pss book:gt7 త్రైత సిద్ధాంత భగవద్గీత: అక్షర పరబ్రహ్మ యోగము

 త్రైత సిద్ధాంత భగవద్గీత:  అక్షర పరబ్రహ్మ యోగము  

అర్జునుడిట్లనియె :-

శ్లోకము 1 : కిం త ద్బ్రహ్మ? కిమధ్యాత్మం? కిం కర్మ పురుషోత్తమ ! ।

అధిభూతం చ కిం ?ప్రోక్త మధిదైవం కిముచ్యతే ?||

(ప్రకృతి, ఆత్మ, పరమాత్మ)

శ్లోకము 2 : అధి యజ్ఞః కథం కోఽత్ర దేహేఽస్మి న్మధుసూదన ! ।

ప్రయాణ కాలేచ కథం జ్ఞేయోఽసి నియతాత్మభిః॥

(ఆత్మ, పరమాత్మ)

భావము: బ్రహ్మమేది ? ఏది ఆధ్యాత్మికము ? కర్మయేది ? ఏది భూతములకు అధిపతి? అట్లే దేవతలకు అధికుడైనవాడెవడు? తెలియచెప్పుము. పురుషోత్తమ .! దేహములో యజ్ఞములకు అధిపతియైనవాడు ఎట్లున్నాడు ? నియతాత్ములు వారి అంత్యకాలములో నిన్ను ఎట్లు పొందుచున్నారు ?

అక్షరము అనగ నాశనములేనిదని అర్థము. అక్షర పరబ్రహ్మమని పేరు పెట్టబడిన ఈ అధ్యాయములో ఎక్కువగ మోక్షమును గురించిన విషయమేకలదు. ఇంకనూ యోగమాచరించు యోగులు ఆ జన్మలో మోక్షము పొందారా లేదా అని తెలుసుకొను విధానము కూడ తెలియబరచబడినది. భగవంతుడు యుద్ధ రంగములో ఇలా అధ్యాయములుగ గీతను చెప్పలేదని, యుద్ధము తర్వాత వ్యాసునిచే భగవంతుడు చెప్పిన విషయము వ్రాయబడినదని ముందే చెప్పాము. వ్యాసుడు అధ్యాయములుగ విభజించి చెప్పిన వాటిలో దాదాపు ఆత్మసంయమ యోగమను అధ్యాయమువరకు ఎక్కువగా యోగముల గురించియే చెప్పాడు. అక్కడి నుండి ఎక్కువగా జీవాత్మ, ఆత్మ, పరమాత్మల గురిచి చెప్పుచూ వచ్చి ఈ అధ్యాయములో మోక్షమును గూర్చి ఎక్కువగా చెప్పాడు. అంతేకాక అధ్యాయము మొదటిలో మంచి ప్రశ్నలనిచ్చి వాటికి జవాబులు తెల్పడము ఎంతో ప్రత్యేకముగ, పాఠకులకు సులభముగ జ్ఞానము అర్థమగులాగున ఉన్నది.

వివరము : ఇక్కడ అర్జునుడు ఒక్కమారుగ ఏడు ప్రశ్నలడిగాడు. ఈ ఏడు ప్రశ్నల చివరిలో అంత్యకాలములో యోగులు ఎట్లు నిన్ను పొందుచున్నారను ప్రశ్న కలదు. మొదటి ఆరు ప్రశ్నలకు రెండు శ్లోకములలో జవాబులు చెప్పబడి ఉన్నాయి. ఈ అధ్యాయములోని 28 శ్లోకములలో రెండు శ్లోకములు అర్జునుని ప్రశ్నలుకాగ రెండు శ్లోకములలో ఆరు ప్రశ్నలకు జవాబులు చెప్పగ మిగత 24 శ్లోకములలోను ఏడవ ప్రశ్నకు జవాబు ఇమిడి వున్నది. అర్జునుడు అడిగిన ఏడు ప్రశ్నలేవనగా! బ్రహ్మమనగా ఏది? ఇచట గమనించవలసినది ఈ ప్రశ్న విష్ణు, ఈశ్వర, బ్రహ్మలను వారిలోని నాలుగు తలల బ్రహ్మను గూర్చి అడిగినది కాదు. ఈ సర్వసృష్టికి మూలకర్త, అన్నిటికి అధిపతి, అంతట వ్యాపించినవాడు, దేవతలకు దేవుడైనవాడు, పరమాత్మయని పిలువబడువాడు ఎవడని అర్జునుడు మొదట ప్రశ్న వేశాడు. రెండవ ప్రశ్న ఆధ్యాత్మికము అనగా ఏమిటి ? మూడవది కర్మ అంటే ఏమిటి? నాల్గవది సర్వజీవరాసులకు అధిపతియైనవాడెవడు? ఐదవ ప్రశ్న సర్వ దేవతలకు పెద్ద ఎవరు? ఆరవ ప్రశ్న దేహములో యజ్ఞములకెవరు అధిపతి? చివరి ఏడవ ప్రశ్న యోగులు అవసానదశలో ఎట్లు మోక్షము పొందగల్గుచున్నారు? ఈ ప్రశ్నలకు జవాబుగ శ్రీకృష్ణుడిట్లన్నాడు.

శ్రీ భగవంతుడిట్లనియే : -

శ్లోకము 3 : అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మ ముచ్యతే ।

భూత భావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః ||

(ప్రకృతి , పరమాత్మ)

భావము : అన్నిటికంటే శ్రేష్ఠమైన నాశనరహితమైనదే బ్రహ్మము. తన్నుతాను తెలుసుకోవడమే ఆధ్యాత్మికము అనబడును. జీవరాశుల ఉనికికి కారణమైన లెక్కాచారమును కర్మ అందురు.

వివరము : మొదటి ప్రశ్నకు జవాబుగ అన్నిటికంటే శ్రేష్ఠమైన, నాశరహితమైనదే బ్రహ్మము అని చెప్పాడు. బ్రహ్మ అంటూనే ఏ బ్రహ్మ అని యోచించక కొందరు వారికి ఇష్టమొచ్చిన దైవమును గురించి తలచుకొనుచున్నారు. చాలామంది చతుర్ముఖ బ్రహ్మననుకోవడము జరుగుచున్నది. బ్రహ్మము అనునది పేరుకాదు. ఒక గొప్పతనమును తెలుపుపదము. బ్రహ్మ అనగ పెద్దది అని అర్థము చేసుకోవాలి. విశేషతను చూపునపుడు బ్రహ్మ పదమునుపయోగించుచుందురు. బ్రహ్మాండము, బ్రహ్మరథము అను పదములు కూడ విశేషతను చూపునవియే. ఇక్కడ అన్నిటికంటే పరమాత్మ విశేషత కల్గినవాడు కనుక ఆయనను బ్రహ్మ అను పదమును గూర్చి చెప్పారు. వాస్తవముగ జవాబులో చెప్పు శ్రేష్ఠమైన బ్రహ్మము అనువానికి అసలు పేరు లేదు. అది ఒక పెద్ద విచిత్రమైనశక్తి. ఆ శక్తిని ఏమని పేరు పెట్టాలో ఎవరికి తెలియక ఇలా బ్రహ్మమని, పరమాత్మని, ఈశ్వరుడని చెప్పుకొనుచుందురు. బ్రహ్మయనినా, పరమాత్మనినా, ఈశ్వరుడనినా అవి పేర్లు కావు. బ్రహ్మ అంటే పెద్దదని, పరమాత్మంటే ఆత్మకంటే వేరైనవాడని లేక ఆత్మకంటే శ్రేష్ఠమైనవాడని అర్థము. అట్లే ఈశ్వరుడు అంటే అధిపతి అని అర్థము. వాస్తవానికివి పేర్లుకావని ఏదీ కానివానికి ఏ పేరు పెట్టాలో ఎవరికి తెలియదనియే చెప్పవచ్చును. పరమాత్మ స్త్రీలింగముకాదు, పురుషలింగముకాదు. అందువలన ఒకచోట పురుషునిగ, ఒక చోట స్త్రీగ ఎట్లు చెప్పిన సరిపోవుచున్నది. భగవద్గీతను చెప్పినది, శ్రీకృష్ణుని శరీరమునుండి పల్కినది కూడ ఆ శక్తియే. ఇప్పుడు అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పునది కూడా అదియే. అది మూడవ అధ్యాయము జ్ఞానయోగములో చెప్పినట్లు అప్పుడప్పుడు అవసరమొచ్చినప్పుడు మానవావతారములో పుట్టి తన ధర్మములను తెలియజేసి పోవుచుండును. అలా పరమాత్మ శరీరమును ధరించడమునే అవతారము అంటున్నాము. ఆయన ఎక్కడ ఏ అవతారమెత్తాడో కాని శ్రీకృష్ణునిగ పుట్టి నేను పలనావాడినని స్వయముగ ప్రకటించుకొంటేగాని మనకు తెలియలేదు. అలాంటి జన్మనే భగవంతుడని వెనుక ఎన్నోసార్లు చెప్పుకున్నాము. భగవంతుడైనవాడు అర్జునుడడిగిన రెండవ ప్రశ్నకు ఏమి జవాబు చెప్పాడనగా!

తన్నుతాను తెలుసుకోవడమే ఆధ్యాత్మికము అన్నాడు. అధ్యయనమనగా వెనుతిరిగి చూచుకోవడమని లేక తిరిగి చదువుకోవడమని అర్థము. గీతను అధ్యయనము చేయడమనగా గీతను తిరిగి తెలుసుకోవడము లేక చదువుకోవడమని అర్థము. అట్లే ఆత్మ అధ్యయనము అనగా ఆత్మను చూచుకోవడము లేక ఆత్మను తెలుసుకోవడమని అర్థము దీని ప్రకారము ఆధ్యాత్మకము అన్న మాటకు తన ఆత్మను తాను తెలుసుకోవడమని అర్థము. లేక తన్నుతాను తెలుసుకోవడమని కూడ చెప్పవచ్చును. తన ఆత్మను తాను అధ్యయనము చేసుకోవడము ఆధ్యాత్మకము అను జవాబు తర్వాత కర్మఅంటే ఏమిటి అను ప్రశ్నకు జవాబు కూడ చెప్పాడు.

కర్మ అనగా జీవరాసులకు సంబంధించిన లెక్కాచారముల పట్టిక. ఒక జీవుడు ఎప్పుడు పుట్టాలి, ఎట్లు పుట్టాలి, ఏ శరీరముతో పుట్టాలి, పుట్టినపుడు ఎంత ఏడ్వాలి, పుట్టిన తర్వాత ఎంత సేపటికి పాలు త్రాగాలి అని, నిమిషమునకు ప్రతి సెకండుకు ఏమి జరగాలి అను నియంత్రిత వివరమునే కర్మ అంటున్నారు. ఇది పుట్టినది మొదలు చచ్చు వరకు ముందే లెక్కలుగ వ్రాసి పెట్టబడి వుండును. ఆ రాతనే కర్మ అంటున్నారు. ఈ విషయమై బైబిలులో ఏసుప్రభువు ఇలా అన్నాడు. ”నీ తలలోని వెంట్రుకలు కూడ లెక్కించబడి ఉన్నవి” మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉండాలి, ఎన్ని పోవాలి, ఎప్పుడు ఏది పోవాలను విషయము కూడ వ్రాయబడివున్నది. అట్లే ఎన్నిమార్లు కనురెప్పమూసి తెరువాలో కూడ వ్రాయబడివుండగ జీవితములో జరుగు పెద్ద చిన్న కార్యములన్నియు లిఖితమై ఉన్నాయని ఆ వివరమునే కర్మ అంటారని తెలుసుకోవాలి. విసర్గ అనగ నియంత్రించబడివున్న లెక్కాచారమని తెలుసుకోవాలి. దాని ప్రకారమే జీవితములో ప్రతి చిన్న పెద్ద పని జరుగుచున్నది. దాని అనుభూతిని జీవుడు పొందుచున్నాడు.

శ్లోకము 4: అధిభూతం క్షరోభావః పురుషశ్చాధిదైవతమ్ ।

అధియజ్ఞోఽహమే వాత్ర దేహేదేహ భృతాంవర ||

(ఆత్మ)

భావము : నాశన స్వభావమున్న శరీరములు గల జీవరాసులకును, దేవతలకును ఆధారమైనవాడిని నేనే. దేహమందు జరుగు యజ్ఞములకు నేనే అధిపతినని తెలియుము.

వివరము : ఈ శ్లోకము యొక్క అర్థము వ్రాయడములో చాలా గీతలలో భూతములకు ఆధారము నాశన స్వభావముగల శరీరములని చెప్పబడి వున్నది. అలా అనుకొంటే ఒక మనిషి బ్రతికున్నపుడు, ఆ జీవునికి వాని శరీరము ఆధారమై అధిభూతమై ఉందనుకొందాము. వాడు అకాలమరణము పొంది స్థూలశరీరమును మాత్రము కోల్పోయి, సూక్ష్మశరీరముతో ఇంకా కొన్ని సంవత్సరములు జీవించి ఉన్నాడనుకొనుము. ఆ జీవునికి అప్పుడు శరీరమే లేదు. అప్పుడు వానికి అధిభూతమెవరగుదురు? అలా బతుకు వానికి అధిభూతముండదా? ఇలాంటి ప్రశ్నలు బయలుదేరి వాటికి జవాబులు వెదికినా దొరకవు. అందువలన శరీరములధిభూతమను మాట నిజముకాదు.

నాశన స్వభావములైన జీవరాసులకు ఆధారమైనది అధిపతియైనది, మరియు దేవతలకు కూడ ఆధారమైనది, అధిపతియైనది ఆత్మ (పురుషుడు) అని చెప్పబడి ఉన్నది. నాశనమగు శరీరములకు, వాటిని ధరించిన జీవులకు, సకల దేవతలకు ఆత్మయే ఆధారమైనది. వాటి జీవన విధానము నడుచుటకు కారణమైవున్నది. ఆత్మశక్తి లేనిది నాశనస్వభావముగల శరీరములు కదలలేవు మరియు పెరుగలేవు. ఆత్మలేనిది జీవుడు శరీరములోనే ఉండలేడు. సకల దేవతల ప్రతిమలలో ఆత్మలేనిదే వాటికి శక్తిలేదు. అవి ప్రతిమనుండి బయటకు రాలేవు, లోపలికి పోలేవు. అవి సంచరించనూలేవు. క్షర భావముగల శరీరములకు, జీవులకు, దేవతలకు అధిపతియైనవాడు ఆత్మయేనని తెలియుము.

