till 81
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
68. భూమిలోనూ, ఆకాశములలోనూ ఎన్నో సూచనలు ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా సాగిపోతున్నారు. (12-105)
ప్రతి మనిషి ఏడు ఆకాశములు, ఒక భూమియందు జీవనము సాగించుచున్నాడు. భూమి, ఆకాశములు లేకుండా ఎవరూ బ్రతకలేరని చెప్పవచ్చును. భూమి మరియు ఏడు ఆకాశముల మధ్యలో వాటి గుండా వచ్చు ఎన్నో సూచనల ద్వారా బ్రతుకుచున్నాడు. అయినా ఆ సూచనలను గురించి ఏమాత్రము పట్టించుకోకుండా మనుషులందరూ బ్రతుకుచున్నారని సూరా 12, ఆయత్ 105లో చెప్పారు.
(12-105) ''ఆకాశాలలో భూమిలో ఎన్నో సూచనలున్నాయి. కానీ వారు వాటిని పట్టించుకోకుండానే సాగిపోవుచున్నారు.''
ఆకాశములు ఎన్నో లేవు. ఎంచుకుంటే ఏడే గలవు. అలాగే భూమి ఒకటే గలదు. ఆ ఏడు ఆకాశములు ఒక భూమి నీవు నివసించు నీ శరీరములోనే గలవని నీకు తెలియదు. నీవు ఏడు ఆకాశముల క్రింద భూమియందు నివశిస్తున్నావని అదే నీ శరీరమని తెలియదు. బయట ఆకాశము ఒక్కటే గలదు, అట్లే బయట భూమి ఒక్కటే గలదు. అయితే ఈ వాక్యములో చెప్పిన ఆకాశములు, భూమి ప్రత్యేకముగా ఉన్నాయి. బయట ఆకాశమును భూమిని ప్రతి మనిషి చూస్తూ బ్రతుకుచున్నాడు. బయటి భూమిలో పంట పండునని భూమిని పరిశీలించుచూ బ్రతుకు చున్నాడు. అట్లే బయటి ఆకాశమునుండి వర్షము వచ్చునని ఆకాశ మేఘములను జాగ్రత్తగా ఆశగా చూస్తున్నాడు. అయితే మనిషి లోపలి ఆకాశాలను, భూమిని ఏమాత్రము పట్టించుకోకుండా మనిషి బ్రతుకు చున్నాడు. తనలో ఏడు ఆకాశములు భూమి ఉండడమే కాకుండా వాటి మధ్యలో తనకు తెలియని ఎన్నో భాగములు కలవని తెలియలేకపోవు చున్నాడు. ఎంతటి పెద్ద మేథావులయినా వారి బుద్ధిని అంతా బయటికే వినియోగించుచున్నారు గానీ, లోపలికి ఏమాత్రమూ ఉపయోగించలేదు. లోపలయున్న ఆకాశములు, భూమి మీద ఏమాత్రమూ శ్రద్ధ చూపడము లేదు.
దేవుడు మనిషికి జ్ఞానమును తెలుపు నిమిత్తము మొదట బయట ఆకాశము నుండి జ్ఞానమును మేఘ గర్జనతో చెప్పడము జరిగినది. అలా చెప్పిన జ్ఞానము దైవ గ్రంథముల రూపములో మనుషుల ముందర యున్నప్పటికీ, వాటిలోని జ్ఞానమును పట్టించుకోకుండా, మనిషి మతములను అడ్డము పెట్టుకొని, తమ ద్యాసనంతా బయటే పెట్టుకోవడము జరిగినది. అటువంటి వారి చూపును, ద్యాసను శరీరము లోపలికి మార్చుటకు దేవుడు బయట ఆకాశములో 'ఇంద్రధనస్సు' అను పేరుతో ఏడు రంగుల అర్ధవలయమును చూపాడు. గొడుగు ఆకృతిని పోలిన ఆ ఏడు రంగుల వలయము నీవు ఏడు ఆకాశముల కింద ఉన్నావని గుర్తు చేయుచున్నది. ఏడు ఆకాశములు నీ శరీరములో ఉన్నాయని, అవి ఒక్కొక్కటి ఒక్కొక్క శక్తి కలిగియున్నదని ఏడు రంగుల వలయములు చూపబడినవి. ఏడు ఆకాశముల క్రింద భూమి ఆధారముతో యున్నావను జ్ఞానమును ఇంద్రధనస్సు చూపినా, మనిషి దానిని కూడా గ్రహించక చూచి వదలివేస్తున్నాడు. బయట కనపడు ఆకాశమునకు ఇంద్రధనస్సుయని పేరు కలదు. ఆ పేరును గురించి చూచినా కొంత జ్ఞానము అర్థము కాగలదు. ఇంద్రయనగా జ్ఞానము అని అర్థము. ఇందూ అనినా, ఇంద్ర అనినా ఒకే అర్థము గలదు. ధనస్సు అనగా నాశనము చేయునది అని అర్థము. జ్ఞానము వలన కర్మ నాశనమగునని, జ్ఞానము కర్మను నాశనము చేయునదియని అర్థమొచ్చునట్లు బయట కనిపించు ఏడు రంగుల అర్ధవలయమును ఇంద్రధనస్సు యని అన్నారు. ఇది నీ కర్మను లేకుండా చేయు జ్ఞాన సూచన అని అర్థమగునట్లు అలా చెప్పారని తెలియుచున్నది.
బయట దైవ గ్రంథములలో కర్మను కాల్చు జ్ఞానమున్ననూ, ఆ గ్రంథముల జ్ఞానములో ఏడు ఆకాశములు అని చెప్పిన వాక్యములున్నా, బయట ఆకాశములో ఇంద్రధనస్సు కనిపించినా మనిషి మాత్రము గ్రంథ రూపములో మరియు దృశ్యరూపములో యున్న జ్ఞానమును పట్టించు కోకుండా పూర్తి స్థాయిలో బయట మతమును పట్టుకొని దాని ప్రకారమే నడుస్తున్నాడు. తన తోటివారిని కూడా నడువమంటున్నాడు. ఇంకా ఇతర మతములవారిని కూడా తన మతములో చేరమంటున్నాడు తప్ప తన శరీరములోపల గల ఆకాశములనుగానీ, వాటి క్రిందయున్న మాంస, ఎముకలు, రక్తముగాయున్న భూమి ధాతువులనుగానీ గమనించడము లేదు. లోపలి ఆకాశములను భూమిని వాటి మధ్యలో యున్నవాటిని గమనించ గలిగితే మనిషి సంపూర్ణ జ్ఞాని కాగలడు. ఎప్పటికయినా శరీరములోనికి ద్యాస మళ్లనివాడు జ్ఞాని కాలేడు. మూడు దైవ గ్రంథములు శరీరములోని ద్యాసను గురించి చెప్పాయని తెలియక, పురాణ రూపములో చెప్పుకొన్న ద్యానములను, ప్రార్థనలను ఆచరించినా ఏమీ ప్రయోజనము ఉండదు, దేవుడు తెలియబడడు. దైవ గ్రంథములలో చెప్పిన ప్రకారము శరీరము లోనికి ద్యాసను మళ్లించితే గ్రంథములలో చెప్పిన శాస్త్రబద్దమైన ప్రార్థన ఏమిటో తెలియును. అప్పుడు నీవు సంపూర్ణ జ్ఞానివి కాగలవు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
69. భూమిలో అనేక ఫల వృక్షములు గలవు. వాటికి కాయు అన్ని ఫలములు ఒకే రుచిని కల్గియుండక ఒకదాని మించిన రుచిని మరొకటి గలవు. గమనించితే ఇందులో ఎన్నో సూచనలున్నాయి. (13-4)
(13-4) ''భూమిలో అనేక రకాల నేలలు ఒకదానికొకటి ఆనుకొని ఉన్నాయి. అందులో ద్రాక్షతోటలు ఉన్నాయి. పంట పొలాలు ఉన్నాయి. ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని శాఖలుగా చీలియుండగా, మరికొన్ని వేరే రకముగా ఉన్నాయి. వాటన్నిటికీ ఒకే నీరు సరఫరా అవుతున్నది. అయినప్పటికీ మేము ఆ పండ్లలో ఒకదానికి మరో దానిపై శ్రేష్ఠతను ప్రసాదిస్తున్నాము. నిశ్చయముగా విజ్ఞులకు ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి.''
విజ్ఞులు అనగా జ్ఞానమున్నవారు అని అర్థము. జ్ఞానములో రెండు రకముల జ్ఞానములు గలవు. ఒకటి ప్రపంచ జ్ఞానము, రెండు పరమాత్మ జ్ఞానము గలవు. ఇక్కడ ప్రపంచ సంబంధమైన వృక్షములు, వాటి ఫలములను చెప్పారు. అదంతయూ ప్రపంచ జ్ఞానము వలన తెలియునవే. అయితే ఇందులో సూచనలున్నాయని చెప్పారు. అయితే అది ప్రపంచ జ్ఞానమునకు కనిపించవు. అందులోని సూచనలు తెలియుటకు పరమాత్మ జ్ఞానము అవసరము. ప్రపంచ జ్ఞానమును ప్రక్కన పెట్టి పరమాత్మ జ్ఞానము ప్రకారము వాక్యములో చెప్పినది చెప్పినట్లు కాకుండా మరొక అర్థముతో చూస్తే ''భూమిమీద అనేక రకముల నేలలు ఒకదానికొకటి ఆనుకొని ఉన్నాయి'' అని వాక్యములో చెప్పారు. ఇప్పుడు ఈ వాక్యమునకు నాలోని ఆత్మ (దేవుడు) ఈ విధముగా భావమును అందించుచున్నాడు. కావున వాటినే నేను చెప్పుచున్నాను. భూమిమీద అనేక రకముల నేలలు ఉన్నట్లు భూమిమీద అనేక రకముల మనుషులు ఉన్నారు. ''అనేక రకములైన నేలలు ఒకదానికొకటి అనుకొని ఉన్నాయి'' అని అన్నారు. ఆ మాట వాస్తవమే యని చెప్పవచ్చును. ఒక కుటుంబమును పరిశీలించి చూస్తే అనేక రకముల నేలలు ఒకదాని ప్రక్కన మరొకటి ప్రక్క ప్రక్కనే యున్నట్లు ఒకే కుటుంబములో ప్రక్క ప్రక్కనే అనేకమంది తల్లితండ్రిగా, అన్నతమ్ములుగా, అత్తాకోడల్లుగా, భార్యాభర్తలుగా అనేక విధముల దగ్గర సంబంధము కలవారై అనేకమంది యున్నారు. అనేకమంది ఒకే ఇంటిలో యున్నా వారిలో బుద్ధులు అనేక రకములుగా ఉన్నాయి. మనుషులలోని బుద్ధులు ఉన్నట్లు భూమిలోని అనేక నేలలలో ద్రాక్షతోటలు, ఖర్జూరపు చెట్లు, పంటపొలాలు అనేక రకములుగానే ఉన్నాయి. అనేక బుద్ధులు యున్నట్లు, అనేక రకములయిన చెట్లు, తీగలు, వృక్షములు గలవు. వారివారి బుద్ధులను బట్టి వారికి పాపపుణ్య కర్మ ఫలములు వచ్చినట్లు ఆయా వృక్షములను, చెట్లనుబట్టి పండ్లు, ఫలములు, గింజలు వస్తున్నవి. అనేక చెట్లకు అనేక పండ్లు కాయగా వాటిలో రుచిగలవి, రుచిలేనివి, తియ్యటివి, చేదువి యున్నట్లు, మనిషి సంపాదించుకొను కర్మ ఫలములు ఒకరకముకాగా, మనిషి సంపాదించు జ్ఞాన ఫలములు కూడా ప్రత్యేకమైనవి గలవు. వృక్షములు, చెట్ల ఫలములు ఒకదానిపై ఒకటి శ్రేష్ఠత కల్గియున్నట్లు, మనిషికి గల జ్ఞాన ఫలములలో ఒకదానిమించి మరొకటి కలదు. దీనినిబట్టి మనిషికి గల జ్ఞానము ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధముగా యుంటూ ఒకరిని మించిన జ్ఞానము మరొకరి వద్ద గలదు.
