pss book:gt8 త్రైత సిద్ధాంత భగవద్గీత: రాజవిద్యా రాజగుహ్య యోగము

 త్రైత సిద్ధాంత భగవద్గీత: రాజవిద్యా రాజగుహ్య యోగము  

శ్రీ భగవంతుడిట్లనియె :-

శ్లోకం 1: ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యా మ్యన సూయవే ।

జ్ఞానం విజ్ఞాన సహితం యజ్జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ||

(ధర్మములు)

భావము : ఇది అతి రహస్యమైన జ్ఞానము. దీనిని విజ్ఞాన సహితముగ విశద పరుతును. దీనిని తెలియుట వలన అశుభములనుండి ముక్తుడవుకాగలవు.

వివరము : బ్రహ్మవిద్య అనునది రహస్యమైనదే. ఎవరికి తెలియని దానివలన అది రహస్యమైనది. అటువంటి జ్ఞానమును అనుభవపూర్వకముగ మరియు విజ్ఞానసహితముగ అర్థమగునట్లు విశదముగ తెలియ చెప్పెదనని భగవంతుడన్నాడు. అట్లు తెలియుట వలన కర్మముల నుండి విడువబడి మోక్షము పొందునని కూడ తెల్పాడు.

శ్లోకం 2: రాజవిద్యా రాజగుహ్యం పవిత్ర మిద ముత్తమమ్ ।

ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తు మవ్యయమ్ ||

(ధర్మములు)

భావము : అన్ని విద్యలయందు పెద్దది, అట్లే అన్ని రహస్యములందు పెద్దది, పవిత్రమైన ఉత్తమమైన ప్రత్యక్షముగ జరుగు ధర్మము. మంచి సుఖమైనది నాశనములేనిది.

వివరము : ఈ చెప్పబడు జ్ఞానము విద్యలలోకెల్ల రాజులాంటిది. మనుషులలో రాజు గొప్పవాడు, ఇది గొప్ప విద్య కాబట్టి రాజుగ పోల్చి చెప్పడమైనది. అట్లే రహస్యములలోకెల్ల గొప్ప రహస్యమైనది. ఎవరికి తెలియనిది రహస్యమే. ఎవరు చెప్పలేని రహస్య విషయము భగవంతుడు తెలియజేయుచున్నాడు. అటువంటి రహస్యమైన ఎవరికి తెలియని విషయమును తెలుసుకోవడము వలన అశుభములు కలుగజేయు గుణముల మీద ఆసక్తి తగ్గిపోవును. ఈ జ్ఞానము ప్రత్యక్ష ధర్మమైనది, నాశనములేనిది అయిన దానివలన ప్రత్యక్ష పనులు చేయువాడు తప్పక తెలిసి చేయవలసివున్నది. అట్లుకాక వాడు చేస్తుంటే నేను చేస్తున్నాననిన తెలివితక్కువ వాడగును. అలా తెలివి తక్కువ పనులు, అర్థములేని పనులు చేయకుండుటకైన ధర్మములు తెలియాలి. ఉదాహరణకు టెంకాయ (కొబ్బరికాయ) అందరు కొట్టుచుంటే మనము కొట్టుచున్నాము, కాని అర్థము తెలియదు. పెళ్లిరోజు తలంబ్రాలు పోస్తున్నాము. అందరు చేస్తుంటే మనము చేస్తున్నాము, కాని అర్థము తెలియదు. అందరు బ్రతుకుతున్నట్లే బ్రతుకుచున్నాము, కాని మన బ్రతుకు యొక్క అర్థము తెలియదు. ఇంకా మనము చేయు ఎన్నో పనులకు, మాట్లాడే మాటకు అర్థము తెలియదు. ఇట్లు గుంపులో గోవింద అని అందరంటే నీవు అనక గోవిందలో అర్థమేమో తెలుసుకోవాలి. అన్నిటికి అర్థము ఆచరణ తెలుపునవి ధర్మములు. వాటిని గూర్చి తప్పక తెలియాలి. ధర్మములను తెలియమని క్రింది శ్లోకములో కూడ చెప్పుచున్నాడు

శ్లోకం 3 : అశ్రద్ధధానాః పురుషా ధర్మ స్యాస్య పరన్తప ! ।

అప్రాప్య మాం నివర్తన్తే మృత్యుసంసార వర్త్మని ||

(ధర్మములు)

భావము : ధర్మముల మీద అశ్రద్ధ కల్గినవాడు, నన్ను తెలియలేక మృత్యు సంసారములోనే వర్తించుచుండును.

వివరము : నీతి న్యాయయుక్తమైనది, జ్ఞానము ధర్మయుక్తమైనది. నీతి న్యాయము ప్రపంచములో నడుచుకొనుటకు అవసరమైన సక్రమ పద్ధతిని చూపించును. జ్ఞానధర్మములు ప్రపంచసంబంధమైనవి కావు. ఇవి పరమాత్మ సంబంధమైనవి. జ్ఞానధర్మముల వలన పరమాత్మను చేరుటకు కావలసిన విధానములు తెలియును. ముఖ్యముగ నీతి న్యాయములేవో, జ్ఞానధర్మములేవో ముందు తెలుసుకోవలసి ఉన్నది. మేము చూచినంతలో జ్ఞానధర్మముల స్థానములను, నీతి న్యాయములు ఆక్రమించుకొన్నవి. జ్ఞానము తెలుపవలసిన పెద్దలు జ్ఞానమనుకొని నీతిని బోధిస్తున్నారు. అలాగే ధర్మముల స్థానములో న్యాయాన్ని బోధిస్తున్నారు. అసలు జ్ఞానము ధర్మము అగమ్యగోచరమైపోయి, మనవరకు నీతి న్యాయములే పెద్దవై పోయాయి. సత్యమునే పలుకమని, పరోపకారము చేయండని, ఇతరులను మోసగించవద్దని, మంచినే ఆచరించండని, అన్యాయముగ వర్తించవద్దని చాలామంది బోధిస్తున్నారు. ఇవి నీతి న్యాయమునకు సంబంధించిన విషయములు. పెద్దలు వీటిని బోధిస్తే పరవాలేదు. కాని గురువులైనవారు వీటిని వదలి జ్ఞానమును ధర్మమును బోధించుట మంచిది.

ధర్మములేవో తెలియని ఈ కాలములో, జ్ఞానము యొక్క అర్థమే తెలియని ఈ పరిస్థితిలో, నీతి న్యాయములు తెలిసినవారే గొప్ప జ్ఞానులుగ, యోగులుగ, గురువులుగ చలామణి అవుచున్నారు. ఇటువంటి పరిస్థితిలో అసలైన జ్ఞానము ధర్మము తెలియబడినప్పటికి గుర్తించలేనిస్థితిలో చాలామంది ఉన్నారు. 'వినాలనుకొన్న వానికి చెప్పబడును. తెలియాలనుకొన్నవానికి తెలుపబడును.' అను సూత్రము ప్రకారము శ్రద్ధవున్నవానికి జ్ఞానము ధర్మములు తెలియబడును. శ్రద్ధలేనివానికి ఒకవేళ తెలియబడిన అశ్రద్ధచే వాటిని ఆచరించడు. ధర్మములు తెలిసినప్పటికి అశ్రద్ధాపరుడు వాటిని వ్యర్థము చేసుకొంటే, పరమాత్మను వాడెప్పటికి తెలుసుకోలేడు. అటువంటి వారు మృత్యువుతో కూడుకొన్న ఈ జగత్తులోనే మునిగి తేలుచుండును. శ్రద్ధగలినవాడు ధర్మయుక్తముగ ఆచరించుచు తొందరలో పరమాత్మను పొందగలడు. ఈ జగత్తునుండి బయటపడగలడు.

శ్లోకం 4: మయా తత మిదం సర్వం జగదవ్యక్త మూర్తినా ।

మత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః ||

(పరమాత్మ)

భావము : అవ్యక్తముగ ఈ ప్రపంచమంతయు వ్యాపించియున్నాను. నాయందే సర్వజీవరాసులున్నవి. నేను వాటియందులేను.

వివరము : కంటికి కనిపించకుండ పరమాత్మ ప్రపంచమంతా వ్యాపించివున్నాడు. వ్యక్తముకాని పరమాత్మ అణువణువున వ్యాపించివున్నాడు. పరమాత్మ పదార్థము నందేకాక శూణ్యములో కూడ వ్యాపించి ఉండుట వలన ఖగోళములో సమస్త గోళములు, నక్షత్రములు, సూర్యచంద్రాది గ్రహములు మొదలగునవన్నియు పరమాత్మలోనే ఉన్నవి. భూగోళము దానిమీదున్న సమస్తము పరమాత్మయందున్నవే యగును. సముద్రము సహితము, సముద్రములోని ప్రాణులు సహితము, ఇది లేదనకుండ అన్నియు పరమాత్మలో నివశించునవేనని తెలియుచున్నది. ప్రదేశమంతా పరమాత్మదే అయినప్పుడు ఏ జీవరాసి ఎక్కడున్న పరమాత్మ స్థలములోనున్నట్లే యగును. అందువలన 'మత్ స్థాని సర్వభూతాని' నా స్థానంలోనే జీవరాసులుంటున్నవి అన్నాడు. ఏ బాడుగ కట్టకుండ ఉచితముగ పరమాత్మ స్థానములో ఉన్నామని జ్ఞప్తి చేసుకోండి. మనము ఆయన స్థానములో ఉన్నాము, కాని ఆయన మన స్థలములోలేడు.

అనంత విశ్వమంతా ఆయనే అయినప్పుడు సూక్ష్మమైన భూగోళమెంత? ఈ చిన్ని భూగోళములో సముద్రము 70 శాతము పోగా 30 శాతము భూమి ఎంత? ఆ కొద్ది భూమిలో అమెరికా, రష్యా మొదలగు వందల దేశాలలో నీదేశమెంత? అందులో నీ దేహమెంత? నీ దేహములో తలలో ఒకచోటున్న నీవెంత? ఇంత చిన్న మనము అంత పెద్ద పరమాత్మలో నివశిస్తున్నాము. అంత పెద్ద పరమాత్మ ఇంత చిన్న మనలోపల పట్టునా? పట్టడు. ఎంతో అనంతముగ విశాలమైన ఎల్లలులేని వాడేమి, నీలోపల ఇమిడివుండేదేమి. ఆయన మనలో ఉండడము సాధ్యపడదు. మనము ఆయనలో ఉండడము సహజమే. అందువలననే ఈ శ్లోకములో సర్వజీవులు నాయందున్నవి, వాటియందు నేను లేను అన్నాడు.

అణువణువు అన్నిటియందు పరమాత్మ వ్యాపించియున్నది. జీవరాసుల శరీరములలోను కూడ పరమాత్మ వ్యాపించి ఉన్నదని చెప్పవచ్ఛును. ఈ విధముగ జీవరాసులన్ని పరమాత్మయందిమిడి దానితో కలిసి ఉన్నవని తెలియుచున్నది. పరమాత్మలేని వస్తువుగాని, జీవరాసికాని జగత్తులో లేదు. పరమాత్మ ఎట్లు అందరిలో వ్యాపించి ఉన్నాడో, ఎక్కడ తనను చెప్పాలో, ఎక్కడ చెప్పకూడదో క్రింద శ్లోకములో తెలియజేయుచున్నాడు చూడండి.

శ్లోకం 5: న చ మత్ స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ ।

భూతభృ న్న చ భూతస్థో మమాత్మా భూత భావనః ||

(పరమాత్మ)

భావము : సర్వ జీవులు నాయందులేవు. నేను ఈశ్వరునిగ (అధిపతిగ) ఎట్లు కలిసి ఉన్నది చూడుము. జీవులు ధరించు శరీరములోని ఆత్మగను, భూతములుగ భావింపబడు జీవాత్మలుగను నేను లేను.

వివరము : అలిగినవాడు అడ్డము తిరిగినట్లు ముందు శ్లోకములో 'అన్ని జీవరాసులు నాయందు ఉన్నవి.' అన్న పరమాత్మ ప్రక్క శ్లోకములోనే ఇక్కడ 'ఏ జీవరాసి నాయందు లేవు' అన్నాడు. 'మత్ స్థాని భూతాని' అన్నవాడు ప్రక్కనే 'నచమత్స్థాని భూతాని' అనడమేమిటి, మనుషులకంటే దేవుడు చాలా స్పీడ్ గా ప్లేటు ఫిరాయిస్తాడేయని అనుమానము వస్తుంది కదా! అలా ఏమి కాదు. తనను అర్థము చేసుకోడానికి పరమాత్మ ఇన్ని విధాల చెప్పవలసి వచ్చింది. ఇలా చెప్పడము వలన వివరముగ అవగాహన చేసుకోవచ్చును. అలాకాకపోతే ఉదాహరణకు ఇప్పుడు బోధకులు భగవంతుడను పదమును ఎక్కడ ఉపయోగించాలను వివరము తెలియకుండి పరమాత్మ అను పదము చెప్పవలసిన చోట భగవంతుడని, భగవంతుని గూర్చి చెప్పవలసినచోట పరమాత్మయను పదము వాడినట్లుండును. భగవంతుడు పరమాత్మ ఇద్దరు ఒకరే అయినప్పటికి సాకారరూపుడు భగవంతుడు. నిరాకార రూపుడు పరమాత్మ. నిరాకారమైన పరమాత్మను గూర్చి చెప్పవలసిన చోట, సాకారమైన భగవంతున్ని చెప్పడములో చాలా పొరపాటగును. ఉదాహరణకు గొప్ప పేరుగాంచిన స్వామీజి తన ఉపన్యాసములో 'భగవంతుడు సర్వవ్యాపి అంతట చూస్తున్నాడు' అన్నాడు. అక్కడ చెప్పవలసినది పరమాత్మ సర్వవ్యాపి అని చెప్పవలసి ఉండగ తప్పుగ భగవంతుడు సర్వవ్యాపి అని చెప్పడమైనది. తప్పేమిటంటే భగవంతుడు ఒక శరీరములో మాత్రముండి, ఆ శరీరములోని కన్ను యొక్క చూపు పరిధిలో మాత్రమే చూడగల్గుచున్నాడు. దీనిని బట్టి భగవంతుడు అంతట చూచుట అబద్దమగును. పరమాత్మ అంతట వ్యాపించి చూచుట నిజమగును. ఆ మాటతో ఆ స్వామీజీకి జ్ఞానము అంతో ఇంతో తెలుసును, కాని సూక్ష్మమైన వివరము వరకు తెలియదని అనుకోవచ్చును. అలా చెప్పడము వలన వినేవారు ఆలోచించక నమ్మడము జరుగును. అలాగే ఇప్పుడు ఇక్కడ పరమాత్మ నేను అంతా చూస్తున్నాను, కాని నేను అంతా చూడడములేదు అన్న విషయమొచ్చినదనుకోండి, అప్పుడు విన్న ప్రజలు ఏమనుకోవాలి. వారు సందిగ్ధావస్థలోపడి అనుమానము తీరక ఈ జ్ఞానమే వద్దనుకోవడము జరుగును. అందువలన జ్ఞానములో ప్రతి విషయమును క్షుణ్ణముగా పరిశీలించి బోధించవలెనని బోధకులకు మా మనవి.

ఇప్పుడు అసలు విషయానికొస్తాము. ముందు చెప్పిన శ్లోకములో నాయందు అందరున్నారని చెప్పి, ఈ శ్లోకములో నాయందు ఎవరు లేరని చెప్పడములో వివరమేమిటని యోచించిన, అదే శ్లోకములోనే 'ఈశ్వరునిగ కలిసివున్నది చూడుము' అన్నాడు. అంతేకాక 'భూతములుగ భావింపబడు వాటిగను భూతస్తునిగ నేను లేను' అన్నాడు. వీటన్నిటిని గమనించిన ఒకే పరమాత్మ మూడుగ విభజింపబడి ఉన్నదని తెలియుచున్నది. రెండు నేను కాదు అనుచున్నాడు. ఆయన కాని రెండు 'మమాత్మనచ భూతస్థో భూత భావనః' అనునవి. భూతస్థో అనగ భూతములందు నివసించువాడైన ఆత్మ, భూత భావనః అనగ భూతములనబడు జీవాత్మలు, మమాత్మ అనగ నేను, నచ అనగ కాను అని అర్థము.

పరమాత్మయిన వాడు ఆత్మ జీవాత్మలుగ నేను లేను అంటున్నాడు. దీనిని బట్టి పరమాత్మకు, ఆత్మకు, జీవాత్మకు విభిన్న భేదములున్నవని తెలియుచున్నది. అవి ఏమిటనగా ! 1) పరమాత్మ అనగ అంతట వ్యాపించివున్నది. అక్కడా ఇక్కడాయను ప్రశ్నలేకుండా అంతట ఉండునది. 2) ఆత్మ అనగ సర్వ జీవుల శరీరములందు మాత్రము వ్యాపించివున్నది. 3) జీవాత్మ అనగ ఒక శరీరములో ఒక్క చోట మాత్రముండునది. ఇలా వేరు వేరుగ మూడు ఆత్మలుండుట వలన మొదటిదైన పరమాత్మలోనికి చివరిదైన జీవాత్మ కలవాలను ప్రయత్నము చేయవలసి వచ్చినది. పరమాత్మకంటే, ఆత్మ, జీవాత్మలు వేరై వాటి పనులు కూడ వేరై ఉండుట వలన, అవి నేను కాను అన్నాడు. పరమాత్మ అంశమే ఆత్మ జీవాత్మలుగ విభజింపబడి ఉన్నవి. ఆ రెండు ఆత్మలకు పరమాత్మయే అధిపతి. వాస్తవముగ ఆత్మ జీవాత్మలలో ఉన్నది పరమాత్మయే, అయినప్పటికి వాటికి పరిధి ఏర్పడినది. అందువలన నేను వాటిలో ఎట్లు కలిసి అధిపతిగనున్నానో చూడుము(తెలియుము) అని శ్లోకములో 'పశ్యన్తి యోగమైశ్వరమ్' అన్నాడు.

