till 67
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
51. మజీద్‍కు హాజరయ్యే ప్రతీసారి వస్త్రాలంకారము పట్ల శ్రద్ధ వహించండి. తినండి త్రాగండి కానీ మితి మీరి పోకండి. (7-31)
ఈ వాక్యము దైవ గ్రంథములో 60 శాతము గల సూక్ష్మవాక్యము లలో ఇది ఒకటని చెప్పవచ్చును. ఈ వాక్యము పైకి చూచుటకు పూర్తి స్థూలముగా కనిపించినా పూర్తి సూక్ష్మ భావముతో కూడియున్నది. అట్లు సూక్ష్మము కాదని స్థూలముగానే చెప్పియున్నారని ఎవరయినా అనినా వస్త్రాలంకారములోను, తినే దానిలో, త్రాగే దానిలో ఏమాత్రమూ జ్ఞానము లేదని తెలియుచున్నది. దేవుడు మనుషులకు వస్త్రాలలోను, తిండిలోను జ్ఞానమున్నదని చెప్పునా? అని ప్రశ్నరాక తప్పదు. ప్రార్థనా స్థలములలో వస్త్రాలంకారము, తినడము, త్రాగడముతో పనే లేదు. ఈ రెండు ప్రపంచ విషయములు అగును గానీ, దేవుని జ్ఞానమునకు ఏమాత్రము సంబంధము లేదు. దేవుడు తన జ్ఞానమును దుస్తులు ధరించడములోను, తినడము, త్రాగడములోను చెప్పునాయని అనుమానము రాకతప్పదు. స్థూలముగా చెప్పుకొంటే ఏమాత్రము జ్ఞానముకాని విషయమును సూక్ష్మముగా తెలిస్తే మంచి జ్ఞానముతోనే వాక్యము ఇమిడియున్నదని తెలియగలదు. ఈ వాక్యములో పూర్తి విషయము ఎలా ఉన్నదో ఇప్పుడు చూస్తాము.
(7-31) ''మీరు మస్జీద్‍కు హాజరైన ప్రతీసారి వస్త్రాలంకరణపట్ల శ్రద్ధ వహించండి. తినండి త్రాగండి కానీ మితిమీరకండి. మితిమీరి పోయే వారిని ఆయన (అల్లాహ్) ఇష్టపడడు.''
దైవ గ్రంథములు మూడు అయినా మూడు ఒకే దేవున్ని గురించి ఒకే జ్ఞానమును చెప్పాయి. తినండి, త్రాగండి యను మాట రెండవ దైవ గ్రంథమయిన ఇంజీలులో (బైబిలులో) ఏసు తన శిష్యులతో పాటు పస్కా పండుగ విందులో పాల్గొనినప్పుడు 'ఒక రొట్టెను ఇచ్చి ఇది నా శరీరమనీ, ద్రాక్ష రసమును ఇచ్చి ఇది నా రక్తము' అని చెప్పి రొట్టెను (శరీరమును) తినండియనీ, పానీయమును (రక్తమును) త్రాగండియని చెప్పాడు. తినండి, త్రాగండి యను పదము బైబిలు గ్రంథములోనే వచ్చినది. అయితే అక్కడ కూడా మనుషులు ఆయన శరీరమును తినడము ఏమిటి? ఆయన రక్తమును త్రాగడము ఏమిటి? ఈయన తిక్కపట్టి మాట్లాడుచున్నాడు అని అనుకొన్నారు. ఆ విషయము నేటికీ ప్రజలలో అర్థము కాకుండా పోయినది. అదే అర్థము కాని పరిస్థితిలో యున్న ప్రజలకు ఆ గ్రంథము తర్వాత ఆరు వందల (600) సంవత్సరములకు వచ్చిన అంతిమ దైవ గ్రంథములో తినండి, త్రాగండి యను పదము వచ్చినది. తినేది, త్రాగేది జ్ఞానము కాదని అందరికీ తెలుసు. అయితే ఈ రెండు మాటలను రెండు దైవ గ్రంథములలో ఎందుకు పొందుపరచారు అను విషయము జుట్టు పెరుక్కున్నా అర్థము కాకుండా పోయినది. అలాంటప్పుడు ఆ వాక్యములను అటు క్రైస్థవులు, ఇటు ముస్లీమ్‍లు ఇద్దరూ స్థూలముగానే చెప్పుకొంటున్నారు.
ఇప్పుడు ఆ వాక్యము మా ముందరకు వచ్చినది. ఖుర్ఆన్‍లో (3-7)లో ''దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మానవునికీ తెలియదని'' చెప్పిన ప్రకారము ఇటువంటి కష్టమైన వాక్యములకు దేవుడే వివరమును చెప్పవలసి యున్నది. తెలుసుకోవాలన్న అభిలాష (శ్రద్ధ) కలవారికి దేవుడు మనుషులలో ఏదో ఒక మనిషి శరీరము నుండి తప్పక వివరించి చెప్పును. ''మనుషులు మాట్లాడు ప్రతి మాటను శరీరములో ఆత్మగాయున్న దేవుడే (అల్లాహ్‍యే) మాట్లాడుచున్నాడు గానీ మాట్లాడు వారు మీరు కాదు'' యని బైబిలు గ్రంథములో మత్తయి అధ్యాయము పది, వాక్యము 20 లో చెప్పియున్నారు. ప్రతి మాట దేవుడే మాట్లాడుచున్నప్పుడు ప్రత్యేకించి జ్ఞాన వివరములు ఒక మనిషి నుండి చెప్పుచుండును. కొందరిలో అజ్ఞానముగా, తెలివి తక్కువగా మాట్లాడువాడు దేవుడే, ఒక్కనిలో జ్ఞాన వివరము చెప్పువాడు దేవుడే. నా లోని ప్రతిమాట నేను పలుకలేదు తండ్రియైన (దేవుడుయైన) ఆత్మయే పలుకుచున్నదని తెలిసిన నేను ఇప్పుడు అర్థముకాని తినండి, త్రాగండి అను పదములకు గల సూక్ష్మ జ్ఞానమును కూడా చెప్పగలడని నమ్ముచున్నాము.
తినండి, త్రాగండి అను విషయము స్థూలముగా జ్ఞానము కాదని తెలుసు. అయితే (7-31) వాక్యములో తినండి, త్రాగండి అనుమాటకంటే ముందు ప్రార్థన మందిరములకు పోయినప్పుడు ప్రతిసారీ వస్త్రాలంకరణలో శ్రద్ధ కలిగి ఉండాలియని చెప్పారు. వస్త్రాలంకారమునకు జ్ఞానమునకు స్థూలముగా ఎటువంటి సంబంధము లేదు. ఒకే వస్త్రముండి మారు వస్త్రము లేని పేదవాడు వస్త్రాలంకారము చేసుకొనలేడు కదా! అటువంటప్పుడు వస్త్రాలు సరిగా లేనివాడు జ్ఞానమును తెలియలేడని చెప్పలేము కదా! జ్ఞానము తెలియుటకు శ్రద్ధ అవసరము యని ప్రథమ దైవ గ్రంథములో చెప్పారు. అందువలన శ్రద్ధయున్న వారికి దుస్తులతో పని లేకుండానే జ్ఞానము లభించును. అటువంటప్పుడు ప్రార్థనా మందిరములకు పోయినప్పుడు ప్రతిసారీ వస్త్రాలంకరణ ఉండాలియని అనడము స్థూలముగా తీసుకొంటే అర్థముకాని విషయమై పోయినది. అందువలన శరీరము లోపలనుండి శరీర అధిపతియైన దేవుడు ఏమి తెలియజేస్తాడో ఇప్పుడు వేచి చూస్తాము. ఈ వాక్యము చివరిలో మితిమీరి పోకండి యని కూడా చెప్పాడు. ఏ విషయములో మితిమీరి పోకూడదో అది స్పష్టముగా అర్థమగునట్లు తెలియజేయలేదు. అందులో కూడా ఏదో దాగియుందని తెలియుచున్నది.
'మస్జీద్‍కు పోయినప్పుడు' అని వాక్యములో యుండుట వలన మస్జీద్ అంటే ఏమిటి? అని యోచిస్తే మనిషి ఎక్కడ దైవ ప్రార్థన చేయునో ఆ స్థలమును మస్జీద్యని అనవచ్చును. అందువలన కట్టడములతో కూడుకొన్న దానినే మస్జీద్ అనుటకు వీలులేదు. ఖాళీ స్థలములో ప్రార్థన చేసినా అది అప్పటికి మస్జీద్యనే చెప్పవచ్చును. మస్జీద్‍కు పోయిన ప్రతిసారియని అనగా! ప్రార్థన చేసిన ప్రతిసారియని అర్థము. ఇక వాక్యములోని 'దుస్తుల' విషయమునకు వస్తే వస్త్రాలంకరణ మీద శ్రద్ధ వహించండియని చెప్పారు. అందరికీ వస్త్రములుండవచ్చును గానీ, అందరి వస్త్రములు అలంకారముగా ఉండవు. దీనినిబట్టి వస్త్రములు వేరు, వాటి అలంకారము వేరని తెలియుచున్నది. ఇక్కడ వాక్యములో గల వస్త్రము ఏమిటి? వస్త్ర అలంకారము ఏమిటి? అని స్థూలముగా కాకుండా సూక్ష్మముగా ఆలోచిస్తే మనిషి శరీరమునకు ధరించు వస్త్రములు బయటికి కనిపించునవనీ, మనిషిలోని జీవుడు ధరించు వస్త్రములు ప్రతి మనిషికీ శరీరమే వస్త్రముగా యున్నదని తెలియుచున్నది. బయట శరీరమునకు గుడ్డను మార్చినట్లు, లోపలి జీవునకు 'మరణములో పాత శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నాడని' భగవద్గీతలో సాంఖ్యయోగమున 22వ శ్లోకము యందు చెప్పబడి యున్నదని మరువకూడదు. అక్కడ చెప్పినట్లు మనిషిలోని జీవుని వస్త్రము అతను ధరించిన శరీరముకాగా, ఆ శరీరములోని మనస్సు, బుద్ధినిబట్టి ఆ శరీరమునకు 'విలువ' అను అలంకారము ఏర్పడును. మనస్సు, బుద్ధి శుద్ధము లేని జీవునికి విలువ లేదు. మనస్సు, బుద్ధి శుద్ధముగా పవిత్రముగా యున్న వాని శరీరము ''జ్ఞాన విలువ'' అను శక్తి అలంకారము కలిగియుండును.
ప్రత్యేకించి దైవ ప్రార్థన సమయములో మనస్సు, బుద్ధి పవిత్రముగా, శుద్ధముగా యుంచుకొన్న వాని ప్రార్థన ఎంతో జ్ఞాన విలువతో (జ్ఞానశక్తితో) కూడుకొని యుండును. మనస్సు ఏకాగ్రతగా, బుద్ధి ఆలోచనారహితముగా యున్నప్పుడు చేసిన ప్రార్థనలో జ్ఞానశక్తి లభించును. పవిత్ర మనస్సు, పరిశుద్ధ బుద్ధి లేనివాడు ఎన్నిమార్లు ప్రార్థన చేసినా అది వృథా ప్రార్థనేయగును. ఆ ప్రార్థనలో ఏమాత్రము జ్ఞానశక్తి లభించదు. జ్ఞానశక్తినే జ్ఞానాగ్నియని ప్రథమ దైవ గ్రంథములో కూడా చెప్పియున్నారు. ప్రార్థన చేసిన ప్రతిసారి శరీరములో మనోబుద్ధులు రెండూ పవిత్రముగా యుంటే వాని దుస్తులు అలంకారముగా యున్నట్లే లెక్కించబడును. ప్రార్థన సమయము తర్వాత దైవజ్ఞాన సముపార్జన కొరకు దైవ గ్రంథములోని వాక్యములను చదివి అందులో యున్న జ్ఞానమును గ్రహించవలసి యుండును. ఏసు రొట్టెను చూపి 'ఇది నా శరీరము అని, పానీయమును చూపి ఇది నా రక్తము అనీ చెప్పి తినండి, త్రాగండి' యని ద్వితీయ దైవ గ్రంథములో చెప్పడము జరిగినది. అంటే నా శరీరమును తినండి, శరీరములోని రక్తమును త్రాగండియని అర్థము కదా! ఇక్కడ గ్రంథమును శరీరముగా, గ్రంథము లోపల కనిపించక ఇమిడియున్న జ్ఞానము శరీరము లోపల బయటికి కనిపించక ప్రవహించుచున్న రక్తముగా అర్థము చేసుకోవలసి యున్నది. ప్రార్థనా స్థలములో ప్రార్థన అయిన తర్వాత కొంతసేపు దైవ గ్రంథమును చదివి అందులో కనిపించక ఇమిడియున్న జ్ఞానమును తెలియండి అను ఉద్దేశ్యముతో 'తినండి, త్రాగండి' అని చెప్పడము జరిగినది.
అయితే గ్రంథములో ఎక్కడయితే తినండి, త్రాగండియని అన్నారో అక్కడంతా స్థూలముగా అర్థము చేసుకోవడము వలన గ్రంథములోని ముతషాబిహాత్ (సూక్ష్మమైన) అను వాక్య అర్థము తెలియక తప్పుదారి పట్టుచున్నారు. ఇదే విషయమే సూరా రెండు, ఆయత్ 187 లో కూడా చెప్పియున్నారు. అక్కడ 'తినండి, త్రాగండి' అను విషయము ఎలాకలదో వాక్యములో చూస్తాము.
(2-187) ''ఉదయపు తెల్లరేఖలు రాత్రి నల్లచారల నుండి స్పష్టపడే వరకు మీరు తినండి, త్రాగండి'' అని ఉన్నది.
తెల్లవారు జామున అనగా మూడు గంటల నుండి ఆరు గంటల వరకు అనగా దాదాపు మూడు గంటల కాలము మనిషిలో బుద్ధి, మనస్సు తాజాగా ఉండడమే కాకుండా బుద్ధి ఆలోచనారహితముగా, మనస్సు చలనరహితముగా ఉండును. అందువలన ఆ సమయములో గ్రంథమును చదివి అందులోని జ్ఞానమును తెలియమని చెప్పడము జరిగినది. ప్రపంచ చదువు చదివే వ్యక్తులయినా తెల్లవారు జామున చదవడము మంచిదని అప్పుడు చదివిన చదువు బాగా జ్ఞాపకముండునని కొందరు చెప్పగా వినియే ఉందుము. అందువలన ప్రాతఃకాలమున చదివిన చదువు శ్రేష్ఠమైనదను ఉద్దేశ్యముతో (2-187) వ వాక్యములో 'తొలిజాములోనే తినండి, త్రాగండి' యని అర్థముతో చెప్పియున్నారు. ఆ విషయమును తెలియని వారందరూ, వాక్యమును స్థూలముగా అర్థము చేసుకొను వారందరూ దేవుడు చెప్పిన సూక్ష్మ భావమును కోల్పోవుచున్నారు. అందువలన అంతిమ దైవ గ్రంథము లోని జ్ఞానము చాలామందికి అర్థము కాకుండా పోయినది.
వాక్యములో చివరిగా మితిమీరి పోకండి ''మితిమీరి పోయేవారిని అల్లాహ్ ఇష్టపడడు'' అని ఉన్నది. వాక్యములో చెప్పిన చివరి విషయము మితిమీరి పోకండియని చెప్పడములో ముఖ్యమైన సందేశము కలదు. దేవుని సందేశమును బుద్ధియున్న వాడు, శ్రద్ధతో గ్రహించువాడు తెలియగలడు. మీరు అడిగే ప్రతిమాటకు, మీకు తెలియని ప్రతిమాటకు 'నేను మీకు అత్యంత సమీపమున ఉండి జవాబు ఇవ్వగలనని' (2-186) లో అల్లాహ్ స్వయముగా చెప్పియున్నాడు. కావున మనకు తెలియని విషయమును అల్లాహ్‍కు విన్న వించుకొంటే ఆయన తప్పక జవాబు ఇచ్చి సత్యమును తెలుపగలడు. ప్రత్యేకించి అల్లాహ్‍కు ఇష్టుడయిన వానికే ఆయన సరియైన జవాబు ఇవ్వగలడు. అల్లాహ్‍కు ఇష్టము లేనివానికి తప్పు జవాబు ఇచ్చి తప్పుదారి పట్టించగలడు. అందువలన మొదట అల్లాహ్‍కు ఇష్టుడుగా ఉండడము నేర్చుకోవాలి.
'మితిమీరి పోకండి' యని చెప్పిన విషయమును గురించి నాకు అల్లాహ్ తెలియజేసిన విషయమును మీకు తెలియజేయుచున్నాను చూడండి. మనిషి ప్రతి విషయములోనూ కర్మబద్దుడైయున్నాడు. అల్లాహ్ అంతిమ దినమున తీర్పు తీర్చిన విధముగానే ప్రతి విషయము జరుగుచుండును. ఎవడు ఏమనుకొనినా, ఏమి చేయాలనుకొనినా ముందే వ్రాయబడిన కర్మ ప్రకారమే జరుగుచుండును తప్ప మనిషి ఇష్ట ప్రకారము జరుగవు. మనిషి ఒక్క జ్ఞాన విషయములో తప్ప మిగతా ప్రపంచ విషయములలో మితిమీరిపోయే అవకాశమే లేదు. 'మితి' అనగా 'కర్మ నిర్ణయము' అని అర్థము. దేవుని జ్ఞాన విషయములో మాత్రము మనిషి పరిమితి ఉండదు. ఎందుకనగా! ప్రపంచ విషయములు మాత్రము కర్మపత్రములో వ్రాసిన విధముగా జరుగుచుండును. జ్ఞాన విషయములు కర్మను అనుసరించి ఉండవు. దేవుడుగానీ, దేవుని జ్ఞానముగానీ కర్మకు అతీతముగా ఉండును. దేవుని విషయములలో మనిషి ఇష్టమువచ్చినట్లు ప్రవర్తించవచ్చును. జ్ఞానమును తెలుసుకోవాలంటే తన ఇష్టప్రకారము ఎంత జ్ఞానమునయినా తెలియవచ్చును. జ్ఞాన విషయములలో కర్మపరిమితి ఉండదు, కావున మనిషి పద్ధతిగా జ్ఞానమును తెలియవచ్చును. అయితే కొందరు పద్ధతి లేకుండా మితిమీరి కూడా పోవుచుందురు. దేవుడు గ్రంథములో చెప్పినది ఒకటైతే తాము మరొకటి చెప్పుచుందురు. దేవుడు బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రకారము జ్ఞానమును చెప్పియున్నాడు. శాస్త్రపద్ధతిని అనుసరించి తెలియు వారు స్వచ్ఛమయిన, సత్యమైన జ్ఞానమును తెలియుచుందురు. శాస్త్రపరిధిని వదలి పరిధి దాటి మితిమీరి పోవువారు శాస్త్రబద్దమైన జ్ఞానమును తెలియ లేరు. దేవుడు చెప్పినట్లు కాకుండా దైవశాస్త్రమును వదలి మితిమీరి పోవువారికి దేవుని జ్ఞానము అశాస్త్రీయమైనది, అసత్యముతో కూడినది తెలియును. అప్పుడు తమకు తెలిసిన అశాస్త్రీయ జ్ఞానమునే సత్యమని నమ్మి దానినే ఇతరులకు చెప్పుచూ తాము తప్పుదారి పోవడమే కాక తమమాటను నమ్మువారందరినీ తప్పుదారి పట్టించడము జరుగును. నేడు అనేకమంది బోధకులు, మత పెద్దలు అనువారు అదే స్థితిలో యున్నారు.
