pss prayer:ఆది ఆరాధన మధ్యారాధన అంత్యారాధన

ఆది ఆరాధన


https://ibm.box.com/s/ursrtq1bqv6kbdrh71i192zmkr6hv99o


ఆది ఆరాధన ఆదివారము సూర్యోదయములోనే చేయవలెను. ఆది ఆరాధన సృష్టి విషయమును తెలియజేయునదై ఉండుట వలన మొదటి దినమైన ఆదివారమే చేయవలసి ఉన్నది. సూర్యోదయముతోనే సృష్టి మొదలైనది కావున సూర్యుడు పుట్టుచున్నప్రుడే మొదటి ఆరాధన జరుగవలెను. ఆది ఆరాధన మనిషి పుట్టుకను సూచించునది కావున గొప్ప విశేషమైన భావముతో కూడుకొని ఉన్నది. ఆరాధన ఒక పద్ధతి ప్రకారము చేయవలసియున్నది. ఆది ఆరాధన పద్ధతి ప్రకారము ఆరాధన విషయము తెలిసిన భక్తులందరు ఒకే స్థలములో కలిసి ప్రార్ధన చేయవలసి ఉండును. ఆది ఆరాధనకు అందరు కలియుట చేత సామూహిక ప్రార్ధనగ ఉండును. ప్రయాణ సమయములలో గాని, ఒంటరిగ ఇతర ప్రదేశములలో ఉన్నపుడు గాని తానొక్కరు ఆరాధన చేసుకోవచ్చును. ఆరాధనకు శుభ్రత చాలా ముఖ్యము ఆరాధన చేయు స్థలము పరిశుభ్రముగా ఉండవలెను. సామూహిక ఆరాధన కొరకు ప్రత్యేకించి ఒక స్థలమును కేంద్రముగ చేసుకోవడము మంచిది. ప్రార్థనా స్థలశుభ్రతయే కాక శరీర శుభ్రత కూడ చాలా అవసరము. ప్రతి ఒక్కరు స్నానము చేసి ప్రార్ధనలో పాల్గొనవలెను. ఒకవేళ ఎప్పుడైనగాని అనారోగ్య పరిస్థితుల వలన స్నానము చేయలేకపోతే తప్పనిసరిగ ముఖము, కాళ్ళు, చేతులు, చంకలు నీటితో శుభ్రము చేసుకోవలెను. ప్రయాణసమయములో స్నానము చేయలేకపోతే నీరు దొరకకపోతే చివరకు రెండు అరచేతులయిన కడుగుకోవలెను. అరచేతి శుభ్రమునకు కూడా నీరు దొరకని పక్షములో ఫేస్‌పౌడర్‌ను అరచేతులకు, ముఖమునకు, చంకలకు అద్దుకొని ప్రార్ధన చేయవచ్చును. ఆది ప్రార్ధనకు ఐదు సంవత్సరముల పిల్లలతో పాటు కుటుంబ సభ్యులందరు పాల్గొన వచ్చును. కుటుంబ సభ్యులకు ఆది (ప్రార్ధన సారాంశమును తెలియజేసి వారిని పాల్గొనునట్లు చేయవలెను. ప్రార్ధనలో పాల్గొను స్త్రీలను ప్రత్యేక వరుసలో కూర్చుండబెట్టవలయును. _సర్వులను సృష్టించిన సృష్టికర్తయైన దేవుని గురించిన మతాతీత ఆరాధన కావున ఏ మతస్థులయిన ఈ ప్రార్ధనలో పాల్గొనవచ్చును. త్రైతారాధన పవిత్రమైనది కావున ప్రార్ధన దినములలో తప్పని సరిగ దురభ్యాసములకు దూరముగ ఉండవలెను. _ త్రైత సిద్ధాంతమును తెలిసిన ప్రబోధ సేవా సమితి సభ్యులు విధిగ త్రైతారాధన చేయవలసి యుండును. ఒకవేళ అనివార్య కారణముల వలన గాని, అనారోగ్య కారణముల వలన గాని ఆది ప్రార్ధన చేయలేని సందర్భములో తర్వాత మిగత సమయములో గాని ప్రార్ధన విధిగ చేయవలెను. సభ్యులు ప్రార్ధనా సమయమునకు కనీసము ఐదు నిమిషములు ముందు ఆరాధన స్థలమునకు చేరి ఉండవలెను. ప్రార్ధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని పలుకరించడము. సభ్యులు విధిగ చేయవలెను. పలకరింపు చేతుల జోడించిన నమస్కారముతో ఉండవలెను. నమస్కారము దేవునికి ఇద్దరము సమానమని తెల్పు ఉద్దేశముతో ఉండవలెను. ప్రార్ధన స్థలమున శత్రువుకయిన తప్పనిసరిగ నమస్కారము చెప్పవలెను. ప్రతి సభ్యుడు తైతారాధన వివరము అర్ధము తెలిసినవాడై వాటి ప్రత్యేకతను ఇతరులకు చెప్పు స్థోమత కలిగి ఉండవలెను.


