pss: kuran ayat draft
ఖుర్ఆన్ గ్రంథములో 89వ సూరాలో 22వ ఆయత్‍నందు (89–22) "దేవదూతలు బారులు తీరియుండగా దేవుడు అవతరిస్తాడు" అని కలదు.
(89-21) “భూమిని ఎడాపెడా దంచి తుత్తునియలుగా చేయటం జరిగినప్పుడు మీ ప్రభువు అవతరిస్తాడు" అని గలదు. “భూమిని దంచి పిండిపిండిగా లేక ముక్కలు ముక్కలుగా చేయటము జరిగినప్పుడు”
(5-68) “ఓ గ్రంథవహులారా! మీరు తౌరాతునూ, ఇంజీలునూ (భగవద్గీతను, బైబిలును) మీ ప్రభువు తరపున మీవద్దకు పంపబడిన దానిని ( ఖుర్ఆన్ గ్రంథమును) మీ జీవితాలలో నెలకొల్పు వరకు మీరు ఏ ధర్మముపైనా లేనట్లే" అని కూడా చెప్పారు.
అంతేకాక 62వ సూరాలో, 5వ ఆయత్‍నందు ఇలా కలదు. (62-5) “తౌరాతు గ్రంథము ప్రకారము ఆచరించాలని ఆదేశించినప్పటికీ, దానికి అనుగుణముగా ఆచరించనివారు ఎన్ని గ్రంథములను అనుసరించినా, అటువంటి వారిని ఎన్నో గ్రంథములను వీపుమీద మోయు గాడిదలాంటి వారని ఉపమానముగా చెప్పవచ్చును.
ఖుర్ఆన్ గ్రంథములో అల్ బఖర అను 2వ సూరాలో 159వ ఆయత్‍నందు ఇలా కలదు చూడండి. (2-159) “మేము అవతరింపచేసిన నిదర్శనాలను మరియు సన్మార్గమును ప్రజల కొరకు గ్రంథములో విశదపరచిన తర్వాత కూడా వాటిని దాచిపెట్టే వారిని దేవుడు శపిస్తాడు. ఇంకా వేరే శపించేవారు కూడా వారిని శపిస్తారు.”
(6-2) “ఆయన మనుషులను మట్టితో చేశాడు. ఆపైన ఒక గడువును నిర్ధారించాడు. మరో నిర్ణీత గడువు మాత్రము అల్లాహ్‍వద్ద మాత్రమే యున్నది. అయినా మీరు సంశయానికి లోనైయున్నారు."
(7-29) “మొదటిసారి అల్లాహ్ మిమ్మల్ని ఎలా పుట్టించాడో, మలిసారి కూడా మీరు అలాగే పుట్టించబడతారు".
(13-5) “ఓ ప్రవక్తా! నీవు ఆశ్చర్యపడవలసియుంటే, ఏమిటి? మరణించి మట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ క్రొత్తగా పుట్టించబడతామా? అన్నవారి మాటలపై ఆశ్చర్యపోవాలి. తమ ప్రభువుపట్ల తిరస్కారవైఖరిని అవలంబించిన వారు వీరే, గొలుసులు వేయబడేది వారి మెడలోనే, నరకములో వీరే కలకాలము ఉంటారు”.
(7–29) “మొదటిసారి దేవుడు మిమ్మల్ని ఎలా పుట్టించాడో, రెండవమారు కూడా మీరు అలాగే పుట్టబడుతారు”
(2-30) “నేను భువిలో ప్రతినిధిని చేయబోతున్నాను అని ప్రభువు తన దూతలతో అన్నప్పుడు భూమిలో కల్లోలాన్ని రేకెత్తించి, రక్తం ప్రవహింపజేసేవాడిని ఎందుకు సృష్ఠిస్తావు ప్రభూ! నిన్ను స్తుతించటానికి, ప్రశంసించటానికి, నీ పవిత్రతను కొనియాడడానికి మేమున్నాము కదా! అని వారన్నారు. దానికి అల్లాహ్ నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు" అని అన్నాడు
(15-29) “నేను అతన్ని పూర్తిగా తయారు చేసి అతనిలో నా ఆత్మను ఊదినప్పుడు మీరంతా అతని ముందు సాష్టాంగపడండి. (30) దేవదూతలందరూ సాష్టాంగపడ్డారు."
(15-31) “ఇక్కడ ఇబ్లీసు తప్ప సాష్టాంగపడేవారిలో అందరూ సాష్టాంగపడినారు. (32) “ఓ ఇబ్లీస్! సాష్టాంగ పడేవారిలో నీవు ఎందుకు చేరలేదు? అని అల్లాహ్ (దేవుడు) అడిగాడు." (33) "కుళ్ళి ఎండిన నల్లని మట్టితో నీవు సృష్ఠించిన మనిషి ముందు నేను మోకరిల్లను." అని ఇబ్లీసు తెగేసి చెప్పాడు.”
