till 125
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
104. వెనుక జన్మ జ్ఞాపకము ఉండదు. (23-99, 100)
(23-99, 100) ''చివరికి వారిలో ఎవరికైనా చావు వచ్చినప్పుడు ఓ ప్రభూ! నన్ను తిరిగి వెనక్కు పంపించు, నేను వదలివచ్చిన లోకములోకే వెళ్ళి సత్కార్యము చేస్తాను అని అంటాడు. ముమ్మాటికీ అలా జరుగదు. అది అతడు అనుకొంటున్న ఒకమాట మాత్రమే. వారు మళ్ళీ సజీవులై లేచే రోజు వరకూ వారి వెనుక ఒక అడ్డు తెర ఉంటుంది.''
ఇంతకుముందు మరణమును గురించి పూర్తిగా చెప్పియున్నాము. అదే విషయమునే తిరిగి ఇక్కడ చెప్పుచున్నాము. మనిషి మరణ సమయము ఒక్క క్షణకాలము కూడా ఉండదు అని చెప్పాను. మనిషికి వెనుకటి జన్మ జ్ఞాపకాలు ఉంటే పై వాక్యములో చెప్పినట్లు అడిగేవాడే. అయితే మనిషి మరణ సమయములోనే మనస్సు కూడా నశించి పోయి ఉండుట వలన మరణముతోనే వెనుకటి జ్ఞాపకాలన్నీ పోయి ఉండును. ఆ సమయములో ఏమీ తెలియని స్థితిలో మనిషియుండును. ఆ స్థితిలో మనిషిని ఒక గుడ్డలో వేసి మూసివేసినట్లు ఉండుట చేత ఏమీ అడగలేని స్థితిలో ఉండును. శిశు శరీరములో ప్రవేశించినప్పుడు ఏ భాష తెలియక తన భావమును తెలుపుటకు ఏమి చేయాలో తెలియకపోవడము వలన తనకున్న కష్టమును ఏడ్పుతో తెలుపుట తప్ప ఏమీ చేయలేకయున్నప్పుడు, అతను ఏ గుణములు పని చేయని అయోమయ స్థితిలో ఉండును. వెనుకటి జన్మ యొక్క సమాచారమును ఏమీ తెలియకుండా ఒక అడ్డుగుడ్డ వేసి మూసివేసినట్లు ఉండును. ఒక్కమారు పాత జ్ఞాపకములన్నీ మూసివేయడము వలన ఏమీ తెలియని స్థితిలో జీవుడు ఉండిపోయి తనదంతా పోయినదను భావముతో ఏడ్చను మొదలు పెట్టును. అంతటితో వెనుకటి సంబంధమంతా జ్ఞాపకము లేని, జ్ఞాపకము రాని స్థితిలో ఉండిపోవును.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
105. దేవుడు దీపము, దేహము చిమ్నీ. (24-35)
(24-35) ''అల్లాహ్ ఆకాశాలకూ భూమికి కాంతి. ఆయన కాంతి ఒక గూటిని పోలియున్నది. ఆ గూటిలో ఒక దీపము ఉంది. ఆ దీపము ఒక గాజు చిమ్నీలో ఉంది. ఆ గాజు చిమ్నీ మెరిసే నక్షత్రము మాదిరిగా ఉంది. ఆ దీపము శుభప్రదమైన ఒక జైతూను వృక్షము నూనెతో వెలిగించబడుతోంది. ఆ వృక్షము తూర్పుకూ చెందదు, పడమరకూ చెందదు. దాని నూనె అగ్ని తగలక పోయినా దానంతట అదే జ్వలిస్తున్నట్లు ఉంది. కాంతిపై కాంతి ఉంది. అల్లాహ్ తానుకోరిన వారికి తన కాంతివైపు మార్గదర్శకత్వము వహిస్తాడు. ప్రజలకు అర్థము అవటానికి ఈ ఉపమానములను అల్లాహ్ విశధపరుస్తున్నాడు. అల్లాహ్‍కు అన్ని విషయములు క్షుణ్ణంగా తెలుసు.''
ఈ వాక్యము చూచేదానికి చాలా కష్టముగా యున్నట్లు కనిపించు చున్నది. కొందరికి ఈ వాక్యము కొడి గోత్రము లేనిదిగా కనిపించిననూ మాకు మాత్రము సులభముగా యున్నట్లు కనిపించుచున్నది. నా లెక్క ప్రకారము మనిషి శరీరములోనే ఈ వాక్యమునకు వివరము గలదు. ఎప్పుడయితే వాక్యములో ''ఆకాశములు'' అని బహువచనములో చెప్పారో అప్పుడు శరీరములోనికి ద్యాస పోవలసియున్నది. ఆకాశములు భూమికి కాంతియని చెప్పారు. ఆ కాంతియే అల్లాహ్యనీ చెప్పారు. శరీరమంతా వ్యాపించియున్న కాంతి అల్లాహ్ యని చెప్పారు. గ్రంథములో ఇద్దరు అల్లాహ్‍లు గలరు. అందులో పెద్ద అల్లాహ్‍ను గురించి ఆయన శరీరములో వ్యాపించియున్న కాంతిగా చెప్పారు. ఒక దీపము ఉంటే ఒకచోట కొంత పరిధిలో వెలుగుయుండును. శరీరమంతా వెలుగు ఉంటే శరీరమంతా ఎన్నో కోట్ల దీపములు ఉన్నట్లు చెప్పవచ్చును. ఎన్నో దీపములు శరీరమంతా ఎన్నో కాంతి పుంజములుగా యున్నవి. కావున శరీరమంతా కాంతియున్నది. ఒక కాంతి ఒకగూటిని పోలియున్నది. శరీరములో గల కాంతి ఎన్నో దీపములుగా యుండగా, ఒక్కొక్క కాంతి ఒక గుండ్రని గూటిలో యున్నది. గుండ్రని గూడు గాజు చిమ్నీలాగా ఉన్నది. అలాగ గుండ్రని గూడు గాజు చిమ్నీలాగా ఉండుట వలన గూటిలో దీపము బయటికి కనిపించడమే కాక దీపము కాంతి గూటి నుండి బయటికి వ్యాపించి యున్నది. గాజు చిమ్నీగా యున్న గూడు మెరిసే నక్షత్రముగా జ్ఞానుల దృష్ఠికి కనిపించుచున్నది. నక్షత్రము అనగా మోక్షము అని అర్థము. ఒకగూడు గాజు చిమ్నీలాగా యున్నా అది పరమాత్మ శక్తితో నిండుకొని యుండుట వలన నక్షత్రము అని పోల్చి చెప్పారు. దీపము వెలుగుచున్నదంటే దానికి రెండు ముఖ్యమైన పదార్థములు కావలెను.
ఒకటి మండే వాయువు, రెండు కాలే పదార్థము. కాలే పదార్థము ఒక నూనెవలె చెప్పారు. నూనె శరీరమంతా వ్యాపించే ఆహారములో లభించుచున్నది. ఆహారమును వృక్షముగా చెప్పారు. ఆహారము శరీరమంతా వ్యాపించి కుడి ఎడమ రెండువైపులా వ్యాపించియుండుట వలన ఆ వృక్షము ఒక వైపుకు కాకుండా రెండువైపులా వ్యాపించి యుండుట వలన వృక్షము తూర్పుకు చెందదు, పడమరకు చెందదు అని చెప్పారు. శరీరములోని ఆహారములో కాల్చబడు భాగముగా మనము తిన్న ఆహారములో పిండిపదార్థములని (గ్లూకోజ్) యని చెప్పవచ్చును. మండే నూనెగా గ్లూకోజ్ యుండగా, మండించే వాయువుగా ప్రాణవాయువు ఉన్నది. శరీరమంతా వ్యాపించిన ధాతుకణములు ఒక్కొక్కటి ఒక గాజు చిమ్నీగా యుండడము, అందులో నూనెవలె యున్న ఆహారములో గల పిండిపదార్థములుండగా పిండి పదార్థము శరీరమంతా వ్యాపించిన ప్రాణవాయువు చేత దానంతట అదే మండుచున్నట్లు తెలియుచున్నది. శరీరమంతా ధాతుకణములు ఒకదానిమీద ఒకటి పేర్చినట్లు కలదు, కావున వాటినుండి వచ్చే కాంతిని కాంతిపై కాంతి ఉన్నది అని అన్నారు. అల్లాహ్ తాను కోరినవారికి తన కాంతివైపు మార్గదర్శకత్వము వహిస్తాడు అని వాక్యములో చెప్పారు. శరీరము అంతా వ్యాపించిన కాంతిని పరమాత్మగా చెప్పుకొంటే శరీరములో ఒకచోట యున్న జీవుడు పరమాత్మలో ఐక్యమగునట్లు దేవుడు దర్శకత్వము చేయును. దేవుడు అనుకొంటే ఒక్కచోట యున్న జీవుడు శరీరమంతా వ్యాపించిన కాంతిలో (దేవునిలోనికి) ఐక్యమై పోవును. శరీరములో జీవాత్మ పరమాత్మలోనికి ఐక్యమైపోయి తాను కూడా శరీరమంతా వ్యాపించిపోవుచున్నాడు. మనిషి శరీరములోనే వ్యాపించిన పరమాత్మలోనికి ఐక్యమగు విధానమును శరీరములోని కాంతిలో కలిసిపోవునట్లు ఉపమానముగా తెలిపారు. ప్రజలకు అర్థమగుటకు ఈ ఉపమానమును అల్లాహ్ విశధపరుస్తున్నాడు అని చెప్పారు. అంతేకాక దేవునికి అన్ని విషయములు వివరముగా తెలుసు, కావున శరీరములో అందరికీ ధాతుకణములలో జరిగే విధానమును వర్ణించి చెప్పాడు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
106. రేయింబగళ్లు మార్చుతున్నాడు మేఘముల విషయము. (24-43, 44)
(24-43, 44) ''అల్లాహ్మేఘాలను నడిపించటాన్నీ, మరి వాటిని పరస్పరము కలపటాన్ని ఆ తర్వాత వాటిని ఒకదానిపై ఒకటి పొరలుపొరలుగా పేర్చటాన్ని నువ్వు గమనించడము లేదా? మరి వాటి మధ్య నుంచి వర్షము కురిపించటాన్ని నువ్వు చూస్తావు. మరి ఆయనే వడగండ్ల పర్వతాలనుండి వడగండ్లను కురిపిస్తాడు. తాను కోరిన వారిపై వాటిని కురిపిస్తాడు. తాను కోరినవారి నుంచి వాటిని తొలగిస్తాడు. మరి ఆ మేఘాలనుండి వెలువడే మెరుపుతీగ కంటి చూపును పోగొట్టినట్లే ఉంటుంది.''
(24-44) ''అల్లాహ్ రేయింబగళ్లను మారుస్తూ ఉంటాడు. కళ్లున్న వారికి ఇందులో గొప్ప గుణపాఠము ఉంది.''
ఈ రెండు వాక్యములలో చెప్పిన విషయము అందరికీ క్రొత్తగా యున్నా, ఇందులో గుణపాఠము ఏమి యున్నదో తెలియకున్నా, ఈ విషయములను కొన్ని సంవత్సరముల పూర్వమే నేను చెప్పియుండడము వలన ఇక్కడ వాక్యములలో యున్నది నాకు సులభముగా అర్థమయినది. గతములో ''మేఘము ఒక భూతము'' అనియూ, ''భూతము ఒక రోగము'' అనియూ చెప్పిన ప్రసంగములు గలవు. వాటి ఆధారముతో ఇప్పుడు చెప్పునది ఏమనగా! శరీరము లోపల దేవుడయిన ఆత్మ శరీరము లోపల గల 25 భాగములకు అధిపతిగా దేవుడుగాయుంటూ శరీర పాలన చేయుచున్నాడు. శరీరము బయట అణువణువునా వ్యాపించిన పరమాత్మ బయట ప్రపంచమునకు దేవుడయినా ఆయన స్వయముగా పని చేయువాడు కాడు. శరీరములో ఆత్మ 25 భాగముల చేత పనిని చేయిస్తూ శరీర యంత్రాంగమును నడిపినట్లు, బయట ప్రపంచమును పరమాత్మ నడుపకున్ననూ ఆయన ఏ జోక్యము చేసుకోకున్ననూ, ఆయన ఆధీనములో యున్న కోట్లాది మంది గ్రహములు, భూతములు బయట ప్రపంచ కార్యములను చేయుచున్నవి. అందులో భాగముగానే ప్రపంచమంతా మేఘములు వర్షమును కురిపిస్తుయున్నవి. అంతేకాక వడగండ్ల వాన కూడా వస్తున్నది. పరమాత్మ ఆధీనములోని మేఘములు అను భూతములు బయట ప్రపంచములో అనేక కార్యములను చేయుచున్నవి.
