అధిక ఆహార విలువలున్న లూసర్న్ గ్రాసం
అధిక ఆహార విలువలున్న లూసర్న్ గ్రాసం.
పశుగ్రాసాలే పాడి అభివృద్ధికి వునాదులు అనే విషయం మనందరికి తెలి సిందే. తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో, అధిక మొత్తంలో సాగుచేసు కునే పశుగ్రాసాల్ని పశువులకు ప్రతి రోజు 30-40 కిలోల వరకు ఉత్పాదక శక్తిని బట్టి అందించాల్సి ఉంటుంది. ఇలా అందించే మొత్తంలో మూడింట ఒకవంతు పప్పుజాతి పశుగ్రాసం (ఉదాహరణ లూసర్న్, అలసంద, పిల్లిపె సర) అందిస్తేగాని పాడిపశువుల్లో పాలదిగుబడితో పాటు, అధిక వెన్న శాతం లభిస్తుంది. కాబట్టి రైతాంగం లూసర్న్ వంటి పప్పుజాతి పశుగ్రాసాల సాగుకు కూడా ప్రాముఖ్యతనివ్వాలి.
లూసర్న్ శీతాకాలంలో సాగుకు అనువుగా ఉండే పప్పుజాతి పశుగ్రాసం. పప్పుజాతి పశుగ్రాసాల్లో కెల్లా లూసర్న్ లో అధికశాతం మాంసకృత్తులు లభిస్తాయి. లూసర్న్ జీర్ణ మయ్యే మాంసకృత్తులు 16 శాతం, శక్తినిచ్చే పోషకాలు 60 శాతం, కాల్షియం, భాస్వరం, ఐరన్ మొదలగునవి ఖనిజలవణాలు, ఎ, ఇ వంటి విలువైన విటమిన్లు సమృద్ధిగా లభ్యమవుతాయి. అందువల్ల లూసర్న్ పశు గ్రాసం సంగ్రహించే పశువులు ఆరోగ్యంగా, దృఢంగా ఉండడం, సక్రమంగా ఎదకు రావడం, అధిక మొత్తంలో వెన్నశాతం కలిగిన పాలది గుబడి పొందడం, పోషణ ఖర్చు తగ్గడం గమనించడం జరిగింది. గుజ రాత్, రాజస్థాన్, పంజాబ్ ప్రాంతాల్లో రైతులు తమ ఇంటి ముందు కూర గాయ మళ్ళలాగా లూసర్న విరి విగా సాగుచేసి పశువులకు అందించ డాన్ని గమనించవచ్చు.
లూసర్న్ సాగు చేయడానికి...
అనువైన రకాలు: ఆర్. ఎల్ 52, 88, ఎల్. హెచ్-84, టి-9, సిర్వా-8, కొ-1, ఆనంద్ -2 మొదలైనవి.
అనువైన భూములు: నీటి పారుద లగల నల్లరేగడి, ఒండ్రు నేలలు సాగుకు అనువైనవి.
విత్తడానికి అనువైన కాలం: అక్టో బర్, నవంబర్ మాసాలు.
కావాల్సిన విత్తనాలు: ఎకరాకు 8-10 కిలోలు.
సాగుపద్దతి: పొలాన్ని 2 సార్లు దున్ని, 5x20 అంగుళం సైజులో మళ్ళు తయారు చేసుకుని, నీటిపారుదలకు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. విత్త నాలను 25 సెంటీమీటర్ ఎడంగా మళ్ళలో విత్తాలి. విత్తనాలను వెదజల్లడం కూడా చేయవచ్చు.
వాడాల్సిన ఎరువులు: దుక్కిలో 8 కిలోల పాస్ఫేటు, 15 కిలోల యూరియా, 20 కిలోల పొటాష్, 4-5 బండ్ల పశువుల ఎరువు వేయాలి. నీటితడి: విత్తనాలు నాటిన మొదటి 10-15 రోజులు, ఆ తర్వాత ప్రతి 25 రోజులకొకసారి నీటితడి ఇవ్వాలి.
దిగుబడి: పశుగ్రాస దిగుబడి మొదటిసారి 60 రోజులకు, ఆ తర్వాత ప్రతి నెల రోజులకొకసారి 4-5 సంవత్సరంల పాటు లభ్యమవుతుంది. సంవత్సరంలో 25-30 మెట్రిక్ టన్నుల పచ్చిమేత దిగుబడి లభి స్తుంది.
పశుగ్రాసాల సాగులో మెలకువలు: లూసర్న్ పశుగ్రాసాలు సాగుచే సినప్పుడు నేలలో నీరు నిలువ ఉండ కుండా చూడాలి.
లూసర్న్ పశుగ్రాసంలో 'బంగా రుతీగ కలుపురాకుండా విత్తనాల్ని మొదటిసారి సాగుచేసినప్పుడు రైజో బియం కల్చర్నుగాని, బెల్లం నీళ్ళను గాని, గతంలో లూసర్న్ సాగుచేసిన మట్టినిగాని కలపాలి.
లూసర్న్ దిగుబడి జనవరి నుండి 2, 3 మాసాలపాటు ఎక్కు వగా ఉంటుంది. కావున అక్టోబర్, నవంబర్ మాసాల్లో సాగు ప్రారంభిం చడం శ్రేయస్కరం.
పండ్లతోటల్లో అంతరపంటగా లూసర్న్ సాగుచేస్తే, నత్రజని స్థాప నతో భూసారం వృద్ధిచెంది, పండ్ల దిగుబడి కూడా పెరుగుతుంది.
పశువులకు లూసర్న్ గ్రాసాన్ని, పూత దశకంటే ముందే సి మేపాలి. రోజుకు 6 కిలోల కంటే ఎక్కువ ఇవ్వకూడదు. ఈ గ్రాసాన్ని ధాన్యపుజాతి పశుగ్రాసాల్లో కలిపి 10 కిలోల వరకు మేపవచ్చు.
లూసర్న్, పశుగ్రాసాన్ని అను కూల వాతావరణ సమయంలో అధిక మొత్తంలో సాగుచేసుకుని, వాడగా మిగిలిన గ్రాసాన్ని నీడలో ఆరబెట్టి ఎండుగడ్డిగా నిలువచేసుకుని, ఇతర సీజన్లలో వినియోగించుకోవచ్చు.
పశుగ్రాసాల్లో రారాజుగా పేరున్న లూసర్న్ గ్రాసాన్ని పాడిపశువులతో పాటు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, ఈము పక్షులకు కూడా అందిస్తే, ఆరోగ్యంగా ఉండి, అధిక ఉత్పాదక శక్తి కలిగి ఉంటాయి.