pss:త్రైత సిద్ధాంత భగవద్గీత : భావము

త్రైత సిద్ధాంత భగవద్గీత : "1" సాంఖ్య యోగము 

శ్రీ భగవంతుడిట్లనియె:-


శ్లోకం 11: (ప్రకృతి, పరమాత్మ)

భావము: శోకింపతగని వాటిని గూర్చి నీవు శోకించుచున్నావు. మరియు నీ ప్రజ్ఞ (బుద్ధి) నెల్లనుపయోగించి మాట్లాడుచున్నావు. పండితులు గతులు కల్గిన మరియు గతులు లేని వాటిని గూర్చి బాధపడరు.


శ్లోకం 12: (జీవాత్మ)

భావము: నేను లేకుంటిననుట ఎప్పటికీ లేదు. నీవు ఎప్పటికీ ఉందువు. ఈ ధరణి పాలించు రాజులు కూడ ఎప్పటికీ ఉందురు. ఇక ముందు కూడ మనమందరము లేకపోవుటనునదే లేదు.


శ్లోకం 13: (జీవాత్మ)

భావము: దేహికి దేహమునందు బాల్యము, యవ్వనము,కౌమారము, ముసలి తనము వరుసగ ఎట్లు కల్గునో, అట్లే శరీరమును వదలిపోవడమను మరణము కూడ కల్గుచున్నది.


శ్లోకం 14: (జీవాత్మ)

భావము: పంచతన్మాత్రలచేత, శీతోష్ణములు సుఖదుఃఖములు మానవులకు కల్గుచుండును. శీతోష్ణములు సుఖదుఃఖములు ఎప్పటికి ఉండునవి కావు. అశాశ్వతములైనవి. వచ్చిపోయెడు వాటిని ఆ కొద్దికాలము ఓర్చుకోవలయును.


శ్లోకం 15: (జీవాత్మ)

భావము: ఎవడు సుఖదుఃఖ భేదములెంచుకొనడో, ఎవనికి వాని వ్యథ కలుగదో వాడే అమృతత్వమునకు అర్హుడగును.


శ్లోకం 16: (ఆత్మ)

భావము: సత్తు కనుక ఆత్మకు నాశనము లేదు. శరీరము అసత్తుకనుక దానికి నాశనము తప్పదు నిశ్చయమైన ఈ రెండిటి నిర్ణయ విధానములు ఆత్మను దర్శించినవారికి తెలిసివుండును.


శ్లోకం 17: (పరమాత్మ)

భావము: నాశనములేని పరమాత్మ ప్రపంచమంత వ్యాపించి సర్వము ఇమిడి ఉన్నది. ఇది శరీరంలోపల కూడ ఉన్నది. అట్టి దానిని ఎవడు నాశనము చేయలేడు.


శ్లోకం 18: (ఆత్మ, పరమాత్మ)

భావము: శరీరములలో నిత్యము ఉండువాడైన ఆత్మయు, నాశనములేని వాడు అప్రమేయుడు అయిన పరమాత్మయు నివశించు శరీరమునకు ఎప్పటికైన నాశనము తప్పదు కావున యుద్ధము చేయుము.


శ్లోకం 19: (జీవాత్మ)

భావము: జీవాత్మను చంపుదునని ఎవడనుకొనునో మరియు అది చంపబడునని కూడ ఎవడనుకొనునో ఆ ఇరువురు ఙ్ఞానశూన్యులని తెలియుము. జీవాత్మ చావునది కాదు, చంపబడునది కాదు.


శ్లోకం 20: (పరమాత్మ)

భావము: పరమాత్మ పుట్టునది కాదు గిట్టునది కాదు. ఒకప్పుడుండి మరియొకప్పుడు లేదనుటకు వీలుకాదు. నిత్యముండువాడు, పురాణుడు శరీరము చంపబడినను తాను చచ్చువాడు కాదు.


శ్లోకం 21: (పరమాత్మ)

భావము: నిత్యుడు, నాశనములేనివాడు పరమాత్మయని ఎవడు తెలుసుకొనునో, వాడు అట్టి పరమాత్మను ఎట్లు హింసింపగలడు? హింసచేయుటకునైన ఎట్లు తలచును?


శ్లోకం 22: (జీవాత్మ)

భావము : మానవుడు పాతవస్త్రమును వదలి క్రొత్తవస్త్రమును ధరించినట్లు ఆత్మ శిథిలావస్థకొచ్చిన పాతదేహమును వీడి క్రొత్త శరీరములో ప్రవేశించుచున్నది.


శ్లోకం23: నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః|

న చైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః||

(జీవాత్మ)

భావము:- జీవాత్మ కత్తికి తెగదు, అగ్నికి కాలదు, నీటికి నానదు, అట్లే గాలికి త్రోయబడదు.


శ్లోకం 24: (పరమాత్మ)

భావము: నిత్యముండువాడు, సర్వ జగత్తంతయు వ్యాపించినవాడు, నిలకడగ ఉండువాడు, చలనము లేనివాడు అయిన సనాతనమైన పరమాత్మ ఛేదింపబడడు, కాలడు, తడుపబడడు, త్రోయబడడు.


శ్లోకం 25: (ఆత్మ)

భావము:- ఆత్మను తెలియచెప్పుటకు, చింతించి తెలుసుకొనుటకు సాధ్యము కాదు. ఆత్మను ఏ వికారములు అంటవు. అందువలన దానికోసము దుఃఖ పడవలదు.


శ్లోకం 26: (జీవాత్మ)

భావము:- అట్లు కాకుండ వాడు నిత్యము పుట్టి నిత్యము చచ్చునని తెలిసితివేని, ఆ విధంబునైన వాని కొరకు నీవు ఏల దుఃఖపడవలయును.


శ్లోకం 27: (జీవాత్మ)

భావము:- పుట్టుట ఎప్పటికైన చచ్చుట కొరకే, చచ్చుట మరి పునర్జన్మమునకే, కనుక అనివార్యమైన ఈ సంగతిని గురించి దుఃఖించుట తగదు.


శ్లోకం 28: (జీవాత్మ)

భావము:-జీవ సంభవములెల్ల తెలియబడవు. అట్లే వాని మరణములు కూడ తెలియబడవు. కాని పుట్టుక చావుల మధ్యనగల జీవితము మాత్రము తెలియును. అట్టి జీవునకు నీవు శోకింపతగదు.


శ్లోకం 29: (జీవాత్మ)

భావము:- మధ్య జీవితములో జరుగు పనులను ఒకడు ఆశ్చర్యముగా చూచుచున్నాడు. ఆ పనులను ఇంకొకడు ఆశ్చర్యముతో వినుచున్నాడు. మరియొకడు వింతగా చెప్పుకొనుచున్నాడు. కాని జీవాత్మ నిజస్థితిని గూర్చి ఎవడు తెలియడు.


శ్లోకం 30: (జీవాత్మ)

భావము:-సర్వదేహములలోను నివశించు జీవాత్మలు ఎప్పటికీ చంపబడునవి కావు. కావున అన్ని జీవరాసుల గురించి నీవు బాధపడవలసిన పనిలేదు.

శ్లోకం 31 - 37(X)కల్పిత శ్లోకము

పై శ్లోకములు కల్పితములని తెలియునట్లు వాటి ప్రక్కన(X) మార్కు గుర్తించి ఉంచాము. వాటి వివరము కూడ వ్రాయలేదు.


శ్లోకం 38: (కర్మయోగము)

భావము : కష్టసుఖములు, లాభనష్టములు, జయాపజయములను సమముగ తలచి యుద్ధము చేయుము. అట్లు చేయుట వలన పాపకర్మములు పొందవు.


శ్లోకం 39: (కర్మయోగము)

భావము : ఇంతవరకు శరీరములందు ఆత్మల వివరముగల జ్ఞానము తెలియజేసాను. ఇకనుండి కర్మబంధములు కలగని జ్ఞానము తెలియజేతును వినుము.


శ్లోకం 40: (కర్మయోగము)

భావము :- కర్మయోగమును ఆరంభించి మానుకొనుట వలన ఏ దోషము లేదు. కొద్దిగ ఆచరించినప్పటికి గొప్ప కర్మభయమునుండి కాపాడగలదు.


శ్లోకం 41: (ప్రకృతి)

భావము :- యోగమునందు బుద్ధిగలవారు ఒకటే నిశ్చయముతో ఉందురు. వేరభిప్రాయములు కల్గువారికి బుద్ధి శాఖోపశాఖలైవుండును.


శ్లోకం 42: (ప్రకృతి)

భావము :- వేదములలోని విషయములను పుష్పములలోని తేనెవలె తియ్యని మాటల రూములలో చెప్పుకొందురు. అజ్ఞానులైనను జ్ఞానులవలె ఉండి ప్రజలకు లాభము వచ్చు పనులను, సుఖముకల్గు పనులను బోధించుచుందురు.


శ్లోకం 43: (ప్రకృతి)

భావము: సుఖములు చేకూర్చు వారిమాటలు జన్మ కర్మ ఫలములొసగు అనేక క్రియలను ప్రేరేపించునవై ఉండును. అట్టి పనులు చేయుట వలన ఇహలోక సుఖములు భోగములు వచ్చుచుండును.


శ్లోకం 44: (ప్రకృతి)

భావము: కోర్కెల చేత ఆకర్షింపబడిన మనస్సు గలవారు అటువంటి సుఖములనే ఆశ్రయించుదురు. వారి మనస్సుకు ఆత్మ విజ్ఞానదాయకమైనట్టి జ్ఞానము ఎప్పటికి పట్టుబడదు.


శ్లోకం 45: (బ్రహ్మయోగము, కర్మయోగము)

భావము: మూడు గుణముల విషయములే వేదములు. వేద భూయిష్టమైన ఆ మూడు గుణములను పూర్తిగ వదలివేయుము. సుఖదుఃఖములు, లాభనష్టములు మొదలగు ద్వంద్వములను వదలి వేసినట్లే యోగక్షేమము అనుదానిని కూడ వదలి నిత్యమైన దైవమును చేరుము.


శ్లోకం 46: (కర్మ యోగము)

భావము: బావి నిండుగవున్న నీరు ఏ విధముగ నిత్యము త్రాగుటకు స్నానము చేయుటకు ఉపయోగపడుచున్నదో, ఆ విధముగనే సర్వ వేదముల నుండి కూడ మనకు నిత్యము ఉపయోగము గలదని బ్రహ్మజ్ఞానియైన వానికి తెలియును.


శ్లోకం 47: (కర్మయోగము)

భావము: కర్మ సంపాదించుటయందే నీకు అధికారము కలదు. కర్మఫలము లందు ఆశపడవలదు. కర్మయగు పాపపుణ్య ఫలములైన కష్టసుఖములకు కారకుడవు కావద్దు. అట్లే కర్మ వచ్చునని దానికి సంబంధించిన పనులు మానవద్దు.


శ్లోకం 48: (కర్మయోగము)

భావము: చేయు పనులయందు కల్గు లాభనష్టముల ఎడల ధ్యాసలేక, మంచి చెడు పనులందు సమబుద్ధి గలవాడై, కార్యములాచరించినవాడు యోగనిష్ఠ ఆచరించిన వాడగును. ఈ విధముగనే నీవు కార్యములు చేయుము.


శ్లోకం 49: (కర్మయోగము)

భావము: కర్మనాశనము చేయు కర్మయోగమునకంటే, నీచస్థితిని కలుగజేయు కర్మ చాలా భేదమైనది. నీవు నీచస్థితిని కలుగజేయు కర్మను విడిచి, ఉన్నత స్థితిని కలుగజేయు కర్మయోగమునే ఆశ్రయింపుము.


శ్లోకం 50: (కర్మయోగము)

భావము: కర్మయోగముననుసరించిన వాడు కర్మయైన పాప పుణ్యములను నాశనము చేయుచున్నాడు. అందువలన నీవు కూడ కార్యములను చేయుచు ఆ పనులయందే ఇమిడిన పాపపుణ్యములను పొందని నేర్పరితనమును తెలియుము. అదియే కర్మయోగము.


శ్లోకం 51: (కర్మయోగము)

భావము: జ్ఞానపరులు కర్మ ఫలములను వదలి, జన్మ బంధములను విడచి మోక్షమును పొందుచున్నారు.


శ్లోకం 52: (కర్మయోగము,బ్రహ్మయోగము)

భావము: ఎపుడైతే మోహగుణమను కల్మషమును దాటగలవో, అపుడే నీవు ఇంతవరకు వినిన, వినవలసి విషయముల కొరకు వైరాగ్యము పొందగలవు.


శ్లోకం 53: (బ్రహ్మ యోగము)

భావము: వివిధ శ్రుతుల వలన కలత చెందిన నీ బుద్ధి చలింపనిదై స్థిరమైన సమాధియందు నిలిచినపుడు నీవు యోగము పొందిన వాడవగుదువు.

అర్జునుడిట్లనియె:-


శ్లోకం 54: (బ్రహ్మయోగము)

భావము: ఓ కృష్ణా! బుద్ధి నిలిచిపోయి సమాధి స్థితిలో ఉన్నవాడు ఏ భాషలో మాట్లాడును? ఏమి మాట్లాడును? ఏ విధముగా కూర్చుండును? ఏమి ఆచరించును?

శ్రీ భగవంతుడిట్లనియె:-


శ్లోకం 55: (బ్రహ్మయోగము)

భావము: ఎప్పుడైతే సర్వ ఆశలు మరియు మనోగతములైనవన్ని ప్రయత్న పూర్వకముగా వదలి ఆత్మయందే జీవాత్మ తృప్తిబొందుచున్నదో అపుడే వానిని స్థిత ప్రజ్ఞుడని చెప్పవచ్చును.


శ్లోకం 56: (బ్రహ్మయోగము)

భావము: దుఃఖమందు బాధపడని వానిని, సుఖములందు సంతోషించని వానిని, మరియు ప్రేమ, కోపము, భయములేని వానిని మౌనము వహించిన బుద్ధిగల వాడందురు.


శ్లోకం 57: (బ్రహ్మయోగము)

భావము: ఎవరైతే అన్నిటియందు సంబంధము లేక, శుభాశుభములయందు మనోధ్యాస ఏమాత్రము లేకుండా, సుఖదుఃఖములు అనుభవించకుండునో, అట్టివాని ప్రజ్ఞ గొప్పది.


శ్లోకం 58: (బ్రహ్మయోగము)

భావము: తాబేలు ఏ విధముగా తన అవయవములను ముడుచుకొనుచున్నదో , ఆ విధముగా మనస్సును ఇంద్రియముల నుండి మరలింపవలెను.


శ్లోకం 59: (బ్రహ్మయోగము)

భావము: బ్రహ్మయోగమాచరించు యోగి ఇంద్రియములకు ఆహారమైనట్టి విషయములయందు మనోధ్యాసలేకుండా చేసుకొన్నప్పటికి, వాని తలలోని విషయముల మీద ఆశ అనుగుణము వీడకయుండును. ఆ ఆశయు కొంత కాలము ఆత్మను దర్శించుట వలన నశించిపోవును.


శ్లోకం 60: (బ్రహ్మయోగము)

భావము: జ్ఞానియైనవాడు యోగ సమయమందు మనస్సు చలించకుండునట్లు ఎంత ప్రయత్నము చేయుచుండిన, యోగభ్రష్టతయను ప్రమాదము కలుగునట్లు ఇంద్రియములు వాని మనస్సును చలింపజేయుచున్నవి.


శ్లోకం 61: (బ్రహ్మయోగము)

భావము: ఇంద్రియములనెల్ల అణచివేసి మనస్సును నాయందు ఎవడుయుంచునో, ఇంద్రియములెవనికి స్వాధీనమైయుండునో అట్టి వాని ప్రజ్ఞ గట్టిది.


శ్లోకం 62: (ప్రకృతి)

భావము: విషయముల ధ్యాసలో వాటి సంగమము మానవునకు ఏర్పడుచున్నది. అట్టి సంగమము వలన మానవునకు కోర్కె పుట్టుచున్నది. దాని వలన క్రోధము పుట్టుచున్నది.


శ్లోకం 63: (ప్రకృతి)

భావము: క్రోధము వలన సమ్మోహము గల్గును. సమ్మోహము వలన స్మృతి భ్రమించుట, స్మృతి భ్రమించుట వలన బుద్ధి నాశనము, బుద్ధి నాశనము వలన భ్రష్టత్వము పొందుట కల్గును.


శ్లోకం 64: (బ్రహ్మయోగము)

భావము: రాగద్వేషములను వదలి అట్లే ఇంద్రియ విషయములను వదలి స్వాధీనపడిన మనస్సుగలవాడెపుడైతే అపుడు ప్రసాదంబు కలుగును.


శ్లోకం 65: (బ్రహ్మయోగము)

భావము: ఆత్మదర్శనము కల్గినపుడే సర్వదుఃఖములకు హాని ఏర్పడును. బుద్ధి సుస్థిరత చెందును. మనస్సు నిర్మలత్వము పొందును.


శ్లోకం 66: (బ్రహ్మయోగము)

భావము: యోగహీనునికి బుద్ధి నిలకడగ ఉండదు. దైవభావము అతనికి కలుగదు. దైవభావములేని వానికి శాంతి లేదు. శాంతిలేని వానికి సుఖముండదు.


శ్లోకం 67: (ప్రకృతి)

భావము: ఏ మనుష్యుని మనస్సు ఇంద్రియముల వెంట తిరుగుచుండునో వాని బుద్ధియు గాలి వలన నావ కదిలినట్లు చలించుచుండును.


శ్లోకం 68: (బ్రహ్మయోగము)

భావము: ఎవడు ఇంద్రియముల యొక్క సర్వ విషయములను నిగ్రహించుచున్నాడో అట్టివాని ప్రజ్ఞ నిలకడగా నిలిచినదగును.


శ్లోకం 69: (బ్రహ్మయోగము, ప్రకృతి)

భావము: సర్వ జీవరాసులకు రాత్రివలె నిద్రించు అజాగ్రత్త ఎందుగలదో అందే బ్రహ్మయోగి జాగ్రత్త కల్గియుండును. ఏదైతే బ్రహ్మయోగికి రాత్రివలె స్థంభించి ఉన్నదో అందే సర్వ జీవరాసులు జాగ్రత్తగానున్నవి.


శ్లోకం 70: (బ్రహ్మయోగము)

భావము: నిండి నిబిడీకృతముగా ఉన్న సముద్రమునందు నదుల నీరు ఎంత చేరినప్పటి పొంగిపోనట్లు, బ్రహ్మయోగనిష్ఠయందున్న వానికి ఎన్ని కోర్కెలున్నను వాటి ప్రభావమేమి లేకపోవును. బ్రహ్మయోగి కాక కోర్కెలు కోరువానికి ఎప్పటికి ఆత్మదర్శనము లభించదు, శాంతిరాదు.


శ్లోకం 71: (బ్రహ్మయోగము, కర్మయోగము)

భావము: సర్వ కోర్కెలను విడనాడి వాటి ధ్యాస ఏమాత్రము లేకుండు వాడును, అట్లే మోహమును, అహంకారమును లేనివాడును తప్పక శాంతి పొందును.


శ్లోకం 72: (బ్రహ్మయోగము,కర్మయోగము)

భావము: ఇది దైవమును పొందుస్థితి. ఈ స్థితి పొందినవాడు నాది నావారు అను మోహమును పొందడు. ఈ స్థితి పొందిన వాడు మరణకాలమున మోక్షమును పొందును.

-----------------

త్రైత సిద్ధాంత భగవద్గీత : "2" కర్మ యోగము  


అర్జునుడిట్లనియె :-


శ్లోకం 1: (కర్మ, బ్రహ్మయోగములు)

భావము :పాపపుణ్య కర్మలగు పనులు చేయుటకంటే బ్రహ్మయోగమే శ్రేష్ఠమైనదని నీ అభిప్రాయమైన, భయంకరమగు కర్మలు కలుగు పనులనే చేయమని నన్ను ఎందుకు నియమించుచున్నావు.


శ్లోకం 2: (కర్మ, బ్రహ్మయోగములు)

భావము :మిశ్రమవాక్యములను చెప్పి నా బుద్ధిని భ్రమింపచేయుటకంటే మోహగుణమందు చిక్కుకోకుండునట్లు ఏది చేయుట మంచిదో దానిని నిశ్చయించి చెప్పుము.

శ్రీ భగవంతుడిట్లనియె :-


శ్లోకం 3: (కర్మ, బ్రహ్మయోగములు)

భావము : మనుజులు ఆచరించుటకు రెండు రకములైన యోగనిష్టలు గలవని ముందే తెలిపియున్నాను. సాంఖ్యము తెలిసినవారు జ్ఞానయోగమును, కార్య వివరము తెలిసినవారు కర్మయోగమును ఆచరించగలరు.


శ్లోకం 4: (ప్రకృతి)

భావము : కర్మ ప్రారంభింపనంత మాత్రమున మరియు చేయుచుండు కర్మలను వదలుట వలనను మోక్షము లభించదు.


శ్లోకం 5: (ప్రకృతి)

భావము : ఎవ్వడుగాని ఎట్టి కర్మ ఆచరింపక ఒక్క క్షణమైన ఊరకయుండలేడు. ప్రకృతి జనితములైన గుణములకు చిక్కినవారై,కర్మముల వశులై పనులు చేయుచుందురు.


శ్లోకం 6: (బ్రహ్మ యోగము,జీవాత్మ)

భావము : కర్మేంద్రియముల పనులను నిగ్రహించి, జ్ఞానేంద్రియముల యొక్క విషయములను స్మరించు వానిని మూఢాత్ముడందురు.


శ్లోకం 7: (కర్మ యోగము)

భావము : ఎవడు జ్ఞానేంద్రియములచే మనస్సును నియమించి, కర్మేంద్రియముల చేత పని చేయుచున్నాడో, వానిని కర్మయోగి అందురు. అట్టివాడు అందరికంటే ఉత్తముడు.

(శ్లోకం 8 : (బ్రహ్మయోగము)

భావము : నీవు చేయు నియమిత పనులను వదలుకొనుటకంటే ఆచరించుట మేలు, చేయు పనులను వదలి దేహయాత్రను చేయలేవు.


శ్లోకం 9: (కర్మ యోగము)

భావము: యజ్ఞ సంబంధము లేకుండ కర్మలు ఆచరించుట వలన మానవులకు తిరిగి కర్మబంధనములు కలుగుచుండును. కనుక అర్జునా! కర్మలయందు బంధింపబడక కార్యములు చేయుము.


శ్లోకం 10 -16 (అశాస్త్రీయము)


శ్లోకం 17: (బ్రహ్మయోగము)

భావము : ఆత్మయందే లగ్నమగచు, ఆత్మతోనే తృప్తిపొంది, ఆత్మతోనే సంతోషము పొందువానికి ఏకార్యము లేదు.


శ్లోకం 18: (బ్రహ్మయోగము)

భావము: అట్టివాడు పనిచేయకుండుట వలన లాభము లేదు. మరియు నష్టము లేదు. అతడు ఏ ప్రయోజనమునకైన ఎవరిని ఆశ్రయించవలసిన పనిలేదు.


శ్లోకం 19: (కర్మయోగము)

భావము: అందువలన చేయుచుండు కార్యము యొక్క ఫలితము మీద ఆసక్తిలేని వాడవై, కర్మప్రకారము కార్యములు చేయుము. అట్లు చేయుట వలన పరమును పొందవచ్చును.


శ్లోకం 20: (కర్మయోగము)

భావము: కర్మయోగమాచరించి జనకుడు మొదలైనవారు మోక్షము పొందిరి. లోకులు తెలుసుకొనుటకైన నీవు ఈ పద్ధతిని ఆచరింపుము.


శ్లోకం 21: (కర్మయోగము)

భావము : శ్రేష్ఠుడు ఏది ఆచరించునో దానినే ఇతరులు ఆచరింతురు. అతడు ఏ ప్రమాణమును చూపునో దానినే ఇతరులు అనుసరింతురు.


శ్లోకం 22: (కర్మయోగము)

భావము : నాకు కర్తవ్యమనునది లేదు. ముల్లోకములందు నేనింత వరకు పొందినది ఇక పొందవలసినది లేదు. ఐనను నేను కర్మలను ఆచరించుచున్నాను.


శ్లోకం 23: (కర్మయోగము)

భావము : ఓ అర్జునా! నేనెప్పుడైనను పనులయందు అజాగ్రత్త కలిగి చేయని ఎడల, భూమిమీద జనులందరు అన్ని విధముల నావలె వారు కూడ పనులు చేయక ఊరకుందురు.


శ్లోకం 24: (కర్మయోగము)

భావము : నేను పనులు చేయకపోతే జగతిలోని మనుషులెల్లరు చెడు మార్గమున పోవుదురు మరియు వర్ణ సంకరమేర్పడును. ప్రజలనెల్ల నేను చెడగొట్టిన వాడనగుదును.


శ్లోకం 25: (కర్మయోగము)

భావము : ఒక అజ్ఞాని అన్ని విధముల పనులయందు ఆసక్తిపరుడై ఎట్లు చేయుచున్నాడో, జ్ఞానమంతయు తెలిసిన జ్ఞానియు అజ్ఞానివలెనె పనులు చేయవలయును. కాని ఆ పనులు చేయుటలో జ్ఞానికి ఫలితము మీద ఆసక్తి ఉండకూడదు.