యజ్ఞములు బయట జరుగునవి కావు. శరీరములోనే రెండు విధములైన యజ్ఞములు జరుగుచున్నవని ముందే జ్ఞానయోగములో చెప్పుకొన్నాము. ఆ యజ్ఞములకు అధిపతియైనవాడు కూడ ఆత్మయేనని తెలియాలి. కోర్టుకు జడ్జిలేనిదే కోర్టు ఎట్లు జరుగదో అట్లే ఆత్మలేనిది శరీరములో ఏ పని జరుగదు. కోర్టుకు ముఖ్య ఆధారమైనవాడు, మరియు అధిపతి జడ్జియైనట్లు, శరీరమునకు అధిపతి, ముఖ్య ఆధారము ఆత్మయేయైఉన్నది. సర్వజీవరాసుల శరీరముల లోపల జరుగు రెండు యజ్ఞములకు, జీవరాసుల శరీరములతో పూజింపబడు బయటి దేవతలకు, జీవరాసులకు అధిపతియైనవాడు ఆత్మ లేక పురుషుడని చెప్పవచ్చును. విభజన ప్రకారము పురుషోత్తముడు వేరు, పురుషుడు వేరని గ్రహించవలెను. ఇక్కడ అధిభూతము, అధియజ్ఞము, అధిదైవమైనవాడు పురుషుడని గ్రహించవలెను. క్రింది శ్లోకములో పురుషోత్తముని గురించి చెప్పబడుచున్నది. ఎక్కడ పురుషుడు, ఎక్కడ పురుషోత్తముని గురించి చెప్పుచున్నారో గ్రహించకపోతే అర్థములన్నియు తలక్రిందులైపోయి భగవద్గీత స్వరూపమే తెలియకుండ పోవును.

శ్లోకము 5 : అన్తకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరమ్ ।

యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ||

(ఆత్మ, పరమాత్మ)

భావము : చివరి కాలములో నన్నే స్మరించుకొంటు శరీరమును వదులువాడు నన్నే పొందగల్గుచున్నాడు. ఈ విషయములో ఏ మాత్రము సంశయము లేదు.

వివరము : ఒక్కొక్కపుడు పరమాత్మ నేను అని చెప్పినప్పుడు ఎచట జీవాత్మ పాత్ర ఉన్నది, ఎచట ఆత్మ పాత్ర ఉన్నదని యోచించి చూడవలెను. ఈ శ్లోకములో అవసానదశలో నన్ను స్మరించువాడు మరణించిన తర్వాత నన్నే పొందుచున్నాడని చెప్పబడినది. శరీరములో అవసానదశ ఏర్పడుచున్నది. శరీరములో మనోధ్యాస ఆత్మ మీద ఉండాలి. అటువంటపుడు మరణించినవానికి శరీరములేదు. శరీరము ఉన్నపుడు స్మరింపబడునది ఆత్మయితే, శరీరము విడిచిన తర్వాత పొందబడునది పరమాత్మ. ఆత్మగ శరీరములో నన్నే స్మరించుచున్నారని, పరమాత్మగ శరీరము బయట నన్నే పొందుచున్నారని చెప్పినది ఒక్కడే, వాడే పరమాత్మ. పరమాత్మ శరీరము లోపల స్మరణకు అందుబాటుగ ఆత్మయై, శరీరము బయట పొందుటకు వీలుగ పరమాత్మయై ఉన్నాడు. అందువలన నన్నే స్మరించువాడు నన్నే పొందగలడని చెప్పాడు. ఇక్కడ మనము మాత్రము స్మరించబడువాడు ఆత్మని, పొందబడువాడు పరమాత్మని వేరువేరుగ విభజించి తెలుసుకోవాలి.

శ్లోకము 6 : యం యం వాఽపి స్మరన్ భావం త్యజత్యన్తే కళేబరమ్ ।

తం త మే వైతి కౌంతేయ! సదాతద్భావ భావితః ||

(జీవాత్మ)

భావము : ఏ ఏ భావమును స్మరించుకొంటూ శరీరమును వదులుచున్నాడో, ఆయా భావమునే అభ్యాస బలము చేత పొందుచున్నాడు.

వివరము : ఈ శ్లోకము నిర్ధిష్టముగా ఫలానా వారిని గూర్చి చెప్పారనుటకు వీలుకాదు. ఈ శ్లోకము ఒక సూత్రములాంటిది, ఒక సూత్రము ప్రకారము ఏ లెక్కనైన చేసినట్లు, ఇక్కడ చెప్పిన సూత్రము కూడ జ్ఞానులకు అజ్ఞానులకు అందరికి పనికివచ్చునది. ఇది ఎవరికైన వర్తించునది. అందువలన ఇది ఫలానా వారికని, పలాన విషయమునకని ఏమాత్రము చెప్పలేము. ఈ సూత్రమేమిటంటే శరీరమును వదులునపుడు అనగ “అవసానదశలో ఎవని మనసులో ఏ జ్ఞాపకమున్నదో మరణము తర్వాత దానినే వాడు పొందును” అన్నది సూత్రము. ముఖ్యముగ గమనించవలసినది ఏమనగా ! ఇది మరణములో అవసానదశ ఏర్పడువారికి మాత్రమే. అవసానదశ ఏర్పడని మరణములెన్నో ఉన్నవి. వాటికి ఈ సూత్రము వర్తించదు. కాలమరణములకే గాని అకాల మరణములకు ఈ పద్ధతి సరిపోదని తెలియాలి. అవసానదశలో ప్రకృతికి సంబంధించిన విషయము ఉండవచ్చు, ఆత్మకు సంబంధించిన విషయమైన ఉండవచ్చును. ఒకవేళ ప్రకృతికి సంబంధించిన విషయముంటే తిరిగి జన్మవుంది. ఏ విషయమును తలచుచుండునో దానినే పొందగలుగును. అట్లుకాక ఆత్మ జ్ఞాపకముంటే మరుజన్మ పొందక పరమాత్మనే పొందగలుగును. ఆ చివరి కాలములో అనగ అవసానదశలో జీవితములో బలమైనదిగా ఏ విషయముంటే అదే జ్ఞాపకము వచ్చును. కొందరు చివరిలో దేవున్ని తలచుకుంటే సరిపోతుంది కదా! చివరి కాలములో నన్ను స్మరించితే మోక్షము పొందవచ్చునన్నారు కదా! ఇప్పటి నుంచి దేనికి ప్రాకులాడవలెను. వృద్ధాప్యమొచ్చినపుడు దానిని గురించి యోచిస్తాము అనువారున్నారు. మనమనుకొన్నట్లు చివరి సమయములో ఏది కావలసివస్తే అది జ్ఞప్తికిరాదు. జీవితకాలములో గల విషయములన్నిటిపైకి ఏ విషయము మనస్సుకు ఎక్కువ గాఢముగ హత్తుకొని ఉండునో, ఆ విషయమే చివరిలో జ్ఞప్తికిరాగలదు. అలా ఎందుకు జరుగుచున్నదనగా! అవసానదశలో మనస్సు బలము కోల్పోవుచుండును. బలహీనపడిన మనస్సు ముఖ్యముకాని చిన్న చిన్న విషయములన్నిటిని మరచిపోవును. జీవితములోని ముఖ్య విషయములను మాత్రమే జ్ఞాపకము చేయగల్గుచుండును. మరణము దగ్గరవుకొలది పూర్తి జ్ఞాపకాలన్నిటిని మరచిపోవును. చివరగ ఏదైతే జీవితములో ఎక్కువగ మనస్సుకు అంటుకొని ఉండునో దానినే జ్ఞాపకము చేయగలదు. ఆ విషయ జ్ఞాపకమే చివరిదగును.

కొందరికి దైవ విషయమే మనస్సులో ఎక్కువగ లగ్నమైవుండును. కొందరికి ప్రపంచ విషయములలో ఏదో ఒకటి పెద్దదుండును. దీనిని బట్టి జన్మనా లేక మోక్షమా అని తెలియును. ఉదాహరణకు ఒకనికి సంగీతమే ప్రాణముగ ఉండుననుకొందాము. వానికి మరణ సమయములో కూడ అదే జ్ఞాపకము వచ్చి మరుజన్మ కల్గును. ఆ జన్మలో కూడ సంగీతమునే నేర్వగలిగి దానియందు ఆసక్తితోనే కొనసాగును. ఒకడు ఒక పరిశోధన సాగిస్తు వాని మనసునిండా ఆ పరిశోధన విషయమే నింపుకొని బ్రతుకుతున్నాడు. చివరికి మరణసమయములో కూడ చివరి ధ్యాస పరిశోధన మీదనే ఉండుట వలన వానికి జన్మకల్గి మరుజన్మలో ఆ పరిశోధనే తిరిగి కొనసాగించును. మనసులో ఏదైతే ఇష్టతనున్నదో దానినే జన్మాంతరమునందు పొందుచున్నాడు. ప్రపంచ విషయములలో ఏదైతే ఇష్టముగ ఉన్నదో దానినే వాడు పొందగలుగుచుండును. ఎన్ని జన్మలు మారిన దాని నుండి బయటపడలేడు. వానిని ఆ శ్రద్ధనుంచి మరల్చాలంటే చాలా కష్టము. ఇష్టము జిగురులాంటిది. ఏ దానికంటుకొంటే దానికే అంటిపెట్టుకొనివుండును. అందువలననే ఒకరి ఇష్టమునొకరు మార్చలేరని పెద్దలు చెప్పారు. ఒకనికి ఇష్టమైన దానిని ఎందరు నివారించిన వాడు వదలుకోడు. శ్రద్ధ అనునది దైవవిషయముల మీద ఉంటే పరవాలేదు. ప్రపంచ విషయముల మీద ఉన్నవారిని పెద్ద పెద్ద గురువులు సహితము మార్చలేరు. ఎవనికి వాడు శ్రద్ధయను దానిని దేనిమీద ఉంచితే బాగుండునో బాగా యోచించి నిర్ణయించుకోవలెను. దీనిని గురించే అర్జును నికి భగవంతుడు క్రింది శ్లోకములో సలహా ఇస్తున్నాడు.

శ్లోకము 7 : తస్మా త్సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ ।

మయ్యర్పిత మనోబుద్ధి ర్మామే వైష్యస్యసంశయః॥

(ఆత్మ, సాకారము)

భావము : కావున సర్వకాలము నీమనసునందు నన్ను స్మరించుచుండుము. బుద్ధి మనస్సు నాకే సమర్పించుట వలన నన్నే పొందగలవు. దీనిలో సంశయము లేదు.

వివరము : అంత్యకాలములో జ్ఞప్తిని బట్టి మరుజన్మగాని, మోక్షముగాని ఉండును. చివరి జ్ఞాపకముకోసము ఇప్పటినుండి ప్రయత్నము చేయవలెనని, అలా చేయుట వలననే చివరిలో అనుకొన్నదానిని పొందవచ్చని అర్జునునికి భగవంతుడు తెల్పుచు ఇలా అన్నాడు. "సర్వకాలము నీ మనస్సును బుద్ధిని నాయోచనలే చేయునట్లు అభ్యాసము చేసుకొనుము. అట్లు సర్వకాలములో నన్ను స్మరించుచుండుట వలన నన్నే పొందవచ్చును". ఇక్కడ చెప్పినది కంటికి కనిపిస్తున్న శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు నన్ను స్మరించమన్నాడు. ఆ మాట శ్రీకృష్ణుడున్నంత వరకు సరిపోతుంది శ్రీకృష్ణుడు పోయాక ఎవరిని స్మరించాలి? ఆయన పోయిన తర్వాత కూడ ఆయన రూపమునే స్మరించాలా? లేక నిరాకారమైన ఆత్మను స్మరించాలా? ఆయనున్నపుడు ఆయనను వదిలి ఆత్మను స్మరించాలా? ఇలా ఇన్ని ప్రశ్నలుద్భవించుచున్నవి. ఈ శ్లోకము చెప్పి ఇరకాటములో పెట్టాడు కావున యోచించాలి.

సాకారము, నిరాకారము అను రెండిటిలో ఎపుడు సాకారమును, ఎపుడు నిరాకారమును ధ్యానించాలన్నది పూర్వమునుండి ఉన్న సమస్యయే. పరమాత్మ సాకారుడై భగవంతునిగ వచ్చిన జన్మవున్నంతవరకు సాకారమునకే పూజ, సాకారమునకే మనోబుద్ధి పనిని లగ్నము చేయాలి. ఫలానా సాకారమని తెలిసిన తర్వాత పూజకాని మనోలగ్నముకాని ఆ సాకారమును వదిలి చేయకూడదు. శ్రీకృష్ణుడు భగవంతుడని తెలిసిన తర్వాత బ్రహ్మయోగమని నిరాకార ధ్యానము చేయడము, గొర్రెపిల్లను చంకలోపెట్టుకొని దానికోసము వెతికినట్లగును. భూమి మీద పరమాత్మ భగవంతునిగ జన్మించుట అరుదు. అది ఎన్నోవేల సంవత్సరములకో జరుగును. అప్పుడు అదృష్టవశాత్తు ఆ జన్మ సామాన్యమైనదికాదని, అపుడపుడు బుద్ధి యోచనకర్థమగుచున్నపుడు ఆ సాకారమును వదలి నిరాకరము మీదికి పోనవసరము లేదు. భగవంతుని జన్మ శ్రీకృష్ణునిదని తెలిసిన మనము ఆయన భగవంతునిగ లేని సమయములో ఉన్నాము, కనుక ఆయన ప్రతిమకు సాకారపూజ చేసినప్పటికి నిరాకార ధ్యానము చేయక తప్పదు. శ్రీకృష్ణుడున్నపుడు ఆయనతో శత్రుత్వము కల్గియుండి యోగము చేయువారు కొందరుండెడివారు. అనగ సాకారముతో శత్రుత్వము, నిరాకారముతో మిత్రుత్వము అటువంటివారు నష్టయోగులగుదురు. పూర్తి జ్ఞానాగ్ని వారిని చేరదు. సాకారము నుండి రావలసినది రాదు. సగము అగ్నిని నష్ఠపోయిన వారగుదురు. శ్రీకృష్ణుని జన్మ అయిపోయిన తర్వాత ఆయన ప్రతిమ విగ్రహకాదని గ్రహించాలి. ప్రతిమ ఏదైనా విగ్రహగా ఉండగలదు. భగవంతుని ప్రతిమ విగ్రహగాలేదు. భగవంతుని ప్రతిమను పూజించినవారు యోగము చేసిన దానితో సమానమే అగును. ఆ అవకాశము మిగతా విగ్రహములగు ప్రతిమలకు లేదు.

శ్లోకము 8 : అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామినా|

పరమం పురుషం దివ్యం యాతి పార్థాఽను చింతయన్ ||

(ఆత్మ, పరమాత్మ)

భావము:అభ్యాసము చేత మనస్సును ఇతర విషయముల మీదికి పోనీయక యోగముతో కూడుకొని చింతించువాడు శ్రేష్ఠమైన, దివ్యమైన పురుషుని పొందగల్గుచున్నాడు.

వివరము : సాకారము తెలియని మనము ఆత్మయోగులు కావాలి. ఆత్మను తెలియాలంటే మనస్సును అభ్యాసముచేత నిలుపగలగాలి. స్వాధీనపడిన మనస్సును అంతర్ముఖముగ చింతచేయించాలి. మనస్సు ఆత్మ మీద చింతగలదై ఉంటూ జ్ఞానాగ్ని సముపార్జనతో కర్మ కాలిపోయిన తర్వాత మరణించినవాడు మరుజన్మకు పోడు. వాడు మరుజన్మకు పోకుండ ముగ్గురు పురుషులలో శ్రేష్ఠమైన దివ్యమైన పురుషుని చేరగల్గుచున్నాడు. మూడవ పురుషుడెటువంటివాడో అటువంటి వానిలాగే వానియందే కలసి పోవుచున్నాడు.