భూమిమీద చెట్లు ఎన్నియున్నా భూమిలోపల వేర్లకు కాయు ఫలములు గలవు. అట్లే భూమి బయట చెట్ల కొమ్మలకు కాయు ఫలములు రెండవ రకము గలవు. అట్లే ప్రపంచములో మనుషులకు ప్రపంచ కర్మలు అను ఒక రకము ఫలితములు ఉండగా, రెండవ రకము జ్ఞాన ఫలములు కూడా కలవు. భూమిపైన కనిపించునట్లు కాయు ఫలములను కర్మ ఫలములుగా లెక్కించవచ్చును. అలాగే భూమిలోపల కనిపించక యున్న అనేక ఫలములను జ్ఞాన ఫలములుగా లెక్కించవచ్చును. జ్ఞానఫలములు వేరువేరుగా యుంటూ, వేరు చెనగ యున్నట్లు తీగ చెనగ యుండదు. రెండు వేరు చెనగే అయినా ఒకటి చెట్లు మొదలులో వచ్చే వేర్ల దగ్గర కాయునవి గుత్తు చెనగ కాగా, చెట్ల కొమ్మలు తీగలుగా భూమిమీద ప్రాకగా ఆ కొమ్మలకు దిగిన వేర్లలో కాయు వేరు చెనగను తీగ చెనగ అంటాము. గుత్తు చెనగ, తీగ చెనగ రెండు ఆకారములోనూ, రుచిలోనూ ఎంతో తేడా కల్గియున్నవి.
అదే విధముగా భూమిలో తయారగు ముర్లంగి గడ్డకు, ఉర్లగడ్డకు ఆకారములోనూ, రుచిలోనూ ఎంతో తేడా కలదు. రెండు గడ్డలు భూమిలోనే పెరిగినా, వాటి రుచులు వేరువేరుగా యున్నట్లు మనిషి యొక్క బుద్ధి గ్రహించు జ్ఞానము అనేక రకముల గలదు. మనిషి మనిషికి వారికున్న జ్ఞానములో తేడా గలదు. చెట్లన్నిటికి ఒకే నీరు అన్నట్లు అందరూ తెలియునది ఒకే దేవుని జ్ఞానమే అయినా అది వారికి లభించిన దానినిబట్టి యుండును. మనిషి చదువుతున్నది దైవగ్రంథమే అయినా దానిలో వారి బుద్ధికి అర్థమయినదానినిబట్టి వారికి జ్ఞానముండును. వారికున్న జ్ఞానమునుబట్టి వారికి జ్ఞానశక్తి లభించి యుండును. వారికున్న జ్ఞానశక్తి అందరిలో ఒకే రకము లేకుండా అనేక స్థాయిలలో కలదు. వారికున్న జ్ఞానశక్తి స్థాయినిబట్టి వారి కర్మలు కాలిపోవుచుండును. వారి కర్మలను కాల్చుటకు సరిపోవు జ్ఞానశక్తిని (జ్ఞానాగ్ని) కలవారు కొందరుండగా, ఇతరుల కర్మలను కూడా కాల్చగల స్థోమత యున్నవారు కూడా కొందరు గలరు. అటువంటివారిలో ఇతర కర్మలను కాల్చి కళ్ల చూపునిచ్చి గ్రుడ్డితనము లేకుండా చేసిన వ్యక్తి ఏసు ఒకడు కలడు. దీనినిబట్టి ఏసు యొద్ద యున్న జ్ఞానము (జ్ఞాన ఫలము) వేరు, మిగతా జ్ఞానుల వద్దయున్న జ్ఞాన ఫలము వేరని తెలియవచ్చును. ఇదంతయూ మనిషిలో యున్న నిగూఢ విషయము. కర్మలను ప్రపంచ ఫలితములుగా, జ్ఞానమును దైవిక ఫలితముగా లెక్కించవలెను. అట్లు లెక్కించినవాడు నిజమైన జ్ఞానియగును.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
70. మనిషికి ముందు వెనుకా ఇద్దరు కాపలావాళ్లు ఉంటారు. ఎవరినయినా వారు శిక్షించాలంటే శిక్ష తొలగిపోయే ప్రసక్తే ఉండదు. ఆయన తప్ప వారిని రక్షించే వారు ఎవరూ ఉండరు. (13-11)
(13-11) మనిషికి ముందూ వెనుకా కావలివాళ్లు అంటియున్నారు. వారు దైవాజ్ఞానుసారము అతనిని కనిపెట్టుకొని ఉంటారు. ఏ జాతి అయినా సరే స్వయముగా తన మనోమయ స్థితిని మార్చు కోనంతవరకు అల్లాహ్ కూడా దాని స్థితిని మార్చడు. అల్లాహ్ ఏ జాతినయినా శిక్షించాలనుకుంటే ఇక ఆ శిక్ష తొలగిపోయే ప్రసక్తే యుండదు. ఆయన తప్ప వారిని రక్షించే వారు కూడా ఎవరూ ఉండరు.''
ప్రతి మనిషికి ముందువెనుక కావలివాళ్లు అంటియున్నారని వాక్యములో చెప్పారు. అయితే అలా ఏ మనిషికి ముందు వెనుక ఎవరు ఉన్నట్లు కనిపించలేదు కదా!యని ఎవరయినా అడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా! ఏ మనిషికీ బయటికి కనిపించు కాపలావాళ్లు ఎవరూ ఉండరు. అయితే వాక్యములో చెప్పిన విషయమును గమనిస్తే జ్ఞానరీత్యా తెలియగల్గితే, ప్రతి మనిషికి ఇద్దరు కాపలావాళ్లు కలరనే చెప్పవచ్చును. ఎలాగనగా! ప్రతి జీవాత్మకు శరీరము లోపల ముందు ఆత్మ, వెనుక పరమాత్మయను ఇద్దరు కాపలాగా కలరు. ఆత్మ జీవునికి ఆనుకొని ప్రక్కనే యుండగా, పరమాత్మ కూడా ఆత్మకు అంటిపెట్టుకొని యున్నారు. దీనిని బట్టి ప్రతి జీవునికి ఆత్మ, పరమాత్మ ఇద్దరు కాపలాగా యున్నారని, ఆత్మ పరమాత్మ దృష్ఠిని కాదని జీవుడు లేడని తెలియుచున్నది.
ఇదంతా అగోచర విషయములు. బయటికి కనిపించునవి కావు. ముందే పరమాత్మ నిర్ణయము ప్రకారము కర్మను అనుసరించి ఆత్మ జీవాత్మను అంటిపెట్టుకొని ఉండును. ఆత్మను అనుసరించి పరమాత్మ శరీరములో సాక్షిగా యున్నాడు. అలా జీవుడు ఆత్మ దృష్ఠిలో యుండగా, ఆత్మ పరమాత్మ దృష్ఠిలో యున్నది. ప్రతి శరీరమునందు జీవాత్మయుండగా, జీవాత్మతో పాటు ఆత్మ ఉండడము సహజము. ఆత్మయున్న చోట పరమాత్మ యుండడము కూడా సహజమే. శరీరములో అగోచరముగా యున్న జీవాత్మకు ముందు వెనుకా అనగా చుట్టూ ఆత్మ, పరమాత్మ అను ఇద్దరూ గలరు. ముందు వెనుకయని వాక్యములో వ్రాసియున్నా వారు ఇద్దరూ ఒక ప్రక్కనే లేరు. ఎటుచూచినా ముందు వెనుకగలరు. అందువలన అన్ని వైపులా కలరని చెప్పవచ్చును. శరీరములో జీవాత్మ పుట్టినప్పటి నుండి మరణము వరకు నివాసము చేయుచున్నది.
శరీరములో జీవుడు తలయందు గల నాలుగు చక్రములలో క్రింది చక్రము అయిన గుణచక్రమందు మూడు భాగములలో అతని కర్మకొద్దీ ఏదో ఒక భాగమున నివశిస్తూయున్నాడు. దీనినిబట్టి జీవుడు శరీరములో ఒకచోట రవ్వంత స్థలములో యున్నాడని తెలియుచున్నది. శరీరము ఎంత పెద్దదయినా జీవుడు మాత్రము కొద్దిగా సూదిమోపినంత జాగాలో యున్నాడు. అయితే శరీరములోని ఆత్మ శరీరమంతయూ గోర్లు, వెంట్రుకల వరకూ వ్యాపించియున్నది. మొదటివాడయిన జీవుడు శరీరములో ఒక్కచోట కొద్దిగాయుండగా, రెండవవాడయిన ఆత్మ శరీరమంతా వ్యాపించియున్నాడు. ఇకపోతే మూడవవాడయిన పరమాత్మ శరీరము లోపల శరీరమంతా వ్యాపించి యుండడమేకాక, శరీరము బయట కూడా అణువణువునా వ్యాపించి యున్నాడు. దీనినిబట్టి విశ్వమంతయూ అల్లాహ్ వ్యాపించి అన్నిటికీ అతీతముగాయున్నాడు. అల్లాహ్ అను ఇద్దరిలో ఈయన మొదటి సృష్ఠికర్త, ఈయన ఎవరితో సంబంధము లేకుండా ఏ అక్కరా లేనివాడు. మొదటి సృష్ఠికర్తయైన అల్లాహ్ మనుషుల ఆరాధనలకు కూడా సంబంధము లేనివాడై, ఏ పనినీ చేయనివాడై యున్నాడు.
శరీరములో శరీరమంతా వ్యాపించిన అల్లాహ్ రెండవ అల్లాహ్ యగును. ఈ అల్లాహ్ అందరికీ ఆరాధ్య దైవముగా యున్నాడు. రెండవ అల్లాహ్ అందరి ఆరాధ్య దైవముగా ఉండడమేకాక శరీరములో జీవుని చుట్టూ ఆవహించి జీవుని కర్మప్రకారము కష్టసుఖములను అనుభవించునట్లు చేయుచున్నాడు. జీవుడు కష్ట సుఖములను అనుభవించుటకు అవసరమైన కార్యములను దేహము చేత చేయిస్తున్నాడు. ప్రతి క్షణము శరీరములో కార్యకర్తగా రెండవ ఆత్మయుండి కార్యములను చేయుచుండగా, మూడవ వాడయిన పెద్ద అల్లాహ్ లేక పరమాత్మ చూస్తూ సాక్షిగా యున్నాడు. మనిషియొక్క కర్మనుబట్టి రెండవ ఆత్మయినవాడు మరణములో తీర్పు తీర్చియుండును. కర్మనుబట్టి తీర్పులో శిక్షలు ఖరారు చేసియుండును. తాను (రెండవ ఆత్మ) విధించిన శిక్షను అమలు చేయువాడు కూడా రెండవ ఆత్మనే. మనిషి తన పద్ధతిని జ్ఞానము చేత స్వయముగా మార్చుకొను అవకాశము గలదు. దేవుని జ్ఞానమును తెలియుట చేత జ్ఞానమునకు కర్మను లేకుండా చేయు శక్తి యుండుట చేత, మనిషి తన విధానమును ప్రపంచము నుండి పరమాత్మ వైపు (అల్లాహ్ వైపు) మార్చుకోవచ్చును. అలా ఎవరంతకు వారు స్వయముగా జ్ఞానమును తెలియుట చేత మార్పు పొందవలసిందేగానీ అల్లాహ్ ఎవరినీ మార్చడు. మూడవ ఆత్మయిన పెద్ద అల్లాహ్ యొక్క జ్ఞానము చేత మార్పు చెందవచ్చునుగానీ, ఆయన జ్ఞానము లేకుండా ఎవడూ మారలేడు. ప్రపంచ ద్యాసలనుండి దేవుని ద్యాసలోనికి మార్పు చెందువాడు రెండవ అల్లాహ్‍ను ఆరాధించవలసిందే, మూడవ అల్లాహ్ యొక్క జ్ఞానమును తెలియవలసిందే. మనిషి మారాలంటే మూడవ అల్లాహ్ అయిన పెద్ద అల్లాహ్ జ్ఞానము చేతనే సాధ్యమగును.
రెండవ ఆత్మయిన ఆరాధ్యదైవము తానే స్వయముగా తీర్పుతీర్చి విధించిన శిక్షలను తప్పక అమలు చేసి జీవుడు అనుభవించునట్లు చేయును. ఆ విధముగా రెండవ అల్లాహ్ శిక్షను అమలు చేయాలనుకొన్నప్పుడు దానిని తొలగించే ప్రసక్తే యుండదు. ఆయన విధించిన శిక్షను ఆయనే తప్పక అమలు చేయవలసియున్నది. అందరికీ ఆరాధ్యదైవముగా యున్న అల్లాహ్ తనను ఆరాధించినా, తాను మాత్రము విధిని అనుసరించి జీవునికి కర్మను అమలు చేసి అనుభవించునట్లు చేయును. తన నిర్ణయమును తాను కూడా మార్చుకోలేడు. తనకంటే పైన పెద్ద అల్లాహ్ అయిన మూడవ అల్లాహ్ కలడు. అందువలన పెద్ద దేవుడు మొదట సృష్ఠ్యాదిలో నిర్ణయించిన నిర్ణయము ప్రకారము రెండవ అల్లాహ్ కూడా పనిని చేయవలసిందే. రెండవ అల్లాహ్ అమలు చేయు శిక్షను మూడవ అల్లాహ్ అయిన పెద్ద అల్లాహ్ తన జ్ఞానమును తెలిసినవాడిని మాత్రమే శిక్షనుండి రక్షించగలడు. మొదటి ఆత్మయిన జీవుడు కర్మను సంపాదించుకోగా, ఆ కర్మను అనుసరించి రెండవ ఆత్మ శిక్షను ఖరారు చేసి తీర్పు తీర్చగా, దీనినుండి రక్షించగలవాడు ఒకే ఒక దేవుడు గలడు. ఆయనే మూడవ ఆత్మయిన పరమాత్మయని చెప్పవచ్చును.
