cloud ద్యానము ప్రార్థ న నమాజ్. 12Dec24 Updated
ద్యానము ప్రార్థ న నమాజ్.
యోగీశ్వరుల వారి రచనల సారాంశము.
1) త్రైత సిద్ధాంత గ్రంథములలో అక్షర సముదాయమే, ఆత్మ సమాచారమై ఉన్నది.
త్రైత సిద్ధాంత గ్రంథములలో క్షయ అక్షయ సమాచారము,
పరమాత్మ సమాచారము ఉన్నది.
2) త్రైత సిద్ధాంత సంబంధ గ్రంథములను భౌతికముగా వ్రాసినది యోగీశ్వర్లు.
త్రైత సిద్ధాంత అనుబంధ గ్రంథములలో అభౌతికముగా యోగశక్తి ఉన్నది.
3) త్రైత సిద్ధాంతము ఇందూ (హిందూ) ధర్మములలో విప్లవాత్మకమైనది.
త్రైత సిద్ధాంత గ్రంథములలోని జ్ఞానము సంచలనాత్మకమైనది, చదివి చూడండి.
4) త్రైత సిద్ధాంతము లోకములో అన్నిటికంటే గొప్పది. త్రైత సిద్ధాంత
గ్రంథములు అన్ని గ్రంథములను మించినవి, దాని రచయిత యోగులకు
ఈశ్వరుడైన యోగీశ్వరుడు.
5) త్రైత సిద్ధాంత గ్రంథములు కనిపిస్తే దుష్టశక్తులు భయముతో వణికిపోతాయి.
త్రైత సిద్ధాంత గ్రంథములను దగ్గర ఉంచితే యోగశక్తికి తాళలేక
భయపడిపోతాయి.
6) త్రైత సిద్ధాంత జ్ఞానము భగవద్గీత తరువాత చెప్పబడిన అతి గొప్ప జ్ఞానము.
త్రైత సిద్ధాంత గ్రంథములలో కృష్ణుడు ముందు చెప్పని జ్ఞానమును కూడా
యోగీశ్వర్లు చెప్పారు.
7) త్రైత సిద్ధాంత జ్ఞానము మానవ జీవితమునకు గొప్ప వెలుగు.
త్రైత సిద్ధాంత వెలుగులోనికి పోయిన వానికి అది దైవశక్తి అని తెలియును.
8) త్రైత సిద్ధాంత భగవద్గీతను వ్రాసినది యోగీశ్వర్లు. అందువలన
త్రైత సిద్ధాంతము అంటే ఏమిటో, అది ఎంత గొప్పదో తెలియబడినది.
9) త్రైత సిద్ధాంతమును గురించి తెలియగలిగితే, యోగీశ్వరుల గ్రంథములను
చదువగలిగితే, ఏ మతస్థుడైనా ఒప్పుకొని తీరును, దానిని ఆచరించును.
10) త్రైత సిద్ధాంతము ప్రత్యక్షముగా భగవంతుడు చెప్పినది. అందువలన అన్ని
మతముల సారాంశము త్రైత సిద్ధాంత గ్రంథములలో కలదు.
11) త్రైత సిద్ధాంత గ్రంథములు వ్యక్తి వ్రాసినవి కావు, వ్యక్తిలోని శక్తి వ్రాసినవి.
అందువలన అన్నీ రహస్యములే చదివి తెలుసుకోండి.
12) త్రైత సిద్ధాంతము భగవద్గీత, బైబిలు, ఖురాన్ గ్రంథములలో కలదు. అయినా
హిందువులకుగానీ, క్రైస్తవులకుగానీ, ముస్లీమ్లుగానీ ఆ విషయము
తెలియదు.
ద్యానము ప్రార్థ న నమాజ్.
వాస్తవముగా వాస్తవమునే చెప్పుతాను. అవాస్తవమును చెప్ప
వలసిన అవసరము నాకు లేదు. సత్యమును బోధించడము దేవుని సేవ
యగును. అందువలన అల్లాహ్ జ్ఞానమును గురించి ఎవరు ఏమనుకొన్నా
ఫరవాలేదు. వారికి అర్థము కాకపోయి నన్ను అపార్థము చేసుకొన్నా
ఫరవాలేదు. అల్లాహ్ దృష్టిలో నేను సత్యమును చెప్పువానిగా ఉండవలెను.
ఇతరుల దృష్ఠిలో నేను అసత్యమును చెప్పువానిగా కనిపించినా వారు నాకు
మోక్షమును (పరలోకమును) ఇవ్వరు. పరలోకమును ఇచ్చువాడు అల్లాహ్
ఒక్కడే. అందువలన అల్లాహ్ దృష్టిలో నేను సత్యమును బోధించు వానిగా
ఉండవలెనని తలచుచున్నాను. మనిషి జీవితములో అన్నిటికంటే అతి
ముఖ్యమైనది “నమాజ్”. నమాజ్ అను పదము మరియు అల్లాహ్
అను రెండు పదములు స్వచ్చమయిన తెలుగు పదములు. పూర్వము
ప్రపంచములో మొదటి భాష తెలుగు భాష. తెలుగు భాష నుండే మిగతా
భాషలు పుట్టాయని చెప్పవచ్చును. కాలక్రమములో కొన్ని తెలుగు పదములు
మిగతా అనేక భాషలలో చేరిపోవడము జరిగినది. అలా అరబ్బీ భాషలో
చేరిపోయిన ముఖ్యమైన పదములు అల్లాహ్, నమాజ్. మిగతా కొన్ని
తెలుగు పదములు అరబ్బీ భాషలోయున్నా అన్నిటికంటే ముఖ్యమైనవి
దేవుడు (అల్లాహ్), దేవుని ఆరాధన (నమాజ్).
నేడు ఇస్లామ్లో అల్లాహ్ అను పదమును, నమాజ్ అను పదమును
తెలియని ముస్లీమ్లు ఎవరూ లేరు. ఈ రెండు పదములు అందరికీ
తెలిసినా పూర్వము ఈ రెండు పదములు తెలుగు భాషలో పుట్టిన పదములని
ముస్లీమ్లకు ఎవరికీ తెలియదు. తెలుగు భాషలో ప్రతి పదము భావముతో
కూడుకొన్న పదమైయుండును. పదములోని శబ్దమును బట్టి అందులోని
సారాంశము తెలియునదిగా ఉండును. అదే విధముగా అల్లాహ్ అను
పదములో రెండు భాగములుగా భావమున్నదని తెలియుచున్నది.
అ+ల్లాహ్ =అల్లాహ్. ల్లాహ్ అనగా అంతు లేక గట్టు అని అర్ధము.
అనగా లేదు, కాదు అని అర్థము. ఈ అర్థముల ప్రకారము అంతులేని
వాడు, హద్దులేనివాడు, లేక గట్టు లేనివాడు దేవుడు అని తెలియునట్లు
చేయుచున్నది. అల్లాహ్ అంతు ఎవరికీ తెలియదు. అందువలన పూర్వము
తెలుగు భాషలో దేవున్ని అల్లాహ్ అని అన్నారు. తెలుగులో దేవుడు అనినా
వెతకబడేవాడు అని అర్థము గలదు. అల్లాహ్ అనినా, దేవుడు అనినా
ఎవరికీ తెలియనివాడే యని అర్థమగుచున్నది.
'అల్లాహ్' అను పదము ఎట్లు అర్థపూరితమైనదో అట్లే నమాజ్
అను పదము కూడా అర్థముతో కూడినదై యున్నది. నమాజ్ అను పదమును
విభజించి చూస్తే న+మ+జ్ అని మూడు భాగములుగా యున్నది. న
అనగా లేదు, కాదు అని అర్థము గలదు. మ అనగా నేను, నా యొక్క
అని అర్థము. జ్ అనగా పుట్టుక లేక జన్మయని అర్థము. దీనిని అంతటినీ
కలిపి చూస్తే 'నాకు జన్మ వద్దు' అని అర్థము. 'నేను పుట్టడము లేదు' అని
చెప్పవచ్చును. నమాజ్ అర్థము ద్వారా మనిషి దేవున్ని జన్మను కోరక
మోక్షమును (పరలోకమును) కోరుచున్నాడని చెప్పవచ్చును. ఈ విధముగా
తెలుగు భాషలో నమాజ్ అను పదమునకు జన్మరాహిత్యమును తెలుపు
అర్థము కలదని చెప్పవచ్చును. అయితే ఇంతవరకు అందరికీ నమాజ్
అంటే ప్రార్థన అని మాత్రమే తెలుసు. అట్లే అయినా ప్రార్థన వలన జన్మ
రాహిత్యము ఏర్పడి పరలోకము లభించునని చెప్పవచ్చును. ఈ విధముగా
ఇస్లామ్ సమాజములో నేడు అల్లాహ్, నమాజ్ ప్రత్యేకమైన స్థానములు
సంపాదించుకొన్నవని చెప్పినా, అవి ఇప్పుడే కాదు పూర్వమే ఈ రెండు
పదములు తెలుగు భాషలో అందరికీ సుపరిచయమైనవే. అయితే కాలము
మారేకొలదీ అవి తెలుగు పదములనీ, నేడు అరబ్బీ భాష పదములుగా
యున్నవనీ, తెలియకుండా పోయినది.
నేడు భూమిమీద ప్రార్థన చేయువారిలో అందరికంటే ముందున్న
వారు ముస్లీమ్హయని చెప్పక తప్పదు. అందువలన నమాజ్ అంటే
ప్రార్థనయని ముస్లీమ్లందరికీ తెలుసు. ప్రార్ధన చేయడము ముస్లీమ్లలో
ముఖ్యమైన దేవుని పనిగా లెక్కించి ఆచరించుచున్నారు. భూమిమీద అత్యంత
ఎక్కువగా ప్రార్థన (నమాజ్) చేయువారు ముస్లీమ్. ముస్లీమ్లు ప్రార్థన
చేయడము మిగతా మతముల వారికి కూడా తెలుసు. ఒక దినము
బహుశా శుక్రవారము అనుకొంటాను మధ్యాహ్నము ఒంటి గంట
ప్రాంతములో నమాజ్కు పోయి, నమాజ్ చేసి వచ్చిన వ్యక్తిని, దాదాపు 50
సంవత్సరముల వయస్సు గల వ్యక్తిని, టీచర్ వృత్తి చేయు వ్యక్తిని “నమాజ్
వలన మీకు ఏమి వస్తుంది?" అని అడిగాను. అందులకు ఆయన “మాకు
ఫలానాది వస్తుందియని ఆశించి మేము నమాజ్ చేయడము లేదు” అని
అన్నారు. అప్పుడు నేను నమాజ్లో ఏమని ప్రార్థన చేస్తారు అని అడిగాను.
అందులకు ఆయన “మేము దేవున్ని జ్ఞాపకము చేసుకొని ఆయనను
పొగడడము తప్ప ఏమీ చేయము” అని అన్నాడు.
మిగతా మతములలో ఎవరు ఏ దేవున్ని ప్రార్థించినా వారు ఏదో
ఒక కోరికతోనే చేస్తారు. ఏ కోర్కె లేకుండా దేవున్ని (అల్లాహ్ ను) పొగడుచూ
ఆరాధన చేయడము ఏ స్వార్ధము లేకుండా చేయు ఆరాధన యగును.
నిస్వార్థముగా ఆరాధన చేయువారు బహుశ ఒక్క ముస్లీమ్హయని
చెప్పవచ్చును. దేవున్ని ఎక్కువగా ప్రార్థన చేయువారు మరియు దేవున్ని
నిస్వార్థముగా ఆరాధించువారు ముస్లీమ్లు తప్ప ఎవరూ లేరనియే
చెప్పవచ్చును. ఎవరి ప్రార్థన అయినా ఆశలతో, కోర్కెలతో కూడుకొని
యుండును. ముస్లీమ్ల ప్రార్థన పెద్దలు నిర్ణయించిన దానిప్రకారము
జరుగుచుండును. నియమిత వేళలలో సామూహిక ప్రార్థన చేయడము
ఒక్క ముస్లీమ్ మతములోనే కలదు. క్రైస్తవులు కూడా ఆదివారము సాముహిక
ప్రార్థనను చర్చీలలో చేయుచుండినా సమయపాలన లేదని, ఒకే
సమయములో కాకుండా కొంత ముందు వెనుక ప్రార్థన జరుగుచుండును.
మూడు మతములలో ప్రార్థన విషయమునందు హిందువులకంటే క్రైస్థవులు,
క్రైస్తవులకంటే ముస్లీమ్లో ఉత్తమరీతిలో ఉన్నారని చెప్పవచ్చును. ప్రార్థన
విషయమై అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్ సూరా 4, ఆయత్ 103లో
ఈ విధముగా చెప్పియున్నారు చూడండి.
(4-103) “మరిమీరు నమాజును నెరవేర్చిన తర్వాత నిలుచున్నా,
కూర్చుండినా, పరుండినా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి. అయితే
పరిస్థితులు కుదుటపడిన తర్వాత మాత్రం నమాజును నెలకొల్పండి.
నిస్సందేహముగా నమాజును నిర్ధారిత వేళలలో చేయడము
విశ్వాసులకు విధిగా చేయబడినది. ('అంతిమ దైవగ్రంథము
ఖుర్ఆన్'లో వ్రాయబడిన వాక్యము).
(4–103) “మీరు నమాజును నెరవేర్చిన తర్వాత నిలుచున్నా,
కూర్చున్నా, పరుండినా అల్లాహ్ను స్మరిస్తూనే ఉండాలి. అయితే
పరిస్థితులపై మీరు సంతృప్తి చెందిన మీదట నమాజును
నెలకొల్పండి. నిశ్చయముగా సమయపాలన చేస్తూ నమాజును
నెరవేర్చము విశ్వాసులకు విధిగా చేయబడినది. (ఖుర్ఆన్ మజీద్లో
వ్రాయబడిన వాక్యము).
(4-103) “ఇక నమాజ్ను పూర్తి చేసిన తర్వాత నిలుచున్నా,
కూర్చున్నా, పరుండినా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి. కానీ
శాంతిభద్రతలు నెలకొన్న తర్వాత నమాజ్ ను స్థాపించండి.
నిశ్చయముగా నమాజ్ విశ్వాసులకు నియమిత సమయాలలో
పాటించడానికి విధిగా నియమించబడినది (దివ్య ఖుర్ఆన్ సందేశము
గ్రంథములో వ్రాయబడిన వాక్యము)
ఒకే వాక్యము మూడు గ్రంథములలో తెలుగు అనువాదముగా
వ్రాసినా కొన్ని పదములు వేరయినా, అర్థము అంతా ఒకే విధముగా
యున్నది. (4-103) వ వాక్యము మూడు భాగములుగా యున్నది. ఒక
భాగము నిర్ణయించబడిన కాలము ప్రకారము నమాజ్ చేయడము ఒక
భాగము కాగా, నమాజ్ అయిపోయిన తర్వాత ఎక్కడున్నా, ఎలా ఉన్నా
దేవున్ని (అల్లాహ్) ను స్మరించుకోవడము రెండవ భాగము. నీకు
అనుకూలమైనప్పుడు నమాజ్ను స్థాపించడము మూడవ భాగము.
మొదటిదయిన నియమిత కాలము ప్రకారము నమాజ్ చేయడము
ముస్లీమ్లందరికీ తెలుసు. నమాజ్ అయిపోయిన తర్వాత నిలుచున్నా,
కూర్చున్నా, పరుండినా అల్లాహ్న స్మరించుకొమ్మని చెప్పిన రెండవ విధానము
మంచిదే అయినా ఎందరు ఆచరిస్తున్నారో చెప్పలేము. ఇక మూడవ
విధానమయిన నమాజు స్థాపించడము ఎవరూ చేయలేదని చెప్పవచ్చును.
భూమిమీద ఎందరు ముస్లీమ్లుయున్నా వారందరికీ నియమిత కాలములో
నమాజ్ చేయడమే తెలుసు కానీ, నమాజ్ను స్థాపించడము అంటే ఏమిటో,
స్థాపింపబడే నమాజ్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఈ వాక్యములో
చెప్పిన మూడు విధానములలో మొదటి విధానము తప్ప రెండవ విధానము
కూడా కొందరికి తప్ప చాలామందికి తెలిసియుండదని చెప్పవచ్చును.
మూడవ విధానమైన నమాజు స్థాపించడము ఒక్కరికి కూడా తెలియదనియే
చెప్పవచ్చును.
ఇస్లామ్ సమాజము అంతయూ మత సాంప్రదాయముల మీద,
మత నియమ నిబద్ధతల (షరియత్) మీద ఆధారపడియుండును. మత
పెద్దలు ఎలా చెప్పితే అలా ఆచరించడము తప్ప, పెద్దల మాటను జవదాటని
పద్ధతిలో ఇస్లామ్ సమాజమంతా యున్నదని చెప్పవచ్చును. అందువలన
సమయ పాలనలో చేయు నమాజ్ తప్ప మిగతా దేనివైపు వారు చూడరు,
దేనిని గురించి ఆలోచించరు. పెద్దలు చెప్పిన నమాజ్ ఒక్కటే, అదే నియమిత
సమయములలో సామూహికముగా నమాజ్ చేయడము. ఇది వదలి వేరే
నమాజ్ అనుమాట కూడా వారు వినరు. దానిని గురించి కొద్దిగా అయినా
ఆలోచించరు. అటువంటప్పుడు మనిషి సామూహికముగా కాకుండా
ఒక్కడుగా ప్రత్యేకమైన నమాజు స్థాపించడము గ్రంథములో యున్నాగానీ
దానిని ఖాతరు చేయరు. అటువంటప్పుడు ఒక వ్యక్తి స్థాపించు నమాజ్
అంటే ఏమిటో ఎవరికీ, ఏ ముస్లీమ్క తెలియదు. మొదట ముస్లీమ్
పెద్దలు ఏమి చెప్పారో దానిని వినడము, దానిని ఆచరించడము తప్ప
స్వయముగా ఖుర్ఆన్ గ్రంథములో చెప్పినమాటను కూడా గమనించరు.
'దేవుడు పుట్టడు' అని పెద్దలు చెప్పారు. అదే వారిలో నిలిచి పోయినది.
ఖుర్ఆన్ గ్రంథములో 'దేవుడు అవతరిస్తాడని' 15వ సూరాలోనూ, 89వ
సూరాలోను చెప్పియున్నా దానిని ఏమాత్రము నమ్మరు. అలాగే మనిషి
తిరిగి పుట్టుతాడు, పునర్జన్మ ఉంది అని గ్రంథములోయున్నా ముందు
తమ పెద్దలు మనిషికి పునర్జన్మలు లేవు అని చెప్పిన మాటనే గట్టిగా
నమ్మియున్నారు. ఇట్లు నమాజ్ విషయములో అందరికీ తెలిసినది, అందరూ
చేయునదే తప్ప ఇతర నమాజ్ అంటే ఏమిటో తెలియదు. నమాజ్ అనే
పదములో ఉండే ప్రతి అక్షరమునకు అర్థమున్నదని కూడా తెలియదు.
నమాజ్ అంటే జన్మలు వద్దు, మోక్షము కావాలని చెప్పడమని తెలియదు.
నమాజ్ అంటే ప్రార్థన అని మాత్రమే తెలుసు.
ఈ ఆయత్లో ముఖ్యమైన ఘట్టము ఏమనగా! పరిస్థితులపై
మీరు సంతృప్తి చెందిన మీదట అనీ, దానినే శాంతిభద్రతలు నెలకొన్న
తర్వాత అనీ, మరొక గ్రంథములో పరిస్థితులు కుదుట పడిన తర్వాతయనీ
వ్రాసియున్నారు. ఇట్లు ఒకే విషయమునే ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా
చెప్పియున్నారు. ఇది ఎలా ఉందంటే బయట ప్రపంచములో గొడవలు
జరిగినప్పుడు పోలీసువారు కర్ఫ్యూ విధించిన తర్వాత పరిస్థితులు చల్లబడి,
శాంతిభద్రతలు కుదుట పడినప్పుడు కర్ఫ్యూ తొలగించే కార్యమును
ఆలోచించి ఎట్లు చేయవలెనో అట్లే ఇక్కడ ఒక మనిషి 'నమాజ్ను
నెలకొల్పడము' అను కార్యము చేయవలసియున్నది. నమాజ్ను మనిషి
ప్రత్యేకముగా నెలకొల్పడమేమిటని ఎవరికయినా ప్రశ్న రాగలదు. ఇదే
ఆయత్లోనే నమాజ్న చేసిన తర్వాత నిలుచున్నా, కూర్చుండినా, పరుండినా
అల్లాహ్ తలచుకొమ్మని చెప్పారు. మొదట నమాజ్ చేసిన తర్వాత అల్లాహ్
స్మరించమని చెప్పారు కదా! అప్పుడు అందరితో కలిసి నిర్ణీత సమయములో
నమాజ్ చేశారు కదా! మొదట చేసినది నమాజ్ అయినప్పుడు రెండవమారు
పరిస్థితులు అనుకూలించినప్పుడు నమాజ్న స్థాపించడము లేక
నెలకొల్పడము అంటే ఏమిటి? నిజము చెప్పితే ఆచరించడము వేరు,
స్థాపించడము వేరు. ఉన్న దానిని ఆచరించవచ్చును. లేనిదానిని
స్థాపించవచ్చును. అలాగే ఉన్న దానిని నెరవేర్చవచ్చును, లేనిదానిని
నెలకొల్పవచ్చును. నిర్ణీత సమయములో అందరూ కలిసి సామూహికముగా
నమాజును చేయవచ్చును, నెరవేర్చ వచ్చును. అంతవరకు లేని క్రొత్తదానిని
అయితే నెలకొల్పడము, స్థాపించడము చేయవచ్చును. (4-103)
వాక్యములో చెప్పిన సమాచారమును బట్టి చూస్తే అంతవరకు ఎవరూ
చేయని దానిని, నిర్ణీత సమయము లేనిదానిని ప్రత్యేకముగా చేయమని
చెప్పడమే కదా! అలా క్రొత్త నమాజ్ను నెలకొల్పడము అంటే ఏమిటి?
అన్నీ అనుకూలించినప్పుడు అంటే ఇతరులతో ఏ పేచీలు రానప్పుడు,
సానుకూలమైన సమయములో నెలకొల్పబడు నమాజ్ ఎలా ఉంటుంది?
అన్నది పెద్ద ప్రశ్నగా మిలిగిపోవుచున్నది.
ఈ వాక్యము సూక్ష్మ (ముతషాబిహాత్) వాక్యము కూడా కాదు.