శ్లోకము 9 : కవిం పురాణ మనుశాసితార మణోరణీయాంస మనుస్మరేద్యః ।

సర్వస్యధాతార మచింత్య రూప మాదిత్యవర్ణం తమసః పరస్తాత్ || (జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)

శ్లోకము 10 : ప్రయాణకాలే మనసాఽచలేన భక్త్యాయుక్తో యోగబలేన చైవ ।

భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుష ముపైతి దివ్యమ్ ||

(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)

భావము : సర్వదర్శి, పురాణుడు, జగత్తును శాశించువాడు, సూక్ష్మములకు సూక్ష్మమైనవాడు, సర్వస్వమును రక్షించువాడు, చింతచేత తెలియనివాడు, సూర్య ప్రకాశము కల్గినవాడు,అజ్ఞానమునకంటే వేరైనవాడునైన పరమాత్మను పొందకోరువాడు, మరణ సమయములో యోగబలము చేత మనస్సును కనుబొమల మధ్యలో నిలుపగలిగి, ప్రాణవాయువును స్థిరపరచినవాడై పరమాత్మలో చేరగల్గును.

వివరము : చేరవలసినది పరమాత్మలోనికి, దృష్ఠిని సారించవలసినది ఆత్మ మీదికి, చేరవలసినవాడు జీవాత్మ, ప్రయాణీకుడు జీవాత్మ,దారి ఆత్మ, గమ్యము పరమాత్మ. ప్రయాణికునికి ముందు గమ్యము తెలియాలి. ఏ ఊరికి పోవాలో, ఆ ఊరెట్టిదో, కొంత ఇతరుల ద్యారా తెలిసిన తర్వాత ఆ ఊరికి పోవు దారేదో తెలుసుకొని, దానివెంట ప్రయాణించిన గమ్యము చేరవచ్చును. అలాగే గమ్యమైన మోక్షమును గురించి భగవంతుడు మనకు కొంత తెలియజేశాడు. మోక్షమనగ ఒక ప్రదేశముగాని,ఒక లోకముకాని కాదు. మోక్షమనగ విడుదల అని అర్థము. జనన మరణములను కల్గించు కర్మనుండి బయటపడడమే మోక్షము. అలా కర్మనుండి మోక్షము పొందినవాడేమగుననగా, సర్వదర్శిగ మారి సర్వ ప్రపంచమును చూడగల్గును. ఒక శరీరములో ఉన్నప్పుడు తనముందు ఉన్న దానిని మాత్రము చూడగల్గువాడు, మోక్షము పొందిన తర్వాత సర్వమును చూడగల్గుట ఎంత గొప్పో ఆలోచించండి. అంతేకాక పూర్వము నుండి ఉండువాడై, ఆది నుండి ఉన్నవన్ని తెలియగలడు. మనిషిగ ఉన్నపుడు మన జీవితం కూడ పూర్తి ఙ్ఞప్తి లేని మనము, సనాతన కాలమునుండి తెలిసిన వారమగుట గొప్పకాదా! జన్మతో ఉన్నపుడు మన కొడుకులు కూడ మన మాట వినరు, వారిని శాశించి చెప్పలేము. జన్మ లేక మోక్షము పొందినపుడు సర్వ జగత్తును శాశించి నడిపించు అధికారము కల్గి ఉందుము. ఇంటిలోని వారిని కూడ శాశించలేనివాడు జగత్తుకే శాసనకర్తయగుట గొప్పకాదా! సామాన్య జీవరాసిగా ఉన్నప్పుడు స్థూలమును తప్ప సూక్ష్మమును తెలియనివాడు, సూక్ష్మములకు సూక్ష్మముగ మారిపోవుట ఎంత గొప్పనో ఆశ్చర్యము కాదా! శరీరముతో ఉన్న మనము అందరి దృష్ఠికి కన్పించుచున్నాము. మోక్షమునకు పోయిన తర్వాత ఎవరి మనోదృష్ఠికి కూడ కనిపించమంటే, ఆ గమ్యము ఎంత గొప్పదో ఆలోచించండి. ఇప్పుడు ఏ ప్రకాశము లేని మనము, విడుదలతో కోటి సూర్య ప్రకాశవంతులమగుట గొప్ప స్థాయిని పొందడము కాదా!

అట్టి స్థితిని పొందగోరువాడు మరణ సమయములో తన మనస్సును ఇతర విషయముల మీదికి పోకుండజేసి, కనుబొమల మధ్య స్థానమున తల మధ్య భాగములో మనోదృష్ఠిని నిలిపి, అక్కడున్నదేదో చూస్తున్నపుడు మనోనిలకడ కల్గుటచేత, ముక్కురంధ్రములలోని ప్రాణవాయువు కూడ సంచరించక నిలిచిపోవును. భ్రూమధ్య స్థానములో ధ్యాసకల్గి అక్కడి ఆత్మను చూచువాడు బయటి విషయములను మరచి, తన పూర్తి ధ్యాస తలమధ్య కేంద్రములోనుంచగ శ్వాస తనంతట తానే నిలిచిపోవును. అలా జీవుడు ఎరుకకల్గి ఉన్నప్పుడు శ్వాస నిలిచిపోవడము యోగులకు మాత్రమే సాధ్యమగును. మిగతా వారికి మరణము మరుపులో జరుగుచున్నది. ఎరుకలో మరణము పొందువారు యోగులు మాత్రమే. విజ్ఞాన పరముగ (సైన్సు ప్రకారము) చూచిన శరీరమును పెంచునవి, ఆరోగ్యముగ ఉంచునవి, ఆయుస్సును నిర్ణయించునవి, వృద్ధాప్యము కల్గించునవి శరీరములోని గ్రంథులు. గ్రంథులలో తయారగు రస ప్రభావము శరీరమును తీర్చిదిద్ది దాని పెరుగుదలకు, తరుగుదలకు అన్నిటికి కారణమని విజ్ఞానశాస్త్రవేత్తలు కూడ చెప్పుచునే ఉన్నారు. అన్ని గ్రంథులపైకి అతిచిన్న గ్రంథి తల మధ్య భాగములో ఉన్నది. చిన్నదైనప్పటికి గ్రంథులనన్నిటిని శాసించి నడిపించు స్వభావము గలది. కావున దానికి గ్రంథిరాజమని పేరు గలదు. దీనినే పిట్యూటరి గ్లాండ్ అని కూడ పిలుతురు . దీని స్థానము తల మధ్యభాగములో కనుబొమ్మల మధ్యన గలదు. చిరునాలుక పై భాగమున కనుబొమ్మల మధ్య స్థలమున గల ఈ గ్రంథి చాలా ముఖ్యమైనది. ఇందులో ఏదో అతీతమైన శక్తి ఉండుటవలన, ఆగ్రంథి నుండి కనిపించని కిరణములు అలల రూపముగ శరీరమంత ప్రాకుచుండును. యోగుల శరీరములో ఆ తరంగముల ప్రభావము మరీ ఎక్కువగా ఉండును. మెదడు మధ్య భాగములో గల ఈ చిన్న గ్రంథి దగ్గర కేంద్రీకృతమైన మనస్సుకు ఆత్మ అనుభవము లభించును. ఆ అనుభవమును మనస్సు ద్వారా జీవుడు అనుభవిస్తుండగ, ప్రాణ వాయువు ముక్కురంధ్రములలో తనంతట తాను నిలిచిపోవును. ఆ ప్రాణవాయువు సాధారణ మానవుని మరణములో చివరి శ్వాసగ బయటికి పోవును. ఇక్కడ యోగుల మరణములో ఆఖరి శ్వాసగ బయటికి పోక శరీరమునందే నిక్షిప్తమై నిలువగ, జీవుడు శరీరములోని ఆత్మను కలుసుకోగలిగి దానిద్వారా శరీరములోనే చివరగ పరమాత్మను కూడ కలుసుకోగల్గుచున్నాడు.

సాధారణ మానవుని మరణములో ఆ జీవుడు శరీరమును వదిలి ఆత్మతో సహా మరో శరీరమును చేరుచున్నాడు. వానితో పాటు వాని కర్మ , గుణములు వేరే శరీరమును ఆశ్రయించుచున్నవి. ఇక్కడ యోగుల మరణములో కర్మ అంతయు నాశనమై పోయినది , గుణములు నిర్వీర్యమైపోయాయి. మనస్సు ఆత్మయందే లగ్నమై జీవున్ని లగ్నము చేయుచున్నది. బుద్ధి, జీవుని వెంట చివర వరకు ఉండి మనస్సు, బుద్ధి , జీవుడు ఏకముగ మారి ఆత్మయందు కలిసి కనిపించక పోయినపుడు జీవుడు ఆత్మ రెండు కలసి ఒకే పదార్థమై పోయి పరమాత్మలో కలిసిపోవుచున్నవి. అప్పుడు శరీరము నిర్జీవమై పోవుచున్నది.

ప్రతి రోజు యోగము చేయుచున్నపుడు కనుబొమ్మల మధ్యలోనే మనస్సును నిలిపి ఆత్మానుభవమును జీవుడు పొందినపుడు శ్వాస కూడా నిలిచి పోవుచున్నది కదా! అపుడు శరీరమును వదలి పరమాత్మలో ఐక్యము కావచ్చును కదా! బ్రహ్మయోగ సమయములో సాధారణముగ మనస్సు నిలిచిపోవడము,ఆత్మ అనుభవము పొందడము, శ్వాస నిలిచిపోవడము జరుగుచున్నపనియే కదా! సాధారణముగ జరుగుపనియే ఒక రోజు మరణమై పోవుటలో ఏదైన ప్రత్యేకత ఉన్నదా అను ప్రశ్న కొందరికి రావచ్చును. దానికి జవాబు ఏమనగా! ప్రతిసారి యోగము చేసినపుడు జరుగు పనియే చివరి మరణములో జరిగినప్పటికి చాలా ప్రత్యేకతలున్నట్లు మనము గ్రహించవచ్చును.

ప్రతి యోగములోను ఆత్మను పొందిన, శ్వాస నిలిచిపోయిన, మనో నిలకడ కల్గినప్పటికి కర్మ అయిపోలేదు, కర్మశేషమున్నది. కావున మనస్సు, బుద్ధి, జీవుడు ఒక్క స్వరూపము కాలేదు. మనస్సు అనుభూతిని అందిస్తు వేరుగనుండగ బుద్ధి మనస్సును హెచ్చరించుచూ కదలనట్లు చేస్తూ అది అందించు అనుభూతిని జీవునికి అందిస్తుండును. బుద్ధి అందించిన దానిని జీవుడు పొందుచుండగ ఆ అనుభూతిని గురించి బుద్ధి తేల్చి చెప్పుచుండును. ఇట్లు యోగ సమయములో వేరు వేరు పదార్థములుగ వాటివాటి పనిని అంత్రర్ముఖముగ నిర్వర్తించు మనస్సు, బుద్ధి , జీవుడు చివరి మరణము సమయములో ఒక్క పదార్థముగ మారిపోవుదురు. అలా మారిన పదార్థము ఆత్మలో కలిసి పోవుచున్నది. యోగ సమయములో ఆత్మ జీవాత్మ వేరువేరుగ ఉండి ఆత్మను జీవాత్మ అనుభవించుచుండగ చివరి సమయములో మనో,బుద్ధి , జీవుడు కలిసిన జీవపదార్థము ఆత్మతో కలిసి ప్రత్యేకమైన ఆత్మగ మారిపోవును. అంతవరకు శరీరములో పరమాత్మ ,ఆత్మ వేరు వేరుగ ఉండగ, ఆ సమయములో ప్రత్యేకముగ మారిన ఆత్మ పరమాత్మలోనికి సులభముగ కలసి పోవుచున్నది. అంతవరకు పరమాత్మతో కలియుటకు వీలుగాని ఆత్మ, జీవముతో కలసిన ఆత్మగ ప్రత్యేకత కల్గి పరమాత్మలో ఐక్యమగుటకు సామర్థ్యము పొంది శరీరమందే కలసి పోవుచున్నది. ఈ విధముగ శరీరములో నున్న జీవాత్మ పరమాత్మను పొందగల్గుచున్నాడు. ఇది బ్రహ్మయోగుల అంత్యకాలములో శరీరమందే జరుగు పనికాగ కర్మయోగుల చివరిదశలో మనో బుద్ధులతో అహము కూడ కలిసి జీవునితో ఐక్యమగుచున్నవి. కర్మయోగులలో మనోనిలకడ అవసరము లేదు. దానితో సమానమైన నిగ్రహము అహము ఎడల ఉన్నది. బ్రహ్మయోగములో మనోనిలకడ కాగా, కర్మయోగులలో అహము యొక్క నిలకడ జరుగవలెను. తర్వాత జీవుడు ఆత్మతో,ఆత్మ పరమాత్మతో కలియుచున్నది. కర్మ అయిపోయిన వెంటనే యోగులలో జరుగు మరణమిది. ఈ విధముగ యోగులు తమ శరీరములోనే పరమాత్మను పొందుగల్గుచున్నారు. ఎక్కడ వెతికితే అక్కడ దొరుకునని ‘ఇందుగలడందులేడని సందేహము వలదని’ పెద్దలు చెప్పిన మాట ప్రకారము శరీరము లోపల యోగము చేయు యోగులకు శరీరములోనే పరమాత్మ లభించగలదు.

శ్లోకము 11 య దక్షరం వేదవిదోవదన్తి విశన్తి యద్యతయో వీతరాగాః ।

యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరన్తి తత్తేపదం సంగ్రహేణ ప్రవక్ష్యే॥

(పరమాత్మ)

భావము : వేద వేత్తలందరు దేనికి నాశనములేదనుచున్నారో, గుణములు వదలిన వారికి ఏది గమ్యస్థానమో , బ్రహ్మచర్యముచే దేనిని పొందగల్గుదురో ఆ పదమును గూర్చి సంగ్రహముగ చెప్పుచున్నాను.

