till 50




అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
37. ఆహార విషయము. (5-87, 88), (5-3)
విశ్వములో ఒకటి కనిపించే ప్రపంచము, రెండు కనిపించని దేవుడు తప్ప మూడవది ఏదీ లేదు. ఒకటి ఉంది అంటే అది ప్రపంచమునకు సంబంధించినదియైనా ఉంటుంది లేక దేవునికి (అల్లాహ్‍కు) సంబంధించి నదియైనా ఉంటుంది. ఈ రెండింటికి సంబంధించినది కాకుండా ఏదీ లేదు. ఒక మనిషి పుట్టాడు అంటే అతను కొంత ప్రపంచమునకు సంబంధించి, కొంత దేవునికి (అల్లాహ్‍కు) సంబంధించి పుట్టియున్నాడు. ప్రపంచములో ఒక మనిషే కాకుండా ఏ జీవరాసి పుట్టినా రెండింటికీ సంబంధించి పుట్టును. బాగా గమనించితే జీవముగలదేది అయినా ప్రపంచమునకు, దేవునికి సంబంధించి యుండును. జీవము లేనిది ఏది అయినా కేవలము ఒక్క ప్రపంచమునకు మాత్రము సంబంధించినదై యుండును. ఇదే విధముగా స్థూల వస్తువులే కాకుండా సూక్ష్మ విషయములు కూడా ఏ దానికో ఒక దానికి సంబంధించి యుండును. విషయములు కూడా రెండే గలవు. ఒకటి ప్రపంచ విషయము, రెండు దేవుని విషయము. ఇంకొక విధముగా చెప్పితే ప్రపంచ వస్తువుకు సంబంధించిన విషయము ప్రపంచమునకు సంబంధించిన విషయముగానే ఉండును. అట్లే దేవుని విషయములు ఉండును. ఒక మాటను చెప్పితే అది దేవుని విషయమా, లేక ప్రపంచ విషయమా తేల్చి చెప్పవచ్చును.

ఇప్పుడు ఆహార విషయమును గురించి అడిగితే అది ప్రపంచ సంబంధ విషయము తప్ప దేవుని విషయము ఏమాత్రము కాదుయని ఎవరయినా చెప్పగలరు. కనిపించే పదార్థముగానీ, వస్తువుగానీ ప్రపంచ సంబంధమైనదే అయి ఉంటుంది. ఆ లెక్క ప్రకారము భార్య విషయమును దైవికము కాదు ప్రపంచ విషయమని చెప్పవచ్చును. భార్య, పుత్రులు మొత్తము శరీర సంబంధమైన వారు ఎవరైనా ప్రపంచ సంబంధమైన వారు గానే చెప్పాలి. శరీర సంబంధ ప్రత్యక్ష పరోక్ష విషయములేవి యున్నా అవి ప్రపంచ విషయములేయని చెప్పవచ్చును. ఆహారము శరీర సంబంధమైనది యగుట వలన దానిని ప్రపంచ సంబంధ విషయముగా చెప్పవచ్చును. ఈ విధముగా సృష్ఠిలోయున్న వాటినన్నిటినీ రెండు భాగములుగా విభజించి చెప్పవచ్చును. ప్రపంచములోయున్న కనిపించేవి, కనిపించనివి అన్నీ ప్రపంచ సంబంధమైన విషయములుగానే యున్నవి. ఈ రెండు విషయములలో ప్రపంచ విషయమును దేవుడు ముందే నిర్ణయించి యుండును. దానిలో ఎవరూ జోక్యము చేసుకోలేరు. ఎవరి జోక్యము వలన అవి మారునవి కావు. దేవుని మొదటి నిర్ణయము ప్రకారమే అన్నీ జరుగుచుండును. ఇప్పుడు నేనున్నాను అయితే నా ఆహార విషయమును నేను మార్చుకొనుటకు వీలుపడదు. ముందే దేవుడు నిర్ణయించినట్లు జరుగుచుండును. దేవుడు ముందే నిర్ణయించిన నిర్ణయము ప్రకారమే ప్రతీదీ జరుగును. నా మరణము కూడా నిర్ణయము మీద ఆధారపడి యుండును. అందులో దేవుని నిర్ణయము తప్ప మన నిర్ణయము ఏమాత్రము పని చేయదు.

ప్రపంచము, దేవుడు అను రెండు విషయములలో ప్రపంచ విషయములన్నియూ ముందే నిర్ణయించబడి యుండును. దేవుడు వాటిలో జోక్యము చేసుకోడు. వాటిని గురించి రెండవమారు చెప్పడు. ఒకమారు నిర్ణయము తర్వాత రెండవమారు దేవుడు చేయునది ఏమీ లేదు. దేవుని నిర్ణయము మనిషి పుట్టినప్పుడే మనిషి చావులోనే జరిగియుండును. అదే అంతిమ దిన తీర్పు. ఆ తీర్పును దేవదూతలు అమలు చేయుచుందురు. ఆ తీర్పు మనిషి పుట్టినప్పటినుండి తిరిగి చనిపోవు వరకు అనుభవించవలసి యుండును. ఇది దేవుడు భూమిమీద మనుషుల జీవితములో పెట్టిన విధానము. దేవుని తీర్పును అమలు చేయువారు దేవదూతలు. తీర్పు విధానము అంతయూ ఇటు దేవదూతలు, అటు మనుషుల మీదనే యుండును. దేవుడు ఆ విషయములలో జోక్యము చేసుకోడు. కోర్టులో న్యాయమూర్తి (జడ్జి) తీర్పు చేసిన తర్వాత దానిని అమలు చేయడము పోలీసుల చేతిలో ఉన్నట్లు, మనిషికి దేవుని తీర్పును అమలు చేయువారు దేవదూతలు. మనిషికి వేయబడిన శిక్ష చట్టము ప్రకారము మనిషి అనుభవించి తీరవలసిందే. ఒకవేళ సత్ప్రవర్తన వలన అతని శిక్ష తగ్గే అవకాశమున్నట్లు, మనిషి జీవితములో మనిషి దైవమార్గమును అవలంభించితే దేవుడు వేసిన శిక్ష కొంత తగ్గే అవకాశము ఉండును. ఖైదీ మంచి ప్రవర్తన ఖైదీ చేతిలో యున్నట్లు, మనిషి దైవిక ప్రవర్తన మనిషి చేతిలో యుండును. అందువలన వారి ప్రవర్తనను మార్చుకోగలిగితే శిక్షమారే అవకాశమున్నట్లు, మనిషి దైవిక మార్గమును అనుసరించు పద్ధతినిబట్టి వానికి నిర్ణయించబడిన శిక్షలో కొంతవరకు మార్పు జరుగవచ్చును.

దైవికమైన ప్రవర్తనను గురించి ఏది సరియైన విధానమో, ఏది నిజమైన దైవమార్గమో దేవుడు తెలియజేయును తప్ప మనిషికిచ్చిన తీర్పులో ఆయన స్వయముగా మార్పుచేయడు. అలా మనిషి దైవికమైన విధానమును తెలియజేయు బాధ్యత దేవునిదే అయివుండుట వలన ఆయన తన బోధల వలన తన జ్ఞాన విధానమంతయూ తెలియజేశాడు. మనిషి అంతిమ దినమున దేవుని తీర్పును పొందిన తర్వాత దైవజ్ఞానమును ఏమాత్రము తెలియకుండా బ్రతికితే వానికి నిర్ణయించబడినవి జరిగితీరును. వాడు దైవ జ్ఞానమార్గములోనికి పోయి దైవజ్ఞానము ప్రకారము నడుచుకోగలిగితే అప్పుడు వానికి నిర్ణయించబడిన విధానము కొంతవరకు మారు అవకాశము గలదు. అందువలన వాని ప్రవర్తన వాని చేతిలోనే యున్నదని దానిని ఎవరూ మార్చలేరని చెప్పవచ్చును. ఇప్పుడు మనిషి జీవితములో ఆహార విషయమును గమనించితే, వాడు ఎప్పుడు ఏమి తినాలని ముందే నిర్ణయించ బడియుండును. మనిషి అంతిమ దినమును పొందినప్పుడే ఆ నిర్ణయము జరిగిపోయి ఉండును. దానిప్రకారము మనిషి తొలి రోజునుండి అనగా శిశు దశ నుండి ఆ నిర్ణయము అమలు జరుగును.

ఒక మనిషికి అంతిమ దిన తీర్పునుబట్టి తన జీవితములో ఏమి తినాలి, ఏమి త్రాగాలి అనునది వ్రాసిపెట్టబడి యుండును. దాని ప్రకారమే వానికి ఆహారములు లభించుచుండును. కొందరికి వాని తీర్పునుబట్టి సుఖమైన ఆహారములు, రుచికరమైన ఆహారములు లభించుచుండును. కొందరికి కష్టముతో కూడుకొన్న ఆహారములు, రుచిలేని ఆహారములు, రోగప్రదమైన ఆహారములు లభించుచుండును. ఇదంతయూ వానివాని కర్మనుబట్టి అనగా కర్మ తీర్పునుబట్టి యుండును. మనిషి అంతిమ దినమున మనిషి జీవితములో చేసుకొన్న పాపపుణ్యములనుబట్టి దేవుడు తీర్పు తీర్చి యుండును. ఆ తీర్పు ప్రకారమే అతనికి అమలు జరుగుచుండును. కొందరి జీవితములో ఏమాత్రము కష్టము లేకుండా సుఖవంతమైన, రుచికరమైన ఆహారములు దొరుకుచుండును. కొందరికి వారి జీవితములో ఎంత కష్టపడినా మంచి ఆరోగ్యమైన ఆహారము దొరకదు, రుచికరమైన ఆహారము దొరకదు. ఇదంతయూ మనము అనుభవ పూర్వకముగా చూస్తున్న విషయములే. దీనిని ఎవరూ కాదనలేరు. దేవుడు కూడా తన జ్ఞానములో అదే చెప్పాడు. దేవుడు ఎప్పుడూ సత్యబద్దమైన జ్ఞానమునే చెప్పునుగానీ, అసత్యమైన జ్ఞానమును చెప్పడు. ఒకచోట ఒక రకము, మరొక చోట మరొక రకము చెప్పడు.

దేవుని జ్ఞానము ప్రకారము దేవుడు ప్రపంచ విషయములను గురించి చెప్పడు. దేవుడు దేవుని విషయములను గురించి మాత్రమే చెప్పును. దేవుడు దేవుని సంబంధ జ్ఞాన విషయములు తప్ప ప్రపంచ విషయములలో జోక్యము చేసుకోడు. ఇప్పుడు ముఖ్యముగా చెప్పదలచు కొన్నదేమనగా! కొందరు దేవుడు తిండి విషయము చెప్పాడు, ఫలానా వస్తువులను తినమన్నాడు, ఫలానావి తినవద్దని చెప్పాడు అని అంటున్నారు. వారు చెప్పే దానినిబట్టి దేవుడు తన ధర్మమును వదలి తాను చేయను అన్న పనులు చేసినట్లగును. దేవుడు దేవుని విషయములనే బోధిస్తాడు తప్ప ప్రపంచ విషయములను బోధించడు. ప్రపంచ విషయములను మనిషి యొక్క అంతిమ దినముననే తీర్పు చేసి చెప్పాడు. ఫలానా వయస్సులో, ఫలానా దినము, ఫలానా పూట, ఫలానా ఆహారము తినవలెనని వ్రాసిపెట్టియుండును. అలా తీర్పులో చెప్పినప్పుడు దానిని కాదని చెప్పే దానికి ఎవరికీ వీలులేదు. ఇంకెవరయినా వచ్చి సంజాయిషీ చెప్పి సరి చేయడానికి వీలులేదు. తీర్పులో చెప్పినది చెప్పినట్లు జరిగితీరును. ''దేవుడు కొన్నింటిని తినవద్దు అని చెప్పాడు'' అని కొందరు అంటున్నారు. దేవుడు ప్రపంచ విషయాలలో జోక్యము చేసుకోడు అన్న మాటకు తినవద్దని చెప్పడము వలన భంగము ఏర్పడును. దేవుడు మాట తప్పినవాడగును. అందువలన మనము వాక్యమును అర్థము చేసుకోవడములో ఏమయినా పొరపడినామేమో కొద్దిగా ఆలోచించండి. దేవుని జ్ఞానమును తేలికగా తీసుకోకూడదు.

దేవుడు ఎక్కడయినా ఫలానా వాటిని తిను, ఫలానా వాటిని తినవద్దు అని చెప్పాడా? అను ప్రశ్నను వేసుకొందాము. ఫలానావి తినమని ఎక్కడా ఏ వాక్యములోనూ చెప్పలేదు. పాపము చేసుకొన్నవాడు తినే తిండిని గురించి చెప్పాడు తప్ప నిన్ను తినవద్దని చెప్పలేదు, అట్లే తినమని కూడా చెప్పలేదు. ఫలానా ఆహారము పాప కార్యములు అని అన్నాడు. ఘోరమైన పాపములు అని కూడా చెప్పాడు. దీనిని బాగా అర్థము చేసుకొంటే ఘోరమైన పాపములు చేసినవారు ఈ ఆహారమునే తినెదరు. పాపకార్యములు చేసినవారికి శిక్షగా ఈ ఆహారమునే ఇస్తాను, ఈ ఆహారము దొరుకునట్లు తీర్పులో నిర్ణయించుతాను అని చెప్పాడని ఎందుకు అర్థము కాదు? పాపము చేసినవారికి దొరుకు ఆహారమును చెప్పాడు తప్ప నిన్ను ఇది తిను, ఇది తినవద్దు అని చెప్పలేదు. నీ కర్మ నిర్ణయములో అనగా తీర్పులో పాపకార్య ఆహారము లభించినా దానిని అహము లేకుండా ఉద్దేశ్య పూర్వకముగా కాకుండా తినినా, దానివలన తిరిగి పాపము రాదు. పాపము చేత నిర్ణయమైన ఆహారమును సత్యతిరస్కారులు, దేవుని ధర్మమును విశ్వసించని వారు తింటే వానికి తిరిగి ఘోరమైన పాపము వచ్చును. అందువలన పాపము చేత నిర్ణయింపబడిన ఆహారము అంతయూ తిరిగి పాపమునే తెచ్చి పెట్టును. అందువలన ఇవి ధర్మసమ్మతము కానివి అన్నారు. ధర్మ సమ్మతము కానివియైనా ఒకవేళ తినినా అహంభావము లేకుండా తిన్నట్లయితే వానికి పాపము రాదు అని చెప్పబడినది.

ఆహార పదార్థముల విషయమై సూరా ఐదులో ఆయత్ 87, 88లో ఈ విధముగా చెప్పారు.

(5-87) ''విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ మీ కొరకు ధర్మసమ్మతము (హలాల్) చేసిన పవిత్రమైన వస్తువులను మీ అంతట మీరుగా నిషేధించుకోకండి. మితిమీరి పోకండి. నిశ్చయముగా అల్లాహ్ మితిమీరి పోయేవారిని ఇష్టపడడు.''

(5-88) ''అల్లాహ్ మీకు ప్రసాదించిన వాటిలో నుండి ధర్మ సమ్మతమైన, పరిశుద్ధమైన పదార్థములను భుజించండి. మీరు విశ్వసించే అల్లాహ్‍కు భయపడండి.'' ఈ రెండు ఆయత్‍లలో మొదటి 87వ వాక్యము ఆహార సంబంధమైనది కాదు. తర్వాత 88వ వాక్యము ఆహార సంబంధమైనది. దేవుడు ప్రపంచములో ఏ వస్తువునయినా నీకు దేవుని ధర్మము ప్రకారము తీర్పు తీర్చబడియుంటే అదే నీకు లభ్యమవుతుంది. ధర్మసమ్మతము చేయబడినది అనగా! దేవుడు నీకు కేటాయించబడినది ఏదయితే వుందో దానిని నీవు నిషేధించుకోవద్దు అని చెప్పాడు. ఇక్కడ భాషను కొంత అర్థము చేసుకోవలసియున్నది. దీనిని నేనే సంపాదించుకొన్నాను అని ఏ వస్తువును అనుకొన్నా ఆ వస్తువును నీవు నిషేధించుకొన్నట్లే అనగా దేవుని ధర్మమును (తీర్పును) నిషేధించుకొన్నట్లగును. దేవుడు ఇచ్చినదే నాకు దొరికింది అని ఇల్లు, భూమి, ధనము, బంగారు విషయములలో అనుకొంటే అది ధర్మమును సమ్మతించినట్లేయగును. అట్లుకాకుండా నేనే సంపాదించుకొన్నాను అనుకొంటే దానిని ధర్మము నుండి నిషేధించి నట్లగును, అప్పుడు అది ధర్మసమ్మతము కాదు, కనుక ఆ వస్తువు విషయములో క్రొత్తగా పాపము వచ్చును. దేవుని ధర్మమును అతిక్రమించు వానిని, అనగా తీర్పు విషయము తెలియని వానిని దేవుడు ఇష్టపడడు అని చెప్పాడు.

ఇకపోతే 88వ వాక్యములో పూర్తి ఆహారమును గురించి చెప్పాడు. దేవుడు తన ధర్మము ప్రకారము తీర్పు తీర్చిన (నిర్ణయించిన) ఆహారమును భుజించమని చెప్పాడు. దానినే మీకు ధర్మసమ్మతము చేయబడి ప్రసాదించిన పరిశుద్ధమైన పాపము రాని వాటినే తినండియని చెప్పాడు. ఇక్కడ 87వ వాక్యములో చెప్పినట్లు ఆహారమును నేనే సంపాదించుకొన్నాను అని అనుకొంటే ధర్మమును మీరిపోయినట్లేయగును. అప్పుడు దానిలోని పాప రహితమును లేకుండా చేసుకొన్నట్లగును. దానినే నిషేధించుకొన్నట్లగును. ఈ రెండు వాక్యములు దైవజ్ఞానము తెలిసిన వారికి, దేవుని చట్టము తెలిసిన వారికి సులభముగా అర్థము కాగలవు. దేవుని ధర్మములు తెలియని వారికి ఈ వాక్యములు అర్థము కావనియే చెప్పవచ్చును. దేవుని చట్టము (ధర్మము) తెలిసినవాడు చెప్పిన జ్ఞానమును సులభముగా అర్థము చేసుకోగలడు. ధర్మములు తెలియనివానికి అర్థమగుట దుర్లభము అని చెప్పవచ్చును. ఆహార విషయము చెప్పుటకు ముందు దేవుడు ఇచ్చిన వస్తువులను నిషేధించు కోకండియని ముందే హెచ్చరించి చెప్పాడు. ఏ వస్తువయినా దేవుడిచ్చినదే యనుకోవడము ధర్మసమ్మతము. అట్లు అనుకోకపోతే ధర్మమును నిషేధించుకొన్నట్లేయగును. దానివలన లేని పాపము వచ్చి అంటుకొనును. ఆహార సంబంధ విషయము ఐదవ సూరాలో మూడవ ఆయత్‍లో కూడా చెప్పాడు.

