till 103
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
101. వీర్యకణము లేకుండా పిల్లలు పుడతారు. (19-20, 21, 22)
(19-20,21,22) ''నాకు పిల్లవాడు కలగడమేమిటి? నన్ను ఏ మగాడు కనీసము తాకనైనా లేదే! నేను చెడునడత కలదానిని కూడా కాదే! అని ఆమె అన్నది.'' (21) ''జరిగేది మాత్రము ఇదే. అది నాకు చాలా సులువు. మేము అతనిని జనుల కోసము సూచనగా మా ప్రత్యేక కృపగా చేయదలిచాము. ఇదొక నిర్ధారిత విషయము అని నీ ప్రభువు సెలవిచ్చాడు. అని అతను వివరించాడు.'' (22) ''అంతే, ఆమె గర్భవతి అయినది. ఈ కారణముగా ఆమె ఏకాంతము కోసము దూరప్రదేశానికి వెళ్లి పోయినది.''
పరమాత్మ తెలిపాడని ఆత్మ చెప్పుచున్నది. ఈ రెండు ఆత్మల (అల్లాహ్‍ల) విషయము అర్థము కాకపోతే జ్ఞానము అర్థము కాదు. మరియ అను స్త్రీకి అల్లాహ్ (దేవుడు) నీకు కొడుకు పుట్టుతాడు అని చెప్పగా ఆమె ఆశ్చర్యపడి నేను ఏ పురుషున్నీ తాకనుకూడా తాకలేదే అదెలా సాధ్యము అని అడుగగా! అది మాకు సులభము, మేము అతనిని (ఏసును) జనుల కొరకు సూచనగా ప్రత్యేక కృపగా చేయదలచుకొన్నాము, ఇదొక నిర్ధారిత విషయము అని నీ ప్రభువు సెలవిచ్చాడు అని అన్నాడు. పరమాత్మ నిర్ణయించి ఒక మనిషిని తయారు చేయబోతున్నాడు అని ఆత్మ చెప్పినది. పరమాత్మ నిర్ణయించగా ఆత్మ తల్లి శరీరములో శిశువును పెంచుతున్నది. పురుష సంపర్కము లేకున్నా స్త్రీలకు గర్భము వచ్చునని ఈ విషయములో నిరూపించబడినది. పరమాత్మ తన ప్రతినిధిగా భూమిమీదికి భగవంతున్ని ప్రజలకు జ్ఞానము తెలుపుటకు పంపునని ఈ వాక్యములో తెలియజేశాడు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
102. అల్లాహ్‍కు సంతానము లేదు. (19-35), (21-26)
(19-35) ''అల్లాహ్‍కు సంతానము ఉండటమనేది ఎంతమాత్రమూ తగదు. ఆయన పరమ పవిత్రుడు. ఆయన ఏ పనినైనా చేయాలని సంకల్పించుకొన్నప్పుడు ''అయిపో'' అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే అది అయిపోతుంది.''
(21-26) ''కరుణామయునికి సంతానము ఉందని వారు చెప్పు తున్నారు. అది నిజము కాదు. ఆయన పవిత్రుడు. పైగా దైవ దూతలంతా గౌరవించబడిన ఆయన దాసులు.''
ఇక్కడ అల్లాహ్ అనబడే పరమాత్మకు సంతానము లేదనే చెప్పాలి. ఆయన ఏ పనిని చేయదలచుకున్నా, అది కార్యరూపముగా ఉండదు. ఆయన సంకల్పముతోనే అయిపోతుంది. అలాగే పరమాత్మ ప్రత్యేకమైన మనిషిని తయారు చేసి తన ఆత్మనే అందులో ఊది భూమిమీదికి ప్రత్యేక మైన మనిషిని పంపుచున్నాడు. పరమాత్మకు సంతానము ఉండదు. ఎవరూ సంతానముగా లేరు. మనుషులందరూ ఆత్మ యొక్క సంతతి కాగా, పరమాత్మకు సంతతి లేదు. దేవదూతలు అనబడువారందరూ పరమాత్మ సేవకులుగా యున్నా, ఆత్మకు సంబంధము లేనివారుగా యున్నా వారు పరమాత్మయొక్క దాసులు మాత్రమే. సర్వజీవరాసులకు ఆత్మ మాత్రమే బీజదాతగా యున్నాడు. కావున ఆత్మే అందరికీ తండ్రి. ఖుర్ఆన్ గ్రంథములో ఆత్మను, పరమాత్మను ఇద్దరికీ అల్లాహ్ అను ఒకే పేరు ఉండుట వలన ఖుర్ఆన్‍ను