pss book:gt10 త్రైత సిద్ధాంత భగవద్గీత: విశ్వరూప సందర్శన యోగము

త్రైత సిద్ధాంత భగవద్గీత:  విశ్వరూప సందర్శన యోగము  

అర్జునుడిట్లనియె : -

శ్లోకం 1: మదనుగ్రహాయ పరమం గుహ్య మధ్యాత్మ సంజ్ఞితమ్ |

యత్త్వ యోక్తం వచస్తేన మోహోఽయం విగతోమమ ||

(ధర్మములు)

భావము : నన్ను అనుగ్రహించి నాకింతవరకు చెప్పిన విషయములు ఆధ్యాత్మములైనవి కావున నాలోని మోహమెల్ల సమసిపోయినది. ప్రతి అధ్యాయమునకు ఒక పేరు పెట్టి పేరు చివరిలో యోగము అన్నారు. అధ్యాయములో ఏ విషయమును గూర్చి ఎక్కువగ చెప్పారో, ఆ విషయమునకు సంబంధించిన పేరు ఆ అధ్యాయమునకు పెట్టడము జరిగినది. ఇక్కడ విశ్వ రూపమునకు సంబంధించిన విషయము ఎక్కువగా ఉండుట వలన, ఈ ఆధ్యాయమును విశ్వరూప సందర్శన యోగమన్నారు. ప్రతి అధ్యాయములో చెప్పెడి విషయము యొక్క మూల ఉద్దేశ్యము జీవాత్మ పరమాత్మలో కలిసిపోవడమే అయివున్నది. కలిసిపోవుటను యోగము అంటారు. విడిపోవుటను వియోగము అంటారు. గీతలో అన్ని అధ్యాయములు కలిసిపోవు విషయమునే చెప్పుచున్నవి కావున అన్ని అధ్యాయములకు చివరిలో 'యోగము' అనుట సమంజసమైనదే.    

శ్లోకం 2: భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా |

త్వత్తః కమలపత్రాక్ష! మహాత్మ్య మపి చావ్యయమ్ ||

(పరమాత్మ)

భావము : సర్వ జీవరాసులకు చావు పుట్టుకలు నీవలన కల్గుననియు, నీ మహిమ అవ్యయమైనదనియు విస్తారముగా ఇంత వరకు వింటిని.

శ్లోకం 3: ఏవ మేత ద్యథాఽఽ త్థత్వ మాత్మానాం పరమేశ్వర! |

ద్రష్టు మిచ్ఛామి తే రూప మైశ్వరం పురుషోత్తమ ||

(పరమాత్మ, నిరాకారము)

భావము : ఓ పురుషోత్తమా! నిన్ను గూర్చి నీవు చెప్పినదంతయు సత్యమగును. నీ విశ్వరూపమును చూడవలెనని నాకు కోరిక కల్గినది.    

శ్లోకం 4: మన్య సే యది తచ్ఛక్యం మయా ద్రష్టు మితి ప్రభో |

యోగేశ్వర! తతోమేత్వం దర్శయాత్మాన మవ్యయమ్ ||

(పరమాత్మ, నిరాకారము)

భావము : నీ ఆత్మ రూపమును నేను చూచుటకు అర్హుడనగుదునేని అవ్యయమైన ఆ రూపమును చూపుము.

వివరము : ఇంతవరకు భగవంతుడు చెప్పిన పరమాత్మ విషయములెన్నో విన్న అర్జునుడు, తన మనస్సులో ఒక నిశ్చయమునకొచ్చాడు. చెప్పెడివాడు పరమాత్మేనని, ఇంతవరకు కనిపిస్తూ చెప్పుచున్నవాడు నిజమైన విశ్వవ్యాపియేనని, విశ్వవ్యాపియైన వాడే ఈ శరీరమునుండి మాట్లాడుచున్నాడను నిశ్చయమునకొచ్చిన అర్జునుడు విన్నదేగాని, నిజముగ చూడని ఆ విశ్వరూపమేమిటో చూడగోరి, ఆ దర్శనము తనకు కలుగునట్లు చేయుమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు ఏమి చెప్పుచున్నాడో క్రిందచూస్తాము.

శ్రీ భగవంతుడిట్లనియె : -

శ్లోకం 5: పశ్య మే పార్థ! రూపాణి శతశోఽ థ సహస్రశః |

నానావిధాని దివ్యాని నానావర్ణా కృతీని చ || (పరమాత్మ, నిరాకారము)

శ్లోకం 6: పశ్యా ఽదిత్యాన్ వసూన్ రుద్రా నశ్వినౌ మరుత స్తథా |

బహూ న్యదృష్టపూర్వాణి పశ్యా ఽశ్చర్యాణి భారత! ||(పరమాత్మ, నిరాకారము)

శ్లోకం 7: ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్ |

మమ దేహే గుడాకేశ! యచ్చాన్యద్ద్రష్టు మిచ్ఛసి ||

(పరమాత్మ, నిరాకరము)

భావము : అర్జునా! అనేక విధములైన, అనేక వర్ణములైన, అనేక ఆకారములైన నా దివ్యరూపమును వందలాదిగ, వేలాదిగ, అసంఖ్యాకములుగ చూడుము.  ఆదిత్యులును, వసువులును, రుద్రులును, అశ్వనీ కుమారులును, మరుత్తులును మొదలగువారిని చూడుము. ఎన్నో జన్మల పుణ్యము చేత కనిపించెడి ఆశ్చర్యమైన ఈ రూపము చూడుము.  సర్వ జగత్తు మరియు అందలి చరాచర జీవుల సమూహమును ఒక్కటిగ నా శరీరమందే ఉన్నట్లు చూడగలవు. ఇష్టమొచ్చిన దేనినైన నాయందే చూడుము.

శ్లోకం 8: న తు మాం శక్యసే ద్రష్టు మనే నైవ స్వచక్షుషా |

దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగ మైశ్వరమ్ ||

(పరమాత్మ, నిరాకారము) 

భావము : అయితే నీకున్న కన్నులతో నన్ను చూచుటకు శక్యము కాదు. నీకు దివ్యమైన కన్నుల నిచ్చెదను. నాయొక్క ఈశ్వర స్వరూపము వాటిచే చూడుము.

వివరము : అర్జునుని కోరికమేరకు తన రూపమును చూపెదనని భగవంతుడు ఒప్పుకొన్నాడు. అయితే నానా విధములైన ప్రపంచము సర్వము ఒక్కటిగ తన దేహములోనే చూడగలవని చెప్పుచు, అలా చూచుటకు నీ శరీరమునకున్న కన్నులు పనికిరావని చెప్పాడు. చూడబడునది విశ్వరూపము, చూడవలెననుకొన్నవి మామూలు కన్నులు. కన్నులు కొంత దూరములో కొంత పరిధిలో చూచుటకు యోగ్యమైనవి. విశాల ప్రపంచమును ఒక్కమారుగ చూచుటకు కన్నులకు శక్తిలేదు. విశ్వరూపమంటే భగవంతుడు చూచాయగ చెప్పుచు ఎన్నో భూగోళములు, ఎన్నో సూర్యగోళములు, ఎన్నో ప్రళయములు, ఎంతో అంతులేని నానా వర్ణములు, నానా ఆకృతులు గల జగత్సర్వము అన్నాడు. 12 ఓల్ట్సు లైటు ప్రకాశమును నేరుగ కన్నులు చూడలేవు. కొద్దిపాటి ప్రకాశమునే చూడలేని కన్నులు సూర్యగోళమును చూడగల్గునా? అదియు ఎన్నో సూర్యులు ఒక్కమారుగ ఒక్క దృశ్యముగ కనిపిస్తే మనకున్న కన్నులు చూడగలవా? చూడలేవు. అందువలననే శ్రీకృష్ణుడు అర్జునునితో నీ కన్నులు చూచుటకు తగవు అన్నాడు. అయితే ఈ కన్నులు పనికిరానపుడు అర్జునుని కోర్కెనెరవేరుటెట్లు? అంత ఇష్టముగ అడిగిన కోర్కె నెరవేరాలంటే ఎంతో గొప్పదైన విశ్వరూపమును చూడగల్గు ప్రత్యేకమైన కన్నులు కావాలి. ఆ ప్రత్యేకమైన కన్ను మనకున్నది అది అందరికి ఉన్ననూ ఉన్నా లేనట్లేనని చెప్పవచ్చును. ఎందుకనగా! ఆ మూడవకన్ను అందరికి మూయబడి వున్నది. ఎక్కడో కొందరికి తెరువబడి, శుక్లాలు వచ్చి కొందరికి ఉన్నప్పటికి, పొరలువచ్చి కొందరికి కాయలు కాచి కొందరికి ఉన్నది. మూడవకన్ను తెరవనివారు తెరిస్తే కనిపిస్తుంది కాని తెరిచిన వారి గ్రుడ్డితనమునకు వైద్యము చేస్తేగాని కనిపించదు. ఇలా అందరికి వున్నా లేనట్లున్న ప్రత్యేకమైన కన్నును తెరిపించి, దానికి స్వచ్ఛమైన చూపును ప్రసాదించవలసినది పరమాత్మయే. ప్రత్యేకమైన చూపులేని అర్జునికి పరమాత్మయే కన్ను తెరిపించి కొద్దిసేపు చూపుకల్గించి తనను చూచునట్లు చేశాడు.  దివ్యమైన కన్నును ఇస్తున్నాను చూడుము అనిన శ్రీకృష్ణుడు ఏమి చూపాడో అది చూచిన అర్జునుడు ఈ విధముగా అంటున్నాడు.

సంజయుడిట్లనియె : - 

శ్లోకం 9: ఏవ ముక్త్వాత తో రాజన్! మహాయోగేశ్వరో హరి: |

దర్మయామాస పార్థాయ పరమం రూప మైశ్వరమ్ ||(కల్పితము)

శ్లోకం 10: అనేక వక్త్ర నయన మనేకాద్భుత దర్శనమ్ |

అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్ || (కల్పితము)

శ్లోకం 11: దివ్య మాల్యామ్బరధరం దివ్యగన్ధానులేపనమ్ |

సర్వాశ్చర్యయమయం దేవ మనన్తం విశ్వతోముఖమ్ || (కల్పితము)

శ్లోకం 12: దివి సూర్య సహస్రస్య భవే ద్యుగపదుత్థితా |

యది భా స్సదృశీసా స్యా ధ్భాసస్తస్య మహాత్మనః || (కల్పితము)

శ్లోకం 13: తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్త మనేకధా |

అపశ్యద్దేవదేవస్య శరీరే పాణ్డవస్తదా || (కల్పితము)

శ్లోకం 14: తత స్స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః |

ప్రణమ్య శిరసా దేవం కృతాంజలి రభాషత || (కల్పితము)    

అర్జునుడిట్లనియె : -

శ్లోకం 15: పశ్యామి దేవాంస్తవ దేవ! దేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ |

బ్రాహ్మణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వా నురగాంశ్చ దివ్యాన్ || (నిరాకారము)

శ్లోకం 16: అనేకబాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో ఽనన్తరూపమ్ |

నాన్తం న మధ్యం నపున స్తవాదిం పశ్యామి విశ్వేశ్వర! విశ్వరూప! ||

(నిరాకారము)

భావము : దేవదేవా! సర్వదేవతలను, సర్వజీవరాసుల సమూహములను, బ్రాహ్మణులను, ఈశ్వరులను మరియు పద్మాసనములో కూర్చున్న ఋషులను, గొప్పవైన ఎన్నో సర్పములను నీ దేహమందు చూచితిని.  ఓ విశ్వేశ్వర! విశ్వరూప! అనేకమైన చేతులు, కడుపులు, ముఖములు, కన్నులు కల్గి అంతట అనంతరూపమైన మరియు ఆది మధ్య అంతము లేని నిన్ను చూడగల్గితిని.

వివరము : ఇక్కడ ఎనిమిదవ శ్లోకము నుండి పదిహేనవ శ్లోకమునకు వచ్చాము. మధ్యలో గల ఆరు శ్లోకములు సంజయుడు చెప్పాడన్న వాటిని మేము చెప్పలేదు. భగవద్గీతలో ధృతరాష్ట్రుని, సంజయుని పాత్ర ఏమాత్రము లేదని మొదటనే చెప్పాము. అందువలన సంజయుని ఆరు శ్లోకములు ఇక్కడ వర్జితమైనవని గ్రహించవలెను.  శ్రీకృష్ణుడు అర్జునుని జ్ఞాననేత్రమునకు చూపు ఇచ్చిన తరువాత భౌతికమైన కన్నులు మూసుకొనగ ఆ కన్నులకు చీకటి ఏర్పడినది. మూడవకన్నుకు వెలుతురు కల్గి చూడగలిగాడు. అప్పుడు అర్జునునకు కనిపించిన దృశ్యమును గురించి తనేమి చూచాడో, ఆ విషయమును అక్కడేనున్న శ్రీకృష్ణునికి చెప్పుచుండెను. ఉదాహరణకు అంజనము చూచువాడు ప్రక్కనున్నవారికి అంజనములో తనేమి చూస్తున్నాడో దానిని చెప్పినట్లు, అర్జునుడు కూడ ఆ సమయములో తనేమి చూస్తున్నాడో దానిని చెప్పగలిగెను.  సమస్త దేవతలను, సమస్త మనుషులను, బ్రాహ్మణులైన ఈశ్వరులను, పద్మాసనముననున్న సమస్త ఋషులను, ఎన్నో గొప్ప సర్పములను చూచానని ఒకమాటన్నాడు. విశ్వరూపము చూచినపుడు అర్జునుడన్న మొదటి మాటలో విశ్వరూపము యొక్క గొప్పతనమేమిటో కొద్దిగ అర్థము కాగలదు. పూజింపబడు దేవతలు, పూజించు మనుషులు అందరు ఒకనియందేగలరన్నపుడు ఆ ఒక్కడు అందరికంటే విశాలమైనవాడని తెలియుచున్నది. అంతేకాక బ్రహ్మజ్ఞానముగల ఈశ్వరులు, పద్మాసనముననున్న ఋషులు ఉన్నారనుటలో బ్రహ్మజ్ఞానము అన్ని జ్ఞానములలో గొప్పది. ఈశ్వరులనగ అధిపతులు, కోటీశ్వరులు మొదలుకొని యోగీశ్వరులు వరకు గల ఈశ్వరులు, అదియు గొప్పదైన బ్రహ్మజ్ఞానముగల వారు ఆయనయందు కనిపించారు. ఋషులు యోగము చేయువేళ పద్మాసనము ధరించుచుందురు. అలా కమలాసనము గల గొప్ప ఋషీశ్వరులు కూడ ఆ రూపములో భాగమై కనిపించినపుడు బ్రహ్మజ్ఞానులకంటెను, యోగీశ్వరులకంటెను, ఋషీశ్వరులకంటెను ఆ రూపము గొప్పదని, పవిత్రమైనదని తెలియుచున్నది. విశాలమైనదని, పవిత్రమైనదని మొదటి మాటలోనే విశ్వరూపమును గురించి తెలియుచున్నది. ఇంకనూ గొప్ప సర్పములు కూడ ఉన్నవని చెప్పారు. సర్పములను చూస్తూనే మరణమును చూచినట్లగును. వాటి ఆకారమే భయమును పుట్టించునదిగ ఉండును. అలాంటి భయంకర సర్పములు కూడ అందులో కలవంటే ఆ రూపము దేనికి భయపడునదికాదని, దేనికి తక్కువదికాదని తెలియుచున్నది. మొదటి శ్లోకములోనే పరమాత్మ నిరాకారమును గూర్చి అన్నిటికంటే విశాలమైనదని అన్నిటికంటే పవిత్రమైనదని, అన్నిటికంటే భయంకరమైనదని కూడ తెలియుచున్నది. విశాలమైన పవిత్రమైన మరియు భయంకరమైన ఆ రూపును గురించి అర్జునుడు రెండవ మాట ఏమన్నాడో క్రింద చూస్తాము.  విశ్వమంతయు ఏకరూపమైనప్పుడు అందులో ఉన్నవన్ని ఆ రూపములోని భాగములేయగును. సమస్త ప్రాణులు ఆ రూపములోనివే అయినపుడు వాటికున్న చేతులు, వాటికున్న తలలు, వాటికున్న కడుపులు, వాటికున్న కన్నులు అన్నియు ఆ రూపమునకున్నవియగును. అన్ని ప్రాణుల అవయవములు ఆ ఒక్క రూపమే అయినపుడు అనేక చేతులు, కడుపులు, కన్నులు, కాళ్ళు, తలలు కల్గిన ఆ రూపును విశ్వరూపమనడములో తప్పులేదు. ఆశ్చర్యమును కల్గించు ఆ రూపును చూచిన అర్జునుడు మొదలు, మధ్యము, తుది ఏదీ తెలియలేదని అన్నాడు. ఎక్కడ చూచిన తలలు, కాళ్ళు, కడుపులు కనిపిస్తున్నాయి. ఆకారమునకు మొదలు కాళ్లన్ని ఒకచోట మధ్యమము అయిన కడుపులన్ని ఒకచోట, చివరవైన తలలన్ని ఒకచోట కనిపించి వుంటే విశ్వరూపము ఇక్కడ మొదలని, ఇక్కడ మధ్యమని, ఇక్కడ అంత్యమని చెప్పవచ్చును. అట్లుకాక అంతట అన్ని అవయవములతో వ్యాపించివున్న ఆకారమును ఆది మధ్యాంత రహితుడని చెప్పవచ్చును.  కొలతలేనటువంటి, ఇంతవరకే వ్యాపించివున్నదని చెప్పలేని ఆ రూపము తేజస్సుకు కేంద్రమైనట్లు ప్రకాశించుచు, చూచుటకు సాధ్యముగాని, సూర్యప్రకాశమును పోలి సమానముగ వ్యాపించివున్నదని కూడ అర్జునుడు చెప్పాడు. ఈ మాటలో పరమాత్మ నిరాకారము పరిధిలేనిదని తెలియడమేకాక, ప్రకాశమును కూడ కల్గియున్నదని తెలియుచున్నది.  పరిధిలేని విశాలమైన, సమస్త రూపులు తనవైన, భయంకరమైన, ప్రకాశ వంతమైన, విశ్వరూపుడైన పరమాత్మ నిరాకారమును చూచిన తరువాత అర్జునునకు ఏమి అర్థమైనదో ఆ విషయమును చెప్పుచున్నాడు.    