శ్లోకం 26: (కర్మయోగము)

భావము : జ్ఞాని పనులు చేయుటయందు అజ్ఞానుల బుద్ధికి భేదము కలిగించ కూడదు. తెలిసినవాడు అన్ని పనులు చేయుచు, ఇతరుల చేత కూడ తనవలె చేయించవలెను.


శ్లోకం 27: (ప్రకృతి)

భావము : ప్రకృతి నిర్మాణము ప్రకారము కర్మ వలన కల్గు గుణప్రేరణ ద్వార జరుగు అన్ని పనులకు, కర్త తానేయని అహంకారము గల అజ్ఞాని తలచుచుండును.


శ్లోకం 28: (కర్మయోగము)

భావము : తత్త్వ జ్ఞానమును తెలిసినవారు, కర్మలు గుణముల యొక్క భాగములను తెలిసినవారై, గుణముల వలననే కార్యములు జరుగుచున్నవని తెలిసియుందురు.


శ్లోకం 29: (ప్రకృతి)

భావము : ప్రకృతి జనిత గుణములందు చిక్కియున్న మనుషునకు ఆ గుణముల కార్యములయందే కర్మముల ప్రకారము ఆసక్తి కలిగించును. జ్ఞానులగువారు అట్టి అజ్ఞాన పరులను చలనమొందించకూడదు.


శ్లోకం 30: (కర్మయోగము)

భావము : సర్వ కర్మలను నాయందే సన్న్యసించి, ఆధ్యాత్మికచింతన చేయుచు, రాజ్యకాంక్ష, నావారను మోహము మొదలగు గుణములను లేకుండ చేసుకొని, కలిగిన తాపమును వదలి యుద్ధము చేయుము.


శ్లోకం 31: (కర్మయోగము, జీవాత్మ)

భావము : ఎవరైతే నేను చెప్పిన ఈ నాపద్ధతి నచ్చినవారై పూర్తి శ్రద్ధకల్గి అసూయలేని వారై అనుసరింతురో వారికి కర్మ అంటకుండ పోవును.


శ్లోకం 32: (కర్మయోగము, జీవాత్మ)

భావము : ఎవడైతే నా పద్ధతి మీద అసూయ పొంది అనుసరింపడో, అట్టివాడు నేను చెప్పిన అన్ని జ్ఞానములకు మూఢుడై జ్ఞానమార్గములో పూర్తి నష్టము పొందినవాడగును.


శ్లోకం 33: (జీవాత్మ)

భావము : జ్ఞానియైనప్పటికి తనయొక్క గత జన్మ సంస్కారములకు తగినట్లు నడుచుకొనును. మిగత జీవరాసులు కూడ వాటివాటి కర్మప్రకారము నడుచు చున్నవి, ఫలితమును పొందుచున్నవి. నేనిట్లు నడువకూడదను నిగ్రహము ఎవనికి పనికిరాదు.


శ్లోకం 34: (బ్రహ్మయోగము)

భావము : ప్రతి ఇంద్రియ విషయమునందు రాగద్వేషములు ఉన్నవి. ఆ రాగ ద్వేషములకు మనుజుడు వశము కారాదు. వాటిని నిగ్రహించుకోవలయును. ఆ రాగద్వేషములు మనిషికి శత్రువులలాంటివి.


శ్లోకం 35: (జీవుడు, కర్మ యోగము)

భావము : అనుష్ఠితమగు పరధర్మముకంటే గుణములేని స్వధర్మమే శ్రేయస్కరము. పరధర్మములో ఉన్న భయముకంటే స్వధర్మములోని మరణమే మేలు.


శ్లోకం 36: (బ్రహ్మ యోగము)

భావము : మనిషికి ఇష్టము లేకున్నను దేనిచేత బలత్కార పూర్వకముగ నియమింప బడి పాపకార్యములు చేయుచున్నాడు?

 

శ్రీ భగవంతుడిట్లనియె: -


శ్లోకం 37: (ప్రకృతి)

భావము : రజోగుణములో పుట్టిన కామమనెడి గుణము మరియు క్రోధమనెడి గుణములు కలవు. ఈ ఆశ తృప్తిలేనిది. కోపము పాపము కలుగజేయునది. ఇవి జ్ఞానమునకు శత్రువులు.


శ్లోకం 38: (ప్రకృతి)

భావము : పొగచేత అగ్నియు, దుమ్ముచేత అద్దము, గర్భపొరలతో శిశువు కప్పబడినట్లు ఆశచేత జ్ఞానము కప్పబడివున్నది.


శ్లోకం 39: (ప్రకృతి)

భావము : తీరనిది మరియు తృప్తిలేనిదైన ఆశ జ్ఞానమునకు నిత్య శత్రువైయుండి జ్ఞానమును కప్పివేయుచున్నది.


శ్లోకం 40: (ప్రకృతి)

భావము : మనస్సు, బుద్ధి, ఇంద్రియములు ఆశకు అధిష్ఠానములుగ ఉన్నవి. వీటి ఆధారముతో మోహమును కలుగజేసి జ్ఞానమును కప్పివేయుచున్నది.


శ్లోకం 41: (బ్రహ్మ యోగము)

భావము : అందువలన ఇంద్రియములను అణచివేసి పాపమును చేయించునది, జ్ఞాన విజ్ఞానములను నాశనము చేయునదియైన ఆశను జయించవలెను.


శ్లోకం 42: (ప్రకృతి, ఆత్మ)

భావము : శరీరములో ఇంద్రియములు శ్రేష్ఠమైనవి. వాటికంటెను మనస్సు శ్రేష్ఠమైనది. దానికంటెను బుద్ధి శ్రేష్ఠమైనది. బుద్ధికంటెను ఆత్మ శ్రేష్ఠమైనది.


శ్లోకం 43: (బ్రహ్మ యోగము)

భావము : బుద్ధికంటే శ్రేష్ఠమైనది ఆత్మయని తెలిసి, జీవాత్మను ఆత్మలో ఐక్యమగునట్లు చేసి, జయింప దుస్సాధ్యమైన ఆశను జయించును.

--------------

త్రైత సిద్ధాంత భగవద్గీత:☜ "3" జ్ఞాన యోగము.  

d

శ్రీ భగవంతుడిట్లనియె :-


శ్లోకం 1:(కర్మ యోగము, బ్రహ్మ యోగము)

భావము  :ఇది అవ్యయమైన జ్ఞానము. మొదట దీనిని సూర్యునికి చెప్పియుంటిని. సూర్యుడు మనువుకు చెప్పెను. తర్వాత మనువు ఇక్ష్వాకుడను రాజుకు చెప్పెను.


శ్లోకం 2: (కర్మ యోగము, బ్రహ్మ యోగము)

భావము  : ఒకరినుండి ఒకరికి పరంపరగ తెలుస్తుపోయి రాజులు, ఋషులు తెలుసుకొనిరి. ఎంతో కాలము ఈ విధముగ జరుగగ, చివరకు యోగముల జ్ఞానము తెలియకుండపోయినది.


శ్లోకం 3: (కర్మ యోగము, బ్రహ్మ యోగము)

భావము  : ఉత్తమమైనది, చాలా రహస్యమైనది, పురాతనమైనది అయిన యోగ విద్యను ఇపుడు నీవు నాకు భక్తుడవు, ప్రియుడవు కావున చెప్పుచున్నాను.

అర్జునుడిట్లనియె :


శ్లోకం 4 :(జీవాత్మ, పరమాత్మ)

భావము  : ఆదిలో సూర్యునికి జన్మకలిగెను. నీ జన్మ ఇపుడు ఈ కాలములో కల్గినది. ఇపుడున్న నీవు పూర్వము సూర్యునికెలా చెప్పితివి. నమ్ముటెట్లు?

శ్రీ భగవంతుడిట్లనియె :


శ్లోకం 5:(జీవాత్మ, పరమాత్మ)

భావము  : నాకు ఎన్నో జన్మలు కల్గినవి, నీకు కూడ ఎన్నో జన్మలు కల్గినవి. అవి అన్నియు వరుసగ నాకు తెలియును. నీకు మాత్రము ఏవీ తెలియవు.


శ్లోకం 6: (నిరాకారము, సాకారము)

భావము  : నాకు పుట్టుకలేదు, నాశనము లేదు. నేను సర్వజీవరాసులకు అధిపతినై ఉన్నాను. అయినప్పటికి నాచేత నిర్మింపబడిన ప్రకృతితో చేరి మాయతో జన్మించుచుందును.


శ్లోకం 7: (నిరాకారము, సాకారము).

భావము  : ఎపుడెపుడు ధర్మములకు గ్లాని ఏర్పడి అధర్మము వృద్ధిచెందుచున్నదో, అపుడు నన్ను నేను తయారుచేసుకొని భూమిమీద పుట్టుచున్నాను.


శ్లోకం 8: (సాకారము)

భావము  : ధర్మాచరణ కల్గిన వారిని సంరక్షించుటకు, అధర్మ ఆచరణ కల్గిన వారిని లేకుండచేయుటకు, ధర్మసంస్థాపన మొనర్చుటకు యుగ యుగమందు పుట్టుచుందును.


శ్లోకం 9: (సాకారము, నిరాకారము)

భావము  : నా దివ్యమైన పనులను జన్మను తెలుసుకొన్నవాడు మరణించిన తర్వాత, వేరు జన్మమునకు పోక నాలోనికి ఐక్యమగును.


శ్లోకం 10: (సాకారము)

భావము  : భయము, ప్రేమ, కోపము విడిచి నామీద ధ్యాసకలవారై నన్ను ఉపాసించువారు ఎందరో జ్ఞాన తపనచే పవిత్రులై నాస్వరూపమును పొందిరి.


శ్లోకం 11: (సాకారము, నిరాకారము)

భావము  : ఎవరు నన్ను ఏ విధముగా భావించి పూజించుచున్నారో, అట్లే వారు నా అనుగ్రహము పొందుచుందురు. మనుజులు ఎన్నో రకములుగ నన్నారాధించు చున్నారు.


శ్లోకం 12: (ప్రకృతి)

భావము  : కర్మఫలములందు ఆశగలవారు దేవతా పూజచేతురు. జగతిలో కామ్య కర్మఫలములు వేగముగ సిద్ధించును.


శ్లోకం 13: (పరమాత్మ)

భావము  : కర్మ, గుణ విభాగములను బట్టి నాల్గు వర్ణములు నాచేత సృష్ఠింపబడినవి. వాటి కర్తనైనను కాకుండ నాశనములేనివాడనై ఉన్నాను.


శ్లోకం 14: (కర్మయోగము, సాకారము)

భావము  : నాకు కర్మములంటవు. నాకు వాని ఫలములందు ధ్యాసలేదు. నేనిట్టివాడనని ఎవడెరుగునో, వానికి కర్మబంధనములు కలుగవు.


శ్లోకం 15: (కర్మయోగము)


శ్లోకం 16: (కర్మయోగము)

భావము  : ఏది కర్మయో, ఏది కర్మకాదో అనుభవమున్న జ్ఞానులు కూడ తెలియక భ్రమపడుచున్నారు. అందరికి అర్థము కాని కర్మ రహస్యమును నీకు చెప్పెదను. దాని వలన మోక్షమును పొందగలవు.


శ్లోకం 17: (ప్రకృతి, కర్మయోగము, బ్రహ్మయోగము).

భావము  : కర్మను తెలుసుకోవాలి. అట్లే వికర్మను తెలుసుకోవాలి మరియు అకర్మను తెలుసుకోవాలి. ఈ కర్మ గతులు తెలుసుకోవడము చాలా కష్టము.


శ్లోకం 18:(కర్మయోగము)

భావము  : కర్మలను రాకుండ నిగ్రహించుట అకర్మ అనియు, కర్మములయందే అకర్మ కలదని తెలిసి, ఎవడు అన్ని కర్మలాచరించుచున్నాడో, వాడే జ్ఞానియని తెలిసిన పెద్దలందురు.


శ్లోకం 19: (కర్మయోగము)

భావము  : ఎవడైతే ఆశ అను గుణము లేకుండ సర్వ(మంచిచెడు) కార్యములు చేయునో, ఎవడైతే జ్ఞానాగ్నిచేత కర్మను కాల్చునో, వానిని బుధులు జ్ఞానపండితుడని అందురు.


శ్లోకం 20 - 22: (కర్మయోగము)

భావము  : కర్మఫలము ఎడల ధ్యాసలేక, నిత్యతృప్తుడవై ఆశను నిగ్రహించుకొని సర్వ కార్యములను సదా చేయువాడు చేయని వానితో సమానము. ఆశ విడిచి, నియమిత చిత్తుడై, దేని మీద శ్రద్ధలేక కేవలము శరీర సంబంధముగ పనులు చేయవలెను. అట్లు చేయువానికి కర్మలంటవు. దొరికినట్టి లాభముతో తృప్తిపొంది, ద్వంద్వములు వీడి, మత్సరము లేని వాడై లాభనష్టములను సమానముగ ఎవడు చూచునో వానికి కర్మబంధములు కలుగవు.


శ్లోకం 23: (కర్మయోగము)

భావము  : సంగము లేనివాడై, ఫలాసక్తి లేక దైవమును చేరవలెనను కోర్కెగలవాడై, కర్మయజ్ఞము చేయువానికి వాని కర్మ అంతయు కాలి నాశనమగును.


శ్లోకం 24 -32: (కల్పితము)


శ్లోకం  33: (కర్మయోగము, బ్రహ్మయోగము)

భావము  : ద్రవ్యయజ్ఞముకంటే జ్ఞానయజ్ఞము శ్రేష్ఠమైనది. సర్వకర్మలు జ్ఞానయజ్ఞములో పరిసమాప్తమగును.


శ్లోకం 34: (కర్మయోగము, బ్రహ్మయోగము)

భావము  : ఆత్మను తెలిసినట్టి గురువులను చేరి వినయవిధేయతలతో నమస్కరించి సేవలు చేయుచు, సమయానుకూలముగ ప్రశ్నలడిగిన వారు జ్ఞానమును ఉపదేశించి, కర్మలు నశించిపోవు జ్ఞానమార్గమును చూపగలరు.


శ్లోకం 37: (కర్మయోగము, బ్రహ్మయోగము)

భావము  : ఏ విధముగ అగ్నిలో కట్టెలు కాలిపోవుచున్నవో, అదేవిధముగ జ్ఞానాగ్నిలో సర్వకర్మలు కాలిపోవుచున్నవి.


శ్లోకం 38: (కర్మయోగము)

భావము  : జ్ఞానమునకు ప్రపంచములో సాటియైనదేది లేదు. దానికంటే పవిత్రమైనది లేదు. కర్మయోగమాచరించెడు కర్మయోగి కాలము జరుగుకొలది మోక్షమునకు దగ్గరవాడగును.


శ్లోకం 39: (బ్రహ్మయోగము)

భావము  : శ్రద్ధ కలిగి ఇంద్రియములను నిగ్రహించు తత్పరులకు జ్ఞానము లభించును. జ్ఞానము కల్గిన తర్వాత అచిరకాలములోనే మోక్షమును పొందగలరు.


శ్లోకం 40: (జీవాత్మ)

భావము  : సంశయాత్ముడై, శ్రద్ధలేనివాడై, జ్ఞానశూన్యుడైన జనుడు తప్పక చెడును. సంశయాత్మునకు ఇహ పరములలో ఎక్కడైన సుఖము లేదు.


శ్లోకం 41: (కర్మయోగము, బ్రహ్మయోగము)

భావము  : జ్ఞాన వివరముచే సంశయములు లేకుండ పోయిన వానికి, యోగ పద్ధతుల ద్వారా కర్మలను కాల్చివేయువానికి, మనస్సును ఆత్మను తెలియువానికి కర్మలు బంధములు కావు.


శ్లోకం 42: (కర్మయోగము)

భావము  : అజ్ఞానము వలన నీ హృదయములో నెలకొన్న సంశయమును జ్ఞాన ఖడ్గముచే నరికివేసి కర్మయోగమాచరించపూనుకొనుము.

------------


త్రైత సిద్ధాంత భగవద్గీత : "4"  కర్మ సన్న్యాస యోగము  


అర్జునుడిట్లనియె: -

శ్లోకం 1: 

(కర్మయోగము, బ్రహ్మయోగము)

భావము : కర్మ సన్న్యాసము చెప్పితివి మరియు కర్మ చేయుట యోగమంటున్నావు. రెండింటిలో ఏది శ్రేష్ఠమో నిశ్చయముచేసి నాకు చెప్పుము.

పరమాత్మలో కలిసిపోవడానికి, జన్మలు లేకుండ మోక్షము పొందడానికి రెండే యోగములు కలవు. అవియే ఒకటి బ్రహ్మయోగము, రెండవది కర్మయోగము. బ్రహ్మయోగములో శరీరముతో జరుగుపనులన్ని వదిలివేసి కూర్చోవడము. రెండవ కర్మయోగములో శరీరముతో జరుగు పనులన్ని చేయడము. ఈ రెండు యోగ విషయములను విన్న అర్జునుడు రెండింటిలో నాకు ఏది శ్రేష్ఠమో తెలుపమన్నాడు. ఆ మాటకు శ్రీకృష్ణుడు వెంటనే జవాబు చెప్పాడు.


శ్రీ భగవంతుడిట్లనియె: -

శ్లోకం 2: 

(కర్మయోగము, బ్రహ్మయోగము)

భావము : కర్మయోగము, బ్రహ్మయోగము రెండును శ్రేష్ఠమైనవే. కాని బ్రహ్మయోగముకంటే కర్మయోగమే గొప్పది.


శ్లోకం 3:

(కర్మయోగము)

భావము : ఎవనికి అసూయ ప్రేమలు లేవో, ఎవడు సుఖదుఃఖ ద్వంద్వములను వదలివేయునో వాడే నిత్యసన్న్యాసి. వానికి బంధనములు లేవు.


శ్లోకం 4: 

(కర్మయోగము, బ్రహ్మయోగము)

భావము : కర్మయోగము వేరని, బ్రహ్మయోగము వేరని తెలియనివారనుచుందురు. తెలిసిన వారు రెండిటిలో దేనినాచరించిన ఫలసిద్ధియగునని చెప్పుచుందురు.


శ్లోకం 5: 

(కర్మయోగము, బ్రహ్మయోగము)

భావము : బ్రహ్మయోగము ద్వార ఏ స్థానము ప్రాప్తించుచున్నదో, అదే కర్మ యోగములోను ప్రాప్తించుచున్నది. బ్రహ్మయోగము, కర్మయోగము రెండు సమానమైనవని తెలియువాడే వాస్తవ జ్ఞానదృష్ఠి కలవాడగును.


శ్లోకం 6: 

(కర్మయోగము, బ్రహ్మయోగము)

భావము : యోగము లేనివాడు,కర్మను సన్న్యశించనివాడు దుఃఖమునే పొందు చుండును. యోగముతో కూడుకొన్నవాడు, మనస్సును అణచినవాడు పరబ్రహ్మ పదవిని తొందరగ పొందును.

భావము : కర్మనశించు రెండు యోగములు లేకపోయిన దుఃఖము పొందుదువు. కర్మయోగము, బ్రహ్మయోగము పొందినవాడు శీఘ్రముగ మోక్షము పొంది పరమాత్మలోనికి ఐక్యమగును.


శ్లోకం 7: 

(బ్రహ్మయోగము)

భావము : విశుద్ధాత్ముడై జితేంద్రియుడై సర్వ జీవుల యొక్క ఆత్మను తన ఆత్మగా తలచు యోగికి కర్మలుండవు.


శ్లోకం 8 - 10

(కర్మయోగము)

భావము : ఆత్మజ్ఞానమును తెలుసుకొన్న కర్మయోగి ఏ కార్యమునకు తాను కర్తను కాదని తలచి చూస్తు, వినుచు, తాకుచు, వాసన చూస్తు, తినుచు, నడుస్తు, నిద్రిస్తు, శ్వాస విడుచుచు తీసుకొనుచు, పల్కుచు, మల మూత్రములను విసర్జిస్తు, దేనినైన గ్రహిస్తు, కనులు తెరచుచు మరియు కనులు మూయుచు తమ తమ కార్యములను ఇంద్రియములు చేయుచున్నవని తలచుచుండును. ఈ విధముగ తన శరీరమందు జరుగు పనులను బ్రహ్మార్పణమొనర్చి సంగమనునది వర్జించినవాడు తామరాకుకు నీరంటనట్లు అఖిల పాపములచే అంటబడడు.


శ్లోకం 11: 

(కర్మయోగము)

శ్లోకం 12: 

(కర్మయోగము)

భావము : శరీరము, మనస్సు, బుద్ధి ఇంద్రియముల చేత జరిగెడి పనులకు సంగమము లేకుండ, ఆత్మశుద్ధియే ఆశయముగ కర్మఫలములందుకాంక్ష మానిన కర్మయోగి పనులు చేయుచున్నను శాంతి పొందును. కర్మయోగికానివాడు కోర్కెలను మానుకోలేక బంధనములో (కర్మలలో) చిక్కుచుండును.


శ్లోకం 13:

(కర్మయోగము)

భావము : మనసుచే సన్న్యసించి, కర్మకార్యములను తన నవద్వారపుర దేహమునకు విడిచి, కార్యకర్త కాక యోగి సుఖముగ నివశించుచుండును.


శ్లోకం 14: 

(ప్రకృతి)

భావము : భూమిమీద కర్మములనుగాని, కార్యములనుగాని, వాటి ఫలితములందు ఆశనుగాని ఆత్మ ఎవనికి కలుగజేయదు, ప్రకృతి స్వభావము చేతనే అవి కల్గుచుండును.


శ్లోకం 15: 

(ప్రకృతి)

భావము : ఎవని పాపముకాని, ఎవని పుణ్యముకాని ఆత్మ తొలగింపదు. అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడివున్నది. దానిచేత ధరణిలో జనులు భ్రమిస్తున్నారు.


శ్లోకం 16:

(ఆత్మజ్ఞానము)

భావము : జ్ఞానముచేత ఎవరి అజ్ఞానమంతయు లేకుండపోవునో, అట్టివారికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశిస్తు వారికున్న భ్రమలన్ని తొలగిపోవును.


శ్లోకం 17: 

(బ్రహ్మయోగము)

భావము : ఆత్మయందు ధ్యాసకల్గి, మనోబుద్ధి నిష్టలన్నియు ఆత్మయందే నిలిపి, యోగమాచరించువారు జ్ఞానాగ్నిచేత కల్మషములన్నియు కాల్చివేయబడినవాడై జన్మలులేని మోక్షము పొందును.


శ్లోకం 18: 

(బ్రహ్మయోగము)

భావము : విద్యయు వినయము కల్గు విప్రులందును, గోవులందును, ఏనుగు లందును, కుక్కలందును, కుక్కలను తిను చండాలునియందును పండితుల దృష్ఠి సమముగా ఉండును.


శ్లోకం 19: 

(బ్రహ్మయోగము)

భావము : ఎవని మనస్సు సర్వ జీవరాసులందు సమత్వమును గ్రహించునో, అతడు ఇహమందే సంసార సముద్రమును దాటినవాడగుచున్నాడు. నిర్దోషమైన అందరియందు సమముగ గల ఆత్మను తలంచుటవలన వాడు ఆత్మను పొందును.


శ్లోకం 20: 

(బ్రహ్మయోగము)

భావము : బ్రహ్మవిదుడు తన అజ్ఞానమునంతయు వదిలి బుద్ధిని ఆత్మయందే నిలుపును. వానికెంత సంప్రీతి కల్గిన సంతోషపడడు. అట్లే ఇష్టములేనిది కల్గిన బాధపడడు.


శ్లోకం 21: 

(బ్రహ్మయోగము)

భావము : బాహ్యస్పర్శ శబ్దాదులందు సంబంధపడక అంతరాత్మలోనే సుఖము పొందునతడు బ్రహ్మయోగి అనబడును. వానికి అక్షయమైన సుఖము కలుగును.


శ్లోకం 22: 

(బ్రహ్మయోగము)

భావము : బాహ్యేంద్రియములనుండి పుట్టు సుఖములు దుఃఖహేతువులు. అవి వచ్చుచు పోవుచువుండును. వాటిని జ్ఞానులు లెక్కచేయరు. మరియు వాటి వలన సంతోషింపరు.


శ్లోకం 23:

(బ్రహ్మయోగము)

భావము : శరీరమును విడువక మునుపే కామ క్రోధములు వాటి వేగమును లేకుండ చేసి శాంతము దాల్చు సమర్థుడెవడో వాడే బ్రహ్మయోగయుక్తుడు, వాడే ఆత్మ సుఖము పొందువాడు.


శ్లోకం 24: 

(బ్రహ్మయోగము)

భావము : ఎవడు అంతరమున సుఖము పొందుచున్నాడో, అంతరమున ఆత్మారాధన చేయుచున్నాడో, ఎవని లోపల జ్ఞానాగ్ని జ్యోతివలె వెలుగుచున్నదో అట్టివాడు బ్రహ్మయోగియై బ్రహ్మమునే పొందును.


