pss book:gt16 త్రైత సిద్ధాంత భగవద్గీత : శ్రద్ధాత్రయ విభాగ యోగము
త్రైత సిద్ధాంత భగవద్గీత : శ్రద్ధాత్రయ విభాగ యోగము
అర్జునుడిట్లనియె :-
శ్లోకం 1: యే శాస్త్రవిధి ముత్సృజ్య యజన్తే శ్రద్ధయాఽన్వితాః ।
తేషాం నిష్ఠా తు కా కృష్ణ! సత్త్వ మాహో రజ స్తమః ||
(ప్రకృతి, గుణములు)
భావము : ఎవరైతే శాస్త్రపద్ధతులను వదలి శ్రద్ధతో పూజలు, ఆరాధనలు చేయుచున్నారో అట్టివారి నిష్ఠను ఏమనవచ్చును? సత్త్వమా! రాజసమా! తామసమా!
వివరము : ప్రతి పని శాస్త్రయుక్తముగ చేయవలెనని వెనుక అధ్యాయములోని చివరి శ్లోకములో చెప్పబడి ఉన్నది. ప్రతి పనిని శాస్త్రయుక్తముగ చేయుమనినట్లే దేవతారాధన మొదలుకొని అన్ని పనులను శాస్త్రయుక్తముగ చేయవలసివున్నది. అయినప్పటికి అందరు అలా చేయడములేదు. శాస్త్రవిధానమును వదలి చాలామంది అనేకమైన కార్యములు చేయుచున్నారు. ఆశతో లాభ మొచ్చునని తలచి చేయు పనులయందు శ్రద్ధ కలదు. ఎంతో శ్రద్ధతో చేయబడు శాస్త్రరహిత కార్యములను ఏ గుణ భాగములకు సంబంధించినవని, వారి శ్రద్ధ ఏ గుణ భాగమునకు సంబంధించినదని అడుగవచ్చును. ఇదియే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. దానికి భగవంతుడేమి చెప్పుచున్నాడో క్రింది శ్లోకములో చూస్తాము.
శ్రీ భగవంతుడిట్లనియె :-
శ్లోకం 2: త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా ।
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు ||
(గుణములు)
వివరము: మన శరీరములో గుణచక్రమొకటి కలదని, అందులో మూడు భాగములు కలవని, ఆ మూడు భాగములకే సాత్త్విక, రాజస, తామస భాగములని పేర్లు పెట్టబడినవని ముందే చెప్పుకొన్నాము. అంతేకాక ఒక్కొక్క భాగములో 12 గుణములు కలవని వాటితోపాటు భయము, ధైర్యమను రెండు గుణములు, శ్రద్ధ అను ప్రత్యేకమైన ఒక గుణము కలిగి మొత్తము 15 గుణములగుచున్నవని కూడ తెలుసుకొన్నాము. ఈ విధముగ ఒక్కొక్క గుణభాగములో ఒక్కొక్క శ్రద్ధ కలదు. శ్రద్ధ అన్ని గుణములవలె ఉండునది కాదు. అన్ని గుణములు కర్మానుసారము ప్రేరేపింపబడుచుండును. శ్రద్ధ మాత్రము గుణభాగములలో ఉన్నప్పటికి, కర్మాధీనము కాదు. జీవునకు స్వభావజనితమైనది శ్రద్ధ, శ్రద్ధ ప్రకారము ఇష్టమైన పనికాని, ఇష్టములేని పనికాని కర్మానుసారము శరీరములో జరుగుచుండును. పరమాత్మను తెలియవలెనను శ్రద్ధ, జ్ఞానము తెలియవలెనను శ్రద్ధ కర్మాతీతమైనవి. ఈ శ్రద్ధ గుణాతీతమైనదని చెప్పవచ్చును. ఈ శ్రద్ధను బట్టి కర్మాతీతమైన జ్ఞానమును ఆత్మప్రాప్తిని పొందవచ్చును. కాని గుణభాగములలోని శ్రద్ధనుబట్టి పనులు జరుగవచ్చును, జరుగక పోవచ్చును. మనిషికొక శ్రద్ధవుండగ దానిప్రకారము జరుగక మరియొక విధముగ పనులు జరుగుట అందరికి ప్రత్యక్షానుభవమై ఉన్నది. 'తానొకటి తలచిన కర్మమొకటి తలచునని' అక్కడక్కడ అనుట వినుచునేవున్నాము.
శ్లోకం 3: సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత ! ।
శ్రద్ధామయోఽయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః ||
(గుణములు)
భావము : సర్వులకు శ్రద్ధ వారి ఇష్టానుసారము పుట్టునది. ఏ శ్రద్ధ ఎవనికి కలదో వానిని ఆ శ్రద్ధా పురుషుడని చెప్పవచ్చును.
వివరము : ఈ శ్లోకము కొంత సారాంశమైన శ్లోకమని చెప్పుకోవచ్చును. ఇందులో ముఖ్యముగ గమనించవలసిన విషయము చాలా ఉన్నది. ఇంతకు ముందు గుణత్రయ విభాగయోగమను అధ్యాయములో గుణములు మూడు భాగములుగ ఉన్నవని, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు గలదని కూడ తెలుసుకొన్నాము. శరీరధారుడైన జీవుడు ఆ గుణభాగములలోనే ఉండునని, ఏ గుణభాగములో ఉంటే ఆ గుణము పేరే జీవునికి కల్గునని కూడ చెప్పుకున్నాము. తామసములో ఉంటే తామసుడని, రాజసములో ఉంటే రాజసుడని, సాత్త్వికములో ఉంటే సాత్త్వికుడనుకొన్నాము. అక్కడ చెప్పినది అక్కడివరకు వాస్తవమే అయినప్పటికి ఇక్కడ మరికొంత మార్పుతో అర్థము చేసుకోవలసి ఉన్నది. ఇక్కడ చెప్పిన శ్లోకములో శ్రద్ధ అనునది జీవునకు స్వభావజనితమైనదని, శ్రద్ధ మూడు విధములుగ ఉన్నదని, గుణములను బట్టి శ్రద్ధలు కలవని చెప్పబడివున్నది. ఏ శ్రద్ధవున్న పురుషుని ఆ గుణ పురుషునిగ చెప్పబడుచున్నది. ఒక్కొక్కప్పుడు జీవుడున్న గుణములోనే శ్రద్దకూడ ఉండును. జీవునకు గల శ్రద్ధ తామస గుణ భాగములోని పనుల మీద ఉండి జీవుడు మాత్రము సాత్త్వికములో ఉన్నాడనుకొనుము. అప్పుడు వాడు సాత్త్వికుడాయనిన కాదని చెప్పవచ్చును. వాడు తామసుడనియే చెప్పవచ్చును. జీవుడు కర్మరీత్యా బలవంతముగ సాత్త్వికగుణ భాగములో బంధింపబడి ఉన్నప్పటికి వాడు సాత్త్వికుడు కాడు. శ్రద్ధను బట్టి పురుషుడు ఎవరైనది నిర్ణయింపబడుచున్నది. "శ్రద్దామ యోఽయం పురుషోయో యచ్చ్రద్ధః స ఏవసః" అనుమాట ప్రకారము ఏ గుణశ్రద్ధతో కలిసినవాడు ఆ గుణ పురుషుడనియే చెప్పబడును. కావున సాత్త్వికములో జీవుడుండి శ్రద్ధ తామస గుణభాగములో ఉన్నపుడు వాడు నిజముగ తామసములో ఉన్నవాడే అగును. సాత్త్వికములో ఉన్నవాడు కాదని తెలియవలెను.