దానియందు పాపమును తెచ్చిపెట్టు ఆహారములను గురించి చెప్పాడు. ఈ ఆహారము వలన పాపము వస్తుంది కావున వాటిని నిషేధ పదార్థములుగా అనగా పాపసంబంధ పదార్థములుగా చెప్పబడినవి. ధర్మముల మీద విశ్వాసము లేనివారికి పాపభీతియే ఉండదు. అందువలన వారు పాపము వచ్చు వాటినయినా వదలక తినుచుందురు. ఇది దేవుడిచ్చినది యని అనుకోకుండా ధర్మములకు నీళ్లు వదలి, అధర్మము ప్రకారము ఆహారమును తీసుకొనుచుందురు. ధర్మము తెలిసినవాడు తనలో అహమును లేకుండా ఉండి ఏదయినా దేవుని నిర్ణయము వలన లభించినదని అనుకొంటే దేవుడు చెప్పిన పాపపు ఆహారమును తినినప్పటికీ వానికి పాపము రాదుయని చెప్పాడు. దీనినే కర్మ కాలిపోవడము అని తౌరాతు గ్రంథములో చెప్పియున్నారు. దానిప్రకారమే వాని పాపమును దేవుడు క్షమించును అని చెప్పారు. ఈ విషయము ఐదవ సూరా మూడవ ఆయత్‍లో చెప్పియున్నారు. దీనిని అర్థము చేసుకొనుటకు జ్ఞానము అవసరము. జ్ఞానము లేని వారికి ఈ వాక్యము కూడా అర్థము కాదు. స్థూలముగా కనిపించునదే తెలియును. దానిప్రకారము ఇవి తినకూడదు, మిగతావి అన్నీ తినవచ్చునని అనుకుంటారుగానీ, అందులోని దేవుని ధర్మము ఏమాత్రము తెలియరు. 'ధర్మసమ్మతము' అనుదానికి అర్థము తెలియని వారికి ఇవి తినకూడదని మాత్రము తెలుసు. ఇప్పుడు వాక్యమును చూస్తాము.

(5-3) ''మీ కొరకు నిషేధింపబడిన వస్తువులు ఇవి, మృత పశువు రక్తము, పంది మాంసము, అల్లాహ్ పేరుగాక వేరు ఇతరుల పేరు ఉచ్ఛరింపబడునది. గొంతు పిసకబడటం వలన చనిపోయిన పశువు. దెబ్బ తగిలి చనిపోయిన పశువు, ఎత్తయిన ప్రదేశము నుండి క్రిందపడి చనిపోయినది, కొమ్ములు తగిలి చనిపోయినది, కౄర మృగాలు చంపి చీల్చి తినటము వలన చనిపోయిన పశువు. కానీ మీరు ఒకవేళ జిబహ్ చేస్తే అది మీకొరకు నిషిద్ధము కాదు. ఇలాగే ఆస్థానాల వద్ద బలి ఇచ్చినవి కూడా నిషిద్ధమే. అదే విధముగా బాణాల ప్రయోగము ద్వారా అదృష్టాన్ని పరీక్షించు కోవడము కూడా నిషిద్ధమే. ఇవన్నీ అత్యంత నీచమైన పాప కార్యములు. ఈ రోజు అవిశ్వాసులు మీ ధర్మము గురించి ఇక ఆశను వదలుకున్నారు. జాగ్రత్త! మీరు భయపడవలసింది వారికి కాదు, మీరు నాకు భయపడండి. ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణము గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. ఇంకా ఇస్లామ్‍ను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. ఎవరయినా తీవ్రమైన ఆకలి బాధతో అల్లాడి పోతూ, గత్యంతరము లేని పరిస్థితిలో పాపానికి పాల్పడే ఉద్దేశ్యము లేకుండా వుండి పై వాటిలో దేన్నయినా తిన్నట్లయితే నిస్సందేహముగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు.''

ఈ విధముగా 5-3 వాక్యము చెప్పబడినది. ఈ వాక్యము ఎవరికి ఎట్లు అర్థమయినా 'అల్లాహ్ అంతిమ దినమున నిర్ధారించిన ఆహారమే మనిషికి లభించును.' చివరిమాటలో పాపము అని చెప్పినవే తినవలసి వస్తే అన్నప్పుడు 'నీ ప్రయత్నములు ఏమీ పనికి రావు. నేను నిర్ధారించినట్లే జరుగును' అని అల్లాహ్ చెప్పినట్లు కలదు. దేవుని ధర్మమును గురించి తెలియకపోతే అది పాప కార్యమేయగును. ఎప్పుడయితే ధర్మము తెలియునో అప్పుడు వానికి ఏ కార్యములో కూడా స్వంత భావము, స్వంత ఉద్దేశ్యము ఉండదు. స్వంత భావము లేకుండా తిన్నవానికి పాపము క్షమించబడును అని చెప్పాడు. ఈ వాక్యము మేము సహితము ధర్మములను గుర్తు పెట్టుకొని చదవడము వలన అర్థమవుచున్నది గానీ ధర్మములు తెలియకపోతే ఈ వాక్యము ఉల్టాగా అర్థమగును.

అంతిమ దినమున తీర్పు చేసిన దేవుడే తన తీర్పును తప్పక అమలు చేయును. తప్పు చేసిన వారికి తీర్పునివ్వడమే కాకుండా అల్లాహ్ కఠినముగా శిక్షించేవాడు. అల్లాహ్ తన ధర్మము ప్రకారము మనుషుల అంతిమ దినమున వారు చేసుకొన్న పాపములకు, పుణ్యములకు అనుగుణముగా న్యాయబద్దముగా తీర్పును ఇచ్చి తర్వాత మొదటి దినము నుండి చివరి దినము వరకు తన తీర్పును అమలు చేయును. తీర్పును అమలు చేయడములో ఎక్కడగానీ రాజీపడడముగానీ, సర్దుకపోవడము గానీ ఉండదు. ఎంత శిక్షవుంటే అంత అమలు ఉండును. ఈ విషయము అంతా తెలియడమే దేవుని ధర్మములు, దేవుని జ్ఞానము తెలియడము. దేవుని జ్ఞానము తెలిసినప్పుడు పాప క్షమాపణ కూడా ఉండును. పాప క్షమాపణ తీర్పు తీర్చిన అల్లాహ్ చేయునా అంటే అటువంటి పని ఆయన పరిధిలో లేదు. ఆయన తీర్పు తీర్చడము, అమలు చేయడము తప్ప క్షమాపణలు ఆయన చేయువాడు కాదు. అయితే పాపముతో కూడిన ఆహారమును 'నేను' అను భావము లేకుండా దేవుడు ఇచ్చినది అని తినునో అటువంటి వాని పాపమును క్షమించువాడు అల్లాహ్‍యే. అయితే తీర్పు తీర్చిన అల్లాహ్ క్షమించడు. తీర్పు తీర్చని అల్లాహ్ క్షమించగలడు. ఈ రహస్యము దేవుడు తన గ్రంథములలో అనేకమార్లు సూచించినా ఎవరూ తెలియలేదు. ఇద్దరు అల్లాహ్‍లు ఉన్నారని మొత్తము మానవాళికి తెలియదు. ఒకరు సృష్ఠికర్తయైన అల్లాహ్, ఆయన పని చేయడు. మరొకరు సృష్ఠింపబడిన అల్లాహ్, ఆయన అన్ని పనులు చేయును.
1 సృష్ఠికర్తయైన అల్లాహ్ ఎవరు? సృష్ఠించబడిన అల్లాహ్ ఎవరు?

2 మనుషులు ఆరాధించని అల్లాహ్ ఎవరు? మనుషులు ఆరాధించే అల్లాహ్ ఎవరు?

3 మనుషుల ఆరాధనలకు దూరముగాయున్న అల్లాహ్ ఎవరు? మనుషుల చేత ఆరాధింప తగిన అల్లాహ్ ఎవరు?

4 పనిని చేయని అల్లాహ్ ఎవరు? పనిని చేసే అల్లాహ్ ఎవరు?

5 అంతిమ దినమునకు సంబంధము లేని దేవుడు ఎవరు? అంతిమ దినమున తీర్పును తీర్చు దేవుడు ఎవరు?

6 ధర్మములు లేని అల్లాహ్ ఎవరు? ధర్మములు గల అల్లాహ్ ఎవరు?

ఈ విధముగా ఇద్దరు అల్లాహ్‍లు ఉన్నారని తెలిసి, మనిషి ఆరాధించవలసినది ఒక్కనినేనని తెలిసి, ఒక్క అల్లాహ్‍నే ఎవరు ఆరాధించునో వాడు దైవమార్గములో ఉన్నట్లేయగును. ఇదే విషయమునే అనగా ఇద్దరు అల్లాహ్‍ల విషయమునే ద్వితీయ దైవ గ్రంథములో ఇంకా విపులముగా ఇచ్చారు. ప్రథమ దైవ గ్రంథములో కూడా ఇదే విషయమును చెప్పారు. అయితే మూడు మతముల వారు ఇద్దరిని గుర్తించలేకపోయారు. ఇద్దరినీ ఎన్నో తేడాలతో గ్రంథములో చెప్పియున్నా, తెలియని గ్రుడ్డివారుగా మనుషులున్నారు. ద్వితీయ దైవగ్రంథములో ఇద్దరు దేవుళ్ళను గురించి చాలా దగ్గరగా చెప్పారు. అయితే ప్రపంచములో ఎన్నో తెలివిలుగల మనుషులు, ఎంతో చదువు చదివిన వారు, మేథావులు అని పేరుపొందిన వారు సహితము ఇద్దరు దేవుళ్లను గుర్తించక ఇద్దరినీ కలిపి ఒకే దేవుడు అని అంటున్నారు.

'ఇద్దరు దేవుళ్లు' అను విషయము మూడు గ్రంథములు చదివిన వారికే తెలియుటకు అవకాశము గలదు. ఒక గ్రంథమును చదివిన వారికి రెండవ దేవున్ని గురించి తెలియు అవకాశమే లేదు. అందువలన చివరి దైవ గ్రంథమయిన ఖుర్ఆన్యందు ఐదవ సూరాలో నాలుగైదు చోట్ల 'మూడు గ్రంథములను చదవమని' అల్లాయే చెప్పినట్లు కలదు. ఒక ఆయత్‍లో 'మూడు దైవ గ్రంథములను చదువకపోతే నీవు ఏ ధర్మములో లేనట్లే'యని కూడా చెప్పడమైనది. ఒకమారు ఖుర్ఆన్ గ్రంథములో సూరా ఐదు, ఆయత్ (68) లో ఏమి చెప్పారో చూడండి.

(5-68) ''ఓ గ్రంథవాహకులారా! మీరు తౌరాతు, ఇంజీలు మరియు మీ ప్రభువు తరపునుండి మీ వద్దకు పంపబడిన ఖుర్ఆన్‍ను మీ జీవితములలో నెలకొల్పువరకు మీరు ఏ ధర్మము పైనా లేనట్లే.''

ఈ వాక్యములో స్పష్టముగా 'మూడు గ్రంథములను మీ జీవితములలో నెలకొల్పుకోమని' చెప్పాడు. అలా కాకుండా నాది ఒక గ్రంథమేయని, ఒక మతమువారు ఒక గ్రంథమును మాత్రమే ఆశ్రయించి దానిని మాత్రమే తెలిసి, దానిప్రకారమే మేమున్నాము అనినా, మిగతా రెండు గ్రంథములలోని జ్ఞానము తెలియనిదే వాడు జ్ఞానములో పరిపూర్ణుడు కాలేడు. ఇద్దరు దేవుళ్ల విషయము తెలియదు. ఇద్దరు దేవుళ్ల విషయము నీ గ్రంథములోయున్నా, మిగతా రెండు గ్రంథములు చదవనిదే అది నీకు తెలియబడదు. అంతేకాక నీ గ్రంథములోని జ్ఞానము కూడా నీకు సరిగా అర్థము కాదు. అందువలననే ఆహార విషయములోని విధానము తెలియకుండా పోయినది. ఇది తినకూడదు అని మనిషి అనుకోవడము జరుగుచున్నది. ముందే దేవుడు నిర్ణయించియుండును, మనిషి నిర్ణయము పనికిరాదు అని తెలియలేకపోయారు. అంతేకాక 'ప్రపంచ విషయములను గురించి దేవుడు (అల్లాహ్) తన బోధలో చెప్పడు' అను మాట కూడా మరచిపోయారు. ఆహార విషయము మూడు దైవ గ్రంథములలో ప్రస్తావించ బడినది. మూడుచోట్ల చెప్పిన విషయమును గ్రహించినప్పుడే ఆహారము యొక్క అసలు విషయము తెలియును. అంతవరకు ఒక గ్రంథమును చదివిన వారికి అర్థము కాదు. తౌరాతు గ్రంథములో సాత్త్విక, రాజస, తామస ఆహారములని చెప్పారు. ఇంజీలు గ్రంథములో అక్షయ, క్షయ ఆహారము అని చెప్పారు. ఖుర్ఆన్ గ్రంథములో పాపముతో కూడుకొన్న ఆహారము అని చెప్పారు. మూడు గ్రంథముల విశ్లేషణ వలననే ఆహార విషయము సంపూర్ణముగా అర్థము కాగలదు. అప్పుడు ఆహారమునకు సంబంధించిన ధర్మములు తెలియును. అప్పుడు మనిషి ఒక తోలుబొమ్మ మాత్రమేయనీ, స్వయం నిర్ణయము ఈ బొమ్మకు లేదనీ, అన్నీ నిర్ణయించు వాడు, నిర్ణయించినవాడు, సృష్ఠించబడిన, అందరూ ఆరాధించదగిన అల్లాహ్ యని తెలియును.

నేడు ప్రతి మనిషి దేవుడు చెప్పిన జ్ఞానమును వదలి మనుషులు చెప్పిన నియమాలనే ఎక్కువగా ఆచరించుచున్నాడు. అలా మనుషులు చెప్పిన నియమాలలో దేవునివైపు కాకుండా మాయ (ఇబ్లీస్) వైపు పోయి నట్లగుచున్నది. మనుషులు బోధించిన నియమములను అనుసరించడము వలన తమ గ్రంథము ఒక్క దానిపైన తప్ప, ఇతర రెండు దైవ గ్రంథముల మీద అసూయ ఏర్పడుచున్నది. అలా ఏర్పడడమేకాక తమ గ్రంథమే మిగతా గ్రంథములకంటే గొప్పదని చెప్పుచుందురు. అలా అయినా తమ గ్రంథమునయినా చదివి, అందులోని జ్ఞానమును తెలియగలిగారా అంటే అదీ లేదు. ప్రతి మతములోనూ దైవ గ్రంథమునకు ప్రక్కలో మనుషులు చెప్పిన మరొక గ్రంథముండును. ప్రజలు అలా ప్రక్క గ్రంథమునకే ఎక్కువ విలువనిచ్చుచున్నారు. దైవ గ్రంథములోని జ్ఞానముకంటే ప్రక్క గ్రంథములోని వాక్యములే గొప్పగా కనిపించుచుండును. హిందువుల భగవద్గీత ప్రక్కన వేదములు, క్రైస్థవుల ఏసు బోధనలు గల క్రొత్త నిబంధన ప్రక్కన పాత నిబంధన, ముస్లీమ్‍ల ఖుర్ఆన్ ప్రక్కన హదీసు గ్రంథములు గలవు. ఈ విధముగా యున్న మూడు దైవ గ్రంథములకు మూడు గ్రంథములుండగా, ప్రజలు వాటి మీదనే ఎక్కువ మక్కువను పెంచుకొన్నారు. అలా వారి మత పెద్దలే చెప్పుట వలన అందరూ ప్రక్క గ్రంథములను గొప్పగా చెప్పుచున్నారు. అవి లేనిది దైవ గ్రంథములను మాత్రమే చదువకూడదని చెప్పుచున్నారు. ఈ విధముగా కలకూర గంపవలె దైవజ్ఞానము మనుషులు చెప్పిన జ్ఞానములో కలిసిపోయినది. దానివలన ఏది నిజమైన జ్ఞానమో ఏ మనిషికీ తెలియకుండా పోయినది. అలా దైవ జ్ఞానము అర్థము కాకుండా పోవడము వలన ముఖ్యమైన విషయములు వేరుగా అర్థము చేసుకోవడ మైనది. ఉదాహరణకు ఆహార విషయములలో ఇవి పాపమునకు సంబంధించినవియనగా ఇంకొక విధముగా అర్థము చేసుకొన్నారు.



అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
38. సర్వ లోకవాసులకు హితోపదేశము. (6-90), (81-27)
భూమి మీద పుట్టిన మనుషులందరికీ పాపమునకు శిక్ష వేసేవాడు, శిక్షను అమలు చేయువాడు అల్లాహ్ (దేవుడు) కాగా, శిక్ష నుండి మరియు శిక్షలు పడు జన్మల నుండి బయటపడు మార్గమును ఇంకొక అల్లాహ్ చూపించాడు. ఒకరు 'సృష్ఠికర్తయైన అల్లాహ్', రెండవవాడు 'కార్యకర్తయైన అల్లాహ్' అని తెలియవలెను. ఈ విషయము తెలియకపోతే ఖుర్ఆన్ జ్ఞానము అర్థము కాదు. ఖుర్ఆన్ జ్ఞానమే కాదు, ఖుర్ఆన్కంటే ముందు వచ్చిన భగవద్గీత, బైబిలు అను రెండు దైవ గ్రంథములలోని జ్ఞానము కూడా అర్థము కాదు. మూడు దైవ గ్రంథములలో ఇద్దరు దేవుళ్ళు, ఒక జీవుని ప్రస్తావన గలదు. మూడు దైవ గ్రంథములు 'ఇద్దరు దేవుళ్ళు, ఒక జీవుని ప్రస్తావన' అను విషయమును ఆధారము చేసుకొని తయారయినవే. మూడు గ్రంథములలో ముఖ్య సమాచారము, మూడు గ్రంథములు తయారగుటకు ఇతి వృత్తముగా యున్న సమాచారము, ముగ్గురు పురుషుల విషయమే. అయితే ముఖ్యమైన ఈ విషయము మూడు మతముల వారికీ తెలియకుండా పోయినది. వారికి మూడు గ్రంథములలో వారివారి మతము కనిపించుతూ యున్నది తప్ప 'ఇద్దరు దేవుళ్ళు, ఒక జీవుడు' ఎవరికీ కనిపించలేదు. ప్రథమ దైవ గ్రంథము భగవద్గీతలో క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అని స్వయముగా అల్లాహ్‍యే చెప్పాడు. వివరముగా చెప్పుకొంటే క్షరుడు అనగా జీవుడు అనియూ, అక్షరుడు, పురుషోత్తమ అనగా ఇద్దరు దేవుళ్ళనియూ చెప్పవచ్చును.

