39. కొత్త కారా? పాత కారా?


39. కొత్త కారా? పాత కారా?

ఒకప్పుడు సంపన్నుల చివరి కోరికగా
ఉన్న కారు.. మధ్యతరగతి బకెట్
లిస్ట్ లోకి వచ్చి చేరింది. కొత్త కారు
కొనాలని కొందరి ఆశ. పాత
కారుతో సరిపెట్టుకుందామని
మరికొందరి భావన. ఇంతకీ ఏ
కారు కొనాలి? ఎప్పుడు కొనాలి?
ఎందుకు కొనాలి? ఈ విషయాలపై
స్పష్టత లేకుండా బలవంతంగా
వాహనయోగాన్ని తగిలించుకుంటే..
చేతి చమురు వదలడం తప్ప,
ఆశించిన ప్రయోజనం ఉండదు.

మారిన సమాజం మనిషిపై చాలా ప్రభావం చూపుతున్నది. దూరపు
బంధువులెవరో కారు కొన్నారని తెలిసింది మొదలు.. అంతకన్నా
పెద్ద బండి కొనేయాలని కొందరు తపిస్తుంటారు. నలుగురిలో గొప్పగా కనిపించ
డానికి శక్తికి మించి తాపత్రయపడుతుంటారు. ఏ ఆలోచననైనా వాయిదా వేసుకో
గలరు కానీ, బుర్రలో కారు కొనాలనే పురుగు చేరితే మాత్రం అంత తేలిగ్గా
దాన్నుంచి తప్పించుకోలేరు. కారు మీదికి మనసు మళ్లింది మొదలు షోరూమ్
లకు వెళ్లడం, కొటేషన్లు తీసుకోవడం దినచర్యలో భాగమైపోతుంది.

ఆన్లైన్ కారు సేలింగ్ లో ధరలు వాకబు చేయడం అత్యవసర కృత్యంగా మారిపోతుంది.
కొత్తదా? పాతదా? మైలేజీ ఎంత? లాంటి ప్రశ్నలు వెల్లువెత్తుతాయి. అయినవారికి, కానివా
ఆ రికి ఫోన్లు చేసి కార్ల పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలుసుకోవడం కర్తవ్యంగా భావిస్తుంటారు. కానీ,
కారు మనకు అవసరమో, లేదోనన్న విషయాన్ని మాత్రం పక్కనపెడుతుంటారు.

ఇవి గమనించండి..

బ్యాంకు రుణాలు సులభంగా మంజూరు అవుతున్న ఈ రోజుల్లో కారు కొనడం పెద్దపనేం
కాదు. నెలకు 40వేల ఆదాయం ఉంటే చాలు.. ఆరేడు లక్షల రూపాయల కారు సాయం
త్రానికి ఇంటి ముందుకు తెచ్చుకోవచ్చు. అయితే, కొత్త కారు కొనాలో, పాత కారును
ఎంచుకోవాలో నిర్ణయించుకోవాల్సింది మీరే! టెక్నికల్ విషయాలు పక్కనపెడితే.. ఒకట్రెండు

ఏండ్లకు తీసేసే ఉద్దేశం ఉంటే పాత కారుకు ఓటు వేయడం మంచిది. కనీసం ఐదేండ్లు నడపా
లని ఫిక్సయితే కొత్త కారుకొనడం మేలు.  కొందరు ముందుగా ముందుగా పాత కోరుకుని డ్రైవింగ్ లో 
నైపుణ్యం సంపాదించి, తర్వాత కొత్త కారు తీసుకోవడం తెలివైన పని అని భావిస్తుంటారు.
కానీ, లోతుగా ఆలోచిస్తే ఇదేమంత గొప్ప నిర్ణయం కాదని తెలుస్తుంది. వెయ్యి రూపాయల
క్లయిమ్ చార్జెస్తో కొత్త కారుకు ఏదైనా డ్యామేజ్ అయితే 100 శాతం మరమ్మతు చేసుకో
వచ్చు. అదే ప్రమాదాలు జరిగినప్పుడు పాత కారుకు యాభై శాతానికి మించి బీమా సంస్థలు
చెల్లించవు. కొత్తదైనా, పాతదైనా.. రెండు నెలల్లో కారు డ్రైవింగ్ రాకమానదు. అలాంటప్పుడు
డ్రైవింగ్ కోసం పాత కారు కొనడం సరైన ఎంపిక అనిపించుకోదు.