ఒక విషయము వినుచున్నప్పుడు మనస్సెక్కడో ఉన్నట్లయితే ఆ విషయము బుర్రకెక్కనట్లు, ఒక గుణములో ఉన్న జీవుని శ్రద్ధ మరెక్కడో ఉన్నట్లయితే జీవుడు అక్కడలేనట్లే లెక్కించబడును. ఎచట శ్రద్ధగలదో అచటే ఉన్నట్లు లెక్కించవలెను. మరొక ఉదాహరణ తీసుకొందాము. జ్ఞానము సంపూర్ణముగ తెలిసినవాడు గుణములలో శ్రద్ధలేనివాడై, గుణములేని దానియందు శ్రద్ధకల్గి ఉన్నాడనుకొనుము. కాని వాని పూర్వజన్మ కర్మప్రకారము ఆ జీవుడు బలవంతముగ రాజస గుణభాగములో చిక్కి అందులోని గుణముల ఆచరణ చేయవలసి వచ్చినపుడు వానిద్వారా జరుగు పనులు రాజస గుణములలోనివైనప్పటికి వానిని రాజసుడనకూడదు. వానికున్న శ్రద్ధనుబట్టి గుణాతీతుడని చెప్పవచ్చును. శ్రద్ధను బట్టి వాని స్థానమును నిర్ణయింపదగుననునదియే ఈ శ్లోకములోని ముఖ్యసూత్రము. గుణ భాగములను బట్టి శ్రద్ధ మూడు విధములైన, గుణాతీత భాగమును బట్టి కూడ శ్రద్ధ కలదు. మూడు గుణముల శ్రద్ధను బట్టి తామసులు, రాజసులు, సాత్త్వికులు కాగ గుణాతీత భాగమును బట్టి యోగులు కూడ ఉన్నారు. 'చాతుర్వర్ణం' అను శ్లోకములో చెప్పినట్లు నాల్గుశ్రద్ధలు కూడ కలవని తెలియాలి.
శ్లోకం 4: యజన్తే సాత్త్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ।
ప్రేతాన్ భూతగణాం శ్చాన్యే యజన్తే తామసా జనాః ||
(గుణములు)
భావము : సాత్త్విక గుణము కలవారు దేవతలను ఆరాధించుదురు. రాజసులు యక్షులను రాక్షసులను, తామసులు ప్రేతములను భూతములను పూజ చేయుదురు.
వివరము : సాత్త్వికశ్రద్ధకల్గిన జీవులు దేవతలను ఆరాధించుదురు. రాజసశ్రద్ధగల వారు దేవతలకంటే తక్కువైన యక్ష రాక్షసులను పూజింతురు. తామస శ్రద్ధకలవారు ప్రేతములను దయ్యములను పూజించుచుందురు.
శ్లోకం 5: అశాస్త్రవిహితం ఘోరం తప్యన్తేయే తపోజనాః ।
దమ్భాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః ||
(గుణములు)
శ్లోకం 6: కర్శయ న్త శ్శరీరస్థం భూతగ్రామ మచేతసః ।
మాం చైవా న్త శ్శరీరస్థం తాన్ విద్ధ్యాసుర నిశ్చయాన్ ||
(గుణములు)
భావము : ఏ మనుజులు అహంకారము, దంభముతో కూడినవారై, ఆశ, ప్రేమ గుణముల బలము కల్గినవారై, ఇతరులను ఇబ్బంది పెట్టువారై, అశాస్త్రపద్ధతిలో తపములు చేయువారై, అజ్ఞానులై శరీరమునందలి ఇంద్రియములను వాటిలోపల ఉండు ఆత్మనైన నన్ను కృశింపజేయుచున్నారో, అట్టివారు అసురులని తెలియుము.
వివరము : కొందరు కోర్కెలే ముఖ్య ఆశయముగ పెట్టుకొని, అవి నెరవేరుటకు కొన్ని నియమములతో కూడిన తపస్సులు కూడ చేయుచుందురు. శరీర కష్టముతో కూడుకొన్న ఆరాధనలను తపస్సులంటాము. శరీరమును తపింపజేయు నియమము లతో కూడిన ఆరాధనలు, ఇతరులకు కూడ ఇబ్బంది కలుగజేయునవిగ ఉండును. ఉదాహరణకు ఇల్లంతా శుభ్రపరచి బొట్టుపెట్టి ఇంటిలోని వారంతా ఒకే ఆహారము తిని బయటి పనులకు పోకుండ ఇంటిలోనే ఉండగ, ఆ ఇంటిలోని ఒకడు పూజ మొదలిడును. ఆ పూజ చేయునంత వరకు ఇంటిలోని వారు బయటికి, బయటివారు ఇంటిలోనికి రాకూడదు. పూజచేయువాడు తన మంత్రము పదివేలు జపమై పోవువరకు లేవకూడదు, ఆహారము తీసుకోకూడదు. ఇటువంటి నియమము గల పూజ మొదలు పెట్టినారనుకోండి. మలమూత్రాదులు వస్తున్నప్పటికి వాటి విసర్జన కొరకు బయటికి పోకూడదు. పోయినట్లయిన నియమము ఉల్లంఘించినట్లగును. ఈ నియమముతో ఇంటిలోని వారుకూడ బాధపడవలసివున్నది. అలాగే పూజ చేయువాడు మంత్రము పదివేలయిపోవు వరకు లేవకూడదు. ఆ నియమము ప్రకారము కూర్చున్నవానికి కాల్లు నొప్పిపుట్టిన కదలకూడదనుటచే వాని ఇంద్రియము లకు కష్టమేర్పడినది. అందులోని చైతన్యముగనున్న ఆత్మకు కూడ ఆహార బలములేక శక్తి బలహీనపడినట్లయినది. కదలకుండుట వలన నరములలో గ్లాని ఏర్పడిశక్తి ప్రసారమగుటకు ఆటంకమేర్పడుచున్నది. ఇటువంటి తపనతో కూడుకొన్న ఆచరణలు చేయువారు శరీరములోని ఇంద్రియములను, అందులోని దైవమైన ఆత్మను కష్టపెట్టువారగుట వలన వారిని రాక్షసాంశ కలవారని చెప్పవచ్చును.
శ్లోకం 7 : ఆహార స్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః ।
యజ్ఞ స్తప స్తథా దానం తేషాం భేద మిమం శృణు ||
(గుణములు)
భావము : సర్వ జీవరాసులు తీసుకొను ఆహారము కూడ మూడు శ్రద్ధలుగ ఉన్నది. అట్లే త్రి శ్రద్ధలుగ యజ్ఞము, తపము, దానము మొదలగునవి కలవు. వాటి భేదములను వివరింతు వినుము.
వివరము : మనిషి తిను ఆహారములోనే కాక చేయు పనులలోను అలాగే ఆరాధనలలోను మొదలగు అన్నిటియందును శ్రద్ధ మూడు విధములుగ ఉన్నదని చెప్పవచ్చును. చేయుచున్న పని ఏ గుణముదైవున్న శ్రద్ధను బట్టి లెక్కించనగునని చెప్పాము కదా! ఆ మూడు గుణభాగముల శ్రద్ధలను ఇక్కడ తెలియజేయుచున్నాడు. మొదట ఆహారమును గూర్చి తెలియజేయుచున్నాడు చూడండి.
శ్లోకం 8 : ఆయుస్సత్త్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః ।
రస్యాస్స్నిగ్ధా స్థ్సిరా హృద్యా ఆహారా స్సాత్త్వికప్రియాః ||
(సాత్త్విక శ్రద్ధ)
భావము : ఆయుస్సును, శరీర ఉల్లాసము, బలము, ఆరోగ్యము, కలుగజేయునవియు, చూచుటకు అందముగను, ప్రీతిని వృద్ధిచేయు రసవత్తరమైనవి, నూనె పదార్థములు కలవి, దీర్ఘకాలమున్నా చెడిపోని ఆహార పదార్థముల మీద సాత్త్వికులకు ప్రీతియుండును.