పరమాత్మను ఒకే శక్తిగ చూచినట్లయితే ముందు శ్లోకములో చెప్పినట్లు అన్ని జీవరాసులు దానియందే గలవు. ఆ మాట అక్కడ వాస్తవమే. పరమాత్మను మూడుగ విభజించి చూడగల్గితే సర్వజీవరాసులు ఆత్మయందున్నవి గాని పరమాత్మయందులేవు. శరీరమంత వ్యాపించి చైతన్యముగనున్నది ఆత్మ. శరీరమంత వ్యాపించిన ఆత్మయందే శరీరములోని జీవాత్మ కూడ గలదు. శరీరమందు ఒకచోటున్న జీవాత్మ శరీరమంత నిండిన ఆత్మలోనున్నదని చెప్పవచ్చును. అందువలన పరమాత్మగ చెప్పబడిన దానియందు జీవాత్మలు లేవనుట ఇక్కడ వాస్తవము.

ఒకే పరమాత్మ మూడుగ విభజింపబడినదైనప్పటికి, విభజించబరచక చూచిన ఎడల సర్వజీవులు పరమాత్మలోనివేనని, విభజించి చూచిన సర్వజీవులు పరమాత్మలో లేవని స్పష్టముగ చెప్పవచ్చును. ఉదాహరణకు ఒకనికి ఆస్తి 9 ఎకరములున్నదనుకొనుము. వానికి ముగ్గురు కొడుకులున్నారనుకొనుము. వారికి యుక్తవయస్సు వచ్చిన తరువాత ఒక్కొక్కరికి మూడు ఎకరముల ప్రకారము పంచాడనుకొనుము. అందులో ఒక మూడెకరాల స్థలాన్ని చూపి ఇదెవరిదని అడిగిన, వాని కొడుకుదని చెప్పవచ్చును. పంచక పూర్వము అడిగినట్లయితే ఆస్తి మొత్తము తండ్రిదని చెప్పవచ్చును. అప్పుడది నిజము. పంచిన తరువాత ఆస్తి తండ్రిది కాదు కొడుకులదని చెప్పవచ్చును. ఇప్పుడిది నిజము. ఈ విధముగనే ఏకముగనున్న పరమాత్మయందు సమస్త జీవరాసులుగలవను మాట నిజము. విభజింపబడిన పరమాత్మయందు ఏ జీవరాసిలేదు అన్న మాట వాస్తవ మైనదేనని గ్రహించాలి.

శ్లోకం 6: యథాఽఽకాశస్థి తో నిత్యం వాయు స్సర్వత్రగో మహాన్ ।

తథా సర్వాణి భూతాని మత్ స్థానీ త్యుపధారయ ! ||

(పరమాత్మ)

భావము : బలము కలిగి సర్వత్ర సంచరించు గాలి నిత్యము ఆకాశమందెట్లున్నదో, అట్లే సర్వ జీవరాసులు నాయందున్నవని గ్రహించుము.

వివరము : ఆకాశము శూణ్యమైనది. శూణ్యములో ఏ పట్టు ఉండదు. అటువంటి ఏ పట్టులేని ఆకాశములో పట్టుగల్గి బలముగ దేనినైన త్రోయగల మహాశక్తికల్గియున్న గాలి అంతట సంచరించుచున్నది. ఆధారములేని ఆకాశములో ఆధారముకల్గ చేసుకొని సంచరించడము, మరీ బలముకల్గి సంచరించడము గొప్ప విధానమే కదా! అని మేమన్నప్పుడు కొందరు 'నేడు స్కైలాబ్ లను, ఉపగ్రహములను మానవుడు తయారుచేసి వదిలాడు కదా! అవియు ఆధారములేని ఆకాశములో ఎగురుచు ముందుకు పోవుచున్నవి కదా! అట్లే కదా వాయువు కూడ ఆకాశములోనున్నది' అని అనవచ్చును. మనిషి ఉపగ్రహములకు యంత్రములున్నవి, కనిపించు రూపమున్నది. గాలికి రూపములేదు. కావున ఉపగ్రహములకు, గాలికి పోలిక కాదు.

కనిపించని ఆకాశములో, కనిపించని గాలి బలముకల్గి ఎట్లు కదులుచున్నదో, అట్లే కనిపించని పరమాత్మలో, కనిపించని జీవాత్మలు బలముకల్గి కదులుచున్నవి. ఆకాశములో గాలికి స్థానమెట్లున్నదో, పరమాత్మయందు కూడ జీవులకు స్థానమట్లే ఉన్నది. ఇక్కడ గ్రహించవలసిన విషయమేమనగా! ఒక శ్లోకములో జీవరాసులు నాయందున్నవన్నాడు. రెండవ శ్లోకములో ఏ జీవరాసి నాలో లేవన్నాడు. తిరిగి ఇప్పుడు మూడవ శ్లోకములో ఆకాశములో గాలి ఉన్నట్లు, జీవులు నాలో ఉన్నవంటున్నాడు.

విభజించి చూచిన జీవులకు ఆధారము ఆత్మని స్పష్టముగ తెలియుచున్నది. విభజించక పోయినట్లయితే జీవులకు కనిపించక పరమాత్మ ఆధారమై ఉన్నదని జ్ఞాపకముంచుకోవాలి.

శ్లోకం 7: సర్వ భూతాని కౌంతేయ ! ప్రకృతిం యాన్తి మామికామ్ ।

కల్పక్షయే పునస్థాని కల్పాదౌ విసృజా మ్యహమ్ ||

(పరమాత్మ)

భావము : సర్వ జీవరాసులు కల్పక్షయములో నా ప్రకృతియందే లీనమగుచున్నవి. కల్పాదిలో నేనే తిరిగి వాటిని పుట్టించుచున్నాను.

వివరము : జీవరాసుల తలలలో నాలుగు చక్రముల చట్రమొకటి భిగించబడి ఉన్నది. బ్రహ్మనాడి ఇరుసుగా గల ఆ నాలుగుచక్రములు పై నుండి వరుసగ 1) బ్రహ్మచక్రము 2) కాలచక్రము 3) కర్మచక్రము 4) గుణచక్రము గలవు. పై నుండి బ్రహ్మచక్రము రెండు భాగములుగ విభజించబడి సగభాగములో ప్రపంచము ఉండునట్లు, సగభాగములో ప్రపంచములేనట్లు నిర్ణయించబడివున్నది. బ్రహ్మచక్రము సగభాగము తిరుగునపుడు ప్రపంచమున్నది. సగభాగము తిరుగుటకు పట్టుకాలము వేయియుగములు. ప్రపంచమున్న వేయియుగముల కాలము పరమాత్మకు పగలుగ, ప్రపంచములేని కాలము పరమాత్మకు రాత్రిగ చెప్పుకొన్నాము. పగలు వేయి యుగముల కాలమును కల్పము అంటున్నాము. కల్పము మొదటిలో ప్రపంచ పుట్టుక, కల్పము చివరిలో ప్రపంచ క్షయము అనగ నాశనమని తెలియాలి. దీనిని బట్టి ప్రపంచము మొదటి నుండి చివరి వరకు వేయియుగముల కాలములో బ్రహ్మచక్రము సగము చుట్టు తిరుగుచున్నది. అలాగే దానిక్రింద చక్రమైన కాలచక్రము సంవత్సరమునకొక చుట్టు తిరుగుచున్నది. కాలచక్రముకంటే క్రిందగల కర్మచక్రము దినముకొక చుట్టు తిరుగుచుండగ, దానికంటే క్రిందగల గుణచక్రము గంటకొకచుట్టు తిరుగుచున్నది.

అన్నిటికంటే క్రిందగల గుణచక్రము మూడు భాగములుగ విభజింపబడి ఉన్నది. దానిలోనే ఏదో ఒక భాగములో జీవుడు నివాసముండును. జీవుని నివాస కేంద్రమునుండి యుగపర్యంతము లెక్కాచారముగలదు. జీవుడు నివశించు గుణభాగములోని గుణములు మంచివి ఆరు, చెడువి ఆరు మొత్తము 12 గలవు. ఒక్కొక్క గుణము నవగ్రహముల ప్రకారము తొమ్మిది భాగములుగ విభజింపబడి ఉన్నది. 12 గుణములు 9 భాగములుగ విభజింపబడుటవలన మొత్తము 12x9 = 108 భాగములుగ విడిపోయివున్నవి. 108 గుణములు గల గుణ భాగములో జీవుడు నివశిస్తున్నాడని ముఖ్యముగ గుర్తుంచుకోవలెను. ఒక్కొక్క జీవుడు శరీరములలో మూడు గుణ ఆవరణములలో ఏదో ఒక భాగమున నివాసముండుట వలన, ఒక గంటకు గుణచక్రము ఒకచుట్టు తిరుగుట వలన, మూడు గుణ ఆవరణములలోని మొత్తము ముఖ్య గుణములు 12x3 = 36 ఒక గంటకు తిరిగినట్లగుచున్నది. అందువలననే పూర్వపు పెద్దలు ఇతరులను గూర్చి చెప్పేటప్పుడు వానికి గంటకు ముప్పైఆరుగుణములు మారుతుంటాయని అనడము పరిపాటిగనున్నది. అలా ఒక గంటకు గుణచక్రములోని మూడు ఆవరణములలో ఉన్న 36 గుణములు తిరుగుచుండగ, ఒక దినమునకు అనగ 12 గంటల కాలమునకు 36x12 = 432 గుణములు మారినట్లగును.

మానవుని పగలు కాలములో 432 గుణములు తిరుగుచున్నవి. పరమాత్మ పగలు కాలము వేయియుగములు కావున మానవుని పగలును వేయిమార్లు హెచ్చించవలసి వచ్చినది. దానిప్రకారము వేయిమార్లు మానవుని పగలును హెచ్చింపు చేసుకొనుట వలన మానవుని పగలులోని 432 గుణములను వేయిమార్లు హెచ్చించవలసి వచ్చినది. అప్పటికి మొత్తము 4,32,000 గుణముల సంఖ్య వచ్చినది. గుణముల వలననే ఈ ప్రపంచము పెరుగుట తరుగుట జరుగుచుండుట వలన ఆ గుణముల సంఖ్యనే ఆధారము చేసుకొని ఒక యుగకాలమును నిర్ణయించవలసి వచ్చినది. ఈ లెక్క ప్రకారము మొదటి కలియుగము 4,32,000 సంవత్సరములు. రెండవదైన ద్వాపరయుగము దానికంటే, రెండింతలు 8,64,000, సంవత్సరములు మూడవదైన త్రేతాయుగము మూడింతలు 12,96,000 నాల్గవదైన కృతయుగము నాల్గింతలుగ 17,28,000 సంవత్సరములు. ఈ విధముగా యుగముల ఆయుస్సు నిర్ణయింపబడినది. నాల్గవదైన కృతయుగముతో ప్రపంచము మొదలు పెట్టబడినది. నాల్గుయుగములు 250 మార్లు జరిగినట్లయితే వేయి యుగములగును.

నాలుగుయుగముల లెక్కప్రకారము మొత్తము సంవత్సరములు

1) కలియుగము

=

4,32,000

2) ద్వాపరయుగము

=

8,64,000

3) త్రేతాయుగము

=

12,96,000

4) కృతయుగమ

=

17,28,000

మొత్తము 4 యుగములు

=

43,20,000

మొత్తము కాలము

=

43,20,000 సంవత్సరములు

నాలుగు యుగములు 250 మార్లు జరిగిన 43,20,000x250 = 108,00,00,000 మొత్తము సంవత్సరములగును. పరమాత్మ పగలు 108 కోట్ల సంవత్సరములు 108 ఉప గుణములకు ప్రతీకగనున్నవి. మానవుని పగలు కాలములో 432 గుణములు తిరుగగ నాల్గవయుగమైన కలియుగకాలము 4,32,000 సం॥ములైనవి. నాల్గుయుగముల మొత్తము కాలము 43,20,000. జీవుని గుణఆవరణములో జీవుడుండు గుణముల సంఖ్యను బట్టి యుగముల వరకు లెక్కించి నిర్ణయింపబడి ఉన్నది. జీవుని గుణములను కేంద్రముగ చేసుకొని నిర్ణయించబడిన లెక్కాచారమే యుగములు, యుగములతో కూడుకొన్న కల్పము ఇపుడర్థమైందనుకొంటము. కల్పమంటే 108 కోట్ల సంవత్సరములని, ఈ కల్పము మొదలైనప్పుడు జీవులు పుట్టుట ప్రపంచమేర్పడుట జరుగునని, కల్పము నాశనమైనపుడు సర్వము నాశనము చెందిపోవునని తెలియవలెను. ఈ విషయమునే భగవంతుడు తెల్పుచు కల్ప అంత్యములో సర్వజీవులు నా ప్రకృతియందే లీనమగుచున్నవని, కల్పాదిలో సర్వజీవులను నేనే తిరిగి పుట్టించుచున్నానని అన్నాడు.

శ్లోకం 8: ప్రకృతిం స్వామ వష్టభ్య విసృజామి పునః పునః ।

భూతగ్రామ మిమంకృత్స్న మవశం ప్రకృతేర్వశాత్ ||

(పరమాత్మ)

భావము : ప్రకృతి వశములోనుండి అస్వతంత్రమైయున్న ఈ సమస్త జీవరాసులను నా ఆధీనములోనున్న ప్రకృతిచేతనే మళ్ళీ మళ్ళీ పుట్టించుచున్నాను.

వివరము : పరమాత్మ తనకు జీవరాసులకు మధ్యలో ప్రకృతినుంచుకున్నాడు. ప్రకృతి ఆధీనములో జీవరాసులుండునట్లు చేసి, తన ఆధీనములో ప్రకృతిని ఉండునట్లు చేసుకున్నాడు. తనకు జీవులకు మధ్య నేరుగ సంబంధము లేకుండ చేసుకున్నాడు. జీవులన్ని ప్రకృతి ఆధీనములోనుండుట వలన వాటికి స్వతంత్రత లేదు. గుణములు, కర్మ, మనస్సు, బుద్ధి, చిత్తము, అహము అను ఎన్నో భాగములుగ విభజింపబడి ఉన్న ప్రకృతిలో చిక్కుకున్న జీవుడు వాటి ప్రకారము పుట్టవలసిందే, కాని తన ఇష్టప్రకారము పుట్టుటకు వీలులేదు. తన పుట్టుక కూడ తన చేతిలో లేని జీవాత్మలు శ్లోకములో చెప్పినట్లు అన్ని విషయములలో అస్వతంత్రమైనవే. అలా స్వతంత్రతలేని జీవరాసులను పరమాత్మయే తన ప్రకృతిచేత, దానిలోనుండు కర్మ భాగములచేత రక రకములుగ పుట్టించుచున్నాడు. జీవరాసులు పుట్టుటకు మూలకర్త పరమాత్మే అయినప్పటికి పైకి కనిపించునట్లు ప్రకృతినుంచాడు.

శ్లోకం 9: న చ మాం తాని కర్మాణి నిబధ్నన్తి ధనంజయ! ।

ఉదాసీనవ దాసీన మసక్తం తేషు కర్మసు ||

(పరమాత్మ)

భావము : ఆసక్తిలేని వాడును, ఉదాసీనత కల్గియున్న వాడునునైన నాకు ఆ కర్మలంటవు.

వివరము : వాని వాని కర్మానుసారము ప్రకృతియే జీవులను పుట్టించుచున్నది. ప్రకృతి చేయుపనిలో ఆసక్తి లేనివానిగ సాక్షిగ చూస్తుండుటవలన జీవులను పుట్టించుట లోని కర్మ ఏమాత్రము పరమాత్మకు అంటలేదు. ఇక్కడ ఒక సాధారణ మనిషికి ఎలా కర్మఅంటదో, అదే పద్ధతిలో జగత్తును సృష్ఠించు పెద్దకార్యములో కూడ కర్మ అంటకుండునట్లు, పరమాత్మ కూడ నడుచుకోవడము ముఖ్యముగ గమనించదగ్గ విషయము. జగత్తు సృష్టికి మూలకర్త తానే అయినప్పటికి ప్రకృతి ద్వార పని చేయిస్తు, తనకేమి అంటనివానివలె అనాసక్తుడై పరమాత్మ ఉన్నాడు. ప్రకృతి చేయు పనులను నేను చేయలేదనుచున్నాడు. అందువలన జగతికి కల్గు ప్రళయ సంభవముల రెండిటి యొక్క పాపపుణ్యములు నాకంటవని చెప్పుచున్నాడు. ఈ విధానమునే మనిషి అనుసరించినట్లయితే, వానికి కూడ కర్మలంటవని వెనుక అధ్యాయములో చెప్పాడని జ్ఞప్తి చేసుకోవలెను.

శ్లోకం 10: మయాఽధ్యక్షేణ ప్రకృతి స్సూయతే సచరాచరమ్ ।

హేతునాఽ నేన కౌంతేయ! జగ ద్విపరివర్తతే ||

(పరమాత్మ)

భావము : నా అధ్యక్షతన గల చరాచర ప్రపంచమునంతటిని ప్రకృతి పుట్టించు చున్నది. ఆ కారణముచేతనే జగత్తు పరివర్తించుచున్నది.

వివరము : పరమాత్మ ప్రకృతికి అధ్యక్షత వహించియుండగ ప్రకృతి సకల చరాచర జీవరాసులను సృష్ఠించుచున్నది. కారణము పరమాత్మకాగ, కార్యము ప్రకృతి చేయుచున్నది. ఈ విధానము శాశ్వతముగనుండుట వలన, చావు పుట్టుకలను ప్రకృతి చేయుచుండుట వలన, జగత్తు చక్రమువలె తిరుగుచువున్నది. ఒక యంత్రమును తయారు చేయువాడు యంత్రము తయారగువరకు కష్టించి తయారు చేయును. యంత్రము తనంతట తానే పనిచేయుటకు మొదలు పెట్టిన తరువాత వానికేమి శ్రమవుండదు. మొదట ఒక నమూనాను తయారు చేసినవాడు ఆ నమూనాను ఎక్కడైనా ఉపయోగించి పనిచేయించ వచ్చును. మొదటి నమూనా ప్రకారమే అన్ని యంత్రములు తానంతటవే పనిచేయును. మొదట ప్రకృతియను యంత్రమును పరమాత్మ తయారుచేసిపెట్టాడు. ఆ యంత్రము ఎల్లప్పుడు తిరుగుచు పని చేయుచునేవున్నది. పరమాత్మ సామర్థ్యముతోనే యంత్రము తిరుగుచున్నదని చెప్పవచ్చును.