ఈ విషయము మూడు దైవ గ్రంథములలో వేరువేరు విధములుగా, మనుషులకు అర్థమగునట్లుగా చెప్పియున్నారు. అయితే మనుషులు ఈ విషయమును సరిగా అర్థము చేసుకోలేకపోయారు. ముస్లీమ్‍లుగా చెప్పుకొను ఇస్లామ్ మతమువారు శరీరములో జీవునికి కాపలాగా యున్న రెండు ఆత్మలను ఇద్దరు దేవదూతలుగా పోల్చుకొన్నారు. దేవదూతలు అనగా దేవుని క్రింద పని చేయువారు అని అర్థము. అయితే శరీరములో కాపలాగా యున్నవారు ఒకరి క్రింద పని చేయువారు కాదు. వారు ఇద్దరూ స్వయముగా అల్లాహ్‍లుగా యున్నారు. అందులో ఒకరు పెద్ద అల్లాహ్కాగా, రెండవవాడు అందరికీ ఆరాధ్య దైవముగా యున్న రెండవ అల్లాహ్గా యున్నాడు. మొదటి పెద్ద అల్లాహ్ భూమిమీద అంతటా వ్యాపించి యుండి, ఎవరి అక్కరా లేనివాడుగా, ఏ పనినీ చేయనివాడుగా యున్నాడు. మూడవ అల్లాహ్ అయినవాడు తాను ఏమయినా చేయదలచుకొన్నప్పుడు ఆ పని వెంటనే అయిపోవును. ఎందుకనగా! మూడవ అల్లాహ్ ఆధీనములో పని చేయు దేవదూతలు కోట్లాదిమంది వెంటనే దేవుడు అనుకొన్న పనిని చేయుచున్నారు. ఈ విధముగా మూడవ అల్లాహ్ క్రింద ఎంతోమంది పనిచేయు దేవదూతలు కలరు.
రెండవ ఆత్మయిన ఆరాధ్య దైవమయిన అల్లాహ్ క్రింద దేవదూతలు ఎవరూ ఉండరు. రెండవ అల్లాహ్ శరీరమువరకు లోపల మాత్రము ఉండేవాడు. ఆయన స్వయముగా కార్యములను చేయు కార్యకర్తగా యున్నాడని అంతిమ దైవగ్రంథములో (6-102) మరియు (2-255) లో చెప్పియున్నారు. రెండవ అల్లాహ్‍యే మీకు ఆరాధ్యదైవము అని మూడవ అల్లాహ్ అయిన పెద్ద దేవుడు అదే అంతిమ దైవగ్రంథములో (3-18) లోనూ మరియు (16-51) లోను చెప్పియున్నారు. రెండవ ఆత్మయిన దేవునికి దూతలు లేరు. మూడవ ఆత్మయిన దేవునికి దేవదూతలు ప్రపంచ వ్యాప్తముగా కోట్లాదిమంది కలరు. దేవదూతలు శరీరము బయట పెద్ద దేవుని ఆధీనములో పని చేయుచున్నారు. శరీరము లోపల ఎవరూ ఎంతమాత్రము పని చేయలేదు. శరీరము లోపల రెండవ ఆత్మయిన ఏకైక ఆరాధ్య దైవము మరియు మూడవ ఆత్మయిన దేవుడు, అందరికీ అధిపతిగా యున్న దేవుడు ఉన్నాడు. అంతేగానీ మిగతా ఎవరూ లేరు. అయితే కొందరు శరీరము లోపలి జ్ఞానము తెలియనివారు తర్వాత రెండవ, మూడవ ఆత్మల విషయము తెలియనివారు, శరీరములో యున్న ఇద్దరు దేవుళ్లను ఇద్దరు దూతలుగా చెప్పారు. అట్లు చెప్పుట పూర్తి అజ్ఞానమగును. దూతలు శరీరము బయటే ఉంటారుగానీ, శరీరము లోపల యుండరని తెలియవలెను.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
71 ఉరుము ఆయన పవిత్రతను కొనియాడుతోంది. ఆయనే పిడుగులను పంపి తాను కోరినవారి మీద వేస్తున్నాడు. (13-13)
ఈ వాక్యము పూర్తి మూడవ పురుషుడయిన పరమాత్మను గురించి చెప్పినది. మూడవ ఆత్మ రెండవ ఆత్మను సృష్ఠించినవాడుగా యున్నాడు. ఆయన మనుషులందరూ ఆరాధించు రెండవ ఆత్మకంటే పెద్దవాడు, మొదటి సృష్ఠికర్తయిన దేవుడు. ఈయన శరీరము లోపల, శరీరము బయట అణువణువునా వ్యాపించి యున్నవాడు. ఈ మూడవ ఆత్మయిన దేవునికి (అల్లాహ్‍కు) ఆయన అనుకొన్నదానిని నెరవేర్చు దేవదూతలు కోట్లాది మంది విశ్వమంతా కలరు. వారిలో ఆకాశములో యున్నవారు కొందరు, భూమిమీద ఉన్నవారు కొందరు గలరు. ఆయనను ఆకాశములోని దేవ దూతలు ఎలా కొనియాడుచున్నారో క్రింది వాక్యములో కలదు చూడండి. మొదట ''అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్'' అను గ్రంథము నుండి తీసి చూపించుచున్నాము. దానినే మరియొక గ్రంథమయిన ''దివ్య ఖుర్ఆన్ సందేశము'' అను గ్రంథములో అదే వాక్యములో ఉన్నదానిని కూడా చూపించుచున్నాము. రెండు గ్రంథములలో ఒకే వాక్యములో కొంత భాష తేడా యున్నా విషయము మాత్రము ఒక్కటే కలదని తెలియుచున్నది.
'అంతిమ దైవ గంథము ఖుర్ఆన్'లో సూరా 13, ఆయత్ 13 లో ఇలా కలదు చూడండి.
(13-13) ''ఉరుము సహితము ఆయన పవిత్రతను కొనియాడుతోంది. ఆయన్ను ప్రశంసిస్తోంది. దూతలు కూడా ఆయన భీతి వలన ఆయన్ని స్తుతిస్తున్నారు. ఆయనే పిడుగులను పంపి తాను కోరినవారిపై పడ వేస్తున్నాడు. అవిశ్వాసులు అల్లాహ్ విషయములో పిడివాదానికి దిగుచున్నారు. ఆయన మహాశక్తివంతుడు.''
'దివ్య ఖుర్ఆన్ సందేశము' గంథములో ఇలా కలదు చూడండి.
(13-13) ''ఉరుము ఆయన పవిత్రతను కొనియాడుతోంది. ఆయన స్తోత్రం చేస్తోంది. దైవదూతలు కూడా ఆయన భయముతో ఆయనను స్తోత్రం చేస్తున్నారు. ఆయన పెళపెళమనే ఉరుములను పంపి, వాటి ద్వారా తాను కోరినవారిని శిక్షిస్తాడు. అయినా సత్య తిరస్కారులు అల్లాహ్‍ను గురించి వాదులాడుచున్నారు. అల్లాహ్ అద్భుత యుక్తివంతుడు.''
రెండు గ్రంథములలోని ఒకే వాక్యము ఒకే భావమును కల్గియున్న దని తెలియుచున్నది. వాస్తవముగా మొదటి సృష్ఠికర్తయిన అల్లాహ్ ప్రపంచ వ్యాప్తముగా అణువణువునా వ్యాపించి యున్నాడు. ఈయనను గురించి ఖుర్ఆన్ గ్రంథములో 112వ సూరాయందు గల నాలుగు ఆయత్‍లలో పూర్తిగా చెప్పియున్నారు. అంతేకాక గ్రంథములో అక్కడక్కడా ఎన్నోచోట్ల చెప్పియున్నారు. అయినా ప్రజలు మూడవ ఆత్మయిన పెద్ద దేవున్ని గురించి సరిగా అర్థము చేసుకోలేక మూడవ ఆత్మను గురించి చెప్పినప్పుడు రెండవ ఆత్మగా అర్థము చేసుకొంటున్నారు. వారి లెక్కలో ఉన్నది ఒకే అల్లాహ్యని అంటున్నారు. ఆరాధ్య దైవము ఒక్కడేయను విషయము మేము కూడా చెప్పుచున్నాము. అయితే ఆరాధనలు కూడా అక్కర లేనివాడు, అన్నిటికీ అతీతముగా యున్న దేవుడు మరొకడున్నాడని చెప్పుచున్నాము. ప్రజల దృష్ఠి ఒక్క దేవుని మీద తప్ప ఇతర దేవుడు లేడని ఉండుట వలన వారికి ఇద్దరు దేవుళ్లున్నారని అందులో ఒకరు ఆరాధనకు అవసరమైనవాడనీ, మరొకడు ఆరాధనకు కూడా అతీతుడని తెలియని దానివలన ఒకే దేవుడను గ్రుడ్డి నమ్మకముతో వాస్తవముగా యున్న దేవుళ్ల విషయమును గ్రహించ లేకపోవుచున్నారు. నేడు ముస్లీమ్‍లందరు ఆరాధించు దేవుడు రెండవవాడని, ఆయననే అనగా రెండవ వానినే ఆరాధించమని చెప్పినవాడు పెద్దవాడయిన మూడవ ఆత్మగాయున్న పెద్ద అల్లాహ్యని తెలియలేకపోయారు. అంతేకాక పెద్ద దేవునికే ప్రపంచములో దేవదూతలు సేవకులుగా గలరని రెండవ అల్లాహ్‍కు దూతలు లేరని తెలియకున్నారు. మీకు బాగా అర్థము కావాలంటే (16-51) ఆయత్ చూడండి. అక్కడ పెద్ద అల్లాహ్ రెండవ అల్లాహ్‍ను ఆరాధించమనీ, తనను కూడా ఆరాధించకూడదని ఆయనను ఆరాధించండి, నాకు భయపడండి అని చెప్పిన మాటను గుర్తు చేసుకోండి. ఈ విధముగా ఉన్న సత్యమును తెలియగలిగినప్పుడు ఇప్పుడు చెప్పిన (13-13) వ వాక్యము మూడవ అల్లాహ్‍ను గురించి చెప్పినదని తెలియగలరు. అందరికీ పెద్ద దేవుడయిన పరమాత్మయనబడు మొట్టమొదటి సృష్ఠికర్తయిన దేవున్ని గురించి ఏమి చెప్పుచున్నదో 13వ సూరా, 13వ ఆయత్నందు కలదు చూడండి.
ఆరాధ్య దైవముకంటే పెద్దవాడయిన, ఎవరికీ సంతతికాని వాడయిన, ఏకైక అధిపతిగా యున్న దేవుడయిన మొట్టమొదటి సృష్ఠికర్తయిన అల్లాహ్‍కు విశ్వములో విశ్వవ్యాప్తముగా కోట్లాదిమంది దూతలు కలరు. ఆ దూతలలో ఆకాశమందు మేఘరూపములో యున్నవారు కూడా కలరు. మేఘములుగా యున్న దూతలు దేవుని జ్ఞానమును తెలియజేయు నిమిత్తము తమకు తెలిసిన భాష అయిన ఉరుములను శబ్దరూపములో దైవ జ్ఞానమును చెప్పడమేకాక దేవున్ని పొగడుచున్నారు. అట్లే ప్రార్థన కూడా చేయుచున్నారని వాక్యములో చెప్పారు. మిగతా దేవదూతలు కూడా పరమాత్మయిన మూడవ అల్లాహ్‍కు భయపడుచూ ఆయనను స్తుతిస్తున్నారు. 16-51 లో ''ఆయనను ఆరాధించండి, నాకు భయపడండి'' అన్నట్లు మిగతా దేవదూతలు అందరూ మూడవ ఆత్మయిన అల్లాహ్‍కు భయపడి ఆయనను ప్రార్థించుచున్నారు. బయట ప్రపంచములో ఆకాశము వరకు వ్యాపించియున్న దూతలు కొందరు మేఘరూపములో ఉండి దేవుని సంకల్పమును అనుసరించి పిడుగులను తెచ్చి దేవుడు కోరిన వారిమీద పడవేయుచున్నారు. ఇదంతా తెలియని అజ్ఞానులు మరియు దేవుని జ్ఞానమును తిరస్కరించి మాట్లాడు సత్య తిరస్కారులు దేవుని విషయములో తమకు తెలిసినదే సత్యమని వాదించు చున్నారు. దేవుళ్లు ఇద్దరు లేరు ఒక్కడేయని అంటున్నారు. అయితే శరీరము లోపల దేవుడు ఆత్మని, శరీరము బయట దేవుడు పరమాత్మని వారికి తెలియదు. వారికి తెలిసినా తెలియకపోయినా విశ్వవ్యాప్తమైన బయటి దేవుడు శరీరము లోపలి దేవునికంటే పెద్దవాడని తెలియకయున్నారు. వారికి బయట వాని విషయము తెలిసినా తెలియకపోయినా ఆయన గొప్ప శక్తివంతుడు. ఆయన శక్తి వలననే అందరి కర్మలు కాలిపోవుచున్నవి. ఆయన దూతల వలననే భూమిమీద ఏమయినా జరుగుచున్నది. ఆకాశములో ఉరుములు, పిడుగులు కూడా ఆయన శక్తివలననే వస్తున్నవి.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
72. అల్లాహ్ తాను కోరినదానిని చెరిపివేస్తాడు. తాను కోరినదానిని అలాగే ఉండనిస్తాడు. మూల గ్రంథము ఆయనవద్దే కలదు. (13-39)
అల్లాహ్ 'తాను కోరినదాన్ని' అని రెండుమార్లు చెప్పడము విశేషముగా యున్నది. మనుషులు ఈ వాక్యములో చాలావరకు పొరపాటు పడిపోయారు. ముస్లీమ్ పెద్దలయిన వారు కూడా ఈ వాక్యములో పూర్తి క్రిందపడిపోయారు. చెప్పినది సులభమే అయితే వినపడినది కఠినముగా యున్నది. అంతటి గొప్పగా యున్న ఈ వాక్యమును క్రింద చూస్తాము.
