pss book: గురు స్తోత్ర పంచకము.
గురు స్తోత్ర పంచకము.
ఆ॥ వె॥ విపుల శాస్త్రజ్ఞాని వేదాంత వేద్యుడు బ్రహ్మ తేజవదన భాసితుండు
సత్య శాంత రూప సద్గురు మూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేరి గొల్తు.
ఆ॥ ॥ అమృతంబు వంటి ఆత్మ బోధన వృష్టి శిష్య గణముపైన చింద జేసి
మృత్యు భయము తీర్చు అత్యున్న తాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరి గొల్తు.
ఆ॥ వె॥ జిహ్వ మీద వాణి జెలువార భక్తుల కాత్మ బోధ గరుప నలరువాడు
ముక్తిదాత యైన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరి గొల్తు.
ఆ॥ వె॥ కోటి జన్మలందు గూడిన కర్మల
జ్ఞాన ఖడ్గ మిచ్చి నరక నేర్ప
దివ్య బోధ చేయు ధీవిశారదుడైన
శ్రీ ప్రబోధ గురుని చేరి గొల్తు.
2
-------
గురుప్రార్థనా మంజరి
ఆ॥ వె॥ పాప భారమవని బాపంగ దలపోసి జన్మ మెత్తి నట్టి సాధుమూర్తి
కర్మ రహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధ గురుని చేరి గొల్తు.
ఓం వందే గురూణామ్ చరణావిందే సందర్శితస్యాత్మ సుఖావబోధే జనస్యయే జాంగళీ కాయమానే సంసారహాలాహల మోహష్యాంత్యై
01. ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర :
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనమః భావము :
గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు. ఇంకనూ సత్యము చెప్పాలంటే గురువే ఆత్మకంటే వేరైన మూడవ పురుషునిగానున్న పరమాత్మ. నిరాకారమైనవాడై సాకారముగా వచ్చియున్న గురువుకు నేను నమస్కరించుచున్నాను.
3
---
విశేషార్థము : దేవతలందరికీ సాకారమున్నది. బ్రహ్మకానీ, శివుడు కానీ, విష్ణువుకానీ శరీరమును ధరించి అందులోని ఆత్మను ఆధారము చేసుకొని చలించువారే. అందువలన ఆత్మ అన్ని దేహములలో ఉన్నది. గురువు ఆత్మస్వరూపుడై బ్రహ్మ శరీరములోను, విష్ణువు శరీరములోను, మహేశ్వరుని శరీరము లోను ఉన్నాడు. అందువలన గురుని బ్రహ్మగా, విష్ణువుగా, శివునిగా చెప్పడమైనది. గురువు ఒకటవ ఆత్మ (క్షరుడు) గా, రెండవ ఆత్మ (అక్షరుడు) గా, మూడవ ఆత్మ (పరమాత్మ) గా ఉన్నాడు. అందువలన గురువు సాకార జీవుడు, నిరాకార ఆత్మ మరియు జీవాత్మ ఆత్మలకంటే వేరైన పరమాత్మగా ఉన్నాడు. మూడు ఆత్మలుగా ఉన్నవాడే నిజమైన నిత్యమైన గురువు. ఆయన ధరించిన శరీరము పవిత్రమైనది. అందువలన ఆ సాకార గురువుకు నమసస్కరించుచున్నాము.
02. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువేనమః
4
భావము : అండ. పిండ, బ్రహ్మాండమంతయు వ్యాపించి విశ్వ రూపమే తన ఆకృతి కల్గి ఆఖండముగా వ్యాపించి ఉన్నవాడు ఎవడో, కదలుచున్న కదలకున్న జీవరాశులందు మరియు మార్పు చెందని పంచభూతములలోను వ్యాపించియున్నవాడు ఎవడో. పరమాత్మ స్థానము తెలిసియున్నవాడు ఎవడో ఆ గురువుకు నమస్కరించుచున్నాను.