శ్లోకం 17: కిరీటినం గదినం చక్రిణం చ తేజో రాశిం సర్వతోదీప్తి మన్తమ్ |

పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమన్తా ద్దీప్తానలార్కద్యుతి మప్రమేయమ్ ||

 (అశాస్త్రీయము)

భావము : విశ్వరూపమునకు ప్రత్యేకించి ఒక తల లేదు. అట్లే ప్రత్యేకించి రెండు చేతులు కూడ లేవు. అందువలన కిరీటము ధరించడము గద, చక్రముకల్గి వుండడమను మాట అశాస్త్రీయమై పోవుచున్నది. గద, చక్రము, కిరీటము దేవతలలోని విష్ణువుకుండవచ్చును. కాని విశ్వరూపమునకుండవు. విశ్వరూపమును, విష్ణురూపముగ గుర్తించునట్లుగ చేసిన ప్రయోగమే ఈ శ్లోకమని చెప్పవచ్చును. దేవతలలో గొప్పవాడైన విష్ణువుకు దేవతలకు దేవుడైన పరమాత్మకు చాలా దూర భేదమున్నదని తెలియాలి.  పైన 16వ శ్లోకములో అనేక బాహూదర వక్త్రనేత్రం అన్నపుడు దానికి వ్యతిరేఖముగ కిరీటినం గదినం చక్రిణంచ అని వ్రాయడము సరియగునా? అందువలన ఈ శ్లోకమును తీసివేయడము జరిగినది.    

శ్లోకం 18: త్వ మక్షరం పరమం వేదితవ్యం త్వ మస్య విశ్వస్య పరం నిధానమ్ |

త్వ మవ్యయ శ్శాశ్వతధర్మగోప్తా సనాతన స్త్వం పురుషో మతోమే || 

(నిరాకారము)

భావము : నీవు అక్షరుడవు. తెలియదగిన పరము నీవే. విశ్వమునకు ఆధారమైన వాడవునీవే. శాశ్వతముగ అవ్యయుడవు. ధర్మరక్షకుడవు నీవే. పురాతనము నుంచి నీవే పురుషునిగ ఉన్నావని నేను తలచుచున్నాను.

వివరము : మొదట లోపల కనిపించు ఆకారమును గూర్చి చెప్పిన అర్జునుడు, ఆ కనిపించునది శ్రీకృష్ణుడేనని ఒక్కమారు అనుమానము లేకుండ నిర్ణయమున కొచ్చినవాడై, నీవు నాశనములేనివాడవు అన్నాడు. ఆ దర్శనములోనే బయటనున్న శ్రీకృష్ణుడే లోపల కనిపించు విశ్వాకారమనుకొనిన అర్జునుడు, అంతవరకు విన్న అక్షరుడు ఈయనేనని తెలిసినవాడై, మోక్షము పొందకోరినవారు తెలియదగిన పరమపదము నీవే అన్నాడు. పరమాత్మకున్న అర్హతలన్ని శ్రీకృష్ణునకున్నవని తలచినవాడై నీవే జగతికి ఆధారము. నీవే ధర్మసంస్థాపకుడవు, మూలకర్తవు, పురుషోత్తముడవు అన్నాడు.

శ్లోకం 19: అనాది మధ్యాన్త మనన్త వీర్య మనన్త బాహుం శశీసూర్యనేత్రమ్|

పశ్యా మిత్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపన్తమ్ ||

(నిరాకారము)

భావము : మొదలు, నడుమ, చివరలేనివాడుగను. అనంత మగతనము గలవాడుగను. అనంత బాహువులు గలవాడుగను, సూర్యచంద్రులు కన్నులుగ ఉన్నవాడుగను, ప్రకాశించు అగ్నివలె ముఖముగలవాడుగను, స్వతేజస్సుచే జగతిని తపింప జేయువాడునుయైన నిన్ను చూడగలిగితిని.   

శ్లోకం 20: ద్యావాపృథివ్యో రిద మన్తరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చసర్వాః |

దృష్ట్వాఽ ద్భుతం రూప ముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్! ||

(నిరాకారము)

భావము : భూమికి, ఆకాశమునకు, వాటి రెండిటి మధ్యను మరియు దిశలకెల్లను వ్యాపించివుంటివి నీవు. చూచుటకు అద్భుతముగను భయంకరముగనున్న నీ ఆకృతిచే ముల్లోకములు భయపడుచున్నాయి.

వివరము : చూచుటకు భయంకరముగనున్న విశ్వరూపు వలన ముల్లోకములు వ్యథచెందినట్లు చెప్పియున్నారు. ఇచట చూచువారు అర్జునుడొక్కడేనని మరువరాదు. ముల్లోకములలోనివారు చూడనూ లేదు. ఎవరు భయపడనూలేదు. అలాంటపుడు భయపడినదెవరు? అను ప్రశ్నరాకమానదు. దానికి జవాబు లోకమనగా ఒక గుణభాగమని, ముల్లోకములనగా మూడు గుణభాగములని తెలియాలి. విశ్వరూపము జ్ఞానస్వరూపమైనది. అందువలన మూడు గుణముల సారాంశమైన 'మాయ' విశ్వరూపమునకు భయపడగలదనియే చెప్పవచ్చును. విశ్వరూపము ఎప్పటికీ గలదు మాయ ఎప్పటికి దానికి భయపడుచూనే ఉంటుంది. అర్జునుడు జ్ఞాననేత్రముచే చూచాడు కావున ఆ విషయమే ఆయనకర్థమైనది. అంతేకాని ముల్లోకములంటే ఏవో గలవని ఊహించుకోకూడదు. అంతేకాక క్రింది శ్లోకములో చెప్పు యక్ష, కిన్నెర,కింపురుష, గరుడ, గంధర్వ, వసువులు, సిద్ధులు, సాధ్యులు, దేవతలు, రాక్షసులు అను మొదలగు తెగలన్ని మనకు కనిపించు మానవ జాతిలోనివేనని తెలియాలి. వీరందరు అర్జునుడు చూచినట్లు విశ్వరూపమును చూడలేదని మరువకూడదు. క్రింద 22వ శ్లోకములో 'వీక్షన్తే' అనుమాటకు ప్రత్యక్షముగ చూచుట అని అర్థము చేసుకోకూడదు. జ్ఞానము ద్వార తెలియుట వలన అని అర్థము చేసుకోవాలి.

శ్లోకం 21: అమీహిత్వాం సురసంఘా విశన్తి కేచిద్భీతాః ప్రాంజలయో గృణన్తి |

స్వస్తీత్యుక్త్వా మహర్షి సిద్ధసంఘాఃస్తువన్తి త్వాం స్తుతిభిఃపుష్కలాభిః || 

(నిరాకారము)

శ్లోకం 22: రుద్రాదిత్యా వసవోయే చసాధ్యా విశ్వేఽశ్వినౌ మరుత శ్చోష్మపాశ్చ |

గన్ధర్వ యక్షాసురసిద్ధ సంఘా వీక్షన్తే త్వాం విస్మితాశ్చైవసర్వే ||

(నిరాకారము)

భావము : దేవతా సమూహములు నీయందు ప్రవేశిస్తున్నారు. కొందరు భయముచే నిన్నుమ్రొక్కుచున్నారు. సిద్ధులైన మహర్షులు స్వస్తి చెప్పుచు సంతసమున స్తుతించుచున్నారు.

వివరము: దేవతలు కర్మనంత అయిపోగొట్టుకొని పరమాత్మయందు చేరుచున్నారు. కొందరు మనుజులు దైవమొకడున్నాడని, తమ తప్పులకు ఆయన శిక్షించునని తలచినవారై, భక్తిచే కాక భయముచే మ్రొక్కుచున్నారు. మరికొందరు మోక్షము పొందుటకు అర్హులైన ఋషులు స్వస్తి అనగ అయిపోయినదని అర్థమొచ్చునట్లు పల్కుచు స్తుతించుచున్నారు. స్వస్తి అనుపదము స్వాహా అను పదమునకు దగ్గర సంబంధమైనది. వీటికి సరియైన పదము గోవింద అని కూడ చెప్పవచ్చును. తెలిసినవారు ఇహములో అన్ని కర్మలు అయిపోచేసుకొని మేము మీవద్దకు వచ్చుటకు సిద్ధముగ వున్నామని తెల్పుచు స్వస్తి అనిగాని, గోవింద అనిగాని స్తుతించుచున్నారు. కొందరట్లుండగ మరికొందరైన రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, అశ్వనీదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, దేవతలు సిద్ధులు అనువారు ఆశ్చర్యముగ పరమాత్మను గూర్చి ఆయన యోగమును గూర్చి ఆలోచించుచున్నారు.    

శ్లోకం 23: రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో! బహుబాహూరుపాదమ్ |

బహూదరం బహుదం ష్ట్రాకరాళం దృష్ట్వా లోకాహ ప్రవ్యథితా స్తథాఽహమ్ ||

(నిరాకారము)

భావము : బహుముఖములు, నేత్రములు అనేకములైన బాహువులు, తొడలు, పాదములు గలదియును, అనేక భయంకరమైన కోరలుగల నీ ముఖము చూచుట వలన లోకులందరు భయముచెందినారు. మరియు నేనుకూడ భయపడి పోవుచున్నాను.

వివరము : ప్రపంచములోని అందరి ఆకారములు పరమాత్మవేయై ఒక్క రూపమున కనిపించుటవలన, సహజముగ ఎవరు ఎక్కడ చూడని అసాధారణ రూపమును చూచుట వలన అర్జునునికి భయముకల్గినది. భయంకరమైన కోరలు గల ముఖము అనడములో కొంత అర్థము గలదు. పరమాత్మకు ప్రత్యేకించి కోరలుగల ముఖములేదు. ఆయనకు మనవలె ముఖముంటే కాళ్ళు చేతులువుండి కొంత పరిధిగల ఆకారమేర్పడగలదు. వాస్తవముగ పరమాత్మకు పరిధిగల రూపములేదు. అందువలన ఆయనకు ముఖము అందులోని కోరలు అసలులేవు. మీరు ముఖమే లేదంటున్నారు శ్లోకములో 'బహుదం ష్ట్రాకరాళం' అనేకమైన భయంకర కోరలు అనుమాట ఉపయోగించి చెప్పబడినది కదా! అని అడుగవచ్చును. వాస్తవమే ఆ మాట ఇక్కడ ఉపయోగించడములో మామూలు అర్థము కాక విశేషార్థమున్నదని తెలియవలసి ఉన్నది. ఆ విశేషార్థమేమనగా!  సాధారణమైన ఆకారమై అందరివలె కాళ్ళు, చేతులు, తల, ముఖమువుంటే అది సాధారణ కన్నులకే కనిపించేది. అక్కడ కనిపించు దృశ్యము అసాధారణ మైనది. కన్నులతో చూడబడు దృశ్యమున్నట్లుండదు. అందువలన ఎవరూ చూడలేని దానిని నీకు చూపుచున్నానని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ దృశ్యము కాలము మరియు ప్రపంచపరిమాణముల రెండింటిని కలబోసుకొని ఉన్నదని ముఖ్యముగ తెలియాలి. జరుగుచున్న ప్రస్తుతకాలము, జరిగెడి ప్రపంచ ప్రస్తుత పరిమాణముల కలయికైన ఆ ఆకృతి వర్ణనాతీతము. ప్రపంచ కొలతల గురించి ఏ ఖగోళశాస్త్రజ్ఞులు ఇంతవరకు చెప్పలేదు. చెప్పగలరను నమ్మకములేదు. కాలమునకు సెకండ్ల నుండి గంటల వరకు కొలతను కనిపెట్టినవారు అసలు కాలమంటే ఏమో చెప్పలేకపోయారు. విడివిడిగనే అవగాహన కాని ప్రపంచ కొలత మరియు కాలము రెండు కలసి ఉండుటను ఒకేమారు దృశ్యరూపముగ కనిపించిన చూచి గ్రహించుటకు సాధ్యమగునా? ప్రపంచములో ఎవరికి అవగాహన కాని ఆ దృశ్యమును అర్జునుడు చూచుట గొప్ప అదృష్టమని చెప్పవచ్చును.  ఇప్పుడు అసలు విషయానికొస్తాము. ఏ జీవరాసికైన నోటిలోని కోరలు వాటికి ప్రత్యేకమైన ఆయుధములని చెప్పవచ్చును. దాదాపు సమస్త జంతుజాలములకు కోరలు ఆయుధములుగ ఉపయోగపడుచున్నవి. ఒక ప్రాణి మరొక ప్రాణిని వేటాడి హింసించడములో వాటి నోటిలోని కోరలు ప్రధానపాత్రవహిస్తున్నవి. అట్లు ఎక్కువగ హింసకు ఉపయోగపడు కోరలు భయంకరమైనవని చెప్పవచ్చును. అంతేకాక ఒక ఆకారమును పూర్తిగ నుజ్జు చేసి, దాని ఆకృతిని పూర్తిగా మార్చివేయగలవి దంతములు. ఉన్న ఆకారమును లేకుండ చేయుటలోను, ఒక జీవరాసిని హింసించడములోను ప్రధానపాత్రకల్గిన దంతములు భయంకరమైనవే అగును. భూమి మీద జీవరాసులకున్న కొద్ది పరిమాణముగల దంతములే భయంకరమైనవిగ ఉండగ, కాలముతో పరిమాణముతో కలిసియున్న ఆ ఆకృతి యొక్క దంతములెంత భయకరముగ ఉండునో! విశ్వరూపమునకున్న కాలపరిమాణముతో కలిసిన దంతములెట్లుండునో, వాటి అవగాహన అర్జునునకెట్లయినదో, కొంత యోచించి మన యోచనాచూపుకందిన దానిని తెలుసుకొందాము.  జీవరాసులు ఎక్కడ మరణిస్తున్నవో అక్కడ పరమాత్మ కోరలలో నలిగినట్లే. ఎక్కడ జీవరాసుల శరీరములు నశించి మృత్యువాతనపడుచున్నవో, అక్కడ పరమాత్మ కోరలలో నలిగినట్లే. ఎక్కడ ప్రమాదముల కారణమున జీవుల శరీరములు నలిగి పోవుచున్నవో, ముక్కలు ముక్కలు కావింపబడుచున్నవో, అక్కడ పరమాత్మ కోరలలో నలిగిపోయినట్లేనని తెలియాలి. ఒక లెక్కప్రకారము మృత్యువునే పరమాత్మ నోటి దంతములనుకొందాము. ఎన్నో రకముల మృత్యువులు ఎంతో భయంకరముగ ఉండును. అందువలన ఆయన కోరలు భయంకరముగ ఉన్నాయని తెలియాలి. ఈ ఒక్క ఆధారమును బట్టి అర్జునుడు చూచిన రూపము ప్రత్యేకమైనదని తెలియుచున్నది. ఆ రూపమునకు మనవలె శరీరములేదని, మనకున్నట్లు నియమిత స్థానములవలె కాళ్ళు చేతులులేవని అర్థమగుచున్నది. ఒక్కొక్కప్పుడు జరుగు పెద్ద ప్రమాదములలో కొన్ని వేలమందో వందలమందో చనిపోవు సంఘటనలు భయంకరముగనుండును. ఇటువంటి భయంకరములను చూచి ప్రజలు భయపడు చున్నారనుటనే, నిన్ను చూచి ప్రజలు భయపడుచున్నారని అర్జునుడన్నాడు.    

శ్లోకం 24: నభస్స్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ |

దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితా న్తరాత్మా ధృతిం న విన్దామి శమం చ విష్ణో! || 

(నిరాకారము)

శ్లోకం 25: దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వెవ కాలానలసన్నిభాని |

దిశోన జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ! జగన్నివాస!||

(నిరాకారము)

భావము : ఆకాశము వరకు వ్యాపించిన అనేక రంగులు గలవాడవు, తెరిచిన నోరు గలవాడవు, ప్రకాశించుచున్న విశాలనేత్రములు గలవాడవునైన నిన్ను చూచుటచే నాలో భయము, బాధకల్గుచున్నది. శాంతి, ధైర్యము లేకుండ పోయినది. భయంకరమగు కోరలుగల నీముఖము కాలాగ్నివలె కనిపించుచున్నది. దానిని చూచుట వలన దిక్కు తెలియలేదు. సౌఖ్యము తెలియలేదు.

వివరము : అసాధారణమైన ఆ రూపము అర్జుననకు ఆకాశమువరకు కనిపిస్తున్నది. ఆకాశము వరకు వ్యాపించు అనేక రంగులు కాంతులు, ఇంద్రధనస్సు, మేఘముల ఆకృతులు అన్ని ఆయన రూపముగ కనిపిస్తున్నవి. ఆకాశములో తుఫాను ముందు వాతావరణము, నల్లని మేఘములు కమ్ముకరావడము, సూర్య ప్రకాశమే దృష్ఠిగ, మృత్యువునాహ్వానించు సంఘటనలే ముఖద్వారముగ మొదలగు దృశ్యములన్ని ఆ రూపములో కనిపించుట వలన అర్జునుడు భయపడసాగెను. ధైర్యము ఏమాత్రము లేకుండపోయినది, ఆపద సమయములో కల్గు భీతి కల్గసాగినది. అనేక భయంకర మృత్యుసంఘటనలే అనేక కోరలుగ కనిపించిగ, కాలమే అగ్నిగ తోచగ, మృత్యువే ముఖద్వారముగ, తెరిచిన నోరుగ, జ్ఞానదృష్టికి తెలియగ అర్జునునికి పూర్తి భయమేర్పడినది. అగ్ని అనగ అన్నిటిని కాల్చి వాటి పేరు రూపము లేకుండ చేయునది. కాలము అగ్నివలెనున్నది. ఈ కాలాగ్ని ఈ రోజు ఉన్నవాడిని రేపటికి, నిన్న ఉన్నవాడిని ఈ రోజుకు లేకుండ చేయుచున్నది. కాలమనెడి అగ్నిలో ఎందరో కాలి కనుమరుగైపోయారు. జరిగెడి కాలములో ప్రతిదినము ఎందరో మృత్యువు పొంది కనిపించక పోవు విధానమే తెరిచిన నోరుగ, కనిపించు కోరలుగ అర్థమగుచున్నది. మృత్యువు ఎల్లవేళల కాచుకొని ఉండడమే తెరచిన నోరని, జరుగు ప్రమాదములే కోరలని, జరిగిన కాలమే కాలగర్భమని, ఆయన ఉదరమని అర్జునునకర్థమైనది. మనకళ్ళెదుట ప్రమాదము జరిగి ప్రాణనష్టమైతేనే మనము చూడలేముకదా! కనిపించు గాయములతో బాధపడువారిని చూచి మనసు కలత చెందుట సహజమే. చిన్న సంఘటనలే చూచుట కష్టమైనపుడు అర్జునుడు జగతిలో జరుగుచున్న మృత్యు సంఘటనలన్ని ఒకేమారు చూచుటవలన భీతిల్లిపోయాడు. మనస్సు కలతచెంది పోయింది. దిక్కు తెలియలేదన్నాడు. ఇంకా ఏమనుచున్నాడనగా! క్రింది శ్లోకము చూడుము.