ఆది ఆరాధన చేయు సమయములో తూర్పువైపుకి తిరిగి కూర్పొనవలెను. సూర్యుడు తూర్పువైపున పుట్టుచున్నాడు కావున మొదటి ఆరాధన తూర్పుదిశకే కూర్చొని చేయవలెను. శరీర అనుకూలతను బట్టి కూర్చోవడము మంచిది. సాధ్యమున్నంత వరకు అందరు ఒకే ఆసనములో కూర్చోవడము శ్రేయస్కరము. అన్నిటికంటే ముఖ్యమైన విధానమేమంటే ప్రతి ఒక్కరు మూడు కోణములు గల తెల్లని గుడ్డను తలమీద కట్టుకోవలెను. గీతలో చెప్పినట్లు మూడుకోణముల వస్త్రము తైతసిద్ధాంతమును తెల్పునట్లు ఉండవలెను. తెల్లని గుడ్డ రెండుకొనలను తలమిద నుంచి గడ్డము క్రింద కలిపి ముడివేసి ఒక కొనను తలవెనుకకు వదిలివేయవలెను. ముఖము క్రింద ఎడమ ప్రక్కనుండి వచ్చినకొనను జీవాత్మ అని, కుడి ప్రక్కనుండి వచ్చినకొనను ఆత్మ అని తలచవలెను. గీతలో చెప్పినట్లు ఒకే శరీరములో జీవాత్మ ఆత్మలు కలిసి నివసిస్తున్నాయను అర్ధము తెలియునట్లు రెండు కొనలను కలిపి కట్టవలెను. శరీరములో మూడవవాదడైన పరమాత్మను గుడ్డ యొక్క మూడవకొనగ తలచవలెను. పరమాత్మ (దేవుడు) _ శరీరములో అగోచరుడై ఎవరికి తెలియకుండవున్నాడు కావున అదే అర్ధమొచ్చునట్లు మూడవకొనను ముందరచూచు వారికి కనిపించకుండ తల వెనుకకుండు నట్లు చేయవలెను. మూడుకొనల గుడ్డను రెండుకొనలు కలిపి గడ్డము క్రింద కట్టితే మూడవకొన యధావిధిగ వెనుకకే ఉండును. భగవద్దీతలో చెప్పినట్లు ఆత్మ జీవాత్మతో కూటస్థునిగ ఉన్నాడు అని తెలియునట్లు అర్ధముతో రెండుకొనలు ముడివేయడము, మూడవ పరమాత్మ ఎవరికి తెలియకుండ ఆత్మ జీవాత్మలకంటే అతీతునిగ ఉన్నాడని తెలియునట్లు అర్ధముతో మూడవకొన వెనుక భాగములో నిలచిపోవడమును చూస్తే త్రైత సిద్ధాంతము పూర్తి కనిపిస్తున్నది. జీవాత్మ (క్షరుడు), ఆత్మ (అక్షరుడు), పరమాత్మ (పురుషోత్తముడు) ఉనికిని తెలియజేయు నిమిత్తము తలమోదనే గుడ్డను కట్టవలెను. ఆత్మలను తెలియజేయు చిహ్నముగ మూడుకొనల గుడ్డను వాడుచున్నాము కావున ఆత్మల స్వచ్ఛతను తెలియజేయునట్లు తెల్లని వస్త్రమును వాడవలెను.


