pss book:gt13 త్రైత సిద్ధాంత భగవద్గీత : గుణత్రయ విభాగ యోగము
త్రైత సిద్ధాంత భగవద్గీత : గుణత్రయ విభాగ యోగము
శ్లోకము 1 : పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞాన ముత్తమమ్ ।
యద్జ్ఞా త్వా మునయస్స ర్వే పరాం సిద్ధిమితో గతాః ||
(జ్ఞానము)
భావము : ఏ జ్ఞానమును తెలుసుకొని మునులందరు శ్రేష్ఠమైన మోక్షమును పొందియున్నారో, అట్టి జ్ఞానములలోకెల్ల ఉత్తమమైన జ్ఞానమును మరల చెప్పుచున్నాను.
శ్లోకము 2 : ఇదం జ్ఞాన ముపాశ్రిత్యమమ సా ధర్మ్య మాగతాః ।
సర్గేఽ పి నోపజాయన్తే ప్రళయే న వ్యథ న్తి చ ||
(జ్ఞానము)
భావము : ఈ జ్ఞానమును తెలిసి ఉపాసించినవారు, నా పరమపదమును పొందిన వారై సృష్ఠికాలములో పుట్టరు. మరియు ప్రళయ కాలములో బాధపడరు.
వివరము : పరమాత్మ జ్ఞానమును పొందినవాడు దానిని ఉపాసించుట వలన, పరమాత్మయందే ఐక్యమైపోయి జీవస్వరూపమును కోల్పోవును. మోక్షము పొందిన తరువాత ఒక మనిషిగాను,లేక ఒక జంతువుగాను లేకుండ, ఏ శరీరము ధరించకుండ, అణువణువున వ్యాపించి పోయివున్నాడు. కనుక వానికి ప్రళయకాలములో బాధకాని, సృష్ఠికాలములో పుట్టుటను సమస్యకానీలేదు. ప్రళయ సంభవములకు అతీతుడుగ ఉండును.
శ్లోకము 3 : మమ యోని ర్మహ ద్భ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహమ్ ।
సంభవ స్సర్వభూతానాం తతో భవతి భారత ! ||
(ప్రకృతి, పరమాత్మ)
భావము : నా యోని పెద్దదైన విశాలమైన ప్రకృతి, దానిని నేను గర్భము ధరించునట్లు చేయుచున్నాను. దానినుండి సర్వభూతముల పుట్టుకలు కలుగుచున్నవి.
వివరము : సమస్త ప్రపంచమంత అన్యములేకుండ ఏకస్తముగ ఉన్నది పరమాత్మ. దానికి మినహా ఏమిలేదని చెప్పుకొన్నాము. కాని ప్రపంచ కార్య కారణములకు పరమాత్మను విభజించుకోవాలని కూడ చెప్పుకొన్నాము. అలా విభజించి చూచుకొంటే నాలుగు ముఖ్య భాగములుగ ఉన్నవి. అవి 1) జీవాత్మ 2) ఆత్మ 3) పరమాత్మ 4) ప్రకృతి. ఈ నాలుగు భాగములలో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అనునవి అలాగే ఉండగ, ప్రకృతి నుండి కనిపించు మరియు కనిపించనివి ఎన్నో పుట్టినవి. సమస్త జీవరాసులు ప్రకృతి నుండి పుట్టినవే. సమస్త జీవరాసులు ప్రకృతి నుండి పుట్టగ, వాటిని పుట్టించిన వాడు పరమాత్మ. ఒక స్త్రీనుండి కొందరు జన్మించుచుండుట మనకు తెలిసిన విషయమే. స్త్రీ నుండి పుట్టిన వారిని పుట్టించిన వాడు పురుషుడుఅని కూడ మనకు తెలుసు. అదేవిధముగా సర్వ జీవరాసుల పుట్టుకకు కారణమైన బీజదాతయగు పరమాత్మ తండ్రికాగ, యోని స్వరూపిణియగు ప్రకృతి తల్లియగుచున్నది. ఒక మనిషికి స్థూలముగ కనిపించు తల్లితండ్రులున్నట్లు, సర్వజీవరాసుల మొత్తమునకు కనిపించని తల్లితండ్రులు ప్రకృతి, పరమాత్మలున్నారని తెలియవలెను. ఈ లెక్క ప్రకారము మన తల్లి ప్రకృతి, తండ్రి పరమాత్మయని చెప్పవచ్చును.