ద్వితీయ దైవగ్రంథమయిన బైబిలులో కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్మయని చెప్పియున్నారు. కుమారుడు అనగా జీవాత్మ (మనిషి) అనియూ, తండ్రి, పరిశుద్ధాత్మయనగా ఇద్దరు దేవుళ్ళు అనియూ చెప్పవచ్చును. అట్లే అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములో త్రోలబడేవాడు, త్రోలే వాడు, సాక్షిగా చూచేవాడు అని ముగ్గురిని చెప్పియున్నారు. ఇక్కడ త్రోలబడేవాడు జీవుడుకాగా, త్రోలేవాడు, సాక్షిగా యున్నవాడు ఇద్దరూ దేవుళ్ళుగా యున్నారు. ఈ విధముగా మూడు గ్రంథములలో భాష వేరుగా కనిపించినా, భావములో ముగ్గురు గలరు. దీనినిబట్టి సృష్ఠ్యాదిలో చెప్పిన తౌరాతు (భగవద్గీత), కలియుగములో చెప్పిన ఇంజీలు (బైబిలు), కలియుగములోనే చివరి దైవ గ్రంథముగా చెప్పిన ఖుర్ఆన్ గ్రంథము మూడు గ్రంథములు సమానముగా ఒకే జ్ఞానమునే బోధించాయని చెప్పవచ్చును. ముగ్గురు పురుషతత్త్వముతో కూడుకొన్నవారు మాత్రమే విశ్వములో గలరు. మిగతాది అంతా స్త్రీతత్త్వముగా యున్నది. యావత్ విశ్వమంతా కలిసి పురుషతత్త్వము గలవారు ముగ్గురు, స్త్రీ తత్త్వముగల ప్రకృతి ఒక్కటి మాత్రమే గలవు. ముగ్గురు పురుషులు, ఒక ప్రకృతిని గురించి చెప్పినవే మూడు దైవ గ్రంథములు. మూడు దైవ గ్రంథములు సమస్త మానవాళికి ఒకే జ్ఞానమును బోధించుచున్నవి.

తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రములలో ఒకే తెలుగు భాషయున్నా, రెండు రాష్ట్ర ప్రజలు ఒకే భాషను మాట్లాడుచున్నా, తెలంగాణా ప్రాంత ప్రజలు ఒక రకముగా, ఆంధ్ర ప్రాంత ప్రజలు మరొక రకముగా మాట్లాడుచుందురు. ఆంధ్రాలో 'అట్లనా' అంటే, అదే మాటనే తెలంగాణాలో 'గట్లనా'యని అందురు. అట్ల అనినా, గట్ల అనినా రెండింటిలోని భావము ఒక్కటే యున్నది. భాషా పదములు వేరుగా పలికినా, అందులోని ఉద్దేశ్యము ఒకటే అయివుండుట వలన రెండూ ఒకటేయనీ, రెండూ ఒకే తెలుగు భాషలోనివి యనియు చెప్పవచ్చును. అదే విధముగా మూడు దైవ గ్రంథములలో ముగ్గురు పురుషులను గురించి వేరువేరు పదములుగా చెప్పియున్నా, భావములో మాత్రము ఒక జీవున్ని, ఇద్దరు దేవుళ్ళను గురించి చెప్పినదే గలదు. ఉద్దేశ్యము ఒక్కటే అయివుండి పలికిన పలుకులు వేరయినా అన్ని పలుకులను ఒక్కటిగానే చెప్పవచ్చును. ఉద్దేశ్యము ఒక్కటే అయినప్పుడు దానిని వినే ప్రజలందరికీ ఒకే సందేశముగా చెప్పవచ్చును. దీనిప్రకారము మూడు గ్రంథములలో యున్న ముగ్గురు వేరువేరు మాటలలో చెప్పబడి యున్నా ఆ ముగ్గురూ ఒక్కటే. అందువలన భగవద్గీతలో చెప్పబడిన ముగ్గురు, బైబిలులో చెప్పబడిన ముగ్గురు, ఖుర్ఆన్‍లో చెప్పబడిన ముగ్గురు సమస్త మానవులకు జ్ఞానబోధగా యున్నారు. అందువలన ఖుర్ఆన్ గ్రంథములో సూరా 81, ఆయత్ 27లో 'ఇది అందరికీ సంబంధించిన గ్రంథము' అని చెప్పారు. ఒకమారు దానిని చూడండి.

(81-27) ''ఇది సమస్త లోకవాసుల కొరకు హితోపదేశము.''

ఖుర్ఆన్ గ్రంథము సర్వలోక ప్రజలకు అని చెప్పియున్నారు గానీ ముస్లీమ్‍లకొక్కరికేనని చెప్పలేదు. నేడు ఖుర్ఆన్ అంటే అది ముస్లీమ్ గ్రంథము అని అంటున్నారు. ముస్లీమ్‍ల గ్రంథమని చెప్పుటకు ఆధారము లేదు. ఎవరు ఏమి చెప్పినా ఖుర్ఆన్ గ్రంథము ప్రజలందరి కొరకు చెప్పినది. మనుషులందరూ ఖుర్ఆన్ గ్రంథమును తప్పక చదవవలసి యుండును. బైబిలులో 'సమస్త మానవులారా నావద్దకు రండి'యని ఏసు అన్నాడు గానీ, క్రైస్థవులారా నా వద్దకు రమ్మని చెప్పలేదు. దీనిప్రకారము మూడు దైవ గ్రంథములు మానవ సమాజమునకు చెప్పినవేగానీ, మత సమాజమునకు చెప్పలేదు. అటువంటప్పుడు ఖుర్ఆన్ ముస్లీమ్‍లదని చెప్పడము పొరపాటు. మిగతా రెండు గ్రంథములను కూడా క్రైస్థవులది బైబిలు అనీ, భగవద్గీత హిందవులదని చెప్పకూడదు. అలా చెప్పితే దేవుని మాటను వ్యతిరేఖించినట్లగును. కొందరు ముస్లీమ్‍లు ఖుర్ఆన్ మా గ్రంథమని చెప్పడమేగాక, ఖుర్ఆన్‍లోని వాక్యములకు ఇతర మతముల వారు వివరమును చెప్పకూడదు అని అంటున్నారు. కొందరు ముస్లీమ్‍లు ఖుర్ఆన్‍కు మేమే హక్కుదారులము, దానిని మాకు తెలియకుండా, మా అనుమతి లేకుండా చదవకూడదు, తాకకూడదు అని అంటున్నారు. అలా అనడమును కొందరు జ్ఞానము తెలిసిన ముస్లీమ్‍లు వ్యతిరేఖించుచున్నారు. వారు ఈ విధముగా అంటున్నారు.

ఏమైనప్పటికీ ఖుర్ఆన్ యావత్తు మానవాళి కోసము అవతరించిన అంతిమ దైవగ్రంథము. ఇది ప్రపంచ మానవులందరి ఉమ్మడి సొత్తు. దీనిపై ఏ ఒక్క జాతికి, వర్గానికి గుత్తాధిపత్యము లేదు. గాలి, నీరు, సూర్యరశ్మి మొదలయిన ప్రకృతి వనరుల్ని మానవుడు ఎలా వినియోగించుకొని ప్రయోజనము పొందు చున్నాడో, ఖుర్ఆన్వల్ల కూడా అలాగే ప్రయోజనము పొందవచ్చును. ఇది ఇహ లోక మానవుల మార్గ దర్శనము కొరకు, పరలోకములో వారి ముక్తి మోక్షాల కొరకు సర్వేశ్వరుడు పంపిన ఏకైక హితవాణి. ఇందులో సత్యాన్వేషకులకు ఆసక్తికరమైన అనేక విషయములు ఉన్నాయి. అందువలన సత్యాన్ని ప్రేమించి మోక్షాన్ని కోరుకొనే ప్రతి ఒక్కరూ కనీసము ఒక్కసారైనా ప్రశాంతముగా ఆలోచించి, దీనిని అధ్యయనము చేయవలసిన అవసరము ఎంతైనా ఉంది.
ఇట్లు
అబుల్ ఇర్ఫాన్
(''ఖుర్ఆన్ భావామృతము'' అనువాదకుడు)

ఇక్కడ అబుల్ ఇర్ఫాన్ గారు వ్రాసిన దానినిబట్టి ఖుర్ఆన్‍ను చదువుటకుగానీ, వ్రాయుటకుగానీ ముస్లీమ్ పెద్దల అనుమతి కావాలని చెప్పు వారి మాటలు వ్యర్థమయినవని, విలువ లేనివని తెలియుచున్నది. మనుషుల మాటలను ప్రక్కన పెట్టి చూస్తే స్వయముగా అల్లాహ్‍యే ''ఖుర్ఆన్ గ్రంథము సర్వమానవుల కొరకు'' అని చెప్పియున్నారు. ఇదే విషయమునే సూరా ఆరు, ఆయత్ 90 లో ఇలా చెప్పారు చూడండి.

(6-90) ''ఇలాంటివారే అల్లాహ్ మార్గదర్శకత్వమును పొందిన వారు. కావున నీవు వారి మార్గాన్నే అనుసరించు వారితో ఇలా అను. ''నేను దీనికి బదులుగా ఎలాంటి ప్రతిఫలమును అడుగను. ఇది సర్వలోకాల వారి కొరకు ఒక హితోపదేశము అని ఓ ప్రవక్తా వారికి చెప్పు.''

ఈ విధముగా స్వయముగా ఖుర్ఆన్ గ్రంథములోనే చెప్పబడి యుండుట చేత ఖుర్ఆన్ హిందువులకు, క్రైస్థవులకు మిగతా తొమ్మిది మతముల వారికి దైవజ్ఞానమునే అందించుట చేత ఇది అందరి కొరకు చెప్పబడిన గ్రంథమేగానీ, ఒక మతమునకుగానీ, ఒక సమాజమునకు గానీ చెప్పబడినది కాదు. అందువలన ఖుర్ఆన్ ముస్లీమ్‍ల గ్రంథము కాదు. అందరికీ సంబంధించినదని చెప్పవచ్చును. ఖుర్ఆన్ గ్రంథమును చదువుటకు, వాక్యములకు వివరమును వ్రాయుటకు సర్వులకు సమాన హక్కు గలదు. గ్రంథమును గురించి ప్రచారమును ఏ మతమువారైనా చేయవచ్చును. కొందరు ముస్లీమ్‍లు మా పెద్దల అనుమతి తీసుకోవాలి లేకపోతే మిమ్ములను ప్రచారము చేయనీయము అని మొండిగా మాట్లాడు చున్నారు. ఎవరయినా దేవుని జ్ఞానమును ప్రచారము చేయవచ్చును. అయితే కొందరు దేవుని జ్ఞానమును ప్రక్కన పెట్టి మత ప్రచారము కొరకు అడ్డముగా మాట్లాడుచుందురు. ఈ మధ్యన 'ఏలూరు'లో కొందరు ముస్లీమ్‍లు ఖుర్ఆన్ గ్రంథమును హిందువులు ప్రచారము చేయకూడదని అన్నారు. అది దేవుని వ్యతిరేఖమైన పనులని వారికి తెలియదు.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
39. ఏ మానవుని మీద దేవుడు తన జ్ఞానమును అవతరింపజేయ లేదు. (6-91)
మనిషికి కావలసిన జ్ఞానమును దేవుడే తెలుపవలసియున్నది. మనిషికి జ్ఞానమును తెలుపుటకు మనిషియే అవసరము. ఒక మనిషి జ్ఞానమును చెప్పితే ఇంకొక మనిషి జ్ఞానమును తెలియగలడు. మనిషికి మనిషి తప్ప జంతువులుగానీ, వృక్షములుగానీ జ్ఞానమును చెప్పలేవు. దేవుడు జ్ఞానమును చెప్పినా మనిషి రూపములోనే చెప్పాలి. అప్పుడయితేనే మనిషి వినగలడు, తెలియగలడు. కృష్ణుడు మనిషే కావున ఆయన తోటి మనిషి అయిన అర్జునునకు జ్ఞానమును చెప్పాడు. అలాగే ఏసు మనిషి అయినందున మనుషులయిన తన శిష్యులకు జ్ఞానమును చెప్పగలిగాడు. మోషే తన ధర్మశాస్త్రము అను జ్ఞానమును అప్పటి మనుషులకు బోధించాడు. అలాగే ముహమ్మద్ ప్రవక్తగారు తనకు తెలిసిన జ్ఞానమును ఇతర మనుషులకు తెలియజేశాడు. దీనినిబట్టి మనిషి ఇంకొక మనిషికి జ్ఞానమును చెప్పగలడు తప్ప మిగతా ఏ విధానము చేతగానీ తెలుపుటకు వీలుపడదని తెలియుచున్నది.

అయితే భూమిమీద ఏ మనిషికిగానీ దేవుని జ్ఞానము తెలియదనీ, దేవుడు తన జ్ఞానమును ఏ మనిషికీ ప్రసాదించలేదనీ, దేవుని జ్ఞానము దేవుడు తప్ప ఎవరూ చెప్పలేరనీ, దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఇతరులకు ఎవరికీ తెలియదనీ దైవగ్రంథములో స్వయముగా దేవుడే చెప్పాడు. ఆ విషయమును అంతిమ దైవగ్రంథము ఖుర్ఆర్‍లో సూరా మూడు ఆయత్ ఏడులో ఈ విధముగా చెప్పారు చూడండి.

(3-7) ''నిజానికి దేవుని జ్ఞానములోని సత్యము దేవునికి తప్ప (అల్లాహ్‍కు తప్ప) వేరెవరికీ తెలియదు. అయితే జ్ఞానములో పరిపక్వత చెందినవారు మాత్రము ''మేము వీటిని విశ్వసించాము. ఇవన్నీ మా ప్రభువు తరపున వచ్చినవే'' అని అంటారు. వాస్తవానికి బుద్ధి జ్ఞానాలు కలవారు మాత్రమే హితబోధను గ్రహిస్తారు.''

ఈ వాక్యము ప్రకారము దేవుని జ్ఞానము దేవునికి తప్ప వేరెవరికీ తెలియనప్పుడు దేవుని జ్ఞానమును దేవుడే చెప్పవలసిందే. దేవుడు నేరుగా ఏ మానవమాత్రునితోనూ మాట్లాడడు అని కూడా దేవుడే ఖుర్ఆన్ గ్రంథములో సూరా 42, ఆయత్ 51లో చెప్పియున్నాడు. ఆ మాట ప్రకారము దేవుడు నేరుగా మనుషులతో మాట్లాడడు. దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మనిషికీ తెలియదు. తర్వాత ఒక మనిషికి ఇంకొక మనిషే జ్ఞానమును చెప్పాలి. మనిషి చెప్పితే ఇంకొక మనిషికి జ్ఞానము తెలుస్తుంది. మనిషికి తెలిసిన భాషలోనే జ్ఞానమును చెప్పవలసియుండును. అట్లు యున్నప్పుడు దేవుడు మనిషిగానే జ్ఞానమును చెప్పవలసియుండును. అయితే సూరా ఆరు, ఆయత్ 91లో ఇలా కలదు.

(6-91) ''అల్లాహ్ ఏ మానవుని మీద ఏ జ్ఞానాన్ని అవతరింప జేయలేదు'' అని పలికినప్పుడు ఈ అవిశ్వాస జనులు అల్లాహ్‍ను అర్థము చేసుకోవలసిన విధముగా అర్థము చేసుకోలేదు. వారిని అడుగు మరి ముసా తెచ్చిన గ్రంథాన్ని ఎవరు అవతరింప చేసినట్లు? ఆ గ్రంథం ఒక జ్యోతి, మానవుల కొరకు మార్గ దర్శకత్వము. మీరు దానిని వేరు వేరు కాగితాలుగా విభజించి చూపుతున్నారు. ఎన్నో విషయాలను దాచేస్తున్నారు. మీకుగానీ, మీ పెద్దలకు గానీ తెలియని ఎన్నో విషయాలు ఇందుమూలముగా మీకు నేర్పబడ్డాయి. తౌరాతును అవతరింపజేసినవాడు అల్లాహ్‍యే అని చెప్పు. ఆ తర్వాత వారిని వారి వ్యర్థ విషయాలలో ఆడుకోనివ్వు.''

దేవుడు పంపిన ఈ వాక్యములో ''ఏ మానవుని మీద దేవుడు తన జ్ఞానమును ప్రసరించలేదు'' యని ఉంది. దాని అర్థము ఏమనగా! దేవుని జ్ఞానము ఏ మానవునికీ తెలియదు అని చెప్పడమే. ఏ మనిషికీ తెలియనప్పుడు ఎవరో ఒకరు చెప్పితేనే ఇంకొక మనిషికి తెలియును. అలాంటప్పుడు ఏ మనిషికీ దేవుడు తన జ్ఞానమును ఇవ్వనప్పుడు, ఇతరులు ఎవరూ, ఏ మానవుడు దేవుని జ్ఞానమును గురించి చెప్పలేరు. ఆ పరిస్థితిలో మానవులకు దేవుడే జ్ఞానము చెప్పవలసి యుంటుంది. అయితే ఇక్కడ ఒక ఆటంకము గలదు. అదేమనగా! దేవుడు నేరుగా ఎవరితోనూ మాట్లాడడు. అంతేకాక ఒక మనిషికి ఇంకొక మనిషి చెప్పినప్పుడే జ్ఞానము అర్థమగును. ఇంకొక మనిషికి జ్ఞానము తెలియదు. దేవుడు తనకు మాత్రమే తెలిసిన తన జ్ఞానమును తాను స్వయముగా (దేవునిగా) ఎవరికీ చెప్పడు. అటువంటప్పుడు భూమిమీద మనుషులకు దైవజ్ఞానము తెలిసే అవకాశమే లేదు. ఏమాత్రము తెలిసే అవకాశము లేకున్నా, దేవుడు మనుషులకు దైవజ్ఞానము తెలియు అవకాశమును కల్గించాడు. తానే స్వయముగా మానవుడు కాని మానవునిగా భూమిమీద అవతరించి జ్ఞానమును చెప్పాడు.