వివరము : ఆహారము మీద శ్రద్ధ ఏ ఏ గుణములలో ఎలాగుండునో ఇక్కడ వివరించడమైనది. మొదట ఆహారమంటే ఏమిటో తెలుసుకొందాము. మనము నోటి ద్వార లోపలికి వేయునవన్నియు ఆహారము కాదు. నోటిద్వారా కడుపులోనికి పోవు అన్నియు ఆహారము కాదని చాలామందికి తెలియదు. నోటిద్వారా కడుపులోనికి పోవు వాటిలో ఆహారపదార్ధములని, ఆహారపదార్ధములు కానివని రెండు రకములైన పదార్థములు కలవు. శరీరమునకు ఉపయోగపడి, శరీర ఆరోగ్యమును కాపాడుచు శరీర పోషణకు ఉపయోగపడు పోషక పదార్థములున్న వాటిని ఆహారము అనవచ్చును. నోటిద్వారా తీసుకొనుచుండినప్పటికి శరీర పోషణకు ఉపయోగపడక నేరుగ మెదడు మీద పనిచేసి మానసికముగ సుఖమునుకల్గించు మత్తుపదార్ధములను ఆహార పదార్ధములనము. అటువంటి మత్తు పదార్థములైన గంజాయి, నల్లమందు, సారా, బ్రాందీలు మొదలుకొని ఉన్న ప్రతిది ఆహారపదార్థ జాబితాలో చేరవు. శరీర పోషణ నిమిత్తము పోషక పదార్థములున్న వాటినే ఆహారముగ పరిగణించవచ్చును. ఆహార పదార్థము తీసుకోవడములో ఆహారమైన ఏ పదార్థమైనను అభ్యంతరము లేదు. కాని ఆహారపదార్ధములు కాని మత్తుపదార్థములు తీసుకోవడము మంచిదికాదు. ఇక్కడ కొందరికొక ప్రశ్న రావచ్చును. అదేమనగా 'ఆహార పదార్థములలో ముఖ్యముగ శాఖాహారము, మాంసాహారము అను రెండు రకములుగ ఉన్నవి కదా! వాటిలో శాఖాహారము మంచిది, మాంసాహారము చెడ్డదనుచు మాంసాహారమును వదలివేయమంటారు. మాంసాహారము వలన చెడు గుణములు వస్తాయని చెప్పుచుంటారు అది వాస్తవమేనా?' ఈ ప్రశ్నలకు జవాబు ఏమనగా! ఆహార పదార్థములలో శరీరమునకు ఉపయోగపడు నవి, మానసికముగ పనిచేయునవని రెండు రకములు ఉన్నవి. కాని శరీరమునకు ఉపయోగపడు ఆహారములో ఇవి తినవచ్చును ఇవి తినకూడదను నియమముగలవి ఏవిలేవు. మానసిక మార్పు కలుగజేయు మత్తుపదార్థములు తప్ప తినకూడనివేవీ లేవు. ఆహారము సంపాదించుకోవడములో పాపపుణ్యములు రావచ్చునుకాని తినడములో ఏమి లేదు. ఆహారము వలన గుణములు మారునని చాలామంది చెప్పగ వినియు, చాలా పుస్తకములలో వ్రాయగ చూచివున్నాము. ఏ ఆధారముతో అలా వ్రాశారో వారికే తెలియదు. ఆహారము వలన గుణములు మారునట్లయితే జ్ఞానబోధ అవసరమే లేదు. అందరికి మంచి ఆహారము పెట్టి మంచిగ మార్చివేయ వచ్చును. ఏ ఆహారము తిన్నప్పటికి వారి శరీరమునకే కాని గుణములకు ఆధారము కాదు. గుణములకు కారణమైనది వెనుకటి జన్మ కర్మయే. సైన్యములో మూడువందల మందికి ఒకచోట ఒకే ఆహారమివ్వడము జరుగుచున్నది. ఒకే ఆహారము తినుచున్న మూడువందల మందికి ఒకే గుణమున్నదా? అని చూచిన ఎడల అట్లు ఎవ్వరికి లేదు. వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క గుణము కల్గివున్నారు. అందువలన ఆహారము గుణములను మార్చలేదని ఋజువగుచున్నది. ఇక్కడ గీతయందు ఈ అధ్యాయములో గుణమును బట్టి ఆహారమున్నదని చెప్పాడు, కాని ఆహారమును బట్టి గుణములున్నట్లు చెప్పలేదని ముఖ్యముగ తెలియవలెను.
ఇంక మాంసాహారమును వివరించుకొని చూచినట్లయితే శరీరము పెరుగుదలకు మాంసకృత్తులను పోషక పదార్థములవసరము. మాంసకృత్తులు (Protiens) అను పోషక పదార్థములు పప్పు ధాన్యములైన కంది, పెసర మొదలగు ధాన్యములలోను జంతువుల మాంసములోను కలవు. ధాన్యములలోని మాంసకృత్తులు శరీరమునకెట్లు ఉపయోగపడుచున్నవో, అట్లే జంతు మాంసములోని మాంసకృత్తులు ఉపయోగపడుచున్నవి. శరీరములో అవి మంచి ఇవి చెడు ఏమి చేయలేదు. ముందే చెప్పాము ఆహారము సంపాదించుకొనుటలో పాపమురావచ్చును, కాని ఆహారము తినుటవలన శరీరములో పాపము రావడముకాని, గుణములు మారడము కాని జరుగదు. ఆహారరీత్య శాఖాహారమైన మాంసాహారమైన ఒక్కటే. ఆహారము శరీర ఆరోగ్య అనారోగ్య సమస్యలకు సంబంధించినది, కాని గుణముల వృత్తి నివృత్తికి సంబంధించినది కాదు. ఆహారమే గుణముల వృత్తి నివృత్తికి సంబంధించినదైవుంటే మనకు జ్ఞానము యోగసాధన అవసరమే లేదు కదా! ఆహారముతోనే గుణములను లేకుండ చేసుకొని పరమాత్మను పొందవచ్చును కదా! అట్లు ఎప్పటికి సాధ్యము కాదుగనుకనే యోగసాధనకు జ్ఞానమవసరమైనది. ఆహారము వలన గుణములలో మార్పువచ్చునని పెద్దస్వాములు, గురువులు చెప్పడము విచారకరము. అంతేకాక ఆహారము మంచిదైనప్పటికి, పెట్టు వారిలో గుణములు మంచివి కాని ఎడల వారు పెట్టిన ఆహారము తినుట వలన, తిన్నవారికి సహితం చెడు గుణములు వచ్చుననుట మరీ విచిత్రము. పెట్టిన వారెట్టివారైన ఆహారములో ఏ ప్రభావముండదు. పెట్టిన వానికి, ఆహారమునకు ఏ సంబంధము లేదు. ఎవరు పెట్టిన అది సాధారణ ఆహారముగనే ఉండును. తప్పుచేసినవాడు తన తప్పును అన్నము పెట్టిన వారి మీద వేయు ద్రోహబుద్ధిచే కొందరలా కథలను అల్లిపెట్టారు. అలా అయిన తప్పుచేసిన ప్రతివాడు అన్నము పెట్టిన వారిమీద తమ తప్పును త్రోయగలడు. ఇది మంచిదేనా మీరే యోచించండి.
