44. అపాత్రదానం వద్దు!

44. అపాత్రదానం వద్దు!

ఎవరి సంపాదన వారిది. ఎవరి
ఖర్చులు వారివి. చివరగా మిగిలిన
సొమ్ములోంచి కాస్తంత మొత్తాన్ని
స్వచ్ఛంద సంస్థలు, వృద్ధాశ్రమాలకు
విరాళంగా ఇవ్వాలనుకునేవారూ
ఉంటారు. మంచి ఆలోచనే. మరో
కోణంలో చూస్తే.. మానసిక సంతృప్తి
కోసం మనం పెడుతున్న పెట్టుబడి
అది. అందులో ప్రతి రూపాయీ
మన స్వార్జితమే. ఆ సొమ్ము దుర్విని
యోగం కాకుండా తగిన జాగ్రత్తలు
తీసుకోవాలి.

దాతృత్వం అనేది బలమైన పాజిటివ్ ఎమోషన్. పంచుకోవడంలోని
ఆనందం అనిర్వచనీయం. దీనివల్ల మన జీవితానికి సార్థకత లభించిన
అనుభూతి కలుగుతుంది. లేనివారితో పంచుకోవడం ఉన్నవారి బాధ్యత కూడా.
కాబట్టే, ఆర్థిక మానసిక వేత్తలు దాతృత్వాన్ని 'మానవీయ పెట్టుబడి'గా అభివర్ణి
స్తారు. “ఓ అనాథ శరణాలయానికి నేనిచ్చిన విరాళమే నా జీవితంలో అత్యుత్తమ
పెట్టుబడి' అంటారు వారెన్ బఫెట్. కానీ, సమాజం కోసం మనం కేటాయించిన
సొమ్ము అందాల్సినవారికి అందినప్పుడే.. ఆ అనుభూతి, ఆనందాలకు సార్థకత,

సరైన ఎన్జీవో కోసం..


దినపత్రికలలో ప్రకటనలు, సోషల్ మీడియాలో ప్రచారాలు, తరచూ పలకరించే ఎస్సెమ్మె
స్లు, కూడళ్ల దగ్గర పంచే కరపత్రాలు.. సాయం కోసం చేసే విజ్ఞప్తులు ఏదో ఓ రూపంలో
మన దృష్టిని ఆకర్షిస్తుంటాయి. దేశంలో ముప్పై లక్షలకు పైగా ఎన్జీవోలు (ప్రభుత్వేతర
స్వచ్ఛంద సంస్థలు) ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. పేదల కోసం, అనాథల కోసం,
వృద్ధుల కోసం, పర్యావరణం కోసం.. ఇలా తమదైన రంగంలో నిజాయతీగా పని చేస్తున్న
సంస్థలు అనేకం. దాతృత్వ ప్రధాన ఉద్దేశం ఆత్మసంతృప్తి. మనకు ఇష్టమైన, మన జీవితంతో
ముడిపడిన సత్కార్యానికి డబ్బు కేటాయించినప్పుడు.. ఆ సంతృప్తి రెట్టింపు అవుతుంది.
కాబట్టి తగిన ఎన్జీవోనే కాదు  ఆ సంస్థ కార్యకలాపాలనూ పరిగణనలోకి తీసుకోవాలి.


కళ్లారా చూడండి..