శ్లోకం 11: అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ ।

పరం భావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్ ||

(పరమాత్మ, సాకారము)

భావము : సర్వజీవరాసులకు అధిపతినైన నేను నరశరీరము ధరించుట వలన, నాశ్రేష్ఠమైన భావము తెలియజాలక మూఢులు నన్ను అవమానించుచున్నారు.

వివరము : పరమాత్మ ఏదో ఒక సమయమున మానవునిగ శరీరము ధరించక తప్పదు. శరీరము ధరించిన అంత గొప్ప పరమాత్మ ఆ సమయములో మానవునివలె సహజముగ మెలగవలసిందె. మానవునికున్న అన్ని కష్టసుఖములు ఆయనకు కూడ తప్పనిసరిగ ఉండును. కర్మలేని పరమాత్మ శరీరము ధరించినపుడు తనకొక కర్మను తానే ఏర్పాటు చేసుకొనివచ్చును. తానే స్వయముగ నిర్మించుకొన్న కర్మ గ్రహముల ఆధీనములో లేదు. గుణములచేత పుట్టిన కర్మ నవగ్రహముల ఆధీనములో ఉండును. పరమాత్మకు ముందు జన్మ కర్మలేదు. కనుక ఆ జన్మలో తానే సృష్ఠించుకొని వచ్చిన కర్మ ఏ జ్యోతిష్యశాస్త్రమునకు అంతుబట్టదు. ఇలా గ్రహములకు సంబంధములేని కర్మను, ఒక జీవితమునకు సరిపడు దానిని తయారు చేసుకొని పుట్టిన పరమాత్మ, భగవంతునిగ శరీరముతో ఉండుట ఎవరు గ్రహించలేరు. కావున ఆయనను కూడ సామాన్య మానవునివలె లెక్కించి, ఆయన గొప్పతనమును ఏమాత్రము గుర్తించలేని మూఢ మానవులు భగవంతుని కూడ అవమానింతురు. భగవంతుడు భూమి మీదకొచ్చినది ధర్మములు తెలియజేయునిమిత్తము. ఆయన ఏమి చేయుచున్నాడని గ్రహించని మనుషులు, ఆయన విశిష్టతను ఏమాత్రము తెలియక ఎన్నో అవమానములకు గురిచేతురు.

శ్లోకం 12: మోఘాశా మోఘ కర్మాణో మోఘ జ్ఞానా విచేతసః ।

రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ||

(జీవాత్మ, ప్రకృతి)

భావము : రాక్షస భావములు కలవారు భ్రాంతితోకూడిన ప్రకృతి స్వభావమును ఆశ్రయింతురు. అట్టివారికి వ్యర్థమైన ఆశ, వ్యర్థమైన కర్మ, వ్యర్థమైన విపరీత జ్ఞానము కల్గుచుండును.

వివరము :ప్రకృతి మార్గము, పరమాత్మ మార్గము అను రెండు మార్గములలో రాక్షస భావములు కలవారు ప్రకృతి మార్గమునే ఆశ్రయింతురు. అసురభావము గలవారికి పరమాత్మ మార్గము రుచించదు. పరమాత్మ మార్గమేదని కొంచెమైన ఆలోచింపరు. ప్రకృతి సంబంధమైన దానినే గొప్పగ తలచుకొనుచు అదే గొప్ప జ్ఞానమనుకొనుచుందురు. వారి బుద్ధికి నిష్ప్రయోజనమైన కార్యములే మంచిగ తోచుచుండును. వారి జీవితములో వ్యర్థమైన కార్యములే చేయుచుందురు.

శ్లోకం 13: మహాత్మానస్తు మాం పార్థ! దైవీం ప్రకృతి మాశ్రితాః ।

భజన్త్య నన్య మనసో జ్ఞాత్వా భూతాది మవ్యయమ్ ||

(జీవాత్మ, పరమాత్మ)

భావము : మహాత్ములైనవారు ప్రకృతికి దైవమైన నన్ను ఆశ్రయించి, అవ్యయునిగ భూతముల మూలకారునిగ నన్ను తెలిసినవారై, మనస్సున అన్యచింత లేకుండ నన్ను ఆరాధిస్తున్నారు.

వివరము : ఈ శ్లోకములో 'దైవీం ప్రకృతి' అన్న పదమునకు దైవప్రకృతి అని లేక సత్వప్రకృతి అని చాలామంది వ్రాయుట జరిగినది. అలా ఇంకొక ప్రకృతి ఉన్నదనుకోవడము పొరపాటు. ఉన్నది ఒకే ప్రకృతి, అది పంచభూత నిర్మితమైనది. ప్రకృతి ఒకటి, దైవప్రకృతి మరొకటి లేవు. 'దైవీం ప్రకృతి' అన్న పదమునకు ప్రకృతికి దైవమైనది అని అర్థము చేసుకోవాలి. గడచిన జన్మలలో పరమాత్మను ఆరాధించినవారు తర్వాత జన్మలో మహాత్ములగుదురు. వారి జీవాత్మ జ్ఞానాగ్ని అను గొప్పధనము కలిగివున్నది. కావున వారు మహాత్ములనబడుదురు. అటువంటి మహాత్ములు ఆ జన్మలో కూడా ప్రకృతికంతటికి దైవమొక్కడున్నాడని, ఆయనే నాశనములేని పరమాత్మయని తెలిసినవారై, వారి మనస్సులో అన్యదేవతల యొక్క యోచన ఏమాత్రము లేనివారై, అన్నిటిని మించినవాడు పరమాత్మేనని ఆయననే ఆరాధించుచుందురు.

శ్లోకం 14 : సతతం కీర్త యన్తో మాం యతంత శ్చ దృఢ వ్రతాః ।

నమస్యంత శ్చ మాం భక్త్యా నిత్య యుక్తా ఉపాసతే ||

(జీవాత్మ, పరమాత్మ)

భావము : ఎల్లప్పుడు నన్ను కీర్తించి భజించువారు, గొప్ప వ్రతములచే ప్రయత్నించు వారు, నన్నే నమస్కరించువారు, భక్తిచే నిత్యయుక్తులైనవారు, అందరు నన్ను ఉపాసించువారే.

వివరము : పరమాత్మను మానవులు తమ తమ బుద్ధికి తోచినట్లు ఊహించుకొను చుందురు. వారు భావించుకొన్న భావమునే గొప్పగ తలచి కీర్తనలతో ఎల్లప్పుడు భజనలు చేయువారు కొందరుండగ, వ్రతముల వలననే దైవమును తెలియవచ్చునను బుద్ధి కల్గినవారు కొందరున్నారు. వారు నియమనిష్టలుగల వ్రతములనే ఆచరించు చున్నారు. మరికొందరు విధేయతతో నమస్కరించుట మంచిదని, ప్రతిరోజు నియమము తప్పక నమస్కరించువారు గలరు. అట్లే భక్తితో వారి మనసులందు నిత్యము సంబంధము పెట్టుకొనువారు గలరు. వీరందరు ఎన్ని విధముల ఏ దేవతలను పూజించినను, అందరు పరమాత్మను ఆరాధించువారేనని అనుకోవచ్చును. ఎందుకనగ పరమాత్మ అంతట నిండివున్నవాడు కనుక వారి ఆరాధనలన్ని పరమాత్మకే చేరుచున్నవి. కాని వారు మాత్రము చేరలేరు. వారు ఆరాధించినవారినే చేరుదురు.

శ్లోకం 15: జ్ఞాన యజ్ఞేన చా ప్యన్యే యజన్తో మాముపాసతే ।

ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖమ్ ||

(సాకారము, పరమాత్మ)

భావము : మరికొందరు జ్ఞానయజ్ఞముచే ఆరాధించువారు, విశ్వవ్యాప్తియై అనేక రూపములుగ ఉన్న నన్ను ఏకరూపునిగ సాకారమును పూజించువారు కలరు.

వివరము : పరమాత్మ నిరాకారముగ అంతట వ్యాపించియున్నాడు. మరియు విశ్వవ్యాపియై అనేక రూపములుగనున్న పరమాత్మ ఒక్క సాకారరూపము ధరించి భగవంతునిగ కూడ ఉన్నాడు. ఇట్లు నిరాకారునిగ, సాకారునిగ ఉన్న పరమాత్మను ఎందరో ఉపాసించుచున్నారు. కొందరు నిరాకారమైన పరమాత్మను చేరుకొనుటకు జ్ఞానాగ్నిచే కర్మను కాల్చివేయుచు జ్ఞానయజ్ఞము చేయువారున్నారు. మరికొందరు సాకారమైన భగవంతుని భక్తితో ఆరాధించువారు గలరు. పరమాత్మ సాకార నిరాకారముగనే కాక ఇంకా ఎట్లున్నాడనగా! క్రింది శ్లోకములో చెప్పుచున్నాడు చూడండి.

శ్లోకం 16 : అహం క్రతు రహం యజ్ఞః స్వధాఽహ మహ మౌషధమ్ ।

మంత్రోహ మహ మే వాఽజ్య మహమగ్ని రహం హుతమ్ ||

(పరమాత్మ)

భావము : నేను క్రతువును, నేను యజ్ఞమును, నేను స్వదయును, ఔషధంబు నేను, మరియు మంత్రము నేను, ఆజ్యమునేను, అగ్ని నేను, హోమము సహితము నేనే అయివున్నాను.

వివరము : పరమాత్మ అణువణువున విశ్వమంత వ్యాపించి ఉండుటవలన మనుషులచేత చేయబడు క్రతువు యజ్ఞము ఆయనే అగును. పితృదేవతలకు పెట్టు శ్రాద్ధము, మనము తిను ఆహారంలోని ఔషధము కూడ ఆయనే అగును. మరియు హోమములో ఉచ్ఛరించబడు మంత్రము, అక్కడ హోమములో వేయు ఆజ్యము (నెయ్యి), హోమములో మండు అగ్ని హోమము మొత్తము పరమాత్మే అయివున్నాడు. దీనిని బట్టి పరమాత్మ కానిది లేనిది ఏదిలేదని తెలియుచున్నది.

శ్లోకం 17 : పితాఽహ మస్య జగతో మాతా ధాతా పితామహః ।

వేద్యం పవిత్ర మోంకార ఋక్సామ యజురేవచ ||

(పరమాత్మ)

భావము : అఖిల జగతికి తల్లి తండ్రినగుదును, మరియు దాతను, తాతను నేనే అగుదును. తెలుసుకొంటే పవిత్ర ఓంకారమును నేనే. ఋక్, సామ, యజుర్వేదములును నేనే.

శ్లోకం 18 : గతి ర్భర్తా ప్రభుస్సాక్షీ నివాస శ్శరణం సుహృత్ ।

ప్రభవః ప్రలయ స్థ్సానం నిదానం బీజ మవ్యయమ్ ||

(పరమాత్మ)

భావము : గతియు, భర్తా, ప్రభువు, సాక్షి, సుహృత్ జనుల నివాస శరణములును, పుట్టు స్థలము, లయము జరుగు స్థలము, నిదానము, బీజము, అవ్యయము అన్నియు నేనే.

శ్లోకం 19: తపా మ్యహ మహం వర్షం నిగృహ్ణా మ్యుత్సృజామిచ ।

అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహ మర్జున! ||

(పరమాత్మ)

భావము : నేను తపియింప చేయుదును. నేను వర్ష జలమును స్వీకరించి మరల విడుతును. మృత్యువును నేను మరియు అమృతమునేనే. సత్తునేనే అసత్తునేనే.

వివరము : జగత్తులో సూర్యరశ్మి అధికము చేసి దానివలన మనుషులు ఎండ వేడిమికి తపించునట్లు చేయువాడు పరమాత్మయే. భూమి మీద కురిసిన జలములన్నియు ఆవిరైపోవునట్లుచేసి లేకుండ చేయువాడు, మరియు వర్షరూపమున నీటిని కురిపించువాడు పరమాత్మయే. సర్వప్రాణులకు మృత్యువు, అట్లే మృత్యువులేని మోక్షము రెండు పరమాత్మయే. ఇంకనూ ఆలోచించి చూచిన శరీరములోని ఆత్మ చైతన్యశక్తి అయిన సత్తు, చైతన్యములేని అసత్తయిన శరీరము రెండు పరమాత్మయే. అన్నిటికి మూలకర్త ఆయనే అయినప్పటికి తన ప్రకృతి ద్వార పనులు చేస్తు నేను చేయలేదంటున్నాడు. చేయనివాడుగనున్నాడు.

శ్లోకం 20: త్రైవిద్యామాం సోమపాః పూతపాపాయజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయన్తే ।

తే పుణ్య మాసాద్య సురేంద్రలోక మశ్నన్తి దివ్యాన్ దివిదేవభోగాన్ || (జీవాత్మ, పరమాత్మ)

శ్లోకం 21: తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యేమర్త్యలోకం విశన్తి ।

ఏవం త్రయీ ధర్మ మనుప్రపన్నా గతాగతం కామకామా లభన్తే ||

(జీవాత్మ, పరమాత్మ)

భావము : మూడు విద్యలు నేర్చినవారు, సోమపానులు, పాపములులేనివారు, యజ్ఞములందిష్టము కలవారు, స్వర్గమును పొందుటకు నన్ను ప్రార్థించుచున్నారు. వారు పుణ్యముగలవారై సురేంద్రలోకము పొంది అక్కడ దివ్యమైన దేవభోగములను పొందుచున్నారు. వారు అచట స్వర్గ సుఖములననుభవించి పుణ్యమైపోయిన వెంటనే తగ్గుస్థితికి వచ్చుచుందురు. అట్లు ఆశపరులకు మూడు విద్యల ధర్మములందుండు సుఖఫలములు అశాశ్వతమైనవిగ గలవు.

వివరము : భూమి మీద మనుషులలో కొందరు తెలివైనవారుందురు. వారిలో జ్ఞానులు పరమాత్మ విషయమును మాత్రము తెలియుదురు. జ్ఞానులుకాని తెలివైనవారు మూడుగుణములలోని మెలకువలన్ని కలిగి ఎక్కడ ఏమి మాట్లాడాలి, ఎక్కడ ఏమి చేయాలని బాగా తెలిసివుందురు. ఏ యోగులకు జ్ఞానులకులేని గుణముల తెలివుండుట వలన వారు యోగులు జ్ఞానులకంటే బాగా బ్రతుకగలరు. మూడు గుణాల విద్యలన్ని నేర్చిన దానివలన ఎలా డబ్బు సంపాదించాలన్నది వారికి బాగా తెలుసును. అందువలన వారు బాగా ధనికులుగ ఉందురు. వారు పాపపు పనులు చేయక పుణ్యమువచ్చు పనులనే తెలివిగ చేయుచుందురు. పూర్వము సోమరసమను నేటి ఖరీదైన మత్తుపానీయమును త్రాగుచుందురు. వారు బాహ్యయజ్ఞములచే దేవతా పూజ చేయించువారై, దానిద్వార స్వర్గసుఖములు కావలెనని ప్రార్థించుచుందురు. అట్టివారు వారి కోర్కెల ప్రకారమే పుణ్యఫల విశేషము వలన జనులలో ఉన్నతస్థితి కల్గిన ఐశ్వర్యవంతుల ఇల్లలో పుట్టి, స్వర్గసుఖములైన దేవతా భోగములను అనుభవించుచుందురు. వారి లోకమే వేరుగ వారు కట్టే బట్ట, తినేతిండి, ఉండే స్థలము అన్నియు భోగములతో కూడుకొన్నవిగనే ఉండును. ఆ లోకపు వారిని అనగ ఆ సెక్షన్ వారిని భూమిమీదనే చూడవచ్చును.

లోకములనగా ఎక్కడోనున్నవని, స్వర్గలోకమంటే పైన ఉన్నదని అనుకోవడము పొరపాటు. లోకములన్ని ఇక్కడ భూమిమీదనే ఉన్నవి. స్వర్గ, నరకలోకములు ఇక్కడే కలవు. ఇంద్రలోకము అందులోని రంభ, ఊర్వసులు కూడ ఇక్కడే కలరు. పుణ్యము చేసుకొన్నవాడు రంభ, ఊర్వసులేమిటి వారికంటే మిన్నగనున్నవారి పొందును కూడ పొందుచున్నాడు. దేవతలనువారు భూమిమీదనే ఉన్నారని ముఖ్యముగ తెలియవలసి ఉన్నది. పై శ్లోకములో చెప్పిన సుఖములన్ని భూమి మీదనే పుణ్యజన్మములో అనుభవించి, ఆ పుణ్యమైపోయిన వెంటనే తగ్గు స్థితికి పోవుచున్నారు. ఎంతో సుఖము అనుభవించినవారు చివరకు ఎన్నో కష్టములననుభవించవలసి వచ్చుచున్నది. ఉన్నతస్థితి నుండి తగ్గుస్థితికి రావడమునే ఊర్థ్వలోకమునుండి మర్త్యలోకమునకు వచ్చుచుందురన్నారు. ఈ విధముగ సుఖములనుభవించడము, వీటి నుండి దిగజారి క్రిందిస్థాయికి పోవడము, మూడు గుణముల విద్యలు నేర్చినవారికి సహజమే అగును. త్రయీ ధర్మముల (మూడు ధర్మముల)లో అశాశ్వత సుఖములు సహజముగ ఉండును.

జ్ఞానులకు యోగులకు మూడుగుణముల విద్యలో ఆసక్తి లేదు. వారికి స్వర్గలోకసుఖముల ప్రాప్తిలేదు. అటువంటి వారి గూర్చి భగవంతుడు చెప్పునదేమనగా!