శ్లోకం 25: 

(బ్రహ్మయోగము)

భావము : సర్వభూత హితము సల్పుచున్నవాడై, పాపము క్షీణింప చేసుకున్న వాడై సంశయము లేకుండ చేసుకొన్నవాడై, ఎవడు ఉన్నాడో వాడు బ్రహ్మయోగియై ఆత్మ స్థానము పొందుచున్నాడు.


శ్లోకం 26: 

(బ్రహ్మయోగము)

భావము : కామమును, క్రోధమును వీడగల్గువాడు, జ్ఞానముచే ఇంద్రియములను నిగ్రహించినవాడు, భూమిమీదనే ఆత్మస్థానము పొందియున్నాడు.


శ్లోకం 27: 

(బ్రహ్మయోగము)


శ్లోకం 28: 

(బ్రహ్మయోగము)

భావము : బాహ్య శబ్దాది ఇంద్రియ విషయములను వదిలి, కనుబొమ్మల మధ్యలో మనోదృష్ఠినివుంచి, ముక్కురంధ్రములలో సంచరించు ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసములను సమానముగా నిలిపివేసి, స్వాధీనపడిన ఇంద్రియములు కలవాడై, మనస్సుచే రాగభయ ద్వేషములను వదలి, మోక్షమే పరమాశయముగ తలచుచు బ్రహ్మయోగులు సదా ఆత్మను అనుభవించుదురు.


శ్లోకం 29: 

(ఆత్మ)

భావము : యజ్ఞ తపములు స్వీకరించువాడనై, సర్వ గుణములకు మహేశ్వరుండనై, సర్వ జీవరాసులకు సుహృదయుడైన నన్ను తెలుసుకొనుట వలన నరుడు శాంతి చెందగలడు.

------------------------------------------------------------------------------------------------------

త్రైత సిద్ధాంత భగవద్గీత :  "5" ఆత్మ సంయమ యోగము


శ్రీ భగవంతుడిట్లనియె:-

శ్లోకం 1: (కర్మయోగము)

భావము : కర్మఫలమును ఆశ్రయింపక కార్యములు చేయవలెనని తలచి ఎవడు చేయునో వాడే నిజమైన సన్న్యాసి, నిజమైన యోగి. అగ్నిలేనటువంటివాడు, పనులు మానుకొన్నవాడు యోగికాడు మరియు సన్న్యాసి కాడు.


శ్లోకం  2: (కర్మయోగము, బ్రహ్మయోగము)

భావము : జ్ఞానులు దేనిని సన్న్యాసమందురో అదియే కర్మయోగమని తెలియుము. మనిషి సంకల్పరహితుడైనప్పుడే యోగము ప్రాప్తించును.


శ్లోకం  3 : (కర్మయోగము, బ్రహ్మయోగము)

భావము : యోగసాధనకు కారణము కర్మ అని చెప్పబడుచున్నది. యోగికి కారణము కర్మనాశనమని చెప్పబడుచున్నది.


శ్లోకం  4: (బ్రహ్మయోగము)

భావము: ఇంద్రియ విషయములయందు, వాటి పనులయందు ఎప్పుడైతే సంగవర్జితము ఏర్పడునో అపుడే వానిని యోగి అనియు, మరియు సర్వసంకల్పసన్న్యాసీ అనియు అందురు.


శ్లోకం  5: (పరమాత్మ,ఆత్మ,జీవాత్మ)

భావము : ఆత్మచేత ఆత్మకు ఔన్నత్యగతియు, మరియు ఆత్మచేత ఆత్మకు అధోగతియు ఏర్పడుచున్నది. అందువలన ఆత్మకు ఆత్మే బంధువు మరియు ఆత్మకు ఆత్మే శత్రువుగ ఉన్నది.


శ్లోకం  6 : (పరమాత్మ, ఆత్మ, జీవాత్మ)

భావము : ఎవడు ఆత్మను తెలుసుకొన్నాడో, వానికి ఆత్మ బంధువుగనున్నది. అట్లే ఎవడు ఆత్మను తెలుసుకోలేడో, వానికి ఆత్మ శత్రువుగ కూడా ఉన్నది.


శ్లోకం  7: (బ్రహ్మయోగము)

భావము : ఆత్మను తెలిసినవాడు పరమాత్మ ఎడల ప్రశాంతత పొందియుండును. అట్టివాడు శీతోష్ణ సుఖదుఃఖములందు, అట్లే మానావమానములందు సమానత్వము కల్గివుండును.


శ్లోకం  8 : (బ్రహ్మయోగము)


శ్లోకం  9: (బ్రహ్మయోగము)

భావము : జ్ఞాన విజ్ఞాన తృప్తుడు, ఆత్మతో ఆనందములో మునిగియున్నవాడు, ఇంద్రియములను జయించినవాడు, నిజమైన బ్రహ్మయోగములో కూడుకొన్నవాడు, మన్ను, రాయి, బంగారను భేదముల ధ్యాసలేనివాడు, స్నేహితులందు సుహృధ్భావము కలవానియందు శత్రువులయందు, బంధువులయందు మిగతావారందరి ఎడల సమతనుండువాడే యోగి.


శ్లోకం  10 : (బ్రహ్మయోగము)

భావము : యోగి సతతము ఆత్మతో కలసియుండి రహస్యముగ ఉండును. ఏకాకిగ ఆశలెల్ల విడచి ఏది గ్రహించనివాడై, నియమించిన చిత్తము కలవాడై ఉండును.


శ్లోకం  11 : (బ్రహ్మయోగము)

భావము : ఎత్తు తగ్గులులేని శుభ్రమైన స్థలములో యోగసాధనకు కూర్చొనునట్లు స్థిరాసనము ఏర్పరచుకొని దానిమీద దర్భలువేసి, దర్భలమీద చర్మము, చర్మముమీద గుడ్డ పరచియుంచుకొని కూర్చొనవలెను.


శ్లోకం  12 : (బ్రహ్మయోగము)

భావము : ఆసనము తయారు చేసుకొని కూర్చొని మనస్సును ఏకాగ్రతనొనర్చి, ఇంద్రియములను, చిత్తము యొక్క పనులను అణచివేసి ఆత్మప్రాప్తి కొరకు బ్రహ్మయోగమును అభ్యసింపవలెను.


శ్లోకం  13 : (బ్రహ్మయోగము)

భావము : శరీరము, శిరస్సు, కంఠము మూడిటిని సమముగ అచంచలముగ నిలిపి, తన దృష్ఠిని నాసికాగ్రములో నిలిపి ప్రక్కదిక్కులు చూడకుండనుండవలెను.


శ్లోకం  14 : (బ్రహ్మయోగము)

భావము : ప్రశాంతుడగుచు, బ్రహ్మచారి వ్రతము పూనినవాడై, భయములేనివాడై, ఆత్మయందే చిత్తమునుంచి మనస్సును అణచి కూర్చొనవలయును.


శ్లోకం  15: (బ్రహ్మయోగము)

భావము : యోగి ఎల్లప్పుడు మనస్సును నియమించిన వాడైయుండి నేననుగ్రహించు మోక్షమను శాంతిని పొందగలుగును.


శ్లోకం  16 : (బ్రహ్మయోగము)

భావము : అమితముగ భుజించువాడు, ఎక్కువగా ఉపవాసముండువాడు, నిదుర పోతు, నిష్ప్రయోజనముగ మేల్కొనువాడు బ్రహ్మయోగమును అభ్యాసము చేయలేడు.


శ్లోకం  17 : (బ్రహ్మయోగము)

భావము : మితమైన భోజనము, మితమైన పనులు, మితమైన నిద్ర మెలుకవ కల్గువాడు బ్రహ్మయోగమును పొంది దుఃఖమును పొందడు.


శ్లోకం  18 : (బ్రహ్మయోగము)

భావము : ఎప్పుడు నియమితమైన చిత్తమును ఆత్మయందే నిలుపగలుగుచున్నాడో, అప్పుడువాడు సర్వకోర్కెలయందు ధ్యాసలేనివాడై, ఆత్మయందే ధ్యాసతో యుండి యోగమును పొందివున్నాడు.


శ్లోకం  19 : (బ్రహ్మయోగము)

భావము : నియతచిత్తుడై యోగముతో కూడుకొన్న జీవాత్మకు ఉపమానముగ గాలి వీచనిచోట దీపము కదలకుండ వెలుగునట్లుండునని చెప్పవచ్చును.


శ్లోకం  20 : (బ్రహ్మయోగము)

భావము : ఎప్పుడు యోగమాచరించుటచేత చిత్తము పనిచేయకుండ పోవుచున్నదో, అపుడు జీవాత్మ ఆత్మను చూచి ఆత్మానందము అనుభవించుచున్నాడు.


శ్లోకం  21 : (బ్రహ్మయోగము)

భావము : అనంతమైన ఆ సుఖము ఇంద్రియాతీతము. దానిని బుద్ధిమాత్రము గ్రహించుచున్నది. ఆ సుఖమును గ్రహించినవాడు దానినుండి చలించక నిశ్చలత పొందివుండును.


శ్లోకం  22 : (బ్రహ్మయోగము)


శ్లోకం  23 : (బ్రహ్మయోగము)

భావము : తనకు లభించు వాటిలో ఇతరములకంటే ఏది అధిక లాభముగ కనిపిస్తున్నదో, పెద్ద దుఃఖము తటస్థించినప్పటికి ఏ స్థితిలో అది తనకు విచారము చలనము కల్గించదో, దుఃఖము పొందుట దేనివలన లేదో, దానిపేరే బ్రహ్మయోగమని తెలియుము. ఈ యోగము యొక్క సారాంశము నిశ్చయముగ తెలిసినవాడు వ్యాకులము లేనివాడై బ్రహ్మయోగమునే ఆచరించును.


శ్లోకం  24 : (బ్రహ్మయోగము)


శ్లోకం  25 : (బ్రహ్మయోగము)

భావము : మనో సంకల్పము వలన సంభవించు ఆశ మొదలగు గుణములను నిశ్శేషముగ లేకుండ చేసి, ఇంద్రియ విషయముల నుండి మనస్సును నిగ్రహించి, మరియు ధైర్యముగల బుద్ధిచేత కొద్ది కొద్ధిగ మనస్సును విషయముల నుండి మరల్చి ఆత్మయందే నిలుచునట్లు చేయవలెను.


శ్లోకం  26 : (బ్రహ్మయోగము)

భావము : అస్థిరము అధిక చంచలమైన మనస్సు దేనివైపు పరుగిడునో, ఆ విషయము నుండి మనస్సును నిగ్రహించి మరల్చి ఆత్మయందే వశమగునట్లు చేయవలెను.


శ్లోకం  27 : (బ్రహ్మయోగము)

భావము : ప్రశాంతత పొందిన మనస్సు గలవాడును, రాజసగుణములేనివాడు, ఆత్మానుభవము పొందినవాడు, కర్మకల్మషము లేకుండ చేసుకొనువాడు ఎల్లవేళల ఉత్తమమైన ఆత్మసౌఖ్యమునే పొందుచుండును.


శ్లోకం  28 : (బ్రహ్మయోగము)

భావము : బ్రహ్మయోగి సాధనచేసి ఎల్లవేళల ఆత్మయందునే మనస్సును లయమొనర్చి కర్మ కల్మషములు నశించగ, ఆత్మసుఖమునే పొందుచు అపరిమితమగు ఆనందమును అనుభవించుచుండును.


శ్లోకం  29 : (బ్రహ్మయోగము)

భావము : బ్రహ్మయోగములో కూడుకొన్నవాడు, అందరి ఎడల ఒకే సమదృష్ఠి కలిగివున్నాడు, సర్వులలో ఆత్మను చూడగల్గుచున్నాడు. మరియు ఆత్మయందే సర్వ భూతములను చూడగల్గుచున్నాడు.


శ్లోకం  30 : (జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)

భావము : ఎవడు నన్ను అంతటా చూస్తున్నాడో, అంతయు నాయందే చూడగల్గు చున్నాడో, వానిని నేను చూస్తున్నాను. వాడు నన్ను చూస్తున్నాడు.


శ్లోకం  31 : (జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)

భావము : సర్వ జీవరాసులలో నేను ఏకరూపముగ ఉండుట తెలిసి ఎవడు నన్ను సేవించునో, పొగడునో అట్టియోగి సర్వదా వర్తించుచున్నప్పటికి అతడు నాయందే వర్తించును.


శ్లోకం  32 : (జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)

భావము : ప్రపంచములో సర్వ జీవరాసులకు సంభవించు సుఖమైన దుఃఖమైన వారిలోని ఆత్మకు సమానముగనున్నట్లు చూచువాడు నిజమైన యోగియని నేననుకొందును.


అర్జునుడిట్లనియె :

శ్లోకం  33 : (కల్పితము)


శ్లోకం  34 : (బ్రహ్మయోగము)

భావము : నాలోని మనస్సు చంచల స్వభావము కలదైనందువలన నీవు చెప్పిన స్థిరమైన స్థితిని యోగమున పొందలేక ఆత్మసామ్యమును తెలియకున్నాను. అమిత చంచలము, దృఢమైనది, బలమైనదియునైన మనస్సును నిగ్రహించుట దుస్సాధ్యమని తోయుచున్నది కృష్ణా ! గాలినెవరు మూటకట్టగలరు.

శ్రీ భగవంతుడిట్లనియె :-


శ్లోకం  35 : (బ్రహ్మయోగము)


శ్లోకం  36 : (బ్రహ్మయోగము)

భావము : అర్జునా ! నీవు చెప్పుమాటలో అనుమానము లేదు. మనస్సు నిగ్రహింపబడనిది, చంచలమైనది. అట్టి మనస్సును అభ్యాసవైరాగ్యముల చేత నిల్పవలెను. మనస్సు నిల్పకపోతే ఈ యోగము పొందుట సాధ్యపడదు. కావున మనస్సును నిగ్రహించుటకు చేయు ప్రయత్నమే మంచి ఉపాయము.


అర్జునుడిట్లనియె :-

శ్లోకం 37 -39

(బ్రహ్మయోగము)

భావము : శ్రద్ధ కలిగియుండి సంపూర్ణ ప్రయత్నము చేసినను మనోచలనము చేత యోగికాలేనివాని గతి ఏమి? ఆత్మదర్శన మార్గములో అప్రతిష్ఠుడైన మూఢుని గతి ఏమి? ఓ కృష్ణా నాకున్న ఈ సంశయమును నీవే తీర్చవలయును. నీవు తప్ప నా సంశయమును. ఇతరులెవరు తీర్చలేరు.


శ్రీ భగవంతుడిట్లనియె :-

శ్లోకం  40 : (జీవుడు)

భావము : మంచి పనులు చేయువానికి మంచే జరుగును. ఈ జన్మలోగాని మరి ఏ జన్మలోగాని వాని సాధనకు నాశనముండదు.


శ్లోకం  41 : (జీవాత్మ)

భావము : యోగభ్రష్టులైనవారు పుణ్యము చేసినవారు పొందులోకములనే తాము పొంది, పరిశుద్ధమైన జ్ఞానము కలవారింటిలో పుట్టగలుగుదురు.


శ్లోకం  42 : (జీవాత్మ)

భావము : అట్లుకాకున్న ధీమంతులైన యోగుల వంశములోనైన పుట్టును. అట్టి లోకపు జన్మ పొందుట ఎంతో దుర్లభము కదా!


శ్లోకం  43 : (జీవాత్మ)

భావము : అట్లు మరుజన్మము పొందినవాడు, తన పూర్వదేహమునందు గల జ్ఞానము బుద్ధికి తోయగ, మరల మోక్షసిద్ధి కొరకు సంపూర్ణ ప్రయత్నము చేయుచుండును.


శ్లోకం  44 : (జీవాత్మ)

భావము : పూర్వజన్మ అభ్యాస బలముచేత లాగబడి ఈ జన్మలో కూడ యోగము ఆచరించవచ్చును. అటువంటి జిజ్ఞాసులు శబ్ద బ్రహ్మమధిగమించి పోవుచున్నారు.


శ్లోకం  45 : (జీవాత్మ)

భావము : అనేక జన్మలనెత్తుచు దృఢప్రయత్నము చేసి యోగమును పొందగల్గి, తనకువున్న సర్వకర్మలు పోయిన తర్వాత పరమును పొందగల్గును.


శ్లోకం  46 : (జీవాత్మ)

భావము : తపస్వికులకంటే యోగి అధికుడు. అట్లే జ్ఞానులకంటే ఉత్తముడు కర్మములు చేయువారికంటే గొప్పవాడు. కావున నీవు యోగివేకమ్ము.


శ్లోకం  47 : (జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)

భావము : సర్వయోగులందు ఎవడు నా గతియైన మోక్షము కొరకు ఆత్మను యోగ ఆచరణచే పొందగల్గి నన్నే భజించునో, వాడు ఉత్తమ యోగి అని నా అభిమతము.

--------------------

త్రైత సిద్ధాంత భగవద్గీత : "6" విజ్ఞాన యోగము  


శ్రీ భగవంతుడిట్లనియె:-

శ్లోకం  1 

(జీవాత్మ, పరమాత్మ)

భావము : నా మీదనే ఆసక్తికల్గి, నన్నే ఆశ్రయించి యోగాభ్యాసము చేయుచు, సంశయము లేకుండ సంపూర్ణముగ నన్ను ఎట్లు తెలియగలవో ఆ విధానమును వినుము.


శ్లోకం  2 

(జీవాత్మ)

భావము : జ్ఞానమును నీకు నేను విజ్ఞాన పూర్వకముగా తెలియచేసెదను. దానిని తెలిసిన తర్వాత ఇంకొకటి తెలియవలసినదుండదు.


శ్లోకం  3 

(జీవాత్మ)

భావము : నరులలో మోక్షమునకై ప్రయత్నము చేయువాడు వేయిమందిలో ఒకడుండుట అరుదు. అట్లు ప్రయత్నము చేయువారిలో చివరకు ఎవడో ఒకడు నన్ను తెలుసుకోగలడు.


శ్లోకం  4  

(ప్రకృతి)

భావము : భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహము అను అష్ట భాగములుగ నా ప్రకృతి గలదు.


శ్లోకం  5  

(ప్రకృతి, పరమాత్మ)

భావము : దేనిచేత ఈ ప్రపంచమంతయు ధరింపబడుచున్నదో అనగా ప్రపంచమునకు ఏది ఆధారముగనున్నదో, అదే జీవరూపమై ప్రకృతికంటే అన్యమై ఉన్నది, దానిని తెలుసుకొనుము. దానికంటే ప్రకృతి చాలా తక్కువై ఉన్నది.


శ్లోకం  6  

(ప్రకృతి, పరమాత్మ)

భావము : ప్రకృతి సమస్త జీవరాసుల పుట్టుకకు స్థానమైన యోనిలాంటిది. నేను జీవరాసుల పుట్టుకకు కారణమైన వానిని, మరియు వాటి ప్రళయమునకు కూడ కారణమైన వానిని.


శ్లోకం  7  

(పరమాత్మ)

భావము : జగతిలో నన్నుమించి ఘనత పొందినది వేరేదియులేదు. దారమందు మణులు ధరింపబడునట్లు సర్వ ప్రపంచమును నేనే ధరింతును.


శ్లోకం  8  

(పరమాత్మ)

భావము : జలములోనున్న రసమును నేను, సూర్య చంద్రులకున్న ప్రకాశమునేను, వేదములందలి ఓంకారమును నేను. ఆకాశములోనున్న ధ్వనిని నేను. అట్లే పురుషులలోని పౌరుషము కూడ నేనే అయివున్నాను.


శ్లోకం  9  

(పరమాత్మ)

భావము : భూమిలోగల సువాసన, అగ్నిలోగల తేజస్సు, జీవరాసులలోని జీవనము, తపస్వికులలోని తపస్సు అయివున్నాను.


శ్లోకం  10  

(పరమాత్మ)

భావము : సర్వ జీవరాశులకు శాశ్వతముగ బీజము నేనేయని తెలియుము. బుద్ధిమంతులలోని బుద్ధిని మరియు తేజస్సులందు తేజంబునేనై ఉన్నాను.


శ్లోకం  11  

(పరమాత్మ)

భావము : కామ రాగ వివర్జిత మొనరించు బలవంతులయందలి బలము నేను. ధర్మమునకు విరుద్ధముగనున్న వారిలో ఆశయును నేను.


శ్లోకం  12  

(పరమాత్మ)

భావము : సాత్విక, రాజస, తామస భావములు నాచేత సృష్ఠింపబడినవని తెలుసుకొనుము. వాటియందు నేను లేను అవి నాయందున్నవి.


శ్లోకం  13 

(పరమాత్మ)

భావము : ఈ జగమంతయు సాత్త్విక, రాజస, తామస గుణమయమగుటచే వాటి ప్రభావముచేత మోహింపబడినవారై, నేను అవ్యయమైన మోక్షమునని తెలియకున్నారు.


శ్లోకం  14 

(పరమాత్మ)

భావము : దైవనిర్మితమైన గుణములతో కూడుకొన్న నా మాయ దుస్సాధ్యమైనది. ఎవరైతే నన్ను శరణుజొచ్చుదురో వారు మాయను దాటిపోగలరు.


శ్లోకం  15  

(జీవాత్మ, పరమాత్మ)

భావము : పాపకార్యములు చేయువారు, మూఢులైనవారు, మాయచేత మూసి వేయబడిన జ్ఞానము కలవారు, అసుర భావము గల జనులు నన్ను తెలియలేరు, పొందలేరు.


శ్లోకం  16  

(జీవాత్మ, పరమాత్మ)

భావము : అర్జునా నన్ను భజించు సుకృతులు నాల్గురకములుగ ఉన్నారు. వారిని ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులు అని విభజించి చెప్పవచ్చును.


శ్లోకం  17 

(జీవాత్మ, పరమాత్మ)

భావము : అట్టివారిలో జ్ఞాని నిత్యము నాతో పొందుకోరి ఒకే భక్తి కల్గియుండు వాడు శ్రేష్ఠుడని చెప్పవచ్చును. వానికి నేను ఎక్కువ ప్రియుడను, అట్లే నాకు వాడు ప్రియుడు.


శ్లోకం  18 

(జీవాత్మ, పరమాత్మ)

భావము : ఈ నాలుగు రకములలోని సర్వులు ఉదారులే. అందులో జ్ఞానిని నా ఆత్మగ తలచుచున్నాను. అతడు నా ఆత్మతో కూడుకొని ఉండి నా యొక్క ఉత్తమమైన గతిని పొందుచున్నాడు.


శ్లోకం  19 

(జీవాత్మ, సాకారము)

భావము : జ్ఞానవంతుడు ఎన్నో జన్మలు పొంది చివరకు వాసుదేవుడే సర్వమని తలచి నన్ను పొందగలుగుచున్నాడు. అట్టివాడు ఎంతో దుర్లభముగ లభించును.


శ్లోకం  20 

(జీవాత్మ)

భావము : ప్రకృతి సంబంధములైన ఆశ గుణములచేత, జ్ఞానములేనివారై అన్యదేవ తారాధన చేయుచున్నారు. ఆయా దేవతల నియమ నిష్ఠలననుసరించి వారిని ఆరాధించుచున్నారు.


శ్లోకం  21 

(జీవాత్మ)

భావము : ఎవడెవడు ఏ ఏ దేవతను శ్రద్ధతో ఆరాధించవలెననుకొనునో, వాని వానికాశ్రద్ధను దృఢమైనదిగా ఉండునట్లు నేను కలుగజేయుదును.


శ్లోకం  22 

(జీవాత్మ)

భావము : వాడు శ్రద్ధవహించి ఆ దేవతలనే ఉపాసన చేయగ దానివలన కామ్యార్థసిద్ధి కలుగును. వాని హితము కోరి నేనే కామ్యార్థసిద్ధి కలుగజేయుచున్నాను.


శ్లోకం  25 

(జీవాత్మ, పరమాత్మ)

భావము : మాయతో కూడుకొన్నవారు, మాయతో కప్పబడినవారైన సర్వులు నన్ను తెలియజాలకున్నారు. మూఢులైన లోకులు నాకు పుట్టుక నాశనము లేదని తెలియలేకున్నారు.


శ్లోకం  26 

(జీవాత్మ, పరమాత్మ)

భావము : సర్వ జీవులకు జరిగిపోయినవి, జరుగుచున్నవి, జరుగబోవునవి నాకు తెలుసు. నన్ను మాత్రము ఎవడు తెలియలేడు.


శ్లోకం  27 

(జీవాత్మ, ప్రకృతి)

భావము : రాగద్వేషములవలన పుట్టుచున్న ద్వంద్వములచే భ్రాంతి చెందినవారై, సర్వ జీవరాసులు పుట్టినది మొదులకొని వాటియందే సమ్మోహమై పోవుచున్నారు.


శ్లోకం  28 

(జీవాత్మ, పరమాత్మ)

భావము : మనుషులలో ఎవడు వాని యొక్క ద్వంద్వ గుణముల మోహము వదలబడి నన్నే భజించుచున్నాడో, అట్టివాడు తన పుణ్యపాపములను నశింప చేసుకొనును.