ప్రపంచములో ఎక్కడ సునామీలు వచ్చినా, ఎక్కడ వరదలు వచ్చినా, ఎక్కడ తుఫానులు వచ్చినా, ఎక్కడ భూకంపములు వచ్చినా అవన్నియూ భూతముల వలన జరుగుచున్నవి. భూమిమీద పెద్దపెద్ద ప్రమాదములు, రోడ్డు ప్రమాదములు, యుద్ధములు, సామూహిక మరణకాండ మొదలగునవి ఎక్కడ జరిగినా అవి అన్నియూ గ్రహముల వలన జరుగుచున్నవని తెలియుచున్నది. ఇది మాత్రమేకాక మనకు తెలియని ఎన్నో కార్యములను గ్రహములు, భూతములు చేయుచున్నవి. భూమిమీద క్రొత్త రోగములు రావాలన్నా, పాత రోగములు పోవాలన్నా భూతముల పాత్ర ఎంతో యున్నదని చెప్పవచ్చును. గతములో ఎప్పుడూలేని కొత్త రోగము భూమిమీద ప్రజలలోనికి రావాలంటే అది ఒక్క భూతముల చేతనే యగునని చెప్పవచ్చును. అంతవరకూ ఎక్కడా లేని క్రొత్త రోగ క్రిమిని భూతములు తయారు చేసి పంపుచున్నవి. గ్రహములు, భూతములు రెండు జాతులు పరమాత్మ ఆధీనములో యుండి, పరమాత్మ సేవకులవలె పనులు చేయుచుండినా, బయటికి మాత్రము పరమాత్మకు, భూతములకు, గ్రహములకు ఎటువంటి సంబంధము లేనట్లే యుండును. దేవుడు (పరమాత్మ) తాను స్వయముగా భూతములకు, గ్రహములకు ఎటువంటి ఆదేశములు ఇవ్వకున్నా పరమాత్మ మనస్సులోని తలంపులను గ్రహించిన భూతములు, గ్రహములు వెంటనే ఆ పనిని చేయుచున్నవి. అందువలన అల్లాహ్ అనుకొన్న వెంటనే ఆ పనులు అయిపోవుచున్నవని చాలా వాక్యములలో వ్రాశారు.
గ్రహముల వలన పిడుగులు పడుచున్నవి. వడగండ్లు కురియు చున్నవి. వర్షము వర్షించుచున్నది. మెరుపులు పుడుతున్నవి, పిడుగులు పడుచున్నవి. ఎక్కడ వర్షము కురియాలో, ఎక్కడ పిడుగులు పడాలో, ఎప్పుడు మెరుపులు మెరియాలో అన్నీ అల్లాహ్యైన పరమాత్మకు తెలియకుండా ఏమీ జరుగవు. సంకల్పము దేవునిదే అయినా కార్యములను చేయునది గ్రహములు, భూతములు. మూడవ పురుషుడయిన పరమాత్మ ఏ గ్రహముతోనూ, ఏ భూతముతోనూ ప్రత్యక్ష సంబంధముగానీ, పరోక్ష సంబంధముగానీ పెట్టుకొన్నట్లు ఎక్కడా కనిపించదు. ఏ సంబంధము లేని వానిగా పరమాత్మయున్నా, ఆయన అనుకొన్న పనులన్నియూ గ్రహముల వలన భూతముల వలన వెంటనే జరిగిపోవుచుండును. పగలు రాత్రి మారడములో గ్రహముల పని, చావు పుట్టుకలు కలుగడములో భూతముల పని, ఇట్లు బయట జరుగు మార్పులన్నిటికి పరమాత్మ పాలనలో సాగు భూతములు, గ్రహములు కారణమని తెలియుచున్నది.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
107. గీటురాయిని అవతరింపజేసినవాడు అల్లాహ్‍యే. (25-1)
(25-1) ''సమస్త లోకవాసులను హెచ్చరించే వానిగా ఉండటానికి గానూ, తన దాసునిపై గీటురాయిని అవతరింపజేసిన అల్లాహ్ గొప్ప శుభకరుడు.''
భూమిమీద తన జ్ఞానమును తెలుపు నిమిత్తము మూడవ పురుషుడు, భగవద్గీతలో పరమాత్మ, బైబిలులో పరిశుద్ధాత్మయనబడుచూ ఖుర్ఆన్ గ్రంథములో అల్లాహ్యను పేరుతో చెప్పబడువాడు అయిన దేవుడు తన జ్ఞానమును ప్రజలకు తెలియజెప్పు నిమిత్తము మొదట ప్రథమ దైవ గ్రంథముగా భగవద్గీతను తయారు చేయించాడు. వ్యాసునిచే వ్రాయబడిన గ్రంథమునకు భగవద్గీతయని వ్యాసుడు పేరు పెట్టాడు. భగవద్గీతను చెప్పినవాడు శ్రీకృష్ణుడు కాగా, వ్రాసినవాడు, పేరు పెట్టినవాడు మనిషి అయిన వ్యాసుడు. భగవద్గీతగా వ్రాయబడిన దేవుని జ్ఞానమునకు దానిని చెప్పిన కృష్ణుడు ''తౌరాతు'' యని పేరుపెట్టి భగవద్గీతను మోషే ప్రవక్తకు ఇవ్వడము జరిగినది. అలా తౌరాతుయని పేరు మార్చబడిన తర్వాత అందులోని జ్ఞానమే ఇంజీలుగా (బైబిలుగా) తయారైనది. తర్వాత తౌరాతు లోని జ్ఞానమే అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్గా తయారయినది. పేర్లు మార్చి వ్రాయబడినా, భాష మార్చి వ్రాయబడినా ప్రాంతములనుబట్టి వ్రాసే విధానమును మార్చి వ్రాసినా మూడు గ్రంథముల జ్ఞానము ఒక్కటేయని చెప్పవచ్చును. మూడు దైవగ్రంథముల పేర్లు వేరయినా, భాష వేరయినా భావము ఒక్కటేయని తెలియుచున్నది.
మూడు దైవగ్రంథములను చదివినవాడు అరుదుగా ఉండగా, మూడిటిలో ఒక్కదానిని చదివినవారు కొందరు గలరు. హిందువులు భగవద్గీతను చదువగా, క్రైస్థవులు బైబిలును చదువగా, ముస్లీమ్‍లు ఖుర్ఆన్ గ్రంథమును చదివారని చెప్పవచ్చును. అట్లని హిందువులు అందరూ భగవద్గీతను చదవలేదు. అట్లే క్రైస్థవులు అందరూ బైబిలును చదవలేదు. ముస్లీమ్‍లందరూ ఖుర్ఆన్ గ్రంథమును చదవలేదు. ఆయా మతములలో ఆయా గ్రంథములను తమ గ్రంథములని చెప్పుకొని కొందరు చదివిన వారు గలరు. అయితే ఆ గ్రంథములనుండి వారికి అర్థమయినది బహు స్వల్పమని చెప్పవచ్చును. మాకు అంతా అర్థమయినది అని చెప్పువారున్నా వారికి అర్థమయినది అంతా తప్పుదారి అయిన అపమార్గమే అర్థమయినది. వారికి అర్థమయిన దానిప్రకారము తమకు తెలిసినదే సత్యము అని అనుకొనుచుందురు. అపమార్గములో అర్థమయినదే నిజమైన జ్ఞానమనుకొని, నిజమైన జ్ఞానమును జ్ఞానమే కాదన్నట్లు మాట్లాడుచూ, జ్ఞానులను సహితము హేళనగా మాట్లాడువారు తయారైనారు. అటువంటి వారిని ఎదురించి జ్ఞానమును జ్ఞానముగా, అజ్ఞానమును అజ్ఞానముగా తేల్చి చెప్పుటకు శాస్త్రబద్దత యను గీటురాయిని ముందే మూడు దైవగ్రంథముల యందు దేవుడు ఇమిడ్చియున్నాడు. దైవ గ్రంథములలోని గీటురాయిని ఉపయోగించి ఏది దైవ జ్ఞానమో, ఏది దైవజ్ఞానము కాదో తేల్చి చెప్పవచ్చును. గీటురాయి అను పేరును బంగారును పరీక్షించుటలో ఉపయోగించు దానికి పెట్టిన పేరని తెలియవలెను. గీటురాయి అనగా పరీక్షించు రాయి అని అర్థము. బంగారు అత్యంత విలువైన లోహము. ఆ లోహములో ఇతర లోహములను కలిపి అది అంతయూ స్వచ్ఛమయిన బంగారుగా నమ్మించుచుందురు. అటువంటి సమయములో వారు చేయు మోసమును గుర్తించుటకు, స్వచ్ఛమయిన బంగారును పరీక్షించుటకు, వారు అందులో ఏవయినా లోహములు కలిసియుంటే తెలియజెప్పుటకు గీటురాయిని ఉపయోగించి చూస్తుందురు. దానివలన బంగారులోని స్వచ్ఛత, అసలు, నకిలీ రెండూ తెలిసిపోవును. దేవుడు మనుషులను గీటురాయివలె దైవగ్రంథములలోకి శాస్త్రబద్దతను ఇచ్చాడు. శాస్త్రబద్దతను గీటురాయిగా ఉపయోగించి ఎంతటి జ్ఞానమునయినా చూడవచ్చును. అందులోని స్పష్టతను తెలియవచ్చును.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
108. భూమి ఆకాశముల రహస్యము తెలిసినవాడు. (25-6)
(25-6) ''ఓ ప్రవక్తా! వారికి చెప్పు, భూమి ఆకాశాలలో ఉన్న రహస్యాలన్నిటినీ ఎరిగినవాడు, దీనిని (ఖుర్ఆన్‍ను) అవతరింప జేసాడు. ఆయన అమితముగా క్షమించేవాడు, అపారముగా కనికరించేవాడు.''
ఈ వాక్యములో చివరిలో దేవుడు అమితముగా క్షమించేవాడు, అపారముగా కనికరించేవాడు అని వున్నది. క్షమించేవాడు కనికరించేవాడు అను పదములు దాదాపు ఒకే అర్థమునే ఇచ్చునవిగా నిపించుచున్ననూ కొద్దిపాటి తేడా కలదని చెప్పవచ్చును. కనికరించేవాడు సహాయమును చేయగలడు. క్షమించేవాడు ఉన్న తప్పులను లేకుండా క్షమించగలడు. కనికరము చేయువాడు సహాయము చేయగా, క్షమించువాడు ఉన్న తప్పును లేక ఉన్న పాపమును క్షమించి లేకుండా చేయగలడు. ఖుర్ఆన్ గ్రంథమును అవతరింపజేసిన దేవుడు అనగా మూడవ ఆత్మయిన పరమాత్మయని చెప్పవచ్చును. ఖుర్ఆన్ గ్రంథమును తయారు చేయుటకు శరీరములో జీవుడు, ఆత్మ, పరమాత్మ ఎలాగున్నారని తెలిసియుండాలి. శరీరములోని యంత్రాంగమును, అందులోని జీవాత్మ, ఆత్మ, పరమాత్మలను పూర్తిగా తెలిసినవాడు ఖుర్ఆన్ గ్రంథమును తెలియజేశాడు అని తెలియుచున్నది. శరీర అంతర్గత జ్ఞానమే ఖుర్ఆన్‍లో ఎక్కువ శాతము ఉండుట చేత, దానిని చెప్పినవాడు అల్లాహ్యని చెప్పుచూ ఆయన క్షమించేవాడు, కనికరించేవాడు యని చెప్పారు.
మనిషి చేసుకున్న పాపములను క్షమించేవాడు దేవుడు. మనిషి పాపము క్షమించబడుటకు మనిషి దేవునికి ఇష్టునిగా ఉండవలెను. దేవునికి ఇష్టుడుగా మారుటకు మనిషి దేవుని జ్ఞానము పూర్తి తెలిసియుండాలి. అలా మనిషి జ్ఞాని అయినప్పుడు దేవుడు మనిషి పాపమును క్షమించగలడు. అలా దేవుడు పాపమును లేకుండా చేయుటకు, మనిషి జ్ఞానిగా మారుట అవసరము. మనిషి జ్ఞానిగా మారుటకు దేవుడు కనికరించి దైవజ్ఞానమును కొంతవరకు తెలియజేయును. మనిషి జ్ఞాని అగుట వలన మనిషి పాపము లేకుండా పోవును. అందువలన వాక్యములో దేవుడు క్షమించేవాడు, కనికరించేవాడు అని చెప్పారు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
109. ఆరు దినముల సృష్ఠి. (25-59), (32-4)
(25-59) ''ఆయనే ఆకాశాలనూ, భూమిని వాటి మధ్యనున్న సమస్త వస్తువులను ఆరు దినములలో సృష్ఠించాడు. ఆ తరువాత అధికార పీఠము పై ఆశీనుడయ్యాడు. ఆయన కరుణామయుడు. కావాలంటే ఆయనను గురించి తెలిసిన వానిని అడుగు.''
(32-4) ''అల్లాహ్‍యే ఆకాశాలనూ, భూమినీ వాటి మధ్యనున్న సమస్తాన్ని ఆరు రోజులలో సృష్ఠించాడు. ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్టించాడు. ఆయన తప్ప మీకు ఏ సహాయకుడు, మరే సిఫారసు చేసేవాడు లేడు. అయినా మీరు హితబోధను గ్రహించరేమిటి?''
