42. ఉద్యోగమా? వ్యాపారమా?

42. ఉద్యోగమా? వ్యాపారమా?

పట్టా చేతికి రాగానే.. పుట్టెడు
ఆలోచనలు. గూగుల్ గూబ అదర
గొట్టే ఐడియాలు తన్నుకొస్తుం
ఉంటాయి. వారెన్ బఫెట్ మనల్ని చూసి
'వారెవ్వా' అనుకోవాలన్న ఆరాటం.
ఇనోసిస్ నారాయణమూర్తి నుంచి
భవిష్ అగర్వాల్ వరకు... మూడు
తరాల ఆంత్రప్రెన్యూర్స్ కథలు
మనకు ఈస్ట్మన్ కలర్ సినిమాలా
కనిపిస్తాయి. ఇక ఉండబట్టలేక,
ఉగ్గబట్టుకోలేక నాన్న ముందు ఓ
ప్రతిపాదన పెడతాం. కట్ చేస్తే..


బాల్కనీలో ఆరాం కుర్చీలో కూర్చుని  పురుషోత్త గా పేపర్ చదువుతూ..గంట
కోసారి అమ్మ చేతి ఫిల్టర్ కాఫీ చప్పరిస్తూ.. రెండేళ్లలో రిటైర్ కావడానికి
మానసికంగా, ఆర్థికంగా సిద్ధపడుతున్న పితాశ్రీకి మన ప్రతిపాదన బాంబు
మోతలా అనిపిస్తుంది. 'ఏమిటీ? బిజినెస్ చేస్తావా? అందుకేనా నిన్ను ఇంజినీ
రింగ్ చదివించింది. వ్యాపారం మనవల్ల అవుతుందా? దిగ్గజాలే దిక్కులేక చస్తు
న్నారు. చార్టర్డ్ ఫ్లైట్లో తిరిగినవాళ్లకు కూడా చాయ్ పైసలకు గతిలేని పరిస్థితి.
వద్దురా బాబూ!' అంటూ బుర్ర తోమేస్తాడు. చేసేదేముంది. 'రిచ్గాడ్.. పూర్
డాడ్ బుక్లో పూర్లాడ్ టైపు మన నాన్నలంతా! యూత్ కలలు అస్సలు అర్ధం
' కావు' అని నిట్టూరుస్తూ వీధి చివర ఇరానీ కేఫ్ వైపు అడుగులేస్తాం.

ఏది మేలు?

బిజినెస్ వర్సెస్ జాబ్.. దశాబ్దాలుగా యువతను వేధిస్తున్న ప్రశ్న. వ్యాపారంలో రిస్క్
ఉంటుంది. ఉద్యోగంలో కంఫర్ట్ ఉంటుంది. వ్యాపారంలో దెబ్బతింటే కోలుకోడానికి జీవితకా
మైనా సరిపోదు. అదే ఉద్యోగమైతే.. ఒక కొలువు పోతే మరొకటి, మహా అయితే జీతంలో
తేడా రావచ్చు. నాన్న మనకు ఇచ్చే సలహా కొత్తదేం కాదు. వాళ్ల నాన్న కూడా ఇలానే
ఉపదేశం చేసుంటాడు. నిజమే, ఉద్యోగాన్ని మించిన కంఫర్ట్ జోన్ లేదు. నాన్నను మించిన
శ్రేయోభిలాషి కనిపించడు. వ్యాపారంలో తొంభైశాతం ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఉద్యోగంలో
తొంభైశాతం మినిమమ్ గ్యారెంటీ ! కానీ, మేనేజ్మెంట్ పుస్తకాలు, మోటివేషన్ స్పీచ్లు..
ఇందుకు విరుద్ధంగా వాదిస్తాయి. 'ఉద్యోగం అనేది ఓ శాశ్వత సమస్యకు తాత్కాలిక పరి
ష్కారం మాత్రమే' అని హెచ్చరిస్తాయి. 'వందమందిలో ఒకడిగా కాదు.. వందమందికి ఒక
డిలా జీవించాలి' అంటూ స్పూర్తినిస్తాయి. మన తాతలు అంబానీలో, అదానీలో అయిన
ప్పుడు.. ఆ వారసత్వాన్ని కొనసాగించాల్సిందే. అన్నీ వదిలేసి ఎక్స్వైజెడ్ కంపెనీలో డేటా
ఎంట్రీ ఆపరేటర్ చేరడం మూర్ఖత్వమే అవుతుంది. కానీ, పక్కా మధ్య తరగతి నుంచి వచ్చి
ఎన్నో కొన్ని బాధ్యతలను భుజానికి వేసుకుని భారంగా నడుస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగానే '
అడుగులు వేయాలి.

