45. ఎంతైనా ఖర్చుపెట్టండి!

45. ఎంతైనా ఖర్చుపెట్టండి!

ఖర్చు విషయంలో రెండే
పరిష్కారాలు. అవసరాలు తగ్గించు
కోవడం, సంపాదన పెంచుకోవడం.
అవసరాలను తగ్గించుకుంటూ
పోతే.. చివరికి కూడు, గూడు,
బట్ట విషయంలోనూ రాజీపడాల్సి
వస్తుంది. అదే, సంపాదన
పెంచుకుంటే జీవితం సంతోష
మయం అవుతుంది. కాబట్టి,
సంపాదనకు పరిమితి పెట్టుకోకండి,
అవసరమైన ఖర్చులకూ పరిమితులు
విధించుకోకండి.

ఏం ఫర్వాలేదు.. సినిమాలు చూడండి. షికార్లు చేయండి. షాపింగ్
వెళ్లండి. అవసరమైనవన్నీ కొనేయండి. ఖర్చు చేయడంలో తప్పు
లేదు. ఖర్చు వృథా కానేకాదు. పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్తే నెట్వర్క్ విస్తరిస్తుంది.
ఫీజు కొంత ఎక్కువైనా మంచి స్కూల్స్ చేర్పిస్తే బిడ్డల భవిష్యత్తుకు బాటలు
వేసినవాళ్లం అవుతాం. ఇరుకిరుకు పోర్షన్ నుంచి విశాలమైన ఇంటికి మారడం
వల్ల.. గాలి, వెలుతురు ఆస్వాదిస్తాం. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా
ఉంటాం. ఇవన్నీ మనకోసం మనం పెట్టుకునే అత్యుత్తమ పెట్టుబడులు. కాబట్టి,
అస్సలు రాజీపడకూడదు, ఏమాత్రం వెనుకాడకూడదు.

పొదుపు పేరుతో నాసిరకం జీవితానికి అలవాటు పడకూడదు. కాకపోతే ఆ ఖర్చుకు పరిమితి
ఉండాలి. రేపటి సంపాదనతో కాదుమన ప్రస్తుత సంపాదననే మనం ఖర్చు చేయాలి. నెల
రాబోయే జీతాన్ని పరిగణనలోకి తీసుకుని, రెండు నెలల తర్వాత మేనేజ్మెంట్ ప్రకటించే
బోనస్ను దృష్టిలో ఉంచుకుని, మూడునెలల తర్వాత చేతికందే వ్యవసాయ రాబడిని
లెక్కగట్టి అర్థంలేని ఖర్చులు చేయడం మాత్రం ఘోరమైన తప్పు. సరిగ్గా అక్కడినుంచే మన
ఆర్థిక అపసవ్య దిశ మొదలవుతుంది, నీ జీతం ఎంతైనా కావచ్చు. కానీ, దానికి సరిపడా
ఖర్చులు ఉంటాయి. అదనపు రాబడి లేకుండా, అదనపు ఖర్చులను సర్దుబాటు చేయడం
అసాధ్యం. బోనస్ అంటారా? కొవిడ్ తర్వాత యాజమాన్యాల ఆలోచనా విధానం మారిపో
యింది. ఉదారగుణం తగ్గిపోయింది. భవిష్యత్తు పట్ల భయం మొదలైంది. చట్టపరంగా తప్పని
సరి అయితే తప్ప బోనస్లు, ప్రోత్సాహకాల జోలికి వెళ్లడం లేదు. ఆ 'తప్పనిసరి'ని తప్పించు
కునే చిట్కాలూ వెతుక్కుంటున్నారు. కాబట్టి, బోనస్ మీద పెద్దగా ఆశలు పెట్టుకోకండి.
వ్యవసాయం గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. చేతికొచ్చిన పంట నోటికొస్తోం
దన్న భరోసా లేదు. కాబట్టి, నీ ఖాతాలో ఉన్న డబ్బు మాత్రమే నీది. అది కూడా.. బ్యాంకు
వాయిదాలు, బీమా ప్రీమియంలు, అద్దెలు, స్కూలు ఫీజులు, మందులు, పాలబిల్లు, కేబుల్
బిల్లు, సిప్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్.. వగైరా వగైరా కేటాయింపుల తర్వాత మిగిలేదే నీది.
సొమ్ముతో షాపింగ్ చేస్తావో, మాలే కొంటావో నీ ఇష్టం.