ఈ వాక్యములలో ''ఆకాశాలను భూమిని వాటి మధ్యయున్న సమస్తమును ఆరు దినములలో సృష్ఠించాడు'' అని ఉన్నది. ఇది పూర్తి సూక్ష్మ జ్ఞానముతో కూడుకొన్న వాక్యము అయినందున వాక్యములో పైకి చెప్పినది ఒకటి ఉండగా, దాని అంతరార్థము మరొకటి ఉండును. ఆకాశములు, భూమి అనగా శరీరము అని అర్థము చేసుకోవాలని ముందే చాలామార్లు చెప్పాము. ఆకాశములు భూమి మధ్యలోగల సమస్త వస్తువులు అనగా తల, కాళ్లు మధ్యలోగల అన్ని అవయవములు అని అర్థము. దీనినిబట్టి మొత్తము శరీరమును దేవుడు తయారు చేశాడు. ఇక్కడ బాగా ఆలోచిస్తే బయట ప్రపంచమును సృష్ఠించిన దేవుడు శరీరములను తయారు చేయుటకు మరొక దేవున్ని సృష్ఠించాడు. ఆయనే ఆత్మ. ఆత్మను సృష్ఠించిన మొదటి దేవుడు ఆత్మకంటే వేరుగాయున్న పరమాత్మ. పరమాత్మ ఆత్మను సృష్ఠించి జీవరాసులను పుట్టించుటకు, చంపుటకు, చనిపోయిన తర్వాత తిరిగి పుట్టించుటకు తగిన అధికారమును ఇచ్చాడు. సర్వ జీవరాసులను సృష్ఠించిన ఆత్మయే సర్వ జీవరాసులకు ఆరాధ్య దైవముగా ఉండునట్లు పరమాత్మయిన దేవుడు ఆత్మ దేవున్ని నియమించాడు. మొదటి దేవుడయిన పరమాత్మను ఖుర్ఆన్ గ్రంథములో అల్లాహ్యని అంటున్నారు. అదే విధముగా రెండవ దేవుడయిన ఆత్మను కూడా ఖుర్ఆన్ గ్రంథములో అల్లాహ్ అని అంటున్నారు. మొదటి దేవున్ని, రెండవ దేవున్ని ఇద్దరినీ ఒకే పేరుతో ఉచ్ఛరించడము వలన వాక్యములలో అల్లాహ్ అను పదము వచ్చినప్పుడు అక్కడ చెప్పబడినది ఏ అల్లాహ్యని ఆలోచించి చూడవలసిన అవసరమున్నది.
మొదటి అల్లాహ్ బయటి ప్రపంచమును సృష్ఠించినప్పుడే రెండవ అల్లాహ్‍ను తయారు చేసి ఆయనకు సర్వ అధికారములు ఇచ్చాడు. దేవుని చేత అధికారములు పొందిన దేవుడు సర్వ జీవరాసుల శరీరములను తయారు చేశాడు. శరీరములను తయారు చేయుటకు ఆరు దినముల వ్యవధి పట్టిందని వాక్యములో చెప్పినట్లు కలదు. ఇది సూక్ష్మవాక్యము అని మరువకూడదు. అందువలన దీనిలోని అర్థమును తెలియుటకు ప్రయత్నము చేయాలి. దాని ప్రకారము చూస్తే ఒక పగలు, ఒక రాత్రి కలిసి ఒక దినముగా చెప్పవచ్చును. అలాగే లోపలి శరీరములో ఒక నాడీకేంద్రము, ఒక గ్రంథి రెండూ కలిసి శరీరమును నడుపుటకు ఉపయోగపడు ముఖ్యస్థానములు. ఇవి శరీరములో ఆరు జతలు కలవు. ఈ ఆరు జతలను ఆరు దినములుగా చెప్పారు. ఇక ఏడవ జోడీని రెండిటినీ కలిపి అధికార పీఠము అని అన్నారు. ఏడవ నాడీకేంద్రము మెదడుకాగా, ఏడవ గ్రంథి తల మధ్య భాగములో అనగా మెదడు మధ్య భాగములో కలదు. అందువలన తలయే శరీరమును సృష్ఠించిన అల్లాహ్‍కు నివాస కేంద్రముగా యున్నదని చెప్పవచ్చును. దేవుడు ఆరు రోజులు శరీరమును తయారు చేసి, అధికార పీఠము మీద అధిష్ఠించి విశ్రాంతి తీసుకొంటున్నాడని వ్రాసిన దానినిబట్టి దేవునికి ఆరు రోజుల శరీరమును సృష్ఠించలేదని, ముందే సృష్ఠించబడిన ఆరు నాడీకేంద్రములను ఒక్క క్షణములో ఆత్మ ఎక్కిపోయి ఏడవ కేంద్రములో స్థానము ఏర్పరచుకొనుచున్నది. తల్లిగర్భములో తొమ్మిది నెలలుగా పెంచిన శరీరములో ఒక్కమారుగా ఆత్మ జీవునితో సహా చేరుచున్నది. ఆరు దినములు అని చెప్పినది తయారు చేయు కాలము కాదని, తయారు చేసిన స్థానములని తెలియవలెను.
జనన సమయములో ఆత్మ జీవాత్మను తీసుకొని వచ్చి తల్లిగర్భములో తయారుకాబడి బయటికి వచ్చిన శరీరములో చేరుచున్నది. అలా చేరినప్పుడు ఒక్క క్షణములోనే ఆరు కేంద్రములను దాటి ఏడవ కేంద్రమయిన తలలోనికి జీవుడు, ఆత్మ చేరడము జరుగుచున్నది. ఏడవ కేంద్రమయిన తలయే ఆత్మకు అధికార స్థానము, జీవునికి అనుభవ స్థానము. అలా చేరిన ఆత్మ తనను నిర్మించిన దేవుని ఆజ్ఞను అనుసరించి జీవున్ని కర్మానుసారము శిక్షించడము జరుగుచుండును. అట్లే సుఖములను ఇవ్వడము జరుగుచుండును. అంతేకానీ రెండవ ఆత్మ కరుణించడముగానీ, దయ చూపడము గానీ ఉండదు. కరుణామయుడుగా, దయామయుడుగా క్షమాశీలుడుగా, కృపాకరుడుగా ఆత్మను నిర్మించిన పరమాత్మ ఉండును గానీ, ఆత్మ నిబద్దతతో కూడుకొని పని చేయుచుండును. ఆత్మ కరుణామయుడు కాదు. పరమాత్మ శిక్షించువాడు కాదు.
☞
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
110. పరలోకానికి సంబంధించిన జ్ఞానము స్థంభించి పోయినది. (27-66)
(27-66) ''అసలు పరలోకానికి సంబంధించి వారి జ్ఞానము స్థంభించి పోయింది. పైగా దాని గురించి వారు సంశయములో పడియున్నారు. కాదు, దానిపట్ల వారు అంధులై పోయారు.''
ఇది సూక్ష్మ జ్ఞానవాక్యము కాకపోయినా చెప్పినది చెప్పినట్లు అర్థము చేసుకొంటే చాలు. మనుషులకు తెలిసిన లోకములు ముఖ్యముగా రెండు గలవు. అందులో ఒకటి స్వర్గలోకము, రెండు నరకలోకము. ఈ రెండు పేర్లు తెలిసినంత మాత్రమున ఏమీ ఒరిగిపోయినది ఉండదు. ఆ రెండు లోకములు ఎక్కడున్నాయో తెలియుట ముఖ్యము. అయితే అందరూ సులభముగా ఆ లోకములను గురించి చెప్పుచూ స్వర్గ, నరకములు రెండూ పైన యున్నాయని చెప్పుచుందురు. స్వర్గలోకములోనికి 'దేవుని ఆరాధన నమాజ్ చేసినవారు పోవుచుందురని' చెప్పుచుందురు. జ్ఞానమార్గములో యున్న వారందరినీ అల్లాహ్ స్వర్గమునకు పంపుననీ, జ్ఞానమార్గములో లేని వారందరినీ అల్లాహ్ నరకమునకు పంపునని చెప్పుచుందురు. చాలా మంది నోట స్వర్గ, నరక లోకములుండునుగానీ 'పరలోకము' అను మాటే యుండడము లేదు. చాలామంది ఖుర్ఆన్ గ్రంథమును చదవకుండానే, దానిలో జ్ఞానము ఏమి ఉందని తెలియకుండానే, వారు వినిన మాటలను బట్టి స్వర్గ, నరకములను గురించి మాట్లాడుచుందురు. వారు చెప్పునది తప్పని తెలిసి అట్లుకాదు, మీరు అనుకొనేది తప్పు అని చెప్పితే ఆ మాటను ఏమాత్రము లెక్కచేయక మా పెద్దలు అల్లాహ్ చెప్పిన విషయమునే చెప్పు చుందురు. అందువలన మా పెద్దలు చెప్పిన మాటనే చెప్పుచున్నాము అని అంటారు.
ఖుర్ఆన్ గ్రంథములో దేవుడు చెప్పినది ఏముందో చూడకుండా, వారి పెద్దల మాటలనే నమ్ముచుందురు. ఖుర్ఆన్ గ్రంథములో చెప్పినది అర్థము కానంతవరకూ ఎవరూ జ్ఞానములో పెద్దవారు కాదు. వయస్సులో పెద్దవారు అయినంత మాత్రమున ఏమీ ప్రయోజనము లేదు. వయోవృద్ధులు ఎందరున్నా ఏమీ ప్రయోజనము ఉండదు. జ్ఞానములో వృద్దులు అయిన వారు చిన్నవయస్సు కలవారైనా ఫరవాలేదు. అందువలన జ్ఞానవృద్ధుల మాటనే వినవలెనని చెప్పుచున్నాము. అందరికీ అలవాటైపోయిన విషయము ప్రకారము మనిషి చనిపోతే అతడు ప్రళయ కాలము వచ్చు వరకు పూడ్చిపెట్టిన గోరీలలోనే ఉండుననీ, ఎప్పుడో ప్రళయము వచ్చినప్పుడు భూసమాధిలో యున్నవారిని దేవుడు లేపి, వారు చేసుకొన్న తప్పులను అన్నిటిని లెక్కించి నరకమునకు, అతడు చేసిన మంచి పనులను లెక్కించి స్వర్గమునకు పంపునని చెప్పుచున్నారు. ఐదు పూటల నమాజు చేసినవారిని దేవుడు తప్పక స్వర్గమునకు పంపునని చెప్పుచున్నారు. ఈ విధముగా దేవుని జ్ఞానము కల్గిన వారంతా స్వర్గమునకు పోవుదురని అనుకొనుచున్నారు తప్ప వారికి పరలోకము ఒకటున్నదనీ, అది స్వర్గనరకములవలె కాకుండా అది ఒక ప్రత్యేకమైన లోకమని తెలియకుండానే అందరూ స్వర్గమును గురించి చెప్పుచున్నారు.
ఖుర్ఆన్ గ్రంథములో పరలోకమును గురించి చెప్పియున్నా 'పరలోకము' అనుమాటను స్వర్గలోకమేయని అనుకొంటున్నారు. వారి పెద్దలు చెప్పిన మాటలు వారిలో గట్టిగా నిలిచిపోయాయి. అందువలన వారు స్వర్గలోకమును మించిన లోకము లేదని, మనిషి దేవున్ని ఆరాధించినా అతను చివరికి స్వర్గమునకే పోయి అక్కడ హాయిగా ఉండునని అనుకొంటున్నాడు. ప్రపంచ సంబంధ పుణ్యములకు స్వర్గము, అట్లే ప్రపంచ సంబంధ పాపములకు నరకము వచ్చుననీ, దేవున్ని ఆరాధించినవాడు పరలోకమును చేరునని ఎవరికీ తెలియకుండా పోయినది. మేము స్వర్గ నరక లోకమునకు అతీతమైనది 'పరలోకము' అని చెప్పినా ప్రజలు అజ్ఞానములో కూరుకొని పోయి ఉండుట వలన మా మాటను లెక్క చేయడము లేదు. స్వర్గము, నరకములు అనునవి ప్రత్యేక లోకములుగా లేవని, అవి భూమిమీద మనుషుల అనుభవములనుబట్టి ఉండునవే తప్ప వేరుగా యుండు లోకములు కాదని తెలియలేకపోయారు. మనిషి గతజన్మలో చేసుకొన్న పాపమునుబట్టి నరకరూపములో యున్న కష్టములను అనుభవించుచుండును. అట్లే మనిషి చేసుకొన్న ప్రపంచ సంబంధ పుణ్యమును బట్టి స్వర్గరూపమైన సుఖములను అనుభవించడము జరుగు చుండును. మనిషి అనుభవించే కష్ట సమయమును నరకమనీ, అట్లే మనిషి అనుభవించే సుఖ సమయమును స్వర్గమని అనవచ్చును. అంతేగానీ స్వర్గ, నరకములు ప్రత్యేక లోకములుగా లేవు. అట్లే పరలోకము అనునది కూడా ఎక్కడోయున్న లోకము అని అనుకోకూడదు. ఎవడయితే కర్మలు లేకుండా చేసుకొని, జనన మరణములకు అతీతుడుగా మారిపోయి పరమాత్మయందు ఐక్యమైపోవునో వానిని పరలోకమును పొందాడు అని అనుచున్నారు. అంతేగానీ పరలోకము కూడా ప్రత్యేకమైన లోకము కాదు. పరమాత్మ ప్రపంచమంతా అణువణువునా వ్యాపించి యున్నాడు. దేవుని లోనికి ఐక్యమై ముక్తి పొందినవాడు కూడా దేవుడు వ్యాపించిన చోటంతా వ్యాపించియున్నట్లే లెక్కించబడును.