శ్లోకం  29 

(జీవాత్మ, పరమాత్మ)

భావము : జరామరణ మోక్షము కొరకు నన్నే ఆశ్రయించి ఎవడు ప్రయతించు చున్నాడో వాడు ఆత్మను, ఆధ్యాత్మికమును, కర్మమును తెలిసినవాడై ఉండును.


శ్లోకం  30 

(జీవాత్మ, పరమాత్మ)

భావము : సర్వజీవరాసులకును, సర్వదేవతలకును, సర్వయజ్ఞములకును నేనే ఆధారభూతుడనని ఎవరు తెలుసుకొందురో, వారు అవసానదశలో వారి మనస్సును నాయందే ఉంచుకొని నన్ను తెలుసుకోగలరు.

---------------------

త్రైత సిద్ధాంత భగవద్గీత:  "7" అక్షర పరబ్రహ్మ యోగము  


అర్జునుడిట్లనియె :-

శ్లోకం 1 

(ప్రకృతి, ఆత్మ, పరమాత్మ)


శ్లోకం 2  

(ఆత్మ, పరమాత్మ)

భావము: బ్రహ్మమేది ? ఏది ఆధ్యాత్మికము ? కర్మయేది ? ఏది భూతములకు అధిపతి? అట్లే దేవతలకు అధికుడైనవాడెవడు? తెలియచెప్పుము. పురుషోత్తమ .! దేహములో యజ్ఞములకు అధిపతియైనవాడు ఎట్లున్నాడు ? నియతాత్ములు వారి అంత్యకాలములో నిన్ను ఎట్లు పొందుచున్నారు ?


శ్రీ భగవంతుడిట్లనియే : -

శ్లోకం 3  

(ప్రకృతి , పరమాత్మ)

భావము : అన్నిటికంటే శ్రేష్ఠమైన నాశనరహితమైనదే బ్రహ్మము. తన్నుతాను తెలుసుకోవడమే ఆధ్యాత్మికము అనబడును. జీవరాశుల ఉనికికి కారణమైన లెక్కాచారమును కర్మ అందురు.


శ్లోకం 4 

(ఆత్మ)

భావము : నాశన స్వభావమున్న శరీరములు గల జీవరాసులకును, దేవతలకును ఆధారమైనవాడిని నేనే. దేహమందు జరుగు యజ్ఞములకు నేనే అధిపతినని తెలియుము.


శ్లోకం 5  

(ఆత్మ, పరమాత్మ)

భావము : చివరి కాలములో నన్నే స్మరించుకొంటు శరీరమును వదులువాడు నన్నే పొందగల్గుచున్నాడు. ఈ విషయములో ఏ మాత్రము సంశయము లేదు.


శ్లోకం 6  

(జీవాత్మ)

భావము : ఏ ఏ భావమును స్మరించుకొంటూ శరీరమును వదులుచున్నాడో, ఆయా భావమునే అభ్యాస బలము చేత పొందుచున్నాడు.


శ్లోకం 7  

(ఆత్మ, సాకారము)

భావము : కావున సర్వకాలము నీమనసునందు నన్ను స్మరించుచుండుము. బుద్ధి మనస్సు నాకే సమర్పించుట వలన నన్నే పొందగలవు. దీనిలో సంశయము లేదు.


శ్లోకం 8  

(ఆత్మ, పరమాత్మ)

భావము:అభ్యాసము చేత మనస్సును ఇతర విషయముల మీదికి పోనీయక యోగముతో కూడుకొని చింతించువాడు శ్రేష్ఠమైన, దివ్యమైన పురుషుని పొందగల్గుచున్నాడు.


శ్లోకం 9 - 10  

(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)

భావము : సర్వదర్శి, పురాణుడు, జగత్తును శాశించువాడు, సూక్ష్మములకు సూక్ష్మమైనవాడు, సర్వస్వమును రక్షించువాడు, చింతచేత తెలియనివాడు, సూర్య ప్రకాశము కల్గినవాడు,అజ్ఞానమునకంటే వేరైనవాడునైన పరమాత్మను పొందకోరువాడు, మరణ సమయములో యోగబలము చేత మనస్సును కనుబొమల మధ్యలో నిలుపగలిగి, ప్రాణవాయువును స్థిరపరచినవాడై పరమాత్మలో చేరగల్గును.


శ్లోకము 11:

(పరమాత్మ)

భావము : వేద వేత్తలందరు దేనికి నాశనములేదనుచున్నారో, గుణములు వదలిన వారికి ఏది గమ్యస్థానమో , బ్రహ్మచర్యముచే దేనిని పొందగల్గుదురో ఆ పదమును గూర్చి సంగ్రహముగ చెప్పుచున్నాను.


శ్లోకం 12 - 13 

(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)

భావము : సర్వద్వారములను నియమించి, మనస్సును హృది మధ్యలో నిలిపి, ప్రాణవాయువును పై ముఖముగ నిలుచునట్లు చేసి, స్థిరయోగత్వము పొంది ‘ఓం’ అను అక్షరమునే స్మరించుకొంటు, శరీరమును వదలి పోవువాడు పరమమైన నన్ను పొందును.


శ్లోకం 14 

(పరమాత్మ)

భావము : వేరు చింతలు మనసున చేరనీయక ఎవడు సర్వదా నన్నే స్మరించునో వానికి సులభుడనౌదును. అతడే నిత్యము నాతో కూడుకొన్న యోగి అనబడును.


శ్లోకం 15 

(పరమాత్మ)

భావము : శ్రేష్టమైన సంసిద్ధి పొందిన జనులు నన్ను పొందినవారైవుండి తర్వాత దుఃఖముతో కూడుకొన్న అశాశ్వతమైన జన్మలు పొందరు.


శ్లోకం 16 

(పరమాత్మ)

భావము : బ్రహ్మలోకము మొదలైన లోకములను పొందినప్పటికి పునర్జన్మ కలదు. నన్ను పొందువానికి పునర్జన్మలేదు.


శ్లోకం 17 

(పరమాత్మ)

భావము : పరమాత్మకు వేయియుగములు ఒక పగలుగ, వేయియుగములు ఒక రాత్రిగ ఉన్నదని తెలిసినవారు రాత్రిపగలును తెలుసుకోగలుగుచున్నారు.


శ్లోకం 18 

(పరమాత్మ, జీవాత్మ)

భావము : బ్రహ్మపగలు జగతిగ మారుచు కనిపించు సర్వము కనిపించని దానినుండి పుట్టినవి. అట్లే బ్రహ్మరాత్రిలో జగత్తంతయు ప్రళయుము చెంది కనిపించుచున్నవన్నియు కనిపించకుండ పోవుచున్నవి.


శ్లోకం 19 

(జీవాత్మ)

భావము : సర్వజీవరాసులు బ్రహ్మపగలులో పుట్టి చివరకు రాత్రి అయిన వెంటనే ప్రళయము పొంది నాశనమై కనిపించకపోయి తిరిగి పగలు మొదలైన వెంటనే పుట్టుచున్నవి.


శ్లోకం 20 

(పరమాత్మ)

భావము : నాశనములేని, మార్పుచెందని, ప్రకృతికంటే వేరైన, శ్రేష్టమైన, జగతి నాశనమైనను తాను నాశనము కాని అన్యమగుస్థితి ఒకటి కనిపించకవున్నది.


శ్లోకం 21 

(పరమాత్మ)

భావము : దానినే కనిపించని నాశనములేని స్థితియనుచున్నాము. పరమగతి కావున దానిని తెలియవలయును, పొందవలెను. అది లభించిన జన్మములు లేకుండ పోవును. దానినే నాదగు నియమస్థానమని, పరంధామమని చెప్పవచ్చును.


శ్లోకం 22  

(పరమాత్మ)

భావము : సర్వ జీవరాసులు ఎవనిలోపల ఉన్నవో, ఈ జగత్తంతయు ఎవనిచే వ్యాపించివున్నదో అట్టి పురుషుని అనన్యమైన భక్తిచే పొందవచ్చును.


శ్లోకం 23  

(జీవాత్మ, మోక్షము)

భావము : యోగులు ఏ కాలములో మరణిస్తే తిరిగి పుట్టుచున్నారో, ఏ కాలములో మరణిస్తే తిరిగి పుట్టక మోక్షము పొందుచున్నారో, వారు శరీరమును వదిలిపోవు ఆ కాలమును చెప్పుచున్నాను.


శ్లోకం 24 

(జీవాత్మ, మోక్షము)

భావము : యోగి అయినవాడు ఏ ప్రాంతములో ఉండి మరణము పొందుచున్నాడో ఆ ప్రాంతము మీద సూర్యప్రకాశము కల్గివుండాలి. మేఘముల నీడ ఉండకూడదు. యోగి మరణించు సమయము పగలుగ ఉండి, ఆ పగలు శుక్లపక్షములోనిదై ఉండాలి. ఆ శుక్లపక్షము ఉత్తరాయణములోనిదై ఉండాలి. ఈ విధముగ సూర్యతేజస్సు కల్గిన పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము చేకూరినకాలములో చనిపోయిన యోగి జన్మించక మోక్షము పొంది పరమాత్మయందైక్యమగుచున్నాడు.


శ్లోకం 25  

(జీవుడు)

భావము : యోగి మరణించు ప్రాంతము మేఘావృతమైవుండినా, రాత్రి సమయమైనా, కృష్ణపక్షము 15 రోజులలోనైనా, దక్షిణాయన ఆరునెలల కాలములోనైన యోగి మరణించిన ఎడల అతడు మోక్షము పొందక, జ్ఞానతేజస్సు కల్గినవాడై తిరిగి జన్మించును. ఈ మరణ సమయములను చాలా గీతలలో తప్పుదోవ పట్టించడము జరిగినది. ‘ప్రయాతాయాన్తితం కాలమ్’ అని 23వ శ్లోకములో చెప్పినప్పటికి కాలమును గూర్చి చెప్పక పగటి దేవత, శుక్లపక్ష దేవత, ఉత్తరాయణ దేవత పోవు దారిలో పోతే మోక్షము లభిస్తుందని వ్రాయబడివున్నది. అలా పగలు దేవతని శ్లోకములో లేని విషయమును తెచ్చి పెట్టడము వలన చాలామంది పొరబడి పోవుచున్నారు. పగలు దేవతను వ్రాసినవారు కూడ చూడలేదు. విన్నవారెక్కడ వెదకగలరు.


శ్లోకం 26 

(జీవాత్మ)

భావము : జగతిలో శుక్ల కృష్ణ గతులు శాశ్వతముగ గలవు. ఒకదాని వలన వృత్తి, మరొక దానివలన అనావృత్తి కల్గుచున్నది.


శ్లోకం 27  

(జీవాత్మ)

భావము : ఇప్పుడు విన్న రెండు విధముల కాలములను తెలిసిన యోగి పొరపాటు పడడు. కనుక అర్జున ఎల్లకాలములలోను నీవు యోగయుక్తునిగనుండవలెను.


శ్లోకం 28  

(జీవాత్మ, మోక్షము)

భావము : ఈ విషయము తెలిసినవాడు వేదధ్యాయణము, యజ్ఞాచరణము, తపస్సు, దానము వలన కల్గు పుణ్యఫలములను అతిక్రమించి మోక్షమును పొందును.

---------------------------------------------

త్రైత సిద్ధాంత భగవద్గీత: "8"  రాజవిద్యా రాజగుహ్య యోగము  


శ్రీ భగవంతుడిట్లనియె :-


శ్లోకం 1 (ధర్మములు)

భావము : ఇది అతి రహస్యమైన జ్ఞానము. దీనిని విజ్ఞాన సహితముగ విశద పరుతును. దీనిని తెలియుట వలన అశుభములనుండి ముక్తుడవుకాగలవు.


శ్లోకం 2 (ధర్మములు)

భావము : అన్ని విద్యలయందు పెద్దది, అట్లే అన్ని రహస్యములందు పెద్దది, పవిత్రమైన ఉత్తమమైన ప్రత్యక్షముగ జరుగు ధర్మము. మంచి సుఖమైనది నాశనములేనిది.


శ్లోకం 3  (ధర్మములు)

భావము : ధర్మముల మీద అశ్రద్ధ కల్గినవాడు, నన్ను తెలియలేక మృత్యు సంసారములోనే వర్తించుచుండును.


శ్లోకం 4 (పరమాత్మ)

భావము : అవ్యక్తముగ ఈ ప్రపంచమంతయు వ్యాపించియున్నాను. నాయందే సర్వజీవరాసులున్నవి. నేను వాటియందులేను.


శ్లోకం 5 (పరమాత్మ)

భావము : సర్వ జీవులు నాయందులేవు. నేను ఈశ్వరునిగ (అధిపతిగ) ఎట్లు కలిసి ఉన్నది చూడుము. జీవులు ధరించు శరీరములోని ఆత్మగను, భూతములుగ భావింపబడు జీవాత్మలుగను నేను లేను.


శ్లోకం 6 (పరమాత్మ)

భావము : బలము కలిగి సర్వత్ర సంచరించు గాలి నిత్యము ఆకాశమందెట్లున్నదో, అట్లే సర్వ జీవరాసులు నాయందున్నవని గ్రహించుము.


శ్లోకం 7 (పరమాత్మ)

భావము : సర్వ జీవరాసులు కల్పక్షయములో నా ప్రకృతియందే లీనమగుచున్నవి. కల్పాదిలో నేనే తిరిగి వాటిని పుట్టించుచున్నాను.


శ్లోకం 8 (పరమాత్మ)

భావము : ప్రకృతి వశములోనుండి అస్వతంత్రమైయున్న ఈ సమస్త జీవరాసులను నా ఆధీనములోనున్న ప్రకృతిచేతనే మళ్ళీ మళ్ళీ పుట్టించుచున్నాను.


శ్లోకం 9 (పరమాత్మ)

భావము : ఆసక్తిలేని వాడును, ఉదాసీనత కల్గియున్న వాడునునైన నాకు ఆ కర్మలంటవు.


శ్లోకం 10 (పరమాత్మ)

భావము : నా అధ్యక్షతన గల చరాచర ప్రపంచమునంతటిని ప్రకృతి పుట్టించు చున్నది. ఆ కారణముచేతనే జగత్తు పరివర్తించుచున్నది.


శ్లోకం 11 (పరమాత్మ, సాకారము)

భావము : సర్వజీవరాసులకు అధిపతినైన నేను నరశరీరము ధరించుట వలన, నాశ్రేష్ఠమైన భావము తెలియజాలక మూఢులు నన్ను అవమానించుచున్నారు.


శ్లోకం 12 (జీవాత్మ, ప్రకృతి)

భావము : రాక్షస భావములు కలవారు భ్రాంతితోకూడిన ప్రకృతి స్వభావమును ఆశ్రయింతురు. అట్టివారికి వ్యర్థమైన ఆశ, వ్యర్థమైన కర్మ, వ్యర్థమైన విపరీత జ్ఞానము కల్గుచుండును.


శ్లోకం 13 (జీవాత్మ, పరమాత్మ)

భావము : మహాత్ములైనవారు ప్రకృతికి దైవమైన నన్ను ఆశ్రయించి, అవ్యయునిగ భూతముల మూలకారునిగ నన్ను తెలిసినవారై, మనస్సున అన్యచింత లేకుండ నన్ను ఆరాధిస్తున్నారు.


శ్లోకం 14  (జీవాత్మ, పరమాత్మ)

భావము : ఎల్లప్పుడు నన్ను కీర్తించి భజించువారు, గొప్ప వ్రతములచే ప్రయత్నించు వారు, నన్నే నమస్కరించువారు, భక్తిచే నిత్యయుక్తులైనవారు, అందరు నన్ను ఉపాసించువారే.


శ్లోకం 15 (సాకారము, పరమాత్మ)

భావము : మరికొందరు జ్ఞానయజ్ఞముచే ఆరాధించువారు, విశ్వవ్యాప్తియై అనేక రూపములుగ ఉన్న నన్ను ఏకరూపునిగ సాకారమును పూజించువారు కలరు.


శ్లోకం 16  (పరమాత్మ)

భావము : నేను క్రతువును, నేను యజ్ఞమును, నేను స్వదయును, ఔషధంబు నేను, మరియు మంత్రము నేను, ఆజ్యమునేను, అగ్ని నేను, హోమము సహితము నేనే అయివున్నాను.


శ్లోకం 17  (పరమాత్మ)

భావము : అఖిల జగతికి తల్లి తండ్రినగుదును, మరియు దాతను, తాతను నేనే అగుదును. తెలుసుకొంటే పవిత్ర ఓంకారమును నేనే. ఋక్, సామ, యజుర్వేదములును నేనే.


శ్లోకం 18  (పరమాత్మ)

భావము : గతియు, భర్తా, ప్రభువు, సాక్షి, సుహృత్ జనుల నివాస శరణములును, పుట్టు స్థలము, లయము జరుగు స్థలము, నిదానము, బీజము, అవ్యయము అన్నియు నేనే.


శ్లోకం 19 (పరమాత్మ)

భావము : నేను తపియింప చేయుదును. నేను వర్ష జలమును స్వీకరించి మరల విడుతును. మృత్యువును నేను మరియు అమృతమునేనే. సత్తునేనే అసత్తునేనే.


శ్లోకం 20 

శ్లోకం 21 (జీవాత్మ, పరమాత్మ)

భావము : మూడు విద్యలు నేర్చినవారు, సోమపానులు, పాపములులేనివారు, యజ్ఞములందిష్టము కలవారు, స్వర్గమును పొందుటకు నన్ను ప్రార్థించుచున్నారు. వారు పుణ్యముగలవారై సురేంద్రలోకము పొంది అక్కడ దివ్యమైన దేవభోగములను పొందుచున్నారు. వారు అచట స్వర్గ సుఖములననుభవించి పుణ్యమైపోయిన వెంటనే తగ్గుస్థితికి వచ్చుచుందురు. అట్లు ఆశపరులకు మూడు విద్యల ధర్మములందుండు సుఖఫలములు అశాశ్వతమైనవిగ గలవు.


శ్లోకం 22 (జీవాత్మ, పరమాత్మ)

భావము : ఎవడైతే అన్యచింత లేకుండ నన్ను ఎల్లప్పుడు ఉపాసించుచున్నాడో, వాడు నిత్యము నాతో కూడుకొనివున్నాడు. అట్టివాని యోగము యొక్క క్షేమమును నేనే వహించుచున్నాను.


శ్లోకం 23 (జీవాత్మ, పరమాత్మ)

భావము : ఎవడు శ్రద్ధతో అన్యదేవతారాధనలాచరించునో వాడు కూడ నన్నే దారి తప్పి ఆరాధించినవాడగుచున్నాడు.


శ్లోకం 24 (పరమాత్మ)

భావము : నేను సర్వ యజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును. నేను ఆత్మగ ఉన్నానని తెలియనివారు దారి తప్పి పడినవారగుదురు.


శ్లోకం 25 (పరమాత్మ)

భావము : దేవతా పూజచేయువారు దేవతలందే చేరుదురు. పితృదేవతలను పూజించువారు వారియందే చేరుదురు. భూతముల పూజించువారు భూతములందే చేరుదురు, నన్ను పూజించువారు నాయందే చేరుదురు.


శ్లోకం :  26 (పరమాత్మ)

భావము : ఆకు అయిన, పుష్పమైన, పండైన, నీరైన ఎవడు భక్తితో సమర్పించునో, పరిశుద్ధమైన ఆత్మకు భక్తి పూర్వకముగ సమర్పించిన దానిని నేను స్వీకరింతును.


శ్లోకం :  27 (పరమాత్మ, కర్మయోగము)

భావము : దేనిని చేయుచున్నావో, దేనిని తినుచున్నావో, దేనిని కాల్చుచున్నావో, దేనిని ఇచ్చుచున్నావో, దేనిని తపము చేయుచుంటివో అన్నియు నాకే సమర్పించుము.


శ్లోకం :  28 (పరమాత్మ, కర్మయోగము)

భావము : ఈ ప్రకారముగ శుభాశుభ ఫలములగు కర్మ బంధములనుండి బయటపడినవాడు, సన్న్యాసయోగ యుక్తాత్ముడైన వాడు విముక్తిగల్గి నన్నే పొందును.


శ్లోకం :  29 (పరమాత్మ)

భావము : సముడనగుదు నేను సర్వ జీవరాసులకు. నాకు ద్వేషిలేడు మరియు ప్రియుడులేడు. భక్తితో ఎవరు కొలుతురో వారియందు నేను, నాయందు వారు కలరు.


శ్లోకం :  30 (జీవుడు, పరమాత్మ)

భావము : పెద్ద దురాచారపరుడైనప్పటికి నన్ను మనస్సులో భజించుట వలన, వాడు నిశ్చయముగ నన్ను తెలియదగినవాడు, కనుక వానిని సాధువని చెప్పవచ్చును.


శ్లోకం :  31 (జీవుడు, పరమాత్మ)

భావము : అట్టివాడు శీఘ్రముగ ధర్మాత్ముడై శాశ్వత శాంతిని పొందుచున్నాడు. నా భక్తుడు చెడిపోడని ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను.


శ్లోకం :  32 (పరమాత్మ)

భావము : పాపయోని సంభవులు, వైశ్య శూద్ర జనులు నన్నాశ్రయించి పరమ గతిని పొందుచున్నారు.


శ్లోకం :  33 (పరమాత్మ)

భావము : పుణ్యముచేసి పుట్టిన బ్రాహ్మణుల, రాజర్షుల గూర్చి వేరే చెప్పనవసరము లేదు. అనిత్యము అసుఖము గల గుణము (లోకము)లందున్నప్పటికి నన్ను భజించి నన్నే పొందుదురు.


శ్లోకం :  34 (సాకారము, నిరాకారము)

భావము : నీవు నా మీదనే మనస్సునుంచుము, నాకు భక్తునిగనుండుము. నన్నే నమస్కరించుము, నన్నే ఆరాధించుము. నా మీద ధ్యాస కల్గి ఆత్మతో కూడిన నన్నే పొందగలవు.


-------------

త్రైత సిద్ధాంత భగవద్గీత :  "9"  విభూతి యోగము  


శ్రీ భగవంతుడిట్లనియె : -

శ్లోకం 1: (జ్ఞానము)

భావము : దేనిని నేను ప్రీతితో నీ హితముకోరి చెప్పితినో మరల శ్రేష్ఠమైన ఆ మాటలనే వినుము.


శ్లోకం 2: (సాకారము)

భావము : దేవతలు, మహర్షులు నా ప్రభవమును తెలియరు. దేవతలకు, మహర్షులకు నేను ముందున్నవాడను, గొప్పవాడను.


శ్లోకం 3: (పరమాత్మ)

భావము : నాకు ఆది అనునదిలేదని, అట్లే పుట్టుకలేదని, లోకములకెల్ల మహేశ్వరుడనని ఎవడు తెలియునో వాడు మూఢత్వము నుండి బయటపడి సర్వ పాపములనుండి ముక్తి పొందును.


శ్లోకం 4: (పరమాత్మ)


శ్లోకం 5: (పరమాత్మ)

భావము : బుద్ధి, జ్ఞానము, నిర్మోహము, ఓర్పు, సత్యము, ఇంద్రియనిగ్రహము, సుఖము, దుఃఖము కలుగుట కలుగకుండుట, భయము, నిర్భయము, అహింస, సమదృష్ఠి, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి అనేక విధ భావములు జీవరాసులకు నావలననే కల్గుచున్నవి.


శ్లోకం 6: (పరమాత్మ)

భావము : మొదట ప్రపంచములో సప్త మహర్షలు, చతుర్ మనవులు నా సంకల్పము చేత తయారైనాయి. తర్వాత వాటి వలన సమస్త జీవరాసులను సృష్ఠించాను.


శ్లోకం 7: (పరమాత్మ)

భావము : నా మహత్యమును, యోగమును, ఆత్మను ఎవడు తెలియగల్గునో, వాడు చలనములేని నాలో కూడుకొనును. దీనియందు అనుమానము లేదు.


శ్లోకం 8: (పరమాత్మ)

భావము : నా వలననే సర్వము పుట్టుచున్నవి. నా వలననే సర్వము వర్తించుచున్నవి. ఈ విషయము తెలిసిన జ్ఞానులు, సమన్విత భావముతో నన్ను ఆరాధింతురు.


శ్లోకం 9: (పరమాత్మ)

భావము : నా భక్తులు చిత్తమును ప్రాణమును నాయందుంచి, నిత్యము నన్ను గూర్చిన విషయములను ఒకరికొకరు బోధించుకొనుచు తృప్తులై ఆనందముగ ఉందురు.


శ్లోకం 10: (పరమాత్మ)

భావము : ఎవడైతే ప్రీతికరముగ నన్నే ఆరాధిస్తు ఎల్లప్పుడు నాతో కూడుకొని ఉండవలెనని తలచునో, అట్టివానికి బుద్ధియోగము నేను కలుగజేయుచున్నాను. దానిచేత నన్ను తెలియగలరు, పొందగలరు.


శ్లోకం 11: (పరమాత్మ)

భావము : అట్టివారిని ఉద్ధరించుటకొరకు వారియందు ఆత్మగానున్న నేను జ్ఞాన దీపమును వెలుగజేసి అజ్ఞాన చీకటిని లేకుండ చేయుదును.