వివరము : వేదములు తెలిసినవారనగ ఏవో పెద్ద గ్రంథములు చదివినవారనో, మరెవరనో అనుకోవద్దు. ‘త్రైగుణ్య విషయా వేదా ‘ అన్న భగవంతుని వాక్యము ప్రకారము గుణములు , వాటి వలన జరుగు పర్యవసానములు తెలిసిన పెద్దలు, అనగ సంపూర్ణ జ్ఞానులు దేనిని నాశనములేనిస్థితి అనుచున్నారో అనగ ప్రళయములో కూడ నాశనము కాని స్థితియేదో, మరియు గుణములు జయించిన వారందరు పొందు మరణములేని స్థితి ఏమిటో చెప్పెదనని భగవంతుడు చెప్పాడు. అంతేకాక బ్రహ్మచర్యముచే దేనిని పొందుదురో అనికూడ అన్నాడు. ఇక్కడ బ్రహ్మచర్యమంటే పెళ్లి చేసుకోకుండ ఉండడమా? సంసారము వదులుకోవడమా? స్త్రీ సాంగత్య నిషేధమా? అను సంశయములురావచ్చును. కాని అవేవి కావు. బ్రహ్మ యొక్క ఆచరణ ఆచరించువాడు బ్రహ్మచారి అను అర్థముగలదు. బ్రహ్మ అనగ పెద్ద,అధిపతి ,పరమాత్మ అను అర్దములలో నిండినవాడని తెలుసుకోవాలి. పరమాత్మకు ఆచరణ ఉన్నదా? అంటే ఉన్నదని చెప్పవచ్చును. ఆయన భగవంతునిగ పుట్టి ఆచరించినదే ఆయన ఆచరణ. అదే బ్రహ్మ ఆచరణ. పరమాత్మ సాకారముగ కర్మయోగము ఆచరించి చూపాడు. తనవలే ఆచరించమని కూడ చెప్పాడు. నేను మార్గదర్శత కొరకు ఆచరించుచున్నాను. నావలే ఆచరించమని చెప్పాడు. అట్లు ఆచరించడమే బ్రహ్మ ఆచరణమగును. అలా ఆచరించువాడే బ్రహ్మచారి. కర్మయోగిని బ్రహ్మచారి అనవచ్చును. కాని పెళ్లి చేసుకోనివానిని బ్రహ్మచారి అనకూడదు. బ్రహ్మచారులు ఏ గమ్యమును పొందుచున్నారో చెప్పదనని భగవంతుడు క్రింది శ్లోకమును తెలియజేశాడు.

శ్లోకము 12: సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ।

మూర్ధ్న్యాధాయాఽత్మనః ప్రాణ మాస్థితో యోగధారణామ్॥ (జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)

శ్లోకము 13: ఓమిత్యే కాక్షరం బ్రహ్మ వ్యాహర న్మామను స్మరన్।

యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిమ్॥

(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)

భావము : సర్వద్వారములను నియమించి, మనస్సును హృది మధ్యలో నిలిపి, ప్రాణవాయువును పై ముఖముగ నిలుచునట్లు చేసి, స్థిరయోగత్వము పొంది ‘ఓం’ అను అక్షరమునే స్మరించుకొంటు, శరీరమును వదలి పోవువాడు పరమమైన నన్ను పొందును.

వివరము : శరీరమునకు విషయ ప్రవేశ ద్వారములు ఐదు కలవు. ఐదు జ్ఞానేంద్రియముల ద్వార విషయములు లోపలికి ప్రవేశిస్తున్నవి. యోగి అయిన వాడు ఐదు జ్ఞానేంద్రియములను మనస్సుద్వార నియమించి, వాటి వలన ఏ విషయము ప్రవేశించకుండ చేసుకొనును. అట్లు విషయప్రవేశము లేకుండ చేసుకొన్నవాడు, తన మనస్సును హృది మధ్యభాగములో నిలుపుకొనుచున్నాడు. హృదయమనగ గుండె అని చాలామంది అనుకోవడము జరుగుచున్నది. వాస్తవముగ ‘హృది’ అంటే గుండె కాదు. బ్రహ్మనాడిలో గల ఏడు కేంద్రములలో చివరిదైన పెద్దదైన నాడీకేంద్రము ఏదో అదే హృదయమనబడును. ఏడవ కేంద్రముగనున్నది తల భాగములో మెదడు. మెదడునే హృదయమనగలము. హృది మధ్య భాగములో మనస్సునుంచ వలెననగా! భ్రూమధ్య స్థానమునకు సమతలములో మెదడునందు మధ్యలోగల గ్రంథిరాజమనబడు పిట్యూటరి గ్రంథివద్ద మనస్సునుంచవలెనని అర్థము. అట్లు నిలుపుటవలన ముక్కు రంధ్రములలో ఆడు శ్వాస పైకి వచ్చినది క్రిందకి పోకుండ నిలచిపోగలదు. అట్లు స్థిరయోగము పొంది ‘ఓం ‘ అను అక్షరమే పరమాత్మని ధ్యానించువాడై ఉండును. ఇచట ‘ఓం’ అను దానిని గురించి తెలుసుకోవలసి ఉన్నది.

మన ముక్కురంధ్రములలో శ్వాస పైకి క్రిందికి పోవునపుడు చిన్న శబ్దము పుట్టుచున్నది . బయట రెండు రంధ్రములలో ప్రవేశించుశ్వాస ఒక శబ్దము. లోపలినుండి ఒకే రంధ్రము ద్వారా వచ్చి రెండుగ చీలి బయటికి వచ్చు శ్వాస మరొక శబ్దమును చేయుచున్నది. పైకి పోవు శ్వాసలో ‘సో’ శబ్దమును, క్రిందికి వచ్చు శ్వాసలో ‘హం’ అను శబ్దమును ఏర్పడుచున్నవి. "సో" శబ్దము చివరిగ ‘ఓ’ అనియు ‘హం’ చివరిలో ‘మ్’ కారమును ఉన్నవి. సోహం శబ్దములో చివరిగ అణిగిన శబ్దము ‘ఓమ్’ అగును. ఒక మారు శ్వాస లోపలికి పోయి బయటికి వస్తే ‘ఓం’ శబ్దమేర్పడుచున్నది. ఇది ప్రతి ఒక్కసారి శ్వాసలో ఇమిడి ఉన్నది. ‘ఓం’ శబ్దము పుట్టుటకు శ్వాస కారణము. శ్వాస ఆడుటకు ఊపిరితిత్తులు ఆధారము. ఊపిరితిత్తులు కదలుటకు కొన్ని నాడులలోని స్పందన కారణము. ఆ నాడులలోని చైతన్యమెక్కడిదని చూచిన చివరకు బ్రహ్మనాడిలోని హృది నుంచి బయలుదేరుచున్నది. ఆ హృదిలోనున్నది ఆత్మ. చివరకు ముక్కు రంధ్రములలో పుట్టు ‘ఓమ్’ శబ్దమునకు ఆత్మ కారణమైవున్నది. ఆత్మ నాశనము లేనిది. అందువలననే దానిని అక్షరమని చెప్పుచున్నాము. క్షరము కాని అక్షరమైన ఆత్మ బయటికి శ్వాస ద్వారా ‘ఓం’ శబ్దముగ తెలియుచున్నది. లోపలి ఆత్మ బయటికి ‘ఓమ్’గ ఉన్నది కావున ‘ఓం’ అనునది నాశనము లేనిదని చెప్పారు. అట్టి ‘ఓం’ అక్షరమును మనస్సులో ధ్యానించుచు, అనగా మనసు చేత ఆత్మ ధ్యాసకల్గి యోగమాచరించుచు, శరీరమును వదులువాడు పరమమైన పరమాత్మనే పొందును. చివరిలో శరీరము వదలునపుడు మనోబుద్ది జీవునితో కలువగ, జీవుడు స్థితి మారిన వాడై ఆత్మలో కలసిపోగ, జీవాత్మ కలసిన ఆత్మ తన స్థితిని కోల్పోయి పరమాత్మలో కలియగ, జీవుడు ముక్తుడై అంతట వ్యాపించి పోవుచున్నాడు.

శ్లోకము 14: అనన్యచేతా స్సతతం యోమాం స్మరతి నిత్యశః।

తస్యాహం సులభః పార్థ ! నిత్య యుక్తస్య యోగినః ||

(పరమాత్మ)

భావము : వేరు చింతలు మనసున చేరనీయక ఎవడు సర్వదా నన్నే స్మరించునో వానికి సులభుడనౌదును. అతడే నిత్యము నాతో కూడుకొన్న యోగి అనబడును.

శ్లోకము 15: మా ముపేత్య పునర్జన్మ దుఃఖాలయ మశాశ్వతమ్।

నాఽప్నువంతి మహత్మాన సంసిద్ధిం పరమాం గతాః ||

(పరమాత్మ)

భావము : శ్రేష్టమైన సంసిద్ధి పొందిన జనులు నన్ను పొందినవారైవుండి తర్వాత దుఃఖముతో కూడుకొన్న అశాశ్వతమైన జన్మలు పొందరు.

వివరము : మోక్షము పొందినవాడు పరమాత్మలోనికి ఐక్యమగును. వాడు తిరిగి పుట్టడు. పుట్టుటకు కర్మ అవసరము. కర్మలేని వాడే సిద్ధి పొందగల్గుచున్నాడు. సిద్ధిపొందిన తర్వాత కర్మలేని కారణమున వాడు పుట్టడు. అట్టివాడు విశాలముగ జగత్తంతయు వ్యాపించిపోయి ఉండును. మరణించు సమయములో శ్వాస బయటికి పోక శరీరములోపలే అణిగిపోయి జీవుడు బయటికి రాక శరీరములోనే ఇమిడి పోవుటవలన వాడు మరొక శరీరమును పొందలేదని తెలియాలి.

శ్లోకము 16: ఆబ్రహ్మ భువనా ల్లోకాః పునరావర్తినోఽర్జున।

మా ముపేత్య తు కౌంతేయ! పునర్జన్మ న విద్యతే॥

(పరమాత్మ)

భావము : బ్రహ్మలోకము మొదలైన లోకములను పొందినప్పటికి పునర్జన్మ కలదు. నన్ను పొందువానికి పునర్జన్మలేదు.

వివరణ : లోకములు ఎన్నో ఉన్నవని అందులో స్వర్గలోకమని, నరకలోకమని, అతల, వితల, సుతల, రసాతల, పాతాలలోకములని రకరకములుగ చెప్పుకొనుట మేము వినియున్నాము. ఆ లోకములన్నియు ఊహాగానములేనని చెప్పవచ్చును. ఉన్నవి మూడే లోకములు. ఊర్ధ్వ , మధ్య, అథమ అను మూడు లోకములుగ విభజింపబడి ఉన్నవి. అవి సాత్త్వికలోకము , రాజసలోకము , తామసలోకము. ఈ మూడు లోకములు భూమి మీద జీవుల శరీర తలలోనున్నవి. పై శ్లోకములో భువనాల్లోకాః అని చెప్పబడివున్నది. దానికి ప్రపంచములో గల లోకములని అర్థము. భూమిమీద గల లోకములలో పెద్దది సాత్త్వికము. ఇది పెద్దది కావున దీనికి బ్రహ్మలోకమని పేరు పెట్టబడినది. భూమిమీద బ్రహ్మలోకము మొదలగు లోకములను పొందుట వలన జన్మ కల్గుననుటలో, జీవుడు ఏ గుణభాగమునందు ప్రవేశించినప్పటికి పునర్జన్మ తప్పదని భగవంతుడు తెలియజేశాడు. ముల్లోకములు వీడి వాటికి లోపల మధ్యనున్న లోకమునకు పోయినవాడు నావలెనగునని, భగవంతుడు నెమలిఫించమును తన శిరస్సు మీద ఉంచి చూపించాడు.ముల్లోకములు వీడి అలోకమైన దానిని చేరినవానికి పునర్జన్మ ఉండదు. లోకములుకాని అలోకము మన శరీరమందే గలదు. మూడు గుణముల మధ్యనున్నది, నెమలిఫించములో మధ్యన చూపబడినది లోకముకాని అలోకమని, అదే పరమాత్మ స్థానమని, అదే మోక్షస్థానమని తెలియవలెను.

శ్లోకము 17: సహస్ర యుగ పర్యంత మహర్య ద్బ్రహ్మణో విదుః

రాత్రిం యుగ సహస్రాన్తాం తేఽహోరాత్ర విదో జనాః ||

(పరమాత్మ)

భావము : పరమాత్మకు వేయియుగములు ఒక పగలుగ, వేయియుగములు ఒక రాత్రిగ ఉన్నదని తెలిసినవారు రాత్రిపగలును తెలుసుకోగలుగుచున్నారు.

వివరము ; కాల, కర్మ, గుణచక్రములు ఒకే ఇరుసుకు అతికించబడివున్నవి. క్రింద గుణచక్రము మూడు భాగములుగ ఉన్నది. దానిపైన కర్మచక్రము 12 భాగములుగ ఉన్నది. కర్మచక్రము మీద కాలచక్రము కూడ 12 భాగములుగ ఉన్నది. ఈ మూడు చక్రముల పైన రెండు భాగములుగ ఉన్న బ్రహ్మచక్రమను పేరుగల మరొక చక్రము గలదు. ఇది ఒక చుట్టు తిరుగుటకు రెండువేల యుగముల కాలము పట్టును. సగము చుట్టు తిరుగుటకు వేయియుగముల కాలము పట్టును. ఈ చక్రములో సగభాగము పగలుగ, సగభాగము రాత్రిగ ఉన్నది.

వారములోని ఏడు దినములకు పేర్లు ఉన్నట్లు, యుగములు నాలుగు వాటికి పేర్లు కలవు. 1) కలియుగము 2) ద్వాపరయుగము 3) త్రేతాయుగము 4) కృతయుగము. ఈ నాల్గుయుగములు వారములు మారినట్లు మారుచు కృతయుగముతో మొదలై కలియుగముతో అయిపోవుచుండును. ఈ నాలుగు యుగములు 250 మార్లు జరిగితే పరమాత్మకు ఒక పగలగును. అట్లే 250 మార్లు రాత్రిగనున్నవి. పరమాత్మ యొక్క రాత్రి పగలు తెలిసినవారు, మనకు జరుగు రాత్రి పగలు కాలము ప్రకారము కూడ వివరించి చూచుకోగలరు. మనకు 1) కలియుగము 4,32,000 సంవత్సరములు 2) ద్వాపరయుగము 8,64,000 3) త్రేతాయుగము 12,96,000 4) కృతయుగము 17,28,000. ఈ విధముగ మొత్తము నాల్గుయుగముల కాలము 43,20,000 సం॥లు . నాల్గుయుగములు 250 మార్లు జరిగిన 108 కోట్ల సంవత్సరములు అగుచున్నవి. బ్రహ్మ పగలు 108 కోట్ల సంవత్సరములు. అనగ ప్రపంచ ఆయుస్సు 108 కోట్ల సంవత్సరములే.

