pss:శరీరము అద్దె ఇల్లు, ఆఖరీ మరణము
శరీరము అద్దె ఇల్లు Audio https://ibm.box.com/s/fgr8rym1tozbhvldtw9db50lw0p6hu1p శరీరము అద్దె ఇల్లు, ఆఖరీ మరణము ఒక మనిషిని విభజించి చూచితే శరీరము మరియు జీవుడు అని చెప్పవచ్చును. జీవుడులేని శరీరమును “శవము” అంటాము. అలాగే శరీరములేని జీవున్ని “దయ్యము” అంటాము. ఒక దయ్యము, ఒక శవము రెండు కలిసియున్నప్రడు “మనిషి" అంటున్నాము. వివరముగ చెప్పుకొంటే ఒక జీవుడు ఒక శరీరములో నివసిస్తూ జీవితకాలమునుగడుపుచున్నాడు. జీవునికి శరీరము గృహములాంటిది. శరీరమనే గృహములో జీవుడు కొంతకాలము నివశిస్తున్నాడు. జీవుడు శరీరములో నివశించిన మొత్తము కాలమును జీవితకాలము అంటున్నాము. జీవితకాలమును పూర్వము “జీతకాలము” అనెడివారు. జీత అను రెండక్షరముల మధ్యలో “వి” అను అక్షరము కాలక్రమములో చేరి పోయినది. అందువలన జీత కాలము అనునది జీవితకాలము అను పదముగ మారిపోయినది. మారిన పదమును వదలి చూస్తే శరీరములో జీవుడున్న కాలమును జీత కాలము అనడములో కొంత అర్ధము ఇమిడియున్నది. ఒక పనికి ప్రతిఫలితముగ ఇచ్చుదానిని జీతము అంటాము లేక బాడుగ (కిరాయి) అని కూడ అంటాము. జీవుడు తన స్వంతము కాని ఇతరుని ఇంటిలో నివశిస్తున్నాడు, కావున ఆ ఇంటి యజమానికి కిరా...