ఫ్రీ (free) గా ఉంటుంది, జ్ఞానము బాగా తెలుసుకోవచ్చు అని వాళ్ళు వీధి వీధిలోకి వచ్చి జ్ఞానము చెప్పిన దానివలన ప్రజలు అటువైపు ఆకర్షింపబడి, అంటే మన మతములో ఉండే జ్ఞానమేదో మనకు తెలియలేదు. అన్ని కట్టుబాట్లలో మనము నిలిచి పోయినాము. ఈ కట్టుబాట్లు లేకుండా, దేవుడిని తెలుసుకునేదానికి చాలా దగ్గర మార్గాలుగా అనిపిస్తున్నాయి ఇతర మతాలు అని ఆ మతాల్లోకి పోవడము జరిగింది. 100 సంవత్సరాలు 50 సంవత్సరాల పూర్వము చూసుకోండి మీరు, మనమంతా ఇందువులుగా ఉన్నవాళ్ళు అందరు ఈ రోజు ఇతర మతస్థులుగా మారిపోవడము జరిగింది. ఆ విధముగా ఎందుకు మారిపోయినాము? అంటే ఇందూ మతములో పూర్తి అన్యాయము అయిపోయింది. ఒక దేవుడు కాదు. భగవద్గీతలో ఒకే దేవుని గురించి చెప్పారు.


ఇతరత్రా దేవుళ్ళను ఎవరిని నమ్ముకున్నాగానీ వ్యభిచార భక్తి అవుతుందని పబ్లిక్గా చెప్పాడాయన. “భక్తిన్ వ్యభిచారిణి” అన్నాడు. భక్తిలో వ్యభిచారము అయితుంది. బాహ్యముగా మీరు వ్యభిచారము చేస్తే, ఒక పురుషుడిని కాకుండా ఇతర పురుషుడిని ఏ విధముగా మీరు నమ్ముకొని వాళ్ళ దగ్గరికి పోతే ఎట్లా వ్యభిచారము అంటున్నామో, ఆ రకముగా దేవుని విషయములో మీకు ఒకడే జగద్భర్త, ఒకడే దేవుడు. ఆ దేవుని విషయములో మీరు అసలైన దేవున్ని వదిలిపెట్టి, మీకు ఎవరైతే పెద్దగ ఉన్నారో ఆ దేవున్ని వదిలిపెట్టి, మిగతా దేవతలను మీరు ఆశ్రయిస్తే, అది వ్యభిచార భక్తి


---

సిద్ది బోధ

అయితుందని భగవద్గీతలో ఏనాడో చెప్పితే, మన ఇష్టము వచ్చినట్టు మనము రకరకాల దేవతలను సృష్టించుకొని వందలు, వేలు, కోట్లు మనుషులకంటే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. ఈ రకంగా రకరకాల దేవతలు, రకరకాల కండిషన్లు, రకరకాల పద్ధతులు ఉండేదానివలన ఇవన్ని వదిలిపెట్టి, ఒకే పద్ధతి ఉన్నటువంటి మతాలలోకి మనిషి ఆకర్షింపబడి అందులోకి పోయాడు. వేరే మతాల్లో కూడా దేవుని జ్ఞానమే చెప్పబడివుంది. వేరే మతాలేమీ చెడువి కావు. వేరే దానిని ఏమి బోధించలేదు. దేవుని వైపు దగ్గరగా పోయే మార్గాలే ఏర్పరిచారు వాటిలో కూడా. అంటే హిందూ మతములో కూడా గొప్ప జ్ఞానము ఉంది, ఈ మతములో ఉండే జ్ఞానము అర్థము కానపుడు, ఇతరులు చెప్పిన జ్ఞానము ఏదో మనకు అర్థమైయింది. అందువల్ల అందులోకి మనము పోవడము జరిగింది. సరే, పోయినారు. కానీ అక్కడ కూడా ఏమి జరుగుతావుందంటే, వాళ్ళూ ఒక సంఘాన్ని, ఒక మతాన్ని పెంచుకునే దానికి ప్రయత్నము చేస్తున్నారు తప్ప, దేవుని జ్ఞానాన్ని వాళ్ళు కూడా మూసిపెట్టేస్తున్నారు. వాళ్ళు కూడా దేవుని జ్ఞానాన్ని చెప్పుకోవడము లేదు ముఖ్యముగా. దాన్ని వెనకాల పెట్టి, ముందర ఏమి చెప్తున్నారంటే, నేను ఫలాన మతస్థుడని బయటికి కనిపించే రకంగ మీరు మారండి అంటున్నారు. మీరు ఆ పనులు చేయండి అంటున్నారు.


కానీ ఇక్కడ దేవుడు ఏమి చెప్పాడంటే ప్రతి మతములోను తనను తెలుసుకుండేటటువంటి దానికి అవసరమైనటువంటి ఎన్నో మార్గాలను అన్ని మతాల్లోను చెప్పబడివుంది. కానీ అవి కూడా మానవునికి తెలియకుండా పోయినాయి. అక్కడ దగ్గర మార్గమే ఉన్నాగానీ, ఇతరత్రా దేవతల సంబంధము లేకుండ ఒకే దేవుని సంబంధము ఉన్నా కానీ, అక్కడ ఏమైతా ఉంది అంటే ఆ ఒక్క దేవుని గురించినటువంటి జ్ఞానముకంటే ఆ మతము


----

యొక్క ఆచారాలే ముఖ్యముగా పట్టుకొని దానిని ఆచరించాలనేదే చెప్తున్నారు. ఇక్కడ నిన్న కొంతమంది మాతో కలిసారు. దేవుని విషయము అడిగితే దేవుని విషయము పక్కన పెట్టి, ముందు మాది ఆచరించండి అంటున్నారు. ముందు దేవుని విషయాలు అర్థమైతే కదా తర్వాత ఆచరణ చేసేదనంటే, లేదు, అర్థము కాకున్నా ఆచరించండి. ఆచరిస్తే మళ్ళ తర్వాత ఎట్లన్నా అర్థమయితాది అంటారు. అంటే అక్కడ ఏ దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు? అంటే, మతాలకే ప్రాధాన్యత ఇస్తున్నారుగానీ దేవుని మార్గానికి ప్రాధాన్యత ఇవ్వడము లేదు. ఈ రకముగా మనము చూస్తే, మానవుడు ఎటు వైపు పోతున్నాడంటే, ఇందువులేమో వాళ్ళ ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించి, అన్ని కండిషన్లు చేసి, మీకు జ్ఞానమే తెలియదు, మీరు మంత్రాలు చదవకూడదు, మీరు తపస్సులు చేయకూడదు, అని కండిషన్లు పెట్టి, మేమే చేయాలి, మీరు మా ద్వారానే వచ్చి మ్రొక్కితేనే మేము రికమెండ్ చేస్తాము. ఏ దేవుని దగ్గరికి వచ్చినా మేము అక్కడ ఉంటాము. మీరు మాకు చెప్పితే మేము ఆ దేవునికి చెప్తాము. మీ పేరు అడ్రస్ న్ని చెప్తాము. అట్లైతే మ్రొక్కండి లేకపోతే మీరు సొంతముగ మ్రొక్కకూడదు అని చెప్పేసినారు వాళ్ళు. సరే, ఇక్కడైతే మన పేరు అడ్రస్ లేకుండా మనము డైరెక్ట్ గా మ్రొక్కొచ్చు కదా అని వేరే మతాల్లోకి పోతే, అక్కడ ఏమి చేస్తున్నారంటే, నువ్వు ఇట్ల చేసుకో, నువ్వు అట్ల చేసుకో అని ఆ కట్టుబాట్లు ముందు అంటగట్టేస్తున్నారు, దేవుని విషయము వాళ్ళకు తెలియడము లేదు.


ఈ రకముగా అన్ని మతాల్లోనూ దేవున్ని తెలుసుకునేదానికి ఆటంకాలు చాలా ఏర్పడినాయి. సరే, ఒక మతములో ఆటంకము ఏర్పడింది. ఇంకో మతములోకి పోతే అందులో కూడా పూర్తి అవగాహన లేకుండా పోతావుంది. పెద్దలు అయినటువంటి వాళ్ళకే మూలగ్రంథాలలో


---

ఉన్నటువంటి విషయాలు అర్థము కాకుండ పోయినాయి. ఒకవేళ ఇవి ఏమిటి? అని దానికి సరైన సమాధానము చెప్పకుండ దాటివేస్తున్నారు. నేను ముందే ఒక సూత్రము చెప్పాను మీకు. ఏదైనాగానీ జ్ఞానము అంటే అది ప్రశ్నగా మిగలకూడదు, జవాబుగా నిలిచిపోవాలి. జ్ఞానము అని దేన్ని అంటామంటే ప్రతి దానికి జవాబై ఉండాలది. ఏ ప్రశ్న మిగలకూడదు ఇంక. అది నిజమైన జ్ఞానము. ప్రశ్న మిగిలింది అనుకోండి! అది జ్ఞానము కాదు, అజ్ఞానమే అయితుంది. దేవుని వైపు పోవాలని సృష్ట్యాదిలోనే దేవుడు మనకు ఒక విషయాన్ని తెలియజేసి, సంపూర్ణమైన సమాచారాన్ని ఇస్తే, దానిని మానవుడు మరిచిపోతే, తిరిగి 5000 సంవత్సరాల పూర్వము భగవద్గీత రూపములో మళ్ళ దానిని బయటికి పెడితే, దాన్ని కూడ లెక్క చేయకుండ మనిషి ఇష్టము వచ్చినట్టు ప్రవర్తించి, ఇదే దేవుడు అని ఒక గుడి కడితే ఆ గుడిలో ఉండేవాడు కాదు, ఈ దేవుడే నిజమైన దేవుడు అని ఇంకొకరు గుడి కడితే, ఇంకొక గుడిలో ఇంకో దేవున్ని పెట్టి ఆ దేవతల కంటే, అందరికంటే పవర్ఫుల్ దేవుడు, ఈ దేవుడు అని ఇంకొకరు చెప్పుకునే దానివలన ఈ ప్రజలు కూడా ఆశలకులోనై, ఈ దేవున్ని మ్రొక్కితే నాకేమి లాభము వస్తుంది? ఆ దేవున్ని మ్రొక్కితే ఎక్కువ లాభము వస్తుంది అని ఒకరికొకరు చెప్పుకోవడము వలన ఈ ప్రజలు ఏమి చేస్తున్నారంటే అందరిని మ్రొక్కేదానికి మొదలుపెట్టారు. ఒక్కో సీజన్లో ఒక్కొక్కరిని మ్రొక్కుతారు.ఎందుకంటే అక్కడకు పోతే ఆయన ఏమి ఇస్తాడో మళ్ళీ ఆ సీజన్ అయిపోయిన తర్వాత ఇంకొకరిని మ్రొక్కుతారు. ఆ సీజన్లో అతన్ని మ్రొక్కితే అతనూ కొంత ఇస్తాడు, ఇతనూ కొంత ఇస్తాడు. వాళ్ళ వలన మనకు మేలే జరుగుతుందిలే అంటారు. వాళ్ళ ద్వారా ఏమీ మేలు జరగడము లేదు. పోయినోళ్ళు యాక్సిడెంట్లు అయి చాలామంది చనిపోతున్నారు.




----

వేయి మంది పోతే 10 మంది అన్నా చచ్చిపోతున్నారు. అది అనుకోవడము లేదు. ఈ కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని పోయి, శ్రమ పడి వస్తున్నాగానీ అక్కడికి పోతే మనకు ఏమి అర్థమైతుంది అని అనుకోవడము లేదు.


ఈ రోజు యాత్రలకు పోతున్నారు. 'యాత్ర' అనే పేరు ‘యాతన’ అనే పేరుతో మొదలైంది. 'యాతన' అంటే 'బాధ' లేక 'కష్టము' అని అర్థము. కాని ‘యాతన' అనేది ఏమైంది? 'యాత్ర' అయింది. 'కాశీ యాతన' అనే వాళ్ళు పూర్వము. కాశీకి పోవడము పూర్వము పెద్ద యాతనంట. నడిచిపోయి లేనిపోని తిప్పలుపడి చాలా కష్టపడే పోయేవాళ్ళన్నమాట. అది ఈ రోజు యాత్ర అయింది. ఈ రకముగా ఈ రోజు కాశీ యాత్రే కాదు తిరుపతి యాత్ర, ఇంకో యాత్ర ఇంకోయాత్ర ఇంకోయాత్ర చాలా యాత్రలున్నాయి. దీని ద్వారా ఏమైతుందంటే అక్కడికి పోవడము, ఏమొస్తుందో ఏమోగానీ వీళ్ళు ఆశగా పోతున్నారు. అక్కడికి పోతే నాకు ఏదో లాభము వస్తుంది, నా వ్యాపారము బాగా జరుగుతుంది, నాకు ఇంకా కోట్లు మిగులుతాయి, లక్షలు మిగులుతాయి అని ఆశతో పోతున్నారు తప్ప దేవున్ని తెలుసుకుందాము, దేవుడు ఎవరు? మనము ఏమి? మనము చనిపోతే ఎక్కడికి పోతాము? ఎక్కడి నుంచి వచ్చాము? అనేటటువంటి ఆధ్యాత్మిక చింతనతో ఏ దేవాలయమునకు ఎవరూ పోవడము లేదు. ఈ మధ్యన దాదాపు 20 రోజుల క్రితము నేను చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్ళినపుడు మా కారు తీసుకొని, తిరుపతిలో పెట్టి, అక్కడి నుంచి బస్సుకు వెళ్ళాను. మళ్ళ తిరిగి తిరుపతికి వచ్చి, కారు తీసుకోవడానికి అని చెప్పి, బస్టాండ్లో దిగినాము మేము. బస్టాండ్లో దిగితే, బస్టాండ్ నిండా కిక్కిరిసి ఉన్నారు. జనమంతా బస్టాండ్లో. సరే, కారు వేరే చోట పెట్టినాము, తీసుకొని రాపో అని డ్రైవర్ను పంపించాము. అక్కడ నిలుచున్నాము, రెండే రెండు నిమిషాలు.


----

ఆ రెండు నిమిషాలు నిలబడి ఉంటే, అట్ల నిలుచుకుండేదానికి కూడా ఒక నరక యాతనగా ఉంది అక్కడ. ఎందుకంటే, బస్టాండ్ చుట్టూ ఒంటికి పోసారు, వాళ్ళంతా. బస్టాండ్ నిండా అదే ఘాటు ఉంది, మూత్ర విసర్జన ఘాటు. అక్కడ నిలుచుండే దానికి కూడా అవకాశము లేదు. మంచి గాలి లేనే లేదు. సరే, అక్కడ నుంచి బస్టాండ్ బయట రోడ్లోకి వచ్చి నిలబడితే, అప్పుడు ఊపిరి పీల్చుకునే దానికి అయింది.


మరి ఇంతమంది అంత కష్టపడి ఎందుకు ఉన్నారక్కడ? ఎంత యాతన అది? “నరకయాతన అంటే ఏ దేశములోనో, ఏ లోకములోనో ఉందనుకుంటున్నారు” ఇటువంటివి లేనిపోనివన్ని. ఇక్కడ బస్టాండ్లోనే ఇంత ఉంటే, పైకి పోతే ఆ బ్యారక్ లో పెట్టి, ఒక రూమ్లో పెట్టి దాన్ని నింపి, మళ్ళ అక్కడి నుంచి నింపి, ఈ విధముగా ముందుకు పంపిస్తున్నా రంటే అక్కడ ఎంత బాధ? చిన్నపిల్లలు, పెద్దలు అసలుకు ఇదంతా పెద్ద యాతనతో కూడుకున్న పనే గదా. దీనిని యాత్ర అంటామా? యాతన అంటామా? యాతనే అది. పబ్లిక్గా కనిపించే యాతన అది. ఈ రకముగా కష్టపడి కష్టపడి ప్రజలు పోతున్నారు. వాళ్ళలో ఒకరిని నీవు ఎందుకు వచ్చావు? అని అడిగితే, వాళ్ళు ఏమి చెప్తారంటే, నేను సంవత్సరము నుంచి దేవున్ని మొక్కుతున్నాను, నాకు బాగా జరుగుతూవుంది అందువలన వచ్చానంటాడు. ఇంకొకరిని అడిగితే, నేను మ్రొక్కుకొని ఉంటే నాకు బిడ్డ పుట్టింది అందుకని వచ్చానంటాడు. ఇంకోడిని అడిగితే నా వ్యాపారము బాగలేదు, తిరుపతికి మ్రొక్కుబడులు చెల్లించుకోవాలని వచ్చామంటారు. ఎవరిని అడిగినా ఏదో ఒక కోరిక కోరినాము, కోరిక కోరాలనో, కోరిన కోరిక నెరవేరిందనో లేకపోతే కొత్తగా వచ్చినామనో, అందరిని చూసి వచ్చామనో, ఏదో ఒకటి చెప్తున్నారుకానీ, దేవుని విషయమేమిటో దేవున్ని


----

తెలుసుకుందాము అనేటటువంటి జవాబు ఎవడూ ఏ దేవాలయములోనూ, ఏ యాత్రలోనూ ఎవడూ చెప్పలేదు. ఎవరన్నా చెప్తున్నారా? లేదు. మళ్ళ ఈ రకముగ మారిపోయినపుడు, ఇదంతా కొంతమంది ఈ నరకయాతనంతా పడలేక, సులభముగా దేవుని విషయము అర్థమైతాదేమో అని వేరే మతాలలోకి పోతే, ఆ మతాల్లో కూడా ఏమైతావుంది ఆ మతము బయటికి కనిపించే రకంగానే వాళ్ళు ప్రవర్తిస్తున్నారుకానీ, అందులో చెప్పినటువంటి జ్ఞానము ఏమిటిదో బయటికి తెలియబడడము లేదు. ఆ వేరే మతము వాళ్ళు ఒకటే చెబుతారు. ఏమనంటే, మీరు దేవుళ్ళందరిని చాలామందిని మ్రొక్కుతారు, మేము మ్రొక్కము. చూడు మీకంటే మేము మేలు అంటారు. వాళ్ళు మ్రొక్కరు నిజమే!


కానీ ఆ దేవుడెవరో తెలియాలి కదా మనకు! ఆ దేవున్ని తెలుసుకునే విధానము తెలియాలి కదా మనకు! అంటే అది కాదు, ముందు నువ్వు ఇట్ల ఉండు, ఇట్ల ఉండు అని అంటారు. పైకి మనము ప్రవర్తన మార్చుకుంటే అంటే గుడ్డలు మార్చుకుంటేనో, వేషాలు మార్చుకుంటేనో, మనము పూజలు, పునస్కారాలు, ప్రార్థనలు మార్చుకుంటేనో మనకు దేవుడు తెలియబడతాడా? ఓ దేవుడా! నువ్వు చాలా గొప్పవానివి, ప్రపంచాన్నంతా నువ్వు సృష్టించావు, నీకంటే మించిన దేవుడు లేడు అని అంటే అక్కడ అతన్ని పొగడడమే జరుగుతావుందిగానీ, నీకేమన్నా దేవుడు తెలియబడుతాడా? నేను ఒక రోజుకి వచ్చి 10 సార్లు చెప్తున్నాను, ఏమని? నాకు నిజమైన దేవుడు తెలుసు, మీరంతా వేరే దేవతలను మ్రొక్కుతున్నారు, నేను అట్ల మొక్కడము లేదు. చూడు! నేను ఒకే ఒక దేవున్ని మ్రొక్కుతున్నాను, ఒకే దేవున్నే మేము ఆరాధిస్తున్నాము, ఒకే దేవున్ని నమ్ముకున్నాము అని అంటే నేనేమి చెప్తున్నానంటే, ఈ ప్రపంచానికంతా సృష్టికర్తవు నువ్వే, మమ్మల్ని అందరిని


----

సృష్టించింది నువ్వే, నువ్వు చాలా గొప్ప దేవునివి అని నేను ప్రార్థిస్తున్నాను. నేనంటే దేవునికేమి లాభము వస్తాది? నాకేమి లాభము వస్తాది? దేవుడే మంటాడంటే నన్నెందుకు పొగుడుతున్నావు నువ్వు? నన్ను పొగిడేదాని వలన నీకు ఏమి లాభము వస్తుంది? నువ్వు నా వైపు ఏమన్నా రాగలుగుతావా? రాలేవు. నన్ను నువ్వు తెలుసుకో! నన్ను నువ్వు అర్థము చేసుకో. నువ్వు తెలుసుకొనేదానికి నేను ఎన్నో మార్గాలు నీకు చెప్పాను. నేనే స్వయముగా చెప్పాను. ఇంకా నా దగ్గర నుంచి వచ్చినటువంటి మనుషుల ద్వారా కూడా చెప్పించా నీకు, నా వైపు ఎట్ల రావాలో నా లోనికి ఏ విధముగా రావాలో. కాని అవన్ని వదిలిపెట్టి, నువ్వు గొప్పోడివి అంటే మీకేమి వస్తుంది? సరే, వాళ్ళ విషయము వదిలిపెడతాము. మీరందరు నా దగ్గరికి వచ్చి, నువ్వు ఎర్రగుడ్డలు కట్టుకున్నావు, ఇక్కడ జ్ఞానము చెప్తున్నావు కాబట్టి నువ్వు చాలా అని మీరంతా నన్ను పొగిడితే, నాకేమన్న లాభము వస్తుందా? నీకేమన్న లాభము వస్తుందా? ఏమీ రాదు.


నా విధానము ఏమో నీకు తెలియాలంటే ఏమి చేయాలి? నేను చెప్పిన మాటలు వినాలి. నేను వ్రాసిన గ్రంథము చదవాలి. నేను చెప్పినది బుర్రకు ఎక్కించుకోవాలి. అప్పుడు మీకు లాభము వస్తుంది. నన్ను మీరు పొగిడితే మీకు ఏమి లాభము రాదు, నాకు కూడా ఏమి లాభము రాదు. మేమనుకుంటామంటే, వీడు మూర్ఖుడు, నేను చెప్పేది ఏమిటో తెలుసుకుంటే వానికి తెలుస్తుంది కదా! నేను చెప్పేది వినకుండ, నన్నే పొగుడ్తుంటే పొగుడ్తుంటే ఏమొస్తుంది నీకు? ఆ పొగిడేదేదో విడిచిపెట్టి, ఆ పొగిడే కాలాన్ని వృథా చేసుకోకుండ, నువ్వు ఎవరు? నువ్వు ఎట్ల ఉన్నావు? నీవు ఏ విధముగ ఉన్నావు? అని నన్ను అడుగు. నేను చెప్తాను. లేకపోతే నేను చెప్పినటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి, అవి చదువుకో. చదువుకున్న


----

తర్వాత దాంట్లో నేను ఎట్లున్నానో అనేది నీకు అవగాహన అవుతుంది. నేను చెప్పినమాట ఒకటి కూడా వాళ్ళకు అర్థము కాలేదు. ఒకడు నేను చదివినా అంటాడు, వానికి ఏమీ అర్థము కాలేదు. ఆ..! బాగా వ్రాశారు, పెద్ద గ్రంథము వ్రాశారు అంటాడు. అంటే, గ్రంథము లావుదైతే నేను గొప్పోన్నేనా? అందులో విషయము నీకు అర్థము కావాలి కదా? అర్థము కాకుండనే, నువ్వు చాలా గొప్పోడివి అంటారు. నేను గొప్పోన్ని అయితే నీకు ఏమి వస్తాది? ఇందులో ఉండే విషయము నీకు సంపూర్ణముగా అర్థమైతేకాని ఏమీ రాదు. నేను ఒక విషయము అడిగినాననుకోండి, నేను వ్రాసిన గ్రంథములోనిది. నేను ఏ ఉద్దేశ్యముతో వ్రాసినానో నాకు తెలుసు. దాన్ని అడిగితే, దాని వివరము నువ్వు చెప్పలేకుండా ఉన్నావు. చెప్పలేక పోయినపుడు నా విషయము నీకు ఎట్ల అర్థమైతాది? అర్థము కాదు.


ఈ మధ్యన ఒక సినిమా చూసినాను నేను. అంటే సినిమాల విషయము కూడ చెప్తాడని మీరు అనుకోవద్దండి. అవి మీకు దగ్గరగ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను నేను. 'సెవెంత్ సెన్స్' అనే సినిమా చూశాను. అందులో ఒక మనిషిని గురించి వాడు చెడ్డవాడా? మంచివాడా? వాడు ఎటువంటి వాడని చూడాలంటే, వాడు ఏ పుస్తకాలు చదువుతున్నాడు అని చూస్తే, వాడు ఎంత మంచోడో తెలుస్తుందంట. వాని మంచితనము వాడు చదివిన పుస్తకాల ద్వారా తెలుస్తుందంట. అర్థమయిందా! వాని చెడ్డతనము వాడు వాడి పారెక్కిన వస్తువుల ద్వారా తెలుస్తుందంట. అంతే గదా! మంచి సూత్రమది. సినిమాకి మనము 60, 70 రూపాయలు టికెట్ పెట్టి పోయినందుకు అంతా 3 గంటల సినిమా మనకు ఉపయోగపడదనుకో, ఏదో కొన్ని కొన్ని పాయింట్లు ఉపయోగపడుతాయి. అందులో ఒకమాట ఉపయోగపడుతుంది, మీరు గమనించినారో లేదోగాని. ఒక సైంటిస్ట్ ఇంట్లోకి


-----

పోయి, ఇద్దరు వెతుకుతుంటారు, అందులో ఏమన్నా దొరుకుతాయా అని. అందులో హీరో పోయి వాని చెత్త బుట్టలో వెతుకుతుంటాడు. అంటే నేను ఏదో ముఖ్యమైన కాగితాలు వెతకమంటే, నువ్వేంది ఇట్ల అనవసరమైన పని చేస్తున్నావు అంటే, అట్ల కాదు ఒక మనిషి మంచివాడు అని చూసేదానికి వాడు చదివిన పుస్తకాలు ఏంటివని ఆ పుస్తకాలు చూస్తే తెలుస్తాదంట, వాడు వ్రాసిన పుస్తకాలుగానీ, చదివిన పుస్తకాలుగానీ. అంతే గదా! వాని భావము తెలిసిపోతుంది. ఎంత మంచి వాడో అని దాంట్లో తెలిసిపోతే, ఎంత చెడ్డవాడు అనేది ఎట్ల తెలిసిపోతుందంటే వాడు వాడిన వస్తువులను బట్టి తెలుస్తుందంట. అంతే గదా! ఓ సీ.డి. చూసింటాడు, పక్కన పెట్టింటాడు. వాడు ఏమి సీ.డి. చూసినాడో అని తెలిస్తే, వాడు ఎట్లాంటి వాడో తెలుస్తాది. అంతే గదా! వాడు ఆధ్యాత్మిక సీ.డి. చూసినాడా? లేకపోతే రాక్ అండ్ రోల్ డాన్స్ (rock and roll dance) సినిమా సీ.డి. చూసినాడా? లేకపోతే బూతు బొమ్మల సీ.డి. చూసినాడా? అని తెలిస్తే వాడు ఎట్లాంటోడో, వాని పద్ధతేందో తెలిసిపోతుంది కదా వాడు వాడే వస్తువులు చూస్తే! అంటే ఆ సూత్రము ప్రకారము చెప్పితే, ఒక మనిషి గొప్పతనము తెలియాలంటే మనము ఏమి చేయాలి? అతను వ్రాసిన పుస్తకాలు, అతను చెప్పిన జ్ఞానము ఏదైనా మనము చూస్తేగానీ అర్థము కాదు.


ఇప్పుడు దేవుని గ్రంథాలు ఉన్నాయి మనకు. అవి చాలా గొప్పవి. 5000 సంవత్సరాల పూర్వము మన మధ్యలోకి వచ్చినటువంటి భగవద్గీత ఉంది. మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి దివ్యమైనటువంటి, పవిత్రమైనటు వంటి ఖుర్ఆన్ ఉంది. పరిశుద్ధ బైబిలు కూడా ఉంది. అర్థమయిందా! కానీ ఇక్కడ ఏమి చెప్పాడంటే, పరిశుద్ధ బైబిలును ప్రవక్త చెప్పాడు, ఖుర్ఆన్న కూడా ప్రవక్త చెప్పాడు, మరి భగవద్గీతను ఎవరు చెప్పారు? అనంటే,


----

మనము ప్రవక్త అని చెప్పలేదు. ఎందుకంటే, రూల్ ప్రకారము ప్రవక్త అన్నాగానీ, ఆయన ప్రవక్త కాదు. అర్థమయిందా! జ్ఞానము చెప్పేవాళ్ళలో మనకు ప్రవక్తలూ ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. కాని ఆ విషయము మీకు తెలియదు. ఇది మీకు కొత్త పాయింట్ చూసుకోండి. జ్ఞానము మనకు అవగాహన చేసి చెప్పేదానికోసము భూమి మీదకి వచ్చినటువంటి మనుషుల్లో ప్రవక్తలూ ఉన్నారు, మిగతా వాళ్ళు కూడ ఉన్నారు. అర్థమయిందా! ఇప్పుడు కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. ఆయన ప్రవక్తనా? అంటే వేరే వాళ్ళకు అర్థమయ్యేటట్టుగ, ఇంకా ప్రవక్త లాంటివాడు అని చెప్పాల్సిందేకాని ఆయన ప్రవక్త కాదు. సరే, ఆయన ప్రవక్తనో కాదో ఆ చర్చ ఇప్పుడు మనకు అవసరము లేదుగాని అది తర్వాత చూసుకుందాము. తర్వాత ముందు తర్వాత కూడా ఇంక మీకు ఎవరు జ్ఞానము చెప్తారు? అంటే ప్రవక్తలే చెప్పాలని రూల్ లేదు. ఇప్పుడు గతముది విడిచిపెట్టు. జరగబోయేది చూస్తాము. బైబిలులో ఏసుప్రభువు ఏమి చెప్పాడో తెలుసునా? నా వెనకల పరిశుద్ధాత్మ ఒకటి వస్తుంది మీ వద్దకు అని చెప్పాడు. అది ప్రవక్త కాదు. నేను చెప్పిన విషయాలన్ని తెలియజేస్తుంది. ప్రవక్తలు చెప్పిన విషయాలన్ని అది తెలియజేస్తుంది. ప్రవక్తలు చెప్పిన విషయాలన్ని తెలియజేయడమే కాకుండ ప్రవక్తలు వదిలిపెట్టిన విషయాలు కూడా తెలియజేస్తుంది. అటువంటి పరిశుద్ధాత్మ వస్తుంది. అది ప్రవక్త కాదు, ఆదరణకర్త. ప్రవక్త అని పేరు పెట్టి చెప్పలేదు చూడు! గమనించు కోండి. జ్ఞానాన్ని చెప్పేవాళ్ళంతా ప్రవక్తలు కాదు. ప్రవక్తలు కూడ ఉన్నారు. అర్థమయిందా!


భగవద్గీతను చెప్పినేది మళ్ళ ప్రవక్తో కాదో మనకు తెలియదుకాని పవిత్రమైనటువంటి ఖుర్ఆన్ను చెప్పినేది ప్రవక్త అని బాగా అర్థమైపోయింది.

----

దాంట్లో వ్రాయబడింది మనము చెప్పుకుంటున్నాము. తరువాత అంతకు ముందుది బైబిలు కూడా ప్రవక్త ద్వారానే తెలియబడినది అని మనము చెప్పుకున్నాము, వ్రాసుకున్నాము. ఇప్పుడు బైబిలును, ఖుర్ఆన్న ప్రవక్తలు చెప్పితే, తరువాత ప్రవక్తలు రారు అని కూడ చెప్పబడింది. ఆఖరి ప్రవక్త ఎవరు? హజరత్ మహమ్మద్ ప్రవక్త గారే చెప్పాడు ఇది. ఇంక ప్రవక్తలు రారు. ప్రవక్తలు రానంతమాత్రాన ఇంక జ్ఞానాన్ని చెప్పేవాళ్ళు లేకుండ పోతారా ప్రపంచములో? ఇది పెద్ద ప్రశ్న. జ్ఞానము చెప్పబడుతుంది. ఈ అజ్ఞానము పెరిగిపోతూనే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ చెప్పే వాళ్ళు అవసరము ఏసుప్రభువు ఏమి చెప్పాడు? ప్రవక్త రాడు, ప్రవక్త అని పేరు చెప్పలేదు. ఏమి చెప్పాడాయన? ఆదరణకర్త వస్తాడు. ఆయన మేము చెప్పిన విషయాలు కాకుండ, మేము చెప్పకుండా వదిలిపెట్టిన విషయాలు కూడా మీకు తెలియజేస్తాడు అని చెప్పాడు. ఈయన ఆదరణకర్తని ఎవరికి తెలుస్తుంది? ఎవరికీ తెలియదు. "లోకము ఆయనను చూడదు.” అంటే లోకమే ఆయనను గుర్తించదు. ప్రవక్త అయితే తెలియబడతాడు పదిమందికి కానీ ఆదరణకర్త తెలియబడడు. మళ్ళీ ఆదరణకర్త వచ్చాడని గుర్తు ఏమిటి, ఎవరికి తెలియబడనపుడు? ఇంక సాక్ష్యము ఏముంది మనకు? అంటే మీరే సాక్ష్యము ఈ రోజు అని చెప్పాడు ఆయన.


ఆ రోజు ఎవరికి చెప్పాడో, ఎంతమందికి చెప్పాడో మీరే సాక్ష్యము. మీకు మాత్రము తెలుస్తుంది అని చెప్పాడు. ఎంతమంది ఉన్నారు ఆ రోజు? 10, 11 మంది ఉన్నారు. ప్రపంచమంతా తెలియకుండా పోయి, ప్రపంచాని కంతా ఆయన జ్ఞానము చెప్పితే, మళ్ళీ ప్రవక్తలు చెప్పనటువంటి, వదిలి పెట్టినటువంటి జ్ఞానాన్ని కూడా ఆయన చెప్పితే, మళ్ళీ ప్రవక్తలు చెప్పినా అర్థము కాకుండా ఉండే జ్ఞానాన్ని కూడా ఆయన చెప్పితే, చూడు ఎట్లుందో!


-----

ఈ ప్రపంచానికంతా చెప్పాలి కదా! ఎందుకంటే ప్రవక్తలు చెప్పనటువంటి జ్ఞానమూ, అర్థము కాకుండా పోయినటువంటి ప్రవక్తలు చెప్పినటువంటి జ్ఞానాన్ని కూడా చెప్పితే, అది అంత గొప్ప జ్ఞానము అందరికీ ప్రాకిపోవాలి కదా అది, అన్ని మతాలకు ప్రాకిపోవాలది, అన్ని మతాలకు ప్రాకి పోవాల్సిందే! అందరికీ తెలియాల్సిందే! ప్రజలందరికీ తెలిసినాకానీ, ఆయన మాత్రము ఎవ్వరికీ తెలియబడడు. ఆ వచ్చేవాడు ఇట్లుంటాడు అని చెప్పాడు. తరువాత ఇప్పుడు ప్రవక్తలు చెప్పిపోయినారు కదా జ్ఞానము. మళ్ళీ ఎందుకు మనకు ఆయన ఆదరణకర్త వచ్చి చెప్పాలి అంటే, ఏమి అవసరము ఉంది? వీళ్ళు చెప్పిన జ్ఞానము మనకు సరిపోతుంది కదా! 2000 సంవత్సరాల పూర్వము మన ఏసుప్రభువు ప్రవక్త చెప్పారు. బైబిలులో చాలా గొప్ప జ్ఞానముంది. అందులో దేవుని జ్ఞానము లేదు అనేదానికి వీల్లేదు. దేవుని జ్ఞానము తెలుసుకునేది సంపూర్ణముగా ఉంది. ఏమాత్రము కొదవ లేకుండ. సరే ఇంకా అక్కడికీ మీకు ఆ జ్ఞానము తెలియకుండ పోతే, దానికి వ్యతిరేఖముగా ఉంటే మళ్ళీ దేవుడు ఏమి చేసాడంటే, మహమ్మద్ ప్రవక్తగారి ద్వార మళ్ళీ ఆ విషయాన్ని కొత్తగా మనకు తెలియజేశాడు. అక్కడ కూడా దేవుడు తెలియజేశాడు కాబట్టి కొంతమంది ఆయనను అనుసరించినటువంటి వాళ్ళు కూడా జ్ఞానము తెలుసుకోనేదానికి ఎంతో అవకాశము ఉంది. అక్కడ కూడా సంపూర్ణమైనటువంటి దేవుని జ్ఞానము ఉంది. కానీ దానిని మనము ఎంతవరకు అర్థము చేసుకున్నాము? అంటే అర్థము చేసుకోకుండ పోయినాము.


ఇప్పుడున్న సమస్య అదే. అన్ని మతాల్లోను జ్ఞానము ఉంది. కానీ ఆ ఉన్న జ్ఞానాన్ని మనము అర్థము చేసుకోలేదు కాబట్టి మళ్ళ చెప్పేవాడు కావాలి మీకు. చెప్పేవాడు వచ్చినా, వింటామని నమ్మకము లేదు.


----

ఎందుకంటే, మాకు ముందే తెలుసు అని చెప్తాము ఆయనకు. ప్రవక్తలు చెప్పిన జ్ఞానమే మనకు అర్థము కాకున్నా, ఒకవేళ ఆదరణకర్త వస్తే, ఆయన మాట వింటామని నమ్మకము ఏముంది? అంటే కొంతమంది ఏమీ తెలియని ప్రజలు వింటే వినొచ్చుకానీ, కొంతమంది ఏమి చేస్తారంటే, మాకు జ్ఞానమంతా తెలుసు, మా ప్రవక్త అంతా చెప్పాడు అంటారు. వారి ప్రవక్త చెప్పిన విషయాన్నే చెప్పినాగానీ వాళ్ళకు అర్థము కాదు. ప్రవక్త చెప్పిన విషయము వాళ్ళకు అర్థమయిందా? అని ప్రశ్నిస్తే, ఆ మూలగ్రంథములో ఉండే విషయాలను ప్రశ్నిస్తే, అందులో కొంతైనా తెలిసివుండదు. అలాంటప్పుడు వాళ్ళు తెలియనటువంటి వాళ్ళే కదా! మళ్ళ తెలియనటువంటి వాళ్ళను గురించి ఈయన తెలియజెప్తున్నాడు కదా అని ఆలోచన చేయరు. అంత గొప్పవాన్ని కూడా నువ్వు మేము చెప్పినట్టు విను అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇదంతా ఎందుకు మానవుల్లో ఈ విధముగా తయారైనారు? ఈ రోజు హిందువులు ఆదరణకర్త వచ్చినాకానీ ఆదరణకర్తకు ఏమి చెప్తారంటే, నీకు జ్ఞానము తెలియదు మా దగ్గర జ్ఞానము ఉంది. నువ్వు చెప్పేదంతా సరిగా లేని జ్ఞానము, మేము చెప్పేది నేర్చుకో అంటారు. వీళ్ళంతా చెడు మార్గములో పట్టిపోయినారని, సక్రమమైన మార్గము సూచించాలని ఆయన వస్తే, ఎవరెంత జ్ఞానములో ఉన్నారో, ఎవరెంత అజ్ఞానములో ఉన్నారో అన్నీ తెలిసి వస్తే, అతనికే చెప్పేదానికి మొదలుపెడతారు. ఇంకొకరు అంటారు నువ్వు ఏ మతానికి సంబంధము లేకుండ మా మతములో ఉంటే బాగుంటుంది అంటారు.


మతము అవసరము లేదయ్యా! దేవుని జ్ఞానము మనకు అవసరము, దేవుని విధానము మనకు అవసరము, దేవుడు చెప్పినటువంటి సమాచారము మనకు అవసరము అనంటే, సమాచారము కథ మళ్ళ చూస్తాముకానీ,


----

ముందు నువ్వు టోపి పెట్టుకో, లేకపోతే నెత్తిన బొట్టు పెట్టుకో, నామము పెట్టుకో అంటారు. మేము నామము పెట్టుకోము, ఏమి పెట్టుకోము అంటే, ఏదో ఒకటి పెట్టుకుంటే కదా నువ్వు కనిపించేది. మేము మీ వాళ్ళము అయితాము, నువ్వు మా వాడివి అయితావు. మీ వాళ్ళు, మా వాళ్ళు అనేది ఈ ప్రపంచవిధానాన్ని బట్టి కాదు, జ్ఞానాన్నిబట్టి కావాలి అని చెప్పితే, లేదు కొంతకాలము బతికి పోయేటటువంటి విధానాన్ని మనిషి అనుసరించాలని చూస్తాడు కానీ ఇంకోటి కాదు. ఏ మతములో మనిషి పుట్టినా గానీ కొంతకాలమే బ్రతికేది చూసుకోండి మీరు. పర్మినెంట్ (per- manent) గా బ్రతుకుతారని నమ్మకము ఉందా? 100 సంవత్సరాలు బ్రతుకుతారని గ్యారెంటీ లేదు. మీరు గ్యారెంటీ లేని జీవితము బ్రతుకుతూ, దాంట్లో ఒక వేషధారణ ధరించి, అదే ముఖ్యము అనుకోవడముకంటే దేవుడు చెప్పిన జ్ఞానము ముఖ్యము అనుకోవడము మంచిది కదా మీరు? మళ్ళ జన్మకు మీరు పోతారని తెలిసినా, తెలియకపోయినాగానీ, మీకు వెంట వచ్చేటటువంటి జ్ఞానాన్ని మీరు తెలుసుకోవడము ముఖ్యమా? మీకు ఈ ఆచారాలు ముఖ్యమా? బొట్టు పెట్టుకోవడము, నామము పెట్టుకోవడము, విభూతి పెట్టుకోవడము ముఖ్యమా? లేకపోతే ఇంకో మతములో ఇంకో విధానము ముఖ్యమా? ఇవన్నిటికంటే నువ్వు బొట్టు ఎందుకు పెట్టు కుంటున్నావో తెలుసుకో! నువ్వు విభూతి ఎందుకు ధరిస్తున్నావో తెలుసుకో! నువ్వు నామము ఎందుకు పెట్టుకున్నావో తెలుసుకో! హిందువులకు ఇదే చెప్పాము మేము. నువ్వు తెలియకుండ చేసేదానికంటే తెలిసి చెయ్యి, అప్పుడు జ్ఞానము బాగా తెలుస్తుంది. తెలియకుండా ఏ పని చెయ్యొద్దు.


మనిషి తెలియకుండానే కొన్ని పనులు చేస్తున్నాడు. నువ్వు ఎందుకు ఇట్లున్నావు? అంటే ఆ విషయము తెలియదు. ఇట్లుండాలి, అంతే. మా


---

పెద్దలు విభూతి పెట్టుకోమని చెప్పారు. ఎందుకు పెట్టుకోవాలి విభూతి? అని అడిగితే, మా తాత పెట్టుకున్నాడు, మా నాన్న పెట్టుకున్నాడు అందుకని నేను పెట్టుకుంటున్నాను ఇది అని చెప్తున్నారుగానీ, ఫలానా దానికి మేము పెట్టుకుంటున్నాము అని చెప్పలేదు. ఇతర మతస్థులు కూడా మా మతములో ఇట్లే ఉండాలి అంటారు. అట్లే ఎందుకు ఉండాలి అని మేమడుగుతున్నాము? దానికొక కారణము ఉంటుంది కానీ ఆ కారణమేంటో మనకు తెలియదు. ఆ కారణము ఇప్పటి వరకు తెలియదు మనకు. తెలియకున్నాగానీ బయట విధానాలకే మనిషి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. దేవుడు చెప్పిన జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వడము లేదు. ఎందుకు ఆ విధముగా మనిషి మారిపోయి నాడు? అంటే అది మనిషిలో ఉండేటటువంటి గుణాల ప్రభావము. ఇప్పుడు నేను చెప్పేది గుణాల ప్రభావము అని మనిషి లోపలి విధానాన్ని చెప్తున్నాను. ప్రజలందరిని దేవుడు తయారుచేసి, వాళ్ళకు ఒక విధానము పెట్టాడు. ఆ విధానము తెలుసుకోకుండా మిగితా మతస్థులు అంటే హిందువులుగానీ, క్రైస్తవులుగానీ, ముస్లీములుగానీ నాది ఫలానా మతము అని పైన ఉండేటటు వంటి చూపుతోనే వాళ్ళు మాట్లాడుతున్నారుగానీ, నేను ఎవరు? నేను శరీరములో నివసించే జీవున్ని, నాకు ఇవన్నీ గుణాలు ఉన్నాయి. ఏ గుణము ఎట్ల నడుపుతుంది? ఈ మాట్లాడేదానికి కారణము వెనకల ఒక మిషనరీ ఉంది. ఆ మిషనరీ ఏ విధముగా మనల్ని కదిలిస్తుంది అనే విషయము తెలుసుకోకుండ పోయి తను మాట్లాడిందే మాట, తనకు తెలిసిందే తెలివి అనుకుంటున్నారు.


కానీ మనము ఏమి చెప్తున్నామంటే ఈ శరీరము ఒక యంత్రాంగము అంటే ఒక మిషనరీ మాదిరి ఉంది. ఒక యంత్రము లాంటిది. నీ శరీరములో ఎన్నో పనులు చేస్తేగానీ ఒక కదిలిక రాదు, ఒక


----

మాట రాదు, ఒక పని జరగదు, నీలో ఒక భావము పుట్టదు. నీలో ఒక భావము, ఒక సమాచారము బయటికి వస్తుంది అంటే లోపల గుణాలు పని చేయాలి, ఆలోచనలు పని చేయాలి, అవన్నీ వచ్చిన తర్వాత నీకు ఆ విషయాన్ని బయటికి చెప్పగలుగుతున్నావుగానీ, నువ్వు అంత సులభముగా చెప్పలేదు. మళ్ళ లోపల ఏమి జరుగుతుంది? అని తన విధానము తనకు తెలియదు. తనెవరో తనకు తెలియదు. తనను ఆడించేవాడు ఎవడో తెలియదు. ఒక మనిషి నాకు కాలు కుంటుపడిపోయింది అంటున్నాడు. కాలు కుంటుపడిపోయింది, నిజమే. నడవలేకుండా ఉన్నావు. అంతవరకు నడిచేవానివి అప్పుడు ఎందుకు నడవలేకపోయినావు? ఏమైంది? దాని గురించి ఆలోచన చేయరు. లోపల విధానము తెలియదు. ఒకవేళ బాగలేక ఒక డాక్టరు దగ్గరికి పోతే ఆయనేదో మందు ఇస్తాడు, బాగైతుంది, అంతే! ఒకవేళ అది డాక్టరు మందు ఇచ్చినా బాగకాలేదు అనుకోండి, ఇంకో పెద్ద డాక్టర్ దగ్గరికి పోతాము. ఎవడిచ్చినా బాగుకాకపోతే? ఈ డాక్టరులంతా డాక్టర్లు కాదా? వీళ్ళకు వైద్యము తెలియదా? కాళ్ళ నొప్పులు ఎవరూ బాగుచేయలేరా? అయినాగానీ నీకు బాగుకాలేదు. ఎందుకు? లోపలి విధానము తెలియదు. నీకు కర్మ ఒకటుంది వెనకాల. ఆ విధానము తెలియదు. మన వెనకాల ఉండే విధానము మనకు తెలియకుండపోయింది కాబట్టి, ఈ రోజు అన్ని మతాల్లోను అజ్ఞానము పెరిగిపోయి, మూల సూత్రాలు ఏవో తెలియకుండపోయినాయి.


పూర్వము పెద్దలు అంటే మహానుభావులు ప్రవక్తలుగా ఉన్నటువంటి వాళ్ళుకానీ ఇంకొకరుగాని ఇంకొకరుగానీ ఎంతో జ్ఞానాన్ని మనకు అందించారు. ఈ రోజు వేల కోట్లు, వందల కోట్లు ఖర్చు బెట్టి ఒక విధానాన్ని కనుక్కొంటే సైంటిస్ట్లు, ఈ విధానాన్ని కొన్ని వందల సంవత్సరాల పూర్వమే


----

చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. అర్థమయిందా! కొన్ని వందల సంవత్సరాల పూర్వమే మన ప్రవక్తలు చెప్పారు. అది మీకు అర్థము కాలేదు. ఆ విషయాలు మూల గ్రంథాల్లో ఉన్నాయి. అవి మీకు అర్థము కాలేదు. అర్థము కాకుండపోయి మనకు అర్థమైనదని చెప్పుకుంటున్నాము. మనకు అర్థమయింది అని చెప్పుకుంటే మన ప్రవక్తకు చెడ్డ పేరు వస్తుందా? మంచి పేరు వస్తుందా? అని ఎవ్వరూ అనుకోవడము లేదు. మీకు తెలిసిన విధానము మీరు చెప్పుకుంటే తక్కువ విధానము అది. నేను చెప్తున్నా కదా! పెద్ద సైంటిస్ట్లకు కూడా అర్థముకానటువంటి జ్ఞానాన్ని విధానాన్ని వాళ్ళు చెప్పగలిగితే, దానిని ఈ రోజు నువ్వు అర్థము చేసుకోకుండా దాన్ని చిన్నగా ఎందుకు మాట్లాడుతున్నావు? అని ప్రశ్న వేస్తే, ఆలోచన చేయడము లేదు. మేమంతా సక్రమముగానే మాట్లాడుతున్నాము అనుకుంటున్నారుకానీ, దేవుడు ఏమి చెప్తున్నాడంటే,లేదు నువ్వు మోసపోతున్నావు అని కూడా హెచ్చరిక చేశాడు. నువ్వు ఇక్కడ నా ముందర కూర్చున్నావు. నువ్వు మోసపోతున్నావు చూడు! అని నేను అంటున్నాను. అంటే నీ వెనకాల కూర్చున్నోడు నీ ప్యాకెట్లో నుండి డబ్బులు తీస్తున్నాడు కాబట్టి నాకు అది కనిపిస్తూ ఉంది.


అప్పుడు నేను ఏమంటున్నాను, ఈ సందర్భములో, ఈ సమయములో నువ్వు మోసపోతున్నావు చూడు అని చెప్తే, నేను మోసపోయి నది నిజమేనూ, మొన్న బస్సు ఎక్కుతూ ఉండి 10 రూపాయలు కండక్టర్ ఇచ్చినాడని పొరపాటుగా ఎంచుకొని వచ్చినా అంటాడు. నువ్వు ఎప్పుడిదో 10 రోజుల క్రితము కండక్టర్కు దగ్గర మోసపోయింది చెప్తున్నావు కానీ, ఇప్పుడు మోసపోతున్నది చెప్పలేదు. నేను ఇప్పుడు మోసపోతున్నానా? 10 రోజుల కిందట కండక్టర్ దగ్గర ఉన్న 10 రూపాయలు మరిచిపోయినది


----

చెప్తున్నా నేను. నువ్వు 10 రోజుల క్రితము కండక్టర్ దగ్గర మరిచి పోయినాను అని నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు తప్ప, ఇప్పుడు మోసపోతున్నావు అంటే, నేనేంటికి మోసపోతా, నేనేమి మోసపోను. అది మొన్నటిది చెప్తున్నాడులే ఆయన అంటే, మొన్నటిది కాదు నేను చెప్పేది. ఏ సందర్భములో చెప్తున్నాము, ఏమి? అని మనము అర్థము చేసుకోవాలి. దేవుడు అక్కడ ప్రత్యక్షముగా చెప్పినాగానీ అర్థము చేసుకోకుండా పోతే ఏమైతుంది మనకు? మనము మోసపోయినట్టే. నేను ఒక వాక్యము చదివాము ఒక గ్రంథములో. ఆ గ్రంథములో వాక వాక్యము అయిపోతూనే అక్కడ ఏమన్నాడు అంటే, నువ్వు మోసపోతున్నావు అన్నాడు. ఈ వాక్యము దగ్గరనే మనము మోసపోతున్నాము. ఇక్కడ మీకు అర్థము కాలేదు అని చెప్పాడు ఆయన. మూలగ్రంథములోనే ఒక వాక్యము చెప్పి, వాక్యము

ప్రక్కనే నువ్వు మోసపోతున్నావు అన్నపుడు, ఈ వాక్యము దగ్గర మనమేమన్నా మోసపోతున్నామేమో అని చూడకుండ, ఏమిటో ఇంకోటి చూపించి, అక్కడ మోసపోతున్నారు, అది కూడా నేను మోసపోలే, వేరేవాడు మోసపోయాడు, అందుకే అందరిని కలిపి చెప్పినాడు ఆయన అంటున్నారు. మీరు మోసపోతున్నారు అంటే, నేనేమి మోసపోలేదులే అనుకుంటే ఎట్లైతాది. అట్ల కాకుండా మనము ఎక్కడ మోసపోతున్నాము? ఏమి కథ? మన పెద్దలు ఎందుకు చెప్పారు? మనమేమన్నా సర్వము తెలిసినటువంటి వాళ్ళమా మనము? అని మనము ఆలోచన చేయడము లేదు. మనకు తెలియని విధానము ఎంతో ఉంది.


మనము పుట్టినప్పటినుండి జీవితము కొన్ని సంవత్సరాలే మనము బ్రతకగలుగుతున్నాము. “జ్ఞానము సముద్రములాంటిది" ఒక విషయాన్ని తెలుసుకోవడానికి నీకు చాలా టైమ్ పడుతుంది. “ఒక జీవితములో నువ్వు


---

సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోలేవు”. ఒక జీవితమంతా కూడా తక్కువ అవుతుంది. దేవుడు చాలా గొప్పవాడు. అంత గొప్పవాని విషయము తెలుసుకోవాలంటే చాలా టైమ్ పడుతుంది నీకు. కాని ఒక సంవత్సరమో, 2 సంవత్సరాలో ఏదో ఒక పుస్తకము చదివినంతమాత్రాన అన్ని నాకు తెలుసు అనుకోవడము పొరపాటు. కొంత జ్ఞానము తెలుస్తానే, ఒక నెల, కొద్దిగా జ్ఞానము తెలుసుకుంటూనే, నాకు అన్ని తెలుసు అని వేరే వాళ్ళతో పోటీకి పోతారు. ఎదుటివానికి ఎంత తెలుసునో, ఏమి కథో, వాని విధానము మనకు తెలియకనే, వానికి పోటీకి పోయి మీకేనా తెలిసేది మాకు అన్ని తెలుసు అంటారు. ఎదుటి వ్యక్తి ఎంతటి వాడో, ఏమి కథో మనకు తెలియదు. కానీ మీకంటే మాకు అన్నీ తెలుసు అనేస్తారు. ఎట్లుంది చూడండి! ఈ రకముగ మనుషులు ప్రతి మతములోనూ మభ్యపడిపోతున్నారు. నేను చెప్తున్నది సర్వులకు ఇది. భగవద్గీత అనేది సర్వమానవులకు చెప్పబడింది. కానీ హిందువులకని పేరు పెట్టి ఎక్కడా చెప్పలేదు. బైబిలు చెప్పబడింది క్రైస్తవులకు అని పేరు పెట్టి ఎక్కడా చెప్పలేదు. తర్వాత ఖుర్ఆన్ అనే గ్రంథము కూడా చెప్పబడింది ప్రవక్త ద్వారా. అది సర్వమానవులకు అని చెప్పబడిందికానీ ఒక ఇస్లామ్ మతస్థులకే అని చెప్పలేదు, మిగతా వాళ్ళకు ఇది అక్కర్లేదు, మాకే అని ఎవరూ చెప్పలేదు. సర్వులకు అది చెప్పినటు వంటిది. ఒక గ్రంథము ఒక ప్రవక్త చెప్పాడు అంటే, అందరికీ చెప్పబడినటు వంటిది. మనము అందరము వినాల్సిందే విని దాంట్లో గ్రహించుకోలేదు. ఆ మతగ్రంథము నేను చదవను, ఈ మతమే నాకు కావాలి అనుకుంటే ఎవరు ఏమి చేస్తారు నీకు! అక్కడ చెప్పినోడు ఎవడు? ఇక్కడ చెప్పినది ఎవడు? అంతా ఒకటే..! నీకు ఇక్కడ అర్థము కాలేదనే మళ్ళీ అక్కడ చెప్పింది. ఇక్కడ అర్థము కానిది ఏందో, అక్కడ అర్థమయ్యేది ఏందో


----

చూసుకోవాలి కదా దాన్ని. చూడు! ఏమి నష్టము అయితుంది నీకు.అక్కడ ఏమి చెప్పినారో చూడు.


మేము క్రైస్తవుల దగ్గరికి పోయి ఇది చదవండి అని గ్రంథము తీసుకుపోయి ఇచ్చాము. అంటే వేరే గ్రంథము చదవము, మేము బైబిలు మాత్రమే చదువుతాము అని వాళ్ళు అంటారు. ఎందుకు అంత భయము మీకు? ఆ మతములోనూ, ఈ మతములోనూ ఇంకో మతాలలోనూ అంతా దేవున్ని గురించే చెప్పారు. దేవుడు ఒక్కడే అని చెప్పబడింది, సృష్టికర్త అందరికి ఒకడే అని చెప్పబడింది. ఏమన్నా మీకో దేవుడు మాకో దేవుడు అని ఒక్కొక్క గ్రంథములో ఒక్కొక్కటి రాశారా? చెప్పండి అట్లైనాగాని. లేదు, నార్మల్గా అందరికీ ఒకటే దేవుడు అంటారు. కానీ లోపల ఆ భావము మాత్రము లేదు. అంటే వాళ్ళ దేవుడు వేరు అనే భావము ఉంటుంది లోపల. ఇప్పుడు కొత్త వాదన వచ్చింది. అందరు దేవుడు దేవుడు అంటున్నారు, మనమంతా దేవుడు అనకూడదు, దేవునికి మనము వేరుగా పేరు పెట్టాలంటున్నారు. చూడు, దేవునికి కూడా వేరుగా పేరు పెట్టవచ్చంట. హిందువులేమో దేవుడు అంటున్నారు కాబట్టి మనము దేవుడు అనకూడదు, సృష్టికర్త అందాము. క్రైస్తవులు సృష్టికర్త అంటున్నారు కాబట్టి మనము అలా పిలవకూడదు మనము ఇంకో పేరు పెడతాము. ఇంకా ఏమి వచ్చిందంటే, అందరూ ప్రవక్త అంటున్నారు. మన ఆయనను కూడా ప్రవక్త అంటే, మళ్ళీ అందరి ప్రవక్తల్లోకి కలిసిపోతాడు. మనము వేరుగా పేరు పెడదాము మా ప్రవక్తకు అని ఇంకా అంటారు. ఇదేమి విచిత్రము! మూల గ్రంథాల్లోనే ప్రవక్త అని ఉంది కదా అంటే, అందరూ ప్రవక్త అనే అంటున్నారు, అది నార్మల్ అయిపోయింది. కాబట్టి మేము వేరే పేరు పెడతాము అంటున్నారు. ఎట్లుందో చూడు! అందరూ దేవుడు అంటున్నారు,


----

దేవుడు దేవుడు అని అది నార్మల్ అయిపోయింది, అది బాగాలేదు పదము. మేము వేరుగా పెట్టుకున్నాము ఆ పదాన్ని అది మా పదము. దేవునికి కూడా వేరు పదము పెడుతున్నారు. మనుషులు చేసే పని చూడండి. ఎట్లుందో!


ఈ రకముగా కొద్దికాలము బ్రతికి పోయేటటువంటి మనల్ని బాగుపరచాలని దేవుడు జ్ఞానము చెప్పితే, ఆ దేవుని జ్ఞానాన్నే అటు కాదు, ఇటు కాదు అని మనము మలుపులు తిప్పేస్తున్నాము. ఎవరికీ అర్థము కాకుండ చేసుకుంటున్నాము. కొంతమంది పెద్దలు దాన్ని అర్థము చేసుకొని ప్రజలకు చెప్పాలి అనుకుంటే అది వాళ్ళ పెద్దలకే అర్థముకాకుండా పోయింది. ప్రజలను తప్పుదారి పట్టించేస్తున్నారు. చిన్నవయసులో పుట్టినటు వంటి అబ్బాయిని నువ్వు మన మతములో పుట్టావు, ఫలానా మతములో పుట్టావని నేర్పిస్తున్నారు. పుట్టినప్పుడు వానిది ఏ మతమో వానికి తెలియదు. వాడు పెద్దైన తర్వాత మనది ఫలానా మతము అంటారు వాడి ఇంట్లో వాళ్ళు. అప్పుడు వాడు ఓ! మనది ఫలానా మతమని అనుకుంటాడు. మనము ఈ గ్రంథమే చదవాలి వేరే గ్రంథము చదవకూడదు అంటాడు. సరే, ఆ గ్రంథమే చదివి అంతా కంఠాపాటము చేసుకున్నావు. అందులో ఏమి సారాంశము ఉందో చూడకుండనే, అందులో పూర్తి జ్ఞానముంది అని చూడకుండనే, అందులో పూర్తి అవగాహన రాకముందరే, ఆచారాలు వ్యవహారాలు ప్రవర్తించేదానికి మొదలుపెడుతున్నారు. మళ్ళీ ఇది మనకు ముఖ్యమా? అని అంటే, నేను చెప్తున్నాను పైన విధానాలు ఏమి ముఖ్యము కాదు. పైన ప్రపంచములో నువ్వు ఏ ఆట ఆడినా, ఏ పద్ధతిగా ఉన్నా ఏ వేషము వేసినాగానీ దేవుడు నీకు తెలియబడడు. నీకు తెలియబడే జ్ఞానము ప్రకారమే దేవుడు తెలియబడతాడు. ఈ మాట కాదనే వాళ్ళు ఎవరైనా


----

ఉన్నారా చెప్పండి. ప్రపంచ విధానాల ప్రకారము ప్రపంచ వేషాలు మార్చుకున్నంత మాత్రాన, మతాలు మార్చుకున్నంత మాత్రాన దేవుడు తెలియబడతాడా? చెప్పండి. తెలియబడడు. దేవుడు చెప్పిన విధానము తెలిస్తేనే తెలియబడేది దేవుడు.


దేవుని కోసము, దేవున్ని తెలుసుకునేదానికే మీరు మతాలు మార్చుకున్నారు, పేర్లు మార్చుకున్నారు, విధానాలు మార్చుకున్నారు, ఆచారాలు మార్చుకున్నారు. అంగీ కట్టుకున్నోడు లుంగీ కట్టుకుంటున్నాడు. లేదు, పొడుగు జుబ్బా వేసుకొనేవాడు పొట్టి జుబ్బా వేసుకుంటున్నాడు, పొట్టి జుబ్బావేసుకునేవాడు పొడుగు జుబ్బా వేసుకుంటున్నాడు, డ్రస్సులు మార్చుకుంటున్నారు, వేషాలు మార్చుకుంటున్నారు, విధానాలు మార్చు కుంటున్నారు. ఇది మంచి పద్ధతా? వీటి వలన తెలుస్తాడు అని చెప్పితే అందరిని అదే వేషము వేయిస్తాము. గ్యారెంటీ ఉందా? మీకు తెలియ బడినాడా దేవుడు? లేదు. మీకొక కష్టము వస్తే అనుభవిస్తారు, బాధపడతారు. చెప్పండి ఏ మనిషైనా బాధపడలేదా? జ్ఞానము తెలిసిన మనిషి బాధపడు తున్నాడు, మేము జ్ఞానులము అనుకున్న మీరు కూడా బాధపడుతున్నారు. జ్ఞానము ఎటువంటిదంటే “నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే” అన్ని విద్యలకంటే పవిత్రమైన విద్య, అన్నిటికంటే గొప్పది, దీనికి సమానమైనది లేదు. ఇటువంటి దీన్ని మీరు తెలుసుకోగలిగితే ఎంత బాధైనా మీరు సులభముగా నెట్టివేయగలరు, మీరు అనుభవించరు దానిని. ఎంత బాధ అయినాగానీ మీరు అనుభవించరది. ఏ సమస్యలైన తేలికగ పోతాయి. మనిషి గందరగోళ పరిస్థితుల్లో వాడు కొట్టుమిట్టాడేటటువంటి సమస్యలు మనకందరికి ఉన్నాయి. ఏ సమస్య వాన్ని చుట్టు ముట్టదు. కానీ జ్ఞానము తెలుసుకోగలిగితే ఎట్లుంటుందంటే ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల డబ్బులు


----

ఇచ్చినగానీ దొరకని ఆనందము నీకు దొరుకుతుంది. అంత గొప్ప ఆనందాన్ని విడిచిపెట్టి, ఎంతో పెద్ద అనుభవాలను, కష్టాలను మనము సులభముగా నెట్టివేసేటటువంటి విధానాన్ని విడిచిపెట్టి, మీరు ఏమను కుంటున్నారంటే ఆ జ్ఞానము తెలియకుండనే, మేము గొప్ప వాళ్ళము అనిపించుకోవాలని నాలుగు మాటలు నేర్చుకొని, ఏదో మాట్లాడుతూ ఇది దేవునికి సంబంధమా కాదా అని తెలియకుండ ప్రపంచ సంబంధమైనటు వంటి, బాహ్య సంబంధమైనటువంటి విధానాలు ఆచరిస్తే, అది ఎవ్వరికీ

మంచిది కాదు.


ఇటు హిందువులకుగానీ, ఇటు మిగతా మతస్థులకుగానీ ఎవరికైనా గానీ అది మంచిది కాదు. ఒకరు మమ్మల్ని అడిగారు. మీరు స్వామీజీ కదా! గడ్డము లేదు, ఏమి లేదు అని అంటే గడ్డము ఉంటే ఒకవేళ దేవుడు తెలుస్తాడు అంటే పెంచుకుంటాను అని చెప్పాము. నాకంటే, మీకంటే ఇంకా పొడుగు గడ్డము వాళ్ళు కూడ ఉన్నారు, వాని దగ్గర ఏమి డబ్బులు లేవు, వాడు అట్లే పెంచుకున్నాడు. డబ్బులు లేక పెంచుకున్నాడు వాడు మళ్ళ వానికేమన్న తెలుసునా? అంటే వానికి కూడ తెలియదు. మీరు నామము పెట్టుకోలేదు, దేనికి? అంటే నామము పెట్టుకుంటే దేవుడు తెలియబడతాడు అంటే నేను పెట్టుకుంటాను. చెప్పు, గ్యారెంటీ ఉందా? నువ్వు పెట్టుకున్నావు, నీకేమన్న తెలిసిందా దేవుని గుడి, గోత్రము? ఏమీ తెలీలేదు. కాబట్టి అట్ల కూడా ఏ వేషము వేసినాగాని మనకు తెలియబడడు. కానీ హిందువులలో ముఖ్యముగా ఏమి అంటే మేము జ్ఞానులము మాకు తెలిసినంత ఎవరికీ తెలియదు అని అనుకొని, మిగతా ప్రజలందరిని అణిచిపెట్టి, మా ద్వారానే మీరు దేవున్ని మ్రొక్కాలి. మా ద్వారా దేవున్ని మ్రొక్కితేనే మీకు ఫలితము వస్తుందని అంటున్నారు. నువ్వు ఎలక్షన్లో


-----

నిలబడాలా, చెప్పు? ఎలక్షన్కు సంబంధించిన మంత్రము చదువుతా అనేవాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇంకోటి బిడ్డకు సంబంధించినది ఏమన్నా ఉందా, చెప్పు? బిడ్డకు సంబంధించిన మంత్రము ఉంది రెడీగ, చదివేస్తా. లేదు, కోర్టులో వ్యవహారము తేల్చాలా, చెప్పు? దానికి సంబంధించిన మంత్రము కూడ ఉంది. ఇవన్ని వ్యవహారాలు సుఖాల కోసమే. దేవుని దగ్గర రికమండ్ చేసేదానికి మేమే ఉన్నాము. మీరు అక్కడ వచ్చి నిలబడితే, మేం ఇక్కడ వచ్చి నిలబడుకొని చెప్తాము. ఇదంతా నడి మధ్య ఒకడు ఎందుకు అసలుకు? దేవుడు మన దగ్గరే ఉన్నాడు, ఎల్లప్పుడు మనము ఎట్లైనా ప్రార్థన చేయవచ్చని వేరే మతాలు బోధించినాయి అనుకోండి. ఈ మత విధానానికంటే అది బాగా సులభము అని చాలామంది పోయిన వాళ్ళు ఉన్నారు. లేరా చెప్పండి?


ఇప్పుడు హిందూ మతములో ఉండి ఆ మతములో ఉంటే దేవుడు సులభముగ తెలుస్తాడని పోయినవాళ్ళు ఇక్కడ చాలా ఉన్నారు. కానీ ఎక్కడ పోయినా తెలియదు అని చివరకు తెలిసింది. ఎక్కడ పోయిన తెలిసాడా? లేదు. అంటే దీనికంటే అది రాగము రవ్వంత బాగుంది. ఇది సన్న రాగము తీస్తుంది, అది పెద్ద రాగము తీస్తుంది. అంటే రాగాల్లో తేడా ఉంది, వేషాల్లో తేడా ఉంది, మాటల్లో తేడా ఉందిగానీ దేవుని విధానము మాత్రము మనకు తెలియబడలేదు. ఇదంత టోటల్గా మనము చూసుకుంటే ఇప్పుడు ఎందుకు ఇంతగా చెప్పుకుంటున్నాము మనము. ఇప్పుడు ఒక గంటసేపు ఉపన్యాసము చెప్పుకున్నాము మనము. ఇదంతా వాళ్ళు ఇట్ల చెప్తున్నారు, అట్ల చెప్తున్నారు, ఎవరు చెప్పినా మనకు తెలియలేదు అని మనము అనుకుంటున్నాము కదా! మళ్ళీ ఎవరంతకు వాళ్ళు గొప్ప అనుకుంటున్నారు. నా కంతకు నాకే తెలుసు. ఈ రోజు ఒకరు వచ్చారు. ఆధ్యాత్మికము అంటే ఓనమాలు


కూడా తెలియవు. అతను ఏమి చెప్తున్నాడంటే, నేను ఈ దేశములోనే మొదటోన్ని అంటున్నాడు! చాలా గొప్పోనివి నువ్వు అని చెప్పినాము మేము. మేము ఎట్లున్నామంటే, చెప్పే వాళ్ళుంటే వింటాము, వినేవాళ్ళుంటే చెప్తాము. అది మా రూల్. వాళ్ళు చెప్తున్నారనుకో, వింటాము. మళ్ళ అతను ఎంతమటుకు అర్థము అయ్యింది అని అడిగితే నీయంతకంటే మించినోడు ఎవడూ లేనే లేడు దేశములో అని చెప్తాము. వాడు ఇంగా పైకి పోతాడు. అంటే ఎందుకు, ఏమి అని ఆలోచన చేయడు అసలుకు. ఈ రకముగ వాళ్ళు చెప్తుంటారు, మేము వింటుంటాము. చాలామంది చెప్పేవాళ్ళే వస్తారుగానీ వినేవాళ్ళు ఇట్ల ఏదో టైమ్ ఉన్నపుడే దొరికేది మాకు. అదీ మేము బలవంతముగ కూర్చోబెడితే, ఇంక మీరు మాట్లాడేదానికి లేదు. కదా! లైసెన్సు మాదిపుడు, కాబట్టి మేము చెప్తే మీరు వినాలిపుడు, కాబట్టి మీరు వింటారు. సమయములో కూర్చొబెట్టుకున్నామా ఇంకా వాళ్ళే చెప్తారన్నమాట. అయిపోయింది, అంతా మీరే చెప్పేస్తారు.


ఈ రకముగా ఉంటుంది కాబట్టి, ఇప్పుడు సమయము కాబట్టి మేము చెప్తున్నాము, ఏమంటే, ఇది మనకు చెడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆ చెడు అలవాటును మనము తీసివేస్తే దేవుడు మనకు తెలియబడతాడు. ఇప్పుడు మనమంతా ఇక్కడికి ఎందుకు వచ్చాము? అన్నానికి వచ్చామా? నీళ్ళకు వచ్చామా? లేకపోతే ఇంకేదో లాభానికి వచ్చామా? ఇక్కడేమి లాభము ఉండదు మీకు. మీకు లాభము ఉండేది ఒకటే ఒకటి. దేవుని జ్ఞానము అనేది మాత్రము తెలియబడుతుంది. దేవుని విధానము తెలియబడుతుంది. దేవుని మార్గములో మీరెట్ల పయనించాలో అని తెలియబడుతుంది. ఇంకో విధానము ఏముండదు ఇక్కడ. దాని కోసమే మీరొచ్చారు. అర్థమయిందా! ఇంకో విధానము ఏమీ లేదు. మళ్ళ దేవుని



విధానము తెలియాలి అంటే ఏమి చేయాలి? అందువలన నేను ఈ విధముగ చెప్పాలి. మీరు పొరపాటు పడుతున్నారని చెప్పాలి. మీరు పొరపాటు పడుతున్నారని ఎవరో ఒకరు చెప్పితే కానీ మీరు బాగుపడరు. మళ్ళీ ఎవరు చెప్తారు మీకు? దేవుడు చెప్పాలి ఇంక చెప్తే. లేకపోతే మమ్మల్ని చెడ్డాడు అనుకున్నా ఫరవాలేదని మేమన్న చెప్పాలి. దేవుడు ఎలాగో చెప్పడు. ఇపుడు మేము ఏమి చెప్పాలంటే, ఇంక ఆయన చెప్పేది మనమే చెబ్దాములే. అంటే మీకంటే నేను గొప్పోన్ని అని అనిపించుకునే దానికి, అంతే! ఇంకేమి లేదు. నేను కూడ పెద్దోన్ని ఏమి కాదు. అంటే ఒక హెచ్చరిక చేస్తే మంచిదని. మీకంటే నేను పెద్దోన్ని ఏమి కాదు, మళ్ళ అట్ల అనుకునేరు! మాకంటే గొప్పేమో అనుకునేరు! అట్లేమి కాదు. మేమూ, మీరూ అంతా ఒకటే. ఒకే స్థానములో ఉన్నాము. మీరు తెలుసుకునే స్థానములో ఉన్నారు. మేము కూడ తెలుసుకునే స్థానములోనే ఉన్నాము. ఏమంటే మనము పొరపాటు పడుతున్నామని చెప్పుకుంటున్నాము.


దొంగలు పదిమంది ఉన్నారు, ఒక ఇంట్లోకి పోయినారు. దాంట్లో 9 మంది దొంగలు పొరపాటు పడినారు. ఏమని? మూటలు కనిపిస్తే ఎత్తుకొని పోదాము అన్నారు. ఒక దొంగ 9 మందిని ఉషారు చేశాడు. వీడు దొంగే, వాళ్ళూ దొంగలే. వీడేమని ఉషారు చేసాడంటే అవి ఎత్తుకుంటే మనకే నష్టము రా అన్నాడు. ఎందుకు నష్టము? అవి వట్టి మిరపకాయల మూటలు, దాన్ని ఎత్తుకున్నామనుకో తుమ్ములు, దగ్గులు వస్తాయి, అంతా లేస్తారు, మనల్నే కొడతారు. మూటలు మూటలే. ఎత్తుకు పోయేది వాస్తవమే. లాభమే కాని దానిని ఎత్తుకుంటే ఏమైతాది లాభముకంటే నష్టము ఎక్కువ వస్తుంది. నువ్వు దొంగవని బయట పడిపోతావు. కాబట్టి వీడు వట్టి మిరపకాయల మూటలు అని తెలుసుకున్న దానివలన వీడు తెలియజెప్పాడు



అంతే తప్ప, వీడు దొంగే. ఇప్పుడు మేమూ మీరూ అంతా సమానమే. మాకూ తెలియదు మీకూ తెలియదు జ్ఞానము. ఏమంటే వట్టి మిరపకాయల మూటలు దొంగలు ఎత్తుకుపోవాలంటే ఎట్లైతే హుషారు చేస్తున్నామో అట్లే మిమ్మల్ని మేము హుషారు చేస్తున్నాము తప్ప మేము కూడ మీకంటే ఏమి పెద్దోళ్ళము కాదు. అర్థమయిందా! అంటే వీళ్ళు మంచి, వీళ్ళు చెడు అని మనము ప్రత్యేకముగ, అదే పనిగా చెప్పాలనే ఉద్దేశ్యముతో చెప్పలేదు. మతస్థులు గొప్పవాళ్ళు, ఈ మతస్థులు తక్కువవాళ్ళు అనే ఉద్దేశ్యముతో చెప్పలేదు. దొంగతనానికి పోయినోళ్ళు అన్ని కులస్థులు అన్ని మతస్థులు ఉంటారు. కానీ అక్కడ మనము దొంగతనము చేసే వస్తువు ఎటువంటిది అంటే, దానిని ముందే చూసిన దానివల్ల, అవి వట్టి మిరపకాయలని

తెలిసినదానివలన, దాని ప్రభావము ఇట్లు ఉంది అని తెలిసినదాని వలన,

అక్కడ హెచ్చరిక చేయాల్సిన పని వచ్చింది ఒక వ్యక్తి, అంత తప్ప ఇంకోటి ఏమి లేదు. తెలియకుండా ఒకవేళ ఎత్తుకున్నాగాని అది లాభము వచ్చే పని అయితే మనము ఎత్తుకుంటాము కానీ దానివల్ల లాభము రాదు మనకు, అంతే తప్ప ఇంకోటి ఏమి లేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పడము కూడ అదే విధానమే అనుకోండి. మీకంటే నేను తెలిసినోన్ని ఏమి కాదు. ఒక మతాన్ని కించపరచాలనో, ఒక వ్యక్తిని కించపరచాలనో ఇది చెప్పడము కాదు. మనంతకు మనము బాగుపడాలని, మనమంతా ఒక గ్రూప్ గా ఉంటు, మీ మంచి కోరుకుంటు మిమ్ములను హెచ్చరిక చేయడము తప్ప ఇంకోటి లేదు.


మేము చెప్పిన మాటలను మీరు చెడుగ అర్థము చేసుకోకుండ, మన మంచి కోసమే కదా చెప్తున్నది! ఈయన దేవుని విధానము తెలుసు కోమని చెప్తున్నాడు తప్ప ప్రపంచవిధానాలు ఏమి చెప్పలేదు కదా! ఇది



మంచి విధానమే అని మీరు విశాల దృష్టితో అర్థము చేసుకుంటే మనమందరము ముందుకు పోగలము. నేను చెప్పినేది అన్ని గ్రంథాల్లోనూ గొప్పతనము ఉంది. అన్ని మతాల్లోనూ గొప్పతనమే ఉంది. ఏ దాంట్లో కూడ తక్కువ భావము లేదు. మనము తక్కువ భావము గల మనుషులము అయినాము. దానివల్ల మనకే నష్టము. అటువంటి భావాలు విడిచిపెట్టి విశాలమైన భావముతో మీరు ముందుకు పోవాలని మేము ఇప్పుడు చెప్తూ, దీనికి కారణము ఏమిటో ఇప్పుడు చెప్తాము చూడండి. ఈ మనుషులు ఒక్కో మతముగా ఒక్కో విధానముగా తయారయి ఎవరి మాటలు మేము వినము, మా మతము మాదే మీ మతము మీదే, ఒకవేళ వింటే నువ్వు మా మాట విను, మీ మాట వినము అనే లెక్కలో ఎందుకు తయారైనారో మనము దాని గురించి ఆలోచన చేసుకోవాల్సిన పని వస్తుంది. ఇప్పుడు దాని గురించే చెప్తాము. ఈ మధ్యన దగ్గర దగ్గర ఒక 15 రోజులు, 20 రోజులు క్రితము ఒక గ్రంథము రిలీజ్ చేసాము మేము. అది “శిలువ దేవుడా?” అనేటటువంటి గ్రంథము. కానీ కొంతమంది చూస్తూనే, ఇది శిలువ దేవుడా? అంటున్నారు. శిలువను గొప్పగా మేము పెట్టుకొని ఉంటే, ఈ విధముగా మీరు క్వొశ్చన్ మార్క్ పెట్టి రాయడము తప్పు కదా! అని క్రైస్తవులు అడగడము జరిగింది. దానికి మేము సమాధానము ఏమని చెప్పామంటే, మీకు ప్రభువు ఒక పూట తిని, ఒక పూట తినక, మీ వెంట మీ గ్రామాలు తిరిగి, మీకు జ్ఞానము చెప్పినటువంటివాడు ఏసుప్రభువు. మీకోసము బాధపడి అతను తన ప్రాణాలు సైతము లెక్కచేయకుండా మీకు జ్ఞానము చెప్పినటువంటివాడు ప్రభువు. అటువంటివాడు దేవుడంటే ఎవరైనా ఒప్పుకుంటారు. ఆయన హింసింపబడి చంపబడినటువంటి శిలువను మీరు గొప్పగా పెట్టుకోవడము పద్ధతి కాదు కదా! అని మనము అడిగినాము.



ఎవరో ఏదో చెప్పారని అనుకోకుండా వాళ్ళ మాటలే మీరు వినాలి అనుకోకుండా మీరు కొంత ఆలోచన చేయండి.


మీరు ఒక ప్రమాదములో చనిపోయారనుకోండి. ఆ ప్రమాదానికి కారణమైనట్టి ఆటోనో బస్సునో గుర్తుగా పెట్టుకుంటావా? దాన్ని చూసుకుంటూ ఉంటావా? అని అడిగాము. అది మీకు దేవుడు కాదు కదా! మీ తండ్రి ఒక ప్రమాదములో చనిపోతే ఆ ప్రమాదానికి కారణమైనటు వంటిది ఏదైతే ఉందో దాన్ని చూడకుండ ప్రక్కన పెట్టడము మంచిది కానీ దాన్ని దగ్గర పెట్టుకొని చూసుకుంటూ ఉండడము అది మంచిదా అని అడిగాము. కానీ నీ దేవుడు ఎవరు? అంటే ప్రభువు దేవుడైతాడు నీకు, నీ లెక్కలో. నువ్వు గొప్పగా చెప్పాలనుకుంటే ప్రభువును గొప్పగా చెప్పుకో! ప్రభువును దేవునిగా పెట్టుకో! కానీ నీకు ప్రభువా? శిలువా? దేవుడు అని నేను డైరెక్ట్ ప్రశ్న వేస్తున్నాను చెప్పు అంటే, ఆ..! ప్రభువే దేవుడు అంటారు. మళ్ళ ప్రభువు దేవుడైనప్పుడు శిలువ దేవుడు కాదు కదా! నేను అదే కదా క్వొశ్చన్ వేసినది. నీకు ఆ జ్ఞప్తి రావాలనే నేను ఆ ప్రశ్న వేసినది. శిలువ దేవుడు కాదు. నువ్వు జేబులో పెట్టుకున్నావో, మెడలో వేసుకున్నావో, ఎక్కడైనా వేసుకున్నావో నాకు సంబంధము లేదు. పెట్టుకో, కానీ శిలువ దేవుడు కాదు. దేవుడు ఎవరు? ప్రభువు. దానికి విలువ ఇయ్యండి. ఆ గ్రంథములో చివరి పేజీలో ఏమి వ్రాసామో చూడండి. ఒక గ్రంథము చదివి మీరు ఇదే గొప్ప అని అనుకోవద్దండి. ఒక మత గ్రంథము చదివి ఇదే గొప్ప అని మీరు అనుకోవద్దండి. హిందువులు భగవద్గీత చదువుతున్నారా వేదాలు చదువుతున్నారా అదే గొప్ప అనుకోవద్దండి. బైబిలు చదవండి. ఖుర్ఆన్ చదవండి. అందులో ఉండే పవిత్ర వాక్యాలను మీరు గుర్తు చేసుకోండి.



నేను సినిమాను చూశాను అంతా మతికి లేకున్నా, కొన్ని విషయాలైనా నాకు జ్ఞాపకము ఉంటాయి కదా! ఆ గ్రంథాలు చదివితే కొన్ని వాక్యాలైనా మీకు జ్ఞాపకము ఉంటాయి కదా! అందులో ఉండేటివి తెలుసుకోండి. వేరే మతస్థులది మేము చదవము అంటే ఏమి మీకు వేరే మతస్థులవి చదవడానికి భయమెందుకు? చదువు. మరి చదివితే దాంట్లోకి పోతానేమో అని భయమా నీకు? ఎందుకు పోవాలి? నీకు జ్ఞానము తెలిస్తే ఎందుకు పోతావు నువ్వు. సరే, అది మంచిగుంటే పో దాంట్లేకే పో ఎవరొద్దన్నారు! నిన్ను కట్టివేసి ఎవరూ ఉంచలేదు. నీ ఇష్టము. నువ్వు ఏ మతస్థునిగానైనా మారొచ్చు ఏమైనా చేయ్యొచ్చు. నీకు స్వతంత్రత ఉంది. కానీ అన్నింటిలో ఏముందో తెలుసుకో. చూసేది కర్తవ్యము నీకు. మేము ఏమి చెప్పినాము, ఏ మతములో ఉండేవాళ్ళు ఆ మతములోనే ఉండి అన్ని తెలుసుకోండి. నువ్వు ఉండే మతములో ఏదీ లేదు అనుకోవద్దండి. నువ్వుండే మతములోనే సంపూర్ణముగా ఉంది. కానీ ఇంకో మతములోకి పోవాల్సిన పనిలేదు. అర్థమయిందా! సాంబారు కుండ ఉంది ఒకటి, సాంబారు చేసిపెట్టినావు. కానీ చివరిలో తిరువాత పెట్టాలి దానికి. తిరువాత అంటాము కదా! నూనె వేసి దాంట్లో కొన్ని అవి వేసి ఇవి వేసి అన్ని, దాని ప్రక్కనే ఇంకొక కుండ ఉంది. ఇది సాంబారు కుండే, అది నీకు తెలుసు. ఉత్త సాంబారు ఏమి బాగుంటుంది దాంట్లో తిరువాత పెడితే బాగా రుచొస్తుంది, చూసేదానికి కూడా బాగుంటుంది, పైన తేలేటివన్ని అంటే నూనె ఇంకా దాంట్లో వేసిన మసాలా వస్తువులు కొన్ని తేలుతాయి, మిరపకాయలు తేలుతాయి అవన్ని ఉంటాయి కదా! ప్రక్కనే ఇంకొక కుండ కూడా ఉంది, అన్ని చేతులు కడిగి, గిన్నెలు అన్ని కడిగి దాంట్లో పోశాము. ఈ తిరువాతది కూడ ముందే ఉన్నాయి దాంట్లో. ఇంతకుముందు కూరలు తిని, దాంట్లో



వేసింటాము కదా! దాంట్లో కూడ తిరువాత మిరపకాయలు అన్ని ఉంటాయి అంటే కడిగి పెట్టిన నీళ్ళు ఉన్న కుండ ఒకటుంది. దాంట్లో అవి కూడా కనిపిసున్నాయి దీంట్లో అవి ఇంకా కనిపించలేదు. నువ్వు పెడితే కనిపిస్తది దీంట్లో కూడ. అప్పుడు ఏమనుకున్నాడు అంటే వీడు, ఈ సాంబారు కుండ కంటే అదే బాగుంది కదా అని దాంట్లో పెట్టినాడంట వాడు. ఎట్లుందో చూడండి!


ఆ రకముగా నువ్వున్న మతమేదో విడిచిపెట్టి ఇంకో మతమునకు పోవడము వృథా. దాంట్లో పోతే ఏమైంది? సాంబారే రుచిగా ఉంది. నువ్వు, రుచే లేనిదానిలోనికి పోయినావు. అవి నువ్వు నోట్లోకి పోసుకో. ఎట్లుంటుందో కడుగు నీళ్ళు! కాబట్టి నీ మతములో నువ్వు ఏదైనా సాధించుకో! ఇంకో మతములోకి పోతే అవివేకము అయితుంది. దేవుడు ఎందుకు పుట్టించాడు నీ మతములో? దేవునికి తెలియదా? ఇంకో మతములో పుట్టించి వానిని లాక్కోవాలని ఎందుకు ప్రయత్నము చేస్తాడు దేవుడు. ఈ మతములో ఉండే దేవుడు ఆ మతములో నిన్ను పుట్టించి ఈ మతములో ఉండే వాన్ని పట్టి ఎందుకు ఇగ్గులాడిస్తాడు అని అడుగుతున్నా నేను. ఎందుకు లాగాలి? దేవుడికి తెలియదా? నువ్వు మతాన్ని పెంచాలని నువ్వు అనుకుంటున్నావేమో, ఏ వ్యక్తి మతాన్ని పెంచలేడు. దేవుడు పెంచగలడు. దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. నువ్వు కేవలము మానవునివే. నిన్ను మూడు రోజుల్లో చనిపోయేటట్టు చేయగలడు. మూడు గంటల్లో చనిపోయేటట్టు చేయగలడు. మూడు నిమిషాల్లో కూడా చనిపోయేటట్టు చేయగలడు. నువ్వు అవతల ఎవరికీ చెప్పలేవు ఎందుకంటే నీవు ఉంటే కదా చెప్పేది! కాబట్టి దేవునికి తెలియని విధానము ఏమీ లేదు. దేవుడు ఎవరిని ఎక్కడ పుట్టించాలో అక్కడ తెలిసే పుట్టించాడు. ఎవరిని ఏ



పని చేపించాలో అన్నీ తెలుసు ఆయనకు. మన కర్మపత్రాలన్ని ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన లిఖించి రాసిపెట్టినటువంటివి మన కర్మ పత్రాలు. దేవున్ని ఏదో మనము ఉద్ధరించాలని, దేవుని మతాన్ని గొప్ప చేయాలను కోవడము మన ఈ విధానమంతా దేవునికి తెలుసు. దేవునికి మతము లేదు కాబట్టి అన్ని మతాలు ఆయనవే. ఏ మతములో ఎవడున్నాగానీ వానికి జ్ఞానము తెలియజేసేది మనిషి కర్తవ్యము గానీ ఇంకోటి ఏమి కాదు. కానీ ఒకటే ఒకటి దేవుడు ఏమి చేశాడంటే నీకు స్వతంత్రత ఇచ్చాడు. మిగతా పనులు అన్ని దేవుని కర్మపత్రములో లిఖించబడినాయి. నీకు జ్ఞానము ఎంత రావాలి అనేది మాత్రము లిఖించబడలేదు. దేవుడు ఏమి చేశాడు? నీ స్వయానికి నీ ఇష్టానికి విడిచిపెట్టేసాడు దాన్ని. నువ్వు ఎంతమటుకు నా మార్గములోకి వస్తావో లేదో అని చూసేదాని కోసము నీ ఇష్ట ప్రకారము వదిలిపెట్టాడు. నీకు ఎంత శ్రద్ధ ఉంటే నువ్వు అంత నా దగ్గరికి రాగలవు. ఆ హక్కును నీకు వదిలేసాడు.