(13-39) ''అల్లాహ్ తాను కోరినదానిని చెరిపి వేస్తాడు. అల్లాహ్ తాను కోరినదానిని అలాగే ఉండనిస్తాడు. మూల గ్రంథము (లౌహె మహ్ ఫూజ్) ఆయనవద్దే కలదు.''
ఇక్కడ వ్రాసిన వాక్యము ''అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్'' లోనిది. ఇప్పుడు అదే వాక్యమునే ''దివ్య ఖుర్ఆన్ సందేశము'' అను తెలుగు అనువాద గ్రంథములోనిది వ్రాసి చూపుతున్నాము. చూడండి.
(13-39) ''అల్లాహ్ తాను కోరినదానిని రద్దు చేస్తాడు. అట్లే తాను కోరినదానిని స్థిరపరుస్తాడు. మాతృగ్రంథము (ఉమ్ముల్ కితాబ్) ఆయన దగ్గరే ఉన్నది.''
ఈ వాక్యములో ఒక పురాతన గ్రంథము పేరు చెప్పబడినది. ఆ గ్రంథమును ''అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్'' అను గ్రంథములో తెలుగు అనువాదకుడు ''ముహమ్మద్ అజీజుర్రహ్మాన్'' గారు చెప్పినది మూల గ్రంథము పేరు 'లౌహె మహ్ ఫూజ్' అని చెప్పారు. మరియొక తెలుగు అనువాద గ్రంథమయిన 'దివ్య ఖుర్ఆన్ సందేశము' యొక్క అనువాదకుడు ''డాక్టర్ అబ్దుల్ రహీమ్ మౌలానా'' గారు చెప్పిన మాతృగ్రంథము పేరు 'ఉమ్ముల్ కితాబ్' అని చెప్పాడు. మూలగ్రంథము అనినా, మాతృగ్రంథము అనినా రెండూ ఒకటే అర్థముతో యున్నవి. ఇద్దరు అనువాద గ్రంథకర్తలు తలా ఒక పేరును చెప్పినా, ఆ రెండు పేర్లు ఒకే గ్రంథము పేర్లే అయినందున, ఇద్దరు చెప్పినది ఒక్కటేయని తెలియుచున్నది. లౌహే మహ్ ఫూజ్ అనినా, ఉమ్ముల్ కితాబ్ అనినా రెండూ మొట్టమొదటి చేతి వ్రాతతో వ్రాయబడిన ఖుర్ఆన్ గ్రంథము పేర్లు. మొదట ఖుర్ఆన్ వ్రాతరూపములో వ్రాయబడినది. అలా వ్రాసిన దానిని అలాగే ఉంచి భద్రపరచారు. దానిని ఖుర్ఆన్ యొక్క మూల గ్రంథమనియూ, లేక ఖుర్ఆన్ యొక్క మాతృ గ్రంథమనియు చెప్పుచుందురు.
అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏమనగా! జిబ్రయేల్ ఈ వాక్యము చెప్పిన రోజు ఈ పేర్లుగల గ్రంథమే లేదు. అందువలన వాక్యములో చెప్పిన గ్రంథము ఖుర్ఆన్ గ్రంథము కాదనీ, వాక్యము చెప్పిన రోజు ఖుర్ఆన్ గ్రంథము వ్రాయబడలేదనీ చెప్పుచున్నాము. జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తకు చెప్పిన వాక్యమును బాగా గమనిస్తే ''అల్లాహ్ తాను కోరినదానిని లేకుండా చేస్తాడు. అట్లే తాను కోరినదానిని అలాగే ఉండనిస్తాడు'' అని ఉంది. ఈ వాక్యములో రెండుచోట్ల 'తాను కోరినదానిని' అని చెప్పబడినది. అందువలన ఇక్కడ కొంత ఆలోచన చేయవలసియున్నది. గతములో దాదాపు 35 సంవత్సరముల క్రిందట మా ఇంటి ప్రహరీ గోడమీద కొన్ని జ్ఞాన వాక్యములను వ్రాయించాను. అప్పుడు ఒక వాక్యమును వ్రాసి యుంచగా దానిని చూచినవారంతా తప్పుపట్టేవారు. ఆ వాక్యము ఇలా ఉన్నది.
''నేను అనుకొంటే నీవు అంతటా ఉంటావు.
నేను అనుకొంటే నీవు ఒక్కచోటే ఉంటావు.''
ఈ వాక్యములో 'నేను అనుకొంటే నీవు' అను పదములు రెండుచోట్ల వాడాము. ఒకచోట వాడినప్పుడు 'నీవు అంతటా ఉంటావు' అని ఒక విధానమును చెప్పి, రెండవమారు 'నీవు ఒకచోటే ఉంటావు' అని రెండవ విధానమును చెప్పాము. ఒకే వాక్యములో రెండు వ్యతిరేఖ పదములు (విధానములు) వాడినదానివలన చూచినవారు వాక్యమును అర్థము చేసుకోలేక తప్పు వ్రాశారు. మొదట 'నేను అనుకొంటే' అని వ్రాసి రెండవమారు కూడా అదే వ్రాశారు. కానీ అక్కడ రెండవచోట ఒక అక్షరమును మరచిపోయారు రెండవచోట నేను అనుకోకుంటే అని వ్రాయవలసింది. రెండవమారు 'కు' అను అక్షరమును లేకుండా చేశారు. దానిని సవరించి నేను అనుకోకుంటే యని వ్రాయండి అని చెప్పేవారు. అయితే మొదట నేను వ్రాసినది తప్పుకాదని నాకు తెలుసు. దేవుడు అనుకొంటే మనిషిని మోక్షములో చేర్చి అంతటా వ్యాపింపజేస్తాడని, అట్లే దేవుడు అనుకొంటే మనిషికి మోక్షము రాకుండా చేసి మనిషిగానే ఒక్కచోటే ఉండునట్లు చేస్తాడను భావముతో వ్రాసిన వాక్యమది. నేను చెప్పిన భావము సరియైనదే. అయితే భావమును వదలి భాషను చూచువారికి అది తప్పుగానే కనిపించుట సహజము. అందువలన ఎవరు తప్పని చెప్పినా, ఎంతమంది తప్పని చెప్పినా ఆ వాక్యమును నేను అలాగే ఉంచాను. ''ప్రబోధ తరంగాలు'' అను పేరు గల మా రచనా గ్రంథములో నేటికినీ ఆ వాక్యము అలాగే కలదు.
నేను 35 సంవత్సరముల క్రిందట చెప్పిన వాక్యములాగే 1400 సంవత్సరముల పూర్వము జిబ్రయేల్ ఖుర్ఆన్ వాక్యము చెప్పాడని నాకు తెలియదు. అయితే నేను వ్రాసిన భావమునకు సరిపోయిన వాక్యము ఖుర్ఆన్‍లో ముందే ఉండడము కొంత సంతోషమును కలుగజేసినా, నేడు ఖుర్ఆన్ వాక్యమును అనువాదకులు సహితము తప్పుగా అర్థము చేసుకోవడము నాకు కొంత బాధగానే ఉంది. దానికి నేను ఏమి చెప్పుచున్నా ననగా! దేవుడు రద్దు చేస్తాడు, లేక అలాగే ఉంచుతాడు అని ఒకదానికొకటి వ్యతిరేఖ కార్యములను చెప్పాడు. ఉదాహరణకు వంటమనిషి చేసినది కాఫీయని ఒకచోట చెప్పి, వంటమనిషి చేసినది ఏదీ లేదు అని చెప్పితే చేసే పని ఒకటే అయినప్పుడు రెండు వ్యతిరేఖమైన మాటలు ఎలా వచ్చాయి? అనునది ప్రశ్నగా మిగిలిపోతుంది. వంటమనిషి చేసే పని ఒక్కటే, అట్లే వంటమనిషి ఒక్కడే, ఇందులో అనుమానము లేదు. వంట మనిషి ఒక్కడే, చేసే పని ఒక్కటే, చేసే జాగా వంటగది. ఈ మూడు ఒక్కటే అయినప్పుడు పనిలో తేడా ఎలా వచ్చినది? అను ప్రశ్నకు జవాబును వెదకవలసి వచ్చినది. అయితే మధ్య కొందరు వచ్చి ఇలా అన్నారనుకోండి. వంట మనిషి చేసినది కాఫీయని చెప్పినప్పుడు ఆయన వంటగదిలో చేశాడనియే అందరూ అనుకొంటారు. అలాగే వంటమనిషి చేసినది ఏమీ లేదని చెప్పినప్పుడు కూడా అతను వంటగదిలోనే ఏమీ చేయలేదని అనుకోవలసి యున్నది. అయితే అట్లుకాకుండా వంటమనిషి చేసినది పూజగదిలో కాఫీయని చెప్పినా, వంటమనిషి చేసినది పూజగదిలో ఏదీ లేదని చెప్పినా, వంటమనిషికి వంట గదితో సంబంధము గానీ, పూజగదితో ఏమి సంబంధమని ప్రశ్నరాక తప్పదు. దానితో వంటగదిలో వంట చేయవచ్చు, చేయకపోవచ్చు. అంతేగానీ పూజగదియని చెప్పడము పూర్తి తప్పు. పూజగదిలో వంట చేయరు అని తేల్చి చెప్పవచ్చును.