ఉదాహరణకు నేడు మూడు మతములలో 'ఉపవాసము' అను పేరుతో ఆహారమును తినకుండా ఉండడము కలదు. అది అన్ని మతములలో సాంప్రదాయ కార్యముగా సాగుచున్నది. అయితే దైవ గ్రంథములలో ఆ కార్యమున్నదని అన్ని మతముల వారు చెప్పుచుందురు. వాస్తవముగా ఉపవాసమునకు సంబంధించిన వాక్యములను దేవుడు ఏ దైవ గ్రంథములో కూడా చెప్పలేదు. అయితే కొందరు మా మత గ్రంథములో ఫలానాచోట, ఫలానా వాక్యమున్నదని చెప్పినా, ఆ వాక్యమును చూస్తే అక్కడ చెప్పినది ఒక్కటి వీరు అర్థము చేసుకొన్నది మరొక్కటి అని తెలియుచున్నది. దేవుడు చెప్పిన వాక్యమును చూస్తే ఆ వాక్యము శాస్త్ర పరిధిలో జ్ఞానమును చెప్పియున్నా కొందరు మనుషులు శాస్త్రపరిధిని అతిక్రమించి, ఉన్నదానిని ఉన్నట్లు కాకుండా వేరు విధముగా అర్థము చేసుకోవడము జరిగినదని తెలియుచున్నది. అటువంటివారు దేవుడు చెప్పిన దానిని శాస్త్రపరిధిలోనే అర్థము చేసుకోక, అజ్ఞాన విధానములో అర్థము చేసుకోవడము వలన, అటువంటి వారిని దేవుడు ఇష్టపడడు అని కూడా వాక్యములో చెప్పడము జరిగినది. శాస్త్రపరిధిని అనుసరించని వారు దైవ గ్రంథమునకే వ్యతిరేఖముగా చెప్పుచుండుట వలన వారంటే దేవునికి కూడా నచ్చదనియే చెప్పవచ్చును. మనిషి జన్మల విషయము గానీ, దేవుని అవతరణ విషయముగానీ, స్వర్గ, నరక, పరలోక విషయములో గానీ, స్థూల, సూక్ష్మ విషయములోగానీ, ప్రార్థనా విషయములోగానీ, దేవుని పాలన కొనసాగించు దేవదూతల విషయములోగానీ, దేవుడు, దేవతల విషయములో గానీ, ధర్మముల విషయములోగానీ, ఆత్మ, పరమాత్మల విషయములో గానీ మొత్తముగా శాస్త్రపరిధి దాటిపోయి తప్పు భావములలో నిండిపోవుట వలన అటువంటివారు దేవునికి అయిష్టులుగా మిగిలిపోయారు. అదే విషయమునే ఈ వాక్యము చివరిలో చెప్పారు. అయినా ఈ వాక్యము మొత్తము సూక్ష్మమైన భావముతో కూడుకొని యుండుట వలన చాలామందికి అర్థము కాలేదనియే చెప్పవచ్చును.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
52. ప్రతి సమాజానికి ఒక గడువు నిర్ధారించబడి వుంది. నిర్ణీత సమయము వచ్చినప్పుడు ఒక్క క్షణము కూడా వారు ముందు వెనుక కాలేరు. (7-34)
ఈ వాక్యములో మొదటనే తప్పుదారి పట్టు అవకాశము గలదు. 'సమాజము' అంటే అందరూ బయటి చూపు చూస్తూ ఫలానా మతము వారనో, ఫలానా కులము వారనో లేక ఫలానా దేశము వారనో, ఫలానా ప్రాంతము వారనో అనుకోవడము జరుగుచున్నది. ఏ విధముగా మొదటనే చెప్పిన సమాజము అర్థము కాలేదో అట్లే తర్వాత చెప్పిన 'నిర్ణీత సమయము' అంటే ఏమిటనిగానీ, 'నిర్ధారించబడిన గడువు' అంటే ఏమిటనిగానీ, ముందు వెనుక అంటే ఏమిటని గానీ తెలియకుండా పోయినది. ఈ విషయమును గురించి చర్చించుకోబోయే ముందు దైవ గ్రంథములోనున్న ఈ వాక్యమును చూస్తాము.
(7-34) ''ప్రతి సమాజానికి ఒక గడువు నిర్ధారించబడియున్నది. వారి నిర్ణీత సమయము వచ్చేసినప్పుడు ఒక్క క్షణము కూడా వారు ముందు వెనుక కాలేరు.''
ఇక్కడ ఈ వాక్యములో బాగా గమనించితే ముందుగా 'ప్రతి సమాజానికి' యని అన్నారు. చాలామందికి సమాజము అంటే ఒక మతము అని అనుకోవడము సహజముగా యున్నది. ఇంకా కొందరు ఒక ప్రాంతములో ఒకే విధమైన జీవనము సాగించువారిని గానీ, లేక ఒక కులము వారినిగానీ ఒక సమాజము అని అనడము జరుగుచున్నది. దైవ గ్రంథములో దేవుడు చెప్పిన ఈ వాక్యములో 'సమాజము'అంటే బ్రహ్మ విద్యా శాస్త్రముననుసరించి యున్న అర్థము ఏమి? అని మనము తెలియ గలిగితే మనుషులు ఇప్పటివరకు అనుకొన్నది పరిమితి దాటి అనుకొన్నట్లు తెలియుచున్నది. శాస్త్రపరిధిలో తెలియగలిగితే ఇంతవరకు మనుషులు అనుకొన్న దానికంటే భిన్నముగా యున్న అర్థము కనపడుచున్నది. అందువలన ఏది సత్యము? ఏది అసత్యము? అని జాగ్రత్తగా చూడవలసి వచ్చినది. అంతేకాక అందరికీ ఎంతో వివరముగా తెలియ చెప్పవలసిన అవసరమున్నది. ఇప్పుడు 'సమాజము' అను పదమును వివరించు కొందాము. సమాజము అను పదమును విడదీసి చూస్తే అందులో రెండు భాగములున్నవి. ఒకటి సమ, రెండు జము, సమ+జము= సమాజము. సమ అనగా సమానమైన అనియూ ఏమాత్రము హెచ్చుతగ్గులు లేకుండా ఒకే విధముగా యున్నదనియూ తెలియుచున్నది. జము అనగా పుట్టడము అని అర్థము. సమాజము అనగా సమానముగా పుట్టడము అని అర్థము గలదు. ఈ అర్థము ప్రకారము ఒక మతమును సమాజము అని అనడము సరిపోదు. మతములో అందరూ సమానముగా పుట్టలేదు. ఆ లెక్క ప్రకారము సమాజము అను పేరు ఒక మతమునకు గానీ, ఒక కులమునకు గానీ, ఒక ప్రాంతవాసులకు గానీ వర్తించదు. అటువంటప్పుడు సమాజము అను పేరు దేనికి లేక ఎవరికి వర్తిస్తుందని చూస్తే బయట 'సమాజము' అను పదము ఎవరికీ వర్తించదని తెలియుచున్నది. బయట సమాజము అనుకొను దానికంటే శరీరము లోపలి సమాజమే నిజమైన సమాజమని తెలియుచున్నది. శరీరము లోపలి సమాజము సమానముగా ఒక్కమారు పుట్టుచున్నది. అట్లే ఒకమారే చనిపోవుచున్నది. ఇప్పుడు ఈ విషయము బాగా అర్థము కావాలంటే సమానముగా అందరూ ఒకేమారు పుట్టి, ఒకే విధముగా పెరిగి, ఒకే ఆయుష్షు కలిగి, ఒకేమారు చనిపోవు వారందరినీ కలిపి సమాజము అని అనవచ్చును. అలా జరుగునది శరీరము బయట లేదుగానీ శరీరము లోపల జరుగుచున్నది.
శరీరములో ఒక గుంపుగాయున్న శరీర భాగములన్నీ ఒకేమారు పుట్టడము, ఒకే విధముగా పెరిగి, ఒకే ఆయుష్షు కలిగి ఒకేమారు చనిపోవడము జరుగుచున్న విషయమే. అందువలన శరీరమును సమ సమాజ నిలయము అని అన్నారు. వివరముగా తెలియగలిగితే శరీరములో మొత్తము 25 భాగములు గలవు. మనిషి పుట్టుకలో శరీరము పుట్టుచున్నది. అప్పుడే శరీరములో ఒక్కమారుగా 25 భాగములు పుట్టుచున్నవి. ఒకే సమానముగా పుట్టునవి శరీరములోని భాగములే యగుట వలన సమ+ జము=సమాజము అని శరీరములోని గుంపును అనవచ్చును. శరీరములోని గుంపు 25 భాగములుగాయుండగా, అందులో జీవుడు కూడా 25వ భాగముగా కలడు. బాహ్యేంద్రియములు 10, అంతరేంద్రియములు జీవునితో 15 గలవు. లోపలివి 15, బయటి ఇంద్రియములు 10తో కలిపి మొత్తము 25 సమాజముగా యున్నవి. శరీర సమాజము ఒకేమారు పుట్టడమేకాక ఒకేమారు చనిపోవుచున్నది. అందువలన (7-34) వాక్యములో సమాజము అను మాటను సజీవ శరీరమునే అన్నట్లు చెప్పారు. ప్రతి మనిషికి దేవుడు కర్మప్రకారము ఎప్పుడు చనిపోవాలో నిర్ణయము చేసియుంచును.
మనిషి శరీరమును ధరించి పుట్టుచున్నాడు, శరీరములో జీవుడు తనతో పాటు 24 శరీర భాగములతో నివాసము చేయుచున్నాడు. శరీరములో 24 భాగములు ఒక్కొక్కటి ఒక్కొక్క పనిని చేయుచుండుట వలన శరీర భాగములను జీవునితో పాటు నివాసము చేయు సమాజము అని చెప్పుచున్నాము. 24 భాగములు పని చేయునట్లు జీవుడు కూడా శరీరములో ఒక పనిని చేయుచున్నాడు. ఒక ప్రత్యేకమైన పనిని చేయు అవయవమును ప్రత్యేక భాగమని చెప్పవచ్చును. అదే విధముగా శరీరములో జీవునితో సహా అన్ని భాగములు పని చేయుచుండుట వలన మొత్తము 25 భాగములని చెప్పాము. 24 భాగములు ప్రకృతి సంబంధమైనవి కాగా, 25వ భాగమయిన జీవుడు ఆత్మ (దేవుని) సంబంధము. జీవుడు మినహా 24 భాగములు స్వయముగా పని చేయునవి కావు. 24 భాగముల చేత శరీరములో జీవునితో పాటు నివాసమున్న ఆత్మ (దేవుడు) పనిని చేయిస్తున్నాడు. 24 భాగముల చేత ఆత్మ సర్వకార్యములను వాని కర్మను అనుసరించి చేయించుచున్నది. కార్యములను చేయు 24 అవయవ భాగములు ఎంత పనిని చేసినా వాటికి అలసట ఉండదు. అలాగే పనిని చేయించు ఆత్మకు కూడా అలసట ఉండదు. శరీరములో ఒక కార్యము జరుగుచున్నప్పుడు అన్ని అవయవములు పని చేయవచ్చును లేక కొన్ని చేస్తూ కొన్ని ఊరక ఉండిపోవడము జరుగుచున్నది. కొన్ని కార్యములలో అవయవములు అన్ని పని చేసినా, చేయకపోయినా ఆత్మ చేయించునది కావున అహర్నిశలూ, ఎల్లప్పుడూ అన్ని కాలములలో ఆత్మ పని చేయుచున్నది. జీవునకు నిద్రయను విశ్రాంతియున్నా ఆత్మకు అటువంటి విశ్రాంతి యుండదు. ఆత్మకు నిద్రగానీ, కునుకుగానీ ఉండదు. అట్లే ఎల్లకాలము పని చేసినా అలసట ఉండదు. శరీరములో అల్లాహ్ ఆత్మరూపములో కార్యకర్తగా యుండి అన్ని పనులను చేయిస్తున్నాడు. అందువలన ఆత్మను 'జీవున్ని, అవయవములను నడిపేవానిగా', జీవుడు 'నడుపబడేవాడుగా' 50వ సూరా, 21వ ఆయత్‍లో చెప్పియున్నారు. దేవుడు కార్యకర్తగా యున్నాడని సూరా ఆరులో ఆయత్ 102లో చెప్పియున్నారు. అలాగే అల్లాహ్‍కు 'కునుకు గానీ, అలసటగానీ లేదని' సూరా రెండు, ఆయత్ 255లో చెప్పియున్నారు.
ఈ విధముగా చెప్పితే సమాజముగా యున్న శరీరమును ఆత్మ (అల్లాహ్) ఎంతకాలము నడిపినా చివరకు ఒకరోజు మరణమును కూడా కలుగజేయును. జీవునికి పుట్టుకను, మరణమును కలుగజేయువాడు అల్లాహ్‍యేనని తెలియవలెను. మనిషి మొదట చనిపోయినప్పుడే అల్లాహ్ (ఆత్మ) జీవుడు సంపాదించుకొన్న కర్మప్రకారము తీర్పు చేసియుండును. ఆ తీర్పులో రెండవ జన్మలో మనిషి ఏయే పనులు చేయాలి, ఏయే అనుభవములను అనుభవించాలి, ఏమి తినాలి, ఎలా బ్రతకాలి, చివరకు ఎప్పుడు చనిపోవాలని నిర్ణయము చేసియుండును. జీవితములో అన్ని కార్యముల నిర్ణయము ప్రకారము 'మరణము' అను నిర్ణయము కూడా జరిగియుండును. మరణములో శరీర రూపములో పుట్టిన సమాజ మంతయూ ఒకమారు చనిపోవలసియుండును. అలా ఎప్పుడు చనిపోవలసినది ఆత్మ నిర్ణయించి యుండుట చేత, ఆ నిర్ణీత గడువు ఏ సమయములో వచ్చునో ఆ సమయములో మనిషి చనిపోవలసియుండును. మరణమును 'తుది గడువు' అని కూడా గ్రంథములో కొన్నిచోట్ల చెప్పియున్నారు. ఎప్పుడు తుది గడువు వస్తుందో అప్పుడు ప్రతి జీవుడు చనిపోవడము జరుగును. జీవుడు చనిపోయినప్పుడు జీవునితోపాటు పుట్టిన శరీర సమాజమంతయూ అనగా 24 భాగములు చనిపోవడము జరుగుచున్నది.
ప్రతి మనిషికీ చావు యొక్క సమయము నిర్ణయించబడియున్నది. ఆ సమయము ఏదో ఒక రోజు వచ్చును. రోజులో ఏదో ఒక సమయములో రాత్రి పూటనో, పగలు పూటనో వచ్చును. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయము నిర్ణయించబడియుండును. నిర్ణయించబడిన సమయము ఏదయినా అది సెకండ్లతో సహా నిర్ణయముండును. తుది గడువు ఎప్పుడు వచ్చునో అప్పుడు ఒక సెకను వెనుకగానీ, ఒక సెకను ముందుగానీ లేకుండా చనిపోవడము జరుగుచున్నది. అదే విషయమునే వాక్యములో వ్రాశారు. మరణములను ప్రత్యక్షముగా చూస్తున్నాము కావున రాత్రిపూట ఏ సమయములోనయినా చనిపోయినవారిని చూచాము. అట్లే పగలు పూట కూడా సెకండ్ల తేడాతో ఎంతోమంది చనిపోవుచుండుట తెలిసిన విషయమే. ఒకే కాలములో, ఒకే సెకనులో ప్రపంచము మొత్తము మీద ఎంతోమంది చనిపోవుచున్నారు. ఏది ఏమయినా మరణ సమయము వచ్చినప్పుడు ఒక్క క్షణ కాలము కూడా ముందు వెనుక లేకుండా చనిపోవలసియున్నది. చావుల గురించి అందరికీ తెలుసు అయితే శరీర సమాజము గురించి చాలామందికి తెలియదు. 'ప్రతి మనిషికి' అని చెప్పుటకు బదులు వాక్యములో 'ప్రతి సమాజానికి' అని చెప్పియున్నారు. ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క సమాజమున్నదనీ, సమాజములోని సంఖ్య మొత్తము 25 మందని తెలియుచున్నది. 25 గా యున్న సమాజమునకు తుది గడువు ఉండేది సహజమే. గడువుకంటే ముందుగానీ, గడువుకంటే వెనుకగానీ ఒక్క సెకను కూడా తేడా లేకుండా పోవుచుందురు. ఇదియంతయూ ప్రతి దినము జరుగుచున్న పనియే, కావున ఈ వాక్యమును సులభముగా అర్థము చేసుకోవచ్చును.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
53. ఒకవేళ మీలోనుండి నియుక్తులైన ప్రవక్తలు నా ఆదేశాలను వినిపించినప్పుడు తమ్ముతాము సరిదిద్దుకున్న వారికి దుఃఖము గానీ, భయముగానీ ఉండదు. (7-35)
మనుషులలో బోధకులు అనేకులు ఉందురు. అయితే ప్రవక్తలు మాత్రము అరుదుగా ఉందురు. ప్రవక్తలు అను పదములో రెండు భాగములు ఉన్నాయి. ప్రమరియు వక్తలు అని రెండు భాగములు గలవు. భూమిమీద అనేకులుగా యున్న బోధకులను వక్తలు యని అనవచ్చును. బోధకులలోనే ముఖ్యమైన వారిగాయుండు వారు అరుదుగా యుందురు. వారినే ప్రవక్తలు యని అంటున్నాము. 'ప్ర' యనగా 'ముఖ్యమైన' అని అర్థమును తెలియవలెను. ప్ర అను శబ్దమునకు పుట్టుటయని అర్థమున్నా అది ఈ సందర్భములో పనికి రాదు. ముఖ్యమైన బోధలు చెప్పువాడు ప్రవక్తయని పిలువబడును. అంతేకాక సాధారణ బోధకులకంటే ప్రత్యేకమైనవారిని ప్రవక్తలుయని అనడము జరుగుచున్నది.
ప్రవక్తలు యనువారు మనుషులలో నుండియే తయారగుచున్నారు. అల్లాహ్ మనుషులనే బోధకులుగా, మనుషులనే ప్రవక్తలుగా తయారు చేయుచున్నాడు. అల్లాహ్ ఇష్టానుసారమే ప్రవక్తలు తయారగుచున్నారని చెప్పవచ్చును. దేవుని జ్ఞానమును ప్రవక్తయను వ్యక్తి శాస్త్రబద్దముగా బోధించుచుండును. కొందరు బోధకులు దేవుని జ్ఞానమును అశాస్త్రీయముగా బోధించవచ్చును గానీ, ప్రవక్త అలా చేయడు. అల్లాహ్ గ్రంథములో తెలియజేసిన జ్ఞానమును శాస్త్రబద్దముగా బోధించువాడు ప్రవక్తయని చెప్పవచ్చును. అల్లాహ్ జ్ఞానమును తెలిసీ తెలియక బోధించు బోధకులు అనేకులు గలరు. ప్రతి ఊరికి ఒకరు లేక ఇద్దరు బోధకులు ఉండవచ్చును. అయితే వేయి ఊర్లకు ఒక ప్రవక్త ఉండవచ్చును. లేకపోతే ఒక దేశమున కంతటికీ ఒక ప్రవక్త యుండవచ్చును అని చెప్పవచ్చును. గ్రంథములో చెప్పిన ప్రకారము 'ఒక భాషకు ఒక ప్రవక్త యుండునని' గలదు. ''ప్రతి భాషవారికి వారి భాషలో బోధించు ప్రవక్తను పంపుదునని'' సూరా 14, ఆయత్ 4 లో చెప్పారు చూడండి.
(14-4) ''మేము ఏ ప్రవక్తను పంపినా అతను విషయమును స్పష్టముగా విడమరచి చెప్పటానికి వీలుగా తన జాతివారి భాషలో మాట్లాడేవానిగా చేసి పంపాము. ఆపైన అల్లాహ్ తాను కోరిన వారిని అపమార్గము పట్టిస్తాడు. తాను కోరిన వారికి సన్మార్గమును చూపిస్తాడు. ఆయన సర్వాధిక్యుడు, వివేకవంతుడు.''
ఈ వాక్యము ప్రకారము ఒక భాషకు ఒక ప్రవక్తయుండవచ్చును. ఒక దేశములో నాలుగు భాషలు మాట్లాడువారు ఉన్నప్పుడు నలుగురు ప్రవక్తలనయినా పుట్టించవచ్చును లేకపోతే నాలుగు భాషలు తెలిసిన ఒకే ప్రవక్తనయినా పుట్టించవచ్చును. బోధకుడు అనువాడు ఒక్క ఊరిలో ఒకడుండవచ్చును లేక ఒక్కొక్క ప్రార్థన మందిరములో ఒక్కొక్క బోధకుడు ఉండవచ్చును. అయితే ఎందరు బోధకులు యున్నా వారందరూ చివరకు ప్రవక్త చెప్పిన వివరమునే అనుసరించవలసియుండును. బోధకులు మనుషులే, ప్రవక్త మనిషే అయి ఉండుట వలన కొందరు బోధకులు ప్రవక్త చెప్పిన మాటను ఖాతరు చేయకుండా, తమకు తెలిసిన జ్ఞానమే గొప్పదని వాదించుచుందురు. ఏ బోధకుడయినా చివరకు ప్రవక్త బోధలే వినవలసియున్నా, ప్రవక్త బోధనే అనుసరించవలసియున్నా విభేదించడము మానుకోరు. ఈ విషయమును సూరా ఏడు, ఆయత్ 35లో ఇలా చెప్పియున్నారు చూడండి.