మిగతా ప్రపంచ విషయాలన్ని ఏవైనాగానీ దేవుని జ్ఞానము తప్ప, మిగతా విషయాలన్ని ముందే లిఖించబడి ఉన్నాయి. ఆ విధముగానే జరుగుతాయి నీకు. ఎవరూ వాటిని మానిపించలేరు. ఈ రోజు యాత్ర అని కాలినడకన ప్రయాణము చేస్తున్నారు, వందలు వేల కిలోమీటర్లు. వాళ్ళను నిలబెట్టగలుగుతావా చూడు నువ్వు! ఒకవేళ వాళ్ళను మీరు ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారంటే, వాళ్ళు మనకు ఒక నమస్కారము చేసి వెళ్ళిపోతారు. నీ అంత అజ్ఞానులే లేరు అనుకుంటారు వాళ్ళు. మనము ఏమి అనుకుంటున్నాము అంటే వీళ్ళంత అజ్ఞానులు లేరు, ఇంత శ్రమ ఎందుకు పడుతున్నారు దేవుని జ్ఞానము తెలియకుండా అని, నిలబెట్టి వాళ్ళను అడిగితే, వాళ్ళు వీళ్ళను ఎగా దిగా చూసి, ఎంత మూర్ఖులు వీళ్ళు అని



వాళ్ళు పోతున్నారు. అంటే వాళ్ళను నువ్వు కాదు ఎవరూ బాగుచేయలేరు. అది వాళ్ళ ఇష్టారాజ్యము. వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు. అంటే ఒక్క దేవుని జ్ఞానములో తప్ప మనిషి ఏ దాంట్లోనూ స్వతంత్రుడు కాదు. నిన్ను ఏ విధముగా నడిపించాలో ఆ విధముగా నడిపిస్తాడు. మళ్ళీ ఆ దేవుడు సర్వస్వతంత్రుడు ఆయనకు అన్నీ తెలుసు అన్నప్పుడు నీవు ఇంకొకరిని మార్చాలి అనుకోవడము పొరపాటు. అంటే మతములోకి మార్చాలి అనుకోవడము పొరపాటు. నువ్వు జ్ఞానము చెప్పు. దేవుని జ్ఞానాన్ని అందించు. నేనిప్పుడు చెప్పాను. నువ్వు సాంబారు కుండ విడిచిపెట్టి కడుగు నీళ్ళ కుండలో తిరువాత పెట్టొద్దు అని. నీ మతములో నువ్వు ఉండు. నువ్వు ఏ మతములో ఉన్నావో దాంట్లో ఉండు. ఎవ్వరూ మారొద్దండి. మారాల్సిన అవసరమే లేదు. దాంట్లో ఎంత కావలసి వస్తే అంత ఉంది కానీ దాంట్లో తెలుసుకో నువ్వు తవ్వి తెలుసుకో. ఇప్పుడు మా దగ్గరకు ఒక క్రైస్తవుడు వస్తాడు. అప్పుడు వానితో నేను బైబిలును గురించే మాట్లాడుతాను. బైబిలులో ఇన్ని వాక్యాలు ఉన్నాయి, మరి నువ్వేమి అర్థము చేసుకున్నావు అని అడుగుతాను. వానికి ఏమి అర్థమై ఉండదు. నేను భగవద్గీత, ఖుర్ఆన్ చెప్పను వానికి. ఎవరికి? క్రైస్తవునికి. తర్వాత హిందువు వస్తాడు. వాని దగ్గర నేను భగవద్గీత గురించే మాట్లాడతానుగానీ వేరే దాని గురించి మాట్లాడను. దీంట్లోనే అర్థము కాలే వేరే దాంట్లోకి పోతే ఏమి అర్థమైతుంది వానికి? అర్థము కాదు. ఆ రకముగా ఎవరు ఏ మతస్థులు వచ్చినా కానీ ఆ మత గ్రంథాల గురించే మాట్లాడి అందులో వ్రాసిన వాక్యాల గురించే నేను అడుగుతున్నాను తప్ప ఇంకోటి నేను చెప్పడము లేదు. ఇంకోటి చెప్పితే ఆ మతాన్ని వీళ్ళకు దిద్దినట్టు అయితుంది. కానీ నేను అట్ల చెప్పడము లేదు. వేరే మతస్థులు వస్తే వాళ్ళ మతములోది నాకు చెప్తారుగానీ నా మతములోనిది చెప్పరు.



దు. కాని కర్మవా

నాది ఏ మతము వాళ్ళకు తెలిస్తే కదా! ఆ రకముగా నేను ఏమి చెప్తున్నా అంటే ఇది జ్ఞాన మార్గాన్ని దేవుని మార్గాన్ని అనుసరించే దానికి అందరికీ స్వతంత్రత ఉంది. ఎవని స్వతంత్రత వానిది. ఎవని ఇష్టము వచ్చినట్టు వాడు పోవచ్చు. కానీ ఎవని ఇష్టప్రకారము వానికి జ్ఞానము తెలియబడుతుంది అని భగవద్గీతలో కూడ ఇదే విషయాన్ని చెప్పారు. “శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్” అని అన్నారు. నీ శ్రద్ధను బట్టి జ్ఞానము వస్తుంది అని చెప్పాడుగానీ కర్మవాన్ లభతే జ్ఞానమ్ అని చెప్పలేదు. కాని కర్మవాన్ లభతే అన్ని పనులు. అన్ని అంటే నీ వేషము భూషము, తిండీ తీర్థము అన్నీ మొత్తము కష్టము సుఖము అన్ని ఎక్కడున్నాయి? కర్మలో ఉన్నాయి. ముందే లిఖించబడి ఉంది. లిఖించబడిన దానిప్రకారమే నీకు జరుగుతావుంది. ఎవరూ దానిని మార్చడానికి అవకాశము లేదు. ఒకే ఒకటి మీ చేతిలో ఉంది, ఏది? దేవుని జ్ఞానాన్ని తెలుసుకునే హక్కు మీ చేతిలో ఉంది. దేవుని జ్ఞానము తెలుసుకునే హక్కు మీ చేతిలో ఉంది. కాబట్టి దాన్ని గురించి మీరు మాట్లాడుకోండి. పదిమంది కూడి దాన్ని గురించి చెప్పుకోండి. మీరు క్రైస్తవులు ఒకచోట చేరినారనుకోండి. క్రైస్తవులు మీరు బైబిలు తీసుకొని, దాంట్లో వాక్యాలు చదువుకోండి మీరు. నేను భగవద్గీత చదవమని చెప్పలేదు గదా మీకు. హిందువులకు ఇంకో గ్రంథము చదవమని చెప్పలేదే నేను. భగవద్గీతే చదువుకోండి, ఇది అర్థమైన తరువాత మళ్ళా చూస్తాము.


మళ్ళీ ఇంకా నేను ఏమి చెప్తున్నానంటే అధికముగా ఇది తెలుసుకొని ఇంకోటి చూడండి. అంతా దీంట్లోనే ఉంది అని అనుకోవద్దండి. అందులో ఏ కోణము నుంచి చెప్పబడిందో దాన్ని కూడా చూడండి మీరు. ఇట్ల అన్ని మతస్థులు అన్ని మూల గ్రంథాలను చదివితేకానీ వాడు జ్ఞాని కాలేడు.



అంటే దాంట్లో విధానాలు ఆచరణలు నువ్వు నేర్చుకోవద్దు. దేవుని జ్ఞానము నేర్చుకో. నేను సెవెన్త్ సెన్స్ సినిమా చూశాను. దాంట్లో డాన్స్లు చేసేటివి ఉన్నాయి, పోట్లాడేటివి ఉన్నాయి. అంటే మంచీ ఉంది, చెడూ ఉంది అన్ని మీకు చెప్పలేదు నేను. కానీ ఒక డైలాగే చెప్పాను నేను. “ఒక మనిషిలోని మంచితనాన్ని చూడాలంటే వాడు చదువుకున్న గ్రంథాలు చూడు, ఒక మనిషిలోని చెడుతనాన్ని చూడాలంటే వాడు వాడుకున్న వస్తువులు చూడు” అని ఒకే ఒక్క డైలాగ్ చెప్పాను నేను. అట్ల నువ్వు మిగతా గ్రంథాల్లో కూడ ఏది మంచి వాక్యము ఉందో దాన్ని చూసుకో నువ్వు, పవిత్ర వాక్యాలున్నాయి కదా! దాంట్లో, లేవని చెప్పలేదు కదా! అన్ని చూడండి. అదే వాక్యమే ఇప్పుడు నేను వ్రాసిన గ్రంథములో చివరి పేజీలో ఉంది. అన్ని గ్రంథాలు చదివితేగానీ జ్ఞాని కాలేడు అని చెప్పాము. కానీ కొంతమంది ఏమి చేస్తున్నారంటే మనము ఒక మంచి గ్రంథము ఇచ్చామనుకోండి, ఇది దేవుని జ్ఞానమని. ఇట్ల నడుచుకోండి, ఇట్లే ఉండాలి అని చెప్పే మతాలకు

సంబంధించిన విషయాలు కాదు. దేవునికి సంబంధించిన విషయాలు అంటే మతాలకు అతీతముగా ఉండే విషయాలు. మతానికి సంబంధము లేకుండా వ్రాసిన పుస్తకాలు ఇస్తే, ఇది మీ మతముది మేము చదవము అని అంటున్నారు. ఎందుకు చదవకూడదు? అని అంటే మా పెద్దలు అట్ల చెప్పారు, కాబట్టి దాని ప్రకారమే మేము పోవాలి. సరే, ఇంకో మతములోకి పోతే వాళ్ళు అట్లే చెప్తారన్నమాట. అంటే ఇది మేము చదవము అంటారన్న మాట. ఎందుకు చదవకూడదు? అనంటే అది సాతాన్, అది మాయ అంటారు. అంటే దేవుడు చెప్పిన జ్ఞానము మాయ అయితదా ఎక్కడైనా? నువ్వు ఇంకో మతములోకిపోతే మాయ అవుతుంది. ఉన్న మతము విడిచిపెట్టి వేరే మతములోకి పోతే మాయ అవుతుంది. కానీ దేవుని



జ్ఞానము మాయ ఎట్లైతుంది? చూడు ఎట్లుందో ఇది! ఇది మాయ కాదు దేవుని జ్ఞానము అంటే, మీరు ఏమన్నా చెప్పండి! మా ప్రభువు చెప్పిందే మేము చదువుతాము.


దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకాయన ఉండేవాడు ఒక ఊరిలో. ఆయన భార్య ఉంది. ఒక భార్యనే గదా అందరికీ ఉండేది! అతనేమి చేస్తాడంటే, ఎవరినీ చూడొద్దు, ఎవరి మాట వినద్దు అంటాడు. ఎందుకు? ఎవరినైనా చూస్తే మళ్ళ వాళ్ళ వెంట పోతుందేమో అని ఈయన భయము. ఎవరినీ చూడొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, అంత కట్టడి చేసి పెట్టారన్నమాట. అంటే తన ఇంట్లోనే ఉండాలి, తననే చూస్తుండాలి, తన మాటనే వింటుండాలి కానీ ఎవరి పక్కన చూడకూడదు అనేటట్టుగా చేశాడు. ఎందుకూ అని అంటే వీడు ముసలోడు, ఆయమ్మ వయసాయమ్మ, ఇదీ తిప్పలు. అంటే వీడు చేతకానోడు, ఆయమ్మ ఎక్కడ పోతుందో అని వీని భయము. ఆ రకముగా ఈ రోజు ఏం చేస్తున్నారంటే, అదే విధానము ప్రకారము వీళ్ళు ఏమి చేస్తున్నారంటే, వేరే మతము పుస్తకాలు చదివితే దాంట్లోకి ఎక్కడ పోతారో దీనిని విడిచిపెట్టి. ఉండేది మా ఇంట్లోనే ఉండాలి అనే లెక్కలో వీళ్ళు మతము అనే దానిని దృష్టిలో పెట్టుకొని దేవుని జ్ఞానాన్ని కూడా మీరు దూరము చేస్తున్నారు మనిషికి. అది మంచి పద్ధతి కాదు. దేవుని జ్ఞానాన్ని ఒక మనిషికి దూరము ఎవడైతే చేయ గలుగుతాడో మహా పాపాన్ని సంపాదించుకుంటాడు. పాపము ఎట్లుందో మీకు తెలియదు. అనుభవించేటప్పుడు తెలుస్తుంది. భయంకరమైన బాధ దానిది. ఆ భయంకరమైనట్టి కర్మలు అనుభవించే దానికంటే ముందే జాగ్రత్త పడడము మంచిది. ప్రపంచ విషయాల్లో ఎటువంటి పాపాలు చేసినాగానీ అవి అనుభవించబడతాయో లేదో, ఒకవేళ దేవుని ద్వారా క్షమించబడొచ్చు,


దేవుని జ్ఞానము ద్వారా క్షమించబడవచ్చు. కానీ దేవుని ఎడల దేవుని జ్ఞానము ఎడల చేసినటువంటి పాపము క్షమించబడదు. అన్ని మూల గ్రంథాల్లోనూ అదే చెప్పారు.


కాబట్టి దేవుని విషయములో జాగ్రత్తగా ఉండండి మీరు. దేవుని విషయము మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మతాలకు సంబంధించిన విషయాలు మాట్లాడకుండా దేవునికి సంబంధించిన విషయాలు మాట్లాడండి. మేము ఇంతకుముందే చెప్పాము. మనిషి ఎందుకు ఇట్ల తయారైనాడు? దేవుని జ్ఞానాన్ని ఎందుకు మభ్యపెడుతున్నాడు? మా దగ్గరికి కొందరు వచ్చి ఇట్లా అంటుంటారు. ఏమనంటే మీరు చెప్పేది చాలా బాగుంది, మిగతా దేవతలను మొక్కకుండా అసలైన దేవున్ని మొక్కమని మీరు బాగా చెప్తున్నారు, మాకు దగ్గరగా ఉన్నారు అని అంటే, నేనేమన్నానంటే నీకు దగ్గర నాకు దగ్గర ఏమిటి దేవునికి దగ్గరగా ఉన్నాము మనమంతా. దేవుడు అన్ని మతాల్లో అదే చెప్పాడు. నీ మతములోనే చెప్పింటే నేను నీకు దగ్గరైతానుగాని అన్ని మతాల్లో అదే చెప్పినాడు కదా! మళ్ళా మీకు దగ్గరేంది? ఎవరంతకు వాళ్ళు దేవునికి దగ్గరే. నువ్వూ దగ్గరే నేనూ దగ్గరే, అందరమూ దగ్గరే అని చెప్పితే వాళ్ళు అట్ల మాట్లాడి ఏమి చేస్తారంటే, నువ్వు మా మతములోకి రా, నువ్వు మా మత ఆచారాలు ఆచరించు అంటారు. ఇదేం పద్ధతి? మీకు దేవుని జ్ఞానము ముఖ్యమా? మతాన్ని ఆచరించడము ముఖ్యమా?


ఇది పద్ధతా కాదా అని ఆలోచన చేయకుండా మాట్లాడుతున్నారు. అంటే ఇది అన్ని మతాల్లో ఉండే రోగము ఒక మతములో కాదు. కొంతమంది ఒక గుంపు వచ్చారు నా దగ్గరికి, 10 సంవత్సరాల క్రితము



దాదాపు 2000 సంవత్సరములో అనుకుంటా బహుశా. వచ్చి, వాళ్ళు ఏమి చెప్పారంటే ఇదంతా బాగుంది, మీరు చాలా దగ్గరున్నారు మాకు, మీరు ఇదొక్కటి విశ్వసిస్తే బాగుంటుంది, దీనికంటే ఇంకా మించింది లేదు, ఇదే నిజమైన విశ్వాసము. అంటే ఏమి విశ్వాసము పొందాలి? నాకు విశ్వాసము లేకపోతే నేను పొందాలి గదా! విశ్వాసము ఉండేగా నేను చెప్తున్నది. ఇప్పుడు వినేదంతా నేను చెప్తున్నాను. కాని వాళ్ళు ఏమంటారంటే అంతా మాదే చెప్తున్నారు, అంతా కరెక్టే మాకు చాలా దగ్గరగా ఉన్నారు మీరు. అంతా మీదే అయినప్పుడు ఇంకా విశ్వాసము ఏంది? మీరు బాప్తిస్మము ఒకటి తీసుకుంటే సరిపోతది. నువ్వు రేపు పొద్దున జ్ఞానము చెప్పిన ఏసుప్రభువు వచ్చినాగానీ ఆయనకు బాప్తిస్మము తీసుకోమని చెప్పే లెక్కలో ఉన్నారు వీళ్ళు. చూడండి ఎట్లుందో! ఇంకో గుంపు వస్తారు. నువ్వు మా ఆచరణలు ఆచరిస్తే మంచిది, మాకు చాలా దగ్గరగా ఉన్నావు అంటారు. నేను ఎవరికి దగ్గర లేను చెప్పండి? అందరికి దగ్గరలోనే ఉన్నాను. ఎందుకంటే మీ మాటలే నేను మాట్లాడుతున్నాను, మీ కన్నా జ్ఞానము బాగా చెప్తున్నాను. అన్ని కరెక్టే అన్ని కరెక్టే అన్ని కరెక్టే చాలా దగ్గరున్నావు కాని ఒకే ఒక్క దాంట్లోనే దూరముగా ఉన్నావు అంటారు. ఇదే మా ఆచరణలు ఆచరిస్తే సరిపోతుంది. మా పెద్దలు ఇట్ల చెప్పారు. పెద్దోళ్ళు ఎవరు ఏమి చెప్పారో పక్కన పెట్టు. నీకు తెలిసిన జ్ఞానమేమి? మూల గ్రంథాలలో ఏముంది విషయము? చెప్పండి. అంటే దాంట్లో సరిగా చెప్పలేరు. దాని విషయము మనకు తెలియదు. బైబిలులో వాక్యాలు క్రైస్తవులకు తెలియవు. చెప్పండి సంపూర్ణముగా బైబిలులో వాక్యాలు ఎవరికైనా తెలుసునా? ఎవరినన్న ధైర్యముగా చెప్పమనండి. లేదు తెలియదు. ఈ రోజు ప్రశ్న అడిగితే అందులో చిక్కుబాటు వస్తావుంది, సరైన సమాధానము లేదు.



సమాధానము చెప్పినా ఇంకో ప్రశ్న ఉద్భవిస్తుంది, దానిప్రక్కనే. దానికి సమాధానము చెప్పినా ఇంకో రెండు ప్రశ్నలు ఉద్భవిస్తాయి. దానికి నువ్వు ఏదో రకంగా సమాధానము చెప్పినా ఇంకా డబుల్ ప్రశ్నలు ఉద్భవిసాయి.


ఈ రకముగా ప్రశ్న మీద ప్రశ్న వస్తుంది. నేను మొట్టమొదటనే చెప్పాను. ఏ ప్రశ్న మిగలకుండా సంపూర్ణమైన జవాబు దొరికినప్పుడే నిజమైన జ్ఞానము అయితుందది. దేవుడు మీకు చెప్పలేదా మీ మతాల్లో? ఎదురాడని జ్ఞానాన్ని నీకు అందిస్తాను. ఎవరూ ఎదురాడలేరు, ఎవరూ ప్రశ్నించలేరు. సంపూర్ణమైనటువంటి జవాబు ఉంది అని చెప్పలేదా? చెప్పాడు. మీరు మరిచిపోయారు. మళ్ళ మీకు ప్రశ్న ఎందుకు మిగులుతా ఉంది? ఆయన చెప్పింది ఏందో మీకు తెలియదు. మీ శరీరములో సంపూర్ణమైన జీవజలాన్ని ప్రవహింపజేస్తాను. జ్ఞానజలాన్ని ప్రహింపచేస్తాను. సంపూర్ణమైన జాన్జము అసలు ఎవరూ దీనికి ఎదురు చెప్పలేరు అని చెప్పాడు ఆయన. కానీ నేను అడిగే ప్రశ్నకు జవాబు లేదు. నేనే ఎదురు చెప్తున్నాను, దానికి జవాబు లేదు. అంటే మీ దగ్గర జవాబు లేదని నిరూపణకు వస్తా ఉంది. జవాబు లేదు అని చెప్పినపుడు జవాబు కోసము మీరు వెతకాలి కదా! వెతకడము లేదు. మళ్ళీ ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చాయి? అనంటే దానికి మూల సూత్రము చెప్పుకుందాము. దేవుడు అంటే సర్వాన్ని సృష్టించాడు అని మళ్ళ కథలు చెప్పుకోవద్దండి. విష్ణువు వచ్చాడు, ఆకు మీద పండుకున్నాడు, ఆకు పోయి ఇంకోటి అయింది, ఇంకోటి పోయి ఇంకోటి అయింది, అది పోయి చేప అయినాడు, ఇది పోయి కప్ప అయినాది, ఇది పోయి తాబేలు అయింది, ఇది పోయి సింహము అయింది, నరసింహావతారము పంది అయింది, పందికొక్కు అయింది, ఎలుక అయింది, ఏంటివి ఏంటివో అన్ని చాలా ఉండాయి, అవన్ని వద్దు అవతారాలు వద్దు.



ఉన్న విషయము చెప్పాలంటే ఒకటే ఒకటి, ఏమి? దేవుడు ఎట్లున్నాడో మనకు తెలియదు. ఆయన పందీ కాదు, కుక్కా కాదు. ఆయన ఎట్లున్నాడో ఎవరికీ తెలియదు. దేవున్ని ఎవరూ చూడలేదు. ఆయన విధానము ఎవరికి తెలియదు. ఆయన ఆకారమే తెలియదు. రూప, నామ, క్రియలు లేనటువంటివాడు దేవుడు. ఆయనకు రూపము లేదు, పేరూ లేదు పని అంతకూ లేదు. చాలా పనికిమాలినవాడు, ఎవరు? దేవుడు. పూర్తి పనికిమాలినవాడు అంటే పని చేసే వాడు కాదు అని అర్థము. పనికి మాలినోడంటే తిట్టు అనుకోవద్దండి. పనికి మాలినవాడు అంటే పని చేయని వాడు, పనిలేనటువంటివాడు అని అర్థము. పనికిమాలినోడు, పెద్ద పనికిమాలినోడు ఎవడు? దేవుడు. ఆయన పనిచేయని వాడు, పేరు లేని వాడు, ఆకారము లేనివాడు అనే బిరుదులు రాకముందు ఆయన ఎట్లున్నాడో ఎవరికీ తెలియదు. మనము పుట్టిన తర్వాత ఇవన్ని ఏవీ లేవు ఆయనకు. మనము పుట్టిన తర్వాత త మనమాదిరి ఆకారము లేదు, మన మాదిరి పేరు లేదు, మనము చేసే పని కూడా ఆయన ఏమి చేయలేదు. అర్థమయిందా! ఆయనకు ఆకలి లేదు, దప్పిక లేదు. మనకైతే ఆకలి అయితాది, దప్పిక అయితాది, బువ్వ కోసము పని చేయాలి మనము. ఆయనకు అవన్నీ ఏమి లేవు కాబట్టి ఆయన ఏమి కాని వాడు ఎట్లున్నాడో మనకు తెలియదు. అంటే సృష్టికంటే ముందు ఎట్లున్నాడో మనకు తెలియదు. అప్పుడు ఏమి చేశాడంటే అప్పుడు ఒక పని చేశాడాయన? ఏమి చేసాడు? మనల్నందరిని సృష్ఠించాడు అది పనే. మనల్ని అందరిని సృష్టించాడు, ప్రపంచాన్ని సృష్టించాడు, సర్వజగత్తును సృష్టించాడు. అండజ, పిండజ, ఉద్భిజ అంటే గుడ్డు నుండి పుట్టేటివి, గర్భము నుండి పుట్టేటివి తర్వాత భూమి నుండి పుట్టిన విత్తనాల నుండి పుట్టిన వాటిని అన్నిటిని ఎవరు సృష్టించారు? దేవుడు సృష్ఠించాడు.



దేవుని సృష్ఠి మూడు రకాలుగా ఉంది, ఆయన పని చేసేటప్పుడు. పని చేసి ఊరకనే ఉన్నాడు. ఇప్పుడు పని చేయడు ఆయన. మనము లేనప్పుడు పని చేశాడు, ఇప్పుడు చేయలేదు. మళ్ళీ కొంతమంది అడగొచ్చు, మనల్నందరినీ పుట్టించాడు కదా! అది కూడా పనే కదా! అంటే కరెక్టే పుట్టించాడు. అది కూడా పనే. కాని ఎప్పుడు? నిన్ను పుట్టించకముందు పని చేశాడు. నువ్వు పుట్టిన తర్వాత పని చేయలేదు. నువ్వు పుట్టిన తర్వాత ఆయన పని చేయడు. అర్థమయిందా! ఆయన గుమస్తాలు, ఆయన కింద పని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆయన చేయాల్సిన పని లేదు. సరే, ఆయన పని చేయనటువంటివాడు కదా! మళ్ళ అంత గొప్ప దేవుడు ఏమి చేశాడంటే ఇంతమందిని సృష్టించి వదిలిపెట్టాడు. సృష్టించి వదిలిపెట్టిన తరువాత వీళ్ళందరిని నడిపే దానికి ఒకరు కావాలి కదా! ఆయన నేను పని చేయను అన్నాడు కదా! నడిపే దాని కోసము ప్రకృతిని ఒక దాన్ని తయారు చేశాడన్నమాట. ప్రకృతిని తయారుచేసి, తాను తండ్రిగా ఉండి, ప్రకృతిని తల్లిగా పెట్టి, ఈ సర్వాన్ని సృష్టించాడు. సర్వమునకు సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో సర్వులకు ఆయనే తండ్రి. అందరికీ ఎవరు తండ్రి? ఎప్పుడైతే నిన్ను పుట్టించాడో! ఎప్పుడు? సృష్టి ఆదిలోనే పుట్టించాడు. నీవు ఈ రోజు పుట్లేదు. ఇప్పుడు నువ్వు పుట్టి 34 సంవత్సరాలు అవుతుందని నువ్వు భ్రమపడుతున్నావు. నువ్వు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? సృష్టి ఆదిలో పుట్టావు నువ్వు. చాలా పెద్ద వయస్సు నీది. ఏమంటే ట్రాన్స్ఫర్ అయితూ వచ్చావు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడినుంచి అక్కడికి. అంటే ఊరులు మారినట్టు శరీరాలు మారినాము. నువ్వు శరీరాలు మారినంత మాత్రాన నిన్ను నువ్వు మరిచిపోయినావు.



ఈ శరీరములో ఉండి ఈ శరీరమే నేను, ఈ పేరే నాది, ఈ పనే నాది అనుకుంటున్నావు. కాదు, ఈ శరీరము అంటే కొంతసేపు ఉండేదే. ఇట్లాంటి శరీరాలు ఎన్నో పోయినాయి నీకు, ఇట్లా పేర్లు ఎన్నో పోయినాయి, ఇట్లాంటి పనులు ఎన్నో చేశావు, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చావు నువ్వు. అంతే కాదు. ఒక్కొక్క సారి ఒక్కొక్క మతములో ఉన్నావు. ఏ మతములో శాశ్వతముగా లేవు. అర్థమయిందా! ఈ మతములో ఉన్న వాళ్ళను తీసుకొని పోయి ఆ మతములో వేస్తాడు. ఆ తములో నుండి తీసుకొచ్చి మళ్ళీ ఈ మతములో ఇలా ఎన్నో మతాల్లో మనము పుడుతూ పుడుతూ వచ్చి చివరకు ఇక్కడ ఉన్నాము. కాని కొన్ని మతాల్లో జన్మలు లేవు అనేటటువంటి భావము ఉంది. కానీ జన్మలున్నాయని అన్ని మతాల్లో చెప్పారు. అది అర్థముకాక జన్మలు లేవు అనుకున్నారు. అర్థము చేసుకుంటే అన్ని మతాల్లోనూ జన్మలున్నాయని చెప్పారుగానీ లేవని ఎవరూ చెప్పలేదు. అర్థమయిందా! ఆదరణకర్త వచ్చినప్పుడు మీరంతా సాక్ష్యము ఉంటారు అని చెప్పారు. ఎప్పుడు? రెండు వేల సంవత్సరాల పూర్వము ఏసుప్రభువు చనిపోయే ముందు తన దగ్గర శిష్యులను కూర్చోబెట్టుకొని చెప్పాడన్నమాట. మీరు కూడ ఆ రోజు ఉంటారు, ఆదరణకర్త వచ్చినప్పుడు. అంతా ఇపుడు అక్కడ వాళ్ళు ఆ రోజు ఉంటారు. అంటే ఆ రోజు పుట్టింటారు. వీళ్ళు కూడా మనషులుగా ఉంటారు. అంటే వీళ్ళంతా ఉన్నట్టే కదా! మీరే సాక్ష్యము. ఇప్పుడు నేను ఈ మాట చెప్పాను కదా! మీరు సాక్ష్యము నాకు. ఆ రోజు ఆయనను చూస్తారు, ఆయనతో మాట్లాడతారు, ఆయన మీ దగ్గరికి వస్తాడు, మీరు ఆయనను గుర్తుపడతారు. మీరే సాక్ష్యము ఆయన ఉన్నట్టు అని చెప్పాడు అంటే వీళ్ళు పుట్టినట్టే కదా అపుడు! మా మతములో పుట్టుకలు లేవు, చావులు లేవు అంటే, ప్రభువు చెప్పలేదా? ఆయన్నే మీరు ఎందుకు




అబద్ధము చెప్పాలి? ఆయన చెప్పాడా అట్లేమన్నా? పుట్టరు అని. అన్ని మతాల్లోనూ పుడతారు అని చెప్పారు. అది అర్థము కాలేదు. ఎట్ల పుడుతున్నారు? అని వివరము అడగడము లేదు.


ఒకవేళ మనకు తెలియనిది ఉంటే తెలుసుకుందాము అనుకోవడము లేదు మళ్ళ మనిషి. ఏమంటున్నాడు? మా మతములో పుట్టడు అని చెప్పేసినారు. మీకు తెలియదండి మా మతములో పుట్టరు. నాకు తెలియనిది ఏముంది? నీకు అర్థము కాలేదు. నీకు అర్థముకాక ఈ మాట మాట్లాడు తున్నావు. మీ గ్రంథములో ఏమి వ్రాయబడింది? జ్ఞానము రాయబడింది. జ్ఞానము ప్రకారము జన్మలున్నాయి అన్నారు. చచ్చినోడు పుడతాడు పుట్టినోడు చస్తాడు అని వ్రాసారుగానీ, ఆ విషయము క్షుణ్ణముగా ఉంది. పబ్లిక్గా ఉంది. ఎందుకు మీరు భ్రమపడుతున్నారు? అంటే మీకు అర్థము కాలేదు. ఎందుకు అర్థము కాకుండా పోయింది? ఒకటే ఒకటి! ఇప్పుడు మనము వెనక్కి పోదాము. మీరేపుడో సృష్ఠి ఆదిలో పుట్టారు. మిమ్మల్ని పుట్టించిన తండ్రి ఒకడున్నాడు. వాడు పర్మినెంట్ తండ్రి. మీరు ఎక్కడ పుట్టినా, మీకు ఎంతమంది తల్లితండ్రులు మారినా, జన్మకు జన్మకు తల్లితండ్రులు మారినా, చివరకు పర్మినెంట్ తండ్రి ఎవరు? ఒక్కడే. తల్లి ఎవరు? ప్రకృతే. ఈ ప్రకృతి అంటే ఏమి? ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి ఈ ఐదు వస్తువులున్నాయి మనకు బయట. అవి కనిపిస్తున్నాయి. ఈ కనిపించేటివి ఏవైతే ఉన్నాయో అవన్ని మనలో ఉన్నాయి. గాలిలేదా నీలో? ఉంది. గాలి పీలుస్తున్నావు, విడుస్తున్నావు. గాలీ ఉంది, నీరూ ఉంది, నీరు గాలి రెండున్నాయి. అగ్గి ఉంది, వేడి లేదా? 98 డిగ్రీల ఫారెన్ హీట్ నీ దగ్గర ఉంది. వేడీ ఉంది. శూన్య ప్రదేశము అయినటువంటి ఆకాశము లేదా? ఉంది. ఈ ధాతుకణాలంతా భూమే. నీలో ఉండే కండలు, ఎముకలు



అన్నీ, ధాతువులు అన్ని భూమికి సంబంధించినవే. మళ్ళీ అన్నీ వస్తువుల తోనూ తయరైనటువంటి శరీరముతో ఉన్నావు.


ఆ విధముగా నీకు తయారుచేసి నీ శరీరాన్ని ఇచ్చినటువంటిది నీ తల్లి, అందులో చైతన్యము ఇచ్చినటువంటివాన్ని నేను తండ్రిని. కదిలెడి జీవరాసి అయినా, కదలకుండేటి జీవరాసైనా ఏది ఎక్కడ పుట్టినా, వాళ్ళకు తల్లి ప్రకృతి, తండ్రి నేను అని భగవద్గీతలో ఏనాడో దేవుడు చెప్పాడు. బైబిలులో కూడా నీ తండ్రి పరలోకమందున్నాడు అని చెప్పబడింది. నువ్వు వీళ్ళనే తండ్రి అనుకోవద్దు, వాళ్ళను తండ్రి అనుకోవడము పొరపాటు. నీ నిజమైన తండ్రి ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు అని చెప్పబడింది. చెప్పలేదా? చెప్పాడు. కాబట్టి తండ్రి అనే వాడు మొట్టమొదటనే నిన్ను సృష్ఠించాడు, వదిలి పెట్టాడు. తర్వాత ప్రకృతిని తల్లిగా పెట్టాడు. ఆ తండ్రే, నువ్వు చెడిపోతుంటే చూడలేక, నువ్వు అజ్ఞానములో పడి ఉంటే చూడలేక, ఆయన మన వద్దకు వచ్చి జ్ఞానాన్ని తెలియజేశాడు. దేవుని విషయము దేవునికి తప్ప ఏ మానవునికి తెలియదు. దేవుడు ఎట్లుంటాడో ఎవరికీ తెలియదు. దేవుడు మనల్ని సృష్టించినపుడే, దేవుని జ్ఞానాన్ని కూడా సృష్టించి పెట్టాడు. మనము బాగుపడేదానికి దేవుని జ్ఞానాన్ని కూడా ఆయన సృష్టించి పెట్టాడు. అది తెలియజేసేందుకు కూడా ఏర్పాటు చేసి పెట్టాడు. ఆయన అంశతో వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన మళ్ళ తిరిగి మనకు వచ్చి చెప్పడము జరుగుతూ ఉంది. ప్రవక్తల రూపములో ఎంతో మంది చెప్పారు. ప్రవక్తలు కాకుండా కూడా చాలామంది చెప్పారు.


భగవద్గీతను చెప్పినటువంటి వాళ్ళు ఎవరు? అంటే భగవంతుడు. “భగవాన్ ఉవాచ” అని సంస్కృతములో అన్నారు. “భగవంతుడు ఇట్లనియే”



అని తెలుగులో వ్రాశారు. భగవంతుడు చెప్పాడు కాబట్టి భగవద్గీత అయిందది. అక్కడ చెప్పింది ఎవరు? ప్రవక్త కాదు. అన్ని మతాల్లో ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవక్త కాదు. ఎవరు చెప్పాడు? భగవంతుడు. ఇప్పుడు మీకు కొత్తదిది. ఆయనను కూడా ప్రవక్త అనుకుని ఉంటిమి మనము. అనుకొని ఉంటిమి కదా? ఇప్పుడు చెప్తున్నాము. ప్రవక్త కాదు. ఇప్పుడు ఎవరు? భగవంతుడు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను భగవంతుడు అని. కానీ ఆయనను ప్రవక్త అనకూడదు, ఆయనను భగవంతుడే అనాలి. అర్థమయిందా! ఇప్పుడు మనకు జ్ఞానాన్ని తెలియజేసే దానికోసము దేవుడు భగవంతునిగా వస్తాడు. దేవుని అంశ భగవంతునిగా వస్తుంది. ఎట్ల వస్తుంది? అని మీకు అనుమానము వస్తే, చాలామంది దేవుడు పుట్టడు అని అంటే, పుట్టడని నేను కూడా అంటాను. అర్థమయిందా! నేను కూడా పుట్టడు అని అంటాను. ఇదే విషయాన్నే “శిలువ దేవుడా?" అనే గ్రంథములో మొట్ట మొదటనే 16, 17 పేజీల లోపల వ్రాసేయబడింది. ముందు చదివితే తెలుస్తుంది దేవుడు పుట్టేవాడు కాదు. “అజోపి సన్నవ్యయాత్మ భూతానా మీశ్వరోపి సన్” ఈ భూతములకన్నింటికి అంటే జీవరాసులకన్నింటికి నేను ఈశ్వరున్ని. అంటే దేవున్ని. “అజోపి” అంటే “నాకు పుట్టుక లేనే లేదు”. “వ్యయాత్మ” అంటే “నేను చనిపోయేవాన్ని కాదు”. “నేను చనిపోయేవాన్ని కాదు, పుట్టేవాన్ని కాదు.” నేను ఎవరిని? జీవరాసులకందరికీ దేవున్ని. జీవరాసులందరిని సృష్ఠించినటువంటి వాన్ని. “భూతానాం ఈశ్వరోపిసన్” అందరికి అధిపతిని నేను. ఈశ్వరుడు అంటే అధిపతి. ఎవరు? దేవుడు. ఆయన భగవద్గీతలో జ్ఞానయోగము అనేటటువంటి అధ్యాయములో 6వ శ్లోకములో ఆ మాట చెప్పాడు. తర్వాత ఆ శ్లోకములో రెండు వాక్యాలుంటే, పైన చెప్పింది ఒక వాక్యము. ఇంక రెండో వాక్యము ఏమంటే "ప్రకృతిం



స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా”. నా ప్రకృతిని నేను ఆవహించి సంభవిస్తున్నాను అంటే పుడుతున్నాను. అంటే మాయతో కూడుకొని, ఆత్మతో కూడుకొని నేను పుడుతున్నాను అన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడేమో ఒక వాక్యము పుట్టడు అని గట్టిగా చెప్తున్నారు. ఇప్పుడేమో మళ్ళ పుడతాడని కూడా సన్నగ చెప్తున్నారు. అంతే గదా!


ఒకే శ్లోకములోనే పుట్టడు అని ఉంది, పుడతాడు అని ఉంది. పుట్టడు అనేది శాస్త్రబద్దమే. పుడతాడు అనేది శాస్త్రబద్ధమే. పరస్పర విరుద్ధమైన విషయాలు శాస్త్రబద్ధము ఎట్లైతాయి? అని మీరు ప్రశ్న వేస్తే, దానికి వివరము ఉంది. ఆ వివరమంతా బాగా రాయబడింది. అది నా గ్రంథము చదివితే, పుడతాడు అనే దానికి ఆధారము ఉంది, పుట్టడు అనేదానికి కూడా ఆధారము ఉంది. ఎట్ల పుడతాడో ఎట్ల పుట్టడో తెలుసుకుంటే ఆ వివరము మీకు తెలుస్తుంది. కాబట్టి దేవుడు భగవంతునిగా వచ్చి, ఆయన జ్ఞానాన్ని మనకు తెలియజేశాడు. ఎవరి జ్ఞానాన్ని? దేవుని జ్ఞానాన్నే తెలిపాడు. ఆయన జ్ఞానాన్ని మనకు తెలియజేశాడు. ఆయన జ్ఞానము సంపూర్ణముగా తెలియజేస్తే అది మనకు అర్థము కాకుండా పోయింది. ఈ రోజు, ఈ హిందూమతములో భగవద్గీతను ప్రక్కకు పెట్టి, వేదాలను ముందుకు తీసుకొచ్చారు చాలామంది. నేను చెప్పాను. ఒక కులము వాళ్ళే ఇట్ల చేశారు అని. హిందూ మతములో నానా రకాల కులాలున్నాయి. వాళ్ళు ఏమి చేశారంటే తమ ఆధిపత్యము కోసము, తామే పెద్ద అనిపించుకోనే దానికోసము ఈ విధముగా చేస్తున్నారు. మేము ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడే ఒక కులము అని పేరు పెట్టి చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళు చేసిన అన్యాయము అట్లాంటిది, దుర్మార్గము అది. ఈ రకముగా చేసి, వాళ్ళు ఏమి చేశారంటే, భగవద్గీతను మూసి



పెట్టి, అణిచి పెట్టి, దానిని బయటికి రాకుండా చేసేసి, ఏమి చెప్పారు? వేదాలు మనకు ముఖ్యము, వేదాలు ప్రమాణము అన్నారు. ఎట్లుందో

చూడండి.


మళ్ళీ ఏది ముఖ్యము మనకు? దేవుడు చెప్పిన భగవద్గీతనా? మనుషులు చెప్పిన వేదాలా? భగవద్గీతను ఎవరు చెప్పారు? భగవంతుడే చెప్పాడు స్వయముగా. వేదాలను ఎవరు చెప్పారు? ఒక మహర్షి చెప్పాడు. ఎవరు? వ్యాసుడు. అష్టాదశ పురాణాలను వ్రాసినది వ్యాసుడు. నాలుగు వేదాలను వ్రాసినది కూడా వ్యాసుడే. ఈయనకంటే చాలా సంవత్సరాల ముందు పుట్టి, దగ్గర దగ్గర 200, 300 సంవత్సరాల ముందు పుట్టిన వ్యాసుడు తనకు తెలిసిందే జ్ఞానము అనుకొని, ఇంతకంటే జ్ఞానము చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అనుకొని, 18 పురాణాలు వ్రాశాడు. ఆయన అంతకుముందే వేదాలు వ్రాసి, అందరికీ ఇచ్చేసినాడు దేశమంతా. అందరూ వాటిని చదువుకున్నారు, వేదాలు చదువుకున్నారు, పురాణాలు చదువు కున్నారు. ఆ వేదాల ప్రకారము దేశమంతా యజ్ఞాలు యాగాలు చేసే వాళ్ళు, పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు. ఎప్పుడు? వ్యాసుడున్న కాలములో ఇవన్నీ జరిగాయి. అంతకుముందు కూడా జరిగాయి యజ్ఞయాగాలు. కానీ వేదాలు అంతకు ముందు లేవు. వేదాలు సనాతనమైనవి, సృష్టి ఆదిలోనే పుట్టినాయి అనేది పూర్తి అసత్యము. మనము సినిమాల్లోనూ డ్రామాల్లోనూ వేదాలు పుట్టినాయని, వేదాలను ఎవరో ఎత్తుకొని పోతుంటే దానిని విష్ణువు వచ్చి కాపాడినాడు అని కథలు చెప్తారు కదా! అది కూడ పురాణమే. ఈ రకముగా పురాణాల్లో ఎన్ని కథలున్నాగానీ అవి కథలుగానే ఉన్నాయి. కానీ, వాస్తవము కాదు. అవి వేదాలు మనకు ముఖ్యమైనేటివి కాదు. వేదాలు అంటే ఏమిటి? అంటే వేదాలు పూర్తి ప్రపంచమంతా వ్యాపించి పోయి,


పూర్తి అందరిలోనూ జీర్ణించుకుపోయి, ఆ రోజు ఏ మతము లేదు. క్రైస్తవ మతము లేదు, ఇస్లామ్ మతము లేదు. ఇస్లామ్, క్రైస్తవ మతము లేని రోజే హిందూ మతములో సర్వనాశనమైపోయేదానికి అన్ని దారులు ఏర్పడినాయి. అంతా చెడిపోయేదానికి అవకాశము వచ్చింది.


వేదాలన్ని పూర్తి అందరిలో చొప్పించుకొని పోయినాయి, పురాణాలు కూడా అందరి తలల్లో చేరిపోయినాయి. ఆ రోజు అధర్మాలు పూర్తి చెలరేగి పోయినాయి. ఎప్పుడు? ద్వాపరయుగము చివరిలో ఈ వేదాలు బయటికి పోయి వ్యాపించినప్పుడు. అంటే ఇదెక్కడి రామాయణము! వేదాలు ఏదో గొప్పవి అనుకుంటుంటే, ఈయనేమో అధర్మాలు అంటాడు అని అనుకోద్దండి. సత్యము చెప్పాలి అంటే చెప్పాల్సిందే మీకు. సత్యము కావాలా? మనకు అసత్యము కావాలా? అని లెక్కేస్తే సత్యమే మనకు కావాలంటే వేదాలు అధర్మాలతో కూడుకున్నటువంటివి. నేను చెప్పే మాట కాదు. భగవద్గీతలో కృష్ణుడే ఆ మాట చెప్పాడు. “త్రైగుణ్య విషయావేదా” అని చెప్పాడు. చెప్పాడా? ఈ గుణాలే వేదాలు అని చెప్పాడు. వేదాల్లో ఉండే విషయాలే గుణాల్లో ఉన్నాయి. గుణాల్లో ఉండే విషయాలే వేదాల్లో ఉన్నాయి అని చెప్పాడు. తరువాత ఇంకా ఏమి చెప్పాడంటే "గుణమయి మమ మాయ” అన్నాడు. ఈ మాయ అనేది ఒకటుందే దేవునికి వ్యతిరేఖముగ, అది నేను తయారు చేసి పెట్టినదే. అది ఏ రూపములో ఉంది అంటే? గుణ రూపములో ఉంది అని చెప్పాడు. అర్థమయిందా! ఇంకా కొద్ది ముందుకుపోయి చెప్పుకుందాము. ఈ వేదాలు అనేటివి మనలోకి విచ్చలివిడిగా చేరిపోయినాయి కాబట్టి, వేదాలే గొప్పవి అనుకోవడము జరుగుతా ఉంది కాబట్టి, మనము పొరపాటు పడి భగవద్గీతను మరిచి పోవడము జరిగింది. ఇట్ల ఎప్పుడైతే అంతకుముందు జ్ఞానాన్ని మర్చి


పోయామో అప్పుడు భగవద్గీత చెప్పాల్సిన అవసరము వచ్చింది. ఎవరికి? దేవునికి. భగవంతునిగా ఉద్భవించినటువంటి కృష్ణుడు, అప్పుడు భగవద్గీతను సమయము చూసి తనకు 90 ఏళ్ళ వయస్సులో ఆ భగవద్గీతను చెప్పడము జరిగింది.


ఈ భగవద్గీతను చెప్పినప్పుడు ధర్మాలన్ని అధర్మాలుగా మారిపోయి ఉన్నాయి. అందువలన నేను పుట్టి చెప్తున్నాను అని చెప్పాడు. ధర్మాలు తెలియాలంటే నేను చెప్పాలి. ధర్మాలు తెలియజేసేదానికే నేను అప్పుడప్పుడు భూమి మీదికి వస్తాను. ఎవరు? భగవంతుడు. తర్వాత ప్రవక్తలు కూడ వస్తారు. ప్రవక్తలు వస్తుంటారు. భగవంతుడు వస్తుంటాడు. అర్థమయిందా! ఇప్పుడు నేను భగవంతునిగా వచ్చాను. ఈ భగవంతునిగా వచ్చినటువంటి నేను ఏమి చేస్తున్నానంటే, నా పని ఏమిటంటే “యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత!” అంటాడు. ఎప్పుడైతే ధర్మాలకు ముప్పు ఏర్పడి ఈ ధర్మాలు అంతరించిపోతున్నాయో! అధర్మాలు చెలరేగిపోతున్నాయో! అప్పుడప్పుడే నేను వచ్చి పుట్టి, జ్ఞానాన్ని చెప్పాల్సిన పని వస్తుంది. ఆ రకముగా ఆయన వచ్చి పుట్టి ఏమి చెప్పాడు? జ్ఞానాన్నే చెప్పాడు. అదే భగవద్గీత. ఎప్పుడు పుట్టాడు? వ్యాసుడు ఉన్న సమయములోనే! వేదాలు ప్రచారము అయిన సమయములోనే! వేదాలు వ్రాయబడిన సమయములోనే! పురాణాలు వ్రాయబడిన సమయములోనే! దేవుడు వచ్చి మనకు జ్ఞానాన్ని చెప్పడము జరిగింది. అంటే అప్పుడు ఇంత పెద్దోళ్ళు ఉండి కూడ ధర్మాలను కాపాడలేకపోయారు. ధర్మాలు అధర్మాలుగా మారిపోయినాయి. వాళ్ళే అధర్మాలను ప్రచారము చేశారు. కాబట్టి ఆ రోజు మళ్ళ దేవుడు వచ్చి భగవద్గీతను చెప్పాల్సిన పని వచ్చింది అని చెప్పినా కానీ జ్ఞాపకము పెట్టుకోకుండ, ఈ రోజు భగవద్గీతను ముఖ్యము కాదని, వేదాలే మనకు



ప్రమాణము అని చెప్పడము ఎంత తెలివితక్కువో చూడండి! వేదాలు చెప్పిన తరువాతనే భూమిమీద వ్యాసుడు ఉన్నప్పుడే ఆయన ఏం చెప్పాడు? ఇవన్నీ వేదాల విషయాలు మంచివి కావు.


ఈ వేదాలన్ని గుణాల విషయాలు, ప్రపంచ విషయాలతో కూడుకొని ఉన్నాయి. దేవుని విషయము ఇందులో ఒక్కటి కూడా లేదు. అంటే పప్పులు, రాళ్ళు అన్ని మిక్స్ అయివున్నాయి. అర్థమయిందా! దాంట్లో ఎక్కడనో ఒకటి రాయి ఉంది అనుకోండి. మీరు దాన్ని పక్కకు తీసిపారేస్తారు ఇవే ముఖ్యము అనుకొని. దాంట్లో ఏదన్నా ఒక మంచి వాక్యము ఉంటుంది, దానిని కూడ కలిపింటారు. దేవుడు, జ్ఞానము వాటిలో కూడా ఉంటాయి. కానీ మిమ్మల్ని మభ్యపెట్టేదానికి, దారి మళ్ళించే దానికోసము. దేవుడు, దైవము అంటూనే మీరు దానిని చూసి దాంట్లో పొరపాటు పడిపోతారు. కాబట్టి అవి మిమ్మల్ని దారి మళ్ళించే దానికి ఉన్నాయి కానీ, దేవున్ని తెలుసుకునే విధానము ఏమాత్రము లేదు కాబట్టి, అది పూర్తి మీకు అధర్మాలుగా ఉన్నాయి అని చెప్పాము. దాని కోసమే భగవద్గీత చెప్తున్నాను అన్నాడు ఆయన. అర్థమయిందా! ఈ రోజు మనము భగవద్గీతను ముఖ్యముగా పెట్టుకున్నామా చూడండి? మేము చెప్తున్నాము భగవద్గీత ముఖ్యము, వేదాలు ముఖ్యము కాదు అని. బయటికి పోయి అడుగుపోండి. వేదాలే ముఖ్యము మనకు, సనాతనమైనేటివి అంటారు. ఎవరు వద్దన్నారు? పోండి దాంట్లోనే. ఆ రకముగా వేదాలే ముఖ్యము అనుకున్నవాళ్ళంతా ఏమైతున్నారు ఈ రోజు? ప్రజలకు ఆ విషయాలు తెలియజేయడము లేదు. ప్రజలను మభ్యపెడుతున్నారు. మీరేంటో ఆహా, ఊహూ అనేటివి చేస్తూ, యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ, మీరు దూరము మీరు దూరము అని పెట్టేసి, మేమే మొదటోళ్ళము అనుకునేదాని వల్ల, ప్రజలంతా వేరే మతాల్లోకి



సిద్ది బోధ

పోతున్నారు తృప్తిగా. మన మతములో చాలా కండిషన్లు ఉన్నాయి. వేరే మతములో అటువంటివి ఏమీ లేవు అని, వేరే మతాలలోకి పోతున్నారే తప్ప, అంటే స్వేచ్ఛ దొరుకుతుందనో లేక లాభము కోసమో మనిషి వేరే మతాల్లోకి పోతున్నాడు తప్ప, జ్ఞానము కోసము పోవడము లేదు. అసలు జ్ఞానము అంటే ఏమిటో తెలియకుండా పోయింది. ఇటువంటి పద్ధతిలో మనిషి ఏమి చేయాలి? అంటే, మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఏమంటే, దేవుడు భగవంతునిగా భూమి మీదికి వచ్చి, జ్ఞానాన్ని తెలియజేశాడు. అర్థమయిందా!


మళ్ళీ ఇంత జ్ఞానము తెలియజేసినా ప్రజలు ఎందుకు ఈ రకముగా పోతున్నారు? భగవద్గీత అనకుండ వేదాలని ఎందుకు అంటున్నారు? బైబిలులో చెప్పినది, ఖుర్ఆన్లో చెప్పిన జ్ఞానాన్ని విడిచిపెట్టి ఆచరణలే ముఖ్యమని వీళ్ళెందుకు అంటున్నారు? అని అంటే దీనికి కారణము పెద్ద కారణము ఉంది. ఏమి అంటే ఎవడైనాగాని నా జ్ఞానము తెలుసుకొని, నన్ను అనుసరిస్తే, నాకు ఇష్టుడు. దేవుడు ఏమి చెప్తున్నాడంటే, ఎవడైనాగానీ, నా జ్ఞానము తెలుసుకొని, నా జ్ఞానము ప్రకారమే ఉంటే, వాడు నాకు ఇష్టుడు తప్ప, వేరే రకముగా ఉంటే నాకు ఇష్టుడు కాదు. నిన్న నేను చెప్పాను. మీరంత బయట గుంపు ఉంటే నాకు ఇష్టము లేదు ఇట్ల అని చెప్పాను. మీరు జ్ఞానము తెలుసుకోండి కూర్చొని. బయట ఏందయ్యా ఆర్భాటము అని చెప్పాను నేను. అరిచినా నేను. అట్లా బయట ఎక్కడా కనిపించకూడదు. ఏది కనిపించకూడదు. బయటంత ఆర్భాటాల కోసము మీరంతా గుంపుగా స్వామి వస్తే ఆహ్వానము పలకడము, ఇదంతా ఏమి? పదిమందికి తెలియాలనా? మీరు జ్ఞానము తెలుసుకోండి అని నేను కోపగించుకొని పోయినాను వెంటనే. మళ్ళ ఆ రకంగా నేను ఏమి



చెప్తున్నానంటే, మీరు జ్ఞానము తెలుకొని జ్ఞానము ఆచరణ చేస్తూ, దేవునికి దగ్గరగా ఉండే విధానాన్ని మీరు తెలుసుకుంటే దేవునికి ఇష్టులుగానీ వేరే రకంగ ఉంటే ఏమాత్రము ఇష్టము లేదు దేవునికి. ఇష్టము లేకపోతే ఏమి చేస్తాడు? తనకు అనుకూలమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో దేవునికి, వాళ్ళతో వానిని దూరము చేయిస్తాడు. నువ్వు పో దూరము పో నీవు నాకిష్టము లేదు అని చెప్పడు దేవుడు. వీడు నాకు ఇష్టమైనోడు, వీడు ఇష్టము లేనోడు అని చెప్పడు. తాను ఎవరి ద్వారా అతన్ని దూరము చేయించాలో వాళ్ళ ద్వారా దూరము చేయిస్తాడు. దేవుడు ఆ పకడ్బంది ప్లాన్ ముందే వేసి పెట్టుకున్నాడు. తండ్రి దేవుడని చెప్పినాము కదా! ప్రకృతి తల్లి అని చెప్పాము కదా! ఇద్దరు భార్యభర్తలే వాళ్ళు. వీళ్ళిద్దరు ఒకటే. తన భార్య అయినట్టి ప్రకృతిని ఏమి చేశాడు ఆయన? తను భగవంతునిగా వచ్చి జ్ఞానము చెప్పినా, తన భార

భార్య ప్రకృతిని మాయగా పంపించాడు.


దేవుడు భగవంతుడైతే, ప్రకృతి ఏమైతుంది మాయ అవుతావుంది. దేవుడు మానవ శరీరమలోనికి వచ్చి భగవంతునిగా వచ్చి మనకు జ్ఞానము చెప్పితే ప్రకృతి అందరి శరీరాల్లో మాయ రూపములో నిలిచి పోయింది. అంటే ఎట్ల నిలిచిపోయింది? మాయ రూపములో. మాయ ఎక్కడుంది? మాయ. మాయ.. అంటున్నావు ఎక్కడుంది? అంటే మన తలలో “గుణమయి మమ మాయ” అని ఆయనే చెప్పాడు. ఒరేయ్ గుడ్జోళ్ళారా! నా మాయ ఎట్లుందంటే గుణాల రూపములో ఉందిరా అని చెప్పాడు ఆయన. చెప్పలేదా భగవద్గీతలో? చెప్పాడు. మనకు మతికి లేదు. కనుక్కోలేము మనము. "గుణమయి మమ మాయా దురత్యయా” అన్నాడు. ఎవడూ దానిని దాటలేడు దుస్సాధ్యము. నా మాయను దాటి ఎవడూ పోలేడు. నా దగ్గరికి ఎవరూ రాలేరు. నాకిష్టమైతే వస్తాడు లేకపోతే నా మాయ నిన్ను పంపిచేస్తుంది



అక్కడ నుంచి. నేను భగవద్గీత చెప్పినాను, బైబిలు చెప్పినాను, ఖుర్ఆన్ చెప్పినాను మరి ఎందుకు నా దగ్గర రాలేదు? ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకొని ఎందుకు దూరముగా ఉన్నారు? మీకు తెలియలేదు నేను ఎవరైనది. మీరేదో బయటివి పట్టుకొని ప్రాకులాడుతున్నారు. వాడేమో నాముమూ బొట్టూ అని వాడంటాడు వేదాలని. మీరేమో ఆచరణ అని ఇంకొకటి అంటారు, ఇంకోటి అంటారు. కానీ నా జ్ఞానము మీరు అంటించుకుంటున్నారా? నా జ్ఞానమును లెక్క చేయకుండా మీరు ప్రక్కన ఆర్భాటాలు చూసుకుంటారా? మీరు ప్రక్కన ఆర్భాటాలు చూస్తున్నారు, అది నాకు ఇష్టము లేదు. కాబట్టి ఆమెకు చెప్తే ఆమె ఏం చేస్తుంది. సైగ చేస్తే చాలు, వీన్ని ఎట్ల పంపియాలి? దీంట్లో ఏమీ లేదు. భగవద్గీతలో ఏముంది? ఏమీ లేదు, మా బైబిలు చూడు అని ఒకడంటే, బైబిలులో ఏముంది? ఏమీ లేదు, మా ఖుర్ఆన్ చూడు అని ఒకడు. ఇట్ల దీంట్లో ఉంది దాంట్లో ఉంది, దాంట్లో ఉంది దీంట్లో ఉంది అని చివరికి అంతా లేకుండా పోతారు బయటికి. మాయ పంపిచేస్తావుంది, జ్ఞానము వైపు రానివ్వడము లేదు ఎవ్వరిని ఎక్కడా? గుణాలు అంటే లోపల ఆలోచనలు వానికి. ఇది కాదు అది కాదు, అది కాదు ఇది కాదు, నేనే పెద్దని ఎవరంతకు వానిని ముందుకు తోసి, వానంతకు వాన్ని పంపిస్తా ఉంది బయటికి. దేవునికి దూరము చేస్తా ఉంది. ఎవ్వరూ దూరము చేయలేదు, ఎవనంతకు వాడే దూరము అయితున్నాడు. ఎవ్వరూ ఏ మనిషి, ఏ మనిషిని దూరము చేయలేడు. ఎందుకంటే ఒకడు చెప్తే, నేనెందుకు నీ మాట వినాలి అంటాడు. తలకాయలో గుణాలు అయితే, నేనే! అనుకుంటాడు, నేనే ఆలోచన చేస్తున్నా నాకే తెలుసు అనుకుంటాడు. కాబట్టి నీకే తెలియనట్టు అది భ్రమింపచేసి నిన్ను ప్రక్కకు పంపిస్తా ఉంది, ఏది? మాయ. ఏది పంపిస్తా ఉంది? దేవునికి అనుకూలముగా ఉండే వ్యక్తే



మాయ. మాయ అని దాన్ని హిందూ ధర్మములో అంటున్నాము. క్రైస్తవములో సాతాన్ అంటారు. ఇస్లామ్ మతములో అయితే సైతాన్ అంటారు.


సాతాన్, సైతాన్, మాయ ఎక్కడున్నాయి? మన తలలో ఉన్నాయి. నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఏ దానితో మాట్లాడుతున్నావు? జ్ఞానముతో మాట్లాడుతున్నావా? మాయతో మాట్లాడుతున్నావా? చూసుకోండి మీరు. జ్ఞానము ముఖ్యమయ్యా మనిషికి, ఆచరణలు ముఖ్యము కాదు అంటే, జ్ఞానము తర్వాత, ముందు ఆచరణ ఉంటే కదా జ్ఞానము వచ్చేది అంటే, ఏమని అప్పటికి? నీలో మాయ మాట్లాడుతుందని అర్థము. అంతే గదా! గుణాల ప్రభావముతో నువ్వు మాట్లాడుతున్నావు కాని జ్ఞాన ప్రభావముతో కాదు మాట్లాడేది. జ్ఞానము యొక్క విలువ తెలియదు, జ్ఞానము యొక్క అర్థము తెలియదు. జ్ఞానము యొక్క వాక్యము తెలియదు, దానికుండే భావము తెలియదు. దాన్ని పక్కన పెట్టి, తిరిగేసి మళ్ళేసి ఏందేందో చెప్పుకుంటున్నారు. కానీ, ఆడ చెప్పినది ముఖ్యము కాకుండా పక్క విధానాలు ముఖ్యము అనుకుంటున్నారు కాబట్టి నాకు ఇష్టుడు కాదు వీడు. ఎప్పుడైతే దేవునికి ఇష్టమ నిన్ను దూరము చేస్తుంది మాయ. జ్ఞానము నుంచి దూరము చేస్తుంది. అంటే వాళ్ళెవరు దూరము చేసేదానికి? నాకిష్టము లేదు నేను పోలేదు అనుకుంటావు నువ్వు. నీకు ఇష్టము లేకుండానే చేస్తుంది మాయ. నీ ఇష్టము అనే దాని మీదనే ఆధారపడుతుంది. నీ తలలోనే ఉంది అది. ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఎవరో గురువు చెప్తాడా లేదా దేవుడు చెప్తాడా? పక్కకు పొమ్మని. లేదు, జ్ఞానము ఎక్కడైతే ఉందో అది నాకు సరిపోలేదు, నాకు అర్థము కాలేదు, మా దాంట్లోనే జ్ఞానము ఉంది అంటారు, వాళ్ళకు తెలిసిందే జ్ఞానము అంటారు. మాయే అట్ల చేస్తుంది. నీకు తెలిసిందే జ్ఞానము వాళ్ళకు ఏమీ తెలియదు. కాబట్టి నువ్వే బాగా తెలిసినోనివి అని మాయ



లోపల అంటే ఏమైతాది? నువ్వు జ్ఞానానికి దూరముగా పోతావు. వాని మాట వినవు. ఆ రకంగ ప్రతి మనిషిని మభ్యపెట్టి జ్ఞానానికి దూరము చేస్తావుంది, ఏది? మాయ. ఆ మాయ ఎటువంటిది? దాన్ని ఎవరూ కనుక్కోలేరు. దేవుని గుమాస్తా అయిన మాయనే మనము కనుక్కోలేకపోతే దేవున్ని కనుక్కుంటామా? అది ఇంకా పెద్దది.


దేవుడు ఇంకా గొప్పవాడు. మాయను కూడా సృష్టించినటువంటి వాడు దేవుడు కాబట్టి మీ అందరికీ కాపలాగా పెట్టినటువంటి వాడు దేవుడు. నీకు కాపల ఉండే వ్యక్తినే కనుక్కోలేకపోయావే? కాపలకంటే గొప్పగా, ఆయనను కాపలా మనిషిని నియమించినటువంటి వ్యక్తిని నీవు కనుక్కుంటావా? కనుక్కోలేవు. కాబట్టి దేవున్ని తెలుసుకోవాలంటే చాలా కష్టము. అందువలన దేవుడే ఏమి చెప్పాడంటే "త్రైగుణ్య విషయా వేదా! నిస్త్రై గుణ్యో” అంటాడు. అంటే ముడు గుణాలతో కూడుకున్నటువంటివే వేదాలు. ఆ వేదాల్లో నువ్వు పడి ఉన్నావంటే ఈ జ్ఞానము నీకు తెలియదు. అంటే మూడు గుణాలే పనిచేస్తుంటాయికానీ జ్ఞానము నీకు తెలియదు. మళ్ళ ఈ గుణాలు ఏంటివి? అంటే "గుణమయి మమ మాయ” అంటే, ఈ గుణాలతో కూడుకున్నదే నా మాయ. మాయ అంటే దేవునికి వ్యతిరేఖమైనది కాదు. ఎవరిది అది? నాది. 'మమ' అంటే “నా యొక్క” అని అర్ధము. "మమ మాయ” అంటే “నా మాయ”. నేను పెట్టినేదే. మీరేమనుకుంటారంటే థూ, థూ, థూ ఈ మాయ ఏం చేస్తుంది మనల్ని? అనుకుంటారు. అంటే, మాయ ఏదో నీకు చెడ్డది, దేవుడేమో నీకు మంచోడు అని అన్నట్టుంది. నువ్వు చెద్దోడివనే మాయను పెట్టినాడు. మాయా, దేవుడూ ఇద్దరూ ఒక్కటే. అర్థమయిందా! దేవుని మాట సక్రమముగా వినేది ఎవరు? మాయనే వింటుంది. దేవుని మాట సక్రమముగా వింటుండబట్టే ఎవడైతే



సరిగా లేడో వాన్ని అంతా తోకకోసి పక్కకు పంపిస్తుంది. అంతేగదా! దూరము చేస్తుంది జ్ఞానము నుంచి. ఆ రకంగా ఉండేటటువంటి మాయ ఎటువంటిది అంటే చూడు “గుణమయి” అంటే గుణాలతో కూడుకున్నది నా మాయ.


కాబట్టి మీ తలలో అన్ని గుణాలే పనిచేస్తున్నాయి. జ్ఞానము పని చేయలేదు కాబట్టి మాయనే పనిచేస్తుంది. ఈ మాయ చాలా గొప్పది. ఎట్ల గొప్పది అంటే 'దురత్యయా' దుస్సాధ్యమైనది, నీకు సాధ్యము కాదు. నువ్వు 10 కేజీలు ఎత్తేటంతటి బలవంతున్ని అనుకుంటే అది నూరు (100) కేజీలుంటుంది, నువ్వు ఎత్తలేవు. లేదు నువ్వు నూరు కేజీలు ఎత్తేటటువంటి బలము నాకుంది అనుకుంటే అది 1000 కేజీలు ఉంటుంది, నీవు ఎత్తలేవు దాన్ని. అది దుస్సాధ్యము. నేను 1000 కేజీలు ఎత్తే వాన్ని అని అనుకుంటే అది 10 టన్నులు ఉంటుంది, అప్పుడు నువ్వు ఎత్తలేవు. ఆ రకముగా నువ్వు ఎంతటోడివైనా గానీ నీకు దుస్సాధ్యముగా ఉంటుంది అది. దానిని మాత్రము నువ్వు జయించలేవు. మాయను జయిస్తాను అని ఎవడైనా అనగలడా అంటే, 'దురత్యయా' అంటాడు. ఎవడూ జయించలేకపోతే ఇంక మేమెందుకిక్కడ ఊరికే ఉండేది, ఇంటికి పోయేది మంచిది కదా! ఈ జ్ఞానము ఎందుకు వినాలి అని మీరు అనొచ్చు. మీరు ఎట్లో కట్లా దారి అన్నా చెప్పితే, జయించుకొని దేవుని దగ్గరికి పోతాము అనుకున్నాము. ఇపుడు జయించలేవు అని దేవుడే చెప్పేస్తే మనమెందుకు వినాలి? ఇంటికి పోయేది మంచిది సంకలో బ్యాగు పెట్టుకొని అని మీరు అంటారేమో అని, దేవుడు ఏం చెప్పాడంటే “ఏమామేవ యే ప్రపద్యస్తే మాయా మేతాం తరన్తితే” అంటాడు. ఎవడైతే నన్ను ఆరాధిస్తున్నాడో, ఎవడైతే నన్నే గొప్పగా తలుచుకుంటున్నాడో, ఎవడైతే నన్ను గుర్తించగలుగుతాడో, నా జ్ఞానాన్ని



గుర్తించగలడో అటువంటి వాడు మాత్రము “మాయా మేతాం తరన్తితే” మాయను దాటి పోగలడు సులభముగా అని చెప్పాడు. మాయను దాటి పోగలడు, ఎవడు? “మామేవ యే ప్రపద్యస్తే ఎవడైతే నన్ను ఆరాధిస్తాడో వాడు మాత్రము మాయను సులభముగా దాటిపోతాడు. అంతవరకు దుస్సాధ్యమే ఇది. ఎవరిని ఆరాధిస్తావు? దేవున్ని. దేవుడేవరో మనకు తెలియదు. తెలియాలంటే ఏమి చేయాలి? ఆయన చెప్పిన విధానాన్ని మనము తెలుసుకోవాలి.


ఆయన చెప్పిన విధానము మనకు అర్థము కాలేదు. ఎవరికి అర్థము అయింది చెప్పండి. భగవద్గీత హిందువులకెవరికైనా అర్థమయిందా? హృదయము మీద చేయి పెట్టుకొని చెప్పమనండి చూస్తాము. బైబిలు క్రైస్తవులకు అర్థమయిందా? నెత్తిన చేయి పెట్టుకొని చెప్పమనండి చూస్తాము. అందరికీ అట్లే అర్థము కాలేదు. ఈ వాక్యము నీకు అర్థము కాలేదని చెప్పినాగానీ, వాళ్ళకు అర్థము కాలేదని తెలిసినాకానీ, అర్థమైనట్లు నటిస్తారు. నాకు అన్నీ అర్థమైనాయని అంటారు కానీ నాకు అర్థము కాలేదని మాత్రము బయటపడరు. లోపల వానికి తెలుసు వానికేమీ అర్థము కాలేదని. మనము ఎత్తి చూపిస్తాము ఈ వాక్యము నీకు అర్థమయిందా అని అడిగితే, తనకు అర్థము కాలేదని లోపల ఒప్పుకున్నా కానీ, బయటికి మాత్రము ఒప్పుకోడు వాడు, నాకు తెలుసు అంటాడు పైకి. అంటే ఆ రకముగా మనిషి తయారై పోయి అంటే గుణాల ప్రభావములో పడిపోయి, నాకు సర్వ జ్ఞానము తెలుసు అనుకొని అసలైన జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాడు. దేవుని జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోకుండా పోతున్నారు కాబట్టి, ఇంక అంత్యము ఏమిటిది? ఎలా తెలుసుకోగలుగుతాడు అంటే, ఎలా తెలుసుకుంటాడు మనిషి? దేవుడే దిగి వచ్చి జ్ఞానము చెప్పినా నీకంటే నీకు రెండింతలు తెలుసు అనే లెక్కలో



ఉన్నాడు. దేవుడే దిగివచ్చి నా జ్ఞానము ఇది అని చెప్పినాగానీ, నీ కంటే ఎక్కువ తెలుసు నాకు అనే లెక్కలో ఉన్నాడు మనిషి. కాబట్టి ఈ చెప్పేవాడు ఎవడు? చెప్పబడేదేమిటి మనకు మంచా, చెడా ఏమిటి? అని ఆలోచన చేయడము లేదు. అతనికే బోధిస్తున్నారు. అతనికే ఉపదేశము ఇచ్చే లెవెల్లో ఉన్నారు. నీకు గురువును అయితా అనే లెవెల్లో ఉన్నారు. నువ్వు మాలాంటి వాళ్ళ దగ్గర ఉపదేశము తీసుకో నీకు మంచిది అంటున్నారు. అంటే, సర్వ జ్ఞానాలు చెప్పినటువంటి దేవుడే దిగి వచ్చి చెప్పినాగానీ, అతనికే ఉపదేశము ఇచ్చే లెవెల్లో ఉన్నారు మన వాళ్ళు. అంటే మళ్ళ ఎట్ల మనకు జ్ఞానము తెలుస్తుంది? ఎట్ల బయటపడతాము?


దేవునికి ఎవడైతే ఇష్టపడతాడో దేవుని జ్ఞానాన్ని ఎవడైతే ఇష్టముతో తెలుసుకోగలుగుతాడో అప్పుడు బయటపడతాము. అట్ల బయటపడలేదని మనకు చెప్తున్నాడు. మనము బయటపడే విధానము లేదా? ఎందుకు లేదు. మన మూల గ్రంథాలు ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయి. నువ్వు క్రైస్తవుడివా! అయితే నీ దగ్గర బైబిలు ఉంది దానిని తెలుసుకో! నువ్వు హిందువా! నీ దగ్గర భగవద్గీత ఉంది తెలుసుకో. నీకు ముందే చెప్పబడింది జ్ఞానము. ఈ రోజు వచ్చి కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఒకవేళ చెప్పినాగానీ దానిని జ్ఞాపకము చేయాల్సిందే నీకు. అందరికీ అన్ని మతస్థులకు ఇదే విధానము దేవుడు చెప్తున్నాడు. కానీ ఏ మతస్థుడు కూడ వాళ్ళను వాళ్ళు తప్పుగా ఎవరూ ఒప్పుకోవడము లేదు. ఇది ప్రజలందరికీ చెప్పే మాట ఇది. నేనే ఒక హిందువులకు, ఒక క్రైస్థవులకు, ఒక ఇస్లామ్ మతమునకే మంచి చెప్తున్నానని కాదు, అన్ని మతస్థులకు చెప్తున్నా సర్వసాధారణముగా. ఇది అందరు చేస్తున్న పొరపాటు. అందరికీ ఎందుకు చెప్పాలయ్యా! మీ మతములో మీరు చెప్పుకోకూడదా! అని ప్రశ్న వేయవచ్చును. దేవుడు



మనుషులకు అని చెప్పాడు. అని మత గ్రంథాల్లో సర్వమానవులకు అని చెప్పాడు తప్ప ఈ ఫలానా మతము వారికే ఈ జ్ఞానము అని చెప్పలేదు. అర్థమయిందా! సర్వమానవుల్లో నువ్వు ఒకనివి, నేను ఒకన్ని. నేను కూడ సర్వ మానవుల్లోనివానినే. ఆ చెప్పినటువంటిది నాకు కూడా చెప్పాడు. అది నాకు కూడా సంబంధించినటువంటిదే మీకు ఒక్కరికే కాదు. బైబిలు ఉందనుకో నీకు ఒక్కనికే కాదు అది చెప్పింది, నాకు కూడా చెప్పాడు. ప్రభువు చెప్పిన వాక్యము నాకు కూడా వర్తిస్తుంది అది. నేను కూడా అనుసరించాల్సిందే. కానీ, మా మతములో ఉండేది అనేమి కాదు సర్వలకు చెప్పాడు. సర్వుల్లో నేను కూడా ఒకనినే, కాబట్టి నాకు కూడ దాని బాధ్యత ఉంది. ఒకవేళ మీరు తప్పు చేస్తే, పొరపాటుపడితే ఇది తప్పు అని చెప్పే బాధ్యత పక్క వ్యక్తికి ఉంటుంది.


ఇంతకుముందు చెప్పాను నేను. మిరపకాయలు దొంగతనానికి పోతే ఎట్లుంటుంది అని. అట్లుంటుంది. అంటే పక్క వ్యక్తి ఏదన్నా పొరపాటు పడి చేస్తున్నాడనుకో. ఏదో గబ గబ ఎత్తు కొచ్చుకుందామని పోయినాడు. మిరపకాయల సంచి ఉంటే దాన్ని ఎత్తుకొచ్చుకుంటా అంటే వద్దురా నాయన ఏ దాన్ని ముట్టుకున్నా పర్వాలేదు, దాన్ని ముట్టుకుంటే ఏమైతుంది? ముక్కులో ఘాటు వస్తుంది, తుమ్ములు వస్తాయి, దగ్గుల వస్తాయి, ఇంట్లో వాడు లేస్తాడు, కట్టేసి కొడతాడు లాస్టికి, అంతే మన పని అయ్యేది. ఆ రకముగా మనమేం చేస్తాము అంటే ఆ మాయలో ఇరుక్కుపోతాము మనము. ఆ పక్క విషయములోకి పోతే మాయ మనల్ని బంధించి వేస్తుంది, పోలేవు నువ్వు అని చెప్పడము తప్ప ఇంకోటి ఏమి కాదు. నేనేమి మీకు గొప్పేమి కాదు. మేము అన్ని మతాలలో ఉండే సారాన్ని నేను ద్వేషము లేకుండ, అసూయ లేకుండ తెలుసుకోగలిగినాము. కాబట్టి ఇప్పుడు అదే విధానాన్నే



మీకు చెప్పగలుగుతున్నాను. నేను గొప్పని కాదు, ఇంకోటి అని కాదు. ఏ మతములో ఉండేవాళ్ళు ఆ మతములో ఉండే గ్రంథాలు తీసుకొని చదువుకోండి. అందులో ఉండే విషయాలు మనకు తెలియబడుతాయి. మనమందరము ఒకే జాతిగా పుట్టినటువంటి వాళ్ళమే. మానవ జాతి మనది. అర్థమయిందా! మానవజాతి పుట్టించినపుడు నీకు కులాలు మతాలు అని పెట్టి పుట్టించలేదు. అర్థమయిందా! మరి నువ్వెందుకు కులములో ఉన్నావు? నీది ఒక పేరే కదా! అని మీరు అడగవచ్చు. నీ కొడుక్కి వేరే కులములో చేసుకున్నావా? నీ కులములో చేసుకున్నావా? అని అడగొచ్చు. నా కొడుకుకు చేసినా, నా దగ్గర ఎవరికి పెళ్ళి చేసినాకానీ, వేరే మతానికి వేరే మతానికి చేసినానుకానీ, ఒక మతానికి ఎప్పుడూ చేయలేదు నేను. వేరే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసినాగానీ అంతా ఒకటేనయ్యా ఎందుకు పెట్టుకుంటారు ఈ బేదాలు! అని మేము చెప్పడము జరిగినదిగానీ, మా ఇంట్లో అట్లే చేసినాము, మాకు తెలిసినోళ్ళకు అట్లే చేసినాముకానీ, మతాలు అని కులాలు అనేటటువంటి వ్యత్యాసము ఎక్కడా పెట్టలేదు. నేను ఏమి చెప్తున్నానంటే సర్వమానవులకు సంబంధించిన బోధ దేవుడు చెప్పాడు కాబట్టి ఇది అందరికీ వర్తించేది. లేదు, మా మతానికే సంబంధించింది అంటే, దేవుడు అందరికీ సంబంధించినోడే కదా! దేవుడు అందరికీ చెప్పాడు కదా! కానీ మా మతానికి అనడము ఏమిటిది? మతమనేది నువ్వు పెట్టుకున్నావా? దేవుడు పెట్టాడా? దేవుడు ఎక్కడా చెప్పలేదు మతమని. సరే ఏమన్నా తలలో వెంట్రుకలు తక్కువ ఉండేవాళ్ళు ఈ మతము, తలలో వెంట్రుకలు ఎక్కువ ఉండే వాళ్ళు ఆ మతము అని ఏమన్నా చెప్పాడా? లేదు.


ఒకవేళ అట్లేమన్నా అంటారేమో అని అందరికి తల మీద వెంట్రుకలు మొలిపించాడు. ఒకవేళ కొందరికి వెంట్రుకలే లేకుండా,



కొందరికి వెంట్రుకలు ఉండే రకంగా, అట్ల కూడా చేయలేదు. అందరికి వెంట్రుకలున్నాయి, మధ్యలో ఊడిపోయిండొచ్చు కానీ పుట్టుకతో అందరికి ఉన్నాయి. ఏమన్నా ఒక్కరికి రెండు ముక్కురంధ్రాలు పెట్టి, కొందరికేమన్నా ఒకటే పెట్టాడా? లేదు, అందరికీ రెండు ముక్కు రంధ్రాలున్నాయి. శరీరములో ఏమన్నా రక్తము వేరుగా ఉందా? ఎక్కడన్నా కలర్ మారిందా ఎవరికన్నా? అందరికీ ఒకటే కలరే. శరీరము అవయవాలు ఏమన్నా మారినాయా? అందరికీ ఒకటే ధర్మాలతో కూడుకున్న అవయవాలున్నాయి. నీ కన్ను చూస్తుంది అంటే ఇంకొకరి కన్ను చూస్తూ ఉంది. నీ చెవి వింటూ ఉందంటే ఇంకొకరి చెవి వింటా ఉంది. అందరి శరీరాలు ఒకే ధర్మాలతో కూడుకున్నటువంటివి ఉన్నాయి. అందరినీ ఒకే రకంగా పుట్టించాడు మధ్యలో వచ్చి నువ్వు వేరు, నేను వేరు అనుకోవడము పొరపాటు. ఒక మతములో పుట్టినవాడు చిన్నవయస్సులో నాకు ఏ మతము లేదు అందరితో కలిసి ఆడుతుంటాడు. చిన్న పిల్లోనిగా ఉన్నప్పుడు మతాలు, ద్వేషాలు ఏమీ లేవు. అందరూ కలిసి ఆడుకుంటారు. హిందువుల పిల్లలు, క్రైస్తవుల పిల్లలు, ముస్లీమ్ల పిల్లలు అంతా కలిసి ఆడుకుంటారు. కొంత పెద్దగా అయిన తరువాత గుణాలు పనిచేస్తాయి కదా మనకు. మాయ పనిచేస్తుంది అప్పుడు ఏయ్ నాది వేరే కులము నాది ఆ కులము నీది వేరే కులము. నేను చర్చీకి పోతా, నువ్వు మసీదికి పోతావు. నేను వేరు, నువ్వు వేరు అని ద్వేషాలు వస్తాయి. ఈ రకంగా మాయలో పడి ద్వేషాలు పెంచుకొని ఈ రోజు నరహోమము చేపించుకుంటున్నారు. ఒకరికొకరు చంపుకోవడము లేదా విదేశాలలో బాంబులు పెట్టుకోవడము లేదా ఎంత హింస? ఒకరికొకరు చంపుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. మానవ వినాశనకరమైనట్టి ఆయుధాలు తయారు చేసుకున్నారు. ఎందుకు? వానిని నేను చంపాలి,



వాడు నాకు శత్రువు, వీడు నాకు శత్రువు. వాళ్ళందరూ రక్తము కారుతుంటే చూడాలి నేను. చూడు ఎట్లుందో! ఎంత ద్వేషమో! అని వీడు అంటాడు. లేదు మొత్తము ఆ దేశములో ఉన్న వాళ్ళంతా ఫలానా మతస్థులే, వాళ్ళంతా సర్వనాశనము కావాలి మొత్తము అని ఇంకొకడు అంటాడు.


దేవుడు మిమ్మల్ని పుట్టిస్తే, దేవున్ని తెలుసుకోవాలని దేవుని జ్ఞానము మనకు అందిస్తే, మనము దానిని తెలుసుకోలేకుండా ఒకడి మీద ఒకడు బాంబులు వేసుకోవడానికి తయారై వేసుకున్నాము. సర్వనాశనము అయిపోతున్నారు. ఇంకా కాదని గ్యారెంటీ ఏముంది చెప్పండి? ఎప్పుడైతే జ్ఞానము తెలుసుకోలేడో అంతవరకు మనిషి అజ్ఞానములో పడి ఆ రకంగ సర్వనాశనము అయితూనే ఉంటాడు. ఎన్నో దృశ్యాలు చూడలేదా చెప్పండి భాదపడేటివి. ఎవడో బజారులో పోతూ ఉంటే అమాయకుడు ఎవరో బాంబు

ఏస్తే ఎవడో చచ్చిపోతాడు. ఎందుకు వేసాడంటే? మొత్తము వాళ్ళంతా చచ్చిపోవాలి. మళ్ళీ పంపించినోడు, ఎంతమందిని వీలైతే అంతమందిని చంపండి. ఎవనికి ఎవడూ శత్రువు కాదు. ఎంతమందిని వీలైతే అంత మందిని చంపండి అని చెప్పితే, అంతమందిని చంపుతారు. ఇదంతా ఎందుకు వచ్చింది? ఒకే ఒక దేవుని జ్ఞానము లేని దానివలన వచ్చింది. నిన్న మేము ఒక మతస్థులతో మాట్లాడినాము. ఒక 10 మంది వచ్చి నాతో మాట్లాడుతున్నారు. ఆప్యాయముగా వాళ్ళతో మాట్లాడుతున్నాము. వాళ్ళు వాళ్ళ మత గ్రంథాల్లో విషయాలు చెప్పితే, చాలా సంతోషముగా మేము వింటున్నాము. ఇంకా మేము తెలుసుకుంటున్నాము. మాకు తెలియనిది ఏమన్నా ఉంటే ఇదెట్లా అని మాకు తెలియదు కాబట్టి, మీ ద్వారా తెలుసుకోవాలి, మీకు అంతో ఇంతో అనుభవము ఉంటుంది కదా! అన్ని విషయాలు మాకు తెలియవు, మాకు తెలుసుకోవాల్సింది ఎంతో



ఉంది అని మేము అడుగుతున్నాము. వాళ్ళు చెప్తున్నారు. ఇంక మధ్యలో ఒక పోలీసు వచ్చాడు. ఏమిటికి అని అడిగితే ఇక్కడికంతా ముస్లీములు ఎక్కువగా వచ్చారు కదా! ఏమన్నా గొడవలు జరుగుతాయేమో! అని వచ్చినాము అన్నాడు. ఎందుకు జరుగుతాయి గొడవలు చెప్పండి! అతనెందుకు వచ్చినాడో ఏమో గానీ, నీవు ఎందుకు వచ్చినావు అనడిగితే, నేను పోలీసును అంటున్నాడు. మళ్ళీ మఫ్టీలో వచ్చినాడు అది కూడా. అలా ఎందుకు రావాల్సిన అవసరము వచ్చింది? ఏదన్నా పోట్లాట, ఏదన్నా ఘర్షణ జరుగుతుందేమో అనుకొని వచ్చినాము అంటే, ఎందుకు జరుగుతుంది ఘర్షణ? అజ్ఞానులుంటే, మీరు వేరు, మేము వేరు అనేటట్టుగా ఉంటే, ఘర్షణ జరుగుతుంది. అటువంటిది ఏమీ లేదు.


అందరము ఒకటే అన్న భావము ఉన్నప్పుడు, మేమందరము ఒక తల్లికి పుట్టి, ఒకే తండ్రికి పుట్టినటువంటి వాళ్ళము అనుకున్నప్పుడు, ఎందుకు వస్తుంది చెప్పండి? అట్ల పుట్టినోళ్ళము కాదా మనము? మొదట ఎవరికి పుట్టినాము ఒకే తల్లికి, ఒకే తండ్రివి పుట్టాము మనము. మళ్ళ ఒక తండ్రి బిడ్డలము అయినప్పుడు, అంతా ఒకరికొకరు అన్నదమ్ములు అయినప్పుడు, ముందూ వెనకా పుట్టినపుడు, మనలో మనము ఎందుకు కొట్లాడుకోవాలి? ఒకరికి అర్థము కాకపోతే ఇంకొకరిని అడిగి తెలుసుకోవాలి, అంతే తప్ప ఇంకోటి ఏమి లేదు. మనకు అర్థము కాని విషయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మేము తెలుసుకుంటున్నాము. మీరు కూడా ఇదే విధముగా తెలుసుకోండి. మీకు అర్థముకానివి ఏమన్నా ఉంటే తెలుసుకోండి అని చెప్పాము. చివరకు ఒక విషయము అడిగాము, మనకు అర్థము కానిది. వాళ్ళకు కూడా అర్థము కాలేదు. ఇంకా ముందు నుంచే అందరికీ అన్ని విషయాలు అర్థము కాలేదు అని చెప్తున్నాము కదా! ఎవరి గ్రంథములో


వాళ్ళకు అర్థము కాలేదు. చివరకు దాన్ని మభ్యపెట్టాలి, దాటేయాలి అని చూస్తే ముందు అది అర్థమైతే మళ్ళీ ఆచరణలు మళ్ళ చూస్తాములేకానీ, ముందు దానికి అర్థమేమో వివరము చెప్పండి అంటే, వాళ్ళు చివరకు ఏమి చెప్పారంటే, పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళ ఉద్దేశ్యాలన్ని నెట్లో వ్రాసింటారు. దీన్ని నెట్లో చూసి చెప్తాము అన్నారు. అది మంచిదే, ఎందుకంటే, ఇంటర్నెట్లో చూస్తే మనకు అన్ని తెలిసిపోతాయి కదా! ఆ రకంగా మేము మంచి భావముతో అడిగి తెలుసుకున్నాము తప్ప ఇంకో ఘర్షణ విధానము ఏమీ లేదు. అంటే ఈ రకంగా ఒకరికొకరు ఇంకొక మతస్థులు, ఇంకొక మతస్థులు కలిస్తే అక్కడ ఏమైతుందో అని వీళ్ళు భయపడుతున్నారు. అంటే అట్లాంటి వాతావరణము సృష్టించుకున్నారు ప్రజలు. హైదరాబాద్లో పోతే ముస్లీములు ఎక్కువున్న ఏరియా (area) లో కొంతమంది హిందువులు ఉంటారు. హిందువులు ఎక్కువున్న ఏరియాలో కొంతమంది ముస్లీములు ఉంటారు. ఆ ఏరియాలో పకడ్బందీగా పోలీసులు బందోబస్తు పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువున్నారు వీళ్ళను ఏమంటారో, వీళ్ళు ఎక్కువున్నారు వాళ్ళను ఏమంటారో అని. ఇంత ఇబ్బంది ఎందుకు వచ్చింది? ఇంత రామాయణము ఎందుకొచ్చింది?


ఈ గవర్నమెంట్ ఏదో జ్ఞానము చెప్పించొచ్చు కదా కొంతమందిని పెట్టి. మీ ఖుర్ఆన్ మీరు చదువుకోండి, మీ భగవద్గీత మీరు చదువుకోండి. మీ బైబిలు మీరు చదువుకోండి. జ్ఞానము తెలుసుకోండి అని చెప్పొచ్చు కదా! ముందు వాళ్ళకు తెలియదు అసలుకు. ఎవరికి? ఆ మంత్రులకు తెలియదు, ఉపమంత్రులకు తెలియదు, ప్రెసిడెంట్కు తెలియదు. వాళ్ళకు జ్ఞానమే తెలియదు. ఇదంతా దేనికి? అంటాడు వాడు. వానికి జ్ఞానమే తెలియదు. ఇదంతా అజ్ఞానముగా కనిపిస్తది. ఇంగా మీరు అజ్ఞానములో



ఉన్నారు, ఆ గ్రంథము ఈ గ్రంథము అని. పోండి, ముందుకు పోండి, అవి కనిపెట్టండి, ఇవి కనిపెట్టండి అని. ఏమిటి కనిపెడతాడు మనిషి? దేవుడు ఒక ఆలోచన ఇస్తే, మనకు కనిపెట్టే దానికి వీలైతుందికాని స్వయముగా ఏ మనిషి ఏదీ కనిపెట్టలేడు. ఈ రకముగా మనిషి గుణాల్లో పడిపోయి దేవుని మార్గానికి వ్యతిరేఖముగా తయారైపోయినాడు. ఇటువంటి గుణాల ప్రభావములో పడొద్దు. ఈ రోజు మేము మీకు కర్మ విధానాన్ని గురించి చెప్పాలని వచ్చాము. అది పోయింది. 2 గంటల ఉపన్యాసము అయినాగానీ, ఇక్కడ మీకు దేవుని విధానములో మనము పొరపాటు పడుతున్నాము అనేదే మీకు చెప్పగలిగినాము కాబట్టి, అంటే మీకు హెచ్చరిక చేశాము ఇంకోటేమి కాదు. మేము ఏమీ పెద్ద జ్ఞానము ఏమి చెప్పలేదు. అంటే మిమ్మల్ని హెచ్చరిక చేశాము. దొంగతనానికి పోతే మిరపకాయల మూట ఎత్తుకురావద్దు. అంటే ఏది ఎత్తుకురావాలో అది ఎత్తుకొచ్చుకో. బైబిలు గ్రంథములో మంచి వాక్యాలున్నాయి అవి తీసుకో. బీరువా తెరిస్తే బంగారు ఉంది, డబ్బులున్నాయి, అవి తీసుకోవయ్యా! మిరపకాయ మూటలు ఇంత లావుటివి ఎందుకు నీకు? లావుగా కనిపిస్తున్నాయని. కొద్దిగైనా చాలు బంగారు నీకు. అట్ల లేదయ్యా నాకు ఏదో లావుగా దొరికింది అని ఎత్తుకొచ్చుకుంటే ఎట్ల? అట్ల కాకుండా పై విధానము విడిచిపెట్టి అసలైన లాభము ఏమిటో చూసుకోండి మీరు. కాబట్టి అన్ని మతస్థులకు చెప్పేది ఏమంటే ఏ మతములో దేవుడు చెప్పినాగానీ సర్వమతస్థులకు, సర్వజనులకు అని చెప్పాడు తప్ప ఫలానా మతస్థులకు అని చెప్పలేదు. సర్వజనులు అయినట్టి వాళ్ళలో మనము కూడా ఒకరము కాబట్టి, మనము ఏ మతములో ఉన్నా, అన్ని మతాల్లో ఉన్న సారాంశమును తెలుసుకొని, అన్ని మతాల ప్రజలను సృష్టించినటువంటివాడు దేవుడు ఒకడే అని తెలుసుకొని, అందరికీ



దేవుడు ఒకడున్నాడు అందరికీ సృష్ఠికర్త ఒకడే అని, అతన్ని ఆరాధించడానికి, అతన్నే మ్రొక్కేదానికి, అతన్నే నమస్కారము చేసేదానికి, మీరు అలవాటు చేసుకుంటారని కోరుతూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.