శ్లోకము 4 : సర్వ యోనిషు కౌంతేయ ! మూర్తయః సంభవంతి యాః ।
తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజ ప్రదః పితా ||
(ప్రకృతి, పరమాత్మ)
భావము : సర్వయోనులందు పుట్టుచున్న అనేక రకముల ఆకారములు గల జీవరాసులకు ప్రకృతి తల్లికాగ, భీజదాతనైన నేను తండ్రినగుదును.
శ్లోకము 5 : సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః ।
నిబధ్నంతి మహాబాహో ! దేహే దేహీన మవ్యయమ్ ||
(జీవుడు, మూడు గుణములు)
భావము : ప్రకృతి చేత పుట్టిన సత్త్వ రజస్తమ అను గుణములు దేహములో నాశనముకాని జీవాత్మను బంధించుచున్నవి.
వివరము : ప్రకృతికి జీవరాసులు పుట్టాయని చెప్పాము కదా! ఆ జీవరాసుల శరీరములను విభజించి చూచినట్లయితే వాటిలో కనిపించెడి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు, కనిపించని వాయువులు, అవయవముల శక్తులు,గుణములు ముఖ్యమైన నాడీకేంద్రములు, గ్రంథులు మొదలగునవి కలవు. శరీరము మొత్తమును లెక్కించిన, దానిలోని భాగములు కూడ ప్రకృతికి పుట్టినవని చెప్పవచ్చును. వీటన్నిటితో కార్యములు జరుగుటకు, కర్మను సంపాదించి పెట్టుటకు, ముఖ్యపాత్రవహించునవి గుణములు. ఈ గుణములు మూడు భాగములుగ ఉన్నవి. ఒకటి తామసగుణ భాగము. రెండవది రాజసగుణ భాగము. మూడవది సాత్త్విక గుణభాగము. ఈ మూడు గుణ భాగములలో ఒక్కొక్కదానియందు ఆరు గుణములు ఒక గుంపుగ, మరియొక ఆరు గుణములు మరొక గుంపుగ ఉన్నవి. ఆరు ఒక వర్గము, మరియొక ఆరు ఒక వర్గముకాగ, ఈ గుంపులకు సంబంధములేని మరియొక రెండు మరియు ఒకటి కలిసి మూడుగుణములు ప్రత్యేకముగ కలవు. దీనిని బట్టి ఒకే గుణభాగములో (6+6+2+1=15) మొత్తము పదిహేను గుణములు గలవని తెలియుచున్నది. ఇంతవరకు అందరు అన్ని పుస్తకములలో వ్రాసుకొన్నవి చెప్పుకొన్నవి ఆరు మాత్రమే. అరిషట్ వర్గములు అని వాటి పేర్లు 1) కామ 2) క్రోధ 3) లోభ 4) మోహ 5) మధ 6) మత్సర్యములు. ఈ విధముగ ఒక గుంపైన ఆరు గుణములు మాత్రము ప్రచారములో కలవు. ఇప్పుడు మేము మా రచనలో మొత్తము గుణములను బహిర్గతము చేసి చెప్పుచున్నాము. అలా తెలుసుకోక పోతే క్షేత్రమును పూర్తి తెలిసినవారము కాము. అన్ని కార్యములకు మూలమైన గుణములను తెలియకపోతే వాటి వలన ఏర్పడు కర్మలు తెలియవు.
