https://ibm.box.com/s/nemjwwm0fxh8fxr7lk7g6dqqx8tt2yrj
సూర్యుడు-అర్జెంటీనా; చంద్రుడు-మాల్టీవులు; నక్షత్రము-బర్‌కిన
జీవాత్మ ఆత్మ పరమాత్మ
ఆరాధన.
ఒక మనిషి తన ఉద్దేశ్యములో విలువైన దానికొరకు విచారించడము లేక ఆరా తీయడము జగతిలో జరిగే
విషయమే. విలువైనది ఏదైన అది ధనముతో సమానమే. విలువైనది ఏదైతే ఉందో, అది ఎక్కడ లభిస్తుందో, ఎవరివద్ద
లభిస్తుందో తెలిసి, దానికొరకు కొంత కార్యము లేక కొంత శ్రమ పడవలసియుంటుంది. అటువంటి కార్యమునకు ఒక
ప్రత్యేకమైన పేరు గలదు. దానినే “ఆరాధన” అంటున్నాము. మనుషులలో ఎన్నో రకములైన ఆరాధనలు గలవు.
దేనినైతే ధనముగా భావించి దానికొరకు ఆరాతీయడమును ఆరాధన అంటున్నామని చెప్పుకొన్నాము కదా! ఇపుడు
ఒక ఆరాధనను ఉదహరించుకొని చూస్తాము. ఒకడు మరొక మనిషి యొక్క స్నేహమును కావాలనుకొన్నాడు. అపుడు
వాని దృష్టిలో ఆ స్నేహము విలువైనది. ఎదుటి మనిషి స్నేహమును కోరిన మనిషి ఆ స్నేహమును సంపాదించుకొనుటకు
కొంత ప్రయత్నమును చేయవలసియుండును. ఆ ప్రయత్నము కార్యరూపములో ఉండును. అటువంటి కార్యములో
ఎదుటి మనిషి కనిపించినపుడు గౌరవముగా పలకరించడమూ, ఆ మనిషికి ఇష్టమైన పనులు చేయడమూ, ఆ మనిషి
స్నేహమునకు అవసరమైనట్లు నడుచుకోవడము మొదలగు కార్యములుండును. అటువంటి కార్యములనే "స్నేహ
ఆరాధన" అంటున్నాము. అదే విధముగా ప్రేమారాధన కలదు. ప్రేమారాధనలో ప్రేమే వానికి విలువైనది. అందువలన
ప్రేమ+ఆరాధన= ప్రేమారాధన అంటున్నాము. ఈ సూత్రము ప్రకారము జీతము రూపములో వచ్చు ధనము కొరకు
ఉద్యోగము చేయువాడు కూడ ఆరాధన చేసినట్లే. అందువలన కొందరికి వారి వృత్తే వారికి ఆరాధన అంటున్నాము.
భూమి మిద ఒక మనిషి ఒక విలువైన దానికొరకు చేయు ప్రతి కార్యము ఒక ఆరాధన అయితే అటువంటివి
ఎన్నో ఆరాధనలు గలవు. దేవతల వద్దనుండి మనిషి విలువైన దానిని కోరి దానికొరకు చేయు కార్యమును "దేవతారాధన"
అంటున్నాము. జగతిలో ఎన్నో రకములైన దేవతారాధనలు గలవు. ఒక క్షుద్రదేవతను ప్రసన్నము చేసుకొని ఆ దేవత
నుండి తాను ఆశించినది పొందవలెనని ఆ దేవతకు ఇష్టమైన జంతువును బలి ఇవ్వడము ఒక కార్యము కాగా, ఆ
కార్యమును క్షుద్రదేవతారాధన అంటాము. ఇట్లు క్షుద్రదేవతల ఆరాధనలు ఎన్నో రకములు మరియు మహాదేవతల
ఆరాధనలు ఎన్నో రకములు ప్రస్థుత కాలములో కూడ గలవు. అదే విధముగ మనుషులైన, బ్రతికియున్న బాబాలనూ,
చనిపోయిన స్వామీజీలను ఆరాధించడము గలదు. ఇంకా చెప్పుకొంటే సంతాన ధనమును ఆశించి పాములనూ,
ఆరోగ్యధనమును ఆశించి వృక్షాలనూ ఆరాధన చేయడము గలదు. దేహ బలమును విలువగా భావించిన కుస్తీ
పహిల్వాన్‌లు ఆంజనేయున్నీ, దొంగతనము సులభముగా జరగవలెనని దొంగలు కృష్ణున్నీ చదువు బాగా రావలెనని
సరస్వతిని, శక్తి కావాలని కాళికాదేవినీ, యుక్తి కావాలని విష్ణువునూ, ఎందరో ఎన్నో రకముల ఆరాధనలను చేయు
చుందురు. ఇటువంటి ఆరాధనలన్నిటిని కలిపి భగవద్గీతలో “అన్య దేవతారాధన” అని భగవంతుడన్నాడు.
యోగశాస్త్రమైన భగవద్గీతను ఆధారము చేసుకొని ఆరాధన విషయములను గమనిస్తే అందులో ఆరాధనలు
రెండు రకములుగా గలవు. ఒకటి జీవునికి అశాశ్వితమైన ధనమును అందించునవి. రెండు జీవునికి శాశ్వితమైన
ధనమును అందించునవి. ప్రకృతివశమైన సుఖములను అందించు ఆరాధనలను గురించి చెప్పుతూ పోతే వందలూ,
వేలూ, లక్షలూ గలవు. పరమాత్మవశమైన సుఖమును అందించు ఆరాధనలు కేవలము మూడే గలవు. వాటినే
భగవద్గీతలో ఒకటి బ్రహ్మయోగము, రెండు కర్మయోగము, మూడు భక్తియోగము అంటాము. ఈ మూడు యోగములను
ఆచరించని వారు కూడా మూడు యోగములకు నమూనాగా మూడు రకముల ఆరాధనలను, మూడు దినములందు,
మూడు కాలములలో ఆచరించునట్లు పెద్దలు తెల్పియున్నారు. ఆ మూడు ఆరాధనలనే త్రైతారాధన అంటున్నాము.
----------
ప్రపంచములోని ఆరాధనలన్నీ యోగమునకు సంబంధము లేనివై, భోగముల ధనమును కాంక్షించునవై ఉన్నవి.
కేవలము త్రైతారాధన మాత్రము జ్ఞాన ధనములను అందించి దేవునియందు ఐక్యము చేయగలదు. త్రైతారాధన
కాకుండా మిగతా ఆరాధనలన్నీ కర్మలను కలుగజేసి జన్మలకు పంపునవై ఉన్నవి.
బాగా ఆలోచిస్తే నేటి జనులలో పెద్దగా పేరుగాంచిన స్వామీజీలకే ఆరాధన యొక్క అర్ధము, విధానము
తెలియకుండ పోయినది. ఇక సాధారణ మనిషిని చూస్తే తానేమి చేయుచున్నాడో తనకే తెలియని స్థితిలో ఉంటూ
నేను చేయునదంతా సరియైనదే అనుకొంటున్నాడు. ఇటు సాధారణ మనిషిగానీ, అటు స్వామీజీలుగానీ నాకు అన్నీ
తెలుసునను గోడకట్టుకొని ఉండుట వలన వారు ఏమీ గ్రహించుకొను స్థితిలో లేరు. మనుషులలో అరుదుగా కొందరు
మాత్రము తనకు తెలియనిది తెలుసుకోవాలనుకొనినా, వారు కూడ దేవతారాధన చేయువారినే ఆశ్రయించి అదే
దారిలో పోవడము జరుగుచున్నది. ఆరాధనలలోనే పెద్దవనుకొనిన యజ్ఞయాగాదులూ, జప తపములూ తనను
ఆరాధించునవి కాదని భగవద్గీతలో దేవుడే స్వయముగా చెప్పినప్పటికీ ఆ విషయము తమకు తెలియకుండ పోయినది.
పీఠాధిపతులు, మఠాధిపతులు సహితము బాహ్యయజ్ఞములను చేయుచు అంతర్ యజ్ఞములను మరచిపోయారు.
భగవద్గీతలో చెప్పిన ద్రవ్యయజ్ఞము, జ్ఞాన యజ్ఞములను అర్థము చేసుకోలేక పోయారు. ఇటువంటి స్థితిలో సామాన్య
మానవున్ని సరియైన మార్గములో నడిపించి, దేవుని సన్నిధానమునకు చేర్చువారే కరువైపోయారు. ఇటువంటి
సందర్భములోనే ద్వాపరయుగములో దేవుడు భగవంతునిగా భూమిమిదకు వచ్చి, అన్య దేవతారాధన వదలి తనను
మాత్రము ఆరాధించమని భగవద్గీతలో చెప్పాడు. చివరకు యజ్ఞములు, దానములు, వేదపఠనములు, తపస్సులు కూడ
తన ఆరాధనకాదనీ, వాటి వలన నావద్దకు చేరలేరనీ చెప్పిపోయాడు. ఆ విషయము ప్రజలకు తెలిస్తే మాకున్న
గౌరవము పోతుందని తలపోసిన కొందరు స్వామీజీలు దేవుడు చెప్పిన దానిని ప్రజలకు తెలియకుండ చేశారు.
అందువలన దేవుని జ్ఞానవిషయములో ప్రజలు ఎంతో నష్టపోయినవారైనారని చెప్పవచ్చును.
ఇదంతయు గ్రహించిన దేవుడు తాను భూమిమీద చెప్పిన ధర్మములు ఎవరికి తెలియకుండ పోయినవని
తెలిసి, అధర్మములు అణిగిపోకుండ సజీవముగా ఉన్నవని గ్రహించి, అధర్మములను అణచివేసి ధర్మములను వృద్ధి
చేయుటకు పూర్వమున్న జ్ఞాన విషయములను మనకు జ్ఞాపకము చేయదలచుకొన్నాడు. అందువలన ఈ విషయములను
ఊహ ద్వారా నాకు అందించి, వ్రాయించి మాకు తెలియజేయుచున్నాడు. అందువలన “త్రైతారాధన" అను పుస్తకములో
వ్రాయబడియున్న మూడు ఆరాధనలు దేవతారాధనలు కావనీ, దేవుడు గీతలో తెల్పిన మూడు యోగముల సారాంశమే
త్రైతారాధన అని తెలియవలెను. త్రైతారాధనను ఆచరించిన వారు మూడు యోగములను ఆచరించినట్లగును. అందువలన
దైవ సన్నిధియైన మోక్షమును పొందుటకు మూడు ఆరాధనలు మూడు సోపానములలాంటివని చెప్పవచ్చును. ఈ
త్రైతారాధనను చదివి ఆచరించక పోయినా పరవాలేదు, కానీ దీనిని గురించి వ్యతిరేఖముగా మాట్లాడితే అది తప్పక
దైవదూషణయగును. ఎవరికీ తెలియకుండ పోయిన త్రైతారాధనను గురించి ఎవరికైనా చెప్పినా, ఈ పుస్తకమును
ఎవరికైన దానము చేసినా అది దేవుని కార్యమును చేసినట్లగును. అది నిజమైన దేవుని సేవయగును.
ఇట్లు
ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.
--------
త్రైతారాధన.
గగనమ్ శూణ్యమ్ అను నానుడి అందరు వినియేయుందురు. అది కేవలము ఒక నానుడియే కాక నగ్నసత్యము.
వివరముగా చెప్పుకొంటే గగనము అనగా ఆకాశము అని అర్థము. ఆకాశము అనగా శూణ్యమనియే అర్ధము.
శూణ్యమును దేవునితో సమానముగా, ఏది కానిదని ఉపమానముగా చెప్పవచ్చును. శూణ్యము లేక ఆకాశము
దేవుడుకాకపోయినప్పటికి దేవునికి దగ్గరగా, దేవునికి సమతగా చెప్పవచ్చును. ఏ స్థూలపదార్థమూ కానటువంటి
దేవున్ని ఏ స్థూల వస్తువుగాని శూణ్యముతో పోల్చి చెప్పుటకు అవకాశము గలదు. నేటికినీ చాలామంది దైవమును
జ్ఞాపకము చేసుకొన్నపుడు ఆకాశమువైపు చూచి నమస్కరించుచుందురు. క్రికెట్ ఆటగాళ్ళు నూరు రన్నులను చేసినపుడు
దేవునికి కృతజ్ఞత చెప్పుకొన్నట్లు ఆకాశమువైపు చూచుట గమనించవచ్చును. అదేవిధముగా కొందరు తమ మాటలలో
దేవుడు పైనుండి చూస్తున్నాడని కూడ అనుచుందురు. ఇట్లు అనేకమంది తమ భావములో దేవుడు ఆకాశములో
నిండియున్నాడని తలచుచుందురు. దేవుడు కనిపించకుండ అణువణువున ఆకాశమంతా నిండియుండడము వాస్తవమే.
అందువలన గగనమ్ శూణ్యమ్ అన్నట్లు శూణ్యమ్ దైవమ్ అనికూడ అనవచ్చును. అంతేకాక దేవుడు పైనుండి
చూస్తున్నాడని చాలామంది అనుచుందురు. ఈ మాటలన్నిటిని బట్టి దేవుడు పైనున్న ఆకాశములో కూడ ఉన్నాడని
చెప్పవచ్చును. దేవుడు గాలిలోనూ, అగ్నిలోనూ, నీరులోనూ, భూమిలోనూ అణువణువునా నిండివున్నప్పటికీ, వాటికి
ప్రాధాన్యతనివ్వకుండ ఒక్క ఆకాశమునకే ఎందుకంత ప్రాధాన్యత నిచ్చారని యోచిస్తే కొంత వివరము తెలియగలదు.
ఆ వివరమేమనగా!
గాలి, అగ్ని నీరు, భూమిలలో స్వయం ప్రకాశమైనవి ఏవీలేవు. ఎక్కడైన భూమిలో రత్నములాంటివి చిన్న
ప్రకాశముగలవి ఉండినా అవి సజీవముగా ఉండవు. ఒకేవొక ఆకాశములో మాత్రమే సజీవముగా ఉండి,
ప్రకాశముగలవియైయుండి, దేనినైనా గ్రహించు శక్తిగల గ్రహములుగా ఉన్నవి మూడే మూడు గలవు. అవియే ఒకటి
సూర్యుడు, రెండు చంద్రుడు, మూడు నక్షత్రము. ఆకాశములోనున్న సూర్య,చంద్ర,నక్షత్రములు మూడు పూర్వకాలమునుండి
మనుషులచేత దైవసమానముగా పరిగణింప బడుచున్నవి. భూమి మీద నివశించు ప్రజలు నాగరికతలేని కాలమునుండి
సూర్యున్ని కొందరూ, చంద్రున్ని కొందరూ, నక్షత్రమును కొందరూ ఆరాధిస్తూనే ఉన్నారు. మనుషులు సృష్టించుకొన్న
విగ్రహారాధన లేని కాలములో కూడ గ్రహములైన సూర్య,చంద్ర, నక్షత్రములను ఆరాధించెడి వారు. కొన్ని దేశములలో
సూర్యున్ని ఎక్కువ ఆరాధించెడివారు, మరికొన్ని దేశములలో చంద్రున్ని ఎక్కువ ఆరాధించెడివారు. కొన్ని దేశములు
ప్రత్యేకించి నక్షత్రమునే ఎక్కువ ఆరాధించెడివారు. ఇంకా కొన్ని దేశములలో చంద్రున్ని నక్షత్రమును ఆరాధించగా,
ఇంకా కొన్ని దేశములలో సూర్యచంద్రులనూ, మరికొన్ని దేశములలో మూడు గ్రహములనూ ఆరాధించెడివారు. ఇప్పటికీ
ఆయాదేశములలో వారి దేశ జెండాలమీద వారు ఆరాధించెడి గ్రహముల బొమ్మలను గుర్తుగా పెట్టుకొని గౌరవప్రదముగా
చూచుకొనుచున్నారు. నేటికినీ అమెరికా జెండాలలో నక్షత్రములనూ, పాకిస్థాన్ జెండాలో చంద్రున్ని నక్షత్రమునూ
అందరూ గమనించియేయుందురు. లెక్కించి చూచితే 73 దేశాలు తమ జెండాల మీద సూర్యుడినో, చంద్రున్నో
నక్షత్రములనో ముద్రించుకొన్నాయి. అర్జెంటీనా మొదలగు 13 దేశములు సూర్యుని జెండాను పెట్టుకోగా, మాల్టీవులు
చంద్రుని జెండాను పెట్టుకోగా, క్యూబా, చైనా, అమెరికా మొదలగు 59 దేశములు నక్షత్రమును జెండాలో పెట్టుకొన్నవి.
----
పూర్వమునుండి దైవజ్ఞానములో వెనుకబడియున్న 78 దేశములు ఆకాశములోని మూడు గ్రహములను
ఉన్నతముగా దైవసమానముగా భావించి దేశజెండాలమీద గౌరవముగా పెట్టుకోగా, పూర్వమునుండి ఆత్మజ్ఞానములో
అతి ఉన్నతస్థానములోవుండి, జ్ఞానమునకు గుర్తుగా ఇందువులనీ, జ్ఞాననిలయమైన భారతదేశము ఇందూదేశమనీ
పేరుగాంచి యుండగా, నేడు జ్ఞానమును కోల్పోయిన మనము మన దేశజెండాలమీద సూర్య, చంద్ర, నక్షత్రములలో
ఏ ఒక్కదానిని కూడ పెట్టుకోక మూడు రంగులనూ, ఒక బండిచక్రమునూ ఉంచుకొన్నాము. జెండాల విషయము
అటుంచితే నేటికినీ భారతదేశములో సూర్యచంద్రాదులను కొందరు ఆరాధిస్తూనే ఉన్నారని ఒప్పుకోక తప్పదు.
సూర్యనమస్కారములను పేరుతో సూర్యున్నీ పౌర్ణమి పూజలను పేరుతో చంద్రున్నీ అమావాస్య పూజలని నక్షత్రములను
ఆరాధించడము జరుగుచున్నది. ఈ విధముగా ప్రపంచ నలుమూలల్లోనూ నాగరికతయున్నవారూ, నాగరికతలేనివారూ,
తెలిసో తెలియకనో సూర్య చంద్ర నక్షత్రములను ఆరాధిస్తూనే ఉన్నారు. ఇందూ దేశమైన భారత దేశములో నేటికినీ
కొన్ని చోట్ల సూర్యదేవాలయములు గలవు. సూర్య నమస్కారములని ఉదయము ఎవరో ఒకరు సూర్యునికి మ్రొక్కడము
కూడ కలదు.