ఇప్పుడు చెప్పబోయే జ్ఞానం సక్రమంగా మీ హృదయాలకు అందించాలని శరీరంలో ఉన్న దేవుడైన ఆత్మను కోరుచూ ప్రారంభిస్తున్నాము. ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశము 'శక్తి' అని మీకు తెలుసు. ముందు చెప్పాము. 'శక్తి' అనేదానిని గురించి చెప్పుతామని ప్రకటించారు. శక్తి అంటే ఏమిటి! శక్తి అనేమాట చాలామంది విన్నారు కానీ దాని సారాంశము మనకు సరిగా అర్థం అయ్యుండదని అనుకుంటాను. మనకు అర్థము అయింది ఒక రకము, మనకు ఉండేది రహస్యం ఒక రకము. దానివలన మనము పూర్తి దాని సారాంశము తెలుసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాము. ఒక ఇంట్లో, ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో భార్య, భర్త ఇద్దరూ ఉన్నారు. ఆ భార్య భర్తలకు ఒక కుమారుడు ఉన్నాడు. తరువాత ఆ భార్యభర్తలకు ఆమెకు మామ, అతనికి తండ్రి ఉన్నాడు. అంటే ఒక తాత, ఒక మనవుడు తరువాత తల్లితండ్రి ఇద్దరూ ఉన్నారు. ఈ రకంగా లెక్కేసుకుంటే ఒక చిన్న కుటంబములో నల్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ నల్గురు వ్యక్తులలో ముగ్గురు పురుషులు, ఒకరు స్త్రీ. ఈ ముగ్గురు పురుషులలో ఈ ముసలి ఆయన ఏమి చేస్తుంటాడంటే ఇంట్లో కూర్చోని చూస్తూ ఉంటాడు. ఈ పెద్ద ఆయన ఏమి చేస్తుంటాడంటే మధ్యలో ఉండే



ఆయన, ఆ ముసలి ఆయన కొడుకు పనులు చేస్తూ, సంపాదించి ఈ కొడుకుకి ఇస్తూ ఉంటాడు. ఆ ఇచ్చినదానిని కొడుకు ఏమి చేస్తాడంటే ఇంట్లో కూర్చోని చిన్న పిల్లవాడు కాబట్టి వాడు అనుభవిస్తూవుంటాడు.


ఒకరోజు మంచి ఆహారము పెడుతారు. ఒక రోజు సంపాదించని రోజు ఏదో కొద్ది ఆహారము పెడుతారు. రుచికరమైన ఆహారము ఏదో పెడుతారు, రుచికరములేని ఆహారము ఒకరోజు పెడుతారు. ఇట్లా కాలం గడుపుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ పని చేసి సంపాదించేది ఎవరు! ఇంటిలో తండ్రిగా ఉన్నటువంటివాడు, ఈ అనుభవించేవాడు ఎవడు తినే వాడు కూర్చోని చిన్నపిల్లవాడు వానికేమి వయస్సు రాలేదు. వాడు చిన్న పిల్లవాడే. ఈ భర్తకు సహకరించేది భార్య ఒక ఆమె వుంది. ఇంక వీళ్ళిద్దరు కాకుండా మరొక ముసలి ఆయన ఉన్నాడు. ఆయన మామూలుగా ఇంట్లోనే కూర్చోంటాడు బయటకుపోడు ఏ పని చేయడు. రిటైర్ అయినాడు ఆయన. ఆయన ఏమి చేస్తాడు అంటే ఊరికే కూర్చోని అన్ని చూస్తూ ఉంటాడు. ఆయనకు ఏదో మందులు ఒకటి వేసుకుంటాడు. వీళ్ళు పెట్టే ఆహారం ఆయనకి అవసరం లేదు. ఆయన ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది. ఆయనది ఆయనే తీసుకుంటుంటాడు. వీళ్ళదాంతో అవసరం లేదు. ఎందుకంటే అతను వీళ్ళ ఆహారం తీసుకొనే పరిస్థితిలో లేడు. ఆయనకు ఒక అనారోగ్యము. ఆ అనారోగ్యము తగినట్టు ఆయన ఆహారము మందులు అవే తీసుకుంటుంటాడు. వీడు నీళ్ళు త్రాగుతుంటాడు. ఆయన వీళ్ళు పెట్టే ఆహారంతో సంబంధం లేకుండా ఉన్నాడు.


ఇప్పుడు ఈ తల్లి తండ్రి ఇద్దరూ సంపాదించినేది తినేది మాత్రము కొడుకు, అర్థమయిందా! ఇంట్లో ఉన్నది నలుగురు. ఒక ఆయన ఏమి



చేసినాడంటే జనాభా లెక్కలు వ్రాసుకొనే ఒక ఆయన వచ్చి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. మా ఇంట్లో నలుగురు ఉన్నాము. మేము అని చెప్పాడు. ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది అని అడిగాడు. మగవాళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు ఒకరు అని చెప్పాడు. అంటే మగవాళ్ళు ఎవరెవరు అని అడిగినాడు. ఒక పిల్ల వాడు, నేను పెద్దవాన్ని, తరువాత మా నాయన ఒక ఆయన ఉన్నాడని ఆయన చెప్పాడు. ఈ విధంగా జనాభా వ్రాసుకొని పోయినాడు ఒక ఆయన. ఆయన వ్రాసుకొని పోయినపుడు ఒక రకంగా వ్రాసుకొని పోయినాడు ఏమని వీడు కొడుకు, వీడు తండ్రి, వీడు తాత అని, ఇంకొక ఆయన వచ్చినాడన్నమాట. ఆయన వచ్చినపుడు ఏమి చేసినాడు అంటే వీడు అనుభవించే వాడు, నేను సంపాదించేవానిని, ఆయన ఏమి పెద్దాయన ఊరికే కూర్చోండేవాడే ఏమి పని చేసేవాడు కాదు అని చెప్పాడు. ఇంకొకరు వచ్చి వ్రాసుకునేదానికి వచ్చినపుడు, సరే ఆయన అట్ల వ్రాసుకొని పోయినాడు. ఏమని వ్రాసుకొని పోయినాడు ఊరికే ఉండేవాడు, చూస్తూ ఉంటాడు. అందరిని అజమాయిషి చేస్తూవుంటాడు. ఇంకొక ఆయన వచ్చినాడు తరువాత ఆ ఇంట్లో ఎవరు ఉన్నారని చెకింగ్ చేసుకొనేడానికి ఆయనవచ్చినపుడు ఏమి చెప్పినారు అంటే వాడు బలహీనుడు, ఏమి పనిచేసే వాడు కాదు నా కొడుకు చిన్న పిల్లవాడు. వాడు బలహీనుడు, నాకు బలం ఉంది. నేను బలవంతున్ని నేను పనిచేస్తాను. ఆ ముసలి ఆయనకు ఏమి సంబంధం లేదు. ఊరికే ఉన్నాడు అని చెప్పినాడన్నమాట. అంటే ఇక్కడ ఏమి చెప్పినాడు బలహీనుడు, బలవంతుడు, అందరితో ఏ సంబంధం లేనటువంటివాడు అని చెప్పాడు. ఒకరికి ఏమి చెప్పినాడు వాడు కొడుకు, నేను తండ్రిని, ఆయన తాత అని చెప్పినాడు.



ఈ రకంగా ముగ్గురికి మూడు రకాలుగా చెప్పినాడు. వాడే ఏమి చెప్పినాడంటే మొదటి వాడు తండ్రి, కొడుకు, వాళ్ళ తాత ఉన్నాడంటే లేదురా! నాయన ఒకడు బలహీనుడు, ఒకడు బలవంతుడు, ఒకడు ఏమి పనికిరానివాడు ఒకడు ఉన్నాడని ఇంకోడు అన్నాడు. అంటే ఎవరు ఏమి చెప్పినాగానీ ఈ ముగ్గురి గురించే కదా! చెప్పుతావుండేది అంటే ఈ ముగ్గురిని ముగ్గురు వచ్చి అడిగితే ఒక్కొరికి ఒక పేరు చెప్పినాడు. కానీ వీళ్ళు ఉండేదేమో ముగ్గురే వాళ్ళకి ఒక రకంగా చెప్పినారు, వీళ్ళకి ఒక రకంగా చెప్పినారు. ఎట్ల చెప్పినాగానీ వాళ్ళు ముగ్గురే కదా! వుండేది, ఆ రకంగా ఈ రోజు ఒక శరీరమనే ఇల్లువుంది. ఆ శరీరము అనే ఇంట్లో ఇప్పుడు ఉండేటువంటి ముగ్గురు మనుషులు ఎట్లయితే ఉన్నారో అట్లనే ఉన్నారు. ముగ్గురు మగవాళ్ళు. ఒక స్త్రీ ఉంది. అక్కడ అయితే ఎట్ల చెప్పినారో ఒక ఆయన వచ్చి అడిగినాడు. ఒక క్రైస్తవుడు వచ్చి అడిగితే వాడు కొడుకు, నేను తండ్రిని, ఆతను ఏమి సంబంధం లేనివాడు అని చెప్పాడు. అట్ల అని అతను ఏమి చెప్పినాడంటే ఇంక అదే చెప్పుతాడు తండ్రి, కొడుకు, పరిశుద్ధాత్మ ఇంక రెండోది చెప్పడు ఆయన. ఆయన నేను క్రైస్తవున్ని నేను ఇదే అడిగి వచ్చాను. ఇదే దేవుడు చెప్పినాడు. ఎవరూ లేరు. ఈ ఇంటిని పరిశోధన చేశాను అంటాడన్నమాట. ఇంకో ఆయన ఏమి చెప్పుతాడంటే ఇంకొక విధంగా చెప్పుతాడు వాడు ఏమీ పనికిరానివాడు, వీడు పనికి వచ్చేవాడు, వీడు ఊరికే చూస్తావుండే వాడు.


ఇప్పుడు ఆ ముస్లీమ్ వచ్చి అడిగితే ఏమి చెప్పుతున్నాడంటే చూడు నేను పెడితే తినేవాడు, నేను ఎట్ల చెప్పితే అట్ల వినేవాడు ఒకడు, చెప్పేవాన్ని చేసేవాన్ని నేనే. ఇంకొక ఆయన ఊరికే చూసుకుంటుంటాడు ముసలివాడు అని చెప్పితే అది చెప్పినట్లు ఆ ముస్లీమ్క అర్ధమయింది. ముస్లీమ్క



ఒకటే విధానం ముగ్గురు ఉన్నారని తెలుసు, క్రైస్తవునికి ముగ్గురు ఉన్నారని తెలుసు, అట్లగానే హిందువుకు కూడా ముగ్గురు ఉన్నారని తెలుసు. కానీ వీళ్ళు వేరువేరు వాళ్ళు అనుకోవడం పొరపాటు. ఒకే ఇంట్లో ఈ ముగ్గురు ఉన్నారు. ఒక ఆడ వ్యక్తి ఉంది. అంటే ఒక ప్రకృతి, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఇది అన్ని శరీరాలలోను ఉంది. ఇల్లు అనేది ఒక శరీరం మీరు లెక్కేసుకోండి. మీ ఇల్లు ఉంది. మీ శరీరమే ఒక ఇల్లు. ఈ శరీరంలో మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది జనాభా వ్రాసుకొండేవాళ్ళు అడుగుతున్నారు. ఏమి చెప్పుతావా నీవు. అది జ్ఞానం తెలియనపుడు నేను ఒకన్నే ఉన్నానని నీవు చెప్పుతావు. ఇప్పుడు అజ్ఞానులను అడిగితే ఏమంటాడు ఎవరున్నారు నేనే కదా! ఉండేది, నేను చేస్తున్నాను అని అంటారు. కానీ ఇప్పుడు జ్ఞానం తెలిసిన తరువాత ఏమి చెప్పుతావు లేదు ముగ్గురు ఉన్నారు అని ఒకడు చేసేవాడు, ఒకడు చూసేవాడు, ఒకడు తెచ్చినేది తినేవాడు. అంతే కదా! వాడు అనుభవించే వాడు. ఈ ముగ్గురు ఉండేది శరీరములో ఎట్ల చెప్పుకున్నా గానీ ఈ ముగ్గురే.


భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 16, 17 శ్లోకాలలో ఇదే విషయమే చెప్పినారు. తరువాత ద్వితీయ దైవగ్రంథము బైబిల్లో మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19వ వచనంలో కూడా ఇదే విషయమే చెప్పినారు. ఒక ఇంట్లో ముగ్గురు ఉన్నారని చెప్పినారు. అక్కడ కూడా ఇంక అంతిమ దైవగ్రంథములోనికి వస్తే 50వ సూరా 21వ ఆయత్లో ఇదే విషయం చెప్పినారు. ఇవన్నీ మనం లెక్కేసుకొని చూస్తే ఇక్కడ ఏమి చెప్పినారు భగవద్గీతలో, బైబిల్లో అదే చెప్పినారు. బైబిల్లో ఏమి చెప్పినారో, ఖురాన్లో కూడా అదే చెప్పినారు. ఏమి వేరు లేదు. ఒక ఇంట్లో నలుగురే ఉన్నారు. ముగ్గురు మగవాళ్ళు. ఇల్లు నీ ఇల్లు కాదా చెప్పు, శరీరమనేది



ఒక ఇల్లు. ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారు. అని లెక్కేసుకొంటే ఉండేది అంతమందే వేరేది ఏది లెక్కేసుకొనే పనిలేదు. ముగ్గురు పురుషులు ఉన్నారు, ఒక స్త్రీ వుంది. స్త్రీ అంటే ప్రకృతి ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అన్నింటిని ఈ ఐదింటిని కలిపితే ప్రకృతి అంటారు. ప్రకృతిని తత్త్వంగా చెప్పుకొన్నాము. ఇంక జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అనేటువంటివి ముగ్గురిని పురుషులుగా చెప్పుకున్నాము. ఈ ముగ్గురు పురుషులు అంటే నేను జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అని అడిగితే ముస్లీమ్ ఎవరైనా లేదంటారా, ఉన్నారని చెప్పాల్సిందే. ఎందుకంటే నీవు అడిగినప్పుడు వాళ్ళు పేర్లు మార్చి చెప్పినారు గానీ, అంటే నీ గ్రంథములో పేరు మార్చి ఉందిగానీ, ఆ ముగ్గురే ఉన్నారు. తోలేవాడు, తోలబడేవాడు, సాక్షిగా చూసేవాడు అని ముగ్గురు ఉన్నారు ఖురాన్. ఇక్కడ ఏముంది బైబిల్లో, ఏముంది ముగ్గురే ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని ముగ్గురే ఉన్నారు. మూడు పేర్లు చెప్పినారు. ఇక్కడ వేరే పేర్లు అక్కడ వేరే పేర్లు అని చెప్పినాడు. ఇక్కడకు వచ్చేసరికి క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అని భగవద్గీతలో చెప్పినారు. ఇక్కడ కూడా ముగ్గురే అని చెప్పినారు చూడండి.


ఒక్క శరీరంలో మూడు ఆత్మలు ఒక్క ప్రకృతి, ముగ్గురు పురుషులు ఒక్క స్త్రీ ఉంది. అని మీరు గుర్తు పెట్టుకొండి. మీరు ఎక్కడికి పోయినా ఇంటికి పోయినాగానీ ఇది నా శరీరము. ఈ శరీరంలో ఎంతమంది ఉన్నారు. నేను ఒకన్ని ఉన్నాను. నా తండ్రి ఒకడున్నాడు. మా తాత ఒకడున్నాడు. అని నీవు లెక్కపెట్టుకోవాలి యాదర్ని అడుగుతాను. నీవు ఎంతమంది ఉన్నారని చెప్పుతావు. నల్గురు ఉన్నారని చెప్పుతా! జీవుడైన నేను, నా తండ్రి అయిన ఆత్మ, చూస్తువుండేటటువంటి పరమాత్మ (పరిశు ద్ధాత్మ), తల్లి అయిన ప్రకృతి. ఇప్పుడు మీ తల్లితండ్రులు ఎవరు ఇందులో



ఆత్మ, ప్రకృతి. ఆత్మ తండ్రిగా, ప్రకృతి తల్లిగావుంటే నీవు పుట్టినావు. ప్రపంచంతో ఏ జీవరాసి పుట్టినాగానీ, భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగంలో 4వ శ్లోకము ఏముందంటే “ప్రపంచములో ఏ జీవరాశి పుట్టినాగానీ వానికి తల్లి ప్రకృతి, తండ్రి ఆత్మ" అనే విషయం ఉంది. అర్థమయిందా! ఇప్పుడు కొడుకు ఎవరు. నేను జీవున్ని స్వామి, నువ్వు, మగ పిల్లవాడు పుట్టినాడు, ఆడపిల్ల పుట్ట లేదు. కొడుకు నీవు, తండ్రి నీ ఆత్మ, తల్లి ప్రకృతి, నీ తాత ఒకడు ఉన్నాడు. వాడు ఏమీ అనడు చూస్తా వుంటాడు అంటే ఆ ముసలివాడు ఏమి పని చేయలేడు. ఊరికే గొంతు కూర్చోని చూస్తా ఉంటాడు. కొడుకు ఏమి చేస్తున్నాడు, మనువడు ఏమి చేస్తున్నాడు. ఇప్పుడు నీ శరీరంలో నీవు ఇంటికిపోతే నీ శరీరంలో ఎంతమంది అని పోల్చుకుంటావు.


ఆధ్యాత్మికరీత్యా, ఆధ్యాత్మికము అంటే జ్ఞానం కదా! నీ శరీరంలో ఆత్మ విధానాన్ని ఏ విధంగా పోల్చుకుంటావు. ఇప్పుడు చెప్పినేదే ముగ్గురు పురుషులు ఒక స్త్రీ. ఇప్పుడు నేను అడుగుతాను ఒక ముస్లీమ్ను నిలబెట్టి, ఇతని శరీరంలో ఎంతమంది ఉన్నారని అడుగుతాము. నీవు ఏమి చెప్పుతావు దానికి 3 పురుషులు ఒక స్త్రీ అని, ముస్లీమ్లకు గానీ, క్రైస్తవులకుకానీ, హిందువులకుగానీ అంత ముగ్గురు మనుషులే కదా! మనుషులకు చెప్పిన విధానముగానీ మతాలకు చెప్పిన విధానము కాదు ఇది. దేవుడు మనుషులకు చెప్పిన విధానము ఇది కదా! మన దగ్గర, మతానికి సంబంధం లేదు. సరే అట్లయినాగానీ మత గ్రంథంలో దేవుడు ఏమి చెప్పినాడు ఈ ముగ్గురినే చెప్పినాడు. ముస్లీమ్లకు అదే చెప్పినాడు, క్రైస్తవులకు అదే చెప్పినాడు హిందువులకు అదే చెప్పినాడు అర్థమయిందా! ఇప్పుడు లెక్కేసుకొంటే పని చేసేవాడు ఎవరు తండ్రి ఒకడే పనిచేసేది. ఒకడేమో కూర్చోని తింటున్నాడు.



ఈయనేమో పని చేసి పెడుతున్నాడు. ఒకడేమో అన్ని చూసుకుంటున్నాడు. ఎవరు! తాత, ఇప్పుడు పని చేసిపెట్టేవానిది బలము ఉంటాది కదా! బలము ఉంటే కదా పని చేసేది. ఆ బలాన్ని ఏమంటున్నామంటే మనము సత్తు అని అంటున్నాము. ఆ శరీరంలో తండ్రికి ఉండే బలాన్ని ఏమంటున్నాము. సత్తు అని అంటున్నాము.


ఆ శరీరంలో సత్తు వలనే ప్రతి మనిషికి ఒక బలము అనేది ఏర్పడింది. అర్థమయిందా! ప్రతి మనిషికి ఒక బలమనేది ఏర్పడినది. ఈ సత్తు అనేదాన్ని ఏమంటున్నాము అంటే కాలక్రమేపి మార్పు వచ్చింది. శక్తి అయింది. అవి రెండు అక్షరాలే ఇవి రెండు అక్షరాలే సత్తు అనే పదం పోయి 'శక్తి' అనే పదంగా మారింది. ఈ శక్తి అనే పదము మనము వింటుంటాము. శక్తి అంటే బలము అని అ అర్థము. బలమును లెక్కవేస్తే, బలము కనిపించేది ఒక రకము, కనిపించనిది ఒక రకము రెండు రకాలుగా ఉంది. శక్తి ఎట్ల ఉంది. కనిపించేది ఒక రకము, కనిపించనటువంటిది ఒక రకము అంటే సూక్ష్మంగా, స్థూలంగా రెండు రకాలుగా ఈ శక్తి పని చేస్తున్నది. పని నీ శరీరంలో శక్తి ఉంది అర్థమయిందా! ఇప్పుడు నీ శరీరంలో శక్తి అంటే ఆత్మ పని చేస్తూ ఉంటే, మీ తండ్రి పని చేస్తూవుంటే, ఆ శక్తివల్లే పని చేస్తావున్నాడు, ఆ శక్తి వల్లే పని జరుగుతావుంది. నీ శరీరంలో ఏ పని జరిగినాగానీ ఆత్మశక్తి వలనే జరుగుతావుంది. ఆత్మ బలము చేతనే జరుగుతావుంది. ఇప్పుడు ఒక మనిషి ఒక మూటను మోసుకొని పోతూవున్నాడు. ఒక ముస్లీమ్ ఒక మూటను మోసుకొని పోతున్నాడనుకో, వాడు ముస్లీమ్ అయినాగానీ, వాడు హిందువు అయినా గానీ, క్రైస్తవుడు అయినాగానీ, వాడు మనిషే కదా! ఒక మనిషి ఒక మూటను మోసుకొని పోతున్నాడనుకో, అపుడు ఎవరు మోస్తూవున్నారు దానిని నీ శరీరంలో,



ఆత్మశక్తి పని చేస్తావుంది. ఆత్మ బలము పని చేస్తావుంది. ఆ మూటను మోస్తూ ఉంది. అర్థమయిందా! ఆత్మ కూడా ఆ శక్తిని ఎంత ఉపయోగించు కోవాలి అనేది ఒక కొలత ఉంది. ఆ కొలత ఏమంటే ఈ జీవుడు అనుభవించే దానికి ఎంత పెట్టాలో అంతే పెట్టాలి అన్నమాట. ఎంత శక్తి ఉపయోగించు కోవాలో, అంతే పని చేయాలి. అంతకంటే ఎక్కువ పని చేయకూడదు. కాబట్టి జీవునికి కర్మ తగినట్టు శక్తి ఉపయోగించి వానికి పోషణ చేస్తావుంది. ఆహారం పెట్టి పోషణ చేస్తావుంది. వాడు తిని అనుభవిస్తున్నాడు. తిని బ్రతుకుతున్నాడు. ఎవరు? కుమారుడు. అర్ధమయిందా!


ఇప్పుడు ఇది కనిపించేటటువంటి స్థూలమైనటువంటి శక్తి. ఒక స్ప్రింగ్ ఉంది అది గజము ఎత్తు నిలబడి ఉంది. అంటే సాగి ఉంది. దానిని బలంగా వత్తుతాము మనము చేత్తో, వత్తితే అది మూడు అంతలకు పోతుంది. అంటే మూడు అడుగుల ఎత్తు ఉండేది 2 అడుగుల ఎత్తుకు పోతుంది అనుకోండి. 1.1/2 అడుగు ఎత్తుపోతుంది. అంటే 1.1/2 ఎత్తు అణిగిపోయింది అంటే అక్కడ ఏమి ఉపయోగపడింది. బలము ఉపయోగ పడింది, శక్తి ఉపయోగపడింది. ఎవరి బలము ఉపయోగపడింది అనే ప్రశ్న వేస్తున్నాము. మిమ్మలిని మీరు ప్రశ్న వేసుకోండి అక్కడ, ఎవరి బలం ఉపయోగపడింది. ఆత్మబలము ఉపయోగపడింది. నీవు ఏమి చేయలేదు. నీ బలం ఏమి లేదు. అపుడు ఆ బలమంతా ఆత్మదే. ఆత్మబలము అక్కడ ఉపయోగపడింది. ఇప్పుడు ఆ పని ఎవరు దానిని అదుముతున్నారు. నీవు అదమ లేదు. నీలో ఉండే ఆత్మ దానిని అదిమిపడుతావుంది. ఎవరు మూటలు మోస్తూ వున్నారు. నీవు మోయలేదు. నీలో ఉండే ఆత్మ దానిని మోస్తూ ఉంది. ఆ మోస్తూ ఉన్నప్పుడు బలము ఉంటుంది కదా! ఆ భారము అనేటువంటి ఫలితం దానిని నీవు అనుభవించాలి. ఈ రకంగా



ఆ పనిలో

ఆధ్యాత్మికరీత్యా లెక్కేసుకుంటే శక్తి అనేటువంటిది ఆత్మ వినియోగిస్తావుంది. ఆ శక్తి వినియోగించిన దానివలన పని జరుగుతావుంది. ఉండేటువంటి కష్టాన్ని, సుఖాన్ని జీవుడైన నీవు అనుభవిస్తున్నావు. ఇది ప్రత్యేకమైన దారి, ప్రత్యేకమైన ఆధ్యాత్మికము. ఇప్పుడు మనము గుడికి పోయి భజన చేసివస్తే ఈ విషయం తెలియదు. చేనుకుపోయి వ్యవసాయం చేసివస్తే ఈ విషయాలు తెలియవు. కానీ ఇక్కడ ఆత్మను విడదీసి తెలుసుకొన్న దానివలన మనకు కొంత అర్థమైతావున్నది.


ఒకరు ఒక పని చేస్తూ ఉన్నారు అంటే ఆ పనిని ఎవరు చేస్తున్నారు. ఆత్మ చేస్తుంది అని గట్టి రూఢీకి రావాలి, మీరు నమ్మకానికి రావాలి ఆత్మ చేస్తూ ఉంది. లేదా, అందులో అనుమానం పెట్టుకోకూడదు. సరే పని చేసేదే కాకుండా, ఒక పాట పాడుతున్నాడనుకోండి వ్యక్తి, ఆ పాట అందంగా పాడుతున్నాడు. రాగ యుక్తంగా పాడుతున్నాడు. ఆ స్వరం బాగా వుంది. ఆ పాట పాడే వాడు ఎవడు, నీవు కాదు ఆ పాట పాడితే వచ్చే ఫలితం వుంటాది చూడు డబ్బులు, అది నీవు అనుభవిస్తావు సుఖంగా తిని, ఈ రకంగా పని చేసి పెట్టే వాడంతా నీలో ఉండేటువంటి తండ్రి, మీలోని తండ్రి అంటే అర్థమవుతుందా! మీరు కాదు, ఒక స్త్రీ వంటింటిలో మంచి బిర్యాని వండింది. రుచికరమైన బిర్యాని వండింది. ఆ రుచికరమైన బిర్యాని పనితనం వండడం. ఆ వండినటువంటి వాడు ఎవరు ! ఆమె కాదా!

ఆమెకాదు, ఇక్కడ మిమ్మల్ని లెక్కేస్తే, ఇక్కడ ఎందుకు అడుగుతున్నాను అంటే అయినా పురుషుడు అయినా ఇండ్లు ఇండ్లే దానిలో ఉండే వాళ్ళు మనుషులు మనుషులే అనుకో. స్త్రీ అనేది శరీరము, పురుషుడు అనేది ఒక శరీరము. ఇంటితో సమానమే, అందులో ముగ్గురు నివాసం చేస్తున్నారు. స్త్రీ శరీరంలోనైనాగానీ, పురుషుని శరీరంలోనైనాగానీ ముగ్గురు



పురుషులు ఉన్నారు. ఒక స్త్రీ ఉంది. సర్వసాధారణ సర్వమానవులకు సమానమైనటువంటి జ్ఞానం, సర్వమానవులకు అంటే స్త్రీలకైనాగానీ, పురుషులకైనాగానీ ఇది అందరికి సమానంగానే స్త్రీలు, పురుషులు అనేటువంటి భావం మనకు అంటే తత్త్వము కనపడేటట్లు దేవుడు చేశాడు. ఎందుకంటే దేవుడు కనిపించకుండా ఒకరు స్త్రీ తత్త్వంగా, ఒకరు పురుష తత్త్వంగా ఉన్నారు కాబట్టి ఈ విధానం తెలియాలి అనే ఉద్దేశ్యంతో బయట శరీరాలను స్త్రీగా, పురుషునిగా పుట్టించినాడు అర్థమయిందా!


లోపల శరీరంలో నీ తండ్రియైన పురుషునిగా పుట్టించినాడు అర్థమయిందా! లోపల శరీరంలో నీతండ్రియైన పురుషుడు, నీ తండ్రియైన ఆత్మ, తల్లియైన ప్రకృతి ద్వారానే నువ్వు జన్మిస్తున్నావు. అనేకంగా స్త్రీ, పురుషుల ద్వారానే సంతానం కల్గేటట్లుగా బయట చూపించినాడు. కానీ వాస్తవంగా స్త్రీ శరీరమైనాగానీ, పురుష శరీరమైనాగానీ అది ఇంటితో సమానము. ఆ ఇంట్లో ముగ్గురే పురుషులున్నారు. ఒక్క స్త్రీ ఉంది. నువ్వు ఎక్కడికిపోయినా ఇదే ఉంది. ముఖ్యమైన జ్ఞానమంతా, మూడు దైవ గ్రంథములలో ముఖ్యమైన జ్ఞానము ఇదే ఉంది చూసుకోండి ఎక్కడైనాగానీ, ముగ్గురు గురించి చెప్పినామా! లేదా చెప్పింది. ముగ్గురు గురించి చెప్పినారు. ఈ విషయం తెలియదు మీకు. ఒక్కొక్కరు ఒక రకంగా ఊహించు కొంటున్నారు. అంటే ఈ విధానము తెలియకపోయి అనుకుంటున్నారు. సరే ఇప్పుడు మనము శక్తి అనేదానికి వస్తే పని చేస్తూవున్నాడు కాబట్టి శక్తి ఉపయోగపడుతువుంది. ఆ శక్తి ఎవరిది అంటే. ఆత్మది అని చెప్పుకున్నాము. తరువాత ఆత్మ శక్తి ఏమి చేస్తుంది అంటే స్థూలంగా కనిపిస్తావుంది మనకు. ఒక బరువు మోస్తున్నాడు, స్థూలంగా బరువు మోస్తువున్నాడు అనేది తెలియబడుతుంది. ఈ రకంగా ఆత్మ శక్తి స్థూలంగానే కనిపిస్తూ ఉంటుంది.



అది పనులు చేస్తూ ఉంటుంది. అహరిశ్నలు నీలో పని చేస్తూ ఉంది. బయట పనే కాకుండా లోపల పని చేసేదెవరు నీ తండ్రి నీ ఆత్మ. ఆత్మను తండ్రి అనాలి. ఆత్మను దేవుడు అనాలి. ఎవరిని ఆరాధించాలి. నీ తండ్రియైన ఆత్మనే ఆరాధించాలి? ఇంకొకరిని ఆరాధించేదానికి లేదు. అట్లే ముస్లీమ్కగానీ, క్రైస్తవుడుగానీ, హిందువుగానీ ఎవరిని ఆరాధించాలి? ఈయననే మీ 'అల్లాహ్' ఈయనే మీరు ఆరాధించండి. అది ఖురాన్లో చెప్పబడింది. అల్లాహ్ ఈ విధంగా సెలవు? ఇస్తున్నాడు. ఎవరు ముసలి ఆయన చెప్పుతున్నాడు.


ఒరే సంపాదించిపెట్టేవాడే వానికి నీవు మర్యాద ఇవ్వాలి, నాకు వద్దు. అతనికి మర్యాద ఇవ్వు. నాకేమి మర్యాద ఇవ్వవలసిన పనిలేదు. నేను ఒక మూలన కూర్చొన్న వానిని, నాతో నీకేమి పనిలేదు అని చెప్పాడు. ఏ అక్కర లేనివాడు. ఎవడు, ముసలివాడు. 112 సూరాలో “ఏ అక్కర లేనివాడు” అని చెప్పబడింది. ఏ అక్కర లేని వాడు ఎవరు ఆ ముసలివాడు. కాబట్టి ముసలివానితో సంబంధం లేదు. ఆ ముసలివానిని ఏమనాలి మనము. “పెద్దాయన”. ఆయన కూడా, ఈయన కూడా మనకు పెద్దాయనే, తండ్రి కూడా, ఆయనను అబ్బ అంటారు. ఈయనను నాయన అంటారు. అబ్బా అన్నా, నాయనా అన్నా రెండు ఒకటే అర్థమే. అబ్బ అంటే ఏమని తండ్రి అనే కదా! అర్థము. నాయన అన్నా తండ్రి అనే అర్థము. తండ్రి అన్నా తండ్రే, అబ్బా అన్నా తండ్రే ఈ రెండు ఒకటే అర్థమే. సరే ఈ పనిచేసి పెట్టి శక్తిని ఉపయోగించి నీకు పోషణగా ఇచ్చేటువంటి నీ శరీరాన్ని కదిలించి మెదిలించి పనిచేసి నిన్ను బ్రతికిస్తున్నాడు కదా! ఎవరు? నీ లోపల ఉండేటువంటి తండ్రి, నీ ఆత్మ. ఆయనను నువ్వు ఆరాధించవలసిందే, ఆయనను నీవు గౌరవించవలసిందే. ఆయనను నీవు గౌరవిస్తే నన్ను



గౌరవించినట్లే అని ఆయన చెప్పుతున్నాడు. పెద్దాయన. ఎవరు, ముసలి ఆయన ఏమి చెప్పుతున్నాడు. యోహాన్ సువార్తలో 5వ అధ్యాయంలో ఈ విషయం క్షుణ్ణంగా 23, 24, 25, 26, 27 వాక్యాలలో చెప్పాడు. ఈయననే మీరు ఆరాధించండి. అన్ని అధికారాలు ఈయనకు నేను ఇచ్చాను. దీంట్లో మనకు ఖురాన్ 16వ సూరా 51వ వచనంలో “ఈయనే మీ అల్లాహ్. ఈయనను మీరు ఆరాధించండి. నాకు భయపడండి" అని చెప్పినాడు. ఇపుడు చెప్పేవాడు ఎవడు ఒక పెద్దాయన, ఎవరిని చూపిస్తున్నాడు మీ తండ్రిని చూపిస్తున్నాడు. ఈయనను పెంచేది ఈయనే. ఈయనను నీవు గౌరవించు, నన్నేమి గౌరవించవలసిన పని లేదు. నాకు భయపడు నేను పెద్దోని ఉన్నాను కదా! ఇంట్లో నాకు భయపడు అని చెప్పాడు. నాకు భయపడండి, ఆయనను ఆరాధించండి ఎక్కడ ఖురాన్లో, బైబిల్లో కూడా యోహాన్ సువార్త 5వ అధ్యాయంలో 23వ వచనం నుంచి ఇదే విషయం చెప్పినాడు. అక్కడ 6, 7 వచనాలు ఉన్నాయి, వరుసగా లెక్కవేస్తే.


ఈ విధంగా లెక్కేసుకుంటుపోతే, మన శరీరంలో ఉండేటువంటి తండ్రినే గౌరవించాలి. ఎందుకంటే ఆయన మన పోషణ నిమిత్తము పని చేస్తున్నాడు. బయటి పనులే కాకుండా, లోపల నీవు నిద్రించే సమయంలో కూడా శ్వాస ఆడించేది ఆయనే. తన బలాన్ని ఉపయోగించి శ్వాస ఆడిస్తున్నాడు. తన బలాన్ని ఉపయోగించి నీవు తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాడు. తన బలాన్ని ఉపయోగించి రక్తాన్ని వడగట్టి దాంట్లోని మూత్రాన్ని విసర్జింపజేయుచున్నాడు. ఈ విధంగా అనేకమైన శరీర పనులు శరీరంలో చేస్తూవున్నాడు. ఒక్క పని చేయకపోతే, ఒంటరిగా నిలిచి పోతాది నీ శరీరం. ఈ విధంగా అహరిశ్నలు, ఎల్లప్పుడూ కునుకులేకుండా, అలసట లేకుండా పని చేస్తున్నాడని ఖురాన్ 2వ సూరా 255 ఆయత్లో ఈ విషయం



చెప్పబడి ఉంది. “ఈయనకు కునుకు రాదు, నిద్రలేదు, ఎప్పటికీ అలసిపోడు అహరిశ్నలు పని చేస్తున్నాడు" ఎవరు? నీ శరీరంలో ఉండే నీ తండ్రి, ఎంత బాగా చెప్పినాడు చూడు. ఇది నువ్వు లోపల ఉండే వాడు నీ తండ్రిని అర్థం చేసుకుంటే ఆత్మ విషయం అంతా నీకు తెలిసిపోతుంది. ఆధ్యాత్మిక జ్ఞానమంతా సంపూర్ణంగా తెలిసిపోతుంది. అట్ల కాకుండా సర్వమానవులకు చెప్పినటువంటి జ్ఞానం కాకుండా, నాది వేరు మతం, నాది వేరు మతమని అనుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. మనుషులందరూ ఒకటే మనుషు లందరికి ఒకటే జ్ఞానం ఇచ్చాడు దేవుడు. అక్కడ ఏమంటున్నాము 'అల్లాహ్’ అంటున్నాము, ఇక్కడ ఏమంటున్నాము తండ్రి అంటున్నాము. ఇక్కడ దీంట్లో అబ్బా అంటున్నాము. అక్కడ అల్లానే అల్లా అంటున్నారు. అక్కడ ఇద్దరు అల్లాలు, పెద్ద అల్లా, చిన్న అల్లా అని ఇద్దరు వస్తారు. కాని నీవు ఆరాధించ వలసింది మాత్రము ఒకే ఏకైక అల్లా ఆయనే, నీ పని చేసి పెట్టేటువంటి అల్లా. ఆయన ఒక్కరినే నీవు ఆరాధించాలి. ఇద్దరు దేవుళ్ళను పెట్టుకోకూడదు నీవు ఎప్పటికీ, ఒక్కరినే దేవున్ని పెట్టుకోవాలి ఆయనే మీకు అల్లా, 16వ సురా 51వ ఆయత్ “ఆయననే ఆరాధించండి, నాకు భయపడండి" అని ఈయన చెప్పాడు.


ఈ విధంగా మనము లెక్కేసుకుంటే మన శరీరంలో ముగ్గురు పురుషులు ఉన్నారు. ఆ ముగ్గురు పురుషులను లెక్కేసుకుంటే నీవు చివరి వానివి మూడవ వానివి అంటే కొడుకు నీవు చిన్నవయస్సులో ఉన్నావు. నీకు పనిచేసే చేతకాదు. నీ కాళ్ళు చేతులు అల్లాడవు సరిగా. ఇంకా చిన్న వయస్సులో పనిచేసే వయస్సు రాలేదు, బలం లేదు. నీవు చిన్నవయస్సులో ఉన్నావు. నీకు పని చేసి పెట్టేవాడు ఎవరు నీ తండ్రి, ఆత్మ, నీతండ్రియైన ఆత్మ. నీవు తండ్రి అంటావు, ఆయన అల్లాహ్ అంటాడు, ఈయన ఆత్మ



అంటాడు. హిందువు ఏమో ఆత్మ అంటాడు. క్రైస్తవుడు ఏమో తండ్రి అంటాడు. ముస్లీమ్ ఏమో అల్లాహ్ అంటాడు. ఈ విధంగా ఈ ముగ్గురిని పెంచేవాడు ఎవరు అంటే, నీలో ఉండేటువంటి తండ్రి ఎవడైతే ఉన్నాడో వాడే సాకుతున్నాడు. నీ శరీరంలో ఇదే జరుగుతా ఉంది. అందరి శరీరంలో ఇదే జరుగుతావుంది. ఒకరి శరీరం గురించి చెప్పేది కాదు. అందరి శరీరంలో ఇదే జరుగుతా ఉంది. దేవుడు చెప్పినటువంటి రూలు ఇది. ఇప్పుడు ఈ శరీరంలో ఒక బరువు ఎత్తినా కానీ, బరువును మోసినా కానీ, శ్వాసను ఆడించినా కానీ శక్తి ఉపయోగపడుతావుంది. దానిని సత్తు అంటున్నాము. సత్తునే బలము అంటున్నాము. శక్తి అంటున్నాము. అంటే శక్తి అంటే కనిపించనటువంటిది. అంటే ఇది కనిపించకుండా పని చేస్తావుంది. ఒకడు బరువు ఎత్తుతా ఉన్నాడు, ఆ శక్తి ఎట్ల ఉపయోగ పడుతున్నది మనకు తెలియదు లోపలి నుంచి, ఒక బరువు ఎత్తుతున్నాడు అనుకోండి, అది ఎట్లా ఉపయోగపడుతుందని అనేది తెలియదుకాని ఎత్తేది కనిపిస్తుంది. అదే రకంగా మనకు కనిపించనటువంటి శక్తి కూడా ఒకటుంది అని చెప్పాను. అంటే ఈయన ముసలి ఆయన మన ఇంట్లో ఉన్నాడు. కదా! పెద్ద ఆయన, ఆయన ఏమి చెప్పుతుంటాడంటే ఒరే ఆ పని ఇట్లచేయి, ఈ పని ఇట్ల చేయి, ఈ మంత్రాన్ని చదువు, ఆ మంత్రాన్ని చదువు అది జరుగుతుందిపో అంటాడు.


ఈయన అంటే ఎవరు? పెద్దాయన, ఈయన స్వంతగా పని చేసే ఆయన. ఆయన ఏమి చెప్పుతాడంటే నీవు ఇట్ల అనుకుంటే జరుగుతుందిపో! అంటాడు ఆయన. ఆయన అనుకుంటే జరుగుతుంది అంటాడు. ఆయన, ఈయన ఏమి చేస్తాడు అంటే అట్ల కాకుండా ఈయన స్వయంగా పని చేస్తున్నాడు ఎవరు, నీ తండ్రి. తాత ఏమి చెప్పుతున్నాడు, నేను చెప్పినట్లు



చేయిరా. నేను చెప్పినట్లు అనుకో జరుగుతుంది అంటాడు. అర్థమయిందా! అంటే ఆయన చెప్పితే అది జరుగుతుంది. ఆయన అనుకుంటే చాలు అన్ని జరుగుతాయి, ఎవరు ముసలి ఆయన అనుకుంటే, ఆయనకు ఆ శక్తి ఉంది. ఈయనకు అట్ల కాదు. ఈయన స్వయంగా చేసే శక్తి, ఆయన కనిపించకుండా చేసే శక్తి ఆయనది. అలాగే రెండు శక్తులు ఉన్నాయనేది బాగా గ్రహించుకోండి. బలాలు రెండు రకాలు ఉన్నాయి. ఈ రెండు రకాల బలాలు ఎట్లు ఉన్నాయి. మీకు కనిపిస్తా ఉంది కదా! అందరికి తెలుసు రెండోది ఎట్లు ఉంది అని మనకు ప్రశ్న వస్తుంది. అది ఎట్లవున్నా నీవు విశ్వాసము పెట్టుకో, ఆ శక్తి నీకు ఉపయోగపడుతుందని చెప్పుతున్నారు పెద్దలు, జ్ఞానంలో, ఆ శక్తి ఎట్ల ఉపయోగపడుతాది. ఆయన చెప్పుతున్నాడు మామూలుగా అంతిమ దైవగ్రంథము ఖురాన్లో ఏమి చెప్పుతున్నారంటే, ఆయన అనుకుంటే చాలు, అల్లాహ్ అనుకుంటే చాలు అది అయిపోతుంది. అయిపో అంటే అయిపోతుంది. చూడు ఎట్లు ఉందో. ఎవరు అనుకుంటే అయి పోతుంది. ఈయన తండ్రి చేస్తే అయిపోతుంది.


తాత అనుకుంటే చాలు అయిపోతుంది. ఎవరు అనుకుంటే తాత అనుకుంటే విభజించి చెప్పుతున్నాను. అర్థం చేసుకోండి, తండ్రి తప్పనిసరిగా చేసే తీరాల్సిందే. తండ్రి శక్తి ఉంది. ఆయన శక్తి అంతా కనిపించే శక్తి. కనిపించేదే అనుకున్నాములే. ఆయన స్వయంగా చేస్తున్నాడు. ఈయన ఏమి చేస్తాడు అంటే, ఈయన చేయడు ఊరికే కూర్చుంటాడు. మాట చెప్పితే జరిగిపోతుంది. ఈయనది ఎవరిది, తాతది. ఆ అల్లాహ్ ఒకడు ఉన్నాడు. ఈ అల్లాహ్ ఏమి చేస్తాడు అంటే అహరిశ్నలు చేస్తున్నాడు, అలసట లేకుండా చేస్తున్నాడు. ఈయనకు కునుకు లేదు, నిద్ర లేదు, అలసట లేదు అని చెప్పుతున్నాడు ఈయన. ఈ అల్లాహ్. ఈయన కార్యకర్త,



నీ తండ్రి ఆయన ఎవరు. ఆయన పని చేయడు, చెప్పింది మీకు చెప్పినాడా లేదా మీ గ్రంథములో చెప్పినాడా లేదా ! చెప్పినాడు ఆయన పని చేయడు. 'అయిపో' అంటే అయిపోతుంది. అయితే అక్కడ కూడా ఏదో శక్తి ఉపయోగపడుతుంది కదా! ఒక పని జరగాలి అంటే ఒక శక్తి ఉపయోగ పడాల్సిందే, ఆ శక్తి కనపరాని శక్తి ఉపయోగపడుతావుంది. అంటే శక్తులు రెండు రకాలు, బలాలు రెండు రకాలు ఒకటి కనిపించే బలం, రెండు కనిపించని బలము. నీకు ఒక రోగం వస్తుంది. నీవు ఏమి చేస్తావంటే పద్ధతి ప్రకారము నీవు హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి తీసుకుపోతావు, డాక్టర్ దగ్గరికి తీసుకపోతే డాక్టర్ ఏమి చేస్తాడంటే ఆ డాక్టర్ దానికి తగిన మందులు ఇస్తాడు. అంటే ఆ క్రిములు చనిపోయేటువంటి మందులు ఇస్తే అది లోపలికి పోతే, ఆ మందు క్రిములను చంపేస్తుంది. అది బలం చంపివేసే బలం ఆ మందుకు ఉంది. అపుడు ఆ రకంగా చంపేస్తుంది. అంటే ఆత్మ ఇచ్చిన బలమే ఇది. అది చంపేస్తుంది ఆ రోగము అణిగిపోతుంది. అర్థమయిందా!


ఇది మామూలుగా తండ్రి వలన జరిగే పని. ఇప్పుడు అట్లకాదు, మనము తాత దగ్గరికి తీసుకోనిపోయి పెట్టినాము అనుకోండి, తండ్రికి సంబంధం లేకుండా తాతను అడుగుతూవుండు, ఏమైనా చేయి నీ ఇష్టం అని అంటున్నాము. అప్పుడు ఏమి చేస్తాడంటే, నీవు ఎవరినైనా అడుగు, తాత ఏమి చేస్తాడంటే, ఏ మందు వాడకోకుండా అది 'పో' అని అనుకుంటాడు, ఆయన తలుచుకుంటాడు, ఆయన అనుకుంటే చాలు అది అయిపోతుంది, ఆ రోగం పోతుంది. పోతుందా లేదా! పోతుంది. ఇప్పుడు ఏ మందు వాడినారు. ఎందుకు వాడలేదు. ఏ శక్తి ఉపయోగపడింది. ఏ శక్తి ఉపయోగపడలేదు. అయితే ఇప్పుడు కనిపించనటువంటి శక్తి ఏదో ఉపయోగపడింది కదా! ఆ కనిపించని శక్తే కదా మనకు ఇప్పుడు అక్కడ



పని చేసినేది. ఈ రకంగా లెక్కేసుకుంటే, శక్తులు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి కనిపించే శక్తి, ఒకటి కనిపించనటువంటి శక్తి అని మనము లెక్కేసుకుంటున్నాము. మీరు బాగా ఆలోచన చేసుకోండి, కనిపించే శక్తి ఉంది భూమి మీద, కనిపించని శక్తి ఉంది భూమి మీద. శక్తి అనేది శక్తి బలం, అది బలం ఉపయోగపడతానే పని జరిగేదది. లేకపోతే ఊరికినే కాదు. కనిపించే బలం, ఉపయోగపడేబలం కనిపిస్తావుంది. కాని కనిపించ కోకుండా, ఉపయోగపడకుండా ఒకటి ఉంది. ఇప్పుడు మనకు లెక్కేసు కుంటాము. ఏమని ఖురాన్లోకి పోతే, ఖురాన్లో ఏమి చెప్పుతున్నాడు. “దేవుడు నీ పాపము క్షమించబడుతావుంది. దేవుడు క్షమాశీలుడు” అని ఉంది. దేవుడు క్షమాశీలుడు, కరుణామయుడు. అల్లా క్షమాశీలుడు, కరుణా మయుడు, వాస్తవమే ఇప్పుడు ఏ అల్లాహ్ ! ఇప్పుడు మనకు ప్రశ్న రావలసింది నిజమైన ముస్లీమ్కు వాడు తెలుసుకోవాల్సిన విధానం. అల్లాహ్ అల్లాహ్ అంటున్నాడు ఏ అల్లాహ్, తండ్రి అల్లానా, తాత అల్లానా. తాత అల్లా ఏమనుకున్నా అది జరుగుతుంది. అనుకుంటే చాలు జరుగుతుంది, తండ్రిది అట్లాకాదు అన్నమాట. అది ప్రాక్టికల్గా చేయాలి. ప్రాక్టికల్గా చేయాలి అంటే దానిని ఏ రకంగా చేయాలో ఆ రకంగానే చేయాలి.


ఇప్పుడు నడుము నొప్పి వచ్చింది. వత్తాలి, బలంగా వత్తి, ఆయిల్ వేసి తిక్కితే నడుము నొప్పిపోతుంది. ఇది బలము ఉపయోగించి చేసే పని ఇది. అది తండ్రి చేయాలి. తండ్రి చేయడం వలనే ఆ బలం ఉపయోగపడు తుంది. వాస్తవమా లేదా ఒక్క నొప్పి వచ్చినపుడు దానిని మర్దన చేస్తే అదిపోతా వుంది. లేదా మందువేస్తే అది పోతావుంది. అప్పుడు కనిపించే బలం ఉపయోగపడింది అక్కడ కానీ దేవున్ని నమ్ముకొని, మనుసులో దేవున్ని అనుకొని ఏమన్నా చేయి నీ ఇష్టం అని కూర్చున్నప్పుడు కూడా ఆ నొప్పి



పోయేటువంటి సందర్భాలు ఉన్నాయి. నీవు నిజంగా పూర్తి దేవుని మీద విశ్వాసం పెట్టుకొని కూర్చుంటే, ఆ బాధ నీకు తొలిగిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ బాధలు ఎవరు తొలగించినారు అని అంటే, మీ ఇంట్లో ఒక ముసలివాడు ఊరికే కూర్చోన్నాడే, ఏ పని పాట లేకుండా ఆ ముసలివాడు ఆ పని చేశాడు. ఏమని ! కనపరాకుండా చేసినాడు వద్దురా! ఈ పిల్లవాడు ఊరికే ఇబ్బంది పడుతున్నాడు, ఈ బాధ వద్దులే అనుకుంటే అయిపోయింది అన్నమాట. ఆయన అనుకుంటే చాలు, పోతాది అనుకుండే వాడు ఒకడు, చేసేవాడు ఒకడు. ఈయన చేసి తీరాల్సిందే, ఆయన ఏమీ చేయడు. ఏ కార్యము చేయడు. ఏ అవసరం లేనట్టివాడు. అయితే ఆయన ఎటువంటివాడు అంటే ఆయనకు శక్తి వుంది. ఆయన శక్తి అంతా లోపల దాగివుంది. అది బయటకు కనిపించదు. ఇప్పుడు మనము నీ శరీరాన్ని ఒక ఇల్లుగా పోల్చి దాంట్లో ముగ్గురు మొగవాళ్ళు, ఒక స్త్రీ ఉంది అని చెప్పినాము. బాగా అర్థమయిందా! బాగా అర్థము చేసుకోండి.


నీ శరీరాన్ని ఒక ఇంటిగా పోల్చినాము. ఒక ఇంటిగా పోల్చి దానికి ఎన్ని వాకిళ్ళు పెట్టినాము. ఎన్ని తలుపులు పెట్టినాము. ఒక మెయిన్ డోర్ ఒకటి పెట్టి, 7 కిటికీలు పెట్టినాము. మెయిన్ డోర్ ఒకటి పెట్టినాము, వెనుకల ఇంకొకటి దొడ్డివాకిలు కూడా పెట్టినాము, దొడ్డికి పోయేది. దొడ్డి వాకిలి ఒకటి పెట్టినాము, మెయిన్ డోర్ ఒకటి పెట్టినాము, రెండు డోర్లు పెట్టి, ఇంక 7 కిటికీలు పెట్టినాము. మొత్తము 9 ఉన్నాయి. 7 కిటికీలు పెట్టినాము, 2 డోర్లు పెట్టినాము. ముందు వాకిలి ఒకటి వెనుక వాకిలి ఒకటి మొత్తము ఎన్ని డోర్లు అయినాయి, ఇప్పటికి 9 డోర్లు అయినాయి. 9 డోర్లు ఉండే ఇల్లు ఉంది నీకు. ఈ 9 డోర్లు ఉండే ఇంట్లో 7 కిటికీలు, 2 డోర్లు వున్నాయి. అన్నీ లెక్కేసుకొంటే ఎన్ని ఉన్నాయి మీ ఇంటికి. ఎన్ని



కిటికీలు వున్నాయి. 7 ఉన్నాయి. డోర్లు ఎన్ని ఉన్నాయి. 2 ఉన్నాయి. మెయిన్ డోర్ ఒకటి ముందర ఉంది అది. ఇంకొక డోర్ అది వెనుకల

ఉంది. ఎప్పుడో ఒకసారి తెరుస్తాం దానిని దీనిని ఎప్పుడు తెరుస్తూనే ఉంటాము. అవసరాన్నిబట్టి దానిని తెరుచుకుంటుంటాము. దీనిని ఎప్పుడు తెరుస్తానే ఉంటాము ఈ డోరు. ఏమి స్వామి నీకు ఎన్ని డోర్లు ఉన్నాయి. నీకు అన్నే ఉన్నాయి. అందరికి ఎన్ని ఉంటే అన్ని. అన్ని దాండ్లకి ఒకటే రకమే. అందరి ఇల్లు ఒకటే రకమే. నీ ఇళ్ళేమి ప్రత్యేకంగా లేదు. అన్ని ఇండ్లు ఒకటే రకమే. అందరికి కిటికీలు అవే ఉన్నాయి. అందరికి డోర్లు అవే ఉన్నాయి. ఒక డోర్ అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాము. ఒక డోర్ మాత్రం ఎప్పుడు తెరుస్తానే ఉంటాము. అది మామూలుగ అర్థమయిందా!


ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. మీ ఇంట్లో నలుగురు. మగ వాళ్లు ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. ఎవరు వచ్చి అడిగినా అదే చెప్పాలి, ముగ్గురే అని చెప్పాలి. మళ్ళీ ఒకటి తక్కువ, ఎక్కువ చెప్పితే బాగుండదు. అర్థమయిందా! పని చేసే వాడు మీ ఇంట్లో. మీ తండ్రి, మీ ఆత్మ ఒక్కడే. ఆయన పని చేసి పెడుతున్నాడు. తినేవాడు ఎవడు కొడుకు, ఎవడు కొడుకు, నువ్వే, నేను నేను అనుకుంటున్నావే ప్రొద్దున లేచినప్పటి నుండి, మొట్ట మొదటి నుండి, పుట్టినప్పటి నుండి నేను నేను అని. నీవు ఏది చేయలేదు. మీ నాయన చేసిపెడతా ఉంటే నీవు తింటున్నావు. ఊరికే అన్ని నేను అనుకుంటున్నావు. ఊరికే కూర్చోని అర్థమయిందా! మీరు ఇద్దరూ కాక ఇంకెవరు ఉన్నారు! మీ తాత, మీ తాత ఒకడు ఉన్నాడు కదా! మీ ఇద్దరు కాక ఒక ముసలివాడు ఉన్నాడు కదా! ఒక పెద్దాయన నీకంటే మీ నాయనకంటే అందరికంటే పెద్దాయన ఒక ఆయన ఉన్నాడు కదా! ఆయన



ఏమి చేస్తా ఉంటాడు. ఏమీ చేయడు. ఊరికినే చూస్తా ఉంటాడు. గొంతు కూర్చొని. వీళ్ళు ఏ పని చేస్తున్నారని అర్థమయిందా! ఇప్పుడు కొడుకు ఎంతో బాధపడుతుంటే తండ్రి ఆడ చూపిచ్చి, ఈడ చూపిచ్చి, ఏదో ఒకటి బాగా చేయాలని చూసినాడు కానీ కాలేదు. కర్మరీత్యా వాడు అనుభవిస్తున్నాడు. తండ్రి కొడుకు ఇద్దరు బాధపడుతున్నారు. ఈ ముసలి వాడు ఏమి చేస్తాడు అంటే చూచినంతసేపు చూసి ఇంక వద్దులే బాధ అని, ఎందుకులే ఆ రోగము బాధ లేకుండా పోవాలని అనుకుంటాడు. మనసులో. అనుకుంటే చాలు వీనికి బాధ పోతుంది. అర్థమయిందా!


ఆ విధంగా కూడా జరిగే సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పుతాను, జరిగిన సంఘటన తీసుకుందాము. ఒక ఆమె అంటే ఇలాంటివి, చిన్నవి వేలు జరిగినాయి, కానీ ప్రస్తుతం దగ్గరగా మీకు చెప్పాలంటే, ఈ మధ్యకాలంలో ఇప్పుడు సభలో వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒక ఆమె వచ్చింది నాకు నడుమునొప్పి అని, సరే వాళ్ళు ఏమి చేసినారంటే హాస్పిటల్కి పోతే డిస్క్లు జరిగినాయి. సుమారుగా జరిగినాయి. చాలా ఇబ్బందిగా వుంటుంది అని చెప్పినారు. ఆ ఇబ్బంది అనుభవిస్తారు పండుకో లేకుండ, కూర్చో లేకుండ అనుభవిస్తారు బాధంతా. మరి ఏమి చేయాలంటే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేసినా మాకు నమ్మకం లేదు పూర్తి సక్రమంగా వస్తాడని, మరలా జరుగవచ్చు కానీ ఆపరేషన్కు ఇంత ఖర్చు అయితాది, పెద్ద ఆపరేషన్ ఇది మూడు లక్షల దాక ఖర్చు అవుతాది. అయినాగానీ నమ్మకం లేదు మేము చేసేది మాత్రము చేస్తాము. పూర్తి నమ్మకం చెప్పలేదు. చేస్తామని చెప్పినారు కానీ అది జరుగుతాదని నమ్మకం లేదు అని చెప్పినారు. సరే వాళ్ళు ఏమి చేసినారంటే, తండ్రి ప్రయత్నం చేసినా కూడా ఇది జరిగేటట్లు లేదు. ఇప్పుడు మామూలుగా



నూనె వేసి తిక్కినా బాగయ్యే విధంగా లేదు. మందులతో అయినాగానీ బాగయ్యేటట్లు లేదు. అర్థమయిందా! ఇప్పుడు ఏమి చేయాలి అంటే దేవున్ని నమ్ముకోవాలి. ఏ దేవున్ని నమ్ముకోవాలి నీవు, వాళ్ళ తాతను నమ్ముకోవాలి. మీ తండ్రి వలన ఏమి కాదు అది. ఇప్పుడు కాదు అని చెప్పినేదే కదా! ఇప్పుడు వాళ్ళు ఏమి చేసినారంటే నేరుగా ఇక్కడికి వచ్చినారు. మన ఆశ్రమానికి వచ్చి, మన ఆశ్రమములో ఇట్ల చెప్పినారు, నడమునొప్పి ఉంది. ఇబ్బంది పడుతున్నాము, డాక్టర్ ఇట్ల చెప్పినాడు అట్ల చెప్పినాడు, మీ సలహా అడగాలని వచ్చినాము. మీరు ఏమి చెప్పితే అది చేస్తాము అంటే నేను చెప్పేదానికి కర్తను నేను కాదు కదా!


నా ఇంట్లో ముగ్గరు ఉన్నారు. నా ఇంట్లో నాది గోక్కోవడం గీక్కోవడం నాకు సరిపోయింది, మీకు ఎక్కడ చెప్పుదును నేను. మీరు ఏమి చేస్తారంటే, మీ ఇంట్లో ఒక ముసలివాడు ఉన్నాడు, ఆ ముసలివాన్ని నమ్ముకొని కూర్చోండి ఎట్లైనా అయితాది అని చెప్పాము. మీరు ఏమి చేయాల్సిన పనిలేదు. మీరు నమ్మకం పెట్టుకోండి, ఎవరి మీద, మీ శరీరంలో ఉండేటువంటి మీ తండ్రికి తండ్రి అయినంటివాని మీద మీరు నమ్మకం పెట్టుకోండి. పరిశుద్ధాత్మ అని ఎవడిని అయితే చెప్పుతున్నామో, వాని మీద నమ్మకం పెట్టుకోండి. అల్లాకు అల్లాగా ఎవడైతే ఉన్నాడో వాని మీద నమ్మకం పెట్టుకోండి. ఆత్మకు పురుషోత్తముడుగా ఎవరు ఉన్నారో, మీ నాన్న ఉత్తముడు అయితే మీ తాత ఇంకా పురుషోత్తముడు అర్థమయిందా! ఆ పురుషోత్తముని మీద నమ్మకం పెట్టుకోండి అని చెప్పినాము. వాళ్ళకు అది అయితే కొన్ని రోజులు ఉండమని చెప్పాము. వాళ్ళకు తొందరగా వాళ్ళకి బాగుకావడం జరిగింది. అది మామూలుగా బాగు అయ్యేది కాదు. అందరికి తెలుసు, మాకు కూడా తెలుసు, అది బయట డాక్టర్కి కూడా



తెలుసు, వాళ్ళకు అర్థమయ్యింది. తట్టుకోలేని పరిస్థితిలో ఇప్పుడు మనము ఏమి చెప్పినాము అంటే ఒక చిన్న ఉపాయం చెప్పినాము. ఒక పని పాట లేక ఒక ముసలివాడు కూర్చుంటాడు. మనము పొద్దు మూకులు నాయన దిక్కు చూసుకుంటే ఎట్లా, తాత ఉన్నాడు కదా, ఆయన దిక్కు చూసి ఒకవేళ వేడుకోండి ఎట్లైనా అయితాది. ఆ ముసలి వాడు ఎలాంటివాడు, ఊరకనే గప్ప్ కూర్చొని ఉంటాడు. మనసులో అనుకుంటే చాలు బాగయితాయి అని చెప్పినాము.

సరే వాళ్ళు ఏమి చేశారంటే ఏమన్నాగానీ, ఇక్కడికి వచ్చినాము. మీరు చెప్పినట్లు వింటాము అంటే సరే ఇక్కడే ఉండండి అని చెప్పినాము, ఇక్కడనే ఉన్నారు. వాళ్ళకి ఏం జరిగిందంటే 2 రోజులకి, 3 రోజులకి పూర్తిగా బాగైపోయినది, మేము 40 రోజులు ఉండమని చెప్పాము. అది 3 రోజులకే బాగయిపోయింది. చూడు ఎట్లుందో. మరళ మధ్యలో ఇంక పోండి అని చెప్పినాము వాళ్ళనే పిలిచి, తర్వాత డాక్టర్ దగ్గరికి పోయి చూపించండి అని చెప్పినాము. మరళా వాళ్ళు డాక్టర్ దగ్గరకు పోయి చూపించినారు. నీవు తట్టుకోలేక చాలా బాధ పడుతుంటివే, ఈ డిస్క్ ఇట్లుందవి అట్లుంది అని చెప్పినాడు ఆయన. అంటే నాకు ఏమి బాధలేదు అని వీళ్ళు అన్నారు. అది ఎట్లయితాది బాధ లేకుండా అని ఆ డాక్టర్లు చెప్పడం జరిగింది. మళ్ళీ మరొక చోటుకి పోయి చూపిస్తే మొదట ఉన్నట్లు లేదు. సక్రమంగా సక్కగా వచ్చేసింది ఫర్వాలేదు అని చెప్పినారు. అయితే అది ఎట్ల వచ్చింది. చక్కగా అది ఎవరి వల్ల వచ్చింది. చెప్పండి తాత వలన వచ్చింది. మీ తండ్రి వల్ల కాదు. మీ తాత ఉన్నాడా లేదా ఆయన అనుకొంటే వచ్చింది. బాగా విడదీసి చెప్పుతున్నా చూడండి. మీరు పొరపాటుపడకుండా ఇప్పుడు ఇలా చాలామంది ఇలాంటివారు ఉన్నారు.



అదే నడుము నొప్పి ఉండే వాళ్ళకి మేము ఏమి చెప్పినామంటే ఇది మందులతో పోదు. ఆపరేషన్ చేసినా అయ్యేపనికాదు. మీరు దేవున్ని నమ్ముకోండి. చిన్న పైపు తీసుకోండి. 2 ఇంచుల పైపు బజారులో కొనుకొచ్చుకుంటే ఒక మూరెడు అది 20/- రూపాయలు కూడ ఖర్చు కాదు, అది ఎక్కడ నొప్పి ఉందో అక్కడ వీపు మీద పెట్టుకొని పండుకోండి అని చెప్పాము. పండుకొంటే ఆటోమెటిక్ బాగయితావుంది. అయితే ఇదంతా అంటే ఊరకనే చూసేదానికి పైకి ఆయన మీద మీకు ఇది కాకుండా ఏదో పని చెప్పుతున్నాము అది జరుగుతా ఉంది. దీనివల్లే కాదు కానీ ఆయన అనుకుంటే జరుగుతావుంది. ఇప్పుడేమి చెప్పుతున్నానంటే ఇంకొకటి

మీరు గమనించండి.



ఇక్కడ 94 గ్రంథాలు వ్రాయబడినాయి. 94వ గ్రంథము ప్రింట్ కాబోతున్నది. ఇప్పుడు 94వ గ్రంథము రేపు మీ చేతికి వస్తుంది. 93 గ్రంథాలు అయిపోయినాయి. ఈ 94 గ్రంథాలలోనూ తండ్రి, తాత, మనవడు ముగ్గురువున్నారు. తరువాత తల్లి కూడా ఉంది. నేను ఇంతకు ముందే చెప్పాను, నాకు నల్గురు కొడుకులు ఉన్నారు. స్థూలంగా ఉండే వాళ్ళు భౌతికమైన సంబంధ కొడుకులు నలుగురు ఉన్నారు. అభౌతికమైన కొడుకులు ఎంతమంది ఉన్నారు. 94 మంది ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది 94 మంది. ధృతరాష్ట్రునికి ఉన్నట్లు ఇంక 100 మంది అయితారు, కొన్ని రోజులు పోతే. ఇప్పుడు 94వ ఆయన బయటికి వస్తాడు. ఆయన ఇప్పుడు శిశువుగా ఉన్నాడు. ఈ 94 గ్రంథాలలో ఏ గ్రంథము తీసుకొన్నాగానీ అది ఇల్లులాంటిది అని చెప్పుతున్నాము. మీ శరీరాలు ఎటువంటివో నేను కొడుకు అని చెప్పినాను కదా! అవి నా కొడుకులు అని చెప్పినాను కదా, కొడుకు అన్నాక వాళ్ళకు కూడా ఒక శరీరం ఉంటుంది కదా! చూసే



దానికి ఒక శరీరం మీ శరీరాలు ఉన్నాయి. నల్లవో, తెల్లవో ఏదో విధంగా మీరు వాళ్ళు నున్నగా ఉండేవాళ్ళు ఉన్నారు. నీటుగా ఉండే వాళ్ళు ఉన్నారు. మంచి డ్రస్సు వేసుకొనే వాళ్ళు ఉన్నారు. గడ్డాలు పెంచుకొనే వాళ్ళు ఉన్నారు. మీసాలు పెంచుకొనేవాళ్ళు ఉన్నారు. ఎట్లన్న ఉన్న మీ శరీరాలు అవి.


ఆ శరీరాలలో ముగ్గురు ఉన్నారు. పురుషులు ముగ్గురు మగవారు, ఒక స్త్రీ ఉంది. ఆ విధంగానే నాకు మానసిక పుత్రులు ఉన్నారు 94 మంది. వాళ్ళను పుత్రులు అంటారు. వాళ్ళు కూడా మనుషులే కదా! ఆ పుస్తకాలు శరీరాలు అవి. మీ శరీరాలకు కాళ్ళు, చేతులు ఎట్లుండాయో అలాగే ఆ గ్రంథాలే శరీరాలు. ఆ శరీరాలలో ఎంతమంది నివాసమున్నారు. నలుగురు నివాసం ఉన్నారు. ఎట్లయితే మీ శరీరాలలో ఉన్నారో అట్లే ఆ గ్రంథాలలో కూడా నివాసం ఉన్నారు. ఆ నలుగురు ఒకరు జీవాత్మ, ఒకరు పరమాత్మ, ఒకరు ఆత్మ, ఒకరు ప్రకృతి. ఈ నాలుగు విషయాలు లేకుండా ఏ గ్రంథము, నాది త్రైతసిద్ధాంతము లేకుండా ఏ గ్రంథం లేదు. ఈ నలుగురితోనే ముడిపెట్టి వ్రాసిపెట్టి ఉంటాము ప్రతి ఒక్క గ్రంథము. కాబట్టి ఈ నలుగురు ఉన్నారు. ఆ గ్రంథములో ఈ నలుగురు ఉన్న గ్రంథము ఎక్కడైనా తీసుకొనిపో, దాంట్లో కనపడే శక్తి కనపరాడు కానీ, తాత అనేవాడు బాగా బలంగా ఉంటాడు. తండ్రికంటే దాంట్లో ఉండే తాత ఏమని చేస్తాడంటే, మీలో ఉన్న రోగాన్ని ఏమీ లేకుండా చేసేటువంటి ఆ సంకల్పం ఆయనకు ఉంది. ఆయన చేయగల్గుతున్నాడు. ఒకరికి ఒక రోగం వచ్చింది అనుకోండి, ఆ రోగము వచ్చి బాధపడుతున్నారు అనుకోండి, ఆ రోగం వచ్చి బాధపడినపుడు ఈ గ్రంథమును తీసుకొని పోయి, వాళ్ళకు అంట్టించిపెడితే వాళ్ళు నమ్మకంగా దానిని తీసుకొని వాళ్ళ మీద పెట్టుకుంటే



అది అంటుకొని పోతావుంది. అతుక్కుని పోయి వాళ్ళలో ఉండేటువంటి కర్మను ఆ రోగాన్ని లేకుండా చేస్తావుంది. అంటే కనిపించని బలము ఉపయోగపడుతావుంది అక్కడ. సరే కనిపించని బలం ఉపయోగపడుతా ఉంది, మనకు తెలిసేదానికి ఏమయింది అంటే, ఆ గ్రంథము శరీరానికి అతుక్కున్నప్పుడు ఒక్కరు లాగినా, ఇద్దరు లాగినా అది రాదు. అతుక్కునే ఉంటుంది. అట్లే ఈ మధ్య చాలాసార్లు ఇద్దరూ లాగిన సందర్భాలు ఉన్నాయిగానీ అయినా అవి రాలేదు. అతుక్కునే ఉన్నాయి బాధను తీసేంతవరకు అవి రాకుండా ఉన్నాయి. అటువంటి సందర్భాలు కూడా జరిగినాయి.


ఇప్పుడు జరిగిన సంఘటన ఒకటి, బెంగుళూరులో జైల్లో ఒకరికి గుండె ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. ఒక రోగికి, ఒక తేదీ ఇచ్చారు.

ఆ మూడు రోజులు తరువాత అతను పోవాలి. ఆ మూడు రోజుల తరువాత పోకుండా ముందు ఏమి చేసినాడు అంటే, మన భగవద్గీత చదివి మీద పెట్టుకొన్నాడు ఇట్ల రాత్రిపూట చదువుతూ... చదువుతూ... నిద్రవచ్చింది పండుకొని నిద్రపోయినాడు. లేస్తే ముఖము కడుక్కునపుడు కూడా అది ఊడి రాలేదు. అట్లే కరుచుకొనివుంది అది. ముఖము కడుక్కొని ఆయన మళ్ళీ ఆ గ్రంథము ఇచ్చిన ఆయన దగ్గరకు పోయినాడు. ఆ గ్రంథము ఒక ముస్లీమ్ ఇచ్చినాడు ఆయనకు. ఈ గ్రంథము ఏమి ఇట్ల అతుక్కుంది మాకు. ఊడిరాలేదు. పట్టుకొని లాగినా రాలేదు. ఇదేమి పెద్ద విచిత్రంగా వుంది. ఒక గ్రంథము ఇచ్చినావు ఏమో చూడు ఈ గ్రంథము కథ అంటే, నీకు ఏదో ఒక రోగము ఉంది అందువలన ఇది పట్టుకుంది అని చెప్పినాడు. సరే ఉండేది వాస్తవమే నాకు గుండె సమస్య ఉంది. నేను గుండె మీద పెట్టుకొని పడుకున్నాను. కరుచుకుంది వాస్తవమే, నాకు ఇది ఏమైతుందో



నాకు తెలియదు కానీ, నాకు సమస్య ఉండేది వాస్తవమే. నేను మూడు రోజుల తరువాత ఆపరేషన్కు పోవాలి అని చెప్పాడు. ఆయన సరే ఈయన ఏమో దానిని నమస్కారం చేసుకొని మామూలుగ దానిని వెనక్కిలాగితే అది వచ్చేసింది. ఆ మూడు రోజుల తరువాత మరలా ఈయన హాస్పిటల్కి పోయినాడు. జైలు నుంచి హస్పిటల్కు పోతే, వాళ్ళు తిరిగి చెక్ చేసికదా ఆపరేషన్ చేసేది, అన్ని రకాల చెకింగ్లు చేసి ఆపరేషన్కు తీసుకోవడం చేస్తారు.


కానీ ఆ చెకింగ్లో ఈయన రోగము ఏమాత్రం లేకుండా పోయింది. గుండె సమస్య ఏమాత్రం లేకుండా పోయింది ఆయనకు. అప్పుడు వాళ్ళు ఏమి చేశారంటే ఈయనకు ఆపరేషన్ చేయవలసిన పని లేదు అని చెప్పేశారు. ఈయనకు ఆశ్చర్యం అయింది. ఇది ఎట్లా జరిగింది డాక్టర్లకు అర్థంకాలేదు. నీకు ఎందుకు మొదట చెక్ చేస్తే ఇట్లుంది, తరువాత స్కానింగ్ చూస్తే ఇట్లుంది. తర్వాత ఎట్ల ఇది బాగుందని ఈయనను అడిగినారు, నాకేమి తెలుసు సార్ నాకు ఏమీ తెలియదు. ఈయనకు గ్రంథము గుర్తుకు రాలేదు. మళ్ళీ ఏమి చేశారంటే వాళ్ళే ఆశ్చర్యంగా పంపిచ్చేశారు. పంపించిన తరువాత ఇక్కడికి వచ్చిన తరువాత ఈయన గ్రంథము ఇచ్చినాను కదా! గ్రంథము కరుసుకుంది కదా! అందుకే అది బాగా అయింది అని ఈయన చెప్పినాడు. ఇప్పుడు ఆపరేషన్ ఖర్చు ఈయనకు పోయింది కదా! గవర్నమెంట్ ఇచ్చినా, ఈయన ఇచ్చినా ఎవరో ఒకరు ఇచ్చినా అక్కడ ఖర్చు అయ్యేది కదా! డబ్బులు. ఆపరేషన్ ఖర్చు పోయింది కదా! ఇంతకుముందు ఒక ఆమె వచ్చింది చెప్పినాను నేను. ఆయమ్మ ఇప్పుడు మీటింగ్లో కూడా కూర్చొని ఉంది. ఆయమ్మకు రోగము పోయింది కదా! ఆయమ్మ ఆపరేషన్ ఖర్చు పోయింది కదా! కొంతమంది నన్ను ఏమని




వెక్కిరిస్తున్నారు అంటే గ్రంథాలు మనుషులను కరుచుకొని (అతుక్కుని) రోగాలు పోతే హాస్పిటల్స్ ఎందుకు, డాక్టర్లు ఎందుకు, ఆ రోగులందరిని వీళ్ళే బాగా చేయవచ్చుకదా! అని, ఎందుకు బాగా చేస్తాడు ఆయన. నమ్మకం ఉండే వాళ్ళకు, దేవుని మీద విశ్వాసం ఉండేవాళ్ళకు, మూలన ఉండే ముసలివాడు నాకు ఏదో ఒకటి చేస్తాడని, ఆ ముసలివాన్ని నమ్ముకొనే వానికి అది జరుగుతుంది. ముసలివాడు తెలియదు వయస్సువాడు తెలియదు, అంతా నేను అనుకుంటే, నా ఇంట్లో ఎవరున్నారు నేను ఒకన్నే ఉన్నాను అనుకుంటున్నావు. నీకు ఎట్ల జరుగుతుంది చెప్పు. ఇంట్లో నేను ఉన్నాను. నా తండ్రి ఉన్నాడు. తండ్రికి తండ్రి ఉన్నాడు అని నమ్మకం కుదిరి, చివరకు ముసలి ఆయన మీద, తాత మీద విశ్వాసం పెట్టుకుంటే అపుడు ఆ తాత ఏమైనా చేస్తాడు నీకు.


ఆ విధంగా కాకుండా మూర్ఖంగా మాట్లాడితే, వీళ్ళు గ్రంథాలు వున్నాయని మోసం చేస్తారు. గ్రంథాలు కరుచుకుంటాయి అంటారు. రోగాలు పోతాయంట, మోసం చేస్తారంట, ఎవరినైనా ఒక పైసా అడిగినామా! మేము మా గ్రంథాలు కరుచుకొని పెద్ద రోగము బాగయింది. 5 లక్షల రూపాయలు ఖర్చు రోగము బాగయింది. నేను ఎవరినైనా ఒక లక్ష రూపాయలు అడిగినానా! రూపాయి అడిగినానా! ఏమీ అడగలేదు మిమ్ములను. దేవుని శక్తిని మీరు నమ్ముకోండి, అది ఉపయోగ పడుతుందని చెప్పాము. నన్ను వెక్కిరించే వాళ్ళు బయట కొంతమంది ఉన్నారు. అంటే ప్రపంచంలో వాళ్ళను అడుగుతున్నాను ఈ ప్రశ్న నీకు తెలుసునా శరీరంలో ఎంతమంది ఉండేది శరీరంలో ఎవరు బాగు చేసేది తెలుసునా! ఒక ఆమెకు బాగయింది. ఆమె శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ ఆమె కర్మను లేకుండా చేశారు. అంత లేనిది ఖురాన్లో “దేవుడు క్షమాశీలుడు" అని ఎందుకు




చెప్పుతారు. దయామయుడు అని ఎందుకు చెప్పుతాడు. వాళ్ళకి బాగా చేసినాడు కదా! దయకల్గి కదా బాగు చేసినది. నిన్ను నమ్ముకున్నాను అని వాళ్ళు విశ్వాసము ఆయన మీద పెట్టింటే కదా! బాగయిండేది అది. ఇందులో ఏమాత్రము విశ్వాసం లేకుండా ఎట్ల బాగయితాది. హాస్పిటల్లో ఉండే అందరిని అక్కడకు పిలుచుకొని పోయి అక్కడ పెడుతాము, బాగుచేయమను అంటే ఎందుకయితాది అట్ల హాస్పిటల్ నుంచి పిలుచుకొని పెడితే, వాళ్ళకు తెలుసునా ముగ్గురు ఉన్నారని, ముగ్గురు ఉన్నారని తెలిసిన వాళ్ళకు మాత్రమే ఇది. ఇష్టంగా మాట్లాడేదానికి ఏమి ప్రయోజనం లేదు. అజ్ఞానం ప్రకారం మాట్లాడితే వాళ్ళకు ఏమి బాగకావు. ఇంకా కొన్ని ఎక్కుతాయి తలకు, కర్మలు ఇంకా కొన్ని తలకు ఎక్కుతాయి. ళ్ళకు అది అర్థము కాలేదు.


ఈ రకంగా లెక్కేసుకుంటే ఇక్కడ ఎన్నో ఎన్నో లెక్కలేనన్ని రోగాలు  బాగయినాయి. కానీ ఇక్కడ ఒక విధానం మీరు తెలుసుకోవాలి. రోగాలు వేరు, లోపాలు వేరు. శరీరంలో లోపాలు ఉంటాయి. అవి వేరు, రోగాలు వేరు. ఈ రోగాలను తాత ఉన్నాడు కదా! ఆయన ఒక నిమిషంలో అనుకుంటే రోగాలు పోతాయి. ఆయన అనుకుంటే చాలు ఆ రోగము పోతుంది. కానీ ఈ లోపాలు ఉన్నాయి చూడండి. ఆ లోపాలను సరిదిద్దే మనము. మనము సరిదిద్దుకోవాల్సిందే. కంటిచూపు ఉంది. అది కంటిచూపు ఒక రోగం కాదు. అది వయస్సు వచ్చిన తరువాత అది తగ్గి పోతుంది. అది రోగం కాదు. నీకు వయస్సు వచ్చేకొద్ది నీవు ముసలివాడివి అవుతావు. అది రోగము కాదు, అది శరీర ధర్మము. అపుడు వయస్సు వచ్చే కొద్ది నీ కంటిచూపు తగ్గిపోతుంది. నీవు ఏమి చేస్తావు. (మళ్ళా పోయి బయట) ఆత్మ ఏమి చేస్తుంది. అంటే అద్దాలు పెట్టి సరిచేస్తుంది. ఈ రకంగా ఆత్మ వలన జరిగేటటువంటి కొన్ని పనులు ఉన్నాయి. అవి ఆత్మ చేస్తుంది. ఆ లోపాలన్ని



బయట సరిదిద్దుకోవాల్సిందే. అంటే ఇంకొకరి ద్వారా గాని లేకపోతే శరీరంలో ఆత్మ ద్వారా గాని సరిదిద్దుకోవాల్సిందేకాని అవి మూడవ ఆత్మ అయినటువంటి దేవుడు, మూడో దేవుడు అయినటువంటి వాడు ఒకడు ఉన్నాడే, ఎవరైతే పరిశుద్ధాత్మో, ఎవరైతే అల్లానో, అతను ఏమీ చేయడు. ఆయన ఒకడు ఉన్నాడని నీకు విశ్వాసం ఉండి, ఆయన ఉండాడని నీకు నమ్మకం కల్గి ఆయనను నీవు విశ్వసించితే, ఆయన ఎంత పెద్ద రోగాన్ని అయిన లేకుండా చేస్తాడు.


నేను ముసలివానిని అయినాను, వయస్సు వానిని కావాలి, ముసలివాన్ని అయినందుకు దిగులుగా ఉంది అంటే, నీవు ముసలివాడు అయినందుకు ఏముంది. అది ధర్మము అది. అది ఏమాత్రము క్షమించ బడదు. పెద్దాయన ఏమి చేయడు అర్థమయిందా! ఇప్పుడు రాబోయో గ్రంథంలో ఏమి చెప్పాము "మరణం అనేది కర్మకు సంబంధం లేదు, బ్రతికి ఉన్నప్పుడు నీవు అనుభవించేటివి అన్ని కర్మలు”. ఈ మరణం అనేది ధర్మము. ఇది ఎవరికైనా వస్తుంది. దేవుడు వచ్చి పుట్టినాకానీ, వాళ్ళకు కూడా రావాల్సిందే అని చెప్పాము. మరణం ధర్మము, అది దేవున్ని వేడుకుంటే పోతుందా! అది పోదు. తప్పనిసరిగా వచ్చి తీరాల్సిందే. ధర్మం ప్రకారం రావాల్సిందే. దేవుడు పెట్టిన ధర్మమే అది. అది ధర్మం ప్రకారము వచ్చి పోవాల్సిందే. ఈ రకంగా లెక్కవేసుకుంటే, కొన్ని శరీరానికి లోపాలు ఉన్నాయి. శరీరానికి రోగాలు ఉన్నాయి. రోగము ఏదైతే వుందో ఆ రోగాన్ని దేవుడు, దేవుడు అంటే ఎవరు ఇద్దరూ దేవుళ్ళు ఉన్నారు. ఏ దేవుడు పెద్ద దేవుడు, తాత దేవుడు. తండ్రికి తండ్రి, అల్లాహు అల్లాహ్ అర్థమయిందా! ఆ దేవుడు మనలను సరిదిద్దగలడు అర్థమయిందా. ఒకరికి ఏమి చెప్పినా మంటే, ఒక బాధతో వచ్చినారు కడుపునొప్పి వస్తావుంది. కడుపు నొప్పి




వచ్చింది, ఏమి చేయాలి అని బాధపడుతున్నాడు. సరే కడుపు నొప్పి అనేది ఒక రోగము. దేవుని దగ్గర నీళ్ళు పెట్టుకొని త్రాగుపో అని చెప్పినాము. దేవుని దగ్గర నీళ్ళు పెట్టుకొని త్రాగితేనే పోయింది. ఎట్ల పోయింది. ఏ శక్తి వలన అది పోయింది. ఆ తాత శక్తి వలన పోయింది. ఎంతోమంది ఇప్పుడు ఈ దేవుని దగ్గరకు వచ్చి రాత్రిపూట నిద్ర చేస్తున్నారు. 10 రోజులు, 15 రోజులు, 20 రోజుల నిద్ర చేస్తున్నారు. వారి రోగాలు  క్రమేపి తగ్గుతా వస్తున్నాయి, పోతున్నాయి.



దేవుడే వారి రోగాలను క్షమిస్తున్నాడు. ఎవరు ఏ చికిత్స చేయలేదు. ఏ మందు ఇవ్వలేదు. చివరకు ధర్మము అనేది ఒకటి ఉంది, ఏది మరణం అనేది అది వచ్చినప్పుడు తప్పదు, ఎవరు ఏమి చేసేదానికి కాదు. దేవుడు కూడా ఏమీ చేయడు. దేవుడు పెట్టిన ధర్మమే అని చెప్పినాము. దానిని ఎవరూ తప్పించేదానికి కాదు. అది నేను కాదు ఇంకొకరు కాదు ఇంకొకరు కాదు ఎవరితోను కాదు అది. ఇప్పుడు చివరి దశలో ఉండేటువంటి వాళ్ళు కూడా వచ్చినారు. అది నీకు రోగము అయితే తప్పకుండా క్షమించ బడుతుంది అని చెప్పినాము. అట్లే చాలా రోగాలు క్షమించబడినాయి. క్యాన్సర్లు పోయినాయి. తరువాత వచ్చి రోగాలు హెచ్.ఐ.వి. పోయినాయి. అంటే మందుల వల్ల ఇవి ఏమి బాగయితాయని నమ్మకం లేని రోగాలు కూడా ఇక్కడ పోవడం జరిగింది. తరువాత నీవు చనిపోతావు పో ఇంక రోజుకంటే ఎక్కువ బ్రతకవు, ఇంటికి పో అని డాక్టర్లు మదనపల్లి హాస్పిటల్ నుంచి ఇంటికి పంపిస్తే ఆ టిబి రోగిని, అతను బ్రతికి 5 సంవత్సరాల నుండి ఇప్పుడు హాయిగా ఉన్నాడు. మన ముందరే వాడు చనిపోతాడని పంపించినారు. రోగి ఇంటికి పోకుండా ఇక్కడి వచ్చినాడు దేవున్ని నమ్ముకుంటానని, సరే నమ్ముకో నీ ఇష్టం. డాక్టర్లు చెప్పినారు పోతావని.



నీవు నమ్ముకొని వచ్చినావు నమ్ముకో. అది ఆ ముసలి ఆయన ఇష్టం, నీ ఇష్టం అని చెప్పాము. అంతే కదా! ఆ ముసలి ఆయన ఏమి చేసినాడు అంటే సరిలే ఏదో విధంగా నేను చేస్తానని బాగు చేసినాడు. అతను బాగయిపోయినాడు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మనముందరే బ్రతుకు తున్నాడు. డాక్టర్ దగ్గరికి పోతే ఏమి చెప్పుతాడు. ఎట్ల బ్రతికినావు అంటారు. ఎట్ల బ్రతికినావంటే ముసలివాడు ఉన్నాడని వారికి తెలియదు కదా! మనకు తెలుసు.


మన శరీరంలో ఒక తాత ఉన్నాడని, మన శరీరం తాతది అయినా గానీ మనము పిల్లలమే. లోపల నీ శరీరం ముసలిది అయినాగానీ, నీవు పిల్లవానివే అర్థమయిందా! నీ తండ్రి ఒకడు ఉన్నాడు. అందుకే నీ శరీరంలో ఈ మూడు పోర్షన్లు చూపించినాడు దేవుడు. పిల్లవానిగా, పెద్దవానిగా, ముసలివానిగా, నీ శరీరం మారుతావుంది. ఈ మూడు రకాలుగా ఎందుకు మారుతుంది అంటే ఒకటి ముసలివాడు, మధ్య రకము వయస్సు, యుక్త వయస్సు వచ్చిన తరువాత, వృద్ధాప్యము ఈ మూడు రకాలుగా ఎందుకు మారుతా ఉందంటే, లోపల ఉండేటువంటి నీలో నుండి మూడు ఆత్మలు అంటే ముగ్గురు పురుషులు ఈ విధంగా ఉన్నారు. ఒకడు ముసలివానిగా ఒకడు మధ్య రకమువానిగా, ఇంకొకడు చిన్నపిల్లవానిగా ఉన్నాడు. అని తెలియజేసే దానికోసరమే, ఈ రకంగా మనకు శరీరాలను దశలు మారుతూ చూపించాడు. తరువాత ప్రకృతి, పురుషులు ఉన్నారనే దానికి మనలో మనల్ని పురుషులుగా పురుష శరీరాలను పుట్టించినాడు, తరువాత శరీరాలను కూడా ఈ దేశంలో పుట్టించి చూపించాడు. ఈ రకంగా రెండు శరీరాలు ఉన్నాయి. ప్రకృతి పురుషుల వలనే సమస్త జీవరాశులు ఉద్భవిస్తున్నాయి అని చెప్పినట్టే, స్త్రీ పురుషులవలనే అందరూ పుట్టడం




జరుగుతావుంది. అందుకనే భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగంలో 3, 4 శ్లోకాలలో ఏమి చెప్పుతాడంటే ఎవడు, ఏ జీవాత్మ, ఏ జీవరాశి ఎక్కడ పుట్టినా, ఎవడు ఎక్కడ పుట్టినా వానికి తల్లి ప్రకృతి, తండ్రి ఆత్మ అని చెప్పినాడు. ఈ మూడు రకాలుగా చూపుతున్నాను. ఇద్దరూ పురుషులు అయితే ఈ చిన్నోడు ఉన్నాడు పిల్లోడు దేనికి తరంగానోడు కదా! అంటే ఆడది కాదు, మగవాడు కాదు అన్నట్లు ఉన్నాడు వాడు. ఇంట్లో కూర్చోని ఏమి పనికి రానివాడు. ఎవరు ఆ చిన్నవాడు, వానిని జీవుడు అంటా ఉన్నాము. ఆ జీవుడు ఎటువంటివాడు పూర్తి మగ లక్షణాలు ఉండవు, పూర్తి ఆడ లక్షణాలు ఉండవు. అంటే తండ్రి చాటున బ్రతుకుతున్నాడు, తల్లి చాటున బ్రతుకుతున్నాడు. అంతే కదా!


ఇద్దరి చాటున బ్రతుకుచున్నాడు పిల్లోడు. మన ఇంట్లో పిల్లోడు అయినగానీ తండ్రి చాటున, తల్లి చాటున ఇద్దరి చాటున బ్రతుకుతున్నాడు కదా, పెద్దోడు అయిన తరువాత తండ్రి చాటున బ్రతుకుతాడు. చిన్నప్పుడు తల్లి దగ్గరకొంతసేపు ఉండి పాలు త్రాగేదివాడు. కాబట్టి వాడు చేతకాని వాడు, చిన్న శిశువుగా ఉన్నపుడు తండ్రితోను, తల్లితోను ఇద్దరి సహాయంతో వాడు బ్రతుకుచున్నాడు. కాబట్టి ఇద్దరి లక్షణాలు వానిలో ఉండాయి కాబట్టి వాడు పూర్తి పురుషుడు కాదు. పురుషుడే అయినాగానీ వానికి ఏమిలేవు మగ లక్షణాలు. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఎట్లు ఉంటాడు, అట్లే ఉంటాడు, చిన్న పిల్లవాని మాదిరిగా ఉంటాడు. అర్థమయిందా! ఆడ, మగ విషయం కూడా వానికి తెలియదు. వానికి ఏమి తెలుసు చిన్న పిల్లోనికి తెలుసునా ఆడ, మగ అని. నేను మగవాన్ని అని తెలుసునా వానికి ఏమీ తెలియదు కదా! వానికి శిశువుకు ఆ రకంగా రెండు లక్షణాలు ఉన్నటివాడు అని దేశంలో ఏమి చేశారంటే స్త్రీ, పురుషులను పుట్టించడమే కాకుండా,




నపుంసకులను కూడా పుట్టించాడు దేవుడు, ఆ విధంగా ఉంది కదా! నపుంసకులు శిశువుగా ఉండే జీవాత్మలకు గుర్తు, ఆత్మ పురుషునికి గుర్తు మగవాళ్ళు, ప్రకృతికి గుర్తు స్త్రీలు, పరమాత్మకు గుర్తు ప్రపంచమే. మొత్తము విశ్వమే. ఆయనకు ఏ గుర్తు ఉండదు. ఆయనని ఎవరూ ఊహించి చెప్పలేరు ఇలాంటివాడని. ఆ ముసలివాడు అని అంటున్నాము గానీ మనము ఆ ముసలివానికి పెద్ద స్థానము ఉంది. ఎవరికీ అర్థము కాదు ఆయన స్థానము. ఆయన అందరికీ సృష్ఠికర్త. అంతేకదా! ఆయన ఉంటేనే కదా! ఇవన్నీ పుట్టినేది మీ నాయన నువ్వు అందరూ పుట్టినేది. ఇకపోతే ఎందుకు పుడతారు. కాబట్టి మీ తాత ముఖ్యమైనవాడు అందరికంటే ముఖ్యమైనవాడు. ఆయనకు అన్ని శక్తులువున్నాయి. అర్థమయిందా!



