40. పిల్లల పేరిట కొంటున్నారా..!

40. పిల్లల పేరిట కొంటున్నారా..!

పిల్లలకు బంగారం లాంటి
భవిష్యత్తు ఇవ్వాలని అందరు
తల్లిదండ్రులూ కోరుకుంటారు.
పిల్లల పేరిట ఇబ్బడిముబ్బడిగా
ఆస్తులు కొనుగోలు చేస్తుంటారు.
ఎఫ్డీలు మొదలు పెడతారు. పాల
సీలు కట్టేస్తుంటారు. ఇవన్నీ పిల్లల
పేరిట కాకుండా.. పిల్లల కోసం
చేయడమే సరైన ఆర్థిక విధానం
అనిపించుకుంటుంది. సరైన ఎంపిక
ద్వారా తల్లిదండ్రుల బాధ్యత
భారం కాకుండా ఉంటుంది.


అమ్మానాన్నల మొదటి ప్రాధాన్యం పిల్లలే ! బిడ్డల ఆరోగ్యం, చదువులు.. వీటి
తర్వాతే మరే విషయమైనా ఆలోచిస్తారు. తమ పిల్లలకు ఏ రంగంలో ఆసక్తి
ఉందో గమనించి.. అందులో రాణించడానికి వాళ్ల కన్నా ముందుగానే సిద్ధపడిపో
తుంటారు. పదో తరగతికి వచ్చేసరికి ఇంటర్మీడియెట్ కాలేజీలు జల్లెడ పడతారు.
ఇంటర్ అయిపోయేనాటికి ఇంజినీరింగ్ కాలేజీల లిస్ట్ ముందేసుకొని శోధిస్తుం
టారు. డాక్టర్ చదువుతానంటే ఫ్రీ సీటు రాకపోతే.. విదేశాలకైనా పంపడానికి సిద్ధ
పడతారు. మధ్యతరగతి అనుభవాలు ఆర్థికంగా తట్టుకోలేరని వారిస్తున్నా.

పిల్లల భవిష్యత్తు ముందు వాటన్నిటినీ భరించడానికి సిద్ధపడతారు. ఈ క్రమంలో పిల్లల కోసం
మని వారిపేరిటే పెట్టు బడులు పెడుతుంటారు కొందరు. స్థలాలు తీసుకోవడం, ఇండ్లు
కొనడం, కూతురు, కొడుకు పేరిట ఎఫ్డి చేయడం వంటివి చేస్తుంటారు. అయితే, పిల్లలు
మైనర్లుగా ఉన్నప్పుడైనా, మేజర్లు అయ్యాక గానీ వారి పేరిట ఆస్తులు పోగు చేయడం ఆర్థి
కంగా సరైన పనికాదు.

ఇలా వద్దు..

నరహరి ప్రభుత్వోద్యోగి, ఒక కూతురు, కొడుకు, బిడ్డ పుట్టినప్పుడు కలిసిరావడంతో అగ్గు
వలో ఓ ప్లాటు కొన్నాడు. కూతురు పేరిటే దానిని రిజిస్ట్రేషన్ చేయించాడు. సంవత్సరాలు గడి
చిపోయాయి. కొడుకును, కూతురును సమానంగా చదివించాడు. పిల్లల చదువులు, కుటుంబ
బాధ్యతలు పెరగడంతో మరే ఆస్తి కూడబెట్టలేకపోయాడు. కూతురుకు ప్రభుత్వోద్యోగం
వచ్చింది. అంతలోనే పెండ్లి నిశ్చయమైంది. అప్పోసొప్పో చేసి వియ్యాలవారు అడిగిన కట్న కానుకలు
సమర్పించి ఘనంగానే పెండ్లి చేశాడు. కొడుకును విదేశాలకు పంపించాలనుకున్నాడు..
చేతిలో చిల్లిగవ్వ లేదు. బిడ్డ పెండ్లికి చేసిన అప్పు ఇంకా మిగిలే ఉంది. ఇప్పుడు కూతురు
పేరిట కొన్న ప్లాటు అమ్మితేగానీ అవసరాలు తీరేలా లేవు. ఇదే విషయం కూతురుతో
చెప్పాడు. 'సరే నాన్నా!' అన్నదామె. రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాక విషయం అత్తారింట్లో తెలిసింది.
మా కోడలు పేరుమీద ఉన్నది మీరెలా అమ్ముతారు?' అన్నారు ఆ ఇంటి పెద్దలు. దఫ 
దప పాల చర్చల తర్వాత నరహరికి 30 శాతం ఇవ్వడానికి ఒప్పుకొన్నారు. ఈ మొత్తం వ్యవహా
రంలో తనను ఇంతదాన్ని చేసిన తండ్రిని ఇబ్బందిపెట్టానని కూతురు బాధ పడింది.వియ్యంకుల
తో అభిప్రాయ భేదాలు వచ్చి నందుకు నరహరి కుమిలిపోయాడు. ఇదంతా ఆయన
ప్లాటున కూతురు పేరుతో రిజిస్ట్రేషన్ చేయడం వల్లే జరిగింది. అదేదో తన పేరిటే ఉండి
ఉంటే.. అప్పు చేయకుండా కూతురు పెండ్లి చేసేవాడు. కొడుకుకూ కొంత ముట్టజెప్పేవాడు.