(7-35) ''ఒకవేళ మీలోనుండే నియుక్తులైన ప్రవక్తలు మీవద్దకు వచ్చి నా ఆదేశాలను వారు మీకు వినిపించినప్పుడు భయభక్తుల వైఖరిని అవలంబించి తమ్ముతాము సరిదిద్దుకున్న వారికి భయముగానీ, దుఃఖముగానీ ఉండదు.''
ఎదుటి మనిషిని తమకంటే గొప్పవానిగా భావించినప్పుడు, అతని మాటకు విలువ ఇచ్చి, అతను చెప్పు జ్ఞానమును తెలియవచ్చును. అట్లు ఎదుటి మనిషిని తమకంటే తక్కువవానిగా లెక్కించినప్పుడు ఎదుటి మనిషి చెప్పుమాటలను మనిషి వినే స్థితిలో ఉండడు. అలాగే బోధకులు ప్రవక్తను చూచినప్పుడు ప్రవక్త యొక్క విలువను గ్రహించనివారై ఆయన చెప్పు జ్ఞానమును తప్పు పట్టుచూ, తాము గ్రహించక తాము చెడిపోయి తమను అనుసరించువారిని కూడా తప్పుదారి పట్టించుచుందురు. అందువలన 14-4 లో ''అల్లాహ్ ప్రవక్తను పంపినా తాను కోరిన వారిని అపమార్గము పట్టిస్తాడు'' అని చెప్పియున్నారు. నేడు ప్రత్యక్షముగా భూమిమీద బోధకులు ప్రవక్తల మాటలను విననివారై తప్పుదోవ పట్టి పోవుచున్నారు.
7-35 లో ''ప్రవక్తలు మీవద్దకు వచ్చినా ఆదేశములను వినిపించి నప్పుడు భయభక్తులతో విని తమ్ముతాము సవరించుకొన్నప్పుడు'' అని ఉంది కదా! దీనినిబట్టి కొందరు దేవుని జ్ఞానమునకు విభిన్నముగా యున్నారని వారు ప్రవక్తలు చెప్పిన మాటను వినగలిగితే భయము, దుఃఖము ఉండదు అని చెప్పారు. అయితే విననివారు కూడా కొందరుంటారని మరువకూడదు. అలా వినక ప్రవక్తకు కూడా ఎదురు మాట్లాడువారిని దేవుడు అపమార్గములోనే పంపునని (14-4) లో చెప్పియున్నారు. ''ప్రవక్త మాటలు వింటే భయము దుఃఖము పోయి జ్ఞానమార్గములో పోవుదురనీ, వినకపోతే అపమార్గము పట్టిస్తానని'' స్వయముగా అల్లాహ్‍యే చెప్పినట్లు కలదు. నేడు భూమిమీద బోధకులు అధికముగా, ప్రవక్తలు అరుదుగా యున్నారు. ఒక ప్రవక్త చెప్పిన జ్ఞానమును బోధకులు అందరూ వినినా ప్రవక్త మాటను గ్రహించువారు కొద్దిమందే యుందురు. ప్రవక్తలు చెప్పిన జ్ఞానమును వ్యతిరేఖించువారు బోధకులు తమకు తెలిసిన జ్ఞానమే సత్యమైనదని ఇతరులు చెప్పు జ్ఞానము అసత్యమైనదని వాదించుచుందురు. ఎదుటివారు చెప్పు జ్ఞానమును వ్యతిరేఖించువారు ఎదుటివారు ప్రవక్తయని కూడా తెలియక దైవజ్ఞానములో తక్కువ చేసి మాట్లాడుచుందురు. అటువంటి వారిని అల్లాహ్ తప్పక అపమార్గములో పోవునట్లు చేయును.
దేవుడు చెప్పిన జ్ఞానమును శాస్త్రబద్దముగా వివరించువాడు గురువు (ప్రవక్త) యని అనుచుందురు. హిందువులలో ప్రవక్తను గురువు అనియు, ముస్లీమ్‍లలో మరియు క్రైస్థవులలో ప్రవక్తయని అనడము జరుగుచున్నది. ప్రవక్త లేక గురువుకాని వారందరూ జ్ఞానమును బోధించినా వారిని బోధకులు యని అనుచుందురు. అందరి దేవుడు ఒక్కడే మరియు అందరి జ్ఞానము ఒక్కటే అయిన దానివలన హిందువుల గురువయినా, ముస్లీమ్‍ల ప్రవక్త యైనా ఒక్కటే జ్ఞానమును, ఒక్కడే దేవున్ని గురించి చెప్పుచుండును. అయితే బోధకులయినవారు హిందువులయితే ముస్లీమ్‍ల ప్రవక్తను ఒప్పుకోరు. ముస్లీమ్‍లయితే హిందువుల గురువును ఒప్పుకోరు. అట్లుకాక ప్రవక్తలయిన వారు గురువులు చెప్పిన జ్ఞానమును, గురువులయిన వారు ప్రవక్త చెప్పిన జ్ఞానమును తప్పక ఒప్పుకొందురు, సత్యమని గ్రహించుదురు. గురువులు గానీ, ప్రవక్తలుగానీ శాస్త్రబద్దమైన జ్ఞానమునే బోధించుచుందురని వారికి బాగా తెలుసు. ఆ విషయము తెలియని బోధకులు ఏ మతమువారయినా గురువులు (ప్రవక్తలు) చెప్పిన జ్ఞానమును గ్రహించలేని స్థితిలో ఉందురు.
ఉదాహరణకు దైవ గ్రంథములలోని ఒక జ్ఞాన విషయమును గురువులు లేక ప్రవక్తలు ఎలా శాస్త్రబద్దముగా చెప్పుదురో దానిని బోధకు లయినవారు ఎలా గ్రహించుకోలేక వ్యతిరేఖించుచున్నారో వివరము చెప్పు కొందాము. అంతిమ దైవ గ్రంథములో 'అల్లాహ్ విషయము' అనేక ఆయత్‍లలో కలదు. ముస్లీమ్‍లకందరికీ అల్లాహ్ ఒక్కడేయను విశ్వాసము నూరు శాతము గలదు. 'ఆరాధింపతగిన అల్లాహ్ ఒక్కడే' యను విషయమును చెప్పితే అందరూ ఒప్పుకొందురు. అయితే ఇక్కడ ఆరాధింప తగిన అల్లాహ్ ఒక్కడేగానీ, అల్లాహ్ ఇద్దరిగా యున్నాడు. మొదటి అల్లాహ్ ఏ ఆరాధన అవసరము లేనివాడనీ, ఆరాధనకు అర్హుడైన అల్లాహ్ ఒక్కడేయను విషయము శాస్త్రబద్దమైనదని ముస్లీమ్ బోధకులు ఒప్పు కోవడము లేదు. ఊరిలో ఎన్ని ప్రార్థనామందిరములుండునో అక్కడ బోధకులు ఉందురు. అయితే బోధకులు దైవ గ్రంథములోని జ్ఞానమును గ్రహించనివారై గురువుల మాటలను లెక్కచేయరు. ఖుర్ఆన్‍లోని వాక్యములను వివరించి చూపినా వారు అర్థము చేసుకొను స్థితిలో ఉండరు.
ప్రకృతి సంబంధమైన ప్రపంచములో ఆత్మ సంబంధమైన వారు ముగ్గురున్నారనీ, అందులో మొదటివాడు జీవుడు (జీవాత్మ) కాగా, మిగతా ఇద్దరినీ ఒకే పేరుతో అనగా 'అల్లాహ్' యను పేరుతో అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్‍లో చెప్పియున్నారు. అయినా గ్రంథములో ప్రత్యక్షముగా యున్న వాక్యములను శాస్త్రబద్దముగా వివరించి చెప్పినా, కొందరు ముస్లీమ్ బోధకులు ఏమాత్రము వినడము లేదు. తమకు తెలిసినదే జ్ఞానము, ఇతరులు చెప్పునది జ్ఞానము కాదన్నట్లు మాట్లాడు చుందురు. అల్లాహ్యను పేరు ఇద్దరికి చెప్పబడుచున్నప్పటికీ అందులో మనుషులందరికీ ఆరాధ్య దైవము ఒక్కడేయనీ, ఆరాధనకు అతీతముగా యుంటూ అల్లాహ్కంటే ముందు స్థానములో మూడవవాడుగా యున్న వాడొకడు కలడని చెప్పినా అది వారికి గ్రహింపుకు రాదు. అప్పుడు చెప్పబడిన సత్యమును అసత్యముగా భావించి మూడవవాడు లేడుయనీ ఉన్నది ఒక్కడేయని చెప్పుచుందురు. అనేక ఆయత్‍లలో 'ఈయనే మీ ఆరాధ్య దైవము'యని మూడవ అల్లాహ్ రెండవ అల్లాహ్‍ను గురించి చెప్పినమాట వారికి ఏమాత్రము గ్రహింపుకు రావడము లేదు. 'పని చేయు అల్లాహ్‍యే మీ ఆరాధ్య దైవము అనీ, నేను పని చేయనివానిననీ, ఏ అక్కర లేనివాడిననీ' చెప్పినా బోధకులు అవగాహన చేసుకొను స్థితిలో ఉండరు.
ఆ విధముగా వారి చెవులు, కన్నులు ఎందుకు మూసివేయబడ్డాయి, సత్యము అసత్యముగా ఎందుకు అనుకుంటున్నారని ఆలోచిస్తే, చెప్పిన సత్యమును అల్లాహ్‍కు ఇష్టమైనవారికే అర్థమగును. అల్లాహ్‍కు ఇష్టము లేనివారికి ఏమాత్రము సత్యము అర్థము కాదు. అల్లాహ్‍కు ఇష్టము అగుటకు జ్ఞానము మీద శ్రద్ధ యుండి, తనకు దేవుని జ్ఞానము తెలియదని, దేవుడు సత్యమును ఏ రూపములో ఎవరినుండయినా తెలుపునని అనుకొనువాడు దేవునికి ఇష్టుడుగా ఉండును. అట్లు కాకుండా నాకు దేవుని జ్ఞానమంతా తెలుసునని అనుకొనువాడు దేవునికి అయిష్టుడుగా ఉండును. దేవుడు తనకు ఇష్టమున్న వానికి మంచి దైవమార్గమును చూపును. ఇష్టము లేనివానికి అజ్ఞాన మార్గమును చూపును. నేను ఒక గురువుగా అల్లాహ్ ఇద్దరనీ, రెండవవాడు ఆరాధ్య దైవమనీ, మూడవవాడు రెండవ అల్లాహ్‍ను నియమించినవాడనీ, మూడవ అల్లాహ్ రెండవ ఆయనకు 'మృతులను లేపి తీర్పుతీర్చు అధికారమును ఇచ్చాడనీ, సర్వులకూ రెండవ అల్లాహ్‍ను ఆరాధ్య దైవమని తెలియజేశాడని, తాను ప్రజల ఆరాధనల అవసరము లేనివాడిననీ', తనను గురించి ఖుర్ఆన్ గ్రంథములో అక్కడక్కడ చెప్పడమే కాక 112వ సూరాలో గల నాలుగు ఆయత్‍లను మూడవ అల్లాహ్‍ను (తనను) గురించి చెప్పడమైనది.
దేవుడు ప్రపంచమునకంతా ఒక్కడేయనీ, దేవుని జ్ఞానము మూడు దైవ గ్రంథములలో ఉన్నది ఒక్కటేయనీ ఎవడు తెలియగలడో, వాడు సక్రమమైన శాస్త్రబద్దమైన జ్ఞానమును తెలిసి, దైవమార్గములో పోవునట్లు దేవుడే చేయగలడు. అట్లుకాకుండా అల్లాహ్ ఒక్కడేయను మాటను తెలిసినంత మాత్రమున ఏమీ ప్రయోజనము లేదు. ఆరాధింపతగిన అల్లాహ్ ఒక్కడేయని తెలిసినప్పుడే ప్రయోజనము. ఆరాధనకు అతీతముగా యున్న అల్లాహ్ మరొకరున్నారని ఆయనే ఖుర్ఆన్‍లో సూరా రెండు, ఆయత్ 117 లో చెప్పిన అల్లాహ్యనీ, ఆరాధనకు తగిన అల్లాహ్ ఒక్కడే ఆయనే సూరా ఆరు, ఆయత్ 102లో చెప్పబడిన అల్లాహ్యని తెలియవలెను. సూరా రెండు ఆయత్ 117కు, సూరా ఆరు, ఆయత్ 102 కు గల తేడాను గమనిస్తే రెండవ అల్లాహ్, మూడవ అల్లాహ్‍ను గురించి తెలియును.
(2-117) ''భూమి ఆకాశమును ప్రప్రథమముగా సృష్ఠించినవాడు ఆయనే. ఆయన ఏ పనినైనా చేయ సంకల్పించుకొన్నప్పుడు దానిని 'అయిపో' అంటే చాలు అది అయిపోతుంది.'' (మూడవ అల్లాహ్) పరమాత్మ.
(6-102) ''ఆయనే అల్లాహ్ మీ ప్రభువు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన సర్వానికి సృష్ఠికర్త. కావున మీరు ఆయననే ఆరాధించండి. ఆయన ప్రతీ కార్యమునకు కార్యకర్తగా ఉన్నాడు.'' (రెండవ అల్లాహ్) ఆత్మ.
ఈ రెండు ఆయత్‍లలో ఇద్దరి అల్లాహ్‍ల తేడాలు స్పష్టముగా కనిపించుచున్నా కొందరు మూడవ అల్లాహ్‍ను ఏమాత్రము గుర్తించక ఉన్నది ఒకే అల్లాహ్ అని రెండవ అల్లాహ్‍ను మాత్రము చెప్పుచుందురు. ప్రవక్తలు (గురువులు) తన వరకు తెచ్చిన సత్యమును నమ్మనివాడు తన్ను తాను సరిదిద్దుకొని దేవుని మార్గములో పయణించలేడు. దేవుడు తన ప్రథమ దైవ గ్రంథము భగవద్గీత (తౌరాత్) యందు ప్రకృతి ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు భాగములుగా ఉండగా, పరమాత్మ (దేవుడు) మూడు భాగములుగాయుండి ప్రపంచమును జీవరాసులతో నడుపుచున్నాడని కలదు. పరమాత్మ ఒకటి జీవాత్మగా, రెండు ఆత్మగా, మూడు పరమాత్మగా ఉన్నాడని తెలియుచున్నది. అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్ ప్రథమ దైవ గ్రంథమును అనుసరించి యున్నదనీ, ప్రథమ దైవ గ్రంథములో 'జ్యోతి, మార్గదర్శకత్వము' కలదని సూరా అయిదు, ఆయత్ 44లో చెప్పడము జరిగినది. ఇది గ్రహించని ముస్లీమ్ బోధకులు కొందరు దేవుడు ముగ్గురుగా లేడని, దేవుడు ఒక్కడేయని వాదించుచున్నారు. అలా చెప్పడము వలన ప్రథమ దైవ గ్రంథమును మరియు అంతిమ దైవ గ్రంథమును రెండింటినీ అవమానించి మాట్లాడినట్లగుచున్నది. అటువంటి వారికి దేవుడు మంచిమార్గమును చూపడు. వారు దైవ సందేశములను తెచ్చిన మనుషులను నమ్మక తమకంటే హీనులుగా చూచుచుందురు.
ప్రకృతి ఐదు భాగములు, దేవుడు మూడు భాగములు ఉన్నట్లు తెలియకపోతే దైవ ఆదేశాలను వినిపించిన వారిని, దైవ గ్రంథములను కించపరచినట్లగును. అర్థము కాకపోతే అడిగి తెలుసుకోవచ్చును గానీ, లేదు, కాదుయని ఎందుకు వాదించవలెను. వాదన వలన ఏమీ లాభము లేదు. సంవాదము వలన ఎంతో లాభము కల్గును, అనగా ఎంతో జ్ఞానము తెలియును. దైవ గ్రంథములను అనుసరించి శాస్త్రబద్దముగా దేవుడు చెప్పిన విధానమును తెలియగలిగితే దేవుని విధానము మూడు గ్రంథము లలో ఎలా యున్నదో తెలియగలదు. ప్రవక్తల (గురువుల) మాటలలోని సత్యమును మూడు గ్రంథములలో ఎలా గలదో ఇప్పుడు చూస్తాము.
ప్రథమ దైవగ్రంథము (తౌరాత్) లో... 1) జీవాత్మ 2) ఆత్మ 3) పరమాత్మ
ద్వితీయ దైవగ్రంథము (ఇంజీలు) లో...
1) కుమారుడు 2) తండ్రి 3) పరిశుద్ధాత్మ
అంతిమ దైవగ్రంథము (ఖుర్ఆన్) లో...
1) మనిషి 2) అల్లాహ్ 3) అల్లాహ్
ఒకటవ ఆత్మ మనిషిగా ఉండగా, రెండవ ఆత్మ అందరికీ దేవుడుగా, ఆరాధింప దైవముగా యున్నది. మూడవ ఆత్మ పరమాత్మగా ఆత్మకంటే అతీతముగా ఉంటూ ఎవరికీ తెలియనిదిగా ఉన్నది. రెండవ ఆత్మనే అందరినీ ఆడించు దేవునిగా ఉండగా, మూడవ పరమాత్మ అందరినీ చూచు సాక్షిగా యున్నాడు. భగవద్గీతలో ఆత్మకు, పరమాత్మకు విడివిడిగా యున్న శ్లోకములు గలవు. ఈ విషయమును శ్రద్ధ, బుద్ధియున్నవాడు గ్రహించగలడు. ఆత్మకు, పరమాత్మకుగల తేడాను తెలియగలడు. రెండవ దైవగ్రంథములో తండ్రి, పరిశుద్ధాత్మయని వేరువేరుగా చెప్పబడినవారే అంతిమ దైవ గ్రంథములో ఇద్దరినీ ఒకే పేరుతో చెప్పడమైనది.
2) ఆత్మ 3) పరమాత్మ (ఆత్మ ఒక్కడే ఆరాధింప తగినవాడు)
2) తండ్రి 3) పరిశుద్ధాత్మ (తండ్రి ఒక్కడే ఆరాధింప తగినవాడు)
2) అల్లాహ్ 3) అల్లాహ్ (రెండవ అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవము)
మూడు దైవ గ్రంథములలో రెండవ ఆత్మే ఆరాధ్య దైవముగా యున్నది. మూడవవాడు ఎవరి అక్కరలేని వాడుగా అన్నిటికీ అతీతముగా యున్నాడు. రెండవవాడే అన్ని కార్యములు చేయుచూ జగత్తులోని జీవుల నందరినీ నడుపుచుండగా, మూడవ ఆత్మ రెండవ దానికంటే అతీతమై, ఏమీ చేయనివాడుగా, మొదటి సృష్ఠికర్తగా అన్ని కార్యములను రెండవ వానికి అప్పజెప్పినవాడుగా యున్నాడు. ఈ విషయము రెండవ దైవ గ్రంథము బైబిలులో యోహాన్ సువార్త ఐదవ అధ్యాయములో 21 నుండి 29వ వచనము వరకు గలదు. మూడు ఆత్మల విషయము తెలిసినవాడే నిజమైన జ్ఞానియని చెప్పవచ్చును.