తెల్లని వస్త్రము తలమోద కట్టుకొని సూర్యోదయమునకు ఐదు నిమిషముల ముందు ప్రార్ధనలో కూర్చోవలెను. సూర్యుడు ఉదయించునపుడు ప్రార్ధనలో ఉండవలెననుట ఆది ప్రార్ధన యొక్క నియమము. సూర్యోదయము తర్వాత ఐదు నిమిషములు ప్రార్ధనలో ఉంటు ప్రార్ధనకాలము పది నిమిషములుండునట్లు చూచుకోవలెను. ప్రార్ధన సమయములో ఎడమ చేయి హస్తమును గడ్డము క్రింద ఆనించి పెట్టుకోవలెను. అలాగే కుడిచేయి హస్తమును తలమోద ఆనించి పెట్టుకోవలెను. అట్లుంచుకోవడము వలన ధ్యాస అంతయు తలమధ్యలో ఏర్పడును. పైన క్రింద చేతులుంచుకొని కళ్ళు మూసుకొని కూర్చోవడము వలన మనోదృష్టి తల మద్య భాగములో చేరుటకు అవకాశమున్నది. ఆదివారము సూర్యోదయము చేయు ప్రార్ధన సృష్టి మొదలును తెలియజేయునదే కాక, నీ పుట్టుకను జ్ఞాపకము చేయుచున్నది. అప్పుడే పుట్టినవానికి, వాని తలలో ఏ గుణములు లేకుండును. పుట్టిన శిశువుకు ఏ గుణములుండవు కావున  శిశువును దేవునితో సమానముగ కొందరు వర్ణించారు. ఆది ఆరాధనలో, సూర్యోదయముతో శిశువు పుట్టుక సమానమైనందు వలన, ఆ సమయములో శిశువు తలలో గుణములు లేనట్లు ఆరాధకుని తలలో కూడ ఏ గుణ సంకల్పము లేకుండ ఉండవలెను. ఆ పది నిమిషములు అట్లుండుటకు ప్రయత్నము చేయవలెను. పుట్టిన శిశువుతో సమానముగ ఉండు ఆరాధన కావున ఇది భగవద్గీతలో చెప్పిన బ్రహ్మయోగ సాధన అగును. త్రైతారాధన క్రమములో మొదటిదయిన ఆది ప్రార్ధన మొదటి దినమైన ఆదివారమే చేయడము కాక బ్రహ్మ, కర్మ భక్తి యోగమను మూడు యోగపద్ధతులలో మొదటిదయిన బ్రహ్మయోగమును ఆచరించినట్లగుచున్నది. సామూహిక ప్రార్ధన కావున అందరు ఒకే మారు మొదలుపెట్టి ఒకే మారు ముగించుటకు మరియు అందరు పది నిమిషముల వరకే ప్రార్ధన చేయుటకు అనుకూలముగ ఉండునట్లు పూర్వము దేవుని బీజాక్షరమైన “ఓం” కారనాదముతో ప్రారంభించి చివరిలో అదే నాదముతో ముగించెడివారు. ఉదయము ఆది ప్రార్ధన తర్వాత ఎవరి పనులు వారు చేసుకొనవచ్చును. ఈ విధముగ ఎంతో సారాంశమైన, ఆచరణతోనున్న ఆది ప్రార్ధన కాలగర్భములో కలిసిపోయినది. తిరిగి దానిని పునరుద్ధరించి పూర్వపు ఆచారమునకు అందరము కలిసి ప్రాణము పోద్దాము. 