స్థూల వాక్యముగానే చెప్పబడియున్నది. అటువంటప్పుడు జవాబు
చెప్పడములో కూడా సులభముగా యుండును. స్థూల వాక్యములోని అర్థము
కంటికి కనిపించునట్లుగానే యుండును. నమాజ్ అనగా ప్రార్థనయని
అందరికీ తెలుసు. ఆ ప్రార్థనను కొందరు ముస్లీమ్ పెద్దలు, జ్ఞాన పరిశోధన
చేసిన వారు మూడు భాగములుగా విభజించి చెప్పారు. "అంతిమ దైవ
గ్రంథము ఖుర్ఆన్”లో “అల్ ఫాతిహా” మొదటి సూరా నమాజ్లో
పఠించడము ముస్లీమ్లకు అందరికీ తెలుసు. అక్కడ ఆ సూరాలో యున్న
ఏడు ఆయత్ల వివరము చెప్పడములో వారి అభిప్రాయములను ఇలా
చెప్పారు. ఇది ఖుర్ఆన్ గ్రంథము నుండి సేకరించి చెప్పుచున్నదే. నమాజ్
చేయడము అంటే ఫాతిహా సూరాలోని ఏడు ఆయత్లను పఠించడమేయని
చెప్పవచ్చును. అలా పఠించు నమాజ్ నాలుగు రకములు కలదు.
1) నెమ్మదిగా చేసే నమాజ్ సిర్రీ నమాజు 2) బిగ్గరగా చేసేది జహీ
నమాజు. 3) విధిగా చేసేది ఫర్జ్ నమాజు. 4) స్వచ్ఛందముగా చేసేది
నఫిల్ నమాజు.
నమాజ్ను తౌహీద్ (ఏకేశ్వరోపాసన) యని అనవచ్చును.
ఏకేశ్వరోపాసన మూడు రకములు గలదని చెప్పవచ్చును. ఆ మూడు
రకములనే ఈ విధముగా ముస్లీమ్ పెద్దలు చెప్పుచున్నారు. 1) తౌహిదే
రుబూబియత్ 2) తౌహీదే ఉలూహియత్ 3) తౌహిదే అస్మా వ సిఫాత్ అని
అంటున్నారు. అందులో 1) తౌహిదె రుబూబియాత్ అనగా! ఈ మొత్తము
విశ్వానికి సృష్ఠికర్త, యజమాని, పోషకుడు, కనిపెట్టుకొని ఉన్నవాడు, వ్యూహ
రచయిత అల్లాహ్ మాత్రమేయని అర్థము. 2) తౌహీదే ఉలూహియత్ అనగా!
అన్ని రకాల ఆరాధనలకు, దాస్యాలకు, వేడుకోళ్లకు అర్హుడు అల్లాహ్
మాత్రమే. 3) తౌహిదే అస్మావ సిఫాత్ అనగా! ఖుర్ఆన్, హాదీసులలో
అల్లాహ్ గురించి చెప్పబడిన గుణ గణాలను లక్ష్యణాలను ఏమాత్రము
వక్రీకరించకుండా వాటిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా
యథాతథముగా అల్లాహు అంగీకరించడము అని చెప్పవచ్చును.
ఈ మూడు దేవుని విధానాలలో దేవుని ప్రార్థనను గురించి చెప్పినది
తౌహీదె ఉలూహియత్ అనునది. అందులో ఆరాధనను గురించి చెప్పారు.
ఆరాధనను గురించి "అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్" అను తెలుగు
అనువాదములో చెప్పినది ఇలా కలదు. ఎవరైనా ఒక ప్రత్యేక వ్యక్తి
మెప్పుకోసము లేక అతని ప్రసన్నత కొరకు ప్రాకులాడుచూ అతని ప్రసన్నత
లేకుండా పోతుందేమోనను భయముతో చేసే ప్రతి పనీ ఆరాధన గానే
భావించబడుతుంది. అందుచేత నమాజ్, రోజా, హజ్, జకాత్ వంటి
క్రియలు మాత్రమే ఆరాధనలు కావు. ఒకానొక ప్రత్యేక అస్తిత్వం ఎదుట
అభ్యర్థించుకోవడము అతని పేర మ్రొక్కుకోవడము, మొక్కుబడులు తీర్చు
కోవడము, అతని ఎదుట బుద్ధిగా చేతులు కట్టుకొని నిలబడడము, అతని
చుట్టూ ప్రదక్షణ చేయడము, అతని సమక్షములో భయభక్తులు
ప్రదర్శించడము, అతను తమకేదయినా అనుగ్రహిస్తాడేమోనని ఆశగా
నిరీక్షించడము ఇవన్నీ ఆరాధన (ఇబాదత్) గానే లెక్కించబడుతాయి.
ఇదంతా చూస్తే ఇన్ని విధముల చేయు క్రియలు అన్నీ ఆరాధనలే,
ప్రార్థనలే అయినప్పుడు నేడు ముస్లీమ్లు చేయు నమాజ్కానీ, హిందువులు
చేయు ప్రదక్షణలు, పూజలుగానీ, క్రైస్తవులు చేయు ప్రార్థనలుగానీ
అన్నీ తౌహీదె ఉలూహియత్కు సంబంధించినవనియే చెప్పవచ్చును.
అటువంటప్పుడు హిందువుల ఆరాధనలకంటే ముస్లీమ్ల నమాజ్ గొప్పదనీ,
ముస్లీమ్ల నమాజ్ కంటే క్రైస్తవుల ప్రార్థన గొప్పదనీ చెప్పుటకు వీలులేదు.
అన్నీ ఒక కోవకు చెందినవేయనీ, అందరి ఉద్దేశ్యము ఒక్కటేయనీ
తెలియుచున్నది. 4-103వ ఆయత్ను అనుసరించి చూస్తే, అక్కడ అల్లాహ్
(దేవుడు) చెప్పిన విధానమును గమనించితే మీరు చేయు ఆశపూరిత,
స్వార్థపూరిత నమాజ్లకంటే, ఆరాధనలకంటే, ప్రార్థనలకంటే ప్రత్యేకమైన
నమాజ్ ఒకటి కలదని చెప్పడమైనది. అయితే మీరు ఇప్పుడు
అలవాటుపడిన నమాజ్లను ఆరాధన క్రమములను, ప్రార్థనలను
వదలకుండా చేసుకొమ్మని చెప్పడమే కాక, మీరు ఏది చేసినా దానికంటే
గొప్పది దేవుని స్మరణ. అందువలన మీరు నమాజ్న సమయాను
కూలముగా, సామూహికముగా మీరు అనుకొన్నట్లు చేసిన తర్వాత దేవున్ని
(అల్లాహ్ ను) స్మరించుచూ ఉండండి అని చెప్పాడు. అల్లాహు స్మరించుట
నిలుచుండినా, కూర్చుండినా, పరుండినా చేయవలసియున్నది. దీనినిబట్టి
చూస్తే మనిషి ఎల్లప్పుడూ మూడు రకముల ఉంటూ కాలము
గడుపుచుండును. నిలబడియైనా ఉండును. లేక కూర్చుని అయినా
ఉండును. ఈ రెండు లేకపోతే పరుండి అయినా ఉండును. ఈ మూడు
స్థితులలో మనిషి ఏదో ఒక స్థితిలో ఎల్లప్పుడూ ఉండును. దీనిప్రకారము
మనిషి ఎట్లుండినా, ఎక్కడుండినా, ఏమి చేయుచుండినా, అల్లాహ్ (దేవున్నే)
స్మరించుకొంటూ ఉండవలెనని చెప్పారు. అయితే అది సాధ్యముకాని
పని. నిలబడినప్పుడుగానీ, కూర్చున్నప్పుడుగానీ మనిషి ప్రపంచ పనులలో
లగ్నమై ఉండును. పడుకొన్నప్పుడు పనులు లేకపోయినా నిద్రలోనికి
పోవును. అందువలన నిలుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకొన్నప్పుడు
మూడు కాలములలో మనిషి దేవున్ని జ్ఞాపకము చేసుకోలేడు.
అలా శరీరము మూడు స్థితులలో యున్నప్పుడు కూడా మీ ఆరాధన
అయిపోయిన తర్వాత దేవున్ని స్మరించమని చెప్పాడు అంటే అంతవరకు
మీరు చేసిన ఆరాధన (నమాజు) దేవునికి సంబంధము లేనిదనేగా అర్థము.
ఆ మాటను దేవుడే స్వయముగా చెప్పినట్లు కలదు.అంతకుముందు
చేసిన నమాజు సక్రమమయినదే అయితే, అది నిజమైన దైవ ఆరాధనే
అయితే, మీరు నమాజు చేసిన తర్వాత నిలబడినా, కూర్చున్నా, పరుండినా
దేవున్ని స్మరించుకోమని అల్లాహ్ చెప్పేవాడు కాదు. అలా చెప్పాడు అంటే
మనుషులు చేసే నమాజు నాకు ఇష్టము లేనిదనేగా అర్థము. అందువలన
ఎవరితోనూ, ఏ ఆటంకము లేనప్పుడు, నీకు పరిస్థితులు అనుకూలించి
నప్పుడు నీవు చేసే నమాజు అందరికీ ఇష్టము లేనిదైనా క్రొత్తది అగుట
వలన వారి వలన వ్యతిరేఖత లేనప్పుడు, శాంతిభదత్రలు ఉన్నప్పుడు,
ఇతరుల విరోధము లేనప్పుడు, అన్నీ సక్రమముగా అనుకూలముగా
యున్నప్పుడు నీవు నమాజును నెలకొల్పుము లేక స్థాపించుము అని
చెప్పాడు. అలా చెప్పడము వలన దేవునికి ఇష్టమయిన నమాజు వేరే
ఏదో ఉన్నదని తెలియుచున్నది. 4-103వ ఆయత్లో నీవు ప్రత్యేకముగా
నమాజును నెలకొల్పుమని చెప్పినా అది ఫలానా విధముగా ఉండునని
చెప్పలేదు. ఎందుకనగా! అది మనిషి దేవుని జ్ఞానమునుబట్టి స్వయముగా
అర్థము చేసుకోవలసియున్నది. అందువలన దేవుడు తన నమాజును
గురించి చెప్పలేదు. అది మనిషి వ్యక్తిగత జ్ఞానమునుబట్టి యుండును.
అంతేకాక ముందు దైవగ్రంథములు అయిన తౌరాతు, ఇంజీలు
గ్రంథములలో అసలయిన ఆరాధన (నమాజును) గురించి చెప్పియున్నారు.
(5-68)వ వాక్యము ప్రకారము మూడు దైవ గ్రంథములను జీవితములో
నెలకొల్పిన వానికి అసలయిన నమాజును గురించి తెలియును.
అందువలన అల్లాహ్ ప్రత్యేకించి ఆయన స్వయముగా ఏమీ చెప్పలేదు.
(5-68) “ఓ ప్రవక్తా వారికి చెప్పు, గ్రంథవహులారా! మీరు
తౌరాతును, ఇంజీలును, మీ ప్రభువు తరపున మీవద్దకు పంపబడిన
దానిని (ఖుర్ఆన్లెను) మీ జీవితాలలో నెలకొల్పనంతవరకు మీరు
ఏ ధర్మముపైనా లేనట్లే.”
ఇక్కడ చెప్పినట్లు మూడు దైవ గ్రంథములు చదవనివారు ఏ
ధర్మములో లేనట్లేయని చెప్పగా, ఏ మతస్థుడయినా మూడు గ్రంథములు
చదివియుంటే అసలయిన నమాజును గురించి తెలియును. అలా తెలిసిన
వాడు మిగతావారు దేవున్ని ఒకటి కొరితే, తాను మరొకటి కోరును. వారు
కోరినది వీడు కోరడు, వీడు కోరినది వారు కోరరు. అదే విషయమును
చెప్పుచూ సూరా నాలుగు ఆయత్ 104 లో ఇలా చెప్పుచున్నారు చూడండి.
(4–104) “వారిని వెంబడించడములో ఏమాత్రము బలహీనతను
ప్రదర్శించకండి. ఒకవేళ మీరు అవిశ్రాంతముగా ఉన్నారనుకొంటే
మీ మాదిరిగానే వారు కూడా అవిశ్రాంతముగా ఉన్నారు. పైగా
అల్లాహ్నుంచి వారు ఆశించని వాటిని మీరు ఆశిస్తున్నారు.
అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడు.”
ఇక్కడ 4-103 ప్రక్క ఆయత్లోనే 4-104లో 'వారు ఆశించని
వాటిని మీరు ఆశిస్తున్నారు' అని ఉన్నది. ముస్లీమ్లందరూ నమాజ్ చేసినట్లే
నీవు కూడా నమాజ్ చేయి. అప్పుడు వారికి నీకు ఏమీ తేడా లేదు.
బయట పనిగానీ, నమాజ్గనీ చేయడములో వారి మాదిరి నీవు, నీ మాదిరి
వారు ఉందురు. అదే విషయమునే వాక్యములో 'వారిని వెంబడించడములో
ఏమాత్రము బలహీనతను ప్రదర్శించకండి' అని అన్నారు. అంతేకాక
మీరు అవిశ్రాంతముగా ఉంటే, వారు కూడా అవిశ్రాంతముగా యుందురని
చెప్పారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమనగా! 'వారు ఆశించని దానిని
మీరు ఆశించుచున్నారు' అని కలదు. ఎవరు ఏమి కోరుచున్నది అల్లాహ్కు
బాగా తెలుసు. ఆయన వివేచన కలవాడు. అందువలన ఎవరు అడిగిన
దానిని వారికి ఇస్తాడు అని తెలియుచున్నది.
ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. 4-103లో అందరితో
పాటు నమాజు నెరవేర్చిన తర్వాత మీకు అనుకూలమైనప్పుడు నమాజ్న
స్థాపించండి అని వాక్యములో చెప్పడమైనది. తర్వాత 4-104లో అందరితో
పాటు మీరు అన్ని కార్యములు చేయుచూ వారికంటే వెనుక పడకండి
అని వున్నది. దానిప్రకారము చూస్తే నీవు, వారు అందరూ చేసినట్లే
నమాజ్ చేయి అని చెప్పినట్లు అర్థమగుచున్నది. అంతేకాక వారున్నట్లే
నీవుండు అని చెప్పుచూ నీవు, వారందరూ కోరని పరలోకమును నీవు
కోరమని చెప్పడమైనది. వారందరూ పరలోకమును (మోక్షమును) ఎందుకు
కోరలేదు అనగా! అందరికీ ఇష్టమైనది సుఖములను అందించు స్వర్గమే
అయినందున ఎవరు కోరినా అందరూ స్వర్గమునే కోరుచున్నారు.
అందువలన వారు కోరని దానిని నీవు కోరుచున్నావని చెప్పారు. దేవుడు
వివేకవంతుడయిన దానివలన ఎవరు కోరిన దానిని వారికిస్తున్నాడు అని
వాక్యములో అర్థమగునట్లు చెప్పాడు.
నీకు 4–103లో చెప్పినది అర్థమయి నిత్యము అందరితో పాటు
నమాజు నెరవేర్చుచూ ప్రత్యేకమైన నమాజును నెలకొల్పి, ఇదే నిజమైన
నమాజని నిర్ణయము చేసి ఇతరులకు చెప్పినా, నీ మాటను వారు
ఖండించకుండా, నీ మాట సత్యమని నిరూపించుటకు ఈ గ్రంథాన్ని పంపు
చున్నాను. నీవు సత్యమును వాదించు, అసత్యమును వాదించు వారి
ప్రక్కన ఉండవద్దని అల్లాహ్ తన వాక్యములో తెలియజేశాడు చూడండి.
(4-105) “ఓ ప్రవక్తా! అల్లాహ్ నీకు చూపిన విధముగా నీవు
ప్రజల మధ్య తీర్పు చెయ్యటానికి గాను మేము నీవైపుకు ఈ
గ్రంథాన్ని సత్యముతో పాటు పంపాము. కనుక ద్రోహానికి పాల్పడే
వారి వైపున వాదిగా నిలబడకు.”
ఈ వాక్యమును చూస్తే నమాజును ప్రతి రోజు ఆచరించే వారికంటే
ఏదో ఒక రోజు క్రొత్తగా అసలైన నమాజును నెలకొల్పి ఇదే నిజమైన
నమాజు అని చెప్పితే దానికి ఆధారముగా సత్యసమేతముగా గ్రంథాన్ని
(గ్రంథవాక్యాన్ని) పంపాము అని చెప్పారు. అయితే నీవు అసలయిన
నమాజు ప్రక్కనే వాదించు, అసలయిన నమాజు లేదు అని దేవుని మాటకు
వ్యతిరేఖముగా చెప్పు ద్రోహానికి పాల్పడే వారి ప్రక్కన వాదించకు అని
చెప్పడమైనది. నాల్గవ సూరాలోని 103, 104, 105 వాక్యములను
చూచిన తర్వాత నేను అసలయిన నమాజు వైపు వాదించాలని అనుకొన్నాను.
వాక్యములో దేవుడే స్వయముగా ప్రతి దినము మీరు నెరవేర్చే నమాజుకంటే
ఎప్పుడో ఒకప్పుడు నీకు అనుకూలము కుదిరినప్పుడు నమాజును స్థాపించు
అని చెప్పిన మాటప్రకారము నిత్యము నమాజును చేసేవారి వైపుకంటే
నమాజును స్థాపించేవారివైపు వాదిస్తాను. మనిషికి అవసరమైనది
ప్రత్యేకముగా స్థాపించబడే నమాజు అని చెప్పు దేవుని మాటనే సత్యమని
నేనూ నావంతుగా చెప్పుదును.
ప్రశ్న :- ప్రపంచములో ఉండే ముస్లీమ్లందరూ నిత్యము అందరూ చేయు
నమాజునే చేయుచున్నారు. అల్లాహ్ నమాజ్న చేయమని చెప్పాడు. ఐదు
పూటల నమాజ్ చేయమని చెప్పాడు. అందువలన నిర్ణీత సమయములలో
ప్రతి దినము ఐదుపూటల నమాజు చేయుచున్నారు. ఇది నమాజ్ కాదా?
జవాబు :- ప్రతి దినము అందరూ చేయు నమాజు అందరితోపాటు
తప్పక చేయమనే వాక్యములో కూడా చెప్పారు. నిత్యము చేయునది నమాజు
కాదని మేము కూడా చెప్పలేదు. ఇది చేస్తూ ఉండేది. నిత్యము నెరవేర్చే
దానిని నెరవేర్చుచూ ఉండమని అల్లాహ్ చెప్పాడు. అలా నెరవేర్చుచూ
ప్రత్యేకమైన నమాజును ఎల్లవేళల చేయు నమాజును నెలకొల్పమన్నాడు.
నిత్యము నెరవేర్చు నమాజుకంటే ఏదో ఒక దినము నెలకొల్పు నమాజు
శ్రేష్ఠమయినదని చెప్పినట్లు కలదు. అందువలన చేసే ప్రార్థన (నమాజు)
ను చేస్తూ క్రొత్త నమాజును నెలకొల్పమన్నాడు.
ప్రశ్న :- ప్రతి దినము చేసే నమాజుకు క్రొత్తగా నెలకొల్పే నమాజుకు ఏమి
తేడా గలదు. నిత్యము చేసే నమాజున్నప్పుడు, క్రొత్త దాని అవసరము
ఏమి ఉంటుంది. దీనిలో లేనిది దానిలో ఏముంది?
జవాబు :- 4-103వ వాక్యములో నమాజును చేసిన తర్వాత నిలబడినా,
కూర్చుండినా, పరుండినా అల్లాహ్ స్మరిస్తూ ఉండమని చెప్పారు కదా!
నమాజు అంటే ఎల్లప్పుడూ అన్ని కాలములలో దేవున్ని స్మరించడమని
చెప్పాడు. అది సాధ్యమేనా? అని చూస్తే ప్రత్యేకమైన నమాజువల్ల
సాధ్యమవుతుంది గానీ సాధారణముగా స్మరించుకొనుటకు సాధ్యము కాదు.
సాధారణముగా నిలబడి, కూర్చొని, పడుకొని ఎవరూ స్మరించుకోలేరు.
అలా సాధ్యము కాదు కనుక, అది సాధ్యమగునది క్రొత్తగా స్థాపించబడే
నమాజునందే కనుక ఇతరుల వలన ఏ ఇబ్బంది లేనప్పుడు, నీకు బాగా
అర్థమయినప్పుడు, క్రొత్తగాయుండు నమాజును, క్రొత్తగా చెప్పబడు
నమాజును స్థాపించండి అని చెప్పాడు. క్రొత్తగా స్థాపించబడు నమాజు
ప్రతి రోజు ముస్లీమ్లందరూ చేయు నమాజ్కంటే చాలా ప్రత్యేకమైనది.
అందువలన ఇది అది కాదు, అది ఇది కాదు. అది అదే, ఇది ఇదేయని
చెప్పవచ్చును.
ప్రశ్న :- ఖుర్ఆన్ గ్రంథములో (4-103) లో నెరవేర్చబడు నమాజ్కంటే
నెలకొల్పబడు నమాజ్ గొప్పదన్నట్లు చెప్పియున్నారు. (4-104) నిత్యము
నమాజు చేయువారు కోరే దానికంటే క్రొత్తగా నమాజును స్థాపించేవారు
కోరేది వేరుగాయుంటుంది అని క్రొత్త నమాజు ప్రత్యేకతను చాటి చెప్పారు.
తర్వాత (4–105) లో మీరు నెలకొల్పినది గొప్పదని తేల్చి తీర్పుతీర్చి
చెప్పినా, వినని వారికి నేను గ్రంథమును 'సత్యసమేతముగా సాక్ష్యముగా
యుండునట్లు పంపుచున్నాను' అని చెప్పాడు. ఈ మూడు ఆయత్లు
చూచుట వలన క్రొత్త నమాజు ఉన్నదని కొందరికి, క్రొత్త నమాజు అంటే
ఏమిటో కొందరికి అర్థమయి ఉండవచ్చును. అయినా మాకు అర్థమగునట్లు
నెలకొల్పబడు నమాజు అంటే ఇదియనీ, దాని వివరమును సంపూర్ణముగా
తెలుపలేదు. ఈ విధముగా మూడు ఆయత్లు చెప్పి క్రొత్త నమాజును
సూచించడమే తప్ప దానిని పూర్తి వివరముగా క్రొత్త నమాజు ఈ విధముగా
ఉండునని చెప్పలేదు. అలాంటప్పుడు క్రొత్త నమాజును ఎలా నమ్మాలి?
జవాబు :- క్రొత్త నమాజు విషయము ప్రక్కన పెట్టి పాత నమాజు
విషయమునకు (ప్రతి దినము చేసే నమాజు విషయమునకు) వచ్చి చూస్తే
ఖుర్ఆన్ గ్రంథములో ఎక్కడా నమాజ్ నిర్వహించే క్రమము అని అల్లాహ్
చెప్పియుండలేదు. అయితే ముస్లీమ్ పెద్దలుగానీ లేక ముహమ్మద్ ప్రవక్తగారు
గానీ నమాజు చేయు పద్ధతిని తెలిసి ఆచరించి చూపుట వలన వారి
తర్వాత వీరు అలాగే చేయను మొదలు పెట్టారు. అల్లాహ్ ఆకాశవాణి
ద్వారా (వహీ ద్వారా) దైవజ్ఞానమును అందించాడు. నమాజులో పఠించు
ఏడు ఆయత్లను కూడా అల్లాహ్ చెప్పలేదు. మనుషులు అల్లాహ్ గొప్ప
తనాన్ని నాలుగు వాక్యములుగా, మనుషుల అవసరమును కోరుచూ మూడు
వాక్యములుగా చెప్పుకొన్నారు. అలా చెప్పిన వాక్యములనే నమాజ్లో
మంత్రములుగా చెప్పుచున్నారు. ఏడు వాక్యములను చదవనిదే అది నమాజ్
అనిపించుకోదుయని చాలామంది ముస్లీమ్ పెద్దలు చెప్పియున్నారు.