ఇంకా ఈ వాక్యములో తెలియవలసిన లోతైన రహస్యము ఏమనగా! ''మీలోనుండి నియుక్తులైన ప్రవక్తలు'' అని యున్నది. ప్రవక్తను గురువు అని కూడా అనవచ్చును. 'దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మానవ మాత్రునికి తెలియదని' (3-7) లో చెప్పిన విషయమును మరువకూడదు. ఆ మాటప్రకారము మనిషిగా పుట్టినవాడు ఎవడూ దేవుని జ్ఞానమును తెలియడనియే చెప్పవచ్చును. దైవ గ్రంథములో దైవజ్ఞానమున్నా దానిని దైవము చెప్పినప్పుడే మనుషులకు అర్థము కాగలదు. దేవుడు దేవునిగా యుండి ప్రజలతో నేరుగా మాట్లాడడు. అందువలన దేవుడు మనుషులలో మనిషిగా వచ్చి తన జ్ఞానమును చెప్పవలసియున్నది. అందువలన దేవుడు మనిషిగా తప్పక రావలసియున్నది. దేవుడు దేవునిగా కాకుండా మనిషిగా వచ్చి మనుషులతో మాట్లాడగలడు. మనుషులలో మనిషిగా వచ్చిన వానిని ప్రవక్త లేక గురువు యని అనవచ్చును. అలా వచ్చిన దేవుడు స్వయముగా దైవ గ్రంథములో నిగూఢముగాయున్న జ్ఞానమును విప్పి చెప్పగలడు. మూడు దైవ గ్రంథములలో నిగూఢ (రహస్య) జ్ఞానవాక్యములు అంతిమ దైవ గ్రంథములో ఎక్కువ గలవు. అలా దేవుడు మనిషిగా వచ్చినప్పుడు అనగా ప్రవక్తగా (గురువుగా) వచ్చినప్పుడు మనుషులు ఆయన చెప్పు జ్ఞానమును విని తమలోని తప్పును సరిదిద్దుకొన్న వారికి పరలోకప్రాప్తి కల్గునని చెప్పుచూ దానినే 'భయము, దుఃఖము ఉండదు' అని అన్నారు. భయము, దుఃఖము పరలోకములోనే లేకుండా ఉండును. ఇహ లోకములో భయము, దుఃఖము ఉండును. అవి లేనిదే పరలోకము (మోక్షము). ఈ వాక్యమును చూచిన తర్వాత 'నేను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు' అనునట్లు నాకు తెలిసినదే జ్ఞానము అనుకోకుండా, తన తప్పును తెలిసి ప్రవక్త జ్ఞానమును తెలియువాడు ధన్యుడు అని చెప్పవచ్చును.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
54. అల్లాహ్ అజ్ఞానుల మీదికి ఆకాశము నుండి ఆపదను పంపును. (7-162)
ఇంతకుముందు చెప్పిన వాక్య వివరములో సందర్భానుసారము 'అల్లాహ్' అను పేరు గలవారు ఇద్దరున్నారని చెప్పియున్నాము. అందులో అందరికీ ఆరాధ్య దైవము ఒక్కడేయనీ, ఆయనే రెండవ అల్లాహ్యనీ, మూడవ అల్లాహ్ మొదటి సృష్ఠికర్తయనీ చెప్పియున్నాము. అల్లాహ్ అంశ మూడుగా యుండగా ఒకటి జీవాత్మకాగా, రెండవవాడు ఆత్మ, మూడవ వాడు పరమాత్మయని ప్రథమ దైవ గ్రంథములో చెప్పియున్నారు. ప్రథమ దైవ గ్రంథమయిన తౌరాతులో చెప్పిన ప్రకారము ఖుర్ఆన్ అదే విధానమునే ధృవీకరించుచున్నది. ప్రథమ దైవ గ్రంథములో చెప్పినట్లు అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్‍లో అల్లాహ్ ఒకటి మనిషిగా, రెండు అల్లాహ్గా, మూడు కూడా అల్లాహ్గా యున్నాడని చెప్పడము జరిగినది. మొదటి వానిని త్రోలబడేవాడు యనీ, రెండవవాడు త్రోలేవాడుయనీ, మూడవ వాడు ఏమీ చేయక సాక్షిగా యున్నాడని సూరా 50, ఆయత్ 21 లో చెప్పడము జరిగినది.
ఎన్నో ఆయత్‍ల సాక్ష్యముతో ఇద్దరు అల్లాహ్‍లున్నారనీ, వారిలో రెండవ వాడు ఆరాధన యోగ్యుడనీ, మూడవ అల్లాహ్ ఏమీ చేయనివాడని చెప్పారు. రెండవ అల్లాహ్ 'మనిషి చేయు ప్రతి కార్యమునకు కార్యకర్తగా యున్నాడని' (6-102) లో మరియు (2-255) లో చెప్పడము జరిగినది. ఇకపోతే మూడవ అల్లాహ్ ఏ అక్కర లేనివాడుగా యుంటూ, ఎవరి ఆరాధనలతో సంబంధము లేకుండా యున్నాడు. మూడవ అల్లాహ్ ఏ కార్యమును చేయడు. అయినా ఆయన సంకల్పించుకొన్న పనులన్నీ వాటంతటకవే జరిగిపోవుచున్నవి. బాగా ఆలోచిస్తే ఒక పనిని చేయువాడు కనిపిస్తే వాడు ఆ పనిని చేయుచున్నాడని ఎవరయినా చెప్పవచ్చును. అయితే ఒక పనిని చేయువాడు కనిపించకుండా జరిగితే దానంతట అది జరిగి పోయినదని చెప్పుదురు. మూడవ అల్లాహ్ సంకల్పించుకొంటే ఆయన చేయకుండానే వాటంతట అవి జరిగిపోవును అని అంటే మనకు కనిపించక చేయువారుండవచ్చును కదా! దీనిని గురించి వివరముగా చెప్పుకొంటే ఈ విధముగా కలదు.
''మమైవాంశో జీవలోకే జీవభూతస్సనా తనః'' ప్రథమ దైవ గ్రంథములో పురుషోత్తమప్రాప్తి యోగము అను అధ్యాయమున ఏడవ శ్లోకములో గల ఈ వాక్యమును అనుసరించి 'దైవ అంశ మనిషిగా (జీవునిగా)' యున్నదని తెలియుచున్నది. అలాగే రెండవ అంశ 'అందరూ ఆరాధింపదగిన ఆత్మగా' ఉన్నది. అట్లే మూడవ అంశ 'ఆత్మకంటే అతీతముగా యున్న పరమాత్మగా' యున్నది. ఇక్కడ చెప్పిన రెండవ ఆత్మను అంతిమ దైవ గ్రంథములో అల్లాహ్ అని అనడమేగాక, మూడవ ఆత్మను కూడా అల్లాహ్ అనియే అంటున్నారు. ఇద్దరు అల్లాహ్‍లలో ఒక్కడే ఆరాధ్య దైవముగా యున్నా, ఆయనే మీ ఆరాధ్య దైవము అని చెప్పినవాడు మూడవ అల్లాహ్‍యేనని చాలామందికి తెలియదు. రెండవ అల్లాహ్, మూడవ అల్లాహ్‍ల మధ్య ఎన్నో తేడాలున్నా వాటిని మనిషి గ్రహించలేకున్నాడు. ఇప్పుడు ఆ తేడాలను వివరముగా చెప్పుకొంటే ఇలా గలవు. రెండవ అల్లాహ్ మనిషి (జీవరాసి) శరీరమంతా వ్యాపించియుండి ఆ శరీరములో చైతన్యశక్తిగా యుంటూ శరీరమును కదలించి, శరీర అవయవముల చేత పనులను చేయించుచున్నాడు. శరీర అవయవములు కదిలి పని చేయుటకు కావలసిన శక్తిని శరీరములో రెండవ అల్లాహ్‍నే ఇచ్చుచున్నాడు. రెండవ అల్లాహ్ చైతన్యరూపముగా శరీరమంతా వ్యాపించి యున్నాడు. రెండవ అల్లాహ్ శరీరములో మాత్రమేయుంటూ, శరీరమంతా వ్యాపించి యున్నాడు. అంతేగానీ శరీరము బయట ఏమాత్రము లేడు. శరీరములో నఖ శిఖ పర్యంతమున్న అల్లాహ్ శరీరము బయట లేనే లేడు.
శరీరము బయట, శరీరము లోపల రెండుచోట్ల మూడవ అల్లాహ్ అయిన పరమాత్మ వ్యాపించియున్నాడు. ఎక్కడయినా అణువణువునా వ్యాపించి యున్నవాడు మూడవ అల్లాహ్ యని తెలియవలెను. మూడవ అల్లాహ్ శరీరము బయట లోపల అంతటా వ్యాపించియుండుట వలన బయట పాలన మూడవ ఆత్మ (అల్లాహ్), లోపల పాలన రెండవ ఆత్మ కొనసాగించుచున్నారని చెప్పక తప్పదు. శరీరము లోపల రెండవ అల్లాహ్ అంతటా వ్యాపించి అన్ని కార్యములను చేయు కార్యకర్తగా యుండగా, శరీరము బయట అల్లాహ్ ఏమీ చేయనివాడైనా ఆయన ఆలోచన మేరకు, ఆయన సంకల్పము మేరకు కార్యములను చేయు దేవదూతలు కోట్ల సంఖ్యలో గలరు. కోట్ల సంఖ్యలోయున్న దేవదూతలు అందరూ మూడవ అల్లాహ్ అనుకున్న దానిని అంతా చేయుచుందురు. దేహములోని 25 భాగములన్నియూ రెండవ ఆత్మ ఆధీనములో ఉండగా, శరీరము బయట గల కోట్లాది భూతములందరూ మూడవ ఆత్మను అనుసరించియుందురు. మూడవ ఆత్మ అయిన దేవుడు లేక అల్లాహ్ తాను ఏమీ ఆదేశించకున్నా ఆయనలో సంకల్పము కలిగిన వెంటనే ఆ పనికి పూనుకొందురు. శరీరములో 25 భాగములను ఆదేశించి నడుపువాడు రెండవ ఆత్మకాగా, ఆదేశించకనే మూడవ ఆత్మ పనులు జరుగుచుండును. ఈ విధముగా దేవునిపాలన సాగుచున్నది. శరీరములో బాధలు రెండవ ఆత్మ ద్వారా జరుగగా, శరీరము బయట ప్రపంచములో ఆపదలు, బాధలు మూడవ ఆత్మ ద్వారా జరుగుచున్నవని తెలియుచున్నది. బయటి ప్రపంచములో వచ్చు ప్రకృతి వైపరీత్యములు అన్నియూ మూడవ ఆత్మ (మూడవ అల్లాహ్) ద్వారా జరుగునవేయని తెలియుచున్నది. గత జన్మలో చేసుకొన్న పాపమునకు, గత జన్మలో చనిపోయినప్పుడు జరిగిన తీర్పులో రెండవ అల్లాహ్ మనిషి చేత పాపమునకు తగిన బాధలు అనుభవించునట్లు నిర్ణయించియుండును. ఆ నిర్ణయము ప్రకారము శరీరము బయట పాపమును అనుభవించుటకు దేవదూతలు తగినట్లు పని చేయుచుందురు. మనిషి చేసుకొన్న పాపమునకు తగినట్లు రెండవ ఆత్మ తీర్పు తీర్చగా ఆ తీర్పు కాలము ఆసన్నమైనప్పుడు మూడవ ఆత్మలో సంకల్పము కల్గును. అప్పుడు మూడవ ఆత్మలో కల్గిన సంకల్పమును అనుసరించి బయట ప్రపంచములోని దేవదూతలు కొందరు పనిచేసి మనిషికి లేక మనుషులకు ఆపదలను కలుగజేతురు. అదే విధముగానే పై వాక్యములో 'అజ్ఞానుల మీదికి ఆకాశము నుండి ఆపదలు కలుగజేతును' అని చెప్పినట్లు ఆకాశ రూపములో యున్న మేఘములు పై నుండి మనుషులకు అనేక రూపములలో బాధలను కలుగజేయుచుండును. ఆకాశ మేఘముల రూపములో కూడా కోట్లాది మంది దేవదూతలు కలరు. దేవ దూతలు భూతములు, గ్రహములు అను రెండు రకములుగా గలరు. ఆకాశము నుండి భూతములుగానీ, గ్రహములుగానీ భూమిమీద ప్రకృతి ఉపద్రవములను కలుగజేయడమే కాకుండా, అనేక రోగములను ఆకాశము నుండే తెచ్చి భూమిమీద వదలడము జరుగుచుండును. భూమిమీద ఎక్కడా లేని సరిక్రొత్త రోగాన్ని తెచ్చి మనుషుల మధ్యలో వదలగా, మనుషులు ఆ రోగము వలన బాధపడడము, చనిపోవడము జరుగుచుండును. దేవ దూతలు ప్రపంచమంతా ఆవహించి యున్నారు. వారివలన తుఫానులు, సునామీలు, వరదలు, భూకంపములు, పిడుగులు మొదలగునవి చేయడమే కాకుండా అనేక రోగములను వ్యాపింపజేయుచుందురు. ఇదంతయూ మూడవ అల్లాహ్ ఆధీనములో యున్న భూతములు చేయుచుందురు. అందువలన సూరా 7, ఆయత్ 162లో ఇలా చెప్పారు చూడండి.
(7-162) ''వారిలో దుర్మార్గులు తమకు ఇవ్వబడిన వాక్కును మరొక మాటతో మార్చివేస్తారు. అందువలన మేము వారిపై ఆకాశము నుండి ఆపదను పంపాము. ఎందుకనగా! వారు చాలా అజ్ఞానముగా ప్రవర్తించేవారు.''
ఈ వాక్యములో 'ఆకాశము నుండి ఆపదను పంపుదుమని' చెప్పిన మాటను మనము చెప్పుకొన్నాము. దానికి వారు చేసుకొన్న పాపమేయని తెలిసినది. వారు దేవుని మాటను కూడా మార్చి చెప్పుచూ అజ్ఞానముగా ప్రవర్తించుచుందురు. అందువలన వారిమీద శిక్షను అమలు చేయుదుమని చెప్పారు. దేవుడు ఇచ్చిన వాక్కును ఎలా మార్చుచున్నారని చెప్పుకుంటే ఉదాహరణకు దైవ గ్రంథములో 'మనిషికి మొదటి జన్మవలె రెండవ జన్మ కలదని' చెప్పినమాటను కాదని, మనిషికి రెండవ జన్మలేదని కొందరు చెప్పడమును గమనించవచ్చును. ఈ విధముగా దైవ గ్రంథములోని దేవుని వాక్కును మార్చి చెప్పువారికి శరీరము లోపలి అల్లాహ్ పాపమును అంటగట్టగా, సమయము వచ్చినప్పుడు మూడవ అల్లాహ్ సంకల్పము ద్వారా దేవదూతలు పనిచేసి ఆకాశము నుండి ఆపదను తెచ్చిపెట్టుదురు. పై వాక్యమును ఇంతవరకు వివరించుకొన్నాము. ఈ వివరమును బట్టి దైవ గ్రంథములలోని విషయమును భావమార్పిడి చేయకుండా అల్లాహ్ చెప్పిన ప్రకారము గ్రహించుకోవలెనని తెలుపుచున్నాము.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
55. దేవతలు, మనుషులు పూర్తి అజ్ఞానముగా ప్రవర్తించుచున్నారు. (7-179)
(7-179) ''ఎంతోమంది జిన్నులను, మానవులను మేము నరకము కోసము పుట్టించాము. వారికి హృదయాలున్నాయి, కానీ వాటితో వారు ఆలోచించరు. వారికి కన్నులున్నాయి, కానీ వాటితో వారు చూడరు. వారికి చెవులు ఉన్నాయి, కానీ వాటితో వారు వినరు. వారు పశువులలాంటివారు. కాదు వాటికన్నా ఎక్కువ గానే దారి తప్పారు. పరద్యానములో పడిపోయిన వారంటే వీరే.''
పై వాక్యములో 'జిన్నులు' అని దేవతలను చెప్పారు. దేవుడు మనుష జాతిని పుట్టించినట్లే, దేవత జాతిని కూడా పుట్టించాడు. దేవతలు (జిన్నులు) అనువారికి స్థూలశరీరము ఉండదు. వారికి సూక్ష్మశరీరము మాత్రమే ఉండును. స్థూల, సూక్ష్మ శరీరములతో పుట్టినవారు మనుషులు కాగా, సూక్ష్మశరీరములతో పుట్టినవారు దేవతలు. దేవతలు కూడా మనుషుల వలె జీవనము సాగించుచుందురు. ఆ విషయము చాలామందికి తెలియదు కనుక దేవతలను మనుషులకంటే గొప్పవారుగా భావించుకోవడము జరుగుచున్నది. దేవుని లెక్కలో మనుషులు, దేవతలు ఇద్దరూ సమానమే. ఎందుకనగా! ఇద్దరూ పాపమును సంపాదించుకొనుచున్నారు. ఇద్దరూ అనుభవించుచున్నారు. మనుషులు చేయు అన్యాయాలు, పాపపు పనులు మాత్రమే మనకు కనిపించుచున్నవి. అయితే దేవతలు చేయు పాపపు పనులు మనుషులు చూడలేకపోవుచున్నారు. మనుషులే చాలా హీనమైన పనులు చేయుచుండగా, దేవతలు మనుషులకంటే హీనమైన పనులు చేయుచున్నారు.
ఈ వాక్యము చివరిలో 'పరద్యానములో పడిపోయినవారు వీరేయని' చెప్పియున్నారు. పరద్యానము అంటే ఏమిటి? అని వివరముగా తెలియవలసిన అవసరమున్నది. దేవునికంటే వేరయిన దానిని 'పర' అని అనుచున్నారు. ఇక్కడ సందర్భమునుబట్టి దేవుడు, ప్రకృతియను రెండే రెండు విశ్వములో గలవు. ప్రకృతి దేవునికంటే భిన్నమైనది. ప్రకృతిలో ఎన్నో విషయములు గలవు. దేవునిలో మూడు ఆత్మల విషయము తప్ప ఏమీ ఉండదు. అందులో మొదటి జీవాత్మను వదలితే రెండు, మూడు ఆత్మల విషయమే ఎక్కువగా ఉండును. దానినే దైవజ్ఞానము అని అంటున్నాము. దైవజ్ఞానముకంటే వేరైనది ప్రపంచ జ్ఞానము లేక ప్రకృతి జ్ఞానము అని చెప్పవచ్చును. ప్రకృతి జ్ఞానములో మనిషి పుట్టినప్పటి నుండి ఉండును. చిన్నప్పటినుండి ప్రకృతి విషయములలో మెలగుచుండుట వలన ప్రకృతి జ్ఞానము లేక ప్రపంచ జ్ఞానము అంతయూ నేర్వకనే వచ్చి యుండును. ప్రపంచ జ్ఞానములో కూడా కొందరు పూర్తి ముందు ఉండగా, కొందరు వెనుకబడియుండుటను చూస్తూనేయున్నాము. కొందరు తమకు దైవజ్ఞానము లేకున్నా ప్రపంచ విషయములలో అన్యాయముగా పోకుండా న్యాయముగా పోవువారు, ఇతరులను మోసగించనివారు, దొంగ తనము, వ్యభిచారము, జూదము మొదలగు చెడు వ్యసనాలలోనికి పోకుండా నీతిగా జీవించువారు ఉన్నారు. మరికొందరు అన్ని చెడు వ్యసనములలో యుంటూ అవినీతిగా బ్రతుకుచున్నారు. కొందరు తమ ధన బలముతో, అధికార బలముతో ఇతరులను అణచివేస్తూ ధనార్జనే ముఖ్యముగా పెట్టుకొని ఏమాత్రము పాపచింతన లేకుండా బ్రతుకుచున్నారు.