ఈ విధముగా చూస్తూపోతే భూమిమిాద పూర్వమునుండి ఆకాశములోని మూడు గ్రహములకు దైవసంబంధముగా
ఎంతో విలువ గలదు. గొప్ప విలువగల సూర్య,చంద్ర,నక్షత్ర గ్రహములను విశధీకరించు కొని చూచితే సూర్యుడు
ఎక్కువ తేజస్సు కలిగి ఎక్కువ కాంతినిచ్చుచూ మొదటి స్థానములోనున్నాడు. అలాగే రెండవస్థానములో చంద్రుడు
సూర్యునికంటే తక్కువ తేజస్సు కలిగి తక్కువ కాంతినిచ్చుచున్నాడు. మూడవస్థానములో నక్షత్రము చంద్రునికంటే
తక్కువ కాంతినివ్వడము తక్కువ ప్రకాశము కల్గియుండడమును గ్రహించవచ్చును. కాంతినివ్వడములోను, ప్రకాశముగా
కనిపించడములోను మొదటి సూర్యుడు ఒకటవ స్థానములో నుండగా, చంద్రుడు రెండవస్థానములోనున్నాడు. అలాగే
నక్షత్రము మూడవస్థానములోనున్నది. దూరములో ఎవరు దూరముగానున్నారని చూచితే కాంతిలో రెండవ
స్థానములోనున్న చంద్రుడు మనకు 3,84,401 కిలోమీటర్ల దూరములో ఉండగా, సూర్యుడు దాదాపు 14,96,00,000
కిలోమీటర్ల దూరములో ఉండగా నక్షత్రములు కొన్ని లక్షల కోట్ల కిలోమిటర్ల దూరములోనున్నవి. దీనిప్రకారము
గమనిస్తే చంద్రుడు సూర్యునికంటే దగ్గరగా ఉన్నాడనీ, చంద్రుడు దగ్గరవాడు సూర్యుడు దూరము వాడు, నక్షత్రము
ఇంకా దూరముగానున్నదని తెలియుచున్నది. మూడుగ్రహములను విడివిడిగా కాంతిలోను, దూరములోను గమనించాము.
అలాగే ఇంకో విధముగా కాలములో చూస్తే సూర్యుడు పగలు, చంద్రుడు రాత్రి, నక్షత్రము ఎల్లపుడు కనిపిస్తారు.
అందువలన పగలుకు రాజు సూర్యుడనీ, రాత్రికి రాజు చంద్రుడనీ, ఎల్లవేళల రాజు నక్షత్రమని పూర్వమునుండి మన
పెద్దలు చెప్పుచున్నారు. ఇప్పటకీ చాలామంది వ్రాసిన వ్రాతలలో రేరాజు చంద్రుడనీ, దినకరుడు సూర్యుడని కనిపిస్తూనే
ఉండును.
ఆకాశములోని మూడు గ్రహములు కాంతిలోనూ, దూరములోనూ, అధికారములోనూ మూడురకములుగానే
ఉన్నారు. “గగనమ్ శూణ్యమ్, శూణ్యమ్ దైవమ్, దైవమ్ త్రైతమ్” అని ఇపుడు మనము చెప్పుకొనుచున్నాము.
-------------
చివరకు దీని సారాంశము ఏమిటంటే దైవము మూడు విధములుగా ఉన్నాడని అర్ధము. ఆధ్యాత్మికములో ముఖ్యసూత్రము
కూడా ఇదియే. కనిపించని దైవము (దేవుడు) కనిపించని మూడు భాగములుగా ఉన్నాడు. ఆ మూడు భాగములనే
భగవద్గీతలో క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడని అన్నారు. అదే అర్ధమయ్యేటట్లు చెప్పుకొంటే నాశనమగువాడు,
నాశనముకానివాడు మరియు మొదటి ఇద్దరి పురుషుల కంటే అతీతుడు ఉత్తమమైనవాడని అర్ధము. ఈ ముగ్గురినే
ఇంకా బాగా అర్ధమగునట్లు చెప్పుకొంటే జీవాత్మ, ఆత్మ పరమాత్మ అని చెప్పవచ్చును. ఈ త్రైతమైన దైవము కంటికి
కనిపించువాడు కాదు. కనుక దైవమును తెలుపు నిమిత్తము కంటికి కనిపించు సూర్య,చంద్ర,నక్షత్రములు మూడింటిని
శూణ్యములో దేవుడే ప్రతిష్టించాడు. అందువలన సూర్య, చంద్ర, నక్షత్రములను ప్రత్యక్ష దైవములని మన పెద్దలు
చాలా సందర్భములలో చెప్పారు.
కనిపించని దైవమును తెలియుటకు కనిపించెడి సూర్య,చంద్ర, నక్షత్రములను పెట్టాడని చెప్పుటకు బలమైన
తార్కాణము కూడ కలదు. అదేమనగా! దైవము భగవద్గీతలో విశ్వరూపసందర్శన యోగమను అధ్యాయములో “నేను
కాలమును” అన్నాడు. ఆ కాలమును కొలుచుటకు సూర్య, చంద్ర, నక్షత్రములు తప్ప ఏమి ఆధారములేదు. అందువలన
ఎటు చూచినా దైవమునకు, మూడు గోళములకు ఎంతో సంబంధమున్నదనియే చెప్పవచ్చును. ఇంతవరకు మనము
చెప్పుకొన్నది అభౌతికమైన దేవున్ని తెలియుటకు భౌతికమైన సూర్య, చంద్ర, నక్షత్రాదులు ఆధారమని, భౌతికపద్ధతిగా
కనిపించెడి సూర్య, చంద్ర, నక్షత్ర గోళములను గూర్చి చెప్పుకొన్నాము. ఇక ఆధ్యాత్మిక పద్ధతిగా వివరించుకొని
చూస్తాము. ఇంతవరకు మనము చెప్పుకొన్న విషయమంతా విశ్వములోనున్న అందరికి సంబంధించినదని
గుర్తుంచుకోవలెను. విశ్వవ్యాప్తముగా అందరికి సంబంధించిన విషయము కావున ఇది ఏ ఒక్క మతమునకు
సంబంధించినది కాదని జ్జప్తిలో పెట్టుకోవలెను. దేవుడు అందరిని సృష్టించాడు, దేవుడు అందరివాడు. దేవున్ని
తెలుసుకోవడములో అందరికీ సమాన హక్కు ఉన్నది. అందువలన ఈ విషయము మతాతీతమైనదని గ్రహించవలెను.
భూమి మీద మనుషులను దేవుడు ఒకే పద్ధతిలో శరీరములను తయారు చేసి ఏ మతముగాని ఒకే ధర్మము
ప్రకారము పుట్టిస్తే, మనిషి అధర్మములను ఆచరిస్తూ, అనేక మతములను సృష్టించుకొని, మనుషులంతా ఒకే జాతియని
మరచిపోయి, మతపిచ్చిలో పడి తమజాతిని తామే ద్వేషిస్తూ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకొనుచున్నారు. అటువంటి
మత ద్వేషములు, మత హింసలు పోవాలంటే దైవజ్ఞానము తెలిసియుండాలి. దైవజ్ఞానము ప్రకారము మనిషిగానీ,
జంతువుగానీ, పక్షిగానీ అన్ని జీవరాసులు మతములేనివై సమానముగా ఉన్నవి. దాని ప్రకారము మనుషులందరిలో
దైవ ధర్మము సమానము. ఒక మనిషిని తీసుకొంటే అతని శరీరములో మూడు ఆత్మలు నివశిస్తున్నవి. శరీరము వేరు
ఆత్మలు వేరు. శరీరము కనిపించుచున్నది, ఆత్మలు కనిపించవు. పైకి మనిషి ఏ మతము పేరు చెప్పుకొనినా, మా
దేవుడు పలానా అని ఏ దేవుని పేరు చెప్పుకొనినా, శరీరములోపలి ఆత్మలు మాత్రము అందరిలో ఒకే ధర్మము
ప్రకారము నిర్మింపబడియున్నాయి. మా మతములో ఆత్మలను గురించి చెప్పలేదనినా, మామతములో ఉన్నవి రెండు
ఆత్మలే అనినా, లేక ఒకే ఆత్మనినా, మనకు ఇష్టమొచ్చిన మత విధానమును గురించి చెప్పినా, దేవుని ధర్మము
ప్రకారము ప్రతి మనిషి మూడు ఆత్మలచే నిండియున్నాడు. ఆ మూడు ఆత్మలే జీవాత్మ ఆత్మ, పరమాత్మయని
జ్ఞప్తికుంచుకోవలెను. ఆధ్యాత్మికరంగమునకు ఈ మూడు ఆత్మలే ఆధారము. ఎవరికైనా మూడు ఆత్మల వివరము
తెలియనంతవరకు ఆధ్యాత్మికము తెలియనట్లే. ఈ మూడింటినే త్రైతము అంటున్నాము. త్రైతము శాస్త్రబద్దముగా,
----------------
సిద్ధాంత బద్గముగా చెప్పబడినది కావున మూడు ఆత్మల శాస్త్రీయతను థైతసిద్ధాంతము అంటున్నాము. త్రైతసిద్ధాంతమును
తెలియుట శరీరము ధరించిన ప్రతి మనిషికీ, శిరస్సుగల ప్రతి మతస్థునికీ అవసరము.
దేవుడు విశ్వములో జీవరాసులయందు మూడు ఆత్మలుగా విభజింపబడియున్నాడు. విశ్వములో మూడు
ఆత్మలుగానున్న దైవము ఆకాశములో మూడు గోళములుగా కనిపిస్తున్నాడు. దైవము తన ఉనికిని చాటుకొనుటకు
అకాశములో సూర్య,చంద్ర, నక్షత్రములుగా కనిపించవలసి వచ్చినది. ఇందులో సూర్యున్ని జీవాత్మగానూ, చంద్రున్ని
ఆత్మగానూ, నక్షత్రమును పరమాత్మగానూ పోల్చి చెప్పవచ్చును. మతాలకు అతీతముగా ప్రతి శరీరములోనూ మూడు
ఆత్మలు గలవు. ప్రపంచములో మూడు ఆత్మలులేని మనిషిగానీ, జంతువుగానీ, పక్షిగానీ, చిన్న క్రిమిగానీ, కీటకముగానీ
ఏదీలేదు. మూడు ఆత్మల విషయము నిగూఢమైన రహస్యము. ఆ రహస్యమును తెలుసుకొనుటకు ఆధారముగానున్న
సూర్య,చంద్ర, నక్షత్రములకు ప్రత్యేకతను కల్గించుటకు, వారములోని ఏడు దినములో మొదటి మూడు దినములకు ఈ
మూడు గోళముల పేర్లనే ఉంచారు. వారములో ప్రారంభమగు మొదటి దినమునకు సూర్యుని పేరుండునట్లు
ఆదివారమనియూ, రెండవ దినమునకు చంద్రుని పేరుండునట్లు సోమవారమనియూ, అట్లే మూడవ దినమునకు
నక్షత్రము పేరుండునట్లు మంగళవారమనియు పేర్లు పెట్టడము జరిగినది. సూర్యున్ని ఆదిత్యుడు అంటారు అందువలన
ఆదివారమనియూ, చంద్రున్ని సోముడు అంటారు కాబట్టీ సోమవారమనియూ, నక్షత్రమును మంగళుడు అంటారు
కావున మంగళవారమనియు చెప్పారు.
ప్రతి శరీరములోని జీవాత్మ అజ్ఞానసంబంధమైనది, ఆత్మ మాత్రము జ్ఞాన సంబంధమైనది, పరమాత్మ
మోక్షసంబంధమైనది. అందువలన సూర్యుని దినమైన ఆదివారమును అజ్ఞాన జీవాత్మ పుట్టిన దినమనీ, చంద్రుని
దినమైన సోమవారము ఆత్మజ్ఞానము పుట్టిన దినమనీ, నక్షత్రదినమైన మంగళవారము మోక్షము తెలిసిన దినమని
చెప్పవచ్చును. ఇంకనూ వివరముగా చెప్పుకొంటే దేవుడు జీవులకొరకే విశ్వమును సృష్టించాడు. కావున ఆదినమును
ఆదివారము అంటున్నాము. “ఆది అనగా మొదటి అనికూడ అర్ధముగలదు. జీవాత్మ ఆత్మ, పరమాత్మలో మొదటివాడైన
జీవున్ని సృష్టించిన దినము కావున ఆవిధముగా కూడ మొదటి దినమును ఆదివారము అనుచున్నాము. ఇదంతయు
మనుషులందరికీ సంబంధించిన విషయమని ముందే చెప్పుకొన్నాము కదా! దానిప్రకారమే నేటికి కూడ మనుషులు
నివసించుచున్న ఎక్కడైనా ప్రపంచవ్యాప్తముగా ఆదివారము, సోమవారము, మంగళవారము మూడు గలవు. ఈ
మూడు దినముల పేర్లు విశ్వవ్యాప్తముగా ఉండడమును బట్టి త్రైతమైన మూడు ఆత్మల విషయము అన్ని దేశములవారికీ,
అన్ని మతములవారికీ తప్పనిసరిగా అత్యవసరముగా తెలియవలసిన అవసరమున్నది. అయితే ఇంతవరకు ఇటు
స్వదేశమైన భారతదేశములోనూ, అటు పరదేశములైన 194 దేశములలోనూ మూడు ఆత్మల విషయముగానీ, వివరముగానీ
ఏమాత్రము తెలియదు. ఇతర దేశములను వదలి మన భారతదేశ చరిత్రను త్రవ్విచూస్తే పూర్వము అన్ని దేశములకంటే
భారతదేశమే ఎక్కువగా ఆత్మజ్ఞానమును తెలిసిన దేశముగా ఉండెడిది. చంద్రుడు ఆత్మ జ్ఞానమునకు చిహ్నము కావున
వారములో రెండవదినముగా ఉన్నదని చెప్పుకొన్నాము. రెండవ దినమును సోమవారమని అంటున్నాము. సోమవారమును
“ఇందువారమని కూడ అనెడివారు. ఇందు అనగా చంద్రుడు అని అర్ధము. దానిప్రకారమే “ఇందు అనగా జ్ఞానము
అనికూడ అర్ధము. “మతి అనగా తెలివి (బుద్ధి) అని అర్ధము. “ఇందుమతి అనగా జ్ఞానముగల బుద్ధి అని అర్ధము.
ఈ విధానముతోనే ఇందుమతి అని పేరు కూడ మన దేశములో చాలామంది పెట్టుకొనెడివారు. పూర్వము అన్ని
దేశములకంటే మిన్నగా ఆత్మజ్ఞానముగల మనుషులు మన దేశములో ఎక్కువగా ఉండెడివారు. కావున భారత దేశమునకు
-------------
ఇందూదేశమని పేరు వచ్చినది. పూర్వము ఒకనాడు ఇందూదేశమని పేరుగాంచిన మన దేశము నేడు ఆత్మజ్ఞానము
లేనిదై హిందూదేశముగా మారిపోయినది. “ఇందూ” అను శబ్దమునకు అర్ధము గలదు. “హిందూ” అను శబ్దమునకు
అర్ధము లేదు. మనది అర్ధములేని హిందూదేశముకాదు, అర్ధమున్న ఇందూదేశమని విప్పిచెప్పినా అర్థము చేసుకోలేని
అజ్ఞానులు సత్యము చెప్పే వారిమీదికి దాడికి దిగుచున్నారు. అనంతపురము జిల్లాలోని గుంతకల్లు మండలములో
మతభక్తి తప్ప, దైవభక్తిలేని హిందూమతనాయకులమని చెప్పుకొనువారు అలాంటిపనికి పూనుకొన్నారంటే ఆశ్చర్యముకాదా!
ఇందూదేశము హిందూదేశముగా మారిపోయినప్పటికీ, ఆనాటికీ ఈనాటికీ ఎప్పటికీ భారతదేశము ఇందూదేశమే.
ఎందుకనగా నేడు కూడ మూడు ఆత్మల త్రైత జ్ఞానమును గురించి, మూడు దినములైన ఆది,సోమ, మంగళవారముల
విశిష్టతను గురించి తెల్పునది భారతదేశము లోనివారే. నేటికినీ ఇందూదేశమైన భారతదేశమునుండియే బయటి
దేశములకు ఆత్మజ్ఞానమంటే ఏమిటో తెలియుచున్నది. ఇప్పటికి కూడ ఇందూజ్ఞానమే విశ్వవ్యాప్తముగానున్న దనుటకు
పెద్ద తార్కాణము గలదు. ఆ ఆధారమేమనగా! ఆది, సోమ, మంగళవారములు మూడు అన్ని దేశములలోను గలవు.
అంతేకాక వారమునకు ఏడు దినములు, నెలకు 30 దినములు ఇందూసాంప్రదాయము ప్రకారము గలవు. అన్నిటికంటే
ముఖ్యముగా అమెరికాలోగానీ, ఆంధ్రాలో గానీ మొదటి దినమైన సూర్యుని దినమును సూర్యుని పేరుతోనే సన్ (SUN)
అనియూ, రెండవదినమైన చంద్రుని దినమును చంద్రుని పేరుతోనే మూన్ (MOON) అనియూ చెప్పుకొనుచున్నారు.
మొదటి దినమైన సూర్యుని దినమును ఇంగ్లీషులో సన్‌డే అనియూ, రెండవదినమైన చంద్రుని దినమును మూన్‌డే
అనియూ అన్ని విదేశీక్యాలెండర్లలోను గలవు. చిన్న పొరపాటు ఏమిటంటే ఆదివారమును సన్‌డే (SUN DAY) అని
వ్రాసినవారు రెండవదినమును మన్‌డే (MONDAY) అని వ్రాశారు. దీనిని గమనిస్తే మన్‌దే ఉండవలసిన చోట
వాస్తవానికి మూన్‌డే ఉండవలెను. కాలక్రమమున (MOON DAY) అని ఉండవలసిన చోట రెండు సున్నలలో ఒక
సున్న ఎగిరిపోయి ఒక సున్న మిగలడము వలన (MON DAY) మండే అయినది. ఇది కేవలము కాలక్రమమున
జరిగిన పొరపాటుగా గమనించవలెను. తెలుగు భాషలో మాత్రము మొదటి మూడు దినముల పేర్లు నేటికినీ చెడిపోకుండ
అలాగే గలవు.
చంద్రుడు భూమికి దగ్గరగా ఉండినప్పటికీ, సూర్యుడు చంద్రుని కంటే దూరముగా ఉండినప్పటికీ వారములోని
ఏడుదినములలో మొదట సూర్యుని దినమైన ఆదివారము (SUN DAY) ను ఉంచి, రెండవదినముగా చంద్రునిదినమైన
సోమవారము (MON DAY)ను ఉంచడమేమిటనీ? మరియు దూరమును ఆధారము చేసుకొని మొదట సోమవారమునుంచి
తర్వాత ఆదివారమునుంచడము సమంజసము కదా! అని కొందరడుగ వచ్చును. దానికి సమాధానము ఏమనగా!
ఇంతకు ముందు పేజీలలో కాంతిని బట్టి సూర్యుడు మొదటివాడనీ, చంద్రుడిని రెండవవాడనీ, నక్షత్రము మూడవదనీ,
దానినిబట్టి వారికి సమాన పోలికలలో సూర్యునికి జీవున్ని చంద్రునికి ఆత్మను, నక్షత్రమునకు పరమాత్మను పోల్చుకొన్నాము.