ఒక గ్రంథము ఇల్లులాంటింది. ఆ ఇంట్లో ముగ్గురు పురుషులు ఎట్లయితే ఉన్నారో, మన ఇంట్లో ఆ గ్రంథములో కూడా ముగ్గురు పురుషులు ఉన్నారు. ప్రకృతి ఉంది. ఆ గ్రంథాన్ని నమ్ముకున్న వాళ్ళకు ఆ గ్రంథము రోగాలను బాగా చేస్తా ఉంది. ఎంతోమంది క్యాన్సర్లు బాగయినాయి. ఎంతో మంది హెచ్.ఐ.వి. రోగాలు బాగయినాయి. ఎన్నో రోగాలు, రకరకాల రోగాలు బాగా అయినాయి. ఇప్పటికి కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ ఏమీ తెలియని గాడిదలు, ఏమీ తెలియని అజ్ఞానులు ఏమని మాట్లాడుతున్నా రంటే అట్ల బుక్కులు బాగా చేసేటట్లు ఉంటే, బుక్కులు అంటుకొని కరుచుకొనేటట్లు ఉంటే, అవి రోగాలు బాగా చేసేటట్లు ఉంటే, ఆస్పత్రిలన్నీ మూసివేస్తాము. దేనికి ఇంక మీ దగ్గరికి తీసుకు వస్తాము బాగా చేస్తారా అని అడుగుతారు. ఆస్పత్రులు మూసివేసి తీసుకువస్తే మేము ఎందుకు బాగా చేస్తాము. ఇక్కడ ఎవరికి చెప్పుతున్నాము. ముగ్గురు పురుషులు జ్ఞానాన్ని తెలిసినవాళ్ళకు, మూడవు పురుషున్ని నమ్ముకున్నంటి వాళ్ళకు ఈ కర్మలు



పోతాయి, కానీ ఏమాత్రం తెలియకుండా అజ్ఞానంగా మాట్లాడేవాళ్ళకు ఇంకా నెత్తికి ఎక్కుతాయి ఏమాత్రము పోవు. అర్థమయిందా! ఒక టీచర్, ఒక పిల్ల వాడు స్కూలులో బొట్టు పెట్టుకొని పోతే హేళనగా మాట్లేది. ఏమి బొట్టు ఇది దరిద్రం బొట్టు ఎక్కడా లేనట్టి మీరే పెట్టుకొని వచ్చారు. తుడుపుకొనిరా! అని చెప్పినారు. అంటే పిల్లలు ఏమి చెప్పినారు లేదు ఇది దేవుని గుర్తు, మేము పెట్టుకొని వస్తాము మేము తుడుపుకోము అని అన్నారు. ఆమె రెండు దెబ్బలు కొట్టింది. కొట్టింటే ఇంటి దగ్గరకి వచ్చి పిల్లలు చెప్పినారు బొట్టు పెట్టుకొని పోయింటే టీచర్ కొట్టిందని, మళ్ళీ పోయి అడిగినారు ఏమ్మా మా పిల్లోల్లు బొట్టుపెట్టుకొని వస్తే మీకేమి ఇబ్బంది, ఏమి లేదు, ఊరికే అన్నాము అది ఇది చెప్పి తప్పించుకుంది ఆమె, మళ్ళీ వారానికే చచ్చిపోయింది. దేనికి చనిపోయిందో మనకు తెలియదు. అంటే ఈ తాత ఏమో చేసినాడని లెక్కే అంతేకదా! ఈ తాత ఊరికే ఉన్నాడా! అనుకొంటాడు ఈ ముండ చనిపోవాలని. ఆ ముండ పోయింది. ఇట్ల చాలామంది చనిపోయారు, ఎన్నో గుర్తులు ఉన్నాయి.


ఈ విధంగా హేళనగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అటువంటి వాళ్ళు ఇలాగే చనిపోయారని ఒక గ్రంథములో కూడా నేను వ్రాసాను. ఏ దాంట్లో “శ్రీ కృష్ణుడు దేవుడా! భగవంతుడా!!” అనే గ్రంథంలో కూడా కొన్ని విషయాలు వ్రాశాను నేను. అవి ఎప్పుడో అప్పుడు పూర్వం వ్రాసినేటివి. ఇప్పుడు ఎన్నో జరిగినాయి. ఇటువంటి విషయాలు అన్ని. వాళ్ళకి తప్పనిసరిగా శిక్షలు పడినాయి క్షమించడమే కాదు, శిక్షను విధించేవాడు కూడా ఆయనే. క్షమించేవాడు ఆయనే. విధించేవాడు ఆయనే కాబట్టి జాగ్రత్తగా మసలుకోవాలి అజ్ఞానంతో ఏమాత్రము దేవున్ని మాత్రం



మాట్లాడకూడదు. దేవుడు దేవుడే ఆయన శక్తిమంతుడు. ఆయన కరుణించే వాడు. దయ దలిచేవాడు, క్షమాశీలుడు. మన కర్మలను క్షమిస్తాడు. ఆయనకు కోపం వస్తే, నీకు పూర్తిగా శిక్షిస్తాడు. ఏమాత్రము వదలడు, కాబట్టి దేవుని ఎడల భక్తిగా ఉండడం నేర్చుకోవాలి. దేవుడు అంటే పూర్తి ఆ గుడికి పోయి దేవున్ని మ్రొక్కుతున్నాను అంటే, ఏ దేవున్ని మ్రొక్కుతున్నావు నీవు. దయ్యాన్ని మ్రొక్కుతున్నావు నీవు. దేవున్ని కాదు. దేవున్ని మ్రొక్కలేదు నీవు. నీవలె పుట్టించబడిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. నీవు కనిపించే మనిషివి, కనిపించని మనుషులను కూడా దేవుడు పుట్టించినాడు. వాళ్ళు పాలిస్తున్నారు. నీవు ఏమని అనుకుంటావంటే, ఈ పుట్టిచ్చినవాన్ని, నీ ఇంట్లో ఉండే ముగ్గురు పురుషులను విడిచిపెట్టి, బయట బొమ్మలను నీవు ఏమని అనుకుంటున్నావో, దేవుళ్ళు అని అనుకుంటున్నావు. అది పెద్ద తప్పు ఈ రకంగా దేవుని జ్ఞానం తెలుసుకోకుండా, బయట ఏమో చేస్తూ ఇదే దేవుడు అనుకోవడం పెద్ద పొరపాటు. ఆ లెక్క ప్రకారం పోతే, క్రైస్తవులు ఒక దారిలో వున్నారు. దేవుడు ఒకడే అని, ముస్లీమ్లు ఒకదారిలో ఉన్నారు దేవుడు ఒకడే అని, హిందువులు మాత్రం దేవుడు ఒకడే అనే దారిలో లేరు. వాళ్ళు ఏ దారిలో ఉండారు అంటే, మేము ఏ మతములో లేని రక్షణ అంతా వాళ్ళ మతంలోనే ఉంది. వాళ్ళ మతము అంటే మా మతంలో ఉండేది నేను కూడా ఇందువును కాబట్టి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ మతంలోని రక్షణ, అంతా హిందు రక్షణ సంస్థలు చాలా పెట్టుకొన్నారు. అవన్నీ మనం పెట్టుకొంటే ఎందుకు పెట్టుకున్నారు అని మేము అంటే, మా మతము అంతా పాడై పోతుంది. వేరే మతాలలోనికి పోతున్నారు. అంతా వేరే మతస్థులంతా మా మతాన్ని చెడబెట్టి, వారి మతంలోకి చేర్చుకుంటున్నారు.




క్రైస్తవులందరూ క్రైస్తవునిగా మార్చుకుంటున్నారు. ముస్లీమ్ ఏమో వారికిష్టము వచ్చినట్లు ముస్లీమ్ గా మార్చుకుంటున్నారు. కాబట్టి మేము రక్షించేదానికి ఉన్నాము. అంటారు. ఏమిటిని రక్షిస్తున్నారు మీరు, మతాన్ని మీరు పెట్టుకొనే పేరు ఏమిటి, ధర్మరక్షణ. నీవు ధర్మ రక్షణ చేస్తున్నావా మత రక్షణ చేస్తున్నావా! వాడు చేసేది మత రక్షణ, పెట్టుకొనే పేరు ధర్మ రక్షణ. అమ్మేది ఎండు చాపలు, గంపలో పెట్టుకొన్నది. ఎండు చాపలు, అమ్మేది ఎండు మిరపకాయలు, ఎండు మిరపకాయలమ్మో అన్నాడంట. ఏంటివి అంటే ఎండు చాపలు దాంట్లో ఉండేవి. ఒరే నీవు అమ్మేది ఎండు చేపలు కదా! ఎండు మిరపకాయలు అని ఎట్ల అంటున్నావు అసలుకు అంటే, నేను ఇట్లే అంటాను అంటే నీవు అట్ల అనడం తప్పు, అవి ఎండు చేపలు, నీవు ఎండు చేపలే అను, నీవు మత రక్షణే అని పెట్టుకో, ధర్మరక్షణ పెట్టుకుంటే బాగుండదు చూడు అని చెప్పినాము. కానీ మనదేశంలో చాలా హిందుమత సంస్థలు చాలా ఉన్నాయి. అన్ని ధర్మరక్షణ, ధర్మరక్షణ అని పేరు పెట్టుకొన్నారుగానీ మతరక్షణ అని ఎవరూ పెట్టుకోలేదు. కానీ వాళ్ళు చేసే పనులన్నీ మత రక్షణే. కానీ నేను ఏమి చెప్పుతున్నాను అంటే నువ్వు ధర్మరక్షణ చేసేటట్లు ఉంటే “ధర్మసంస్థాపనార్థాయ సంభావమి యుగే యుగే” ప్రతి యుగంలోను ధర్మములను సంస్థాపన చేసేదానికి నేను వస్తాను అని ఆయన ఎందుకు చెప్పాలి. ఆయన ఎందుకు రావాలి. మీరే ప్రొద్దున ఇంత పొడువు లెటర్ వ్రాయండి, మేమంతా ఉన్నాము 20 మంది సంఘాలు ఏదో ఒకటి, వ్రాయండి మేము చూసుకొంటాము అని, వ్రాయండి మేము రక్షిస్తామని, ఆయన రాకుండ ఉంటాడు. అక్కడినే ఆయన శ్రమపడి రావాలి. ఆయన ఎందుకు పుట్టాలి. దేవుడు ఎందుకు వచ్చి పుట్టాలి ఇక్కడ. మీరే చేయవచ్చు కదా! ఆ సమస్య ఏమిటో. అట్లా



తెలియదు ధర్మమేమి తెలియదు. నీవు ఏమి సంరక్షణ చేస్తావు చెప్పు. ధర్మము అనే విషయమే తెలియదు. ధర్మం అనే పేరే తెలియదు. అసలుకు నీ శరీరము ఒక ఇల్లు, ఈ ఇంటిలో 10 ఉండరని విషయమే తెలియదు. నువ్వు శరీరాన్ని విడిచిపెట్టి, నేనే దేవున్ని నేనే దేవున్ని అనే లెక్కలో నీవు మాట్లాడుతున్నావు.


నీవు పిల్లవానివి, పాలు త్రాగేవానివి నీవు, మీ అమ్మ, మీ నాయనతో బ్రతికే వానివి. అర్థమయిందా నువ్వు నేనే అన్ని చేస్తూవున్నాను అనుకోవడం పెద్ద పొరపాటు. నీవు నపుంసకునివి అంతేకదా! పిల్లవానికి ఏ స్పర్శ ఉండదు. ఆడవాళ్ళ స్పర్శ ఉండదు. మగవాళ్ళ స్పర్శ ఉండదు. వాళ్ళకి ఏ ధ్యాస ఉండదు. కాబట్టి నీవు నపుంసకునివి. పురుషునిగా ఉండు. పెద్ద మబ్బోని మాదిరి మాట్లాడవద్దు నీవు. అట్లగా జ్ఞానిగా నీవు మాట్లాడు. జ్ఞానం తెలుసుకొని మాట్లాడు, ఫరవాలేదు. ఎదుగు ఆ స్టేజికి మాట్లాడు. ఫరవాలేదు సరిపోతుంది. అట్లా ఎదగకోకుండా నీవు ఏమి చేస్తున్నావు. నేను జ్ఞానిని అనుకుంటున్నావు, నాకు అన్నీ తెలుసు అని అనుకుంటున్నావు. ఏదో ఒక గ్రంథము చదివి నేను ఏమనుకుంటున్నానంటే నాకు అన్ని తెలిసిపోయినాయి అనుకుంటున్నావు. కానీ గ్రంథాలలో చెప్పిన విషయం కూడా నీకు తెలియదు. హిందువులు ఉన్నారు. భగవద్గీత దేవుడు ఇచ్చాడు. కానీ భగవద్గీత నా గ్రంథము అని వారికి తెలియదు. కానీ వేదాలు చదవలేదు అంటారు. వేదాలు మా గ్రంథాలు అని అంటారు. వేదాలకు నీకు ఏమి సంబంధం ఉందయ్యా అసలుకు ఒక్కొక్కరు మమ్మలిని వెక్కిరిస్తున్నారు. ఆయన ఏమిటి వేదాలు చదవలేదు. ఏమి చదవలేదు. జ్ఞానం చెప్పుతాడంట అతను బుక్కులు వ్రాసినాడు, ఎట్ల వ్రాసినాడు, ఏమి అధికారం ఉంది అని వ్రాసినాడు. సంస్కృతం రాదు. వేదాలు చదవలేదు. ఆయన గురువు ఎట్ల


----

అయినాడు అని నన్ను ప్రశ్నిస్తున్నారు. నేను ప్రపంచానికి అర్థం చెప్తున్నాను. ప్రపంచానికి జ్ఞానం చెప్పుతున్నాను. మూడు మతాల సారాంశాన్ని చెప్పుతున్నాను నేను. మీరు అట్ల కాదు ఒక మతాన్ని పట్టుకొని ఊగులాడుతున్నారు. ఇంకొక మతాన్ని మీరు ద్వేషిస్తున్నారు.


మీవల్ల మతద్వేషాలు తప్ప, ప్రపంచములో ఏమీ ఉండవు. ఒకరినొకరు చంపుకోవడం తప్ప ఏమి లేదు. నా వల్ల ప్రేమవుంది. ఒకరికొకరికి, మీరంతా కలిసినారు ఇప్పుడు ఒకచోట ఉన్నారు. అన్నదమ్ముల మాదిరి ఉన్నారు. ముస్లీమ్లు ఉన్నారు. క్రైస్తవులు ఉన్నారు. హిందువులున్నారు. ఒకరికొకరు ఆప్యాయతగా మాట్లాడించు కుంటారు. ఏమీ ద్వేషములేదు. అందరికి ఒకటే దేవుడు అని మీకు తెలుసు. కాబట్టి ఇది మంచిదా అది మంచిదా! చెప్పండి. ఏమాత్రము జ్ఞానం

తెలియకుండా మీరు వేదాలు చదివినారా అంటే, వేదాలతో మనకు ఏమి పని ఉంది. వేదాలు జ్ఞానం చెప్పినాయా, చెప్పలేదు. మూడు గుణాల విషయాలే చెప్పినాయి. "త్రైగుణ్య విషయా వేదా నిసైగుణ్యో భవార్జున”

భగవద్గీతలో ఒక వాక్యం ఉంది. "త్రైగుణ్య విషయా వేదా” అని

మూడు గుణాల విషయాలే ఆ వేదాలలో ఉన్నాయి అవి వద్దు. విడిచి పెట్టు అని చెప్పినాడు ఆయన “గుణమయి మమ మాయ” గుణాలే నా మాయ. నేను పుట్టిచ్చిన మాయ గుణాలతో కూడుకొని ఉంది. అది అడ్డంపడిందనుకో ఏమాత్రము జ్ఞానం తెలుసుకోలేవు. దేవుడు నీకు తెలియబడడు. “మమ మాయ దురత్యయా” నా మాయను జయించి ఎవరూ ముందుకు పోలేరు అని చెప్పాడు ఆయన. ఆ మాయను వదిలి పెట్టు నీవు. “మామేవ యే ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే” అంటాడు. ఎవరైతే నన్ను ఆరాధిస్తాడో వాడు తప్పనిసరిగా మాయను దాటిపోగలడు అని చెప్పాడు. అట్లకాదు


---

సిద్ది బోధ

మాయను పట్టుకుంటున్నావు. నీవు వేదాలు చదవమంటున్నావు. వేదాలు చదువుతున్నావు. వేదాలు మాయ అని చెప్పినారు, గుణాలు మాయ అని చెప్పినారు.


భగవద్గీతలో చెప్పిన మాటలను వ్యతిరేఖించి, కాదని నీవు చెప్పుతున్నావా! వేదాలు చదవమని. ఆ ఒక్కచోటే కాదు విశ్వరూప సందర్శన యోగంలోకి పోతే 48, 53 శ్లోకాలలో ఏమి చెప్పినారు అంటే వేదాలు చదివేదాని వలనగానీ యజ్ఞాలవల్ల గానీ, దానాల వల్లగానీ, ధ్యానం చేసినందువల్ల గానీ ఏమాత్రం ప్రయోజనం లేదు. దేవుడు తెలియబడడు” అని చెప్పినారు. దేవుడు తెలియబడడు అని చెప్పితే నీవు ఎందుకు వేదాలు పట్టుకొని నీవు చదువుతున్నావు. ఎందుకు ధ్యానం చేస్తున్నావు. ఎందుకు యజ్ఞాలు చేస్తున్నావు అని అడిగితే, ఈయన యజ్ఞాలు, దానాలు, వేదాలంతా వ్యతిరేఖిస్తాడు. ఈయన హిందువు కాదు అని చెప్తున్నారు. ఈ మధ్యన 15 రోజుల క్రిందట అమరావతి అంటే మనకు రాజ్యపరిపాలన అక్కడే కదా! ఉండేది. సెక్రటేరియట్ అమరావతికి పోయి డి.జి.పి.ని కలిసినారు. కొంత మంది స్వామీజీలు, కారులో పోయి ఒక గురువు 10 మంది శిష్యులు అంతాపోతే ఒక ఇద్దరు, ముగ్గురు స్వాములు అంతా కలిసిపోతే వాళ్ళు అక్కడ ఉండే వాళ వాళ్ళంతా అంతా పెద్ద గురువులు వచ్చినారు అని మర్యాదగా పిలిచి మాట్లాడిచ్చినారు. డి.జి.పి. తో కలవాలి అంటే తీసుకొనిపోయి డి.జి.పి. దగ్గర విడిచిపెట్టినారు. ఆ డి.జి.పి. కి ఏమి చెప్పుతున్నారంటే అయ్యా తాడిపత్రిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎక్కడా ఒక పైసా ఎవరిని కూడా చంద అడగకోకుండా ఆయన మెయింటెన్ చేస్తావున్నాడు. పెద్దపెద్ద ఇళ్ళు కట్టినాడు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినాడు. చాలామంది ఆయన దగ్గరకు వస్తారు. ఆయనకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తూ ఉండేది మీరు


--

చూడండి, మీరు నిఘాపెట్టండి. ఆయనకు ముస్లీమ్ దేశాలనుంచి డబ్బులు వస్తున్నాయి. ఆయన ముస్లీమ్ గ్రంథాలు వ్రాసినాడు. ఆ ముస్లీమ్లంతా ఈయనకు ప్రోద్భలము చేసి, మా మతాన్ని ప్రచారము చేయమని చెప్పింటే, ముస్లీమ్ గ్రంథాలు వ్రాసి, ముస్లీమ్ మతాన్ని ప్రచారం చేస్తావున్నాడు. హిందువులు ముసుగులో ఉన్న ముస్లీమ్ అని అక్కడ చెప్పారు. ఎవరికి డి.జి.పి.కి రిపోర్ట్ చేశారు. చూడు ఎట్లుందో అంటే పోలీసుశాఖకు పెద్దగా ఉంటాడే ఆ పెద్ద ఆయనకు రిపోర్ట్ చేసినారు. సరే చూస్తాంలే అన్నారు వాళ్ళు.


నేను ఎవరిని పైసా అడగలేదు. పైసా అడగకపోతే వేరే వాళ్ళు ఇచ్చినట్లేనా! సరే ఇంతమంది ముస్లీమ్లను అడుగుతాను. ఎవరినైనా ఒక పైసా అడిగినానా! నేను ఎవరిని అడగలేదు. నా కొద్ది నేను జ్ఞానం చెప్పుతున్నాను. నా వ్యాపారాలు నాకు దండిగా (చాలా) ఉన్నాయి. నా వ్యాపారాలలో కూడా నేను సంపాదించుకుంటున్నాను అన్నిటికి ఇన్కమ్ టాక్స్ వ్రాసి చూపిస్తున్నాము మేము. ఎక్కడా ఫాల్ట్దు మాకు. ఏమి ఆర్థికము ఉంది. ఏమి ఖర్చులు ఉన్నాయి అనేవి అన్నీ చూపిస్తున్నాము మేము. అయితే నన్ను చెప్పి ఏమి పని ఉంది అక్కడికి పోయి వీళ్ళకి, చేతకాక నన్ను ముస్లీమ్ అన్నారు. ఇంతకుముందే కొంతమంది పోయి వాళ్ళు క్రిష్టియన్, క్రిష్టియన్ బోధలు బోధిస్తా ఉన్నాడు అని ఇంతకుముందే రిపోర్ట్ ఇచ్చారు. ఇట్లా దీనిగురించి ఒకరు ఇట్లా, ఒకరు అట్లా, ఇంకోరు ఇంకొకరకంగా చెప్పుతున్నారు. హిందువులా అసలు మీరు, హిందువే కాదు ఈయన అని చెప్పి వేదాలు చదవలేదు అని అంటారు. వేదాలు రుజువా అని నేను చెప్పుతూవున్నాను. వేదాలు వద్దని చెప్పినాడు భగవద్గీతలో దేవుడు అని చెప్పితే వేదాలు చదవలేదు, నాకు సంస్కృతంరాదు. సంస్కృతం లిపే


----

లేదు దానికి. దానిని ఏమి పట్టుకొని చేయాలి. లిపి ఉండే భాష గొప్పదా, లిపి లేని భాష గొప్పదా. లిపి లేకుండా చాలా భాషలు ఉన్నాయి. మన దేశంలో దానిని ఏమి చేస్తావు చెప్పు. దానిని వేరే లిపితో వ్రాసుకుంటున్నాము మనము. ఇప్పుడు సంస్కృతం వ్రాయాలంటే హిందీ అక్షరాలతో వ్రాయాలి మనము. సంస్కృతం శ్లోకాలు అన్ని ఎక్కడ ఉన్నాయి ఏమిటితో వున్నాయి. సంస్కృత శ్లోకాలన్ని హిందీ భాషతో వ్రాసుకుంటాము మనము. తరువాత తెలుగు భాషలో వ్రాసుకున్నాము. తెలుగు భాషలో అయితే ఇంకా స్పష్టంగా వ్రాసుకొన్నాము. హిందీ భాషలో సరిగా పదాన్ని పలికేదానికి రాదు, అక్షరాలు సరిగా లేవు. ఎక్కువ అక్షరాలు ఉండేది తెలుగు భాషలోనే, కాబట్టి తెలుగు భాషలో మనం స్పష్టంగా వ్రాసుకొన్నాము శ్లోకాలు. అయితే ఇప్పుడు మనం లిపి లేని భాష మంచిదా! లిపివున్న భాష మంచిదా! సరే లిపి ఉండే భాషే మాకు మంచిది. కాబట్టి లిపి ఉండే భాషలో జ్ఞానం చెప్పుతున్నాము.



ఇది జ్ఞానం కాదా! తెలుగులో చెప్పితే జ్ఞానం కాదా! నేను స్వచ్ఛమైన జ్ఞానం చెప్పుతున్నాను. స్వచ్ఛమైన ఆధ్యాత్మికాన్ని చెప్పుతున్నాను. ఆత్మకు సంబంధించిన విషయాలు చెప్పుతున్నాను. ఇప్పుడు నేను సింపుల్గా ఒక ఇల్లు, మూడు ఆత్మలు, ఒక స్త్రీ చెప్పినాను. ఇప్పుడు ఇది మీకు సింపుల్గా అర్థమయిందా! ఇది ఎవరైనా చెప్పారా! ఇంత సింపుల్గా మీకు చెప్పండి. ఒక ఇల్లు పోల్చి నా గ్రంథాన్ని పోల్చి ఒక ఇల్లుగా చెప్పాను. ఆ గ్రంథాలు ఎన్నో రకాలుగా బాగు చేస్తున్నాయని చెప్పినాను, చెప్పుతున్నాము. మేము క్రొత్త చెరువు వాళ్ళు ఒక ఊరిలోకి ప్రచారం పోతే, ఆ ప్రచారంలో పోయిన వెంటనే ఎవరికో ఒకరికి తేలు కుట్టిందంట. ఆ తేలు కుట్టింది మందు ఉందా అని అడిగినారు బండి దగ్గరకు వచ్చి, ఏదో ఉందేమో మన దగ్గర


---

అని, అంటే మా దగ్గర మామూలుగా మందు లేదు. పెద్దమందు ఉందిలే అని బుక్ పెట్టారు. బుక్ పెడితే అది తేలు విషాన్ని ఒక నిమిషంలో రెండు నిమిషాల్లో తీసేసింది. ఆ విషయం పోయింది వెంటనే వారికి ఆ గ్రంథం యొక్క విలువ తెలిసింది. ఆ ఊరిలో వీళ్ళు ఏమి చెప్పకనే 150 బుక్కులు తీసుకొన్నారు ఆ రోజు, అంటే ఆ గ్రంథము అటువంటిది. అంత పని చేసింది చూడు. మన ముందరే తేలు విషాన్ని లాగేసింది ఇది, ఏదో శక్తి వుంది అని వాళ్ళు తీసుకున్నారు. మరి కనిపించే సత్యం కాదా!


ఇది ఈ రకంగా మనకు అంటే ఆత్మ, పరమాత్మ, జీవాత్మ అనే విషయం ఎక్కడైతే ఉందో అక్కడంతా శక్తి ఉంది అని చెప్పుతున్నాము. నా ప్రతి గ్రంథములోను ఈ మూడు ఆత్మల తెలియబడిన జ్ఞానం ఉంది గానీ, ఈ మూడు ఆత్మలకు సంబంధం లేకుండా ఏ జ్ఞానం వ్రాయలేదు ఇంతవరకు. ఇప్పుడు బైబిల్ వ్రాసినాను. అందులో మూడు ఆత్మలే ఉన్నాయి. భగవద్గీత వ్రాశాము అందులో మూడు ఆత్మలే ఉన్నాయి. ఖురాన్ వ్రాశాము అందులో మూడు ఆత్మలే ఉన్నాయి. క్రైస్తవులకు చెప్పినాము తెలియని విధానం తెలుసుకోండి అని చెప్పాము. ఏమిని చెప్పినాను ఇద్దరు కుమారులు ఉన్నారు మీరు తెలుసుకోండి. అక్కడ ముస్లీమ్లకు ఏమి చెప్పినామంటే ఇద్దరు అల్లాలు ఉన్నారు. మీరు తెలుసుకోండి మీరు పొరపాటు పడినారు. మ్రొక్కాల్సింది ఒక అల్లానే. నీవు నమాజు చేయాల్సింది ఒక అల్లానే. అదిమాత్రము వాస్తవమే. కానీ 112వ సూరా పెద్ద అల్లాను గురించి చెప్పినారు. “ఆయన ఏ అక్కరలేని వాడు. ఎవరికి ఆయన పుట్టలేదు. ఎవరు ఆయన సంతతి కాదు.” అంతేకదా! ఎవరూ కాదు సంతతి. మనము తండ్రి సంతతి. మనము ఆయన సంతతి కాదు. ఆయనకు సంతతిలేదు. ఆయన ఎవరికీ తండ్రి కాదు. ఎవరికీ కుమారుడు కాదు. ఆయన అంత


----

పెద్దాయన ఉన్నాడు అని దాంట్లో చెప్పినారు. ఏ దాంట్లో 112వ సూరాలో 4 ఆయత్లు ఉన్నాయి. 4 ఆయత్లు, ఆ తాతను గురించి చెప్పినేటివి. ముస్లీమ్ లు బాగా గుర్తుపెట్టు కోండి అన్ని కలిపి చదువుకోవద్దండి 2వ సూరా 255లో రెండవ ఆత్మ గురించి చెప్పినారు. మీ తండ్రిని గురించే ఏ అల్లాని అయితే ఆరాధించాలో, ఆ అల్లానే అక్కడ చెప్పారు. ఆయన మీకు అల్లా మీరు ఆరాధించవలసింది ఆయననే, మీరు నమాజు చేయవలసింది ఆయననే.


ఆ పెద్దాయనకు చేయకూడదు. 16వ సురా 51వ ఆయత్లో చెప్పినారు ఇద్దరు అల్లాలను ఎప్పుడూ పెట్టుకోవద్దండి మీరు. మీరు ఆరాధించవలసింది, నమాజు చేయవలసింది ఒకే అల్లాహ్ ను, ఇద్దరు అల్లాలు లేరు. మీకు ఈయనే మీ అల్లాహ్. ఈయననే మీరు ఆరాధించండి అని చెప్పి రెండవ ఆత్మను చూపించాడు. చెప్పుతూ ఏమి చెప్పినాడు అంటే నాకు భయపడండి. పెద్దాయన ఉన్నాడని నా మీద భయము పెట్టుకోండి, మీరు నాకు భయపడండి. ఈయనను మీరు ఆరాధించండి అని చెప్పినాడు. అపుడు ఇద్దరు అల్లాలు కదా! పెద్దాయన చెప్పినాడు కదా. చూసుకోండి మీరు ఉందో లేదో అది. ఉంది, ఇంక ఏమి చెప్పినాడు. అల్లాను మరియు జ్ఞాన సంపన్నులు, దేవదూతలు 3వ సురా 18వ ఆయత్లో అల్లాను, దేవ దూతలు మరియు జ్ఞానసంపన్నులు, ఈయనే మీ అల్లా అని చెప్పినారు. ఎవరు చెప్పినారు. అల్లాహ్ చెప్పినాడు కదా! జ్ఞాన సంపన్నులు చెప్పినారు కదా! దేవదూతలు చెప్పినారు కదా! ఈయనే అల్లాహ్ అని ఎవరైతే రెండవ అల్లాను చూపించినారో ఆయనే మనకు అల్లాహ్. ఒక్కడే అల్లాహ్ ప్రపంచానికి అంతా, మీరు హిందువులకు ఒకడే దేవుడు, ఆత్మే దేవుడు. క్రైస్తవులకు ఒకడే తండ్రి. ప్రపంచానికంతా ఒకడే తండ్రి, మీరు ఎవరినీ


----

మ్రొక్కకూడదు. తాతను మ్రొక్కకూడదు. పరిశుద్ధాత్మను ఏమాత్రము మ్రొక్కకూడదు. నా కుమారుని గౌరవిస్తే నన్ను గౌరవించినట్లే అని చెప్పలేదా! చెప్పినాడు. మళ్లీ ఇవన్నీ వృథా మాటలా. ఇవన్నీ దైవ గ్రంథములో ఉండే మాటలు. ఇవన్నీ కాదని మీరు ఎందుకు పోతున్నారు అని నేను అడుగు తున్నాను. మూడు దైవగ్రంథములలోని మాటలు విడదీసి విడదీసి చెప్తున్నాను. ఎంతోమంది ఆసక్తిగా ఇక్కడికి వస్తున్నారు. మీకు క్రొత్త జ్ఞానాన్ని తెలియ జేయాలనే ఉద్ధేశ్యంతో మీకు బాగా అర్థమయ్యేరకంగా ఎన్నో కోణాలలో, ఉన్న జ్ఞానాన్ని మూడు ఆత్మల జ్ఞానాన్నే, ఎన్నో కోణాలలో మీకు చెప్తున్నాను. ఎన్నో కోణాలలో మీకు గ్రంథాలు వ్రాయడం జరిగింది.


ఇప్పుడు మీకు క్రొత్త గ్రంథము ఒకటి వచ్చింది. రేపు పౌర్ణానికికంటే ముందు వారం లోపల ఇచ్చేస్తాము అది. మీకు మరలా రేపు నెలలో 94వ గ్రంథము మీకు వచ్చినట్లు అవుతుంది. అది కూడా మీకు క్రొత్త కోణంలో చూపించినాము. ఈ రకంగా లెక్కేసుకుంటాపోతే, మీకు జ్ఞానమంతా విపులంగా అర్థమయ్యే రకంగా చెప్పుతూ వస్తున్నాము. మీకు అర్థమయితా ఉంది. మీరు కొంతమంది నిలబడి మట్లాడుతున్నారు. మీ మాటలు చూస్తే, నాకంటే బాగా మాట్లాడుతున్నారు మీరు. నేనే సరిగా మాట్లాడలేదుగానీ, నాకంటే బాగా మాట్లాడుతున్నారు. నాకంటే బాగా అర్థమయింది మీకు కొంతమందికి. అందరికీ అర్థమయిందో లేదోగానీ, కొంతమందికి చాలా బాగా అర్థమయింది. చిన్న పిల్లోల్లకు కూడా బాగా అర్థమయింది. మాకు అదే సంతోషము. ఈ రోజు ఒక గ్రంథాన్ని గురించి ఒక ఆయన చెప్పుతూ ఉంటే మాకు సంతోషమైనది. మేము వ్రాసిన గ్రంథాన్ని ఎంత బాగా అర్థము చేసుకున్నాడు అని. మేము పడే శ్రమకు ఇప్పుడు ఓపిక తక్కువ అయిపోయింది. వయస్సు ఎక్కువ అయిపోయి, అయినా రాత్రి పూట


---

కూడా మేము వ్రాస్తూ ఉన్నాము. ఇంతకుముందు వ్రాసినంత వేగంగా వ్రాయలేపోతున్నాము అని ఇబ్బంది పడుతూ వ్రాస్తూ ఉన్నాము గానీ, మేము వ్రాసిన గ్రంథాన్ని చదువుకొని, దానిని తెలుసుకొని పొగుడుతూ ఉంటే, అంటే కొడుకును పొగుడుతూవుంటే తండ్రి ఎట్ల సంతోషపడుతాడో అట్ల మేము సంతోషపడుతున్నాము.


మా గ్రంథాలన్నీ అంటే మా కుమారులందరు బాగా మీ చేత ప్రశంసింపబడాలని మేము కోరుకుంటున్నాము. అంటే గ్రంథాలన్నీ మీరు బాగా అర్థము చేసుకోవాలని కోరుకుంటున్నాము. నేను చెప్పినేది ఒక మతానికి సంబంధించిన బోధకాదు. నాకు తాలు అనేటివి ఏమాత్రము సంబంధం లేదు. నేను చెప్పినేది సమస్త మానవులకు సంబంధించిన జ్ఞానం చెప్పుచున్నాను. మీరు అర్థం చేసుకోండి. బాగా ఆలోచన చేయండి. నేను ఏదో చెప్పుచున్నానా వేరే విరుద్ధమైన జ్ఞానం. ఖురాన్లో జ్ఞానమే చెప్పుతున్నాను మీకు, బైబిల్ జ్ఞానము చెప్పుతున్నాను మీకు, మీకు భగవద్గీతలోని జ్ఞానమే చెప్పుతున్నాను. ఎక్కడైనా తేడావుందా చెప్పండి. ఎక్కడైనా చూపగలరా తేడా ఉందని, చూపలేరు. ఎవరైనా చూపగలరా తేడా ఉందని, చూపలేరు. కానీ కొంతమంది అజ్ఞానులు ఏమి చేస్తారంటే, ఆయనను దేవుడు కాదన్నాడు, ఈయనను దేవుడు కాదంటే ఉండేది ముగ్గురేరా నాయన, ఉండేది ముగ్గురు. అయితే అందులో ఒకడే దేవుడు. ఇంకోడు ఏమి కనపరాకుండా ఉంటాడు ఆయన. ఉండేది ఒకడే దేవుడు. ఒకడే దేవుడు అయినపుడు అంతమంది దేవుళ్ళు అని ఎలాగా చెప్పాలి నేను. నీ మాదిరి నేను ఏమన్నా అజ్ఞానినా చెప్పేదానికి. విఘ్నేశ్వరుని దేవుడు కాదన్నాడు. ఎందుకు కాదంటాడు. మీకు వద్దు మీకు ఓపిక ఉంది మీరు చేసుకోండి. నేను ఆయనను కాదని చెప్పలేదు. రాముడు


---

దేవుని కాదన్నాడంట. నేను ఎప్పుడు చెప్పినాను దేవుడు కాదని. అసలు వాళ్ళ ప్రసక్తే రాలేదే. ఇంతసేపు ఒక గంట నుంచి మాట్లాడుతున్నాము

వాళ్ళ ప్రసక్తి ఏమన్నా తీసుకొచ్చామా దేవుడు కాదు అని, మన జ్ఞానము మనము చెప్పుకుంటున్నాము. వీళ్ళు దేవుళ్ళు అని వారి పేరు పెట్టి ఎవరూ దేవుడు కాదని నేను చెప్పలేదు. మీకు ఓపిక ఉంది. మీరు మ్రొక్కుకోండి. మీరు అజ్ఞానంలో పోండి అట్లా, మీ చేతనయితే అట్లే పోండి.


అదే చెప్పిండేది ఏసుప్రభువు, ఏమి చెప్పినాడు బైబిల్లో “నేనే ఆయనని తెలియనంత వరకు మీ పాపాల్లో మీరు పడి పోండి” అన్నాడు. నేను పైన ఉన్నావాన్ని, మీరు క్రిందవున్నవారు. నేను పైనున్న వానినని తెలియనంతవరకు, మీ పాపంలో మీరు పడి పోండి. నేను పోతున్నాను, ఎక్కడికి పోతున్నాను మీకు తెలియదు. నేను వెళ్ళే చోటికి మీకు తెలియదు.

నేను పోయేచోటికి మీకు తెలిసేంతవరకు మీ పాపాల్లో మీరు పడిపోండి అని చెప్పాడు. చావుపోండి అని చెప్పాడు. చెప్పలేదా! చెప్పినాడు. మీరు జ్ఞానం తెలుసుకోండి అని చెప్పితే, నన్ను అట్లపోయి, ఇట్ల పోయి నన్ను భ్రష్టుపట్టియాలని చూస్తారు. నన్ను ఫేస్బుక్లలో పెట్టి అది పెట్టి ఇదిపెట్టి ప్రతిరోజు ఏదో ఒకటి ఆరోపణలు చేస్తూ వున్నారు. నేను ప్రతి దానికి జవాబు ఇచ్చాను. ఇప్పుడు వచ్చిన బుక్లో ఇందూ ధర్మమునకు రక్షణ అవసరమా. మీరందరు ఎందుకు పెట్టుకొన్నారు పేర్లు. దేవుడు ఎందుకు రావాలి. మీరంతా రక్షించినపుడు దేవుడు ఎందుకు రావాలి. సరే మేము చూస్తూవున్నాము 30 సంవత్సరముల నుంచి ఆ సంఘం, ఈ సంఘం, ఆ మతంలోకి పోతున్నాము, ఈ మతంలోకి పోతున్నాము, వానిని పోనీకుండా చేసి, వీన్ని పోనీకుండ చేసి అన్ని రక్షణ సమితులు చేసుకున్నాము. ఇన్ని రక్షణ సమితులు ఉంటే మీ మతము ఎందుకు క్షీణిస్తూవుంది అయితే మా


----

సిద్ది బోధ

మతము క్షీణించి పోతావుంది. ఎట్లా పోతావున్నారు మీరంతా రక్షించే వాళ్ళు ఉంటే, మీరు రక్షించాలికదా! మీ మతము క్షీణించకుండా చూసుకోవాలి కదా! లేదు మా మతము క్షీణించిపోయింది. దాంట్లోకి పోతారు. వాళ్ళు జ్ఞానం చెప్పుతారు. వాళ్ళు నచ్చి పోయారు. మీరు జ్ఞానం చెప్పండి.


మీరు ఏమన్నా ఒక్కమాట చెప్పుతారా జ్ఞానం లేదు. వాన్ని మ్రొక్కు వీన్ని మ్రొక్కు అని చెప్పుతారు. తీర్థము పై నుంచి పోస్తారు క్రిందికి ముట్టుకోకుండా. ప్రసాదం పై నుంచి వేస్తారు. ఇన్ని వివక్ష చూపుతుంటే ఏమి చేస్తారు, ఇతర మతాలలోకి పోక. మీరు జ్ఞానం చెప్పండి. భగవద్గీత ఇచ్చినాడు, భగవద్గీత జ్ఞానం చెప్పండి మీరు. మీరు స్వచ్ఛమైన హిందువులు అయితే మీరు చెప్పండి. ఇష్టము వచ్చినట్టు ఆ పూజ చేయి, ఈ పూజ చేసుకుంటా కూర్చోని అయితే ఎవరిని గుళ్ళలోకి రాకుండా బైట నిలబెట్టి పూజ చేస్తే, ఇదెందుకు, అదేమేలు కదా! బాగుంది అని పోతారు దాంట్లోకి, అది మీలో తప్పు పెట్టుకొని, ఇంకొకరిని ఎందుకు అనాలి. సరే మీ చావు మీరు చస్తావున్నారు. మా జ్ఞానం మేము చెప్పుకుంటున్నాము. నన్ను ఎందుకు విమర్శించాలి. మా బుక్ వల్ల కర్మలు పోతున్నాయి. మీరు బుక్కులు నమ్ముకోండి. జ్ఞానం తెలుసుకోండి జ్ఞానం వలనే మీ కర్మలు పోతాయి అంటే హాస్పిటల్స్ ఎందుకు డాక్టర్లు ఎందుకు అంటే ఎందుకు నేను కూడా అడుగుతా నమ్ముకుంటే ఏమి అవసరం లేదు. ఎందుకు అంటే నమ్మకం లేని వానికి బుక్కులు ఏమి పని చేయవు. నమ్మకం ఉండేవానికి మా బుక్కులు పని చేస్తాయి. నమ్ముకో నా బుక్కుల దగ్గరికిరా, బాగా కాకపోతే అడుగు. ఎంతోమందికి బాగయినాయి కదా! మా బుక్కులు అతుక్కున్నాయి కదా! ఎందుకు అతుక్కున్నాయి భూతద్దం పెట్టిచూడు ఏమన్నా


----

బంక వేసి కరిపిచ్చినామా మీ చేతనయితే అయితే అదెలా అర్థం కాదు. ఆసుపత్రుల్లో ఏమి చేయాలంటే ఆసుపత్రులు మూసివేస్తాము. అందరిని పిలుచుకొని వస్తాం. మీరు బాగా చేస్తారంటే, దేనికి చేస్తాము. నమ్ముకున్నోనికి ఇది ఉపయోగపడుతుందని చెప్పుతున్నాము కానీ నమ్మకం లేనివానికి ఇది ఉపయోగపడదు. నీవు విమర్శించినావా నీకే ముప్పు. నీకు శిక్షపడుతుంది తప్పదు. దేవుడు కఠినంగా శిక్షించేవాడు అయితే దేవుడు దయామయుడు అని పాపాలను క్షమిస్తాడు. నీవు మంచిగా ఉంటే క్షమిస్తాడు. చెడ్డగా ఉంటే శిక్ష వేస్తాడు. దేవునికి ఈ రెండు చేతనయితాయి.


కాబట్టి దేవుని ఎడల మంచిగా ఉండేది చూసుకో, నీవు విమర్శ చేయవద్దు. నీవు అజ్ఞానిగా ఉండి అందరిని అజ్ఞానులు అంటే ఎట్ల చెప్పు. నేను ఇంతమందికి జ్ఞానం చెప్పుతున్నాను కాబట్టి ఇంతమంది వచ్చారు. ఇంతమంది తెలుసుకుంటున్నారు. ఈ ఊర్లో ఉండే వాళ్ళు నన్ను విమర్శిస్తే, అంటే వాళ్ళకు జ్ఞానం లేదనే కదా! అర్థము. ఇక్కడికి వచ్చిన వాళ్ళు శ్రీకాకుళం నుంచి వచ్చినారు, చివరి జిల్లా, ఇంకా రాయఘడ్ నుంచి వచ్చారు 1000, 1200 కిలోమీటర్ల నుంచి వచ్చినారు. కానీ ఇక్కడ 10 గజాల దూరంలో ఉండేవాళ్ళు రాలేదు. వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు రాలేదు. వాళ్ళ గురించి మనకు సంబంధం లేదు. కానీ మీరెందుకు నన్ను అజ్ఞానులు అంటున్నారు. అజ్ఞానులైతే ఇంతమంది ఎందుకు వస్తారు చెప్పండి. ఇప్పుడు ఇంతమంది వచ్చి జ్ఞానం చెప్పుతారని నోరు తెరుచుకొని, కళ్ళు తెరుచుకొని వింటున్నారు. చెవులు పెట్టుకొని వింటున్నారు. తెలిసిన దానితో బాగా శ్రద్ధగా ఆలకిస్తున్నారు. దీనిని గంటసేపు చెప్పు, 1. 1/2 గంటలు చెప్పు, ఏమాత్రం కదలకుండా కూర్చున్నారు. వారికి టైమే తెలియలేదు. నేను తొందరగా చాలిస్తే అంత తొందరగా అయిపోయిందా


----

అనుకుంటున్నారు. చెప్పేది మైమరచి వింటున్నారు. నేను చెప్పేది ఏమి మీ జీవితాలకు సంబంధించిన విషయం. ఇది బయట లాభాలకు సంబంధించిన విషయం కాదు. బయట లాభాల గురించి చెప్పినానా, చెప్పలేదు. బయట లాభం గానీ, స్వంత లాభం గానీ ఏ లాభంగానీ నీకు సంబంధం లేదురా! నాయన. నీవు ఊరుకుండు అని చెప్పుతున్నాము.


నీవు పిల్లోనివి, మీ అమ్మచాటున, మీ నాయన చాటున బ్రతికినోనివి నీవు, అర్థమయిందా! కాబట్టి నీకు ఏమి సంబంధం లేదు. బతికిచ్చే వాళ్ళు వాళ్ళు, ఆలన పాలన చేసేవాళ్ళు, వాళ్ళు చేస్తారు. నీ తండ్రి, తల్లి చేతకాకపోతే తాతవున్నాడు ఆయన చూసుకుంటాడు. ఆయన ఏమి అనుకుంటే అది అయితాది. చెప్పలేదా చెప్పు ఖురాన్లో స్పష్టంగా చెప్పినాడు. ఆయన అయిపో అంటే అయిపోతుంది. అనుకుంటే ఏమైనా అవుతుంది. చెప్పలేదా! చెప్పినాడు. ఆయన ఎవరు తాత దేవుడు. తండ్రి దేవుడు ఉ న్నాడు. నీకే ఆయనే ఆరాధ్యదైవము. ఆయనను మ్రొక్కాలి. ఒకడే అల్లాహ్ నీకు. నీవు ఆరాధించవలసిన అల్లాహ్ ఒకడే. నీకు ఇద్దరు అల్లాలు నేను చెప్పలేదు. ఇద్దరు అల్లాలు నీవు పెట్టుకోకూడదు. ఒక్కడే దేవుడు నీకు కూడా. క్రైస్తవులకుగానీ తండ్రి ఒక్కడే దేవుడు, నీ తండ్రి ఒక్కడే దేవుడు అని ఎప్పుడైతే నమ్మినావో, తాత విషయం నీకు తెలుస్తుంది. తండ్రిని నమ్ముకో తండ్రికి చేతకాకపోతే తాత చూచుకొంటాడు. ఒక అమ్మాయి ఉంది ప్రస్తుతానికి, ఆమె హార్ట్లో రంధ్రము పడింది, బ్రతకదు అని చెప్పి డాక్టర్లు పంపించారు. ఇది చివరి స్టేజి వదులుకోండి అని పంపించారు. సరే ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. మేము ఏమని చెప్పినామంటే, చూడమ్మా ఇది లోపము, రోగము కాదు, రంధ్రము పడింది సరిచేసుకోవచ్చు, పూడ్చుకోవచ్చు, వాళ్ళు పూడ్చలేదు ఇది నిలబడదు అన్నారు. వాళ్ళు చేతులు


---

ఎత్తేసినారు డాక్టర్లు, అయితే అది ఏమో నాకు తెలియదుగానీ, నీవు దేవున్ని నమ్ముకో ఆయన ఏమి చేస్తే అది అవుతుంది. ఇట్ల అయితాది అట్ల అయితాది నేను చెప్పను. అది నీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది. నీ కర్మను బట్టి ఉంటుంది అని చెప్పాము.


అట్లగానే మేము చెప్పుతాము అంటే మేము ఇది చేస్తూవున్నామని నా మీద ఎప్పుడు నేను పెట్టుకోలేదు. చేస్తే ఆయన చేయాలి, ఆ మూల వుండే ఆయన పెద్ద ఆయన. లేకపోతే రెండవ ఆయన చేయాలి, మీ తండ్రి. మీ తండ్రి అన్న చేయాలి, మీ తాత అన్న చేయాలి. నీతో ఏమీకాదు. అనుభవించే వానివే నీవు, నేనుండాను నా స్టేజి కూడా నాది అంతే. నాకు ఒక తండ్రి ఉన్నాడు, నాకు ఒక తాత వున్నాడు. నేను చిన్న పిల్లవాన్నే, నేను ఏమీ చేయలేను. నేను దారి చూపిస్తా ఏమని, మా నాయన మా తాత ఎట్లు ఉన్నాడో మీ నాయన, మీ తాత అట్లే ఉన్నారు. మా తాత ఏమి చేస్తాడో మీ తాత అదే పని చేస్తాడు. మా నాయన ఏమి చేస్తాడో, మీ నాయన కూడా అదే చేస్తాడు కాబట్టి మీ నాయనను, మీ తాతను నమ్ముకో నేను ఏమి చేసేవానిని కాదు అని చెప్పుతా. ఒక ఆయన చదివినాడన్న మాట. ఆయనకు నువ్వే తాతవి అని చదివినాడు, నువ్వే తండ్రివి అని చదివినాడు నువ్వే తల్లివి అని చదివాడు. ఒక ఆయన లిస్టు వ్రాసుకొని చదివినాడు చూడు ఆయన. ఆయన భావం మంచిదేగానీ నేను మాత్రంకాదు అని చెప్పుతున్నాను. ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాను. నేను మీటింగ్ చెప్పుతున్నాను నాకు తెలిసి ఏమి చెప్పలేదు. ఇక్కడకు వచ్చి కూర్చునేంత వరకు నాకు ఏమీ తెలియదు ఆ విషయం. మీకు ఒక అంశము ఇచ్చినాము చెప్పుతామని, అది ఏమి చెప్పాలో ఆయనే చెప్పుతాడు. ఎవరు తండ్రి, ఆయన తాతకు సంబంధము లేదు. తండ్రి ఏమి చెప్పినా చెప్పాలి. ఆయన


---

ఏమి చెప్పుతాడో చెప్పుతాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఒక శక్తి అనే దాని గురించి విడదీసి చెప్పినాను, కనిపించే శక్తి ఒక రకము ఉంది, కనపరాని శక్తి ఒక రకము ఉంది. కనిపించే శక్తి ఈయనే చేస్తాడు. కనపరాని శక్తి ఆయన ఉన్నాడు. ఆయన ఏమైనా చేస్తాడు. అని చెప్పలేదా! చెప్పినాము.


మాట్లాడేవాని ప్రతి మాట నీ తండ్రియే మాట్లాడుతున్నాడు, నీవు మాట్లాడలేదు అని బైబిల్ స్పష్టంగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో చెప్పబడింది. ఈ విధంగా లెక్కేసుకొని పోతే, నీ తండ్రి మీతో మాట్లాడుతున్నాడు, నా తండ్రి నాలో నుంచి మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడలేదు, నేను పిల్లవాన్ని నాకు ఏమీ తెలియదు. నేను గ్రుడ్డివానిని, మూగవానిని. ఈ రకంగా అన్ని ఏమీ తెలియకుండా చిన్న పిల్లవాడు ఎట్లు ఉన్నాడో అట్ల ఉన్నాము. ఇక్కడి నుంచి ప్రక్కకు పోలేదు. ప్రక్కనుండి ఎక్కడికి పోలేదు. చిన్న పిల్లవాడు ఎట్లు ఉన్నాడో ఆ విధంగా చూడలేడు, వినలేడు, కదలలేడు, మెదలలేడు ఎవరు, జీవాత్మ చెప్పినాను కదా! ఇంతకు ముందు చెప్పినాము ఆ మాట మీకు జ్ఞాపకం ఉందో లేదో. ఇప్పుడు చేసేవాడు ఎవడు, మీ నాయన మీ తండ్రి. సరే చూసేవాడు ఎవడు, తాత ఒకడున్నాడు. ఇది లోకానికి మొత్తం తెలియదు. మీకు ఇంతకుముందు తెలుసునా చెప్పండి ఎవరన్నా తెలిసింటే తెలియదు, లోకానికి మొత్తం తెలియదు. బోధకులుగా ఉన్న వాళ్ళకి తెలియదు. సామాన్య ప్రజలకు ఏమి తెలుస్తాది. కాబట్టి ఈ రహస్యం అనేది మీకు తెలియబడింది. ఈ రహస్యం గ్రంథములో ఉంది, నేను చెప్పినేది కాదు. గ్రంథములో చూపిచ్చి చెప్పుతున్నా నేను. అది మీరు అర్థం చేసుకోండి. ఇది లోకానికి చాటండి. ఈ విషయం లోకానికి చాటితే మీరు ధన్యాత్ములు అవుతారు. ఎందుకంటే మీరు బోధకులు, మీరు చాటినారు అనుకోండి దేవుని సేవ నూటికి


----

నూరుపాళ్లు చేసినట్లవుతుంది. ఆయన పని మనం చేసినట్లవుతుంది. సత్యాన్ని ప్రకటించినట్లవుతుంది.


ఏసు చెప్పినాడు “నీ విరోధులు కూడా నిన్ను ఎదురాడని జ్ఞానాన్ని అందిస్తాను” అని. నీ విరోధులు కూడా నిన్ను ఎవరూ ప్రశ్న వేయలేరు. ఏ ప్రశ్నకైనా జవాబు ఉంది. అని ఆయన చెప్పినాడు నీకు, నీ విరోధులు కూడా ఎదురాడని జ్ఞానాన్ని నీకు అందిస్తాను చూడు అని చెప్పినాడు. ఆ జ్ఞానాన్ని మనకు అందించినాడు మీరు తెలుసుకోండి. గ్రంథము రూపంలో అనేకమైనటువంటి విషయాలు మీ దగ్గరకు వచ్చాయి. ఈ అనేకమైన విషయాలు మీరు తెలుసుకుంటూ పోయేకొద్దీ ప్రతి నెల, ప్రతి సంవత్సరము మీరు జ్ఞానంలో పెరుగుతా వస్తున్నారు. మీరు రెండు సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నారు. సంవత్సరం క్రితం ఎట్ల ఉన్నారు, ఇప్పుడు ఎట్లు ఉన్నారు చూసుకోండి. మార్పు ఉందా లేదా, జ్ఞానంలో మార్పువుంది. కాబట్టి ప్రతి గ్రంథము మిమ్ములను మారుస్తావుంది. ప్రతి గ్రంథము మిమ్ములను ఒక మలుపు తిప్పుతూ, జ్ఞానంలో ముందుకు తీసుకొని పోతావుంది. మీరు ముందుకు పోయోకొద్ది, పోయోకొద్ది దగ్గర అవుతున్నారు. కానీ మనము ఎక్కడికి చేరాలి. పరలోక రాజ్య చేరాలి, మోక్షానికి చేరాలి అర్థమయిందా! స్వర్గానికి కాదు, స్వర్గం ఇక్కడనే ఉంది. ఇంక ఎక్కడికి పోవాల్సిన పనిలేదు. డబ్బులున్న వాళ్ళకి స్వర్గం ఉంది. ఆ స్వర్గం మనకు ఇక్కడనే ఉంది. ఆ స్వర్గంతో మనకు పనిలేదు. తాత ఉండే చోటుకి పోవాలి మనము. తండ్రి పని చేస్తావుంటాడు. ఆయన కూడా వద్దు మనకు, మన తాత పని చేయక ఉన్నాడు చూడు, అక్కడికి పోవాలి తాత దగ్గరికి మనము. ఎవరి వంశస్థులము, తాత వంశస్థులము మనము, అర్థమయిందా! ఏ వంశము నీది అల్లాహ్ వంశము. దేవుని వంశము నీది అర్థమయిందా. పరిశుద్ధాత్మ


----

వంశము నీది, అక్కడికి పోవాలి. అక్కడికి పోవాలంటే ఈ జ్ఞానం తెలుసుకోవాలి. దీనిని మీరు తెలుసుకొన్నేది తెలుసుకున్నట్లు ప్రకటించండి. బోధకులే కాదు, మీరంతా బోధకులే ఈ రోజు ఎక్కడికి పోయి చెప్పినా కూడా అది బోధ అవుతుంది. మీరందరూ ప్రకటించండి. వీళ్ళు చెప్పవచ్చు, వీళ్ళు చెప్పకూడదు అనేది లేకుండా ప్రకటించండి.


కానీ మీరు గురువులుగా చెలామణి కావద్దండి. అది పెద్ద పీకులాట, కొంతమంది కొంచెం నేర్చుకుంటూనే అప్పుడే గురువుగా పోయి, నాకు దక్షిణ పెట్టు, గుడ్డలు ఇవ్వండి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంతకు ముందు అట్ల చేసి ఇక్కడ నాతో దూరంగా పోయినారు. వాళ్ళు బయటికి పోయి రెండు మాటలు నేర్చుకుంటూనే అప్పుడే గురువుగా చలామణి అయి, ఆయన ఎక్కడ బయటికి వచ్చే గురువు కాదు, నేనే బయటకు వచ్చే గురువుని మీరందరికి జ్ఞానం చెప్పే గురువుని, నేనే మీ అందరికి గురువు నేనే అని చెప్పుకున్నారు. గురువుకు దక్షిణ ఇవ్వాలి కదా! వాళ్ళు దక్షిణలు ఇస్తే వీళ్ళు జేబులో పెట్టుకొని వచ్చినారు. నేను ఎప్పుడు చేయలేదు ఈ పని మీరెందుకు చేస్తూన్నారని అంటే వాళ్ళు ఇట్లా అలవాటు అయినారు. నేను గుడ్డలు తీసుకోలేదు, దక్షిణలు తీసుకోలేదు. మీరు ఎందుకు తీసు కుంటున్నారు, పనికి మాలిన పని. ఈ పని చేయవద్దండి. తెలిసిన జ్ఞానాన్ని బోధించండి. అది దేవుని సేవ అవుతుంది, నిజమైన దేవుని సేవ అవుతుంది. అది ఇతరులకు చెప్పండి. చాలామంది ఏమి చేశారు, రోజు మతాలలో మునిగిపోయి, మతం మత్తులో ఏమి చేస్తున్నారంటే మతాన్ని బోధిస్తున్నారు తప్ప జ్ఞానాన్ని బోధించడంలేదు. మీరు చెప్పండి ఇది మతమా ఇది జ్ఞానము. బైబిల్ జ్ఞానము ఉంది, భగవద్గీతలో జ్ఞానం ఉంది. ఖురాన్ రెండు గ్రంథాలు వ్రాసినాను వజ్రవాక్యాలు, జ్ఞానవాక్యాలు. పెద్ద గ్రంథాలు. బైబిలు


----

చిన్న గ్రంథము 300 పేజీలు పైన మేము వ్రాసినేది. భగవద్గీత 700 పేజీలే. 1500 పేజీలు గ్రంథము ఉంది. ఖురాన్ అది 700 వందలే ఇది మూడు వందలే 1500 పేజీలు ఖురాన్ వ్రాసినేది. నేను వజ్ర వాక్యాలు వ్రాసాము దానిలో అవి వజ్రాలే కాదు. వజ్రాలకంటే గొప్ప వాక్యాలు. అంత గొప్ప వాక్యాలుగా ఉన్నాయి.


పవిత్ర ఖురాన్లో ఉండే వాక్యాలు. “ఘనమైన రాత్రి” అని ఒకటి

ఉంది. అది చదివితే చాలు మీది జన్మ సార్థకము అయినట్లే   అసలుకు . వజ్ర వాక్యాలలో అంత బాగావుంది అన్నమాట. చాలామంది చదివినవాళ్ళు చెప్పుతున్నారు ఘనమైన రాత్రి అద్భుతంగా వ్రాసారని. నేను వ్రాసినేది కాదు. చెప్పినోడు అద్భుతమైన వాడు. ఘనమైన రాత్రి అని ఏమి చెప్పినాడు, ఎంత బాగా చెప్పినాడు, ఘనమైన రాత్రి అని. చెప్పినోడు ఎవరు అల్లాహ్, ఆయన గొప్పవాడు. ఆయన విధానం తెలియకుండా పోతే ఏమాత్రం ప్రయోజనం లేదు. ఆయన విధానం తెలుసుకోవాలంటే ముందు నీ శరీరంలో నీవు చూసుకో, నీ శరీరమే ఒక ఇల్లు, నువ్వు బయట ప్రపంచములో ఏ కులములోనైనా పుట్టిండు ఫరవాలేదు. హీనమైన కులమయిన ప్రజల దాంట్లోనే, అట్లగానే నీవు మనిషివా కాదా అని చెప్పు, అంతే నాకు కావల్సింది. కులము, మతము సంబంధం లేదు. నీవు మనిషివి లేదు నేను ముస్లీమ్ అంటే ముస్లీమ్ అయినా మనిషివే. దేవుడు ఎవరికి చెప్పినాడు. మనుషులకు చెప్పినాడు, ముస్లీమ్లకు చెప్పలేదు. ఖురాన్ గ్రంథములో “సమస్త మానవులకు హితోపదేశిని” అని చెప్పినాడా! ముస్లీమ్లకు అని చెప్పినాడా! లేదు బైబిల్లో ఏమి చెప్పినాడు “సమస్త జనులారా నా వద్దకు రండి” అని అన్నాడు గానీ, క్రైస్తవులు మాత్రమే నా దగ్గరికి రమ్మని చెప్పలేదు.


---

అయితే ఎక్కడన్నా భగవద్గీతలో కృష్ణుడు హిందువులకు అని బోధ చెప్పినాడా! ఆ పదమే వాడలేదు. అలాంటపుడు మీరు ఎందుకు అనుకుంటున్నారు. ఇది ముస్లీమ్లది, ఇది క్రైస్తవులది మీరంతకు మీరు పేరు పెట్టుకొన్నారు. ఖురాన్ ముస్లీమ్లది అని ఎవరు చెప్పినారు. అక్కడ ఎక్కడైనా ఉందా! సర్వమానవులది అందిరిది. దానిని నీవు చదువయ్యా! నీవు వేరేవాళ్ళ గ్రంథమని ఎలా అంటావు? ఎవడు అన్నాడు వేరే వాళ్ళ గ్రంథమని, నా గ్రంథము అంటాడు ఏ దానిని ఖురానన్ను. అట్లగానే బైబిలు చదువు, ఇది క్రైస్తవులది అంటామా మనము లేదు, ఖురాన్లో 5వ సురాలో 44, 46, 48 వచనాలలో, 5వ సూరా 68వ వచనంలో కూడా అదే చెప్పబడింది. ఏమి చెప్పినారు అంటే ఈ మూడు అంటే బైబిల్ ఖురాన్ అంటే భగవద్గీతలో సంబంధించినవే అని సాక్ష్యం చెప్పింది ఖురాన్. ఈ మూడు గ్రంథాలలో ఉండేటటువంటి తౌరాత్లో ఉండే జ్ఞానమే మిగతా రెండు గ్రంథాలలో ఉందని సాక్ష్యం చెప్పింది, ఏది ఖురాన్ చెప్పింది. మూడు గ్రంథాల సారాంశము తెలియకపోతే వాడు ఏ మతములో లేనట్లే, ఏ ధర్మములో లేనట్లే, బైబిల్, ఖురాన్, భగవద్గీత ఈ మూడు ధర్మాలు తెలియకపోతే వాడు ఏ ధర్మములో లేనట్లే, మూడు తెలిసివుండాలి. నాది అని ఒక బుక్ పట్టుకుంటే ఏమి ప్రయోజనం లేదు. నాది ఖురాన్ అని ఒకటి చదివితే ఏమి ప్రయోజనం లేదు. మిగతా వాటిని కూడా చదువు బైబిల్ కూడా చదువు, ఎవరు వద్దన్నారు. సరే అట్లా దిక్కు తెలియదని నేను ఏమి చేశానంటే మూడు గ్రంథాలు వ్రాసి ఇచ్చినాను. వెతికి వెతికి వ్రాసి ఇచ్చినాము. అంత గందరగోళం పడకుండా ఏవి ముఖ్యమైనవో వెతికి వ్రాసియిచ్చినాను.


మూడు గ్రంథాలు మీ ముందువున్నాయి. ఇంకా కూడా నేను ఏమి చేసినాను చాలామందికి ఇక్కడ బైబిల్ ఇచ్చినారు, ఖురాన్ ఇచ్చినారు,


---

భగవద్గీత ఇచ్చినాము మనము. ఉచితంగా బైబిల్, ఖురాన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ద్వేషంతో ఇవ్వలేదు. ఉచితంగా ఇస్తున్నాము కదా! అది చదువుకోండి, ఇది మంచిది అని చెప్పి ఇచ్చినాము కదా! దానిమీద ద్వేషాలు చూపేదానికి ఉంటే మేము ఎందుకు ఇస్తాము. మేము ఎందుకు దానం చేస్తాము, ఎవరినో హైదరాబాద్లో అడుక్కోని వచ్చి ఇక్కడ ఎందుకు దానం చేస్తాము, చెప్పండి. దాంట్లో ఎంత గొప్ప సారాంశం ఉంది అని హైదరాబాద్లో ఖురాన్లు అన్నీ అడిగి అడిగి అడుక్కొని అడుక్కొని, తీసుకొచ్చుకొని తెలుగులో వ్రాసిన ఖురాన్లు మీకు చాలామందికి ఇచ్చాము. అయితే ఇవన్నీ మేము చేస్తూ ఉన్నామంటే సర్వమానవులు ఒకటే అనే ఉద్దేశ్యంతో చేస్తున్నాము. నీవు మనుషులలో కులము, హిందువులలో ఏ కులం అన్నాగానీ నాకు సంబంధం లేదు. మనుషులలో ఏ మతమైనగానీ నాకు సంబంధం లేదు. నేను చెప్పే జ్ఞానం ఒకటే. నీ శరీరంలో ముగ్గురు ఉన్నారు పురుషులు, ఒక స్త్రీ ఉంది. వారిలో నీవు చిన్న పిల్లవానివి, తల్లిపాలు త్రాగుతున్నావు. తండ్రి ఆస్తులన్నీ తీసుకుంటున్నావు, రెండు జరుగుతున్నాయి. నీకు నీవు కదలలేవు, మెదల లేవు, అటువంటి స్థితిలో ఉన్నావు. నీ తండ్రి నిన్ను పోషిస్తున్నాడు. అర్థమయిందా! నీకేమైనా ఆయన మేలు చేస్తాడు. ఆయన అనుకుంటే అది అయితాది. ఏదైనాగానీ ఈ విధానం మీకు సింపుల్గా చెప్పినాను ఒక కుటుంబము, ఒక ఇల్లు అని పోల్చి నీ శరీరాన్ని ఇల్లు చేసుకో, నీ శరీరంలో ఈ కుటుంబం ఉందని చూసుకో, నీకు జ్ఞానం అర్థమవుతుంది. భగవద్గీత అంతా పిండిన ఇదే ఉంది. బైబిల్ పిండినా ఇదే ఉంది, ఖురాన్ పిండినా ఇదే ఉంది. దానిలో ఎంత విపులంగా మనము వజ్ర వాక్యాలు వ్రాశాము, ఖురాన్లో జ్ఞాన వాక్యాలు వ్రాసినాము మీరు చదువుకోండి. ఎందుకు అర్థముకాదు. ఇప్పుడు చెప్పిన జ్ఞానమే అర్థమవుతుంది. వేరే జ్ఞానం ఏమి అర్థం కాదు.


---

ఈ మూడు విధానాలనే నేను మొట్టమొదట తెలుసుకున్నాను. ఏమిటది ఒక ఇల్లు, ముగ్గురు పురుషులు, ఒక స్త్రీ, ఒక శరీరము, మూడు ఆత్మలు, ఒక ప్రకృతి ఉంది అని తెలుసుకున్నాను నేను. నాకు భగవద్గీత సులభం అయింది. బైబిల్ సులభం అయింది. ఖురాన్ సులభం అయింది. ఈ మూడు తెలుసుకుంటే మీకు అన్ని సులభం అయిపోతాయి. ఈ రోజు నేను ఖురాన్ విచ్ఛలవిడిగా మాట్లాడుతున్నాను అంటే, నాకు మూడు తెలుసు కాబట్టి. ఈ రోజు నేను బైబిల్లో ఎవరికీ తెలియని క్రైస్తవులకు కూడా తెలియని రహస్యాలు చెప్పుతున్నాను అంటే ఎట్లా వచ్చింది నాకు. ఈ మూడు రహస్యాలు తెలుసు కాబట్టి. భగవద్గీత కూడా నాకు, మొట్టమొదటి నేను త్రైతసిద్ధాంత గ్రంథంగా వ్రాశాను అంటే ఎట్లు వ్రాశాను. ఈ విధానం తెలుసుకాబట్టి, ఇప్పుడు నీవు ఉన్నావు. నీ శరీరం ఉంది. బాగా ధ్యాస పెట్టుకోండి నేను చెప్పేది. నీవు ఉన్నావు నీ శరీరము ఉంది. నీ పండ్లు ఎత్తుగా ఉండాయో, నీ కళ్ళు సొట్టగా ఉన్నాయో, నీ మూతి అడ్డంగా ఉందో, సొట్టగా ఉందో నాకు తెలియదు కానీ, నీ లోపలుండే వాళ్ళు మాత్రము ముగ్గురే. నీవు అందంగా ఉండావో నాకు తెలియదు, అందరికి చెప్పుతున్నాను. నీవు ఎట్ల ఉన్నా మీలో ఉండేది మాత్రము ఈ ముగ్గురే. కాబట్టి ఈ ముగ్గురిని తెలుసుకుంటే మీకు ఒక అమ్మ ఉంది, ఒక తండ్రి ఉన్నాడు. ఒకతాత ఉన్నాడు, నువ్వు ఉన్నావు, నీవు ఏమిటికీ పనికిరాని వాడివి. పాలు త్రాగుతున్నావు, తండ్రి అల్లాడిస్తే అల్లాడిస్తున్నావు. నీవు అట్లా బ్రతుకుతున్నావు. చూడలేవు, వినలేవు, చేయలేవు ఏమీ చేతకాని వాడు నీవు, అని చాలాసార్లు నేను చెప్పాను.


ఆ విధంగా నీవు ఉన్నావు  నీ తండ్రిని నమ్ముకో, ఏదైనా నీకు జరుగుతుంది. నీకు అన్ని తండ్రి చేసిపెడుతున్నాడు. అన్ని ఆటలు


---

ఆడించేవాడు ఆయనే. అర్థమయిందా లేదా, నీకు అన్ని ఆటలు ఆడించేవాడు ఆయనే. తరువాత అన్ని చూస్తూ ఉండే వాడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఏమైనా చేయగలడు. ఈయన మిమ్మలను ఎటైనా పాలించగలడు. అందువలన ఈ చిన్న రహస్యాన్ని తెలుసుకుంటే గొప్ప జ్ఞానాన్ని తెలిసినట్లు అవుతుంది మీరు అంతేకదా! మీరు ఏ వాక్యంలో చూసుకోండి, ఈ చిన్న రహస్యము తప్ప ఏమి లేదు. ఈ త్రైత సిద్ధాంతాన్ని ముడివేసి నేను మూడు గ్రంథాలు చెప్పినాను, ఈ త్రైతసిద్ధాంతాన్నే మీరు తెలుసుకొనమనే ఈ రోజు మీకు జ్ఞానం చెప్పుతున్నాను. ఈ త్రైత సిద్ధాంతాన్ని తెలుసుకొనే సర్వమానవులు ఒక్కటే, ఏమాత్రము తేడా లేదు అని చెప్పుతున్నాను. ఈ త్రైత సిద్ధాంతాన్ని తెలుసుకొంటే ప్రపంచానికి అంతా ఒక్కడే అల్లాహ్, ఒక్కడే సృష్టికర్త, ఒక్కడే దేవుడు అని చెప్పుతున్నాను. నీకు వివరము అర్థము కాకపోతే నా దగ్గరకు వచ్చి అడగండి. నేను ఇంకో విధంగా చెప్పుతాను. ఇప్పుడు ప్రతినెల అదే కదా! చెప్పుతావుండేది, మీకు అర్థం కాలేదని, అర్థంకావాలి అని తీసి తీసి మల్లిచ్చి తిప్పిచ్చి అట్ల చేసి ఇట్ల చేసి చెప్పాలికదా! తిప్పి తిప్పి కాల్చినట్టు చెప్పుతానే ఉండాను నేను ఈ విషయాలన్ని. ఈ రకంగా మీకు రకరకాలుగా అనేక కోణాల నుంచి చెప్పుతున్నాను. అనేక కోణాలుగా గ్రంథాలు ఇస్తున్నాను. తెలుసుకోండి కాని బయట విమర్శించే వాళ్ళు వాళ్ళ పాపాలలో వాళ్ళు పడుతారు. వాళ్ళని ఏమాత్రం లెక్కచేయలేదు. ఎందుకంటే మనం కూడా వాళ్ళని ఏమి చేసేవాళ్ళము కాదు. తండ్రి అందరిని చూస్తూ ఉన్నాడు. ఆయన ఎవరికి ఏ శిక్ష వేయాలో అది తీర్పుదినాన ఆ శిక్ష వేస్తాడు. వాళ్ళవన్నీ లెక్కపెట్టుకుంటాడు. వాళ్ళ పాపాలన్ని చిట్టాకు ఎక్కుతున్నాయి. వాళ్ళను తీర్పుదినాలలో ఏ శిక్ష వేయాలనో ఆ శిక్ష వేస్తాడు. మధ్యలో జోక్యం చేసుకోడు అర్థమయిందా. ఈ రకంగా


---

ఇప్పుడు చెప్పిన వరకు జ్ఞానం అయితే అది కొంతమందికేమో నూటికి నూరుపాళ్ళు ఎక్కుతుంది. కొంతమందికేమో గ్రహించుకొనే శక్తి లేకుండా ఉంది. నేను అందుకే మొట్టమొదటనే చెప్పుతున్నాను. లోపల ఉండేటువంటి మీ తండ్రికి ఏమి చెప్పుతున్నాను అంటే, మీ తండ్రి నా తండ్రి ఒకటే. మీ దాంట్లో వేరు, నా దాంట్లో వేరుగా లేడు. ఏమి చెప్పుతున్నాను వీళ్ళకు గ్రహించుకునే శక్తి అంటే లోపల బుద్ధికి గ్రహించుకొనే శక్తి నీవు ఇవ్వు. గ్రహించుకొనేటట్లు చేయి. గ్రహించుకొంటే నీ దగ్గరకు రాగలరు. గ్రహించుకోకపోతే దూరంగా పోగలరు అని నేను మొట్ట మొదటనే చెప్పాను. ఈ ఉపన్యాసము ప్రారంభమైనపుడే మీ శరీరాలలో ఉండే ఆత్మను నేను ఒకటే విధంగా కోరుకుంటున్నాను. ఈ చెప్పబోయే జ్ఞానం మీకు బాగా గ్రహింపునకు రావాలని, అలా గ్రహింపు చేయాలని కోరుకుంటూ ఈ ఉపన్యాసాన్ని మొదలు పెడుతున్నాను అని చెప్పాను. నేను కోరుకునేది అదే. మీరు కూడా మాకు అర్థమయ్యేటట్లు చేయి దేవుడా! అని మీరు ఏమి చేయాలంటే మీ అల్లాహ్ అయిన దేవున్ని, మీ తండ్రి అయిన దేవున్ని, మాకు తండ్రి అయిన దేవున్ని మేము కోరుకుంటున్నాము.


ఆ రకంగా మనకు చాలా వరకు మీరు చెప్పిన ఇంతకు ముందు మాట్లాడేదాన్ని బట్టి, మీకు చాలా బాగా అర్థమయింది కొంతమందికి. కొంతమంది వెనుకల వచ్చినాగానీ, చాలా స్పీడుగా ముందుకు వెళ్లి పోయినారు. కొంతమంది ముందు నుంచి ఉన్నాగానీ వాళ్ళు క్రమేపి తెలుసు కుంటున్నారు. కొంతమంది చదువురాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అర్థంకాక, అర్థమై ఇబ్బందిపడుతున్నారు. ఏ ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మీరు ఒకటే ధ్యేయం పెట్టుకోండి, మాకు అర్థంకావాలి. నిన్ను నమ్ముకున్నాము అని విశ్వాసం పెట్టుకోండి, దేవుడు మీకు తెలియజేస్తాడు. విశ్వాసాన్ని మించినది


---

ఏదీ లేదు. కాబట్టి మీరు ఏమాత్రం మాకు చదువురాదే అనుకోవద్దండి. మాకు చెప్పేవాళ్ళులేరు అని అనుకోవద్దండి. మాకు పెద్దగా విద్యలేదు అనుకోవద్దండి. దేవుడు అన్ని తెలియజేస్తాడు. దేవుని మీద విశ్వాసం పెట్టుకోండి. ఇప్పుడు శక్తి అంటే మీకు ఎంతమందికి శక్తి ఉంది మన శరీరంలో, నీకు ఏమాత్రం శక్తి లేదు. నీకు శక్తి లేదు. ముద్రవేసుకోండి నాకు శక్తి లేదని, లేకపోతే ఉదయం లేచినప్పటి నుండి అన్ని పనులు నేనే చేస్తున్నానని అంటావు నీవు, అది పెద్ద పొరపాటు కాబట్టి నీకు శక్తి లేదు. నీవు ఏమి చేసేవానివి కాదు. నేను శిశువును అనుకోండి. చేసేవాడు తండ్రి, అర్థమయిందా! ఇంకొక ఆయన చూసేవాడు ఉన్నాడు. ఆయన అనుకుంటే ఏమైనా జరుగుతుంది. ఆయన శక్తి కనిపించదు, ఆయన బలం కనిపించదు. అది సూక్ష్మంగా ఉంటాది. కనిపించని బలము అర్థమయిందా! ఈయన శక్తి కనిపిస్తూ ఉంటుంది.

ఒక క్షయరోగము గల మనిషి లేదా క్యాన్సర్ రోగంగల మనిషి, లేకపోతే ఒక హెచ్.ఐ.వి. రోగం ఉండే మనిషి దేవున్ని విశ్వసించి నన్ను ఏమి చేస్తావో చేయి, నాకు బాగు చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఎవరి చేతకాదు, ఏ మందులు లేవు అని నమ్ముకుంటే ఏమవుతుంది. తాత అనేటువంటి పురుషుడు ఉన్నాడు కదా! ఆయన నీ నమ్మకాన్ని చూసి ఆయన ఏమనుకుంటాడు అంటే మనుసులో, ఒరే నిన్ను క్షమించి పోయినారా! అనుకుంటుంటాడు. ఆయన క్షమాశీలుడు అని చెప్పినాను కదా! క్షమించే వాడు అని చెప్పినాను కదా! నీ పాపాన్ని క్షమిస్తాడు అని చెప్పినాను కదా! ఎవరు క్షమించేది! తాత. ఆయన క్షమించినాను అనుకొంటే ఈయనకు ఆ రోగం పోతుంది. ఇప్పుడు మీకు కరెక్టుగా రెండవ వరుసలో ముందర రెండవ వరుసలో చివరి గోడకు ఆనుకొని కూర్చోన్న మనిషి చెప్పుతున్నాడు.


----

ఆ చివరలో చెప్పండి రెండవ వరుస చివర లేచి నిలబడినాడు ఆయన. సరే మీరు కూర్చోండి. మీకు హెచ్.ఐ.వి. రోగం ఉన్నాది కదా! ఆయనకు మైకి ఇవ్వు. నువ్వు సాక్ష్యం చెప్పాలి అంటే ఇంకొకటి ఏమీ లేదు. నీకు హెచ్.ఐ.వి. రోగం ఉన్నది కదా! 4 సంవత్సరముల క్రిందట ఇక్కడకు వచ్చినపుడు ఉన్నది స్వామి, జ్ఞానం తెలుసుకున్న తరువాత వెళ్ళిపోయింది స్వామి! నీకు అప్పుడు ఎన్ని పాయింట్లు ఉన్నాయి సి.డి. కౌంటింగ్, 50 పాయింట్లు స్వామి. అంటే చివరి దశ సి.డి. కౌంట్ 50 ఉన్నది స్వామి! ఈ రోజు 700 ఉంది స్వామి! మరి ఎట్ల వచ్చింది ఇప్పుడు అది. జ్ఞానం తెలుసుకున్నాను స్వామి తాత ఉన్నాడే తాత చేసినాడు ఆ పని. ఇప్పుడు నీవు బత్తలపల్లిలో ఆర్.డి.టి. హాస్పిటల్కు పోతే ఒక సంవత్సరం వాళ్ళ దగ్గరే పెట్టుకొని ట్రీట్మెంట్ ఇచ్చినా 10 పాయింట్లు పెరగాలన్నా కష్టమే. అలాంటిది 700 పాయింట్లు ఎట్ల వచ్చింది నీకు. ఇది సాక్ష్యం తాత చేసినాడు ఇది. ఆ పని తాత చేసినాడు. నేను కూడా చేయలేదు.


ఆ రోజే చెప్పినాను దేవున్ని నమ్ముకో అవుతుందని, చేసినాడా లేదా ఆ పని. అది కంటికి కనపడకుండా జరిగిన పని, కంటికి కనపరానిశక్తి అది అందువల్ల శక్తి కంటికి కనిపిచ్చేది, కనపరానిది అనేది ఉంది. సాక్ష్యం నువ్వే నీలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళంతా మనకు సాక్ష్యమే. ఈ రకంగా లెక్కేసుకొంటే దేవుడు ఏమైనా చేయగలడు, ప్రత్యక్ష నిరూపణగా మనము చెప్పుతున్నాము. ఆయనకు 50 పాయింట్లు కౌంటింగ్ ఉన్నప్పుడు చివరిదశ 60, 50 అంటే అయిపోయింది. ఆయనను లేపాలంటే ఇద్దరు మనుషులు పట్టుకొని లేపేవాళ్లు లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ రోజు హాయిగా ఉన్నాడు. మరి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయితా ఉంది ఈ రోజుకి ఆయనను చూడబట్టి, ఎందుకు ఆయన బాగున్నాడు


---

అంటే ఎవరి వలన బాగయినాడు చెప్పండి గట్టిగా, తాత. ఎవరివల్ల తాత వల్ల, ఎవరి తాత మీ తాత, మా తాత ఏమీ కాదు. ఎవరి తాత వాళ్ళకి బాగా చేస్తాడు. కాబట్టి అందరి తాత ఒకడే. అర్థ మయిందా! కాబట్టి తాత ఒకడు. తండ్రి ఒకడు ఉన్నాడు అని గ్రహించుకోండి. నువ్వు సూక్ష్మంగా నిన్ను అర్థం చేసుకోండి. నీకు ఏమి చేతకాదు అని అర్థం చేసుకోండి. అర్థమయిందా! నేను కూడా చెప్పాను అనేక సందర్భాలలో మీటింగ్ చెప్పేటపుడు నాకేమి చేతకాదు, నాకు ఏమి తెలియదు చెప్పేవాడంతా రెండవవాడే ఆ తండ్రీ అని చెప్పినాను. జ్ఞాపకం పెట్టుకోండి ఈ రోజు కూడా చెప్పినాను కదా! రూలు ప్రకారం అట్లే చెప్పినాను నేను. అర్థమయిందా! అంటే ఏసుప్రభువు వచ్చినాడు భూమి మీదకి ఆయన జ్ఞానం చెప్పిపోయినాడు అర్థమయిందా!


ఆయన ఎవరు. ఆయన ఎవరు చెప్పగలరా! మీరు చెప్పండి తండ్రి అవుతాడా, తాత అవుతాడా, కొడుకు అవుతాడా ఇప్పుడు దిక్కు తెలియదు. ఆయన శరీరంలో ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఉంటారు. ఆయన వేషం వేసుకొని వచ్చాడు. ఆయన నేను కుమారుడిని అని చెప్పినాడు. నా తండ్రి ఒకడు ఉన్నాడు అని చెప్పినాడు. అన్ని దొంగ మాటలు. ఉండేది ఒకడే. ఆయనే తాత, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు. ఆయన చెప్పినది మిమ్ములను మోసం చేసేదానికి చెప్పినాడు. మిమ్ములను మభ్యపరిచేదానికి చెప్పాడు. ఆయన తప్ప ఇంకొకరు ఎవరూ లేరు. తండ్రి ఆయనే, తాత ఆయనే, కొడుకు ఆయనే కొడుకుగా వచ్చాను అని అన్నాడు. కొడుకుగా వచ్చినాడు. మళ్ళీ పోతాను ఇంకొకరిని పంపిస్తాను అన్నాడు. ఎవరు వస్తారు. ఈయనే అంగీ మార్చుకొని వస్తాడు. అవతలకు ఇవతలకు అర్థమయిందా! అన్ని మభ్య పెట్టేమాటలు. యోహాను సువార్తలో అద్భుతంగా ఉన్నాయి.


---

ఇవన్ని చూస్తూ, మీరు చూడండి. యోహాన్ సువార్త చదవండి. ఇప్పుడు గ్రంథం వచ్చింది మీ దగ్గరకు రత్నవాక్యాలు అని, ఆ రత్నవాక్యాలు చదవండి. ముస్లీమ్లు మీరు కూడా చదవండి రత్నవాక్యాలు అద్భుతంగా ఉన్నాయి చూడండి. అది బైబిల్ గ్రంథంలో ఉండేది, ఖురాన్ గ్రంథంలో ఉండేది జ్ఞానమే, అందులో కూడా చదవండి. మీకు చెప్తా సరే ఇప్పుడు మీకు చాలాసేపు ఇట్లే ఇబ్బంది పెట్టేది బాగుండదేమో దగ్గర దగ్గర 2 గంటలకు 10 నిమిషాలు తక్కువ ఉందా! 10 నిమిషాలు చెప్పి 2 గంటలు చేస్తామా సరిపోతుంది. సరే మీకు ఏమైనా సంశయములు ఉంటే అడగండి ఇప్పుడు చెప్పిన జ్ఞానంలో. మీకు ఏమన్నా ప్రశ్న ఉంటే అడుగుతారా? అడగండి స్వామి! మీరు అడుగు ప్రశ్న గెట్టిగా చెప్పు ధైర్యంగా అడుగు. నమస్కారం స్వామి! నేను ఒక క్రైస్తవున్ని నాకు తెలుసు రత్నవాక్యాలు అనే గ్రంథములో ప్రభువు చూపించిన చేతిలో మూడు వ్రేళ్ళకు మాత్రమే అర్థం చెప్పినారు. ఇంకా రెండు వ్రేళ్ళు ఉన్నాయి. రెండు వ్రేళ్ళు ఉన్నాయి కదా! అవి చదువుకుంటే చాలులే అని అర్థం చేసుకుంటారని వ్రేళ్ళకు తగ్గట్టు నేను చెప్పినేది ముగ్గురు పురుషుల గురించి చెప్పినాను నేను. అర్థమయిందా!


ఒక అమ్మ కూడా ఉంది. అమ్మ ఇంకొక అమ్మ కూడా ఉంది అని చెప్పినాను కదా! నువ్వు మంచి ప్రశ్న వేసినావు. నేనే చెప్పుతాను ఇప్పుడు మూడు వ్రేళ్ళు ఇట్ల చూపినాడు అర్థమయిందా ఒకటి మధ్యవ్రేలు, ఒకటి చూపుడు వ్రేలు, ఒకటి (బొటనవ్రేలు), ఇదేమో తండ్రి (మధ్యవ్రేలు), దానికంటే చిన్నగా ఉండేది కుమారుడు (చూపుడు వ్రేలు), ఇది పరిశు ద్ధాత్మ (బొటనవ్రేలు), తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని చెప్పినాడా! ఈ రెండు వ్రేళ్ళు (ఉంగరం వ్రేలు, చిటికెన వ్రేలు) కదా! ఈ రెండు వ్రేళ్ళు ప్రకృతి కనిపించే ప్రకృతి, కనిపించని ప్రకృతి అంటే చర ప్రకృతి,


---

అచర ప్రకృతి. ఈ రెండు ప్రకృతివి గుణాలు ఉండాయే నీలో ప్రకృతి వలనే గుణాలు వచ్చేది ఈ గుణాలను అణచి వేసుకుంటే, ఈ గుణాలను అణచివేస్తే నీవు ఈ చర ప్రకృతి, అచర ప్రకృతి ఉండాయే వీటిని అణచి వేస్తే ఈ మూడు ఆత్మలు తెలియబడుతారు అని చెప్పినేది, మీరు గుణాలలో ఉన్నంతవరకు తెలియబడరు అని చెప్పినేది. ఐదు వ్రేళ్ళకు అర్థం వచ్చిందా! ఇప్పుడు తెలిసిందా! తెలిసింది ఇప్పుడు. చర ప్రకృతి అచర ప్రకృతి రెండు భాగాలుగా వుంది. ఈ ప్రకృతి మీకు తల్లిగా ఉంది. నేను చెప్పినేది ముగ్గురు పురుషులు ఒక ఇంట్లో ఒక ఆడ ఆమె ఉంది అని చెప్పినాను. ఆమెని లెక్కవేసుకో నీవు. మళ్ళీ ఈమె ఏమి చేస్తుంది తెలుసునా! మీకు ఉపయోగ పడుతావుంది, సహకరిస్తావుంది. తండ్రికి సహకరిస్తావుంది. ప్రక్కనే ఉంది, మీ తండ్రి ప్రక్కనే ఉన్నాడు కదా! తండ్రి, కుమారుడు కదా! ఈ తండ్రి ప్రక్కనే ఈమె ఉంది భార్య. మీ అమ్మ ఆమె, మిమ్ములను ఇబ్బంది పెడుతావుంటుంది. ఆమెవల్ల నీవు అంతటోనివి, ఇంతటోనివి నిన్ను ఎక్కిస్తావుంటుంది. పొగుడుతావుంటుంది నిన్ను, ఆమె మాట వినవద్దు నీవు. మీ తల్లి మాట నీవు వినవద్దు, అందుకే వ్రేళ్ళు ముడుచుకొని చూపిచ్చినాడు ఆయన. అందువల్ల మీకు అర్థమయిందా, ఇపుడు అర్థమై

ఉంటుంది అనుకుంటాను.