ఇప్పుడు మేము తెలుపు గుణములు అందరిలోను ఉన్నవేనని తెలియాలి. ఒక గుణ భాగములో లేక ఒక గుణ ఆవరణములో ఉన్న మొత్తము 15 గుణములలో కంటికి తెలియనివైనను వాటిలో ఒక విధముగ 12 మాత్రము స్థూలగుణములుగను, మూడింటిని సూక్ష్మగుణములుగను చెప్పుకోవచ్చును. ఈ వివరణ అర్థమగుటకు మాత్రమేనని తెలియాలి. ముఖ్యముగ చెప్పుకొను 12 గుణములలో ఆరు చెడు గుణములని, ఆరు మంచి గుణములని చెప్పుకోవచ్చును. వాటినే రాక్షస (చెడు) గుణములని, దైవ (మంచి) గుణములని కూడ చెప్పవచ్చును. ఇంతవరకు రాక్షస ప్రభావము గల కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యములనే మనమందరము వినియున్నాము. మనము వినని, ప్రచారములో లేని దైవ ప్రభావముగల 1) దానము 2) దయ 3) ఔధార్యము 4) వైరాగ్యము 5) వినయము 6) ప్రేమ అను పేరున్న ఈ గుణములు ఒక గుంపుగ ఉన్నవి. ఇవి మొదటి ఆరు గుణములకు వ్యతిరేఖమైనవి. కామము లేక ఆశ అనబడు గుణమునకు దానము అనునది విరుద్ధమైన గుణమని తెలియవలెను. అట్లే కోపమునకు దయ, లోభమునకు ఔధార్యము, మోహమునకు వైరాగ్యము, మదము (గర్వము) నకు వినయము, మత్సరము (అసూయ) అను దానికి ప్రేమ అను గుణములు వ్యతిరేఖమైనవి.
ఆరు చెడువి, ఆరు మంచివన్నాము కదా! ఆరు చెడు గుణములు పాప కర్మను సంపాదించి పెట్టుచున్నవి. అలాగే ఆరు మంచి గుణములు పుణ్యమును సంపాదించి పెట్టుచున్నవి. మిగతా మూడు గుణములను సందర్భానుసారము తరువాత చెప్పెదము. ఇవి 6+6=12 గుణములు పాపపుణ్యములను సంపాదిస్తున్నవన్నాము కదా! ఉదాహరణకు ఒక కామమను గుణమును దానికి వ్యతిరేఖమైన దానమను గుణమును తీసుకొందాము. ఆశయను గుణము ఏదో ఒక విధముగ తనకు లేని దానిని ఇతరుల నుండి తాను సంపాదించుకొనునట్లు చేయును. అట్లు చేయుటలో అక్రమాలు, అన్యాయములు, అసత్యములు అన్ని కూడుకొని ఉండుట సహజము. దాని వలన పాపము సంభవించును. దానికి వ్యతిరేఖమైన దానగుణము ఇతరులకులేని దానిని తన వద్దనుండి ఉచితముగ ఇప్పిస్తున్నది. ఇందులో అక్రమ, అన్యాయ, అసత్యమనునవి ఏమాత్రము ఉండుటకు అవకాశములేదు. కావున ఈ కార్యములో పుణ్యమే సంభవించును. ఈ విధముగ సంభవించు పాపపుణ్యములు జీవున్ని బంధించి మరుజన్మలకు తీసుకుపోవును. అందువలన గుణముల వలన ఏర్పడు కార్యములలో సంభవించు పాపపుణ్య ఫలితములను కర్మ బంధములన్నారు. కర్మ బంధములనునవి ఆ శరీరములో ఉన్న జీవున్ని బంధించి పెట్టివుండును. మరుజన్మకు లాగుకొని పోవు కర్మలను జన్మబంధములని కూడ అంటున్నారు. ఈ విధముగ జీవున్ని బంధించు సూత్రములను (త్రాడులను) గుణములే తయారు చేయుచున్నవి. ముఖ్యముగ జీవునకు బంధనములను కలుగజేయునవి గుణములు. అందువలన ఈ శ్లోకములో దేహములోనున్న జీవున్ని మూడు గుణ భాగములు బంధించి పెట్టాయన్నాడు.
ఈ అధ్యాయములో ఇక్కడ నుండి గుణములు ప్రేరేపించు కార్యములను గురించి తెలియజేయుట ప్రారంభమగుచున్నది. కావున ముందే గుణముల వివరమంతా తెలియవలసిన అవసరమున్నది. అందువలన గుణముల గూర్చి వివరముగ తెలుసుకొందాము. ఇంతవరకు తామస గుణభాగములో 12 గుణములు, రాజస గుణభాగములో 12 గుణములు, సాత్త్విక గుణభాగములో 12 గుణములు మొత్తము 36 గుణములు కలవని తెలుసుకున్నాము. క్రింద పటములో గుణ భాగములను వాటిలో గల జీవాత్మను చూడవచ్చును.