అదే విధముగా (13-39) వాక్యములో 'దేవుడు రద్దు చేయునది, రద్దు చేయక అలాగే యుంచునది' మూల గ్రంథములో యను మాట వాస్తవమేగానీ, మూల గ్రంథము అనగానే ఖుర్ఆన్ యొక్క మాతృగ్రంథము పేరు ఉమ్ముల్ కితాబ్ యని చెప్పడము పెద్ద తప్పు. ఇక్కడ బాగా అర్థము చేసుకుంటే ''దేవుడు అనుకొంటే మనిషిని సన్మార్గములో (జ్ఞానమార్గములో) అయినా పంపగలడు. అలాగే దేవుడు అనుకొంటే మనిషిని చెడు మార్గములో (అజ్ఞాన మార్గములో) అయినా పంపగలడు.'' మనిషి భావమును బట్టి ఇదే ప్రపంచములో దేవుడు రెండు విధములా చేయగలడు. ఇంకా చెప్పితే దేవుడు క్షమాశీలుడు, దేవుడు మనిషి చేసుకొన్న పాపమును క్షమించి లేకుండా చేయగలడు. మనిషి జ్ఞానమార్గములోనికి వచ్చినప్పుడు అతనికున్న గత పాపముల చిట్టానుండి పాపములను లేకుండా చేయగలడు. మనిషి మారకుండా అలాగే అజ్ఞాన మార్గములో ఉంటే దేవుడు అతని పాపమును అతని పాపముల చిట్టానుండి తీసివేయక అలాగే ఉంచగలడు. అదే విషయమునే పై వాక్యములో చెప్పియున్నారు. దేవుడు తాను కోరిన దాన్ని (పాపమును) రద్దు చేస్తాడు. అలాగే తాను కోరిన దాన్ని (పాపమును) అలాగే ఉంచుతాడు. రద్దు చేసేది కానీ, రద్దు చేయనిది కానీ మనిషియొక్క కర్మ చిట్టాయను గ్రంథములో గలదు. మనిషి చేసుకొన్న ప్రతి పాపమును, ప్రతి పుణ్యమును శరీరములోని దేవుడు (రెండవ ఆత్మ) 'కర్మపత్రము' అను గ్రంథములో వ్రాసియుంచుతున్నాడు. తర్వాత దాని ప్రకారమే మనిషి బ్రతుకును దేవుడే క్షణక్షణము నడుపుచున్నాడు. కర్మలిఖితము ఒక గ్రంథమందు వ్రాసియుంచువాడు నీవు ఆరాధించు దేవుడు. ఆ కర్మ లిఖితమును కర్మగ్రంథము నుండే మూడవ ఆత్మయిన దేవుడు క్షమించి తీసివేయగలడు, లేక అలాగేనయినా ఉంచగలడు. ఈ వాక్యములో చెప్పవలసిన గ్రంథము కర్మపత్రమను గ్రంథమునేగానీ, ఖుర్ఆన్ మాతృ గ్రంథము కాదు. కర్మ నిలువయున్న కర్మ యొక్క మూలగ్రంథమని తెలియాలి. ఒకవేళ లేదు కాదు మీ మాట సరికాదు అని ఎవరయినా అనినా ఈ వాక్యము చెప్పినప్పుడు ''ఉమ్ముల్ కితాబ్'' అను ఖుర్ఆన్ గ్రంథమే తయారు కాలేదు కదా!యని అడుగవచ్చును. అందువలన వాక్యములో భాషను గమనించక భావమును గ్రహించమని కోరుచున్నాము. మొత్తానికి ఈ వాక్యములో ముస్లీమ్ పెద్దలు కూడా తప్పుదారి పట్టడము గమనార్హము.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
73. ఖుర్ఆన్ మానవుల కొరకు ఒక సందేశము. ఆరాధ్యదైవము ఒక్కడేయని గ్రహించటానికి. (14-52)
(14-52) ఈ ఖుర్ఆన్ సమస్త మానవుల కొరకు ఒక సందేశము. దీని ద్వారా వారిని హెచ్చరించటానికి, అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవము అని వారు గ్రహించటానికి, ఇంకా విజ్ఞులు (మేథావులు) గ్రహించుటకు''
ఈ వాక్యమును చూస్తే సులభముగాయున్నా, ఎంతో తెలివియున్నా కూడా ఇది అర్థము కాదని చెప్పుటకు సాక్ష్యముగా వాక్యము చివరిలో ''విజ్ఞులు గ్రహించటానికి'' అని చెప్పియున్నారు. దీనినిబట్టి కొంత లోతుగా ఆలోచించగా! నేడు ముస్లీమ్ అయిన వారందరూ దేవుడు ఒక్కడే ఆరాధ్య దైవము అని పూర్తి విశ్వాసము కల్గియున్నారు. హిందువులకు ఆ మాట చెప్పితే వారు ఎలాగూ నమ్మరు. అది ముస్లీమ్‍లకు చెప్పినమాట, ముస్లీమ్ గ్రంథము ఖుర్ఆన్‍లోని మాటయని అంటారు. అట్లే వారి మాటప్రకారమే ముస్లీమ్‍లకే చెప్పినమాట ప్రకారము తీసుకొనినా, ముస్లీమ్‍లు దేవుడు ఒక్కడేయనీ అతనే ఆరాధ్యదైవమని నమ్మియున్నారు కదా! అయితే వాక్యము చివరిలో మేథావులు తెలియుటకు అని ఉంది. అంతేకాక ఇది మానవులకు సందేశము మరియు మనుషులను హెచ్చరించటానికి అని చెప్పి అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవమని గ్రహించటానికి అన్నారు.
పూర్వము సృష్ఠ్యాదిలో దేవుడు ప్రపంచ నాటకమునకు జీవున్ని సృష్ఠించాడు. జీవున్ని నడుపుటకు జీవునికి దేవుడయిన వానిని, జీవునికి ఆరాధ్య దైవమయిన వానిని సృష్ఠించాడు. అప్పుడు జీవునికి దేవుడు ఒక్కడే యనీ, అతనే ఆరాధ్య దైవమని మొదటి సృష్ఠికర్తయిన దేవుడు జ్ఞానమును చెప్పాడు. జీవున్ని, అతనికి దేవున్ని సృష్ఠించినవాడు సృష్ఠ్యాదిలోని దేవుడు. అప్పుడు జీవుడు ఒక్కడే అయినా దేవుళ్లు ఇద్దరున్నట్లయినది. ఒకడు జీవునికి ఆరాధ్యదైవము కాగా, అతనిని సృష్ఠించిన మొదటి దేవుడు కూడా ఉండుట వలన మనుషులు ఎవరిని ఆరాధించవలెనను సంశయము ఏర్పడును. అందువలన 16-51లో ''ఇద్దరు అల్లాహ్‍లను ఆరాధ్య దైవముగా పెట్టుకోకండి. మీకు ఆరాధ్య దైవము ఒక్కడేయని'' మొదటి సృష్ఠికర్తయిన పెద్ద అల్లాహ్ చెప్పియున్నాడు. మేథావులు సహితము పొరపాటు పడు అవకాశముండుట వలన (14-52) లో సమస్త మానవులకు ఇది ఒక సందేశముగా వాక్యమును చెప్పాడు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
74. భయపడకు నీకు జ్ఞానసంపన్నుడగు కుమారుడు పుట్టునని చెప్పుచున్నాను. ఏమిటి వృద్ధాప్యము వచ్చిన తర్వాత మీరు శుభవార్తను చెప్పుచున్నారా! దీనిని మీరు ఎలా వినిపిస్తున్నారు? (15-53, 54)
భూమిమీద దేవుడంటే భక్తి కాకుండా, భయము కూడా కలవారున్నారు. కొందరిలో భయము, భక్తి రెండూ ఉండగా, కొందరిలో భక్తిమాత్రముండి భయము లేకున్నది. మరికొందరిలో భయము మాత్రముండి భక్తి లేనివారు కలరు. ఇంకా కొందరిలో భయములేదు, భక్తి లేదు. ఈ విధముగా యున్న నాలుగు రకముల వారికి చెప్పునదేమనగా! భక్తి, భయము రెండూ ఉండువారే మంచి మార్గములో యున్నవారని చెప్పవచ్చును. భయము, భక్తి యున్నవారిలో కూడా శ్రేష్ఠులు, శ్రేష్ఠులు కానివారు కలరని చెప్పవచ్చును. ఎలాయనగా! అల్లాహ్ యనువాడు ఒక్కడేయని ఆ ఒక్కని మీదనే భయము, భక్తి చూపువాడు పూర్తి శ్రేష్ఠుడు కాదని చెప్పవచ్చును. అల్లాహ్ ఒక్కడేయని, అతనే ఆరాధ్య దైవమని నమ్మినా ఆ దేవునికి భక్తి మాత్రము అవసరము, ఆయనపట్ల భయము ఉండకూడదు. అందువలన అతడు పూర్తి శ్రేష్ఠుడు కాదని చెప్పవచ్చును. అయితే శ్రేష్ఠుడు ఎవరనగా!
సృష్ఠి పూర్వము ఒక అల్లాహ్ ఉండేవాడనీ, ఆయన మొట్టమొదట భూమిని ఆకాశమును తయారు చేశాడనీ, తర్వాత ప్రాణకోటిని తయారు చేయుటకు ఆయన మరొక ఆత్మను సృష్ఠించాడనీ, ఆ ఆత్మే సర్వమానవులనూ సృష్ఠించాడనీ మనుషులను సృష్ఠించినవాడే అందరికీ ఆరాధ్య దైవముగా యున్నాడని, అందరికీ ఆరాధ్య దైవముగా యుండమని ఆత్మను నియమించిన వాడు మొదటి సృష్ఠికర్తయిన పరమాత్మయనీ చెప్పవచ్చును. మానవులను సృష్ఠించిన ఆత్మకు కూడా తండ్రిగా యున్న పరమాత్మ తనకు భయపడమనీ, తన ఆత్మను ఆరాధించమని (16-51) వ ఆయత్‍లో చెప్పియున్నాడు. ఆయన మాటప్రకారము సృష్ఠి పూర్వము ఉన్న పరమాత్మయను అల్లాహ్‍ను, సృష్ఠి తర్వాత మనుషులను తయారు చేసిన ఆత్మయను అల్లాహ్‍ను ఇద్దరినీ తెలిసి మానవులను సృష్ఠించిన ఆత్మ యెడల భక్తియు, ప్రపంచము అయిన ప్రకృతిని సృష్ఠించిన పరమాత్మ యెడల భయమును కల్గియున్నవాడు నిజమైన జ్ఞానియగును. సృష్ఠిరహస్యమును పూర్తిగా తెలియకుండా అందరివలె ప్రార్థన ఒకటే చేయుచుంటే అది కేవలము భక్తియగును. ప్రప్రథమముగా విశ్వమును సృష్ఠించిన దేవున్ని తెలియకపోతే వాడు సంపూర్ణ జ్ఞాని కాలేడు.
దేవుడంటే భయమున్న వానికి దేవునిమీద భక్తి ఆరాధన చేయు జ్ఞానము ఉండదు. ఎందుకనగా! అతనికి ఒకే దేవుడున్నాడని తెలియును గానీ, ఇద్దరు దేవుళ్లున్నారని తెలియదు. ముఖ్యముగా భయమున్న వానికి మూడవ ఆత్మయిన పరమాత్మ మనిషికి ఇద్దరు దేవుళ్ల జ్ఞానమును ఇవ్వాలి. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అను మూడు ఆత్మల జ్ఞానము తెలిసినప్పుడు మనిషికి భయము లేకుండాపోయి సంతోషము కల్గును. అటువంటివానికి పెద్ద దేవుడయిన మూడవ ఆత్మమీద కొంత భయము, రెండవ ఆత్మ మీద కొంత భక్తియుండును. దేవుడంటే భయము, భక్తి సమానముగా ఉండుట వలన ఏదీ పైకి కనిపించదు. అప్పుడు వానియందు జ్ఞానము వృద్ధి కాగలదు. అటువంటివాడు తాను మూడు ఆత్మల జ్ఞానము తెలియుటకు వయస్సు ముదిరి ముసలివాడు కావచ్చును. అటువంటి వానికి దేవుడు ఏమి చెప్పుచున్నాడనగా! అంతిమ దైవ గ్రంథములో సూరా 15, ఆయత్ 53, 54 యందు ఇట్లు చెప్పుచున్నాడు చూడండి.
(15-53, 54) ''భయపడకు. మేము నీకు జ్ఞాన సంపన్నుడైన కుమారుడు పుడుతాడన్న శుభవార్తను అందజేయుచున్నాము.'' అని వారన్నారు. ''ఏమిటి, వృద్ధాప్యము వచ్చిన తర్వాత మీరు నాకు ఈ శుభవార్త వినిపిస్తున్నారా? ఈ శుభవార్తను అసలు మీరు ఎలా వినిపిస్తున్నారు?'' అని అతడు అన్నాడు.
ఈ వాక్యములోని సారాంశము ఏమనగా! మనుషులకు రెండు రకముల సంతానము కలదు. ఒక రకమును బిందుపుత్రుడుయని అనవచ్చును. మరొక రక సంతానమును నాదపుత్రుడుయని అనవచ్చును. బిందు పుత్రుడనగా తండ్రి వీర్యబిందువుకు పుట్టువాడని చెప్పవచ్చును. అట్లే నాదపుత్రుడు యనగా! చెప్పే జ్ఞానము వలన శిష్యుడుగా తయారయిన వానిని గురువుకు కొడుకుతో సమానమగుట వలన అతనిని నాదపుత్రుడు యని అందురు. నాదపుత్రుడు వ్యక్తి వృద్ధాప్యమును పొందిన తర్వాత అయినా కూడా వచ్చుటకు అవకాశము గలదు. ఎంత వృద్ధాప్యము వచ్చినా కొన్ని వందలమంది నాదపుత్రులను పొందు అవకాశము గలదు. అందువలన ఈ వాక్యమును చెప్పి వాక్యములో జ్ఞాన సంపన్నుడైన కుమారుడు పుడతాడని చెప్పుట గమనార్హముగా యున్నది.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
75. రంగు రంగుల వస్తువులను ఆయన మీకోసము సృష్ఠించాడు. అందులో పెద్ద సూచన ఉంది. (16-13)
(16-13) ''ఇంకా రంగు రంగు వస్తువులను ఎన్నింటినో ఆయన (దేవుడు) మీ కోసము భూమిలో సృష్ఠించాడు. నిస్సందేహముగా గుణపాఠము గ్రహించే వారి కోసము ఇందులో చాలా పెద్ద సూచన ఉంది.''