దూరమును బట్టి చూస్తే చంద్రుడు దగ్గర వాడే అయినప్పటికీ వారములో సూర్యున్నే మొదట ఉంచి ఆదివారమును
మొదటి. దినముగా ఉంచడమునకు ఆధ్యాత్మిక కారణము కలదని చెప్పవచ్చును. అదేమనగా! చంద్రుడు భూమికి
దగ్గరగా ఉన్నట్లు, శరీరములో కూడ చంద్రసమానమైన ఆత్మ శరీరమంత వ్యాపించి బయటి చర్మము వరకు, వెంట్రుకల
వరకు ఉండి బయటి మనుషులకు దగ్గరగా ఉండినప్పటికీ, శరీర బాహ్య అవయవముల వరకు వ్యాపించి అన్నిటిని
కదిలించి పని చేయిస్తూ ఉన్నప్పటికీ ఆత్మను ఎవరూ దగ్గరగా గుర్తించడములేదు. ఆత్మ శరీరబాహ్య అవయవముల
వరకు వ్యాపించియుండి పనిని చేయిస్తుందని ఎవరూ అనుకోవడములేదు. భూమికి సూర్యుడు దూరముగా ఉన్నట్లు,
------
శరీరములో కూడ సూర్యునితో సమాన పోలికయున్న జీవుడు బాహ్య ప్రపంచమునకు చాలా దూరముగా శరీరము
లోపల నివాసమున్నాడు. తల ఫాలభాగములో (నుదిటి భాగములో) తలలోపల గుణచక్రములో చిక్కుకొన్న జీవుడు
బాహ్య అవయవములతో సంబంధము లేకుండా దూరముగా ఉండినప్పటికీ, ఏ అవయవమును జీవుడు కదిలించి
పనిని చేయించనప్పటికీ, తానే అన్నీ చేస్తున్నట్లూ, తాను బయటి శరీరముగా ఉన్నట్లు తలచుచున్నాడు. ప్రతి ఒక్కరు
శరీరమును నేనే, నేనే శరీరమును అను భావముతో ఉన్న దానివలన దూరముగానున్న సూర్యున్ని మొదటి
దినముగాయుంచి, దగ్గరగాయున్న చంద్రున్ని రెండవ దినముగా ఉంచడము జరిగినది. దూరమును బట్టి లోపల గల
ఆత్మనుగానీ, బయటగల చంద్రున్నిగాని తీసుకోక బాహ్యముగానున్న వెలుగును బట్టీ, అంతరముగానున్న భావమునుబట్టి,
మొదట ఆదివారమును తర్వాత సోమవారమును ఉంచడము జరిగినది. దీనిని ఎవరైనా కాదనగలరా? బాహ్యకాంతిని
బట్టి, అంతర్ భావమునుబట్టి పెద్దలు నిర్ణయించినవే ఆది,సోమ,మంగళవారములనీ, ఇవియే ప్రపంచ వ్యాప్తముగా
నేటికినీగలవనీ తెలిసినపుడు ఎవరూ కాదనలేరు. నేడు చిన్నదిగా కనిపిస్తున్న ఇందూ సంస్కృతి పూర్వము
ప్రపంచవ్యాప్తముగా ఉండెడిదని ఇప్పటికీనున్న సన్‌డే (ఆదివారము) వలన తెలియుచున్నది.
సన్‌డే (ఆదివారము) అయిన తర్వాత మూన్‌డే (సోమవారము) వస్తున్నది. మూన్‌డే (సోమవారము) తర్వాత
స్టార్‌డే (నక్షత్రవారము) రావలయును. కానీ మూడవ దినము అలా స్టార్‌డే అనకుండ ట్యూస్‌డే అనుచున్నాము.
ఇంగ్రీషు భాషలో ట్యూస్‌డే అనగా ఎర్రని గ్రహమైన కుజగ్రహ దినమని అర్ధము. ఇది ఆంగ్రభాషలో (ఇంగ్లీషులో) ఉండే
మూడవ దినము యొక్క పేరుండగా, తెలుగుభాషలో మూడవ దినమునకు నక్షత్రము యొక్క పేరే గలదు. నక్షత్రము
యొక్క భావము ప్రకారము దానిని శుభకర దినమని చెప్పుచు మంగళవారమని అనుచున్నాము. ఇందూదేశమైన
భారతదేశములో ఆత్మజ్ఞానముననుసరించి మొదటి మూడు పేర్లు మూడు దినములకుండగా, విదేశములలో మన
ఇందూ సంస్కృతికి అద్దము పట్టినట్లు మొదటి రెండు దినములు సూర్య చంద్ర దినములుగానే ఉన్నవి.
షట్‌శాస్త్రములలో ఆరవశాస్త్రమైన బ్రవ్మవిద్యాశాస్త్రములో అనగా భగవద్దీతలో విశ్వరూపసందర్భన యోగమునందు,
32వ శ్లోకములో “కాలోస్మి” అను పదమును దేవుడుపయోగించి చెప్పాడు. కాలోస్మి అనగా కాలమును నేనే అని
అర్ధము. దీనినిబట్టి దేవుడు కనిపించని కాల స్వరూపుడుగా ఉన్నాడని తెలియుచున్నది. కనిపించని కాలము మనముందరే
క్షణక్షణము జరుగుచున్నది కానీ కాలమంటే ఏమిటో ఎవరికి కనిపించదు. అంతేకాక కాలము మనముందరే దినములుగా,
నెలలుగా, సంవత్సరము లుగా జరిగిపోవుచున్నప్పటికీ, అది అర్ధము కానిదే కావున దేవుడు ఎవరికీ కనిపించడు,
తెలియబడడు అని చెప్పవచ్చును. కనిపించని అభౌతికమైన కాలమును భౌతికమైన గణితముతో దినముగా, మాసముగా,
సంవత్సరముగా లెక్కించుకొంటున్నాము. అగమ్యమైన, అభౌతికమైన ఆకాశములో భౌతికమైన సూర్య, చంద్ర, నక్షత్రములు
మూడు ఎట్లు త్రైతముగా కనిపిస్తున్నవో అలాగే అభౌతికమైన కాలము కూడా దినము, నెల, సంవత్సరము అను
త్రైతముగానే తెలియుచున్నది. అంతేకాక ఇంకొక విధముగా గమనిస్తే సృష్టికర్తయిన కనిపించని పరమాత్మ అండజ,
పిండజ, ఉద్భిజ అను మూడు కనిపించే జీవరాసులుగా విభజింపబడి త్రైతముగానే ఉన్నాడు.
1. తెలియని అకాశము ఒకటికాగా తెలిసెడు సూర్య, చంద్ర, నక్షత్రములు మూడు (త్రైతము) గలవు.
2. తెలియని కాలము ఒకటికాగా తెలిసెడు దినము, మాసము, సంవత్సరము మూడు (త్రైతము) గలవు.
3. తెలియని పరమాత్మ ఒకటికాగా తెలిసెడు అండజ, పిండజ, ఉద్భిజము మూడు (త్రైతము) గలవు.
-----------
ఈ మూడింటిలోను మొదటిదైన సూర్యచంద్రాదులను గురించి తెలుసుకొన్నాము. గ్రహములైన సూర్యచంద్రాదుల
గమనమును తెలుపునవి దినములు, మాసములు, సంవత్సరములు. దిన,మాస,సంవత్సరములు కాలములోని భాగములని
తెలుసుకొన్నాము కదా! కాలమైన దేవునికి 108 కోట్ల సంవత్సరములు పగలుగా నిర్ణయింపబడినది. ఈ విషయము
ఆరవ శాస్త్రములో అక్షర పరబ్రహ్మయోగమను అధ్యాయములో 17వ శ్లోకములో చెప్పబడినది. ఇది అక్కడి శ్లోకమును
పరిశోధించి చూచితే తెలియబడును. శ్లోకములో వేయి యుగములు దేవునికి పగలుగా చెప్పబడినది. యుగములు
ఉన్నవి నాలుగే కావున ఆ నాలుగు యుగములను 250 మార్లు లెక్కించి చూచితే దేవునికి ఒక పగలు కాలము ఎన్ని
సంవత్సరములైనది తెలియును. దేవుని యొక్క ఒక పగలు కాలమే ప్రపంచము యొక్క ఆయుష్షని తెలియుచున్నది.
కలియుగము 4,32,000 సంవత్సరములు
ద్వాపరయుగము 8,64,000 సంవత్సరములు
త్రైతాయుగము 12,96,000 సంవత్సరములు
కృతయుగము 17,28,000 సంవత్సరములు
నాలుగుయుగములు కలిసి 43,20,000 సంవత్సరములు కాగా వేయి యుగములకు మొత్తము 108 కోట్ల
సంవత్సరములగుచున్నవి. 108 కోట్ల సంవత్సరములు, కాలము లెక్కలో (దేవుని లెక్కలో) ఒక దినముగా
లెక్కించబడుచున్నది. దేవుని ఒక్క పగలును మాత్రము ప్రపంచ ఆయుష్షుగా నిర్ణయించడమైనది. ఆరవశాస్తబద్ధమైన
ప్రపంచ ఆయుష్షు అందరికి తెలియునట్లు 108 సంఖ్యను ముఖ్యముగ అనేక సందర్భములలో మనము
వాడుకొనుచున్నాము. 108 సంఖ్య సృష్టియుండు కాలమును తెలుపుచున్నది. కావున ఈ సంఖ్య అందరికి తెలియునట్లు
ప్రతి మతములోను జపమాలను ఉపయోగించునట్లు చేసి, ఆ జపమాలలో 108 పూసలు ఉండునట్లు దేవుడుంచాడు.
ప్రతి మనిషిలోను గుణముల సంఖ్య 108 ఉండునట్లు చేసిన దేవుడు, 108 గుణములుగల జీవరాసి 108 కోట్ల
సంవత్సరముల సృష్టిలో జీవించునట్లు చేశాడు. 108 కోట్ల సంవత్సరముల తర్వాత ప్రళయమేర్పడును. అప్పుడు
సర్వము నాశనము కాగలదు. అందువలన ప్రపంచ ఆయుష్షును ఎవరూ మరువకుండునట్లు జపమాలలో 108
పూసలనుంచడమేకాక, దానమిచ్చు సమయములో 108 రూపాయలను ఇచ్చునట్లు, పూజ చేయు సమయములో 108
పూలతో పూజించునట్లు చేశారు. అలాగే ప్రతి మంత్రమును 108 సార్లు జపించునట్లు చేశారు. పెళ్లి సమయములో
ఇచ్చు కానుకలను కూడ 108 సంఖ్యతో జోడించారు. ఇట్లు బయటి సమాజములో 108 సంఖ్యను అనేక సందర్భములలో
వాడుకొనుచున్నాము.
అయినప్పటకీ 108 సంఖ్య ప్రపంచ ఆయుష్టని నేడు చాలామందికి తెలియకుండ పోయినది. పూర్వము
జ్ఞానమును తెలిసినవారు 108 సంఖ్యను అనేక చోట్ల గుర్తుగా పెట్టుకోగా, నేడు జ్ఞానమును తెలియనివారు ఆ
సంఖ్యను 101గా మార్చుకొన్నారు. కొందరు 116గా మార్చుకొన్నారు. ఇటువంటి వారిని చూచిన దేవుడు
ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రికి తీసుకొని పోవు అంబులెన్సు వ్యాన్ మీద 108 సంఖ్యను గుర్తించి నీ స్థిర ఆయుష్షు
ఇంతేనని గుర్తుండునట్లు చేశాడు. నీకు అపాయస్టితి 108 సంఖ్యలోనే ఉన్నదన్నట్లు, అపాయస్థితిలో చేయవలసిన
ఫోన్‌నంబరు కూడ 108 గానే ఉంచాడు. ఏది ఏమైనా 108 సంఖ్య ప్రపంచము యొక్క మొత్తము ఆయుష్షని మనిషి
మరచిపోయాడు. 108 కోట్ల సంవత్సరములు సజీవముగానున్న ప్రకృతి, 108 కోట్ల సంవత్సరముల తర్వాత ప్రళయము
---------------
చెంది విశ్వమంతా లేకుండ పోవును. 108 కోట్ల సంవత్సరముల విశ్వములేని విరామము తర్వాత తిరిగి సృష్టి
ఏర్పడుచున్నది.
తిరిగి క్రొత్తగా ఏర్పడు సృష్టి ఇపుడు ఎట్లున్నదో అట్లేయుండును. అప్పుడు కూడ మూడు రకముల శరీరములతోనే
జీవరాసులు ఉద్భవించును. అవియే త్రైతము ప్రకారము అండజ,పిండజ, ఉద్భిజములు. ఆకాశములోని
సూర్య,చంద్ర,నక్షత్రాదులకు కాల పరిమాణములుగా దిన,మాస, సంవత్సరములు ఉండగా, దిన, మాస, సంవత్సరములు
జీవరాసులైన అండజ,పిండజ, ఉద్భిజములకు ఆయుఃపరిమాణములుగా ఉన్నవి. ఇట్లు ఒకదానితో ఒకటి
సంబంధపడియున్నవి. భూమిమిద కనిపించెడు జీవరాసులు ఉండగా, ఆకాశములో కనిపించే గ్రహములు ఉండగా,
మధ్యలో కనిపించని కాలము దైవమునకు గుర్తింపుగా ఉన్నది. కనిపించని కాలము దిన,మాస, సంవత్సరముల
పరిమాణముతో ఉన్నది. అటువంటి దినములకు ఏడు పేరు మాసములకు పండ్రెండు పేర్లు, సంవత్సరములకు
అరువదిపేర్లు మన పెద్దలుంచారు. ఏడు దినములలో ప్రతి దినమునకు చివర వారము అని 7 పేర్లుండడము, ప్రతి
నెలకు చివర మాసము అని 12 పేర్లుండడము, అట్లే సంవత్సరమునకు చివర వత్సరము అని 60 పేర్లుండడము
గమనించ వచ్చును. కాలమునకు వార, మాస, వత్సరములని పేర్లున్నవని అందరికి తెలుసు. కానీ ఇక్కడ కాలక్రమమున
“మూస” అను పదము “మాస” అని మారియున్నది. అందువలన అందరికి తెలిసిన మాస పదమునే మనము కూడ
చెప్పుకొంటున్నాము. అట్లే “యోగము” అను పదము “యుగము” అను పదముగా మారిపోయినది. దానిని కూడ
మనము యుగము అను పదముగానే చెప్పుకొన్నామని గ్రహించవలెను. ఉదాహరణకు చైత్రమూసము చైత్రమాసముగా
చెప్పుకొంటున్నాము. అదే విధముగా కలియోగమును కలియుగముగా వ్రాసుకొన్నాము.
కాలములోనే ప్రతి జీవరాసి పుట్టుచున్నది. అనగా దైవము ప్రతి జీవరాసిని సృష్టిస్తున్నాడని ప్రత్యక్షముగా
తెలియుచున్నది. కనిపించని దైవము ప్రతి జీవరాసిని తేడా కలిగిన ఆకారముతో పుట్టించుచున్నాడు. అందువలన
కాలమునకు వార, మాస, వత్సరమని పేర్లుంచడము జరిగినది. వారము అనగా తేడా కల్గిన, మాసము అనగా
ఆకారముగా, వత్సరము అనగా పుట్టించబడినదని అర్ధము. ఈ అర్ధము ప్రకారము పుట్టిన మనిషి మనిషికి తేడా కల్గిన
ఆకారము కలదని అందరికి తెలియుచున్నది. ప్రతి మనిషికి కొద్దిపాటి ముఖవర్చస్సులోనే ఎన్నో తేడాలుండడమును
అందరు గ్రహించ వచ్చును. దీనివలన ప్రతి మనిషి వారాగా (తేడా) మూస (ముద్ర) పోయబడిన ఆకారముతో
వత్సరింపబడు (పుట్టింపబడు)చున్నాడని తెలియుచున్నది. ఇక్కడ వారము అనునది ఏడు పేర్లు కల్గియుండడము
అందరికి తెలుసు. వారమునకు ఏడు పెర్లే ఎందుకు పెట్టారు? అని ప్రశ్నించుకొని చూస్తే ఆ ప్రశ్నకు జవాబు ఈ
విధముగా తెలియుచున్నది.
భూమి మీదున్న ప్రతి మనిషి బయట కనిపించెడి సూర్య చంద్ర నక్షత్రాదుల వెలుగులోనూ, లోపల కనిపించని
మూడు ఆత్మల ప్రభావము తోనూ జీవించగల్డుచున్నాడు. బయట గ్రహముల కాంతి కిరణము ఏడు తేడాలుగా
(వారాలుగా) ఉన్నది. అలాగే లోపల ఆత్మల ప్రభావము కూడ ఏడు వారాలుగా (తేడాలుగా) ఉన్నది. కాంతి
కిరణములను విభజించితే ఏడు విధ రంగులు తెలియుచున్నవి. ఆత్మశక్తిని విభజించితే ఏడు నాడీకేంద్రములలో ఏడు
రకముల శక్తిగాయున్నది. అందువలన మనిషి జీవించు దినమునకు ఏడు పేర్లు పెట్టవలసివచ్చినది. ఆ ఏడు పేర్లలో
ముందుగల మూడు పేర్లు సూర్య, చంద్ర, నక్షత్రములకు సంబంధించినవిగా ఉండడము గమనించదగ్గ విషయము.
ప్రస్తుత కాలములో నాగరికత అను పేరుతో, విజ్ఞానమను చదువుతో అజ్ఞానములో మునిగిపోయిన మనిషి ఆది,
--------
సోమ, మంగళవారముల విశిష్టతను విస్మరించినవాడై, తనకు సంబంధించిన జ్ఞానమును తానే తెలుసుకోలేకపోయాడు.
విజ్ఞానము కల్గి సుఖాలలో మునిగిపోయిన నేటి మనుషులకంటే ఆత్మజ్ఞానము కల్గి ఆది, సోమ, మంగళవారముల
అర్ధమును తెలిసిన పూర్వపు మనుషులే ఎంతో గొప్ప అని తెలియుచున్నది.
ప్రతి మనిషి తేడా కల్గిన ముఖముతో, మూసపోసిన ఆకారముతో, పుట్టించబడియున్నాడని అందరికి తెలుసు.
అటువంటి మనిషి సూర్య చంద్ర, నక్షత్ర మూడు గ్రహముల కాంతిలో, మూడు ఆత్మల ప్రభావములో బ్రతుకగలుగుచున్నాడు.
దైవము ఆకాశములో భౌతికముగా కనిపించెడి రెండు గ్రహములుగా, ఒక అగ్రహ నక్షత్రముగా శరీరములో కనిపించని
మూడు ఆత్మలుగా ఉన్నాడని చెప్పుకొన్నాము కదా! దీనిని బట్టి ప్రతి మనిషి ఇటు బయటి గ్రహముల వలన, అటు
లోపలి ఆత్మల వలన మొత్తముగా దైవము వలన జీవించుచున్నాడని తెలియుచున్నది.
దైవము కనిపించే విధముగా సూర్య, చంద్ర, నక్షత్రములుగా
దైవము కనిపించని విధముగా జీవాత్మ, ఆత్మ ,పరమాత్మలుగా
దైవప్రభావములో ఇటు బయట, అటు లోపల జీవించు మనిషి బయటి సూర్య, చంద్ర, నక్షత్రములను, లోపలి
జీవాత్మ, ఆత్మ, పరమాత్మలను తెలిసి ఆరాధించడమునే త్రైతారాధన అంటున్నాము. త్రైతారాధనలో బయటి సూర్య
చంద్ర నక్షత్రముల గుర్తులైన ఆది, సోమ, మంగళవారములలో మూడు ఆత్మలను ఆరాధించడమునే త్రైతారాధన
అంటున్నాము. కొందరు పెద్దలు జ్ఞానమును తత్త్వములను పాటలరూపములో పాడునపుడు “మూడునాళ్ళ జీవితమునకు
మురిసిపోయే వెందుకు జీవా” అని పాడుచుండుట వినియున్నాము.. దీనిని బట్టి మన జీవితము మూడునాళ్ళేనా అని
యోచిస్తే ఒక దినము పుట్టడమునకు, ఒకదినము జ్ఞానము తెలుసుకొనుటకు, ఒక దినము మోక్షమును పొందుటకని
తెలియుచున్నది. మొదటి దినము జీవుడు పుట్టి, రెండవ దినము ఆత్మను తెలుసుకొని, మూడవ దినము పరమాత్మలో
చేరవలెనని కూడ తెలియుచున్నది. అందువలన కొందరు కవులు,పెద్దలు “ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది
యౌవ్వనమ్” అన్నారు. ఈ విషయమును బ్రతికియున్నవారు తెలుసుకొనుటకు చచ్చిన వారికి మూడవ దినమును
చేయుచుందురు. దీనినిబట్టి మనకు తెలిసినా, తెలియకుండినా జీవితము మూన్నాళ్ళ ముచ్చటని తెలియుచున్నది.