మూడు ఆవరణములుగనున్న గుణ భాగములలో గుణములు ఏ విధముగ ఉన్నది క్రింది పటము చూడవచ్చును.
ఒక్కొక్క భాగములో మొత్తము 12 గుణములుండగ, తామస గుణ స్వభావములు, రాజస గుణస్వభావములు, సాత్త్విక గుణస్వభావములు వేరువేరుగ ఉండుట వలన వాటి ఆకారములు కూడ వేరు వేరుగ ఉన్నవని తెలియవలెను. ఒక గుణభాగములో ఒక్కొక్క గుణము 9 భాగములుగ విభజింపబడి ఉన్నది. ఈ విధముగ ఒక గుణభాగములో (12x9 =108) మొత్తము 108 గుణములు కలవు. 108 గుణములన్ని ఒకే విధముగ ఉండక వాటి ప్రభావ పరిమాణములలో తేడాలున్నవి. అదెలాయనగా! ఉదాహరణకు ఆశ అను గుణమును తీసుకొందాము. ఆశలో పెద్ద ఆశ, చిన్న ఆశ అను 9 రకముల ఆశలుండును. అట్లే కోపమును తీసుకొనిన మొదట పెద్ద కోపముండును. దాని తరువాత పరిమాణము తగ్గుచుపోతు చివరకు 9వది చిన్నదిగ ఉండును. ఇదే ప్రకారముగ మొదటి ఆరు గుణములు మొదట పెద్దదిగ ఉండి చివరకు చిన్నదిగ మారివుండును. మిగతా మంచి ఆరు గుణములు పరిమాణములలో కూడ మొదటి ఆరు గుణములవలె తేడా ఉండును. అయితే ఇక్కడ గమనించవలసిన విషయమేమనగా! మొదటి గుణములు పెద్ద పరిమాణము నుండి చిన్నగ మారియుండగ రెండవ గుంపులోని గుణములు చిన్న పరిమాణము నుండి పెద్ద పరిమాణము వరకు మారి ఉండుట గమనించదగ్గ విషయము. ఉదాహరణకు పెద్ద కోపమునుండి చిన్న కోపము వరకు మారివుండగ, దానికి వ్యతిరేఖమైన దయా గుణము కోపము చిన్నదిగ అంత్యమైన చోటనుండి చిన్న గుణముగా ప్రారంభమై చివరకు పెద్దదిగ మారివుండును. కోపము పెద్దది నుండి చిన్నది వరకు 9 భాగములు మారివుండగ, దానికి వ్యతిరేఖమైన దయ అక్కడ నుండి చిన్నదిగ ప్రారంభమై 9వ భాగము పెద్దదిగ మారినిలిచి ఉండును. అవి ఎట్లున్నది క్రింది పటములో చూడుము.
ఈ విధముగ మూడు గుణ ఆవరణములలోను ఒక్కో గుణభాగములో 12 గుణములు 9 భాగములు కాగ మొత్తము 108 అవును. ఈ సంఖ్యయే కోట్ల సంఖ్యలో ప్రపంచ ఆయుస్సయినది. మొత్తము ప్రపంచములోని జీవరాసులన్నియు మూడు గుణభాగములలోని 108 గుణములలోనే చిక్కుకొని ఉన్నవి. చిన్నవి పెద్దవి అయిన 108 గుణములే సర్వజీవులను శరీరములలో బంధించి పెట్టి ఉన్నవి. అందువలననే పూర్వము పెద్దలు మానవుడు చేయు మంత్రసాధనకాని, దైవనామ జపముకాని, ప్రదక్షిణలుకాని, పూజించు పూలుకాని, ఆకులుకాని, జపమాలలోని పూసలను కాని 108 సంఖ్య పెట్టి ఉండడము గమనార్హము. ప్రతిది 108 పెట్టి ఒక్కొక్క జపముకాని, పూజకాని ఒక్కొక్క గుణమునకని 108 గుణములు గుర్తుండునట్లు చేశారు. ఆ వివరము మనందరికి తెలియకపోయిన పూర్వము పెద్దలు సంపూర్ణజ్ఞానులైన దానివలన వారెంతో ముందు చూపుతో ఈ పద్ధతి ఉంచారని గ్రహించవలెను. ప్రతి జపమాలలోను 108 పూసలు గుణములకు ప్రతి రూపములుగ ఉంచి, వీటియందే నీవు బంధించి ఉన్నావనునట్లు పూసలను గుండ్రని ఆవరణముగ ఏర్పరిచి పెట్టారు.