శ్లోకం 26: అమీచ త్వాం ధృతరాష్ట్ర స్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః |

భీష్మోద్రోణ స్సూతపుత్ర స్తథా ఽసౌ సహాస్మదీయై రపి యోధముఖ్యైః ||

(నిరాకారము)

శ్లోకం 27: వక్ర్తాణి తేత్వరమాణా విశన్తి దం ష్ట్రాకరాళాని భయానకాని |

కేచి ద్విలగ్నా దశనాన్తరేషు సందృశ్యన్తే చూర్ణితై రుత్తమాంగైః ||

(నిరాకరము)

భావము : ధృతరాష్ట పుత్రులగు దుర్యోధనాదులందరు, మిగతా రాజుల సమూహము, భీష్ముడు, ద్రోణుడు,కర్ణుడు ఇటువైపు మన యుద్ధవీరులైన ముఖ్యులు అందరు వేగముగ భయంకరముగనున్న నీ ముఖముల కోరలలో ప్రవేశించుచున్నారు. కొందరేమో కోరలమధ్య తగుల్కొని చూర్ణము చేయబడినవారై తలలు మాత్రము కనిపిస్తున్నవి.

వివరము : ఈ 27వ శ్లోకములో ఎంతో వివరము తెలియవలసి వున్నది. ఈ అధ్యాయములో ఈ 27వ శ్లోకమే చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చును. విశ్వరూపము యొక్క అవగాహన అంతో ఇంతో దీనియందే తెలియవలసివున్నది. కావున జాగ్రత్తగా తెలుసుకోవలెనని తెలుపుచున్నాము.  అక్కడ యుద్ధరంగములో ఉన్న రెండువైపుల సైన్యములోనివారు భీకర భయానకమైన ముఖములోని నోటియందు వేగముగ ప్రవేశించుచుండుట అర్జునుడు తెలుసుకొన్నాడు. సైన్యములు రెండు యుద్ధము చేయుచుండగ, అటు ఇటు వైపునుండి ఎందరో సైనికులు రాజులు మరణించుట జరుగుచున్నది. వీరేకాక భూమిమీద ఎందరో ఆ సమయములో మరణించుట జరుగుచున్నది. మరణించు వారందరు పరమాత్మ నోటిలోనికి వేగముగ పోయినట్లు అర్జునునకు తెలియుచున్నది. మృత్యు గుహవలెనున్న నోటిలో భయంకరమైన కోరలలో నమలబడి నుజ్జు నుజ్జయినవారై, పరమాత్మ గర్భమైన కాలగర్భములోనికి జారి కనిపించకుండ పోవుచున్నారు. అలాగ ప్రతిక్షణము పరమాత్మ కాలమై తన గర్భములోనికి మ్రింగివేయుచున్నాడు. అహర్నిశలు అలా జరుగుచునేవున్నది. అలా జీవరాసులు చూర్ణమై కనిపించకపోవు ఈ ప్రక్రియలో కొందరు మృత్యుకోరలలో నలిగిపోయి కాలగర్భములో కలిసి పోయినప్పటికి, వారి శరీరములు కనిపించకపోయినప్పటికి, వారి తలలు కోరల మధ్యలో చిక్కుకొని ఫలానా వారివని గుర్తించునట్లు కనిపిస్తూనేవున్నవి. ఎందరో మృత్యుకుహూరములో ప్రవేశిస్తు కోరలచేత నమలబడి ఏమాత్రము తెలియకుండ వారి అడ్రస్ లేకుండ కాలగర్భములో కలిసిపోవుచున్నారు. అలాంటి భయంకర కాలముఖములో మృత్యుకోరల మధ్యలో చిక్కుకొని మరణించి నప్పటికి, వారి శరీరములు కాలాగ్నిలో కాలిపోయినప్పటికి, పళ్ల మధ్యలో చిక్కుకొని గుర్తింపు పొందిన తలలు కొన్ని ఉండుట విశేషము. ఆనాడు అర్జునుడికే కాదు మనకు కూడ కొందరు కోరల మధ్య చిక్కుకొన్నవారు కనిపిస్తున్నారు. నాకే కాదు మనోనేత్రము తెరిచిచూస్తే మీకు కూడ కనిపించగలరు.  నిత్యము కోట్ల సంఖ్యలో జీవులు మరణము పొందుచున్నవి. ఇలా నిత్యము జరుగుట అందరి దృష్ఠికి తెలిసిన విషయమే. మరణిస్తున్న విషయము తెలిసినప్పటికి ఎందరు పోయారో, ఎవరు పోయారో తెలియదు. పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అన్నట్లు అడ్రస్ లేని వారెందరు చస్తున్నారో తెలియదు. అలా కాలాగ్నిలో కాలిపోయి కనిపించకుండ పోయిన వారిలో 1948 వ సంవత్సరము చనిపోయి కాలగర్భములో కలిసిపోయిన గాంధీ లేకున్న ఆయన గుర్తింపుకు మూలకారణమైన ఆయన తలయును కీర్తి కాలమను కోరలలో చిక్కుకొని కనిపిస్తూనేవున్నది. అందువలన ఆయన అందరికి తెలిసిన అడ్రస్సు అయినాడు. నిత్యము మృత్యు కోరలలో ఎందరో నలిగి కనిపించక పోవుచున్నప్పటికి కొందరు కోరల సంధులలో చిక్కుకొని కనిపిస్తున్నారని చెప్పుటకు గాంధీతాతే కాదు ఇంకా చాలా మంది వున్నారు. అటువంటి వారిలో మదర్ థెరిస్సా, సుభాస్ చంద్రబోస్, ఇందిరాగాంధీ మొదలగు ఈ కాలమువారే కాక పూర్వకాలములో పోయిన హరిశ్చంద్రుడు, శిభిచక్రవర్తి ఎందరో కనిపిస్తూనే ఉన్నారు. నేను చెప్పినవారు మీ దృష్ఠికి తెలియలేదా? అందరికి తెలుసును. అంతో ఇంతో కీర్తి సంపాదించుకొన్నవారు భూమి మీద స్థిరస్థాయిగ పేరున్నవారై నిలిచి పోవుదురు. వారు చనిపోయినప్పటికి గుర్తింపుగ తెలిసినట్లే ఉందురు.  రేపు నేను చనిపోయిన, కాలగర్భములో కలిసిపోయినా, గీత రచన చేసిన దానివలన, తెలియని ధర్మములు తెలిపిన దానివలన, కొందరికి జ్ఞానమార్గ దర్శకుడైన దానివలన, గుర్తింపుగ కొందరికైన, కొంత కాలమైన, కాలకోరలలో చిక్కుకొని కనిపిస్తుంటాము. నేను పోయిన తర్వాత కూడ నాకు కొంత అడ్రస్ ఉంటుంది. అలాంటి అడ్రస్ కోసము మీరు కూడ ప్రయత్నించండి. ఎందరో ధనికులు, రాజులు చక్రవర్తులు, నియంతలు కాలగర్భములో కలిసి పోయారు వారిలో కొందరు తప్ప మిగతావారంత ఎందరు పోయారో, ఎప్పుడు పోయారో, ఏమి చేశారో, ఎక్కడుండిరో తెలియక అడ్రస్ లేని వారైనారు. డబ్బు సంపాదనే ముఖ్యమనుకొన్నవారు ఎప్పటికి కనిపించరు. దినమునకు వేయిమణుగుల బంగారు సంపాదించిన వాడు కూడ కాలములో కనిపించకపోయాడు. అటువంటి సంపాదకుడే కనిపించక పోతే నీ సంపాదనెంత.? అందువలన ధనము సంపాదించువాడు గాని, అధికారము చూపించువాడు గాని, కాలములో గుర్తింపులేనివారేనని గ్రహించాలి. అంతో ఇంతో కీర్తి కల్గిన వారే కొంత కాలమైన కనిపిస్తారు. ఇది మన దృష్టికాగ అర్జునుని మనోచూపుకింకా ఏమి తెలిసినదో క్రింద చూస్తాము.    

శ్లోకం 28: యథా నదీనాం బహువోఽమ్బువేగా స్సముద్ర మేవాభి ముఖా ద్రవన్తి |

తథా తవామీ నరలోకవీరా విశన్తి వక్త్రాణ్య విభిజ్వలన్తి ||

(నిరాకారము)

శ్లోకం 29: యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశన్తి నాశాయ సమృద్ధవేగాః|

తథైవ నాశాయ విశన్తిలోకా స్తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః ||

(నిరాకారము)

భావము : ఏ విధముగ నదులన్ని సముద్రమువైపు అతివేగముగ ప్రవహిస్తు సముద్రములో పడుటకై ప్రయత్నిస్తున్నవో, అట్లే ఈ నరకంలోని వారందరు జ్వలించుచున్న నీ ముఖమువైపు పరుగిడుచు నీ ముఖములో ప్రవేశిస్తున్నారు. మండుచున్న అగ్నిలో మిడుతలు వేగముగ వచ్చి పడి కాలిపోయినట్లు, భూమి మీద జీవరాసులన్నియు ఆవిధముగనే వేగముగ నీ ముఖాగ్నిలో పడి మరణిస్తున్నాయి.

వివరము : పుట్టిన ప్రతి జీవరాసి చివరకు మరణము పొందవలసిందేనని అందరికి తెలుసు. మనవెనుక నీడవలె వెంటాడుతున్న మృత్యువు ఎల్లవేళల తన నోరు తెరచుకొనియేవున్నది. మనము ఎప్పుడైన ఆ నోటిలో పడవలసిందే. అయినప్పటికి ఆ విషయమును అందరు మరచిపోయారు. ఎల్లవేళల శాశ్వతముగ ఉండువారివలె మెలగుచున్నారు. ఎవరెట్లున్నా మృత్యువును గురించి తెలిసినప్పటికి మరియు తెలియనప్పటికి ప్రతివారు మృత్యువును పొందవలసిందే. అలా ప్రతి దినము మృతి పొందువారు సముద్రమువైపు నదులు ప్రవహించురీతి, పరమాత్మ నోటిలో ప్రవేశించుటకు పరుగిడునట్లు అర్జునునికి అర్థమైనది. అక్కడ మృత్యువు ఉన్నదనిగాని, పలాన కాలములో మృత్యువు వచ్చుననిగాని తెలియని మానవులు ఉన్నట్లుండి మృతి చెందుచున్నారు. మిడుతలు అగ్నిని చూచి చనిపోతామని తెలియక ప్రతిదినము ఎగిరినట్లే ఎగిరి అగ్నిలోపడి చనిపోవచున్నవి. వాటికి ఆ ప్రమాదము గురించిగాని, అక్కడా మరణమున్నదని గాని తెలియదు. కనిపించు ఆకర్షణ వస్తువు మీదికి నిత్యము ఎగిరినట్లే ఎగిరి అగ్నిలోపడి చనిపోవుచున్నవి. అలాగే మానవులు లేక జీవులు ప్రతిదినము ఉన్నట్లే ఉంటూ, అకస్మాత్తుగ మిడుతలవలె మరణిస్తున్నారు. మిడతలకు మండుచున్న అగ్ని అందముగ కనిపించునట్లు, జీవులకు మృత్యు సంఘటనలు కూడ మొదట అందముగనే కనిపించివుండును. మంటలో పడితే చస్తామని మిడుతలకు తెలియనట్లు, జీవునికి కూడ ఆ పనులలో మరణమున్నదని తెలియదు. నర సమూహములకు పరమాత్మ ముఖాగ్ని ఎన్ని ఆకారములలోనున్నదో తెలియదు. ఒకవేళ తెలిసిన తెలియకున్నా ఆ ముఖాగ్నిలో పడవలసిందే, ఆ నోటిలోని భీకర కోరల మధ్య నలిగి పోవలసిందే.

శ్లోకం 30: లేలిహ్యసే గ్ర సమాన స్సమన్తా ల్లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః |

తేజోభి రాపూర్వజ గత్సమగ్రం భాస స్త వోగ్రా:ప్రతపన్తి విష్ణో! ||

(నిరాకారము)

శ్లోకం 31: ఆఖ్యాహి మేకోభవానుగ్రరూపో నమోఽస్తు తేదేవ! వరప్రసీద |

విజ్ఞాతు మిచ్ఛామి భవన్త మాద్యం నహి ప్రజానామి తవప్రవృత్తిమ్ ||

(నిరాకారము)

భావము : మండుచున్న ముఖములచేత సమస్త జీవరాసులను మ్రింగుచున్నవాడవై సమస్తమును ఆస్వాధించుచున్నావు. నీ యొక్క కిరణములు జగత్తంతయు వ్యాపించి తపింపజేయుచున్నవి. ఉగ్రరూపుడవు నీవు ఎవడవో నాకు చెప్పుము. నీ ప్రవృత్తి నాకు తెలియకున్నది. ఆది పురుషుడైన నిన్ను నమస్కరించి తెలియకోరుచున్నాను.

వివరము : అర్జునుని జ్ఞానచూపుకు పరమాత్మ యొక్క ఔన్నత్యము పూర్తిగా అర్థము కాలేదు. మండుచున్న ముఖజ్వాలలచే సమస్తమును మ్రింగు పరమాత్మ అర్థము కాలేదు. ఆ పరమాత్మ కిరణముల వేడిమికి సమస్త జగత్తంతయు తపించుచుండుట, ఆ జ్వాలలో సమస్తము అంత్యమగుచుండుట చూచిన అర్జునునికి అంతవరకు అటువంటివాడున్నాడని తెలియక పోవడముచే ఈయనే శ్రీకృష్ణుడా! అసలు ఈ శ్రీకృష్ణుడెవరు? అను సంశయమేర్పడినది. వెంటనే అసలు నీవెవరు? నీ ప్రవర్తన ఏమిటో నాకర్థము కాలేదు. ముందు నీవెవరో నాకు తెలుపుము? అని ప్రశ్న వేశాడు. నీవెవరు అన్న ప్రశ్నకు పరమాత్మ, క్రింద జవాబిచ్చాడు.

పరమాత్మ ఇట్లనియె : -

శ్లోకం 32: కాలోస్మి లోకక్షయకృ త్ప్రవృద్ధోలోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః |

ఋతే ఽపి త్వాన భవిష్యన్తి సర్వేయే ఽవస్థితాః ప్రత్యనీకేషు యోధాః ||

(పరమాత్మ)

భావము : లోకములోని జీవులను నశింపచేయు బలమైన కాలమును నేను. జీవులను సంహరించుటే నా పని. ఇపుడు నీవు లేకపోయినను యుద్ధము చేయక పోయినను వీరు సంహరింపబడుదురు.

వివరము : అర్జునుడు నీవెవరు అన్న ప్రశ్నకు సమస్తమును నాశనము చేయు కాలము నేను అన్నాడు. పరమాత్మ ఇంతకు ముందే తనెంత మహిమ గలవాడో చెప్పియున్నాడు. అయినప్పటికి విశ్వరూపములో భయంకరముగ కనిపించడము వలన, ముందు విన్నదంతయు మరచిపోయి అనుమానమొచ్చి నీవెవరో తెలియ జెప్పమన్నాడు. ఆ మాటకు కాలమును నేనని పరమాత్మ జవాబిచ్చుటయే కాక నీ ప్రవృత్తేమని అడిగిన దానికి జవాబుగ, నా పని జీవుల శరీరములను నాశనము చేయడమే అన్నాడు. అంతేకాక కర్మరీత్య భౌతికశరీరమును వదలవలసి వచ్చినపుడు తప్పక ఏదో ఒక విధముగ మృత్యువు చెందవలసిందే. అచట రాజులు, సైనికులు కర్మరీత్య మరణించవలసివున్నది. కావున అర్జునుడు యుద్ధము చేయకున్నను సంహరింపబడువారు తప్పక సంహరింపబడవలసిందే. కనుక పరమాత్మ అర్జునునితో నీవు ఇక్కడ యుద్ధము చేయకున్నను వారి ఆయువు మూడినది. వారు చావక తప్పదన్నాడు.

శ్లోకం 33: తస్మాత్త్వ ముత్తిష్ఠ యశోలభస్వ జిత్వాశత్రూన్ భుంక్ష్వరాజ్యం సమృద్ధమ్ |

మయైవైతే నిహతాఃపూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్! || 

(పరమాత్మ)

శ్లోకం 34: ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాఽన్యానపి యోధవీరాన్ |

మయాహతాంస్త్వం జహిమావ్యధిష్ఠాయుద్ధ్యస్వజేతా ఽసిరణే సపత్నాన్ ||

(పరమాత్మ)

భావము : కనుక శత్రువులను జయించుటకు లెమ్ము. వారు ఇంతవరకే నాచే సంహరింపబడిన వారుగనున్నారు. నీవు నిమిత్తమాత్రముగ యుద్ధము చేసి జయించిన కీర్తియు, రాజ్యమును పొందుము.  ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు మొదలగు యుద్ధవీరులందరు నాచేత సంహరింపబడివున్నారు. నీవు యుద్ధము చేయకున్నను వారు జీవించివుండరు.అని పరమాత్మ అన్న మాటలు విని అర్జునుడిట్లనసాగెను.