శ్లోకం 22: అనన్యాశ్చిన్త యన్తోమాం యే జనాః పర్యుపాసతే ।

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ||

(జీవాత్మ, పరమాత్మ)

భావము : ఎవడైతే అన్యచింత లేకుండ నన్ను ఎల్లప్పుడు ఉపాసించుచున్నాడో, వాడు నిత్యము నాతో కూడుకొనివున్నాడు. అట్టివాని యోగము యొక్క క్షేమమును నేనే వహించుచున్నాను.

వివరము : మానవునికి భక్తి అంటూ ఉంటే అది ఎందరో దేవతలకు సంబంధించి ఉండడము సహజము. భూమిమీద ఎందరో దేవుళ్లుండడము అందరికి తెలిసిన విషయమే. సంపూర్ణ జ్ఞానము తెలియనంతవరకు మానవుడు దేవుళ్లను ఆరాధించడము పరిపాటైపోయింది. దేవుళ్లందరికి దేవుడైన పరమాత్మ ఒకడున్నాడని తెలియకపోవడమే ముఖ్యకారణము. ఎవనికైతే సంపూర్ణ జ్ఞానము తెలియునో వాడప్పుడు భూమిమీదున్న దేవుళ్లందరు తనవలె జీవాత్మలని, తన శరీరములోవలె ఆత్మ జీవాత్మలు వారికి ఉన్నవని తెలిసినవాడై, అందరికి అతీతుడైన ప్రపంచమునకు ఆదికర్తయైన పరమాత్మను తెలియవలెనను పట్టుదలతో ఉండును. అటువంటివాడు వాని మనస్సులో ఇతర దేవతల ఆలోచన రానీయక, ఆత్మకంటే పరమైన పరమాత్మను శ్రద్ధతో ఉపాసించును. పరమాత్మను ఉపాసించుటంటే అందరు ఆచరించునట్లు ప్రత్యేకమైన పూజా విధానమేది కాదని తెలియాలి. జీవాత్మగనున్నవాడు తన స్థితిని కోల్పోయి పరమాత్మలోనికి ఐక్యమగుటకు చేయు ప్రయత్నమని తెలియాలి. దానినే యోగమంటాము. పరమాత్మలోనికి ఐక్యమగుటకు మార్గము యోగము. యోగమవలంభించి దైవమును చేరవలెనని ప్రయత్నించు వానికి ఆరోగ్యము సరిగ లేకుండపోవచ్చును. ఆర్థిక ఇబ్బందులు రావచ్చును. శత్రువుల బాధలు కలగవచ్చును. ఇంటిలో భార్య పిల్లల యొక్క వ్యతిరేఖత కలుగవచ్చును. ఇట్లు ప్రపంచములో అనేకమైన బాధలు కలిగినప్పటికి వాటినుంచి ఎటువంటి రక్షణగాని, బాధ నివారణగాని, ఆర్థిక సహాయముగాని పరమాత్మ కలుగచేయడు. సహాయముగాని, రక్షణగాని, బాధ ఉపసంహరణగాని యోగికి కలుగ చేయనపుడు వాని క్షేమమును పరమాత్మ ఎలా వహించినట్లవుతుందని మనకు తప్పక ప్రశ్న రాగలదు. ఆ ప్రశ్నకు జవాబును వెదికి చూచినట్లయితే, పరమాత్మను ఆరాధించు యోగిక్షేమమును పరమాత్మ చూడడములేదు. వాని యొక్క అనారోగ్యము నుండి గాని, అన్ని ఇబ్బందులనుంచి గాని కాపాడుతానని ఆయన పై శ్లోకములో చెప్పనూలేదు. ఆయన చెప్పినది కేవలము తనను ఆరాధించు వాని 'యోగము' యొక్క క్షేమమును కాపాడుతానని చెప్పాడు కాని, ఆరాధించువాని యొక్క క్షేమమును కాపాడుతానని చెప్పలేదు. పై శ్లోకములో 'యోగక్షేమ' మన్నాడు గాని యోగిక్షేమమనలేదు.

భూమిమీద యోగమాచరించు ఉత్తమ యోగులకు కూడ ప్రపంచములోని మానవుల నుంచి కష్టాలు తప్పలేదనుటకు గత చరిత్రలోను, వర్తమానములోను ఎన్నో ఆధారములు కలవు. సక్రమమైన యోగికి ఎన్ని కష్టాలొచ్చిన, అనారోగ్యమైన ప్పటికి పరమాత్మ మీద దృష్ఠి మాత్రము సడలదనుటకు కూడ చరిత్రలోను, వర్తమాన కాలములోను ఆధారములు గలవు. వీటినన్నిటిని బట్టి చూచినట్లయితే తనకు కల్గు ప్రపంచ ఒడిదుడుకులన్ని కర్మరీత్య కలుగునవని, తన శ్రద్ధను ఎల్లప్పుడు పరమాత్మ మీద నిలిపిన యోగి యొక్క యోగము దెబ్బతినకుండ దాని క్షేమమును పరమాత్మయే చూడగలడని తెలియుచున్నది.

శ్లోకం 23: యేఽప్యన్య దేవతాభక్తా యజన్తే శ్రద్ధయాఽన్వితాః ।

తేఽపి మామేవ కౌంతేయ! యజ్యన్త్య విధిపూర్వకమ్ ||

(జీవాత్మ, పరమాత్మ)

భావము : ఎవడు శ్రద్ధతో అన్యదేవతారాధనలాచరించునో వాడు కూడ నన్నే దారి తప్పి ఆరాధించినవాడగుచున్నాడు.

వివరము : ముప్పది మూడు కోట్లు దేవతలని నానుడి ఉన్నట్లు, ఎందరో దేవతలుగల భూమి మీద పరమాత్మను విడచి అన్యదేవతారాధన చేయువారు చాలామంది కలరు. పరమాత్మను ఆరాధించువారు అరుదు. కాని దేవతలను కొలుచువారు కొదవలేరు. పాపాత్ములు, దుర్మార్గులు, దొంగలు, జ్ఞానులకు వ్యతిరేఖులు, పరమాత్మంటే ఏమాత్రము విశ్వాసములేనివారు, పరమమూర్ఖులు కూడ ఏదో ఒక దేవతను నిష్టగ పూజించుచుందురు. కోర్కెలు కోరుచుందురు. వారు ఏ దేవతను పూజించిన ఆ పూజ పరమాత్మకే చెందును. అంతట అన్ని దేవుళ్లలోను ఉన్న వాడైన పరమాత్మకు ఆ పూజ చేరినప్పటికి వారు పరమాత్మను చేరలేరు. వారి మనస్సులో వేరు దేవతా ధ్యాసవుండుట వలన వారు మార్గము తప్పినవారై ఉన్నారు. ఎక్కడ ఏ దేవునికి చేసిన పూజనైన స్వీకరించువాడు అంతట వ్యాపించిన పరమాత్మే, అయినప్పటికి పూజచేయువారు పరమాత్మను చేరలేరు. దేవతలను పూజించువారు చివరకు దేవతలవద్దకు చేరవలసిందే.

శ్లోకం 24: అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ ।

నతుమా మభిజానన్తి తత్త్వేనాఽతశ్చ్యవన్తితే ||

(పరమాత్మ)

భావము : నేను సర్వ యజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును. నేను ఆత్మగ ఉన్నానని తెలియనివారు దారి తప్పి పడినవారగుదురు.

వివరము : ఈ శ్లోకములో తత్త్వేనా అను పదముకు ఆత్మగా అను అర్థమును వదలి యదార్థముగ అని చాలా గీతలలో వ్రాయుట వలన నిజార్థము మరుగునపడి చెప్పవలసిన పూర్తి భావము బయటపడకపోయినది. నిజభావము చెడిపోకపోయిన, పూర్తి వివరము బయటపడకపోయినది. కనుక తత్త్వము అనగ "ఆత్మ" అని అర్థము చేసుకోవడము వలన పూర్తి భావము బయటపడగలదు. మనుషులు చేయు బాహ్య పూజలకు సంబంధించిన యజ్ఞముల గురించి ఇక్కడ చెప్పలేదు. పరమాత్మ తను చెప్పవలసిన రెండు యజ్ఞములు ఇదివరకే చెప్పియున్నాడు. జ్ఞాన, ద్రవ్య యజ్ఞములనునవి శరీరములో జరుగుచున్నవని కూడ తెల్పాడు. అక్కడే శరీరములో జరుగు యజ్ఞములకు భోక్తను కూడ నేనే అన్నాడు. ఇక్కడ యజ్ఞములకు పెద్ద లేక అధిపతి అయిన ప్రభువును కూడ నేనే అంటున్నాడు. ఆయన ఎట్లు భోక్త, ఎట్లు ప్రభువుగ ఉన్నాడని యోచించిన, శరీరములో ఆత్మ సర్వత్ర వ్యాపించి ఉన్నది. ఆత్మశక్తి చేతనే తలలో జ్ఞానయజ్ఞము గాని, కడుపులో ద్రవ్యయజ్ఞము గాని జరుగుచున్నవి. ఆత్మ చైతన్యములేనిది రెండు యజ్ఞములు జరుగుటకు వీలులేదు. పరమాత్మయే ఆత్మగనున్నది. పరమాత్మ ఆత్మరూపముగ యజ్ఞములకు అధిపతిగ ఉన్నాడు. నన్ను ఆత్మగ తెలియకపోతే అనుచు 'అభిజానన్తి తత్త్వేన' అన్నాడు. పరమాత్మను ఆత్మగ తెలియకపోతే మోక్షమార్గము నుండి తప్పిపోయిన వాడేయగును.

ఇంతవరకు పరమాత్మ, ఆత్మ, జీవాత్మల విభజన ఏ గీతలో కూడ వ్రాయబడలేదు. అందువలన చాలా భాగము గీత ఎవరికి ఇంతవరకు అర్థము కాలేదని చెప్పవచ్చును. ఆత్మల వివరము తెలిసినపుడు చాలా శ్లోకములకు అర్థము బయటపడును. ఆత్మల వివరము కూడిన ఈ గ్రంథము గీతకు క్రొత్త జన్మనిచ్చినదని చెప్పవచ్చును. అసూయపడక అర్థము చేసుకోమంటున్నాము. అంతేకాక అనేకుల భావమునకు విభేదము కల్గించు భావమున్న క్రింద శ్లోకము చూడుము.

శ్లోకం 25: యాన్తి దేవవ్రతాన్ దేవాన్, పితౄన్ యాన్తి పితృవ్రతాః ।

భూతాని యాన్తి భూతేజ్యాః యాన్తి మద్యాజినోఽపి మామ్ ||

(పరమాత్మ)

భావము : దేవతా పూజచేయువారు దేవతలందే చేరుదురు. పితృదేవతలను పూజించువారు వారియందే చేరుదురు. భూతముల పూజించువారు భూతములందే చేరుదురు, నన్ను పూజించువారు నాయందే చేరుదురు.

వివరము : అన్ని రకముల పూజలను చేయువారందరు కలిపి నాల్గు రకములుగ విభజించి చెప్పబడినారు. 1) దేవతాపూజ చేయువారు 2) పితృదేవతలను పూజించువారు. 3) జీవరాసులను పూజించువారు 4) పరమాత్మను ఆరాధించువారు. ఇందులో దేవతా పూజచేయువారిని అందరము చూచేవుంటాము. ఉదాహరణకు ఒక ఊరిలో ఒక వేంకటేశ్వరస్వామి గుడి ఉన్నదనుకొందాము. ఒకడు ఆ గుడికి నిత్యముపోయి ఆ వేంకటేశ్వరస్వామిని శ్రద్ధతో పూజిస్తున్నాడనుకొందాము. అలా శ్రద్ధగా పూజచేయుచు, అన్ని దేవతలకంటే ఆ దేవున్నే గొప్పగ భక్తితో ఆరాధిస్తు కొంతకాలము జరిగినది. వానికి మరణమాసన్నమై చనిపోయాడు. తర్వాత జన్మ మనుషులలో పుట్టడము జరుగలేదు. అట్లని వాడు మోక్షము పొందలేదు. ఒక గుడిలోని దేవతా ప్రతిమలో జీవునిగ జన్మ కల్గినది. ఈ మాట విచిత్రముగనున్నది కదా! అయినా వాస్తవమే. ప్రతి గుడిలోని ప్రతిమలో ఒక జీవుడుండును, ఆ ప్రతిమలో దేవుడు అతడేయగును. గుడిలో అనేక భక్తులచేత పూజలు స్వీకరిస్తు వారు పూజించు దేవుడు తానేననుకొన్న ఆ జీవుడు, కొంత కాలానికి వృద్ధాప్యము పొంది మరణావస్థను కూడ పొందవలసి వస్తుంది. సాధారణ మనిషిలో జరుగు శరీర దశలు ప్రతిమ శరీరములోనుండు వానికి కూడ జరుగును. అలా మరణించిన వాడు ఎక్కడికి పోయేది మనకనవసరము. ఇక్కడ మనకు అవసరమైన విషయము ఖాళీగా జీవుడులేని ప్రతిమలోనికి ఒక క్రొత్త జీవుడు వచ్చి చేరుచున్నాడు. అలా చేరినప్పటి నుంచి మనిషి ఆయుస్సువలె దాదాపు వంద సంవత్సరములవరకైన ఆ ప్రతిమలోనే ఆ జీవుడుండవచ్చును. మనము చిన్న తనమునుండి పిలువబడు పేరునే మనదని, కుటుంబీకులనుకొను మతమే తన మతమని, తన కులమని తలచి, నేను పలానవాడిని, నా మతము ఫలానా అని చెప్పుకున్నట్లు, గుడిలోని ప్రతిమలో జన్మకల్గినవాడు అక్కడి భక్తులు ఉచ్ఛరించు పేరే తనదని, తాను ఫలానా దేవుడనని భ్రమించి అనుకొనును. పుట్టక పూర్వము ఏ మతములేని జీవుడు పుట్టిన కుటుంబమునుబట్టి నాది ఫలానా మతమనుకొని భ్రమించినట్లు, ప్రతిమలోని జీవుడు కూడ నేను ఫలానా దేవుడని భ్రమించును. అలా ఒక ప్రతిమలోని ఒక జీవుడు ఆ దేవునిగ చలామణి అగుచు తన ముడుపు ఒక పైసా కూడ ప్రక్కకు పోకుండ చూచుకొనుచు, ఎవడైన ఆ డబ్బును తీసుకొన్న వానికేదో ఒకటి చేసి బాధ పెట్టుచున్నాడనుకొందాము. ఆ దేవుని విషయములో ప్రజలు భయపడి సత్యమున్న దేవుడని పైసా అపహరించిన ముప్పు తప్పదని భయపడెడివారు. అంతేకాక ఆ దేవాలయ ప్రాంగణములో ఏ తప్పు చేసిన ఆ దేవుడు వారికి బాధపెట్టెడివాడు. అందువలన అక్కడ ఎవరు ఏ తప్పు చేయకుండిరి. కొంత కాలమునకు ఆ జీవుడు ఆ ప్రతిమను వదలి మరణించి పోయాడు. ఆ స్థానములో మరొక జీవుడు వచ్చి దేవునిగ చలామణి అగుచున్నాడు. ఈ జీవుని మనస్తత్త్వము ముందున్న జీవునికంటే వేరుగనున్నది. ఎవరేమి చేసినా పట్టించుకొనేవాడు కాదు. అందువలన అక్కడికి వచ్చు భక్తులకు ఆ దేవుడంటే భయము తగ్గిపోయింది. ఈ విధముగ ఒకే ప్రతిమలో కొంత కాలముండు ఒక దేవునికి (జీవునికి) తరువాత వచ్చిచేరి కొంతకాలముండు వేరొక దేవునికి (జీవునికి) చాలా తేడాలుండవచ్చును. మా అనుభవములో ఇప్పటికి దాదాపు 50 సం॥ క్రితము ముడుపు చెల్లించుకొనేదానికి ఒక భక్తుడు ఒక భక్తబృందముతో కలిసి వడ్డికాసులవాడని పేరు పొందిన దేవుడుగల గుడికి పోయాడు. అక్కడ ముడుపులు చెల్లించు సమయములో పూర్తి డబ్బులు హుండీలో వేయక మూడుబొట్లు (10 పైసలు) తనవద్దనే దాచి పెట్టుకొన్నాడు. ఆ భక్తునిది చిన్న వయస్సు అయిన దానివలన తెలిసో తెలియకో చిన్న పొరపాటు చేసాడనుకొందాము. 14 సం॥ల బాలుడు తను ధరించిన అంగీ మెడకాలరులో ఆ మూడు బొట్లును చొప్పించి దాచి పెట్టుకొన్నాడు. గుడినుండి బయటకొచ్చిన తరువాత భోజనానికి ఒక జాగాలో వెంటవచ్చిన వారందరు సద్దివిప్పి కూర్చున్నారు. ఆ కాలములో హోటళ్లు చాలా తక్కువ. చాలామంది సద్దిమూట (తినుపదార్థములు) కట్టుక పోయేవారు. తినేదానికి కూర్చున్న ఆ బాలునికి కాళ్లు, చేతులు స్వాధీనములో లేకుండ పోవడము. శరీరమంతా వణుకు ప్రారంభముకావడము, నోటివెంట నా మూడుబొట్లు నాకిమ్మని అనడము జరిగినది. కాళ్లు చేతులు వణుకుచు నా మూడు బొట్లు నాకిమ్మని మాటి మాటికి అనడము అక్కడున్న వారికి ఒక్కమారుగ ఏమి అర్థము కాలేదు. చివరికి ఆ బృందములోని వారికి ఆలోచన వచ్చి శరీరమంత వెతకగ మూడుబొట్లు షర్టుకాలరులో దొరికాయి. వారు వెంటనే స్వామీ! నీ మూడు బొట్లకు మరీ మూడు బొట్లు వడ్డీగ ఇస్తున్నాము. మమ్ములను క్షమించమని కోరగ ఆ బాలునికి తిరిగి స్పృహ వచ్చినది. వెంటనే ఆరుబొట్లు హుండీలో వేయడము జరిగినది. బాలుడేమో స్పృహలోనికి వచ్చాడు కాని, ఆ దేవుడు శరీరము మీదికి వచ్చి మూడుబొట్లు కావాలని మాట్లాడు సమయములో వచ్చిన వణుకు జీవితాంతము శరీరములో అలాగే నిలిచిపోయినది.