దేవుడు స్వయముగా మానవుడు కాని మానవునిగా వచ్చి జ్ఞానము చెప్పడము వలన మనిషికి మనిషే జ్ఞానమును చెప్పినట్లయినది. తర్వాత ఏ మనిషికీ జ్ఞానము ప్రసాదించకుండా తానే మానవులకు జ్ఞానమును చెప్పినట్లయినది. దానివలన దేవునికి తప్ప, ఇతర మనుషులకు ఎవరికీ దేవుని జ్ఞానము తెలియదని అర్థమయినది. 'దేవుడు మనిషితో నేరుగా మాట్లాడడు' అను మాట నెరవేరునట్లు దేవుడు దేవునిగా కాకుండా దేవుడు మనిషి అవతారములో మాట్లాడినాడు. 'దేవుడు పుట్టడు' అనుమాట నెరవేరునట్లు దేవుడు దేవునిగా పుట్టకుండా మనిషివలె పుట్టాడు. దేవుడు మనిషికాదు అనునట్లు దేవుడు పూర్తి మనిషిగా కాకుండా 'భగవంతుడు' అను ప్రత్యేకమైన మనిషిగా పుట్టాడు. భగవంతుడు ఇటు దేవునికి అటు మనిషికి చెందినవాడు కాకుండా మధ్యలో యున్నవాడు. భగవంతుడు మనిషి ఆకారములో యున్నా దేవుని జ్ఞానము కలవాడుగా యున్నాడు. భగవంతుడు మనిషితో సమానముగా పైకి కనిపించుచున్నా లోపల దేవునితో సమానముగా యున్నాడు. మనిషి గర్భమునుండి నిర్జీవముగా పుట్టితే తర్వాత ప్రాణము పోసుకొంటే భగవంతుడు తల్లిగర్భము నుండి సజీవముగా పుట్టినవాడు. మనిషి శరీరములో జీవుడు ఒకే కోణములో బ్రతుకుతుండగా, భగవంతుడు ఒక కోణములో మనిషిగా, మరొక కోణములో దేవునిగా బ్రతుకుచున్నాడు. రెండు కోణముల జీవితముగల మనిషి ఒకే ఒకడు భూమిమీద ఉంటాడు అతడే భగవంతుడు. భగవంతున్ని మనుషులు ఎవరూ గుర్తు పట్టలేరు. అందువలన భగవంతున్ని సాధారణ మనిషిగా చూస్తారు. భగవంతున్ని దేవదూతలు అనబడు భూతములు, గ్రహములు గుర్తించి నమస్కరించుచున్నారు. దేవుడు తనను తాను మనిషిగా నమ్మించు అవతారము భగవంతుడు. భగవంతుడు ఒక్కచోట భూమిమీద యున్నా, దేవుడు ప్రపంచమంతా వ్యాపించియుండును. దేవుడు ప్రపంచమంతా వ్యాపించియున్నా, భగవంతుడు మనిషివలె ఒక్కచోట యున్నా, దేవునికున్న శక్తి యుండుట చేత భగవంతుడు దేవునితో సమానము అయినందున మరియు దేవుడు భగవంతుడు ఒకటే అయినందున, దేవున్ని సూక్ష్మముగా ఆరాధించినా, భగవంతున్ని స్థూలముగా ఆరాధించవచ్చును. దేవుడు భగవంతుడు ఒకటేయని తెలియకపోతే వాడు సంపూర్ణ జ్ఞాని కాలేడు. మనిషికి పుట్టుక గలదు, అట్లే చావు కలదు. అయితే భగవంతునికి పుట్టుక లేదు, చావులేదు. భగవంతునికి మనిషికున్నట్లే మరణమున్నా మరణములో భగవంతుడు చావడు, మరుజన్మకు పోడు. భగవంతుడు మనిషివలె పుట్టినా పుట్టుకలో భగవంతుడు జన్మకు రాలేదు. ఆయన పుట్టువాడు కాడు. అందరివలె పుట్టినట్లు, అందరివలె మరణించినట్లు కనిపించినా భగవంతునికి చావు పుట్టుకలు లేవు. ఆయన దేవుడే అయిన దానివలన ఆయనకు జనన మరణములుండవు. దేవుడు ప్రపంచమంతా వ్యాపించి యున్నా మనిషివలె కనిపిస్తూ మనుషుల మధ్యలోనికి వచ్చి తన జ్ఞానమును చెప్పి పోవును. దేవుడు మనిషివలె అవతరించడమునే భగవంతుడు అని అంటారు.

దేవుడు మనిషివలె అవతరిస్తాడని భగవద్గీత (తౌరాత్), బైబిలు (ఇంజీలు), ఖుర్ఆన్ మూడు దైవ గ్రంథములలో చెప్పియున్నారు. అయితే అలా పుట్టినవాడు భగవంతుడుగా యుంటాడు అని ఎక్కడా చెప్పలేదు. భగవంతుడు అను పేరును దేవుడు తన దైవగ్రంథములలో ఎక్కడా ప్రకటించ లేదు. అలా ప్రకటించకున్నా దైవజ్ఞానమును సంపూర్ణముగా అర్థము చేసుకొన్నవారు, మూడు దైవ గ్రంథములలో 'మనిషిగా వస్తాను' అని చెప్పిన వాక్యములను ఆధారము చేసుకొని తమకు తెలిసిన జ్ఞానముతో దేవుని జన్మను భగవంతునిగా చెప్పారు. అలా చెప్పుటకు ఒక కారణము గలదు. భగము (తల్లిగర్భము) నుండి సజీవముగా పుట్టువాడు అయినందున భగవంతుడు అను పేరును పెట్టడమైనది. బలవంతుడు అనగా బలము కలవాడు అనినట్లు భగవంతుడు యనగా! భగము కలవాడు యని చెప్పకూడదు. భగము నుండి వచ్చినవాడు అని అర్థము. దేవుడు సృష్ఠిర్త అయినందున ఆయన సృష్ఠించేవాడు. ఎవరిని సృష్ఠించినా గర్భము నుండే పంపాలి. అందువలన ఆయన కేరాఫ్ అడ్రస్ గర్భము. గర్భము నుండే దేవుడు మనిషిగా వచ్చాడు కావున ఆయనను 'భగవంతుడు' అని అనవచ్చును. దేవుని పూర్తి అడ్రస్ ఎవరికీ తెలియదు. అయితే ఆయన పెద్ద అడ్రస్ కాకుండా చిన్న అడ్రస్ అనగా చిరునామా మాత్రము అందరి సృష్ఠి జరుగు గర్భము అని చెప్పవచ్చును. అందువలన దేవుడు మనిషి రూపములో భగము నుండి వచ్చాడు కనుక అలా వచ్చిన దేవుని చిరునామా తెలియునట్లు 'భగవంతుడు' అని అన్నారు.

'దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మానవునికీ తెలియదని' అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో సూరా 3, ఆయత్ 7 లో దేవుడే చెప్పియున్నాడు. ఆ మాట ప్రకారము భూమిమీద ఏ మనిషికీ దేవుని జ్ఞానము తెలియదు. అందువలన దేవుడే తన జ్ఞానమును మనుషులకు చెప్పవలసియున్నది. మొదట జ్ఞానమును చెప్పు వానిని గురువుయని అంటారు. 'గురువు' యను పేరు ఏ మానవునికీ వర్తించదు. ఎందుకనగా! మొదట జ్ఞానమును ఎవరూ చెప్పలేదు. దేవుడు భగవంతునిగా వచ్చి జ్ఞానమును చెప్పిపోయిన తర్వాత ఉన్న జ్ఞానమును చెప్పువాడు బోధకుడు యగును గానీ గురువు కాడు. దీనినిబట్టి గురువు వేరు, బోధకుడు వేరని చెప్పవచ్చును. భూమిమీద ఏ మనిషి స్వయముగా దేవుని జ్ఞానమును తెలియలేడు. అందువలన స్వయముగా ఎవరికీ తెలియని దేవుని జ్ఞానమును చెప్పలేడు. అందువలన మనుషులలో గురువు ఉండడు. దేవుడు భూమిమీద మనిషిగా అవతరించి భగవంతుని రూపములో దేవుని జ్ఞానమును మనుషులకు తెలియజేయును. కనుక భగవంతుడే భూమిమీద గురువుగా యుండును. దేవుని రహస్యములు, దేవుని ధర్మములు, దేవుని మర్మములు దేవుడే మనిషిగా వచ్చి చెప్పగలడు. అతడే భగవంతుడు. భూమిమీదికి భగవంతుడు రానంతవరకు దేవుని ధర్మములు తెలియవు.

'దేవుడు ఏ మానవుని మీద తన జ్ఞానమును అవతరింపజేయలేదు' అని దేవుడే చెప్పినప్పుడు తన జ్ఞానమును తానే మొదట స్వయముగా చెప్పుతానని అర్థము కదా! అటువంటప్పుడు మహా ప్రవక్తల రూపములో చెప్పిన జ్ఞానము ఎవరు చెప్పినట్లు? అని ప్రశ్నించుకొని చూచినట్లయితే దానికి జవాబు 'దేవుడే ప్రత్యేకమైన మనిషిగా వచ్చి తన జ్ఞానమును తానే చెప్పాడు' అని చెప్పవచ్చును. అలా చెప్పిన ఆయనను సాధారణ మనిషిగా లెక్కవేయక అసాధారణ మనిషిగా చూడవలసి ఉండును. మనిషి కాని మనిషిని దేవుని అవతారము అని చెప్పవచ్చును. అట్లు మారువేషములో అసాధారణ మనిషిగా వచ్చినవాడే 'భగవంతుడు' అనబడు దేవుడు. దేవుడు శరీరధారి కాడు, కావున ఆయన ఎవరితోనూ మాట్లాడలేడు. అయితే ఎప్పుడో ఒకప్పుడు అరుదుగా దేవుడు భగవంతునిగా వస్తే అప్పుడు శరీరముండుట వలన మనుషులతో నేరుగా మాట్లాడవచ్చునని చెప్పవచ్చును.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
40. అల్లాహ్ మూసాతో నేరుగా మాట్లాడాడు. (4-164)
'అల్లాహ్ మాట్లాడడు' అని చెప్పినది దైవ గ్రంథమే. అట్లే 'అల్లాహ్ మాట్లాడును' అని చెప్పినది దైవ గ్రంథమే. అదెలా సాధ్యము దేవుడు రెండు విధముల మాట్లాడునా? యని ప్రశ్న రాక తప్పదు. అయితే ఇక్కడ కొంత అర్థము చేసుకోవలసిన అవసరమున్నది. బుద్ధికి పదును పెట్టవలసి యున్నది. బాగా యోచిస్తే దేవుడు సూక్ష్మమైనవాడు. కనిపించువాడు కాడు. శరీర ఐదు ఇంద్రియములకు తెలియనివాడు. ఆకారము లేని దేవుడు ఎలా మాట్లాడగలడు? దేవుడు యనగా దేవులాడబడేవాడు (వెదకబడే వాడు) అని అర్థము కలదు. ఇది అంతయూ సృష్ఠికర్తయైన దేవుడు యొక్క స్థితియని చెప్పవచ్చును. 'దేవుడు దేవుడుగా యున్నప్పుడు ఏ మానవునితోనూ మాట్లాడడు' అను మాట వాస్తవమే. ఇక్కడ ఒక ఉదాహరణను చెప్పుకొని చూస్తాము. మనిషికి నిద్ర, మెలుకువ యను రెండు స్థితులు గలవు. మనిషి నిద్రలో ఎవరితోనూ మాట్లాడడు యను మాట పూర్తి సత్యము. మనిషి ఒక స్థితిలో ఉన్నప్పుడు మాట్లాడడు అనుమాట సత్యమే అయినా, రెండవ స్థితియైన మెలుకువలో యున్నప్పుడు మాట్లాడుచున్నాడు. దీనినిబట్టి మనిషి నిద్రలో యున్నప్పుడు నేరుగా ఎవరితోనూ మాట్లాడడు అనుట ఎంత సత్యమో అట్లే మనిషి మెలుకువలో యున్నప్పుడు మాట్లాడును అనుట అంతే సత్యమగును.

ఒకచోట ఒక స్థితిలో మనిషి మాట్లాడడు అని చెప్పిన మాట అదే మనిషే మాట్లాడును అనుమాటకు పరస్పర విరుద్ధముగా యున్నా రెండూ సత్యమనియే చెప్పవచ్చును. నిద్రలో ఉన్న మనిషి మాట్లాడడు అని చెప్పి అదే నిద్రలోనే మనిషి మాట్లాడును అంటే అది అసత్యమగును గానీ, మనిషి నిద్రస్థితిలో మాట్లాడడు యని చెప్పి అదే మనిషి మెలుకువ స్థితిలో మాట్లాడును అని చెప్పుటలో తప్పు లేదు. మనిషికి గల రెండు స్థితులలో రెండు రకములుగా యుండునని తెలిసినట్లు, దేవుడు తనకు గల ఒక స్థితి అయిన సూక్ష్మముగా (దేవునిగా) యున్నప్పుడు మాట్లాడడనీ, తన రెండవ స్థితియైన స్థూలముగా (భగవంతునిగా) యున్నప్పుడు మాట్లాడునని చెప్ప వచ్చును. దీనినిబట్టి దేవుడు సూక్ష్మముగా యున్నప్పుడు మాట్లాడడు, ఊరక యుండుననీ, స్థూలముగా యున్నప్పుడు మౌనముగా ఊరకయుండడని చెప్పవచ్చును.

నేడు మనుషులు మూడు మతములుగా విభజింపబడియుండి, ఎవరి జ్ఞానము వారిదే అన్నట్లు ఉండుట వలన వారి చూపంతయూ మతముల చుట్టూనే యున్నదిగానీ, దేవుని జ్ఞానము తెలియు దారిలో లేదు. అందువలన మనుషులు అసంపూర్ణ జ్ఞానులుగా ఉండుట వలన దేవుని సూక్ష్మ, స్థూల యను రెండు విధానములు తెలియకుండా పోయాయి. ముస్లీమ్‍లు దేవుడు సూక్ష్మముగా కనిపించనివాడు అని నమ్మారు. అదే హిందువులు దేవుడు స్థూలముగా కనిపించువాడు యని దేవున్ని అనేక రూపములలో చూపారు. ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీతలోనూ అట్లే మిగతా రెండు దైవ గ్రంథములలోనూ దేవుని స్థూల, సూక్ష్మ రెండు విధానములను తెల్పియున్నారు. అది గ్రహించనివారు ఏదో ఒక విధానమునే తెలిసినవారై దేవుడు మాట్లాడడు, దేవునికి రూపము లేదు యని అంటున్నారు. అట్లే మరొక విధానమును తెలిసినవారు దేవుడు మాట్లాడుననీ, దేవునికి ఆకారము కలదని చెప్పుచున్నారు. రెండు విధానములు దేవునికి ఉన్నాయని తెలియనివారు మా జ్ఞానము గొప్పయని ఒక మతము వారు అనగా, మా జ్ఞానమే గొప్పయని ఇంకొక మతము వారు అంటున్నారు.

మూడు మతములలో దేవుని రెండు విధానములను తెలిసినవారు లేకపోవడము వలన, ఇక్కడ ఖుర్ఆన్ గ్రంథములో సూరా నాలుగు ఆయత్ 164 లో చెప్పిన వాక్యమునకు 42-51లో చెప్పిన వాక్యము వ్యతిరేఖముగా యున్నది చూడండి. (42-51) ''అల్లాహ్ ఏ మానవునితోనూ నేరుగా మాట్లాడడు!'' అని కలదు. (4-164) ''అల్లాహ్ మూసా ప్రవక్తతో నేరుగా మాట్లాడాడు'' అని కలదు. ఈ రెండు వాక్యములను దగ్గర చేర్చి చూస్తే ఒకదానికొకటి పూర్తి విరుద్ధముగా కనిపించుచున్నవి. వివరము తెలియని వారికి వ్యతిరేఖముగా కనిపించినా మాకు దేవుని సూక్ష్మ, స్థూల రెండు విధానములు తెలిసినదానివలన మాకు రెండు వాక్యములు ఏమాత్రము వ్యతిరేఖముగా కనిపించడము లేదు. దేవుడు స్థూల విధానములో మాట్లాడునని దానివలన దైవ గ్రంథమయిన ఖుర్ఆన్‍లో 4-164లో 'మూసాతో దేవుడు మాట్లాడాడు' అని చెప్పారు. దేవుని సూక్ష్మ విధానము వలన 'దేవుడు మాట్లాడడు' యని అదే ఖుర్ఆన్ గ్రంథములో 42-51లో వ్రాసియున్నారు. రెండూ ఉన్న విధానములే కావున ఒకే గ్రంథములో రెండు వాక్యములను చెప్పారు.

ప్రథమ దైవ గ్రంథము అయిన భగవద్గీతలో ''దేవుడు పుట్టడు'' అని ఒకచోట చెప్పియున్నారు. తర్వాత మరొకచోట ''దేవుడు శరీరము ధరించి పుట్టి మనుషులచేత అవమానమును పొందుచున్నాడని'' చెప్పారు. భగవద్గీతలో పుట్టడనీ, తర్వాత పుట్టునని పరస్పర విరుద్ధముగా చెప్పి యున్నారు. ఈ విషయము అక్కడ కూడా చాలామందికి అర్థము కాలేదు. దేవుడు ఒక్కడే అయినా ఆయన రెండు విధములా ఉన్నాడని తెలియని వారికి దైవ గ్రంథములోని జ్ఞానము ఏమాత్రమూ తెలియడము లేదని చెప్పవచ్చును. మూడు మతములలో గల మనుషులు దేవున్ని ఒకే కోణములో చూచుట వలన గ్రంథములో రెండు కోణములుగా యున్న ఏ విషయమూ అర్థము కాకుండా పోయినది. ప్రతి దైవ గ్రంథములో స్థూల విషయములు 40 శాతము, సూక్ష్మ విషయములు 60 శాతము ఉన్నాయని ఏ మతము వారు గ్రహించలేకపోయారు.

స్థూల సూక్ష్మ విషయములను తెలియనిదానివలన దేవుడు రెండు కోణములలో చెప్పిన జ్ఞానము ఎవరికీ తెలియకుండా పోయినది. ఇంజీలు (బైబిలు) గ్రంథములో ఒక సందర్భమున ఏసు తన శిష్యులతో కలిసి భోజనము చేయుచూ ఒక రొట్టెను విరిచి తన శిష్యులకు ఇచ్చి 'ఇది నా శరీరము' యని చెప్పెను. అట్లే ఒక గిన్నెతో ద్రాక్షరసము ఇచ్చి 'ఇది నా నుండి చిందింపబడుచున్న నిబంధన రక్తము. దీనిని మీరు త్రాగుడు' అని చెప్పడమైనది. ఈ వాక్యములు రెండు సూక్ష్మ జ్ఞానముతో కూడుకొన్నవై యున్నవి. రొట్టెను శరీరముగా, ద్రాక్షరసమును రక్తముగా చెప్పడమైనది. ఇక్కడ బాగా గమనించితే శరీరము స్థూలముగా కనిపించుచుండును. రక్తము సూక్ష్మముగా కనిపించక శరీరములోపల యుండును. శరీరములోనికి పోతే రక్తము ఉన్నట్లు తెలియును. అలాగే స్థూలము కనిపించునదైనా సూక్ష్మము ఉన్నా కనిపించక లోపలయుండును. శరీరము 10 భాగములు అనగా 40 శాతము స్థూలముగా యున్నది. శరీరములోని భాగములు 15 సూక్ష్మముగా యున్నవి. అనగా 60 శాతము కలవు. శరీరములోని 15 భాగములలో రక్తము సూక్ష్మముగా ఇమిడి యున్నది.