ముచ్చటించడము అనగా ఒక విషయమును గురించి మాట్లాడుకోవడము అని అర్ధము. మూన్నాళ్ళ ముచ్చటనగా
ఆది,సోమ,మంగళ అను మూడు దినములలోని విషయమును తెలుసుకోవడమని అర్ధము. అలా తెలుసుకోక పోతే
ప్రపంచములో ఎవరు ఏ హోదాలో బ్రతికినా వారి జీవితము వృథా అనియే తెలియుచున్నది. అందువలన భూమిమిద
పుట్టిన ప్రతి మనిషి ఏ మతస్టుడైనా త్రైతారాధనను తెలిసి తీరవలసిందే మరియు చేసి తీరవలసిందే. ఇది ఆత్మలకు
సంబంధించిన జ్ఞానము కావున మనుషులందరికి కావలసిన, మతాలకు అతీతమైన ఆచరణయని తెలియవలెను.
త్రైతారాధన భావపూరితమైనది. కావున ఏడు దినములలో మొదటి మూడు దినములైన ఆది, సోమ,
మంగళవారములలో చేయడమే కాక, శరీరములోని ఏడు నాడీకేంద్రములలో మొదటి మూడు కేంద్రములైన
కంఠస్థానమునూ, భ్యూమధ్యస్థానమునూ, కపాలస్థానమును గుర్తించుకొని మూడు స్థానముల లోపలే తలలో ధ్యాస
ఉండునట్లు చేయుటకు ఆరాధన సమయములో కుడిచేయి హస్తమును తల మదా, ఎడమచేయి హస్తమును గడ్డము
క్రింద ఉంచుకోవలెను. మూడు ఆత్మలకు గుర్తుగా మూడు కోణముల గుడ్డను తలకు కట్టుకోవలెను. ఇప్పటికి
ఇదంతయు క్రొత్తగా కనిపించి నప్పటికీ, ఇదేదో పరమతబోధని కొందరికనిపించినప్పటికీ, పూర్వము కొన్ని లక్షల
----
సంవత్సరముల పూర్వము ఏ మతమూలేని కాలములోనే త్రైతారాధనను జ్ఞానులు ఆచరించెడివారని తెలియవలెను.
అన్ని సంవత్సరముల పూర్వమున్నది మాకుగానీ, ఏ పీఠాధిపతికిగాని, ఏ మఠాధిపతికిగాని తెలియనిది ఇప్పుడు నీకెట్లు
తెలియునని కొందరికి ప్రశ్నరాగలదు. దానికి జవాబు నాకు కూడ ఏమాత్రము తెలియదు. కానీ నాలోని రెండవవాడైన
ఆత్మకు అన్నీ తెలుసు కావున ఆయన చెప్పి వ్రాయిస్తున్నది వ్రాస్తున్నాను. నీలో కూడ ఆత్మ ఉన్నది, అయినా నీవు
అడగవు ఆయన చెప్పడు, అంతే మికు నాకు తేడా. ఇంకా ఆయన చెప్పునదేమనగా! వారములో ముందు గల ఆది,
సోమ, మంగళ వారములను గురించి మాకు తెలియని దానిని విపులముగా చెప్పెదను శ్రద్ధగా వినండి అంటున్నాడు.
ఆదివారము
“ఆది” అనగా ప్రపంచరీత్యా మొదటిదని అర్థము. ఆధ్యాత్మికరీత్యా చావుపుట్టుకలు గల క్షరాత్మయిన జీవాత్మని
అర్ధము. దైవము జీవునికొరకే సృష్టిని ప్రారంభించ వలసివచ్చినది. మొదట జీవున్ని సృష్టించిన దినమును ప్రపంచరీత్యా
ఆదివారమనియు, ఆధ్యాత్మికము ప్రకారము రవి (సూర్యుని) దినమనియు చెప్పుచున్నాము. ప్రపంచరీత్యా మొదటి
(ఆది) దినమైనప్పటికీ చావు పుట్టుకలతో సమానముగా ఉదయించుచూ మరియు అస్తమించుచూ సూర్యుడు జీవునివలె
ఉన్నాడు కావున ఆదివారమును రవి వారమని కూడ అనుచున్నాము. ఏది ఏమైన సృష్టి ఆవిర్భవించిన దినము
ఆదివారము. దైవము ప్రత్యక్షముగా ఉంటూ ఇటు ఆత్మనూ, అటు జీవాత్మనూ శరీరముతో పుట్టించిన దినము ఆదివారము.
మూడు ఆత్మలలో మననుండి మొదటిది జీవాత్మ, రెండవది ఆత్మ, మూడవది పరమాత్మ ఉండగా మొదటి జీవాత్మ
ఉద్భవించిన దినము కావున దానిని ఆదివారము అంటున్నాము. బయటి సూర్యుని దినమైన రవివారమనినా, లోపలి
జీవాత్మ దినమని ఆదివారమనినా రెండూ ఒక్కటేనని తెలియవలెను. దైవము తన ప్రకృతిచేత జీవులను సృష్టించిన
కార్య ఆరంభ దినము కావున దీనిని దైవకార్య ఆరంభ దినము” అంటున్నాము. దైవము తన సంకల్పము చేత
సర్వమును సృష్టించిన దినము కావున మొదటి దినమైన ఆదివారమును సంకల్పదినమని కూడ పూర్వమనెడివారు.
అన్నిటికంటే శ్రేష్టమైన దైవము చేత తయారైన దినము కావున శ్రేష్టదినమనియూ, పవిత్రమైన దైవము చేత తయారైన
దినము కావున పవిత్రదినమనియు ఆదివారమునకు పేర్లు గలవు. ఇపుడు ఈ విధముగా మారియుండినా పూర్వము
మొదటి దినమును ఆదివారమనియూ, దైవకార్య ఆరంభ దినమనియూ, శ్రేష్టదినమనియూ, పవిత్రదినమనియూ గొప్పగ
చెప్పుకొనెడివారు.
ఒక విధముగా చెప్పితే రోమ్, గ్రీక్‌దేశములలో దేవతల మీద గ్రహముల మిద భక్తి ఎక్కువగా ఉన్ననూ మన
దేశములో ఆ దేశములను మించిన జ్ఞానముండెడిది. అందువలన జ్ఞానములో అగ్రదేశమైనందున మన దేశమును
ఇందూదేశమని ముందునుండి అన్ని దేశములవారు పిలిచెడి వారు. మొదట ఇందూ (జ్ఞాన) దేశమైన మన దేశమునకు
భరతుని కాలమునుండి భారతదేశమని పేరు వచ్చినది. దీనిని భారతదేశమనినా ఆది నుండి జ్ఞానముగల దేశము
కావున. దీనికి ఇందూదేశమనెడి పేరు అతుక్కు పోయినది. ఇందూత్వము అనగా దైవజ్ఞానము ఈ దేశములో
సన్నగిల్లిపోయి ఇందూ అను పదము హిందూగా మారిపోయినదని మేము అనేక సందర్భములలో చెప్పాము. ఇందూ
అను శబ్దము కొంత మార్పుచెంది హిందూ అని పలుకబడుచున్నప్పటికీ జ్ఞానములో ఇతర దేశములకంటే ఈ దేశమే
గొప్పది. కావున అర్ధమును తెలిసి ఈ దేశమును ఇందూదేశముగా చెప్పుకొందాము. ఈ దేశము జ్ఞానముగల
దేశమని తెలిసి మన దేశములో చెప్పిన జ్ఞానమును మొదట ప్రపంచదేశములన్ని అనుసరించెడివి. అంటే ఇందూదేశమైన
---------
భారతదేశము అన్ని దేశములకు మార్గదర్శకముగా ఉండెడిదని అర్థమగుచున్నది. అన్ని దేశములకు మార్గదర్శకమైన
ఇందూదేశములోనే సూర్యచంద్ర నక్షత్ర వరుస క్రమమునూ, దాని ద్వారా జ్యోతిష్యశాస్తమునూ బయటకు వచ్చినవి.
సూర్యుడు మొదటివాడని, ఏడు రోజులలో మొదటిది ఆదివారమని ఇందువులు చెప్పినట్లు ప్రపంచదేశములన్నియు
ఆదివారమునే మొదటి దినముగా ఉంచుకొన్నవి. ఆదివారము దేవుడు సృష్టించిన, తయారు చేసిన పవిత్ర దినము
కావున ఆ దినమును పవిత్రముగ ఉంచుకొని దేవుని ధ్యాసలోనే, దేవుని జ్ఞానములోనే ఇందువులు గడిపెడివారు. ఆ
దినము ఏ పనిని చేయకుండ సృష్టి ఆవిర్భదినముగా, తాము పుట్టిన దినముగా చెప్పుకొనుచు సృష్టికర్తయిన దేవుని
గొప్పతనమును కొనియాడెడివారు. అందువలన ఆదివారమును ఇందువులు సెలవుదినముగా పెట్టుకొని ఏ పనిని
చేయకుండ దేవుని జ్ఞానమును తెలుసుకొనుటకు ఉపయోగించెడి వారు. ఇందూదేశ ప్రజలు అన్ని దేశప్రజలకు
ఆదర్శముగా ఉండుట వలన ఇందువులవలె ప్రపంచ దేశములన్నియు ఆదివారమును మొదటి దినముగా పెట్టుకోవడమేకాక
ఆదివారమును వారు కూడ పవిత్ర దినముగా, సెలవుదినముగా చేసుకొన్నారు. ఇంగ్లీషులో హోలీడే (HOLY DAY)
అనగా పవిత్రదినమని అర్ధము. పూర్వము ఆదివారమును విదేశాలలో కూడా హోలీడే అని అనెడి వారు. కాలక్రమమున
హోలీడే కాస్త హాలీడేగా మారిపోయినది. పవిత్ర దినమును సెలవుదినముగా ఉంచుకొను ఆచారము పూర్వమునుండి
విదేశములలో కూడ ఉండెడిది. HOLY DAY(హోలీడే) చివరకు HOLI DAY (హాలీడే) గా మారిపోయి. నేడు
సెలవుదినమును హాలీడే అని, సండే ఈజ్ హాలీడే అంటున్నారు. పూర్వము సన్‌డే ఈజ్ హాలిడే అనెడివారు. ప్రపంచములో
ఏ మతములేని కాలములోనే ఆదివారము సెలవుదినముగా ఉండడము మొదలై నేటికినీ ఆ సాంప్రదాయము
ప్రపంచమంతా మిగిలియున్నది.
ఇందువులు ఆదివారమును శుచి, శుభ్రతతో పండుగ వాతావరణములో గడిపెడివారు. ఆ దినమును పవిత్రముగ
గొప్పగ చూచుకొనుట వలన దుర్వ్యసనములైన మత్తుపానీయములను త్రాగడము కానీ, మాంసమును తినడముకానీ,
చెడుగా మాట్లాడముకానీ, చెడుగా ప్రవర్తించడముగానీ చేసెడివారు కాదు. వారములోని ఏడు రోజులలో ఆరు రోజులు
తమకై వినియోగించుకొనినా ఆదివారము ఒక్క దినము దేవుని కొరకు పనిని చేయాలనుకొనెడివారు. ఇందువులను
చూచి ప్రపంచ దేశములన్నియు ఆదివారమును పవిత్రముగనే గడిపెడివారు. కాలము గడుచుకొద్దీ జ్ఞానులు అజ్ఞానులుగా
మారిపోవుచు వచ్చారు. రాజులు పోయినా వారి కోటలు శిథిలావస్థలో మిగిలి ఉన్నట్లు, ఇందూ సాంప్రదాయములు
అడుగంటిపోయినా వాటికి తార్కాణముగా ఆదివారము సెలవుదినముగా మిగిలిపోయినది. ఇందూదేశములో అజ్ఞానము
చోటు చేసుకొని ఇందుత్వము ప్రశ్నార్ధకమైనది. ఇందువులు పవిత్రముగ ఉంచుకొనిన మొదటి దినమును అనగ
ఆదివారమును, వారము చివరి దినముగా ఉంచుకొన్నారు. చాలామంది వారాంతమైన ఆదివారము అని పల్కుచున్నారు.
అయినప్పటికి విదేశీసాంప్రదాయ క్యాలెండర్లలో కూడ ఆదివారము మొదటి దినముగా పైననే ముద్రించడము నేటికినీ
జరుగు చున్నది. కానీ ఆచరణలో ఆదివారము పవిత్రదినము కాకుండ భ్రష్టుపట్టిన దినమైనదని చెప్పక తప్పదు.
ఎందుకనగా అన్ని దురలవాట్లకు ఆదివారము అడ్డాగా మారిపోయినది. ఆదివారమును ప్రత్యేకించి మాంసభక్షణ
దినముగా పెట్టుకోవడము, మత్తుపానీయములు త్రాగడము, జూదమాడడము జరుగు చున్నది. సెలవుదినమైనందున
అన్ని విలాస కార్యములకు ఆదివారము నెలవైనది. ఆదివారము సెలవు దినముగా ఎందుకున్నదని యోచించని వారు
దానిని అజ్ఞాన పనులకు ఉపయోగించుకొనుచున్నారు. ఆదివారమును చివరి దినముగా చాలామంది అనుకోవడము
జరుగుచున్నది. దేవుని ఆరాధనగానీ, దేవుని జ్ఞానమును గురించి తెలుసుకోవడముగానీ జరగడము లేదు. ఆదివారము
జీవునికి సంబంధించినదనీ, జీవుడు పుట్టిన దినమని మరిచిపోయారు. ఆదివారస్థానములో గురువారమూ,
--------
సోమవారస్థానములో శుక్రవారమూ, మంగళవారస్థానములో శనివారము చోటుచేసుకొన్నాయి. పూర్వము
ఆది,సోమ, మంగళవారములు ముఖ్యమైనవి పవిత్రమైనవి కాగ ఇప్పటికాలములో గురు, శుక్ర, శనివారములు పవిత్రతను
సంపాదించు కొన్నాయి. గురు,శుక్ర,శనివారములలో మనుషులు శుచి శుభ్రతను పాటిస్తూ దేవతల పూజలు చేయడము
జరుగుచున్నది. ఈ విధముగా ఆదివారము ఇందువులలో ప్రాధాన్యతను కోల్పోయి చాలాకాలమైనది. అయినప్పటికీ
ఇప్పుడు ఆదివారము యొక్క ప్రాధాన్యతను ఆత్మ మనకు గుర్తు చేయుచున్నది.
కోట్ల సంవత్సరములనుండి ఇందువులలో ప్రాధాన్యత సంపాదించు కొన్న ఆదివారము మాంసభక్షణ దినముగా
మారిపోగా, అర్ధముతో కూడుకొన్న ఇందూ అను శబ్ధము అర్ధములేని హిందూ శబ్ధముగా మారిపోయినది. ఇందూ
సాంప్రదాయములను తెలియని స్థితిలో హిందువులు నిలిచిపోయారు. సాధారణమనుషులకే కాక స్వామీజీలకు కూడ
దైవధర్మములూ, జ్ఞానసాంప్రదాయములు తెలియకపోయినందువలన హిందువులలో కొందరు పరమతముల
వ్యామోహమును పెంచుకొని ఇక్కడ లేనిదేదో అక్కడ దొరుకుతుందని భ్రమపడి మతములు మారుచున్నారు. ప్రపంచ
దేశములన్నిటికీ ఆదర్శప్రాయమైన జ్ఞానముకల ఇందూదేశములోనే మరియు వందశాతము జ్ఞానమును బోధించు
భగవద్గీత పుట్టిన ఇందూదేశము లోనే ఇందూమతమును వదిలి ఇతర మతములను కొందరు స్వీకరిస్తున్నారు.
ఇందూమతము గనిలాంటిది, ఇతర మతము నిధిలాంటిది అని తెలియక చాలామంది మతమును మారుచున్నారు.
గనిలో దొరికిన దానిని తీసుకొని పోయి మరొక చోట ఉంచితే అది నిధి అవుతుంది. ఇందూత్వ గనిలో పుట్టిన జ్ఞానమే
ఇతరచోట్ల ఇతర మత నిధులుగా ఉన్నవని తెలియనివారు అలా ఇతరమతములకు ప్రాకులాడుచున్నారు. గని త్రవ్వేకొద్ది
దొరుకుతుంది, నిధి త్రవ్విన ఒకరోజే దొరుకుతుంది. అందువలన గని శాశ్వితము, నిధి అశాశ్వితమని చెప్పవచ్చును.
ఎవరికైనా వాడు పుట్టిన మతమే గనిలాగ ఉంటుంది. పరమతము నిధిలాగే ఉంటుంది. గనిలోలేనిది నిధిలో
దొరకదు. నిధిలో దొరికినదేదో అది గనిలోనిదే. అందువలన మతమార్పిడి చేసుకోవడము పొరపాటని మేము
చెప్పకతప్పదు.
కోట్ల సంవత్సరముల పూర్వమే ఆదివారము తయారై ఉంటే వందల సంవత్సరముల పూర్వము తయారైన
మతములు కూడ ఆదివారమును మార్చలేకపోయాయి. అందువలన ఆదివారము ఇతరదేశములలో కూడా
ముఖ్యదినముగానే ఉన్నది. ప్రపంచములోనే మొదటి దినమైన ఆదివారమునూ గ్రహములలో మొదటిదైన సూర్యున్నీ
ఆధారము చేసుకొని, ఆత్మలలో మొదటిదైన జీవాత్మకొరకు జ్యోతిష్యశాస్తమును ఇందువులు తయారు చేశారు. షట్
శాస్త్రములలో ఒకటైన జ్యోతిష్యశాస్తము ఆదివారమే మానవుని మెదడులో మెదిలి తయారైనది. ఆదివారము పుట్టిన
జీవునికి ఆదివారము పుట్టిన జ్యోతిష్యము కర్మను తెలియజేయుచున్నది. ఈ విధముగా ఎన్నో విధముల ఆదివారము
ముఖ్యదినముగా గుర్తింపు పొందివున్నది. ప్రపంచములో ఉత్తర, దక్షిణ దిశలలో వ్యాపించియున్న అయస్కాంతశక్తి
ప్రత్యేకించి ఆదివారములో మానవుని మీద ఎక్కువ ప్రభావమును చూపుచున్నది. ఒక్క మానవుని మీదేకాక
పంచభూతముల మీద కూడ ప్రభావమును చూపుచున్నది. ఆదివారము అమావాస్యదినము అయినా, పౌర్ణమి దినము
అయినా మరీ ఎక్కువ ప్రభావముండుట వాస్తవము. ఆదివారము అభౌతికమైన సూక్ష్మములకు శక్తివంత దినముగా
ఉన్నదని పూర్వమందరికి తెలుసు. ఇట్లు స్థూలముగా సూక్ష్మముగా ఆదివారము అన్ని విధముల ప్రాధాన్యత పొంది
యున్నదని తెలియవలెను.
