36. షరతలకు లోబడి.. రాబడి!
ఆర్థికాంశాల్లో ఆచితూచి అడుగు
వేయడం ముఖ్యం. అలాగని
మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే
పుణ్యకాలం కాస్తా కరిగిపోతుంది.
అందుకే పెట్టుబడుల విషయంలో
తొందరపాటు పనికిరాదు,
ఆలస్యమూ కూడదు. 'మరి ఎక్కడ
ఇన్వెస్ట్ చేయాలి?' ఈ ప్రశ్నకు
సమాధానం చెప్పేవాళ్లు చాలా
మంది ఉంటారు. కానీ, 'ఎందుకు
ఇన్వెస్ట్ చేయాలి' అంటే మాత్రం
సవివరంగా విశ్లేషించరు.
ఒకరు రియల్ఎస్టేట్లో పెట్టమని సలహా ఇస్తారు. మరొకరు షేర్స్ కొనమని
చెబుతారు. ఇంకొకరు మ్యూచువల్ ఫండ్స్ ద బెస్ట్ అంటారు. బంగారం
ఉత్తమం అని మరికొందరి ఉవాచ. అన్ని రంగాల్లోనూ ఆగమేఘాల మీద ఇన్వెస్ట్
చేసే వ్యక్తులు.. మ్యూచువల్ ఫండ్స్ దగ్గరికి వచ్చేసరికి ఏదో కాని పని అన్నట్టుగా
కంగారుపడుతుంటారు. షరతులకు లోబడి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే
అత్యవసర సమయాల్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
నిర్దుష్టమైన ఫలితాన్ని ఆశించే ఏ పని అయినా మొదలుపెడతాం. పెట్టుబడి విషయంలోనూ
ఇదే సూత్రం వర్తిస్తుంది. ఫలితం ముందస్తుగా ఊహించి, కాలపరిమితిని దృష్టిలో ఉంచుకొని
ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మదుపు చేయడం చాలా అవసరం.
భూమి కొన్నా, మరేదైనా ఆస్తి కొనుగోలు చేసినా ఏ ప్రయోజనం ఆశించి కొంటున్నామన్నది.
ముఖ్యం. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్కు అనుకూలమైన వేదికే! కానీ, మార్కెట్
హెచ్చుతగ్గులు లాభాలను గణనీయంగా ప్రభావితం చేస్తాయనే ఉద్దేశంతో చాలామంది
ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి వెనుకంజ వేస్తుంటారు.
అన్నిట్లో అదే రిస్క్.
మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ అనే భావన చాలామందిలో ఉంటుంది. నెలవారీగా కొంత
మొత్తాన్ని ఆర్డీ చేసుకుంటే తప్ప.. మరే పెట్టుబడి అయినా ఎంతోకొంత రిస్క్తో కూడుకున్నదే.
ఉదాహరణకు పది లక్షల పెట్టి ఒక స్థలం తీసుకున్నారు పది సంవత్సరములకు దాని విలువ మార్కెట్లో
30 లక్షలకు పెరిగింది! అయితే అత్యవసరం వచ్చిందే అనుకుందాం! అప్పటిక
ప్పుడు మార్కెట్లో అమ్మకానికి పెడితే 20 లక్షలు వస్తుందన్న గ్యారెంటీ లేదు! పైగా సరైన
బయ్యర్ దొరికే ఆ ఫ్లాట్ అమ్ముడు పోవడానికి కనీసం రెండు నెలలు సమయమైనా పట్టొచ్చు.
ఈ లోపు మీ అవసరం మాటేమిటి అదే మ్యూచువల్ ఫండ్ అనుకోండి, ఎస్ఐపి ద్వారా
నెలకు 50వేలు ఇన్వెస్ట్ చేశారే అనుకుందాం. అంటే సంవత్సరానికి 6 లక్షలు. పదేం
డ్లకు 60 లక్షలు అవుతుంది. రిటర్న్స్తో కలుపుకొంటే కోటి వరకూ వస్తుంది.
మార్కెట్ ఒడుదొడుకులకు గురైనా 80 లక్షల వరకూ రావొచ్చు. కరోనా వంటి దుర్భర
మైన పరిస్థితులు ఏర్పడితే మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ మాత్రమే కాదు.. కోట్లు వెచ్చించి
భూములు కొనే వ్యక్తులూ ఉండరు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉద్యోగం పోయినా..
మ్యూచువల్ ఫండ్స్లో అయితే డబ్బులు వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
మూడు రోజుల్లో నగదు మీ ఖాతాలో జమవుతుంది. ఇల్లు గడవడానికి ఆ గడవడానికి ఆ సొమ్ము
ఉపయోగపడుతుంది.
ఉన్నదంతా వద్దు..
అలాగని ఉన్నదంతా మ్యూచువల్ ఫండ్స్లో పెడతామంటే పొరపాటు. మీ ఆదాయంలో
కొత్త వాటికి కేటాయించాలి. ఎంత అనేది మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణ
యించుకోవాలి. ఉదాహరణకు మూడేండ్ల కూతురు ఉంటే.. తను ఇంటర్ పూర్తయ్యేసరికి
సుమారు పదిహేనేండ్ల సమయం ఉంటుంది. ఈ కాలపరిమితితో పై చదువు కోసం 30
లక్షల నుంచి 50 లక్షలు వచ్చే ప్లాన్ ఎంచుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే పెండ్లికే
అనుకోండి మరో ఐదేండ్లు కాలపరమితి పెంచుకోవచ్చు. పిల్లల చదువు, ఇంటి ఖర్చులు,
ఇతరత్రా అన్నీ పోయిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఎస్ఐపీ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే..
సమయోచితంగా వాడుకునే వెసులుబాటు ఉంటుంది. మీ అవసరాలకు తగ్గట్టుగా షరతులకు
లోబడి ఇన్వెస్ట్ చేస్తే.. ఆశించిన రాబడి తప్పకుండా లభిస్తుంది!
బంగారం బంగారమే!
మ్యూచువల్ ఫండ్స్ కాలపరిమితి ఎంత ఉండాలన్నది ముఖ్యం. మీ అవసరం కనీసం ఎనిమి
దేండ్ల కాలపరిమితి తర్వాత అయితే మ్యూచువల్ ఫండ్స్ మంచిదే! మీ ఇన్వెస్ట్మెంట్ మీద
లోన్ కూడా తీసుకోవచ్చు. దీర్ఘకాలిక ప్రయోజనాలకు రియల్ ఎస్టేట్ మంచి ఎంపిక. అయితే,
మీ అవసరాన్ని ముందుగానే అంచనావేసి అందుకు తగ్గట్టుగా అది మంచి ధర పలికినప్పుడు
అమ్మాల్సి ఉంటుంది. బంగారం మీద పెట్టుబడి కాలానికి సంబంధం లేని ఇన్వెస్ట్మెంట్.
బంగారం ధరలు కాస్త హెచ్చుతగ్గులకు లోనైనా పెట్టుబడికి గిట్టుబాటు అవుతుంది. పైగా
బంగారం అయితే అమ్మకుండానే అవసరాలు తీర్చుకోవచ్చు. బ్యాంకులో కుదువపెడితే..
అప్పటికప్పుడు అప్పు పుడుతుంది. మరీ తప్పని పరిస్థితుల్లో అమ్ముకున్నా మార్కెట్ ధర
పలుకుతుంది.