కనిపించు శరీరమును అనగా ఇచ్చిన రొట్టెను స్థూలమైన గ్రంథముగా చెప్పుకొంటే శరీరములో సూక్ష్మముగా ఇమిడియున్న రక్తమును గ్రంథములో జ్ఞానముగా చెప్పవచ్చును. ఏసు తన శరీరమును బైబిలు గ్రంథముగా, రక్తమును గ్రంథములో సూక్ష్మముగా ఇమిడియున్న జ్ఞానముగా పోల్చి చెప్పాడు. ఈ విషయమును తిరిగి ఏసే చెప్పువరకు తెలియని పరిస్థితి క్రైస్థవులలో ఉన్నదని చెప్పవచ్చును. అయితే ఇక్కడ ద్రాక్ష రసమును రక్తముగా (జ్ఞానముగా) చెప్పిన ఏసు అదే బైబిలు గ్రంథములో జ్ఞానమును 'జీవ జలము' అని అన్నాడు. ఒకచోట దైవజ్ఞానమును నిబంధన రక్తమని చెప్పి మరొక చోట అదే జ్ఞానమునే 'జీవజలము' అన్నప్పుడు, ఒకే జ్ఞానమును రక్తముగా ఒకచోట, జలముగా మరొకచోట రెండు విధములా చెప్పినట్లు కలదు. ఈ విధముగా మూడు దైవ గ్రంథములలోను జ్ఞానము రెండు కోణములలో రెండు రకములుగా చెప్పడమైనది. ఒకే దేవుడు ఒకే జ్ఞానమును రెండుగా చెప్పినా, దానిని ఒక్కటిగానే గ్రహించు స్థోమత మనిషిలో ఉన్నప్పుడే మనిషికి సంపూర్ణమైన జ్ఞానము అర్థమగును. అంతిమ దైవ గ్రంథములో ఒక దేవుడు ఒకే జ్ఞానము రెండు కోణములు అని అర్థము చేసుకొన్నప్పుడే ఒక కోణములో దేవుడు మాట్లాడడనీ, మరొక కోణములో దేవుడు మాట్లాడును అని తెలియును. అప్పుడే 4-164వ ఆయత్ సంపూర్ణముగా అర్థము కాగలదు. గ్రంథములోని రెండు కోణములు తెలియకపోతే దేవుడే అబద్దము చెప్పినట్లుండును.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
41. ఒంటరిగా వస్తారు. (6-94)
ఎక్కడికయినా సరే ఎంతమందితోనయినా పోవచ్చును. అయితే చావు పుట్టుకలలో ఒక్కరే ఉంటారు. దీనికి సంబంధించిన వాక్యము ఇలా కలదు చూడండి.

(6-94) ''మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించినట్లుగానే మీరు మా సన్నిధికి ఒంటరిగా వచ్చారు. మేము మీకు ప్రసాదించిన దాన్నంతా మీ వెనుకే వదలేసి వచ్చారు. మీ వ్యవహారాలలో మాకు భాగస్వాములని మీరు భావించిన మీ సిఫారసుదారులను కూడా ఇప్పుడు మేము మీ వెంట చూడడము లేదు. నిజంగానే వారికీ మీకు మధ్యగల సంబంధాలన్నీ తెగిపోయాయి. మీరు నమ్ముతూ ఉన్నదంతా మీకు కనిపించకుండా పోయినది.''

ఈ ఆయత్ స్థూలముదే అయినా కొంత తెలియనిదానిని అర్థము చేసుకోవలసియున్నది. దేవుడు మనిషిని మొదటిసారి పుట్టించినట్లు అనగా ఒంటరిగాయని అర్థము. మనిషి ఒంటరిగా పుట్టుచున్నాడు మరియు ఒంటరిగా మరణిస్తున్నాడు. మరణములో వెంటవచ్చువారు ఎవరూ ఉండరు. జీవితములో ఎవరు ఎన్నాళ్ళు తోడున్నా చివరికి మరణములో ఎవరూ తోడు రారు అనునది అందరికీ తెలిసిన సత్యము. మనిషి మరణించిన రోజు బయటి వారిని వదలి పోవడమే కాకుండా, పుట్టుక నుండి జీవునికి నివాసముగా యున్న శరీరము కూడా చనిపోయిన స్థలము లోనే నిలిచిపోవును. 24 శరీర భాగములను వదలి బయటికి రావడము జరుగుచున్నది. ఎప్పుడు జీవాత్మ బయటికి వచ్చినదో అదే క్షణమే జీవుడు మరొక చోటికి పోవడము జరుగుచున్నది. అలా ఒకమారు శరీరమును వదలి వచ్చినప్పుడు దేవుడు ఆ జీవితములో ప్రసాదించిన ధన, కనక, వస్తు, వాహనములను శరీరముతో పాటు వదలి రావడము జరుగుచున్నది.

మనిషి జీవితములో దేవునితో సమముగా ఇతర దేవతలను ఆరాధించినప్పటికీ, వారు మీకు జీవితములో సహాయపడినారనుకొనినా చనిపోయిన తర్వాత మనిషి వెంటవారున్నట్లు రావడము లేదు. ఇతర దేవతల మీద ఎంత భక్తి భావములున్నా అదంతా మరణముతో పూర్తిగా తెగిపోయినది. మీరు మీ జీవితములో నమ్మినదంతా మరణముతో కనిపించకుండా పోవుచున్నది. మనిషి జీవితములో గల అధికారముగానీ, జన బలముగానీ, ధన బలముగానీ, స్థిరాస్థులయిన భూములుగానీ తనవెంట రాకపోవడమే కాక దేవునితో సమానముగా లెక్కించి ఎంతో కాలమునుండి మ్రొక్కుచున్న దేవతల ఆచూకీ కూడా మరణములో లేకుండా పోవుచున్నది. అన్నీ వదలిన మనిషి (జీవుడు) ఒక్కడు ఒంటరిగా మరణములో పోవుచున్నాడు.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
42. ఆయనే నీకు ఆరాధ్య దైవము మరియు ఆయనే నీకు కార్యకర్త. (6-102)
విశ్వములో సృష్ఠి అనగా తయారు చేయబడినది అని అర్థము. సృష్ఠికర్త అనగా ఉన్నదానిని తయారు చేసినవాడు అని అర్థము. సృష్ఠి రెండు రకములు గలదు. ఒకటి బయట కనిపించు ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను పంచభూతములు, రెండవది పంచభూతముల మిశ్రమము చేత తయారయిన శరీరము. బయట దానిని అచర ప్రకృతి యనీ, శరీర రూపములోయున్న దానిని చర ప్రకృతియని అనుచున్నారు. బయటిది మార్పు చెందని ప్రకృతి, శరీరములోపలిది మార్పు చెందే ప్రకృతియని చెప్పవచ్చును. రెండు విధముల ప్రకృతులను దేవుడే (అల్లాహ్‍యే) సృష్ఠించాడు. దీనినిబట్టి అల్లాహ్ సృష్ఠించిన సృష్ఠి రెండు రకములు. బయటి సృష్ఠిని, లోపలి సృష్ఠిని అల్లాహ్‍యే సృష్ఠించాడు. కావున అల్లాహ్‍ను సృష్ఠికర్తయని అంటున్నాము. దేవున్ని సృష్ఠికర్తయని అనడమే రెండు రకముల సృష్ఠిని బట్టి అల్లాహ్ రెండు విధములుగా యున్నాడు. బయటి సృష్ఠిని సృష్ఠించిన వాడు అల్లాహ్‍యే. అట్లే లోపలి సృష్ఠిని సృష్ఠించినవాడు అల్లాహ్‍యే. అల్లాహ్ అనే పేరు ఒక్కటేయున్నా మొట్టమొదట భూమిని ఆకాశమును సృష్ఠించిన సృష్ఠికర్త ఒకరుకాగా, తర్వాత శరీర ప్రకృతిని సృష్ఠించిన అల్లాహ్ మరొకరు. అయితే ఇద్దరినీ అల్లాహ్ అని పిలుచుట చేత మనుషులందరూ అల్లాహ్ ఒక్కడేయని అనుకొంటున్నారు. అయితే మొదటి సృష్ఠికర్త ఒకరు, తర్వాత శరీరములను సృష్ఠించిన సృష్ఠికర్త మరొకరు అని ఎవరికీ తెలియకుండా పోయినది.

నేడు ముస్లీమ్‍లందరూ అల్లాహ్ ఒక్కడేయనీ, ఒక్క అల్లాహ్‍యే ఆరాధ్య దైవమనీ ఆరాధ్యులు ఇద్దరు లేరని అంటున్నారు. ఆ మాట నూటికి నూరుపాళ్లు వాస్తవమే. విశ్వములో ఆరాధ్య దైవము ఒక్క అల్లాహ్‍యేనని నేను కూడా చెప్పుచున్నాను. అయితే ఇద్దరిలో ఏ అల్లాహ్ ఆరాధ్య దైవముగా యున్నాడను విషయము ఏ మనిషికీ తెలియకుండా పోయినది. శరీరములను సృష్ఠించిన అనగా మనుషులను సృష్ఠించిన రెండవ అల్లాహ్ ఒక్కడే అందరికీ ఆరాధ్య దైవము అని తెలియకపోవడము విచిత్రము. విశ్వములో ఒకే అల్లాహ్ ఉన్నాడనీ, ఆయన ఒక్కడే ఆరాధ్య దైవము అని అంటున్నారు. అయితే ఆరాధ్య దైవము ఒక్కడేయనుట వాస్తవమే గానీ, అల్లాహ్ ఒక్కడు అనుట సత్యము కాదు. ప్రప్రథమముగా బయట భూమిని, ఆకాశమును సమస్త వస్తువులను సృష్ఠించిన సృష్ఠికర్త అయిన అల్లాహ్ మొదటివాడు కాగా, శరీరము లోపలి సూక్ష్మ ప్రకృతిని అయిన భూమి, ఆకాశములను వాటి మధ్య సమస్తమునూ సృష్ఠించిన అల్లాహ్ రెండవవాడు. బయట ప్రకృతిని కాకుండా లోపలి ప్రకృతిని సృష్ఠించిన అల్లాహ్‍యే సమస్త మానవులకు ఆరాధ్య దైవముగా యున్నాడు. అయితే ఇద్దరు అల్లాహ్‍లు అనడము చాలామందికి అర్థముకాని విషయము, నమ్మలేనిదిగా యున్నా నేను చెప్పు మాట సత్యము అనుటకు అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములోనే ఆధారములు కలవు. మొదటి సృష్ఠికర్తయిన మొదటి అల్లాహ్‍ను గురించిన వాక్యమును సూరా రెండు, ఆయత్ 117 లో చూడవచ్చును.

(2-117) ''భూమి ఆకాశమును ప్రప్రథమముగా సృష్ఠించినవాడు ఆయనే (అల్లాహ్‍యే). ఆయన ఏ పనైనా చేయ సంకల్పించు కొన్నప్పుడు దాన్ని 'అయిపో' అంటే చాలు అది అయిపోతుంది.''

ఈ వాక్యమును చాలామంది చూచినా ప్రప్రథమముగా అను విశేష పదమును ఎవరూ గుర్తించియుండరు. అంతేకాక ఆయన పని చేయడు అనీ, సంకల్పించుకొన్నప్పుడు దానంతట అది అయి పోతుందనీ చెప్పడము మొదటి అల్లాహ్ యొక్క ప్రత్యేకత. మొట్టమొదట సృష్ఠిని తయారు చేసినది కూడా మొదటి అల్లాహ్ ప్రత్యేకత యని అందరూ తెలియవలసి యున్నది. అయితే మొదటి అల్లాహ్ తన వెనుక యున్న రెండవ అల్లాహ్‍ను ఆరాధ్య దైవము అని స్వయముగా సూరా మూడు ఆయత్ 18 లో చెప్పడమైనది చూడండి.

(3-18) ''అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవము లేడని స్వయముగా అల్లాహ్, ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులు సాక్ష్యమిచ్చుచున్నారు. ఆయన సమత్వము సమతూకముతో ఈ విశ్వమును నిలిపియుంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశాలి అయిన ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కాదు.''

ఇక్కడ బాగా బుద్ధిని ఉపయోగించి చూస్తే రెండవ అల్లాహ్‍ను నిజమైన ఆరాధ్య దైవమని మొదటి అల్లాహ్ చెప్పినట్లు కలదు. దేవదూతలు మొదటి అల్లాహ్‍కు మాత్రమే గలరు. మొదటి అల్లాహ్ మరియు ఆయన దూతలు, జ్ఞానులు అయినవారు రెండవ అల్లాహ్‍ను గొప్పగా ఆరాధ్య దైవముగా చెప్పారు అని తెలియుచున్నది. స్వయముగా మొదటి అల్లాహ్ అయినవాడు రెండవ అల్లాహ్‍ను ఆరాధ్య దైవముగా వర్ణించి చెప్పడము వాక్యములో బాగా కనిపించుచున్నా ఇద్దరూ ఒకే పేరుతో యున్నారనీ, వారు ఇద్దరూ అల్లాహ్‍లేయని చాలామందికి తెలియదు. ఈ విధముగా యున్న ఇద్దరిలో మొదటి వాడు బయటి ప్రపంచమును సృష్ఠించిన సృష్ఠికర్త కాగా, రెండవ అల్లాహ్ శరీరములుగా గల ప్రకృతిని సృష్ఠించిన సృష్ఠికర్తగా యున్నాడు. తండ్రిని మరియు తండ్రికి తండ్రిని అబ్బ అని ఒకే పేరుతో పిలిచినట్లు చర, అచర అను రెండు ప్రకృతులను సృష్ఠించిన ఇద్దరు సృష్ఠికర్తలను ఒకే పేరుతో పిలుస్తున్నట్లు ఖుర్ఆన్ గ్రంథములో కలదని మనుషులకు తెలియనిదానివలన బైబిలులో తండ్రి, పరిశుద్ధాత్మ యొక్క వివరమును, భగవద్గీతలో ఆత్మ, పరమాత్మ వివరమును తెలియలేక పోయారు. భగవద్గీతలో పదిహేనవ (15) అధ్యాయము వరకు ఆత్మ, పరమాత్మలను 'ఆత్మ'యను ఒకే పేరుతో చెప్పారు. అట్లే బైబిలు గ్రంథములో తండ్రి, పరిశుద్ధాత్మను అనేకచోట్ల 'తండ్రి'యను పేరుతో చెప్పడమైనది. మనుషులకు ఆత్మ తండ్రికాగా, ఆత్మకు పరిశుద్ధాత్మ తండ్రిగా యున్నట్లు చెప్పడమైనది. అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్‍లో ఇద్దరినీ 'అల్లాహ్' యని చెప్పినప్పటికీ మొదటి సృష్ఠికర్తయనీ, తర్వాత సృష్ఠికర్తయనీ రెండు విధములుగా చెప్పియున్నారు. అంతేకాక పని చేయు అల్లాహ్, పని చేయని అల్లాహ్ అని కూడా విడివిడిగా చెప్పియున్నారు. అయినా మొదటి అల్లాహ్‍ను ఎవరూ గుర్తించకపోవడము దురదృష్టకరము. ముస్లీమ్‍లు అల్లాహ్ ఒక్కడే ఇద్దరు లేరు అని అంటున్నారు. అయితే ఆరాధింపదగిన అల్లాహ్ ఒక్కడేయనీ, ఆయనకంటే పెద్ద అల్లాహ్ మరొకరు ఉన్నారని, ఆయనే పని చేయని అల్లాహ్యని తెలియలేకపోయారు. పనిని చేయు అల్లాహ్‍ను ఒక్కనినే గుర్తించి ఆయన ఒక్కడే అల్లాహ్ యని చెప్పడము కొంత అజ్ఞానమే యగును. స్వయముగా మొదటి అల్లాహ్ 'రెండవ అల్లాహ్ ఒక్కడే మీకు ఆరాధ్య దైవము' అని చెప్పిన వాక్యము (3-18) లో యున్నా, పెద్ద అల్లాహ్ 'ఏ అక్కరా లేనివాడు' అని (112-2) లో యున్నా, మొదటి అల్లాహ్ 'ఏ కార్యము చేయనివాడుయని మరియు మొదటి సృష్ఠికర్తయని' (2-117) లో యున్నా తండ్రియైన అల్లాహ్‍ను గుర్తించక కుమారుడైన అల్లాహ్‍ను ఒక్కనినే గుర్తించి అల్లాహ్ ఒక్కడేయని చెప్పడము పూర్తి పొరపాటు. ఆరాధింపతగిన అల్లాహ్ ఒక్కడేయని చెప్పండి అది వాస్తవము. అంతేగానీ అల్లాహ్ ఒక్కడేయని ఇద్దరు లేరు అని చెప్పడము తప్పుయని చెప్పుచున్నాము. ఆరాధ్య దైవము ఒక్కడేయని ఇద్దరు కాదని (16-51)లో కూడా కలదు చూడండి. (16-51) ''అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. ఇద్దరు ఆరాధ్య దైవములను కల్పించుకోకండి. ఆరాధ్య దైవము మటుకు ఆయన ఒక్కడే. కావున మీరంతా కేవలము నాకే భయపడండి.''

ఈ ఆయత్‍లో మొదటి అల్లాహ్ చెప్పినట్లు స్పష్టముగా తెలియు చున్నది. ఆరాధ్య దైవము ఇద్దరు కాదు, ఆయన ఒక్కడేయని మొదటి అల్లాహ్ రెండవ అల్లాహ్‍ను చూపించాడు. ఇద్దరు అల్లాహ్‍లు ఉండడము వలన ఆరాధనకు ఇద్దరు పనికిరారు రెండవ అల్లాహ్ ఒక్కడే పనికి వస్తాడనీ 'ఆయనకు మ్రొక్కండి, నాకు భయపడండి'యని కూడా ఇద్దరి ఉనికిని చాటుకుంటూ చెప్పాడు. 'ఇద్దరు' అను మాటను గ్రహించాలి. ఇట్లు అనేకచోట్ల ఖుర్ఆన్ గ్రంథములో యున్నా పనిలేని మొదటి అల్లాహ్‍ను గ్రహించ లేకపోయారు. ఇంతేకాక మొదటి అల్లాహ్ రెండవ అల్లాహ్‍ను గురించి చెప్పిన ముఖ్యమైన విషయము సూరా ఆరు, ఆయత్ 102 లో యున్నది చూడండి.

(6-102) ''ఆయనే మీ అల్లాహ్, మీ ప్రభువు. ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధ్యులు కారు. సమస్త వస్తువులను సృష్ఠించిన వాడు ఆయనే. కాబట్టి మీరు ఆయననే ఆరాధించండి. అన్ని విధములా కార్యసాధకుడు ఆయనే.''