జింక గడ్డి మేస్తుంది కావున కౄర జంతువు కాదు. పులి మాంసము తింటుంది కావున కౄర జంతువుగ తయారైనదని కొందరు ఉపమానము చెప్పవచ్చును. జింక జన్మతః సాధు జంతువు. పులి జన్మతః కౄర జంతువు. వాటి సాధుత్వము కౄరత్వము సహజముగ వాటితోపాటు పుట్టినవేకాని మాంసము, గడ్డి తినుట వలన మధ్యలో వచ్చినవి కావు. శరీర పోషణకు ఎవరికి లభ్యమైన ఆహారమును వారు తినవచ్చును. తినిన ఆహారము శరీరమునకు ఉపయోగపడునే తప్ప గుణములను మార్చలేదు. సారా త్రాగినవాడు మరోలా మారిపోవుచున్నాడు కదా! అదివాడు తీసుకొన్న సారాను బట్టియే కదా మారినదని కొందరడుగవచ్చును. దానికి జవాబు మొదటనే చెప్పుకొన్నాము, సారా ఆహారము కాదు, మత్తు పానీయమని. మత్తును కలుగజేయు ఏ పదార్థమైన వాని మానసిక ప్రవృత్తిని తాత్కాలికముగ మార్చగలదు. వానిలో అణిగివున్న దానిని మత్తు బయట పెట్టగలదు, కాని లేని దానిని కల్పించలేదు. మంచివానిగ కన్పించు వాని నిజస్వభావము మత్తులో బయటపడగలదు. లోపల దాగివున్న విషయము బయటపడగలదు. కొన్ని రహస్యములు కూడ ఆ సమయములో బయట పెట్టగలరు. మత్తు కల్గిన సమయములో మనస్సు నిజము దాచుకొను స్వభావమును కోల్పోవును. ఏది ఏమైనా మత్తు పదార్థము ఆహారము కాదు కనుక అది మానసికముగ పనిచేయునని ముందే చెప్పాము. ఆహారము శరీర బల అబల, ఆరోగ్య అనారోగ్యములను నిర్ణయించునదై ఉన్నది. మత్తు పదార్థము మానసిక బలాబలములను, గుణవృత్తి ప్రవృత్తులను నిర్ణయించునదై ఉన్నది. మత్తు పాణీయమైన సారా మానసికముగ గుణముల ప్రేరణ కల్గించునదై మనో ఉల్లాసమును కలుగజేయునదై, ఉండగ, నల్లమందు అను మత్తు పదార్థము తలలోని గుణములు పనిచేయకుండ స్తబ్ధతకలుగజేయును. ప్రపంచములో ఏదీ తనకు సంబంధములేనట్లు ఏ గుణము పనిచేయని మత్తులో జీవున్ని ముంచి ఉంచగలదు. అందువలన ఏది ఆహారము, ఏది ఆహారముకాదని మొదట తెలియడము మన కర్తవ్యము.
ఆహారమైన వాటిలో మాంసాహారము నిషేధమనుట మంచిదికాదు. దాని వలన జ్ఞానము కలుగదనుట మరీ మంచిదికాదు. కర్మరీత్య మాంసాహారమే దొరికినపుడు, తప్పక తినవలసి వచ్చినపుడు, నేను తిననని కూర్చొనుట వీలుకాదు. యుద్ధము చేయనని అర్జునుడు కూర్చున్నప్పటికి కర్మరీత్య నీ పని నిల్వబోదు నీ చేతనే జరుగునన్నట్లు, నేనీ ఆహారము తిననని కూర్చున్నా కర్మ ఉన్నప్పుడు వానిచేతనే తినబడును. అంతమాత్రమున నేను జ్ఞానమునకు పనికిరానని అనుకోకూడదు. పనికి రావని ఇతరులకు కూడ చెప్పకూడదు. భగవద్గీతలో ఆహారములను గూర్చి చెప్పునప్పుడు మాంసాహారము నిషేధమని భగవంతుడెక్కడ చెప్పలేదు. ప్రతి దానిని జ్ఞానపరముగ యోచించాలి తప్ప అన్యదా యోచించి చెప్పకూడదు. ఇక్కడ కూడ ఈ ఆహారముల మీద ఈ గుణములలోనున్న వారికి శ్రద్ధ ఉండునని చెప్పాడు తప్ప ఇవి తినుట వలన ఈ గుణములు అభివృద్ధగునని చెప్పలేదనుట గ్రహించవలెను. ఇక్కడ ఆహారమును బట్టి గుణములు లేవు, గుణములను బట్టి ఆహారమున్నదనుటయే సూత్రము.
ఉదాహరణకు కర్మరీత్య జీవుడు తామసములో ఉన్నప్పటికి, అక్కడ ప్రేరణ వలన ఆయా గుణములచేత లభించు తామసాహారము తిన్నప్పటికి, వాని శ్రద్ధ సాత్త్వికములో ఉన్న ఎడల వానిని జ్ఞానరీత్య సాత్త్వికునిగ లెక్కించవలెనని కూడ చెప్పుకొన్నాము. ఇక్కడ ఇప్పుడు చెప్పిన శ్లోకములో సాత్త్విక శ్రద్ధ కల్గిన వానికున్న ఆహార ప్రీతిని మాత్రము చెప్పుచున్నట్లు గ్రహించవలెను. అది వానికి లభించవచ్చును లభించకపోవచ్చును. అది కర్మను బట్టి ఉండును.
శ్లోకం 9 : కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణరూక్ష విదాహినః ।
ఆహారా రాజస స్యేష్టా దుఃఖశోకామయప్రదాః ||
(రాజసగుణశ్రద్ధ)
భావము : చేదు, పులుపు, ఉప్పు, కారము, వేడిగ ఉన్నవి, సారము లేకుండ ఎండి పోయినవి, దాహమును కలుగజేయునవి, తినుటలో కష్టము, తిన్న తరువాత బాధను కల్గించు అనారోగ్యకర పదార్థములయందు రజోగుణము కలవారికి శ్రద్ధవుండును.
శ్లోకం 10 : యాత యామం గతరసం పూతిపర్యుషితంచ యత్ ।
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ ||
(తామస గుణ శ్రద్ధ)
భావము : ఉడికి ఉడకనిది, రసము పోయినది, చెడిపోయి వాసన వచ్చునది, తిని మిగిలి వదలివేసిన దానిని, పవిత్రతలేనిది అయిన ఆహారము తామసులకు ప్రీతిగ ఉండును.
శ్లోకం 11: అఫలాకాంక్షి భి ర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే ।
యష్టవ్య మేవేతి మనస్సమాధాయ స సాత్త్వికః ||
(సాత్త్వికము)
భావము : ఫలితము మీద కాంక్షలేక శాస్త్రవిధి ప్రమాణములను అనుసరించి యజ్ఞము (పూజ) చేయవలెనని మనస్సున నిశ్చయించి, చేయు యజ్ఞము సాత్త్విక యజ్ఞమనబడును.
శ్లోకం 12 :అభిసన్ధాయ తు ఫలం దమ్భార్ధ మపి చైవ యత్ ।
ఇజ్యతే భరతశ్రేష్ఠ ! తం యజ్ఞం విద్ధి రాజసమ్ ||
(రాజసము)
భావము : మనస్సు ఫలితము మీద సంబంధించినవాడై దంభముగ ఇతరులకు తెలియునట్లు చేయబడు యజ్ఞమును రాజసయజ్ఞమని తెలియుము.
శ్లోకం 13 : విధిహీన మసృష్టాన్నం మంత్ర హీన మదక్షిణమ్ ।
శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ||
(తామసము)
భావము : శాస్త్రపద్ధతిలేనిది, అన్నదానములేనిది, మంత్రములులేనిది దక్షిణలేనిది అసలు శ్రద్ధ లేకుండ చేయు యజ్ఞమును తామసయజ్ఞమని చెప్పవచ్చును.
శ్లోకం 14 : దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచ మార్జవమ్ ।
బ్రహ్మ చర్య మహింసా చ శారీరం తప ఉచ్యతే ||
(తపము)
భావము : దేవతలయందును, బ్రాహ్మణులయందును, గురువులయందును జ్ఞానుల యందును, భక్తియు, శుచిత్వము, కపటము లేకుండుట, బ్రహ్మచర్య అహింసా ప్రవర్తనము, శరీర తపస్సని చెప్పబడును
శ్లోకం 15 : అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ ।
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ||
(తపము)
భావము : పరులు బాధపడని మాటలు, ప్రియము, హితము, సత్యము గల మాటలు, ఇతరులకు మంచి చేయునటుల మాట్లాడుటయు, వేదమభ్యసించుటయు వాక్ తపస్సని చెప్పబడును.
శ్లోకం 16 : మనఃప్రసాద స్సౌమ్యత్వం మౌన మాత్మవినిగ్రహః ।
భావసంశుద్ధి రిత్యేత త్తపో మానస ముచ్యతే ||
(తపము)
భావము : మనో నిర్మలత్వమును, సౌమ్యమును, మౌనము వహించుటయు, జీవాత్మ కష్టసుఖములలో నిగ్రహముగవుండుటయు, భావ సంశుద్ధి కలిగి ఉండుటయు మానస తపములని చెప్పబడును.