సంజయుడిట్లనియె : -

శ్లోకం 35: ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలి ర్వేపమానః కిరీటీ |

నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతభీతః ప్రణమ్య || (కల్పితము)

అర్జునుడిట్లనియె : -

శ్లోకం 36: స్థానే హృషీకేశ! తవప్రకీర్త్యా జగత్ప్రహృష్య త్యనురజ్యతే చ |

రక్షాంసి భీతాని దిశో ద్రవన్తి సర్వే సమాస్యన్తి చ సిద్ధసంఘాః ||

(నిరాకారము)

శ్లోకం 37: కస్మాఛ్చ తేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోఽ ప్యాదికర్త్రే |

అనన్త!దేవేశ!జగన్నివాస!త్వ మక్షరం సదసత్తత్పరంయత్ |

(నిరాకారము)

భావము : ఓ పరమాత్మ! నీ మహిమా కీర్తిని విని జగత్తంతయు సంతోష మందునుండగ, రాక్షసులు భయపడి దిక్కులకు పరుగిడుచున్నారు. సిద్ధులెల్లరు నమస్కరించుచున్నారు. బ్రహ్మకు కూడ ఆదికర్తవైన, మహాత్ముడైన నిన్ను ఎందుకు నమస్కరింపకుందురు. దేవదేవ! జగన్నివాస! నీవే ఆ అక్షరము మరియు సత్తు, అసత్తు, వాటికి వేరుగనున్న వాడు అన్నియు నీవేయగుదువు.

వివరము : పరమాత్మ గొప్పతనము, మహిమను, అన్నిటిని విన్న జనులు కొందరు ఎంతో సంతోషపడుచున్నారు. ప్రపంచ విషయములకంటే పరమాత్మ విషయములకు ఎక్కువ విలువిచ్చువారు ఎందరో భూమిమీద కలరు. అట్టివారు దైవవిషయములు చెవులపడిన వెంటనే సంతోషము పొందుచున్నారు. ఆ విషయములో క్రొత్త అనుభూతి పొందుచున్నారు. ఎంత పెద్ద ప్రపంచ విషయములైన వారికి రుచించవు. ఇట్టివారు కొందరైతే కొందరు రాక్షసగుణములు గలవారు పరమాత్మ విషయము విని ఆయన కర్మరీత్య శిక్షించునని, ఆ శిక్ష భయంకరముగ ఉండునని, వాటిని తప్పించుకోవలెనని ప్రయత్నించుచు దిక్కు దిక్కుకు ప్రాకులాడుచుందురు. రకరక మార్గముల అనేక దిక్కుల ప్రయాణిస్తున్నారు. ఏ దిక్కులోని ఏ మార్గములోనైన పాపములనుండి రక్షించుకొను అవకాశము గలదేమోనని వెదుకుచున్నారు. మరికొందరు సిద్ధులనబడువారు ఏ దిక్కులేనివారై, ఏ మార్గము అనుసరింపనివారై, కేవలమొక్క పరమాత్మనే నమ్మి ఆరాధించుచు నమస్కరించుచున్నారు.  అసత్తైన శరీరములో సత్తయిన ఆత్మ కలదు. సత్తుకాని శరీరములోనున్న సత్తు(ఆత్మ)పోయినపుడు సత్తుపోయిందని పూర్వమనెడివారు. ఒక ఆవు మరణించినపుడు పూర్వము ఆవు సత్తు పోయిందనెడివారు. ఆ పదము కాల క్రమేపి మారి నేడు ఆవు సచ్చిపోయిందంటున్నారు. అట్లే రామయ్య అనెడివాడు మరణించినపుడు రామయ్య ఆత్మ(సత్తు) పోయిందని పూర్వమనెడివారు. నేటి కాలములో ఆ పదమే రామయ్య సచ్చి పోయాడనబడుచున్నది. సత్తు అన్నమాట సచ్చి అనుట జరుగుచున్నది. అసత్తయిన శరీరములోనున్న సత్తయిన ఆత్మయు, ఆత్మకంటే వేరుగనున్న పరమాత్మయు అన్నియు ఆ నిరాకారమేనని తెలియాలి. కాలమును నేనే అన్న తరువాత అర్జునునకు పరమాత్మ యొక్క ఔన్నత్యము పూర్తి అర్థమై ఆయన యొక్క నిజతత్త్వమును గూర్చి ఇలా చెప్పుచున్నాడు.

శ్లోకం 38: త్వమాదిదేవః పురుషః పురాణ స్త్వమస్య విశ్వస్య పరం నిధానమ్|

వేత్తాఽ సి వేద్యంచ పరంచ ధామ త్వయాతతం విశ్వ మనన్త రూప! ||

(నిరాకారము)

భావము : ఓ కృష్ణా! ఆది దేవుడవు, పురాణ పురుషుడవు, విశ్వమయుడవు, పరమ పదముడవు, తెలిసినవాడవు, తెలియదగినవాడవు అన్నియు నీవే.

వివరము : భూమి మీద ఉన్న దేవతలందరిలో మొదటివాడు, అన్ని దేవతలకంటే గొప్పవాడు, పురాతన కాలమునుండి పురుషుడని చెప్పబడినవాడు, విశ్వమంతయు అణువణువున వ్యాపించినవాడు, చివరకు పొందదగిన తెలియదగిన మోక్షము మరియు తెలిసిన జ్ఞాని, తెలియదగిన జ్ఞానము, తెలిసిన యోగి, తెలియదగిన ఆత్మ అన్నియు పరమాత్మయేనని అర్జునుడు తెలుసుకొన్నాడు. తరువాత ఏమనుచున్నాడనగ!

శ్లోకం 39: వాయుర్యమోఽ గ్నిర్వరుణ శృశాంకాః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ |

నమో నమస్తేఽ స్తు సహస్రకృత్వః పునశ్చ భూయోఽ పినమో నమస్తే ||

(నిరాకారము)

వివరము : ఈ శ్లోకములో ప్రజాపతి అన్న పదమును చతుర్ముఖ బ్రహ్మ అని చాలా గ్రంథములలో వ్రాయబడివున్నది. ప్రక్కనే 'ప్రపితామహశ్చ' అను పదమునకు అతని తండ్రిని పుట్టించినవాడు తాత అని అర్థముగలదు. అనగ బ్రహ్మ, బ్రహ్మ తాతయు నీవే అని వ్రాయబడివున్నది. బ్రహ్మకు తండ్రి విష్ణువు తప్ప తాతలేడని అందరికి తెలుసు. అలాంటప్పుడు బ్రహ్మ, బ్రహ్మతాత అనడము తప్పగును. కావున ప్రజాపతి అను పదమునకు సూర్యుడన్న అర్థము సరిపోవునని గ్రహించవలెను. సూర్యుడు సూర్యుని తాత అనడము సమంజసము, సత్యము. బ్రహ్మ బ్రహ్మతాత అని లేని తాతను చెప్పడము అసమంజసము అసత్యమని తెలియాలి.  వాయువు, అగ్ని, యముడు, వరుణుడు, చంద్రుడు, బ్రహ్మ, బ్రహ్మ తండ్రి తాత అన్నీ నీవే అగుదువు. అట్టి నీకు మ్రొక్కుచున్నాను. మరిమరి వేలమార్లు మ్రొక్కుచున్నాను.

శ్లోకం 40: నమః పురస్తా దథ పృష్ఠతస్తే నమో ఽస్తు తే సర్వత ఏవ సర్వ |

అనన్త వీర్యా మిత విక్రమ స్త్వం సర్వం సమాప్నోషి తతోఽ సి సర్వః ||

(నిరాకారము)

భావము : మ్రొక్కువాడనుముందు, మ్రొక్కవాడను వెనుక, మ్రొక్కువాడను సర్వ దిక్కులందు, అమిత పరాక్రమవంతుడవు మరియు అమిత మగతనముగల వీర్యుండవు. సర్వమునకు వ్యాపించిన వాడవగుట వలన సర్వము నీవేయగుదువు.

వివరము : పరమాత్మ సర్వము వ్యాపించినవాడు. మనకు ముందు, వెనుక, ప్రక్కల, చుట్టు, పైన, క్రింద అంతట వ్యాపించివున్నవాడు. ఇక్కడున్నాడని అక్కడ లేడనునది లేక, మొత్తము నిండినవాడుగ పరమాత్మవున్నాడు. అందువలన అర్జునుడు ముందు వెనుక సర్వ దిక్కుల మ్రొక్కుచున్నానని చెప్పాడు. అంతట వ్యాపించి అన్నియు తానైనవాడే పరమాత్మయని అమిత వీర్యముగల మగతనము కూడ ఆయనేనని అర్జునుడన్నాడు.

శ్లోకం 41: సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హేకృష్ణ! హేయాదవ! హేసఖేతి |

అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదా త్ప్రణ యేన వాఽ పి || (సాకారము)

శ్లోకం 42: యచ్చాపహాసార్థ మసత్కృతోఽ సి విహార శయ్యాసన భోజనేషు |

ఏకోఽ థవాఽ ప్యచ్యుత! తత్సమక్షం తత్ క్షా మయేత్వా మహ మప్రమేయమ్ ||

(సాకారము)

భావము : సఖుడవని తలచి వినయవిధేయతలు లేకుండ, నీ మహత్యము తెలియక ఓయి సఖా! ఓయి మాధవ! ఓయి కృష్ణా అని విహరించునపుడు, పరుండునపుడు, కూర్చుండునపుడు, భోజనము చేయునపుడు, ఒంటరిగనున్నపుడు ఇతరుల ఎదుట ఎగతాళిగ మాట్లాడినవన్నియు క్షమించవలయును.

శ్లోకం 43: పితా ఽ సి లోకస్య చరాచరస్య త్వమస్యపూజ్యశ్చ గురుర్గరీయాన్ |

నత్వత్సమో ఽస్త్యభ్యధికః కుతోఽ న్యో లోకత్రయే ఽప్యప్రతిమప్రభావ! ||

(సాకారము)

భావము : చరాచర జీవరాసులకు తండ్రివియును, పూజ్యుడవును, గురుడవును నీవే. దేవదేవ! ముల్లోకములందు నీకు సమానమైన వారెవ్వరులేరు. అందరికంటే నీవే అధికుడవు.

వివరము : ఇంతవరకు చాలా శ్లోకములలో అన్నియు నీవే అనిన అర్జునుడు ఇప్పుడిక్కడ ప్రత్యేకించి పరమాత్మను తండ్రిగ, పూజ్యగురువుగ చెప్పాడు. ఈ శ్లోకములో కేవలము తండ్రి గురువునిద్దరిని గూర్చి చెప్పడములో ఒక విశేషత గలదు. అదేమనగా! ప్రతి మానవునికి తండ్రిద్వార జన్మ కలగడము సహజము. దీనిని భౌతిక జన్మ అంటాము. అభౌతికమైన జన్మ అనునది మరొకటి కలదు. ఆ జన్మను ప్రతి ఒక్కడు పొందవచ్చును. పొందక పోవచ్చును. భౌతిక జన్మకు కారణము కన్న తండ్రి. అట్లే అభౌతిక జన్మకు కారణము పూజ్యగురువు. కన్న తండ్రి యొక్క వీర్యబిందువుచే కలుగు జన్మ భౌతికమైనది స్థూలమైనది. పూజ్యగురువు యొక్క జ్ఞాననాదముచే కల్గు జన్మ అభౌతికమైనది, సూక్ష్మమైనది. తండ్రిచే కల్గిన వారిని బిందుపుత్రులని, గురువుచే అభివృద్ధయిన వారిని నాద పుత్రులని అందురు. తండ్రిచే కల్గిన జన్మ కనిపించునది. కర్మవృద్ధి చేయునది కాగ, గురువుచే కల్గినది కనిపించనిది, కర్మనాశనము చేయునదైవున్నది.  ఇలా ఒక జీవితములో రెండు జన్మలకు అర్హులైన మనుషులు చాలామంది కేవలమొక జన్మతోనే సరిపెట్టుకొని, గురువుచే కల్గు రెండవ జన్మను పొందకున్నారు. ఇక్కడ అర్జునుడు ఈ రెండు జన్మల విషయమును గుర్తుచేసుకొని, రెండు జన్మలకు కారణమైన తండ్రిని, గురువును కూడ పరమాత్మగ చెప్పాడు. వీరిద్దరిని అలా చెప్పడములో కారణమేమనగా! స్థూలజన్మలకు కారణమైన తండ్రిశరీరములో మగతనమై ఆ శరీరములో వీర్యకణముగ కూడ ఉన్నవాడు పరమాత్మేనను వాస్తవము తెలిసిన అర్జునుడు సర్వ జీవుల పుట్టకకు కారణమైన వాడు కనిపించని పరమాత్మేనని అర్థము చేసుకొన్నాడు. అలాగే సూక్ష్మజన్మకు కారణమైన గురువు యొక్క శరీరములోని జ్ఞానము, జ్ఞానము యొక్క వివరణ పరమాత్మయేనని నిజము తెలిసిన అర్జునుడు సర్వజీవరాసులకు పూజ్యగురువు కూడ పరమాత్మేనని తన మనోనేత్రములచే తెలుసుకొన్నాడు. అందువలననే కన్న తండ్రివగుదువు. పూజ్య గురుడవగుదువని పరమాత్మను కొనియాడాడు.

శ్లోకం 44: తస్మాత్ర్పణమ్యప్రణిధాయ కాయం ప్రసాదయే త్వా మహ మీశ మీడ్యమ్ |

పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు: ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ ||

(నిరాకారము)

భావము : అందువలన నీకు సాష్టాంగనమస్కారము చేయుచు పూజార్హుడైన ఈశ్వరుడైన నిన్ను ప్రసన్నుడవగుమని ప్రార్థించుచున్నాను. ఓ దేవదేవ! కుమారునికి తండ్రివలె, మిత్రునికి మిత్రునివలె, ప్రియురాలికి ప్రియుడువలె నన్ను మన్నించుటకర్హుడవు.

శ్లోకం 45: అదృష్టపూర్వం హృషితో ఽ స్మిదృష్ట్వా భయేన చప్రవ్యథితం మనోమే|

త దేవ మే దర్శయ దేవ! రూపం ప్రసీద దేవేశ! జగన్నివాస! ||

(సాకారము, నిరాకారము)

భావము : ముందెప్పుడు చూడని అదృష్టపూర్వమైన ఈ రూపము చూచి మొదట సంతోషము కల్గినది. అయినను ఇప్పుడు మనస్సులో భయము కల్గుచున్నది. దేవదేవ నీవు ప్రసన్నుడవై, మొదటి సౌమ్యమైన ఆకారమునే చూపుము.

వివరము : అర్జునుడు అంతవరకు ఎవ్వరు చూడని ఆ దృశ్యమును చూచి, అదృష్టము వలన అబ్బిన ఆ దర్శన భాగ్యమును గూర్చి సంతసించినప్పటికి, భయంకరమౌ రూపము అతని మనస్సులో భయము కల్గించెను. ఆ విశ్వరూపమును అర్జునుడు చూడజాలక మొదటి సౌమ్యరూపమును చూపమని కోరెను.

శ్లోకం 46: కిరీటినం గదినం చక్రహస్త మిచ్ఛామి త్వాంద్రష్టు మహం త ధైవ |

తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్త్రబాహో! భవ విశ్వమూర్తే! ||

(అశాస్త్రీయము)

భావము : ఈ అధ్యాయములో 17వ శ్లోకము ఇక్కడ 46వ శ్లోకము రెండునూ అశాస్త్రీయ శ్లోకములే. ఇవి కల్పిత శ్లోకములని తెలియాలి. ఎందుకనగ విశ్వరూపమునకు పరిమితిగ చేతులు లేవు. అట్లే శ్రీకృష్ణునకు నాల్గు చేతులు లేవు. సాధారణ మనిషిగనున్న శ్రీకృష్ణునికి నాల్గు చేతులున్నాయనుట ఎంత సమంజసము. అలా నాల్గుచేతులుంటే విశ్వరూపము చూపి నేను దేవుడనని చెప్పుకోవలసిన అవసరముండదనుకుంటాము. నాల్గు చేతులుంటేనే చెప్పకనే దేవుడని ప్రజలే పూజించెడివారు. అపరిమిత అసంఖ్యాకములైన చేతులు విశ్వరూపమునకుండగ కేవలము వేయి చేతులని చెప్పడమేమిటి? అనేక సంశయములతో కూడుకొని ఎటుచూసిన శాస్త్రబద్దమైన జవాబు దొరకని శ్లోకములను ఈ గీతలో బయటికి నెట్టివేయడము జరిగినది. ఇది శాస్త్రమను జలముచే కడగబడిన గీత. ఎన్నో భావములు సవరింపబడిన గీత. దీనిని అసూయతో అడ్డముగ మాట్లాడువారు తప్ప అందరు సమ్మతింపతగినదని తెలియజేయుచున్నాము.

పరమాత్మ ఇట్లనియె : -

శ్లోకం 47: మయాప్రసన్నేనతవార్జునేదం రూపం పరం దర్శిత మాత్మయోగాత్ |

తేజోమయం విశ్వ మనన్తమాద్యం యన్మేత్వదన్యేన నదృష్టపూర్వమ్ ||

(నిరాకారము)

భావము : నా యొక్క ప్రసన్నముచేత మొదటిదైన విశ్వవ్యాపకమైన, తేజస్సుచే కూడిన నా శ్రేష్ఠమైన రూపము చూపబడినది. పూర్వమునుండి ఇంతవరకు నీవు తప్ప ఇతరులెవరు దీనిని చూచిన వారులేరు.

వివరము : ఈ అధ్యాయములో 32వ శ్లోకమును ఇక్కడ 47వ శ్లోకమును భగవంతుడిట్లనియెనని అన్ని గీతలలో వ్రాయబడివున్నది. అలా వ్రాయుట పొరపాటని తెలియాలి. జ్ఞానముతో ప్రతి సూక్ష్మమును స్థూలముగ చెప్పదలచిన మేము ఈ విషయమును కూడ చెప్పక తప్పలేదు. ఈ రెండు శ్లోకములను భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పలేదు. అర్జునునికి జ్ఞాననేత్ర దృష్ఠివున్న ఆ సమయములో స్వయముగ విశ్వరూపుడైన పరమాత్మయే పల్కిన మాటలివి. ఆ సమయములో దేహధారియైన శ్రీకృష్ణుడు చెప్పినప్పటికి భౌతిక చెవులకు వినిపించవు. అందువలన ఈ శ్లోకముల వద్ద భగవంతుడిట్లనియె అని వ్రాయకూడదు. పరమాత్మ ఇట్లనియె అని వ్రాయుట సమంజసము.