భూమిమీద సృష్ఠించిన ఎన్నో వస్తువులను చూచి మనిషి దైవ జ్ఞానమును తెలియాలను ఉద్దేశ్యముతో చంద్రున్ని, అనేక రంగు వస్తువులనూ, అత్తపత్తి చెట్టును మొదలగు వాటిని తయారు చేసి పెట్టాడు. దేవుని ఉద్దేశ్యము గొప్పదయినా, మనిషి దేవుడు సృష్ఠించిన వాటిని చూచి వాటి సూచన ప్రకారము ఏమాత్రమూ జ్ఞానమును గ్రహించడము లేదు. ఉదాహరణకు చంద్రున్ని తీసుకొని చూస్తే చంద్రుడు జ్ఞానమునకు గుర్తుయని చెప్పుచుందురు. చంద్రున్ని ఇంద్రుడు అనుట కూడా కలదు. ఇందు అనగా చంద్రుడని, చంద్రుడనగా జ్ఞానమనీ, జ్ఞానము కల్గిన వానిని ఇందువు అని చెప్పుచుందురు. జ్యోతిష్య శాస్త్రములో కూడా జ్ఞానమునకు అధిపతిగా చంద్రున్ని చెప్పడమైనది. జ్ఞానముగల స్త్రీని ఇందుమతియని పేరుపెట్టి పిలువడము కూడా కలదు. మనిషిలో జ్ఞానము చిన్నగా మొదలయి మనిషి శ్రద్ధనుబట్టి పెద్దగా తయారవుతూపోవును. అందువలన చంద్రుడు అమావాస్య తర్వాత చిన్నగా మొదలయి పెరుగుచూపోవునని, పెరిగే జ్ఞానమునకు గుర్తుగా చంద్రున్ని దేవుడు చూపాడు. పూర్తి జ్ఞానము గల్గిన వానిని ఇందువు అని చంద్రుని పేరే పెట్టడమైనది. ఇందువు, ఇందుమతి అనగా జ్ఞానికి పెట్టిన పేర్లు అయినందున జ్ఞానమునకు చిహ్నముగా పెరిగే చంద్రున్ని శివుని నెత్తిన పెట్టి చూపడము కూడా జరిగినది. అట్లే చెట్లలో అత్తపత్తి చెట్టును చూపడమైనది. ఏ పనిని చేసినా 'నేను' అను అహము లేకుండా చేసిన దానిని పెద్దగా చెప్పుకోకుండా ఉండునట్లు అత్తపత్తి చెట్టును చూచి తెలుసుకోవచ్చును.
అత్తపత్తి చెట్టు చిన్న చెట్టు. దానిని ఇంగ్లీషు భాషలో Touch me not అని కూడా అనుచుందురు. ఆ చెట్టును కొద్దిగా తగిలితే అది వెంటనే ఆకులను ముడుచుకొనును. పెద్దగా కనిపించునది చిన్నగా కనిపించును. దానిని చూచిన మనిషి జ్ఞానమును గ్రహించవచ్చును. తాను చిన్న పనిని చేసి పెద్దగా చెప్పుకొనుచుండును. అత్తపత్తి చెట్టును చూచిన తర్వాత పెద్ద పనిని చేసినా చిన్నగా చెప్పుకోవలెననీ, తన్ను తాను తగ్గించుకోవలెనని తెలియగలదు. జ్ఞానమును తెలియాలను శ్రద్ధయున్నవానికి బయట ప్రపంచములో ఎన్నో సూచనలు కనిపించును. జ్ఞానము మీద ధ్యాస లేనివానికి బయట ఎన్ని సూచనలున్నా ఏమీ ప్రయోజనముండదు. వాడు వాటిని చూచి ఏమీ గ్రహించడు. శ్రద్ధయున్నవాడు గ్రహించుటకు దేవుడు చేసిన సూచనలలో ఆయన ఎన్నో రంగు రంగు వస్తువులను భూమిమీద సృష్ఠించాడు. జ్ఞానము మీద శ్రద్ధగలవాడు సూచనలు గ్రహించగలిగితే ఇందులో ఎంతో జ్ఞానసందేశము గలదు.
మన శరీరములో మనము అనగా జీవుడు తలయందు ఒకచోట నివాసము చేయుచున్నాడు. జీవుడు నివాసము చేయు జాగాను 'గుణచక్రము' అని అనుచున్నాము. ఇదంతా జ్ఞానము తెలిసినవారు తెలియగలిగినది. అంతేకాక భగవద్గీతలో (ప్రథమ దైవగ్రంథము) లో చెప్పిన విషయము అని తెలియవలెను. మనిషి తలలో జీవునిగా గుణచక్రమందు నివాసము చేయుచుండగా! అక్కడ గుణచక్రములో గల మూడు భాగములందు జీవుడు ఏదో ఒక భాగమున నివాసము చేయుచున్నాడు. గుణచక్రము మూడు భాగములందు గుణములు నిండుకొని యున్నవి. ఒక్కొక్క భాగమున పన్నెండు (12) గుణముల ప్రకారము మూడు భాగములలో (36) గుణములు గలవు. ఒక్క భాగమున ఆరు మంచి, ఆరు చెడు గుణములు మొత్తము పన్నెండు (12) గుణములు గలవు. దేవుడు బయట ప్రపంచములో అనేక రంగు వస్తువులను సృష్ఠించినట్లు, గుణచక్రములోని గుణములు కూడా అనేక వర్ణములుగా (రంగులుగా) తయారు చేశాడు. అందువలన ప్రథమ దైవ గ్రంథములో గుణ భాగములను గురించి చెప్పుచూ ఒక శ్లోకములో ''చాతుర్వర్ణము'' అను పదమును వాడాడు. 'వర్ణము' అనగా 'రంగు' అని తెలియగలిగితే బయట ఎన్నో రంగుల వస్తువులను తయారు చేసినట్లు శరీరములో దేవుడు 'ఎన్నో రంగులు' అను భావములు గల గుణములను తయారు చేశాడు. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క రంగు కలిగియున్నట్లు శరీరము లోని ఒక్కొక్క గుణము ఒక్కొక్క ప్రభావమును కల్గియున్నది. అందువలన గుణములను రంగులతో పోల్చి చెప్పారు. మనిషి తలలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అను ఆరు చెడు గుణములు, అట్లే దాన, దయ, ఔదార్య, వైరాగ్య, వినయ, ప్రేమ అను ఆరు మంచి గుణములు గలవు. ఈ ఆరు + ఆరు = పన్నెండు ఒక్కొక్కటి ఒక్కొక్క భావమును, ప్రభావమును చూపుచున్నవి. అందువలన గుణములను పన్నెండు రంగులతో పోల్చి చెప్పారు. బుద్ధి యున్నవాడు బయట దేవుడు సృష్ఠించిన రంగులను బట్టి శరీరములోని గుణములను గ్రహించగలడు. అందువలన వాక్యములో 'గుణపాఠము గ్రహించేవారికోసము' అని కూడా చెప్పియున్నారు. ఆ మాటనుబట్టి బయటి రంగులనుబట్టి లోపల గుణములను తెలియవచ్చు నని సూచనగా తెలిపారు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
76. దైవమార్గములో దౌర్జన్యానికి గురియై ఇల్లు వాకిలి వదలిపోయిన వారికి ప్రపంచములో ఉత్తమ నివాసము లభించగలదు. (16-41)
(16-41) ''దౌర్జన్యానికి గురియైన తర్వాత దైవమార్గములో ఇల్లు వాకిలి వదలి వలస పోయిన వారికి మేము ప్రపంచములోనూ ఉత్తమ నివాసాన్ని కల్పిస్తాము. ఇక పరలోకంలో లభించే పుణ్యఫలమైతే మరింత గొప్పది. ఈ విషయాన్ని జనులు తెలుసుకొంటే ఎంతో బాగుండును.''
ప్రపంచములో దైవమార్గము, మాయ మార్గము అని రెండు రకముల దారులు కలవు. మాయ మార్గము చాలా విశాలమైనది. అందులో ఎటువంటి ఆటంకము లేకుండా మార్గము సాగిపోవుచుండును. దైవ మార్గము చాలా ఇరుకైనదిగా యుండును. అందులో అనేక నష్టములు, అనేక కష్టములతో దారి సాగుచుండును. దైవమార్గములో ఇల్లు వాకిలి కూడా పోవచ్చును. అలాగే ఎంతో నష్టము కలుగవచ్చును. అయితే ఇవన్నీ దైవమార్గములో పోయే మనిషికి పరీక్షల్లాంటివి. ఈ పరీక్షలో నెగ్గినవానికి చాలా దైవికమైన లాభము కలుగబోవును. ఉదాహరణకు పొలములో ఎంతో ఖరీదైన విత్తనములను చల్లి నష్టపోవుచున్నాము. రైతుగా యున్నవారు అప్పులపాలై పంటను పెట్టుట చూస్తూనే యున్నాము కదా! అప్పటికీ రైతు నష్టము పొందినవానివలె గింజలను భూమిలో చల్లినా, విత్తనముల కొరకు అప్పులపాలైనా, తర్వాత కొంత కాలమునకు పంటపండి చల్లిన విత్తనములకంటే వందరెట్లు ఎక్కువగా గింజలు వచ్చును. కొంత కాలము శ్రమ అయినా పంట వచ్చిన తర్వాత రైతు సుఖమును పొందవచ్చును. అలాగే దైవమార్గములో నష్టపోయినవాడు చివరకు తన నివాసమైన ఇల్లు వాకిలిలాంటి శరీరమును పోగొట్టుకొన్నా అనగా దైవమార్గములో మరణించినా తర్వాత అతనికి దేవుని తీర్పులో విశేషమైన దైవిక లాభము కల్గును. తర్వాత జన్మలో మంచి ఆరోగ్యమైన శరీరమును దేవుడిచ్చును. ఇహములో కొంత తృప్తిగల జన్మవచ్చి ఆ జన్మలో జ్ఞాన సముపార్జన వలన పరము లభించును. అనగా మోక్షము లభించును. పరము అనునది ప్రపంచ లాభములకంటే, ప్రపంచ సుఖములకంటే ఎన్నోరెట్లు మేలయినది. మాయ మార్గముకంటే దేవుని మార్గము ఎంతో గొప్పదని తెలుసుకొంటే ఎంతో లాభము పొందగలడు. ఈ విషయము మనుషులు తెలియక మాయ మార్గములోనే పోవుచూ తాత్కాలిక సుఖముల కొరకు ప్రాకులాడుచున్నారు. అటువంటి వారు పై వాక్యమును చూచి అయినా బాగుపడగలరని దేవుడు ఈ వాక్యమును చెప్పాడు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
77. పైన ఆకాశము క్రింద భూమి ఉన్నాయి. అందులో నిదర్శనము కలదు. అలాగే పశువు కడుపులో పేడ, రక్తము మధ్యలో పాలున్నాయి. (16-65, 66)
(16-65,66) ''అల్లాహ్ ఆకాశము నుండి నీళ్లను కురిపించి దానిద్వారా ఎండిపోయిన భూమినుండి తిరిగి పంటను బ్రతికిస్తున్నాడు. వినేవారి కోసము నిశ్చయముగా ఇందులో నిదర్శనము కలదు.'' (66) ''మీ కోసము పశువులలో కూడా ఒక గుణపాఠమున్నది. వాటి కడుపులోయున్న పేడకు, రక్తానికి మధ్యలో మంచి స్వచ్ఛమైన పాలను మీకు త్రాగిస్తున్నాడు. త్రాగే వారికి అది కమ్మగా ఉంటుంది.''