నమాజ్లో ఏడు వాక్యములను తప్పనిసరిగా మంత్రపఠనము లాగా
చదువవలసి యుండును. అయితే ఈ విషయమును అనగా ఏడు
ఆయత్లను చదివే విషయమును దైవ గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములో
అల్లాహ్ చెప్పినట్లు జిబ్రయేల్ ఎక్కడా ఏ సూరాలో, ఏ ఆయత్లో చెప్పలేదు.
వాస్తవముగా అల్ ఫాతిహా అను ఏడు ఆయత్లను మనుషులు
ప్రార్థన కొరకు సృష్ఠించుకొన్నదేగానీ దేవుడు చెప్పినది గాదు. ప్రార్థన
విషయమును ప్రత్యేకించి అల్లాహ్ చెప్పియుండలేదు. గడచిన మూడు
యుగములలోనూ, తర్వాత గడచుచున్న కలియుగములోను అనేకులు అనేక
ప్రార్థనలను చేయుచున్నారు. ముందే తయారయిన హిందూ మతములో
అనేక దేవతారాధనలు గలవు. అట్లే ఇస్లామ్కంటే ముందు తయారయిన
క్రైస్థవములో కూడా ప్రార్థనలు కలవు. కలియుగములో 3600
సంవత్సరముల తర్వాత ఇస్లామ్ సమాజము తయారయినది. అంతవరకు
అందరూ చేయు ప్రార్థనలలాగే ముస్లీమ్లు నమాజు అను పేరుతో ప్రార్థనను
తయారు చేసుకొన్నారు. అందులో మొదటి నుండి చివర వరకు చేయు
విధానము, చదువు వాక్యములు అన్నియూ మనుషులు కల్పించుకొన్నవే.
ఖుర్ఆన్ు గ్రంథముగా వ్రాయకముందే ముస్లీమ్లలో ప్రార్థన విధానమును
ముహమ్మద్ ప్రవక్తగారు ప్రవేశపెట్టారని చెప్పవచ్చును. ముస్లీమ్ సమాజము
ఏర్పడినప్పటి నుండి నమాజు అను ప్రార్థనయున్నా అది ఇతర మతస్థులు
ఆచరించునట్లు అచరించుట వలన, అది ఒక విధమైన ప్రార్థనే అయినా,
దానిని చేయువారు అట్లే చేస్తూ క్రొత్త నమాజును స్థాపించమని 4-103లో
చెప్పియున్నారు. పాత నమాజు వలన మనిషికి పరలోక ప్రాప్తి యుండదనీ,
మిగతా మతములు వారు చేయు ప్రార్థనలకు కూడా మోక్షము (పరలోకము)
లభించదని దేవుడు తెలియజేసినట్లు ఇంకొక నమాజును (ప్రార్థనను)
చెప్పడమైనది.
పాత నమాజును చేస్తూనే క్రొత్త నమాజు అర్థమయినప్పుడు
పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడు నమాజును స్థాపించమన్నారు. పాత
నమాజులోని లోపమును చూపిస్తూ నిలబడినప్పుడు, కూర్చుండినప్పుడు,
పరుండినప్పుడు అల్లాహ్ను (దేవున్ని) స్మరించుము అన్నాడు. అలా స్మరణ
ఉండుట కొరకే క్రొత్త నమాజు అవసరమైనది.
పాత నమాజు చేసినంతసేపు దేవుని జ్ఞాపకము ఉండును.
చేయనప్పుడు దేవుని జ్ఞాపకము ఉండదు. అందువలన శరీరము మూడు
స్థితులలో యున్నప్పుడు దేవుని స్మరణ చేయమని చెప్పిన అల్లాహ్
విధానమును నమాజ్ అని చెప్పుచూ దానిని స్థాపించమని చెప్పాడు.
ఆయన ప్రజలకు మంచి చేయుటకు, పరలోకము లభించునట్లు చేయుటకు
నమాజ్ను స్థాపించమని చెప్పాడు కదా! మనిషికి ఆ నమాజు (ప్రార్థన)
ఎలాగుండునో తెలియనప్పుడు ఎలా స్థాపించునను ప్రశ్న ఇప్పుడు అందరికీ
వచ్చినది. అయితే దానికి జవాబుగా ఇట్లు చెప్పుటకు వీలుకలదు. ఇంతకు
ముందు చెప్పిన జ్ఞానము ప్రకారము అనగా! రెండు, మూడు సూరాలలో
చెప్పిన జ్ఞానము ప్రకారము మనిషి ఎల్లవేళల, మనిషికి జ్ఞాపకమున్న (ఎరుక
యున్న) సమయములలో ఒక్క క్షణము కూడా దేవున్ని మరచిపోకుండా
ఉండుటకు తగినది చెప్పబడియున్నది. రెండు సూరాలలోనేకాక, ఆరవ
సూరాలో కూడా దేవుడు సూచించిన నమాజు కలదు. అందువలన ఖుర్ఆన్
చదివిన ఏ వ్యక్తి అయినా అంతకుముందు చేయు ఆరాధన చేయుచూ,
దాని తర్వాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా చేయబడు నమాజును
స్థాపించవచ్చును. అయితే దేవుడు చెప్పిన ఈ నమాజు ప్రార్థన
మందిరములో చేయునది కాదు. బజారులో నిలబడినప్పుడుగానీ,
హోటల్లో కూర్చున్నప్పుడుగానీ, పరుపు మీద పడుకొన్నప్పుడుగానీ దేవుడు
సూచించిన నమాజును చేయవచ్చును. నిలబడి నడుస్తునప్పుడు బజారులోని
దృశ్యములను చూస్తూ, కూర్చుండి మాట్లాడుచున్నప్పుడు ఇతరులతో
వాదించుచూ గానీ, పడకలో పరుండి భార్యాపిల్లలతో సంతోషముగా
మాట్లాడునప్పుడుగానీ, పూర్తి నమాజుగాయుండు ఆరాధనను చేయవచ్చును.
పాత నమాజు ప్రతీ దినము నియమింపబడిన కాలములో
చేయుచున్నా దానికి కొన్ని విధివిధానములు గలవు. క్రొత్త నమాజులో
అటువంటివి ఏవీ లేవు. పాత నమాజులో ఏడు ఆయత్లు చదవడము,
మోకాల్ల మీద కూర్చొని వంగి తల భూమికి పెట్టి ప్రార్థన చేయడము
గలదు. క్రొత్త నమాజులో అటువంటి క్రియలు ఉండవు. పాత నమాజులో
నిర్ణీత సమయముండును. క్రొత్త నమాజులో సమయము ప్రత్యేకించి
యుండదు. అన్ని సమయములలో ఆచరించునదిగా ఉండును. పాత
నమాజులో సాముహికముగా జనముతో కూడి చేయడము గలదు. అయితే
క్రొత్త నమాజులో ప్రక్క మనిషితో సంబంధము లేకుండా అడవిలో అయినా
ఒక్కడే చేయవచ్చును. ఇట్లు ఎన్నో తేడాలు ఉండుట వలన పాత నమాజును
చేస్తూ క్రొత్త నమాజును నెలకొల్పమన్నాడు. అలా నెలకొల్పడము వలన
పాత నమాజును చేసే సమయములో కూడా పాత నమాజును చేస్తూనే
క్రొత్త నమాజును దానిలోనే మిళితముగా చేయవచ్చును. నీ శరీరము
ఏమి చేయుచున్నా, నిలబడి గానీ, కూర్చుండిగానీ, పరుండి గానీ యున్నా
ఏమి చేయుచున్నా దానిని వదలక క్రొత్త నమాజును చేయవచ్చును. ఇదంతా
పెద్ద విచిత్రముగా ఏదో మాయాలాగా ముందు కనిపించినా, తెలిసిన
తర్వాత క్రొత్త నమాజు ఎంతో సులభమైనదని అనిపించును.
ప్రశ్న :- నేడు ముస్లీమ్లు అల్లాహ్ (దేవుడు) అనినా, ముహమ్మద్ ప్రవక్త
అనినా ఎంతో ఇష్టముగా యుండుటేగాక వారి మాటను ఎంతో గౌరవముగా
స్వీకరిస్తారు, ఆచరిస్తారు. అటువంటప్పుడు ముస్లీమ్ సమాజములో
నమాజు ఒక్కటేకలదు. దానిని నిర్ణీత సమయములలో అందరూ కలిసి
సామూహికముగా, క్రమశిక్షణగా, శుచిశుభ్రతలతో, కాళ్లు, చేతులు, ముఖము
కడుగుకొని ప్రార్థనలో (నమాజులో) పాల్గొని తృప్తి పొందుచున్నారు.
కొందరికి వీలయితే ఐదుపూటలు నమాజ్ చేయువారు కలరు. అంతేకాక
ముస్లీమ్లు అంటే విశ్వాసము, విశ్వాసము అంటే ముస్లీమ్లు అనునట్లు
గలదు. ఖుర్ఆన్ గ్రంథమును ఎంతో గౌరవముగా చదివి దానిలో దేవుడు
చెప్పిన సూచనలను తెలియుచుందురు. అంత భక్తిగా యున్నవారికి మీకు
తెలిసిన రెండవ క్రొత్త నమాజు తెలియకుండునా? అట్లు యున్నట్లు హదీసు
పండితులకుగానీ, ఖుర్ఆన్ బోధకులకు గానీ తెలియదా? మీరు చెప్పేంత
వరకు వారికి తెలియదంటారా? మసీదులలో ఇమాంసాబ్లు నిత్యము
ఖుర్ఆన్ పఠనము చేయుచుందురు. వారు కూడా మీరు చెప్పిన దానిని
చెప్పలేదే? మీరు తెలుగులో వ్రాసిన ఖుర్ఆనన్ను చదివి చెప్పుచున్నారు.
ఖుర్ఆన్ గ్రంథము అరబ్బీ భాషలో వ్రాయబడినది. అరబ్బీ భాషా పండితులు
మీరు చెప్పిన వాక్యమును చదివియుంటారు కదా! మీరు చెప్పిన (4-103)
వాక్యములో ఇంకో నమాజును గురించి దానిని నెలకొల్పమని చెప్పిన దానిని
గురించి చెప్పినది తెలిసియుండదా? అరబ్బీ పండితులకు తెలియని
విషయమును మీరు చెప్పుచున్నారా? అని మాకు అనుమానము (ప్రశ్న)
వచ్చుచున్నది. దీనికి మీరు ఏమి జవాబు చెప్పగలరు?
జవాబు :- ఖుర్ఆన్ గ్రంథమును అరబ్బీ భాషలో వ్రాసిన మాట నిజమే.
అరబ్బీ, తెలుగు తెలిసిన పండితులు అరబ్బీ భాషలోని ఖుర్ఆన్ గ్రంథమును
తెలుగులో అనువదించి వ్రాశారు. అలా తెలుగు అనువాద గ్రంథములు
నావద్ద ఏడు గ్రంథములు గలవు. అన్ని గ్రంథములలోను (4-103)
ఆయత్ను చూస్తే అన్నీ ఒకే అర్థము ఇచ్చునవిగా గలవు. కొన్ని
గ్రంథములలోని పదములు వేరుగాయున్నా అర్థము ఒకే విధముగా
యున్నది. ఒక గ్రంథములో నమాజును స్థాపించండి అని వ్రాశారు.
మరొక గ్రంథములో నమాజును నిర్మించండి అని గలదు. ఇంకొక దానిలో
నమాజును నెలకొల్పండి యని కలదు. మూడు తెలుగు అనువాద
గ్రంథములలో వేరువేరు పదములుగా నిర్మించండి, స్థాపించండి,
నెలకొల్పండి యని యున్నా అన్నీ ఒకే అర్థమును చూపుచున్నవి.
అటువంటప్పుడు భాషను చూడక భావమును చూడవలెను. ఇటువంటి
ప్రశ్న వస్తుందేమోనని ముందుచూపుగా ఒకే ఆయన్ను మూడు
గ్రంథములనుండి సేకరించి మూడు విధముల వ్రాసి చూపాను. ఆ మూడు
ఆయత్లు కొద్దిగా పదాలు వేరుగా యున్నా భావములో అన్నీ ఒకే విధముగా
యున్నవని చెప్పవచ్చును. తర్వాత ఇస్లామ్లో ఎందరో పండితులు భక్తులు
ఉన్నారు. అయితే 4-103 లో క్రొత్త నమాజును కూడా పాత నమాజుగా
వారు లెక్కించుకొని క్రొత్త దానిని కూడా పాతదానిగానే చెప్పుచున్నారు.
ఎన్నిచోట్ల చెప్పినా ఉన్నది ఒకే నమాజు కదా!యని అంటున్నారుగానీ
వాక్యములోని హెచ్చుతగ్గులను, సూక్ష్మాతి సూక్ష్మములను తెలియలేకున్నారు.
అలా నమాజ్ ఒక్కటేయని, అల్లాహ్ ఒక్కడేయని నిర్ధారణలో ఉండుట
వలన క్రొత్త నమాజ్ వారికి తెలియకుండా పోయినది.
ప్రశ్న :- ఇంత పెద్ద ముస్లీమ్ సమాజములో, ఖుర్ఆన్ వాక్యమునందు
నమాజ్ స్థాపించండి, నెలకొల్పండి అని వ్రాసిన పదము అర్థముకాక చెప్పిన
నమాజ్ను పాత నమాజ్ అనుకున్నారా? ఒక్కరు కాకపోతే మరొక్కరికయినా
దాని భావము అర్థము కాలేదా? ఇస్లామ్ పండితులకంటే నీవు పెద్దవాడివా,
వారికి అర్థము కానిది నీకు అర్థమయినదని మేము ఎట్లు నమ్మాలి? నీవు
ఇందూ సమాజములోని వానివి. హిందూ సమాజములోని మనిషి (మీరు)
ఖుర్ఆన్ గ్రంథము చదివి అర్థము చేసుకొన్న దానిని ఇస్లామ్ పండితులకు
అర్థము కాలేదని చెప్పగలరా?
జవాబు :- సత్యమును సత్యముగానే చెప్పితే అల్లాహ్ సంతోషిస్తాడుగానీ,
సత్యమును అసత్యముగా చెప్పితే అల్లాహ్ ఏమాత్రము ఒప్పుకోడు. దేవుడు
అంటే ఎంతో నాకు భయము కలదు. అట్లే భక్తీ కలదు. సత్యము అంటే
కూడా భయము కలదు. దేవుడు, దేవుని బోధలు సత్యసమేతముగా
ఉండును. అందువలన సత్యమును అసత్యముగా చెప్పుట పెద్ద తప్పుగా
భావింతును. వాస్తవముగా ఖుర్ఆన్ గ్రంథము నాకు అర్థమయినట్లు ఇతర
ముస్లీమ్లకు అర్థము కాలేదనియే చెప్పుచున్నాను. హిందూ సమాజములో
పుట్టిన వానికి అర్థము అయినప్పుడు, ముస్లీమ్ సమాజాములో పుట్టినవారికి
అర్థము కాకుండా పోవునా? ఇది నమ్మవలసిన మాటేనాయని
అడుగవచ్చును. అట్లు అడగడములో తప్పులేదుగానీ సత్యము తెలిస్తే మీరు
ఎవరూ ఈ మాటను అడుగరు. అందరికీ తెలియని సత్యము ఏమనగా!
ఖుర్ఆన్ గ్రంథములో ఎన్నో గొప్పవాక్యములు గలవు. ఇప్పుడు
వజ్రవాక్యములను పేరుతో ఈ గ్రంథమును వ్రాయుచున్నా, వాస్తవముగా
చూస్తే వజ్రవాక్యములు అను పేరు కూడా ఒక విధముగా ఈ గ్రంథమునకు
తక్కువేయని చెప్పవచ్చును. వజ్రాలకంటే ఎక్కువ విలువయిన వాక్యములు
ఖుర్ఆన్ గ్రంథములో గలవు. ఖుర్ఆన్ గ్రంథము ఏ మనిషికి అర్థము
కావాలన్నా, మతముతో సంబంధము లేకుండా ముస్లీమ్కగానీ,
హిందువులకుగానీ, క్రైస్థవులకుగానీ ఎవరికి అర్థము కావాలన్నా మిగతా
రెండు గ్రంథములు చదివిన వారికే అర్థమగును. ఎవడయితే మూడు
దైవ గ్రంథములలో మిగతా రెండు గ్రంథములు చదవకపోతే ఖుర్ఆన్
అర్థము కాదు. మిగతా రెండు దైవగ్రంథములయిన భగవద్గీత, బైబిలు
చదివి అర్థము చేసుకొనియుంటే వానికి ఖుర్ఆన్ గ్రంథము సులభముగా
అర్థము కాగలదు. నేను భగవద్గీతను, బైబిలును వివరముగా
చదువగలిగాను. చదవడమేకాక బాగా అర్థము చేసుకొన్నాను. అందువలన
మూడవ గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథము బాగా అర్థమవుచున్నది.
ముస్లీమ్లకు కూడా తెలియని రహస్య భావములు నాకు తెలియుచున్నవి.
వాస్తవానికి (4-103) వ వాక్యము చిన్న వాక్యము. అందులో మూడే
ముక్కలు గలవు. ఒకటి పాత నమాజును చెయ్యి, తర్వాత ఎక్కడున్నా ఏ
పరిస్థితిలోయున్నా అని చెప్పుచూ నిలుచున్నా, కూర్చుండినా, పరుండినాయని
అన్నారు. ఆ తర్వాత సమయము అనుకూలిస్తే, నమాజును నెలకొల్పమని
చెప్పాడు. నమాజును నెలకొల్పమని చెప్పినది అన్ని గ్రంథములలో గలదు.
అందరూ దానిని చదివినా పాత నమాజును తప్పనిసరిగా శ్రద్ధగా
ఆచరించడమే నమాజును నెలకొల్పినట్లు తలచుచున్నారు. గ్రంథములో
మా బుద్ధికి క్రొత్త నమాజుగా కనిపించుచున్నది. దానికి ఒకే ఒక కారణము
గలదు. అదే వారు ఖుర్ఆన్ గ్రంథమును అర్థము చేసుకోలేదని
కారణము చేతనే క్రొత్త నమాజ్ కూడా పాత నమాజ్ మాదిరే అర్థమయినదని
చెప్పవచ్చును. అలా అర్థము కాకపోవడానికి ముస్లీమ్లు భగవద్గీతను,
బైబిలును చదవలేదు. రెండు గ్రంథములను చదవనిదే మూడవ గ్రంథము
అర్థముకాదని నేను కొన్ని సంవత్సరములనుండి చెప్పుచునే యున్నాను.
భగవద్గీత (తౌరాతు), బైబిలు (ఇంజీలు), ఖుర్ఆన్ మూడు దైవ
గ్రంథములేయని చెప్పవచ్చును. ఒక దైవ గ్రంథము అర్థము కావాలంటే
మిగతా రెండు దైవ గ్రంథములను తప్పనిసరిగా చదువవలసిందే. మనిషి
ఏ ధర్మములో యున్నా ఆ ధర్మము వానికి తెలియాలంటే మిగతా రెండు
గ్రంథములను చదవవలెను. ఇది అల్లాహ్ ఐదవ సూరాలో 68వ ఆయత్లో
ఇలా ఆజ్ఞ చేసి చెప్పాడు చూడండి. అక్కడ చెప్పిన వాక్యము అనుసరించి
మనిషి ధర్మము నిర్ణయించబడును.
(5-68) “ఓ గ్రంథవాహకులారా! మీరు తౌరాతు, ఇంజీలును,
మీ ప్రభువు వద్ద నుండి వచ్చిన మీ వద్దకు పంపబడిన దానిని
(ఖుర్ఆన్ గ్రంథమును) మీ జీవితాలలో నెలకొల్పు వరకు మీరు
ఏ ధర్మముపైనా లేనట్లే.
ఈ వాక్యము ఖుర్ఆన్ గ్రంథములో ముస్లీమ్లకే చెప్పియున్నారు
కదా! అటువంటప్పుడు ముస్లీమ్లు భగవద్గీత, బైబిలు చదవనిదే ఖుర్ఆన్
గ్రంథములో ఆయత్లు సక్రమముగా అర్థము కావు. దేవుని నియమము
ప్రకారము నడుచుకోని వారికి వారి ధర్మము వారికే తెలియదు. ఇది
ముస్లీమ్లకే కాదు, అన్ని మతముల వారికి వర్తించును. అందువలన
తమ మత గ్రంథమని ఒక గ్రంథమును ఆశ్రయించి మిగతా రెండు దైవ
గ్రంథములను పరమత గ్రంథములుగా అసూయతో చూచువారికి ఎంత
కాలమునకయినా వారి గ్రంథములలోని జ్ఞానమే అర్థము కాదు. నేడు
హిందువులు బైబిలును పరమత గ్రంథము అని అసూయతో చూస్తున్నారు.
అట్లే ఖుర్ఆన్ గ్రంథమును కూడా పరమత గ్రంథమని దూరముగా పెట్టారు.
అందులో ఏమున్నది ఆ రెండు గ్రంథముల జ్ఞానము తెలియదు కావున
అటువంటి వారికి భగవద్గీత జ్ఞానము కూడా తెలియదు. అంతేకాక మేము
హిందువులమని చెప్పుకొనుచుండినా వారికి హిందూ ధర్మము ఏదో
తెలియకుండును. ఒక దైవగ్రంథములోని జ్ఞానము అర్థము కావాలంటే
మిగతా రెండు దైవ గ్రంథముల జ్ఞానము తెలిసియుండాలి. ఈ సూత్రము
తెలియని దానివలన ముస్లీమ్లకు వారి ఖుర్ఆన్ గ్రంథములో ఆయత్లు
అర్థము కావడము లేదు.
నేను భగవద్గీత, బైబిలు రెండు గ్రంథములు చదివాను కావున
ఖుర్ఆన్ అర్థమగుచున్నది. అలాగే ఖుర్ఆన్, బైబిలు చదివియుండుట
వలన భగవద్గీత అర్థమగుచున్నది. అట్లే భగవద్గీత, ఖుర్ఆన్ను చదివి
యున్నాను కావున నాకు బైబిలు సులభముగా అర్థమగుచున్నది.