భూమిగాని, ఆకాశముగాని భూమిమీద సామ్రాజ్యము గాని, మతములు గాని మనగలిగేది 108 కోట్ల సం॥లే అన్నమాట. నీవు ఈ ప్రమంచములో ఆడే నాటకమునకు చివరగా తెరపడేది 108 కోట్ల సం॥రములకే . జీవాత్మల యొక్క చావు, పుట్టుకల కథ జరుగునది 108 కోట్ల సం॥రములని తెలియాలి. ఇది దేవుడు జీవుల వెంట పంపిన ఆయుఃకాలము. ఇది మన ఆయువు యొక్క ధర్మమని అందరికి తెలియులాగున, 108 సంఖ్య ఏమిటని తెలియనివారు యోచించునట్లు, తెలిసినవారు మరచి పోకుండునట్లు ప్రతి దైవారాధనలోను, నామ జపములోను, మంత్ర జపములోను 108 చేయాలని, విరాళము చేయు సొమ్ముగాని 108 సంఖ్యగా ఉండునట్లు తెలిపారు. అంతేకాక 108 సంఖ్యకు మనకు చాల అమూల్యమైన దగ్గర

సంబంధమొకటున్నది. అదెట్లనిన మన శరీరములో ఆశ, కోపము, లోభము, మోహము, గర్వము, అసూయ అను ఆరు చెడు గుణములు కలవు. వాటికి వ్యతిరేఖమైన ఆరు మంచి గుణములు కూడ కలవు. అసూయకు ప్రేమ వ్యతిరేఖమైనట్లు ఆరుకు ఆరు వ్యతిరేఖ గుణములు గలవు. ఇవన్నియు శరీరములో ఉండుట వలన వీటి మీద కర్మ, కర్మమీద గ్రహములు అధికారము కల్గియున్నవి. అందువలన నవగ్రహములను అనుసరించి కర్మ, కర్మను అనుసరించి గుణములు స్పందించుచుండును. నవగ్రహముల ప్రభావము కర్మ ద్వార గుణముల మీద కలదు. ఆదిత్యాది 9 గ్రహములు, గుణములను కూడ ఒక్కొక్క దానిని 9 రకములుగా విభజించినవి. ఆశ 9 స్థాయిలలోనుండగా, అట్లే మిగతా గుణములు కూడా 9 స్థాయిలుగా ఉన్నవి. అందువలననే మనకు వచ్చు కోపములలో పెద్దస్థాయి కోపము, చిన్న స్థాయి కోపము కలదు. అట్లే పెద్ద ఆశకలదు చిన్న ఆశ కలదు. మిగతా అన్ని గుణములు అట్లే ఉన్నవి. ఇది ప్రత్యక్షముగా కనిపించు విషయమే. ఈ విధముగా మన శరీరములోని చెడు గుణములు ఆరు ఒక్కొక్కటి తొమ్మిదిగా చీలిపోగా, అట్లే వాటికి వ్యతిరేఖమైన ఆరు మంచి గుణములు కూడ చీలి పోయినవి. ఒక వర్గమైన ఆరు గుణములు చీలికలెన్నియని లెక్కించి చూచిన 6x9 =54 కాగలవు. అట్లే మరొక వర్గమును గుణించి చూచిన 6x9=54 కాగలవు. ఈ విధముగా ఒక గుణభాగములోని మొత్తము గుణముల సంఖ్య 108 అని తెలియుచున్నది.

ప్రపంచ ఆయుస్సు 108 కోట్ల సంవత్సరములను అనుసరించియే మానవుల జీవితమును నడుపు గుణముల సంఖ్య 108 ఉండునట్లు దేవుడు సరిచేసి పెట్టాడు. గణితములో అతి పెద్ద సంఖ్య కోటి. గణితములోని 108 కోట్లు జ్ఞప్తికుండునట్లు 108 ఆలోచనా వికారములను మన శరీరములో పెట్టాడు. ఆ వికారములు గుణితము వలన వచ్చినవి. కావున దగ్గర పదమైన గుణితము నుండి ఉద్భవించునదిగా కన్పించునట్లు వాటిని గుణము’ లన్నారు. ఈ విధముగా శరీరములో గల యోచనలకు గుణములను పేరు కల్గినది. ఇన్ని విధముల పెద్దలు యోచించి గుణములని ప్రత్యేకమైన పేరు పెట్టి వాటి యొక్క 108 సంఖ్యను కూడా ప్రత్యేకముగా పెట్టారు. 108 కోట్లు సం॥లు 108 గుణములతో జీవితమును గడుపవలెనని గుర్తుండునట్లు మనము జపించు జపమాలలో 108 పూసలనుంచారు. అయినప్పటికి మన పెద్దలు తెల్పిన విధానము కొంత మాసిపోయింది. జీవుని వెంట పంపిన ఆయువు యొక్క ధర్మము అధర్మముగా మారిపోవుచున్నది. జపమాలలో 108 సంఖ్య ఇంకనూ మిగిలి ఉన్నప్పటికి, దాని అర్థము తెలియకుండా పోయినది. విరాళము చేయుటలోను, ముడుపులు కట్టడములోను, పెళ్ళిలో డబ్బులు చదివించడములోను 108 బదులు 116 వచ్చి పడుచున్నది. దేవుని ధర్మములలో ముఖ్యమైన ఆయుఃధర్మము ఇలా అధర్మముగా మారిపోవుటకు దగ్గరపడుచున్నది. ఈ విధముగా 108 కోట్ల సం॥లు జీవులతో సంబంధమేర్పరుచుకొని ఉన్నవి. 108 కోట్ల సం॥లు జగతివున్న కాలమునకు పగలు, జగతిలేని నిరామయ కాలమునకు రాత్రి అని పేరు పెట్టడములో అంతరార్థమేమో చూస్తాము.

శ్లోకము 18: అవ్యక్తా ద్వ్యక్తయ స్సర్వాః ప్రభవన్త్య హరాగమే।

రాత్య్రాగమే ప్రలీయన్తే తత్రైవాఽవ్యక్త సంజ్ఞ కే॥

(పరమాత్మ, జీవాత్మ)

భావము : బ్రహ్మపగలు జగతిగ మారుచు కనిపించు సర్వము కనిపించని దానినుండి పుట్టినవి. అట్లే బ్రహ్మరాత్రిలో జగత్తంతయు ప్రళయుము చెంది కనిపించుచున్నవన్నియు కనిపించకుండ పోవుచున్నవి.

వివరణ : కాలచక్రము మీద తిరుగు బ్రహ్మచక్రములో సగము పగలుగ మొదలైనపుడు జగత్తంతయు ఏర్పడి కనిపిస్తున్నది. అంతవరకు అవ్యక్తముగ కనిపించక ఉండిన జగత్తంతయు కనిపిస్తున్నది. కనిపించనిదంతయు క్రమేపి కనిపిస్తూవస్తు కొంత కాలమునకు పూర్తి ప్రపంచమేర్పడుచున్నది. అలా ఏర్పడిన ప్రపంచము వేయియుగముల కాలము జీవుల సంతతితో నిండిపోవును. చస్తూ పుట్టుచున్న జీవుల చరిత్ర వేయియుగములు గడువగ ప్రళయమేర్పడి ప్రపంచమంతయు చివరకు అదృశ్యమైపోవుచున్నది. ప్ర అనగ కలిగినది, పంచమనగా ఐదు. పంచభూతములచే ఏర్పడినది కావున జగతిని ప్రపంచమన్నారు. పుట్టినదంతయు నాశనము కావడమును ప్రళయము అన్నారు. ప్రభవము, ప్రళయములతో పరమాత్మ యొక్క పగలు రాత్రిళ్లు గడుస్తున్నవి.

శ్లోకము 19: భూతగ్రామ స్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే।

రాత్య్రాగమేఽవశః పార్థ! ప్రభవ త్యహరాగమే॥

(జీవాత్మ)

భావము : సర్వజీవరాసులు బ్రహ్మపగలులో పుట్టి చివరకు రాత్రి అయిన వెంటనే ప్రళయము పొంది నాశనమై కనిపించకపోయి తిరిగి పగలు మొదలైన వెంటనే పుట్టుచున్నవి.

శ్లోకము 20: పరస్తస్మాత్తు భావోఽన్యోఽవ్యక్తోఽవ్యక్తాత్సనాతనః।

యస్ససర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి॥

(పరమాత్మ)

భావము : నాశనములేని, మార్పుచెందని, ప్రకృతికంటే వేరైన, శ్రేష్టమైన, జగతి నాశనమైనను తాను నాశనము కాని అన్యమగుస్థితి ఒకటి కనిపించకవున్నది.

వివరము : ప్రళయములో సర్వ జగత్తును దానిలోని సర్వజీవరాసులును కనిపించునది అంతయు నాశనమైపోయి ఏమిలేకుండ పోవుట సంభవించును. పంచభూతములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి కూడ ఉండవు. నీకు నాకు మధ్యలోగల బయలు కూడ లేనిస్థితి అంటే అదెట్లుండునో ఊహించుటకు కూడ సాధ్యముకాదు. శూణ్యము కూడ కానిదెలా ఉండునో అగమ్యగోచరము. ఆ స్థితిలో కూడ నాశనముకానిది ఒకటున్నది. ప్రపంచమంతయు లయమై పోయినప్పటికి లయము గాని అన్యమైనదేదో క్రింద శ్లోకములో చూస్తాము.

శ్లోకము 21: అవ్యక్తోఽక్షర ఇత్యుక్త స్త మాహుః పరమాం గతిమ్।

యం ప్రాప్య న నివర్తన్తే తద్ధామ పరమం మమ॥

(పరమాత్మ)

భావము : దానినే కనిపించని నాశనములేని స్థితియనుచున్నాము. పరమగతి కావున దానిని తెలియవలయును, పొందవలెను. అది లభించిన జన్మములు లేకుండ పోవును. దానినే నాదగు నియమస్థానమని, పరంధామమని చెప్పవచ్చును.

వివరము : ప్రపంచమంతయు నాశనమైన నాశనముగాని కనిపించనిస్థితినే మోక్షము అంటున్నాము. శ్రేష్ఠమైనగతి అదియే కావున దానిని పొందుటే మానవుని లక్ష్యము. లక్ష్యమైన దానిని ఎన్నో జన్మల ప్రయత్నము చేసి పొందినట్లయితే ఇక జన్మలుండవు. జన్మలులేని ఆ స్థానము లేక స్థితినే పరమార్థమనబడును. అదే పరమాత్మని దానికంటే వేరే దైవములేదని తెలియాలి. పరమాత్మే తానుగ మారిపోవు స్థితికి ఏదీ సమానము కాదు. అన్నిటికంటే గొప్పదైన లాభమును వదలి కొద్దిసేపు కనిపించి తన వెంట రాకపోవు ధనము, బంగారము మీద ఆశ పెంచుకోవడము తెలివి తక్కువ కాదా!

శ్లోకము 22 : పురుష స్స పరః పార్థ! భక్త్యా లభ్య స్త్వనన్యయా।

యస్యాన్తస్థ్సాని భూతాని యేన సర్వమిదం తతమ్॥

(పరమాత్మ)

భావము : సర్వ జీవరాసులు ఎవనిలోపల ఉన్నవో, ఈ జగత్తంతయు ఎవనిచే వ్యాపించివున్నదో అట్టి పురుషుని అనన్యమైన భక్తిచే పొందవచ్చును.

వివరము : పరమాత్మ అణువణువున ప్రపంచమంత వ్యాపించి ఉండుటవలన సర్వజీవరాసులు పరమాత్మయందేనున్నవి. ప్రపంచమంత సూక్ష్మముగ పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు. అంత గొప్ప పరమాత్మను మనకున్న చిన్న శరీరములోనే అన్యమైన చింతలేని భక్తితోనే పొందవచ్చును.

శ్లోకము 23 : యత్రకాలే త్వనా వృత్తి మావృత్తిం చైవ యోగినః।

ప్రయాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ! ||

(జీవాత్మ, మోక్షము)

భావము : యోగులు ఏ కాలములో మరణిస్తే తిరిగి పుట్టుచున్నారో, ఏ కాలములో మరణిస్తే తిరిగి పుట్టక మోక్షము పొందుచున్నారో, వారు శరీరమును వదిలిపోవు ఆ కాలమును చెప్పుచున్నాను.

వివరము : ఒక పందెమును కాచిన వాడిని గెలిచాడా లేదా అని చూడవచ్చును. పందెము కాయని వానిని గెలిచాడా లేదాయని చూడవలసిన అవసరము లేదు. అట్లే నదిలో దిగినవాడిని ఆవలిగట్టుకు చేరుచున్నాడా లేదా అని చూడవలెను. నదిలో దిగనివానిని అసలు చూడనవసరము లేదు. ఆ విధముగనే మోక్షము పొందవలెనని ప్రయత్నము చేయు యోగులను మరణ సమయములో మోక్షము పొందుచున్నాడా లేదాయని చూడవచ్చును. అసలు ప్రయత్నమే చేయని యోగులు కానివారిని గూర్చి వారి మరణ సమయమేదని చూడనవసరము లేదు. శ్లోకములో కూడ ‘యోగినః’ అను పదమును ఉపయోగించి ఇది యోగులకు మాత్రమేనని తెలుసుకొనునట్లు చెప్పారు.

యోగులు అయినంతమాత్రమున ఆ జన్మలోనె మోక్షము పొందుదురని తలచుట పొరపాటు. ఎన్నో జన్మలు ప్రయత్నము చేయుటవలన, యోగులైనప్పటికి కొన్ని జన్మల వరకు కర్మకాలిపోవుటకు కాలము పట్టుట వలన, అంతవరకు మోక్షము పొందలేరు. అందువలననే యోగులు మోక్షము పొందు మరణకాలమేదో, పొందని మరణకాలమేదో చెప్పెదనని భగవంతుడు ఆ కాలమును తెలియజేయుచున్నాడు. యోగులు మోక్షము పొంది జన్మించని మరణకాలమును, యోగులు మోక్షము పొందక తిరిగి జన్మించు మరణకాలమును తెలుసుకొందాము.

శ్లోకము 24: అగ్నిర్జ్యోతి రహ శుక్ల ష్షణ్మాసా ఉత్తరాయణమ్।

తత్రప్రయాతా గచ్ఛన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః॥

(జీవాత్మ, మోక్షము)

భావము : యోగి అయినవాడు ఏ ప్రాంతములో ఉండి మరణము పొందుచున్నాడో ఆ ప్రాంతము మీద సూర్యప్రకాశము కల్గివుండాలి. మేఘముల నీడ ఉండకూడదు. యోగి మరణించు సమయము పగలుగ ఉండి, ఆ పగలు శుక్లపక్షములోనిదై ఉండాలి. ఆ శుక్లపక్షము ఉత్తరాయణములోనిదై ఉండాలి. ఈ విధముగ సూర్యతేజస్సు కల్గిన పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము చేకూరినకాలములో చనిపోయిన యోగి జన్మించక మోక్షము పొంది పరమాత్మయందైక్యమగుచున్నాడు.