మనము పైన ఆకాశమును క్రింద భూమిని చూస్తున్నాము. పైన ఆకాశము ద్వారా వర్షము కురుస్తున్నది. వర్షము కురిసిన తర్వాత కొన్ని రోజులకు భూమిలో పంటపండి మనిషి చివరకు ధనవంతుడగుచున్నాడు. ఆకాశములో ధనములేదు, భూమిలో ధనములేదు. అయినా భూమి ఆకాశముల ద్వారా మనిషి ధన లాభమును పొందుచున్నాడు. అట్లే శరీరములో పైన ఆత్మ, ఆత్మ క్రింద శరీరము ఉన్నట్లు ఆవు కడుపులో ఒక ప్రక్క పేడ, మరొకప్రక్క రక్తము యున్నా ఆవు పాలను ఇస్తావున్నది. పాలను త్రాగి అందులోని కమ్మని రుచిని మనిషి పొందుచున్నాడు. ఆవు కడుపులో పనికిరాని పేడ, పనికిరాని రక్తమున్నట్లు మనిషిలో పైన కనిపించని ఆత్మ, క్రింద కనిపించని మాయ యున్నది. మాయ ఆవు కడుపులో పేడవలె యున్నా, ఆత్మ ఆవు జీవించుటకు ఆధారమైన రక్తమువలె యున్నా పేడ, రక్తము మధ్యలో పాలువచ్చినట్లు, మాయ, ఆత్మ మధ్యలో మనిషి శ్రద్ధనుబట్టి ముక్తి (పరలోకము) లభించుచున్నది. భూమి ఆకాశముల మధ్య లభించు దాన్యము వలన ధనము దొరికినట్లు, ఆవు కడుపులో పేడ రక్తము మధ్య లభించు పాలవలన కమ్మని రుచి లభించినట్లు, శరీరములో ఆత్మ, మాయ మధ్యలో లభించు జ్ఞానము వలన మోక్షము లేక ముక్తి లభించుచున్నది.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
78. పనికి రానివాడు, పనికి వచ్చువాడు ఇద్దరూ సమానమేనా? (16-75, 76)
అల్లాహ్ ఒక ఉపమానమును చెప్పి దానిని గమనించితే కొంత జ్ఞానము కల్గునని అదే పనిగా ఒక ఉదాహరణను ఇచ్చుచున్నాడు. అల్లాహ్ ఇచ్చిన ఉదాహరణలో ఏమి తెలియునో ప్రయత్నించి చూద్దాము. అయితే అల్లాహ్ చాలామందికి తెలియదనియే చెప్పుచున్నాడు. (16-75) ''అల్లాహ్ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఇతరుల యాజమాన్యములో యున్న ఒక బానిస ఉన్నాడు. అతనికి ఏ అధికారమూ లేదు. కాగా మరోవ్యక్తి యున్నాడు అతనికి మేము మా వద్దనుండి మంచి ఉపాధిని సమకూర్చాము. అందులో నుండి అతను రహస్యము గానూ, బహిర్గతముగానూ ఖర్చుపెడతాడు. మరి వీరిద్దరూ సమానులేనా? సర్వ స్తోత్రములు అల్లాహ్ కొరకే. అయితే వీరిలో చాలామందికి తెలియదు. (16-76) అల్లాహ్ మరో ఇద్దరి వ్యక్తుల ఉదాహరణను కూడా ఇస్తున్నాడు. వారిలో ఒకడు మూగవాడు, ఏదీ చేయలేడు. పైగా అతను తన యజమానికి భారముగా తయారయ్యాడు. అతన్ని ఎక్కడికి పంపినా మేలును తీసుకరాడు. మరొకతను న్యాయం గురించి ఆదేశిస్తున్నాడు. అతను సన్మార్గమున ఉంటున్నాడు. వీరిద్దరూ ఒకటేనా?''
వీరి సంగతి తెలియాలంటే ముందు మనకు తెలిసిన విధానములో ఒక విషయమును చెప్పుకొందాము. మాయ ఆధీనములో గల ఒక మనిషి యున్నాడు. అతనికి స్వతంత్రత లేదు. ఏమి చేయాలన్నా తన యజమాని అనుమతి లేనిది చేయకూడదు. అతని బ్రతుకు బానిస బ్రతుకులాంటిది. ఏదయినా కావాలని అడిగే స్వతంత్రత కూడా అతనికి లేదు. శరీరములోని జీవుడు బానిస బ్రతకు బ్రతుకుచున్నాడు. అయితే అదే శరీరములోనే పూర్తి స్వతంత్రత కలిగి తన ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేయుచూ బ్రతుకువాడు మరొకడున్నాడు. బానిస బ్రతుకు బ్రతుకువాడు జీవాత్మకాగా, రహస్యముగా, బహిర్గముతగా ఖర్చు చేయుచూ బ్రతుకుటకు కావలసిన ఉపాధి ఆయన పొంది యున్నాడు. తన యజమాని అయిన పరమాత్మ తనకు ఉపాధిని కల్పించగా, తనకున్న దానిలో తన ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేయు ఆత్మ మరొకడు కలడు. జీవాత్మ యజమాని మాయకాగా, ఆత్మ యజమాని పరమాత్మ అయి ఉన్నది. వీరు ఇద్దరూ ఒకేచోట యున్నా అనగా ఒకే శరీరములో యున్నా ఒకడు బానిస, మరొకడు స్వతంత్రుడు. వీరు ఇదే రీతిలో ఉంటే ఎప్పటికీ సమానులు కాలేరు.
ఇంకొక ఉపమానములో ఒకడు మూగవాడు అతను ఏదీ చేయలేడు. పైగా అతని యజమానికి అతని వలన భారము (ఇబ్బంది) ఏర్పడుచున్నది. దీనిని గమనించితే ఒక జీవుడు కర్మను అనుభవించుచూ తాను బాధపడడమేకాక తన యజమాని అయిన ఆత్మను కూడా ఇబ్బంది పెట్టుచున్నాడు. అటువంటి జీవుని వలన ఆత్మ తన పనిని తాను చేయలేదు. ఇంకొక శరీరములో జీవుడు అన్ని విధములా బాగుండి దైవజ్ఞానము తెలిసి పూర్తి సన్మార్గములో యున్నాడు. ఈ విధముగా యున్న ఇద్దరు జీవుళ్లు ఎప్పటికీ సమానము కారని చెప్పవచ్చును. ఇక్కడ అల్లాహ్ రెండు ఉపమానములను చెప్పాడు. అందులో మొదటిది ఒకే శరీరములో యున్న జీవాత్మ, ఆత్మను గురించి చెప్పినది. దానికి జవాబు సమానులు కారని చెప్పాము. రెండవ ఉపమానము రెండు శరీరములలో యున్న ఇద్దరు జీవాత్మలను గురించి చెప్పిన విధానము కలదు. ఒకరు కర్మను అంగలోపముతో అనుభవించు జీవాత్మకాగా మరొకరు కర్మ అనుభవము లేని జ్ఞానిగా యున్నాడు. ఈ ఇద్దరు జీవుళ్లు కూడా సమానులు కారని చెప్పుచున్నాము. దేవుడు ఉపమానరీతిలో చెప్పినది జీవాత్మ, ఆత్మ విషయము. ఇంకా జీవాత్మ మరియు జీవాత్మ విషయమును గురించి చాలామంది వివరించి తెలుసుకోలేకపోతున్నారు. అందువలన ఈ రెండు ఉపమానముల జవాబు సమానము కాదని తెలిసినా, ఎట్లు సమానము కావను వివరము తెలియదు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
79. ప్రళయము రెప్పపాటు కాలములో జరుగుతుంది. అల్లాహ్ అన్నిటికీ అధికారిగా యున్నాడు. (16-77)
(16-77) ''ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న నిగూఢ విషయాలు అల్లాహ్‍కు మాత్రమే తెలుసు. ప్రళయ వ్యవహారము రెప్పపాటు కాలములో లేదా అంతకన్నా తక్కువ సమయములోనే జరిగి పోతుంది. నిశ్చయముగా అల్లాహ్ అన్నిటిపై అధికారము గలవాడు.''
ఈ వాక్యములో అల్లాహ్ అను పదము వచ్చినది. ఇక్కడ ఏ అల్లాహ్ యొక్క విషయము గలదని ఒకమారు చూచుకొంటే ఇద్దరి అల్లాహ్‍లలో అందరికీ ఆరాధ్య దైవమయిన రెండవ ఆత్మగా యున్న అల్లాహ్‍ను గురించి చెప్పియున్నదని తెలియుచున్నది. అలాగే ఈ వాక్యములో ముఖ్యముగా గమనించవలసిన విషయము ఏమనగా! ఆకాశము అని ఒక ఆకాశమును చెప్పక ఆకాశములలోనూ అని బహువచనములో చెప్పియున్నారు. ఆకాశములు ఏడున్నాయనీ, ఆ ఏడు ఆకాశములు మనిషి శరీరములో సప్త నాడీకేంద్రములుగా యున్నవనీ, అందులో పెద్ద ఆకాశము మెదడుగా పైన గలదనీ, దాని తర్వాత ఆరు ఆకాశములు కలవని తెలియుచున్నది. అయితే నేటికాలములో మనుషులకు ఏడు ఆకాశముల విషయము ఏమాత్రమూ తెలియదు. ఏడు ఆకాశములు మన శరీరములో ఉన్నాయని తెలియనప్పుడు భూమి శరీరములో ఎలాగున్నది ఏమాత్రము తెలియదు. ఆకాశములు, భూమి రెండూ శరీరములో ఉన్నాయని తెలియనప్పుడు శరీరములోనే ప్రళయము జరుగునని ఏమాత్రము తెలియదు. భూప్రళయము అనగా భూమి ఆకాశములు అన్నీ లేకుండా పోవు ప్రళయము శరీరములోనే జరుగుననీ, అది సెకనులో పదవవంతు కాలములో జరుగునని చాలామందికి తెలియదు.
నేను గతములో చాలామార్లు ప్రళయము అంటే మనిషి శరీరము నాశనం అగుట అనగా మరణము పొందుట అనియూ, మరణము ఎవరికయినా ఒక సెకనులో పదవవంతు సమయములో సంభవించునని చెప్పాము. మరణమును గురించి చాలా విషయములు ''మరణ రహస్యము'' అను గ్రంథమందు మరియు ''జనన మరణ సిద్ధాంతము'' అను గ్రంథమందు వ్రాసియున్నాము. ఆకాశములోను భూమిలోను గల నిగూఢ విషయములు అల్లాహ్‍కు మాత్రమే తెలుసు అని వాక్యములో అన్నారు. ఆ మాట వాస్తవమే. ఎందుకనగా! శరీరమును తయారు చేసినది రెండవ ఆత్మగా యున్న అల్లాహ్‍యే. భూమి ఆకాశములలోని విషయాలు అనగా శరీర అంతర్గత విషయములని అర్థము. శరీరము బయటి విషయములు మనుషులకు తెలియును గానీ శరీరము లోపలి విషయములు అందరికీ తెలియవు. శరీర అంతర్గత విషయములు రహస్యములుగా యున్నవి చాలా గలవు. శరీరములో మనస్సు ఎలా ఉందో, అది ద్రవ పదార్థమో, ఘన పదార్థమో ఎవరికీ తెలియదు. ప్రతి దినము మనము చెప్పుకొను బుద్ధి విషయము, దాని ఆకారము రహస్యముగా యున్నదని చెప్పక తప్పదు. శరీరములో ముఖ్యముగా నివశించు జీవుడు లేక జీవాత్మ ఎలాగున్నది ఎవరికీ తెలియదు. ఈ విధముగా ఎంతో రహస్యమైన శరీర విషయములు ఏవీ మనుషులకు తెలియవు. శరీరములో జరిగే చావుకుగానీ, పుట్టుకు గానీ అట్లే శరీరములో గల సమస్తమునకు గానీ శరీరములోని ఆత్మ, పరమాత్మలను ఇద్దరు దేవుళ్లలో ఆత్మయను దేవుడే అధిపతిగా ఉన్నాడు. సమస్త శరీరములకు ఆత్మ అధిపతికాగా, పరమాత్మ బయట ప్రపంచములో అధిపతిగా ఉన్నాడు. పరమాత్మ అన్నిటినీ అనగా సర్వ ప్రపంచమును సృష్ఠించిన మొదటి సృష్ఠికర్తకాగా, ఆత్మ శరీరములను సృష్ఠించిన రెండవ సృష్ఠికర్తగా యున్నాడు. శరీరము, శరీరములను సృష్ఠించిన ఆత్మకు అధిపతి పరమాత్మే అయినా, శరీరము బాధ్యత అంతా ఆత్మకే పరమాత్మ అప్పజెప్పాడు. శరీరములో ఆత్మ తప్ప జీవాత్మ, బుద్ధి, చిత్తము, అహము ఎలాగున్నది చిత్రపటముగా గీచి చూపవచ్చును. ఇంతకుముందు మేము వ్రాసిన ''త్రైత సిద్ధాంత భగవద్గీత'' యను ప్రథమ దైవ గ్రంథమున జీవాత్మ, బుద్ధి, చిత్తము, అహము అను నలుగురి ఆకారములు చూపడము జరిగినది. అదే చిత్రమును క్రింద చూపుచున్నాము చూడండి.
జీవుని చిత్రము
ఈ చిత్రములో మనస్సు చిత్రము లేదు. జీవుడు శూన్యమైనవాడే అయినా ప్రకృతితో తయారయిన బుద్ధి, చిత్తము, అహము అను మిగతా మూడు జీవుని చుట్టూ ఆవహించి ఉండుట వలన అందులో మధ్యనగల శూన్యము కూడా ఆకారమునకు దొరికినది. మూడు పొరల మధ్యన గలవాడు జీవుడనీ, జీవునికి ఆనుకొని మొదటి పొరగా యున్నది బుద్ధియనీ, రెండవ పొరగాయున్నది చిత్తముయనీ, మూడవ పొరగాయున్నది అహము యనీ తెలియవలెను. శరీరములో అత్యంత రహస్యముగా యున్నది మనస్సు దానిని చిత్రీకరించి చూపుటకు సాధ్యపడదు. ఎందుకనగా! నిద్రలో ఒక ఆకారము, మెలకువలో మరొక ఆకారమును కల్గి రెండు అవస్థలలో అనగా నిద్ర, మెలుకువ అను రెండు స్థితులలో రెండు ఆకారములుగా మనస్సు కలదు. మెలుకువలో శరీరమంతా ఆత్మతో సమానముగా వ్యాపించియున్న మనస్సు, నిద్రలో ఒక్కచోట చేరి ఒక బిందువు ఆకృతిని పోలియుండి బ్రహ్మనాడిలో చేరిపోవుచున్నది. ముఖ్యమైన ఈ ఐదు జీవునితో సహా ఉన్నవి చాలా రహస్యములయినా మిగతా భాగములు కూడా ఎవరికీ తెలియనివిగా గోప్యముగా యున్నవని చెప్పవచ్చును.