ఈ మూడు వ్రేళ్ళు చూపించడంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, తండ్రి ప్రక్కనే తల్లి ఉంది. ఈ తల్లి ఎట్ల ఉంది అంటే కనిపించే ప్రకృతి, కనిపించని ప్రకృతిగా ఉంది. కనిపించని ప్రకృతిగా నీ శరీరంలో వుంది. కనిపించే ప్రకృతిగా బయటవుంది. కానీ ఈ మూడు ఆత్మలు మాత్రము ఒకటే విధంగా ఉన్నాయి. కానీ బయట ఒకటి లోపల ఒకటి లేవు. అన్ని ఒకే విధంగా ఉన్నాయి. ఈ మూడు ఆత్మల గురించి మీరు


---

తెలుసుకుంటే సరిపోతుంది. ఇంకొక ప్రశ్న స్వామి! ప్రభువు పటంలో గుండె

బొమ్మ చూపిస్తూ గుండెకు రక్తం కారుతూవున్నట్లు, ముళ్లకంచె చుట్టినట్లు వెలుతురులో అనగా ప్రకాశం వెలుతురో శిలువ కాలుతున్నట్లుగా ఉంటుంది. దాని అర్థం అడిగాను ఇంతకుముందు స్వామి! ఏమి లేదు మీరు దుర్మార్గులని, ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. దేవున్ని ఇబ్బంది పెడుతున్నారు. అన్ని మేమే చేస్తున్నామని గుర్తు అని. మీకు జ్ఞానం తెలియదు. మీరు అజ్ఞానులు, దేవుడు వచ్చినా కూడా ఆయనను వదలి పెట్టరు, ఆయనను కూడా అజ్ఞాని అంటున్నారు. అదే చెప్పుతున్నాను కదా! దేవుడు వచ్చి జ్ఞానం చెప్పినా కూడా ఆయనను అజ్ఞాని అంటున్నారు. ఆయనకు ములుకులు కొట్టి చంపేశారు. ఆయనను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మీ అజ్ఞానం ఇట్ల ఉంది చూడండి అని చూపిస్తున్నాడు. ఆయన ప్రకాశవంతమైన దేవుడు, కానీ ఆయనను మీరు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పే అర్థమే అది. అడుగు అమ్మా గట్టిగా అడుగు, ధైర్యంగా అడుగు దగ్గర పెట్టుకో. మొన్న అంటే జనవరి 1వ రోజు నైట్ మీరు కట్టె, కొట్టె, తెచ్చె అనే దాని గురించి చర్చించుకోమన్నారు కదా! తాత.


"ఏమి లేదు టైంపాస్ కోసం చెప్పాను. కట్టె, కొట్టె, తెచ్చె అనే దానికి వివరము చెప్పండి నాన్న. వివరము ఏమీలేదు. ఒక ఆయన చెప్పినాడంట రామాయణము మూడు మాటల్లో చెప్పురా! నేను ఎక్కువ సేపు వినలేను. నాకు అంత ఓపికలేదు అన్నాడు, అంటే వీళ్ళు ఏమి చెప్పినారంటే సేతువుకట్టె అని, కట్టినారు చూడు సముద్రంలో దానిని కట్టె అని చెప్పినారు. రావణాసురుని కొట్టె అని చెప్పినారు. సీతను తెచ్చె అని చెప్పినారు. సింపుల్గా చెప్పాలంటే కట్టె, కొట్టె, తెచ్చె అని చెప్పినారు. పూర్వము ఒక కథ ఉన్నది అన్నమాట. పుటుక్కు జరజర డుబుక్కుమే అని


---

ఒకటున్నది. పుటుక్కున ఎలుక కొరికితే, జర జర జారి డుబ్బుక్కున పడితే క్రింద మేక ఉన్నది, మే అని అరిచిందంటా. పుటుక్కు జర జర డుబుక్కుమే అని చెప్పినారు, అట్లగానే వీళ్ళు సింపుల్గా అంత పొడవుగా చెప్పుకోకుండా, సింపుల్గా రామాయణం అంతా 3 మాటల్లో చెప్పినారు. కట్టే సేతువుని కట్టినాడు, రావణాసురునికొట్టె, కొట్టినారు, సీతను తెచ్చినాడు కట్టె, కొట్టె, తెచ్చె అని మూడు మాటల్లో రామాయణం చెప్పినారు అని చెప్పినాము. టైంపాస్కి చర్చించుకొనేదే గానీ పెద్ద జ్ఞానమేమి కాదు అని చెప్పినాము. జ్ఞానపరంగా ఏమి అర్థం లేదా నాన్న గారు? జ్ఞానపరంగా ఉంది అర్థము, ఇప్పుడు చెప్పుము మరలా మీటింగ్లో చెప్పుతాము. నేను జ్ఞానపరంగా చెప్పుతాను, రేపు నెలలో మీటింగ్ చెప్పుతా. జనవరి 1వ రోజు మీకు జ్ఞానం చెప్పినాను. జనవరి 1వ రోజు మా వాళ్ళకు జ్ఞానం చెప్పినాము. 3, 6, 9 అని దేవుని జ్ఞానం కదా! ఆ 3, 6, 9 ఎట్లు చెప్పినేది రేపు మీటింగ్లో చెప్పుతాను. ఇప్పుడు ఎందుకంటే టైం అయింది. ఇప్పుడు చెప్పితే చాలా టైం అవుతుంది అది. చాలా వివరము ఉంటుంది 3, 6, 9 అనేదానికి, ఇంకొక ప్రశ్న అడుగుచాలు, ఇంక అంతకంటే ఎక్కువ వద్దు.


భగవద్గీతలో కర్మయోగం గురించి అర్థం కాలేదు స్వామి! ఏమి అర్థం కాలేదు స్వామి. నేను అదే కదా చెప్పుతుండేది. నాయన అన్ని పనులు చేస్తావుంటే, కొడుకు నేను నేను అనుకొంటే ఎట్ల? క్రింద పండుకొని పండుకొన్న వాడు పండుకొన్నాను అనుకోవాలి కదా! లేదు స్వామి ఇప్పుడు మా ఊరికి పోవాలంటే ఒక 3 గంటలు ప్రయాణం పడుతాది స్వామి. నేను ఆశతో 2 గంటల ప్రయాణం చేసి వెళ్ళాలనుకొంటాను స్వామి. నీవు దండిగా అనుకుంటావు. రెండు గంటలకు వెళ్ళాలని నేను అనుకుంటాను స్వామి. మీ అమ్మ చెప్పుతాది ఇట్లా అనుకో అని. అనుకుంటే ఆశతో


----

పోయినట్లు అవుతుంది కదా! స్వామి, ఆశతో పోయినట్లు అవుతాది అంటే అపుడు కర్మయోగానికి వ్యతిరేఖంగా చేసినట్లు అవుతుంది కదా! స్వామి. అట్ల ఏమీ లేదు, ఆయన చేసినాడు. నీవు చేయలేదు. మీ అమ్మ చెప్పితే, నీవు పోవాలని అనుకున్నావు, లోపల గుణాలు ఉన్నాయి చూడు, నీవు అనుకోలేదు, గుణాలు చెప్పితే నీవు అనుకున్నావు, మీ నాయన తీసుకు పోయినాడు తొందరగా, నీవు అట్లు కూడా నీవు పోలేదు. అందుకే నీవు ఊరకనే ఉండు, పండుకొన్నోడు పండుకున్నట్లుగా. నేను పోయినాను అని నీవు ఎందుకు అనుకోవాలి? నేను పోయినాను కదా స్వామి, నేను పోయినాను కదా స్వామి అంటున్నావు. అదంతా నీవు అనుకోవద్దు. మీ నాయన నిన్ను పంపిస్తున్నాడని చెప్పుతున్నాను కదా! నేను. మోసుకొని పోయినోడు మీ నాయన, పంపిచ్చినోడు మీ నాయనే, మళ్ళీ నీవు ఎందుకు అనుకోవాలి? లేదు స్వామి, ఇప్పుడిది కాదు సమస్య చాలా రోజుల నుంచి అడుగుదామని అవకాశం వచ్చింది స్వామి!


నేను భగవద్గీత చదివినప్పుడు డౌట్ వచ్చింది స్వామి. నేను అడగాలని అవకాశం వచ్చిందని, అడుగుతున్నాను స్వామి, మంచిది చాన్స్ మంచిది. ఇప్పుడు అప్పటి నుండి అదే చెప్పినాను. నీవు శిశువువు, పాలు త్రాగి నిన్ను ఊరికే పండబెడుతున్నారు. నేను పోయినాను అని నీవు ఎందుకు అనుకోవాలి? మీ నాయన పోతాడు. మీ అమ్మ చెప్పితే, మీ అమ్మ చెప్పినమాట నీవు వింటున్నావు. మీ నాయన తీసుకొని పోయేది నీవు చూస్తూ ఉన్నావు. మీ అమ్మ చెప్పినేది నువ్వే అనుకొని, మీ నాయన చేసినేది నువ్వే అనుకొంటే ఎట్ల అని, నువ్వు ఏమి చేత కానోడు ఊరికే ఉండు అని చెప్పినాను ఇంతవరకు నేను. అదే కర్మయోగం అవుతుంది. నీవు ఊరికే ఉంటే, నేను ఊరికే ఉన్నాను, నేను చేతకాని వానిని, నేను


---

పాలు త్రాగే పిల్లోన్ని, నేను ఏమీ చేయలేదు, అన్నీ వాళ్ళే చేస్తున్నారని అనుకో, నువ్వు నిజంగా కర్మయోగం అవుతుంది, అర్థమయిందా! అదే కర్మయోగం ఇంకోటి ఏమీలేదు.

చివరి అవకాశం ఇస్తా, తొందరగా చెప్పు 2 నిమిషాల లోపు అయిపోవాలి. పురుషోత్తమ ప్రాప్తి యోగము 15వ శ్లోకములో “వేద వేదాంతము నన్నే తెల్పుచున్నవి” అని ఉన్నది. కొంచెం స్పష్టంగా కావాలి స్వామి. వేదాంతము. వేదాలు అంటే గుణాలు 'త్రైగుణ్య విషయా వేదా’ వాటిని విసర్జించి నన్నే తెలుపుతున్నాయి అన్నాడు. నేను చెప్పుతాను కదా!


గుణాలు అంటే వేదాలు, గుణాల అవతల ఉండేది వేదాంతం. వేదాంతము తెలిసినటువంటివాడు వేదాలను, వేదాంతాన్ని తెలిసినంటివాడు అని అర్థము అర్థమయిందా! వేదాంతము అంటే ఏమిటిది. అంతం చివరిలో గుణాలు దాటి ఉండేది ఏది. తల్లి దాటి ఉండేది ముగ్గురు పురుషులున్నారు వాళ్ళని తెలుసుకుంటే అని అర్థము. కాబట్టి వేదాలను, వేదాంతాన్ని తెలుసుకున్నటువంటి వాడు అని అర్థము. ఎప్పుడైతే గుణాలను విడిచి పెట్టినావో అప్పుడు అన్ని అయిపోతాయి. ఇంక చాలు పోండి, అట్లయితే అంతా వస్తూవుంటారు. చెప్పిన దానినే మీరు అడుగుతున్నారు. ఇంతకుముందు చెప్పినాను స్వామి. మళ్ళీ మీరు అదే అడుగుతున్నారు, విన్నదానినే. చాలు ఇంక చాలు 2 గంటలు అయింది. ఇప్పటికి దగ్గర దగ్గర 5.30 అయింది మిమ్ములను ఇబ్బంది పెట్టిన వానిని అవుతాను చాలాసేపు కూర్చబెటితే, నేను ఇట్లా చెప్పుతావుంటే ఇట్లే టైం అయిపోతా ఉంటుంది. అట్ల వద్దు మీరు కావలసివుంటే ఈ రోజు, రాబోయే బుక్ జిరాక్స్ పేపర్లు తీసుకొని చదువుకోండి అంత కావలసింటే. అయితే రేపు వచ్చే నెలకు ఇంకా బాగా అర్థమయితాది. మీరు అడిగే ప్రశ్నలకు ఇంతకు


----

ముందు జవాబులు వచ్చినాయి. బుక్ లో ఉంది. మీరు సరిగా అర్థం చేసుకోలేక, దానినే అడుగుతున్నారు ప్రశ్నను మీరు. ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.



సంతోషము. మరొక్కమారు మీతో కలుసుకున్నాము. మరొక్కమారు జ్ఞానాన్ని గురించి ఇపుడు చర్చించుకుందాము. ఇప్పుడు చెప్పబోయే విషయము పౌర్ణమి-అమావాస్య. “పౌర్ణమి” అంటే దానిని పూర్తి వివరించు కుంటే పూర్ణముతో కూడుకొన్నటువంటిది లేదా సంపూర్ణమైనటువంటిది అని దాని అర్థము. అర్థమయిందా! పౌర్ణమి అంటే మనము బయట చూస్తున్నాము, వెలుగుతో కూడుకున్నటువంటిదని, అమావాస్య అంటే చీకటితో కూడుకున్నటువంటిదని ఎవరికైనా తెలుసు. దాని అర్థాలు ఎట్లున్నాగానీ బయటికి కనిపించే విధానము మాత్రము ఇదే. ఒకటి చీకటి, ఒకటి వెలుగు. అమావాస్య అంటే చీకటి, పౌర్ణమి అంటే వెలుగు. ఇట్ల బాహ్యముగ కనిపించే విధముగా చీకటి, వెలుగులు పెట్టాడు. ఈ చీకటి వెలుగులు అనే దాన్ని కొంతమంది ప్రపంచ సంబంధముగా కష్ట సుఖాలతో పోలుస్తారు. సుఖాలు వెలుగులాంటివి, కష్టాలు చీకటిలాంటివని. అంటే కలకాలము కష్టము ఉండదు, కలకాలము చీకటి ఉండదు. వెలుగు కూడ వస్తుంది, సుఖాలు కూడా వస్తాయి.


మీరు ఆశతో బ్రతకండి అని చెప్పుతూ ఉంటారు. వాస్తవమే కష్టసుఖాలు అనేవి చీకటి వెలుగులలాంటివి అనేది మాత్రము వాస్తవమే!


---

అది బయట ప్రపంచ సంబంధముగా, ఇప్పుడు మనము కూర్చున్నది ఆధ్యాత్మిక సంబంధముగా ఉండే విషయాలను తెలుసుకొనేదానికి మాత్రమే ఇక్కడ కూర్చొన్నాము. ఆధ్యాత్మికము అంటే ఏమి? ఆత్మను ఆధ్యాయనము చేయడము. ఆత్మను తెలుసుకోవడము అంటే ఆధ్యాయనము చేయడము ఏదైతే ఉందో దానిని ఆధ్యాత్మికము అని అంటాము. ఆత్మను ఆధ్యాయనము చేయడములో దీని వివరము ఏమిటి? మనము ఆత్మను ఆధ్యాయనము చేస్తున్నామా? బయట విషయములోకి పోతే ఆత్మ అనేది ఏమిటిదో తెలియదు. ఆత్మ అనేది శరీరాంతర్గతముగా ఉంటుంది కాబట్టి శరీరాంతర్గతముగా తెలుసుకొనే దాన్నే మనము ఏమంటాము? ఆధ్యాత్మిక విషయము అని అంటాము. ఆత్మ లోపల ఉంటుంది కాబట్టి దానిని కనిపించనటువంటిది అని చెప్పుకుంటాము. బయట కనిపించేటటువంటిది ఏది? ప్రకృతి. అంటే మాయ. తర్వాత ప్రకృతి నుంచి పుట్టినటువంటిది మాయ. మనము బాగా చెప్పుకోవలసినది లోపల దేవుడు అయితే ఉన్నాడు, బయట మాయ అనేది ఉంది. దేవునికి పూర్తి వ్యతిరేఖ గుర్తుగా మనము పెట్టుకొని చెప్పుకుంటే మాయ అనేది చెప్పుకోవాలి. అర్థమయిందా! కాని ఇక ప్రకృతి అనేది ఉంది దానిని ఎందుకు చెప్పలేదు? అని ఒక ప్రశ్న వస్తుంది మనకు. ప్రకృతి అన్నపుడు దేవుడు, ప్రకృతి అని చెప్పవచ్చు కదా! అని అడగవచ్చు. ప్రకృతి అనేది ఒకటి ఉంటది కదా! మాయ అనేది ప్రకృతి నుంచే తయారయినది గదా! ఇప్పుడు ప్రకృతి పరమాత్మకు వ్యతిరేఖమైనది. చూడండి, మనకు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. ఆ సమస్య ఏ మతములోను తెలియకుండ పోయింది.


దేవుడు మూడు మత గ్రంథాలలోను తెలియజెప్పినాడు అది. పెద్ద దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనకు వ్యతిరిక్తముగా ప్రకృతి ఉంది.


---

సిద్ది బోధ

వ్యతిరిక్తముగా ఏమి కాదు గాని ఆయన పెట్టినాడు అది మనము వ్యతిరిక్తముగా ఉంది అనడమే. అది ఆయన తయారు చేసి పెట్టినదే. ఏది? ప్రకృతి. తరువాత దేవుడు ఏమి చేసినాడంటే ఇంకో దేవున్ని తయారు చేసినాడు. ఎందుకంటే, ఆయన ఏ పని చేసేవాడు కాదు. పని చేసే నిమిత్తము ఇంకో దేవున్ని తయారు చేసి పెట్టినాడు. ఆ దేవుడు మనుషులందరిని సృష్ఠించాడు. ఆయనను “దేవుడు” అని అంటున్నాము, ఇంకొక రకముగా చెప్పితే “ఆత్మ” అని అంటున్నాము. మళ్ళీ ఇంకొకాయన పెద్ద దేవుడుని ఏమంటున్నాము అంటే ఈయనకంటే వేరుగా ఉన్నాడు కాబట్టి “పరమాత్మ” అని అంటున్నాము అంటే పరముగా ఉండేవాడు, ఆత్మకంటే వేరుగా ఉండేవాడు. వాడు ఎవడో తెలియదుకాని ఆత్మకంటే వేరుగా ఉండేవాడు అని చెప్పినాము. వాని పేరు ఖచ్చితముగా తెలియదు. ఆత్మకంటే వేరుగా ఉన్న వాన్ని పరమాత్మ అంటున్నాము. నీలో దేవుడుగా ఉండేవాన్ని ఆత్మ అని అంటున్నాము. ఆ ఆత్మనే నీవు ఆరాధించాలి, మ్రొక్కాలి, నమస్కరించాలి, ప్రార్థన చేయాలి. నీవు ఏమి చేసినాగాని నీలో ఉండే ఆత్మనే నీవు ఆరాధించాలి. ఇది అన్ని గ్రంథాలలో చెప్పిన విషయము. నా కుమారుని ఘనపరిచినటు వంటి వాడు నన్ను ఘనపరిచినట్లే అని బైబిల్ చెప్పినారు. చెప్పినారు కదా!


ఆ రకముగానే ఖుర్ఆన్లో 16వ సూరా 51వ ఆయత్లో ఏమి చెప్పినారంటే అల్లాహ్ ఈ విధముగా సెలవు ఇస్తున్నాడు. ఇద్దరు అల్లాహ్ ను మీరు మ్రొక్కకూడదు. మీకు ఒకే అల్లాహ్. మీరు నమస్కారము చేయవలసినది ఒకే అల్లాహ్ ను. ఆయన్నే మీరు నమస్కరించాలి, ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే మ్రొక్కాలి. నాకు భయపడండి, ఆయనను మాత్రము నమస్కరించండి. ఒకే అల్లాహు మీరు ఆరాధించవలసినది అని చెప్పాడు.


---

ఎవరు చెప్పారు? అల్లాహ్. ఏ అల్లాహ్ను చెప్పాడు? ఇంకొక అల్లాహ్ ను చూపిస్తూ చెప్పాడు, ఈయనే మీ ఆరాధ్య దైవము అని. కాని నాకు భయపడండి అని చెప్పాడు. అర్థమయిందా! అపుడు అక్కడ కూడ ఇద్దరు అల్లాహ్ లు అని మనకు తెలుస్తావుంది. కానీ మనము ఆరాధించవలసిన అల్లాహ్ ఒక్కడు మాత్రమే. ఇంకొక ఆయన ఉన్నాడు. 112వ సూరాలో 4 వాక్యాలు చెప్పాడు. ఆయన ఏ అక్కరా లేనటువంటివాడు. ఆయన ఒక్కడే దేవుడు ఇంకో దేవుడంటు లేడు. అంటే పెద్ద దేవుడు ఆయన. ఆయన తరువాత మిగతా సృష్టంతా జరిగింది. అందరిని సృష్టించిన సృష్టికర్త ఆయన ఒక్కడే. ఆయన ఎవరికీ కొడుకు కాదు, మనుషులు ఆయన సంతతి కాదు. ఇంకొక అల్లాహ్ సంతతి కానీ ఆయనకు మనుషుల సంతతి లేదు. ఆయన మనుషులకు పుట్టేవాడు కాదు. ఆయన ప్రత్యేకమైన దేవుడు. ఆయన ఏ అవసరము లేనటువంటి వాడు. తరువాత ఆయన ఏ పని చేయడు. ఆయన అనుకుంటే అన్ని అయిపోతాయి అని కూడా చెప్పడము జరిగింది ఖుర్ఆన్ గ్రంథములో, అదే విధముగా ఇద్దరు అల్లాహ్ లు ఉన్నారు అని మనము చెప్పుకున్నాము కదా! ఈ ఇద్దరు అల్లాహ్ లో రెండవ అల్లాహ్ ఉన్నాడే ఆత్మ అనేటటువంటి అల్లాహ్ ఆయనకు వ్యతిరిక్తమైనది మాయ. మళ్ళీ “ఆత్మ”కు వ్యతిరిక్తమైనది ప్రకృతి అని మనము చెప్పకూడదు. ‘ప్రకృతి’ అని చెప్పితే 'పరమాత్మ' అని చెప్పాలి. మాయ అని చెప్పితే వ్యతిరేఖముగా మనము ఏమి చెప్పాలి? ఆత్మ అని చెప్పాలి.


ఇప్పుడు మనము ఆధ్యాత్మిక విద్య నేర్చుకొనే దానికి మాత్రమే ఇక్కడికి వచ్చాము. ఆధ్యాత్మికరీత్య అమావాస్య, పౌర్ణమి అని అంటే బయట కనిపించేది చీకటి వెలుగు అని మనము అర్థము చేసుకోగలము. అది బయట సంబంధించినది. అది కాకుండా ఆధ్యాత్మిక సంబంధముగా


----

ఉండే అర్థము ఏమి? అంటే లోపలికి చూసుకుంటే జ్ఞానము, అజ్ఞానము అని అర్థమవుతుంది. అమవాస్య పౌర్ణమి అంటే మనకు బయట కూడా చీకటి వెలుగు కనిపిస్తుంది కదా! జ్ఞానాన్ని వెలుతురుగాను, అజ్ఞానాన్ని చీకటిగాను మనము పోల్చుకోవచ్చు. అలాగే చెప్పుతున్నాము. అజ్ఞాన అంధకారము అంటాము అంటే అజ్ఞానము అనేటువంటి చీకటి అని మనము చెప్పుకుంటున్నాము. ఆ రకముగా పోల్చుకుంటే చీకటిని అజ్ఞానముగా పోల్చుకోవచ్చు. జ్ఞానాన్ని వెలుగుగా పోల్చుకోవచ్చు. ఇప్పుడు ప్రతిచోట రెండు అనేటివి మనకు కన్పిస్తున్నాయి. ఏ విధముగా జ్ఞానము, అజ్ఞానమని కనిపించిందో, ఏ విధముగా చీకటి వెలుగని కనిపించిందో, ఏ విధముగా మాయ, ఆత్మని కనిపించిందో, ఏ విధము కష్టము, సుఖము కనిపించిందో, ఆ విధముగా ఎక్కడన్నా చూసుకో రెండూ ఒకదానికొకటి వ్యతిరిక్త దిశలో ఉంటాయి. కాని వాటిలో మనము ఏరుకోవలసినది దైవిక సంబంధమైన వాటినే ఏరుకొని చూడాలి. ఆ ప్రయత్నము కోసమే మనము శిక్షణ తీసుకుంటున్నాము ఇప్పుడు ఇదంతా. ఇక్కడకు వచ్చి వినడముగానీ చేయడముగాని ఇదంతా దేవుని జ్ఞానాన్ని తెలుసుకొనే నిమిత్తమేగాని ఇంకోటి ఏమి లేదు. కానీ నేను ముందు నుండి చెప్పుతున్నాను. దేవుని జ్ఞానము తెలుసుకొను నిమిత్తమే అయితే దేవుడు అందరికి ఒక్కడే. నీకు ఒక దేవుడు నాకు ఒక దేవుడు ఇంకో మతానికి ఒక దేవుడు లేనే లేడు. ప్రపంచానికంతా అల్లా ఒక్కడే, పరమాత్మ ఒకడే అని చెప్పాము. ఇంకొక భాషలో ఇంకొక పేరుతో పిల్చుకున్నాగానీ అందరికి సృష్టికర్త ఒక్కడే. నిన్ను సృష్టించినటువంటి వాడు ఒక్కడే. మళ్ళీ ఆ సృష్ఠికర్తను తెలుసుకొనే నిమిత్తము మనము ఇక్కడంతా తోడైనాము.


---

అదే పనిలో ప్రతి నెల ఇక్కడ గుంపుగా చేరి ఎక్కడెక్కడనో దూరము నుండి ప్రయాణము చేసి వచ్చి ఎంతో కష్టానికి ఓర్చుకొని, ఖర్చులకు ఓర్చుకొని, ఇక్కడకు వచ్చి మనము జ్ఞానము తెలుసుకోవడానికి ప్రయత్నము చేస్తున్నాము కాబట్టి, మా చేతనయినంత మేము కూడా జ్ఞానాన్ని మీకు తెలియజెప్పాలని ప్రయత్నము చేస్తున్నాము. ఇప్పుడు మరియొక మారు మేము లోపల ఉండేటటువంటి దేవున్ని అంటే ఆత్మను ఏమని కోరు కుంటున్నామంటే మీ శరీరాలలో బుద్ధికి ఇక్కడ చెప్పేటటువంటి జ్ఞానాన్ని బాగా అంటుకొనేటట్లు చేసి, అర్థము అయ్యేటట్లు చేసి, జ్ఞాపకము ఉండేటట్లు చేయాలని కోరుకుంటూ మరీ పునఃప్రారంభిస్తున్నాము. ఈ పునః ప్రారంభములో మనము భగవద్గీతలో నుండి ఒక శ్లోకము తీసుకొని చెప్పుకుందాము. నాకు చూడకుండా చదివేది రాదు. దేశములో ఎంత మంది స్వామీజీలున్నారో అంతమంది మొట్టమొదట భగవద్గీతను కంఠాపాఠము చేసుకొని ఉంటారు. మిగతా వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ వాళ్ళ గ్రంథాలలో వాక్యాలు కంఠాపాఠము చేసుకున్నారు కానీ కంఠాపాఠము అనేది నాకు రాదు, నాకు అవసరము లేదు అనుకున్నాను. కాబట్టి అవసరము బుక్కు చూసి చదివి చెప్పుతాను. అందులో కూడా ఒకటి రెండు తప్పులు ఉండవచ్చు. ఆ తప్పులను మీరు సక్రమముగా సరిదిద్దుకొని, చెప్పిన జ్ఞానాన్ని మాత్రము అర్థము చేసుకోండి. తప్పును అర్థము చేసుకోవద్దండి. అర్థమయిందా! ఇప్పుడు ఏమి చెప్పుతున్నాము అంటే 'అక్షర పరబ్రహ్మ యోగము' అనేటువంటి ఒక అధ్యాయము ఉంది భగవద్గీతలో. అక్షరము అంటే నాశనము లేనటువంటిది అని అర్ధము. అంటే నాశనము కానటువంటి దేవున్ని గురించి చెప్పినటువంటి అధ్యాయము అని అర్థము. సరేలే, ఆ అధ్యాయములో 26వ శ్లోకము, 27వ శ్లోకము,


----

28వ శ్లోకము మనకు ఒక గుర్తింపు అర్థాన్ని ఇస్తున్నాయి. ఏమని? ఈ 'పౌర్ణమి అమావాస్య'కు సంబంధించి ఆ విషయాన్ని గురించి తెలుసుకొనే విధానము ఈ మూడు శ్లోకాలలో ఉంది అని నేను అనుకుంటున్నాను. ఆ మూడు శ్లోకాలను మీకు ఇక్కడ తెలియజెప్పాలని అనుకున్నాను. ఇప్పుడు ఈ 3 శ్లోకాలలో 26వ శ్లోకము చూస్తే...


26వ శ్లో॥ శుక్ల కృష్ణ గతీ హ్యేతే జగతః శాశ్వతీ మతే ! ఏకయా యాత్యనా వృత్తిమ్ అన్యయావర్తతే పున ః ||


“పున:” అంటే తిరిగి అని అర్ధము. "శుక్ల కృష్ణ గతీ హ్యేతే” అంటాడు. అంటే శుక్లపక్షము, కృష్ణపక్షము అనేటువంటివి కన్పించేవి రెండు రకాలున్నాయి. “శుక్లము” అంటే “తెలుపు”, “కృష్ణము” అంటే “నలుపు” అనేటటువంటివి రెండునా 'నలుపు తెలుపు అనేటివి వాటిని గూర్చి మనము చెప్పుకోవలసిందే. వీటిలో యోగులకు ఏది కావాలి అని ఆలోచన చేస్తే ఒక మా యోగులకు పనికి వస్తా ఉంది. అంటే దేవుని దగ్గరకు చేరాలని ప్రయత్నము చేసే వాళ్ళకు ఒకటి పనికి వస్తా ఉంది. ఇంకొకటి అట్ల పనికి రాదు తిరిగి జన్మలకు కారణము అయితా ఉంది అని చెప్పడము జరిగింది. దానినే మనము తెలుగులో చెప్పుకుంటే కృష్ణుడు ఏమంటున్నా డంటే అర్జునినితో, అర్జునునికేగా జ్ఞానము చెప్పినది? అవును స్వామి! ఆ..! మనకు కాదు, అర్జునిడికే అని విడిచిపెట్టండి. అట్ల అనుకోవద్దండి స్వామీ! అర్జునుడికి అని పేరు పెట్టి చెప్పినాగాని అది మనకే అనుకోండి. “కలవు పార్థ! రెండు గతులుగా శుక్ల కృష్ణంబులనుచు” అంటే రెండు రకాలుగా ఉన్నాయి, శుక్లము, కృష్ణము అనేటువంటి వర్ణములు. అంటే తెలుపు రంగు నలుపు రంగు రెండు ఉన్నాయి అని చెప్పినాడు. ఆ రెండింటిని


---

నీవు ఎట్లన్నా పోల్చుకో జ్ఞానరీత్య కాని రెండు ఉన్నాయి. అవి ఎవరికి పనికి వస్తున్నాయి అంటే “యోగి జనులకెల్ల” అంటే యోగులుకు మాత్రమే పనికి వస్తాయి. ఎవరికి పనికి వస్తాయి? తపస్సు చేసే వాళ్ళకు కాదు, యజ్ఞాలు చేసే వాళ్ళకు కాదు, దానాలు చేసే వాళ్ళకు కాదు, తరువాత వేదాలు చదివే వాళ్ళకు కూడా కాదు. దేవున్ని తెలుసుకోవాలని ఎవడైతే ఇష్టముగా దేవుని మీద ఇష్టపడి ఉన్నాడో వానికి మాత్రమే ఇది పనికి వస్తుంది. ఎవరిని అనాలి యోగి అని? “యోగము” అంటే “కలయిక”, “వియోగము” అంటే “విడిపోవడము”. అర్థమయిందా!


దేవునిలోకి కలిసిపోవాలని, దేవునికి దగ్గరగా కావాలని ఎవడైతే ప్రయత్నము చేస్తున్నాడో వాడేమైనా చేయనీ పాట పాడనీ, పద్యము పాడనీ, నమాజ్ చేయనీ, శ్లోకము చెప్పనీ, ఇంకోటి చేయనీ, ఏమైనా చేసుకోని వాని భావములో ఇది ఉంటే మాత్రము వానిని “యోగి” అని మనము అనాలి. ముస్లీములేమో నమాజు చేస్తారు, క్రైస్తవులేమో ప్రార్థన చేస్తారు, హిందువులేమో పూజ చేస్తారు. కాని ఇవి మాత్రము ఉండకూడదు ఏవి? ఈ తపస్సులుకానీ, యజ్ఞాలుకానీ, వేదాలుకానీ, దానాలుకానీ ఈ నాలుగు రకాలు లేకుండ ఉంటే వాడు తరువాత దేవునికి దగ్గరగా చేరేవాడు అయితాడు. "రెండు గతులుగా శుక్ల కృష్ణంబులనుచు యోగి జనుల కెల్ల అందునొకట యోగి చెందు ననావృత్తి మరియొకంట జనిన మరల బుట్టు” ఒక మార్గములో పోతే వానికి వృత్తి లేదు అంటే పుట్టుక లేదు, వాడు ఏమి చేస్తాడంటే మోక్షానికి పోతాడు. ఇంకో మార్గములోకి పోతే వాడు తిరిగి జన్మకు పోతాడు అని ఇప్పుడు రెండు మార్గాలు చెప్పినాడు. దానినే “పౌర్ణమి అమావాస్య” అని నేను గుర్తు పెట్టి చెప్పుతున్నాను. దాని వివరము ఇంకా కొంత లోతుకు పోయి చెప్పుకుందాము.



----

ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమి చెప్పినాడు అంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటేమో చీకటి మార్గము, ఇంకొకటేమో వెలుగు మార్గము. ఈ రెండు మార్గాలలో ఒకటేమో జన్మ లేకుండ చేస్తుంది. ఇంకొకటేమో జన్మ కలుగజేస్తుంది అని చెప్పాడు. అర్థమయిందా! ఇప్పుడు మళ్ళా 27వ శ్లోకములో ఏమి చెప్పుతున్నాడంటే


నైతే సృతీ పార్థ! జానన్ యోగీ ముహ్యతి కశ్చన |

తస్మాత్ సర్వేషు కాలేషు యోగ యుక్తో భవార్జున ॥


"ఇట్టి రెండు తెఱంగు లెఱిగిన యోగి పుంగవునకెపుడు భ్రాంతి గలుగబోదు. కనుక నీవు సర్వకాలంబులను పార్థ! యోగ యుక్తుండవు గనుండవలయు” ఈ విధముగా రెండు మార్గాలు తెలుసుకున్నటువంటి వానికి భ్రాంతి కలుగబోదు అంటే అజ్ఞానము కలుగదు. కనుక నీవు ఎప్పుడూ యోగముతో కూడుకొని ఉండు అని చెప్పినాడు. ఈ రెండు మార్గములు తెలిసినటువంటి వానికి అజ్ఞానము కలగదు. కాబట్టి సర్వకాలముల యందును ఎల్లప్పుడూ నీవు దేవునిలోనికి ఐక్యము కావాలని, దేవుని చింత పెట్టుకొని, అటువంటి కోరికే కల్గి ఉండు అని అక్కడ చెప్పడము జరిగింది పై శ్లోకములో ఇంకా 28వ శ్లోకములో ఏమి చెప్తున్నాడంటే...


వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ | అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపై తిచాద్యమ్ ॥


నేను అదే పనిగ తప్పు కూడా చదివినాను, మీరు అర్థము ఏమి చేసుకున్నారో ఏమో! కాని వివరము మాత్రము ఖచ్చితముగా సత్యమే


---

చెప్పుతాను, అబద్దము చెప్పను. “దీని నెఱుంగవాడతిక్రమించు” ఇదంతా తెలుసుకున్నటి వాడు దేనిని అతిక్రమిస్తున్నాడు అనంటే “వేదముల, జపముల, యజ్ఞములను, దానముల జెలంగు పుణ్య ఫలముల జ్ఞానియై పరమమైన యాది పదము బొందు" ఇవన్నీ తెలుసుకున్నటువంటి వాడు తపస్సులు చేసినాకానీ, యజ్ఞములు చేసినాగానీ, దానములు చేసినాగానీ, వేద ఆధ్యాయనము చేసినాగానీ వీటివలన కల్గు పుణ్యఫలములను అతిక్రమించి వాటన్నిటిని దాటి వేసి ఏమాత్రము సంబంధము లేకుండా వాడు మోక్ష పదవి పొందగలుగుతాడు. మోక్షము అంటే దేవుని వద్దకు పోగల్గుతాడు. ఇతర భాషలలో పరలోక రాజ్యానికి పోతాడు అని మనము చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు మార్గాలు ఉన్నాయి. ఈ ప్రపంచములో ఒక మార్గము యోగులకు పనికి వస్తుంది, ఇంకొక మార్గము పనికి రాదు ఎందుకంటే అది జన్మలను కలుగజేస్తాది అని చెప్పడము జరిగింది.


ఈ రెండు మార్గాలలోనూ ఎప్పుడూ దేవున్నే స్మరించుకుంటూ ఉండు అని చెప్పడము జరిగింది. అసలైన మార్గములో ఎప్పుడైతే ఉంటావో ఆ మార్గము అన్నిటికంటే మించినటువంటిది. వీటివల్ల వచ్చేటువంటి పుణ్యఫలాలు యజ్ఞము చేస్తే ఏమి వస్తుంది? పుణ్యము వస్తుంది. దానము చేస్తే ఏమి వస్తుంది? పుణ్యము వస్తుంది. వేదాలు చదివితే ఏమి వస్తుంది? పుణ్యము వస్తుంది. మీరు ఇవన్ని మంచిపనులే కదా అనుకొని, ఇవన్ని చెయ్యొద్దని చెప్తున్నారే మరి మీరు అని మమ్ములను అడిగితే, మేము వద్దని చెప్పముకాని దానివలన మీకు పుణ్యము వస్తుంది, ఆ పుణ్య ఫలములను కూడా అతిక్రమించి నీవు మోక్షాన్ని పొందవచ్చు అని మనకు ఈ మూడు శ్లోకాలలో అక్షర పరబ్రహ్మ యోగములో చెప్పడము జరిగింది. ఈ మూడు శ్లోకాలను మనము విశ్లేషణ చేసి తెలుసుకొని వీటి వలన ఇంకా ముందుకు


----

మనము వివరించి తెలుసుకుంటే ఏమి తెలుస్తుంది అంటే ఇప్పుడు మనము ఉన్నాము. ఇప్పుడు నేను ఈ జ్ఞానము చెప్పుతున్నాను, మీరు వింటున్నారు. చెప్పే వ్యక్తి కన్పిస్తున్నాడు, మాట్లాడే వ్యక్తి కన్పిస్తున్నాడు అంటే చూపుకు దృశ్యము కనిపిస్తావుంది. చెప్పేవ్యక్తి దృశ్యము. చెవికి చెప్పేవ్యక్తి మాట వినిపిస్తావుంది. ఇప్పుడు ఈ రెండిటిని కలిపి ఏమి చెప్పుతున్నాము అంటే ఎవరు చెప్పుతున్నారు అని ప్రశ్న వేసుకుంటే అక్కడ ప్రబోధానంద స్వామి వారు కూర్చోని చెప్పుతున్నారు అని అంటారు. అంటే వాస్తవమే! మీకు కనిపించేది ప్రబోధానంద స్వామే!


ఇంతకుముందు ఒక ఆమె మాట్లాడింది. మొదట మాట్లాడింది, రెండవసారి మాట్లాడింది. అంటే రెండుసార్లు ఆమె మాట్లాడింది. మొదట మాట్లాడినపుడు, నేను అప్పుడే వచ్చి చూశాను, ఈమె మాట్లాడుతుండేది మనిషా లేకపోతే లోపలి ఉండేటటువంటి దయ్యమా అని అనుకున్నాను. మళ్ళీ ఏమి అనుకున్నాను? ఓహెూ! లోపలుండే ఆమె మాట్లాడుతుంది ఈమె కాదు అనుకున్నాను. తరువాత మళ్ళా ఆమె కొంతసేపు ఉన్నాక అపుడు ఏమి మాట్లాడినానో నాకు జ్ఞాపకము లేదు, ఇప్పుడు వచ్చి నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు నా పేరు ఇది, నా ఊరు ఇది అని చెప్పింది ఆమె ఇప్పుడు ఒక మనిషిలో ఇద్దరు కన్పించారు మీకు. స్పష్టముగా కన్పించారు కదా అక్కడ! అంటే ఈమె కాక ఇంకొక ఆమె ఉంది, ఆమెను ఏమని అంటున్నామంటే దేవత అని అంటున్నాము లేకపోతే దయ్యము అంటున్నాము. ఇట్ల మీ భాషలో దేవత అయినాగాని నా భాషలో మాత్రము దయ్యమే. ఎంత పెద్ద దేవత అయినాగానీ నా భాషలో మేము దయ్యమే అంటాముగానీ దేవత అని అనము. అది మీరు లెక్కాచారములో దేవత అని చెప్పినాగానీ నా లెక్కలో దయ్యమే. సరే దయ్యమో దేవతో ఎవరన్నకానీ


----

వాళ్ళు కూడా జ్ఞానము తెలుసుకుంటున్నారని ఇంతకుముందే చాలాసార్లు చెప్పాము. మీరే కాదు మీకంటే చాలామంది దేవతలు ఇక్కడకు వచ్చి, శ్రద్ధగా వింటున్నారు అని కూడా చెప్పాము.


మా అనుభవములో వారము క్రిందట ఒక ఆంజనేయస్వామి తటస్థ పడడము జరిగింది. ఇందాక ఈమెలో నుంచి మాట్లాడినట్లే ఆంజనేయస్వామి ఒక ఆడ శరీరములో నుంచి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతుంటే వారి సంభాషణ విన్నా నేను. వాళ్ళు ఫోన్లో మాట్లాడినదంతా మళ్ళీ నాకు రికార్డ్ చేసి వినిపించారు. వినిపిస్తే అందులో ఏమి కనిపించిందంటే తెలిసిన మా భక్తుడు ఒకాయన ఉన్నాడు, ఆయన చెప్పేమాటలు చూసి, ఆయన బాగా మంచి జ్ఞాని అనుకోంటి నేను మాత్రము, కానీ ఆంజనేయస్వామి ముందర మాట్లాడినపుడు ఆయన అజ్ఞాని, ఆంజనేయ స్వామియే జ్ఞాని అనుకున్నాను నేను. అట్ల కనిపించిందన్నమాట. అంటే అంత డీప్, అంత శుద్ధముగా జ్ఞానము తెల్సుకొని మాట్లాడుతున్నాడు ఆయన. పై పైన మాట్లాడేవాళ్ళు అటు ఇటు తప్పుటడుగు వేసి మాట్లాడుతున్నారుగాని ఆయన మాత్రము ఖచ్చితముగా జ్ఞానము ప్రకారమే ఏమాత్రము ప్రక్కటడుగు వేయకుండా మాట్లాడుతున్నాడన్నమాట. అపుడు మాకు ఏమనిపించిందంటే దేవతలు మనుషులకంటే బాగా జ్ఞానము తెలుసుకుంటున్నారు అని అనిపించింది మాకు. అంటే మా లెక్కలో దేవతలు అంటే దయ్యాలు అని. దేవుడు అందరిని సృష్టించాడు కనిపించే మనుషులను, కనిపించనటువంటి మనుషులను కాబట్టి ఆ కనిపించనటువంటి మనుషులే దేవతలు. దేవతలో దయ్యాలో ఎవరో అనుకుందాము. ఈ రకముగా వాళ్ళలో అది కనిపించింది. అంటే ఒక మనిషిలో ఇద్దరు మాట్లాడేటటువంటి విధానము అక్కడక్కడ కనిపిస్తా ఉంది. ప్రత్యక్షముగా ఇప్పుడు గుంటూరు జిల్లా నుంచి వచ్చిన


---

ఆడమనిషి మాట్లాడింది. మళ్ళీ ఆమె మాట్లాడినపుడు తెలిసింది కదా! అట్లగానే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కానీ నాలో దయ్యము మాట్లాడడము లేదు, సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు. అర్థమయిందా!


ఇప్పుడు ఆత్మ ఆధ్యాయనము ఒకటుంది, ప్రకృతి ఆధ్యాయనము ఒకటుంది. ప్రకృతి ఆధ్యాయనము ప్రకారము చూస్తే ప్రబోధానంద స్వామి బయటకు కనిపించే ఆయన (వ్యక్తి) మీకు, కానీ ఆధ్యాత్మికము ప్రకారము చూస్తే ఎవరు మాట్లాడుతున్నారు? లోపల ఉండేటువంటి ఆత్మే మాట్లాడు తుంది. అర్థమయిందా! ఇప్పుడు ఆత్మ మాట్లాడుతుందంటే మీలో మాట్లాడేది కూడ ఆత్మే కదా! ప్రతి మాట ఆత్మే మాట్లాడుతుంది అని బైబిల్లో చెప్పబడింది. అన్ని గ్రంథాలలోనూ చెప్పినారు. మనుషులు బొమ్మలులాగా ఉన్నారు అని చెప్పినారు భగవద్గీతలో కూడా. నేను వాళ్ళను ఆడిస్తా ఉన్నాను, మాట్లాడిస్తున్నాను, పాడిస్తున్నాను అని చెప్పినాడు. ఆ రకముగా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి, నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నాతో మాట్లాడిస్తుంటే ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? అని లెక్కవేస్తే ఆధ్యాత్మికరీత్య లోపల ఉండేటటువంటి ఆత్మే మాట్లాడుతుంది గానీ మీరు అనుకున్న మనిషి కాదు. అర్థమయిందా! కానీ అప్పుడప్పుడు మనిషిలోని భావాలూ మాట్లాడుతుంది ఆత్మే. ఆత్మ యొక్క భావాలు మాట్లాడుతుంది ఆత్మే. కానీ మనిషి యొక్క భావాలు మాట్లాడినపుడు అది మనిషి విధానమే. ఆత్మ స్వయముగా మాట్లాడినపుడు అది ఆత్మ విధానమే. మాట్లాడేవాడేమో ఆయనే! కానీ ఎప్పుడు మనిషి భావము? ఎప్పుడు ఆత్మ భావము? అంటే ఎప్పుడు మనిషి మాట్లాడుతున్నాడు? ఎప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు? అనే విషయము మాత్రము అగమ్యగోచరము, అది ఎవ్వరికీ ఏమాత్రము అర్థము కాదు. అందువల్ల ఇప్పుడు ఆమెలో ఎప్పుడు దయ్యము మాట్లాడింది? ఎప్పుడు


---

మనిషి మాట్లాడింది? అనేది ఎట్లా కనిపించలేదో, అట్లగానే ఎప్పుడు మనిషి మాట్లాడుతాడు? ఎప్పుడు దేవుడు మాట్లాడుతాడు? అనే విషయము మాత్రము తెలియదు. ఇంతకుముందే చెప్పినాను. నేను తప్పులు చదువుతాను, ఇప్పుడు చదవడములో కూడా ఒకటి తప్పు పోయింది, ఏమనుకోవద్దండి అని చెప్పాము. అది మనిషి యొక్క భావన. ఇక్కడ పలికే శబ్దములో తప్పు ఉంది కానీ మీరు ఏమనుకోవద్దండి అది మనిషి యొక్క భావన. కానీ ఆ భావమును కూడా పలికినవాడు ఎవడు ఆత్మే. పలికిన వాడు ఆత్మ. మనిషి యొక్క భావాన్ని తీసుకవచ్చి చెప్పినాడు, అప్పుడు మనిషి చెప్పినట్లే లెక్క అవుతుంది.


అట్లు కాకుండా మనిషి భావము లేకుండా మనిషి గచ్చి ఉండిపోయినాడనుకో, ఆయనంతకు ఆయన చెప్పినాడనుకో స్వయముగా, మనిషి ప్రమేయము ఏమి కుండా అపుడు ఆయన చెప్పిందే అవుతుంది. అర్థమయిందా! ఇప్పుడు అన్ని జ్ఞానాలు నాకు ఏమాత్రము తెలియవు చెప్పేదంతా ఆయనే అని చెప్పి కూర్చొన్నాము మేము, నాకేమి సంబంధము లేదు అని. ఆయన ఏదో చెప్పుతున్నాడు మిమ్మల్ని నవ్విచ్చాడు, ఏడ్పించాడు అంటే మీకు బాగా అర్థమయ్యేటట్లు చేసినాడు. ఇవన్నీ చేసినది ఎవరు? ఆత్మ. ఆత్మ అనేవాడు మిమ్ములను మీలో నుండి కూడా మాట్లాడుతున్నాడు. నా విషయము ప్రక్కన పెట్టండి, మీ విషయము తీసుకోండి. మీలో నుంచి కూడా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఆత్మ మాట్లాడుతా ఉందో, ఎప్పుడు నీ భావాన్ని చెప్పుతా ఉందో అది నీకు ఏమాత్రము తెలియడము లేదు. అన్నీ నేనే మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నావు. అర్థమయిందా! నేను అంతో ఇంతో జ్ఞానము తెలిసి నేను ఏమి అనుకుంటున్నాను అన్నీ స్వయముగా ఆత్మే మాట్లాడుతావుంది. అవసరము వచ్చినపుడు తన విషయము


---

చెప్పుతుంది, అవసరము వచ్చినపుడు నా విషయము కూడా చెప్పుతుంది. కానీ నా విషయము చెప్పినా గానీ, ఆయన విషయము చెప్పినాగానీ అది ఆత్మే దేవుడే పలుకుతున్నాడు అనే విధానము ఖచ్చితముగా నాకు తెలుసు. కాబట్టి అప్పుడు ఏమవుతా ఉంది అంటే ఇది ఆధ్యాత్మికము అవుతావుంది నాది. లేదు, మీరు అట్లుకాకుండ నేనే మాట్లాడుతున్నాను అనే భావము మీలో ఉంది కాబట్టి అది ఆధ్యాత్మికము కాదు. దానికి వ్యతిరిక్తమైనటు వంటిది మాయ తత్త్వము. మాయలో మీరు చిక్కుకున్నారు. మాయలో ఉన్నారు, నీకు మాయ వలన ఏమి తెలియలేదు అని తెలిసింది. అందువల్ల ఇప్పుడు ఈ ఆధ్యాత్మికము అనేది ఏమిటి? మాయ అనేది ఏమిటి?

చూసుకోవాలి మీరు.


ఈ విధముగా చూసుకుంటే ప్రతి నిత్యము మనము ఎటువంటి భావములో ఉన్నాము? అని చూసుకుంటే మనిషి ఏమనుకుంటున్నాడు అంటే నేను అనుకుంటూనే అన్నీ జరుగుతున్నాయి, నేను అనుకుంటూనే మాట్లాడు తున్నాను, నేను కోరుకుంటూనే ఈ పని చేస్తున్నాను అని అంటున్నాడు. జ్ఞానము తెలియని మనిషి ఇలా అంటున్నాడు. వాస్తవమే! కాని నీవు అనుకున్నదే జరుగుతా ఉంది, నీవు కోరుకున్నదే తింటున్నావు, నీవు మాట్లాడాలనుకున్నదే మాట్లాడుతున్నావు, నీ భావాన్నే అక్కడ వ్యక్తము చేస్తున్నాడు. నీ పనినే చేస్తున్నాడు, ఇదంతా జరుగుతూవుంది, కానీ ఆ జరిపేవాడు ఎవడు? ఆత్మ అన్నమాట. ఆత్మ చేస్తూ ఉండే దానివల్ల నేనే చేస్తున్నానని నీవు అనుకున్నావు. ఎందుకంటే అన్నీ నీవు అనుకున్నట్లే జరుగుతున్నాయి కదా! కానీ అక్కడ చేసేవాడు ఎవడు నీ శరీరములో? దానికి ఎవరు అధిపతి? అనేది తెలియక పోవడము వలన నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నాడు మనిషి. ఒకానొకప్పుడు తను ఏమి చేతకాని


---

పరిస్థితులలో చేయి కదలని పరిస్థితిలో, కాళ్ళు కదలని పరిస్థితిలో, శరీరము కదలని పరిస్థితిలో నీవు ఉండి పోయి, ఏమి మాట్లాడని సమయము వచ్చినప్పుడు కానీ, నడవలేని పరిస్థితి వచ్చినపుడుకానీ, నీవు ఏమి చేయలేని పరిస్థితులు వచ్చినప్పుడుకానీ, నువ్వు ఆలోచన కూడా చేయలేని పరిస్థితి వచ్చినప్పుడుకానీ నీవు ఎందుకు నడవలేక పోతున్నావు? ఎందుకు మాట్లాడలేక పోతున్నావు? ఎందుకు పరుగెత్తలేక పోతున్నావు? నువ్వు పరుగెత్తాలనుకుంటున్నావు, పరుగెత్తవచ్చు కదా! అపుడు నీవు తినాలను కుంటున్నావు, తినొచ్చు కదా! కానీ ఆ పనులు నీ చేత చేయించడు. చేసేవాడు వేరే ఉన్నాడు, వాడు చేయడు. నేను చేయలేకపోతున్నానని అపుడు కూడా అనుకుంటున్నావు నీవు. కానీ ఆయన నా చేత చేయించలేదు, చేసేవాడు ఆయనే అని అప్పటికి కూడ తెలియదు. ఈ విధముగా మనిషి ఏమి చేస్తున్నాడంటే ఈ చీకటి వెలుతురు అనేటువంటి రెండు విధానాలలో కొట్టు మిట్టాడుతూ దానినే మనము బయట అమావాస్య, పౌర్ణమి అనేటటువంటి విధానాన్ని చూపుతూ దేవుడు ఏమి చేసినాడు మనకు ఈ మాయ, ఆత్మ అనేటువంటి విధానాన్ని కూడా పెట్టినాడు. మాయ అనేదానివల్ల ఆత్మ అనే విషయము ఏమాత్రము తెలియకుండా పోయింది, బయట విషయమే తెలుస్తావుంది. బయట నీకు చీకటి వెలుగు ఏ విధముగా ఉన్నాయో, అంటే శుక్లపక్షము, కృష్ణపక్షము ఏ విధముగా ఉందో, కృష్ణ అంటే నలుపు శుక్ల అంటే తెలుపు అని మేము చెప్పుతున్నాము కదా!


ఈ రెండు విధానాలు ఏ విధముగా ఉన్నాయో, ఆ విధముగా నీలో జ్ఞానము, అజ్ఞానము రెండూ ఉన్నాయి. ఈ జ్ఞానము అజ్ఞానము రెండింటిని నీవు అలవాటు చేసుకోవాలి అంటే ఎప్పుడు నేను జ్ఞానములో వుండి మాట్లాడుతున్నాను? ఎప్పుడు నేను అజ్ఞానములో వుండి మాట్లాడు


---

తున్నాను? అని తెలుసుకోవాలంటే మాత్రము నీవు అహర్నిశలు జాగ్రత్తగా ఉండి ఆలోచనలు చేస్తేగాని అది అర్థము కాదు. నీకు చిన్నప్పటి నుండి ఎట్ల అలవాటు అయ్యింది? నేనే మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నావు. నీవు అనే వానివి ఒకడు ఉన్నావు అని నీవు అనుకోవడమే పెద్ద పొరపాటు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఒక ఇంటిలో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురిలో నీవు చిన్న పిల్లోనివి. అది కూడా నీవు ఎదగలేని పరిస్థితిలో నీ బుద్ధి వికాసము కాలేదు, కాళ్ళు చేతులు పెరగలేదు, కాళ్ళు చేతులు సొట్ట పోయినాయి, కండ్లు కనిపించలేదు, చెవులు వినిపించ లేదు, అటువంటి పరిస్థితిలో నీవు వాళ్ళకు పుట్టావు, నీవు అట్లే ఉన్నావు. వాళ్ళు ఏమి చేస్తున్నారంటే నీ తల్లి తండ్రి నిన్ను సాకుతున్నారు, అంటే నిన్న పోషిస్తున్నారు. నీ తల్లి నీ తండ్రి నీకు ఏది పెడితే అది తింటున్నావు, నీవు స్వయముగా ఏమి తినడము లేదు. 4. ఒకచోట నుంచి ఎత్తుకొని పండబెడితే ఆడ పండుకుంటున్నావు. నీ చెయ్యి తీసి ఇట్ల పెడితే ఆ చెయ్యి ఇట్ల పడతా ఉంది. కాళ్ళు తీసి అట్ల పెడితే అట్ల పడతా ఉంది. నీవు స్వయముగా కాళ్ళు కదిలించలేదు, చేయిని కదిలించలేదు, అటువంటి శిశుదశలో ఉన్నావు నీవు. ఏమాత్రము ఎదగని పరిస్థితిలో, శరీరము అభివృద్ధి కాని పరిస్థితిలో ఉండి, శరీరము పని చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి నీది. కానీ నీ కాళ్ళు ఎత్తి పెట్టేవాళ్ళు, చెయ్యిని ఎత్తి పెట్టేవాళ్ళు, నిన్ను ఎత్తి ఇంకొక చోట నడిపించే వాళ్ళు, ఇంకొక చోట పండబెట్టే వాళ్ళు, అందరూ నీ తల్లి తండ్రులే, ఇద్దరే ఉన్నారు, నీ తాత చూస్తూ ఉన్నాడు అని చెప్పినాను నేను. నీవు ఇలా మొత్తముగా అవిటివానివి అయి ఉండి నీవు 'నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, అన్ని పనులు నేనే చేస్తున్నాను' అనుకోవడము పెద్ద పొరపాటు. అర్థమయిందా! నీవు ఒకసారి నవ్వాల్సిన పరిస్థితి


----

వచ్చినప్పుడు నవ్వుతావు. నీ భావము అది. నీ భావాన్ని వ్యక్తము చేస్తూ దేవుడు నవ్విస్తాడు. అబ్బా నాకి సంతోషము కల్గింది, నేను నవ్వినాను అనుకుంటావు. నీకు సంతోషము కల్గినేది వాస్తవమేకానీ, నవ్వినేది వాస్తవమా? అని నేను ప్రశ్నవేస్తున్నాను. నీవు నేనే నవ్వి నాను అని అనుకుంటున్నావు, ఇంక ప్రశ్నే లేదు దానికి. నేను ప్రశ్న వేస్తున్నాను? నవ్వేది నువ్వు కాదు. ఆ నవ్వు ఎవరిది? ఆయన నవ్విచ్చినాడు, నిన్ను భ్రమలోపడేసినాడు. అర్థమయిందా!


ఆ భ్రమలో నువ్వు మునిగి పోయినావు. ఆ భ్రమలో నీవు ఏమి చేస్తున్నావు అంటే నేను నవ్వినాను అనుకుంటున్నావు. అది పెద్ద పొరపాటు. నేను కాకపోతే ఇంక ఎవ్వరు నవ్వినారు? అంటే నీకు తెలియని వాడు ఇంకోడు ఉన్నాడు, కనిపించనోడు " అని చెప్పినాను కదా నేను! నీకు కనిపించేదంతా చీకటే. నువ్వు చీకటిలో ఉన్నావు. నీకు తెలియనిది ఇంకొకటి ఉంది. అర్థమయిందా! ఇప్పుడు “నవ్వు” దగ్గరికి వచ్చే సరికి 'ఆనందము నీది’, 'నవ్వు ఆత్మది’. “ఏడుపు” దగ్గరికి వచ్చేసరికి 'బాధ నీది', 'ఏడుపు ఆత్మది'. ఏడుపు ఎవ్వరిది? గట్టిగ చెప్పండి. ఏడుపు ఆత్మది. ఏడ్చేవాడు, నటన చేసేవాడు, కనిపించేదంతా ఆత్మది. సరే, ఇప్పుడు అందులో ఉన్న దు:ఖము ఎవ్వరిది? దుఃఖము నీది, అనుభవించే బాధ నీది. ఒకసారి నేను ఏడ్చినాను, ఎవరు? జీవుడు. అంటే బాధపడినాడు జీవుడు. కాని పైన ఏడ్చాలి కదా! జీవునికి బాధ ఉన్నపుడు పైకి తెలియాలి కదా! తెలిసే విధముగా చేసినది ఎవరు? ఆత్మ ఏడ్చింది, జీవుడు బాధ పడినాడు. ఇది కొత్త చదువు ఉన్నట్లుంది మీకు. ఆత్మ ఏడ్చింది, జీవుడు బాధపడినాడు. ఒక అరగంట పోయిన తరువాత నేను బాగా ఏడ్చినానా అని అడుగు తున్నాడు, ఎవరు? అడిగేది ఎవరు? ఆత్మ.


---

కానీ జీవుడే అడుగుతున్నాడని వీళ్ళు అనుకున్నారు. కాని జీవుడు అడగలేదు, జీవుడు బాధపడినాడు. వాడు బాధ పడినేది వానికి తెలుసు. కానీ ఆత్మ ఏమి చేస్తున్నదంటే మనుషులను మభ్యపెట్టే దానికోసము ఇప్పుడు ఎవరు ఏడ్చారనుకుంటున్నారు వీళ్ళు అని, ఏడ్చినేది నేను కదా! అసలు నన్ను గుర్తించినారా లేదా! అని నేను బాగా ఏడ్చినానా? అని అంటాడు, అంటే వినేవాళ్ళకు ఏమి అర్థము కాలేదు. ఏడ్చినంతసేపు ఏడ్చి మళ్ళా బాగా ఏడ్చినానా అంటున్నాడు అని. అట్లగా, కాని ఒక ప్రక్క ఏమి అన్పిస్తాది అంటే మాకు, ఈ ఏడ్చినోడు ఊరకనే ఉండకుండా మళ్ళీ బాగా ఏడ్చినానా? అని అడుగుతున్నాడు అనిపిస్తాది మాకు, పల. కాని మనము లోపల నుంచి చెప్పేదానికి కాదు కదా! మన భావాన్ని వ్యక్తము చేయాలంటే ఆయనే చేయాలి. ఇట్ల రెండు భావాలను వ్యక్తము చేస్తున్నాడు. ఆయన భావాన్ని ఆయనే వ్యక్తము చేస్తాడు, మన భావాన్ని కూడా ఆయనే వ్యక్తము చేస్తాడు. ఇది క్రొత్త విషయము మీకు గుర్తు పెట్టుకోండి. ఇది క్రొత్త విధానము మీకు అర్థమయితాందో లేదో ఈ రోజు. మనలో ఉండేదాన్ని ఏదైనాగానీ ఆయన వ్యక్తము చేస్తాడు. నీవు ఇతరులతో ఏమనుకొంటావు అంటే నీవు వాని మీద గుణముతో అసూయపడి ఏదో వాని గురించి చెడ్డగా మాట్లాడాలనుకొన్నావు. అది నీ పద్ధతి, దేవుని పద్ధతి కాదు. నీ గుణాల ప్రభావము. ఆ గుణాల ప్రభావములో వాళ్ళను ఏదో అనాలనుకున్నావు. అనేది ఎవరు? అనేది ఆత్మ, నోటితో మాట్లాడేది ఆత్మ, కాని భావము? నీది. నీవు ఏదైతే వ్యక్తపరచాలని అనుకున్నావో దానిని ఆయన వ్యక్త పరుస్తున్నాడు. వేరే వాళ్ళ మీద అసూయను నీవు వేరేవాళ్ళని తిట్టాలని తిట్టినావు, వాన్ని నానారకాల మాటలు తిట్టినావు, ఆ మాటలు అనేది ఎవరు? ఆత్మ. మన భావము అయితే ఉందిగాని తిట్టాలని, తిట్టినేది మనము


---

కాదు వాస్తవముగా. ఆ తిట్టినేది మాత్రము ఎవరు? ఆత్మే. అంటే ఆయనకు అన్ని తిట్లు వస్తాయన్న మాట, నానారకాల తిట్లు కూడా ఆయనకు వస్తాయి. అక్కడ ఏమి మాట్లాడాలో అదే మాట్లాడుతాడు కాని నేను తిట్టినన్ని తిట్లు ఎవ్వరూ తిట్టరు అని వీడు అనుకుంటాడు.


కానీ నిజముగా ఎవరు తిట్టినేది? భావము వీనిది, తిట్లు ఆయనవి. భాష ఆయనది, మాట ఆయనది, మాట్లాడేది మాత్రము ఆయన కాని ఆ మాటలు అన్నీ మనమే మాట్లాడేవాళ్ళమని మనము అనుకుంటాము. అబ్బా నేను తిట్టినట్లు ఎవ్వరూ తిట్టలేదు, నేను బాగా తిట్టినాను అనుకుంటాడు. ఇంకా అప్పుడు ఏమవుతుంది అంటే తిట్టిన పాపమంతా నీ నెత్తిన పడుతుంది వచ్చి. ఆయన తిడితే వీడు ఎందుకు మోసుకోవాలి అని. భావము నీదిగాని పని నీది కాదు కదా! అయినా ఆ పనిని కూడా నేనే చేసినానని అనుకోవడము వల్ల నీకు ఏమయితా ఉంది? ఆ పనిలో చేసిన తప్పంతా నీ మీద వచ్చి పడుతా ఉంది. ఆ పాపము అంతా నీ మీద వచ్చి పడుతా ఉంది. ఈ విధముగా లెక్కవేసుకుంటే మనము ఎక్కడ మోసపోతున్నాము? ఎక్కడ మోసపోలేదు? అనే విషయము ఏ మనిషికి తెలియదు. దేవుడు మనలో ఉండి మాట్లాడుతున్నాడు. మీకు నిరూపణగా ఒక వాక్యము చెప్పుతాను. దైవగ్రంథము ఖుర్ఆన్ ఉంది కదా! ఆ ఖుర్ఆన్ గ్రంథములో అల్బఖర 2వ సూరాలో 186వ ఆయత్లో “మీకు దేవుడు అత్యంత సమీపమున ఉన్నాడు మీరు అనుకుండే ప్రతి విషయము ఆయనకు తెలుసు” నీ భావములో ఏమైతే ఉందో ఆ భావము ఆయనకు తెలుసు. ఎందుకు? నీకు అందరికంటే దగ్గరగా ఉండేవాడు ఎవరు? అత్యంత సమీపమున మీలో ఉండే దేవుడు. మళ్ళీ ఆయనకు అది తెలుసు కాబట్టి నీ భావాన్ని ఏమి చేస్తాడాయన? అంటే మాటల రూపములో వ్యక్తము చేస్తాడు.


---

అర్థమయిందా! నీవు అనుకుండే భావాన్ని మాటల రూపములో వ్యక్తము చేస్తాడు. అట్లేకాక నీవు అనుకోకున్నాగానీ నీకు తెలియని విషయాన్ని కూడా ఆయన మాటల రూపములో వ్యక్తము చేస్తాడు. మాటల రూపములోగానీ ఇంకో రూపములోగానీ వ్యక్తము చేస్తాడు, నీకు అర్థమయ్యేటట్లు చేస్తాడు. నీకు తెలియని విషయము కూడా చెప్పుతాడు.

ఒక సందర్భములో ఎవరితోనయినా నీవు మాట్లాడుతా ఉంటావు, జ్ఞానము చెప్పాలనుకుంటావు, నీకు తెలియదు ఆ జ్ఞానము, కొంతవరకు ఏదో నీకు ఉన్నవరకు చెప్పాలనుకుంటావు. చెప్పుతా చెప్పుతా నీ మాటలు రెండు చెప్పుతావు మళ్ళీ మూడో మాట రాదు నీకు. మూడో మాట, నాలుగో మాట, ఐయిదో మాట, ఆరో మాట, నూరు నూటయాభై, రెండువందలు, మూడు వందలు, ఐదువందలు మాటలైన ఆయన చెప్పుతాడు. ఒక గంట అయిపోయిన తరువాత ఇంత సేపు నేను మాట్లాడినానా? అని వీడు

అనుకుంటాడు. ఎందుకంటే వీనికి ఏమీ తెలియదు కదా! అనుమానము వచ్చేది ఖాయమే! కానీ అనుమానము వచ్చినా నేనే కదా మాట్లాడినేది అనుకుంటాడు వాడు. వీనికి తెలియదు ఇంకొకడు ఉన్నాడని. వెనుకల మాట్లాడినేది ఇంకొకడు ఉన్నాడని తెలియదు. ఒక ఆమె వచ్చింది, స్వామి! నేను జ్ఞానము ఇతరులకు చెప్పాలనుకున్నాను. నేను చదివిన జ్ఞానము నాకు జ్ఞాపకము ఉండదు. ఇతరులకు ఎట్ల చెప్పాలి నేను? చెప్పాలనుకుంటే ఏమి చేయాలి నేను? నీవు ఏమి చేయవద్దు. చెప్పాలి అని అనుకో. చెప్పేవాడు ఇంకొకడు, నీకెందుకు? అని చెప్పినాను నేను. అంటే నేను చెప్పితే కదా చెప్పేది, ఇంక ఎవరు ఉన్నారు చెప్పేది? అంటే అది వద్దమ్మా నీవు జ్ఞానము చెప్పాలనుకున్నావు. నేను జ్ఞానము చెప్పాలని అనుకొని, నువ్వు మొదలు పెట్టు, ఏదో ఒకటి రవ్వ. నీవు అనుకో. ఆయనే మొదలు పెడుతాడు


---

ఆయనే చివరి వరకు ఆయనే చెప్పుతాడు. చివరకు ఏమనుకుంటావు నువ్వు? అబ్బా ఇంతసేపు నేను చెప్పినానా! ఇదంతా ఎంత బాగా చెప్పినాను! అనుకుంటావు. లేకపోతే ఇంతసేపు నాకు ఎట్ల తెలుసు అని అనుకుంటావు, నీకే ఆశ్చర్యమవుతుంది నీవు చెప్పినేది. కానీ ఆశ్చర్యము ఎందుకయింది అంటే ఇంతసేపు నేను మాట్లాడినానా అని నీకు ఆశ్చర్యము అయితాది కానీ మాట్లాడేది వాస్తవమే కానీ ఎవరు మాట్లాడినేది? అది మాత్రము తెలియదు. ఎవరు మాట్లాడినారు? అంటే నీలో ఉండే దేవుడే మాట్లాడినాడు కానీ నీవు మాట్లాడలేదు.


ఈ విధముగా మనకు ప్రతి విషయములోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి సందర్భములోనూ మనకు దేవుడు మాట్లాడుతా ఉన్నాగానీ, దేవుడు పని చేస్తూ ఉన్నాగానీ, అవన్నీ నేనే చేస్తూ ఉన్నాను, నేనే మాట్లాడుతున్నాను అనే భావము మనిషిలో ఉంది. ఒక్కొక్కసారి అనుమానము వస్తాది ఏమనంటే ఇవన్ని నేను చేసినానా? ఇవన్ని నేను మాట్లాడినానా? అనే అనుమానము వస్తుంది. అట్లగానే మాకు కూడా ఒకసారి అనుమానము వచ్చింది. ఏమని అనుమానము వచ్చింది? 95 గ్రంథాలు నేను వ్రాసినానా అబ్బా! అని వెనకకు తిరిగి చూసుకున్నా. అంటే ఒరేయ్ ! రోజు చెప్పేది నీకు అదే చదువు మళ్ళీ నేను వ్రాసినాను అని నీవు ఎందుకు అనుకుంటావు. నీవు వ్రాయలేదు ఒకటి కూడా. మొదటి నుంచి వ్రాసేవాడు వేరేవాడు అని నేను అందరికి చెప్పుతున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇట్ల ఇంకోటి అనుకోవడము ఏంది? 95 గ్రంథాలు వ్రాసినాను అని, ఇది పెద్ద పొరపాటు. 95 గ్రంథములు నీవు వ్రాయలేదు. నేను జ్ఞానము చెప్పాలని ఉద్దేశ్యము నీకు ఉంది. చెప్పినేది ఎవరు? ఆయన చెప్పినాడు ఆ ఉద్దేశ్యాన్ని బయటికి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు మీటింగ్ చెప్పాలని ఉంది. ఏంది? "పౌర్ణమి


---

అమావాస్య” కానీ పౌర్ణమి అమావాస్యలో రెండే రెండు తెలుసు. అది ఒకటి చీకటని, ఇంకొకటి పగలని. మనకు ఏమి తెలియదే! ఎట్ల చెప్పాలి? అంటే ఒకటే ధైర్యము మాకు, ఏమి? అంటే ఏమాత్రము మీటింగ్కు వచ్చేంతవరకు వెనకకు తిరిగి చూసుకోలేదు. ఎందుకు చూసుకోలేదు? అంటే మాట్లాడేవాడు జీవుడినైన నేను కాదు, ఆత్మ అని ఉంది కదా!


ఈ పనికి నాకు ఎందుకు భయము, నేను ఊరకే ఉంటే సరిపోతాది కదా! అని ఊరక ఉన్నాము. సరే, ఇప్పుడు మాట్లాడడము మొదలుపెట్టినాము మొదలుపెట్టినాము చెప్పుతా ఉన్నాడన్నమాట ఇందులో రహస్యము. చూడు! మాట్లాడేవాడు ఒకడే, మీరు పొరపాటు పడుతా అంటారు. తప్పు చదివేవాడు వాడే, రైట్ చదివేవాడు వాడే. ఒకవేళ తప్పు చదివినాడు అనుకో, ఈయనకు చదువురాదని మీరు అనుకుంటారు. ఎవరిని? కనిపించేవానిని. కనిపించిన వాడు కాదు చదివింది, కనపరానోడు చదువుతున్నాడు. అర్థమయిందా! అయన అదే పనిగా తప్పు చదివి తప్పుడోడు అనిపిచ్చుకుంటాడు. మంచి చేసి మంచోడు అనిపిచ్చుకుంటాడు. కానీ లోపల ఉండే వానికి ఏమాత్రము సంబంధము లేకుండ ఈయనే మీకు బయట ప్రపంచములో పని చేస్తూ ఉన్నాడు. అర్థమయిందా! ఆ పని చేస్తున్నాడు అని ఎవరికీ తెలియదు. అర్థమయిందా! ఖుర్ఆన్ గ్రంథములో 6వ సూరా 102వ ఆయత్లో కూడా "ఈయనే మీ కార్యకర్త, ఈయనే మీ అల్లాహ్, ఈయనే మీకు ఆరాధ్య దైవము” అని చెప్పబడింది. అప్పుడు ఈయనే మీ కార్యకర్త అని కూడా చెప్పబడింది. ఎవరు చెప్పారు ఈయనే మీ కార్యకర్త అని? పెద్ద అల్లాహ్ చెప్పినాడు అంటే ముందున్న అల్లాహ్. ఈ విధముగా ఆయన కార్యకర్తగా నీలో పనిచేస్తూ ఉన్నాడు. కార్యకర్త అంటే ప్రతి కార్యానికి ఆయన కర్తగా ఉన్నాడు. మళ్ళీ ప్రతి కార్యానికి ఆయన కర్తగా ఉన్నపుడు ప్రతి పనిని నీవు


----

ఎందుకు చేస్తున్నానని అనుకుంటున్నావు. అది తప్పు కాదా! తప్పే. ఒకరు ఏమి చెప్పుతున్నారు అంటే స్వామీ!


మేము గ్రంథ ప్రచారము చేయాలనుకున్నాము, దేవునిసేవ చేయాలని అనుకున్నాము. కాని మేము అనుకున్నంత గ్రంథాలు పోవడము లేదు, అందరివి చాలా పోతూ ఉన్నాయి, మావి కొన్నే పోతున్నాయని అన్నాడు. అంటే నేను ఏమి జవాబు చెప్పుతున్నాను అంటే నువ్వు ఉద్దేశ్యము “సేవ చేయాలనే ఉద్దేశ్యము”ను నీవు పెట్టుకో, నీకు పోయినాయా లేదా అనేది నీకు సంబంధము లేదు. ఆ పని చేసే వాడంతా ఇంకోడు. బయట మాట్లాడేవాడు, దానిని చూపించేవాడు, మాట్లాడేవాడు అమ్మేవాడు ఇంకోడు. ఉద్దేశ్యము నీది, ఆ ఉద్దేశ్యము ప్రకారము ఆయన పని చేస్తున్నాడు. ఆయన అమ్ముతాడు. ఆయన రెండన్నా అమ్మనీ, మూడన్నా అమ్మనీ, పదన్నా అమ్మనీ, ఇరవై అన్నా అమ్మనీ ఎక్కువ అమ్మిన రోజు నేను అమ్మినాను అనుకోవద్దు, తక్కువ అమ్మిన రోజు కూడ నేను అమ్మినా అని అనుకోవద్దు. నీకు రెండూ సంబంధము లేదు. ఈ రెండు చేసినేది ఎవరు? ఆత్మ. కాబట్టి ఆయన మీద ధ్యాస పెట్టుకో నీవు. ఎప్పుడైతే ఆయన మీద ధ్యాస పెట్టుకున్నావో, నేను అనే భావన నీకు పోతుంది. కానీ మనము ఇప్పుడు మూడు గ్రంథాలు చదివినాము. మీరు ఒక భగవద్గీతనే చదవద్దండి, బైబిలు చదవండి, ఖుర్ఆన్ కూడా చదవండి అని చాలామందికి ఖుర్ఆన్ కూడ ఇచ్చాను. ఖుర్ఆన్లో ఉండే వాక్యాలను మీకు వ్రాసి ఇవి వజ్రవాక్యాలు అని చూపిచ్చాము, మీరు చదువుకున్నారు. తరువాత అట్లగానే బైబిలు చదివినారు. అట్లే భగవద్గీత చదివినారు. మూడు గ్రంథాలు చదివినాకాని మిమ్ములను వెన్నంటి నీడలాగా వస్తావుంది అజ్ఞానము. ఏ పని చేసినా “నేనే”, ఏ మాట మాట్లాడినా “నేనే” అని అనుకుంటారు. ఆంజనేయస్వామితో


----

మాట్లాడిన భాషణలో, ఒకాయన జ్ఞాని ఇట్లా అంటున్నాడు “వేరేవాళ్ళు కుట్ర చేసినారు నన్ను చంపాలని” అని అంటున్నాడు. దానికి ఆయన ఏమంటున్నాడంటే అన్ని స్వామికి తెలుసు కదా! 


చంపేవాడు కూడ స్వామే కదా! వాళ్ళెవరు చంపేదానికి? నీవు ఎందుకు అంత అజ్ఞానములో ఉన్నావు? జ్ఞానము తెలుసుకున్నావా? అని ఆంజనేయస్వామి దండిస్తున్నాడు ఈయనను. అపుడు ఏమని అర్థము? దండించే వాడే బాగా జ్ఞానము తెలుసుకున్నాడు, వీనికి కాలేదు అని అర్థము. ఆ రకముగా లెక్కేసుకుంటే మనము పొరపాటు పడుతున్నాము. ఎంత జ్ఞానము తెలుసుకున్నాగాని “నేను” అనే భావము వదిలి పెట్టలేదు మీరు. ఇంకా కొంతమంది నేను “నేను” అనే భావాన్ని తీసేసుకున్నాను అన్నాగానీ, ఇంగువను తీసేసిన తరువాత కూడా డబ్బీలో ఇంగువ వాసన ఉన్నట్టు, ఇంగువ లేకున్నా ఇంగువ వాసన ఉన్నట్టు, నేను అనే భావము కొంతైనా మిగిలి ఉంది. ఈ రకముగా "నేను అనే భావము ఎంతవరకైతే ఉందో అంతవరకు నీవు అమావాస్యలో ఉన్నట్లే. నేను అనే భావము ఎప్పుడైతే పోయిందో అపుడు నీవు పౌర్ణమి రోజుల్లోకి వచ్చినట్లే.” చీకటిలో నుండి బయటకు వచ్చినట్టే అని ఈ భావాన్ని తెలుసుకొనే నిమిత్తమే నేను చెప్పేది. మొట్టమొదట నుంచి కొన్ని సంవత్సరముల నుంచి ఈ జ్ఞానము చెప్పుతున్నాను. ఈ మూడు మూరల శరీరములోనే చెప్పుతున్నాను, ఇంక బయటికి పోలేదు. ఎంత చెప్పినా దీని లోపలదే చెప్పుతున్నానుగాని దీనినుండి బయటకు పోలేదు. ఈ రవ్వంతలోనే మీరు వెతుకులాడినాగానీ మిగతా రహస్యము ఏమి లేదు. ఎన్నోసార్లు దీని గురించి చెప్పినాను. కానీ మీరు ధ్యాసంతా ప్రక్కకు మళ్లించుకుంటున్నారు కానీ సరియైన మార్గములోకి మళ్ళించుకోవడము లేదు. ఎంత చెప్పినాగానీ ఒకడంటాడు


----

వాన్ని బాగా తిట్టి వచ్చినాను ఇప్పుడు నేను అని అంటాడు. బాగా తిట్టినావు, వాన్ని దూషించాలనేది నీ భావమే, కానీ ఆ పని చేసినది ఎవరు? ఇంకొకాయన. ఎవరూ తిట్టని తిట్లు తిట్టినాడంట. ఆ తిట్టినేది ఎవరు? లోపల ఉండేవాడు. మీలో దేవుడు అంటారే ఆ దేవుడే తిట్టినేది. ఆ దేవుడు చూడు ఎట్ల ఉన్నాడో! తిట్లు తిడుతాడు, పొగడ్తలు పొగుడుతాడు, మంత్రాలు చదువుతాడు, పాటలు పాడతాడు, అన్నీ చేస్తాడు. అర్థమయిందా!


నీవు సారాయి త్రాగాలను కున్నపుడు సారాయి బాటిల్ పట్టుకొని త్రాగేది ఎవరు? దేవుడు. అదేంది! దేవున్ని సారాయి త్రాగేవాడంటాడీయన అని అనుకోవద్దు. ఏ పని చేసినా ఆయనే స్వామి! దొంగతనము చేసేది ఎవరు? ఆత్మ. భావము నీది, కాని చేసినేది ఆత్మ. అర్థమయిందా! ఈ రకముగా లెక్కేసుకుంటే పని ఆత్మది, భావము జీవునిది, అది కూడ కొన్ని విషయాలలో మాత్రమే, కాని అన్ని విషయాలలో నీ భావము లేదు. ఆయన స్వంత భావముతో ఆయన ప్రవర్తిస్తాడు. ఇపుడు ఈ మీటింగులో నేనేమి ఏమి చెప్పాలనుకున్నానో నాకు తెలుసునా ఏమన్నా? నాకేమీ తెలియదు. కానీ ఆయన ఏమి చెప్పాలని అనుకున్నాడో అదే చెప్పుతాడు. ఆత్మ చెప్పిన దానిని పొరపాటుగా నేను బాగా చెప్పినాను అనుకుంటే బుద్ధి తక్కువ అయితుంది. కానీ చెప్పినేదంతా ఆయనే కాబట్టి వాస్తవముగా నీకు జ్ఞానము ఉంటే, బుద్ధి ఉంటే నీవు ఏమనకుంటావంటే అంతా ఆయనే చేసినాడు, ఆయనే చెప్పినాడు, ప్రతి కార్యము ఆయనదే, ఏ కార్యము నాది కాదు. నేను మాత్ర వేసుకున్నాను, ప్రొద్దున్నే ఒకటి. ఎందుకంటే కాళ్ళు వాపులు ఉన్నాయి, ఎక్కువ నీరు ఉంది, మీరు మాత్ర వేసుకుంటే మూత్రము ఎక్కువ వస్తుంది మీకు, మాత్ర వేసుకోండి నీరంతా తగ్గిపోతుందని ఒక డాక్టర్ మాత్ర ఇచ్చినాడు. ఆ మాత్ర వేసుకుంటే అది అర్ధగంటకు ఒకసారి, గంటకు ఒకసారి మూత్ర విసర్జన చేయాల్సిందే తప్పనిసరిగా అర్థమయిందా!


---

మీరు మీటింగులో మాట్లాడుతున్నప్పుడు మొదట వచ్చి కూర్చొన్నాను, వింటూ వింటూ ఉన్నాను, మీరు మాట్లాడడము ఒకటిన్నర గంట మాట్లాడినారు, అప్పటికే లోపల బ్లాడర్ నిండిపోయింది. అర్థమయిందా! బ్లాడర్ అంటే లోపల సంచి నిండి పోయింది. మూత్రము నిండి పోయినంక ఏమి చేయాలి? బయటికి పోయాలి. మళ్ళీ నేను కూర్చొని మాట్లాడాలంటే గంట, గంటన్నరసేపు పడుతాది అనుకోండి. ఒకవేళ అప్పుడు మళ్ళీ నిండిపోతే ఏమి చేయాలి? అవంతకు అవే ఓపెన్ అయి బయటకి పోతాయి మనము ఏమి చేసే దానికి లేదు. కానీ అక్కడ ఓపెన్ చేసేది ఎవరు? ఆయనే (ఆత్మే). నేను ఏమని అనుకున్నాను అంటే ఇప్పుడు ఇది బలవంతముగా లోపల గుమి కూడినాయి. ఇప్పుడు నేను జ్ఞానము చెప్పాలి అనేది నా ఉద్దేశ్యము. నేను చెప్పకున్నా ఆయన చెప్పుతాడు. కానీ ఆ పనికి ఉపయోగపడాలి అనే ఉద్దేశ్యముతో ఇక్కడ కూర్చున్నాను నేను. ఇప్పుడు నేను ఒంటికి పోసే దానికి పోవాలా? జ్ఞానము చెప్పాలా? నేను ఏమనుకున్నానంటే ఉద్దేశ్యము ప్రకారము కదా ఆయన చేసేది! నాకు ఒంటికి పోసే ఉద్దేశ్యము లేదు, అది నిండిపోని, పొర్లి పోని నాకు సంబంధము లేదు. నేను మాత్రము ఈ పనే చేస్తాను అనుకున్నాను. ఆయన ఓపెన్ చేసే ఆయన ఆయనే కదా! కాని ఓపెన్ చేయకుండ అట్లే పెట్టుకున్నాడు. నీవు ఎప్పుడు లేసిపోతే అప్పుడు ఓపెన్ చేస్తానులే అని. కాబట్టి ఇప్పుడు ఆ పని చేసేవాడు ఆయనే, ఏది చేసినా కూడా ఆయనే. మీరు మలవిసర్జనకు పోతారనుకోండి. ఏమి ఇట్లాంటివి చెప్పుతాడీయన అనుకొనేరు మీరు. అన్నీ అట్లాంటివే ఆయన చేసేది. అన్ని పనులు చేసేది ఆయనే కాబట్టి అన్ని చెప్పాల్సిందే మీకు. మళ్ళీ ఒకటి, రెండు చెప్పకపోతే అవి నేనే అనుకుంటావు నీవు. కాబట్టి అది కాదురా నాయనా! అన్ని పనులు ఆయనే


---

చేస్తాడు కాబట్టి, నీవు మలవిసర్జనకు పోతావు, పోయేటపుడు ఏమి చేస్తావంటే, నీవు పోవాలనుకొని పోతావు. కానీ ఆయనకు ఇష్టమైతేనే ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తాడు లేకపోతే లేదు అర్థమయిందా!


నీవు పోయినా ఆయన ఓపెన్ చేయాలని గ్యారెంటీ ఏమి! బీగము వేసుకొని కూర్చుంటాడాయన! ఇంక అది ఓపెన్ కాదు, నీకు రాదు ఇంక మళ్ళా ఊరికనే లేచి వస్తావు. ఎపుడైతే మళ్ళా ఆయన ఓపెన్ చేస్తాడో అపుడు పరిగెత్తి పోవాల నీవు. అది నీ చేతిలో ఏమీ దు. ఒకవేళ నీ చేతిలో లేదు అని గుర్తింపుకు, నేను చేస్తున్నాని మీకు మతికి రావాలని, బయట పనులైతే మీకు అర్థము కావని, లోపల పనులు ఆయన చేసేదానికి మొదలు పెట్టాడు. లోపల పనులు ఉన్నాయి కదా మనకు! మూత్ర విసర్జన కానీ, మలవిసర్జనకానీ ఇంకొకటికానీ, ఇంకొకటికానీ, ఏవైనాగానీ వాటన్నిటిని మీరు ప్రక్క ధ్యాస పెట్టుకోవద్దండి, ఇక్కడే చూడండి. ఆమెను వదిలిపెట్టండి, నీవు వినమ్మా, ఏ దేవతవో నీవు, నీవు ఏమనొద్దు, ఊరికనే యాక్షన్ (action) చేయొద్దు విను. మీరు ఈ బయట పనుల్లో పొరపాటు పడతారు. లోపల పనుల్లో అయితే పొరపాటు పడలేరు. అది మీకు గ్యారెంటీగా కన్పిస్తుంది. అంతా మీ ఇష్టము కాదు, నా ఇష్టము. పనులు చేసేవాడు నీవు కాదు, నేను. మళ్ళీ అంతా నీ ఇష్టమైతే దొడ్డికి ఎందుకు రాదు నీవు పోతే? ఎంత ట్రై చేసినా రాలేదు, ఏమి చేస్తామ్! అని గొనుక్కుంటు వస్తాడు. మళ్ళా పోయినపుడు, అపుడు కూడా రాలేదనుకో వాడు మళ్ళా మ్రొక్కుంటా మొదలుపెడతాడు, ఏమో దయచేసి ఎట్లో కట్ల వచ్చేటట్లు చేయండి అని, ఎవరిని? అపుడు దేవుడు మతికి వస్తాడు వానికి. రెండు, మూడుసార్లు రాకపోతే ఏమైతాది? అపుడు దేవుడు మతికి వచ్చి దేవున్ని మ్రొక్కుంటాడు. ఆ పని చేసేవాడు ఆయనే కదా. అంటే అపుడు కూడా


---

ఆయనే చేస్తాడని అనుకోడు, నేనే చేసేది, నేను పని చేసేటట్లుగా నాకు ఆర్డర్ ఇవ్వు అంటాడాయన. అపుడు కూడా వీడే చేస్తానని ఒప్పుకుంటాడు గానీ చేసేది ఆయనే అని అనుకోడన్నమాట.


ఈ రకముగా ఒక్కొక్కసారి నీకు తెలియకుండా నీ గుడ్డల్లో ఒంటికి వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి? అది నీ పని కాదు. ఒంటికి పోసేది నువ్వే అనుకుంటే మళ్ళా నీవు పోసేటట్లుగా ఉంటే ఎందుకు పోసినావు అక్కడ నీవు గుడ్డల్లో? ఆ..! అవి నాకు తెలియకుండా వచ్చినాయి అంటాడు. నీకు ఎందుకు తెలియకుండా వచ్చినాయి? నీవే కదా పోసినేది? మళ్ళా తెలియకుండా నీకు ఎందుకు వచ్చినాయి? అపుడు నేను కాదు అనుకుంటావు. కానీ ఇంకొకడు ఎవడో చేసినాడని అపుడు నీకన్నా స్మరణకు రావాలి కదా! ఈ విధముగా స్మరణకు వచ్చే దానికోసము నీ లోపల ఉండే కార్యక్రమాలు నీకు తెలియకుండా, నీకు సంబంధము లేకుండా ఆయన చేస్తాడన్నమాట. నీవు అనుకోకున్నపుడు ఆ పని చేస్తాడు, అనుకున్నపుడు చేయడు. నీవు అనుకోకుండానే నీకు ఆకలి కలుగజేస్తాడు. అరే ఈ పని అయిపోయిన తరువాత పోదాము అనుకుంటే అప్పుడే ఆకలి వేస్తుందేందబ్బా అనుకుంటావు. అది నీ ఇష్టము కాదు కదా! సరే, నీవు ఆహారము తినాలని అనుకుంటావు. ఆహారము తినేది కూడా ఆయనే, కానీ నాలుక మీద రుచిని అనుభవించేవానివి నీవు. ఆహారాన్ని చేయి తీసుకొని లోపల పెట్టి, ఆ నోరు నమిలి మింగే పని చేసేదంతా ఎవరు? కార్యమంతా చేసేదెవరు? ఆత్మే. అందులో ఉండే సుఖ దుఃఖాలను మాత్రము అనుభవించేవాడివి నీవు జీవాత్మవు. బాగా లెక్కేసుకో.