ముస్లీమ్లకు (4-103)లో యున్న వాక్యములో క్రొత్త నమాజ్ అర్థము
కాలేదంటే, క్రొత్త నమాజు ఉన్నదని తెలియలేదంటే వారికి మిగతా రెండు
గ్రంథముల జ్ఞానము తెలియదనే చెప్పవచ్చును. దేవుడు ఒక సూత్రమును
ఒక దైవ గ్రంథములలో చెప్పితే మూడు దైవగ్రంథములలో ఆ సూత్రము
ఉన్నట్లేయగును. మూడు దైవగ్రంథములలో ఒకే దేవున్ని గురించి
చెప్పియుండుట చేత ఒక జ్ఞాన సూత్రము ఒక దైవ గ్రంథములో చెప్పితే
అది మిగతా రెండు దైవగ్రంథములలో చెప్పినట్లుగా లెక్కించవలెను.
చెప్పునది ఒకే దేవున్ని అయినందున ఒకే సూత్రము మూడు గ్రంథములలో
సమానముగా వర్తించును.
ఒక బ్యాంకు లాకర్లో సొమ్మును దాచుకొన్నప్పుడు, బ్యాంకు
లాకర్కు రెండు తాళము చెవులు ఉండును. ఒకటి ఖాతాదారునికి ఇచ్చి
రెండవ దానిని బ్యాంకు మేనేజర్ ఆధీనములో ఉంచుకొనును. లాకర్లో
సొమ్ము కావలసి వస్తే నీ వద్ద యున్న తాళము చెవితో మాత్రము లాకర్
తెరుచుకోదు. బ్యాంక్ మేనేజర్ వద్దయున్న తాళము చెవి నీవద్ద యున్న
తాళము చెవి రెండూ ఉపయోగించినప్పుడు బ్యాంక్లాకర్ తెరుచుకొని
అందులోని సొమ్ము లభించును. ఇక్కడ బ్యాంక్ లాకర్ తెరవటానికి రెండు
తాళము చెవులు అవసరమైనట్లు ఒక తాళము చెవితో లాకర్ తెరుచుకోనట్లు
ఒక గ్రంథము చదివితే దేవుని జ్ఞానము లభించదు. రెండు తాళములు
ఉన్నప్పుడే లాకర్ తెరచుకొన్నట్లు ఎప్పుడయినా ఇతర మత గ్రంథములని
అసూయ చెందక చదివినప్పుడు గ్రంథములోని వాక్యమందు గల జ్ఞానము
లభించును. నేడు ఎక్కడ చూచినా ఒక మతము రెండవ మతము మీద
ద్వేషము కల్గియున్నది. అందువలన ఎవరికీ దైవ గ్రంథములలోని జ్ఞానము
అర్థము కావడము లేదు. దేవుడు అన్ని మతములకు ఒక్కడే అయినప్పుడు
అన్ని మతములలోని జ్ఞానము ఒక్కటే యుండును గానీ, వేరుగా యుండుటకు
అవకాశముండదు. ఆ విషయము తెలియక ప్రతి ఒక్కరూ మత ద్వేషమును
కల్గి ఇతర దైవ గ్రంథములోని జ్ఞానము తెలియని దానివలన ఒక
మతములోని జ్ఞానము ఆ మతములోనే అర్థము కాకుండా పోయినది.
ముఖ్యముగా అదే కారణము చేత వాక్యములో నమాజును నెలకొల్పమని
చెప్పినా, అది ఏ నమాజో ముస్లీమ్లకే అర్థము కాకుండా పోయినది.
ఖుర్ఆన్ గ్రంథములో ఈ మాట ఉన్నది. కావున ముస్లీమ్లకే
ఈ విషయము బాగా అర్థము కావలసియున్నది. అయితే వారు చేయుచున్న
నమాజ్కు, క్రొత్తగా స్థాపించబడవలసిన నమాజ్కు ఏమి తేడా యున్నదని
వారు కొంచెమయినా ఆలోచించలేదు. (4-103) వ ఆయత్ ఖుర్ఆన్
గ్రంథములో చేయుచున్న నమాజును గురించి చెప్పడమేకాక, క్రొత్తగా
నెలకొల్పు నమాజ్ను గురించి కూడా చెప్పాడు. ఇది అల్లాహ్ నుండి
వచ్చిన జ్ఞానముకాగా, దానినే జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తగారికి చెప్పాడు.
ఈ జ్ఞానమును సృష్ఠి మొదలయిన తర్వాత కొంత కాలానికే వాణి (శబ్దము)
ద్వారా వచ్చినది. ఆ శబ్దము ఆకాశము నుండి వచ్చినది. ఆ రోజు అది
మాటల రూపములో రాలేదు. ఆకాశము నుండి ఎలా శబ్దము వచ్చునో
అలాగే ఉరుముల రూపములో వచ్చినది. అలా ఉరుముల రూపములో
వచ్చిన శబ్దమును విని, గ్రహించుకొన్న సూర్యుడు కొంతకాలానికి భూమి
మీద ‘మనువు' అను వ్యక్తికి తాను వినిన శబ్దములను మనుషుల మాటల
రూపములోనికి మార్చి చెప్పాడు. సూర్యుడు ఏ శబ్దములోని భావమును
గానీ, ఏ భాషలోని భావమునుగానీ గ్రహించుశక్తి గలవాడు, అలాగే ఏ
భాషలోనయినా మాట్లాడు స్థోమత గలవాడు. అన్ని భాషలను గ్రహించుశక్తి
ఆయనకు గలదు. అందువలన కృతయుగములోనే మొదటి భాష అయిన
తెలుగు భాషలో మాట్లాడి, మనువుకు ఆకాశవాణి చెప్పిన జ్ఞానమును
చెప్పడము జరిగినది. అలాగే కలియుగములో 1400 సంవత్సరముల
క్రితము 'జిబ్రయేల్' అను పేరుతో క్రిందికి దిగివచ్చి, ముహమ్మద్ ప్రవక్తగారికి
కృతయుగములో మనువుకు చెప్పిన జ్ఞానమునే చెప్పడము జరిగినది.
మనువుకు చెప్పిన జ్ఞానమే చివరికి మారుచూ మారుచూ వచ్చి కలియుగము
మొదటిలో ద్వాపరయుగము చివరిలో అనగా యుగ సంధిలో వ్యాసుని
చేత ‘భగవద్గీత' గ్రంథముగా వ్రాయబడినది. అలాగే అదే జ్ఞానమే 1400
సంవత్సరములప్పుడు ‘ఖుర్ఆన్' గ్రంథముగా వ్రాయబడినది. దీనినిబట్టి
చరిత్ర తెలిసిన వారికి రెండు గ్రంథములలోని జ్ఞానము ఒక్కటేయని
తెలియబడుచున్నది.
అందువలన ఖుర్ఆన్ గ్రంథములో (4-103) ఆయత్ ఒక్క
ముస్లీమ్లకే గాక హిందువులకు, క్రైస్తవులకు వర్తించునదిగా యున్నది.
దీనినిబట్టి చూస్తే హిందువులు ఏ ఆరాధన చేయుచున్నారో దానికంటే
వేరే ఆరాధనను నెలకొల్పుకోవలసిన అవసరమున్నది. అట్లే క్రైస్తవులు
ఆరాధన (ప్రార్థన) చేయుచున్నారో దానికంటే వేరుగా యున్న ప్రార్థనను
నెలకొల్పుకోవలసిన అవసరమున్నది. అట్లే ముస్లీమ్లు వారు చేయుచున్న
నమాజు వారు చేయుచూ, దానిని కాదని ప్రత్యేకముగా మరొక నమాజును
నెలకొల్పుకోవలసిన అవసరమున్నది. అంతవరకు చేయని క్రొత్త నమాజును
నెలకొల్పుకోమని చెప్పడమైనది. అలాగే నెలకొల్పుకోవలసిన అవసర
మున్నది. అయితే దేవుడు ఈ విషయమును వాక్యరూపములో చెప్పినా
'నాకు తెలిసినది ఇంతే, నాకు తెలియనిదాని జోలికి నేను పోను' అని
దేవుడు చెప్పిన వాక్యమును కూడా తెలియనివారు, చూడనివారు గలరు.
అటువంటి వారికి నాలాంటి వాడు ఎవడయినా వాక్యము ఇలా ఉన్నదని
చూపినా, ఖుర్ఆన్ గ్రంథము జ్ఞానమును కూడా పెడచెవిన పెట్టి, మా
పెద్దలు చెప్పినట్లు నడుచుకొనుచుందుమని చెప్పుచుందురు. పెద్దలు చెప్పినది
వినడము మంచిదే అయినప్పుడు దేవుడు చెప్పినది వినడము మరీ
మంచిదగును కదా! దేవునికంటే పెద్దలు కూడా చిన్నవారేయగుదురు. దేవుని
మాటతో సమానముగా పెద్దల మాటలను పోల్చుకోకూడదు. దైవగ్రంథము
లోని వాక్యమును వదలి, పెద్దలు పెట్టిన మత సాంప్రదాయములను
అనుసరించి అట్లే నడచుకొంటే దేవునిమాటను గౌరవించని వారమగుదుము.
ప్రశ్న :- మీరు చెప్పినది మంచిదే. అయితే కొందరు విద్వాంసులయిన
ముస్లీమ్లు ఖుర్ఆన్ గ్రంథములోని ప్రతి వాక్యమును తెలిసిన పండితులుగా
యుంటున్నవారు ఈ విషయమును గురించి ఇలా అంటున్నారు. (4-103)
వ వాక్యములో చెప్పినది అర్థము కావాలంటే (4-102) వ వాక్యమును
చూడాలి. అక్కడ యుద్ధ సమయములో 'కొందరు నమాజ్ చేయండి,
కొందరు నమాజ్ చేయకుండా శత్రువుల ఎడల అప్రమత్తముగా యుండండి
అనీ, మొదట కొందరు నమాజ్ చేసినప్పుడు కాపలా యున్న మిగతావారు
తర్వాత నమాజ్ చేయండి' అనీ చెప్పియున్నట్లు కలదు. అలా మొదట
కొందరు, రెండవ మారు కొందరు నమాజు చేయడము జరుగుచున్నది.
నమాజు చేసేవాడిని ఉద్దేశించి నమాజును నెలకొల్పండి అని అన్నారు.
అంతేగానీ రెండవవారు చేయునది క్రొత్త నమాజ్ కాదు. మొదట చేయునది,
తర్వాత చేయునది రెండూ ఒకే నమాజుగా యున్నది. అది తెలియక
కొందరు రెండవమారు రెండవ గుంపు చేయునది క్రొత్త నమాజ్కాదు.
రెండూ ఒకే నమాజ్యని తెలియవలెను.
(4-102) (ఓ ప్రవకా) “నీవు వారి మధ్యన ఉన్న సమయములో
(యుద్ధము జరుగుతూ యుంటే) వారు నమాజ్ చేయటానికి
సిద్ధమైనప్పుడు వారిలో ఒక వర్గము నీతోపాటు సాయుధులై
నిలబడాలి. మరి వారు నమాజ్ చేయగానే మీ వెనక్కి
వెళ్లిపోవాలి. అప్పటి వరకు నమాజ్ చేయని రెండవ గుంపు
వచ్చి నీతోపాటు నమాజ్ చేయాలి. నమాజ్ చేసి ప్రక్కన
యున్నవారు ఆయుధములు ధరించి అప్రమత్తముగా ఉండాలి"
అని ఉంది.
ఈ ఆయత్ యుద్ధసమయములో కూడా నమాజ్ చేయాలని,
అప్పుడు అందరూ ఒకేమారు నమాజు చేయక రెండు గుంపులుగా చీలిపోయి
ఒక గుంపు నమాజ్ చేయునప్పుడు మరొక గుంపు ఆయుధములు ధరించి
నమాజ్ చేయువారికి కాపలా ఉండవలెననీ, అట్లే మొదటి గుంపు నమాజ్
అయిపోయినప్పుడు రెండవ గుంపు నమాజ్ చేయగా మొదటి గుంపు కాపలా
ఉండవలెనని వాక్యములో చెప్పియున్నారు. మొదటి గుంపు నమాజ్ చేయగా
తర్వాత రెండవ గుంపు చేయు నమాజ్ను 'నమాజ్ను నెలకొల్పమని'
చెప్పారు. అందువలన ఉన్నది ఒకే నమాజ్, గుంపులు రెండు ఉండుట
వలన ఒక గుంపు నమాజ్ను ఆచరించగానే రెండవ గుంపును నమాజ్
చేయమని చెప్పడములో అలా చెప్పారు తప్ప రెండవ నమాజ్ లేదు.
నమాజులు ఒకటే ఉండును దానినే అందరూ ఆచరిస్తున్నారు. రెండవ
క్రొత్త నమాజు లేదని చెప్పుచున్నారు. పొరపడి రెండవ గుంపును చేయమని
చెప్పినదే రెండవ నమాజ్ అని అంటున్నారు. దీనికి మీరు ఏమంటారో
చెప్పండి?
జవాబు :- దేవుడు (అల్లాహ్) అనుగ్రహించినట్లు దైవగ్రంథములోని జ్ఞానము
అర్థమగుచుండును. అలాగే ఇస్లామ్ పండితులకు అర్థమయి ఉండవచ్చును.
పండితులు చెప్పినట్లు రెండవ గుంపు నమాజ్ చేయడమును వాక్యములో
గల రెండవ నమాజ్ అర్థము చేసుకొని యుండవచ్చును. అయితే అల్లాహ్
మనిషికి ఇచ్చిన బుద్ధితో ఆలోచిస్తే నాకు ఈ విధముగా అర్థమగుచున్నది.
నేడు ముస్లీమ్ సమాజములో ఉన్నది ఒకే ఒక నమాజ్. ఒకే విధమైన
నమాజునే ముస్లీమ్లందరూ చేయుచున్నారు. ఎన్ని గుంపుల మనుషులు
గుంపుల వారిగా, ఎన్నిమార్లు చేసినా ఒకే నమాజ్యేగానీ అది రెండవ
నమాజ్ యుండదు. నమాజు ఏడు ఆయత్ల పఠనముతో కూడుకొని
యుండును. ఏడు ఆయత్ల పఠనము లేనిది నమాజ్ పూర్తికాదు. నమాజు
ముందు చేసినా వెనుక చేసినా, వేరువేరు సమయములలో చేసినా నమాజ్
అనునది ఒక్కటే. నమాజు క్రమశిక్షణతో కూడుకొనియున్నది.
సామూహికముగానయినా చేయవచ్చును. ఎవరూ లేనిచోట ఒంటరిగా
అయినా చేయవచ్చును. ఎలా చేసినా, ఎప్పుడు చేసినా నమాజ్ ఒక్కటేగానీ
రెండవది లేనేలేదు. అయితే (4-103) లో నెరవేర్చే నమాజు వేరు,
నెలకొల్పబడే నమాజు వేరుగా చెప్పియున్నారు. ఆచరించబడే నమాజును
నేడు అందరూ ఆచరించుచున్నారు. యుద్ధ సమయములో ఒక గుంపు
ముందు చేసిన నమాజునే రెండవ గుంపు కూడా చేయుచున్నది. అంతేగానీ
ముందు గుంపు ఒక నమాజు చేస్తే రెండవ గుంపు రెండవ రకము
నమాజును చేయలేదు. వాక్యములో చెప్పిన సారాంశములో అందరూ
ఆచరించు నమాజు చెప్పడమేకాక క్రొత్తగా స్థాపించబడే నమాజును
గురించి చెప్పారు. రెండవ క్రొత్త నమాజును బయటపెట్టడము వలన
దానిని ఒప్పుకొని కొందరి వలన పేచీలు వస్తాయేమోనని తెలిసి ముందే
సమయము అనుకూలించినప్పుడు, శాంతిభద్రతలున్నప్పుడు అని చెప్పారు.
రెండవ నమాజు క్రొత్త నమాజు ఉందంటేనే అదేమిటని ఆలోచించకుండా
దానిని గురించి వ్యతిరేఖముగా మాట్లాడు వారుందురు. అందువలన
ముందే అనుకూలమైనప్పుడు అని చెప్పారు.
(4-102) వ వాక్యములో ఉన్న సమాచారములో క్రొత్త నమాజు
లేనేలేదు, పాత నమాజును గురించే చెప్పారుగానీ అందరూ ఆచరించు
నమాజ్కంటే వేరే నమాజును గురించి చెప్పలేదు. (4-103) లో మాత్రమే
క్రొత్తగా స్థాపించవలసిన నమాజును గురించి చెప్పారు. అయినా ఆ క్రొత్త
నమాజును ఇంతవరకు ఎవరూ స్థాపించలేదు. క్రొత్తగా స్థాపించవలసిన
నమాజును గురించి ప్రత్యేకముగా అల్లాహ్ చెప్పలేదు. అల్లాహ్ ప్రత్యేకముగా
క్రొత్త నమాజు ఇలా ఉంటుందని చెప్పియుంటే ప్రజలు దానిని
స్థాపించేవారు, తర్వాత అందరూ ఆచరించేవారు. దేవుడు ప్రత్యేకమైన
క్రొత్త నమాజును స్థాపించుకొమ్మన్నాడు గానీ, ఇదే క్రొత్త నమాజు అని
ఏమాత్రము చెప్పలేదు. అలా ఎందుకు చెప్పలేదనగా! ముందు చెప్పిన
రెండు దైవగ్రంథములలోనూ క్రొత్త నమాజును గురించి యున్నది. అట్లే
చివరి దైవ గ్రంథమయిన ఖుర్ఆన్లో కూడా దానిని గురించి గలదు.
మూడు దైవగ్రంథములలో వెదికితే రెండవ రకమయిన క్రొత్త
నమాజు కనిపించగలదు. అలా దైవగ్రంథములో వెదకకల్గి రెండవ
నమాజును (ప్రార్థనను) తెలియగలిగినా అది తెలిసిన వానికి ఒక్కనికే
ఉపయోగపడును. ఏ మతస్థుడయినా మొదటినుండి అలవాటయిన, మొదటి
నుండి తెలిసిన నమాజునే ఆచరించుచున్నాడు. అది ఒక్కటే నమాజు అని
అనుకొనుచున్నారు. గ్రంథములలో నిక్షిప్తమైయున్న నమాజు ఏమిటో ఎవరికీ
తెలియదు. ఒకవేళ దానిని ఎవరయినా విశధీకరించి ఇదే క్రొత్త నమాజు
అని చెప్పినా, దాని విషయమును సంపూర్ణముగా తెలిసినా, దానిని అందరూ
చేయలేరు. రెండవ నమాజును గురించి తెలిసినా, దానిని ఆచరించుటకు
చాలామంది పూనుకొనినా ఒకరు లేక ఇద్దరు ఆ నమాజ్ను
చేయగలరేమోగానీ, అందరూ ఆచరించలేరు. దేవుని ఆరాధనను
దేనినయినా నమాన్గానే చెప్పవచ్చును అని “తౌహీదె ఉలూహియత్” అని
ముస్లీమ్ పెద్దలు చెప్పియున్నారు. అల్లాహ్ యొక్క రెండవ క్రొత్త ఆరాధన
(నమాజు) “తౌహిదె ఉలూహియత్" కోవకు కూడా చెందినది కాదు. అదొక
ప్రత్యేకమైన ఆరాధన. దానిని ప్రయత్నించి చేయలేక వదలివేసినవారు
కూడా కలరు. పట్టుదల గల జ్ఞానసంపన్నులైన వారు దానిని సాధించి
ఆచరించినవారు కూడా కలరు. తౌరాతు (భగవద్గీత), ఇంజీలు (బైబిలు)
గ్రంథముల జ్ఞానమును చెప్పిన కృష్ణుడు, ఏసు ఇద్దరూ రెండవ నమాజ్నే
ఆచరించారు. మా వలె మీరు కూడా ఆచరించమని కృష్ణుడు తన
గ్రంథములో చెప్పియున్నాడు. మొదట వహీ ద్వారా వచ్చిన జ్ఞానములో
రెంవవ నమాజును గురించి యున్నది. అందువలన చివరిలో ఖుర్ఆన్
జ్ఞానమును చెప్పిన జిబ్రయేల్ తన జ్ఞానములో రెండవ ఆరాధనను గురించి
చాలాచోట్ల చెప్పాడు. అయినా ఖుర్ఆన్ గ్రంథములో రెంవవ నమాజు
వివరము గలదని ముస్లీమ్లకు తెలియకుండా పోయినది. అందువలన
(4-103) లో ప్రత్యేకముగా నమాజును నెలకొల్పండియని చెప్పాడు.
అయినా ఆ ఆయన్ను ముస్లీమ్లు చూచి ఆరాధన అంటే ఒకటేయనీ,
ప్రార్థన (నమాజు) తాము చేయునదేయని అనుకొంటున్నారు.
ప్రశ్న :- మీరు చెప్పునది కొంత సత్యమే అనిపించినా ఒక ప్రక్క సత్యము
కాదనిపించుచున్నది. మీరు సత్యమును చెప్పాలని తాపత్రయపడుచు
చెప్పుచున్న విధానమునుబట్టి మీరు చెప్పునది సత్యమే అనిపించినా ఇంకా
మాకు ఆటంకముగా కనిపించు కొన్ని వాక్యములనుబట్టి దీనికేమంటారు
అని అడుగవలసి వచ్చినది. ఇంకొక చోట కూడా నమాజు స్థాపించండి
అను పదముతోనే చెప్పారు. ఆ వాక్యమునుబట్టి మేము ఏమనుకోవాలో
మీరే చెప్పండి.
(17-78) “నమాజును నెలకొల్పు. సూర్యుడు నెత్తి నుండి వాలినప్పటి
నుంచి రాత్రి చీకటి అలుముకొనే వరకు" అని చెప్పబడియున్నది.
దీనినిబట్టి నమాజును చేస్తూనే ఉండు అని ఉంది కదా! ఈ వాక్యములో
చెప్పినది ఒకే నమాజు కదా! రెండవ నమాజు పేరు లేదు కదా! (4-103)
లో చెప్పినట్లే నమాజును నెలకొల్పమని మొదటనే చెప్పారు. దీనిని చూచిన
తర్వాత మీకు ఏమనిపిస్తావుంది? ఇక్కడ ఏ నమాజును గురించి
చెప్పియున్నారు? అను ప్రశ్నలు వస్తున్నవి. దీనికి మీరేమంటారు?
జవాబు :- మిమ్ములను తప్పుదారి పట్టించాలనునది నా ఉద్దేశ్యము కాదు.
సత్యము చెప్పాలనునదే నా ఉద్దేశ్యము. దాని ప్రకారము చెప్పుచున్నాను.
పైగా ఒక ఆయత్కు తప్పు వివరము ఇస్తే ఘోరమైన పాపము వస్తుందని
సూరా 41, ఆయత్ 40లో కలదు.
(41-40) “మా వాక్యాల విషయములో వక్రవైఖరిని అవలంభించి
అసత్యాలను కూర్చి చెప్పు వారిని మేము చూస్తూనే యున్నాము.