                                                                  మధ్యారాధన

మధ్యారాధన మధ్యాహ్నము సరిగ పండ్రెండు గంటల సమయములో సూర్యుడు నడి నెత్తినున్నపుడు చేయవలెను. ఆది ప్రార్ధనలో తూర్పుకు తిరిగి కూర్ప్చొనగ, మధ్యప్రార్ధనలో దక్షిణ దిశకు తిరిగి కూర్ప్చొనవలయును. మొదటి ప్రార్ధనలోనున్నల్లే మధ్య ప్రార్ధనలో కూడ తలమిద గుడ్డ కట్టుకోవడము చేతులు పెట్టుకోవడము చేయవలెను. మధ్యప్రార్థన రెండవ రోజైన సోమవారము చేయవలెను. సోమవారము దైవజ్ఞానమునకు సంబంధించిన దినము కావున ప్రార్ధనకాలములో తలలో జ్ఞానము యొక్క జ్ఞప్తికల్లి తనకు సంభవించు ప్రతిదీ, తనచేత చేయబడు ప్రతిదీ, తాను అనుభవించు ప్రతిదీ కర్మ నిర్ణయము ప్రకారము జరుగుచున్నవని తన ప్రమేయమేది లేదని తలపోయుచుండవలెను. ప్రార్ధనసమయము కూడ పది నిమిషములుండునట్లే చూచుకోవలెను. ఆది ప్రార్ధన మొదలు పెట్టినట్లు అందరు 'ఓం” శబ్దముతో మొదలు పెట్టి "ఓం" శబ్దముతో ముగించవలెను. ఓం శబ్దమును మొదట చెప్పుటకు మరియు ప్రార్ధన చివరిలో చెప్పుటకు ముందే ఒకరిని నిర్ణయించుకొని ఉండవలెను. మధ్యప్రార్ధన మధ్యాహ్నమే చేయవలెను. అనివార్యకారణముల వలన గాని, ఆరోగ్యరీత్య ఆ సమయానికి చేయలేక పోతే ఇతర సమయములో గాని తప్పనిసరిగ చేయవలెను. సోమవార ప్రార్ధనకు కూడ ఆదివార ప్రార్ధనపట్ల శుభ్రముగనున్నట్లే ఉండవలెను. సోమవార మధ్యప్రార్థనలో దిశా, భావము తప్ప అన్నీ ఆది (ప్రార్ధనకు పాటించినట్లే పాటించవలెను.


మధ్యప్రార్థన జీవిత జ్ఞానమునకు సంబంధించినది కావున ప్రపంచములో పాత్రధారుడై నడుచుకొను ప్రతి మనిషి తనను నడిపించు సూత్రము కర్మయని, కర్మసూత్రము కదలించునట్లు కదలుచున్నానని స్వయముగ తాను కదలు స్వతంత్రుడనుకానని జ్ఞానము కల్గియుండునట్లు మధ్యప్రార్ధన ఏర్పరచబడివున్నది. మధ్యప్రార్ధనలో తాను కర్మబద్దుడననీ, ప్రతి పని నేను చేయునది కాదు నా చేత చేయించబడుచున్నదనీ, నాచేత జరుగబడు కార్యము నేను చేయడము లేదని యోచించడము వలన మనిషి జీవితములో కూడ అదే జ్ఞానము జ్ఞాపకముండి, ఏ కర్మనూ అంటించు కోవడము జరుగదు. మధ్యప్రార్థన అహము లేని విధానమును అలవాటు చేయుచున్నది. ఈ అలవాటును భగవద్గీతలో చెప్పిన రెండవదైన కర్మయోగము అని తెలియవలెను. పుట్టింది మొదలు ప్రతి మనిషి చావు వైపు ప్రయాణిస్తున్నాడు. 