ఇపుడు నీకు ప్రసాదముగా ఒక లడ్డు ముక్క ఇచ్చారు. ఆ ముక్కను నోట్లో పెట్టుకున్నావు నీవు. అంటే వేరే వాళ్ళు ఇస్తే చేయి చాపడము, ఆ


---

చేతిలో పెట్టిన దానిని తీసి నోట్లో వేసుకోవడము, ఆ నోట్లో వేసుకున్న దాన్ని చప్పరించడము, ఆ నాలుక అటూ ఇటూ కదిలించడము ఈ విధముగా కదిలించిన తరువాత అందులో ఉండేటటువంటి రుచిని, నాలుకలో ఉన్నటువంటి గ్రహింపు కణాలు దాన్ని గ్రహించుకుంటే, ఆ రుచి మనస్సు ద్వారా లోపల యున్న నీ బుద్ధికి తెలియబడుతుంది, ఆ బుద్ధి జీవునవైన నీకందిస్తుంది. అప్పుడు బుద్ధి ప్రక్కన ఉండేవానివి నీవు ఆ రుచిని అనుభవిస్తావు, ఎవరు? జీవుడు. నీవు అక్కడున్నావు. నాలుక దగ్గర లేవు. బుద్ధి ప్రక్కలో ఆనుకొని ఉన్నావు. ఆ బుద్ధి అందించిన దానిని నీవు స్వీకరిస్తున్నావు. ఇక్కడ నాలుక దగ్గర నుంచి మనస్సు నేరుగా ఎవరికి అందిస్తుంది? నీ తలలో ఉన్న బుద్ధికి అందిస్తుంది. ఆ బుద్ధి నీకు అందిస్తుంది. కానీ ఇపుడు ఈ చెయ్యి చాపి, పెట్టిన లడ్డుని నోట్లో పెట్టి తినిపించినది ఎవరు? ఆ కార్యము చేసినది ఎవరు? ఆత్మ. ఆత్మ అంటే నీలో ఉన్న దేవుడు. అర్థమయిందా! అందుకే పూర్వము పెద్దలు వాళ్ళ ఉద్దేశ్యము ప్రకారము ఏమి చేశారంటే నాలో ఉన్న దేవునికి నేను నమస్కారము చేస్తున్నాను అని రెండు చేతులు జోడించి అనుకున్నారన్నమాట. అంటే శరీరములోనే నేనూ ఉన్నాను, దేవుడూ ఉన్నాడు, ఇద్దరము ఒక్కటిగా అయిపోవాలి, ఇద్దరము కలిసిపోవాలని వాళ్ళు నమస్కారము చేసినారు. వాళ్ళ ఉద్దేశ్యము తెలియజేశారు పూర్వము. అంటే ఇద్దరు ఉన్నారనే జ్ఞాపకము వాళ్ళకు ఉంది కాబట్టి ఆ పని చేశారు. ఈ రకముగా ఇపుడు మనము ఏమి పని చేసినా ఇద్దరము అనే ఉద్దేశ్యముతో చేస్తున్నారా? నేను ఒక్కన్నే అనే ఉద్దేశ్యముతో చేస్తున్నారా మీరు? నేను ఒక్కన్నే అనే ఉద్దేశ్యముతో చేస్తున్నారు. అర్థమయిందా! ఇపుడు గుడికి పోయినావు, ఏదో ఒక దేవున్ని పెట్టుకున్నావు, గుడిలో పూజ చేయాలని అనుకున్నావు.


---

ఒక కొబ్బరికాయ కొడతావు, ఊదిబత్తిలు ముట్టిస్తావు, అవీ ఇవి ఆహారము పెడతావు, ఏమేమో చేస్తావు, నమస్కారము కూడా చేస్తావు, ఈ పనులన్ని నీ భావాన్ని తెలియజేసేదానికేనా పెట్టినేది? నీవు చేసేటివా అవి? నీ భావాన్ని తెలియజేసే నిమిత్తమే పనులున్నాయి. కాని ఆ పనులు చేసినేది ఎవరు? ఆత్మ. కానీ నేనే చేసినాను అనుకుంటే ఏమైతుందది? పొరపాటు అవుతుంది. ఇప్పటినుండి ప్రతి పనిలోను మీరు విశ్లేషణ చేసుకోవాలి. నీవు ప్రతి నిత్యమూ లేచిన దగ్గరి నుండి తిరిగి పడుకునేంత వరకు ఎన్నో కార్యాలు చేస్నున్నావు. కానీ నువ్వు చేస్తున్నావా? అని ఎవరైనాగానీ నిన్ను ప్రశ్నిస్తే నేను చేయలేదు, ఆ కార్యాలు చేసేవాడు నాలో ఉన్న దేవుడు, నాలో ఉన్న ఆత్మ అని చెప్పండి. ఒకరికి చెప్పకపోయినా ఫర్వాలేదు, మీకు మీరు తెలుసుకోండి చాలు. కానీ మీకు మీరు తెలియకుండా పోయి, వేరేవాళ్ళకు చెప్పకుండా పోయి, ఏమి తెలియకుండా ఉండే పరిస్థితిలో ఉంటే, నీవు మభ్యపడిపోతావు. అర్థమయిందా! నేను ఒక మనిషిని హత్య చేసినాను అని అనుకుంటున్నాను. హత్య చేసినాను అని అనుకున్నపుడు, మీరు ఆధ్యాత్మికరీత్యా ఏమనుకుంటున్నానంటే హత్య జరిగినేది వాస్తవమే! హత్య చేసినేది వాస్తవమే! ఆ కార్యాలన్నీ నెరవేర్చినేది, వానిని పొడిచినేది, వంగినేది, వానిని నరికినేది ఇవన్నీ లెక్కేస్తే ఏమైతే కార్యాలు జరిగినవో ఆ కార్యాలన్ని చేసినేది ఎవరు? ఆత్మ అంటాము. అర్థమయిందా! అందులో భావాన్ని అనుభవించినది ఎవరు? జీవాత్మ. ఈ పొడచడములో కూడా అంత సులభముగా ఉంటుందా అంటే లేదు, అందులో కూడ బాధ ఉంటుంది. పొడవడము కూడా పనే కదా అది! ఆ పనిలో కూడా బాధ ఉంటుంది కదా! వానిని పొడిచినపుడు రక్తము వస్తే వానికన్నా నీకే బాధ అనిపిస్తది, ఆ రక్తము చూసి. మరి ఆ బాధ అనుభవించేవాడు ఎవడు? వీడే. అర్థమయిందా!


---

ఈ లెక్కన లెక్కేసుకుంటే మనము ఈ దృశ్యాలన్నిటినే కాకుండా మనము చేసే పనులను కూడా విశ్లేషణ చేసి చూసుకుంటూ పోతే, మనకు అంతో ఇంతో కొద్దిగా జ్ఞానము అర్థమవుతుంది. దేవునికి దగ్గరగా పోయిన వాళ్ళము అవుతాము. విభజన కార్యక్రమము అవుతుంది. ఆయననా నేనా? నేనా ఆయననా? అని. అపుడు నేను జీరోను అని తెలిసిపోతుంది. నేను చెప్పాను మూత్రము, మలవిసర్జన దగ్గరి నుండి ప్రతి కార్యాన్ని మీరు లెక్కేసుకోండి. తినడము, పరుగెత్తడము, మాట్లాడటము, తిట్టడము, కొట్టడము ఇట్ల ప్రతీకార్యాన్ని లెక్కేసుకోండి. ఎవరు చేస్తున్నారు ఇవన్ని? ఆత్మే చేస్తావుంది. భగవద్గీతలో రెండు భావాలున్నాయి, రెండు తెఱంగులున్నాయి, రెండు విధానాలున్నాయి. ఒకటేమి వృత్తి, ఇంకొకటి అనావృత్తి. ఒకటేమో మోక్షము పోతావు, ఇంకొక దానిగుండా అయితే తిరిగి పుడతావు అని చెప్పినాడు. ఈ రకముగా మనము ప్రతి కార్యములోనూ లెక్కేసుకొని విశ్లేషణ చేస్తూ పోవాలి ప్రతి పనిని. ఇపుడు నేను చెప్పేదంతా ఇది బయట ఎక్కడో పోయి ఏదో కార్యక్రమము చేసి, నేను గొప్ప భక్తున్ని అనిపించుకునేది కాదు. మీరు స్వయముగా మిమ్మల్ని పరీక్షించుకునేదానికి చెప్తున్నాను. ఇది మీకు సంబంధించిన విషయము. మీరు ఒక సినిమా చూస్తున్నారనుకో. అందులో ఒకడు కత్తి తీసుకొని దుర్మార్గముగా పొడిచేసినాడనుకో. అబ్బ, ఎంత దుర్మార్గము అనుకుంటాము. కానీ పొడిచినేది వీడే అనుకుంటావు. పొడిపించుకుండేది వాడే అనుకుంటావు. కానీ పొడిపించుకున్నవాడు లోపల ఉన్నాడు, పొడిచినవాడూ లోపలే ఉన్నాడు, పైన మాత్రము అక్కడా ఇక్కడా రెండు ప్రక్కల కనిపించినట్లు ఉంది కదా పని! ఆ పని చేసినవాడు ఎవడు? ఆత్మే. ఆ జ్ఞాపకము మీకు వచ్చిందంటే మీరు అజ్ఞానములో నుండి బయటపడినట్టే. శుక్లపక్షములోనికి వచ్చినట్టే. పౌర్ణమిలోకి వచ్చినట్టే. అర్థమయిందా! అది జ్ఞాపకము లేకుండా


----

పోయిందనుకోండి మీరు అజ్ఞానము అనే చీకటిలో ఉన్నట్లే. ఇట్ల ప్రతి పనిలోనూ విశ్లేషణ చేసుకుంటు పోండి. ఇంకా మీకు దగ్గరగా అర్థము కావాలంటే ఇంకో విధానము చెప్తాము. అంటే మేము దేవునికి దగ్గరగా తీసుకొని పోయే విధానమంతా చెప్తూ వస్తున్నాము, ఇంకొకటి ఏమీ కాదు. ప్రతి నిత్యమూ మనము అద్దము చూసుకుంటాము కదా!


అద్దము చూసుకున్నపుడు పురుషులే కానివ్వండి, మీసాలు బాగుండాయా లేదా అని చూసుకుంటాడు, వాని మీసాలు వాడు చూసుకొని

వాని మీసాల గురించి వాడు సంతోషపడతాడు. తర్వాత మీసాలు చూసుకున్నాక, ముక్కు మొఖము అన్ని చూసుకొని నేను తెల్లగ ఉన్నాను, వేరేవాళ్ళంతా నల్లగా ఉన్నారు, నేను బాగున్నాను, అందముగా ఉన్నాను అనుకుంటాడు. కానీ వాడు ఎవరు? కనిపించేవాడు ఎవడు? వాడు ఎక్కడనో లోపల తలలో గుణచక్రములో ఒక భాగములో చిక్కుకొని రవ్వంతై ఉన్నాడని మనము చెప్పినపుడు, నీకు ఆ జ్ఞాపకము ఎందుకు లేకుండా పోయింది? నీ మీసాలు పట్టుకొని ఎందుకు నీవు సంతోషపడుతున్నావు, నావే మీసాలని? ఆ మీసాలు నీవి కాదు, నీ మూతి ముక్కు నీది కాదు, శరీరమంతా ఆత్మది. అర్థమయిందా! ఆ శరీరానికి అధిపతి అంతా ఆయన, శరీరమంతా వ్యాపించినోడు ఆయన, ఆ శరీరమంతా ఆయనది, మధ్యలో నీవు ఎక్కడనో ఇరుక్కొని, పైన ఉండే శరీరమంతా నాదే అంటే ఎట్లా చెప్పు. ఇది పెద్ద అన్యాయము కాదా? అన్యాయము కాదు, అజ్ఞానము. ప్రతిమనిషి ఇట్ల తెలియని విధానములో పడిపోయి, అతనిలో నేను నేను అనే భావము ఒకటుంది. క్రైస్తవమతములోకి పోతే తండ్రి ఒకడున్నాడు, ఆయన అన్నీ చేస్తున్నాడు. తాత అధికారము ఇచ్చినాడు కాబట్టి తండ్రి అన్ని పనులు చేస్తున్నాడు. నిన్ను చంపేది వాడే, జడ్జ్మెంట్ చేసేదీ వాడే,


---

తిరిగి పుట్టించేదీ వాడే, పాలించేది వాడే. ప్రతి నిత్యము నీకు ఏమి కావాలి అని ఆలోచన చేసి, ఏది అవసరమో అది అందించేవాడు కూడా వాడే. అన్ని పనులు ఎవని కర్మానుసారము వానికి చేస్తున్నాడు. అయినా కానీ నేను అని అనుకోవడము అది పెద్ద పొరపాటా కాదా? చెప్పండి.


మనము ప్రొద్దున లేచినప్పటి నుండి ఏమి చేస్తునాము? ఆ పాటే చేస్తున్నాము, పొరపాటే. ఆ పొరపాటు చేయకుండా ఉండాలంటే నీవు ధ్యాసపెట్టుకో, ఏమని పెట్టుకో? రెండు విధానాలున్నాయి మనిషిలో. ఒక విధానము కర్మ తెచ్చిపెడుతుంది, జన్మలకు పంపిస్తుంది. ఒక విధానము జన్మలు లేకుండా చేస్తుంది. ఆ రెండు విధానాలలో ఏది నీకు అవసరమో అది నీవు తెలుసుకో అని చెప్పినాడన్నమాట. అర్థమయిందా! ఒకటి జ్ఞానమార్గము, ఇంకొకటి అజ్ఞానమార్గము. ఒకటి వెలుతురు మార్గము, ఇంకొకటి చీకటి మార్గము ఉన్నాయి అని చెప్పినారు. మళ్ళీ ఈ రెండు మార్గాలను నీవు ఎన్నుకొని అందులో ఒక మార్గాన్నే నీవు ఎంచుకో అని చెప్పినపుడు, ఆ మార్గము ఏది? ప్రతి పనిని నేను చేస్తున్నాను అని అనుకుండేదా? ప్రతి పనిని దేవుడు చేస్తున్నాడు అని అనుకుండేదా? ప్రతి పనిని దేవుడు చేస్తున్నాడు అనుకోవడము నిజమైన మార్గము. ప్రతి పనిని నేను చేస్తున్నాను అనుకోవడము అజ్ఞాన మార్గము. అర్థమయిందా! ఇపుడు నీకు ఆయనే చేస్తున్నాడని తెలిసినాగానీ నీకు ఏమాత్రము ఏమీ తక్కువ లేకుండా అన్ని కరెక్టుగా చేస్తుండాయన. ఆయన ఏమి పనులు చేయాలో ఆ పనులన్నీ చేస్తుంటాడు. ఆయన ఏ ఒక్క పనిని కూడా వదిలిపెట్టడు. ఆయన ఎక్కడాగాని అరమరిక లేకుండా, సోమరితనము లేకుండా పనులు చేస్తూ ఉంటాడు. ఎవరు? నీలో ఉండే దేవుడు. నీ'లో' కాదు, నీవు లోపల ఉన్నావు, ఆయన బయటున్నాడు. నీ 'బయట' ఉండే దేవుడు అనుకో.


---

ఆయనలో నువ్వున్నావు, కానీ మనము అలవాటు ప్రకారము ఏమి చేస్తున్నామంటే నీలో ఉండే దేవుడు అంటున్నాము. వీడు జీవుడు పెద్దోడా ఏమన్నా? జీవుడు చిన్నోడు, పెద్దోడు ఆత్మ. ఆ పెద్దోనిలో వీడు ఉన్నాడు. అర్థమయిందా! ఆ లెక్క ప్రకారము పోతే నీవు ఎవరిలో ఉన్నావో ఆ దేవుడే అన్నీ చేస్తున్నాడు.


సరే అయితే ఇట్ల నీవు విశ్లేషణ చేసుకుంటూ పోతే ప్రతి కార్యములోనూ అంటే ఒక దొంగతనము జరిగిందనుకో. ఆ దొంగతనము జరిగినపుడు, అందులో దొంగతనము చేసిన వానికి పాపము వస్తుంది. దొంగతనము చెడ్డపనే కదా! ఇంకొకరి సొమ్మును అపహరించినట్టే కదా! అది పాపము వస్తుంది. పాపము వస్తుంది అని అన్నపుడు, పాపము రాకుండా నీవు చేసుకో అని మనము జ్ఞానము గురించే చెప్తున్నాము. మనమే చెప్పేది కాకుండా పూర్వకాలము ఐదువేల సంవత్సరాల పూర్వము భగవద్గీతను చెప్పినపుడు కృష్ణుడు అర్జునుడికి ఏమి చెప్పినాడంటే ఎదుటి వానిని చంపేది పాపమే, నేను కాదని చెప్పను. అయినాగానీ పాపము లేకుండా నీవు చేయి. పాపము నీకు సంబంధము లేకుండా చేసుకో అని చెప్పినాడు. అంటే మళ్ళీ నీవు చెయ్యి అన్నట్టు ఉంది, నీవు పాపము సంబంధము లేకుండా చేసుకో అన్నట్టూ ఉంది. అంటే కృష్ణుడు భగవద్గీత 18 అధ్యాయాలు చెప్పిన తరువాత అర్జునునికి అర్థమయింది. ఏమని అర్థమయింది? ఇపుడు మేము అర్ధగంటో, గంటో చెప్పినా కదా నేను! ఈ విషయము అర్థమయింది. ఏమని? చేసేవాడు లోపల ఉండే ఆయన, మనకు సంబంధము లేదు. కానీ మనము పొరపాటు పడుతున్నాము అని అనుకున్నాడు. ఆయన కూడా అదే చెప్పినాడు. ఒరేయ్! నీకేమి సంబంధము లేదు, చేసేవానిని నేను. వీడినీ చంపుతా, వాడిని చంపుతా, వీళ్ళంతా చచ్చిపోయేవాళ్ళే ఎవరూ


---

మిగిలే వాళ్ళు కాదు. ఇంతమంది చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, వాళ్ళను ఎవ్వరినీ నీవు చంపలేదు, నీకు పాపము రాదు అని అన్నాడు. ఇంకా నేను ఒక సూత్రము చెప్తున్నా చూడు “యస్యనాహంకృతోభావో బుద్ధిర్యస్యనలిప్యతే” అంటాడు. “ఎవని భావములో అహంకారము లేదో, ఎవరి బుద్ధి ఫలితము మీద లేకుండా వాడు పనిచేస్తున్నాడో నాకు సంబంధము లేదని ఎవరైతే ఊరకే ఉన్నాడో, నేను అనే భావము లేకుండా వాడు లోపల ఉన్నాడో, వానికి ఏమాత్రము హత్యా పాపము కూడా అంటదు" అని చెప్పినాడు.


ఆ రకముగానే నీవు ఇంతమంది సైన్యాన్ని చంపినాకానీ నీకు పాపము రాదు అని చెప్పినాడు. ఆ విధానము ఈయనకు అర్థమైంది, తరువాత యుద్ధము చేసినాడు అదే ప్రకారమే. అక్కడ యుద్ధము చేయమని ప్రేరేపించినాడా? యుద్ధము చేసినా పాపము రాకుండా తప్పించుకోమని చెప్పినాడా? పాపము రాకుండా తప్పించుకోమని చెప్పాడు. తప్పించుకునే విధానము ఎట్లాంటిది? ఏ కార్యము జరిగినాకానీ “నేను కాదు” నాలో కార్యకర్తగా ఉండే "దేవుడే” చేశాడు అని. ఒకచోట చెప్తాడు. నేను నీ కార్యకర్తను, నీ కాపరిని, నీ పని చేసేవానిని నేనే అని చెప్పినాడు దేవుడు. సరే ఆయనే తర్వాత అన్ని పనులు చేసినపుడు నాకేమి సంబంధము లేదని నీవు అనుకోవచ్చు కదా! కానీ ఏ కోశాన అయినా ఎవడైనా అను కుంటున్నాడా మనిషి? లేదు. పాట పాడేవాడు ఏమంటున్నాడంటే నేను అద్భుతముగా ఒక పాట పాడాను, అది అందరూ మెచ్చుకుంటున్నారు ఆ పాటను అని చెప్తున్నాడు. అందరూ మెచ్చుకునేది వాస్తవమే! వీడు పాడినేది వాస్తవమే! ఆ పాట అద్భుతముగా ఉండేది కూడా వాస్తవమే! కానీ పాడినేది వీడా? కాదు. చూడు ప్రతి చిన్న కార్యమును లెక్కేసుకుంటూ వస్తే అది కానే కాదు. ఆ పాడాలన్న ఉద్దేశ్యము వీనిది కానీ పాడినేది ఇంకో ఆయన.


---

సరే, పాడాలనే ఉద్దేశ్యముతో వాడు పాడితే అన్నీ నీవు బాగా పాడుతావా? అట్లా పాడలేవు. నేను భగవద్గీత చదివి మూడు శ్లోకాలు చెప్పినాను, నా గొంతు ఆగిపోయింది, నాలుక ఆరిపోయింది, నాలుక మీద తేమ లేదు. అయినా చెప్పాలని ప్రయత్నము చేశాను. అది తప్పులో ఒప్పులో చెప్పినాగానీ, అది ఎట్లుందో! నేను బాగా చెప్పాలనే ఉద్దేశ్యము అయినాగానీ అది చెప్పినోడు ఎట్ల చెప్పినాడో అది ఆయనకు సంబంధము, అంతేగానీ నాకు ఏమాత్రము సంబంధము లేదు. నేను ముందే చెప్పినాను. ఆయన తప్పు చదువుచున్నాడు, అది ఆయనే చూడు! నాకేమి సంబంధము లేదు జీవునిగా నేను చెప్తున్నా మళ్ళీ. తప్పు చెప్పినోడు ఆయనే, ఆయన తప్పుగా చదువుతాడు, మంచిగా చదువుతాడు, రాగము తీస్తాడు, అన్ని రకాలుగా ఏమి కావాల్సింటే అది చేస్తాడు.


అన్నీ నటనలు ఆయనకు సాధ్యము అవుతాయి కానీ లోపల ఉండే వాళ్ళము మనము కాము అని హెచ్చరిస్తూ చెప్పినా నేను. నా భావాన్ని ఆయనే చెప్పినాడు. ఆ మాట కూడా ఆయనే చెప్పినాడు కానీ భావము నాదది. ఈయన మోసము చేస్తాడు మీరు జాగ్రత్త! అని నేను అనుకుంటే, అదే మాట చెప్పినాడు మీకు. ఈయన మోసము చేస్తాడు జాగ్రత్త! అని తన గురించి తాను చెప్పినాడు. అయినా మీకు అర్థమవుతుందా? మీకు అర్ధము కాదని మాకు ధైర్యము ఉంది. మీకు అర్థమయితే మళ్ళీ ఇంక ఇక్కడికి రారు, ఓహెూ! ఇంతే కదా జ్ఞానము! అని. మీకు అర్థము కాదు అనే ధైర్యము మాకుంది కాబట్టి చెప్తున్నాము. ఎందుకు అర్థము కాలేదు అంటే మీరు మరీ మరీ వస్తున్నారంటే అర్థము కాకనే కదా వచ్చేది? అందుకనే అర్థము కాలేదనే మేము చెప్తున్నాము. మీకు అర్థము కాలేదు, ఎందుకంటే ఇక్కడి నుండి బయటకు పోతానే మీ స్టేజే మారిపోతుంది. ఇక్కడ ఉండే


----

స్మరణ అంతా పోతుంది. పదేపదే “నేను కాదు నేను కాదంటే” ఎట్టా పని చేసేది అంటాడు, మళ్ళీ వీడు చేసేవాని మాదిరి. గాలిలో దీపము పెట్టుకొని నేను కాదు దేవుడా, నీవే! అంటే ఎట్లైతాది అంటాడు. అన్నీ ఇక్కడ ఉపమానాలతో సహా చెప్తాడన్నమాట. ఇదంతా చెప్పేవాడు ఆత్మే కానీ ఈయనను మరిపిస్తున్నాడు. ఎవరిని? లోపల ఉండే జీవున్ని. ఇట్లా దేవుడు ఏమి చేస్తున్నాడంటే, ప్రతి నిత్యము ఆయనే మాట్లాడుతున్నా, ఆయనే చేస్తున్నా కూడ నీవే చేస్తున్నావు, నీ వల్లే అవుతుంది అనే ఉద్దేశ్యాన్ని ఆయన వ్యక్తము చేస్తూ మాటల్లో చెప్తున్నాడు. అపుడు మనము ఏమనుకుంటున్నామంటే ఓహెూ! నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నాము. ఇట్ల దేవుడు నీలో ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. ఆ విధానము నీకు తెలియడము లేదు. సరే, నీవు నీ శరీరములో పని చేస్తుంది దేవుడు కాదు, నేనే అనుకుంటే, నీవు పోయాలనుకుంటే ఒంటికి (మూత్రము) ఎందుకు రాలేదు? నీవు పోయినపుడే దొడ్డికి ఎందుకు రాలేదు నీకు? ఒకడంటాడు.


ఏమయ్యా! నీవు తొందరగా స్నానము చేసిరా పో, ఊరికి పోవాల అంటే స్నానమైతే చేస్తాగాని లెట్రిన్ పోవాలంటే కష్టమిపుడు, ఇది టైమి రాదు, అంటే ఎనిమిది గంటలకు గాని రాదు ఏమి చేయాలి? అంటాడు. మళ్ళీ ఎనిమిది గంటల వరకు ఉండాలి కాచుకొని. అంటే వీని పని అయితే వీడు చేస్తాడు కదా! మళ్ళ ఈయన పని కాదు గదా! అర్థమయిందా! అంటే ఎవరి అనుభవము వాళ్ళది, మీ అనుభవము మీకు ఎట్లుందో! మేము చెప్పేకి కాదు. ఒకాయన మాతో ఏమన్నాడంటే, గ్రీన్టి టాబ్లెట్ వేసుకుంటే బాగా బేదికి వస్తుంది, ప్రొద్దున్నే వస్తుంది, కడుపు సాఫ్ అయిపోతాది అన్నాడు, తెలంగాణ భాషలో. అంటే అట్లే కానీలే! సాఫ్ అవుతుందో, క్లీన్ అవుతుందో ఎట్లో కట్ల! అని నేను ఏమి చేసానంటే ఒకటి కాదు, రెండు


---

రెండు వేసుకుంటున్నాను. సాపూ కాలేదు, క్లీనూ కాలేదు, దాని బుద్ధి పుట్టినపుడు అది వస్తుంది. మేము చెప్తున్నాము. స్నానము చేయడానికి పోతారా అంటే పోతాము అంటాము. మళ్ళీ మీరు బయటకు పోలేదే! అంటే నా చేతిలో ఏముంది! ప్రయత్నము చేసి చూస్తాము, ఒకవేళ ఆయన కరుణిస్తే వస్తుంది లేకపోతే లేదు. సరేలే, రాలేదనుకో రాలేదు అంతే! స్నానము చేసి మళ్ళీ ఎప్పుడో వచ్చినపుడు అంటే ఆయన ఓపెన్ చేసినపుడు పోయేదన్నమాట. మళ్ళీ ఎందుకు రాలేదు అంటే బీగము (తాళము) తీస్తే కదా వచ్చేది! బీగము వేసి కూర్చున్నాడాయన! బీగము తీయంది రాదు. మళ్ళీ ఎవరి పని ఇది? ఆయన పని. చిన్న పనే ఆయన చేతిలో ఉన్నపుడు మిగతా పనులన్ని నీ చేతిలో ఉన్నాయా చెప్పు? లేదు నీవు తింటావు అది అరుగుతుందో లేదో నీకు తెలియదు. ఆయన అరిగిస్తే అరుగుతుంది లేకపోతే లేదు. ఆయన అరగనిచ్చేది లేదనుకో అది అట్లే నిలిచిపోతుంది లోపల, జీర్ణము కాదు. మళ్ళా తిరిగి వాంతికి అవుతుంది. ఈ రకముగా లెక్కేసుకుంటే నీవు స్వతంత్రునివి కాదు.


నీవు స్వతంత్రునివి కాదు, నీవు తోలబడేవానివి. ఖుర్ఆన్లా చెప్పినట్లు తోలబడేవానివి. నిన్ను తోలేవాడు ఎట్ల తోలితే అట్ల పోవాల్సిందే నీవు. నీ ఇష్టము ఏమీ లేదు. కానీ అన్నీ నా ఇష్టముగా నేనే చేస్తున్నా అని అనుకుంటున్నావు, అది పెద్ద పొరపాటు. ఇపుడు ప్రతి ఒక్కటీ మంచే కోరుకుంటాడు మనిషి, నాకు ఇట్లే ఉండాలనుకుంటాడు కాని అట్లే ఉండదు. ఎందుకు ఉండదు అంటే అంతా ఆయన ఇష్టము. నీ ఇష్టము ఏమీ లేదు. కర్మనుబట్టి నీ పని చేస్తుండాయన. ఏ పని ఎవరికి ఎట్ల చేయాలో అట్లే చేస్తుంటాడు. ఏ పని ఎట్ల చేసినా కానీ నేను అనే భావము పెట్టుకుంటే మాత్రము వాడు పనికి రాడు. ఒకప్పుడు నేనుండే శరీరము


---

బాగా పరుగెత్తేది. ఆ రోజు పరుగెత్తిచ్చేవాడు ఎవరు? ఆ..! ఆయనే. స్పీడుగా పరుగెత్తిచ్చేవాడు, అందరికంటే స్పీడు. ఆ రోజు అందరికంటే స్పీడుగా పరుగెత్తిచ్చినోడు మళ్ళ ఈ రోజు నడవకుండ కూర్చోబెట్టిచ్చినాడు. అంటే ఆ రోజు పరుగెత్తేవాన్ని నేను కాదు, ఈ రోజు నడవకుండా నిలబడిపోయిన వానిని నేను కాదు అని నాలో భావము ఉంది మొదట్నుంచి. అది నాకు తెలిసిన జ్ఞానము. నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు అందించాలని ప్రతి నెల ఏదో రకముగా మీకు చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు పౌర్ణమి, అమావాస్య అని చెప్పాను, జ్ఞానము, అజ్ఞానము అని పోల్చి చెప్పాను, అదే చీకటి, వెలుగు అని చెప్పాను. అదే నీవు జ్ఞానములో ఉంటే ఇట్లుంటుంది, అజ్ఞానములో ఉంటే ఇట్లుంటుంది అని చెప్పాను. జ్ఞానములో ఉంటే నేను ఒక్కన్ని లోపల ఉన్నాను, బయట లేను అనుకుంటావు. అజ్ఞానములో ఉంటే అద్దము చూసుకొని నా మీసము బాగుంది, నా ముక్కు బాగుంది అనుకుంటావు నీవు. అర్థమయిందా! నీ మీసము నీది కాదు, ముక్కు నీది కాదు, శరీరమే మొత్తానికి నీది కాదు. కానీ మాయ వలన నీవు భ్రమిస్తున్నావు. నీ గుణాల వలన నీవు భ్రమిస్తున్నావు. ఆ గుణాల వలన భ్రమించి అజ్ఞానములో నీవు పడి కొట్టుమిట్టాడుతున్నావు. ఆ అజ్ఞానము తొలిగిపోవాలి అంటే ఏమి చేయాలి? మనము జ్ఞానాన్ని సంపూర్ణముగా తెలుసుకోవాలి. జ్ఞానాన్ని సంపూర్ణముగా తెలుసుకోవాలంటే ఇట్ల ప్రతినెల వచ్చి వింటూ ఉంటే అవుతుందా? కానీ పని.


ఇప్పటికి 95 గ్రంథాలు వ్రాశాము ఇక్కడ. ఇంకా మీకు గ్రంథాలు వస్తాయి. ఆ గ్రంథాల్లో ఉండే జ్ఞానాన్నంతా తెలుసుకోండి. తెలుసుకుంటూ పోతే మీకు ఈ విధానమంతా అర్థము అవుతుంది. ఈ విధానమంతా అర్థమైనపుడు ఎక్కడ నీ భావము ఉంది? ఎక్కడ నీ కార్యము ఉంది? అని


----

నీకే అర్థము అవుతుంది. కార్యానికి నీ భావానికి సంబంధము లేదు అని తెలిసిపోతుంది. అట్ల తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము. సరే, ఇపుడు ఈ విధముగా లెక్కేసుకుంటూ పోతే ప్రతి కార్యము వెనుక ఆయన ఉన్నాడు. ప్రతి కార్యములో నీకు ఏమాత్రము అధికారము లేదు అనే ఒక గుర్తింపు నీకు వస్తే, అపుడు నీవు ఏమనుకుంటావు కొద్దిగా నాకు జ్ఞానము అర్థమయింది అనుకుంటావు. ఒక్క నిమిషము జ్ఞానము నీకు కొద్దిగా అర్థమయితే ఆ తర్వాత ఇంకొక స్టెప్ ఇంకొక స్టెప్ కొన్ని కార్యాల్లో అంతా నేను కాదు, నేను కాదు అని నీకు అర్థమైనపుడు, కొంత కాలానికి ప్రతి కార్యములోనూ నేను కాదు అనే విషయము తెలిసిపోతుంది. అప్పుడు నీవు జ్ఞానము వైపు ప్రయాణించేదానికి అవకాశము ఏర్పడుతుంది. ఇపుడు అట్ల లేకపోతే పైన విషయాల భ్రమల్లో మనము పడినాము అంటే ఏమవుతుంది?

ఈ జ్ఞానము మీకు అర్థము కాదు. నేను చెప్పాను ఇంతకు ముందు. ఈ నెలలో రెండు గ్రంథాలు వచ్చాయి. అందులో “వేదములు మనిషికి అవసరమా?” అని ఒక గ్రంథము చెప్పాను. వేదముల్లో ఏముంది? గుణాల విషయము తప్ప ఏమీ లేదని దేవుడే చెప్పినాడు భగవద్గీతలో. ఇంకా కొంతమంది ఏమి చెప్తున్నారంటే టీ.వీ.లలో చర్చలు పెట్టుకొని కొంతమంది బ్రాహ్మణులు ఈయన ఇట్ల వేదాలను గురించి మాట్లాడుతున్నాడు, ఈయన హిందూమతాన్నంతా చెడగొడుతున్నాడు, భారతదేశమంటే వేదాలు, హిందుత్వము అంటే వేదాలు, హిందువులకంతా ప్రామాణిక గ్రంథాలు వేదాలు అని చెప్తున్నారు.


వాళ్ళు దైవ గ్రంథాలను గురించి ఒక్కమాట కూడ చెప్పలేదు. హిందువులకంతా ప్రామాణిక గ్రంథము భగవద్గీత అని చెప్పలేదు, వేదాలు అని చెప్తున్నారు. వాళ్ళకు అవసరము అది. సరే, టీ.వీ.లో ఒక యాంకర్,


----

ముగ్గురు మనుషులు మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటల్లో అంతా ఇదే కన్పిస్తా ఉంది. ఏమని కనిపిస్తా ఉంది? ద్వేషము కనిపిస్తా ఉంది. ఏమని? మేము బ్రాహ్మణులుగా ఉన్నవాళ్ళమే ఏమి మాట్లాడినా మాట్లాడాలా! ఏ జ్ఞానము చెప్పినా మేమే చెప్పాలి, ఇతరులు చెప్పకూడదు అనే ద్వేషమే కనిపిస్తుంది. అంటే వాళ్ళలో ఉండే భావము ఏమిటిది? ద్వేషము. మాట్లాడేవాడు ఎవడు? ఆత్మ. ఈ నలుగురు వ్యక్తులుగా ఉండి ఒక్కొక్కరిలో ఒక్కో రకముగా మాట్లాడుతున్నాడు ఆయన. వాళ్ళలో ఉండే భావాన్ని బయటకు వెలిబుచ్చుతున్నాడు, అది మాటల రూపములో చెప్తున్నాడు ఈయన. కానీ వాళ్ళలో భావాన్ని చెప్తున్నాడు ఈయన అంతేగానీ అది ఈయన భావము కాదది. ఆయన భావము ఏదో మననుంటి చెప్పించినాడు. ఓ ఇదే చూడు! అని వ్రాపించినాడు గ్రంథములో, వేదాలు పనికి రావని. వాళ్ళ భావములో ఏమో వేదాలే పనికొచ్చేది అని వాళ్ళు చెప్తున్నారు. చూడండి ఎట్లుందో! ఈ విశ్లేషణ మనము తెలుసుకుంటే ఒక్కనిలోనే కాదు ఎంతమందిలోనైనా ఆయన నాటకము ఆడుతున్నాడు. ఆ నాటకములో ఉండేటటువంటి విషయ విధానము మనము తెలుసుకోగల్గితే, మనకు అంతో ఇంతో జ్ఞానము అర్థమవుతుంది అని మీరు తెలుసుకుని, ఇట్ల ప్రతి దాన్ని మనము విశ్లేషణ చేసుకుంటూ వస్తే అపుడు మీకు జ్ఞానము తెలియబడుతుంది.


కానీ ఈ గుణాలు అనేటటువంటివి మనలో ఉన్నాయి కాబట్టి అవి ఆత్మకు వ్యతిరేఖమైన దిశలోనే ప్రయాణిస్తూ ఉంటాయి. ఆత్మకు వ్యతిరేఖమైనది ఏది? మాయ అని చెప్పినాను. మాయను విడదీస్తే గుణాలు. ఆ గుణాలలో 12 రకాల గుణాలున్నాయి. ఆ గుణాలన్ని ఏమి చేస్తుంటా యంటే ఆత్మకు వ్యతిరిక్తదిశగా ప్రయాణము చేయాలని చూస్తుంటాయి. ఆ గుణాల మాయలో పడి చాలామంది వాటిలో మిళితము అయిపోయి ఆ


----

అజ్ఞాన మార్గములో మాట్లాడుతున్నారు. కానీ ఎవరు ఏమి మాట్లాడినాకానీ మేము తెలుపుట ఏమంటే! ఇది వాళ్ళలో ఉండే భావాన్ని దేవుడు వ్యక్తము చేస్తున్నాడు, వాళ్ళలో పలికేవాడు కూడా దేవుడే, పలికేవాడు దేవుడు అనే మాట మర్చిపోకూడదు ఎప్పటికీ. కానీ ఆ దేవుడు ఎవరు అనే విధానము మనకు తెలియకుండా పోతే బాగుండదు. దేవుడు తన విధానాన్ని ఇక్కడి నుండి చెప్పినాడు, వాళ్ళలో ఉండే మాయ విధానాన్ని అక్కడి నుండి చెప్పిస్తున్నాడు. వాళ్ళది మాయ, మనది దైవత్వము. దైవత్వమును ఒకవైపు నుండి చెప్పించినాడు, మాయ విధానాన్ని ఒక ప్రక్క నుండి చెప్పిస్తున్నాడు. ప్రజలు ఎట్ల పోతారో మీరు చూసుకోండి అని మీకు చెప్పినాడు. నేను చెప్పేది జ్ఞానమే కాకుండా వాళ్ళు చెప్పేటటువంటి మాయ కూడా ఉంది. ఇపుడు మీరు విశ్లేషణ చేసుకోవాలి, ఏది మాయ? ఏది దేవుడు? అని. అట్ల చేసుకోగల్గినప్పుడు మీరు దానినుండి బయటపడతారు. మేము ఏమి చెప్పినాగానీ చాలామందికి అయిష్టత, అసూయ ఉన్నాగానీ దేవుడు ఏమి చేశాడంటే మా ఉద్దేశ్యమును నెరవేస్తున్నాడు. మా ఉద్దేశ్యము ఏమి? ప్రజలకు మంచి జ్ఞానాన్ని అందించు తండ్రి, ఆ జ్ఞానాన్ని వాళ్ళకు అర్థమయేటట్లు చేయి తండ్రి అని మేము కోరుకుంటున్నాము.




కాబట్టి ఆయనేమి చేస్తున్నాడంటే మా గుండా వాస్తవమైన విషయాన్ని ప్రకటిస్తున్నాడు. అందువల్ల గ్రంథములు చదివి ఎంతోమంది రాగలిగినారు. నేను ఎవరినీ పిలవలేదు. గ్రంథములు చదివి దాంట్లో సత్యము ఉందని తెలిసి మీరు వచ్చారు. మళ్ళీ ఆ సత్యము చెప్పింది ఎవరు? ఆయన. కానీ ఇపుడు "హిందూ ధర్మానికి రక్షణ అవసరమా?" అని చెప్పాడు. అందులో కొంత వ్యతిరేఖత వచ్చింది. "వేదాలు మనిషికి అవసరమా?” అని వచ్చింది. అందులో పూర్తి వ్యతిరేఖత వచ్చింది. ఇప్పుడు చెప్పబోయేది


----

“ఉపనిషత్తులలో లోపాలు”. ఉపనిషత్లలో పరిశోధకులు టీ.వీ. డిబేట్ లో కూర్చొని మాట్లాడుతున్నారు. వేదాలు మనవి కాదు, వేదాలు పనికి రావు అన్నవాళ్ళు మనుషులే కాదు, వాళ్ళు అజ్ఞానులు అని నీచముగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎట్లన్నా మాట్లాడనీలే, ఆ మాట మాట్లాడి, వాళ్ళ భావాన్ని దేవుడు వ్యక్తము చేశాడు. కానీ మా మనోభావాన్ని కూడా దేవుడు వ్యక్తము చేయాలని కోరుకుంటున్నాము. మన భావాన్ని అంటే ఉపనిషత్తులలో లోపాలు ఏమిటో బయటపెట్టు అని చెప్పినాము, ఆయన బయటపెడతాడు. ఉపనిషత్తులేంటో పెద్దవి. ఆ ఉపనిషత్లలో వాళ్ళంతా పెద్ద పరిశోధకులు. మనము అడుగుతాము వాళ్ళని, మీరు పరిశోధకులై ఉండి, ఇంత అసత్యాన్ని ఎట్ల ఒప్పుకుంటున్నారు? మీరు పరిశోధన చేసేటపుడు ఈ అసత్యము మీకు కనపరాలేదా? అని అడుగు డాయన. ఈ రకముగా ఇంకొక గ్రంథము కూడా మీ ముందుకు రాబోతుంది. ఇంకా వాళ్ళు ఏమైనా డిబేట్ పెట్టి మాట్లాడితే, ఇంకొక గ్రంథము కూడా వస్తుంది వాళ్ళకు వ్యతిరేఖముగా. అంటే ఈ ప్రక్క మాట్లాడేవాడు ఆయనే, ఆ ప్రక్క మాట్లాడేవాడు ఆయనే, నడిమధ్య వినేవాళ్ళు మాత్రము మీరు. నిర్ణయము తీసుకోవాల్సింది మీరు. ఎటుపోతారో మీ దారి మీది! మీ ఇష్టము!


కాబట్టి ఈ రకముగా ముందు తర్వాత కూడా మీకు మంచి మంచి గ్రంథాలు అందుతాయి. ఇపుడు మీకు చెప్పినేది కూడా ఇంతకుముందు చెప్పిన జ్ఞానమే ఉంటుంది కాని కొంత వెరైటీగా ఉంటుంది ఇది. మళ్ళీ ఈ జ్ఞానాన్ని మీరు గ్రహించుకొని, తర్వాత వచ్చే జ్ఞానాన్ని కూడా గ్రహించుకొని, అన్ని జ్ఞానాల వల్ల మనము ముందుకు పోతున్నామా? వెనక్కి పోతున్నామా? చూసుకోండి. ఇక్కడ ఎవర్నిగానీ కించపరిచే పద్ధతిగానీ ఇంకొకటి ఇంకొకటి లేదు. అన్ని మతాలు సమానమే. అందరికి దేవుడు ఒక్కడే. ఆయనే మనల్ని


---

పరిపాలిస్తున్నాడు. మీలో వేరు వేరుగా ఏ భావము లేకుండా దేవుని విధానములోనే పోవాలని, మీరంతా దేవుని బిడ్డలుగా ఉండాలని, దేవున్నే ప్రార్థన చేయాలని, వేరే దేవతలను మీరు మ్రొక్కకూడదు వేరే అన్య దేవతారాధన చేయకూడదని నేను కోరుకుంటు, ఈ విషయము చెప్పడమే కాకుండా ఇప్పుడు మీరు చూశారు, ఒక దేవత వచ్చింది, ఆమె కూడా జ్ఞానము వింటావుంది. ఇంతకుముందు చాలా దేవతలు వచ్చారు. వాళ్ళంతా జ్ఞానము విన్నారు. ఆంజనేయస్వామి ఒక పెద్దాయన ఆయన కూడా వచ్చి జ్ఞానము తెలుసుకుంటానని చెప్తున్నాడు. ఆయన ఇంకా ఏమి చెప్తున్నాడంటే మీరు ఎట్లంటే అట్ల కూర్చుంటున్నారు, మేము దేవతలము అట్ల కూర్చోము, దేవతలము ఎవరు వచ్చినాగానీ పద్ధతిగా కూర్చుంటామని వీళ్ళకే క్రమశిక్షణ నేర్పుతున్నాడు. ఈ రకముగా లెక్కేసుకొని చూస్తే మనుషులకంటే దేవతలే బాగా శ్రద్ధగా ఉన్నారు. వాళ్ళు కొంతమంది అజ్ఞానములో ఉన్నాగానీ కొంతమంది జ్ఞానులుగా ఉన్నారు. మీలో కూడా అందరు మనుషులంతా జ్ఞానులని చెప్పలేము గానీ మీలాంటి వారు కొంత జ్ఞానము మీద ఆసక్తి కలిగి ఇక్కడికి వచ్చి జ్ఞానము తెలుసుకుంటున్నారు కాబట్టి మాకు సంతోషము. ఇదే ఉద్దేశ్యాన్ని మీరు కొనసాగిస్తు, జ్ఞానాన్ని తెలుసుకుంటు, విశ్లేషణ చేసుకొంటు మీరు ముందుకు పోవాలి.


కానీ జరిగే పనుల్లో కలిగే సుఖాల్లో మీరు పొరపాటుపడొద్దండి. ఒక మనిషి ఒక బాటిల్ సారాయి త్రాగి, ఒక కోడిపుంజు తింటాడనుకోండి. బాగా కోడిని తిన్నా, బాటిల్ సారాయి త్రాగినా ఏవ్! అని త్రేపి ఎంత బాగుంది! అనుకుంటాడు, అయిపోయిన తర్వాత ఆ రుచిని అనుభవించి నావు. ఆ పని చేసిది ఎవరు? సారాయి బాటిల్ నోటి దగ్గర పెట్టిందెవరు? కోడి తినిపించినేది ఎవరు? ఆయనే. నీ భావము ఏది ఉందో ఆ ప్రకారము


---

చేశాడు ఆయన. కానీ నేనే చేసినాను అనుకుంటున్నావు. దానివల్ల నీకు చేసిన పని ఏమిటిదో మంచిది అయితే పుణ్యము, చెడుది అయితే పాపము నీకు తప్పనిసరిగా చేకూరుతుంది. ఇటువంటి పాప పుణ్యాల నుండి నీవు బయటపడి, దేవునివద్దకు పోవాలని ప్రయత్నము చేస్తే, ఆయన నీకు అత్యంత సమీపములో ఉన్నాడు. నీ ప్రతి ప్రశ్నకు జవాబు ఇస్తాడు. ప్రతి మాటకూ జవాబు ఇస్తాడు. నిన్ను ఆయన దగ్గరకు చేర్చుకుంటాడు. కాబట్టి మీరందరు ఆ దేవుని మీద అంటే అల్లాహ్ మీద అంటే అంతులేనటువంటి వాడు ఒకడున్నాడని, ఆయన మీద దృష్టి పెట్టుకొని, ఆయన ఒక్కడే దేవుడని, మీరు ఆయన దగ్గరకు చేరాలనే ఉద్దేశ్యముతో అంటే పరలోక రాజ్యానికి పోవాలనే ఉద్దేశ్యముతో మీరు గట్టి ఉద్దేశాన్ని పెట్టుకొని, ఇలాగనే జ్ఞానము ఇంకా తెలుసుకొని ముందుకు ముందుకు పోయి, దేవున్ని తొందరగా మీరు తెలుసుకోగల్గుతారనే నమ్మకముతో ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.


తేది:12.03.2017


మొట్టమొదటగా దేవున్ని ప్రార్థిస్తూ మనందరికీ స్వచ్ఛమైన జ్ఞానాన్ని అందించాలని కోరుతూ, మనం ఇప్పుడు ఈ సభను ప్రారంభించు కుంటున్నాము. ఈ సభలో ఉన్నవారంత జ్ఞానాన్ని శ్రద్ధగా వినాలని, ఏమరపాటుగా ఎవరూ ఉండకూడదని మరి మరి చెప్తున్నాము. ఇప్పుడు ఈ రోజు మనం చర్చించుకోబోయే విషయము ‘మతసామరస్యం' అనే విషయాన్ని చర్చించుకుంటున్నాము కానీ మతసామరస్యాన్ని గురించి ఏ


--

గ్రంథంలోనూ లేదు. దేవుని జ్ఞానాన్ని గురించి మూడు దైవగ్రంథాలలో ఉంది. కానీ భగవద్గీతలో కానీ, బైబిల్లో కానీ, ఖురాన్లో గానీ దేనిలో కూడా ఈ మతసామరస్యం గురించి ఒక్క వాక్యం కూడ ఎక్కడా లేదు. లేని వాక్యాన్ని, లేని జ్ఞానాన్ని, లేని విధానాన్ని మేము ఇప్పుడు చెప్తున్నాము. ఎందుకంటే ఆ రోజు మతమే లేదు. మతమే లేని రోజుల్లో వాళ్ళు జ్ఞానాన్ని చెప్పినారు కాబట్టి భగవద్గీత, బైబిల్ రెండూ మతము లేని సమయంలో చెప్పినటువంటివి. కాబట్టి మతం అనే ప్రస్థావన రాలేదు అక్కడ తర్వాత మతమనేది కొద్ది కొద్దిగా పుట్టిన తర్వాత ఇస్లామ్ అనేటటువంటిది వచ్చింది కానీ అందులో కూడా మత ప్రసక్తి ఎక్కడా రాలేదు. 'సర్వమానవులకు చెప్పేటటువంటి బోధ' ఇది అని చెప్పారు.


కానీ ఇప్పుడు మనుషులు ఏమి చేసారంటే ఇది మాది అని చీల్చుకొని మా జ్ఞానము వేరు అని ఎవరంతకు వాళ్ళు మాట్లాడుతున్నారు మూడు గ్రంథాలలోనూ ఏ మతానికి సంబంధించినటువంటి జ్ఞానం లేదు. అన్ని మతాలకు సంబంధించిన జ్ఞానం ఉంది సర్వమానవులకు సంబంధించిన జ్ఞానం ఉంది. ఒక మతానికి సంబంధించింది అంటూ ఎక్కడా లేదు. సర్వమానవులకు నేను చెప్పే ఈ బోధ వర్తిస్తుందని మూడు గ్రంథాలలో ఉంది. కానీ ఇది క్రైస్తవులకే, ఇది ముస్లీమ్లకే, ఇది హిందువులకే అని ఎక్కడా చెప్పలేదు. అయినా గానీ నేడు మూడు మతాల్లో మా మతము గొప్ప, మా దేవుడు గొప్ప అనేటటువంటి భావం సంపూర్ణంగా ఉంది ఇది మంచి పద్ధతి కాదు అంతా సమానమే అని కొందరు చెప్తున్నా కానీ అది ఎవరూ లెక్కపెట్టుకోకుండా మాదే గొప్ప అని ఎవరంతకు వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. అది ఒక మతంలోనే ఇది లేదు అన్ని మతాల్లోనూ ఇది ఉంది. ఈ విధానము మనకు ఎంత కాలముంటుందో


---

అంతకాలం మనకు దేవుని జ్ఞానము అర్థంకాదు, ఎందుకంటే దేవుని జ్ఞానము అర్థంకాదు. ఎందుకంటే దేవుని జ్ఞానం ఎప్పుడైతే అర్థమైతుందో అప్పుడు ఈ మతం అనే సమస్య ఉండదు. మా జ్ఞానము మా దేవుడనే సమస్య ఉండదు. అందరికి సమానమైన జ్ఞానము అనేటటువంటి విధానం వస్తుంది అది ఎప్పుడైతే రాలేదో ఎప్పుడైతే మా మతము అనేది ఎవరిదైతే ఉందో అప్పుడు దేవుని జ్ఞానం ఎవరికి సంపూర్ణంగా అంటదని అది మరి మరి చెప్తున్నాము. ఇప్పుడు మీకు ఈ మతసామరస్యానికి సంబంధించిన విధానంలో భాగంగా ఈ నెలలో కూడ మీకు ఒక గ్రంథాన్ని అందించాము. అది “ప్రాథమిక జ్ఞానము” అంటాము. ఈ ప్రాథమిక జ్ఞానములో ఏముంది అంటే ఒకరిని ఒకరు దూషించుకునేది ఉంది, ఒకరిని ఒకరు ప్రశ్నించుకునేది ఉంది. మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అనేటటువంటిది ఉంది.


మేము మీకంటే గొప్పని ఒక మతస్థులు ఇంకో మతస్థులను రెచ్చగొట్టి మాట్లాడే విధానముంది. మేము దానిని ఏమి చెప్పినామంటే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పాము. ఒకరిని ఒకరు విమర్శించుకునేది మంచి పద్ధతి కాదు అని చెప్పాము. మీరు ప్రశ్న అడుగుతున్నారు. ఇదెట్లా అని అంటే ఆ ప్రశ్నలో మీరు తప్పుందో లేదో చూసుకోండి. మీ ప్రశ్నలోనే మీది తప్పుంటే ఇంకొకరిని ప్రశ్నించడం ఏమి బాగుంటుంది? అని అడిగినాము అంటే ఎక్కడ తప్పుందో అక్కడ మేము దానిని గుర్తించి మీకు తెలియచెప్తున్నాము అన్నమాట. ఎందుకు మాకు ఏమి అవసరమొచ్చింది అంటే సమాజం బాగుండాలి మనుషులంతా బాగుండాలి. మనుషులంతా దేవుని వైపుకు పోవాలి అనే ఉద్దేశ్యంతోనే మేము చెప్తున్నాము కానీ ఇంకో స్వార్థంతో ఏమీ కాదు. సరే ఇప్పుడు మనం ఏదో ఒక మతంలో పుట్టాము ఒక మతంలో పుట్టి, ఆ పుట్టిన కొన్నాళ్ళకు ఫలాన మతం మాది అని


---

తెలిసిన తర్వాత ఆ మతంలో కొంత ఉంటూ ఆ మతంలో ఉండే పెద్దలు రెచ్చగొడితే వాళ్ళు రెచ్చగొట్టినట్టు మనం పోయి పోయి వేరే మతాన్ని దూషిస్తూ వేరే మతస్థులను అవకాశం వచ్చినప్పుడల్లా బాధించేదానికి దూషించేదానికి, మొదలు పెడుతున్నారు. అది ఈ మతం, ఆ మతం అని కాదు అన్ని మతస్థులకు ఈ జాఢ్యము ఉంది. ఇది మంచి పద్ధతి కాదని మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ మేము చెప్పేవాళ్ళ మీదికి మా మీదికి కూడ వీళ్ళు వదలలేదు అన్నమాట. మేము ఒకటి చెప్పితే మూడు రోజుల క్రితం మా సభ్యులు జ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారు ఇంటింటికి తిరిగి, హిందూ మతంలో ఎవరూ ఈ విధంగా ప్రచారం చేసినోళ్ళు ఎవరూ లేరు. మొదటగా మేమే చేస్తున్నాము, మొట్టమొదటగా ఇంటింటికి తిరిగి భగవద్గీత ప్రచారం చేస్తూ, భగవద్గీతకు సంబంధించిన గ్రంథాలను చూపిస్తూ, తర్వాత ఈ జ్ఞానము మంచిది అని చెప్తున్నాము అందరికి. చాలామంది స్వీకరించి దానిని తీసుకొంటున్నారు. కొంతమంది మాత్రం అసూయపరులు అదే పనిగా మాది హిందువు జ్ఞానము అని చెప్పినా గానీ, మేమే హిందూ జ్ఞానంతో ఉండాలి, మేమే హిందూ జ్ఞానం ప్రచారం చేయాలి, మేమే హిందూ జ్ఞానంలో పెద్దలుగా ఉండాలి. మేమే పేరు పొందాలి ఇతరులు పొందొద్దు అన్న ఉద్దేశ్యంతో అటువంటి వాళ్ళు ఏమి చేస్తున్నారంటే మేము చెప్పేటటువంటి ఈ భగవద్గీత ప్రచారానికి కూడ ఆటంకం కలుగుజేస్తున్నారు. మూడు రోజుల క్రితం అది ఖమ్మం జిల్లా కల్లూరులో మా సభ్యులను కొట్టి ఊరిలో మీరు ఉండకూడదు. ఈ ప్రచారం చేయకూడదు అని చెప్పి, పంపించినటు వంటి సంఘటన జరిగింది. అంటే వీళ్ళు తిరిగి కొడితే మళ్ళీ వాళ్ళు సహకరిస్తారు.


మేము ఏమి చెప్పినామంటే ఇటువంటి సంఘటనలు జరుగు తుంటాయి. మీరు ఓపికగా జ్ఞానాన్ని ప్రచారం చేయండి. మనం జ్ఞానం


---

ప్రచారం చేసేదానికి పోయినాము కానీ ఇంకొకదానికి కాదు, సరే దుర్మార్గులు ఉంటారు, సన్నార్గులుంటారు. సన్నార్గులైనటువంటి వారు మన గ్రంథాలను స్వీకరించి జ్ఞానాన్ని స్వీకరిస్తారు. దుర్మార్గులైనట్టి వాళ్ళు దానిని దూషిస్తారు అయినా ఓర్చుకొని రాండి అని చెప్పాము. మా మాటకు కట్టుబడి మా వాళ్ళు ఎక్కడైతే వేరే వాళ్ళు దూషణకు దిగుతున్నారో అక్కడ నుంచి మాములుగా మౌనంగా వచ్చేస్తున్నారన్నమాట, వాళ్ళ పాపం వాళ్ళకే చుట్టుకుంటుంది. వాళ్ళ పాపం వాళ్ళనే బాధిస్తుంది అన్న ఉద్దేశ్యంతో వీళ్ళు అక్కడినుండి రావడం జరిగింది. ఈ విధంగా కొన్నిచోట్ల ఆటంకం కలుగుతూనే ఉంది. ఈ ఆటంకం ఎందుకు కలుగుతుంది అంటే మతద్వేషం, మతసామరస్యం లేదు. మతద్వేషంలో ఒకవేళ మేము హిందువులుగా ఉన్నట్టివాళ్ళను ఎవరన్నా క్రైస్థవులు వద్దని ఆటంకపరిచినారా అంటే అది లేదు, ఎక్కడన్నా ముస్లీమ్లు ఆటంకపరిచినారా అంటే ఎక్కడో ఒకచోట అరుదుగా జరిగిన సంఘటనలు తప్ప, ఒక్క ఏలూరులో తప్ప ఇంతవరకు ముస్లీమ్లు ఎవరూ మన జ్ఞానాన్ని వద్దని చెప్పలేదు. మన జ్ఞానాన్ని చెప్తుంటే వాళ్ళు సంతోషపడుతున్నారు. మేము జ్ఞానాన్ని చెప్పేటప్పుడు లేచి నిలబడి వింటున్నారు శ్రద్ధగా అంత భక్తి శ్రద్ధలు కలిగియున్నారు, కానీ ఒక్క ఏలూరులో మాత్రము మీరు మా గ్రంథాలను ప్రచారం చేయద్దండి, మా ఖురాను సంబంధించినటువంటి వాక్యాలు ఎక్కడా చెప్పొద్దండి, మా ఊరిలో ఉండొద్దండి అని చెప్పడం జరిగింది. చాలులే అక్కడ కూడ చాలులే అని వదిలేసి వచ్చాము. ఈ రకంగా ఎక్కడన్నా ఒకచోట జరుగుతూ ఉంటుంది. అది మేము దానిని పెద్దగా పట్టించుకోకుండా మేము జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ చేస్తూ ఇంతవరకు సాగించాము. ఆ కృషి వల్ల ఈ రోజు ఇంతమంది వచ్చి కూర్చొని వింటున్నారు.


---

ఈ జ్ఞానం గొప్పదని మీరు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినా రావడమే కాకుండా, మీకు తెలిసిన విధానాన్ని ఎవరంతకు వాళ్ళు ప్రచారం చేసి చెప్తున్నారు. అది మాకు సంతోషము. మీకు ఏ జ్ఞానమైతే తెలిసిందో ప్రపంచంలో ఎక్కడా లేదు అని మీకు నమ్మకం కలిగి, ఈ నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా ఇతరులకు చెప్తున్నారు. అది సంతోషము. ఈ విధానము ఒక్క హిందువులేనా చేస్తుండేది జ్ఞానం అంటే, అట్ల కాదు మళ్ళీ క్రైస్థవులుగా ఉన్నవాళ్ళు కూడ చెప్తున్నారు జ్ఞానాన్ని బయటికి, తర్వాత ముస్లీమ్లుగా ఉన్నోళ్ళు కూడ ఈ జ్ఞానాన్ని బయటికి చెప్తున్నారు. ఈ రోజు ఇక్కడున్నట్టి వాళ్ళంతా మనం మతసామరస్యం కలిగియున్నాము. ఒకే వేదిక మీద మూడు మతాల వాళ్ళు కలిసియున్నాము. ఇది అరుదుగా జరిగేటటువంటి సంఘటన అరుదుగా కనిపించేటటువంటి దృశ్యము ఎక్కడన్నా చూడండి ముస్లీమ్లు, క్రైస్తవులు, హిందులు ఏకంగా ఒక వేదిక మీద ఉండడం చాలా అరుదుగా ఉంటుంది. ఒకే జ్ఞానాన్ని వినడం చాలా అరుదుగా ఉంటుంది. ఎక్కడన్నా ఒకచోట అట్ల వింటున్నా కానీ, వాళ్ళు అది సరిపోక ద్వేషం పొందుతుంటారు కాని సంతోషం పడేటటువంటి విధానం వాళ్ళలో ఉండదు, కానీ ఇక్కడ కూర్చున్నట్టి వాళ్ళందరూ జ్ఞానము వింటూ ఉంటే వాళ్ళు సంతోషపడుతున్నారు. సంతోషపడి ప్రతి నెల అభివృద్ధి అయితూ ఇంకా కొంతమంది పెరుగుతూ పెరుగుతూ వచ్చారు. ఇప్పుడు అనేక మంది రావడం జరుగుతుంది. ఈ జ్ఞానం కోసమే ఈ జ్ఞానాన్ని తెలుసుకునే దానికోసమే ఇంతమంది వస్తున్నారు అని మాకు అర్థమైంది. ఇటువంటి విధానం అంటే ఇటువంటి అమరిక దేశమంతా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము.


కానీ ఇప్పటికే అంటే మతద్వేషము ఎక్కువగావుంది, మత సామరస్యం ఎక్కడా లేదు కానీ ఇక్కడి నుంచి మొదలై అది కొద్దిగా విస్తరిస్తూ


---

కొంత కాలానికి దేశమంతా వ్యాపించుకుంటుంది. అంటే ఈ రోజు మేము దానికి ఒక పునాదిగా వేసి చెప్పాము. చిన్న ప్రారంభం చేసి చెప్పాము ఇట్లుంటుంది అని కానీ, మేముండం కానీ, మేము లేకున్నా కానీ ఇది ఇట్లే కొనసాగుతుంది. మతసామరస్యం అనేది ప్రజల్లో అందరికి ప్రాకిపోతుంది. ఈ జ్ఞానం అందరికి ప్రాకిపోతుంది, ఎందుకు అంటే మేము లేకున్నా ఎందుకు ప్రాకి పోతుందంటే అది సజీవమైనది. మేము సజీవంగా ఉన్నా లేకపోయినా జ్ఞానము సజీవమైనది, అది సజీవమైనది కాబట్టి అది సజీవంగా ఉంటూ దేశమంతా ప్రాకిపోయి, అందరిని మార్చగలిగే శక్తి దానికి ఉంది. అటువంటిది ఈ జ్ఞానంలో ఉంది అని నాకొక్కనికే కాదు, మీ అందరికి కూడ ఒక నమ్మకమే. నేను ఏమి చెప్తున్నానంటే ఇప్పుడు ఈ మత సామరస్యాన్ని గురించి ఎక్కడా ఏ గ్రంథంలోనూ, ఏ వాక్యం కూడా లేదు.

ఫలానాచోట ఖురాన్లో లో ఇట్ల చెప్పినారనో, బైబిల్లో ఇట్ల చెప్పినారనో,

భగవద్గీతలో ఇట్ల చెప్పినారనో మతసామరస్యం గురించి చెప్పాలంటే ఎక్కడా ఒక వాక్యమంటూ ఎక్కడా లేదు, కానీ ఖురాన్లో మతసామరస్యం అనేది కాదు కానీ జ్ఞానాన్ని గురించి ఒకమాట చెప్పారు.


ఈ జ్ఞానము “సమస్త లోకవాసులకు హితోపదేశము” అని అంటే ఇప్పుడు చెప్పేటటువంటి జ్ఞానము సమస్త లోకవాసులకు హితోపదేశము అన్నారు. అంటే అందరికి అవసరమైన జ్ఞానము అని ఉంది. తర్వాత బైబిల్లో “ప్రజలారా నా వద్దకు రండి సమస్త జనులారా నా వద్దకు రాండి” అని ఏసుప్రభువు చెప్పినట్టి విధానముంది. ఒక మాటుంది. సమస్త జనులారా అని అంటే అందరూ రాండి అన్నాడు కానీ క్రైస్థవులు ఒక్కరినే రమ్మని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఇక్కడ సర్వమానువులకు జ్ఞానము అని అక్కడ తెలుస్తా ఉంది. ఇక్కడ తెలుస్తావుంది. ఇక్కడ భగవద్గీతలోకి వస్తే “ఓ


---

మానవులారా” అనేటటువంటి వాక్యాన్ని సంబోధించినారు కాబట్టి మానవులారా అంటే మానవ జన్మను ఎత్తిన వాళ్ళందరికి ఈ జ్ఞానము అవసరమే అని చెప్పినారు కాబట్టి ఇది ప్రజలందరికి అవసరమైన జ్ఞానము అనేది మాత్రం మనకు తెలుస్తావుంది కానీ, ఇంకా మతసామరస్యం గురించి ఎక్కడా ఏమాత్రం కనిపించలేదు. సరే ఆ చిన్న వాక్యాన్ని మనం పట్టుకొని మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకునేదానికి ముందుకు పోయేదానికి అవకాశ ముంది. తర్వాత ఒక మతంతో ఒక మతం సర్దుబాటు చేసుకొని పోయే అవకాశముంది. మేము ఏమి చెప్తున్నామంటే ఈ మధ్యకాలంలో అంటే మొట్టమొదట ఒక హిందూమతంలో జ్ఞానమే చెప్తూ వస్తూ కొంతకాలానికి క్రైస్తవమతంలో కూడా కలిపి చెప్పాము, తర్వాత కొంతకాలానికి ముస్లీమ్ మతంలోది కూడ చెప్పాము. ఒక్కసారిగా చెప్పితే అజీర్ణం అవుతుందన్న ఉద్దేశ్యంతో, జీర్ణించుకోలేరు అన్న ఉద్దేశ్యంతో నేను కొద్ది కొద్దిగా జ్ఞానాన్ని చెప్పుచూ వచ్చి, ఈ రోజు మూడు మతాల జ్ఞానాన్ని మీకు అందిస్తూ వచ్చాము. ప్రతి గ్రంథంలోనూ మిమ్మల్ని ముందుకు తీసుకు పోయేటి జ్ఞానాన్నే మీకు అందిస్తున్నాము ఒక గ్రంథము చదివినా కానీ మీరు ముందుకు పోతారు కానీ వెనక్కి వచ్చేటటువంటి అవకాశం ఏమాత్రము లేదు. ఇట్ల ముందుకు ముందుకు పోతూ పోతూ మీరు ఏమి చేస్తారంటే, దేవునికి దగ్గరగా పోయేటటువంటి నమ్మకం మీకు కలుగుతా ఉంది. మీకది స్వచ్ఛంగా తెలుస్తుంది.


ఇంతకుముందుకు ప్రతి సంవత్సరము, ప్రతి నెల మనకు ముందుకే పోతున్నాము కాని వెనక్కి పోయేటటువంటిది ఏమి లేదు కానీ ఇప్పుడు ఈ మతసామరస్యాన్ని గురించి చెప్పుకుంటే ఇది ఇక్కడనే మొదలైంది అని చెప్పాము కదా! ఇక్కడే మొదలైంది ఇది ఇంతటితో ఆగదు ఇది సజీవమైంది ఇది కొనసాగుతుంది అని చెప్పుకుంటున్నాము కదా మరి ఎట్లా కొనసాగు


---

తుంది. మీరు లేనప్పుడు మీరు ఉంటే కదా! ఇది సాగించేది అని అంటే నేను అనేటటువంటి ప్రసక్తి ఇక్కడ లేదు. కానీ దేవుడు అనేటటువంటి ప్రసక్తి తీసుకుంటే దేవుడు ఎప్పటికీ ఉంటాడు. ఆయన దేనిని కొనిసాగించాలో దానిని కొనసాగిస్తాడు. ఆ కొనసాగించే ఉద్దేశ్యముతోనే ఇక్కడ మనవద్ద బయటికి తీసుకొచ్చాడు, అది నేను చెప్పినది కూడ కాదు. కానీ మీ దృష్టిలో మేము వ్యక్తి కనిపించినా, అది మేము చెప్పేది కాదు కానీ దేవుడు అందించినటువంటి విషయము దేవుని విషయం ఆ విధంగా ఉంది ఏ విధంగా ఉంది? ఇది కొనసాగాలి అనేది ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ జనాభా 700 కోట్లు దాటింది. 700 కోట్లకంటే మించి ఉండ కూడదు అని ఒక గ్రంథంలో మేము వ్రాసాము. 700 కోట్లకంటే మించితే అది చాలా అధికం అయిపోతుంది. కాబట్టి వినాశనం తప్పనిసరిగా జరగాల్సిందే, 700 కోట్లకంటే మించి ఒక కోటి జనాభా ఉన్నా కానీ ఒక్కసారిగా కోటిమంది చనిపోయేటటువంటి అవకాశం అంటే అంత భయంకరమైనటువంటి విధానం అవుతుంది. అది మళ్ళీ అంతమంది చనిపోతారా అంటే చనిపోవాల్సిందే. ఎందుకంటే మళ్ళీ చనిపోయేదానికి కారణముంటుందా అంటే దండిగా ఉంది కారణం. మనుషులు చేసినటు వంటి దుర్మార్గాలు, దుష్టతనమే దానికి కారణం అవుతుంది. ఆ పాపాలే వాళ్ళను ఆ విధంగా చంపేస్తాయి. అందువలన ఈ రోజు జ్ఞానానికి ఆటంకం కలుగజేసేవాళ్ళున్నారు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టే వాళ్ళున్నారు జ్ఞాన విషయాల్లో వీళ్ళందరికి తగిన శిక్ష తప్పనిసరిగా పడుతుంది, పడకుండా ఉండదు. ఈ శిక్ష పడినప్పుడు ఘోరమైనట్టి చావులు మనం చూస్తున్నాము. అటువంటి చావులు కలిగినప్పుడు దేవునికి కనికరం లేదా, దేవునికి దయ లేదా? దేవుడు ఇంత అన్యాయంగా చంపేస్తాడా? దేవునికి తెలియకుండా ఎలా జరుగుతుంది?


---

దేవునికి అన్ని తెలిసే జరుగుతాయి. దేవుని ఇష్టంతోనే అంతా జరుగుతుంది. మళ్ళీ దేవునికి చనిపోయేది ఇష్టమా అంటే నీకు ఒక రూల్ పెట్టాడు, నువ్వు పాపం అనుభవిస్తావు అని ఆ రూల్ ప్రకారమే నువ్వు చేసుకున్నది నువ్వు అనుభవిస్తున్నావు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. నువ్వు చేసుకున్నది పాపం చేసుకుంటే ఆ పాపానికి ఎప్పుడో ఒకసారి శిక్ష తప్పదు, తగిన శిక్ష తప్పదు. తప్పు ఏదైనా శిక్ష తప్పదు. ఆ రకంగా శిక్షలు అనుభవించేటటువంటిది మనకు తప్పనిసరిగా జరుగుతా ఉంది అటువంటి శిక్షలు చిన్న చిన్నవి మనం చూస్తునే ఉన్నాము. 20 మంది చనిపోయినారు ఒకచోట అంటారు, 20 మంది ఏముంది 200 మంది చనిపోయినారు. 200 మంది ఏముంది 2000 మంది కూడా చనిపోయినటువంటి సంఘటనలు కూడా జరుగుతుంటాయి. ఈ సంఘటనలకంతా కారణము ఏమి అంటే మనుషులు చేసుకున్న పాపమే అందరూ ఒకటే రకంగా పాపం చేసారంటే రకరకాలుగా పాపం చేసింటారు. అందరికి ఒకటే రకంగా శిక్ష పడుతుంది. అంటే అంతా ఒకటే రకంగా స్టేజీకి సంబంధించినట్టి శిక్షలుంటాయి. అటువంటి శిక్ష వాళ్ళకు పడుతుంది. అందరూ ఒకటే రకం పాపం చేసుకున్నట్టే ఒకటే చోట చేసుండరు. అనేకచోట్ల చేసింటారు ఒకడు జ్ఞానాన్ని దూషిస్తే, ఇంకొకడు దేవున్ని దూషిస్తే వానిది వీనిది రెండూ ఒకటే రకమైన పాపం కాదా! ఇద్దరిది ఒకేరకంగా జ్ఞానాన్ని దూషించినటు వంటి వాళ్ళందరికి ప్రత్యకమైన శిక్షంటూ ఒకటుంటుంది. అది దేవుడు తప్పనిసరిగా అమలు చేస్తాడు. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే ఇది మనుషుల్లో ఎందుకు ఇట్ల వచ్చింది అని అంటే, మనుషుల్లో అందరిలో ఇది లేదు కాని కొందరిలో మాత్రం ఉంది అని చెప్పవచ్చు.


---

మనుషులు ఉదయం లేచినప్పటినుంచి ఏదో ఒక పని చేసి బ్రతుకుతుంటారు. సాయంకాలం వరకు పని చేసి తరువాత ఇంట్లో కూర్చుంటే అందరూ ఈ మతము మతద్వేషము అనేది ఉండదు దానిని పట్టించుకోరు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అన్నమాట. కొంతమంది పని పాటలేని పెద్దలు ఏమి చేస్తారంటే, దీనిని అదే పనిగా రెచ్చగొట్టి వాళ్ళకు నేర్పిస్తుంటారు. వాళ్ళకు బోధిస్తుంటారు మేము బోధకులము అని చెప్పి ఏమి చేస్తుంటారంటే, మనది ఈ మతము మన మతం అభివృద్ధి అయ్యేది, మనం ఇట్లే ఉండాలని మతాన్ని మనుషులకు నూరి పోస్తున్నారు. పని చేసుకొని బ్రతికే మనుషులు 90 శాతం ఉంటే, 95 శాతం ఉంటే కేవలం 5 శాతం మంది మనుషులు మాత్రమే ఆ మతము అనే దానిని విద్వేషాన్ని వాళ్ళు ఏమి చేస్తున్నారంటే దానికి అంటించి ప్రజలకు బోధించి, ప్రజల్లో ఇది మా మతము అనే విధానాన్ని కలిగించి నారు. అంతవరకూ ప్రజల్లో మతము అనేది లేకున్నా కానీ వీళ్ళే గుర్తు చేసి ఇది మన మతము అని చెప్పి వాళ్ళను మనుషులందరి నుండి ప్రత్యేకంగా చీల్చి ప్రక్కకు పెడుతున్నారనమాట. ఈ రకంగా ప్రతి మతంలో హిందూ మతంలో ఉంది, క్రైస్తవ మతంలో ఉంది, ముస్లీమ్ మతంలో కూడ ఉంది. ఈ మూడు మతాల్లో ఏమి చేస్తున్నారంటే మా మతం వేరు, మా మతం వేరు అని చెప్పుకుంటుంటే మేము ఏమి చేస్తున్నాము అంటే ఇది మంచి పద్ధతి కాదు అందరూ ఐకమత్యంగా ఉండాలి.


మనుషులంతా ఒకటే ఎక్కడైనా మీకు ఏదైనా తేడా వచ్చిందా, ఒక మనిషిలో జీవన విధానంలో ఎవడైతే అన్నం తింటున్నాడో, అట్లే ఇంకొకడు కూడ అదే అన్నం తింటున్నాడు. ఏ మతస్థుడైతే నీళ్ళు త్రాగుతున్నాడో, ఒక మతస్థుడు నీళ్ళు త్రాగితే ఇంకో మతస్థుడు కూడ


--

అదే నీళ్ళు త్రాగుతున్నాడు. జీవన విధానమంతా ఒకటే ఉన్నప్పుడు, అయితే మత విధానం ఎక్కడినుంచి వచ్చింది ప్రక్కగా మీకు అని మనం చెప్తున్నాము. అయినా మమ్మల్ని కూడా ఏమి చేశారంటే ఒక మతానికి కట్టేసి, వీళ్ళు పరమత బోధ చేస్తున్నారని ఒక నింద ఆరోపణ చేస్తున్నారు. కొంతమంది హిందువులే చేస్తున్నారు. మేము హిందువులము భగవద్గీతను ప్రచారం చేస్తున్నాము అంటే, ఇది భగవద్గీతేనా అని దానిని తెరిచి చూసి ఇది భగవద్గీతేనా అంటున్నారు. భగవద్గీతలో శ్లోకాలు చూసి కూడా, అది భగవద్గీత అని తెలియనటువంటి వాళ్ళున్నారంటే, హిందువుల్లో వాళ్ళని ఏమనుకోవాలి చెప్పండి. మళ్ళీ అటువంటి హిందువులు ఉన్నారు కాబట్టి, ఈ రోజు హిందూ సమాజమనేది ముందుకు పోలేకపోతుంది. తర్వాత ఇందూ సమాజంలో మతాన్ని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా  మతమనేదాన్ని బోధిస్తూ, కొందరికి అనేక సంఘాలు పెట్టి, ఆ సంఘాల్లో మతరక్షణ చేయాలి అన్న ఉద్దేశ్యంతో, మతరక్షణ అనే సాకు పెట్టి ఇతరులను నిందించే దానికి ద్వేషించేదానికి అలవాటు చేసి ట్రైనింగ్ ఇస్తున్నారు. మళ్ళీ ఇది మంచి పద్ధతా మానవ సమాజంలో అంటే, మంచి పద్ధతి కాదు, అయినా వాళ్ళు అట్లే చేస్తున్నారు. సరే వాళ్ళు ఒకరే అట్ల చేస్తున్నారా అంటే వాళ్ళు చేస్తే మేం ఏమి తక్కువ అని ఇంకో మతం వాళ్ళు కూడ చేస్తున్నారు.




ఇటువంటి మతద్వేషం కలిగిన మనుషుల్లోకి మేము పోయి జ్ఞానాన్ని బోధించాలంటే వీడు వినడు, వాడు వినడు, ఇంకోడు వినడు ముగ్గురు వినకుండా ముగ్గురు ద్వేషించే స్వభావం అనేది కనపడతా ఉంది. క్రైస్థవులు ఒక్కసారి వ్యతిరేఖించారు ఈ పుస్తకాలు చదవద్దండి. ఇవి మాయ సాతానుకు సంబంధించిన పుస్తకాలు చదివితే మనం కూడ మారిపోతాము అని


---

హెచ్చరిస్తున్నారు క్రైస్థవులు. ఈ మధ్యన ముస్లీమ్లు కూడ, ఒక ముస్లీమ్ పెద్ద ఒకాయన టీవీలో కనిపిస్తూ త్రైత సిద్ధాంతాన్ని నమ్మవద్దండి, అది చాలా ప్రమాదకరమైనది, దేవునికి వ్యతిరేఖ మార్గంలో తీసుకొని పోతుందని చెప్పనటువంటి విధానం కూడ ఉంది. దేవునికి వ్యతిరేఖం తీసుకొని పోతున్నామా, సానుకూలంగా దేవునికి దగ్గరగా తీసుకొని పోతున్నామా, అది మీకే తెలుసు. ఈ రకంగా హిందూ సమాజంలోకి వస్తే, అందరికంటే ఎక్కవ వీళ్ళే దూషిస్తున్నారు మమ్మల్ని, వీళ్ళు హిందువులు కాదు అంటున్నారు. మేము హిందువులమే, భగవద్గీతను ప్రచారం చేస్తున్నాము అంటే, మీరు హిందువులు కాదు భగవద్గీతను ప్రచారం చేయడం లేదు, బైబిలు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు అని చాలామంది మమ్ములను ఆరోపణ చేస్తున్నారు. మేము ఒక మతాన్ని ద్వేషించింది ఎక్కడైనా ఉందా? ఇప్పుడికి 88 పుస్తకాలు

వ్రాశాను, మీకు 88 గ్రంథాలలో ఏ మతాన్ని ద్వేషించింది కానీ, ఏ మతాన్నైనా ఎక్కువ చేసి తక్కువ చేసి చెప్పేది కాని ఎక్కడా లేదు. ఎక్కడ చూసినా కానీ మానవులంతా ఒక్కటే అనే విధానం చెప్తున్నాము. అందరికీ సరిపోయేటటు వంటి ఒకే బోధను చెప్తున్నాము. మూడు గ్రంథాల్లో ఉండేటటువంటిది ఒకే బోధ అని చెప్తున్నాము. మూడు గ్రంథాల్లోనూ వేరు వేరు బోధలు లేవు అని చెప్తున్నాము. ఎక్కడైనా ఒకే జ్ఞానముంది అని మేము చెప్తున్నాము.


మీరు జ్ఞానంలో ఏ బేధాలు పెట్టుకోవద్దండి, పెట్టుకుంటే ఏమీ ప్రయోజనం లేదని కూడా చెప్తున్నాము ఇంత సామరస్యంగా చెప్పినా కూడ మమ్మల్ని కూడ ఒక మతానికి కరిపించి అంటే, మీరు హిందువులు కాదు అని మమ్మల్ని అంటున్నారంటే, ఇది కుట్రపూరితంగా చెప్పేదే గానీ ఇందులో వాస్తవము ఏమాత్రం లేదు. వాస్తవం ఏమాత్రం లేదని ప్రజలందరికి తెలుసు అంటే, మేము ఒక మతాన్ని గురించి ఎక్కడా బోధించలేదు. ఒక


--

మతంలోకి చేరమని ఎక్కడా చెప్పలేదు. ఒక మతాన్ని విడిచి పొమ్మని కూడ చెప్పలేదు. లేకపోతే హిందూమతంలోకి మా మతంలోకి రమ్మని మేము స్వార్థపూరితంగా ఎక్కడా కూడ ఎవ్వరికీ చెప్పలేదు. ఏ మతంలో ఉండే వాళ్ళు ఆ మతంలో ఉండండి అని చెప్పాము. ఆ మతంలో ఉంటూ మీరు జ్ఞానాన్ని తెలుసుకోండి. మీరు హిందువు అయితే భగవద్గీత చదువు, క్రైస్థవుడైతే బైబిల్ చదువు, ముస్లీమ్ అయితే ఖురాన్ గ్రంథం చదువు అని చెప్తున్నాం కానీ, అన్ని గ్రంథాలకంటే మా గ్రంథం గొప్పదని మేము ఎప్పుడూ చెప్పలేదు. ఈ అంతిమ దైవ గ్రంథంలో ఏమి చెప్పారంటే ఖురాన్ గ్రంథంలో భగవద్గీత, బైబిల్ సారాంశం ఖురాన్లో ఉంది, ఈ ఖురాన్ ఆ రెండు గ్రంథాలను సమర్థిస్తూ ఉంది. ఆ రెండు గ్రంథాలను నిరూపిస్తావుంది, సాక్ష్యం చెప్తావుంది. అందులో ఇదే జ్ఞానముందని సాక్ష్యం చెప్తావుంది అని చెప్పాము. తర్వాత ఈ రెండు మతాలకు మొట్టమొదటిది ఆధారము తౌరాత్ గ్రంథం అని చెప్పాము, అంటే భగవద్గీత గ్రంథము అని చెప్పాము. భగవద్గీత గ్రంథములో ఉండేదే అన్ని మతాల్లో ఉంది అని కూడా అక్కడ అంతిమ దైవగ్రంథం ఖురాన్లో చెప్పడం జరిగింది. ఆ రకంగా చెప్పినా కూడా తరువాత మాది వేరు అని ఎందుకు అంటున్నారంటే అర్థం కాలేదు. బైబిల్ విషయానికి వస్తే తౌరాత్ గ్రంథంలో ఉండేదే ఇంజీలు గ్రంథంలో ఉంది. అందులో జ్యోతి ఉంది ఆ జ్యోతే ఇందులో ఉంది. అందులో జ్ఞానముంది ఆ జ్ఞానమే ఇందులో ఉంది అని చెప్పడం జరిగింది. అది కూడా వేరు అని ఎక్కడా లేనే లేదు, ఈ రకంగా అన్నింటిలోనూ ఒకటే ధ్యాస ఉన్నప్పుడు, ఒకటే జ్ఞానము ఉన్నప్పుడు, ఒకటే దేవునికి సంబంధించిన జ్ఞానం చెప్పినప్పుడు మనం దానిని అర్థం చేసుకోలేకుండా ఇది మా మతము, మా మతానికి సంబంధించిన జ్ఞానము అనుకోవడం పెద్ద పొరపాటు

అయితుంది.

---

ఇది దేవుడు చెప్పినేది, సర్వమానవులకు సంబంధించిన జ్ఞానం చెప్పినాడు, ఏ మతాన్ని సమర్థించి చెప్పలేదు. అసలుకు దేవుడు జ్ఞానం చెప్పినప్పుడు మతాలు లేనే లేవు. భగవద్గీత చెప్పినప్పుడు అసలు మతం లేదు, బైబిల్ చెప్పినప్పుడు అసలుకు మతం లేదు. బైబిల్ చెప్పినప్పుడు మతం పుట్టుకొస్తుంది, అప్పుడు మళ్ళీ తర్వాత చెప్తాను. మీకు అది అర్థం కాదు అని చెప్పాడు. ఆయన ముందే అంచనా వేసి, ముందే దృష్టి పెట్టుకొని మతములు అనేవి భవిష్యత్తులో పుడతాయి. ఇప్పుడు నేను చెప్పును, ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు. తర్వాత మీకు ఈ విషయాన్ని చెప్తాను, జ్ఞానం చెప్తాను వచ్చే ఆయన చెప్తాడు పోండి మీకు అని చెప్పాడు. ఆయన ఈ రకంగా అప్పుడు బైబిల్, భగవద్గీతను చెప్పినప్పుడు మతము లేదు. తర్వాత మతాలొచ్చాయి. మతం వచ్చిన తరువాత ఖురాన్ గ్రంథం చెప్పబడింది అయినా గానీ, అక్కడ కూడ మతాన్ని గురించి ఎక్కడ చెప్పలేదు. సర్వమానవులకు సంబంధించిన జ్ఞానం అని చెప్పారు. ఇట్ల లెక్కేసుకుంటూ పోతే ఏ మత గ్రంథంలో కూడ అంటే, మత గ్రంథం అని చెప్పకూడదు కాని ఏ దైవ గ్రంథంలో కూడ ఒక మతము అనే ప్రసక్తి లేదు. అయినా గానీ ఇది ఈ మతమనేది 2000 సంవత్సరాల లోపు పుట్టింది కాని అంతకుముందు లేదు. 2000 సంవత్సరాలప్పుడు ఈ బైబిల్ గ్రంథం పుట్టింది. బైబిల్ గ్రంథంలో ఏసుప్రభువు జ్ఞానం చెప్పాడు. అప్పుడు కూడ ఈ మతం లేదు తర్వాత కొంత కాలానికి ఈ క్రైస్థవ సమాజాలు ఏర్పడినాయి. ఆ సమాజాలు ఏర్పడి క్రైస్థవ సమాజమంతా పెద్దగా అయ్యి, చివరికి క్రైస్థవ మతం అయింది. అంతవరకూ మతము లేదు. క్రైస్తవ మతము తర్వాత ఏమైందంటే, దానికొక క్రైస్థవ మతమని పేరు పెట్టుకున్న తర్వాత, మేము హిందువులము అని హిందూ మతమని పేరు పెట్టుకున్నారు.


---

ఈ రకంగా మాది హిందూ మతమని పేరు పెట్టుకున్నారు. ఈ మతాలన్ని ఎప్పటినుండి వచ్చాయంటే 2000 సంవత్సరాల తరువాత వచ్చాయి కానీ అంతక ముందు లేవు. 1900 సంవత్సరాల నుంచి ఈ మతాలు వచ్చాయి కాని 1900 సంవత్సరాల పూర్వం ఎవరైనా గానీ ఫలాన మతముందని నిరూపించగలరా చెప్పండి. కానీ ఇదేదో కొన్ని వేల, లక్షల సంవత్సరాల నుంచి మతాలున్నట్టు వాటి గురించి చెప్పుకుంటున్నారు. మతాలన్ని ఎప్పటి నుంచి వచ్చినాయి. మీరు ఇప్పుడు చెప్పుకునే మతాలన్ని అంటే కేవలం 1900 సంవత్సరాల నుంచే ఇది ప్రారంభమయ్యి వచ్చాయి. సరే ఇప్పుడు ఈ హిందూ మతనమనేది అచ్చు 'ఇ' తో ఉండేది పూర్వము హల్లు ‘హి’ తోలేదు. ఈ రోజు హిందువులు అనేవాళ్ళంతా కలిసి హిందూ సమాజాలు, హిందూ రక్షణ సంస్థలు అని రకరకాల పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ ఏమి చేస్తున్నారంటే, హిందూ అని హల్లు 'హి’ తో ఉండే పదాన్ని వాడుతున్నారు. హిందూ మతము అని మేము ఏమి చెప్తున్నాము అంటే అది కేవలం 150 సంవత్సరాల నుంచే మారిపోయి వచ్చింది కాని అంతకు ముందు అచ్చు 'ఇ' తో ఉండేది 'ఇందు' మతము అనే పేరుండేది. హిందూ అనేటటువంటి పేరు లేదు అని మేము చెప్తున్నాము. ఈ నూరు నూటయాభై సంవత్సరాల నుంచి వచ్చినదాన్ని పట్టుకొని, మీరు ఏమి చెప్పినా కానీ వినడం లేదు. ఎవరైనా ఏ బుద్ధి ఉన్నటువంటి మనిషి అయినా కాని దానికి అర్థం చెప్పగలడా అంటే ఎవడూ చెప్పలేడు. అందరూ అంటుంటే మేము అంటున్నాము అంటారు తప్ప, నిజమైన అర్థం దానికి లేదు. ఇందూ అనే అక్షరంతో చెప్పితే దానికి అర్థముంది. కానీ హిందూ అనే పేరుతో చెప్పితే దానికి అర్థం లేదు అన్నమాట. ఈ రకంగా మతానికి ఒక పేరు పెట్టుకున్నప్పుడు కూడా మనం తప్పు పేరుతో పెట్టుకొని తప్పుగానే చెప్పుకుంటున్నాం తప్ప ఇంకొకటి ఏమి లేదు.



----

ఈ మధ్యకాలంలో కొంతమంది స్వామిజీలంతా వ్యతిరేఖించారు. ఇది చిన్నజీయర్ స్వామిజీ ఇంకొకరు ఇంకొకరు వీళ్ళంతా ఏమి చెప్పినారంటే, హిందువు అనే పదాన్ని మనం వాడితే మన గొంతు మనం కోసుకున్నట్టే అన్నారు. ఆ పదం వాడకూడదు మనము అని చెప్పారు. మళ్ళీ అంత కఠినంగా వాళ్ళు చెప్పినప్పుడు ఆ పదాన్ని మనం ఎందుకు వాడుతున్నామంటే ఇది ఒక రాజకీయము, ఇది గుంపును మైంటెయిన్ చేసేదానికే వాడుతున్నారు తప్ప ఇంకా దానికి కాదు. ఇది దేవుని జ్ఞానాన్ని ముందుకు పోవాలి అన్న ఉద్దేశ్యంతో ఎవరూ దీనిని వాడడం లేదు. ఈ రోజు అందరూ అంతే అన్నమాట, మా గుంపు పెద్దగా ఉండాలి అని అట్ల అనుకుంటున్నారు తప్ప, మేము దేవుని జ్ఞానంలో మందుకు పోవాలి అని ఎవరూ అనుకోవడం లేదు. ఈ రకంగా ఈ మతం అనేదానిని పెంచుకుంటూ పెంచుకుంటూ పోతున్నారు. ఇంతవరకూ పెరిగింది. మతమనేది, ఇష్టమొచ్చినట్టు పెరిగిపోయింది కానీ, ఇప్పుడు ఏమి చేస్తున్నామంటే మేము ఇప్పటి నుండి చిన్న ప్రయత్నం చేశాము. ఈ మతాన్ని ముందుకు పెరగని గనియ్య కూడదు అని. ఆ చిన్న ప్రయత్నమే ఈ రోజు మా ముందు ప్రత్యక్షంగా కనిపిస్తూవుంది అభివృద్ధి అయ్యి క్రైస్థవులున్నారు, ముస్లీమ్లున్నారు, హిందువులున్నారు. అంటే ఒక్కసారి ఒక్క మనిషి ప్రయత్నం చేస్తే అది మంచి ప్రయత్నమైతే ఏదైనా దేవుడు సాధింపజేస్తాడు దానిని అనే ఋజువుగా జరిగింది అన్నమాట. ఇదే విధానము దేశమంతా ప్రపంచమంతా పెరిగిపోతే ఏమైతుంది? ఏమి ఉండరు, ఏ మతకల్లోలాలు ఉండవు. అందరూ అన్నదమ్ములుగా ఉంటారు తప్ప ద్వేషపరులుగా ఎవరూ

ఉండరు.