వ్యాపారాన్ని ఉద్యోగంలా..

అవును, వ్యాపారాన్ని సైతం ఓ ఉద్యోగంలా మార్చుకోవచ్చు. వ్యాపార సంపదనంతా.. మళ్లీ
వ్యాపారానికే ఖర్చు పెట్టుకుంటూ వెళ్లడం మంచిది కాదు. కుటుంబం వేరు, వ్యాపారం వేరు
అనుకోవాలి. అందులోంచి నెలనెలా జీతంలా తీసుకోవాలి. వ్యాపార లాభాలతో వ్యక్తిగత
ఆస్తులు కొనుగోలు చేయాలి. దీనివల్ల వ్యాపారంలో తీవ్ర నష్టం వచ్చినా.. మనకంటూ
భరోసా ఉంటుంది. పేరున్న సంస్థల ఫ్రాంచైజీ తీసుకోవడం ద్వారా కూడా.. వ్యాపారాన్ని
ఉద్యోగంలా చేసుకోవచ్చు. లాభాలు పరిమితమే కానీ, రిస్క్ తక్కువ. వ్యాపారంలో విజయం
సాధిస్తేనే జీవితంలో విజయం సాధించినట్టు కాదు. ఉద్యోగం బానిస లక్షణమూ కాదు. ఏ
ఉపాధి మార్గమైనా మనకు సంతృప్తిని ఇవ్వాలి. వృత్తి, వ్యాపారం మన వ్యక్తిగతం. ఎవర్నీ జడ్జ్
చేయొద్దు. మీరూ ఆత్మన్యూనతకు గురికావద్దు.

మధ్యే మార్గం?

వ్యాపారంలో రిస్క్ ఉంది. దాంతోపాటే లాభం ఉంది. ఉద్యోగంలో ఎదుగుదల జానాబెత్తెడే.
అయితేనేం భద్రత ఉంది. ఈ రెండిటిలోని మంచి లక్షణాలతో మనదైన హైబ్రీడ్ మాడల్
సృష్టించుకుంటే తిరుగే ఉండదు. ఎస్.. ఉద్యోగంలాంటి వ్యాపారం, వ్యాపారం లాంటి
ఉద్యోగం! ఉదాహరణకు.. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల పనితీరు, సీనియారిటీ ఆధా
రంగా ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ స్కీమ్ (ఈఎస్ఓపీ) కింద వాటాలు ఇస్తాయి. అంటే, ఆ
సంస్థలో మనకు ఎంతోకొంత భాగం ఉంటుంది. ఆ ప్రకారంగా, ప్రత్యక్షంగా ఉద్యోగం చేస్తూ,
పరోక్షంగా వ్యాపారం చేస్తున్నట్టే. షేర్ విలువ పెరిగేకొద్దీ వాటాదారుగా మన సంపద కూడా
పెరుగుతుంది. ఈ స్కీమ్ పుణ్యమాని కుబేరులుగా మారిన సాధారణ ఉద్యోగులు ఎంతో
మంది. అలాంటి సంస్థలలో చేరే అవకాశం వస్తే వదులుకోకూడదు. అందరికీ ఆఫరు రాకపో
వచ్చు. మిగతా వాళ్లు.. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న రంగాలను ఎంచుకోవాలి. అవసరమైతే
ఉద్యోగాలు మారాలి. నగరాలు, దేశాలు మారాలి. దీనివల్ల జీతభత్యాలు చకచకా పెరిగిపో
తాయి. వ్యాపారంలో కంటే ఎక్కువే సంపాదించవచ్చు. కాకపోతే, ఇలాంటి ప్రయోగాలు
సాధ్యమైనంత చిన్న వయసులోనే మొదలుపెట్టాలి. వ్యాపార వ్యూహంతో ఉద్యోగం చేయడం
మంటే ఇదే. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కూడా ఉద్యోగులే కదా!!

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024