pss: vajra till 11 20 30
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
"అంతిమ దైవ గ్రంథములో వజ్రవాక్యములు" అను ఈ గ్రంథ రచయిత అయిన శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి ముందు మాట వాస్తవముగా చెప్పాలంటే ప్రథమ దైవగ్రంథము, ద్వితీయ దైవగ్రంథము, అంతిమ దైవగ్రంథము అని మూడే మూడు గ్రంథములు దేవుని ద్వార మనుషులకు ఇవ్వబడినవి. ఈ మూడింటియందు ఒకే దైవజ్ఞానము ఉండుట వలన వాటికి ముందు వెనుక దైవగ్రంథములను పేర్లు వచ్చినవి. మూడు దైవగ్రంథములలో ఆధ్యాత్మికమే ఉండుట వలన గ్రంథములలో ఆధ్యాత్మికము రహస్యముగా దాచిపెట్టబడి ఉన్నదని చెప్పవచ్చును. అందువలననే మూడు సమాజములవారికి మూడు గ్రంథముల వాస్తవికత అర్థముకాలేదని, వారికి అర్థమైనది అంటే అది మతములకు సంబంధించినదే అర్థమైనదని తెలియుచున్నది. గంధమారుతము అంటే వాసనను లేకుండ చేసినది అన్నట్లు గ్రంథము అనగా రహస్యముతో కూడుకొన్నది అని అర్థము గలదు. గంధమారుతము నుండి వాసనను ముక్కులద్వారానే తెలియదగును. అలాగే గ్రంథములోని ఆధ్యాత్మికము బుద్ధి ద్వారనే తెలియబడును. గ్రంథములోని విషయమును ఆత్మ తెలియజేసినప్పుడు మాత్రమే తమ బుద్ధి ద్వార గ్రహించవచ్చును. ఆత్మ తెలియజేయాలనుకోక పొతే మనిషి గ్రంథమును ఎంత చదివినా అందులోని చిన్న ముక్క కూడ అర్థము కాదు. అదే పరిస్థితే నేడు భూమి మీద నెలకొని యున్నది. నేడు భూమి మీద మూడు గ్రంథములను మూడు సమాజముల వారు నాది ఈ గ్రంథము, నాది ఈ గ్రంథము అని పంచుకొని, నిర్ణయించుకొని మూడింటిని వారి వారి గ్రంథములుగా చెప్పుకుంటున్నారు. ఎలా చెప్పుకొనినా ఆ గ్రంథములను వారు అందరూ చదువలేదు. చదివినా అవి అందరికి అర్థముకాలేదు. గ్రంథము అని సూత్రము ప్రకారము అందులోని సమాచారము వారి బుర్రలకు, బుర్రలలోని బుద్ధికి అందలేదు. అలా బుద్ధి గ్రాహ్యమునకు రావాలంటే గ్రంథములోని శక్తి రూపమై యున్న ఆత్మకు చదివే వాడు నచ్చి యుండాలి. ఆత్మకు ఇష్టములేని వానికి గ్రంథము అర్థముకానట్లు ఆత్మ చేయుచున్నది. చదివిన తర్వాత వాని బుద్ధికి అది వాస్తవ భావముతో కాకుండా వేరు భావములో అర్థమగుచున్నది. అందువలన నేడు గ్రంథములను వ్రాయువారు వేరు భావములో వాక్యమునకు అర్థమును వ్రాయడము జరుగుచున్నది. మేము చెప్పునది మూడు గ్రంథముల విషయములలో అలాగే కొనసాగుచున్నది. హిందువులకు భగవద్గీత అర్థముకాలేదు. క్రైస్తవులకు బైబిలు అర్థముకాలేదు. ముస్లీమ్ లకు ఖుర్ఆన్ అర్థముకాలేదు. భగవద్గీత అర్థముకాలేదని మేము వ్రాసిన "త్రైత సిద్ధాంత భగవద్గీత" బయటికి వచ్చిన తర్వాత చాలా మందికి తెలిసినది. అలాగే క్రైస్తవులకు బైబిలు అర్థముకాలేదు అనుటకు మేము వ్రాయబోవు "సువార్త బైబిలు" బయటికి వచ్చిన తర్వాత తెలియగలదు. ఇక పొతే ముస్లీమ్ లకు ఖుర్ఆన్ గ్రంథము అర్థమైనదా, అర్థముకాలేదా అని విషయము ఇప్పుడు మేము వ్రాసిన "అంతిమ దైవగ్రంథములో వజ్రవాక్యములు " అని ఈ గ్రంథము ద్వారా తెలియగలదు. ఖుర్ఆన్ గ్రంథములో 114 సూరాలు, 6236 ఆయత్‍లు గలవు. అందులో స్థూల మరియు సూక్ష్మ అని రెండు రకముల వాక్యములు గలవు. మేము ఈ గ్రంథము ద్వార 6236 వాక్యములలో 132 సమాచారములకు వివరమును వ్రాసినాము. మేము వ్రాసిన 132 సమాచారములు దాచిపెట్టబడిన జ్ఞానము గల వాక్యములే అని చెప్పవచ్చును. ఈ 132 వాక్యములు వజ్రములవలె అమూల్యమైన వాక్యములుగా చెప్పవచ్చును. ముఖ్యముగా ఈ గ్రంథమును గురించి మేము చెప్పబోవునది ఏమనగా! ఇంతవరకు ఖుర్ఆన్ అర్థముకాకపోయిన ఇప్పుడు ఈ గ్రంథముతో అర్థముకాగలదు.
-----
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
అభిప్రాయం
తేది: 08.08.2017, శ్రీ కాళహస్తి.
జ్ఞానరత్న, సంఘమిత్ర, తాత్విక ఉపన్యాస చక్రవర్తి, అక్బర్ శాస్త్రి, అచల పరిపూర్ణ
మరియు నిర్భయానంద ఇత్యాది బిరుదాంకితులు, శ్రీయుతులు మొఘల్ ఫాహి,
అక్బర్బాద్షా Rtd.Jr. Accounts Officer, (Electricity)A.P.S.P.D.C.L
గౌరవనీయులు పూజ్య యోగిపుంగవులైన ఆచార్య ప్రబోధానంద మహాశయుల వారి వంద ఆధ్యాత్మిక గ్రంథాలలో దాదాపు ముఫ్పై, మరియు రికార్డు అయిన వారి 200 ప్రసంగాలలో చాలావాటిని శ్రద్ధగా పరిశీలించడముతో, నిద్రపోతున్న సింహము జూలు విదిల్చి మేల్కొన్నట్లుగా నాలోని జ్ఞాన భాస్కరుడు లేచాడు. దానితో వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, కని-కల్ల నిజము తెల్సిన మనుజుడెపో నీతిపరుడు, మహిలో సుమతీ! అని చెప్పిన బద్దెన కవిని తలపించి వివేకోదయాన్ని కల్గించి త్రిమతాలలోని (హిందూ, క్రైస్తవ, ముస్లీమ్ల) దైవ సారాంశము ఒక్కటేనన్న సమరస భావాన్ని స్ఫురింపజేసి, ఆనందోన్మత్తుణ్ణి కావించి, విశ్వమానవ సౌభ్రాతృత్వ కడలిలో అజ్ఞానము అంతరించి, జ్ఞాన సంకేతమైన దైవ స్వరూప అభయత్త్వానుభూతిని కల్గించినందుకు ఆచార్యుల వారి పాద పద్మములకు మరొక్కమారు శిరసా నా హృదయపూర్వక నమో వాక్యములర్పించుకొంటున్నాను.
ఇలాంటి పరిస్థితిలో, వారి గ్రంథాల ద్వారా నాకు తెల్సినదేమనగా! మతానుయాయులైన హిందూ, క్రైస్తవ, ముస్లీమ్ సోదరులు, ఆచార్యుల వారు తమ గ్రంథాలలో వెలిబుచ్చిన సారాంశాలను అపార్థాలతో మాయకులోనై కేసులు పెట్టి ''ఆప్తాయదార్థవక్తా'' అన్నట్లు ఉన్న నిజాన్ని ఉన్నట్లుగా ప్రజానీకానికి విశదపరుస్తున్న ప్రబోధానందుల వారి మనస్సును చికాకు పరచడము, నా మనసుకు చాలా బాధ కల్గిస్తున్నది. పైగా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు గురికావలసి వస్తుందని వారిని హెచ్చరించడం, ఇది విన్న మాలాంటి వారికి శరాఘాతాలే కదా!
భారతీయ రాజ్యాంగం ప్రకారము మతాధికారులే చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడము ఎంత నేరమో, బ్రహ్మవిద్యా శాస్త్రం ప్రకారము (ఆధ్యాత్మికరీత్యా) దైవముచే అమలు కావాల్సిన నేరశిక్షల చట్టాన్ని మతోన్మాదులే స్వతహాగా బరి తెగించి, నిష్కల్మషులై సత్య ప్రబోధము గావిస్తున్న యోగీశ్వరులవారికి సహకరించక పోగా, ఇలా ఇబ్బందులపాలు చేయడము జ్ఞానము నెరిగినవారు హర్షించరుగాక హర్షించరు!
ఈ విషయములో వేమనయోగి వర్యులు తమ పద్యములో ''అంతరంగ మందు అపరాధములు చేసి, మంచివానిరీతి మసలుచుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుండెరుగడా? విశ్వదాభి రామ వినుర వేమా! అని అన్నారు. అదే మాదిరిగా ఒక సందర్భములో ''మక్కాలోని ''కాబా మసీదు'' ను కాపాడుకొనే బాధ్యత ఆ దేవునిదే! కనుక ఆయనే రక్షించుకుంటాడు'' అంటారు అప్పటి దైవజనులు. కావున చెప్పడమే మన ధర్మము వినకపోతే మీ ఖర్మము.
భగవంతుడు దేశ, కాల, పరిస్థితులనుబట్టి ఎవరెవరిని ఎప్పుడు ఏ విధముగా వారివారి అర్హతలనుబట్టి ఏమి చెప్పాలో ఆయనకు తెలుసు. మధ్యలో విషయం తెల్సుకోక మతోన్మాదాలతో జోక్యము చేసుకోవడము, ఇలాంటి ఆచార్యుల వారి సర్వాత్మనా కార్యక్రమాలకు అడ్డుతగలడమే అవుతుంది.
ఇకనుంచి అయినా, ప్రభుత్వము వారు పరిశీలించి, సర్వమతాలకు ఆరాధ్యుడు దేవుడు ఒక్కడే! అని తమ త్రైత సిద్ధాంత బోధ ద్వారా కృషి చేస్తూ, మానవులంతా ఒక్కటే! సర్వప్రాణులూ సమానమే అని తమ రచనల ద్వారా, గ్రంథాల ద్వారా వెల్లడిస్తున్న ఆచార్యుల వార్కి అండగా నిలవడమే ఆయనకు కొండంత బలమని అర్థిస్తూ ''లోకాస్సమస్తా స్సుఖినోభవన్తు'' అనే సూక్తిని స్మరిస్తూ సర్వులకు అల్లాహ్ అయిన దేవున్ని ప్రార్థిస్తూ...సెలవు. నమస్తే
ఇట్లు
సర్వజన శ్రేయోభిలాషి
ఎం.ఎస్. అక్బర్ బాదుషా
శ్రీకాళహస్తి, జవశ్రీశ్రీ : 9704521588
-----
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
అంతిమ దైవగ్రంథములో వజ్ర వాక్యములు
ఖురాన్ గ్రంథము రెండవ సూరా ''అల్ బఖర'' తో ప్రారంభమైనది. ఖురాన్ గ్రంథము యొక్క మొత్తము సూరాలు 114. అందులో మొదటిది ''అల్ ఫాతిహా'' సూరా. దీని అర్థము 'ప్రారంభము' అని మాత్రమే. రెండవ సూరా పేరు ''అల్ బఖర'' అనగా 'ఆవు' అని అర్థము. ఖురాన్ గ్రంథము ఎక్కడి నుండి ప్రారంభమైనది? అని ప్రశ్న వస్తే అందరూ అల్ ఫాతిహా సూరా నుండి అని చెప్పుదురు. నన్ను అడిగితే నేను అలా చెప్పను. జ్ఞానబోధ ఎక్కడినుండి ప్రారంభమయినదో అక్కడి నుండి అని చెప్పుదును. జ్ఞానబోధ సూరా అల్ బఖర నుండి ప్రారంభమైనది కావున అల్ బఖర సూరా నుండి ఖురాన్ గ్రంథము ఆరంభమైనదని చెప్పుదును. అల్ ఫాతిహా సూరా మనిషికి చెప్పబడిన జ్ఞానబోధ కాదు. అల్ ఫాతిహా సూరాలో మొత్తము ఏడు వాక్యములు గలవు. ఏడు వాక్యములు అల్లాహ్ (దేవుని) ప్రార్థనగా యున్నది. ఏడు ఆయత్లు మనుషులు అల్లాహ్ను వేడుకొను విధానమైయున్నది. ఈ ఏడు ఆయత్లు మనుషులు జ్ఞానము తెలిసిన తర్వాత వారి భక్తి భావముతో మనుషులు చెప్పినవేగానీ వేరు కాదు.
దేవుడు ప్రజలకు జ్ఞానమును తెలియజేయాలను ఉద్దేశ్యముతో ఆకాశములోనున్న జిబ్రయేల్ అను గ్రహమును ప్రేరేపించగా, ఆ ప్రేరణను అల్లాహ్ ఆజ్ఞగా తలచిన జిబ్రయేల్ భూమిమీదికి వచ్చి, అప్పటి కాలములోని మనుషులలో ఉత్తమమైన ముహమ్మద్ ప్రవక్తగారిని ఎన్నుకొని ప్రవక్తగారికి జ్ఞానమును చెప్పడమైనది. జిబ్రయేల్ చెప్పిన జ్ఞానమును గ్రంథరూపము చేసినప్పుడు మొదట ప్రార్థనను వ్రాసి, తర్వాత జిబ్రయేల్ చెప్పిన జ్ఞానమును వ్రాయడము జరిగినది. అలా వ్రాసిన ప్రార్థనను మొదటి సూరాగా చెప్పి జిబ్రయేల్ చెప్పిన జ్ఞానమును రెండవ సూరాగా వ్రాయడమైనది. ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీత పదునెనిమిది అధ్యాయములుగా యున్నా, అందులో వాస్తవానికి పదిహేడు అధ్యాయములు భగవంతుడు చెప్పిన బోధ యున్నది. దానినే 'భగవద్గీత' అని అనవలెను. అర్జునుడు చెప్పినది బోధ కాదు, భగవంతుడు చెప్పినది భగవద్గీత. అయినా అర్జునుడు చెప్పిన దానితో సహా భగవద్గీత యనడము జరుగుచున్నది, అలా అనకూడదు. వాస్తవముగా భగవద్గీత ఎలా 18 అధ్యాయములు లేదో, అలాగే అంతిమ దైవగ్రంథములో కూడా 114 సూరాలు లేవు. భగవద్గీతను పదిహేడు అధ్యాయములు అనడము ఎంత న్యాయమో, ఖురాన్ గ్రంథమును 113 సూరాలు అని చెప్పడము అంతే న్యాయమగును. అందువలన జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తగారికి జ్ఞానమును చెప్పినది అల్ బఖర సూరానుండి యేనని చెప్పవచ్చును. అల్ బఖర సూరాలో ఖురాన్ జ్ఞానము ఎలా ప్రారంభమయినదో ఇప్పుడు చూస్తాము. అల్ బఖర సూరాలో మొదటి ఆయత్ నుండి కాక రెండవ ఆయత్నుండి జ్ఞానము ప్రారంభమయినది. రెండు, మూడు, నాలుగు అను మూడు ఆయాత్లలో రెండవ ఆయత్నుండి జ్ఞానబోధ ప్రారంభమయినది.
(2-2) ''ఇది (ఈ ఖురాన్) ఒక దివ్య గ్రంథము అనుటకు ఇందులో ఏమాత్రము సందేహము లేదు. దైవభీతి గలవారికి ఇది మార్గదర్శకత్వము. (2-3) ''ఎవరయితే అగోచర యదార్థాన్ని విశ్వసిస్తారో, నమాజును స్థాపిస్తారో మరియు మేము ప్రసాదించిన జీవనోపాధినుండి మా మార్గములో ఖర్చు చేస్తారో (2-4) ''ఓ ముహమ్మద్, ఎవరయితే నీపై అవతరింపబడిన ఈ ఖురాన్ను మరియు నీకు పూర్వము అవతరింపజేయబడిన (దివ్య గ్రంథాలను) విశ్వసిస్తారో, మరియు పరలోక జీవితమును దృఢముగా నమ్ముతారో''
ఖురాన్ గ్రంథము యొక్క గొప్పతనము, ఖురాన్ గ్రంథము యొక్క సూక్ష్మత్వము మొట్టమొదట ఈ మూడు ఆయత్లలోనే కనిపించుచున్నది. మొదటి ఈ మూడు ఆయత్లు అర్థమయితే తర్వాత ఖురాన్ గ్రంథము అర్థము కాగలదు. ఇక్కడ మూడు వాక్యములు సరిగా తెలియకపోతే, మొదటనే తప్పుగా వేరు విధానములో అర్థమయితే మిగతా గ్రంథములోని ఆయత్లన్నీ తప్పుగానే అర్థము కాగలవు. దేవుడు చెప్పిన భావము తెలియకుండాపోవును. వేయిమందికి లేక లక్షమందికి ఈ మూడు ఆయత్లు ఒకే విధముగా అర్థమయినా అది దేవుడు చెప్పిన భావము కాకపోతే ఏమీ ప్రయోజనము లేదు. లక్షమంది ఒకే మాటను చెప్పినా అది అసత్య జ్ఞానముగా లెక్కించబడును. దేవుడు ఏ ఉద్దేశ్యముతో చెప్పాడో ఆ ఉద్దేశ్యము ఒక్కనికి అర్థమయినా, ఆ ఒక్కనినే సత్యమైన జ్ఞానియని చెప్పవచ్చును. లక్షమందిది కాదని ఒక్కనిది సత్యమైన జ్ఞానమనుటలో ఏమయినా పక్షపాత ధోరణి యుండవచ్చునేమోయని అనుకొనుటకు అవకాశము లేకుండా, తన జ్ఞానము ఏది నిజమైనదో, ఏది అసత్యమైనదో తేల్చి చెప్పుటకు తన గ్రంథములోనే శాస్త్రీయమైన వాక్యములను దేవుడు చెప్పియుండుట వలన వాటిని గీటురాయిగా ఉపయోగించి మనిషి అర్థము చేసుకొన్నదానిలోని సత్యాసత్యమును తేల్చి చెప్పవచ్చును. అందువలన కొంత ఆలస్యమయినా ఫరవాలేదు, ముందు ఈ మూడు వాక్యములను బాగా తెలియగలిగి తర్వాత ముందుకు పోవలసియుండును.
ఖురాన్ గ్రంథములో ముందు చెప్పబడిన మూడు ఆయత్లలో ముందు ఆయత్ కష్టమయినది కాదు. దానిని పెద్దగా అర్థము చేసుకోవలసిన అవసరము లేదు. మూడవ చివరి ఆయత్ కూడా విశ్వాసము మీద ఆధారపడి యున్నది గానీ పెద్దగా గ్రహించుకోవలసిన పని లేదు. ఇకపోతే మధ్యలో యున్న ఒక్క ఆయత్ను మాత్రము చాలా జాగ్రత్తగా అర్థము చేసుకోవలసి యున్నది. ఈ వాక్యములో మూడు భాగముల విషయములు కలవు. వాటిలో ఒకటి గ్రంథములో అత్యంత ముఖ్యమైనది అగోచర యదార్థము, రెండు నమాజు, మూడు నీకు ప్రసాదించిన జీవనోపాధి. ఈ మూడు విషయములు మనిషి బుద్ధికి అర్థము కాకపోతే, అది అమృతమే అయినా చివరికది విషమువలె బాధించును. అమృతము వలె మనిషిని రక్షించక విషమువలె బాధించును. దేవుడు చెప్పినది వాస్తవ జ్ఞానమే అయినా మనిషి బుద్ధికి అది సరైన భావములో అర్థము కాకపోతే మనిషి జీవితమే వ్యర్థము. అల్లాహ్ (దేవుడు) ఖురాన్ గ్రంథము ప్రారంభములో మూడు ఆయత్లను ముఖ్యముగా చెప్పాడు. అందులో మధ్యలోని ఒక్క వాక్యములో మనిషి అర్థము చేసుకోవలసిన మూడు విషయములను తెలియజేశాడు. దేవుని జ్ఞానము ఈ మూడు విషయముల మీద ఎక్కువ ఆధారపడియుంటుంది. ఈ మూడు జ్ఞాన విషయములు అర్థము కాకపోతే వాడే వానికి విషముగా లెక్కించవచ్చును.
దేవుడు చెప్పిన వాక్యమును అర్థము చేసుకొంటే ఒక విధముగా, అర్థము కాకపోతే మరొక విధముగా యుంటుంది. అర్థమయితే ఎలాగుంటుందో, అర్థము కాకపోతే ఎలాగుంటుందో క్రింద అక్షర రూపములో చూడండి.
జ్ఞాన విషయము - జ్ఞాని
ప్రాణ విషము - అజ్ఞాని
జ్ఞాన విషయము ప్రాణ విషములాగ మారిపోగలదు. అర్థమయితే విషయము. అర్థము కాకపోతే విషయములో 'య' లేకుండా పోయి విషయమే విషముగా మారిపోగలదు. పై వాక్యములో మొత్తము ఎనిమిది అక్షరములు గలవు. క్రింది వాక్యములో కూడా ఎనిమిది అక్షరములే గలవు. అయితే పైది జీవింపజేయును. క్రిందిది హరింపజేయును. దేవుని జ్ఞానము తెలియకుండా మనిషి ఎన్నాళ్ళు బ్రతికినా వాని జీవితము గుర్తింపు లేనిది. 'పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా' అన్నట్లు అది ఏ విధముగా చూచినా గుర్తింపు లేని జీవితముగానే ఉండును. ప్రతి మనిషి జీవితానికి గుర్తింపు రావాలంటే వాడు దేవుని జ్ఞానమును తెలియాలి. వాడు జీవుడు అయినందున తనకంటే పెద్ద అయిన తనను సృష్ఠించినవానిని తెలియవలసియున్నది. అప్పుడే వాడు ఆధ్యాత్మిక జీవితమును పొందినట్లగును. ఆధ్యాత్మికము అనగా 'ఆత్మను అధ్యయనము చేయడము' అని అర్థము. ఒక్కమారు వాడు ఆధ్యాత్మికములోనికి ప్రవేశించాక వాడు దేవుని దృష్ఠిలో గుర్తింపు పొందినవాడగును. అయితే వాని ఆధ్యాత్మిక జీవితము రెండు విధములుగా యుండును. ఒకటి సక్రమ మార్గము, రెండు అక్రమమైన మార్గము అని చెప్పవచ్చును. వాటినే జ్ఞాన మార్గము, అజ్ఞాన మార్గము అని కూడా చెప్పవచ్చును. జ్ఞానమార్గములో పోవువాడు జ్ఞాన విషయములను పొందును. అజ్ఞాన మార్గములో పోవువాడు ప్రాణ విషమును పొందును. అందువలన ఆధ్యాత్మికము మనిషిని దేవుని వైపు పంపగలదు. అది అర్థము కాకపోతే, తప్పుదారిలో అర్థమయివుంటే అదే ఆధ్యాత్మికమే మనిషిని మాయవైపు పంపును. మాయ విషముతో సమానము. దేవుడు అమృతముతో సమానమని పోల్చి చెప్పవచ్చును. అందువలన ప్రతి మనిషిని హెచ్చరించినట్లు ఖురాన్ గ్రంథములో మొదటనే మూడు ఆయత్లను చెప్పి దేవుడు తన జ్ఞానము యొక్క విధానమును తెలియజేశాడు. మొదట చెప్పిన మూడు వాక్యములలో మధ్యది, రెండవది అయిన వాక్యము మొదటనే మనుషులకు సరియైన మార్గమును అనుసరించునట్లు ముఖ్యమైన మూడు జ్ఞాన విషయములను చెప్పినది.
దాదాపు 1400 సంవత్సరములప్పుడు చెప్పిన అంతిమ దైవ గ్రంథము ఖురాన్లో ముఖ్యముగా చెప్పిన మూడు అంశములు ఈ రోజు వరకు మనుషులకు అర్థము కాలేదనియే చెప్పవచ్చును. ఖురాన్ గ్రంథము ఒక ముస్లీమ్ సమాజానికే చెప్పిన జ్ఞానమని చాలామంది అనుకొంటున్నారు. అలా అనుకోవడము పెద్ద పొరపాటు. ''ఖురాన్ దైవగ్రంథము అది సకల లోక ప్రజల కొరకు చెప్పిన హితోపదేశము''. ఖురాన్ గ్రంథము ఏ ఒక్క మతమునకు పరిమితమైనది కాదు, అట్లే ఏ మతమునకు సంబంధించినది కాదు. ఖురాన్ గ్రంథము మనుషులందరికీ అర్థము కాలేదని చెప్పవచ్చును. దైవగ్రంథములు భూమండలములో మూడు గలవు. మూడు గ్రంథములు సకల మానవులకు సంబంధించినవి. అందువలన మూడు గ్రంథములను అర్థము చేసుకోవడము మూడు మతములలోని ప్రజలందరి బాధ్యత. నేడు ఖురాన్ గ్రంథము అర్థము కాలేదంటే దానికి ప్రతి మనిషి జవాబు చెప్పవలసిందే.
ప్రథమ, మధ్యమ, అంతిమ దైవగ్రంథములు మూడు ఒకే జ్ఞానమును బోధించినా, మూడు గ్రంథములను చూస్తే వేరువేరు జ్ఞానమును బోధించినట్లు కనిపించును. చెప్పిన కాలమునుబట్టి, చెప్పిన భాషనుబట్టి వేరువేరుగా చెప్పినట్లు కనిపించడము వాస్తవమే. అయితే బోధించినది మాత్రము ఒకే సత్యమైన జ్ఞానము. మూడు గ్రంథములలోనే మూడు అగోచర ఆత్మలను గురించి చెప్పిన సారాంశము తప్ప ఇతరము ఏమీ లేదు. మూడు ఆత్మలను గురించి, వాటికి అనుబంధముగా యున్న జ్ఞానమును గురించి చెప్పడమైనది. ప్రథమ దైవగ్రంథములో మూడు ఆత్మల జ్ఞానమును చెప్పినా, మూడవ ఆత్మ (పరమాత్మను) గురించి కొంత ఎక్కువ విశధీకరించి చెప్పారు. అలాగే రెండవ దైవ గ్రంథములో మూడు ఆత్మలను గురించి చెప్పినా, రెండవ ఆత్మను (మధ్యాత్మను) గురించి ఎక్కువగా చెప్పినట్లు కనిపించుచున్నది. ఇక అంతిమ దైవగ్రంథ విషయానికి వస్తే సూరా 50, ఆయత్ 21లో మూడు ఆత్మలను గురించి చెప్పినా, జీవాత్మను గురించి మిగతా రెండు ఆత్మలకంటే కొంత ఎక్కువ చెప్పినట్లయినది. కొంత ఎక్కువ తక్కువలుగా మూడు గ్రంథములలోనూ మూడు అగోచర ఆత్మలను గురించి చెప్పడము ముఖ్య ఉద్దేశ్యముగా యున్నది.
మూడు దైవగ్రంథములలో దేవుని అంశలు మూడని ఒకటి జీవాత్మ, రెండు ఆత్మ, మూడు పరమాత్మయని చెప్పడమైనది. పరమాత్మయనబడు మూడవ ఆత్మను దేవునిగా అల్లాహ్గా చెప్పడమైనది. మూడు ఆత్మలు అగోచరమైనవయినందున, ఆత్మల జ్ఞానమంతయూ బయటి దృష్ఠికి కనిపించదు. అందువలన ఖురాన్ ప్రారంభములోనే ''ఎవరయితే అగోచర యదార్థమును విశ్వసిస్తారో'' అని చెప్పడమైనది. అయితే భూమిమీద అగోచర విషయములను నమ్మని భౌతికవాదులు చాలామంది యున్నారు. కనిపించని అభౌతిక విషయములను ఇతరులు నమ్మకపోయినా, దేవుడు చెప్పిన అభౌతిక ఆత్మలను యదార్థమని ఎవడయితే నమ్మగలడో, వానికి ఆత్మజ్ఞానము సులభముగా అర్థము కాగలదు. కనిపించని యదార్థమైన ఆత్మల విషయములో మనుషులు పూర్తిగా అవగాహన లేకుండా పోయారు. అన్ని మతములలోనూ మూడు ఆత్మలను గురించి చెప్పుకొనువారే కరువై పోయారు. బోధకులకే ఆత్మలంటే ఏమిటో తెలియకుండా పోయినది. అగోచర విషయములను మేము నమ్మము అనువారు చాలామంది గలరు. తమను తాము సర్వము తెలిసినవారుగా భావించుకొనిన వారు, అభౌతిక ఆత్మవాదము పూర్తి అసత్యమని చెప్పుచుందురు. మొత్తము మీద మూడు ఆత్మలను గురించి నిగూఢముగా మూడు దైవగ్రంథములలో చెప్పబడినదని మూడు మతముల మనుషులకు తెలియకుండా పోయినది. దైవ గ్రంథములో ఆత్మలను గురించి ఉందని తెలియకపోవడము వలన వాటిని తెలుసుకొను ప్రయత్నమును ఎవరూ చేయలేదు.
రెండవ జ్ఞాన విషయము నమాజ్ను స్థాపించడము. నమాజ్ విషయములో కూడా చాలామంది పొరపడిపోయి తమకు తెలిసినదే నమాజ్ (ప్రార్థన) అని అనుకొంటున్నారు. దేవుడు ఇచ్చిన గీటురాయి ప్రకారము చూస్తే ఇంతవరకు ''నమాజ్'' అను ప్రార్థన దేవుని భావమునకు సరిపోవు ప్రార్థనగా లేదని, అందువలన అసలయిన ప్రార్థనను నెలకొల్పమని చెప్పాడు. మనుషులు చేయు ఆరాధనను చూచి అదే ఆరాధనయని అనుకొనుటకంటే, దైవగ్రంథములో దేవుడు ఏమి చెప్పాడో, దేనిని తన ఆరాధనగా చెప్పాడో, ఎట్లు ఆచరిస్తే తనది ఆరాధన అవుతుందో దాని ప్రకారము చేస్తే దేవుని మార్గములో ప్రయాణించినట్లగును. లేకపోతే మాయమార్గములో ప్రయాణించినట్లగును. ఖురాన్ గ్రంథమును చెప్పినది 1400 సంవత్సరముల క్రితము. అంతకుముందు మూడు యుగములు గడచిపోయాయి. మూడు యుగములనుండి దేవుని ఆరాధనను మనిషి చేయలేదను ఉద్దేశ్యముతో కలియుగములో తయారయిన మూడు దైవ గ్రంథములలో దైవారాధనను గురించి చెప్పియున్నారు. చివరి గ్రంథమయిన ఖురాన్లో నమాజ్ను నెలకొల్పమని చెప్పాడు. 1400 సంవత్సరములప్పుడు నమాజ్ విషయము దేవుడు చెప్పాడంటే అంతవరకు నమాజ్ విషయము మనుషులకు తెలియదనేగా అర్థము. దేవుని సందేశము గ్రంథరూపములో వచ్చిన తర్వాత అయినా ప్రార్థన (నమాజ్) విషయములో ఏమయినా క్రొత్తదనము వచ్చినదాయని చూస్తే ఏమీ తేడా రాలేదు. వాళ్ళు నోటితో గొణిగి చెప్తే, వీళ్ళు అరచి చేస్తున్నారు. వాళ్ళు నిలబడి చేస్తే వీళ్ళు కూర్చొని చేస్తారు. వాళ్ళు మంత్రములు చదివి ప్రార్థన చేస్తే, వీళ్ళు వాక్యము చదివి చేస్తారు. వాళ్ళు ఒకే దానిని 108 మార్లు జపిస్తే, వీళ్ళు ఒకే దానినే పూటకు ఒకమారు జపిస్తున్నారు. వాళ్ళు ఉదయము, సాయంకాలము ప్రార్థన చేస్తే, వీళ్ళు ఇంకా కొన్ని ఎక్కువమార్లు చేస్తున్నారు. చేసే విధానములు, చెప్పే మంత్రములు వేరువేరయినా ఆరాధనలన్నీ మనస్సుతోనే చేస్తున్నారు. మనస్సును నిలిపి చేయడము లేదు. అందువలన వారు చేయునది, వీరు చేయునది రెండూ తపస్సు క్రిందికే జమకట్టబడినాయి. అందరి ప్రార్థనలు ప్రకృతి సంబంధమైనవై తపస్సు క్రిందికి రాగా, నిజమైన ప్రార్థన ఇంతవరకు లేకుండా పోయినది. అందువలన ''నమాజును నెలకొల్పండి'' అని వాక్యములో చెప్పారు.
మూడవ మాటగా దేవుడు ''నేను ప్రసాదించిన జీవనోపాధి నుండి నా మార్గములో ఎవడు ఖర్చు చేస్తాడో వాడు వాస్తవమయిన నా జ్ఞానమును తెలియగలడు''. మనిషి జీవితములో దైవము వైపునుండి ఇవ్వబడునవి ఉండవచ్చును, ఉండకపోవచ్చును. అయితే కర్మవైపు నుండి ఇవ్వబడునవి అనేకముండును. ప్రపంచములో ఏది లభించినా అది కర్మవైపు నుండి వచ్చినదే అయివుండును. ధనము వచ్చినా, రోగము వచ్చినా అన్నీ కర్మనుండి వచ్చును. ఇది అది అని చెప్పుటకు వీలు లేకుండా మనిషికి జీవితములో లభించునవన్నియూ కర్మనుండే లభించును. ఒక్క దేవుని జ్ఞానము తప్ప మిగతావన్నీ కర్మ ఫలితమేయని తెలియవలెను. జీవితములో దైవజ్ఞానము మాత్రము దేవుడు ఇచ్చుచున్నాడు. జ్ఞానమును దేవుడు తప్ప ఇచ్చువారు ఎవరూ లేరు. జ్ఞానము మినహా ప్రతీదీ కర్మవలన కల్గును. త్రాగేనీళ్ళ నుండి పడుకొనే పడక వరకు ప్రపంచ సంబంధ ప్రతి వస్తువు, ప్రతి ప్రపంచ జ్ఞానములు అన్నీ కర్మనుండే లభించును. మనిషికి దైవజ్ఞానము దేవునినుండే ప్రసాదింపబడును. అందువలన మూడవ మాటగా ''నేను ప్రసాదించిన జీవనోపాధినుండి ఎవరు ఖర్చు చేస్తారో'' అని చెప్పబడినది. దీని అర్థము ఇలా కలదు. దేవుడు ప్రసాదించే జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేయడమే దేవుని సేవగా భావించి, దైవజ్ఞానమును ప్రచారము చేయు కొలది అతడు చివరకు అతి రహస్యమైన ఆత్మజ్ఞానమును తెలియగలడు. దానివలన అతనికి ముక్తి లభిస్తుంది అని చెప్పియున్నారు. అయితే మనుషులు దేవుడు ప్రసాదించిన జ్ఞానమును ఇతరులకు పంచకుండా, దేవుడు చెప్పిన మాటను అర్థము చేసుకోలేక, కర్మప్రకారము సంప్రాప్తమైన ధనమును పేదవారికి దానము చేయుచూ దేవుని మాట ప్రకారము దేవుడిచ్చినది ఇతరులకు అంతో ఇంతో పంచుతున్నామని తృప్తి పొందుచున్నారు. దేవుడు ధనమిచ్చాడా? అని ఆలోచించడము లేదు. దేవుడు ఏమి ఇవ్వగలడని కొద్దిగ అయినా విచక్షణ లేకుండా పోయినది. కర్మప్రకారము ధనము రాగలదు. కర్మప్రకారము వచ్చిన ధనమును పంచితే తిరిగి కర్మేరాగలదు. దేవుని వలన వచ్చిన జ్ఞానమును పంచితే తిరిగి ఉత్తమమైన జ్ఞానము లభించగలదు. అయితే ఈ విషయములో మనిషి పొరపడి కర్మవలన వచ్చిన ధనమును పంచుతూ దేవుడు చెప్పినట్లు నడచు కొంటున్నానని అనుకోవడము పెద్ద పొరపాటు.
ఏ మనిషికయినా దేవుని జ్ఞానము ఒక్కమారుగా పూర్తి ఇవ్వబడదు. కొద్దికొద్దిగా లభించుచూ పోవుచుండును. మనిషికి కొద్ది జ్ఞానము తెలియగానే దేవుడు చెప్పిన జ్ఞానము ప్రకారము నడువగలిగితే తర్వాత ఇంకా కొంత ఉత్తమమైన జ్ఞానము తెలియును. ఇట్లు మనిషి జీవితములో అంచెలంచెలుగా జ్ఞానము లభించగా చివరకు దేవుని వాస్తవ జ్ఞానమర్థమయి పోవును. దానివలన మనిషికి పరలోక ప్రాప్తి కల్గును.
------
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
వజ్ర వాక్య వివరము
☞
1. సత్య తిరస్కారులు. (2-7)
భూమిమీద దేవున్ని ఏమాత్రము విశ్వసించనివారు కూడా కలరు. ముఖ్యముగా చెప్పితే కనిపించే మనుషులనూ, కనిపించని దేవతలను దేవుడు సృష్ఠించాడు. అయితే వారిలో కొందరు దేవున్ని విశ్వసించే వాళ్ళు యున్నారు, విశ్వసించని వాళ్ళు యున్నారు. మొత్తము జీవరాసులందరినీ ఈ విషయములో రెండుగా విభజించవచ్చును. కనిపించని దేవతల విషయము మనుషులకు సరిగా తెలియదు. దేవతలంటే తమకంటే గొప్పవారను భావము చాలామందిలో గలదు. దేవతలు మనుషులకంటే తక్కువ వారని చాలామందికి తెలియదు. దేవతలతో యున్న కొన్ని అనుభవముల చేత కొంత కాలమునకు వారు ఎంత గొప్పవారో, ఎంత నీచమైనవారో తెలియగలరు. అందరినీ సృష్ఠించిన దేవున్ని మనుషులు, దేవతలు ఆరాధించవలసి యున్నది. అయితే మనుషులు దేవున్ని పూర్తి మరచిపోయి దేవతలను ఆరాధించే దానికి మొదలు పెట్టారు. దానితో మనుషులకంటే నీచులయిన దేవతలు తమను తాము గొప్పవారిగా అనుకోవడము జరిగినది. దేవతల ఆరాధనతో మనిషి దేవున్ని, దేవుని జ్ఞానమును పూర్తిగా మరచిపోవడము జరిగినది.
దేవుడు అను ద్యాసగానీ, దేవుని జ్ఞానము అను జ్ఞప్తిగానీ లేని మనిషి ఇతరులు దేవున్ని ఆరాధించడము చూచి అసూయ చెందడమే కాక దేవున్ని పూర్తి తిరస్కార ధోరణిలో మాట్లాడడము మొదలుపెట్టాడు. ఈ విధముగా దేవున్ని కొందరు విశ్వసించగా, కొందరు విశ్వసించక తిరస్కారులుగా యున్నవారు గలరు. అటువంటి తిరస్కారులకు ఎంతగా చెప్పినా వారు ఏమాత్రము వినరు. ప్రపంచములో ఎన్నో చిన్న పెద్ద విషయములలో యోచించువారు దేవుని విషయములో ఏమాత్రము యోచించరు. దేవున్ని గురించి ఎంతో గొప్పగా చెప్పినా వారు ఏమాత్రము వినను కూడా వినరు. అటువంటి వారున్నారని దేవునికి బాగా తెలుసు. అందువలన అటువంటి తిరస్కారులను గురించి అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో సూరా రెండు, ఆయత్ ఏడులో ఇలా అన్నారు.
(2-7) ''అల్లాహ్ వారి హృదయాలపై, వారి చెవులపై ముద్రవేశాడు. వారి కళ్లపై పొర వుంది. ఇంకా వారికి మహా (ఘోరమైన) శిక్ష ఉంది.''
ఈ వాక్యములో వారి హృదయము, వారి చెవులు మూసివేయ బడినాయి. ముఖ్యమైన సామాగ్రికల పెట్టెకు బీగము (తాళము) వేసి తిరిగి దానిని ఎవరూ తీయకుండా లక్కతో దానికి ముద్ర వేయుదురు. అనగా వారి హృదయములో గల బుద్ధి దేవుని జ్ఞానమును గ్రహించదు. వారి చెవులు దేవుని జ్ఞానమును వినవు. అందువలన చెవులపై ముద్రవేశాడు అని అన్నారు. వారు తమ కళ్లతో జ్ఞాన గ్రంథాల వైపు చూడరు. వారి కన్నులకు పొర వుంది. కావున జ్ఞానము ఏమాత్రము కనిపించదు. అటువంటి మనుషులకు జ్ఞానము ఎంత మాత్రము చేరదు, దారులన్నీ మూసివేయబడ్డాయి అని చెప్పారు. బయట విషయము ఏదయినా తెలియాలంటే రెండు జ్ఞానేంద్రియముల ద్వారానే తెలియవలసియుంది. ఒకటి కన్ను, రెండు చెవ్వు. ఈ రెండూ మూసివేయబడినవంటే వారి హృదయములో గల బుద్ధికి కొద్దిగా కూడా అర్థము కాదని చెప్పుటకు కన్ను, చెవు, హృదయము మూసివేయబడినాయి అని చెప్పారు. దైవజ్ఞానము మనిషిలోనికి చేరుటకు ఒకటి కన్ను, రెండు చెవ్వు, మూడు హృదయము (బుద్ధి) ఈ మూడే ముఖ్యమైనవి. అందువలన దేవుడే ఈ మూడింటినీ మాయ చేత ముద్ర వేయించాడు. దేవుడు మనిషిని సక్రమమైన మార్గములో అయినా పంపును లేక అక్రమమైన మార్గములో అయినా పంపును. దేవుడు తనకు ఇష్టము లేని వారిని అలాగే చేయును. దానికి కారణము దేవున్ని మనిషి గౌరవించకపోగా విమర్శించుట వలన అటువంటి వారిని దేవుడు గుర్తు పెట్టుకొని తన మాయ చేత తనకు దూరముగా పంపును. తనకు దూరముగా మనిషి పోవుటకు చెవి, కన్ను మరియు బుద్ధి (హృదయమును) తాళము వేసి ముద్రవేశాడు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
2. దేవున్ని రెండుమార్లు తిరస్కరించిన వారు. (4-137)
దేవున్ని, దేవుని జ్ఞానమును కొంత ఆస్తిక భావము గలవారు మొదట కొంత విశ్వాసము కల్గియున్నా, తర్వాత వారు వారిలో దాగియున్న నాస్తిక భావము బయటికి రాగా, కొంచెమైనా విచక్షణా జ్ఞానము లేకుండా వారు తిరస్కారులుగా మారిపోయి, తిరిగి కొంత కాలమునకు విశ్వాసులుగా మారి, ఆ తర్వాత తిరస్కారులుగా మారువారు కొందరు అక్కడక్కడ యున్నారు. అటువంటివారిని గురించి అంతిమ దైవగ్రంథములో సూరా 4, ఆయత్ 137 యందు ఇలా చెప్పారు చూడండి.
(4-137) ''నిశ్చయముగా ఎవరైతే విశ్వసించిన తర్వాత తిరస్కరించి, మళ్ళీ విశ్వసించి ఆ తరువాత తిరస్కరించి, ఆ తిరస్కారములోనే పురోగమిస్తారో అలాంటివారిని అల్లాహ్ ఎన్నటికీ క్షమించడు మరియు సన్మార్గము వైపునకు దారి చూపడు.''
కొందరు దేవున్ని విశ్వసించి దానివలన ఇతరుల మీద పెత్తనమో, సమాజములో గౌరవమునో ఆశించియుందురు. అటువంటి పెత్తనముగానీ, అటువంటి గౌరవముగానీ దొరకనప్పుడు కష్టాలు వస్తున్నాయనో, దేవుని విశ్వాసము వలన రోగాలు ఎక్కువ వస్తున్నాయనో, డబ్బులు ఆదాయము తగ్గిపోయిందనో సాకు చూపి, అవిశ్వాసులుగా మారిపోయి తిరస్కార ధోరణిలో ఉందురు. అటువంటివారు కొంత కాలమునకు ఆధ్యాత్మికములో యుంటూ దేవుని మీద విశ్వాసము కల్గియుంటే, దానివలన డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చునని తలచి తిరిగి విశ్వాసులుగా మారినట్లు నటించుచుందురు. వారు ధనము మీద ఆశతో విశ్వాసులుగా నటించు వారైన దానివలన వారికి అనుకున్నంత డబ్బు రానందున అట్టివారు తిరిగి అవిశ్వాసులుగా మారిపోయి తర్వాత వారు తిరస్కారులుగానే కొనసాగుచుందురు. రెండుమార్లు వారి ఆశలు ఫలించకపోవడము వలన మూడవ మారు వారు విశ్వాసులుగా మారకుండా అవిశ్వాసులుగానే కొనసాగుచుందురు. విశ్వాసులుగా నటించుటకు వారు ఇతరులకంటే ఎక్కువ వాక్యములను నేర్చిన వారైనా, తిరిగి వారు విశ్వాసులుగా మారకుండా అవిశ్వాసులుగానే కొనసాగుచుందురు.
ప్రపంచ సంబంధ ఆశలను వదలి దేవున్ని విశ్వసించినవారు విశ్వాసములో నిలువ గలరు. అట్లుకాకుండా బయటి ఆదాయము కొరకు గానీ, హోదా కొరకుగానీ, గౌరవమునకుగానీ ప్రాకులాడువారు అది లభిస్తే విశ్వాసులుగానే యుందురు. ఒకవేళ ప్రపంచ సంబంధమైనవి ఏవి లభించకపోయినా అటువంటి వానికి దేవుని మీద విశ్వాసము తగ్గిపోతూ వచ్చును. అందువలన దేవుని జ్ఞానమును ప్రపంచ సంబంధ లాభముల తోనూ గౌరవములతోనూ, పదవులతోనూ ముడివేయకూడదు. అలా బయటి విషయములలో జ్ఞానమును ముడిపెట్టిన వాడు తనకు ఏమి నష్టము జరిగినా వాడు అవిశ్వాసిగా మారిపోవును. అంతటితో ఊరక యుండక తన నష్టమును కష్టమును చూపుచూ దేవున్ని విమర్శించుటకు మొదలుపెట్టును. దానివలన అటువంటివాడు విశ్వాసిగా మారలేడు. ఒకవేళ మారినా వాడు తొందరగా తిరిగి అవిశ్వాసిగానే కొనసాగును. అందువలన ఏ మనిషి అయినా జ్ఞానముతో విశ్వాసిగా మారవలెనుగానీ, ప్రపంచ విషయములతో సంబంధపడి విశ్వాసిగా మారకూడదు. ప్రపంచ విషయముల ధ్యాస యున్నవాడు దేవుని విశ్వాసములో ఇమడలేడు. ఈ విధముగా లెక్కించి చూచిన మనుషులలో విశ్వాసులు కొందరు, అవిశ్వాసులు చాలామంది కలరని తెలియుచున్నది.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
3. వారిని వారే మోసగించుకొంటున్నారు. (2-8, 9)
(2-8, 9) ''ప్రజలలో కొందరు మేము అల్లాహ్‍ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించాము అని అనే వారున్నారు. కానీ వాస్తవానికి వారు విశ్వసించేవారు కాదు. వారు అల్లాహ్‍ను, అల్లాహ్‍ను విశ్వసించిన వారిని ఇద్దరినీ మోసగిస్తున్నామని అనుకొంటున్నారు. కానీ వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మోసగించడము లేదు. అయితే వారది గ్రహించడము లేదు.''
చాలామంది ఆకారానికి ముస్లీమ్‍లుగా కనిపించుచున్నారు గానీ వాస్తవానికి వారిలో దేవుని మీద విశ్వాసము ఉండదు. ఉండక పోయినా దేవున్ని విశ్వసిస్తున్నామని చావును, చావులో జరిగే విధానమును నమ్ముచున్నామని అంటున్నారు. అయితే వారికి దేవుని మీద, అంతిమ దినము మీద వారికి విశ్వాసముండదు. వారికున్నదంతా మత ధ్యాసే ఉండును. మతమును, మత విధానములను తలచినంతగా దేవున్ని, అంత్యదినము అనగా చనిపోయిన దినమును గురించి వారు ఏమాత్రము ఆలోచించడము లేదు. పైకి కనిపించుటకు వేషధారణలో అందరికంటే పెద్ద ముస్లీమ్‍గా, అందరికంటే నిజమైన ముస్లీమ్‍గా కనిపించుచుందురు. అటువంటివారు నిజమైన ముస్లీమ్‍లని కొందరు నమ్మవచ్చును. దేవునికి మనుషుల భాషతో పనిలేదు. ఆయన భావమును గ్రహించును. అందువలన మతము కొరకు ముస్లీమ్‍లుగా యుండి అల్లా జ్ఞానమును ఏమాత్రము తెలియనివారిని దేవుడు తెలియగల్గును. వారి అంతరంగమందు దాగియున్న భావమును దేవుడు తెలియగలడు. అందువలన వారికి దైవగ్రంథములోని జ్ఞానము తెలియదనీ, వారు మతమునకు ముస్లీమ్‍లేగానీ జ్ఞాన విషయములో ముస్లీమ్‍లు కాదని దేవుడు తెలియగల్గును. అటువంటప్పుడు మత సంబంధ ముస్లీమ్‍లు ప్రజల దృష్ఠిలో ముస్లీమ్‍లుగా కనిపించినా దేవుని దృష్ఠిలో వారు ముస్లీమ్‍లు కారు. వారికి దేవుని జ్ఞానము మీద ధ్యాస లేనందున దేవుని మీద కూడా ధ్యాస ఉండదని చెప్పవచ్చును. వారు తాము ముస్లీమ్‍లని ఇతరులను మోసము చేయుచుందురు. అయితే వాస్తవానికి వారిని వారు మోసము చేసుకొంటున్నారు. ప్రజలు వారిని చూచి మోసపోయినా ప్రజలకు ఏమాత్రము నష్టముండదు. అయితే నష్టము ముస్లీమ్‍లుగా వేషము వేసిన జ్ఞానము తెలియనివారే ఎక్కువగా నష్టపోవుచున్నారు. అందువలన వారిని వారే మోసగించుకొనుచున్నారని చెప్పవచ్చును. దేవుడు పై వాక్యములో అదే మాటను చెప్పాడు.
1) ప్రశ్న :- సూరా రెండు, ఆయత్ ఎనిమిది (2-8) లో అంతిమ దినమును విశ్వసించినవారు ముస్లీమ్‍లు అని చెప్పారు. ముస్లీమ్‍లు అల్లాహ్‍ను విశ్వసించవచ్చును గానీ అంతిమ దినమును విశ్వసించడము ఏమిటి? అని ప్రశ్న రాగలదు. అంతిమ దినమును గురించి వివరముగా చెప్పవలెనని కోరుచున్నాము?
జవాబు :- ఈ విషయమును గురించి ముస్లీమ్‍లందరూ పొరపడిపోయారని చెప్పవచ్చును. అంతిమ దినము అంటే ఏమిటి? అని మేము ముందు వ్రాసిన ''అంతిమ దైవ గ్రంథములో జ్ఞాన వాక్యములు'' అను గ్రంథములో విపులముగా చెప్పియున్నాము. ఇప్పుడు ఈ గ్రంథములో కూడా వ్రాయబోవు సమాచారములో అంతిమ దినమును గురించి సందర్భానుసారముగా వివరించి చెప్పు ప్రయత్నము చేస్తాము. ఇప్పుడు స్థూలముగా కొంత సమాచారమును తెలియజేస్తాను. తర్వాత విపులముగా తెలియగలరు. అంతిమ దినము అనగా అందరికీ తెలిసిన అర్థము ప్రకారము చివరి దినము అని చెప్పవచ్చును. చివరి దినము అంటే జీవితమునకు చివరి దినము అని అర్థము. జీవితములో మరణము వచ్చిన రోజే చివరి దినమగును. అంతవరకు శరీరములో యున్న జీవుడు మరణములో ఏమగును? మరణము పొందిన దినమున అతనికి కల్గు అనుభవములేమిటి? అని ప్రశ్నించుకొని వాటి అన్నిటికీ సమాధానము తెలియడమే అంతిమ దినమును గురించి సంపూర్ణముగా తెలియడమగును. అంతిమ దినమున జీవాత్మ శరీరమును విడచిపోవును. అలా పోవడము ఒక సెకండులో జరిగిపోవును. ఆ సెకండు కాలములోనే ఆ జన్మలో ఆ జీవుడు చేసుకొన్న పాపపుణ్యముల లెక్క, దాని ప్రకారము సుఖదుఃఖములు అనుభవించవలెనని తీర్పు జరుగును. అయితే ఈ తీర్పు మీద ముస్లీమ్‍లకు ఎవరికీ నమ్మకము లేదు. వారి నమ్మకము అంతా ప్రళయ దినమున దేవుడు తీర్పు తీర్చుతాడని, ప్రళయ దినము భూమి ఆకాశములు పంచభూతములు అన్నీ నాశనమగు దినమని ముస్లీమ్‍ల అందరి నమ్మకము. ప్రపంచమునకు ప్రళయము అనునది లేనే లేదు. లేని ప్రళయమును గురించి చెప్పుకోవడము పెద్ద పొరపాటగుచున్నది.
2) ప్రశ్న :- ప్రళయమంటే ఏమిటి? అది ఎప్పుడు జరుగును?
జవాబు :- ప్రళయము అంటే పుట్టినదంతయూ నాశనమయి పోవడము. పంచభూతములు తమ విధులను నెరవేర్చక నిలిచి పోవడమును ప్రళయము అని చెప్పవచ్చును. శరీరములో యున్న పంచ భూతములు తమ విధులను నెరవేర్చలేక నిలిచిపోవడమును ప్రళయము అని చెప్పవచ్చును. ప్రళయములో శరీరమునందు పంచభూతములు నశించును. అంతేగానీ బయట కనిపించు అగ్ని, భూమి, నీరు, గాలి, ఆకాశము అన్నీ నశించి పోవునని అనుకోవడము పెద్ద పొరపాటు. బయట స్థూలముగా యున్నది ఏదీ నాశనము కాదు. అయితే పంచభూతముల చేత తయారయిన శరీరము నశించి పోవడమును ''ప్రళయము'' అని అంటున్నాము. శరీరములోని పంచభూతములు నాశనము కావడమును ప్రళయము అని అనవచ్చును. స్థూలముగా కనిపించు ప్రపంచము ఎప్పటికీ నాశనము కాదు. పుట్టిన శరీరములు నశించిపోవుచున్నవి. దానినే ప్రళయము అని అనవచ్చును. అంతిమ దినము యొక్క విషయములో చాలామంది పొరపడిపోయారు. అందువలన వాక్యములో అంతిమ దినమును గురించి చెప్పడము అయినది. మొత్తము ముస్లీమ్‍లు ''మనిషి చనిపోయిన తర్వాత శవమును భూమిలో గుంత తీసి పూడ్చడము చేయుచున్నారు. పూడ్చిన గుంతలో చనిపోయిన వారు ప్రళయ కాలము వరకు ఉంటారు'' అని చెప్పుచున్నారు. అలా చెప్పడము వలన వారిలో విచక్షణా జ్ఞానము పూర్తి లేకుండా పోయినదని అర్థమగుచున్నది. పది రూపాయల చిల్లరను తీసుకొన్నప్పుడు అందులో అర్ధ రూపాయి తక్కువయున్నా తిరిగి చిల్లర ఇచ్చిన వానిని అడిగి అర్ధ రూపాయి ఇప్పించుకొంటాము. ఇక్కడ పది రూపాయల వద్ద తక్కువ, ఎక్కువయని బుద్ధి పని చేసినప్పుడు మిగతా చోట కూడా అలాగే పని చేయాలి కదా!
చనిపోయిన వాని శరీరములో జీవుడే యుండడు. వాడు శరీరమును వదలిపోతే శరీరము శవము అయిపోతుంది. ఒకమారు శరీరమును వదలిపోయిన తర్వాత తిరిగి ఆ శరీరములోనికి జీవుడు చేరడు. శవమయిన శరీరములోనికి జీవుడు చేరేదానికి అవకాశమే లేదు. శవము దాదాపు ఆరు నెలలలో పూర్తి కుళ్ళిపోవును. ఎముకలు కొంత ఆలస్యముగా లేకుండాపోవును. జరిగే సత్యము అంతేకాగా, దేవుడు శవమును పూడ్చిన గుంతలో నుండి మనిషిని సజీవముగా లేపునని కొందరు చెప్పడము, వినిన మిగతా వారందరూ అట్లే జరుగునని అనుకోవడము, ఇతరులకు అలాగే చెప్పడము వలన, అదే నిజమని అందరూ అనుకోవడము జరుగుచున్నది. దేవుడు అనుకొంటే ఏమయినా చేయగలడని చెప్పుచున్నారు. దేవుడు ఎప్పుడూ శాస్త్రమునకు విరుద్ధముగా ఏదీ చేయడు. శవములోనికి జీవుడు చేరకూడదని దేవుడే నిర్ణయించి పెట్టినప్పుడు, దానిని దేవుడు ఎలా అతిక్రమించగలడు? 'భూసమాధినుండి చనిపోయిన జీవున్ని శరీరముతో సహా లేపుదును' అని దేవుడు తన వాక్యములో చెప్పిన మాట వాస్తవమే! అయితే దానిని అర్థము చేసుకోవడములో తప్పుగా అర్థము చేసుకొన్నారు. పూడ్చిన గుంతలో నుండి అనుకోవడము పెద్ద పొరపాటు. తల్లిగర్భమునుండి చనిపోయిన దినముననే అనగా అంతిమ దినమున మనిషిని శరీరముతో సహా లేపుదును అని దేవుడే చెప్పాడు. దానిని విచక్షణ లేనివారు ఎటు పడితే అటు అర్థము చేసుకోవడము వలన మిగతా వారందరూ దానినే నిజమని నమ్మారు. ఒక మనిషి చనిపోతే చనిపోయిన క్షణమే కర్మ లెక్కించబడి, తీర్పు తీర్చబడి రెండవ జన్మకు వచ్చి తల్లిగర్భమునుండి శరీరము బయటికి రాగా అందులో జీవుడు చేరుచున్నాడు. ఇదంతయూ ఒక్క క్షణములో జరిగిపోవుచున్నది. కావున 'అంతిమ దినమున' అన్నారు. అంతిమ దినము అనగా చనిపోయిన రోజు. అదే రోజే లేపబడుచున్నాడు. కావున చచ్చిన రోజే జీవుడు క్రొత్త శరీరముతో, క్రొత్త బుద్ధి, క్రొత్త మనస్సు మొదలగు వాటితో పుట్టుచున్నాడు. ఈ విషయము అర్థముకాక మనిషికి పునర్జన్మే లేదని మరొక అసత్యమును మనిషి చెప్పుచున్నాడు. మేము వ్రాసిన ''పునర్జన్మ రహస్యము'' అను గ్రంథము చదివితే చనిపోయిన వారు తిరిగి పుట్టిన తర్వాత వెనుకటి జన్మల జ్ఞాపకము వచ్చి చెప్పు సంఘటనలు అనేకము గలవు. అవన్నీ ప్రత్యక్ష సత్యములు అయినందున వాటిని అసత్యమని చెప్పుటకు వీలులేదు. దీనినిబట్టి మనిషికి పునర్జన్మలున్నా యని తెలియుచున్నది. ఇంత చెప్పినా నమ్మను అనే వారిని ఏమీ చేయలేము. వారి దారిన వారిని వదలి వేయడము మంచిది.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
4. మీరు సత్యాన్ని తెలిసియుండి దాచకండి. (2-42)
కొందరు తమముందు ప్రత్యక్షముగా యున్న సత్యమును తెలిసి కూడా తిరిగి అసత్యమునే చెప్పుచున్నారు. అలా వారు చెప్పుటకు కారణము మత నియమములని చెప్పుచున్నారు. ఒక ఇంటిలో దాదాపు 40 సంవత్సరముల వయస్సుగల వ్యక్తి హత్య కావింపబడ్డాడు. అతడు రెండు సంవత్సరముల తర్వాత అదే ఇంటిలోనే తిరిగి పుట్టడము జరిగినది. అతనికి వెనుకటి జన్మ జ్ఞాపకములు స్పురణకు రావడము మొదలుపెట్టాయి. అప్పుడు అదే ఇంటిలోని వారినందరిని గుర్తుపట్టాడు. అలా గుర్తుపట్టగా పుట్టిన పిల్లవాడు తమ ఇంటి మనిషేనని అందరికీ రూఢిగా తెలిసిపోయినది. దానితో మనిషికి పునర్జన్మలున్నవని, మనిషి చనిపోయిన తర్వాత వెంటనే తిరిగి జన్మకు వచ్చునని సాక్ష్యముగా అర్థమయిపోయినది. అయితే వారు ముస్లీమ్ కుటుంబము వారు. అందులోనూ ముస్లీమ్‍లందరికీ ఆ ఊరిలో బోధకుడుగా యున్నందున, ఇంటిలోపల పునర్జన్మల సత్యము తెలిసిపోయినా బయట బోధలో మనిషికి జన్మలు లేవు అని మొదటినుండి చెప్పినట్లే చెప్పుచుండెను. దీనినిబట్టి బోధకుడు ముస్లీమ్ అయినందున తనకు పునర్జన్మల విషయము సత్యమని తెలిసినా, సత్యమును అసత్యముతో కలిపి మతబోధ ప్రకారము జన్మలు లేవు అని చెప్పుచుండెను. ఇటువంటి వారిని చూచిన దేవుడు వారికి కనువిప్పు కల్గునట్లు సూరా రెండులో ఆయత్ 42 యందు ఇలా చెప్పియున్నాడు చూడండి.
(2-42) ''సత్యాన్ని అసత్యముతో కలిపి తారుమారు చేయకండి. మీకు తెలిసియుండి కూడా సత్యాన్ని దాచకండి.''
ఈ వచనమును చదివిన తర్వాత ముస్లీమ్‍లు చాలామంది సత్యమును తెలిసినా వారు మత నియమముల కొరకు సత్యమును దాచి అసత్యమును చెప్పుచున్నారని అర్థమగుచున్నది. ముఖ్యముగా బోధకుల స్థానములో యున్నవారు సత్యమును దాచి అసత్యమును బయటికి చెప్పుచున్నారని అర్థమగుచున్నది. అలా చేయవలసిన అవసరము ఏమి వచ్చింది? అని పరిశీలించి చూస్తే కేవలము మత అభివృద్ధి కొరకే అని అర్థమగుచున్నది. ఇది ఒక ముస్లీమ్ మతమునకే పరిమితము కాలేదు. ప్రతి మతములోనూ ఇదే విధానము కలదని తెలియుచున్నది. కొందరు తెలిసి అసత్య ప్రచారము చేయగా, కొందరు వారిని అనుసరించి పోవుచున్నారు తప్ప, తాము ఆచరించునది, తాము చెప్పునది సత్యమా అసత్యమా? అని ఏమాత్రము తెలియరు. కొందరయితే మా పెద్దలు చెప్పినట్లు మేము చెప్పవలసిందేగానీ మా స్వంతము ఏమీ చెప్పకూడదని అంటున్నారు. వారికి ఖుర్ఆన్ గ్రంథములో సత్యాన్ని దాచకండి యని (2-42) లో చెప్పిన మాట ఏమాత్రము తెలియదు. నేను మాత్రము దేవుని మాటను అనుసరించుచూ, దేవుని వాక్యమును గౌరవించుచూ సత్యమును ప్రజలకు తెలుపాలనుకొన్నాను. నేను హిందువునే అయినా ప్రథమ దైవగ్రంథమును అర్థము చేసుకొన్నాను కావున, దానిని అనుసరించే మిగతా రెండు గ్రంథముల జ్ఞానము ఉండుట వలన ఎక్కడయినా జ్ఞానము అజ్ఞానముగా ప్రజలకు అర్థమయివుంటే అది తప్పని నాకు తెలిసిపోవుచున్నది. సంగీతమును తెలిసినవాడు ఏ పాటయినా పాడును అన్నట్లు జ్ఞానము తెలిసిన వానికి ఏ సత్యమయినా తెలియగలదు. అందువలన జ్ఞాన విషయములో సత్యమును సులభముగా చెప్పగలుగు చున్నాను. ఎచ్చటయితే అసత్యమున్నదో అచ్చట సత్యమును తెలుపడమే నా కర్తవ్యముగా పెట్టుకోవడము వలన, నా బోధలు నిఘంటువువలె యుండుట వలన, ఇతరులు తెలియుటకు సులభమయినది. (2-42) లో గల దేవుని వాక్యమునకు గౌరవమును కల్గించునట్లు నేను సత్యమునే తెల్పుచూ ఈ గ్రంథమును వ్రాయపూనినాను. దీనివలన జ్ఞాన విషయములు, ఖుర్ఆన్ గ్రంథములో అర్థముకాని విషయములు కూడా సులభముగా అర్థము కాగలవు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
5. మూసాకు గీటురాయిని ఇచ్చాము. (2-53)
నేను సత్యమునే చెప్పి దేవుని వాస్తవిక జ్ఞానమును తెలియజేస్తానని చెప్పినా, కొందరికి నా మాట మీద కూడా సంశయము ఉండవచ్చును. నా మాటను నమ్మని వారు కూడా ఉండవచ్చును. అందువలన దేవుడు జ్ఞానములో ఏది సత్యము, ఏది అసత్యము అని తెలియుటకు మూసాకు గీటురాయిని ఇచ్చి పంపడము జరిగినది. దేవుడు మూసా అను ప్రవక్తకు దైవగ్రంథమును ఇచ్చాడు. ముందు దైవ గ్రంథమును మూసాకు ఇవ్వడమే కాక తర్వాత ''సత్యాసత్యమును వేరు చేసే గీటురాయిని ప్రసాదించాము'' అని దేవుడు చెప్పాడు. దానివలన గ్రంథములోని వాక్యములను ఎవరు గానీ అపార్థము చేసుకోకుండా, తప్పు భావముతో అర్థము చేసుకోకుండా సరైన అర్థము తెలియుటకు, సత్యమును స్వీకరించి అసత్యమును వదలుటకు గీటురాయిని ప్రసాదించాడు. దానివలన మాకు కూడా మేము చెప్పునది సత్యమేయని తెలియుటకు ఉపయోగపడుచున్నది. గీటురాయిని గురించి అల్లాహ్ (దేవుడు) తన గ్రంథములో సూరా రెండు, ఆయత్ 53లో ఈ విధముగా చెప్పుచున్నాడు చూడండి.
(2-53) ''మీరు సన్మార్గులవుతారని మేము మూసాకు గ్రంథాన్ని మరియు (సత్యాసత్యాలను వేరే చేసే) గీటురాయిని ప్రసాదించాము.''
''దివ్య ఖుర్ఆన్ సందేశము'' అను తెలుగు అనువాద గ్రంథము నుండి వాక్యమును తీసి వ్రాశాము. ''అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్'' అను తెలుగు అనువాద గ్రంథమునుండి అదే వాక్యమునే వ్రాయుచున్నాము. తెలుగు అనువాదకులు పదాలు తేడాతో వాక్యమును వ్రాసినా అనువాదకులందరూ ఒకే భావమునే ఉండునట్లు వ్రాసియుందురు. ఆ విషయమును తెలియుటకే ఇక్కడ దివ్య ఖుర్ఆన్ సందేశములోని వాక్యమును వ్రాయుచున్నాము చూడండి.
(2-53) ''ఇంకా మేము మూసాకు, మీ మార్గదర్శకత్వము నిమిత్తము గ్రంథాన్ని, గీటురాయిని ప్రసాదించాము.''
ఈ విధముగా రెండు గ్రంథములలోని వాక్యములను చూచినా, కొంత పదాల తేడాతో యున్నా ఒకే భావమునే తెలియజేయుచున్నవి. రెండు వాక్యములను చూచినా ప్రజలు సన్మార్గులవుటకు మొదట దైవగ్రంథమును మూసాకు ఇవ్వడము జరిగినది. తర్వాత అందులోని వాక్యములను ఎవరంతకు వారు ఇష్టానుసారముగా చెప్పుకోకుండా ఒక హద్దును ఏర్పరచుచూ మనుషులు అర్థము చేసుకొన్నది సత్యమో కాదో తేల్చి చూచుకొనుటకు మూసాకు దేవుడు గీటురాయిని కూడా ఇచ్చాడు. ఇక్కడ బాగా అర్థము చేసుకొంటే మూసాకు దేవుడు మొదట గ్రంథమును ఇచ్చాడు. తర్వాత సత్యాసత్యములను తేల్చి తెలుసుకొనుటకు గీటురాయిని ఇచ్చాడు అని వుంది. దీనినిబట్టి గ్రంథమువేరు, గీటురాయి వేరని తెలియు చున్నది. అలాగే ప్రతి మనిషి గ్రంథమును చదవవచ్చును. గ్రంథములోని విషయములను గీటురాయిని ఉపయోగించి సత్యమును తెలిసి అసత్యమును వదలి వేయవచ్చును.
ప్రశ్న :- గీటురాయి వేరు, గ్రంథము వేరని మీరంటున్నారా?
జవాబు :- నేను అనడము అటుంచి దేవుడు చెప్పిన ఖుర్ఆన్‍లోని (2-53) వాక్యాన్ని చూస్తే ఎవరికయినా గ్రంథము వేరు, గీటురాయి వేరని తెలియగలదు. గ్రంథము, గీటురాయి రెండూ ఒకటేయని కొందరను కోవచ్చును. అయితే దేవుడు ఇచ్చిన విచక్షణా శక్తి వలన గీటురాయి వేరు, గ్రంథము వేరని తెలియుచున్నది. ప్రతి చిన్న విషయమును విడదీసి తెలుపు విచక్షణా శక్తియే గీటురాయి అని కూడా అర్థము చేసుకోవచ్చును. గ్రంథమును అర్థము చేసుకొనులాగ చేయునది గీటురాయి. గీటురాయి వేరు, గ్రంథము వేరని తెలియవలెను. మూసాకు దేవుడు గ్రంథము ఇచ్చాడు. గ్రంథము ఇచ్చిన తర్వాత దాని పేరు తౌరాతుయని గ్రంథము ఇచ్చిన ఆయనే చెప్పాడు. గ్రంథము తర్వాత గీటురాయిని కూడా ఇచ్చాడు.
ప్రశ్న :- మీరు కొన్ని సందర్భములలో భగవద్గీత గీటురాయిగా ఉన్నదని చెప్పారు. అప్పుడు భగవద్గీత, గీటురాయి రెండూ ఒక్కటే అని కదా! అంతేకాక మీరు వ్రాసిన గీటురాయి గ్రంథములో 54వ పేజీయందు తౌరాతును గీటురాయిగా చెప్పారు. అలాగే భగవద్గీతను తౌరాతుగా చెప్పారు. అంతేకాదు మూడు దైవగ్రంథములను గీటురాయిగా పోల్చి చెప్పారు. ఇక్కడేమో గ్రంథము వేరు, గీటురాయి వేరు అని అంటున్నారు. మీరు చెప్పే మాటను మేము ఎలా అర్థము చేసుకోవాలి?
జవాబు :- ఎలా అర్థము చేసుకోవాలనునదే గీటురాయి. మనిషిలోని విచక్షణా జ్ఞానమునే గీటురాయి అని చెప్పుచున్నాము. గ్రంథము వేరు, గ్రంథమును అర్థము చేసుకొను విచక్షణా శక్తి వేరు. మొదట మూసాకు తౌరాతు గ్రంథమును అల్లాహ్ (దేవుడు) ఇచ్చినది వాస్తవమే. తర్వాత దానిని అర్థము చేసుకొను బుద్ధికి తగిన విచక్షణాశక్తిని ఇచ్చినది వాస్తవమే. అందువలన వాక్యములో గ్రంథమును మరియు గీటురాయిని రెండింటినీ ఇచ్చాను అని అన్నాడు. అందువలన గ్రంథము వేరు, గీటురాయి వేరని చెప్పాను. ఇకపోతే గీటురాయి గ్రంథములో మూడు దైవగ్రంథములయందు మూడు గీటురాళ్ళు కలవని చెప్పాము. దైవగ్రంథమును గీటురాయిగా ఎందుకు చెప్పామో అక్కడ మీరు ఎట్లు అర్థము చేసుకోవాలో వివరముగా తెలిపెదను. పాలను పూర్తిగా శీతలీకరణ చేసి చల్లగా చేస్తే పాలు ఐస్గా తయారగును. మన ఇంటిలోని ఫ్రిజ్‍లో ఐస్ ట్రేలో పాలను పోసి ఉంచితే పాలు ఐస్ ముక్కగా మారిపోవును. మనము తినే ఐస్గా, రుచికరముగా, తియ్యగా ఉండునట్లు పాల ఐస్‍ను తయారు చేసుకొనుటకు పాలలో కొంత చక్కెరను (పంచదారను) కలిపి, చక్కెర కలిపిన పాలను ఐస్ ట్రేలో పెట్టితే తియ్యని ఐస్ తయారగును. తియ్యని ఐస్‍ను విడదీసి చూస్తే అందులో పాలు+పంచదార రెండూ కలిసియున్నాయి. వాస్తవానికి పాలు వేరు, పంచదార వేరు. పాలు ద్రవ పదార్థము, పంచదార ఘన పదార్థము. ద్రవ పదార్థమైన పాలలో పంచదార కలిసిన దానివలన తియ్యని ఐస్ తయారయినది. పంచదార లేకుండా పాలే అయితే తీపిలేని చప్పని ఐస్ తయారయ్యేది. అది తినేదానికి యోగ్యముగా ఉండదు. పాలు మరియు పంచదార, ఐస్ ముక్క ఈ మూడు అర్థమయినవి కదా!
అలాగే పాలు గ్రంథముగా పోల్చుకొందాము, పంచదారను గీటురాయిగా పోల్చుకొందాము. ఈ రెండూ కలిపి తయారయిన ఐస్‍ను దైవ గ్రంథముగా లెక్కించుకొందాము. పాలు ద్రవ పదార్థముగా వేరుగా యున్నది. అలాగే చక్కెర ఘన పదార్థముగా వేరుగాయున్నది. రెండూ పరిమాణములోనూ, ఆకారములోనూ వేరువేరుగా యున్నవి. ఈ రెండింటినీ కలిపితే కలిసిపోవుచున్నవి. కలుపకపోతే వేరువేరుగా యున్నవి. గ్రంథమును పాలుగా పోల్చాము. దేశములో దైవగ్రంథములు మినహా ఎన్నో గ్రంథములు గలవు. చరిత్రలు గ్రంథ రూపముగా యుండును. చరిత్ర గ్రంథములను చదువునప్పుడు మనిషి ధ్యాస యంతయూ గత చరిత్రయంతయూ కథలాగ ఉండును కనుక దానిని మౌనముగా చదివి తెలుసుకోవలసిందే. చరిత్రలో ఎందరో రాజులు రాజ్యములు మారినా వాటిని తెలియుటకే మన బుద్ధి పరిమితమైయుండును గానీ అలా ఎందుకు జరిగింది? ఇలా ఎందుకు జరిగింది? అను ప్రశ్న రాదు. జరిగిపోయినది చరిత్ర కావున దానిని కథలాగ చదువవలసిందే!
నేడు మనకు ఎన్నో విషయములు జరుగుచున్నవి, ఎన్నో విషయములు జరిగి పోయినవి. అవి మన ఇష్టప్రకారము కాకుండా కర్మ ప్రకారము జరిగేవి అయినందున వాటిని ఎవరూ ఎందుకు ఇలా జరగాలి? అని ప్రశ్నించుటకు వీలులేదు. పూర్వము తయారయిన గ్రంథములన్నీ ఇతిహాసమునకు (చరిత్రకు) సంబంధించినవే. అందువలన వాటిని విచక్షణతో చదువవలసిన అవసరము లేదు. అవి అన్నియూ జరిగిన దానిని తెలియుటకు మాత్రమే చదువుచుండెడివారము. తర్వాత నాటికలు, పిట్టకథలు, పొడుపు కథలు, సామెతలు మొదలగు గ్రంథములు తయారయినా అవి చదివి తెలుసుకొనునవే గానీ, వాటి దగ్గర విచక్షణ అవసరమే లేదు. తర్వాత విద్య, వైద్య, విజ్ఞాన గ్రంథములన్నియూ చదివి నేర్చుకోవలసినవే గానీ ఇదెందుకు, అదెందుకు అను విచక్షణ అక్కడ కూడా అవసరము లేదు. ఇంకా కొంత కాలము గడువగా కలియుగము మొదలు, ద్వాపర యుగము చివర యుగ సంధికాలములో పురాణ కథల గ్రంథములు వ్యాసుని చేత వ్రాయబడినవి. అందులో భయముతో ముడివేయబడిన భక్తి యుండుట వలన అక్కడ కూడా మనిషి విచక్షణ అవసరము లేకుండా పోయినది. తర్వాత వేదములు, ఉపనిషత్తుల గ్రంథములు వ్యాసుని చేతనే తయారయి వచ్చినవి. పురాణములను చదివిన వారు వేదములను, ఉపనిషత్తులను చదివారు. అప్పటికే అనేక దేవతా పూజలయందు చిక్కుకుపోయిన వారు దేవతల మీద భక్తి వలన, భయము వలన ఉపనిషత్తులను వేదములను చదివారు. వాటియందు కూడా విచక్షణా జ్ఞానముతో పని లేకుండా చెప్పింది వినవలెను, చేయమన్నది చేయవలెను అని గ్రుడ్డిగా ఒకరిని చూచి మరొకరు పెద్దలు చెప్పినవి వినడము, చెప్పినది చేయడము తప్ప ఇదెందుకు? అదెందుకు? అను విచక్షణ ఎవరికీ ఏమాత్రము లేకుండాపోయినది. అంతవరకు మనిషికున్న విచక్షణయంతయూ బయట ప్రపంచ విషయములలో ఉపయోగపడేదే గానీ, స్వంతానికి ఏమాత్రము ఉపయోగ పడలేదు. తనకు సంబంధించిన విషయములన్నియూ బయటి ప్రపంచములో ఉన్నాయని అనుకొను మనిషి బయటి ప్రపంచములోనే తన బుద్ధి యొక్క విచక్షణను ఉపయోగించాడు.
మనిషి బుద్ధికి గల విమర్శనాశక్తినే విచక్షణా జ్ఞానము అని అంటున్నాము. ఆ విచక్షణా జ్ఞానమునే గీటురాయి అని క్రొత్తగా చెప్పబడినది. గీటురాయి అని పేరు రావడానికి ఒక కారణము గలదు. పూర్వ కాలము నేను చిన్నవయస్సులో యున్నప్పుడు దాదాపు అరవై సంవత్సరములప్పుడు నాకు ఏడు లేక ఎనిమిది సంవత్సరముల వయస్సులో ఇప్పటి రూపాయి ఆనాడు లేదు. బొట్టు, అర్ధ అణా, అణా, రెండు అణాలు, పావలా, అర్ధ రూపాయి, రూపాయి అను నాణెములు ఉండేవి. రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయలు, వంద రూపాయల నోట్లు ఉండేవి. అప్పటి చలామణి అంతయూ నాణెములు ఎక్కువగా ఉండేది. నోట్ల చలామణి తక్కువ ఉండేది. అప్పటి కాలములో అవన్నియూ బ్రిటీష్ గవర్నమెంటు తయారు చేసిన డబ్బుగా ఉండేది. నాణెముల మీద, నోట్ల మీద బ్రిటీష్ రాజుల ఫోటోలు ఉండేవి. అప్పటికి స్వాతంత్య్రము వచ్చి పది సంవత్సరములు అవుతుంది. ఆ పది సంవత్సరములలోనే అర్ధ రూపాయి బిల్లలు నకిలీవి తయారయినవి. అర్ధరూపాయి విలువ అప్పుడు వారము రోజులకు సరిపడు తిండి సరుకులు వచ్చేవి. అందువలన అర్ధరూపాయిని ఇస్తే ఇది నకిలీదా, అసలుదాయని జాగ్రత్తగా చూచేవారు. నకిలీది అని తెలిస్తే ఇది చెల్లదు అని వెనక్కు ఇచ్చెడివారు. అది నకిలీదా కాదా!యని తెలుసుకొనుటకు అర్ధరూపాయిని బండమీద గీచి చూచెడివారు. బండమీద గీకితే కొద్దిగ నల్లని చార బండమీద పడితే అది దొంగ బిళ్ళయనీ, నల్లని చార పడకపోతే మంచి బిళ్ళయనీ అనుకొనెడివారు. అర్ధరూపాయి బిల్లను రాయిమీద గీచి చూడడము ఇప్పటికీ నాకు బాగా జ్ఞాపకము కలదు. అప్పుడు అర్ధరూపాయిని ప్రతి దానిని రాయిమీద గీచి చూచెడివారు. అందువలన రాయిని గీటురాయి అని అప్పటినుండి అనడము అలవాటైపోయినది. అప్పటికే బంగారును గీచి చూచు రాయిని సానరాయి అని అనెడివారు. తర్వాత కాలములో సానరాయి అను పదము పోయి దానిని కూడా గీటురాయి అని చెప్పేదానికి అలవాటు పడిపోయారు. 1956, 57 లో అర్ధరూపాయిని అందరూ గీచి చూస్తున్నారని అప్పటి ప్రభుత్వమునకు చిన్నతనముగా ఉండేది. అందువలన 1957లో రూపాయికి 16 అణాలు అను మాటను లేకుండా మొత్తము నాణెములను తీసివేసి, రూపాయికి 100 పైసలు అను లెక్కలో నాణెములను పైసా, రెండు పైసలు, ఐదు పైసలు, పది పైసలు, 20 పైసలు, 50 పైసలు, రూపాయి నాణెములను తెచ్చారు. నేడు పైసానుండి 50 పైసల నాణెముల వరకు చలామణి లేకుండా పోయింది.
60 సంవత్సరములప్పుడు అందరూ అర్ధరూపాయిని గీచి గీచి చూడడము వలన ''గీటురాయి'' అను పేరు అందరికీ తెలిసిపోయినది. అంతేకాక ఆ దినములలో మనిషి అర్ధరూపాయిని చూస్తేనే అది దొంగదా, మంచిదాయని తెలియాలనుకొనెడివారు. అర్ధరూపాయి సత్యమైనదా, అసత్యమైనదాయని అక్కడ బుద్ధి పనిచేయడమును, దానిని పరీక్షించి తెలుసుకోవడమును విచక్షణ అని చెప్పవచ్చును. అది డబ్బు మీద గల విచక్షణ. అలాగే ప్రపంచ విషయములలో ప్రతి దానిమీద మనిషికి విచక్షణ ఉండేది. గుడ్డను చూస్తే అది ఎన్నో నంబరు దారముతో తయారయినదని పరిశీలించెడివారు. గుడ్డల షాప్లో అప్పుడు నేత చీరలు ఉండేవి. 50 నంబరు నూలు నుండి గుడ్డలు తయారయ్యేవి. అంగడి ఆయన చీరను చూపి ఇది నూరో నంబరు చీర అని చెప్పినా, కొనేవారు అతని మాటను నమ్మకుండా అది ఎన్నో నంబరు చీరయని జాగ్రత్తగా చూచెడివారు. ఒకవేళ అంగడి ఆయన తప్పు చెప్పియుంటే గుర్తించేవారు. అలా సరుకుల అంగడిలో సరుకుల నాణ్యతను చూచెడివారు. ఇచ్చే డబ్బుకు సరిపడు నాణ్యతయుంటే కొనేవారు. లేకపోతే ఇంకొక అంగడికి పోయేవారు. ఈ విధముగా బయటి ప్రపంచములో అడుగడుగునా బుద్ధి యొక్క విచక్షణను ఉపయోగించి చూచెడివారు.
అటువంటి విచక్షణను మనిషి తన స్వంత విషయములో అనగా ఆధ్యాత్మిక విషయములో ఏమాత్రము ఉపయోగించడము లేదు. నేడు మనిషి ప్రపంచ విషయములలో ఎంతో గొప్పగా విచక్షణను ఉపయోగించి చూచుచున్నాడు. అయితే భక్తి, జ్ఞాన, ఆత్మ జ్ఞాన విషయములలో ఎవరు ఏమి చెప్పితే దానినే వింటున్నారు. ఎలా చేయమంటే అలానే చేస్తున్నారు. బయట విషయములలో ఎంతో మేథావులుగాయున్న వారు కూడా గ్రుడ్డిగా యజ్ఞములు చేయుచున్నారు. విచక్షణ లేకుండా ఆరాధనలు చేయుచున్నారు. గురువులు, స్వాములనువారు ఏమి చెప్పితే అది చేస్తున్నారు. వంగు అంటే వంగుచున్నారు. నిలబడు అంటే నిలబడుచున్నారు. పవిత్రమని మురికి నీళ్ళలో మునగమంటే కూడా మునుగుచున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి తీర్థయాత్రలకు పోయి అపాయములలో చిక్కుకొంటున్నారు. ఎన్నో బాధలు పడుచున్నారు అయినా వారికి ఏమాత్రము విచక్షణ లేకుండా పోయినది. ఇది ఎందుకు చేయాలి? దానివలన లాభమేమి? అని ఆలోచించడము లేదు. మిగతా ప్రపంచ విషయములలో ఎంతో తెలివిగా యున్నవారు దైవిక విషయములలో గ్రుడ్డిగా ప్రవర్తించుచున్నారంటే వారికి విచక్షణ లేదని, బుద్ధిని వారు ఉపయోగించడము లేదని తెలియుచున్నది. దీనినిబట్టి చూచిన గ్రంథములోని విషయములను కూడా గ్రుడ్డిగా నమ్ము అవకాశమున్నందు వలన మనిషికి విచక్షణా శక్తి అవసరము అన్నాము.
మనిషి బుద్ధికి ఏదయితే విచక్షణా శక్తియుందో దానినే 'గీటురాయి' అని అన్నాము. ప్రపంచ సంబంధ ఏ గ్రంథములో కూడా గీటురాయిని మనిషి ఉపయోగించుకోలేదు. గ్రంథమును విమర్శించి జవాబును చూచునది గీటురాయి. గీటురాయి మనిషి మెదడులో ఉంటుంది. దీనిని బట్టి గ్రంథము వేరు, గీటురాయి అను మనిషి బుద్ధి వేరు. మనిషి ఏ గ్రంథములో కూడా తన బుద్ధిని ఉపయోగించలేదు. కావున దైవగ్రంథములో ఏమాత్రము తన బుద్ధిని ఉపయోగించి జ్ఞానము చూడడని తెలిసిన దేవుడు తన గ్రంథములో అంతరంగమును గురించి, బుద్ధిని గురించి కూడా చెప్పాడు. గ్రంథములో సంచలన విషయములను పెట్టి, మనిషి బుద్ధిని ఉపయోగించునట్లు చేశాడు. దైవగ్రంథములో మనిషి విచక్షణ బుద్ధి వేరు. గ్రంథము వేరు, అయితే దైవ గ్రంథమును దేవుడు మనకు ఇచ్చాడు. దైవ గ్రంథమును ఎవరు చదివినా వారి బుద్ధి పని చేయులాగున గ్రంథములో శక్తిని ఉంచాడు. అయితే మనిషికి గల శ్రద్ధనుబట్టి బుద్ధియొక్క విచక్షణ పని చేయులాగ దైవగ్రంథములో శక్తిని అమర్చాడు. దైవగ్రంథములో దైవశక్తి యున్నది. అది చదివిన వారి మీద పనిచేసి వారి బుద్ధి విచక్షణను పని చేయునట్లు చేయుచున్నది. ఆ శక్తి గ్రంథము చదివెడు మనిషి శ్రద్ధతో మిళితమై వాని శ్రద్ధ ఎంత ఉందో అంతే విచక్షణ పని చేయులాగ చేయుచున్నది. అందువలన నేడు ఒకే దైవగ్రంథము అనేక మందికి అనేక విధములుగా అర్థమయినది.
దైవము, దైవ జ్ఞానము మీద శ్రద్ధ మనుషులకు అనేక విధములుగా యున్నది. ఎంత శ్రద్ధయుంటే అంతే అవగాహనయుండును. దైవ గ్రంథములో గల శక్తి మనిషి శ్రద్ధతో కలిసినప్పుడు విచక్షణ ఏర్పడును. ఎంత విచక్షణ ఏర్పడునో అంతే జ్ఞానము దైవగ్రంథము నుండి లభించును. అందువలన భగవద్గీత గ్రంథములో జ్ఞానయోగమందు 39వ శ్లోకమున 'శ్రద్ధవాన్ లభతే జ్ఞానమ్' అని చెప్పియున్నారు. దేవుడు దైవ గ్రంథమును ఇచ్చి దానిని చూచిన వాని మెదడు మీద పని చేయు శక్తిని గ్రంథములో ఇచ్చాడు. ఆ శక్తి మనిషి శ్రద్ధ మీద ఆధారపడి పని చేయుట చేత శ్రద్ధను బట్టి గ్రంథములోని జ్ఞానము వానికి అర్థమగుచున్నది. ఒకనికి దేవుని మీద శ్రద్ధ నూరు పాళ్ళు యుంటే దేవుడు తన గ్రంథములో చెప్పిన జ్ఞానము నూరుపాళ్ళు అర్థమగును. శ్రద్ధ కేవలం పది శాతము ఉంటే వాని శ్రద్ధనుబట్టి పది శాతము జ్ఞానము అర్థము కాగలదు. జ్ఞానిగా నటించువానికి దైవము మీద శ్రద్ధ కేవలము ఐదు శాతము కలదనుకోండి, అప్పుడు వానికి ఐదు శాతము జ్ఞానమే లభించును. అందువలన నేడు ఒకే భగవద్గీతను అనేక విధముల అర్థము చేసుకొన్నవారు గలరు.