కానీ ఇప్పుడు ఒక మతాన్ని గురించి ఒక మతం ద్వేషంతో ఉంది. ఎక్కడ అంటే అక్కడ దాడులు చేయాలని ఉన్నారు. ఆ మతాలుండకూడదు,


---

మా మతమే ఉండాలి దేశంలో, భూమి మీదంతా మా మతమే ఉండాలి. ఇంకో మతం ఉండకూడదు అని ప్రతిజ్ఞలు చేసుకొని చెప్పుకుంటున్నారు. ఇంకో మతాన్ని దొరికితే చాటుగా ఏమిటి పబ్లిక్ గా గొంతు కొస్తున్నారు మీరు చూసి ఉంటారు. కొన్ని వీడియోల్లో మనిషి ఇంకో మనిషిని గొంతు కోస్తున్నాడు అంటే, ఒక మతమే దానికి కారణం. మా మతము ఇది వాడి మతం అది, ఆ మతాన్ని నేను ఉండనియ్యకూడదు అనే ఉద్దేశ్యంలో, దొరికిన వాన్ని అవకాశము వచ్చిందని గొంతు కోసిన సంఘటనలను కూడా మీరు కొన్ని వీడియోల్లో చూసేవుంటారు. వీడియోలు పెట్టి చూపించారు. భయంకరంగా అంటే మా మతమే అభివృద్ధి కావాలి, మా మతమే ఉండాలి, వేరే మతాలను ఇట్ల చేస్తాము మేము అని అవి ఉగ్రవాద క్రియ అంటున్నాము. మనం ఏ వాద క్రియ అయినా కానీ ఇదంతా మత వాద క్రియనే, మతంతో కూడుకొని ఉండేదే, మతమున్నంత వరకూ మనకు జ్ఞానం ఏమాత్రం తెలియదు. మతము అనేటటువంటిది ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే జ్ఞానానికి ఆటంకం కలిగింది. అది ఇప్పుడు నేను చెప్పను తర్వాత నేను ఏసుప్రభువు కూడ ఒక వాక్యం చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పినా సహించుకోరు తర్వాత మతము అనేది పుట్టిన తర్వాత చెప్తానన్నాడు. అప్పుడు వుంటాడా ఆయన అంటే అప్పుడుండడు. అప్పుడొచ్చే వాళ్ళు ఎవరైనా చెప్తారుపో అన్నాడు. ఈ రోజు ఎవరు చెప్తారో ఏమో గాని మనం మాత్రం దాని గురించి చెప్పుకుంటున్నాము. ఇది అందరికి అవసరమైనట్టి విధానమే, ఇదేం జ్ఞానమా ఇది, ఈ ఆటంకంగా ఉండే విధానాన్ని తీసివేసుకుంటేనే జ్ఞానం అభివృద్ధి అవుతుంది. మనకు ఇప్పుడు మా దగ్గర ఏ మతము లేదు అని పనిచేసుకుంటాం అంటే, కలిసిమెలసి పని చేసుకుంటున్నాం, అన్ని మతస్థులు కలిసి పని చేసుకుంటున్నాం. కానీ కొంతమంది మత


----

పెద్దలు ఏమి చేశారంటే ద్వేషాలు పెట్టి ఒకరికొకరికి విద్వేషాలు పెంచి చంపుకునేంత వరకు తీసుకొనిపోతున్నారు, అది మంచి పద్ధతి కాదు. అటువంటి జాఢ్యం మీరు అంటించుకోవద్దండి, ఎవరు చెప్పినా వినొద్దండి. మా పెద్దలు చెప్తున్నారు అనేటటువంటిది వదిలిపెట్టండి. పెద్దల మాటలు అసలు వినొద్దండి.


మీకు బుద్ధి ఉంది, మీకు జ్ఞానముంది మీకు యోచనా శక్తి ఉంది, మీరు ఆలోచన చేయండి ప్రతి విషయాన్ని. ఎందుకు వేరే వాళ్ళు చెప్పినట్టు, వాళ్ళ మీద నమ్మకంతో ఎందుకు పోతారు, మీరు వాళ్ళు చెప్పినట్టు మీరు ఎందుకు వినాలి. మా పెద్దలు చెప్పినట్టే వింటాము అని ఎందుకు అనాలి. మీకు దేవుడు గ్రంథం ఇచ్చాడు ఆ గ్రంథాన్ని మీరు చదవండి. ఆ గ్రంథం చదివితే మీకు దేవుడు అందులో ఏమి చెప్పినాడో తెలుస్తుంది. కానీ ఈ రోజు ఎవరూ ఆ పని చేయడం లేదు, గ్రంథం చదవడం లేదు, ఈ రోజు ముస్లీమ్లున్నారు 98% ఎవరు కూడ ఖురాన్ను చదవలేదు. ఎవరో 2% చదివినోళ్ళు ఏమి చేస్తున్నారంటే వాళ్ళకేం అర్థమైందో, ఆ అర్థమైనదాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు, అంటే వాళ్ళకు అర్థమయి ఉండేది ఏమన్నా అర్థం కాని వాళ్ళ ఉద్దేశ్యం ఏమంటే, మతం పెంచుకోవాలనేదే వాళ్ళకు అర్థమైంది. కాని ఈ రోజు ముస్లీమ్లు ఎట్లున్నారంటే ఖురాన్ అంటే చాలా పవిత్రంగా చూసుకుంటారు, ఎంతో గొప్పది అనే ఉద్దేశ్యంతో ఉన్నారు. కానీ ఖురాన్ లో ఒక్కమాట కూడ వాళ్ళకు తెలియదు, మనం చెప్తూవుంటే వాళ్ళు శ్రద్ధగా వింటున్నారు, లేచి నిలబడి వింటున్నారు. కూర్చున్నవాళ్ళు కూడ హైదరాబాద్ లో పెద్ద పెద్ద వ్యాపారస్థులున్నారు. వాళ్ళకు ఖురాన్లో ఒక వాక్యం చెప్తే ఎంతో సంతోషపడి నిలబడి వింటున్నారు. వాడు తీసుకునేటటువంటి లాభం తీసుకోకుండా, ఆ వస్తువులు మనకి ఇస్తున్నారు. అంటే అంత శ్రద్ధ


---

ఉంది వాళ్ళకు, కానీ ఆ జ్ఞానము మాకు ఇంతవరకు తెలియదు అంటున్నారు. మేము ఇస్తాం చదువుకోండి అంటే మాకు తెలుగులో చదవకూడదు. మేము చదవము మా పెద్దలు చెప్పినారు, చదివితే మళ్ళీ వాడు జ్ఞాని అయితాడు, మళ్ళీ మనకు ఆటంకం అయితాడు, చిన్న ఆటంకం సరే ఇంతవరకు మనం మతసామరస్యాన్ని గురించి మనుషుల్లో ఉండే మతాన్ని గురించి చెప్పు కున్నాము. దేవునికి ఇష్టములేదేమో ఇదంతా చెప్పుకునే దానిని ఇప్పటి నుండి మనం నిలిపివేసి జ్ఞానాన్ని చెప్పుకుందాము. మనం కొద్దిగా ప్రపంచంలో ఉండేటటువంటి రెండే రెండూ వస్తువులున్నాయి. ఆ రెండూ మినహా ఏవీ లేవు.


ఒకటి దేవుడు, ఇంకోటి ప్రకృతి. ఆ ప్రకృతి మనకు కనిపిస్తావుంది, దేవుడు కనిపిచడు. ప్రకృతి స్త్రీ తత్త్వము అంటాము, దేవున్ని పురుషతత్త్వం అంటాము. దేవున్ని పురుషుడుగా వర్ణిస్తాము, ప్రకృతిని స్త్రీగా వర్ణిస్తున్నాము. ఇది ఆధ్యాత్మికంలో ప్రాథమిక జ్ఞానము. ఇది ప్రతి మనిషికి తెలిసే ఉండాలి. ఏ మతస్థునికైనా కానీ ఈ విధానం తెలిసి ఉండాలి. కానీ ఇది తెలియకపోతే మాత్రం ముందుకు మనం పోలేము. జ్ఞానంలో ప్రకృతి 5 భాగాలుగా విభజించబడింది. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అవి 5 భాగాలుగా విభజింపబడింది. దేవుడు మూడు భాగాలుగా విభజింప బడినాడు అంటే ప్రపంచానికి మొత్తం ఒకటే పురుషుడు, ఆ పురుషులు ముగ్గురుగా ఉన్నారు. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అనే మూడు పేర్లతో ఉన్నాడన్నమాట అంటే ఈ ప్రపంచమంతా కలిసి స్త్రీ తత్త్వముండగా, పరమాత్మ పురుష సంబంధమైనవి. అది ఇప్పుడు ప్రపంచంలో ఉండేటటు వంటి విషయాలు, అన్ని ప్రపంచ సంబంధ విషయాలైతాయి. దేవునికి సంబంధించిన విషయాలన్ని దేవుని సంబంధ విషయాలైతాయి. ఈ ప్రకృతి


----

సంబంధ విషయాలు, అన్ని ప్రపంచ సంబంధ విషయాలైతే, ఈ మూడు ఆత్మలకు సంబంధించిన విషయాలన్ని దేవునికి సంబంధించిన విషయాలైతాయి. దేవుడు ఎప్పుడైనా గాని తన జ్ఞానానికి సంబంధించిన విషయాలే తన గ్రంథంలో బోధిస్తాడు. కానీ ప్రకృతి సంబంధించిన విషయాలు ఎక్కడా బోధించలేదు, అవసరం లేదు. ఆయన బోధించే అవసరం లేదు కానీ మన గ్రంథాల్లో ప్రకృతి సంబంధించిన విషయాలు కూడ మనం వ్రాసి పెట్టుకున్నాము, అంటే మళ్ళీ ఇది దేవుడు చెప్పినటు వంటిదా అంటే దేవుడు చెప్పినటువంటిది ఏమాత్రం కానే కాదు. ఇప్పుడు మనం విభజించుకోవచ్చు. మన బుద్ధి ఉంది, మన తెలివితో ఏమని విభజించుకోవచ్చంటే, ఒక విషయాన్ని చూస్తే ప్రపంచ విషయామా, దేవుని విషయమా అని మనము లెక్కేసుకొని చూస్తే, దేవుని విషయమైతే దేవుడు చెప్పింటాడు. ప్రపంచ విషయమైతే దేవుడు చెప్పనే చెప్పడు. మీరు దొంగతనం చేయద్దు అనే మాట దేవుడు చెబుతాడా? అంటే ఆ మంచిదే దేవుడు మంచే చెప్తాడు అనే ఉద్ధేశ్యం కొందరికి కలిగి దేవుడు చెప్పి ఉండవచ్చు అంటారు.


దేవుడు ఎప్పుడు ఆ మాట చెప్పడు, ఎందుకంటే ప్రతి మనిషి అంటే ఒక దొంగగా మారి వాడు దొంగ పని చేయాలంటే ఆ పని ఎవరు చేపిస్తున్నారు? దేవుడే చేపిస్తున్నాడన్నమాట. ప్రతి మనిషిని దొంగగా మార్చేది ఎవరు దేవుడే. మనిషి తనంతకు తను మారడం లేదు, దేవుడు ఆ విధంగా మార్చి చేపిస్తున్నాడు. కాబట్టి అది ముందే ఆ విషయం నిర్ణయం చేసి, ఆ నువ్వు పుట్టినప్పుడే దానిని నీలో పెట్టి పంపించాడు. దానిప్రకారం వీడు జీవితంలో తయారై ఆ రకంగా నడుచుకుంటుంటాడు. జీవితంలో వారు దొంగ కావలిసుంటే దొంగైతాడు, మంచి కావాలంటే మంచే అయితాడు.


---

ఈ రకంగా ఏ రకంగా మారాల్సినటువంటి వాడు ఆ రకంగా మారతాడు. అది ముందే అంతిమ దినంలో తీర్పులోనే అది ఉంది. మనం చనిపోయినప్పుడే మన పాపపుణ్యాలను లెక్కేసి దేవుడు జడ్జిమెంట్ చేసి పంపిస్తాడు. దేవుని జడ్జిమెంట్ను మనము తీర్పుదినము అంటాము. ఆ తీర్పు చేసినప్పుడే ఏ విషయాల్లో ఎట్లుండాలి, ప్రపంచ విషయాల్లో అని ముందే నిర్ణయం చేసి పంపిస్తాడు. ఆ నిర్ణయం ప్రకారము జీవితమంతా జరుగుతూవుంటుంది దానిని ఎవరూ మార్చేదానికి అవకాశం లేదు. అది చెప్పింది దేవుని నిర్ణయం ప్రకారమే జరిగి తీరాల్సిందే. మనము ఏమి చెప్తామంటే ఇది మంచి పని, ఇది చెడ్డ పని అని చెప్పడం వాస్తవమే కానీ దేశంలో అది ప్రపంచ నీతి అయితుంది కాని జ్ఞానం కాదు. దేవుని జ్ఞానం కాదు. ప్రపంచ నీతి ప్రకారం మనము చెప్పుకుంటాము. కానీ జ్ఞానం ప్రకారం చెప్పుకుంటే మంచి పనులు, చెడ్డ పనులు దేవునికి సంబంధం లేదు. ఒకసారి తీర్పు తీర్చిన తర్వాత అది జరుగుతూ పోతుంటాయి, దేవుడు దానిని జోక్యం చేసుకోడు. ఇది తిను, ఇది తినొద్దు అని దేవుడు చెప్తాడా అంటే ఆయన ముందే ఇవి తిను అని వ్రాసిపెట్టాడు. తినొద్దు అని ఎందుకు చెప్తాడు? నీ కర్మరీత్యా ఏదైతే నువ్వు తినాలో జీవితంలో ఎప్పుడు ఏది అనుభవించాలో, ఎప్పుడు ఏమి మాట్లాడాలో, ఎప్పుడు దేనిని రుచి చూసి ఆ సుఖాన్ని అనుభవించాలో ఆ రకంగా అన్ని విషయాలు క్షణ క్షణం నీకు వ్రాసిపెట్టబడింది. కానీ ఆయన మధ్యలో ఎక్కడా కాని ఇది చేయద్దు అని చెప్పడు. నీ జీవితంలో జరుగుతుంటాయి, అది దేవుడు ముందు వ్రాసిపెట్టినట్టు జరుగుతుంటాయి.


కానీ మనిషి తెలియకుండా ఏమి అనుకుంటున్నాడంటే నేనే ఇవన్నీ చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ మనిషికి ఏమాత్రం సంబంధం


---

లేదు, ముందే నిర్ణయం ప్రకారం అది జరుగుతున్నాయి. చేపించేవాడు దేవుడు చేపిస్తున్నాడు మంచి పనులే చేపిస్తాడు కదా! చెడు పనులు ఎందుకు చేపిస్తాడని అందరూ అనుకోవచ్చు. కానీ మంచి పనులు, చెడు పనులు అన్నిటిని మన చేత చేయించేవాడు దేవుడు. ఖుర్ఆన్ అంతిమ దైవ గ్రంథంలోకి పోతే 50వ సూరాలో, 21వ ఆయత్లో ఏమి చెప్పారంటే నిన్ను తోలేవాడు ఒకడున్నాడు, ఎవరిని నిన్ను ఎట్ల తోలితే అట్ల పోతుంటావు. అంటే తోలేవాడు ఒకడున్నాడు, నువ్వు తోలబడేవానివి అని చెప్పినారు. అయితే తోలబడేవానివి అయినప్పుడు, తోలేవాడు ఒకడున్నాడు అన్నప్పుడు వాడు ఎట్ల తోలితే అట్ల తోలబడుతున్నావు. కానీ నువ్వు స్వయంగా పోలేదు కదా! ఎవరికి కూడా మళ్ళీ నేను చేస్తున్నాను అని నువ్వు ఎందుకు అనుకుంటాన్నావు? ఈ రకంగా లెక్కేసుకుంటే ఏది కూడా సొంతంగా చేయలేదు నువ్వు అని మనకు తెలిసిపోతావుంది. ఆ విధానం మనం జ్ఞాపకం పెట్టుకొని మనం తెలుసుకుంటే అది నీ జీవితంలో సగం జ్ఞానం అయితుంది. ఒక చిన్న విధానం జ్ఞాపకం పెట్టుకుంటే ఎన్నో గ్రంథాలు చదవాల్సిన పని లేదు. కానీ నేను చేయలేదు ఏది, చేపిస్తున్నాడు ఇంకొకడు అని నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటే అది పెద్ద జ్ఞానం అయితుంది. ఈ జ్ఞానం ప్రకారం నువ్వు తెలుసుకుంటూ నీ జీవితంలో జరిగే పనులు నీవు ఏది చేయలేదు అన్న ఉద్దేశ్యం ఎప్పుడైతే ఉంటే, అప్పుడు నీకు అహర్నిశలు నువ్వు జ్ఞానంలో ఉన్నట్టు అయితుంది.


ఇది పెద్ద జ్ఞానము, మనకు తెలియనటువంటి జ్ఞానము. ఇది మనకు చాలా సూక్ష్మంగా ఉన్నా కానీ భగవద్గీతలోనూ, బైబిల్లోనూ మూడు గ్రంథాల్లో ఇదే జ్ఞానం చెప్పబడింది. ఇంకొకటి ఏమి లేదు. ఇది చాలామంది ఏమనుకుంటారు అంటే ప్రపంచ నీతిని జ్ఞానం అనుకుంటారు. కానీ


---

జ్ఞానం వేరు, ప్రపంచ నీతి వేరు. ప్రపంచ నీతికి జ్ఞానానికి సంబంధం ఉండదు. దేవుడెప్పుడు ప్రపంచ నీతిని చెప్పడు. దొంగతనము చేయుట తప్పు అని అంటే అది నీతి అయితుంది. వ్యభిచారం చేయుట తప్పు అంటే అది నీతి అయితుంది. దుర్భాషలు ఆడుట తప్పు అంటే అది నీతి అయితుంది. జ్ఞానం కాదు జ్ఞానంలో నువ్వు దుర్భాషలాడొద్దు ఇంకో పని చేయద్దు అని ఏది కూడ చెప్పలేదు. ఇప్పుడు మనం లెక్కేసుకొని చూస్తే ప్రపంచ విషయాలు కొన్ని, దేవుని విషయాలు కొన్ని అని చెప్తున్నాము కదా! ప్రపంచ విషయాల్లో దేవుడు జోక్యం చేసుకొని ఎక్కడా ఎవరికి ఏమి చెప్పడు. తన జ్ఞానాన్ని తాను చెప్పినాడన్నమాట, ఆయన జ్ఞానాన్ని మనం తెలుసుకోగలిగితే అది నిజమైన జ్ఞానం అయితుంది. ఆయన జ్ఞానంలో ఈ ప్రపంచ విషయాలు ఏవి ఉండవు. ఇప్పుడు చిన్న సమస్య మనం తీసుకుందాం. ఒక ఆహారాన్ని నువ్వు తినకూడదు అని అనుకుంటున్నావు. అంటే ఎందుకు తినకూడదు అనుకుంటున్నావు. ఇది పాపము వచ్చేది దీనిని తింటే నాకు పాపం వస్తుంది అని అనుకుంటున్నావు. పాపం వస్తుంది అంటే తినకూడదు అని ఏమి లేదు కదా! తింటే పాపం వస్తుంది. ఒక నిషేధమైన స్థలం అక్కడికి రాకూడదు మనుషులు అని ఉంటుంది. అంటే మనుషులు ప్రవేశిస్తే శిక్ష వేస్తారు. దాంట్లోకి పోతే మనుషులు దీంట్లోకి ప్రవేశించొద్దండి అని ఉంది. అంటే మనుషులు ప్రవేశించకూడదంటే నిన్ను ప్రవేశించకూడదని చెప్పారా? అందరికి చెప్పినమాట ప్రవేశిస్తే ఏమైతుంది శిక్ష పడుతుంది అంతే కదా! ప్రవేశంచకూడదని ఏమి లేదు శిక్ష అనేది ఒకటుంది. ప్రవేశిస్తే శిక్ష వేస్తాము ఆ శిక్షకు లోనయ్యేది మీకు ఇష్టమైతే రాండి లేకపోతే లేదు, శిక్షను ఎవడూ ఇష్టపడడు. కాబట్టి రావద్దండి అని చెప్పారు.


----

అక్కడ మిలటరీ స్థలం ఉంటుంది. మిలటరీ స్థలంలోకి ఈ సివిల్ జనం రావద్దండి, ప్రజలు రావద్దండి వస్తే ఏమైతుందంటే వాళ్ళు శిక్ష వేస్తారు, దండిస్తారు. అట్లగానే ఒకచోట ఏమి చేశారంటే ఈ ఆహారం తినొద్దండి, ఇది పాపంతో కూడుకొన్నటువంటిది అని చెప్పారు. ఇది పాపంతో కూడుకున్నట్టి ఆహారం అని చెప్పినారు కానీ దానిని తింటే పాపం వస్తుంది. అని చెప్పారు గానీ నువ్వు తినకూడదని ఏమన్నా చెప్పాడా? ఎక్కడైనా ఉందా? బాగా గమనిస్తే ఎక్కడా లేదు. అది నువ్వు తినకూడదు అని ఏమి లేదు. ఒకవేళ ఇబ్బందిపడిపోయి గత్యంతరం లేని సమయంలో, నువ్వు దానిని తింటే ఏ ఉద్దేశ్యం లేకుండా, తినాలన్న ఉద్దేశ్యం లేకుండా, నేను అనే భావం లేకుండా తిన్నా గానీ దేవుడు దానిని క్షమిస్తాడు అని ఉంది. తరువాత అప్పుడు తినకూడదా అన్నప్పుడు నువ్వెట్ల తింటావు నీ ఇష్టమే కదా! అంటే నీ ఇష్టం పని చేయదు. నీ ఇష్టం పని చేయకుండా ఒకవేళ తిన్నా అది పాపం వచ్చేటటువంటి సందర్భం. ఆ పాపం నుండి తప్పించుకోవాలంటే నువ్వు దేవుని క్షమాపణ కావాలి, నీకు దేవుడు క్షమించాలి, దేవుడు ఆ పాపాన్ని క్షమించాలంటే, నేను ఈ పని చేయలేదు, నాకు సంబంధం లేదు, ఇష్టం లేకుండా కూడ అది జరిగింది. ఉద్దేశ్య పూర్వకంగా ఈ పని చేయలేదు అనే భావం ఉంటే, నీకు అందులో ఉండేటటువంటి పాపం నీకు అంటదు అని చెప్పారు. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఒకమాట ఏమి చెప్పారంటే “యస్య నాహంకృతో భావో బుద్ధి ర్యస్య నలిప్యతే!” అనే శ్లోకంలో "ఎవని భావంలో అహంకారం లేదో, ఎవని బుద్ధికి ఆ ఫలితం మీద బుద్ధి పట్టుపడదో, వాడు దేశంలో ఉండే వాళ్ళందరిని చంపినా, వాడు హంతకుడు కాదు, హత్యా పాపం వాన్ని అంటదు” అని చెప్పినాడు. విచిత్రంగా ఉంటుంది. ఒకన్ని చంపినా కూడ హంతకుడు కాదు, హత్య పాపం వీనిని అంటదు అంటే వాని భావములో


---

అహంకారము లేదు. నేను అనే భావం లేకుండా వాడు చేశాడు, ఈ పని ఎవరు చేశారు తరువాత అంటే, నీ శరీరంలో ఉండే దేవుడే చేశాడు. నువ్వు జీవునిగా చేయలేదు, ఇద్దరుండారు అంటే శరీరంలో ఇద్దరున్నారు క్షరుడు, అక్షరుడు అనే వాళ్ళు. నువ్వు ఏదీ చేయకుండా నువ్వు ఉన్నావు చేసేవాడు ఒకడున్నాడు.


ఖురాన్లో 6వ సురా 102వ ఆయత్లో ఏమి చెప్పారంటే దేవుడు కార్యకర్తగా ఉన్నాడు. నువ్వు ఏ దేవున్ని అయితే ఆరాధిస్తున్నావో ఆ దేవుడు నీకు అధిపతిగా ఉన్నాడు. కార్యకర్తగా ఉన్నాడు, ఆయనే పనులు చేసి పెట్టేవాడుగా ఉన్నాడు, ఏమి పనులు చేస్తున్నాడు? జరిగే పనులన్ని చేస్తున్నాడు. దొంగతనం చేశారనుకో ఎవరు చేశారు, ఆ దొంగతనం ఆయనే చేశాడు, నువ్వు చేయలేదు. నేను చేసినా అనుకున్నాము అనుకోండి, అది దేవుని సీటు నువ్వు తీసుకున్నట్టు అవుతుంది. దేవుని పని నువ్వు చేసినట్టు అవుతుంది. కాబట్టి దేవుడు చేసిన పని, నేను చేసిన అని చెప్పుకోవడం పెద్ద తప్పు అయితుంది. దానికి శిక్ష పడుతుంది. అదే నీకు పెద్ద పాపము అని చెప్పాము. అందువలన ఈ రకంగా మనం ఏమి చెప్పినామంటే భగవద్గీతలోకానీ, బైబిల్ గానీ, ఖురాన్లో గానీ ఒకే జ్ఞానం చెప్పారు. నేను అయితే ఇది చేయద్దు అని చెప్పిన పనులు నువ్వు చేస్తే పాపం వస్తుంది. ఇవి పుణ్యం పనులు, ఇవి పాపం పనులు చేయవద్దండి అనవసరంగా శిక్షలు అనుభవిస్తారు అని దేవుడు చెప్పడం జరిగింది. మనం ఈ రకంగా చెప్పుకుంటే దేవుడనేవాడు మన శరీరంలో ఉండి మనల్ని ఆడిస్తున్నాడు అని జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఈ జ్ఞాపకాన్ని పెట్టుకుంటే ఏ పని నీకు సంబంధం లేదనే ధ్యాస నీకు ఉంటుంది.

అంటే

చేస్తావుండి నేను చేయలేదని ఎట్ల అనుకోవాలి అని అంటే ఎవరేమి చేస్తారు.


---

దానికి నేను చేస్తున్నాను కదా! అంటే నువ్వు ఎంతటోనివి చెప్పు, ఒకప్పుడు నీ చెయ్యి నువ్వు ఎత్తలేవు. నీ చెయ్యి కదా అంటే నా చాతకాలేదు నా చెయ్యి చచ్చుపడిపోయింది అంటావు. తరువాత ఎట్ల చచ్చుపడిపోయింది నీ చెయ్యే కదా, అది నీ కాలు నేను నడచలేను అంటావు. ఎట్ల అయింది అది తరువాత, నీ చేయి నువ్వు ఎత్తలేకుండా ఉన్నప్పుడు, నువ్వు సరిగా నీ నోరు మాట్లాడనప్పుడు, నీ శరీరం నీ మాట విననప్పుడు అది నీ శరీరమే కదా! తరువాత నీ మాట ఎందుకు వినకుండా అయిపోయింది. అది లోపల ఇంకొకడుండి దానిని ఆడిస్తున్నాడు, వాడు ఆడిస్తే నవ్వు ఆడుతున్నావు. నువ్వు పొరపాటుగా వాని విషయం నీకు తెలియక నువ్వే ఆడుతున్నా అంటున్నావు. వాడు ఉండాడు అనే జ్ఞాపకం నీకు లేదు ఆ జ్ఞాపకాన్ని పెట్టుకుంటే ఏమైతుంది, ఇంకొకడు ఉన్నాడు నాకు పెద్ద అనే ధ్యాస వస్తుంది. నీకు ఆ ధ్యాస వచ్చినప్పుడు ఏమైతుంది నీ జీవితములో ఏ పనులు చేసినా గాని, అది నీకు సంబంధం లేని పనిగా ఉంటుంది. అందుకే బైబిల్లో దేవుడు ఒకమాట చెప్పాడు “నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ తండ్రే మాట్లాడుతున్నాడు నువ్వు కాదు” అని అంటే నీ శరీరంలో ఉండే దేవుడే మాట్లాడుతున్నాడు కానీ నువ్వు కాదని చెప్పినారు. మనం ఏమి అనుకుంటున్నాము ప్రతిమాట మనమే మాట్లాడుతున్నాము అనుకుంటున్నాము అది పెద్ద పొరపాటు. ఈ విధంగా మనమేమి చేస్తున్నామంటే 'నేను' అనే భావంతో ప్రతి మనిషి చలిస్తున్నాడు.


ఆ 'నేను' అనే భావం తీసేసినప్పుడు మతము లేదు, మనిషి లేడు అంతా ఒకే భావం అయిపోతుంది. అంతా దేవుని మయమే, అదంతా దేవుని ఆట అయిపోతుంది. ఆ రకంగా మీరు తెలుసుకోగలిగితే ఇది సంపూర్ణ జ్ఞానం అయితుంది. ఈ రోజు మనం ఇంతటితోనే ముగిస్తాము.


----

నాకు ఆరోగ్యం బాగాలేదు, అయినా

మీకు ప్రతినెల గ్రంథాన్ని

అందిస్తున్నాము. రేపు నెల మీకు పౌర్ణమి లేదు అంటే పౌర్ణమికంటే ముందు పౌర్ణమి 15వ తేది అయితాది బహుశ 5వ తేదీనే మీకు ఆ పౌర్ణాన్ని సెట్ చేసినాము, అంటే మీటింగ్ ఇక్కడుంటుంది. పుట్టినరోజు పండుగకు అని అందరూ 5వ తేదీన వస్తారు. కాబట్టి తరువాత పౌర్ణానికి ఎవరూ రావాల్సిన పని లేదు. ఆ పౌర్ణమి మీటింగ్ను ఏప్రిల్ 5వ తేదీకే మార్చుకుంటున్నాము. మీరు అప్పుడు ఏప్రిల్ 5వ తేదీకి మీకు ఇక్కడికి రావచ్చు, పౌర్ణానికి రాకున్నా ఫరవాలేదు. అప్పుడు ఏమి పౌర్ణమి ఇక్కడుండదు. ఇప్పుడు ఈ విషయాన్ని మీకు అంటే మతసామరస్యాన్ని గురించి చెప్పుచూ, మన శరీరంలోనే దేవుడున్నాడు. నువ్వు అనేది ఏమి లేనే లేవు, నువ్వుంటే కదా! నీకు మతముండేది. నువ్వే లేవు అసలుకు అది జ్ఞాపకం తెచ్చుకోండి అని చెప్పుచూ ఇంతటితో ఈ సమావేశాన్ని

ముగిస్తున్నాము.

తేది : 23-06-2013

ఇప్పుడు మనము ఒక క్రొత్త విషయాన్ని తెలుసుకోవాలను కుంటున్నాము. ప్రతి మీటింగ్లోనూ అట్లే క్రొత్త విషయాన్ని చెప్పు కుంటున్నాము కాబట్టి మీరు శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వినండి చెప్పడం మావంతు కాబట్టి మీరు శ్రద్ధగా వినండి. ఇప్పుడు మేము ప్రస్తుతం ఒక గ్రంథము వ్రాస్తూ ఉన్నాము “హేతువాదము-ప్రతివాదము” అని ఆ హేతువాదము అనే గ్రంథము 300 పేజీలు అయింది. కొంత 400 గానీ


---


500 గానీ చేసి కృష్ణాష్టమికి విడుదల చేయాలనుకుంటున్నాము. ఆ గ్రంథములో వ్రాసినటువంటి ఒక భాగాన్ని మీకు చెప్పదలచుకున్నాను. ముందు హేతవాదం అని అంటే “హేతువు” అంటే కారణము అని అర్థము. కారణాన్ని అడిగే దానిని హేతువాదము అంటాము. ఏ దానికైన ఒక కారణం అడిగి తెలుసుకుంటే అది హేతువాదము. ఒక వస్తువు ఇట్లు ఉంది అంటే అది ఎందుకు ఉంది ఇట్ల అని ఒక ప్రశ్న వేసుకోవడం అంతా హేతువాదము. ఆ ప్రశ్నవేసి అడగడమే హేతువాదము. అది తరువాత జవాబు అప్పుడు దొరకవచ్చు, దొరకకుండ పోవచ్చు తరువాత దొరకవచ్చు, ఎప్పుడైన దొరకవచ్చు. కానీ ముందు అది ఉండాలి మీలో, హేతువాదము అందరిలో ఉందా! ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంటుంది. కొంతమందిలో ఎక్కువ కొంతమందిలో తక్కువ ఉంటుంది. ఈ హేతువాదము ఎప్పటి నుండి మొదలు అవుతుంది మనిషిలో అంటే చిన్న పిల్లప్పటి నుండి మొదలు అవుతుంది. అంటే కొద్ది కొద్దిగా బుద్ధి పెరిగినప్పటి నుండి చిన్న వయస్సులో నుంచే మొదవుతుంది.


ఒక వస్తువును చూస్తే దాని విషయము తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. దానిని మనం అపుడు మాటలు వచ్చేటపుడు ఏమి చేస్తాము అంటే పెద్దవాళ్ళని అడుగుతాము. ఇది ఎట్లా అని వాళ్ళు వీలైతే చెప్పుతారు లేకపోతే లేదనుకోండి. అడగడం వాళ్ళవంతుగా ఉంటుంది. అది దానిని మనము అప్పుడు మనకు తెలియదుగానీ అది ఏమి అని ప్రశ్నించడమే హేతువాదము అని అంటాము. ఒక విషయం సంపూర్ణంగా తెలియనపుడు దాని గురించి సంపూర్ణముగా అడిగితే దాని కారణాన్ని గురించి, దాని యొక్క వివరము గురించి అడగడమే హేతువాదము. అది మనకు చిన్నప్పటినుంచే అలవాటై ఉంటుంది. కొంతమందికి చిన్నప్పటి నుండి


----

బాగా తీక్షణంగా ప్రతి దానిని తెలుసుకోవాలి అని అలవాటు కొంతమందికి ఉంటుంది. కొంతమందికి అలవాటు ఉండదు. ఏదో కొన్ని వాటి మీద మాత్రం ఆసక్తి వుంటుంది. మిగతా వాటిమీద ఊరికే మబ్బుగా ఉంటారు. పెద్దగా చురుకుదనంగా ఉండరు. అట్ల కొంతమంది ఏమి చేస్తారు అంటే హేతువాద దృష్టి కొంతమందిలో నూటికి 90% ఉంటుంది. 100కి 60% ఉంటుంది, 100కి 30% ఉంటుంది. అంటే ఎంత శాతము అయినా ఉండవచ్చు. 10% వరకు కానీ అంతో ఇంతో ఉండే ఉంటుంది. 10% అయిన ఉంటుంది చివరకు అంటే 10% ఉండేవాడు ఏమి చేస్తాడు అంటే పూర్తి విషయాలు తెలుసుకోలేడు. వానికి నిదానంగా తెలుస్తాయి ప్రపంచ విషయాలు, అంటే కొన్ని విషయాలు లేక చురుకుదనంగా ఉండే వానికి ప్రతి విషయము బాగా జ్ఞాపకం పెట్టుకొంటాడు. ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుంటుంటాడు. తలలో (బుర్రలో) జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఒక విషయాన్ని అడిగినాడు అంటే దానిని జ్ఞాపకం పెట్టుకొనేదానికే అడుగుతాడు. అడిగి తెలుసుకుంటున్నాడంటే ఆసక్తి ఉన్నట్లే కదా! అది. ఆసక్తి ఉంది కాబట్టి ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా తలలో పెట్టుకొంటాడు. అందుకే చాలా విషయాలు ఎవరికి తెలుస్తాయి అంటే హేతువాదం బాగా ఉండేవాళ్ళకి చాలా విషయాలు తెలియబడుతాయి. హేతువాదం లేనటువంటివాళ్ళకు సరిగా తెలియబడవు.


ఇప్పుడు ప్రపంచ విషయాలు, పరమాత్మ విషయాలు అని రెండు రకాలుగా ఉన్నాయి. మనకు విషయాలన్ని ఈ రెండు రకాల విషయాలలోను దేని మీద ఎక్కువ ఆసక్తి ఉంటే దానిమీద ఎక్కువ ప్రశ్నలు వస్తూంటాయి. మనిషి పుట్టుకలోనే ప్రపంచ విషయాల మీదనే ఎక్కువ ఆసక్తి వుంటుంది. కొంతమంది డబ్బు అంటే దానిమీద మంచి మంచి ప్రశ్నలు వేసుకుంటారు.


---

దానిని ఆసక్తిగా అడుగుతుంటారు. కొంతమంది బంగారు అంటే ఎక్కువ ఆసక్తిగా అడుగుతుంటారు. కొంతమంది జ్ఞాన విషయాలు అంటే బాగా అడుగుతుంటారు. మిగతా విషయాల మీద శ్రద్ధ ఉండదు. కొంతమంది పోట్లాడేటివి బాంబులు వేసుకుంటారంటే ఎట్ల అది, ఎట్లా ఇది ఎట్ల ఎట్ల వేసిరి బాంబులు, ఏమి కథ ఇవన్నీ ఎట్ల తయారు చేస్తారు, ఏమి కథ దాని మీద ఆసక్తిగా అడుగుతారు. ఈ రకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం మీద ఆసక్తి ఉంటుంది. అంటే ఏ దాని మీద అయినగానీ దానిని హేతువాదమే అంటాము. కానీ మనకు ఏది ముఖ్యము, జీవితంలో అంటే అన్నిటికంటే ముఖ్యము, దేవుని మీద ఆసక్తి కల్గి ఉండడమే ముఖ్యము. కృష్ణుడు భగవద్గీత చెప్పేటపుడు అర్జునుడు కొన్ని ప్రశ్నలు అడిగినాడు. దానిని మనము ఏమంటాము అంటే ప్రశ్నించవలసిన ప్రశ్నలు, అవి తెలుసుకోవాల్సిన ప్రశ్నలు కాబట్టి హేతుబద్ధమైన ప్రశ్నలు అని అంటాము. నడిమధ్య మొండము మాత్రము అడుగుతారన్న మాట. అది తల ఉండదు దానికి తోకవుండదు మధ్యలో దాని గురించి అడుగుతారు. నీవు దేని గురించి అడుగుతున్నావు దానిని చెప్పేవానికి కూడా అర్థముకాదు అన్నమాట. వాడు అడిగేది ఎట్ల అడుగుతాడంటే దానికి తల ఉండదు, అంటే తోకవుండదు. వాడు దేనిని గురించి అడుగుతున్నాడో మనకు అర్థం కాదు, జవాబు చెప్పు అంటాడు. అపుడు ఎట్ల చెప్పాలి. ఏదని అది. అందువలన అలాంటి ప్రశ్నలను మనము హేతువాదము అనకూడదు. సంపూర్ణమైనటువంటి ప్రశ్న ఏదైతే ఉందో దానిని హేతువాదం అంటారు. కొంతమంది చొప్పదంటు ప్రశ్నలు అంటారు. చొప్పదంటు ప్రశ్నలు అడగకూడదు అని చొప్పదంటు ప్రశ్నలు అనేటివి హేతువాదము కాదు అని అది ఎందుకు వచ్చింది పేరు అంటే,

కొన్ని తల తోక లేకుండా న

చొప్పదండు ప్రశ్న అని అది తల తోక లేని ప్రశ్న మాదిరి ఉంటుంది.


---

దంటు పొడువుగా ఉంది దూడ చిన్నగావుంది ఇంత పొడవుది దాంట్లోకి ఎట్ల పోయింది. ఈ ప్రక్క తింటే ఆ ప్రక్క ఎందుకు రాలేదు అని అడిగినాడంట ఒకడు. చూడు ఎట్లుందో అది ఉండేది మూరడే కదా దూడ, ఇది బారెడు కదా! అయితే అంత కనపరాకుండా ఎట్లపోయింది అని అడిగినాడంట. అంటే ఇట్ల ప్రశ్నలు అన్నమాట. నములుతాంది చూస్తే నీకు అర్థమయితాది. అడగవలసిన పనిలేదు. అది మడతపడిపోతావుంది అని తెలుస్తుంది. ముక్కలు ముక్కలు అయిపోతావుంది అని తెలుస్తుంది చూస్తానే. అనవసరంగా అడిగే ప్రశ్న అంటారు దానిని, అది హేతువాదానికి ఏమని జ్ఞాన విషయాలలో ప్రశ్న వేయండి అని చెప్పితే అది హేతుబద్దంగా ఉండదు అన్నమాట. అనవసరమైన ప్రశ్నగా ఉంటుంది. ఏమి అడుగుతారంటే ఎట్లాంటిది అంటే అది కూడా తల తోకలేని ప్రశ్న ఎట్లు ఉంటుంది అంటే మనము దేని నుంచి పుట్టినాము అంటే కర్మ వలన పుట్టినాము. కర్మ అనేది ఎక్కడి నుండి వచ్చింది అంటే మనం చేసుకుంటే వచ్చింది. మొట్ట మొదట లేదు కదా మనకు కర్మ. మొట్ట మొదట లేదు నీకు కర్మ. అయితే ఎందుకు పుట్టినాము. నీవు పుట్టలేదు అపుడు దేవుడు పుట్టించినాడు. ఇప్పుడు నువ్వే పుడుతున్నావు. అపుడు దేవుడు ఎందుకు పుట్టించినాడు. దేవున్ని అడుగుపో. అపుడు దేవుడు ఎందుకు పుట్టించినాడు అంటే ఎవరి ప్రశ్న అది దేవున్ని అడగవలసిన ప్రశ్న అది. నన్ను అడగవలసిన ప్రశ్న కాదు. ఇప్పుడు మనకు ఎంతవరకు సమాధానాలు తెలుసు.


నీవు ఎందుకు పుట్టినావు అంటే కర్మవలన పుట్టినావు. కర్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే, నీవు చేసుకున్న దానివల్ల వచ్చింది. అంటే ఉండాది చేసుకున్నాము. మొట్టమొదట మనకు కర్మ లేదు కదా! అంటే మొట్ట మొదట కర్మలేదు. మొట్టమొదట ఈ జ్ఞానమంతా తెలుసుకొని అర్థము చేసుకుంటే


---

అది అర్థమవుతుంది. అట్ల లేకుండా మొదట కర్మలేదు కదా! మొట్టమొదట మనము పుట్టినపుడు కర్మే లేదు కదా! అపుడు ఎట్లా కర్మ వచ్చింది అంటే అప్పుడు నీకు లేదు కర్మే లేదు. అయితే ఎందుకు పుట్టినావు. రూలు ప్రకారం పుట్టకూడదు కదా! అంటే రూలు ప్రకారం నీవు పుట్టకూడదు. కానీ దేవుడు పుట్టించినాడు. ఎవరు దేవుడు ఎందుకు పుట్టించినాడంటే ఎవర్ని అడుగుతావు, నీవు నన్ను అడిగితే నడిమధ్య వానికి ఏమి జవాబు చెప్పాలి. నీవు పోయి దేవున్ని అడుగుపో అని చెప్పాలి. మనం చెప్పే ప్రశ్న. జవాబు కాదు అది ఇట్ల ఏమి చేస్తారు అంటే అనవసరమైన ప్రశ్నలు వేసి కాలయాపన చేస్తారు. అట్లుకాకుండా నీకు ఎంత సమాధానము అవసరమో అంతే అడగాలి. అది అనవసరమైన ప్రశ్న అవుతుంది. నువ్వు ఇవన్నీ తెలుసుకో, కర్మ అంటే తెలియదు, జన్మ అంటే తెలియదు. కర్మ ఏ రకంగా జన్మలా మారుతుంది అనేది తెలియదు. ఇవన్నీ తెలియకముందే నీవు టకటక ముందుకు పోయి అది ఎట్ల, ఇది ఎట్ల అంటే ఎట్లయితాది చెప్పు. ఆ విధంగా మన జ్ఞాన విషయాలలో కూడా పద్ధతిగా అడిగి తెలుసుకొనే విధానం ఉంది. విధానాన్నే అనుసరిస్తే దేవుడు మీకు జ్ఞానం తెలియ జేస్తాడు. లేకపోతే తెలియజేయడు అర్థమయిందా! అది నీకు ఇంకొక రకంగా అర్థమయితాది. ఒకవేళ నీకు జవాబు వచ్చినాగానీ, ఈ జవాబుగానీ నీకు అర్థము కాదు. ఇది చెప్పినా వివరము అర్థము కాదు. అది ఇంకొక రకంగా అర్థమయిపోయి, నీవు వేరే దారిలోకి వెళ్ళిపోతావు. కాబట్టి నీ ఉద్దేశ్యము మంచిగా ఉండాలి. అడిగే ప్రశ్న సరైనదిగా ఉండాలి. అప్పుడు నీకు దేవుడు అర్థమయ్యేటట్లు చేస్తాడు, లేకపోతే అర్థంకాదు. అంటే ప్రశ్న అనేది మనిషి హక్కు హేతువాదము అనేది మనిషి హక్కు హేతవాదము అంటే ఏదో చెడ్డవాదము కాదు అన్నమాట.


---

ఈ కాలంలో హేతువాదము అనేది ఎట్ల మారిపోయింది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ కనిపించలేదు అది. హేతువాదము పేరు ఉన్నాగానీ అది ప్రస్తుతానికి ఎక్కడా మనుషులలో కనిపించలేదు. అది కనిపించేది ఏ రకంగా అయితే నాస్తికవాదము ఏదైతే ఉందో, అదే హేతువాదంగా పరిగణించబడుతావుంది. హేతువాది అంటే వాడు నాస్తికవాదిగా ఉంటాడు. అడ్డము మాట్లాడుతుంటాడు అన్నమాట. ఏది కాదు ఇదికాదు ఇదిలేదు వాడే నిర్ణయం చేస్తా ఉంటాడు. మూఢంగా మాట్లాడుతుంటాడు, శాస్త్రబద్ధత ఉండదు. హేతువాదం అనే దానికి శాస్త్రబద్ధత ఖచ్చితంగా ఉంటుంది. ఇటువంటిది మనం లెక్క వేసుకొంటే, మనకు శాస్త్రబద్ధంగా మాట్లాడడం, శాస్త్రబద్ధంగా తెలుసుకోవడమే మనకు హేతువాదము. ఇది నాస్తికవాదంగా లెక్కవేసుకోకుండా మనము సరియైన పద్ధతిలో తెలుసుకోవడము హేతువాద పద్ధతి అంటాము. ఇది మనిషికి చిన్నప్పుడే మొదలవుతుంది. అంటే మాకు జ్ఞాపకం ఉన్నట్టు, మా అనుభవంలోని విషయం దాదాపు తొమ్మిది సంవత్సరాల వయస్సులో ఒక ముసలి ఆయనతో కలసి ఒక గుళ్ళోకి పోయి కూర్చున్నాము. ఆ ముసలి ఆయన ఏమి చెప్పినాడు అంటే ఆ ముసలి ఆయనకు ప్రశ్న వేసినాము మనము. ప్రశ్న వేయడము హేతువాదము అని అంటున్నాము కదా! మనము. ఆ గుడిలోకి పోతే అన్ని రకరకాల బొమ్మలు ఉన్నాయి, అది పెద్ద గుడి, తాడిపత్రి దేవస్థానము అంత గుడి అనుకో. అంత పెద్దది కాకుండా అంత గుడి కూర్చోండే దానికి తిరిగే దానికి అంత ఉంది. సరే ఒకచోట కూర్చున్నాము. కూర్చున్న తరువాత ఏదో ఒకటి మాట్లాడాలి. ప్రశ్న వచ్చింది అన్నమాట. ఈ గుళ్ళు ఎందుకు కట్టినారు. దేవున్ని తెలుసుకొనేదానికి. దేవున్ని అని అంటే గుళ్ళోనే దేవుడా, ఎక్కడా తెలుసుకోకూడదా అంటే


---

తెలుసుకోవచ్చు. గుడిలోకి వస్తే దేవుడు జ్ఞాపకం వస్తాడు అనే ఉద్దేశ్యంతో కట్టినారు అని ఆయన చెప్పినాడు. మేము వేసే ప్రశ్న ఇది. ఆయన చెప్పే

జవాబు ఇది.


మా ఊరిలో చిన్న గుడి ఉంది. ఇక్కడ పెద్ద గుడివుంది. చిన్న గుడిలో చిన్న దేవుడు, పెద్ద గుళ్లో పెద్ద దేవుడు ఉంటాడా అని అడిగాము. చిన్నవయస్సులో తెలియదు కదా! మనకు. అంటే చిన్న గుడి తెలుసు, పెద్దగుడి తెలుసు. అది పెద్ద గుడి, మేము చూసినేది చిన్నగుడే. వాళ్ళు ఏమన్నారు అంటే చిన్న గుడి, పెద్ద గుడి ఏమి లేదు, ఏ గుళ్ళో అయినా దేవుడు ఒక్కడే. దేవుడు అనేవాడు ఒకడేవుంటాడుగానీ చిన్నగుడికి, పెద్దగుడికి పెద్ద చిన్న అని ఏమి ఉండదు అని చెప్పినారు. సరే మరలా ఇంకో ప్రశ్న వేసినాము అంటే, మా ఊరిలో నేను చూసినట్టు, నాకు తెలిసినట్లు ఆ చిన్న గుడికిపోయి మ్రొక్కినాము అక్కడ ఒక దేవత ఉంది అక్కడ గాజులు, గీజులు అన్ని పెట్టినారు. ఇక్కడ అయితే దేవత ఉంది, ఇక్కడ మగ దేవుడు ఉన్నాడు. దేవుడు ఆడనా? మగనా? అని అడిగినాము. ఆడగా ఉంటాడా, మగగా ఉంటాడా అని, అంటే ఆయన తికమకపడి తొందరగా చెప్పాలంటే కష్టము కదా! ఆయన ఏమి చెప్పాడంటే దేవుడు ఆడకాదు, మగకాదు రెండూ కాదు. ఇవి మనము ఊరికే పెట్టుకున్నేటివే. ఇవి ఎందుకంటే అట్లా గుర్తు పెట్టినేది అంటే ఒక మగదేవునికి ఒక ఆడ దేవత ఉంటాడని ఉద్దేశ్యంతో పెట్టినారు. మనం మనుషులకు ఉన్నట్లు అట్ల పెట్టినారు. మళ్ళీ వీళ్ళలో ఎవరు దేవుడు అని అడిగినాము. అంటే చిన్న చిన్న ప్రశ్నలు చూడండి. ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి. వీళ్ళుకాదు, వాళ్ళుకాదు వాళ్ళుకాదు అని అంటారు. మరి నిజమైన దేవుడు ఎవరు? అని అడిగాము. నిజమైన దేవుడు అని కొంత ఆలోచన


---

చేసి ఏమి చెప్పినాడంటే నిజమైన దేవుడు కనపరాడు అని చెప్పినాడు. కనిపిస్తాడంటే అడుగుతాము కదా! మరొక ప్రశ్న మనము. అది ఎట్లా అని కాబట్టి వీని పీడంతా ఎందుకని ఆయన ఏమి చేసినాడంటే, కనపరాడు అని చెప్పినాడు ఆయన. మళ్ళీ కనపరాకపోతే వీళ్ళందరిని ఎందుకు పెట్టినారు. అంటే ఆయన గుర్తు కోసము అట్ల పెట్టినారు అని అన్నాడు. సరే అది నిజమే అది చెప్పడమేమో మళ్ళీ కనపరాకపోతే మనము ఎట్ల చూసేది అని అడిగినాము. ఎందుకు కనపరాడు అని అడిగినాము. ఎందుకు కనపరాడు ఎట్లా చూసేది మనము. కనపరాడు అనేదానికి ఒక కారణం ఉండాలి కదా! ఎందుకు కనపరాడు అని ప్రశ్న వేశాము హేతుబద్ధంగా, ఎందుకంటే ఆయన ఏమి చెప్పినాడు అంటే అర్థమయ్యే దానికి, మాయ అనే తెర అడ్డము ఉంది.


దేవుడు ఉన్నాడు, మనకు దేవుడు లేడని కాదు దేవుడు ఉన్నాడు. కానీ కనిపించడు. ఎందుకు కనిపించలేదంటే మాయ అనేది గుడ్డ అడ్డం ఉంది, అది తీసివేస్తే కనిపిస్తాడు అని చెప్పినాడు. దేవుడు కనిపిస్తాడు. మాయ అనే తెర అడ్డముంది. అపుడు అంతవరకు బాగానే ఉంది. తరువాత అయితే ప్రశ్న వేయాలి కదా! ఆయన ఏమి చెప్పినాడంటే మళ్ళీ మనము ఏమి అడిగినామంటే ఈ మాయ అనే గుడ్డ కనిపిస్తే కదా! తీసేసేది దేవుడు అంటే కనపడలేదు అనుకో, ఇది అడ్డము ఉంది దేవునికి ముందు ఇదే కనపరాలేదు. దాన్ని ఎట్ల తీసేది అని అడిగినాము. ఆయప్ప చెప్పలేక ఇప్పుడు కాదుకానీ ఇంక కొన్ని రోజులు పోయిన తరువాత అర్థమయితాది నీకు అన్నాడు. అంటే మేము ఏమనుకొన్నామంటే ఇప్పుడు ఈ వయస్సులో కనపరాడేమో పెద్ద వయస్సు వచ్చిన తరువాత గుడ్డ కనిపిస్తాదేమో అనుకున్నాము. కొంత కాలము పెద్ద వయస్సు వచ్చింది కదా! అది గుడ్డ


---

కనపరాలేదు, దేవుడు కనపరాలేదు. ఇప్పుడు మళ్ళీ అంటే ఆయన ఏదో ఒకటి చెప్పాలంటే చెప్పినాడు. వాస్తవమే మాయ కనిపిచ్చేది కాదు, దేవుడు కనిపిచ్చేవాడు కాదు. మాయ కూడ కనిపించదు. దేవుడు కూడ కనిపించడు. మనకు ఇప్పుడు అర్థమయింది. సరే మనము ఈ విధంగా హేతువాద దృష్టితో మనము ప్రశ్నలు వేయగా, అది ఏమి అని తెలుసుకొనే ఉద్దేశ్యము ఉంది కాబట్టి, తరువాత అప్పుడు ఆ ప్రశ్నకు జవాబు రాలేదు. కాబట్టి ఎప్పుడైనా ఆ ప్రశ్నను మనము వెతుకుతాం కదా! ఆ ప్రశ్న వెతుకుతూ వచ్చిందానివలన, మనము ఏమి చేశామంటే వెతుకుతూ వెతుకుతూ అన్వేషణ చేస్తే ఏమయింది చివరకు, మనము ఈ రోజు కొంతవరకు ముందుకు పోయి, అంతో ఇంతో తెలుసుకోగల్గినాము. తెలుసుకున్న దానినే మీతో మేము పంచుకుంటున్నాము. మీకు కూడా కొంత అర్థమవుతుంది. అంతే

కదా!


ఈ రకంగా మనము జ్ఞానాన్ని తెలుసుకొనేదానికి మొదలు పెట్టినాము దానిని అన్వేషణ అంటాము. ఒక్కచోట మీ ప్రశ్నకు జవాబు దొరకకపోతే వెతుకుతావు. ఇంకొక చోట, ఇంకొక చోట వెతకడమే అన్వేషణ అంటాము. నీకు సత్యం దొరికేంతవరకు, జవాబు దొరికేంత వరకు అన్వేషణ చేస్తావు, దానినే సత్యాన్వేషణ అంటాము. నీవు అన్వేషణ చేసిన తరువాత ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది. 'వెదికే వానికి దొరకబడును' అని ఒక శాసనం ఉంది. నువ్వు వెదికినావు అనుకో అది తప్పనిసరిగా దొరుకుతుంది. అడిగినావు అనుకో తప్పనిసరిగా చెప్పబడుతుంది. అప్పుడు కాకపోతే తరువాత అయినా చెప్పబడుతుంది. కాబట్టి ఎక్కడా నిరాశపరిచే జ్ఞానం ఈ జ్ఞానంలో లేదు. కాబట్టి అందరికి ఈ విషయం అర్థము కావాలంటే మిమ్మల్ని ప్రశ్నించుకుంటూ రావాలి. దేవుని విషయం అర్థం కావాలంటే


---

ప్రతిదానిని మీరు ప్రశ్నించుకుంటూ వస్తే, అపుడు మీకు జవాబు దొరుకుతుంది. ఆ జవాబు దొరకకపోతే ఇంకోసారి ఇంకోసారి ప్రయత్నం చేయాలి ఎక్కడో ఒకచోట దొరుకుతుంది. దొరికేంత వరకు దానిని వదలిపెట్టకూడదు. అప్పుడు సంపూర్ణమైనటువంటి జవాబు తప్పనిసరిగా దొరుకుతుంది. అది ఈ రోజు దొరకవచ్చు, రేపు దొరకవచ్చు, ఎల్లుండి దొరకవచ్చు. కొంతకాలానికి తరువాత అయిన దొరకవచ్చు, దొరకడం మాత్రం వాస్తవం. అర్థమయిందా! ఎప్పుడైతే జ్ఞానం కోసం అన్వేషిస్తున్నాడో వానికి నేను ఎదురాడని జ్ఞానం అందిస్తాను అని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే జ్ఞానంకోసం అన్వేషణ చేస్తున్నాడో వానికోసము నేను ఎదురాడని జ్ఞానాన్ని అందిస్తానన్నాడు. ఈ రకంగా మనము ప్రశ్నించుకుంటూ పోతే ఎప్పటికైనా సరియైన జవాబు దొరుకుతుంది. అటువంటి ప్రశ్నలతో మనము ఇప్పుడు “హేతువాదము-ప్రతివాదము" అనేటువంటి గ్రంథములో ఒక ప్రశ్న అడిగినాము. ఏమని అడిగినాము అంటే ఇప్పుడు హేతువాదిగా ఉండి అడిగే వాళ్ళు ఎవరు? వ్రాసేవాడు అడగాలి. ప్రతివాదిగా జవాబు చెప్పేవాడు ఎవడు? వ్రాసేవాడు చెప్పాలి. రెండు బాణాలు ఒక ప్రక్క నుంచే రావాలి. అంటే హేతువాదానికి న్యాయం ఎట్ల చేయాలో అట్లే చేయాలి. హేతువాదం ఎట్ల ఉండాలో ప్రశ్న అట్లే అడగాలి. చెప్పేవాన్ని నేను ఆయనేనని సులభంగా అడిగి, సులభంగా జవాబు చెప్పుకోకూడదు అన్నమాట. ప్రశ్న సులభంగా ఉండకూడదు. కష్టంగానే అది ఉండాలి. అటువంటి ప్రశ్నలు హేతువాదమైన ప్రశ్న ఏమని అడిగాము అంటే కర్మసిద్ధాంతాన్ని గురించి అడిగాము.



ఇంతవరకు అన్ని విషయాలు బాగానే చెప్పుకున్నాను. కర్మ సిద్ధాంతములో పెద్ద రహస్యంగా అది మిగిలిపోయినది. ఏమంటే కర్మ అంటే పాపము + పుణ్యము రెండింటిని కలిపి కర్మ అంటున్నాము. దానిని


---

విడదీస్తే రెండు ఉన్నాయి పాపములు వున్నాయి, పుణ్యాలు అందులో ఉన్నాయి. మనము ఏమి చేస్తామంటే పాపము చేసుకొన్నవాడు కష్టాలు అనుభవిస్తాడు, దుఃఖాలు అనుభవిస్తాడు. పుణ్యము చేసుకొన్నవాడు సుఖాలు అనుభవిస్తాడు. సంతోషాన్ని అనుభవిస్తాడు అని మనము చెప్పుకొన్నాము. అంతేకదా! ఇప్పుడు ఆ లెక్కకుపోతే మనము గత జన్మలో చేసుకున్న పాపాలు ఈ జన్మలో అనుభవిస్తున్నాము. గత జన్మలో చేసుకున్న పుణ్యాలు ఈ జన్మలో అనుభవిస్తున్నాము అని చెప్పుకున్నాము. అంటే గత జన్మలోనూ చేసుకున్నటువంటివి, మిగతా వాళ్ళు ఏమి చెప్పుతున్నారంటే ఆ పాపాలన్ని నరకంలో అనుభవించి, పుణ్యాలన్నింటిని స్వర్గలోకంలో అనుభవించి వస్తారు. తరువాత అక్కడి నుంచి వచ్చిన తరువాత జన్మకు వస్తారు అని చెప్పినారు. అన్ని అక్కడనే అయిపోయినాక జన్మ ఎట్ల వస్తుంది అంటే మళ్ళీ బ్రహ్మ దేవుని దగ్గరకు క్రొత్తగా వ్రాయించు కొని వస్తారు అని ఒక పురాణములో చెప్పినారు. మళ్ళీ అక్కడ ఏమని ప్రశ్న వస్తాది అంటే మళ్ళీ బ్రహ్మదేవుడు ఏదో వ్రాసి పంపిచ్చేవాడు అక్కడ పుట్టుపో, ఇక్కడ పుట్టుపో అందరికి ఒకటే వ్రాత వ్రాయకూడదా మరీ ఒకనికి బీదవానిగా, ఒకనికి ధనవంతునిగా ఎందుకు వ్రాయాలి అని ప్రశ్నరావచ్చు. అంతేకదా! ఒకనికి కష్టపడేటట్లు, ఒకడు సుఖపడేటట్లు ఎందుకు వ్రాయవచ్చు, అందరిని ఒకటే రకంగా వ్రాయవచ్చు కదా! ఇవన్నీ ఇంత రామాయణాలు ఎందుకు పెట్టాలి అని అడగవచ్చు. మనము ఏమి అంటే అది ప్రశ్నేకాదు అది జవాబు కాదు సరియైన జవాబు కాదు. ఆ బ్రహ్మదేవుడు ఎవరు లేరు. వ్రాసే వాళ్ళు అంతకులేరు. కానీ ఎవరి పాపము వారు అనుభవించక తప్పదు అని మనము ఏమి చేసినాము అంటే ఆధ్యాత్మికరీత్యా చెప్పుకున్నాము. ఎవడు చేసుకున్న పాపము వాడు అనుభవించాలి. ఇక్కడనే భూమి మీదనే, ఎవడు


---

చేసుకున్న పుణ్యాన్ని వాడే ఇక్కడనే అనుభవించాలి. కాబట్టి మన గత జన్మలో చేసుకొనేటివి ఈ జన్మలో ఆనుభవిస్తున్నాము అని చెప్పుకున్నాము.


గత జన్మలో అప్పుడు ప్రస్తుతానికి చేస్తూవున్నటువంటి పాపాలను ఏమంటాము, పాపాలను, పుణ్యాలను ఏమంటాము మనము అంటే, ఇప్పుడు ప్రస్తుతము చేస్తూ ఉన్నటువంటి దానిని ఆగామిక కర్మ అంటాము. కొత్తగా సంపాదించుకొనే కర్మను ఆగామిక కర్మ అంటాము. కొత్తగా వచ్చేది అది. ముందే ఇది అనుభవించాలి నిర్ణయమై వున్నటువంటి దానిపేరు ప్రారబ్ధకర్మ అని అంటాము. మీ అందరికి కూడా బాగా తెలుసు అది. అనుభవించేదేమో ప్రారబ్ధకర్మ, సంపాదించుకొనేది ఆగామికర్మ. ఇప్పుడు మనము ఏమంటున్నాము అంటే ఏది సంపాదించుకుంటే అది అనుభవిస్తున్నాము. ఏది ఆగామిక కర్మలో సంపాదించుకొన్నది, ప్రారబ్ధ కర్మలో అనుభవిస్తున్నాము. మధ్యలో సంచితము అనే పేరు ఎందుకు వచ్చింది అని ప్రశ్న వేసినాము. హేతువాది ఏమని అడిగినాడంటే అక్కడ ఆగామిక కర్మను సంపాదించుకుంటున్నాడు, మనిషి ప్రారబ్ధకర్మను అనుభవిస్తున్నాడు, ఆగామిక కర్మ పోయిన జన్మలోది, ఈ జన్మలో ప్రారబ్ధకర్మగా వచ్చింది అనుకో. దానిని అనుభవించవచ్చు కదా! అట్లే మళ్ళీ సంచితము అనేది ఏమిటి మధ్యలో అని ప్రశ్న వేసుకోవాల్సిన పని వచ్చింది.


మనము ఏమి చెప్పినాము అంటే ఇంతకు ముందు సంచితము అనేది కర్మ యొక్క కూడలి అని చెప్పాము మనము. కర్మ యొక్క కూడలి అది. ఆగామికము వచ్చి సంచితంలో పడుతుంది. సంచితం నుండి ప్రారబ్ధము వస్తుంది అని చెప్పినాము. అట్ల ఎందుకు దాంట్లో పడడం ఇది ఒక మూట కట్టుకోవడము, దానిలో నుంచి మళ్ళీ తీసుకోవడం ఎందుకు ఎట్ల రికార్డ్ ఉంటుంది కదా! ముందు చేసుకొన్నది ముందు చేసుకున్నట్లు,


---

వెనుకల చేసుకున్నది వెనకల చేసుకున్నట్లు ఉంటుంది కదా! వరుసక్రమేపి అనుభవించుకుంటూ రావాలి అని మీరే చెప్పుతున్నారు కదా! మళ్ళీ రకంగా వరుసక్రమేపి పోయిన జన్మలో చేసుకొన్నటివంటివి వరుసగా ఈ జన్మలో అనుభవించవచ్చు కదా! ఈ జన్మలో చేసుకున్నటివంటి కర్మలు అయితే రేపు జన్మలో ప్రారబ్ధకర్మయై మనము అనుభవించే అవకాశం ఉంది కదా! మధ్యలో సంచితకర్మ అనేది ఎందుకు వచ్చింది అనేటటువంటిది కూడా మనకు ప్రశ్నగా వచ్చింది. ఇప్పుడు దానిని ఇంతవరకు ఎక్కడా ప్రశ్నించుకో లేదు. సంచితకర్మ ఉంది అంటే వింటున్నాము. ప్రారబ్ధకర్మ అంటే వింటున్నాము. ఆగామిక కర్మ అంటే వింటున్నాము. కానీ సంచితకర్మ అనేది వాస్తవమే. ఆగామికకర్మ అనేది వాస్తవమే. ప్రారబ్ధకర్మ అనేది కూడా వాస్తవమే. ఈ ప్రారబ్ధమనేది అనుభవించేది, ఆగామికమనేది అనుభవించేది అయినపుడు ఈ సంచితము అనేది ఏది కాదు కదా! దీనిని చెప్పుకోవాల్సి నటువంటి పని వచ్చింది అని అంటే "జననమరణ సిద్ధాంతం” అను గ్రంథము వ్రాసుకున్నపుడు “నీవు చనిపోయినటువంటి వ్యక్తి మరణం పొందిన తరువాత వెంటనే అదే క్షణములోనే జన్మ పొందడం జరుగుతావుంది' అని చెప్పుకున్నాము. మరణం పొందినట్టి వ్యక్తి అదే క్షణంలోనే జన్మను పొందుతాది అనడం కూడా జరుగుతావుంది అని చెప్పినాము. అంటే అంతవరకు సంపాదించుకొనే కర్మ ఏదైతే ఉందో ఒక్క క్షణములో ప్రారబ్ధంగా మారిపోతావుంది అని చెప్పాము.


ఆ జన్మకు తగినటువంటి కర్మగా రెండవ జన్మలో ఏదైతే అనుభవించాలో ఆ అనుభవానికి తగినటువంటి కర్మను నిర్ణయింపబడుతా వుంది. ఎలా నిర్ణయింపబడుతావుంది అంటే మనకు అర్థమైంది, ఏమని అర్థమయింది. మేము చెప్పేది ఎట్లన్నవున్నా మీకు అర్థము అయింది


---

ఏమంటే, ఇప్పుడు ఆగామిక కర్మలో నుండి కొంత తీసుకొని ప్రారబ్ధకర్మగా నిర్ణయిస్తూ ఉన్నారు అని చాలామంది అర్థము చేసుకున్నారు. ఒకవేళ కొంత అంతో ఇంతో మిగిలితే ప్రక్కన ఎత్తి పెట్టుకొన్నారు అని తెలుసుకున్నారు. ఆ ఎత్తి పెట్టుకొండేది సంచితము అని అనుకున్నాము. ఇప్పుడు సంపాదించుకుంది ఆగామిక కర్మ, అనుభవించేది ప్రారబ్ధకర్మ అయితే మధ్యలో సంచితాన్ని మనము పెట్టుకున్నాము, అది కలయిక అన్నాము. అక్కడనుంచి ఇది వస్తుంది అని చెప్పినాము. అంటే అక్కడి నుంచి తీసుకుంటున్నాము దీనిని అని ఇప్పుడు, సరే ఇదంతా కథ బాగానే ఉంది కానీ ఇక్కడ మనము ఏమి చెప్పుతున్నాము, చనిపోయినటివంటి మరుక్షణమే, మరుక్షణము అంటే వెంటనే అదే క్షణంలోనే మనిషి మళ్ళీ తిరిగి జన్మించడం అవసరం వచ్చింది. ఏమాత్రము ఆలస్యము లేకుండా పుడుతున్నాడు. ఇది రహస్యంలో కెల్ల రహస్యము ఇది మనకు తెలియదు. తెలియకున్నా కూడా జరిగేటువంటి సత్యము ఇది. మళ్ళీ ఈ సత్యం ఉంది కదా! ఎప్పుడైతే మరణించాడో అప్పుడే ఆగామికము ప్రారబ్ధంగా మారుతుంది. అప్పుడు సంచితము నుండి మారుతుంది అని అంటున్నాము మనము. అంటే సంచితము అని పేరు ఎందుకు వచ్చింది అక్కడ. ఆగామిక కర్మ అనేది ఒక జన్మలో చేసుకున్న కర్మ రెండవ జన్మకు ప్రారబ్ధము అయితూవుంటే, ఇప్పుడు సంచితము అవసరం ఏమొచ్చింది. సంచితం అనే పేరు ఎందుకొచ్చింది అక్కడ. దానిని సంచితము అని తీసిప్రక్కన పెడుతాము. అక్కడ దాని అవసరం ఏమి వచ్చిందంటే, దానిని ప్రక్కన తీసిపెట్టి దాని అవసరం లేదు అనుకొంటే, ఇంకో చిక్కువస్తుంది మనకు. దేవుడు ఏమి చేసినాడంటే అది అవసరం అనే ఉద్దేశ్యంతోనే దానిని అక్కడ పెట్టాడు. చూడండి ఎట్ల ఉందో, అంటే మనకు అవసరం లేకున్నాగానీ


---

దాని అవసరము అనే ఉద్దేశ్యంతో పెట్టాడు. అది ఎలా అవసరం అయింది మనకు అని అంటే చేసుకున్న కర్మ చేసుకున్నట్లు అనుభవించకూడదు మనిషి. చేసుకున్న కర్మ చేసుకున్నట్లు అనుభవించకోకుండా మార్పుచెంది ఆ కర్మ అనుభవించాలి.


ఆ రకంగా మార్పుచెందే దానికోసము ఈ సంచితము అనే పదాన్ని అక్కడ పెట్టాల్సి వచ్చింది. అర్థమయింది అంటే ఎలా మార్పు, ఏ మార్పు, మార్పు చెందాల్సి అవసరం ఏమి వచ్చింది అని అంటే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాము. దాని అర్థము చేసుకొనేముందు అది అర్థము కావాలంటే మనము ఒకరోజు శ్రమపడి పనిచేస్తున్నాము. దానికి కావలసిన రెండో రోజుకు కావల్సిన ఆహారాన్ని మనము సంపాదించుకుంటున్నాము. రేపటి వంటకు కావాల్సిన సామాగ్రి ఈ రోజు సమకూర్చుకుంటాము అని అనుకోండి. ఈ రోజు బజారుకి పోయినపుడు కాయగూరలు తెచ్చుకుంటాము. కిరాణ షాపుకి పోయినపుడు పప్పుదినుసులు తెచ్చుకుంటాము. ఇంకొక చోటుకి పోయినపుడు బియ్యము తెచ్చుకుంటాము. ప్రొద్దున్నే 5 గంటలకే పాలు తెచ్చుకుంటాము. ఈ రకంగా ఒక్కొక్క సమయంలో వేరువేరుచోట్ల, వేరువేరు సమయాలలో వేరువేరు వస్తువులు తెచ్చుకుంటున్నాము. అంతేకదా! అన్ని కలిపి వంట వండుకుంటున్నాము. వేరువేరు సమయాలలో వేరువేరు వస్తువులు తెచ్చుకొని, వంటకు ఉపయోగించుకొని మనము తింటున్నాము అనుకో, అపుడు ఏమవుతుంది వంట చేసుకున్నపుడు ఏమవుతుంది. కాయకూరలు మార్కెట్లోకి పోయి టమోట పండ్లు, పచ్చి మిరపకాయలు, ఇంకోటి ఇంకోటి ఇంకో కాయకూరలు రకరకాలు తెచ్చుకున్నాము అనుకోండి. అన్ని కలిపి మనము ఏమి చేస్తాము, కూర చేస్తాము. ఆ కూరలో కారము వేస్తాము, ఉప్పు


---

వేస్తాము, పసుపు వేస్తాము, చింతపండు వేస్తాము రక రకాలు అన్ని రుచి కోసము అన్ని కలుపుకుంటాము.


అన్ని వస్తువులు మనము సంపాదించుకొని బజారు నుంచి తెచ్చుకోనేటివి అవి అన్నీ. అవి ఊరికనే రాలేదు కదా! డబ్బులు పెడితే వచ్చినాయి. ఏదో శ్రమపడితే వచ్చినాయి. నువ్వు శ్రమపడి తెచ్చుకున్నటు వంటి రకరకాల వస్తువులను కలిపి వంట చేసుకుంటే, ఆ వంటలో తినేటపుడు ఇది పసుపు అని ప్రక్కన పెట్టేదానికి కాదు. ఇది ఉప్పు అని ప్రక్కన పెట్టేదానికి కాదు. ఇది కారము అని చేయి పెట్టి చూపేదానికి కాదు. చూడలేదు కదా! చూపలేవు కలిసిపోయింటాయి. అన్ని కలిసిపోయి ఉంటాయి. పప్పు దినుసులు అన్ని అణిగిపోయింటాయి. ఉడికిపోయి మెత్తగా అయిపోయి దాంట్లో మిక్స్ అయిపోయింటాది. కాబట్టి ఇవి పప్పు దినుసులు అని చూపే దానికి కూడా కాదు. మసాలాలు అంతా మిక్స్ అయిపోయింటాయి. వాసన రూపంలో కలిసిపోయింటాయి, మసాలాలను అంతకు చూపించేదానికి కాదు. ఇవన్నీ మనము కలుపుకొని తింటున్నాము. మసాలను తెచ్చుకుంటున్నాము. పప్పుదినుసులు తెచ్చుకుంటున్నాము. కాయగూరలు తెచ్చుకుంటున్నాము అన్ని కలుపుకొని వంట చేసుకొని తింటున్నాము. ఈ రకంగా మనము వంట చేసుకొని తినేటపుడు అన్నీ తింటున్నాము అనుభవిస్తున్నాము కానీ ఇది ఫలానిది అని తెలియదు నీకు.


ఫలానిది అని తెలియకుండా ఆ రుచిని అనుభవిస్తున్నావు. కారము అనుభవిస్తున్నావు. కారము ఉందికానీ మిరపకాయ తెలియదు కనపడవు దాంట్లో ఉప్పు ఉంది, పులుపు ఉంది అన్నీ ఉన్నాయి. కాని అవి కనపరాకుండా నీవు అనుభవిస్తున్నావు. నువ్వు ఉప్పు ఒకసారే కదా!


---

కొనుకొచ్చుకొనేది. ఒకేసారే కదా! కొనుకొచ్చుకొనేది. మిరపకాయలు ఒకచోట కొనుకొచ్చుకొన్నావు. మిరపకాయలు ముందుగా కొన్ని తెచ్చు కున్నావు. ముందు మిరపకాయలు తింటావా అన్నీ. ఎవడు చేసుకున్నది వాడు అనుభవించాలంటే ఎవడు చేసుకున్నది వాడు అనుభవిస్తున్నాడు. మిరపకాయలు తింటున్నాడు. ఎవడు కొనుకొచ్చుకొనేది వాడు తినాలి అంతేకదా! ఎవడు కొనుకొచ్చుకొనేది వాడు తింటున్నాడు. మనము ఎట్ల తింటున్నాము, వండుకొని తింటున్నాము. నీవు మిరపకాయలు తెచ్చుకొని, మిరపకాయలు, మిరపకాయలు తినలేదు ఉప్పు తెచ్చుకొని ఉప్పు ఉప్పు తినలేదు. మసాలలు తెచ్చుకొని మసాల మసాల తినలేదు. వంట చేసుకొని రకరకాలు తింటున్నావు, నీకు అవి కనిపించలేదు.


ఆ రకంగానే నీవు చేసుకున్న పాపపుణ్యాలను నువ్వు అనుభవించక తప్పదు. కానీ అవి మిక్స్ అయి నువ్వు అనుభవిస్తున్నావు. అవి కలసి పోయినాయి. కలసిపోవాల్సిన పని వచ్చింది. కలసిపోకపోతే ఉప్పు ఉప్పే, మిరపకాయలు మిరపకాయలే, చింతపండు చింతపండే తిన్నట్లు అవుతుంది, అది తినేదానికి కష్టం, అది భయంకరంగా

ఉంటుంది. అట్లకాకుండా అన్నికలుపుకొని తినేటట్లుగా ఏ రకంగా అయితే వంటను పెట్టుకున్నాము. మధ్యలో దేవుడు కూడా ఆ రకంగా ఏమి చేసాడంటే సంచితము అనేటువంటి దానిని పెట్టి చనిపోయేటటువంటి సమయంలో అదంతా ఒక్కసారిగా కలిసి వేయబడుతుంది. నీవు చనిపోయిన సమయంలో అంతవరకు ఆగామికర్మ నీ కర్మచక్రంలో చేరి, అక్కడ ఒక నిలువుగా ఉంటూ చనిపోయినపుడు ఈ ఆగామిక కర్మ ఏమవుతుంది అంటే సంచితకర్మలోనికి సంచితకర్మగా మారిపోతుంది. సంచిత కర్మ అంటే వంటగా మారిపోతుంది. మనము ఇక్కడ చేసిన వంటగా ఎట్ల అయితే


---

మారిపోతుందో తెచ్చుకున్న వస్తువులు. ఆ రకంగా వంటగా ఇది మారిపోతా వుంది. అపుడు ఏమైపోయింది అంటే పాపాలు, పుణ్యాలు అన్ని దీంట్లో కలిసిపోయినాయి దీనిని గుర్తించడానికి వీలులేదు.


ఈ రకంగా కలిసిపోయిన దానిని ఏమి చేసాడంటే నీకు ప్రారబ్ధంగా బయటకివస్తావుంది. వంటపాత్రలోకి అన్ని వేసి ఉడకబెట్టిన తరువాత నీకు ఎట్లయితే సాంబారుగానో, చారుగానో బయటికి వచ్చినట్లు, అది నీకు ఏ రకంగా వస్తావుంది ఆగామిక కర్మ ఏ రకంగా వస్తావుంది. సంచితము అనే కలయికలో కలసిపోయి అది ప్రారబ్ధము అనే దానిని నీవు తర్వాత వచ్చిన జన్మలో మొదటి నుండి చివరివరకు అనుభవించాలి. ఇది ఒక కథ అనుకోండి. కథ చెప్పినట్లుగానే ఉంది ఇది అంతా, కథ చెప్పినట్లే ఏముంది. అట్ల ఎందుకు అని ప్రశ్న వస్తుంది మనకు. అంతేకదా! హేతువాదం అన్నపుడు అట్ల ఎందుకు ఎవడు చేసుకున్న పాపము వాడు అనుభవించాలి. ఎవడు చేసుకున్న పుణ్యము వాడు అనుభవించాలి అన్నప్పుడు సుఖదుఃఖాలు వున్నాయి కదా! పుణ్యాన్ని సుఖంగానే, పాపాన్ని కష్టంగానే అనుభవించాలి కదా! ఎందుకు పెట్టలేదు దేవుడు ఈ రకంగా ఎందుకు పెట్టినాడు. వాస్తవమే పాపము వలన వచ్చే ఫలితము ఏముంది కష్టమే. పుణ్యము వలన వచ్చే ఫలితము ఏమిటి సుఖమే. అయినాగానీ ఈ రకంగా మనము అనుభవిస్తే ఎట్లు వుంటుంది. ఒకసారి టమోటపండు తెచ్చుకొని తింటావు, అది బాగానే ఉంటుంది. మిరపకాయ తినాలన్నపుడు కష్టంగానే ఉంటుంది. అంటే మరలా నీవు ఇంకోటి క్యారెట్ తిన్నపుడు అది బాగుంటుంది. కానీ మిరపకాయ తిన్న కారం అట్లే ఉంటుంది. ఆ క్యారెట్ కూడా కారం కనిపిస్తావుంటుంది. రుచి చెడిపోతుంది నీకు. అర్థమయిందా! విడి విడిగా తింటే ఏమయితాది


---

అంటే అన్ని నీకు ఏది కూడ రుచి తెలియకుండా పోతుంది. అన్ని కలిసిపోయి అంటే నీకు ఇది తిన్నా కూడా అది తిన్నట్లే ఉంటుంది. అది తిన్నా కూడా ఇది తిన్నట్లే ఉంటుంది. అంత గందరగోళం అయిపోతుంది. ఏది కూడా ప్రత్యేకంగా కనిపించదు. ప్రత్యేకంగా కనిపించాలంటే ఏమి చేయాలి. కాబట్టి ‘సంచితము’ అనేదానిగా మారాలి. సరే ఇంకో విధానము మారక పోతే ఏమయితుంది అట్లే కనపరానిలే ఏముంది మనం అడిగితే, కష్టము చేసుకొనేవాడు పాపము చేసుకొనేవాడు పాపమే అనుభవించని ఏమి వాని కష్టము వాడు అనుభవిస్తాడు. సుఖము చేసుకున్నవాడు సుఖము అనుభవిస్తాడు అంటే పుణ్యము చేసుకున్న వాడు సుఖము అనుభవిస్తున్నాడా వచ్చే సుఖం వస్తుంది. లేని సుఖం రాదు కదా! అదే రకంగానే వచ్చిన కష్టం వస్తుంది. లేని కష్టం రాదు కదా! ఏదో విధంగా అనుభవిస్తున్నాడు కదా! వాడు. అట్లే పెట్టింటే బాగుండు కదా! అంటే ఇంకొక పెద్ద చిక్కు వస్తుంది. కాబట్టి ఈ చిక్కును దేవుడు దృష్టిలో పెట్టుకొని ఏమి చేసినాడు అంటే సంచితము అనేదానిని మధ్యలో నిర్మించాడు. ఇప్పుడు మనము గత జన్మలో 70 సంవత్సరాలు బ్రతికినాము అనుకోండి బ్రతికినపుడు, ఈ జన్మలో 50 సంవత్సరాలకే కర్మ నిర్ణయించబడింది, 50 సంవత్సరాలు బ్రతకాలని ఉంది. చావు, పుట్టుకలు కర్మనుబట్టి ఉండవు. చావు, పుట్టుకలు మధ్య మధ్యలో నీకు వస్తూ ఉంటాయి. కానీ అవి ఎప్పుడు ఏ ప్రకారం జరగాలో ఆ ప్రకారంగా అప్పుడు జరుగుతూ ఉంటుంది. కాని చావు, పుట్టుకలు కర్మప్రకారం ఉండవు అని ఇంతకు ముందు మనము చెప్పుకున్నాము. అది మధ్యలో వచ్చేటటువంటి స్టేషన్లు మాదిరి వుంటాయి. అంతేకాని కర్మలు ప్రకారం ఉండవు. ఒక జన్మలో జరిగేటివి ధనాన్ని మనకు ఏమంటే పాపపుణ్యాలు కర్మలు అంటాము.


---

కర్మలు వాటి ప్రకారం జరుగుతా ఉంటాయి. ఇప్పుడు అటువంటి నువ్వు 70 సంవత్సరాలు బ్రతికినోడు 50 సంవత్సరాలకు చనిపోతే, ఏ మౌతుంది అంటే 20 సంవత్సరాల కర్మ మిగులుతుంది వానికి. ఇప్పుడు సంచితం లేదు, అనుకోండి. సంచితం ప్రక్కన పెట్టేసేయండి మీరు. సంచితం లేకుండా కేవలం ఆగామిక కర్మ ఉంది. అప్పుడు కేవలం ప్రారబ్ధకర్మ వచ్చేస్తుంది. అంతేకదా! ప్రారబ్ధము వచ్చేస్తుంది. 70 సంవత్సరాల వాడు 70 సంవత్సరాలు అనుభవించకుండా మధ్యలో పుల్స్టాప్ వచ్చేసింది ఇది, మరణం వచ్చేసింది. వెంటనే మరలా పుట్టినాడు. అక్కడి నుండి ఏమి కావాలి. అక్కడ 50 సంవత్సరాల వరకు అయిపోయింది కదా! కర్మ. మరలా 20 సంవత్సరాలు కర్మ మిగులుతాది కదా! మళ్ళీ ముందుది ముందే, వెనుకలది వెనుకలే జరగాలి కదా! ఆ లెక్కప్రకారము ముందుది ముందే వెనకలది వెనుకలే జరగాలంటే అప్పుడు 70 సంవత్సరాల వయస్సులో వాడు ఏమి పని చేస్తావుంటే, ఇప్పుడు ఏమి పని చేయాలి చిన్న వయస్సులో, శిశువుగా ఉన్నపుడు బాల్యంలోనే ఏమి చేయాలి వీడు. అంత పెద్ద పని వీడు చేయాల్సివస్తుంది. అంటే 70 సం॥లో చేసేపని, సంవత్సరం పిల్లవాడు కూడా చేయాల్సి పని వస్తాది. 70 సం॥లకు భార్య ఉంటాది. సంవత్సరం పిల్లవాడు భార్య అడిగితే ఏమి బాగుంటుంది చెప్పండి. నాకు భార్య కావాలని అడిగితే, ఈ రకంగా తలక్రిందులు అయితాది సమాజమంతా. అంతేకదా! బాగా అర్థం చేసుకోండి. ముందు ఏ కర్మ ఉందో అట్టే జరగాలి, వెనుకల ఏ కర్మముందో అట్లే జరగాలి మార్పు చెందకుండా జరగాలంటే 50 సం||లు పుల్స్టాప్ అయి మళ్ళీ ప్రారంభమైంది అనుకో అప్పుడు ఏమి కావాలి వీనికి? వీడు శిశువుగా ఉన్నపుడే భార్య ఉండాలి కర్మప్రకారం. భార్యను కొట్టేది ఉంటుందో, తిట్టేది ఉంటుందో ఏవో ఉంటాయనుకో, అవన్నీ వాడు పడాలి. శిశువుగా ఉన్నప్పుడు ఎట్ల పడుతాడు.


---

శరీరం చిన్నది కదా! శరీరంలో తేడాలు ఉంటాయి కదా! బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము అని ఈ నాల్గు దశలలో శరీరం ఉంది. నాలుగు దశలలో ఎప్పుడు ఏది ఎంత బరువు మోయాలో అంత బరువు మోస్తాడుగాని, లేదు ఎప్పుడు ఎప్పుడుది మోయాలి రూలు ప్రకారం ముందుది ముందే, వెనుకలది వెనుకలే అంటే చిన్నోనికి పెద్ద బరువును పెడితే ఏమౌతుంది. మోసేదానికి అవకాశమే ఉండదు. అప్పుడు చిన్న పిల్లోనికి పెండ్లి చేయాల్సి వస్తాది. అట్ల చేసేదానికి అయితాదా! అట్ల చేసేదానికి కాదు. వానికంటే పెద్దోని వెంబడి వెతుకులాడే దానికే పెద్ద పీకులాట ఉంది మనకు. పుడుతానే ఎత్తుకొచ్చి పెండ్లి ఎక్కడ చేస్తావు కర్మ ప్రకారం, ఆ రకంగా ఇటువంటి చిక్కులు వస్తాయి కాబట్టి కర్మరీత్యా ముందుది ముందే వెనుకలది వెనుకలే వరుస క్రమంగా అనుభవించాలంటే కాదు. ఆగామి ప్రారబ్ధంగా నేరుగా మారాలంటే కాదు. ఇవన్నీ మిక్స్ (కలిపి) చేసుకొని, ఏది ముందు అనుభవించాలి, ఏది వెనుకల అనుభవించాలి నిర్ణయం చేసి పెట్టేది ప్రారబ్ధము. ఏ వయస్సులో ఏమి అనుభవించాలి. అని నిర్ణయం చేసేది ప్రారబ్ధము. అందుకోసమే సంచితాన్ని ముందు పెట్టి, ఆ నిర్ణయాన్ని ఇక్కడ కలియజేస్తున్నట్లు ఆ నిర్ణయం ప్రకారం, సంచితం నిర్ణయం ప్రకారం వచ్చిన తరువాత ప్రారబ్ధము అవుతుంది. అది అనుభవించేది ఒక జన్మలో. ఎక్కడ నిర్ణయం అవుతుంది. సంచితంలో నిర్ణయం అవుతుంది. సంచితం అనేటువంటి దాంట్లో నిర్ణయం అవుతా ఉంది. అంటే సంపాదించేది ఆగామి, అనుభవించేది ప్రారబ్ధము మధ్యలో మార్పు చేస్తుంది ఇది కలిపి. అంతా కలిపి ఎప్పుడు ఏది అనుభవించాలి. ఏ వయస్సులో ఏది అనుభవించాలి అనేది మార్పు చేసి ఇచ్చేది సంచితం. దానికోసం దేవుడు సంచితం పెట్టాడు. సంచితం అనే పేరు ఎందుకు


---

వచ్చిందంటే ఈ రకంగా కలిపి నీకు ఇచ్చేదాని కోసమే దానిని పెట్టాడు. లేకపోతే అంత గందరగోళం అయిపోతాది.


ఏ వయస్సులో ఏమి జరగాలనేది తెలియకుండా, రకరకాల తతంగాలు ఏర్పడుతాయి. అందువలన బాగా ఆలోచన చేసుకుంటే ఇదంత గందరగోళ పరిస్థితి సమాజమంతా ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా ముందు చేసుకున్నది వెనుకల అనుభవించవచ్చు, వెనుకల చేసుకున్నది ముందు అనుభవించవచ్చు. అంటే అవకాశాన్ని బట్టే వారి శరీర అనుకూలాన్ని బట్టి వాడేమి బాధలు అనుభవించాల్సిందే, సుఖాన్ని అనుభవించాల్సిందే. ఎప్పుడు ఏ సుఖాలు అనుభవించాలనేది దానికోసము దేవుడు ఏమి చేసినాడంటే సంచితము అనిపెట్టి, సంచితంలో ప్రారబ్ధము నిర్ణయం చేసి ఇస్తాడు అన్నమాట. దానిని మనము ఏమంటాము అంటే

ఇది కర్మ యొక్క పద్ధతి అంటున్నాము. ఇది పద్ధతి, ఈ పద్ధతిలో ఆగామి అనేటటువంటి కర్మ సంచితము అనేటటువంటి కూడలిలో కలిసిపోయి అక్కడ మార్పుచెంది ప్రారబ్ధంగా వస్తుంది అది. అది ప్రారబ్ధంగా మారాలంటే ఏదో ఒకటి కావాలి కదా! మార్పు చెంది వస్తుంది. ఎప్పుడు జరుగుతావుంది అది. మరణించిన సమయంలో జన్మించేటపుడు. జన్మించేటపుడు మరణించేటపుడు అంటే ఎప్పుడు ఒకే జన్మలోనే సెకండ్ కాలము ఎంతవుంది మీరు చూసుకుంటే గడియారం చూసుకుంటే సెకండ్ కాలము రవ్వంత కూడా లేదు. మరణించిన సమయంలోనే ఇంత వేగంగా మారిపోతావుంది. ఈ ఆగామి కర్మ అంతా ఒక్కసారిగా ప్రారబ్ధంగా మార్చివేయబడుతావుంది. ఈ ఆగామిని ప్రారబ్ధంగా మార్చివేసే ప్రక్రియను 'సంచితము' అని అంటున్నాము. సంచిత కర్మ అంటున్నాము.