చదివినవారంతా ఇద్దరు అల్లాహ్‍ల తారతమ్యము తెలియక 'అల్లా' అను ఒకే పేరునుబట్టి అల్లాహ్ ఒకడేయని అనుకొంటున్నారు. ఆరాధనకు అర్హుడైన అల్లాహ్ ఒకడు, ఆరాధనలకు అతీతుడయిన అల్లాహ్ మరొకడు ఉన్నాడని తెలియలేకపోయారు. అలాగే పనిని చేయు అల్లాహ్ ఒకడు ఉండగా, పని చేయని అల్లాహ్ మరొకడున్నాడని తెలియలేక ఆరాధ్య దైవము ఒక్కడే యని అంటున్నారు. ఇద్దరిలో ఆరాధ్య దైవము ఒక్కడేయని పెద్ద అల్లాహ్ చిన్న అల్లాహ్‍ను చూపాడు. అయినా 'జాడతప్పను బోడిమామా' యను సామెత ప్రకారము మొదట విన్నదే నిజమనీ, తమ పెద్దలు చెప్పినదే నిజమని అనుకోవడము వలన ముస్లీమ్‍లకు చాలామందికి ఇద్దరు దేవుళ్ల విషయము తెలియదు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
103. అధర్మవరులు వీరే. (23-53)
(23-53) ''వారు తమ ధర్మం విషయములో పరస్పర భేదా భిప్రాయములు కల్పించుకొని విభిన్న తెగలుగా చీలిపోయారు. ప్రతి వర్గము వారు తాము అనుసరించే దానితో సంతోషపడు తున్నారు.'' (దివ్య ఖుర్ఆన్ సందేశము)
(23-53) ''అయితే వారంతటవారే విభేదించుకొని తమ ధర్మాన్ని ముక్క చెక్కలుగా చేసుకొన్నారు. ప్రతి వర్గము వారు (ప్రతి మతము వారు) తమవద్దయున్న దానితోనే సంబరపడిపో సాగారు.'' (అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్)
ఇక్కడ రెండు తెలుగు అనువాద ఖుర్ఆన్ గ్రంథముల నుండి ఒకే ఆయత్ ఎలా ఉన్నదో వ్రాసి చూపించాము. రెండు వాక్యములలో కొన్ని పదములు వేరుగా యున్నా, భావము రెండిటియందు ఒకటే యున్నది. దేవుడు మనుషులను ఒకే సమాజముగా పుట్టించాడు. అంటే ఒకే జాతిగా పుట్టించాడు. మనిషి ఒక శరీరము ధరించి పుట్టితే ఆ శరీరము నల్లగా తెల్లగా యున్నా, పొడవు పొట్టిగా యున్నా, శరీరము బయటి అవయవము లలో గానీ, అట్లే శరీరము లోపలి అవయవములలోగానీ ఏ తేడా లేకుండా దేవుడు పుట్టించాడు. అందరికీ శరీర నిర్మాణము చేసి అందులో జీవితమును ఇచ్చినవాడు శరీరములోనే నివశించుచున్న ఆత్మని చెప్పుచున్నాము. మనుషులకు ఆత్మే దేవుడు. అందరూ ఆరాధించవలసిన వాడు ఆత్మయను దేవుడే. ఆత్మయను దేవుడు ఆయనకంటే వేరుగా (పరముగా) యున్న దేవుని చేత నిర్మితమైనవాడు, ఆత్మకంటే వేరుగా యున్న దేవుడు అయిన పరమాత్మను, ఆత్మను ఇద్దరినీ ఖుర్ఆన్ గ్రంథములో ఒకే పేరు అయిన 'అల్లాహ్' అను పదము (శబ్దము) పిలుచుచున్నారు. పరమాత్మయిన వాడు కనిపించే భూమిని, కనిపించే ఆకాశమును మొత్తము నిర్జీవ ప్రపంచమును తయారు చేశాడు. తర్వాత జీవులను (మనుషులను) అన్ని రకముల జీవరాసులను తయారు చేయదలచి, ఆ పని నిమిత్తము ఆత్మను సృష్ఠించి మనుషులను పుట్టించడము, అట్లే మరణింప జేయడము, జీవన మరణముల మధ్యలో జీవితమును ఇచ్చునట్లు అన్ని అధికారములను ఆత్మకు పరమాత్మ ఇచ్చాడు. పరమాత్మ బయటి ప్రపంచమును సృష్ఠించిన, తర్వాత తాను ఏమీ చేయనివాడై జీవుల సృష్ఠినంతటిని సృష్ఠించుటకు, పాలించుటకు అన్ని అధికారములు ఆత్మకు ఇచ్చి తాను సాక్షిగా ఊరక ఉండిపోయాడు.