మూడు దైవగ్రంథములలో జ్ఞానశక్తి (దైవశక్తి) నిక్షిప్తమై యున్నది. కావున మూడు గ్రంథములు గీటురాయిగా ఉన్నవని చెప్పాము. గ్రంథములలో శక్తి విషయము ఎవరికీ తెలియదు, కావున మేము అలా చెప్పవలసి వచ్చినది. దీనిని గురించి విపులముగా తెలియుటకు (2-53)వ ఆయత్‍లో చెప్పిన విషయమును వివరించి చూచుకొందాము. అందులో మూసాకు గ్రంథమును మరియు సత్యాసత్యమును వేరు చేసే గీటురాయిని ప్రసాదించాము అన్నాడు. ఇప్పుడు మనము మూసా అను వ్యక్తినే మొదట మోషే అని పిలిచెడివారు. మోషే అను పదము కొంత కాలమునకు మూసాగా మారిపోయినది. మొదట ద్వాపరయుగము చివరిలో అనగా కలియుగము మొదటిలో ప్రథమ దైవగ్రంథము సంస్కృత భాషలో తయారయినది. చెప్పినవారు మొదట అల్లాహ్ కాగా, తర్వాత దానిని మనుషులకు చెప్పినవాడు సూర్యుడు (జిబ్రయేల్) కాగా, దానినే ద్వాపర యుగము చివరిలో కృష్ణుడు అర్జునునకు చెప్పగా అర్జునుని ద్వారా వ్యాసుడు తెలిసి, తనకు తెలిసిన దానిని గ్రంథరూపము చేశాడు. మొదట సృష్ఠ్యాదిలో చెప్పిన జ్ఞానము ఆకాశవాణి ద్వారా శబ్దముల రూపములో వినిపించగా దానినే సూర్యుడు గ్రహించి భూమిమీద మనువుకు చెప్పాడు. చివరకు సూర్యుడు మనువుకు చెప్పిన దానినే తిరిగి కృష్ణుడు అర్జునునకు చెప్పగా అది వ్యాసుని ద్వారా గ్రంథరూపము దాల్చినది. మొదట ఆకాశమునుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట కలియుగము మొదటిలో గ్రంథము కాగా, దానినే ''ప్రథమ దైవ గ్రంథము'' అని అంటున్నాము. ప్రథమ దైవగ్రంథము కంటే ముందు దైవజ్ఞానమునకు సంబంధించిన గ్రంథము ఏదీ లేదు.
ఆ విధముగా తయారయిన మొదటి దైవ గ్రంథము పేరు ఆనాడు, ఈనాడు భగవద్గీతయని భారతదేశములో చెప్పుకొన్నాము. భగవద్గీత తయారయిన వెంటనే కృష్ణుడు తన గ్రంథమయిన గీతను తీసుకొని పోయి ఇజ్రయేల్ దేశములోగల మోషే (మూసా) ప్రవక్తకు స్వప్నములో ఇవ్వడము జరిగినది. దీనికి సంబంధించిన విషయము మా రచనలలోని ''కృష్ణ మూస'' అను గ్రంథములో గలదు. మూసాకు ఇచ్చిన గ్రంథము భగవద్గీత అయినా మోషేకు తౌరాతు అను పేరును చెప్పాడు. మోషేకు తనవద్దకు వచ్చిన గ్రంథము పేరు తౌరాతుయని తెలియునుగానీ భగవద్గీతయని తెలియదు. భగవద్గీత అను పేరుకంటే తౌరాతు అను పేరే సరియైనదిగా లెక్కించిన అల్లాహ్ మోషేకు తౌరాత్యని చెప్పాడు. మోషేకు తౌరాతు గ్రంథము ఇవ్వబడినదిగానీ అప్పుడు గీటురాయిగా ఇవ్వబడలేదు. మోషే తౌరాతు గ్రంథమును చూచినా ఆయనకు అందులోని విషయము అర్థము కాలేదు. అప్పుడు మోషేకు గ్రంథములోని విషయమును తెలియాలను శ్రద్ధ ఎక్కువ అయినది. అంతేకాక మోషే చిన్నవయస్సులోనే దేవుని మీద పూర్తి శ్రద్ధ కల్గియున్నాడు. తౌరాతు గ్రంథములో శ్రద్ధనుబట్టి జ్ఞానము లభించునని చెప్పియుండుట వలన ఆ విధానము అమలు జరుగునట్లు మూసాకు గ్రంథము ఇచ్చిన మూడవ రోజు గ్రంథమునకు శక్తి ఇవ్వబడినది. ఆ దైవశక్తితో మనిషి శ్రద్ధ కలిసినప్పుడు గీటురాయి ఏర్పడుచున్నది. అనగా మనిషి శ్రద్ధను బట్టి దైవశక్తి వలన బుద్ధికి విచక్షణా జ్ఞానము ఏర్పడుచున్నది. ఎంత విచక్షణయుంటే అంత జ్ఞానము లభ్యమగుట జరుగుచున్నది. ఇది దేవుడు ఏర్పరచిన కొలమానము. దేవుడు ఏర్పరచిన కొలమానము ప్రకారము మనిషికి జ్ఞానము లభించడము జరుగుచున్నది. దైవశక్తి శ్రద్ధ కలిసినప్పుడే బుద్ధి విచక్షణ ఏర్పడగా, బుద్ధి విచక్షణ ఎంత కల్గునో అంతే జ్ఞానము లభించును. ఇది దైవ నిర్ణయము. అందువలన ''శ్రద్ధవాన్ లభతే జ్ఞానమ్'' అని గీతలో చెప్పారు.
మరొకమారు వివరముగా చెప్పితే మూసాకు అల్లాహ్ గ్రంథము ఇచ్చిన తర్వాత మరియు గీటురాయిని కూడా మూడు రోజులకు ఇవ్వడమైనది. గీటురాయి అనగా బుద్ధియొక్క విచక్షణా శక్తి. విచక్షణా శక్తికి కారణము దైవశక్తి. దైవశక్తిని దేవుడు మూడవ రోజు గ్రంథములో చేర్చాడు. దైవశక్తి + మనిషి శ్రద్ధ = గీటురాయి (విచక్షణాశక్తి). గీటురాయి వలన సత్యమైన జ్ఞానము మనిషికి తెలియబడుచున్నది. ఒక బోధకునికి తన మతము మీదయున్న శ్రద్ధ దైవము మీద లేదు. ఆ బోధకుడు దైవమును అడ్డము పెట్టుకొని మతమును ప్రచారము చేయుచుండెను. అటువంటి వానికి వాని దైవ గ్రంథమునుండి జ్ఞానము తప్పు భావములో లభించినది గానీ అసలయిన జ్ఞానము లభించలేదు. వానికున్న శ్రద్ధ నూటికి ఐదు పాళ్ళే అయినందున అతనికి దైవజ్ఞానము కూడా ఐదు పైసలంతే అర్థమయినది. అతనివద్ద యున్న మిగతా 95 పైసలు జ్ఞానము మాయా జ్ఞానము తప్ప ఏమీ లేదు. దైవ గ్రంథములోని జ్ఞానము అతనికి అజ్ఞాన భావముగా అర్థమయినది తప్ప జ్ఞానమార్గములో అర్థము కాలేదు. అందువలన అతడు బోధకుడైయుండి, ప్రజలకు గొప్ప జ్ఞానిగా కనిపించు చుండినా, ప్రజలలో గొప్ప గౌరవ మర్యాదలుండినా దైవమార్గములో అతనికి వచ్చిన లాభము ఏమీ లేదు. అతనికి గీటురాయిలాంటి విచక్షణ లేనందున జ్ఞానము తెలియకుండా పోయినది. విచక్షణ లేకుండా పోవడానికి కారణము అతనికి దేవుని మీద శ్రద్ధ తక్కువ కలదని చెప్పవచ్చును. భూమిమీద గురువులను, జ్ఞానులను, స్వాములను మతము అను మాయ ఆవహించి యున్నది. అందువలన అందరికీ మతము మీద శ్రద్ధను మాయ కల్గించు చున్నది. దేవుని మీద శ్రద్ధ లేనిదానివలన నేడు బోధకులయిన వారికే దైవ గ్రంథములలోని జ్ఞానము తెలియకుండా పోయినది.
ప్రశ్న :- నేను ఇప్పుడు మిమ్ములను ముక్కుసూటిగా ఒక ప్రశ్న అడుగు చున్నాను. మీరు బుద్ధి సూటిగా జవాబు చెప్పండి? దేవుడు తన గ్రంథమయిన తౌరాతు గ్రంథమునకు ఒక్కదానికే దైవశక్తిని ప్రసాదించాడు. తౌరాతు గ్రంథమును ఒక్క మోషే (మూసా) తప్ప ఎవరూ చూడలేదు. అటువంటప్పుడు భగవద్గీత తర్వాత మూడు వేల సంవత్సరములకు తయారయిన బైబిలు (ఇంజీలు) గ్రంథమునకు దైవశక్తిని దేవుడు ఇచ్చాడా? ఎప్పుడిచ్చాడు? బైబిలు తర్వాత ఆరువందల సంవత్సరములకు తయారయిన ఖుర్ఆన్ గ్రంథమునకు శక్తిని ఇచ్చాడా? ఎప్పుడిచ్చాడు? మీరు మూడు గ్రంథములకు శక్తి ఉన్నదని చెప్పారు. వాస్తవముగా మిగతా రెండు గ్రంథములకు శక్తి యున్నదా?
జవాబు :- దేవుడు ఒక్క తౌరాతు గ్రంథమునకు మాత్రము శక్తిని ఇచ్చాడు. మిగతా రెండు గ్రంథములకు శక్తిని ఇవ్వలేదు. అయినా వాటియందు తౌరాతులో యున్న దైవశక్తి కలదు. అయితే దేవుడు ఇవ్వకుండా వాటిలో శక్తి ఎలా వచ్చినదని కొందరు ప్రశ్నించవచ్చును. దానికి మా సమాధానము ఇలా కలదు. తౌరాతు గ్రంథములో ఉన్న జ్ఞానమే మిగతా రెండు గ్రంథముల యందు ఉండుట వలన తౌరాతు గ్రంథములోని జ్ఞానజ్యోతి, మార్గ దర్శకత్వము ఉండుట వలన తౌరాతు గ్రంథములోని దైవశక్తి మిగతా రెండు గ్రంథములయందు కలదు. తౌరాతు గ్రంథములోని జ్ఞానమే మిగతా రెండు గ్రంథములలో ఉన్నదనుటకు నిదర్శనముగా అంతిమ దైవ గ్రంథము లోని కొన్ని ఆయత్‍లను ఇక్కడ చెప్పుకొందాము. మొదట సూరా 5, ఆయత్ 46లో వ్రాసియున్న సమాచారమును చూద్దాము.
(5-46) ''ఆ ప్రవక్తల తర్వాత మేము మర్యం (మరియమ్మ) కుమారుడు ఈసాను (ఏసును) పంపాము. అతను తనకు పూర్వము వచ్చిన తౌరాతు గ్రంథమును సత్యమని ధృవీకరించేవాడు. మేము అతనికి ఇంజీలు (బైబిలు) గ్రంథాన్ని ఇచ్చాము. అందులో మార్గదర్శకత్వము, జ్యోతి ఉన్నవి. అది తనకు ముందున్న తౌరాతు గ్రంథమును ధృవీకరించుచున్నది. అంతేకాక అది దైవభీతి కలవారికి మార్గదర్శినిగా, హితోపదేశినిగా ఉన్నది.''
(5-48) ''మేము నీవైపుకు ఈ ఖుర్ఆన్ గ్రంథమును సత్య సమేతముగా అవతరింపజేశాము. ఇది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను (తౌరాతును, ఇంజీలును) సత్యమని ధృవీకరించు చున్నది. నీవద్దకు వచ్చిన సత్యమును వీడి వారి మనోవాంఛలను అనుసరింపకు.''
(5-44) ''మేము తౌరాతు గ్రంథమును అవతరింపజేశాము. అందులో మార్గదర్శకము, జ్యోతి ఉన్నాయి. ఆ తౌరాతు గ్రంథ ఆధారముగానే ముస్లీమ్‍లయిన ప్రవక్తలు, రబ్బానీలు, ధర్మవేత్తలు యూదుల సమస్యలను పరిష్కరించేవారు.''
(5-68) ''ఓ గ్రంథవాహకులారా! మీరు తౌరాతును, ఇంజీలును (భగవద్గీతను, బైబిలును) మీ ప్రభువు తరపున మీవద్దకు పంపబడిన దానినీ (ఖుర్ఆన్ గ్రంథమును) మీ జీవితాలలో నెలకొల్పు వరకు మీరు ఏ ధర్మము పైనా లేనట్లే.''
(62-5) ''తౌరాతు గ్రంథము ప్రకారము ఆచరించాలని ఆదేశించి నప్పటికీ, దానికి అనుగుణముగా ఆచరించని వారు ఎన్ని గ్రంథములను అనుసరించినా ప్రయోజనము లేదు. అటువంటి వారిని గ్రంథములను వీపు మీద మోయు గాడిదలాంటి వారని ఉపమానముగా చెప్పవచ్చును. దేవుని వాక్యములను ధిక్కరించిన వారి దృష్టాంతము చాలా చెడ్డది. దుర్మార్గపు జనులకు అల్లాహ్ సన్మార్గమును చూపడు.''
(2-89) ''వారివద్ద ముందు నుంచి యున్న దైవగ్రంథాన్ని (భగవద్గీతను) ధృవీకరించే గ్రంథము (ఖుర్ఆన్) అల్లాహ్ (దేవుని) వద్దనుండి వచ్చినది.''
(10-37) ''ఖుర్ఆన్ గ్రంథము దేవుడు పంపిన వాణి ద్వారా కాకుండా ఇతరుల కల్పనతో వ్రాయబడిన గ్రంథము కాదు. పైగా ఇది తనకంటే ముందు అవతరించిన (తౌరాతు, ఇంజీలు) గ్రంథాలను ధృవీకరించే గ్రంథము. ఇంకా ముందు గ్రంథములలోని ముఖ్య విషయములను విపులీకరించేదిగా యున్నది.''
(5-43) ''దైవాదేశాలు పొందు పరచబడియున్న తౌరాతు గ్రంథము తమవద్ద యున్నప్పటికీ వారు నిన్ను ఎట్లు న్యాయ నిర్ణేతగా చేసుకొంటున్నారు. యదార్థమేమి అంటే తౌరాతును మరచిన వారు అసలు విశ్వాసులే కాదు.''
ఈ ఎనిమిది వాక్యములను చూచిన తర్వాత ఖుర్ఆన్ గ్రంథమునకు ఆధారము తౌరాత్యని చెప్పక తప్పదు. ఖుర్ఆన్ తౌరాతు ఆధారముగా పుట్టినదగుట వలన, తౌరాత్ జ్ఞానమే ఖుర్ఆన్‍లో ఉండుట వలన, తౌరాత్‍లో గల దైవశక్తి ఖుర్ఆన్ గ్రంథములో కూడా యున్నదని చెప్పవచ్చును. కొన్ని మనుషుల కల్పిత వాక్యములు తప్ప మిగతా ఖుర్ఆన్ గ్రంథమంతా తౌరాత్ జ్ఞానమే ఉండుట వలన తౌరాత్‍లోని దైవశక్తియే ఖుర్ఆన్ గ్రంథములో కూడా కలదు. అందువలన భగవద్గీత తర్వాత వచ్చిన ఇంజీలు, ఖుర్ఆన్ గ్రంథములలో తౌరాత్ గ్రంథములోని దైవశక్తే కలదని చెప్పవచ్చును. దైవశక్తియున్న గ్రంథము వలన మనిషి శ్రద్ధనుబట్టి గీటురాయి మనిషి తలలో ఉద్భవించగా, గీటురాయిని బట్టి (విచక్షణా శక్తిని బట్టి) మనిషికి దైవజ్ఞానము లభించుచున్నది.
తౌరాతు గ్రంథమును ఎవరూ చూడలేదు. మోషే (మూసా) ప్రవక్తకు మాత్రము తౌరాతు అంటే ఏమిటో తెలుసు. మోషే చెప్పిన తౌరాత్‍లోని విషయములను అన్నిటినీ కలిపి మోషే ధర్మశాస్త్రము అని అన్నారు. తౌరాత్ పేరుతో ఎవరుగానీ గ్రంథమును చూడలేదు. అయితే ఖుర్ఆన్‍లో (5-43) లో 'తౌరాత్ గ్రంథము తమవద్ద యున్నప్పటికీ' అని వ్రాశారు. ఈ మాటను బట్టి తౌరాతు గ్రంథము నేడు మనవద్ద యుందని చెప్పవచ్చును. అయితే నేడుగానీ, గతములోగానీ తౌరాతు గ్రంథమును చూచిన వారిలో ఒక్క మోషే తప్ప ఎవరూ లేరు. అటువంటప్పుడు ఐదవ సూరా 43వ ఆయత్‍లో చెప్పిన మాట వాస్తవమేనా? యని ప్రశ్న రాగలదు. తౌరాత్ అను పేరు మధ్యలో వచ్చినదే గానీ, గ్రంథము తయారయినప్పుడు పెట్టిన పేరు కాదు. తౌరాత్ యను పేరు గ్రంథమును మోషేకు ఇవ్వబడినప్పుడు స్వయముగా గ్రంథమును ఇచ్చినవారు చెప్పిన పేరు. మోషే తర్వాత ఆ దేశములో ఎవరుగానీ తౌరాత్ గ్రంథమును చూచిన వారు లేరు. తౌరాత్ యొక్క విషయము అంతే!
తౌరాత్ అను పేరు పెట్టక ముందు ఆ గ్రంథము భారతదేశములో పుట్టినది. గ్రంథమును వ్రాసిన వాడు వ్యాసుడు. గ్రంథమును చెప్పిన వాడు కృష్ణుడు. కృష్ణునికంటే ముందు సూర్యుడు చెప్పాడు. సూర్యుడు ఆకాశవాణి ద్వారా వచ్చిన జ్ఞానమును విని కృతయుగములో భూమిమీద చెప్పాడు. తర్వాత ద్వాపరయుగములో కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు చెప్పగా, అర్జునుడు విని వ్యాసునికి చెప్పగా వ్యాసుడు గ్రంథముగా వ్రాశాడు. అదియే ప్రథమ దైవగ్రంథము. భూమిమీద మొదట వెలసిన ప్రథమ దైవ గ్రంథమునకు గ్రంథమును వ్రాసిన వ్యాసుడే భగవద్గీతయను పేరును పెట్టాడు. ఈనాడు (5-43) వాక్యములో చెప్పినట్లు తౌరాతు గ్రంథము మారు పేరుతో, మొదటి పేరుతో మన వద్దయున్నది. అందువలన ఖుర్ఆన్‍లోని 5-43వ వాక్యము ఏ విధముగా తప్పు కాదు. భగవద్గీతను తౌరాతుగా వెదకితే అది ఎక్కడా లేదు. భగవద్గీతను తౌరాతుగా తలచి వెదికితే అది మనవద్ద కలదని చెప్పవచ్చును.
ప్రశ్న :- తౌరాత్ గ్రంథము (భగవద్గీత) తర్వాత దైవశక్తి గల గ్రంథము రాలేదంటారా?
జవాబు :- రాలేదని చెప్పుటకు వీలులేదు. తౌరాతు గ్రంథములో దైవశక్తిని దేవుడు మూసా ప్రవక్తకు గ్రంథమును ఇచ్చిన తర్వాత మూడవ రోజు గీటురాయి అను పేరుగల విచక్షణాశక్తి మూసాకు ఇవ్వబడినది. అదే శక్తి అదే జ్ఞానమున్న మిగతా రెండు గ్రంథములలో ఇవ్వబడినది. ఈ పద్ధతి ప్రకారము మూడు దైవగ్రంథముల జ్ఞానము ఏ గ్రంథములో యున్నా, ఆ గ్రంథములో దైవశక్తి దానంతట అదే చేర్చబడుచున్నది. నేడు తయారయిన గ్రంథములలో దైవశక్తి చేరియున్నదని అదే గీటురాయిగా మనని తయారు చేయుచున్నదని చెప్పినా ఆ విషయమును ప్రజలు నమ్మలేరు. అందువలన నేడు ఎక్కడయినా తౌరాతు గ్రంథమును పోలిన గ్రంథము తయారయివుంటే అందులోని దైవశక్తి భగవద్గీతలో కనపడక యున్నట్లు చెప్పవచ్చును. భగవద్గీతలో కనిపించక నిక్షిప్తమైయున్న దైవశక్తి నేడు ఏ గ్రంథములోయున్నా, గ్రంథములో అణిగియుండక బయటి ప్రపంచమునకు తెలియునట్లు ఉండును. గ్రంథములోని శక్తి బయటికి తెలియుచున్నా, మనిషి ప్రత్యక్షముగా దానిని చూచినా, అనేక అనుమానముల వలన గ్రంథములోని దైవశక్తిని నమ్మలేడు. ఇతరులకు దైవశక్తి గల గ్రంథములు ఏవయినా తెలుసో, తెలియదోగానీ నాకు మాత్రము ఫలానా గ్రంథములే దైవశక్తి గలవని తెలుసు.
ఇక్కడ మోషే ప్రవక్త చరిత్రను కొంత తెలియవలసిన అవసర మున్నది. అందువలన మా రచనలలోని ''కృష్ణ మూస'' గ్రంథము నుండి సేకరించిన సమాచారమును చూస్తాము
కృష్ణుడు సాధారణ మనిషి కాదు. ఆయన ప్రత్యేకముగా వచ్చిన భగవంతుడు. భగవంతుని శరీరములో మూడు ఆత్మలు యున్నా, ఆత్మ తన పని తాను చేసినా, జీవాత్మ అయినవాడు కర్మ లేనివాడు, ప్రత్యేకమైనవాడు. అతనికి అందరివలె మరణముండదు. 'జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల' యన్నట్లు ఆయనకు మరణములు వర్తించవు. అట్లే అందరివలె పుట్టుక కూడా వర్తించదు. తండ్రి వీర్యకణముతో సంబంధము లేకుండా పుట్టిన ఆయనకు అందరివలె పుట్టుక ఎట్లు లేదో అట్లే ఆయనకు అందరివలె జీవుడు శరీరమును వదలి చనిపోవడము లేదు. ఆయన కర్మతో సంబంధము లేనివాడు. ఒకచోట చనిపోయి మరొకచోటికి పోవుటకు అతనికి కర్మలేదు. స్వయం నిర్ణయము ప్రకారము ఆయన పుట్టుక యుండును మరియు చావు వుండును. ఆయన ప్రస్తుతము భగవంతుడయినా ఆయనే మూడవ శక్తి అయిన పరమాత్మ (దేవుడు). అందువలన ఆయనను శాసించు శక్తి ఏదీ లేదు. ఆయన ధర్మసంస్థాపన కొరకు స్వయం నిర్ణయమును తీసుకొనును. భవిష్యత్తు ప్రణాళికను అనుసరించి ఆయన చేయు పనులుండును. తన రెండవ రాకను గురించి బోయవానికి కొంత సమాచారమును తెల్పిన కృష్ణుడు, అదే సమాచార నిమిత్తము ఇజ్రయేల్ దేశ సమీపములోనున్న ఒక ప్రవక్త శరీరములోనికి ప్రవేశించాడు. అప్పటి కాలములో జ్ఞాన సమాచారమును అందించు వ్యక్తిని ప్రవక్త అనడము సహజము. అది కొంత జ్ఞానమయినా కావచ్చును లేక ఎక్కువ జ్ఞానమయినా కావచ్చును. మొత్తము మీద జ్ఞాన సమాచారమును అందించు ప్రవక్తగా యున్న వ్యక్తికి కృష్ణుని మరణ సమయమునకు అతని మరణము కూడా నిర్ణయింపబడియుండెను. అతని పేరు ''మోషే'' అని చెప్పబడుచుండెను. మోషే ప్రవక్త ఆ సమయమునకు చనిపోవునను విషయము కృష్ణునికి తప్ప ఎవరికీ తెలియదు. మోషేకు కూడా తెలియదు. మోషే సాధారణ మనిషే అయినందున తన మరణమును గురించి మోషేకు తెలియదు.
సర్వ సృష్ఠికర్తయిన అల్లాయే (దేవుడే) మోషేను ఆ ప్రాంతములో పేరుపొందిన ప్రవక్తగా చేసియుంచాడు. మోషే 54 సంవత్సరములు బ్రతికాడు. మోషే 54 సంవత్సరములు బ్రతుకునట్లు, మోషే చనిపోవు సమయమునకు కృష్ణుడు చనిపోవునట్లు ముందే నిర్ణయము జరిగినట్లు ఎవరికీ తెలియదు. కృష్ణునికి మాత్రము అన్నీ తెలిసే జరిగినవి. ఆయన స్వయముగా దేవుడే అయివున్నందున ఆయనకు అన్నీ తెలుసు. మోషే చనిపోయిన క్షణములోనే కృష్ణుడు చనిపోయి మోషే శరీరములో ప్రవేశించు నట్లు నిర్ణయించుకున్నాడు. మోషే ప్రవక్త చనిపోవడము, కృష్ణ భగవాన్ చనిపోవడము ఒకేమారు జరిగినది. కృష్ణుడు తన శరీరములో లేకుండా పోయి మోషే శరీరములో ప్రత్యక్షమయినాడు. అలా మోషే శరీరములో చనిపోయినట్లు ఎవరూ గుర్తించలేదు. మోషే చనిపోయినా అందులో కృష్ణుడు యుండుట వలన మోషే సాధారణముగా బ్రతికేయున్నాడని అందరూ అనుకొన్నారు. కృష్ణుడు మోషేవలెనే వుండి జ్ఞానమును చెప్పుచుండుట వలన కృష్ణున్ని ఎవరూ గుర్తించలేదు, అందరూ మోషేనే మాట్లాడుచున్నాడని అనుకోవడము జరిగినది. కృష్ణుడు చనిపోయినట్లు భారతదేశములోనున్న వారికి తెలిసినా, అతను మోషేగా ఇతర దేశములో యున్నాడని మాత్రము తెలియదు.
ప్రశ్న :- ప్రపంచములో ఎందరో ప్రవక్తలుండగా మోషే ప్రవక్త శరీరమునే కృష్ణుడు ఎందుకు ఎంచుకున్నాడు?
జవాబు :- ఇది మంచి ప్రశ్నే! సమయానుకూలముగా అడుగవలసిన ప్రశ్నే. దీనికి నా జవాబు ఏమంటే కృష్ణుడు భగవద్గీతను చెప్పిన తర్వాత వ్యాసమహర్షి కృష్ణుడు చెప్పిన జ్ఞానమును గ్రంథరూపము చేయుటకు దాదాపు రెండు సంవత్సరములు పట్టినది. స్వచ్ఛమయిన కల్తీ లేని భగవద్గీత అప్పుడుండేది. వ్యాసుడు చనిపోయిన తర్వాత కొందరు స్వార్థవరులు వారి స్వార్థముతో కొన్ని శ్లోకములను కలుపడము జరిగినది. మొదట తయారయినది కలుషిత శ్లోకములు లేని భగవద్గీతగా యుండెడిది. కృష్ణుడు 90 సంవత్సరముల వయస్సులో అర్జునునకు సృష్ఠ్యాదిలోని జ్ఞానమును చెప్పగా, తర్వాత రెండు సంవత్సరముల కాలములో అది గ్రంథరూపముగా మారగా దాని పేరు 'భగవద్గీత' యని చెప్పుకొన్నాము. మోషే 54 సంవత్సరములు బ్రతుకగా, కృష్ణునికి 92 సంవత్సరముల వయస్సులో భగవద్గీత తయారయినది. భగవద్గీత తయారయిన సమయానికి మోషే వయస్సు సరిగా 20 సంవత్సరములుండును. 20 సంవత్సరముల తర్వాత 34 సంవత్సరములు మోషే బ్రతికాడు. అలాగే కృష్ణుడు కూడా 92 సంవత్సరముల తర్వాత 34 సంవత్సరములే బ్రతికాడు.
మోషేకు ఇరువది (20) సంవత్సరముల వయస్సులో ఒక శుభ దినము ఏర్పడినది. అప్పటినుండి మోషే అప్పుడప్పుడు కొంత జ్ఞానమును చెప్పుచూ మంచి వక్తగా మారిపోయాడు. తర్వాత ఆయనను ప్రవక్త అని అందరూ అన్నారు. 20 సంవత్సరములనుండి ఆయన జీవితములో ఒక క్రొత్త వెలుగు వచ్చినది. 92వ సంవత్సరములో కృష్ణునిలో కూడా ఒక తృప్తి ఏర్పడినది. అప్పుడు జరిగిన విశేషము ఏమి అనగా! మోషేకు 20 సంవత్సరములు గడచు కాలమున ఒక దినము ఆదివారము రాత్రి నడిరేయి గడచిన సమయములో స్వప్నము రావడము జరిగినది. ఆ స్వప్నములో కృష్ణుడు కనిపించి గ్రంథమైన తన భగవద్గీతను మోషేకు ఇవ్వడము జరిగినది. మోషే తన స్వప్నములో కృష్ణున్ని చూచినా కృష్ణుడు ఎవరో తనకు తెలియదు. అయితే స్వప్నములో కనపడిన కృష్ణుడు ఎంతో తేజస్సు కల్గియుండడమును చూచిన మోషే అతను నిజముగా దేవుడని నమ్మాడు. తేజస్సుతో కనిపించిన కృష్ణుడు మోషేకు భగవద్గీతా గ్రంథమును ఇచ్చి ఇది తౌరాత్ గ్రంథమని చెప్పడమైనది. మోషే స్వప్నములో గ్రంథమును తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు. అంతే! అతని మెదడులో మెరుపు మెరిసినట్లయినది. మోషేకు ఒక్కమారుగా మెలుకువ వచ్చినది. మెలుకువ వచ్చిన తర్వాత కూడా గుండె వేగముగా కొట్టుకొనుచుండగా, తలలో ఏదో క్రొత్త అనుభూతిని పొందిన సంతోషము కల్గినది. జరిగినది ఏమిటి? అని కళ్ళు తెరచి చూడగా తన చేతులలో గ్రంథము కనిపించినది. అదియే తౌరాత్ గ్రంథము. దానిమీద అప్పటి భాషలో 'తౌరాత్' యని ఉండడమును మోషే చూచాడు. ఆ విధముగా మోషేకు తౌరాత్ గ్రంథము లభించినది. అక్కడి తౌరాత్ గ్రంథమే ఇక్కడి భగవద్గీత.
''తౌరాత్'' యనగా మూడు చీకటి రాత్రులని అర్థము. మూడు కనిపించని ఆత్మల యొక్క జ్ఞానముండుట వలన, మూడు ఆత్మల జ్ఞానము రహస్యమైనదయినందున, మూడు ఆత్మలనుద్దేశించి తౌరాత్యని భగవద్గీతకు కృష్ణుడే పేరు పెట్టాడని తెలియుచున్నది. ఇదంతా చదివే వారికి ఒక కథలాగ యున్నా, నమ్మశక్యముగానిదైయున్నా ఇది నూటికి నూరు పాళ్ళు జరిగిన సత్యము. నమ్మమని ఎవరినీ బలవంతము చేయడము లేదు. సత్యమును చెప్పక తప్పదు, కావున ఇప్పుడు సమయము ఆసన్నమైనప్పుడు చెప్పక తప్పలేదు. అట్లని పైకి కనిపించు నన్ను ఈ విషయమునకు బాధ్యున్ని చేయవద్దండి. నిజముగా మీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. ఇప్పుడిది మీకే కాదు నాకు కూడా క్రొత్త విషయమే. ఇలా మనకు తెలియని ఎన్నో క్రొత్త విషయములు ఆత్మకు తెలుసు. ఆత్మ అందించితేనే ఇప్పుడు మనకు తెలియుచున్నది.
తౌరాత్ గ్రంథము మోషేకు లభించినదని తెలిసినది కదా! ఇక్కడే ఇంకొక క్రొత్త రహస్యము కలదు. అదేమనగా! తౌరాత్ గ్రంథమును మోషే తప్ప ఎవరూ చూడలేదు. తౌరాత్ గ్రంథము మోషేకు మాత్రమే కనిపించేది, ఇతరులకు కనిపించేది కాదు. ఆ విధముగా తౌరాత్ (భగవద్గీత) గ్రంథము అక్కడి మనుషులకు రహస్య గ్రంథమయినది. ఆ విషయము మోషేకు కూడా అర్థమయినది. గ్రంథములోని జ్ఞానమును రాత్రిపూట చదువుకొని పగలు ఇతరులకు చెప్పెడివాడు. చెప్పేది భగవద్గీతలోని జ్ఞానమయినందున అది శాస్త్రబద్దముగా యుండెను. జ్ఞానమునకు గీటురాయిగా (సానరాయిగా) ఉండెను. తౌరాత్ జ్ఞానము వలన ఏది జ్ఞానమో, ఏది అజ్ఞానమో తేల్చిచెప్పుటకు వీలయ్యేది. అందువలన తౌరాత్ గ్రంథమునకు గీటురాయి అను పేరు సార్థకమయినది. అదే గీటురాయియే మన వద్ద గల భగవద్గీత. ఆ దినములలో మోషేకు మాత్రము కనిపించి ఇతరులకు కనిపించని భగవద్గీత నేడు మనముందు జ్ఞానులకు, అజ్ఞానులకు కనిపించుచున్నది. నేడు గ్రంథము కనిపించినా అందులోని జ్ఞానము చాలా మందికి కనిపించడము లేదు. అనగా అర్థము కావడము లేదు.
మోషే చెప్పు జ్ఞానమునకు చాలా మంది ఆకర్షితులై ఆయన చెప్పు జ్ఞానమును తెలియుచుండిరి. మోషే తనకు తౌరాత్ గ్రంథము లభించినప్పటి నుండి 34 సంవత్సరములు గ్రంథములోని జ్ఞానమునే చెప్పాడు. మోషే చెప్పు జ్ఞానము తౌరాత్ గ్రంథములోనిదని ప్రజలకు తెలియదు. మోషేకు 54 సంవత్సరములు గడచిన తర్వాత మోషే శరీరములో లేకుండా పోవడమూ, అందులో స్వయముగా కృష్ణుడే ఉండడము ఇతరులెవరికీ తెలియదు. కృష్ణుడు తొమ్మిది సంవత్సరములు మోషే శరీరములో వుండి, మోషే చెప్పునట్లే నటించుచూ రాబోయే ఏసును గురించి అతని జీవితములో జరుగు కొన్ని సంఘటనలను గురించి చెప్పడము జరిగినది. మోషే (కృష్ణుడు) చెప్పిన సంఘటనలు ఏసు జీవితములో నెరవేరినట్లు నాలుగు సువార్తలలో తెలియుచున్నది. మోషే ఏసును గురించి చెప్పిన కొన్ని సంఘటనలను తెలుసుకొన్న యెషయా అవే సంఘటనలనే తన లేఖనములలో వ్రాశారు. మోషే తౌరాత్ గ్రంథ జ్ఞానమును చెప్పుటవలన అతను ధర్మ శాస్త్రమును చెప్పాడని అందరూ అనుకోవడము జరిగినది. మోషే స్వయముగా ధర్మ శాస్త్రమును చెప్పాడని అనుకున్నారు. మోషేకు ఒక్కనికే తెలిసిన తౌరాత్‍ను మోషే తర్వాత ఎవరూ చూడలేదు. మోషే తప్ప తౌరాత్ గ్రంథమును చూచిన రెండవ వ్యక్తి లేడనియే చెప్పవచ్చును. కృష్ణుడు మోషే శరీరములో తొమ్మిది సంవత్సరములుండి ఏసును గురించి ముందే చెప్పడము, ఆ విషయములను తర్వాత తెలిసిన ప్రవక్తలు లేఖనములుగా వ్రాయడము జరిగినది.
ఇంతవరకు చూచిన విషయమునుబట్టి శ్రీకృష్ణుడు భారతదేశములో చనిపోయి మోషే శరీరములో చేరి, మోషేగా తొమ్మిది సంవత్సరములు జీవించడము జరిగినదని తెలిసినది కదా! కృష్ణుడు భారతదేశములో జీవించి ఉన్నప్పుడు చిన్నతనములో గోవులను కాచాడని చెప్పారు. అందువలన చిన్నప్పటినుండి ఆయనకు గోవులు అలవాటైపోయాయి. ఆయన ఎక్కడ వుంటే అక్కడ గోవులు కనీసము ఒక్కటిగానీ ఉండడము అలవాటై పోయాయి. కృష్ణుని జన్మలో 'ఆవుదూడ' అనుబంధము ఎక్కువగా ఉన్నది. అందువలన ఆయన చిత్రపటములలో ఆవుదూడ కనిపించుచుండును. కృష్ణుడు భారతదేశములో చనిపోయి మోషే శరీరములోనికి వచ్చిన తర్వాత ఆయన శరీరము మారినా, ఆయన చూపుకు ఆవుదూడలు ఆకర్షణగా వచ్చి ఆయన తాకేవరకు చేతి స్పర్శ కొరకు కాచుకొని వుండేవి. ఈ విధముగా శరీరము వేరయినా లోపలయున్న కృష్ణుని ప్రభావము వలన ఆవుదూడలు మోషే వద్ద ఆకర్షణగా యుండేవి. అది చూచినవారందరూ మోషే తర్వాత ఆవు దూడను గౌరవముగా చూచెడివారు. అందువలన మోషే కొద్ది రోజులు ఎవరికీ కనిపించకుండా పోవుటవలన మోషే తర్వాత ఆవుదూడను ఆరాధించను మొదలుపెట్టారు. మోషే కనిపించకుండా పోయిన 40 రోజులలోనే ఇంత పని జరిగినది. మోషే వచ్చిన తర్వాత ఆవుదూడను ఆరాధించు వారిని చూచి మోషే వారిని దండించడము జరిగినది. ఈ విషయమై అంతిమ దైవగ్రంథము ఖురాన్‍లో సూరా 2, ఆయత్ 51, 54లలో ఇలా చెప్పారు చూడండి.
(2-51) ''ఇంకా జ్ఞాపకము చేసుకోండి, మేము మూసాకు నలభై రాత్రుల వాగ్దానం చేసి పిలిచినప్పుడు, మీరు అతను లేకపోవడము చూచి ఆవుదూడను ఆరాధ్య దైవముగా చేసుకొన్నారు మరియు మీరు దుర్మార్గులయ్యారు.''
(ఇది ''దివ్య ఖుర్ఆన్ సందేశము'' అను గ్రంథములోని తెలుగు అనువాద వాక్యము. ఇదే ఆయత్‍ను ''అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్'' అను తెలుగు అనువాద గ్రంథములో వ్రాసిన వాక్యమును కూడా ఇక్కడ చెప్పుకొందాము. కొన్ని భాషా పదములు వేరయినా వాక్యములోని భావము మాత్రము ఒక్కటేయని గ్రహించవచ్చును. ''అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్'' గ్రంథములోని వాక్యమును క్రింద చూడండి.)
(2-51) ''జ్ఞాపకము చేసుకోండి, మేము మూసాకు నలభై రాత్రుల వాగ్దానం చేసి అతనిని పిలిచినప్పుడు, అతను వెళ్ళిన తర్వాత మీరు ఆవుదూడను పూజించను మొదలుపెట్టారు. ఆ విధముగా మీరు దుర్మార్గానికి పాల్పడ్డారు.''
(2-54) (దివ్య ఖుర్ఆన్ సందేశము) ''మరియు జ్ఞాపకము చేసుకోండి. మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు. ఓ నా జాతి ప్రజలారా! నిశ్చయముగా ఆవుదూడను ఆరాధ్య దైవముగా చేసుకొని మీకు మీరే అన్యాయము చేసుకొన్నారు. కనుక పాశ్చాత్తాపముతో క్షమాబిక్ష కొరకు మీ నిర్మాతను (సృష్ఠికర్తను) వేడుకోండి. మీలోని వారిని (ఘోర పాతకులను) లేకుండా చేయండి. ఇదే మీ కొరకు మీ సృష్ఠికర్త దృష్ఠిలో శ్రేష్ఠమైనది. ఆ తరువాత అల్లాహ్ మీ పాశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా ఆయనే పాశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత''
(2-54) (అంతిమ దైవగ్రంథము ఖురాన్) ''మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు. ఓ నా జాతివారలారా! ఆవుదూడను ఆరాధ్య దైవముగా చేసుకొని మీరు మీ స్వయానికి అన్యాయము చేసుకొన్నారు. కనుక ఇప్పుడు మీరు పాశ్చాత్తాప భావముతో మీ సృష్ఠికర్తవైపుకు మరలండి. ఘోర కృత్యానికి పాల్పడిన మీలోని వారిని చంపండి. మీ సృష్ఠికర్త వద్ద ఇదే మీ కొరకు మేలైనది. మరి ఆయన మీ పాశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. నిస్సందేహముగా ఆయన పాశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కనికరించేవాడు.''
(ఈ విధముగా రెండు గ్రంథములలోనూ ఒకే భావమును వ్రాసి యుంచారు.) మూసా (మోషే) తన ప్రజలకు హెచ్చరిక చేస్తూ, మీరు మిమ్ములను సృష్ఠించిన దైవమును కాకుండా దేవుని చేత సృష్ఠింపబడిన ఆవుదూడను ఆరాధించి మీకు మీరు అన్యాయము చేసుకున్నారు. దానివలన పాపము వచ్చింది. అలా చేసిన వారు ఘోర పాపాత్ములు. అటువంటి వారిని జ్ఞానముతో మార్చి (వారిని చెడు నుండి మంచికి మార్చి) లేకుండా చేయండి. అన్నిటికంటే మంచి పని అదేయగును. దేవుడు పాశ్చాత్తాపాన్ని స్వీకరించి పాపమును లేకుండా క్షమించగలడనీ, దేవుడు క్షమాశీలుడనీ జిబ్రయేల్ చెప్పాడు.
మూసా (మోషే) తర్వాత ప్రజలు కొన్ని రోజులు మోషే కనిపించక పోతే ఇక మోషే లేడని తలచినవారై, మోషే బదులు మోషేకు దగ్గరగా యున్న ఆవుదూడను గౌరవించను మొదలుపెట్టారు. అదే ఆరాధన అయినది. తర్వాత మోషే వచ్చి ఎప్పటికయినా అందరినీ సృష్ఠించిన సృష్ఠికర్తకు విధేయులుగా ఉండాలిగానీ, సృష్ఠింపబడిన జంతువులను ఆరాధించకూడదని చెప్పి అది పాపపు పనియని, ఆ పాపమును క్షమించమని దేవున్ని వేడుకొంటే, దేవుడు క్షమించగలడని చెప్పాడు. అంతేకాక దేవుడు క్షమాశీలుడు, కరుణామయుడు అని కూడా చెప్పాడు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
6. మీరు మూసాతో అన్న మాటను గుర్తుంచుకోండి. మీపై పిడుగుపడింది. (2-55), (2-60, 61), (4-153)
మోషే (మూసా) తన అజ్ఞాతము తర్వాత తన ప్రజలవద్దకు వచ్చి చూడగా, మూసా ప్రవక్త అన్ని రోజులుగా చెప్పిన ధర్మశాస్త్రమును (తౌరాతును) లెక్కించక తమ మనో భావము ప్రకారము సృష్ఠికర్తకు (దేవునికి) బదులు ఆవుదూడను ఆరాధించడము పాపకార్యముగా చెప్పి, చేసిన తప్పిదమునకు వచ్చిన పాపము పోవునట్లు దేవున్ని క్షమించమని వేడుకోవలసినదిగా మూసా చెప్పగా! అప్పుడు పాప కార్యములను చేసిన ప్రజలు, దేవున్ని ఆరాధించక ఆవు దూడను ఆరాధించిన ప్రజలు మూసాకు ఎదురు మాట్లాడారు. ''నీవు మాకు దేవున్ని చూపిస్తే దేవున్ని విశ్వసిస్తాము'' అని దైవజ్ఞానమునకు వ్యతిరేఖముగా మాట్లాడారు. అప్పుడు వారు చేసిన తప్పుకు గుర్తుగా వారిమీద పిడుగు పడి చనిపోయారు. చనిపోయిన వారు తిరిగి పుట్టవలసిందే. అదే విధముగా దేవుడు చనిపోయిన వారిని తిరిగి బ్రతుకునట్లు చేశాడు. చనిపోయి తిరిగి పుట్టిన వారు దైవత్వమునకు దాసులుగా ఉంటారేమోనని అనుకున్నాము.
అయితే ప్రజలు నీటి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు బండను కర్రతో కొట్టమని చెప్పాడు. అలా కొట్టగా రాతినుండి పన్నెండు ఊటలు ప్రవహించసాగాయి. మనుషులలో ప్రతి తెగవారు నీటిని త్రాగే విధానాన్ని కనుగొన్నారు. అప్పుడు నీటిని త్రాగినట్లే దేవుడు మీకు ప్రసాదించిన ఆహారమును తినమని దేవుడు ఆదేశించగా అప్పుడు మనుషులు మేము ఒకే రకమైన ఆహారము తిని ఉండలేము. భూమిలో పండే ఆకుకూరలు, కాయకూరలు, గోధుమలు, ఉల్లిగడ్డలు, పప్పుదినుసులు మొదలగునవి పండించబడినవన్నీ తింటామన్నారు. అప్పుడు శ్రేష్ఠమైన ఆహారమును వదలి దానికి బదులుగా స్వల్పమైన ఆహారమును కోరుకొన్నారు. దీనినంతటినీ గమనిస్తే ప్రజలు దేవుడు చెప్పిన మాటను అతిక్రమించుచూ మాయ చెప్పిన మాటను ఆచరించుచున్నారని తెలిసినది. దేవుని మాటను వినకుండా దేవుని జ్ఞానమును వినినా దాని మీద ధ్యాసను పెట్టకుండా తన ఇష్టానికి తగినట్లు నడుచుకొనుచూ దేవున్ని వదలి జీవరాసులను, దేవుని చేత సృష్ఠింపబడిన దేవతలను ఆరాధించుచున్నారు. అది తప్పని చెప్పినా అర్థము చేసుకోలేని స్థితిలో దేవున్ని, దేవుని ఉనికిని ప్రశ్నించుచూ, దేవుడుంటే చూపండని అడుగుట వలన ఆకాశములోని గ్రహములకు కోపము వచ్చి వారి మీద పిడుగును వేశారు.
నేడు కూడా దేవుని అస్తిత్వమును ప్రశ్నించిన వారిని చూచి దేవుని పాలకులయిన ఆకాశములోని భూతములు, గ్రహములు కోపగించుకొనునవై మనుషుల మీద అనేక రకముల హింసలను కల్గించుచున్నవి. అయినా మనుషులకు ఆ విషయము అర్థము కావడము లేదు. ఎన్నో రోగములు, ఎన్నో ప్రమాదములలో చిక్కుకొని చనిపోయి తిరిగి పుట్టుచున్నారు. తర్వాత జన్మలో అయినా సక్రమముగా జ్ఞానరీత్యా నడుచుకొంటారు యని అనుకొన్న దేవుడు మనుషుల కొరకు భూమిమీద పన్నెండు మతములను పుట్టించి వారికిష్టమైన మనుషులుండునట్లు స్వతంత్రమును కల్గించాడు. అయితే దేవుడిచ్చిన ఆహారమనబడు జ్ఞానమును జీవనాధార ఆహారముగా స్వీకరించమని చెప్పితే జ్ఞాన ఆహారము మాకు అవసరము లేదని భూమిలో పండు ధాన్యములను, కాయకూరలను ఆహారముగా తీసుకొంటామని అంటున్నారు. అలా వారికిష్టమైన ఆహారమును తీసుకొంటూ దేవుడిచ్చిన జ్ఞాన ఆహారమును వదలుకోవడము వలన కర్మలలో చిక్కి నలిగి పోవుచున్నారు. ఎంత ఉన్నా లేని బీదవారివలె కర్మలను అనుభవించు చున్నారు. దేవుని జ్ఞానము ప్రకారము నడువకపోయిన దానివలన కర్మలు ఏమాత్రము నశించక అన్నీ అనుభవించవలసి వచ్చినది. దేవునికి దూరముగా ఉండవలసి వచ్చినది. ఆకాశ శక్తులయిన గ్రహముల వలన పిడుగుల బాధలు, వర్షము వరదల బాధలు, రోగముల బాధలు అనేకము అనుభవించవలసి వచ్చినది.
పన్నెండు చీలికలు ఊటలుగా పుట్టిన నీటిని త్రాగుటయని వాక్యములో చెప్పారు. పన్నెండు నీటి ఊటలను పన్నెండు మతములుగా అర్థము చేసుకోవాలి. పన్నెండు ఊటల నీళ్ళు త్రాగుచూ పన్నెండు మతములుగా యున్న మనుషులు దేవుని జ్ఞానమును తెలియకుండా దానిని స్వీకరించక యున్నారు. ఇక్కడ దేవుడిచ్చిన ఆహారము అనగా దేవుని జ్ఞానము అని తెలియవలెను. ఎప్పుడయితే దేవుని జ్ఞానమును వదలి ప్రపంచ జ్ఞానము వెంట మనిషి పడుచున్నాడో, అప్పుడే దేవుని పాలకుల వలన బాధలు తప్పవని చెప్పుటకే వారి మీద పిడుగు పడింది యని చెప్పారు. మనిషికి కనిపించకుండా ఎన్నో అనర్థములు, బాధలు వచ్చు చుండును. వాటి వలన మనిషి చాలా ఇబ్బంది పడుచుండును. అయినా ఇదంతా దేవుడిచ్చిన జ్ఞానమును తెలియని దానివలన జరుగుచున్నదని అనుకోవడము లేదు. దేవుడు మన వెంటపడి జ్ఞానమును అందించినా ఇది మాకు రుచిగా లేదు, ప్రపంచ విషయములే రుచిగా యున్నవని అనుకొంటున్నారు. అటువంటి వారికి పాపక్షమాపణ ఉండదు. దేవున్ని, దేవుని జ్ఞానమును విశ్వసించిన వానికి మాత్రమే పాపక్షమాపణ జరుగును. దేవుని క్షమాశీలత్వమునకు దారి ఏర్పడును. అందువలన దైవజ్ఞాన ఆహారమును స్వీకరించుచూ కర్మలను ఆకలిని లేకుండా చేసుకొమ్మని కోరుచున్నాము.
ఇంతవరకు చెప్పిన విషయమును గురించి స్వయముగా ఖుర్ఆన్ గ్రంథములో ఆయత్‍ల (వాక్యముల) రూపములో చెప్పిన సమాచారమును ఇప్పుడు వ్రాయుచున్నాము చూడండి.
(2-55) ''అప్పుడు మీరు అతనితో (మూసాతో) అన్న మాటలను జ్ఞప్తికి తెచ్చుకోండి. ''ఓ మూసా! మేము అల్లాహ్‍ను ప్రత్యక్షముగా చూడనంతవరకు నిన్ను ఏమాత్రము విశ్వసించము'' అన్నారు. అదే సమయములోనే మీరు చూస్తూ ఉండగానే ఒక భయంకర మైన పిడుగు మీపై విరుచుకపడింది. అప్పుడు మీరు చనిపోయారు.''
(2-56) ''ఆ పిమ్మట మీరు విధేయతకల్గి ఉంటారేమోయని మీరు చనిపోయిన తర్వాత మిమ్ములను బ్రతికించడము జరిగినది.''
(2-60) ''మరియు జ్ఞాపకము చేసుకోండి. మూసా తన ప్రజలకు నీటి కొరకై ప్రార్థించినప్పుడు మేము ''నీవు ఆ బండను కర్రతో కొట్టుము'' అని ఆదేశించాము. అప్పుడు అలాగే కొట్టగా దానినుండి పన్నెండు నీటి ఊటలు ప్రవహించసాగాయి. ప్రతి తెగ వారు తమ నీరు త్రాగే స్థలమును కనుగొన్నారు. అప్పుడు వారితో అన్నాము. ''అల్లాహ్ మీకు ప్రసాదించిన ఆహారమును తినండి, త్రాగండి కానీ, భూమిలో కల్లోలము రేపుతూ, దౌర్జన్య పరులుగా తిరగకండి.''
(2-61) ''మరియు అప్పుడు మీరు ''ఓ మూసా! మేము ఒకే రకమైన ఆహారము తింటూ ఉండలేము. కావున భూమిలో ఉత్పత్తి అయ్యే ఆకు కూరలు, దోసకాయలు, కాయకూరలు, గోధుమలు, ఉల్లిగడ్డలు, పప్పు దినుసులు మొదలయినవి మా కొరకు పండించమని నీవు నీ ప్రభువును ప్రార్థించు'' అని అన్నారు. దానికతను ''ఏమీ? శ్రేష్ఠమైన దానికి బదులుగా అల్పమైన దానిని కోరుకొంటున్నారా, అలాగయితే మీరు ఏదయినా నగరానికి తిరిగిపోండి. నిశ్చయముగా అక్కడ మీకు మీరు కోరినంత దొరుకుతుంది అని అన్నాడు. తర్వాత వారు తీవ్ర అవమానానికి మరియు దారిద్య్రానికి గురి అయ్యారు. మరియు వారు అల్లాహ్ ఆగ్రహానికి గురి అయ్యారు. ఇదంతా వాస్తవానికి వారు అల్లాహ్ సూచన (ఆయత్)లను తిరస్కరించిన ఫలితము మరియు ప్రవక్తలను అన్యాయముగా చంపిన దాని ఫలితము. ఇదంతా వారు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించిన ఫలితము మరియు హద్దులు మీరి ప్రవర్తించిన పర్యవసానము.''
(4-153) ''ఓ ప్రవక్తా! గ్రంథ ప్రజలు నిన్ను ఆకాశమునుండి వారిపై ఒక గ్రంథాన్ని అవతరింపజేయమని అడుగుతున్నారని ఆశ్చర్యపడకు. వాస్తవానికి వారు మూసాను ఇంతకంటే దారుణమైన దానిని కోరుతూ ''అల్లాహ్‍ను మాకు ప్రత్యక్షముగా చూపించు'' అని అడిగారు. అప్పుడు వారి దుర్మార్గానికి ఫలితముగా వారిపై పిడుగు విరుచుకుపడింది. స్పష్టమైన సూచనలు లభించిన తరువాతనే వారు ఆవుదూడను ఆరాధ్య దైవముగా చేసుకొన్నారు. అయినా దానికి మేము వారిని క్షమించాము మరియు మూసాకు స్పష్టమైన అధికారము ఇచ్చాము.''
ఈ వాక్యములన్నియూ చూచిన తర్వాత దేవుని మాటను ధిక్కరిస్తే, దేవుని జ్ఞానమును ప్రశ్నిస్తే కలుగు పర్యవసానము అర్థమయివుంటుంది. ఇది ఆ కాలములోనే కాదు, ఏ కాలములో అయినా దేవుని మాటను లెక్కించని వారికి తప్పక జరుగును. ఈ వాక్యములలో మాటిమాటికి మూసాను ప్రజలు అడిగినట్లు గలదు. పిడుగు పడి చనిపోయిన తర్వాత తిరిగి పుట్టి ఆ తర్వాత కూడా చాలామార్లు మూసాను ప్రశ్నించి అడిగినట్లు గలదు. దీనిని చూచిన తర్వాత మూసా ఎంతకాలము బ్రతికాడను ప్రశ్న రాగలదు. మనకు తెలిసినంత వరకు మూసా 54 సంవత్సరములు బ్రతకగా కృష్ణ మూసా తిరిగి తొమ్మిది సంవత్సరములు బ్రతికాడు. అంతయు కలిసినా 63 సంవత్సరములే యగును. కృష్ణమూస కాలములో ఆవుదూడను ఆరాధించిన వారు దేవున్ని ప్రత్యక్షముగా చూపనంత వరకు నమ్మము అని దేవుని అస్తిత్వమును ప్రశ్నించినందుకు పిడుగుపడి చనిపోయారు. వారు పుట్టిన తర్వాత దేవుడిచ్చిన జ్ఞాన ఆహారమును తినమని చెప్పితే మాకు అవసరము లేదు అన్నారు. దేవుని జ్ఞానమునకు తలకు ఎక్కించుకోమని చెప్పితే, అది వద్దు అని చెప్పి కడుపు నింపుకొను ఆహారమును అడిగారు. వారు చేసిన తప్పులకు వారికి శిక్షలు పడుచున్నా తాము అజ్ఞానముగా ఉన్నందుకే ఇదంతా జరుగుచున్నదని తెలియక గ్రుడ్డిగా అట్లే ప్రవర్తించుచున్నారు.
మూసా విషయమును చూస్తే మూసా 63 సంవత్సరములకు చనిపోతే ఎంతో కాలముగా మూసాను వారు అడిగినట్లు కలదు కదా!యని ప్రశ్న రాకతప్పదు. అయితే ఆ ప్రశ్నకు జవాబు ఇలా కలదు చూడండి. మూసా 63 సంవత్సరములకు చనిపోయినది వాస్తవమే అయినా ఆయన చనిపోయిన తర్వాత తిరిగి 63 సంవత్సరముల వరకు తన ప్రజలకు అప్పుడప్పుడు కనిపించి మాట్లాడేవాడు. చివరిలో 63 సంవత్సరములకు చనిపోయినది కృష్ణమూస అయినందున, ఆయన సాధారణ వ్యక్తి కానందున సాక్ష్యాత్తూ భగవంతుడే అయినందున, దేవుని ప్రతినిధి అయినందున, దేవుని ఆత్మే అయినందున తిరిగి కనిపించు శక్తి ఆయనకు ఉండేది. కృష్ణుని శరీరములో 126 సంవత్సరములు ద్వాపరయుగమున బ్రతికిన కృష్ణుడు, మోషే (మూసా) శరీరములో ఆ శరీరమునకు 126 సంవత్సరములు అగునట్లు ఆ శరీరముతోనే కనిపించాడు. అందువలన అనేకమార్లు తన ప్రజలకు జవాబు చెప్పుతూ వచ్చాడు. ప్రజలు ఆయనను అప్పుడప్పుడు అడుగుచూ వచ్చారు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
7. మనుషులు వ్రాసిన గ్రంథము దైవగ్రంథము కాదు. (2-79)
ఈ కాలములో ప్రతి మత గ్రంథము ప్రక్కన, మనుషులు వ్రాసిన గ్రంథము ఉన్నది. దేవుడు మూడు దైవగ్రంథములు ఇవ్వగా, అవి మూడు, మూడు మతములలో మత గ్రంథములుగా చెప్పబడుచున్నవి. క్రైస్థవములో నాలుగు సువార్తలకు ముందు వెనుక పాత క్రొత్త నిబంధనలను గ్రంథములు గలవు. ఇస్లామ్‍లో దైవగ్రంథమయిన ఖుర్ఆన్ ప్రక్కనే హదీసు గ్రంథములున్నవి. హిందుత్వములో భగవద్గీత ప్రక్కనే వేదములున్నవి. మూడు గ్రంథములకు మూడు గ్రంథములు పోటీగా తయారయినవి. ప్రక్కన గల మూడు గ్రంథములను దైవగ్రంథములతో సమానముగా చూడవలెనని కొందరు చెప్పుచున్నారు. అయితే మనుషులు వ్రాసినవి దైవగ్రంథములు కావని మేము ముందునుండి చెప్పుచున్నాము. మనుషులు ఎంత ప్రయత్నించి వ్రాసినా దేవుని ఆత్మ చెప్పిన దానితో సమానము కావు. మనుషులలో జీవాత్మ ఎంత వ్రాసినా వాని విషయము వానికే తెలియదు. ఆత్మ పరమాత్మ విషయములను ఎలా వ్రాయగలదు? ఆత్మచేత చెప్పబడినదే దైవజ్ఞానము. మొదట ఆత్మ చెప్పగా, ఆత్మ చెప్పిన దానిని తర్వాత ఏ మనిషి వ్రాసినా అది దైవగ్రంథముగా ఉండును. ఆత్మ ప్రమేయము లేకుండా జీవాత్మలు వ్రాయునది ఏదికానీ దైవగ్రంథము కాదు. అటువంటి అర్హత దానికి ఉండదు.
దైవగ్రంథమునకు మనుషుల గ్రంథమునకు ఏమి తేడా?యని కొందరు అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! దైవ గ్రంథములలో దైవశక్తి యుండును, మనుషుల గ్రంథములలో దైవశక్తి యుండదు. దైవము మీద శ్రద్ధయున్న వారికి దైవగ్రంథములు గొప్పగా కనిపించును. మిగతా వారు వ్రాసినవి ఆసక్తి రహితముగా కనిపించును. అయితే దైవగ్రంథము లను కూడా మనుషులే వ్రాసియున్నారు. మనుషులు స్వయముగా వ్రాయక ముందు ఆత్మనుండి చెప్పబడిన విషయములను గ్రంథరూపముగా ఇతర మనుషులు వ్రాయడము జరిగినది. అట్లు మనుషులు వ్రాసినా వ్రాయక ముందు ఆత్మ చెప్పియుండుట వలన వాటిని దైవగ్రంథములు అన్నాము. అట్లుకాక స్వయముగా మనుషులు వ్రాసిన వాటిని 'మనుషుల గ్రంథములు' అని అన్నాము. అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్ విషయమును చూస్తే అల్లాహ్ నుండి సంకల్పింపబడిన జ్ఞానము మొదట ఆకాశ ఆత్మనుండి శబ్దరూపముగా వినపడగా, ఆకాశవాణిగా వచ్చిన శబ్దమును ఆ రోజు ఒకే ఒక సూర్యుడు గ్రహించాడు. సూర్యుడు అన్నిటికంటే పెద్ద గ్రహము అయినందున వాణిని గ్రహించు స్థోమత ఒక్క సూర్యునికే ఉండేది. అందువలన మిగతా గ్రహములు ఆకాశములో ఎన్నియున్నా అవి ఏవీ గ్రహించుకోలేక పోయాయి. ఉరుముల రూపములో వినపడిన వాణి ఆదిలోని మొట్టమొదటి జ్ఞానము. వహీ అని ఖుర్ఆన్ గ్రంథములో అరబ్బీ భాషలో చెప్పినా, వాణి అని తెలుగు భాషలో చెప్పినా రెండూ ఒక్కటే. వహీ అంటే శబ్దము. శబ్దము మాటల రూపములో రాలేదు. మేఘముల ఉరుముల శబ్దరూపములో వచ్చిన వాణి లేక వహీ మనుషులు వినుటకు అర్థము కానటువంటి భయంకర శబ్దముగా ఉండేది. అటువంటి శబ్దమును సూర్యుడు వినగలిగి సూర్యుడు మనువుకు కృతయుగములో చెప్పాడు. కలియుగములో సూర్యుడే జిబ్రయేల్ అను పేరుతో ముహమ్మద్ ప్రవక్తకు చెప్పాడు. ప్రవక్తకు చెప్పినప్పుడు ఆ ప్రాంత భాషలోనే అనగా అరబ్బీ భాషలోనే చెప్పాడు. దేవుని పాలనలోయున్న వారు అన్ని భాషలు వినగలరు, అన్ని భాషలు మాట్లాడగలరు. అందువలన ఆకాశ భాషను సూర్యుడు గ్రహించగలిగాడు. తర్వాత కలియుగములో సూర్యుడు ప్రవక్తగారికి చెప్పినప్పుడు అయితే మాట శబ్దము ఒక్కటి వినిపించి చెప్పిన వ్యక్తి కనిపించక పోవడము వలన వినిపించిన మాటను వహీ అన్నారు. శబ్దము ఒక్కటే వినిపించినది కావున దానిని వహీ అన్నా తప్పు లేదుగానీ వాస్తవానికి అది వహీ కాదు. వహీ సృష్ఠి ఆదిలోనే వచ్చినది. కలియుగములో ప్రవక్త గారు విన్నది తెరచాటున కనిపించని జిబ్రయేల్ చెప్పినది. అందువలన ఇవి మాటలేగానీ వహీ కాదు. చెప్పినవారు కనిపించక వారి శబ్దము వినిపించడము వలన దానిని వహీ అనడములో న్యాయముందిగానీ వాస్తవానికి దానిని 'వహీ' అనకూడదు. ''తెరచాటునుండి చెప్పబడిన జ్ఞానము'' అని చెప్పవచ్చును. వాణి శబ్దము కాకుండా, దేవుని ప్రతినిధి చెప్పినది కాకుండా, తెరచాటునుండి చెప్పినది కాకుండా ఏది అయినా అది మనుషులదే దేవునిది కాదని చెప్పవచ్చును. దేవుడు తన జ్ఞానమును మూడు విధముల తెలియజేయుదునని చెప్పాడు. మూడు విధములు కానిది దేవుని జ్ఞానము కాదనీ, అది మనుషుల జ్ఞానమని చెప్పవచ్చును. ఈ సూత్రము ప్రకారము ఖుర్ఆన్ గ్రంథము తెరచాటునుండి చెప్పబడిన జ్ఞానము అయినందున అది దైవగ్రంథముగా మారినది. ఖుర్ఆన్ గ్రంథమును మనుషులు వ్రాసినా అది దైవగ్రంథమేనని చెప్పవచ్చును. అయితే హదీసు సూత్రములు (వాక్యములు) (42-51) ఆయత్ ప్రకారము దేవుడు చెప్పినవి కావు. అందువలన మనుషులు హదీసులను ఎంతగొప్పగా చెప్పుకొనినా వాటిని దైవగ్రంథముగా గానీ, దైవగ్రంథములో భాగముగాగానీ చెప్పుటకు వీలులేదు. వాటిని మానవ గ్రంథములుగానే చెప్పవచ్చును.
ఈ విషయమును గురించి ఖుర్ఆన్ గ్రంథములో సూరా రెండులో ఆయత్ 79 యందు ఇలా చెప్పారు చూడండి.
(2-79) ''ఎవరైతే తమ చేతులారా ఒక పుస్తకాన్ని వ్రాసి దానివలన గౌరవము, ధనము పొందే నిమిత్తము ఇది అల్లాహ్ తరపునుండి వచ్చింది అని ప్రజలకు చెబుతారో వారికి వినాశనముంది. వారి చేతులు వ్రాసినందుకు వారికి చెడు తప్పదు. మరియు వారు పొందిన ధన గౌరవములకు కూడా వారికి నాశనము తప్పదు.''
దేవుడు చెప్పిన మూడు విధముల కాకుండా మనుషులు చెప్పుట దానినే వ్రాయుట ఎక్కడ జరుగునో, అలాంటి వాటి ద్వారా గౌరవము, ధనము పొందు నిమిత్తము వారు వ్రాసిన గ్రంథములను దైవగ్రంథములని ప్రచారము చేయుట వలన వారికి ఘోరమైన పాపము తగుల్కొనుచున్నది. దైవగ్రంథముల ప్రక్కనేయుండి దైవ గ్రంథములతో పాటు గౌరవమును పొందుచూ దైవగ్రంథములని పేరు తెచ్చుకోవాలని ఆశించు వారందరికీ వినాశనము తప్పదని చెప్పారు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
8. మూసాకు గ్రంథము ఇచ్చాము. అట్లే ఈసాకు గ్రంథము నిచ్చాము. మీకు నచ్చని వారిని ఎదిరించారు, చంపారు. (2-87, 6-154, 155, 157)
దేవుడు మనుషులను మంచి మార్గములో నడిపించు నిమిత్తము భూమిమీదికి ఎందరినో ప్రవక్తలను పంపాడు. ప్రవక్తలు అనగా కొద్ది నుండి గొప్పవరకు జ్ఞానమును బోధించువారు. వక్త అనగా బోధించు వాడు అని అర్థము. ప్ర అనగా ముఖ్యమైన అని అర్థము గలదు. ముఖ్యమైనది దైవజ్ఞానమే కనుక, జ్ఞానమును బోధించు ప్రతివారు ప్రవక్తలుగానే పిలువబడుచున్నారు. దేవుడు మనుషులకు జ్ఞానమును బోధించు వారిని ఎంతోమందిని మనుషుల వద్దకు పంపినా ప్రవక్తలు బోధించుటకు కావలసిన జ్ఞానమును తన గ్రంథములలో నింపి పంపినా మనుషులు మూర్ఖత్వమునుండి మారకపోవడమే కాక తమకు నచ్చని విషయములను (జ్ఞానమును) చెప్పినందుకు ప్రవక్తలను కూడా అనగా హితము చెప్పిన వారిని కూడా ఎదిరించి మాట్లాడారు. తమకు అనుకూలముగా మాట్లాడునట్లు చేసుకోవాలని ప్రయత్నించారు. తమ మాట వింటే ఫరవాలేదు. వినకపోతే ప్రవక్తలను కూడా వదలక చంపారు. ఇటువంటి మనో స్వభావములున్న మనుషులను, దేవుడు బాగుపరచాలని ప్రయత్నించిన తర్వాత కూడా బాగుపడక అజ్ఞానులుగా మిగిలిపోయి, దుర్మార్గపు భావములలోనే ఉంటూ, తమవద్ద గల ధనముతో అన్ని పనులు నెరవేరునని అనుకొని దేవున్ని, దేవుని జ్ఞానమును, దేవుని జ్ఞానము తెలిసిన జ్ఞానులను, ఏమాత్రము గౌరవించని వారిని సహితము తన జ్ఞానమును స్వయముగా బోధించి, వారిని బాగు చేయుటకు వచ్చినా, వారు తమ దుష్ట భావమును వదలి మంచి మార్గములోనికి రారు. నూటికి ఒకడుకాక పోయినా లక్షమందికి ఒడు మారినా వానికి మంచి జరిగినట్లేయని తలచి దేవుడు తన ఆత్మను నింపిన తన ప్రతినిధిని పంపి జ్ఞానము చెప్పిన సందర్భములు కొన్ని గలవు. అయినా మనిషి చెడును వీడి మంచిని చేరుతాడను నమ్మకము లేదు. ఈ విషయమై అల్లాహ్ అనబడు దేవుడు తన ఖుర్ఆన్ గ్రంథములో కొన్ని ఆయత్‍లను చెప్పాడు చూడండి.
(2-87) ''వాస్తవముగా మేము మూసాకు తౌరాతు గ్రంథాన్ని ప్రసాదించాము. మరియు అతని తర్వాత ప్రవక్తలను పంపాము. మరియమ్మ కుమారుడైన ఈసాకు (ఏసుకు) స్వచ్ఛమైన, స్పష్టమైన సూచనలను ఇచ్చాము. పరిశుద్ధాత్మతో అతనిని బలపరిచాము. అయితే మీ మనోవాంఛలకు ప్రతికూలముగా యున్న దానిని తీసుకొని ఏ ప్రవక్త అయినా మీ వద్దకు వస్తే, మీరు వారిపట్ల దురహంకారముతో ప్రవర్తించారు. వారిలో కొందరిని మీరు అసత్యవాదులన్నారు, మరికొందరిని చంపారు.''
(6-154) ''సజ్జనులకు మా అనుగ్రహాన్ని పూర్తి చేయటానికి, ప్రతి విషయమును వివరించటానికి, వారికి మార్గదర్శకత్వమును, కరుణను చూపడానికి మరియు తమ ప్రభువును దర్శించటానికి, ఉన్నదానిని విశ్వసించటానికి మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము.''
(6-155) ''అదే విధముగా శుభప్రదమైన ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేశాము. కావున దీనిని అనుసరించి భయభక్తులు కల్గియుంటే మీరు కరుణింపబడవచ్చు.''
(6-157) ''మీరు ''ఒకవేళ నిశ్చయముగా మా మీద గ్రంథమును అవతరింపజేసియుంటే మేము వారికంటే ఉత్తమరీతిలో సన్మార్గములో నడిచియుండే వారము'' అని అంటారు. కాబట్టి వాస్తవానికి ఇప్పుడు మీ ప్ర్రభువు తరపునుండి మీ వద్దకు ఒక స్పష్టమైన ప్రమాణము, మార్గదర్శకత్వము మరియు కారుణ్యముగల ఈ ఖుర్ఆన్ గ్రంథము వచ్చింది. ఇక అల్లాహ్ సూచనలను అసత్యాలని పలికేవారికంటే, దైవ వచనాలపట్ల విముఖత ప్రదర్శించే వానికంటే మించిన దుర్మార్గుడు ఎవడూ ఉండడు. కాబట్టి ఈ వాక్యముల పట్ల విముఖత తెలిపేవానికి ఫలితముగా భయంకరమైన శిక్ష విధిస్తాము.''
దేవుని జ్ఞానమును వ్యతిరేఖించిన వానికి దేవుని వైపునుండి దేవుని పాలకులు కొన్ని శిక్షలను విధించుచున్నారు. అయినా అవి దేవుని వైపునుండి వచ్చాయని మనిషికి తెలియకపోవడము వలన దైవము ఎడల ఏమాత్రము భయము లేకుండా పోయినది. దానివలన ఒక మనిషిని సన్మార్గములో పంపుటకు దేవుడు కూడా ఎక్కువ శ్రమ పడవలసి వస్తున్నది. ఇంతవరకు మూడు దైవగ్రంథములను పంపినా స్వయముగా తన ప్రతినిధి వచ్చిపోయినా, నేటికీ అజ్ఞాన శాతము భూమిమీద 99 పాళ్ళు ఉందనియే చెప్పవచ్చును. చెప్పుట కాదుగానీ ప్రత్యక్షముగా కనిపించుచున్నది.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
9. దైవగ్రంథము వచ్చినా దానిని చూడరు. (2-101)
దేవుడు తానే తన ప్రతినిధి వేషములో భూమిమీద తిరిగి ప్రత్యక్షముగా జ్ఞానమును చెప్పి, తన జ్ఞానము ఎప్పటికీ ప్రజల మధ్య ఉండులాగున గ్రంథరూపములో జ్ఞానమును ఇచ్చినా, గుణములతో నిండిన మనుషులు గుణముల మాయ ప్రభావము చేత గ్రంథమును కూడా చూడరు. గ్రంథ విషయము మాకు తెలియదే! అని అంటారు. అదే విషయమునే తన వాక్యములో దేవుడు (అల్లాహ్) ఇలా చెప్పాడు.
(2-101) ''వారివద్ద పూర్వము నుండి ఉన్న గ్రంథమును ధృవపరుస్తూ ఒక ప్రవక్త అల్లాహ్ దగ్గరనుండి వారివద్దకు వచ్చినప్పుడు గ్రంథ ప్రజలలో ఒక వర్గము వారు దానిని గురించి ఏమీ తెలియని వారిగా అల్లాహ్ గ్రంథాన్ని తమ వీపుల వెనక్కి త్రోసివేశారు.'' ఈ విధముగా మనిషి వద్దకు జ్ఞానము వచ్చినప్పుడు మనిషి దానిని పట్టించుకోవడము లేదు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
10. పరలోకము కొరకు మరణాన్ని కోరండి. (2-94)
అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో స్వర్గలోకము, నరకలోకము, పరలోకము అను మూడు లోకముల పేర్లు కలవు. స్వర్గలోకమును గురించి గ్రంథములో ఎక్కువగా వ్రాయబడినది. ముస్లీమ్‍లలో స్వర్గమునకు పోవాలను కోర్కె ఎక్కువగా కనిపించుచున్నది. పరలోకము అనునది స్వల్పముగా వ్రాయబడినది. తర్వాత నరకమును గురించి కూడా ఎక్కువగా వ్రాయడము జరిగినది. స్వర్గలోకము ప్రత్యేకముగా యున్నదని గ్రంథములో ఎక్కడా చెప్పలేదు. స్వర్గ లోకమున్న విషయాన్ని చెప్పారు. అయితే మనుషులకు అర్థమయినది ఒకటి. గ్రంథములో చెప్పినది ఒకటి. మనుషులలో విచక్షణా జ్ఞానము తక్కువ అయినవారు కొందరు, అసలుకు విచక్షణే లేనివారు కొందరు, గ్రంథమును చదవడము వలన వారికి గ్రంథములో చెప్పిన వాస్తవము అర్థము కాకుండా పోయినది.
పరలోకమును గురించిన అవగాహన ఏమాత్రము లేదు. పర లోకము అంటే ఏమిటి? అను విషయము పూర్తి మనుషులకు తెలియకుండా పోయినది. స్వర్గ నరకలోకములను గురించినంత మాత్రము కూడా పరలోకమును గురించి తెలియకుండా పోయినది. కొందరి దృష్ఠిలో స్వర్గలోకము పరలోకము రెండూ ఒకటేనని అనుకొన్నారు. కొందరు స్వర్గ లోకమునకు నరక లోకమునకు మధ్యలో ఉండునది పరలోకము అని చెప్పుచున్నారు. కొందరికి పరలోకము అంటే చెడుదా, మంచిదా! అని కూడా తెలియదు. స్వర్గలోకము పైన కలదని నమ్ముచున్నారు. స్వర్గములో సుఖములు కలవనీ, నరకములో కష్టములు కలవని చెప్పుచున్నారు. అయితే పరలోకములో ఏమున్నది ఎవరూ చెప్పలేకున్నారు. మనిషి మరణించిన తర్వాత స్వర్గానికో, నరకానికో పోతాడని హిందూ మతము వారు చెప్పుచున్నారు. స్వర్గ నరకముల విషయము ఒక్క ఇస్లామ్ మతమునకే పరిమితి కాలేదు. భూమిమీద ఉన్న మతములన్నీ స్వర్గ నరకముల గురించి చెప్పుచున్నవి. అయితే ఇస్లామ్ మతములో మనిషి చనిపోయిన తర్వాత అతను భూసమాధిలో ప్రళయ కాలము వరకు ఉండుననీ, ప్రళయ దినమున అల్లాహ్ మనిషిని సమాధినుండి లేపి అతను బ్రతికినప్పుడు చేసిన పాపపుణ్యములన్నిటినీ లెక్కించి దానికి తగినట్లు దేవుడు తీర్పు తీర్చి స్వర్గమునకో, నరకమునకో పంపుననీ చెప్పుచుందురు.
ప్రళయ దినముననే అంతవరకు చనిపోయి గుంతలలో ఉన్న వారిని శరీరములతో సహా లేపి, దేవుడు విచారణ చేయునని చెప్పడములో, ఎంత వరకు సత్యము కలదని? ఎవరయినా ప్రశ్నించితే, దేవుడు చెప్పిన దానిని ప్రశ్నించకూడదు, అల్లాహ్ చెప్పిన దానిని వినడము తప్ప ప్రశ్నించకూడదు, అలా ప్రశ్నిస్తే దేవుని ఎడల విశ్వాసము లేదనీ, అవిశ్వాసమున్నదని చెప్పుదురు. ప్రశ్నిస్తే అవిశ్వాసులని అంటారని భయపడి కొందరు ప్రశ్న వచ్చినా ప్రశ్నించకుండా యున్నారు. మనుషులలో చాలామందికి ఈ విషయములో విచక్షణ లేకపోవడము వలన ప్రశ్నే రాకుండా పోయినది. ఎక్కడయినా ఒక్కడు ప్రశ్నించాలని యోచన వచ్చినా వానిని అవిశ్వాసి అంటారని, దేవుడు చెప్పినది ప్రశ్నించకూడదని చెప్పడము వలన భయపడి కొందరు ప్రశ్నించలేకపోవుచున్నారు.
పరలోక విషయానికి వస్తే ఖురాన్ గ్రంథములోనే పరలోక విషయములో మనిషి ఎట్లున్నాడో తెల్పుచూ చెప్పిన వాక్యము సూరా 27, ఆయత్ 66లో కలదు చూడండి.
(27-66) ''వాస్తవానికి పరలోక జీవితము గురించి వారి జ్ఞానము శూన్యమే. నిజంగా దానిని గురించి వారు సంశయములో పడినారు. ఇంకా చెప్పితే దాని విషయములో వారు అంధులై పోయారు.''
ఈ వాక్యమును చూచిన తర్వాత మనుషులకు పరలోకమును గురించి వారికున్న జ్ఞానము శూన్యమని తెలిసినది. అంతేకాక పరలోక విషయములో వారు పూర్తి గ్రుడ్డివారిగా ఉన్నారని దేవుడే చెప్పినట్లు అర్థమగుచున్నది. అంధత్వములో యున్న మనిషికి పరలోక జ్ఞానము లేదని అర్థమగుచున్నది. లోకము అనుభవింపబడునదని ఒక విధముగా చెప్పవచ్చును. సుఖాలను అనుభవించునది స్వర్గలోకము, కష్టాలను అనుభ వించునది నరకలోకము. పరలోకము అనగా లోకముకంటే వేరుగా యున్నదని అర్థము. లోకము అనగా అనుభవించునది అయితే పరలోకము అన్నప్పుడు అనుభవమునకు వేరుగాయున్నదని అర్థము. ఏ అనుభవమూ లేనిదనీ, అనుభవముకంటే వేరుగాయున్నదనీ చెప్పవచ్చును. ఏ అనుభవము లేనిది పరలోకము అన్నప్పుడు, దానిని ఇంకా కొంచెము వివరముగా చూస్తే, లోకములో అనుభవములుండును. అనుభవములు కర్మ వలన సంభవించుచుండును. మంచి కర్మ అయిన పుణ్యముగానీ, చెడు కర్మ అయిన పాపము గానీ ఏ కర్మయున్నా అది అనుభవ రూపములోనికి వచ్చును. పాపపుణ్యములు రెండూ లేనప్పుడు ఏ అనుభవము లేకుండా పోవును. అప్పుడు లోకమే లేదని అర్థము. అందువలన లోకముకంటే వేరయినది పరలోకము. 'పర' అనగా వేరుగాయున్నదని అర్థము.
మనిషికి పరలోకము లభించవలెనంటే మనిషి పుట్టుకలో పాపముగానీ, పుణ్యముగానీ ఏదీ ఉండకూడదు. ఎప్పుడు మనిషి కర్మ రహితుడగునో అప్పుడు పరలోకము లభించును. లోకముకంటే వేరయిన లోకము ఎక్కడున్నది? అని ప్రశ్న వస్తే, కర్మ రహితమైనది ఎక్కడ కలదో అక్కడ పరలోకము ఉంటుంది అని చెప్పవచ్చును. పాపపుణ్యములు లేని స్థలము దేవునియందు మాత్రమే కలదు. ఎందుకనగా! దేవుడు పాపపుణ్య కర్మ రహితుడు. ఆయనకు ఏ కర్మ లేదు. అందువలన ఆయనకు ఏ అనుభవము లేదు. మనిషి కూడా కర్మలేనివాడైతే దేవునిలోకి ఐక్యమై పోయి ఏ అనుభవము లేనివాడుగా ఉండిపోవును. వానికి చావు పుట్టుకలు లేవు అని తెలియుము.
చావు పుట్టుకలు లేని, కర్మలు లేని పరలోకము లభ్యమగుటకు మనిషి మనిషిగా ఉండకూడదు. మనిషికి మరణము వచ్చినప్పుడు కర్మ లేకపోవడము వలన రెండవ జన్మకు పోకుండా వాడు నేరుగా పరలోకమును పొందును, అనగా మోక్షమును పొందును. అటువంటి స్థితిని పొందడమును దేవునియందు ఐక్యమై ఉండడము అని చెప్పవచ్చును. పరలోకము పొందిన వాడు అప్పటినుండి కర్మలకు అతీతుడై ఉండును. ఇప్పుడున్న స్థితినుండి మోక్షస్థితి (పరలోక ప్రాప్తి) పొందవలెనంటే మరణము వచ్చిన తర్వాతనే అది లభించును. అందువలన పరలోకము కొరకు మరణమును కోరవలెనని ఖుర్ఆన్ గ్రంథములో సూరా 2, ఆయత్ 94 లో ఇలా చెప్పారు చూడండి.
(2-94) ''వారితో ఇలా అను ఒకవేళ అల్లాహ్ వద్దనున్న పరలోక నివాసము మానవులందరికీ కాక కేవలము నీకు మాత్రమే ప్రత్యేకించబడియుంటే, మీరు ఈ అభిప్రాయములో సత్యవంతులే అయితే మీరు మరణాన్ని కోరండి.'' అని కలదు.
ఈ వాక్యము చదివితే మరణము తర్వాతనే పరలోక రాజ్యము లభించునని అదియూ నీ ఒక్కనికే లభించునని చెప్పుచున్నాడు. అలా చెప్పడమునకు కారణము ఏమనగా! ఇంతకుముందు ఎందరు పరలోకమును పొందియున్నా వారు పరలోకములో కనిపించరు. ఇప్పుడు ఒకనితో పాటు పదిమంది పరలోకమునకు పోవుటకు అర్హులుగా యున్నా, వందమంది ఒకేమారు పరలోకమును పొందినా అందులో మిగతా వారు ఎవరూ కనిపించరు. తాను ఒక్కడు మాత్రము ఉన్నట్లు తెలియుచుండును. అందరికీ అటువంటి అనుభూతే యుండుట వలన ఎవరికి వారు తెలియు చుందురు. ఇతరులున్నట్లు తెలియదు. అందువలన వాక్యములో ''మానవులందరికీ కాక నీకు మాత్రమే ప్రత్యేకించబడియుంటే'' అని చెప్పారు. అంతేకాక ఇప్పుడు మేము చెప్పు ఒంటరి విషయము ''సత్యమని నీకు అర్థమయితే'' అని వాక్యములో చెప్పడమైనది. పరలోకము యొక్క విలువ తెలిసినవాడు దానిని పొందుటకు మరణము కొరకు కాచుకొని ఉండును. మరణము తర్వాతనే మనిషికి మోక్షము గానీ, జన్మగానీ లభించును. అయితే జన్మకు పోకుండా పరలోకమునకు పోవాలనుకొన్నవాడు మరణమును కోరుకొనుచుండును. మరణము పొందిన తర్వాత రెండవ జన్మకు పోవు తీర్పు పొందక శాశ్వితముగా ఒకే స్థితిలో పరలోకమును పొందవలెనని ఉండును.
మోక్షము (పరలోకము) యొక్క విషయములో మనుషులు అంధులై యున్నారని (27-66) లో చెప్పినట్లు మనిషి తాను శరీరముతో బ్రతికి యున్నట్లే నేను మోక్షము పొందియున్నాను అని చెప్పుకొంటున్నాడు. కొద్ది మాత్రము జ్ఞానము తెలిసినంత మాత్రమున తనను గొప్ప జ్ఞానిగా ఊహించుకొని పరలోక విషయము ఏమాత్రము తెలియనివాడు తాను ప్రస్తుతము పరలోకములోనే ఉన్నాను అని అంటున్నాడు. మనిషి చనిపోతే తర్వాత సెకండు కాలములోనే రెండవ జన్మకుగానీ లేక పరలోకమునకు (మోక్షమునకు) గానీ పోవలసియుండును. మరణము పొందిన క్షణమే ఇటు ఇహలోకమునకా, అటు పరలోకమునకా అన్నది కర్మ నిర్ణయము మీద ఆధారపడియుండును. కర్మయుంటే జన్మకు, కర్మ లేకపోతే మోక్షమునకు (పరలోకమునకు) పోవలసియుండును. అయితే కొందరు ఆధ్యాత్మికము అర్థము కాని స్థితిలో ఉండి, దైవగ్రంథములో వ్రాసిన విషయము అర్థము కాకపోవడము వలన మరణము తర్వాత సమాధులలో ప్రళయము వరకు ఉండవలెనని, ఇంతకు ముందు చనిపోయిన వారందరూ ప్రస్తుతము భూసమాధులలోనే యున్నారని అంటున్నారు. రేపు తాము చనిపోయినా అట్లే గుంతలలో ఉందుమని చెప్పుకొంటున్నారు. ఈ విషయము ఖుర్ఆన్ గ్రంథములో అల్లాహ్ చెప్పాడని కూడా చెప్పుచున్నారు. అయితే అట్లు చెప్పిన మాట ఏ దైవగ్రంథములోనూ లేదు. దైవగ్రంథములో చెప్పిన విషయమును మనిషి సరిగా అర్థము చేసుకోక తనకు అర్థమయినదో లేక తనలాగా పొరపాటుపడిన బోధకులు చెప్పిన మాటనో విని దానినే చెప్పు చున్నారో గానీ, ఇది వాస్తవమా కాదా!యని ఏమాత్రము ఆలోచించడము లేదు.