ప్రపంచ జ్ఞానములో యున్న వారందరికీ వారి ద్యాసయంతయూ ప్రపంచ ధనము మీదే ఉండగా దేవుడు, దైవము అనుమాటలను వినుటకు కూడా ఇష్టపడక అజ్ఞాన జీవితమునే గడుపుచున్నారు. కొందరు డబ్బు కొరకే పుట్టాము, డబ్బు కొరకే బ్రతుకుచున్నాము అన్నట్లు వ్యవహరించుచూ ధనము కొరకు ఏ అవినీతిపనైనా చేయుచున్నారు. ధనము కొరకు దేవునికి, దేవుని మార్గములో యున్న మనుషులకు హాని కల్గించుచూ వ్యతిరేఖముగా ప్రవర్తించుచుందురు. అజ్ఞానముతో కూడుకొన్నవారు, ప్రపంచ జ్ఞానములో యున్నవారు వారి అజ్ఞాన పనులలో హద్దూ పద్దూ లేకుండా ప్రవర్తించు చుందురు. మామూలు బలహీన ప్రజలను దోచుకొంటూ, పాపభీతి అనునది ఏ కోశములో లేకుండా బ్రతుకుచుందురు. తాను తన సంసారము బాగు పడితే చాలు మిగతావారంతా ఏమయిపోయినా ఫరవాలేదన్నట్లు ప్రవర్తించు చుందురు. తనకొద్దిపాటి సుఖము కొరకు ఇతరులను హత్య చేయడానికి కూడా వెనుకాడరు. ఇతరుల జీవితములు నాశనమయినా తాను క్షేమముగా యుండవలెనను వారికి ప్రపంచ జ్ఞానములోనే నీతి నిజాయితీ ఏమాత్రము ఉండదు. అట్టివారికి దేవుని జ్ఞాన విషయములు ఏమాత్రము పట్టుబడవు. ఎవరయినా దైవజ్ఞానమును చెప్పినా, ఆ మాటలు వారి చెవిలో దూరవు. వారికి కన్నులు ఉన్నా వారికి దేవుని జ్ఞానముగానీ, దైవ గ్రంథములు గానీ ఏమాత్రము కనిపించవు. ఒకవేళ బలవంతముగా చూపించినా, బలవంతముగా వినిపించినా వారి బుద్ధి విన్న మాటలను, చూచిన దృశ్యమును గ్రహించుస్థితిలో ఉండదు. వారికి హృదయములున్నాయి గానీ వారి బుద్ధి ఆలోచించని స్థితిలో ఉండుట వలన హృదయాలకు ఏమీ చేరదు. అజ్ఞానులను ఆలోచిస్తే వీరు మనుషులేనాయని అనుమానము రాక తప్పదు. అలా ఆలోచిస్తే అటువంటి అజ్ఞాన ప్రజలు పశువులకంటే హీనులుగా బ్రతుకుచున్నారని తెలియుచున్నది. అదే విషయమునే (7-179) వ వాక్యములో చెప్పియున్నారు. పశువులకంటే దిగజారిన వారిని ఎందరినో భూమిమీద చూడవచ్చును.
ఇకపోతే 'జిన్నులు' అని వాక్యములో చెప్పియున్నారు. జిన్నులు అను పేరు చాలామందికి క్రొత్తగా కనిపించినా అందులో విశేషము ఏమీ లేదు. మనుషులు దేవునితో సమానముగా లేక దేవునిగా నమ్మి పూజించు దేవతలనే ఖుర్ఆన్ గ్రంథములో జిన్నులు అని చెప్పడము జరిగినది. జిన్నులను దేవతలుగా చెప్పుకొంటే భూమిమీద పుట్టిన మనుషులకు దేవతల విషయము ఏమాత్రము తెలియదనియే చెప్పవచ్చును. మనుషుల లెక్కలో దేవతలు గొప్పవారిగా, మనుషులకంటే మహిమ గలవారిగా మనుషుల జీవితములను మార్చు వారిగా, మనుషులు కోరు కోర్కెలను నెరవేర్చు శక్తి వంతులుగా, ఆపదలో రక్షించు ఆపద్బాంధవులుగా లెక్కించి పూజించు చుందురు. మనుషులు చేయు ఆరాధనలన్నీ దేవతలకే అయివుండడము విచిత్రము. ముస్లీమ్ సమాజములోను, క్రైస్థవ సమాజములోను దేవతలను పూజించుట నిషేధముగా యున్నా, హిందూ సమాజములో అధిక శాతము దేవతలను ఆరాధించుటకు అలవాటు పడిపోయారు. దేవతలు ఏమీ చేయలేరనీ, ఏ శక్తి లేనివారనీ, ఏ మహిమ లేనివారనీ హిందువులలో అధిక శాతము మందికి తెలియదు. చాలామంది దేవతలను ఆరాధించుటకు అలవాటు పడిపోయారు. అటువంటప్పుడు ఎవరు ఏ దేవతను ఆరాధించు చుందురో ఆ దేవతే వారి దృష్ఠిలో దేవునిగా యుండును. దేవుడు వేరు, దేవతలు వేరను విషయమే తెలియని మనుషులు పెద్దపెద్ద గుడులనుకట్టి అందులో దేవతలను ప్రతిష్ఠించి అనేక విధములయిన ఆరాధనలతో ఆరాధించడము పరిపాటిగా చేయుచున్నారు. మనుషులలో కొందరు ఒక దేవతను, మరికొందరు మరొక దేవతను ఆరాధించుటకు అలవాటు పడినారు. అందరూ ఒక దేవతను పూజించడము లేదు.
మనుషులు దేవతలను గొప్పగా పెట్టుకోగా, దేవతలు మనుషులను తమకంటే తక్కువవారిగా భావించి చూస్తున్నారు. వాస్తవానికి మనుషులు దేవతలు ఇద్దరూ దేవుని చేత సృష్ఠించబడినవారే. దేవతలు మనుషులు కర్మప్రకారమే పుట్టగా అందులో వక్తలు (బోధకులు), ప్రవక్తలు (గురువులు) మానవులలోనే పుట్టారు. దేవతలలో బోధకులుగానీ, గురువులుగానీ పుట్టడము లేదు. దేవతలు అందరూ దైవజ్ఞానము ఏమాత్రము తెలియని వారుగా పుట్టుచున్నారు. మనుషులలోనే అంతో ఇంతో జ్ఞాన సంస్కారము గలవారు పుట్టుచున్నారు. దేవతలుగా పుట్టిన తర్వాత కొందరు మనుషులు చెప్పు బోధలు విని అంతో ఇంతో జ్ఞానమును సంపాదించుకొనుచున్నారు. కొందరు తాము మనుషులకంటే గొప్పవారమను భావమును కల్గి మనుషులయిన బోధకులు, గురువులు చెప్పు మాటలను వినడము లేదు. కొందరయితే తామే దేవునికంటే గొప్పవారమనీ, తమకంటే ఏ దేవుడూ గొప్పకాదను అహము కల్గి నిజమైన దైవజ్ఞానము తెలిసి, నిజమైన దేవున్ని ఆరాధించు జ్ఞానులను సహితము ఇబ్బందులపాలు చేయుచున్నారు. తమను మ్రొక్కక దేవున్ని మ్రొక్కువారిని అనేక ఇబ్బందులు కలుగజేసి దేవున్ని మ్రొక్కడము మానివేసి తమనే మ్రొక్కవలెనని వారి శరీరములలో ప్రవేశించి రోగముల రూపములో బాధ పెట్టుచుందురు.
జిన్నులు (దేవతలు) మనుషులకంటే కౄరముగా ప్రవర్తించుచూ, మనుషులకంటే రెండింతలు పాపమును సంపాదించుచున్నారు. తమ దేవాలయము దగ్గర ఎంగిలి మూసాడని ఒక మనిషిని ఒక దేవత కాళ్లు చేతులు పడిపోవునట్లు చేయడమును చూచాను. తెలియక ఎంగిలి మూస్తే, అదియూ దేవాలయమునకు దూరముగా ఎంగిలి మూసినా, తప్పేయని చెప్పు దేవతలు మనుషులకంటే కౄరులు కాదా? ఒక బాలుడు పుట్టకు సమీపములో మూత్రము పోశాడని, తాను నివాసముంటున్న పుట్టకు దగ్గరగా మూత్రము పోయుటవలన పాముకాటుకు గురిచేసి చిన్నపిల్లలను సహితము చంపు దేవతలు మనుషులకంటే కఠినస్తులు కాదా? నా దేవాలయము దగ్గర అరుగు మీద సారాయి త్రాగి పడుకొన్నాడని పార్శ్వవాయువు రూపములో కాలు, చేయి, నోరు పడిపోవునట్లు చేయు దేవతకంటే కౄరులు కలరా? యని అడుగుచున్నాను. నాకు పూజలు మాని ఇంకొక దేవతను మ్రొక్కుచున్నారని రోగముల రూపములో బాధించు దేవతలకంటే మనుషులు నయము కాదా? ఈ మధ్య కాలములో నన్ను వదలి గురువుల వద్దకు పోయి జ్ఞానము తెలియుచున్నారని ఇంట్లో చిన్న పిల్లలకు మూర్ఛవచ్చునట్లు చేయు దేవతలకంటే అజ్ఞాన మనుషులు మేలు కాదా? అంతో ఇంతో దయ కల్గిన మనుషులకంటే ఏమాత్రము దయలేని కొందరు దేవతలు పూర్తి దుర్మార్గులు కారా? ఇప్పుడు చెప్పిన సంఘటనలన్నీ నేను ప్రత్యక్షముగా చూచి చెప్పునవేయని మీరు తెలియండి. నేను గతములో ఎందరో దేవతలను చూచాను, వారు చేయు దుర్మార్గపు పనులను చూచాను. కొంతవరకు చాలామంది దేవతలను మీరు మనుషులకంటే దుర్మార్గముగా ప్రవర్తించు చున్నారని దండించిన సందర్భములు చాలాగలవు. మీరు నమ్మినా, నమ్మక పోయినా మనుషులకంటే దుర్మార్గములో ఎక్కువవారు దేవతలు అనుమాట సత్యము. మనుషులే పెద్ద దుర్మార్గులుగా యున్నారని అనుకొంటే, మనుషుల కంటే మించిన దుర్మార్గులు దేవతలని ఎవరికీ తెలియదు. మేము ఈ మాటను చెప్పితే హిందువులలో కొందరు మా మాటను నమ్మకపోగా, మా మీదికే పోట్లాటకు వచ్చినవారు కూడా యున్నారు.
నా అనుభవరీత్యా నేను చూచిన దానిలో దేవతలయందు కొద్దిమంది మాత్రము కొంత సాత్త్విక స్వభావము కల్గియున్నారు. అటువంటివారు అక్కడక్కడ బోధకులవద్ద గానీ, గురువులవద్ద గానీ దైవజ్ఞానమును విని కొంత దైవ జ్ఞానమును పొందినవారుగా యున్నారు. అట్లు తెలుసుకొన్న వారికి ఎంత పెద్ద గుడియున్నా, తనను ఎందరో వచ్చి పూజించుచున్నా దానినంతటినీ లెక్కచేయక దైవజ్ఞానమునకే ప్రాధాన్యతనిచ్చు దేవతలు గలరు. ఉదాహరణకు హైదరాబాదులో జూబ్లీహిల్స్‍లో పెద్దమ్మ గుడి పెద్దదిగా యున్నది. అక్కడ దేవాలయములో కొలువైయున్న పెద్దమ్మ దేవతను ఎందరో ధనికులు, రాజకీయ నాయకులు, గొప్పవారిగా పేరుగాంచినవారు పూజించడము తెలిసిన విషయమే. అంత పెద్ద హోదాలో యున్న దేవత దైవజ్ఞానము పట్ల ఆసక్తి కల్గినదై, ప్రతీ నెల ఒక గురువు దగ్గర జరుగు బోధలు వినేదానికి పోవుచున్నదంటే ఆశ్చర్యపడవలసిన విషయమే. చిన్న దేవతలు సహితము మేము గొప్పయను భావముతో అజ్ఞానముతో ఉండగా, ఎంతో పేరు ప్రఖ్యాతులు గల దేవత తనను తాను తగ్గించుకొని జ్ఞానమునకు విలువనిచ్చి దైవ జ్ఞానమును తెలుసుకోవడములో దాదాపు 400 కిలోమీటర్ల దూరము ఇతర మనుషులతో ప్రయాణము చేసిపోవుచున్నదంటే దేవతలకు కూడా జిజ్ఞాసకలదని తెలియుచున్నది. ఒక ప్రసిద్ధిచెందిన దేవత ఇతర మనుషుల వద్దకుపోయి జ్ఞానమును తెలియుచున్నదంటే, నేను మనుషుల కంటే తక్కువయను భావమున్నప్పుడే అది సాధ్యమగును. ఈ విధముగా దేవతలలో కూడా కొందరు జ్ఞాన శ్రద్దకలవారు ఉన్నారు.
మనుషులలో అందరూ దుర్మార్గులుగానీ, అందరూ అజ్ఞానులు గానీ లేరు. అలాగే దేవతలలో కూడా అందరూ దుర్మార్గులుగానీ, అందరూ అజ్ఞానులుగానీ లేరు. దేవతలు, మనుషులు అను రెండు జాతులలో మంచివారు గలరు, అట్లే చెడువారు గలరు. అయితే రెండు జాతులలోనూ అధికశాతము అజ్ఞానులు గలరని తెలియవలెను. ఇక్కడ దేవుడు పుట్టించిన మనుషులు, దేవతలను చెప్పాముగానీ, దేవదూతలను గురించి చెప్పలేదు. దేవదూతలు దేవుని పాలనలోని వారుకాగా, దేవతలు దేవుని చేత సృష్ఠింప బడినవారు. దేవదూతలకు మనుషులవలె చావు, పుట్టుకలు లేవు. అదే దేవతలకయితే మనుషులకున్నట్లు చావు, పుట్టుకలు గలవు. దేవతలు, మనుషులు ఇరువురూ దేవదూతల చేత పాలింపబడుదురు. దేవతలు కూడా పాపములను పొంది తిరిగి వచ్చు జన్మలలో శరీరములోని దేవుని (ఆత్మ) చేత, ప్రపంచములోని దేవదూతల చేత కష్టములను అనుభవించు చుందురు. అందువలన మనుషులను, దేవతలను వదలి అందరినీ సృష్ఠించిన దేవున్ని ఆరాధించమని చెప్పుచున్నాము.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
56. భూమిని ఆకాశమును సృష్ఠించిన వానిని మీరు గుర్తించలేరా? దీని తర్వాత మీరు దేనిని విశ్వసిస్తారు? (7-185, 186)
(7-185,186) ''ఏమిటి? ఆకాశాల మరియు భూమియొక్క వ్యవస్థను, అల్లాహ్ సృష్ఠించిన ఇతర వస్తువులను వారు గమనించలేదా? వారి కాలము దగ్గరపడి యుండవచ్చునన్న సంగతిని గురించి కూడా వారు ఆలోచించలేదా? మరి ఖుర్ఆన్ తర్వాత వారు విశ్వసించే ఇంకొక వస్తువు ఏముంటుంది? (186) అల్లాహ్ అపమార్గమున వదలిపెట్టిన వారిని సన్మార్గము వైపు ఎవరూ తీసుకరాలేరు. వారు తమ తలబిరుసుతనములోనే తచ్చాడుతూ ఉండేలా అల్లాహ్ వారిని వదలివేస్తాడు.''
ఈ వాక్యము 185 పూర్తి సూక్ష్మజ్ఞానముతో కూడుకొనియున్నది. (186) పూర్తి స్థూలముగాయున్నది. (185) వ వాక్యమును స్థూలముగా చెప్పితే వాక్యములోని భావము ఏమీ తెలియకుండాపోవును. అందువలన (185)వ వాక్యమును సూక్ష్మముగానే వివరించి చెప్పుకొన్నప్పుడు అల్లాహ్ చెప్పిన విషయము పూర్తిగా అర్థము కాగలదు. అందువలన మొదట 185వ వాక్యమును సూక్ష్మ అర్థముతోనే చెప్పుకొందాము. దేవుడు ఒక యంత్రములాంటి వ్యవస్థను తయారుచేసి, ఆ వ్యవస్థ పూర్తిగా పనిచేయుటకు ఎన్నో వస్తువులను కూడా ఆ వ్యవస్థలో తయారు చేసియుంచాడు. అయితే ఆ యంత్రములాంటి వ్యవస్థ ఏమిటి?యని పరిశీలించి చూస్తే ఆకాశములు భూమితో కూడుకొన్న దైవ నిర్మితమైన వ్యవస్థను మనము నిత్యము చూస్తున్నాము. ఎంతో సామాగ్రితో నిండియున్న యంత్రము కొంతకాలము పనిచేసి చివరకు పనికిరాకుండా చెడిపోయినట్లు, దేవుడు నిర్మించిన వ్యవస్థ కూడా కొన్ని సంవత్సరములు పని చేసి చివరకు ఎప్పుడో ఒకప్పుడు పని చేయకుండాపోవును. బయటి యంత్రముతో సమానమైన వ్యవస్థలో ఏడు ఆకాములు గలవు. బయటి ఆకాశము ఒక్కటేయుండగా దేవుడు తయారు చేసిన వ్యవస్థలో ఒక రకమైన ఆకాశము కాకుండా ఏడు రకముల ఆకాశములు గలవు. బయట ఆకాశమును చూస్తే అందులో ఏమీ లేకుండా శూన్యముగా తెలియుచున్నది. ఆకాశము భూమినుండి పైకి వ్యాపించి యున్నది. ఆకాశములో ఏమీ లేదని, అది ఒక ఖాళీగా యున్న శూన్యమని ఇతరులు కూడా చెప్పుచున్నారు. ఆకాశము, గగనము, శూన్యము యని ఆకాశమును చెప్పుచుందురు. ఈ మూడు పదములలో 'శూన్యము' అనగా కనిపించకుండా ఉన్నదని అర్థము గలదు. కనిపించదు అనేది వాస్తవమేగానీ కనిపించకుండా ఉన్నది ఏదో ఎవరికీ తెలియదు. 'గగణము' అను పదమును తీసుకొని చూస్తే గణము అనగా గుంపుగా యున్నది. ప్రమథ గణములు అనగా గుంపులుగా యున్న మొదటివారని అర్థము. అట్లే 'గుణ గణములు' అనగా 'గుంపులుగా యున్న గుణములని' అర్థము. 'క్రోదము' అనగా 'కోపము'. కోపము అను గుణము ఎన్నో రకముల పెద్దవి, చిన్నవి గలవు. కోపము ఎన్నో రకములు ఉన్నట్లు, మిగతా గుణములు కూడా చిన్నవి, పెద్దవి ఎన్నో రకములు గలవు. ఒక గుణము తొమ్మిది రకముల గుంపుగా తలయందు కలవని ముందే చెప్పుకొన్నాము. దాని ప్రకారము 12 గుణముల గుంపులను గుణ గణములు అని అంటున్నాము. ఇకపోతే ఆకాశము అనగా ఎంతో గుంపుగలదని అర్థము. కోశము అనగా ఒక గుంపు పనులతో కూడుకొన్నదని అర్థము. అన్నమయ కోశము అనగా! జీర్ణాశయము, చిన్నప్రేగులు, పెద్ద ప్రేగులు, జీర్ణాశయములో ఊరే రసములు మొదలగునవన్నీ కలిపి అన్నమయ కోశము అని అంటున్నాము. అ అంటే లేదు అని అర్థము. ఆ అంటే ఉన్నదని అర్థము. ఆకాశమును విడదీసి చూస్తే ఆ+కోశము=ఆకాశము అని చెప్పుచున్నారు. ఎంతో గుంపుతో కూడుకొన్న దానిని ఆకాశము అని అంటున్నాము.
ఆకాశము అంటే పైన ఉండేదియని అందరికీ తెలుసుకానీ, ఇప్పుడు మనము చెప్పుకొన్న అర్థములు ఎవరికీ తెలియవు. అల్లాహ్ తన దైవ గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములో ఆకాశములు, ఆకాశము అను పదములను చాలాచోట్ల ఉపయోగించి చెప్పుట వలన ఆకాశము అంటే ఏమిటి? అని పూర్తి వివరముగా చూడవలసివచ్చినది. మనకు కనిపించు బయటి ఆకాశములో ఏమీ లేనట్లు కనిపించినా, వాస్తవముగా మనకు కనిపించని ఎన్నో జీవరాసులు, ఎంతో నీరు, ఆ నీటిలో చేపలు, కప్పలు, పాములు మొదలగునవి ఎన్నో గుంపులుగా కలవు. ఆకాశము నుండి నీరు వర్షరూపములో కురియడము అందరికీ తెలుసు. అక్కడక్కడ అప్పుడప్పుడు చేపలు ఎన్నో పై నుండి క్రిందపడడము చూచేయుందుము. దానిప్రకారము కొన్నిచోట్ల అనేకరకముల జీవరాసులు ఆకాశమునుండి క్రింద పడడము గలదు. చెప్పుతూపోతే మనకు కనిపించు వృక్షజాతి, గడ్డిరకములు, తీగలు అన్నీ మొదట ఆకాశము నుండి క్రిందికి వచ్చినవే. ఒక ప్రాంతములో లేని జీవరాసులను, జంతువులను ఆకాశము తెచ్చి ఆ ప్రాంతములో క్రిందికి వదలుచున్నదని చాలామందికి తెలియదు. ఈ విధముగా బయట ఆకాశముండగా, దేవుడు సృష్ఠించిన లోపలి ఆకాశములు మరియు భూమితో కూడుకొన్న వ్యవస్థలో ఉన్నవన్నీ అవి ఆకాశమునుండి, భూమి నుండి పుట్టినవేయని తెలియుచున్నది. బయటి ఆకాశమునుండి సమస్త జీవరాసులు రాగా, భూమినుండి సమస్త వస్తువులు వచ్చాయి. అయితే దేవుడు నిర్మించిన లోపలి వ్యవస్థలో ఏడు ఆకాశములుండగా, అందులో ఏమి పుట్టినవో గమనించి చూడాలంటే దేవుడు చేసిన ఆ వ్యవస్థ ఏమిటో ముందు తెలియవలెను.