అగ్నిలో పడవేయబడువాడు మేలా? లేక ప్రళయ దినాన
సురక్షితముగా ప్రశాంత స్థితిలో వచ్చేవాడు మేలా? మీరు
ఇష్టమొచ్చింది చేసుకొంటూ పోండి. ఆయన (అల్లాహ్) మీరు
చేసే పనులన్నీ చూస్తూనే యున్నాడు."
ఆయత్లో దేవుని వాక్యమునకు తప్పు భావమును వ్రాస్తే
మరణానంతరము అగ్నిలో పడవేయబడుదురు అని చెప్పిన తర్వాత కూడా
ఎవరూ ఆయత్ల జోలికి పోరు. సత్యము తెలిసియుంటే బయటికి
చెప్పగలరు గానీ వాక్యమును గురించి తెలియకపోతే ఊరకనే ఉండును.
నాకు సత్యము తెలిసింది కావున ధైర్యముగా బయటికి చెప్పుచున్నాను.
బుద్ధి పెట్టి యోచించువారికి నా మాటలలోని సత్యము తెలియగలదు.
ఇప్పుడు మీరు (17-78)వ ఆయత్లోని వాక్యమును చెప్పారు. ఇక్కడ
నమాజును నెలకొల్పమని చెప్పారు. కావున క్రొత్త నమాజును గురించి
చెప్పారని తెలియుచున్నది. తలమీది సూర్యుడు తిరిగినప్పటినుండి రాత్రి
చీకటి పడే వరకు క్రొత్త నమాజ్ను వదలకుండా చేయవచ్చును. అదే
పాత నమాజు అయితే నిర్ణయమైన కాలములలో క్రమశిక్షణగా
సామూహికముగా నమాజు చేయవలసి యుండును. క్రొత్త నమాజుకు
నియమాలు లేవు. మధ్యాహ్నము నుండి రాత్రివరకు ఏకధాటిగా చేయు
నమాజ్ క్రొత్తదికాగా, పాత నమాజ్ ఏకధాటిగా చేయునది కాదు. దీనినిబట్టి
(17-78) ఆయత్లో క్రొత్త నమాజును గురించి చెప్పియున్నారు గానీ
పాత నమాజు చెప్పలేదని తెలియుచున్నది. పాత నమాజ్ నియమములతో
కూడినదనీ, ఏకధాటిగా చేయునది కాదని ముస్లీమ్లందరికీ తెలుసు. పాత
నమాజును గురించి అందరికీ తెలుసు, క్రొత్త నమాజును గురించి ఎవరికీ
తెలియదు. మేము చెప్పుతూయుంటే, ఇప్పుడే తొలిసారిగా క్రొత్త నమాజు
అను పేరును వినుచుందురు. ఇప్పుడయినా గ్రంథములో చెప్పిన క్రొత్త
నమాజును గురించి తెలియవచ్చును కదా! మూడు దైవ గ్రంథములలో
మనకు తెలియని క్రొత్త నమాజు గురించి ముఖ్యముగా చెప్పియున్నారు.
మనిషికి బోధించిన జ్ఞానములో ప్రధానముగా క్రొత్త నమాజును గురించే
గలదు. అటువంటప్పుడు క్రొత్త నమాజ్ను గురించి అందరూ తెలిసి
గ్రంథములో చెప్పినట్లు ఏకదాటిగా నమాజ్న చేయవచ్చును కదా!
మూడు దైవ గ్రంథములలో క్రొత్త నమాజును గురించి యుండడము
వాస్తవమేయని దానిని గురించి తెలిసిన మేము చెప్పుచున్నాము. ఇంకా
వివరముగా చెప్పితే ప్రథమ దైవ గ్రంథము భగవద్గీతలో క్రొత్త నమాజును
గురించి ఎక్కువ శాతము చెప్పబడినది. ద్వితీయ దైవ గ్రంథమయిన
బైబిలులో భగవద్గీతలో చెప్పిన దానికంటే కొంత తక్కువ చెప్పియున్నారు.
అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్ గ్రంథములో ద్వితీయ దైవ గ్రంథములో
కంటే తక్కువ చెప్పియున్నారు. తౌరాతు గ్రంథములో దాదాపు 60 శాతము
కొత్త నమాజు గురించి చెప్పగా, ఇంజీలు గ్రంథములో 30 శాతము
చెప్పారు. ఖుర్ఆన్ గ్రంథములో 15 శాతము చెప్పారు. మూడు దైవ
గ్రంథములలో ఇంత శాతము చెప్పారని కొలత వేసి మేము చెప్పుచున్నా
మంటే అదేదో గ్రంథములో యున్నా చదివిన వారికి అర్థము కాలేదనేగా
తెలియుచున్నది. మాకు తెలిసినది మీకు కూడా తెలియగలదు. మీకు
తెలిసిన వరకే గోడకట్టుకొని ఇంతే ఉన్నది అనుకోకూడదు. దైవ
గ్రంథములలో మనకు తెలియనిది ఎంతో గలదు. అందువలన బుద్ధిని
ఉపయోగించి ప్రతి వాక్యమును చూడవలెనని తెలుపుచున్నాము.
ప్రశ్న :- మూడు దైవ గ్రంథములలో క్రొత్త నమాజ్న గురించి చెప్పి
యున్నారని మీరు తెలుపుచుండగా మేము వింటున్నాము. మాకు ఎందుకు
తెలియలేదో, మీకు ఎందుకు తెలిసిందో? మీకు తెలిసింది కదా! ఇప్పుడయినా
అందరికీ ఆ నమాజును గురించి మీరు తెలియ చెప్పవచ్చును కదా!
ఇంతవరకు మీరు ఆ క్రొత్త నమాజు ఇలా చేయవలెనని చెప్పలేదు.
ఇప్పుడయినా ఆ క్రొత్త నమాజును ఎలా నెలకొల్పాలో? ఎలా ఆచరించాలో
చెప్పవలెనని అడుగుచున్నాము. దయచేసి మీకు తెలిసినదంతా మాకు
తెలుపవలెను.
జవాబు :- నాకు తెలిసినది నేను చెప్పగలను. అయితే గ్రంథములో
ఎన్నోచోట్ల గల దానిని ఎవరంతకు వారు తెలుసుకొని ఆచరించినప్పుడు
దానికి విలువ యుండును. నమాజ్ అను పేరుకు సార్థకము చేకూరును.
క్రొత్త ప్రార్థన లేక నమాజు వలన మనిషి పరలోకమును చేరు భాగ్యము
కల్గును. “నాకు జన్మ వద్దు" అను అర్థమును నమాజ్ అనే మూడు
అక్షరములు తెల్పుచున్నవి. ఒకప్పుడు కృతయుగములోనే నమాజ్ అనునది
స్వచ్ఛమయిన తెలుగు పదముగా ఉండేదని ముందే చెప్పుకొన్నాము. దాని
అర్థము తెలుగులో న అంటే వద్దు. మ అంటే నాకు, జ్ అంటే జన్మలు.
'నాకు జన్మలు వద్దు' అను మాటను కుదించిన అక్షరములలో నమాజ్
యని అన్నారు. క్రొత్త నమాజ్ (ఆరాధన) అయితే దాని అర్థమునకు
సరిపోవునదిగా యున్నది. అహర్నిశలు చేయునది ఒకే ఒక ఆరాధన
కలదు. అదే క్రొత్త నమాజ్. నీకు క్రొత్త నమాజ్యని చెప్పుచున్నా నాకు
మాత్రము అలవాటుపడిన పనిగా యున్నది. అందరికీ తెలిసిన పాత
నమాజ్ దేవుని మీద విశ్వాసమున్న వారు అనగా ముస్లీమ్లు అదొక పనిగా
చేయుచున్నారు. అయితే అందరి దృష్టిలో క్రొత్త నమాజ్ గ్రంథములో
చెప్పబడినది ప్రత్యేకించి చేయు కార్యము కూడా కాదు. అందరికీ అర్థమయ్యే
దానికి నేను క్రొత్త నమాజు చేస్తున్నాను అని చెప్పినా అది నేను చేయునది
కాదు. అది అందరిలో జరుగుచున్నది. నాలో కూడా జరుగుచున్నది.
జరుగుచున్న దానిమీద ధ్యాసను పెట్టుకొన్నాను. కావున అది నేను
చేసినట్లగుచున్నది. అంతేగానీ క్రొత్త నమాజ్ను ప్రత్యేకించి పాత నమాజ్వలె
చేయునది కాదు. ఎవరికి తెలిసినది వారు చేయుట అని చెప్పవచ్చును
గానీ ప్రత్యేకముగా చేయునది కాదు కనుక సామూహికముగా చేయలేము.
నియమిత కాలములో అనునదే ఉండదు. బయటికి కనిపించునది కాదు.
పాత నమాజ్ బయటికి తెలియును. పాత నమాజు చేయువారిని చూడ
వచ్చును. క్రొత్త నమాజ్ను చేయువారు ప్రక్కలోయున్నా వారిని గురించి
మనకు తెలియదు.
చాలామంది ముస్లీమ్ పెద్దలు అందరూ చేయు నమాజ్న కుదించిన
నమాజ్ యని అనుచుందురు. భయముతో నియమముతో చేయు నమాజ్ను
కట్టివేయబడిన నమాజ్, కుదించబడిన నమాజ్యని అనుచుందురు.
క్రొత్తగా నెలకొల్పమని చెప్పిన నమాజ్ కుదించబడిన నమాజ్ కాదు. ఇంతే
సమయములో ఇట్లే చేయవలెనను నియమము లేదు. అందువలన అందరూ
ప్రతి దినము చేయు నమాజ్కంటే ప్రత్యేకమయినది. నిత్యము అందరూ
ఒకచోట గుమికూడి చేయు నమాజ్ ఏడు ఆయత్ల పఠనముతో
కూడుకొనియుండును. మిగతా మతములలో కూడా ఏవో మాటలతోనో,
మంత్రములతోనో వారి ఆరాధనలు కూడుకొని యుండును. క్రైస్తవుల
ఆరాధన మాటలతో, హిందువుల ఆరాధన మంత్రములతో కూడుకొన్నట్లు
ముస్లీమ్ల ఆరాధన (నమాజ్) ఏడు వాక్యముల పఠనముతో కూడుకొని
యుండును. ఆ ఏడు ఆయత్లలో ముందు నాలుగు అల్లాహ్ను పొగడునవి,
తర్వాత మూడు అర్థించునవిగా యున్నవి. దేవుని ఆరాధనలో ఈ రెండు
విధానములు అన్ని మతములయందు గలవు. పొగడడము,
అడుగుకోవడము దేవుని వద్దే కాకుండా ప్రపంచ వ్యవహారములలో కూడా
యున్నది. ప్రపంచ వ్యవహారములలో కూడా ఒకనిని ముందు పొగిడి
తర్వాత అడిగితే వాడు ఏమయినా ఇవ్వగలడు. పొగడకుండా అడిగితే
ఎవడూ ఏమీ ఇవ్వడు. అదే సూత్రమునే అందరూ దేవుని విషయములో
కూడా ఉపయోగించారు. ముందు ప్రసన్నత కొరకు పొగడడము తర్వాత
లబ్ధి కొరకు అర్థించడము జరుగుచున్నది. ప్రపంచములో ఉపయోగించు
విధానమును దేవుని విషయములో ఉపయోగించడము దేవునికి ఇష్టము
లేదు. దానివలన మనుషులను, దేవున్ని సమానము చేసినట్లగును.
అయితే మనుషులకు తెలిసిన విధానము ఒక్కటే అయినప్పుడు
అదే విధానము ప్రకారము దేవుని ఆరాధన విషయములో ముందు
పొగడడము తర్వాత అడగడము అను రెండు పద్ధతులు గల దానినే
ఆచరించుచున్నారు. ఈ విధానము ఒక మతమునకే కాకుండా
మనుషులున్న ప్రతీ మతములో గలదు. ఒక మనిషి నుండి లాభమును
పొందవలసినప్పుడు వానిని పొగిడితే వాడు ప్రసన్నుడవును. తర్వాత
వానిని అర్థించితే అప్పుడు వాడు ఇచ్చుట జరుగుచున్నది. ప్రపంచ
విషయములో ముఖ్యమయిన దానినిగానీ, ముఖ్యముకాని దానినిగానీ
అర్థించడము జరుగుచున్నది. దేవుని వద్ద కూడా మనిషి అలాగే అర్థించు
చున్నాడు. అయితే దేవుని వద్ద అర్థించవలసినది ముఖ్యమైనదయిన
పరలోకము. దానిని మోక్షము అని అంటున్నాము. ముఖ్యమైన ముక్తిని
గురించి అడగడమును ప్రార్థన అని అనవచ్చును. 'ప్ర' అనగా ముఖ్యమైన
అనీ, అర్థన అనగా అడుగుకోవడము అని చెప్పవచ్చును. ప్ర+అర్థన=ప్రార్థన
అని అంటున్నాము. అయితే నేడు చాలామంది ముఖ్యముకాని దానిని
దేవుని వద్ద అడుగుచూ, దానిని కూడా ప్రార్థనయని అంటున్నారు. ముఖ్యము
కాని దానిని అడగడము దేవునికి కూడా సరిపోదు. అంతేకాక అందరినీ
పొగడినట్లు తనను పొగడడము, అందరినీ అడిగినట్లు తనను అడగడము
దేవునికి ఏమాత్రము సరిపోలేదు. అలా చేయడము వలన మనుషులను,
దేవున్ని కలిపివేసినట్లగుచున్నది.
మనుషులలో హిందువులు ధ్యానము అనీ, క్రైస్థవులు ప్రార్థనయనీ,
ముస్లీమ్లు నమాజ్ అను పేర్లతో చేయు ఆరాధనలు ఏవీ దేవునికి (అల్లాహ్)
కు సరిపోవు. అందువలన మూడు మతములలో యున్న మనుషులకు
తనను ఎలా ఆరాధించవలెనో తెలుపుచూ నేడు దేవుని విధానములో
చేయు ఆరాధనలన్నీ ఏవీ తనకు సరిపోవనీ, తనకు ఇష్టము లేదని తెలిపి
తనకిష్టమైన విధానమును ప్రజలకు తన గ్రంథముల ద్వారా తెలియజేశాడు.
మనిషి తనతో కలియవలెనని అనుకోవడమే తనకు ఇష్టమనీ, మిగతా ఏవీ
తనకు ఇష్టము లేదని తెలియజేశాడు. అదే విషయమునే తన గ్రంథములలో
కలయిక లేక ఐక్యము అను అర్థముతో తన ప్రార్థనను గురించి చెప్పాడు.
దేవుడు తన మూడు గ్రంథములలో చెప్పిన దానిని నేడు క్రొత్త నమాజ్
అని అంటున్నాము. పాత నమాజ్ మనుషులు సృష్టించుకొన్నది. క్రొత్త
నమాజ్ దేవుడు సృష్ఠించినది. అందువలన దైవ గ్రంథములలో క్రొత్త
నమాజ్ను నెలకొల్పమని చెప్పాడుగానీ, పాత నమాజ్ను గురించి ఎక్కడా
ఏమీ చెప్పలేదు. పాత నమాజ్ ముస్లీమ్లలో, ధ్యానము హిందువులలో
ప్రార్థన అను పేర్లతో క్రైస్థవుల యందు ఉండుట సహజమే. అయితే
మూడు మతముల ప్రజలలో అందరూ ధ్యానము, ప్రార్థన, నమాజ్లను
ఆచరించడము లేదు. దేవుని భయము యున్నవారు కొందరు, అట్లే దేవుని
మీద భక్తియున్నవారు కొందరూ అనగా దేవుని మీద భక్తితోనో, భయముతోనో
ప్రార్థన చేయుచున్నారు. మరికొందరు లాభము కొరకు చేయుచున్నారు.
ఎలా చేసినా నూటికి నూరుమంది దేవుని ఆరాధనలు చేయడము లేదు.
కొందరు మాత్రమే ఆరాధన చేయుచున్నారు. కొందరు దేవుడున్నాడని
నమ్మకమున్నా ఆరాధనలు చేయకున్నారు. కొందరు దేవుడు ఉన్నాడను
నమ్మకము కూడా లేకుండా నాస్తికులుగా యున్నారు. వారు ఆరాధనలు
చేయరు, ఆరాధనలలో పాల్గొనరు.
భారతదేశములోనే మొట్టమొదట దేవుడు మరియు దయ్యమును
గురించి తెలిసినది. అప్పుడు హిందూ సమాజము కలదు. అప్పుడు
కొందరు జ్ఞానులు తమకున్న జ్ఞానము చేత దయ్యమును వదలి దేవున్ని
ఆరాధించ వలెనని తెలుసుకొన్నారు. ఆ క్రమములో దేవుడు ఎవరో తెలియక
దయ్యములను అనేక దేవతలుగా ఆరాధించను మొదలుపెట్టారు.
సమయములో దేవుడు తన జ్ఞానమును ప్రజలకు తెలియబరచుటకు ఆకాశ
వాణి ద్వారా జ్ఞానమును పంపడము, చివరికది సూర్యుని ద్వారా భూమికి
చేరడము జరిగినది. అయినా భూమిమీద దేవుని జ్ఞానము మనుషులందరికీ
తెలియుటకు చాలా కాలము పట్టినది. కొందరికి దేవుని జ్ఞానము తెలిసినా
ముందునుండి అలవాటు పడిన పనులనే చేయుచూ దైవజ్ఞానము తెలియుట
వరకే అన్నట్లుండిరి. కొందరు మాత్రము దేవుని జ్ఞానము తెలిసి, జ్ఞానము
ప్రకారము నడుచుకొనేవారు. మొదట దైవజ్ఞానము కొంతవరకు
భారతదేశమంతా ప్రాకినా తర్వాత మాయ ప్రభావము వలన జ్ఞానము,
అజ్ఞానముల మధ్యలో కొందరు అటు, కొందరు ఇటు మారుచూ చివరికి
అజ్ఞానమే ఎక్కువగా పెరిగిపోయినది.
అటువంటి పరిస్థితులలో మనిషి దేవుని వద్దనుండి కొందరు,
దేవతల వద్దనుండి చాలామంది కోర్కెలను కోరను మొదలుపెట్టారు.
ఇతరులను ఏదయినా అడుగునప్పుడు అడిగేవారు అడుగవలసిన వాని
మెప్పును పొందితే అడిగినది తప్పక ఇచ్చునను ఉద్దేశ్యముతో కోర్కెలతో
కూడుకొన్న వారు తాము ఆరాధించు దేవున్నిగానీ, దేవతలనుగానీ ముందు
బాగా పొగిడేవారు. తర్వాత తమ కోర్కెలను వెలిబుచ్చి అడిగేవారు. దానినే
మొదట ఆరాధనయని అన్నారు. ఆ రోజులలో ధనమే అన్నిటికీ మూలము
అని ధనము ఉంటే అన్ని పనులు జరుగునని తలచి దేవతా పూజలలోగానీ,
దేవుని పూజలోగానీ చివరకు ధనమునే కోరుచుండిరి. ధనమును కోరుటకు
చేయవలసిన ఆరాధనలను మనిషి ఏర్పరచుకున్నాడు. ఆనాడు ఈనాడు
చేయు పూజలను ఆరాధన యనుటలో అర్థము గలదు. ఆరాధన పదమును
విభజించి చూస్తే చివరిలో 'ధన'యని కలదు. దేవతల వద్ద తమకు
కావలసిన ధనము కొరకు ఆరా తీయడమును ఆరాధనయని చెప్పడము
జరుగుచున్నది. మొదట ఆ విధముగా దేవతలవద్ద ఆరాధనలు తయారు
కాగా, చివరకు దేవునివద్ద కూడా అదే ఆరాధనను చేయుటకు మొదలు
పెట్టారు. వాస్తవముగా దేవునివద్ద చేయు ఆరాధన వేరు, దేవతల వద్ద
చేయు ఆరాధన వేరు.
దేవతల వద్ద చేయు ఆరాధన ప్రపంచ ధనమును ఆశించి చేయునది
యని చెప్పవచ్చును. అదే దేవుని వద్ద చేయు ఆరాధన జ్ఞాన ధనమును
ఆశించి చేయునదియని చెప్పవచ్చును. రెండూ ఆరాధనలే అయినా ఒకటి
దేవుని వద్ద, రెండవది దేవతల వద్ద చేయునదిగా యున్నది. దీనినిబట్టి
ఆరాధనలు రెండు తెగలని చెప్పవచ్చును. దేవునివద్ద చేయు ఆరాధన
జన్మలు లేని మోక్ష స్థితికి అనగా పరలోకమునకు తీసుకొని పోవును.
దేవతల వద్ద చేయు ఆరాధన జన్మలకు తీసుకొని పోవునదిగా యున్నది.
మనుషులు ఎక్కువగా జన్మలు కలుగజేయు దేవతా ఆరాధనలే చేయు
చున్నారు. జన్మలు లేకుండా చేయు ఆరాధనలు దేవుడు నిర్ణయము చేసి
చెప్పియున్నాడు. దేవుడు చెప్పినట్లు చేయు ఆరాధనలు జన్మలు లేకుండా
చేయును. కనుక అటువంటి ఆరాధనలను “నమాజ్" అని పేరుపెట్టి
చెప్పడము జరిగినది. నమాజ్ అనగా జన్మలు లేకుండా పోవడము అని
అర్థమును తెలుపుచున్నది. 'న' అనగా వద్దు, 'మ' అనగా నాకు, 'జ'
అనగా జన్మలు అని చెప్పవచ్చును. దేవుని ఆరాధనను నమాజ్ అని
పూర్వము కృతయుగము లోనే హిందువులు చెప్పేవారు. భూత కాలములో
లేదు, భవిష్యత్తు కాలములో లేదు అని చెప్పుటకు “న భూతో న భవిష్యత్”
అని చెప్పినట్లు “జన్మల విషయములో జన్మలు వద్దు, జన్మలు లేవు" అని
చెప్పుటకు నమాజ్ అని చెప్పారు. జన్మలు లేకుండా దేవునిలోనికి ఐక్యమగు
కోర్కెను తెలుపునదే నమాజ్ అని అర్థము. అయితే నేడు దేవుని ప్రార్థనలో
కూడా ఏదో ప్రపంచ కోర్కెలను ఆశించి చేయు ఆరాధనను నమాజ్ అని
అంటున్నారు.
ప్రపంచ ధనమును ఆశించి దేవతలను పూజించువారు తమ
పూజలను ఆరాధనయని అన్నట్లు అట్లే పరమాత్మ ధనమును ఆశించి
పూజించు వారు కూడా తమది ఆరాధనేయని చెప్పుచున్నట్లు రెండు రకముల
ఆరాధనలను దేవుడు దేవతల పట్ల చేసినట్లు, రెండు రకముల నమాజ్లను
దేవునివద్ద చేయుచున్నారు. దానినే ఖుర్ఆన్ గ్రంథములో (4-103) లో
గల అందరూ చేయు పాత నమాజు అనియూ, ఒక్క మనిషి అయినా
క్రొత్తగా నెలకొల్పు దానిని క్రొత్త నమాజు అనియూ రెండు రకములు
గలవు. ఆ రెండు రకములు తెలియక ముస్లీమ్లు నమాజ్ ఒక్కటేయని
అనుకొన్నారు.