ఆ ప్రతిమలో ఉన్న జీవుడు మనుషులకంటే డబ్బుమీద ఎక్కువ ఆశకల్గి ఒక బాలుని జీవితాన్నే నాశనము చేయడము జరిగింది. కొంత కాలానికి ఆ దేవుడు చచ్చిపోయి మరొక జీవుడు ఆ ప్రతిమలో చేరుకొని ఆ దేవునిగ చలామణి అగుచున్నాడు. ఈయన ఆయనవలె కాక తన సొమ్మును ఎవరెంత తిన్నా, మోసముగ తీసుకొన్న ఏమి పట్టించుకోవడములేదు. ఈ విధముగ ఒకే ప్రతిమలో నివాసమున్న ఇద్దరి దేవుల్లలో వారి వారి మనస్తత్వమును బట్టి ఒకరికొకరికి భేదముండును. మొత్తము మీద దేవతా పూజ చేయువారు ప్రతిమలలో జీవులుగ పుట్టి దేవుళ్లుగ చలామణి అగుదురు.

సంవత్సరమునకు ఒకమారు పెద్దల పండుగ అని ఆ దినము వారింటిలో చనిపోయినవారిని పూజించడము, వారికి గుడ్డలు సమర్పించడము జరుగుచుండును. ఆ విధముగ చాలామంది చేయుచుందురు. కొందరు చనిపోయిన పెద్దలపూజ తప్ప మిగతా దేవతలను కూడ పూజించరు. పరమాత్మంటే ఏమిటో పేరుకూడ వారు వినివుండరు. ఏ దేవుని ధ్యాస కూడ లేని అట్టివారు తప్పనిసరి విధిగ పితృదేవతలను ఆరాధించుచుందురు. ఆ విధముగ పితృదేవతలనే గొప్పగ పూజించెడివారు, చనిపోయిన తరువాత జన్మలకు పోక, పితృదేవతలుగనే మారిపోయి తమ కుటుంబీకులు ఆరాధిస్తే, గుడ్డలు అర్పిస్తే స్వీకరించుచుందురు. అలా పూజించక పోయిన గుడ్డలు పెట్టకపోయిన ఇతరుల శరీరములోనికి వచ్చి మాకు గుడ్డలు పెట్టలేదు, సంవత్సరమునకొక మారైన కొబ్బరికాయ కూడ కొట్టలేదని దండించువారు కూడ కలరు. దేవతా ప్రతిమల జన్మలకంటే ఈ జన్మలు నికృష్ఠమైనవని చెప్పవచ్చును. వారికి చాలా మంది భక్తులుంటే వీరికి వారి కుటుంబమువారు మాత్రమే భక్తులు అదియు సంవత్సరమునకొకమారు.

భూతములను పూజించువారు భూతములలోనికే పోవుదురని కూడ చెప్పారు. భూతములనగ జీవరాసులని అర్థము. మానవులు ఎన్నో భూతములను పూజించుట వాస్తవమే, కాటమయ్య అని కుక్కను, పోతురాజని దున్నపోతును, నాగరాజని పామును, నందీశ్వరుడని ఎద్దును, కామధేనువని ఆవును, జిల్లెడు చెట్టును, జమ్మిచెట్టును, వేపచెట్టును, గరుత్మంతుడను గ్రద్దను ఇట్లు ఒక్కో ప్రాంతములో ఒక్కోరకముగ అనేక జీవరాసులను దేవతలుగ భావించి పూజించెడివారు గలరు. అలా పూజించడము వలన చివరకు ఆ జంతువులుగనో, పక్షులుగనో, చెట్లగనో పుట్టవలసి వస్తుంది. అందువలన భూతములను పూజించువారు భూతములనే పొందుదురన్నారు.

దేవతలను, పితృదేవతలను, జీవులను పూజించక పరమాత్మ విషయ జ్ఞానము తెలిసి, మనస్సులో అన్యచింతలేకుండ యోగపద్ధతి అనుసరించుట వలన పరమాత్మనే చేరవచ్చును. వానికి జన్మలుండవు.

శ్లోకం 26: పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యాప్రయచ్ఛతి ।

తదహం భక్త్యు పహృత మశ్నామి ప్రయతాత్మనః ||

(పరమాత్మ)

భావము : ఆకు అయిన, పుష్పమైన, పండైన, నీరైన ఎవడు భక్తితో సమర్పించునో, పరిశుద్ధమైన ఆత్మకు భక్తి పూర్వకముగ సమర్పించిన దానిని నేను స్వీకరింతును.

వివరము : ఒక ఇంటిలో ఆరు మంది వ్యక్తులున్నారు. వారి పేర్లు వరుసగ 1) లింగడు 2) రంగడు 3) భీముడు 4) సోముడు 5) రాముడు 6) వెంకట్రాముడు. వీరిని గుర్తించి పిలుచుటకు ఆరు పేర్లు పెట్టబడినవి. రామున్ని పిలిస్తే రాముడే వస్తాడు. రంగన్ని పిలిస్తే రంగడే వస్తాడు. అట్లుకాక రాముడిని పిలిస్తే లింగడు రావడము, లింగన్ని పిలిస్తే సోముడు రావడము జరుగదు. అట్లు వస్తే వారికి పిచ్చి పట్టిందంటాము. వీరి మాదిరే శరీరమను ఇంటిలో 1) మనస్సు 2) బుద్ధి 3) చిత్తము 4) అహము 5) భూతము (జీవుడు) 6) తత్త్వము (ఆత్మ) అను పేర్లు కల్గినవారున్నారు. ఎవరిపేరు పిలిస్తే వారు పలికిన పరవాలేదు. అట్లుకాక ఒకరిపేరు పిలిస్తే మరొకరు పలికిన వారిని తెలివి తక్కువవారనవచ్చును. ఇక్కడ పలికేవారు కరెక్టుగ పలికిన, పిలిచేవారు ఒకరి పేరుపెట్టి ఇంకొకరిని పిలిచారనుకొందాము. అప్పుడు పిలిచేవారే బుద్ధిహీనులని చెప్పవచ్చును. ఇదంతా ఎందుకు చెప్పుచున్నా మనగా! ఈ శ్లోకములో అలాగే వ్రాయబడివుంది. 'ప్రయతాత్మనః' అను మాటకు ఒకరేమో పరిశుద్ధమైన బుద్ధి అన్నారు. మరొకరేమో పరిశుద్ధమైన మనస్సు అన్నారు. శరీరమనే ఇంటిలో తత్త్వము అనువాడు వేరు, బుద్ధి అనువాడు వేరు, మనస్సు అనువాడు వేరు, వేరు వేరుగనున్న వారిని శ్లోకములో తత్త్వము అని చెప్పినప్పుడు దానిని బుద్ధియని ఒకరు చెప్పడము, మనస్సని మరొకరు చెప్పడము చూస్తే ఏమనిపిస్తుంది? వారికి పిచ్చియనిపిస్తుంది కదా! 'ప్రయతాత్మనః' అన్నపుడు పరిశుద్ధమైన ఆత్మ అని అర్థము. ఆత్మను వదలి ప్రక్కవారిని చెప్పుకోవడము పొరపాటు. ఇటువంటి మాటలను చూచి హేతువాదులు ఆధ్యాత్మికము, ఆత్మ అన్ని బూటకము అంటున్నారు.

పత్రమ్, పుష్పమ్, ఫలమ్, తోయమ్ అనువాటిలో దేవునికి ఏ ఒక్కదానితోను అవసరము లేదు. అయినప్పటికి వీటి పేర్లు చెప్పడములో కొంత విశేషముందను కుంటాము. తోయము అనగా నీరు, పత్రము అనగా చెట్టుకున్న ఆకు, అలాగే పుష్పము, ఫలము నాలుగు చెట్టుకున్నవే. సాధారణముగ ఆకు చెట్టు మీద ఒక సంవత్సరము వరకు ఉండి రాలిపోవును. ఫలము కొన్ని దినముల వరకుండును. పుష్పము ఒక్క దినము మాత్రముండును. ఈ మూడిటిలో ఉన్న నీరు మాత్రము శాశ్వితముగ ఉండును. ఈ విధముగ ఒక్క దినము మాత్రముండు పుష్పమునుగాని, ఒక వారము దినములుండు ఫలమునుగాని, ఒక సంవత్సర కాలముండు ఆకునుగాని, శాశ్వితముగ ఉండు నీరునుగాని చెప్పడములో అశాశ్వితమైనవి మూడు, శాశ్వితమైనది ఒకటిగా అర్థమైనది. అశాశ్వితమైన వాటిలో కూడ ఒక దినము, ఒక వారము, ఒక సంవత్సరకాలము వరకుండు వాటిని చెప్పాడు. ఈ మూడు చర ప్రకృతికి సంబంధించినవి. శాశ్వితమైన నీరు మాత్రము అచర ప్రకృతికి సంబంధించినది. ఈ విధముగనే మన శరీరములో కొంత తేడాలతో మార్పు చెందు మూడు గుణ భాగములు, ఏ తేడా లేకుండ మార్పు చెందని ఆత్మ భాగము గలదు. మూడు గుణములలోని తామసుడు, రాజసుడు, సాత్త్వికుడు అను జీవుడు ఎప్పటికైన నాశనముకాగల అశాశ్వితమైనవాడని, ఆత్మ భాగములోనున్న వాడు నాశనము కానివాడని తెలియుచున్నది. శాశ్వితముకాని గుణములను, శాశ్వితమైన యోగమును వదలినవాడు నావద్దకు చేరునని చెప్పడమే ఈ శ్లోకములోని అర్థము.

లోతుగ యోచించక పోతే ఈ శ్లోకము వేరు విధముగ అర్థమై ఆకు, పూవు, కాయ, నీరు అనియే తెలియును. ఈ నాల్గింటిలోని నిగూఢార్థము తెలియదు. 1) ఇక్కడ నాలుగింటిని మాత్రమే ఎందుకు చెప్పాడు? ఐదుకాని, మూడుకాని ఎందుకు చెప్పలేదు? 2) అన్ని చెట్టుకున్నవే ఎందుకు చెప్పవలెను? 3) నాల్గవదైన నీరు కల్గిన ఆకు, పూవు, పండునునే ఎందుకు చెప్పాడు? 4) మనకున్న ధనమో, ధాన్యమో, వస్తువో, వాహనమో ఇవ్వమని అడగక ప్రత్యేకించి ఆకు, కాయ, పూవు, నీరు అని అడగడమేమిటి? 5) ఏ చెట్టు లేనిచోట మనిషి ఉంటే అక్కడ ఇవి ఏవి లభించవు కదా! అప్పుడు వీటికంటే చౌకగ దొరుకు, ఎక్కడైన లభించు మన్నునైన ఇవ్వవచ్చని ఎందుకనలేదు? ఈ విధముగ ఎన్నో ప్రశ్నలు వేసుకుంటే దేవుని ఉద్ధేశ్యము మనకు తెలియగలదు. ఇక్కడున్న ఐదు ప్రశ్నలకు జవాబుల రూపములో చెప్పుకుంటే ఈ విధముగ కలవు.

1) నాల్గింటిని మాత్రమే ఎందుకు చెప్పాడు? ఐదుకాని, మూడుకాని ఎందుకు చెప్పలేదు?

జవాబు : మ్రొక్కే వానిలో సమర్పించుకోవలసినవి నాలుగు మాత్రమే ఉన్నాయి. పరమాత్మలోనికి ఐక్యమవడానికి, మోక్షమను ఐదవస్థానమును పొందడానికి, మనిషి వదలవలసినవి నాలుగు స్థానములే, కనుక నాల్గింటిని మాత్రమే చెప్పవలసివచ్చినది.

2) అన్ని చెట్టుకున్నవే ఎందుకు చెప్పవలెను?

జవాబు : దేవునికి అర్పించవలసినవి ఆరాధించే మనిషిలోనే ఉన్నాయి. మనిషిలో ఉన్నట్లు సమాన పోలిక కలది భూమి మీద చెట్టు మాత్రమే ఉన్నది. శాశ్విత అశాశ్వితములైనవి మనిషిలో ఉన్నట్లు అశాశ్వితమైన ఆకులు, పూవులు, కాయలే కాక శాశ్వితమైన నీరు కూడ చెట్టులో కలదు. అందువలన చెట్టుకున్న వాటినే శ్లోకములో చెప్పారు.

3) నాల్గవదైన నీరు కల్గిన ఆకు, పూలు, పండునే ఎందుకు చెప్పారు?

జవాబు : మనిషిలో మూడు గుణ భాగములు కలవు. అట్లే గుణాతీతమైన గుణములు లేని ఒక భాగము కలదు. మూడు గుణ భాగములలోను ఒక శక్తి వ్యాపించి ఉన్నది. కనిపించక వ్యాపించిన శక్తి శరీరములో అన్నిటికి ఆధారమై కదలించు చైతన్యమై ఉన్నది. ఆత్మశక్తి మూడు గుణ భాగములకు మధ్యనున్న నాల్గవ స్థానములో ఉన్నది. నాల్గవ స్థానములోనున్న ఆత్మశక్తి మూడు స్థానములకు కూడ ఆధారమైన్నది. ఏ విధముగ ఆకులోను, పూవులోను, పండులోను తేమ వ్యాపించియున్నదో ఆ విధముగనే మనిషి యొక్క తామస, రాజస, సాత్త్వికమను భాగములలో ఆత్మ వ్యాపించియున్నది. చెట్టంతయు నీరు వ్యాపించి ఉన్నట్లు శరీరమంతయు ఆత్మ వ్యాపించియున్నది. ఆకు, పూవు, కాయలలో ఏ విధముగ నాల్గవదైన నీరు వ్యాపించియున్నదో, అదే విధముగ నీరువలె ఆత్మ వ్యాపించియున్నది. కావున చెట్టుకున్న ఆకు, పూలు, కాయలనే చెప్పారు.

4) మనకున్న ధనమో, ధాన్యమో, వస్తు వాహనమునో అడగక ప్రత్యేకించి ఆకు, పూవు, కాయ, నీరు అని అడగడమేమిటి?

జవాబు : దేవుడు అడిగితే ఎంత విలువకల్గిన వాటినైన ఇచ్చుటకు సిద్ధముగనున్న మనుషులు భూమి మీదుండగా, అడగకనే కోట్ల డబ్బును, విలువైన వజ్రాలను హుండీలలో వేయు భక్తులుండగా, అడిగేదేదో పెద్దవి అడిగి ఉండవచ్చును కదా! లేకపోతే అడగకుండ అయిన ఉండాలి. అడిగి మరీ అంత చౌకైన వాటిని కోరడము చూస్తే, దేవుడు చాలా తెలివి తక్కువవానిగ కన్పిస్తున్నాడు కదా! ప్రపంచములోని గొప్ప తెలివున్న వారిలోని తెలివిని కూడ నేనే, అన్నవాడు తెలివితక్కువ వాడెట్లగును? ఆయన చెప్పిన దానిని అర్థము చేసుకోలేని మనుషులే తెలివితక్కువ వారు. దేవుడు తాను గీచిన దేహమనబడు గీతలోపలి విషయమునే సూత్రము ప్రకారము కోరుచున్నాడు కాని, శరీరము యొక్క హద్దుకు బయటనున్న వస్తువులను కోరలేదు. ఆకులు, కాయలు, పూలు, నీరు శరీరమునకు బయటివే కదా! అని కొందరికి ప్రశ్న రావచ్చును. దానికి జవాబు, చెట్టు కూడ ఒక శరీరమేనని, అందులో కూడ జీవుడున్నాడని మరచిపోకూడదు. జీవుడు దేవుని వద్దకు చేరవలెనంటే, జీవాత్మ నాలుగు స్థాయిలను దాటి పోవలసిందే, ఆ నాలుగు స్థాయిలను సమానముగ తెలుపునవి చెట్టులోని నాల్గు భాగములే, ఆధ్యాత్మిక ప్రమాణమునకు సరిపడునవి చెట్టులోని ఆకులు, పూవులు, కాయలు, నీరు కనుక వాటినే పేరుపెట్టి చెప్పవలసివచ్చినది. దేవునికి వస్తు వాహనములతో గాని, ధన కనకములతో గాని పనిలేదు. అందువలన దేవునికి అవసరములేని డబ్బును, వజ్రాలను, బంగారును సమర్పించే దానికంటే గుణాలున్న మరియు గుణములులేని వాటిని ఆయనకు ఇవ్వడము మంచిది. ఆ విధానమును తెల్పుటకే ప్రత్యేకించి "యాన్తి దేవ వ్రతాన్ దేవాన్" అను శ్లోకము తర్వాత ఈ విషయమును చెప్పాడు. దీనికంటే ముందు శ్లోకములో దేవతలను పూజించువాడు, దేవతలనే చెందుతాడు నన్ను చెందడన్నపుడు, దేవతల యొక్క పూజలనే దేవుడు వద్దని చెప్పినట్లు కదా! అటువంటపుడు గుడికి పోయి పూజలో ఆకులు, కాయలు, పూలు, నీళ్లు పెట్టమని చెప్పునా! మీరే ఆలోచించండి. దేవతారూపములే ఆరాధనలో లేనపుడు పూలు, కాయలు ఎక్కడ పెట్టాలని యోచించారా? యోచిస్తే కాయలు, పూవులు, ఆకులు వెనుక పెద్ద రహస్యమే అర్థము కాగలదు.

5) ఏ చెట్టు లేనిచోట మనిషి ఉంటే అక్కడ ఇవి ఏవి లభించవు కదా! అప్పుడు వీటికంటే చౌకగా దొరుకు, ఎక్కడైన లభించు మట్టినైన ఇవ్వవచ్చునని ఎందుకనలేదు?