--------------
సోమవారము
ఒక దేశములో ఒక ప్రభుత్వముంటుంది. ప్రభు అనగా రాజు అని అర్థము. ప్రభువుచేత పాలింపబడునది
కావున దానిని ప్రభుత్వము అంటాము. బయటి దేశములో ప్రభువూ ప్రభుత్వమూ ఉన్నట్లే, లోపలి దేహములో కూడ
ఒక దేవుడూ దైవత్వమూకలదు. దేశములోని ప్రభుత్వమునకు చట్టముంటుంది. అలాగే దేహములోని దైవత్వమునకు
ధర్మముంటుంది. దేశములోని చట్టమును తెల్పునది న్యాయము. అలాగే దేహములోని ధర్మమును తెల్పునది జ్ఞానము.
చట్టము తెలియాలంటే న్యాయశాస్త్రమును చదవాలి. అట్లే ధర్మమును తెలియాలంటే జ్ఞానముగల యోగశాస్త్రమును
చదవాలి. న్యాయశాస్త్రము యల్.యల్.బి పుస్తకములలో గలదు, దానిని బోధించుటకు ప్రొఫెసర్లు గలరు. అదే
విధముగా జ్ఞానము గల యోగశాస్త్రము భగవద్గీత రూపములో గలదు, దానిని బోధించుటకు స్వామీజీలు (యోగులు)
గలరు. దేశములోని న్యాయమునకు అధిపతిగా న్యాయశాఖ మంత్రి ఉంటాడు. అలాగే దేహములోని జ్ఞానమునకు
అధిపతిగా చంద్రుడు గలడు. ఈ విషయమునే క్రింద వివరముగా చూడండి.
బయటి దేశములో --- లోపలి దేహములో
దేశము - దేహము
ప్రభుత్వము - దైవత్వము
ప్రభువు - పరమాత్మ
చట్టము - ధర్మము
న్యాయము - జ్ఞానము
న్యాయశాస్త్రము - యోగశాస్త్రము
ఎల్.ఎల్.బి - భగవద్గీత
ప్రోఫెసర్లు - స్వామీజీలు (యోగులు)
మంత్రి - చంద్రుడు (ఇందువు)
బయటి దేశములూ చట్టములూ మారవచ్చును, ప్రభువులూ ప్రభుత్వములూ మారవచ్చును, కానీ లోపలి
దేహములుగానీ, ధర్మముగానీ, దేవుడుగానీ, దైవత్వముగానీ ఎప్పటికి మారవు. అందువలన బయటిదంతా అశాశ్వితమనీ
లోపలిదంతా శాశ్వితమని మన పెద్దలు చెప్పుతూవచ్చారు. బయటి ప్రభువులూ ప్రభుత్వములూ అశాశ్వితమైనవని
లోపలి దేవుడు దైవత్వము శాశ్వితమని అందరు జ్ఞప్తికి పెట్టుకోవలెను. శాశ్వితమైన దేవుని కొరకు ఆయన ధర్మమునూ,
ఆయన ధర్మము కొరకు జ్ఞానమునూ తెలియవలెను. జ్ఞానమునకు అధిపతి చంద్రుడని చెప్పుకొన్నాము. చంద్రుడినే
ఇందువనీ, సోముడనీ అనుచున్నాము. మొదటి దినమైన ఆదివారము సృష్టి జరిగిన తర్వాత రెండవదినమున జ్ఞానము
తెలిసినది. కావున రెండవ దినమునకు జ్ఞానాధిపతియైన చంద్రుని పేరునుంచుతూ ఆ దినమును ఇందు వారమనీ,
సోమవారమని పిలుస్తున్నాము. ఈ విధముగా సృష్టి తర్వాత రెండవ దినమును జ్ఞాన దినముగా పరిగణించవలసి
వచ్చినది.
---------------
ప్రతి మనిషికి జ్ఞానము తెలియవలసినది తలకు. మనిషి తలకు ఒక్కమారుగ జ్ఞానమంతా తెలియదు. మొదట
కొద్దిగ జ్ఞానమును తెలుసుకొన్నవాడు జ్ఞానాన్ని దినదినాభివృద్ది చేసుకొనుచు చివరకు సంపూర్ణముగా తెలియవలెను.
జ్ఞానము సముద్రములాంటిది. ఇన్ని రోజులలో తెలుసుకుంటామని ఎవరూ చెప్పలేరు. ఎంతో కాలము జ్ఞానాన్ని
అభివృద్ధి చేసుకొంటూనే ఉండాలి. అందువలన జ్ఞానమును అభివృద్ది చెందుతున్న చంద్రవంకతో సమానముగా
పోల్చారు. సంపూర్ణ జ్ఞానిని పూర్ణచంద్రునితో సమానముగా పోల్చడమైనది. మనిషి జ్ఞానాన్ని తన తలలో వృద్ది
చేసుకోవలసియున్నది, కావున మానవాకారములోనున్న శంకరుడు కూడ తన తలమిద అభివృద్ది చెందుచున్న జ్ఞానమునకు
చిహ్నముగా చంద్రవంకను ధరించి చూపించాడు. ఈ విధముగా చంద్రుడు జ్ఞానమునకు గుర్తుగా ఉన్నాడు.
జ్యోతిష్యశాస్తములో కూడ చంద్రగ్రహమును జ్ఞాన చిహ్నముగానే ఉంచారు. ఇదే ఆధారముతో జ్ఞానముగల దేశమును
ఇందూదేశము అన్నారు. సృష్టి ఆదిలో రెండవ దినము మనిషికి జ్ఞానము తెలిసినది, కావున ఆ రెండవ దినమును
ఇందువారము లేక సోమవారము అంటున్నాము. ఇందూ దేశములో ఇందువారము ఇందువులకు జ్ఞానరీత్యా ఎంతో
ముఖ్యమైనది. అందువలన ఇందువారమైన సోమవారమును పూర్వమునుండి జ్ఞానవృద్ధి దినముగా పరిగణించెడివారు.
కాలక్రమమున జ్ఞానము తెలియని వారి మధ్యలో సోమవారము జ్ఞానమునకు గుర్తని కూడ తెలియకుండ పోయినది.
ఇందూదేశమైన భారతదేశములోనే ఇందూత్వము (జ్ఞానము) తెలియని ఇందువులు చివరకు మనము
పూర్వమునుండి ఇందువులమని పేరుగాంచియున్నామని తెలియక చివరకు మూన్‌డే, మన్‌డే అయినట్లు ఇందువులు
హిందువులుగా చెప్పుకొంటున్నారు. జ్యోతిష్యశాస్తములో జాపతకము అను పదములో జా ప్రక్కనున్న “ప” అను
అక్షరముపోయి జాతకము అయినట్లు ఇతర దేశములలో ఇంగ్లీషు భాషలో రెండవ దినమైన చంద్రుని దినమును
పూర్వమునుండి MOONDAY (మూన్‌డే) అని పిలుచువారు యమ్ ప్రక్కన గల రెండు సున్నలలో ఒక సున్నను
మరచిపోయి MONDAY (మన్‌డే) అని పిలుచుచున్నారు. ఇతర దేశములలో ఒక సున్నను మరచిపోతే భారతదేశములో
ఏకంగా ఒక అక్షర స్వరూపమునే మార్చి “ఇ” ను “హి” గా చేసి ఇందూ దేశమును హిందూదేశము అంటున్నారు.
పూర్వము మనము జ్ఞానముగల ఇందువులమని చెప్పినా వినని హిందువులు నేడు దైవభక్తులు కాకుండ దేశభక్తులుగా
ఉంటూ సత్యమును చెప్పిన మాలాంటి వారిని కూడ లెక్కచేయకున్నారు.
జ్ఞానములో అన్ని దేశములకు మిన్నగాయుండి ఇతర దేశములచేత ఇందూదేశమని పిలిపించుకొన్న ఈ దేశమునకు
పూర్వవైభవము రావాలంటే మనమందరము జ్ఞానమును తెలిసిన ఇందువులుగా మారాలి. అలా మారాలంటే జ్ఞానమునకు
ప్రతీకగాయున్న సోమవారమును గురించి తెలుసుకోవాలి. మొదటి రోజు సృష్టి ఆదికి చిహ్నముకాగా, రెండవరోజు
దైవధర్మమును తెలుపు జ్ఞానమునకు గుర్తని తెలియాలి. జీవితములో మూడు రోజులే ముఖ్యమైనవి. ఒకటి పుట్టుక,
రెండు బ్రతుకుట, మూడు చచ్చుట. ఈ మూడు దినములకు గుర్తుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను చెప్పారు.
జ్ఞానమునకు అధిపతి చంద్రుడైనట్లు, పుట్టుకకు బ్రహ్మ, బ్రతుకుటకు విష్ణువు, చావుకు హరుడు అధిపతులని చెప్పారు.
ముఖ్యమైన మూడు రోజులు వారములో మొదటనే గలవు. అందులో రెండవది ఇందువారము (సోమవారము).
కాలగమనములో ఆదివారమున వచ్చు అమావాస్య ఎంత ముఖ్యమైనదో అలాగే సోమవారమున వచ్చు పౌర్ణమి కూడ
అంతే ముఖ్యమైనది. ఆదివారమున వచ్చు అమావాస్య శక్తివంతమైనట్లు, సోమవారమున వచ్చు పౌర్ణమి కూడ
శక్తివంతమైనదే !
---------
మంగళవారము
మంగళము అనగా శుభకరమని అర్ధము. ప్రపంచములో అన్నిటి కంటే శుభమైనది ఏది అని ప్రశ్నించుకొని
చూస్తే అన్నిటికంటే మించి అత్యంత శుభకరమైనది దైవము ఒక్కటే. దైవమును కాలము అని కూడ అంటాము.
కాలము అనగా నాశనమని కూడ అర్ధము గలదు. దీని ప్రకారము చివరకు మంగళము అంటే నాశనమని కూడ
చెప్పుకోవచ్చును. ఆధ్యాత్మికరీత్యా అలాగే చెప్పుకోవలసియున్నది. మంగళవారము అంటే నాశనదినము అని అర్ధము.
ఆదివారము సృష్టికీ, సోమవారము స్థితికీ, మంగళవారము లయకు గుర్తుగా పూర్వము నుండి పెద్దలు చెప్పుచునే
ఉన్నారు. ఇక్కడ కొంత అనుమానము వచ్చి “సృష్టి స్థితి లయ అను మూడూ, మూడు దినములకు గుర్తయితే,
లయ(నాశనము)కు సంబంధించిన దినమును శుభకరమైనదిగా మంగళ వారమని పేరు పెట్టారుగా, నాశనము
ఎవరికైనా బాధతో కూడుకొని ఉంటుంది, కానీ శుభముతో కూడుకొని ఉంటుందా?” అని కొందరు ప్రశ్నించవచ్చును.
దానికి మా సమాధానము ఏమనగా! నాశనము యొక్క నిజస్థితిని తెలియక గుణ ప్రభావమువలన చాలామంది
బాధపడుచుండవచ్చును. కానీ నాశనమునకు అర్ధమును తెలిస్తే ఎవరూ బాధపడరు. ఉదాహరణకు ఒకడు మరణిస్తే
అతను నీకు దగ్గర సంబంధీకుడు కాబట్టి నీవు బాధపడ వచ్చును. చనిపోయినవాడు నాశనము కాలేదు, వాడు
కేవలము రూపాంతము చెందాడు. వాస్తవానికి వాడు నాశనము కాలేదు. అటువంటివానిని గూర్చి బాధపడడమును
చూస్తే ఆ బాధ నాశనము గురించి కాదు, మరణమును గురించి మాత్రమే. ఈ విధముగా చూస్తే నిజానికి ఎవడు
కూడ నాశనమునకు బాధపడడము లేదు. ఆకారమార్పుకే బాధపడుచున్నాడు. జీవమున్నవి కానీ, జీవములేనివి కానీ
మార్పు చెందినపుడు ఆ మార్పును నాశనము అనుకోకూడదు. ప్రపంచములో ఏదైనా, ఎవరైనా మార్పు చెందుచున్నారే
గానీ నాశనము చెందడములేదు. మార్పు ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది. నాశనము బహు అరుదుగా జరుగుతుంది.
నాశనము కేవలము జీవరాసులకు సంబంధించినదే కానీ జీవములేని వాటికి సంబంధించినది కాదు. ఒక జీవుడు
ఎప్పటికైనా నాశనము చెందవచ్చును, కానీ ఒక వస్తువు ఎప్పటికి నాశనము చెందదు.
ముఖ్యమైన సమస్య ఏమిటంటే నాశనము ఏది అను విషయము, చాలామంది మేధావులకు కూడ తెలియదు.
మార్పును లేక మరణాన్ని నాశనము అని సర్వసాధారణముగా అందరు అనుకొంటున్నాము. కానీ అది కేవలము ఒక
మార్పేగాని నాశనముకాదని గుర్తించలేక పోతున్నాము. ఉదాహరణకు ఒక కట్టె కాలి బొగ్గుకావచ్చు, బూడిదకావచ్చు.
అంత మాత్రమున దానిని కట్టె నాశనమైంది అనకూడదు. కట్టె బొగ్గుగ మార్పు చెందింది అనవచ్చును. బూడిదైతే
బూడిదగా మార్పుచెందింది అనవచ్చును. తుమ్మకట్టెను కాల్చి బూడిద చేస్తే దానిని తుమ్మకట్టె బూడిద అంటాము.
ఎందుకంటే తుమ్మకట్టె బూడిదలో కొన్ని ప్రత్యేకతలుంటాయి. తుమ్మకట్టె ఎటువంటి స్థితిలోను లేకుండ పోయినపుడు
అది నాశనమైంది అనవచ్చును. అట్లు ఏ వస్తువు నాశనము చెందదు. కేవలము శరీరమును ధరించిన జీవుడు
మాత్రము నాశనము కాగలడు. జీవుడు నాశనము కొరకు యోగముతో ఎంతో శ్రమిస్తేగానీ, ఎంతో ఆరాటపడితేగానీ
అరుదుగా నాశనము చెందుటకు అవకాశముగలదు. జీవుడు కోరుకుంటేనే ఎంతో కాలమునకు అరుదుగా లభించు
నాశనమును గురించి యోచిస్తే అది ఎంతో గొప్పది, పవిత్రమైనది, శుభకరమైనదని తెలియుచున్నది. అందువలన
నాశనమంటే కాలము, కాలమంటే దైవము, దైవమంటే శుభము లేక మంగళమని చెప్పవచ్చును. జీవుడు నాశనము
చెందు దినమునకు మంగళవారమని పేరు పెట్టాము.
-----------
ఆధ్యాత్మిక జ్ఞానము తెలిసినవారికి మాత్రమే ఆది,సోమ,మంగళ వారముల విశిష్టత తెలియును. గ్రుడ్డివానికి
రత్నమిచ్చినా దానిని కేవలము సాధారణ రాయిగా లెక్కించుకొన్నట్లు ఆత్మజ్ఞానము లేనివానికి ఆది, సోమ, మంగళ
వారములు కేవలము సాధారణ దినములుగా కనిపించుచున్నవి. జ్ఞానము ప్రకారము ఆది, సోమవారములను గురించి
ముందు చెప్పుకొన్నాము. ఇపుడు మంగళవారమును గురించి వివరముగా చెప్పుకొందాము. సూర్య కుటుంబములోని
గ్రహములు తొమ్మిదని చాలామంది చెప్పుకొనుచుందురు. ఆ మాట తప్పని, సులభముగా చెప్పవచ్చును. అదెలా
అనగా! ఇక్కడ ఒక చిన్న ఉదాహరణను చెప్పు కొందాము. పరమానందయ్య శిష్యులు పదిమంది అనుకొందాము.
పదిమంది నదిలోనికి స్నానానికి దిగి బయటకు వచ్చిన తర్వాత అందరూ బయటికి వచ్చారో లేదోనని వారిని వారు
లెక్క పెట్టుకొన్నారట. నదిలోనికి దిగినది పదిమంది, తిరిగి బయటికి వచ్చినది పదిమందే! అయినా ఒకడు తగ్గిపోయినట్లు,
తొమ్మిదిమందే ఉన్నట్లు లెక్కించుకొన్నారు. అక్కడ జరిగిన పొరపాటు ఏమనగా! లెక్కించువాడు తనను వదలి
ఎదురుగా ఉన్నవారిని మాత్రము లెక్కించడము వలన ఒకరు తక్కువైనట్లు కనిపించినది. అలాగే సూర్య కుటుంబములో
భూమి కూడ ఒక గ్రహముగా ఉన్ననూ భూమిని లెక్కించక ఇతర గ్రహములను లెక్కించడము వలన తొమ్మిది
గ్రహములుగా తెలియుచున్నవి. వాస్తవానికి భూమితో సహా లెక్కించితే గ్రహములు పది అని తెలియుచున్నది.
పరమానందయ్య శిష్యులు పదిమంది అయినా చివరకు వారు తొమ్మిది మందేయున్నట్లు, ఒకడు నీటిలో కొట్టుకుపోయినట్లు
బాధపడుచున్నప్రుడు, ప్రక్క మనిషి వచ్చి అందరిని కలిపి లెక్కించి పదిమంది యున్నట్లు తేల్చి చెప్పినట్లు, చివరకు
మనకు కూడ ప్రక్కమనిషి కథ చెప్పి వివరిస్తేగానీ గ్రహములు పదియని తెలియకుండా పోయినది. ఇంకా వివరించుకొని
చూస్తే గ్రహములు తొమ్మిది కాదు మొత్తము పండ్రెండని తెలియగలదు. ఇక్కడ వాటిని గురించి చెప్పడము సందర్భము
కాదు. అందువలన “జ్యోతిష్యశాస్త్రము” అను గ్రంథములో వాటి వివరము అందించగలము. ఇక్కడ సూర్య కుటుంబములో
గ్రహముల సంఖ్య తొమ్మిదను మాట తప్పనుటకు మాత్రమే ఈ వివరము చెప్పవలసినది.
కుటుంబము అనగా కొందరు ఒక గుంపుగా కలిసి సమిష్టిగా పని చేయడమును కుటుంబము అంటున్నాము.