ద్వాపరయుగము వరకు భూమిమీద మతములు లేవు. ఉన్న
వారందరూ ఇందువులే యగుట వలన ఈ దేశమును ఇందూదేశము
అని అన్నారు. ఇందూ అను పేరుతో ఇందువులు ఉండేవారు. ఈ మధ్య
కాలములో దాదాపు 100 నుండి 150 సంవత్సరముల క్రితము 'ఇందూ'
అను శబ్దము, 'హిందూ' అను శబ్దముగా మారిపోయినది. కలియుగము
ప్రారంభమయిన తర్వాత మూడువేల సంవత్సరములకు మతములు
అనునవి పుట్టుకొచ్చినవి. అలా పుట్టిన వాటిలో మొదటిది క్రైస్తవ మతము.
మొదట అది సంఘముగా తయారయి, క్రైస్థవ సంఘము గుంపు పెరిగేకొద్దీ
అది మతముగా మారిపోయినది. క్రైస్తవ మతము తయారయిన తర్వాత
ఇందూ సమాజముగా యున్నవారు తమది ఇందూమతము అని చెప్పారు.
ఇట్లు ఇందూమతముగా తయారయ్యే వరకు ఇందూ సమాజముగా
యున్నవారు తమ కోర్కెల నిమిత్తము అనేక దేవతలను ఆశ్రయించి వారిని
ఆరాధించడము జరిగేది. అప్పటి దేవతలను ఆరాధించకూడదని
కలియుగము మొదటిలోనే తౌరాతు జ్ఞానము (భగవద్గీత జ్ఞానము) బయటికి
వచ్చినది. అయినా తౌరాతు జ్ఞానమును కొందరే అర్థము చేసుకోగలిగి
దేవుడు వేరు, దేవతలు వేరని తెలియగలిగినా చాలామంది దేవతారాధకులే
ఉండేవారు.
ఆనాడు తౌరాత్ జ్ఞానము వలన దేవుడు, దేవతలు అని
రెండు భాగములు చేసి, దేవుని ఆరాధన వేరు, దేవతల ఆరాధన వేరని
చెప్పియున్నా, ప్రపంచ ధనమును ఇచ్చు దేవతలనే ఆశ్రయించి
ఆరాధించడము ప్రజలకు అలవాటై పోయినది.
కలియుగములో భగవద్గీత ప్రథమ దైవగ్రంథముగా బయటికి
వచ్చినా, అంతకు ముందు యుగములనుండి దేవతా పూజలకు అలవాటు
పడిన ప్రజలు భగవద్గీత మాటను లెక్కచేయక దేవతారాధనయందే ఆసక్తిని
చూపుచుండిరి. అటువంటప్పుడు దేవతారాధనలలో రెండు ఆరాధనలు
పేరుగాంచియుండేవి. ఈ రెండు ఆరాధనలను పేరుతో పిలుస్తున్నా వాటిలో
తేడాలుండేవి. ఆ తేడాలనుబట్టి వాటికి పేర్లు కూడా పెట్టారు. వాటిని
యజ్ఞములు మరియు తపస్సులుగా చెప్పేవారు. యజ్ఞములు
దేవతారాధనలలో ఒకటయినా యజ్ఞములను చేయు విధానము వేరు,
తపస్సులను చేయు విధానము వేరుగాయుండేది. తపస్సు చేయడములో
ఏదో ఒకటి తలచుటయో, జపించుటయో జరుగుచుండును. తపస్సు
చేయువారు జపించే మంత్రముగానీ, తలచే మాటగానీ బయటికి
తెలియకుండా జపించేవారు. తపస్సు చాలావరకు మౌనముగా సాగేది.
యజ్ఞములకంటే తపస్సులు చేయువారు గొప్పవారు అను భావము
ఉండేది. తపస్సు చేయువారు తపశ్శక్తిని పొందేవారు. తపశ్శక్తికి దేవతలు
సహితము భయపడేవారు. దేవతలను ఆరాధించగా వచ్చిన తపశ్శక్తికి
దేవతలే భయపడేవారంటే దేవతల ఆరాధనలలో గొప్ప ఆరాధన తపస్సని
చెప్పవచ్చును. ఇది ఎవరికి వారు చేసేదేగానీ సామూహికముగా చేయునది
కాదు. ఎవరి సహాయముతో లేకుండా చేయునది తపస్సు.
యజ్ఞములు చేయడము ఒక విధమైన దేవతారాధనయని
చెప్పవచ్చును. ముందే ఒక కోర్కెను ఉద్దేశ్యములో పెట్టుకొని దేవతల
కొరకు చేయు ఆరాధన యజ్ఞము అని చెప్పవచ్చును. యజ్ఞము ద్వారా
ఒక దేవతనుగానీ లేక ఎక్కువమంది దేవతలను గానీ ఆరాధించుచూ
చేయునది యజ్ఞము. యజ్ఞము మౌనముగా తపస్సువలె చేయునది కాదు.
యజ్ఞము ఒకే వ్యక్తి చేయలేడు. కొందరితో కలిసి ఒక దేవున్ని గానీ,
ఎక్కువ మంది దేవుళ్ళనుగానీ ఆరాధించవచ్చును. యజ్ఞములో అగ్నిని
రగిల్చి అగ్నిలో ఆహుతి చేసి ప్రతి వస్తువు వారు సంకల్పించుకున్న దేవతకు
చేరునని చేయువారి నమ్మకము. యజ్ఞము ఒక్కరు చేయునది కాదు
సామూహికముగా చేయునది. యజ్ఞము చేయువారు వేదమంత్రములను
చదువుచుందురు. వేదమంత్రములు లేని యజ్ఞము ఎక్కడా చేయబడదు.
యజ్ఞములతో వేదములు సంబంధపడియుండును. అట్లే తపస్సుతో ఏదో
ఒక మంత్రము సంబంధపడియుండును. మంత్రము వేరు, తపస్సు
వేరయినట్లు, యజ్ఞము వేరు వేద పఠనము వేరుగా యున్నది. మనుషులు
చేయు దేవతల ఆరాధనలలో యజ్ఞములు, తపస్సులు ముఖ్యపాత్రను
పోషించుచున్నవి.
తపస్సులు, యజ్ఞములు రెండూ కృతయుగము నుండి వచ్చుచున్నవే.
యజ్ఞములు ఒక హిందూమతములోనే ఉండగా, తపస్సులు అన్ని మతముల
లోనూ ఉన్నవి. యజ్ఞములు మొదటినుండి యజ్ఞములుగానే చెప్పబడు
చున్నవి. వాటి పేరులోగానీ, ఆచరణలోగానీ ఏ మార్పు లేదు. అయితే
తపస్సులు తపస్సులుగా చెప్పబడడము లేదు. కొందరు తపస్సుయనగా,
కొందరు ధ్యానము అంటున్నారు. తపస్సు అన్ని మతములలోనికి చొచ్చుకొని
పోయినదంటే వినేవారందరికీ ఆశ్చర్యముగా ఉండును. ఎవరు
ఏమనుకొన్నా తపస్సు అను ఆరాధన అనేక రూపములలో, అనేక పేర్లతో
అన్ని మతములలో ఉన్నదనుట సత్యము. తపస్సును గుర్తించుట చాలా
సులభము. తపస్సు ఎక్కడున్నా దానికి చిన్న మంత్రమో, లేక పెద్ద మాటయో
తగిలించబడియుండును. ఆ లెక్కప్రకారము ఎక్కడ అయితే మంత్ర
పఠనగానీ, మాటల పలుకులు తలచుటగానీ ఉండునో అక్కడ తపస్సు
ఉన్నదని చెప్పవచ్చును. నేడు ధ్యానము అని కొందరూ, మెడిటేషన్ అని
కొందరూ అనుచున్నా అది తపస్సు క్రిందికే జమకట్టబడును. క్రైస్థవుల
ప్రార్థనలయందు చెప్పబడు మాటలను చేర్చి వారి ప్రార్థనను తపస్సుయని
చెప్పవచ్చును. తపస్సు అనునది ఒక నిమిషము నుండి ఒక సంవత్సరము
వరకు చేయవచ్చును. తపస్సుకు కాలపరిమితి లేదు. ఎక్కడ చేసినా,
ఎవరు చేసినా, ఎప్పుడు చేసినా మంత్రముతో కూడి చేయునది తపస్సే
యగును.
నేడు ముస్లీమ్ మతములో అనగా ఇస్లామ్ సమాజము వారు తమ
ప్రార్థనా మందిరములయిన మజీద్లలో నిలబడిగానీ, కూర్చుండిగానీ
ఖుర్ఆన్ గ్రంథములో మొదటి సూరా అయిన అల్ఫాతిహా సూరాలో
ఏడు ఆయత్లను పఠించుచూ చేయు నమాజ్ అను ఆరాధన కూడా ఒక
రకముగా తపస్సనియే చెపవ్పచ్చును. తపస్సు అను పదము ముస్లీమ్లలో
గానీ ఖుర్ఆన్ దైవగ్రంథములోగానీ చెప్పకున్నా, అలా మాటల పఠనతోగానీ,
చిన్న మంత్ర పఠనతోగానీ చేయు ఆరాధన తపస్సుకు సంబంధించినదే
యగును. ఏదయితే ఏమి, అది దేవుని ఆరాధనే కదా!యని ఎవరయినా
అనవచ్చును. అది దేవుని ఆరాధనగానీ, దేవతల ఆరాధనగానీ అది దైవిక
మైన ఆరాధన కాదు. ప్రథమ దైవగ్రంథములో తపస్సు అధర్మములలో
ఒకటిగా చెప్పబడినది. ద్వాపరయుగము వరకు దేవుని మార్గములో
ఆటంకములు కల్గించు అధర్మములు ముఖ్యమైనవి నాలుగేయుండేవి.
కలియుగములో నేడు అధర్మముల సంఖ్య పెరిగి ఆరుకు చేరినది. అందులో
ఒకానొక అధర్మము తపస్సు. ప్రథమ దైవగ్రంథమయిన తౌరాతు
గ్రంథములో తపస్సు వలన దేవుడు తెలియబడడు అని ఖచ్చితముగా
చెప్పబడినది.
నేడు అధర్మములు మనుషుల అజ్ఞానమును ఆధారము చేసుకొని
వారు చేయు ఆరాధనల లోనికి చొచ్చుకొనిపోయి మనుషులు చేయు
ఆరాధనలు అధర్మములైనవిగా చేయుచున్నవి. మనుషులు తాము చేయు
ఆరాధనలు సక్రమమైనవేయని చేయుచున్నారు. అలాంటి నమ్మకమును
అధర్మములు మనుషులలో కల్గించినవి. నేడు ముస్లీమ్లు ఎంతో
విశ్వాసముతో దేవున్ని ప్రార్థించాలను ఉద్దేశ్యముతో ఖుర్ఆన్ గ్రంథములో
మొదటి సూరాలోని ఏడు ఆయత్లను పఠించుచూ నమాజ్ చేయుచున్నారు.
అలా చేయు నమాజ్ను మనుషులు బోధించారు గానీ, దేవుడు బోధించలేదు.
మనుషుల బోధలలో దూరిన అధర్మములు చివరకు ప్రార్థనలో కూడా
చేరినవి. తపస్సుగాయున్న ఏ ఆరాధన వలనగానీ దేవున్ని తెలియుటకు
శక్యముకాదు అని ప్రథమ దైవగ్రంథములో చెప్పబడియున్నది. దాని
ప్రకారము నేడు ముస్లీమ్లు చేయు నమాజ్ వలన దేవుడు తెలియబడడు.
దానివలన పరలోకము లభించదు. ఈ విషయము మనుషులకు
తెలియకున్నా దేవునికి అన్నీ తెలుసు. అందువలన మనుషులు తనను
చేరుటకు నిజమైన ఆరాధన, నిజమైన నమాజ్ను తెలియజేయాలనుకొన్నాడు.
దేవుడు తనవద్దకు చేరాలనుకొన్న వారికి నిజమైన నమాజ్న
తెలియజేస్తూ (4-103) వ వాక్యములో 'నమాజ్ను నెలకొల్పండి' అన్నాడు.
దానివలన పాత నమాజ్ను మీరు ఎప్పుడు చేసినా ఫరవాలేదు. నియమ
నిబంధనలు లేని, మంత్ర పఠన లేని, నిర్ణీత సమయము లేని నమాజ్న
సూచించాడు. అయినా మనుషులు దానిని గుర్తించలేక దానిని కూడా
పాత నమాజ్ క్రిందికే జమకట్టుకున్నారు. దేవుడు ఒకవైపు పాత నమాజును
చేస్తూ మరొకవైపు క్రొత్త నమాజును నెలకొల్పమన్నాడు. అదియూ బయట
ప్రపంచములో అనుకూలమైనప్పుడు, శాంతిభద్రతలున్నప్పుడు అని చెప్పినా
ఇదేదో ప్రత్యేకమయినది అని అనుకోవడము లేదు. ఈ విధముగా ఒక్క
ముస్లీమ్ మతములోనే కాదు అన్ని మతములలో వారివారి ఆరాధనలను
వదలుకోలేక పోవుచున్నారు. మనుషులు ఏర్పరచిన ఆరాధన కాదని,
దేవుడు చెప్పిన ఆరాధనను స్వీకరించడము లేదు. ఒకవేళ మాలాంటి
వారు మీరు చేయుచున్న ఆరాధనలో మంత్రములున్నవి. మంత్రములుగానీ,
మాటలుగానీ లేని ఆరాధనను దేవుడు కోరుకొంటున్నాడు అని చెప్పినా
వినకున్నారు.
మనుషులుగా యున్నవారు సత్యమును చెప్పినా సాటి మనుషులు
వినకున్నారు. ఇది ఇప్పుడు సమస్యకాదు పూర్వమునుండి అనగా సృష్ట్యాది
నుండి ఉండే సమస్యయే. ప్రతీ విషయానికి దేవుడు వచ్చి చెప్పడము
సాధ్యము కాదు. దేవుడు వచ్చి స్వయముగా బోధించడు. దేవుడు ఎవరితోనూ
మాట్లాడడు. ఆయన మౌనముగా ఉండువాడే. అందువలన మొదట తన
పాలకులయిన ఆకాశము ద్వారా తన జ్ఞానము చెప్పించాడు. ఆకాశము
తన శబ్దము ద్వారా దేవుని జ్ఞానమును తెలియజేసింది. దేవుడు ఆకాశ
వాణి ద్వారా తెలియజేయడమేమిటి యని మనుషులు అనుకొను
అవకాశమున్నది కావున అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్లో సూరా
42, ఆయత్ 51 లో ఇలా చెప్పాడు చూడండి.
(42-51) “దేవుడు ఏ మానవునితోనూ ప్రత్యక్షముగా మాట్లాడడు.
దేవునితో మాట్లాడడము మనిషికి సాధ్యమయ్యే పనికాదు. దేవుడు
తన జ్ఞానమును వాణి ద్వారా (నహీ ద్వారా) లేక తెరవెనుక
నుంచి, మనిషికి చేరలేస్తాడు. లేదా తాను కోరినది తన ఆజ్ఞతో
సూచించడానికి తన ప్రతినిధిని పంపుతాడు. ఆయన
మహోన్నతుడు, ఎంతో వివేకవంతుడు.”
ఈ వాక్యమును బట్టి దేవుడు గతములో శబ్దము ద్వారా జ్ఞానమును
తెలియజేశాడని నిరూపణ అయినది. దేవుడు వాణి ద్వారాయే కాక మిగతా
రెండు విధముల జ్ఞానమును తెలిపినా, మొదట వాణిద్వారా వచ్చిన జ్ఞానమునే
చెప్పుతూ వచ్చాడు. అయినా మనిషి దేవుని జ్ఞానమును తెలిసిన జ్ఞానిని
అనుకొంటున్నాడుగానీ, దేవుడు చెప్పిన జ్ఞానమును ఏమాత్రము అందుకోలేక
పోవుచున్నాడు. ఆ మాట వాస్తవమనుటకు ఖుర్ఆన్ గ్రంథములో దేవుడు
'నమాజును నెలకొల్పండి' యని చెప్పినా దానిని గ్రహించలేకపోయాడు.
ఈ విధముగా మనిషి అజ్ఞానములో మొదటినుండి ప్రయాణిస్తూ నేను
జ్ఞానములోనే ఉన్నానని ఊహించుకొంటున్నాడు. మనిషికి ఒకమారు చెప్పితే
సరిపోలేదని గ్రహించిన దేవుడు, తాను మనుషులకు తెలియజేయు మూడు
విధానములను ఒక్కమారుతో ఆపకుండా మరీమరీ ఆ మూడు విధానముల
ద్వారా చెప్పుచున్నాడు. సూర్యగ్రహము మనకు తెలిసినంతలో రెండుమార్లు
భూమిమీదికి వచ్చి జ్ఞానము చెప్పాడు. అలాగే దేవుని ప్రతినిధి మానవ
రూపములో రెండుమార్లు భూమిమీదికి వచ్చి జ్ఞానమును చెప్పిపోయాడు.
ఇకపోతే ఆకాశవాణి ప్రతీ సంవత్సరము తన శబ్దము ద్వారా జ్ఞానమును
గ్రహములకు, భూతములకు తెలియజేస్తూనే యున్నది. వాణి ద్వారా
అందుకొన్న ఆజ్ఞను అనుసరించి గ్రహములు, భూతములు తమ
చేతనయినంత వరకు మనుషులు జ్ఞానమార్గములో నడుచునట్లు
చేయుచున్నారు.
ఆకాశవాణి మేఘరూపములో గర్జించుచూ, పెద్దపెద్ద శబ్దములను
కల్గించుచున్నది. ఆ శబ్దములలోని అర్థము మనుషులకు తెలియదు.
గ్రహములు, భూతములు మాత్రము గ్రహించగలుగుచున్నవి. మేఘములు
ఆకాశము రెండూ ఒక్కటే. ఆకాశము అప్పుడప్పుడు మేఘముల రూపములో
దర్శనమిచ్చుచుండును. మేఘములు గర్జించునప్పుడు వర్షము వచ్చును.
వర్షము వచ్చినప్పుడు బయట ప్రదేశములో పనులన్నీ వదలుకొని మనుషులు
ఊరక నిలుచుందురు. అప్పుడు మేఘముల శబ్దములు వినే అవకాశము
దొరుకును. మేఘముల శబ్దములే ఆకాశవాణి యని చెప్పుచున్నాము. ఆ
శబ్దమునే వహీ అని ఖుర్ఆన్లో అన్నారు. వహీ అంటే వారి భాషలో
చెప్పిన వాక్యము అని చాలామంది అనుకోవడము జరుగుచున్నది. మనము
మాట్లాడు భాషలో ఎప్పుడూ వహీ రాలేదు. మాటల రూపములో వహీ
వచ్చిందని చాలామంది అనుకోవడము జరుగుచున్నది. అలా ఎప్పుడూ
రాలేదు. ఆకాశము నుండి వహీ లేక వాణి సంవత్సరమునకు ఒకమారు
రావడము నేడు అందరికీ తెలుసు. ఈ రోజులలో ఎట్లు శబ్దము
ఉరుముల రూపములో వచ్చినదో ఆ రోజు కూడా అలాగే ఉరుముల
రూపములోనే వాణి రావడము జరిగినది. నేడు మనకు మేఘముల శబ్దము
ఎలా అర్థము కాలేదో ఆనాడు కూడా ఎవరికీ అర్థము కాలేదు. దానిని
ఆకాశములోని సూర్యుడు (జిబ్రయేల్) గ్రహించి భూమిమీద మనుషులకు
మనుషుల భాషలో తెర చాటునుండి చెప్పడము జరిగినది. ఆనాటి నుండి
నేటివరకు దేవుడు మొదట మేఘముల ద్వారా పంపిన జ్ఞానమే మూడు
దైవ గ్రంథములయందు చెప్పబడినది. ఈ కాలములో కూడా ప్రతీ
సంవత్సరము ఆకాశవాణి తన శబ్దము ద్వారా తన సందేశమును
తెలియజేస్తూనే యున్నది. ఆ భాష ఎవరికీ తెలియదు. ఆకాశ భాష
తెలిసినవారు గ్రహములు, భూతములని చెప్పాము. నేడు భూమిమీద
దేవుని పాలనను నడుపుచున్నవి గ్రహములు, భూతములే. అవి ఎక్కడో
ఆకాశములోనే ఎప్పుడూ లేవు. భూమిమీద మన మధ్యనే ఉంటూ, మనలను
బయట కష్టసుఖములకు లోను చేస్తున్నవి. గ్రహములు, భూతములు
మన మధ్యలో ఉంటూ ఎన్నో కార్యములను మనకు తెలియకుండా చేస్తున్నవి.
మనకు ఆకాశవాణి భాషరాదు. ఆ భాష దేవుని పాలనలో పాలనను
సాగించు పాలకులయిన గ్రహములకు, భూతములకు తెలుసు. వారు
ప్రతీ సంవత్సరం ఆకాశము చెప్పు సూచనలను వారి భాషలో గ్రహించు
చుందురు. అలా వారు తెలియగలిగిన సమాచారములు మనకు
తెలియాలంటే దేవుని పాలకులు ఫలానావారు, ఫలానాచోట ఉన్నారని
తెలియగలిగితే తమకు తెలిసిన జ్ఞానమును మాకు తెలుపమని వారిని
వేడుకొంటే వారు స్వచ్ఛమయిన దేవుని జ్ఞానమును తెలుపగలరు. అలా
వారి భాష తెలియగలిగితే వారు ముందు మనిషిని జ్ఞానమును తెలియమని
హెచ్చరించుచున్నారు. మీరు జ్ఞానము తెలియక పోవడమే కాక, దేవుని
జ్ఞానమును నిందించడము జరుగుచున్నదని, అలా చేయుట వలన మేము
చాలామందిని చంపివేశామని చెప్పుచున్నారు. దైవజ్ఞానమును నిందించిన
వారిని వారు నిందించిన 24 గంటలలో చంపివేశామని చెప్పుచున్నారు.
వారు దేవుని జ్ఞానమును చెప్పే దానికంటే వారు వేయుచున్న శిక్షలను
వింటే చాలా భయము పుట్టుకొస్తున్నది. దేవున్ని వదలి, దేవున్ని ఏమాత్రము
తలచను కూడా తలచక, దేవుని జ్ఞానమునుగానీ, దేవుని గ్రంథములను
గానీ అపహాస్యము చేసినవారిని, దేవుని ఆరాధనను చేయక దేవతల
ఆరాధనను చేయువారిని, దేవతల గుడులకు పోవునప్పుడు వారిని రోడ్డు
ప్రమాదములలో చంపివేయుచున్నామనీ, కొందరిని అంగహీనులను
చేస్తున్నామనీ చెప్పుచున్నారు. ఎక్కువగా దేవాలయములకు భక్తిగా పోవువారి
మీద దృష్ఠి కేంద్రీకరించి ఎక్కువగా వారినే రోడ్డు ప్రమాదములలో
ప్రమాదములకు గురి అగునట్లు చేయుచున్నామని తెలుపుచున్నారు. అదే
విధముగా పెళ్లి సంబంధమునకు గానీ, పెళ్లికిగానీ పోవువారిని కూడా
ప్రమాదముల పాలు చేయుచున్నామని చెప్పుచున్నారు.