జవాబు : కొన్ని భగవద్గీతలలో కొందరు రచయితలు ఇది బీద భక్తులను గురించి చెప్పిన శ్లోకమని వ్రాశారు. మరియు "ధనికులు సమర్పించే నైవేద్యములు, ధనము, బంగారు మా వద్దలేదే అని చింతించ తగదు. దేవునికి భక్తితో పత్రము, పుష్పము, ఫలము, తోయము అను వాటిని ఇచ్చిన సరిపోవును. ఇవి విలువ లేనివే అని ఏమి అనుకోక దేవుడు వాటిని కూడ ప్రేమతో తీసుకొనును" అని వ్రాశారు. ఈ విషయమును చదివిన ఒక పిల్లవాడు ఈ విధముగ మాట్లాడుచు "ధనికులైన భక్తులు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు కొన్ని కోట్ల డబ్బును, ఎంతో విలువ చేసే బంగారును, ఖరీదైన వజ్రాలను హుండీలో వేసి వస్తున్నారు కదా! ఏమిలేని బీద భక్తులు తిరుపతికి పోతే వారిని కూడ వదలకుండ పూలో, కాయలో, ఆకులో ఇవ్వమని అడగడము చూస్తే దేవుడు చాలా ఆశపోతని, బీదవారి దగ్గరనుండి కూడ ఏదో ఒకటి తీసుకోవాలను ఆశకల్గినవాడని మాకు అర్థమవుతుంది. బజారులో పూలు అమ్మేవాల్లే పూల ప్రక్కనే ఆకులు అమ్ముతున్నారు. కాయలమ్మే చోటే వాటర్ బాటిల్లు (నీళ్ల సీసాలు) అమ్ముతున్నారు. నీళ్లుకాని, పండ్లుకాని, పూలుకాని, ఆకులుకాని అన్ని కొనవలసిందే, డబ్బులు లేని భక్తునికి వాటిని కొనాలన్నా ఇబ్బందే కదా! ఇదంతా చూస్తూవుంటే వచ్చేటపుడు ఉత్తచేతుల రావద్దు ఏదో ఒకటి తీసుకొనిరా అని పుట్టింటినుంచి వచ్చే కోడలుకు అత్తగారు చెప్పినట్లువుంది. ఏదో ఒకటి లాభము రావాలని చివరకు పూలు, కాయలు, ఆకులు, నీళ్లు అడుగుచున్న దేవుడు చాలా ఆశగలవాడే" అని అమాయకముగ అడిగాడు. ప్రక్కనేవున్న మరొక పిల్లవాడు ఏదో ఒకటి దేవుడు మనకివ్వాలి కాని, దేవుడే ఏదో ఒకటి ఇమ్మని మనలను అడగడమేమిటని ప్రశ్నించాడు. ఇలాంటి ప్రశ్నలు ఇతరులకు కూడ వచ్చి వారి మనస్సులో దేవునికున్న విలువ పోయే అవకాశము గలదు. అందువలన ఇతర భగవద్గీతలలో చెప్పినట్లు ఈ శ్లోకము బీద భక్తులకు చెప్పినదికాదని, ఈ శ్లోకములోని విషయమును మనుషులందరికి చెప్పినదని గ్రహించుకోవలెను.

పై ఐదవ ప్రశ్నకు జవాబును చూస్తే దేవుని దృష్ఠిలో ఖరీదైనవని, చౌకగ లభించునవని భావములేదు. ఏ చెట్టులేని చోట మన్ను లభించుననుట వాస్తవమే అయినప్పటికి, ఆయన బయట కనిపించే చెట్లను గురించి, వాటికి లభించే ఆకులు, పూలు, కాయలను గురించి చెప్పలేదు. అందరి శరీరములోనున్న చెట్టును గురించి చెప్పాడు. కొంత జ్ఞానము తెలిసినవాడు శరీరమునే వృక్షముగ తలచి, అందులోని ఆత్మశక్తినే నీరుగ, పూవులను, కాయలను, ఆకులను మనలోపలనున్న గుణస్థానములుగ తలచి, దేవుడు వాటిని వదలుకొమ్మన్నాడని గ్రహించవలసియున్నది. లోదృష్ఠి లేకుండ బయట దృష్ఠితో చూస్తే అంతా అపార్థమే అగును. చివరకు దేవుడు కూడ మనుషులవలె ఆశగలవానిగ అర్థమగును. అట్లుకాక దేవుడు చెప్పినది ఆత్మజ్ఞానమని, ఆధ్యాత్మికముతో తనవద్దకు చేరు సూత్రములను తెలియచేశాడని, జ్ఞానముతో చూచినపుడే దేవుని శ్లోకము పూర్తి అర్థము కాగలదు. దేవుని వలననే అన్ని మనకు లభ్యమగుచున్నపుడు, అన్నిటిని దేవుడే సృష్ఠించుచున్నపుడు, దేవునికి వాటితో పనేమి ఉంటుందని యోచించండి. ఈ శ్లోకము ప్రకారము నడుచుకోవాలంటే ఏ విధముగ ఉండాలో ఆ విధానమును కూడ క్రింద శ్లోకములోనే చెప్పాడు. ఈ శ్లోకముకంటే ముందు చెప్పిన శ్లోకములో ఏమి చెప్పాడో, ఈ శ్లోకము తర్వాత ఏ విధముగ చెప్పాడో, పరిశీలిస్తే మధ్యనున్న ఈ శ్లోకము యొక్క అసలైన పూర్తి భావము అవగాహన కాగలదు. అందువలన అన్ని భగవద్గీతలలో ఈ శ్లోకమును చదివినట్లు ఇక్కడ లేదని తెలుపుచున్నాము. అందరిది కాదని నీవు చెప్పే అర్థము ఏ నిఘంటువులో ఉందని మాత్రము అడుగవద్దండి.

శ్లోకం 27: యత్క రోషి యదశ్నాసి య జ్జు హోషి దదాసియత్ ।

యత్త పస్యసి కౌంతేయ! తత్కురుష్వ మదర్పణమ్ ||

(పరమాత్మ, కర్మయోగము)

భావము : దేనిని చేయుచున్నావో, దేనిని తినుచున్నావో, దేనిని కాల్చుచున్నావో, దేనిని ఇచ్చుచున్నావో, దేనిని తపము చేయుచుంటివో అన్నియు నాకే సమర్పించుము.

వివరము : చేయుచున్నవాడు పరమాత్మకు సమర్పించిన సమర్పించుకున్నా పరమాత్మకే చేరును. సమర్పించుకున్న ఎడల చేసిన దానిలోని కర్మ అంటదు. సమర్పించక పోయినట్లయితే చేయుచున్న కర్మ అంటును. ఎటూ పరమాత్మకే చేరును. కనుక ఆయనకే అన్ని సమర్పించుట తెలివైనవాని పనియగును. అట్లుకాక మిగతా దేవతలకనో, లేక మనుషులకనో, దైవసమర్పణ చేసినవాడు తెలివి తక్కువవాడగును.

శ్లోకం 28: శుభాశుభ ఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః ।

సన్న్యాస యోగ యుక్తాత్మా విముక్తో మాపైష్యసి ||

(పరమాత్మ, కర్మయోగము)

భావము : ఈ ప్రకారముగ శుభాశుభ ఫలములగు కర్మ బంధములనుండి బయటపడినవాడు, సన్న్యాసయోగ యుక్తాత్ముడైన వాడు విముక్తిగల్గి నన్నే పొందును.

శ్లోకం 29: సమోహం సర్వ భూతేషు నమేద్వేష్యోఽస్తి న ప్రియః ।

యే భజన్తి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ ||

(పరమాత్మ)

భావము : సముడనగుదు నేను సర్వ జీవరాసులకు. నాకు ద్వేషిలేడు మరియు ప్రియుడులేడు. భక్తితో ఎవరు కొలుతురో వారియందు నేను, నాయందు వారు కలరు.

వివరము : సర్వ జీవరాసులకు పరమాత్మ సమానముగ ఉన్నాడు. ఆయనకు ఒకడు మిత్రుడని మరియొకడు శత్రువను భావము ఏమిలేదు. ఆయనకు మనము సమానమే అయినప్పటికి మనకు ఆయన సమానముకాదని చెప్పవచ్చును. పరమాత్మ అందరిని ఒకే దృష్ఠితో చూచుచున్నప్పటికి, మనము ఆయనను ఒకేదృష్ఠితో చూడలేదు. ఒక్కొక్కడు ఒక్కొక్కరకముగ ఆయనను చూస్తున్నారు. అందువలన ఆయనకు అందరు సమానమే అయిన అందరికి ఆయన సమానముకాలేదని చెప్పవచ్చును. ఎవరెవరి భావమును బట్టి వానికి పరమాత్మ అంతంతే ఉండును. దగ్గరగ భావించుకొన్న వానికి దగ్గరగ ఉండును. దూరముగ భావించుకొన్నవానికి దూరముగ ఉండును. అలాగే నీవు ఏ దృష్ఠితో చూచిన ఆ దృష్ఠికి తగినట్లే తెలియును. పరమాత్మయందే ధ్యాసకల్గిన వారికి పరమాత్మ ధ్యాస కూడ వారియందే ఉండును. ఎవరైతే ఆయన ప్రతిరూపమైన ఆత్మతో కలిసి ఉన్నాడో, వారితో కూడ ఆయన కలిసి ఉన్నాడు.

శ్లోకం 30: అపి చే త్సుదురాచారో భజతే మా మనన్యభాక్ ।

సాధు రేవస మన్తవ్య స్సమ్యగ్వ్య వసితో హి సః ||

(జీవుడు, పరమాత్మ)

భావము : పెద్ద దురాచారపరుడైనప్పటికి నన్ను మనస్సులో భజించుట వలన, వాడు నిశ్చయముగ నన్ను తెలియదగినవాడు, కనుక వానిని సాధువని చెప్పవచ్చును.

వివరము : దుర్మార్గున్ని సాధువు అనడమేమిటి? చెడ్డవానిని మంచివాడనడమేమిటని ఇక్కడ అనుమానము రాకమానదు. పరమాత్మను తెలియగోరి మనస్సులో భజించువానిని, అనగ కర్మయోగ ఆచరణకల్గి పరమాత్మను చేరవలెనని గట్టి నిశ్చయము కలవాడు, వాని పూర్వ కర్మరీత్య ప్రపంచములో చెడుపనులే చేయుచు దురాచారుడని పేరుగాంచినప్పటికి, పరమాత్మ దృష్ఠిలో వాడు సజ్జనుడనియే చెప్పవచ్చును. ఎందుకనగ వానికి దురాచార కర్మయైన పాపము అంటలేదు. వానికి పరమాత్మ మంచిగనున్నాడు కావున పరమాత్మకు వాడు మంచివాడేనని తెలియాలి.

శ్లోకం 31: క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి|

కౌంతేయ! ప్రతి జానీహి న మే భక్తః ప్రణశ్యతి||

(జీవుడు, పరమాత్మ)

భావము : అట్టివాడు శీఘ్రముగ ధర్మాత్ముడై శాశ్వత శాంతిని పొందుచున్నాడు. నా భక్తుడు చెడిపోడని ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను.

వివరము : ప్రపంచములో ఎంత దుర్మార్గుడైనప్పటికి పరమాత్మను చేరవలెనను కాంక్ష కలిగినవాడు తొందరగ (ధర్మాత్ముడై) ధర్మములతో కూడిన ఆత్మగలవాడై, ముక్తిపొంది శాశ్వత శాంతియైన పరంధామమును చేరును. పరమాత్మను ఆత్మ మూలముగ ఆరాధించినవాడు ఎప్పటికి చెడిపోడని మంచి స్థితినే పొందునని, ఆత్మపరముగా వానికి మించిన లాభము పొందువాడు భూమిమీదలేడని ప్రతిజ్ఞచేసి చెప్పవచ్చును. ప్రపంచరీత్య ఎట్లున్న పరమాత్మరీత్య ధర్మాత్ముడైన వాడు చెడిపోడని ప్రతిజ్ఞగ దేవుడే చెప్పాడంటే అదెంత గొప్ప విషయమో ఆలోచించండి.

శ్లోకం 32: మాం హి పార్థ! వ్యపాశ్రిత్య యేఽపిస్యుః పాపయోనయః|

స్త్రీయో వైశ్యా స్తథా శూద్రాస్తేఽపి యాన్తి పరాంగతిమ్||

(పరమాత్మ)

భావము : పాపయోని సంభవులు, వైశ్య శూద్ర జనులు నన్నాశ్రయించి పరమ గతిని పొందుచున్నారు.

వివరము : పరమాత్మను సాధించు యోగము స్త్రీలు చేయకూడదను నియమము లేదు. శరీరము అపరిశుద్ధముగనున్నను మనస్సు పరిశుద్ధముగ ఉండవలెనను సూత్రము ప్రకారము ఎట్టి పరిస్థితులలోను కూడ స్త్రీలు యోగమాచరించవచ్చును. పెద్దకులమను వైశ్యులు, తగ్గుకులమను శూద్రులు పరమాత్మకు సమానమే. కావున ఏ కులమువారైనను యోగమాచరించవచ్చును. అంతేకాక నీచుల గర్భములో పుట్టినవారు కూడ యోగమాచరించవచ్చును. వీరందరు పరమాత్మను ఉపాసించి మోక్షము పొందవచ్చును. వీరే మోక్షము పొందుచున్నపుడు వీరికంటే గొప్పయిన బ్రహ్మజ్ఞానులు, రాజర్షుల గురించి వేరే చెప్పనేల అంటున్నాడు చూడండి.

శ్లోకం 33: కిం పున ర్బ్రాహ్మణాః పుణ్యాభక్తా రాజర్షయస్తథా|

అనిత్య మసుఖం లోక మిమం ప్రాప్య భజస్వమామ్||

(పరమాత్మ)

భావము : పుణ్యముచేసి పుట్టిన బ్రాహ్మణుల, రాజర్షుల గూర్చి వేరే చెప్పనవసరము లేదు. అనిత్యము అసుఖము గల గుణము (లోకము)లందున్నప్పటికి నన్ను భజించి నన్నే పొందుదురు.

వివరము : శూద్రుడు అనగ క్షుద్రమైనపనులు చేయువాడు. నీచయోనిలో పుట్టినవారు పరమాత్మను ఆరాధించి పరమపదము పొందుచుంటే బ్రాహ్మణులను, రాజర్షులను గురించి వేరు చెప్పనవసరము లేదు. బ్రాహ్మణులనగ బ్రహ్మజ్ఞానము తెలిసినవారని అర్థము. అంతో ఇంతో బ్రహ్మజ్ఞానము తెలిసినవారు, పరమాత్మ విలువ తెలిసినవారు సులభముగ యోగమాచరించి మోక్షము పొందవచ్చును. రాజర్షులనువారికి, మోక్షమునకు దగ్గరగ ఉన్నవారికి, మోక్షమార్గములో కొంత ప్రయాణించినవారికి మరీ సులభముగ ముక్తి లభించును. ఇంతకీ రాజర్షులనగా ఎవరనిన పూర్తి వివరము తెలుసుకొందాము.

బ్రహ్మజ్ఞానము తెలిసి దానిప్రకారము యోగమాచరించు వారికి జ్ఞానాగ్ని లభించునని ముందే తెలుసుకొన్నాము. అలా లభించిన జ్ఞానాగ్ని శిరస్సునందు చేరి అక్కడ నిలువయుండి అక్కడే గల కర్మను కాల్చుచుండును. అలా కర్మను కాల్చుటకు కొన్ని జన్మలు పట్టునని కూడ తెలుసుకొన్నాము. మొదట చిన్న కణముగా పుట్టిన జ్ఞానాగ్ని కాలము గడుచుకొలది, యోగము ఆచరించుకొలది, పెరుగుచూ పోయి చివరకు పెద్ద అగ్నిగోళముగ మారును. యోగుల శరీరములో ఉన్న 'జ్ఞానాగ్ని పెరిగిన కొలత' ను బట్టి యోగుల గొప్పతనమును గుర్తించవచ్చును. యోగ సమయములో లభించిన జ్ఞానాగ్ని ఆ సమయములో కర్మను కాల్చును. యోగము చేయని సమయములో కర్మను కాల్చక నిలిచియుండును. తిరిగి యోగము చేయు సమయములో జ్ఞానాగ్ని పెరుగుచుండును, కర్మను కాల్చుచుండును. యోగము ఆచరించగా ఆచరించగా జ్ఞానాగ్ని పెరుగుతూ పోవుచుండును. కర్మ తీవ్రత ఎక్కువవుంటే అగ్ని ఎక్కువ ఖర్చగును. అటువంటి వారికి సంపూర్ణ అగ్ని నిలువగల్గుటకు చాలాకాలము పట్టును. తీవ్రకర్మలు లేనివారికి అగ్ని తక్కువ ఖర్చగుచు మిగులుచుపోవును. వారికి అగ్ని సంపూర్ణ స్థితికి చేరుటకు తక్కువ కాలము పట్టును. ఎంత తక్కువ కాలమైన సంవత్సరములలో ఉండును. జ్ఞానాగ్ని శరీరములో ఎంత సాంద్రతతో నిలువగల్గునో ఆ సాంద్రత పొందిన వానిని సంపూర్ణయోగి అనవచ్చును. సంపూర్ణ యోగి అయిన తరువాత కూడ కర్మ కొంతకాలము కాలవచ్చును.