03. ఓం మన్నాథో శ్రీ జగన్నాథ, మద్గురు శ్రీ జగద్గురు
మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువేనమః
భావము : నా యొక్క నాథుడైన గురువే జగత్తంతటికి నాథుడు. నా యొక్క గురువే జగత్తులోని సర్వజీవరాశులకు అన్వయించు జ్ఞానమును బోధించు జగత్ గురువు. నా శరీరములో ఆత్మగా నున్న గురువే, సర్వ జీవుల శరీరములో ఆత్మగా ఉన్నాడు. ఆ గురువుకు నా నమస్కారము.
04. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీ గురువేనమః
5
---
భావము : అజ్ఞానమనే గ్రుడ్డితనమునకు జ్ఞానమనే కాటుకను దిద్ది, ఆత్మను దృశ్యముగా చూపించు గురువుకు నమస్కరించు చున్నాను.
05.
ఓం బ్రహ్మానందం, అచలపూర్ణం, త్రిగుణాతీతం, ఆత్మసాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనంద నిత్యసద్గురం తం నమామి.
భావము: అన్నింటినీ మించిన ఆనందము కలవాడు, మార్పు చెందని దానితో నిండినవాడు, మూడు గుణముల కర్మ అంటని వాడు, ఆత్మను సాక్షాత్కరింపజేసుకొన్నవాడు. రెండు కాని ఒక్కటైన పరమాత్మలో మూర్తీభవించినవాడు. నిత్యము ఆత్మా నందమును పొందువాడైన సద్గురువుకు నేను నమస్కరించు చున్నాను.
06.
ఓం నిత్యానందం, పరమసుఖదం, కేవలం
జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సదృశం,
తత్త్యమస్యాది లక్ష్యం,
ఏకం నిత్యం విమల మచలం, సర్వధీ సాక్షిభూతం,
భావాతీతం, త్రిగుణరహితం సద్గురుం తం నమామి.
భావము : నిత్యము ఆత్మానుభవము అను ఆనందముతో కూడినవాడు, జీవునికంటే వేరుగాయున్న ఆత్మ సుఖము కలుగ జేయువాడు, కేవలము ఆత్మజ్ఞానమే స్వరూపముగ కలవాడు, పాప పుణ్యములైన ద్వంద్వములకతీతుడు, ఆకాశమువలె వ్యాపించి దేనినీ అంటనివాడు. తత్త్వమస్యాది వాక్యములు ధ్యేయముకలవాడు, ఎప్పటికీ ఏక స్వరూపుడైనవాడు, పాపపుణ్య మనే ఏ మాలిన్యము లేనివాడు. చలనము లేని మార్పులేని) సమస్త జీవరాసులు బుద్ధికి సాక్షిగనున్నవాడు, ఏ
వాడు.భావమునకు అందనివాడు, మూడు గుణములందుండినా వాటికి అతీతుడైన వాడును అయిన సద్గురువును నమస్కరించు చున్నాను.
07. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే
జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురువేనమః
భావము : బహుజన్మల నుండి పేర్కొనిన పాప. పుణ్యమి శ్రితము
---
లను జ్ఞానమను అగ్నిచేత దహింపజేయునట్టి గురుమూర్తికి నేను
నమస్కరించుచున్నాను.
08. ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే
నమ శ్రీ గురునాథాయ ప్రకాశానంద మూర్తయే
భావము : సత్తు చిత్తు యొక్క ఆనందమునే (చిత్తునందు సత్తును అనుభవించు ఆనందమునే స్వరూపముగా గలవాడును, జీవాత్మగయుంటూ ఆత్మస్థానమును, పరమాత్మ స్థానమును వ్యాపించినవాడును, అన్నింటికీ ప్రకాశమునిచ్చు శక్తిని అనుభవించువాడును ఐన గురువుకు నమస్కారము. 09. ఓం గురురేకో జగత్సర్వం బ్రహ్మ, విష్ణు, శివాత్మకం,
గురోః పరతరం నాస్తి తస్మాస్థం పూజయేద్గురుం భావము : గురువే బ్రహ్మ, విష్ణు, శివుల యొక్క ఆత్మగనున్న వాడు, గురువు ఒక్కడే జగత్తంతయూ నిండి సర్వమై ఉన్నవాడు, గురువుకంటే మించిన వేరైన మోక్షము లేదు. అందువలన గురువును అన్ని విధముల పూజింపవలయును.