దేవుని పాలనను నడుపు గ్రహములు, భూతములు ప్రతీ మనిషి
వెంట ఉండి వారు చేయుచున్న ప్రతీ పనిని చూస్తూనే యున్నవి.
అవసరమునుబట్టి ఒక్కొక్క సమయములో పదుల సంఖ్యలో ఉండడము,
ఒక్కొక్కమారు ఎవరూ లేకుండా పోవడము కూడా జరుగుచున్నది. దైవ
దూషణ చేసినప్పుడు ఒకవేళ ఆ సమయములో అతనివద్ద గ్రహములు
ఉంటే ఆ గ్రహముల వలన అతనికి బాధలు తప్పవు. ఒకవేళ ఆ
సమయములో భూతములు అక్కడవుండి అతను దేవుని జ్ఞానమునకు
వ్యతిరేఖముగా మాట్లాడినది చూస్తే వారు అతనిని అదును చూచి తప్పక
చంపివేయుదురు. ఐదు తేళ్లు కుట్టిన బాధవరకు గ్రహములు కలుగజేయ
గలవు. అంతేగానీ చంపుటకు అధికారము లేదు. భూతములయితే
ఏకముగా చంపు అధికారమును కల్గియున్నాయి. ఈ విషయము ద్వితీయ
దైవ గ్రంథములో వ్రాయబడియున్నది. ఈ విషయములన్నీ సులభముగా
తెలియవచ్చును. దేవున్నిగానీ, దేవుని జ్ఞానమునుగానీ నిందించిన వారికి
గ్రహముల వలన, భూతముల వలన శిక్షలు తప్పవు.
దేవుని ఆరాధన విషయములో గ్రహములు, భూతములు
మనుషులను చూస్తూనే యుందురు. దేవున్ని వదలి దేవతలను పెద్దగా
తలచి ప్రపంచ సుఖముల కొరకు వారిని ఆరాధిస్తే అనేక సమయములలో
అనేక ఇబ్బందులు కలుగజేయుచుందురు. అయినా దానివలనే ఈ బాధలని
మనుషులకు తెలియదు. దేవుని పాలకులకు 24 గంటల ముందు
చేయవలసిన పనులకు ఆజ్ఞ ఇవ్వబడుచున్నది. దేవుని ఆజ్ఞను గ్రహించిన
పాలకులు మనుషులకు ముందే నిర్ణయించబడిన కర్మను రద్దు చేసి శిక్షలు
విధించగలరు. దేవతలను ఆశ్రయించి, దేవున్ని వదలిన వారికి శిక్షలు
వేయుచుందురు. దేవున్నే విశ్వసించి సరియైన జ్ఞానము తెలియక దేవున్ని
ఆరాధించు క్రమము తెలియక పోయిన వారిని గ్రహములు, భూతములు
గ్రహించుచుండును గానీ వారిని ఏమీ అనరు. వారికి దేవుడు జ్ఞానము
తెలియు అవకాశమిచ్చినప్పుడు వారు తెలియకపోతే, నేను పట్టిన కుందేలుకు
మూడే కాళ్లు అను ధోరణిని అవలంభించి, నాకు తెలిసినదే నేను చేస్తానని
జ్ఞానమును తెలియకపోతే అప్పుడు వారిని గ్రహములు, భూతములు
కష్టాలకు గురి చేస్తారు. అంతకంటే ఎక్కువ శిక్షను వేయరు. అట్లుకాకుండా
జ్ఞానమును దూషిస్తే కఠినముగా శిక్షలు వేస్తారు. దేవుని పాలకులు
దేవుడనినా, దేవుని జ్ఞానమనినా ఎంతో ఇష్టపడుతారు. జ్ఞానులను చూచి
సంతోషిస్తారు.
గత జన్మల పాపము వలన కర్మను అనుభవించు తీర్పు చేయబడి
పెద్దపెద్ద రోగముల చేత పీడింపబడువారు దేవుని జ్ఞానమును తెలియగలిగి
దేవుని మీద విశ్వాసము పొంది, దైవజ్ఞానమును తెలియుటకు ఇష్టపడు
వారిని రక్షించు పనిని కూడా చేయుచున్నారు. దేవుని పాలకులు శిక్షించు
వారేకాదు రక్షించువారు కూడా యని తెలియవలెను. మాకు తెలిసినంత
వరకు దేవుని జ్ఞానమును దూషించిన వారిని 24 గంటలలోపు కొందరినీ,
వారము సమయములో కొందరినీ, నెల లోపల కొందరినీ అక్కడక్కడ చంపిన
సంఘటనలు గలవు. కొందరు క్యాన్సర్ రోగులు, ఎయిడ్స్ రోగులు రోగము
ముదిరిపోయిన వారు దేవుని జ్ఞానము తెలిసి దానినే ఆశ్రయించడము
వలన నిజమైన ఆరాధన చేయడము వలన ఖుర్ఆన్ గ్రంథములో (4-103)
లో చెప్పినట్లు అసలయిన నమాజును చేయడము వలన వారి శరీరములో
క్యాన్సర్, ఎయిడ్స్ రోగములు కూడా మాయమైపోయి. వారు సంపూర్ణ
ఆరోగ్యము గలవారుగా మారడము వెనక దేవుని పాలకుల హస్తముందని
తెలియుచున్నది. అందువలన ఇప్పటినుండయినా దేవుని ఆరాధనను దేవుడు
చెప్పినట్లే చేస్తాము.
అసత్యమును వేయిమంది చెప్పినా, అది సత్యము కాదు,
సత్యమును వేయిమంది కాదనినా, అదిఅసత్యము కాదు.
హిందూ రక్షణా! హిందూ భక్షణా!!
భగవద్గీతయే చదవనివాడు హిందూ రక్షకుడా?
హిందూ ధర్మమే తెలియనివారు హిందూ రక్షకులా?
హిందువులు నేడు కులాలుగా చీల్చబడి, అందులో హెచ్చుతగ్గు
కులములుగా వర్ణించబడియున్నారు అనుట అందరికీ తెలిసిన సత్యమే.
దేవుడు మనుషులందరినీ సమానముగా పుట్టించితే కొందరు మనుషులు
తమ స్వార్థ బుద్ధితో హిందూ (ఇందూ) సమాజమును ముక్కలు ముక్కలుగా
చీల్చి, బలహీనపరచి హిందూసమాజమునకంతటికీ తామే గొప్పవారమనీ,
తాము చెప్పినట్లే అందరూ విని, అన్ని కార్యములు చేసుకోవాలనీ ప్రచారము
చేసుకొన్నారు. ఎన్నో కులములుగా యున్న హిందూ సమాజములో తమ
కులమే అగ్రకులమని చెప్పుకోవడమే కాకుండా, ఇతర కులముల వారందరికీ
తామే మార్గదర్శకులమనీ, గురువులమనీ ప్రకటించుకొన్నారు. భవిష్యత్తులో
తమకు ఎవరూ అడ్డురాకుండునట్లు, అన్ని కులములను అంటరాని
కులములను చేసి, హిందూ సమాజమునకు తీరని అన్యాయము చేశారు.
అంతటితో ఆగక నేటికినీ హిందూ సమాజ రక్షకులుగా చెప్పుకొనుచూ,
హిందూ సమాజమును సర్వనాశనము చేయుచూ, హిందూ సమాజము
ఇతర మతములుగా మారిపోవుటకు మొదటి కారకులగుచున్నారు.
అటువంటివారు హిందూ సమాజమునకు చీడ పురుగులుగాయున్నా,
మిగతా కులముల వారందరూ వారి నిజ స్వరూపమును తెలియక వారు
చెప్పినట్లే వినుట వలన, హిందూ సమాజమును పూర్తిగా అజ్ఞాన దిశవైపుకు,
అధర్మ మార్గమువైపుకు మళ్ళించి, ప్రజలకు ఏమాత్రము దైవజ్ఞానమును
తెలియకుండా చేసి, తాము చెప్పునదే దైవబోధయని నమ్మించారు.
అటువంటి స్థితిలో నేడు త్రైత సిద్ధాంతకర్తగా ఆచార్య ప్రబోధానంద
యోగీశ్వరులవారు అజ్ఞాన దిశవైపు నిలిచి పోయిన హిందూసమాజమును
సరియైన దారిలో పెట్టుటకు, భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తి యోగమను
అధ్యాయమున బోధింపబడిన క్షర, అక్షర, పురుషోత్తమ అను ముగ్గురు
పురుషుల విషయమును త్రైత సిద్ధాంతము అను పేరుతో ప్రతిపాదించి
దైవజ్ఞానమును అందరికీ అర్థమగులాగున గ్రంథరూపములో వ్రాయడము,
బోధించడము జరుగుచున్నది. దానివలన నేడు ప్రజలు అసలైన జ్ఞానము
తెలియుచున్నదని సంతోషపడుచున్నారు. అగ్రకులముగానున్న వారిలో
కూడా ఎందరో తమ అజ్ఞాన చీకటులను వదలి, ఇంతవరకూ తమకు
తెలియనిజ్ఞానము యోగీశ్వరుల ద్వారా ఇప్పుడు తెలియుచున్నదని
సంతోషపడి శిష్యులుగా చేరిపోవుచున్నారు. అయితే అగ్రకులములో
కొందరు మాత్రము యోగీశ్వరులు తెలియజేయు జ్ఞాన విషయములను
చూచి ఈ జ్ఞానము వలన ప్రజలు జ్ఞానములో చైతన్యులై, జ్ఞానము తెలియని
తమను గౌరవించరని భావించి, దానివలన సమాజము మీద తమ
ఆధిపత్యము లేకుండా పోవునని తలచి, యోగీశ్వరులు తెలుపుచున్న త్రైత
సిద్ధాంతము గానీ, త్రైత సిద్ధాంత భగవద్గీతగానీ హిందువుల జ్ఞానమే
కాదనీ, అది క్రైస్థవ మతమునకు సంబంధించినదనీ, దానిని ఎవరూ
చదవకూడదని ప్రచారము చేయను మొదలుపెట్టారు. అంతేకాక తాము
హిందూధర్మరక్షకులమని, కొంత రాజకీయరంగు పూసుకొని, మా జ్ఞాన
ప్రచారమునకు అక్కడక్కడ అడ్డుపడడము జరుగుచున్నది. తమ మాట
విను ఇతర కులముల వారికి కూడా ప్రబోధానందయోగీశ్వరులు చెప్పు
జ్ఞానము హిందూ జ్ఞానము కాదు, క్రైస్తవుల జ్ఞానమని హిందువుల
ముసుగులో క్రైస్థవ మత ప్రచారము చేయుచున్నారని చెప్పడమేకాక,
అటువంటివారిని ప్రేరేపించి మా ప్రచారమునకు అడ్డు తగులునట్లు
చేయుచున్నారు.
యోగీశ్వరులు నెలకొల్పిన హిందూ (ఇందూ) జ్ఞాన వేదిక
ఇటువంటి ఆగడాలను కొంతకాలముగా ఓర్పుతో చూడడము జరిగినది.
మాలో ఓర్పు నశించి, మమ్ములను అన్యమత ప్రచారకులుగా వర్ణించి చెప్పు
అగ్రకులము వారిని, వారి అనుచరులను మేము ఎదురుదిరిగి ప్రశ్నించడము
జరిగినది. మేము ప్రశ్నించిన ఒక్క ప్రశ్నకు కూడా వారు సరియైన
సమాధానము ఇవ్వలేదు. ఆ జవాబులు ఎలా ఉన్నాయో పాఠకులుగా
మీరు చూడండి.
మా ప్రశ్న :- ఇంతవరకు ఏ హిందువూ చేయని విధముగా ఊరూరు
తిరిగి, ఊరులో ఇల్లిల్లూ తిరిగి హిందూ ధర్మములను ప్రచారము
చేయుచున్నాము కదా! అటువంటి మమ్ములను మీరు అన్యమత
ప్రచారకులుగా ఎందుకు చెప్పుచున్నారు?
వారి జవాబు :- హిందూమతములో ఎందరో స్వామీజీలు ఉన్నారు. వారు
ఎవరూ ఇల్లిల్లు తిరిగి ప్రచారము చేయలేదు. హిందువులు అట్లు ఎవరూ
ప్రచారము చేయరు. క్రైస్తవులయితేనే బజారు బజారు, ఇల్లిల్లూ తిరిగి
ప్రచారము చేస్తారు. మీరు హిందువుల ముసుగులో ఇల్లిల్లూ తిరిగి
క్రైస్తవమును ప్రచారము చేయుచున్నారు.
మా ప్రశ్న :- మేము క్రైస్తవులమయితే భగవద్గీతను ఎందుకు ప్రచారము
చేస్తాము?
వారి జవాబు :- మీరు ప్రచారము చేయునది త్రైత సిద్ధాంత భగవద్గీత.
అది క్రైస్తవులది. బైబిలుకే మీరు అలా పేరు పెట్టారు.
మా ప్రశ్న :- క్రైస్తవులు తమను క్రైస్తవులుగానే చెప్పుకుంటారు. అలాగే
బైబిలును బైబిలుగానే చెప్పుకొంటారు. వారి ప్రచారము క్రైస్తవము, బైబిలు
అయినప్పుడు అదే పేరుమీద ప్రచారము చేస్తారు తప్ప హిందువులుగా
భగవద్గీత పేరుతో ఎందుకు ప్రచారము చేస్తారు? ఇంతవరకు అట్లు ఎక్కడా
జరుగలేదు. ఏ మతమువారు ఆ మతము పేరు చెప్పుకొంటారు గానీ
ఇతర మతముపేరు చెప్పరు. అంతెందుకు మీరు మా భగవద్గీతను తెరచి
చూచారా? అందులో భగవద్గీత శ్లోకములున్నాయా? బైబిలు వాక్యము
లున్నాయా?
వారి జవాబు : త్రైత సిద్ధాంతమని యున్నది కదా! త్రైతము అంటే
త్రిత్వము అని త్రినిటి అని మాకు బాగా తెలుసు.
మా ప్రశ్న :- హిందూ ధర్మములలో అద్వైత సిద్ధాంతమును ఆదిశంకరా
చార్యుడు ప్రతిపాదించాడు. విశిష్టాద్వైతమును రామానుజాచార్యులు
ప్రతిపాదించాడు, ద్వైతమును మధ్వాచార్యులు ప్రకటించాడు. ఇప్పుడు
ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించాడు.
సిద్ధాంతకర్తలు, సిద్ధాంతములు వేరయినా అందరూ హిందువులని మీరు
ఎందుకు అనుకోలేదు?
వారి జవాబు :- మీ త్రైతసిద్ధాంత భగవద్గీతలో యజ్ఞములను చేయకూడదని
వ్రాశారు కదా! నిజముగా భగవద్గీతలో అలా లేదు కదా!
మా ప్రశ్న :- మీరు హిందువులలో ముఖ్యులుగా వుండి అంత మూర్ఖముగా
మాట్లాడితే ఎలా? ప్రపంచమునకంతటికీ ఒకే భగవద్గీతయుంటుంది గానీ,
మీ భగవద్గీత, మా భగవద్గీతయని వేరుగా ఉండదు. భగవద్గీతకు వివరము
ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా వారికి అర్థమయినట్లు చెప్పియుండవచ్చును
గానీ, అందరికీ భగవద్గీత మూల గ్రంథమొక్కటేనని గుర్తుంచుకోండి. త్రైత
సిద్ధాంత భగవద్గీత అన్నిటికంటే సరియైన భావముతో యున్నదని చదివిన
జ్ఞానులందరూ పొగడుచూయుంటే, మీ కులములో ఎందరో ప్రశంసించు
చూయుంటే, మీకు కొందరికి మాత్రము వ్యతిరేఖముగా కనిపించిందనడము
అసూయతోనే అని మాకు అర్థమగుచున్నది. యజ్ఞములు చేయవద్దని
మేము ఎక్కడా చెప్పలేదు. యజ్ఞముల వలన పుణ్యము వస్తుంది, స్వర్గము
వస్తుంది అని చెప్పాము. యజ్ఞముల వలన మోక్షము రాదు, దేవుడు
తెలియడని చెప్పాము. అంతెందుకు మీరు మేము అన్ని కులములకంటే
స్వచ్ఛమయిన హిందువులమని చెప్పుకొంటున్నారు కదా! భగవద్గీతలో
చెప్పిన ఒక్క హిందూ ధర్మమును చెప్పండి.
వారి జవాబు :- అవన్నీ మాటలు వద్దు... మీరు హిందువులు కాదు.
మా ప్రశ్న :- మొండిగా మాట్లాడవద్దండి మీరు అగ్రకులమువారమని
ఇష్టమొచ్చినట్లు మాట్లాడకండి. మేము హిందువులము కాము అనుటకు
ఆధారము ఏమైనా చూపగలరా? మా కథ అట్లుంచి మీరు సరియైన
హిందువులే అయితే భగవద్గీతలో విశ్వరూప సందర్శనయోగమను
అధ్యాయములో 48వ శ్లోకములోనూ, 53వ శ్లోకములోనూ భగవంతుడు
ఏమి చెప్పాడో మీరే చెప్పండి.
వారి జవాబు :– మేము ఇంతవరకు భగవద్గీత చదువలేదు. మీకు కావలసి
వస్తే సంపూర్ణానందస్వామితో చెప్పిస్తాము.
మా ప్రశ్న :– కనీసము భగవద్గీతను కూడా చదువని మీరు యోగీశ్వరులయిన
ప్రబోధానందస్వామిని దూషించడము మంచిదా? ఒక్క హిందూ ధర్మమును
కూడా తెలియని మీరు హిందూ ధర్మ రక్షకులమని చెప్పడము మంచిదా?
యోగీశ్వరుల వారు వ్రాసిన ఒక్క గ్రంథము కూడా చదువకుండ మేము
తప్ప పూజ్యులుగా, గురువులుగా ఎవరూ ఉండకూడదను అసూయతో
ఇలాగ మాట్లాడితే దేవుడు ఓర్చుకోడని చెప్పుచున్నాము.
వారి జవాబు :- హిందూ మతములో ఎందరో దేవుళ్ళున్నారు. శివుడు
దేవుడే, శివుని కొడుకు గణపతి దేవుడే, రాముడు దేవుడే, రాముని సేవకుడు
ఆంజనేయుడు దేవుడే. అలాంటి హిందూ మతములో దేవుడు ఒక్కడే
అని చెప్పడము మీది తప్పు కాదా?
మా మాట :- మేము మతమును గురించి చెప్పలేదు. హిందూ మతములో
ఎందరో దేవుళ్ళుండడము నిజమే, అయితే హిందూ జ్ఞానములో, హిందూ
ధర్మము ప్రకారము విశ్వమునకంతటికి ఒకే దేవుడని చెప్పాము. భగవద్గీతలో
దేవుడు చెప్పినదే చెప్పాము తప్ప మేము దేవతలను గురించి లేరని చెప్పలేదే!
దేవతలకందరికీ అధిపతియైన దేవుడు ఒక్కడున్నాడని, ఆయనే దేవదేవుడనీ,
అతనిని ఆరాధించమని చెప్పాము.
వారి జవాబు :- మీరు రాముని పేరు చెప్పరు, శివుని పేరు చెప్పరు,
వినాయకుని పేరు చెప్పరు. ఎవరి పేరూ చెప్పకుండా దేవుడు అనీ,
సృష్ఠికర్తయనీ అనేకమార్లు పేర్కొన్నారు. దేవుడు అను పదమునుగానీ,
సృష్టికర్తయను పదమునుగానీ క్రైస్తవులే వాడుతారు. హిందువులు వాడరు.
అందువలన మిమ్ములను హిందువులు కాదు క్రైస్తవులు అంటున్నాము.
మా ప్రశ్న :- క్రైస్తవ మతము పుట్టి రెండువేల సంవత్సరములయినది.
సృష్ఠిపుట్టి ఎన్ని కోట్ల సంవత్సరములయినదో ఎవరూ చెప్పలేరు. సృష్ట్యాది
నుండి 'సృష్ఠికర్త' అను పదమును 'దేవుడు' అను పదమును హిందూ
సమాజము వాడుతూనే యున్నది. మొదటినుండి హిందూసమాజములో
యున్న దేవుడు, సృష్ఠికర్త అను పేర్లను హిందువులు క్రైస్తవులకేమయినా
లీజుకిచ్చారా? లేక పూర్తిగా వారికే అమ్మేశారా? అని అడుగుచున్నాము.
సృష్ఠికర్త అనిగానీ, దేవుడు అనిగానీ హిందువులయినవారు అనకూడదని
ఎక్కడయినా ఉన్నదా అని అడుగుచున్నాము?
వారి జవాబు :- మీరు హిందూమతమును కాకుండా అన్యమతమును
బోధించుచున్నారనుటకు, మిమ్ములను మీరు హిందువులుగా చెప్పుకో
లేదు. హిందువులుగా కాకుండా ఇందువులుగా చెప్పుకొంటున్నారు.
అటువంటప్పుడు మీరు హిందూమతమును చీల్చినట్లు కాదా! ప్రత్యేకించి
ఇందూ మతము అను దానిని ప్రచారము చేసినట్లు కాదా! మీరు హిందువులే
అయినప్పుడు మీ గ్రంథములలోగానీ, మీ బోధలలో గానీ ప్రత్యేకించి
ఇందువులు అని ఎందుకు చెప్పుచున్నారు?
మా మాట :- మేము సూటిగా ఒక ప్రశ్నను అడుగుతాము జవాబు చెప్పండి.
హిందువు, ఇందువు అను పదములో కొద్దిపాటి శబ్దము తప్ప ఏమి
తేడాయుందో మీరే చెప్పండి. తెలుగు భాషను వ్రాసే వారందరూ
హిరణ్యకశ్యపున్ని చంపినది నరశింహస్వామి అని చెప్పుచుందురు అలాగే
వ్రాయుచుందురు. ప్రస్తుతకాలములో నరశింహులు అని పేరున్నవాడు
కూడా వాని పేరును నరశింహులు అని వ్రాయడము అందరికీ తెలుసు.
అయితే ఆ మాట తప్పు అలా వ్రాయకూడదు దానిని నరసింహ అని
వ్రాయవలెను అని చెప్పుచున్నాము. అడవిలో మృగరాజును సింహము
అని అంటాము తప్ప శింహము అని అనము అనికూడ చెప్పుచున్నాము.