శ్లోకం 17 : శ్రద్ధయా పరయా తప్తం తప స్త త్త్రివిధం నరైః ।
అఫలాకాంక్షి భి ర్యుక్తై స్సాత్త్వికం పరిచక్షతేః ||
(సాత్త్వికము)
భావము : ఫలకాంక్షలేక పరమశ్రద్ధతో, యోగ్యత గల మనుజులు సలుపు ఈ త్రివిధ తపములను సాత్త్విక తపములని అందురు.
శ్లోకం 18 : సత్కార మాన పూజార్థం తపోదంభేన చైవయత్ ।
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్ ||
(రాజసము)
భావము : సత్కరింపుకొరకు, సన్మానము కొరకు, పూజకొరకు, దంభముగ చంచలము క్షయకరమునగు రీతిలో సలుపు తపమును రాజస తపమందురు.
శ్లోకం 19 : మూఢగ్రాహే ణాత్మనో య త్పీడయా క్రియతే తపః ।
పరస్యోత్సాదనార్థం వా తత్తామస ముదాహృతమ్ ||
(తామసము)
భావము : తెలివి లేనట్టి పట్టుదల తోడ తనకు కష్టమైనను చేయు తపము, పరుల వినాశనమునకు చేయు తపమును తామస తపమని చెప్పబడును.
శ్లోకం 20 : దాతవ్యమితి య ద్దానం దీయతేఽనుపకారిణే ।
దేశే కాలేచ పాత్రే చ త ద్దానం సాత్త్వికం స్మృతమ్ ||
(సాత్త్వికము)
భావము : దానమొనరింపవలెనను ఉద్ధేశ్యము కలిగివుండి, దేశ కాలపాత్రా పాత్రలు తెలిసి, బదులుమేలు చేయనట్టి సజ్జనునకిచ్చు దానమును సాత్త్విక దానమందురు.
వివరము : శరీరములోని గుణములలో జ్ఞానమునకు నిత్య శత్రువగు ఆశ (కామము) అను గుణముకు పూర్తి వ్యతిరిక్తమైన గుణము దానము. ఒకరి నుండి తీసుకొనునది ఆశకాగ, ఒకరికిచ్చునది దానము. మూడు గుణ భాగములలో కామమను గుణము మూడు విధములుగ ఉన్నట్లు, దానము కూడ మూడు విధములుగ ఉన్నది. అందులో సాత్త్విక దానమును గురించి ఇక్కడ తెలిపారు. దానము చేయవలెనను తలంపు కలిగివుండి ఏ కాలములో అవసరమో, ఏ కాలములో అవసరము కాదో తెలుసుకొని ఎదుటి వానికి అవసరమైన సమయములో దానము చేయడము, అదియు అతడు దానమునకు యోగ్యుడో, అయోగ్యుడో తెలుసుకొని ఎదుటివాడు యోగ్యుడైనపుడే దానమీయవలెను. తిరిగి మేలు చేయని వానికిచ్చునదియే సాత్త్విక దానమగును. అలాకాక వానికి వస్తురూపముగ దానమిచ్చి ధన రూపముగ మేలు పొందకూడదు. అలా చేసిన అది సాత్త్విక దానమనిపించుకోదు. ఈ కాలములో చాలామంది ప్రతిఫలకాంక్షలోపల పెట్టుకొని పైకి దానము చేయుచుందురు. ఇంకా కొందరు రూపాయి దానమిచ్చి పది రూపాయిల పని చేయించుకొనువారు కూడ కలరు. అట్లు చేసిన మొదట ఇచ్చినది దానమే అయిన అది సాత్త్విక దానమనిపించుకోదు. ప్రతిఫలకాంక్షలేనిదే సాత్త్విక దానమగును. దానములలో యోగ్యత, కాలమును తెలిసి చేసిన దానమే సాత్త్విక దానమగును.
శ్లోకం 21: యత్తు ప్రత్యుపకారార్థం ఫల ముద్దిశ్యవా పునః ।
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్ ||
(రాజసము)
భావము : ఫలమునందు ఆశ, ప్రత్యుపకారమునందు ఆలోచనకల్గి, అతికష్టము మీద మనస్సులో బాధపడుచు ఇచ్చు దానము రాజస దానమని చెప్పబడుచున్నది.
వివరము : ఇప్పుడు దానమిచ్చుట వలన వానిచేత వేరు విధముగ మేలు పొందవచ్చునను. ఆశకల్గి ఇచ్చుదానము కాని, నేను దానము చేయుట వలన పుణ్యము వచ్చునని ఆలోచనతో ఇచ్చుదానమును కాని, దానమిచ్చుటవలన నా వద్ద ఉన్నది పోవుచున్నదేయని లోపల బాధపడుచు ఇచ్చు దానమునుకాని రాజస దానమనియందురు.
శ్లోకం 22 : అదేశకాలే యద్దాన మపాత్రే భ్యశ్చదీయతే ।
అసత్కృత మవజ్ఞాతం త త్తామస ముదాహృతమ్ ||
(తామసము)
భావము : మర్యాదలేక, తిరస్కార పూర్వకముగ, దేశకాలమును తెలిసికొనక పాత్రుడగునో కాదో ఆలోచించక ఇచ్చుదానము తామస దానమందురు.
వివరము : దానమిచ్చునప్పుడు తీసుకొనువానికి మర్యాదలేకుండ విసిరిపారేసినట్లు దానమివ్వడము, అడిగిన తిరస్కారముగ దానమివ్వడము, కాలపరిస్థితి తెలుసుకోక వర్షాకాలము చెట్టుకు నీరుపోసినట్లు అవసరములేనప్పుడు దానమివ్వడము, దానమునకు పాత్రుడగునో కాదో చూడకనే ఉన్నవానికి ఇవ్వడము తామస దానమని పెద్దలు చెప్పుచుందురు.
ఇంతటితో శ్రద్ధాత్రయ విభాగయోగమనబడు ఈ అధ్యాయము ముగిసింది. ఇందులో ఇంకను మిగిలియున్న ఆరు శ్లోకములు వ్రాయబడలేదు. ఇవి త్రిశ్రద్ధలకు సంబంధములేని విషయమేగాక గీతకు సంబంధముకాని విషయములు, భగవంతుడు చెప్పని విషయములు కావున ఆరు శ్లోకములు ఇక్కడ చెప్పబడలేదని తెలియవలెను. యోగశాస్త్రము కాని విషయములనే వెనుక అధ్యాయములలో కూడ విడువబడి యున్నవి. అలాగే ఇప్పుడు కూడ తీసి వేయడము జరిగింది. ఇలాంటివే ముందు రాబోవు అధ్యాయములో కూడ కలవు.
శ్లోకం 23 : ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః ।
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా ||
(కల్పితము)
శ్లోకం 24 : తస్మా దోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః ।
ప్రవర్తన్తే విధానోక్తా స్సతతం బ్రహ్మవాదినామ్ ||
(కల్పితము)
శ్లోకం 25 : తదిత్యనభిసన్ధాయఫలం యజ్ఞతపఃక్రియాః ।
దానక్రియాశ్చ వివిధాః క్రియన్తే మోక్షకాంక్షి భిః ||
(కల్పితము)
శ్లోకం 26 : సద్భావే సాధుభావే చ సదిత్యేత త్ప్రయుజ్యతే ।
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ ! యుజ్యతే ||
(కల్పితము)
శ్లోకం 27 : యజ్ఞే తపసి దానే చ స్థితి స్సదితి చోచ్యతే ।
కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే ||
(కల్పితము)
శ్లోకం 28 : అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ ।
అస దిత్యుచ్యతే పార్థ ! న చ తత్ప్రేత్యనో ఇహ ||
(కల్పితము)
ఈ ఆరు శ్లోకములలో ఓం తత్ సత్ అను పదమును గూర్చి చెప్పిన విషయముకలదు. 'ఓం తత్ సత్' అను పద ఉచ్ఛరణ యజ్ఞ దాన తపములలో కలుగు దోషములను పోగొట్టగలదనియు, ఆ పదములు పరబ్రహ్మ స్వరూపమనియు చెప్పబడియున్నది. అంతేకాక యజ్ఞదాన తపస్సులందు మోక్షకాములు ఈ శబ్దముల నామోచ్ఛరణ చేయుచుందురని కూడ చెప్పివున్నారు. భగవంతుడు చెప్పిన భగవద్గీత ఒకే పద్ధతి ఒకే బోధగ ఉండవలెను. మోక్షకాములకు యోగమే శరణ్యమనియు, పరమాత్మను తెలియగోరువారికి యజ్ఞదాన తపములు సాధనములు కావని, వాటివలన తెలియుటకు శక్యముకాదనియు తెల్పిన భగవంతుడు మాటమార్చి మోక్షాసక్తులకు యజ్ఞదానతపములు పనికి వచ్చునని చెప్పునా? యోగమే శరణ్యమన్నవాడు యజ్ఞదానతపములు సాధనములని చెప్పునా? ఇది భగవంతుడు చెప్పినవి కాదు.