శరీరముతో ఉన్న కర్మయోగి కాని, బ్రహ్మయోగి కాని, పరమాత్మ ఆకృతిని తెలియలేరు. బ్రహ్మయోగులు మాత్రము తమ శరీరములోని ఆత్మను వారి మనోనేత్రముచే చూడగల్గినను పరమాత్మను చూడలేరు. బ్రతికివున్నవారెవరు పరమాత్మను చూడలేరనియే చెప్పవచ్చును. అర్జునునికి పరమాత్మయే స్వయముగ కల్పించిన అవకాశము వలన చూడగలిగాడు. అటువంటి అవకాశమెవరికైన వస్తే తప్ప చూడలేరనియే చెప్పవచ్చును. సృష్ఠ్యాదినుండి ఎవరూ చూడని రూపు నీవు చూడగల్గితివని పరమాత్మ అనడము వలన అది ఎవరికీ సాధ్యము కానిదని తెలియుచున్నది. పరమాత్మ ఇలా ఉన్నాడని తెల్పునిమిత్తము ఒకమారు అర్జునుని అడ్డము పెట్టుకొని బహిర్గతము చేసినదని తెలియవలెను. పరమాత్మ రూపము పరమాత్మ తెలుపవలసిందే కాని వేరెవరిచేత కాదని తెలియవలెను. అర్జునునికి పరమాత్మ అనుగ్రహముతో కల్గిన దానివలన మనకు కొంత అర్థమైనదని అనుకొందాము.

శ్లోకం 48: నవేదయజ్ఞాధ్యయనైర్నదానైర్న చక్రియాభిర్న తపోభిరుగ్రైః |

ఏవం రూప శ్శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర! ||

(నిరాకారము)

భావము : వేదములచేతకాని, యజ్ఞములచేతకాని, దానములచేతకాని, ఉగ్రతపస్సుల చేతకాని ఈ రూపముగల నన్ను తెలియజాలరు. జగతిలో నీవు తప్ప నన్ను చూచినవారు ఎవరు లేరు.

వివరము : ఈ శ్లోకములో ఏవైతే పరమాత్మనారాధించు ఆరాధనలుకావో, వేటివలన పరమాత్మను తెలియలేరో వాటిని తెలియజేశాడు. నేటికాలములో వేదములు తెలిసిన స్వాములు, యజ్ఞములు చేయు గురువులు, చేయించు ధనికులు, దేవతల ప్రసన్నము కొరకు తపస్సులు చేయు సన్న్యాసులు, దానము చేయు ఔధార్యులు, గొప్ప జ్ఞానులుగ, దైవజ్ఞులుగ చలామణి అగుట సహజమే. వేదములు తెలిసినవారు, యజ్ఞములు చేయువారు, దానములు తపస్సులు చేయువారు దేవుని మార్గములో ఏమాత్రము లేరను సత్యము కొంత చేదుగ ఉన్నప్పటికి, పరమాత్మ వాక్యము ప్రకారము ఇది సత్యమే. దైవమునకు వ్యతిరేఖమైనది మాయ. మాయ పరమాత్మవైపు ఎవరిని పోకుండ తనవైపు ఉండునట్లు యజ్ఞ, దాన,తపస్సులను సృష్ఠించి వాటిచేత దైవమార్గములో ఉన్నట్లు భ్రమింపచేసింది. దేవుడే స్వయముగ ఇవి నన్ను తెలియు మార్గములుకావని చెప్పినప్పటికి, నమ్మనంత లోతుకు మనలను తనలో ముంచి వేసింది. అందువలన ఇప్పటికైన ఏవి దైవమును తెలియుమార్గములో, ఏవికావో తెలియుట ముఖ్యము. ఈ విషయము విశ్వరూపము చాలించునపుడు చివరిలో చెప్పినది. ఊరికి పోవువాడు ముఖ్యమైన విషయము చివరిలో చెప్పినట్లు, జాబు వ్రాయువాడు చివరిలో ముఖ్యమైన విషయమును తిరిగి వ్రాసినట్లు, పరమాత్మ తన విశ్వరూపము చాలించు చివరిలో చెప్పిన విషయము మానవ జాతికే చాలా ముఖ్యమైనది. భగవంతునిగ కాక పరమాత్మ స్వయముగ తన విశ్వరూపము నుండి ఇచ్చిన సందేశము చాలా ముఖ్యము. పరమాత్మ విశ్వరూపములో నుండి చెప్పినవి రెండే విషయములు.

1) నేనే కాలమునై ఉండి అందరి పుట్టుకను కల్గించి చివరకు మృత్యువు అగుచున్నాను.

2) వేదముల వలన, యజ్ఞములవలన, దానముల వలన, తపస్సుల వలన నన్ను ఎవరు తెలియలేరు.

పరమాత్మ తెల్పిన ఈ రెండు విషయములు జీవరాసులకి చాలా ముఖ్యమని తెలియాలి. మన ఆరాధనలను బట్టి మనము పరమాత్మ వైపు ఉన్నామా లేక ప్రకృతి(మాయ లేక సాతాన్, లేక సైతాన్) వైపు ఉన్నామా ఆలోచించుకోండి.

శ్లోకం 49: మాతేవ్యథా మాచవిమూఢభావోదృష్ట్వారూపం ఘోరమీదృజ్మ మేదమ్ |

వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం త దేవ మే రూప మిదం ప్రపశ్య ||

(సాకారము, నిరాకారము)

భావము : ఈ భయంకర రూపమును నీవు చూచి భయము చెందకు, విమూఢ భావములను పొందకు. నీకు ప్రీతి కలుగుటకు, భయము వీడిపోవుటకు మొదటి సౌమ్యముగనున్న రూపునే చూపుచున్నాను చూడుము.

వివరము : విశ్వరూప సందర్శనములో అర్జునుని మనోనేత్రమునకు పరమాత్మ తప్ప ఎవరు కనిపించలేదు. అందరు ఆయనయందే కనిపించుట వలన, అందరిని నాశనము చేయు ఆ రూపు భయంకరమైనదగుట వలన అర్జునుడు భీతిల్లిన మాట నిజమే. భయము చెందిన అర్జునునికి కుదుట కల్గించుటకు సాధారణ కన్నులకు దృష్టినిచ్చి, మనోనేత్రమును లేకుండ చేసి, పరమాత్మ తిరిగి సాధారణ మనిషివలె శ్రీకృష్ణునిగ అర్జునునికి కనిపించసాగెను. అపుడు అర్జునుడు భయము నుండి తేరుకొన్నవాడై ఇట్లనెను.

సంజయుడిట్లనియె : -

శ్లోకం 50: ఇత్యర్జునం వాసుదేవ స్తథోక్త్వా స్వకం రూపం ధర్మయామాస భూయః |

అశ్వాసయామాస చ భీత మేనం భూత్వా పున సౌమ్యవపు ర్మహాత్మా || (కల్పితము)

అర్జునుడిట్లనెను : -

శ్లోకం 51: దృ ష్ట్వే దం మానుషం రూపం తవ సౌమ్యం జనార్ధన! |

ఇదానీ మస్మి సంవృత్త స్సచేతాః ప్రకృతిం గతః||

(సాకారము)

భావము : ఓ కృష్ణా! మనుజరూపమున నీ సౌమ్య స్వభావ ఆకృతినిగని నా అంతరంగమందు స్వస్థత చేకూరెను. మనసు నిలకడకల్గెను.    

శ్రీ భగవంతుడిట్లనియె : -

శ్లోకం 52: సుదుర్ధర్శ మిదం రూపం దృష్టవా నసి యన్మమ |

దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః ||

(నిరాకారము)

భావము : అర్జునా! నీవు చూచిన బ్రహ్మాండమైన రూపము ఇతరులు చూచుట దుర్లభము. దేవతలెందరో నా దివ్యాకృతిని చూచుటకు ఎల్లప్పుడు కాంక్షకల్గియున్నారు.

వివరము : పరమాత్మ దర్శనము పొందాలని దేవతలెందరో ఆశకల్గివున్నారు. అయినప్పటికి వారికి దర్శనము కాలేదు. ఇచట కొందరికొక ప్రశ్న పుట్టవచ్చును. 'మానవులమగు మనకు ఆ దర్శనము లభించకపోవచ్చును. కాని దేవతలకు కూడ సాధ్యముకాదంటున్నారే' నని అడుగవచ్చును. దానికి జవాబు దేవతలు వేరు. మనుషులు వేరనుకోకూడదు. మనుషులలో కొంత ఎక్కువ పుణ్యము చేసినవారు దేవతలగుచుందురు. అంతేకాని వారికి మనకు పెద్ద తేడా ఏమీవుండదు. వారు జీవులే మనము జీవులమే. వారికి మనకంటే ఎక్కువ జ్ఞానముండుట వలన పరమాత్మ దర్శనమును నిత్యము కోరుకుంటున్నారు. అయినప్పటికి అది సాధ్యపడలేదు. పరమాత్మ దయతో అర్జునునికొక్కనికే ఆ దర్శనమబ్బినది.

శ్లోకం 53: నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా |

శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవా నసి మాం యథా ||

(నిరాకారము)

భావము : నీవు నన్ను ఎట్లు చూచియున్నావో ఆ దర్శనము దొరకవలెనన్న వేదములచేతను, తపస్సుల చేతను, దానములచేతను మరియు యజ్ఞముల చేతను శక్యము కాదు.

వివరము : ఈ విషయము 48వ శ్లోకములో విశ్వరూపములో కూడ చెప్పివున్నారు. ముఖ్య విషయము కావున భగవంతునిగ మరియొకమారు ఇక్కడ చెప్పడమైనది. అర్జునుడు చూచిన పరమాత్మ దర్శనము వేదములు చదువుట వలన కాని, దానముల వలనగాని, యజ్ఞములు చేయుట వలన కాని, తపస్సుల వల్లనైన కాని లభించదు. కొందరికి తపస్సుల వలన ఎవరినైన ప్రత్యక్షము చేసుకోవచ్చునను భావముండును. తపస్సుల వలన దేవతలు ప్రత్యక్షమగుదురేమో కాని పరమాత్మ దర్శనము మాత్రము దానముల చేతకాని, వేదద్యాయణము వలనకాని, యజ్ఞయాగాదుల వలన కాని, ఉగ్రమైన తపస్సుల వలన కాని సాధ్యపడదని తెలియవలెను. అలాయైన పరమాత్మను పొందువారందరు ఎలా ఏ మార్గముచే పొందుచున్నారని ప్రశ్నించగ క్రింది శ్లోకములో జవాబు చూస్తాము.

శ్లోకం 54: భక్త్యా త్వనన్యయా శక్య అహ మేవం విధో ఽ ర్జున! |

జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరన్తప! ||

(పరమాత్మ, బ్రహ్మయోగము)

భావము : అర్జునా! నా ఆత్మను తెలియుటకు, చూచుటకు, ప్రవేశించుటకు అనన్యమైన భక్తిచేతనే సాధ్యమగుదును.

వివరము : ఇతర దేవతల మీద ధ్యాసలేక పరమాత్మ మీదనే భక్తి కల్గినవాడు, అన్యచింత లేకుండ మనస్సు నిల్పగలవాడు, తన శరీరమందలి పరమాత్మ అంశమైన ఆత్మను తెలియగలుగును, చూడగలుగును. తరువాత పరమాత్మయందు ప్రవేశించగల్గును. ఈ విధముగ పరమాత్మను చేరుమార్గము గలదు.

శ్లోకం 55: మత్క ర్మకృన్మత్పరమో మద్భక్త స్సంగవర్జితః |

నిర్వైర స్సర్వభూతేషు యస్సమామేతి పాణ్డవ! ||

(భక్తియోగము, బ్రహ్మయోగము, కర్మయోగము)

భావము : ఎవడు నాకర్మలనే ఆచరించుచున్నాడో, ఎవడు నా స్థానమునే ముఖ్య గతిగా తలంచుచున్నాడో, ఎవడు సంగవర్జితుడో, ఎవడు సర్వభూతములందు వైరము లేనివాడై బ్రహ్మయోగియై ఉన్నాడో అతడు నన్ను పొందగలడు.

వివరము : ఈ శ్లోకములో మత్ కర్మ= నా పనిని, కృత్ = చేయువాడు. నా పనిని చేయువాడు అని పరమాత్మ చెప్పియున్నాడు. పరమాత్మ పని ఏమిటని అనుకొంటే ఆయన అన్ని చేయుచున్నాడు. అన్ని పనులు ఆయనవేనని కొందరనవచ్చును. అన్నిటికి కారణము ఆయనే అయినప్పటికి అవి మనకు కనిపించకుండ, మనకు తెలియకుండచేయునవి. వాటిని మనము లెక్కించకూడదు. ఉదాహరణకు సర్వ జీవరాసులను పుట్టించుచున్నాను మరియు చంపుచున్నానని వెనుకటి అధ్యాయములో చెప్పివున్నాడు. పరమాత్మ చేయు ఆ పనిని జీవులుగనున్న మనము చేయజాలము. మనకు పూర్తిగ తెలియనట్లు భగవంతునిగ సాకారరూపమున చేయుపనులే ముఖ్యము. అంతపెద్ద పరమాత్మ కేవలము ఒక చిన్న మానవశరీరము ధరించి పుట్టి మానవులకు అవసరమైన ధర్మములను తెలియజేతునన్నాడు. ధర్మములకు ముప్పుకల్గి అవి లేకుండా పోయినపుడు నేను పుట్టుదునన్నాడు. అటువంటపుడు ఆయన జీవిత ధ్యేయమైన పని ధర్మములను తిరిగి నెలకొల్పుటయే. ఇక్కడ నాపనిని అని దానినే చెప్పుచున్నాడు. ఎవడైతే మాసిపోయిన ధర్మములను తెలియజేయు చున్నాడో, వాడు పరమాత్మ పనిని చేసినట్లగును. ఆయన పనిని చేయువాడు పరమాత్మను పొందుటకవకాశము గలదని తెలియజేయుచున్నాడు.  ఇచట కొందరికొక ప్రశ్న పుట్టుటకు అవకాశము గలదు. అదేమనగా! పరమాత్మను చేరవలెనంటే రెండేమార్గములన్నారు కదా! ఆ రెండు లో ఒకటి కర్మయోగము, రెండవది బ్రహ్మయోగమని మీరే చెప్పారు కదా! ఇపుడు ఏ యోగము కానటువంటి ఈ పనిని చేయుట వలన మోక్షము పొందవచ్చునంటున్నారు కదా! అసలు పరమాత్మను చేరు మార్గములెన్ని ఉన్నవి? మొదట చెప్పినవి రెండేనా! లేక చాలా ఉన్నాయా?  ఇలా ప్రశ్నించడము వలన జ్ఞానాభివృద్ది బాగా జరుగునని మా అభిప్రాయము. అనుమానమొచ్చినపుడు అర్జునుడు శ్రీకృష్ణుని వదలక ప్రశ్నించాడు. అలాగున ఇక్కడ ఈ ప్రశ్న సర్వసమ్మతము. దానికి జవాబు ఏమనగా! పరమాత్మను చేరుటకు మార్గములు రెండేనని ఇపుడు కూడ చెప్పుచున్నాము. అందరికి యోగ్యమైనవి రెండే మార్గములు. అందరికి యోగ్యము కానిది, అందరికి సాధ్యముగానిది ఒక మార్గమున్నది. అది దొడ్డిదారిలాగ పరమాత్మను చాలా తొందరగ చేర్చునది. ఇది మనసు నిలపడముకంటే కూడ దుస్సాధ్యమైనది. అందువలన పరమాత్మ గీతలో కూడ ముందు రెండే మార్గములని తెలియజేసి తరువాత సందర్భానుసారముగ దీనిని చెప్పాడు. ఈ విషయము అనగ మూడవ దాని విషయము ఆరవ అధ్యాయమైన విజ్ఞానయోగములో 19వ శ్లోకమందు తెలియజేసివుంటాము. ఆరవ అధ్యాయము లోనే మూడవదారి తెలియబరచబడినది. ఇది చాలా దగ్గరి దారి కనుక సూక్ష్మములో మోక్షమంటున్నాము. నిజముగ ఇది కర్మ, బ్రహ్మయోగములాంటిది కాదు. ఇది భక్తియోగమనబడు ప్రత్యేకమైన మార్గము ఈ ప్రత్యేకమైన మార్గములోనే పరమాత్మ పనులు ఆచరించడము కూడానున్నదని తెలియవలెను. సాధారణముగ తండ్రిపనిని కొడుకు చేసినట్లు, పరలోక రాజ్య తండ్రియైన పరమాత్మ పనిని ఆయన సంతతియైన మనము చేయుట సముచితము. తండ్రిని గుర్తించి ఆయన పనులను గుర్తించి అవి ఆచరించడము వలన సులభముగ మోక్షమును పొందవచ్చును. అట్లుకాక పోయిన యోగమార్గములు రెండేగతియని తెలియవలెను.  అంతేకాక నా భక్తుడై, సంగవర్జితుడై అనికూడ అన్నాడు. పాపపుణ్యములను అంటకుండ ఎవడు పనులు చేయుచున్నాడో వాడు పరమాత్మను చేరగలడు. ఇది పరమాత్మను చేరు రెండు మార్గములలో ఒకటైన కర్మయోగము. కర్మయోగములో పాపపుణ్యముల సంగమముండదు. కర్మల సంగమమును వదలిన వాడు పరమాత్మను చేరుననుటయే కాక ఈ శ్లోకములో మరొక మాట కూడ అన్నాడు. సర్వభూతములకు వైరము లేనటువంటివాడు నన్ను చేరగలడు. ఈ మాట రెండవ మార్గమైన బ్రహ్మయోగమునకు సంబంధించినది. బ్రహ్మయోగములో సర్వజీవులకు సమమైన ఆత్మానుభవమును పొందుచున్నాడు. ఆ సమయములో వాడు ఏ జీవరాసికి శత్రువుకానటువంటి ఆత్మతో సంబంధపడి ఉన్నాడు. అటువంటి బ్రహ్మయోగము ఆచరించువాడు సర్వజీవులకు వైరములేనటువంటి వాడని తెలియాలి. ఇచట యోగమార్గములు రెండును మరియు ప్రత్యేకమైన మార్గమొకదానిని గురించి చెప్పి వాటి వలన విశ్వరూపుడైన పరమాత్మను చేరగల్గుదురని తెలియజేశాడు. ఇంతటితో విశ్వరూపసందర్శన యోగమను ఈ అధ్యాయము సమాప్తము.