అర్జునుడిట్లనియె : -

శ్లోకం 12 - 15: ఈ మాటలువిన్న అర్జునుడు ఈ విధముగ అంటున్నాడు

భావము : పరబ్రహ్మవు, పరంధామము, పవిత్రుడవు, శ్రేష్ఠుడవు, పురుషుడవు, శాశ్వతుడవు,దివ్యుడవు, ఆది దేవుడవు, అజుడవు, విభుడవు అనుచు నారదుడు, అసితుడు, దేవలుడు, సప్తఋషులు, వ్యాసుడు చెప్పుచుండిరి. ఇపుడు నీవే స్వయముగ చెప్పగ వినుచున్నాము.  ఏది నాకు చెప్పితివో అదియంతయు సత్యమైనదని మనసులో తలచు చున్నాను. నీ యొక్క అసలు స్వరూపము దేవతలు, దానవులు కూడ తెలియలేకున్నారు.  సకల భూతములను సృజించువాడవు, సకల జీవులను పాలించు వాడవు, దేవతలకు దేవుడవు, జగమునకు భర్తవైన ఓ పురుషోత్తమా! నిన్ను నీవే తెలుసుకోగలవు.


శ్లోకం 16 - 18: భావము : ఏ మహిమల చేత ఎల్లలోకములను వ్యాపించివున్నావో, ఆ దివ్య మహిమలను సశేషముగ చెప్పుటకు నీవే అర్హుడవు.  నేను ఎల్లపుడు నీ చింతయే చేయుచు యోగినై నిన్ను తెలుసుకొనుట ఎట్లు? ఏయే భావముల నిన్ను చింతింపవలెనో తెలియచెప్పుము.  విస్తరించివున్న ఆత్మను, దానిని పొందు విధానమును, దాని మహిమను మరల చెప్పుము. ఆ అమృతవాక్కులు ఎన్నిమార్లు విన్నను తృప్తిలేదు.


శ్రీ భగవంతుడిట్లనియె : -

శ్లోకం 19: (పరమాత్మ, మహత్యములు)

భావము : నా విభూతులు (మహిమలు) అంత్యములేనట్టివి. వాటిలో ముఖ్యమైన కొన్నింటిని మాత్రము చెప్పెదను.


శ్లోకం 20: (పరమాత్మ, మహత్యములు)

భావము : నేను ఆత్మగవున్నవాడనై సర్వ జీవరాసులకు ఆధారముగనున్నాను. సర్వ జీవరాసులకు ఆదియు, మధ్యమును, అంత్యమును నేనే.

గమనిక : పరమాత్మ గొప్పతనమునుతెలియచేయు ఈ అధ్యాయములో సర్వము నేనే అను పరమాత్మ వాక్కును ఎన్నో విధములుగ వివరించి చెప్పడమైనది. ఎన్ని విధముల వివరించి చెప్పుకున్నను చివరకు మనకర్థమగునది పరమాత్మకు అతీతమైనదిగాని, పరమాత్మకు మినహాగాని ఏది లేదనుటయే. ఇక్కడ 21వ శ్లోకము నుండి 40వ శ్లోకము వరకు ఏకధాటిగ చెప్పిన విషయము కూడ అదియే. కావున మొత్తము 20 శ్లోకముల వరకు ఒకే విషయమైన దానివలన అన్నిటిని ఒక్కమారుగ కలిపి వ్రాయడము జరిగినది. శ్లోక శ్లోకము వేరువేరుగ వ్రాయక 21 నుంచి 40 వరకు వ్రాసి ఒకే భావము చెప్పడమైనదని గ్రహించాలి.


శ్లోకం 21- 40:

భావము : సూర్యులందరిలోన విష్ణువును నేను. ప్రకాశముగల జ్యోతులలో సూర్యుడను. వాయువులలో మరీచి వాయువును నేను, నక్షత్రములలో చంద్రుడను నేను. వేదములలో సామవేదమును, దేవతలలో దేవేంద్రుడను, ఇంద్రియములలో మనస్సును నేనే. జీవరాసులలోని చైతన్యము(ఆత్మ)ను నేనే. రుద్రులలో శంకరుడను, యక్షరాక్షసులలో కుబేరుడను నేనే. వసువులలో అగ్నిని నేనే, శిఖరములలో మేరు శిఖరమును నేను, పురోహితులందు బృహస్పతిని నేనని తెలియుము. సర్వ సేనాదులందు షణ్ముఖుండనగుదు, సరస్సులలో నేను సాగరుండనగుదు.  ఋషులలోన నేనగుదు భృగుమహర్షిని, శబ్దములలో ఓంకార శబ్దమునేను. యజ్ఞములందు నేను జ్ఞాన(జప)యజ్ఞమగుదును. పర్వతములలో హిమాలయమును అగుదు నేను.  25వ శ్లోకములో 'యజ్ఞానాం జపయజ్ఞోస్మి' అను వాక్యము కలదు. యజ్ఞములలో జపయజ్ఞము నేనని దీని అర్థము. అన్నిటిలోను పేరుపేరున గొప్పవాటినే చెప్పి అవియన్ని నేనన్నవాడు. ఇక్కడ యజ్ఞములన్నిటికంటే గొప్పదైన జ్ఞానయజ్ఞము నేననక జపయజ్ఞము నేనన్నాడు. ఇది నిజమా! అవి మనము ఆలోచించవలసివున్నది. ద్రవ్యయజ్ఞముకంటే జ్ఞానయజ్ఞమే శ్రేష్ఠమైనదని జ్ఞానయోగమను అధ్యాయములో తెలియజేసి ఆ శ్రేష్ఠమైన యజ్ఞము నేననక జపయజ్ఞమని చెప్పడమేమిటి? కావున ఇక్కడేదో పొరపాటు జరిగినదని తెలియుచున్నది. వాస్తవముగ అన్నిటియందు శ్రేష్ఠమైన వాటినే సూచించిన భగవంతుడు ఇక్కడ మాత్రము శ్రేష్ఠమైన జ్ఞానయజ్ఞమును వదలి జపయజ్ఞమని చెప్పివుండడు. శ్లోకములో జ్ఞానయజ్ఞము స్థలములో జపయజ్ఞమని పొరపాటుగ మారిపోయి ఉండవచ్చును. కావున అక్కడ జ్ఞానయజ్ఞమనియే చదువుకోవాలని కోరుచున్నాము. అన్నిటికంటే గొప్పది, కర్మ నిర్మూలణము చేయునది జ్ఞానయజ్ఞము. కావున 'యజ్ఞానం జ్ఞాన యజ్ఞోస్మి' అని తెలుసుకోవలెను.  సర్వ వృక్షంబులందు అశ్వర్థవృక్షమును, దేవర్షులందు నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిలమునిని నేను.  అశ్వములలో నేను ఉచ్ఛైశ్రవమును, అమృతములో బుట్టినందువలన ఏనుగులలో ఐరావతమును నేను. నరులలో రాజును నేను.  ఆయుధములలో వజ్రాయుధమును నేను, ఆవులయందు కామధేనువును. పుట్టించువారలలో కందర్పుడను, సర్పములలో వాసుకి సర్పమును నేనే అగుదును.  నాగులలో వేయి శిరస్సుల అనంతుడగుదును. జలచరములకు వరుణ దేవుడను, పితరులందు ఆర్యముడను. దండించువారిలో యముడను నేను.  రాక్షసులలో ప్రహ్లాదుడను, వేచివున్న వారికి కాలమును నేను, మృగములలో సింహమునేను. పక్షులలో వైనతేయుండను పక్షిని నేను.  వేగముగ చరించువారిలో గాలిని. శస్త్రములు ధరించిన వారిలో రామ చంద్రుడను, చేపలలో మొసలిని, పుణ్యజలములలో గంగానదిని నేను.  పుట్టెడు వాటికంతయు ఆది, మధ్య, అంత్యములు నేను. విద్యలయందు ఆధ్యాత్మిక విద్యనగుదును. వాదించువారి వాదము నేను.  అక్షరములలో 'అ ' కారమును, సమాసములలో ద్వంద్వసమాసమును, నాశనములలో అక్షయమును, విశ్వముఖుడైన విధిని నేనే.  ఎల్లవారిని సంహరించుటలో మృత్యువును. పుట్టువారికి భవిష్యత్తును, స్త్రీలలో లక్ష్మిని, కీర్తి, స్మృతి, మేధస్సు, ఓర్పు అన్నియు నేను.  సామగానంబులలో బృహత్సామమును, ఛందస్సులో గాయత్రిని, మాసములలో మార్గశిరమాసమును, ఋతువులలో వసంతఋతువును నేనే అయివున్నాను.  మోసములలో జూదము నేను. సర్వతేజస్సులందు తేజము నేను. సాత్త్వికులలోగల సత్యమును నేను. అట్లే ప్రయత్నించువారిలో ప్రయత్నమును, గెలుపొందువారిలో జయమును నేనే. యాదవులలో వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, సకల మునులలో వ్యాసమునిని, అట్లే సర్వకవులలో శుక్రకవిని నేనే.  దండన చేయువారి దండన నేనగుదు. రాజులలో రాజనీతియును రహస్యములలో మౌనమును, జ్ఞానులలోని జ్ఞానమును నేనేయగుదును.  సర్వజీవులకు బీజమునేను. నేను లేనట్టి జీవరాసి ఏదియులేదు. సర్వ చరాచర భూతములు నావలననే పుట్టును.  ఈ విధముగ చెప్పుచుపోతే నాశుభకరమైన విభూతులకు అంత్యము లేదు, కావున వర్ణింపనలవి కాదు. విస్తరించక ముఖ్యమైన వాటిలో కొన్నిటిని మాత్రము నీకు చెప్పితిని.


శ్లోకం 41: (పరమాత్మ)

భావము : సర్వ జీవరాసులందు మహిమగలది, శుభకరమైనది, పేరు పొందినదేది కలదో అది ఎల్ల నా తేజము వలన పుట్టినదేనని తెలియుము.


శ్లోకం 42: (పరమాత్మ)

భావము : అట్లు కాకున్న ఇన్ని విధములుగ నేను చెప్పి ఏమి ప్రయోజనము! నాయొక్క ఎన్నో అంశములలో ఒక్క అంశచేతనే జగత్తంతయునున్నదని తెలియుము.

---------

త్రైత సిద్ధాంత భగవద్గీత:  "10" విశ్వరూప సందర్శన యోగము  

అర్జునుడిట్లనియె : -


శ్లోకం 1: (ధర్మములు)

భావము : నన్ను అనుగ్రహించి నాకింతవరకు చెప్పిన విషయములు ఆధ్యాత్మములైనవి కావున నాలోని మోహమెల్ల సమసిపోయినది. 


శ్లోకం 2: (పరమాత్మ)

భావము : సర్వ జీవరాసులకు చావు పుట్టుకలు నీవలన కల్గుననియు, నీ మహిమ అవ్యయమైనదనియు విస్తారముగా ఇంత వరకు వింటిని.

 


శ్లోకం 3: (పరమాత్మ, నిరాకారము)

భావము : ఓ పురుషోత్తమా! నిన్ను గూర్చి నీవు చెప్పినదంతయు సత్యమగును. నీ విశ్వరూపమును చూడవలెనని నాకు కోరిక కల్గినది.    


శ్లోకం 4: (పరమాత్మ, నిరాకారము)

భావము : నీ ఆత్మ రూపమును నేను చూచుటకు అర్హుడనగుదునేని అవ్యయమైన ఆ రూపమును చూపుము.

    

శ్రీ భగవంతుడిట్లనియె : -


శ్లోకం 5-7: (పరమాత్మ, నిరాకరము)

భావము : అర్జునా! అనేక విధములైన, అనేక వర్ణములైన, అనేక ఆకారములైన నా దివ్యరూపమును వందలాదిగ, వేలాదిగ, అసంఖ్యాకములుగ చూడుము.  ఆదిత్యులును, వసువులును, రుద్రులును, అశ్వనీ కుమారులును, మరుత్తులును మొదలగువారిని చూడుము. ఎన్నో జన్మల పుణ్యము చేత కనిపించెడి ఆశ్చర్యమైన ఈ రూపము చూడుము.  సర్వ జగత్తు మరియు అందలి చరాచర జీవుల సమూహమును ఒక్కటిగ నా శరీరమందే ఉన్నట్లు చూడగలవు. ఇష్టమొచ్చిన దేనినైన నాయందే చూడుము.

    


శ్లోకం 8: (పరమాత్మ, నిరాకారము) 

భావము : అయితే నీకున్న కన్నులతో నన్ను చూచుటకు శక్యము కాదు. నీకు దివ్యమైన కన్నుల నిచ్చెదను. నాయొక్క ఈశ్వర స్వరూపము వాటిచే చూడుము.

    

సంజయుడిట్లనియె : - 


శ్లోకం 9-14:

అర్జునుడిట్లనియె : 

శ్లోకం 15-16: (నిరాకారము)

భావము : దేవదేవా! సర్వదేవతలను, సర్వజీవరాసుల సమూహములను, బ్రాహ్మణులను, ఈశ్వరులను మరియు పద్మాసనములో కూర్చున్న ఋషులను, గొప్పవైన ఎన్నో సర్పములను నీ దేహమందు చూచితిని.  ఓ విశ్వేశ్వర! విశ్వరూప! అనేకమైన చేతులు, కడుపులు, ముఖములు, కన్నులు కల్గి అంతట అనంతరూపమైన మరియు ఆది మధ్య అంతము లేని నిన్ను చూడగల్గితిని.


శ్లోకం 17:  (అశాస్త్రీయము)

భావము : విశ్వరూపమునకు ప్రత్యేకించి ఒక తల లేదు. అట్లే ప్రత్యేకించి రెండు చేతులు కూడ లేవు. అందువలన కిరీటము ధరించడము గద, చక్రముకల్గి వుండడమను మాట అశాస్త్రీయమై పోవుచున్నది. గద, చక్రము, కిరీటము దేవతలలోని విష్ణువుకుండవచ్చును. కాని విశ్వరూపమునకుండవు. విశ్వరూపమును, విష్ణురూపముగ గుర్తించునట్లుగ చేసిన ప్రయోగమే ఈ శ్లోకమని చెప్పవచ్చును. దేవతలలో గొప్పవాడైన విష్ణువుకు దేవతలకు దేవుడైన పరమాత్మకు చాలా దూర భేదమున్నదని తెలియాలి.  పైన 16వ శ్లోకములో అనేక బాహూదర వక్త్రనేత్రం అన్నపుడు దానికి వ్యతిరేఖముగ కిరీటినం గదినం చక్రిణంచ అని వ్రాయడము సరియగునా? అందువలన ఈ శ్లోకమును తీసివేయడము జరిగినది.    


శ్లోకం 18: (నిరాకారము)

భావము : నీవు అక్షరుడవు. తెలియదగిన పరము నీవే. విశ్వమునకు ఆధారమైన వాడవునీవే. శాశ్వతముగ అవ్యయుడవు. ధర్మరక్షకుడవు నీవే. పురాతనము నుంచి నీవే పురుషునిగ ఉన్నావని నేను తలచుచున్నాను.


శ్లోకం 19: (నిరాకారము)

భావము : మొదలు, నడుమ, చివరలేనివాడుగను. అనంత మగతనము గలవాడుగను. అనంత బాహువులు గలవాడుగను, సూర్యచంద్రులు కన్నులుగ ఉన్నవాడుగను, ప్రకాశించు అగ్నివలె ముఖముగలవాడుగను, స్వతేజస్సుచే జగతిని తపింప జేయువాడునుయైన నిన్ను చూడగలిగితిని.   


శ్లోకం 20: (నిరాకారము)

భావము : భూమికి, ఆకాశమునకు, వాటి రెండిటి మధ్యను మరియు దిశలకెల్లను వ్యాపించివుంటివి నీవు. చూచుటకు అద్భుతముగను భయంకరముగనున్న నీ ఆకృతిచే ముల్లోకములు భయపడుచున్నాయి.

    


శ్లోకం 21: (నిరాకారము)

శ్లోకం 22: (నిరాకారము)

భావము : దేవతా సమూహములు నీయందు ప్రవేశిస్తున్నారు. కొందరు భయముచే నిన్నుమ్రొక్కుచున్నారు. సిద్ధులైన మహర్షులు స్వస్తి చెప్పుచు సంతసమున స్తుతించుచున్నారు.


శ్లోకం 23: (నిరాకారము)

భావము : బహుముఖములు, నేత్రములు అనేకములైన బాహువులు, తొడలు, పాదములు గలదియును, అనేక భయంకరమైన కోరలుగల నీ ముఖము చూచుట వలన లోకులందరు భయముచెందినారు. మరియు నేనుకూడ భయపడి పోవుచున్నాను.


శ్లోకం 24: (నిరాకారము)


శ్లోకం 25: (నిరాకారము)

భావము : ఆకాశము వరకు వ్యాపించిన అనేక రంగులు గలవాడవు, తెరిచిన నోరు గలవాడవు, ప్రకాశించుచున్న విశాలనేత్రములు గలవాడవునైన నిన్ను చూచుటచే నాలో భయము, బాధకల్గుచున్నది. శాంతి, ధైర్యము లేకుండ పోయినది. భయంకరమగు కోరలుగల నీముఖము కాలాగ్నివలె కనిపించుచున్నది. దానిని చూచుట వలన దిక్కు తెలియలేదు. సౌఖ్యము తెలియలేదు.


శ్లోకం 26: (నిరాకారము)


శ్లోకం 27: (నిరాకరము)

భావము : ధృతరాష్ట పుత్రులగు దుర్యోధనాదులందరు, మిగతా రాజుల సమూహము, భీష్ముడు, ద్రోణుడు,కర్ణుడు ఇటువైపు మన యుద్ధవీరులైన ముఖ్యులు అందరు వేగముగ భయంకరముగనున్న నీ ముఖముల కోరలలో ప్రవేశించుచున్నారు. కొందరేమో కోరలమధ్య తగుల్కొని చూర్ణము చేయబడినవారై తలలు మాత్రము కనిపిస్తున్నవి.


శ్లోకం 28: (నిరాకారము)


శ్లోకం 29: (నిరాకారము)

భావము : ఏ విధముగ నదులన్ని సముద్రమువైపు అతివేగముగ ప్రవహిస్తు సముద్రములో పడుటకై ప్రయత్నిస్తున్నవో, అట్లే ఈ నరకంలోని వారందరు జ్వలించుచున్న నీ ముఖమువైపు పరుగిడుచు నీ ముఖములో ప్రవేశిస్తున్నారు. మండుచున్న అగ్నిలో మిడుతలు వేగముగ వచ్చి పడి కాలిపోయినట్లు, భూమి మీద జీవరాసులన్నియు ఆవిధముగనే వేగముగ నీ ముఖాగ్నిలో పడి మరణిస్తున్నాయి.

  

శ్లోకం 30: (నిరాకారము)


శ్లోకం 31: (నిరాకారము)

భావము : మండుచున్న ముఖములచేత సమస్త జీవరాసులను మ్రింగుచున్నవాడవై సమస్తమును ఆస్వాధించుచున్నావు. నీ యొక్క కిరణములు జగత్తంతయు వ్యాపించి తపింపజేయుచున్నవి. ఉగ్రరూపుడవు నీవు ఎవడవో నాకు చెప్పుము. నీ ప్రవృత్తి నాకు తెలియకున్నది. ఆది పురుషుడైన నిన్ను నమస్కరించి తెలియకోరుచున్నాను.

    

పరమాత్మ ఇట్లనియె : -

శ్లోకం 32: (పరమాత్మ)

భావము : లోకములోని జీవులను నశింపచేయు బలమైన కాలమును నేను. జీవులను సంహరించుటే నా పని. ఇపుడు నీవు లేకపోయినను యుద్ధము చేయక పోయినను వీరు సంహరింపబడుదురు.

    

శ్లోకం 33: (పరమాత్మ)


శ్లోకం 34: (పరమాత్మ)

భావము : కనుక శత్రువులను జయించుటకు లెమ్ము. వారు ఇంతవరకే నాచే సంహరింపబడిన వారుగనున్నారు. నీవు నిమిత్తమాత్రముగ యుద్ధము చేసి జయించిన కీర్తియు, రాజ్యమును పొందుము.  ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు మొదలగు యుద్ధవీరులందరు నాచేత సంహరింపబడివున్నారు. నీవు యుద్ధము చేయకున్నను వారు జీవించివుండరు.అని పరమాత్మ అన్న మాటలు విని అర్జునుడిట్లనసాగెను.


సంజయుడిట్లనియె : -

శ్లోకం 35: (కల్పితము )  


అర్జునుడిట్లనియె : 

శ్లోకం 36: (నిరాకారము)


శ్లోకం 37: (నిరాకారము)

భావము : ఓ పరమాత్మ! నీ మహిమా కీర్తిని విని జగత్తంతయు సంతోష మందునుండగ, రాక్షసులు భయపడి దిక్కులకు పరుగిడుచున్నారు. సిద్ధులెల్లరు నమస్కరించుచున్నారు. బ్రహ్మకు కూడ ఆదికర్తవైన, మహాత్ముడైన నిన్ను ఎందుకు నమస్కరింపకుందురు. దేవదేవ! జగన్నివాస! నీవే ఆ అక్షరము మరియు సత్తు, అసత్తు, వాటికి వేరుగనున్న వాడు అన్నియు నీవేయగుదువు.

   


శ్లోకం 38: (నిరాకారము)

భావము : ఓ కృష్ణా! ఆది దేవుడవు, పురాణ పురుషుడవు, విశ్వమయుడవు, పరమ పదముడవు, తెలిసినవాడవు, తెలియదగినవాడవు అన్నియు నీవే.

    

శ్లోకం 39: (నిరాకారము)

    

శ్లోకం 40: (నిరాకారము)

భావము : మ్రొక్కువాడనుముందు, మ్రొక్కవాడను వెనుక, మ్రొక్కువాడను సర్వ దిక్కులందు, అమిత పరాక్రమవంతుడవు మరియు అమిత మగతనముగల వీర్యుండవు. సర్వమునకు వ్యాపించిన వాడవగుట వలన సర్వము నీవేయగుదువు.


శ్లోకం 41 - 42: (సాకారము)

భావము : సఖుడవని తలచి వినయవిధేయతలు లేకుండ, నీ మహత్యము తెలియక ఓయి సఖా! ఓయి మాధవ! ఓయి కృష్ణా అని విహరించునపుడు, పరుండునపుడు, కూర్చుండునపుడు, భోజనము చేయునపుడు, ఒంటరిగనున్నపుడు ఇతరుల ఎదుట ఎగతాళిగ మాట్లాడినవన్నియు క్షమించవలయును.

    


శ్లోకం 43: (సాకారము)

భావము : చరాచర జీవరాసులకు తండ్రివియును, పూజ్యుడవును, గురుడవును నీవే. దేవదేవ! ముల్లోకములందు నీకు సమానమైన వారెవ్వరులేరు. అందరికంటే నీవే అధికుడవు.


శ్లోకం 44: (నిరాకారము)

భావము : అందువలన నీకు సాష్టాంగనమస్కారము చేయుచు పూజార్హుడైన ఈశ్వరుడైన నిన్ను ప్రసన్నుడవగుమని ప్రార్థించుచున్నాను. ఓ దేవదేవ! కుమారునికి తండ్రివలె, మిత్రునికి మిత్రునివలె, ప్రియురాలికి ప్రియుడువలె నన్ను మన్నించుటకర్హుడవు.

   

శ్లోకం 45: (సాకారము, నిరాకారము)

భావము : ముందెప్పుడు చూడని అదృష్టపూర్వమైన ఈ రూపము చూచి మొదట సంతోషము కల్గినది. అయినను ఇప్పుడు మనస్సులో భయము కల్గుచున్నది. దేవదేవ నీవు ప్రసన్నుడవై, మొదటి సౌమ్యమైన ఆకారమునే చూపుము.

    


శ్లోకం 46: (అశాస్త్రీయము)

భావము : ఈ అధ్యాయములో 17వ శ్లోకము ఇక్కడ 46వ శ్లోకము రెండునూ అశాస్త్రీయ శ్లోకములే. ఇవి కల్పిత శ్లోకములని తెలియాలి. ఎందుకనగ విశ్వరూపమునకు పరిమితిగ చేతులు లేవు. అట్లే శ్రీకృష్ణునకు నాల్గు చేతులు లేవు. సాధారణ మనిషిగనున్న శ్రీకృష్ణునికి నాల్గు చేతులున్నాయనుట ఎంత సమంజసము. అలా నాల్గుచేతులుంటే విశ్వరూపము చూపి నేను దేవుడనని చెప్పుకోవలసిన అవసరముండదనుకుంటాము. నాల్గు చేతులుంటేనే చెప్పకనే దేవుడని ప్రజలే పూజించెడివారు. అపరిమిత అసంఖ్యాకములైన చేతులు విశ్వరూపమునకుండగ కేవలము వేయి చేతులని చెప్పడమేమిటి? అనేక సంశయములతో కూడుకొని ఎటుచూసిన శాస్త్రబద్దమైన జవాబు దొరకని శ్లోకములను ఈ గీతలో బయటికి నెట్టివేయడము జరిగినది. ఇది శాస్త్రమను జలముచే కడగబడిన గీత. ఎన్నో భావములు సవరింపబడిన గీత. దీనిని అసూయతో అడ్డముగ మాట్లాడువారు తప్ప అందరు సమ్మతింపతగినదని తెలియజేయుచున్నాము.