ఎందుకనగా! గీతలో బాహ్యయజ్ఞములను గూర్చి ఎచటను చెప్పి ఉండలేదు. ఆయన చెప్పినవి రెండే యజ్ఞములు. అవియు శరీరములోపల జరుగునవి. జ్ఞానయజ్ఞము, ద్రవ్యయజ్ఞమని పేరు పెట్టబడినవని, రెండు యజ్ఞములు దేహములో జరుగునవేనని, తెలిపినవాడు బాహ్య యజ్ఞములను గురించి చెప్పునా? దానము గుణచక్రములోని గుణ భాగములలోని ఒక గుణమగును. గుణము వలన ప్రపంచము, గుణ వర్జితము వలన పరబ్రహ్మ తెలియునని చెప్పినవాడు మోక్షమునకు దానము పనికివచ్చునని తెలుపుట మంచిదా! దానగుణము వలన పుణ్యము లభించును కాని మోక్షము లభించునా? ఒక గుణమైన దానము ప్రపంచరీత్య మంచిని పెంపొందించును కాని మోక్షమును చూపలేదు. అంతేకాక తపస్సుకంటే యోగమధికమని యోగమును ఆచరించి యోగివి కమ్మని చెప్పినవాడు తపస్సును గురించి గొప్పగా చెప్పడు. అలా చెప్పాడంటే అది అసత్యమని చెప్పవచ్చును. కావున ఇచట యజ్ఞదాన తపములను గూర్చి చెప్పబడిన శ్లోకములు ఆరును కల్పితములని చెప్పవచ్చును. 'ఓం' అను దానిని గూర్చి అది ఏ వివరము నిచ్చుచున్నదని, దాని సారాంశమేమని చెప్పిన వాడు దానికి తత్ సత్ కలిపి పూర్ణము చేయడము ఆంజనేయునికి నామము పెట్టి ఇప్పుడు ఆంజనేయుడనవచ్చు అన్నట్లున్నది. కనుక జ్ఞానమును చేకూర్చలేనివి, అజ్ఞానమునిచ్చి సంశయము రేకెత్తించునవియు, ఒకచోట భగవంతుడు చెప్పిన దానికి విరుద్ధముగ మరొకచోట చెప్పబడిన శ్లోకములను ఇక్కడేకాక వెనుక అధ్యాయములలో కూడ మూడు నాలుగు చోట్ల తీసి ప్రక్కన పెట్టడము జరిగినది. హేతుబద్దమైన జ్ఞాన జిజ్ఞాసపరులు మేము చెప్పిన మాటలను అర్థము చేసుకోగలరనుకుంటాము.
------------------------------------------------
త్రైత సిద్ధాంత భగవద్గీత : శ్రద్ధాత్రయ విభాగ యోగము
అర్జునుడిట్లనియె :-
శ్లోకం 1: యే శాస్త్రవిధి ముత్సృజ్య యజన్తే శ్రద్ధయాఽన్వితాః ।
తేషాం నిష్ఠా తు కా కృష్ణ! సత్త్వ మాహో రజ స్తమః ||
(ప్రకృతి, గుణములు)
భావము : ఎవరైతే శాస్త్రపద్ధతులను వదలి శ్రద్ధతో పూజలు, ఆరాధనలు చేయుచున్నారో అట్టివారి నిష్ఠను ఏమనవచ్చును? సత్త్వమా! రాజసమా! తామసమా!
శ్రీ భగవంతుడిట్లనియె :-
శ్లోకం 2: త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా ।
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు ||
(గుణములు)
భావము: మన శరీరములో గుణచక్రమొకటి కలదని, అందులో మూడు భాగములు కలవని, ఆ మూడు భాగములకే సాత్త్విక, రాజస, తామస భాగములని పేర్లు పెట్టబడినవని ముందే చెప్పుకొన్నాము.
శ్లోకం 3: సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత ! ।
శ్రద్ధామయోఽయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః ||
(గుణములు)
భావము : సర్వులకు శ్రద్ధ వారి ఇష్టానుసారము పుట్టునది. ఏ శ్రద్ధ ఎవనికి కలదో వానిని ఆ శ్రద్ధా పురుషుడని చెప్పవచ్చును.
శ్లోకం 4: యజన్తే సాత్త్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ।
ప్రేతాన్ భూతగణాం శ్చాన్యే యజన్తే తామసా జనాః ||
(గుణములు)
భావము : సాత్త్విక గుణము కలవారు దేవతలను ఆరాధించుదురు. రాజసులు యక్షులను రాక్షసులను, తామసులు ప్రేతములను భూతములను పూజ చేయుదురు.
శ్లోకం 5: అశాస్త్రవిహితం ఘోరం తప్యన్తేయే తపోజనాః ।
దమ్భాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః ||
(గుణములు)
శ్లోకం 6: కర్శయ న్త శ్శరీరస్థం భూతగ్రామ మచేతసః ।
మాం చైవా న్త శ్శరీరస్థం తాన్ విద్ధ్యాసుర నిశ్చయాన్ ||
(గుణములు)
భావము : ఏ మనుజులు అహంకారము, దంభముతో కూడినవారై, ఆశ, ప్రేమ గుణముల బలము కల్గినవారై, ఇతరులను ఇబ్బంది పెట్టువారై, అశాస్త్రపద్ధతిలో తపములు చేయువారై, అజ్ఞానులై శరీరమునందలి ఇంద్రియములను వాటిలోపల ఉండు ఆత్మనైన నన్ను కృశింపజేయుచున్నారో, అట్టివారు అసురులని తెలియుము.
శ్లోకం 7 : ఆహార స్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః ।
యజ్ఞ స్తప స్తథా దానం తేషాం భేద మిమం శృణు ||
(గుణములు)
భావము : సర్వ జీవరాసులు తీసుకొను ఆహారము కూడ మూడు శ్రద్ధలుగ ఉన్నది. అట్లే త్రి శ్రద్ధలుగ యజ్ఞము, తపము, దానము మొదలగునవి కలవు. వాటి భేదములను వివరింతు వినుము.
శ్లోకం 8 : ఆయుస్సత్త్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః ।
రస్యాస్స్నిగ్ధా స్థ్సిరా హృద్యా ఆహారా స్సాత్త్వికప్రియాః ||
(సాత్త్విక శ్రద్ధ)
భావము : ఆయుస్సును, శరీర ఉల్లాసము, బలము, ఆరోగ్యము, కలుగజేయునవియు, చూచుటకు అందముగను, ప్రీతిని వృద్ధిచేయు రసవత్తరమైనవి, నూనె పదార్థములు కలవి, దీర్ఘకాలమున్నా చెడిపోని ఆహార పదార్థముల మీద సాత్త్వికులకు ప్రీతియుండును.
శ్లోకం 9 : కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణరూక్ష విదాహినః ।
ఆహారా రాజస స్యేష్టా దుఃఖశోకామయప్రదాః ||
(రాజసగుణశ్రద్ధ)
భావము : చేదు, పులుపు, ఉప్పు, కారము, వేడిగ ఉన్నవి, సారము లేకుండ ఎండి పోయినవి, దాహమును కలుగజేయునవి, తినుటలో కష్టము, తిన్న తరువాత బాధను కల్గించు అనారోగ్యకర పదార్థములయందు రజోగుణము కలవారికి శ్రద్ధవుండును.