ఏ జీవుడైన శరీరములో గుణచక్రమందు మూడు గుణ ఆవరణములందు ఒకే సమయములో ఎప్పుడూ ఉండడు. ఒక సమయములో ఒక గుణ ఆవరణములోనే ఉండును. అందువలన ఒక ఆవరణములో ఉన్న 108 గుణములలోనే బంధింపబడి ఉన్నాడని చెప్పబడుచున్నాడు.
శ్లోకము 6: తత్ర సత్త్వం నిర్మల త్వాత్ప్రకాశక మనామయమ్ ।
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ! ||
(జీవుడు,సాత్త్వికము)
భావము : మూడు భాగములలో సాత్త్విక గుణభాగములో గల గుణములు నిర్మలత్వము ప్రకాశత్వము కల్గి ప్రయాసలేనివై, సుఖములందాసక్తి కల్గించునవై ఉండి జ్ఞానసుఖములలోనే బంధించును.
వివరము : సాత్త్విక భాగములోని గుణములు సుఖములందు ఆసక్తి కల్గించి జ్ఞాన సుఖములలోనే బంధించును. జ్ఞానసుఖము అనగా ఇచ్చట దైవజ్ఞానమేనని అనుకోకూడదు. ప్రపంచ విషయ జ్ఞానమని అర్థము చేసుకోవాలి. మిగతా రెండు గుణముల వారికంటే సాత్త్వికులు క్రొత్త విషయము తెలుసుకొనుటలోనే ఎక్కువ లగ్నమైవుందురు. జీవితమంత నేర్చుకొన్న తరగని సమాచారములెన్నో కలవు. అటువంటి వాటిని ఒకదాని తరువాత ఒకటి నేర్చుకొనుటకే తన తెలివినంత ఉపయోగించుచుండును. తెలియని దానిని తెలుసుకోవడమును జ్ఞానమంటాము. తెలియని వాటిని తెలుసుకొనుట సాత్త్వికులకు ఆసక్తి. ఆ ఆసక్తిలోనే మునిగి క్రొత్త వాటిని తెలుసుకొని ఇంకా క్రొత్తవాటిని తెలుసుకొను సుఖమునందే మునిగి ఉండడమును సాత్త్విక జ్ఞానమంటారు.
శ్లోకము 7: రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవమ్ ।
త న్నిబధ్నాతి కౌన్తేయ ! కర్మసంగేన దేహినమ్ ||
(జీవుడు, రాజసము)
భావము : రాజస గుణ భాగములోని గుణములు ప్రపంచ విషయములందు ప్రీతిని కలుగజేయునవై, వాటియందు ఆసక్తి ఆశను పుట్టించునవై, ఆ పనులందే తగులుకొనునట్లు చేసి జీవున్ని బంధించుచున్నవి.
శ్లోకము 8: తమ స్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ ।
ప్రమాదాలస్య నిద్రాభి స్తన్నిబధ్నాతి భారత ! ||
(జీవుడు, తామసము)
భావము : తామస గుణ ఆవరణములో ఉన్న గుణములు అజ్ఞానమును కలుగజేయునవై, మోహమును పుట్టించునవై ఉన్నవని తెలియుము. అంతేకాక ప్రమాదముతో కూడుకొన్న మజ్జుతనము, నిద్రలయందే జీవున్ని బంధించి పెట్టుచున్నవి.