-------------------------------------------------

త్రైత సిద్ధాంత భగవద్గీత:  విశ్వరూప సందర్శన యోగము  

అర్జునుడిట్లనియె : -

శ్లోకం 1: మదనుగ్రహాయ పరమం గుహ్య మధ్యాత్మ సంజ్ఞితమ్ |

యత్త్వ యోక్తం వచస్తేన మోహోఽయం విగతోమమ ||

(ధర్మములు)

భావము : నన్ను అనుగ్రహించి నాకింతవరకు చెప్పిన విషయములు ఆధ్యాత్మములైనవి కావున నాలోని మోహమెల్ల సమసిపోయినది. ప్రతి అధ్యాయమునకు ఒక పేరు పెట్టి పేరు చివరిలో యోగము అన్నారు. అధ్యాయములో ఏ విషయమును గూర్చి ఎక్కువగ చెప్పారో, ఆ విషయమునకు సంబంధించిన పేరు ఆ అధ్యాయమునకు పెట్టడము జరిగినది. ఇక్కడ విశ్వ రూపమునకు సంబంధించిన విషయము ఎక్కువగా ఉండుట వలన, ఈ ఆధ్యాయమును విశ్వరూప సందర్శన యోగమన్నారు. ప్రతి అధ్యాయములో చెప్పెడి విషయము యొక్క మూల ఉద్దేశ్యము జీవాత్మ పరమాత్మలో కలిసిపోవడమే అయివున్నది. కలిసిపోవుటను యోగము అంటారు. విడిపోవుటను వియోగము అంటారు. గీతలో అన్ని అధ్యాయములు కలిసిపోవు విషయమునే చెప్పుచున్నవి కావున అన్ని అధ్యాయములకు చివరిలో 'యోగము' అనుట సమంజసమైనదే.    

శ్లోకం 2: భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా |

త్వత్తః కమలపత్రాక్ష! మహాత్మ్య మపి చావ్యయమ్ ||

(పరమాత్మ)

భావము : సర్వ జీవరాసులకు చావు పుట్టుకలు నీవలన కల్గుననియు, నీ మహిమ అవ్యయమైనదనియు విస్తారముగా ఇంత వరకు వింటిని.

శ్లోకం 3: ఏవ మేత ద్యథాఽఽ త్థత్వ మాత్మానాం పరమేశ్వర! |

ద్రష్టు మిచ్ఛామి తే రూప మైశ్వరం పురుషోత్తమ ||

(పరమాత్మ, నిరాకారము)

భావము : ఓ పురుషోత్తమా! నిన్ను గూర్చి నీవు చెప్పినదంతయు సత్యమగును. నీ విశ్వరూపమును చూడవలెనని నాకు కోరిక కల్గినది.    

శ్లోకం 4: మన్య సే యది తచ్ఛక్యం మయా ద్రష్టు మితి ప్రభో |

యోగేశ్వర! తతోమేత్వం దర్శయాత్మాన మవ్యయమ్ ||

(పరమాత్మ, నిరాకారము)

భావము : నీ ఆత్మ రూపమును నేను చూచుటకు అర్హుడనగుదునేని అవ్యయమైన ఆ రూపమును చూపుము.

శ్రీ భగవంతుడిట్లనియె : -

శ్లోకం 5: పశ్య మే పార్థ! రూపాణి శతశోఽ థ సహస్రశః |

నానావిధాని దివ్యాని నానావర్ణా కృతీని చ || (పరమాత్మ, నిరాకారము)

శ్లోకం 6: పశ్యా ఽదిత్యాన్ వసూన్ రుద్రా నశ్వినౌ మరుత స్తథా |

బహూ న్యదృష్టపూర్వాణి పశ్యా ఽశ్చర్యాణి భారత! ||(పరమాత్మ, నిరాకారము)

శ్లోకం 7: ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్ |

మమ దేహే గుడాకేశ! యచ్చాన్యద్ద్రష్టు మిచ్ఛసి ||

(పరమాత్మ, నిరాకరము)

భావము : అర్జునా! అనేక విధములైన, అనేక వర్ణములైన, అనేక ఆకారములైన నా దివ్యరూపమును వందలాదిగ, వేలాదిగ, అసంఖ్యాకములుగ చూడుము.  ఆదిత్యులును, వసువులును, రుద్రులును, అశ్వనీ కుమారులును, మరుత్తులును మొదలగువారిని చూడుము. ఎన్నో జన్మల పుణ్యము చేత కనిపించెడి ఆశ్చర్యమైన ఈ రూపము చూడుము.  సర్వ జగత్తు మరియు అందలి చరాచర జీవుల సమూహమును ఒక్కటిగ నా శరీరమందే ఉన్నట్లు చూడగలవు. ఇష్టమొచ్చిన దేనినైన నాయందే చూడుము.

శ్లోకం 8: న తు మాం శక్యసే ద్రష్టు మనే నైవ స్వచక్షుషా |

దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగ మైశ్వరమ్ ||

(పరమాత్మ, నిరాకారము) 

భావము : అయితే నీకున్న కన్నులతో నన్ను చూచుటకు శక్యము కాదు. నీకు దివ్యమైన కన్నుల నిచ్చెదను. నాయొక్క ఈశ్వర స్వరూపము వాటిచే చూడుము.

సంజయుడిట్లనియె : - 

శ్లోకం 9: ఏవ ముక్త్వాత తో రాజన్! మహాయోగేశ్వరో హరి: |

దర్మయామాస పార్థాయ పరమం రూప మైశ్వరమ్ ||(కల్పితము)

శ్లోకం 10: అనేక వక్త్ర నయన మనేకాద్భుత దర్శనమ్ |

అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్ || (కల్పితము)

శ్లోకం 11: దివ్య మాల్యామ్బరధరం దివ్యగన్ధానులేపనమ్ |

సర్వాశ్చర్యయమయం దేవ మనన్తం విశ్వతోముఖమ్ || (కల్పితము)

శ్లోకం 12: దివి సూర్య సహస్రస్య భవే ద్యుగపదుత్థితా |

యది భా స్సదృశీసా స్యా ధ్భాసస్తస్య మహాత్మనః || (కల్పితము)

శ్లోకం 13: తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్త మనేకధా |

అపశ్యద్దేవదేవస్య శరీరే పాణ్డవస్తదా || (కల్పితము)

శ్లోకం 14: తత స్స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః |

ప్రణమ్య శిరసా దేవం కృతాంజలి రభాషత || (కల్పితము)    

అర్జునుడిట్లనియె : -

శ్లోకం 15: పశ్యామి దేవాంస్తవ దేవ! దేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ |

బ్రాహ్మణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వా నురగాంశ్చ దివ్యాన్ || (నిరాకారము)

శ్లోకం 16: అనేకబాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో ఽనన్తరూపమ్ |

నాన్తం న మధ్యం నపున స్తవాదిం పశ్యామి విశ్వేశ్వర! విశ్వరూప! ||

(నిరాకారము)

భావము : దేవదేవా! సర్వదేవతలను, సర్వజీవరాసుల సమూహములను, బ్రాహ్మణులను, ఈశ్వరులను మరియు పద్మాసనములో కూర్చున్న ఋషులను, గొప్పవైన ఎన్నో సర్పములను నీ దేహమందు చూచితిని.  ఓ విశ్వేశ్వర! విశ్వరూప! అనేకమైన చేతులు, కడుపులు, ముఖములు, కన్నులు కల్గి అంతట అనంతరూపమైన మరియు ఆది మధ్య అంతము లేని నిన్ను చూడగల్గితిని.

శ్లోకం 17: కిరీటినం గదినం చక్రిణం చ తేజో రాశిం సర్వతోదీప్తి మన్తమ్ |

పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమన్తా ద్దీప్తానలార్కద్యుతి మప్రమేయమ్ ||

 (అశాస్త్రీయము)

భావము : విశ్వరూపమునకు ప్రత్యేకించి ఒక తల లేదు. అట్లే ప్రత్యేకించి రెండు చేతులు కూడ లేవు. అందువలన కిరీటము ధరించడము గద, చక్రముకల్గి వుండడమను మాట అశాస్త్రీయమై పోవుచున్నది. గద, చక్రము, కిరీటము దేవతలలోని విష్ణువుకుండవచ్చును. కాని విశ్వరూపమునకుండవు. విశ్వరూపమును, విష్ణురూపముగ గుర్తించునట్లుగ చేసిన ప్రయోగమే ఈ శ్లోకమని చెప్పవచ్చును. దేవతలలో గొప్పవాడైన విష్ణువుకు దేవతలకు దేవుడైన పరమాత్మకు చాలా దూర భేదమున్నదని తెలియాలి.  పైన 16వ శ్లోకములో అనేక బాహూదర వక్త్రనేత్రం అన్నపుడు దానికి వ్యతిరేఖముగ కిరీటినం గదినం చక్రిణంచ అని వ్రాయడము సరియగునా? అందువలన ఈ శ్లోకమును తీసివేయడము జరిగినది.    

శ్లోకం 18: త్వ మక్షరం పరమం వేదితవ్యం త్వ మస్య విశ్వస్య పరం నిధానమ్ |

త్వ మవ్యయ శ్శాశ్వతధర్మగోప్తా సనాతన స్త్వం పురుషో మతోమే || 

(నిరాకారము)

భావము : నీవు అక్షరుడవు. తెలియదగిన పరము నీవే. విశ్వమునకు ఆధారమైన వాడవునీవే. శాశ్వతముగ అవ్యయుడవు. ధర్మరక్షకుడవు నీవే. పురాతనము నుంచి నీవే పురుషునిగ ఉన్నావని నేను తలచుచున్నాను.

శ్లోకం 19: అనాది మధ్యాన్త మనన్త వీర్య మనన్త బాహుం శశీసూర్యనేత్రమ్|

పశ్యా మిత్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపన్తమ్ ||

(నిరాకారము)

భావము : మొదలు, నడుమ, చివరలేనివాడుగను. అనంత మగతనము గలవాడుగను. అనంత బాహువులు గలవాడుగను, సూర్యచంద్రులు కన్నులుగ ఉన్నవాడుగను, ప్రకాశించు అగ్నివలె ముఖముగలవాడుగను, స్వతేజస్సుచే జగతిని తపింప జేయువాడునుయైన నిన్ను చూడగలిగితిని.   

శ్లోకం 20: ద్యావాపృథివ్యో రిద మన్తరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చసర్వాః |

దృష్ట్వాఽ ద్భుతం రూప ముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్! ||

(నిరాకారము)

భావము : భూమికి, ఆకాశమునకు, వాటి రెండిటి మధ్యను మరియు దిశలకెల్లను వ్యాపించివుంటివి నీవు. చూచుటకు అద్భుతముగను భయంకరముగనున్న నీ ఆకృతిచే ముల్లోకములు భయపడుచున్నాయి.

శ్లోకం 21: అమీహిత్వాం సురసంఘా విశన్తి కేచిద్భీతాః ప్రాంజలయో గృణన్తి |

స్వస్తీత్యుక్త్వా మహర్షి సిద్ధసంఘాఃస్తువన్తి త్వాం స్తుతిభిఃపుష్కలాభిః || 

(నిరాకారము)

శ్లోకం 22: రుద్రాదిత్యా వసవోయే చసాధ్యా విశ్వేఽశ్వినౌ మరుత శ్చోష్మపాశ్చ |

గన్ధర్వ యక్షాసురసిద్ధ సంఘా వీక్షన్తే త్వాం విస్మితాశ్చైవసర్వే ||

(నిరాకారము)

భావము : దేవతా సమూహములు నీయందు ప్రవేశిస్తున్నారు. కొందరు భయముచే నిన్నుమ్రొక్కుచున్నారు. సిద్ధులైన మహర్షులు స్వస్తి చెప్పుచు సంతసమున స్తుతించుచున్నారు.

శ్లోకం 23: రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో! బహుబాహూరుపాదమ్ |

బహూదరం బహుదం ష్ట్రాకరాళం దృష్ట్వా లోకాహ ప్రవ్యథితా స్తథాఽహమ్ ||

(నిరాకారము)

భావము : బహుముఖములు, నేత్రములు అనేకములైన బాహువులు, తొడలు, పాదములు గలదియును, అనేక భయంకరమైన కోరలుగల నీ ముఖము చూచుట వలన లోకులందరు భయముచెందినారు. మరియు నేనుకూడ భయపడి పోవుచున్నాను.

శ్లోకం 24: నభస్స్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ |

దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితా న్తరాత్మా ధృతిం న విన్దామి శమం చ విష్ణో! || 

(నిరాకారము)

శ్లోకం 25: దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వెవ కాలానలసన్నిభాని |

దిశోన జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ! జగన్నివాస!||

(నిరాకారము)

భావము : ఆకాశము వరకు వ్యాపించిన అనేక రంగులు గలవాడవు, తెరిచిన నోరు గలవాడవు, ప్రకాశించుచున్న విశాలనేత్రములు గలవాడవునైన నిన్ను చూచుటచే నాలో భయము, బాధకల్గుచున్నది. శాంతి, ధైర్యము లేకుండ పోయినది. భయంకరమగు కోరలుగల నీముఖము కాలాగ్నివలె కనిపించుచున్నది. దానిని చూచుట వలన దిక్కు తెలియలేదు. సౌఖ్యము తెలియలేదు.

శ్లోకం 26: అమీచ త్వాం ధృతరాష్ట్ర స్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః |

భీష్మోద్రోణ స్సూతపుత్ర స్తథా ఽసౌ సహాస్మదీయై రపి యోధముఖ్యైః ||

(నిరాకారము)

శ్లోకం 27: వక్ర్తాణి తేత్వరమాణా విశన్తి దం ష్ట్రాకరాళాని భయానకాని |

కేచి ద్విలగ్నా దశనాన్తరేషు సందృశ్యన్తే చూర్ణితై రుత్తమాంగైః ||

(నిరాకరము)

భావము : ధృతరాష్ట పుత్రులగు దుర్యోధనాదులందరు, మిగతా రాజుల సమూహము, భీష్ముడు, ద్రోణుడు,కర్ణుడు ఇటువైపు మన యుద్ధవీరులైన ముఖ్యులు అందరు వేగముగ భయంకరముగనున్న నీ ముఖముల కోరలలో ప్రవేశించుచున్నారు. కొందరేమో కోరలమధ్య తగుల్కొని చూర్ణము చేయబడినవారై తలలు మాత్రము కనిపిస్తున్నవి.

శ్లోకం 28: యథా నదీనాం బహువోఽమ్బువేగా స్సముద్ర మేవాభి ముఖా ద్రవన్తి |

తథా తవామీ నరలోకవీరా విశన్తి వక్త్రాణ్య విభిజ్వలన్తి ||

(నిరాకారము)

శ్లోకం 29: యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశన్తి నాశాయ సమృద్ధవేగాః|

తథైవ నాశాయ విశన్తిలోకా స్తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః ||

(నిరాకారము)

భావము : ఏ విధముగ నదులన్ని సముద్రమువైపు అతివేగముగ ప్రవహిస్తు సముద్రములో పడుటకై ప్రయత్నిస్తున్నవో, అట్లే ఈ నరకంలోని వారందరు జ్వలించుచున్న నీ ముఖమువైపు పరుగిడుచు నీ ముఖములో ప్రవేశిస్తున్నారు. మండుచున్న అగ్నిలో మిడుతలు వేగముగ వచ్చి పడి కాలిపోయినట్లు, భూమి మీద జీవరాసులన్నియు ఆవిధముగనే వేగముగ నీ ముఖాగ్నిలో పడి మరణిస్తున్నాయి.

శ్లోకం 30: లేలిహ్యసే గ్ర సమాన స్సమన్తా ల్లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః |

తేజోభి రాపూర్వజ గత్సమగ్రం భాస స్త వోగ్రా:ప్రతపన్తి విష్ణో! ||

(నిరాకారము)

శ్లోకం 31: ఆఖ్యాహి మేకోభవానుగ్రరూపో నమోఽస్తు తేదేవ! వరప్రసీద |

విజ్ఞాతు మిచ్ఛామి భవన్త మాద్యం నహి ప్రజానామి తవప్రవృత్తిమ్ ||

(నిరాకారము)

భావము : మండుచున్న ముఖములచేత సమస్త జీవరాసులను మ్రింగుచున్నవాడవై సమస్తమును ఆస్వాధించుచున్నావు. నీ యొక్క కిరణములు జగత్తంతయు వ్యాపించి తపింపజేయుచున్నవి. ఉగ్రరూపుడవు నీవు ఎవడవో నాకు చెప్పుము. నీ ప్రవృత్తి నాకు తెలియకున్నది. ఆది పురుషుడైన నిన్ను నమస్కరించి తెలియకోరుచున్నాను.

పరమాత్మ ఇట్లనియె : -

శ్లోకం 32: కాలోస్మి లోకక్షయకృ త్ప్రవృద్ధోలోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః |

ఋతే ఽపి త్వాన భవిష్యన్తి సర్వేయే ఽవస్థితాః ప్రత్యనీకేషు యోధాః ||

(పరమాత్మ)

భావము : లోకములోని జీవులను నశింపచేయు బలమైన కాలమును నేను. జీవులను సంహరించుటే నా పని. ఇపుడు నీవు లేకపోయినను యుద్ధము చేయక పోయినను వీరు సంహరింపబడుదురు.

శ్లోకం 33: తస్మాత్త్వ ముత్తిష్ఠ యశోలభస్వ జిత్వాశత్రూన్ భుంక్ష్వరాజ్యం సమృద్ధమ్ |

మయైవైతే నిహతాఃపూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్! || 

(పరమాత్మ)

శ్లోకం 34: ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాఽన్యానపి యోధవీరాన్ |

మయాహతాంస్త్వం జహిమావ్యధిష్ఠాయుద్ధ్యస్వజేతా ఽసిరణే సపత్నాన్ ||

(పరమాత్మ)

భావము : కనుక శత్రువులను జయించుటకు లెమ్ము. వారు ఇంతవరకే నాచే సంహరింపబడిన వారుగనున్నారు. నీవు నిమిత్తమాత్రముగ యుద్ధము చేసి జయించిన కీర్తియు, రాజ్యమును పొందుము.  ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు మొదలగు యుద్ధవీరులందరు నాచేత సంహరింపబడివున్నారు. నీవు యుద్ధము చేయకున్నను వారు జీవించివుండరు.అని పరమాత్మ అన్న మాటలు విని అర్జునుడిట్లనసాగెను.