ముక్తి లేక మోక్షము పొందినవాడు పరలోకము పొందినవాడని చెప్పవచ్చును. దీనినిబట్టి పరలోకము కూడా ఒక లోకము కాదని వారు ఉన్న స్థితిని లోకము అని అంటున్నాము తప్ప లోకమనునది ప్రత్యేకమైన దేశములాంటిదో, రాజ్యములాంటిదో కాదని తెలియవలెను. మనిషి సుఖములను అనుభవించు స్థితిని స్వర్గలోకము అని, దుఃఖములు పొందు స్థితిని నరకలోకమని, దేవునియందు ఐక్యమైయున్న స్థితిని మోక్షమని (పరలోకమని) చెప్పుచున్నారు. మనిషి ఎంతసేపు సుఖమును పొందు స్థితిలో ఉండునో, అంతసేపు స్వర్గలోకములో యున్నట్లు లెక్కించబడును. ఒక మనిషి ఒక అరగంట కాలము సుఖమును పొంది తర్వాత కష్టములను పొందు స్థితిలో చిక్కుకొనినట్లయితే, అతడు అరగంట కాలము స్వర్గ లోకములో యుండి, తర్వాత నరకలోకములోనికి ప్రవేశించినట్లగును. ఈ విధముగా ఒకరోజే అనేకమార్లు స్వర్గమును, అనేకమార్లు నరకమును మనిషి పొందుచున్నాడు. అందువలన మనిషికి స్వర్గనరకములు శాశ్వితముగా ఉండక కొద్దికాలము సుఖము (స్వర్గము), కొద్దికాలము దుఃఖము (నరకము) ఉండును. స్వర్గనరకములను పొందుచూ ఏ దానియందు స్థిరముగా లేకుండా మనుషులు ఉందురు. స్థిరత్వము లేని స్వర్గ నరకములు మనిషి జీవితములో నిత్యము వస్తూ, నిత్యము పోతూ ఉంటాయి. అయితే పరలోకము అలా కాకుండా ఒకమారు పరలోకమును పొందితే దానిని వదలిపోవునది అంటూ ఉండదు. పరలోకము స్వర్గ నరకములవలె అశాశ్వితమైనది కాదు. ఒకమారు పరలోకమును పొందితే అది శాశ్వితముగా నిలిచిపోవును. స్వర్గ, నరకములు శాశ్వితము కాదు కావున శాశ్వితము కాని వాటిని వదలి శాశ్వితమైన పరలోకమును పొందుటకు మనిషి ప్రయత్నము చేయాలి. అయితే నేడు పరలోకానికి సంబంధించిన జ్ఞానమే మనిషికి తెలియకుండా పోయినది. పై వాక్యములో చెప్పినట్లు పరలోకమును గురించిన సంశయములో పడిపోయిన మనుజులు అది ఉందా లేదాయనుకొనుచూ దాని విషయములో పూర్తి గ్రుడ్డివారై పోయారు.
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
111. మేము లోగడ ఎవరికి గ్రంథమును ఇచ్చామో వారు దీనిని కూడా విశ్వసిస్తారు. (28-52)
(28-52) ''మేము లోగడ ఎవరికయితే గ్రంథము నిచ్చామో వారు దీనిని (ఖుర్ఆన్)ను కూడా విశ్వసిస్తారు.''
అల్లాహ్, సృష్ఠికర్త, పరమాత్మ అను మూడు బిరుదులచేత పిలువబడు దేవుడు ప్రజలకు తన జ్ఞానమును తెలుపు నిమిత్తము మొదట కృతయుగములోనే 'జపర' అను పేరుతో మాటల రూపములో, పాటల రూపములో యున్న జ్ఞానమును చెప్పియున్నాడు. ఆనాడు దేవుడు తన సేవకులయిన ఆకాశ మేఘముల ద్వారా ఉరుములతో, మెరుపులతో జిబ్రయేల్‍కు (సూర్యునికి) చెప్పిన జ్ఞానము ఆనాడు గ్రంథరూపము కాలేదు. చివరకు ద్వాపర యుగమున అదే జ్ఞానమునే శ్రీకృష్ణుడు అను పేరుతో యున్న భగవంతుడు (దేవుని చేత పంపబడిన మనిషి) అర్జునుడు అను వ్యక్తికి చెప్పగా, అతడు వ్యాసుడు అనునతనికి తిరిగి చెప్పాడు. అర్జునుని ద్వారా వినిన వ్యాసుడు విన్న జ్ఞానమునంతటినీ గ్రంథరూపముగా వ్రాశాడు. అలా వ్రాసిన గ్రంథము పేరు వ్యాసుడు పెట్టిన మొట్టమొదటి పేరు ''భగవద్గీత''. తర్వాత భగవంతుడయిన కృష్ణుడే స్వయముగా పెట్టిన రెండవ పేరు ''తౌరాతు''. ఇది ఒక యుగము ముందు అనగా గడచిపోయిన ద్వాపర యుగములో దేవుడు ఇచ్చిన గ్రంథము. అప్పటి గ్రంథమును నేడు ఎవరు చదివినా ఇది మా జ్ఞానమేయని దానిని విశ్వసిస్తారు. అట్లే నేడు ఇచ్చిన అంతిమ దైవగ్రంథమును ద్వాపరయుగములో యున్నవారు నేడు చదివినా ఇది మా గ్రంథమేయని విశ్వసిస్తారు. మొదట దేవుడు ఇచ్చిన గ్రంథము పేరు భగవద్గీత లేక తౌరాతుయని చెప్పబడినా, దానిని జ్ఞానులు ప్రథమ దైవగ్రంథమని చెప్పుచున్నారు. నేడు దేవుడిచ్చిన గ్రంథము పేరు ఖుర్ఆన్ అయినా దానిని జ్ఞానులు అంతిమ దైవగ్రంథము అని అంటున్నారు. ముందు వచ్చినది, వెనుక వచ్చినదియని ప్రథమ, అంతిమ అని చెప్పినా అవి రెండూ సమానముగా దైవ గ్రంథములే అయిన దానివలన నేటి దానిని ఆనాటివారు చదివినా, ఆనాటి దానిని నేటివారు చదివినా రెండూ ఒకటేయని చెప్పుచూ రెండిటిని విశ్వసించగలరు. ఇదే విషయమునే క్రింది వాక్యములో కూడా చెప్పుచున్నారు చూడండి.
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
112. మేము కృతయుగము నుండి ముస్లీమ్‍లుగా యున్నాము. (28-53)
(28-53) ''వారికి దీనిని (ఖుర్ఆన్‍ను) చదివి వినిపించినప్పుడు ''ఇది మా ప్రభువు తరపునుండి వచ్చిన సత్యము అని మేము విశ్వసిస్తున్నాము. అసలు మేము దీనికి ముందు నుంచే ముస్లీమ్‍లుగా యున్నాము'' అని వారు చెబుతారు.
ముస్లీమ్ అనగా దేవుని మీద విశ్వాసము గలవాడు యని అర్థము. నేడు ఇస్లామ్ మతము వచ్చిన తర్వాత ముస్లీమ్‍లు ఏర్పడినారని చెప్పుటకు వీలులేదు. ముస్లీమ్ అనే పదము, నమాజ్, జకాత్, రోజా అను పదములు కృతయుగము నుండి ఉన్నాయి. మొట్టమొదట ప్రపంచములో పుట్టిన భాష తెలుగు భాష. మొదటి భాషయిన తెలుగుభాషలోని తెలుగు పదములే నేడు చెప్పుచున్న నమాజ్, జకాత్, రోజా, ముస్లీమ్ అను పదములు. అవి ఈ మధ్య కాలములో తయారయిన అరబ్బీ భాషలో పలుకబడు పదములుగా యున్నా అవి కృతయుగములోనే తెలుగులో చెప్పబడిన పదములు అని చెప్పవచ్చును. ఇప్పుడు ఖుర్ఆన్‍ను చదివిన మేము ఇది ఆదిలోనే దేవుడు చెప్పిన సత్యమని గుర్తించగలిగినట్లు పూర్వపు జ్ఞానము కల్గిన వారు నేడు ఖుర్ఆన్ గ్రంథమును చదివినా ఇది ప్రథమ దైవగ్రంథములోని సత్యముయని చెప్పగలరు. నేడు అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్ జ్ఞానమును ద్వాపర యుగములో తయారయిన ప్రథమ దైవ గ్రంథములోనిదేయనీ, దీని ప్రకారము మేము ముందుగానే ముస్లీమ్‍లుగా యున్నామని మేము, మాలాంటి వారు అందరూ చెప్పుచున్నారు. అంతేకాక నాతో సమానమైన ముస్లీమ్‍లు కొందరే ఉన్నారనీ, మిగతా వారంతా సంపూర్ణ జ్ఞానము తెలియని దానివలన సంపూర్ణ ముస్లీమ్‍లు కాదని చెప్పవచ్చును. మూడు దైవ గ్రంథముల జ్ఞానమును తెలిసినవాడే అసలయిన ధర్మములో యున్నట్లు, అసలయిన ముస్లీమ్ అయినట్లు అని చెప్పవచ్చును.
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
113. పట్టణ వాసులపై ఆకాశము నుండి శిక్షను విధిస్తాము. (29-34, 35)
(29-34,35) ''మేము ఈ పట్టణ వాసులపై, వారి తిరుగుబాటు ధోరణి కారణముగా ఆకాశమునుండి శిక్షను అవతరింపజేయు చున్నాము. మేము ఆ పట్టణాన్ని బుద్ధి జీవుల కోసము స్పష్టమైన గుణపాఠ సూచనగా చేశాము.''
ఈ పట్టణవాసులు అనగా కొంత అర్థము చేసుకోవలసిన అవసరమున్నది. వాసులు అనగా నివసించువారు అని అర్థము. పట్టణము అనగా! అనేకమంది నివశించుచున్న స్థలము అని అర్థము. ఏకము అనగా ఒకటియనీ, అనేకము అనగా ఒకటి కాకుండా ఒకటికంటే ఎక్కువమంది నివశించునది యని అర్థము. దీని ప్రకారము ఆధ్యాత్మిక అర్థము ప్రకారము మనము నివశించు శరీరమే పట్టణముగా యున్నదని తెలియుచున్నది. శరీరములో నివశించు జీవులు, దేవుడు చెప్పిన జ్ఞానమును లెక్కచేయక తిరుగుబాటు ధోరణిలో మాట్లాడుచూ, తమకు తెలిసిన జ్ఞానమే గొప్పదని మాట్లాడుచుందురు. అలా మాట్లాడడము వలన దైవ గ్రంథములో చెప్పిన జ్ఞానమునకు పూర్తి వ్యతిరేఖమగుట వలన, వారి కోసము దేవుడు శిక్షను ఖరారు చేసి వారి మీదికి పంపుచున్నాడు. దేవుడు ఖరారు చేసిన శిక్ష వారి మీదికి ఆకాశమునుండి వచ్చుచున్నది. ఆకాశము శరీరములోనే ఏడు భాగములుగా యున్నది. ఏడు భాగములనుండి అనేక రోగముల రూపములో శిక్షలు అమలు చేయబడును. గతజన్మలలో దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖముగా మాట్లాడి, తమకు తెలిసిన అజ్ఞానమునే జ్ఞానముగా చెప్పు వారికి ఇప్పుడు ప్రస్తుత జన్మలో ఏడు నాడీ కేంద్రముల ఆధీనములో యున్న శరీర భాగములకు రోగరూపములో శిక్షలు వచ్చుచుండును. దానివలన ఏ నాడీకేంద్ర పరిధిలో గల శరీర భాగములకయినా రోగములు రావచ్చును. అలా వచ్చు రోగములన్నిటిని ఆకాశము నుండి వచ్చు శిక్షలుగా చెప్పవచ్చును. ఈ విధముగా శిక్షలు అమలు జరుగడము బుద్ధిగల జీవులు ఆలోచిస్తే కొంత జ్ఞానమున్న వారు తెలుసుకొను గుణపాఠముగా యున్నది. దేవుని శిక్షలు ఎప్పుడు ఎలాగయినా శరీరములో ఏర్పడవచ్చును. శరీరములో ఏర్పడు బాధలన్నీ శరీర ఆకాశమునుండి వచ్చునవిగా చెప్పవచ్చును. ఆ బాధలన్నీ బుద్ధిగల వారు గ్రహించి దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖముగా మాట్లాడకుండుటకు గుణపాఠముగా ఉన్నవి.
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
114. తమ పుట్టుక గురించి లోతుగా ఆలోచించడము లేదు. (30-8)
(30-8) ''ఏమిటి, వారు తమ పుట్టుక గురించి లోతుగా ఆలోచించడము లేదా? అల్లాహ్ భూమి ఆకాశములనూ, వాటి మధ్యనున్న సమస్తమును అత్యుత్తమ రీతిలో నిర్ణీత కాలము కొరకు మాత్రమే సృష్ఠించాడు. అయితే చాలామంది తమ ప్రభువును కలుసుకోవలసి ఉందనే విషయాన్ని తిరస్కరిస్తారు.''