వివరము : సర్వ జీవరాసులకు బ్రహ్మనాడియందు ఆత్మ ఉన్నది. బ్రహ్మనాడి యొక్క సప్తస్థానమున ఆత్మశక్తి కేంద్రీకృతమైవున్నది. సప్తస్థానమును కేంద్రముగా చేసుకొని దానిచుట్టు కర్మ, కాలచక్రములు తిరుగుచున్నవి. కాలచక్రములో రాత్రిపగలు, శుక్లకృష్ణపక్షములు, మాసములు, ఉత్తర దక్షిణాయణములు, సంవత్సరములు జరుగుచునే ఉన్నవి. రాత్రిపగలు మొదలుకొని సంవత్సరకాలము వరకు కర్మను జీవరాసులు అనుభవించుచున్నవి. కాలచక్రములో రాత్రి పగళ్లు ఎలా సంభవించుచున్నవనగా! కర్మచక్రములోయున్న భాగములను సూర్యుడు దాటుచు ప్రయాణము చేయుచుండును. ఒక్కొక్క భాగమును దాటుటకు రెండు గంటల కాలముపట్టును. సూర్యోదయము మొదలుకొని ఆరు భాగములు దాటుటకు పన్నెండు గంటలు పట్టును. దీనిని పగలుగా మనము చూస్తూవున్నాము. అట్లే మిగతా ఆరు భాగములు దాటుటకు పన్నెండు గంటల కాలముపట్టును. దీనినే రాత్రి అనుచున్నాము. మన కపాలములోయున్న కర్మచక్రమును దాటుచు సూర్యుడు కాలచక్రములో పయనించుచున్నాడు. ఇట్లు కాలచక్రములో పయనించుచు కర్మచక్రము పన్నెండు భాగములను దాటుటకు 24 గంటలు కాలము పట్టుచున్నది. 24 గంటలను ఒక దినము అని అనుచున్నాము. కర్మచక్రములో మధ్యరేఖ ఉన్నది. మధ్యరేఖకు ఎడమ ప్రక్క ఆరుభాగములు పగలు, కుడిప్రక్క ఆరు భాగములు రాత్రిగా సూర్యభ్రమణములో తెలియుచున్నది. పగలు, రాత్రి క్రింది పటములో చూడుము. సూర్యుడు కాలచక్రములో పరిభ్రమించుచున్నాడు కదా! కాలచక్రము పన్నెండు భాగములు కదా! సూర్యుడు ఒక్కొక్క భాగమును దాటుటకు ఒక మాసపుకాలము పట్టును. కాలచక్రము యొక్క పన్నెండు భాగములను సూర్యుడు పూర్తి దాటుటకు పన్నెండు మాసములు పట్టును. దానినే ఒక సంవత్సరము అని అనుచున్నాము. కాలచక్రములో మధ్య ఆత్మ రేఖయున్నది. ఆత్మ రేఖకు ఎడమ ప్రక్కయుండు ఆరు భాగములను సూర్యుడు దాటుటకు ఆరు మాసములు పట్టును. ఆ కాలమునే ఉత్తరాయణమని అనుచున్నారు. అట్లే కుడి ప్రక్కయుండు ఆరు భాగములను దాటుటకు ఆరు మాసములు పట్టును. ఆ కాలమునే దక్షిణాయనమని అనుచున్నాము. ఉత్తర దక్షిణాయణములను తర్వాత పేజీలోని పటములో చూడవచ్చును. కాలచక్రములో చంద్రుడు ఒక్కొక్క భాగమును దాటుటకు రెండున్నర దినములు పట్టును. ఆత్మరేఖకు ఒక ప్రక్కయున్న ఆరు భాగములు దాటుటకు 15 దినములు, మరియొక ప్రక్కయున్న ఆరు భాగములు దాటుటకు 15 దినములు పట్టును. చంద్రుడు 12 భాగములు దాటుటకు 30 దినముల కాలము పట్టును. కాలచక్రము మీద చంద్రుడు ఆత్మరేఖకు ఎడమప్రక్కయున్న భాగములు దాటు కాలమును శుక్లపక్షము అనియు, కుడి ప్రక్కయున్న భాగములు దాటుకాలమును కృష్ణపక్షము అనియు అందురు. కృష్ణ శుక్లపక్షములను క్రింది పటములో చూడవచ్చును ఈ విధముగా కాలచక్రములో రాత్రి పగలు, శుక్ల కృష్ణపక్షములు, ఆయనములు జరుగుచున్నవి. జీవునకు యోగముచేత లభించిన యోగశక్తియంతయు కర్మ కాలచక్రముల మధ్యయందున్న గురుకేంద్రమును చేరుచుండును. ఎవనికి యోగశక్తి పరిపూర్ణస్థితికి వచ్చునో వానికి సూర్యుడు ఆత్మరేఖకు ఎడమ ప్రక్క ఉన్నప్పుడే, చంద్రుడు కూడ కాలచక్రములో ఆత్మరేఖకు ఎడమప్రక్క ఉన్నప్పుడే మరణము సంభవించును. ఆ విధముగా మరణించిన యోగి మధ్యలోయున్న కేంద్రములోనికి పోవుచున్నాడు. అనగా ఆత్మయందు లీనమగుచున్నాడు. ఇతర సమయములలో చనిపోయిన యోగి కేంద్రములోయున్న పరమాత్మను చేరలేడు. పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము కలసిన కాలములో పరమాత్మను చేరుటకు యోగికి మార్గము ఏర్పడును. పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణములో కాలచక్రమందు జీవునికి ఏర్పడిన దారిని క్రింది పటములో చూడవచ్చును. 

శ్లోకము 25 : ధూమో రాత్రి స్తథా కృష్ణష్షణ్మాషా దక్షిణాయనమ్।

తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే॥

(జీవుడు)

భావము : యోగి మరణించు ప్రాంతము మేఘావృతమైవుండినా, రాత్రి సమయమైనా, కృష్ణపక్షము 15 రోజులలోనైనా, దక్షిణాయన ఆరునెలల కాలములోనైన యోగి మరణించిన ఎడల అతడు మోక్షము పొందక, జ్ఞానతేజస్సు కల్గినవాడై తిరిగి జన్మించును. ఈ మరణ సమయములను చాలా గీతలలో తప్పుదోవ పట్టించడము జరిగినది. ‘ప్రయాతాయాన్తితం కాలమ్’ అని 23వ శ్లోకములో చెప్పినప్పటికి కాలమును గూర్చి చెప్పక పగటి దేవత, శుక్లపక్ష దేవత, ఉత్తరాయణ దేవత పోవు దారిలో పోతే మోక్షము లభిస్తుందని వ్రాయబడివున్నది. అలా పగలు దేవతని శ్లోకములో లేని విషయమును తెచ్చి పెట్టడము వలన చాలామంది పొరబడి పోవుచున్నారు. పగలు దేవతను వ్రాసినవారు కూడ చూడలేదు. విన్నవారెక్కడ వెదకగలరు.

వివరము : రాత్రి, శుక్లపక్షము, దక్షిణాయణములో మరణించిన యోగి ఆత్మను చేరలేడు. ఆ సమయములో మరణించిన యోగికి కాలచక్రములో ఆత్మను చేరు మార్గము లభించదు. రాత్రి, శుక్లపక్షము, దక్షిణాయణములో కాలచక్రమందు మార్గము ఎట్లువున్నది తర్వాత పేజీ పటములో చూడవచ్చును. పగలు, శుక్లపక్షము, దక్షిణాయణములో మరణించిన యోగి ఆత్మను చేరలేడు. ఆ సమయములో మరణించిన యోగికి కాలచక్రములో ఆత్మను చేరు మార్గము ఉండదు. పగలు, శుక్లపక్షము, దక్షిణాయణములో కాలచక్రమందు మార్గము ఎట్లు ఉన్నది క్రింది పటములో చూడవచ్చును. ఆత్మను చేరుటకు అన్ని ద్వారములు ఒకే ప్రక్క అనగా ఎడమవైపే వచ్చి ఉండవలయును. అట్లుకాక కాలచక్రములో ఏ ద్వారము కుడిప్రక్కకు పోయిన యోగికి ఎడమవైపు మార్గము లభించక తిరిగి వేరే శరీరమును ఆశ్రయించి పుట్టుచుండును. ఇది యోగులకు మాత్రము నిర్ణయించబడివున్నది.

యోగి ఉత్తరాయణములో, కృష్ణపక్షములో, పగలు మరణించిన ఆత్మను చేరలేడు. ఆ సమయమున మరణించిన యోగికి కాలచక్రములో ఆత్మను చేరు మార్గముండదు. ఆ సమయమున కాలచక్రము ఎట్లుండుననగా కింద పటములో చూడవచ్చును. 

శ్లోకము 26: శుక్ల కృష్ణే గతీ హ్యేతే జగత శ్శాశ్వతీమతే।

ఏకయా యా త్యనావృత్తి మన్యయాఽఽవర్తతే పునః॥

(జీవాత్మ)

భావము : జగతిలో శుక్ల కృష్ణ గతులు శాశ్వతముగ గలవు. ఒకదాని వలన వృత్తి, మరొక దానివలన అనావృత్తి కల్గుచున్నది.

వివరము : ప్రపంచములో పక్షములు మారకుండ శాశ్వతముగ ఉండునట్లు ఏర్పరచబడివున్నది. కృష్ణ, శుక్లపక్షములు రెండు శాశ్వతగ ఉండి యోగులకు వృత్తి అనావృత్తి కలుగజేయుచున్నవి. ఈ విషయమును యోగులకు తప్ప సాధారణ వ్యక్తులకు లెక్కించకూడదని మరొకమారు జ్ఞప్తి చేయుచున్నాము.

శ్లోకము 27 : నైతే సృతీ పార్థ! జానన్ యోగీ ముహ్యతి కశ్చన।

తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున॥

(జీవాత్మ)

భావము : ఇప్పుడు విన్న రెండు విధముల కాలములను తెలిసిన యోగి పొరపాటు పడడు. కనుక అర్జున ఎల్లకాలములలోను నీవు యోగయుక్తునిగనుండవలెను.

వివరము : యోగి మరణములో తేడాలున్నవని, యోగియొక్క కర్మ పూర్తి అయిపోనిదే చివరికాలము శుక్లపక్షవర్గముకాదని, అలా కాలము తప్పిపోవుటలో తిరిగి జన్మ కల్గునని, తెలిసినవాడు కర్మ తొందరగ అయిపోవుటకు ఎల్లకాలము యోగముతో కూడుకొనివుండుటకు ప్రయత్నించును. ఆ విషయమై భగవంతుడు అర్జునునికి ఎల్లకాలము యోగయుక్తునిగ ఉండమన్నాడు.

శ్లోకము 28 : వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలంప్రదిష్టమ్।

అత్యేతి తత్సర్వమిదం విదిత్వాయోగీపరంస్థాన ముపైతి చాద్యమ్॥

(జీవాత్మ, మోక్షము)

భావము : ఈ విషయము తెలిసినవాడు వేదధ్యాయణము, యజ్ఞాచరణము, తపస్సు, దానము వలన కల్గు పుణ్యఫలములను అతిక్రమించి మోక్షమును పొందును.

వివరము : యోగవిధానము తెలిసి ఫలానా కాలములో చనిపోతేనే మోక్షము పొందుటకవకాశము కలదని తెలిసినవాడు గొప్ప జ్ఞాని యోగి అయివుండును. అటువంటివాడు వేద, యజ్ఞ, దాన, తపస్సుల వలన వచ్చు సుకర్మను ఆశించడు. ఎందుకనగా వాడు కర్మను పోగొట్టుకోవాలని ఉన్నవాడు కనుక అటువంటి కర్మలనన్నిటిని అతిక్రమించి వద్దని తలచినవాడై, ఆ కర్మల వలన వచ్చు సుఖముకంటే మోక్షమే మిన్నగ తలచినవాడై యోగమునే ఎల్లవేళల ఆచరించి చివరకు పరమపదము పొందగల్గును.

---------------------------

త్రైత సిద్ధాంత భగవద్గీత:  అక్షర పరబ్రహ్మ యోగము  

అర్జునుడిట్లనియె :-

శ్లోకము 1 : కిం త ద్బ్రహ్మ? కిమధ్యాత్మం? కిం కర్మ పురుషోత్తమ ! ।

అధిభూతం చ కిం ?ప్రోక్త మధిదైవం కిముచ్యతే ?||

(ప్రకృతి, ఆత్మ, పరమాత్మ)

శ్లోకము 2 : అధి యజ్ఞః కథం కోఽత్ర దేహేఽస్మి న్మధుసూదన ! ।

ప్రయాణ కాలేచ కథం జ్ఞేయోఽసి నియతాత్మభిః॥

(ఆత్మ, పరమాత్మ)

భావము: బ్రహ్మమేది ? ఏది ఆధ్యాత్మికము ? కర్మయేది ? ఏది భూతములకు అధిపతి? అట్లే దేవతలకు అధికుడైనవాడెవడు? తెలియచెప్పుము. పురుషోత్తమ .! దేహములో యజ్ఞములకు అధిపతియైనవాడు ఎట్లున్నాడు ? నియతాత్ములు వారి అంత్యకాలములో నిన్ను ఎట్లు పొందుచున్నారు ?

అక్షరము అనగ నాశనములేనిదని అర్థము. అక్షర పరబ్రహ్మమని పేరు పెట్టబడిన ఈ అధ్యాయములో ఎక్కువగ మోక్షమును గురించిన విషయమేకలదు. ఇంకనూ యోగమాచరించు యోగులు ఆ జన్మలో మోక్షము పొందారా లేదా అని తెలుసుకొను విధానము కూడ తెలియబరచబడినది. భగవంతుడు యుద్ధ రంగములో ఇలా అధ్యాయములుగ గీతను చెప్పలేదని, యుద్ధము తర్వాత వ్యాసునిచే భగవంతుడు చెప్పిన విషయము వ్రాయబడినదని ముందే చెప్పాము. వ్యాసుడు అధ్యాయములుగ విభజించి చెప్పిన వాటిలో దాదాపు ఆత్మసంయమ యోగమను అధ్యాయమువరకు ఎక్కువగా యోగముల గురించియే చెప్పాడు. అక్కడి నుండి ఎక్కువగా జీవాత్మ, ఆత్మ, పరమాత్మల గురిచి చెప్పుచూ వచ్చి ఈ అధ్యాయములో మోక్షమును గూర్చి ఎక్కువగా చెప్పాడు. అంతేకాక అధ్యాయము మొదటిలో మంచి ప్రశ్నలనిచ్చి వాటికి జవాబులు తెల్పడము ఎంతో ప్రత్యేకముగ, పాఠకులకు సులభముగ జ్ఞానము అర్థమగులాగున ఉన్నది.

శ్రీ భగవంతుడిట్లనియే : -

శ్లోకము 3 : అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మ ముచ్యతే ।

భూత భావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః ||

(ప్రకృతి , పరమాత్మ)

భావము : అన్నిటికంటే శ్రేష్ఠమైన నాశనరహితమైనదే బ్రహ్మము. తన్నుతాను తెలుసుకోవడమే ఆధ్యాత్మికము అనబడును. జీవరాశుల ఉనికికి కారణమైన లెక్కాచారమును కర్మ అందురు.

శ్లోకము 4: అధిభూతం క్షరోభావః పురుషశ్చాధిదైవతమ్ ।

అధియజ్ఞోఽహమే వాత్ర దేహేదేహ భృతాంవర ||

(ఆత్మ)

భావము : నాశన స్వభావమున్న శరీరములు గల జీవరాసులకును, దేవతలకును ఆధారమైనవాడిని నేనే. దేహమందు జరుగు యజ్ఞములకు నేనే అధిపతినని తెలియుము.

శ్లోకము 5 : అన్తకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరమ్ ।

యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ||

(ఆత్మ, పరమాత్మ)

భావము : చివరి కాలములో నన్నే స్మరించుకొంటు శరీరమును వదులువాడు నన్నే పొందగల్గుచున్నాడు. ఈ విషయములో ఏ మాత్రము సంశయము లేదు.