   

పరమాత్మ ఇట్లనియె : -


శ్లోకం 47: (నిరాకారము)

భావము : నా యొక్క ప్రసన్నముచేత మొదటిదైన విశ్వవ్యాపకమైన, తేజస్సుచే కూడిన నా శ్రేష్ఠమైన రూపము చూపబడినది. పూర్వమునుండి ఇంతవరకు నీవు తప్ప ఇతరులెవరు దీనిని చూచిన వారులేరు.

శరీరముతో ఉన్న కర్మయోగి కాని, బ్రహ్మయోగి కాని, పరమాత్మ ఆకృతిని తెలియలేరు. బ్రహ్మయోగులు మాత్రము తమ శరీరములోని ఆత్మను వారి మనోనేత్రముచే చూడగల్గినను పరమాత్మను చూడలేరు. బ్రతికివున్నవారెవరు పరమాత్మను చూడలేరనియే చెప్పవచ్చును. అర్జునునికి పరమాత్మయే స్వయముగ కల్పించిన అవకాశము వలన చూడగలిగాడు. అటువంటి అవకాశమెవరికైన వస్తే తప్ప చూడలేరనియే చెప్పవచ్చును. సృష్ఠ్యాదినుండి ఎవరూ చూడని రూపు నీవు చూడగల్గితివని పరమాత్మ అనడము వలన అది ఎవరికీ సాధ్యము కానిదని తెలియుచున్నది. పరమాత్మ ఇలా ఉన్నాడని తెల్పునిమిత్తము ఒకమారు అర్జునుని అడ్డము పెట్టుకొని బహిర్గతము చేసినదని తెలియవలెను. పరమాత్మ రూపము పరమాత్మ తెలుపవలసిందే కాని వేరెవరిచేత కాదని తెలియవలెను. అర్జునునికి పరమాత్మ అనుగ్రహముతో కల్గిన దానివలన మనకు కొంత అర్థమైనదని అనుకొందాము.

    

శ్లోకం 48: (నిరాకారము)

భావము : వేదములచేతకాని, యజ్ఞములచేతకాని, దానములచేతకాని, ఉగ్రతపస్సుల చేతకాని ఈ రూపముగల నన్ను తెలియజాలరు. జగతిలో నీవు తప్ప నన్ను చూచినవారు ఎవరు లేరు.


శ్లోకం 49: (సాకారము, నిరాకారము)

భావము : ఈ భయంకర రూపమును నీవు చూచి భయము చెందకు, విమూఢ భావములను పొందకు. నీకు ప్రీతి కలుగుటకు, భయము వీడిపోవుటకు మొదటి సౌమ్యముగనున్న రూపునే చూపుచున్నాను చూడుము.

   

సంజయుడిట్లనియె : -

శ్లోకం 50: (కల్పితము )    

అర్జునుడిట్లనెను : -

శ్లోకం 51: (సాకారము)

భావము : ఓ కృష్ణా! మనుజరూపమున నీ సౌమ్య స్వభావ ఆకృతినిగని నా అంతరంగమందు స్వస్థత చేకూరెను. మనసు నిలకడకల్గెను.    


శ్రీ భగవంతుడిట్లనియె : -

శ్లోకం 52: (నిరాకారము)

భావము : అర్జునా! నీవు చూచిన బ్రహ్మాండమైన రూపము ఇతరులు చూచుట దుర్లభము. దేవతలెందరో నా దివ్యాకృతిని చూచుటకు ఎల్లప్పుడు కాంక్షకల్గియున్నారు.

    

శ్లోకం 53: (నిరాకారము)

భావము : నీవు నన్ను ఎట్లు చూచియున్నావో ఆ దర్శనము దొరకవలెనన్న వేదములచేతను, తపస్సుల చేతను, దానములచేతను మరియు యజ్ఞముల చేతను శక్యము కాదు.


శ్లోకం 54: (పరమాత్మ, బ్రహ్మయోగము)

భావము : అర్జునా! నా ఆత్మను తెలియుటకు, చూచుటకు, ప్రవేశించుటకు అనన్యమైన భక్తిచేతనే సాధ్యమగుదును.

  

శ్లోకం 55: (భక్తియోగము, బ్రహ్మయోగము, కర్మయోగము)

భావము : ఎవడు నాకర్మలనే ఆచరించుచున్నాడో, ఎవడు నా స్థానమునే ముఖ్య గతిగా తలంచుచున్నాడో, ఎవడు సంగవర్జితుడో, ఎవడు సర్వభూతములందు వైరము లేనివాడై బ్రహ్మయోగియై ఉన్నాడో అతడు నన్ను పొందగలడు.

--------------

త్రైత సిద్ధాంతభగవద్గీత : "11" భక్తి యోగము    


అర్జునుడిట్లనియె :-

శ్లోకం|| 1 : (బ్రహ్మ, కర్మ, భక్తి యోగములు).

భావము : ఆ విధముగ ఎల్లపుడు ఆత్మతో కూడుకొన్నవాడు, భక్తితో నిన్ను ఉపాసించువాడు, కనిపించని నాశనములేని స్థానమును గురించి ఉపాసించువాడు గలరు. వీరిలో బాగా యోగము తెలిసిన వారు ఎవరు?.


శ్రీ భగవంతుడిట్లనియె :-

శ్లోకం|| 2 : (బ్రహ్మ, కర్మ, భక్తియోగములు).

భావము : పరమశ్రద్ధ కల్గినవారై నాయందు మనస్సునుంచి, నిత్యము నాతో యుక్తము కోరి ఉపాసించువారందరు ఉత్తమయోగులని నా ఒప్పుదల.


శ్లోకం|| 3: (మోక్షము).


శ్లోకం|| 4: (బ్రహ్మయోగము).

భావము : అక్షరమైనది, నిర్ధేశింపబడనిది, కనిపించనిది, ఆలోచనకందనిది, కూటస్థమైనది, అచలమైనది, శాశ్వతమైనది, అంతట వ్యాపించినదియైన పరమాత్మను ఉపాసించువారు.

ఇంద్రియములను నిగ్రహించి, అన్నిటియందు బుద్ధి సమముచేసి, సర్వభూత హితులైన వారు నన్ను పొందగల్గుదురు.


శ్లోకం|| 5 : (బ్రహ్మయోగము).

భావము : అట్లు ఆత్మను ఉపాసించునట్టి బ్రహ్మయోగులు అనుసరించు మార్గము చాలా కష్టమైనది పార్థ! ఇంద్రియములకు తెలియని ఆత్మను పొందుట అతి కష్టమైన మార్గమని తెలియుము.


శ్లోకం|| 6: (కర్మయోగము).

భావము : ఎవరైతే సర్వకర్మలు నాకే సమర్పణమొనర్చారో, వారు ఇతర ఏ కర్మలు అంటని రీతిలో కర్మయోగంబొనర్చి నన్ను ఉపాసించుచున్నారు.


శ్లోకం|| 7 : (భక్తి యోగము).

భావము : నాయందే వారి మనస్సును లగ్నము చేసివున్న నాభక్తపరులు కలరు. నేను శీఘ్రముగ వారినందరిని మృత్యు సంసార సముద్రమునుండి బయటపడ వేయుచున్నాను.


శ్లోకంకములలో బ్రహ్మయోగము, కర్మయోగము, భక్తియోగము మూడు చెప్పబడినవి. ఈ మూడు విధానములననుసరించి వారిని తప్పక మృత్యుమయమై సారములేనిదైన జన్మకర్మల జలమయమైన సముద్రము నుండి బయటపడవేతును. మోక్షమునిస్తునని పరమాత్మ తెలిపాడు.


శ్లోకం|| 8 : (బ్రహ్మయోగము).


శ్లోకం|| 9 : (బ్రహ్మయోగము).

భావము : నాయందే మనసునుంచి ఎల్లపుడు నన్నే తలచుచుండుము. నాయందే బుద్ధినుంచుము. ఆ తరువాత నన్నే పొంది నాయందే నిలుతువు. ఈ విషయములో అనుమానము లేదు. నీ చిత్తమును స్థిరరీతి నాయందు నిలుపశక్తిలేని ఎడల ఓ అర్జునా! అట్టి శక్తి అభ్యాసయోగమున పొందగలవు.


శ్లోకం|| 10 : (భక్తియోగము).

భావము : మనస్సు నిల్పు అభ్యాసమునకు సమర్థత లేనివాడవైతే నా పనులు చేయుము. నా కొరకు పనులు చేయుట వలన మోక్షమును పొందవచ్చును.


శ్లోకం|| 11 : 

(కర్మ యోగము).

భావము : భక్తియోగము చేత నాపనులు చేయుటకు కూడ సామర్థ్యములేని వాడవైతే అఖిల కర్మఫలత్యాగివగుము. అట్టికర్మ యోగమున నన్ను పొందగలవు.


శ్లోకం|| 12 : (బ్రహ్మ, కర్మ యోగములు).

భావము : అభ్యాసముకంటే జ్ఞానము మేలు, ధ్యానము జ్ఞానముకంటే గొప్పది, ధ్యానమును మించినది కర్మఫలత్యాగము. మనిషికట్టి త్యాగముచే శాంతికల్గును.


శ్లోకం|| 13 : (కర్మయోగము).


శ్లోకం|| 14: (కర్మయోగము).

భావము : సర్వ జీవరాసులందు ద్వేషములేక, కరుణ స్నేహముకల్గి, మమత విడిచి, అహంకారములేకుండ, కల్గెడి సుఖదుఃఖములను సమముగ చూచుచు, ఓర్పుకల్గి వుండువాడు, ఎల్లపుడు సంతృప్తికల్గిన కర్మయోగియై మనోబుద్ధియందు మోక్షము పొందవలెనను దృఢనిశ్చయము కల్గివుండు భక్తునియందు నాకధిక ప్రేమ.


శ్లోకం|| 15: (బ్రహ్మయోగము).

భావము : అర్జునా! ఎవని వలన ప్రపంచమునకు భయములేదో, ప్రపంచముచే ఎవడు భయపడడో, వాడు కోపమును, భయమును, సంతోషమును మనో వ్యాకులతను పొందడు, వాడే నాకు పరమప్రియుడు.


శ్లోకం|| 16: (బ్రహ్మయోగము).

భావము : దేనియందు ఆశలేనివాడును, మనో శుభ్రతకల్గినవాడును, పట్టుదల కల్గిన వాడును, ఎవరి పక్షము లేనివాడు, దేనిని ఆరంభించక వదలివేసిన బ్రహ్మయోగి అయిన భక్తుడు నాకధిక ప్రియుడు.


శ్లోకం|| 17: 

(కర్మయోగము).

భావము : సంతోషపడక అట్లే దుఃఖమును పొందక, ద్వేషమందక, అభిలాషియు కాక, మంచిచెడు పుణ్యపాపములను పొందక, వాటిని పరిత్యజించినవాడు ఎవడో వాడు నాకు మిగులప్రియుడు.


శ్లోకం|| 18: (బ్రహ్మ, కర్మయోగములు).


శ్లోకం|| 19: (కర్మయోగము).

భావము : మిత్రులయందు, శత్రువులయందు, మానావమానములందు, శీతోష్ణ సుఖదుఃఖములందు సమతకల్గినవాడు, పాపపుణ్యములను సమానముగ వర్జితము చేసినవాడు, స్థుతియు, నిందయు సమముగ తలచి దొరికిన దానితో తృప్తిచెంది గృహములు మొదలగు నివాసస్థలముల మీద ఆశలేని స్థిర మనస్కుడగువాడు నాకు ప్రియుడు.


శ్లోకం|| 20: (బ్రహ్మ, కర్మయోగములు).

భావము : ఎవరు నా పరమపదము మీద శ్రద్ధగలిగి, ఈ మృతములేని ధర్మము లను ఏ విధముగ చెప్పియున్నారో, ఆ విధముగ ఉపాసించు భక్తుడు నాకు పరమప్రియుడు.

---------------

త్రైత సిద్ధాంత భగవద్గీత : "12" క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  


అర్జునుడిట్లనియె :-

శ్లోకం 1 

(ప్రకృతి, పురుషుడు)

భావము : ఓ కృష్ణా! ప్రకృతి అనగా ఏది? పురుషుడెవడు? క్షేత్రము అనగానేది? క్షేత్రజ్ఞుడెవడు? జ్ఞానమేది? జ్ఞేయమైనదేది? వీటన్నిటిని తెలియవలెనని కోరిక కల్గినది తెలియజెప్పుము.


శ్రీ భగవంతుడిట్లనియె :-

శ్లోకం 2 

(ప్రకృతి, పురుషుడు)

భావము : అర్జునా! ఈ శరీరమే క్షేత్రమని చెప్పబడుచున్నది. దీనిని పూర్తిగ ఎవడు తెలిసివున్నాడో వానిని జ్ఞానులైనవారు క్షేత్రజ్ఞుడని చెప్పుచున్నారు.


శ్లోకం 3 

(ప్రకృతి, పురుషుడు)

భావము : సర్వ శరీరములందున్న క్షేత్రజ్ఞుడను నేనేయని తెలియుము. శరీరమును అందులోని ఆత్మను తెలుపు జ్ఞానమే నిజమైన జ్ఞానమని నా భావము.


శ్లోకం 4 

(ప్రకృతి, పురుషుడు)

భావము : అట్టి క్షేత్రమేదియో, అది ఎట్టిదగునో, దానికేవికారములుగలవో, ఆ వికారములు దేనినుండి పుట్టుచున్నవో, ఎవడు క్షేత్రజ్ఞుడో, వానికేమి ప్రభావములున్నవో వాటిని క్లుప్తముగ చెప్పెదను వినుము.


శ్లోకం 5 

(ప్రకృతి, పురుషుడు)

భావము : ఋషుల వలనను, వేదములవలనను, హేతువులతో సిద్ధాంతము చేయబడిన బ్రహ్మసూత్రముల వలనను, నిర్ణయింపబడి శరీరము మరియు ఆత్మ యొక్క విషయములు చెప్పబడివున్నవి. పెద్దలందరు నిర్ణయించిన జ్ఞానము తెలుసుకొందాము.


శ్లోకం 6 


శ్లోకం 7 

(ప్రకృతి)

భావము : గొప్ప భూతములైన జీవాత్మ, ఆత్మయును, అవ్యక్తమైన బుద్ధి, అహము మొదలగునవియు, ఒకటిగనున్న పది ఇంద్రియములు, అగోచరమైన ఐదు ఇంద్రియములు. ప్రేమ, అసూయ, సుఖదుఃఖము, ధైర్యము, భయము, శ్రద్ధ, అను చేతనమైన సంఘము. ఎన్నో వికారములు గలదిగ ఈ శరీరక్షేత్రము చెప్పబడివున్నది.


శ్లోకం 8 -12 

(జ్ఞానము)

భావము : గర్వ దంభములనునవి కలుగకుండ, శాంతి నిష్కపటము, అహింస కలిగి, సద్గురువులను పూజించుచు, ధైర్యము ఆత్మనిగ్రహముకల్గి ఇంద్రియముల మీద ఆసక్తి లేక, నేనను అహంకార భావము లేకుండ, జన్మ, మృతి, ముసలితనము, రోగము, దుఃఖము వచ్చునవి, పోవునవిగ తలచుకొనుచు, భార్యాపుత్రులందు ప్రేమలేకుండ గృహము, భూమి మొదలగు వాటిమీద ఆసక్తి లేక, నిత్యము సంభవించెడి ఇష్టాఇష్టములందు, కష్టసుఖములందు సమచిత్త్వము కల్గి, వ్యభిచరింపని భక్తికల్గి, అనన్యమైన యోగము చేయుచు, మనుషులులేని స్థలములో ఉండుటకు ఇష్టపడుచు, జనసమూహములందు ఇష్టములేనివాడై ఆధ్యాత్మిక జ్ఞానమును నిత్యము కల్గి, ఆత్మను జ్ఞానముచేత తెలియగోరినవాడై ఉండవలెను. దానినే జ్ఞానమని అట్లుకాని అన్యమంతయు అజ్ఞానమని తెలియవలెను.


శ్లోకం 13 

(పరమాత్మ)

భావము : ఏది జ్ఞేయమో దానిని చెప్పెదను. దానిని తెలియుట వలన అమృతమును పొందవచ్చును. అది అనాది, మత్పరము, బ్రహ్మము. దానిని సత్తనియు, అసత్తనియు పిలువకూడదు.


శ్లోకం 14 

(పరమాత్మ)

భావము : అందరియందు కాళ్లు, చేతులు, కన్నులు, ముఖము, చెవులు కల్గి పరమాత్మ అంతట వ్యాపించివున్నది.


శ్లోకం 15 

(పరమాత్మ)

భావము : పరమాత్మ సర్వేంద్రియముల గుణములలో ప్రకాశించునదియైయుండి సర్వేంద్రియములు లేనిదిగనున్నది. అన్నిటిని భరించునదైయుండి ఏది లేనిదని, అన్ని గుణములను అనుభవించునదై ఏ గుణములేనిదని చెప్పవచ్చును.


శ్లోకం 16 

(పరమాత్మ)

భావము : చర అచర ప్రపంచముగ జీవరాసుల లోపల బయట పరమాత్మ ఉన్నది. అది సూక్ష్మమగుటచే తెలియబడునది కాదు. దూరముగ మరియు దగ్గరగనున్నదని తెలియుము.


శ్లోకం 17 

(పరమాత్మ)

భావము : పరమాత్మ విభజింపబడక ఒక్కటైయున్నను, జీవరాసులలో విభజింపబడి ఉన్నది. సమస్త జీవులను భరించునదియు, సమస్త జీవులను లయము చేయునదియు, సమస్త జీవులను పుట్టించునదియై ఉన్నది.


శ్లోకం 18 

(పరమాత్మ)

భావము : పరమాత్మ ప్రకాశించెడి వాటికి ప్రకాశమైయున్నది. అజ్ఞానమున కంటే వేరైనది. జ్ఞానము జ్ఞేయమైనది. సర్వజీవరాసుల హృదయములో జ్ఞానగమ్యమైయున్నది.


శ్లోకం 19 

(ప్రకృతి, పరమాత్మ)

భావము : ఈ విధముగ క్షేత్రమును, అట్లే జ్ఞానమును, జ్ఞేయమును సంగ్రహముగ చెప్పబడినది. నా భక్తులు దీనిని బాగుగ తెలిసినవారై నన్ను పొందుటకు అర్హులగుదురు.


శ్లోకం 20 

(ప్రకృతి, పరమాత్మ)

భావము : ప్రకృతి, పురుషులు రెండును ఆదిలేనివని తెలియుము. గుణవికారములెల్ల ప్రకృతినుండి పుట్టినవేనని తెలియవలయును.


శ్లోకం 21 

(ప్రకృతి, జీవాత్మ)

భావము : కార్య కారణములను కలుగజేయుటయందు ప్రకృతి హేతువుగనున్నది. పురుషుడు సుఖదుఃఖములనుభవించుటకు కారణభూతునిగ ఉన్నాడని చెప్పవచ్చును.


శ్లోకం 22 

(ప్రకృతి, జీవాత్మ)

భావము : పురుషుడు ప్రకృతియందున్నవాడై ప్రకృతి సంభవములైన గుణములను అనుభవించుచున్నాడు. గుణములతో సంబంధపడియున్న కారణమువలన మంచి చెడు యోనులయందు జన్మించుచున్నాడు.


శ్లోకం 23 

(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)

భావము : దేహము ధరించిన పురుషుడు దేహమునందు సాక్షీభూతునిగను అనగ ఆత్మగను, సమ్మతించువాడైన జీవునిగను, భరించు భర్తగనున్న పరమాత్మగను, అనుభవించు జీవునిగను, మహేశ్వరుడుగను, ఆత్మగను, పరమాత్మగను చెప్పబడుచున్నాడు.


శ్లోకం 24 

(ప్రకృతి, పురుషుడు)

భావము : ఎవడైతే ఈ ప్రకారముగ పురుషులను, ప్రకృతిని, గుణములను తెలుసుకొన్నాడో, వాడు ఎల్లపుడు అన్ని విషయములలో వర్తించుచున్నప్పటికి తిరిగి జన్మించడు.


శ్లోకం 25 


శ్లోకం 26 

(జీవుడు, మోక్షము)

భావము : మృత్యువును జయించి మోక్షము పొంది పరమాత్మయందు ఐక్యమగుటకు, కొందరు పరమాత్మ సాకారరూపమును ధ్యానించు భక్తియోగము కల్గియుందురు. మరికొందరు బ్రహ్మయోగముననుసరించి ఆత్మదర్శనమును చేసుకొనుచుందురు. ఇంకా కొందరు కర్మయోగమును అనుసరించుచుందురు. ఈ విషయములు తెలియనివారు ఇతరులవలన విని, వారు చెప్పిన ప్రకారము ఉపాసనచేసి సాఫల్యమును పొందుచున్నారు.


శ్లోకం 27 

(ప్రకృతి, పురుషుడు)

భావము : స్థావర జంగమమైన జంతువేది పుట్టిన, అట్లే ఏకించిత్ వస్తువు పుట్టిన అది క్షేత్రక్షేత్రజ్ఞుల కలయికతోనే పుట్టుచున్నదని తెలియవలెను.


శ్లోకం 28 

(పరమాత్మ)

భావము : సర్వజీవరాసులందు సమానముగ నివాసముండు పరమాత్మను, సమస్తము నాశనమైనప్పటికి నాశనముగాని వానిగ ఎవడు చూచునో వాడే చూచినవాడగును.


శ్లోకం 29 

(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)

భావము : సమస్త ప్రాణులందు సమముగ నివశించు పరమాత్మను సమముగ చూచువాడు, ఆత్మచేత ఆత్మను హింసించడు. అందువలన అతడు ఉత్తమగతిని (మోక్షము) పొందును.


శ్లోకం 30 

(ప్రకృతి, పరమాత్మ)

భావము : అన్ని విధముల కర్మలు వాటి పనులు ప్రకృతిచేతనే జరుపబడుచున్నవని, పరమాత్మ అకర్త అనియు తెలిసినవాడే నిజమును తెలిసినవాడు.


శ్లోకం 31 

(పరమాత్మ)

భావము : భూత భేదంబులన్నియు పరమాత్మ ఒక్కనివేయని, పరమాత్మవలననే అన్ని విస్తరింపబడుచున్నవని ఎప్పుడు తెలియునో అప్పుడు పరమాత్మనే పొందుచున్నాడు.


శ్లోకం 32 

(పరమాత్మ)

భావము : అనాదియు, నిర్గుణుడును, అవ్యయుడును అయిన పరమాత్మ శరీరమందున్నప్పటికి కర్మలు చేయడు, కర్మలనంటడు.


శ్లోకం 33 

(పరమాత్మ)

భావము : ఏ విధముగ అంతట వ్యాపించి అన్నిటిని తాకియున్న ఆకాశము సూక్ష్మమగుట వలన దానినేది అంటనట్లు, అట్లే సర్వదేహములందు వ్యాపించి తాకియున్న పరమాత్మను ఏవిగాని అంటకున్నవి.


శ్లోకం 34 

(పరమాత్మ)

భావము : సూర్యుడొక్కడీ లోకమునంతటిని ఎట్లు ప్రకాశింపజేయకల్గుచున్నాడో అట్లే పరమాత్మ సమస్త క్షేత్రములను, క్షేత్రజ్ఞులను ప్రకాశింపజేయుచున్నాడు.


శ్లోకం 35 

(ప్రకృతి, పురుషుడు)

భావము : జ్ఞాననేత్రముచేత క్షేత్రము, క్షేత్రజ్ఞులను, వాటి భేదములను, జీవరాసులను, ప్రకృతిని, మోక్షమును ఎవరు తెలియగల్గుచున్నారో, వారు పరమ పదమును పొందగల్గుచున్నారు.


----------------------------------------------------------------------------------------------------------------

త్రైత సిద్ధాంత భగవద్గీత : "13" గుణత్రయ విభాగ యోగము  


శ్లోకము  1 

(జ్ఞానము)

భావము : ఏ జ్ఞానమును తెలుసుకొని మునులందరు శ్రేష్ఠమైన మోక్షమును పొందియున్నారో, అట్టి జ్ఞానములలోకెల్ల ఉత్తమమైన జ్ఞానమును మరల చెప్పుచున్నాను.


శ్లోకము  2 

(జ్ఞానము)

భావము : ఈ జ్ఞానమును తెలిసి ఉపాసించినవారు, నా పరమపదమును పొందిన వారై సృష్ఠికాలములో పుట్టరు. మరియు ప్రళయ కాలములో బాధపడరు.


శ్లోకము  3 

(ప్రకృతి, పరమాత్మ)

భావము : నా యోని పెద్దదైన విశాలమైన ప్రకృతి, దానిని నేను గర్భము ధరించునట్లు చేయుచున్నాను. దానినుండి సర్వభూతముల పుట్టుకలు కలుగుచున్నవి.


శ్లోకము  4 

(ప్రకృతి, పరమాత్మ)

భావము : సర్వయోనులందు పుట్టుచున్న అనేక రకముల ఆకారములు గల జీవరాసులకు ప్రకృతి తల్లికాగ, భీజదాతనైన నేను తండ్రినగుదును.