శ్రీ సద్గురు పాదుకాస్తవమ్.
01. శ్రీ సమంచిత మవ్యయం పరమ ప్రకాశమగోచరం
భేదవర్జిత మప్రమేయ మనంత మాద్యమ కల్మషం!
నిర్మలం నిగమాన్త మద్వయ మప్రతర్క్యమ బోధకం
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!
భావము : శుభకరమైనది, నాశనములేనిది, నీకంటే వేరుగా ఉండి నీకు తెలియకుండా ఉండునది, భేదము లేక అంతటా నిండినది. ప్రమాణములకు తెలియనిది. ఆది మొదలు లేనిది, కర్మ కాలుష్యములేనిది, నిర్మలమై, వేదాంతసారమై, ద్వంద్వ ములులేనిదై బోధించుటకు బుద్ధికి సాధ్యముకాని గురు పాదములను ప్రాతఃకాలముననే మనస్సునందు ధ్యానింతును.
02. నాదబిందు కళాత్మకం దశనాద భేద వినోదకం
మంత్రరాజ విరాజితం నిజమండలాన్తర్భాసితమ్ !
పంచమవర్ణమఖండ మద్భుత మాది కారణ మచ్యుతం
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!
9
---
భావము : శబ్ద రూపమనుతన్మాత్రలకు శక్తినిచ్చు ఆత్మగ ఉన్నది. శబ్దమందు పది రకములైన నాదములను పుట్టించి వినోదము
కల్గించునది. మంత్రరాజమై "ఓం" కార శబ్దమును పుట్టించి దానియందు ప్రకాశించునది. నిజమండలమైన బ్రహ్మనాడి లోపల నివశించునది, పంచభూతములంతట అఖండముగ అద్భుతముగ వ్యాపించి మూలకారణమై అర్థము కాకుండా ఉన్నదియగు గురుపాదములను నిర్మలకాలమున మనస్సునందు ధ్యానింతును.
03.
వ్యోమవద్భహిరంత రస్థిత మక్షరం నిఖిలాత్మకమ్ కేవలం పరిశుద్దమేకమజన్మహి ప్రతిరూపకం ! బ్రహ్మతత్త్వ వినిశ్చయం నిరతాను మోక్ష సుబోధకమ్ ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!
భావము : సర్వజీవరాసులయందు నాశనములేనిదై ఆకాశము వలె లోపల బయట వ్యాపించినది. ప్రతీది తన రూపముగ విశ్వ రూపమై, పవిత్రమై ద్వంద్వముకాని ఏకమైనది. నిరంతరము మోక్షమును బోధించుచూ బ్రహ్మతత్త్వమును నిర్ణయించునదైన
----
గురుపాదములను మనస్సునందు మొదట కాలముననే స్మరింతును.
04. బుద్ధిరూపమ బుద్ధికం త్రితయైకకూట నివాసినం
నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకమ్ !
పశ్చిమాన్తర ఖేలనం నిజ సుద్దసంయమి గోచరం
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!
భావము : బుద్ధికి శక్తినిచ్చుచు బుద్ధికానిదై, మూడు నాడులు కలియు భూమధ్యమున నివాసము కలది, మార్పుచెందనిదై నిరంతరము, నిర్మలము సర్వకారణమై ప్రకాశించునది. బ్రహ్మ నాడిలో సహస్రార చక్రమున ఆడునది. ఏ గుణము లేని శుద్ధమైనవారికి గోచరించునది, అయిన గురుపాదములను నిర్మల కాలమున ధ్యానింతును.
!
05.
హృద్గతం నిమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం
నీల మధ్య సునీల సన్నిభ మాదిభిందు నిజాంశుకమ్ !
సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!