ప్రపంచము సృష్ఠికర్త చేత సృష్ఠింపబడినది. ఇది ఎప్పటికీ నాశనమగునది కాదు. ప్రపంచమునకు ప్రళయ దినము లేనేలేదు. అట్లున్నదని ఏ గ్రంథములో కూడా వ్రాయలేదు. ఎక్కడా వ్రాయనిదే ఎక్కడా చెప్పనిదే, తనకు తాను ఊహించుకొని ప్రపంచ నాశనము తప్పదని చెప్పుచున్నారు. వాస్తవానికి అటువంటిది ఏదీ లేదు. దైవగ్రంథములలో అంతిమ దినమనీ, ప్రళయ దినమనీ వ్రాసియుండుట వాస్తవమే. అయితే అది బయట ప్రపంచమునకు చెప్పలేదు. లోపలి ప్రపంచమును గురించి చెప్పిన మాటయని తెలియవలెను. శరీరము ఎప్పుడు నశించి చనిపోవునో, అప్పుడు వానికది ప్రళయ దినమగును. ఎవడు చనిపోయిన దినము వానికి అదే అంతిమ దినమని చెప్పవచ్చును. భూమిమీద మరణ దినమే అందరికీ అంతిమ దినము. మరణ దినమే వాని శరీరమునకు ప్రళయ దినము. ప్రతి ఒక్కనికీ వ్యక్తిగతముగా చెప్పిన మాటలే ప్రళయ దినము, అంతిమ దినము అని తెలియవలెను. అట్లు లెక్కించక సామూహిక ప్రళయ దినము, సామూహిక అంత్య దినము వస్తుందనుకోవడము పొరపాటగును. నిత్యము కొందరి జీవితములకు అంత్య దినముగా యున్నది. అట్లే ప్రతి దినము కొందరికి ప్రళయ దినముగా యున్నది. ఎట్లు అంతిమ దినమున్నదో అట్లే ప్రథమ దినము ఉన్నది. ఎట్లు ప్రళయ దినమున్నదో అట్లే ప్రభవ దినము కూడా యున్నది. అంత్య ప్రథమ దినములు, ప్రళయ ప్రభవ దినములు కలవు. వాటియందు గల అజ్ఞాన అపోహలను తీసివేయుట వలన స్వచ్ఛమయిన జ్ఞానము తెలిసి పరలోకమును పొందవచ్చును.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
11. చివరి రోజును గురించి భయపడండి. (2-48, 2-123, 21-47)
చివరి రోజు అనగా! జీవితమునకు ముగింపు రోజును చివరి రోజు అని అంటున్నాము. జీవితములో ఎన్నో రోజులు గడచి పోయినా చివరి ఒక రోజుతో జీవితము ముగిసిపోవుచున్నది. జీవితమునకు అంత్య రోజు ఏదయితే ఉన్నదో దానినే చివరి రోజు, లేక అంతిమ దినము అని అంటున్నాము. అయితే కొందరు ఉన్న సత్యమును వదలి తమ వరకు ఆలోచించక బయట ప్రపంచమునకు సంబంధించిన చివరిరోజును చెప్పుకొంటున్నారు. మనిషికి సంబంధించిన జ్ఞానమును గ్రంథ వాక్యములో చెప్పియుండగా, మనిషి విచక్షణా జ్ఞానము లేకుండా అక్కడ చెప్పినది గ్రహించుకోలేక, తనకు చెప్పిన విషయమును వదలి ప్రపంచమునకు సంబంధించిన విషయమును లెక్కించుకోవడము జరుగుచున్నది. దాని వలన దారితప్పి జ్ఞానమార్గమును వదలి వేరు మార్గములో నడచినట్లగు చున్నది. అంతిమ దినమును గురించి సూరా 2, ఆయత్ 48లోనూ మరియు 123 లోనూ చెప్పారు. అంతేకాక సూరా 21, ఆయత్ 47లో కూడా ఇలా చెప్పారు చూడండి.
(2-48) ''తీర్పు దినమునకు భయపడండి. అప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఏ విధముగానూ ఉపయోగపడలేడు. అతనికి ఎట్టి సిఫారసు అంగీకరించబడదు. మరియు ఎలాంటి పరిహారము తీసుకోబడదు. వారికి ఎలాంటి సహాయము కూడా చేయబడదు.''
(2-123) ''పునరుత్థాన దినమును గురించి భయముగలిగి యుండండి. ఆనాడు ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తికి ఏమాత్రము ఉపయోగపడలేడు. అంతేకాక ఎవరి నుండి ఎలాంటి పరిహారము స్వీకరించబడదు. ఎవరి సిఫారసు లాభదాయకము కాదు, వారికి ఎలాంటి సహాయము లభించదు.''
(21-47) ''పునరుత్థాన దినమున మేము సరిగ్గా తూచే త్రాసును ఏర్పాటు చేస్తాము. కనుక ఏ వ్యక్తికి కూడా ఏమాత్రము అన్యాయము జరుగదు. ఒకవేళ ఆవగింజంత కర్మయున్నా మేము దానిని ముందుకు తెస్తాము. దాని లెక్క చూడడానికి మేమే చాలు.''
ఈ మూడు ఆయత్‍లలో మనిషి యొక్క చివరి దినమును గురించే వ్రాశారు. మిగతా రెండు దైవగ్రంథములకంటే చివరి గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములోనే విపులముగా వ్రాయడము జరిగినది. ఎంతో వివరముగా వ్రాసియున్నా గ్రంథములోని భావమును గ్రహించుకోలేక చాలామంది గ్రంథములో చెప్పినది ఒకటయితే వారు అర్థము చేసుకొన్నది మరొకటిగా యున్నది. మనకి అంతిమ దినము చనిపోయిన దినమే అయివుండగా అది తెలిసి కూడా సత్యమును వదలి అసత్యమును నమ్ముచున్నారు. అసత్యమును చెప్పు వారి మాటలనే వింటున్నారు. గ్రంథములో మనిషియొక్క అంత్య దినమును గురించి చెప్పితే, మనిషి ప్రపంచము యొక్క అంత్య దినమును గురించి చెప్పుకోవడము జరిగినది. కొందరు తమ మాటలను సత్యమని చెప్పుటకు ముహమ్మద్ ప్రవక్తగారే అలా చెప్పారని తమ తప్పును ప్రవక్తగారి మీదికి త్రోశారు. ప్రవక్తగారు చెప్పిన విషయము పైన గల మూడు ఆయత్‍లలో ఉండగా దానిని అర్థము చేసుకోలేక ప్రవక్తగారే తప్పు బోధించినట్లు ప్రచారము చేశారు. కొందరు ముఖ్యమైన వారు, బోధకులుగా యున్నవారు చెప్పగా మిగతా అసంఖ్యాక ముస్లీమ్ సమాజమంతా అదే నిజమని నమ్మినది.
నేడు ప్రతి మనిషి కొంత బుద్ధి కల్గియున్నాడు. బుద్ధికి ప్రపంచ సంబంధముగా ఎంతో విచక్షణ కలదు. ప్రపంచములో ఎంతో నైపుణ్యముగా ఉపయోగపడు విచక్షణ దైవ విషయముల దగ్గర పూర్తి గ్రుడ్డిదై పోయినది. సత్యమేదియని ఏమాత్రము ఆలోచించడము లేదు. మా పెద్దలు చెప్పింది మేము వింటున్నాము అంటున్నారు. వినడములో తప్పులేదు. అయితే వినిన విషయము సత్యమా అసత్యమా? అని ఏమాత్రము ఆలోచించకుండా గ్రుడ్డిగా నమ్మకూడదు. అలా నమ్మితే అది సత్యమయితే మంచిదే. ఒకవేళ మనము విన్నది సత్యము కాకపోతే అప్పుడు చెప్పినవాడు ఒకడే చెడిపోతే విన్నవారు వేలమంది, లక్షల మంది చెడిపోతారు. అందువలన చెప్పిన వానికంటే వినినవారికే ఎక్కువ నష్టము జరుగును. జరిగిన నష్టము ధనమో, ధాన్యమో అయితే ఫరవాలేదు. అది ప్రపంచ సంబంధమైనది కాకుండా దైవ సంబంధమైనదయిన దానివలన మనిషి జీవితమునకే నష్టము. మనిషి జన్మకే నష్టము. జీవితమంతా తప్పు జ్ఞానములోనే ఉండిపోవడము, దానినే చెప్పుకోవడము జరుగును. అటువంటప్పుడు ప్రస్తుత జన్మ అంతా వ్యర్థ మగును. వాస్తవ జ్ఞానము తెలియక జన్మ వృథాయగును.
దైవజ్ఞానము జన్మకు సంబంధించినది, ఒక జీవితమునకు సంబంధించినది అగుట వలన దైవ విషయములలో సత్యాసత్యమును తెలిసి బ్రతుకుట మంచిది. జన్మయొక్క ఉద్దేశ్యము దైవ జ్ఞానమును తెలియడమే. అటువంటి జ్ఞానము తెలియకపోతే జన్మయంతా సార్థకము లేనిదగును. అందువలన దైవగ్రంథములో చెప్పిన ప్రతి విషయమును జాగ్రత్తగా గ్రహించుచూ శ్రద్ధగా తెలియవలసి యున్నది. అంతిమ దిన విషయమును తీసుకొని చూస్తే దేవుడు జ్ఞానమును చెప్పినది తనకని తెలియక తనకు గల అంతిమ దినమును వదలి ప్రపంచ సంబంధ అంతిమ దినమును గురించి చెప్పడము పెద్ద తప్పగును. మనిషికి అంతిమ దినము లేకపోతే అప్పుడు నీవు ప్రపంచ అంతిమ దినమును గురించి ఆలోచించాలి గానీ, నీకున్న అంత్య దినమును వదలి బయట ప్రపంచ అంత్య దినమును గురించి ఎందుకు ఆలోచించాలి? దేవుడు ఎక్కడయినా ప్రపంచ సంబంధ అంతిమ దినమును గురించి చెప్పాడా? అని అడిగితే కొందరు ''అవును దేవుడు ప్రపంచ అంత్య దినమును గురించి చెప్పాడని'' అనుచున్నారు. ''ప్రళయ దినమే అంత్య దినము అని చెప్పడము వలన ప్రపంచమునకు ప్రళయము సంభవించినప్పుడు మనుషులకు అంత్య దినము వచ్చునని మేము అనుకొంటున్నాము. మా పెద్దలు అలాగే చెప్పారని'' చెప్పుచున్నారు. ప్రళయము అను ఒకమాటను అడ్డము పెట్టుకొని ప్రపంచ ప్రళయమని అంటున్నారు. ప్రళయము అనగా నాశనము అని అర్థము అగును. అంతేగానీ ప్రపంచ ప్రళయమని ఎందుకు అనుకోవాలని మేము అంటున్నాము.
ఖుర్ఆన్ గ్రంథములోనే మూడవ సూరాలో అంతిమ దినమును గురించి మరికొన్ని వాక్యములు (ఆయత్‍లు) చెప్పడము జరిగినది. రెండవ సూరాలో చెప్పినా, మూడవ సూరాలో చెప్పినా సత్యము ఏదయితే దానినే చెప్పియుందురు గానీ వేరు చెప్పియుండరు కదా! దేవుని జ్ఞానమును ముహమ్మద్ ప్రవక్తగారికి చెప్పినది సాధారణ వ్యక్తి కాదు. ప్రతి దినము ప్రపంచమునకు వెలుగునిచ్చు సూర్యుడే జిబ్రయేల్ అను పేరుతో చెప్పడమైనది. జిబ్రయేల్ సృష్ఠి ఆదిలోనే ఆకాశవాణి ద్వారా వచ్చిన జ్ఞానమును విన్నవాడు. మొదట జిబ్రయేల్ తౌరాతును మనువుకు బోధించాడు. రెండవమారు తాను విన్న జ్ఞానమును, తాను తెలిసిన జ్ఞానమును ముహమ్మద్‍కు బోధించాడు. ప్రపంచములో జ్ఞానమును విన్న మొదటి వ్యక్తి జిబ్రయేల్ అయిన దానివలన ఆయన మహాజ్ఞానిగా యుంటూ తనకు తెలిసిన జ్ఞానమును ప్రవక్తగారికి చెప్పగా, ప్రవక్త ఇతరులకు అనగా తన అనుచరులకు చెప్పగా చివరికది గ్రంథరూపమైనది. అదే ఖుర్ఆన్ గ్రంథము. ఖుర్ఆన్ గ్రంథములో మనిషి చనిపోవు దినమును అంతిమ దినమనీ, పునరుత్థాన దినమనీ, ప్రళయ దినమనీ చెప్పడమైనది. మూడు, నాలుగు పేర్లతో చెప్పినా అది మనిషి చనిపోవు చివరి దినమును గురించి చెప్పినదేగానీ వేరుకాదు. ఇప్పుడు మూడవ సూరాలో చెప్పిన వాక్యములను కూడా చూస్తాము.
(3-9) ''దేవుడు నిశ్చయముగా జనులందరినీ ఏదో ఒక రోజు సమీకరిస్తాడు. ఆ రోజును గురించి ఎలాంటి అనుమానము లేదు. అల్లాహ్ తన వాగ్దానానికి విరుద్ధముగా వ్యవహరించడు.''
(3-10) ''అవిశ్వాసులను వారి అంతిమ దినమున వారి సిరి సంపదలుగానీ, వారి సంతానముగానీ, కర్మపత్రము నుండి, అల్లాహ్ శిక్షనుండి విడిపించడములో ఏమాత్రము ఉపయోగ పడవు. నరకానికి ఇంధనము అయ్యేవారు వీరే.''
(3-114) ''అల్లాహ్‍ను, అంతిమ దినమును కూడా వారు విశ్వసిస్తారు. మంచిని చేస్తారు, చెడును ఆపుతారు. సత్కార్యముల కోసము, దేవుని సేవ కోసము వారు ఒకరికొకరు పోటీ పడతారు. అటువంటి వారు సజ్జనుల కోవకు చెందినవారు.''
(3-185) ''ప్రతి ప్రాణి మృత్యువును రుచి చూడవలసిందే. ప్రళయములో అంతిమ దినమున మీరు అందరూ కర్మల పూర్తి ఫలితములను పొందుతారు. అప్పుడు ఎవడయితే నరకాగ్నిలో పడకుండా మోక్షములో ప్రవేశిస్తాడో అతడు నిశ్చయముగా సఫలీకృతుడైనట్లే. ప్రాపంచిక జీవితమైతే మాయ తతంగము తప్ప మరేమీ కాదు, అది మోసపూరిత జీవితమే.''
ఇక్కడ వ్రాసిన నాలుగు ఆయత్‍లను (వాక్యములను) చూస్తే మరణ సమయములోని పూర్తి జ్ఞానము కలదు. అయితే మనిషి తన బుద్ధిని ఈ వాక్యములయందు లగ్నము చేసి చూడకుండా, అందులో చెప్పిన విషయమును పూర్తి గ్రహించకుండా, ఒకచోట ''ప్రళయములో అంతిమ దినమున'' అని వ్రాయబడిన దానిని చూచి ప్రళయము ఎవరికి? అంతిమ దినము ఎవరికి? అని ఏమాత్రము ఆలోచించక, ప్రపంచ ప్రళయమును గురించి చెప్పుకోవడము జరిగినది. ప్రళయము అనగా 'ప్ర' అను శబ్దములో పుట్టినదియని అర్థము. ళయము అనగా నాశనము, లేకుండా పోవడము అని అర్థము. పుట్టినది ప్రపంచము అని అంటాము. అట్లే శరీరము అని అంటాము. ప్రపంచము అనగా ఐదు చేత పుట్టినదని అర్థము. వివరముగా చెప్పుకొంటే ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు భాగముల చేత పుట్టినది. అటువంటి ప్రపంచములో ఐదు భాగములయిన ప్రకృతి చేత పుట్టినది శరీరము. శరీరములో కూడా ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు గలవు. బయట ప్రపంచము కనిపించు ప్రకృతి కాగా, శరీరము లోపలి ప్రపంచము ప్రతి జీవునికి కలదు. ప్రతి మనిషికి పంచ భూతముల చేత తయారయిన శరీరము గలదు. శరీరములో ఐదు భూతములు మిళితముగా ఉండుట వలన అవి మార్పుకు లోనవుతూ శిథిలావస్థకు చేరుచున్నవి. బయట ప్రపంచము మార్పు చెందక ఎప్పటికీ ఒకేలాగ ఉన్నది. శరీరము మాత్రము ఏదో ఒక రోజు నశించి పని చేయకుండా నిలిచిపోవుచున్నది. ఎప్పుడయితే శరీరములో కనిపించక యున్న మనస్సు, బుద్ధి, చిత్తము, అహము నాశనము చెందుచున్నవో వాటితో పాటు మిగతా శరీర భాగములన్నీ నశించుచున్నవి. అలా నశించి పని చేయకుండా పడిపోవు శరీరమును చనిపోయిన శరీరము అంటున్నాము. శరీరము ఎప్పుడు చనిపోయిందో అప్పుడే జీవునకు మరణస్థితి ఏర్పడు చున్నది. పంచభూత నిర్మిత శరీరము ఎప్పుడు చనిపోవుచున్నదో అప్పుడే ఆ శరీరమునకు ప్రళయము ఏర్పడినదని చెప్పవచ్చును. ప్రళయము శరీరమునకే ఏర్పడును. శరీరములోని పంచభూతములయిన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమికి ప్రళయము ఏర్పడుచున్నది. ఐదు భూతములు ఒక్కచోట ఉన్నప్పుడు అనగా శరీరములో కలిసియున్నప్పుడు ప్రళయము ఏర్పడుచున్నది.
బయట ప్రపంచములో ఐదు భూతములు ఒక్కచోట లేవు. వేరువేరుగా యున్నవి. నీరున్నచోట అగ్ని లేదు. అగ్ని వున్నచోట నీరు లేదు. అట్లే భూమి, ఆకాశము వేరువేరుగా యున్నవి. అందువలన బయట ప్రపంచమునకు ఆయుష్షు లేదు, అంతము లేదు. లోపలి ప్రపంచ మయిన శరీరమునకే ప్రళయము గలదు. అందువలన వాక్యములో చెప్పిన ప్రళయము శరీరమునకేగానీ బయటి ప్రపంచమునకు కాదని తెలియ వలెను. బయట ప్రపంచమునకు ఎప్పటికీ అంత్యము లేదు. యుగములు రెండువేలు గడచితే ఒక కల్పమగును. అట్లు ఎన్ని కల్పములయినా జరుగ వచ్చును. పూర్తిగా ప్రపంచము లేకుండా పోవును అనుట ఎప్పటికీ ఉండదు. ఏ యుగమునకు నాశనము లేదు. ఈ విషయమును మా రచనలలోని ''కలియుగము ఎప్పటికీ యుగాంతము కాదు'' అను గ్రంథములో విపులముగా వ్రాశాము. దానిలో బయటి ప్రపంచమునకు అంత్యము లేదని తెలిసినది. సునామీలు, భూకంపములు అనునవి మనుషులు కష్టపడుటకు ఏర్పడునవే గానీ అవన్నీ ప్రళయములు కావు. ఇంతవరకు ప్రపంచము ప్రళయము చెందును అనుటకు ఆధారము లేదు. శరీరము ప్రళయమును పొందవచ్చును. అనగా శరీరము నాశనము కావచ్చును. దానినే మరణము లేక చావు అనీ, మృత్యువు అనీ అంటున్నాము. మృతి చెందిన దినమును ప్రళయ దినమని చెప్పవచ్చును.
ప్రళయ దినము అనగా మనిషి చనిపోవు సమయములో ఏమి జరుగును అను సమాచారము ఎవరికీ తెలియదు. అప్పుడు ఏమి జరిగేది చనిపోయిన జీవునకు తెలుసు. అయితే చనిపోయిన తర్వాత వాడు ఆ శరీరమునుండి మాట్లాడడు గనుక ఆ సమయములో ఏమి జరిగినది బ్రతికియున్న ఎవరికీ తెలియదు. అది అత్యంత రహస్యమయిన విషయము. అటువంటి రహస్య విషయమును కూడా సులభముగా మీకు విప్పి చెప్పడమైనది. మా పరిశోధనలో శోధించి ఛేదించిన రహస్యమును మేము మా రచనలలోని ''జనన మరణ సిద్ధాంతము'' అను గ్రంథములో తెలియజేశాము. చనిపోవుట తిరిగి పుట్టుట అత్యంత చోద్యమైన రహస్యము. సులభముగా చెప్పితే మరణము నిద్రలాగ వచ్చును. జననము మెలుకువలాగ వచ్చును. చావడము పుట్టడము ఒక సెకను కాలములో జరిగిపోవుచున్నది. ఆ సెకను కాలములో మనిషికి (జీవునకు) తెలిసి కొంత, తెలియక కొంత జరుగుచున్నది. తెలిసి జరిగేది నిద్రపోవడము, అలాగే మెలుకువలోనికి రావడము. ఇది ప్రతి దినము ప్రతి మనిషికీ జరుగుచున్నది.
మనిషి చావు, నిద్ర రెండు ఒక్కటేయగును. జ్ఞాపకము ఉన్నంత వరకు మనిషికి బాధలు, సుఖములు తెలియుచుండును. ఎప్పుడు సుఖములు, బాధలు తెలియకుండా పోవుచున్నవో అప్పుడు నిద్రయగును. నిద్రపోయినవాడు అదే శరీరములో లేవగలిగితే మెలుకువ అంటాము. అట్లు కాకుండా వేరే క్రొత్త శిశు శరీరములో జ్ఞాపకము వచ్చి లేవగలిగితే దానిని జన్మ అంటారు. జన్మను నిర్ణయించి జన్మకు పంపువాడు శరీరములోని ఆత్మయేనని తెలియవలెను. ప్రతి మనిషి నిద్రలోనికి పోతే అందులో ఎవడయినా జన్మకు పోవచ్చును. జన్మకు పోవలసిన వానిని దేవుడే (ఆత్మే) వేరే శరీరమును నిర్ణయించి పంపుచున్నది. ఆ విషయమును గురించి ఖుర్ఆన్ గ్రంథములో సూరా 39, ఆయత్ 42లో ఇలా చెప్పడమైనది చూడండి.
(39-42) ''అల్లాహ్‍యే ఆత్మలను (జీవాత్మలను) మరణ కాలమున వశపరచుకొనేవాడు. మరణించిన వారి ఆత్మలకు దేనికైతే మరణము నిర్ణయింపబడుతుందో దానిని తనవద్దే ఆపుకొని మిగతా వారి ఆత్మలను నిర్ణీత సమయము వరకు తిరిగి పంపుతాడు. ఇందులో ఆలోచించే వారికి గొప్ప సూచనలు ఉన్నాయి.''
ఈ వాక్యము కొందరికి అర్థమయినా చాలామందికి అర్థము కాక యుండవచ్చును. దీనినే వివరముగా చెప్పుకొంటే, ప్రతి దినము ప్రతి మనిషి నిద్ర అనబడు చావులోనికి పోతున్నాడు. నిద్రపోయినవాడు చచ్చిన వాడు ఇద్దరూ ఒక్కటేలాగున కనపడుచుందురు. శరీరములోని ఆత్మ ఆధీనములో నిద్రపోయినవాడు ఉండును. ఆత్మ వాని కర్మను బట్టి వాడు ఇంకా బ్రతకవలసి యుంటే అదే శరీరములోనే మెలుకువలోనికి పంపును. అట్లుకాక ఆ జన్మ కర్మయంతయు అయిపోయి వుంటే వానిని రెండవ జన్మకు పంపును. రెండవ జన్మ లేదని ముస్లీమ్ సమాజమంతా అనుకొంటున్నారు. రెండవ జన్మ ఉన్నదనుటకు సాక్ష్యముగా ఖుర్ఆన్ గ్రంథములోనే అనేక ఆయత్‍లు (వాక్యములు) గలవు. రెండవ జన్మ ఉన్నదను ఖుర్ఆన్ వాక్యములను ఇప్పుడు చూచి రెండవ జన్మ ఉన్నదని నిర్ణయమునకు వచ్చిన తర్వాత అంతిమ దినమున ఏమి జరుగుచున్నదో తెలియని విషయమును తెలుసుకొందాము. రెండవ జన్మకు సంబంధించిన వాక్యములను ఇప్పుడు చూస్తాము.
(7-29) ''మొదటిసారి మిమ్ములను అల్లాహ్ ఎలా పుట్టించాడో, మలిసారి కూడా మీరు అలాగే పుట్టించబడతారు.'' (అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్ అను గ్రంథమునుండి ఈ వాక్యమును సేకరించాము.)
(22-66) ''మీకు జీవనము ప్రసాదించినవాడు దేవుడే. ఆయనే మరణమును ఇస్తాడు. మళ్లీ ఆయన తిరిగి బ్రతికిస్తాడు. అయినా మానవుడు మేలును మరచేవాడే.''
(36-68) ''వృద్ధాప్యానికి చేరిన వారిని మళ్లీ జనన స్థితికి తీసుక పోతాము. అయినా వాళ్ళు అర్థము చేసుకోరేమిటి?''
(40-11) ''మా ప్రభూ! నీవు మాకు రెండుసార్లు చావునిచ్చావు. రెండుసార్లు బ్రతుకునిచ్చావు.''
(53-44) ''నిశ్చయముగా ఆయన మరణింప చేసేవాడు మరియు జీవితమును ప్రసాదించేవాడు.''
(53-46) ''ప్రవహింపచేసే వీర్య బిందువునుండి''
(53-47) ''మరొక జీవితమును ప్రసాదించడము ఆయనకే (దేవునికే) చెల్లును.''
ఈ వాక్యములన్నిటినీ చూచిన తర్వాత మనిషికి రెండవ జన్మలేదు అనువారు దేవుని వాక్యమునకు వ్యతిరేఖముగా మాట్లాడినట్లగును. కొందరు దేవుడు చెప్పిన మాటను కూడా లెక్కించక మా మతములో జన్మలు లేవు అనువారు దేవుని శిక్షకు అర్హులు. వీర్యబిందువు నుండి మరొక జీవితమును ప్రసాదించడము అంటే రెండవ జన్మయని ఎవరికయినా అర్థము కాగలదు. మనిషికి మొదట మరణము వస్తే తర్వాత జన్మ వచ్చును. మరణము తర్వాత జన్మ వచ్చు వరకు మనిషికి తెలియని విధానము ఒకటి గలదు. దానినే ''తీర్పు తీర్చడము'' అని అంటున్నాము. తీర్పు తీర్చడము అంటే రెండవ జన్మను నిర్ణయించి పంపడము అని అర్థము. మనిషి చేసుకొన్న కర్మప్రకారము రాబోవు జన్మ నిర్ణయము జరుగును. అలా తీర్పు తీర్చు విధానము మనిషికి ఏమాత్రము తెలియదు. తీర్పు విధానమంతయూ మనిషికి తెలియని అత్యంత గొప్ప రహస్యమని చెప్పవచ్చును. ఇప్పుడు మరణము ఎట్లు జరుగుచున్నదో మరణ సమయములో తీర్పు విధానము ఎట్లున్నదో, తీర్పులోని అత్యంత రహస్యముతో పాటు తెలుసుకొందాము. ఇది ఒక మనిషికనిగానీ, ఒక మతము వారికే అనిగానీ ఏమీ లేదు. మనిషి అనువాడు ఏ మతము వాడయినా మరణములో జరుగు విధానము ఇంతేననీ, ఇంతకంటే మిగిలియున్న రహస్యము ఏమీ లేదని తెలియవలెను.
మొదటి బాల్యదశ మొదలుకొని వృద్ధాప్యదశ వరకు శరీరము లోపలి బయటి అవయవములు, కర్మ, గుణములు అన్నీ ఒకే విధముగా వాటివాటి పని చేయుచుండగా అవసాన దశలో మాత్రము శరీరము లోపలి, బయటి అవయవములలో మార్పులు కలుగుచూ అన్నియూ పని చేయక నిలిచిపోవును.
శరీరము యొక్క అన్ని దశలలో శరీరమంతా వ్యాపించి శక్తినిచ్చి అవయవములనన్నిటినీ కర్మానుసారము నడిపించు ఆత్మ అవసాన దశలో శరీరమంతా లేకుండా కొద్దికొద్దిగా ముకుళించుకొనును. అవసాన సమయములో ఆత్మ ముకుళించుకు పోవడము వలన మొదట వెంట్రుకలు చర్మము యొక్క స్పర్శ లేకుండా పోవును. ఆ సమయములో చీమలు కుట్టినా తెలియకుండా పోవును. తేలుకుట్టినా నొప్పి తెలియకుండా పోవును. బ్రతికినన్నాళ్ళు అన్ని దశలలోనూ చర్మము ద్వారా తెలిసిన బాధలు అవసాన దశలో తెలియకుండా పోవును. దీని ప్రకారమైతే జీవునికి అన్ని దశలకంటే అవసాన దశయే బాధ లేనిదని చెప్పవచ్చును. శరీరమంతా ఉన్న ఆత్మ ముడుచు పోవుట వలన కర్మేంద్రియములైన కాళ్ళు, చేతులు పని చేయు స్థోమతను కోల్పోవును. అప్పుడు మనిషి కదలక, మెదలక మంచము మీద పడివుండడము మాత్రముండును. నోటి కదలిక శక్తి కూడా లేకుండా పోవడము వలన మనిషి మాట్లాడలేడు. కేవలము కర్మేంద్రియములు పని చేయక, కొద్ది నిమిషములు జ్ఞానేంద్రియములు పని చేయుచుండుట వలన తనవద్దకు వచ్చిన మనుషులు కనిపిస్తుందురు, వారి మాటలు వినిపిస్తుండును. తాను మాత్రము ఎవరినీ పలకరించలేని స్థితిలో ఉండును. నోరు, కాళ్ళు, చేతులు పని చేయని దానివలన తనలో తాను మదనపడు చుండును. అప్పటి వరకు శరీరము మీద గల నొప్పులు కూడా తెలియక పోవును. కాళ్ళ నొప్పులు కూడా కనిపించవు. శరీరము లోపలి నొప్పులేమైనా వుంటే అవి మాత్రము తెలియుచుండును. తర్వాత కొంత సేపటికి అంతవరకు పని చేయుచున్న జ్ఞానేంద్రియములైన కళ్ళు, చెవులు కూడా శక్తి హీనమైపోవును. అప్పుడు బయట ఎవరున్నది, ఎవరు ఏమి మాట్లాడుచున్నది తెలియకుండా పోవును. బయటివారు ఇదుగో నీ చిన్న కొడుకొచ్చాడని చెప్పినా, దాచిన ధనమెక్కడ పెట్టినావని అడిగినా, లోపలి జీవునకు విషయమే తెలియకుండును. కన్నులు తెరచుకొని ఉండినా కనిపించకపోవుట వలన కనురెప్ప కూడా కొట్టక చూస్తున్నట్లే బయటి వారికి కనిపించుచుండును. అటువంటి సమయములో యమదూతలు వచ్చారని వారిని చూస్తున్నాడని, దూత దర్శనము చేత మన ధ్యాస పోయిందని కొందరనుకొనుచుందురు. అవసాన దశలోనున్న వారికి చూపే లేదని తెలియక, యమకింకరులను చూస్తున్నాడనుకోవడము పొరపాటు.
శరీరము బయటగల జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు పని చేయక పోవడము వలన బాహ్య బాధలన్నీ వదలిపోయినట్లే. బయటి ప్రపంచముతో పాటు మనస్సు కూడా బయటి ప్రపంచముతో సంబంధము తెగిపోయి లోపల ఇంద్రియములు పని చేయుచుండును. ఆత్మతో పాటు మనస్సు కూడా బయటి ఇంద్రియములతో సంబంధము తెగిపోవడము వలన బయటి విషయములను బుద్ధికి అందించ లేకపోవును. బుద్ధికి బయటి విషయములు చేరని దానివలన యోచించనవసరమే లేకుండా పోయినది. బుద్ధికి యోచనలు లేనిదానివలన చిత్తమునకు పనియే లేదు. ఏ పని జరగనందున అహమునకు కూడా పనిలేదు. అప్పటికీ మనస్సుకు ఆత్మశక్తి అందుచుండుట వలన మనస్సు తన నైజము ప్రకారము జరిగి పోయిన పనులను గురించి జ్ఞాపకము తెచ్చుచుండును. క్రమేపీ మనస్సు కూడా బలహీనపడి పోవుచుండును. ఆ సమయములో మనస్సు అందించు కొద్దిమాత్రము జ్ఞాపకము తప్ప మనిషికి ఏ బాధగానీ, ఏ చింతగానీ లేకుండును. ఎన్నో శరీర బాధలు, మానసిక బాధలు కల్గి ఏమాత్రము శాంతి లేనివానికి జీవితములో ఎప్పుడూ చవిచూడని బాధ రహిత స్థితిని అవసాన దశలో జీవుడు పొందుచుండును. ఏ బాధలు, ఏ చింతలు లేని ఆ స్థితిని గూర్చి బ్రతికున్నవారు తెలియలేక, చనిపోవునపుడు జీవుడు ఎంత బాధ అనుభవిస్తున్నాడో అని అనుకొనుచుందురు. చివరకు మనస్సు కూడా శక్తిహీనమైపోవుచూ చిన్నచిన్న విషయములను మరచిపోవును. తనకున్న జ్ఞాపకశక్తి తగ్గుట వలన చాలా ముఖ్యమైన విషయములనూ, బాగా మనస్సుకు హత్తుకొనివున్న విషయములనూ జ్ఞాపకము తెచ్చుచుండును. ఆ విషయములనే బుద్ధి గ్రహించి జీవునకు తెలియజేయుచుండును. మనస్సు చివరి వరకు జ్ఞాపకాల పనినే చేయుచుండును. చివరకు మనస్సు అన్ని విషయములను మరచిపోయి ఆఖరుకు తనకున్న గొప్ప విషయమేదో దానినొక్క దానిని జ్ఞాపకము తెచ్చును. అదియే మనస్సుకు చివరి జ్ఞాపకము. దానికంటే మించిన విషయము మనస్సుకుండదు. ఆ చివరి విషయమే బుద్ధి ద్వారా జీవుడు గ్రహిస్తుండును. జీవితములో దేనినయితే మనిషి గొప్పగా తలచి ఉండునో, ఏ విషయమైతే మనిషికి ప్రాముఖ్యముగా ఉండునో, ఏ విషయమును జీవిత ధ్యేయముగా, జీవిత సారాంశముగా పెట్టుకొని బ్రతుకుచుండునో ఆ విషయమే చిట్టచివరి జ్ఞాపకమగును. చివరి విషయము మనోఫలకము మీద బుద్ధి ద్వారా జీవుడు చూచుచుండగా, ఆత్మ తనశక్తిని బుద్ధి, మనస్సు నుండి కూడా ముకుళింపజేయుట వలన అన్ని అవయవములు స్తంభించిపోయినట్లు అవి కూడా లేకుండా పోవును. శరీరములో అంతవరకు అన్ని దశలలో పని చేసిన 24 భాగములు అంత్యమై పోవును. చివరకు శరీర భాగముగా పేరుగాంచిన జీవుడొకడు మిగులును. ఆత్మ శరీరమంతటి నుండి ముడుచుకొని తన నివాస కేంద్రమైన బ్రహ్మనాడిని చేరును. అప్పుడు శరీరమంతా మృతమైపోయి తల మధ్యలో బ్రహ్మనాడి యందు ఆత్మయు, గుణచక్రములో జీవుడును ఉందురు. ఆ స్థితి కొన్ని సెకండ్లు మాత్రముండి ఆత్మ బ్రహ్మనాడిని కూడా వీడి తనతో పాటువున్న నాల్గు చక్రములను తీసుకొని శరీరమును వదలిపోవును. అప్పటికి పూర్తి మరణము సంభవించినట్లగును. అవసాన దశలో ముడుచుకొంటూ శరీర భాగములను వదలించుకొన్న ఆత్మ చివరకు తనతోపాటు జీవున్ని, వానిచుట్టు వున్న గుణములను అనగా గుణచక్రమును, దానికి పైనగల కర్మచక్రమును మిగతా రెండు చక్రములను తీసుకొని మరియొక శరీరమునకు పోవును. ఈ విషయమునే భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగమునందు ఎనిమిదవ శ్లోకములో...
శ్లో|| 8. శరీరం య దవాప్నోతి యచ్చాప్యుత్క్రామ తీశ్వరః |
గృహీ త్వైతాని సంయాతి వాయుర్గన్ధాని వాశయాత్ ||
భావము :- ''ఆత్మ ఏ శరీరము నుండి బయలుదేరి, తిరిగి ఏ శరీరమందు తాను ప్రవేశించుచున్నదో అక్కడికి తనతోపాటు కామాది గుణములను, కర్మను, జీవున్ని గాలి వాసనను తీసుకపోయినట్లు తీసుక పోవుచున్నది.''
మరణించిన శరీరమునుండి ఆత్మ నాల్గు చక్రములతో సహా బయలు దేరుచున్నది. ఆత్మ నాల్గు చక్రములకు ఇరుసుగా ఉండుట వలన ఆత్మ ఎక్కడికి పోయినా, దానిని అంటి పెట్టుకొనియున్న నాల్గు చక్రములు పోవుచుండును. మనుషులకొక్కరికే గాక ప్రతి జీవరాసికి ఈ నాల్గు చక్రముల అమరిక ఉండును. ఏ జీవరాసి శరీరము మరణము పొందినా, దానిలోని ఆత్మ నాల్గుచక్రములతో సహా బయలుదేరి కంటికి కనిపించకుండా పోవుచున్నది. గాలిలో సువాసన కనిపించకుండా మరొక చోటికి ప్రయాణము చేసినట్లు ఆత్మ కూడా సూక్ష్మముగా పోవుచున్నది. ఆత్మ, జీవాత్మ, గుణములు, కర్మ ఏవీ కనిపించునవి కావు. అందువలన మన ముందరే అవి చనిపోయిన వాని శరీరమునుండి పోయినా, వాటిని మనము గుర్తించలేము. ఆత్మను ఆధారము చేసుకొన్న నాల్గు చక్రములు ఆత్మతో పాటు పోవుచుండుట వలన క్రింది చక్రములో గల గుణములతో సహా జీవాత్మ కూడా పోవలసివున్నది. ఆత్మ జీవాత్మ రెండు జోడు ఆత్మలు. అందువలన ఒకటిపోతే మరొకటి కూడా పోవలసిందే!
పూర్వకాలము నుండి మనుషులకు మరణ కాలములో తెలియని రహస్యము ఏమనగా! ఆత్మ నాలుగుచక్రములతో బయటికి పోవుచున్నదను విషయము ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఏ గురువులు చెప్పలేదు, ఏ పుస్తకములలో వ్రాయబడలేదు. ఏ యుగములో కూడా నాల్గు చక్రముల వివరము ఎవరూ చెప్పక పోవడము వలన, ఈ విషయము క్రొత్తదగుట వలన జాగ్రత్తగా అర్థము చేసుకోవలయును. నీకు, నాకు అని తేడా లేకుండా ప్రతి జీవరాశి శరీరములోను తలయందు బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములు గలవు. సూక్ష్మరూపమై జ్ఞానదృష్ఠికి గోచరించు వీటిని జ్ఞానముతోనే తెలియనగును. ఆధ్యాత్మిక విద్యలోనే అతి రహస్యమైన నాల్గు చక్రములను అర్థము చేసుకొంటే జనన మరణ రహస్యము సులభముగా తెలియును. పాఠకులకు కొంత అర్థమగుటకు సూక్ష్మముగనున్న నాల్గు చక్రములను, కర్మచక్రమును తర్వాత పేజీలో చూడవచ్చును.
నాల్గు చక్రములలోని కాల, కర్మ, గుణచక్రముల విషయము కొంత అర్థమైవుండును. అన్నిటికంటే పైనగల బ్రహ్మచక్రము విశ్వము యొక్క ఆయుష్షుకు సంబంధించినది కావున దాని విషయము ఇపుడు మనకు అనవసరము. పువ్వులోని వాసన కనిపించనట్లు, వాసన గాలితో కలిసి మరొక చోటికి పోయినట్లు మరణములో నాల్గు చక్రముల అమరిక క్షణాల
మీద మరియొక శరీరమును చేరుచున్నది. వాస్తవముగా చెప్పాలంటే ఒక సెకనులో పదవవంతు కాలములో మరియొక శరీరమును చేరుచున్నదని చెప్పవచ్చును. ఇంకనూ వివరముగా చూస్తే మరణించబోవు వాని శరీరములో ఆడు శ్వాస పైకి క్రిందికి ఆడుచుండును కదా! అవసానదశలో ముక్కు రంధ్రములలో పైకి పోయి క్రిందికి వస్తున్న శ్వాస మరణముతో చివరిగా క్రిందికి వచ్చిన తర్వాత పైకి ముక్కురంధ్రములలో దూరదు. క్రిందికి వచ్చిన శ్వాస తిరిగి ముక్కు రంధ్రములలో దూరి పైకి పోవడము దాని సహజమైన పని అయినప్పటికీ అలా మరణించిన శరీరములో దూరక వెంటనే ఆత్మ ప్రవేశించిన చోట శ్వాస శరీరములోనికి ప్రవేశించును. ఇక్కడ క్రిందికి వచ్చినది ఇక్కడే పైకి పోక, ఇక్కడ పోయినట్లే ఏమాత్రము ఆలస్యము చేయక అక్కడ వేరు శరీరములోనికి పోయినది. దీనినిబట్టి శ్వాస క్రిందికి పైకి ఆడుచునే వున్నది. మరణముతో పాత జాగాలో పైకి పోక క్రొత్త జాగాలో పైకి పోయినది. మరణించిన శరీరము నుండి, క్రొత్తగా పుట్టిన శరీరము వేలమైళ్ళ దూరములో ఉండినప్పటికీ తత్క్షణమే ఆత్మ అక్కడికి చేరగల్గుచున్నది. మరణించిన జీవుడు వెంటనే వేరొక శరీరమును ప్రవేశించుట వలన యమధర్మరాజు, యమలోకము అను ప్రసక్తే లేదు. అటులయిన యమధర్మరాజు యొక్క ఉద్యోగమేమి కావలెనని కొందరడుగ వచ్చును. మీరు ఊహించుకొన్న యమలోకముగానీ, యమధర్మరాజుగానీ కేవలము కల్పితము. మనము చేసుకొన్న పాపపుణ్యములన్నియూ జన్మలలో భూమిమీదనే అనుభవించవలెను. పుణ్యము చేసిన వానికి స్వర్గము ఇచటే గలదు, పాపము చేసిన వానికి నరకము ఇక్కడే గలదని తెలియాలి.
ఎంతదూరమైనా ఒక సెకనులో పదవవంతు కాలములో పోవు ఆత్మ, జీవాత్మలకు తాము ధరించెడి శరీరము ఫలానా ప్రదేశములో ఉన్నదని ముందే తెలిసియుండునా? అను ప్రశ్న కూడా కొందరికి రావచ్చును. దానికి జవాబు చూస్తాము. మరణమునకు ముందు అవసాన దశలో మనస్సుకు చివరి జ్ఞాపకము ఏదయితే వచ్చియుండునో దానికి సంబంధించిన జన్మ కలుగునని భగవద్గీతలో చెప్పబడినది. చివరి జ్ఞాపకములను మొదట రెండు రకములుగా విభజించవచ్చును. పరమాత్మ సంబంధ జ్ఞాపకములన్నీ ఒక రకము, ప్రపంచ సంబంధమువన్నీ రెండవ రకముగా చెప్పవచ్చును. ఆఖరు జ్ఞాపకము ఏ కోవకు చెందినదో, దానిలోను అది ఏ స్థాయికి చెందినదో దానిప్రకారము వచ్చే జన్మ ఉండును. దీనిని గురించి భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగము ఆరవ శ్లోకములో...
శ్లో|| 6. యంయం వాపిస్మరన్ భావం త్యజత్యన్తే కళేబరమ్!
తం తమే వైతి కౌంతేయ! సదాతద్భావ భావితః ||
అన్నాడు. దీనిప్రకారము చివరి దశలో ఏ భావముండునో దానికి సంబంధించిన జన్మయే లభ్యమగును. చివరిలో ప్రపంచ సంబంధము జ్ఞాపకము వచ్చివుంటే ఆ భావమునకు సరిపడు జన్మ ఏ స్థలములో, ఏ ఇంటిలో కల్గియుండునో ఆ ఇంటిలో జన్మించిన శిశువును ఆత్మ చేరగలదు. శరీరమును వదలిన వెంటనే చివరి మనోభావమునకు తగిన శరీర మెచట జన్మించి ఉండునో అచటికి ఆత్మ నేరుగా పోగలదు. జీవుని ప్రారబ్ధము ప్రకారము ఏ శరీరములో ప్రవేశించవలెనో, ఆ శరీరములోనికే ఆత్మ ప్రవేశించుటకు తగిన కారణము గలదు. అనుభవించవలసిన కర్మలను బట్టి, తెలియవలసిన జ్ఞానమునుబట్టి, చేరవలసిన జీవున్నిబట్టి శిశు శరీరములోని మెదడులో అమరికలుండును. మరణించిన వాని చివరి జ్ఞాపకమునకు క్రొత్త శరీరములోని అమరికలు సరిపడు శరీరమే ఆత్మకు గోచరమగును, అదియే గమ్యమగును. నీరు పల్లమునకు (తగ్గుకు) పారునట్లు ఆత్మ, మనస్సు చివరి జ్ఞాపకమునకు సరిపడు శరీరమునే చేరును. తాబేలు సముద్రము బయటికి వచ్చి ఇసుకగుంతలో గ్రుడ్లు పెట్టి పోవును. కొద్ది రోజులకు ఇసుకలోనే గ్రుడ్లు పిల్లలుగా మారి ఇసుక నుండి బయటికి వచ్చి సముద్రము వైపే పోవును. సముద్రము ఎక్కడున్నది కనిపించక పోయినా అటు ప్రక్కకే ప్రయాణము సాగును. ఒకవేళ దారి మళ్ళించిన అది మాత్రము అటువైపే పోవును. సముద్రము తెలియనట్లు, దారి లేనట్లు ఒక పెద్ద గోడను పర్లాంగు పొడవు కట్టినా, తాబేలు పిల్ల ప్రక్క దిశలకు పోక గోడ పొడవున వచ్చి తిరిగి సముద్రమువైపే పోవును. అలాగే ఒక పావురమును వెయ్యిమైళ్ళ దూరములో వదలిన తన ఊరెటువైపు ఉన్నదో అటువైపే ప్రయాణము చేయును. అప్పుడే పుట్టిన తాబేలు పిల్ల ఎన్ని అడ్డంకులున్నప్పటికీ సముద్రపు దిశను గుర్తించుచున్నది. అట్లే దారి, దిశ తెలియని పావురము తన ఊరి దిశను సులభముగా గుర్తించుచున్నది. అలా గుర్తించు శక్తి వాటి శరీరములోని ఆత్మలకు గలదు. అట్లే ప్రారబ్ధ కర్మకు తగిన శరీరమును మరియు చివరి యోచనకు తగిన మడతలు గల మెదడున్న శరీరమును ఆత్మ గుర్తించగలదు.
మనిషి సంపాదించుకొన్న ఆగామికర్మ, సంచితకర్మలో కలిసిపోయి వుండును కదా! మనిషి మరణించినపుడు సంచితములోనిది ప్రారబ్ధముగా ఎలా మారుచున్నది? అని కొందరడుగవచ్చును. దానికి సమాధానము మరణ సమయములో శరీరమంతా శక్తి కోల్పోయి అన్ని అవయవములు పని చేయని స్థితిలో ఆత్మ ఊపిరితిత్తుల ద్వారా కొద్దిమాత్రము శ్వాసను ఆడిస్తూ చివరకు మనస్సు యొక్క పనిని కూడా నిలిచిపోవునట్లు చేయును. ఆ సమయములో చివరగా తనకందిన దానిని మాత్రము జీవాత్మ చూస్తుండును. ఒక శ్వాస తప్ప, మనస్సు కూడా నిలిచిపోయిన తర్వాత ఆత్మ బ్రహ్మనాడిలో చేరి నాల్గుచక్రములతో సహా ఒక్క క్షణముండునని ముందే చెప్పుకొన్నాము. ఆ క్షణములోనే చివరి మనోదృశ్యమును బట్టి సంచితమునుండి ప్రారబ్ధమును ఆత్మ చేతనే ఎన్నుకోబడును. జీవునికి చివరి దృశ్యము అందనంతవరకు ప్రారబ్ధము నిర్ణయము కాదు. చివరి దృశ్యమునుబట్టి ప్రారబ్ధము, ప్రారబ్ధమునుబట్టి రెండవ జన్మ శరీరము నిర్ణయించబడును. ఏ శరీరమును పొందవలసినది ప్రారబ్ధము నిర్ణయించగా, ప్రారబ్ధము జీవునికి వచ్చు చివరి మనోదృశ్యమును బట్టి నిర్ణయించబడును. చివరి క్షణములో సంచితమునుండి ప్రారబ్ధము నిర్ణయమైనపుడు ఆ సమయములోనే అంతవరకు సంపాదింపబడిన ఆగామి కర్మ సంచితములో కలిసిపోవును. సంచితము నుండి ప్రారబ్ధము తయారగుట మరియు సంచితములోనికి ఆగామికర్మ కలిసిపోవుట రెండూ ఒకే సమయములో జరిగిపోవును.
మనిషి తన జీవితములో ఏ విషయము మీద ఎక్కువ లగ్నమై బ్రతుకుచున్నాడో, ఏ విషయము మీద తన ఇచ్ఛ ఎక్కువగా ఉన్నదో, ఏ విషయమును ఎల్లప్పుడు తలచుకొనుచుండునో, ఆ విషయ జ్ఞాపకమే అవసానదశలో చివరిగా మనస్సుకు వచ్చి జీవునికి చేరును. ఎల్లపుడూ స్మరించుట చేత శరీరము వదలునపుడు అదే జ్ఞాపకము వచ్చి తర్వాత అదే స్థితిని పొందునని గీతలో కూడా చెప్పారు. అంతేకాక ''ఎల్లపుడూ నన్నే స్మరించుము, చివరిగా నేనే జ్ఞప్తికి వచ్చి నాలోనికే ఐక్యమగుదువని'' దేవుడు తెల్పడము కూడా జరిగినది. ఈ విషయములను గీతలో అక్షర పరబ్రహ్మ యోగమను అధ్యాయము 7, 8 శ్లోకములలో...
శ్లో|| 7. తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ |
మయ్యర్పిత మనోబుద్ధి ర్మామేవైష్యస్య సంశయః ||
శ్లో|| 8. అభ్యాస యోగ యుక్తేన చేతసానాన్య గామినా |
పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చిన్తయన్ ||
దీని భావము :- ''నీ మనస్సు, బుద్ధి అన్నీ నాకే సమర్పించి సర్వ కాలముల లందు నన్నే స్మరించుచుండుము. తప్పక నన్నే చేరగల్గుదువు. ధ్యానము, అభ్యాసము చేత మనసునందు నన్నే స్మరించుచుండుట వలన పరమము, దివ్యము అయిన నన్నే పొందగలవు''. అని గీతలో ఉపాయము కూడా చెప్పాడు.
జీవునికి తర్వాత జన్మ ఏదైనా రావచ్చునుగానీ, మరణించు సమయములో శారీరక, మానసిక బాధలన్నిటి నుండి తప్పించుకొని ఏ బాధ పొందడని చెప్పవచ్చును. ఇంతవరకు మరుజన్మకు పోవువానికి అవసాన దశలో జరుగు విషయమంతా వివరముగా తెలుసుకొన్నాము.
ఇంతవరకు చదివిన సమాచారములో మరణము శరీరములో ఎలా వస్తున్నదో పూర్తిగా తెలిసిపోయినది. మరణము వచ్చినప్పుడు మనిషి చేసుకొన్న కర్మను అనగా పాపపుణ్యములను పూర్తిగా లెక్కించి ఆ పాప పుణ్యముల ప్రకారము తర్వాత జన్మను నిర్ణయించడము జరుగుచున్నది. అది మాత్రము అత్యంత రహస్యమైన ప్రక్రియ. మనిషి కర్మనుబట్టి తీర్పు తీర్చు అధికారము పరమాత్మకు తప్ప ఎవరికీ లేదు. అయితే పరమాత్మ తన అధికారము ప్రకారము పని చేయక తీర్పు తీర్చు పనిని తన ఆత్మకు ఇచ్చాడు. దానివలన పరమాత్మకు బదులు ఆత్మే అందరికీ జన్మల తీర్పు చేయుచున్నది. ఈ విషయమును బైబిలు గ్రంథములో యోహాన్ సువార్తలో 5వ అధ్యాయము 22, 23 వచనములలో కలదు చూడండి.
(యోహాన్ 5-22, 23) ''తండ్రి యెవనికిని తీర్పు తీర్చడుగానీ తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు. కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.''
ఈ వాక్యములో తండ్రియని చెప్పిన చోట అల్లాహ్ అనియు లేక పరమాత్మ అనియు అర్థము చేసుకోవాలి. కుమారుడు అని చెప్పినచోట ఆత్మయని గ్రహించుకోవాలి. పరమాత్మ (దేవుని) కుమారుడు ఆత్మని తెలిసినప్పుడే వాక్యములోని భావము సక్రమముగా అర్థమగును. లేకపోతే ఏమీ అర్థము కాదు. దేవుడు తీర్పు తీర్చు అధికారమున్నవాడైనా, ఎవనికీ తండ్రి తీర్పు తీర్చడు అని వ్రాసియున్నారు. పరమాత్మ పని చేయడు కావున ఆయన తన పనిని తన కుమారుడైన ఆత్మకు అప్పజెప్పియున్నాడు. తండ్రి (అల్లాహ్) పనిని ఆత్మే చేయుచూ, సర్వజనులకు మరణ సమయములో కర్మల నిర్ణయము ప్రకారము రెండవ జన్మ ఏది రావలెనను నిర్ణయమను తీర్పును వెల్లడించుచున్నది.
కర్మ నిర్ణయము ప్రకారము మరణములో రెండవ జన్మ నిర్ణయము జరుగునప్పుడు ప్రక్కవాడుగానీ, తన బంధువులుగానీ, ఇతర దేవతలు గానీ, ఎవరూ ఏ సహాయమును అందించలేరు. ఇంతకు ముందు చెప్పిన వాక్యముల ప్రకారము ఎవరి సిఫారసుగానీ, ఎవరి సహాయముగానీ, ఎవరి ఓదార్పుగానీ ఉండదు. ఆత్మ ప్రతి చిన్న విషయమును లెక్కించి దానికి తగిన ఫలితమును పొందునట్లు జన్మ లభించునట్లు చేయును. ఆ సమయములో ఆత్మ ఎవరికీ అన్యాయము చేయదు. ప్రతి చిన్న కర్మను వదలకుండా లెక్కించు యంత్రములాగ ఆత్మ పని చేయును. జీవితములో జ్ఞానమును తెలిసి సక్రమముగా బ్రతికిన వానికి పాప కర్మలు తక్కువ యుండును. కావున వానికి తర్వాత జన్మ మంచిదే వచ్చును. అట్లు కాకుండా ప్రస్తుత జన్మలో అధికారము, ధనము ఉండుట వలన తాను ఏమి చేసినా తన బలము చేత జరుగునని, పాపమును లెక్కించక, తన ఇష్ట ప్రకారము పని చేసిన వానికి తర్వాత జన్మలో భయంకరమైన నరకము అనుభవించునట్లు నిర్ణయించి పంపబడును. ఈ విధముగా మరణ దినమున పాపపుణ్య కర్మల తీర్పు తీర్చబడును. పుణ్యము గలవాడు తర్వాత జన్మలో సుఖములను అనుభవించును. అట్లే పాపము గలవాడు కష్టములను అనుభవించు జన్మ వచ్చును. సుఖములను భూమిమీద జీవితములో అనుభవించడమును స్వర్గము పొందినట్లు లెక్కించవచ్చును. అట్లే కష్టములను అనుభవించడమును నరకమును పొందినట్లగును. తర్వాత జన్మలో స్వర్గ, నరకములను మరణములోనే నిర్ణయము జరుగును.
ప్రశ్న :- మీరు మనిషికి మరణ సమయములో ఒక సెకను కాలములో గత జన్మ కర్మ ప్రకారము రాబోయే జన్మ నిర్ణయించబడునని ఇప్పుడు చెప్పుచున్నారు. చెప్పడమే కాక దైవగ్రంథములలోని వాక్యములను కూడా సాక్ష్యముగా చూపుచున్నారు. ఇది నిజమని నమ్మాలా వద్దా? అని మాకు సంశయము ఏర్పడుచున్నది. ఎందుకనగా! గతములో మీరు ''కలియుగము ఎప్పటికీ యుగాంతము కాదు'' అను గ్రంథమును వ్రాశారు. అందులో 84వ పేజీలో మనిషి సంపాదించుకొను ఆగామి కర్మ 69 సం||, 5 నెలల, 10 రోజులకు ఒకమారు సంచితములో చేరిపోవుచున్నదని చెప్పారు. మరణ సమయములో సంచిత కర్మే ప్రారబ్ధముగా మారుచున్నది. దానిప్రకారము ఒక మనిషి అరవై (60) సంవత్సరములు బ్రతికి చనిపోయాడనుకొందాము. అరవై సంవత్సరముల ఆగామి కర్మ ప్రారబ్ధముగా మారుటకు అవకాశము లేదు కదా! అంతకుముందు 69 సంవత్సరములప్పుడు ఆగామి కర్మ మారి సంచితమై యుండుట వలన అప్పటి సంచితము నుండి రాబోవు జన్మకు ప్రారబ్ధము ఏర్పడుచున్నది. అంతేగానీ ప్రస్తుత జన్మలోని ఆగామి కర్మ నుండి ప్రారబ్ధము రాదు కదా! జన్మకు కావలసిన ప్రారబ్ధ కర్మ సంచితము నుండే రావలసియున్నది. ఈ జన్మలోని ఆగామి సంచితము కానందున అంతకు ముందు పోయిన జన్మలోని సంచితమే ఇప్పుడు రాబోయే జన్మకు కర్మగా మారుచున్నది కదా! ఈ జన్మ కర్మ ప్రారబ్ధముగా మారలేదు కదా! ఈ జన్మలో చేసుకొన్న కర్మనుబట్టి రేపు రాబోవు జన్మ నిర్ణయమగును. తీర్పులో జరిగేది అదే అన్నప్పుడు ఈ జన్మలో 60 సంవత్సరములు బ్రతికినా ప్రస్తుత జన్మలోని కర్మ రాబోవు జన్మకు ఏమాత్రము రాలేదు కదా! ఇప్పుడు 60 సంవత్సరములు చేసిన పాపపుణ్యములు వచ్చే రెండవ జన్మకు రావు కదా! యని అడుగుచున్నాను. దీనికి మీరేమంటారు?
జవాబు :- మనుషుల వెనుకటి జన్మల కర్మలు ప్రారబ్ధముగా మారుననుట వాస్తవమే. శాస్త్రపద్ధతి ప్రకారము 69 సం||, 5 నెలల, 10 రోజుల కర్మ ఒకమారు సంచిత కర్మలో చేరడము సూత్రబద్ధమైన పని. ఈ విషయమును సంపూర్ణముగా తెలియుటకు మా రచనలలోని ''కలియుగము ఎప్పటికీ యుగాంతము కాదు'' అను గ్రంథమును చూడవలెను. ఒకమారు సంచితముగా మారిన కర్మ చిన్నచిన్న జన్మలకయితే ఒకే జన్మకు పరిమితి కాకుండా కొన్ని జన్మల వరకు ప్రారబ్ధమగుచుండును. 70 సంవత్సరముల పైన 80, 90, 100 సంవత్సరములు బ్రతుకు వారికి రెండు సంచితముల కర్మ ప్రారబ్ధముగా తయారగును. సంచితములో నిలువయున్న కర్మనుబట్టి జన్మలు నిర్ణయించబడుచుండును. కొందరికి కర్మల పేర్లు కూడా తెలియవు. కావున ప్రథమ దైవగ్రంథములో యున్న ప్రకారము చెప్పితే ఒక జన్మలో తయారయి క్రొత్తగా వచ్చు కర్మను ఆగామి కర్మ అంటాము. ఒక జన్మలో నిర్ణయింపబడి ఆ జన్మలో అనుభవించు కర్మను ప్రారబ్ధ కర్మ అంటున్నాము. జన్మ జన్మకు మిగులుపడుచూ వచ్చు కర్మను సంచిత కర్మ అని అంటున్నాము. మొదటి జన్మలో సంపాదింపబడిన కర్మను ఆగామి కర్మయనగా! ఆగామికర్మ సంచిత కర్మగా మారి నిలువయుండును. నిలువ యున్న సంచితకర్మ నుండి ఒక జన్మకు ఆత్మ కేటాయించబడిన కర్మను ప్రారబ్ధకర్మ యని అంటారు. మొదట ఆగామికర్మ, తర్వాత సంచిత కర్మ, ఆ తర్వాత ప్రారబ్ధ కర్మయని వరుస క్రమము తెలియవలెను.
కర్మల విషయము అర్థము కాక పండితులు కూడా భ్రమపడు చుందురు. సక్రమముగా అర్థము చేసుకోలేరు. అందువలన మీరు ఈ కర్మల విషయములో బుద్ధి యొక్క విచక్షణను ఉపయోగించి సక్రమముగా తెలియవలెనని తెల్పుచున్నాను. కర్మల విషయమై భగవద్గీతలో జ్ఞాన యోగమున 16వ శ్లోకమందు ఇలా చెప్పారు చూడండి...
శ్లో|| 16. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః |
తత్తే కర్మ పవ్రక్ష్యామి యద్జ్ఞాత్వా మోక్షసే శుభాత్ ||
భావము :- ''కర్మయేదో, ఏది కర్మకాదో పండితులు కూడా తెలియక భ్రమపడుచుందురు. సంసార బంధనమెల్ల దేని చేత (ఏ జ్ఞానము చేత) లేకుండా పోవునో దానిని చెప్పెదను వినుము.''
కర్మ విషయములో నేడు పెద్ద స్వాములుగా యున్నవారు, గొప్ప బోధకులుగా యున్నవారు, మాకు దేవుని జ్ఞానము తెలియును అనువారు అందరూ పొరపడియున్నారు. కర్మల విషయములో వారివద్ద ఖచ్చితమైన సమాచారము లేదు. అందువలన కర్మలు అంటుకోవడములో గానీ, కర్మలు అనుభవానికి రావడములోగానీ మనుషులవద్ద సరియైన అవగాహన లేదు. ఎంతవారైనా ఎంత పెద్ద జ్ఞానులయినా కర్మలను గురించి తెలియ వలసియున్నది. చనిపోయిన దినమున ఒక్క క్షణములో ఆత్మచేత రెండవ జన్మకు సరిపడు కర్మ నిర్ణయమగుచున్నది. చనిపోయినప్పుడు మనిషి యొక్క కుల, మత, వర్గ భేదములు లేకుండా ఆత్మ అందరికీ సమానముగా ఉండి ఖచ్చితమైన న్యాయ నిర్ణయము ప్రకారము కర్మలను రెండవ జన్మకు నిర్ణయించును. 'మాకు జన్మలు లేవు' అనే వారిని కూడా వదలడము లేదు. చావును చవిచూచిన ప్రతి మనిషి ఒక్క సెకను కాలములో తీర్చబడు తీర్పుకు లోనుకావలసిందే.
చనిపోయిన జీవాత్మలన్నీ ఆత్మవద్ద హాజరు కావలసిందే. ఎక్కడ హాజరు అవుదురు? అనుమాటకొస్తే తెలిసే విషయము ఆశ్చర్యముగా ఉండును. మనిషి చనిపోవు సమయములో శరీరమును జీవాత్మ వదలి పోవలసియుండును. ఎప్పుడయితే జీవుడు శరీరమును వదలి బయటికి పోవునో అప్పుడు వాడు మరణము పొందినట్లగును. మరణమును పొందు జీవుడు రెండవ జన్మకు కావలసిన ప్రారబ్ధ కర్మను మరణము పొందు చివరి క్షణములో శరీరమందే ఆత్మ చేత తీర్పు తీర్చబడి, రెండవ జన్మ ఏది? ఎక్కడ? అను విషయము నిర్ణయమగును. రెండవ జన్మ నిర్ణయము జరిగిన తర్వాతనే జీవాత్మను, ఆత్మ శరీరమునుండి తీసుకొని రెండవ జన్మకు చేర్చును. రెండవ జన్మకు వచ్చి క్రొత్తగా పుట్టిన శిశు శరీరములో జీవాత్మ చేర్చబడును. అలా చేరిన తర్వాత జీవితము షరా మామూలుగానే కర్మ ప్రకారము జరుగుచుండును. మనిషి చనిపోవు సమయములో ఒక్క క్షణమందు రెప్పపాటు కాలములో కర్మ నిర్ణయము పాత శరీరమందే జరుగును. పాత శరీరమందు కర్మచక్రములో సంచిత కర్మయుండగా సంచిత కర్మనుండి రాబోవు జన్మకు సరిపోవు ప్రారబ్ధమును కేటాయించడము జరుగును.
అలా పాత శరీరమును వదలి పోవుముందు ఒక సెకను కాలములో జరుగు కర్మనిర్ణయ ప్రక్రియ (తీర్పు తీర్చు కార్యము) జరుగునప్పుడు మనిషి బ్రతికియున్నప్పుడున్న మతముగానీ, మతమును బోధించిన మనుషులు కానీ అడ్డుపడి ఘోర కర్మ నుండి తప్పించలేరు. ఒక మనుషులే కాక అతను సంపాదించుకొన్న ధనముగానీ, హోదాగానీ, ఎవరి సిఫారసు గానీ, కర్మ నుండి మనిషిని విడిపించడము గానీ కర్మను తగ్గించునట్లు ఉపయోగపడడముగానీ ఉండదు. మనిషి బ్రతికియున్నప్పుడు ఆరాధింపబడిన దేవతలుగానీ కర్మనిర్ణయ సమయములో మనిషికి ఏ సహాయము చేయలేరు. అప్పుడు ఎవరి సహాయము అక్కడ ఆ సమయములో పనికి రాదు. నేను పండితుడను, జ్ఞానిని, యోగిని అనువారు కూడా మౌనముగా యుండి కర్మ తీర్పు ప్రకారము పోవలసిందే. తీర్పు తీర్చు విధానము ఎవరికీ తెలియకపోవడము వలన చాలామందికి రెండవ జన్మ భయమే లేకుండా పోయినది. అత్యంత రహస్యమైన తీర్పు విధానమును స్పష్టముగా తెలియజేశాము. ఇందులో సంశయమున్నా, అర్థము కాని విషయమున్నా అడుగవచ్చును. జ్ఞానము సముద్రము వంటిది. మనిషికున్న ఇష్టతను (శ్రద్ధను) బట్టి తెలియుచుండును. నేను ఎంతో గొప్ప రహస్యమైన విషయమును చెప్పినా, ఇంకా కొంత జ్ఞానము మిగిలియున్నదని చెప్పుచున్నాను. అయితే చెప్పిన వరకు నూటికి నూరుపాళ్ళు సత్యమే చెప్పబడినది. ఇందులో ఏమాత్రము సంశయము లేదు.
ప్రశ్న :- మీరు చెప్పిన దానిని గురించి ఏమాత్రము సంశయము లేదు. మీరు చెప్పిన వివరము మూడు దైవగ్రంథములకంటే మిన్నగా అర్థమగునట్లు గలదు. తీర్పును గురించి బైబిలులో కొంత, ఖుర్ఆన్ గ్రంథములో కొంత చెప్పియున్నా అక్కడ అర్థముకాని వివరమంతా ఇక్కడ మీరు చెప్పుట వలన అర్థమయినది. అయినా చిన్న ప్రశ్న ఒకటి కలదు. అదేమనగా! మనిషి చనిపోయిన సమయములో పాత శరీరమునందే రాబోవు జన్మను గురించిన నిర్ణయము జరుగుననీ, ఆ నిర్ణయము ప్రకారమే క్రొత్త శరీరమును ధరించడము, క్రొత్త జీవితము ఏర్పడడము జరుగునని తెలుసుకొన్నాము. మీ మాట ప్రకారమే రాబోయే జన్మలో పుట్టుకతోనే కుంటివాడుగా పుట్టవలెనని, అందరికీ ఉన్నట్లు రెండు కాళ్ళు కాకుండా గర్భములో ఒకకాలే తయారయి వుండుట వలన, వాడు రెండవ జన్మలో జీవితమంతా కుంటివానిగా బ్రతుకవలసి యుండును. రెండవ జన్మ కుంటివానిగా బ్రతకవలెనని మరణ సమయములోని ఆత్మ తీర్పులో నిర్ణయముకాగా అదే సమయములో క్రొత్త శరీరములో ప్రవేశించి జననము జరుగవలెను కదా! తల్లిగర్భములో దాదాపు తొమ్మిది నెలలనుండి కుంటి శరీరము తయారు కావలసియున్నది. అప్పుడు ఒక్క క్షణములో జరుగు నిర్ణయమునకు సరిపడు శరీరము ముందే ఎలా తయారగును? అను ప్రశ్న వచ్చినది. చనిపోవు వాని కర్మ ముందే నిర్ణయము జరిగియుంటే దానికి సరిపడు శరీరము తయారగుటకు వీలగును. అట్లు ముందే తీర్పు జరగనప్పుడు వాని కర్మకు తగిన శరీరము ముందే ఎలా తయారగు చున్నదను ప్రశ్నకు జవాబును తెలుపమని కోరుచున్నాము?
జవాబు :- ఇంతకు ముందు నా జవాబును ముగించునప్పుడు చివరిలో నేను ఎంత చెప్పినా ఈ విషయములో ఇంకా కొంత జ్ఞానము మిగిలి యున్నదని చెప్పాను. నేను ఏదయితే మిగిలియున్నదని చెప్పానో దానినే నీవు అడగడము జరిగినది. నేను ఈ విషయమై చెప్పడము అసందర్భ మగునని ముందు చెప్పలేదు. ఇప్పుడు నీవు అడిగావు కావున నేను సందర్భానుసారము చెప్పగలను. జాగ్రత్తగా, శ్రద్ధగా వినమని తెల్పు చున్నాను. పాపములు ప్రపంచ సంబంధమైనవి సర్వసాధారణముగా ఉండును. అయితే మరొక రకమైన పాపము కొందరికి మాత్రమే అరుదుగా ఉండును. దీనినిబట్టి పాపములు రెండు రకములని తెలియుచున్నది. ఒకటి ప్రపంచ సంబంధ పాపముకాగా, రెండవది దైవ సంబంధ పాపమని చెప్పవచ్చును. ప్రపంచ సంబంధ పాపములు మనుషులకు సర్వ సాధారణము. ప్రపంచ సంబంధ కర్మ ఏదయినా 69 సంవత్సరముల 5 నెలల 10 రోజులకు ఒకమారు సంచితములో చేరుచుండును. అది ఇంతవరకు చెప్పిన విధానమంతయూ సత్యమే. అందులో ఎటువంటి అసత్యము లేదు. ప్రపంచ సంబంధ పాపపుణ్యములను మనిషి పూర్తి శరీరముతో సుఖ దుఃఖములుగా (స్వర్గ, నరకములుగా) భూమిమీదనే తన జీవితములో అనుభవించును. ప్రపంచ సుఖ దుఃఖములను మనిషి అంగ లోపము లేని శరీరముతోనే అనుభవించవలెను. అనగా కుంటి, గ్రుడ్డి, చెవిటి, మూగ అను అవయవ లోపములేని శరీరములోనే అనుభవించ వలసి యున్నది. శరీరములో ఏ అవయవ లోపముయున్నా అది ప్రపంచ సంబంధ పాపమునకు సంబంధము లేదు.
దైవ సంబంధ పాపము చేసుకొన్న వానికి శరీరములో అవయవ లోపము ఏర్పడును. దైవసంబంధ పాపము పుణ్యము (దైవ సంబంధ కర్మ) ప్రపంచ సంబంధ ఆగామి కర్మవలె 69-5-10 రోజులకు కర్మ చక్రములోని సంచితములో చేరదు. ప్రస్తుతము జరుగుచున్న జన్మలో దైవ సంబంధ కర్మవస్తే అది ఆగామిగా అట్లే ఎంత కాలమయినా ఉండి మనిషి మరణించినప్పుడు తీర్పు జరుగు క్షణములో నేరుగా ప్రారబ్ధము కాగలదు. దేవునికి, దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖముగా ప్రవర్తించిన వారికి మాత్రమే అలా జరుగును. దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖముగా మాట్లాడినా, దేవుని జ్ఞానమునకు తప్పు అర్థములను ఆపాదించి చెప్పినా, అటువంటి వారందరికీ రెండవ జన్మలో శరీర అంగ లోపము ఏర్పడి జీవితములో అంగ లోపమునకు సంబంధించిన కష్టములను, బాధలను పొందవలసి యున్నది. అటువంటి వారిని నష్టాత్ములని చెప్పవచ్చును. అందరివలె వారి శరీరములో ఆత్మశక్తి అన్ని అవయవములకు ప్రాకదు. ఆత్మశక్తి ప్రాకని వారి శరీరములోని అవయవములు పుట్టుకతోనే లేకుండా యుండును. ఒకవేళ అవయవములున్నా మధ్యలో అయినా ఆత్మశక్తి అవయవములకు ప్రాకకుండా నిలిచిపోవడము వలన అవయవములు పని చేయవు. చేయివుండి పని చేయకపోతే వానిని నష్టాత్ముడని చెప్పవచ్చును. కొందరికి 'చేయి' అను అవయవమే లేకుండా ఉండుట వలన అటువంటి వానిని కూడా నష్టాత్ముడేయని చెప్పవచ్చును. ఆత్మశక్తిని నష్టపోయిన వానిని నష్టాత్ముడు అని అనవచ్చును.
దైవజ్ఞానమును బోధించు బోధకుడిగా యుండి తప్పు భావములను బోధించిన వానికి శరీరమునకు అవయవములే లేకుండా పుట్టగలడు. అట్లుకాక బోధించిన దానిని విని తప్పు దారిపట్టినా, తర్వాత సత్యము తెలిసినప్పుడు కూడా తన భావమును మార్చుకోకుండా తన మతములో ఇట్లే చెప్పవలెను, అట్లే చేయవలెను అని మతమునకు కట్టుబడి సత్యమునకు దూరముగా ఉండు వానికి శరీర అవయవములున్నా అందులో ఆత్మశక్తి ప్రవహించదు. ఆత్మశక్తి ప్రవహించని అవయవములున్నా లేకున్నా ఒక్కటే. ఈ విషయమును గురించి ప్రథమ దైవగ్రంథము భగవద్గీతలో దైవాసుర సంపద్విభాగ యోగము అను అధ్యాయములో ఎనిమిది, తొమ్మిది శ్లోకములలో చెప్పియున్నారు. అక్కడ ఏమి చెప్పారో ఇప్పుడు క్రింద చూస్తాము.
శ్లో|| 8. అసత్య మపత్రిష్ఠం తే జగ దాహు రనీశ్వరమ్ |
అపరస్పర సమ్భూతం కి మన్యత్కా మహైతుకమ్ ||
భావము :- ప్రపంచములో దేవుడనే వాడు ఎవడూ లేడనుచూ, దేవుడు ప్రపంచమును సృష్ఠించలేదనీ, పరస్పర రసాయనిక మార్పుల వలన ప్రపంచము జీవరాసులు పుట్టాయనుచూ, జగతి పుట్టుటకు దేవుడు కారణము కాదనీ, ప్రపంచము నిత్యము జరుగుటకు మనిషిలోని ఆశే కారణమనీ, మనిషి కోర్కెవలన మనిషి తలచుట వలన అన్నిటినీ కనిపెట్టుచున్నాడని నాస్తికత్వమును చెప్పుచుందురు.
శ్లో|| 9. ఏతాం దృష్టి మవష్టభ్య నష్టాత్మానోల్ప బుద్ధయః |
పభ్రవ న్త్యుగక్రర్మాణః క్షయాయ జగతోహితాః ||
భావము :- ఇటువంటి అజ్ఞానముతో పుట్టుచున్న వారందరూ నష్టాత్ములై, అల్పబుద్ధి కలవారై, అశుభమును చేయువారై భయంకర కర్మలతో పుట్టు చుందురు. వీరివలన లోకమునకు నష్టము, నాశనము కల్గుచుండును. వీరి శరీరములలో ఆత్మశక్తి కొన్ని అవయవములకు ప్రవహించదు. కావున వీరిని ''నష్టాత్మా'' యని శ్లోకములో చెప్పారు.
శరీర అవయవములలో కాలు, చేయి లేనివానిని అంగలోపము గలవాడని అనుచుందురు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే అంగము వుండి అంగములో శక్తిలేని వానిని నష్టాత్ముడని శ్లోకములో చెప్పినట్లు కాక అంగహీనుడని కూడా అనవచ్చును. ఇదంతయూ దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖముగా మాట్లాడిన వానికి మాత్రమే మరణ సమయములో తీర్పునందు గత జన్మలోని దైవిక పాపము రెండవ జన్మకు నేరుగా ప్రారబ్ధ కర్మయగుచున్నది. దైవిక పాపము ఆగామి నుండి నేరుగా ప్రారబ్ధము కాగలదు. ప్రపంచ కర్మవలె ఆగామి కర్మ సంచితకర్మగా మారదు. అందువలన వెనుక జన్మలో ఎప్పుడు చేసినా అది దైవిక కర్మయిన దానివలన వెంటనే రెండవ జన్మలో అనుభవానికి వచ్చునట్లు నిర్ణయించబడుచున్నది. దైవ సంబంధ పాపముగానీ, పుణ్యముగానీ సంచిత కర్మలో చేరిపోక, తీర్పులో ప్రారబ్ధ కర్మగా మారి అనుభవమునకు రెండవ జన్మలోనే వచ్చుచున్నదని చాలామందికి తెలియదు.
దేవుని జ్ఞానమును తప్పుదారి పట్టించిన వానికి, దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖము చేసినవానికి, ఒక మతములో యుండి ఆ మతమునకు సంబంధించిన అజ్ఞానముతో వేరొక ఇతర దైవగ్రంథములోని జ్ఞానమును కించపరచినట్లు మాట్లాడిన వానికి, ఆత్మశక్తి యొక్క నష్టము జరిగి నష్టాత్ముడని చెప్పవచ్చును. ఇందులో దైవికమైన మరియొక పెద్ద పాపము గలదు. అది ఏమనగా! దేవుని జ్ఞానమునేకాక దేవున్నిగానీ, దేవుని కుమారుడైన సాకార భగవంతునికి గానీ, అట్లే దేవుని కుమారుడుగా చెప్పబడు ఆత్మకు గానీ వ్యతిరేఖముగా దూషణగా మాట్లాడువానికి గానీ, వ్యతిరేఖముగా చేయువానికి గానీ భయంకరమైన పాపము సంభవించును. ప్రపంచ సంబంధమైన పాపమును దైవజ్ఞానము చేత దహించుకొని లేకుండా చేసుకోవచ్చును. అనుభవించకుండా తప్పించుకోవచ్చును. అయితే దేవునికి, దేవుని కుమారుని సాకారమునకు, నిరాకారమునకు వ్యతిరేఖముగా మాట్లాడిన వానికి, కార్యములు చేసిన వానికి అంగలోపము అవయవ లోపముతో పోదు. 'ఆత్మశక్తిని నష్టపోవడము' అను శిక్షతో సరిపోదు. అటువంటి వానిని 'రెండు యుగముల పర్యంతము నిత్యము పాపము అనుభవించు శిక్ష పడును.' నా మాటను నమ్మలేకపోతే ఇంజీలు గ్రంథములో (బైబిలులో) మత్తయి సువార్తయందు 12వ అధ్యాయము 31, 32 వాక్యములలో వ్రాసినది చూస్తే మీకే అర్థమగును. (మత్తయి 12-31, 32) ''మనుష్యులు చేయు పత్రి పాపమును, దూషణయు వారికి క్షమింపబడును గానీ, ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వానికి పాపక్షమాపణ కలదు గానీ, పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగ మందైననూ, రాబోవు యుగమందైననూ పాప క్షమాపణ లేదు.''
ఇక్కడ చెప్పిన దైవ గ్రంథములోని రెండు వాక్యములలో రెండు యుగముల కాలము నిత్యము పాపము అనుభవించ వలసిందే. వానికి పాప క్షమాపణ లేదని చెప్పడమైనది. దేవుని జ్ఞానమునకు విరుద్ధముగా మాట్లాడినా, బోధించినా వానికి ఆత్మశక్తి నష్టము అంగ లోపము కల్గును. అయితే నేరుగా దేవున్నే వ్యతిరేఖముగా మాట్లాడువానికి పాప క్షమాపణ లేకపోవడమే కాక భయంకరమైన పాపమును రెండు యుగముల పర్యంతము అనుభవించవలసి వచ్చును. మనుష్యులను దూషించిన పాపమును దైవజ్ఞానము వలన దైవసేవ వలన జ్ఞానమను అగ్నిని సంపాదించుకొని కర్మను కాల్చుకోవచ్చును. దేవునికి వ్యతిరేఖముగా మాట్లాడినా, వ్యతిరేఖముగా చేసినా వాని కర్మపోదు. వాడు రెండు యుగములు ఎడతెరపిలేకుండా నిత్యము అనుభవించవలెను. దేవున్ని గానీ, ఆత్మనుగానీ, ఆత్మ శరీరము ధరించి భగవంతునిగా సాకారముగా వచ్చియున్నప్పుడు గానీ దూషించినా, వ్యతిరేఖ కార్యములు చేసినా వానికి భయంకరమైన పాపము తప్పదని హెచ్చరిక చేయడము జరిగినది.
దైవ దూషణ ఒక మనిషి చేశాడనుకొనుము. అప్పుడు వానికి సంభవించు పాపము ఆగామికముగా మొదట వచ్చును. అది ప్రపంచ కర్మవలె సంచితముగా మారదు. నేరుగా మరణ సమయములో రెండవ రాబోవు జన్మలో అనుభవమునకు వచ్చునట్లు ప్రారబ్ధ కర్మగా మారుచున్నది. అందువలన దైవ సంబంధమైన కర్మను ప్రపంచ సంబంధ కర్మతో సమానముగా లెక్కించకూడదు. రెండవ జన్మకే కాచుకొనియుండు కర్మ ప్రకారము తల్లిగర్భములో తయారగు శిశువు కూడా అంగవైకల్యముగా తయారగుచున్నది. అంగవైకల్యమైన శరీరము ఎవనికి కలదో వానిని దైవ సంబంధ కర్మవలన వచ్చిన ఫలితమని తెలియవలెను. దైవ సంబంధ కర్మ సంచితముగా యున్నా అది ప్రారబ్ధముగా మారి అనుభవించుటకు సిద్ధముగా యుండుట వలన పుట్టకముందే శరీరము మార్పులకు లోనగుచున్నది.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
12. అల్లాహ్ రంగును స్వీకరించండి. (2-138)
ఖుర్ఆన్ గ్రంథములో మూడవ సూరా, ఏడవ ఆయత్నందు దైవ గ్రంథములో రెండు రకముల వాక్యములు కలవని, వాటినే స్థూల, సూక్ష్మ వాక్యములని చెప్పడమైనది. స్థూలము అనగా ప్రత్యక్షముగా తెలియునదని అర్థము. అలాగే సూక్ష్మము అనగా నేరుగా తెలియకుండా ఆలోచిస్తే గానీ తెలియదని, నిగూఢముగా ఉండు విషయమని అర్థము. వీటినే గ్రంథములో ముహ్కమాత్ వాక్యములని స్థూలవాక్యములను, ముతషాబిహాత్ వాక్యములని సూక్ష్మవాక్యములను చెప్పారు. ఖుర్ఆన్ గ్రంథములో సూక్ష్మవాక్యములు దాదాపు అరవై (60) శాతము గలవు. పై వాక్యము కూడా ముతషాబిహాత్ (సూక్ష్మవాక్యము) నకు సంబంధించినదేయని చెప్పవచ్చును. ఈ వాక్యములో పైకి కనిపించు అర్థము ఒకటియుండగా వాక్యములో అణిగియుండు అర్థము వేరుగాయుండును. మసక చీకటిలో దారిలో పడియున్న త్రాడు పామువలె కనిపించును. ప్రత్యక్షముగా కనిపించునది పాముగాయున్నా దానినే దీపము వెలుగులో చూస్తే పాము కాదు త్రాడని తెలియును. అలాగే వాక్యము పై చూపుకు ఒక విధమైన భావమును కల్గించినా దానినే 'బుద్ధి విచక్షణ' అను వెలుగులో చూడగలిగితే వాక్యములోని సత్యమైన భావము తెలిసిపోవును.
అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో సూరా రెండు, ఆయత్ 138 నందు సూక్ష్మ భావము ఎలా అణిగియున్నదో ఇప్పుడు చూస్తాము.
(2-138) ''అల్లాహ్ రంగును స్వీకరించండి. అల్లాహ్ రంగుకన్నా మంచి రంగు ఎవరిది కాగలదు? మేము మాత్రము ఆయన్నే ఆరాధిస్తాము.''
ఈ వాక్యములో రంగు అనుమాట సూక్ష్మ అర్థముతో కూడుకొని యున్నది. ప్రస్తుత కాలములో ముస్లీమ్‍లందరూ సూక్ష్మవాక్యముల జోలికి పోకూడదనీ, ఏ వాక్యమునకయినా సూక్ష్మ అర్థముతో చెప్పకూడదనీ, అలా చెప్పువారు తమకు ఇష్టమొచ్చిన భావమును చెప్పుచుందురని చెప్పుచూ, సూక్ష్మ అర్థమును చూడడము మానివేసి ప్రతి వాక్యమునకు స్థూలముగానే అర్థము చెప్పుచుందురు. ఒక విధముగా సూక్ష్మవాక్యములకు కొందరు తప్పు భావమును చెప్పియుండవచ్చును. అంతమాత్రమున అందరూ అలాగే చెప్పుదురని, ఎవరు సూక్ష్మ అర్థమును చెప్పినా వినకుండాపోతే మొత్తానికి ఆ వాక్యమును పూర్తిగా పోగొట్టుకున్నట్లగును. సూక్ష్మవాక్యములకు ఎవరయినా అర్థమును చెప్పగలిగితే అది వాస్తవమా కాదా!యని మన బుద్ధిని ఉపయోగించి చూచి అది సత్యమా కాదా!యని పరిశీలించవచ్చును. వాక్య అర్థము శాస్త్రబద్దమా కాదా!యని చూచి తెలియవలెను.
(3-7) వాక్యములో ముతషాబిహాత్ (సూక్ష్మ) వాక్యములకు అర్థము అల్లాహ్‍కు తప్ప ఏ మనిషికీ తెలియదని చెప్పారు. అంతేకాక ఎవరికయితే బుద్ధి శ్రద్ధ, జ్ఞానము మీద ఉండునో వాడు అసలయిన అర్థమును గ్రహించ గల్గును అని చెప్పియున్నారు. ఆ మాట ప్రకారము సూక్ష్మ వాక్యములలోని అర్థము అందరికీ తెలియదనుట వాస్తవమే. సూక్ష్మ వాక్యముల అర్థము దేవునికి మాత్రమే తెలుసుననుట కూడా సత్యమే. అట్లు మనుషులకు తెలియనప్పుడు ఆ వాక్యములను చెప్పి ప్రయోజనముండదు. కావున దేవుడు మనుషులు తెలియుటకు ఒక అవకాశమిచ్చాడు. అది ఏమనగా! దేవుని జ్ఞానము మీద శ్రద్ధయున్న వానికి, వాని శ్రద్ధనుబట్టి వాని బుద్ధి పని చేయునట్లు చేసి, వాని బుద్ధికి తగినట్లుగా అర్థమగునట్లు దేవుడే చేయుచున్నాడు. అలా చేయుట వలన గ్రంథములో గల సూక్ష్మవాక్యముల అర్థము ప్రజలకు తెలియుచున్నది. ఈ విధముగా దేవుడు తనకు మాత్రము తెలిసిన జ్ఞానమును ప్రజలకు వారి శ్రద్ధనుబట్టి తెలుపుచున్నాడు. అందువలన దేవుని జ్ఞానము శ్రద్ధయున్న మనుషులకు అక్కడక్కడ అర్థమగు చున్నది. దేవుని జ్ఞానము అర్థమయిన వాడు ఎవడయినా సూక్ష్మవాక్యము యొక్క అర్థమును చెప్పితే దానిని విని ఇతరులు కూడా తెలుసుకోవచ్చును. అట్లు కాకుండా 'దేవునికి తప్ప ఎవరికీ తెలియదను' సూత్రము ప్రకారము మనుషులు చెప్పిన మాటలన్నీ తప్పే అంటే మనము దేవుని జ్ఞానమును నష్టపోయినట్లగును. దేవుడు ఎవరితోనూ మాట్లాడడు. అందువలన దేవుడు తనకు తెలిసిన జ్ఞానమును ఇతరులకు చెప్పుటకు వీలుపడదు. దేవుని జ్ఞానము దేవునికే తెలిసినా, ఇతర మనుషులకు ఎవరికీ తెలియకున్నా దేవుడు మనుషులకు ఏదో ఒక రకముగా తెలియజేయును. మనిషి శ్రద్ధను బట్టి మనిషికి దేవుని జ్ఞానము దైవగ్రంథము నుండి అర్థమగులాగున చేయును.