శ్లోకము  5 

(జీవుడు, మూడు గుణములు)

భావము : ప్రకృతి చేత పుట్టిన సత్త్వ రజస్తమ అను గుణములు దేహములో నాశనముకాని జీవాత్మను బంధించుచున్నవి.


శ్లోకము  6

(జీవుడు,సాత్త్వికము)

భావము : మూడు భాగములలో సాత్త్విక గుణభాగములో గల గుణములు నిర్మలత్వము ప్రకాశత్వము కల్గి ప్రయాసలేనివై, సుఖములందాసక్తి కల్గించునవై ఉండి జ్ఞానసుఖములలోనే బంధించును.


శ్లోకము  7

(జీవుడు, రాజసము)

భావము : రాజస గుణ భాగములోని గుణములు ప్రపంచ విషయములందు ప్రీతిని కలుగజేయునవై, వాటియందు ఆసక్తి ఆశను పుట్టించునవై, ఆ పనులందే తగులుకొనునట్లు చేసి జీవున్ని బంధించుచున్నవి.


శ్లోకము  8

(జీవుడు, తామసము)

భావము : తామస గుణ ఆవరణములో ఉన్న గుణములు అజ్ఞానమును కలుగజేయునవై, మోహమును పుట్టించునవై ఉన్నవని తెలియుము. అంతేకాక ప్రమాదముతో కూడుకొన్న మజ్జుతనము, నిద్రలయందే జీవున్ని బంధించి పెట్టుచున్నవి.


శ్లోకము  9

(జీవుడు, మూడు గుణములు)

భావము : సాత్త్విక గుణభాగము యొక్క గుణములు సుఖములందాసక్తి కల్గించగ, రాజసగుణభాగములోని గుణములు ఆశను కల్గించి లాభము కొరకు పనులు చేయించగ, తామస ఆవరణములోని గుణములు జ్ఞానమును కప్పివేసి ప్రమాదాలచే ముప్పునుకలుగ చేయు పనులందే ఆసక్తి కల్గించి చేయించుచున్నవి.


శ్లోకము  10

(జీవుడు, మూడు గుణములు)

భావము : మూడు గుణ భాగములలో జీవుడు ఒక సమయములో ఏదో ఒక భాగములో మాత్రముండును. తామస భాగములో ఉన్నప్పుడు రాజస భాగములోను, సాత్త్విక భాగములోను ఉండడు. అలాగే రాజస భాగములో ఉన్నప్పుడు తామస భాగములోను, సాత్త్వికములోను ఉండడు. సాత్త్విక భాగములో ఉన్నప్పుడు రాజస భాగములోను, తామస భాగములోను ఉండడు.


శ్లోకము  11

(జీవాత్మ, సాత్త్వికము)

భావము : శరీరమునందున్న జీవునకు అనేక మార్గముల ద్వారా జ్ఞానము ఎప్పుడు కల్గుచున్నదో, అప్పుడు ఆ జీవుడు సాత్త్విక గుణభాగములోనున్నాడని తెలియవచ్చును.


శ్లోకము  12

(జీవాత్మ, రాజసము)

భావము : సంకుచిత స్వభావము, కార్యములందాసక్తి, ధనము మీద, బంగారు మీద ఇష్టము, మనస్సుకు అశాంతి ఎప్పుడు కల్గుచున్నవో అప్పుడు రాజస గుణ భాగములోని గుణములు పనిచేయుచున్నవని తెలియవచ్చును.


శ్లోకము  13

(జీవాత్మ, తామసము)

భావము : అజ్ఞానము, మజ్జుతనము, చెడుపనులు చేయుటయందే మనసు లగ్నమగుట ఎప్పుడు పొడచూపునో, అప్పుడు జీవుడు తామసభాగములో ఉన్నాడని, తామస గుణములు జీవుని మీద పని చేయుచున్నవని తెలియవచ్చును.


శ్లోకము  14

(జీవాత్మ, సాత్త్వికము)

భావము : దేహధారి అయిన జీవుడు సత్త్వ గుణభాగములో ఉన్నప్పుడు మరణిస్తే, వాడు ఉత్తమ జ్ఞానవంతులు పొందు పరిశుద్ధమైన జన్మను పొందును.


శ్లోకము  15

(జీవాత్మ, రాజసము, తామసము)

భావము : రాజస భాగములో జీవుడున్నపుడు మరణించిన ఎడల కర్మములతో కూడిన జన్మలే వచ్చును. తామసములో ఉండి చనిపోయిన వానికి మూఢ యోనులందే జన్మము కల్గుచుండును.


శ్లోకము  16

(జీవుడు, మూడు గుణములు)

భావము : సాత్త్విక గుణభాగములో జీవునకు పుణ్యకార్యములు నిర్మల ఫలితములు దొరుకును. రాజస భాగములో జీవునకు దుఃఖము దొరుకును. తామసములో అజ్ఞానమే జీవునకు కల్గుచుండును.


శ్లోకము  17

(జీవుడు, మూడు గుణములు)

భావము : సత్త్వగుణ ఆవరణములో జీవునకు జ్ఞానముకల్గుచుండును. రాజస భాగములో ఇతరుల సొమ్ము నాది కావలెనను ఆకాంక్ష ఏర్పడుచుండును. తామస భాగములో తనకు ఇష్టము నష్టము చేకూర్చుకొనుట, భ్రాంతి అజ్ఞానము చేకూరు చుండును.


శ్లోకము  18

(జీవుడు, మూడు గుణములు)

భావము : సాత్త్వికులకు ఉత్తమమైన జన్మలు, రాజసులకు మధ్యమమైన జన్మలు, తామసులకు నీచమైన జన్మలు కల్గుచుండును.


శ్లోకము  19

(జీవుడు, మూడు గుణములు)

భావము : సర్వకార్యములకు గుణములే కర్తలని ఎవడు తెలుసుకొనునో, ఆ గుణములు వేరు తాను వేరని వాడు తెలుసుకొని నా స్థానమైన పరమపదమును పొందుచున్నాడు.


శ్లోకము  20

(జీవుడు, మూడు గుణములు)

భావము : దేహమునందున్న జీవుడు దేహమునందున్న గుణములను తెలుసుకొని, జన్మ మృత్యుజరా దుఃఖములను వదలినవాడై, మృతములేని మోక్షమును పొందుచున్నాడు.

అర్జునుడిట్లనియె :-


శ్లోకము  21

(యోగి)

భావము : ఓ కృష్ణా! ఈ త్రిగుణ భాగములోనున్న గుణములన్నిటిని అతిక్రమించిన వాని ఆచారమెట్లుండును? వాడు త్రిగుణములనెట్లు అతిక్రమించి వర్తించుచుండును?


శ్రీ భగవంతుడిట్లనియె :-

శ్లోకము  22

(యోగి)

భావము : తేజస్సుగ జరిగెడి కార్యములను తనవని అనుకొనని వాడు, తనకు సంప్రాప్త మైన వాటి ఎడల ద్వేషంబులేనివాడు, తనకు దొరికిన వాటి ఎడల కాంక్షలేనివాడు.


శ్లోకము  23

(యోగి)

భావము : సర్వ విషయములందు తటస్థముగ ఉదాసీనునిగ ఉండి ఎవడు గుణములచే చలించబడడో, ఎవడు ప్రతిది గుణముల ప్రవర్తనయేయని తెలిసి వాటికి అచంచలుడై బుద్ధి నిశ్చలత పొందియుండునో.


శ్లోకము  24

(యోగి)

భావము : సుఖదుఃఖములను ఎవడు సమముగ చూచునో, బంగారు మన్నురాతికి ఎవడు సమముగ విలువిచ్చునో, ప్రీతీ అప్రీతి స్తుతి నిందల ఎడల ఎవడు స్థిర బుద్ధి గలవాడైవుండునో.


శ్లోకము  25

(యోగి)

భావము : ఎవడు మానావమానములయందు, మిత్ర శత్రువులందు సమబుద్ధి కలవాడో, కామ్య కర్మములనెల్ల పరిత్యజించిన వాడెవడో అట్టివానిని గుణాతీతుడని చెప్పవచ్చును.


శ్లోకము  26

(సాకార, నిరాకారములు)

భావము : వ్యభిచరించని మనస్సుతో పరమ భక్తితో ఎవడు నన్ను సేవించుచున్నాడో, వాడు త్రిగుణములనెల్ల అతిక్రమించి పరమాత్మయందైక్యమగుటకు అర్హుడగును.


శ్లోకము  27

(సాకార, నిరాకారములు)

భావము : నిత్యుడు అవ్యయుడైన నిర్మలాత్మ, శాశ్వితైశ్వర్య ధర్మమౌ పరమపదము, జ్ఞానులు పొందగలుగు మోక్షపదవి లభించవలెనన్న నన్ను ఆశ్రయించవలసిందే.

-------------------------------------------------------------------------------------------------------

త్రైత సిద్ధాంత భగవద్గీత:  "14" పురుషోత్తమ ప్రాప్తి యోగము  


శ్రీ భగవంతుడిట్లనియె:-

శ్లోకం  1 

(ప్రకృతి, పురుషుడు)

భావము : పైకి వేర్లు క్రిందికి కొమ్మలు గల అశ్వర్థమనే వృక్షము అవ్యయమైనదని, వేదములు ఆకులుగ ఉన్నవని ఎవడు తెలియునో వాడు వేదములు తెలిసినవాడని చెప్పవచ్చును.


శ్లోకం  2 

(ప్రకృతి, పురుషుడు)

భావము : ఆ అశ్వర్ధమను వృక్షము యొక్క శాఖలు గుణ విషయములచే వృద్ధి అయినవై అనేక దిశలకు వ్యాపించి ఉన్నవి. మరియు దాని వేర్లు విస్తరించినవై మనుష్య లోకమున వ్యాపించినవి.

 

శ్లోకం  3 

(ప్రకృతి, పురుషుడు)

భావము : అశ్వర్థవృక్షము యొక్క రూపముగాని, దాని మొదలుగాని, చివరగాని ఉన్న స్థితియుగాని తెలియబడడములేదు. దృఢమైన మూలముగల ఈ వృక్షమును అసంగశస్త్రముచే నరుకవలెను.


శ్లోకం   4 

(పరమాత్మ)

భావము: ఏ పదమును పొందిన తరువాత తిరిగి జన్మించరో దానిని తెలియవలెను. ఈ ప్రకృతి జీవరాసులన్ని ఎవరి వలన పుట్టి వ్యాపించియున్నవో అట్టి పురాణ పురుషుని శరణువేడవలెను.


శ్లోకం   5 

(పరమాత్మ)

భావము: మాన, మోహములను వీడిన వారు, ప్రపంచ విషయములతో సంగమించుట వలన కల్గు కర్మను లేకుండ చేసుకొన్నవారు, నిత్యము ఆత్మ చింతన చేయువారు, ఆశలను లేకుండ చేసినవారు, సుఖదుఃఖములకు కారణమగు పాపపుణ్యములనుండి బయట పడిన వారు అయిన జ్ఞానులు, నాశనములేని పరమపదమును పొందుచున్నారు.


శ్లోకం   6 

(పరమాత్మ)

భావము:దానిని సూర్యుడు కాని, చంద్రుడు కాని , అగ్ని కాని ప్రకాశింప చేయలేరు. దేనిని పొందిన తిరిగి జన్మించరో అదే నా పరంధామము.


శ్లోకం  7 

(పరమాత్మ)

భావము: బ్రతికివున్న జీవరాసులలో జీవాత్మ నా అంశమై, ప్రకృతి సంబంధమైన ఇంద్రియములలో ఆరవదైన మనస్సును ఆకర్షించుచున్నది.


శ్లోకం   8 

(ఆత్మ, ప్రకృతి)

భావము : ఆత్మ శరీరమును వదిలి ఎప్పుడు పోవుచున్నదో, పోయి ఎక్కడ ప్రవేశిస్తున్నదో,అక్కడికి వాయువు వాసనను తీసుకుపోయినట్లు ఆత్మ గుణములను కూడ తీసుకొని పోవుచున్నది.

 

శ్లోకం  9 

(జీవాత్మ)

భావము : చెవులు,కన్నులు, చర్మము, నాలుక, ముక్కు అను జ్ఞానేంద్రియములను మరియు మనస్సును అధిష్ఠించి వాటి విషయములను అనుభవిస్తు జీవాత్మ శరీరమందున్నాడు.

 

శ్లోకం  10 

(జీవాత్మ)

భావము : దేహము అంతమై దానిని వదిలిపోవునపుడు, దేహములో ఉన్నపుడు, గుణముల అనుభవములను పొందుచున్నప్పుడు, ఆ జీవుడెలానున్నది జ్ఞానులు జ్ఞాననేత్రముచే చూడగలరు. అజ్ఞానులు చూడలేరు.

 

శ్లోకం  11 

(ఆత్మ)

భావము : ప్రయత్నము చేయు యోగులు దేహామందున్న ఆత్మను చూడగలరు. అచేతస్కులు, అకృతాత్ములు ఎంత ప్రయత్నించినను ఆత్మను తెలియలేరు.

 

శ్లోకం  12 

(పరమాత్మ)

భావము : సమస్త జగత్తును ప్రకాశింపజేయు సూర్యునిలో ఉండు తేజస్సు, చంద్రునికున్న తేజస్సు, అగ్నికున్న తేజస్సు నా యొక్క తేజస్సేనని తెలియవలెను.

 

శ్లోకం  13 

(పరమాత్మ)

భావము : భూమియందుండి నా బలము చేత సమస్త జీవరాసులను నేనే ధరించుచున్నాను. రసమయుడైన చంద్రునిగా ఉంటు సమస్త ఔషధులను పోషించుచున్నాను.

 

శ్లోకం  14  

(ఆత్మ)

భావము : నేను సకల జీవుల శరీరములందు వైశ్వానరుడను అగ్నిగ ఉండి, ప్రాణ అపాన వాయువులచేత మండుచు, నాల్గు విధములగు ఆహారములను పచనము చేయుచున్నాను.


శ్లోకం   15 

(ఆత్మ)

భావము : సర్వజీవరాసుల హృదయ స్థానములో నేనున్నాను. స్మృతి, ఙ్ఞానము, ఊహ దాని మరుపు నా వలననే కల్గుచున్నవి. వేదవేదాంతములు నన్నే తెల్పుచున్నవి. వేదముల తెలిసినవాడను నేనే.

 

శ్లోకం  16 

(ఆత్మ, జీవాత్మ)

భావము : లోకములో రెండు రకముల పురుషులు కలరు. వారు క్షరుడనియు,అక్షరుడనియు చెప్పబడుచున్నారు. క్షరుడు సర్వభూతములందు కలడు. క్షరునితో కూటస్తునిగనున్న వాడు అక్షరుడని చెప్పుచున్నారు.


శ్లోకం   17  

(పరమాత్మ)

భావము : ఉత్తముడగు పురుషుడు అన్యమైనవాడొకడున్నాడు. వాడే పరమాత్మయని చెప్పబడుచున్నాడు. అతడే ముల్లోకములను ఆవహించి అవ్యయుడై, అధిపతియై, భర్తయై ఉన్నాడు.


శ్లోకం   18 

(పరమాత్మ)

భావము : క్షరునికంటే అతీతుడను, అక్షరునికంటే ఉత్తముడను అయినందువలన లోకమునందు వేదములలో నేను పురుషోత్తముడనని ప్రసిద్ధిగాంచివున్నాను.


శ్లోకం   19 

(పరమాత్మ)

భావము : ఎవడు అజ్ఞానరహితుడై జ్ఞానసహితుడై పురుషోత్తమునిగా నన్ను ఎరింగిన వాడై, ఉన్నాడో, వాడు సర్వము తెలిసినవాడై అన్ని భావములతో నన్ను ఆరాధించిన వాడగుచున్నాడు.

 

శ్లోకం  20 

(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)

భావము : ఈ ప్రకారముగ మిగుల రహస్యమైన శాస్త్రము నీకు నేను చెప్పితిని. దీనిని తెలుసుకొన్నవాడు బుద్ధిమంతుడును, కృతకృత్యుడగును.

--------------------------------------------------------------------------------------------------------

త్రైత సిద్ధాంత  భగవద్గీత :  "15" దైవాసురసంపద్విభాగ యోగము  


శ్రీ భగవంతుడిట్లనియె : -

శ్లోకం 1 - 3

(దైవగుణము)

భావము : భయము లేకుండుట, సత్త్వగుణములో మంచివైన ఆరు గుణములు కల్గియుండడము, జ్ఞానము యోగములందలి వ్యవహారములన్ని తెలిసియుండడము, దానమిచ్చుట, ఇంద్రియములను స్వాధీనములో ఉంచుట, ద్రవ్య జ్ఞానయజ్ఞములు తెలిసి వేదాధ్యాయణము చేసివుండుట, తపస్సుకల్గి కపటము లేకుండుట, అహింస, సత్యమునే పలుకుట, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతికల్గి చాడీలు చెప్పకుండుట, జీవరాసులమీద దయ,విషయములందు ఆసక్తి లేకుండుట, మృదువుగ ఉండుట, గంభీరభావము కల్గియుండుట మనస్సు చలింపకుండుట, తేజస్సు, క్షమించు స్వభావము, ధైర్యము, శుభ్రత, పరులకు ద్రోహము చేయకుండుట, అభిమానము లేకుండుట దైవాంశయందు పుట్టినవారికి కల్గుచున్నవి.


శ్లోకం 4

(అసుర గుణము)

భావము : గర్వము, అధికారత్వము చలాయించుట, అభిమానము కల్గివుండుట, క్రోధము, కఠినత్వము కల్గివుండుట, అజ్ఞానము కల్గియుండుట రాక్షసాంశయందు పుట్టినవారికుండును.


శ్లోకం 5

(దైవ, అసుర గుణము)

భావము : దైవ అంశ మోక్షమును కల్గించును. అసురాంశ బంధమే కల్గించును. నీవు దైవాంశ సంభూతుడవైనందు వలన బాధపడవలసిన పనిలేదు.


శ్లోకం 6

(దైవ, అసుర గుణములు)

భావము : లోకమున దైవ అసుర అను రెండు రకముల జీవులు పుట్టుచున్నారు. దైవ విషయముల వాటి గుణముల గురించి చెప్పివున్నాను. అసురులను గూర్చి చెప్పెదను వినుము.


శ్లోకం 7

(హేతువాద అసురగుణము)

భావము : అసురులైన వారు మనిషి యొక్క పుట్టుకనుగాని, మరణముగాని తెలుసుకోలేరు. వారివద్ద శుచిత్వముగాని, ఆచారముగాని, సత్యముగాని ఉండదు.


శ్లోకం 8

(నాస్తికవాద అసురగుణము)

భావము : దేవుడు అనేవాడు లేడు అనియు, దేవునిచేత జగత్తు సృష్ఠింపబడినదనుట అసత్యమనియు, స్త్రీ పురుషుల పరస్పర సంబంధము వలననే జీవరాసులు పుట్టుచున్నవని, స్త్రీ పురుష సంబంధమునకు కామము తప్ప వేరే ఏముంది అనుచున్నారు.


శ్లోకం 9

(హేతువాద, నాస్తిక అసురగుణము)

భావము: ఈ విధమైన భావము గలవారు అల్పబుద్ధిగలవారై, నష్టాత్ములై, క్షయమును పొందుచు, ఇతరులకు అహితులగుచు, భయంకరమైన కర్మను సంపాదించుకొన్నవారై తిరిగి పుట్టుచున్నారు.


శ్లోకం10: 

(అసుర గుణము)

భావము: దంభ, మాన, మధ, గర్వయుతులైన రాక్షసులు తీరని కోర్కెలు కలవారై, మోహమున తమ తప్పులు గ్రహించనివారై, శాస్త్రీయతలేని పనులచే వ్రతములు ఆచరింతురు.


శ్లోకం 11

(అసుర గుణము)


శ్లోకం 12

(అసుర గుణము)

భావము: మరణించువరకు బ్రతుకు తెరువు కొరకు పరిమితములేనట్టి చింత చేయువారై, కోర్కెల వలన కల్గు సుఖములే గొప్పవని మనస్సులో నిశ్చయము చేసుకొన్నవారై, ఆశయను పాశముచే అనేక విధముల బంధింపబడినవారై, కామక్రోధ పరవశులై, తమ కోర్కెలు నెరవేర్చుకొనుటకు అన్యాయమైన మార్గముల ద్వార ధనము సంపాదింతురు.


శ్లోకం13: 

(అసుర గుణము)

భావము: ఈ ధనమిప్పుడు నాచే సంపాదించబడినది. మన కోర్కెలను బట్టి సంపాదించగలము. ఇప్పుడు సంపాదించిన ధనమంతయు నాది. మరల నేను ఎంతో ధనమును సంపాదించగలను.


శ్లోకం 14 - 16

(అసుర గుణము)

భావము: నేను శత్రువును చంపినాను. ఇతర శత్రువులను కూడ చంపగలను. నేనే ఈశ్వరుడను, భోగిని, సుఖిని, నేను సిద్ధుడను, నేను బలశాలిని, జనులలో మంచి కులమువాడను, భాగ్యవంతుడను, నాకు సమానులెవ్వరు లేరు, నేను యజ్ఞము చేయుదును, దానము చేతను, ఆనందపడెదనను అజ్ఞాన భ్రమచే మోహితులైనవారు, అనేక విధములగు చిత్తవిభ్రాంతి పరులు, మోహమను వలలో చిక్కి కోర్కెలను అనుభవించుటయందు ఆసక్తి గలవారై పాపమును సంపాదించుకొని నరకమును అనుభవించుటకు పోవుచున్నారు.


శ్లోకం 17

(అసుర గుణము)

భావము: తమ్ము తాము పొగడుకొనుచు, తమ ప్రభావమే గొప్పదనుచు, ధన మాన మధములచే కూడిన వీరు, గర్వముతో అశాస్త్రీయపద్ధతిలో చేయు యజ్ఞమును నామకార్థయజ్ఞమనవచ్చును.


శ్లోకం 18

(అసుర గుణము)

భావము: అట్టి అసుర జనులు అహంకారాగ్నులై ఉండి, బలము గర్వము కామ క్రోధమును ఆశ్రయించినవారై, తమ శరీరములందును, పర శరీరములందునున్న నన్ను అసూయతో ద్వేషించుచుందురు.


శ్లోకం 19

(జీవాత్మ, పరమాత్మ)

భావము: కౄరులు, ద్వేషులు,శుభమును ధూషించు ఆ నరాధములను అసుర యోనులందే త్రోయబడి సంసార దుఃఖ గతులను పొందునట్లు నేనే చేయుచుందును.


శ్లోకం 20

(జీవాత్మ, పరమాత్మ)

భావము: అట్లు అసుర యోనులందు జన్మించినట్టివారు జన్మ జన్మములకు అజ్ఞానులగుచు నన్ను పొందు జ్ఞానము యొక్క విధానమే తెలియలేరు. జన్మ జన్మకు అధమగతి పొందుచుందురు.


శ్లోకం 21

(ప్రకృతి)

భావము: ఆత్మ నాశనకరమైన ఈ అసుర భావమునకు మూడు త్రోవలుండును. కామ, క్రోధ, లోభమను మూడింటిని వర్జింపవలయును.


శ్లోకం 22

(ప్రకృతి)

భావము : ఈ మూడు తమో ద్వారములను ఎవడు విడుచునో వానికి శుభము ఏర్పడి పరమపదము పొందగలడు.


శ్లోకం 23

(జీవాత్మ)

భావము : శాస్త్రవిధులను విడచి ఆశ కొరకే సంచరించువాడు ఏమి సాధించలేదు . వాడు సుఖమును పొందలేడు, మోక్షమును పొందలేడు.


శ్లోకం 24

(జీవాత్మ)

భావము : కార్య అకార్యములను తెల్పునది శాస్త్రము . కనుక శాస్త్రవిధానము ఎరిగి కర్మలాచరించవలెను.

---------------

త్రైత సిద్ధాంత భగవద్గీత : "16" శ్రద్ధాత్రయ విభాగ యోగము  


అర్జునుడిట్లనియె :-

శ్లోకం 1

(ప్రకృతి, గుణములు)

భావము : ఎవరైతే శాస్త్రపద్ధతులను వదలి శ్రద్ధతో పూజలు, ఆరాధనలు చేయుచున్నారో అట్టివారి నిష్ఠను ఏమనవచ్చును? సత్త్వమా! రాజసమా! తామసమా!

శ్రీ భగవంతుడిట్లనియె :-


శ్లోకం 2

(గుణములు)

భావము: మన శరీరములో గుణచక్రమొకటి కలదని, అందులో మూడు భాగములు కలవని, ఆ మూడు భాగములకే సాత్త్విక, రాజస, తామస భాగములని పేర్లు పెట్టబడినవని ముందే చెప్పుకొన్నాము.


శ్లోకం 3

(గుణములు)

భావము : సర్వులకు శ్రద్ధ వారి ఇష్టానుసారము పుట్టునది. ఏ శ్రద్ధ ఎవనికి కలదో వానిని ఆ శ్రద్ధా పురుషుడని చెప్పవచ్చును.