----
భావము : ప్రతి జీవరాసి హృదయమునందు నివాసమై, మలినము లేనిదై, పరమాణువై మనస్సుకు సాక్షిగ ఉన్నది. నల్లనిరంగు మధ్యలో నల్లనిదై ఉన్నది. మొదటి స్వరూపమై నిజమైన అంశ కలిగినది, శరీర మధ్యలో నుండి సూక్ష్మమైన దానిని కూడా వినుచు మిక్కిలి చురుకైనదిగనున్నది అయిన గురుపాదములను ప్రాతఃకాలముననే తలంచి నమస్కరించు చున్నాను.
06.
పంచపంచ హృషీక దేహ మనశ్చ తుష్క పరస్పరం
పంచభూతన కామషట్క సమీర శబ్దము ఖేతరమ్ !
పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మవిలక్షణం
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!
భావము : ఐదైదు ఇరువదైదు ఇంద్రియములచే తయారయిన శరీరమున మనస్సు మొదలయిన అంతఃకరణములందు పరస్పరము సంబంధము కలుగజేయునది, పంచభూతములచే తయారయిన కామము మొదలగు ఆరు గుణములు, పంచ
---
వాయువులు, శబ్దము మొదలగు పంచతన్మాత్రలకు వేరుగ నున్నది. పంచకోశములకు, మూడు గుణముల ధర్మములకు విలక్షణమైనది అయిన గురుపాదములను మొదటనే మనస్సు నందు భక్తిచే ధ్యానింతును.
07.
పంచముద్ర సులక్ష్యదర్శన భావమాత్ర నిరూపణం
విద్యుదాది, ధగద్ధగిత్వ రుచిర్వినోద వివర్ధనమ్ !
చిన్ముఖాన్తర వర్తినం విలసద్విలాసమమాయకం
ప్రాతరేవహి మాన సాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!
భావము : ఖేచరీ, భూచరీ, షణ్ముకీ మొదలగు పంచముద్రల లక్ష్యార్థ దర్శనభావముచే నిరూపణకు వచ్చునది. మెరుపులవలె ధగధగ మెరయు జ్యోతి స్వరూపముచే సంతోషమును కలుగ జేయునది, బ్రహ్మనాడి మొదటి భాగమైన సహస్రారము లోపలి వర్తించునది. మాయయందే ప్రకాశించునప్పటికీ మాయలేనిదైన గురుపాదములను ఉదయ కాలముననే ధ్యానింతును.
13
----
08.
పంచవర్ల శుచిర్విచిత్ర విశుద్ధతత్త్వ విచారణమ్
చన్ద్రసూర్య చిదగ్ని మణ్డలమణ్ణితం ఘనచిన్మయమ్ !
చిత్కళా పరిపూర్ణన్తర చిత్సమాధి నిరీక్షణం
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!
భావము : తత్త్వ విచారణ చేసిన పంచభూతములందు విచిత్రముగ నున్నది. సూర్య, చంద్ర, అగ్ని మొదలగు వాటియందు సారాంశమై అనగా ప్రకాశమై మూల పదార్థముగ ఉండునది, చిత్కళచే నిండినది, శరీరాంతరమున జ్ఞాన సమాధిచే తెలియబడు గురుపాదముల మనో నిర్మలకాలమున భక్తిచే
నమస్కరించుచున్నాను.
09.
హంసచార మఖణ్ణనాద మనేక వర్ణమ రూపకం
శబ్దజాలమయం చరాచరజన్తుదేహ నివాసినమ్ !
చక్రరాజ మనాహతో ద్భవమేకవర్ల మతః పరం
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్
!! భావము : రూపము లేని శ్వాసరూపమున అఖండనాదమై అనేక శరీరములందు ఉండినది. "సోహం" అను శబ్ధముచేత చరాచర జీవరాసుల దేహములందు నివాసము చేయునది. అన్ని జీవరాసుల అనాహతస్థానమందు ఒకే విధముగా పుట్టినదై వాటికంటే వేరైనది అయిన గురుపాదముల భక్తిచే మనస్సునందు భావించి పూజింతును.