'సంస్థ' అను పదమునుండి 'వస్థ' అను పదము రూపాంతరము చెందినది. సంస్థ అనగా ఎంతోమందితో కూడుకొన్నదని అర్థము. 'వ్య' అనగా నశించునది లేక మరణించునది యని అర్థము. నాశనమగు గుంపుతో కూడుకొన్న దానిని వ్యవస్థ అని అంటాము. మానవ శరీరమును అల్లాహ్ తయారు చేశాడు. మానవ శరీరములో ఎన్నో అవయవములు, వాటికి అనుబంధ భాగములు సజీవముగా గలవు. సజీవముగా యున్న గుంపుతో కూడుకొన్నది మానవ శరీరము. అది కొంత కాలమునకు నశించును కనుక శరీరమును వ్యవస్థయని దైవ గ్రంథములో చెప్పారు. శరీరము అను వ్యవస్థలో ఏడు ఆకాశములు పైన, క్రింద భూమి కలదు. అంతేకాక భూమి ఆకాశముల మధ్యలో ఎన్నో శరీర భాగములు గలవు. అందువలన ఆకాశాలు మరియు భూమి యొక్క వ్యవస్థను ''భూమి, ఆకాశములు మధ్యలో గల వస్తువులను అల్లాహ్ సృష్ఠించాడు'' అని చెప్పారు. దానిని సూక్ష్మ భావముతో గమనించితే దేవుడు చేసిన వ్యవస్థ శరీరమే యని తెలియుచున్నది. శరీరములోని ఆకాశములలో ఎన్నో దాగియున్న సమాచారములు గలవు. శరీరములోని ఆకాశములు ఏడు గలవు. ఏడులో అన్నిటికంటే పెద్ద ఆకాశము తలయందు గలదు. మిగతా ఆరు ఆకాశములు వెన్నుపాము అను నాడియందు గలవు. ఈ ఏడు ఆకాశములు మరియు పాదములు మొదలుకొని యున్న శరీరమును భూమి యని అంటున్నారు. శరీరములోనే నాడీవ్యవస్థను ఆకాశములనీ, శరీరమును భూమియని దేవుడు నిగూఢముగా చెప్పాడు. శరీరమును భూమి అనుటకు సాక్ష్యముగా శరీరము మీద ఎక్కడ దిద్దినా భూమికి గుర్తుగా మట్టి వచ్చుచున్నది. ఈ విధముగా కనిపించే శరీరమును, కనిపించని నాడులను అన్నిటినీ కలిపి ఆకాశములు, భూమితో తయారయిన వ్యవస్థయని దేవుడు చెప్పాడు.
భూమి ఆకాశముల శరీర వ్యవస్థను అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్‍లో చెప్పియుండగా దానిని ఎవరూ గమనించకుండా, దానిని గురించి ఏమీ తెలియనివారుగా యున్నారు. వారు శరీర వ్యవస్థలో ఉన్నామనీ, అందులో కాలము దగ్గరపడుచున్నదనీ, మరణము వస్తే శరీర వ్యవస్థను వదలిపోవాలని వారు ఏమాత్రమూ ఆలోచించలేదు యని వాక్యములో చెప్పారు. భూమి ఆకాశములను గురించి ఖుర్ఆన్ గ్రంథములో ఎక్కువగా చెప్పియున్నారు. ఖుర్ఆన్ గ్రంథమే ఆఖరి దైవ గ్రంథము. కావున ఖుర్ఆన్ తర్వాత మనుషులు విశ్వసింపదగిన గ్రంథము ఇంకొకటి లేదు. అటువంటప్పుడు శరీర వ్యవస్థను గురించి ఆలోచించక, అందులో కొద్దికాలమే ఉంటాము, కాలము ప్రతి దినము దగ్గరపడుతున్నదని ఆలోచింపకయున్నారు. ఇతరులు ఆ విషయమును చెప్పినా అదియంతయూ అజ్ఞానము, అది అవసరము లేదు. మనిషి ఇతర దేవతలను కాకుండా అల్లాహ్‍ను ఒక్కనినే ప్రార్థించుచూపోవాలి. ప్రార్థన తప్ప వేరేది ఏమీ అవసరము లేదు అని అంటున్నారు. అలాగే ప్రార్థన చేయుచున్నారు. అయితే ఆ ప్రార్థన అడ్రస్లేని జాబులాంటిదని, శరీర అంతర్గతములో యున్న ఆత్మను, మనస్సును, బుద్ధిని తెలిసి వాటి ద్వారా చేసే ప్రార్థన చాలా శక్తివంతమయినదని నేడు చాలామందికి తెలియదు. అలా తెలియని వారిని హెచ్చరించుతూ, ''వారి కాలము దగ్గరపడియుండ వచ్చునన్న సంగతి గురించి కూడా వారు ఆలోచించ లేదా?'' అని వాక్యములో చెప్పారు.
శరీరములో నిర్ణయించబడిన కర్మ అయిపోవుకొద్దీ ప్రతి మనిషికి మరణము దగ్గరవుతూ వచ్చుచుండును. అలా మనిషికి (తమకు) పోయే కాలము దగ్గర పడిందేమోనన్న విషయము గురించి ఎవరూ ఆలోచించడము లేదు. దీనినిబట్టి ఏ మనిషి తమలోపలి వ్యవస్థను గురించి ఆలోచించడము లేదని, ఇతరులు చెప్పినా వినడము లేదని వారి తలబిరుసుతనముతో (అహముతో) ప్రవర్తించుచూ తమకు తెలిసినదే నిజమైన జ్ఞానమని అనుచూ సత్యమును చెప్పు జ్ఞానులను సహితము అజ్ఞానులుగా పోల్చి దూషించు చుందురు. అటువంటి వారిని అల్లాహ్ అజ్ఞాన మార్గమున పోవునట్లు చేయుచున్నాడు. అల్లాహ్ అలా ఎవరిని అపమార్గములో వదలివేశాడో వారు ఎంతకాలమయినా అదే మార్గములో ఉంటారు తప్ప జ్ఞానమార్గము లోకి రాలేరు. వారికి బయటి చూపు తప్ప లోపలిచూపు ఏమాత్రమూ ఉండదు. శరీరాంతర్గత వ్యవస్థను తెలియనివాడు బయట ఎంత గొప్ప జ్ఞానియని అనిపించుకొన్నా గురువుగా, బోధకుడుగా యున్నా వానిదారి తప్పుదారే యగును. వాడు ఎప్పటికీ మంచిదారిలోనికి రాలేడు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
57. ఆయన ముందు సాష్టాంగపడుచూ ఉంటారు. (7-206)
భూమిమీద మూడు మతములు ముఖ్యముగా యున్నవి. మూడు మతములవారే ఎక్కువ సంఖ్యలో యున్నారు. ఇప్పుడు మనము చెప్పుకొను వాక్యము అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్‍లోనిది. ఖుర్ఆన్ గ్రంథము సర్వమానవులది కాగా ముస్లీమ్‍లు తమ గ్రంథము అని అంటున్నారు. గ్రంథము ఏదైన ఏ మానవ సమాజమునకూ సంబంధము లేనిదై మనుషులందరికీ జ్ఞానమును చెప్పునదై యున్నది. మత సాంప్రదాయములు ఏ మతమునకు సంబంధించినవి ఆ మతమునకు ఉండునుగానీ, దేవుని జ్ఞానము మాత్రము మతసాంప్రదాయములవలె ఒక మతమునకు సంబంధించి యుండదు. నేడు భూమిమీద మనుషులు దేవుని జ్ఞానము కంటే ఎక్కువగా మతమునకు, మత సాంప్రదాయములకు ఎక్కువ విలువ నిచ్చుచున్నారు. మత సాంప్రదాయము ప్రకారము షరియత్ అను పేరుతో కొన్ని నియమములు గలవు. ఆ నియమముల ప్రకారము ఇస్లామ్ మత సాంప్రదాయము ప్రకారము అల్లాహ్‍కు తప్ప ఇతర మనుషులకు ఎవరికీ నమస్కరించకూడదు అన్నది నియమము. అయితే ఇస్లామ్ జ్ఞానము ప్రకారము అంతిమ దైవగ్రంథమయిన ఖురాన్‍లో 15వ సూరాలో 29, 30, 31 ఆయత్‍లలో దేవుని చేత సృష్ఠించబడినవాడు, దేవుని ఆత్మయిన వాడు మనిషిగా వస్తే అతనికి అందరూ సాష్టాంగపడండియని స్వయముగా అల్లాహ్‍యే చెప్పాడు. అయితే అక్కడ చెప్పిన ఆయత్‍లకు వ్యతిరేఖముగా కొందరు దేవుడు మనిషిగా రాడు అని అంటున్నారు. దేవుడు తయారు చేసిన మనిషిలో, దేవుని ఆత్మను దేవుడే ఊది పంపినపుడు, వచ్చినవాడు దేవుడే యగును తప్ప వేరు కాడు. దేవుని ఆత్మతో కూడుకొన్న మనిషి దేవునితో సమానమైనవాడై వస్తే ఆయనకు నమస్కరించండియని దేవుడు చెప్పినా, తమ మత షరియత్ ప్రకారము అల్లాహ్‍కు తప్ప ఇతరులకు మ్రొక్కము అని అంటున్నారు. అదే విషయమునే సూరా 7, ఆయత్ 206 లో కూడా చెప్పడమైనది. ఆ వాక్యమును ఇక్కడ చూస్తాము.
(7-206) ''నీ ప్రభువుకు చేరువలో యున్నవారు ఆయన ఆరాధన పట్ల గర్వాతిశయముతో మెలగరు. పైగా వారు అణుకువతో ఆయన పవిత్రతను కొనియడుతూ, ఆయన ముందు సాష్టాంగ పడుచూ ఉంటారు.''
ఈ వాక్యములో అల్లాహ్ యొక్క ఆరాధనపట్ల గర్వపడక వినయముగా ఉంటారు అని వుంది కానీ అల్లాహ్ ఎవరికీ కనిపించేవాడు కాడు. ఆయనను ఎవరూ చూడలేదు. అయితే అల్లాహ్ అయినవాడు మట్టితో ఒక బొమ్మను చేసి తన ఆత్మతో పంపినప్పుడు శరీరములో ఉన్న వ్యక్తికి భక్తినిబట్టి అతనికి గౌరవము ఉండునుగానీ, శరీరమును బట్టి గౌరవము ఉండదు. అట్లే దేవుడు మనిషిగా వస్తే ఆ మనిషిలోని దేవుని పవిత్రతను పొగడవలసి యుంటుంది. అలాగే ఆయన ముందు సాష్టాంగ పడవలసి ఉంటుంది. అల్లాహ్ యొక్క ఆకారము కనిపించదు. కనిపించని ఆకారమును ఆరాధన రూపములో ప్రార్థించినా, అల్లాహ్ యొక్క కనిపించే ఆకారమును పొగడవలసిందే, అట్లే దేవుని ఆకారము ముందర సాష్టాంగ నమస్కారము చేయవలసిందేయని ఈ వాక్యములో చెప్పారు. దీనినిబట్టి అల్లాహ్ రెండు రకముల ఉన్నాడనీ, ఒకటి శరీరము లేకుండా నిరాకారుడుగా, మరొకటి శరీరము కలిగి సాకారరూపముగా యున్నాడని తెలియుచున్నది. కనిపించని అల్లాహ్‍ను ప్రార్థనతో ఆరాధించినా, అనగా నమాజ్ చేయడము చేత ఆరాధించినా, సాకారరూపముగా యున్న అల్లాహ్‍ను సాష్టాంగములతో నమస్కరించమని ఖుర్ఆన్ వాక్యములోనే చెప్పారు. అయితే నేడు ముస్లీమ్‍ల పెద్దలు ముస్లీమ్ సమాజానికి అనగా ముస్లీమ్‍లందరికీ దేవుడు ఎప్పటికీ ఆకారములేని నిరాకారుడేగానీ, ఆకారముగల సాకారుడు కాదని చెప్పడము వలన, ముస్లీమ్‍లందరినీ ఖుర్ఆన్ వాక్యము నుండి తప్పించి తప్పుదారి పట్టించారని తెలియుచున్నది. ఖుర్ఆన్ గ్రంథములో 15వ సూరాలోనేకాక 7వ సూరాలో మరియు 8వ సూరాలోనూ, 89వ సూరాలోనూ మరికొన్ని చోట్ల దేవుడు మనిషి రూపము కల్గి సాకారునిగా వస్తాడని చెప్పియున్నట్లు కలదు. అమాయక ముస్లీమ్‍లను అందరినీ తప్పుదారి పట్టించినవారిని దేవుడు క్షమించడు. దేవుడు భూమిమీదికి ఆకారముతో రావలసిన పని ఏమి అని కొందరు అనుకోవచ్చును. దానికి జవాబును వెతికితే దొరుకుతుంది. అయితే నీ ప్రశ్నకు నీవు జవాబును వెదకకుండా నీకు జవాబును దేవుడు (అల్లాహ్) అందివ్వగలడు. ఖుర్ఆన్ గ్రంథములో అనేకచోట్ల 'దేవుడు ఆకారముగల మనిషిగా వస్తాడు' అని యుండగా అల్లాహ్ ఎప్పటికీ రాడుయని ముస్లీమ్ బోధకులయిన ముస్లీమ్ పెద్దలు చెప్పడములో అజ్ఞానము తప్ప జ్ఞానము లేదని తెలియుచున్నది.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
58. సత్యమును సత్యముగా, అసత్యమును అసత్యముగా నిగ్గు తేల్చాలన్నది ఆయన ఉద్దేశ్యము. (8-8)
(8-8) ''అపరాధులకు (అజ్ఞానులకు) ఎంత సహించరానిదైనా సరే సత్యం సత్యముగా, అసత్యం అసత్యముగా నిగ్గు తేల్చాలన్నది ఆయన అభిమతము.''
ఈ వాక్యము పూర్తి స్థూలముగా చెప్పబడినది. దేవుడు సూక్ష్మముగా, స్థూలముగా ఉంటాడు అని ఇంతకుముందు వాక్యములో చెప్పుకొన్నాము. అల్లాహ్‍ను అందరూ కనిపించనివానిగానే చెప్పుచుంటారు. అయితే ఈ వాక్యములో అల్లాహ్‍ను స్థూలముగా, శరీరము ధరించిన మనిషిగా చెప్పారు. దేవుడు ఒక శరీరమును ధరించి భూమిమీదికి రావలసిన అవసరమున్నది. భూమిమీద మనుషుల మధ్య అజ్ఞానము పూర్తిగా వ్యాపించిపోయి తమను తాము జ్ఞానులము అనుకొనుచూ, అధర్మములను ఆచరించుచూ వాటినే ధర్మములు అనుకొను సమయములో, భూమిమీద దైవ గ్రంథమున్నా దానిలో ప్రతి వాక్యమును తప్పుగా అర్థము చేసుకొన్నప్పుడు, దైవ గ్రంథములోని వాక్యమును సత్యసమేతముగా విప్పి చెప్పువారు భూమిమీద లేనప్పుడు, దేవుని జ్ఞానమును దేవుడే విప్పి చెప్పవలసియుండును. అయితే దేవుడు కనిపించువాడు కాదు. ఆయనకు శరీరముగానీ, ఆకారముగానీ లేదు. అందువలన 'ఆయన రూపమును ఎవరూ చూడలేదు, ఆయన స్వరమును ఎవరూ వినలేదు' అని ఒక దైవ గ్రంథములో కూడా చెప్పారు. అటువంటి దేవుడు తన జ్ఞానమును ప్రజలకు చెప్పాలంటే తప్పనిసరిగా కంఠశబ్దముతో చెప్పవలసియుండును. అందువలన తప్పనిసరిగా అల్లాహ్ ఒక శరీరమును ధరించవలసివచ్చినది.
అప్పుడు తనకోసము ప్రత్యేకముగా ఒక శరీరమును తయారు చేసుకొని అందులో తానే ప్రవేశించి, శరీరమును ధరించినవాడై ఆకారము తోనూ, మాటతోనూ పుట్టుచున్నాడు. అలా పుట్టినవాడు సాధారణ మనిషి కాకుండా ప్రత్యేకమైన మనిషిగా ఉండును. ఆ విధముగా శరీరమును ధరించి వచ్చిన దేవున్ని ప్రథమ దైవ గ్రంథములో ''భగవంతుడు'' అని అన్నారు. ఆకారము లేనివానిని దేవుడు అనియు, ఆకారమున్నవానిని భగవంతుడు అని ఆధ్యాత్మికములో చెప్పుచున్నారు. భగవంతునిగా వచ్చిన దేవుడు తన ధర్మములను జ్ఞానరూపములో బోధించును. అప్పుడు మనుషులలో కొంత జ్ఞానము ఏర్పడి ధర్మములకు బలము చేకూరును. అప్పుడు అజ్ఞానులు అజ్ఞానమునకు, అధర్మములకు అలవాటుపడి యుండుట వలన మనిషిగాయున్న దేవుడు భగవంతునిగా వచ్చి చెప్పు మాటలు సరిపోకుండును. భగవంతుడు చెప్పు జ్ఞానమును అజ్ఞానులు వ్యతిరేఖించి మాట్లాడుచుందురు. అటువంటి అజ్ఞానులు ఎంత వ్యతిరేఖించినా, ఇతరుల ద్వారా ఎంతో వత్తిడి తెచ్చి భగవంతుడు జ్ఞానము చెప్పకూడదని ప్రయత్నించినా, ప్రభుత్వమును నడుపు రాజులవద్దకు పోయి భగవంతునిగా వచ్చినవాడు అజ్ఞానమును బోధించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడని నేరారోపణ చేసినా, ఆయన మాత్రము సత్యమును సత్యముగా, అసత్యమును అసత్యముగా నిగ్గుతేల్చి చెప్పును. అలా సత్యసమేతమైన బోధను చెప్పుటకే ఆయన భూమిమీద శరీరమును ధరించి వచ్చాడని తెలియుచున్నది. ఈ వాక్యము ముస్లీమ్‍ల బోధకు పూర్తి వ్యతిరేఖముగా యున్నది. వారు 'దేవుడు పుట్టడు' అని పూర్తి ప్రచారము చేసుకొన్నారు. అయితే ఖుర్ఆన్ గ్రంథములో 'దేవుడు మనిషివలె పుట్టునని' చెప్పుటకు సుమారు ఏడు లేక ఎనిమిది ఆయత్‍లు మనకు కనిపించుచున్నవి. దేవుడు తన గ్రంథమందు చెప్పిన వాక్యమును విని అర్థము చేసుకోలేని వారికి ఎప్పటికీ జ్ఞానము అర్థము కాదు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
59. సత్యమును తిరస్కరించి ఎప్పటికీ నమ్మనివారు అల్లాహ్ దృష్ఠిలో అత్యంత హీనమైన జంతువులు. (8-55)
దేవుడు భూమిమీద మనిషిగా పుట్టి, సత్యసమేతముగా జ్ఞానమును చెప్పితే, చెప్పినవాడు అజ్ఞానియనీ, అతను చెప్పిన బోధ అజ్ఞానముతో కూడుకొన్నదనీ, సరియైనది కాదని బయట ప్రచారము చేతురు. భగవంతునిగా వచ్చినవాడు తమ మతమునకు వ్యతిరేఖముగా బోధించు చున్నాడనీ, అతని మాటలు విని తమ మతమువారు చెడిపోవుచున్నారని అన్ని మతములవారు ఆరోపణ చేయుదురు. ఎందుకనగా! దేవుడయిన భగవంతుడు చెప్పు బోధను మిగతా మతములవారందరూ వ్యతిరేఖించు చుందురు. ఆయన చెప్పు బోధలు వారివారి మత గ్రంథములని చెప్పుకొను దైవ గ్రంథములలో ఉండినప్పటికీ, అవి ముందే వేరు భావముతో అర్థమయి ఉండుట చేత, భగవంతుడు చెప్పు సత్యమును ఒప్పుకోక తిరస్కరించు చుందురు. భగవంతుడు భూమిమీదికి వచ్చినప్పుడు సత్యమును సత్యముగా, అసత్యమును అసత్యముగా వేరుచేసి చెప్పును. అప్పుడు అసత్యము వైపు ఉండి, అదే జ్ఞానము అనుకొను వారికి సత్యము ఒంటబట్టదు. అందువలన వారు సత్యమును తిరస్కరించుచుందురు. అటువంటి వారు సత్యమును ఎప్పటికీ నమ్మరు. ఈ విషయమై సూరా 8, ఆయత్ 55లో ఇలా కలదు చూడండి.