అవార్డులు, బ్యాలెన్స్ షీట్, పత్రికలలో కథనాలు.. అన్నీ ఒక ఎత్తు. అంతిమంగా మీరు కళ్లారా 
చూసిందే నిజం. మీకు నచ్చితేనే నచ్చినట్టు. కాబట్టి, మనసుకు దగ్గరగా అనిపించిన
ఎన్జీవోను ఎంచుకోగానే.. ఓ పూట ఆ ఆవరణకు వెళ్లండి. అక్కడి పిల్లలు, అనాథలు, నిర్భాగ్యులతో
మాట్లాడండి అదే రంగంలో పనిచేస్తున్న మిగతా  సంస్థలనూ సందర్శించండి. ఏ సంస్థ
ఎక్కువ జీవితాలను ప్రభావితం చేస్తున్నది, ఏ సంస్థకు బతుకులను మార్చే శక్తి ఉంది, ఎవరి
చేతిలో పెడితే కనుక మీ కష్టార్జితం సద్వినియోగం అవుతుంది.. అనేది కోణంలో ఆలోచిం
చండి. కొన్ని సంస్థలు.. ఆ మొత్తాన్ని ఎలా ఖర్చుచేస్తున్నది. ఎవరికి సాయం చేస్తున్నది
తెలియజేస్తూ న్యూస్ లెటర్ కూడా ఇస్తాయి.ఇలాంటి సమాచారం వల్ల మనకు ఎన్జీవో పట్ల
నమ్మకం పెరుగుతుంది. ఆత్మీయులకు సిఫారసు చేస్తాం కూడా. దాతృత్వానికి పెట్టుబడి
సూత్రాలను జోడిస్తున్నవారూ ఉన్నారు. నెలనెలా కొంత మొత్తాన్ని సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్
ప్లాన్ (సిప్)కు మళ్లించి.. దీర్ఘకాలంలో భారీ మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నారు. దీనివల్ల
మరింత మొత్తం పోగవుతుంది. మరిన్ని జీవితాలు బాగుపడుతాయి. ప్రతినెలా గుర్తుంచుకుని
చెల్లించడం కష్టం అనిపిస్తే.. ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ (ఈసీఎస్) ద్వారా నెలనెలా ఫలానా
తేదీన నిర్ణీత మొత్తాన్ని ఏదైనా ఎన్జీవో బ్యాంకు ఖాతాకు బదిలీ చేయవచ్చు. ఎంచుకున్న సంస్థ
వెబ్సైట్లోకి వెళ్లి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడమూ ఒక పద్ధతి. నేరుగా డబ్బు ఇవ్వకపో
యినా.. మన వృత్తి నైపుణ్యాన్ని ఆయా ఎన్జీవోల కోసం వినియోగించడం ద్వారానూ
ఆత్మసంతృప్తి పొందవచ్చు. ఇది ఆర్థికేతర సేవ. మనం గీసిన పెయింటింగ్స్, మనం రాసిన పుస్తకాలు,
మనం చెక్కిన శిల్పాలు.. విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా నలుగురి కోసం
మళ్లించవచ్చు. మనకు సేద్యం ఉంటే, పంటలో కొంత భాగాన్ని పేదలకు పంచవచ్చు. మన
సుంటే మార్గాలు అనేక దారి ఏదైనా దాతృత్వం గొప్ప లక్షణం.

పన్ను మినహాయింపు..

విరాళాల ద్వారా ఆదాయపన్ను ప్రయోజనాన్నీ పొందొచ్చు. ఇన్కమ్ టాక్స్ యాక్ట్-1961
లోని సెక్షన్ 80 జీ ప్రకారం.. యాభై నుంచి నూరు శాతం పన్ను వినహాయింపు లభిస్తుంది.
కానీ, ఆ విరాళం మన మొత్తం ఆదాయంలో పదిశాతానికి మించకూడదు. అయితే, ఇక్కడో
నిబంధన ఉంది. మనం విరాళం అందించిన సంస్థలకు 80 జీ రిజిస్ట్రేషన్ తప్పక ఉండాలి.
అప్పుడే, నోటిఫైడ్ సంస్థల జాబితాలో చోటు లభిస్తుంది. మినహాయింపులకు వీలూ
ఉంటుంది. కొత్త టాక్స్ విధానాన్ని ఎంచుకునేవారికి ఈ మినహాయింపు వర్తించదు. పాత పద్ధ
తినే ఎంచుకున్నా.. రెండు వేల రూపాయలకు మించిన నగదు విరాళాలు ఈ పరిధిలోకి రావు.,
దుస్తులు, వస్తువులు, ఆహారం, పుస్తకాల రూపంలో ఇచ్చిన విరాళాలు కూడా 80 జీ కింద
అనర్హమైనవే.



బీమా తర్వాతే ఏదైనా..