10.
జన్మకర్మ విలీనకారణ హేతుభూతమ భూతకం
జన్మకర్మ నివారకం రుచిపూరకం భవతారకం !
నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్
!! భావము : జన్మకర్మల నాశనమునకు కారణమై జన్మలేనిదై ఉన్నది. జన్మకర్మల నివారించునది, సంసారసాగరమును దాటింపజేయు ప్రకాశజ్ఞానమైనది. పేరు, రూపములేనది, శుభకరమై అన్నింటికంటే గొప్ప నాయకత్వము గలదియైన గురుపాదములకు మనసంతర్భాగమున మొదటి కాలముననే నమస్కరింతును.
----
11.
తప్తకాంచన దీప్యమాన మహాణుమాత్రమ రూపకం
చన్దికాన్తరతారకైరవ ముజ్జ్వలం పరమాస్పదమ్ !
నీలనీరద మధ్యమస్థితి విద్యుదాది విభాసితం
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!
భావము : కాంచిన బంగారు ప్రకాశము కలది, సూక్ష్మాణురూప మైనది. చంద్రుని వెన్నెలకంటెను, నక్షత్రకాంతికంటెను, తెల్లని కలువ అందముకంటెను గొప్పగ వేరైనది, నల్లని మేఘముల మధ్య మెరుపు తీగలవలె ప్రకాశించునది అయిన గురుపాదము లను మనస్సునందు భావించి పూజించుచున్నాను. 12. స్థూల
సూక్ష్మసకారణాన్తరఖేలనం పరిపాలనమ్
విశ్వతైజపప్రాజ్ఞ చేత సమస్తరాత్మ నిజాంశుకమ్ !
సర్వకారణమీశ్వరం విటలాన్తరాళ విహారకమ్
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!
భావము: స్థూల, సూక్ష్మ, కారణ శరీరములందు వ్యాపించి ఉండునది, విశ్వ, తైజస, ప్రాజ్ఞ (నిద్ర, మెలుకువ, స్వప్న అవస్థల)
---
సమస్త జీవుల అంతరమున నివశించునది. సూర్యచంద్రనాడుల మధ్యన ఉన్న బ్రహ్మనాడియందు ఉండి సర్వమునకు కారణమైన ఈశ్వరశక్తిగనున్న గురుపాదములకు మనస్సునందు తలంచి నమస్కరించుచున్నాను.
గురుస్తోత్రములు.
01. కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం
గృహం బాంధవా సర్వమే తద్ధిజాతం
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం
తతఃకిం తతఃకిం తతఃకిం తతః కిం !!
భావము : భార్య, ధనము, పుత్రులు, మనవళ్ళు. బంధువులు గృహము మొదలగునవన్నియు మానవునికుండినప్పటికీ గురు పాదపద్మముల మీద మనస్సు లగ్నము కానియెడల ఉన్నవన్నియు ఎందుకు? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?
17
----
02. షడంగాది వేదో ముఖేశాస్త్ర విద్యా
కవిత్వాది గద్యం సుపద్యం కరోతి
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం
తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!
భావము : షడంగాది వేదములు, శాస్త్రవిద్యలు కంఠములోనే ఉన్నప్పటికీ కవిత్వాది గద్య పద్యములు సులభముగా కూర్చగల సామర్థ్యమున్నప్పటికీ గురుపాదపద్మముల మీద మనస్సు లగ్నము కాని వానికి అవి అన్నియూ ఉండినను ఏమి ప్రయోజనము? ఏమి సార్ధకము? అవి అన్నీ ఎందుకు?
03.
విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః
సదాచార నిత్య సువృత్తిన్నచాన్యః
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం
తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!
భావము : మానవుడు విదేశములందు మహాపూజ్యుడుగ ఉండిననూ, స్వంతదేశమున ధన్యుడిగా ఉండిననూ, ఎల్లప్పుడూ
-----
సదాచారములు సత్ప్రవర్తన కలిగి ఉండినప్పటికినీ గురుపాద పద్మముల మీద మనస్సు లగ్నము కానివాడు ఎట్లుండినా ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము? ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము?