దేవుని జ్ఞానము గ్రంథములో సూక్ష్మ వాక్యములు (ముతషాబిహాత్) గా వ్రాసియుంచినా అది అర్థమగుటకు ఒక మార్గమును దేవుడు ఏర్పరచి యున్నాడు. మనిషికున్న శ్రద్ధ, గ్రంథములోని దైవశక్తి రెండూ కలిసినప్పుడు ఆ మనిషిలో బుద్ధికి విచక్షణ ఏర్పడును. మనిషి బుద్ధికి విచక్షణ ఎంత ఏర్పడునో అంతవరకు వాక్యములో చెప్పిన జ్ఞానము అర్థము కాగలదు. మనుషులలో దైవజ్ఞానము మీద శ్రద్ధ పది శాతమునుండి 20, 30, 40, 50, నుండి 100 శాతము వరకు శ్రద్ధగలవారు కలరు. నూరుశాతము శ్రద్ధ కలవానికి దైవవాక్యములోని సూక్ష్మ అర్థము నూరుశాతము అర్థము కాగలదు. అలా నూరు శాతము అర్థమయిన వ్యక్తి సూక్ష్మ వాక్యములకు వివరము చెప్పినప్పుడు అది నూటికి నూరు శాతము సత్యమైన భావముగా ఉండును. అటువంటప్పుడు చెప్పిన వ్యక్తి మాటలోని సత్యమైన జ్ఞానమును విని తెలియవలయును. అట్లు వినకుండా మనుషులు చెప్పు జ్ఞానము సరియైనది కాదు అంటే అటువంటి వాడు ఎప్పటికీ సత్యమైన జ్ఞానమును తెలియలేడు.
ఎప్పుడయినా దేవుని జ్ఞానము మనిషి చెప్పగా విని తెలియవలసిందే గానీ వేరు దారి లేదు. ఎవరు సత్యమైన జ్ఞానమును చెప్పునది నీకు అర్థము కాకపోతే చెప్పినది ముందు విని తర్వాత బుద్ధి చేత యోచించితే అందులో సత్యమున్నదీ, లేనిదీ తెలిసిపోవును. తెలియాలను శ్రద్ధ యుండుట వలన వినిన మాటలోని సత్యాసత్యము తెలియు శక్తిని దేవుడు ఇచ్చును. ఖుర్ఆన్ గ్రంథములో (2-138) వాక్యమును చూచాము కదా! అందులో ''అల్లాహ్ రంగును స్వీకరించండి, అంతకంటే మంచి రంగు ఎవరిదీ లేదు'' అని కూడా చెప్పారు. ఈ వాక్యమును వ్రాసిన చోట గ్రంథకర్తలు, గ్రంథ అనువాదకులు ఎవరయినా కావచ్చును, వారు వాక్యమునకు వివరమును వ్రాశారు. వారు వ్రాసిన వివరమును చూస్తే చాలావరకు కళ్ళకు కనిపించే రంగును గురించే వ్రాశారు. క్రైస్థవులు పసుపు రంగును పవిత్రముగా చూస్తారని చెప్పి వారు అనుకొన్న పసుపురంగు కంటే గొప్పది ఇస్లామ్ ధర్మము అని కనిపించే రంగునుండి నేరుగా ఒక ధర్మము వైపు వచ్చారు. ధర్మములలో ప్రతి మతమునకు ఒక ధర్మమున్నది. అందులో ఇస్లామ్ ధర్మమని చెప్పడము ఒక మత ధర్మాన్ని చెప్పినట్లగుచున్నది. వారు చెప్పినది అంతా విన్న తర్వాత వారు బయటి రంగును గురించి మాట్లాడుచున్నారా? లేక ఒక మత ధర్మమును గురించి మాట్లాడుచున్నారా? అని స్పష్టముగా తెలియలేదు. ''అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్'' అను తెలుగు అనువాద గ్రంథములో వ్రాసిన విషయమును ఇక్కడ వ్రాయుచున్నాము చూడండి.
''క్రైస్థవులు పసుపు పచ్చ రంగుగల నీరును ప్రత్యేకించుకున్నారు. దాన్ని వారు క్రైస్థవ పిల్లలకు ఇస్తారు. క్రైస్థవము (బాప్తిస్మం) పుచ్చుకోదలచిన వారందరికీ అది ఇవ్వబడుతుంది. దీన్నే వారు బాప్తిస్మము పుచ్చుకోవడము అని అంటారు. ఈ ఆచారము వారి దృష్ఠిలో చాలా ముఖ్యమైనది. బాప్తిస్మము పుచ్చుకోనివారిని, వారు పరిశుద్ధులుగా భావించరు. అల్లాహ్ వారి పోకడలను ఖండిస్తూ అసలు రంగు అల్లాహ్‍దేనని, అల్లాహ్ రంగును మించినది వేరొకటి లేదని చెప్పాడు. అల్లాహ్ రంగు అంటే భావము సహజ ధర్మము. సహజ ధర్మము ఇస్లామ్ మాత్రమే. ప్రవక్తలందరూ తమ తమ కాలాల్లో తమ జాతి ప్రజలను ఈ ధర్మము వైపుకే పిలిచారు అంటే దేవుని ఏకత్వము వైపుకు మానవాళిని ఆహ్వానించారు''
ఇక్కడ వ్రాసినది చూచారు కదా! కొంత రంగును, కొంత ఇస్లామ్ ధర్మమును చెప్పారు. వారికి అర్థమయినది వారు చెప్పారు. ఎవరు చెప్పినా వినడములో తప్పులేదు. వినిన తర్వాత అది సత్యమా? అసత్యమా? అని విచక్షణతో ఆలోచించాలి. అలా ఆలోచించగలిగినప్పుడు మనలోని శ్రద్ధనుబట్టి దేవుడు సత్యమునే తెలియునట్లు చేయును. మేము ఇక్కడ చెప్పినట్లే అందరు చెప్పేది వింటాము. తర్వాత అది సత్యమా అసత్యమా అని బుద్ధి విచక్షణతో చూస్తాము. విన్న సమాచారము శాస్త్రబద్దమైతే సత్యమనీ, అశాస్త్రమైతే సత్యము కాదనీ నిర్ణయించుకొంటాము. సత్యము దొరికితే అంతటితో తృప్తి చెందుతాము. సత్యము దొరకకపోతే తిరిగి సత్యము కొరకు అన్వేషణ సాగిస్తాము. అందరూ చేయవలసిన పని కూడా అదే. అట్లుకాకుండా మత నియమములలో చిక్కుకొని మతము చెప్పినట్లు వింటే సత్యమును వదలుకోవలసి వస్తుంది. అందువలన మతమునకు అతీతముగా దేవుని జ్ఞానమును తెలియవలసియున్నది. దేవుడు మతములకు అతీతుడు. కావున మతాతీతముగా దేవుని జ్ఞానమును తెలియవలసి యున్నది.
(2-138) ఆయత్‍లో చెప్పిన జ్ఞానము సూక్ష్మజ్ఞానము. దీనిని స్థూలముగా ఏమాత్రము చూడకూడదు. మూడు దైవ గ్రంథములలో సూక్ష్మ వాక్యములతో నిండిన జ్ఞానము ఒక్క ఖుర్ఆన్ గ్రంథమునందు మాత్రమే కలదు. తౌరాత్ గ్రంథమును చెప్పినవాడు కూడా జిబ్రయేలే. జిబ్రయేల్ తౌరాతు గ్రంథములో అన్నీ స్థూల వాక్యములనే చెప్పాడు. ఖుర్ఆన్ గ్రంథములో ఎక్కువగా సూక్ష్మవాక్యములను చెప్పాడు. అటువంటి సూక్ష్మ వాక్యములలో ''దేవుని రంగును పులుముకోండి'' అనునది కూడా ఒక సూక్ష్మ వాక్యమే. వేమన యోగి పద్యములు గానీ, బ్రహ్మముగారి తత్త్వములు గానీ పూర్తిగా సూక్ష్మవాక్యములతోనే కూడుకొనియుండును. పైన కనిపించునట్లు ఒక విషయముంటే దానికి సమానముగా కనిపించని భావము అందులో ఉండును. వారు చెప్పిన సూక్ష్మ భావములను ఒక్కమారుగా అర్థము చేసుకోలేరన్నది వాస్తవము. అలా ఎందుకు వ్రాశారని చూస్తే దానికొరకు బాగా ఆలోచించినప్పుడే ఆ విషయము పూర్తిగా తెలియును. అలా ఆలోచించి తెలుసుకొన్న విషయము జీవితాంతము జ్ఞాపకములో ఉండిపోవును. సులభముగా తెలిసినది తొందరగా మరచి పోవుటకు అవకాశము కలదు. అందువలన ప్రతి విషయమును ఆలోచించి తెలియునట్లు సూక్ష్మవాక్యములను చెప్పారు. ఇంతకు ముందు (39-42) ఆయత్‍లో ''అల్లాహ్‍యే ఆత్మలను (జీవాత్మలను) మరణ కాలమున వశపరచుకొనేవాడు. మరణించిన వారి ఆత్మలకు దేనికయితే మరణము నిర్ణయింపబడుతుందో దానిని తనవద్దే ఆపుకొని మిగతా వారి ఆత్మలను నిర్ణీత సమయము కొరకు తిరిగి పంపుతాడు'' అని చెప్పిన తర్వాత అదే వాక్యమందు చివరిలో ''ఇందులో ఆలోచించే వారికి గొప్ప సూచనలున్నాయి'' అని అన్నారు. అలా చెప్పడములో దీనిని బాగా ఆలోచించండి. ఇది పూర్తి సూక్ష్మమైన జ్ఞాన విషయము అని చెప్పినట్లున్నది. ఈ విధముగా అనేక వాక్యముల చివర ఏదో ఒక మాట చెప్పి ముగించినవి చాలా కలవు.
ఇవన్నీ చూచిన తర్వాత సూక్ష్మ వాక్యములను ఎంతో విచక్షణతో చదువాలని అర్థమయినది. 'అల్లాహ్ రంగు' అని వాక్యములో వ్రాయడము జరిగినది. ఇక్కడ బాగా ఆలోచిస్తే దేవునికి రూపమే లేదు. ఫలానా రూపములో ఉండేవాడు దేవుడు అని చెప్పే దానికి వీలులేదు. దేవునికి రూపములేదు, అట్లే పేరు లేదు. ఇంకా ఆయన పని చేయువాడు కాదు. దీనిప్రకారము దేవుడు నామ, రూప, క్రియలు లేనివాడని చెప్పవచ్చును. దేవుని ఉనికే ఎవరికీ తెలియనప్పుడు ఆయన ఫలానా అని చెప్పుటకు ఆయనది కనిపించే రంగు కాదు. ఆయన ఏ రంగూ లేనివాడు. అయితే మనిషి కొంత దీర్ఘముగా ఆలోచించి అసలు సత్యమును తెలియుటకు చెప్పిన వాక్యమే గానీ వేరు కాదు. ఇక్కడ దేవుని రంగును గురించి ఆలోచిస్తే దేవుని జ్ఞానమునే దేవుని రంగని చెప్పడమైనది. దేవుని జ్ఞానమును రంగుగా వర్ణించి చెప్పినప్పుడు దానిని కొంత ఆలోచిస్తే గానీ అది దేవుని జ్ఞానమని అర్థము కాదు. ''దేవుని వాక్యమును మించిన జ్ఞానము ప్రపంచములో ఇంకొకటి లేదు'' కనుక దేవుని రంగుకంటే మించిన రంగు ఏది కలదు? అని వాక్యములో చెప్పారు. ''దేవుని జ్ఞానమును స్వీకరించండి. దేవుని జ్ఞానము తెలియండి'' అని చెప్పుటకు ''దేవుని రంగును స్వీకరించండి'' అని వ్రాశారు. దేవుని జ్ఞానము స్వీకరించిన తర్వాత, దేవుని జ్ఞానము అర్థమయిన తర్వాత దేవుని గొప్పతనము తెలిసిపోవును. దేవుని ప్రత్యేకత, దేవుని ప్రాముఖ్యత తెలిసిన తర్వాత ప్రపంచమును సృష్ఠించినవాడు దేవుడేయని, ప్రపంచమును నడుపువాడు దేవుడేయనీ, ప్రపంచమును నశింపజేయువాడు దేవుడేయనీ తెలిసినప్పుడు దేవునితో తప్ప ఇతరులతో పనే లేదనిపించును. మనిషి పుట్టుక, మనిషి బ్రతుకు, మనిషి మరణము అన్నీ దేవుని చేతిలోయున్నప్పుడు మనిషికి అవసరమైన ప్రతీ దానిని గురించి దేవున్నే అడుగుకోవలసి వస్తున్నది. మనిషికి కావలసిన వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనది మోక్షము. చావు పుట్టుకలు లేని పరలోకము. తనకు కావలసిన విలువైనది, శాశ్వితమైనది అయిన పరలోకము కొరకు దేవున్నే వేడుకోవలసి యున్నది. అందువలన ''నేను దేవున్నే ఆరాధిస్తున్నాను'' అని వాక్యములో చెప్పడమైనది. మొదట దేవుని రంగు స్వీకరిస్తే, అనగా దేవుని జ్ఞానము తెలియగలిగితే తర్వాత దేవుని ప్రత్యేకత ఏమిటో తెలియును. దేవుని ప్రత్యేకత తెలిసి అన్నీ ఆయన ద్వారానే లభించునని, అన్నిటికీ ఆయనే అధిపతియనీ తెలిసినప్పుడు ఎవడయినా తప్పక ఆయననే ఆరాధించును. ఆయన జ్ఞానమునే అనుసరించును. ఈ విషయమును చెప్పుటకు 'రంగు' అను పదమును, 'జ్ఞానము' అను పదమునకు బదులుగా వాడారు. అలా వాడుట వలన శ్రద్ధయున్న వానికి సత్యము తెలియును. శ్రద్ధ లేనివానికి సత్యము తెలియకుండా పోయి అజ్ఞానములో ఉండిపోవును. మనిషిలోని శ్రద్ధను పెంచుటకు ఇలా సూక్ష్మ వాక్యములను వ్రాయవలసిన అవసరము ఏర్పడినది. సూక్ష్మ వాక్యములలో విషయమును నేరుగా చెప్పక ఇతర వస్తువులతో పోల్చి చెప్పడము వలన ఆలోచనా విధానము పెరగవలెననీ, దానివలన శ్రద్ధ పెరుగునని ఊహించి సూక్ష్మవాక్యములను చెప్పారు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
13. గ్రంథమును చూచినవారు కన్నకొడుకును గుర్తుపట్టినట్లు గుర్తు పట్టగలరు. (2-146), (6-20)
మనిషి దైవమును గురించి తెలియుటకు దైవ గ్రంథములను ఇచ్చాడు. వాస్తవానికి దైవ గ్రంథము ఒక్కటే ఉన్నది. అయితే కాలమును బట్టి, దేశమును బట్టి దేవుడు ఒకే జ్ఞానమునే మూడు గ్రంథములుగా ఇచ్చాడు. మూడు గ్రంథములలోనూ ఒకే జ్ఞానమే గలదు. మూడు గ్రంథముల ఉద్దేశ్యము మనిషి దేవున్ని తెలియుటయే ముఖ్య ఉద్దేశ్యముగా యున్నది. మొదట దేవుడు చెప్పిన జ్ఞానము గ్రంథరూపము కాలేదు. దేవుడు చెప్పిన జ్ఞానము ''జపర'' అను పేరుతో కొన్ని వేల సంవత్సరములు అలాగే ఉండిపోయినది. కొన్ని వేల సంవత్సరముల కాలములో జపర అను పేరులో కొంత మార్పు చెంది ''జబుర'' అని చెప్పుకోవడము జరిగినది. అప్పటినుండి దైవజ్ఞానము మాటల రూపములో జబుర అను పేరుతోనే ఉండేది. జబుర (జపర) జ్ఞానము మొదట గ్రంథరూపమైనది. దానికే 'తౌరాతు' అని పేరు వచ్చినది. తౌరాతు అను పేరు తర్వాత వచ్చినది. ముందు ఆ గ్రంథమునకు పెట్టిన పేరు భగవద్గీత. భారతదేశములో భగవద్గీత వ్రాయబడినది. వ్యాసుడు వ్రాయగా చెప్పినవాడు శ్రీకృష్ణుడు. భగవద్గీతను చెప్పిన కృష్ణుడే మోషే ప్రవక్తకు భగవద్గీతను ఇచ్చి దానిపేరు భగవద్గీతయని చెప్పక తౌరాతు యని చెప్పాడు. ఈ విధముగా 'జపర', 'జబుర' కావడము, జబుర జ్ఞానమే భగవద్గీతగా తయారు కావడము, భగవద్గీతయే ఇజ్రయేల్ దేశములో మోషేకు ఇచ్చినప్పుడు తౌరాతు గ్రంథముగా చెప్పబడడము జరిగినది. జబుర జ్ఞానమును గ్రంథరూపము చేసినప్పుడు అందులో దేవుని ఉద్దేశ్యమును పొందుపరచి దేవుని జ్ఞానమును చెప్పాడు. ఈ విధముగా తౌరాతు గ్రంథము పేరు బయటికి వచ్చినది. అయితే ఆ గ్రంథమును మోషే తప్ప ఎవరూ చూడలేదు. ఆ విషయము ఇంతవరకు ఎవరికీ తెలియదు. అంతేకాక తౌరాతే భగవద్గీత అను విషయము కూడా ఎవరికీ తెలియదు.
తౌరాతు అను పేరు చెప్పినా, భగవద్గీతయను పేరు చెప్పినా రెండూ ఒక్కటేయను విషయము ఇటు భగవద్గీత పుట్టిన భారతదేశములోగానీ, అటు తౌరాతు యని పేరు పొందిన ఇజ్రయేల్ దేశములోగానీ ఒక్కరికి కూడా తెలియదు. తౌరాతును ఎవరూ చూడలేదు గనుక అక్కడి ప్రజలు జ్ఞానము తెలియు నిమిత్తము దేవుడు తన ప్రతినిధిగా ఏసును పంపి తౌరాతు జ్ఞానమునే చెప్పించాడు. ఆయన జెప్పిన జ్ఞానము ఇంజీలు గ్రంథముగా తయారయినది. తౌరాతు జ్ఞానమే ఇంజీలులో ఉన్నదని కూడా ప్రజలకు తెలియదు. తౌరాతు గ్రంథములోని జ్ఞానమయినా, ఇంజీలు గ్రంథములోని జ్ఞానమయినా రెండూ జపర (జబుర) జ్ఞానమేయని కూడా మనుషులకు తెలియదు. అలా తెలియలేదని ఇంకొక గ్రంథరూపములో అయినా చెప్పితే గ్రహించగలరని జిబ్రయేల్ చేత ముహమ్మద్ ప్రవక్తగారికి చెప్పడము జరిగినది. ప్రవక్త గారికి జిబ్రయేల్ చెప్పిన జ్ఞానమే చివరకు ఖుర్ఆన్ గ్రంథముగా తయారయినది. ఖుర్ఆన్ గ్రంథము తౌరాతు, ఇంజీలు గ్రంథములను ధృవీకరించుచున్నదని ఐదవ సూరాలో చెప్పడమైనది. అయినా మనిషి మూడు గ్రంథములలోని జ్ఞానము ఒక్కటేనని, అది జపర యని పిలువబడు జ్ఞానమేయని తెలియలేక పోయాడు. అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములో తౌరాతు, ఇంజీలు గ్రంథములలోని జ్ఞానమే ఖుర్ఆన్ యందు గలదని చెప్పడమైనది. మూడు గ్రంథములు దైవ గ్రంథములే. మూడు గ్రంథములలో దేవున్ని గురించిన జ్ఞానమే కలదు. మూడు గ్రంథములలో దేవుని జ్ఞానమే ఉండుట వలన దేవున్ని గురించి తెలియవచ్చును. దేవున్ని తెలియు నిమిత్తమే దేవుని గ్రంథములు మూడు గలవని తెలియవలెను.
దైవ గ్రంథములోని వాక్యములో దేవున్ని తెలియు జ్ఞానము ఉండుననునది సత్యమని ఎవరయినా ఒప్పుకొని తీరవలసిందే. దైవ గ్రంథములో ప్రతీ వాక్యము మనుషులు దేవున్ని తెలియు నిమిత్తమే ఉన్నదను మాటను అందరూ అంగీకరించవలసిందే. దైవగ్రంథములో దేవున్ని కాక ఇతరులను ఎవరినయినా తెలుపు నిమిత్తము ఉన్నదనుట అసత్యమగును. దేవుని గ్రంథములో దేవున్ని తెలియుటే సత్యము. దేవున్ని ప్రజలు తెలియు నిమిత్తమే గ్రంథములో దేవుని జ్ఞానమును వ్రాసియుంచారు. ఇప్పుడు రెండవ సూరా, 146వ ఆయత్నందు ఏమి వ్రాశారో చూద్దాము. (2-146) ''మేము ఈ గంథాన్ని ప్రసాదించినవారు తమ కుమారులను ఏ విధముగా గుర్తిస్తారో ఇతనిని (ముహమ్మద్‍ను) కూడా ఆ విధముగా గుర్తిస్తారు. వాస్తవానికి వారిలోని ఒక వర్గము వారు తెలిసి కూడా సత్యాన్ని దాస్తున్నారు.'' (ఇది ''దివ్య ఖుర్ఆన్ సందేశము'' అను గ్రంథము నుండి సేకరించి వ్రాయడమైనది. ఇదే వాక్యమునే ''అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్'' అను గ్రంథమునుండి తీసి వ్రాయుచున్నాము చూడండి.) (2-146) ''మేము ఎవరికి గ్రంథమును వొసగామో వారు తమ కన్న కొడుకులను గుర్తు పట్టినట్లే అతన్ని (అనగా ముహమ్మద్ ప్రవక్త గారిని) గుర్తు పడతారు. వారిలోని ఒక సమూహము సత్యాన్ని గుర్తించి కూడా దాన్ని కప్పిపుచ్చు తుంది.''
ఈ విధముగా రెండు గ్రంథములనుండి సేకరించిన రెండు వాక్యములలో ఒకే భావముండుట చూచాము. అంతేకాక వాక్యము చివరిలో వాక్యమునకంతటికీ విశేషమైన విషయము కలదు. అదేమనగా! 'వాస్తవానికి వారిలో కొందరు (ఒక సమూహము వారు) సత్యమును తెలిసి దాస్తున్నారు' అని ఉన్నది కదా! సత్యము అంటే ఏమిటి? సత్యమును తెలిసి ఎందుకు దాస్తున్నారు? సత్యమును సత్యముగా ఎందుకు బయట పెట్టడము లేదు? అని మనిషి కొంత విచక్షణను ఉపయోగించి చూడవలసియున్నది. ఈ వాక్యము రెండు భాగములుగా యున్నది. ఒక భాగము ఖుర్ఆన్ గ్రంథమును చూచినవారు ''తమ కన్నకొడుకులను ఎలాగ గుర్తిస్తారో అట్లు అతనిని (ముహమ్మద్ ప్రవక్తను) గుర్తు పడతారు'' అనునది ఒక భాగముగానూ, ''వారిలో ఒక వర్గము వారు సత్యమును గుర్తించి కూడా దానిని దాస్తున్నారు'' అనునది మరియొక భాగముగా యున్నది. ఈ వాక్యములోని మొదటి భాగమును చూస్తే దైవ గ్రంథము యొక్క ప్రాథమిక ఉద్దేశ్యమునకు వ్యతిరేఖముగా యున్నది. కొంత ఆలోచిస్తే వాక్యము వ్రాయడములో కొంత పొరపాటు జరిగినట్లు ఎవరికయినా అర్థము కాగలదు. అయితే ఆ విషయము అర్థమయినప్పటికీ కొందరు ఆ విషయమును దాచేస్తున్నారు. సత్యము బయటికి తెలియకుండా మూసివేయుచున్నారని వాక్యములో చెప్పారు.
ఒకే వాక్యములో పరస్పర విరుద్ధముగా వ్రాసియున్నారంటే, వాక్యము కొందరికి సత్యముగా కనిపించినా, కొందరికి అసత్యముగా కనిపించినదని చెప్పవచ్చును. ఇంకొక విధముగా చెప్పితే చెప్పబడిన వాక్యములో అసత్యమున్నదను సత్యము అందరికీ తెలిసినా కొందరు (ఒక గుంపువారు) దానిని వారు ఇష్టపడుట వలన సత్యమును కప్పిపుచ్చుతున్నారని మరొక వర్గము వారు ఆరోపించుచున్నట్లు తెలియుచున్నది. ఏది ఏమయినా వాక్యములోనే ఒక వర్గము వారు లేక ఒక సమూహము వారు సత్యమును తెలిసి కప్పిపుచ్చుచున్నారు అని చెప్పుచున్నారంటే కప్పిపుచ్చు వారికి వేరుగా యున్న వర్గము వారు అలా చెప్పుచున్నారని తెలియుచున్నది. అయితే ఈ వాక్యమును చెప్పినది మహాజ్ఞాని అయిన జిబ్రయేల్ అయినందున, జిబ్రయేల్ గారే సత్యమును కప్పిపుచ్చు వారిని గురించి చెప్పాడని అర్థమగుచున్నది. ఇక్కడ ఎవరు చెప్పారన్నది ముఖ్యము కాదు, సత్యము ఏది అనునదే ముఖ్యము. కప్పిపుచ్చబడు సత్యమును గురించి యోచించి చూస్తే ''బుద్ధి విచక్షణ'' అను గీటురాయి ద్వారా సత్యాసత్యములు తెలిసిపోవును.
సత్యమును గురించి ఆరా తీస్తే దైవగ్రంథమును ఎవరు చూచినా అందులో దేవున్ని గురించి తెలియు దేవుని జ్ఞానము కలదు. ఇక్కడ వాక్యములో 'దేవుడు తెలియబడును' అనకుండా ''ముహమ్మద్ ప్రవక్తగారు తెలియుదురు'' అని సూచనగా చెప్పడములో పొరపాటయినదని ఒప్పుకోక తప్పదు. వాక్యములో 'కొడుకులను' అని బహువచనము చెప్పి ఏక వచనమయిన ప్రవక్తగారిని చూపడములో కూడా తప్పేగలదు. అంతేకాక ''జ్ఞానము తెలిసినవాడు తండ్రిని కొడుకు గుర్తుపట్టినట్లు'' ''మనిషి దేవున్ని గుర్తిస్తాడు'' అని చెప్పబోయి ''తండ్రి కొడుకులను గుర్తించినట్లు'' అని చెప్పడము పొరపాటని తెలియుచున్నది. 'ఎవరికి గ్రంథమును వొసగామో వారు గ్రంథమును చూచి తమ కొడుకు గుర్తుపట్టినట్లు అనగా తండ్రిని కొడుకులు గుర్తుపట్టినట్లు దేవున్ని గుర్తు పట్టుదురు' అని చెప్పవలసియున్నది. వాక్యములో 'తమ కుమారులని' ఉన్నచోట 'కుమారులు' అని ఉండవలసింది. అలాగే రెండవ వాక్యములో కూడా 'తమ కన్న కొడుకులను' అని ఉన్నచోట 'తమ కన్నకొడుకులు' అని ఉండవలసింది. 'ను' అను అక్షరము ఒకటి ఎక్కువ చేరడము వలన 'తండ్రి కుమారులను' అని అర్థమగుచున్నది. అట్లు కాకుండా కుమారులే 'తండ్రిని గుర్తుపట్టగలరు' అన్నట్లు చెప్పడము సత్యము. దైవ గ్రంథములో దేవుడు తండ్రితో సమానము. ప్రజలు కొడుకులతో సమానము. ప్రజలే దేవున్ని తెలియు విధానము దైవ గ్రంథములో ఉండుట సత్యము. అందువలన ఒక వర్గము వారు సత్యమును తెలిసి కప్పిపుచ్చుతున్నారని చెప్పడమైనది.
వాక్యములో తండ్రియైన దేవుడు తెలియబడునని చెప్పక 'అతను' అన్నచోట ప్రవక్త పేరు చెప్పడము వలన సత్యమును కొందరు కప్పిపుచ్చారని వాక్యములో చెప్పారు. దేవున్ని తెలియుటకు దైవ గ్రంథముల జ్ఞానమున్నా గానీ, మనుషులను తెలియుటకు లేదనుట సత్యము. అయితే చాలామందికి ఈ సత్యము తెలుసు. అయితే తెలిసీ సత్యమును కొందరు మూసి పెట్టు చున్నారు. గ్రంథములోని గుట్టును విప్పి చెప్పుచూ కొందరు సత్యమును తెలిసినా సత్యమును మూసివేయుచున్నారని దేవుడు ప్రకటించాడు. ఇప్పటి నుంచయినా దైవగ్రంథములోని ప్రతి వాక్యములోని సత్యాసత్యమును తెలియు విచక్షణ కొరకు దేవున్ని వేడుకొందాము. ఇదే వాక్యమునే సూరా6, ఆయత్ 20లో కూడా చెప్పియున్నారు చూడండి. (6-20) ''ఎవరికయితే మేము గ్రంథాన్ని వొసగియున్నామో వారు తమ కన్న కొడుకులను గుర్తు పట్టినట్లే ప్రవక్తను గుర్తుపడతారు. అయితే తమను తాము నష్టములో పడవేసుకొన్నవారు మాత్రము విశ్వసించరు.'' (మరియొక గ్రంథములో) (6-20) '''ఎవరికయితే మేము గ్రంథాన్ని ప్రసాదించామో వారు తమ పుత్రులను గుర్తించినట్లు అతనిని (ముహమ్మద్‍ను) గుర్తిస్తారు. ఎవరైతే తమను తాము నష్టానికి గురి చేసుకొంటారో అలాంటివారే విశ్వసించరు.'' మీరు గీటురాయి అను విచక్షణతో వివరించుకొని చూచి సత్యమును తెలియవలెను.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
(14) ఎవరి కర్మలు వారివే. (2-141, 4-111, 35-18, 53-39, 41-46)
ఇంతకుముందు కర్మలను గురించి చెప్పుకొన్నాము. అప్పుడు కర్మల పేర్లను కూడా చెప్పుకొన్నాము. క్రొత్తగా వచ్చు కర్మను ఆగామికర్మ అనియూ, నిలువయున్న కర్మను సంచిత కర్మ అనియూ, ప్రస్తుత జన్మలో అనుభవానికి వచ్చు కర్మను ప్రారబ్ధకర్మయనీ మూడు రకముల పేర్లను చెప్పుకొన్నాము. మూడు పేర్ల కర్మలు ప్రతి మనిషికి ప్రత్యేకముగా ఉండును. ఏ మనిషి బుద్ధి ఆ మనిషికే ఉండును. మనుషుల బుద్ధులు వేరు వేరుగాయుండును. అట్లే మనుషుల బుద్ధికి వున్న భావములు కూడా వేరు వేరుగా ఉండును. ఒకరి బుద్ధికి మరొకరి బుద్ధికి కొద్దిగయినా తేడా యుండును. బుద్ధిని బట్టి భావము, భావమును బట్టి కర్మయుండును. బుద్ధి భావమునుబట్టి క్రొత్తగా తయారగు కర్మను ఆగామికర్మయని అంటున్నాము. ఒకే కార్యమును నలుగురు చేసినా, నలుగురు ఒకే పని చేసినా, దానివలన ఒకే రకమైన ఆగామికర్మ వచ్చునని మనము అనుకొన్నా, అలా ఒకే కర్మ వారికి రాదు. వారు ఒకే పనిని నలుగురు వేరువేరుగా చేసినా, చేసినది అందరూ ఒకే కార్యమయినా వారికి ఒకే విధమైన కర్మరాదు. ఎందుకనగా! వారు చేసినది ఒకే కార్యమునయినా, నలుగురు నాలుగు పొట్టేల్లను గొంతుకోసి చంపినా, వారు చేసినది ఒకే కార్యమే అయినా, కర్మ ఒకే విధముగా రాదు. దానికి కారణము వారి బుద్ధి యొక్క భావము వేరువేరుగా ఉండుట వలన వారు చేసిన కార్యములలో నలుగురికి నాలుగు రకముల కర్మలు వచ్చాయి.
వారిలోని అహము యొక్క భావము ఒకే విధముగా లేకుండుట వలన, వేరువేరుగా ఉండుట వలన, వారికి వేరు వేరు మోతాదులలో ఆగామి కర్మ రావడము జరిగినది. ఈ విధముగా వేరువేరుగా వచ్చిన కర్మ ఎవరికి వారి తలలోని కర్మచక్రములో చేరి సంచిత కర్మగా మారి ఉండును. మనిషి మరణించినప్పుడు రెండవ జన్మకు తీర్పు చెప్పినప్పుడు సంచిత కర్మ ప్రారబ్ధముగా మారి రెండవ జన్మలో అనుభవించుటకు సిద్ధముగా ఉండును. అప్పుడు ఎవరి కర్మను వారు అనుభవించుచున్నారు. ప్రతి మనిషి కర్మ ప్రత్యేకముగా ఉండుట వలన ఎవరి కర్మను వారు అనుభవించవలసియున్నది. ప్రతి మనిషికి కర్మ వేరుగా తయారగుచున్నది. ఎవని కర్మను వారు అనుభవించుచున్నారు. అంతతప్ప, ఇతరుల కర్మలో ఎవరికి కొంచెము కూడా సంబంధముండదు. అదే విషయమునే ఖుర్ఆన్ గ్రంథములో కొన్ని వాక్యములయందు వ్రాశారు. ఇప్పుడు ఆ వాక్యములను చూస్తాము.
(2-141) ''ఇప్పుడు అది గతించిన ఒక సమాజము. వారు చేసుకొన్నది వారికి చెందుతుంది. మీరుచేసుకొన్నది మీకు లభిస్తుంది. వారి కర్మల గురించి మీరు ప్రశ్నింపబడరు.''
(4-111) ''కానీ ఎవడైనా పాపమును సంపాదించుకొంటే అతను సంపాదించుకున్నది అతనిపైనే పడుతుంది. అల్లాహ్ ప్రతీదీ తెలిసినవాడు, వివేచన గలవాడు.''
(35-18) ''బరువును మోసేవాడెవడూ మరొకరి బరువును మోయడు. బరువును మోసేవాడు ఒకవేళ తన బరువును మోపేే నిమిత్తము వేరొకరిని పిలిచినా, అతను సమీప బంధువు అయినా సరే, కొద్దిగా కూడా ఎత్తుకోడు. ఓ ప్రవక్తా! చూడకపోయినా తమ ప్రభవుకు భయపడే వారిని, నమాజులను నెలకొల్పే వారిని మాత్రమే నీవు సావధానపరచగలవు. ఎవడు పరిశుద్ధుడయినా తన స్వయము కొరకే పరిశుద్ధుడౌతాడు.''
(53-39) ''ప్రతి మనిషి దేనికొరకు పాటుపడతాడో అది మాత్రమే అతనికి లభిస్తుంది.''
(41-46) ''ఎవరైనా సత్కార్యము చేస్తే తన మేలు కోసమే చేసు కుంటాడు. మరి ఎవరైనా దుష్కార్యమునకు ఒడిగడితే దాని దుష్ఫలితము అతని మీదనే పడుతుంది. నీ ప్రభువు మాత్రము దాసులకు అన్యాయము చేసేవాడు కాడు.''
అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్ గ్రంథము కర్మ ఫలితములను గురించి చెప్పిన వాక్యములను గురించి చదివిన తర్వాత ఎవడు చేసుకొన్న కర్మములను వాడు అనుభవించవలసిందేనని, దేవుడు కర్మల నిర్మాణము అలాగే చేశాడని తెలియుచున్నది.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
15. దేవుని నుండి వచ్చిన దానిని సంశయపడకు. (2-147, 2-209)
ప్రపంచములో ఒక్క జ్ఞానము తప్ప అన్నీ కర్మనుండి లభించునవే అయివుండును. దైవజ్ఞానము ఒక్కటి మాత్రము దేవుని నుండి లభించును. అలా దేవుని నుండి లభించిన దైవజ్ఞానమే మానవులకు మూడు గ్రంథములుగా దగ్గరయినది. అయితే మనుషులలోని మాయ చేత దేవుని నుండి వచ్చిన జ్ఞానము కూడా మతములుగా విడిపోయినది. వాస్తవముగా అది విడిపోలేదు, మనుషులే దానిని విడదీసుకొని మూడు గ్రంథములకు మూడు మతములను అంటగట్టారు. ఇదంతా మాయ విధానము వలన జరిగిన పనియేగానీ వేరు కాదు. దేవుని మూడు గ్రంథములు మతములకు అతీతముగా యున్న జ్ఞానమును బోధించినవి. దేవుని గ్రంథములో మతాలకు అతీతమైన దేవున్ని గురించి చెప్పిన జ్ఞానమే ఉండునుగానీ మత సంబంధమైన జ్ఞానము ఉండదు. దేవుడు మతాతీతుడు అయినందున మతాతీత జ్ఞానమే మూడు గ్రంథములలో కలదని చెప్పవచ్చును.
భూమిమీద గ్రంథములు ఎన్నో గలవు. అయితే మూడు గ్రంథములే దైవ గ్రంథములని పేరుగాంచినవి. దైవగ్రంథములలో దైవ జ్ఞానమున్నదని చెప్పగలిగినా, మిగతా గ్రంథములను దైవగ్రంథములని అనకూడదు. మిగతా గ్రంథములు ఎన్నో ఉన్నా, వాటిలో అన్నీ జ్ఞానమును బోధించకున్నా, కొన్ని అయినా జ్ఞానమును బోధించిన గ్రంథములు గలవు. అలాంటి గ్రంథము లను ఏ కోవకు సంబంధించినవిగా లెక్కించవలెను? అను అనుమానము రాక తప్పదు. కొన్ని గ్రంథములలో దేవుని జ్ఞానమువలె కనిపించినా అందులో అంతా ప్రపంచ జ్ఞానము అనగా మాయ జ్ఞానము ఎక్కువగా ఉండును. కొన్ని గ్రంథములు మాత్రము పూర్తి జ్ఞానము కొరకే వ్రాయబడి యున్నవై యుండును. వాటియందు దేవుని జ్ఞానమే కనిపించుచుండును. మూడు దైవ గ్రంథములలో దేవుడు ఉద్బోధించిన జ్ఞానమే ఉండుట వలన వాటిని తెలియుటయందు ఏమాత్రము సంశయము లేదు. అయితే మనుషులు చెప్పినవి, మనుషులు వ్రాసినవి అయిన గ్రంథములలో దైవజ్ఞానముండునా? వాటినుండి దైవజ్ఞానమును తెలియవచ్చునా? అనునది సంశయముగా ఉన్నది.
దైవజ్ఞాన విషయములో జాగ్రత్తగా ఉండవలెననీ, అన్నీ దైవ జ్ఞానమును బోధించు గ్రంథములు కాదనీ, మూడు దైవ గ్రంథాల విషయములో ఎటువంటి అనుమానము లేకున్నా కొన్ని పూర్తి దైవజ్ఞానముతో కూడిన గ్రంథములపట్ల ఎలా వ్యవహరించాలి? అని కొందరు సంశయము కల్గియున్నారు. దానికి మా సూచన ఏమనగా! దైవ గ్రంథములు పైకి కనిపించునవి, వరుస క్రమములో తయారై ప్రథమ, ద్వితీయ, అంతిమ అని పేరు పెట్టబడినవి మూడు గ్రంథములు కాగా, పైకి కనిపించనివి ఎన్నో గలవు. మూడు గ్రంథములు బయటికి తెలియునట్లు గలవు కావున వాటి విషయములో ఎవరూ చదువకపోయినా సంశయింపరు. అయితే బయటికి ఏమాత్రము తెలియని గ్రంథములు దైవ గ్రంథములని తెలియక పోవడము వలన వాటిని సాధారణ గ్రంథములుగా లెక్కించి వాటిలోని జ్ఞానము ఎడల సంశయపడుచుండుట వాస్తవమే. అయితే మూడు దైవ గ్రంథములుకాక మిగతా ఏ గ్రంథమైనా దైవ గ్రంథమా కాదా?యని తెలియుటకు ఒక అవకాశము కలదు. దాని ప్రకారము ఏది దైవగ్రంథముగా కనిపించినా, దాని ఎడల సంశయము పొందక చదివి దేవుని జ్ఞానమును తెలియవచ్చును.
దైవగ్రంథములలో దైవజ్ఞానము ఉండుట సహజమే. దైవజ్ఞానమున్న చోట దైవశక్తి కూడా ఉండును. నూటికి నూరుపాళ్ళు దైవజ్ఞానమున్న దైవ గ్రంథము ఏదయినా అందులో దైవశక్తి దైవజ్ఞానముతోపాటు ఉండును. మూడు దైవగ్రంథములలో జ్ఞానశక్తి యుండుట వలన బయట రసాయన క్రియ జరిగినట్లు మనిషి అంతరంగమున దైవక్రియ జరిగి మనిషిలో బుద్ధికి విచక్షణ ఏర్పడి, విచక్షణనుబట్టి జ్ఞానము మనిషికి లభించుచున్నది. ఈ దైవ క్రియలో ముఖ్యపాత్ర పోషించునవి గ్రంథములోని దైవశక్తి (జ్ఞానశక్తి) మరియు మనిషిలోగల జ్ఞానము మీద శ్రద్ధ. మనిషిలో గల శ్రద్ధ ఎంత ఉంటే అంత మనిషికి జ్ఞానము లభించుచున్నది. అందువలన ''శ్రద్ధవాన్ లభతే జ్ఞానమ్'' అని ప్రథమ దైవ గ్రంథములో జ్ఞానయోగమందు 39వ శ్లోకమున చెప్పడమైనది. ఒక ప్రక్క గ్రంథములోని జ్ఞానశక్తి, రెండవ ప్రక్క మనిషిలోని శ్రద్ధ, రెండూ కలిసినప్పుడు దైవక్రియ ఏర్పడుచున్నది. దైవక్రియలోనే శ్రద్ధనుబట్టి బుద్ధి, బుద్ధినిబట్టి జ్ఞానము దొరుకుచున్నది. అందువలన ''శ్రద్ధవాన్ లభతే జ్ఞానమ్'' అని అనడము జరిగినది. ఈ ప్రక్రియ మనిషికి తెలిసినా తెలియకున్నా మూడు దైవ గ్రంథములవద్ద జరుగుచున్నది.
భూమిమీద దేవుడు చెప్పిన మూడు విధానముల ప్రకారము మూడు దైవ గ్రంథములు తయారయినా, మిగతా గ్రంథములు కూడా కొన్ని దైవ గ్రంథములుగా చెప్పుటకు అర్హత కల్గియున్నవి. సూత్రము ప్రకారము ఏ గ్రంథములో దైవశక్తి (జ్ఞానశక్తి) కలదో ఆ గ్రంథమును దైవ గ్రంథము అని చెప్పుచున్నాము. గ్రంథములో జ్ఞానశక్తి మూడు దైవగ్రంథములుగా పేరుగాంచిన వాటిలోనే కాకుండా మిగతా వేరే గ్రంథములలో కూడా దైవశక్తి ఉండుట వలన వాటిని కూడా దైవ గ్రంథములని చెప్పవచ్చును. ఎక్కడయితే మనిషిలోని శ్రద్ధనుబట్టి దైవక్రియ వలన దైవజ్ఞానము లభించు చున్నదో అక్కడ దైవగ్రంథము కలదని చెప్పవచ్చును.
దైవ గ్రంథములలో దైవశక్తి యుండును కనుక వాటిని దైవ గ్రంథములనవచ్చును. దైవశక్తి ఎలా ఉన్నది బయటికి తెలియకపోయినా మూడు గ్రంథములయిన భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ గ్రంథములను దైవ గ్రంథములని అనుచున్నాము. ఆ మూడు గ్రంథములలో దైవశక్తి ఉండుట వాస్తవమే. దైవశక్తి యుండుట వలన అవి మూడు దైవగ్రంథములయినాయి. మూడు దైవ గ్రంథములలో శక్తి బయటికి ఏమాత్రమూ కనిపించునది కాదు. ఆ మూడు గ్రంథములు కాకుండా మిగతా దైవ గ్రంథములు ఏవయినా ఉండుటకు అవకాశముండునా? అను ప్రశ్నకు మిగతా దైవ గ్రంథములు ఉండవచ్చుననే చెప్పవచ్చును. దేవుడు మూడు నియమముల ప్రకారము చెప్పు బోధలను మూడు దైవ గ్రంథములన్నాము. వాటి ముందు వెనుక వరుసను బట్టి మూడు గ్రంథములకు ప్రథమ, ద్వితీయ, అంతిమ గ్రంథములని చెప్పాము. మూడు గ్రంథముల తర్వాత కూడా అవసరమును బట్టి దేవుడు జ్ఞానము తెలియజేయును. దేవుడు ఎప్పుడు ఎలా తెలియజేస్తాడో మాత్రము ఎవరికీ తెలియదు. మూడు విధానముల ప్రకారము ఒకమారే చెప్పుదునని ఎక్కడా చెప్పలేదు. ఆ మూడు విధానములలో ఎవరూ గుర్తించని ఏదో ఒక విధానముతో తన జ్ఞానమును తర్వాత కూడా చెప్పవచ్చును. అయితే ఖచ్చితముగా ఇట్లే చెప్పునని చెప్పలేము. అది అల్లాహ్ (దేవుని) ఇష్టము.
దేవుడు మనుషులకు ఎవరికీ తెలియకుండా ముందు చెప్పిన మూడు విధానములు కాకుండా ప్రత్యేకించి మరొక విధానము ప్రకారము జ్ఞానమును బయటికి చెప్పు అవకాశము ఒకటి గలదు. ఆ విధానమును ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీత (తౌరాతు) గ్రంథమందు ముందే చెప్పియున్నారు. తర్వాత అంతిమ దైవ గ్రంథములో మూడు విధానములను చెప్పడము జరిగినది. అందరికీ తెలిసిన మూడు విధానముల ప్రకారము జ్ఞానము చెప్పడమేకాక, ఎవరికీ తెలియని మరొక విధానము ప్రకారము కూడా చెప్పు విధానమును దేవుడు ముందే ప్రథమ దైవ గ్రంథమందే చెప్పియున్నాడు. ఆ విషయమును ఏ మనిషి నుండి అయినా చెప్పవచ్చును. దానిని సూచన ప్రాయముగా భగవద్గీత, పురుషోత్తమ ప్రాప్తి యోగము అను అధ్యాయములో 15వ శ్లోకమందు చెప్పియున్నారు చూడండి.
శ్లో|| 15. సర్వస్య చాహం హృదిసన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞాన మపోహనంచ|
వేదైశ్చ సర్వైరహ మేవ వేద్యో వేదాన్తకృ ద్వేదవి దేవ చాహమ్ ||
భావము:- ''నేను సకల జీవరాసుల హృదయ పీఠమునందు నివాసమున్నాను. నా వలననే మనిషికి (జీవరాసులకు) స్మృతి, జ్ఞానము, ఊహ కల్గుచున్నవి. వేదములు నన్నే తెలియజేయును. వేద ఫల దాతను కూడా నేనే.''
ఈ శ్లోకములో ముఖ్యముగా 'నా వలన మనిషికి స్మృతి, జ్ఞానము, ఊహ కల్గునని' చెప్పాడు కదా! అందులో మధ్యలో గలది జ్ఞానము. మనిషికి జ్ఞానము తెలియజేతును అన్నప్పుడు దాని ఆధారముతో మనుషులకు కావలసిన జ్ఞానమును దేవుడు తెలియజేయవలసిన అవసరమున్నది. ఇప్పుడు కొందరు ఒక ప్రశ్న అడుగవచ్చును. అదేమనగా! దేవుడు మూడు గ్రంథములలో తన జ్ఞానమునంతటినీ చెప్పాడు కదా! తర్వాత చెప్పవలసిన జ్ఞానము ఏమున్నదని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! దేవుడు మూడు విధానముల ప్రకారము మూడు గ్రంథముల జ్ఞానమును చెప్పాడు. అయితే మనుషులు మూడు గ్రంథములను ఆధారము చేసుకొని మూడు మతములను ఏర్పరచుకొని మూడు వర్గములుగా విడిపోయి ఉన్నారు. అంతిమ దైవ గ్రంథములో కొన్నిచోట్ల మూడు గ్రంథముల జ్ఞానము ఒకటేయని చెప్పియున్నా, మనుషులు మాత్రము 'మతము' అను అజ్ఞానములో పూర్తి మునిగిపోయి మతవర్గములుగా చీలిపోయి, దేవుని జ్ఞానమును, దేవున్ని కూడా మూడు వర్గములు చేశారు. 'దేవుడు అందరికీ ఒక్కడే' అను భావము పోయింది. ఎవరి మతము వారికి గొప్పయనీ, ఎవరి దేవుడు వారికి గొప్పయను భావములో మనుషులున్నారు. దేవుడు అందరికీ సంబంధించినవాడు అని చెప్పినా, ఒక మతస్థులు 'దేవుడు' అను పేరును కూడా ఒప్పుకోవడము లేదు. వారి దేవున్ని వారి మతములో అందరూ ఒకే విధముగా పిలుస్తారని, అలాగే వారి దేవున్ని అదే పేరుతో పిలువవలెనని, వేరే ఏ పేరు చెప్పినా, సర్వసాధారణముగా దేవుడు అని అనినా వారు ఒప్పుకోరు. ఈ విధముగా 'మతము' అను అజ్ఞానము పూర్తి స్థాయిలో అందరియందు పెరిగిపోయినది.
ఈ మతము ఆ మతము అనకుండా మతము అయిన ప్రతి దానియందు అజ్ఞానము పెచ్చుగా పెరిగి పోయినది. అటువంటి అజ్ఞానమును మూడు దైవగ్రంథములు నిర్మూలించలేవు. ఎందుకనగా! మూడు దైవ గ్రంథములను ఆధారము చేసుకొని పుట్టిన అజ్ఞానమును లేకుండా చేయుటకు ప్రత్యేకమయిన జ్ఞానము అవసరము. ఒక ప్రక్క మూడు గ్రంథముల జ్ఞానమును జ్ఞాపకము చేయుచూ మరొక ప్రక్క మతములను నిర్మూలించుటకు, మనిషిలో దాగియున్న అజ్ఞానమును పోగొట్టుటకు దేవుడు ప్రత్యేకమయిన జ్ఞానమును చెప్పవలసి యున్నది. అయితే దానిని మనిషి శరీరమునుండి ఆత్మగాయున్న వాడు బయటికి తెలియజేస్తే తెలియును. మనిషిలో ఆత్మగాయున్న దేవుడే మనిషినుండి చెప్పే జ్ఞానమే మనుషుల అజ్ఞానమును తీసివేయును. అలాగే మనిషి నుండి వ్రాయించిన ఆత్మే తన జ్ఞానమును మనుషులకు ఎలా అవసరమైతే అలా తెలియజేయును. అలా తెలియబడినది నిజమైన జ్ఞానమా కాదా!యని తెలియుటకు, అందులో దైవశక్తి ఉన్నదా లేదా?యని తెలియుటకు ఏదో ఒక ఆధారమును బయటికి దేవుడు తెలియజేయవలసిన అసవరమున్నది. దేవుడు భగవద్గీతలో చెప్పినట్లు ఏ మనిషినుండయినా, ఏ వయస్సు మనిషిలో నుంచయినా, ఏ మతములో మనిషినుండయినా మూడు గ్రంథముల తర్వాత అవసరమైన జ్ఞానమును తెలియజేయును. అలా తెలియజేసిన జ్ఞానము గ్రంథరూపమైతే, దానిని దైవ గ్రంథమని మనుషులకు తెలియక పోయినా దానిలోని జ్ఞానశక్తి బయటికి కనపడునట్లు దేవుడు అమర్చి యుండును. మూడు దైవ గ్రంథములలో జ్ఞానశక్తి లేక దైవశక్తి బయటికి కనిపించకపోయినా వాటియందు జ్ఞానశక్తియుండుట వలన వాటిని దైవ గ్రంథములు అని అనుచున్నాము. ఇప్పుడు మూడు గ్రంథముల మినహా తయారయిన వాటిలో స్వయముగా ఆత్మ మనిషి నుండి చెప్పిన గ్రంథములు ఉండుట వలన వాటిని కూడా దైవ గ్రంథములనుటకు వాటియందు జ్ఞానశక్తి (దైవశక్తి) బయటికి తెలియునట్లు ఉండును. అట్లు తెలియకపోతే వాటిని దైవ గ్రంథములనుటకు ఆధారము ఏమీ లేదనియే చెప్పవచ్చును.
మూడు దైవ గ్రంథములు పరోక్షముగా మనిషి కర్మను హరించి కర్మరహితున్ని చేసి జీవున్ని దేవునియందు ఐక్యమగుటకు తయారు చేయు చున్నవి. దైవ గ్రంథముల ఉద్దేశ్యమే అది. మూడు విధానముల చేత చెప్పబడిన బోధలు మూడు గ్రంథములై చేయుచున్న కర్తవ్యము ఏమి అనిన మనిషిని (జీవున్ని) దేవునియందు ఐక్యమగునట్లు చేయుటయే ముఖ్యమైన కర్తవ్యము మరియు ముఖ్యమైన ఉద్దేశ్యము. మూడు దైవ గ్రంథములను ఎంతగా విశ్వసించిన అంతగా గ్రంథములు పనిచేయును. మూడు గ్రంథములలో ఒకే దేవున్ని ఉద్దేశించి చెప్పిన జ్ఞానము ఉండుట వలన, మనిషి వేరుగా తలచినా గ్రంథములలో ఉన్నది ఒకే జ్ఞానము అయినందున, మూడు గ్రంథములయందు కర్మను కాల్చుశక్తియే కలదు. అయితే ఇక్కడ ముఖ్యముగా గమనించవలసిన విషయము ఒకటి కలదు. అది ఏమనగా! మూడు గ్రంథములను మనిషి విశ్వసించినప్పుడు మాత్రమే గ్రంథములు కర్మను కాల్చగలవు. ఒక గ్రంథమును విశ్వసించి రెండు గ్రంథములను విశ్వసించకపోయినా, లేక రెండు గ్రంథములను విశ్వసించి ఒక గ్రంథమును దూరముగా ఉంచినా, ద్వేషముగా చూచినా, లేక మూడు గ్రంథములను ఏమాత్రము విశ్వసించక అసూయతో చూచినా, వారి యెడల గ్రంథములు కర్మను కాల్చు పని చేయవు. నేడు భూమిమీద ఒక గ్రంథమును విశ్వసించు వారు గలరు. మిగతా రెండు గ్రంథములను అసూయతో చూచుట వలన, విశ్వసించక పోవడము వలన నేడు ఎవరికీ దైవ గ్రంథముల వలన కర్మలు తొలగడము లేదు.
వివరముగా చెప్పితే ముస్లీమ్‍లు ఖుర్ఆన్ గ్రంథమును తమ గ్రంథమని చెప్పుచున్నారు. అందువలన వారు ఖుర్ఆన్ గ్రంథమును మాత్రము విశ్వసించి మిగతా రెండు గ్రంథములను వారు విశ్వసించడము లేదు. మిగతా రెండు గ్రంథములు కూడా ఖుర్ఆన్ గ్రంథములో చెప్పినట్లు దైవ గ్రంథములే అయినా వారు మతముతో కట్టివేయబడినవారై, మతదృష్ఠితో ఒక గ్రంథమును నమ్మి మిగతా రెండు గ్రంథములను నమ్మకపోవడము వలన వారికి దైవ గ్రంథముల వలన కలుగు కర్మ తొలగు విధానము ఏమాత్రమూ పని చేయడము లేదు. క్రైస్థవులు బైబిలు గ్రంథమును తమ గ్రంథమని చెప్పుకొంటున్నారు. మిగతా రెండు గ్రంథములను అసూయతో చూస్తున్నారు. ఇకపోతే హిందువుల విషయానికి వచ్చి చూస్తే వీరు క్రైస్థవులు, ముస్లీమ్‍లవలె భగవద్గీతను తమ గ్రంథమని నమ్మక వేదములను, ఉపనిషత్తులను తమ గ్రంథములని చెప్పుకొంటున్నారు. దానివలన వీరు మూడు గ్రంథములను నమ్మలేదని చెప్పవచ్చును. హిందువులలో చాలా తక్కువమంది భగవద్గీతను ఆశ్రయించిన వారు కలరు. అయినా వారు కూడా మిగతా రెండు గ్రంథములను నమ్మక అవి ఇతర మత గ్రంథములని వాటికి దూరముగా ఉంటున్నారు. ఈ విధముగా మూడు దైవ గ్రంథములను పూర్తిగా నమ్మిన వారు భూమిమీద చాలా అరుదుగా ఉందురని చెప్పవచ్చును.
ఎవరయితే మూడు దైవగ్రంథములను విశ్వసిస్తారో వారికి తెలియకుండానే కర్మలు తొలగిపోవును. అంతేకాక మూడు దైవ గ్రంథములు లిసి ఒకే దైవగ్రంథములోని భాగములని, మూడింటిని సమానముగా గౌరవిస్తాడో వాని కర్మలు తొలగిపోవును. మూడు గ్రంథములు ఒకే గ్రంథములోనివని అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో సూరా 6, ఆయత్ 91లో చెప్పియున్నారు. అంతేకాక సూరా 5, ఆయత్ 44, 46, 48, 68 లోనూ, (62-5) లోనూ మూడు గ్రంథములలోను ఒకే జ్ఞానమున్నదని చెప్పారు. ముస్లీమ్‍లు తమ గ్రంథము ఖుర్ఆన్ అని చెప్పినా, అందులో మూడు గ్రంథములు ఒక్కటేయని ఎన్నో వాక్యములలో చెప్పియున్నా, వారికి గ్రంథముకంటే మతము ముఖ్యమైనందున దైవ గ్రంథములోని మాటలను కూడా లెక్క చేయడము లేదు. చాలామంది ముస్లీమ్‍లకు దైవ గ్రంథములో ఏమి వ్రాసియున్నారను విషయము కూడా తెలియదు. ముస్లీమ్‍లకు బోధలు చెప్పువారు ఈ విషయములు గ్రంథములో వ్రాసియున్నాయని ప్రజలకు చెప్పడము లేదు. కొందరు ముస్లీమ్ పెద్దలు దైవ గ్రంథమును ప్రక్కన పెట్టి, మనుషులు వ్రాసిన హదీసు గ్రంథములను చదువుట వలన ఖుర్ఆన్ గ్రంథములో దేవుడు చెప్పిన విషయములు తెలియకుండా పోయినవి. అందువలన మూడు దైవ గ్రంథములలో ఒకే దేవుని జ్ఞానమున్నదను విషయము, ఒకే దేవున్ని గురించి చెప్పిన విషయము ముస్లీమ్ ప్రజలకు తెలియకుండా పోయినది. దానివలన వారు ఒకే గ్రంథమును విశ్వసించి ఇతర రెండు గ్రంథములను విశ్వసించక పోవడము వలన దైవ గ్రంథము వలన కర్మ కాలిపోవు విధానము వారికి లేకుండా పోయినది. దానిని వారు నష్టపోయినట్లే.
దేవుని నుండి వచ్చినది మొదట ఒకే ఒక జ్ఞానము. తర్వాత అది మనుషుల చేత మూడు గ్రంథములుగా వ్రాయబడినది. అందువలన సూరా ఆరులో ఆయత్ 91యందు (6-91) ''అవిశ్వాస జనులు దేవున్ని అర్థము చేసుకోవలసిన విధముగా అర్థము చేసుకోలేదు. వారిని అడుగు మూసా తెచ్చిన తౌరాతు గ్రంథాన్ని ఎవరు అవతరింప జేసినట్లు? ఆ గ్రంథము ఒక జ్యోతి, మానవుల కొరకు మార్గ దర్శకత్వము. మీరు దాన్ని వేరువేరు కాగితములుగా (వేరు వేరు గ్రంథములుగా) విభజించి చూపుతున్నారు.'' ఈ విధముగా దేవుడు చెప్పిన తర్వాత కూడా దైవ గ్రంథములు ఎన్నియున్నా అన్నీ ఒక్కటేయని తెలియకపోతే వారిది అజ్ఞానమగును.
ప్రశ్న :- మూడు దైవగ్రంథములు మనుషుల కర్మలు కాల్చునవై యున్నవని అన్నారు. మూడు దైవగ్రంథములలో కర్మను కాల్చుశక్తి బయటికి కనిపించ కుండా ఇమిడియున్నదని కూడా చెప్పారు. మూడు గ్రంథములకంటే మినహా ఎన్నో గ్రంథములు జ్ఞానశక్తి (దైవశక్తి) కలవి ఉన్నాయని చెప్పారు. వాటిలో దైవశక్తి కలదని తెలియుటకు ఆధారము కూడా ఉన్నదని చెప్పారు. ఆధారము లేకపోతే ఇతరులు వాటిని గుర్తించుటకు అవకాశమే లేదని కూడా చెప్పారు. అటువంటి గ్రంథములు ఉండుననుటకు భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తియోగమున 15వ శ్లోకమును ఆధారముగా కూడా చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత మాకు కూడా కొంత నమ్మకము ఏర్పడినది. అయితే అవి ఎట్లున్నాయో, ఎక్కడున్నాయో మాకు తెలియదు. మీకు మనిషి చేత రచింపబడిన దైవశక్తిగల దైవగ్రంథములు మీకు తెలిసియుంటే మాకు తెలుపమని కోరుచున్నాము?
జవాబు :- మూడు దైవగ్రంథముల బోధను ఒకే గ్రంథములో కలదని ఇతరులు చూపిస్తే అవి నమ్మదగినవి కావు. నేను ఫలానా గ్రంథములని చెప్పితే మీరు నమ్మడము మంచిది కాదు. అటువంటి గ్రంథములను ఎవరంతకు వారు గ్రహించగలిగితే మంచిది. అలా తెలియుటకు ముందు దైవశక్తియంటే ఏమిటి? అది దైవగ్రంథములలో ఎలా గలదో తెలియగలిగితే మూడు దైవగ్రంథముల తర్వాత వచ్చు దైవ గ్రంథము ఏదో ఎట్లుండునో తెలియవచ్చును. దేవుని జ్ఞానమును సంపూర్ణముగా చెప్పుటకు మూడు గ్రంథములు బయటికి వచ్చాయి. అదే దేవుని జ్ఞానమును తెల్పుటకు వచ్చు దైవ గ్రంథము ఒకటిగాయుండదు. అనేక గ్రంథములుగా చెప్పబడియుండును అని అనుకొంటున్నాను. అనేక గ్రంథముల రూపములో తెలియజేయువాడు దేవుడేయని చెప్పవచ్చును. దేవుడు భగవంతునిగా యున్నప్పుడే అది సాధ్యమగును. దేవుడు భగవంతుని రూపములో శరీరమునుండి చెప్పిన జ్ఞానము దైవజ్ఞానమే అయినా, పైకి చూచుటకు నమ్మదగినదిగా ఉండదు. అయితే ఆ గ్రంథములు చదివే కొలది అవి దైవగ్రంథములని తెలియుచుండును. విశ్వాసముతో చదివే వానికి ఫలానా గ్రంథములు దైవగ్రంథములని తెలియును. అందువలన గ్రంథములలోని దైవత్వమును ఎవరంతకు వారు తెలియవలసినదేగానీ, ఇతరులు చెప్పునది కాదు.
దైవజ్ఞానము అనగా దైవశక్తితో కూడుకొన్నది. దైవశక్తితో కూడుకొన్న జ్ఞానము స్వచ్ఛమయిన దేవుని జ్ఞానమై ఉంటుంది. దేవుని జ్ఞానమును ఎందరు బోధించినా, గ్రంథముగా వ్రాసినా అందులో దైవశక్తి లేకపోతే మనిషికి అందవలసిన ఆనందము, తృప్తి దానిలో దొరకదు. దైవశక్తి యున్న గ్రంథములను చదివినప్పుడు మనిషి గ్రహించగలిగితే ప్రత్యేకమైన ఆకర్షణ అందులో ఉండును. అటువంటిది ఎక్కడ దొరికినా అది దేవుని నుండి వచ్చినదని తెలియవచ్చును. తెలియకపోయినా నమ్మవచ్చును. అందువలన అంతిమ దైవగ్రంథములో సూరా 2 ఆయత్ 147లో ఇలా చెప్పారు చూడండి.
(2-147) ''నిస్సందేహముగా ఇది నీ ప్రభువు తరపునుండి వచ్చిన సత్యము. కావున నీవు సందేహించే వారిలో చేరకు.''
ఈ వాక్యములో చెప్పినట్లు ఎక్కడయితే దేవుడు భగవంతుని రూపములో చెప్పిన దానిని నీవు సందేహించితే, అదే నిజమైన దేవుని జ్ఞానమని, అందులోని రుచినిబట్టి గ్రహించలేకపోతే, తృప్తినిచ్చే శాస్త్రబద్దతను గ్రహించలేకపోతే అప్పుడు దేవుడు నిన్ను ఎక్కడికి పంపాలో అక్కడికి పంపును. ఆ విషయములో దేవుడు చాలా వివేకవంతుడు. అంతేకాక దేవుడు చెప్పినా గ్రహించక దేవుని జ్ఞానమును హేళనగా మాట్లాడితే దేవుడు వానిని సులభముగా వదలక ఏమయినా చేయగల శక్తివంతుడు. ఇదే విషయమును తెలియజేస్తూ సూరా 2, ఆయత్ 209లో ఇలా చెప్పారు చూడండి.
(2-209) ''మీ వద్దకు స్వచ్ఛమయిన హితోపదేశములు వచ్చిన పిదప కూడా మీరు తప్పటడుగు వేస్తే, నిజంగా అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడని తెలుసుకోండి.''
దైవగ్రంథములో దేవుడు చెప్పిన వాక్యముల ప్రకారము ఎక్కడయినా గానీ, ఏ గ్రంథములో అయినాగానీ దైవశక్తి గల దైవజ్ఞానము కనిపించినా దాని రుచిని తెలియలేక అది స్వచ్ఛమయిన దైవజ్ఞానమని గ్రహించలేకపోతే ఆ మనిషిని దేవుడు ఎంతటి అజ్ఞానములోనికయినా పంపును. ఎంతటి నరకములోనికయినా త్రోయును. దేవుడు ఏమి చేయాలో తెలిసిన వివేకవంతుడు అట్లే మహాశక్తివంతుడు. ఆయన మనిషిని ఏమయినా చేయగల సమర్థవంతుడు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
16. దేవుని చిహ్నములు. (2-158), (5-2), (22-32)
'దేవుని చిహ్నము' అనగా దేవుని రూపమును పోలినదని లేక దేవుని లక్ష్యణములను పోలినదని చెప్పవచ్చును. దేవునికి రూపము లేదు కనుక దేవుని లక్ష్యణములను లేక దేవుని ధర్మములను పోలినదని చెప్పవచ్చును. లక్ష్యణములనినా, ధర్మములనినా ఒక్కటేయని తెలియవచ్చును. దీనిప్రకారము దేవుని చిహ్నము అనగా దేవుని ధర్మముతో సమానమైనదని, లేక దేవుని హోదాతో సమానమైనదని చెప్పవచ్చును. దేవుని చిహ్నము దేవుని ధర్మముతో పోల్చి చెప్పునది, కావున దేవుని ధర్మమును గౌరవించినట్లే దేవుని చిహ్నమును గౌరవించవలెను. పూర్వము రాజులు అంతఃపురములో యుండి అవసరము వచ్చినప్పుడు మాత్రమే బయటికి వచ్చేవారు. ప్రతి చిన్న పనికి బయటికి వచ్చేవారు కాదు. అయితే కొన్ని పనులు రాజు ఆజ్ఞప్రకారము జరుగవలసియుండును. అప్పుడు రాజు బయటికి రాకుండా తన ఆజ్ఞను మాత్రము ఇతరుల చేత చెప్పి పంపును. అప్పుడు రాజుగారు ఆజ్ఞ ఇచ్చారా లేదా!యని బయటివారు తెలియుటకు రాజుగారి ఆజ్ఞను నమ్ముటకు రాజుగారి వేలి ఉంగరమును రాజు ఆజ్ఞకు చిహ్నముగా పంపడము జరుగును. బయటివారు రాజుగారి ఉంగరమునుగానీ లేక ఏదయినా రాజుగారి గుర్తుగా వచ్చిన దానిని చూచి రాజుగారు స్వయముగా వచ్చినట్లు తలచి ఆజ్ఞను అమలు పరచెడివారు. దీనినిబట్టి రాజుగారి చిహ్నము రాజుతో సమానమైనదని తెలిసినది. దేవుని చిహ్నమును దేవుని ముద్ర అని కూడా పిలువవచ్చును. ''దేవుని చిహ్నము'' అని అంతిమ దైవ గ్రంథములో వ్రాసియుండుట వలన చిహ్నముకంటే ముందు 'దేవుని' అని వ్రాసియుండుట వలన ఈ గుర్తు దేవునికి సంబంధించినదని చెప్పకనే తెలియుచున్నది.
ఈ చిహ్నమును గురించిన సమాచారమును అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో 2, 5 సూరాలలో మరియు 22వ సూరాలో మూడు ఆయత్‍లలో వ్రాసిన దానిని ఇప్పుడు చూస్తాము (2-158) ''నిస్సందేహముగా సఫా మర్‍వాలు అల్లాహ్ చిహ్నములలోనివి. కనుక కాబా గృహాన్ని దర్శించి హజ్ ఉమ్రహ్‍లు చేసేవారు వాటి మధ్య ప్రదక్షిణ చేస్తే అందులో ఏమాత్రము తప్పులేదు. స్వచ్ఛంగా ఎవరయినా ఏదయినా సత్కార్యము చేస్తే అల్లాహ్ ఆదరించేవాడు, తెలుసుకొనేవాడు.''
(5-2) ''విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ చిహ్నాలనుగానీ, ఏ నిషిద్ధ మాసాన్నిగానీ అగౌరవపరచకండి''. ఖుర్బానీ నిమిత్తము కాబా గృహానికి కొనితేబడుతున్న జంతువుల మెడలో పట్టాలు కట్టబడియున్న జంతువుల జోలికి పోకండి. అలాగే తమ ప్రభువు అనుగ్రహాన్ని, ప్రసన్నతను పొందే ఉద్దేశ్యముతో పవిత్ర గృహము కాబావైపు వెళుతున్న వారికి అడ్డు తగలకండి. అయితే మీరు ఇహ్రామ్ దీక్షను విరమించిన మీదట వేటాడవచ్చు. మస్జీద్ హరామ్‍కు పోకుండా మిమ్ములను నిలువరించిన వారిపట్ల ద్వేషం మిమ్ములను హద్దుమీరిన వారిగా మార్చివేయరాదు. సత్కార్యా లలో అల్లాహ్ భీతితో కూడిన విషయాలలో ఒండొకరికి తోడ్పడుతూ ఉండండి. పాపకార్యాలలో, దౌర్జన్యపు పనుల్లో ఎవరి తోనూ సహకరించకండి. అల్లాహ్‍కు భయపడుతూ ఉండండి. నిస్సందేహముగా అల్లాహ్ చాలా కఠినముగా శిక్షించేవాడు.''
(22-32) ''ఎవడయితే అల్లాహ్ నియమించిన చిహ్నములను గౌరవిస్తాడో, అది వారి హృదయాలలో ఉన్న దైవ భీతి వల్లనే.''
ఈ మూడు వాక్యములలో మొదటి దానియందు సఫా, మర్‍వాలు అను రెండు పర్వతాలను దేవుని చిహ్నములుగా చెప్పడమైనది. రెండవ వాక్యములో ''అల్లాహ్ చిహ్నాలను అగౌరవపరచకండి'' అను ఒకమాట కలదు. మూడవ వాక్యములో ''దేవుని భయము ఉన్నవారే అల్లాహ్ నియమించిన చిహ్నములను గౌరవిస్తారు'' అని ఉంది. మొత్తము మీద మూడు వాక్యాల సారాంశము దేవుని చిహ్నమును అగౌరవపరచకూడదనీ, గౌరవించవలెననీ చెప్పారు. దేవుని చిహ్నము ఏది? అను ప్రశ్నకు జవాబుగా 'దేవుడు నియమించినది' అని కలదు. దేవుడు తన జ్ఞానము చేత నియమించిన గుర్తును దేవుని చిహ్నము అని చెప్పబడుచున్నది. అంతేగానీ ముందే ప్రకృతిలో పుట్టిన పర్వతములను దేవుడు తన చిహ్నములుగా చెప్పలేదు. దేవుడు నియమించినది దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానము చేత నియమించి లేక నిర్ణయించి చెప్పినవే దేవుని చిహ్నములు. 'దేవుని చిహ్నములు' అని వాక్యములో చెప్పబడినది. అందువలన దేవుని చిహ్నములు ఎన్ని గలవు? అను ప్రశ్న రాగలదు. దేవుని చిహ్నము ఒక్కటే అయినా వాక్యములో 'చిహ్నములు' అని చెప్పబడినది. దానికి గల కారణము కూడా కలదు. అదేమనగా! చెట్టు ఒక్కటే అయినా దానికి కొమ్మలు నాలుగు కలవనుకో, అప్పుడు చెట్టును నాలుగుగా చెప్పుకోకూడదు. ఒకే చెట్టుకే నాలుగు కొమ్మలు ఉండుట వలన నాలుగు కొమ్మలను ఒకే చెట్టుగా చెప్పినట్లు, దేవుని జ్ఞానము ఎన్నో భాగములుగా యున్నా అది అంతయూ ఒక్క జ్ఞానమే. అలాగే దేవుని జ్ఞానము చేత తయారయిన దేవుని చిహ్నము కొన్ని భాగములుగా యున్నా దానిని ఒక్కటిగానే చెప్పాలి. అందువలన దేవుని చిహ్నము ఒక్కటేయని చెప్పవచ్చును.
ముఖ్యముగా చెప్పితే దేవుని చిహ్నము యొక్క ఆకారము కొన్ని భాగములుగా ఉండుట వలన దానిని చిహ్నములు అని బహువచనముతో చెప్పియుండవచ్చును. దేవుని చిహ్నము నాలుగు భాగములతో కూడుకొన్న ఆకారము. ఒకే ఆకారముగాయున్న దేవుని చిహ్నమును దేవుని ముద్రయని దైవ గ్రంథములోనే చెప్పుచున్నారు. ఒకే ఆకారమును చిహ్నము అనీ, ముద్రయని రెండు పేర్లతో మరియు రెండు అర్థములతో చెప్పుట వలన దేవుని గుర్తును బహువచనముగా పిలిచి యుండవచ్చును. 'దేవుని చిహ్నము' అను పేరుతో అంతిమ దైవగ్రంథములో మూడు ఆయత్‍లయందు చెప్పియుండగా, ద్వితీయ దైవగ్రంథమందు చివరిలోనున్న యోహాన్ ప్రకటన అను పాఠములో 'దేవుని ముద్ర' అని చెప్పారు. ఈ విధముగా రెండు దైవ గ్రంథములలో ఒకచోట దేవుని ముద్రయనీ, మరొక చోట దేవుని చిహ్నము అనీ ప్రత్యక్షముగా వాక్యములో చెప్పియుండగా, ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీతయందు పేరును ప్రత్యక్షముగా చెప్పకున్నా దేవుని ముద్ర లేక చిహ్నము యొక్క ఆకారమును పరోక్షముగా చెప్పియున్నారు. నేను మొదట 1977వ సంవత్సరము భగవద్గీతలో నాలుగు భాగములుగా యున్న ఆకారమును గుర్తించగలిగాము. ఆ రోజులలో జ్ఞానదృష్ఠికి నాలుగు భాగములుగాయున్న ఆకారము తెలియబడగా, ఆ ఆకారమును చిత్రపటముగా గీయగలిగాను. ఆ రోజు చిత్రపటముగా గీయబడిన బొమ్మకు పేరును పెట్టలేదు. ఈ మధ్యకాలములో దాదాపు 38 సంవత్సరములకు అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్‍లో 'దేవుని చిహ్నము' అని చదవగలిగాను. తర్వాత ద్వితీయ దైవగ్రంథము ఇంజీలులో 'దేవుని ముద్ర'యని చదవగలిగాను. రెండుచోట్ల చూచిన తర్వాత నేను భగవద్గీతలో చూచిన చిత్రపటమే దేవుని చిహ్నము మరియు దేవుని ముద్రగా యున్నదని గ్రహించగలిగాను.
దేవుని చిహ్నము లేక దేవుని ముద్ర దేవుని జ్ఞానముతో సమాన మైనది. అందువలన దేవుని ముద్రను చూస్తే దేవుని జ్ఞానము తెలిసినట్లు, దేవున్ని అర్థము చేసుకొన్నట్లు ఉండును. దేవుని జ్ఞానము ప్రకారము శరీరము లోపలి ప్రపంచము, శరీరము బయటి ప్రపంచము అని రెండు రకములుగా ప్రకృతిని చెప్పవచ్చును. ప్రకృతినే ప్రపంచము అంటున్నాము. దేవుని నుండి పుట్టినప్పుడు మొదట పెట్టబడిన పేరు ప్రకృతికాగా, రెండవ పేరునే పూర్తి అర్థముతో ప్రపంచము అని అంటున్నాము. ప్రకృతియనినా అర్థముతో కూడుకొన్న పేరే. కృతియనగా చేయబడినది. 'ప్ర' అనగా ముఖ్యముగా అని అర్థము. దేవుని చేత మొట్టమొదట ముఖ్యముగా చేయబడినది ప్రకృతి. 'కృతి'యనడములో స్త్రీ తత్త్వమును సూచించుచున్నది. అందువలన 'చేయబడినది' అని అన్నాము. చేయబడినది కృతియని చెప్పినా, అది దేవుని చేత చేయబడిన దానివలన దానిని ప్రకృతియని అంటున్నాము. అంటే ఎంతో ప్రాముఖ్యమైనదని అర్థము.
ప్రకృతి స్త్రీ తత్త్వము గలది, దేవుడు పురుష తత్త్వము గలవాడు అని ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీతలో చెప్పుకొన్నాము. దేవుడు తన సృష్ఠిలో మొట్టమొదట సృష్ఠించినది ప్రకృతినే. అప్పటికి ప్రకృతి పరమాత్మ ఇద్దరే కలరు. అప్పుడు పరమాత్మ తన సంకల్పము చేత ప్రకృతిని ఐదు భాగములుగా విభజించాడు. అంతేకాక తననుండి రెండు భాగములను తయారు చేసి తననుండి బయటపడిన రెండు భాగములకు ఒక దానికి ఆత్మయని, రెండవ దానికి జీవాత్మయని పేరు పెట్టాడు. దేవుడు ఆత్మ స్వరూపుడే అనగా పురుష స్వరూపుడే అయినందున దేవుని నుండి విభజింపబడిన రెండింటినీ ఆత్మ, జీవాత్మయని చెప్పడమైనది. ఇట్లు పరమాత్మ మూడు భాగములుగా, ప్రకృతి ఐదు భాగములుగా మొత్తము ఎనిమిది భాగములు మొదట తయారయిన విశ్వరూపము. ప్రకృతి ఐదు భాగములు వరుసగా 1) ఆకాశము 2) గాలి 3) అగ్ని 4) నీరు 5) భూమి. ఇదంతయూ నిర్జీవమైన ప్రపంచముగా తయారయినది. ఈ ప్రపంచములో జీవరాసులను నింపుటకు దేవుడు ఐదు భాగములుగా యున్న ప్రకృతిని రెండు భాగములుగా చీల్చాడు. ఆకాశములో రెండు భాగములు, గాలిలో రెండు భాగములు, అగ్నిలో రెండు భాగములు అలాగే నీరు, భూమిలో కూడా రెండు భాగములు చేశాడు. అలా తయారయిన రెండవ భాగముల ప్రకృతిని చరప్రకృతియని, మొదటి భాగములను అచర ప్రకృతియని పేరు పెట్టడమైనది. దానిని క్రింద కొంత అర్థమగుటకు చిత్ర పట రూపములో చూస్తే బాగుంటుంది.
ప్రకృతిని తయారు చేసిన దేవుడు కనిపించని వాడు. ప్రకృతిని తయారు చేయకముందు దేవునికి ఏ రూపము ఉండేదో మనకు తెలియదు గానీ సృష్ఠిని తయారు చేసిన తర్వాత దేవునికి రూపము లేదు. ఆయన ప్రకృతి వెనుక ఉండిపోవుట వలన దేవుని రూపము ఎవరికీ తెలియదు. అట్లే ఆయన ఎవరికీ తెలియనివాడై పోయాడు. ప్రకృతిని సృష్ఠించిన తర్వాత తాను మూడు భాగములుగా తయారైనాడు. మూడు భాగములను క్రింద చూస్తాము.
ఈ మూడు ఆత్మలే ఆధ్యాత్మికమునకు మూల సూత్రములు. ఈ సూత్రములతోనే జ్ఞానము అనే లెక్కలు చేయవచ్చును.
ఒక ప్రక్కనుండి పరమాత్మ, ఆత్మ, జీవాత్మల వరుసయుండగా! మరియొక్క ప్రక్కనుండి జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అను వరుసలో యున్న మూడు ఆత్మలు, ముందు పుట్టిన ప్రకృతికి వెనుక ప్రక్కయుండుట వలన ఈ మూడు ఆత్మలు ఎవరికీ కనిపించకయున్నవి. అందరికీ ముందుయున్న ప్రకృతియే కనిపించుచున్నది. మొదట తయారయిన ప్రకృతి ఐదు భాగములుగా తయారయినది. మొదట తయారయిన ప్రకృతి ఐదు భాగములుగా తయారయిన తర్వాత ప్రతి భాగము మరియు రెండు భాగములుగా విభజింపబడినది. దానిని తర్వాత పేజీలలో దృశ్యరూపముగా చూస్తాము.
ఈ విధముగా ప్రకృతి పంచభూతములుగా చీలిపోయి అందులో అచర, చర ప్రకృతియని భాగములుగా చీలిపోయి, అచర ప్రకృతిలోని
అర్ధ ఐదు భాగములు సకల జీవులు నివశించుటకు ఉపాధిగానుండుటకు శరీరములుగా తయారయినది. అచర ప్రకృతినుండి తయారయిన శరీరములోనే ప్రతి మనిషి ఉంటున్నాడు. శరీరములు కాకుండావున్న సగము అచర ప్రకృతి బయట ప్రపంచముగా కనిపించుచున్నది. బయట కనిపించు ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అనునవే ఒక దానితో ఒకటి కలిసి శరీరములుగా తయారయినవి. ప్రకృతిని తయారు చేసిన వాడు అల్లాహ్ (దేవుడు). అందువలన ప్రకృతికి అధిపతి ఆయనే, యజమాని, దేవుడు అన్నీ ఆయనే.
అచర ప్రకృతి బయట ప్రపంచముగా ఉండిపోగా, చర ప్రకృతి శరీరములుగా ఉంటూ మార్పు చెందుచూ శరీరములో యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము, మరణము వచ్చునట్లు చేయుచున్నది. అల్లాహ్ (దేవుడు) బయట ప్రపంచము ఆకాశము మొదలుకొని భూమిని మధ్యలో గల గాలి, అగ్ని, నీరు అను మూడును సృష్ఠించిన సృష్ఠికర్త. అలాగే లోపలి ప్రపంచము ఆకాశములు మొదలుకొని భూమి మరియు మధ్యలో గల సమస్తమును సృష్ఠించాడు. దేవుడు ఇట్లు రెండు రకముల సృష్ఠిని తయారు చేశాడు. బయట ప్రపంచములో ఆకాశమునకు భూమికి మధ్యలో గాలి, అగ్ని, నీరు అను మూడు తప్ప మిగతావి ఏవీ లేవు. అదే చర ప్రకృతి అయిన శరీరములో ఏడు ఆకాశములు పై నుండి ఒకదాని తర్వాత మరొకటియుండగా! పై ఆకాశమునుండి క్రింది పాదముల వద్దనున్న భూమి వరకు గల సమస్తమును అల్లాహ్‍యే (దేవుడే) సృష్ఠించాడు. శరీరములో ఆకాశము అనబడు తల నుండి భూమి అనబడు పాదముల వరకు మొత్తము 24 భాగములు గలవు. అవికాక వాటికి అనుబంధముగా యున్న రక్తము, మాంసము, ఎముకలు, నరములు మొదలగునవి ఎన్నో గలవు. అందువలన గ్రంథములో ఒకచోట ఒక వాక్యమునందు ''ఆకాశములు భూమి వాటి మధ్యలో యుండు సమస్తమును అల్లాహ్ సృష్ఠించాడు'' అని వ్రాసియున్నారు.
దేవుడు సృష్ఠ్యాదిలో శరీరము బయటి ప్రపంచము మరియు శరీరము లోపలి ప్రపంచము అని రెండు ప్రపంచములను సృష్ఠించాడు. వాటినే అచర ప్రకృతి, చర ప్రకృతియని రెండు విధముల పిలిచారు. వాటినే మార్పు చెందే ప్రకృతి, మార్పు చెందని ప్రకృతియని పిలిచారు. ఇంకా నాశనమయ్యే ప్రకృతి, నాశనము కాని ప్రకృతియని కూడా పిలిచారు. నాశనమును ''సఫా'' యనీ, నాశనములేని దానిని ''మర్‍వా'' యని ఆనాడు అన్నారు. సఫా చేస్తాను అంటే చంపుతాను, నాశనము చేస్తానని అర్థము. అందువలన మార్పు చెందేది అంటే నాశనమయ్యేదియను అర్థముతో సఫా అని చెప్పడమైనది. దేవుడు తయారు చేసిన రెండు ప్రకృతులకు సఫా, మర్‍వాలని పేరు పెట్టడమైనది. నేడు సఫా, మర్‍వాలు అనగా రెండు కొండలుగా గుర్తించుకొన్నారు. విశేషమైన అర్థముతో కూడుకొన్న రెండు కొండలు దేవుని సృష్ఠిలోని రెండు ప్రకృతులకు గుర్తుగా పెద్దలు చూపించారు. 'సఫా' అనగా నాశనమయ్యే ప్రకృతికి గుర్తుగా చూపినది. 'మర్‍వా' అనగా నాశనము కాని ప్రకృతికి గుర్తుగా చూపినది. సఫా, మర్‍వాలు చూస్తే దేవుని సృష్ఠిలోని రెండు ప్రకృతులు గుర్తుకు రావలెనను ఉద్దేశ్యముతో ఆ రోజు పెద్దలు రెండు కొండలను చూపారు.
అల్లాహ్ (దేవుడు) రెండు ప్రకృతులను తయారుచేసి తాను ఊరక ఉండిపోయాడు. సృష్ఠిని చేసిన తర్వాత దేవుడు పని చేయకుండా విశ్రాంతి తీసుకొన్నాడు. అందువలన ఆయన అప్పటినుండి క్రియా రహితుడయినాడు. ఈ విషయమును చెప్పుచూ ఆరు రోజుల సృష్ఠి తర్వాత ఏడవ రోజు, ఏడవ ఆకాశములోని తన సింహాసనమున ఆసీనుడయ్యాడు. అప్పటినుండి ఆయన పని చేయలేదు. జరుగవలసిన దానిని ఆయన చేయడు. ఆయన 'అయిపో' అంటే అదే అయిపోతుంది. అనగా తన పాలకుల ద్వారా చేయబడుతుంది. ఈ విషయమై అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో ఈ విధముగా చెప్పారు. సూరా ఏడు, ఆయత్ 54లో ఒకమారు చూడండి.
(7-54) ''సంశయము లేకుండా దేవుడే మీరాజు. ఆయన ఆకాశములను భూమిని ఆరు రోజులలో సృష్ఠించాడు. ఆ తర్వాత సింహాసనముపైన ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దానిని వేగముగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధముగా సృష్ఠించాడు. వినండి! సృష్ఠి ప్రక్రియ ఆయన స్వంతము. ఆజ్ఞ ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన దేవుడు అపారమైన శుభాలు కలవాడు.''
(10-3) ''నిశ్చయముగా మీరాజు దేవుడే. ఆయన ఆకాశములను, భూమిని ఆరు రోజులలో సృష్ఠించాడు. తర్వాత సింహాసనాన్ని (అర్ష్ను) అధిష్ఠించాడు. ఆయన సమస్త వ్యవహారాలను నిర్వ హిస్తున్నాడు. ఆయన అనుమతి లేకుండా (ఆయన సమక్షములో) సిఫారసు చేయగలవాడు ఎవడూ లేడు. అటువంటి అల్లాహ్‍యే దేవుడు, కాబట్టి మీరు ఆయననే ఆరాధించండి. ఇంత చెప్పినా మీరు గుణపాఠము గ్రహించరా?''
(50-37) ''హృదయాన్ని కలిగియుండి, శ్రద్ధను కల్గియుండి ఆలకించండి. సావధానముగా మసలుకొనే ప్రతి వ్యక్తికీ ఇందులో హితోపదేశము కలదు.''
(50-38) ''నిశ్చయముగా భూమి, ఆకాశములను వాటి మధ్యనున్న అన్నిటినీ ఆరు దినములలో సృష్ఠించాము. మరి మాకు అలసట ఏమాత్రము రాలేదు.''