శ్లోకము 9: సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత ! ।
జ్ఞాన మావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ||
(జీవుడు, మూడు గుణములు)
భావము : సాత్త్విక గుణభాగము యొక్క గుణములు సుఖములందాసక్తి కల్గించగ, రాజసగుణభాగములోని గుణములు ఆశను కల్గించి లాభము కొరకు పనులు చేయించగ, తామస ఆవరణములోని గుణములు జ్ఞానమును కప్పివేసి ప్రమాదాలచే ముప్పునుకలుగ చేయు పనులందే ఆసక్తి కల్గించి చేయించుచున్నవి.
శ్లోకము 10: రజ స్తమ శ్చాభిభూయ సత్త్వం భవతి భారత ! ।
రజ స్సత్త్వం తమ శ్చైవ తమ స్సత్త్వం రజస్తథా ||
(జీవుడు, మూడు గుణములు)
భావము : మూడు గుణ భాగములలో జీవుడు ఒక సమయములో ఏదో ఒక భాగములో మాత్రముండును. తామస భాగములో ఉన్నప్పుడు రాజస భాగములోను, సాత్త్విక భాగములోను ఉండడు. అలాగే రాజస భాగములో ఉన్నప్పుడు తామస భాగములోను, సాత్త్వికములోను ఉండడు. సాత్త్విక భాగములో ఉన్నప్పుడు రాజస భాగములోను, తామస భాగములోను ఉండడు.
శ్లోకము 11: సర్వద్వారేషు దేహేఽస్మిన్ ప్రకాశ ఉపజాయతే ।
జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్త్వమిత్యుత ||
(జీవాత్మ, సాత్త్వికము)
భావము : శరీరమునందున్న జీవునకు అనేక మార్గముల ద్వారా జ్ఞానము ఎప్పుడు కల్గుచున్నదో, అప్పుడు ఆ జీవుడు సాత్త్విక గుణభాగములోనున్నాడని తెలియవచ్చును.
వివరము : ఇక్కడ 'సర్వద్వారేషు' అను పదమునకు అనేక దారుల ద్వారా లేక అనేక ద్వారములద్వార అనేకరీతుల జ్ఞానము అభివృద్ధికావడమని అర్థము చేసుకోవలెను. అట్లుకాక శరీరమునకున్న తొమ్మిది ద్వారముల ద్వార జ్ఞానము కల్గడమని అనుకోకూడదు. అది అర్థములేని మాటయగును. గుదము గుహ్యము ద్వార జ్ఞానము కల్గుతుందా అని ఎవరైన ప్రశ్నిస్తే జవాబు లేకుండా పోతుంది. శ్లోకములోని నిజభావము ప్రకారము అనేక విధముల జ్ఞానము అభివృద్ధికావడమని తెలియవలెను. అనేక మార్గముల ద్వార జ్ఞానము తెలియబడుచు పెరగడము సాత్త్విక గుణ భాగములో జీవుడున్నప్పుడు జరుగును.
శ్లోకము 12: లోభః ప్రవృత్తి రారమ్భః కర్మణా మశమః స్పృహా ।
రజస్యేతాని జాయన్తే వివృద్ధే భరతర్షభ ! ||
(జీవాత్మ, రాజసము)
భావము : సంకుచిత స్వభావము, కార్యములందాసక్తి, ధనము మీద, బంగారు మీద ఇష్టము, మనస్సుకు అశాంతి ఎప్పుడు కల్గుచున్నవో అప్పుడు రాజస గుణ భాగములోని గుణములు పనిచేయుచున్నవని తెలియవచ్చును.
శ్లోకము 13: అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ ।
తమ స్యేతాని జాయన్తే వివృద్ధే కురునందన ! ||
(జీవాత్మ, తామసము)
భావము : అజ్ఞానము, మజ్జుతనము, చెడుపనులు చేయుటయందే మనసు లగ్నమగుట ఎప్పుడు పొడచూపునో, అప్పుడు జీవుడు తామసభాగములో ఉన్నాడని, తామస గుణములు జీవుని మీద పని చేయుచున్నవని తెలియవచ్చును.