యోగుల శరీరములోని తలలో నిలువవుండు జ్ఞానాగ్ని యొక్క పూర్ణత్వమును బట్టి సంపూర్ణ యోగులు, అసంపూర్ణ యోగులని యోగులను విభజించ వచ్చును. జ్ఞానాగ్ని సాంద్రతను బట్టి యోగుల యోగ్యతను పూర్వము పెద్దలు ముందే నిర్ణయించి పెట్టారు. ఆ నిర్ణయము ప్రకారము యోగులు నాల్గు హోదాలు కలిగివున్నారు. 1) మహర్షి 2) రాజర్షి 3) దేవర్షి 4) బ్రహ్మర్షి. యోగుల తలలోపల జ్ఞానాగ్ని ప్రకాశము యొక్క సంపూర్ణత్త్వములో పావు భాగమున్న వానిని మహర్షి అనవచ్చును. అర్థభాగమున్న వానిని రాజర్షి అనవచ్చును. మూడొంతులున్న వానిని దేవర్షి అనవచ్చును. సంపూర్ణత్వముగ అగ్ని ప్రకాశమున్నవానిని బ్రహ్మర్షి అనవచ్చును. ఇక్కడ వివరించబడిన మహర్షులు, రాజర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు పూర్వముండెడివారని చరిత్రలో తెలియుచున్నది. విశ్వామిత్రుడు పట్టుదల కలిగి ఒకే జన్మలో మహర్షి స్థాయి నుండి రాజర్షి, దేవర్షి స్థాయిలు పొంది చివరకు బ్రహ్మర్షి స్థాయిని కూడ పొందినట్లు తెలిసిన విషయమే. జ్ఞానాగ్ని ఉన్నవారు మహర్షులు, రాజర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు కాగ ఏమాత్రము జ్ఞానాగ్నిలేని వారిని బేవర్షులు అనెడివారు. కొంచమైన జ్ఞానాగ్నిలేని బేవర్షులు కూడ పరమాత్మను ఆరాధించి చివరకు మోక్షమును పొందుచుండగ బ్రహ్మజ్ఞానము తెలిసిన వారిని, రాజర్షులైనవారిని గూర్చి చెప్పనవసరము లేదని ఈ శ్లోకములో భగవంతుడు చెప్పాడు.

శ్లోకం 34: మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు|

మా మే వైష్యసి యుక్త్వై వ మాత్మానం మత్పరాయణః ||

(సాకారము, నిరాకారము)

భావము : నీవు నా మీదనే మనస్సునుంచుము, నాకు భక్తునిగనుండుము. నన్నే నమస్కరించుము, నన్నే ఆరాధించుము. నా మీద ధ్యాస కల్గి ఆత్మతో కూడిన నన్నే పొందగలవు.

వివరము : ఈ శ్లోకములో సాకార భగవంతున్ని, నిరాకార పరమాత్మను రెండిటిని గూర్చి చెప్పబడివున్నదని గ్రహించవలెను. 'యుక్త్వైవ మాత్మానం మత్పరాయణః' అను వాక్యము నిరాకార పరమాత్మ సంబంధమైనది. దీనిలో 'నా ధ్యాసతో ఆత్మయందు కూడుకొన్నవాడు' అని చెప్పబడినది. ఆత్మ నిరాకారమైనది ఆత్మతో కూడుకోవడము అనగా యోగము చేయడము. కనపడని పరమాత్మ కొరకు కనిపించని ఆత్మను యోగము చేత ధ్యాస కల్గివుండువాడు చివరకు మోక్షము పొందును. ఇదొక పద్ధతికాగ, సాకార సంబంధమైనది మరొక పద్ధతి గలదు. సాకార పద్ధతనగ కనిపించు విగ్రహాలను పూజించడము కాదు. పరమాత్మయే భగవంతునిగ పుట్టినప్పుడు కనిపించు శరీరముగల ఆ భగవంతున్ని పూజించడము, నమస్కరించడము, ఆయన మీదనే మనోధ్యాస కల్గివుండడము. అలాగే ఆయనకే మనము భక్తులుగవుండడము సాకారమునకు సంబంధించినదగును. సాకార ఆరాధన సామాన్యముగ లభించునది కాదు. పరమాత్మ భగవంతునిగ వచ్చు రాకయే ఎవరికి తెలియదు. ఆ రాకను తెలియడమే కష్టము. ఆయన భూమి మీద ఉన్నప్పుడే సాకారపూజ సాధ్యమగును. ఆయన ఎల్లప్పుడు భూమిమీద ఉండువాడు కాదు. కావున ఎల్లప్పుడు ఆచరించుటకు అనువైనది నిరాకార ఆరాధనయేనని తెలియుము. నిరాకారముగనో, సాకారముగనో ఆయనను ఆరాధించుట వలన ఆయననే పొందగలరని తెలిపారు. ఇదియే అతి రహస్యమైనది. అతి పెద్దదైన విద్యయని తెలియాలి. ఇంతటితో ఈ రాజవిద్యా రాజగుహ్య యోగమను అధ్యాయము సమాప్తము.

-------------------------------

త్రైత సిద్ధాంత భగవద్గీత: రాజవిద్యా రాజగుహ్య యోగము  

శ్రీ భగవంతుడిట్లనియె :-

శ్లోకం 1: ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యా మ్యన సూయవే ।

జ్ఞానం విజ్ఞాన సహితం యజ్జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ||

(ధర్మములు)

భావము : ఇది అతి రహస్యమైన జ్ఞానము. దీనిని విజ్ఞాన సహితముగ విశద పరుతును. దీనిని తెలియుట వలన అశుభములనుండి ముక్తుడవుకాగలవు.

శ్లోకం 2: రాజవిద్యా రాజగుహ్యం పవిత్ర మిద ముత్తమమ్ ।

ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తు మవ్యయమ్ ||

(ధర్మములు)

భావము : అన్ని విద్యలయందు పెద్దది, అట్లే అన్ని రహస్యములందు పెద్దది, పవిత్రమైన ఉత్తమమైన ప్రత్యక్షముగ జరుగు ధర్మము. మంచి సుఖమైనది నాశనములేనిది.

శ్లోకం 3 : అశ్రద్ధధానాః పురుషా ధర్మ స్యాస్య పరన్తప ! ।

అప్రాప్య మాం నివర్తన్తే మృత్యుసంసార వర్త్మని ||

(ధర్మములు)

భావము : ధర్మముల మీద అశ్రద్ధ కల్గినవాడు, నన్ను తెలియలేక మృత్యు సంసారములోనే వర్తించుచుండును.

శ్లోకం 4: మయా తత మిదం సర్వం జగదవ్యక్త మూర్తినా ।

మత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః ||

(పరమాత్మ)

భావము : అవ్యక్తముగ ఈ ప్రపంచమంతయు వ్యాపించియున్నాను. నాయందే సర్వజీవరాసులున్నవి. నేను వాటియందులేను.

శ్లోకం 5: న చ మత్ స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ ।

భూతభృ న్న చ భూతస్థో మమాత్మా భూత భావనః ||

(పరమాత్మ)

భావము : సర్వ జీవులు నాయందులేవు. నేను ఈశ్వరునిగ (అధిపతిగ) ఎట్లు కలిసి ఉన్నది చూడుము. జీవులు ధరించు శరీరములోని ఆత్మగను, భూతములుగ భావింపబడు జీవాత్మలుగను నేను లేను.

శ్లోకం 6: యథాఽఽకాశస్థి తో నిత్యం వాయు స్సర్వత్రగో మహాన్ ।

తథా సర్వాణి భూతాని మత్ స్థానీ త్యుపధారయ ! ||

(పరమాత్మ)

భావము : బలము కలిగి సర్వత్ర సంచరించు గాలి నిత్యము ఆకాశమందెట్లున్నదో, అట్లే సర్వ జీవరాసులు నాయందున్నవని గ్రహించుము.

శ్లోకం 7: సర్వ భూతాని కౌంతేయ ! ప్రకృతిం యాన్తి మామికామ్ ।

కల్పక్షయే పునస్థాని కల్పాదౌ విసృజా మ్యహమ్ ||

(పరమాత్మ)

భావము : సర్వ జీవరాసులు కల్పక్షయములో నా ప్రకృతియందే లీనమగుచున్నవి. కల్పాదిలో నేనే తిరిగి వాటిని పుట్టించుచున్నాను.

శ్లోకం 8: ప్రకృతిం స్వామ వష్టభ్య విసృజామి పునః పునః ।

భూతగ్రామ మిమంకృత్స్న మవశం ప్రకృతేర్వశాత్ ||

(పరమాత్మ)

భావము : ప్రకృతి వశములోనుండి అస్వతంత్రమైయున్న ఈ సమస్త జీవరాసులను నా ఆధీనములోనున్న ప్రకృతిచేతనే మళ్ళీ మళ్ళీ పుట్టించుచున్నాను.

శ్లోకం 9: న చ మాం తాని కర్మాణి నిబధ్నన్తి ధనంజయ! ।

ఉదాసీనవ దాసీన మసక్తం తేషు కర్మసు ||

(పరమాత్మ)

భావము : ఆసక్తిలేని వాడును, ఉదాసీనత కల్గియున్న వాడునునైన నాకు ఆ కర్మలంటవు.

శ్లోకం 10: మయాఽధ్యక్షేణ ప్రకృతి స్సూయతే సచరాచరమ్ ।

హేతునాఽ నేన కౌంతేయ! జగ ద్విపరివర్తతే ||

(పరమాత్మ)

భావము : నా అధ్యక్షతన గల చరాచర ప్రపంచమునంతటిని ప్రకృతి పుట్టించు చున్నది. ఆ కారణముచేతనే జగత్తు పరివర్తించుచున్నది.

శ్లోకం 11: అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ ।

పరం భావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్ ||

(పరమాత్మ, సాకారము)

భావము : సర్వజీవరాసులకు అధిపతినైన నేను నరశరీరము ధరించుట వలన, నాశ్రేష్ఠమైన భావము తెలియజాలక మూఢులు నన్ను అవమానించుచున్నారు.

శ్లోకం 12: మోఘాశా మోఘ కర్మాణో మోఘ జ్ఞానా విచేతసః ।

రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ||

(జీవాత్మ, ప్రకృతి)

భావము : రాక్షస భావములు కలవారు భ్రాంతితోకూడిన ప్రకృతి స్వభావమును ఆశ్రయింతురు. అట్టివారికి వ్యర్థమైన ఆశ, వ్యర్థమైన కర్మ, వ్యర్థమైన విపరీత జ్ఞానము కల్గుచుండును.

శ్లోకం 13: మహాత్మానస్తు మాం పార్థ! దైవీం ప్రకృతి మాశ్రితాః ।

భజన్త్య నన్య మనసో జ్ఞాత్వా భూతాది మవ్యయమ్ ||

(జీవాత్మ, పరమాత్మ)

భావము : మహాత్ములైనవారు ప్రకృతికి దైవమైన నన్ను ఆశ్రయించి, అవ్యయునిగ భూతముల మూలకారునిగ నన్ను తెలిసినవారై, మనస్సున అన్యచింత లేకుండ నన్ను ఆరాధిస్తున్నారు.

శ్లోకం 14 : సతతం కీర్త యన్తో మాం యతంత శ్చ దృఢ వ్రతాః ।

నమస్యంత శ్చ మాం భక్త్యా నిత్య యుక్తా ఉపాసతే ||

(జీవాత్మ, పరమాత్మ)

భావము : ఎల్లప్పుడు నన్ను కీర్తించి భజించువారు, గొప్ప వ్రతములచే ప్రయత్నించు వారు, నన్నే నమస్కరించువారు, భక్తిచే నిత్యయుక్తులైనవారు, అందరు నన్ను ఉపాసించువారే.

శ్లోకం 15: జ్ఞాన యజ్ఞేన చా ప్యన్యే యజన్తో మాముపాసతే ।

ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖమ్ ||

(సాకారము, పరమాత్మ)

భావము : మరికొందరు జ్ఞానయజ్ఞముచే ఆరాధించువారు, విశ్వవ్యాప్తియై అనేక రూపములుగ ఉన్న నన్ను ఏకరూపునిగ సాకారమును పూజించువారు కలరు.

శ్లోకం 16 : అహం క్రతు రహం యజ్ఞః స్వధాఽహ మహ మౌషధమ్ ।

మంత్రోహ మహ మే వాఽజ్య మహమగ్ని రహం హుతమ్ ||

(పరమాత్మ)

భావము : నేను క్రతువును, నేను యజ్ఞమును, నేను స్వదయును, ఔషధంబు నేను, మరియు మంత్రము నేను, ఆజ్యమునేను, అగ్ని నేను, హోమము సహితము నేనే అయివున్నాను.

శ్లోకం 17 : పితాఽహ మస్య జగతో మాతా ధాతా పితామహః ।

వేద్యం పవిత్ర మోంకార ఋక్సామ యజురేవచ ||

(పరమాత్మ)

భావము : అఖిల జగతికి తల్లి తండ్రినగుదును, మరియు దాతను, తాతను నేనే అగుదును. తెలుసుకొంటే పవిత్ర ఓంకారమును నేనే. ఋక్, సామ, యజుర్వేదములును నేనే.

శ్లోకం 18 : గతి ర్భర్తా ప్రభుస్సాక్షీ నివాస శ్శరణం సుహృత్ ।

ప్రభవః ప్రలయ స్థ్సానం నిదానం బీజ మవ్యయమ్ ||

(పరమాత్మ)

భావము : గతియు, భర్తా, ప్రభువు, సాక్షి, సుహృత్ జనుల నివాస శరణములును, పుట్టు స్థలము, లయము జరుగు స్థలము, నిదానము, బీజము, అవ్యయము అన్నియు నేనే.

శ్లోకం 19: తపా మ్యహ మహం వర్షం నిగృహ్ణా మ్యుత్సృజామిచ ।

అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహ మర్జున! ||

(పరమాత్మ)

భావము : నేను తపియింప చేయుదును. నేను వర్ష జలమును స్వీకరించి మరల విడుతును. మృత్యువును నేను మరియు అమృతమునేనే. సత్తునేనే అసత్తునేనే.

శ్లోకం 20: త్రైవిద్యామాం సోమపాః పూతపాపాయజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయన్తే ।

తే పుణ్య మాసాద్య సురేంద్రలోక మశ్నన్తి దివ్యాన్ దివిదేవభోగాన్ || (జీవాత్మ, పరమాత్మ)

శ్లోకం 21: తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యేమర్త్యలోకం విశన్తి ।

ఏవం త్రయీ ధర్మ మనుప్రపన్నా గతాగతం కామకామా లభన్తే ||

(జీవాత్మ, పరమాత్మ)

భావము : మూడు విద్యలు నేర్చినవారు, సోమపానులు, పాపములులేనివారు, యజ్ఞములందిష్టము కలవారు, స్వర్గమును పొందుటకు నన్ను ప్రార్థించుచున్నారు. వారు పుణ్యముగలవారై సురేంద్రలోకము పొంది అక్కడ దివ్యమైన దేవభోగములను పొందుచున్నారు. వారు అచట స్వర్గ సుఖములననుభవించి పుణ్యమైపోయిన వెంటనే తగ్గుస్థితికి వచ్చుచుందురు. అట్లు ఆశపరులకు మూడు విద్యల ధర్మములందుండు సుఖఫలములు అశాశ్వతమైనవిగ గలవు.

శ్లోకం 22: అనన్యాశ్చిన్త యన్తోమాం యే జనాః పర్యుపాసతే ।

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ||

(జీవాత్మ, పరమాత్మ)

భావము : ఎవడైతే అన్యచింత లేకుండ నన్ను ఎల్లప్పుడు ఉపాసించుచున్నాడో, వాడు నిత్యము నాతో కూడుకొనివున్నాడు. అట్టివాని యోగము యొక్క క్షేమమును నేనే వహించుచున్నాను.

శ్లోకం 23: యేఽప్యన్య దేవతాభక్తా యజన్తే శ్రద్ధయాఽన్వితాః ।

తేఽపి మామేవ కౌంతేయ! యజ్యన్త్య విధిపూర్వకమ్ ||

(జీవాత్మ, పరమాత్మ)

భావము : ఎవడు శ్రద్ధతో అన్యదేవతారాధనలాచరించునో వాడు కూడ నన్నే దారి తప్పి ఆరాధించినవాడగుచున్నాడు.

శ్లోకం 24: అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ ।

నతుమా మభిజానన్తి తత్త్వేనాఽతశ్చ్యవన్తితే ||

(పరమాత్మ)

భావము : నేను సర్వ యజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును. నేను ఆత్మగ ఉన్నానని తెలియనివారు దారి తప్పి పడినవారగుదురు.

శ్లోకం 25: యాన్తి దేవవ్రతాన్ దేవాన్, పితౄన్ యాన్తి పితృవ్రతాః ।

భూతాని యాన్తి భూతేజ్యాః యాన్తి మద్యాజినోఽపి మామ్ ||

(పరమాత్మ)

భావము : దేవతా పూజచేయువారు దేవతలందే చేరుదురు. పితృదేవతలను పూజించువారు వారియందే చేరుదురు. భూతముల పూజించువారు భూతములందే చేరుదురు, నన్ను పూజించువారు నాయందే చేరుదురు.

శ్లోకం 26: పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యాప్రయచ్ఛతి ।

తదహం భక్త్యు పహృత మశ్నామి ప్రయతాత్మనః ||

(పరమాత్మ)

భావము : ఆకు అయిన, పుష్పమైన, పండైన, నీరైన ఎవడు భక్తితో సమర్పించునో, పరిశుద్ధమైన ఆత్మకు భక్తి పూర్వకముగ సమర్పించిన దానిని నేను స్వీకరింతును.

శ్లోకం 27: యత్క రోషి యదశ్నాసి య జ్జు హోషి దదాసియత్ ।

యత్త పస్యసి కౌంతేయ! తత్కురుష్వ మదర్పణమ్ ||

(పరమాత్మ, కర్మయోగము)

భావము : దేనిని చేయుచున్నావో, దేనిని తినుచున్నావో, దేనిని కాల్చుచున్నావో, దేనిని ఇచ్చుచున్నావో, దేనిని తపము చేయుచుంటివో అన్నియు నాకే సమర్పించుము.

శ్లోకం 28: శుభాశుభ ఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః ।

సన్న్యాస యోగ యుక్తాత్మా విముక్తో మాపైష్యసి ||

(పరమాత్మ, కర్మయోగము)

భావము : ఈ ప్రకారముగ శుభాశుభ ఫలములగు కర్మ బంధములనుండి బయటపడినవాడు, సన్న్యాసయోగ యుక్తాత్ముడైన వాడు విముక్తిగల్గి నన్నే పొందును.