(8-55) ''సత్యాన్ని తిరస్కరించి ఎన్నటికీ దానిని విశ్వసించకుండా ఉండేవారే అల్లాహ్ దృష్ఠిలో అత్యంత హీనమైన జంతువులు''
ఈ వాక్యములో భగవంతుడయిన మనిషి చెప్పు సత్యము తమకు ఇష్టము లేనిదనీ, లేక తమ సాంప్రదాయములకు వ్యతిరేఖమయినదనీ, దానిని ఎప్పటికీ విశ్వసించని వాడు ఎవడయితే ఉన్నాడో వాడు భూమిమీద అత్యంత హీనమైన జంతువు అని అన్నారు. అటువంటి మనుషులను నీచమైన జంతువులుగా పోల్చి చెప్పారు. 'జంతువు' అనగా పుట్టినప్పటికీ వృథాగా బ్రతుకునదియని అర్థము. 'తు' అనగా వృథాగా, 'వు' అనగా ఉండునదని అర్థము. 'జ' అనగా పుట్టినయని అర్థము. దీనినిబట్టి జంతువు అనగా పుట్టి కూడా వృథాగా ఉండునది యని అర్థము. జంతువులు ఏవయినా తమ ఆహారము పట్ల పూర్తి శ్రద్ధను కలిగి తమ బుద్ధిని పూర్తిగా ఆహారమును సంపాదించుటలో ఉపయోగించునుగానీ, దైవము మీద చింతన ఏమాత్రమూ చేయవు. జంతువుల యొక్క చింతనయంతా తమ ఆహారమును ఎలా సంపాదించాలియనీ, తమ ఆహార జంతువుల మీద ఎలా దాడి చేయాలి యనీ ఆలోచించుచుండును. అంతతప్ప తమ జన్మను గురించిగానీ, దేవుని జ్ఞానమును గురించిగానీ యోచించు స్థితిలో ఉండవు. అజ్ఞానులు జంతువుల కంటే హీనమైనవారని దేవుడు చెప్పాడు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
60. అజ్ఞానులు జ్ఞానులుగా మారితే వారి పాపములు క్షమించబడుతాయి. మారకపోతే కర్మను అనుభవించక తప్పదు. (8-38)
(8-38) ''ఓ ప్రవక్తా! ఈ అవిశ్వాసులకు చెప్పు. వారు గనుక మానుకుంటే గతములో వారివలన జరిగిన పాపాలన్నీ క్షమించ బడతాయి. ఒకవేళ వారు మళ్ళీ అదే వైఖరిని అవలంభిస్తే గత జాతులపై విధింపబడిన ఉత్తర్వుల ఉపమానము ఉండనే ఉంది.''
ఈ వాక్యములో పాపములను చేయు అజ్ఞాన జనులు జ్ఞానులుగా మారిపోయి జ్ఞానమార్గమును అవలంభించితే గతములో వారు చేసుకొన్న పాపలములన్నీ వారు తెలిసిన జ్ఞానమునుబట్టి వారు ఆచరించుచున్న జ్ఞానమునుబట్టి క్షమించబడుచుండును. అట్లుకాకుండా వారు జ్ఞానమును తెలిసిన తర్వాత కూడా జ్ఞానము ప్రకారము ఆచరించక తమకు ఇష్టమొచ్చి నట్లు పూర్వపు పద్ధతుల ప్రకారమే పాపపు పనులు చేయుచున్నట్లయితే వారి పాపము క్షమించబడదు. అజ్ఞాన ప్రజలకందరికి విధించిన పాపమునే వారికి విధించబడుతుంది. అజ్ఞానులను దయదలచి దేవుడు జ్ఞాన మార్గమును అరుదుగా చూపుచుండును. అట్లు అరుదైన జ్ఞానము అజ్ఞానులకు దొరికినప్పుడు వారు జ్ఞానులుగా మారిపోయి, సక్రమముగా ఉంటే గతములో వారు చేసుకొన్న పాపములు కూడా క్షమించబడి లేకుండా పోతాయి. అరుదైన ఆ అవకాశమును జారవిడుచుకొన్న వారికి ఎప్పటికీ జ్ఞానము దొరకదు, వారు పాపములనుండి బయటపడలేరు. అటువంటి వారు జన్మజన్మకు అధోగతి పాలగుచూ పోవుచుందురు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
61. మంచి పనులు చేసేవాళ్లు పుణ్యాత్ములవుతారు గానీ జ్ఞానులు కాలేరు. అల్లాహ్ జ్ఞానులకు తప్ప పుణ్యాత్ములకు సన్మార్గమును చూపడు. (9-19)
(9-19) ''ఏమిటి, మీరు హజ్‍యాత్రికులకు మంచినీళ్లు సరఫరా చేయటాన్ని, మస్జీదె హరామ్‍లకు సేవలు చేయటాన్ని, అల్లాహ్‍ను, అంతిమ దినమును విశ్వసించి అల్లాహ్ మార్గములో యుద్ధము చేసేవారితో సమానముగా పరిగణించారా? వారు అల్లాహ్ దృష్ఠిలో సమానులు కాజాలరు. అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గమును చూపడు.''
భూమిమీద మంచి పనులు చేసేవారు పుణ్యాత్ములవుతారు. చెడు పనులు చేసేవారు పాపాత్ములవుతారు. పుణ్యాత్ములను పాపాత్ములను ఇద్దరినీ కలిపి కర్మలను చేయువారని అనవచ్చునుగానీ, జ్ఞానులు అనే దానికి వీలులేదు. ఎందుకనగా! పాపపుణ్య కార్యములకు జ్ఞానము వేరుగా ఉంటుంది. జ్ఞానులు వేరు, ప్రపంచ కర్మలు సంపాదించుకొనువారు వేరు. మనకు తెలిసినంతలో హజ్‍యాత్రికులకు మంచినీళ్లు ఇచ్చువారు, మస్జీద్లకు సేవ చేయువారు మంచి కార్యములు చేయువారి క్రిందికి జమకట్టవచ్చును. అయితే వారు ఆ పనిని చేయుట చేత పుణ్యఫలితము రావచ్చును. ఇటువంటి కొన్ని మంచి పనులను దుర్మార్గులు తమ దుర్మార్గము చేత సంపాదించిన పాపపు సొమ్మును ఉపయోగించి దాహము పొందిన వారికి నీళ్లను, ఆకలిగొన్నవారికి అన్నమును పెట్టవచ్చును. మిక్కిలి మంచి పనులయినటువంటి హజ్‍యాత్రికులకు మంచినీళ్లు ఇచ్చినా, ప్రార్థనా మందిరములకు మరమత్తులు చేసినా, వారు గతములో చేసుకొన్న పాపములు క్షమించబడవు. కొందరు తమ పాపములను తగ్గించుకొను నిమిత్తము ఇటువంటి మంచిపనులు చేయుచుందురు. మంచివానికి సహాయము చేసినా, దేవుని ప్రార్థనామందిరములకు సహాయపడినా వాడు తన పాపపు సొమ్ముతోనే సహాయము చేయుచున్నాడు. అంతమాత్రమున ఎంతో గొప్ప జ్ఞానులతో సమానము కాడు. అటువంటివాడు తన పాపపు సొమ్ముతో మంచి పనులు చేయుట వలన వానికి పుణ్యము రావచ్చునుగానీ వానికి జ్ఞానము రాదు.
జ్ఞానము కొరకు ప్రాకులాడి అంతిమ దినమయిన మరణ దినముతో దేవుడు తీర్పుతీర్చునని తెలిసి, ఆ తీర్పునుండి తప్పించుకొని బయటపడుటకు దేవుని జ్ఞానము వలననే సాధ్యమవుతుందని తెలిసి, దేవుని జ్ఞానము కొరకు జీవితములో శ్రమించినవాడు జ్ఞాని కాగలడు. అలా శ్రమించి జ్ఞానము తెలిసినవాడు పుణ్య కార్యములను చేసినవాడు ఇద్దరూ ఎప్పటికీ సమానులు కారు. ప్రపంచ పనులలో ఎంత మంచి పనులు చేసినా, జ్ఞానము తెలియని వానిని దేవుడు అజ్ఞానిగానే లెక్కించును. అటువంటి అజ్ఞానులకు దేవుడు ఎప్పుడూ జ్ఞానమును ఇవ్వడు. జ్ఞానము మీద శ్రద్ధకల్గి శ్రమించిన వానికి జ్ఞానమును ఇచ్చును. అందువలన జ్ఞానము మీద శ్రద్ధ లేకుండా బయటి పనుల మీద ద్యాసకల్గి చేయువారిని, జ్ఞానులను దేవుడు సమానముగా చూడడు. అంతేకాక జ్ఞానము కొరకు శ్రమించనివారికి తన జ్ఞానమును ఎంతమాత్రము కలుగజేయడు. ప్రపంచ మార్గములో ఎన్ని మంచి పనులు చేసినా వారిని దేవుడు దుర్మార్గులవలె పరిగణించును. అందువలన 'దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గమును కలుగజేయడు' అని వాక్యములో చెప్పియున్నారు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
62. దేవునికంటే ప్రపంచ విషయములే గొప్పగావుంటే, దేవుడు అవిధేయులకు సన్మార్గమును చూపడు. (9-24)
(9-24) ''ఓ ప్రవక్తా! వారికి చెప్పు. ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ సమీప బంధువులు, మీరు సంపాదించిన సిరి సంపదలు, కుంటుపడుతుందేమోనని మీరు భయపడే మీ వర్తకము, మీకు ఎంతో ప్రియమయిన మీ గృహాలు మీకు అల్లాహ్కన్నా, ఆయన ప్రవక్తకన్నా, ఆయన మార్గములో సలిపే పోరాటముకన్నా ఎక్కువ ప్రియమైనవైతే అల్లాహ్ తీసుకవచ్చే తీర్పు (శిక్ష) కొరకు ఎదురు చూడండి. అల్లాహ్ అవిధేయులకు సన్మార్గమును చూపడు.''
ఈ వాక్యములో ప్రపంచ విషయములలో ఆసక్తియుండి దేవుని విషయము మీద ఆసక్తి లేకపోతే అటువంటి వారు అల్లాహ్‍కు విధేయులు కారని చెప్పడమైనది. దేవునికి విధేయులు కాని వారికి దేవుని నుండి తప్పక శిక్ష ఎదురవుతుందని చెప్పియున్నారు. దేవునికి వ్యతిరేఖ దిశలో యున్న వారికి దేవుడు ఎప్పుడూ తన జ్ఞానమును ఇవ్వడు. ప్రపంచ విషయములనగా తల్లితండ్రులు మొదలగు బంధువులు మరియు భూములు, బంగారు, గృహములు మొదలగు ప్రపంచ ఆస్తులు, సజీవమైన, నిర్జీవమైన వాటిమీద ఆసక్తియుండువారికి దేవుని మీద, దేవుని జ్ఞానము మీద, దేవుని జ్ఞానమును చెప్పు ప్రవక్తల మీద శ్రద్ధయుండదు. దీనినిబట్టి మనిషికి ప్రపంచ శ్రద్ధ, పరమాత్మ శ్రద్ధ (దేవుని శ్రద్ధ) యను రెండు రకముల శ్రద్ధలు గలవని తెలియుచున్నది. ప్రపంచ శ్రద్ధయున్న వానికి ప్రపంచ సంబంధ పాప పుణ్యములు వచ్చుచుండును. దేవుని శ్రద్ధయున్న వానికి దేవుని జ్ఞానము లభ్యమగును. దేవుని జ్ఞానము లభ్యమయినవానికి ప్రస్తుతము వచ్చు పాపములుగానీ, గతములో ఉండు పాపములుగానీ అన్నీ క్షమించబడును. అదే ప్రపంచ శ్రద్ధయున్న వానికి వచ్చు పాపములకు (కర్మలకు) శిక్షలు తప్పక తీర్పు దినమున లభించును. దేవుడు మనిషియొక్క అంత్య దినమున, మనిషి దేవుని యొక్క శిక్షను తీసుకొని వచ్చి ప్రపంచములో పుట్టిన తర్వాత దానిని అనుభవించును. అలా అనుభవించేవారిని భూమిమీద చూస్తూనే యున్నాము. స్వర్గ, నరకములు భూమిమీదనే ప్రత్యక్షముగా అందరికీ కనిపించుచున్నవి. అట్లే అందరూ అనుభవించుచున్నారు. స్వర్గనరకములు ఇక్కడే గలవు. పరలోకము ఎక్కడో కలదు. దేవుని మీద శ్రద్ధగలవానికి కనిపించని పరలోకము లభించును.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
63. దేవుని మార్గములో పోరాడి చంపుతారు చంపబడతారు. తన ప్రాణాలను పరలోకమునకు బదులుగా దేవుడు కొంటాడు. దేవునితో వ్యాపారము లాభసాటియైనది. పరలోకము వస్తుంది (9-111)
(9-111) నిస్సందేహముగా అల్లాహ్ ముస్లీమ్‍లనుండి (విశ్వాసుల నుండి) వారి ధన, ప్రాణములను కొంటున్నాడు. దానికి బదులుగా స్వర్గాన్ని (పరలోకమును) ఇస్తున్నాడు. విశ్వాస ప్రజలు దేవుని మార్గములో పోరాడుతారు, చంపుతారు, చంపబడతారు. ఈ విషయమై తౌరాతులోనూ (భగవద్గీతలోనూ), ఇంజీలులోను (బైబిలులోను), ఖుర్ఆన్‍లోను సత్యమైన వాగ్దానము చేయ బడింది. వాగ్దానాన్ని నెరవేర్చటములో అల్లాహ్‍ను మించిన వాడెవడుంటాడు. కాబట్టి ఖరారు చేయబడిన ఈ వర్తకానికి సంబరపడండి. ఘన విజయము అంటే ఇదే.''
ఈ వాక్యము పూర్తి ముతషాబిహాత్ (సూక్ష్మమైన) వాక్యముగా యున్నది. అందువలన ఈ వాక్యము అంతయూ నిగూఢముగా చెప్పబడినది. ఇక్కడ దేవుడు మనుషులతో వ్యాపారము చేయుచున్నాడు. డబ్బులిచ్చి వస్తువులు కొన్నట్లు, దేవుడు పరలోకము మోక్షము అను ధనమునకు మనుషుల సంపదలను, ప్రాణములను కొంటున్నాడు. దేవుడిచ్చు ముక్తి కొరకు జ్ఞానులయినవారు తమ ధనమును, ప్రాణములను దేవునికి సమర్పించుచున్నారు. అలా దేవుని వశము చేసిన తమ ధన, ప్రాణముల మీద ఆశ వదలి అవి మనవి కావు అని అనుకొని దేవుని మార్గములో అజ్ఞానముతో పోరాడుచున్నారు. అజ్ఞాన పోరాటములో తమ ధనము పోయినా, ప్రాణము పోయినా అవి తమవి కావు ముందే దేవునికి ఇచ్చేసినవని తెలిసి వెను తిరగని పోరాటము మాయతో కూడుకొన్న అజ్ఞానముతో చేయుచున్నారు. ఆ పోరాటములో మాయ రూపములో తమ శరీరములోయున్న ఎన్నో గుణములను వాటి ఆసక్తిని చంపి లేకుండా చేయడము జరుగుచున్నది. మాయతో చేయు పోరాటములో గుణములను, వాటి ధ్యాసలను చంపి లేకుండా చేయడమేకాక అప్పుడప్పుడు గుణముల దెబ్బలకు పోరాటము చేయువారు కూడా క్రిందపడిపోయి చనిపోవు చుండును. జీవిత రణరంగములో గుణములను శత్రువులతో పోరాటము చేయు వేళ ఒక్కొక్కప్పుడు విజయము, ఒక్కొక్కప్పుడు ఓటమి జరుగు చుండును. ఇది ధర్మపోరాటము, ధర్మములను ఆయుధములు తీసుకొని జీవిత రంగములో చేయు పోరాటం. ఈ పోరాటము వలన ముందే దేవునికి అమ్మివేసిన ధన ప్రాణములు పోయినా ఫరవాలేదు. ఎందుకనగా! దేవునితో ముందే ఒప్పందము చేసుకొన్న వ్యాపారము ప్రకారము ముక్తికి (పరలోకమునకు) బదులుగా పోరాడుచున్నాము.
అలా పోరాడితే చివరకు పోయేది ప్రాణమయినా వారికి లభించు నది ముక్తి. దేవునితో చేయు వ్యాపారములాంటిదయిన ఈ లావాదేవి చాలా మంచిదే, మంచి లాభసాటిదే. ఈ విషయములో దేవుడు ఏమీ మాట తప్పువాడు కాడు. తన ఒప్పందమును వాగ్దానరూపముగా మూడు దైవ గ్రంథములలో చెప్పియున్నాడు. భగవద్గీత (తౌరాతు), బైబిలు (ఇంజీలు) మరియు చివరి దైవగ్రంథమయిన ఖుర్ఆన్‍లో దేవుడు శాస్త్రబద్దముగా మీ ప్రాణ ధనములను లెక్కచేయక మాకిస్తే, మీకు మా సన్నిధానమైన పరలోకమును ఇస్తానని చెప్పియున్నాడు. అల్లాహ్ చెప్పిన మాటను నెరవేర్చక పోవడము అంటూ ఏదీ లేదు. చెప్పినమాటను నెరవేర్చడములో ఆయన కంటే మించినవాడెవడున్నాడు. ఏది ఏమయినా మనిషి యెడల దేవుడు చేసిన ఈ ఒప్పందము మనిషికి చాలా లాభసాటి అయినది. ఈ వాక్యములో మోక్షము లేక ముక్తి అని చెప్పవలసినచోట స్వర్గము అని చెప్పియున్నారు. అక్కడ శాస్త్రబద్దమైన జ్ఞానరీత్యా ముక్తి లేక మోక్షము అనియో ఇంకా పరలోకమనియో చెప్పడమే సత్యమైనదిగా ఉండును. స్వర్గము అని చెప్పకూడదు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
64. నావద్ద అల్లాహ్ నిధులుగానీ, అగోచర జ్ఞానము గానీ లేదు. మీరు తక్కువగా చూచువారికి మేలు చెయ్యనని కూడా చెప్పలేదు. వారి అంతరాలలో ఉన్నది అల్లాహ్‍కు బాగా తెలుసు. ఒకవేళ నేను గనుక అలాంటి మాటయంటే నేను దుర్మార్గునిగా లెక్కించబడతాను. (11-31)
ఈ విషయమునకు సంబంధించిన వాక్యము అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్‍లో సూరా 11, ఆయత్ 31లో ఇలా గలదు.
(11-31) ''నా దగ్గర అల్లాహ్ నిధులున్నాయని నేను మీతో అనడము లేదే! నావద్ద అగోచర జ్ఞానము కూడా లేదు. నేను దైవ దూతనని కూడా చెప్పడము లేదు. మీరు చిన్నచూపు చూస్తున్నవారికి అల్లాహ్ ఏ మేలు చెయ్యబోనని కూడా చెప్పలేదు. వారి ఆంతర్యాలలో ఉన్న దానిని అల్లాహ్ బాగా ఎరిగినవాడు. ఒకవేళ నేను గనుక అలాంటిమాట ఏదైనా అంటే నేను దుర్మార్గులలో ఒకడిగా పరిగణించబడతాను.''