“కుంటుంబము” అను పదము “కుటుంబముగా” చెప్పబడుచున్నదని కూడ “సుభోద” గ్రంథములో “నీ సంసారము”
అను వ్యాసములో చెప్పాము. ఒక దేశములో ఎన్నో కుటుంబములు ఉన్ననూ, ఆ దేశములోని కుటుంబములన్ని ప్రభుత్వము
యొక్క ఆధీనములోనే ఉండును. ప్రభుత్వము ప్రభువు చేతిలో ఉండును. ప్రభుత్వములోని చట్టమునకు లోబడి దేశములోని
అన్ని కుటుంబములు ఉండును. ఎవరూ చట్టమును అతిక్రమించకూడదు. అలాగే విశ్వములోని ఎన్నో గ్రహ
కుటుంబములున్నవి. దేశములో కుటుంబములన్నిటికి ప్రభువు ప్రభుత్వము పెద్దగాయున్నట్లు, విశ్వములోని గ్రహ
కుటుంబములకు కూడ ఒక ప్రభువు, ప్రభుత్వము కలదు. దానిని “దైవము, దైవత్వము అంటున్నాము. మనుష్య
కుటుంబములు ప్రభుత్వ ఆధీనములో ఉన్నట్టు, గ్రహకుటుంబములు దైవత్వ ఆధీనములో ఉన్నవి. దేశములోని అన్ని
కుటుంబములకు ప్రభువు (రాజు) పెద్ద అయినట్టు, విశ్వములోని అన్ని గ్రహకుటుంబములకు పెద్ద దైవము ఒక్కడేనని
తెలియవలెను. దేశములో ప్రభువు స్వతంత్రుడై ఎవరి ఆధీనములో లేనట్లు, విశ్వములోని దైవము కూడ సర్వ
స్వతంత్రుడై ఎవరి ఆధీనములో ఉండదు. “ఛత్రము” అనగా గొడుగు అని అందరికి తెలుసు. ఛత్రము ఎండకు వానకు
రక్షణ నివ్వగలదు. దేవుడు ఎవరి రక్షణలో లేనివాడు గనుక దైవమును “నఛత్రుడు” అంటున్నాము. నఛత్రుడైన
దైవమునకు గుర్తుగా ఆకాశములో నక్షత్రము గలదు. వాస్తవానికి నక్షత్రము అను పదము పూర్వము “నఛత్రము” అను
పదముగా ఉండెడిది. కాలక్రమున చివరకు నఛత్రము అను శబ్దము నక్షత్రమను శబ్దముగా మారిపోయినది. నక్షత్రము
దైవమునకు గుర్తని కొంత వివరము తెలిసినదికదా! ప్రపంచము లోని ఎన్నో దేశములకు ఎందరో రాజు (ప్రభువు)
-----------
లున్నట్లు, విశ్వములోని ఎన్నో సూర్య కుటుంబములకు పెద్దగా ఎన్నో నక్షత్రములు ఉన్నవని బాహ్యర్థముగా
కనిపించుచున్నవి. ప్రభువు అంటే రాజు అన్నట్లు నక్షత్రము అంటే దేవుడని తెలియవలెను. దేవుడు శుభకరమైనవాడు
గనుక అతనిని మంగళుడు అంటున్నాము. ఉరిశిక్షపడిన వానికైనా దేశానికి ప్రెసిడెంట్ (ప్రభువు) అయినవాడు ఒక
సంతకము చేస్తే శిక్ష మొత్తము రద్దయిపోగలదు. అలాగే కర్మ శిక్షపడిన వానిని విశ్వాధిపతియైన దేవుడు సమ్మతిస్తే
వాడు శిక్షనుండి విడుదల పొందగలడు. కర్మ శిక్షనుండి జీవుని విడుదలనే ముక్తి లేక మోక్షము అంటున్నాము.
అందువలన దేవున్ని ముక్తిదాత లేక మోక్షదాత అంటున్నాము. జీవుడు నాశనమైనపుడే ముక్తి పొందగలడు. అందువలన
దైవమును కాలుడు అని అంటున్నాము. అలాగే మంగళుడు అని అంటున్నాము. మంగళకరమైన దైవమునకు
గుర్తుగా వారారంభమున మూడవ దినమును మంగళవారమని అంటున్నాము. ఇంతవరకు చెప్పుకొన్న దానిని బట్టి
మంగళవారమునకు గల కొంత వివరమును తెలుసుకొన్నాము.
ఆదిలో “రామ” అను పదమును దైవమునకు ఉపయోగించెడివారు. దశరథరాముడు పుట్టక పూర్వమే “మరా”
అన్న శబ్దమునుండి “రామ అను శబ్దము పుట్టినది. రామ అనినా మరా అనినా రెండు ఒకే అర్ధము నిచ్చుచున్నవి.
దైవమునకు మారు పేరైన రామా శబ్దమును దశరథపుత్రునికి పెట్టడము జరిగినది. త్రేతాయుగమునుండి దశరథరామ
పేరు వాడుకలోనికి రాగ, కృతయుగమునుండియున్న ఆత్మారామ శబ్దము మరుగున పడిపోయి నది. రామ అంటే
దశరథ రాముడే అని అందరికి తెలుసు. అదే విధముగా మంగళ అను పేరు దైవమునకు సంబంధించినది కాగ అది
మరుగున పడిపోయి చివరకు కుజగ్రహమునకు మంగళుడని పేరు వచ్చినది. కుజ గ్రహమునకు మంగళ అను
పేరుండుట వలన ఆ పేరు దైవానిదని తెలియకుండ పోయినది. అందువలన మంగళ అన్నప్పుడు దానికి సమానమైన
అర్ధమునిచ్చు నక్షత్రమును ఎవరు గుర్తించక కుజగ్రహమునే జ్జప్తి చేసుకొంటున్నారు. రామ శబ్దము దశరథ పుత్రునికి
అంటుకొని దశరథరామున్ని జ్ఞప్తికి తెచ్చినట్లు, మంగళ శబ్దము కుజగ్రహమునకు అంటుకొనిపోయి కుజగ్రహమునే
జ్ఞప్తికి తెచ్చుచున్నది. అందువలన కొందరు ఆది, సోమ, మంగళవారములకు అధిపతులు సూర్య, చంద్ర, కుజగ్రహములని
అంటున్నారు. వాస్తవానికి ఆది, సోమ, మంగళవారములకు అధిపతులుగా సూర్య,చంద్ర,నక్షత్రములను చెప్పవలసియున్నది.
జీవాత్మ, ఆత్మ రెండు, శరీరములో ఉండగా ఆత్మకంటే పరముగానున్న పరమాత్మ ఎలా శరీరములోనున్నదో, అలాగే
సూర్య,చంద్ర రెండు గ్రహములు ఆకాశములో ఉండగా గ్రహముకంటే వేరుగాయున్న గ్రహము అని పేరు లేని
నక్షత్రము ఆకాశములోనే ఉన్నది. సూర్య చంద్రులకంటే అతీతమైన నక్షత్రము గ్రహము కాకపోయినా, “మంగళ అను
బిరుదు నక్షత్రమునకు ఉండగా కుజగ్రహము మంగళుడని పేరు కల్గియుండడము వలన చివరకు నక్షత్రము స్థానములో
కుజగ్రహము నిలిచి పోయినది. ఆత్మజ్ఞానము ప్రకారము మంగళ అనగా కుజగ్రహము కాదని నక్షత్రమని తెలియవలెను.
దీనిప్రకారము దేవునికి గుర్తుగా నక్షత్రమునూ, నక్షత్రదినముగా మంగళ వారమును లెక్కించవలసియున్నది. సూర్య,
చంద్ర, నక్షత్రములలో సూర్య చంద్రులను గ్రహములనుచున్నాము నక్షత్రమును గ్రహము అనుటకు వీలులేదు. సూర్యున్ని
సూర్యగ్రహము అనవచ్చును, చంద్రున్ని చంద్రగ్రహము అనవచ్చును, కానీ నక్షత్రమును నక్షత్రగ్రహము అని అనలేము.
అలాగే శరీరములోని ఏ ఆత్మ కానిది పరమాత్మ అని చెప్పవచ్చును.
ఆదివారము సృష్టి విషయమును తెల్పునదై ఉండగ, సోమవారము దేవుని జ్ఞాన విషయము తెల్పునదై ఉండగ,
మూడవదయిన మంగళవారము ఏకముగ పరమాత్మను, పరంధామమును, మోక్షమును తెల్పునదై ఉన్నది. ఆదివారమునకు
సూర్యుడు, సోమవారమునకు చంద్రుడు ముఖ్యులు కాగ మంగళవారమునకు నక్షత్రము ముఖ్యముగ ఉన్నది. సూర్యుడు
-----------
ఆకాశములో పగలు కనిపించి రాత్రి ఉండడు. అలాగే చంద్రుడు రాత్రి కనిపించి పగలు కనిపించడు. సూర్యచంద్రులు
ఆకాశములో కొంత సేపు కనిపించి కొంత సేపు కనిపించరు. జగత్తు ఉన్నంత వరకు మనిషికి పుట్టుక, జ్ఞానము
అవసరము. జగత్తు ఉన్నంతవరకే గల పుట్టుక జ్ఞానములు జగత్తు ప్రళయము చెందినపుడు లేకుండ పోవును.
జగత్తు ప్రభవము, ప్రళయములు చెందుచు కొంత కాలముండి కొంత కాలము లేకుండ పోవుచున్నది. 108 కోట్ల
సంవత్సరములున్న జగత్తు, 108 కోట్ల సంవత్సరములు లేకుండ పోవుచున్నది. ఆ సూత్రము ప్రకారమే ప్రపంచములో
రాత్రింబవళ్ళు ఏర్పడినవి. ఈ సూత్రము ప్రకారమే మనిషి పుట్టుక జ్ఞానములు కొంత కాలముండి కొంత కాలముండవని
తెల్పునట్లు, ఒక దినములో కొంత కాలము కనిపించి కొంత కాలము కనిపించని సూర్య చంద్రులను గుర్తింపుగ
నుంచారు. పుట్టుక, జ్ఞానమును తెల్పు ఆది, సోమవారములకంటే మించినది మంగళవారము. మంగళవారము
శాశ్వితముగ ఎప్పటికి ఉండు దేవున్ని తెలియజేయునది. మంగళవారము, పుట్టుక జ్ఞానముల తర్వాత మోక్షము
పొందవలెనని తెలియజేయు సందేశమిచ్చునదై ఉన్నది. జ్ఞానము ద్వార లభించు వాడు శాశ్వితమైన దేవుడు! దేవుడు
అనంతుడు!!! అన్నిటికంటే పెద్దవాడు!!! అందువలననే ఎల్లపుడు ఆకాశములో ఉన్న నక్షత్రమును, సూర్య చంద్ర
గోళములన్నిటికంటే కొన్ని లక్షల రెట్లు పెద్దగనున్న నక్షత్రమును దేవుని చిహ్నముగ చూపడము జరిగినది. లోతైన
బావిలోనికి దిగి, అనగా సూర్యరశ్మి లేకుండ చీకటిగనున్న లోతైన బావిలో నుండి ఆకాశము వైపు చూస్తే పగలు
కూడ నక్షత్రములు కనిపించగలవు. నక్షత్రములు పగలు రాత్రి ఎప్పటికి ఉండును. అన్ని సమయములలోను మనలను
చూస్తున్న దేవున్ని అన్ని సమయములలోను మనమిద గల నక్షత్రముతో పోల్చి చెప్పడము గొప్ప విధానమే. మోక్షమును
పొందడము దైవమును పొందినట్లే అగును. దైవమును ఫలానా అని చెప్పలేము. దేవుడు అన్నిటికి అతీతమైనవాడు.
అందువలన ఎటు తేల్చి చెప్పలేక శుభప్రదమైనవాడని చెప్పాము. . శుభప్రదమును మంగళమని చెప్పుచు మూడవ
దినమును మంగళవారమని అన్నాము.
మనిషి జీవితములో ముఖ్యమైనవి మూడు గట్టములున్నవి. ఒకటి పుట్టుక, రెండవది జీవించుట, మూడవది
మరణించుట. వీటినే ఆది, మధ్య అంత్యములంటున్నాము. ఆది, మధ్య, అంత్యములు గల అందరికి ముఖ్యమైనవి
ఆదివారము, సోమవారము, మంగళవారము. ఆదిని గూర్చి ఆదివారము (రవివారము), మధ్యను గూర్చి సోమవారము,
అంత్యమును గూర్చి మంగళవారములు గుర్తించుకొన్నాము. అలాగే ఆది, మధ్య, అంత్యముల వివరమును తెల్పునవిగ
సూర్యున్ని చంద్రున్ని నక్షత్రమును గుర్తించుకొన్నాము. ఈ విధముగ గుర్తించుకోవడము లేక తెలుసుకోవడము లేక
ఇతరులకు తెలుపడము జ్ఞానమైతే దాని ప్రకారము ఆచరించడము ఆరాధన అవుతుంది. ఈ ఆరాధనలో నిన్ను నీవు
గుర్తించుకొనుటకు దైవభావము పొందుటకు మంచి అవకాశముగలదు. పూర్వము కృతయుగములోనే మన పెద్దలు
జ్ఞాన విధానముతో మనకు మంచి మార్గమును చూపారు. అందరికి ఆధారమైనవాడు, అందరిని సృష్టించినవాడు,
సర్వమునకు మూలమైనవాడు ఒకే దేవుడని తెలియునట్లు, అసలైన పరమాత్మను (ఖుదాను) వదలి ఇతరులను
పూజించకుండునట్లు, మరి ఏ ఇతర దేవతలను పూజించకుండునట్లు, ఏ దేవతలైన అసలైన దేవుని (పరమాత్మ) చేతనే
సృష్టించబడ్డారని తెలియునట్లు, దేవుని చేత సృష్టించబడిన దేనినైన దేవునితో సమానముగ చూడకుండునట్లు, మనిషి
అసలైన జ్ఞానమార్గములో ప్రయాణించుటకు, మోక్షము పొంది దేవునిలో ఐక్యమగునట్లు ముఖ్యమైన ఆరాధనను
ఏర్పరిచారు. పూర్వము సంపూర్ణ జ్ఞానులైన మన పెద్దలు ఏర్పరిచిన ఆరాధన క్రమము చాలా గొప్పది. త్రైతాయుగములోని
వశిష్ట విశ్వామిత్రలకంటే, మరియు ద్వాపరయుగములోని వ్యాసునికంటే గొప్పవారైన కృతయుగపు బ్రహ్మర్షుల చేత
చెప్పబడిన మరియు ఆచరింపబడిన ఆరాధనయే త్రైతారాధన. త్రైతారాధన వారములోని ఆది, సోమ, మంగళవారములు
-----------
మాత్రము ఆచరింపబడునదై ఉన్నది. త్రైతారాధన అన్ని ఆరాధనలకంటే మించినదై దైవమునకు దగ్గరగ తీసుకుపోవునదై
ఉన్నది. త్రైతారాధన గొప్ప అనుభూతితో కూడుకొన్నదై ఆరాధన సమయములో గొప్ప తృప్తిని ఏర్పరుచుచున్నది.
త్రైతారాధన మూడు భాగములుగ ఉన్నది. ఆది ఆరాధన, మధ్య ఆరాధన, అంత్య ఆరాధన అని మూడు
ఆరాధనలను కలిపి త్రైతారాధన అంటున్నాము. ముందు ఆది ఆరాధనను గురించి తెలుసుకొందాము.
ఆది ఆరాధన
ఆది ఆరాధన: ఆదివారము సూర్యోదయములోనే చేయవలెను. ఆది ఆరాధన సృష్టి విషయమును తెలియజేయునదై
ఉండుట వలన మొదటి దినమైన ఆదివారమే చేయవలసి ఉన్నది. సూర్యోదయముతోనే సృష్టి మొదలైనది కావున
సూర్యుడు పుట్టుచున్నపుడే మొదటి ఆరాధన జరుగవలెను. ఆది ఆరాధన మనిషి పుట్టుకను సూచించునది కావున
గొప్ప విశేషమైన భావముతో కూడుకొని ఉన్నది. ఆరాధన ఒక పద్ధతి ప్రకారము చేయవలసియున్నది. ఆది ఆరాధన
పద్ధతి ప్రకారము ఆరాధన విషయము తెలిసిన భక్తులందరు ఒకే స్థలములో కలిసి ప్రార్ధన చేయవలసి ఉండును.
ఆది ఆరాధనకు అందరు కలియుట చేత సామూహిక ప్రార్ధనగ ఉండును. ప్రయాణ సమయములలో గాని, ఒంటరిగ
ఇతర ప్రదేశములలో ఉన్నపుడు గాని తానొక్కరు ఆరాధన చేసుకోవచ్చును. ఆరాధనకు శుభ్రత చాలా ముఖ్యము
ఆరాధన చేయు స్థలము పరిశుభ్రముగా ఉండవలెను. సామూహిక ఆరాధన కొరకు ప్రత్యేకించి ఒక స్థలమును
కేంద్రముగ చేసుకోవడము మంచిది. ప్రార్థనా స్థలశుభ్రతయే కాక శరీర శుభ్రత కూడ చాలా అవసరము. ప్రతి ఒక్కరు
స్నానము చేసి ప్రార్ధనలో పాల్గొనవలెను. ఒకవేళ ఎప్పుడైనగాని అనారోగ్య పరిస్థితుల వలన స్నానము చేయలేకపోతే
తప్పనిసరిగ ముఖము, కాళ్ళు, చేతులు, చంకలు నీటితో శుభ్రము చేసుకోవలెను. ప్రయాణసమయములో స్నానము
చేయలేకపోతే నీరు దొరకకపోతే చివరకు రెండు అరచేతులయిన కడుగుకోవలెను. అరచేతి శుభ్రమునకు కూడా
నీరు దొరకని పక్షములో ఫేస్‌పొడర్‌ను అరచేతులకు, ముఖమునకు, చంకలకు అద్దుకొని ప్రార్ధన చేయవచ్చును. ఆది
ప్రార్ధనకు ఐదు సంవత్సరముల పిల్లలతో పాటు కుటుంబ సభ్యులందరు పాల్గొన వచ్చును. కుటుంబ సభ్యులకు ఆది
ప్రార్ధన సారాంశమును తెలియజేసి వారిని పాల్గొనునట్లు చేయవలెను. ప్రార్ధనలో పాల్గొను స్త్రీలను ప్రత్యేక వరుసలో
కూర్చుండబెట్టవలయును. _సర్వులను సృష్టించిన సృష్టికర్తయైన దేవుని గురించిన మతాతీత ఆరాధన కావున ఏ
మతస్థులయిన ఈ ప్రార్ధనలో పాల్గొనవచ్చును. త్రైతారాధన పవిత్రమైనది కావున ప్రార్ధన దినములలో తప్పని సరిగ
దురభ్యాసములకు దూరముగ ఉండవలెను. త్రైత సిద్దాంతమును తెలిసిన ప్రబోధ సేవా సమితి సభ్యులు విధిగ
త్రైతారాధన చేయవలసి యుండును. ఒకవేళ అనివార్య కారణముల వలన గాని, అనారోగ్య కారణముల వలన గాని
ఆది ప్రార్ధన చేయలేని సందర్భములో తర్వాత మిగత సమయములో గాని ప్రార్ధన విధిగ చేయవలెను. సభ్యులు
ప్రార్ధనా సమయమునకు కనీసము ఐదు నిమిషములు ముందు ఆరాధన స్థలమునకు చేరి ఉండవలెను. ప్రార్ధనకు
వచ్చిన ప్రతి ఒక్కరిని పలుకరించడము సభ్యులు విధిగ చేయవలెను. పలకరింపు చేతుల జోడించిన నమస్కారముతో
ఉండవలెను. నమస్కారము దేవునికి ఇద్దరము సమానమని తెల్పు ఉద్దేశముతో ఉండవలెను. ప్రార్ధన స్థలమున
శత్రువుకయిన తప్పనిసరిగ నమస్కారము చెప్పవలెను. ప్రతి సభ్యుడు త్రైతారాధన వివరము అర్ధము తెలిసినవాడై
వాటి ప్రత్యేకతను ఇతరులకు చెప్పు స్థోమత కలిగి ఉండవలెను.
------------
ఆది ఆరాధన చేయు సమయములో తూర్పువైపుకి తిరిగి కూర్చొనవలెను. సూర్యుడు తూర్పువైపున పుట్టుచున్నాడు
కావున మొదటి ఆరాధన తూర్పుదిశకే కూర్చొని చేయవలెను. శరీర అనుకూలతను బట్టి కూర్చోవడము మంచిది.