శ్లోకం 10 : యాత యామం గతరసం పూతిపర్యుషితంచ యత్ ।
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ ||
(తామస గుణ శ్రద్ధ)
భావము : ఉడికి ఉడకనిది, రసము పోయినది, చెడిపోయి వాసన వచ్చునది, తిని మిగిలి వదలివేసిన దానిని, పవిత్రతలేనిది అయిన ఆహారము తామసులకు ప్రీతిగ ఉండును.
శ్లోకం 11: అఫలాకాంక్షి భి ర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే ।
యష్టవ్య మేవేతి మనస్సమాధాయ స సాత్త్వికః ||
(సాత్త్వికము)
భావము : ఫలితము మీద కాంక్షలేక శాస్త్రవిధి ప్రమాణములను అనుసరించి యజ్ఞము (పూజ) చేయవలెనని మనస్సున నిశ్చయించి, చేయు యజ్ఞము సాత్త్విక యజ్ఞమనబడును.
శ్లోకం 12 :అభిసన్ధాయ తు ఫలం దమ్భార్ధ మపి చైవ యత్ ।
ఇజ్యతే భరతశ్రేష్ఠ ! తం యజ్ఞం విద్ధి రాజసమ్ ||
(రాజసము)
భావము : మనస్సు ఫలితము మీద సంబంధించినవాడై దంభముగ ఇతరులకు తెలియునట్లు చేయబడు యజ్ఞమును రాజసయజ్ఞమని తెలియుము.
శ్లోకం 13 : విధిహీన మసృష్టాన్నం మంత్ర హీన మదక్షిణమ్ ।
శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ||
(తామసము)
భావము : శాస్త్రపద్ధతిలేనిది, అన్నదానములేనిది, మంత్రములులేనిది దక్షిణలేనిది అసలు శ్రద్ధ లేకుండ చేయు యజ్ఞమును తామసయజ్ఞమని చెప్పవచ్చును.
శ్లోకం 14 : దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచ మార్జవమ్ ।
బ్రహ్మ చర్య మహింసా చ శారీరం తప ఉచ్యతే ||
(తపము)
భావము : దేవతలయందును, బ్రాహ్మణులయందును, గురువులయందును జ్ఞానుల యందును, భక్తియు, శుచిత్వము, కపటము లేకుండుట, బ్రహ్మచర్య అహింసా ప్రవర్తనము, శరీర తపస్సని చెప్పబడును
శ్లోకం 15 : అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ ।
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ||
(తపము)
భావము : పరులు బాధపడని మాటలు, ప్రియము, హితము, సత్యము గల మాటలు, ఇతరులకు మంచి చేయునటుల మాట్లాడుటయు, వేదమభ్యసించుటయు వాక్ తపస్సని చెప్పబడును.
శ్లోకం 16 : మనఃప్రసాద స్సౌమ్యత్వం మౌన మాత్మవినిగ్రహః ।
భావసంశుద్ధి రిత్యేత త్తపో మానస ముచ్యతే ||
(తపము)
భావము : మనో నిర్మలత్వమును, సౌమ్యమును, మౌనము వహించుటయు, జీవాత్మ కష్టసుఖములలో నిగ్రహముగవుండుటయు, భావ సంశుద్ధి కలిగి ఉండుటయు మానస తపములని చెప్పబడును.
శ్లోకం 17 : శ్రద్ధయా పరయా తప్తం తప స్త త్త్రివిధం నరైః ।
అఫలాకాంక్షి భి ర్యుక్తై స్సాత్త్వికం పరిచక్షతేః ||
(సాత్త్వికము)
భావము : ఫలకాంక్షలేక పరమశ్రద్ధతో, యోగ్యత గల మనుజులు సలుపు ఈ త్రివిధ తపములను సాత్త్విక తపములని అందురు.
శ్లోకం 18 : సత్కార మాన పూజార్థం తపోదంభేన చైవయత్ ।
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్ ||
(రాజసము)
భావము : సత్కరింపుకొరకు, సన్మానము కొరకు, పూజకొరకు, దంభముగ చంచలము క్షయకరమునగు రీతిలో సలుపు తపమును రాజస తపమందురు.
శ్లోకం 19 : మూఢగ్రాహే ణాత్మనో య త్పీడయా క్రియతే తపః ।
పరస్యోత్సాదనార్థం వా తత్తామస ముదాహృతమ్ ||
(తామసము)
భావము : తెలివి లేనట్టి పట్టుదల తోడ తనకు కష్టమైనను చేయు తపము, పరుల వినాశనమునకు చేయు తపమును తామస తపమని చెప్పబడును.
శ్లోకం 20 : దాతవ్యమితి య ద్దానం దీయతేఽనుపకారిణే ।
దేశే కాలేచ పాత్రే చ త ద్దానం సాత్త్వికం స్మృతమ్ ||
(సాత్త్వికము)
భావము : దానమొనరింపవలెనను ఉద్ధేశ్యము కలిగివుండి, దేశ కాలపాత్రా పాత్రలు తెలిసి, బదులుమేలు చేయనట్టి సజ్జనునకిచ్చు దానమును సాత్త్విక దానమందురు.
శ్లోకం 21: యత్తు ప్రత్యుపకారార్థం ఫల ముద్దిశ్యవా పునః ।
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్ ||
(రాజసము)
భావము : ఫలమునందు ఆశ, ప్రత్యుపకారమునందు ఆలోచనకల్గి, అతికష్టము మీద మనస్సులో బాధపడుచు ఇచ్చు దానము రాజస దానమని చెప్పబడుచున్నది.
శ్లోకం 22 : అదేశకాలే యద్దాన మపాత్రే భ్యశ్చదీయతే ।
అసత్కృత మవజ్ఞాతం త త్తామస ముదాహృతమ్ ||
(తామసము)
భావము : మర్యాదలేక, తిరస్కార పూర్వకముగ, దేశకాలమును తెలిసికొనక పాత్రుడగునో కాదో ఆలోచించక ఇచ్చుదానము తామస దానమందురు.
శ్లోకం 23 : ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః ।
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా ||
(కల్పితము)
శ్లోకం 24 : తస్మా దోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః ।
ప్రవర్తన్తే విధానోక్తా స్సతతం బ్రహ్మవాదినామ్ ||
(కల్పితము)
శ్లోకం 25 : తదిత్యనభిసన్ధాయఫలం యజ్ఞతపఃక్రియాః ।
దానక్రియాశ్చ వివిధాః క్రియన్తే మోక్షకాంక్షి భిః ||
(కల్పితము)
శ్లోకం 26 : సద్భావే సాధుభావే చ సదిత్యేత త్ప్రయుజ్యతే ।
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ ! యుజ్యతే ||
(కల్పితము)
శ్లోకం 27 : యజ్ఞే తపసి దానే చ స్థితి స్సదితి చోచ్యతే ।
కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే ||
(కల్పితము)
శ్లోకం 28 : అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ ।
అస దిత్యుచ్యతే పార్థ ! న చ తత్ప్రేత్యనో ఇహ ||
(కల్పితము)
ఈ ఆరు శ్లోకములలో ఓం తత్ సత్ అను పదమును గూర్చి చెప్పిన విషయముకలదు. 'ఓం తత్ సత్' అను పద ఉచ్ఛరణ యజ్ఞ దాన తపములలో కలుగు దోషములను పోగొట్టగలదనియు, ఆ పదములు పరబ్రహ్మ స్వరూపమనియు చెప్పబడియున్నది. అంతేకాక యజ్ఞదాన తపస్సులందు మోక్షకాములు ఈ శబ్దముల నామోచ్ఛరణ చేయుచుందురని కూడ చెప్పివున్నారు. భగవంతుడు చెప్పిన భగవద్గీత ఒకే పద్ధతి ఒకే బోధగ ఉండవలెను. మోక్షకాములకు యోగమే శరణ్యమనియు, పరమాత్మను తెలియగోరువారికి యజ్ఞదాన తపములు సాధనములు కావని, వాటివలన తెలియుటకు శక్యముకాదనియు తెల్పిన భగవంతుడు మాటమార్చి మోక్షాసక్తులకు యజ్ఞదానతపములు పనికి వచ్చునని చెప్పునా? యోగమే శరణ్యమన్నవాడు యజ్ఞదానతపములు సాధనములని చెప్పునా? ఇది భగవంతుడు చెప్పినవి కాదు.