మీ జీవన సౌధానికి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ రెండు పిల్లర్స్
లాంటివి. ఆ తర్వాత మీరు చేసే పెట్టుబడులు అన్నీ స్లాబుల్లాంటివి.
పిల్లర్స్ బలంగా లేకుండా ఎన్ని అంతస్తులు కడితే మాత్రం ఏం ప్రయో
జనం! ఒక్క కుదుపుతోనే మీ జీవితం కుప్పకూలిపోతుంది. ముఖ్యంగా
ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతి, సగటు ఉద్యోగి అందరూ ఆరోగ్య
బీమా కాన్సెప్టు లోతుగా అర్థం చేసుకోవాలి. పాతికేండ్ల తర్వాత వైద్యాని
కయ్యే ఖర్చులను అంచనా వేసి.. ఆ మొత్తానికి ఇన్సూరెన్స్ తీసుకోవాలి.
ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత కుటుంబ వ్యవహారానికయ్యే
ఖర్చులు ఆ తర్వాతే ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాలి. లేకపోతే
ఊహించని ప్రమాదం జరిగి ఆస్పత్రిపాలైనా, దీర్ఘకాలిక వ్యాధిబారిన
పడినా.. మీ కుటుంబం ఆర్థికంగా ఇరవై ఏండ్లు వెనకపడిపోతుందని
గుర్తుంచుకోండి. కుటుంబసభ్యులు నలుగురు ఉన్నట్లయితే.. 50
లక్షల నుంచి కోటి దాకా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అవసరం.
ఈ నలుగురు ఫ్యామిలీ 10 లక్షల పాలసీ తీసుకున్న దానికీ, 50
లక్షల పాలసీ తీసుకోవడానికి మధ్య ప్రీమియం వ్యత్యాసం గట్టిగా
 10 వేలకు మించదు. కానీ, చాలామంది ఎక్కువ మొత్తానికి పాలసీ
తీసుకుంటే పదివేల భారం అదనంగా పడుతుందని భావిస్తారు. అయితే,
ఆస్పత్రి బిల్లు పదిలక్షలు దాటి మరో నాలుగైదు లక్షలు ఎక్కువ అయితే..
అవి ఎక్కడ్నుంచి తేగలుగుతారు? హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకున్నవారిలో 90
శాతం మంది 10 లక్షల లోపు పాలసీ కట్టినవారే! పాలసీ అవసరం
రాకపోవడంతో దానినే కొనసాగిస్తున్నారు. కానీ, భవిష్యత్తులో ఇబ్బంది
ఎదురైతే.. అప్పుడు ఇన్సూరెన్స్ సంస్థ మీ కవరేజీని పెంచదు. కాబట్టి, ఈ
పూటే మీ హెల్త్ ఇన్సూరెన్స్కవరేజీని 50 లక్షలకు పెంచుకోండి.
ఇందుకోసం ఇన్సూరెన్స్ ఏజెంటును సంప్రదించి, అన్ని విషయాలు
చర్చించి, సరైన పాలసీని ఎంచుకోండి.

వ్యవస్థను నమ్ముకుంటే..

కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్లను విపరీతంగా ఆకర్షించే వాటిల్లో ఒకటి షేర్
మార్కెట్. మ్యూచువల్ ఫండ్స్ సేఫ్ గా లాభాలు ఇవ్వడానికి సిద్ధంగా
ఉన్నా.. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి, ట్రెండ్ సృష్టిస్తామని భావిస్తుం
టారు. అసలు మ్యూచువల్ ఫండ్స్క, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్కు మధ్య
వ్యత్యాసం ముందుగా తెలుసుకోవడం చాలా అవసరం. ఎవరికి వారు
పరిశోధించి, పరిశీలించి, స్టాక్ మార్కెట్ ఆనుపానూ తెలుసుకునే సత్తా
ఉన్నవాళ్లు ట్రేడింగ్ చేయాలి. అప్పటికీ మార్కెట్ ఎప్పుడెలా స్పందిస్తుందో
తలలు పండిన మేధావులు కూడా అంచనా వేయలేరు. దశాబ్దాలుగా
మార్కెట్లో పాతుకుపోయిన దమానీలు, అగర్వాల్లు కూడా గత ఇరవై
ఏండ్లలో సాధించిన రిటర్న్స్ ఏడాదికి రమారమి 18 శాతమే (లాంగ్
ర్మ్లో ఏడాదికి 18 శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్
చాలా ఉన్నాయి)! మార్కెట్లో పెట్టుబడికి మీ కోసం ఓ వ్యవస్థ పనిచేస్తే
అది మ్యూచువల్ ఫండ్స్ సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకా
లంలో ఇది సేఫ్ గేమ్ అన్నమాట! పెట్టుబడికి లాంగ్ టర్మ్ ఢాకా
ఉండదు. స్టాక్స్లో వచ్చే లాభం ఇక్కడ కూడా దర్జాగా పొందొచ్చు. పైగా
ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా, మీరెలాంటి పరిశోధనలు
చేయకుండా, మీ సమయాన్ని మీ కుటుంబానికి వెచ్చిస్తూ కూల్గా
రిటర్న్స్ సంపాదించొచ్చన్నమాట! స్పష్టంగా చెబితే.. స్టాక్స్ వ్యవహారం
సముద్రంలో ఈత నేర్చుకోవడం లాంటిది. ఒక్క పెద్ద అల వస్తే.. మనిషి
గల్లంతే! అదే మ్యూచువల్ ఫండ్స్ అంటే స్విమ్మింగ్పల్లో ఈత నేర్చు
కోవడం అన్నమాట. ఎంత లోతు ఉందో తెలుస్తుంది. అలల అలజడి
ఉండదు. సేఫ్గ స్విమ్మింగ్ చేయొచ్చు.

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024