మీరే హక్కుదారు..

ఒక్క నరహరి మాత్రమే కాదు.. చాలామంది తల్లి దండ్రులు పిల్లల పేరిట ఇన్వెస్ట్ చేస్తుం
టారు. ఇది తప్పు కాకపోవచ్చు. లెక్కకు మించిన ఆస్తులు ఉన్నప్పుడు అలా చేయడం సబబు
అనిపించుకుంటుంది. కానీ, ఉన్న ఒకటి రెండు ఆస్తులను పిల్లల పేరిట పెట్టడం భవిష్యత్తులో
విపరీత పరిస్థితులకు దారితీయొచ్చు. డబ్బుకు తొలి ప్రాధాన్యం ఇస్తున్న ఈ రోజుల్లో ఆస్తులు
పిల్లలకు ధారపోయడం శేష జీవితాన్ని రిస్క్ పెట్టినట్టే అవుతుంది. వారి కోసం కూడబె
ట్టడం న్యాయం. కానీ, వారి పేరిటే ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు. కూతురు మెడిసిన్ చదువు
కోసం ఓ ఆస్తి కొన్నా, పదిలక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా దానికి హక్కుదారు మీరే ఉండాలి.
అవసరానికి వాటిని పిల్లల చదువుకో, పెండ్లికో, వాళ్ల వ్యాపారానికో ఇవ్వడం మీ చేతుల్లో
పని! అదే వారి పేరుమీదే ఉంటే.. ఆస్తిని మీకు తెలియకుండా అమ్మేయనూ వచ్చు. అప్పుడు
మీరు వారిని నైతికంగా నిలదీయొచ్చేమో కానీ, చట్టపరంగా దానిని సవాలు చేయలేరు. 'కీ
డెంచి మేలెంచు' అని పెద్దలు ఊరికే చెప్పలేదు. పిల్లల కోసం ఆస్తులు కూడబెట్టండి. అవి మీ
పేరిటే ఉండేలా చూసుకోండి.

అవసరాలకు తగ్గట్టు..

పిల్లల ఉన్నత విద్య కోసం ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు లక్ష రూపా
యలు ఉన్న ఇంజినీరింగ్ ఫీజు.. పదిహేనేండ్ల తర్వాత నాలుగు లక్షలు అవుతుంది. నాలు
గేండ్ల కోర్సుకు కనీసం పదిహేను లక్షలు అవసరం అవుతాయి. అందుకు తగ్గట్టుగా ఇన్వెస్ట్
చేయాలి. పిల్లల చదువుకు అందివచ్చేలా భవిష్యత్తులో ఆర్థిక అవసరాలను గుర్తించి పాలసీలు,
మ్యూచువల్ ఫండ్స్, ఇతర రంగాల్లో పెట్టుబడి పెట్టండి. ఎంత మొత్తం అవసరమవుతుందో
అంచనా వేయకుండా చేసే మదుపు లక్ష్యాన్ని నెరవేర్చదని గుర్తించండి.

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024