ప్లాస్టిక్ మనీ వద్దు.

వ్యక్తుల ఖర్చుల వల్ల ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. కొత్త కంపెనీలు వస్తాయి. నలుగురికి
ఉపాధి లభిస్తుంది. దేశానికి కూడా మంచిదే. కాకపోతే ముందుగా మన అవసరాలకు,
బాధ్యతలకు ఖర్చు పెట్టాలి. ఆ తర్వాతే వినోదాలు, విలాసాలు, జీవనశైలి వ్యయాలు. అందు
అందులోనూ క్రెడిట్ కార్డ్ గీకుడు అలవాటు పడితే ఆర్థిక ఊబిలో చిక్కుకుపోయినట్లే.
గడువు తేదీలోగా చెల్లించలేక ఆ మొత్తాన్ని ఈ ఎం ఐ గా మార్చుకుంటాం. దీంతో నెలవారి చెల్లింపులు
మోయ లేనంతభారంగా మారిపోతాయి. కొత్త అప్పులు అవసరం అవుతాయి. వడ్డీల
మోత మొదలవుతుంది. ఖర్చు పెట్టాలన్న కోరిక ఉండటంలో తప్పులేదు. అదే సమయంలో
సంపాదించాలనే తపన కూడా ఉండాలి. అదనపు సంపాదన మార్గాల గురించి ఆలోచించాలి.
కొత్త అవకాశాల వైపు అడుగులు వేయాలి. అంతేకానీ, గాల్లో లెక్కలేసుకుంటూ.. కాలిమీద
కాలేసుకుని కూర్చోవడం మంచిది కాదు. ఆ బాధ్యతలేని తనమే ఏదో ఒకరోజు మనల్ని
ముంచేస్తుంది. నిజానికి మనం స్వతహాగా జాగ్రత్తపరులమే. ఎస్ఐపీ పెట్టుబడులు 25
వేల కోట్లకు చేరాయి. బీమా రంగం బలపడింది. రియల్ ఎస్టేట్ పుంజుకుంది. ఇవన్నీ మంచి
పరిణామాలే. కాకపోతే, చేతిలోని సంపాదనలోంచే ఖర్చుపెట్టాలి. ఆ మాత్రం బాధ్యత ఉంటే
చాలు. జీవితానికి పొదుపు-మదుపు ఎంత అవసరమో, ఖర్చులూ అంతే అవసరం. ప్రతిదా
నికీ రాజీపడుతూ కూర్చుంటే.. ఆత్మన్యూనత నెత్తినెక్కుతుంది. జీవితంలో సర్దుబాటు సరి
కాదు. మనం సాంకేతిక యుగంలో ఉన్నాం.. చేతిలో నైపుణ్యం ఉంటే ఆకాశమే హద్దు.
నైపుణ్యం లేకపోయినా బాధపడుతూ కూర్చోవాల్సిన పన్లేదు. నైపుణ్యం పెంచుకునే మార్గాలు
అనేకం. ఆన్లైన్ కోర్సులున్నాయి. ఆఫ్లైన్ చదువులున్నాయి. మీరిప్పుడు బ్లాక్ అండ్ వైట్
సినిమాల నాటి హీరో కాదు. దారిద్ర్యాన్ని తిట్టుకుంటూనో, నిరుద్యోగాన్ని ఎత్తిచూపుతూనో,
పేదరికాన్ని ప్రేమిస్తూనో, కుబేరుల్ని ద్వేషిస్తూనో బతికేయడానికి. సంతోషంగా జీవించడానికి
ఎంత ఖర్చు చేయాలో అంత చేయండి. సంతృప్తిగా జీవించడానికి ఎంత డబ్బు అవసరమో
అంత సంపాదించండి. ఖర్చు తగ్గించుకుని కోటీశ్వరులైనవారు ఎక్కడా కనిపించరు.
సంపాదన పెంచుకున్నవారే ఆర్థిక విజేతలు అవుతారు. కుటుంబసభ్యుల ప్రేమను, బంధువులు
ఆదరాన్ని పొందుతారు.

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024