మరణమును ప్రళయము అని దైవ గ్రంథమయిన ఖుర్ఆన్‍లో చాలాచోట్ల చెప్పియున్నారు. ఎక్కడ చెప్పినా ప్రళయము శరీరము బయట జరగదనీ, శరీరములోనే ఉన్న వ్యవస్థలన్నీ పాడయిపోవడమే ప్రళయమనీ, ఇంకొక విధముగా చెప్పితే శరీరములోని వ్యవస్థలన్నీ పని చేయని స్థితి ఏర్పడడము ప్రళయము అనీ తెలియవలెను. ప్రళయమే మరణము మరణములోను, పుట్టుకలోను, శరీరము జీవించియున్నప్పుడు శరీర వ్యవస్థకు అంతటికీ ఆరాధ్యదైవమైన ఆత్మయే (అల్లాహ్) అధిపతిగా యున్నారు. శరీరమునకు ఆత్మ తప్ప వేరు అధికారి ఎవరూ లేరు. ఆత్మయే ఆరాధింపతగిన అల్లాహ్యని చెప్పబడుచున్నది. ఆత్మ అందరికీ అధికారి కావున అందరిలో ఆయనకు తెలియని రహస్యమంటూ ఏదీ లేదు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
80. తల్లిగర్భములో శిశుశరీరమును పెంచి ప్రసవింపజేసినవాడు ఆత్మయే. (16-78)
(16-78) ''అల్లాహ్ మిమ్ములను మీ మాతృగర్భాలనుండి మీకే తెలియని స్థితిలో బయటికి తీశాడు. మీ కొరకు చెవులను, కళ్లను, హృదయాలను తయారు చేసినది ఆయనే. మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారని అనుకొన్నాడు.''
దేవుడు ఎవరికీ అంతుబట్టనివాడు. అందువలన తెలుగు భాషలో దేవుడనీ, అల్లాహ్యని పిలువబడుచున్నాడు. చాలామంది అల్లాహ్యను పదము అరబ్బీ భాషలోనిదని అనుకోవచ్చును. అయితే అది తెలుగు పదమనీ, కృతయుగములోనే ఆ పేరున్నదని చాలామందికి తెలియదు. అంతులేనివాడు అల్లాహ్యనీ, దేవులాడబడేవాడు దేవుడనీ అర్థముతో కూడుకొన్న దేవుడు మానవ శరీరములో కార్యకర్తగా యున్నాడు. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోవు వరకు అన్ని పనులను ఆత్మే చేయుచున్నాడు. శరీర అవయవములందు ఆవహించియుండి, అవయవములలో చైతన్యశక్తిగా (కదిలే శక్తిగా) యుంటూ శరీరమును కదలించి, అన్ని అవయవముల ద్వారా పనిని చేయిస్తున్నాడు. అన్ని అవయవములలో తానుండి పని చేయుట చేత శరీర వ్యవస్థ అంతయూ పని చేయుచున్నది. శరీరములో ఎవరు పనిని చేయుచున్నది తెలియని మనిషి (జీవుడు) శరీరములో జరిగే పనులన్నిటినీ తానే చేయుచున్నానని భ్రమించుచున్నాడు. భ్రమ చేత తాను కార్యముల కర్తగా యున్నానని జీవుడు అనుకొనినా, నిజమైన కార్యకర్త అల్లాహ్‍యే. శరీరములో జీవాత్మ మొదటి ఆత్మగా ఉండగా, రెండవ ఆత్మగా అందరూ ఆరాధించు అల్లాహ్యున్నాడు. మూడవ ఆత్మయిన పరమాత్మ శరీరములో సాక్షిగా అన్నిటినీ చూస్తూ యున్నాడు. జీవాత్మ తాను చేయుచున్నానని భ్రమించు పనులన్నిటినీ ఆత్మ చేయుచున్నది. ఆ పద్ధతిలో కార్యకర్తగా యున్న ఆత్మ, స్త్రీ గర్భములో జరుగు కార్యములను కూడా చేయుచున్నాడు. స్త్రీ గర్భము ధరించిన మొదటి రోజు నుండి గర్భములో శిశువును పెంచుతూ వస్తున్నది శరీరములోని అల్లాహ్ అయిన రెండవ ఆత్మేనని తెలియవలెను. ఆత్మ శిశువు యొక్క తల మొదలుకొని కాళ్ల వరకూ అన్ని అవయములను క్రమబద్ధముగా గర్భములో పెంచుతూ యుండడమేకాక శిశువు యొక్క కార్యకర్తగా కూడా తయారగుచున్నాడు. తల్లిగర్భములోని శిశు శరీరములో ప్రాణము లేదు, జీవుడు కూడా లేడు.
తల్లి శరీరములోని ఆత్మే తల్లిని ప్రసవింపజేయుచున్నాడు. తల్లి శిశువును ప్రసవించినప్పుడు శిశువు మృతదేహమువలె యుండును. అంతవరకు శిశువుకు కూడా తల్లి శరీరములోని ఆత్మే సంరక్షణగా యున్నది. శిశు శరీరము ప్రసవింపబడు సమయములో గానీ, ప్రసవింపబడిన తర్వాత గానీ, ప్రసవింపబడిన కొంతసేపయిన తర్వాతగానీ ఆత్మ జీవునితో సహా వచ్చి శిశువులో చేరుచున్నది. అప్పటినుండి ఆత్మ శిశు శరీరములో కార్యకర్తగా ఉండిపోవుచున్నది. ఇన్ని పనులు చేసి తల్లి శరీరములో శిశు శరీరమును పెంచి, తర్వాత ప్రసవింపబడిన శరీరములో చేరి, జీవితమును సాగించుటకు చైతన్యముగా యున్న ఆత్మను (అల్లాహ్‍ను) ఎవరూ గుర్తించటము లేదు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
81. దేవుడు తలచుకొంటే అందరినీ ఒకే సమాజముగా పుట్టించేవాడు. (16-93)
సమాజము అనగా గుంపుగా ఉండేవారని అర్థము. అయితే సమాజములు రెండు రకములుగా గలవు. ఒకటి బయటి సమాజము. రెండు లోపలి సమాజము అని అనవచ్చును. శరీరము బయట, శరీరము లోపల రెండు సమాజములు గలవు. శరీరము బయట మనుషుల గుంపులు, శరీరములోపల ఇంద్రియముల గుంపులు గలవు. ఇక్కడ దేవుడు సమాజము అను పదమును వాడాడు. అయితే ఏ సమాజమును గురించి ఆ మాట చెప్పాడో కొంత ఆలోచించి చూడవలసియున్నది. (16-93) వ వాక్యములో ఏమి చెప్పారో ముందు చూస్తాము.
(16-93) ''అల్లాహ్ గనుక తలచుకొంటే మీ అందరినీ ఒకే సమాజముగా చేసి ఉండేవాడు. కానీ ఆయన తాను తలచిన వారిని అపమార్గానికిలోను చేస్తాడు. తాను తలచిన వారికి సన్మార్గము చూపుతాడు. మీరు చేస్తున్న పనులన్నిటి గురించి మీరు తప్పకుండా ప్రశ్నించబడతారు.''
ఇక్కడ బాగా గమనిస్తే మీ అందరినీ ఒకే సమాజముగా పుట్టించే వాడినని చెప్పలేదు. ఒకే సమాజముగా చేసి ఉండేవాడిని అని అన్నాడు. ఈ రెండు మాటలలో ఎంతో తేడా గలదు. ఒకే సమాజముగా పుట్టించే వాడయితే ఒక మతము గుంపులోనో, లేక ఒక కులము గుంపులోనో పుట్టించేవాడు. అప్పుడు అది బయట సమాజము అయిపోయేది. అట్లు బయట సమాజముగా అందరినీ దేవుడు చేయలేదు. అలా ఎప్పటికీ చేయడు. బయట సమాజము అంతా మనుషులు తయారు చేసుకొన్నదేగానీ, దేవుడు చేసినది కాదు. పుట్టిన మనుషులను ఒకే సమాజముగా దేవుడు తలచుకొంటే చేసేవాడు. అలా చేయుటకు మనిషి ఏ మతములో పుట్టినవాడయినా, వాడు మనుషులు ఏర్పరచుకొన్న ఏ సమాజములో ఉండినా ఆ సమాజము నుండి తీసి తాను ప్రత్యేకమైన సమాజముగా చేసేవాడినని దేవుడు చెప్పాడు. దేవుడు తలచుకొంటే ఎవడు ఏ సమాజములో ఉండినా అతడు దేవుడు నిర్మించిన సమాజములోనికి రావలసిందే యని తెలియుచున్నది. దేవుడు మనిషిని జ్ఞానిగా మార్చుతూపోగా, చివరికి మనుషులు జ్ఞానులుగా మారిపోయి జ్ఞానుల సమాజము ఏర్పడగలదు. అందులో బయట సమాజములోని వాడు ఎవడయినా మారిన మనిషిగా తయారయి ఉండును. దేవుని జ్ఞానము తెలిసినవారందరూ తమతమ కుల, మత భేదములను వదలి ఒకే సమాజముగా ఉందురు.
అయితే దేవుడు అలా మనుషులనందరినీ ఒకే సమాజముగా తయారు చేయగలిగే స్థోమతయున్నా అలా చేయలేదు. ఎందుకనగా! మనుషులు అనేక కర్మలతో కూడుకొన్నవారై, అనేక గుణములకు అలవాటు పడినవారై యుండుట చేత అందరినీ జ్ఞానమార్గములో పంపి జ్ఞాన సమాజముగా తయారు చేయలేదు. శరీరములో యున్న దేవుడు శరీరములో జీవుడు చేసుకొన్న కర్మ చిట్టాను చూచి వానిని నడుపుచుండును. అందులవన కర్మనుబట్టి వానికున్న జ్ఞానమునుబట్టి దేవుడు మనిషిని నడుపు చుండును. అందువలన వారి శ్రద్ధ, బుద్ధినిబట్టి, కర్మనుబట్టి మనిషిని అపమార్గములో (అజ్ఞాన మార్గములో) పంపగలడు. లేకపోతే సన్మార్గము (జ్ఞానమార్గము) లోనయినా పంపగలడు. మనిషి తన కర్మప్రకారము నడుచుకొనుచుండును. వాస్తవముగా ఆత్మే నడుపుచుండును. అయితే జీవుడు ఆత్మ చేసిన ప్రతి పనినీ తానే చేయుచున్నాడని అనుకోవడము వలన, జీవుడు ఆ పనిని చేసినట్లు బాధ్యత వహించడము వలన, ఆ పనిలోని పాపపుణ్యములను జీవుడు పొందుచున్నాడు. శరీరములో ఆత్మ అన్ని పనులు చేయుచుండినా జీవుడు నేను చేశానని అనవసరముగా అనుకొంటున్నాడు. అయినా ఏ పనిని అయినా దేవుడయిన ఆత్మ తప్ప మిగతావారు ఎవరూ చేయలేదు. అదే విషయమునే ద్వితీయ దైవ గ్రంథములో ఇలా చెప్పారు చూడండి.
(మత్తయి 10-20) ''మీ తండ్రి ఆత్మ మీలో యుండి మాటాలాడు చున్నాడే గానీ, మాటలాడువారు మీరు కాదు.''
ఈ వాక్యమును బట్టి జరుగుచున్న కార్యములన్నీ ఏ మనిషీ చేయలేదని శరీరములోని దేవుడయిన ఆత్మే చేయుచున్నాడని తెలియుచున్నది. అయితే మనిషి ఆ విషయములో దేవున్ని మరచిపోయి నేనే చేస్తున్నానని అనుకొంటున్నాడు. అందువలన దేవుడు వారివారి కర్మనుబట్టి కొందరిని అజ్ఞానులుగానూ, కొందరిని జ్ఞానులుగాను చేయుచున్నాడు. ఒకే సమాజముగా చేయుటకు వీలుపడలేదు. దేవుడు చేసే ప్రతి పనిని జీవుడు నేను చేస్తున్నానని అనుకోవడము వలన వాడు చేసుకొన్న పాపములకు, పుణ్యములకు వానినే బాధ్యున్ని చేసి శిక్షించవలసివచ్చినది. దేవుడు శరీరములలో కార్యములను చేయడమేకాక మనిషిని (జీవున్ని) శిక్షించడము మొదలగు పనులనూ చేయవలసియున్నది.
☞