శ్లోకం 29: సమోహం సర్వ భూతేషు నమేద్వేష్యోఽస్తి న ప్రియః ।

యే భజన్తి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ ||

(పరమాత్మ)

భావము : సముడనగుదు నేను సర్వ జీవరాసులకు. నాకు ద్వేషిలేడు మరియు ప్రియుడులేడు. భక్తితో ఎవరు కొలుతురో వారియందు నేను, నాయందు వారు కలరు.

శ్లోకం 30: అపి చే త్సుదురాచారో భజతే మా మనన్యభాక్ ।

సాధు రేవస మన్తవ్య స్సమ్యగ్వ్య వసితో హి సః ||

(జీవుడు, పరమాత్మ)

భావము : పెద్ద దురాచారపరుడైనప్పటికి నన్ను మనస్సులో భజించుట వలన, వాడు నిశ్చయముగ నన్ను తెలియదగినవాడు, కనుక వానిని సాధువని చెప్పవచ్చును.

శ్లోకం 31: క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి|

కౌంతేయ! ప్రతి జానీహి న మే భక్తః ప్రణశ్యతి||

(జీవుడు, పరమాత్మ)

భావము : అట్టివాడు శీఘ్రముగ ధర్మాత్ముడై శాశ్వత శాంతిని పొందుచున్నాడు. నా భక్తుడు చెడిపోడని ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను.

శ్లోకం 32: మాం హి పార్థ! వ్యపాశ్రిత్య యేఽపిస్యుః పాపయోనయః|

స్త్రీయో వైశ్యా స్తథా శూద్రాస్తేఽపి యాన్తి పరాంగతిమ్||

(పరమాత్మ)

భావము : పాపయోని సంభవులు, వైశ్య శూద్ర జనులు నన్నాశ్రయించి పరమ గతిని పొందుచున్నారు.

శ్లోకం 33: కిం పున ర్బ్రాహ్మణాః పుణ్యాభక్తా రాజర్షయస్తథా|

అనిత్య మసుఖం లోక మిమం ప్రాప్య భజస్వమామ్||

(పరమాత్మ)

భావము : పుణ్యముచేసి పుట్టిన బ్రాహ్మణుల, రాజర్షుల గూర్చి వేరే చెప్పనవసరము లేదు. అనిత్యము అసుఖము గల గుణము (లోకము)లందున్నప్పటికి నన్ను భజించి నన్నే పొందుదురు.

బ్రహ్మజ్ఞానము తెలిసి దానిప్రకారము యోగమాచరించు వారికి జ్ఞానాగ్ని లభించునని ముందే తెలుసుకొన్నాము. అలా లభించిన జ్ఞానాగ్ని శిరస్సునందు చేరి అక్కడ నిలువయుండి అక్కడే గల కర్మను కాల్చుచుండును. అలా కర్మను కాల్చుటకు కొన్ని జన్మలు పట్టునని కూడ తెలుసుకొన్నాము. మొదట చిన్న కణముగా పుట్టిన జ్ఞానాగ్ని కాలము గడుచుకొలది, యోగము ఆచరించుకొలది, పెరుగుచూ పోయి చివరకు పెద్ద అగ్నిగోళముగ మారును. యోగుల శరీరములో ఉన్న 'జ్ఞానాగ్ని పెరిగిన కొలత' ను బట్టి యోగుల గొప్పతనమును గుర్తించవచ్చును. యోగ సమయములో లభించిన జ్ఞానాగ్ని ఆ సమయములో కర్మను కాల్చును. యోగము చేయని సమయములో కర్మను కాల్చక నిలిచియుండును. తిరిగి యోగము చేయు సమయములో జ్ఞానాగ్ని పెరుగుచుండును, కర్మను కాల్చుచుండును. యోగము ఆచరించగా ఆచరించగా జ్ఞానాగ్ని పెరుగుతూ పోవుచుండును. కర్మ తీవ్రత ఎక్కువవుంటే అగ్ని ఎక్కువ ఖర్చగును. అటువంటి వారికి సంపూర్ణ అగ్ని నిలువగల్గుటకు చాలాకాలము పట్టును. తీవ్రకర్మలు లేనివారికి అగ్ని తక్కువ ఖర్చగుచు మిగులుచుపోవును. వారికి అగ్ని సంపూర్ణ స్థితికి చేరుటకు తక్కువ కాలము పట్టును. ఎంత తక్కువ కాలమైన సంవత్సరములలో ఉండును. జ్ఞానాగ్ని శరీరములో ఎంత సాంద్రతతో నిలువగల్గునో ఆ సాంద్రత పొందిన వానిని సంపూర్ణయోగి అనవచ్చును. సంపూర్ణ యోగి అయిన తరువాత కూడ కర్మ కొంతకాలము కాలవచ్చును.

యోగుల శరీరములోని తలలో నిలువవుండు జ్ఞానాగ్ని యొక్క పూర్ణత్వమును బట్టి సంపూర్ణ యోగులు, అసంపూర్ణ యోగులని యోగులను విభజించ వచ్చును. జ్ఞానాగ్ని సాంద్రతను బట్టి యోగుల యోగ్యతను పూర్వము పెద్దలు ముందే నిర్ణయించి పెట్టారు. ఆ నిర్ణయము ప్రకారము యోగులు నాల్గు హోదాలు కలిగివున్నారు. 1) మహర్షి 2) రాజర్షి 3) దేవర్షి 4) బ్రహ్మర్షి. యోగుల తలలోపల జ్ఞానాగ్ని ప్రకాశము యొక్క సంపూర్ణత్త్వములో పావు భాగమున్న వానిని మహర్షి అనవచ్చును. అర్థభాగమున్న వానిని రాజర్షి అనవచ్చును. మూడొంతులున్న వానిని దేవర్షి అనవచ్చును. సంపూర్ణత్వముగ అగ్ని ప్రకాశమున్నవానిని బ్రహ్మర్షి అనవచ్చును. ఇక్కడ వివరించబడిన మహర్షులు, రాజర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు పూర్వముండెడివారని చరిత్రలో తెలియుచున్నది. విశ్వామిత్రుడు పట్టుదల కలిగి ఒకే జన్మలో మహర్షి స్థాయి నుండి రాజర్షి, దేవర్షి స్థాయిలు పొంది చివరకు బ్రహ్మర్షి స్థాయిని కూడ పొందినట్లు తెలిసిన విషయమే. జ్ఞానాగ్ని ఉన్నవారు మహర్షులు, రాజర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు కాగ ఏమాత్రము జ్ఞానాగ్నిలేని వారిని బేవర్షులు అనెడివారు. కొంచమైన జ్ఞానాగ్నిలేని బేవర్షులు కూడ పరమాత్మను ఆరాధించి చివరకు మోక్షమును పొందుచుండగ బ్రహ్మజ్ఞానము తెలిసిన వారిని, రాజర్షులైనవారిని గూర్చి చెప్పనవసరము లేదని ఈ శ్లోకములో భగవంతుడు చెప్పాడు.

శ్లోకం 34: మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు|

మా మే వైష్యసి యుక్త్వై వ మాత్మానం మత్పరాయణః ||

(సాకారము, నిరాకారము)

భావము : నీవు నా మీదనే మనస్సునుంచుము, నాకు భక్తునిగనుండుము. నన్నే నమస్కరించుము, నన్నే ఆరాధించుము. నా మీద ధ్యాస కల్గి ఆత్మతో కూడిన నన్నే పొందగలవు.

-------------------------

త్రైత సిద్ధాంత భగవద్గీత: రాజవిద్యా రాజగుహ్య యోగము  

శ్రీ భగవంతుడిట్లనియె :-

శ్లోకం 1 (ధర్మములు)
భావము : ఇది అతి రహస్యమైన జ్ఞానము. దీనిని విజ్ఞాన సహితముగ విశద పరుతును. దీనిని తెలియుట వలన అశుభములనుండి ముక్తుడవుకాగలవు.

శ్లోకం 2 (ధర్మములు)
భావము : అన్ని విద్యలయందు పెద్దది, అట్లే అన్ని రహస్యములందు పెద్దది, పవిత్రమైన ఉత్తమమైన ప్రత్యక్షముగ జరుగు ధర్మము. మంచి సుఖమైనది నాశనములేనిది.

శ్లోకం 3  (ధర్మములు)
భావము : ధర్మముల మీద అశ్రద్ధ కల్గినవాడు, నన్ను తెలియలేక మృత్యు సంసారములోనే వర్తించుచుండును.

శ్లోకం 4 (పరమాత్మ)
భావము : అవ్యక్తముగ ఈ ప్రపంచమంతయు వ్యాపించియున్నాను. నాయందే సర్వజీవరాసులున్నవి. నేను వాటియందులేను.

శ్లోకం 5 (పరమాత్మ)
భావము : సర్వ జీవులు నాయందులేవు. నేను ఈశ్వరునిగ (అధిపతిగ) ఎట్లు కలిసి ఉన్నది చూడుము. జీవులు ధరించు శరీరములోని ఆత్మగను, భూతములుగ భావింపబడు జీవాత్మలుగను నేను లేను.

శ్లోకం 6 (పరమాత్మ)
భావము : బలము కలిగి సర్వత్ర సంచరించు గాలి నిత్యము ఆకాశమందెట్లున్నదో, అట్లే సర్వ జీవరాసులు నాయందున్నవని గ్రహించుము.

శ్లోకం 7 (పరమాత్మ)
భావము : సర్వ జీవరాసులు కల్పక్షయములో నా ప్రకృతియందే లీనమగుచున్నవి. కల్పాదిలో నేనే తిరిగి వాటిని పుట్టించుచున్నాను.

శ్లోకం 8 (పరమాత్మ)

భావము : ప్రకృతి వశములోనుండి అస్వతంత్రమైయున్న ఈ సమస్త జీవరాసులను నా ఆధీనములోనున్న ప్రకృతిచేతనే మళ్ళీ మళ్ళీ పుట్టించుచున్నాను.

శ్లోకం 9 (పరమాత్మ)
భావము : ఆసక్తిలేని వాడును, ఉదాసీనత కల్గియున్న వాడునునైన నాకు ఆ కర్మలంటవు.

శ్లోకం 10 (పరమాత్మ)
భావము : నా అధ్యక్షతన గల చరాచర ప్రపంచమునంతటిని ప్రకృతి పుట్టించు చున్నది. ఆ కారణముచేతనే జగత్తు పరివర్తించుచున్నది.

శ్లోకం 11 (పరమాత్మ, సాకారము)
భావము : సర్వజీవరాసులకు అధిపతినైన నేను నరశరీరము ధరించుట వలన, నాశ్రేష్ఠమైన భావము తెలియజాలక మూఢులు నన్ను అవమానించుచున్నారు.

శ్లోకం 12 (జీవాత్మ, ప్రకృతి)
భావము : రాక్షస భావములు కలవారు భ్రాంతితోకూడిన ప్రకృతి స్వభావమును ఆశ్రయింతురు. అట్టివారికి వ్యర్థమైన ఆశ, వ్యర్థమైన కర్మ, వ్యర్థమైన విపరీత జ్ఞానము కల్గుచుండును.

శ్లోకం 13 (జీవాత్మ, పరమాత్మ)
భావము : మహాత్ములైనవారు ప్రకృతికి దైవమైన నన్ను ఆశ్రయించి, అవ్యయునిగ భూతముల మూలకారునిగ నన్ను తెలిసినవారై, మనస్సున అన్యచింత లేకుండ నన్ను ఆరాధిస్తున్నారు.

శ్లోకం 14  (జీవాత్మ, పరమాత్మ)
భావము : ఎల్లప్పుడు నన్ను కీర్తించి భజించువారు, గొప్ప వ్రతములచే ప్రయత్నించు వారు, నన్నే నమస్కరించువారు, భక్తిచే నిత్యయుక్తులైనవారు, అందరు నన్ను ఉపాసించువారే.

శ్లోకం 15 (సాకారము, పరమాత్మ)
భావము : మరికొందరు జ్ఞానయజ్ఞముచే ఆరాధించువారు, విశ్వవ్యాప్తియై అనేక రూపములుగ ఉన్న నన్ను ఏకరూపునిగ సాకారమును పూజించువారు కలరు.

శ్లోకం 16  (పరమాత్మ)
భావము : నేను క్రతువును, నేను యజ్ఞమును, నేను స్వదయును, ఔషధంబు నేను, మరియు మంత్రము నేను, ఆజ్యమునేను, అగ్ని నేను, హోమము సహితము నేనే అయివున్నాను.

శ్లోకం 17  (పరమాత్మ)
భావము : అఖిల జగతికి తల్లి తండ్రినగుదును, మరియు దాతను, తాతను నేనే అగుదును. తెలుసుకొంటే పవిత్ర ఓంకారమును నేనే. ఋక్, సామ, యజుర్వేదములును నేనే.

శ్లోకం 18  (పరమాత్మ)
భావము : గతియు, భర్తా, ప్రభువు, సాక్షి, సుహృత్ జనుల నివాస శరణములును, పుట్టు స్థలము, లయము జరుగు స్థలము, నిదానము, బీజము, అవ్యయము అన్నియు నేనే.

శ్లోకం 19 (పరమాత్మ)
భావము : నేను తపియింప చేయుదును. నేను వర్ష జలమును స్వీకరించి మరల విడుతును. మృత్యువును నేను మరియు అమృతమునేనే. సత్తునేనే అసత్తునేనే.

శ్లోకం 20 
శ్లోకం 21 (జీవాత్మ, పరమాత్మ)
భావము : మూడు విద్యలు నేర్చినవారు, సోమపానులు, పాపములులేనివారు, యజ్ఞములందిష్టము కలవారు, స్వర్గమును పొందుటకు నన్ను ప్రార్థించుచున్నారు. వారు పుణ్యముగలవారై సురేంద్రలోకము పొంది అక్కడ దివ్యమైన దేవభోగములను పొందుచున్నారు. వారు అచట స్వర్గ సుఖములననుభవించి పుణ్యమైపోయిన వెంటనే తగ్గుస్థితికి వచ్చుచుందురు. అట్లు ఆశపరులకు మూడు విద్యల ధర్మములందుండు సుఖఫలములు అశాశ్వతమైనవిగ గలవు.

శ్లోకం 22 (జీవాత్మ, పరమాత్మ)
భావము : ఎవడైతే అన్యచింత లేకుండ నన్ను ఎల్లప్పుడు ఉపాసించుచున్నాడో, వాడు నిత్యము నాతో కూడుకొనివున్నాడు. అట్టివాని యోగము యొక్క క్షేమమును నేనే వహించుచున్నాను.

శ్లోకం 23 (జీవాత్మ, పరమాత్మ)
భావము : ఎవడు శ్రద్ధతో అన్యదేవతారాధనలాచరించునో వాడు కూడ నన్నే దారి తప్పి ఆరాధించినవాడగుచున్నాడు.

శ్లోకం 24 (పరమాత్మ)
భావము : నేను సర్వ యజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును. నేను ఆత్మగ ఉన్నానని తెలియనివారు దారి తప్పి పడినవారగుదురు.

శ్లోకం 25 (పరమాత్మ)
భావము : దేవతా పూజచేయువారు దేవతలందే చేరుదురు. పితృదేవతలను పూజించువారు వారియందే చేరుదురు. భూతముల పూజించువారు భూతములందే చేరుదురు, నన్ను పూజించువారు నాయందే చేరుదురు.

శ్లోకం :  26 (పరమాత్మ)
భావము : ఆకు అయిన, పుష్పమైన, పండైన, నీరైన ఎవడు భక్తితో సమర్పించునో, పరిశుద్ధమైన ఆత్మకు భక్తి పూర్వకముగ సమర్పించిన దానిని నేను స్వీకరింతును.

శ్లోకం :  27 (పరమాత్మ, కర్మయోగము)
భావము : దేనిని చేయుచున్నావో, దేనిని తినుచున్నావో, దేనిని కాల్చుచున్నావో, దేనిని ఇచ్చుచున్నావో, దేనిని తపము చేయుచుంటివో అన్నియు నాకే సమర్పించుము.

శ్లోకం :  28 (పరమాత్మ, కర్మయోగము)
భావము : ఈ ప్రకారముగ శుభాశుభ ఫలములగు కర్మ బంధములనుండి బయటపడినవాడు, సన్న్యాసయోగ యుక్తాత్ముడైన వాడు విముక్తిగల్గి నన్నే పొందును.

శ్లోకం :  29 (పరమాత్మ)
భావము : సముడనగుదు నేను సర్వ జీవరాసులకు. నాకు ద్వేషిలేడు మరియు ప్రియుడులేడు. భక్తితో ఎవరు కొలుతురో వారియందు నేను, నాయందు వారు కలరు.

శ్లోకం :  30 (జీవుడు, పరమాత్మ)
భావము : పెద్ద దురాచారపరుడైనప్పటికి నన్ను మనస్సులో భజించుట వలన, వాడు నిశ్చయముగ నన్ను తెలియదగినవాడు, కనుక వానిని సాధువని చెప్పవచ్చును.

శ్లోకం :  31 (జీవుడు, పరమాత్మ)
భావము : అట్టివాడు శీఘ్రముగ ధర్మాత్ముడై శాశ్వత శాంతిని పొందుచున్నాడు. నా భక్తుడు చెడిపోడని ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను.

శ్లోకం :  32 (పరమాత్మ)
భావము : పాపయోని సంభవులు, వైశ్య శూద్ర జనులు నన్నాశ్రయించి పరమ గతిని పొందుచున్నారు.

శ్లోకం :  33 (పరమాత్మ)
భావము : పుణ్యముచేసి పుట్టిన బ్రాహ్మణుల, రాజర్షుల గూర్చి వేరే చెప్పనవసరము లేదు. అనిత్యము అసుఖము గల గుణము (లోకము)లందున్నప్పటికి నన్ను భజించి నన్నే పొందుదురు.

శ్లోకం :  34 (సాకారము, నిరాకారము)

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024