పరమాత్మ ఆజ్ఞ ప్రకారము ఆత్మ సర్వమానవులను తయారు చేయడము జరిగినది. ఆత్మ చేసిన మానవ సమాజము అంతా ఒకే సూత్రబద్దముగా తయారు చేయబడినది. ఒక వాక్యమును ఎవరు వ్రాసినా, వాక్యములోని అక్షరములన్నీ ఒకే విధముగా యున్నా, వ్రాసినవారి చేతి కదలిక వేరువేరుగా యుండుట వలన వ్రాయబడిన అక్షరములు పొడవుగా పొట్టిగా, పెద్దవిగా చిన్నవిగా ఉండును తప్ప వాక్యములో ఏ విధమైన మార్పు ఉండదు. ఉదాహరణకు 'దేవుడు' అను మూడు అక్షరముల పదమును పదిమంది చేత వ్రాయించితే, వారు వ్రాసిన మూడు అక్షరములు ఒకే విధ అక్షరములు ఉండును. అయితే వ్రాసినవారి చేతి కదలికలనుబట్టి వ్రాత వేరువేరుగా యున్నట్లు కనిపించును. ప్రత్యేకముగా చూస్తే దేవుడు అను మూడు అక్షరముల పదము పది రకములుగా యున్నట్లు కనిపించుచున్నది. చూడండి.
దేవుడు దేవుడు
దేవుడు దేవుడు
దేవుడు దేవుడు
దేవుడు దేవుడు
దేవుడు దేవుడు
ఈ విధముగా ఆత్మ (అల్లాహ్) మనుషులను సృష్ఠించాడు. అయితే మనిషి ఆకారములో తేడాలుయున్నా, లోపల యున్న మిషనరీ (యాంత్రిక) నిర్మాణములో ఏ మార్పు ఉండదు. శరీరము 25 భాగములుగా యుండి పని చేయునట్లు ఆత్మ (దేవుడు) మనిషిని నిర్మించాడు. మనిషి జననము లోనూ, అట్లే మనిషి మరణములోనూ, జీవనములోనూ అందరూ ఒకే సూత్రమును అనుసరించి, ఒకే సూత్రము ప్రకారము నడుచుచున్నారు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము వరకు మనుషులందరూ ఒకే సంఘముగా బ్రతుకుచూ, ఒకే భక్తిభావము కల్గి తమలో ఎటువంటి భేదములు లేకుండా మనుషులంతా ఒకటేయను సూత్రము ప్రకారము జీవించెడివారు. మూడు యుగములనుండి మనుషులు ఒకరికొకరు హెచ్చుతగ్గుల ఆహారమును తింటూ, హెచ్చుతగ్గుల కష్టసుఖములను అనుభవించుచూ ఒకే మానవ సంఘముగా యుండేవారు. అయితే కలియుగము అయిన ప్రస్తుత యుగములో మనుషులు తాము బ్రతుకుచున్న ఒకే ధర్మములో భేదములను కల్పించుకొని, ఆ భేదముల ప్రకారము వేరువేరు సంఘములుగా (గుంపులుగా) చీలిపోయి, చీలిపోయిన గుంపుకు 'మతము' అను పేరు పెట్టుకొని, ప్రస్తుతము పన్నెండు మతములుగా అనగా పన్నెండు చీలికలుగా తయారయిపోయి ఎవరి మతమును వారు సమర్థించు కొనుచున్నారు. ఎవరి మతములో వారు సంతోషపడుచూ మా మతమే పెద్దయని ఒకరి కొకరు పోటీపడుచున్నారు. ఆ పోటీలో ఆధిపత్యమును సంపాదించు కొనుటకు ఒక వర్గమువారు మరొక వర్గమును చంపుటకుకైనా వెనుకాడడము లేదు. వాటినే మత ఘర్షణలు అని అంటున్నారు. అదే విషయమునే (23-53) లో వ్రాశారు.
ఈ వాక్యముకంటే ముందు వాక్యములో అనగా (23-52) లో ఏమున్నదో ఒకమారు చూస్తే దేవుడు మనుషులను తయారు చేసిన ఉద్దేశ్యము వేరు, మనుషులు ప్రవర్తించే ప్రవర్తన వేరని తెలియుచున్నది.
(23-52) ''నిశ్చయముగా మా ఈ ధర్మము ఒకే ధర్మము. నేనే మీ అందరి ప్రభువును. కాబట్టి మీరు నాకు భయపడండి.''
ఈ వాక్యమును చూస్తే నేను ముందు చెప్పినట్లు మనుషులందరినీ దేవుడు ఒకే సమాజముగా తయారు చేసి, అందరికీ ఒకే ధర్మమును తయారు చేసి ఇచ్చాడు. అందరికీ ఆయనే దేవుడు. అయినా మనుషులు మతమను మాయలో పడిపోయి, తమ మానవ సమాజమును ముక్కలుగా చీల్చు కొన్నారు. తన ధర్మమును వేరు వేరుగా చీల్చుకోవడమేకాక దేవున్ని కూడా వేరువేరుగా చెప్పుకొంటున్నారు.
☞