04.
క్షమామండలే భూప భూపాల బృంధం
సదా సేవ్యతే యస్యపాదార విందం
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం
తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!
భావము : నీవు భూమిమీద చక్రవర్తివైనప్పటికినీ, చిన్న రాజు లందరూ ఎల్లప్పుడు నీ పాదముల సేవ చేసినప్పటికినీ గురుపాద పద్మముల మీద మనస్సు లగ్నము కాని ఎడల నీవు ఎంతటి వాడవైనా ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము? ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము?
19
----
05.
నభోగే నయోగే నవారాజ్యభోగే
సకాంతా ముఖేవైన విత్తేషు యుక్తః
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్నలగ్నం
తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!
భావము : ఎన్నియో భోగ సుఖములుండినా, గొప్ప యోగి అయినా, గొప్ప రాజ్యమును భోగించినా, మంచి అందమైన స్త్రీల సాంగత్య ముండినా గురుపాద పద్మముల మీద మనస్సు లగ్నము కాని వానికి ఏమి ఉండినా ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము? ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము?
06.
యశోమేగతం దిక్షుదాన ప్రతాప
జగద్వస్తం సర్వం కరే యత్ ప్రసాదాత్
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం
తతఃకిం తతః కిం తతఃకిం తతః కిం !!
---
భావము : తనయొక్క కీర్తి, ప్రతాపము, దానగుణము అన్ని దిక్కులయందు వ్యాపించినా. జగత్తంతయు తన స్వాధీనములో
ఉండినా, గురుపాద పద్మముల మీద మనస్సు లగ్నము కానివానికి ఏమి ఉన్ననూ, ఎట్లు ఉండిననూ, ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము? ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము?
07.
అరణ్యే నివాసే స్వగేహేచ కార్య:
నదేహే మనో వర్తతేమే అనార్వే
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్నలగ్నం
తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!
భావము : మానవుడు అరణ్యమందుండినా. స్వంత ఇంటిలో శరీర కార్యములలో మనస్సునుంచక విరక్తు డైనప్పటికీ గురుపాద పద్మముల మీద మనస్సు లగ్నము కాని ఎడల ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము? ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము?
---
08.
అనర్థ్యాని రత్నాని యుక్తాని సమ్యక్
సమాలింగితా కామినీ యామినీసు
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం
తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!
భావము : వెలలేని గొప్పరత్నములు కలవాడైనను, సుందరమైన స్త్రీలను ఆలింగనము చేసుకొనువాడైననూ, గురుపాద పద్మముల మీద మనస్సునుంచనివాడైన ఎట్లుండినను, ఏమి ప్రయోజనము? ఏమి సార్ధకము? ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము?
09.
శరీరం సురూపం, తథావాకళత్రం
యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం
తతః కిం తతః కిం తతఃకిం తతఃకి !!
భావము: మానవునికి సుందరమగు శరీరము మరియు మంచి గుణవంతురాలగు భార్య విచిత్రమగు గొప్ప యశస్సు, మేరు పర్వతమును బోలు ధనము ఉండినప్పటికీ గురుపాద పద్మముల
-----
మీద మనస్సు లగ్నము కానివానికి ఎన్ని ఉండినా ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము? ఏమి ఫలము? ఏమి
ఉపయోగము.
ఓం విశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపమున వెలసి మూఢులను జ్ఞానులన్ జేయ బయల్పడిన ఓ గురురాయా ఇదే నా మనఃపూర్వక వందనమ్ ॥
ఓం మంగళం గురుదేవాయ మహానీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యయా సాధురూపాయ మంగళం ఓం తత్సత్ II
ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళమ్ |
ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి శ్రీకృష్ణవాసుదేవాయ మంగళమ్ ||
ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి అద్వితీయ కుమారాయ మంగళమ్ ||
ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి రావణబ్రహ్మాయ మంగళమ్ ||
23
----