శ్లోకము 6 : యం యం వాఽపి స్మరన్ భావం త్యజత్యన్తే కళేబరమ్ ।

తం త మే వైతి కౌంతేయ! సదాతద్భావ భావితః ||

(జీవాత్మ)

భావము : ఏ ఏ భావమును స్మరించుకొంటూ శరీరమును వదులుచున్నాడో, ఆయా భావమునే అభ్యాస బలము చేత పొందుచున్నాడు.

శ్లోకము 7 : తస్మా త్సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ ।

మయ్యర్పిత మనోబుద్ధి ర్మామే వైష్యస్యసంశయః॥

(ఆత్మ, సాకారము)

భావము : కావున సర్వకాలము నీమనసునందు నన్ను స్మరించుచుండుము. బుద్ధి మనస్సు నాకే సమర్పించుట వలన నన్నే పొందగలవు. దీనిలో సంశయము లేదు.

సాకారము, నిరాకారము అను రెండిటిలో ఎపుడు సాకారమును, ఎపుడు నిరాకారమును ధ్యానించాలన్నది పూర్వమునుండి ఉన్న సమస్యయే. పరమాత్మ సాకారుడై భగవంతునిగ వచ్చిన జన్మవున్నంతవరకు సాకారమునకే పూజ, సాకారమునకే మనోబుద్ధి పనిని లగ్నము చేయాలి. ఫలానా సాకారమని తెలిసిన తర్వాత పూజకాని మనోలగ్నముకాని ఆ సాకారమును వదిలి చేయకూడదు. శ్రీకృష్ణుడు భగవంతుడని తెలిసిన తర్వాత బ్రహ్మయోగమని నిరాకార ధ్యానము చేయడము, గొర్రెపిల్లను చంకలోపెట్టుకొని దానికోసము వెతికినట్లగును. భూమి మీద పరమాత్మ భగవంతునిగ జన్మించుట అరుదు. అది ఎన్నోవేల సంవత్సరములకో జరుగును. అప్పుడు అదృష్టవశాత్తు ఆ జన్మ సామాన్యమైనదికాదని, అపుడపుడు బుద్ధి యోచనకర్థమగుచున్నపుడు ఆ సాకారమును వదలి నిరాకరము మీదికి పోనవసరము లేదు. భగవంతుని జన్మ శ్రీకృష్ణునిదని తెలిసిన మనము ఆయన భగవంతునిగ లేని సమయములో ఉన్నాము, కనుక ఆయన ప్రతిమకు సాకారపూజ చేసినప్పటికి నిరాకార ధ్యానము చేయక తప్పదు. శ్రీకృష్ణుడున్నపుడు ఆయనతో శత్రుత్వము కల్గియుండి యోగము చేయువారు కొందరుండెడివారు. అనగ సాకారముతో శత్రుత్వము, నిరాకారముతో మిత్రుత్వము అటువంటివారు నష్టయోగులగుదురు. పూర్తి జ్ఞానాగ్ని వారిని చేరదు. సాకారము నుండి రావలసినది రాదు. సగము అగ్నిని నష్ఠపోయిన వారగుదురు. శ్రీకృష్ణుని జన్మ అయిపోయిన తర్వాత ఆయన ప్రతిమ విగ్రహకాదని గ్రహించాలి. ప్రతిమ ఏదైనా విగ్రహగా ఉండగలదు. భగవంతుని ప్రతిమ విగ్రహగాలేదు. భగవంతుని ప్రతిమను పూజించినవారు యోగము చేసిన దానితో సమానమే అగును. ఆ అవకాశము మిగతా విగ్రహములగు ప్రతిమలకు లేదు.

శ్లోకము 8 : అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామినా|

పరమం పురుషం దివ్యం యాతి పార్థాఽను చింతయన్ ||

(ఆత్మ, పరమాత్మ)

భావము:అభ్యాసము చేత మనస్సును ఇతర విషయముల మీదికి పోనీయక యోగముతో కూడుకొని చింతించువాడు శ్రేష్ఠమైన, దివ్యమైన పురుషుని పొందగల్గుచున్నాడు.

శ్లోకము 9 : కవిం పురాణ మనుశాసితార మణోరణీయాంస మనుస్మరేద్యః ।

సర్వస్యధాతార మచింత్య రూప మాదిత్యవర్ణం తమసః పరస్తాత్ || (జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)

శ్లోకము 10 : ప్రయాణకాలే మనసాఽచలేన భక్త్యాయుక్తో యోగబలేన చైవ ।

భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుష ముపైతి దివ్యమ్ ||

(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)

భావము : సర్వదర్శి, పురాణుడు, జగత్తును శాశించువాడు, సూక్ష్మములకు సూక్ష్మమైనవాడు, సర్వస్వమును రక్షించువాడు, చింతచేత తెలియనివాడు, సూర్య ప్రకాశము కల్గినవాడు,అజ్ఞానమునకంటే వేరైనవాడునైన పరమాత్మను పొందకోరువాడు, మరణ సమయములో యోగబలము చేత మనస్సును కనుబొమల మధ్యలో నిలుపగలిగి, ప్రాణవాయువును స్థిరపరచినవాడై పరమాత్మలో చేరగల్గును.

శ్లోకము 11 య దక్షరం వేదవిదోవదన్తి విశన్తి యద్యతయో వీతరాగాః ।

యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరన్తి తత్తేపదం సంగ్రహేణ ప్రవక్ష్యే॥

(పరమాత్మ)

భావము : వేద వేత్తలందరు దేనికి నాశనములేదనుచున్నారో, గుణములు వదలిన వారికి ఏది గమ్యస్థానమో , బ్రహ్మచర్యముచే దేనిని పొందగల్గుదురో ఆ పదమును గూర్చి సంగ్రహముగ చెప్పుచున్నాను.

శ్లోకము 12: సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ।

మూర్ధ్న్యాధాయాఽత్మనః ప్రాణ మాస్థితో యోగధారణామ్॥ (జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)

శ్లోకము 13: ఓమిత్యే కాక్షరం బ్రహ్మ వ్యాహర న్మామను స్మరన్।

యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిమ్॥

(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)

భావము : సర్వద్వారములను నియమించి, మనస్సును హృది మధ్యలో నిలిపి, ప్రాణవాయువును పై ముఖముగ నిలుచునట్లు చేసి, స్థిరయోగత్వము పొంది ‘ఓం’ అను అక్షరమునే స్మరించుకొంటు, శరీరమును వదలి పోవువాడు పరమమైన నన్ను పొందును.

శ్లోకము 14: అనన్యచేతా స్సతతం యోమాం స్మరతి నిత్యశః।

తస్యాహం సులభః పార్థ ! నిత్య యుక్తస్య యోగినః ||

(పరమాత్మ)

భావము : వేరు చింతలు మనసున చేరనీయక ఎవడు సర్వదా నన్నే స్మరించునో వానికి సులభుడనౌదును. అతడే నిత్యము నాతో కూడుకొన్న యోగి అనబడును.

శ్లోకము 15: మా ముపేత్య పునర్జన్మ దుఃఖాలయ మశాశ్వతమ్।

నాఽప్నువంతి మహత్మాన సంసిద్ధిం పరమాం గతాః ||

(పరమాత్మ)

భావము : శ్రేష్టమైన సంసిద్ధి పొందిన జనులు నన్ను పొందినవారైవుండి తర్వాత దుఃఖముతో కూడుకొన్న అశాశ్వతమైన జన్మలు పొందరు.

శ్లోకము 16: ఆబ్రహ్మ భువనా ల్లోకాః పునరావర్తినోఽర్జున।

మా ముపేత్య తు కౌంతేయ! పునర్జన్మ న విద్యతే॥

(పరమాత్మ)

భావము : బ్రహ్మలోకము మొదలైన లోకములను పొందినప్పటికి పునర్జన్మ కలదు. నన్ను పొందువానికి పునర్జన్మలేదు.

శ్లోకము 17: సహస్ర యుగ పర్యంత మహర్య ద్బ్రహ్మణో విదుః

రాత్రిం యుగ సహస్రాన్తాం తేఽహోరాత్ర విదో జనాః ||

(పరమాత్మ)

భావము : పరమాత్మకు వేయియుగములు ఒక పగలుగ, వేయియుగములు ఒక రాత్రిగ ఉన్నదని తెలిసినవారు రాత్రిపగలును తెలుసుకోగలుగుచున్నారు.

శ్లోకము 18: అవ్యక్తా ద్వ్యక్తయ స్సర్వాః ప్రభవన్త్య హరాగమే।

రాత్య్రాగమే ప్రలీయన్తే తత్రైవాఽవ్యక్త సంజ్ఞ కే॥

(పరమాత్మ, జీవాత్మ)

భావము : బ్రహ్మపగలు జగతిగ మారుచు కనిపించు సర్వము కనిపించని దానినుండి పుట్టినవి. అట్లే బ్రహ్మరాత్రిలో జగత్తంతయు ప్రళయుము చెంది కనిపించుచున్నవన్నియు కనిపించకుండ పోవుచున్నవి.

శ్లోకము 19: భూతగ్రామ స్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే।

రాత్య్రాగమేఽవశః పార్థ! ప్రభవ త్యహరాగమే॥

(జీవాత్మ)

భావము : సర్వజీవరాసులు బ్రహ్మపగలులో పుట్టి చివరకు రాత్రి అయిన వెంటనే ప్రళయము పొంది నాశనమై కనిపించకపోయి తిరిగి పగలు మొదలైన వెంటనే పుట్టుచున్నవి.

శ్లోకము 20: పరస్తస్మాత్తు భావోఽన్యోఽవ్యక్తోఽవ్యక్తాత్సనాతనః।

యస్ససర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి॥

(పరమాత్మ)

భావము : నాశనములేని, మార్పుచెందని, ప్రకృతికంటే వేరైన, శ్రేష్టమైన, జగతి నాశనమైనను తాను నాశనము కాని అన్యమగుస్థితి ఒకటి కనిపించకవున్నది.

శ్లోకము 21: అవ్యక్తోఽక్షర ఇత్యుక్త స్త మాహుః పరమాం గతిమ్।

యం ప్రాప్య న నివర్తన్తే తద్ధామ పరమం మమ॥

(పరమాత్మ)

భావము : దానినే కనిపించని నాశనములేని స్థితియనుచున్నాము. పరమగతి కావున దానిని తెలియవలయును, పొందవలెను. అది లభించిన జన్మములు లేకుండ పోవును. దానినే నాదగు నియమస్థానమని, పరంధామమని చెప్పవచ్చును.

శ్లోకము 22 : పురుష స్స పరః పార్థ! భక్త్యా లభ్య స్త్వనన్యయా।

యస్యాన్తస్థ్సాని భూతాని యేన సర్వమిదం తతమ్॥

(పరమాత్మ)

భావము : సర్వ జీవరాసులు ఎవనిలోపల ఉన్నవో, ఈ జగత్తంతయు ఎవనిచే వ్యాపించివున్నదో అట్టి పురుషుని అనన్యమైన భక్తిచే పొందవచ్చును.

శ్లోకము 23 : యత్రకాలే త్వనా వృత్తి మావృత్తిం చైవ యోగినః।

ప్రయాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ! ||

(జీవాత్మ, మోక్షము)

భావము : యోగులు ఏ కాలములో మరణిస్తే తిరిగి పుట్టుచున్నారో, ఏ కాలములో మరణిస్తే తిరిగి పుట్టక మోక్షము పొందుచున్నారో, వారు శరీరమును వదిలిపోవు ఆ కాలమును చెప్పుచున్నాను.

శ్లోకము 24: అగ్నిర్జ్యోతి రహ శుక్ల ష్షణ్మాసా ఉత్తరాయణమ్।

తత్రప్రయాతా గచ్ఛన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః॥

(జీవాత్మ, మోక్షము)

భావము : యోగి అయినవాడు ఏ ప్రాంతములో ఉండి మరణము పొందుచున్నాడో ఆ ప్రాంతము మీద సూర్యప్రకాశము కల్గివుండాలి. మేఘముల నీడ ఉండకూడదు. యోగి మరణించు సమయము పగలుగ ఉండి, ఆ పగలు శుక్లపక్షములోనిదై ఉండాలి. ఆ శుక్లపక్షము ఉత్తరాయణములోనిదై ఉండాలి. ఈ విధముగ సూర్యతేజస్సు కల్గిన పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము చేకూరినకాలములో చనిపోయిన యోగి జన్మించక మోక్షము పొంది పరమాత్మయందైక్యమగుచున్నాడు.

శ్లోకము 25 : ధూమో రాత్రి స్తథా కృష్ణష్షణ్మాషా దక్షిణాయనమ్।

తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే॥

(జీవుడు)

భావము : యోగి మరణించు ప్రాంతము మేఘావృతమైవుండినా, రాత్రి సమయమైనా, కృష్ణపక్షము 15 రోజులలోనైనా, దక్షిణాయన ఆరునెలల కాలములోనైన యోగి మరణించిన ఎడల అతడు మోక్షము పొందక, జ్ఞానతేజస్సు కల్గినవాడై తిరిగి జన్మించును. ఈ మరణ సమయములను చాలా గీతలలో తప్పుదోవ పట్టించడము జరిగినది. ‘ప్రయాతాయాన్తితం కాలమ్’ అని 23వ శ్లోకములో చెప్పినప్పటికి కాలమును గూర్చి చెప్పక పగటి దేవత, శుక్లపక్ష దేవత, ఉత్తరాయణ దేవత పోవు దారిలో పోతే మోక్షము లభిస్తుందని వ్రాయబడివున్నది. అలా పగలు దేవతని శ్లోకములో లేని విషయమును తెచ్చి పెట్టడము వలన చాలామంది పొరబడి పోవుచున్నారు. పగలు దేవతను వ్రాసినవారు కూడ చూడలేదు. విన్నవారెక్కడ వెదకగలరు.

శ్లోకము 26: శుక్ల కృష్ణే గతీ హ్యేతే జగత శ్శాశ్వతీమతే।

ఏకయా యా త్యనావృత్తి మన్యయాఽఽవర్తతే పునః॥

(జీవాత్మ)

భావము : జగతిలో శుక్ల కృష్ణ గతులు శాశ్వతముగ గలవు. ఒకదాని వలన వృత్తి, మరొక దానివలన అనావృత్తి కల్గుచున్నది.

శ్లోకము 27 : నైతే సృతీ పార్థ! జానన్ యోగీ ముహ్యతి కశ్చన।

తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున॥

(జీవాత్మ)

భావము : ఇప్పుడు విన్న రెండు విధముల కాలములను తెలిసిన యోగి పొరపాటు పడడు. కనుక అర్జున ఎల్లకాలములలోను నీవు యోగయుక్తునిగనుండవలెను.

శ్లోకము 28 : వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలంప్రదిష్టమ్।

అత్యేతి తత్సర్వమిదం విదిత్వాయోగీపరంస్థాన ముపైతి చాద్యమ్॥

(జీవాత్మ, మోక్షము)

భావము : ఈ విషయము తెలిసినవాడు వేదధ్యాయణము, యజ్ఞాచరణము, తపస్సు, దానము వలన కల్గు పుణ్యఫలములను అతిక్రమించి మోక్షమును పొందును.