మనిషి జీవితమును దైవిక ధ్యేయము లేకుండా గడుపుచున్నాడు. మనిషికి ఉన్న ధ్యేయము దైవిక ధ్యేయము కాకుండా ప్రపంచ సంబంధమైన ధ్యేయము కలదు. అదే ధనమును సంపాదించవలెనను ధ్యేయము తప్ప ఏమీ లేదు. తన జీవితమును గురించి తన పుట్టుకను గురించి మనిషి లోతుగాగానీ, పైపైనగానీ ఆలోచించడము లేదు. తనను గురించి తాను మరచిపోయి బయట ప్రపంచ ద్యాసలలోనే మనిషి బ్రతుకుచున్నాడు. మనిషి ఎట్లు ఏ ఆలోచనలలో బ్రతికినా నిర్ణీత గడువు వరకు మాత్రమే ఉండును. దేవుడు మనిషిని పుట్టించినప్పుడే ఒక గడువు వరకు మాత్రమే బ్రతుకునట్లు శరీరమును తయారు చేసి పంపియుండును. దేవుడు శరీరమును భూమి ఆకాశములను శరీరములో ఉండునట్లు తయారు చేశాడు. అంతేకాక భూమి ఆకాశముల మధ్యలో సమస్త వస్తువులతో సహా శరీరమును తయారు చేశాడు. ఆకాశము తలకాగా, భూమి పాదములు కాగా, మధ్యలో యున్న అవయవములన్నీ సమస్త వస్తువులుగా యున్నవి. ఈ విధముగా దేవుడు శరీరమును అత్యుత్తమ రీతిలో తయారు చేశాడు. ఎంత ఉత్తమ రీతిగా చేసినా శరీరము నిర్ణీత గడువు వరకు బ్రతుకులాగున శరీరములో అవయవములను పొందుపరచి చేశాడు. కొంత వరకు బ్రతుకు శరీరములో నివసించు జీవుడు జీవితమున్న సమయములోనే, శరీరముతో బ్రతుకు సమయములోనే దేవున్ని గురించి తెలుసుకోవాలని, తమను సృష్ఠించిన దేవున్ని తెలుసుకొని కలుసుకోవాలని ఏమాత్రము అనుకోవడము లేదు. ఎవరయినా జ్ఞానులు ఆ విషయమును గుర్తు చేసినా దానిని తిరస్కరించు చున్నారు. అలా దేవుని సాన్నిధ్యమును తిరస్కారముగా మాట్లాడువారు తమను గురించి తమ జన్మను గురించి, తమ శరీరమును గురించి కొద్ది మాత్రము కూడా ఆలోచించకుండా బ్రతుకుచున్నారు.
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
115. ప్రళయము గురించి అల్లాహ్కే తెలుసు. (33-63), (43-85)
(33-63) ''ప్రళయము గడియ గురించి నిన్ను ప్రశ్నిస్తున్నారు కదా! ఆ సంగతి అల్లాహ్కే తెలుసునని వారికి చెప్పు. నీకేమి తెలుసు? బహుశా ప్రళయము అతి సమీపములోనే ఉందేమో!''
(43-85) ''ఇంకా ఆయన గొప్ప శుభకరుడు, భూమి ఆకాశాల లోను, వాటి మధ్యగల సమస్త వస్తువుల మీదనూ ఆధిపత్యము ఆయనదే. ప్రళయ గడియ గురించిన జ్ఞానము కూడా ఆయన వద్దనే ఉంది.''
ప్రళయము అంటే బయట కనిపించు భూమి, ఆకాశము, వాటి మధ్యలోగల గాలి, నీరు, అగ్ని అన్నీ చెలరేగిపోయి అన్నీ సర్వనాశనము అయిపోవడము ప్రళయము అని చాలామంది అనుకొనుచుందురు. బయట కనిపించు భూమి, ఆకాశము, గాలి, అగ్ని, నీరు అను పంచభూతములు మూడవ పురుషుడయిన పరమాత్మ ఆధీనములో గలవు. పరమాత్మ ఆధీనములో యున్న ప్రతీదీ ఆయన సేవ నిమిత్తమే ఉన్నాయి. అందువలన బయటి ప్రకృతియైన ఆకాశము, భూమి, గాలి, అగ్ని, నీరు అనువాటికి ప్రళయము ఎప్పటికీ ఉండదు. ఆకాశము, భూమి మొదలగు వాటి చేత శరీరము తయారయినది. శరీరము రెండవ పురుషుడయిన ఆత్మ ఆధీనములో యున్నది. శరీరము దేవుని సేవ నిమిత్తము ఉండునది కాదు. కావున శరీరములో యున్న (శరీర రూపములో యున్న) ఆకాశము, భూమి వాటి మధ్యలో యున్న సమస్తము పూర్తిగా నాశనము చెందు అవకాశము గలదు. శరీరము నాశనము అగుటనే గ్రంథములో ప్రళయము అని అన్నారు. శరీర రూపములో యున్న ప్రకృతి ప్రళయమును పొందునట్లు ఆత్మయే చేయుచున్నది. శరీరమును నాశనము చేయువాడు ఆత్మయేనని తెలియవలెను. శరీరము మరణము పొంది ఎప్పుడు నాశనమగునో శరీరములోని ఆత్మకే తెలుసు. ప్రళయము గురించి జీవాత్మకు ఏమాత్రము తెలియదు. అందువలన ప్రళయ గడియ రెండవ ఆత్మయిన అల్లాహ్కే తెలుసు.
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
116. పరిశుద్ధులు మాత్రమే నన్ను ముట్టుకోగలరు. (56-77, 78, 79)
(56-77,78,79) ''నిశ్చయముగా ఈ ఖుర్ఆన్ చాలా గౌరవ ప్రదమైనది. అదొక సురక్షితమైన గ్రంథములో నమోదై ఉన్నది. పరిశుద్ధులు మాత్రమే దానిని ముట్టుకోగలరు.''
అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్ సురక్షితమైన గ్రంథములో నమోదైయున్నది. అయితే ఈ మాటను చాలామంది అర్థము చేసుకోలేక ఖుర్ఆన్ గ్రంథము ఒక గ్రంథములో వ్రాసిపెట్టారని దానిని మాతృగ్రంథము అని అంటారని చెప్పుచున్నారు. చాలామంది ఖుర్ఆన్ మాతృగ్రంథములో నమోదై ఉంది అంటున్నారు. ఇక్కడ బాగా అర్థము చేసుకొంటే ఖుర్ఆన్ మొదట ఒకచోట వ్రాసిపెట్టారు. వారు వ్రాసిన తర్వాత అది గ్రంథము అయినది. వ్రాయకముందు గ్రంథము కాలేదు కదా! వ్రాసిన తర్వాత గ్రంథమయినది కదా! దానిని మొదటి గ్రంథమని, మాతృగ్రంథమని, ఉమ్ముల్ కితాబ్యని అంటున్నారు. అయితే అలా వ్రాసిన గ్రంథమును గురించి ''ఈ గ్రంథము ఇంకొక గ్రంథములో నమోదై ఉన్నది'' అన్నారు. ''అది ముందే ఉన్న సురక్షితమైన గ్రంథము'' అని కూడా చెప్పారు. ఖుర్ఆన్ గ్రంథము తయారైనప్పుడు దానికంటే ముందే కొన్ని సంవత్సరముల నుండి యున్న గ్రంథములో వ్రాసిపెట్టబడియున్నది అని చెప్పారు. దీనిని నేరుగా చెప్పితే ''ఈ ఖుర్ఆన్ గ్రంథము ముందే వ్రాసిపెట్టబడిన గ్రంథములోనే యున్నది'' అని అర్థము. ముందే తయారైన గ్రంథము తౌరాతు గ్రంథము. ఆ తౌరాతు గ్రంథములోని వాక్యములు ఖుర్ఆన్‍లో ఉన్నాయనిగానీ, లేక ఖుర్ఆన్‍లోని వాక్యములు తౌరాతులో ఉన్నాయనిగానీ చెప్పడమే, ముందే యున్న ఒక సురక్షితమైన గ్రంథములో ఉన్నదని అన్నారు. సూరా ఆరు, ఆయత్ 91లో (6-91) లో ''మూసా తెచ్చిన తౌరాతు గ్రంథమును ఎవరు అవతరింపజేసినట్లు? ఆ గ్రంథము ఒక జ్యోతి, మానవుల కొరకు మార్గదర్శకత్వము. మీరు దానిని వేరువేరు కాగితములుగా (వేరువేరు గ్రంథములుగా) విభజించి చూపుతున్నారు.''
ఈ వాక్యమును చూచిన తర్వాత తౌరాతు గ్రంథములోనిదే ఖుర్ఆన్ అని అర్థము కాగలదు. అందువలన ఖుర్ఆన్ మరొక గ్రంథములో నమోదై యున్నది అని అన్నారు. అంతేగానీ వ్రాసిపెట్టబడిన ఖుర్ఆన్‍లో ఖుర్ఆన్ ఉందని చెప్పలేదు. ముందు తయారు చేయబడినది తౌరాతు గ్రంథము. దానినే ప్రథమ దైవ గ్రంథము అని అంటున్నారు. ప్రథమ దైవ గ్రంథములోని జ్ఞానమే అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్‍లో ఉందని చెప్పడము కొరకే ఖుర్ఆన్ ముందే యున్న గ్రంథములో నమోదైయున్నదని చెప్పారు. అంతేకాక (43-4) లో ''నిశ్చయముగా ఇది మాతృ గ్రంథములో యున్నది. మావద్ద అది ఎంతో ఉన్నతమైన వివేకముతో నిండిన గ్రంథముగా యున్నది'' అని అన్నారు. ఇక్కడ విషయమును అర్థము చేసుకుంటే చాలా సులభముగా యున్నది. అర్థము చేసుకోకపోతే అనుమానముతో కూడుకొన్న విషయమై పోవును. ఖుర్ఆన్ తౌరాత్‍లో యుండుట వలన అది ఎవరికీ కనిపించని విధముగా యున్నది. ఎవడయితే పవిత్రమైన బుద్ధిగలవాడో వాడే దానిని చూడగలడు. దానిని తాకగలడు. పవిత్రమైన బుద్ధి లేనివానికి అది కనిపించదు, దానిని తాకలేడు.
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
117. ఖుర్ఆన్ కల్పితగాథ కాదు. తన పూర్వ గ్రంథములను ధృవీకరిస్తున్నది. (12-111)
(12-111) ''నిశ్చయముగా వీరి గాథలలో విజ్ఞత గలవారికి గుణపాఠము ఉన్నది. ఈ ఖుర్ఆన్ కల్పితమైన విషయము ఎంతమాత్రము కాదు. పైగా ఇది తన పూర్వమున్న గ్రంథాలను ధృవీకరిస్తూవుంది. ప్రతి విషయమును స్పష్టముగా విడమరచి చెబుతున్నది. విశ్వసించే జనులకు ఇది సన్మార్గము, కారుణ్యము.''
ఖుర్ఆన్ కల్పిత గ్రంథము కాదు. ఇది దైవ గ్రంథము. ఇది పూర్వమున్న తౌరాతు, ఇంజీలు గ్రంథాల జ్ఞానమును ధృవీకరిస్తున్నది. ప్రతి విషయము వివరముగా చెప్పబడినది. ఇందులోని జ్ఞానము గుణపాఠముగా యున్నది. గుణపాఠము అనగా మాయను గురించి తెల్పునదియని అర్థము. మాయను ఇబ్లీసు యని గ్రంథములో చెప్పినా, మాయ అంటే దేవుని మార్గములో పోకుండా పూర్తి ఆటంకము చేయునది. దేవుని మార్గమును ఆటంకము చేయు మాయను ఎవరూ జయించలేరు. అయితే దైవ గ్రంథమును చదువుట వలన మాయను జయించుటకు తగిన ఉపాయము దొరుకును. మాయను గురించి ప్రథమ దైవ గ్రంథములో ఇలా చెప్పారు చూడండి.
దేవుని చేత తయారు చేయబడిన, గుణములతో కూడుకొన్న నా మాయను జయించుట దుస్సాధ్యము అని దేవుడే చెప్పుచున్నాడు. ఎవడయితే నన్ను ఆరాధించుచున్నాడో వాడు మాత్రమే దుస్సాధ్యమైన మాయను దాటిపోగలడు. దేవున్ని తెలిసి, దేవుని జ్ఞానమును తెలిసి, ఆయనను ఆరాధించుటకు అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్ చదువుట వలన సాధ్యము కావచ్చును. అందువలన విజ్ఞత గలవారికి ఇందులో గుణపాఠము గలదని చెప్పారు. ''గుణమయీ మమ మాయా'' అని భగవద్గీతలో చెప్పియుండుట వలన మన తలలోని గుణములనే మాయయని చెప్పవచ్చును. ఖుర్ఆన్‍ను విశ్వసించి చదివే వారికి మాయను జయించు శక్తి లభించును. ముందు వచ్చిన భగవద్గీత, బైబిలులోని జ్ఞానమే ఖుర్ఆన్‍లో కూడా ఉండుట వలన మనిషికి మాయను జయించుశక్తి లభించగలదు.
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
118. చనిపోయిన వానిని అల్లాహ్ లేపునని కొందరు అంటారు. లేపడని మరికొందరు అంటారు, ఏది నిజము? (16-38)
(16-38) ''చనిపోయిన వారిని అల్లాహ్ తిరిగి లేపడు'' అని వారు అల్లాహ్ పై గట్టిగా ప్రమాణాలు చేసి మరీ చెబుతారు. ఎందుకు లేపడు? తప్పకుండా తిరిగి బ్రతికించి లేపుతాడు. ఇది ఆయన వాగ్దానము. దీన్ని నెరవేర్చటాన్ని ఆయన విధిగా చేసుకున్నాడు. కానీ చాలామందికి ఈ విషయము తెలియదు.''
ముస్లీమ్ సమాజములో మనిషి చనిపోతే వాడు వాని శరీరముతో పాటు గోరీలయందే ఉండుననీ, అలా ఉండగా ప్రళయ కాలము వచ్చినప్పుడు దేవుడు వచ్చి సమాధులలో యున్న వారినందరినీ వారివారి శరీరములతోనే లేపునని, అప్పుడు మనిషి చేసిన పాప పుణ్యముల విచారణ చేయునని పాపము చేసిన వారిని నరకమునకు, పుణ్యము ఎక్కువ చేసిన వారికి స్వర్గమును పొందునట్లు చేయునని చెప్పుచుందురు. దేవుడు అట్లు చేయునా? అని విచారిస్తే అలా చేయడని తెలియుచున్నది. దేవుడు చనిపోయిన వానిని తిరిగి జన్మించునట్లు చేయుచున్నాడు తప్ప భూసమాధుల నుండి లేపడమనునది జరగడము లేదు. దేవుడు చేయని పనిని దేవునికి అంటగట్టడము వలన అటువంటి వారిని చూచి దేవుడు విసిగించుకొనును. అంతేకాక దేవునికి అబద్దములు అంటగట్టు వానిని తర్వాత జన్మలో దేవుడు అతనిని అజ్ఞాన మార్గములో పోవునట్లు చేయును. అదే అతనికి దేవుని నుండి వచ్చు శిక్షయని చెప్పవచ్చును.