(16-51) లో అల్లాహ్‍యే స్వయముగా మీ ఆరాధ్య దైవము ఆయన ఒక్కడే అని చెప్పినట్లు, (6-102) లో కూడా ఆయనే మీ అల్లాహ్, మీ ప్రభువు, మీ ఆరాధ్య దైవము అని మొదటి అల్లాహ్‍యే స్వయముగా చెప్పాడు. అందువలన అందరికీ ఆరాధ్య దైవము రెండవ అల్లాహ్ ఒక్కడేయని తెలియవలెను. అల్లాహ్‍లు ఇద్దరు అనునది సత్యమే అయినా అందులో ఒక్కడే అందరి ఆరాధ్య దైవమని తెలియవలెను. మొదటి అల్లాహ్ మీద భయము, రెండవ అల్లాహ్ మీద భక్తి కల్గియుండాలి. ఇద్దరు అల్లాహ్‍లు అని తెలియడము జ్ఞానము. ఒక్కనినే ఆరాధించడము ధర్మము. ఎవడయితే సమస్త మానవులకు ఆరాధ్య దైవముగా యున్నాడో అతడే అందరికీ కార్యకర్తగా యున్నాడు. అలాగే ఎవడయితే సమస్త మానవులకు సాక్షిగా మొదటి అల్లాహ్గా యున్నాడో అతడే ఏ కార్యమును చేయనివాడుగా యున్నాడు. ఒకే పేరు మీద ఇద్దరు యున్నా అందులో ఒకరు కార్యకర్తగా, ఆరాధ్య దైవముగా ఉండగా, మరొకరు ఆరాధనకు అతీతముగా యుంటూ, కార్యములకు కూడా అతీతముగా ఉన్నాడు. అందువలన (6-102) ఆయత్‍లో పనిచేసే అల్లాహ్‍ను గురించి చెప్పుచూ ఆయనే మీ ఆరాధ్య దైవమని కూడా చెప్పారు. (2-117) లో ఆరాధనకు సంబంధము లేని అల్లాహ్‍ను గురించి చెప్పుచూ ఆయన మొదటి సృష్ఠికర్త యనీ, ఆయన పని చేయడనీ చెప్పడము జరిగినది. అల్లాహ్ అను ఒకే పేరు ఇద్దరికీ యున్నా అందులో ఒకడు ఆరాధ్య దైవము మరొకరు ఏ ఆరాధన అక్కర లేనివాడు. ఒకడు కార్యకర్త, మరొకడు సృష్ఠికర్త ఆయనే కార్యమునకు అతీతుడు. ఈ విధముగా ఇద్దరి అల్లాహ్‍ల మధ్య ఎన్నో తేడాలున్నాయని గ్రహించినవాడే నిజమైన జ్ఞాని యగును.



అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
43. ఎవరూ ఆయనను చూడలేదు. ఆయన అందరినీ చూడగలడు. (6-103)
ఇక్కడ ముహ్కామాత్ (స్థూలము), ముతషాబిహాత్ (సూక్ష్మము) లను గురించి చెప్పడమైనది. మనుషులు స్థూలమైనవారు అలాగే మనుషుల దృష్ఠి స్థూలమైనదే. దేవుడు సూక్ష్మమైనవాడు అట్లే దేవుని చూపు సూక్ష్మమైనదే. స్థూలదృష్ఠి స్థూలమునే చూడగలదు. సూక్ష్మమును చూడలేదు. అందువలన స్థూలదృష్ఠిగల మనిషి సూక్ష్మమైన దేవున్ని చూడలేడు. సూక్ష్మమైన దృష్ఠి స్థూలమును చూడగలదు. అందువలన సూక్ష్మదృష్ఠిగల దేవుడు స్థూలముగా యున్న మనుషులనందరినీ చూడగలడు. అందువలన సూరా ఆరు, ఆయత్ 103 లో ఈ విధముగా చెప్పారు చూడండి.

(6-103) ''ఎవరి చూపులు కూడా ఆయన్ని (దేవున్ని) అందుకో జాలవు. ఆయన మాత్రము అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మదృష్ఠి కలవాడు. సర్వమూ తెలిసినవాడు.''

ఈ వాక్యములో ''ఆయన సూక్ష్మ దృష్ఠి కలవాడు'' అని యున్నది. దేవుడు సూక్ష్మమైనవాడు అయినప్పుడు ఆయనకు సూక్ష్మదృష్ఠి ఉండడము సహజమే. సూక్ష్మదృష్ఠికి కన్ను అనునది ఉండదు. కన్ను లేకుండా ఉండు దృష్ఠిని సూక్ష్మదృష్ఠియని చెప్పడము జరుగుచున్నది. దేవునికి మనిషికున్నట్లు అవయవములు ఉండవు. కన్ను అను అవయవము కూడా ఉండదు. దేవుడు ఇంద్రియాతీతుడు, ఇంద్రియములకు అతీతముగా ఉండువాడు దేవుడు. దేవున్ని ఖుర్ఆన్ గ్రంథములో అల్లాహ్యని చెప్పారు. అల్లాహ్ అనగా అంతులేని వాడని అర్థము. అల్లాహ్ (దేవుడు) ఒక మనిషి శరీరము లోపల శరీరమంతా వ్యాపించియుండును. ఒక శరీరము లోపల మాత్రము యుంటే అతనికి అంతు ఉందని చెప్పవచ్చును. అందువలన దేవుడు ఆత్మ స్వరూపుడై జీవుడు ఎక్కడుండునో అక్కడ జీవునికి తోడుగా ఉండును. జీవాత్మ శరీరములో ఒకచోట మాత్రముండగా ఆత్మ అయిన దేవుడు నఖ శిఖ పర్యంతమూ వ్యాపించి యుండును. గోర్లు, వెంట్రుకల చివరి వరకూ వ్యాపించియుండును.

ఒక్క శరీరములో ఒక్క జీవాత్మ మాత్రముండగా, ఆత్మ మాత్రము ఒక్క శరీరములో యున్నదే అన్ని శరీరములలోనూ ఉండును. ఆత్మ ఒక్కటే అన్ని శరీరములలో ఒకే విధానము కల్గియున్నది. జీవున్ని కర్మ ప్రకారము అనుభవించునట్లు శరీరమును కదలించుచూ శరీరములో చైతన్యముగా యున్నది. ఆత్మనే అల్లాహ్గా చెప్పుచున్నాము కావున ఆయన అన్ని శరీరములలో పూర్తి వ్యాపించియుండి అందరినీ ఆడించుచుండుట వలన ఆయన అందరినీ చూచినట్లే. అందరి గుట్టు ఆయనకు తెలిసినట్లే. ఆత్మ అయిన దేవుడు శరీరములోని అన్ని అవయవములయందు వ్యాపించడమే కాక కన్నుయందు కూడా వ్యాపించియుండుట వలన ఆయన అందరి చూపులను అందుకోగలడని వాక్యములో చెప్పారు. ఆత్మశక్తి వలన మనిషి యొక్క ప్రతీ అవయవము పని చేయుచున్నది. అందువలన మనిషి శరీరములోని అంతరంగములో గల ప్రతీ విషయము ఆయనకు తెలుసు. తనకు కళ్లు లేకున్నా అందరి కళ్లతో సర్వమునూ చూడగలడు. అందువలన వాక్యములో ఆయన సర్వమూ తెలిసినవాడుయని అన్నారు. మనిషి శరీరములో బుద్ధి, మనస్సుయందు కూడా యుండి బుద్ధిని ప్రేరేపించు వాడు, మనస్సును ఉత్తేజపరచువాడు అన్నిటికీ తన చైతన్యమును ఇచ్చి పనిని చేయించువాడు అయినందున ఆయనకు తెలియనిది అంటూ ఏదీ లేదు.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
44. మీ వద్దకు సూచనలు వచ్చాయి. వాటిని నమ్మక గ్రుడ్డిగాయుంటే మీకే నష్టము. (6-104)
(6-104) ''వాస్తవానికి ఇప్పుడు మీ ప్రభువు నుండి నిదర్శనాలు వచ్చాయి. కావున వాటిని ఎవడు గ్రహిస్తాడో తన మేలుకే గ్రహిస్తాడు. ఎవడు అంధుడుగా ఉంటాడో అతడే నష్టపోతాడు. నేను మీ రక్షకుడను కాను అని చెప్పు.''

ఈ వాక్యము జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తకు చెప్పినా ఇందులోని సారాంశమును అర్థము చేసుకోవడము చాలా కష్టము. ఈ వాక్యమును ఎవరు చెప్పారు? అన్నది ప్రశ్నకాగా, ఎవరికి చెప్పారు? అన్నది కూడా ప్రశ్నయే. కొందరు ముహమ్మద్ ప్రవక్తగారికి చెప్పినట్లు చెప్పుచున్నారు. దేవుడు నేరుగా మనుషులకు చెప్పాడని కొందరు చెప్పుచున్నారు. ఇందులోని వాస్తవమును గ్రహిస్తే మనందరి రక్షకుడు అల్లాహ్ మాత్రమే యని చెప్పవచ్చును. అల్లాహ్ నుండి కనిపించని దర్శనము అనగా! నిదర్శనములు మీవద్దకు వచ్చాయి అని అన్నారు. ఒక విధముగా దైవ జ్ఞానమును నిదర్శనము యని అంటున్నాము. దేవుడు మనిషి అజ్ఞానము నుండి జ్ఞానములో పడాలని తననుండి కొన్ని సూచనలను తెలియజేశాడు. దేవుని సూచనలు గ్రంథరూపములో వచ్చాయి. గ్రంథరూపములో వచ్చిన జ్ఞానము అను నిదర్శనములు ఎవడు బుద్ధితో దర్శనము చేసుకొనునో వాడు మేలు పొందగలడు. అందుకే వాక్యములో ''ఎవడు నిదర్శనములను గ్రహిస్తాడో తన మేలుకే గ్రహిస్తాడు'' అని చెప్పియున్నారు.

ఈ వాక్యములో 'దేవుని నుండి వచ్చిన నిదర్శనములు' అను మాటకు అర్థము 'దైవము నుండి వచ్చిన జ్ఞానము' అని తెలుసుకొన్నాము. తర్వాత దైవ జ్ఞానమును తెలుసుకోవడము ద్వారా మనిషి పొందు మేలు ఏమిటో, జ్ఞానము తెలియకపోతే పొందే నష్టము ఏమిటో తెలియవలసి యున్నది. అంతేకాక దేవుడు రక్షకుడైయుండి కూడా నేను మీ రక్షకుడను కానుయని ఎందుకు చెప్పాడో తెలియవలసి యున్నది. అయితే కొందరు ముహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి ప్రవక్తగారు ప్రజలకు రక్షకుడను కాను యని చెప్పమన్నట్లు వాక్యము చివరిలో కలదనీ, అది ప్రవక్తకు చెప్పిన మాటయని కొందరు అనవచ్చును. ఇది ప్రవక్తకు చెప్పినట్లు కాక స్వయముగా అల్లాహ్‍యే (దేవుడే) మనుషులకు 'నేను మీ రక్షకుడను కాను' అని చెప్పినట్లున్నదని మేము అనుకొంటున్నాము. దేవుడే ఆ వాక్యమును చెప్పినట్లు అనుకొంటే వాక్యములోని భావము స్పష్టముగా అర్థము కాగలదు. అలా కాకుండా ప్రవక్త గారికి చెప్పమని చెప్పాడు అనుకొంటే వాక్యములోని భావము సంపూర్ణము కాదు. చివరిగాయున్న 'రక్షకుడు' అను పదములో వాక్య సారాంశము అంతయూ ఇమిడి యున్నదని అనుకొంటున్నాను. 'దేవుడు క్షమాశీలుడు' అనుమాట ఖుర్ఆన్ గ్రంథములో అనేకచోట్ల గలదు. అంతేకాక ప్రత్యేకముగా (6-127) లో 'దేవుడు జ్ఞానులకు రక్షకుడుగా ఉన్నాడు' అని చెప్పారు. దీనినిబట్టి చూస్తే దేవుడు మంచివారందరికీ రక్షకుడే యని, మంచివారు కానివారికి దేవుని రక్షణ ఉండదని తెలియు చున్నది. అల్లాహ్ యొక్క జ్ఞానమును గ్రహించినవాడు మేలు పొందుతాడు అనగా రక్షణ పొందుతాడు యని అర్థము. అల్లాహ్ యొక్క జ్ఞానమును గ్రహించని వానికి అల్లాహ్ రక్షకుడుగా ఉండడు. అందుకే (6-104) లో దేవుని జ్ఞానము గ్రహించని వానికి నష్టమేయని చెప్పాడు. వానికి దేవుడు రక్షణ ఇవ్వడు కావున అదియే వానికి నష్టము. దేవుని జ్ఞానము అవతరించి నప్పటికీ దానిని చదవని (చూడని) వారు, ఒకవేళ గ్రంథ జ్ఞానమును చూచినా లేక గ్రంథ బోధను వినినా దానిని అర్థము చేసుకోకుండా నాకు జ్ఞానము తెలుసునని గర్వముగా యున్నవారికి దేవుని రక్షణ ఉండదు. అందువలన అటువంటి వారిని ఉద్దేశించి 'నేను మీ రక్షకుడను కాను' యని ప్రజలకు చెప్పుయని ప్రవక్తగారికి దేవుడు జిబ్రయేల్ ద్వారా చెప్పాడు. దేవుని దగ్గర నుండి జ్ఞాన నిదర్శనములు వచ్చినప్పుడు వాటిని గ్రహించిన వాడు ధన్యుడు. వాడు తన మేలుకొరకే జ్ఞానమును గ్రహించాడు. ఎందుకనగా! వానికి దేవుని రక్షణయను మేలు కలుగనున్నది. దేవుని జ్ఞానము గ్రహించనివాడు నష్టపోయినవాడగును. దేవుని రక్షణ లేకుండా పోవడమే అతనికి నష్టమని తెలియవలెను.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
45. ఏమి చేసినా వాళ్ళు విశ్వసించరు. (6-111)
ఏ మనిషి అయినా మొదట తనకు అర్థమయినదే సత్యమని పూర్తిగా విశ్వసించియుండును. తనకు మొదట తెలిసినదే సత్యమని విశ్వసించి యుండుట వలన రెండవమారు తెలిసినది ఏదయినా అసత్యమను నిర్ణయము కలిగి యుండును. ఉదాహరణకు పాము కరిస్తే చనిపోతాము అని మొదట తెలిసినవాడు ఎప్పటికీ అది సత్యమేయని నమ్మియుండును. అటువంటి వానికి పాముకాటుకు గురియైన వారందరూ చనిపోరు అని చెప్పితే అది అసత్యముగా కనిపించును. నాగుపాము కరిస్తే చనిపోవు మాట వాస్తవమే. అయితే పూడుపాము కరిస్తే చనిపోడు అనుమాట కూడా వాస్తవమే. పాములలో తేడా తెలియనివాడు తనకు తెలిసిన మొదటి మాటనే సత్యమంటున్నాడు గానీ, అన్ని పాములు విషమున్నవి కాదను విషయము అతనికి తెలియకపోవడము వలన ఏ పాము కరచినా చనిపోతారనే అతను నమ్ముచున్నాడు. అట్లు అన్ని పాముల వలన చనిపోడని వేయిమంది వచ్చి చెప్పినా ఆ మాటలను నమ్మేస్థితిలో ఉండడు. అలాగే దేవుని విషయములో ముందు తనకు అర్థమయినదే సత్యమని తర్వాత ఎవడు ఏది చెప్పినా అది అసత్యమని అనుకోవడము జరుగుచున్నది.

ఉదాహరణకు 'దేవునికి పుట్టుకలేదు' అని మొదట చదివినప్పుడు గానీ, తెలుసుకొన్నప్పుడు గానీ దానినే పూర్తి నమ్మినవాడు తర్వాత 'దేవుడు జన్మిస్తాడు' అనుమాట పూర్తి అసత్యము అని అంటాడు. అట్లుకాదు 'దేవుడు అప్పుడప్పుడు ఎప్పుడో ఒకమారు జ్ఞానమును బోధించుటకు జన్మిస్తాడు' యని ఎంత చెప్పినా అతడు నమ్మేస్థితిలో ఉండడు. తనకు మొదట తెలిసిన దానికి భిన్నముగా బోధించు వానిని అసత్యము చెప్పువానిగా లెక్కించును. తర్వాత చెప్పువాడు సత్యమునే చెప్పినా, మొదటి దానిని నమ్మినవాడు రెండవమాటను ఏమాత్రము నమ్మడు. దేవుడు జ్ఞానబోధ చేయు అవసర నిమిత్తము జన్మిస్తాడని చెప్పినా, అలా జన్మించడము శాస్త్రబద్దమైన సత్యమే అయినా దానిని అసత్యముగానే లెక్కించును. అదే విధముగా 'దేవుడు జన్మించడు, దేవునికి జన్మలు లేవు' అని మొదట తెలిసిన ముస్లీమ్‍లు తర్వాత ''దేవుడు అవతరిస్తాడు, మనుషుల మధ్యలోకి వస్తాడు. అప్పుడు మీరు కూడా నమస్కరించండి, దేవుని రాకను తెలిసిన దేవదూతలు వచ్చిన వానికి సాష్టాంగ దండ ప్రణామము చేశారు. అయితే మాయతో కూడుకొన్నవాడు మనిషివలె వచ్చిన దేవున్ని నమస్కరింపడు'' అని దైవ గ్రంథములో చెప్పినా వినే స్థితిలో ఉండరు. అలా చెప్పినమాటను అసత్యముగా లెక్కింతురు.

ఈ విధముగా మనుషులు మొదట తెలిసిన దానినే నమ్ముదురని తర్వాత తెలిసినది ఎంత సత్యమని చెప్పినా నమ్మరని తెలుపుటకు అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్‍లో సూరా ఆరు, ఆయత్ 111 లో ఇలా కలదు చూడు.

(6-111) ''మేము వాళ్ళ దగ్గరికి దూతలను పంపించినా, మృతులు వారితో మాట్లాడినా, సమస్త వస్తువులను మేము వారి కళ్ల ఎదుటే తెచ్చి పెట్టినా వారు విశ్వసించడమనేది కల్ల. ఒకవేళ అల్లాహ్ తలిస్తే అది వేరే విషయము. అయితే వీరిలో చాలామంది అజ్ఞానపు మాటలు మాట్లాడేవారే.''

ఈ వాక్యములో దూతలు అని ఒక పదము, మృతులు అని మరొక పదము చెప్పబడినది. వీరి విషయమును గురించి బాగా తెలియగలిగితే దేవదూతలు రెండు రకములు కలరు. ఒకటి భూతములు, రెండు గ్రహములు. భూతములను, గ్రహములను దేవదూతలుయని చెప్పడమైనది ఇకపోతే మృతులు అనగా చనిపోయినవారు. మన లెక్కలో చనిపోయినా వారు పూర్తి చనిపోక అకాల మరణము పొందియుండుట వలన వారు స్థూలశరీరము లేకుండా సూక్ష్మముగా బ్రతికేయుందురు. అట్లు ఉన్నవారు ఇతరుల శరీరములలో ఆవహించి మాట్లాడగలరు. అజ్ఞానపు దారిపట్టి, అజ్ఞాన వాక్యములను విశ్వసించిన వారికి సత్యమైన జ్ఞానమును ఎంత చెప్పినా వారు వినరని చెప్పుచూ అటువంటి వారికి దేవదూతలయిన భూతములు, గ్రహములు బాధించినా, సూక్ష్మశరీరముతో యున్న మృతులు వచ్చి మాట్లాడి చెప్పినా వినే స్థితిలో ఉండక తమకు తెలిసినదే సత్యమని వాదించుచుందురు.