సంజయుడిట్లనియె : -

శ్లోకం 35: ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలి ర్వేపమానః కిరీటీ |

నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతభీతః ప్రణమ్య || (కల్పితము)

అర్జునుడిట్లనియె : -

శ్లోకం 36: స్థానే హృషీకేశ! తవప్రకీర్త్యా జగత్ప్రహృష్య త్యనురజ్యతే చ |

రక్షాంసి భీతాని దిశో ద్రవన్తి సర్వే సమాస్యన్తి చ సిద్ధసంఘాః ||

(నిరాకారము)

శ్లోకం 37: కస్మాఛ్చ తేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోఽ ప్యాదికర్త్రే |

అనన్త!దేవేశ!జగన్నివాస!త్వ మక్షరం సదసత్తత్పరంయత్ |

(నిరాకారము)

భావము : ఓ పరమాత్మ! నీ మహిమా కీర్తిని విని జగత్తంతయు సంతోష మందునుండగ, రాక్షసులు భయపడి దిక్కులకు పరుగిడుచున్నారు. సిద్ధులెల్లరు నమస్కరించుచున్నారు. బ్రహ్మకు కూడ ఆదికర్తవైన, మహాత్ముడైన నిన్ను ఎందుకు నమస్కరింపకుందురు. దేవదేవ! జగన్నివాస! నీవే ఆ అక్షరము మరియు సత్తు, అసత్తు, వాటికి వేరుగనున్న వాడు అన్నియు నీవేయగుదువు.

శ్లోకం 38: త్వమాదిదేవః పురుషః పురాణ స్త్వమస్య విశ్వస్య పరం నిధానమ్|

వేత్తాఽ సి వేద్యంచ పరంచ ధామ త్వయాతతం విశ్వ మనన్త రూప! ||

(నిరాకారము)

భావము : ఓ కృష్ణా! ఆది దేవుడవు, పురాణ పురుషుడవు, విశ్వమయుడవు, పరమ పదముడవు, తెలిసినవాడవు, తెలియదగినవాడవు అన్నియు నీవే.

శ్లోకం 39: వాయుర్యమోఽ గ్నిర్వరుణ శృశాంకాః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ |

నమో నమస్తేఽ స్తు సహస్రకృత్వః పునశ్చ భూయోఽ పినమో నమస్తే ||

(నిరాకారము)

శ్లోకం 40: నమః పురస్తా దథ పృష్ఠతస్తే నమో ఽస్తు తే సర్వత ఏవ సర్వ |

అనన్త వీర్యా మిత విక్రమ స్త్వం సర్వం సమాప్నోషి తతోఽ సి సర్వః ||

(నిరాకారము)

భావము : మ్రొక్కువాడనుముందు, మ్రొక్కవాడను వెనుక, మ్రొక్కువాడను సర్వ దిక్కులందు, అమిత పరాక్రమవంతుడవు మరియు అమిత మగతనముగల వీర్యుండవు. సర్వమునకు వ్యాపించిన వాడవగుట వలన సర్వము నీవేయగుదువు.

శ్లోకం 41: సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హేకృష్ణ! హేయాదవ! హేసఖేతి |

అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదా త్ప్రణ యేన వాఽ పి || (సాకారము)

శ్లోకం 42: యచ్చాపహాసార్థ మసత్కృతోఽ సి విహార శయ్యాసన భోజనేషు |

ఏకోఽ థవాఽ ప్యచ్యుత! తత్సమక్షం తత్ క్షా మయేత్వా మహ మప్రమేయమ్ ||

(సాకారము)

భావము : సఖుడవని తలచి వినయవిధేయతలు లేకుండ, నీ మహత్యము తెలియక ఓయి సఖా! ఓయి మాధవ! ఓయి కృష్ణా అని విహరించునపుడు, పరుండునపుడు, కూర్చుండునపుడు, భోజనము చేయునపుడు, ఒంటరిగనున్నపుడు ఇతరుల ఎదుట ఎగతాళిగ మాట్లాడినవన్నియు క్షమించవలయును.

శ్లోకం 43: పితా ఽ సి లోకస్య చరాచరస్య త్వమస్యపూజ్యశ్చ గురుర్గరీయాన్ |

నత్వత్సమో ఽస్త్యభ్యధికః కుతోఽ న్యో లోకత్రయే ఽప్యప్రతిమప్రభావ! ||

(సాకారము)

భావము : చరాచర జీవరాసులకు తండ్రివియును, పూజ్యుడవును, గురుడవును నీవే. దేవదేవ! ముల్లోకములందు నీకు సమానమైన వారెవ్వరులేరు. అందరికంటే నీవే అధికుడవు.

శ్లోకం 44: తస్మాత్ర్పణమ్యప్రణిధాయ కాయం ప్రసాదయే త్వా మహ మీశ మీడ్యమ్ |

పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు: ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ ||

(నిరాకారము)

భావము : అందువలన నీకు సాష్టాంగనమస్కారము చేయుచు పూజార్హుడైన ఈశ్వరుడైన నిన్ను ప్రసన్నుడవగుమని ప్రార్థించుచున్నాను. ఓ దేవదేవ! కుమారునికి తండ్రివలె, మిత్రునికి మిత్రునివలె, ప్రియురాలికి ప్రియుడువలె నన్ను మన్నించుటకర్హుడవు.

శ్లోకం 45: అదృష్టపూర్వం హృషితో ఽ స్మిదృష్ట్వా భయేన చప్రవ్యథితం మనోమే|

త దేవ మే దర్శయ దేవ! రూపం ప్రసీద దేవేశ! జగన్నివాస! ||

(సాకారము, నిరాకారము)

భావము : ముందెప్పుడు చూడని అదృష్టపూర్వమైన ఈ రూపము చూచి మొదట సంతోషము కల్గినది. అయినను ఇప్పుడు మనస్సులో భయము కల్గుచున్నది. దేవదేవ నీవు ప్రసన్నుడవై, మొదటి సౌమ్యమైన ఆకారమునే చూపుము.

శ్లోకం 46: కిరీటినం గదినం చక్రహస్త మిచ్ఛామి త్వాంద్రష్టు మహం త ధైవ |

తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్త్రబాహో! భవ విశ్వమూర్తే! ||

(అశాస్త్రీయము)

భావము : ఈ అధ్యాయములో 17వ శ్లోకము ఇక్కడ 46వ శ్లోకము రెండునూ అశాస్త్రీయ శ్లోకములే. ఇవి కల్పిత శ్లోకములని తెలియాలి. ఎందుకనగ విశ్వరూపమునకు పరిమితిగ చేతులు లేవు. అట్లే శ్రీకృష్ణునకు నాల్గు చేతులు లేవు. సాధారణ మనిషిగనున్న శ్రీకృష్ణునికి నాల్గు చేతులున్నాయనుట ఎంత సమంజసము. అలా నాల్గుచేతులుంటే విశ్వరూపము చూపి నేను దేవుడనని చెప్పుకోవలసిన అవసరముండదనుకుంటాము. నాల్గు చేతులుంటేనే చెప్పకనే దేవుడని ప్రజలే పూజించెడివారు. అపరిమిత అసంఖ్యాకములైన చేతులు విశ్వరూపమునకుండగ కేవలము వేయి చేతులని చెప్పడమేమిటి? అనేక సంశయములతో కూడుకొని ఎటుచూసిన శాస్త్రబద్దమైన జవాబు దొరకని శ్లోకములను ఈ గీతలో బయటికి నెట్టివేయడము జరిగినది. ఇది శాస్త్రమను జలముచే కడగబడిన గీత. ఎన్నో భావములు సవరింపబడిన గీత. దీనిని అసూయతో అడ్డముగ మాట్లాడువారు తప్ప అందరు సమ్మతింపతగినదని తెలియజేయుచున్నాము.

పరమాత్మ ఇట్లనియె : -

శ్లోకం 47: మయాప్రసన్నేనతవార్జునేదం రూపం పరం దర్శిత మాత్మయోగాత్ |

తేజోమయం విశ్వ మనన్తమాద్యం యన్మేత్వదన్యేన నదృష్టపూర్వమ్ ||

(నిరాకారము)

భావము : నా యొక్క ప్రసన్నముచేత మొదటిదైన విశ్వవ్యాపకమైన, తేజస్సుచే కూడిన నా శ్రేష్ఠమైన రూపము చూపబడినది. పూర్వమునుండి ఇంతవరకు నీవు తప్ప ఇతరులెవరు దీనిని చూచిన వారులేరు.

శరీరముతో ఉన్న కర్మయోగి కాని, బ్రహ్మయోగి కాని, పరమాత్మ ఆకృతిని తెలియలేరు. బ్రహ్మయోగులు మాత్రము తమ శరీరములోని ఆత్మను వారి మనోనేత్రముచే చూడగల్గినను పరమాత్మను చూడలేరు. బ్రతికివున్నవారెవరు పరమాత్మను చూడలేరనియే చెప్పవచ్చును. అర్జునునికి పరమాత్మయే స్వయముగ కల్పించిన అవకాశము వలన చూడగలిగాడు. అటువంటి అవకాశమెవరికైన వస్తే తప్ప చూడలేరనియే చెప్పవచ్చును. సృష్ఠ్యాదినుండి ఎవరూ చూడని రూపు నీవు చూడగల్గితివని పరమాత్మ అనడము వలన అది ఎవరికీ సాధ్యము కానిదని తెలియుచున్నది. పరమాత్మ ఇలా ఉన్నాడని తెల్పునిమిత్తము ఒకమారు అర్జునుని అడ్డము పెట్టుకొని బహిర్గతము చేసినదని తెలియవలెను. పరమాత్మ రూపము పరమాత్మ తెలుపవలసిందే కాని వేరెవరిచేత కాదని తెలియవలెను. అర్జునునికి పరమాత్మ అనుగ్రహముతో కల్గిన దానివలన మనకు కొంత అర్థమైనదని అనుకొందాము.

శ్లోకం 48: నవేదయజ్ఞాధ్యయనైర్నదానైర్న చక్రియాభిర్న తపోభిరుగ్రైః |

ఏవం రూప శ్శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర! ||

(నిరాకారము)

భావము : వేదములచేతకాని, యజ్ఞములచేతకాని, దానములచేతకాని, ఉగ్రతపస్సుల చేతకాని ఈ రూపముగల నన్ను తెలియజాలరు. జగతిలో నీవు తప్ప నన్ను చూచినవారు ఎవరు లేరు.

1) నేనే కాలమునై ఉండి అందరి పుట్టుకను కల్గించి చివరకు మృత్యువు అగుచున్నాను.

2) వేదముల వలన, యజ్ఞములవలన, దానముల వలన, తపస్సుల వలన నన్ను ఎవరు తెలియలేరు.

పరమాత్మ తెల్పిన ఈ రెండు విషయములు జీవరాసులకి చాలా ముఖ్యమని తెలియాలి. మన ఆరాధనలను బట్టి మనము పరమాత్మ వైపు ఉన్నామా లేక ప్రకృతి(మాయ లేక సాతాన్, లేక సైతాన్) వైపు ఉన్నామా ఆలోచించుకోండి.

శ్లోకం 49: మాతేవ్యథా మాచవిమూఢభావోదృష్ట్వారూపం ఘోరమీదృజ్మ మేదమ్ |

వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం త దేవ మే రూప మిదం ప్రపశ్య ||

(సాకారము, నిరాకారము)

భావము : ఈ భయంకర రూపమును నీవు చూచి భయము చెందకు, విమూఢ భావములను పొందకు. నీకు ప్రీతి కలుగుటకు, భయము వీడిపోవుటకు మొదటి సౌమ్యముగనున్న రూపునే చూపుచున్నాను చూడుము.

సంజయుడిట్లనియె : -

శ్లోకం 50: ఇత్యర్జునం వాసుదేవ స్తథోక్త్వా స్వకం రూపం ధర్మయామాస భూయః |

అశ్వాసయామాస చ భీత మేనం భూత్వా పున సౌమ్యవపు ర్మహాత్మా || (కల్పితము)

అర్జునుడిట్లనెను : -

శ్లోకం 51: దృ ష్ట్వే దం మానుషం రూపం తవ సౌమ్యం జనార్ధన! |

ఇదానీ మస్మి సంవృత్త స్సచేతాః ప్రకృతిం గతః||

(సాకారము)

భావము : ఓ కృష్ణా! మనుజరూపమున నీ సౌమ్య స్వభావ ఆకృతినిగని నా అంతరంగమందు స్వస్థత చేకూరెను. మనసు నిలకడకల్గెను.    

శ్రీ భగవంతుడిట్లనియె : -

శ్లోకం 52: సుదుర్ధర్శ మిదం రూపం దృష్టవా నసి యన్మమ |

దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః ||

(నిరాకారము)

భావము : అర్జునా! నీవు చూచిన బ్రహ్మాండమైన రూపము ఇతరులు చూచుట దుర్లభము. దేవతలెందరో నా దివ్యాకృతిని చూచుటకు ఎల్లప్పుడు కాంక్షకల్గియున్నారు.

శ్లోకం 53: నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా |

శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవా నసి మాం యథా ||

(నిరాకారము)

భావము : నీవు నన్ను ఎట్లు చూచియున్నావో ఆ దర్శనము దొరకవలెనన్న వేదములచేతను, తపస్సుల చేతను, దానములచేతను మరియు యజ్ఞముల చేతను శక్యము కాదు.

శ్లోకం 54: భక్త్యా త్వనన్యయా శక్య అహ మేవం విధో ఽ ర్జున! |

జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరన్తప! ||

(పరమాత్మ, బ్రహ్మయోగము)

భావము : అర్జునా! నా ఆత్మను తెలియుటకు, చూచుటకు, ప్రవేశించుటకు అనన్యమైన భక్తిచేతనే సాధ్యమగుదును.

శ్లోకం 55: మత్క ర్మకృన్మత్పరమో మద్భక్త స్సంగవర్జితః |

నిర్వైర స్సర్వభూతేషు యస్సమామేతి పాణ్డవ! ||

(భక్తియోగము, బ్రహ్మయోగము, కర్మయోగము)

భావము : ఎవడు నాకర్మలనే ఆచరించుచున్నాడో, ఎవడు నా స్థానమునే ముఖ్య గతిగా తలంచుచున్నాడో, ఎవడు సంగవర్జితుడో, ఎవడు సర్వభూతములందు వైరము లేనివాడై బ్రహ్మయోగియై ఉన్నాడో అతడు నన్ను పొందగలడు.

-----------------------------------

త్రైత సిద్ధాంత భగవద్గీత:  విశ్వరూప సందర్శన యోగము  

అర్జునుడిట్లనియె : -

శ్లోకం 1: (ధర్మములు)

భావము : నన్ను అనుగ్రహించి నాకింతవరకు చెప్పిన విషయములు ఆధ్యాత్మములైనవి కావున నాలోని మోహమెల్ల సమసిపోయినది. ప్రతి అధ్యాయమునకు ఒక పేరు పెట్టి పేరు చివరిలో యోగము అన్నారు. అధ్యాయములో ఏ విషయమును గూర్చి ఎక్కువగ చెప్పారో, ఆ విషయమునకు సంబంధించిన పేరు ఆ అధ్యాయమునకు పెట్టడము జరిగినది. ఇక్కడ విశ్వ రూపమునకు సంబంధించిన విషయము ఎక్కువగా ఉండుట వలన, ఈ ఆధ్యాయమును విశ్వరూప సందర్శన యోగమన్నారు. ప్రతి అధ్యాయములో చెప్పెడి విషయము యొక్క మూల ఉద్దేశ్యము జీవాత్మ పరమాత్మలో కలిసిపోవడమే అయివున్నది. కలిసిపోవుటను యోగము అంటారు. విడిపోవుటను వియోగము అంటారు. గీతలో అన్ని అధ్యాయములు కలిసిపోవు విషయమునే చెప్పుచున్నవి కావున అన్ని అధ్యాయములకు చివరిలో 'యోగము' అనుట సమంజసమైనదే.    

శ్లోకం 2: (పరమాత్మ)

భావము : సర్వ జీవరాసులకు చావు పుట్టుకలు నీవలన కల్గుననియు, నీ మహిమ అవ్యయమైనదనియు విస్తారముగా ఇంత వరకు వింటిని.

శ్లోకం 3: (పరమాత్మ, నిరాకారము)

భావము : ఓ పురుషోత్తమా! నిన్ను గూర్చి నీవు చెప్పినదంతయు సత్యమగును. నీ విశ్వరూపమును చూడవలెనని నాకు కోరిక కల్గినది.    

శ్లోకం 4: (పరమాత్మ, నిరాకారము)

భావము : నీ ఆత్మ రూపమును నేను చూచుటకు అర్హుడనగుదునేని అవ్యయమైన ఆ రూపమును చూపుము.

శ్రీ భగవంతుడిట్లనియె : -

శ్లోకం 5: 

శ్లోకం 6: 

శ్లోకం 7: (పరమాత్మ, నిరాకరము)

భావము : అర్జునా! అనేక విధములైన, అనేక వర్ణములైన, అనేక ఆకారములైన నా దివ్యరూపమును వందలాదిగ, వేలాదిగ, అసంఖ్యాకములుగ చూడుము.  ఆదిత్యులును, వసువులును, రుద్రులును, అశ్వనీ కుమారులును, మరుత్తులును మొదలగువారిని చూడుము. ఎన్నో జన్మల పుణ్యము చేత కనిపించెడి ఆశ్చర్యమైన ఈ రూపము చూడుము.  సర్వ జగత్తు మరియు అందలి చరాచర జీవుల సమూహమును ఒక్కటిగ నా శరీరమందే ఉన్నట్లు చూడగలవు. ఇష్టమొచ్చిన దేనినైన నాయందే చూడుము.