ప్రతి మనిషి (జీవుడు) చనిపోయినప్పుడు అతని శరీరమును వదలి జీవుడు దేవునివద్ద వెంటనే తీర్పు పొంది, మరుక్షణమే ఇంకొక జన్మలోనికి పోవుచున్నాడు. చనిపోయిన జీవుడు వేరే శిశు శరీరమును చేరిన తర్వాత కొంతసేపటికి అనగా కొన్ని గంటలకు అతని మరణ శరీరమును భూమిలో పూడ్చిపెట్టడము జరుగుతాయున్నది. శరీరమును వదలిపోయిన జీవునికి, మృత శరీరమునకు ఏమాత్రము సంబంధము ఉండదు. ఒకమారు శరీరము నుండి జీవుడు బయటికి పోతే తిరిగి ఆ శరీరమువైపు వచ్చు అవకాశమే ఉండదు. మరణమును పొందిన జీవుడు దేవుని చేత తీర్పు తీర్చబడి ఎక్కడికో పోయి జన్మించగా, ఒక్క క్షణములో అతడు దేవుని చేత జన్మను పొందగా, అతని శరీరము కొన్ని గంటల తర్వాత భూమిలో పూడ్చబడి కుళ్లిపోవుటకు ప్రారంభించును. ఆరు నెలల లోపల ఎముకలు తప్ప శరీరమంతయూ పూర్తిగా నాశనము అయిపోవు చున్నది. ఒక సంవత్సరమునకు ఎముకలు కూడా పూర్తిగా శిథిలమయి పోవుచున్నవి. అటువంటప్పుడు ఎంతోకాలము శరీరములో నివాసమున్న జీవునితో మృత శరీరము సంబంధము లేకుండా మార్పుచెంది కుళ్లిపోయి ఏమాత్రము మిగలకుండా నశించిపోవుచున్నది. జీవుడు ఎక్కడో వాని కర్మకొద్ది పోయి పుట్టి, పాతశరీరముతో ఏమాత్రము సంబంధము లేకుండా పోయినప్పుడు దేవుడు ప్రళయములో అదే శరీరముతో, అదే మనిషిని భూసమాధి నుండి సజీవముగా లేపును అనుట దేవున్ని, దేవుని పనిని హాస్యాస్పదముగా మాట్లాడినట్లు కాదా!
చనిపోయిన జీవున్ని దేవుడు తిరిగి తల్లిగర్భము నుండి వచ్చిన శరీరములో శిశువుగా లేపుచున్నాడు. చనిపోయిన జీవున్ని తిరిగి బ్రతికించి లేపడము దేవుడు తన విధిగా చేయుచున్న పని. అయితే ఆయన ఎప్పుడు ఏ విధముగా జీవున్ని తిరిగి బ్రతుకునట్లు చేయుచున్నాడో తెలియక ఎవరో చెప్పిన కట్టుకథలను నమ్మి ఖుర్ఆన్ గ్రంథములో చెప్పిన జ్ఞానమును కూడా లెక్క చేయడము లేదు. మనుషులు మూర్ఖులుగా ప్రవర్తించుచూ, దేవునికి కూడా అబద్దములు అంటగట్టుచున్నారు. ఆకాశములు, భూమి అంటూనే బయట ఆకాశమా, శరీరము లోపలి ఆకాశమా అని ఆలోచించకుండా బయట ఆకాశముగా లెక్కించుచున్నారు. ప్రళయము అంటూనే బయట ప్రళయము జరుగదని, జరిగేది శరీరము లోపలి ప్రళయమేయని తెలియక ప్రళయములో మనిషి తిరిగి లేచును అని బయట లెక్కవేయుచున్నారు. బయట ప్రళయము ఎప్పటికీ జరుగునది కాదని తెలియక మాట్లాడుచున్నారు. మరణమే ప్రళయమనీ, అది శరీరములో శరీరమునకు జరుగు ప్రళయమనీ, శరీర నాశనమను ప్రళయములో జీవుడు మరొక శరీరమును చేరి క్రొత్త జన్మ పొందుచున్నాడని, దేవుడే జీవున్ని అలా క్రొత్త జన్మలో లేపుచున్నాడనీ తెలియకపోవుటయే కాక దేవుడు చనిపోయిన దేహములోనే లేపును అని అంటున్నారు. అలా జరుగుట అసంభవము. అందువలన దేవుడు దైవ గ్రంథమయిన ఖుర్ఆన్‍లో ఏమి చెప్పాడో బాగా గమనించమని తెలుపుచూ, దేవునికి అబద్దములు అంటగట్టవద్దని చెప్పుచున్నాము.
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
119. ఖర్జూరము, ద్రాక్షనుండి మత్తుపాణీయమును తయారు చేస్తారు. అట్లే వాటినుండి మంచి ఆహారమును చేస్తారు. ఇందులో విజ్ఞత గలవారికి సూచనలున్నాయి. (16-67)
(16-67) ''ఖర్జూరము, ద్రాక్షపండ్లనుండి మీరు మత్తుపాణీయమును తయారు చేస్తారు. వాటినుండి మంచి ఆహారమును కూడా గ్రహిస్తున్నారు. విజ్ఞత కలవారి కోసము ఇందులోనూ గొప్ప సూచన ఉంది.''
పాము విషము మనిషి ప్రాణమును తీయగలదని విన్నాము. నాగుపాము విషము వలన చాలామంది చనిపోయిన వారున్నారు. పాము విషము మనిషి శరీరములోనికి ప్రవేశిస్తే మరణము తప్పదని ఎందరో చెప్పిన మాటను విన్నాము. అంతేకాక అక్కడక్కడ పాముకాటుకు గురియైన వారు చనిపోవడము చూస్తూనే యున్నాము. నాగుపాము అంటే భయపడు సమయములో ఒక వ్యక్తి వచ్చి ''పాము విషము వలన మనిషి అస్వస్థతకు గురియై గంటలోపే చనిపోవుట వాస్తవమే. అదే పాము విషము వలన అనారోగ్యమునకు (అస్వస్థతకు) గురియైన వారు కూడా ఆరోగ్యమును పొందుట కూడా వాస్తవమే'' అని ప్రచారము చేయుచుండెను. అప్పుడు అతనితో ఇంకొక వ్యక్తి వచ్చి ''పాము విషముతో అనారోగ్యమునకు గురియై చనిపోవుట వాస్తవము అయితే, నీవు అనారోగ్యము గలవాడు, చనిపోవుటకు సిద్ధముగా యున్నవాడు, పాము విషము వలననే తిరిగి ఆరోగ్యమును పొంది జీవించునని, చనిపోవు ప్రమాదమునుండి బయటపడునని ఎలా చెప్పుచున్నారని'' అడిగెను. దానికి అతను ఈ విధముగా సమాధానమును చెప్పాడు. ''పాము విషము పాముకాటు ద్వారా మనిషి శరీరములోనికి చేరి రక్తములోనికి కలిస్తే ఆ మనిషి చనిపోవుట సత్యము. అదే విషమునే నోటిద్వారా శరీరములోనికి పంపితే ఆ విషము అతనిలోని అనారోగ్యములను లేకుండా చేసి పూర్తి ఆరోగ్యమును ఇచ్చుచున్నది. ఒకే విషము మనిషిని చంపుటకు, మనిషిని బ్రతికించుటకు ఉపయోగపడుటకు కారణమయినది. అదెలాయనగా! పాము విషము కాటు ద్వారా శరీరములోనికి చేరి రక్తములో కలిస్తే మనిషి చనిపోవును. అదే విషము నోటి ద్వారా శరీరములోనికి చేరి రక్తములోనికి కలిస్తే మనిషి పూర్తి ఆరోగ్యముగా తయారై జీవించును. ఇది సత్యము.
అదే విధముగా ఖర్జూరము, ద్రాక్ష మనిషికి మంచి ఆహారముగా ఉపయోగపడుచూ ఆరోగ్యమును ఇచ్చుచున్నది. అదే ద్రాక్ష, ఖర్జూరమును మత్తుపాణీయముగా చేసుకొని త్రాగితే అది అనారోగ్యమును కల్గించును. మత్తును కల్గించి మనిషి చేత చేయరాని పనులను చేయించును. అట్లే మనిషి చేత మాట్లాడరాని మాటలను మాట్లాడించును. ఖర్జూరము, ద్రాక్ష రెండు మంచి రుచికరమైన ఫలములే. అయితే వాటిని ఉపయోగించు కోవడములో తేడా వస్తే ఉపయోగించిన మనిషిలో కూడా తేడా వచ్చును. ఒకే విషమే మనిషిని చంపుటకు, బ్రతికించుటకు రెండు విధముల ఎట్లు ఉపయోగపడుచున్నవో, అట్లే ఒకే ఖర్జూరము, ద్రాక్ష రెండూ మంచి రుచికరమైన పండ్లు అయినా వాటిని ఉపయోగించడములోని మార్పునుబట్టి మనిషిలోని గుణములలో మార్పు తెచ్చుచున్నది. ఖర్జూరములు, ద్రాక్ష ఆహారముగా ఉపయోగపడితే ఆరోగ్యమును ఇచ్చుచున్నది. పాణీయముగా త్రాగితే అనారోగ్యములను కల్గించుచున్నది. అదే విధముగా దేవుని జ్ఞానమును అర్థము చేసుకోగలిగితే మనిషిని మోక్షమునకు పంపును. అదే జ్ఞానమును అర్థము చేసుకోక అపార్థము చేసుకొంటే మనిషిని జన్మలకు పంపును. ఒక విధముగా ముక్తి జ్ఞానము వలన కల్గుచున్నది. అట్లే మరొక విధముగా కర్మతో కూడుకొన్న జన్మలు కల్గుచున్నవి.
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
120. విశ్వసించి సత్కార్యములు చేసినవారికి మంచి ప్రతి ఫలము ఇవ్వడానికి ప్రళయము వస్తుంది. (34-3,4)
(34-3,4) ''మాపై ప్రళయము వచ్చిపడదు'' అని అవిశ్వాసులు అంటున్నారు. ''ఎందుకు రాదు? అగోచర జ్ఞాని అయిన నా ప్రభువు సాక్షిగా! అది మీపై తప్పకుండా వస్తుంది. రవ్వంత వస్తువు కూడా అది ఆకాశములలో యున్నా, భూమిలోయున్నా ఆయన నుండి గోప్యముగా లేదు. దానికన్నా చిన్నవస్తువైనా, పెద్ద వస్తువైనా ప్రతిదీ ఒక స్పష్టమైన గ్రంథములో లిఖిత పూర్వకముగా ఉంది అని వారికి చెప్పు.''
(34-4) ''విశ్వసించి సత్కార్యములు చేసినవారికి మంచి ప్రతి ఫలమే ఇవ్వడానికి ప్రళయము వస్తుంది. ఇలాంటి వారి కోసమే మన్నింపు, గౌరవ ప్రదమైన ఉపాధి ఉన్నాయి.''
దేవుని మీద విశ్వాసము లేని అజ్ఞానులు ''మాపై ప్రళయము వచ్చి పడదు'' అని అంటారు. ప్రళయము అంటే ఏదోయని చాలా దూరముగా యోచించుకొనియున్నారు. ప్రళయము అంటే మరణము అని వారు అనుకోవడము లేదు. మనుషులు చేయు చిన్నపనైనా, పెద్దపనైనా దేవునికి తెలియకుండా లేదు. ప్రతి పనియొక్క ఫలితమును కర్మపత్రము అను గ్రంథములో లిఖించబడియున్నాయి. మనిషి అవిశ్వాసియై పాపపుణ్య కర్మలను నమ్మకపోయినా, అలాగే మనిషి విశ్వాసియై సత్కార్యములను చేసినవారికి మంచి ఫలితమును ఇవ్వడానికి వారికి మరణమును ఇచ్చి మరణములో తర్వాత జన్మకు సరిపడు గౌరవప్రదమైన ఉపాధిని దేవుడు కల్పించుచున్నాడు. ఈ వాక్యములో బాగా గమనించితే, ఒక మనిషి మంచిగా దేవుని జ్ఞానమును తెలిసి జ్ఞానిగా మసలుకొంటూ, ఎన్నో మంచి పనులు చేయగా ఎంతో గొప్ప జ్ఞానమును ఇతరులకు తెలుపగా అతనికి దైవ సంబంధమైన ఫలము అతని నొసటిలోపల యున్న కర్మగ్రంథము అను కర్మచక్రములో కర్మ గ్రంథమందు వ్రాయబడియున్నది. అతని కర్మ ఫలమును ఇచ్చుటకు దేవుడు ఒకమారు మరణమును కల్పించును. ఆ మరణములో తీర్పు తీర్చడములో అతను తిరిగి జన్మకు పోవుటకుగానీ, జన్మకు పోకుండా మోక్షము పొందుటకుగానీ నిర్ణయము చేయబడి మనిషికి గౌరవ ప్రదమైన జన్మనయినా ఇచ్చును. లేకపోతే జన్మకు పోకుండా పరలోకప్రాప్తి కల్గించి, దేవుని సాన్నిధ్యములో చేరిపోవునట్లు చేయును. అట్లు చేయుటకు ఆ మనిషికి మరణము రావలసియున్నది. మరణమును శరీర ప్రళయము అని అనవచ్చును. ప్రళయము రానిదే తర్వాత జన్మగానీ, పరలోక ప్రాప్తి అయిన ముక్తిగానీ లభించదు.