'సింహము' అంటే అర్థమున్నది గానీ, 'శింహము' అంటే అర్థము లేదు
అని కూడా చెప్పాము. అలా ఉన్నది ఉన్నట్లు చెప్పితే 'ఇందువు' అనే
దానికి అర్థమున్నదిగానీ 'హిందువు' అనే దానికి అర్థములేదు అని చెప్పాము.
సృష్ట్యాదిలో పుట్టినది ఇందూ సమాజమనీ, అది మధ్యలో పేరుమారి 'దృష్ఠి,
జిష్ఠి' అయినట్లు 'ఇందూ' అను శబ్దము 'హిందూ' అని పలుకబడుచున్నదని
చెప్పాము. ఇందూ పదము ఎందుకు వాడాలి హిందూ పదమును ఎందుకు
వాడకూడదని కూడా వివరముగా మా గ్రంథములలో గలదు. ఉన్న సత్యము
మీకు తెలిసినా, మీరు మాకంటే పెద్ద ఎవరూ ఉండకూడదను అసూయతో
మాట్లాడుచున్నారు.
అగ్రకులములో ఎందరో పెద్దలు మా జ్ఞానమును తెలిసి
సంతోషించుచుండగా, కొందరు మాత్రము వీధి రౌడీలలాగా తంతాము,
పొడుస్తాము, కాలుస్తాము మీరు ప్రచారము చేయవద్దండని చెప్పడము
మంచిది కాదు. మా గ్రంథములు ఏదీ చదువకుండా మాట్లాడడమూ,
మేము చెప్పిన మాటలను వినకుండా ఇవన్నీ డ్రామాలు, నాటకాలు అనడము
మంచిది కాదు. మీరు ఎవరైనా మా గ్రంథములలో ఇతర మతములను
ప్రచారము చేసినట్లుగానీ, ఫలానా మతములోనికి చేరమని చెప్పినట్లుగానీ
ఉంటే నిరూపణ చేయండి, అలా నిరూపించిన వారికి ఇందూ జ్ఞానవేదిక
తరపున పది లక్షల రూపాయలను ఇవ్వగలము. నిరూపించ లేకపోతే
మీరు లక్ష రూపాయలు ఏ ఊరిలో శ్రీకృష్ణుని గుడికయినా ఇవ్వవలెను.
ఈ షరతుకు ఎవరైనా ముందుకు వస్తారా? అని అడుగుచున్నాము.
ఇట్లు,
ఇందూ జ్ఞానవేదిక.
చరిత్రలో జరిగిన అన్యాయము.
హిందువులలో జరుగుచున్న యదార్థము.
నాలుగువందల సంవత్సరముల క్రిందట ఆధ్యాత్మిక రంగములో
మెరిసిన వజ్రము వేమనయోగి. ఆధ్యాత్మికమను పాలను చిలికి దైవజ్ఞానము
అనే వెన్నను తీసి ఇచ్చినవాడు వేమన. వేమన తన పద్యములలో చెప్పిన
ఒక్కొక్క జ్ఞాన విషయము విపులముగా వ్రాసుకొంటే ఒక్కొక్క గ్రంథము
కాగలదు. వేమన స్వచ్ఛమైన తెలుగు భాషలో పద్యమును వ్రాసి చెప్పాడు.
సంస్కృతము జోలికి పోలేదు. ఒక ప్రక్క పద్యములు వ్రాసి కవిగా
కనిపించినా, ఒక ప్రక్క అంతు తెలియని ఆధ్యాత్మికవేత్త వేమనయోగి.
అయితే ఆయన పుట్టినది రెడ్డి కులమున. చరిత్రలో మాకంటే ఎవరూ
పెద్దగా ప్రశంసింపబడకూడదని గర్వములో యున్న అగ్రకులములోని
కొందరు పనిగట్టుకొని వేమన యోగిని పిచ్చివానిగా జమకట్టి, అతను
చెప్పింది జ్ఞానమేకాదని ప్రజలలో ప్రచారము చేశారు. పిచ్చివాని మాటలు
పిచ్చివారే వింటారు అని హేళనగా మాట్లాడడము జరిగినది. అనేక
కులములుగాయున్న హిందువులకు జ్ఞాన విషయములో పరిచయము
లేనిదానివలన, అగ్రకులము వారు వేమన చెప్పినది జ్ఞానమే కాదనడము
వలన, వేమన తన జ్ఞానమునకు తగినట్లుగా ప్రకాశింప లేకపోయాడు.
తాము అగ్రకులము వారమనీ, మిగతా వారందరూ తగ్గు కులమువారనీ
విభజించి, తాము చెప్పినట్లు వినవలెననీ, అట్లు వింటేనే మిగతా కులముల
వారందరూ సుఖముగా బ్రతుకగలరనీ, అగ్రకులమువారు ప్రచారము
చేసుకొన్నారు. అలా తమను తాము గొప్పగా ప్రకటించుకోవడమేకాక
హిందువుల ఇళ్ళలో జరుగు ప్రతి మంచి పనికీ, చెడు పనికీ, చావుకూ
పుట్టుకకూ, పెళ్ళికీ పేరంటానికీ ప్రతి కార్యమునకూ తాము చెప్పునట్లు
చేయాలనీ, తాము నిర్ణయించు కాలములోనే చేయాలనీ, అట్లు చేయకపోతే
నష్టము, కష్టము కలుగుతుందని భయపెట్టడము వలన, భయముతో
జ్ఞానము తెలియని మిగతా కులముల వారందరూ వారు చెప్పిన దానిని
నమ్మడము జరిగినది. ఈ విధముగా హిందూమతములో అగ్రకులము
వారు భయము అను బ్లాక్మెయిల్ చేసి, తగ్గు కులము వారందరినీ
తమమాట వినునట్లు చేసుకొన్నారు. ఆనాటి నుండి హిందూ సమాజమును
మోసము చేస్తూ ఎవరికీ హిందూ జ్ఞానమును తెలియకుండా చేసి, తాము
హిందూ సమాజమును అనేక పేర్లతో దోచుకొంటూ బ్రతకడమే కాక,
మిగతా కులములలో ఎవరు జ్ఞానులుగా పుట్టినా, వారిని హేళన చేయడమూ,
అజ్ఞానిగా వర్ణించడమూ జరిగినది.
చరిత్రలో నాలుగు వందల సంవత్సరముల క్రితము వచ్చిన
వేమనను పిచ్చివానిగా వర్ణించి, శాస్త్రము తెలియనివాడని వర్ణించారు.
తర్వాత మూడు వందలయాభై సంవత్సరముల క్రిందట వచ్చిన 'పోతులూరు
వీరబ్రహ్మము’గారు గొప్ప జ్ఞానిగా తయారై, భవిష్యత్తు కాలములో జరుగు
సంఘటనలను ముందే తెలియజేసి గొప్ప కాలజ్ఞానమునే వ్రాశాడు. ఆయన
వ్రాసిన భవిష్యత్తు కాలక్రమమున నేటికినీ జరుగుచునేయున్నది. అంతటి
గొప్ప జ్ఞాని అయిన వీరబ్రహ్మముగారు అగ్రకులమువాడు కాకపోవుట వలన,
విశ్వకర్మ (ఆచారుల) కులమున పుట్టుట వలన, అగ్రకులము వారు బ్రహ్మము
గారు బ్రతికియున్న కాలములోనే, తమ ఊరిలోనికి రాకుండా, ఆయన
జ్ఞానమును ప్రచారము చేయకుండా అడ్డుకొన్నారు. ఆ రోజు ఇతరులు
జ్ఞానులు కాకూడదను అసూయ అను గుణముతోనూ, మేమే తెలిసిన
వారమను గర్వముతోనూ ఆ పని చేశారు. హిందూ సమాజములో ఇటువంటి
వారుండుట వలన విసిగి పోయిన హిందువులు హిందూ మతమును వీడి
ఇతర మతములోనికి పోవుచున్నారు. ఇందూమతములో దేవునికి గుడికి
అంటరాని వారిగా ఉండలేని వారందరూ కొందరు జ్ఞానము కొరకు,
కొందరు కులవివక్ష లేని స్వతంత్రము కొరకు మతమును మారజొచ్చారు.
ఈ విధముగా హిందూమతములోని వారు ఇతర మతములోనికి పోవుటకు
మొదటి కారకులు హిందూమతములోని అగ్రకులములవారేనని
అనుమానము లేకుండా చెప్పవచ్చును.
తమ వలననే హిందువులు ఇతర మతములలోనికి పోవుచున్నారని
అగ్రకులమువారికి కూడా తెలుసు. అయితే తమ తప్పును ఎవరూ
గుర్తించనట్లు తాము హిందూమతమును ఉద్ధరించువారిగా, హిందూధర్మ
రక్షకులుగా వర్ణించుకొని హిందూ ధర్మ భక్షకులుగా నేటికినీ సమాజములో
కొనసాగుచున్నారు. వారిని హిందూ ధర్మ భక్షకులు, హిందూ ధర్మ నాశకులు
అని చెప్పుటకు అనేక ఆధారములు గలవు. అటువంటి వాటిని పరిశీలించితే,
హిందువులలోని మిగతా కులము వారివద్ద భగవద్గీతను బోధించు కృష్ణుడు
అర్జునుడు యున్న చిత్రపటము (ఫోటో) యుంటే దానిని ఇంటిలో
ఉంచుకో కూడదనీ, ఆ పటము ఇంటిలో ఉంటే ఇంటిలో కూడా యుద్ధాలు
వస్తాయనీ, అనేక కష్టాలు వచ్చి పాండవులు అరణ్యవాసము పోయినట్లు
బాధపడవలసివస్తుందనీ అగ్రకులమువారు నేటికినీ చెప్పుచునే యున్నారు.
అటువంటి భగవద్గీత ఫోటోలను గుడులలో ఉంచవలెననీ లేకపోతే ఏటిలోని
నదీ ప్రవాహములో పారవేయాలనీ చెప్పడము, చేయించడము కూడా
జరిగినది. అంతేకాక భగవద్గీతను ఇంటిలో ఉంచుకోకూడదని భగవద్గీతను
ఎవరూ చదువకూడదనీ, చదివితే కష్టాలు వస్తాయనీ, భగవద్గీతను ఎవరి
ఇంటిలోనూ లేకుండునట్లు చేయుచున్నారు. భగవద్గీత అర్జునునికి యుద్ధ
రంగములో యుద్ధము చేయుటకు చెప్పినది, అందువలన చదువకూడదు,
చదివితే చదివినవారు కూడా అనేక తగాదాలలోనూ, కోర్టు వ్యవహారముల
లోనూ చిక్కుకోవలసి వస్తుందని చెప్పడము జరుగుచున్నది. ఇంకనూ
హిందువులకు వేదములు ముఖ్యమైనవనీ, వాటిని అన్ని కులముల వారు
చదువకూడదనీ, వేదములను తామే చదువవలెననీ చెప్పడము కూడా
జరుగుచున్నది. ఈ విధముగా భగవద్గీతకు వ్యతిరేఖముగా మాట్లాడు
వారు హిందూ సమాజమునకు చీడపురుగులుకాక ఏమవుతారో మీరే
ఆలోచించండి.
ఇదంతయూ గతములో జరిగిన విషయములు, అవి చాలక ప్రస్తుత
కాలములో వీరి ఓర్వలేనితనము, మేమే పెద్ద అను గర్వము ఎలాగుందో
చూడండి. వేమనయోగిని, పోతులూరి వీరబ్రహ్మముగారిని అగ్రకులము
వారు ఎంత హేళన చేసినా, వేమనయోగిని రెడ్డి కులస్థులు వేమారెడ్లుగా
గుర్రముల నెక్కి ప్రచారము చేయుట వలన, వీరబ్రహ్మముగారిని విశ్వకర్మ
(ఆచారి) కులమువారు కాలజ్ఞానమును ప్రచారము చేయుట వలన, వేమన
సంఘములు, విశ్వకర్మ సంఘములు తయారై వేమనను, బ్రహ్మముగారిని
ప్రచారము చేయుట వలన, కొంతమంది ప్రజలకు వేమనయోగి పద్యములు,
వీరబ్రహ్మము గారి కాలజ్ఞానము కొంతవరకు తెలియును. వేమనయోగి
ఆ కాలములోనే తన పద్యములలో అగ్రకులమువారు చేయు తప్పులను
ఎండబెట్టడము జరిగినది. వీరబ్రహ్మముగారి చరిత్రలో కూడా బ్రహ్మము
గారికి అగ్రకులము వారు చేసిన ఆటంకములను వ్రాయడము జరిగినది.
వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో "ప్రబోధాశ్రమము
ఉన్నతమైన జ్ఞానము కలది” అని మూడువందల యాభై సంవత్సరములప్పుడే
వ్రాసియుంచాడు. కాలజ్ఞానములో 'ప్రబోధాశ్రమము' యొక్క పేరుండడము
ఈ మధ్యన ఐదు సంవత్సరముల క్రితము మాకు తెలిసినది. తర్వాత
బ్రహ్మము గారు వ్రాసిన కాలజ్ఞానములో ప్రబోధాశ్రమమునకు, ప్రబోధానంద
యోగీశ్వరులకు సంబంధించిన చాలా విషయములు వ్రాసినట్లు తెలిసినది.
ఎంతో గొప్ప జ్ఞాని, కాలజ్ఞాని అయిన పోతులూరి వీరబ్రహ్మముగారు ప్రబోధా
శ్రమాధిపతియైన ప్రబోధానందయోగీశ్వరులు వారిని గొప్పగా చెప్పుచూ
“ప్రబోధాశ్రమము వారు శయనాధిపతి గుణములు కల్గియున్నారు.
శయనాధిపతియే ఆనందగురువు. ఆనంద గురువే నాకు గురువు, మీకు
గురువు" అని వ్రాయడము జరిగినది. ప్రబోధానందయోగీశ్వరుల
జ్ఞానమేమిటో, ఎంత శక్తివంతమైనదో జ్ఞాన జిజ్ఞాసులకు కూడా తెలియు
చున్నది. ఎందరో జ్ఞానులయిన వారు యోగీశ్వరులు చెప్పుచున్న జ్ఞానము
ఎంతో గొప్పదని ప్రశంసించుచున్నారు. బ్రహ్మముగారే స్వయముగా తన
గురువుగా చెప్పుకొన్న వ్యక్తి ఎంతటి వాడయివుంటాడో మనము కూడా
ఆలోచించ వలసియున్నది. అయినా ప్రబోధానందయోగీశ్వరుల వారు
ఒక్క దైవ జ్ఞానములో తప్ప మిగతా అన్నిటిలో సాధారణ వ్యక్తిగానే
కనిపిస్తాడు. ఎదురుగా చూస్తే ఇతనికి జ్ఞానము తెలియునా! అన్నట్లు
కనిపించినా, అవును ఆయన ఎవరికీ తెలియని గొప్పవాడే అన్నట్లు ఆయన
వ్రాసిన గ్రంథములే గొప్ప శక్తులుగా నిరూపించుకొన్నాయి. ఒక గ్రంథము
దగ్గరకు వస్తూనే కొందరిలో మార్పు కనిపించడమూ, కొందరు గ్రంథమును
చదివిన వెంటనే అంతవరకు నయముగాని రోగములు పోవడము జరుగు
చున్నది.
పైకి కనిపించని శక్తి యోగీశ్వరులలో నిక్షిప్తమైయుండుట బయటికి
కనిపించకపోయినా ఆయన చెంతకు పోయినవారికి దేహములో నయము
కాని, మందులులేని ఎయిడ్స్, క్యాన్సర్, డెంగీజ్వరములు సహితము
శాంతించి పోవడము జరుగుచుండుట వలన యోగీశ్వరులు ఎంతటివారో
ఎవరికయినా సులభముగా అర్థమయిపోగలదు.
వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో "ఆనంద యోగిని
దూషించిన వారు చాలా ఇబ్బందుల పాలవుతారని” వ్రాయడము జరిగినది.
అలాగే ఆయనను గానీ, ఆయన గ్రంథములనుగానీ దూషించినవారు
ఇంతవరకు ఎవరూ సురక్షితముగాలేరు. తెలియని రోగములతో, అర్థముకాని
బాధలతో కొందరుండగా, కొందరు చిత్రహింసలపాలై చనిపోవడము
జరిగినది. అలా ఎందుకు జరుగుచున్నదో తెలియనివారు, పాపమును
మూటగట్టుకొనుటకు యోగీశ్వరుల వారి జ్ఞానమునకు అక్కడక్కడ ఆటంకము
లను కలుగజేయుచున్నారు. హిందూమతములో ఆదిశంకరాచార్యులు
అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించాడు. తర్వాత కొంతకాలమునకు
విశిష్టాద్వైత సిద్ధాంతమును రామానుజాచార్యులు ప్రతిపాదించాడు.
మరికొంత కాలమునకు ద్వైత సిద్ధాంతమును మధ్వాచార్యులు ప్రకటించాడు.
వీరు ముగ్గురూ అగ్రకులము వారు కావడము విశేషము. గత ముఫ్ఫైఆరు
సంవత్సరముల నుండి త్రైత సిద్ధాంతమును ఆచార్య ప్రబోధానంద
యోగీశ్వరుల వారు ప్రకటించి, ఆ సిద్ధాంతమునే ప్రచారము చేయుచూ
త్రైత సిద్ధాంతము ప్రకారము భగవద్గీతను వివరించి వ్రాయడము జరిగినది.
హిందూమతములోని సిద్ధాంతముల వివరము తెలియని ప్రజలకు,
అగ్రకులమువారు త్రైతము అంటే క్రైస్తవులకు సంబంధించినదనీ, త్రైత
సిద్ధాంత భగవద్గీతయని పైకి చెప్పుచూ లోలోపల క్రైస్తవ మతమును
బోధించుచున్నారని యోగీశ్వరులకు, యోగీశ్వరుల జ్ఞానమునకు
వ్యతిరేఖముగా చెప్పడము జరిగినది. హిందుత్వమును ఒక వైపు సర్వ
నాశనము చేయుచున్న అగ్రకులములవారు హిందూమతమును కాపాడువారి
వలె నటించుచూ యోగీశ్వరుల జ్ఞానమునకు కొన్నిచోట్ల ఆటంకము
కల్గించడము జరిగినది. మూడుచోట్ల అన్యమతప్రచారమని భగవద్గీతను
ప్రచారము చేయు యోగీశ్వరులు శిష్యుల మీద కేసులు పెట్టడడము కూడా
జరిగినది. కొన్నిచోట్ల ప్రత్యక్ష దాడులకు దిగడము జరిగినది. అయినా
ప్రబోధానంద శిష్యులు అన్నిటికీ ఓర్పు వహించి, జ్ఞానప్రచారము చేయు
చున్నారు. ఈ మధ్యకాలములో నల్గొండ జిల్లా భువనగిరిలో దేవేంద్ర అను
మా సంఘ సభ్యునిమీద అన్యమత ప్రచారము చేయుచున్నాడని ఆరోపించి
కేసు పెట్టడము జరిగినది. అంతేకాకుండా మా ప్రచార వాహనము
భువనగిరిలోనికి పోయినప్పుడు మా ఊరిలో ప్రచారము చేయవద్దని
అడ్డుపడి పంపించడము జరిగినది. కరీంనగర్లో గోడమీద "త్రైత సిద్ధాంత
భగవద్గీతను చదవండి” అని వ్రాస్తే, అగ్రకులము వారువచ్చి ఇది క్రైస్తవ
మతప్రచారము దానిని తుడిపివేయమని చెప్పడము జరిగినది. రెండు
రోజుల క్రిందట ఆర్లగడ్డలో ప్రచార వాహనముండగా అక్కడికి ఒక అగ్ర
కులస్థుడు వచ్చి ఇది క్రైస్తవ ప్రచారము, ఈ ప్రచారమును నిలిపివేయండని
ఘర్షణపడగా, ఆ సమయానికి మా గ్రంథములు చదివిన వారు అక్కడుండుట
వలన వారే అగ్రకులమువారికి బుద్ధి చెప్పి పంపడము జరిగినది. అక్కడున్న
ప్రజలు అనిన మాటలు "ఇది ఎంతో గొప్ప జ్ఞానము. ఇంతకాలానికి
గొప్ప జ్ఞానము దొరికిందని మేము సంతోషపడుచుంటే, సమాజాన్ని
సర్వనాశనము చేసిన మీరు దీనిని జ్ఞానము కాదంటారా? ఇట్లే మాట్లాడితే
ఊరిలో లేకుండా మిమ్ములను మేమే పంపుతాము” అని అనడము జరిగినది.
ఈ విధముగా ప్రజలే తిరగబడి బుద్ధి చెప్పు సమయము అన్నిచోట్లా వస్తుంది.
గౌతమబుద్ధుడు జ్ఞానము చెప్పితే అతను అగ్రకులము వాడు కాదని,
ఆయనది వేరు మతమని ప్రచారము చేశారు. ఆ దినము గౌతముడు
హిందువే కదా! తమ ఆధిపత్యము కొరకు హిందూమతమునుండి బుద్ధున్ని
చీల్చి అతనిది బౌద్ధమతమని చెప్పి హిందూమతమునుండి వేరు చేశారు.
ఈ దినము బౌద్ధమతము విదేశాలలో వ్యాపించియున్నా స్వదేశములో
లేకుండా చేసినది అగ్రకులము వారు కాదా! ఈ దినము బుద్ధుడు మావాడే
బౌద్ధము హిందూమతమే అని చెప్పుకోలేని పరిస్థితి మనకు ఏర్పడినది.
అలాగే ప్రబోధానంద యోగీశ్వరులు చెప్పు త్రైత సిద్ధాంతమును హిందూ
మతములోని భాగము కాదనడమూ, త్రైత సిద్ధాంత భగవద్గీతను భగవద్గీతే
కాదనడమును ఒకవైపు ప్రజలు గమనిస్తున్నారు. ప్రబోధానంద యోగీశ్వరులు
గత 40 సంవత్సరములుగా బోధించుచున్న బోధ హిందుత్వములోనే
ఎంతో గొప్పదని అన్ని మతములవారు ఒప్పుకొనుచుండగా, తగ్గుకులము
వారని అగ్రకులముచే అనబడినవారందరూ హిందూ (ఇందూ) జ్ఞానమును
తెలుసుకొని చైతన్యవంతులై అగ్రకులము వారికి తిరగబడి జ్ఞానము చెప్పు
స్థితికి ఎదిగారు. తగ్గుకులము వారిమీద ఆధారపడి బ్రతుకుచున్న
అగ్రకులమువారిని తగ్గుకులము వారందరూ ఒక్కమారు వెలివేస్తే, మీతో
మాకు సంబంధము వద్దు అంటే ఏమవుతుందో చెప్పనవసరము లేదు.
అటువంటి స్థితి రాకుండుటకు మా జ్ఞానమునకు అడ్డురావద్దని అగ్రకులము
వారికి మరీమరీ చెప్పుచున్నాము.
ఇట్లు,
ప్రబోధ సేవాసమితి.