మూడవది 'సమస్త వస్తువులు వారి కళ్ల ఎదుట పెట్టినా' అని ఉంది. దీనికి ముందు చెప్పిన దేవదూతలు, మృతులు ఇద్దరూ సూక్ష్మమైన వారే అనగా కంటికి కనిపించని వారే, మూడవదయిన 'సమస్త వస్తువులు' అనుమాట కంటికి కనిపించు స్థూలమైనదని అందరూ అనుకోవచ్చును. అయితే ఈ ఆయత్‍లో చెప్పిన దూతలు, మృతులు, సమస్త వస్తువులు మూడు సూక్ష్మమైనవేగాని ఇందులో ఒకటి కూడా స్థూలమైనది లేదు. సమస్త వస్తువులు స్థూలముగా కంటికి కనిపించునవే కదా!యని ఎవరయినా అనుకోవచ్చును. దూతలు, మృతులు చెప్పితేనే విననివారు కనిపించే వస్తువులను చూచి మారుతారని అనుకోవడము పొరపాటు. ఇక్కడ మూడవ దయిన వస్తువులు కూడా సూక్ష్మమైన వాక్యమేయని తెలియవలెను. సమస్త వస్తువులు అనుమాట సూక్ష్మమైనదని చెప్పుటకు ఒక ఆధారము గలదు. ''క్రింద భూమిని పైన ఏడు ఆకాశములను వాటి మధ్యలో సమస్త వస్తువులను సత్యసమేతముగా దేవుడు సృష్ఠించాడని'' అంతిమ దైవ గ్రంథములో చెప్పబడినది. బయట కనిపించు భూమిని బయట కనిపించు ఆకాశములు వాటి మధ్యలో గల సమస్త వస్తువులు అనుమాట స్థూలమైనది కాదు. కనిపించు ఆకాశము ఒకటే గలదు, కనిపించని ఆకాశములు ఏడు గలవు. అందువలన ఈ వాక్యము సూక్ష్మమైనదని చెప్పవచ్చును. శరీరమునకు క్రింద గల కాళ్ళను భూమి అనియూ, పైన తలను ఏడవ ఆకాశమనియూ కాళ్ళు, తల మధ్యలోగల శరీర భాగములన్నిటినీ సమస్త వస్తువులని అర్థము చేసుకొన్నప్పుడే ఈ వాక్యము సరియైన పద్ధతిలో అర్థము కాగలదు.

శరీరములోని అన్ని అవయవములను తెలియజేస్తూ అవి ఏ శక్తి వలన పని చేయుచున్నవో, వాటి నిర్మాణము ఎలా సాగినదో అన్ని అవయవముల వలన మనిషికి గల ఉపయోగమేమి? అవయవముల వలన మనిషి ఎలా జీవించగలుగుచున్నాడో వివరముగా కనిపించునట్లు తెలియ జేసినా అజ్ఞాని అయినవాడు అనగా అవిశ్వాసి అయినవాడు దేవుని జ్ఞానమును విశ్వసించక తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు అన్నట్లు వాదించుచూ అజ్ఞాన మాటలనే మాట్లాడుచుందురు.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
46. నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనము,నా మరణము అన్నీ అల్లాహ్కే అర్పితము. (6-162)
మనిషి జీవితమును దేవుడే ఇచ్చాడని మనుషులు నమ్మడము లేదు. మనమే పని చేస్తున్నాము, మనమే జీవితమును కొనసాగిస్తున్నాము మధ్యలో దేవుడు ఏమి చేశాడు? అని కొందరు ప్రశ్నించుచున్నారు. పైకి కనిపించు జీవితము తప్ప దాని వెనుకదాగియున్న రహస్యము తెలియదనియే చెప్పవచ్చును. జీవితము వెనుక జరిగే తతంగమును చెప్పినా మనిషి వినేటట్లు లేడు. అలా వినకపోవడము అజ్ఞానమేయని చెప్పవచ్చును. జ్ఞానము మీద ఆసక్తి యున్నవారు, జ్ఞానులు అయినవారు రహస్యమైన శరీరయంత్రాంగమును గురించి చెప్పితే అర్థము చేసుకోగలరు. సాధారణ మనిషి చేసే ప్రార్థన గానీ, జీవనములో చేసే పనులన్నీ గానీ చివరకు మరణము వరకు అన్నీ తానే చేయుచున్నానను అహముతో కూడుకొన్న భావము (అహంభావము) కలిగియున్నాడు. ఇది ప్రపంచములో అందరి భావన అలాగే యున్నది.

అయితే దైవ జ్ఞానమును సంపూర్ణముగా తెలిసినవాడు జీవితములో జరుగుపనులన్నీ తాను ఏమాత్రము చేయడము లేదనీ, శరీరములో రహస్యముగా యున్న దేవుడే చేయిస్తున్నాడని తలచి అన్ని పనులు దేవునికే సమర్పణయనీ అనుకొనును. ఆ విషయమై సూరా ఆరు, ఆయత్ 162 లో ఇలా వ్రాసియుంచారు చూడండి.

(6-162) ''ఈ విధముగా ప్రకటించు ''నిస్సందేహముగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనము, నా మరణము ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే.''

ఈ ఆయత్‍లో ఎంతో నిగూఢమైన అర్థము ఇమిడియున్నది. అది తెలియాలంటే శరీర యంత్రాంగమును తెలిసియుండాలి. శరీరము ఒక యంత్రములాంటిది అందులో జీవుడు యంత్రములో ఉపయోగపడు ఇంధనములాంటివాడు, దేవుడు యంత్రములోని శక్తిలాంటివాడు. యంత్రములోని శక్తి యంత్రమును ఆడునట్లు చేయుచూ యంత్రము వలన అనేక పనులు జరుగునట్లు చేయుచున్నది. అలాగే శరీరయంత్రము చేత బయట పనులు ఎన్నో జరుగుచున్నవి. శరీరము చేత చేయుచున్న ప్రార్థనగానీ, ఆరాధనలుగానీ, జీవన కార్యములుగానీ అన్నీ శరీరములో శక్తియైయున్న దేవుని చేతనే జరుగుచున్నవి. శరీర యంత్రాంగమును తెలిసిన జ్ఞాని తాను ఏమీ చేయలేదని, తాను నిమిత్తమాత్రుడనేననీ, అన్ని కార్యములను శరీరములో దీపమువలెయున్న దేవుడే చేయుచున్నాడని అనుకొనును. అప్పుడు జననము నుండి మరణము వరకు శరీరములో జరుగు అన్ని కార్యములకు దేవుడే కారణమనీ, ఆయనే చేయిస్తున్నాడని తెలిసి అన్ని కార్యములు ఆయనకే సమర్పణయని అనుకొనును.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
47. ప్రతి దానికి ఆయనే ప్రభువు. ఎవరు చేసిన పనులకు వారే బాధ్యులు. బరువును మోసే వాడు ఇంకొకరి బరువును మోయడు. మీరు ప్రభువు వద్దకు పోయినప్పుడు మీరు విభేదించినది చెప్పును. (6-164)
ప్రపంచములో సర్వమానవులకు ఒక్కడే దేవుడు. ఆ విధముగా సృష్ఠింపబడిన వారందరూ ఒకే దేవుని ఆధీనములో ఉన్నారు. సర్వ శరీరములు అల్లాహ్ (దేవుని) ఆధీనములోనే ఉన్నాయి. అన్ని శరీరములలో చైతన్యశక్తిగా దేవుడున్నాడు. శరీరములలోనున్న దేవున్ని ఆత్మయని అంటున్నాము. ఆత్మ శరీరమంతా వ్యాపించి శరీరమునకు అధిపతిగా ఉన్నది. శరీరములో అధిపతిగా యున్న దేవుడు జీవుడు చూస్తున్నట్లే జీవునికి తెలియునట్లే బుద్ధికి ఆలోచనలు ఇచ్చి, మనస్సుకు ఆజ్ఞలు ఇచ్చి శరీరము చేత పనులను చేయిస్తున్నాడు. అయితే దేవుడు చేయించగా, శరీరము చేయగా శరీరములో ఏమీ చేయని జీవుడు అన్ని కార్యములను తానే చేయుచున్నట్లు అనుకొంటున్నాడు. బుద్ధి చేయు ఆలోచనలు, మనస్సు ద్వారా వచ్చు ఆజ్ఞలు అన్నీ తనవేనని మనిషి (జీవుడు) అనుకోవడము జరుగుచున్నది. అందువలన శరీరములో జరిగిన పనులకు దేవుడు బాధ్యుడు అయినా మనిషి తాను చేయుచున్నట్లు అనుకోవడము వలన జరిగిన కార్యములన్నిటికీ జీవుడే బాధ్యుడు అగుచున్నాడు. దేవుడు చేసినా నేనే చేశానని జీవుడు అహంభావమును పొందుట వలన ఆ కార్యములలోని మంచి, చెడు ఫలితములయిన పుణ్యము, పాపము రెండూ జీవునికే చెందుచున్నవి. అందువలన ఎవరు చేసిన కార్యములకు వారే బాధ్యులు అని వాక్యములో చెప్పారు.

మనిషి జ్ఞానమును కలవాడైతే అన్ని కార్యములను శరీరములో గుప్తముగాయున్న ఆత్మే (దేవుడే) చేయుచున్నాడని తెలియగలుగును. దైవ జ్ఞానము లేనివానికి అహంభావము కలిగి అన్నీ నేనే చేయుచున్నానని అనుకొనును. బరువును మోయువాడు తెలిసి ఇంకొకరి బరువును తీసుకొని మోయడు. అలాగే పాపములను అనుభవించు జీవుడు జ్ఞానమును తెలిసిన తర్వాత తనకు తెలిసి జరిగినా ఆ పనులు తాను చేయలేదనీ, శరీరములో అధిపతిగాయున్న ఆత్మే అన్నీ చేయుచున్నాడని, శరీరములో జరిగెడి మంచి పనులకు, చెడు పనులకు తాను కారణము కాదనీ, శరీరమునకు అధిపతియైన దేవుడే సర్వకార్యములను చేయుచున్నాడని, శరీరము ద్వారా బయట జరిగే కార్యములకు, అట్లే శరీరము లోపల రాత్రింబగళ్లు జరిగే శరీర అంతర్ముఖ కార్యములను దేవుడే చేయుచున్నాడని అలా శరీరము లోపల, శరీరము బయట కార్యములను చేయడములో సూరా రెండు, ఆయత్ 255 (2-255) లో చెప్పినట్లు ''ఆయనకు అలసట రాదు, అట్లే కునుకు రాదు.'' శరీరములో (2-186) లో చెప్పినట్లు ''జీవునికి అత్యంత సమీపమున ఉండి కార్యములను చేయుచున్నాడని'' తెలియగలిగిన వాడు శరీరము బయట జరిగే పనులను తాను చేశానని ఒప్పుకోడు. అజ్ఞాన దశలో అలా ఒప్పుకొని చెడు కార్యములలోని పాపమును అనుభవించువాడు, పాప భారము ఎంత బరువైనదో, ఎంత కష్టమైనదో తెలిసి, జ్ఞానము కల్గిన తర్వాత తన పొరుగువాడయిన ఆత్మ చేయు కార్యములకు తాను బాధ్యుడు కాదని అనుకొనును. ఇదే విషయమును చెప్పుచూ వాక్యములో (6-164) లో ''బరువును మోయువాడు ఇంకొకరి బరువును మోయడు'' అని అన్నారు. వాక్యమును పూర్తిగా చూస్తే ఇలా కలదు చూడండి.

(6-164) ఇలా అను ''నేను అల్లాహ్‍ను వదలి వేరొకరిని దేవునిగా స్వీకరించాలా! సర్వులకు అల్లాహ్ ఒక్కడే ప్రభువు. ప్రతి వ్యక్తి తాను సంపాదించినదే అనుభవిస్తాడు. బరువును మోసేవాడు ఎవ్వడూ ఇతరుల బరువును మోయడు. చివరకు మీరంతా మీ ప్రభువు వైపుకు మరలి పోవలసియున్నది. అప్పుడు ఆయన మీరు ఏ విషయములలో భేదాభిప్రాయములు కల్గియుండేవారో వాటిని మీకు తెలియజేస్తాడు.''

ఈ వాక్యములో సగము వరకు వివరముగా తెలుసుకొన్నాము. 'బరువును మోసేవాడు ఇతరుల బరువును మోయడు' అని తెలుసుకొన్నాము. ఇతరుల బరువు అనగా శరీరములో ఆత్మ చేసిన కార్యములలో వచ్చిన పాపపుణ్యములను బరువును జ్ఞాని అయిన జీవుడు మోయడు అని తెలియ గలిగాడు. జ్ఞానమును తెలిసినవాడు గానీ, జ్ఞానమును తెలియనివాడు గానీ ఏదో ఒకరోజు చనిపోక తప్పదు. అప్పుడు మనిషి సంపాదించు కొన్న పాపపుణ్యములను బట్టి తొలి జన్మవలె మలి జన్మను దేవుడు కలుగ జేయును. దానినే 'తీర్పు దినము' అంటున్నాము. తీర్పు దినమును అంతిమ దినము అని కూడా అనుచున్నాము. అంతిమ దినము అనగా జీవితములో చివరి రోజు. అదే మనిషి మరణించిన రోజు.

మనిషి మరణించిన సమయములో ఒక సెకను కాలములో దేవుడు తీర్పు తీర్చి తిరిగి మలి జన్మకు పంపును. అలా జరుగు తీర్పు సమయములో అనగా ఒక్క క్షణకాలములోనే జరుగవలసినవన్నీ జరిగిపోవును. ఇది అందరికీ తప్పక జరుగును. కావున వాక్యములో మీరందరూ ప్రభువువైపుకు మరలి పోవలసిందేయని అన్నారు. అది తప్పనిసరిగా జరిగే పనియైనా మరణ సమయములో ఒక్కక్షణములో జరిగే తీర్పును గురించి ఎవరికీ తెలియదు. కొందరు జ్ఞానులకు ఈ విషయము తెలిసినా మరణములోనూ, పుట్టుకలోనూ ఎవరికీ జ్ఞాపకము ఉండదు. అనగా మననము (జ్ఞాపకము) చేయు మనస్సు ఉండదు. అందువలన తీర్పు సమయములో ఏమి జరిగినది ఎవరికీ తెలియదు, అనగా జ్ఞాపకము ఉండదు. తీర్పు సమయములో పాపపుణ్యములకు తగిన శిక్షలను, సుఖములను నిర్ణయించడమే కాకుండా మనిషి తన జీవితములో ఏయే విషయములలో దేవునితో, దేవుని జ్ఞానముతో భేదాభిప్రాయములు కలిగియున్నాడో దేవుడు తెలియజేసి దానికి తగిన శిక్ష విధించును. సాధారణముగా మనిషి కొన్ని విషయములలో దేవున్ని నమ్మడము, కొన్ని విషయములలో నమ్మకపోవడము జరుగుచున్నది. ఉదాహరణకు 'దేవుడు ఒక్కడే'యను విషయమును కొందరు నమ్ముచున్నారు, కొందరు నమ్మడము లేదు. ముస్లీమ్‍లు 'దేవుడు ఒక్కడే'యని అనుచుండగా హిందువులు అనేక దేవుళ్లను ఆరాధించుచున్నారు. దేవుడు ఒక్కడేయను సత్యమును ముస్లీమ్‍లు నమ్మగా, హిందువులు నమ్మలేకపోవుచున్నారు. అందువలన తీర్పు దినమున ఈ విషయములో ముస్లీమ్‍లను వదలివేసి హిందువులను దేవుడు శిక్షకు గురి చేయును.

అదే విధముగా 'దేవుడు మనిషిగా అవతరిస్తాడు' అను సత్యమును హిందువులు గ్రహించగా, ముస్లీమ్‍లు ఆ విషయములో విభేదించి 'దేవుడు అవతరించడు' అని చెప్పుచుండుట వలన తీర్పు దినమున ఆ విషయములో హిందువులను వదలివేసి ముస్లీమ్‍లకు వారి తప్పును తెలియజేసి దానికి తగిన శిక్షను విధించును. కొందరు ఒక గురువును గొప్పగా గౌరవించడము, మరొక గురువును దూషించడము చేయుచుందురు. గురువుల (బోధకుల) విషయములో నిజమైన బోధకున్ని దూషించడము వలన వచ్చు పాపమును తీర్పు దినమున చెప్పబడును. ఇట్లు దేవుడు, దేవుని జ్ఞానము, బోధకులు మొదలగు అనేక విషయములలో మనుషులు కొందరు విభేదించడము వలన ప్రపంచ పాపములనే కాకుండా దైవ సంబంధ పాపములకు శిక్షలు తీర్పు దినమున ఖరారు చేయబడును. అయితే మనిషి అయినవాడు తీర్పు దినమును నమ్మలేకపోవుచున్నాడు. ఒకే దేవుడని నమ్మినవారు కూడా తీర్పు దినము మరణించిన సమయమేయని తెలియలేక పోవు చున్నారు. ఈ విషయములన్ని గ్రహించుటకు ముఖ్యముగా మరణ సమయములో తీర్పు జరుగు విధానమును ఈ ఆయత్‍లో చెప్పడము జరిగినది.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
48. విశ్వసించిన వారికి ఇది హితబోధిని. (7-2)
(7-2) ''ఓ ప్రవక్తా! ఇది ఒక గ్రంథము. దీని ఆధారముగా నీవు ప్రజలను హెచ్చరించటానికిగానూ ఇది నీ వద్దకు పంపబడినది. కాబట్టి దీనిపట్ల నీ మనసులో ఎటువంటి సంకోచము ఉండకూడదు. విశ్వసించిన వారికి ఇది హితబోధిని (దైవ జ్ఞానము తెలియజేయు జ్ఞాపిక).''

కాగితములో వ్రాయబడిన దానిని లేక వ్రాయబడిన కాగితములు కూర్చబడిన దానిని పుస్తకము లేక గ్రంథము అని అంటాము. అందులో వ్రాయబడిన విషయములనుబట్టి అది గ్రంథమా లేక పుస్తకమా అని నిర్ణయించడము జరుగును. ప్రపంచ విషయములు ఏవియున్నా అది పుస్తకము అని చెప్పబడును. దైవ విషయములు ఏవియున్నా అది గ్రంథము అని చెప్పబడును. ఇంకా కొంత వివరముగా చెప్పుకొంటే తలలో వచ్చు ప్రపంచ ఆలోచనలున్న దానిని పుస్తకము అని చెప్పడము జరుగుచున్నది. దానినే మస్తక విషయములు గలది పుస్తకము అని అంటున్నారు. నాడులను, గ్రంథులను నడుపు శక్తి నుండి వచ్చు విషయములున్న దానిని గ్రంథము యని అంటున్నారు. దానినే గ్రంథిశక్తి నుండి పుట్టుకొచ్చిన విషయములు గలది గ్రంథము అని అంటున్నాము. గ్రంథిలో దైవశక్తి పని చేయుచున్నది. దైవశక్తి వలన వచ్చు జ్ఞాన విషయములు గలది గ్రంథము. ఖుర్ఆన్ దైవ శక్తి వలన వచ్చిన సమాచారము గలది కావున దానిని గ్రంథము అనియూ, దైవ గ్రంథము అనియూ అంటున్నాము. దేవుడు ఆకాశము ద్వారా (వాణి ద్వారా) అందించిన జ్ఞానమును జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తకు చెప్పగా, అది గ్రంథరూపముగా మారినది, దానినే అంతిమ దైవ గ్రంథము అని అంటున్నాము.