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
121. పన్నెండు తెగలు, పన్నెండు మతాలు, పన్నెండు గుణాలు. (7-160)
(7-160) ''మేము వారిని పన్నెండు తెగలుగా విభజించి, వేరువేరు సమూహములుగా చేశాము. మూసా జాతివారు అతన్ని నీళ్లు అడిగినప్పుడు ''నీ చేతికర్రను ఫలానా రాతిపై కొట్టు'' అని మేము అతనిని ఆదేశించాము. అంతే అతను కర్రతో కొట్టగానే ఆ రాతిబండనుండి పన్నెండు ఊటలు చిమ్ముకు వచ్చాయి. ప్రతి తెగవారు తాము నీళ్లు తాగవలసిన చోటును తెలుసుకొన్నారు. మేము వారిపై మేఘ మబ్బుల ద్వారా నీడను కల్పించాము. వారిపై మన్న, సల్వాలను ఆహారముగా దించాము. మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన పదార్థములను తినండి అని వారికి చెప్పాము. అయితే వారు మాకు చేకూర్చిన నష్టము ఏమీలేదు. వారు తమ స్వయానికే నష్టము చేకూర్చుకొనేవారు.''
దేవుడు మనుష్య జాతిని పన్నెండు తెగలుగా విభజించి, పన్నెండు మతములుగా చేశాడు. ఇవి బయట కనిపించు పన్నెండు మతములుగా కనిపించడమేకాక శరీరము లోపల పన్నెండు గుణములతో మనుషులు పన్నెండు రకముల మాయలో ఉన్నారు. పన్నెండు జాతులలో ఒక తెగవారు నీళ్లు అడిగినప్పుడు రాతినుండి పన్నెండు ఊటల నీళ్లు వచ్చాయి. పన్నెండు ఊటల నీళ్లు పన్నెండు రకములుగా ఉన్న మాయకు విరుగుడుగా ఉన్నాయి. అంతేకాక పన్నెండు రకముల గుణములను నిరోధించునట్లు దేవుడు జ్ఞానము అనే ఆహారమును ఇచ్చాడు. అలా ఇవ్వడమే కాకుండా మీరు మేము ఇచ్చిన పరిశుద్ధమైన ఆహారమునే తినండియని చెప్పాడు. అయితే వారు సక్రమముగా జ్ఞానమును తెలియడము లేదు. దానివలన దేవునికి ఏమీ నష్టము ఉండదు. అయితే మనుషులు తమకు తాము స్వయానా అజ్ఞానము వైపు పోవుచున్నారు. మనుషుల తలలో యున్న గుణచక్రములో పన్నెండు గుణములు ఇలా కలవు.
పన్నెండు గుణములు గుణచక్రములో ఈ విధముగా గలవు. అందులో మంచి గుణములు అనబడునవి వాటికి వ్యతిరేఖమయినవి మొత్తము పన్నెండు మంచి, చెడు గుణములు వరుసగా ఇలా గలవు.
మంచి గుణములు (6) చెడు గుణములు (6)
1) దాన X 1) కామ (ఆశ)
2) దయ X 2) క్రోధ (కోపము)
3) ఔదార్య X 3) లోభ (పిసినారి తనము)
4) వైరాగ్య X 4) మోహ (నా అనునది)
5) వినయ X 5) మద (గర్వము)
6) ప్రేమ X 6) మత్సర (అసూయ)
ఈ విధముగా రెండు గుంపులుగా యున్న గుణములు ఒక్కొక్కటి తొమ్మిది భాగములుగా యున్నవి. దీనిప్రకారము 6I9=54 మొత్తము గుణములు మంచివి 54, చెడువి 54 మొత్తము 54+54=108 గుణములు గలవు. పన్నెండు గుణములు తనయందున్నాయి అని తెలియువరకు దేవుని జ్ఞానము మనిషికి తెలియదు. అందువలన మనుషులు వారికివారే స్వయానా నష్టమును తెచ్చుకొంటున్నారన్నారు.
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
122. మూసాకు తొమ్మిది మహిమలను ఇచ్చాము. (17-101)
(17-101) ''మేము మూసాకు స్పష్టమైన తొమ్మిది మహిమలను ఇచ్చాము. కావాలంటే నీవు స్వయముగా ఇస్రాయీల్ వంశీయులను అడుగు.''
(17-102) ''మూసా ఇలా సమాధానమిచ్చాడు. గుణపాఠముతో కూడుకొన్న ఈ సూచనలను భూమి, ఆకాశముల ప్రభువు తప్ప మరెవరూ అవతరింపజేయలేదన్న విషయము నీకు తెలుసు.''
ఐదువేల సంవత్సరముల పూర్వము మోషే అను ప్రవక్త ఒకడు ఉండేవాడు. అప్పటి మోషే ఇప్పటి కాలములో మూసాయను పేరుతో చెప్పబడుచున్నాడు. మూసా మోషేగా చెప్పబడు కాలములో, అనగా ఆయన బ్రతికియున్న కాలములో దాదాపు 20 సంవత్సరముల వయస్సులోనే పరమాత్మయిన దేవుడు భగవంతునిగా తన జ్ఞానమును తౌరాతు గ్రంథరూపములో ఇచ్చాడు. తౌరాతు గ్రంథము యొక్క మొదటి పేరు భగవద్గీత. దేవుడు అయిన పరమాత్మ భగవంతునిగా వచ్చి ఇచ్చిన గ్రంథము తౌరాతు. తౌరాతులో దేవుని జ్ఞానము అంతయూ గలదు. దేవుని జ్ఞానమును గురించి వచ్చిన మొదటి గ్రంథము తౌరాతు. అందులో దేవుని సమస్త జ్ఞానము సంపూర్ణముగా గలదు. దైవ జ్ఞానములో ఏ సంశయము వచ్చినా దానికి జవాబు తౌరాతు గ్రంథములో దొరుకును. ఇప్పుడు ఖుర్ఆన్ (17-101) లో చెప్పిన వాక్యమునందు చెప్పబడిన తొమ్మిది మహిమలు కూడా తౌరాతు జ్ఞానములో తెలియునవే. దేవుడయిన పరమాత్మకు తొమ్మిది మహిమలు, ఆత్మకు ఆరు మహిమలు, జీవాత్మకు మూడు మహిమలు గలవని తౌరాతు గ్రంథములోనే తెలియుచున్నది. దేవుడు తెలియజేసిన తన తొమ్మిది సూచనలు గుణపాఠముతో కూడుకొని యున్నవి. ఆ సూచనలను దేవుడు తప్ప ఎవరూ అవతరింపజేయలేదని తెలియుచున్నది. ఇప్పుడు దేవుడు, జీవుడు, మధ్యలో గల దేవుడు యొక్క మహిమలను తెలుసుకొందాము. అనగా జీవాత్మ, ఆత్మ, పరమాత్మయను ముగ్గురి సూచనలు తెలుసుకొందాము.
జీవాత్మ సూచనలు (మహిమలు)
1) దేవుని మీద ఇష్టము కల్గియుండుట.
2) దేవుని జ్ఞానమును తెలియుట.
3) దేవుని లోనికి ఐక్యమగుట.
ఆత్మ యొక్క సూచనలు (మహిమలు)
1) జీవులకు జన్మలను ఇచ్చుట.
2) జీవులకు మరణమును ఇచ్చుట.
3) జీవులకు జీవనమును ఇచ్చుట.
4) జీవులకు మరణములో తీర్పు తీర్చుట.
5) జీవులకు ఆరాధ్య దైవముగా ఉండుట.
6) జీవులకు వెంట ఉండుట.
పరమాత్మ సూచనలు (మహిమలు)
1) ఆయన ఒక్కడే ఇతరుల సంబంధము లేకుండా యున్నాడు.
2) ఆయన సంతతి లేనివాడు, ఆయన తాతేగానీ తండ్రికాడు.
3) ఆయన ఏ అవసరము, ఎవరి అవసరము లేనివాడు.
4) ఆయన అన్ని ఆరాధనలకు అతీతుడు.
5) ఆయన మోక్షముగా యున్నాడు. మోక్షమును ఇచ్చువాడుగా యున్నాడు
6) ఆయన మొదటి సృష్ఠికర్త, ఆయనకంటే ముందు ఎవరూ లేరు.
7) ఆయన అధికారముగల అధికారేగానీ, అహంకారి కాడు.
8) ఆయన దర్శకుడేగానీ కార్యకుడు కాడు.
9) ఆయన ఎవరి అంచనాకు తెలియడు.
జీవాత్మ = 3 3 + 6 = 9 - 9
ఆత్మ = 6 9 + 9 = 18 - 9
పరమాత్మ = 9 1 + 8 = 9 - 9
పరమాత్మ ఎటుచూచినా 9 గానే యున్నాడు. పరమాత్మను గురించి తెలియుటకు ముందు జీవాత్మను, ఆత్మను గురించి తెలిసియుండాలి. ముగ్గురి విషయమును తెలియక దేవున్ని ఆరాధించుచున్నామని చెప్పువారు ఎవరిని ఆరాధించుచున్నారో తెలిసి ఆరాధించితే మంచిది. పరమాత్మ విధానము తెలియక ఆరాధన ఒక్కటే మా విశ్వాసము అనినా వానిని దేవుడు ఒప్పుకోడు.
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
123. దేవుని సంతాన విషయము వారికి గానీ, వారి ముత్తాతలకు గానీ తెలియదు. (18-4, 5), (21-26)
(18-4) ''అల్లాహ్ సంతానము కలిగి యున్నాడని పలికేవారిని హెచ్చరించటానికి ఈ గ్రంథము అవతరింప చెయ్యబడినది.''
(18-5) ''యదార్థానికి వారికిగానీ, వారి తాతముత్తాతలకుగానీ, ఈ విషయము ఏమీ తెలియదు. వారి నోటివెంట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు చెప్పేదంతా పచ్చి అబద్దమే.''
(21-26) ''రుణామయునికి సంతానము ఉందని వారు చెప్పుతున్నారు. ఇది నిజము కాదు. ఆయన పవిత్రుడు. పైగా దైవదూతలయిన వారంతా గౌరవింపబడిన ఆయన దాసులు.''
దేవుడయిన పరమాత్మకు కరుణామయుడు, క్షమాశీలుడు, దయా శీలుడు అను బిరుదులు గలవు. ఈ మాటలు ఆరాధ్య దైవమైన రెండవ ఆత్మగా యున్న అల్లాహ్‍కు చెప్పకూడదు. మూడవ ఆత్మయిన పరమాత్మకు మాత్రమే చెప్పునవని జ్ఞాపకములో ఉంచుకోవలెను. ప్రతీదీ క్షుణ్ణముగా తెలిసినప్పుడే దేవుని జ్ఞానము అర్థము కాగలదు. శరీరములో గల అల్లాహ్ ఒకడనీ, ఆయనే అందరికీ ఆరాధ్యదైవముగా ఉన్నాడనీ, ఆయనకే మనుషులంతా సంతానముగా గలరనీ, ఆయనే అందరినీ పుట్టించుచున్నాడు, ఆయనే అందరినీ చంపుతున్నాడనీ, ఆయన అందరి శరీరములలో గల దేవుడని తెలియాలి. అట్లే శరీరము బయట మరొక అల్లాహ్ యున్నాడనీ, ఆయన దేవుడయినా ఎవరికీ ఆరాధ్యదైవము కాదనీ, ఆయన ఆరాధనలతో అక్కర లేనివాడనీ, ఆయన ఎవరినీ పుట్టించువాడు కాడు అలాగే చంపువాడు కాదనీ, ఆయనకు ఎవరూ సంతతి కాదనీ, ఆయనతో పాటు ఆదినుండి యున్న దేవదూతలందరూ ఆయన పరిపాలనా నిమిత్తము నిర్మించుకొన్న ఆయన దాసులనీ తెలియవలెను. ఇట్లు మానవులకు ఇద్దరు దేవుళ్లు కలరు. అయితే మొదటి దేవునికి భార్య లేదు, సంతతీ లేదు.