పూర్వము సృష్ఠ్యాదిలో ఆకాశవాణి చెప్పిన జ్ఞానమును మొదట ఆకాశములోని సూర్యుడు విన్నాడు. తర్వాత సూర్యుడు భూమిమీద మనువు అను వ్యక్తికి చెప్పగా అతని ద్వారా సూర్యుడు చెప్పిన జ్ఞానము అందరికీ తెలిసినది. మొదట భూమిమీద గల మనువు అను ఒక వ్యక్తిని ఎంచుకొని అతనికి కృతయుగములోనే సూర్యుడు జ్ఞానమును చెప్పాడు. ఆకాశములో మొదట జ్ఞానమును విన్నవాడు సూర్యుడయితే అతని వలన ఖగోళములో కూడా ఎందరో జ్ఞానమును తెలియగలిగారు. గతములో మోషే ప్రవక్త ద్వాపర యుగములో ఉండేవాడు. తర్వాత అతనికి మూసా ప్రవక్త యని పేరు మారిపోయినది. ఇంజీలు బైబిలుగా మార్చబడినది. భగవద్గీత తౌరాతుగా చెప్పబడినది. ఈసా తర్వాత ఏసుగా చెప్పబడినాడు. మనువే తర్వాత భీష్ముడుగా వచ్చాడు. ఇట్లు ఎన్నో పేర్లు ఎందరికో మార్చబడినాయి. అదే పద్ధతిలో కృతయుగములో సూర్యుడు అని చెప్పిన పేరును ఫలానా వాడని గుర్తించనట్లు సూర్యుడు తన పేరును ''జిబ్రయేలు'' అను పేరుగా చెప్పుకొని కలియుగములో ముహమ్మద్ ప్రవక్తగారికి ఖుర్ఆన్ జ్ఞానమును చెప్పాడు.
జిబ్రయేల్ దూతకాదని నమ్మదగిన ఆత్మయని ఖుర్ఆన్ గ్రంథములో గలదు. జిబ్రయేలు తాను తెలియగల్గిన జ్ఞాన సమాచారమును ఒకమారు కృతయుగములోనే మనువు అను వ్యక్తికి అందించాడు. అట్లే కలియుగములో జిబ్రయేల్ అను పేరుతో 'మ' అను అక్షరము మొదటగల మహమ్మద్ (ముహమ్మద్) ప్రవక్తగారికి అందివ్వడము జరిగినది. దేవుడు నా యొక్క భక్తులు అని సూచించిన వారిని 'మ' అను అక్షరముతో ప్రారంభమగు పేర్లుగల వారిగా జిబ్రయేల్ గారికి తెలియజేయగా, ఆయన దేవుని సూచన మేరకు ఒకమారు మనువును, మరొకమారు ముహమ్మద్ ప్రవక్తను ఎన్నుకొన్నాడు. అలా ఎన్నుకొన్నవారికి తన జ్ఞానమును చెప్పాడు. చెప్పిన వాడు ఒక్కడే, అయితే రెండు కాలములలో రెండు పేర్లతో చెప్పబడుట ద్వారా ఆయనను ఒక్కడేయని చాలామంది గుర్తించలేకపోయారు. అందువలన నేను ఉన్న సత్యమును ఇప్పుడు చెప్పవలసివచ్చినది. నేను చెప్పిన సత్యము ప్రకారము కలియుగములో ముహమ్మద్ ప్రవక్తకు, కృత యుగములో మనువుకు చెప్పిన వ్యక్తి ఒక్కడే ఆయనే సూర్యుడు. సూర్యుడు జిబ్రయేల్గా కలియుగములో ప్రవక్తగారికి చెప్పినా, కృతయుగములో సూర్యునిగా మనువుకు చెప్పినా, తనకు తెలిసిన జ్ఞానము ఒక్కటే చెప్పాడు తప్ప వేరు ఏమీ చెప్పలేదు. చెప్పినది ఒక్కడే అయినందున ఆయన చెప్పినది ఒక్కటే జ్ఞానమని తెలియవచ్చును. దీనిప్రకారము భగవద్గీత (తౌరాతు) జ్ఞానము, ఖుర్ఆన్ జ్ఞానము వేరువేరు కాదని చెప్పవచ్చును. ఖుర్ఆన్ గ్రంథము సూరా ఐదులో 44,46,48,68 ఆయత్‍లలో ఖుర్ఆన్ తౌరాత్ జ్ఞానమును ధృవీకరించుచున్నదని వాక్యములలో తెలియజేయబడినది.
జిబ్రయేల్ (సూర్యుడు) మనువుకు గానీ, ముహమ్మద్ ప్రవక్తకు గానీ ఏది చెప్పినా తనకు తెలిసిన జ్ఞానమును చెప్పాడు తప్ప తాను స్వంతముగా ఏమీ చెప్పలేదు. అందువలన ఆయనవద్ద అల్లాహ్ నిధులున్నాయని గానీ, ఆయనవద్ద అగోచర జ్ఞానమున్నదనిగానీ, తాను దేవదూతనని గానీ చెప్పలేదు. అందరి హృదయాలలో ఉన్నది అల్లాహ్‍కు తెలుసునని చెప్పాడు తప్ప తనకు తెలుసునని చెప్పలేదు. ఒకవేళ ఎప్పుడయినా తాను స్వయముగా చెప్పిన జ్ఞానము ఎక్కడయినా ఉంటే తాను దుర్మార్గుడనవుతానని చెప్పాడు. దీనినిబట్టి జిబ్రయేల్ ప్రతీ జ్ఞానమును అల్లాహ్ చెప్పాడని చెప్పాడు తప్ప తాను చెప్పుతున్నానని ఒక్క ముక్క కూడా చెప్పలేదు. అంత పెద్ద వ్యక్తి తన మీద భారము పడకుండా దేవుడు చెప్పిన జ్ఞానమునంతటినీ దేవుడు ఈ విధముగా చెప్పాడని చెప్పాడు తప్ప తాను చెప్పుచున్నట్లు ఎక్కడా చెప్పలేదు. అందువలన నేడు ఎంతో చిన్న వ్యక్తులమయిన మనుషులు దేవుని జ్ఞానమును దేవుడు చెప్పినట్లే చెప్పాలిగానీ, తాము చెప్పినట్లు మార్చి చెప్పకూడదు. అలా చెప్పితే అతడు మానవులలో దుర్మార్గుడుగా లెక్కించబడుతాడని జిబ్రయేల్ చెప్పినట్లు కలదు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
65. దేవుడు మనుషులను, దేవతలను నరకములో నింపుతాడు. వారిని దానికే పుట్టించాడు. (11-119)
(11-119) ''నీ ప్రభువు అయిన దేవుడు దయచూపిన వారు తప్ప మిగతా వారినందరినీ ఆయన పుట్టించిందే అందుకొరకు, ''నేను నరకాన్ని జిన్నాతులు (దేవతలు) మరియు మనుషులతో నింపుతాను'' అని నీ ప్రభువు అన్న మాట నెరవేరింది.''
నేడు భూమిమీద మానవ జాతియంతా ఒక్కటే అయినా, మనుషులు మతాలను సృష్ఠించుకొని మతాలకు కొన్ని సాంప్రదాయములను పెట్టుకొని ఆ సాంప్రదాయముల ప్రకారము మనుషులు అనేక సమాజములుగా విడిపోయారు. ఇది హిందూసమాజము, అది క్రైస్థవ సమాజము, మరొకటి ముస్లీమ్ సమాజమని మొత్తము (12) పన్నెండు సమాజములుగా మనుషులు విడిపోయారు. ఇది కనిపించే ప్రపంచములోని మనుషుల యొక్క స్థితి. దేవుడు మనుషులను అందరినీ సమానమైన శరీరములతో పుట్టించాడు. దేవుడు తన సృష్ఠిలో కనిపించే మనుషులనేకాక కనిపించని మనుషులను కూడా సృష్ఠించాడు. స్థూల దేహములు లేకుండా సూక్ష్మ దేహములతోనే ఉండునట్లు మరొక మనుష జాతిని సృష్ఠించాడు. సాధారణ మనిషికి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము అను రెండు భాగముల శరీరముండును. రెండవ జాతి మనుషులను స్థూల దేహము లేకుండా సూక్ష్మ దేహము మాత్రముండునట్లు దేవుడు సృష్ఠించాడు. రెండవ జాతి అనగా రెండవ సృష్ఠి అయిన మనుషులకు కనిపించే దేహములు ఉండవు కావున వారు సాధారణ మనుషులకు కనిపించరు. స్థూల సూక్ష్మ రెండు దేహములున్న మనుషులకంటే, సూక్ష్మదేహము ఒక్కటి యున్నవారు తక్కువవారే యని చెప్పవచ్చును. దీనినిబట్టి కనిపించే మనుషులు, కనిపించని మనుషులకంటే గొప్పవారనీ, కనిపించని మనుషులు అన్ని విధములా తక్కువవారని చెప్పవచ్చును.
అయితే మనుషులలో మంచివారు, చెడువారు యున్నట్లు కనిపించని మనుషులలో కూడా మంచి చెడు రెండు రకముల మనుషులు కలరు. కనిపించే మనుషులను ప్రజలు అని పేరుతో చెప్పవచ్చును. 'జ' అనగా పుట్టుట. 'ప్ర' అనగా ముఖ్యముగా అని అర్థముగలదు. ప్రజలు అనగా ముఖ్యముగా పుట్టినవారు అని అర్థము. అదే రెండవ రకమైన సృష్ఠి అయిన కనిపించని వారిని జిన్నాతులని ఖుర్ఆన్ గ్రంథములో చెప్పారు. అదే ప్రథమ దైవ గ్రంథములో దేవతలు అని చెప్పారు. ప్రజలు కనిపించే వారు కాగా, దేవతలు కనిపించనివారని తెలియవచ్చును. దేవతలు మనుషులకంటే బుద్ధిహీనులు, అజ్ఞానులని చెప్పవచ్చును. అయితే నేడు హిందూ సమాజములో దేవతలను గొప్పవారిగా తలచుచుందురు. అంతేకాక వారిని చాలామంది ఆరాధించుచుందురు. తెలివితక్కువ వారిని, తెలివి గలవారు ఆరాధించడమేమిటియని కొందరికి ప్రశ్నరావచ్చును. అదే మిగతా మత సమాజములలో అనగా క్రైస్థవ, ముస్లీమ్ సమాజములలోని మనుషులు దేవతలుగా యున్న వారిని గొప్పగా తలువరు మరియు పూజించరు (ఆరాధించరు). వారు తమ దైవ గ్రంథములుగా చెప్పుకుంటున్న బైబిలు, ఖుర్ఆన్‍లలో దేవున్ని తప్ప దేవతలను ఆరాధించమని చెప్పలేదు. అదే విషయమునే హిందూ సమాజము యొక్క గ్రంథమని అనుకొనుచున్న ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీతలో దేవున్ని తప్ప దేవతలను ఆరాధించవద్దని చెప్పియున్నారు. అయినా ఆ విషయమును హిందువులు గాలికి వదలివేసి దేవతలను ఆరాధించుచున్నారు.
హిందూ సమాజములో దేవతలను గొప్పవారిగా తలచి ఆరాధించినా, దేవతలు మనుషులతో సమానముగా కాకుండా తక్కువ శరీరము కలిగి పుట్టారనీ, వారి మనస్తత్త్వము కూడా మనుషుల భావముల కంటే తక్కువయని చాలామందికి తెలియదు. దేవతలు మనుషులకంటే గొప్పవారను భావము హిందువులకందరికీ గలదు. మనుషులు చేయు పనులలో పాపపుణ్య కర్మలు వచ్చినట్లు, దేవతలు చేయు పనులలో కూడా పాపపుణ్య కర్మలు వచ్చుచుండును. సహజముగా ఎవరయినా మంచి పనిని చేస్తే పుణ్యము, చెడు పనిని చేస్తే పాపము రావడము సహజము. మనుషులు మంచికంటే ఎక్కువ చెడునే చేస్తున్నారనీ, అందువలన మనుషులలో ఎక్కువమందికి పాపము వస్తున్నదని చెప్పుచున్నాము. మనుషులకంటే ఎక్కువశాతము దేవతలు మంచికంటే చెడు పనినే ఎక్కువగా చేయుచుండుట వలన, మనుషులకంటే పాపమును ఎక్కువ సంపాదించు వారిలో మొదటివారుగా దేవతలున్నారు. పాపమును సంపాదించువారిలో ఎక్కువ శాతముమంది దేవతలు, తక్కువ శాతముమంది మనుషులు ఉన్నారు. 'దేవతలు' అను పేరు మధ్యలో వచ్చినదేగానీ మొదటినుండి ఉండు పేరు కాదు. దేవతలు అను పేరు రాకముందు 'కనపరాని మనుషులు'గా చెప్పబడేవారు.
మనుషులయినా, దేవతలయినా దేవుని సృష్ఠిలోనివారే. పాప పుణ్యములు సమానమే. వాటి వలన వచ్చు ఫలితములయిన కష్ట సుఖములూ సమానమే. ఇందులో దేవతలకు ఎటువంటి రాయితీ లేదు. అందువలన దేవుడు ఇలా అన్నాడు. ''నేను నరకాన్ని దేవతలు మరియు మనుషులతో నింపుతాను'' అన్నాడు. దేవుడు తన పాలనను సక్రమముగా నిర్వర్తించు చున్నాడు. అందువలన దేవతలకు, మనుషులకు స్వర్గ నరకములు సమానముగా ఉన్నాయి.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
66. ఓ ప్రవక్తా నీకు వహీ ద్వారా ఈ ఖుర్ఆన్ జ్ఞానమును చెప్పాము. ఇంతకుముందు దీనిని గురించి నీకు ఏమీ తెలియదు. (12-3)
(12-3) ''ఓ ప్రవక్తా! మేము నీవద్దకు వహీ ద్వారా ఖుర్ఆన్‍ను పంపి అత్యుత్తమమైన జ్ఞానమును నీకు చెబుతున్నాము. నిశ్చయముగా ఇంతకు మునుపు నీకు దీనిని గురించి ఏమీ తెలియదు.''
ఈ వాక్యములో జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తకు ఖుర్ఆన్ జ్ఞానమును చెప్పువరకు ప్రవక్తకు ఏమీ తెలియదని జిబ్రయేల్ చెప్పిన తర్వాత ప్రవక్తగారికి ఖుర్ఆన్ జ్ఞానము తెలిసినదని చెప్పాడు. దీనినిబట్టి అప్పుడు ఆ దేశములో ఏ మనుషులకూ జ్ఞానము తెలియదనీ, ప్రవక్తకు జ్ఞానము తెలిసిన తర్వాత ప్రవక్తగారు ప్రజలకు చెప్పితే ప్రజలకు ఖుర్ఆన్ జ్ఞానము తెలిసినదని అర్థమగుచున్నది. ఈ ఖుర్ఆన్ జ్ఞానమే ఇంజీలు జ్ఞానముగా యున్నది. ఇంజీలు జ్ఞానమే తౌరాతు జ్ఞానముగా యున్నది. తౌరాతు జ్ఞానమే జపర (జబుర) జ్ఞానముగా యున్నది. ఖుర్ఆన్, ఇంజీలు, తౌరాతు మూడు దైవ గ్రంథములుగా యున్నవి. మూడు దైవ గ్రంథముల లోని జ్ఞానము ఒకదానితో మరొకటి సంబంధపడి యుండుట వలన మూడు గ్రంథములలో ఒకే జ్ఞానమున్నదని చెప్పవచ్చును. ఈ జ్ఞానమంతయూ మొదట ఆకాశవాణి ద్వారా వచ్చినది. అప్పుడు గ్రంథరూపము కాకుండా మాటల రూపములోయున్న జ్ఞానము పేరు ''జపర'' యని చెప్పారు. జపర పేరు నేడు 'జబుర' అని చెప్పబడుచున్నది. తర్వాత అదే జ్ఞానమే గ్రంథరూపము కాగా వాటి పేర్లే భగవద్గీత (తౌరాతు), బైబిలు (ఇంజీలు), ఖుర్ఆన్ అను పేర్లు గల గ్రంథములుగా వచ్చాయి. భగవద్గీత గ్రంథమును (జ్ఞానమును) శ్రీకృష్ణుడు చెప్పగా, బైబిలు గ్రంథ జ్ఞానమును ఏసు చెప్పాడు. వీరిద్దరూ మనుష రూపములో యున్నవారే. అయితే ఖుర్ఆన్ గ్రంథ జ్ఞానమును జిబ్రయేలు (సూర్యుడు) అను ఆకాశ గ్రహము వచ్చి చెప్పినది. అదే జిబ్రయేలు (సూర్యుడే) కృతయుగములోనే మొట్టమొదట భూమిమీద మనుషులకు జ్ఞానమును చెప్పాడు. అక్కడ మొదట చెప్పినవాడే ఇక్కడ చివరిలో కూడా చెప్పాడు. అందువలన ఖుర్ఆన్‍ను అంతిమ దైవ గ్రంథము అని అంటున్నాము.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
67. నేను ముస్లీమ్‍గానే చనిపోవాలి. (12-101)
(12-101) ''నా ప్రభూ! నీవు నాకు రాజ్యాన్ని ప్రసాదించావు. ఇంకా నీవు నాకు కలల భావార్థాన్ని వివరించే విద్యను నేర్పావు. ఓ భూమ్యాకాశాల సృష్ఠికర్తా! ఇహంలోనూ పరంలోనూ నువ్వే నా రక్షకుడవు. ముస్లీమ్‍గా ఉన్న స్థితిలోనే నాకు మరణము ఇవ్వు. నన్ను సజ్జనులలో చేర్చు'' అని వేడుకున్నాడు.
దైవజ్ఞానము తెలిసిన తర్వాత ఒక జ్ఞాని దేవున్ని ఇలా వేడుకొన్నాడట. అతని ప్రార్థనలో ''నాకు ధన ధాన్యాలనిచ్చి ధనికుడు అను పేరు వచ్చునట్లు చేశావు. అయినా నాకు తృప్తిలేదు. అవన్నీ ప్రపంచ సంబంధమైనవే. మరణముతో అవి ఇక్కడే నిలిచిపోవును, నేను ఎక్కడికో పోవుదును. అందువలన వాటితో నాకు సంబంధము లేదు. అలాగే మనిషికి వచ్చే కలల భావాన్ని తెలిపే విద్యను నేర్పావు. అయితే కలల భావాన్ని తెలిసినంత మాత్రమున ఇతరుల దృష్ఠిలో నేను గొప్పవాడిగా కనిపించవచ్చు అయినా ఆ గొప్పతనము చనిపోవువరకే, చనిపోయిన తర్వాత నా వెంటరాని దానితో నాకు తృప్తి లేదు. ఇటు ప్రపంచములోను అటు పరలోకములోను నువ్వే నా దేవునివి. నేను ఎప్పటికీ నీ మీద విశ్వాసము గలవాడిగానే ఉండాలి'' యని వేడుకొన్నాడు.
ఇక్కడ వాక్యములో 'ముస్లీమ్‍గానే చనిపోవాలి' యను మాట గొప్ప సారాంశమైన మాటగాయున్నది. ముస్లీమ్ అనగా ఒక మతస్థుడుగా తలువ కూడదు. ముస్లీమ్ అనగా విశ్వాసియని అర్థము. దేవుని మీద ఎవరు విశ్వాసము కల్గియున్నారో వారు అందరూ ముస్లీమ్‍లేయగుదురు. ఆ లెక్క ప్రకారము ఏ మతములో అయినా ముస్లీమ్‍లు ఉండవచ్చును. ఒక్క ఇస్లామ్ మతములోనే ముస్లీమ్‍లు ఉంటారనుకోవడము పొరపాటు. ఇప్పుడు నేను హిందూ సమాజములో పుట్టాను అయినా దేవుని మీద విశ్వాసములో నేను మొదటివాడుగా యున్నాను. అందువలన నన్ను పెద్ద ముస్లీమ్యని ఎవరయినా అనవచ్చును. అట్లే దేవుని మీద విశ్వాసమున్న ప్రతివాడు ముస్లీమ్‍గానే యున్నాడు. నేను నా జీవితము చివరివరకు దేవునిమీద విశ్వాసముతోనే బ్రతికి, దేవుని మీద విశ్వాసముతోనే చనిపోవాలి యని నా కోర్కె. అప్పుడు నేను ముస్లీమ్‍గానే చనిపోవాలని నా కోర్కె. మిగతా వారు కూడా దేవుని మీద ఇష్టము, నమ్మకము కలిగి బ్రతకాలనీ, అలాగే చనిపోవాలని చెప్పుచున్నాను. మరణములో కూడా దేవుని మీద విశ్వాసము అట్లేయుండుట వలన అందరూ ముస్లీమ్‍లుగానే చనిపోవునట్లగును. దేవుని మీద విశ్వాసము జీవితాంతము సాగవలెనని కోరుకొంటున్నాను.
☞