అంతిమ దైవ గ్రంథమునకు కొందరు ఖుర్ఆన్ అని పేరు పెట్టారు. అంతిమ దైవ గ్రంథములోని జ్ఞాన సమాచారమును చెప్పి ప్రజలను తప్పు దారిలో (అజ్ఞాన దారిలో) పోకుండా హెచ్చరించమని, మేలుకొల్పమని ప్రవక్తగారికి చెప్పడమైనది. మొదట నీవద్దకు పంపబడిన జ్ఞానము ఎడల నీవు ఎటువంటి సంకోచము లేకుండా బాగా అర్థము చేసుకొని ఇతరులకు చెప్పమని ప్రవక్తగారికి మొదటే చెప్పారు. ప్రవక్తగారు ఎంతో వివరముగా చెప్పిన జ్ఞానమును ఎవరయితే బాగా తెలియగలరో వారికి ఇది సర్వ విధముల మంచిని చేకూర్చు హితబోధిని యని కూడా వాక్యములో చెప్పారు. గ్రంథములో జ్ఞానము ఉన్నా దానిని సంశయము లేకుండా, తప్పు భావముల లోనికి పోకుండా తెలియజేయు వ్యక్తి అవసరము. అలా జ్ఞానమును బోధ రూపములో తెలియజేయు బోధకుడు లేనిదే ఎవరికీ జ్ఞానము అర్థము కాదు. బోధకుడుగా యున్నవాడు మొదట తాను ప్రతి విషయములోని సత్యమును తెలిసియుండును. అలా తెలిసి అంతిమ దైవ గ్రంథమును వివరముగా చెప్పినవాడు ముహమ్మద్ ప్రవక్తగారు. నేడు ఆయన లేడు కావున కొందరు ముస్లీమ్‍లు కొన్ని ఆయత్‍లను తప్పుగా అర్థము చేసుకొను అవకాశము గలదు.

నేడు అంతిమ దైవ గ్రంథములోని కొన్ని వాక్యములలో సంకోచము కల్గునట్లు కొందరు అర్థము చేసుకొంటున్నారు. అలా సత్యసమేతముగా అర్థము కానప్పుడు ఆ వాక్యములో కలుగు సంశయములకు జవాబులు ఉండవు. జవాబులేని జ్ఞానము సంకోచ జ్ఞానము అగును. అది సత్యమైన జ్ఞానము కాదు. ఉదాహరణకు మనుషులు చనిపోతే తిరిగి ప్రళయ కాలమున సమాధులనుండి లేపబడును అని ఉన్నది. ఈ వాక్యమును నేడు ప్రతి ఒక్కరు సరియైన భావము ప్రకారము అర్థము చేసుకోలేదు. కొన్ని లక్షల సంవత్సరములకో, కోట్ల సంవత్సరములకో వచ్చు ప్రళయ దినమున చనిపోయిన వారందరినీ వారివారి సమాధుల నుండి దేవుని చేత లేపబడుదురు అని అర్థము చేసుకొన్నారు. వారు అర్థము చేసుకొన్నది సత్యమేయని వారు అనుకొనినా, వాస్తవానికి అది దూరముగా యున్నదని వారికి తెలియదు. ప్రళయము ఎప్పుడో వస్తుంది అనుకోవడము పొరపాటు. ప్రళయము అనగా మరణించు సమయమనీ, సమాధి అనగా తల్లిగర్భము యని సూక్ష్మ అర్థమును తెలియలేకపోయారు. ప్రతి వాక్యమును స్థూలముగా అర్థము చేసుకొంటే గ్రంథములో సూక్ష్మవాక్యములున్నవని చెప్పిన (3-7)వ వాక్యము ఏమి కావలెను? దేవుడు తన గ్రంథమున ముతషాబిహాత్ (సూక్ష్మ) వాక్యములున్నవని చెప్పినమాట వ్యర్థము కాకూడదు అంటే వాక్యము స్థూలముగా చెప్పినా, అందులో సూక్ష్మము ఇమిడియున్నదని తెలిసి సరిగా అర్థము చేసుకొన్నప్పుడు గ్రంథములోని వాక్యములు సంశయము లేకుండా అర్థమయినట్లు లెక్కించవచ్చును. సూక్ష్మ విషయములు తెలియకపోతే అతనిలో ఎన్నో సంకోచములు ఉన్నట్లు తెలియవలెను. ముహమ్మద్ ప్రవక్త గారు ప్రతి విషయమును పూర్తిగా తెలిసి వాక్యములను బయటి ప్రజలకు చెప్పారు. అయితే నేడు ప్రజలే దైవ గ్రంథమును సరిగా అర్థము చేసుకోలేదు. 'అంతిమ దినమున ప్రళయ కాలములో చనిపోయిన వారిని వారివారి సమాధుల నుండి లేపును' అని చెప్పడమేకాక 'సమాధి నుండి లేచినవాడు గుడ్డలు లేకుండా నగ్నముగా ఉండును' అని చెప్పాడు.

ఈ విషయమును విశధీకరించుకొని అర్థము చేసుకొంటే 'చనిపోయినవాడు తిరిగి తల్లిగర్భము అను సమాధి నుండి లేచును' అని చెప్పుచూ తల్లిగర్భము నుండి వచ్చిన వారికి గుడ్డలు ఉండవనీ వారు నగ్నముగా యుందురని అర్థముతో సమాధినుండి వచ్చిన వారికి దుస్తులు ఉండవని చెప్పాడు. అప్పుడు ప్రవక్తగారి చిన్న భార్య అయిన ఆయెషా అను ఆమె సమాధి అంటే తల్లిగర్భము అని అనుకోక భూసమాధియని అనుకోవడము వలన ప్రవక్తగారిని ఒక ప్రశ్న అడిగింది. అదేమనగా! ''మేము స్త్రీలము మమ్ములను అల్లాహ్ సమాధినుండి లేపినప్పుడు శరీరము మీద గుడ్డలు లేకపోతే మాకు మానము, మర్యాద పోవును కదా! అది స్త్రీలకు అవమానకరము కాదా?''యని అడిగింది. అప్పుడు ప్రవక్తగారు ఇలా చెప్పాడు. ''సమాధుల నుండి లేపబడిన వారికి ఆ సమయములో బయట ప్రపంచ స్పృహలు ఉండవు. అందువలన ఎవరికీ మర్యాద పోదు'' అని అన్నాడట. ఇదంతయూ గమనించితే ప్రవక్త గారికి సత్యము తెలిసి పోయినదనీ, చనిపోయినవాడు వెంటనే వేరొక శరీరము ధరించి తల్లిగర్భము నుండి నగ్నముగా పుట్టునని తెలిసి చెప్పాడని అర్థమగుచున్నది. ఈ విధముగా ప్రతి వాక్యమును సంశయము లేకుండా తెలియగలిగినప్పుడు అందరికీ దైవ గ్రంథము హిత బోధినియగును. అర్థము కానప్పుడు సరియైన భావము తెలియనప్పుడు వారికది అహిత బోధిని యగును. అప్పుడు దైవ గ్రంథము యొక్క లాభమును మనిషి పొందలేడు. అందువలన ఆలస్యమైనా ఫరవాలేదు గ్రంథమును సరిగా అర్థము చేసుకోండి.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
49. ఎవరి వద్దకు ప్రవక్తలను పంపామో వారిని తప్పక అడుగుతాము. (7-6), వారికి అన్నీ విప్పి చెప్పుతాము, మాకు అన్నీ తెలుసు. (7-7)
ఇక్కడ 7-6, 7-7 వాక్యములను చూస్తే దేవుడు జ్ఞానమును తెలియు మనుషులను తిరిగి ప్రశ్నించును. అట్లే జ్ఞానము చెప్పు బోధకులను అడగకమానడనీ, అందువలన తెలియువారు, తెలియజెప్పువారు సరియైన వివరణ తెలిసియుండాలియని హెచ్చరించినట్లు ఇక్కడ చెప్పిన రెండు ఆయత్‍లు గలవు. ఇప్పుడు ఆ రెండు వాక్యములను చూస్తాము.

(7-6) ''ఎవరి వద్దకు ప్రవక్తలు పంపబడ్డారో వారిని తప్పకుండా అడుగుతాము. ప్రవక్తలను కూడా మేము తప్పకుండా ప్రశ్నిస్తాము.''

(7-7) ''మాకు ప్రతీదీ తెలుసు గనుక తర్వాత వారి ముందు ఉన్నదున్నట్లు విప్పి చెప్పుతాము. మాకు ఏదీ తెలియకుండా లేదు.''

ఈ వాక్యములో 'ప్రవక్తలు' అని చెప్పారు. ప్రవక్తలు అనగా ముహమ్మద్ ప్రవక్తగారు కాదు. జ్ఞానమును చెప్పు బోధకులనందరినీ ప్రవక్తలు అని అనడము జరిగినది. బోధకుల ద్వారా ఎవరయితే జ్ఞానమును విన్నారో వారందరూ దైవజ్ఞానమును సరిగా అర్థము చేసుకొన్నారో లేదోయని తెలియు నిమిత్తము వారిని తప్పక ప్రశ్నించి చూస్తాము. అప్పుడు వారు తెలిసినది సత్యమో కాదో తెలిసిపోవును. జ్ఞానమును ప్రవక్తల ద్వారా విన్నవారినే కాకుండా జ్ఞానమును చెప్పిన ముఖ్య వక్తలయిన బోధకులను కూడా తప్పకుండా ప్రశ్నిస్తాము. అప్పుడు వారు చెప్పినది తప్పో ఒప్పో తెలిసి పోవును. అలా ప్రశ్నించడము వలన ఎవరి జ్ఞానము వారికి సత్యమో కాదో తెలిసిపోవును. అయినా తాము చెప్పినది అసత్యమైనదని కొందరు గురువులకు (బోధకులకు) తెలిసినా మాది సత్యమేయని వాదించు వారు గలరు. అటువంటి బోధకులు ప్రజలకు అసత్యమునే చెప్పుచూ అందరినీ తప్పు దారి పట్టించుచుందురు. అటువంటి వారికి దేవుడే దిగివచ్చి ఉన్నదున్నట్లు విప్పి చెప్పును. దేవునికి తెలియని జ్ఞానము ఏదీ లేదు. దేవుడు సూక్ష్మమైనవాడు. అందువలన సూక్ష్మ జ్ఞానరహస్యమంతయూ అల్లాహ్‍కు తెలుసు. అల్లాహ్ మనిషి రూపములో నుండి జ్ఞానమును సవివరముగా చెప్పినప్పుడు సత్యమైన జ్ఞానము ఇటు మనుషులకు, అటు బోధకులయిన వక్తలకు తెలియును. దేవుడు భూమిమీద సత్యసమేతమైన జ్ఞానమును మనిషివలె వుండి మనుషుల భాషలోనే చెప్పును. అప్పుడు అన్ని భాషలవారు ఎవరికి ఎంత ఆసక్తియుండునో అంత జ్ఞానమును తెలియగలరు. చివరకు దేవుడు చెప్పనిదే ఇటు ప్రజలకు, అటు బోధకులయిన ప్రవక్తలకు జ్ఞానము తెలియదు.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
50. మొదటిసారి అల్లాహ్ మిమ్ములను ఎలా పుట్టించాడో, మలిసారి కూడా అలాగే పుట్టించబడతారు. (7-29)
ఒక మనిషి ఒకమారే పుట్టి చనిపోతాడని, చనిపోయిన తర్వాత ప్రళయము వరకు భూసమాధులలోనే ఉంటారని, ప్రళయములో అల్లాహ్ సమాధుల నుండి చనిపోయిన వారిని లేపి వారి పాపపుణ్యములను విచారించి స్వర్గానికో, నరకానికో పంపునని ముస్లీమ్‍లు అనుకొంటున్నారు. మనిషి చనిపోయేది, సమాధుల నుండి లేచేది, దేవుడు తీర్పు తీర్చేది, ప్రళయ కాలము మొదలగునవి అన్నీ సూక్ష్మ జ్ఞానమే అయినదానివలన సూక్ష్మ జ్ఞానదృష్ఠి లేనివారు వాక్యములోని సత్యము తెలియక స్థూలముగా అర్థము చేసుకొన్నారు. చీకటిలోని త్రాడును పామని భ్రమించినట్లు, ప్రళయమంటే ఎప్పుడో వచ్చునదనీ సమాధులంటే భూమిలో ఉన్నవని అనుకోవడము జరుగుచున్నది. వాక్యమును స్థూలముగా అర్థము చేసుకోవడము వలన వాక్యములోనున్న భావము అంతయూ దారితప్పి తప్పుగా చెప్పుకోవడము జరిగినది. చనిపోయిన వాని మృత దేహమును భూమిలో పూడ్చగా ఆరు నెలలకు శవము పూర్తి కుళ్లిపోయి మట్టిలో కలిసిపోవుచున్నది. మనిషి మృత శరీరమును శవముగా భూమిలో పెట్టుచున్నారుగానీ మనిషిని సజీవముగా భూమిలో పాతిపెట్టలేదు కదా! అలాంటప్పుడు చనిపోయిన వాడు భూసమాధిలో ఉన్నాడని చెప్పడము పొరపాటు కాదా! మనిషి బ్రతికినప్పుడు శరీరములో యున్న జీవుడు ఎవరికీ కనిపించడు. కనిపించని జీవుడు మరణములో ఎట్లు శరీరము నుండి బయటికి పోయేది, ఎక్కడికి పోయేది ఎవరూ చూడలేదు. అటువంటప్పుడు సూక్ష్మమైన జీవున్ని స్థూలముగా చూచినట్లు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ప్రళయము వరకు భూమిలో ఉన్నాడు అని చెప్పుకోవడము తప్పుకాదా!

దైవ గ్రంథము అను పేరు ఒక్కటే అయినా దైవ గ్రంథములు మూడుగా ఉన్నాయి. ఒకటి తౌరాత్ (భగవద్గీత), రెండు ఇంజీలు (బైబిలు), మూడు ఖుర్ఆన్. దైవ గ్రంథములు మూడుగా యున్నా అందులోని జ్ఞానము ఒకదానితో మరొకటి అనుసంధానము చేయబడియున్నది. ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీతలోని జ్ఞానమే మిగతా రెండు దైవ గ్రంథములలో యున్నదని చివరిగా వచ్చిన ఖుర్ఆన్ గ్రంథమే ధృవీకరించి చెప్పుచున్నది. ఈ విషయమును సూరా ఐదు, ఆయత్ 48లో చూడవచ్చును.

(5-48) ''మేము నీ వైపునకు ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్‍ను) సత్య సమేతముగా అవతరింపజేశాము. ఇది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరించుచున్నది. నీవద్దకు వచ్చిన సత్యమును విడచి వారి మనోవాంఛలను అనుసరించకు.''

ఈ వాక్యము ప్రకారము 5000 సంవత్సరముల ముందు వచ్చిన భగవద్గీత, 2000 సంవత్సరముల ముందు వచ్చిన బైబిలు గ్రంథములలో గల జ్ఞానము సత్యమని ఖుర్ఆన్ గ్రంథము ధృవీకరించుచున్నదని తెలియుట వలన భగవద్గీతలో మనిషికి చావు పుట్టుకలు గలవని చెప్పినట్లు ఖుర్ఆన్‍లో కూడా చనిపోయిన మనిషి తిరిగి వెంటనే జన్మించునని చెప్పియున్నారు. చనిపోయినవాడు మొదట పుట్టినట్లే తర్వాత కూడా పుట్టునను విషయమును సూరా ఏడు ఆయత్ 29లో చెప్పియున్నారు చూడండి.

(7-29) ఓ ప్రవక్తా! ఈ విధముగా చెప్పు ''నా ప్రభువు న్యాయము గురించి ఆదేశించాడు. సజ్దా చేసే ప్రతీసారి మీ దిశ సరిగ్గా ఉండేటట్లు చూచుకోమని, ధర్మాన్ని కేవలము అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకొని ఆయన్ను వేడుకోమని ఆయన ఆజ్ఞాపించాడు. మొదటిసారి అల్లాహ్ మిమ్ములను ఎలా పుట్టించాడో మలిసారి కూడా మీరు అలాగే పుట్టించబడతారు.''

చాలామంది ముస్లీమ్‍లు మనిషికి రెండవ జన్మలేదని అనుకోవడము సహజము. అయితే వారి అజ్ఞానమును పటాపంచలు చేయుచూ అల్లాహ్ తన ఆయత్‍లో మనిషి మొదట పుట్టునట్లే తిరిగి రెండవసారి కూడా పుట్టు చుండును అని తేల్చి చెప్పాడు. ఈ ఆయత్‍లో చెప్పినది సత్యమైన మాటయని సాక్ష్యముగా చూపుటకు సూరా 53, ఆయత్ 46, 47 లలో కూడా ఇలా చెప్పారు.

(53-46) ప్రవహింప చేసే వీర్యబిందువు నుండి

(53-47) మరొక జీవితమును ప్రసాదించడము ఆయనకే (అల్లాహ్కే) చెల్లును.

ఈ విధముగా చెప్పిన మూడు వాక్యములలో మనిషికి మరణమే కాదు, జన్మ కూడా కలదని తెలియుచున్నది. అంతేకాక మనిషి తండ్రి వీర్యబిందువు చేతనే మరుజన్మ పొందుచున్నాడు అంటే తల్లిగర్భములో శిశు శరీరము పెరిగిన తర్వాత, ప్రసవము జరిగి జీవుడు తిరిగి క్రొత్తగా పుట్టుచున్నాడు. కొందరికి పూర్తి తెలియునట్లు మొదట తల్లిగర్భము నుండి జన్మించినట్లే చనిపోయిన తర్వాత కూడా తిరిగి తల్లిగర్భము నుండే జన్మించునని చెప్పుటకు తొలిసారి పుట్టినట్లే రెండవసారి కూడా పుట్టుననీ, తండ్రి వీర్యకణము ద్వారా తల్లిగర్భము నుండి తయారయిన శిశు శరీరములో పుట్టునని వాక్యములలో అర్థమగునట్లు చెప్పారు. దీనినంతటినీ గమణించిన తరువాత కూడా మనిషికి రెండవమారు జన్మలు ఉండవు అని అనుకోవడము అజ్ఞానమే యగును. (7-29)వ వాక్యము రెండవ జన్మను ధృవీకరించగా, అదికాదు అనడము పూర్తిగా వాక్యమునకు వ్యతిరేఖముగా మాట్లాడినట్లగును.

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024