సృష్ఠి లేకపూర్వము కూడా అల్లాహ్ అను దేవుడు యున్నాడు. అప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన ఏకైకుడు. ఆయనకు రెండవ వ్యక్తే లేడు. అలాంటప్పుడు ఆయనకు భార్య ఎలా వస్తుంది? సంతానము ఎలా కల్గుతుంది? ఈ ప్రపంచములోని జీవరాసులు అందరూ రెండవ అల్లాహ్ యొక్క సంతానము. మొదటి అల్లాహ్ రెండవ అల్లాహ్‍ను సృష్ఠించి, ఆయనకు భార్యగాయున్న ప్రకృతిని సృష్ఠించి, వారికి జీవరాసులు సంతానము కల్గునట్లు పథకమును రచించి అమలు చేశాడు. రెండవ అల్లాహ్‍నే అందరికీ ఆరాధ్య దైవముగా చేసి తాను ఏమీ సంబంధము లేనట్లు మొదటి అల్లాహ్ ఉండిపోయాడు. తననుండి మిగతావారిని సృష్ఠించక వారిని తననుండి విభజించాడు. అందువలన మొదట దేవునికి ఎవరూ సంతానము కాదు అని చెప్పారు. ఆయన సృష్ఠి పూర్వము నుండి ఒక్కడేయున్న దేవుడు. అందువలన ఆయన ఎవరికీ సంతానము కాదు అని కూడా చెప్పారు. ఆయన ''స్వయంభూ'' అనగా స్వయముగా తనకు తానుగా పుట్టిన దేవుడు. ఆ శక్తి ఒక్క ఆది దేవునికి తప్ప ఎవరికీ లేదు. ప్రపంచములో పన్నెండు మతములవారికి దేవుడను భావమున్నది గానీ, దేవుని జ్ఞానము తెలియదు. అందరూ దేవున్ని ఆరాధించుచున్నారు, ప్రార్థన చేయుచున్నారుగానీ దేవుడు ఒక్కడేయని అనుకొంటున్నారు గానీ ఇద్దరు అని తెలియదు. అన్ని మతముల వారికి ఇద్దరు దేవుళ్ల విషయము తెలియదు. అందువలన దైవ గ్రంథములను చదువమని దేవుడు అనేకచోట్ల చెప్పియున్నాడు. దేవున్ని గురించి తెలియనిదే దేవుని గురించి ప్రార్థన చేస్తే, అది అడ్రస్ వ్రాయని ఉత్తరమువలె వృథా అయిపోతుందని మేము చాలామార్లు చెప్పాము. దేవుడు అదే విషయమునే తెలియజేస్తూ నీవు ఎవరిని ప్రార్థించుచున్నావని ప్రశ్న వేయుచున్నాడు. ఖుర్ఆన్‍లో 16-51లో ''ఇద్దరు దేవుళ్లను ఆరాధించకండి. నేను సృష్ఠించిన అల్లాహ్‍ను ఆరాధించండి. నాకు మాత్రము భయపడండి'' యని రెండవ దేవుని ఆరాధనను, మొదటి దేవుడయిన తనకు భయపడమని చెప్పడము జరిగినది. దానివలన ఇద్దరున్నామని చెప్పినట్లయినది. అయినా అన్నీ చదివినా దానిని గ్రహించుకొను శక్తిని దేవుడు మనుషులకు ఇవ్వలేదు. దానికి కారణము మనుషులు దేవున్ని పూర్తి నమ్మలేదు. నమ్మినట్లు చెప్పుచున్నారు తప్ప దేవుని మీద పూర్తి విశ్వాసము లేదు. మొదటి దేవుని మీద విశ్వాసమున్నప్పుడే రెండవ దేవున్ని ప్రార్థించినా ఆ ప్రార్థన ఫలించుతుంది. ''మొదటి దేవుని విషయము గాలికి వదిలివేసి రెండవ దేవునికి ప్రార్థన చేయమని చెప్పిన మొదటి దేవుని ధ్యాస లేకుండా రెండవ దేవున్ని ఎంత ప్రార్థించినా ప్రార్థనకు ఫలితమిచ్చువాడు పరలోకమును (మోక్షమును) ఇచ్చువాడు మొదటి దేవుడే అయినందున అటువంటి ప్రార్థన ఫలించదు'' అని చెప్పాము. అల్లాహ్ ఒక్కడేయను మాటను గట్టిగా మాట్లాడు ముస్లీమ్‍లు గలరు. అయితే ఆరాధింపతగిన వాడు ఒక్కడేయనీ, దానికి ఫలితమిచ్చువాడు మొదటి అల్లాహ్యని తెలియనివారుండుట వలన వారు చేసే ప్రార్థనలన్నీ వృథాయగుచున్నవని చెప్పవచ్చును. నాకు జ్ఞానము బాగా తెలుసుయను బోధకులకు కూడా మొదటి మరియు రెండవ అల్లాహ్‍ల విషయము తెలియదు. వారికి తెలిసినదంతా ఒక దేవుడే. అంతమాత్రమున మనుషులకు జ్ఞానమున్నదనుకోవడము పొరపాటు.
దేవుడు ఇద్దరిగా యుండి రెండవవానిచేత అన్నీ మనుషులకు ఇచ్చువాడు మొదటి దేవుడే. మొదటి దేవుడే మోక్షమును కూడా ఇచ్చుచున్నాడు. మొదటి దేవుడే నీ కర్మను లేకుండా చేయు క్షమాశీలుడు. ఆయనే నిన్ను దయతలచి పరలోకమునకు చేర్చువాడు. పేరుకు మీరు ఆరాధించేది రెండవ దేవున్నియని తెలియనివారికి మూడవ దేవుని విషయము ఏమాత్రము తెలియదు. ఇది సామాణ్యులకు కాకుండా, పెద్దపెద్ద బోధకులకు కూడా అర్థముకాని విషయముగా యున్నది. అంతపెద్ద దేవుడయిన మొదటి దేవుడు, నీకు ఆరాధ్య దైవముగా యున్న దేవునికి కూడా గొప్పవాడయిన దేవుడు, నీకు తెలిసిన రెండవ దేవునికి అన్ని అధికారములు ఇచ్చిన మొదటి దేవుడు, ఎవరో నిత్యము జ్ఞానులము అని చెప్పుకొనువారికి కూడా తెలియదు. అంతేకాదు జ్ఞానులని బోర్డు పెట్టుకొని బోధలు చెప్పువారికి కూడా మొదటి దేవుని విషయము తెలియదు. ఇది ఖుర్ఆన్‍లోని విషయమే యని మాలాంటి వారు చెప్పినా వినకుండా మొదటి దేవుని విషయమును చెప్పిన మాలాంటి వారిని కూడా దూషించడము, అజ్ఞానులని ప్రచారము చేయడమును గ్రహించిన మొదటి దేవునికి అటువంటి వారిమీద కోపము రాదా? వస్తుంది. అందువలననే వారికి దైవ గ్రంథములోని విషయము తెలియకుండా చెవులకు, కన్నులకు ముద్రవేసి మూసివేశాడు. వారి బుద్ధికి తెలుసుకోవాలన్న శ్రద్ధ లేదు కావున వారికి అవగాహన లేకుండా చేశాడు. అందువలన వాక్యములో వారికిగానీ, వారి ముత్తాతలకుగానీ మొదటి దేవుని విషయము తెలియదని చెప్పారు.
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
124. ఆ రోజు ఒక్క చావు కోసము అరవకండి. అనేక చావుల కోసము అరవండి. (25-14)
(25-14) ''ఆ రోజు ఒక్క చావుకొరకు అరవకండి. అనేక చావుల కోసము అరుస్తూ ఉండండి.''
మనిషికి జీవితము చివరిలో చావు వస్తుంది. మనిషి జీవితము జననముతో మొదలయితే మరణముతో ముగుస్తుంది. ఒక్క జీవితమునకు ఒక మరణము తథ్యము. అయితే మనిషికి ఒక జీవితముతో వాడు లేకుండా పోతాడా? ఒక్క జీవితముతో లేకుండా పోవాలంటే అది మోక్షము పొందడముతోనే సాధ్యమగును. మోక్షము లభించాలంటే మనిషికి దేవుని జ్ఞానము అవసరము. దేవుని జ్ఞానము లభించాలంటే మనిషికి దేవుని దయ అవసరము. అయితే మనిషికి దేవుని మీద శ్రద్ధ లేదు కావున దేవునికి కూడా మనిషి మీద దయ లేదు. అందువలన మనిషికి దేవుని జ్ఞానము తెలియదు. దేవుని జ్ఞానము తెలియని కారణమున అతనికి ముక్తి (మోక్షము) లభించదు. ముక్తి లభించని కారణమున మనిషి మళ్లీ మళ్లీ పుట్టుచూ, మళ్లీ మళ్లీ చస్తూ ఉండాలి. అటువంటప్పుడు ఒక చావులో వచ్చు బాధకు ఏడ్చితే అది అంతటితో అయిపోదు కదా! అందువలన అనేక చావులకు, అనేకమార్లు ఏడ్చవలసియుండును. అందువలన ముందుగానే ఏడ్పునకు అలవాటు పడవలసియున్నది. ఒక్కచావు ఒక్క ఏడుపు కాకుండా, అనేక చావులు అనేక ఏడుపులు మనిషికి తప్పవు. ఒకవేళ చావు, పుట్టుకల నుండి తప్పించుకొని ఏడుపుల నుండి తప్పించు కోవాలంటే మనిషికి దేవుని జ్ఞానము అవసరము. మనిషికి దేవుని జ్ఞానము లభించాలంటే దైవ గ్రంథములను నమ్ముకో. మనుషులు చెప్పు మాటలను దైవ జ్ఞానమనుకోవద్దు. అలా నమ్మాలంటే దేవుడు భూమిమీదికి మనిషిగా వచ్చినప్పుడు మాత్రమే ఆయన చెప్పు మాటలను జ్ఞానమని నమ్ము. అలా నమ్ముటకు దేవుడు మనిషిగా వచ్చినా, ఆయన మనకు తెలియడు. అది అరుదుగా జరిగేపని. అందువలన ఇప్పుడు మూడు దైవ గ్రంథములు తప్ప ఏవిగానీ, ఎవరుగానీ జ్ఞానమును చెప్పు స్థితిలో లేరు. నేడు దైవ గ్రంథములు అందుబాటులో ఉన్నాయి. అందులోని జ్ఞానమును అందుబాటు లోనికి తెచ్చుటకు దేవుడే శరణ్యమని ఆయనను విశ్వసించి, ఆయన మీదే ఆధారపడడము మంచిది. అన్యదా వేరే దారి లేదు.
అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు
☜ వజ్ర వాక్య వివరము
☞
125. అకస్మాత్తుగా ఆపద రాకముందే దైవజ్ఞానమును అనుసరించు. (39-55)
(39-55) ''మీకు తెలియకుండానే మీపై అకస్మాత్తుగా ఆపద వచ్చి పడకముందే మీ ప్రభువు తరపునుండి మీకు పంపబడిన ఉత్తమ విషయాన్ని (జ్ఞానాన్ని) అనుసరించండి.''
మనిషికి భవిష్యత్తులో జరుగునది ఎవరికీ తెలియదు. అందువలన భవిష్యత్తు అంధకారము అని కొందరు అన్నారు. అంటే జరుగబోవునది చీకటిమయమని చెప్పుచున్నారు. చీకటిమయము అనగా! ఎవరు ఏమి చేయబోవుచున్నారను విషయము తెలియదు అని అర్థము. అట్లే ఎవరికి ఏమి జరుగును అను విషయము కూడా తెలియదు. అటువంటి వాటిలో మనిషికి మంచి జరుగవచ్చును, చెడు జరుగవచ్చును. ఏదయినా జరిగేంత వరకు మనిషికి దానిని గురించి తెలిసియుండదు. అదే విధముగా మనిషికి తెలియకుండానే ఆపద రావచ్చును. ఆ ఆపదలో మీరు పూర్తిగా లేకుండా పోవచ్చును. అనగా మరణము సంభవించవచ్చును. ఒకమారు మరణము వచ్చిన తర్వాత ఆ జన్మను వదలిపోవలసి వచ్చును. అందువలన ఆపద వచ్చిన తర్వాత దేవుని జ్ఞానము తెలియుటకు అవకాశము ఉండదు. ఏ ఆపద లేనప్పుడు, అన్ని అవకాశములున్నప్పుడు తెలియలేని జ్ఞానమును ఆపద వచ్చిన తర్వాత తెలియగలరను నమ్మకము లేదు. ''దీపమున్నప్పుడే ఇల్లు సర్దుకోవలెనను'' సామెతను చెప్పినట్లు, ఆయుష్షు అను దీపము ఉన్నప్పుడే శరీరమను ఇల్లులో సర్దుబాటు చేసుకోవలెనన్నట్లు మనిషి బ్రతికి యుండగానే దైవజ్ఞానమును తెలియవలెను.
ఒకవేళ అట్లు తెలియకపోతే తెలియముందే ఏ ఆపద అయినా వచ్చి అది మరణము వరకు పోవచ్చును. అప్పుడు ఆ జన్మయంతయూ వృథాయగును. ఒక జన్మ జ్ఞానము తెలియకుండా వృథా అయిందనుకొనే అవకాశముగానీ, జ్ఞాపకముగానీ లేకపోవడము వలన తర్వాత జన్మలో అయినా దైవజ్ఞానమును తెలుసుకోవాలను యోచన రాకపోవచ్చును. మనిషి జన్మ ఉన్నప్పుడే కొంత బుద్ధి గ్రహించుశక్తి గలదై ఉండును. మనిషిగా యున్నప్పుడు జన్మను వృథా చేసుకొన్నవానికి తర్వాత జన్మ మానవ జన్మయే దొరుకునను నమ్మకము లేదు. ఒకవేళ మానవ జన్మ దొరికినా, అప్పుడు కూడా దేవుని జ్ఞానమును తెలియుదుము అను నమ్మకము ఏమీ లేదు. ఒకవేళ మానవ జన్మ రాకుండా ఇతర జంతువు జన్మ ఏది లభించినా అప్పుడు ఆ శరీరములోని బుద్ధికి గ్రహింపుశక్తి ఎటూ ఉండదు. అందువలన అప్పుడు కూడా ఆ జన్మ కూడా వృథాయగును. అందువలన నేడే మానవ జన్మలో నీవు ఉన్నప్పుడే దైవజ్ఞానమును అనుసరించమని తెలుపుచున్నాము. ఏ జన్మ వృథా అయినా ఫరవాలేదు గానీ, మానవ జన్మ వృథా కావడము వలన మనిషి పెద్దగా నష్టపోయినట్లగును.