దేవుడు తన సృష్ఠిని లోపల ప్రకృతి, బయట ప్రకృతియని రెండు రకముల తయారుచేసి బయట ప్రకృతిని మార్పు చెందని అచర ప్రకృతిగా, లోపల ప్రకృతిని మార్పు చెందే చర ప్రకృతిగా నియమించాడు. సృష్ఠిని తయారు చేసిన తర్వాత దేవుడు తాను ఏమీ చేయని క్రియారహితుడుగా ఉండిపోయాడు. అయితే తాను సృష్ఠించిన రెండు ప్రకృతులలో కార్యములు జరుగుటకు అవసరమైన యంత్రాంగమును అమర్చాడు. అందువలన దేవున్ని గొప్ప వివేకవంతుడు అని చెప్పవచ్చును. ఆయన నిర్మించిన పాలనను అర్థము చేసుకోవడమే నిజమైన జ్ఞానము. దేవుని పాలన అర్థము కాకపోతే దేవునికి సంబంధించిన జ్ఞానము అర్థము కాలేదనియే చెప్పవచ్చును. దేవుడు రెండు రకముల సృష్ఠిని తయారు చేసి, బయట పాలనను తన ప్రకృతి పాలించునట్లు ఏర్పాటు చేసి ప్రకృతి వెనుక ఎవరికీ తెలియకుండా తానుండి తన ప్రకృతికి సూచనలిస్తూ, ప్రకృతిలోని పాలకులకు ప్రకృతి సూచనలిచ్చునట్లు చేసి బయట పాలన సాగించెను. ఇక లోపలి పాలన విషయములోనికి వస్తే, తననుండి విడదీసిన ఆత్మను తనవలె దేవున్ని చేసి శరీరము లోపలి పాలన సాగునట్లు చేసెను. తననుండి విడదీసిన జీవున్ని శరీరములో నివశించునట్లు చేసి కర్మ విధానము చేత ఆత్మ జీవున్ని శరీరములో పాలించునట్లు చేశాడు.
రెండు ప్రకృతులయందు ఇద్దరు దేవుళ్లు అని చెప్పవచ్చును. బయట ప్రపంచములో సృష్ఠిని సృష్ఠించిన దేవుడు క్రియారహితుడై ఎవరికీ తెలియని వాడై ఉండిపోగా, కనిపించు ప్రకృతి తన పాలకుల చేత ప్రపంచమును పాలించుచున్నది. అవసరమైనప్పుడు మాత్రమే ప్రకృతికి పరమాత్మ సూచనలు మాత్రము చేయుచున్నది. అదియూ మనుషులకు తెలియదు. ప్రకృతికి దేవుడు ఎప్పుడు ఏమి సూచనలిచ్చునో ఎవరికీ తెలియదు. అందరికీ తెలియునట్లు ప్రకృతియే తన పాలకుల చేత ప్రపంచమును నడుపు చున్నది. లోపలి ప్రపంచమయిన శరీరములో దేవుడై కర్మరీత్యా జీవున్ని పాలించువాడు ఆత్మే. దేవుడు తన ఆత్మనే శరీరములో దేవునిగా నియమించి జీవులైనవారందరూ అనగా మనుషులైన వారందరూ ఆత్మ చేత పాలించ బడువారిగా చేశాడు. పరిపాలననుబట్టి లోపలి దేవుడు, బయటి దేవుడు అని చెప్పవలసి వచ్చినది. ఇద్దరు దేవుళ్లున్నారని చెప్పుటకు మూడు దైవ గ్రంథములలో ఎన్నో ఆధారములు గలవు. ఈ విధానము మీకు బాగా అర్థమగుటకు ''దేవుని ముద్ర'' అను గ్రంథమును చదువవచ్చును. దేవుడు తన సృష్ఠిని రెండుగా విభజించి తాను కూడా రెండుగా తయారై మనుషులందరూ ఆరాధించుటకు ఒకే దేవుడు అర్హుడని, ఆయనే శరీరము లో గల దేవుడని చెప్పియున్నాడు. ఈ విషయమును అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో సూరా మూడు ఆయత్ 18 యందు ఇలా చెప్పియున్నాడు చూడండి.
(3-18) ''అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యదైవము లేడని స్వయముగా అల్లాహ్, ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులూ సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వము, సమతూకముతో ఈ విశ్వాన్ని నిలిపి యుంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు.''
ఈ వాక్యమునుబట్టి నిజముగా సృష్ఠికర్త అయిన దేవుడే మనుషులందరూ ఆరాధించవలసిన దేవుడు ఈయనేయని మరొక దేవున్ని చూపించినట్లు పై వాక్యములో కలదు. అక్కడ చెప్పినవాడు బయటి దేవుడే కాగా, సూచించబడిన దేవుడు శరీరములోనున్న దేవుడు. శరీరములో ఆత్మనే దేవునిగా పరమాత్మ నిర్ణయము చేశాడు. జీవరాసులందరూ శరీరములలోనే నివశించుట వలన శరీరములోయున్న ఆత్మ దేవున్నే ఆరాధ్య దైవముగా ఉండునట్లు స్వయముగా సృష్ఠికర్తయైన దేవుడే వాక్యములో చెప్పియున్నాడు. ఈ విధముగా సృష్ఠిలో బయట దేవుడు, లోపల దేవుడు అని ఇద్దరు దేవుళ్ళుండగా అందరూ ఆరాధించవలసిన దేవుడు శరీరము లోపలి దేవున్నేయని నిర్ధారణ చేయబడినది. దేవుని నిర్ధారణ ప్రకారము మనుషులకు ఇద్దరు దేవుళ్లుకాగా, అందులో శరీరము లోపలి దేవున్నే ఆరాధించవలసిన దేవుడుగా స్వయానా దేవుడే నిర్ణయము చేశాడు.
దేవుని చట్టము ప్రకారము అనగా ధర్మముల ప్రకారము, దైవగ్రంథముల ఆధారముగా ఇద్దరు దేవుళ్ళు, రెండు ప్రకృతులు గలవు. బయట ప్రకృతిని బయట దేవున్ని తెలియునట్లు జ్ఞానము చేత దేవుని గుర్తును తయారు చేశాము. అలాగే లోపలి దేవున్ని లోపలి ప్రకృతిని గుర్తించునట్లు జ్ఞానము చేత దేవుని గుర్తును తయారు చేశాము. లోపలి దేవునికి సంబంధించిన గుర్తును దేవుని చిహ్నము అనియూ, బయటి దేవునికి సంబంధించిన గుర్తును దేవుని ముద్రయని చెప్పుచున్నాము. రెండు రకముల దేవుళ్ళకు రెండు రకముల గుర్తులను కొంత జ్ఞానము చేత చిత్రపటములుగా నేడు మేము గుర్తించగా, గతములో అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో లోపలి దేవుని గుర్తును దేవుని చిహ్నము అను పేరుతో వ్రాసిన మూడు ఆయత్‍లను చూచాము. అలాగే దేవుని ముద్ర అను పేరుతో వ్రాసిన వాక్యము ద్వితీయ దైవ గ్రంథములో ప్రకటన గ్రంథమందు తొమ్మిదవ అధ్యాయమున నాల్గవ వాక్యములో గలదు. అక్కడ దేవుని ముద్రను గురించి వ్రాయబడి యున్నది. అయితే రెండు చోట్ల దేవుని గుర్తు యొక్క చిత్రమును గురించి చెప్పియుండలేదు. అయినా భగవద్గీతలో పరోక్షముగా చెప్పిన జ్ఞానమును బట్టి దేవుని గుర్తును చిత్రపటముగా మేము ఇప్పటికి 38 సంవత్సరముల క్రిందటే గుర్తించాము. అదే చిత్రపటమే దేవుని చిహ్నముగా, దేవుని ముద్రగా రెండు రకములు కలదని తెలియుచున్నది. దేవుని జ్ఞానము ప్రకారమే కనిపెట్టబడినది దేవుని గుర్తు. దేవుని గుర్తునే దేవుని చిహ్నము అని ఒక గ్రంథములో, దేవుని ముద్రయని ఒక గ్రంథములో మేము విడమరచి చెప్పాము.
దేవుని చిహ్నమును చిత్రపటముగా గీచి చూచిన దాని చిత్రపటము క్రింది విధముగా గలదు చూడండి.
శరీరము లోపల గల దేవుడు, దేవుని యంత్రాంగము, దేవుని పాలనను గురించి చూడగలిగితే శరీరములో దేవుడు, కర్మ, కాలము, గుణములు అన్నీ తెలియును. ఆత్మే దేవుడైయుండి జీవాత్మను కర్మప్రకారము పాలించుచున్నది. శరీరము లోపల నియమింపబడిన దేవుడుగా ఆత్మయుండి కర్మను అనుసరించి ఎప్పుడు ఏ సమయములో జీవుడు అనుభవించాలో దానిని అనుభవింపజేయుటకు గుణములను ఉపయోగించి కర్మేంద్రియముల ద్వారా పనిని చేసి జీవున్ని ఆత్మే అనుభవింపజేయు కార్యకర్తగాయున్నది. శరీరములో యున్న మనుషులందరికి శరీరములోని ఆత్మే దేవుడని పరమాత్మ తేల్చి చెప్పినది. ఆరాధ్యదైవము వేరేవాడు ఎవడూ లేడని, అందరికీ ఆరాధ్యదైవము ఈయన ఒక్కడేయని ఆత్మను పరమాత్మయిన దేవుడు నిర్ణయించి చెప్పినట్లు (3-18) వాక్యములో గలదు. సృష్ఠికర్తయైన దేవుడు సృష్ఠి తర్వాత తాను ఏమీ చేయనివాడై ఉండిపోయి భూమిమీద మనుషులందరికీ తన ఆత్మనే దేవునిగా నియమించి పోయాడు. ఈ విషయము మూడు దైవగ్రంథములలో వివరముగా యున్నా మనుషులు దానిని గ్రహించలేకపోయారు. అందువలన ఇప్పుడు మేము చెప్పు విషయము అందరికీ క్రొత్తగా మరియు వింతగా కనిపించును. మీకు ఎట్లు కనిపించినా నేను చెప్పినది పూర్తి సత్యము.
ఇంతకుముందు దేవుని చిహ్నము యొక్క చిత్రపటమును చూచారు. ఇప్పుడు అదే చిత్రపటమును చూపి దానినే దేవుని ముద్రగా చెప్పుచున్నాము తర్వాత పేజీలో చూడండి.
ఇది దేవుని ముద్ర అని పిలువబడినా ఆకారములో దేవుని చిహ్నము, దేవుని ముద్ర రెండూ ఒకటిగానే యుండును. పేర్లు రెండు అయినా, దేవుడు ఒక్కడే అయినందున దేవునికి సంబంధించిన గుర్తు ఒక్కటేయున్నది. అయితే వివరము రెండు రకములు గలదు. ఒకే దేవుడే సృష్ఠి పూర్వమున్నాడు, సృష్ఠి తర్వాతయున్నాడు. సృష్ఠి పూర్వమున్న దేవుడు సృష్ఠి బయట ఎలా మూడు ఆత్మలుగా చీలిపోయాడో, అట్లే మొదట తన నుండి ప్రకృతిని విడదీసి శరీరములు తయారు చేశాడో, ఆ నాలుగు
భాగములను చూపుచూ దేవుని ముద్రను తయారు చేయడమైనది. అందువలన దేవుని ముద్రలో ప్రకృతి, పరమాత్మ, ఆత్మ, జీవాత్మ నలుగురే చూపబడియుందురు. ఈ నలుగురిలో ముగ్గురిని మాత్రమే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయని క్రైస్థవులు చెప్పుకోవడము జరుగుచున్నది. తండ్రి అనగా ఆత్మ, కుమారుడు అనగా జీవాత్మ, పరిశుద్ధాత్మ అనగా పరమాత్మయని అర్థము. వారు మొదట తయారయిన ప్రకృతిని వదలివేశారు. ప్రకృతిని గుర్తించుకోలేదు. మిగతా ముగ్గురిని కూడా వరుస క్రమము లేకుండా చెప్పుకొన్నారు. ముందు పరిశుద్ధాత్మ చెప్పవలసి యుండగా ముందు ఆత్మను తండ్రియని చెప్పి చివరిలో పరిశుద్ధాత్మను చెప్పారు. జ్ఞానరీత్యా చెప్పితే 'ప్రకృతి, పరిశుద్ధాత్మ, తండ్రి, కుమారుడు' అని అనాలి.
దేవుని ముద్ర బయట ప్రపంచములోని నాలుగు భాగములను చూపుచున్నది. అట్లే పరమాత్మకు గుర్తుగా దేవుని ముద్ర గలదు. దేవుని చిహ్నము శరీరము లోపలగల ఆత్మ విధానమునకు, కాలమునకు, కర్మమునకు, గుణములకు గుర్తుగా ఉండిపోయినది. ఇట్లు ఒకే గుర్తు రెండు పేర్లతో పిలువబడుచూ లోపలి దేవునికి, బయటి దేవునికి ప్రతీకగా యున్నది. లోపలి, బయటి రెండు విధానములు ఒకటి మార్పుతో కూడుకొన్నది, మరొకటి మార్పు లేని ప్రకృతితో యున్నది. మార్పుగల ప్రకృతియున్న గుర్తును 'చిహ్నము' అని అంటున్నాము. మార్పులేని ప్రకృతిగల దానిని 'ముద్ర'యని అంటున్నాము. దేవుని గుర్తులలో రెండిటిలోనూ ప్రకృతి యుండుట వలన మార్పు చెందే ప్రకృతితో తయారయిన శరీరము మరణించుచున్నది. ''చర'' అను మార్పు చెందు ప్రకృతిలో జనన మరణములు రెండూ కనిపించుచున్నవి. అందువలన మార్పు చెందే ప్రకృతి నాశనమగుచున్నది. తిరిగి ఉత్పత్తియగుచున్నది. అందువలన దానిని నాశనము చేయునదని చెప్పవచ్చును. దానినే సఫా అని అరబ్బీ భాషలో చెప్పడమైనది. మార్పుచెందని ప్రకృతికి మర్‍వా యని పేరు పెట్టుకొన్నారు. అరబ్బీ భాషలోగల రెండు పేర్లను రెండు కొండలకు ఉంచి ఆ రెండు కొండలను దేవుని చిహ్నములుగా చెప్పుకొంటున్నారు. దాని వెనుకయున్న వివరము తెలియదుగానీ, దేవుని చిహ్నములు సఫా, మర్‍వాలను రెండు కొండలుగా యున్నవని ముస్లీమ్‍లు చెప్పుకోవడము జరుగుచున్నది. (2-158) వ ఆయత్‍లో సఫా, మర్‍వాలను పర్వతముల పేర్లు చెప్పి దేవుని చిహ్నములన్నారు. సఫా అనగా నాశనమునకు గుర్తుగా చెప్పవచ్చును. కావున మార్పుచెందే చర ప్రకృతికి 'సఫా' అను పేరు చెప్పబడినదని అనుకోవచ్చును. అంతేగానీ అక్కడ భూమిమీద గల కొండలను అల్లాహ్ చిహ్నములు అనుకోవడము పొరపాటు. దేవుని చిహ్నము వెనుక యున్న జ్ఞానము తెలిస్తే రెండు కొండలు 'దేవుని ముద్రకు, దేవుని చిహ్నము'నకు గుర్తులని తలచవలెను. అంతతప్ప జ్ఞానమును తెలియకుండా బయట పర్వతములను చుట్టివచ్చినా ప్రయోజనముండదు. అందువలన ప్రతి మనిషి తాను ఆరాధించవలసిన దేవుడు ఒక్కడేయని తెలిసి, ఆయన వెనుక చిహ్నము, ముద్ర రూపములో యున్న జ్ఞానమును తెలియగలిగితే దేవున్ని చేరుమార్గము లభించును. దేవుని జ్ఞానమును తెలియకుండా ప్రార్థన చేసినా ప్రయోజనముండదు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
17. సృష్ఠి పాలన జరుగు విధానము. (2-164)
''దేవుడు సమస్తమును సృష్ఠించెను'' అని విన్నాము, చదివాము. ఈ మధ్య కాలములో దేవుడు ఒక్కడేయని అందరికంటే గట్టిగా చెప్పే మస్లీమ్‍లు మా గ్రంథమని చెప్పుకొను అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్‍లో సృష్ఠి తర్వాత పని చేయని దేవుడు, సృష్ఠి తర్వాత పని చేసే దేవుడు అని రెండు ఆయత్‍లలో (వాక్యములలో) ఉండడము చూచాము. సూరా రెండు ఆయత్ 117లో ఇలా చెప్పారు చూడండి.
(2-117) ''భూమి ఆకాశమును ప్రప్రథమముగా సృష్ఠించినవాడు ఆయనే (దేవుడే). ఆయన ఏ పనియైనా చేయ సంకల్పించు కొన్నప్పుడు దాన్ని 'అయిపో' అంటే చాలు అది అయిపోతుంది.''
'దేవుడు పని చేయడు' అను ఈ వాక్యమే కాకుండా 'దేవుడు పని చేయుచున్నాడు' అని సూరా రెండు ఆయత్ 255లో ఇలా చెప్పారు చూడండి.
(2-255) ''అల్లాహ్ మాత్రమే నిజమైన ఆరాధ్య దైవము. ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు, అన్నిటికీ మూలాధారము, ఆయనకు కునుకుగానీ, నిద్రగానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనములో ఉన్నది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షములో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానిని, వారికి వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును. ఆయన కోరుకొన్నది తప్ప ఆయనకున్న జ్ఞానములోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోనికి రాదు. ఆయన కుర్చీ వైశాల్యము భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు.''
(2-117) లో చెప్పబడిన వాడు సృష్ఠికర్త అయిన దేవుడు. ప్రప్రథమముగా భూమిని ఆకాశమును సృష్ఠించిన తర్వాత ఆయన అన్ని పనులు చేయుట మానివేసి ఊరక ఉండిపోయాడు. అవసరము వస్తే ఆయన ఏదీ చేయక కేవలము సంకల్పముతో ఆ పని అయిపోయేటట్లు చేసేవాడు. ఆయన సంకల్పించుకొంటే వెంటనే దానిని చేయు తన పాలకులను ఆయన ముందే నియమించి పెట్టుకొన్నాడు. ఈ విధముగా మొదట భూమిని ఆకాశమును సృష్ఠించిన దేవుడు తర్వాత ఎప్పుడూ ఆయన పనిని చేయలేదు. అందువలన ఆయనను పనిని చేయని దేవునిగా చెప్పాము.
విశ్వములో బయట పనులను చేయుటకు తన పాలకులను నియమించి, శరీరము లోపలి కార్యములను చేయుటకు ఆత్మను నియమించి ఆత్మను తనంతటి వానిగా తన అధికారములన్నీ ఇచ్చి శరీరములో దేవునిగా నియమించి శరీరములో నివసించు జీవునికి దేవునిగా ఉండునట్లు, ఆయననే జీవులందరూ ఆరాధించునట్లు నియమించి పెట్టాడు. అంతే కాకుండా జీవులనందరినీ ప్రకృతి చేత చావు పుట్టుకలను పొందునట్లు చేసి, శరీరములోని కార్యములన్నీ ఆత్మే చేసేటట్లు కూడా నియమించినది. కర్మ ప్రకారము కర్మలను అనుభవింపజేయడము, కర్మ ప్రకారము పుట్టించడము కర్మ ప్రకారము పాలించడము, కర్మ ప్రకారము ఆడించడము ఆత్మకు అప్పజెప్పి ఆయనను పని చేసే దేవునిగా నియమించి, సృష్ఠి పూర్వమున్న దేవుడు సృష్ఠి తర్వాత దేవున్నే మనిషికి కార్యకర్తగా చేశాడు. శరీరములో యున్న దేవుడయిన ఆత్మనే అందరూ ఆరాధించు ఏకైక ఆరాధకుడుగా చేశాడు. దీనినిబట్టి భూమిమీద పని చేయని దేవుడు, పనిని చేయు దేవుడు అను ఇద్దరు దేవుళ్ళు తెలియుచున్నారు. పనిని చేయు దేవుడే అందరికీ ఆరాధ్య దైవము అని మొదటి దేవునిచే నిర్ణయింపబడినది. ఆరాధించబడు రెండవ దేవుడే మనిషికి (2-255) లో చెప్పినట్లు 'కార్యకర్తగా' యున్నాడు.
పనిని చేయని దేవుడు శరీరము బయట తన పాలకుల చేత తన సంకల్పము చేత కార్యములు చేయించుచున్నాడు. శరీరము లోపలి ఆరాధ్య దైవము తానే స్వయముగా అన్ని పనులు చేయుచున్నాడు. శరీరములో కార్యములను చేయు దేవుడు నిద్రపోకుండా పనిని చేయుచున్నాడనీ, జీవున్ని జీవింపజేయడములో ఆత్మయిన దేవుడు ఎప్పుడూ అలసిపోడని (2-255) లో చెప్పడము జరిగినది. ఇట్లు ఇద్దరు దేవుళ్ళలో ఒకరు లోపలి దేవుడు కాగా, బయటి దేవుడు సృష్ఠికర్తయైన దేవుడు. బయటి దేవుడు పనిని చేయడు. తన పాలకుల చేత తన సంకల్పముతో పని చేయించును. శరీరము లోపలి దేవుడు తానే శరీరమంతా పని చేయుచూ కార్యకర్తగా యుంటూ అందరూ ఆరాధించే దేవుడుగా కూడా యున్నాడు.
ఇప్పుడు అసలు విషయానికి వస్తే సూరా 2, ఆయత్ 164 లో శరీరము బయట పాలనను గురించి, లోపలి పాలనను గురించి వ్రాయడము జరిగినది. మొత్తము మనిషి పుట్టుకనుండి బయట జరుగు పనులను సహితము చేయు పాలకులను గురించి చెప్పడము జరిగినది. దీనిని మొత్తము సృష్ఠి పాలనయని చెప్పవచ్చును. ఇప్పుడు సూరా రెండు, ఆయత్ 164ను చూస్తాము.
(2-164) ''భూమి ఆకాశాల సృష్ఠిలో, రేయింబవళ్ళ నిరంతర మార్పులో, ప్రజలకు ఉపయోగ పడే వస్తువులను సముద్రములలో మోసుకపోవు ఓడలలో, ఆకాశం నుండి అల్లాహ్ కురిపించే వర్షపు నీటిలో, ఆ వర్షము నీటి ద్వారా నిర్జీవముగా పడియున్న భూమిని బ్రతికించడములో, అన్ని రకాల జంతువులను అందులో వశింపజేయడములో, వీచే పవనాల దిశలు మార్చటములో, భూమి ఆకాశాల మధ్య నియమ నిబంధనలకు కట్టుబడి మసలుకుంటున్న మేఘాలలో బుద్ధిగలవారికి ఎన్నో నిదర్శనములు కలవు.''
ఈ వాక్యములో ''బుద్ధి గ్రాహితశక్తియున్న వారికి ఎన్నో నిదర్శనములు గలవు'' అని చెప్పాడు. 'నిదర్శనము'లో ప్రత్యేకమయిన అర్థము గలదు. దర్శనము అనగా చూడడము అని చెప్పవచ్చును. నిదర్శనము అనగా 'దర్శనము లేనిది'యని చెప్పవచ్చును. అనగా కనిపించనిది యని అర్థము. ఎన్నో కనిపించని సత్యములు ఈ వాక్యములో యున్నట్లు తెలియుచున్నది. అందువలన నా బుద్ధి గ్రాహితమునకు వచ్చిన సత్యములన్నిటినీ తెలియజేతును చూడండి. భూమి ఆకాశముల సృష్ఠి అనగా ఇందులో రెండు రకముల అర్థము కలదు. బయటి ప్రపంచములో కనిపించు ఆకాశము భూమి అనునవి కలవు. అవి ఒక్కమారే సృష్ఠ్యాదిలో దేవుని చేత తయారు చేయబడినాయి. తర్వాత మాటిమాటికి సృష్ఠింపబడవు. మాటిమాటికి సృష్ఠింపబడునది శరీరము అను ప్రకృతి. శరీరము బయట భూమి ఆకాశములను అచర ప్రకృతియని అంటాము. శరీరము లోపలి ఆకాశము భూమిని చర ప్రకృతి అంటాము. శరీరములో కూడా ఆకాశము భూమి అని చెప్పబడినవి కలవు. శరీరము అంతా ప్రకృతే అయినా అందులో ఆకాశము భూమి అని చెప్పు గుర్తులు కలవు. తలను ఆకాశము అని అంటాము. భూమిని, కాళ్ళు అని గుర్తుగా చెప్పడము, మధ్య భాగము నంతటినీ భూమి, ఆకాశముల మధ్యలో గల సమస్తము అని అంటాము.
'భూమి ఆకాశములు వాటి మధ్యలో ఉండు సమస్తము' అని ఖుర్ఆన్ గ్రంథములో సూరా 32 ఆయత్ 4లో గలదు. ఈ వాక్యములో చెప్పినది శరీరమును గురించి అని చెప్పవచ్చును.
(32-4) ''అల్లాహ్‍యే ఆకాశాలను భూమిని వాటి మధ్యనున్న సమస్తమును ఆరు రోజులలో సృష్ఠించాడు. ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్టించాడు.''
అని యున్నది. ఈ వాక్యమును బాగా గమణించితే నిత్యము జరుగు పనులలో ఇదొక పనియని అర్థమగుచున్నది. నిత్యము జరుగునది కాక సృష్ఠి ఆదిలో ఒకమారే జరిగి తర్వాత జరుగదు. అదే బయటి భూమి ఆకాశమును తయారు చేయడము అని అర్థము చేసుకోవలెను. అంతేకాక బయటి ఆకాశము, భూమిని ఒకమారు తయారు చేసినవాడు సృష్ఠికర్తయైన పరమాత్మ అని చెప్పవచ్చును. శరీరము లోపలి ఆకాశములు, భూమిని తయారు చేయువాడు శరీరములో దేవుడుగా యున్న, అధిపతిగాయున్న ఆత్మయని తెలియవలెను. ఈ విధముగా బయటి సృష్ఠి, లోపలి సృష్ఠియని తెలియవలెను. లోపలి సృష్ఠిలో ఆకాశములు బహువచనములో ఉండును. బయటి సృష్ఠి అంటే ఆకాశము ఏకవచనములో ఉండును. లోపలి సృష్ఠిలో ఏడు ఆకాశములుండగా, బయటి సృష్ఠిలో ఒకే ఆకాశము ఉండును. ఒకే ఆకాశము, ఒకే భూమి ఉండు సృష్ఠిని ఒకమారే సృష్ఠికర్తయైన పరమాత్మ సృష్ఠించగా, ఏడు ఆకాశములు ఒక భూమి ఉండు శరీరములోని ప్రకృతిని నిత్యము ఎన్నిటినో శరీర రూపములలో ఆత్మ దేవుడు సృష్ఠించుచున్నాడు. బయటి ఆకాశమును, భూమిని మిగతా మూడు గాలి, నీరు, అగ్ని అను వాటిని తయారుచేసి తర్వాత రెండవమారు ఏ పని చేయక సృష్ఠికర్త అయిన పరమాత్మ ఊరక ఉండిపోయాడు. తర్వాత పరమాత్మ దేవునిగా నియమించిన ఆత్మ, తర్వాత ఆయన పాలకులు పని చేయుచుండగా విశ్వపాలన జరుగుచున్నది. విశ్వాధినేత మొదట సృష్ఠికర్తయిన పరమాత్మ యను దేవుడుకాగా, తర్వాత పనులు చేయు వారందరూ దేవుని చేత నియమింపబడిన పాలకులు అని అర్థము చేసుకోవలెను. అందులో మొదటి పాలకుడు ఆత్మయను దేవుడుకాగా, మిగతా పాలకులందరూ బయట ప్రపంచములో ఉందురు. ఆత్మయను దేవుడు శరీరములో ఉండి తన క్రింద పని చేయు 24 మంది పాలకులను పని చేయిస్తూ 25వ జీవున్ని నడుపుచున్నాడు. శరీరములో దేవుడైయున్న ఆత్మ జీవున్ని కష్టసుఖములలో నడుపుచున్నాడు. ''శరీరము ధరించిన ఏ మనిషికయినా, ఏ జీవరాసికయినా ఆత్మే ఆరాధింపదగిన దేవుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు ఎవడూ లేడు.'' ఈ విషయము మూడు దైవ గ్రంథములలో చెప్పబడియున్నా అంతిమ దైవ గ్రంథములో అనేకమార్లు చెప్పియున్నారు. అయితే ఆ విషయము ఏ మానవునికీ అర్థముకాక మొదటి సృష్ఠికర్తయైన పరమాత్మనే మేము ఆరాధించుచున్నామని అంటున్నారు. అయితే మొదటి సృష్ఠికర్త 'ఏ అక్కర లేనివాడనీ, ఏ ఆరాధన అవసరము లేనివాడని' ఆయనే స్వయముగా చెప్పినా తెలియకున్నారు. ఒకమారు అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో సూరా 112లో రెండవ ఆయత్నందు చెప్పినది గమనించండి. (112-2) ''ఆయన ఏ అక్కరా లేనివాడు.'' ఈ మాటను చూచిన తర్వాత కూడా మొదటి సృష్ఠికర్తయైన దేవున్ని ఆరాధించితే వాడు జ్ఞానము తెలియక, దేవుడు చెప్పిన మాట అర్థముకాక అలా చేయుచున్నాడని చెప్పవచ్చును. నేడు ముస్లీమ్ సమాజము ఒకే దేవున్ని ఆరాధించుచున్నది. అయితే దేవుడు చెప్పినమాట అర్థముకాక ఎవరిని ఆరాధించవలెనో వారిని ఆరాధించక, ఎవరిని ఆరాధించకూడదో వారిని ఆరాధించుచున్నారు.
సూరా మూడులో ఆయత్ 18లో దేవుడే స్వయముగా ఇంకొక దేవున్ని చూపి 'ఈయనే మీకు ఆరాధ్య దైవము, ఈయన తప్ప వేరే దేవున్ని మీరు ఆరాధించవలసిన అవసరము లేదు' అని చెప్పియున్నా దానిని చూడకుండా ఖుర్ఆన్ గ్రంథములోని జ్ఞానమును అనుసరించకుండా కొందరు ముస్లీమ్‍లు ప్రవర్తించుచున్నారు. దేవుని విషయములో ఎవరిని ఆరాధించాలో వారికి సక్రమముగా తెలియకుండా పోయినది. ఒక్క దేవున్ని ఆరాధించుచున్నా ఆ ఒక్క దేవుడు సృష్ఠి పూర్వమున్నవాడా? సృష్ఠి తర్వాత యున్నవాడాయని స్పష్టముగా తెలియలేకున్నారు. ఒకమారు ఈ వాక్యమును చూడండి.
(3-18) ''అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యదైవము లేడని స్వయముగా అల్లాహ్, ఆయన దూతలు, జ్ఞానసంపన్నులూ సాక్ష్యమిచ్చు చున్నారు. ఆయన సమత్వము, సమతూకముతో ఈ విశ్వాన్ని నిలిపియుంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశాలి అయిన ఆయన తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారు.''
ఈ ఆయత్ (వాక్యమును) చూచిన తర్వాత అయినా స్వయముగా అల్లాహ్ ఎవరిని ఆరాధించమని సిఫారసు చేయుచున్నాడని యోచించ లేకపోయారు. అట్లే (112-2) వ వాక్యములో ''ఏ అక్కర లేనివాడు దేవుడు'' అని చెప్పినప్పుడయినా మన ఆరాధన సృష్ఠ్యాదిలోని దేవునికి అవసరము లేదు కదా!యని ఆలోచించలేకపోయారు. ఎవరో ఏదో చెప్పితే దానిని విని ముందుకు పోతున్నారు తప్ప స్వయముగా ఖుర్ఆన్ గ్రంథములో ఏమి వ్రాశారని చూడకున్నారు. అందువలన మనము చేయు ఆరాధన ఎవరికి చేరవలెనో వారికి చేరడము లేదు. ఇది ఒక మతమునకు ఉన్న సమస్య కాదు. అన్ని మతములలో ఉన్న సమస్యేయని తెలియవలెను. హిందువులయితే ఏకముగా ఒక దేవుని ఆరాధనయనునది లేక బహు దేవతారాధన చేయుచున్నారు. అందరూ తెలియవలసినదేమనగా! ఒకే దేవున్ని ఆరాధించవలెను, అయితే ఆ ఒక్క దేవుడు ఎవరో తెలిసి ఆరాధించండి. ఇదంతా ఎందుకు చెప్పుచున్నామనగా! (2-164) ఆయత్ అర్థము కావాలంటే ఇదంతా తెలిసియుండాలి. ఈ విధానమంతా తెలిసి యుంటే 164వ వాక్యములో చెప్పిన విషయము సులభముగా అర్థము కాగలదు. ఒక మనిషి ఎలా పుట్టుచున్నాడు? ఎవరి చేత పుట్టుచున్నాడు? రేయింబగళ్ళు ఎలా మారుచున్నవి? అన్నియూ తెలియును. నాకు తెలిసినంత వరకు ఈ వాక్యమును రెండు విధముల భాగించి చూడవలసియున్నది. అలా చూడగలిగితే శరీరమును తయారు చేయు పనిని ఎవరు చేస్తున్నారో, ఆయనను మొదటి భాగములో తెలియవలెను. తర్వాత రెండవ భాగములో శరీరము బయట జరిగే పనులు ఎవరు చేయుచున్నారో తెలియవచ్చును.
2-164 వాక్యము ఎనిమిది (8) భాగములుగా యున్నది. అందులో మొదటిది భూమి ఆకాశముల సృష్ఠియని వ్రాయబడియున్నది. మిగతా ఏడు శరీరము బయట అందరికీ తెలియునట్లు జరుగుచున్నది. మిగతా ఏడు విషయములకంటే ముఖ్యమైనది మరియు ఎవరికీ సరిగా అర్థము కానిది మొదట చెప్పిన భూమి ఆకాశముల సృష్ఠియని చెప్పవచ్చును. ఆకాశములు శరీరము లోపలయున్నవి. ఆకాశము ఒక్కటి అయితే శరీరము బయట గలదు. వాక్యములో చెప్పినది ఆకాశములు అయినందున ఇది శరీరములోని విషయమని తెలియుచున్నది. శరీరముల సృష్ఠి తల్లి శరీరములో జరుగుచున్నది. తల్లి శరీరములోగానీ, తండ్రి శరీరములోగానీ ఆత్మే దేవునిగా యుంటూ శరీర కార్యములన్నిటినీ చేయుచున్నది. ఆత్మ కార్యములలో మనిషి శరీరమునకు బీజదాత కార్యము ఒకటికాగా, తర్వాత శిశు శరీరమును పూర్తిగా తొమ్మిది నెలలు శరీరములోనే పెంచి తర్వాత ప్రసవింపజేయుచున్నది. బయటపడిన శరీరములోనికి ఎక్కడో చనిపోయిన జీవున్ని తెచ్చి శిశు శరీరములో వేయుచున్నది. శిశు శరీరములోనికి జీవున్ని చేర్చి అక్కడ నుండి శిశు శరీరములో శిశువు పెరుగుటకు, బ్రతుకుటకు సంబంధించిన కార్యములను చేయుచున్నది. మనుషులను శరీరములో అధికారిగా, అధిపతిగా, దేవునిగాయున్న ఆత్మ కార్యకర్తగా పని చేసి మనిషిని సృష్ఠించుచున్నది. ఆత్మ పుట్టబోయేవాని తల్లి శరీరము లోను, తండ్రి శరీరములోను పని చేసి సృష్ఠి కార్యమును జయప్రదముగా చేయుచున్నది. భూమిమీద మనుషులే కాదు ఏ జీవరాసి పుట్టవలెనన్నా ఆత్మయే సృష్ఠించవలసి యున్నది. 2-164 వాక్యములో చెప్పినట్లు మొత్తము దేవుని పరిపాలన ఎనిమిది రకములను చెప్పియుండగా అందులో మొదటిది శరీరముల సృష్ఠియని చెప్పారు. దానినే జ్ఞానరీత్యా భూమి ఆకాశముల సృష్ఠియని చెప్పారు. ఈ సృష్ఠి కార్యములో ఆత్మ మూడు శరీరములలో ఉండి ఉమ్మడిగా పని చేయుచున్నది. ఒకటి పుట్టబోయే వాని తండ్రి శరీరములో బీజముగా బీజదాతగా, రెండు తల్లి శరీరములో శిశువును పెంచుటలో, మూడు చనిపోయిన శరీరములోని జీవున్ని తీసుకొని క్రొత్త శిశు శరీరములో తెచ్చివేయడము అను కార్యములు చేయడము వలన భూమి ఆకాశముల సృష్ఠి అని మొదటి కార్యమును చెప్పారు.
మనకు తెలిసిన జ్ఞానరీత్యా శరీరాంతర్గత జ్ఞానము ప్రకారము మనిషిని సృష్ఠించడములో నిదర్శనము కలదని వాక్యములో చెప్పారు. వాక్యములో ఎనిమిది కార్యములను చెప్పి ఇందులో బుద్ధిగలవారికి ఎంతో నిదర్శనమున్నది యని చెప్పారు. మొదటి కార్యము భూమి ఆకాశములను సృష్ఠించడము అనగా! ఒక సజీవమైన శరీరమును పుట్టించడమునకు సంబంధించిన మొత్తము కార్యమును అని అర్థము చేసుకొంటే, అది కనిపించకుండా ఎవరికీ తెలియకుండా జరుగుచున్న పనిగా చెప్పవచ్చును. ఇంతవరకు మనకు తెలిసి ఒక మనిషి (శిశువు) పుట్టుకకు కారణము కనిపించే తండ్రి, కనిపించే తల్లియని అనుకొన్నాము. అయితే అందులో కనిపించే తండ్రిపాత్రగానీ, తల్లిపాత్రగానీ లేదని ఎవరికీ తెలియదు. వారి పాత్ర లేదు అంటే, చెప్పిన వానిని విచిత్రముగా చూచువారు గలరు. ఇతరులు నమ్మినా నమ్మకపోయినా, వాస్తవముగా జరుగునది పైకి కనిపించునది ఏమాత్రము కాదు. మనకు కనిపించనిది జరుగుచున్నది. అందువలన బుద్ధిగల వారికి ఎంతో కనిపించని విషయము తెలియగలదని వాక్యము చివరిలో 'నిదర్శనములు కలవు' అని అన్నారు.
బుద్ధి గలవారికి ఎన్నో నిదర్శనములు జ్ఞానము ద్వారా తెలియు చున్నప్పుడు, బుద్ధిలేనివారికి కనిపించనిది తెలియదనేగా అర్థము. ఎట్లు చెప్పినా కొందరు కనిపించని విషయములలో కొంతయినా తెలుసుకొందా మని అనుకోక మొండిగా తమకు తెలిసినదే నమ్ముతామనీ, తమకు కనిపించనిది, అభౌతికమైన దానిని ఏమాత్రము నమ్మము అంటున్నారు. అభౌతికమును నమ్మనంత మాత్రమున తాము గొప్ప బుద్ధి గలవారైనట్లు కనిపించని అభౌతికమును గురించి చెప్పిన వారందరూ ప్రజలను మోసము చేసేవారిగా లెక్కించడము, ప్రచారము చేయడము జరుగుచున్నది. దైవ గ్రంథములో నిదర్శనము అనగా అభౌతికము అనేకదా! అర్థము. బుద్ధిగల వారికి నిదర్శనము కలదు అని అన్నప్పుడు, బుద్ధిలేనివారికి ఏమాత్రము జ్ఞానము లేనివారికి నిదర్శనము లేదనేగా, తెలియదనేగా అర్థము. బుద్ధి ఉన్నా, దానికి గ్రాహితశక్తి కావాలి. కొందరు మాకు బుద్ధి ఉంది, ఎన్నో రంగములలో మేము మేథావులము. మాకు బుద్ధి లేదా! అని కొందరు నాస్తికులు మాట్లాడడము జరుగుచున్నది. వారు కొన్ని విషయములలో మేథావులే. కనిపించే విషయములలో మాత్రము బుద్ధిగల వారే, కాదని మేము చెప్పలేదు. అయితే అభౌతిక విషయములలో మాత్రము వారి బుద్ధికి గ్రాహితశక్తి లేదు అని చెప్పుచున్నాను. బుద్ధి గ్రాహితశక్తి గలవారికే అభౌతికమైన (నిదర్శనమైన) విషయములు తెలియగలవు. శరీరములో అధిపతిగా ఆత్మయున్నది. ఆత్మే దేవుడుగా యున్నది. ఆత్మే శరీరములో సర్వ కార్యములను చేయు కార్యకర్తగా యున్నది. ఒకవైపు దేవునిగా, ఒకవైపు కార్యకర్తగా యున్న వానిని అర్థము చేసుకొనుటకు తప్పనిసరిగా మనిషికి ఉన్న బుద్ధికి ప్రత్యేకమైన గ్రాహితశక్తి అవసరము. అది లేనివారే మేము చెప్పే విషయమును అర్థము చేసుకోలేకపోవుచున్నారు. వారి బుద్ధికి చెప్పేవారందరూ మోసగాళ్లే యనునట్లు కనిపించుచుండును.
ప్రశ్న :- మేము విద్యావేత్తలము, మేథావులము అనువారికే ఆధ్యాత్మిక విషయము మీద గ్రాహితశక్తి తక్కువ యుండును. మేము చూచిన వారిలో విద్యావేత్తలు, మేథావులు, ధనికులు, పదవులలో హోదాగా యున్నవారు ఆధ్యాత్మిక విషయములను నమ్మరు. వారికి ఎందుకు అర్థము కావడము లేదు. వారిని చూచి పెద్ద తెలివైనవారే నమ్మనప్పుడు మనమెందుకు నమ్మాలి? అని కొందరు వారిని చూచి దైవజ్ఞానమును కొద్దిగయినా తెలియకుండా చెడిపోవుచున్నారు. ఎందుకు ఇట్లు జరుగు చున్నది? విద్యావేత్తలకు బుద్ధి బాగా ఉంటేనే కదా! వారు విద్యావేత్తలయి నది. వారికెందుకు అర్థము కాలేదు?
జవాబు :- వారు ప్రపంచ విద్యలో వేత్తలుగానీ, పరమాత్మ జ్ఞానములో ఉత్తదుత్తలే (ఉత్త కుండలే). దేవుడు కనిపించేవాడు కాడు. అంటే దేవున్ని ఎవరూ దర్శించలేరు. దేవుడు నిదర్శుడు. దేవుని జ్ఞానము కూడా సూక్ష్మముగానే ఉండును. స్థూలము అనగా కంటికి కనిపించునది, స్పర్శకు తెలియునది. సూక్ష్మము అనగా కంటికి కనిపించదు, చేతికి తాకితే తెలియదు. ప్రపంచ చదువులలో వేత్తలయిన వారు స్థూలమునే తెలియగలరు. ఇంద్రియములకు తెలియు విషయులే వారికి తెలియును. ఇంద్రియములకు తెలియని విషయములు తెలియవు. వారి బుద్ధికి వాటిని గ్రహించు శక్తి యుండదు. మనిషికి ఆధ్యాత్మిక విషయములన్నియూ సూక్ష్మమైనవై యున్నవి. ఆత్మ కనిపించదు. ఆత్మకు సంబంధించిన సాక్ష్యములు ఏవీ కనిపించవు. అప్పుడు జ్ఞాన విషయములన్నియూ వారికి అసత్యముగా కనిపించు చుండును. అందువలన వారు జ్ఞానమును చెప్పు వారిని మోసగాళ్ళలో కలిపివేస్తున్నారు.
అంతెందుకు జ్ఞానులలో కూడా అనగా అభౌతికమును నమ్మేవారిలో కూడా కొన్ని జ్ఞాన విషయముల ఎడల వారి బుద్ధి పని చేయలేదు. అప్పుడు వారు తప్పుదారిపట్టి, తప్పు జ్ఞానమును అర్థము చేసుకొంటున్నారు. దీనికంతటికీ కారణము దైవజ్ఞానము మీద ఎంత శ్రద్ధయుండునో అంత వేగముగా జ్ఞానము అర్థమగును. కొందరికి శ్రద్ధ తక్కువ యుండుట వలన వారికున్న శ్రద్ధ ప్రకారము సూక్ష్మ విషయముల మీద నమ్మకమున్నా అర్థమయ్యేది తక్కువ యుండును. శ్రద్ధ లేనివారికి పూర్తి గ్రాహిత శక్తి యుండదు. బయట ప్రపంచములో ఎంత మేథావులయినా, ఎంత బుద్ధి గలవారైనా ఆధ్యాత్మిక విషయములు కొద్దిగ కూడా అర్థము కావు. అందువలన ఆధ్యాత్మికము అంతా అబద్దము. ఆత్మ అనునది హేతుబద్దము కానిది, అసత్యమైనది అంటున్నారు.
ఆకాశములో సూర్యుడు ఉంటున్నాడు. ఎంతో దూరములో యున్న సూర్యుని వెలుగు భూమిమీద పడుచున్నది. సూర్యుని వెలుగు భూమిమీద సూర్యకిరణముల ద్వారా వస్తున్నది. పైన సూర్యుడు సత్యమే, క్రింద వెలుగు సత్యమే అయితే మధ్యలో సూర్యకిరణములు కనిపించడము లేదు. అట్లని సూర్యకిరణమును అసత్యమంటామా! అని విద్యావేత్తలను ప్రశ్నించితే కనిపించని కిరణములను నమ్ముతాము అంటున్నారు. పైన సూర్యుడు క్రింద వెలుగు ఉన్నది, కావున వెలుగును తీసుకవచ్చే కిరణములను నమ్ముతాము అనేవారు లోపల ఆత్మ, పనులు బయట జరుగుచున్నవి కదా! పనులు జరుగుటకు ఆధారమైన ఆత్మశక్తిని ఎందుకు నమ్మడము లేదు? అని అడిగితే సూర్యుడు కనిపించినట్లు ఆత్మ కనిపించడము లేదు అంటున్నారు. అట్లని కనిపించని ఆత్మను నమ్మనప్పుడు, కనిపించని మనస్సును ఎందుకు నమ్మాలి? అంటే దానికి సరియైన జవాబు లేదు. బుద్ధి కనిపించదు, మనస్సు కనిపించదు. కనిపించని వాటిని పట్టుకొని బుద్ధిగలవానిని మేథావి అని అంటున్నారు. అట్లే కొందరు కనిపించని మనస్సును ఆధారము చేసుకొని మనస్తత్వ డాక్టర్లు, మనస్తత్వ శాస్త్రము అని పేరు పెట్టి చెప్పుచున్నారు. కనిపించని మనస్సుకు శాస్త్రము అని పేరుపెట్టి చెప్పినప్పుడు కనిపించని ఆత్మను ఎందుకు నమ్మరు? అంటే దేవతలకు అలవాటుపడిన హిందువులకు ఆత్మంటే సులకన. మిగతా మతముల వారయిన ముస్లీమ్‍లు అల్లాహ్‍ను తప్ప ఆత్మను ఒప్పుకోము అంటున్నారు. క్రైస్థవుల విషయములో కొందరు ఆత్మయని వ్రాసుకొన్నా, చెప్పుకొనినా అది జంతువులలో మిగతా వాటిలో ఉంటుందిగానీ మనిషిలో ఉండదు అంటున్నారు.
'మానవజాతికంతా ఆత్మే దేవుడని' మూడు దైవ గ్రంథములు చెప్పుచున్నా ఆత్మయను పదమును అనేక సందర్భములలో వాడుచున్నా ఆత్మంటే అదేమిటి? దేవునికి ఆత్మకు సంబంధమేమి? అని అంటున్నారు. 'ఆత్మే దేవుడని భగవద్గీత, బైబిలు, ఖురాన్ గ్రంథములు చెప్పుచున్నాయి' అను మాటను మరచిపోయారు. ఆత్మ చేత జన్మించి, ఆత్మ ఇచ్చిన శరీరములో ప్రవేశించి, ఆత్మ చేతనే క్షణక్షణము జీవించుచూ, ఆత్మను మనిషి తెలియలేడంటే, ఆత్మ విషయములు అబద్దముగా ఉన్నాయంటే, అతనిని నిజముగా అంధుడనియే చెప్పాలి.
వాక్యములో చెప్పిన ఎనిమిది కార్యములలో 'భూమి ఆకాశముల సృష్ఠిలో నిదర్శనము కలదని' చెప్పినట్లు నా బుద్ధికి తెలిసిన విధానమంతయూ చెప్పాను. భూమి ఆకాశముల సృష్ఠి వెనుకల జరుగుచున్న, తర్వాత జరుగ బోవు కార్యము ఇట్లే ఉంటుందని తెలిపాను. ఇది కనిపించని కార్యమయిన దానివలన ఎవరికీ తెలియదు. ఇతరులకు తెలియని రహస్యమును నేను చెప్పడమైనది. వాక్యములో చెప్పిన ఎనిమిది కార్యములలో 'శరీరము లోపల జరుగునది ఇది ఒక్కటే.' మిగతా ఏడు కార్యములు శరీరము బయట జరుగునవి. ఈ కార్యమును ఒక్కదానినే ఆత్మ చేయుచున్నది. సృష్ఠ్యాది నుండి యున్న దేవుడు సృష్ఠించిన వారిలో మొదటివాడు ఆత్మ. అంతేకాక సృష్ఠ్యాది దేవుని తర్వాత, దేవుని చేత నియమింపబడిన దేవుడుగా యున్నవాడు ఆత్మని ముందే చెప్పాము. ఆత్మ శరీరముల లోపలేయున్నది. తర్వాత చెప్పిన ఏడు కార్యములు దేవుడు సృష్ఠించిన తన పాలనలోని భూతములు, మహాభూతములు, గ్రహములు, ఉపగ్రహములు చేయుచున్నవి. మిగతా పనులలో రెండవది 'రేయింబగళ్ళు నిరంతరము మార్పు చెందడము' అను కార్యము కలదు.
ప్రపంచము సృష్ఠింపబడినప్పుడు నుండి రాత్రి, పగలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చుచున్నవి. సృష్ఠి తర్వాత రాత్రింపగళ్ళు మార్పు నిరంతరాయముగా కొనసాగుచున్నది. ఏదయినా ఒకరోజు ఎప్పుడయినా ఒకప్పుడు, రాత్రి రాలేదనో లేక పగలు రాలేదనో చెప్పుటకు వీలులేదు. ఈ రెండు 'సృష్ఠినుండి ఎల్లప్పుడు కొనసాగునట్లు దేవుని నిర్ణయము' అయినందున అప్పటినుండి ఇప్పటి వరకు అలాగే కొనసాగుచున్నది. తర్వాత కాలములో కూడా కొనసాగుతుంది. ఇది సృష్ఠ్యాదిలోని దేవుని నిర్ణయమయిన దానివలన ఆయన పాలకులు ఆ పనిని తప్పక చేయుచుందురు. శరీరములో అయితే దేవుని పాలకులయిన మహాభూతములు, భూతములు, గ్రహములు, ఉపగ్రహములు పని చేయరు. శరీరములో ఆత్మ ఒక్కడే అన్ని కార్యములను నిర్వర్తించును. భూమి ఆకాశముల సృష్ఠి అనగా శరీరమును తయారు చేసి సజీవము చేయడములో ఆత్మే అన్నీ చేయుచున్నది. బయట కార్యములన్నిటినీ భూతములు, గ్రహములు చేయుచున్నారు. బయటి కార్యము వాక్యములో మొదట 'రేయింబగళ్ళు మార్పులో నిదర్శనము కలదని' చెప్పారు. బయట జరుగుచున్న రాత్రింపగళ్ళను ఎవరు మార్పు చేయు చున్నారో చాలామందికి తెలియదు. అందువలన కనిపించని తెలియని విధానము ఎక్కడయితే ఉందో అక్కడ 'నిదర్శనము' అనుమాటను చెప్పారు.
రాత్రి చీకటితో, పగలు వెలుగుతో కూడుకొనియుండునను విషయము అందరికీ తెలుసు. అంతేకాక సూర్యుని వలన రాత్రింపగళ్ళు జరుగుచున్నవని కూడా తెలుసు. ఖగోళశాస్త్రము అభివృద్ధి అయ్యేకొద్దీ భూమి తన చుట్టూ తాను తిరుగుచూ, సూర్యుని చుట్టూ తిరుగుచున్నదని కూడా తెలిసిపోయినది. దాని ఫలితముగా పగలు, రాత్రి ఒకదాని వెనుక మరొకటి వచ్చుచున్నవని చెప్పుచుందురు. ఇదంతయూ సత్యమేయని చెప్పక తప్పదు. అలా అన్నీ తెలిసిపోయినప్పుడు ఈ విషయములో నిదర్శనము అనునది ఏమి కలదని ప్రశ్నించవచ్చును. కొద్దిపాటి చదువు చదువుకొన్న వానికి కూడా రాత్రింబగళ్ళు, అమావాస్య, పౌర్ణమి ఎలా వచ్చుచున్నవో తెలుసు. ఇక్కడ తెలియనిది ఏమీ లేదనిపించినా, సూర్యుని గురించి మనకు సూర్యుడు ఒక గ్రహము అని తెలిసినా, భూమి ఒక మహాభూతమని తెలియదు. భూమి, సూర్యుడు గుండ్రముగా యున్నారని చెప్పినా, సూర్యుడు మండే గోళమనీ, భూమి సముద్రముతో సహా యున్న గుండ్రని గోళమని చెప్పినా అందులో యున్న శక్తి తెలియదు. భూమి తిరిగే గోళమయినా అది స్వయముగా తిరుగుచున్నదా లేక ఏదయినా శక్తి దానిని త్రిప్పుచున్నదా! యను విషయము తెలియదు.
దైవజ్ఞానమును సముపార్జన చేసిన తర్వాత సూర్యుడు సజీవమైన గ్రహమనియూ, అట్లే భూమి కూడా సజీవమైన భూతమనియూ తెలియు చున్నది. సూర్యుడు గ్రహమే అయినా ఆయన సజీవుడు. బుద్ధి చేత సమస్తమును గ్రహించు స్వభావము గలవాడు. ప్రపంచములో సృష్ఠింపబడిన పరిపాలకులలో, అట్లే పాలింపబడు జీవరాసులలో (మనుషులలో) అత్యంత ఉన్నతమైన బుద్ధిగలవాడు సూర్యుడు. సూర్యుడు ప్రపంచములో బుద్ధి గ్రాహ్యశక్తిలో కూడా మొదటివాడు. ఆయన గ్రహించుకోలేనిది ఏదీ ప్రపంచములో లేదు. అందువలన ప్రపంచములో సృష్ఠ్యాదియందు ఆకాశవాణి ద్వారా దేవుడు తెలియజేసిన తన జ్ఞానమును సూర్యుడు గ్రహించ గలిగి, తాను తెలిసిన దానిని భూగోళము మీద గల 'మనువు' అను వ్యక్తికి తెలియజేశాడు. అలాగే కలియుగములో 'ముహమ్మద్ ప్రవక్త'క ు అదే జ్ఞానమునే జిబ్రయేల్ అను పేరుతో చెప్పాడు. మనువుకు చెప్పిన సూర్యుడే తర్వాత కలియుగములో ఒక మనిషికి జ్ఞానము చెప్పాడని తెలియకూడదని భావించి తన పేరును మార్చుకొని చెప్పాడు. ఆ విషయము నాకు ఒక్కనికి తప్ప ఇతరులకు ఎవ్వరికీ తెలియదు. సూర్యుడు కృతయుగములో మనువుకు జ్ఞానము చెప్పి, తర్వాత కలియుగములో అదే జ్ఞానమునే తన పేరును మార్చుకొని చెప్పడము జరిగినది. మొదట కృతయుగములో మనువుకు జ్ఞానము చెప్పినప్పుడు నేను ఫలానా సూర్యున్నియని మనువుకు చెప్పలేదు. ఆనాడు తనకు జ్ఞానము ఎవరు చెప్పారను విషయము మనువుకు ఎంతమాత్రము తెలియదు. ద్వాపరయుగము చివరిలో కలియుగము మొదటిలో కృష్ణుడు అర్జునునకు జ్ఞానము చెప్పినప్పుడు 'మనువుకు సూర్యుడు జ్ఞానము చెప్పాడని' కృష్ణుడు చెప్పగా అప్పుడు అందరికీ సూర్యుడు భూమిమీద జ్ఞానమును ఒక మనిషికి చెప్పాడని తెలిసినది. అంతవరకు సూర్యుని విషయము ఎవరికీ తెలియదు. అంతేకాక ఇప్పటికి 14 వందల సంవత్సరముల క్రితము అదే సూర్యుడే మారుపేరుతో జ్ఞానమును చెప్పి పోయాడు. అప్పుడు కూడా ఆయన సూర్యుడని తెలియకుండా చేశాడు. ఇప్పుడు నేను చెప్పుచుంటే కొందరికి ఆ విషయము తెలిసినది. నేను చెప్పకపోతే సూర్యుడు రెండవమారు భూమిమీద జ్ఞానమును చెప్పాడను విషయము ఎప్పటికీ తెలిసేది కాదు.
సూర్యుడు గ్రహమే అయినా, ఆయన గ్రహములలోకెల్లా చాలా ముఖ్యమైనవాడు. సృష్ఠిలో గల ఎందరో గ్రహములకు సూర్యుడు కొన్ని ఆదేశాలు ఇచ్చుచున్నాడు. సూర్యుడు రాత్రంతా కనిపించకయుండి పగలు జరుగవలసిన కార్యముల గురించి సూర్యుడు మిగతా కొన్ని గ్రహములకు తెలియజేయగా, సూర్యుని నుండి విషయమును తెలుసుకొన్న ప్రకారము పగలు మొదలయిన తర్వాత ఎవరు, ఎప్పుడు ఏమి చేయాలో అదే చేస్తున్నారు. సాధారణ మనిషికి తెలియకుండా ఎన్నో విషయములు సూర్యునికి, భూమికి మధ్యలో జరుగుచున్నవి. సూర్యుని నుండి ఆదేశములు తీసుకొన్న గ్రహములు ఆ పనిని సక్రమముగా చేయుచున్నవి. అంతేకాక పగలు సమయములో భూమి ద్వారా కొన్ని భూతములు తాము చేయవలసిన కార్యములను గురించి తెలుసుకొని తర్వాత ఎప్పుడు ఆ కార్యములను చేయాలో అప్పుడే ఆ పనులను చేయుచున్నవి. రాత్రిపూట గ్రహములకు సూర్యుడు ఆదేశములివ్వగా, పగలు పూట భూమి భూతములకు తనకు అందిన ఆదేశములు ఇచ్చుచున్నది. పైన సూర్యుడు క్రింద భూమి తమ ద్వారా గ్రహములకు, భూతములకు జరుగవలసిన కార్యముల వివరమును ఆదేశముల ద్వారా తెలియజేయగా, సూర్యుని ద్వారా తెలుసుకొన్న గ్రహములు, భూమి ద్వారా తెలుసుకొన్న భూతములు తమతమ కార్యములను చేయుచున్నవి.
మనుషులకు తెలియకుండా అనగా నిదర్శనములతో ఎన్నో కార్యములు భూమిమీద జరుగుచున్నవి. ''భూకంపములు, సునామీలు, తుఫానులు, టోర్నడోలు'' అను ప్రకృతి సంఘటనల వెనుక గ్రహముల, భూతముల జోక్యమున్నదని ఎవరికీ తెలియదు. పగలు భూమి ద్వారా ఆదేశములు భూతములు గ్రహించగా, రాత్రి సూర్యుని ద్వారా ఆదేశములను గ్రహములు గ్రహించుచున్నవి. ''భూతములకు ఆదేశములు ఇచ్చుట కొరకు పగలు, గ్రహములకు ఆదేశములను ఇచ్చుటకు రాత్రిని'' భూమి, సూర్యుడు ఇద్దరు కలిసి వచ్చునట్లు చేయుచున్నారు. పగలు కొరకు సూర్యుడు, రాత్రి కొరకు భూమి ప్రయత్నించుట వలన రాత్రింబగళ్ళు జరుగుచున్నవని తెలియుచున్నది. రాత్రింపగళ్ళులోనే తమ ఆదేశములు భూతములకు, గ్రహములకు ఇచ్చుటకు ఒకదాని తర్వాత ఒకటి చక్రమువలె వచ్చునట్లు సూర్యుడు, భూమి చేయుచున్నారు. రాత్రింబగళ్ళు వెనుక ఇంత రహస్యమున్న దని ఎవరికీ తెలియదు.
భూతములు, గ్రహములు సజీవులనీ తమ ద్వారానే బయట ప్రపంచములోని మనుషులు కష్టసుఖములను అనుభవిస్తున్నారని ఇంతవరకు గ్రంథములలో వ్రాయబడలేదు. ఇంతవరకు ఎవరూ చెప్పనూ లేదు. ఇప్పుడు క్రొత్తగా ఒక మనిషి చెప్పితే మేము వినవలెనా? అను సంశయము చాలామందికి రావచ్చును. దానికి జవాబు ఏమనగా! ఈ విషయములు ఇంతవరకు ఎవరికీ తెలియదని మీకు కూడా బాగా తెలుసు. ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు తెలియజేయడము జరుగుచుండును. ఇప్పుడు నా ద్వారా వింటే తప్పేముంది. నేను చెప్పునది సత్యమో కాదోయని తెలియుటకు ఒక యదార్థ సంఘటనను ఉదాహరణగా చెప్పుకొందాము. ఇప్పటికి బహుశా మూడు లేక నాలుగు సంవత్సరముల క్రితము విశాఖ పట్టణములో హుదుద్ తుఫాను భయంకరముగా వచ్చినది. ఆ తుఫానులో వర్షము రావడము, సముద్రము బీచ్లో ముందుకు రావడమే కాకుండా అప్పుడు వీచిన గాలివలన కరెంటుపోల్లు అన్ని క్రిందపడిపోగా, ఎన్నో వృక్షములు నేలకొరిగి పోయాయి. ఉన్న చెట్లకు ఒక్క ఆకు కూడా లేకుండా రాలిపోవడము జరిగినది. అప్పుడు ప్రజలు ఎవరూ చనిపోలేదు గానీ, చాలామంది చాలా కష్టములుపడ్డారు. ఆ విషయము ఆ ప్రాంతము వారు ఎవరూ మరచిపోయి ఉండరు.
ఆ తుఫాను వలన నష్టము, కష్టము పడినవారందరూ సాధారణముగా కోలుకోవడానికి దాదాపు నెల రోజులు పట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వారము రోజులు వైజాగ్లోనే ఉండి సహాయక చర్యలు వేగముగా జరుగునట్లు చూచాడు. తర్వాత ఒక సభ సమావేశములో మాట్లాడుతూ ''మనము ధైర్యముగా హుదుద్ తుఫానును ఎదుర్కొన్నాము. మన ధైర్యము చూచి తుఫానే పారిపోయింది. ఎవరికీ ప్రాణనష్టము జరుగలేదు'' అని తుఫాన్ను హేళనగా మాట్లాడడము జరిగినది. అది సజీవమైనది, మన మాటలను గ్రహించుచూ ఉంటుంది అని ముఖ్యమంత్రి గారికి తెలియదు. ఆయన చెప్పుమాటలను నేను టీ.వీలో విన్నాను. అప్పుడే ప్రక్కవారితో ఈయనకు తుఫాన్ సజీవమైనది అని తెలియదు. ఆ రోజు తుఫాన్ను సృష్ఠించి ఎంతో నష్టము, కష్టమును తెచ్చినవి భూతములు, గ్రహములు. ఈయన ఇప్పుడు చెప్పేమాటలు వారు వింటే వారికి కోపము రావచ్చును. తిరిగి ఇంకోమారు తుఫాన్ రూపములో వేధించగలరని చెప్పాను. భూమిమీద ప్రజలకు ఎవరికీ ప్రకృతి వైపరీత్యముల వెనుక ఎవరున్నారు? ఎవరు ఏమి చేయుచున్నారను విషయము తెలియదు.
రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను ఆనాడు తుఫానును సృష్ఠించిన గ్రహములు విన్నారు. తర్వాత ఆరు నెలలకో లేక కొద్దిగా ముందు గానీ వెనుకగానీ స్వయముగా ముఖ్యమంత్రిగారు ''విశాఖ ఫెస్టివల్'' అను పేరుతో సముద్ర తీరమున బీచ్లో పెద్ద ఉత్సవమును ఏర్పాటు చేశారు. ప్రజలందరూ అందులో పాల్గొనునట్లు ఏర్పాటు చేసి, పెద్ద పెద్ద గుడారాలు కట్టించారు. విశాఖ ఫెస్టివల్ వారము రోజులు జరుగునట్లు ఏర్పాటు చేశారు. క్రింద ఇసుకలో పెద్దపెద్ద మ్యాట్లు పరిపించారు. అన్ని హంగామాలతో ఉత్సవమును చేయాలనుకొన్నారు. అయితే తుఫాన్ను గురించి ''తుఫాన్ను జయించాము. మన ధైర్యమును చూచి అదే పారిపోయింది'' అని చెప్పడము గ్రహములకు, భూతములకు జ్ఞాపకముంది అన్నట్లు తుఫాను లేకపోయినా, వాతావరణము అంతయూ సక్రమముగా ఉండినా, ఎటువంటి ముందు హెచ్చరికలు లేకున్నా, సముద్రము నీరు ఎదురురోడ్డును త్రాకేటట్లు ముందుకు వచ్చింది. రోడ్డులోయున్న రెండు చిన్నవంతెనలు కూడా సముద్రము తాకిడికి కూలిపోయాయి. కొన్నిచోట్ల బీచ్రోడ్డు సగమునకు పైగా కోతకు గురి అయింది. తుఫాన్ వచ్చిన సమయములో జరిగినట్లే రోడ్డు వరకు నీరు వ్యాపించింది. ఫెస్టివల్ కొరకు ఏర్పాటు చేసుకొన్న ఇసుక మీద పరచిన పెద్ద పట్టాలన్నిటిని తడిపి వేసి, ఫెస్టివల్ జరుగకుండా చేసినది. గ్రహములు, భూతములు ప్రకృతిలో వైపరీత్యముల వెనుక ఉండి పని చేయుచున్నవనుటకు ఇది బలమైన నిదర్శనము. మేము చెప్పుమాటలు నమ్మశక్యము గానివిగా యున్నా, విశాఖ ఫెస్టివల్ చెడిపోయిన విధానమును చూచయినా నమ్మక తప్పదు. రాష్ట్ర ముఖ్యమంత్రి హుదుద్ తుఫానును గురించి భయము లేకుండా మాట్లాడినప్పుడే వీరు పొరపాటుగా మాట్లాడుచున్నారు, అలా మాట్లాడితే గ్రహములు, భూతములు తిరిగి ఏదైనా చేయగలరని చెప్పాము. మేము చెప్పినట్లే విశాఖ ఫెస్టివల్‍ను కనిపించని గ్రహములు, భూతములు భంగము చేశాయి అని చెప్పవచ్చును. తుఫాను లేకుండా, సునామీ లేకుండా సముద్రము పోటు రోడ్డువరకు రావడము, రోడ్డును కోసివేయడము ఆలోచించదగిన విషయమైనా దానిని గురించి ఏ మేథావి ఆలోచించలేదు. ఈ విషయములో జరిగిన పనికి హేతువాదులు ఎందుకు హేతువును చూపలేకపోయారు? ఇటువంటి విషయములలో కారణము చూపకుండా మేము హేతువాదులము అంటే ఎలా సరిపోతుంది?
ప్రకృతిలో అనగా శరీరము బయట జరుగు ప్రతీ కార్యము వెనుక ఎంతోమంది గ్రహములు, ఎంతోమంది భూతములు పని చేయుచున్నారు. అలా ప్రతి చోట, ప్రతి క్షణము జరుగుచుండుట వలన దేవుని పాలన సులభముగా సాగుచున్నది. మనుషులకు గ్రహములు, భూతములు కంటికి కనిపించరు, అట్లే వారు చేయు పనులు కనిపించినా, చేయుచున్న విధానము తెలియదు. నేడు భౌతికమునే నమ్ముతాము అభౌతికమును నమ్మము అనువారు తుఫాను లేనప్పుడు సముద్రము ఎందుకు ముందుకు వచ్చినదో, ప్రభుత్వము చేయ తలపెట్టిన ఉత్సవమును ఎందుకు జరుగకుండా చేసినదో చెప్పలేరు. మనకు తెలియని ఎన్నో పనులు ప్రపంచములో జరుగుచున్నా ఆ పనుల వెనుక ఎవరున్నారో మనుషులకు ఎంతమాత్రము తెలియదు. భూమిమీద మనకు తెలిసినా, తెలియకున్నా అన్ని పనులు దేవుని పాలకుల చేత జరుగుచున్నవి. అయితే పనులు తెలుసు, వాటివలన కలిగే బాధలు తెలుసు. పనుల వెనుక ఎవరున్నది తెలియదు. ఏ పనిని అయినా గానీ భూమిమీద తమకు అందిన ఆదేశాల ప్రకారము పాలకులు చేయుచున్నారు. భూతములకు మహాభూతమైన భూమి ద్వారా, గ్రహములకు ముఖ్య గ్రహమైన సూర్యుని ద్వారా ఆదేశములు అందుచుండగా మిగతా భూతములు, గ్రహములు కార్యములను చేయుచున్నవి.
పనుల కొరకు (పరిపాలన కొరకు) గ్రహములకు కావలసిన ఆదేశములను అందుకొనుటకు రాత్రి కొరకు గ్రహములు వేచియుండగా, అట్లే భూతములకు కావలసిన ఆదేశములను అందుకొనుటకు పగలు కొరకు వేచి చూస్తున్నారు. దీనిప్రకారము ముఖ్య గ్రహమైన సూర్యుడు గ్రహములకు దేవుని సంకల్పములోని ఆదేశములను అందించుచుండగా, మహా భూతమైన భూమి భూతములకు దేవుని సంకల్పములోని ఆదేశములను అందించుచున్నది. అందువలన సూర్యుడు రాత్రి కొరకు, భూమి పగలు కొరకు కాలచక్రమును తిరుగునట్లు చేయుచున్నవి. అందువలన భూమిమీద రాత్రింబగళ్ళు ఒకదాని తర్వాత మరొకటి నిరంతరము మారుచున్నవి. ఇప్పుడు రాత్రింబగళ్ళు మార్పులోని నిదర్శనము అర్థమయినదని అనుకుంటాను.
ఇంతవరకు దేవుని పాలనలోని రెండవ కార్యము ''రాత్రింబగళ్ళు'' జరుగుచున్న విధానమును తెలుసుకొన్నాము. ఇప్పుడు దేవుని పాలన గురించిన ఖుర్ఆన్ వాక్యములోని మూడవ కార్యములోని 'నిదర్శనము' తెలుసుకొందాము. ''ప్రజలకు లాభమును చేకూర్చే వస్తువులను మోసుకుంటూ సముద్రాలలో నడిచే ఓడలలో'' అని వ్రాసియుంది. దీనిని గురించి చెప్పుకొంటే సముద్రము మీద సామాగ్రిని మోసుకపోయే పడవలను మనము చూస్తున్నాము. పైకి సముద్రములో సులభముగా పడవల ప్రయాణము సాగుచున్నట్లు కనిపించినా మనకు కనిపించని రహస్యము ఒకటి గలదు. అది ఏమనగా! ప్రతి పడవ వెంటా ఒకటి లేక రెండు లేక అంతకంటే ఎక్కువ భూతములుగానీ లేక గ్రహములుగానీ, లేక భూతములు గ్రహములు ఇద్దరు కలిసిగానీ పడవను గమ్యము చేర్చు వరకు తమ శక్తి సామర్థ్యములను వినియోగించి పడవ ప్రయాణమును సాగునట్లు చేయుచున్నవి. తమ పాలన ప్రకారము సముద్ర ప్రయాణమును సాగించుచూ మానవులకు కావలసిన సామాగ్రిని దూర ప్రాంతములకు అందించు చున్నారు. తమకు అందిన సమాచారము ప్రకారము ఓడలను గమ్యమున కయినా చేర్చగలవు, లేక సముద్రములోనయినా ముంచివేయగలవు.
వంద సంవత్సరముల పూర్వము 1500 మందితో ప్రయాణించు పడవను సముద్రములో భూతములే ముంచివేసినవని ఎవరికీ తెలియదు. ఒకవేళ తెలిసినా తప్పించుటకుగానీ, భూతములను మెప్పించి ప్రమాదము జరుగకుండా చేయుటకుగానీ ఎవరి చేత కాదు. ఎందుకనగా! భూతములు గానీ, గ్రహములుగానీ దేవుని ఆజ్ఞను అనుసరించును గానీ మనుషుల ఆజ్ఞను అనుసరించవు. ప్రతి పనికి దేవుడు ఆజ్ఞ ఇవ్వడము జరుగదు. దేవుడు నేరుగా గ్రహములకు, భూతములకు ఆజ్ఞ ఇవ్వడు. ఏ ఆజ్ఞ అయినా గానీ క్రింద భూమినుండి భూతములకు, పైన సూర్యుని నుండి గ్రహములకు ఆజ్ఞ ఇవ్వబడును. గ్రహములకుగానీ, భూతములకుగానీ ఏ ఆజ్ఞ అయినా గానీ ఒకరోజు ముందు ఇవ్వబడును. ఆజ్ఞను ఇచ్చు సూర్యుడుగానీ, భూమి గానీ మనుషుల కర్మనుబట్టి శిక్షలుగానీ, రక్షలుగానీ ఇవ్వమని ముందే దేవుని ఆజ్ఞ ఉండుట వలన మనుషుల కర్మప్రకారమే పాలకులు నడుచుకొను చుందురు. పాలకుల మంచి ప్రవర్తనగానీ, చెడు ప్రవర్తనగానీ మనుషుల కర్మనుబట్టియుండును.
ప్రశ్న :- మనుషుల కర్మనుబట్టి దేవుని పాలకులయిన భూతములు, గ్రహములు ప్రవర్తించి శిక్షలు, రక్షలు విధించుచున్నప్పుడు పాలకులకు దేవుని ఆజ్ఞతో పనే లేదు కదా! మీరు దేవుని ఆజ్ఞ ప్రకారము పాలకులు పని చేయుచుందురు అని చెప్పారు. పాలకుల కర్తవ్యము మనుషుల కర్మనుబట్టియే కదా! దేవుని ఆజ్ఞనుబట్టి కాదుకదా! ఉదాహరణకు ప్రభుత్వ పాలనలో ముందే గల గవర్నమెంట్ ఆర్డర్ (+.ూ) ప్రకారము ఉద్యోగస్తులు పని చేయుచుందురు. అంతేగానీ మాటిమాటికి ప్రతిరోజు ప్రభుత్వము పైనుండి పనిని చెప్పదు కదా! అట్లే దేవుని పాలకులకు ఒకమారు నిర్ణయించబడిన విధి నిర్వహణ ప్రకారము చేయుచుందురు. అంతేగానీ దేవుని ఆజ్ఞ మధ్యలో ఎందుకు? అని నేను ప్రశ్నించుచున్నాను. దీనికి వివరముగా జవాబు చెప్పగలరని కోరుచున్నాము.
జవాబు :- పాలకులు, పాలకుల పనులు చేయు విధానము ఎవరికీ కనిపించునది కాదు. సృష్ఠ్యాదినుండి అనేకులు మీకు జ్ఞానమును చెప్పినా ఈ విషయములను ఎవరూ చెప్పలేదు. తెలియని విషయములు, కనిపించని విషయములు, సూక్ష్మ విషయములు చెప్పుటకు ఎవరికీ చేతగాదు. అయినా ఇప్పుడు నా చేత దేవుడు చెప్పించడము ఒక విధముగా మీ అదృష్టమేయని చెప్పవచ్చును. నాకు తెలిసినంతవరకు పాలకులు అయిన భూతములు, గ్రహములు సంపూర్ణముగా దైవజ్ఞానమును తెలిసిన గొప్ప జ్ఞానులు. సూర్యుని ద్వారా, భూమిద్వారా తమకు అందిన ప్రతి ఆజ్ఞను దేవుని ఆజ్ఞగానే భావించి పని చేయుదురు. సూర్యుని ద్వారా, భూమిద్వారా అందిన ఆజ్ఞలు కర్మప్రకారము నిర్ణయించబడి చెప్పినవయినా ఇదంతయూ దేవుని నిర్ణయము వలన జరుగుచున్నదను భావములో ఉందురు. వారు దైవజ్ఞానులు అయినందున సహజముగా అలా అనుకోవడము మంచిది. అదియే సత్యము. మేము కూడా ధర్మము ప్రకారము దేవుని ఆజ్ఞ అని చెప్పినా దేవుడు ప్రతి విషయములోనూ ఆజ్ఞ ఇచ్చువాడు కాడు. పాలకులు దేవుని చట్టమును అనుసరించి కర్మప్రకారము పాలించువారై యున్నారు. అందువలన దేవుని ఆజ్ఞను అనుసరించి శిక్షలు, రక్షలు విధించుచుందురని చెప్పాము. ఈ విషయములను అర్థము చేసుకొనుటకు మనుషులకు బుద్ధి గ్రాహిత శక్తి అవసరము.
అట్లని దేవుడు ఏమీ జోక్యము చేసుకోడా?యని అంటే అట్లుండదు ఆయన ఏదయినా తలచినప్పుడు దానిని అయిపో అంటే అయిపోతుంది అని అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లోనే సూరా రెండు అల్బఖర, ఆయత్ 117లో ఇలా చెప్పారు చూడండి.
(2-117) ''భూమి ఆకాశమును ప్రప్రథమముగా సృష్ఠించినవాడు ఆయనే. ఆయన ఏ పనినైనా చేయ సంకల్పించుకొన్నప్పుడు దానిని అయిపో అని అంటే చాలు, అది అయిపోతుంది.''
ఇక్కడ దేవుడు అను మాటను ఆయన అని చెప్పియున్నారు. ఆరాధించ వలసిన దేవుడు ఒక్కడే అయినా సృష్ఠి పూర్వము దేవుడు, సృష్ఠి తర్వాత దేవుడు అని ఇద్దరున్నారు. ఆ ఇద్దరినీ వాక్యములలో ఆయన అని చెప్పడమైనది. చెప్పిన వాక్యములో ఆయన అనగా దేవుడని అర్థమయినా ఇద్దరి దేవుళ్లలో ఏ దేవుడని ప్రశ్న రాగలదు. అప్పుడు సృష్ఠి పూర్వము దేవుడా? సృష్ఠి తర్వాత దేవుడా? యని తెలియుటకు వాక్యములోనే కొంత ఆధారముండును. ఇప్పుడు ఈ వాక్యములో ''ప్రప్రథమముగా సృష్ఠించిన వాడు'' అని యున్నది. భూమి ఆకాశమును సృష్ఠించినవాడు ఒక్కడే. అవి ఒక్కమారే సృష్ఠించబడినాయి. అయినా మొట్టమొదట తయారు చేసినవాడు ఆయనే అని ఉంది. భూమి, ఆకాశములు తర్వాత కూడా సృష్ఠించబడినాయి. కావున రెండవమారు తయారు చేసిన దేవుడు వేరు, మొదట తయారుచేసిన దేవుడు వేరు. అందువలన ఎవరు? అను గుర్తింపుకు ''ప్రప్రథమమున భూమి, ఆకాశమును తయారు చేసిన దేవుడు'' అని చెప్పియున్నారు. మొట్టమొదట భూమి, ఆకాశమును తయారుచేసిన దేవుడే శరీరము బయటయున్న ప్రకృతికి అంతటికీ పెద్ద. ఆయన ఆధీనములోనే భూతములు, గ్రహములు సమస్త పాలకులు గలరు.
భూమి ఆకాశమును రెండవమారు తయారు చేసినవాడు కూడా దేవుడే. అయితే ఈ దేవుడు శరీరము లోపలే పెద్ద. శరీరము లోపలే ఆయన పాలనయంతా గలదు. రెండవమారు తయారు చేయబడిన ఆకాశములు, భూమి రెండు శరీర రూపములో యున్నవి. మొదట తయారు చేయబడిన ఆకాశము భూమి బయట కంటికి కనిపించునవే యని తెలియ వలెను. బయట ఆకాశమును భూమిని సృష్ఠించినవాడు సృష్ఠ్యాది దేవుడయిన పరమాత్మ. తర్వాత మానవున్ని సృష్ఠించిన దేవుడు ఆత్మ. తర్వాత సృష్ఠింప బడిన ఆకాశములు భూమి శరీర రూపములలో యున్నవి. మొదట సృష్ఠింప బడినవి కనిపించు ఆకాశముగా, కనిపించు భూమిగా యున్నవి. బయట సృష్ఠి, బయట పాలన బయట దేవుడని జ్ఞాపకముంచుకోవాలి. మనుషులు ఆరాధించవలసిన దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడు శరీరములోనివాడు. ఆరాధనకు అతీతముగా ఆరాధనలు కూడా అక్కర లేనివాడు, ఏ అక్కరా లేనివాడు సృష్ఠ్యాదిలోని దేవుడు. సృష్ఠి తర్వాత దేవుడు ఆత్మకాగా, సృష్ఠి పూర్వము దేవుడు పరమాత్మ. ఆత్మకంటే వేరుగా యున్నవాడు పరమాత్మ. పరమాత్మయే ప్రప్రథమముగా ఆకాశమును, భూమిని సృష్ఠించాడు. ఆయన (పరమాత్మ) బయట పాలకులందరికీ దేవుడు. బయట పాలకులు ఆయనను ఆరాధించరుగానీ భక్తి, గౌరవ భావము కల్గిన జ్ఞానులుగాయున్నారు. పాలకులకు శరీరము లోపలి దేవుడు తెలుసు, శరీరము బయటి దేవుడు తెలుసు. దైవజ్ఞానము సంపూర్ణముగా తెలిసినవారికి ఇద్దరు దేవుళ్లు తెలుసు. అట్లే తాము బయట పాలనలోయున్నామని కూడా తెలుసు.
పాలన సాగించు భూతములు, గ్రహములు సూర్యుని నుండి, భూమి నుండి ఆజ్ఞలు తీసుకోవడము వాటినే చేయడము జరుగుచున్నది. అయినా జ్ఞానము ప్రకారము తమకు ఆజ్ఞలు ఇచ్చు సూర్యునికి, భూమికి అందరికీ యజమాని దేవుడు పరమాత్మేయని తెలుసు. గ్రంథములోని వాక్యమును చదువు వారికి కూడా ఆ తేడా తెలియునట్లు ''మొట్టమొదట ఆకాశమును, భూమిని సృష్ఠించిన దేవుడు ఆయనే'' అని చెప్పియున్నారు. ఆయన అవసరమైనప్పుడు సంకల్పించుకొంటే ఆ పని జరిగిపోవును. దేవుడు 'అయిపో' అని చెప్పుట మనకు అర్థమయ్యే దానికేగానీ, ఆయన 'అయిపో' అని అరచుటకు నోరు లేదు. ఆయనకు శరీరము లేదు. ఆయన ప్రత్యక్షముగా ఏమీ చెప్పువాడు కాడు. ఆయన మనస్సులో అనుకొంటే చాలు ఆ విషయము ఇటు సూర్యునికి, అటు భూమికి చేరిపోవును. అప్పుడు వారు మధ్యలో వచ్చిన ఆ విషయమును తమ పాలకులయిన భూతములకు భూమి, గ్రహములకు సూర్యుడు ఆదేశమివ్వగా దానిప్రకారము అది చేయబడును. దేవుడు అనుకొంటే ఏదయినా జరిగిపోవును అని ఉన్నది కదా! పరమాత్మయిన దేవుడు ఏమి అనుకొంటాడు? ఏమని సంకల్పించుకొంటాడు? ఆయన మధ్యలో సూర్యునికి భూమికి ఎందుకు ప్రత్యేకమైన పనిని కల్పించుచున్నాడు? అని ప్రశ్నించుకొని చూస్తే అట్లు దేవుడు అనగా సృష్ఠ్యాదిలోని దేవుడు అరుదుగా సంకల్పించుకొనును. అంతేగానీ మాటి మాటికీ దేనినీ చేయదలచుకోడు. కర్మప్రకారమే పాలకులు ఖచ్చితముగా పనిని చేయునప్పుడు మధ్యలో ఆయన జోక్యము చేసుకోడు. అలా చేశాడు అంటే అది చాలా అరుదుగా జరుగు పనియై ఉండును. ఏమిటి అంత అత్యంత అవసరమైన పని? తమ విధులను జాగ్రత్తగా నెరవేర్చు పాలకులను మధ్యలో కల్పించుకొని చెప్పవలసిన అవసరము ఏమి వచ్చింది? ఆయన ఏ పనిని చేయనివాడుగా యుండి తన మౌనమును భంగము చేసుకొని, నోరు తెరచి చెప్పకున్నా సంకల్పము చేతనయినా తన ఆజ్ఞను తన పాలకులకు తెలియజేయు అవసరము ఏమి? అని ప్రశ్నించుకొని చూస్తే కొంత ఆసక్తికరమైన విషయములు తెలియుచున్నవి. ''దేవుడు అపార కరుణా మయుడు, అమిత దయాసాగరుడు'' అని చెప్పిన మాటను మరువలేము.
సాధారణ ప్రజల ఎడల పాలకులు పని చేయుచుండగా, ప్రజలు కష్ట సుఖములను అనుభవిస్తూ వారి బ్రతుకు వారు బ్రతుకుచుండగా, పాలకులు వీరి పని వీరు చేయుచుందురు. మనుషుల పుట్టుకలోనే మనిషి గత జన్మలో చేసుకొన్న పాపపుణ్యములను లెక్కించి ప్రారబ్ధముగా చేసి ప్రస్తుత జన్మలో అనుభవించునట్లు శరీరములో మరణము జరిగినప్పుడే ఆత్మ కర్మల నిర్ణయము చేసి పంపును. అలా నిర్ణయించబడిన కర్మచక్రము లోని కర్మలను చూచిన కాలచక్రములోని పన్నెండు గ్రహములు గ్రహించి వాటిని సూర్యునకు తెలుపగా, సూర్యుడు పాలకులకు తెలుపగా, పాలకులు ఖచ్చితముగా కర్మపాలన చేయుచున్నారు. మనిషి పుట్టినప్పటినుండి మనిషి చనిపోవువరకు జరుగుచున్న విధానము ఇదియే. జరుగ వలసిన విధానము కూడా అదియే. అయితే ఎవడయినా మధ్యలో దేవుని మీద శ్రద్ధను పెంచుకొని ఇతరుల ద్వారాగానీ, గ్రంథముల ద్వారాగానీ దైవజ్ఞానమును తెలియగలిగి యోగమును ఆచరించగలిగితే కర్మనాశనము జరుగును. శరీరములో ఎంత జ్ఞానము కల్గినది, ఎంత జ్ఞానశక్తి వలన ఎంత కర్మ కాలిపోయినది దేవునికి తెలుసు. ఒక రోజు గ్రహముల చేత గుర్తింపబడిన కర్మ సూర్యునికి తెలియబడగా, సూర్యుడు ఒక రోజు ముందు పాలకులకు తెలిపియుండును. పాలకులు రెండవ రోజు సాయంకాలము నాలుగు గంటలకు ఒక పాపము ప్రకారము మనిషికి కాలు విరిగిపోవునట్లు చేయవలసి యున్నది. బస్సు టైరు క్రింద కాలుపడి నలిగిపోయి కాలు తొలగించవలసిన కర్మయున్నది. అట్టివాడు తన జ్ఞానముచేత ఆ కర్మను లేకుండా చేసుకోగలిగినప్పుడు ఆ అనుభవమంతయూ పూర్తి తొలగి పోవలసి యున్నది.
మనిషియొక్క యోగమును, జ్ఞానమును బట్టి దేవుడే ఆ కర్మను క్షమించియుండును. అనగా తన శక్తిచేత కాలిపోవునట్లు చేసియుండును. దానిని ''దేవుని క్షమాశీలత''యని అంటారు. దేవుడు మనిషి పాపమును క్షమించి కరుణామయుడు, కృపాశీలుడు అనుమాటను సార్థకము చేసుకొనును. దేవుని క్షమాశీలత వలన కర్మచక్రములోని కర్మ ఈ రోజు తొలగిపోయివుంటే నిన్నటి దినమే సూర్యుడు తెలుసుకొన్న కర్మను అనుభవింపజేయుటకు పాలకులకు ఆజ్ఞ ఇచ్చి ఉండును. అప్పుడు పాలకులు తమకు అందిన ఆజ్ఞ ప్రకారము శిక్షను అమలు చేయవలసి యున్నది. అలాంటప్పుడు దేవుడు పాపమును క్షమించియుండుట చేత అది అమలు కాకూడదు. అప్పుడు మొదటి దేవుడు అయిన ఆయన మొట్టమొదట భూమి ఆకాశమును సృష్ఠించిన దేవుడు, తన భక్తుని పాపము క్షమించబడినదని, అది ముందే పాలకులకు ఆజ్ఞగా చేరబడినదని, దానిని రద్దు చేసుకోమని సూర్యునికి సంకల్పము చేత తెలుపగా సూర్యుడు అత్యవసరముగా తన పాలకులకు సమాచారమును పంపి ఆ కార్యమును రద్దు చేయించును. అటువంటి అత్యవసర సమయములలో దేవుడు తన సంకల్పము చేత తాను తలచినది తన పాలకుల వరకు చేరిపోవును. అప్పుడు ఆ శిక్షను పాలకులు రద్దు చేయడము జరుగుచున్నది. ఇదంతయూ ఒకరోజు కాలవ్యవధిలో జరుగు శిక్షల ఎడల క్షమాపణ జరిగినప్పుడు ఇటువంటి అత్యవసర సంకల్పముల అవసరము వచ్చును. దేవుని సంకల్పముల చేత దేవుని పని నెరవేరుచున్నది.