శ్లోకం 4

(గుణములు)

భావము : సాత్త్విక గుణము కలవారు దేవతలను ఆరాధించుదురు. రాజసులు యక్షులను రాక్షసులను, తామసులు ప్రేతములను భూతములను పూజ చేయుదురు.


శ్లోకం 5

(గుణములు)


శ్లోకం 6

(గుణములు)

భావము : ఏ మనుజులు అహంకారము, దంభముతో కూడినవారై, ఆశ, ప్రేమ గుణముల బలము కల్గినవారై, ఇతరులను ఇబ్బంది పెట్టువారై, అశాస్త్రపద్ధతిలో తపములు చేయువారై, అజ్ఞానులై శరీరమునందలి ఇంద్రియములను వాటిలోపల ఉండు ఆత్మనైన నన్ను కృశింపజేయుచున్నారో, అట్టివారు అసురులని తెలియుము.


శ్లోకం  7 

(గుణములు)

భావము : సర్వ జీవరాసులు తీసుకొను ఆహారము కూడ మూడు శ్రద్ధలుగ ఉన్నది. అట్లే త్రి శ్రద్ధలుగ యజ్ఞము, తపము, దానము మొదలగునవి కలవు. వాటి భేదములను వివరింతు వినుము.


శ్లోకం  8 

(సాత్త్విక శ్రద్ధ)

భావము : ఆయుస్సును, శరీర ఉల్లాసము, బలము, ఆరోగ్యము, కలుగజేయునవియు, చూచుటకు అందముగను, ప్రీతిని వృద్ధిచేయు రసవత్తరమైనవి, నూనె పదార్థములు కలవి, దీర్ఘకాలమున్నా చెడిపోని ఆహార పదార్థముల మీద సాత్త్వికులకు ప్రీతియుండును.


శ్లోకం  9 

(రాజసగుణశ్రద్ధ)

భావము : చేదు, పులుపు, ఉప్పు, కారము, వేడిగ ఉన్నవి, సారము లేకుండ ఎండి పోయినవి, దాహమును కలుగజేయునవి, తినుటలో కష్టము, తిన్న తరువాత బాధను కల్గించు అనారోగ్యకర పదార్థములయందు రజోగుణము కలవారికి శ్రద్ధవుండును.


శ్లోకం  10 

(తామస గుణ శ్రద్ధ)

భావము : ఉడికి ఉడకనిది, రసము పోయినది, చెడిపోయి వాసన వచ్చునది, తిని మిగిలి వదలివేసిన దానిని, పవిత్రతలేనిది అయిన ఆహారము తామసులకు ప్రీతిగ ఉండును.


శ్లోకం  11

(సాత్త్వికము)

భావము : ఫలితము మీద కాంక్షలేక శాస్త్రవిధి ప్రమాణములను అనుసరించి యజ్ఞము (పూజ) చేయవలెనని మనస్సున నిశ్చయించి, చేయు యజ్ఞము సాత్త్విక యజ్ఞమనబడును.


శ్లోకం  12 

(రాజసము)

భావము : మనస్సు ఫలితము మీద సంబంధించినవాడై దంభముగ ఇతరులకు తెలియునట్లు చేయబడు యజ్ఞమును రాజసయజ్ఞమని తెలియుము.


శ్లోకం  13 

(తామసము)

భావము : శాస్త్రపద్ధతిలేనిది, అన్నదానములేనిది, మంత్రములులేనిది దక్షిణలేనిది అసలు శ్రద్ధ లేకుండ చేయు యజ్ఞమును తామసయజ్ఞమని చెప్పవచ్చును.


శ్లోకం  14 

(తపము)

భావము : దేవతలయందును, బ్రాహ్మణులయందును, గురువులయందును జ్ఞానుల యందును, భక్తియు, శుచిత్వము, కపటము లేకుండుట, బ్రహ్మచర్య అహింసా ప్రవర్తనము, శరీర తపస్సని చెప్పబడును


శ్లోకం  15 

(తపము)

భావము : పరులు బాధపడని మాటలు, ప్రియము, హితము, సత్యము గల మాటలు, ఇతరులకు మంచి చేయునటుల మాట్లాడుటయు, వేదమభ్యసించుటయు వాక్ తపస్సని చెప్పబడును.


శ్లోకం  16 

(తపము)

భావము : మనో నిర్మలత్వమును, సౌమ్యమును, మౌనము వహించుటయు, జీవాత్మ కష్టసుఖములలో నిగ్రహముగవుండుటయు, భావ సంశుద్ధి కలిగి ఉండుటయు మానస తపములని చెప్పబడును.


శ్లోకం  17 

(సాత్త్వికము)

భావము : ఫలకాంక్షలేక పరమశ్రద్ధతో, యోగ్యత గల మనుజులు సలుపు ఈ త్రివిధ తపములను సాత్త్విక తపములని అందురు.


శ్లోకం  18 

(రాజసము)

భావము : సత్కరింపుకొరకు, సన్మానము కొరకు, పూజకొరకు, దంభముగ చంచలము క్షయకరమునగు రీతిలో సలుపు తపమును రాజస తపమందురు.


శ్లోకం  19 

(తామసము)

భావము : తెలివి లేనట్టి పట్టుదల తోడ తనకు కష్టమైనను చేయు తపము, పరుల వినాశనమునకు చేయు తపమును తామస తపమని చెప్పబడును.


శ్లోకం  20 

(సాత్త్వికము)

భావము : దానమొనరింపవలెనను ఉద్ధేశ్యము కలిగివుండి, దేశ కాలపాత్రా పాత్రలు తెలిసి, బదులుమేలు చేయనట్టి సజ్జనునకిచ్చు దానమును సాత్త్విక దానమందురు.


శ్లోకం  21

(రాజసము)

భావము : ఫలమునందు ఆశ, ప్రత్యుపకారమునందు ఆలోచనకల్గి, అతికష్టము మీద మనస్సులో బాధపడుచు ఇచ్చు దానము రాజస దానమని చెప్పబడుచున్నది.


శ్లోకం  22 

(తామసము)

భావము : మర్యాదలేక, తిరస్కార పూర్వకముగ, దేశకాలమును తెలిసికొనక పాత్రుడగునో కాదో ఆలోచించక ఇచ్చుదానము తామస దానమందురు.



శ్లోకం  23 నుండి  28 వరకు:

(కల్పితము)

ఈ ఆరు శ్లోకములలో ఓం తత్ సత్ అను పదమును గూర్చి చెప్పిన విషయముకలదు. 'ఓం తత్ సత్' అను పద ఉచ్ఛరణ యజ్ఞ దాన తపములలో కలుగు దోషములను పోగొట్టగలదనియు, ఆ పదములు పరబ్రహ్మ స్వరూపమనియు చెప్పబడియున్నది. అంతేకాక యజ్ఞదాన తపస్సులందు మోక్షకాములు ఈ శబ్దముల నామోచ్ఛరణ చేయుచుందురని కూడ చెప్పివున్నారు. భగవంతుడు చెప్పిన భగవద్గీత ఒకే పద్ధతి ఒకే బోధగ ఉండవలెను. మోక్షకాములకు యోగమే శరణ్యమనియు, పరమాత్మను తెలియగోరువారికి యజ్ఞదాన తపములు సాధనములు కావని, వాటివలన తెలియుటకు శక్యముకాదనియు తెల్పిన భగవంతుడు మాటమార్చి మోక్షాసక్తులకు యజ్ఞదానతపములు పనికి వచ్చునని చెప్పునా? యోగమే శరణ్యమన్నవాడు యజ్ఞదానతపములు సాధనములని చెప్పునా? ఇది భగవంతుడు చెప్పినవి కాదు.

-------------

త్రైత సిద్ధాంత భగవద్గీత:  "17" మోక్ష సన్న్యాస యోగము  

అర్జునుడిట్లనియె:-


శ్లోకం 1

(కార్య సన్న్యాసము, కర్మ త్యాగము)

భావము : ఓ కృష్ణా! సన్న్యాసము మరియు త్యాగము అనువాటి యొక్క నిజ తత్త్వమును వేరు వేరుగ విశదముగ తెలియకోరుచున్నాను.


శ్లోకం 2

(కార్య సన్న్యాసము, కర్మ త్యాగము)

భావము : కోరి చేయు పనులనెల్ల వదలి వేయడము సన్న్యాసమని కవులందురు. కోరి చేసిన పనులలోని ఫలితమును (కర్మను) వదలుకోవడము త్యాగమని జ్ఞానులందురు. (ఆత్మ సంయమ యోగములో 1, 2 శ్లోకములలో త్యాగమును కూడ సన్న్యాసమనియే చెప్పినట్లు గ్రహించవలెను).

శ్లోకం  3 నుండి  8 వరకు:

(కల్పితము)


శ్లోకం 9

(సాత్త్వికము)

భావము: కర్మ నియతమైనది కార్యమని, కార్యము చేయుటలో సంగము లేకుండ ఫలితము మీద ధ్యాస లేకుండ చేయుట సాత్త్విక త్యాగమని అందురు.


శ్లోకం 10

(కర్మయోగము)

భావము: సత్త్వగుణ త్యాగియైనవాడు మేధావియై, సంశయములను ఛేదించు జ్ఞానము గలవాడై ఉండి, కార్యములలో కల్గు కర్మను నాశనము చేయగల అగ్ని గలవాడై ఉండును. తనకు సుఖము కలుగజేయు పనులయందు ఆసక్తి లేకుండా, దుఃఖము కష్టము కలుగజేయు పనులయందు అయిష్టతలేకుండును.


శ్లోకం 11

(కర్మయోగము)

భావము: దేహము ధరించినవాడు సంపూర్ణముగ కర్మను వదలి పెట్టుటకు శక్యము కాదు. ఎవడు కర్మఫలత్యాగము చేయునో వాడు త్యాగి అనబడును.


శ్లోకం 12

(కర్మయోగము)

భావము: అనిష్టమనియు, ఇష్టమనియు, మిశ్రమమైనదనియు మూడు విధ కర్మలు త్యాగులు కానివారికి మరణానంతరము కలుగుచున్నవి. త్యాగియైనవానికి ఏ కర్మలు లేవు.


శ్లోకం13: 

(ప్రకృతి)

భావము: సర్వకర్మలు ఆచరించుటకు సాంఖ్యసూత్రము ప్రకారము ఐదు కారణములు ఉన్నవని చెప్పబడినవి. వాటిని వివరింతును తెలుసుకొనుము.


శ్లోకం 14: 

(ప్రకృతి)

భావము: శరీరమును అధిష్టించియున్న వాటిలో అనేక కార్యములు చేయు బాహ్య కరణములు, వివిధ కార్యములు చేయించు అంతఃకరణములు వీటిలో దైవమొకటి కలసి మొత్తము ఐదు కర్తలైయున్నవి.


శ్లోకం 15

(ప్రకృతి)

భావము: మానవుడు మనోవాక్కాయములచే ప్రారంభించు కార్యములు న్యాయమైనవి గాని, అన్యాయమైనవిగాని వాటికి పైన చెప్పబడిన ఐదు భాగములు కారణములని చెప్పవచ్చును.


శ్లోకం 16:

(జీవాత్మ)

భావము : కర్మ కార్య విషయములందు కర్తలైదునుండగ, అజ్ఞానియైనవాడు అన్నిటికి జీవాత్మయే (తానే) కర్తయని తలచుచున్నాడు. అట్టివాడు తెలివి తక్కువవాడై తన నిజస్థితిని తెలియకున్నాడు.


శ్లోకం 17:

(కర్మయోగము)

భావము: ఎవని భావములో అహము లేదో, ఎవని బుద్ధి ఫలితము మీద ఉండదో, వాడు జగత్తులోని అందరిని చంపినప్పటికి వానికి కర్మ అంటదు. వాడు హంతకుడు కాడు.


శ్లోకం 18

(యోగము, వియోగము)

భావము: జ్ఞానము, జ్ఞేయము, పరిజ్ఞాతయని, కర్మచ్ఛేదనమునకు చేయునది, చేయువాడు, సంభవించునదియని కర్మ సంభవమునకు మూడు విధములున్నవి.


శ్లోకం 19

(గుణములు)

భావము : గుణ వివరణ సాంఖ్యమునందు గుణ భేదములను బట్టి జ్ఞానము, కర్త, కర్మ అనునవి మూడు విధములుగ ఉన్నవి. వాటి వివరమును చెప్పెద శ్రద్ధగ వినుము.

శ్లోకం 20

(సాత్త్వికజ్ఞానము)

భావము : సర్వ జీవరాసులందు ఉన్న పరమాత్మ నాశరహితమై ఒకే రూపముగ ఉన్నదని, వేరు వేరు ఆకారములుగ ఉన్న జీవశరీరములందు వేరువేరుగ విభజింపబడినదై ఏకముగ ఉన్నదని తెలుపు జ్ఞానమును ‎సాత్త్విక జ్ఞానమందురు.


శ్లోకం 21

(‎రాజసజ్ఞానము)

భావము : సర్వ జీవరాసులందు భావమును బట్టి అందులోని పరమాత్మ కూడ వేరు వేరుగవున్నాడని తెలుపు జ్ఞానము రాజసజ్ఞానమగును.


శ్లోకం 22

(‎తామసజ్ఞానము)

భావము : శాస్త్రబద్దము కానట్టిది, అసత్యమైనది, అల్పమైనదియునైన ఒక్క కార్యమే సర్వార్థసిద్ధియనుచు, ఆసక్తియంతయు దానియందుంచు జ్ఞానమును తామస జ్ఞానమందురు.


శ్లోకం 23

(‎సాత్త్విక కర్మ)

భావము : ఫలాపేక్ష లేక, సంగరహితముగ, ప్రేమ ద్వేషములులేకుండ చేయు నియతకర్మ (ప్రారబ్ధకర్మ)ను సాత్త్విక కర్మ అనబడును.


శ్లోకం 24

‎(రాజసకర్మ)

భావము : కోర్కె కలవాడై మిక్కిలి ప్రయాసతో, కర్త తానన్న అహంభావముతో గర్వ పడుచు చేయు కర్మను రాజసకర్మయని అందురు.


శ్లోకం 25

(తామసకర్మ)

భావము : తాను చేయు పనివలన కలుగు నాశనమును, హింసను ఆలోచించక, తన చేతనౌనో కాదోయని యోచించక, పౌరుషములచే అజ్ఞానభ్రాంతితో చేయు కర్మములను తామసకర్మలని అందురు.


శ్లోకం 26

(‎సాత్త్విక కర్త)

భావము : సంగరహితుడై కర్త తానన్న అహంకారములేకుండ ధైర్యము ఉత్సాహము కల్గి, కార్యఫలములలో నష్టలాభముల మీద కలత చెందనివాడై, పనులు చేయు వానిని సాత్త్విక కర్తయని అందురు.


శ్లోకం 27

(రాజసకర్త)

భావము : బంధువుల మీద ప్రేమ కలిగి కార్యములలో లాభమును కోరువాడై, లోభియగుచు హింస చేయువాడై, శుభ్రతలేనివాడై, సంతోష దుఃఖములకు చలించువాడు రాజసకర్తయగును.


శ్లోకం 28

(తామసకర్త)

భావము : అస్థిర స్వభావుడు, అనర్హుడును, శాస్త్రవిధానము తెలియని అవిద్యాపరుడును, ఏదీ ఆరంభించక ఉండువాడు, మోసగాడును, ఇతరులను చెరచువాడు, సోమరితనము గలవాడును, విషాదపరుడు, తొందరగ చేయవలసిన దానిని దీర్ఘకాలము వరకు చేయనివాడు తామసకర్తయని చెప్పబడును.


శ్లోకం 29

(గుణములు)

భావము : మానవునికి ఉన్న త్రిగుణములనుబట్టి వానికున్న బుద్ధి మరియు ధైర్యములు మూడు విధములుగ ఉన్నవి. వాటిని మూడు విధములుగ ఒక్కొక్క దానిని వివరించి తెలిపెదను వినుము.


శ్లోకం 30

(సాత్త్వికబుద్ధి)

భావము : ఇది జన్మలు కల్గించునదని, ఇది జన్మరాహిత్యము చేయునదని, ఇది కార్యమని, ఇది అకార్యమనియు, ఇవి భయాభయములని, ఇది బంధము, ఇది మోక్షము అని వివరించి తెలుపు బుద్ధి సాత్త్వికబుద్ధి అని చెప్పవచ్చును.


శ్లోకం 31

(రాజసబుద్ధి)

భావము : ఇది ధర్మమని, ఇది అధర్మమని, ఇది కార్యమని, ఇది అకార్యమని ఉన్నదున్నట్లు తెలియజేయలేక పొరపాటుగ వేరుదానిని సూచించు బుద్ధి రాజస బుద్ధియని చెప్పవచ్చును.


శ్లోకం 32

(తామసబుద్ధి)

భావము : అజ్ఞానము చేత అధర్మమును ధర్మమనిపించుచు, మరియు తెలియదగిన వాటినన్నిటికి విరుద్ధముగ తెలుపుచున్న బుద్ధిని తామసబుద్ధి అని అందురు.


శ్లోకం 33

(సాత్త్వికధృతి)

‎భావము : శరీరములోని మనస్సు, ఇంద్రియములు, వాయువుల యొక్క పనులను నిలుపగల్గి వాటిని యోగమందు తగులుకొని నిలుచునట్లు చేయు ధైర్యమును సాత్త్విక ధైర్యమని చెప్పవచ్చును.


శ్లోకం 34

(రాజసధృతి)

భావము : మిక్కిలి ఆసక్తిగల ఫలాకాంక్షచే ధర్మముయందును ధనము కొరకు ఆశను కలుగజేయు ధృతిని రాజస ధైర్యము అనవచ్చును.


శ్లోకం 35

(‎తామసధృతి)

భావము : స్వప్నము, భయము, శోకము, విషాద, మదములు మొదలుగా గల విషయములందు మదిని విడవకుండ నిల్పు దుష్ఠునికున్న ధైర్యమును తామస ధృతి అనవచ్చును.


శ్లోకం 36

(గుణములు)

భావము : అభ్యాసవశమున ఏ సుఖము కల్గుచున్నదో, దేనివలన దుఃఖములు సమసిపోవుచున్నవో, ఆ మూడు విధములైన సుఖములను వివరించెదను వినుము.


శ్లోకం 37

(సాత్త్విక సుఖము)

భావము : మొదట చూచిన విషతుల్యముగ తోచుచు, పోను పోను తుదకు అమృత తుల్యముగ కనిపించు, ఆత్మ విషయమందు యోచించు బుద్ధికి కల్గు సుఖమును సాత్త్విక సుఖమని అందురు.


శ్లోకం 38

(రాజస సుఖము)

భావము :విషయములు, ఇంద్రియములు కలిసి ఏకమై ఆదియందు అమృత సమానముగ తోచు సుఖము, పోను పోను పరిణామము చెందుచు చివరకు విషముతో సమానముగ కనిపించును, అట్టి సుఖమును రాజస సుఖమని అందురు


శ్లోకం 39

(తామస సుఖము)

‎భావము : ఆదియందు అంత్యమందు కూడ నిద్ర, ఆలస్య, ప్రమాదములతో కూడి మనస్సును అజ్ఞానమందు ముంచు సుఖమును తామస సుఖమని చెప్పవచ్చును.


శ్లోకం 40

(గుణములు)

భావము : భూమి మీద గల సమస్త జీవరాసులలోను మరియు దైవత్వముగల దేవతలలోను ఎవడైననుగాని, ప్రకృతి జనిత గుణములను పూర్తి విసర్జించి చరించువాడు లేడు.


శ్లోకం 41

(కల్పితము)


శ్లోకం 42  నుండి  48 వరకు

(కల్పితము)


శ్లోకం 49

(కర్మయోగము)

భావము : దేనియందును ఆసక్తిలేనివాడవై, మనసునందు విషయస్పృహలను మాని కార్యము చేసిన, కర్మ అంటని సన్న్యాసముచే ఆత్మను జయించి (తెలుసుకొని)న వాడగుచున్నాడు.


శ్లోకం 50

(యోగము)

భావము : కర్మయోగసిద్ధిని పొందిన వానిని గూర్చి నేను తెల్పితిని. అట్లే బ్రహ్మయోగ పద్ధతి నానుండి తెలుసుకొనుము. ఇది జ్ఞాననిష్ఠలో శ్రేష్ఠమైనది.


శ్లోకం 51 -53

(యోగము)

భావము : శుద్ధమైన బుద్ధికల్గి, విషయములను జయించి, ఆత్మయందునే మనస్సును నియమించి, శబ్దాది విషయముల త్యజించి, రాగద్వేష గుణములను వదిలి, ఏకాంత వాసము చేయుచు, మితముగ భుజించుచు, వాక్ మనోకాయముల పని చేయకుండు నట్లు చేసి, నిత్యము ధ్యానయోగ (బ్రహ్మయోగ)మునందే లగ్నమై, అహంకారము బలము, గర్వము, కామము, క్రోధము, బాహ్య వస్తువుల మీద ధ్యాస వదలి, మమకారములేక శాంతినొందువాడు పరబ్రహ్మమును పొందుటకు సమర్థుడగును.


శ్లోకం 54

(బ్రహ్మ, కర్మయోగములు)

భావము :బ్రహ్మభూతుడు, ఆత్మ ప్రసన్నుడు కోర్కెలను కోరడు. దుఃఖములను పొందడు, సర్వభూతములను సమముగ జూచువాడై ఉత్తముడగు నా భక్తవరుడగును.


శ్లోకం 55

(సాకార, నిరాకారము)

భావము : నేను నిశ్చయముగ ఎట్టివాడనో, ఎవ్వడనై ఉన్నానో పరమభక్తిచే తెలియగల్గినవాడు, నా యదార్థమంతయు తెలిసినవాడై తదుపరి నాయందే చేరిపోగలడు.


శ్లోకం 56

(మోక్షము)

భావము : సర్వకర్మలను ఎల్లపుడు నా పద్ధతినాశ్రయించి చేయువానికి నా అనుగ్రహము వలన అవ్యయమైన శాశ్వతమైన పరమపదము లభించగలదు.


శ్లోకం 57

(కర్మయోగము)

భావము : మనసుచే సర్వకార్యములు నాకే సమర్పించి, నీవు ఎల్లప్పుడు నాయందే చిత్తమును లగ్నము చేసి, నాకంటే ఇతరములేదని తలచి కర్మయోగమున ఆరాధించుము.


శ్లోకం 58

(కర్మయోగము)

భావము : నాయందే చిత్తముంచిన, నేను ప్రసాదించు ప్రసాదమువలన సర్వ దుఃఖములనుండి తరింతువు. అట్లుకాక ఆహంకారమునే కల్గి నామాట వినకున్న చెడిపోదువు.


శ్లోకం 59: 

(ప్రకృతి)

భావము : అట్లు అహంకారమునే వహించి యుద్ధము చేయనని పట్టుబట్టిన నీ నిశ్చయము నిలువదు. ప్రకృతి నిన్ను నియోగించి పంపగలదు.


శ్లోకం 60

(ప్రకృతి)

భావము : అర్జునా! మోహముచే యుద్ధము చేయనను నీ నిర్ణయము నీ స్వభావములో నీయందే ఉన్న కర్మచేత కట్టివేయబడి, నీ ప్రయత్నము లేకనే అస్వతంత్రముగ యుద్ధము చేసెదవు.


శ్లోకం 61

(పరమాత్మ)

భావము : సర్వ జీవరాసుల శరీర హృదయములందు పరమాత్మ తిష్ఠవేసి ఉండి, యంత్రమునెక్కి ఆడించువానివలె తన మాయచేత సర్వభూతములను ఆడించుచున్నాడు.


శ్లోకం 62

(పరమాత్మ)

భావము : సర్వ భావములలో పరమాత్మను శరణువేడుము. ఆయన అనుగ్రహము వలన ప్రకృతికంటే అన్యమైన శాంతిని మరియు శాశ్వతమైన మోక్షస్థానమును పొందవచ్చును.


శ్లోకం 63

(జ్ఞానము)

భావము : రహస్యములలోకెల్ల అత్యంత రహస్యమైన జ్ఞానమును నీకు నేను చెప్పితిని. దీనిని శేషము లేకుండ వివరించుకొని చూచి ఎట్లు నీకిష్టమో అట్లు చేయుము.


శ్లోకం 64

(గీతా సారాంశము)

భావము : సర్వ రహస్యములలో ఉత్తమమగు పరమవచన సముదాయమును మరల వినుము. నీవు నాకు మిగుల ఇష్టుడవగుటచే హితము కోరి చెప్పుచున్నాను.


శ్లోకం 65

(గీతా సారాంశము)

భావము : నన్ను నీ మనస్సున తలంపుము. నీవు నా భక్తునిగ ఉండుము. నన్నే పూజించుము. నన్నే నమస్కరింపుము. నన్నే పొందగలవు. ఇది సత్యము. నీవు నాకు మిక్కిలి ప్రియుడవు కాగలవు. ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను.


శ్లోకం 66

(గీతా సారాంశము)

భావము : సర్వధర్మములను సంపూర్ణముగ వీడి నన్ను మాత్రమే నీవు శరణు కోరుము. నిన్ను పాపనియచంబులో నుండి ముక్తుని చేతును. దుఃఖింపకుము.

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024