శ్లోకము 14: యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ ।
తదోత్తమవిదాం లోకా నమలాన్ ప్రతిపద్యతే ||
(జీవాత్మ, సాత్త్వికము)
భావము : దేహధారి అయిన జీవుడు సత్త్వ గుణభాగములో ఉన్నప్పుడు మరణిస్తే, వాడు ఉత్తమ జ్ఞానవంతులు పొందు పరిశుద్ధమైన జన్మను పొందును.
శ్లోకము 15: రజసి ప్రళయం గత్వా కర్మసంగీషు జాయతే ।
తథా ప్రలీన స్తమసి మూఢయోనిషు జాయతే ||
(జీవాత్మ, రాజసము, తామసము)
భావము : రాజస భాగములో జీవుడున్నపుడు మరణించిన ఎడల కర్మములతో కూడిన జన్మలే వచ్చును. తామసములో ఉండి చనిపోయిన వానికి మూఢ యోనులందే జన్మము కల్గుచుండును.
శ్లోకము 16: కర్మణ స్సుకృతస్యాఽహు స్సాత్త్వికం నిర్మలం ఫలమ్ ।
రజస స్తు ఫలం దుఃఖ మజ్ఞానం తమసః ఫలమ్ ||
(జీవుడు, మూడు గుణములు)
భావము : సాత్త్విక గుణభాగములో జీవునకు పుణ్యకార్యములు నిర్మల ఫలితములు దొరుకును. రాజస భాగములో జీవునకు దుఃఖము దొరుకును. తామసములో అజ్ఞానమే జీవునకు కల్గుచుండును.
శ్లోకము 17: సత్త్వాత్సం జాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ।
ప్రమాదమోహౌ తమసో భవతోఽజ్ఞాన మేవ చ ||
(జీవుడు, మూడు గుణములు)
భావము : సత్త్వగుణ ఆవరణములో జీవునకు జ్ఞానముకల్గుచుండును. రాజస భాగములో ఇతరుల సొమ్ము నాది కావలెనను ఆకాంక్ష ఏర్పడుచుండును. తామస భాగములో తనకు ఇష్టము నష్టము చేకూర్చుకొనుట, భ్రాంతి అజ్ఞానము చేకూరు చుండును.
శ్లోకము 18: ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా మధ్యే తిష్ఠన్తి రాజసాః ।
జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్ఛన్తి తామసాః ||
(జీవుడు, మూడు గుణములు)
భావము : సాత్త్వికులకు ఉత్తమమైన జన్మలు, రాజసులకు మధ్యమమైన జన్మలు, తామసులకు నీచమైన జన్మలు కల్గుచుండును.
శ్లోకము 19: నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టాఽనుపశ్యతి ।
గుణేభ్య శ్చ పరం వేత్తి మద్భావం సోఽధిగచ్ఛతి ||
(జీవుడు, మూడు గుణములు)
భావము : సర్వకార్యములకు గుణములే కర్తలని ఎవడు తెలుసుకొనునో, ఆ గుణములు వేరు తాను వేరని వాడు తెలుసుకొని నా స్థానమైన పరమపదమును పొందుచున్నాడు.
శ్లోకము 20: గుణా నేతా నతీత్య త్రీన్ దేహీ దేహసముద్భవాన్ ।
జన్మ మృత్యు జరాదుఃఖై ర్విముక్తోఽమృత మశ్నుతే ||
(జీవుడు, మూడు గుణములు)
భావము : దేహమునందున్న జీవుడు దేహమునందున్న గుణములను తెలుసుకొని, జన్మ మృత్యుజరా దుఃఖములను వదలినవాడై, మృతములేని మోక్షమును పొందుచున్నాడు.
అర్జునుడిట్లనియె :-
శ్లోకము 21: కైర్లింగై స్త్రీన్ గుణా నేతా నతీతో భవతి ప్రభో ।
కి మాచారః కథం చైతాం స్త్రీన్ గుణా నతివర్తతే ||
(యోగి)
భావము : ఓ కృష్ణా! ఈ త్రిగుణ భాగములోనున్న గుణములన్నిటిని అతిక్రమించిన వాని ఆచారమెట్లుండును? వాడు త్రిగుణములనెట్లు అతిక్రమించి వర్తించుచుండును?