ఇంత గణితముగా దేవుని పని, దేవుని పాలకుల చేత జరుగు చున్నదని చాలామందికి తెలియదు. పాలకులందరికీ దేవుడే అధిపతి. ఆయనే యజమాని. దేవుని ఆజ్ఞ మేరకు సూర్యుడు, భూమికీ, సూర్యుని భూమి అనుమతిమేరకు పాలకులు, పని చేయుట వలన అందరూ దేవుని ఆజ్ఞ చేత పనిని చేయువారుగా చెప్పియున్నాము. ఇది సాధారణముగా జరుగు విధానముకాగా, ఎప్పుడో ఒకప్పుడు అరుదుగా మనిషి పాపము క్షమించబడినప్పుడు, అది ముందే పాలకులకు ఆజ్ఞ చేయబడియుంటే అప్పుడు మాత్రమే దేవుని సంకల్పము పని చేయగా భూమికి సూర్యునికి చేరిన సంకల్పము పాలకులకు తెలుపబడును. అప్పుడు పాలకులు దేవుని సంకల్పము ప్రకారము శిక్షను రద్దు చేసుకొందురు. ఇదంతా అరుదుగా జరిగే విషయము. పాప క్షమాపణలోనే దేవుడు సంకల్పించుకోవడము ఒక్కటే కాదు. మరొక విషయములో కూడా దేవుని సంకల్పము ఉండును.
మనుషులు ముందే చేసుకొన్న పాపపుణ్యముల వలన, వారి కర్మ పత్రములలో వ్రాయబడిన విధానము వలన, వారి జీవితములను కర్మను అనుసరించి శరీరములోని దేవుడు తీర్పుతీర్చి, జన్మ జీవితమును నిర్ణయము చేసి పంపును. అలా పంపబడిన మనిషిని అతని కర్మప్రకారము శరీరము లోపలయున్న ఆత్మయే శరీరములో కర్మను అనుభవింపజేయుచుండును. జీవుడు (మనిషి) కర్మను అనుభవించుటకు కావలసిన పనులను శరీరములో ఆత్మే చేయుచున్నది. కొన్ని కర్మలు బయటి పనుల వలన మనిషి అనుభవించ వలసియుండగా, అటువంటి పనులనన్నిటినీ బయటి పాలకులు చేయుచున్నారు. శరీరము లోపల ఆత్మ, శరీరము బయట పరమాత్మ పాలకులు చేయు కార్యముల వలన, శరీరమును ధరించిన జీవుడు కర్మ చక్రములోని (కర్మపత్రములోని) కర్మప్రకారము జీవించగలుగుచున్నాడు. జీవితములో కష్టసుఖములను, సుఖ దుఃఖములను అనుభవించుచున్నాడు. అలా కర్మప్రకారమే జీవితము గడచునట్లు దేవుడు నిర్ణయించియుండును.
అట్లు కర్మప్రకారము జీవితమును సాగించు జీవుడు, జరుగుచున్న జీవితములో స్వంత భావములు కల్గియున్నాడు. జీవితములో జరుగు సంఘటనలన్నియూ ముందే కర్మపత్రము ప్రకారము నిర్ణయమైనవే జరుగు చుండును. కర్మపత్రములోని ప్రారబ్ధ కర్మప్రకారము జరుగు పనులన్నియూ శరీరము లోపల, శరీరము బయట జరుపబడుచుండును. జీవితములో పనులు చేయుటయందుగానీ, కర్మలను అనుభవించుటయందుగానీ జీవునికి ఎటువంటి స్వతంత్రత లేకుండా యుండును. జీవునికి అనుభవించడములో గానీ, దానికొరకు అల్లాడడములోగానీ ఎంతమాత్రము స్వతంత్రత లేక యుండును. అయితే అంతర్గత భావములో స్వతంత్రత కల్గియుండును. అతను జ్ఞానము ప్రకారము భావించుకోవచ్చును లేక అజ్ఞానము ప్రకారము భావించుకోవచ్చును. భావములన్నీ జీవుని ఆధీనములో ఉండుట వలన అతను మంచి చెడు రెండు రకముల భావములలో ఏ భావమునందైనా ఉండవచ్చును. ఉదాహరణకు ఒక కార్యములో ఎట్లు భావమును పొంది యుండునో చెప్పుకొని చూద్దాము.
ఒక మనిషికి వాని కర్మప్రకారము ఒక రాజకీయ పదవి పొందు అవకాశము కలదు. దానిప్రకారము అతను రాజకీయ పదవిని దాదాపు పది సంవత్సరములు అనుభవించడము జరిగినది. ఆ అనుభవములో విపరీతమైన డబ్బు కూడా చేకూరినది. ఒక ప్రక్క అధికారము మరొక ప్రక్క ధనము లభించడము వలన అతను సమాజములో గొప్పవ్యక్తిగా గుర్తింపు పొందాడు. అందరూ అతనిని గౌరవించేవారు. ఇదంతయూ వాడు పుట్టకముందు చనిపోయినప్పుడే కర్మరీత్యా ఆత్మ నిర్ణయించి పంపగా వచ్చి పుట్టడము జరిగినది. వాని జీవితములో ఏదీ స్వంతముగా చేయుట లేదు. అన్నియు లోపలి ఆత్మ మరియు బయటి పరమాత్మ పాలకులు చేయుచుండగా వానికి జీవితములో రాజకీయ పదవి, ధనము, గౌరవము లభించాయి. అయితే మనిషిగా పుట్టినవానికి ఏమీ తెలియదు. కలిగినదంతా తన బుద్ధి వలననే కలిగాయి అని తన భావములో ఎల్లప్పుడు అనుకోవడము జరిగినది. అన్నీ కర్మప్రకారమే అయినా, మనిషిలోని భావములు మాత్రము కర్మ ప్రకారముండవు. మనిషిలోని భావములు వాని స్వంతము. మనిషి ఏ భావమునయినా పొందునట్లు దేవుడు జీవునికి పూర్తి స్వతంత్రత కల్గించాడు. అయితే చేయబడు కార్యములలో గానీ, అనుభవించు కర్మలలోగానీ మనిషికి ఎటువంటి స్వతంత్రత లేదు.
భావ స్వతంత్రము జీవునికి ప్రాథమిక హక్కులాంటిది. మనిషి స్వంత భావములు వాని బుద్ధి నుండి పుట్టుచుండును. సర్వ జీవరాసులకు భావముల గని వాని బుద్ధియే. వాని బుద్ధి భూమిలోని గనిలాంటిది. భూమిని బట్టి గని లోపలి ఖనిజము లభించునని చెప్పినట్లు, మనిషిలోని బుద్ధిని బట్టి అందులోని భావములుండును. మనిషిలోని బుద్ధికి భావ స్వాతంత్య్రము కలదు. మనిషి బుద్ధి అజ్ఞానముతో నిండియుంటే వాని బుద్ధి నుండి అజ్ఞాన భావములు బయటికి వచ్చుచుండును. ఒకవేళ వాని బుద్ధి జ్ఞానముతో నిండియుంటే వానినుండి వచ్చు భావములన్నియూ పూర్తి జ్ఞానముతో నిండియుండును. మనిషి అజ్ఞానములో వేయి రకములు, జ్ఞానములో వేయి విధములు ఉండుట వలన మనిషి భావములు మొత్తము రెండువేల సంఖ్యలో గలవని చెప్పవచ్చును.
వేయియుగములు దేవుని పగలు, వేయి యుగములు దేవుని రాత్రియని చెప్పినట్లు మనిషి అజ్ఞానము వేయి విధములు, జ్ఞానము వేయి విధములు దేవుని రాత్రింబగళ్ళకు గుర్తుగా పెట్టబడినది. దేవుని పగలు అజ్ఞానమునకు గుర్తుగా, దేవుని రాత్రి జ్ఞానమునకు గుర్తుగా లెక్కించి, ఆ గుర్తులు మనిషి బుద్ధిలో చిత్రీకరించి, మనిషి భావములు అజ్ఞానమునకు సంబంధించినవి వేయి, జ్ఞానమునకు సంబంధించినవి వేయి కలవని చెప్పారు. పగళ్ళులో ఎండకాలము పగలు, చలికాలము పగలు ఉన్నట్లు, రాత్రిళ్ళలో వెన్నెల రాత్రులు, చీకటి రాత్రులు ఉన్నట్లు మనిషిలోని బుద్ధి వేయి విధములయినా, అందులో కూడా అనేక హెచ్చుతగ్గు బుద్ధుల భావములు ఉండును. ఇట్లు మనిషి బుద్ధి జ్ఞానములోగానీ, అజ్ఞానములోగానీ శాఖోపశాఖలై ఉండును.
మనిషి జ్ఞానముకంటే అజ్ఞానములో ఉండేవారే ఎక్కువ శాతము ఉండుట వలన వారిలో భావములన్నీ అజ్ఞాన భావములే ఉండును. ఎన్నో వేలసంఖ్యలో అజ్ఞాన భావములుండుట వలన మనిషి తలంపులో అవియే బయటికి వచ్చుచుండును. అదే విధముగా జ్ఞానముతో కూడుకొన్న బుద్ధి గలవారికి జ్ఞానముతో కూడుకొన్న భావములే వచ్చుచుండును. బుద్ధి భావములతో సంబంధము లేనిది ''దేవునిలోనికి ఐక్యము కావాలను ఉద్దేశ్యము.'' అది ఒక్కటి తప్ప మిగతా జ్ఞాన, అజ్ఞాన భావములన్నీ మనిషికి పాపపుణ్యములను తెచ్చిపెట్టుచుండును. అజ్ఞానములో ఎన్నో శాఖలు, జ్ఞానములో ఎన్నో శాఖలు ఉండుట వలన వాటినే మంచి, చెడు శాఖలని చెప్పవచ్చును. యోగమునకు తప్ప మిగతా కార్యముల ఎడల బుద్ధి పని చేసినా, అందులో జ్ఞాన భావములు బయలుదేరినా, అవి దేవున్ని చేర్చు యోగమునకు సంబంధించినవి కాకపోవడము వలన వాటి వలన పుణ్యము లభించవచ్చునని పెద్దలు చెప్పారు. అజ్ఞాన భావము వలన పాపము లభించునని వేరే చెప్పనవసరము లేదు.
మనిషి జీవితమంతా ముందే నిర్ణయింపబడిన కర్మప్రకారము జరుగునప్పుడు, అందులో జీవుని స్వతంత్రము ఏమీ లేనప్పుడు వాస్తవముగా క్రొత్త కర్మ వచ్చుటకు అవకాశమే లేదు. అయితే మనిషికున్న భావ స్వాతంత్య్రము వలన, బుద్ధి మనిషికి అనేక భావములను అందించుట వలన జీవుడు శరీరములో ఏమీ చేయకున్ననూ, బుద్ధి భావములు అహమ్ భావములుగా మారుట వలన క్రొత్త కర్మ (ఆగామికర్మ) ఏర్పడుచున్నది. మనిషి ప్రారబ్ధకర్మను అనుభవిస్తూ, అన్ని పనులకు తానే కారణమని అనుకోవడము వలన జరిగిపోయిన కర్మ తిరిగి ఏర్పడుచున్నది. మనిషిలోని అహము యొక్క భావముల వలన జరుగుచున్న ప్రారబ్ధము తిరిగి ఆగామికర్మగా తయారగుచున్నది. మనిషి బుద్ధి వలన వచ్చు భావములకు అహము చేరి క్రొత్త కర్మలు వచ్చుచున్నవి. అహము వలన వచ్చు భావముల వలన గతములో ప్రారబ్ధముగా యున్న కర్మ తిరిగి ఆగామికర్మగా వచ్చుచున్నది. మనిషి బుద్ధి వలన ఏర్పడు క్రొత్త భావముల వలన సరికొత్త కర్మ ఏర్పడుచున్నది. విషయము అర్థమగుటకు ఉదాహరణగా చెప్పుకొంటే రాజకీయ పదవిలో యున్నవాడు వాని కర్మప్రకారము పదవి, హోదా, డబ్బు కలిగినా వానిలోని అహము అన్నీ తనవలనే వచ్చినట్లు తలచుట వలన క్రొత్త కర్మ వచ్చి చేరుచున్నది. జరిగిన పనిని జీవుడు చేసినట్లే లెక్కించి ఆ పనులలోని కర్మను జీవునికి చేరునట్లు లోపలి ఆత్మే చేయుచున్నది. బుద్ధి క్రొత్త భావములను అందించుట వలన, బుద్ధి భావములను జీవుని భావములే యని అహము జీవున్ని అనుకొనునట్లు చేయుట వలన బుద్ధి వలన కూడా క్రొత్త కర్మ వచ్చుచున్నది.
బుద్ధి వలన పుట్టు ప్రతి భావముతో అహము చేరి, జీవుని భావముగా చేయుట వలన అహము సాంద్రతనుబట్టి కర్మ సాంద్రత పెరుగుచుండును. మనిషి బుద్ధికి భావములు స్వంతమయిన దానివలన, దానికి కర్మ పరిమితియన్నది ఏదీ లేని దానివలన, రాజకీయ నాయకుడు ఒక ఆధ్యాత్మికవేత్తకంటే, ఒక యోగికంటే తననే గొప్పవానిగా తలచుట వలన ఆ భావమునకు అహము చేరుట వలన, ''నిజమే! నీవే యోగికంటే గొప్పవానివి'' అని చెప్పుట వలన వాని భావమునకు సరితూగు కర్మ వచ్చి అతనికి చేరును. బుద్ధి భావములో ఒక యోగికి చెడు చేయాలని, అతనికి నష్టమును, కష్టమును చేయాలని అలా చేయుట వలన ప్రజల చేత గౌరవించబడు యోగి కూడా తన క్రిందికి వచ్చి తనే గొప్పయనీ, తనను పొగడవలెనని భావించినప్పుడు దానికి ప్రక్కనేయున్న అహము చేరుట చేత వాడు ఆ పని చేయకున్ననూ చేసినట్లగుచున్నది. అప్పుడు దేవుని చట్టము ప్రకారము అనగా! దేవుని జ్ఞానము ప్రకారము క్రొత్త కర్మ (పాపము) వచ్చి అతని కర్మచక్రములో చేరిపోవుచున్నది. ప్రపంచ విషయములైతే దానివలన వచ్చు కర్మ ప్రపంచములో సాధారణముగా అనుభవించునదై ఉండును. అలాకాక దేవుని విషయములోనయినా, దేవుని జ్ఞాన విషయములోనయినా, తప్పు భావము, హేళన భావము, యోగులను జ్ఞానులను బాధించు వేధించు భావము కల్గుట వలన వాడు ఎంత పెద్ద రాజకీయ పదవిలో యున్నా, వానికి ప్రత్యేకమైన కర్మ అంటుకొనును. అటువంటి కర్మలు రెండు రకములుగా యుండును.
దేవుడు మనిషిగా వచ్చి పుట్టినప్పుడు అనగా! భగవంతునిగా యున్నప్పుడు, పదవిలో యున్న వాని బుద్ధి భావములో చెడు యోచన వస్తే, దానికి అహము చేరుట వలన అది పాపముగా మారుటకు అవకాశము గలదు. అటువంటి పాపము నేరుగా అన్ని కర్మలు చేరినట్లే వాని కర్మచక్రమును చేరియుండి, తర్వాత జన్మలో అనుభవమునకు వచ్చును. అలా వచ్చు పాపము రెండవ జన్మనుండి అనుభవమునకు వచ్చును. దానిని గురించి ఇంజీలు (బైబిలు) గ్రంథములో ''ఈ యుగములోనూ రాబోవు యుగములోనూ పాపమును అనుభవించవలెనని'' చెప్పియున్నారు. అనవసరముగా చెడు తలచి రెండు యుగముల కాలము ప్రతి జన్మలోనూ, నిత్యము పాపము అనుభవించవలెనని కలదు. (మత్తయి-12-31, 32) ''మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గానీ, ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వానికి పాపక్షమాపణ కలదు గానీ, పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైననూ రాబోవు యుగమందైననూ పాపక్షమాపణ లేదు.''
అధికారము, ధనము యున్నవారు తామే అందరికంటే గొప్పయను భావముతో యోగులను సహితము అగౌరవముగా మాట్లాడడము, వారికి వ్యతిరేఖముగా చేయడము చేయుచుందురు. అలా చేయకున్నా యోగుల ఎడల వ్యతిరేఖ భావము వస్తే అది మహా పాపముగా పరిగణించబడును. సామాన్య మనుషుల ఎడల చేసే పాపము ఎప్పుడయినా జ్ఞానమార్గములోనికి వచ్చినవానికి క్షమించబడును. అయితే దేవుడే మనిషిగా వస్తే ఆయనను తప్పుగా తలచినా, ఆయనకు చెడు చేసినా ఆ పాపము క్షమించబడదు. మనుషులలో జ్ఞానము తెలిసి యోగులుగా యున్నవారిని చెడుగా భావించితే వారికి కూడా పాపము వస్తుంది. వారి పాపము సామాన్య మానవుని పాపమువలె కాకుండా, మనిషిగా యున్న భగవంతుని ఎడల చేసిన పాపము వలె కాకుండా వేరుగాయుండును. మనుషుల యెడల చేసిన పాపముగానీ, మనిషి ఆకారములో దేవుడే యున్నప్పుడు ఆయన ఎడల చేసిన పాపముగానీ నేరుగా మనిషి కర్మచక్రమును చేరియుండి రెండవ జన్మలో అది అనుభవ మునకు వచ్చును. సాధారణ మనిషి వలన వచ్చిన పాపము సాధారణ కష్టముల వలన, రోగముల వలన అనేక బాధల వలన, అనేక దుఃఖముల వలన అనుభవములను పొందవలసియుండును. అదే దేవుడు మనిషిగా వచ్చినప్పుడు ఆయన ఎడల చేసిన పాపము తర్వాత జన్మలోనే ప్రారంభమయినా అప్పటినుండి అది రెండు యుగముల పర్యంతము నిత్యము పాప అనుభవముతో కూడుకొనియుండును.
ఒక్క యోగుల విషయములో మాత్రము వచ్చిన పాపము కర్మ చక్రమును చేరదు. మరు జన్మమున అనుభవమునకు రాదు. మనిషి యోగిగా యున్నప్పుడు పూర్తి జ్ఞానసంపన్నుడై దానిని ఆచరించు వాడైనప్పుడు ధనము, అధికారము యున్నవారు తమ బుద్ధిలో నేనే గొప్పయను భావము పుట్టగా, అది అహమును చేరి అహంభావముగా మారగా, అప్పుడు యోగిని అగౌరవముగా ఆలోచించినందుకు గానీ లేక ఏదయినా వ్యతిరేఖమైన పనులు చేయుట వలన ఏర్పడిన పాపమును గానీ, అది సామాన్యముగా అహంభావము పొందిన మనిషి తలలోని కర్మచక్రములో చేరదు. అది అప్పుడే అదే జన్మలోనే కొద్దికాలము వ్యవధిలోనే అనుభవమునకు వచ్చును. అట్లు పాలకులు చేయుచున్నారు. ఒకవేళ యోగుల ఎడల చేసిన పాపము అప్పుడే అదే జన్మలో అనుభవమునకు రాకపోతే అది కర్మచక్రము చేరినదని అనుకోవలెను. అనుభవమునకు రాని కర్మ, కర్మచక్రములో చేరి తర్వాత జన్మలో రెండు యుగముల కాలము అనుభవమునకు వచ్చును. ప్రస్తుత కాలములో ఒక యోగిపట్ల చెడు భావమును కల్గిన రాజకీయ నాయకున్ని చూచాను. అతడు జనబలము, ధన బలముతో తన బుద్ధే గొప్పదని అనుకొని, యోగి ఎడల తప్పు భావములు, ఇబ్బంది పెట్టు పనులు చేయుట జరుగుచున్నది. అతనికి పాపము వచ్చియుండును. అయితే ప్రస్తుత కాలములో ఎంతమాత్రము అనుభవమునకు రాలేదు. అతను అన్ని రకముల బాగున్నాడు, ఏ పాప అనుభవము అతను పొందలేదు. గ్రహములు, భూతములు అతను యోగుల ఎడల చేయు అరాచకములను చూచి కూడా ఊరకయున్నారంటే వానికి ప్రత్యేకముగా శిక్షించుటకు వాని కర్మను కర్మచక్రములోనికి పంపారని తెలియుచున్నది. అతను రెండు యుగముల పాప అనుభవమునకు అర్హుడయినాడని నాకు అర్థమయినది.
కర్మల విషయము ఇంతవరకు ఎవరూ చెప్పలేదని, ఇప్పుడు నేను చెప్పినది క్రొత్తగా యున్నదని, దీనిని నమ్మకపోతే మీరే జ్ఞానములో నష్ట పోయినవారగుదురు. మీరు అనేక రహస్యములు తెలియు కాలము వచ్చినది కావున నా ద్వారా క్రొత్త రహస్యములను వినగలుగుచున్నారు. దేవుని పాలకులు తమకు ఇవ్వబడిన ఆజ్ఞలను తప్పక ఆచరించి పాపపుణ్య అనుభవములను న్యాయబద్దముగా అందించుచున్నారు. దేవుని జ్ఞానమును తెలిసిన జ్ఞానుల ఎడల మరియు జ్ఞానమును ఆచరించు యోగుల ఎడల ఇతరులు చేసిన పాపములు కర్మచక్రము చేరనప్పుడు, వారిని శిక్షించు బాధ్యత రెండు రకముల పాలకులకు ఉంది. అయితే తమ ఇష్టమొచ్చినట్లు ఏదీ చేయక, ప్రతీదీ ఆజ్ఞను అనుసరించి చేయుచుందురు. శరీరములోని ఆత్మ వాని పాపమును కర్మచక్రములో చేర్చుకొనక బయటికి పారవేసినప్పుడు ప్రప్రథమముగా భూమిని ఆకాశమును సృష్ఠించిన దేవుడు అన్నీ తెలిసినవాడై ఆ పాపమును అప్పుడే అనుభవమునకు వచ్చునట్లు సంకల్పించుకొనగా ఆ సంకల్పమును స్వీకరించిన సూర్యగ్రహము, మహాభూతమైన భూమి ఎలా ఆ పాపమును అనుభవింపజేయాలో పథకమును రచించి తమ పాలకులకు తెలుపగా వారు తప్పక అమలు చేయుదురు. అలా అమలు చేయగా ఏ రోగము లేకుండా చనిపోయిన వారు కొందరిని చూచాను. అట్లే ప్రమాదము లేనిచోట కూడా ప్రమాదము జరిగి అంగ లోపము పొందిన వారిని, చనిపోయిన వారినీ చూచాను. పాము కరచి చనిపోయిన వారిని చూచాను. నేను చూచినవి వేల సంఖ్యలో గలవు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన బాధలను అనుభవించారు. భూతముల పనైతే నేరుగా చంపడము జరుగును. గ్రహముల పనైతే బాధించడము జరుగును. రెండింటినీ చూచాను కావున ఇప్పుడు చెప్పగలుగుచున్నాను.
దేవుడు తన సంకల్పము ద్వారా తన పాలకులకు ఎలా ఆజ్ఞను ఇచ్చుచున్నాడో తెలియుటకు ఇదంతయూ చెప్పవలసి వచ్చినది. అత్యవసరముగా కర్మలను రద్దు చేయుటకుగానీ, అమలు పరచుటకుగానీ తన సంకల్పముతో తెలుపగా దానినే దేవుని ఆజ్ఞగా భావించి పాలకులయిన గ్రహములు, భూతములు పని చేయుచున్నారు. ఈ విధముగా కర్మ పాలనలో చాలా జాగ్రత్తగా పాలకులు పని చేయుచుందురు. ఒక్క పాపమును అనుభవింపజేయడములోనే కాకుండా పుణ్యమును అనుభవింప జేయడములో కూడా ఒకే విధముగా పని చేయుచున్నారు. పాలకులు కేవలము అనుభవములను అనుభవింపజేయుటకే కాకుండా, ప్రపంచములో శరీరము బయట జరుగు కార్యములను అన్నిటినీ చేయుచున్నారు. శరీరము లోపల ఆత్మే కార్యకర్తగా పనిచేయుచుండగా, శరీరము బయట కార్యములన్నిటినీ భూతములు, గ్రహములు చేయుచున్నవి. అందువలన బరువులను మోసుకొని పోవు ఓడలలో కనిపించని పాలకుల పని జరుగు చున్నది. పాలకులు పడవలను క్షేమముగా గట్టుకు చేర్చుచున్నారని అదే ఆ పనిలో 'నిదర్శనమని' తెలియుచున్నది.
దేవుని పాలనలో ఎన్నో పనులు ప్రపంచ వ్యాప్తముగా యున్నవి. వాటిలో కొన్నింటిని మాత్రము చెప్పి, అర్థమగునట్లు చేయుట వలన మిగతావన్నీ అర్థమగునని దేవుడు కొన్నింటిని ఇక్కడ చెప్పాడు. అందులో నాల్గవది ఇలా కలదు. ''ఆకాశము నుండి అల్లాహ్ వర్షపు నీటిని కురిపించి మాతృ భూమిని బ్రతికించడములో'' బీడు భూముల మీద వర్షమును కురిపించి, అవి పచ్చని పైరుతోగానీ, గడ్డితోగానీ నిండునట్లు చేయడము చాలా పెద్ద కార్యము. అయినా మనిషికి సర్వసాధారణముగా జరుగు కార్యముగా కనిపించుచుండును. ఎక్కడయినా కనుచూపు మేర ఖాళీ భూములు కనిపించడము అందులో గడ్డిగానీ, చిన్న మొక్కలుగానీ లేకుండడము వలన ఎండు భూములుగా కనిపించడము, ఏమాత్రము పచ్చదనము లేకుండడము వలన, భూమి రంగుతో యున్న మైదానములన్నీ వర్షము కురియడము వలన వారము లేక పదిరోజులలో పూర్తి పచ్చదనము చేకూరి, ముందు కనిపించు వట్టి భూముల దృశ్యము కనిపించకుండా పోవును. అలా ఒక్కమారుగా భూమి అంతయూ పచ్చదనము సంతరించు కోవడము ప్రతి సంవత్సరము సాధారణముగా కనిపించినా, మనకు తెలియకుండా దాని వెనుక ఎంతో కృషి, ఎందరో శ్రమించడము జరుగు చున్నది.
ఈ విషయము తెలియుటకు ఒక పరిశోధనవలె మనము కొన్ని కార్యములు చేసి చూస్తాము. ఒక పది ఎకరముల బీడు భూమిని తీసుకొని దానిచుట్టూ మట్టికట్టలు వేసి, బయటి నీరు లోపలికిగానీ, లోపలి నీరు బయటికిగానీ రాకుండా పోకుండా చేసి, లోపలి పది ఎకరముల భూమిని చదును చేసి ఆ భూమిలో అంతకుముందున్న ఏ విత్తనములు లేకుండా పోవునట్లు పొలమంతా చెత్త వేసి అగ్గిపెట్టి కాల్చవలెను. చెత్త పది, పదిహేను నిమిషములు కాలునట్లు చేస్తే, అప్పుడు ఆ భూమిలో యున్న పోషక పదార్థములు, గడ్డి విత్తనములు మిగతావి ఏవియున్నా కాలిపోవును. తర్వాత వర్షము వచ్చినా ఆ పది ఎకరములు బాగా వర్షపు నీరుతో తడిసినా మొలకెత్తే దానికి విత్తనములుండవు. అట్లే మొలచిన గడ్డి బ్రతికే దానికి కావలసిన పోషక పదార్థములు ఉండవు. అయినా వర్షము వస్తే యథాతథముగా గడ్డి మొలచి పెరుగుచున్నది. అప్పుడు అక్కడ గడ్డి మొలచేదానికి విత్తనములు ఎక్కడినుండి వచ్చాయని? ఆలోచించవలసిన పని ఏర్పడుచున్నది. ఎంత ఆలోచించినా దానికి సమాధానము దొరదు.
అదే విధముగా మరొక పది ఎకరముల జాగాలో ఆరు అడుగుల లోతు వరకు త్రవ్వి అదేమన్నును చుట్టు కట్టవేసి బయట నీరు లోపలికి రాకుండా చేశారనుకోండి. అప్పుడు ఆరు అడుగుల లోతులో ఒక్క గడ్డి గింజగానీ ఉండుటకు అవకాశమే ఉండదు. అటువంటి స్థలములో కూడా వర్షము వచ్చి నేల తడిస్తే గడ్డి మొలకెత్తును. అంతలోతులో ఏ గింజ లేనిదీ, ఎలా పైరు పచ్చగా మొలచినదని ఆలోచించవలసి వచ్చును. అప్పుడు ఎంతగా ఆలోచించినా జవాబు దొరకడము లేదు. ఇట్లు ప్రకృతిలో మనుషుల వద్ద జవాబు లేని కార్యములు జరుగుచున్నవి. జవాబు ఉన్నా మనిషి ఆ జవాబును నమ్మడము లేదు. నన్ను వాటిని గురించి అడిగితే సులభముగా జవాబును చెప్పగలను. మనకు కనిపించని విధానము వర్షము కురియడము వెనుక, భూములు మొలకెత్తి పచ్చగా ఉండడము వెనుక ఎంతోయున్నదని, దానిని కనిపించని దర్శనమని (దృశ్యమని) చెప్పాము. అదియే 'నిదర్శనము' అని వాక్యములో చెప్పారు. కనిపించనిది కంటికేగానీ బుద్ధికి కాదు. ఇంకొక రకముగా చెప్పితే మనిషికి రెండు రకములయిన చూపు కలదు. ఒకటి బాహ్య కన్నుల ద్వారా చూడవచ్చును. రెండవది బుద్ధ్గి గ్రాహితము ద్వారా తెలియవచ్చును. బుద్ధి గ్రాహితమునే మనోనేత్రము అని చెప్పుచుందురు. దానినే జ్ఞానదృష్ఠి యని కూడా చెప్పు చుందురు. మనస్సుకు చూపు లేదుగానీ బుద్ధికే చూపు గలదు. అయితే అలవాటు ప్రకారము మనోదృష్టియని అనడము జరుగుచున్నది గానీ, మనస్సుకు ఎక్కడా దృష్టి లేదు. ప్రథమ దైవగ్రంథములో జ్ఞానచక్షువు అని బుద్ధినే చెప్పారు. మనో చక్షువు అని ఎక్కడా చెప్పలేదు. అలవాటయిన భాష ప్రకారమైతే మనోనేత్రముతో యని చెప్పవచ్చును. సత్యమును చెప్పాలంటే అలవాటు లేని భాషయినా జ్ఞాననేత్రము లేక బుద్ధిచూపుతో యని చెప్పవచ్చును. నాకున్న బుద్ధి గ్రుడ్డిది కాదు, మంచి చూపుగలది. నా బుద్ధికున్న చూపుతో ఆకాశములో యున్న మేఘముల వరకు చూడగలను. అట్లే శూన్యములో తేలియాడుచున్న కోట్లమైళ్ళ దూరములో యున్న గ్రహ గోళములను చూడగలను. అట్లే ఆకాశ భూతములో గల అంతరార్థమును తెలియగలను. ఇదంతయూ నేను స్వయముగా మాట్లాడడము లేదు. ద్వితీయ దైవగ్రంథములో (మత్తయి-10-20) ''మీ తండ్రి ఆత్మ మీలో యుండి మాట్లాడుచున్నాడేగానీ మాట్లాడువారు మీరు కారు.'' అని చెప్పిన మాటను మరువకూడదు.
నాకు తెలిసిన విషయము చెప్పితే ఆకాశములో భూతముల జాతికి చెందిన మేఘములు గలవు. అట్లే గ్రహముల జాతికి చెందిన ఎ న్నో గ్రహములు గోళములుగా గలవు. ఆకాశములోనున్న భూతములకు ఒక నిర్ధిష్టమైన ఆకారము ఉండదు. గ్రహములన్నియూ గోళముల రూపములో ఉండగా, కొన్ని భూతములు మేఘముల రూపములో యుండగా, మరి కొన్ని భూతములు కంటికి కూడా కనిపించని ఆకారములో రోగములుగా యున్నవి. మేఘములు ఎట్లు సజీవమైనవో అట్లే రోగములు కూడా సజీవమైన పాలకులని ఎవరికీ తెలియదు. ఇప్పుడు సందర్భానుసారము చెప్పితే మేఘములు వర్షమును వర్షించునని అందరికీ తెలుసు. మేఘములలో భూములకు చాలినంత వర్షము నీరు ఎలా నిలువ యున్నదో చాలామందికి తెలియదు. కొందరు చదువుకున్న వారు మేఘములు నీటి ఆవిరిని స్వీకరించి యుండుననీ, చల్లగాలి మేఘములకు తగిలినప్పుడు వర్షించునని చెప్పుచుందురు. ఎండకాలములో సముద్రము నీరు ఆవిరిగా మారగా అదియే మేఘములయినవనీ నీటి ఆవిరే వర్షముగా వస్తున్నదని కొందరు చెప్పుచుందురు. ఈ లెక్కలన్నీ తప్పేనని మేము పది సంవత్సరముల క్రిందటే చెప్పాము. ''దయ్యాల-భూతాల యదార్థ సంఘటనలు'' అను గ్రంథములో వ్రాశాము. సముద్రము నుండిగానీ, మరి ఏ ఇతర స్థలముల నుండిగానీ మేఘములు నీటి ఆవిరిని గ్రహించడము లేదని చెప్పాము. సముద్రము నీరు ఆవిరి అగుటకు వంద సెంటీగ్రేడ్ వేడి అవసరము అనీ, అది ఇంతవరకు ఎక్కడా రాలేదనీ, ఎక్కువ అంటే 50 సెంటిగ్రేడు డిగ్రీల వరకే భూమిమీద ఉష్ణోగ్రత వస్తున్నదనీ, అంతకంటే ఎక్కువ రానప్పుడు నీరు ఎలా ఆవిరవుతుందని అడిగాము. అది అంతయూ కాకిలెక్కలేయని తేలిపోయినది.
మేఘములు భూతములు అని చెప్పాము కదా! భూతములయిన మేఘములు దేవుని పాలకులలోని భాగములేయని జ్ఞాపకముంచుకోవలెను. మేఘములు సముద్రములోని నీరును నేరుగా తమయందు నింపుకొను చున్నవి. ఈ విషయము కంటికి కనిపించునది కాకపోయినా, ఎక్కడయినా సాక్ష్యము కొరకు అందరికీ కనిపించేటట్లు చెరువులలోని నీరంతటినీ పీల్చుకొని రెండు నిమిషములలో చెరువును ఖాళీ చేసినది. దానిని ప్రత్యక్షముగా చూచినవారు గలరు. సముద్రములో నీటిని కనిపించకుండా పీల్చుకొనినా 'తాను ఈ పనిని చేయుచున్నానని' తెలుపునట్లు బయట చెరువులలోని నీరును కొందరు చూస్తున్నట్లే పైకి లాగుకొన్న సందర్భములు గలవు. అలా తీసుకొన్న నీరును కొంతకాలము తనలోనే పెట్టుకొని భూమిమీద ఎక్కడ అవసరమో అక్కడ వర్షించుచున్నవి. ఎక్కడ వర్షించవలెనో మేఘములకు మహాభూతమైన భూమినుండి ఆజ్ఞ వచ్చును. ఆ ఆజ్ఞ ప్రకారమే మేఘములు వర్షించును.
మేఘములు బీడు భూమిలో వర్షించగా అక్కడగల విత్తనములు మొలకెత్తి భూమి పచ్చగా మారిపోవును. ఒకవేళ మొలకెత్తుటకు అక్కడ విత్తనములు లేకపోతే నీరే విత్తనములతో సహా వర్షించును. అక్కడ లేని జంతువులనుగానీ, అక్కడలేని వృక్ష జాతులనుగానీ మేఘములే తెచ్చి అవి లేని జాగాలో వదలుచున్నవి. మేఘములు ఒక వర్షపు పనిని మాత్రమే చేయలేదు. ఒక ప్రాంతములో లేని విత్తనములను, జీవరాసులను మరొక ప్రాంతమునకు తెచ్చి వదలుచున్నవి. ఈ మాటలు ఎవరూ నమ్మలేనివయినా జరుగుచున్న సత్యము అదియే. మేఘము కొన్ని వందల మైళ్ల దూరములో యున్న మొసళ్ళను తెచ్చి అవి లేని ప్రాంతములో వదలిన సంఘటనలు జరిగినవి. అట్లే తాబేళ్ళను ఎక్కడనుండో తెచ్చి ఆ జాతి తాబేళ్ళు లేని జాగాలో క్రొత్తగా వదలడము జరిగినది. ఇట్లు అనేక జంతువులను గానీ, వృక్షజాతులను గానీ, మేఘము ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతమునకు తెస్తున్నవి. అట్లే పక్షులను వాటిలోని నిక్షిప్త రోగములను, రోగములు లేని ప్రాంతములోనికి తెస్తున్నవి. భూమండలములో లేని రోగములను కూడా ఇతర గ్రహములనుండి స్వీకరించి, తెచ్చి ఇక్కడ వదలడము జరుగుచున్నది. ఒక జంతువునుగానీ, కొన్ని జంతువుల మందలనుగానీ (గుంపులనుగానీ) మేఘము తనయందు ఒకటి రెండు రోజులనుండి రెండు మూడు నెలల వరకు ఉంచుకొన్న సందర్భములు గలవు. అన్ని రోజులు ఆ జంతువులకు ఆహారమును సమకూర్చి తనయందే పెట్టుకొన్నవంటే మేఘములు ఎంత శక్తివంతమైనవో అర్థము చేసుకోవచ్చును.
ఆహారము అవసరమైన జంతువులనే కాక, నీరు అవసరమైన చేపలను సహితము తనలో కొంతకాలము పెట్టుకొని వర్షములో ఒక్క చేప కూడా చనిపోకుండా పై నుండి క్రిందికి వదలుచున్నది. ఆకాశము నుండి క్రిందపడితే చేపలు చనిపోవు అవకాశము కలదు, కావున రెండు అడుగుల ఎత్తునుండి క్రిందికి వేయుచున్నది. మేఘము యొక్క చేతులు వేలు, లక్షల సంఖ్యలో యుండునని ముందే చెప్పుకొన్నాము. ప్రతి చేపను ఒక చేయి తెచ్చి క్రింద వదలిపోవుచున్నది. అందువలన క్రిందపడిన ప్రతి చేప చనిపోకుండా బ్రతికేయున్నది. ఇదంతయూ కనిపించక జరుగు చున్నది. చేప కనిపించినా మేఘము చేతులు కనిపించడము లేదు. అట్లే మనకు కనిపించుచున్న వర్షము కొంతే, కనిపించక భూమిమీదికి చేరు నీరు కొన్నిచోట్ల ఎక్కువగాయుండును. కొన్ని ప్రాంతములలో కురిసే వర్షమునకు క్రింద ప్రవహించే నీరుకు సంబంధము లేని విధముగా యుండును. కొద్దిసేపు కొంత వర్షము కురిసినా క్రిందికి భూమిమీద చేరిన నీరు ఎక్కువ యుండును. అదంతయూ మేఘముల మహత్యము. మేఘములు ఏమి అనుకుంటే అది చేయగలవు. మేఘముల విషయము ఎవరికీ అర్థము కాదు. మేఘములు రోగములను క్రిందికి తెచ్చును. కొన్ని రోగములు వేరు రూపములలో యుండినా, అవి మేఘముల ఆధారము తోనే క్రిందికి దిగును. అనేక జీవరాసులను, అనేక వృక్ష జాతులను, అనేక విత్తనములను, అనేక వస్తు జాలమును, అనేక జంతు జాలమును ఇట్లు అనేకములయిన వాటిని ఒక ప్రాంతమునుండి మరొక ప్రాంతమునకు మేఘములే చేర్చుచున్నవి. అందువలన భూమిమీద కొన్ని ప్రాంతములలో అంతవరకు లేని క్రొత్త జాతుల పక్షులు, క్రొత్త జాతి మృగములు కనిపించుచుండును. ఎక్కడో ఆఫ్రికా ఖండములో యున్న అరుదైన తాబేళ్లు ఇక్కడ (భారత దేశములో) ఆంధ్రప్రదేశ్లో కనిపించాయంటే అది మేఘముల పనేయని చెప్పవచ్చును. ఇట్లు మనకు తెలియకుండా, కనిపించకుండా వర్షము కురియడములోనూ, బీడుభూములు పచ్చని పైర్లతో నిండడములోనూ, ఆ పైర్లలో జీవసముదాయము నిండిపోవడములోనూ ఎంతో నిదర్శనముగా మేఘములు పని చేయుచున్నవని తెలియవలెను. ఈ విషయమునే ఖుర్ఆన్ గ్రంథములోని 2-164వ వాక్యములో వ్రాశారు.
అంతేకాకుండా అదే వాక్యములో వీచే గాలుల దిశలు మారడములో కూడా నిదర్శనము కలదని చెప్పారు. గాలి కనిపించదుగానీ దాని శక్తి కనిపించుచుండును. 'సజీవమైన దానికే శక్తియుండును' అను సూత్రము ప్రకారము గాలి సజీవమైనదేయని తెలియుచున్నది. జీవము అను దానిని భూతము అనుట సహజము. భూతము అనగా జీవుడు అని అర్థము. గాలి మహా భూతములలో ఒకటియని మనకు తెలుసు. భూతము అను దాని దగ్గర జోడుగా ఆత్మయుండును. సజీవమైన దేనియందు గానీ దానికి సమీపమున ఆత్మయుండును. సజీవమైనదేదయినా శక్తి కల్గియుండును అంటే శక్తినే ఆత్మయని లెక్కించదగును. ఆత్మ వలననే ప్రతి దానికి శక్తి వచ్చుచున్నది. గాలి భూతమైతే ఆ భూతమునకు ఆత్మ శక్తిని ఇచ్చుచున్నది. ఎంత శక్తి అవసరమైతే అంత శక్తిని ఇచ్చుచున్నది. గాలికి అమితమైన శక్తి యుండునని అందరికీ తెలుసు. ఆ శక్తి యంతయూ గాలి వెనుకయుండు ఆత్మదని చాలామందికి తెలియదు. ప్రపంచములో భూతములు కొన్ని కోట్లుయున్నా, మహా భూతములు మాత్రము ఐదేయని చెప్పుచున్నాము. దేవుడే ప్రకృతియనబడు ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు భాగములను భూతములనీ, ఇవి ఐదు ప్రపంచమునకు మూల స్థంభముల లాంటివనీ, వాటిని మహా భూతములని చెప్పారు. అన్ని భూతములకంటే గొప్పవి అయినందున ఈ ఐదును మహా భూతములని చెప్పడమేకాక వాటికి అందరికంటే ఎక్కువ శక్తిని కూడా ఇచ్చాడు. అందువలన ఐదు భూతముల శక్తిని ఎవరూ అంచనావేయలేరు.
గాలి ఎక్కువ శక్తికలదై ఏ దిశకు అయినా వీచు సామర్థ్యము కలదై యున్నది. ఎంతశక్తివంత భూతమైనా దేవుని ఆజ్ఞకు లోబడి పని చేయుచుండును. శూన్యములో ఏ ఆధారము లేని చోట గాలికి దిశలు మారుచున్నవి. గాలి తనకు లభించిన ఆజ్ఞ ప్రకారము దిశలు మార్చు కొంటున్నది. ఏ దిశ నుండి ఏ దిశకు గాలి వీచవలెనో, ఎంత శక్తితో వీచవలెనో అన్ని ఆదేశములు గాలికి చేరియుండును. అంతేకాక ఎక్కడ తనశక్తితో దేనిని కూల్చవలెనో అక్కడ ఆ పనిని గాలి చేయుచున్నది. గాలివలన ఒక్కొక్కప్పుడు ఎంతో నష్టము జరుగును. 'టోర్నడోలు' అను రూపములో గాలి ఎంతటి నష్టమునయినా చేయగలదనీ, ఎందరినయినా చంపగలదనీ, ఎన్ని ఇళ్ళనయినా నేలమట్టము చేయగలదని తెలిసినది. వచ్చిన ఆజ్ఞ ప్రకారము గాలి తన దిశను ఎటయినా మార్చుకోగలదు. ఇదంతయూ నిదర్శనమేయని తెలియవలెను. కనిపించని విధానము అంతయూ బుద్ధి చేత తెలియవచ్చునని వాక్యము చివరిలో చెప్పియుండుట చేత బుద్ధి గ్రాహితశక్తి యున్నవారు అనగా బుద్ధికి చూపుయున్నవారు ఎవరయినా ఈ విషయములలోని కనిపించని విధానమును నేరుగా చూడవచ్చును. అందువలన బుద్ధిగల వారికి ఇందులో నిదర్శనము కలదని చెప్పారు. దాని అర్థము బుద్ధికి చూపున్న వారికి అనగా జ్ఞానదృష్ఠి యున్నవారికి ఈ విషయములన్నియూ తెలియునని చెప్పారు. నేడు భూమిమీద గల మనుషులకు బుద్ధియున్నది గానీ, అది ప్రపంచమునే చూచుచున్నదిగానీ కనిపించని విధానమును జరిగే పనులలో చూడలేకున్నది.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
18. ఉప వాసములు. (2-187), (7-31)
సూరా 7, ఆయత్ 31 ని చూస్తాము.
(7-31) ''ఓ ఆదం సంతతివారలారా! మీరు మస్జీదుకు హాజరైన ప్రతిసారీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. తినండి, త్రాగండి. కానీ మితిమీరకండి. మితిమీరిపోయే వారిని ఆయన (అల్లాహ్) ఇష్టపడడు.''
ఇప్పుడు రెండవ సూరాలోని 187వ ఆయత్‍ను ఇక్కడ చూస్తాము. (2-187) ''ఉపవాస రాత్రులందు మీరు మీ భార్యలతో కలుసు కోవడము మీ కొరకు ధర్మ సమ్మతము చేయబడినది. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. మీరు రహస్యముగా ఆత్మద్రోహానికి పాల్పడుచున్నారనే సంగతి అల్లాహ్‍కు తెలుసు. అయినప్పటికీ ఆయన క్షమా గుణముతో మీ వైపుకు మరలి, మీ తప్పును మన్నించాడు. ఇకనుండి మీరు మీ భార్యలతో ఉపవాస రాత్రులందు రమించడానికి, అల్లాహ్ మీ కొరకు రాసిపెట్టిన దానిని అన్వేషించటానికి మీకు అనుమతివుంది. తొలిజాములోని తెలుపు నడిరేయి నల్లని చారలోనుండి ప్రస్ఫుటమయ్యేవరకు తినండి, త్రాగండి. ఆ తర్వాత వీటినన్నిటిని పరిత్యజించి రాత్రి చీకటి పడేవరకు ఉపవాసము ఉండండి. ఇంకా మీరు మస్జీద్లలో ''ఎతెకాఫ్'' పాటించే కాలములో మాత్రము మీ భార్యలతో సమాగమం జరుపకండి. ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. మీరు వాటి దరిదాపులకు కూడా పోకండి. ప్రజలు అప్రమత్తముగా ఉండేటందుకుగానూ అల్లాహ్ తన ఆయతులను ఇలా విడమరచి చెప్పుచున్నాడు.''
ఈ ఆయత్‍లో 90 శాతము భార్యాభర్తలు ఒకరినొకరు కలుసుకొను విషయముండగా, పది శాతము రాత్రి తినండి, త్రాగండియని పగలు ఉపవాసముండండియని చెప్పియున్నారు. ఈ విషయమును అందరూ ప్రపంచ సంబంధముగానే చూస్తున్నారు. అయితే ముస్లీమ్‍లకు అర్థమయినది పది శాతము చెప్పిన రాత్రి తినండి, పగలు తినవద్దండి అని చెప్పినదే నూరు శాతము అర్థమయినది. ఈ ఆయత్‍లో చెప్పిన 90 శాతము భార్యాభర్తల సంబంధమును వదలివేసి పదిశాతము రాత్రిపూట తినండి అను విషయమునే చెప్పుకొనుచూ దానినే అందరూ ఆచరిస్తున్నారు. మేము ఈ ఆయత్ చూచిన తర్వాత ప్రపంచ సంబంధముగా అర్థము చేసుకొంటే ఈ విషయమును దేవుడు ఎందుకు చెప్పాడు? ఈ విషయములు ప్రపంచ విషయములైనప్పుడు ఈ విషయములతో దేవునికి ఏమి పని ఉండును? అని ఆలోచించాము. ఈ వాక్యముకంటే ముందు 186వ వాక్యమును చెప్పియున్నందున ఆ వాక్యము ప్రకారము 187వ ఆయత్ మనుషులకు అర్థము కాలేదని తెలిసినది. 'పగలు ఉపవాసము' అను విషయము పూర్తి దైవ సంబంధమైనదని తెలిసిపోయినది. వెనక్కు పోయి 184, 185వ వాక్యములను చూచిన తర్వాత 'ఉపవాసము' అనగా తినే తిండికి సంబంధించిన విషయము కాదనీ, దైవికమైన యోగమనీ, అలా ప్రపంచ ధ్యాస లేకుండాపోయి దైవచింతనలో యుండడము ఉపవాసమగుననీ, దానికి కావలసిన జ్ఞానమును గురువువద్ద నుండి పొందడము ఉపదేశము అనీ, ఉపదేశమును పొందినవాడు, ఉపవాసము ఉండవలసిందేనని తెలిసి పోయినది. ఉపదేశమునే 'రంజాన్' అని చెప్పినట్లు, రంజాన్, రోజా అను పదములు ఖుర్ఆన్ గ్రంథముకంటే ముందే కృతయుగములోనే చెప్పబడినవని తెలిసిపోయినది. దానిప్రకారము నిజమైన ఉపదేశమును పొందిన వానిని 185వ వాక్యములో రంజాన్ ను పొందినవాడు అని వ్రాయబడి యుండడము మా భావమునకు చాలా దగ్గరయినది. అప్పుడు 187వ వాక్యములో వ్రాసిన భార్యాభర్తలు కలుసుకోవడమును ధర్మసమ్మతము చేయబడినదని చెప్పియుండడమును గురించి ఆలోచించగా కొంత విషయము అర్థమయినది. అదేమనగా! అక్కడ చెప్పినది భార్యాభర్త శరీర సంబంధముగా కలుసుకోవడమును గురించి కాదు. భార్యాభర్తలు కలుసుకోవడానికి అనగా లైంగిక విషయముల దగ్గర కూడా దైవ సంబంధమైన ధర్మము ఉంటుందా? యని ప్రశ్న రాక తప్పదు. అలా ప్రశ్నించుకొని చూస్తే ఆ విషయములో దేవుడు ఏమీ చెప్పలేదు అనీ, ఆ పనులన్నియూ వారివారి కర్మలనుబట్టి ముందే నిర్ణయింపబడి యుండునని చెప్పక తప్పదు. ప్రతి చిన్న ప్రపంచ విషయము ముందే వ్రాసిపెట్టబడిన కర్మపత్రము ప్రకారము జరిగి తీరవలసిందే. ఈ విషయములో ధర్మమనునది ఉండదు. ఆ విషయము మీద దేవుడు ఎటువంటి ధర్మనిర్ణయము చేయలేదు. వాక్యమును మనము సరిగా గ్రహించుకోలేదు.
గ్రంథ ప్రారంభమందే మూడవ సూరా మొదటిలోనే ఏడవ ఆయత్‍లో ఈ గ్రంథములో ముతషాబిహాత్ వాక్యములున్నవని గ్రంథమును బోధించిన జిబ్రయేల్గారే చెప్పడమైనది. జ్ఞానమును వాక్యరూపములో బోధించగా అది గ్రంథరూపమై ప్రజలలోనికి పోయినప్పుడు దానిని సరిగా అర్థము చేసుకోలేకపోతే చేసిన పని వ్యర్థమగునని జిబ్రయేల్ మొదటే తాను చెప్పిన వాక్యములలో ముతషాబిహాత్ (సూక్ష్మ అర్థములుగల) వాక్యములున్నవని చెప్పడమైనది. జిబ్రయేల్ ముందే చెప్పినా చాలామంది ముస్లీమ్‍లు ముతషాబిహాత్ వాక్యములున్నట్లుగానీ, వాటికి సూక్ష్మమైన అర్థమున్నది అనిగానీ, బయటికి చెప్పుకోవడము లేదు. ఎవడయినా సూక్ష్మముగా వివరము చెప్పువాడు ఉంటే ''ఇవి మనుషులు చెప్పు విషయములు కావు, దీని అర్థము దేవునికే తెలుసు'' అని వానిని హేళన చేయుచున్నారు. మనుషులు స్వయముగా చెప్పలేరు అని నేను కూడా ఒప్పుకొంటాను. అయితే మనిషిలోయున్న దేవుడు చెప్పవచ్చును కదా!యని ఎవరూ అనుకోవడము లేదు. ఈ విధముగా ముతషాబిహాత్ వాక్యముల వివరము మనుషులు తెలియలేకపోయారు.
దేవుడు ముతషాబిహాత్ వాక్యములను చెప్పకుండా స్థూలమైన ముహ్కమాత్ వాక్యాలే చెప్పియుంటే బాగుండేది కదా!యని కొందరు అడుగ వచ్చును. దానికి నా సమాధానము ఏమనగా! దేవుడు అన్నీ తెలిసిన వాడు. ఆయన మనుషులు చదివే వాక్యము మనుషులకు సులభముగా అర్థము కాకూడదనే అటువంటి సూక్ష్మ అర్థముగల వాక్యములను పెట్టాడు. అటువంటి వాక్యములను తెలియాలని ఎవడు తపన పడునో, వానికి 2-186 వాక్యములో చెప్పినట్లు తానే వాని శరీరములోనుండే తెలియజేయును. కష్టమైన వాక్యములు దేవుని మీద నమ్మకము లేనివారికి అర్థము కాకూడదనే ఉద్దేశ్యముతోనే దేవుడు నిగూఢ వాక్యములను ఉంచడము జరిగినది. నేడు ఎంతోమంది ముస్లీమ్‍లు భూమిమీద గలరు. కొన్ని కోట్ల సంఖ్యలో ముస్లీమ్‍లు ఉండగా, అందులో లక్షలు, వేలు, నూర్లు, పదుల సంఖ్యలో కూడా కొన్ని విషయములు సక్రమముగా అర్థమైన వారున్నారని చెప్పలేము. ముస్లీమ్‍లలో ఒక క్రమశిక్షణ గలదు. ఏ ఇతర మతములలో లేని క్రమశిక్షణ ముస్లీమ్‍లలో యుండుటను గొప్పగా చెప్పుకోవచ్చును. అటువంటి గొప్పతనము మిగతా మతములలో లేదనియే చెప్పవచ్చును. అయితే వారి పెద్దలు ఎలా చెప్పితే అలా వినడము క్రమశిక్షణే అయితే అది ప్రపంచ విషయములలో గొప్పగానే కనిపించుచుండును. కనిపించే విధముగా పెద్దల మాటప్రకారము నడువ గల్గుట గొప్ప పనియేయగును. అదే పరమాత్మ (దేవుని) విషయములోనికి వచ్చేటప్పటికి (6-91) ఆయత్‍లో ''నేను చెప్పిన జ్ఞానము మీకుగానీ, మీ పెద్దలకుగానీ తెలియదు'' అని దేవుడే చెప్పియుండుట వలన దేవుని జ్ఞానము వారి పెద్దలకు కూడా తెలియదనియే చెప్పవచ్చును. అందువలన దేవుని జ్ఞాన విషయములో పెద్దలు చెప్పినట్లు వింటాము అనే క్రమశిక్షణే నష్టమును చేకూర్చినది. ప్రపంచ విషయములో గొప్పగా చెప్పబడిన క్రమశిక్షణ జ్ఞాన విషయములో జ్ఞానమును తెలియకుండా చేసినది. పెద్దలు చెప్పినట్లు వినడము వలన వారు చెప్పిన కొన్ని తప్పు భావములు అందరికీ ప్రాకి పోయినవి. ఉపవాస విషయములో అదే జరిగినది. అట్లే భార్యాభర్త కలయిక అను విషయములో అదే జరిగినది.
సూరా రెండు 184, 185 ఆయత్‍లలో చెప్పిన, చెప్పబడిన 'ఉపదేశము' ఏమిటో అక్కడగల 'ఉపవాసము' ఏమిటో తెలియకుండా పోయినది. అదే విధముగా 187వ ఆయత్‍లో 90 పాళ్ళు భార్యాభర్తల కలయిక విషయము చెప్పితే అది దంపతుల శారీరక కలయిక క్రిందికి పోల్చుకొన్నారు. అలా అనుకొనే ముందు ఈ విషయములో దేవునికి సంబంధము లేదు కదా! దేవుడు చెప్పునది జ్ఞాన విషయము కదా! కర్మకు సంబంధించిన ప్రపంచ విషయము ఎందుకు చెప్పును? అని కొద్దిగయినా ఆలోచించలేకపోయారు. మనిషికి ఐదు జ్ఞానేంద్రియముల ద్వారా కష్టములు సుఖములు శరీరములోని జీవునికి చేరుచుండును. ఆహార విషయమునకు వస్తే వాడు చేసుకొన్న కర్మను అనుసరించి వానికి ఏ ఆహారము దొరకవలెనో అది నిర్ణయము ముందే జరిగిపోయివుండును. దేనిని ఎప్పుడు తినవలెనని వ్రాసిపెట్టబడియుంటే అది అప్పుడే లభించును. సుఖ దుఃఖములను ఐదు జ్ఞానేంద్రియముల ద్వారా మనిషి అనుభవించుట జరుగుచున్న సత్యము. నాలుక ద్వారా రుచి అనే సుఖమును అనుభవించవలసి యుండును. మనిషి ఏ మతస్థుడయినా గానీ మతము పైన విషయమేగానీ లోపల మాత్రము అందరికీ అన్ని మతముల వారికీ ఒకే విధానము గలదు. ఒకే నాలుక ద్వారా మనిషి రుచి యను సుఖమునో కష్టమునో అనుభవించ వలసి యుండును. మనిషి ఆహారము నాలుకకు సంబంధించినది. అంటే శరీర ఇంద్రియ సంబంధమైనది. అలాగే భార్యాభర్త శరీర కలయికకు సంబంధించిన విషయము, ఐదు జ్ఞానేంద్రియములలో చర్మమునకు సంబంధించినది. ఇక్కడ ముస్లీమ్కని, హిందువుకని, క్రైస్థవులకని వేరువేరు విధానము ఉండదు. శరీరమున్న వారికందరికీ ఒకే విధానముండును. శరీరములో ఐదు జ్ఞానేంద్రియములు వరుసగా ఇలా గలవు. 1) కన్ను, 2) ముక్కు, 3) నాలుక, 4) చెవి, 5) చర్మము. ఈ ఐదు ప్రపంచ సుఖ దుఃఖములకు ద్వారములలాంటివి. వీటివలననే శరీరములోని జీవునికి కష్టసుఖములు చేరుచుండును. ఆహార సుఖము నాలుక ద్వారా లోపలి జీవునికి చేరగా, భార్యాభర్తల కలయిక సుఖము చర్మము అను జ్ఞానేంద్రియము ద్వారా చేరును. ఈ ఐదు అవయవ సుఖదుఃఖములు మనిషి చేసుకొన్న కర్మనుబట్టి యుండును. ఈ విషయములను దేవుడు మనిషిని జన్మకు పంపినప్పుడే తన తీర్పులో కర్మపత్రముగా వ్రాసి పంపియుండును. కర్మపత్రములో ముందే వ్రాసిన దానిప్రకారమే ఆహారముగానీ, భార్యభర్తలు ఉండడము గానీ జరుగు చుండును. మధ్యలో దేవుడు వీటి జోక్యము చేసుకోడు. జీవుని కర్మనుబట్టి ఆత్మ వానిని తోలుచుండగా, అల్లాహ్ (దేవుడు) సాక్షిగా చూస్తూ యుండును. ఇదే విషయమే సూరా 50, ఆయత్ 21 (50-21)లో చెప్పడమైనది. అక్కడ చెప్పిన వాక్యమును మనుషులు మరువకూడదు.
సుఖదుఃఖములకు అతీతమైనది నిద్ర. దేవుడు మనిషికి కష్ట సుఖములను కర్మబద్దము చేశాడుగానీ నిద్రను కర్మకు అతీతము చేశాడు. అందువలన నిద్రలో సుఖము ఉండదు, కష్టము ఉండదు. సుఖదుఃఖ కర్మలు అమలు కానప్పుడు మనిషి నిద్రలోనికి పోవును. మనిషి పగలు మెలుకువగల్గి కర్మలు ఆచరించునట్లు, రాత్రిపూట కర్మలకు అతీతముగా నిద్రపోవునట్లు దేవుడు నిర్ణయించాడు. నిద్రలో శరీరము అను ప్రకృతి (స్త్రీ), పురుషుడు అనబడు ఆత్మ రెండు ఏకమైపోవును. అప్పుడు పురుషుడుగా యున్న ఆత్మగానీ, ప్రకృతి (స్త్రీ)గాయున్న శరీరముగానీ వేరువేరుగా లేకుండా ఒకటిగాయుండును. దానినే 'స్త్రీ పురుషుల కలయిక' అని అంటారు. శరీరములో నివశించు ఆత్మ శరీరముతో కలిసిపోయినప్పుడు నిద్రయగును. అట్లే శరీరమే ఆత్మలో కలిసినప్పుడు కూడా నిద్రయేయగును. అందువలన ఆత్మ శరీరమును కలియవచ్చును. శరీరము ఆత్మను కలియవచ్చును. ఇక్కడ మీకు అర్థమగుటకు శరీరమును ప్రకృతియనీ, ఆత్మను పురుషుడనీ చెప్పడమైనది. భగవద్గీత గ్రంథములో ప్రకృతివలన తయారయిన శరీరమును స్త్రీ అంశయనీ, ఆత్మను, జీవాత్మను, పరమాత్మను ముగ్గురు పురుషులని చెప్పడమైనది. ఆత్మ పురుషుడని చెప్పుచూ ఆత్మ, శరీరము కలిసినప్పుడు నిద్రయగును. అప్పుడు శరీరములో సుఖదుఃఖములను జీవుడు అనుభవించుట లేదు.
సూరా రెండు ఆయత్ 187లో ప్రకృతి ఆత్మలో కలియవచ్చును. ఆత్మ ప్రకృతిలో కలియవచ్చును అను విషయమును 'మీకు మీ భార్యలు దుస్తులు, మీ భార్యలకు మీరు దుస్తులు' అని చెప్పారు. భార్య అనగా భరించబడునది ప్రకృతియనీ, భర్త అనగా భరించువాడు ఆత్మయనీ తెలియ వలెను. నిద్రను భార్యాభర్తల కలయికగా చూడవలెను. మనిషి రాత్రి పడుకొని నిద్రపోయేదానికి శరీరములో దేవుడు నిర్ణయించాడు. దానినే 'ధర్మసమ్మతము చేయబడినది' అని చెప్పాడు. రాత్రిపూట నిద్ర పోయేది ధర్మసమ్మతము. అందువలన రాత్రిపూట నిద్రపోవడము వలన పాపము రాదు. పగలు పూట నిద్ర అధర్మము. పగలు నిద్ర ధర్మసమ్మతము కానిది. పగలు నిద్ర పోవువారిని 'మీరు రహస్యముగా ఆత్మద్రోహానికి పాల్పడుచున్నారని' చెప్పాడు. అందువలన రాత్రిపూట నిద్రపోవడము ధర్మసమ్మతము చేయబడినది. అయితే తొలిజాములోని తెలుపు చీకటి నుండి కనిపించే వరకు అనగా, నాలుగు నుండి ఆరుగంటల వరకు రెండు గంటలు మీ కొరకు దేవుడు తెల్పిన జ్ఞానమును, వ్రాసిపెట్టబడిన దైవగ్రంథములలో అన్వేషించటానికి అనుమతివుంది అని చెప్పాడు. తెల్లవారుజామున రెండు గంటల కాలము దేవుని జ్ఞానమును గ్రంథములలో వెదకి తెలుసుకొనుటకు దేవుడు అనుమతి ఇచ్చాడు. అందువలన ఆ సమయములో మేల్కొనడము ధర్మసమ్మతమే. మిగతా రాత్రి మేలుకోవడము పగలు చేయవలసిన పనులు రాత్రి చేయడము అధర్మమగును. 'తొలి జాములో తెల్లని సారలు కనిపించే వరకు తినండి, త్రాగండి' అని వున్నది కదా!యని కొందరు అడుగవచ్చును. దానికి నా జవాబు ఇలా కలదు. మీ కొరకు వ్రాసిపెట్టబడిన దానిని అన్వేషించండి అని చెప్పి, ఆ పని చేయవలసింది తెల్లవారు జామున యని చెప్పి, అప్పుడు మీకు చదువువస్తే చదవండి. చదువు రాకపోతే ఇతరుల ద్వారా వినండి అని చెప్పాడు. 'చదవండి, వినండి' అని చెప్పు మాటను చాటుగా 'తినండి, త్రాగండి'యని చెప్పారు. దైవజ్ఞానమంతా అలాగే చెప్పబడుచూ వుంటుంది. దానిని బుద్ధి శ్రద్ధ కల్గినవాడు తెలియగలడు అని (3-7) లో చెప్పడమైనది. తెల్లవారిన తర్వాత వినేది, చదివేది వదలి దానిని ఆచరించుచూ యోగమును (ఉపవాసమును) చేయవలెను. యోగము (ఉపవాసము) అనగా జీవాత్మ, ఆత్మతో కలిసి నివశించడము అని అర్థము. ఆత్మ, జీవాత్మ కలిసియుండు దానిని 'యోగము' అని అంటాము. దానినే వాక్యములో ఉపవాసము అని చెప్పాడు. పగలు యోగము, రాత్రి నిద్ర, తెల్లవారు జామున జ్ఞానము తెలియుట మనిషికి ధర్మసమ్మతము చేయుటయని ఈ వాక్యములో తెలిసినది. దేవుడు చెప్పిన విషయమును సూక్ష్మముగానే యోచించాలి గానీ, స్థూలముగా యోచించితే అక్కడ చెప్పిన జ్ఞాన రహస్యము తెలియకుండా పోతుంది. కొందరు మత పెద్దలు తాము చెప్పు జ్ఞానమును సూక్ష్మముగా చెప్పక స్థూలముగా చెప్పారు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
19. అత్యంత సమీపమున ఉన్నది. (2-186)
ప్రపంచములో మనిషి అనువానికి అత్యంత సమీపమున అనేక సమయములలో అనేక వస్తువులలో, మనుషులలో, జంతువులలో, పక్షులలో ఏవయినా ఉండవచ్చును. అయితే అవి ఎల్లప్పుడూ దగ్గరగా యుండక కొన్ని సమయములలో మాత్రము దగ్గరయుండి తర్వాత దూరముగా పోవడము జరుగుచున్నది. ఎల్లప్పుడు దగ్గరగాయుండునది, ఏ సమయములో కూడా మనిషికి దూరముగా పోనిది ఏదయినా ఉన్నది అంటే అది శరీరమే యని చెప్పవచ్చును. ఎవని శరీరము వానికి ఎల్లప్పుడు దగ్గరగా యున్నదని చెప్పవచ్చును. అట్లు చెప్పినా అది సరియైన జవాబు కాదని తెలియుచున్నది. ఎందుకనగా! మనిషి సజీవముగా యున్నంతవరకు జీవునికి దగ్గరగా వాని శరీరము యున్నా మరణములో అది దూరముగా పోవుచున్నది. జీవుడు శరీరమును వదలి దూరముగా పోవుచున్నాడు. అప్పుడు ఎల్లప్పుడు దగ్గరగా ఉండునది అనుమాట శరీరమునకు కూడా వర్తించదు.
ఇట్లు లెక్కించుచూ పోతే భూమిమీదున్నది వస్తువుగానీ, చివరకు శరీరముగానీ ఏదీ కూడా జీవునకు దగ్గరగా లేదని తెలియుచున్నది. ప్రపంచము పుట్టినప్పుడు నుండి, అనగా నీవు శరీరముతో పుట్టినప్పటినుండి ఇంతవరకు జీవునికి అత్యంత సమీపముగా యున్నది ఆత్మేనని తెలియు చున్నది. జీవునికి శరీరమున్నప్పుడుగానీ, శరీరము లేనప్పుడుగానీ ఎప్పటికీ జీవునికి అత్యంత దగ్గరగా యున్నవాడు ఆత్మయని మూడు దైవ గ్రంథములలో చెప్పబడినది. జీవాత్మతో ఎప్పుడూ కూడుకొనియుండువాడు అని ఆత్మను 'కూటస్థుడు' అని ప్రథమ దైవగ్రంథములో చెప్పారు. ద్వితీయ దైవగ్రంథములో ప్రక్కనేయున్నవాడు అను ఉద్దేశ్యముతో 'పొరుగువాడు' అని చెప్పారు. అంతిమ దైవగ్రంథములో ఎల్లప్పుడు 'త్రోలేవాడు' అని చెప్పియున్నారు. ఎల్లప్పుడు జీవున్ని త్రోలాలి అంటే త్రోలే ఆత్మ జీవున్ని అంటి పెట్టుకొని ఉంటుంది అని తెలియుచున్నది. చావులోగానీ, పుట్టుకలో గానీ, జీవితములో గానీ జీవున్ని అంటిపెట్టుకొని అతి సమీపమున ఎల్లప్పుడు యున్నది ఆత్మేనని తెలియుచున్నది. మనిషికి (జీవునికి) అతి దగ్గరగా యున్నది ఆత్మే అయివుండుట వలన, జీవున్ని నడుపుచున్నది ఆత్మేనని కూడా తెలియుచున్నది. జీవుని ప్రతి మాటను దగ్గరుండి ఆత్మ వినుచున్నది. అవసరమొస్తే, జీవుడు తన భక్తుడు అయితే, వానికి వచ్చిన ప్రశ్నకు జవాబు కూడా ఆత్మ ఇచ్చుచున్నది. ఈ విషయమై అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో సూరా రెండు, ఆయత్ 186లో ఇలా చెప్పారు చూడండి.
(2-186) ''నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే నేను వారికి అతి సమీపములోనే ఉన్నాను, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును విని జవాబిస్తాను. కాబట్టి వారు సరైన మార్గము పొందటానికి నా ఆజ్ఞను అనుసరించాలి మరియు నాయందు విశ్వాసము కలిగియుండాలి అని చెప్పు.''
దేవుడు అనగా మనుషులు ఆరాధించవలసిన దేవుడైన ఆత్మ స్వయముగా ఈ వాక్యమును చెప్పినట్లు యున్నది. నా భక్తులయిన వారు అడిగితే వారికి మాత్రము చెప్పు, మిగతా అందరికీ చెప్పవద్దు అన్నట్లు ఈ వాక్యములో 'నా దాసులు నన్ను గురించి అడిగితే' అని చెప్పారు. అంతేగాక వారికి అతి సమీపమున ఉన్నానని కూడా ఆత్మ చెప్పియున్నాడు. ఎంత దగ్గర? అను ప్రశ్నకు మనసులో అనుకొన్న దానిని వినగలుగునంత దగ్గరగా శరీరములో దేవుడు ఒక్కడు గలడని స్వయముగా ఆయనే చెప్పి యున్నాడు. తన భక్తుడు అనుకొను ప్రతి మాటను దగ్గరుండి వినగలుగు చున్నాడు. అలా వినినప్పుడు అవసరమైన ప్రతి మాటకు ఆయన (దేవుడు) జవాబు ఇచ్చునని కూడా చెప్పియున్నాడు. ఈ వాక్యమునుబట్టి శరీరములోని జీవునికి, శరీరములోని ఆత్మే దగ్గరగా యున్నదని తెలియుచున్నది.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
20. జ్ఞానముతో వాదించండి. (2-190, 191, 192, 193, 194)
ఎక్కడయినా దేవుని ధర్మ విషయములలో చాలామందికి పూర్తి జ్ఞానము ఉండదు కనుక వారు వేరువేరు అభిప్రాయములు కల్గియుందురు. అసలయిన సత్యమయిన జ్ఞానమును ఒకడు కలిగియుంటే అదే విషయములో అనేక అభిప్రాయములతో అనేకులు ఉండుట వలన నాది సత్యమని ఒకడు అంటే లేదు నాదే సత్యమని ఇంకొకడు అనుట జరుగు చుండును. ఇట్లు ఎవరిది వారు సత్యమని భావించుకోవడము వలన ఒకరికొకరు పొందికలేక వాదించుకొనుటకు పూనుకొందురు. అలాంటప్పుడు వారు జ్ఞాన విషయములలో మాత్రము వాదించు కొనుచున్నారు తప్ప ప్రపంచ విషయములలో కాదు. అందువలన అంతిమ దైవగ్రంథములో సూరా రెండు, ఆయత్ 190 లో ఇలా చెప్పారు చూడండి.
(2-190) ''మీతో పోరాడే వారితో మీరు కూడా దైవమార్గములో పోరాడండి. కానీ మితిమీరకండి. మితిమీరి పోయేవారిని అల్లాహ్ ఇష్టపడడు.''
ఇక్కడ వాక్యములో పోరాటము అని ఉంది. పోరాటము రెండు విషయములలో ఉండును. ఒకటి ప్రపంచ విషయము, రెండు పరమాత్మ సంబంధింత జ్ఞాన విషయములో పోరాటములు ఉండును. పోరాటము అనగా రెండు కర్మేంద్రియముల ద్వారా జరుగునది. మనిషికి ఐదు కర్మేంద్రియములు గలవు. కాళ్లు, చేతులు, నోరు, గుదము, గుహ్యము అను ఐదు కర్మేంద్రియములలో ఒకటి చేతులు, రెండు నోరు ద్వారా పోరాటము జరుగుచుండును. నోరు ద్వారా జరుగునవి మాటలతో కూడు కొని యుండును. చేతులతో చేయు పోరాటము మల్లయుద్దము (కుస్తీ) కావచ్చు, రాళ్లు విసురుకోవడము కావచ్చు, కట్టెలతో కొట్టుకోవడము కావచ్చు, కత్తులతో పొడుచుకోవడము కావచ్చు. ఇక్కడ మనుషులు దేవుని జ్ఞాన విషయములో భేదములు వచ్చినప్పుడు నోటితోనే వాదించవలెను. పరమాత్మ విషయములన్నియూ జ్ఞానము చేత, నోటిమాటతో బోధించబడి యుండును. అందువలన జ్ఞాన విషయములన్నియూ మాటలతోనే నోటి వాదములోనే జరుపవలసియున్నది. అందువలన అల్లాహ్ ముందే ఈ విషయములో మనుషులు పొరపాటు పడకుండా ఉండుటకు ''మీరు దైవమార్గములో పోరాడండి'' యని చెప్పియున్నాడు. దైవ మార్గములో పోరాటము నోటితో మాటలవరకే పరిమితి అయివుండుట వలన మితిమీరి ప్రవర్తించకండి, మితిమీరి పోయే వారిని అల్లాహ్ ఇష్టపడడు అని చెప్పారు. దీనినిబట్టి నోటితోకాక చేతులతో పోరాటము చేయువారిని దేవుడు ఇష్టపడడు అని చెప్పియున్నారు. కావున దేవుని జ్ఞాన విషయము ఏదయినా 'నోటి మాటల పోరాటమే చేయాలి' అని ప్రత్యేకించి చెప్పాడు.
ప్రథమ దైవ గ్రంథములో దేవుడు ధర్మసంస్థాపన నిమిత్తము వచ్చినప్పుడు ధర్మములను నోటితోనే బోధించి, నోటితో మాటల రూపమున చెప్పు జ్ఞానముతో అధర్మవరులను సంహరిస్తాను అని చెప్పాడు. నోటి మాటలతో చంపుతాను అంటే వానిలో ఉండే ఉద్దేశ్యమును (అజ్ఞానమును) లేకుండా చేసి తాను చెప్పు జ్ఞానిగా మార్చడము అని అర్థము. అంతేగానీ భౌతికముగా కత్తులతో చంపుకోవడము కాదు. ఒక వ్యక్తిలోని భావమును మార్చివేసి క్రొత్త భావములోనికి తేవడమును వానిని వాని భావమునుండి చంపివేసినట్లు అగును. ఇక్కడ వాక్యములో పోరాడండి, చంపండి అని అంటే ఇది ప్రపంచ విషయమైతే దానిని బాహ్యముగా అర్థము చేసుకో వచ్చును. దేవుని మార్గములో పోరాటమని వాక్యములో చెప్పియుండుట వలన చంపడము అంటే వాని లోపలి భావమును లేకుండా చేయడము అని అర్థము. అందువలన ఇక్కడ 191, 192, 193, 194 వాక్యములలో చెప్పునదంతా మాటల యుద్ధమేనని, భావమును చంపడమే యని తెలియవలెను. దేవుని (అల్లాహ్) మాటను మితిమీరి పోయేవారిని అల్లాహ్ ఇష్టపడడు అని చెప్పియున్నారు.
మనిషిలోని భావమును మార్చగలిగితే వానిని హత్య చేసిన దానికంటే గొప్పకార్యమగును. అందువలన ఎదుటి మనిషిని భౌతికముగా చంపడములో వీరత్వము లేదు. నిజమైన వీరత్వము ఎదుటి మనిషిని మానసికముగా భావములను చంపితే అదియే నిజమైన వీరత్వము. వాడే నిజమైన వీరుడు. అందువలన మీరు దైవమార్గములో పోరాడండియని (2-190) లో చెప్పియున్నారు.
(2-191) ''వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో తలపడండి. మిమ్ములను ఎక్కడినుండి వారు తరిమికొట్టారో, అక్కడినుండి మీరు కూడా వారిని తరిమికొట్టండి. ఫిత్నా (భావ మార్పిడి చేయడము) అనేది చంపటముకన్నా తీవ్రమైనది, 'మస్జిదె హరామ్'' వద్ద వారు మీతో యుద్ధము చేయనంత వరకు మీరు వారితో పోరాడకండి. వారు గనుక మిమ్ములను హతమార్చడానికి ప్రయత్నిస్తే మీరు కూడా ధీటైన జవాబు ఇవ్వండి. అవిశ్వాసులకు సరైన సమాధానము ఇదే. (192) ''ఒకవేళ వారు గనుక తమ తప్పు భావములను మానుకొంటే నిశ్చయముగా అల్లాహ్ క్షమించే వాడు, కరుణించేవాడు. (193) ''తప్పు భావము సమసిపోనంత వరకు, దైవ ధర్మానిది పై చేయి కానంతవరకు వారితో పోరాడుతూనే (వాదించుచూనే) ఉండండి. ఒకవేళ వారు యుద్ధాన్ని విరమిస్తే మీరు విరమించండి. మెడలు వంచ వలసినది అసత్యవాదులే. (194) ''నిషిద్ధమాసమునకు బదులుగా నిషిద్ధ మాసమున్నది. నిషేధాజ్ఞలు సరిసమానముగా వర్తిస్తాయి. మీపై ఎవరయినా మాటల దౌర్జన్యమునకు ఒడికడితే మీరు కూడా ఆ మేరకు వారి మీద ప్రతీకారముగా మాట్లాడండి. అల్లాహ్‍కు భయపడుతూ ఉండండి. అల్లాహ్ (దేవుడు) భక్తి గలవారికి తోడుగా ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకోండి.''
ఈ విధముగా మొత్తము ఐదు ఆయత్‍లలో (వాక్యములలో) నోటి పోరాట విషయమును గురించి చెప్పారు. 191వ వాక్యములో చెప్పిన దానినిబట్టి జ్ఞాన విషయములో వాదించువారు ఎక్కడ ఎదురై వాదించినా, మీరు కూడా వాదించుటకు తలపడండి. వాదించువారు ఎక్కడ నుండి మొదలు పెట్టి మిమ్ములను ఓడించాలని చూస్తున్నారో, మీరు కూడా అక్కడ నుండే ఆ విషయములనుండే మొదలుపెట్టి వారిని వాదనలో పారిపోవునట్లు, ఓడిపోవునట్లు చేయండి. జ్ఞానములో భావమార్పు (ఫిత్నా) అనునది చంపడముకన్నా పెద్దది. ప్రార్థనా మందిరములలో వారు జ్ఞాన విషయములలో వాదనకు దిగనంతవరకు మీరు కూడా వాదనకు దిగక ఊరక ఉండండి. వారు గనుక మిమ్ములను వాదనలో జయించాలని చూస్తే మీరు కూడా వారితో ధీటుగా వాదించి ఓడించండి. జ్ఞానమును నమ్మని వారికి సరియైన పని అదేయని తెలియండి.
192) ''ఒకవేళ వారు గనుక వారు తప్పు భావములను మానుకొంటే అల్లాహ్ వారిని క్షమించేస్తాడు, కరుణిస్తాడు.''
193) ''తప్పు భావము వారిలో లేకుండా పోవునంతవరకు దైవధర్మానిదే పై చేయి కానంతవరకు వారితో వాదోపవాద పోరాటము చేస్తూనే ఉండండి. ఒకవేళ వారు వాదనలు మానుకొంటే మీరు మానుకోండి. చివరికి మెడలువంచి మాది తప్పని తలలు దించుకోవలసినది అసత్యమును మాట్లాడువారే.''
194) ''మీపై ఎవరయినా మాటల దౌర్జన్యమునకు మొదలు పెడితే మీరు కూడా వారికి బదులుగా మాటలు మొదలు పెట్టి మాట్లాడండి. దేవునికి (అల్లాహ్‍కు) భయపడుతూ ఉండండి. అల్లాహ్ తనమీద భక్తిగలవారికి తోడుగాయుంటాడు అన్న మాటను మరచిపోకండి.''
ఈ విధముగా సూరా రెండులో ఐదు వాక్యములలో మీరు జ్ఞాన విషయములో వాదించు విధానమును తెలుపడము జరిగినది. ఈ వాక్యములలో ''చంపడము, దాడి చేయడము'' అను పదములు వాడబడినా మొదటి వాక్యములోనే ''మీరు పోరాడదలిస్తే దైవమార్గములోనే పోరాడండి'' అని యున్నది. అంతేకాక మితిమీరి పోకండి అని కూడా చెప్పడమైనది. దైవ మార్గములో పోరాటము నోటి మాటలతోనే ఉండును. అందువలన దానిని పరిమితియని అంటున్నాము. నోటి మాటలతో కాకుండా చేతులతో పోరాటము చేయువారు పరిమితి మీరి పోయినట్లగును. దేవుడు చెప్పినట్లు నోటితో కాకుండా చేతులతో పోరాటము చేయువానిని అల్లాహ్ ఇష్టపడడు అని వాక్యములో చెప్పియున్నాడు. అందువలన ఎవరయినా అల్లాహ్‍కు ఇష్టము లేని విధానమును అనుసరించకూడదు. అట్లు అనుసరించిన వాడు అల్లాహ్ (దేవునికి) వ్యతిరేఖముగా ప్రవర్తించినట్లగును.
జ్ఞానములు రెండు రకములు గలవు. ఒకటి ప్రపంచ జ్ఞానము, రెండు పరమాత్మ జ్ఞానము. జ్ఞానము బుద్ధిని ఆధారము చేసుకొని మనిషిలో పెరుగుచుండును. ప్రపంచము మీద శ్రద్ధయున్న వానికి ప్రపంచ జ్ఞానము, దేవుని మీద శ్రద్ధయున్న వానికి దేవుని జ్ఞానము లభించుచుండును. అయితే మిశ్రమ శ్రద్ధలు కొందరిలో ఉండును. కొందరిలో కేవలము ప్రపంచ శ్రద్ధ మాత్రము ఉండును. అటువంటి వారికి ప్రపంచ జ్ఞానము తప్ప పరమాత్మ జ్ఞానము ఏమాత్రము లభించదు. అటువంటి వానికి దేవుడుగానీ దేవుని జ్ఞానముగానీ ఏమీ తెలియదు, చెప్పినా వినే ఓపికగానీ, అర్థము చేసుకొను శక్తిగానీ ఏమాత్రము ఉండదు. ప్రపంచ శ్రద్ధ ఎక్కువ, దేవుని మీద శ్రద్ధ తక్కువ యుండువారు కలరు. అందువలన వారికి మిశ్రమ జ్ఞానము ఏర్పడును. అది పూర్తి ఎటూకాని జ్ఞానము ఉండును. కొందరికి దేవుని జ్ఞానము మీదనే ఎక్కువ శ్రద్ధయుండును ప్రపంచ జ్ఞానము మీద తక్కువ శ్రద్ధయుండును. అటువంటి వానివద్ద యున్న జ్ఞానము స్వచ్ఛమైన దైవజ్ఞానముండును. కొద్దిగ ప్రపంచ జ్ఞానముండుట వలన అది దైవజ్ఞానములో కలియక ప్రత్యేకముగా యుండును. కొందరిలో పూర్తి దైవజ్ఞానము మీదనే శ్రద్దయుండును. అటువంటి వారికి పూర్తి దైవజ్ఞానమే చేరియుండును. వారిలో పేరుకు మాత్రమే ప్రపంచ జ్ఞానముండుట వలన వారు సమాజములో తెలివి తక్కువవారిగా కనిపించుచుందురు. కొంత ప్రపంచ జ్ఞానము, ఎక్కువ దైవజ్ఞానము కల్గినవారిలో మిశ్రమ జ్ఞానమున్న వారు తరచు 'మా జ్ఞానమే గొప్పయని' వాదించుచుందురు. ఉదాహరణగ చెప్పుకొంటే ఎక్కువ ప్రపంచ ధనమున్న వాడు తనవద్ద ధనము ఎక్కువ లేదని చెప్పుచుండును. వానివద్ద కొంత జ్ఞానధనము కొద్దిగయున్నా దానిని ఎక్కువ యున్నట్లు చెప్పుకొనుచుండును. అటువంటివారే ఎక్కువ ప్రపంచ జ్ఞానము, తక్కువ దైవజ్ఞానము కలవారుగా యుందురు. వారు ఎల్లప్పుడు తమవద్ద దైవజ్ఞానము ఎక్కువ వుంది అని తలపోయుచూ ఎక్కువ జ్ఞానమున్న వారితో వాదమునకు దిగుచుందురు. అట్టివారు చివరకు వాదములో ఓడిపోక తప్పదు. అట్లు ఓడిపోయినప్పుడు జ్ఞానులమీద కక్షను పెంచుకొను అవకాశము గలదు. అటువంటివారే ఇతరుల మీద హింసాయుత దాడులకు పాల్పడుచుందురు. అటువంటి దానిని దేవుడు పూర్తి ఖండించుచున్నాడు. అది మంచి పద్ధతి కాదని చెప్పుచున్నాడు. ఖుర్ఆన్‍లో 2-190 నుండి 194 వరకు వీరిని గురించి చెప్పాడు.
అటువంటి తక్కువ జ్ఞానమున్నవారు ఎక్కువ జ్ఞానమున్న వారితో వాదమునకు దిగుచూ తమకు తెలిసిన జ్ఞానమే గొప్పయని చెప్పుచుందురు. వారు మాట్లాడు మాటలలో శాస్త్రబద్ధత ఎంతమాత్రము ఉండదు. అయినా తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్ళున్నాయి, కావున అన్ని కుందేళ్లకు మూడు కాళ్ళుండునని మొండిగా వాదించుచుందురు. ఏ కుందేలుకయినా నాలుగు కాళ్లు ఉంటాయి. నీవు పట్టుకొన్న కుందేలు కుంటిది అంటే వాడు తనమాటను నెగ్గించుకోవాలని చూచును తప్ప తన కుందేలును గురించి ఇది కుంటిదేమో అని అనుకోడు. అటువంటి వారు దేశములో ప్రతిచోట తప్పక ఉందురు.
ఒక గ్రంథములో తెలివితక్కువ వారిని వర్ణించి చెప్పుచూ ''తల తోక తెలియనివారని'' వ్రాసియున్నది. దానిని చూస్తే ఒక జంతువుకు ఇది తల, ఇది తోకయని గుర్తించలేని గ్రుడ్డివారు, తెలివి లేనివారు ఉన్నారని చెప్పియుండగా, మరొక తెలివి తక్కువవాడు దానిని చూచి ఏనుగుకు తలకే తోక యున్నదియని అన్నాడట. అలా ఉండుట వలననే తల తోకయని వ్రాశారు అని చెప్పాడట. అక్కడ వ్రాసినది వేరు, నీవు చెప్పునది వేరని చెప్పినా అతడు గ్రహించలేక తల తోక ఒక్క ఏనుగుకే యున్నదని తొండమును తోకగా పోల్చుకొని చెప్పాడు. కొందరికి తొండము అంటే ఏమిటి? తోక అంటే ఏమిటి?యని వివరము తెలియనివారు అన్నీ తెలిసిన వారితో నాకు తెలిసినదే సత్యము అని అంటున్నారు. ఎలా సత్యము? అని కొంతయినా ఆలోచింప లేకపోవుచున్నారు.