సాధ్యమున్నంత వరకు అందరు ఒకే ఆసనములో కూర్చోవడము శ్రేయస్కరము. అన్నిటికంటే ముఖ్యమైన విధానమేమంటే
ప్రతి ఒక్కరు మూడు కోణములు గల తెల్లని గుడ్డను తలమీద కట్టుకోవలెను. గీతలో చెప్పినట్లు మూడుకోణముల
వస్త్రము థ్రైతసిద్ధాంతమును తెల్పునట్లు ఉండవలెను. తెల్లని గుడ్డ రెండుకొనలను తలమిద నుంచి గడ్డము క్రింద
కలిపి ముడివేసి ఒక కొనను తలవెనుకకు వదిలివేయవలెను. ముఖము క్రింద ఎడమ ప్రక్కనుండి వచ్చినకొనను
జీవాత్మ అని, కుడి ప్రక్కనుండి వచ్చినకొనను ఆత్మ అని తలచవలెను. గీతలో చెప్పినట్లు ఒకే శరీరములో జీవాత్మ
ఆత్మలు కలిసి నివసిస్తున్నాయను అర్ధము తెలియునట్లు రెండు కొనలను కలిపి కట్టవలెను. శరీరములో మూడవవాదైన*
పరమాత్మను గుడ్డ యొక్క మూడవకొనగ తలచవలెను. పరమాత్మ (దేవుడు) . శరీరములో అగోచరుడై ఎవరికి
తెలియకుండవున్నాడు కావున అదే అర్ధమొచ్చునట్లు మూడవకొనను ముందరచూచు వారికి కనిపించకుండ తల
వెనుకకుండు నట్లు చేయవలెను. మూడుకొనల గుడ్డను రెండుకొనలు కలిపి గడ్డము క్రింద కట్టితే మూడవకొన
యధావిధిగ వెనుకకే ఉండును. భగవద్గీతలో చెప్పినట్లు ఆత్మ జీవాత్మతో కూటస్టునిగ ఉన్నాడు అని తెలియునట్లు
అర్ధముతో రెండుకొనలు ముడివేయడము, మూడవ పరమాత్మ ఎవరికి తెలియకుండ ఆత్మ జీవాత్మలకంటే అతీతునిగ
ఉన్నాడని తెలియునట్లు అర్ధముతో మూడవకొన వెనుక భాగములో నిలచిపోవడమును చూస్తే త్రైత సిద్ధాంతము పూర్తి
కనిపిస్తున్నది. జీవాత్మ (క్షరుడు), ఆత్మ (అక్షరుడు), పరమాత్మ (పురుషోత్తముడు) ఉనికిని తెలియజేయు నిమిత్తము
తలమిదనే గుడ్డను కట్టవలెను. ఆత్మలను తెలియజేయు చిహ్నముగ మూడుకొనల గుడ్డను వాడుచున్నాము కావున
ఆత్మల స్వచ్చతను తెలియజేయునట్లు తెల్లని వస్త్రమును వాడవలెను.
తెల్లని వస్త్రము తలమిద కట్టుకొని సూర్యోదయమునకు ఐదు నిమిషముల ముందు ప్రార్ధనలో కూర్చోవలెను.
సూర్యుడు ఉదయించునపుడు ప్రార్ధనలో ఉండవలెననుట ఆది ప్రార్ధన యొక్క నియమము. సూర్యోదయము తర్వాత
ఐదు నిమిషములు ప్రార్ధనలో ఉంటు ప్రార్ధనకాలము పది నిమిషములుండునట్లు చూచుకోవలెను. ప్రార్ధన సమయములో
ఎడమ చేయి హస్తమును గడ్డము క్రింద ఆనించి పెట్టుకోవలెను. అలాగే కుడిచేయి హస్తమును తలమిద ఆనించి
పెట్టుకోవలెను. అట్లుంచుకోవడము వలన ధ్యాస అంతయు తలమధ్యలో ఏర్పడును. పైన క్రింద చేతులుంచుకొని
కళ్ళు మూసుకొని కూర్చోవడము వలన మనోదృష్టి తల మద్య భాగములో చేరుటకు అవకాశమున్నది. ఆదివారము
సూర్యోదయము చేయు ప్రార్ధన సృష్టి మొదలును తెలియజేయునదే కాక, నీ పుట్టుకను జ్ఞాపకము చేయుచున్నది.
అప్పుడే పుట్టినవానికి, వాని తలలో ఏ గుణములు లేకుండును. పుట్టిన శిశువుకు ఏ గుణములుండవు కావున
-------------
శిశువును దేవునితో సమానముగ కొందరు వర్ణించారు. ఆది ఆరాధనలో, సూర్యోదయముతో శిశువు పుట్టుక
సమానమైనందు వలన, ఆ సమయములో శిశువు తలలో గుణములు లేనట్లు ఆరాధకుని తలలో కూడ ఏ గుణ
సంకల్పము లేకుండ ఉండవలెను. ఆ పది నిమిషములు అట్లుండుటకు ప్రయత్నము చేయవలెను. పుట్టిన శిశువుతో
సమానముగ ఉండు ఆరాధన కావున ఇది భగవద్గీతలో చెప్పిన బ్రహ్మయోగ సాధన అగును. త్రైతారాధన క్రమములో
మొదటిదయిన ఆది ప్రార్ధన మొదటి దినమైన ఆదివారమే చేయడము కాక బ్రహ్మ, కర్మ, భక్తి యోగమను మూడు
యోగపద్ధతులలో మొదటిదయిన బ్రహ్మయోగమును ఆచరించినట్లగుచున్నది. సామూహిక ప్రార్ధన కావున అందరు
ఒకే మారు మొదలుపెట్టి ఒకే మారు ముగించుటకు మరియు అందరు పది నిమిషముల వరకే ప్రార్ధన చేయుటకు
అనుకూలముగ ఉండునట్లు పూర్వము దేవుని బీజాక్షరమైన “ఓం” కారనాదముతో ప్రారంభించి చివరిలో అదే నాదముతో
ముగించెడివారు. ఉదయము ఆది ప్రార్ధన తర్వాత ఎవరి పనులు వారు చేసుకొనవచ్చును. ఈ విధముగ ఎంతో
సారాంశమైన, ఆచరణతోనున్న ఆది ప్రార్ధన కాలగర్భములో కలిసిపోయినది. తిరిగి దానిని పునరుద్ధరించి పూర్వపు
ఆచారమునకు అందరము కలిసి ప్రాణము పోద్దాము.
మధ్యారాధన
మధ్యారాధన మధ్యాహ్నము సరిగ పండ్రెండు గంటల సమయములో సూర్యుడు నడి నెత్తినున్నపుడు చేయవలెను.
ఆది ప్రార్ధనలో తూర్పుకు తిరిగి కూర్చొనగ, మధ్య ప్రార్ధనలో దక్షిణ దిశకు తిరిగి కూర్చొనవలయును. మొదటి
ప్రార్ధనలోనున్నట్లే మధ్యప్రార్ధనలో కూడ తల మీద గుడ్డ కట్టుకోవడము చేతులు పెట్టుకోవడము చేయవలెను. మధ్యప్రార్ధన
రెండవ రోజైన సోమవారము చేయవలెను. సోమవారము దైవజ్ఞానమునకు సంబంధించిన దినము కావున
ప్రార్ధనకాలములో తలలో జ్ఞానము యొక్క జ్ఞప్తికల్గి తనకు సంభవించు ప్రతిదీ, తనచేత చేయబడు ప్రతిదీ, తాను
అనుభవించు ప్రతిదీ కర్మ నిర్ణయము ప్రకారము జరుగుచున్నవని తన ప్రమేయమేది లేదని తలపోయుచుండవలెను.
ప్రార్ధనసమయము కూడ పది నిమిషములుండునట్లే చూచుకోవలెను. ఆది ప్రార్ధన మొదలు పెట్టినట్లు అందరు ఓం”
శబ్దముతో మొదలు పెట్టి ఓం” శబ్దముతో ముగించవలెను. ఓం శబ్దమును మొదట చెప్పుటకు మరియు ప్రార్ధన
చివరిలో చెప్పుటకు ముందే ఒకరిని నిర్ణయించుకొని ఉండవలెను. మధ్యప్రార్ధన మధ్యాహ్నమే చేయవలెను.
అనివార్యకారణముల వలన గాని, ఆరోగ్యరీత్య ఆ సమయానికి చేయలేక పోతే ఇతర సమయములో గాని తప్పనిసరిగ
చేయవలెను. సోమవార ప్రార్ధనకు కూడ ఆదివార ప్రార్ధనపట్ల శుభ్రముగనున్నట్లే ఉండవలెను. సోమవార మధ్యప్రార్ధనలో
దిశా, భావము తప్ప అన్నీ ఆది ప్రార్ధనకు పాటించినట్లే పాటించవలెను.
మధ్యప్రార్ధన జీవిత జ్ఞానమునకు సంబంధించినది కావున ప్రపంచములో పాత్రధారుడై నడుచుకొను ప్రతి
మనిషి తనను నడిపించు సూత్రము కర్మయని, కర్మసూత్రము కదలించునట్లు కదలుచున్నానని స్వయముగ తాను
కదలు స్వతంత్రుడనుకానని జ్ఞానము కల్గియుండునట్లు మధ్యప్రార్థన ఏర్పరచబడివున్నది. *మధ్యప్రార్ధనలో తాను
కర్మబద్దుడననీ, ప్రతి పని నేను చేయునది కాదు నా చేత చేయించబడుచున్నదనీ, నాచేత జరుగబడు కార్యము నేను
చేయడము లేదని యోచించడము వలన మనిషి జీవితములో కూడ అదే జ్ఞానము జ్ఞాపకముండి, ఏ కర్మనూ అంటించు
కోవడము జరుగదు. మధ్యప్రార్థన అహము లేని విధానమును అలవాటు చేయుచున్నది. ఈ అలవాటును భగవద్గీతలో
చెప్పిన రెండవదైన కర్మయోగము అని తెలియవలెను. పుట్టింది మొదలు ప్రతి మనిషి చావు వైపు ప్రయాణిస్తున్నాడు.
-------------
జన్మనుండి ప్రతి మనిషి యొక్క జీవితము మరణము వైపుకు సాగుచున్నది. మరణమునకు అధిపతి పరమాత్మయని,
అతడే యముడని అతని దిశ దక్షిణమని చెప్పుకొన్నట్లు శరీరములో జీవాత్మ కుడి ప్రక్క కాల ద్వారముల ద్వారానే
మోక్షము పొందవలసి ఉన్నది. జీవునికి మరణము గాని, మోక్షము గాని కాలచక్రములోని కుడి ప్రక్క ద్వారముల
ద్వారానే జరుగుచున్నది. ఈ విషయము మాచే రచింపబడిన “త్రైత సిద్ధాంత భగవద్గీత” అక్షరపరబ్రహ్మయోగమను
అధ్యాయములోను మరియు “ప్రబోధ” గ్రంథములో కర్మ, కాల, బ్రహ్మచక్రములను అధ్యాయములోను విపులముగ
చెప్పబడినది. జీవిత ప్రయాణము మరణము లేక మోక్షము వైపుకు కావున వాటి ద్వారములు కుడిప్రక్కనున్నందు
వలన ఆదివారము తూర్పువైపుకు కూర్చున్నవారు రెండవ రోజు సోమవారము కుడిచేతి వైపు తిరిగి దక్షిణమువైపు
కూర్చోవలసి ఉన్నది. మధ్యారాధన సోమవారమునది కావున జ్ఞానము యొక్క జ్ఞప్తి కల్గియుండడము, జ్ఞాన గమ్యము
కుడివైపు కావున దక్షిణదిశకు తిరిగి కూర్చోవడము ప్రత్యేకత. సోమవారము యొక్క ఆరాధన వివరము తెలిసి ఆచరించు
వ్యక్తి తర్వాత అదే జ్జప్తితో కర్మయోగమును ఆచరించగలడు. జీవితములో కర్మయోగ ఆచరణ అలవరచుకోవడము
ద్వార మనిషి భగవద్గీతలో దేవుడు చెప్పినట్లు యజ్ఞకర్మ ఆచరించినట్లగును. యజ్ఞకర్మ అనగా రాబోవు కర్మను
కాల్చివేయడమని అర్ధము. కర్మను అంటని విధానము సోమవారము ఆచరించెడి మధ్యారాధన వలన సాధ్యమై మనిషి
మోక్షమును పొందవచ్చును. ఆదివారము చేయు సూర్యోదయ ప్రార్ధనలో బ్రహ్మయోగము, సోమవారము మధ్యాహ్నము
చేయు మధ్య ప్రార్ధనలో కర్మయోగము అలవాటగును. త్రైతారాధనలో భాగములైన ఆది, సోమవారముల ప్రార్ధనలో
ఇంత విశేషముండగ మూడవ ప్రార్ధన ఏమిటో తెలుసుకొందాము.
అంత్యారాభన
ఆది ప్రార్ధన వారములో మొదటిదైన అదివారము చేయగ, మధ్య ప్రార్ధన వారములో రెండవ దినమైన సోమవారము
చేయగ, అంత్యప్రార్ధన వారములో మూడవ దినమైన మంగళవారము చేయబడు చున్నది. ఆదివారము జీవుని పుట్టుకను,
సోమవారము జీవితములో దైవజ్ఞానమును తెలుపగ మంగళవారము సరాసరి మోక్షమునే తెలియజేయు చున్నది.
శుభప్రదమైన మోక్షమును తెలియు ఆరాధన మూడవ దినమైన మంగళప్రదమైన మంగళవారము చేయబడుచున్నది.
మంగళవారము చేయు అంత్య ఆరాధనతో మొత్తము త్రైతారాధనలు పూర్తి అగుచున్నవి. త్రైతారాధనలో చివరిదైన
అంత్యారాధన కూడ తెల్లని గుడ్డను తలమీద ధరించి, చేతులు తలమీద, క్రింద పెట్టుకొని ఆది, మధ్య ఆరాధనలాగే
చేయవలసివుండును. చివరిదైన అంత్యారాధన మంగళవారము సూర్యాస్తమయములో చేయవలెను. సూర్యుడు
అస్తమించక ముందు ఐదు నిమిషములపుడు ప్రారంభించి, అస్తమించిన తర్వాత ఐదు నిమిషములుండు నట్లు చేయవలెను.
మొత్తము పది నిమిషముల ప్రార్థనసమయములో మిగతా ప్రార్ధనలలాగే గుడ్డ, చేతులుండగ కూర్చున్న దిశ, తలలోని
ఉద్దేశ్యము వేరుగవుండును. మంగళవారము సూర్యాస్తమయములో చేయు ప్రార్ధన పడమటి దిశ వైపుకు తిరిగి
చేయవలెను. ప్రార్థనసమయములో భగవద్గీతలో చెప్పిన భక్తియోగమును ధ్యాసలోనికి తెచ్చుకోవలెను. ప్రపంచమునకు
అంతటికి దేవుడైన పురుషోత్తముడే పెద్ద అని, పరమాత్మమీదకంటే అన్యదా ఎవరిమీద విధేయత లేదని, దేవుని మీద
ఉన్న భక్తియే దేవుని అంశయైన భగవంతుని మీద కూడ ఉన్నదని, సృష్టికర్త, పరలోక రాజ్యాధిపతియైన పరమాత్మయే
సర్వలోక శాసనుడని, ఆది మధ్య అంత్యములు లేనివాడు దేవుడని, దేవుని మీద పూర్తి ఇష్టత విశ్వాసము కల్గి దేవునిలోకి
ఐక్యమగుటయే ప్రార్ధనలోని ముఖ్య ఉద్దేశ్యము.
--------
కాని ప్రస్తుత కాలములో ఇందూ మతము హిందూ మతముగ మారిపోయి ఏకేశ్వరోపాసన స్థానములో
బహుదేవతారాధన ఏర్పడినది. సూర్యాస్తమయముతో రాత్రి ప్రారంభమగుచున్నది. సూర్యాస్తమయము మానవుని
అస్తమయమును తెలుపుచున్నది. జీవుని అంత్యము మోక్షమని, శరీర అంత్యము మరణమని తెలిసి ఆ రెండింటిని
తెలియజేయునది సూర్యుడు అస్తమించడము కావున సూర్యుడు అస్తమించు దిశకు తిరిగి నా అస్తమయము నీలోనికి
ఐక్యము కావలెనని కోరికతో ప్రార్ధన చేయడమునే అంత్యప్రార్ధన అంటున్నాము. అంత్యప్రార్ధన మోక్షము కొరకుండవలెను.
సువిశాలమైన దేవునియందిమిడి కనిపించకపోవునట్లు ఉద్దేశ్యము కల్గి చేయడమే చివరి ప్రార్ధన యొక్క అర్ధము,
ఉద్దేశ్యము. మానవుని గమ్యము చివరికి మోక్షమే కనుక మంగళవారమే చేయడము జరుగుచున్నది. ఆది సోమ,
మంగళవారములలో ఆది, మధ్య, అంత్యకాలములైన ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రములలో బ్రహ్మ, కర్మ
భక్తియోగములు అచరించడమే త్రైతారాధనయని తెలియవలెను.
ఆదివారము -- ఉదయము -- తూర్పు --... బ్రహ్మయోగము
సోమవారము -- మధ్యాహ్నము -- దక్షిణము న-- కర్మయోగము
మంగళవారము -- సాయంకాలము -- పడమర --... భక్తియోగము
మూడు యోగములతో, మూడు దినములందు, మూడుకాలములలో, మూడు దిశలలో దేవున్ని ఆరాధించడమే
త్రైతారాధన. త్రైతారాధన ప్రబోధసేవా సమితివారే కాక అందరు ఆచరించడము మంచిది.
త్రైతారాధకులు ముఖ్యముగ పరమాత్మ జ్ఞానము తప్ప అన్యదేవత ఆరాధన వదలి వేయవలసి ఉంటుంది.
త్రైతారాధన మూడురోజులు, మొత్తము విశ్వమునే సృష్టించి నడిపించు స్వయంశక్తి పరుడైన పరమాత్మ ఆరాధనతో
కూడుకొని ఉన్న దానివలన, అన్నింటికంటే పెద్ద, అసలైన సృష్టికర్త దేవుడని తెలిసిన తర్వాత ఇతర దేవుళ్ళను
ఆశ్రయించడము పరమాత్మను మనము సరిగా అర్ధము చేసుకోలేదని అర్ధము. దేవుని గొప్పతనము తెలియనివారే
ఇతర దేవుళ్ళను ఆశ్రయించగలరు. కనిపిస్తుంటే తొంగిచూడడము అవసరము లేదు కదా! అలాగే దేవుని జ్ఞానము
తెలిసినపుడు ఇతర దేవతలను గూర్చి యోచించరు కదా! ఇతర దేవుళ్ళను మానవుడు సృష్టించుకొన్నదే కాని ఆ
దేవుళ్ళు కూడ మనవలె జీవులేననీ, మనము పుట్టినట్లే వారుకూడ పుట్టారనీ చాలామందికి తెలియదు. పూర్వము
పెద్దలు పరమాత్మను తెలుపు జ్ఞానమును తెలియజేయునిమిత్తము దృశ్యరూపమైన దేవాలయమును సృష్టించారు.