రుణంలో కోత.

కొత్త కారు ధర ఎక్కువ అని చాలామంది అనుకుంటారు. అందులో సగం ధరకే పాతది .
వస్తుంది కదా అని సెకండ్ హ్యాండ్ వైపు మొగ్గు చూపుతారు. ఉదాహరణకు పది లక్షల
కొత్త 90 శాతం వరకు రుణం మంజూరు అవుతుంది. అంటే యజమాని పది శాతం
డౌన్ పేమెంట్ కడితే చాలు. అదే పాతకారు ధర 6 లక్షలు ఉందనుకోండి.
రుణం 60% నికి మించి రాదు. అంటే డౌన్ పేమెంట్గా 2.40 లక్షలు చెల్లించాల్సిందే. 
పైగా సెకండ్ హ్యాండ్ కారు రుణంపై వడ్డీ రేట్లు ఫస్ట్యండ్తో పోలిస్తే కొంత అధికంగా
ఉంటాయి. దీంతో ఈఎమ్ఐ భారం పెరుగుతుంది కూడా.

బేరీజు వేసుకోండి.

కారు కొనేముందు.. ఎన్నేండ్లు వాడుతామన్నది ముఖ్యం. రెండేండ్లకే ముచ్చట తీరిందని కొత్త
కారు అమ్మకానికి పెడితే మీరు ఊహించిన ధర వచ్చే అవకాశం ఉండదు. అమ్మబోతే అడవి గా
తయారవుతుంది. ఉదాహరణకు 10 లక్షల కొత్త కారు రెండేండ్లు వాడి మార్కెట్లో
అమ్మకానికి పెడితే గరిష్టంగా 6 లక్షలకు మించి పలకదు. అదే 6 లక్షల సెకండ్
హ్యాండ్ కారు రెండేండ్లు వాడుకొని అమ్మకానికి పెడితే 3.5 లక్షలు పలుకొచ్చు. ఈ
క్రమంలో నష్టశాతం కొత్త కారుకే ఎక్కువగా ఉంటుంది. పాత కారుకు తక్కువగా ఉంటుంది.
కనీసం ఐదేండ్లు మార్చకుండా ఉంటామని ఫిక్సయితే గానీ, కొత్త కారు కొనొద్దు! కొత్తకారు,
పాత కారు నిర్వహణ ఖర్చులను బేరీజు వేసుకోవడం ద్వారా స్పష్టత వచ్చే అవకాశం
ఉంటుంది. రెండిటి మైలేజీలో వ్యత్యాసాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడుగానీ
కొత్త కారు తీసుకోవాలో, పాత కారు తీసుకోవాలో.. ఒక నిర్ణయానికి రావాలి!

అవసరమైతేనే..

కారు కొనుకోవడం తేలికే! కానీ, అది మనకు అవసరమో, లేదో ముందుగా తెలుసుకోవాలి. రాబడి
బలంగా ఉంటే పెద్దకారు కొనుక్కోవచ్చు. జీతం తప్ప వేరే ఆదాయం లేకపోతే చిన్నకారుతో
సరిపెట్టుకోవచ్చు. పిల్లల ఫీజులు, గృహ అవసరాలు, కనీస అవసరాలు.. వీటన్నిటికీ ఇబ్బంది
లేకుంటే మీ శక్తి, ఆసక్తి మేరకు కొత్తదో, పాతదో ఏదో ఒక కారు కొనుగోలు చేయొచ్చు.

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024