ఆధ్యాత్మిక జ్ఞానమును చెప్పిన వారు ఎవరూ దానిని గ్రంథముగా వ్రాయలేదు. మేము దైవగ్రంథముల విషయమును చెప్పుచున్నాము. కృష్ణుడు జ్ఞానము చెప్పగా, అది భగవద్గీతగా వ్యాసుడు వ్రాశాడుగానీ, కృష్ణుడు వ్రాయలేదు. దైవ గ్రంథములను చెప్పినవారు వ్రాయకూడదని దేవుడు ముందే నిర్ణయము చేశాడు. చెప్పినవాడే వ్రాస్తే తాను చెప్పినది మాత్రమే గ్రంథములో వ్రాయును. అట్లుకాక ఇతరులు వ్రాస్తే చెప్పినది కొంత, చెప్పనిది కొంత వ్రాసి గ్రంథము చేయగలరు. చెప్పినది మాత్రమే ఏ దైవగ్రంథములో ఉండకూడదనీ, చెప్పినది కొంత, చెప్పనిది కొంత దైవగ్రంథములో ఉండవలెనని దేవుని ఉద్దేశ్యము. అందువలన కృష్ణుడు భగవద్గీతను వ్రాయలేదు. అట్లే ఏసు చెప్పిన ఇంజీలు గ్రంథమును (బైబిలు గ్రంథమును) ఏసు వ్రాయలేదు. కృష్ణుడు చెప్పిన జ్ఞానమును వ్యాసుడు ఒక్కడు వ్రాయగా, ఏసు చెప్పిన జ్ఞానమును మత్తయి, మార్కు, లూకా, యోహాన్ అను నలుగురు వ్రాశారు. అలాగే ముహమ్మద్ ప్రవక్త మనుషులకు చెప్పిన జ్ఞానమును ప్రవక్తగారు వ్రాయలేదు. ప్రవక్తగారు వ్రాస్తే తాను చెప్పిన వాక్యములను మాత్రము వ్రాయగలడు. అలా వ్రాయకూడదని అల్లాహ్ యొక్క నిర్ణయము. చెప్పినవి, చెప్పనివి రెండూ, మూడు దైవగ్రంథములలో యున్నవి. అలా ఉన్నప్పుడే జ్ఞానమునకు విలువయని దేవునికి తెలుసు. చీకటి యున్నప్పుడే వెలుగు యొక్క విలువ తెలియును. అట్లే చెడు ప్రక్కన మంచి యుంటే మంచియొక్క విలువ తెలుస్తుంది. అజ్ఞానము ప్రక్కలో జ్ఞానమున్నప్పుడే జ్ఞానము యొక్క ప్రత్యేకత తెలుస్తుంది. అంతేకాక చదివే వానికి నేరుగా అర్థము కాకూడదనీ, ఎవనికయితే జ్ఞానము మీద ఆసక్తి యుండునో వానికి మాత్రమే జ్ఞానము తెలియునట్లు దేవుడే అదే పనిగా మూడు గ్రంథములను చెప్పినవారితో వ్రాయించలేదు. ఇతరులు వ్రాయునట్లు చేశాడు.
అలా వ్రాసినందున కొన్ని పూర్తి జ్ఞాన విషయములున్నా, కొన్ని పూర్తి ప్రపంచ సంబంధ విషయములుండును. దేవుడు తన జ్ఞానమును మాత్రము చెప్పియుండగా, ప్రపంచ ఆస్తులు పంచుకొను విషయము కూడా దేవుడు చెప్పినట్లు గ్రంథములలో వ్రాయబడియున్నది. మూడు గ్రంథములు అలాగే యున్నవి. ఖుర్ఆన్ గ్రంథములోని జ్ఞానము చాలా ప్రత్యేకమయినది. ఎంతోగొప్ప రహస్య జ్ఞానమును చెప్పిన ఘనత ఖుర్ఆన్‍కు ఉన్నది. అట్లే దేవుని జ్ఞానము కాని విషయములు ఎన్నో గ్రంథములో గలవు. బుద్ధిగల వాడు వాని బుద్ధిని ఉపయోగించి, తన జ్ఞానమును తెలియవలెనను ఉద్దేశ్యముతో దేవుడే అలా చేశాడని తెలియుచున్నది. మనిషి శ్రద్ధనుబట్టి అన్నీ కలుపుకొని చదువుకొనువారు గలరు. కొందరు అవసరమైనవే గ్రహించి మిగిలిన వాటిని వదలివేయువారు గలరు. విచక్షణ లేనివారు గ్రంథములోని వాక్యమును తీసుకొని జ్ఞానులతో పోట్లాడుచుందురు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
21. స్వర్గము సులభముగా వస్తుందనుకోవడము పొరపాటు. (2-214)
'స్వర్గము' అనునది మూడు దైవగ్రంథములలో చెప్పబడియున్నది. అయితే స్వర్గము అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంటుంది? అను విషయము నేడు మూడు గ్రంథములను చదివినా, మూడు మతముల వారికి తెలియదని నేను అనుకొంటున్నాను. ఎందుకనగా! మూడు మతములవారు స్వర్గము అనునది ఒక ప్రత్యేకమైన లోకమని అనుకొంటున్నారు. అక్కడే అందరూ స్వర్గమును గురించి అర్థము చేసుకోలేక పోయారని తెలియుచున్నది. మొదటనే తప్పుదారి పట్టినవారు తర్వాత కొంత సత్యమును చెప్పుకొనినా ఏమీ ప్రయోజనముండదు. స్వర్గములో సుఖములు ఉంటాయి, నరకములో కష్టాలు, బాధలు ఉంటాయి అని అనుకోవడము సత్యమే అయినా మనిషికి ప్రయోజనము చేకూర్చునదై ఉండదు. స్వర్గ, నరకములు ఒకదానికొకటి వ్యతిరేఖమైన లోకములనీ, నరకములో శిక్షలతో కూడుకొన్న బాధలుండగా, స్వర్గములో సుఖమయమై ఉండునని చెప్పుకొనుచుందురు.
హిందూమతములో నరకమును గురించిన వివరముల గ్రంథమున్నది. దాని ఆధారముతో దానికి వ్యతిరేఖమైన స్వర్గములో సుఖములను అంచనా వేసుకోవడము జరిగినది. మొదట హిందువులు అనుకొన్నట్లే తర్వాత మిగతా మతములవారు అనుకోవడము జరిగినది. హిందువులలో నరకమును గురించి ఎక్కువగా చెప్పుకోగా, ముస్లీమ్‍లలో స్వర్గమును గురించి ఎక్కువ చెప్పుకోవడము జరిగినది. క్రైస్థవులలో స్వర్గ నరకముల గురించి ఎక్కువగా చెప్పుకోలేదు. హిందువులలో చనిపోయిన మనిషి ముందు స్వర్గానికి పోయి, తన పుణ్యము అయిపోవు వరకు సుఖములు అనుభవించి, తర్వాత పాపమును అనుభవించుటకు నరక లోకమునకు పోయి అక్కడ నరకమును అనుభవించి, పాపము అయిపోయిన వెంటనే తిరిగి భూమిమీద క్రొత్త జన్మ ఎత్తుచున్నాడని చెప్పుకొంటున్నారు. అదే ముస్లీమ్‍లలో అయితే మనిషి జీవితములో చేసుకొన్న దానినిబట్టి స్వర్గమో, నరకమో ఏదో ఒక్కటి లభించుననీ, ఏది లభించితే దానిలోనే శాశ్వితముగా ఉందురని చెప్పుచూ స్వర్గములో మనిషి అనుభవించు సుఖాలను గురించి ఎక్కువగా వ్రాశారు.
స్వర్గ సుఖముల గురించి ఎక్కువగా వర్ణించి చెప్పి దేవుని కొరకు పని చేసినవాడు స్వర్గమునకు పోతాడని, అక్కడ మంచి అందగత్తెలయిన కన్యలుగా యున్న ఆడపిల్లలు సేవలు చేయుచుందురనీ, అట్లే వారితో శరీర సుఖములు పొందవచ్చునని చెప్పియున్నారు. అనుకూలమైన వాతావరణములో అనుకూలమైన అందమైన స్త్రీలతో శాశ్వితముగా స్వర్గములో ఉండిపోవచ్చునని చెప్పియున్నారు. ఎలాగయితేనేమి, స్వర్గము అంటే సుఖాల పుట్టయని చెప్పుకొనుచుందురు. స్వర్గమును గురించి ఇస్లామ్ మతములో ఎక్కువగా చెప్పుకోవడము గలదు. అందువలన ముస్లీమ్‍లందరికీ స్వర్గము నోరు ఊరించు లోకముగాయున్నది. కొందరు యువకులు, దేవుని కొరకు చనిపోతే స్వర్గమునకు పోతారుయను మాటను విని ఇక్కడ నిత్యము ఆర్థికముగా ఇబ్బందులు పడుటకంటే ఏదో ఒక రకముగా దేవుని పనిలో చనిపోతే స్వర్గానికి పోయి శాశ్వితముగా సుఖములు అనుభవించ వచ్చును కదా!యని అనుకొంటున్నారు. అటువంటి యువకులను డబ్బు చూపి ఆకర్షించి, కొందరు వారిని దేవుని పనియని, మతము పని చెప్పి, మతము కొరకు చనిపోతే దేవుని కొరకు చనిపోయినట్లే యని తమ మతముకంటే ఇతర మతములలో యున్నవారు తమ దేవున్ని, తమ మతమును తిరస్కరించినవారనీ, వారిని చంపితే అది దేవుని కొరకు పని చేసినట్లనీ, ఇతరులను చంపు కార్యములో చనిపోతే స్వర్గము వస్తుందని చెప్పడము వలన చాలామంది యువకులు స్వర్గము కొరకు అదే పనిగా చావాలని మనుషుల మీద దాడులు చేయుచున్నారు. అలా ఇతరులను చంపడములో తప్పనిసరిగా వారు కూడా చావవలసిన పని ఏర్పడుచున్నది. అది వారికి తెలిసి అదే పనిగా చనిపోవాలను ఉద్దేశ్యముతో ఉగ్రవాద చర్యలకు పాల్పడుచున్నారు.
అలా ఇతర మతస్థులను చంపడము, తమ దేవుని కొరకు పని చేసినట్లనీ, ఆ పనిని చేయడములో చనిపోతే నేరుగా స్వర్గ లోకానికి పోవచ్చుననీ వారు నమ్మి ఇతరులను చంపి తాము చనిపోతున్నారు. అయితే అంత సులభముగా వారికి స్వర్గము రాదని వారికిగానీ, వారి పెద్దలకుగానీ తెలియదు. నేడు యువకులకు స్వర్గ సుఖముల ఆశచూపి స్వర్గము కొరకు ఉగ్రవాదులుగా కొందరి యువకులను తయారు చేసి, వారు స్వర్గము కొరకు చనిపోవాలను నిర్ణయముతో చేతనయినంత మందిని చంపుదురు. అట్లు వారు చేయుచున్న దాడులలో వారు చనిపోవడము జరుగుచున్నది. దీనినిబట్టి స్వర్గము కొరకు తాము అమాయక ప్రజలను చంపుచున్నారని, అది పాపపు పనియనీ, అటువంటి పాపపు పని వలన నరకమునకు పోవలసి వస్తుందని వారికి తెలియదు. తమకు తెలిసినదే సత్యమని, తమ పెద్దలు చెప్పినదే వాస్తవమని నమ్మి తమ ప్రాణాలను పోగొట్టుకొనుచున్నారు.
'ఉగ్రవాదులు' అను పేరుతో పోలీసుల మీదికో, సైన్యము మీదికో, లేకపోతే ప్రజల మీదికో, ఐదు లేక ఆరుమంది వచ్చి దాడి చేసి, తమ సంఖ్యకు నాలుగు, ఐదు ఇంతలు ఎక్కువమందిని ప్రజలు తేరుకొనే లోపలే చంపి తర్వాత ఎంతమందిని వీలయితే అంతమందిని చంపుటకు ప్రయత్నింతురు. ఇట్లు మారణకాండ సాగించు లోపలే భద్రతా దళముల చేతిలో చనిపోవడము జరుగును. భద్రతా దళములు ఉగ్రవాదులు చనిపోయిన తర్వాత ''ఉగ్రవాదులు ఎవరూ తప్పించుకోకుండా అందరినీ చంపివేశాము'' అని భద్రతా దళాలు చెప్పుకొనును. ఉగ్రవాదులుగా వచ్చిన వారు తప్పించుకోవాలనేది వారి హృదయాలలో ఉండదు. వారు చనిపోవాలనే వచ్చియుందురు. వారు ముందే తాము భద్రతా దళాల చేతిలో చనిపోతామని నిర్ణయము చేసుకొనే వచ్చియుందురు. తప్పించుకొనే దానికి వారికి అవకాశమున్నా వారు తప్పించుకోరు. భద్రతా దళాలు తమను చంపలేని స్థితిలోయున్నా, వారే బయటికి వచ్చి వారు కాల్చే దానికి అవకాశము కల్పించుదురు. వారు స్వర్గము కొరకు చనిపోవాలను ఉద్దేశ్యముతో అక్కడకి వచ్చారే తప్ప తప్పించుకొనుటకు కాదు. ఆ విషయము భద్రతా దళములకు తెలియక మేము ఉగ్రవాదులు తప్పించుకోకుండా అందరినీ చంపివేశామని చెప్పుకొనుచుందురు.
ముఖ్యముగా వారు స్వర్గము అంటే ''వడ్డించిన విస్తరి లాంటిదని'' తలచి మతము కొరకు, దేవుని కొరకు చనిపోతే స్వర్గమే వస్తుందని అదే పనిగా చచ్చుటకే ఉగ్రవాదుల అవతారములో రావడము జరుగుచున్నది. చెప్పి పంపేవారు అలానే చెప్పి పంపుచున్నారు. బాగా గమనించితే ఉగ్ర వాదులుగా మారి చావుటకు సిద్ధమగువారు అందరూ చిన్న వయస్సు వారే అయివుండడము గమనించదగిన విషయము. చిన్న వయస్సు వారికి అవసరమైన స్వర్గము, పెద్ద వయస్సువారికి అవసరము లేదాయని చూస్తే, అది అందరికీ అవసరమే అయితే, చురుకుగా ఇతరులను చంపుటకు చిన్నవయస్సువారే పనికి వస్తారనీ, వారిని తయారు చేసి పంపేవారు అనుకోవడము వలన, అందరినీ చిన్నవయస్సు వారినే పంపడము జరుగు చున్నది. స్వర్గము కొరకు చావుకైనా సిద్ధమయినవారు అందరూ ఆర్థిక ఇబ్బందులతో జీవితమును కష్టముగా సాగించువారే. వారిని అలా తయారగునట్లు చేసి స్వర్గము యొక్క ఆశ చూపు నాయకులకో, పెద్దలకో స్వర్గము అవసరము లేదా! అంత సులభముగా మతము కొరకు చచ్చు చావుతోనే స్వర్గము వచ్చేటట్లయితే, బోధించి పంపు వారిలో కనీసము ఒక్కరయినా స్వర్గము కొరకు చనిపోవుటకు సిద్ధమగుచున్నారా? అని చూస్తే వారు ఎవరూ అలా తయారు కారు. వారు అందరినీ తయారు చేసి పంపడమే వారి లక్ష్యము. ఉగ్రవాదము వలన ఎవడయినా స్వర్గమునకు పోడని వారికి బాగా తెలుసు.
అందువలన వారు ఉగ్రవాదులుగా పోయి చనిపోవడానికి ఎవరూ ముందుకు రారు. వారు అట్లే ఉండి అమాయకులకందరికీ పెద్దల మాటలను వినవలెనను ఆంక్షలు పెట్టి, పెద్దలు చెప్పినట్లే జరుగునని బోధించి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తామని చెప్పి అమాయకులైన ముస్లీమ్‍ల చావుకు కారణమగుచున్నారు. 'చంపు, చావు' అను రెండు మాటలే నేర్పించి పంపు చున్నారు. వారి మాటలు విని అమాయకులైనవారు దేవుని జ్ఞానము మీద శ్రద్ధను వదలి, తమ జీవితములను నాశనము చేసుకోవడమేకాక ఇతర సమాజములలోని మనుషుల జీవితములను కూడా నాశనము చేస్తున్నారు. వాస్తవముగా వారికి దేవుని జ్ఞానము తెలియకనే అలా తయారగుచున్నారు.
ముస్లీమ్‍లను రెండు విధముల విడదీసి చెప్పవచ్చును. ఒక రకము అమాయక ముస్లీమ్‍లు, రెండవ రకము మాయ ముస్లీమ్‍లు. అమాయక ముస్లీమ్‍లు తమ పెద్దలు చెప్పినట్లు వినవలెనను పరిస్థితిలో ఉందురు. వారి మనోబలహీనతను ఆధారము చేసుకొని కొందరు వారి మీద తాము పెద్దలమని చెప్పుచూ పెత్తనము చెలాయిస్తుందురు. ఖుర్ఆన్ గ్రంథము లోనిది వారికి బోధించక మరియొక గ్రంథమే ముఖ్యమని ఆ గ్రంథములోని మత విషయములను, మత సాంప్రదాయ విషయములను నేర్పించి 'మేము మనుషులము' అను మాటను మరచిపోవునట్లు చేసి 'మేము ఫలానా మతస్థులము' అను ధ్యాస వచ్చునట్లు చేయుచున్నారు. ఖురాన్‍లోని జ్ఞానమును బోధించక ముస్లీమ్‍లందరినీ పక్కదారి పట్టించి తమకు అనుకూలముగా మార్చుకుంటున్నారు. అటువంటి స్థితిలో మిగతా ముస్లీమ్‍లందరికీ ఖుర్ఆన్‍లోని జ్ఞానము తెలియకుండా చేశారు. అరబ్బీ భాషలోనే చదువవలెనను నియమమును ఉంచి, అరబ్బీ భాషరాని ఏ దేశము ముస్లీమ్‍లకు గ్రంథజ్ఞానమే తెలియకుండా చేశారు. అరబ్బీ భాష వచ్చిన ప్రాంతము కొంతే అగుట వలన ప్రపంచములో కేవలము పది శాతము ముస్లీమ్‍లే ఖుర్ఆన్‍ను అరబ్బీ భాషలో చదువగలరు. అయితే ఆ పది శాతము మందిలో కూడా ఖుర్ఆన్కంటే ముందు చదువవలసినవి హదీసు గ్రంథములనీ, ప్రవక్త మీద ముస్లీమ్‍లకున్న అభిమానమును అడ్డము పెట్టి ప్రవక్తగారు చెప్పిన నియమములను ముందు పాటించాలనీ, హదీసులను మనుషులకు (ముస్లీమ్‍లకు) పరిచయము చేయుట వలన గల్ఫ్ దేశములలో అరబ్బీ భాష వచ్చిన ముస్లీమ్‍లకు కూడా ఖుర్ఆన్ జ్ఞానము కాకుండా హదీసు వాక్యములనే చెప్పుట వలన పేరుకు ఖుర్ఆన్ గ్రంథము ముస్లీమ్‍లది అని చెప్పుకొన్నా, అందులోని జ్ఞానము ముస్లీమ్‍లకే తెలియకుండా పోయినది. నేడు దైవగ్రంథము ఖుర్ఆన్ కంటే మనుషుల గ్రంథములయిన హదీసులే ముస్లీమ్‍లకు బాగా తెలుసు. మేము స్వచ్ఛమయిన ముస్లీమ్‍లకు నిలయమయిన హైదరాబాద్లో ఎన్నో ముస్లీమ్ షాప్లలో ఖుర్ఆన్ ఆయత్‍లను చెప్పితే ''ఇవి మాకు తెలియవు, ఖుర్ఆన్‍ను మేము చదవలేదు'' అని అంటున్నారు. మరికొందరు ''మేము ఖుర్ఆన్‍ను చదివినా ఎక్కడ ఏమి వ్రాశారో తెలియదు, మేము మాకు రాని అరబ్బీ భాషలో చదివాము. అందువలన ఏ ఆయత్‍లో ఏమి ఉన్నది తెలియదని'' వారు చెప్పుచున్నారు. కొందరు బోధకులయిన వారిని కొన్ని ప్రశ్నలు అడిగితే ఒక్క ప్రశ్నకు కూడా సరియైన జవాబు చెప్పలేక పోవుచున్నారు. కొన్ని ఆయత్‍లను గురించి అడిగితే వాటిని అర్థము చేసుకోవలసిన విధముగా అర్థము చేసుకోక తప్పు భావముతో అర్థము చేసుకొన్నారు. ''నమాజ్ చేయమని చెప్పిన దేవుడు ఒకరు, ఏ అక్కర లేదని చెప్పిన దేవుడు మరొకరు'' అని తెలియదు. అట్లే ''సృష్ఠి పూర్వము దేవుడు, సృష్ఠి తర్వాత దేవుడు'' ఇద్దరు అను విషయమే తెలియదు. ఆరాధించవలసినది ఒక్క దేవున్నేయనీ, హితము చెప్పిన దేవున్ని గురించి తెలియదు. మనుషులు ఆరాధించవలసిన దేవుడు ఒక్కడే అయినా, ఆరాధనలకు అతీతముగా యున్న దేవుడు మరొకడున్నాడని, ఖుర్ఆన్‍లో యున్నదని వారికి తెలియదు. ఆరాధన అవసరము లేని దేవున్ని గురించి 112వ సూరాలో యున్నదనీ, ఆరాధించవలసిన దేవున్ని గురించి అన్ని సూరాలలో గలదని వారికి తెలియదు. వారికే తెలియని ఖుర్ఆన్ గ్రంథమును గురించి తెలుసుకొందామని అనుకోకుండా వారు హదీసులనే ప్రేమించుచున్నారు, దానినే ఇతర ముస్లీమ్‍లకు చెప్పుచున్నారు. ఏ గ్రంథములో ఏమి యున్నది వారికి తెలుసు. అయినా వారిలో 'మతము' అను అధర్మము ఇమిడిపోయి వుండుట వలన ఇతరులకు కూడా మతము అను దానిని గురించే బోధించుచున్నారు. హదీసుల వలననే వారిలో మత ఐకమత్యముంటుందనీ, అది ఖుర్ఆన్ వలన మతము సాధ్యము కాదని వారికి తెలుసు. అందువలన దైవగ్రంథమయిన ఖుర్ఆన్‍లోని దైవజ్ఞానమును బోధించక, మత సాంప్రదాయములను తెలుపు హదీసు గ్రంథములోని మాటలనే ఎక్కువగా చెప్పుచున్నారు.
ఎక్కడయినా, ఎవరయినా దైవగ్రంథమయిన ఖుర్ఆన్‍ను చదివినా అందులోని ఆయత్‍ను లోతుగా అర్థము చేసుకోకుండా, మత సాంప్రదాయములు అందులో కూడా ఉండునట్లు వాటికి అర్థము చెప్పు కొంటున్నారు. ఇప్పుడు ఖుర్ఆన్‍లోని ఒక ఆయత్‍ను తీసుకొని ఎలా తప్పు భావముతో, మత సాంప్రదాయముతో కూడుకొన్న అర్థమును చెప్పుకొంటున్నారో చూద్దాము.
(2-214) ''ఏమిటి మీరు స్వర్గములో ఇట్టే ప్రవేశించగలమని అనుకొంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వము గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకింకా ఎదురు కానేలేదు. వారిపై కష్టాలు, రోగాలు వచ్చిపడ్డాయి. వారు ఎంతగా కుదిపి వేయబడ్డారంటే (ఆ ధాటికి తాళలేక) ''ఇంతకీ దైవ సహాయము ఎప్పుడు వస్తుంది'' అని ప్రవక్తలను, వారి సహచరులను ప్రశ్నించ సాగారు. ''వినండి! దైవసహాయము సమీపములోనే ఉంది'' అని వారిని ఓదార్చడము జరిగినది.''
దైవ గ్రంథములోని ఆయత్‍ల (వాక్యముల) వివరము తెలియక స్వర్గము అంటే ఏమిటో తెలియనివారు, అది ఎక్కడ ఉంటుందో తెలియని వారు మోక్షము సులభముగా వస్తుందనుకున్నవారు. మతము కొరకో, దేవుని కొరకో చనిపోతే స్వర్గము సులభముగా లభించునని అనుకొన్నారు. అయితే 'స్వర్గ విషయములో వారు పొరపాటు పడుచున్నారు' అను విషయము పై వాక్యమును బట్టి తెలియుచున్నది. పై వాక్యములో స్వర్గములో సులభముగా ప్రవేశించ గలవారు పూర్వము నుండి ఉన్నారు. అయితే పూర్వము మేము స్వర్గానికి పోతామని అనుకొన్నవారు చనిపోయిన తర్వాత వారికి తర్వాత జన్మలలో ఎదురైనటువంటి పరిస్థితులు ఎట్లుంటాయో ఇప్పుడు స్వర్గమును గురించి మాట్లాడుకొను వారికి తెలియదు. అటువంటి వారి పరిస్థితులు చాలా దుర్భరముగా తయారయినాయి. వారికి స్వర్గము రాలేదుగానీ, వారికి అనేకమైన కష్టాలు, రోగాలు వచ్చాయి. వారు మానసికముగా ఎంతో క్షోభకు గురియై కుదిపివేయబడ్డారు. వారికి స్వర్గ సుఖాలు వస్తాయని మురిసిపోయారుగానీ, వారు చనిపోయిన తర్వాత వారికి సుఖాల బదులు కష్టాలు వచ్చాయి, స్వర్గానికి బదులు నరకము వచ్చింది. కష్టాల ధాటికి, రోగాల ధాటికి తట్టుకోలేక ''మాకు దేవుని సహాయము ఎప్పుడు అందుతుంది? దేవుడు మమ్ములను ఎప్పుడు కష్టాల నుండి బయట పడవేస్తాడు'' అని కొంత జ్ఞానమును బోధించు ప్రవక్తలను, ప్రవక్తల సహచరులను దీనముగా అడుగుచుందురని వాక్యములో చెప్పారు. అలా అడిగితే ''దేవుడు సహాయము తొందరగానే చేస్తాడు'' అని వారు చెప్పుచుందురు.
దేవుడు సహాయము చేస్తాడా! చేయడా! అను విషయము ప్రవక్తలైన వారికి కూడా తెలియదు. అందువలన దేవుడు తొందరగా సహాయము చేస్తాడు అని చెప్పుచుందురుగానీ, ఎప్పుడు సహాయము చేస్తాడని వారికి కూడా తెలియదు. ఓదార్పు కొరకు అలా చెప్పుచుందురేగానీ అటువంటి వారికి దేవుడు సహాయము చేస్తాడను నమ్మకము కూడా లేదు. ఎందుకనగా! స్వర్గము ఏదో, నరకము ఏదో తెలియనివారు నరకము వచ్చే పనులు చేసి స్వర్గము వస్తుందనుకోవడము పొరపాటు. మతము కొరకనో, దేవుని కొరకనో నీవు స్వంతముగా అనుకొని దుర్మార్గపు పనులు, హింసతో కూడుకొన్న పనులు చేసి స్వర్గము వస్తుందని అనుకొంటే నీవు అనుకొన్నట్లు రాదు. నీవు చేసిన పనికి ప్రతి ఫలితముగా ఏమి రావలెనో అదే వచ్చును. మనిషి చేసిన పనిలో కనిపించక పాపము, పుణ్యము రెండూ ఉండును. చేసిన పని మంచిదయితే పుణ్యము, చెడ్డదయితే పాపము రావడము సహజము. మతము కొరకు, దేవుని కొరని నీవు అనుకొన్నట్లు తన గ్రంథములో ఎక్కడా చెప్పలేదు. ఎక్కడా చెప్పకున్నా, నీ స్వంతముగానో నీలాంటి వారు స్వయముగానో చెప్పగా విని చేసిన పనులు దేవుడు చెప్పినవి కావు. దేవుడు ఎక్కడా తన జ్ఞానములో మీ స్వర్గము కొరకు ఇతరులను చంపమని చెప్పలేదు. దేవుని లెక్కలో ఎవరయినా అజ్ఞానులు అధర్మవరులుయున్నా, వారికి 'దైవజ్ఞానము' బోధించి వారిని మంచి జ్ఞానులుగా, ధర్మవరులుగా మార్చమని చెప్పాడుగానీ, సంహరించమని ఎక్కడా చెప్పలేదు.
మతమను మాయలో మనిషి చిక్కుకొని మరియు మత సాంప్రదాయములు అను ధ్యాస పెరిగిపోయి, మతము అనునది అధర్మమని తెలియక, మతము కొరకు చేయు పనులు ఏవయినా పాపమే వస్తుందని తెలియక, పుణ్యము వస్తుంది, దానివలన సుఖము వస్తుంది, అని అనుకొను వారు గతములో కూడా ఉన్నారు. వారు మతము కొరకు మతమును అభివృద్ధి చేయుటకు ఇతర మతములను అణచివేయాలని ఇతర మతముల వారిని చాలామందిని చంపడము జరిగినది. ఆ రోజు వారు చేయు పని మంచిదేయని వారు చేసినా, అది దేవుని లెక్కలో మంచిదా! కాదాయని ఏమాత్రము ఆలోచించలేదు. తన కొరకుగానీ, తన జ్ఞానము కొరకుగానీ దేవుడు హింస చేయమనలేదు, హితముతో బోధించమని చెప్పాడు. అటువంటప్పుడు తనకు సంబంధము లేనిది, మనుషులు తయారు చేసుకొన్నది, అజ్ఞానముతో కూడుకొన్నది అయిన మతము కొరకు ఇతరులను చంపమనిగానీ, హింసింపమనిగానీ చెప్పినాడనుట అజ్ఞానమే గానీ జ్ఞానము కాదు. అలా హింస చేసినవారికి పాపము రాకతప్పదు. దానివలన భూమిమీద జన్మించి నరక బాధలను ఇక్కడనే అనుభవించక తప్పదు.
స్వర్గము గానీ, నరకము గానీ ఏదో ప్రత్యేకమయిన లోకము కాదు. గత జన్మలో చేసుకొన్నవి ప్రస్తుత జన్మలో, ప్రస్తుత జన్మలో చేసుకొన్నవి రాబోయే జన్మలో అనుభవించవలసి యున్నది. కొందరు ముస్లీమ్‍లు జన్మలే లేవు, వచ్చేది స్వర్గమో, నరకమో అని అంటున్నారు. అటువంటి వారికే ఈ ఆయత్ చెప్పబడినది, ఈ వాక్యములో గలదు. వాస్తవానికి 'పూర్వము గతించినవారు ప్రస్తుత జన్మలో ఏమి అనుభవిస్తున్నారో వారి కష్టాలు మీకు ఇంకా అనుభవమునకు రాలేదు' అని వాక్యములో చెప్పారు. 'పూర్వము చనిపోయిన వారికి ఇప్పుడు జీవితములో కష్టాలు, రోగాలు వచ్చాయి' అని చెప్పియున్నారు. పునర్జన్మలున్నాయని, చనిపోయిన వారు స్వర్గము వస్తుందనుకొనినా 'వారికి ఈ జన్మలో కష్టాలు, రోగాలు వచ్చాయి' అని వాక్యములో చెప్పబడియుండుట వలన ఈ వాక్యములో జన్మలు, గత జన్మలు ఉన్నాయని తెలియుచున్నది. జన్మలు లేవు అనుకొను వారు కూడా తప్పనిసరిగా జన్మలున్నాయని తెలియునట్లు దేవుడు 'పూర్వము గతించినవారిపై కష్టాలు, రోగాలు వచ్చి పడ్డాయి, వారు బాధల చేత కుదిపి వేయబడ్డారు' అని చెప్పియుండుటను బట్టి జన్మలు లేవు అనువారు స్వయముగా దేవుని వాక్యమును ధిక్కరించినట్లగును. దేవుడు జన్మలున్నా యని చెప్పినా, మనిషి తన స్వంత జ్ఞానము చేత జన్మలు లేవు అని అంటున్నాడు. ముస్లీమ్‍లు వారి హదీసుల ఆధారముతో జన్మలు లేవు అంటున్నారు తప్ప ఖుర్ఆన్ గ్రంథములో 'జన్మలు లేవు' అని ఎక్కడా చెప్పలేదు.
ఖుర్ఆన్ గ్రంథములో అనేక ఆయత్‍లలో జన్మలున్నాయి అని చెప్పారు తప్ప, లేవు అని ఎక్కడా చెప్పలేదు. అంతెందుకు ఈ వాక్యములో 'పూర్వము గతించినవారు' అనగా ''ముందు చనిపోయిన వారికి వచ్చినవి, ఎదురైనవి మీకు ఎదురుకాలేదు'' అని చెప్పారు. అంతేకాక వారికి కష్టాలు, నష్టాలు, రోగాలు వచ్చాయి అని చెప్పారు. ఇదంతయూ దైవ గ్రంథములో యున్న తర్వాత కూడా జన్మలు లేవు అనువారు దైవగ్రంథములోని దేవుని వాక్యమును కాదనినట్లగును. అదొక్కటే కాదు వాక్యములో స్వర్గము సులభముగా వస్తుందని అనుకొన్నవారికి స్వర్గము రాలేదు, తర్వాత జీవితములో కష్టాలు వచ్చాయి అని చెప్పారు. దీనినిబట్టి చూస్తే మనుషులు అనుకొన్నట్లు స్వర్గము రాదని తెలియుచున్నది. అంతేకాక స్వర్గము మరొక ప్రత్యేకమయిన లోకము కాదనీ, మనిషి అనుభవించే సుఖములను స్వర్గము అనీ, అట్లే మనిషి అనుభవించే కష్టములను నరకము అనీ తెలియవలసి యున్నది. కష్టములుగానీ, సుఖములుగానీ జీవితములో ఇక్కడే అనుభవించుచున్నాము. కావున స్వర్గ నరకములనునవి రెండు భూమిమీద అనుభవించు అనుభవములే తప్ప అవి లోకములు కాదని తెలియుచున్నది. కొందరు స్వార్థవరులు ఇతరులకు ఆశ చూపుటకు స్వర్గ నరకములు ప్రత్యేకమైన లోకములనీ, అక్కడ స్వర్గములో మనుషులకు ఇష్టమైన సుఖములు ఉండునని చెప్పుకొన్నారు. లోకములు వేరుగా లేవనీ, నీవు అనుకొన్నట్లు నీవు చేయు పనులకు స్వర్గము వస్తుందని అనుకోవడము పూర్తి తప్పు. నీవు చేసే ప్రతీ పనికి తీర్పు చెప్పు దేవుడు నీ శరీరములోనే ఉన్నాడు. ఆయన నీవు చేసిన ప్రతీ పనికి పాపపుణ్యములు నిర్ణయించి దానివలన అనుభవించవలసిన కష్ట సుఖములను కూడా తీర్పు చేసి జన్మలకు పంపియున్నాడు. దేవుని తీర్పు ప్రకారము భూమిమీదనే జీవితములోనే అనుభవముల రూపములో పాపపుణ్యములను అనుభవించవలసి యున్నది. అట్లు అనుభవించు వారిని ఎందరినో మనతో జీవించు వారియందు చూస్తున్నాము. 'మాకు ఎప్పుడు ఈ కష్టాలు పోతాయి' అని మా దగ్గరికి వచ్చి అడిగిన వారిని చూచాము. 'దేవుడు దయ తలిస్తే, దేవుడు క్షమించితే మీ కష్టాలు, మీ రోగాలు పోతాయి' అని మేమే చాలామందికి చెప్పాము. పై వాక్యములో చెప్పినట్లు కష్టాల ధాటికి, రోగాల ధాటికి, దిక్కుతోచక కుదించి పోయిన వారిని చూచాము. వారు ఆశగా మా కష్టాలు పోయే మార్గము చెప్పమని ఎందరో అడిగారు.
నేడు భూమిమీద అటువంటి వారిని మేము చూడడమే కాదు, మీరు కూడా మీ ఊరిలోనో, మీ ఇళ్ళ ప్రక్కనో, ఎక్కడో ఒకచోట అట్లు బాధపడువారిని చూచియే యుందురు. సుఖములను అనుభవించే వారిని చూస్తున్నాము, కష్టాలు అనుభవించే వారిని చూస్తున్నాము. వారు అనుభవించే కష్టాలు పాపముల నమూనాలనీ, అట్లే వారు అనుభవించే సుఖములు వారి పుణ్యముల నమూనాలని తెలియుచున్నది. ప్రత్యక్షముగా కనిపిస్తున్నా, స్వయముగా మనమే అనుభవిస్తున్నా అవి మనము చేసుకొన్న పాపపుణ్యములు కాదు అని తెలియకపోతే దేవుడు దైవగ్రంథములో (2-214) లో వాక్యమునకు విలువ లేదనియే చెప్పవచ్చును. ఇది దేవుని వాక్యమైయుండుట వలన అది ముమ్మాటికీ సత్యమైనది. ఈ వాక్యము ప్రకారము మనిషి గతించడము ఉన్నది. గతించిన తర్వాత కర్మపత్రము ప్రకారము వెంటనే తీర్పు పొంది జన్మించడము జరుగుచున్నది. జన్మించిన తర్వాత జరిగే జీవితములో పాప ఫలము అనుభవించడమూ ఉంది. పాప ఫలము అనుభవించడమే నరకమును చవి చూచినట్లగును. అట్లే పుణ్య ఫలమును అనుభవించడము కూడా కలదు. దానినే స్వర్గము అనుచున్నాము. ఈ రెండు అనగా స్వర్గ, నరకములు మిశ్రమముగా ఉండును. ఒక గంటసేపు నరకమును అనుభవించిన తర్వాత, ఒక అరగంట కాలము సుఖమును (స్వర్గమును) అనుభవించుటకు వ్రాసియుంటే అట్లే జరిగి తీరును. దీనినంతటినీ బాగా గమనించితే ఆధ్యాత్మికరీత్యా ''స్వర్గ, నరకము''లనునవి అనుభవించు అనుభవముల పేర్లేగానీ, అవి లోకములు కావు.
''లోకము'' అను పదము ''లోచన'' అను పదము నుండి పుట్టినది. లోచన అనగా కంటితో చూడడము, చెవితో చూడడము, నాలుక, చర్మము, ముక్కు ద్వారా చూడడము అని అర్థము. చూడడము అంటే కంటి చూపు ఒక్కటే కాదు, ఐదు జ్ఞానేంద్రియముల సామత్యమును లోచన అని అనవచ్చును. నాలుకతో రుచి చూచాను అంటే నాలుకకు అనుభూతి అనునది ఏదయితే ఉందో అదే లోచన లేక చూపు. లోచన నుండి పుట్టిన పదము లోకము అని చెప్పాము కదా! దానిప్రకారము సుఖముల అనుభవమును స్వర్గలోకము అని అన్నారు. లోకము అనగా అనుభూతి లేక అనుభవము. కడుపునొప్పిని గంటసేపు అనుభవించినప్పుడు గంట కాలము నరకమును అనుభవించినట్లేయగును. అంతేగానీ ప్రత్యేకమయిన లోకము లోనికి పోయి అనుభవించి రాలేదు. కడుపు నొప్పి పోయిన తర్వాత హాస్పిటల్లో ఫ్యాన్ క్రింద చల్లని గాలి తగులుచుండగా, అందమైన నర్సులు కడుపును మెత్తని చేతులతో నొక్కుచుండగా, అరగంట కాలము వైద్యశాలలో ఉండి అరగంట తర్వాత ఇంటికి రావడము జరిగినది. అప్పుడు గంటసేపు నరకమును, అరగంటసేపు స్వర్గమును అతడు అనుభవించినట్లగుచున్నది. ముందు వెనుక అనుభవములో వచ్చునవే స్వర్గ, నరకములు. అంతేగానీ అవి వేరు లోకములుగా ఉండుననీ, స్వర్గములో ఎల్లకాలము ఒకే విధముగా ఉండవచ్చుననీ అనుకోవడము పొరపాటు. మనిషి మంచి చెడు అనుభవములతో కూడుకొన్నవే స్వర్గ, నరకములు. స్వర్గ నరకములు ఒక్కొక్కనికి ఒక్కొక్క సమయములో అనుభవమునకు వచ్చుచుండును. అంతేగానీ ఒక ఊరిలోని ప్రజలకు అందరికీ ఒకేమారు సుఖము ఉండడము గానీ, దాని తర్వాత అందరికీ ఒకేమారు బాధలు ఉండడము గానీ జరుగదు. ఒక ఊరిలోనే కాదు ఒక ఇంటిలో పదిమంది యుంటే వారిలో ఒకనికి కడుపునొప్పి వచ్చి బాధపడుచుండును. ఇంకొకడు కామెర్ల రోగముతో బాధపడుచుండును. ఆ దినము మిగతా ఎనిమిది మంది కోడిమాసంము (చికెన్) తింటూ రుచిని చూస్తున్నారు (అనుభవించుచున్నారు). ఒకే సమయములో ఇద్దరు చికెన్ తినకుండా పత్యముండడము, మిగతావారు తింటూ హాయిగా ఉండడము రెండూ చూస్తే, ఇద్దరు నరకము ఎనిమిది మంది స్వర్గమును ఒకే సమయములో పొందుచున్నారని తెలియుచున్నది. అందువలన (2-214) వాక్యములో మీరు స్వర్గమును సులభముగా తొందరగా చేరవచ్చునని అనుకోవడము పొరపాటని, అట్లు అనుకొన్నవారు చాలామంది పూర్వము చనిపోయి ప్రస్తుతము కష్టాల, రోగాల బాధలు అనుభవించలేక సహాయమునకు ఎదురు చూస్తూ ఇతరులను జ్ఞానమున్న ప్రవక్తలను మా కష్టాలు ఎప్పుడు పోతాయి, దేవుడు ఎప్పుడు సహాయము చేస్తాడని అడుగుచున్నారని చెప్పియున్నారు. దీనిని గమనించిన తర్వాత మా అనుభవము ప్రకారము స్వర్గ, నరకములను గురించి మనిషి తెలియని స్థితిలో యున్నాడని చెప్పవచ్చును. స్వయముగా నరకమును అనుభవిస్తూ నేను స్వర్గానికి పోతానని చెప్పడము, అట్లే స్వయముగా స్వర్గమును అనుభవించు వారు ఎక్కడో స్వర్గము ఉందనుకోవడము పొరపాటు. జ్ఞానముగలిగి సత్యమును తెలియగలిగితే స్వర్గ, నరకములు మనవద్దనే, మన అనుభవము లోనే ఉన్నవని తెలియుచున్నది. ఈ సమయములో నీవు ఎక్కడున్నావు? స్వర్గములోనా, నరకములోనా? చూచుకో...
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
22. ఎవరికి ఖర్చు చేయగలవు? తల్లి తండ్రికా, బంధువులకా, నిరుపేదలకా? (2-215)
ఒక మనిషి ఇంకొక మనిషికి సహాయము చేయడము మంచి కార్యమే. ఇందులో తనకు బంధువులుగా యున్నవారు చాలామంది యుండవచ్చును. అట్లే చిన్నప్పటినుండి తనను పెంచి పోషించిన తల్లితండ్రి కూడా కలరు. ఇకపోతే బయటివారు పేదలు, అనాథలు, బాటసారులు ఎవరయినా, ఎందరయినా ఉండవచ్చును. అయితే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏమనగా! నీ సంబంధీకులకుగానీ, సంబంధీకులు కాకపోయిన వారికి గానీ నీవు ఏమి ఇస్తావు, ఎలా ఆదుకొంటావు? అన్నది ముఖ్యమైన ప్రశ్న. ఖుర్ఆన్ గ్రంథములో మనిషి జీవితమునకు దగ్గరగాయున్న జ్ఞానము, ముందు వచ్చిన రెండు గ్రంథములకంటే ప్రత్యేకముగా అర్థమగునట్లు కలదు. అయితే ఇది ఎందరికి అర్థమయినదని చూస్తే ముస్లీమ్‍లకంటే ఇతర మతముల వారికే బాగా అర్థము కాగలదని చెప్పవచ్చును. అలాంటి విశిష్టత ఖుర్ఆన్ గ్రంథములో యున్నదని చెప్పక తప్పదు. ఈ ఖుర్ఆన్ గ్రంథము మిగతా రెండు మతస్థులకు దేవుడిచ్చిన వరములాంటిది. అయితే మా గ్రంథము అని చెప్పుకొను ముస్లీమ్‍లకు దీనిని అర్థము చేసుకోవడములో అందరికంటే వెనుక యున్నారని చెప్పవచ్చును. మా మాట సత్యము కాదని కొందరికి అనిపించినా, ఇప్పుడు చెప్పు వాక్యమును చూస్తే మా మాట సత్యమని తెలియగలదు, చూడండి.
(2-215) ''తాము ఏమి ఖర్చు చెయ్యాలి? అని వారు నిన్ను ప్రశ్నించుచున్నారు. మీరు ఏమి ఖర్చు చేసినా అది మీ తల్లి తండ్రుల కొరకూ, బంధువుల కొరకూ, అనాథలకొరకూ, నిరుపేదల కొరకూ, బాటసారుల కొరకు ఖర్చు చేయాలి. మీరు ఏ మేలు చేసినా అల్లాహ్‍కు దాని గురించి తెలుసు అని (ఓ ప్రవక్తా) వారికి చెప్పు.''
ఈ వాక్యములో అంతా సులభముగా అర్థమయినా, రెండు ముక్కలు అర్థము కాకుండాయున్నవి. అవి ఏమనగా! 'వారు నిన్ను ప్రశ్నించుచున్నారు' అని ఉంది. వారు అంటే ఎవరు? ఎవరు ప్రశ్నించుచున్నారను విషయము కొంత యోచన చేయువారికి అర్థము కాగలదుగానీ, యోచన చేయని వారికి సులభముగా అర్థము కాదు. తర్వాత రెండవ ముక్క ఏదనగా! 'తాము ఏమి ఖర్చు చెయ్యాలి?' అనునది. దానికి కొందరు యోచించుచున్నారు. మరి కొందరు ఏమీ యోచించకనే జవాబును చెప్పుచున్నారు. బీదలకు, బాటసారులకు, అనాథలకు, తల్లితండ్రులకు ఇవ్వవలసినవి ధనము, ధాన్యము, బంగారు, భూమి ఇవ్వవచ్చును. అందులో అందరికీ అవసరమైనది ధనము అందువలన దానినే అందరికి ఇచ్చి ఆదుకోవచ్చును అని చెప్పుచున్నారు. కొందరికి ఇందులో అనుమానములు కూడా కొన్నియున్నవి. ధనము కలవాడు ఇతరులకు ధనమును దానము చేయవచ్చును. ఒకవేళ ఇచ్చే వాని వద్ద ధనము లేకపోతే ఎలాగ? అను ప్రశ్న రాగలదు.
ఒకవేళ ఒకనివద్ద ధనమున్నా తల్లితండ్రులకు ఇవ్వగలడు, బంధువులకు ఇవ్వగలడు, ఇతరులకు ఇవ్వలేడు. అనాథలు, నిరుపేదలు, బాటసారులు బయటివారుగా లెక్కించబడుచుందురు. బయటివారికి సహాయము చేయవలెనని అనుకొనినా తనకు దగ్గరవారయిన తల్లితండ్రులు, బంధువులు తమకే ఇమ్మంటారుగానీ, ఇతరులకు ఇచ్చేది ఒప్పుకోరు. అందువలన దానము చేయవలసిన సొమ్ము అంతా తనవారికే సరిపోవును. తనవారికి కాకుండా మిగులునది ఉండదు. అట్లు తనవారికే కాకుండా బయటి వారికి కూడా ఇయ్యగల స్థోమతయుండి ఒకమారు అనాథలకు, నిరుపేదలకు ధనము ఇస్తే రెండవ రోజు అంతకంటే రెట్టింపు పేదవారు, అనాథలు వచ్చి అడుగుదురు. ఇట్లు ''ఇచ్చేవాడుంటే చచ్చేవాడు కూడా వస్తాడు'' అను సామెత ప్రకారము, వచ్చే వారికి అంతు ఉండదు. అందువలన ఒకరికి ఇద్దరికి దానము ఇవ్వవచ్చునుగానీ, వచ్చిన వారందరికీ దానము ఇచ్చుటకు సాధ్యపడదు. ఇటు తనవారైన తల్లితండ్రులకు గానీ, బంధువులకుగానీ, బయటివారైన పేదవారు, అనాథలకుగానీ, ధనముగానీ దానికి సంబంధించిన స్థూలముగా యున్న ధాన్యముగానీ, బంగారుగానీ ఏది ఇచ్చినా రెండవ రోజు అడుగుదురు. మాటిమాటికీ ఇచ్చుటకు ఎంత ధనము ధాన్యమున్నా అవి అన్నీ అయిపోవుచుండును. ఎంత ఇచ్చినా, ఎందరికి ఇచ్చినా, ఎన్నిమార్లు ఇచ్చినా చివరకు ఇవ్వలేదనుమాటే మిగులును గానీ ఇచ్చాడను మాట మిగలదు.
ఉదాహరణకు ఒక హోటల్ యజమాని తండ్రి పుణ్యము సంపాదించుకొనుటకు పేదలకు దానము చేయాలి అను ప్రయత్నము చేసి తన కుమారుని హోటల్ దగ్గర కూర్చోని అక్కడికి వచ్చిన అడుక్కొనే వానికి ఒక బ్రెడ్ ఇచ్చి, గ్లాసు పాలను ఉచితముగా ఇచ్చాడు. దానిని దానముగా అతను లెక్కించుకొన్నాడు. దానివలన పుణ్యము వస్తుంది అనుకొన్నాడు. రెండవ రోజు మొదట వచ్చిన అడుక్కొనువాడు, వాని వెంట వానికి తోడుగా మరో నలుగురు వచ్చి హోటల్ యజమాని తండ్రికి నమస్కరించి ''ఆకలిగా ఉన్నదయ్యా'' అని అడిగారు. అప్పుడు దానము చేస్తే పుణ్యము వస్తుందని తెలిసిన అతను వచ్చిన ఐదుమందికీ పాలు, బ్రెడ్లు ఇచ్చి పంపాడు. హోటల్ యజమాని కొడుకు వచ్చి ''అలా ఎందుకు ఇచ్చావు? వచ్చిన వారికి ఒక్క రూపాయి ప్రకారము ఐదుమందికి ఐదు రూపాయలు ఇచ్చి పంపియుంటే బాగుండేది కదా!'' యని అడుగగా, ''డబ్బులు ఇస్తే వారు దేనికయినా ఖర్చు చేయవచ్చు. చెడు పనులకయినా వాడుకోవచ్చు. అందువలన అటువంటి అవకాశము లేకుండా కడుపులోనికి తినే దానికి, త్రాగే దానికి బ్రెడ్, పాలు ఇచ్చాను'' అని చెప్పాడు. సరే అది మంచి పనేలే అనుకొన్నాడు. అయితే అడుక్క తినేవారు (బిక్షగాళ్లు) మూడవ రోజు, నాల్గవ రోజు, ఐదవ రోజు ప్రతి దినము రెట్టింపు సంఖ్యలో హాజరయి అడగను మొదలు పెట్టారు. అప్పుడు హోటల్ వాళ్ళు బిక్షగాళ్ల ధాటికి దివాలా తీసే స్థితికి వచ్చారు. అపుడు హోటల్ యజమాని జోక్యము చేసుకొని ఒక్క బిక్షగానికి కూడా బ్రెడ్డు పాలు ఇయ్యకుండా వారిని అక్కడనుండి పొమ్మన్నాడు. అప్పుడు ఆ బిక్షగాళ్ళు హోటల్ వాళ్లను తిట్టుచూ పోయారు. అన్ని రోజులు వారికి దానము చేసినా ఏమీ ప్రయోజనము లేకుండా పోయినది. చివరికి బిక్షగాళ్ళతోనే తిట్లు తినవలసి వచ్చినది. కనిపించే వస్తువులుగానీ, ధనముగానీ ఇచ్చే కొద్దీ తరగిపోవును. చివరకు ఇవ్వలేని స్థితి ఏర్పడును. అప్పుడు అంతవరకు తీసుకొన్నవారే బిక్షగాళ్ళు దూషించినట్లు దూషిస్తారు.
నేను చూచిన మరొక సంఘటనను వివరిస్తాను చూడండి. ఆంజనేయ జయంతి రోజు ఒక భక్తుడు ఆంజనేయస్వామి గుడిలో అన్న దానము చేస్తానని మ్రొక్కుకొన్నాడు. ఆ రోజు 200 కేజీల బియ్యమును వండి, పేదవారందరూ వచ్చి గుడిలో భోజనము చేసి పోవలసినదిగా చాటింపు వేశారు. వంట వండడము ఉదయము 11 గంటలకు అయిపోగా భోజనము పెట్టేదానికి 11-30 నుండి మొదలు పెట్టారు. 12-30 గంటలకు వండిన అన్నము అంతా అయిపోయినది. 12-30 నుండి వచ్చిన వాళ్ళు చాలామంది యున్నారు. అయితే వారికి అన్నము లేదు. అప్పుడు భోజనానికి వచ్చిన పేదవారు, కూలీవాళ్లు ''ఇంతమాత్రానికి అన్నదానమని చాటింపు వేయాలా? చాటింపు వేసినవాళ్లు అన్నము పెట్టాలి కదా!''యని నాలుగు తిట్లుతిట్టి పోయారు. అన్నదాన కార్యక్రమము పెట్టక పోతే ఏ సమస్య ఉండేది కాదు. అన్నదానమని చెప్పిన దానివలన వాళ్లు తిట్ల దానము చేసి పోయారు. కనిపించే వస్తువుల దానము ఏదయినా ఇచ్చే డబ్బుగానీ, వస్తువులుగానీ అయిపోయిన వెంటనే క్రొత్త సమస్యలను మనమే తెచ్చుకొన్నట్లగును.
అందువలన ఎవరయినా దానము చేయదలిస్తే ఏమి ఇవ్వదలచు కొన్నరని తెలివైనవారు అడుగుచున్నారు. (2-215) వాక్యములో మీరు ఏమి ఇవ్వదలచుకొన్నారని వారు నిన్ను ప్రశ్నించుచున్నారు? అని వేసిన ప్రశ్న జ్ఞానమున్న వారు అడుగుచున్నారని చెప్పినది. ప్రశ్నించినది జ్ఞానులే అయినా అడిగిన ప్రశ్నలో మీరు ఏమి ఖర్చు చెయ్యాలి? అని అడిగారు. జ్ఞానులు ముందే హెచ్చరిక చేసినట్లు అడుగుచున్నారు. నీవు నీ వారయిన తల్లితండ్రులకు, నీ బంధువులకు ఇచ్చినా, బయటి వారయిన పేదలు, బాటసారులు, అనాథలకు ఇచ్చినా కనిపించే దానము ఇస్తే చివరికది అయిపోవును. దానము తీసుకొన్న వారితోనే దూషణలు వచ్చును. అందువలన కనిపించని ధనమును దానము ఇవ్వండి. ఎంతమందికి ఇచ్చినా, ఎన్నిమార్లు ఇచ్చినా, ఎంత ఇచ్చినా తరగని ధనము అయినందున అది అయిపోతుంది అనే భయము లేదు. తీసుకొని పోయేవాడే మోసుకొని పోలేడుగానీ ఇచ్చేదానికి ఏ అలసటగానీ, అవమానముగానీ ఉండదు. తరగని ధనము ఇచ్చేవాడు ఎంత ఇస్తే తిరిగి అంత చేరే ధనము ఒక్క జ్ఞాన ధనమే. జ్ఞానము అను ధనమును నీ వారయిన తల్లితండ్రులకు, బంధువులకు ఇవ్వడమేకాక బయటివారయిన పేదవారు, అనాథలు బాటసారులు మొదలగు వారికి ఇవ్వవచ్చును.
జ్ఞానులయిన వారు దానము ఇవ్వాలి అనుకొను వారికి ముందే హెచ్చరించినట్లు, నీవు ఏమి ఇవ్వదలచావు? అని ప్రశ్నించుచున్నారు. నీవు ఏమి ఇచ్చినా, ప్రపంచ ధనము ఇచ్చినా, జ్ఞాన ధనము ఇచ్చినా రెండిటిని గురించి అల్లాహ్ (దేవుడు)కి తెలుసు. ప్రపంచ ధనములో మంచి డబ్బు, చెడ్డ డబ్బు అనునది ఏమీ ఉండదు. అదే ఒకే విలువగల్గిన డబ్బుగా ఉండును. దానము ఇచ్చినవారు ఎవరయినా ప్రపంచ ధనము మాత్రము ఒకే విలువ కల్గియుండును. అయితే ఎటొచ్చీ జ్ఞాన ధనములోనే చెల్లని ధనము, చెల్లే ధనము అని రెండు రకములుండును. ప్రపంచ ధనములో అన్నీ చెల్లే నోట్లేయుండును. ప్రపంచ ధనములో ఎక్కడయినా చెల్లని నోట్లుయున్నా వెంటనే దానిని బ్యాంకువారు గానీ, బయట వ్యాపారస్తులు గానీ, మిగతా వారుగానీ ఎవరయినా చటుక్కున గుర్తించగలరు. అందువలన చెల్లని ధనము ఉండేదానికి వీలులేదు. ఒక్క జ్ఞాన ధనములోనే చెల్లని ధనము, చెల్లే ధనము రెండు ఉన్నాయి. దానము తీసుకొన్నవాడు మోసపోయే అవకాశమున్నది. అందువలన జ్ఞాన ధనమును ఇచ్చే వానికంటే దానము తీసుకొనేవాడే ఎక్కువ జాగ్రత్తగా చూచి తీసుకోవలెను. చెల్లని ధనము తీసుకొనినా, తీసుకొన్న వానికి ఏమీ ప్రయోజనము ఉండదు. అందువలన జ్ఞానము చెప్పే వానికంటే వినేవాడే జాగ్రత్తపడవలసి యుండును. దానములలో అన్ని దానములకంటే ఉత్తమమైనది జ్ఞాన దానము. ఎందుకనగా! జ్ఞానము అను ధనమును దొంగలు ఎత్తుక పోలేరు, చాలాకాలమున్నా అది పుచ్చిపోదు, పురుగు పట్టదు, రంగుగానీ, వాసన గానీ మారదు. అనగా ఎట్లుండునది అట్లే యుండునని అర్థము. అందువలన జ్ఞాన దానము శ్రేష్ఠమయినదని పెద్దలు చెప్పారు.
నీవు నా వారికిగానీ, బయటివారికిగానీ ఏ మేలు చేసినా అనగా ప్రపంచ ధనమును ఇచ్చినా లేక జ్ఞాన ధనమును ఇచ్చినా అది అల్లాహ్ (దేవునికి) ఖచ్చితముగా తెలుసు. అయితే అట్లు దానము చేసినది జ్ఞాన ధనము అయితే అది చెల్లేదా? చెల్లనిదా?యని చూచు బ్యాంకులాంటివాడు దేవుడు. బ్యాంకులో ప్రపంచ నోట్లలో చెల్లని నోటును కనుగొన్నట్లు జ్ఞాన ధనములో అది మంచి జ్ఞానమా! కాదా!యని దేవుడు తెలియగలడు. సత్యసమేతమైన జ్ఞానమును దానముగా ఇచ్చియుంటే అది మంచి దానమే యగును. అట్లుకాక అసత్య జ్ఞానమును చెప్పియుంటే దానిని దేవుడు దానముగా గుర్తించడు. అతడు దానము చేయకున్నను దానము చేసినట్లు తన వారిని, బయటి వారిని ఇరువురినీ మోసము చేసినట్లగును. తనది జ్ఞానమేయని దానము చేసి యున్ననూ దేవుడు దానిని తప్పుగా పరిగణించును. అందువలన వాక్యములో మీరు ఏ మేలు చేసినా అల్లాహ్‍కు దానిని గురించి తెలియును. అందువలన నీవద్దగల ధనము సరియైనదో కాదో ముందు చూచుకో, సరియైనదైతే దానము చేయి, కాకపోతే ఊరక యుండు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
23. అంతిమ దినమున పునర్జన్మ గురించి. (3-30)
మనిషి జీవితము గడచిపోయిన తర్వాత మనిషికి అంత్యదినము ఏర్పడును. మనిషికి ప్రథమ దినము పుట్టిననాడే జరిగినది. చచ్చిననాడు 'అంత్య దినము' అని అంటున్నాము. ఒక లెక్కప్రకారము ఏదయితే మనిషికి అంత్య దినమైన రోజు ఉందో దానిని ప్రథమ దినము అని అంటున్నాము. మనిషి జీవితమునకు అంతిమ దినమునే చచ్చిన రోజు అంటున్నాము. అదే రోజే మనిషికి పుట్టిన దినమై జీవితమునకు ప్రథమ దినమగుట వలన మనిషికి ఎప్పుడైనా చివరి దినము, ప్రథమ దినము రెండూ ఒకే రోజు వచ్చుచున్నవి. ఇదంతా కనిపించని విషయము అయినందున ఒక్క దినమే చావు, పుట్టుకలున్నాయని ఎవరికీ తెలియదు. ముందు మనిషి మరణమును పొందుచున్నాడు. తర్వాత అదే క్షణమే జన్మను పొందుచున్నాడు. చావు పుట్టుకలలో శరీరము మారిపోవుచున్నది. మనిషిగా పుట్టిన ఏ మతస్థునికైనా ఒకే విధానము గలదు. మరణ దినమునే ప్రళయ దినము అని అంటున్నాము. అంతిమ దినమున పాత శరీరము పోవడము, ప్రథమ దినమున క్రొత్త శరీరము రావడము జరుగుచున్నది. ప్రథమ దినము, అంత్య దినము రెండూ ఒకే సెకనులో జరుగుచున్నవి కనుక ఒకే రోజే, ఒకే క్షణమే మనిషి శరీరము మారిపోవుచున్నది. శరీరము మారిపోయి క్రొత్త శిశు శరీరము లభించుట వలన అంత్యదినమే పునర్జన్మకు నాందియని తెలియవలెను. ఆ దినమే రెండవ జీవితమునకు అవసరమైన పాప పుణ్యములు రెండు జీవునికి తెలియును. అప్పుడు జీవుడు (మనిషి) తన పుణ్యమును గురించి చింతించకున్నా, పాపమును గురించి తప్పక చింతించును. తాను పాపమును చేయకుండా ఉండివుంటే బాగుండేది యని అనుకొనును. ఈ జన్మకు కేటాయించబడిన పాపము ఇప్పుడు కాకుండా కొన్ని జన్మల అవతల వచ్చేటట్లు దూరముగా ఉండివుంటే బాగుండేది అని తలచును. ఈ విషయమై సూరా 3, ఆయత్ 30లో ఇలా వ్రాశారు చూడండి.
(3-30) ''ఆ రోజు ప్రతి వ్యక్తి తాను చేసుకొన్న పుణ్యాన్నీ, తాను చేసుకొన్న పాపాన్నీ తనముందు చూచుకొంటాడు. తనకూ తన పాపానికి మధ్య ఎంతో దూరము ఉంటే బాగుండేదే! అని కాంక్షిస్తాడు. అల్లాహ్ తన గురించి మిమ్ములను హెచ్చరించు చున్నాడు. అల్లాహ్ తన దాసులపట్ల అమితమైన ప్రేమ గలవాడు.''
మనిషి అంత్య దినమున శరీరములోని ఆత్మయే అల్లాహ్గా యుంటూ మనిషి చేసిన సంచితకర్మను కొంత ప్రారబ్ధకర్మగా మార్చి క్రొత్త శరీరము ధరించి రెండవ జీవితములో అనుభవించ వలెనని నిర్ణయించును. అప్పుడు కర్మ నిర్ణయము జరుగడము, జన్మ మారడము క్షణకాలములో జరిగినా జీవునికి ఎదురుగా జరగడము వలన అనుభవించవలసిన పాపమును చూచి ఇది ఎంతో దూరము ఉంటే, కొన్ని జన్మల తర్వాత అనుభవమునకు వచ్చును. దగ్గరగా యుండుట వలన ఈ జన్మలోనే అనుభవించవలసి వచ్చును అని తలపోయును. అలా అప్పుడు అనుకొనినా ఏమీ ప్రయోజనము లేదు. అందువలన మిమ్ములను హెచ్చరించుచూ తనను గురించి తెలియుమనీ, తన జ్ఞానమును తెలియవలెననీ, దానివలన పాపము దూరముగా పోవడము తర్వాత ఆలస్యముగా అనుభవానికి రావడము లేకుండా, మొత్తానికి పాపమంతయు లేకుండా పోవు విధానమును తెలుపుచున్నాడు. పాపమును అనుభవించ కుండా మొత్తము లేకుండా పోవునట్లు జరుగు విధానమును హెచ్చరిక చేసి చెప్పుచున్నాడు. అంటే! దేవునికి తన భక్తుల మీద అమితమైన ప్రేమ ఉందని చెప్పవచ్చును. ఎక్కువ ప్రేమ గలవాడైనందున పాపక్షమాపణ విధానమును అనేక విధముల బోధించాడు. అయినా మనిషి దేవుడు చెప్పిన విధానమును అనుసరించక తన ఇష్టమొచ్చినట్లు అజ్ఞానములో నడుచుకొంటున్నాడు. అందువలన పాప క్షమాపణ లేకుండా అల్లాహ్‍యే చేయుచున్నాడు. దేవుడు తన మాట వినేవారిని ప్రేమిస్తాడు. వినని వారిని ద్వేషిస్తాడు. కావున దేవుని క్షమాశీలతను పొందాలంటే దేవునికి దాసులుగాయుంటూ దేవుని జ్ఞానమును తెలియాలి. అప్పుడు పాపక్షమాపణ ఎలా జరుగునో, అల్లాహ్ దయ ఎట్లుండునో అప్పుడు తప్పక తెలియును.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
24. భర్త లేకుండా సంతానము. (3-40), (3-47)
భూమిమీద అందరికీ తెలిసిన సత్యమువలె తెలియని సత్యము ఒకటి గలదు. అందరూ అందరికీ తెలిసిన సత్యమే అని అనుకొనినా, వాస్తవముగా ఎవరికీ తెలియని సత్యము 'సంతానము' ను గురించి కలదని చెప్పవచ్చును. సంతానము స్థూల విషయమే, అయితే అందులో సూక్ష్మమైన విషయము, అందరికీ తెలియని విషయము కలదు. అది ఏమనగా! ప్రతి మనిషి తన తల్లితండ్రులకు పుట్టానని అనుకొంటున్నాడు. ఖచ్చితముగా పుట్టాను అని నిరూపణగా చెప్పలేరు. కొందరు మేము ఫలానా వారికే పుట్టాము. ఫలానా వారే నా తల్లితండ్రులు అని గట్టిగా చెప్పినా, అది సత్య నిరూపణగా చెప్పలేడు. కొందరు కనిపించే పోలికలను చూపించినా అందులో వాస్తవము లేదు. డి.ఎన్.ఎ (D.N.A) టెస్టింగ్ చేయిస్తే ఏ బిడ్డకు ఎవరు తల్లితండ్రులో శాస్త్రబద్దముగా, హేతుబద్దముగా చెప్పవచ్చునని శాస్త్రవేత్తలు సహితము చెప్పుచుందురు. D.N.A పరీక్ష తర్వాత ఫలానా వారే తల్లితండ్రులని ఖచ్చితముగా, ఆధారపూరితముగా చెప్పవచ్చును. భౌతిక శాస్త్ర ఆధారముతో మేము ఈ మాటను చెప్పుచున్నామని కొందరు విజ్ఞానమును తెలిసినవారు చెప్పుచుందురు.
ఏ విషయమునయినా సత్యనిర్ధారణ చేయుటకు ఆరు శాస్త్రములు గలవు. సంతానము అను విషయము ఇట్లే కలదని నిర్ధారణ చేసి చెప్పుటకు ఇది భౌతికమైన విషయమని తలచి భౌతిక శాస్త్ర ఆధారముతో ఈ సమస్యను పరిష్కారము చేయుచుందురు. కొందరు ఈ విషయము భౌతిక శాస్త్రమునకు సంబంధించినది కాదు, ఇది బ్రహ్మవిద్యా శాస్త్రమునకు సంబంధించినదని చెప్పుచున్నారు. ఈ సంతాన విషయము వాస్తవముగా ఏ శాస్త్రమునకు సంబంధించినదో ముందు తెలిస్తే తర్వాత ఆలోచించ వచ్చును. ఈ విషయమై చూస్తే మనిషి స్థూలమైనా అతనిలో కొంత సూక్ష్మమున్నది. స్థూలముకంటే సూక్ష్మమే ఎక్కువగా యున్నది. అందువలన స్థూలముగా కొంత, సూక్ష్మముగా కొంత ఆలోచించవలసి యున్నది. స్థూలమును గురించి భౌతిక శాస్త్రము ద్వారా, సూక్ష్మమును గురించి బ్రహ్మ విద్యా శాస్త్రము (సూక్ష్మ శాస్త్రము) ద్వారా పరిశోధించి తెలుసుకోవలెను.
శిశు శరీరము తయారగునది తల్లిగర్భములో, తల్లిగర్భములో పురుష బీజము చేరినప్పుడు తల్లి గర్భము ధరించును. గర్భములో శిశు శరీరము పెరుగుట వలన 9 నుండి 10 నెలలలో పెరిగిన శిశువు ప్రసవింపబడును. ప్రసవింపబడిన శిశు శరీరములోనికి జీవుడు చేరడము జరుగుచున్నది. జీవుడు శరీరములో ఎప్పుడు చేరితే అప్పుడు మనిషి జీవితము ప్రారంభ మగుచున్నది. స్త్రీ గర్భములో తయారగు శరీరమునకు అవసరమైన బీజము పురుషునిది అవసరము. పురుష బీజము పురుషుని నుండే స్త్రీ గర్భములో చేరవలసియున్నది. స్త్రీ ప్రకృతి సంబంధమైనది. ప్రకృతి ఒక్కటే అయినందున ఏ స్త్రీ గర్భమయినా శిశు దేహమును పెంచుటకు స్థోమత కల్గియున్నది. ప్రకృతి తత్త్వము వలన పుట్టిన స్త్రీ తల్లిగా యుంటున్నది. గర్భము ధరించుటకు సిద్ధముగా యున్నది. ప్రకృతి ఒక్కటేకాగా, పురుషుడు బహువచనములో ముగ్గురు యున్నారు. ఇద్దరు పురుషులుకాగా, ఒకరు పురుషోత్తముడుగా యున్నాడు. ఇద్దరు పురుషులలో జీవుడు అనువాడు పురుషుడే అయినా నశించిన పుంసత్వము కల్గియున్నాడు. అతనిని (జీవున్ని) నపుంసకుడుయని అనవచ్చును. రెండవ పురుషుడు ఆత్మకాగా, మూడవ పురుషుడు పరమాత్మ.
మూడవ పురుషుడయిన పరమాత్మ ''ఏ అక్కర లేనివాడు.'' ''ఎవరితోనూ సంబంధము లేనివాడు.'' ''ఆయనకు ఎవరూ సంతానము లేరు.'' ఈ విషయమును అనగా మూడవ పురుషుని విషయమును ఖుర్ఆన్ గ్రంథములో 112వ సూరాలో రెండవ వాక్యము లోనూ, మూడవ వాక్యములోనూ ఈ విషయములు చెప్పబడియున్నవి. మూడవ పురుషుడయిన పురుషోత్తముడు ''ఎవరికీ బీజదాత కాదు'' అని 112వ సూరాలోని మూడవ వాక్యము ప్రకారము తెలిసినది. ఇక మిగిలిన మధ్యాత్మ ఒక్కడే బీజదాతగా యున్నాడని తెలిసినది. మూడు ఆత్మలలో మధ్యాత్మ ఒక్కడే సర్వజీవరాసులకు బీజదాతగా యున్నాడు గనుక అతనినే తండ్రియని అనవచ్చును. అయితే ముఖ్యమైన సమస్య ఏమి అనగా ప్రతి మనిషి శరీరములోనూ మూడు ఆత్మలు గలవు. ఈ విషయము సూరా 50 ఆయత్ 21లో చెప్పబడియున్నది. ''తోలబడేవాడు, తోలేవాడు, చూచేవాడు'' అని ముగ్గురిని చెప్పారు. ఈ ముగ్గురిలో మధ్యాత్మ అయిన తోలేవాడే సర్వులకు తండ్రిగా యున్నాడు.
మూడు ఆత్మలు కంటికి కనిపించునవి కావు. మూడు ఆత్మలు స్త్రీ శరీరములోను, పురుష శరీరములోనూ గలవు. స్త్రీ శరీరములోని మధ్యాత్మ స్త్రీ శరీరములోనే తన బీజమును స్త్రీ గర్భములో వదలుట వలన స్త్రీ గర్భములో శిశువు పెరుగుచున్నది. స్త్రీకి బయట పురుషునితో సంబంధము లేకపోయినా స్త్రీ శరీరములోని ఆత్మ వలన స్త్రీ గర్భము ధరించు అవకాశము గలదు. ఈ విషయము తెలియని ఒక పురుషుడు అట్లే, ఒక స్త్రీ తమ సంతతి విషయములో అనుమానమును వ్యక్తము చేసిన విషయము మూడవ సూరాలో 40వ ఆయత్నందు మరియు 47వ ఆయత్నందు చెప్పిన దానిని ఇప్పుడు ఇక్కడ చెప్పుకొందాము చూడండి.
(30-40) ''జకరియ్యా ఇలా విన్నవించుకొన్నాడు. ''ప్రభూ నేనేమో పండు ముసలివాన్ని నా భార్య గొడ్రాలు. అలాంటప్పుడు నాకు కొడుకు ఎలా పుడతాడు?'' దానికి ''అలాగే జరుగుతుంది, అల్లాహ్ తాను కోరినది చేస్తాడు'' అని దైవదూత సమాధానము ఇచ్చాడు.''
(3-47) ''ఆమె ''నా ప్రభూ! నాకు పిల్లవాడు ఎలా పుట్టగలడు? నన్ను ఏ మనిషీ తాకలేదే!'' అని అన్నది. ''అలాగే జరుగుతుంది అల్లాహ్ తాను కోరినది పుట్టిస్తాడు. ఆయన ఏ పనినైనా చేయ సంకల్పించుకొన్నప్పుడు 'అయిపో' అంటే చాలు అది అయి పోతుందియని దైవదూత ద్వారా సమాధానము లభించినది.''
ఈ రెండు వాక్యములలో మాకు స్వయముగా పిల్లలు పుట్టు అవకాశము లేదు కదా! అటువంటి మాకు సంతానము ఎలా కలుగుతుంది? అని మొదటి వాక్యములో మగవాడయిన జకరియ్యా అడిగాడు. అట్లే రెండవ వాక్యములో 'పురుషుడు నన్ను తాకనిదే నాకు ఎలా పిల్లలు పుట్టగలరని' ఒక స్త్రీ అడిగినట్లు కలదు. అయితే రెండు వాక్యములలోనూ దేవుడు అనుకుంటే ఏమయినా జరుగగలదని, దేవుని మీద సమాధానము చెప్పారు గానీ, స్త్రీ పురుషుల కలయిక చేత సంతానము కలుగుతుందని చెప్పలేదు. అసలు విషయము ఏమనగా! బాహ్యముగా కనిపించు పురుష శరీరములను ధరించిన మగవారి చేత స్త్రీలకు ఎవరికిగానీ సంతానము కలుగదు, కలుగుటకు వీలులేదు. ఎందుకనగా! పురుషుడు అనువాడు ఏ శరీరములో అయినా ఉన్నాడుగానీ, పైకి కనిపించు మగవారిని పురుషులనకూడదు. శరీరములు ఆడవయినా, మగవయినా అందులో ముగ్గురు పురుషులు గలరు. ముగ్గురు పురుషులలో బీజదాత అయిన మధ్య పురుషుడు గలడు. మనుషుల కర్మలను అనుసరించి మనుషులను నడిపించువాడు మధ్య పురుషుడే అయినందున ఆయన ఎవరికి ఎప్పుడు సంతతిని కలుగజేయవలెనో అప్పుడు కలుగజేయును. సంతతి భార్య భర్తలుగా యున్న వారికి వారి కర్మను అనుసరించి సంతానమును కలుగజేయును. సంతాన సుఖమునుగానీ, సంతాన బాధలుగానీ భార్యాభర్తలు ఇద్దరు అనుభవించు కర్మయుండును. అందువలన పెళ్ళి అయిన వారికే పురుషుడైన ఆత్మ సంతానమును కలుగునట్లు బీజమును ఇచ్చుచున్నాడు. మధ్యాత్మ అయిన ఆత్మే అందరి శరీరములలో దేవుడుగా యుంటూ, భార్యాభర్తలుగా యున్న దంపతులకు తానే సంతానమును కలుగజేయగా అప్పుడు భార్యకు భర్తగా యున్నవాడు తన వలననే, తన బీజము వలననే తన భార్యకు సంతానము కల్గినదని అనుకొంటున్నాడు.
మనిషి అయిన ప్రతి మగవాడు సంతాన విషయములో తానే తండ్రినని భ్రమించుచున్నాడు. వాస్తవముగా తన భార్యకు పుట్టిన సంతానమునకు తనకు ఎటువంటి సంబంధము ఉండదు. అయితే మనిషికి అనగా మగవానికి ఆ విషయము తెలియకుండునట్లు దేవుడయిన ఆత్మ మనిషిని మభ్యపరచుచున్నాడు. దంపతులలో తండ్రి ఆకారమును కొంత, తల్లి ఆకారమును కొంత శిశువుకు వచ్చునట్లు చేయుచున్నాడు. అప్పుడు ఆ దంపతులు తమ బిడ్డలో తమ పోలికలను చూచుకొని మురిసి పోవుచుందురు. పుట్టిన వానికి తమ పోలికలున్నవనీ, తండ్రి పోలికలు ఎక్కువ అని కొందరూ, తల్లి పోలికలు ఎక్కువ గలవని కొందరూ చెప్పుకొను చుందురు. తండ్రి శరీరము మరియు తల్లి శరీరము లోపల ఆత్మేయుండుట వలన, ఆత్మ శరీరము అంతటా వ్యాపించియుండుట వలన, ఆత్మ మనిషి పాదము నుండి తల వరకు గోర్లలో, వెంట్రుకలలో కూడా వ్యాపించి యుండుట వలన శరీరములోని ఆత్మ, శరీరము యొక్క ఆకృతిని పోలియుండును. అందువలన ఏ శరీరములోని ఆత్మ ఆ శరీరము యొక్క ఆకారమును పోలియున్నదని చెప్పవచ్చును.
మనిషి ఎవరయినాగానీ ఆ మనిషి ఆకారము ఆ శరీరములో నివసించు జీవునిది కాదు. వాస్తవముగా శరీరము జీవునిది కాదు. శరీరమునకు అధిపతి, శరీరమంతా పై అంచువరకు వ్యాపించిన ఆత్మ అయినందున శరీర ఆకృతి కూడా అధిపతియైన ఆత్మదేయని తెలియవలెను. జీవుడు శరీరము లోపలయున్నాడు. అతనికి శరీర ఆకృతికి ఏమాత్రము సంబంధము లేదు. అయినా అజ్ఞానము వలన శరీరములోని ప్రతి జీవుడు శరీరము యొక్క ఆకారము తనదేయని అనుకొనుచున్నాడు. వాస్తవముగా జీవునికి శరీర ఆకృతికి ఏమాత్రము సంబంధము లేదు. శరీరము యొక్క ఆకృతి ఆ శరీరము అంతటా వ్యాపించిన ఆత్మదేయని తెలియవలెను. పుట్టిన ప్రతి శిశువుకు ఆత్మే బీజదాత, తండ్రి అయిన దానివలన దంపతులుగాయున్న ఇద్దరి శరీర పోలికలు బిడ్డకు వచ్చి యుండును. ఆత్మబిడ్డకు ఆత్మ ఆకార పోలికలే వచ్చాయి అని చెప్పవచ్చును.
ప్రకృతి తల్లికాగా, ఆత్మ తండ్రిగాయున్నాడు. అందువలన ప్రకృతికి మారుపేరుగా యున్న స్త్రీల గర్భములోనే శిశువు శరీరము పెరుగుచున్నది. తల్లి శరీరములోని ఆత్మే బీజదాత అయినందున సంతానము కలుగుటకు ఏ పురుషుడు అవసరము లేదు. దంపతులు భార్యాభర్త ఇద్దరుగా ఉండగా, ఆ రెండు శరీరములలోని ఇద్దరు జీవులు కర్మలు అనుభవించుచుండగా, ఆత్మ వారి చేత అనుభవింపజేయుచున్నది. అందువలన ఖుర్ఆన్ గ్రంథములో సూరా 50, ఆయత్ 21లో ''జీవాత్మను త్రోలబడేవాడనీ, ఆత్మను త్రోలేవాడనీ, పరమాత్మను సాక్షిగా చూచేవాడనీ'' చెప్పియున్నారు చూడండి.
(50-21) ''ప్రతి ప్రాణి (ప్రతి జీవుడు) ఒక తోలేవాడితో, మరొక సాక్ష్యమిచ్చే వాడితో సహా వస్తుంది.''
(50-21) ''ప్రతి వ్యక్తి (ప్రాణి) ఒక తోలేవాడితో, ఒక సాక్ష్యమిచ్చే వాడితో సహా హాజరవుతాడు.'' (ఖుర్ఆన్ మజీద్ తెలుగు అనువాదము)
జీవుడు శరీరము లోపల అధిపతియైన ఆత్మచేత నడుపబడు చుండగా, పరమాత్మ చూస్తూ ఉన్నాడు. ఇంకా వివరముగా అర్థమగునట్లు చెప్పవలెనంటే మొట్టమొదట భూమిని, ఆకాశమును సృష్ఠించిన అల్లాహ్ చూస్తూయుండగా, సర్వజీవరాసులకు ఆరాధింపబడు ఏకైక అల్లాహ్గా నియమింపబడిన, ఆరాధ్య దైవముగా యున్న అల్లాహ్ నడిపించుచుండగా ప్రతి మనిషి (ప్రతి జీవుడు) జీవితమును అనుభవించుచున్నాడు. ఇక్కడ సాక్షిగా ఉండు అల్లాహ్ ఒకరుకాగా, సర్వ ప్రపంచములోని జీవులనందరినీ నడిపించుచూ అందరిచేత ఆరాధింపబడు అల్లాహ్ మరొకరు గలడని అర్థము చేసుకోవలెను. ఇదే విషయమునే (3-18) లో ఇద్దరు అల్లాహ్‍లు గలరనీ, మొదటి సృష్ఠికర్తయిన అల్లాహ్ మనుషులకు ఆరాధ్య దైవముగా ఉండుటకు మరొక అల్లాహ్‍ను నియమించాడనీ, మొదటి సృష్ఠికర్తయిన అల్లాహ్ సాక్షిగా చూస్తుయున్నాడనీ, కార్యకర్తగా, ఆరాధ్య దైవముగాయున్న అల్లాహ్ జీవులను కర్మప్రకారము తోలుచున్నాడనీ కలదు చూడండి.
(3-18) ''అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవము లేడనీ, స్వయముగా అల్లాహ్, ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులు సాక్ష్యమిచ్చు చున్నారు. ఆయన సమత్వము, సమతూకముతో ఈ విశ్వాన్ని నిలిపియుంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు.''
(6-102) ''ఆయనే అల్లాహ్, మీ ప్రభువు. ఆయన తప్ప మరొక రెవరూ ఆరాధ్యులు కారు. సమస్త వస్తువులను సృష్ఠించినవాడు ఆయనే. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. అన్ని విషయాల కార్యసాధకుడు ఆయనే, అన్ని పనులు చేయు కార్యకర్త ఆయనే.''
ఈ రెండు వాక్యములను చూచిన తర్వాత సృష్ఠిపూర్వము అల్లాహ్ మొదటివాడు కాగా, ఆయన చేత ఆరాధ్య దైవముగా సర్వ కార్యముల కార్యకర్తగా నియమింపబడిన అల్లాహ్ మరొకడున్నాడని చెప్పబడియున్నది. (3-18) లో 'మొదటి అల్లాహ్ రెండవ అల్లాహ్‍ను నియమించాడనీ, ఆరాధ్య దైవము ఆయన ఒక్కడేయని చెప్పాడనీ' తెలియుచున్నది. (6-102) లో 'ఆరాధ్య దైవము మరియు అన్ని కార్యముల కార్యసాధకుడుగా అనగా సర్వ కార్యములు చేయు కార్యకర్తగా రెండవ అల్లాహ్‍యే ఉన్నాడని తెలియుచున్నది.' ఇప్పుడు (50-21) లో 'మొదటి అల్లాహ్ చూస్తూ ఉండగా, రెండవ అల్లాహ్ చేస్తూయుండగా, సర్వప్రాణులు (సర్వ జీవరాసులు) కర్మలను అనుభవించుచూ జీవితములో పరిగెత్తుచున్నారని' తెలియుచున్నది.
ఈ కార్యక్రమములోనే మనుషులను ఆత్మే శిశువులుగా స్త్రీ శరీరముల నుండి పుట్టించుచున్నది. ఏ స్త్రీ శరీరము నుండి ఏ జీవుడు శిశువుగా పుట్టినా, అతనికి ప్రకృతి తల్లియనీ, తండ్రి అల్లాహ్ అయిన ఆత్మయని తెలియవలెను. అయితే ఈ విషయము ఎవరికీ తెలియకుండా పోయినది. ప్రతి బిడ్డకు తామే తల్లితండ్రులమని భార్యాభర్తలుగా యున్న జీవుళ్ళు అనుకోవడము జరుగుచున్నది. సర్వప్రపంచములోని మనుషు లందరూ అదే భ్రమలోనే యున్నారు. ఈ విషయము (ఈ జ్ఞానము) మాకు తెలియదు అనుటకు అవకాశము లేకుండా ప్రథమ దైవ గ్రంథము లోనే ఐదువేల సంవత్సరముల పూర్వమే దేవుడు చెప్పియున్నాడు. ''సర్వ జీవరాసులకు నేనే బీజదాతను. ప్రకృతి నాకు గర్భముగల స్త్రీగా యుండగా నేను ప్రకృతికి భర్తగా యున్నాను. మా వలననే సర్వ జీవరాసులు శరీరము ధరించి పుట్టుచున్నవి.'' అలా పుట్టిన వారందరికీ నిజమైన తల్లి తండ్రి మేమేయని గుణత్రయ విభాగయోగమున 3, 4 శ్లోకములలో చెప్పి యున్నారు. తర్వాత ద్వితీయ దైవగ్రంథములో పరోక్షముగా ఈ విషయమును చెప్పియున్నారు. ప్రత్యక్షముగా ఏసు పుట్టుకయే గలదు. ఇకపోతే అంతిమ దైవ గ్రంథమున (3-40) (3-47) రెండు ఆయత్‍లలో 'మనుషులకు సంతతి కలుగునా?యను ప్రశ్నను లేవనెత్తారు. ఆ రెండు ఆయత్‍లకు వివరణ ఇచ్చుటకు ఇంతవరకు ఇంత సమాచారమును చెప్పాము. అయినా అంత తొందరగా, అంత సులభముగా ఈ విషయము అర్థము అగునను నమ్మకము లేదు. అందువలన బుద్ధిగ్రాహిత శక్తి సరిగా లేనివారికి సహితము పూర్తి వివరముగా తెలియుటకు ఇంకా కొంత సమాచారమును చెప్పుకోవలసిన అవసరమున్నది.
అందరూ బాహ్య తల్లితండ్రులను కనిపించేవారుగా చెప్పుచున్నా వారికి నిజమైన తల్లి ప్రకృతి, నిజమైన తండ్రి ఆత్మయని తెలిసిపోయినది. ప్రకృతి తల్లితండ్రుల ఇద్దరి శరీరములుగా ఉండగా, తండ్రియైన ఆత్మ భార్య భర్త అయిన కనిపించే తల్లి తండ్రి శరీరము లోపల గలడు. అయితే సత్యమును చెప్పితే ఆకారములు రెండు తల్లి తండ్రులవే అయినా భావము మాత్రము తప్పుయని చెప్పవచ్చును. వాస్తవముగా చెప్పితే కనిపించే ఆకారములు రెండు ఆత్మవే అయినందున తల్లి శరీర ఆకృతి కూడా ఆత్మదే. భార్యాభర్త ఆకృతులు రెండు ఆత్మవికాగా, వారి శరీరములు రెండు ప్రకృతియైన తల్లివిగాయున్నవి. శరీరములు ప్రకృతి నిర్మితములు కాగా, అదే శరీరముల ఆకారము ఆత్మదని జ్ఞానము ప్రకారము తెలియుచున్నది. అయితే జీవుడు మాత్రము ఎక్కడా బయటికి కనిపించడము లేదు. జీవుడు శరీరములో తలయందు తల మధ్య భాగములో యున్న గుణచక్రమందు రవ్వంతగా గుండ్రని ఆకారము కల్గియున్నాడు. శరీర లోతులలో యున్న జీవుని ఆకారమును ఎవరూ చూచియుండలేదు. మేము మనుషులను చూస్తున్నామనుకొను ఆకారములు ఆత్మవి. శరీరములు ప్రకృతివి. తల్లియైన ప్రకృతి శరీరమును తయారు చేసియుండగా తండ్రియైన ఆత్మ శరీరములకు ఆకారముగా యున్నాడు. ఆత్మ ఒక్కొక్క శరీరములో ఒక్కొక్క ఆకృతి కల్గియున్నది. అందువలన మనుషులకే సర్వ జీవరాసుల ఆకారములన్నియూ ఆత్మవేయని తెలియవలెను. ఆత్మ ఒకే ఆకృతిలో లేదు. జీవాత్మ ఒకే ఆకారములో యున్నాడు. ఎందరు జీవుళ్ళయినా అందరూ ఒకే ఆకారము కల్గి, అందరూ గుండ్రముగానే యున్నారు.
ఆత్మ ఒక్కడే అయినా ఎన్ని శరీరములుంటే అన్ని ఆకారములుగా యున్నాడు. జీవుళ్ళు ఎన్ని శరీరములలోయున్నా అందరూ ఒకే ఆకృతిని పోలియుండగా, ఆత్మ ఎన్ని శరీరములలో యున్నా అన్ని శరీరముల ఆకృతి కల్గియున్నది. శరీరములు ప్రకృతివి. శరీరముల పై ఆకారములు ఆత్మవి. లోపలి ఆకారము జీవాత్మలది. ఏ శిశువు ఎక్కడ పుట్టినా అక్కడ తల్లి తండ్రిగా పైకి కనిపించు వారి D.N.A ఆ శిశువులో ఉండును. అన్ని శరీరములు ప్రకృతివే అయినా అన్ని శరీరముల అధిపతి ఆత్మ అయినందున D.N.A ఆత్మదే అయివుండును. అందువలన ఒక శిశువు ఏ తల్లితండ్రుల శరీరమునకు పుట్టాడు అని ఆ శరీరముల D.N.A ను బట్టి చెప్పుచున్నారు. ఆత్మను బట్టి ప్రతి శరీరమునకు ఆత్మ ఆకారము వేరువేరుగా యున్నట్లు D.N.A అనునది కూడా వేరువేరుగా యుండును. D.N.A అనునది జీవాత్మకు సంబంధము లేనిది. శరీరములో కష్ట సుఖములు అనుభవించువాడు జీవుడు, అనుభవింపజేయువాడు దేవుడయిన ఆత్మ.