----

ఈ సంచితకర్మ ఏమి చేస్తుంది ప్రారబ్ధాన్ని నిర్ణయించి పెట్టితే ఏమౌతుంది అంటే అందరిని దృష్టిలో పెట్టుకొని ఒక వ్యక్తిని కాదు, ప్రపంచాన్నంత దృష్టిలో పెట్టుకొని, వయస్సును దృష్టిలో పెట్టుకొని, కాలాన్ని దృష్టిలో పెట్టుకొని, అన్నిటిని దృష్టిలో పెట్టుకొని అది ఒక కర్మను తయారు చేయిస్తాది అది ప్రారబ్దము. ఈ ప్రారబ్ధము ప్రకారము మనకు ప్రశ్నవచ్చింది మళ్ళీ ఏమని ఈ రోజు దక్షిణకాశి అనే యాత్రకు చాలామంది పోయినారు. వాళ్ళందరు ఒకేసారి సుమారుగా దగ్గర దగ్గర 20,000 మంది చనిపోయినా రంట ఇప్పుడు. ఇరవై వేలమంది ఒకటే కర్మ ఒకటే పాపము చేసుకున్నారా అని అడగవచ్చు. ఇరవై వేలమంది ఒకటే పాపము ఎట్ల చేసుకుంటారు. చేసుకోరు అన్నుమాట. రకరకాల పాపం చేసి ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అందరికి ఒకటే శిక్షపడింది. అక్కడికి పోయినోళ్ళు అంతా చనిపోయారు అనుకుంట. ఒకటే రకమైన శిక్ష పడింది కదా! మరి ఎందుకు వీళ్ళ ప్రారబ్ధము అలాగే తీర్చి పెట్టబడింది. రకరకాల పాపాలు చేసుకున్నా ఆ పాపాలన్ని మిక్స్చేసి, కొంతమందిని గుంపుగా తయారుచేసి, ఈ పాపము ఇంతమంది అనుభవించుపోండి అని చేసినారు. ఇది ఎక్కడ మార్చబడింది ఇది అంతా సంచితం అనే దాంట్లో మార్చబడింది. ఒక బస్సు అగ్గి అంటుకొని బస్సు, బస్సులో ఉండేవాల్లంతా కాలిపోయినారు. ఇప్పుడు మనకు ప్రశ్నవస్తుంది. ఏమని బస్సులో ఉండే ఆ సమయానికి ఉండే వాళ్ళంతా ఒకటే పాపం చేసుకుంటారా! ఒకడు చిన్న పిల్లవాడు చనిపోయినాడు. పెద్దవాళ్ళు చనిపోయినారు. మధ్య వయస్సు వాళ్ళు చనిపోయినారు. రకరకాలుగా చనిపోయినారు. వీళ్ళంతా ఒకటే పాపం చేసుకున్నారా అని అడిగినారు. ఒకటే పాపం చేసుకున్నవాళ్ళు, ఒకటేరకము పాపము చేసుకున్నారని మనము చెప్పేదానికి వీలులేదు. ఒకటే పాపం చేసుకున్నారని ఎట్ల చెప్పుతాం, చెప్పే దానికి కాదు. అంతమంది ఒకటే


---

పాపం చేసుకోకున్నగానీ రకరకాల పాపాలు, వేరువేరు పాపాలు చేసి ఉంటారు.


ఆ పాపాలను ఏమి చేసినారంటే మిక్స్చేసి ఒక రకంగా ఒకటే రకంగా మార్చి పంపించినటువంటిది సంచితము. ఆ రకంగా మార్చినదాని వల్ల అందరికి ఒకటే రకమైన శిక్షపడింది ఇక్కడ. ఇప్పుడు అంటే ఇంకా మనము వివరించుకుంటే ఒకడు ఒక పాపాన్ని చేస్తే వాడు కాలిపోవాలి అని ఉంది అనుకో, ఒక పాపాన్ని చేస్తే అర్థమయిందా! ఇప్పుడు ఒక పాపాన్ని పూర్తి చేసినపుడు కాలిపోవాలి. ఒకడు ఏమి చేసినాడంటే సగం పాపమే చేసినాడు. వీడు చేయాల్సినదాంట్లో సగమే చేసినాడు. వాడు కూడా బస్సులో ఉన్నాడు. వాడు కూడా అంటుకున్నాడు. ఇప్పుడు ఒకపాపం చేస్తే కాలిపోవాల్సినోడు సగం పాపమే చేసినాడు కదా! వాడు ఎట్ల కాలి పోయినాడు అని ప్రశ్న రావచ్చు మనకు. ఇదంతా ఆధ్యాత్మిక విషయంలో తర్కము అన్నమాట. ఇవి అందరికి వచ్చే ప్రశ్నలు కాదు. చాలా జాగ్రత్తగా వినండి. ఇదేందో కాకమ్మ గువ్వమ్మ కథలుకాదు. వాస్తమైన జరిగిన జీవిత సత్యాలు ఇప్పుడు మనము సగం పాపం చేసినోడు ఎట్ల చనిపోయినాడు, ఎట్ల కాలిపోయినాడు. వాడు ఒక పాపం చేస్తే కాలిపోయేదానికి అర్హుడు అంత శిక్ష వీనికి పడింది అనుకుందాము. వాడు సగం పాపం చేసినాడు కదా! సరే ఇంకొరిని చూస్తే సగము కాకుండా ఒకటి కాకుండా 1.1/2 చేసినోడు ఉన్నాడు ఒకడు. వాడు కూడా అదే బస్సులో ఉండి కాలిపోయి నాడు. 1.1/2 పాపము చేసుకొన్నవానికి ఒకటే శిక్ష సగము పాపము చేసుకొన్నవానికి ఒకటే శిక్ష, ఒక పాపము చేసినోనికి ఒకటే శిక్ష ఎట్ల అని మనము అడగవచ్చు. ఇది సాధ్యమేనా అని రూలు ప్రకారం అట్ల ఉండకూడదు కదా! లెక్కచారము మీరు ఏమి చెప్పినారు.


---

ఒక పాపము చేసివుంటే ఇంతేకావాలి. ఇంతే అన్నాను కదా! అయితే అట్లా ఇప్పుడు 1.1/2 వాడువున్నాడు, అర్థమువాడు ఉన్నాడు, ఒకటి వాడు ఉన్నాడు కదా! మరి ఎట్లా అని ప్రశ్న వస్తుంది అప్పుడు. ఇక్కడ ఏమి జరిగింది అంటే ఈ సంచితంలో ఒకటి ఉన్నవానికి అది శిక్ష సరిపోయింది. అర్థము ఉన్నవానికి ప్రక్కంది ఇంకొక పాపము దానిని తీసుకొని వచ్చి సగము దీంట్లేకి వేసి పూర్తిచేసి పెట్టినారు అన్నమాట. 1.1/2 ఉన్నవానికి సగము ప్రక్కకు వేసి అయితే ఇంకొకచోట అనుభవిస్తులే అని చెప్పి ఒకటి చేసి ఇక్కడ పెట్టినారు. అందరికి ఒకటి సమానం పెట్టినదాని వలన అందరూ ఒకటే రకమైనటువంటి అనుభవాలు అనుభవించారు. ఈ పాపాన్ని హెచ్చుతగ్గులు క్రమము చేసి, మిక్స్చేసి ఎక్కువ తక్కువ సవరించి ఎప్పుడు ఏది అనుభవించాలో అంతే అనుభవించాలి, ఇంతమంది అనుభవించాలని లెక్కచారముగా పెట్టినటువంటిది సంచితము. అది సంచితానికి ఇంత గొప్పతనం ఉంది. సంచితము అంటే మనకు ఏమిటిది సంపాదించేది కాదు, అనుభవించేది కాదు. మరి ఎందుకు ఈ పేరు వచ్చింది అని లెక్క వేసుకుంటే ఈ సంపాదించే దానికంటే, అనుభవించేదానికంటే పెద్ద పని చేస్తావుంది. అంతా మిక్స్ చేసి ఎక్కడ ఎంత అనుభవించాలో ఎక్కడ ఎంత కలపాలో ఎంత తీసివేయాలో అంతచేసి పెడుతావుంది. ఏది సంచితము అనేది. ఈ రకంగా మనము నిత్యము జరిగే పనులు మనము చూస్తే ఒకే రకమైన బాధలు అనుభవించేవాళ్ళు ఉన్నారు. అందరూ ఒకటే రకమైన బాధలు, అంతా కరెక్ట్ ఈ సమయానికి పోయిన జన్మలో ఈ సమయానికి అందరూ ఇదే పాపము చేసుకొని ఉంటారా అంటే, ఆ సమయానికి ఎవరూ చేసుకోరు ఒకటే సమయానికి అందరూ ఆ పాపాన్ని ఎవరూ చేసుకోలేదు. చేసుకోకున్నా గానీ కొంతకర్మను దాంట్లోకి సరిదిద్ది, తీసివేసి, కొంత కలిపి అదే అనుభవించేటట్లు చేసినటువంటిది ఏది, సంచితము.


---

ఈ రకంగా సర్దుబాటు చేసి, ప్రపంచంలో ఏ కర్మలు ఎట్ల అనుభవించాలో, ఎవరు ఎంత అనుభవించాలో, ఏ సమయంలో ఎంత అనుభవించాలో ఎంతమంది ఒకసారి అనుభవించాలో లెక్కాచారంగా తీర్చిదిద్దినటువంటిదే సంచితము. అది అనుభవానికి వస్తే ఏమౌతుంది అది ప్రారబ్ధము అయితావుంది. అది ఒక్కసారిగా అనుభవించేది కాకుండా దేశంలో రకరకాలుగా అనుభవించే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు ప్రత్యేకంగా అనుభవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కర్మను కూడా అదే రకంగా మిక్స్ చేసిపెట్టేది. ఒకడు తన జీవితకాలంలో అంటే 70 సంవత్సరాలు బ్రతికినాడు అనుకోండి 50 సం॥ములు సత్పురుషుడుగా ఉన్నాడు. 50 సం॥ల తరువాత దురలవాట్లు వచ్చినాయి. వచ్చి అన్ని పాపాలే చేసుకున్నాడు. మొదట అన్ని పుణ్యాలే చేసుకున్నాడు. తరువాత 20 సం॥, 70 సం॥ జీవితంలో అన్ని పాపాలే చేసుకున్నాడు. ఇప్పుడు అన్ని పుణ్యాలు అనుభవించి, అన్ని పాపాలు అనుభవించే దానికి కాదు అన్నమాట. కాబట్టి ఏమి చేసినాడు అంటే మిక్స్ చేసి వానికి పూర్తి సుఖము, పూర్తి దుఃఖము కాకుండా పూర్తి సుఖము ఉన్నా, పూర్తి దుఃఖము ఉన్నా ఇబ్బంది అవుతుంది. అవి మిక్స్ చేసి జీవితంలో సుఖాన్ని ఇచ్చాడు. కానీ ఒక కష్టాన్ని కూడా పెట్టినాడు వానికి శాశ్వతంగా, ఏదో ఒక కష్టాన్ని పెట్టినాడు వాని వెంట. వాడు దానిని అనుభవిస్తూనే ఉన్నాడు. దీనిని అనుభవిస్తున్నాడు, సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఒక ప్రక్కన ఒకచోట ఏమీ కుంటుకుంట అందరి మాదిరి ఉండడువాడు. వాడు కుంటాల్సి పని వచ్చింది. ఇదొక రకమైన పాపము. అంతేకదా! వాడు కుంటుతావుంటే పాపము అయిపోయింది. జీవితంలో కుంటితనము. ఆ రకంగా కొంత పాపాన్ని జీవితమంతా అనుభవించేటట్లు చేసి మిగతావి సుఖాలు కూడా ఉన్నాయి. ఏ సుఖము అనుభవించాలో ఆ సుఖాన్నే అనుభవించేటట్లు చేసినాడు.


---

ఈ రకంగా ఎప్పుడు ఎవరిని ఏ రకంగా తీర్చిదిద్దాలో అది ఎవరికి అర్థముకాదు. ఏ కర్మ ఏ రకంగా మారిందో ఎవరికీ అర్థముకాదు. అది కర్మ రహస్యము. కర్మ రహస్యము ఎవరికీ అర్థముకాదు. ఈ మారినటువంటి కర్మ ఎవరికీ అర్థంకాదు. ఏ రకంగా ఎప్పుడు ఏ కర్మ ఎవడు ఏ సమయంలో ఎట్ల అనుభవిస్తాడో ఎవరికీ అర్థం కాదు. ఇటువంటి కర్మను మనము ఇంతకు ముందే మనము సంపాదించుకొని ఉన్నాము. ఈ సంపాదించుకున్న కర్మలే మనము అనుభవిస్తున్నాము. ప్రారబ్ధంగా మనము అనుభవించేదంతా ఈ రోజు మనము మంచి సుఖాన్ని అనుభవిస్తున్నాను, మంచి సుఖాన్ని చేసినాను అనుకోవద్దండి. ఒక కష్టాన్ని అనుభవిస్తే నేను చాలా పాపాన్ని చేసినాను అనుకోవద్దండి. నీవు చేసిన పాపాలు, పుణ్యాలు వేరు వేరుగా ఉన్నాయి కానీ మిక్స్ అయి వస్తావున్నాయి మీకు. ఆ రకంగా మిక్స్ అయి ఎందుకు వస్తున్నాయి అంటే ఒక్కసారిగా కనపరాకుండా మధ్య మధ్యలో ఇటు సుఖాలు దుఃఖాలు కన్పిస్తున్నాయంటే వాటి మధ్యలో నీవు ఉంటూ ఈ సుఖాలకు దుఃఖాలకు అతీతమైనటువంటిది ఏదైనా ఉందా అని నీవు వెదుకులాడుతావు అని ఈ రకంగా పెట్టినాడు దేవుడు. రెండింటిని ఎందుకు కరిపిచ్చినాడంటే జీవితంలో ఒక్క రోజులోనే సుఖాలు, దుఃఖాలు రెండు ఉన్నాయి. అయితే ఒక రోజులోనే సుఖాలు, దుఃఖాలు ఎందుకు పెట్టాడు అంటే రెండింటిని అనుభవించిన తరువాత మబ్బుగా ఉన్నవానికి ఏమి అర్థము కాదు.


కొంత విచక్షణ ఉన్నవానికి, హేతువాద దృష్టి ఉన్నవానికి ఇవన్నీ ఎందుకు ఇట్ల అనుభవిస్తున్నాము అని దృష్టివచ్చిన వానికి, తప్పించుకొనే ఉపాయం లేదా అని ప్రశ్నవస్తుంది. తప్పించుకొనే ఉపాయం ఉంది అని దేవుడు ఏమి చేసినాడంటే అర్థమయ్యే కోసము రెండిటిని పెట్టినాడు మిక్స్డ్ గా


---

అది ఇది జరుగుతాది, అది జరుగుతాది, చీకటి కొన్నాళ్ళు, వెన్నెల కొన్నాళ్ళు అని మామూలుగా సుఖము కొంతసేపు, దుఃఖము కొంత సేపు ఉంటుంది. ఏది శాశ్వతంగా ఉండదు అని పెద్దలు చెప్పుతుంటారు. ఈ రకంగా నువ్వు సుఖదుఃఖాలు అనుభవిస్తూ ఈ పాపపుణ్యాలు ఇవి కారణం అని తెలుసుకొని, ఈ రకంగా ఇవి మారి మన జీవితంలో ప్రారబ్ధంగా వచ్చినాయి అని తెలుసుకొన్నపుడు, ఈ ప్రారబ్ధాన్ని మనము లేకుండా చేసుకొనే దానికి అవకాశం లేదా అనే ప్రశ్నవస్తే, దేవుడు ఏమి చెప్పినాడంటే అవకాశం ఉంది అని చెప్పాడు. ఏ రకంగా చెప్పాడు. ఈ జ్ఞానంలో 'జ్ఞానం అనే అగ్నిలో, అగ్నిలో ఏ విధంగా కట్టెలు కాలిపోతాయో, అదే రకంగా జ్ఞానం అనే అగ్నిలో నీ కర్మలు అనేటటువంటివి కాలిపోతాయని దేవుడు చెప్పాడు. కర్మలు అనేటువంటి కట్టెలు కాలిపోతాయి. అంటే మనము చేసుకున్నటువంటి కర్మలు ఉన్నాయి కదా! అంటే పాపము అని చెప్పలేదు, పుణ్యము అని చెప్పలేదు. మిక్స్ చేసి పెట్టినాను నేను. ఆయన చెప్పేది ఏమి చెప్పుతున్నాడంటే అన్ని మిక్స్ చేసి పెట్టినాను నేను అవన్నీ కాలిపోతాయి అని చెప్పినాడు. ఇప్పుడు ప్రత్యేకించి ఏమేమి కాలిపోతాయి, ప్రత్యేకించి అవే కాలిపోతాయి అని చెప్పలేదు అక్కడ. “దగ్ధకర్మాణాం” అని అన్నాడు, 'దగ్ద పాపానాం' అని ఏమి అక్కడ చెప్పలేదు. కాబట్టి నీ కర్మలు కాలిపోతాయని చెప్పినాడుగానీ పాపాలు కాలిపోతాయని చెప్పలేదు. ఈ కర్మలలో ఏమి ఉన్నాయి సుఖాలు, దుఃఖాలు రెండు మిక్స్ అయినాయి మన జీవితంలో నుంచి. అన్ని కాలిపోతాయి. అంటే నాకు పాపము, నాకు కష్టము పోవాలి, సుఖము అట్లే ఉండాలంటే కుదరదు. నీవు శనగకాయలు కాల్చుకొని అగ్గిపెడితే శనగకాయలు కాలుతాయి, శనగకాయలుతోపాటు కట్టెపుల్లలు కాలుతాయి. రెండు కాలుతాయి కదా! నీకు శనక కాయలు ఒకటే కాలవు.


---

అదే విధంగానే నీలో ఉండే పాపము, పుణ్యము రెండు కాలుతాయి. నీవు పాపముతో పాటు పుణ్యము పోవాలి అనుకొనుంటే ఫరవాలేదు. అనుకొని చేసుకో, నా కర్మ పోవాలని ప్రయత్నం చేసేటట్లు ఉంటే నీకు పోతాయి. నీవు ప్రత్యేకంగా ఇదీ పోవాలనుకుంటే కోరిక కోరితే పోవు. నీవు జ్ఞానం తెలుసుకున్నావు. ఆ జ్ఞానం వల్ల ఏమన్నాపోనీలే అనుకుంటే ఏ కర్మ అయినా పోతాది అర్థమయిందా! జ్ఞానం అనేది ఒకటి ఉంది. కాబట్టి దానిని నేను తెలుసుకొనే దానికోసము దేవుడు ఏమి చేసినాడంటే రెండిటిని మిక్స్ చేసి అందిస్తూ, మధ్యలో ఈ జ్ఞానాన్ని తెలుసుకొనే దానికి అవకాశం కూడా ఇచ్చాడు. కానీ మనిషికి ఈ అవకాశం ఇస్తే మనిషి ఏ మనుకొన్నాడంటే ఈ జ్ఞానాన్ని ఏమాత్రం లెక్కపెట్టకోకుండా ఈ కనిపించేటటువంటి సుఖదుఃఖాలను లెక్కపెట్టుకుంటూ, వాని జీవితంలో ఎక్కువ సుఖం దేని వలన వస్తుందంటే డబ్బు వలన వస్తుందని, కర్మవలన వస్తుందని కాదు మనము వెనకల కర్మ అనుకుంటున్నాము కదా! ఇవన్నీ లెక్కే లేదు వాళ్ళకు దేనివలన వస్తుంది. ఆ డబ్బు వలన వస్తుంది అని, డబ్బు సంపాదించుకొనేదానికి ప్రాకులాడుతున్నారు. అంటే వీళ్ళ దృష్టి అంతా ఎక్కడ మరలి పోయింది. ప్రపంచం మీద మళ్ళి పోయింది. అంటే జ్ఞానం మీద మళ్ళలేదు. అందువలన ఇతనికి ప్రపంచంలోనే తిరిగి పాపాలు సంపాదించుకోవడం చేస్తున్నాడు. కానీ ఆ పాపాలు సంపాదించుకొని మరలా ఏమి చేస్తున్నాడు అంటే ఉత్త పాపాలయితే ఏమి బాగుంటుంది పుణ్యాలు కూడా సంపాదించుకోవాలని అయితే ఈ దేవతలకు వాళ్ళకు, వీళ్ళకు పుణ్యక్షేత్రాలకు పోతే పుణ్యాలు వస్తాయని ఎట్ల చెప్పినారు దీనిని 10 రోజులు పాపం చేసుకుంటే, లేదు 100 రోజులు పాపం చేసుకున్నా ఒక్క తీర్థయాత్ర చేస్తే పాపాలు పోతాయి అని అన్నారు. 100 రోజులలో చేసుకున్న పాపాలన్నీ పోతాయంట.


---

ఒకచోట నీళ్ళలో మునిగితే జన్మలో చేసుకున్న పాపాలన్నీ పోతాయని చెప్పినారు. ఇట్లా కథలు వ్రాసిపెట్టి మభ్యపెట్టినారు. మనము తీర్థయాత్రలు చేస్తే, ఫలానా దేవుని దగ్గరకు పోతేనో లేదా మునిగి వస్తేనో మీకు ఉండే పాపాలన్నీ పోతాయని. మనము ఏమి చేస్తున్నాము జ్ఞానం తెలుసుకుంటే పోతాయని మనం చెప్పుతుంటే, వాళ్ళు అట్లే చెప్పుకున్నారు. వాళ్ళకు అట్ల అర్థమయింది. వాళ్ళు ఏమి చేస్తున్నారంటే వంద రోజులు డబ్బు సంపాదించుకొని, మోసాలు చేసి అవి చేసి, ఇవి చేసి నాకు డబ్బు వస్తే చాలు ఎట్లోగట్లా మనకు ఫరవా లేదంటే పాపముగానీ, ఏ మన్నాగానీ అని పాపం, పుణ్యం చేసి డబ్బులు సంపాదించుకున్నాగానీ ఆ పాపాన్ని పోగొట్టుకొనేదాని కోసమే ఏమి చేస్తారు. ఇట్లా తీర్థయాత్రలు చేయడం మొదలుపెడుతారు. సంవత్సరానికి ఒకసారి సంవత్సరం చేసిన పాపం అంతా ఒకసారి పోయివస్తే సరిపోతాదిలే. సంవత్సరం సంవత్సరం

ఎందుకుపోవాలి 10 సం॥లకు ఒకసారిపోతే సరిపోతాదని కొంతమంది 12 సం||లకు ఒక తీర్థయాత్ర పెట్టినారు. అంతేకదా! 10 సం||లకో, 12 సం||లకో ఒక పేరు పెట్టినారు. దీంట్లోకి పోతే 12 సం॥లకు ఒకసారి అన్ని పోతాయంట దాంట్లోకి పోతే ఆ రకంగా పెట్టుకొన్న వాళ్ళు ఉండారు. వీటివల్ల ఏమయితా ఉందంటే జ్ఞానము అనేది తెలియకుండా పోతావుంది. ప్రజలకు తెలియకుండా పోయిన దానివలన ఏమయితావుంది నష్టము ఎవరికి జరుగుతావుంది ప్రజలకే జరుగుతా ఉంది. అజ్ఞానం పెరిగిపోతా వుంది. అధర్మాలు పెరిగిపోతావున్నాయి. ధర్మాలకు ముప్పు వస్తావుంది. ధర్మాలు తెలియకుండా పోతున్నాయి.


జ్ఞానము అనేది ఇది అని తెలియక పోతుంది. కర్మ అనేది ఇది అని తెలియకపోతుంది. మాయ అంతకు తెలియకుండా పోతావున్నది.


---

దేవుడు అసలు తెలియకుండా పోతున్నాడు. కాబట్టి ఇవన్నీ ఏమి చేయాలి. చూసినంతసేపు చూసినాము, మారుతారని మారుతారని చివరకు కోపం వస్తే ఏమౌతుంది తీసి చెంపపెట్టి కొడుతారు. ఎప్పుడు మారుతావురా! నీవు మారవా! అని ఆ రకంగా వాళ్ళని కొట్టినారు, ఎవరిని దక్షిణకాశి పోయిన వారిని. పదే పదే కాశికాశి అని వస్తే ఎట్ల అనుకున్నావు అని ఒకటేసారే ఎవరు కొట్టినారు. భూతాలు, ఏ భూతాలు పంచభూతాలు. పంచ భూతాలలో గాలి ఒకటి, వాన ఒకటి అన్నీ ఇవే కదా! రాళ్ళు ఒకటి రప్పలు ఒకటి అన్ని అవే కదా! భూమిని బట్టి, భూమి దబదబ అని ఇరిగి పడింది పై నుంచి వాన దొబ దొబ పడింది. అంత రాళ్ళు ఎట్ల పడినాయో, అంత వాన ఎట్ల వచ్చిందో నిమిషాల మీద ఏమో మరి అయోమయం. లెక్కచారమేసుకుంటే అంతవాన ఒకటేసారి జరగదు. కానీ ఈ లెక్కాచారము కథే తెలియదు ఎవరు శక్తులు చేసే పనులు. ఎవరు చేసే పని భూతాలు చేసే పని, మహా భూతాలు ఏవి ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. భూమి ఇరిగిపడింది. గాలి నూకేసింది, నీళ్ళు బడబడ వచ్చేసినాయి. కానీ అందరికి తిప్పలు వచ్చినాయి. కానీ ఇంతమంది దేవతలు ఏమయినారు అంటే దేవతలు లేదు, నువ్వు లేదు అందరిని దేవతల గుళ్ళని కూడా అది ఈడ్చిపారేసింది. చూడు ఎట్లుందో మళ్ళీ వాళ్ళని లెక్కాచారంగా పెడితే ఏమన్నా వాళ్ళని మూలాది పెట్టినట్లు అవుతాదని, ఈ రకంగా ఈ భూతాలు ఏమి చేస్తాయి అంటే భూతాలు ఎవరి క్రింద ఉన్నాయి. దేవుని క్రింద ఉన్నాయి అన్నమాట. దేవుని క్రింద ఉన్న భూతాలు ఆ రకంగా వీళ్ళను ఇబ్బంది పెట్టేసి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండని చెప్పుతున్నాయి. ఈ భూతాలు అంటే దేవుని జ్ఞానాన్ని తెలిసినటువంటి భూతాలు ఏమి చేసినాయి అంటే దేవుని జ్ఞానం తెలుసుకోండి. దానికి విలువ ఇవ్వడం లేదు. కర్మలు సంపాదించుకుంటున్నారు మీరు. ఆ కర్మలు అనుభవిస్తున్నారు. దేవుని


---

జ్ఞానం మీద ధ్యాస లేకుండ పోయింది. అని రకరకాల ఇబ్బందులు పెడుతున్నాయి.


ఇట్లా అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నాయి. అయినా మనము వాటిని గుర్తించడం లేదు. ఎంతకైన మళ్ళీ మొరటుపడి అదే పనులు చేస్తున్నాము. అట్ల కాకుండా కర్మ అంటే ఏమి, మన జన్మ అంటే ఏమి, ఎందుకు పుట్టాము, ఎందుకు అనుభవిస్తున్నాము ఇవన్నీ ప్రశ్నల రూపకంగా తెలుసుకుంటే ఏమయితాది అంటే, నీవు ప్రశ్నించుకుంటే ఏమయితాది అంటే హేతువాదం అయితుంది. ఆ హేతువాదం అనేది ప్రపంచ విధానంలో లేకుండా దేవుని విధానంలో పెట్టుకోండి. నీ విధానంలో పెట్టుకోండి ముందు నీవు ఎవరు? ఏమి కథ, నేను ఎందుకు పుట్టాను, నీ గురించి ఆలోచన చేసుకుంటే అవి ఒక్కొక్క ప్రశ్నకు జవాబు తెలుసుకుంటూపోతే నీకు కర్మ అనేది ఒకటి ఉందని, కర్మ అనేది ఇట్ల ఆగామికం ఉంది ఆగామికం ప్రారబ్ధమవుతుంది. ఆగామి ప్రారబ్ధంగా మారడానికి సంచితం ఒకటి ఉంది. ఈ రకంగా వంట చేసి మిక్స్ చేసి పెడుతావుంది ఇది. ఇది ఫలాన పాపము, ఫలాన పుణ్యం కనుకొనే దానికి వీలులేదు. ఈ బాధ అనుభవిస్తున్నా వంటే ఫలాన పాపము వలనే అనుభవిస్తూ ఉన్నావని చెప్పేదానికి వీలులేదు ఎవరు కూడ. ఎవరూ చెప్పేదానికి కాదు. అట్ల అనుభవించేది ఏది కూడ గుర్తు పట్టుకోకుండా చేసినట్టినది ఏది. ఈ సంచితము అనే కర్మ ఒకటి వుంది. అది మనము ఈ రోజు ఈ సంచితము అనేది దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము. సంచితము అనేది కర్మ రహస్యము ప్రారబ్ధము, ఆగామికము ప్రారబ్ధంగా ఎందుకు మారుతావుంది. ప్రారబ్ధము ఆగామికముగా ఎందుకు మారుతావుంది, ప్రారబ్ధము చేస్తూ మనము క్రొత్త కర్మ సంపాదించుకుంటున్నాము. అది ఎందుకు మారుతుంది ఏ రకంగా


---

అని ఒక్కొక్కదానిని తెలుసుకుంటూ పోతే ఏమైతుంది. నీవు ఒక్కొక్క మెట్టు జ్ఞానాన్ని ఎక్కినట్లు అవుతుంది. జ్ఞానాన్ని అధిరోహించినట్లు అవుతుంది. ఆ రకంగా నీవు జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల జ్ఞానిగా మారుతావు, దేవుని విషయం తెలియబడుతుంది. అప్పుడు సులభంగా దేవుని మార్గంలో సాగిపోగలవు. ఇవన్నీ ప్రశ్నలకు జవాబులు వస్తాయి. లేకపోతే ఒక్క ప్రశ్నకే జవాబు దొరకకోకుండా, అక్కడే ఎంత తిప్పలుపడినా కూడా జవాబు దొరకకోకుండా పోతుంది, రకరకాల కర్మలు అనుభవిస్తున్నావు. భర్తను భార్య హింసిస్తూ ఉంటుంది అది ఒకరకమైన కర్మ. భార్యను భర్త హింసిస్తూ ఉంటాడు అది ఒకరకమైన కర్మ. భార్యను, భర్తను ఇద్దరిని కలిపి కొడుకులు హింసిస్తూ ఉంటారు అది ఒక కర్మ. తల్లిదండ్రులు ఇద్దరు కలిసి కొడుకులను ఒక రకంగా ఉందో చెప్పండి హింసిస్తుంటారు. ఇది ఒక రకమైన ఉండినా ఏమి సమస్య లేకున్నా నానా రకరకాలు ఉంటారు అసలుకు. అన్ని అనారోగ్యంతో అది ఒక బాధ ఉంటుంది. ఈ రకంగా రకరకాల బాధలు అనుభవిస్తున్నారు. ఇటువంటి బాధలన్ని తప్పించుకోవాలి, కర్మలన్నీ లేకుండాపోవాలంటే కర్మ యొక్క రహస్యం మనకు తెలియాలి. ఆ కర్మ రహస్యం తెలియాలంటే ముందు జ్ఞానం బాగా అర్థం కావాలి. ఆ జ్ఞానం కావాలంటే మీకు శ్రద్ధ కావాలి. శ్రద్దవున్న వాళ్ళకే జ్ఞానం లభిస్తుంది. కాబట్టి శ్రద్ధను పెంచుకోండి. ఆ శ్రద్ధ ప్రకారం ప్రకారం మీరు ప్రశ్నించుకోండి. అది హేతువాదం అవుతుంది. ఆ హేతువాదం పూర్తిగా తెలియాలంటే మీకు వచ్చే గ్రంథములో తెలుస్తుంది. అంతవరకు కాచుకొని కూర్చోండి. ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాము.


---


తేది: 05.04.2016


ఇప్పుడు నేను చెప్పు విషయము మీకు వింతగా అనిపించవచ్చును. అయినా ఇప్పుడు నేను చెప్పకపోతే నా తర్వాత చెప్పువారు ఉండరు కాబట్టి చెప్పుచున్నాను. భూమి మీద పుట్టిన జనులలో మనుషులు, మానవులు, ప్రజలు అను మూడు రకముల వారున్నారు. ములో మనస్సు 

యుండుట వలన అందరినీ ఏకముగా మనుషులు అని అనవచ్చును. మనస్సుగల వాడు మనిషి అని చెప్పబడుచున్నాడు. అందరికీ మనస్సు యుండుట వలన అందరినీ కలిపి మనుషులు అని అంటున్నాము. అయితే మనుషులలో మానవులు ఉన్నారు, అలాగే ప్రజలు ఉన్నారు. మానవులు,

ప్రజలు ఇద్దరు ఆకారములో ఒకే రకముగా యుండుట వలన ఎవరు

ప్రజలో, ఎవరు మానవులో బయటికి తెలియకుండా పోయినది. ఎవరయినా తప్పు పనిచేస్తే వానిని దూషించునప్పుడు నీవు మనిషివేనా? అని దూషించడము జరుగుచుండును. అంతేకాక నీకు మానవత్వమున్నదా? అని కూడా అనుచుందురు. అంతేగానీ నీవు ప్రజవేనా? అని ఎవరూ అనరు. ఎందుకనగా! ‘ప్రజ' అను పదము ప్రత్యేకమైనది. పశువులలో ఎద్దుకు, దున్నపోతుకు ఎంత తేడా ఉందో, మనుషులలో ప్రజలకు, మానవులకు అంతే తేడా ఉందని చెప్పవచ్చును. పూర్వము సూర్యుడు భూమిమీద జ్ఞానమును మనువు ద్వారా అందించాడు. మనువు తనకు సూర్యుని ద్వారా తెలిసిన జ్ఞానమును ఇతరులకు అందించగా, దేవుని జ్ఞానము భూమి మీద పూర్తి ప్రాకిపోయినది. అలా తెలియబడిన జ్ఞానమును


---

కొందరు చౌకగా చూస్తూ, హేళనగా మాట్లాడుచుండిరి. అలా హేళనగా మాట్లాడు వారిని చూచిన మాయ, వారు దేవుని వైపు పోకుండాయుండుటకు అజ్ఞానమును జ్ఞానమువలె తెలియజెప్పి, అజ్ఞానము మీద వారికి ఇష్టము పుట్టునట్లు చేసి, వారిని అజ్ఞానము వైపు పోవునట్లు, జ్ఞానము వైపు రానట్లు చేయాలనుకున్నది. అప్పుడు మనువు చేత స్వయముగా జ్ఞానము బోధించి, స్వయముగా ధర్మములను చూపించి, తన బోధకు శాస్త్రమను పేరును తగిలించి మను ధర్మశాస్త్రమని పేరు పెట్టాడు. ఈ రకముగా మనువు చెప్పిన ధర్మములను ఆచరించినవాడు ఎవడయినా వానిని “మానవుడు” అనడము పూర్వము జరిగెడిది. అలాగే దేవుని ధర్మములను ఆచరించిన వానిని “ప్రజ” అని అనడము జరిగెడిది.


పూర్వము దేవుని ధర్మములు ఆచరించెడివారు అధికముగా యుండెడివారు. అందువలన వారినందరినీ 'ప్రజలు' అను పేరుతో పిలిచెడివారు. మనువు యొక్క ధర్మములను అనుసరించెడివారు చాలా తక్కువమంది యుండెడివారు. అందువలన వారిని 'మానవులు' అని పిలిచెడివాడు. పూర్వము భూమి మీద ఉన్న మనుషులలో ప్రజలు ఎక్కువగా ఉండెడివారు. మానవులు తక్కువగా యుండెడివారు. యుగములు మారగా, కాలము జరుగగా ప్రజలు తగ్గిపోయారు. మానవులు ఎక్కువయి పోయారు. పూర్వముకంటే ఇప్పుడే మనుషుల సంఖ్య ఎక్కువగాయున్నప్పటికీ, అందులో ప్రజలు అరుదుగా యున్నారు. ఎక్కడ చూచినా మానవులే కనిపించు చున్నారు. ప్ర అనగా ముఖ్యమైన, సారాంశమైన అని అర్థము కలదు. జ అనగా పుట్టుట అని అర్థము గలదు. ఎవడయితే దేవుని ధర్మములను తెలియగలిగాడో, వాని జన్మ సారాంశమైన జన్మగా మారిపోవుచున్నది. అందువలన దైవ ధర్మములను తెలిసిన వారిని ప్రజలు అని అనవలసి


---

వచ్చినది. దైవధర్మములను తెలిసిన వాని జన్మ సార్థకమగుట వలన అట్టివారికి ముఖ్యమైన జన్మలు గలవారని లేక సారాంశమైన జన్మలు కలవారని అర్థమొచ్చునట్లు చెప్పుటకు ప్రత్యేకించి వారిని ప్రజలు అని చెప్పడమైనది. ఒక మనిషి మానవుని నుండి ప్రజగా మారాలంటే వానికి దైవజ్ఞానము లభించాలి. దైవజ్ఞానము లభించాలంటే వానికి దేవుని మీద, దేవుని జ్ఞానము మీద ఎక్కువ శ్రద్ధ ఉండాలి. అందువలన ముందు మానవునికి దేవుని జ్ఞానము మీద శ్రద్ధ కలగాలి. బోధకుడుగానీ, గురువుగానీ ఎంత వివరమును చెప్పినా, ఎంత మంచిగా బోధించినా శ్రద్ధ లేకపోతే మానవుడు ప్రజగా మారలేడు.


నేడు దేశములో చాలామంది మానవులుగా (అజ్ఞానులుగా) బ్రతుకుతున్నారు. కానీ ప్రజలుగా (జ్ఞానులుగా) బ్రతుకడము లేదు. దేవుడు ఆయన గొప్పదనమును అంటే ఆయన జ్ఞానమును తెలుసుకునేందుకే మనిషిని పుట్టించాడు. కానీ మనిషి తాను ఎందుకు పుట్టాడో అను విషయము మర్చిపోయి, ఏదో ఒకటి సంపాదించుకొని, తన వెనుకవారి కొరకు కూడా కూడబెడుతున్నాడు. అందరికీ కూడబెట్టడము దేనికి? నీవు తినేదానికి సంపాదించుకుని తృప్తిగా ఉండవచ్చును కదా! అని ఎవరయినా జ్ఞానము తెలిసినవారు అంటే, మనము ఏమన్నా జంతువులమా? మనుషులము. మనకు, మన పిల్లలకు, మన పిల్లల పిల్లలకు సంపాదించి పెట్టాల అంటున్నాడు. కానీ తాను సంపాదించినది తన పిల్లలు తింటారను నమ్మకము లేదు. తన పిల్లలవరకు ఎందుకు, తాను తింటాడను నమ్మకము కూడా లేదు. ఎందుకంటే సంపాదించిన తరువాత తీరా అనుభవించే సమయానికి చావు వస్తే అది అనుభవించకుండానే చనిపోవలసివస్తుంది. అప్పుడు జీవితాంతము పడ్డ శ్రమ అంతా వృథా అయిపోనట్లే కదా! నేడు


--

చాలామంది జీవితాలు ఎలా వృథా అయిపోవుచున్నవో అను విషయము మీకు అర్థము అగుటకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి.


ఒక ఊరిలో కొంగనపల్లి బుచ్చయ్య చౌదరి అని ఒకాయప్ప ఉండేవాడు. ఆయనకు నూరు ఎకరాల భూమి ఉండేది. ఆయనకు ఒకడే కొడుకు. ఆయన భార్య చనిపోయింది. అయినా అతను పెళ్ళి చేసుకోలేదు. ఎందుకంటే రెండో పెళ్ళి చేసుకున్న తరువాత పిల్లలు పుడితే వారికి కూడా తన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని, అదే ఇంకా 20 ఎకరాలు సంపాదించి తన కొడుక్కే ఇస్తే జీవితాంతము దర్జాగా బ్రతుకుతాడు కదా, పెద్ద పేరు ఉంటుంది వాడికి అని రెండో పెళ్ళి చేసుకోలేదు. ఇంటిలో భార్య లేదు కాబట్టి వంట తానే చేసుకొనేవాడు. అయితే అన్నము మాత్రము వండుకొని కూర వండుకొనేవాడు కాదు. కూర వండుకుంటే డబ్బులు ఖర్చు అవుతాయని వండుకునేవాడు కాదు. ఉత్త అన్నము ఎలా తినాలి అని దానిలోకి కొరుక్కుని తినేందుకు మిరపకాయను అన్నము ప్రక్కన పెట్టుకునేవాడు. అయితే ఆ మిరపకాయను కూడా తినేవాడు కాదు. ఉత్త అన్నము ముద్ద లోపల పెట్టుకొని, మిరపకాయను చూస్తూ, రెండో ముద్దకు కొరుక్కుందాములే అనుకొనేవాడు. అలా చివరికి అన్నము అయిపోయేది కానీ మిరపకాయ అట్లే ఉండేది. ఈ రకముగా చివరికి మిరపకాయను కూడా మిగుల బెట్టుకునేవాడు. ఇలాంటి బ్రతుకు బ్రతుకుతూ 20 ఎకరాలు సంపాదించి ఒకరోజు గబుక్కున చనిపోయాడు. అప్పుడు వాని కొడుకుకు ఏమి చేయాలో అర్థము కాలేదు. ఎందుకంటే అతను ఎప్పుడు ఏ పని చేసి ఎరుగడు. అంతేకాకుండ వానికి వాని తండ్రి డబ్బు విలువ ఏమిటో కూడా నేర్పలేదు. అయితే ఒకరోజు వాడు బెంగుళూరులో ఉన్న తన ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. టాక్సీలో వెళ్లామని టాక్సీ ఎక్కాడు. తాను కూర్చున్న


---

సిద్ది బోధ

సీటు బాగోలేదని టాక్సీ డ్రైవరు మీద కసురుకున్నాడు. దానికి వాడు పది నిమిషాలు కూర్చుని వెళ్ళేదానికి సీట్లు బాగుంటే ఏమిటీ లేకపోతే ఏమిటీ నీవు ఏమైనా నా బండిని కొంటావా అని అన్నాడు. దానికి వాడు పౌరుషానికి పోయి, నేను కొనలేననుకున్నావా! అని చెప్పి, అప్పటికప్పుడు డబ్బులిచ్చి కొనుకున్నాడు. తీరా ఆ టాక్సీలో ఇంటికి వెళ్ళాలనుకుంటే వాళ్ళ ఇల్లు సందుల మధ్య ఉండటము వలన, ఆ సందులో టాక్సీ పట్టకపోవడముతో దానిని వేరేవాళ్ళ ఇంటిలో పెట్టి చేసేది ఏమీలేక నడుచుకుంటు ఇంటికి పోయాడట. ఈ రకముగా ముందు వెనుక ఆలోచన చేయకుండ, ఏది పడితే అది కొంటు, డబ్బును వృథాగా ఖర్చు చేసి చివరికి బీదవాడై పోయినాడు. బుచ్చయ్య తన కొడుకు దర్జాగా బ్రతుకడము కోసము సంపాదించిన డబ్బు కొడుకు తిన్నాడా అంటే లేదు, పోనీ బుచ్చయ్య అయినా తిన్నాడా అంటే లేదు. అతను జీవితాంతము కష్టపడి సంపాదించినందుకు ఏమీ ప్రయోజనము లేకుండా పోయింది. అందుకే మన పెద్దలు 'పాచి పళ్ళోడు సంపాదిస్తే బంగారు పళ్ళోడు తినిపోయాడట' అని సామెత చెప్పుతారు.


ఈ రకముగా మనిషి ఎంత డబ్బు సంపాదించినా, వాని జన్మకు సార్థకత లేకుండా పోతుంది. మనిషి జన్మకు సార్థకత ఉండాలంటే సంపాదించుకోవలసినది డబ్బు కాదు జ్ఞానము. ఈ రోజు మేము కొన్ని మతాలవారిని చూస్తున్నాము. వారు అప్పటికి తినేదానికి చూస్తారు, హాయిగా తింటారు, హాయిగా బ్రతుకుతారు. వారి పిల్లలకు జ్ఞానము సంపాదించి పెడితే చాలు అనుకుంటారు. వారిని చూస్తే మాకు చాలా సంతోషము అనిపిస్తుంది. కానీ హిందువులు అలాకాదు. మన పిల్లలకు సంపాదించి పెట్టి, వారి పిల్లలకు కూడా సంపాదించి పెట్టాలని అనుకుంటు దేవుని


---

మీద ఏమాత్రము ధ్యాస లేకుండా బ్రతుకుతున్నారు. మీకు దేవుని మీద ధ్యాస ఉందా అని వారిని అడిగితే, ఎందుకు లేదు! మేము ఉగాది రోజు గుడికి వెళ్ళి టెంకాయ కొట్టి వస్తున్నాము కదా! అంటున్నారు. అంటే ఉగాది రోజు ఒక్కరోజు వెళ్ళి టెంకాయ కొట్టి వస్తే జ్ఞానము వచ్చేస్తుందా? దేవుడు తెలియబడుతాడా? అని అడుగుచున్నాను. ఈ రకముగా వారికి జ్ఞానము తెలియక పోగా, ఎవరయినా వారికి జ్ఞానము చెప్పితే వారిని హేళనగా మాట్లాడుతున్నారు. అటువంటి వారికి మేము ఏమి చెప్పుచున్నా మంటే! మీ జీవితము సార్థకము కావాలంటే మీరు డబ్బు సంపాదించు కుంటు, మీ వెనుక ఉండే వాళ్ళకు సంపాదించి పెట్టాలి అనుకోకుండ, మీరు జ్ఞానము తెలుసుకొని, మీ వెనుక ఉండే వారికి కూడా జ్ఞానము సంపాదించి పెట్టమని చెప్పుచున్నాము. నేను ఎంతోకాలము బ్రతుకుతాను అని అనుకునేబదులు ఇప్పుడే చనిపోతాను అనుకొని జ్ఞానమును తెలుసుకునేందుకు ప్రయత్నము చేయమని చెప్పుచున్నాము.


మేము ఏప్రిల్ 5, 1950న పుట్టాము. ఈ దినము ఏప్రిల్ 5, 2016. కావున ఈ రోజు నా పుట్టినరోజు అని అందరూ అనుకుంటుంటారు. కానీ ముందు మరణము, ఆ తరువాత జననము అను సూత్రము ప్రకారము మేము ఈ దినమును మా మరణ దినము క్రిందికే లెక్కవేసుకుంటాము. ఈ దినము నేను పుట్టిన దినము అని మీరు అనుకోవచ్చు. కానీ నేను మాత్రము చచ్చిన దినమనే అనుకుంటాను. అంతేకాకుండ ఆ రోజు నేను ఎవరు? ఎందుకు పుట్టాను? పోయిన జన్మలో ఏమి చేశాను? ఈ జన్మలో పుట్టి నేను ఎంత జ్ఞానము తెలుసుకున్నాను? తెలుసుకున్న జ్ఞానమును ఇతరులకు ఎంత అందించాను? అని జ్ఞాపకము చేసుకుంటాను. ప్రస్తుతము మనము పుట్టేఉన్నాము కావున పుట్టినరోజును గురించి చెప్పుకోవలసిన


---

అవసరము లేదు. కానీ మనము చనిపోయే దినము వస్తుంది. కాబట్టి చావును గురించి కొంత చెప్పుకుందాము. కాలము గడిచేకొద్ది చావు దగ్గరకు వస్తుందని అందరికీ తెలుసు. అందుకని నేను చాలామందికి ఈ విధముగా చెప్తుంటాను. ప్రతి మనిషికి చావు దగ్గరవుతూ ఉంటుంది. ఈ సంవత్సరము పుట్టిన రోజు చేసుకుంటే, రేపు సంవత్సరము పుట్టినరోజు చేసుకుంటామో లేదో కూడా తెలియదు. ఈ రోజు మాట్లాడేటటువంటి శరీరము రేపు మాట్లాడకుండ మూగబోతుంది. కదిలే శరీరము కదలకుండా నిలిచిపోతుంది. ఆ రోజు ఈ కదిలే శరీరమునకు అలవాటు పడినవారు కదలని శరీరముతో మనకు ఇక పనిలేదు అనుకుంటారు. కానీ మేము ఏమి చెప్పుచున్నామంటే! మేము కదిలినా, కదలకున్నా మీరు మా జ్ఞానానికి అలవాటు పడాలి. కానీ నాకు అలవాటు పడకూడదు. నాకు అలవాటు పడకూడదు అంటే నాతో మాట్లాడాలనికానీ, నన్ను చూడాలనికానీ అనుకోకూడదు. నా జ్ఞానమును తెలుసుకోవాలని అనుకోవాలి. అయితే నా పుట్టినరోజు సందర్భముగా ఎంతోమంది నన్ను దర్శించుకోవాలని, నాకు పాదనమస్కారము చేసుకోవాలని వస్తుండేవారు. వారికి నేను దేవునికి ఒక్కనికే పాదనమస్కారము చేయాలి. మామూలు మనిషిగా ఉన్న నాకు పాదనమస్కారము చేయవద్దు అని చెప్పేవాడను. అయినా కొందరు మేము బయటికి రాగానే ఠక్కున పాదాల మీద పడిపోయి నమస్కారము చేసేవారు. మాకు అలవాటు పడవద్దండి అని మేము ఎంత చెప్పినా వినకపోవడముతో, ఆ అలవాటును తప్పించి, వారిని మా జ్ఞానమునకు దగ్గరగా చేయుటకు మేము ఎవరికీ కనిపించకుండా ఉండిపోయాము. అంతేకాకుండ మమ్ములను చూడాలని అనుకున్న వారిని కూడా మా వద్దకు రానివ్వకుండ చేశాము. మాకు తప్పనిసరిగా దర్శనము కావాలని అన్న వారిని మీరు అన్ని


--

గ్రంథములు చదివి తరువాత మా దగ్గరకు రండి అని చెప్పేవారము. ఇంకా కృష్ణమందిరము ఎదురుగా ఉన్న పందిరిలో మాకు ఒక సమాధిని కూడా ఏర్పాటు చేసుకున్నాము. రేపు ప్రొద్దున్న చనిపోతే మమ్ములను ఇక్కడే సమాధి చేస్తారు. అప్పుడు మా ఆకారము అట్లే ఉంటుంది. ఆ రోజు మీరు ఆ సమాధిని చూసుకోవాల్సిందేకానీ మమ్ములను చూచేదానికి కాదు అని చెప్పేవారము. మిమ్ములను మా నుంచి దూరముగా చేసి, జ్ఞానానికి దగ్గరగా చేయాలనే ఉద్దేశముతో ఇవన్నీ చేస్తున్నాము. కాబట్టి నన్ను చూడాలనే ప్రయత్నము చేయకుండా నా జ్ఞానము తెలుసుకోవాలనే ప్రయత్నము చేయండని చెప్పుచున్నాము.


ప్రతి పౌర్ణమికి మా ప్రవచనము వినుటకు ఎంతోమంది దూర ప్రాంతాలనుండి వచ్చేవారు. ఆ ముందు రోజు క్షణక్షణము ఆటోలు వస్తుండేవి. మేము కూడా నిద్రపోకుండా తెల్లవార్లు వారిని గమనిస్తూనే ఉండేవారము. మందిరములో అంతమంది పడుకునేదానికి సౌకర్యముగా లేకపోయినా, ఎలాగోలా సర్దుకొని, ఇబ్బందులకు ఓర్చుకొని మా జ్ఞానమును తెలుసుకోవడము చూచి మేము సంతోషించేవారము. వారు అంత శ్రమ పడి వచ్చినందుకు ఫలితముగా నేను వారికి ప్రత్యేక జ్ఞానమును అందించాలని అనుకునేవాడను. ఎటువంటి జ్ఞానము చెప్పేవాడినంటే జ్ఞానము అర్థము అయిన తరువాత దానినుండి ఎవడూ ప్రక్కకు పోయేదానికి అవకాశము ఉండేది కాదు. అర్థము చేసుకోకుండా మా మీద ఆరోపణలు చేసేవారు కూడా కొందరున్నారనుకోండి. అదీ మేము హిందూధర్మ రక్షకులము అని పేరు పెట్టుకున్నవారే మా మీద ఆరోపణలు చేసేవారు. అది మంచి పద్ధతి కాదని చెప్పేవారము.


---

మేము ప్రతి ఊరిలో, ప్రతి ఇంటి ఇంటికి తిరిగి జ్ఞాన గ్రంథాలను అందించడము వలన నేడు ఆంధ్రా అంతా మా జ్ఞానము ప్రచారమైనది. అయితే మూడు ఊర్లలో మాత్రము కొంత వ్యతిరేకత ఎదురయినది. అక్కడి హిందువులు మీరు, మీ జ్ఞానమును ఇక్కడ ప్రచారము చేయవద్దు అన్నారు. ప్రచారము చేయాల్సిన అవసరము మాకు లేదు. కానీ మీ మేలు కోరి మీకు జ్ఞానాన్ని అందించడానికి వచ్చాము అని చెప్పాము. అయినా ప్రచారము ఎందుకు చేయవద్దంటున్నారు? అని మేము వారిని అడిగితే, మీది హిందూ జ్ఞానము కాదు, పరమత జ్ఞానము అన్నారు. దేని ఆధారముగా పరమత జ్ఞానమని అంటున్నారు? అని అడిగాము. దానికి వారు మీ సిద్ధాంతము పేరు త్రైత సిద్ధాంతము కదా! త్రైతము అంటే త్రిత్వమే కదా. త్రిత్వము క్రైస్తవులదే కదా అంటున్నారు పెద్ద వాళ్ళకు ఏదో జ్ఞానము తెలిసినట్లు! త్రైత అంటే

ంటే త్రిత్వము అయితే, అద్వైత అనే పదానికి కూడా ఒక రకముగా త్రిత్వము అనే అర్థమే వస్తుంది. మరి అద్వైతసిద్ధాంతము ఆచరిస్తున్న మీరందరూ ఏమౌతారు? అని అడుగుచున్నాము. నిజము చెప్పితే హిందువులకు హిందూమతములో సిద్ధాంతకర్తలు ఎవరో తెలియదు. ఎవరెవరు ఏ ఏ సిద్ధాంతములు చెప్పారో కూడా తెలియదు. అటువంటిది మేము హిందూ సిద్ధాంతమైన త్రైత సిద్ధాంతము చెప్తుంటే దానిని క్రైస్తవమునకు సంబంధించినది అంటున్నారు. అటువంటివారి కోసమే “హిందూమతములో సిద్ధాంత కర్తలు" అను గ్రంథమును వ్రాశాము.


ఇంకా కొంతమంది హిందువులు మేము చెప్పేది జ్ఞానమే కాదు అంటున్నారు. అటువంటివారికి నేను ఏమి చెప్తున్నానంటే! మా జ్ఞానము ఎంత శక్తివంతమైనదో తెలియుటకు ఈ మధ్య జరిగిన యదార్థసంఘటన చెప్తాము వినండి. నెల్లూరు దగ్గర ఆత్మకూరు నుండి ఒక ముస్లీము మా


---

దగ్గరకు రావడము జరిగినది. అతను కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ రోగముతో బాధపడుతున్నాడు. దానికోసము 25 లక్షల రూపాయల దాకా ఖర్చు కూడా చేశాడు. అయినా అది బాగు కాలేదు. అయితే అతని సహ ఉద్యోగి సుధాకరాచారి అను పేరు గల వ్యక్తి, అతని విషయము తెలుసుకొని గ్రంథముల శక్తిని గురించి వివరించి చదువుకోమని చెప్పాడట. అయితే ఒకరోజు విపరీతముగా కడుపునొప్పి వస్తే అది చూడలేక సుధాకరాచారి “దేవాలయ రహస్యములు" అను గ్రంథమును అతని కడుపు మీద పెట్టగా, ఆ గ్రంథము అతని శరీరమునకు కర్చుకొని పోయింది. 8 గంటలు కర్చుకొని ఆ తరువాత దానంతట అదే ఊడివచ్చిందట. 8 గంటలు కర్చుకున్నందుకు అతని క్యాన్సర్ రోగము 75 శాతము తగ్గిపోయినది. కొన్ని సంవత్సరాలుగా 25 లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకున్నా నయము కాని క్యాన్సర్, మా గ్రంథము పెట్టుకోవడము వలన నయమయినదని అతను మా మందిరమునకు వచ్చి వారము రోజులు నిదుర చేసి, మమ్ములను కలిసి వెళ్ళడము జరిగినది. అట్లే మరొకచోట ఒక డాక్టర్ ఐదు నెలల చిన్నపిల్లవానికి పిర్రమీద ఇంజక్షన్ చేస్తే, అది గడ్డకట్టి పిల్లవాడు నొప్పితో ఏడుస్తుంటే, ఏమి చేయాలో అర్థముకాక అతని తల్లితండ్రులు మా గ్రంథమును పెడితే అది ఆ చిన్నపిల్లవానికి కరుచుకుందట. అప్పుడు వాడు ఏడుపు ఆపేశాడట. ఆ చిన్నపిల్లవాడు కూడా ముస్లీమే. ఇవే కాదు ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరిగాయి. మా గ్రంథములను నమ్మకముతో పెట్టుకున్నవారికి అవి క్యాన్సర్, ఎయిడ్స్ వంటి భయంకర కర్మలను కూడా లేకుండా చేసిన సందర్భములు కలవు. ఇటువంటి భయంకర కర్మలను కాల్చే శక్తి మా గ్రంథములలో తప్ప ప్రపంచములోని ఏ గ్రంథములలోను లేదని ధైర్యముగా చెప్పుచున్నాము. జ్ఞానము అనే అగ్ని కర్మలను కాల్చివేస్తుంది


---

అని దేవుడు గీతలో చెప్పిన మాటను ఆయన మా గ్రంథముల ద్వారా మనుషుల కర్మలను కాల్చి నిరూపణ చేసుకున్నాడని చెప్పవచ్చును.

దేవుడు భగవద్గీతలో చెప్పిన సిద్ధాంతమును ఆధారము చేసుకొనే మేము త్రైత సిద్ధాంతము అని పేరు పెట్టి భగవద్గీతను వ్రాశాము. ఒకే సిద్ధాంతము మీద ఇప్పటికి నూరు (100) గ్రంథములు వ్రాశాము. ఇలా ఒకే సిద్ధాంతము మీద నూరు గ్రంథములు వ్రాసిన వారు ప్రపంచములో ఎవరూ లేరని చెప్పవచ్చును. మా గ్రంథములలో మూడు మతాలకు సంబంధించిన జ్ఞానము ఉన్నది కనుకనే వాటికి కర్మలను తీసివేసే శక్తి ఉందని చెప్పవచ్చును. అయితే కేవలము హిందూ మతానికి సంబంధించిన గ్రంథములకే కర్మలను కాల్చే శక్తి ఉందా? లేక మిగతా మతాలకు సంబంధించిన గ్రంథములకు కూడా ఆ శక్తి ఉందా? అని కొందరు అడుగవచ్చును. మాకు అన్ని మతాలు సమానమే. ఇక్కడ ఒక మతము ఎక్కువగా, ఇంకో మతము తక్కువగా ఎప్పుడు చెప్పబడదు. మూడు మతాలకు సంబంధించిన గ్రంథములలో ఒకే జ్ఞానము ఉంది. కావున మూడు మతాలకు సంబంధించిన గ్రంథాలలో కూడా ఒకే విధమైనటువంటి శక్తి ఉందని చెప్పవచ్చును. గ్రంథములు కర్చుకొని బాధలను లేకుండా చేయడము అనేది ప్రత్యక్షముగా జరుగుచున్నటువంటి ఒక వింత అయినప్పటికీ, జనవిజ్ఞాన వేదిక వారు ఇటువంటి వాటిని మూఢనమ్మకాలనీ, దేవుని పేరుతో ప్రజలను మోసము చేస్తున్నారనీ కొట్టి పారేస్తుంటారు. వారిని ఒకసారి మేము ఇలా అడిగాము. గ్రంథాలు శరీరాలకు ప్రత్యక్షముగా కర్చుకుంటున్నాయి కదా! కర్చుకోవడమే కాకుండ రోగమును కూడా లేకుండా చేస్తున్నాయి కదా! అందులో ఏమి మోసము ఉంది? వీడియోలు కూడా ఉన్నాయి. కావాలంటే చూసి చెప్పండి అంటే, మా దగ్గర డి.వి.డి ప్లేయర్


---

లేదు అన్నారు. మేము చూడమని వారికి డి.వి.డి. ప్లేయర్ కూడా ఇస్తే మాకు చూచేదానికి సమయము లేదు అంటున్నారు. ఈ రకముగా సమాధానము చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. వారికి మేము ఏమి చెప్పుచున్నామంటే! మా గ్రంథములలో ఉండే జ్ఞానము సత్యమైనది. సత్యమైన జ్ఞానమునకు అపజయము ఉండదు, దానిని ఎవరూ ఖండించలేరు అని చెప్పుచున్నాము.


మేము 1986 నుంచి జ్ఞానపరీక్షలు నిర్వహిస్తు వస్తున్నాము. అయితే ఏప్రిల్ 5, 2016న మా పుట్టినరోజు సందర్భముగా జ్ఞాన పరీక్ష నిర్వహించడము జరిగినది. ఆ రోజు పౌర్ణమి కూడా కావడముతో మా జ్ఞానమును వినుటకు వచ్చిన వారందరు కూడా పరీక్షలో పాల్గొనడము జరిగినది. దాదాపు 1000 మంది దాకా వ్రాశారు. వారిలో హిందువులు, క్రైస్తవులు, ముస్లీములు మూడు మతాల వారు ఉన్నారు. జ్ఞానపరీక్షలో మేము ఒక ప్రశ్నాపత్రము ఇస్తాము. అందులో పది (10) ప్రశ్నలు ఉంటాయి. అయితే జ్ఞానపరీక్షలో పాల్గొనాలనుకున్నవారికి తమకు చేతనయినంత డబ్బు కట్టి అంటే 10 రూపాయల నుండి 100 రూపాయల వరకు కట్టి పాల్గొనమని చెప్తాము. వారు ఇచ్చిన ఆ డబ్బును ఆ పరీక్షలో పదికి పది మార్కులు సంపాదించుకున్నవానికి ఇవ్వడము జరుగుతుంది. అలా ఎందుకనగా! కనీసము ప్రైజ్మనీ కోసమైన ఎక్కువమంది జ్ఞానపరీక్షలో పాల్గొని, జ్ఞానానికి దగ్గర అవుతారనే ఉద్దేశముతో వారిని ఉత్సాహరించేందుకే అలా చేస్తాము కానీ వేరు ఏమీ కాదు. అంతేకాకుండ మేము పరీక్ష వ్రాసేవారిని ఒకరికొకరు చూచుకొనే వ్రాయండి ఏమీ ఫరవాలేదని చెప్తాము. ఎందుకంటే వారు చూచుకొని వ్రాసినా, వారికి పదికి పది మార్కులు రావని మా నమ్మకము. ఎందుకంటే ప్రశ్నపత్రము మేము అలా తయారు


---

చేసియుంటామన్నమాట. అలా ఎందుకు చేస్తామంటే! ఒకవేళ పదికి పది మార్కులు వస్తే వారు తమను తాము మేము సంపూర్ణ జ్ఞానులము అనుకునే అవకాశము ఉంది. అలా అనుకోవడము వలన వారు జ్ఞానములో ముందుకు పోలేరు. అలా వారు జ్ఞానములో ఆగిపోకుండా ముందుకు పోవాలనే ఉద్దేశ్యముతోనే మేము ప్రశ్నలు తయారు చేస్తాము. ఆ రోజు పరీక్ష ముగిసిన తరువాత రాత్రంతా మేలుకొని 1000 పేపర్లు కూడా స్వయముగా దిద్దాము. ఆ ప్రశ్నలు వాటి సమాధానములు తరువాత అందరికి సమావేశములో చెప్పడము జరిగినది. అందులోనుండి ఒక ప్రశ్నను గురించి ఇప్పుడు చెప్పుకుందాము. ఆ రోజు జ్ఞానపరీక్షలో "ఏకేశ్వరోపాసన ఎవరికి అవసరము? హిందువులకా, క్రైస్తవులకా, ముస్లీములకా?” అను ప్రశ్న ఇచ్చాము. దానికి పరీక్షలో పాల్గొన్న అందరూ అంటే హిందువులు, క్రైస్తవులు, ముస్లీములు అందరూ

“అందరికీ అవసరమే” అని వ్రాశారు. ఆ ప్రశ్నకు మా జవాబు కూడా అదే కావున దానిని సరియైన జవాబుగా లెక్కించి అందరికీ ఒక్కమార్కు ఇవ్వడము జరిగినది. అయితే ఇక్కడ 'అందరికీ అవసరము' అనే జవాబును చూచి కొందరు నన్ను ఈ విధముగా ప్రశ్నించవచ్చును.


ముస్లీములు అల్లాహ్ ఒక్కడే అని, ఆయన ఒక్కడినే విశ్వసిస్తున్నారు కదా! అటువంటపుడు వారు ఏకేశ్వరోపాసన చేస్తున్నట్లే కదా. అట్లే క్రైస్తవులు కూడా యోహెూవా ఒక్కడే దేవుడు అంటారు అంటే వారు కూడా ఏకేశ్వరోపాసన చేస్తున్నట్లే కదా. ఇక హిందువుల విషయానికి వస్తే, వాళ్ళు రకరకాల దేవతలను పూజిస్తున్నారు కావున “హిందువులకు ఏకేశ్వరోపాసన అవసరము” అని చెప్పడము ఆ ప్రశ్నకు సరియైన జవాబు అవుతుంది కానీ “అందరికీ అవసరము” అనేది సరియైన జవాబు ఎలా


---

కాగలదు? ఎందుకంటే ముస్లీములు, క్రైస్తవులు ఏకేశ్వరోపాసనలోనే ఉన్నారు కదా? అని అడుగవచ్చును. దానికి నా సమాధానము ఏమనగా! హిందువులు అనేక రకాల దేవుళ్ళను ఆరాధిస్తున్నారను విషయము అందరికీ తెలిసినదే. ఒకడు రాముడిని ఆరాధిస్తే, ఇంకొకడు ఆంజనేయుడిని ఆరాధిస్తున్నాడు. రాముడిని ఆరాధించువాడు, ఆంజనేయుడిని ఆరాధించేవాడిని చూచి నీవు రాముని కాళ్ళ దగ్గర కూర్చునే ఆంజనేయుడిని ఆరాధిస్తున్నావు కావున ఆంజనేయుడిని ఆరాధించే నీకన్నా రాముడిని ఆరాధించే నేనే గొప్ప అని అంటున్నాడు. దానికి జవాబుగా ఆంజనేయుడి భక్తుడు సీతను తీసుకొచ్చింది మా ఆంజనేయుడే కదా! మా ఆంజనేయుడు సహాయము చేయకపోతే మీ రాముడు అడవుల వెంటే తిరిగేవాడు కాబట్టి రామున్ని పూజించే మీకన్నా ఆంజనేయుడిని పూజించే నేనే గొప్ప అంటున్నాడు. వీళ్ళకు రామునిలో ఏదో గొప్పతనము కనిపించియుంటే, వారికి ఆంజనేయునిలో ఏదో గొప్పతనము కనిపించియుంటుంది. ఈ రకముగా రాముడిని, ఆంజనేయుడిని ప్రక్క ప్రక్కనే పెట్టుకొని మీ రామున్ని మేము మ్రొక్కము అని ఆంజనేయుడి భక్తులు ఎలా అంటున్నారో, మీ ఆంజనేయుడిని మేము మ్రొక్కము అని రాముడి భక్తులు ఎలా అంటున్నారో అట్లే ముస్లీములు మా అల్లాహ్ను తప్ప మేము క్రైస్తవుల యోహెూవాను కానీ, హిందువుల కృష్ణున్ని కానీ మ్రొక్కము అంటున్నారు. ముస్లీములు దేవుడు (అల్లాహ్) ఒక్కడే అన్నాగానీ, మా అల్లాహ్ను తప్ప మేము వేరే దేవున్ని మ్రొక్కము అంటున్నారంటే హిందువులకు, క్రైస్తవులకు ఇంకొక దేవుడు ఉన్నాడని వారు ఒప్పుకున్నట్లే కదా! అటువంటపుడు అది ఏకేశ్వరోపాసన ఎట్లు అవుతుంది? ప్రపంచానికంతా దేవుడు ఒక్కడే అని విశ్వసించి ఆయనను మాత్రమే మ్రొక్కడము ఏకేశ్వరోపాసన అవుతుంది


---

కానీ మా దేవుడు వేరు, వాళ్ళ దేవుడు వేరు అనుకున్నప్పుడు అది ఏకేశ్వరోపాసన కాదు. దీనినిబట్టి ముస్లీములలో ఏకేశ్వరోపాసన లేదని వారికి కూడా అది అవసరమని తెలియుచున్నది. అట్లే క్రైస్తవులు కూడా మేము మా యోహెూవాను తప్ప ముస్లీముల అల్లాహ్నుగానీ, హిందువుల కృష్ణున్నిగానీ మ్రొక్కము అంటున్నారు. మా యోహెూవా వేరు, వాళ్ళ అల్లాహ్ వేరు అన్నప్పుడు ఇంకొక దేవుడు ఉన్నాడు అనే గ్రుడ్డితనము వారిలో ఉన్నట్లే కదా! అటువంటపుడు అది కూడా ఏకేశ్వరోపాసన కాదు. అందువలన క్రైస్తవులకు కూడా ఏకేశ్వరోపాసన అవసరము. అట్లే హిందువులు మా కృష్ణున్ని తప్ప మేము ముస్లీముల అల్లాహ్నుగానీ, క్రైస్తవుల యోహెూవాను గానీ మ్రొక్కము అంటున్నారు అంటే వారి మనస్సులో కూడా వాళ్ళ దేవుడు కాకుండ వేరే దేవుడు ఉన్నాడు అను భావన ఉన్నట్లే కదా! కాబట్టి వీరికి కూడా ఏకేశ్వరోపాసన అవసరమే.


హిందువుల కృష్ణుడు వేరు, క్రైస్తవుల యెహెూవా వేరు, ముస్లీముల అల్లాహ్ వేరు అను భావము మనసులో ఉన్నంతవరకు ఎవడూ ఏకేశ్వరోపాసనలో లేనట్లే. ఎప్పుడయితే ముస్లీములు మా అల్లాహ్, క్రైస్తవులు యెహెూవా అనే పేరుతో, హిందువులు కృష్ణుడి పేరుతో పిలుస్తున్నారని అనుకుంటారో, ఎప్పుడయితే క్రైస్తవులు మా యెహెూవానే ముస్లీములు అల్లాహ్ పేరుతో, హిందువులు కృష్ణుని పేరుతో పిలుస్తున్నారనీ అనుకుంటారో, ఎప్పుడయితే హిందువులు మా కృష్ణున్నే ముస్లీములు అల్లాహ్ పేరుతో, క్రైస్తవులు యెహెూవా పేరుతో పిలుస్తున్నారని అనుకుంటారో అప్పుడు కృష్ణుడు, యోహెూవా, అల్లాహ్ ముగ్గురు కాదు ఒక్కడే అనే భావన అందరిలో వచ్చేస్తుంది. అప్పుడు అది ఏకేశ్వరోపాసన అవుతుంది. కానీ నేడు ఒక హిందువు భగవద్గీతను తీసుకొని వెళ్ళి ముస్లీములకు ఇస్తే


---

వీళ్ళు వారి గ్రంథాలు మనకు ఇచ్చి వీళ్ళ దేవున్ని మనలను అంటగట్టడానికి వచ్చారు అనుకుంటున్నారు. క్రైస్తవులు మా ఏసుప్రభువు చెప్పిన బైబిలు తప్ప మేము ఏ గ్రంథమును చదవము, చూడము అంటున్నారు. హిందువులు కూడా ముస్లీముల గ్రంథాల వైపు చూడడము లేదు. ఈ రకముగా మూడు మతాల మధ్య ఐక్యమత్యము అనునది ఏమాత్రము లేదు.

కానీ మా జ్ఞానము తెలుసుకునేవారిలో మూడు మతాలవారు ఉన్నారు. మా జ్ఞానము తెలిసిన ముస్లీములు భగవద్గీత, బైబిలును చూచి ఇది మా అల్లాహ్ జ్ఞానమే అంటున్నారు. అట్లే క్రైస్తవులు భగవద్గీత, ఖుర్ఆన్ను చూచి ఇది మా యెహెూవా జ్ఞానమే అంటున్నారు. అట్లే హిందువులు మేము వ్రాసిన ఖుర్ఆన్ను చదివి ఇంతవరకు మేము ఖుర్ఆన్ కేవలము ముస్లీముల గ్రంథమే అనుకున్నాము, అది మా గ్రంథము కూడా అని అంటున్నారు. అంతేకాక మా గ్రంథముల ద్వారా అల్లాహ్ అను పదమునకు అర్ధము తెలిసి, మేము అల్లాహ్ అను పదములో ప్రతి అక్షరానికి ప్రతి శబ్దానికి అర్థము చెప్పుతాము మీరు చెప్పగలరా? అని హిందువులు ముస్లీములకు సవాలు విసురుతున్నారు. దానికి ముస్లీములు సమాధానము చెప్పలేకపోవుచున్నారు. హిందువులు ఖుర్ఆన్న ఇది మా కృష్ణుని జ్ఞానము అని చెప్పుకుంటున్నారు. అట్లే మా జ్ఞానము తెలిసిన ముస్లీములు మేము వ్రాసిన భగవద్గీతను చదివి, ఇది మా అల్లాహ్ జ్ఞానమే అంటున్నారు. అంతేకాక సంతోషముగా కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొంటున్నారు. ప్రపంచానికంతా ఒక్కడే దేవుడు అయినప్పుడు, ఎవరు మ్రొక్కినా ఆయనను మ్రొక్కాల్సిందే ఇంకొకడు లేడు అనే ఉద్దేశముతో వారు పాల్గొంటున్నారు. ముస్లీములు కృష్ణాష్టమి వేడుకలలో మనస్ఫూర్తిగా పాల్గొంటున్నారు అంటే మా జ్ఞానము అర్థమయ్యే కదా! లేకపోతే ఎందుకు పాల్గొంటారు! మీ


---

సిద్ది బోధ

వారిని,

జ్ఞానమును మా ఊరిలో ప్రచారము చేయవద్దు అన్న విశ్వహిందు పరిషత్ . మేము హిందూ ధర్మాన్ని రక్షించేవారము అని పేరు పెట్టుకున్నవారిని మేము ఇలా అడుగుతున్నాము. మీరు ఎక్కడయినాగానీ, ఏ పండుగలలో అయినాగానీ, మీ దేవుని ఊరేగింపులోగానీ ఒక్క ముస్లీమునయినా పిల్చుకున్నారా? అని అడుగుచున్నాము. మామూలుగా హిందువులు ఏదైనా ప్రసాదము పెడితే ముస్లీములు తినరు. ముట్టను కూడా ముట్టరు. విసిరి పారేస్తారు. అటువంటి వారు మా జ్ఞానము తెలిసిన తరువాత కృష్ణాష్టమి వేడుకలకు హాజరవడమే కాక, వారి మొఖాన దేవుని చిహ్నాన్ని కూడా ధరిస్తున్నారంటే వారు దానిని ఎంత గౌరవిస్తున్నారో ప్రత్యక్షముగా తెలుస్తున్నది. అంతేకాక వాళ్ళు మా అల్లాహ్ యే కృష్ణునిగా ఉన్నాడని అంటున్నారు. హిందువులు మా కృష్ణుడే అల్లాహ్ ఉన్నాడని అంటున్నారు. అట్లే క్రైస్తవులు మా యెహోవానే అల్లాహ్, కృష్ణునిగా ఉన్నాడని అంటున్నారు. ఎప్పుడయితే మూడు మతాల వారు ఒకే దేవుడు ఉన్నాడని విశ్వసిస్తారో అప్పుడు ప్రపంచములో ఏకేశ్వరోపాసన వచ్చినట్లే. మా జ్ఞానము తెలిసిన తరువాత మూడు మతాల వారు అల్లాహ్, యెహెూవా, కృష్ణుడు ముగ్గురు ఒక్కడే అంటున్నారు కావున, మూడు మతాల వారిలో ఎటువంటి భేదాభిప్రాయము లేదు కావున, మేము చెప్పిన జ్ఞానము ద్వారా ప్రపంచములో ఏకేశ్వరోపాసన వచ్చేసినట్లే.


ఈ రోజు అనగా ఏప్రిల్ 5, 2016న మా పుట్టినరోజు. అంటే మేము 65 సంవత్సరములు పూర్తి చేసుకొని 66వ సంవత్సరములోనికి ప్రవేశించాము. ఇంకా ఎంతకాలము బ్రతుకుతానో నాకు తెలియదు. అయినాగానీ ఒక గ్రంథములో 72 సంవత్సరములు బ్రతుకుతామని వ్రాశాము. అయితే మా మాట మీద మాకే నమ్మకము లేదని చెప్పుచున్నాము.


---

TIME IS SHORT DO IT NOW అను మాట ప్రకారము మేము ఇంకా బ్రతుకుతాము అని అనుకుంటు, కాలమును వృథా చేయకుండా ఇప్పుడే చనిపోతాము అనుకొని పనులన్నీ తొందరగా పూర్తి చేస్తు పోతుంటాము. అంతేకాక మా మందిరములో మాకు ఒక గోరి కూడా కట్టుకున్నాము. చివరికి ఆ గోరిలోనికే మేము పోతాము. కాబట్టి మమ్ములను మాలాగా చూడకుండా గోరిగా చూస్తే మంచిదని చెప్పుచున్నాను. ఈ రోజు ఆయన పుట్టినరోజు అనుకుంటే చావు, గోరి అంటాడేమిటి? అనుకోవద్దండి. చావు అనేది ఎవరికయినా సహజమే. రేపు ప్రొద్దున్న మాకు ఇలా జరుగబోతుందని మీకు ముందే తెలియాలనే ఉద్దేశముతో ఇదంతా చెప్పుతున్నాను. ఆ చివరి గడియ వచ్చే లోపే మీకు జ్ఞానమును గొప్పగా అందించాలని అనుకుంటున్నాను. ఆ ప్రయత్నమే చేస్తున్నాను. మీకు జ్ఞానము చెప్పడమే కాకుండా, కనీసము ఒక గంట అయినా విశ్రాంతి తీసుకోకుండ మందిరము పనులు భక్తులతో చేపిస్తూ, మేము కూడా చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా అట్లే చేయాలనుకుంటున్నాము. కాబట్టి మీరు కూడా కాలమును నిద్ర పోయేదానికి, ఇంకా అనవసరమైన పనులకు వినియోగించ కుండా జ్ఞానాన్ని తెలుసుకునేదానికి ఉపయోగించడని చెప్పుచున్నాము. వేరే జ్ఞానాలు ఏమీ వద్దు కేవలము త్రైత జ్ఞానమును మాత్రమే తెలుసుకోండి అని చెప్పుచున్నాము.


అదేమయ్యా! నీవు చెప్పిన జ్ఞానమే గొప్పదా? నీవు చెప్పిన జ్ఞానాన్ని నీవే పొగుడుకుంటున్నావు అని మీరు అడుగవచ్చును. దానికి జవాబుగా నేను చెప్పిన జ్ఞానము కాదయ్యా ఇది. సృష్ఠి ఆదిలో దేవుడు చెప్పిన జ్ఞానము అని చెప్పుచున్నాము. నీవు చెప్తున్నది భగవద్గీతలోని జ్ఞానమే కదా. దేశములో 330 భగవద్గీతలు ఉన్నాయి. వాటన్నిటిలో లేని ప్రత్యేకత నీవు


---

చెప్పిన భగవద్గీతలో ఉందా? అని అడుగవచ్చును. దానికి నా జవాబు! 330 భగవద్గీతలలో శక్తి లేదు. కానీ నేను వ్రాసిన భగవద్గీతలో శక్తి ఉంది. అంతేకాకుండ భగవద్గీత ఆత్మ సంయమ యోగములో “అగ్నిలేనటువంటి వాడు, పనులు మానుకున్నటువంటివాడు సన్యాసి కాదని, అగ్ని ఉన్నటువంటి వాడు, పనులు చేసేవాడే నిజమైన సన్యాసి నిజమైన యోగి" అన్నారు. దానిప్రకారము మాలో అగ్ని ఉందని మేము నిరూపణ చేసుకున్నాము కాబట్టి మేము యోగి అని పేరు పెట్టుకున్నాము. యోగి ఏంటి “యోగీశ్వరుడు” అని పేరు పెట్టుకున్నాను. అట్ల మీరు ఎవరయినా పెట్టుకోగలరా? మీలో శక్తి ఉందని నిరూపణ చేసుకోగలరా? ఎవరూ చేసుకోలేరు. ఆయనంతకు ఆయన నాకు శక్తి ఉందని అంత గర్వముగా చెప్పుకుంటున్నాడేమిటి? అని మీరు అనుకోవచ్చును. దానికి నేను ఏమి చెప్పుచున్నానంటే! నేను నాకు మ్రొక్కమనో, నన్ను గొప్పగా చూచుకోమనో చెప్పియుంటే మీరు నాకు గర్వము ఉంది అనుకోవాలి. కానీ నేను అలా కాకుండ అందరిని నాతో సమానముగా కూర్చో పెట్టుకుంటున్నాను. వారు దూరముగా కూర్చున్నా నాకు వినపరాదని చెప్పి దగ్గరగా వచ్చి కూర్చోమని చెప్తాము. నాకు బాగానే వినిపిస్తుంది అయినాగానీ నేను వినపరాదనే చెప్తాను. ఎందుకంటే అలా చెప్తే అప్పుడయినా వారు నాకు దగ్గరగా కూర్చుంటారని. “తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును" అను వాక్యము ప్రకారము అలా చేస్తుంటాము. అందరూ ప్రబోధానంద స్వామీ అంటే ప్రత్యేకముగా ఉంటాడేమో అనుకుంటారు.


కానీ మేము ప్రత్యేకముగా ఏమీ ఉండము. మేమూ అందరిలాగే ఉంటాము. మా వేషధారణగానీ, మా నడవడికకానీ మామూలు మనుషుల మాదిరే ఉంటుంది. ఉదాహరణకు దినములో ఒక అర్థగంట సేపు అదీ


---

అత్యవసరము అనిపిస్తే అడ్డపంచ కట్టుకుంటాను లేకపోతే డ్రాయర్ బనియన్తోటే ఉంటాను. ఇంకా ఇతరులయినా చూచేదానికి కొంత బాగా కనిపిస్తారు కానీ నేను అంత బాగా కనపరాను. అయితే నేను ఏమి చెప్తానంటే మీరు చూడాల్సింది నన్ను కాదు, నాలో ఉండే జ్ఞానమును. నా జ్ఞానమును తెలుసుకుంటే మీకు జ్ఞానశక్తి వస్తుంది. అప్పుడు మీరు మానవులనుండి ప్రజలు కాగలరు.


నేను ప్రజలు, మానవులు అని చెప్పినప్పుడు కేవలము హిందువులలోనే ప్రజలు, మానవులు ఉన్నారు అని అనుకోకూడదు. అన్ని మతాల మనుషులలో కూడా ప్రజలు, మానవులు ఉన్నారని తెలియాలి. అయితే ఇక్కడ కొందరు ఒక ప్రశ్న ఇలా అడిగే అవకాశము కలదు. మీరు మను ధర్మాలను ఆచరిస్తున్నవారు మానవులు అని చెప్పారు. హిందువులలో మను ధర్మాలు ఉన్నాయి కావున వారిని ఆచరించే హిందువులు మానవులు అవుతారు అంటే ఒప్పుకోవచ్చు. అయితే ఇస్లామ్లో కానీ, క్రైస్తవములోకానీ మనుధర్మములు లేవు. లేనపుడు ఆచరించే అవకాశమే లేదు. కాబట్టి ముస్లీములు కానీ, క్రైస్తవులు కానీ మానవులు కారు. అటువంటపుడు మీరు అన్ని మతాల మనుషులలో మానవులు ఉన్నారు అని ఎలా చెప్పారు? అని అడుగవచ్చును. దానికి నా జవాబు ఇలా కలదు. మనుధర్మములు కేవలము హిందూమతములోనే ఉన్నాయని అనుకోవడము పొరపాటు. ఎందుకంటే మనుధర్మము అనేది మనిషి పుట్టినప్పుడే అతని తలలో నిక్షిప్తమై ఉంది. అందువలన ప్రతి మనిషి అతను ఏ మతస్థుడయినాగానీ పుట్టినప్పటినుండే అతనికి తెలియకుండానే మనుధర్మములను ఆచరిస్తున్నాడని చెప్పవచ్చును. అయినా ఫలానాది మనుధర్మము అని మూడు మతాల వారికి తెలియదు. అంతెందుకు నేడు పెద్ద పెద్ద హిందూపండితులు మనుధర్మము అని


---


చెప్తున్నారు. ఫలానాది మనుధర్మమని చెప్పమనండి చూస్తాము. వారు చెప్పలేరు. ఎందుకంటే చెప్పుకుంటే వారి ముఖాన వారే మసి పూసు కున్నట్లవుతుంది. ఎందుకంటే వారు మనుధర్మమునే ఆచరిస్తున్నారు. మనుధర్మాన్ని ఆచరిస్తే మనిషి చెప్పిన జ్ఞానాన్ని ఆచరించినట్లే. కాబట్టి మనుధర్మాలను వదిలి దేవుని ధర్మములను ఆచరించండి అని చెప్పు చున్నాము. నేను దేవుని ధర్మములను ఆచరిస్తూ, నా దగ్గరకు జ్ఞానము తెలుసుకొనుటకు వచ్చిన వారికి కూడా దేవుని ధర్మాలనే ఆచరించండని చెప్పుచున్నాను. కానీ మనుధర్మములను ఆచరించమని చెప్పలేదు.


త్రైత సిద్ధాంతము మా మతములో ఎక్కడుంది అని ఇతర మతస్థులు మమ్ములను అడుగడము జరిగినది. దానికి మేము ఏమి చెప్పామంటే! దేవుని జ్ఞానము ఒకటే అయినపుడు, ఆ ఒకటే జ్ఞానము మూడు గ్రంథాలలో ఉన్నప్పుడు, భగవద్గీతలో ఉన్న త్రైతసిద్ధాంతము మిగతా గ్రంథములలో కూడా ఉన్నట్లే కదా! అన్ని గ్రంథాలలో త్రైత సిద్ధాంతము ఉంది. కానీ మీరు అది కనుక్కోలేకపోయారు. ఉదాహరణకు భగవద్గీతలో "ఎవని భావములో అహంకారము లేదో వాడు లోకములో ఉన్నవారందరిని చంపినా వానికి పాపము రాదు, వాడు హంతకుడు కాదు” అని చెప్పారు. ఈ మాట అందరికి లోక విరుద్ధమైన మాటగా కనిపించవచ్చును. కానీ ఇది దేవుని చెప్పినమాట కాబట్టి వాస్తవము అని తెలియవలెను. అదే విషయమును బైబిలులో మరో రకముగా చెప్పుచూ “ఒక స్త్రీ ని మోహపు చూపుతో చూచిన ప్రతివాడు అప్పుడే తన హృదయములో ఆమెను వ్యభిచరించిన వాడగును” అని అన్నారు. గీతలో చంపినా పాపము రాదు అంటే, బైబిలులో వ్యభిచారము చేయకున్నా కేవలము అనుకున్నందుకు పాపము వస్తుంది అన్నారు. వాస్తవానికి ఆ రెండు మాటల భావము ఒకటే. అయినా అది అర్థముకాక వాటిని రెండు వేరు వేరు వాక్యాలు అనుకోవడము జరుగు


---

చున్నది. అట్లే త్రైత సిద్ధాంతము మూడు గ్రంథాలలో చెప్పబడియున్నా, మూడు రకాలుగా చెప్పడము వలన ఎవరూ కనిపెట్టలేకపోయారు. భగవద్గీతలో “క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు" అను ముగ్గురు పురుషులు లోకములో ఉన్నారని చెప్పితే, బైబిలులో అదే ముగ్గురిని “తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ” అని అన్నారు. వారినే ఖుర్ఆన్లో “తోలబడేవాడు, తోలేవాడు, సాక్షీ భూతుడు” అన్నారు. మూడు గ్రంథాలలో ముగ్గురిని వేరు వేరు పేర్లతో చెప్పినా, చెప్పినవాడు ఒక్కడే. ఆ విషయము తెలియక భగవద్గీత చెప్పినది కృష్ణుడని, బైబిలు చెప్పినది ఏసు అని, ఖుర్ఆన్ చెప్పినది అల్లాహ్ అని వారు ముగ్గురు వేరు వేరు అని అనుకుంటున్నారు. కానీ నేను ఏమి చెప్పుచున్నానంటే! జగత్తు అంతటికి ఒకడే భర్త ఉన్నాడు, వాడే దేవుడు. ఆ దేవుడు అణువణువునా వ్యాపించియున్నాడు. వాడినే జగద్భర్త అంటున్నాము. జగతికంతా ఒకడే భర్త అన్నప్పుడు జగతిలో ఉన్న ముస్లీములకు, హిందువులకు, క్రైస్తవులకు అందరికీ ఒకడే భర్త అనియే కదా అర్థము. దేవుడు అణువణువునా వ్యాపించియున్నాడు అన్నప్పుడు మనిషిలోపల కూడా ఉన్నాడనియే కదా అర్థము. అటువంటపుడు నీవు మనిషిలో ఉన్న దేవుడిని చూడు, మనిషిని చూడవద్దు. అట్లే నీవు మనిషి ఆకారాన్ని చూడవద్దు, ఆ ఆకారములో ఉన్న శక్తిని చూడు. అప్పుడు నీవు దేవునికి దగ్గర కాగలవు. అలాకాకుండ పైకి కనిపించే మనిషినే చూస్తే, దేవుడు కనిపించడు. ఈ రకముగా మనిషి తెలియక భ్రమలోపడి మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు అని, మా మతము వేరు, మీ మతము వేరు అని, మా జ్ఞానము వేరు, మీ జ్ఞానము వేరు అని అనుకోవడము జరుగుచున్నది. కానీ నేను ఏమి చెప్తున్నానంటే మూడు మతాలలో జ్ఞానము చెప్పినవాడు ఒక్కడే కావున మూడు మతాలు ఒక్కటే. అట్లే మూడు మతాలలో ఉన్న జ్ఞానము ఒక్కటే అని చెప్పుచున్నాము. దానినే త్రిమత ఏకైక జ్ఞానము అంటున్నాము.


---


చివరిగా చెప్పునదేమనగా! చావును తలచుకోవడానికి కూడా చాలామంది భయపడుతుంటారు. కానీ అటువంటి భయమేమీ లేదు. చావు ఏమీ భయంకరముగా ఉండదు. మనిషి బ్రతికియున్నప్పుడే భయంకర అనుభవాలు అనుభవిస్తున్నాడు. కానీ చావు అనేది చాలా సులభముగా వస్తుంది. మాకు కూడా వస్తుంది. అది వచ్చేలోపు మేము పుట్టినందుకు సార్థకతగా నాకు చేతనయినంత జ్ఞానమును మీకు అందించాలని అనుకున్నాను. అలానే అందిస్తున్నాను. కాబట్టి మీరు నేను చెప్పే జ్ఞానమునకు అలవాటుపడండి కానీ నాతో మాటలాడాలని గానీ, నన్ను చూడాలని గానీ అనుకోవద్దండి. ఇప్పటినుండి ప్రబోధానంద స్వామి లేడు అనుకోండి. ఎందుకంటే లేకుండా పోయేకాలమే రాబోతుంది. ఆ గడువు రాకముందే మీరు ఆ గడువుకు అలవాటుపడాలి. అప్పుడు ఆ రోజు ఏడ్చేవాళ్ళు ఉండరు. ఎందుకంటే ముందునుండి చెప్తునే ఉన్నాడు కదా! పోయే రోజు వస్తుందని అనుకుంటారు. ఇలా చెప్పకుండా ఉన్నట్టుండి ఒకరోజు పోతే ఆ ప్రొద్దు అందరూ కూర్చుని ఏడుస్తారు. తరువాత ఇక మాకు ఇక్కడ పనేమి లేదులే అనుకుంటారు. అలాకాకుండ నేను జీవించి ఉన్నా, లేకున్నా మీరు మందిరానికి వచ్చి జ్ఞానము తెలుసుకుంటుండాలనీ, మీరు మానవుల నుండి ప్రజలుగా మారాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.


సమాప్తము.

అసత్యమును వేయిమంది చెప్పినా, అది సత్యము కాదు,

సత్యమును వేయిమంది కాదనినా, అది  అసత్యము కాదు


---




Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024