(15-39) “ఓ ప్రభూ! నీవు నన్ను అపమార్గము పట్టించినందు వలన నేను భూమండలములోని మానవులకు పాపాన్ని అందముగా కనిపించేలా చేస్తాను. వారినందరినీ పెడతోవ పట్టిస్తాను అని ఇబ్లీసు చెప్పాడు. (40) అంతేగాక ఇట్లు కూడా అన్నాడు. నీ ద్వారా ఎన్నుకోబడిన ప్రత్యేక దాసులను తప్ప అందరినీ తప్పుదారి పట్టిస్తాను అన్నాడు. (41) అప్పుడు అల్లాహ్ (దేవుడు) ఇలా సెలవిచ్చాడు. నన్ను చేరే ఋజుమార్గము ఇదే. (42) నా దాసులపైన నీ అధికారము సాగదు. నీ అధికారము నిన్ను అనుసరించే భ్రష్టులపై సాగుతుంది. (43) అలాంటి వారందరి కోసము వాగ్దానము చేయబడిన చోటు నరకము గలదు."
2-7) “అల్లాహ్ వారి హృదయాలపై, వారి చెవులపై ముద్రవేశాడు. వారి కళ్ళపై పొరవుంది. ఇంకావారికి మహా ఘోరమైన శిక్షవుంది."
(2-18) “వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు ఇక వారు సరియైన దారికి మరలిరారు.”
(2-6) ఇలా వుంది. “అవిశ్వాసులను నీవు భయపెట్టినా, భయపెట్టకపోయినా ఒక్కటే వారు విశ్వసించరు."
(2-6) ఇలా వుంది. “అవిశ్వాసులను నీవు భయపెట్టినా, భయపెట్టకపోయినా ఒక్కటే వారు విశ్వసించరు."
(2-29) “దేవుడు మీ కోసము భూమిలోయున్న సమస్త వస్తువులను సృష్ఠించాడు. తర్వాత ఆకాశము వైపునకు ధ్యాసను మరల్చి తగురీతిలో సప్తాకాశములను నిర్మించాడు. ఆయన అన్నీ తెలిసినవాడు”
(29-44) “అల్లాహ్ ఆకాశాలనూ, భూమినీ సత్యబద్ధముగా సృష్ఠించాడు. ఆకాశాలను భూమిని పరమార్థముతో సృష్ఠించాడని తెలిసితే, ఇందులో గొప్ప నిదర్శనము దొరుకుతుంది".
. (6-59) "అగోచరాల తాళము చెవులు అల్లాహ్ వద్దనే ఉన్నాయి. అల్లాహ్‍కు (దేవునికి) తప్ప ఇతరులెవరికీ వాటి గురించి తెలియదు. భూమిలోనూ, సముద్రములోనూ ఉన్న వస్తువులన్నిటి గురించి ఆయనకు తెలుసు. రాలే ఆకుకూడా ఆయనకు తెలియకుండా రాలదు. నేలలోని చీకటి పొరలలో పడే ఏ గింజ అయినా, పచ్చిది ఎండినది ఏది అయినా స్పష్టమైన గ్రంథములో నమోదైయున్నది."
(49-18) “భూమ్యాకాశాలలో యున్న రహస్య విషయములన్నీ అల్లాహ్‍కు బాగా తెలుసు. అంతేకాక మీరు చేసేదంతా ఆయన చూస్తూనేయున్నాడు."
2-163) “మీ అందరి ఆరాధ్య దైవము ఒక్కడే. ఆయన తప్ప మరో ఆరాధ్యదైవము లేనే లేదు. ఆయన అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు.”
(3-18) “అల్లాహ్ (దేవుడు) తప్ప మరో ఆరాధ్యదైవము లేదని స్వయముగా దేవుడు, దేవుని దూతలు మరియు జ్ఞాన సంపన్నులయిన వారు సాక్ష్యమిస్తున్నారు. ఆయన సామత్యము, సమతూకముతో ఈ విశ్వాన్ని నిలిపియుంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన దేవుడు తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు.”
(2-255) “దేవుడు మాత్రమే నిజమైన ఆరాధ్య దైవము. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు. ఆయన సజీవుడు. ఆయన అన్నిటికీ మూలాధారము. ఆయనకు కునుకుగానీ, నిద్రగానీ రాదు. భూమ్యాకాశములలో ఉన్న సమస్తము ఆయన ఆధీనములో యున్నది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షములో సిఫారసు చేయగలవాడు ఎవడూ లేడు. వారికి ముందూ, వెనుకాయున్న సమాచారము మొత్తము ఆయనకు తెలుసు. ఆయన కోరినది తప్ప, ఆయనకున్న జ్ఞానములోని ఏ విషయమూ వారి గ్రాహ్యపరిధిలోనికి రాదు. ఆయన కుర్చీ వైశాల్యము భూమి ఆకాశములను చుట్టుముట్టియుంది. భూమ్యాకాశాలను రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు.”