ప్రతి శరీరములోనూ అధిపతిగా యున్న ఆత్మ బీజదాతగా యుండగా దానిని స్వీకరించు ప్రకృతి తల్లిగా యున్నది. ఒక స్త్రీ శరీరములోని ఆత్మ బీజమును దానము చేయుచున్నది. కావున పురుష సంపర్కముతో సంబంధము లేకుండా స్త్రీకి సంతానము కలుగవచ్చును. అట్లు కలుగునని (3-40) (3-47) ఆయత్‍లలో చెప్పబడియున్నది. ఇంజీలు గ్రంథములో చెప్పబడిన ''ఏసు పురుష సంబంధము లేకుండా పుట్టాడని'' సాక్ష్యము గలదు. అలాగే చాలామంది భర్తలు లేకముందే పిల్లలుగన్న చరిత్ర గలదు. కలియుగములో ఏసు పుట్టినట్లే, ద్వాపర యుగములో కర్ణుడు కూడా పుట్టాడు. దేవుడు ఇస్తే భర్త లేకున్నా సంతానము కలుగుతుంది. దేవుడు ఇవ్వకపోతే భర్తవున్నా సంతానము కలుగదు. సంతానము కలుగుట, కలుగక పోవుట కర్మనుబట్టి ఆత్మ అనుకోవడముబట్టి యుండును. అంతేగానీ ఎంత పెద్ద మీసాలున్న వారికయినా పిల్లలు పుట్టుదురను నమ్మకము లేదు. అంతా ఆత్మయనబడు ఆయన ఇష్టము. ఆయన ఇష్టము మన కర్మనుబట్టి యుండును. నేడు కొందరు వైద్యులు 'సంతాన సాఫల్య కేంద్రము'లను పేర్లతో బోర్డులు పెట్టుకొన్నారు. అయినా డాక్టరునుబట్టి ఏ ప్రయోజనము ఉండదు. ఆత్మ అనుకొంటే డాక్టర్ల ఉద్దేశ్యము నెరవేరును, లేకపోతే లేదు. అందువలన సంతాన సాఫల్య కేంద్రములు కూడా ఆత్మ సాఫల్యమును బట్టి యుండునుగానీ డాక్టర్ల చేతిలోగానీ, వారి పనిలోగానీ ఏమీ ఉండదు.
కొందరికి అమితమైన సంతానమును ఇచ్చువాడు ఆయనే (ఆత్మయే). ఏమాత్రము సంతానమును ఇవ్వక గొడ్రాలు చేయువాడు ఆయనే. కొందరికి వృద్ధాప్యములో సంతానమును కల్గించి ఆశ్చర్యమును కల్గించువాడు ఆత్మయే. కొందరిలో కవల పిల్లలను కల్గించువాడు ఆత్మయే. కొందరిలో గర్భము మధ్యలో పోవునట్లు చేయువాడు కూడా ఆయనే. కొందరికి ఏడు నెలలకే శిశువును తయారు చేయును. కొందరిలో పది నెలలకు కూడా పూర్తి ఎదుగుదల లేకుండా చేయును. కొందరిలో ఆరోగ్యవంతమైన, అంగ సౌష్టవమైన శిశువును పుట్టించును. కొందరిలో అంగహీనత కల్గిన శిశువును పుట్టించును. మనుషులలో తల్లితండ్రులుగా యున్న వారి కర్మను బట్టి ఆ శరీరములోని ఆత్మ వారికి సంతానము కలుగజేయగా, వారి సంతానము వలన తల్లితండ్రులుగా చెప్పుకొను వారికి అనేకమైన సుఖములు, అనేకమైన దుఃఖములు కల్గుచుండును. అందువలన ఆత్మ కర్మనుబట్టి కొందరికి భర్త లేనప్పుడు కూడా సంతానము కల్గించి, దానివలన అనేకమైన ఇబ్బందుల పాలు చేయగలడు. ఇతర పురుషుల వలననే సంతానము కల్గునని నమ్మినవారు భర్తలేని స్త్రీ సంతానము పొందితే ఆమెను అనేకులు కులటయని నిందింతురు. కర్మనుబట్టి ఆత్మయే అలా నిందలపాలు చేయుచున్నది. భర్తలేని స్త్రీకి సంతానము కల్గించి, నిందలపాలు చేయువాడు ఆత్మయిన దేవుడే. అలా నిందించుటకు కారణము ప్రజలకు బయటి పురుషునితో సంబంధము లేకుండా సంతానము కలుగవచ్చునను సత్యము తెలియని దానివలన అలా జరుగుచున్నది. అందువలన ప్రతి మనిషి ఆత్మజ్ఞానము తెలియగలిగితే శరీరములో ఆత్మ ఏమి చేయుచున్నది తెలియును. తానే పురుషుడైయుండి అందరికీ సంతానము కలుగజేయు వాడు ఆత్మేనని తెలియగలదు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
25. అతనికి తౌరాతు, ఇంజీలు గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు. (3-48)
మొదటి సృష్ఠికర్తయైన దేవుడు, అనగా మనకు తాతయైన దేవుడు ప్రతి శరీరములోనూ కార్యనిర్వాహకునిగా మరియు ఆరాధ్య దైవముగా ఉండునట్లు ఆత్మనే తయారు చేసి అన్ని అధికారములు ఆత్మకు ఇచ్చి తాను ఏమీ చేయక చూస్తూ యుండును. శరీరములో దేవుడు కర్మనుబట్టి పాపపుణ్యములను, శ్రద్ధనుబట్టి జ్ఞాన అజ్ఞానములను ఇచ్చుచుండును. మనిషి శ్రద్ధ అజ్ఞానము వైపు ఎక్కువగా ఉండుట చేత ఆత్మ అజ్ఞానమునే మనిషికి అందించుచుండును. అట్లు కొంతకాలము అనగా వేల సంవత్సరములో లేక లక్షల సంవత్సరములో జరుగగా అజ్ఞానము ఎక్కువై అధర్మములు అభివృద్ధియగుచున్నవి. ధర్మములు బలహీనపడి పోవుచున్నవి. అప్పుడు ధర్మములకు గ్లాని ఏర్పడినదని తలచి, తిరిగి ధర్మములు అభివృద్ధి చెంది, అధర్మములు లేకుండా పోవలెనని తలచిన మొదటి సృష్ఠికర్తయైన దేవుడు, తానే ఆ కార్యమును చేయుటకు పూనుకొనును. శరీరములో దేవుడుగాయున్న ఆత్మ కర్మ ప్రకారము ప్రవర్తించుట వలన, కర్మ ప్రకారమే ఆత్మే అధర్మములను అభివృద్ది చేసినది. అయితే ధర్మముల ప్రతిష్టాపన ఆత్మ చేయదు. ధర్మప్రతిష్టాపన పరమాత్మయైన దేవుడు చేయవలసి యున్నది. అయితే పరమాత్మ ఏమీ చేయనివాడుగా యుండుట వలన ఆయన చేయనట్లే యుంటూ, తన ప్రతినిధి ద్వారా చేయించినట్లు చూపుచూ ఇతరులు తెలియనట్లు తానే ధర్మ ప్రతిష్టాపన చేయుచున్నాడు.
పరమాత్మయైన దేవుడు తాను కానట్లు తన ప్రతినిధియన్నట్లు, ప్రతినిధి పేరుతో తానే తన ధర్మములను భూమిమీద ప్రజలకు తెలియజేయు చున్నాడు. ఈ కార్యము చేయుటకు మనుషుల మధ్యలోనికి మనిషివలె వచ్చి, మనుషుల భాషలో ధర్మయుక్తమైన జ్ఞానమును చెప్పవలసి యుండును. ఆ విధముగా వచ్చినవాడే ఈసా, ఆయననే ఏసు అని చెప్పుచున్నాము. దేవుడు తానే స్వయముగా ఏసుగా వచ్చియున్నా ఆ విషయము ఎవరికీ తెలియకూడదు కావున ఏసును సాధారణ మనిషిగానే ప్రజలు నమ్మునట్లు చేయుచున్నాడు. అందువలన ఏసుకు గతములో వచ్చిన భగవద్గీతను, ఇప్పుడు అనగా ఏసు యున్నప్పుడు చెప్పు బైబిలును (ఇంజీలును) నేర్పునట్లు చెప్పుచున్నాడు. అదే విషయమునే ఖుర్ఆన్ గ్రంథములో సూరా 3, ఆయత్ 48లో ఈ విధముగా చెప్పుచున్నారు చూడండి. (3-48) ''అల్లాహ్ అతనికి (ఈసాకు) గ్రంథాన్ని వివేకాన్ని బోధిస్తాడు. తౌరాతు, ఇంజీలు గ్రంథ జ్ఞానాన్ని నేర్పుతాడు.''
తౌరాతు, ఇంజీలు అను పేర్లు అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్ ఒక్క గ్రంథములో మాత్రమే చెప్పియున్నారు. తౌరాతుయనగా భగవద్గీత. ఇంజీలు అనగా బైబిలు గ్రంథము. ఇంజీలు అంటే బైబిలు అని ముస్లీమ్‍లు ఒప్పుకోవచ్చునుగానీ, తౌరాతు అంటే భగవద్గీతయను మాటను సులభముగా ఒప్పుకోరు. వారి దృష్ఠిలో తౌరాతు గ్రంథము ప్రత్యేకమైనది ఉంటుందియను నమ్మకము కలదు. తౌరాతు గ్రంథమును వారు చూడకున్నా దానిని భగవద్గీతయని మేము చెప్పితే దానిని ఒప్పుకొనుటకు వారి మనస్సు అంగీకరించడము లేదు. 'తౌరాతు' అను పేరు గ్రంథమును మూసా ప్రవక్త (మోషే ప్రవక్త) ఒక్కడు మాత్రము చూచాడు. ఆ పేరుతో ఆ గ్రంథమును ఎవరూ చూడలేదు. మోషే (మూసా)కు నేరుగా సాకార రూపములో మనిషిగా యున్న దేవుడే ఆ గ్రంథమును మూసాకు ఇచ్చి దాని పేరు తౌరాతుయని చెప్పాడు. ఎవరయితే గ్రంథమును ఇచ్చారో ఆయనే ఆ గ్రంథము పేరు కూడా చెప్పి ఇచ్చాడు. అలా ఇవ్వబడిన గ్రంథమును మూసా ఒక్కడు చూచాడు. ఆయన తర్వాత ఆ పేరుతో ఆ గ్రంథము ఎక్కడా లేదు. భారతదేశములో భగవద్గీతగా యున్న గ్రంథమే తౌరాతుయని తెలియవలెను.
ఏసుగా వచ్చిన ఆయన ఎవరో ఆయనకు తౌరాతు జ్ఞానము తెలుసు. అదే జ్ఞానమునే ఇంజీలు జ్ఞానముగా ఏసు చెప్పడము జరిగినది. అంతకు ముందు గతములో భగవద్గీతయే తౌరాతుగా చెప్పబడిన జ్ఞానమే ఏసు కాలములో ఇంజీలు (బైబిలు) జ్ఞానముగా ప్రజలకు చెప్పాడు. ఏసుగాయున్న వ్యక్తికి ఒకే దేవుని జ్ఞానము తెలియుట చేత దానినే ''తౌరాతు, ఇంజీలు జ్ఞానము ఆయనకు నేర్పబడ్డాయి'' అని వాక్యములో చెప్పారు. 'నేర్పబడ్డాయి' అంటే ఆయనకు రెండు గ్రంథముల జ్ఞానము తెలుసుయని మనము అర్థము చేసుకోవాలి.
శరీరములోని 'ఆత్మయిన దేవుడు ఒక్కడే ఆరాధింప తగినవాడు' అని నిర్ణయించి, అధికారములు ఇచ్చినవాడు మొదటి సృష్ఠికర్తయిన పరమాత్మ. పద్ధతి ప్రకారము అధర్మములు అభివృద్ధయి ధర్మములకు ముప్పు ఏర్పడినప్పుడు తిరిగి ధర్మప్రతిష్టాపనకు వచ్చినవాడు ఏసుయని చెప్పుకొన్నాము. ఏసు వచ్చి ఇంజీలు జ్ఞానమును చెప్పాడు. అయితే తౌరాతు (భగవద్గీత) జ్ఞానమును చెప్పిన కృష్ణుడు కూడా దేవుడు సాకారముగా అవతరించినవాడే కదా!యని కొందరు అనుకోవడము జరిగినది. దేవుడు శరీరము ధరించి కృష్ణుడుగా వచ్చినమాట నిజమేగానీ, ఆయన ఏసువలె ధర్మసంస్థాపనకు రాలేదుయని చెప్పవచ్చును. ''ధర్మ సంస్థాపన కొరకు దేవుడు మనిషివలె వస్తాడని'' కృష్ణుడు చెప్పినట్లు ఏసు వచ్చాడు. కృష్ణుడు ''సృష్ఠ్యాదిలో తాను సూర్యునకు చెప్పిన జ్ఞానమును తిరిగి జ్ఞాపకము చేయుట కొరకు వచ్చాడు.'' భగవద్గీత సృష్ఠ్యాదిలో చెప్పినదేగానీ ద్వాపరయుగము చివరిలో చెప్పినది కాదు. అందువలన కృష్ణుడు దానిని భగవద్గీతయను పేరుతో చెప్పలేదు. కృష్ణుడు చెప్పిన పేరు, కృష్ణుడు పెట్టిన పేరు 'తౌరాతు' యని తెలియవలెను.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
26. అల్లాహ్‍యే నిజమైన దైవము. (3-62)
(3-62) ''నిశ్చయముగా ఇదే (మర్యమ్ కుమారుడు ఈసా గురించిన) నిజమైన గాథ. అల్లాహ్ తప్ప ఆరాధనకు వేరెవరూ అర్హులు కారు. నిశ్చయముగా అల్లాహ్‍యే ప్రాబల్యము కలవాడు, ఆయనే వివేచనా పరుడు.''
పెద్ద దేవుడు ధర్మసంస్థాపన నిమిత్తము శరీరము ధరించి ఎక్కడ పుట్టినా, ఆయన జీవితము రెండు కోణములలో ఉండును. ఒకటి ప్రపంచ కోణములో సాధారణ జీవితమును సాగించడము, రెండు దైవికమయిన అసాధారణ జీవితమును సాగించడము రెండు రకముల జీవితముండును. సాధారణ జీవితము ఎక్కువగా యుండును, దైవికమైన అసాధారణ జీవితము చాలా తక్కువ యుండును. ద్వాపర యుగములో 'తౌరాత్ జ్ఞానమును గుర్తు చేసిన కృష్ణుడు దేవుని అవతారమే' అయినా ఆయన తన జీవితములో ధర్మప్రతిష్టాపన చేయుటకు రాలేదు. గతములో ఆకాశవాణి ద్వారా సూర్యునకు చెప్పిన జ్ఞానమును ఐదు లేక ఆరు నిమిషములలో గుర్తు చేయుటకు వచ్చాడు. తన జీవితములో ఎప్పుడుగానీ ప్రత్యక్షముగా కృష్ణుడు ఎవరికీ జ్ఞానము చెప్పలేదు. మనిషిగా తర్వాత వచ్చినవాడు మొదట కృష్ణునిగా వచ్చినవాడే అయినా, తన రెండవ జన్మలో ఏసుగా వచ్చి ధర్మములను మూడు సంవత్సరములు తెలియజేయడమైనది. మూడు సంవత్సరములు తెలియజేసిన జ్ఞానము తౌరాత్ జ్ఞానమే అయినా దానికి ''ఇంజీలు'' అని క్రొత్త పేరు పెట్టబడినది. చెప్పినవాడు ఏసుగా యున్నందున దానికి వేరు పేరు పెట్టాడు. దానివలన కృష్ణుడు వేరు, ఏసు వేరను భావము రావలెననీ, ఇద్దరూ ఒకటేయని తెలియకూడదనీ అలా చేశారు.
జ్ఞాన సముపార్జన వలన వారు ఇద్దరు ఒక్కరేయనీ, రెండు గ్రంథముల జ్ఞానము ఒక్కటేయని తెలియుట సరియైన పద్ధతి. అందువలన వారు వేరువేరుగా ఉన్నారనీ, గ్రంథములు వేరువేరుగా ఉన్నవనీ తెలుపడ మైనది. అలా వారి యదార్థస్థితి బయటి మనుషులకు తెలియకుండడమే మంచిది. తెలిస్తే ''ఆరాధ్య దైవము ఒక్కడే'' యను మాటకు భంగము ఏర్పడును. దేవుని అవతారముగా ఫలానా వారున్నారని తెలిస్తే వారిని ఆరాధించుటకు అవకాశమున్నది. అందువలన అది సరియైన పద్ధతి కాదు. ఆరాధ్య దైవము ఆత్మ ఒక్కడే అయినందున ఆ మాటకు భంగము కలుగకూడదు అంటే భగవంతుని అవతారముగా వచ్చినవారు గానీ, చెప్పబడిన గ్రంథములుగానీ ఫలానాయని తెలియకూడదు. అందువలన ఏసు కాలములో ఏసు ఎవరయినది తెలియకుండా పోయినది. అట్లే చెప్పబడిన ఇంజీలు గతములో ఎట్లుండేదని ఎవరికీ తెలియకుండా పోయినది.
కృష్ణుడు దేవుని అవతారమే గానీ ధర్మములను బోధించి ధర్మ ప్రతిష్టాపన చేయుటకు రాలేదు. కృష్ణుడు భగవద్గీతలో (తౌరాతులో) చెప్పినట్లు ''దేవుడు ధర్మసంస్థాపన నిమిత్తము ప్రతి యుగములోనూ వస్తాడు. ధర్మములను బోధించి అధర్మములను లేకుండా చేసి ధర్మములను స్థాపితము చేస్తాడు'' యని చెప్పినట్లు దేవుడు ఏసు రూపములో వచ్చాడని తెలియు చున్నది. దేవుడు మనిషి ఆకారములో ఏసుగా వచ్చినా ఆయన ఎవరి చేత పూజింపబడలేదు. ఆరాధింపదగిన దేవుడు ఒక్కడే అదే విషయమునే వాక్యములో ''అల్లాహ్ తప్ప ఆరాధనకు ఎవరూ అర్హులు కాదు'' అని అన్నారు. శరీరములో చైతన్యముగా యున్న ఆత్మ తప్ప, సాకారముగా కనిపించు వారు ఎవరూ ఆరాధనకు అర్హులు కారని చెప్పారు. అందువలన స్వయముగా దేవుడే మనిషిగా వచ్చినా తాను ఎవరయినది తెలియుటకు అవకాశము లేకుండా చేయుచున్నాడు. ఈ కారణము చేత కృష్ణుడుగా వచ్చినప్పుడుగానీ, ఏసుగా వచ్చినప్పుడుగానీ సాధారణ మనుషులకు తాను ఎవరయినది ఏమాత్రము తెలియకుండా చేశాడు. కృష్ణునిది దేవుని అవతారమే, అలాగే ఏసుది దేవుని అవతారమే. కృష్ణుడు ధర్మసంస్థాపనకు రాలేదు. జ్ఞాపకము చేయుటకు మాత్రమే వచ్చాడు. కొన్ని నిమిషముల పని మాత్రమే ఆయనది. ఏసు ధర్మ సంస్థాపన కొరకు వచ్చాడు. అదే ఆయన (ఏసు) నిజమైన గాథ.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
27. దైవ గ్రంథమున్నా తప్పుదారిలో ఎందుకు పోతున్నారు? (3-69, 70, 71)
దైవ గ్రంథములు మూడు ప్రజలందరి సొత్తుగాయున్నవి. ఏ గ్రంథము ఏ మతమునకు సంబంధము లేదు. హిందువులు, క్రైస్థవులు తమ గ్రంథములుగా భగవద్గీతను, బైబిలును చెప్పుకొన్నా ముస్లీమ్‍లు ఆ రెండు గ్రంథములలోని వాక్యములను తీసుకొని బోధించుచున్నా దానికి హిందువులుగానీ, క్రైస్థవులుగానీ అభ్యంతరము తెలుపలేదు. ఒక్క ముస్లీమ్‍లు మాత్రము ఖుర్ఆన్ గ్రంథములోని వాక్యములు ఎవరయినా, ఎక్కడయినా చెప్పినా, వాటిని వివరించి వ్రాసినా దానికి అభ్యంతరము తెలుపుచున్నారు. 'మా ఖుర్ఆన్‍ను మీరు చెప్పకూడదు' అంటున్నారు. 'ఇది మా ఖుర్ఆన్' అనుటకు గ్రంథములో ఏ ఆధారము లేదు. అది ఒక్క ముస్లీమ్ గ్రంథము కాదు. అందరి ఉమ్మడి సొత్తు. (81-27) వ ఆయత్‍లో ఇలా కలదు. ''ఇది సమస్త లోకవాసులకు హితోపదేశము'' అని చెప్పబడి యున్నది. ఇది ఒక్క ముస్లీమ్‍లకని చెప్పలేదు. అలాంటప్పుడు ఖుర్ఆన్ గ్రంథమును ఎవరయినా చదివి, వివరించి చెప్పుకోవచ్చును. ఎవరి బుద్ధికి దేవుడు ఎంత అందిస్తే అంత ఖుర్ఆన్ గ్రంథము అర్థము కాగలదు. అంతేగానీ ముస్లీమ్‍లు ఇది మా గ్రంథమనినా, ఇతరులు చదువకూడదనినా అల్లాహ్ లెక్కలో వారిది తప్పగును. మూడు గ్రంథములు మూడు మతముల వారికి స్వతంత్రమైనవి. ఎవరు ఏ గ్రంథమునయినా చదువవచ్చు, దానిని వివరించి ఇతరులకు చెప్పవచ్చు. అట్లు చదువకూడదు, వివరించి చెప్పకూడదు అనుటకు ఎవరికీ హక్కులేదు.
హిందువులు ఇతర మత గ్రంథములని చెప్పుకొను బైబిలు, ఖుర్ఆన్ చదువవచ్చును. అట్లే క్రైస్థవులు భగవద్గీత, ఖుర్ఆన్‍ను, ముస్లీమ్‍లు భగవద్గీత బైబిలును చదివి చెప్పవచ్చును. తమకు అర్థమయ్యే విధానము వేరువేరు అర్థములుగా యున్నా ఫరవాలేదుగానీ మూడు దైవగ్రంథములను చదువ వలెనను ఉద్దేశ్యము కల్గియుండవలెను. దైవగ్రంథములను చదువవలెనను శ్రద్ధకల్గి చదువుచుండినా ఎప్పుడో ఒకప్పుడు దేవుడు దయతలచి దానిలోని నిజ భావమును తెలియజేయును. అలా చదువుచున్న వారికి తమ గ్రంథమని చెప్పుకొను వారికి తెలియని సత్యము తెలియవచ్చును. ముస్లీమ్‍లకు అర్థము కానిది ఖుర్ఆన్ గ్రంథములో క్రైస్థవులకు అర్థము కావచ్చును. సత్యమును చెప్పితే మూడు మతముల వారికి మూడు గ్రంథములలో చెప్పిన జ్ఞానము అర్థము కాలేదనియే చెప్పవచ్చును. దేవుని మీద, దేవుని జ్ఞానము మీద శ్రద్ధయున్న వాని బుద్ధికి వాక్యములోని జ్ఞానము సత్యసమేతముగా అర్థమగును.
ఒక మతము వారు ఎవరయినా మా గ్రంథము మాకు అర్థము కాలేదా? యని అడిగితే కాలేదని చెప్పవచ్చును. ఎందుకనగా! మూడు గ్రంథములలో ఒకే దేవుని జ్ఞానముండుట వాస్తవము. అయితే అందులోని సత్యము పూర్తిగా అర్థము కాలేదని చెప్పవచ్చును. దానికి ఆధారము కలదు. అదేమనగా! హిందువులు భగవద్గీత చదివినా, క్రైస్థవులు బైబిలు చదివినా, ముస్లీమ్‍లు ఖుర్ఆన్ చదివినా అందులో అర్థము కాని విధానము మూడు గ్రంథములలో గలదు. అది ఏమనగా! భగవద్గీతలో సృష్ఠికర్తయిన దేవున్ని ఆత్మయని, సృష్ఠింపబడిన ఆత్మను ఆత్మని చెప్పియుండుట వలన అట్లే జీవాత్మను ఆత్మని చెప్పియుండుట వలన ఏ శ్లోకములో భావము ఏ ఆత్మను గురించి కలదో చెప్పుటకు వీలుపడడము లేదు. అట్లే బైబిలు గ్రంథములో దేవున్ని తండ్రియని చెప్పడమేకాక దేవుని చేత సృష్ఠింపబడిన దేవున్ని కూడా తండ్రియని చెప్పారు. అలాంటప్పుడు ఏ వాక్యములో ఏ తండ్రిని గురించి చెప్పారో తెలియకుండా పోయినది. అట్లే ఖుర్ఆన్ గ్రంథములోనికి వచ్చి చూస్తే సృష్ఠ్యాదిలో సర్వమును సృష్ఠించిన దేవున్ని అల్లాహ్యని అన్నారు. సృష్ఠి తర్వాత అందరూ ఆరాధించుటకు ఆరాధ్య దైవముగా నిర్ణయింపబడిన దేవున్ని అల్లాహ్యని అన్నారు. ఈ లెక్క ప్రకారము సృష్ఠ్యాదిలో యున్న దేవుడు, సృష్ఠి తర్వాత ఆరాధన అవసరమైన దేవున్ని తయారు చేసి ఈయన ఒక్కడే ఆరాధ్య దైవమని చూపించాడు. అలా ఆరాధింపబడు దేవుడు, ఆరాధన అవసరములేని దేవుడు ఇద్దరినీ అల్లాహ్యని వాక్యములో చెప్పియుండుట చేత ఎక్కడ ఏ అల్లాహ్‍ను గురించి చెప్పారని ముస్లీమ్‍లు ఎవరూ తెలియలేకపోవుచున్నారు. ఖుర్ఆన్ గ్రంథములో 112వ సూరాలో రెండవ ఆయత్‍లో మొట్టమొదటి సృష్ఠికర్తయిన అల్లాహ్‍ను చెప్పియున్నారు. అల్లాహ్ నిరాపేక్షా పరుడు. ఏ ఆకాంక్ష లేనివాడనీ, ఏ అక్కర లేనివాడని చెప్పారు. ఇంకా బాగా అర్థము చెప్పుకొంటే ఏ ఆశా లేనివాడు అని చెప్పవచ్చును. ఏ ఆకాంక్ష లేని దేవున్ని 112వ సూరా, రెండవ వాక్యములో చెప్పియున్నారు.
అక్కడే అదే సూరాలో మొదటి వాక్యములో అల్లాహ్ ఒక్కడే గలడు అని సృష్ఠ్యాదిలో యున్న దేవున్ని గురించి చెప్పారు. సూరా రెండు ఆయత్ 255లో మనుషులు ఆరాధించుటకు అర్హుడయిన ఒకే దేవున్ని గూర్చి చెప్పారు. మూడవ వాక్యములో అల్లాహ్‍కు సంతతి లేదు అని చెప్పబడినది. తర్వాత చెప్పిన (6-102) వాక్యములో అందరినీ సృష్ఠించిన వాడు ఆయనే అన్నారు. 112వ సూరా రెండవ ఆయత్‍లో అల్లాహ్ ఏ ఆకాంక్ష లేనివాడు అని చెప్పారు. (2-255)లో ''నిత్యము పని చేయువాడు'' అని చెప్పారు. (2-117) ''భూమిని ఆకాశమును సృష్ఠించినవాడు ఆయనే, ఆయన పని చేయడు, ఆయన 'అయిపో' అంటే అయిపోతుంది'' అని చెప్పారు. అదే (2-255)లో ''కునుకు నిద్ర లేకుండా పనిని చేయుచున్నాడని చెప్పి, పనిని చేయడములో అల్లాహ్ అలిసి పోడు'' అని అన్నారు. ఇవన్నీ చూచిన తర్వాత (2-255) లో పనిని చేసే అల్లాహ్ ఉండగా, (2-117)లో పనిని చేయక మౌనముగా యుంటూ అల్లాహ్ సంకల్పించుకొంటే అయిపోవునని చెప్పారు. ఒకచోట 'ఏ అవసరము లేనివాడు, ఎవరి అక్కర లేని అల్లాహ్' వాక్యములో గలడు. ఇంకొక వాక్యములో 'నమాజ్ చేయు భక్తులతో అక్కర గల అల్లాహ్' ఉన్నట్లు తెలియుచున్నది. ఇట్లు సృష్ఠి పూర్వము 'ఏ సంబంధము లేని అల్లాహ్' ఉండగా సృష్ఠి తర్వాత 'తాను ఒక్కడే ఆరాధ్యదైవము'గా యున్న అల్లాహ్ కలడు. అయితే ముస్లీమ్ సమాజము మొత్తమునకు అల్లాహ్ ఒక్కడే గలడని తెలుసు. ఆరాధ్య దైవముగా యున్న (6-102) లో గల అల్లాహ్ ఒక్కడు మాత్రము తెలుసు. (112-1,2,3) వాక్యములలో గల ఏ సంబంధము లేని అల్లాహ్ గురించి ఏమాత్రము తెలియదు. ఒకరు ఆరాధనకు దూరముగా యుండే అల్లాహ్ గలడనీ, మరియొకరు ఆరాధనకు అర్హుడైయున్న అల్లాహ్ గలడనీ ఖుర్ఆన్ గ్రంథములో ఇద్దరు అల్లాహ్‍లను గురించి చెప్పియున్నారను విషయము తెలియదు.
ముస్లీమ్ సమాజములో సాధారణ మనుషులు కాకుండా మేము జ్ఞానులము, మాకు ఖుర్ఆన్ జ్ఞానము బాగా తెలుసు అనువారికి కూడా ఇద్దరు అల్లాహ్‍లు ఉన్నారనీ, ఒకరు సృష్ఠి పూర్వమునుండి ఉండే అల్లాహ్యనీ, అందరూ ఆరాధించుటకు సృష్ఠి తర్వాత నియమింపబడిన అల్లాహ్ మరొకరు గలడనీ, మొత్తానికి ఇద్దరు అల్లాహ్‍లు గలరని తెలియదు. 112వ సూరాలో నాలుగు వాక్యములలో చెప్పిన దేవుడు మొదటి సృష్ఠికర్త యనీ, (2-255) లో (6-102) లో చెప్పబడిన అల్లాహ్ రెండవ సృష్ఠికర్త యనీ, ఇద్దరి దేవుళ్ళ తారతమ్యము తెలియకున్నారు. ఆరాధనకు దూరముగా యున్నవాడు మొదటి దేవుడనీ, ఆరాధనకు అర్హుడైన ఒకే ఒక దేవుడు మొదటి దేవుని చేత సృష్ఠింపబడిన రెండవ దేవుడనీ, గ్రంథములో శ్రద్ధయున్న వారి బుద్ధికి తెలియుచుండగా అది అసత్యము అని చెప్పుచున్న ముస్లీమ్‍లు కూడా కలరు. ఒకే దేవుడని చెప్పుకొను ముస్లీమ్‍లు తమ గ్రంథమని చెప్పుకొను ఖుర్ఆన్ గ్రంథములో ఇద్దరు దేవుళ్ళను గురించి చెప్పియున్నారని చెప్పితే మా మాట వినిన ముస్లీమ్‍లు దానిని జీర్ణించు కోలేకపోవుచున్నారు. ఇద్దరు అల్లాహ్‍లు గ్రంథములో యున్నా ఒకరు మనుషులతో ఏ సంబంధము లేని దేవుడు ఉండగా, నమాజ్‍తో సంబంధము గల దేవుడు గలడు. ఈ విషయము ముస్లీమ్‍లందరికీ క్రొత్త విషయమే.
ఖుర్ఆన్ గ్రంథములో 112వ సూరాలోని నాలుగు వాక్యములు మనుషుల ఆరాధనతో సంబంధము లేని దేవున్ని గురించి చెప్పారని తర్వాత (6-102) లో మరియు (2-255) లో ''ఆరాధనతో సంబంధమున్న దేవున్ని గురించి చెప్పారని ''ధర్మచక్రము'' గ్రంథములో చెప్పియున్నారని మేము చెప్పగా కొందరు జ్ఞానులుగా యున్నవారు సూరా మూడు ఆయత్ 69లో చెప్పినట్లు మేము ఇద్దరు దేవుళ్ళని చెప్పినది సత్యము కాదనీ, మీరు తప్పు దారి పట్టిపోయారు, ఇప్పటినుండయినా మీ దారి మార్చుకొమ్మని చెప్పుచూ మమ్ములను దారి మళ్లించాలని చూస్తున్నారు. వారు సక్రమమయిన మార్గములో ఉన్నారని అనుకొంటున్నారు. నిజానికి వారే తప్పుదారిలో యున్నారని వారు తెలియలేకపోయారు. వారి మార్గమును గురించి వారు తెలియక ఇతరుల మార్గము తప్పుయని అంటున్నారు. అటువంటి వారిని గురించి ఖుర్ఆన్ గ్రంథములో సూరా మూడులో, ఆయత్‍లు 69, 70, 71 అను మూడు వాక్యములలో ఇలా చెప్పారు చూడండి.
(3-69) ''గ్రంథవహులలోని ఒక వర్గము మిమ్ములను పెడత్రోవ పట్టించాలని చూస్తున్నది. నిజానికి వారు తమను తాము పెడత్రోవలో పడవేసుకొంటున్నారు. వాస్తవానికి వారే తప్పుదారి పట్టుచున్నారని గ్రహించలేకపోవుచున్నారు.''
(3-70) ''ఓ గ్రంథవహులారా! మీరు అల్లాహ్ ఆయతులకు సాక్షిగా యుండి కూడా వాటిని ఎందుకు తిరస్కరించుచున్నారు.''
(3-71) ''గ్రంథము గల ఓ ప్రజలారా! తెలిసి కూడా సత్యానికి అసత్య రంగు పులిమి చెప్పిన దానిని ఎందుకు అనుమానాస్పదము చేస్తున్నారు? ఉద్దేశపూర్వకముగా సత్యాన్ని ఎందుకు కప్పిపుచ్చు తున్నారు?''
దేవుడు ఇద్దరుగా యున్నారని చెప్పినా గ్రంథమును చదువువారు, గ్రంథము తమ దగ్గరేయున్నా దానిని గమనించక మీరు తప్పుదారిలో పోవు చున్నారని సత్యము చెప్పిన వారిని అంటున్నారు. నిజానికి వారే అసత్యమార్గము పట్టియున్నారని వారికి తెలియదు. గ్రంథములో చెప్పిన (112, 1,2,3) (6-102) ఆయత్‍లలో ఉండగా సత్యమును ఎందుకు కాదంటున్నారు. తెలిసి 'సత్యానికి అసత్య రంగుపూచి సత్యమును ఎందుకు కప్పిపుచ్చుతున్నారని' దేవుడు ప్రశ్నించుచున్నాడు. మనిషి ప్రపంచ విషయములలోనూ డబ్బువద్దను చాలా జాగ్రత్తగాయుండును. వేయి రూపాయలు అప్పు తీసుకొన్నవాడు ఒకమారు ఐదువందలు మరొకమారు నాలుగు వందలు డబ్బు ఇస్తే ఇంకా వందరూపాయలు బాకీయున్నాడని లెక్కవేసి చెప్పుదుము. ముందు ఏమి ఇచ్చాడు తర్వాత ఏమి ఇచ్చాడని లెక్కాచారము చెప్పు మనిషి దేవుని విషయములో అంత గ్రుడ్డిగా ఎందుకున్నాడో తెలియకున్నది. ముందు ఎంత జ్ఞానమును చెప్పాడు, తర్వాత ఎంత జ్ఞానమును చెప్పాడు అని లెక్క తెలియలేకపోవుచున్నాడు. డబ్బు విషయములో ఎంత ఇచ్చాడు, ఎంత బాకీ ఉన్నాడని రూపాయితో సహా లెక్క చెప్పు మనిషి, జ్ఞాన విషయములో కొంతయినా విచక్షణ లేకుండా పోవడము విచిత్రముగా యున్నది.
దైవ గ్రంథములు జ్ఞానమును గ్రామునుండి తూకము వేసి టన్ను వరకు వివరముగా చూపు త్రాసులాంటివి. దైవ గ్రంథములు ఖచ్చితముగా తూకము చూపు తక్కెడలాంటివి. చిన్న జ్ఞానము నుండి పెద్ద జ్ఞానము వరకు ఎంతో వివరముగా విచక్షణా సహితముగా, శాస్త్రబద్దముగా తెలుపు చున్నవి. దైవజ్ఞానమును ఖచ్చితమైన తూకముతో చూపు దైవ గ్రంథములో 112వ సూరాలోని నాలుగు ఆయత్‍లలో తొమ్మిది వేల (9000) రూపాయల తూకమున్న దేవున్ని చూపి తర్వాత (6-102) వాక్యములో తొమ్మిది వందల (900) రూపాయల తూకమున్న దేవున్ని చూపారు. పైన (112-1,2,3,4) వాక్యములలో సంఖ్య తొమ్మిదేయుండి సున్నాలు మాత్రము మూడు గలవు. అలాగే (6-102) వాక్యములో సంఖ్య తొమ్మిదేగానీ సున్నాలు రెండే గలవు. అటువంటప్పుడు చదువు వచ్చినవాడు ఎవడయినా చిన్న మొత్తము ఏది, పెద్ద మొత్తము ఏది అని సులభముగా చెప్పగలడు. అదే విధముగా పని చేయనివాడు, ఏ అక్కర లేనివాడు (112-2) లో ఉండగా, పని చేయువాడు ఆరాధనకు తగినవాడు (6-102)లో ఉన్నాడు. దీనిప్రకారము బుద్ధియున్న వారు ఎవరు పెద్ద దేవుడు? ఎవరు చిన్న దేవుడు? అని తెలియగలరు. దైవ గ్రంథమయిన ఖుర్ఆన్‍లో ఎంతో ఖచ్చితమైన లెక్కప్రకారము జ్ఞానముండగా దానిని ముస్లీమ్‍లు సరిగా తెలియలేక రెండుచోట్ల చెప్పబడిన వాడు ఒక్కడే యనుచున్నారు. అలా అనడము 9000 లను, 900 లను ఒక్కటేయని చెప్పినట్లు కలదు. 112వ సూరాలోని 2వ ఆయత్‍కు ఆరవ సూరాలోని 102వ ఆయత్‍కు తేడా తెలియకపోతే తొమ్మిది వేల (9000) కు, తొమ్మిది వందల (900) కు తేడా తెలియనట్లేయగును. బైబిలులోగానీ, ఖుర్ఆన్ గ్రంథములో గానీ తొమ్మిది సంఖ్యను చూస్తున్నారుగానీ దాని ప్రక్కలో యున్న సున్నాలను గమనించడము లేదు. వాక్యము ఎంత విలువయైనదని లెక్కించి చూడడము లేదు.
ఉదాహరణకు బైబిలును బోధించు కాలేజీలు పెట్టుకొని, ఆ కాలేజీలలో కొందరిని బోధకులు (పాస్టర్‍లు)గా తయారు చేయు ఒక బోధకుడు తనకంటే బైబిలులో మించిన జ్ఞాని లేడని అనుకొను ఒక స్కూల్ డైరెక్టర్ మమ్ములను దేవుని మార్గము త్రప్పి నడచువానిగా, అందరినీ తప్పుదారిలో పంపు వానిలాగా వర్ణించి చెప్పడము జరిగినది. అతనిని బైబిలులో ఒక వాక్యమును చెప్పి ఇది నీకుగానీ, మరి ఎవరికయినా దీని వివరము తెలుసునా?యని అడుగుచున్నాను. నన్ను ఇతరులు విమర్శించిన విమర్శలను కూడా అందరూ చదువునట్లు నేను గ్రంథములోనే వ్రాయుచున్నాను. నేను త్రిమత గురువును. మూడు మతముల వాక్యములకు వివరమును చెప్పుచున్నాను. నా వివరము శాస్త్రబద్దముగా ఉందో లేదో నా గ్రంథములు చదివే ప్రజలకే తెలుసు. నా ప్రశ్న ఇది చూడండి. మార్కు సువార్తలో 14వ అధ్యాయములో 22, 23, 24 ఇలా కలవు. మార్కు (14-22, 23, 24) ''వారు భోజనము చేయు చుండగా, ఆయన ఒక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చి మీరు తీసుకొనుడి, ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని వారికిచ్చెను. వారందరూ దానిలోనిది తాగ్రిరి. అప్పుడాయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము'' అని చెప్పి యున్నాడు.
అట్లే ఇదే విషయమే మత్తయి సువార్తలో 26వ అధ్యాయములో 26, 27, 28 వాక్యములలో చెప్పియున్నారు చూడండి. (మత్తయి 26-26, 27, 28) ''వారు భోజనము చేయుచుండగా ఏసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి, విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినుడి. ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ తాగ్రుడి. ఇది నా రక్తము అనగా! పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింప బడుచున్న నిబంధన రక్తము.''
మార్కు, మత్తయి రెండు సూవార్తలలో ఒకే విషయము చెప్పబడి యున్నది. ద్రాక్షరసమును గిన్నెలో ఇచ్చి ఇది నా నిబంధన రక్తము పాపుల కొరకు చిందింపబడుచున్న రక్తము అని చెప్పారు. అయితే నేడు క్రైస్థవ బోధకులు వారిని తయారు చేసిన పెద్ద బోధకులు 'ఏసు మన కొరకు చిందించిన రక్తముతో మీ పాపములను కడుగుకొనుడి' అని చెప్పుచున్నారు. ఆ రోజు ఏసు తన రక్తము ప్రస్తుతము చిందింప బడుచున్నదియని వర్తమాన కాలములో చెప్పాడు. ఆ వాక్యము ఎప్పుడు చెప్పినా అది సజీవ వాక్యమై వర్తమాన కాలమునకే వర్తించునను విషయము నేడు బోధకులకు తెలియకుండా పోయినది. ఏసుప్రభువుది నిబంధన రక్తము. అందువలన అది ఎప్పటికీ ఉండునదియని తెలియుచున్నది. ఏసు చెప్పిన జ్ఞానమే శాశ్వితముగా వెదజల్లుచున్న జ్ఞానము (చిందింప బడుచున్న రక్తము) అని ఎందుకు అర్థము కాలేదో! అంతేకాక ఆయన నా నిబంధన రక్తమును త్రాగమని చెప్పితే ఏసురక్తముతో పాపమును కడుగుకొనుము అనియో లేక రక్తమును పూసుకొనుము అనియో చెప్పుచున్నారు. ఏసు తన వాక్యములో త్రాగమని చెప్పాడా? తన రక్తముతో కడుక్కోమన్నాడా? ఏసు ఒకటి చెప్పితే మరొకటి చెప్పు బోధకులు నన్ను విమర్శిస్తూ, నా మార్గము సరియైనది కాదు అంటున్నారు. ''నాకు మార్గము లేదు అని వారికి తెలియదు. నాకు ప్రయాణమే లేదు, మార్గమెలా ఉండును? నా మార్గమే లేనప్పుడు నాది మీవలె ప్రయాణమే కానప్పుడు, 'నా మార్గము తప్పు' అనుకోవడము పొరపాటు కాదా! నాకు ప్రయాణమే లేనప్పుడు మీకు మార్గము ఎలా కనిపించిందో చెప్పగలరా?''
ఇంతవరకు ఆయన రక్తమును గురించే క్రైస్థవ లోకము చెప్పు కొంటున్నది. ఆయన శరీరమును గురించి కొంతయినా ఆలోచించారా? లేదు ఆయన జ్ఞానరక్తము యని చెప్పితే సాధారణ రక్తము అనుకొన్నారు. అయితే ఆయన శరీరమునుండే రక్తము కారవలసియున్నది. రక్తము 'నిబంధన' అను పేరుతో యున్నది. నిబంధన యను మాటను మరిచి ప్రక్కన పెట్టిన మీది ఏ మార్గమో చెప్పగలరా? రొట్టెను ఇచ్చి నా శరీరము అన్నాడు. శరీరమునుండే రక్తము వస్తుంది. అందువలన నా శరీరమును తింటే అందులో రక్తము దొరుకుతుందియని చెప్పకనే చెప్పినట్లు అర్థమగు చున్నది. నా శరీరము గ్రంథము, దానిలోనే జ్ఞానము అను రక్తము దొరుకును. అది మీ కర్మలను కాల్చునుయని ఏసు తన శిష్యులకు గుప్త భావమును తన మాటలలో ఇరికించి చెప్పాడు. ఆయన చెప్పిన మాటే మీకు అర్థము కాలేదు. అయినా రహస్య సత్యమును చెప్పు మాది చెడు దారి, శరీరమును గురించి మాట్లాడని మీది మంచిదారా?
మీలాంటి వారున్నారని తెలిసిన దేవుడు 3-69వ వాక్యమును చెప్పాడు. ఎదుటి వారిని తప్పుదారి యను వారు తామే దారి తప్పి యున్నారని వారికి తెలియదని చెప్పాడు. అటువంటి కొందరు ఒక ఇస్లామీ సంస్థలో గురువులమని చెప్పుకొను వారు మమ్ములను విమర్శిస్తూ ఇలా వ్రాశారు గమనించండి. ''త్రైత సిద్ధాంత స్థాపకులు శ్రీ ప్రబోధానంద యోగీశ్వరులు. స్వామి వారి భావము మంచిదే. వారు ఇస్లామ్‍ను, ముహమ్మద్ ప్రవక్తగారిని గౌరవిస్తారు. వారు ఇస్లామ్‍ను లేకుండా చేయాలి అని అనుకోలేదు. నిజమైన ఆత్మజ్ఞానమును చెప్పదలచారుగానీ వారు ఏదైతే మార్గాన్ని తీసుకొన్నారో అది చాలా ప్రమాదకరము. ఇస్లామ్ యొక్క అసలు ఉద్దేశ్యమునుండి అది దూరము చేస్తుంది. ఒక పెద్ద మనిషి ఒక గుంపును తీసుకొని వెళ్ళుచున్నారు కానీ, గమ్యము ఎక్కడున్నదో వారికే తెలియదు. ఇలాంటి వారు తాము మార్గము తప్పడమే కాకుండా అందరినీ మార్గము తప్పిస్తారు. అందుకే మా ఈ ప్రయత్నము. స్వామివారికి వారి భక్తులకు నిజమైన మార్గమును చూపి అంధకారము నుండి వెలుగులోనికి తీసుకొని రావాలని కోరుచున్నాము.''
ఈ విధముగా ముస్లీమ్‍ల ఆధ్యాత్మిక సంస్థలోయుండు గురువులుగా యున్నవారు వ్రాశారు. మేము నడుచు మార్గము ప్రమాదకరమైనదనీ అంధకారము నుండి వెలుగు లోనికి తేవాలని కోరుచున్నామని చెప్పారు. నా మార్గము చెడుదనీ, ప్రమాదకరమైనదని వ్రాశారు. నేను ఏ దారిలో పోలేదే, నా దారి మీకు ఎలా కనిపించినది? నాది ప్రయాణమే కానప్పుడు నా దారి మీకు ఎలా కనిపించినదో? నేను మూడు మతములను సమానముగా చూస్తూ, మూడు గ్రంథములను దైవ గ్రంథములని చెప్పుచూ మూడు దైవ గ్రంథములను గౌరవిస్తూ, ప్రజలకు మూడు గ్రంథములలోని విషయములను సమానముగా చెప్పుచున్నాము. నేను మతముల మధ్య ద్వేష భావము గల మనుషులలో ఇతర మతముల మీద ద్వేష భావము లేకుండా చేసి గౌరవ భావమును కల్గునట్లు చేశాను. ఏ గ్రంథములో అయినా రహస్య వాక్యములుండి వాటి భావము అర్థము కాకపోయినప్పుడు, అక్కడి వాక్యమునకు మేము అర్థమును వివరిస్తూ మూడు గ్రంథముల జ్ఞానమును బోధిస్తున్నాను. నాలాంటి మత ద్వేషము లేని వానినే ఒక ప్రక్క ముస్లీమ్‍లు, మరొక ప్రక్క క్రైస్థవులు నన్ను విమర్శిస్తున్నారు. కావున వారి కొరకు దేవుడు 3-69 వాక్యమును కేటాయించి చెప్పాడు. వాక్యము ప్రకారము వారు దారితప్పిన వారై తాము దారి తప్పినామని తెలియనివారై యున్నారు. ఇప్పటికి మేము 102 గ్రంథములను వ్రాశాము. నా గ్రంథములను చదివి ఇదే నిజమైన జ్ఞానమనీ, నన్ను విమర్శించిన వారి భార్యలు కూడా నా జ్ఞానము కొరకు భర్తలనే వదలివేశారు. భర్తలను ఎదిరించి వారి జ్ఞానము నుండి బయటికి వచ్చి, నా జ్ఞానము మీదనే ధ్యాసకల్గి, నా జ్ఞానమునే నిత్యము పఠించుచున్నారు. ఇది వారికి 'కుక్కకాటుకు చెప్పుదెబ్బ' యన్నట్లు అయినది. ఇంట్లో వారి భార్యలు కూడా వారి జ్ఞానమును ఒప్పుకోలేదు. వారి భార్యలు సహితము నా జ్ఞానమునే ఆశ్రయించి యుండుట, వారికి చాలా అవమానకరమైన విషయమైనది. అట్లే 'ఆదామ' యనే క్రైస్థవ గురువు తన శిష్యులు నా వద్దకు వచ్చి జ్ఞానము తెలుసు కొంటున్నారని ఓర్చుకోలేని బాధ కల్గినవారై చివరకు సోషల్ మీడియాయైన 'ఫేస్బుక్'లో నన్ను విమర్శించాడు. నన్ను, నా జ్ఞానమును తెలియకుండానే విమర్శించు వారు ఇళ్లలో తమ భార్యలను కూడా తమ జ్ఞానము గొప్పదని చెప్పుకోలేకపోయారు. తమ జ్ఞానము ఇతరులను విమర్శించుటకు పనికి వచ్చునని తెలియుచున్నది.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
28. దైవాజ్ఞ లేనిది ఏ ప్రాణి చావదు. (3-145)
(3-145) ''అల్లాహ్ ఆజ్ఞ కానంతవరకు ఏ ఒక్కరికీ మరణము రాదు. ప్రతి ప్రాణికి మరణ సమయము వ్రాయబడియున్నది. ప్రాపంచిక ఫలితము కోరుకొను వారికి మేము దాన్ని ఇస్తాము. పరలోక ప్రతిఫలితమును ఆశించిన వానికి మేము దానిని ప్రసాదిస్తాము. కృతజ్ఞులై ఉండేవారికి మేము శీఘ్రముగా మంచి ప్రతిఫలితమును ఇస్తాము.''
ఈ వాక్యములో నాలుగు అంశములున్నవి. ఒకటి మరణము, రెండు ప్రాపంచిక కోరికలు, మూడు పరలోకము, నాలుగు భక్తి భావము. మరణము ముందే నిర్ణయము చేసి వ్రాయబడియుండును. తర్వాత మూడు విషయములు జరుగబోవునవి అని తెలియవలెను. ముందే నిర్ణయము చేయబడిన చావు ఏ సమయమునకు రావలెనని వ్రాసియుండునో ఆ సమయమునకే వచ్చును. అది నిర్ణయింపబడి యున్న విషయమైనందున కాలము జరుగుకొలది అది జరిగిపోవును కదా! అటువంటప్పుడు దేవుని ఆజ్ఞ కొరకు అది ఆగదు కదా!యని ఎవరయినా ప్రశ్నించవచ్చును. దానికి జవాబు ఈ విధముగా కలదు.
మనకు తెలిసిన మరణము ఒక్కటే గలదు. వాస్తవముగా మరణములు నాలుగు రకములు గలవు. ఆ నాలుగు రకముల మరణములలో రెండు మరణములు దేవుని ఆజ్ఞతో సంబంధము లేకుండా కాలక్రమమున జరిగి పోవుచుండును. అయితే రెండు మరణములు మాత్రము దేవుని ఆజ్ఞను అనుసరించి యుండును. మిగతా రెండు మరణములు ఒకటి అకాల మరణము, రెండు తాత్కాలిక మరణము అనునవి దేవుని ఆజ్ఞతో సంబంధము లేకుండా వచ్చుచుండును. అకాల మరణము, తాత్కాలిక మరణము తర్వాత ఉన్నవి మరణము, ఆఖరీ మరణము. ఈ రెండు మరణములు దేవుని ఆజ్ఞ లేనిది జరగడము లేదు.
ఇప్పుడు ఈ విషయమును సంపూర్ణముగా తెలియుటకు ముందుగా మరణము అంటే ఏమిటి? అను వివరము తెలియవలసి యుండును. మరణమును గురించి ఇంతకు ముందు ''జనన మరణ సిద్ధాంతము'' అను గ్రంథమును వ్రాసుకొన్నాము. రెండవది ''మరణ రహస్యము'' అను గ్రంథమును, మూడవది ''పునర్జన్మ రహస్యము'' అను గ్రంథమును వ్రాసు కొన్నాము. దాదాపు తొంభైయి (90) శాతము మరణమును గురించి చెప్పుకోవడము జరిగినది. ఇప్పుడు ఈ చర్చతో పూర్తి నూరు (100) శాతము మరణమును గురించి తెలిసినట్లగును. సాధారణముగా మనిషి శరీరములో జరిగే శ్వాస ఆగిపోతే మరణము అని అందరూ అనుకొంటున్నారు. ఇప్పుడు అలా చనిపోవడములో నాల్గు రకములు కలవని చెప్పుకొన్నాము. మనిషి శరీరములో ఎలా వచ్చినా దానిని మరణమేయని మనము అనుకొంటున్నాము. మరణములో కనిపించేది ఒక్కటే అయితే కనిపించనిది ఎంతో గలదు. కనిపించని సమాచారమును గురించి ఇప్పుడు చెప్పుకొందాము.
మరణము పొందిన వ్యక్తి ఒక్క సెకను కాలములో రెండవ జన్మను చేరుచున్నాడు అని ఇంతకుముందు జన్మ విషయమును గురించి చెప్పుకొన్నాము. మరణించిన జీవుడు రెండవ జన్మలో అనుభవించుటకు కావలసిన కర్మను కర్మపత్రములో వ్రాయించుకొని రావలసియున్నది. అప్పుడే మరణము తర్వాత ఎప్పుడు వచ్చునో నిర్ణయము చేయబడును. అందువలన వాక్యములో ప్రతి ప్రాణికి మరణము ముందే వ్రాయబడి యున్నది అని చెప్పియున్నారు. మరణములో కర్మ నిర్ణయము రెండవ జన్మకు కావలసినంత నిర్ణయము చేసి ముద్రించిన తర్వాత జీవుడు (మనిషి) రెండవ జన్మకు పోవడము జరుగుచున్నది. మనిషి చనిపోవడము జరిగిన తర్వాత కర్మ నిర్ణయము దేవుడు చేయనిదే ఎవడూ రెండవ జన్మకు పోయే అవకాశము లేదు. గతములో చనిపోయినప్పుడు కూడా ప్రస్తుత జన్మకు దేవుడే కర్మ నిర్ణయము చేసి పంపియుండును. అయితే జీవితములో జరుగవలసినవి అన్నియూ వ్రాయబడియుండును. వ్రాయబడిన పాపపుణ్యముల ప్రకారము ఏమి అనుభవించవలెనో వాటిని జీవుడు జీవితములో అనుభవ రూపములో పొందుచుండును. అట్లు ఒక జన్మకు కావలసినంత కర్మను సంచితకర్మ నుండి శరీరములోని ఆత్మే కేటాయించియుండును. శరీరములోని ఆత్మే అందరికీ ఆరాధ్య దైవముగా ఉండునట్లు సృష్ఠికర్తయైన దేవుడు నిర్ణయించి ఆత్మకు అధికారము ఇచ్చియున్నాడు. అధికారము పొందియున్న ఆత్మయిన దేవుడు జీవుని మరణములో కర్మను కేటాయించి రెండవ జీవితమునకు పంపుచున్నది.
ఇక్కడ ముఖ్యముగా గమనించవలసిన విషయమేమనగా! ఒక జీవితమునకు కావలసినంత కర్మను కేటాయించి పంపుటకు ఆత్మకు అన్ని అధికారములు గలవు. తాను దేవునివద్ద నుండి పొందిన అధికారము ప్రకారము జీవునికి ఎంతో కొంత కర్మను అత్మయిన దేవుడు నిర్ణయించు చున్నాడు. అలా అనుభవించే కర్మలను శరీరములోని దేవుడు కేటాయించు చున్నాడు. ఆ కేటాయింపు ప్రకారము జీవుడు కష్ట సుఖ అనుభవములను అనుభవించుచుండును. ఎప్పుడయితే కర్మ అయిపోవునో అప్పుడు అనుభవములు అయిపోవును. అప్పుడు ఆ జన్మలో జీవుడు ఏమీ అనుభవించుటకు వీలులేదు. అప్పుడే ప్రతి దినము నిద్రలోనికి పోయినట్లు జీవుడు నిద్రను పొందును. నిద్రలో ఏ అనుభవము లేదుకదా! ఏ అనుభవము లేని దానినే నిద్ర అనవచ్చును లేక మరణము యని అనవచ్చును. రెండిటిలో ఏదయినా కావచ్చును. బయటి మనుషులకు నిద్రవేరు, చావువేరుగా కనిపించు చుండును. నిద్రలో శ్వాస ఉండును, మరణములో శ్వాస ఉండదు. అయితే జీవునికి మాత్రము రెండూ ఒకే విధముగా ఉండును. ఏదీ తెలియనిదే నిద్ర, ఏదీ తెలియనిదే చావు. నిద్రనుండి లేవగానే ప్రపంచము కనిపించినట్లు మరణము నుండి జన్మలోనికి పోయినప్పుడు కూడా ప్రపంచమే కనిపిస్తా వుంది. నిద్రనుండి లేవగానే పాపపుణ్య అనుభవములు మొదలవుతాయి. అలాగే మరణము నుండి జన్మలోనికి రాగానే పాపపుణ్య కర్మల అనుభవములు మొదలవుతాయి.
ఒక మనిషి ఎప్పుడయినా, ఏ విధముగానయినా, ఏ పరిస్థితిలో అయినా ప్రపంచ జ్ఞాపకమును కోల్పోవుటయే మరణము అనవచ్చును, తిరిగి అదే శరీరములో లేస్తే దానిని నిద్ర అంటాము. లేక తిరిగి క్రొత్త శరీరములో లేస్తే దానిని మరణము అంటాము. మనిషి తన జీవితములో అనుభవించే కర్మయున్నంత వరకు వచ్చే మరుపు నిద్రగా వచ్చును. ఎప్పుడయితే అనుభవించే కర్మయంతయూ అయిపోవునో అప్పుడు వచ్చే మరుపును మరణము అనవచ్చును. జీవితములో పుట్టినప్పటి నుండి అన్ని అనుభవములు అనుభవించినా మరణము అనునది అనుభవములో ఉండదు. అలాగే పుట్టుక యనునది కూడా అనుభవములో ఉండదు. ఏ అనుభవము లేనిది, అనుభవములన్నీ అయిపోయినది మరణము కాగా, ఏ అనుభవము లేనిది, అనుభవములు ప్రారంభము అగునది జననము అని చెప్పవచ్చును. ఈ విధముగా చెప్పితే ఇటు మరణము గానీ, అటు జననము గానీ రెండూ జీవుని అనుభవములో లేనివనీ, ఏమాత్రము ఎవరికీ తెలియనివనీ చెప్పవచ్చును. మరణమును గురించి మరొకమారు జ్ఞాపకము చేయడమేమనగా!
మనిషికి వ్రాసిపెట్టబడిన కర్మలు అయిపోతానే మరణము రావలెను వస్తుంది. కర్మలు అయిపోతే వచ్చేదే మరణముగానీ, ప్రత్యేకించి మరణము ఫలానా సమయములో వస్తుంది అని వ్రాసిపెట్టియుండదు. కర్మలు అయిపోవడమునే మరణముగా వ్రాయబడినదని చెప్పవచ్చును. ఇంకొక విధముగా చెప్పితే కర్మలు అయిపోయిన సమయమునే మరణ సమయముగా వ్రాసియున్నదని కూడా చెప్పవచ్చును. అంతేగానీ మరణము అను పేరుతో ఫలానా సమయము అని చెప్పబడియుండదు. ఏదో ఒక సమయములో జీవితములో అనుభవించవలసిన ప్రారబ్ధకర్మలన్నీ అయిపోతే ఆ సమయమే ఆ మనిషికి మరణ సమయముగా లెక్కించబడును. ఆ సమయములో మనిషి తనకున్న జ్ఞాపకమును కోల్పోవును అదే మరణము. సర్వ సాధారణముగా మరణము పొందిన జీవుడు ఒక సెకను కాలములో కావలసిన కర్మను మోసుకొని తర్వాత జన్మకు పోవును. ఇదంతా మనిషికి తెలియదు అని ముందే చెప్పాము. ఏ అనుభవము లేని స్థితిలో మనిషి యుండుట వలన రెండవ జన్మకు కర్మను ఎవరు కేటాయించారు? ఎంత కర్మను కేటాయించారు? అను విషయము ఏమాత్రము తెలియదు.
మరణించిన మనిషి మౌనముగా ఎరుక లేని స్థితిలో యుండును. అకాల మరణములోగానీ, తాత్కాలిక మరణములోగానీ దేవుని జోక్యము ఉండదు. ఎప్పుడయితే కర్మ అయిపోవునో, అప్పుడు దేవుని ఆజ్ఞతోనే మరణము వచ్చును. ప్రారబ్ధ కర్మలు అయిపోయిన మనిషికి తర్వాత అనుభవించుటకు సంచితకర్మ లేకపోతే, ఉన్న కర్మంతయూ అతని జ్ఞానాగ్ని చేత కాలిపోయి వుంటే అప్పుడు వాడు పరలోకమును పొందవలసి యున్నది. అతని కర్మ జ్ఞానము అను అగ్నిచేత కాలిపోయినదని చెప్పినా, లేక దేవుని చేత క్షమించబడినదని చెప్పినా రెండూ ఒక్కటే. భాష వేరు అయినా భావము అంతా ఒక్కటేయగును. మనిషి కర్మలను క్షమించే వాడు, లేకుండా చేయువాడు, జ్ఞానమను అగ్నిగా కాల్చువాడు దేవుడు ఒక్కడే. ఏ దేవుడు ఆరాధనకు అర్హుడుగా యున్నాడో, ఏ దేవుడు సృష్ఠికర్త చేత అన్ని అధికారములు పొందియున్నాడో, ఆ దేవుడే మనిషి శరీరములో యుండి అతను చనిపోయినప్పుడు తన ఆజ్ఞలను ఉపయోగించి మనిషిని జన్మలకు పంపడముగానీ, లేక మోక్షము (పరలోకము) నకు పంపడము గానీ చేయును.
ఒక మనిషి శరీరములో ఎప్పుడు మరణమును పొందునది శరీరములో యున్న దేవుడయిన ఆత్మకే తెలుసు. ఒకనికి రాత్రి పది గంటల వరకు అనుభవించు కర్మ కలదు. తర్వాత కర్మ లేదు. అతడు తన జీవితములో దేవున్ని విశ్వసించి, దేవున్నే ఆరాధించుట వలన, దేవుని జ్ఞానము సంపూర్ణముగా తెలియుట చేత అతని కర్మలన్నీ నశించిపోయినవి. అతనిని క్రొత్త కర్మ ఏదీ అంటలేదు. పాతకర్మలు కూడా కొన్ని అనుభవిస్తూ రావడము వలన అతని కర్మ రాత్రి పదిగంటలకు అయిపోవునట్లు గలదు. అప్పుడు వానికి రాత్రి పూట పది గంటలప్పుడు మరణము సంభవించును. అప్పుడు వాడు వాస్తవముగా మోక్షమును పొందవలసి యున్నది. అయితే బ్రహ్మ విద్యా శాస్త్రము ప్రకారము ప్రథమ దైవగ్రంథములో అక్షర పరబ్రహ్మ యోగములో చెప్పినట్లు రాత్రిపూట చనిపోయిన వానికి మోక్షము రాదు. అట్లు రాత్రిపూట చనిపోవువాడు జన్మలకు పోవలసియుండును. అప్పుడు వాని చావు తర్వాత వాడు మోక్షమునకు పోవలసియున్నా, అయితే అది రాత్రిపూట మరణము అయిన దానివలన మోక్షమునకు ఆటంకమేర్పడును. రాత్రిపూట చనిపోయినవాడు జన్మకు పోవలసియుండును. అప్పుడు దేవుని వాక్యమునకు ముప్పు ఏర్పడుచున్నది. మోక్షము పొందువాడు పగలు పూటే చనిపోవాలను సూత్రము వర్తించక పోవును. అందువలన అప్పుడు దేవుడయిన ఆత్మ జోక్యము చేసుకొని వానిని రాత్రి వరకు బ్రతకకుండా ముందు రోజు పగలే చనిపోవునట్లు చేయుచున్నాడు.
రాత్రి చనిపోవలసిన వాడు రాత్రివరకు అనుభవించ వలసిన కర్మను శరీరములోని దేవుడే క్షమించుట వలన అతని కర్మ ముందే పగలు కాలములోనే అయిపోవుచున్నది. అప్పుడు వాడు పగలే చనిపోవును, మోక్షమును పొందును. ఇక్కడ దైవాజ్ఞ పని చేసినదని తెలియుచున్నది. ఒకవేళ మోక్షము పొందనివాడు జన్మలకు పోవువాడు ఎప్పుడు చనిపోయినా వానికి చనిపోవు కాల నియమములు వర్తించవు. కర్మ మిగులు యున్నవాడు చనిపోతే అక్కడే శరీరములోనే జీవునితో పాటు యున్న ఆత్మ వానిని రెండవ జన్మకు కావలసిన కర్మను నిర్ణయించి తీర్పుచేసి పంపును. అలా తీర్పు చేయడము ఒక సెకను కాలములోనే జరిగిపోవుచున్నది. మనిషికున్న నాలుగు మరణములను ఆత్మే కలుగజేయుట చేత ఆత్మకు తెలియనిది ఏ మరణము లేదని చెప్పవచ్చును. అయితే రెండు మరణములలో మరణ సమయములో దేవుని జోక్యము ఏమీ ఉండదు. మరణము, ఆఖరీ మరణము అను రెండు మరణములలో మాత్రము దేవుడు నిర్వహించవలసిన పాత్ర గలదు. అందువలన ''దేవుని ఆజ్ఞ లేనిది ఎవనికీ మరణము రాదు'' అని పై వాక్యములో చెప్పారు.
ఇంకనూ వాక్యములో ''ప్రాపంచిక విషయమును కోరుకొన్న వానికి దానిని ఇస్తాము'' అని చెప్పబడియున్నది. మనిషి మరణిస్తే వాని కర్మ ప్రకారము, వాని శ్రద్ధ (కోరిక) ప్రకారము, వానికి రెండవ జన్మలో అనుభవించునట్లు ఆత్మ కర్మను నిర్ణయించి పంపుచున్నాడు. అప్పుడే వాడు కోరిన కోర్కెలు తర్వాత జన్మలో నెరవేరునట్లు దేవుడే చేయుచున్నాడు. అలాగే పరలోకమును ఆశించిన వానికి దానినే ఇస్తాము అని చెప్పాడు. దేవుడు మోక్షమునకు పంపువాని ఎడల కర్మలను ఎలా క్షమించుచున్నాడో, మోక్షము పొందవలసిన కాలము పగలు, శుక్లపక్షమి, ఉత్తరాయణము ఉండునట్లు కర్మలను సవరించి వానిని తిరిగి పుట్టకుండా, వానిది చివరి మరణము అగునట్లు చేసి పంపుచున్నాడు. అట్లే దేవునియందు విశ్వాసము కలవానికి రాబోవు జన్మలో జ్ఞానమును తెలుసుకొను అవకాశమును కల్గించుచున్నాడు. ఈ విధముగా శరీరములోనే దేవుడు ఆత్మరూపములో ఉంటూ, తన ఆజ్ఞలతోనే తర్వాత జన్మకుగానీ, జన్మలులేని పరలోకమునకుగానీ పంపుచున్నాడు. అందువలన ప్రతి మరణము దేవుని ఆజ్ఞతోనే జరుగుచున్న దని చెప్పారు. మరణము, జననము రెండు అంటుకొని యున్నవి. జననమును చెప్పితే మరణమును చెప్పినట్లే, మరణమును చెప్పితే జననమును చెప్పినట్లే యగును. శరీరములోనే జీవునితో పాటు యున్న దేవునికి శరీరములో తానే అన్నీ చేయుచున్నాడు. మరణమును కూడా తానే కల్గించుచున్నాడు. మరణములో చేయవలసినది అంతా చేయు చున్నాడు. అందువలన ''అల్లాహ్ ఆజ్ఞ లేనిది ఏ జీవికి మరణము రాదు'' యని అన్నారు.
మరణముగానీ, జననముగానీ ఏ మానవునికీ తెలియదు. ఈ విధానము శరీరము లోపల అత్యంత రహస్యముగా జరుగుచున్నది. ఎవరికీ ఏ అనుభవము లేనిదానిని నేను చెప్పడము జరిగినది. ఎవరికీ తెలియనిది ఈయనకెలా తెలుసుయని పొరపడి నా మాటను నమ్మకపోతే మీకే నష్టము. ఎవరికీ తెలియనిది వాస్తవమే. అయితే నేను చెప్పినదీ వాస్తవమే. పైకి కనిపించు వ్యక్తిని నేను చెప్పినది వాస్తవమే అని గట్టిగా చెప్పుటకు ఆధారము గలదు. ఆ ఆధారము ఏమి అనగా! మీకు కనిపించు నేను మాట్లాడు ప్రతిమాట, నేను వ్రాయు ప్రతి వ్రాత నాది కాదు. నా శరీరములో ఆత్మగాయున్న దేవుడే స్వయముగా చెప్పాడుగానీ, నేను మనిషిగా ఏమీ చెప్పలేదు. వాస్తవముగా నాకు ఏమీ తెలియదు. నేను ఒక దౌర్భాగ్యపు జీవితమును గడిపే సామాణ్య మనిషిని మాత్రమే. ఈ రహస్యము చెప్పిన ఘనత మన తండ్రియైన దేవునిదే. తాతయైన దేవుడు (పరమాత్మ) చూస్తూయుండగా, తండ్రియైన దేవుడు (ఆత్మ) సర్వ మానవులలో అన్నీ చేయుచున్నది. (3-145) వాక్యములో చెప్పినట్లు వాక్యములో చెప్పిన కార్యములన్నియూ చేయువాడు శరీరములో యున్న దేవుడే. శరీరము లోపల, శరీరము బయట ఉండి చూస్తున్న పరమాత్మ తన కుమారుడైన ఆత్మకు మరణములో తీర్పు తీర్చు అధికారమును ఇచ్చాడు. అంతేకాక అందరిచేత ఆరాధించుటకు అర్హుడైన వాడు కుమారుడయిన ఆత్మయేనని ఆయన మృత్యువును దాటుటకు మోక్షమును (పరలోకమును) ఇచ్చుటకు అర్హుడుగా యుండునట్లు, మన తాతయైన పరమాత్మ తండ్రియైన ఆత్మకు సర్వ అధికారములు ఇచ్చాడు. ఇదే విషయమునే ద్వితీయ దైవ గ్రంథము ఇంజీలులో యోహాను సువార్తలో ఏమి చెప్పారో చూడండి.
(యోహాన్ 5-21) ''తండ్రి మృతులను ఏలాగు లేపి బత్రికించునో అలాగే కుమారుడును తన ఇష్టము వచ్చిన వారిని బత్రికించును.''
(యోహాన్ 5-22) ''తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడుగానీ''
(యోహాన్ 5-23) ''తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారున్ని ఘనపరచ వలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు. కుమారున్ని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రి ఘనపరచడు''.
(యోహాన్ 5-24) ''నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటి యున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.''
(యోహాన్ 5-25) ''మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను''.
(యోహాన్ 5-26) ''తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై యున్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగహ్రించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగహ్రించెను.''
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
29. కర్మ ఫలితము న్యాయముగా దొరుకుతుంది. (3-161)
(3-161) ''ఒక ప్రవక్త ద్రోహానికి పాల్పడడమనేది జరగని పని. ద్రోహానికి పాల్పడే ప్రతి ఒక్కడూ తను ద్రోహానికి పాల్పడిన దానిని తీసుకొని ప్రళయదినాన హాజరవుతాడు. తర్వాత ప్రతి ఒక్కరికీ వారు చేసుకొన్న కర్మలకు పూర్తి ప్రతిఫలితము ఇవ్వబడుతుంది. వారికెలాంటి అన్యాయము జరుగదు.''
'వక్త' అంటే బోధించువాడు లేక చెప్పువాడు. ప్రవక్త యనగా బాగా బోధించువాడు లేక గొప్ప విషయమును చెప్పువాడు అని అనవచ్చును. బోధించే వాడినే ప్రవక్తయని అన్నప్పుడు, బోధించేవాడు మంచే బోధిస్తాడు గానీ ఇతరులకు చెడు చేయుటకు పూనుకోడు. ఒకవేళ ఎవరయినా బోధకుల ముసుగులో అనగా దొంగగా మాటలు చెప్పేవారు వారి స్వార్థము కొరకు కపటముగా మాట్లాడుచూ ఇతరులను మోసము చేయాలనుకొంటే వారు శిక్షకు గురికాక తప్పదు. ప్రవక్తలయినా, పాఠకులయినా, పండితులయినా, మోసము చేయువాడు ఎవడయినా వాడు చేసిన మోసమునకు ప్రతిఫలముగా పాపము వచ్చియుండును. ఆ పాపము వాని వెంటనే ఉండును. అలా ఉండిన పాపముగానీ, పుణ్యముగానీ మరణ సమయములో తీర్పుకు వచ్చును. శరీరములో తీర్పు జరుగు క్షణ కాలములో మనిషి చేసుకొన్న పాపముగానీ, పుణ్యముగానీ న్యాయబద్దముగా తీర్పు తీర్చబడును. అనగా చేసుకొన్న పాపమునకు తగిన కష్టమును అనుభవించు నట్లు నిర్ణయము చేయబడును. అట్లే మనిషి చేసుకొన్న పుణ్యమునకు తగినట్లు సుఖములు అనుభవించుటకు దేవుని చేత నిర్ణయము చేయబడును. మనిషి చేసుకొన్న పాపపుణ్యములకు ప్రళయ కాలములో తీర్పు తీర్చబడును అని గ్రంథములో చాలాచోట్ల వ్రాయబడి యున్నది.
ప్రళయము అంటే ఏదో ప్రపంచ నాశనమని అనుకోకూడదు. ప్రపంచము అనగా బయట కనిపించునదే ప్రపంచము కాదు. పంచము అనగా అయిదు అనియూ, ఐదు చేత పుట్టగా దానినే ప్రపంచము అనియూ చెప్పచుందుము. 'ప్ర' అనగా పుట్టుటయని అర్థము గలదు. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను వస్తువుల చేత తయారయినది శరీరము. అలాగే ఈ ఐదు బయటికి కనిపించే భాగముల చేత అమర్చబడినది ప్రపంచము. బయట ప్రపంచము ఎప్పటికీ నాశనము కానిది. దేవుడు, ప్రకృతి రెండు కుడి, ఎడమగా యున్నవి. దేవునికి భార్యలాంటిది ప్రకృతి. ప్రకృతి భాగములయిన ఐదు వస్తువుల మిశ్రమము చేత తయారయినది మానవ దేహము. ఒక్క మానవ దేహమే కాదు, సమస్త జీవరాసుల శరీరములు ప్రకృతి చేతనే తయారయినవి. ఎప్పుడయితే పుట్టినదంతా నాశనము అయిపోతుందో దానిని ప్రళయము అని అనవచ్చును. బయటి ప్రకృతి దేవుని దగ్గరగా ఉండునది కావున అది ఎప్పుడూ నాశనము కాదు. ఇకపోతే శరీరముగా తయారయిన ప్రకృతి మట్టి మట్టిలోనికి, గాలి గాలిలోనికి కలిసిపోవు అవకాశము గలదు. మరణ సమయమునుండి శరీరము మార్పు చెంది పూర్తి నాశనమై పోవును. అనగా ప్రళయమై పోవుచున్నది. శరీర ప్రళయము మరణములోనే మొదలవును, కావున మరణమును ప్రళయము అని అంటున్నారు. మరణములో జీవుడు శరీరము నుండి ఎప్పుడు బయటికి పోతే అప్పుడే శరీరము ప్రళయము చెందునట్లు లెక్కించవలెను. శరీరము లయమై (నాశనమై) పోవడమునే ప్రళయము అని అంటున్నాము. దేవుడు చావును ప్రళయము అని వాక్యములో చెప్పాడు. మరణ దినమున దేవుడు న్యాయబద్దముగ పాపమునకు కష్టము, పుణ్యమునకు సుఖము నిర్ణయించి జన్మకు పంపును. పాపపుణ్య నిర్ణయము ప్రకారము తీర్పు తీర్చునప్పుడు మనము దేవుని ముందర హాజరయినట్లే కదా! అందువలన పాపములతో సహా ప్రళయ దినమున హాజరవుతారు అని చెప్పాడు. ఈ వాక్యములో ప్రళయము అను దానినే వివరముగా తెలియవలసిన అవసరమున్నది. చాలామందికి ప్రళయము అంటే మరణించిన రోజు అని అర్థముకాక బయట భూమి కంపించడము, సునామీలు, తుఫానులు బయట ఉపద్రవములు జరగడమును ప్రళయమని అనుకొంటున్నారు తప్ప 'మరణమే ప్రళయము' అని ఎవరూ అనుకోవడము లేదు. ప్రతి మరణము వాని శరీరమునకు జరుగు ప్రళయముగా లెక్కించ వలెను. ప్రళయములో (మరణములో) శరీరము నాశనమగుచున్నది గానీ, అప్పుడు కూడా శరీరములో యున్న జీవుడు నాశనము కాలేదు. ఎవడు ఎంత తప్పు చేసియుంటే అంత తప్పుకు బదులుగా న్యాయముగా శిక్షలు నిర్ణయించబడును. నిర్ణయించువాడు దేవుడే (శరీరములోని ఆత్మే) అయిన దానివలన ఎవనికిగానీ, ఎటువంటి అన్యాయము జరుగదు. ప్రతి ఒక్కటి న్యాయబద్దముగా నిర్ణయింపబడును.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
30. ప్రవక్తలను మనుషుల నుండే పంపుతాడు. (3-164)
ఒక విషయమును గురించి బాగా మాట్లాడు వానిని వక్తయని అంటాము. 'ప్ర' అంటే 'ముఖ్యము' అనీ, లేక 'పుట్టిన'యని అర్థము కలదు. 'ప్రవక్త' యనగా జ్ఞానమును చెప్పువాడని కూడా చెప్పుకోవచ్చును. వక్తలు ఎవరయినా కావచ్చును. వారిలో ప్రవక్తలు కొందరే ఉందురు. ఒక ఉపన్యాసమును విని చెప్పిన వానిని వక్తయని కొందరు అనడము మేము విన్నాము. ఒక రోజు హరికథను ఒక వ్యక్తి బాగా చెప్పాడనీ, వానిని 'మంచి వక్త' అనీ అన్నారు. అలాగే ప్రవక్తలని కొద్దిమందిని మాత్రమే చెప్పుచున్నారు. మా లెక్కలో నేడు కూడా ప్రవక్తలు ఎందరో ఉన్నారు. పూర్వము కూడా ఉండేవారు. అయితే పూర్వము కొద్దిమందిని మాత్రమే ప్రవక్తలు అని చెప్పుచూ మిగతా వారిని చెప్పలేదు. నేడు కూడా ప్రవక్తలు ఎందరోయున్నా వారిని ప్రవక్తలు అని చెప్పకపోవడమును చూస్తే నేటి ప్రజలకు 'ప్రవక్త' అను పేరుకు అర్థము తెలియదని తెలియుచున్నది. అందువలన అందరికీ అర్థమగునట్లు మేము చెప్పునదేమనగా!
'ప్ర' అంటే 'పుట్టిన' లేక 'ముఖ్యమైన' అను అర్థము ప్రకారము, ప్రవక్త అనగా 'ముఖ్యమైన మాటలు చెప్పువాడు' అనీ లేక 'పుట్టిన విషయమును చెప్పు వాడని' అర్థము. పుట్టిన విషయము అనగా ఇతరులు చెప్పిన దానిని చెప్పడము అని అర్థము. హరికథ ఇతరులు వ్రాసినదో లేక ఇతరులు చెప్పినదో అయివుండుటను బట్టి హరికథను చెప్పువానిని ప్రవక్త అనక అందరూ వక్త అని అంటున్నారు కదా! న్యాయముగా అయితే మీరు చెప్పినట్లు ప్రవక్తయని అనవచ్చును కదా!యని కొందరు ప్రశ్నించవచ్చును. దానికి జవాబు ఏమనగా! చెప్పబడేది ప్రపంచ విషయమైతే ఎంత చెప్పినా, ఏది చెప్పినా వానిని వక్త అనియే చెప్పుదురు. పుట్టిన విషయములలో ప్రపంచ విషయముల బోధకులకు మంచివక్తలని పేరు గలదు. ఇకపోతే ప్రపంచ విషయము కానటువంటిది పరమాత్మ, ఆత్మ విషయమైనటువంటిది ఏది చెప్పబడినా చెప్పిన వానిని ప్రవక్తయని అనవలెను. ఆకాశవాణి ద్వారా చెప్పబడిన జ్ఞానము మూడు గ్రంథముల రూపములో గలదు. వాటినే దైవ గ్రంథములని అంటున్నాము. ఆ గ్రంథముల జ్ఞానము ముందే ఇతరుల చేత చెప్పబడి, ఇతరుల చేత వ్రాయబడియున్నది. అలా ముందే చెప్పబడి యున్న విషయమును (జ్ఞానమును) మాటల రూపములో బాగా చెప్పువానిని వక్త అనకుండా ప్రవక్తయని అనవచ్చును. వక్త బాగా మాట్లాడినా, ప్రవక్త తక్కువగా మాట్లాడినా వక్తది ప్రపంచ జ్ఞానమై యుండును. ప్రవక్తది పరమాత్మ జ్ఞానమైయుండును. వక్తకు, ప్రవక్తకు అంత తేడా గలదు.
మరొక విషయమేమనగా! వక్త, ప్రవక్త అను మాటలు మనుషులకే వర్తించును. దేవుడు మనిషివలె వచ్చి జ్ఞానమును బోధించినప్పుడు ఆయనను ప్రవక్తయని 'గుంపులో గోవిందా'యన్నట్లు పిలువవచ్చును గానీ, ఆయనను ప్రత్యేకముగా చెప్పునప్పుడు ప్రవక్తయని అనకూడదు. ఆయనకు ప్రత్యేకించి 'భగవంతుడు' అను పేరును చెప్పవచ్చును. ఆయన దేవుని జ్ఞానమునే చెప్పినా, మనిషివలెనున్న భగవంతుడు చెప్పిన జ్ఞానము, ముందు చెప్పిన జ్ఞానమేకాక కొంత ప్రత్యేకమైన జ్ఞానమును, అంతవరకు చెప్పని విధానములో యున్న జ్ఞానమును చెప్పియుండుట చేత ఆయనను ప్రవక్తయని అనకూడదు. ఆయన చెప్పిన జ్ఞానము క్రొత్త కోణములో చెప్పబడియుండుట వలన ఆయనకు ప్రవక్తయను పేరు కూడా వర్తించదు. అందువలన అందరూ ఆయనను గుర్తించలేక ప్రవక్తయని అనవచ్చును గానీ, వాస్తవానికి ఆయన ప్రవక్త కాదు. గతములో దేవుడు మనిషిగా వచ్చిన సందర్భములు ఎన్ని ఉన్నాయోగానీ, మనకు తెలిసినవి రెండు మాత్రము గలవు. దేవుడు శరీరములో యున్న కాలములో ఆయన తెలియలేదుగానీ, ఆయన వచ్చి పోయిన కొన్ని వేల సంవత్సరములకు దేవుడు మనిషిగా వచ్చిపోయినట్లు తెలిసినది.
తెలియనప్పుడు దైవజన్మలోనున్న వారిని ప్రవక్తయనినా ఫరవా లేదు. వారు ఎవరయినది ఇప్పుడు తెలిసియుండుట చేత ఇప్పుడు వారిని ప్రవక్తలు అనుటకు వీలులేదు. వారిని ప్రత్యేకించి భగవంతుడు యని పిలువవచ్చును. భగవంతుడు భూమిమీద ఉన్నప్పుడు ఆయనను గుర్తించుటకు సాధ్యము కాదు గనుక, అప్పుడు ఆయనను భగవంతుడని ఎవరూ అనుటకు అవకాశముండదు. అప్పుడు ఏమనినా వారిని ప్రవక్తలనియే చెప్పవలసి యుండును. తెలియనప్పుడు కృష్ణున్ని, ఏసును ప్రవక్తలని చెప్పినా ఫరవాలేదుగానీ, తెలిసిన తర్వాత ప్రవక్తలని చెప్పడము భావ్యము కాదు. మనుషులలోనే వక్తను ప్రవక్తలనీ, ప్రవక్తలను వక్తలనీ చెప్పుచున్నాము. కొందరు ప్రవక్తలను దేవునితో సమానముగా గానీ, దేవుని కంటే ఎక్కువగా గానీ చూచువారు కూడా కలరు.
మనుషులు ఎంత గొప్పవారైనా, ఎంత గొప్ప ప్రవక్తలైనా వారిని దేవునివలె చూడడము గానీ, దేవునికంటే గొప్పగా గౌరవించడము గానీ తగని పనియగును. అయితే నేడు ముస్లీమ్‍లు అందరూ కాదుగానీ కొందరు తమ ప్రవక్తయైన ముహమ్మద్ ప్రవక్తగారిని దేవునికంటే గొప్ప యన్నంత గౌరవముతో చూస్తున్నారు. ముస్లీమ్‍లకు వారి ప్రవక్త మీద ఉన్నంత గౌరవము, ప్రేమ ఇతర మతములలో ఎవరికిగానీ, ఏ ప్రవక్త మీదగానీ అంత లేదనియే చెప్పవచ్చును. ముస్లీమ్‍లకు ముహమ్మద్ ప్రవక్తకు యున్న అనుబంధము అలాంటిది. ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్న ప్రవక్తల విషయమై అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములో సూరా 3లో ఆయత్ 164 లో ఇలా కలదు.
(3-164) ''అల్లాహ్ విశ్వాసులకు చేసిన మహోపకారము ఏమిటంటే, ఆయన వారిలోనుండే ఒక ప్రవక్తను ఎన్నుకొని వారి వద్దకు పంపాడు. అతడు వారికి దేవుని వాక్యములను చదివి వినిపిస్తాడు. వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. వారికి గ్రంథ జ్ఞానాన్నీ, వివేకాన్నీ బోధిస్తాడు. నిశ్చయముగా అంతకు ముందైతే వారు స్పష్టమైన అపమార్గమునకులోనై ఉండేవారు.''
ఈ వాక్యములో బాగా గమనిస్తే దేవుడు ప్రజలలోనుండే ప్రవక్తను ఎన్నుకొంటాడని గలదు. ఈ మాటనుబట్టి ఎప్పటికయినా ప్రవక్తలు మనుషులే అయివుంటారు. దేవుడు మనిషిగా వస్తే ఆయన ప్రవక్త కాడు అను మా మాటకు వాక్యములోగల మాట సాక్ష్యముగా యున్నది. మనుషులలోనే ప్రవక్తను ఎన్నుకొని, మనుషుల వద్దకే పంపితే అతను ముందే యున్న విషయమును, గ్రంథరూపమైన దానిని చదివి వినిపిస్తాడు, దానినే బోధిస్తాడు. ''ఉన్న జ్ఞానమును బోధించువాడు ప్రవక్తగానీ, లేని జ్ఞానమును ప్రవక్త బోధించలేడు'' అను మా మాటకు ఇది సాక్ష్యముగా గలదు. ప్రవక్తయైన మనిషి దైవ గ్రంథముల జ్ఞానమును బోధించగా దానివలన ప్రజలు పరిశుద్ధత నొందగలరు. ముందు అపమార్గము (అజ్ఞాన మార్గము)లో యుండే వారందరూ ప్రవక్తల బోధల వలన జ్ఞానమార్గమును పొందగలరు. పై వాక్యములో ముఖ్యముగా మనుషులే ప్రవక్తలనీ, ప్రవక్తలు ముందు పుట్టి గ్రంథరూపమైన జ్ఞానమునే బోధింతురనీ, స్వయముగా ఏమీ చెప్పరని తెలియుచున్నది.
☞