పెరటి తోటల పెంపకంతో పౌష్టికాహారం.
పెరటి తోటల పెంపకంతో పౌష్టికాహారం.
మనం తీసుకునే ఆహారంలో పోషక విలువల దృష్ట్యా కూరగాయ లకు ఎంతో ప్రాధాన్యత ఉంది.. వీటిలో ఖనిజ లవణాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. మనం తీసు కునే ఆహారంలో వీటిని ఉపయోగిం చడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగు తుంది. ప్రతీ మనిషి రోజుకు కనీసం 400 గ్రా. కూరగాయలు, 50 గ్రా. ఆకుకూరలు తీసుకోవాలి. అందు కోసం ప్రతీ కుటుంబం తమకు కావా ల్సిన కూరగాయలు తమ పెరట్లోనే పండించడం ఆరోగ్యకరమైన అభిరు చికి తార్కాణం. కూరగాయలను సొంత పెరట్లో పెంచడం ఒక కళ.
పెరటి తోటలవల్ల లాభాలు:
కూరగాయలు కొనే అవసరం తగ్గి సమయం ఆదా అవుతుంది. డబ్బు, 'తీరిక సమయం సద్వినియోగం అవుతుంది.
కుటుంబంలోని పిల్లల మధ్య సహకార భావనను స్తుంది.
శరీరానికి వ్యాయామం, మన సుకు ఉల్లాసం కలుగుతుంది.
కూరగాయలు తాజాగా, రుచిగా ఉంటాయి.
తక్కువ స్థలంలో ఖర్చు లేకుండా సంవత్సరమంతా కూరగా యలు పొందవచ్చు.
పెరటితోట పెంపకంలో మెలకువలు:
ఐదుగురు సభ్యులున్న కుటుం బానికి ఐదు సెంట్ల స్థలంలో సభ్యుల అభిరుచిని బట్టి సంవత్సరమంతా వివిధరకాల కూరగాయలు పండించ వచ్చు.
నిర్ధారించిన స్థలంను మెత్తగా పలుగుతో తవ్వి కలుపుమొక్కలు, దుబ్బులు లేకుండా చేసి చదును చేయాలి. ప్రతీ చదరపు మీటరుకు 2.5 కిలోల కంపోస్ట్, ప్రతీ 15 చ.మీ. మడికి నేలను చదును చేసి 500 గ్రా. సూపర్ ఫాస్పేట్, 250 గ్రా. అమ్మో నియం సల్ఫేట్, 125 గ్రా. పొటాష్ వేయాలి.
టొమాటో, వంగ, మిరప, క్యాబేజి, ఉల్లి, కాలీఫ్లవర్ వంటి కూర గాయలకు తోటలో ఒక మూల 2 చ.మీ. స్థలంలో 15 సెం.మీ. ఎత్తుగా ఉండే నారుమడిలో నాణ్య మైన విత్తనాలను వేసుకుని నెలరో జుల వయస్సుగల నారును మళ్లలో నాటుకోవాలి.
బహువార్షిక మొక్కలైన కూర అరటి, కరివేపాకు, నిమ్మ, మునగ వంటి మొక్కలను తోటకు ఉత్తర దిశలో నాటాలి.
పెరటితోట కంచెపైన కాకర, బీర, దోస వంటి తీగజాతి కూరగా యలు వేయాలి.
మళ్లను వేరుచేసే గట్లపై క్యారెట్, ముల్లంగి, బీట్ రూట్ వంటి పంటలు వేయాలి.
దీర్ఘకాలిక కూరగాయలైన కాలీఫ్ల వర్, క్యాబేజి, వంగ మళ్లలో వరుసల మధ్య పాలకూర, తోటకూర, చుక్క కూర వంటి స్వల్పకాలిక కూరలు వేయాలి.
కంపోస్ట్ గోతులను తోటలో రెండు మూలలా ఏర్పర్చి కలుపు, ఇతర వ్యర్థాలను వేసి ఎరువుగా వాడ వచ్చు.
మొక్కల పెరుగుదల దశలో రెండు, మూడుసార్లు 50 గ్రా. యూరియా వేసుకోవాలి.
సాధ్యమైనంతవరకు నీటి సదు పాయానికి దగ్గరగా తోటను పెంచాలి.
పెరటితోటలోని మొక్కలకు ఎండ బాగా తగిలేటట్లు చూడాలి.
కలుపును ఎప్పటికప్పుడు నివా రిస్తే చీడపీడల బెడద తగ్గుతుంది.
పంట ఎక్కువగా రావాలని విత్త నాలు లేదా నారు మొక్కలు వత్తుగా చల్లరాదు లేదా నాటరాదు.
చీడపీడలు గమనిస్తే వేపగిం జల కషాయాన్ని పిచికారి చేసు కోవాలి.