శ్లోకం 8: (పరమాత్మ, నిరాకారము) 

భావము : అయితే నీకున్న కన్నులతో నన్ను చూచుటకు శక్యము కాదు. నీకు దివ్యమైన కన్నుల నిచ్చెదను. నాయొక్క ఈశ్వర స్వరూపము వాటిచే చూడుము.

సంజయుడిట్లనియె : - 

శ్లోకం 9: 

శ్లోకం 10: 

శ్లోకం 11: 

శ్లోకం 12: 

శ్లోకం 13: 

శ్లోకం 14: 

అర్జునుడిట్లనియె : -

శ్లోకం 15: 

శ్లోకం 16: (నిరాకారము)

భావము : దేవదేవా! సర్వదేవతలను, సర్వజీవరాసుల సమూహములను, బ్రాహ్మణులను, ఈశ్వరులను మరియు పద్మాసనములో కూర్చున్న ఋషులను, గొప్పవైన ఎన్నో సర్పములను నీ దేహమందు చూచితిని.  ఓ విశ్వేశ్వర! విశ్వరూప! అనేకమైన చేతులు, కడుపులు, ముఖములు, కన్నులు కల్గి అంతట అనంతరూపమైన మరియు ఆది మధ్య అంతము లేని నిన్ను చూడగల్గితిని.

శ్లోకం 17:  (అశాస్త్రీయము)

భావము : విశ్వరూపమునకు ప్రత్యేకించి ఒక తల లేదు. అట్లే ప్రత్యేకించి రెండు చేతులు కూడ లేవు. అందువలన కిరీటము ధరించడము గద, చక్రముకల్గి వుండడమను మాట అశాస్త్రీయమై పోవుచున్నది. గద, చక్రము, కిరీటము దేవతలలోని విష్ణువుకుండవచ్చును. కాని విశ్వరూపమునకుండవు. విశ్వరూపమును, విష్ణురూపముగ గుర్తించునట్లుగ చేసిన ప్రయోగమే ఈ శ్లోకమని చెప్పవచ్చును. దేవతలలో గొప్పవాడైన విష్ణువుకు దేవతలకు దేవుడైన పరమాత్మకు చాలా దూర భేదమున్నదని తెలియాలి.  పైన 16వ శ్లోకములో అనేక బాహూదర వక్త్రనేత్రం అన్నపుడు దానికి వ్యతిరేఖముగ కిరీటినం గదినం చక్రిణంచ అని వ్రాయడము సరియగునా? అందువలన ఈ శ్లోకమును తీసివేయడము జరిగినది.    

శ్లోకం 18: (నిరాకారము)

భావము : నీవు అక్షరుడవు. తెలియదగిన పరము నీవే. విశ్వమునకు ఆధారమైన వాడవునీవే. శాశ్వతముగ అవ్యయుడవు. ధర్మరక్షకుడవు నీవే. పురాతనము నుంచి నీవే పురుషునిగ ఉన్నావని నేను తలచుచున్నాను.

శ్లోకం 19: (నిరాకారము)

భావము : మొదలు, నడుమ, చివరలేనివాడుగను. అనంత మగతనము గలవాడుగను. అనంత బాహువులు గలవాడుగను, సూర్యచంద్రులు కన్నులుగ ఉన్నవాడుగను, ప్రకాశించు అగ్నివలె ముఖముగలవాడుగను, స్వతేజస్సుచే జగతిని తపింప జేయువాడునుయైన నిన్ను చూడగలిగితిని.   

శ్లోకం 20: (నిరాకారము)

భావము : భూమికి, ఆకాశమునకు, వాటి రెండిటి మధ్యను మరియు దిశలకెల్లను వ్యాపించివుంటివి నీవు. చూచుటకు అద్భుతముగను భయంకరముగనున్న నీ ఆకృతిచే ముల్లోకములు భయపడుచున్నాయి.

శ్లోకం 21: (నిరాకారము)

శ్లోకం 22: (నిరాకారము)

భావము : దేవతా సమూహములు నీయందు ప్రవేశిస్తున్నారు. కొందరు భయముచే నిన్నుమ్రొక్కుచున్నారు. సిద్ధులైన మహర్షులు స్వస్తి చెప్పుచు సంతసమున స్తుతించుచున్నారు.

శ్లోకం 23: (నిరాకారము)

భావము : బహుముఖములు, నేత్రములు అనేకములైన బాహువులు, తొడలు, పాదములు గలదియును, అనేక భయంకరమైన కోరలుగల నీ ముఖము చూచుట వలన లోకులందరు భయముచెందినారు. మరియు నేనుకూడ భయపడి పోవుచున్నాను.

శ్లోకం 24: (నిరాకారము)

శ్లోకం 25: (నిరాకారము)

భావము : ఆకాశము వరకు వ్యాపించిన అనేక రంగులు గలవాడవు, తెరిచిన నోరు గలవాడవు, ప్రకాశించుచున్న విశాలనేత్రములు గలవాడవునైన నిన్ను చూచుటచే నాలో భయము, బాధకల్గుచున్నది. శాంతి, ధైర్యము లేకుండ పోయినది. భయంకరమగు కోరలుగల నీముఖము కాలాగ్నివలె కనిపించుచున్నది. దానిని చూచుట వలన దిక్కు తెలియలేదు. సౌఖ్యము తెలియలేదు.

శ్లోకం 26: (నిరాకారము)

శ్లోకం 27: (నిరాకరము)

భావము : ధృతరాష్ట పుత్రులగు దుర్యోధనాదులందరు, మిగతా రాజుల సమూహము, భీష్ముడు, ద్రోణుడు,కర్ణుడు ఇటువైపు మన యుద్ధవీరులైన ముఖ్యులు అందరు వేగముగ భయంకరముగనున్న నీ ముఖముల కోరలలో ప్రవేశించుచున్నారు. కొందరేమో కోరలమధ్య తగుల్కొని చూర్ణము చేయబడినవారై తలలు మాత్రము కనిపిస్తున్నవి.

శ్లోకం 28: (నిరాకారము)

శ్లోకం 29: (నిరాకారము)

భావము : ఏ విధముగ నదులన్ని సముద్రమువైపు అతివేగముగ ప్రవహిస్తు సముద్రములో పడుటకై ప్రయత్నిస్తున్నవో, అట్లే ఈ నరకంలోని వారందరు జ్వలించుచున్న నీ ముఖమువైపు పరుగిడుచు నీ ముఖములో ప్రవేశిస్తున్నారు. మండుచున్న అగ్నిలో మిడుతలు వేగముగ వచ్చి పడి కాలిపోయినట్లు, భూమి మీద జీవరాసులన్నియు ఆవిధముగనే వేగముగ నీ ముఖాగ్నిలో పడి మరణిస్తున్నాయి.

శ్లోకం 30: (నిరాకారము)

శ్లోకం 31: (నిరాకారము)

భావము : మండుచున్న ముఖములచేత సమస్త జీవరాసులను మ్రింగుచున్నవాడవై సమస్తమును ఆస్వాధించుచున్నావు. నీ యొక్క కిరణములు జగత్తంతయు వ్యాపించి తపింపజేయుచున్నవి. ఉగ్రరూపుడవు నీవు ఎవడవో నాకు చెప్పుము. నీ ప్రవృత్తి నాకు తెలియకున్నది. ఆది పురుషుడైన నిన్ను నమస్కరించి తెలియకోరుచున్నాను.

పరమాత్మ ఇట్లనియె : -

శ్లోకం 32: (పరమాత్మ)

భావము : లోకములోని జీవులను నశింపచేయు బలమైన కాలమును నేను. జీవులను సంహరించుటే నా పని. ఇపుడు నీవు లేకపోయినను యుద్ధము చేయక పోయినను వీరు సంహరింపబడుదురు.

శ్లోకం 33: (పరమాత్మ)

శ్లోకం 34: (పరమాత్మ)

భావము : కనుక శత్రువులను జయించుటకు లెమ్ము. వారు ఇంతవరకే నాచే సంహరింపబడిన వారుగనున్నారు. నీవు నిమిత్తమాత్రముగ యుద్ధము చేసి జయించిన కీర్తియు, రాజ్యమును పొందుము.  ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు మొదలగు యుద్ధవీరులందరు నాచేత సంహరింపబడివున్నారు. నీవు యుద్ధము చేయకున్నను వారు జీవించివుండరు.అని పరమాత్మ అన్న మాటలు విని అర్జునుడిట్లనసాగెను.

సంజయుడిట్లనియె : -

శ్లోకం 35:    

అర్జునుడిట్లనియె : -

శ్లోకం 36: (నిరాకారము)

శ్లోకం 37: (నిరాకారము)

భావము : ఓ పరమాత్మ! నీ మహిమా కీర్తిని విని జగత్తంతయు సంతోష మందునుండగ, రాక్షసులు భయపడి దిక్కులకు పరుగిడుచున్నారు. సిద్ధులెల్లరు నమస్కరించుచున్నారు. బ్రహ్మకు కూడ ఆదికర్తవైన, మహాత్ముడైన నిన్ను ఎందుకు నమస్కరింపకుందురు. దేవదేవ! జగన్నివాస! నీవే ఆ అక్షరము మరియు సత్తు, అసత్తు, వాటికి వేరుగనున్న వాడు అన్నియు నీవేయగుదువు.

శ్లోకం 38: (నిరాకారము)

భావము : ఓ కృష్ణా! ఆది దేవుడవు, పురాణ పురుషుడవు, విశ్వమయుడవు, పరమ పదముడవు, తెలిసినవాడవు, తెలియదగినవాడవు అన్నియు నీవే.

శ్లోకం 39: (నిరాకారము)

శ్లోకం 40: (నిరాకారము)

భావము : మ్రొక్కువాడనుముందు, మ్రొక్కవాడను వెనుక, మ్రొక్కువాడను సర్వ దిక్కులందు, అమిత పరాక్రమవంతుడవు మరియు అమిత మగతనముగల వీర్యుండవు. సర్వమునకు వ్యాపించిన వాడవగుట వలన సర్వము నీవేయగుదువు.

శ్లోకం 41: 

శ్లోకం 42: (సాకారము)

భావము : సఖుడవని తలచి వినయవిధేయతలు లేకుండ, నీ మహత్యము తెలియక ఓయి సఖా! ఓయి మాధవ! ఓయి కృష్ణా అని విహరించునపుడు, పరుండునపుడు, కూర్చుండునపుడు, భోజనము చేయునపుడు, ఒంటరిగనున్నపుడు ఇతరుల ఎదుట ఎగతాళిగ మాట్లాడినవన్నియు క్షమించవలయును.

శ్లోకం 43: (సాకారము)

భావము : చరాచర జీవరాసులకు తండ్రివియును, పూజ్యుడవును, గురుడవును నీవే. దేవదేవ! ముల్లోకములందు నీకు సమానమైన వారెవ్వరులేరు. అందరికంటే నీవే అధికుడవు.

శ్లోకం 44: (నిరాకారము)

భావము : అందువలన నీకు సాష్టాంగనమస్కారము చేయుచు పూజార్హుడైన ఈశ్వరుడైన నిన్ను ప్రసన్నుడవగుమని ప్రార్థించుచున్నాను. ఓ దేవదేవ! కుమారునికి తండ్రివలె, మిత్రునికి మిత్రునివలె, ప్రియురాలికి ప్రియుడువలె నన్ను మన్నించుటకర్హుడవు.

శ్లోకం 45: (సాకారము, నిరాకారము)

భావము : ముందెప్పుడు చూడని అదృష్టపూర్వమైన ఈ రూపము చూచి మొదట సంతోషము కల్గినది. అయినను ఇప్పుడు మనస్సులో భయము కల్గుచున్నది. దేవదేవ నీవు ప్రసన్నుడవై, మొదటి సౌమ్యమైన ఆకారమునే చూపుము.

శ్లోకం 46: (అశాస్త్రీయము)

భావము : ఈ అధ్యాయములో 17వ శ్లోకము ఇక్కడ 46వ శ్లోకము రెండునూ అశాస్త్రీయ శ్లోకములే. ఇవి కల్పిత శ్లోకములని తెలియాలి. ఎందుకనగ విశ్వరూపమునకు పరిమితిగ చేతులు లేవు. అట్లే శ్రీకృష్ణునకు నాల్గు చేతులు లేవు. సాధారణ మనిషిగనున్న శ్రీకృష్ణునికి నాల్గు చేతులున్నాయనుట ఎంత సమంజసము. అలా నాల్గుచేతులుంటే విశ్వరూపము చూపి నేను దేవుడనని చెప్పుకోవలసిన అవసరముండదనుకుంటాము. నాల్గు చేతులుంటేనే చెప్పకనే దేవుడని ప్రజలే పూజించెడివారు. అపరిమిత అసంఖ్యాకములైన చేతులు విశ్వరూపమునకుండగ కేవలము వేయి చేతులని చెప్పడమేమిటి? అనేక సంశయములతో కూడుకొని ఎటుచూసిన శాస్త్రబద్దమైన జవాబు దొరకని శ్లోకములను ఈ గీతలో బయటికి నెట్టివేయడము జరిగినది. ఇది శాస్త్రమను జలముచే కడగబడిన గీత. ఎన్నో భావములు సవరింపబడిన గీత. దీనిని అసూయతో అడ్డముగ మాట్లాడువారు తప్ప అందరు సమ్మతింపతగినదని తెలియజేయుచున్నాము.

పరమాత్మ ఇట్లనియె : -

శ్లోకం 47: (నిరాకారము)

భావము : నా యొక్క ప్రసన్నముచేత మొదటిదైన విశ్వవ్యాపకమైన, తేజస్సుచే కూడిన నా శ్రేష్ఠమైన రూపము చూపబడినది. పూర్వమునుండి ఇంతవరకు నీవు తప్ప ఇతరులెవరు దీనిని చూచిన వారులేరు.

శరీరముతో ఉన్న కర్మయోగి కాని, బ్రహ్మయోగి కాని, పరమాత్మ ఆకృతిని తెలియలేరు. బ్రహ్మయోగులు మాత్రము తమ శరీరములోని ఆత్మను వారి మనోనేత్రముచే చూడగల్గినను పరమాత్మను చూడలేరు. బ్రతికివున్నవారెవరు పరమాత్మను చూడలేరనియే చెప్పవచ్చును. అర్జునునికి పరమాత్మయే స్వయముగ కల్పించిన అవకాశము వలన చూడగలిగాడు. అటువంటి అవకాశమెవరికైన వస్తే తప్ప చూడలేరనియే చెప్పవచ్చును. సృష్ఠ్యాదినుండి ఎవరూ చూడని రూపు నీవు చూడగల్గితివని పరమాత్మ అనడము వలన అది ఎవరికీ సాధ్యము కానిదని తెలియుచున్నది. పరమాత్మ ఇలా ఉన్నాడని తెల్పునిమిత్తము ఒకమారు అర్జునుని అడ్డము పెట్టుకొని బహిర్గతము చేసినదని తెలియవలెను. పరమాత్మ రూపము పరమాత్మ తెలుపవలసిందే కాని వేరెవరిచేత కాదని తెలియవలెను. అర్జునునికి పరమాత్మ అనుగ్రహముతో కల్గిన దానివలన మనకు కొంత అర్థమైనదని అనుకొందాము.

శ్లోకం 48: (నిరాకారము)

భావము : వేదములచేతకాని, యజ్ఞములచేతకాని, దానములచేతకాని, ఉగ్రతపస్సుల చేతకాని ఈ రూపముగల నన్ను తెలియజాలరు. జగతిలో నీవు తప్ప నన్ను చూచినవారు ఎవరు లేరు.

1) నేనే కాలమునై ఉండి అందరి పుట్టుకను కల్గించి చివరకు మృత్యువు అగుచున్నాను.

2) వేదముల వలన, యజ్ఞములవలన, దానముల వలన, తపస్సుల వలన నన్ను ఎవరు తెలియలేరు.

పరమాత్మ తెల్పిన ఈ రెండు విషయములు జీవరాసులకి చాలా ముఖ్యమని తెలియాలి. మన ఆరాధనలను బట్టి మనము పరమాత్మ వైపు ఉన్నామా లేక ప్రకృతి(మాయ లేక సాతాన్, లేక సైతాన్) వైపు ఉన్నామా ఆలోచించుకోండి.

శ్లోకం 49: (సాకారము, నిరాకారము)

భావము : ఈ భయంకర రూపమును నీవు చూచి భయము చెందకు, విమూఢ భావములను పొందకు. నీకు ప్రీతి కలుగుటకు, భయము వీడిపోవుటకు మొదటి సౌమ్యముగనున్న రూపునే చూపుచున్నాను చూడుము.

సంజయుడిట్లనియె : -

శ్లోకం 50:     

అర్జునుడిట్లనెను : -

శ్లోకం 51: (సాకారము)

భావము : ఓ కృష్ణా! మనుజరూపమున నీ సౌమ్య స్వభావ ఆకృతినిగని నా అంతరంగమందు స్వస్థత చేకూరెను. మనసు నిలకడకల్గెను.    

శ్రీ భగవంతుడిట్లనియె : -

శ్లోకం 52: (నిరాకారము)

భావము : అర్జునా! నీవు చూచిన బ్రహ్మాండమైన రూపము ఇతరులు చూచుట దుర్లభము. దేవతలెందరో నా దివ్యాకృతిని చూచుటకు ఎల్లప్పుడు కాంక్షకల్గియున్నారు.

శ్లోకం 53: (నిరాకారము)

భావము : నీవు నన్ను ఎట్లు చూచియున్నావో ఆ దర్శనము దొరకవలెనన్న వేదములచేతను, తపస్సుల చేతను, దానములచేతను మరియు యజ్ఞముల చేతను శక్యము కాదు.

శ్లోకం 54: (పరమాత్మ, బ్రహ్మయోగము)

భావము : అర్జునా! నా ఆత్మను తెలియుటకు, చూచుటకు, ప్రవేశించుటకు అనన్యమైన భక్తిచేతనే సాధ్యమగుదును.

శ్లోకం 55: (భక్తియోగము, బ్రహ్మయోగము, కర్మయోగము)

భావము : ఎవడు నాకర్మలనే ఆచరించుచున్నాడో, ఎవడు నా స్థానమునే ముఖ్య గతిగా తలంచుచున్నాడో, ఎవడు సంగవర్జితుడో, ఎవడు సర్వభూతములందు వైరము లేనివాడై బ్రహ్మయోగియై ఉన్నాడో అతడు నన్ను పొందగలడు.

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024