జన్మనుండి ప్రతి మనిషి యొక్క జీవితము మరణము వైపుకు సాగుచున్నది. మరణమునకు అధిపతి పరమాత్మయని, అతడే యముడని అతని దిశ దక్షిణమని చెప్పుకొన్నట్లు శరీరములో జీవాత్మ కుడి ప్రక్క కాల ద్వారముల ద్వారానే మోక్షము పొందవలసి ఉన్నది. జీవునికి మరణము గాని, మోక్షము గాని కాలచక్రములోని కుడి ప్రక్క ద్వారముల ద్వారానే జరుగుచున్నది. ఈ విషయము మాచే రచింపబడిన “తైత సిద్ధాంత భగవద్గీత” అక్షరపరబ్రహ్మయోగమను అధ్యాయములోను మరియు “ప్రబోధ” గ్రంథములో కర్మ, కాల, బ్రహ్మచక్రములను అధ్యాయములోను విపులముగ చెప్పబడినది. జీవిత ప్రయాణము మరణము లేక మోక్షము వైపుకు కావున వాటి ద్వారములు కుడిప్రక్కనున్నందు వలన ఆదివారము తూర్పువైపుకు కూర్చున్నవారు రెండవ రోజు సోమవారము కుడిచేతి వైపు తిరిగి దక్షిణమువైపు కూర్చోవలసి ఉన్నది. మధ్యారాధన సోమవారమునది కావున జ్ఞానము యొక్క జ్ఞప్తి కల్గియుండడము, జ్ఞాన గమ్యము కుడివైపు కావున దక్షిణదిశకు తిరిగి కూర్చోవడము ప్రత్యేకత. సోమవారము యొక్క ఆరాధన వివరము తెలిసి ఆచరించు వ్యక్తి తర్వాత అదే జ్ఞప్తితో కర్మయోగమును ఆచరించగలడు. జీవితములో కర్మయోగ ఆచరణ అలవరచుకోవడము ద్వార మనిషి భగవద్గీతలో దేవుడు చెప్పినట్లు యజ్ఞకర్మ ఆచరించినట్లగును.  యజ్ఞకర్మ అనగా రాబోవు కర్మను కాల్చివేయడమని అర్ధము. కర్మను అంటని విధానము సోమవారము ఆచరించెడి మధ్యారాధన వలన సాధ్యమై మనిషి మోక్షమును పొందవచ్చును. ఆదివారము చేయు సూర్యోదయ ప్రార్ధనలో బ్రహ్మయోగము, సోమవారము మధ్యాహ్నము చేయు మధ్య ప్రార్ధనలో కర్మయోగము అలవాటగును. త్రైతారాధనలో భాగములైన ఆది, సోమవారముల ప్రార్ధనలో ఇంత విశేషముండగ మూడవ ప్రార్థన ఏమిటో తెలుసుకొందాము.