---------------------
త్రైత సిద్ధాంత భగవద్గీత:  అక్షర పరబ్రహ్మ యోగము  

అర్జునుడిట్లనియె :-
శ్లోకం 1 
(ప్రకృతి, ఆత్మ, పరమాత్మ)

శ్లోకం 2  
(ఆత్మ, పరమాత్మ)
భావము: బ్రహ్మమేది ? ఏది ఆధ్యాత్మికము ? కర్మయేది ? ఏది భూతములకు అధిపతి? అట్లే దేవతలకు అధికుడైనవాడెవడు? తెలియచెప్పుము. పురుషోత్తమ .! దేహములో యజ్ఞములకు అధిపతియైనవాడు ఎట్లున్నాడు ? నియతాత్ములు వారి అంత్యకాలములో నిన్ను ఎట్లు పొందుచున్నారు ?
అక్షరము అనగ నాశనములేనిదని అర్థము. అక్షర పరబ్రహ్మమని పేరు పెట్టబడిన ఈ అధ్యాయములో ఎక్కువగ మోక్షమును గురించిన విషయమేకలదు. ఇంకనూ యోగమాచరించు యోగులు ఆ జన్మలో మోక్షము పొందారా లేదా అని తెలుసుకొను విధానము కూడ తెలియబరచబడినది. భగవంతుడు యుద్ధ రంగములో ఇలా అధ్యాయములుగ గీతను చెప్పలేదని, యుద్ధము తర్వాత వ్యాసునిచే భగవంతుడు చెప్పిన విషయము వ్రాయబడినదని ముందే చెప్పాము. వ్యాసుడు అధ్యాయములుగ విభజించి చెప్పిన వాటిలో దాదాపు ఆత్మసంయమ యోగమను అధ్యాయమువరకు ఎక్కువగా యోగముల గురించియే చెప్పాడు. అక్కడి నుండి ఎక్కువగా జీవాత్మ, ఆత్మ, పరమాత్మల గురిచి చెప్పుచూ వచ్చి ఈ అధ్యాయములో మోక్షమును గూర్చి ఎక్కువగా చెప్పాడు. అంతేకాక అధ్యాయము మొదటిలో మంచి ప్రశ్నలనిచ్చి వాటికి జవాబులు తెల్పడము ఎంతో ప్రత్యేకముగ, పాఠకులకు సులభముగ జ్ఞానము అర్థమగులాగున ఉన్నది.

శ్రీ భగవంతుడిట్లనియే : -
శ్లోకం 3  
(ప్రకృతి , పరమాత్మ)
భావము : అన్నిటికంటే శ్రేష్ఠమైన నాశనరహితమైనదే బ్రహ్మము. తన్నుతాను తెలుసుకోవడమే ఆధ్యాత్మికము అనబడును. జీవరాశుల ఉనికికి కారణమైన లెక్కాచారమును కర్మ అందురు.

శ్లోకం 4 
(ఆత్మ)
భావము : నాశన స్వభావమున్న శరీరములు గల జీవరాసులకును, దేవతలకును ఆధారమైనవాడిని నేనే. దేహమందు జరుగు యజ్ఞములకు నేనే అధిపతినని తెలియుము.

శ్లోకం 5  
(ఆత్మ, పరమాత్మ)
భావము : చివరి కాలములో నన్నే స్మరించుకొంటు శరీరమును వదులువాడు నన్నే పొందగల్గుచున్నాడు. ఈ విషయములో ఏ మాత్రము సంశయము లేదు.

శ్లోకం 6  
(జీవాత్మ)
భావము : ఏ ఏ భావమును స్మరించుకొంటూ శరీరమును వదులుచున్నాడో, ఆయా భావమునే అభ్యాస బలము చేత పొందుచున్నాడు.

శ్లోకం 7  
(ఆత్మ, సాకారము)
భావము : కావున సర్వకాలము నీమనసునందు నన్ను స్మరించుచుండుము. బుద్ధి మనస్సు నాకే సమర్పించుట వలన నన్నే పొందగలవు. దీనిలో సంశయము లేదు.
సాకారము, నిరాకారము అను రెండిటిలో ఎపుడు సాకారమును, ఎపుడు నిరాకారమును ధ్యానించాలన్నది పూర్వమునుండి ఉన్న సమస్యయే. పరమాత్మ సాకారుడై భగవంతునిగ వచ్చిన జన్మవున్నంతవరకు సాకారమునకే పూజ, సాకారమునకే మనోబుద్ధి పనిని లగ్నము చేయాలి. ఫలానా సాకారమని తెలిసిన తర్వాత పూజకాని మనోలగ్నముకాని ఆ సాకారమును వదిలి చేయకూడదు. శ్రీకృష్ణుడు భగవంతుడని తెలిసిన తర్వాత బ్రహ్మయోగమని నిరాకార ధ్యానము చేయడము, గొర్రెపిల్లను చంకలోపెట్టుకొని దానికోసము వెతికినట్లగును. భూమి మీద పరమాత్మ భగవంతునిగ జన్మించుట అరుదు. అది ఎన్నోవేల సంవత్సరములకో జరుగును. అప్పుడు అదృష్టవశాత్తు ఆ జన్మ సామాన్యమైనదికాదని, అపుడపుడు బుద్ధి యోచనకర్థమగుచున్నపుడు ఆ సాకారమును వదలి నిరాకరము మీదికి పోనవసరము లేదు. భగవంతుని జన్మ శ్రీకృష్ణునిదని తెలిసిన మనము ఆయన భగవంతునిగ లేని సమయములో ఉన్నాము, కనుక ఆయన ప్రతిమకు సాకారపూజ చేసినప్పటికి నిరాకార ధ్యానము చేయక తప్పదు. శ్రీకృష్ణుడున్నపుడు ఆయనతో శత్రుత్వము కల్గియుండి యోగము చేయువారు కొందరుండెడివారు. అనగ సాకారముతో శత్రుత్వము, నిరాకారముతో మిత్రుత్వము అటువంటివారు నష్టయోగులగుదురు. పూర్తి జ్ఞానాగ్ని వారిని చేరదు. సాకారము నుండి రావలసినది రాదు. సగము అగ్నిని నష్ఠపోయిన వారగుదురు. శ్రీకృష్ణుని జన్మ అయిపోయిన తర్వాత ఆయన ప్రతిమ విగ్రహకాదని గ్రహించాలి. ప్రతిమ ఏదైనా విగ్రహగా ఉండగలదు. భగవంతుని ప్రతిమ విగ్రహగాలేదు. భగవంతుని ప్రతిమను పూజించినవారు యోగము చేసిన దానితో సమానమే అగును. ఆ అవకాశము మిగతా విగ్రహములగు ప్రతిమలకు లేదు.

శ్లోకం 8  
(ఆత్మ, పరమాత్మ)
భావము:అభ్యాసము చేత మనస్సును ఇతర విషయముల మీదికి పోనీయక యోగముతో కూడుకొని చింతించువాడు శ్రేష్ఠమైన, దివ్యమైన పురుషుని పొందగల్గుచున్నాడు.

శ్లోకం 9  

శ్లోకం 10  
(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)
భావము : సర్వదర్శి, పురాణుడు, జగత్తును శాశించువాడు, సూక్ష్మములకు సూక్ష్మమైనవాడు, సర్వస్వమును రక్షించువాడు, చింతచేత తెలియనివాడు, సూర్య ప్రకాశము కల్గినవాడు,అజ్ఞానమునకంటే వేరైనవాడునైన పరమాత్మను పొందకోరువాడు, మరణ సమయములో యోగబలము చేత మనస్సును కనుబొమల మధ్యలో నిలుపగలిగి, ప్రాణవాయువును స్థిరపరచినవాడై పరమాత్మలో చేరగల్గును.

శ్లోకము 11 య దక్షరం వేదవిదోవదన్తి విశన్తి యద్యతయో వీతరాగాః ।
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరన్తి తత్తేపదం సంగ్రహేణ ప్రవక్ష్యే॥
(పరమాత్మ)
భావము : వేద వేత్తలందరు దేనికి నాశనములేదనుచున్నారో, గుణములు వదలిన వారికి ఏది గమ్యస్థానమో , బ్రహ్మచర్యముచే దేనిని పొందగల్గుదురో ఆ పదమును గూర్చి సంగ్రహముగ చెప్పుచున్నాను.

శ్లోకం 12 

శ్లోకం 13 
(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)
భావము : సర్వద్వారములను నియమించి, మనస్సును హృది మధ్యలో నిలిపి, ప్రాణవాయువును పై ముఖముగ నిలుచునట్లు చేసి, స్థిరయోగత్వము పొంది ‘ఓం’ అను అక్షరమునే స్మరించుకొంటు, శరీరమును వదలి పోవువాడు పరమమైన నన్ను పొందును.

శ్లోకం 14 
(పరమాత్మ)
భావము : వేరు చింతలు మనసున చేరనీయక ఎవడు సర్వదా నన్నే స్మరించునో వానికి సులభుడనౌదును. అతడే నిత్యము నాతో కూడుకొన్న యోగి అనబడును.

శ్లోకం 15 
(పరమాత్మ)
భావము : శ్రేష్టమైన సంసిద్ధి పొందిన జనులు నన్ను పొందినవారైవుండి తర్వాత దుఃఖముతో కూడుకొన్న అశాశ్వతమైన జన్మలు పొందరు.

శ్లోకం 16 
(పరమాత్మ)
భావము : బ్రహ్మలోకము మొదలైన లోకములను పొందినప్పటికి పునర్జన్మ కలదు. నన్ను పొందువానికి పునర్జన్మలేదు.

శ్లోకం 17 
(పరమాత్మ)
భావము : పరమాత్మకు వేయియుగములు ఒక పగలుగ, వేయియుగములు ఒక రాత్రిగ ఉన్నదని తెలిసినవారు రాత్రిపగలును తెలుసుకోగలుగుచున్నారు.

శ్లోకం 18 
(పరమాత్మ, జీవాత్మ)
భావము : బ్రహ్మపగలు జగతిగ మారుచు కనిపించు సర్వము కనిపించని దానినుండి పుట్టినవి. అట్లే బ్రహ్మరాత్రిలో జగత్తంతయు ప్రళయుము చెంది కనిపించుచున్నవన్నియు కనిపించకుండ పోవుచున్నవి.

శ్లోకం 19 
(జీవాత్మ)
భావము : సర్వజీవరాసులు బ్రహ్మపగలులో పుట్టి చివరకు రాత్రి అయిన వెంటనే ప్రళయము పొంది నాశనమై కనిపించకపోయి తిరిగి పగలు మొదలైన వెంటనే పుట్టుచున్నవి.

శ్లోకం 20 
(పరమాత్మ)
భావము : నాశనములేని, మార్పుచెందని, ప్రకృతికంటే వేరైన, శ్రేష్టమైన, జగతి నాశనమైనను తాను నాశనము కాని అన్యమగుస్థితి ఒకటి కనిపించకవున్నది.

శ్లోకం 21 
(పరమాత్మ)
భావము : దానినే కనిపించని నాశనములేని స్థితియనుచున్నాము. పరమగతి కావున దానిని తెలియవలయును, పొందవలెను. అది లభించిన జన్మములు లేకుండ పోవును. దానినే నాదగు నియమస్థానమని, పరంధామమని చెప్పవచ్చును.

శ్లోకం 22  
(పరమాత్మ)
భావము : సర్వ జీవరాసులు ఎవనిలోపల ఉన్నవో, ఈ జగత్తంతయు ఎవనిచే వ్యాపించివున్నదో అట్టి పురుషుని అనన్యమైన భక్తిచే పొందవచ్చును.

శ్లోకం 23  
(జీవాత్మ, మోక్షము)
భావము : యోగులు ఏ కాలములో మరణిస్తే తిరిగి పుట్టుచున్నారో, ఏ కాలములో మరణిస్తే తిరిగి పుట్టక మోక్షము పొందుచున్నారో, వారు శరీరమును వదిలిపోవు ఆ కాలమును చెప్పుచున్నాను.

శ్లోకం 24 
(జీవాత్మ, మోక్షము)
భావము : యోగి అయినవాడు ఏ ప్రాంతములో ఉండి మరణము పొందుచున్నాడో ఆ ప్రాంతము మీద సూర్యప్రకాశము కల్గివుండాలి. మేఘముల నీడ ఉండకూడదు. యోగి మరణించు సమయము పగలుగ ఉండి, ఆ పగలు శుక్లపక్షములోనిదై ఉండాలి. ఆ శుక్లపక్షము ఉత్తరాయణములోనిదై ఉండాలి. ఈ విధముగ సూర్యతేజస్సు కల్గిన పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము చేకూరినకాలములో చనిపోయిన యోగి జన్మించక మోక్షము పొంది పరమాత్మయందైక్యమగుచున్నాడు.

శ్లోకం 25  
(జీవుడు)
భావము : యోగి మరణించు ప్రాంతము మేఘావృతమైవుండినా, రాత్రి సమయమైనా, కృష్ణపక్షము 15 రోజులలోనైనా, దక్షిణాయన ఆరునెలల కాలములోనైన యోగి మరణించిన ఎడల అతడు మోక్షము పొందక, జ్ఞానతేజస్సు కల్గినవాడై తిరిగి జన్మించును. ఈ మరణ సమయములను చాలా గీతలలో తప్పుదోవ పట్టించడము జరిగినది. ‘ప్రయాతాయాన్తితం కాలమ్’ అని 23వ శ్లోకములో చెప్పినప్పటికి కాలమును గూర్చి చెప్పక పగటి దేవత, శుక్లపక్ష దేవత, ఉత్తరాయణ దేవత పోవు దారిలో పోతే మోక్షము లభిస్తుందని వ్రాయబడివున్నది. అలా పగలు దేవతని శ్లోకములో లేని విషయమును తెచ్చి పెట్టడము వలన చాలామంది పొరబడి పోవుచున్నారు. పగలు దేవతను వ్రాసినవారు కూడ చూడలేదు. విన్నవారెక్కడ వెదకగలరు.

శ్లోకం 26 
(జీవాత్మ)
భావము : జగతిలో శుక్ల కృష్ణ గతులు శాశ్వతముగ గలవు. ఒకదాని వలన వృత్తి, మరొక దానివలన అనావృత్తి కల్గుచున్నది.

శ్లోకం 27  
(జీవాత్మ)
భావము : ఇప్పుడు విన్న రెండు విధముల కాలములను తెలిసిన యోగి పొరపాటు పడడు. కనుక అర్జున ఎల్లకాలములలోను నీవు యోగయుక్తునిగనుండవలెను.

శ్లోకం 28  
(జీవాత్మ, మోక్షము)
భావము : ఈ విషయము తెలిసినవాడు వేదధ్యాయణము, యజ్ఞాచరణము, తపస్సు, దానము వలన కల్గు పుణ్యఫలములను అతిక్రమించి మోక్షమును పొందును.

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024