---------------------
త్రైత సిద్ధాంత భగవద్గీత : శ్రద్ధాత్రయ విభాగ యోగము
అర్జునుడిట్లనియె :-
శ్లోకం 1
(ప్రకృతి, గుణములు)
భావము : ఎవరైతే శాస్త్రపద్ధతులను వదలి శ్రద్ధతో పూజలు, ఆరాధనలు చేయుచున్నారో అట్టివారి నిష్ఠను ఏమనవచ్చును? సత్త్వమా! రాజసమా! తామసమా!
శ్రీ భగవంతుడిట్లనియె :-
శ్లోకం 2
(గుణములు)
భావము: మన శరీరములో గుణచక్రమొకటి కలదని, అందులో మూడు భాగములు కలవని, ఆ మూడు భాగములకే సాత్త్విక, రాజస, తామస భాగములని పేర్లు పెట్టబడినవని ముందే చెప్పుకొన్నాము.
శ్లోకం 3
(గుణములు)
భావము : సర్వులకు శ్రద్ధ వారి ఇష్టానుసారము పుట్టునది. ఏ శ్రద్ధ ఎవనికి కలదో వానిని ఆ శ్రద్ధా పురుషుడని చెప్పవచ్చును.
శ్లోకం 4
(గుణములు)
భావము : సాత్త్విక గుణము కలవారు దేవతలను ఆరాధించుదురు. రాజసులు యక్షులను రాక్షసులను, తామసులు ప్రేతములను భూతములను పూజ చేయుదురు.
శ్లోకం 5
(గుణములు)
శ్లోకం 6
(గుణములు)
భావము : ఏ మనుజులు అహంకారము, దంభముతో కూడినవారై, ఆశ, ప్రేమ గుణముల బలము కల్గినవారై, ఇతరులను ఇబ్బంది పెట్టువారై, అశాస్త్రపద్ధతిలో తపములు చేయువారై, అజ్ఞానులై శరీరమునందలి ఇంద్రియములను వాటిలోపల ఉండు ఆత్మనైన నన్ను కృశింపజేయుచున్నారో, అట్టివారు అసురులని తెలియుము.
శ్లోకం 7
(గుణములు)
భావము : సర్వ జీవరాసులు తీసుకొను ఆహారము కూడ మూడు శ్రద్ధలుగ ఉన్నది. అట్లే త్రి శ్రద్ధలుగ యజ్ఞము, తపము, దానము మొదలగునవి కలవు. వాటి భేదములను వివరింతు వినుము.
శ్లోకం 8
(సాత్త్విక శ్రద్ధ)
భావము : ఆయుస్సును, శరీర ఉల్లాసము, బలము, ఆరోగ్యము, కలుగజేయునవియు, చూచుటకు అందముగను, ప్రీతిని వృద్ధిచేయు రసవత్తరమైనవి, నూనె పదార్థములు కలవి, దీర్ఘకాలమున్నా చెడిపోని ఆహార పదార్థముల మీద సాత్త్వికులకు ప్రీతియుండును.
శ్లోకం 9
(రాజసగుణశ్రద్ధ)
భావము : చేదు, పులుపు, ఉప్పు, కారము, వేడిగ ఉన్నవి, సారము లేకుండ ఎండి పోయినవి, దాహమును కలుగజేయునవి, తినుటలో కష్టము, తిన్న తరువాత బాధను కల్గించు అనారోగ్యకర పదార్థములయందు రజోగుణము కలవారికి శ్రద్ధవుండును.
శ్లోకం 10
(తామస గుణ శ్రద్ధ)
భావము : ఉడికి ఉడకనిది, రసము పోయినది, చెడిపోయి వాసన వచ్చునది, తిని మిగిలి వదలివేసిన దానిని, పవిత్రతలేనిది అయిన ఆహారము తామసులకు ప్రీతిగ ఉండును.
శ్లోకం 11
(సాత్త్వికము)
భావము : ఫలితము మీద కాంక్షలేక శాస్త్రవిధి ప్రమాణములను అనుసరించి యజ్ఞము (పూజ) చేయవలెనని మనస్సున నిశ్చయించి, చేయు యజ్ఞము సాత్త్విక యజ్ఞమనబడును.
శ్లోకం 12
(రాజసము)
భావము : మనస్సు ఫలితము మీద సంబంధించినవాడై దంభముగ ఇతరులకు తెలియునట్లు చేయబడు యజ్ఞమును రాజసయజ్ఞమని తెలియుము.
శ్లోకం 13
(తామసము)
భావము : శాస్త్రపద్ధతిలేనిది, అన్నదానములేనిది, మంత్రములులేనిది దక్షిణలేనిది అసలు శ్రద్ధ లేకుండ చేయు యజ్ఞమును తామసయజ్ఞమని చెప్పవచ్చును.
శ్లోకం 14
(తపము)
భావము : దేవతలయందును, బ్రాహ్మణులయందును, గురువులయందును జ్ఞానుల యందును, భక్తియు, శుచిత్వము, కపటము లేకుండుట, బ్రహ్మచర్య అహింసా ప్రవర్తనము, శరీర తపస్సని చెప్పబడును
శ్లోకం 15
(తపము)
భావము : పరులు బాధపడని మాటలు, ప్రియము, హితము, సత్యము గల మాటలు, ఇతరులకు మంచి చేయునటుల మాట్లాడుటయు, వేదమభ్యసించుటయు వాక్ తపస్సని చెప్పబడును.
శ్లోకం 16
(తపము)
భావము : మనో నిర్మలత్వమును, సౌమ్యమును, మౌనము వహించుటయు, జీవాత్మ కష్టసుఖములలో నిగ్రహముగవుండుటయు, భావ సంశుద్ధి కలిగి ఉండుటయు మానస తపములని చెప్పబడును.
శ్లోకం 17
(సాత్త్వికము)
భావము : ఫలకాంక్షలేక పరమశ్రద్ధతో, యోగ్యత గల మనుజులు సలుపు ఈ త్రివిధ తపములను సాత్త్విక తపములని అందురు.
శ్లోకం 18
(రాజసము)
భావము : సత్కరింపుకొరకు, సన్మానము కొరకు, పూజకొరకు, దంభముగ చంచలము క్షయకరమునగు రీతిలో సలుపు తపమును రాజస తపమందురు.
శ్లోకం 19
(తామసము)
భావము : తెలివి లేనట్టి పట్టుదల తోడ తనకు కష్టమైనను చేయు తపము, పరుల వినాశనమునకు చేయు తపమును తామస తపమని చెప్పబడును.
శ్లోకం 20
(సాత్త్వికము)
భావము : దానమొనరింపవలెనను ఉద్ధేశ్యము కలిగివుండి, దేశ కాలపాత్రా పాత్రలు తెలిసి, బదులుమేలు చేయనట్టి సజ్జనునకిచ్చు దానమును సాత్త్విక దానమందురు.
శ్లోకం 21
(రాజసము)
భావము : ఫలమునందు ఆశ, ప్రత్యుపకారమునందు ఆలోచనకల్గి, అతికష్టము మీద మనస్సులో బాధపడుచు ఇచ్చు దానము రాజస దానమని చెప్పబడుచున్నది.
శ్లోకం 22
(తామసము)
భావము : మర్యాదలేక, తిరస్కార పూర్వకముగ, దేశకాలమును తెలిసికొనక పాత్రుడగునో కాదో ఆలోచించక ఇచ్చుదానము తామస దానమందురు.
శ్లోకం 23
(కల్పితము)
శ్లోకం 24
(కల్పితము)
శ్లోకం 25
(కల్పితము)
శ్లోకం 26
(కల్పితము)
శ్లోకం 27
(కల్పితము)
శ్లోకం 28