అంత్యారాధన

ఆది ప్రార్ధన వారములో మొదటిదైన అదివారము చేయగ, మధ్య ప్రార్ధన వారములో రెండవ దినమైన సోమవారము చేయగ, అంత్య ప్రార్థన వారములో మూడవ దినమైన మంగళవారము చేయబడు చున్నది. ఆదివారము జీవుని పుట్టుకను, సోమవారము జీవితములో దైవజ్ఞానమును తెలుపగ మంగళవారము సరాసరి మోక్షమునే తెలియజేయు చున్నది. శుభప్రదమైన మోక్షమును తెలియు ఆరాధన మూడవ దినమైన మంగళప్రదమైన మంగళవారము చేయబడుచున్నది. మంగళవారము చేయు అంత్య ఆరాధనతో మొత్తము  త్రైతారాధనలు పూర్తి అగుచున్నవి. త్రైతారాధనలో చివరిదైన అంత్యారాధన కూడ తెల్లని గుడ్డను తలమీద ధరించి, చేతులు తలమీద, క్రింద పెట్టుకొని ఆది, మధ్య ఆరాధనలాగే చేయవలసివుండును. చివరిదైన అంత్యారాధన మంగళవారము సూర్యాస్తమయములో చేయవలెను.  సూర్యుడు అస్తమించక ముందు ఐదు నిమిషములపుడు ప్రారంభించి, అస్తమించిన తర్వాత ఐదు నిమిషములుండు నట్లు చేయవలెను. మొత్తము పది నిమిషముల ప్రారనసమయములో మిగతా 'ప్రార్ధనలలాగే గుడ్డ, చేతులుండగ కూర్చున్న దిశ, తలలోని ఉద్దేశ్యము వేరుగవుండును. మంగళవారము సూర్యాస్తమయములో చేయు ప్రార్ధన పడమటి దిశ వైపుకు తిరిగి చేయవలెను. ప్రార్ధనసమయములో భగవద్గీతలో చెప్పిన భక్తియోగమును ధ్యాసలోనికి తెచ్చుకోవలెను. ప్రపంచమునకు అంతటికి దేవుడైన పురుషోత్తముడే పెద్ద అని, పరమాత్మమీదకంటే అన్యదా ఎవరిమీద విధేయత లేదని, దేవుని మీద ఉన్న భక్తియే దేవుని అంశయైన భగవంతుని మీద కూడ ఉన్నదని, సృష్టికర్త, పరలోక రాజ్యాధిపతియైన పరమాత్మయే సర్వలోక శాసనుడని, ఆది మధ్య అంత్యములు లేనివాడు దేవుడని, దేవుని మీద పూర్తి ఇష్టత విశ్వాసము కల్గి దేవునిలోకి ఐక్యమగుటయే ప్రార్ధనలోని ముఖ్య ఉద్దేశ్యము.  కాని ప్రస్తుత కాలములో ఇందూ మతము హిందూ మతముగ మారిపోయి ఏకేశ్వరోపాసన స్థానములో బహుదేవతారాధన ఏర్పడినది. సూర్యాస్తమయముతో రాత్రి ప్రారంభమగుచున్నది. సూర్యాస్తమయము మానవుని అస్తమయమును తెలుపుచున్నది. జీవుని అంత్యము మోక్షమని, శరీర అంత్యము మరణమని తెలిసి ఆ రెండింటిని తెలియజేయునది సూర్యుడు అస్తమించడము కావున సూర్యుడు అస్తమించు దిశకు తిరిగి నా అస్తమయము నీలోనికి ఐక్యము కావలెనని కోరికతో ప్రార్ధన చేయడమునే అంత్యప్రార్ధన అంటున్నాము. అంత్యప్రార్ధన మోక్షము కొరకుండవలెను. సువిశాలమైన దేవునియందిమిడి కనిపించకపోవునట్లు ఉద్దేశ్యము కల్లి చేయడమే చివరి ప్రార్ధన యొక్క అర్ధము, ఉద్దేశ్యము. మానవుని గమ్యము చివరికి మోక్షమే కనుక మంగళవారమే చేయడము జరుగుచున్నది. ఆది సోమ, 'మంగళవారములలో ఆది, మధ్య, అంత్యకాలములైన ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రములలో బ్రహ్మ, కర్మ భక్తియోగములు అచరించడమే తైతారాధనయని తెలియవలెను.


ఆదివారము --      ఉదయము -- తూర్పు --     బ్రహ్మయోగము

సోమవారము _ --  మధ్యాహ్నము -- దక్షిణము  --కర్మయోగము

మంగళవారము -- సాయంకాలము -- పడమర --   భక్తియోగము


మూడు యోగములతో, మూడు దినములందు, మూడుకాలములలో, మూడు దిశలలో దేవున్ని ఆరాధించడమే

త్రైతారాధన.త్రైతారాధన ప్రబోధసేవా సమితివారే కాక అందరు ఆచరించడము మంచిది.

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024