శ్రీ భగవంతుడిట్లనియె :-
శ్లోకము 22: ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహ మేవ చ పాణ్డవ! ।
న ద్వేష్టి సమ్ప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ||
(యోగి)
భావము : తేజస్సుగ జరిగెడి కార్యములను తనవని అనుకొనని వాడు, తనకు సంప్రాప్త మైన వాటి ఎడల ద్వేషంబులేనివాడు, తనకు దొరికిన వాటి ఎడల కాంక్షలేనివాడు.
శ్లోకము 23: ఉదాసీన వదాసీనో గుణైర్యోన విచాల్యతే ।
గుణా వర్తన్త ఇత్యేవ యోఽవతిష్ఠతి నేంగతే ||
(యోగి)
భావము : సర్వ విషయములందు తటస్థముగ ఉదాసీనునిగ ఉండి ఎవడు గుణములచే చలించబడడో, ఎవడు ప్రతిది గుణముల ప్రవర్తనయేయని తెలిసి వాటికి అచంచలుడై బుద్ధి నిశ్చలత పొందియుండునో.
శ్లోకము 24: సమదుఃఖసుఖ స్స్వస్థ స్సమలోష్టాశ్మకాంచనః ।
తుల్యప్రియాప్రియో ధీర స్తుల్యనిన్దాత్మ సంస్తుతిః ||
(యోగి)
భావము : సుఖదుఃఖములను ఎవడు సమముగ చూచునో, బంగారు మన్నురాతికి ఎవడు సమముగ విలువిచ్చునో, ప్రీతీ అప్రీతి స్తుతి నిందల ఎడల ఎవడు స్థిర బుద్ధి గలవాడైవుండునో.
శ్లోకము 25: మానావమానయో స్తుల్య స్తుల్యో మిత్రారిపక్షయోః ।
సర్వారమ్భపరిత్యాగీ గుణాతీత స్స ఉచ్యతే ||
(యోగి)
భావము : ఎవడు మానావమానములయందు, మిత్ర శత్రువులందు సమబుద్ధి కలవాడో, కామ్య కర్మములనెల్ల పరిత్యజించిన వాడెవడో అట్టివానిని గుణాతీతుడని చెప్పవచ్చును.
శ్లోకము 26: మాం చ యోఽవ్యభిచారేణ భక్తియోగేన సేవతే ।
స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ||
(సాకార, నిరాకారములు)
భావము : వ్యభిచరించని మనస్సుతో పరమ భక్తితో ఎవడు నన్ను సేవించుచున్నాడో, వాడు త్రిగుణములనెల్ల అతిక్రమించి పరమాత్మయందైక్యమగుటకు అర్హుడగును.
శ్లోకము 27: బ్రహ్మణో హి ప్రతిష్ఠాఽహ మమృతస్యావ్యయస్య చ ।
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాన్తికస్య చ ||
(సాకార, నిరాకారములు)
భావము : నిత్యుడు అవ్యయుడైన నిర్మలాత్మ, శాశ్వితైశ్వర్య ధర్మమౌ పరమపదము, జ్ఞానులు పొందగలుగు మోక్షపదవి లభించవలెనన్న నన్ను ఆశ్రయించవలసిందే.
వివరము : ఈ చివరి రెండు శ్లోకములలోను నిరాకారమైన పరమాత్మను పొందుటకు సాకార పరమాత్మను ఆశ్రయించవలసినదని, సాకారమును భక్తి యోగముచే సేవించవలెనని భావము ప్రకటించారు. సాకార పరమాత్మ ప్రస్తుతము లేకున్న ఆయన సాకారముగ ఉన్నప్పుడు తెలిపిన జ్ఞానము నాశ్రయించుట వలన నిరాకార పరమాత్మను పొందవచ్చును. పరమాత్మ భగవంతునిగ ఉన్నప్పుడు చెప్పిన జ్ఞానమును వదలి అన్యదేవతల మహాత్యములనో, పురాణమహిమలనో ఆశ్రయించిన, ఎవరూ ఎప్పటికీ మోక్షము పొందలేరు.
--------------