దేవాలయ రూప నామములు పూర్వము దైవజ్ఞానముతో నిండుకొన్నవై ఉండెడివి. కాలక్రమమున ఆనాటి ఉద్దేశ్యమూ,
జ్ఞానమూ తెలియకుండ పోయిన దానివలన ఇతర ఉద్దేశ్యములతో మానవుడు అనేక దేవుళ్ళను తయారు చేసుకొన్నాడు.
అర్ధము లేని ఆచరణలలో మునిగి పోయాడు. ఇటువంటి ఆచారములను, భక్తిని, భగవద్గీతలో తామస ఆచారము,
తామసభక్తి అని చెప్పబడి ఉన్నవి. ఖర్చు, కష్టము లేని పరమాత్మ ఆరాధనను వదలి ఖర్చు, కష్టమున్న అనేక ఇతర
దేవతారాధనలను మనిషి కల్పించు కొన్నాడు. దేవుడు తప్ప ఇతర దేవతారాధన మాయప్రేరేపితమని తెలియని దానివలన
వాటిలో ఇరుక్కొని పోయి పరమాత్మ జ్ఞానమునకు దూరమై పోవుచున్నారు. అన్యదేవతల ఆలయములు కట్టించినవారు
మొదలుకొని ఆ దేవతలను పూజించువారు సహితము మాకంటే మించిన భక్తుడుగాని, మాకంటే మించిన జ్ఞానిగాని
లేడని వారి మనస్సులో దృఢమైన గోడ కట్టుకొన్నారు. అటువంటి వారికి పరమాత్మ జ్ఞానము చెప్పినా వారి హద్దును
దాటి వారు వినే స్థితిలో లేరు.
------------
మోక్షాధిపతియైన పరమాత్మను తెలుపు నిమిత్తము పూర్వము ఇందూమతములోనే ఏకేశ్వరోపాసన తెలియజేయు
జ్ఞానము వెలువడినది. ఇందూమతములోనే ఒకే దేవుని ఉపాసన తెలియజేయు దేవాలయములు కూడ తయారైనవి.
కాని ప్రస్తుత కాలములో ఇందూమతము హిందూమతముగ మారిపోయి ఏకేశ్వరోపాసన స్థానములో
బహుదేవతారాధన ఏర్పడినది. కాలగమ్యములో ప్రత్యేకించి ఏ మతముకాని ఇందూమతము నుండి అనేక మతములు
ఏర్పడినప్పటికీ, వాటిలో బహుదేవతారాధన లేకుండడము సంతోషదాయకమైనప్పటికీ, మతాల అవగాహన వారిలో
లేకుండ పోయి పరమతద్వేషము కొందరిలో నిలిచిపోయినది. దీనిని బట్టి ఎవరు ఏ మతస్తులైనా వారిలో ఇంకా
కొంత మాయ పని చేస్తున్నదనియే చెప్పవచ్చును. ఇటువంటి ప్రస్థుత కాలములో ఏ మాయ పనిచేయని విధానము,
అన్ని మతముల అవగాహన, అందరికీ మిగత దేవతలకు సహితము అధిపతియైన పరమాత్మను తెలియు జ్ఞానమున్న
బోధలు గాని, అనుసరించు విధానములు గాని ఎంతో అవసరము. ఆ అవసరము తీర్చునట్లు త్రైత సిద్ధాంత బోధలు
దేవుడు మనకందించాడు. దేవుడు అందించిన అసలైన జ్ఞానము ప్రబోధ సేవా సంస్థలో ఉండడము మన అదృష్టముగ
భావించి ఈ సంస్ధ సభ్యులు ఇతరులకు కనువిప్పు కల్గునట్లు కొన్ని ఆచరణలు కల్గియుండవలెను.
త్రైతారాధనను త్రైతసిద్ధాంతము తెలిసిన ప్రతి ఒక్కరు ఆచరించవలెను. ప్రభోదసేవా సమితి వారు త్రైతారాధన
చేస్తూ తెలియని వారికి కూడ తెలియజెప్పు స్థోమత కల్గి ఉండవలెను. ఈ సంఘము వారు పరమాత్మ జ్ఞానము,
పరమాత్మ ఆరాధనలో తప్ప ఇతర దేవతల ఆరాధనలో పాల్గొనరాదు. సమీప బంధువులు పిలిచిన, వారికి అర్ధమగులాగ
తమ విధానము తెలియజెప్పి మాపద్ధతి ప్రకారము అలా పాల్గొనడము దైవ ద్రోహమగునని చెప్పవలెను. పరమాత్మ
కొరకు ఏమైన కష్టపడవచ్చునుగాని ఇతర దేవతల కొరకు ఎటువంటి శ్రమగాని పడకూడదు. అన్యదేవతల కొరకు
చేయు పూజలలో పాల్గొనక పోవడమే కాక అటువంటి పూజ నిర్వాహణకు గాని, నిర్మాణములకు గాని ఎటువంటి
చందా ఇవ్వకూడదు. అట్లు ఇచ్చిన అజ్ఞాన సహితమైన పరదేవతారాధనను ప్రోత్సహించినట్లగును. ఆది, మధ్యాంత
రహితుడు పరలోకాధిపతియైన పరమాత్మను గాని, ఆయన అంశనుగాని ఆరాధించు ఆరాధనలో పాల్గొనవచ్చును.
అక్కడిచ్చు ప్రసాధమును మహా బహుమతిగ భావించవలెను. అన్యదేవతారాధనల ప్రసాధములను ఎవరైన ఇచ్చిన
వాటిని తినుబండారములవలె భావించ వలెను. ప్రతి దినము తాను స్వయముగ కొంత త్రైత జ్ఞానమును తెలుసుకోవడము
గాని, చేతనైతే ప్రతి దినము కొందరికైన త్రైత జ్ఞానమును తెలుపడము గాని చేయవలెను. త్రైతారాధన చేయు మూడు
దినములలోను పవిత్రముగ ఉండుటకు అలవాటుపడవలెను. ఆ మూడు దినములలో కఠినముగ మాట్లాడుట,
దూషించుట మానవలెను. త్రైతారాధనలో అందరు తెల్లని వస్త్రములు ధరించవలెను. తెలుపు జ్ఞానచిహ్నమైన
చంద్రుని రంగు. అందరు తెల్లని రంగు ధరించడము క్రమశిక్షణను తెలియజేయును. త్రైత సంఘములో ఎవరు
చనిపోయిన పూర్వపు ఆచారమువలె ఆ శవమును శివముగ భావించి అందరు శరీర అంత్యక్రియలో పాల్గొనవలెను.
త్రైత జ్ఞానము ప్రకారము “శ్రీమతము (శ్రీమంతము)” జ్ఞానము కల్గిన స్త్రీలకు మాత్రమే చేయవలెను. చనిపోయిన
వాడు జన్మలకు పోయినట్లయితే. వానికి పిండాకూడు పెట్టకూడదు. చనిపోయిన వాడు మోక్షము చెందినట్లయితే
వానికి తప్పనిసరిగ పిండాకూడు పెట్టు కార్యమును భావ పూరితముగ చేయవలెను. మృతదేహమునకు శివపూజ
చేయునపుడు, అలాగే మోక్షము పొందిన వానికి పిండాకూడు పెట్టు సమయములోను త్రైతమును అనగా మూడు
ఆత్మలను తెలుపు తెల్లనిగుడ్డను తలమిద ధరించవలెను. బహుశ పిండాకూడు కార్యము చాలా అరుదుగ జరుగును
కావున ఈ పని లేక పోవచ్చును కాని శివమును మాత్రము తలమిద గుడ్డ ధరించియే తాకవలెను. పిండాకూడును
-----------
గురించి కాని, శవమును శివముగ చూచుటను గాని, శ్రీమంతమును గురించి గాని ఇతరులకు తెలియ చెప్పడము
మరియు త్రైత ఆరాధన గురించి చెప్పడము సాధ్యమున్నంత వరకు చేయవలెను. ప్రబోధ సేవాసమితి వారు నిత్యము
జ్ఞానము తెలుసుకొనుటకు మరియు తెలియజెప్పుటకు కొంత కాలమును కేటాయించుకొన్నట్లు, దేవుని కొరకు ఒక
గంట కాని లేక అరగంట కాని పని చేయునట్లు ఏర్పాటు చేసుకోవలెను. అలా చేయగ వచ్చిన డబ్బును దేవుని పనికి
ఉపయోగించవలెను. ప్రబోధసేవా సంస్థలో నిజమైన జ్ఞానమున్నదని ఇతరులకు తెలియునట్లు నడుచుకోవలెను.
భూమి మీద ధర్మములు అధర్మములుగ మారునని భగవద్గీతలో దేవుడు తెల్పినట్లు పూర్వము ఎంతో
పవిత్రముగనున్న ఆది,సోమ,మంగళ వారములు ప్రస్థుత కాలములో అపవిత్రముగ మారిపోయినవి. అలాగే ఏ పవిత్రతలేని
మిగత నాలుగు దినములు పవిత్రముగ లెక్కించబడుచున్నవి. వివరముగ చూస్తే అన్నివిధముల చెడిపోయిన వానిని
వీడు శనిపట్టినవాడని అంటున్నాము. అన్ని విధముల చెడుపునకు శని అధిపతి అని అందరికి తెలిసినట్లే ఉన్నది.
శనిదినమైన శనివారము పూర్వము పవిత్రత లేని దినముగనే లెక్కించెడివారు. అలాగే వస్తువాహన,విలాసములకు,
శృంగారమునకు అధిపతియైన శుక్రుని యొక్క శుక్రవారమును, ప్రపంచ దేవతలకు గురువుగయుంటూ ప్రపంచ
జ్ఞానమునకు అధిపతిగయుండి ప్రపంచజ్ఞానము మీద మనుషులను లగ్నము చేయు గురుగ్రహము యొక్క దినమైన
గురువారమును, మంత్ర తంత్రములకు, భూతప్రేత పిశాచములకు తాంత్రిక విద్యలకు అధిపతియైన బుధుని యొక్క
దినమైన బుధవారమును పరమాత్మ జ్ఞానము తెలిసినవారు ఏమాత్రము పవిత్రదినముగ భావించెడివారు కారు. జ్ఞానరీత్య
మొదటి మూడుదినములైన ఆది, సోమ, మంగళ వారములనే పవిత్రముగ చూచుకొనెడివారు. ప్రస్తుత కాలములో
చివరి మూడుదినములైన గురు,శుక్ర,శనివారములు పవిత్రముగ మారిపోవడము, మొదటి మూడుదినములైన
ఆది,సోమ,మంగళవారములు అపవిత్రముగ మారిపోవడము జరిగినది.
అన్నివిధముల బ్రష్టుపట్టినవానికి మారుపేరుగ చెప్పు శని వారమును, అన్ని ధరిద్రములకు గుర్తుగ చెప్పు
శనివారమును ఏమాత్రము జ్ఞానములేని వారు కూడ పవిత్రముగ పరిగణిస్తున్నారు. చాలామంది శనివారము ఇల్లు
వాకిలి శుబ్రముచేసుకొని కొందరు దేవతలకు ప్రత్యేకముగ పూజలు చేయుచున్నారు. శనివారము శుచి శుభ్రమును
పాటిస్తు తలస్నానము చేసి మాంసముగాని, చేపలనుగాని ఇంటిలోపలికి కూడ తీసుకురాక పవిత్రదినముగ
భావించుచున్నారు. జ్ఞానసంబంధముగ ఎటువంటి ప్రత్యేకతలేని దినమును మరియు దరిద్రములకు మారుపేరైన
శనివారదినమును ఈ కాలములో పవిత్రముగ చూడడము, అన్ని విధముల జ్ఞానవివరముతో కూడుకొన్న ఆదివారమును
అపవిత్ర పనులకు వాడుకోవడము చూస్తే ధర్మము అధర్మముగ మారినదని చెప్పకుండ ఉండలేము. అలాగే ఏమాత్రము
జ్ఞానసంబంధ విషయములులేనిది, ప్రపంచ సంబంధమైన ధన, కనక, వస్తు, వాహన, భోగభాగ్య, శృంగార విషయములకు
ఆలవాలమైన శుక్రగ్రహ దినమైన శుక్రవారము కూడ లక్ష్మీవారమని, డబ్బుదినమని, డబ్బుకొరకు పూజలు నిర్వహిస్తు,
ఉపవాసాలు ఉంటూ పవిత్రముగ గడపడము చూస్తునే ఉన్నారు. గురువారము కూడ సాయిబాబ భక్తులు, రాఘవేంద్రస్వామి
భక్తులు శుచి శుభ్రతలతో పవిత్రముగ పూజలు సాగించడము కూడ చూస్తున్నాము. ఈవిధముగ వారమునకు చివరివైన
గురు,శుక్ర,శని మూడురోజులను పవిత్రముగ చూడడము, మొదటి ఆది,సోమ,మంగళ మూడురోజులను అపవిత్ర
కార్యములకు వాడుకొంటూ వాటికి ప్రాధాన్యత ఇవ్వకపోవడము చాలా గమనించతగ్గవిషయము. దీనినిబట్టి కాలగర్భములో
ఎన్నో ధర్మములు అధర్మములుగ, అధర్మములు ధర్మములుగ తిరగబడినవని అర్థమగుచున్నది. పరమాత్మ జ్ఞానమునకు
అవరోధములైన అధర్మములను లేకుండ చేసుకొని, దేవుని ధర్మములను ప్రచారము చేసి వాటిని ఆచరించడము మన
----------------
కర్తవ్యము. అధర్మములను లేకుండ చేసి ధర్మములను నెలకొల్పుటకు సృష్టికర్తయైన దేవుడే మానవునిగ వచ్చి ఎన్నో
శమలు,బాధలు, అవమానములు చవిచూచాడు. మానవులమైన మనము ఇపుడు ధర్మములను ధర్మములుగ, అధర్మములను
అధర్మములుగ చూపించి చెప్పితే అధర్మములకు అలవాటుపడిన మనుషుల ద్వారా కొంత ఇబ్బంది తప్పదు.
విషయములోని సత్యము తెలిసి చెప్పక పోతే తనలోపలి దైవ ప్రతినిధియైన ఆత్మకు ద్రోహము చేసినట్లగును. తెలిసి
చెప్పితే ఇటు అజ్ఞాన ప్రజలకు అయిష్టత ఏర్పడును. చెప్పకపోతే అటు ఆత్మ ద్రోహమగును. ఆదివారము ఇల్లు, ఒళ్ళు
శుభ్రముగ ఉంచుకొని మాంసము తెచ్చుకోకుండ పవిత్రముగ గడపమనిన, శనివారము మాంసము తినవచ్చుననిన
జ్ఞానము తెలియనివారికి చాలా విరుద్ధముగ ఉండును. దైవమార్గములో ఎటువంటి కష్టములనైన ఎదుర్కొనవలెనని,
దానివలన దైవమునకు చేరువకాగలమని తలచి. ప్రతి మనిషి ధర్మములనే ప్రచారముచేసి అధర్మములను లేకుండ
చేయుటకు ప్రయత్నించవలెను.
పూర్వము ఇందూమతము ఎంతో జ్ఞానోన్నత కల్గియుండెడిది. జ్ఞాన సంపన్నదేశమైనందు వలన భారతదేశమును
ఇందూదేశమని కూడ పిలిచెడివారు. పూర్వము మూడు దినములు త్రైతారాధన సక్రమముగ జరిగెడిది. ఆనాడు
సామూహిక త్రైతారాధన నేడు ఇస్తాంమతములో మసీద్‌నందు జరుగు ప్రార్ధనలాగుండెడిది. ప్రతి ఒక్కరు ప్రార్ధనలో
పాల్గొనెడివారు. అటువంటి ఇందువుల ఆరాధన నేడు మచ్చుకైన కానరాకుండ పోయినది. పూర్వము ఎంతో అర్ధసహితముగ
చేయు జ్ఞాన ఆరాధన లేకుండపోయినది. అదేరీతిని బోలు ప్రార్ధనలు ఇస్లాంస్థాపనలో ముస్లిములందున్నాయి. ఎంతో
విశ్వాసము, దేవునిపట్ల విధేయత, ప్రవక్తల మాట జవదాటని క్రమశిక్షణ ఇస్లాం మతములో ఉండడము సంతోషింపదగిన
విషయమేయైన పూర్వకాలమే ఎంతో జ్ఞానోన్నతమైన ఇందూమతములో నేడు అజ్ఞానము చోటుచేసుకొని అనేక అన్యదేవతల
ఆరాధనలకు అలవాటుపడి తమదైన త్రైతారాధనను మరచిపోవడము విచారింపదగిన విషయము. ఇప్పటికైన తమ
పొరపాటును గ్రహించి వెనుక పుట్టిన ఇస్లాం మతములోని వారి ఆరాధన (నమాజ్)ను చూచి, చాలాముందు పుట్టిన
మనకు ఎంతో జ్ఞానవివరముతోనున్న ఆరాధన కలదని గ్రహించి, త్రైతారాధన వివరము మనము తెలుసుకొని ఇతరులకు
తెలిపి, ఆచరించి ఇతరులను ఆచరింప చేయవలెను. ఇందువైన ప్రతి ఒక్కరు ఇంతవరకు తెలియని త్రైతారాధనను
తెలియాలి. ఇంతవరకు ఇతర గురువులు, ఇందూమతము లోని జ్ఞానమును బోధించు స్వాములు ఎవరు ఈవిషయము
చెప్పలేదే అని మమ్ములను ప్రశ్నించక ఎందరు స్వాములుండినా, జ్ఞానము తెలియకపోతే ప్రయోజనము లేదని తలచి
ఇతర మతముల ముందర ధైర్యముగ నిలబెట్టుగలుగు త్రైతారాధన చేయండి. మగతనము లేని పురుషుడు భార్యను
ఎంత బాగ చూచుకొనిన ఆడతనము గల స్తీకి అసంతృప్తే ఉంటుందంట. అలాగే పురుషత్వమును (దైవమును)
తెలుపలేని గురువు ఎంత బాగ బోధించిన ఆడతనము (మాయతత్వము) గల వానికి అసంతృప్తియే మిగిలి ఉంటుంది.
----------------
అందువలననే నేటి కాలములో ఒకవ్యక్తి ఎందరో గురువులను ఆశ్రయించడము జరుగుచున్నది. అప్పటికి కూడ
వానికి తెలియవలసినది తెలియడము లేదు. ఇప్పటికైన మించిపోయినది లేదు. గురువుల భ్రమలు వదలి అందరికి
“జగత్ గురువు” అనువాడు ఒకడు కలడని తలచి వానిని అన్వేషించు ఉద్దేశ్యముతో ఈ త్రైతారాధన ఆచరిస్తూ
ఇందువుల ఆరాధన ఇట్లుండునని తెలియునట్లు చేయవలెను. నీవు నిజమైన ఇందువైతే నీముఖాన బొట్లు, నామముకంటే
ముఖ్యము అది, సోమ, మంగళవారముల ఆరాధన, మూడు దినములు, మూడు దిక్కులలో, మూడు యోగములతో,
మూడు లోకముల వారికి తెలియునట్లు మూడు ఆరాధనలు చేసి ఇందువు అను పదమునకు విలువను, అర్థమును
చేకూర్చవలెనని కోరుచున్నాము. ఇప్పటికైన ప్రతి దినము ఇందువుగ పుట్టి, ఇందువుగ బ్రతికి, ఇందువుగ మరణించమని
తెలియజేయుచున్నాము.
ఇట్టు
ఇందూ ధర్మప్రదాత.
సంచలనాత్మత రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త.
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు.