pss: b g vib
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ విభూతి యోగము
☞
శ్రీ భగవంతుడిట్లనియె : -
(9) శ్లో|| 1: భూయ ఏవ మహాబాహో! శృణు మే పరమం వచః|
యత్తే హం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా ||
(జ్ఞానము)
భావము : దేనిని నేను ప్రీతితో నీ హితముకోరి చెప్పితినో మరల శ్రేష్ఠమైన ఆ మాటలనే వినుము.
వివరము : పరమాత్మను గురించి భగవంతుడు ఇప్పటికే చాలా విషయములు తెలియజేశాడు. వినేవాని హితము కోరి తెలియ చెప్పానన్నాడు. అయినప్పటికి ఇంకా తెలియజేయుచున్నాను వినుము అన్నాడు. ఈ విషయములన్ని అర్జునునికి కాదు వాస్తవముగ మనకేనని తలచవలెను. అట్లనుకొనుటవలన భగవంతుడు చెప్పువిషయముల మీద ధ్యాస శ్రద్ధ పెరుగును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ విభూతి యోగము
☞
(9) శ్లో|| 2: న మే విదు స్సురగణాః ప్రభవం న మహర్షయః |
అహ మాద్హిరి దేవానాం మహర్షీణాం చ సర్వశః ||
(సాకారము)
భావము : దేవతలు, మహర్షులు నా ప్రభవమును తెలియరు. దేవతలకు, మహర్షులకు నేను ముందున్నవాడను, గొప్పవాడను.
వివరము : పుణ్యఫలము ఎక్కువగుట వలన భూమిమీదనే ఇష్ట సుఖములను అనుభవించువారు దేవతలు. అలాగే భూమిమీదనే జ్ఞానాగ్నిని సంపాదించుకొన్న వారు మహర్షులు. దేవతలు, మహర్షులు ఇరువురు పరమాత్మ పుట్టుకను తెలియరు. దేవతలు మహర్షులు భూమిమీదనే ఉన్నారు. పరమాత్మ ప్రభవము (పుట్టుక) భగవంతునిగ భూమిమీదనే జరుగుచున్నది. భూమిమీద భగవంతునిగ పుట్టు పరమాత్మను ఇక్కడే ఉన్న దేవతలు, మహర్షులు కూడ తెలియలేకున్నారు.
దేవతలకున్న పుణ్యములోను, మహర్షులకున్న జ్ఞానశక్తిలోను ఇద్దరికి ముందున్నవాడు పరమాత్మ. ఇద్దరికంటే గొప్పవాడైనందున ఆయనను గూర్చి తెలియలేకున్నారు. తెలియాలని ప్రయత్నము చేస్తే తప్ప పరమాత్మ భగవంతునిగ తెలియడు. అదియు కష్టతరమైన పని. అలా తెలిసినవారు చాలా అరుదు.
☞
You are now Online
You are now Online
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ విభూతి యోగము
☞
(9) శ్లో|| 3: యో మా మజ మనాదిం చ వేత్తి లోక మహేశ్వరమ్ |
అసమ్మూఢ స్స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే ||
(పరమాత్మ)
భావము : నాకు ఆది అనునదిలేదని, అట్లే పుట్టుకలేదని, లోకములకెల్ల మహేశ్వరుడనని ఎవడు తెలియునో వాడు మూఢత్వము నుండి బయటపడి సర్వ పాపములనుండి ముక్తి పొందును.
వివరము : పరమాత్మకు మొదలేదో ఎవరికి తెలియదు. అది అగమ్యగోచరము. అందరివలె పుట్టుక కూడ లేదు. ఇక్కడ భగవంతునిగ పుట్టుచున్నది కదా అని కొందరడుగవచ్చును. పరమాత్మ నిరాకారమునుండి సాకారమునకు వస్తున్నాడు కాని అందరివలె జన్మకాదు. జన్మకున్న లక్షణాలు అక్కడలేవు. స్త్రీ పురుష సంబంధముతోనే అందరికి జన్మలు కలుగుచున్నవి. పరమాత్మ పురుష సంబంధము లేని స్త్రీయందు కూడా పుట్టగలడు. అనగా అందరివలె అది జన్మకాదని తెలియాలి. అంతేకాక సర్వలోకములకు మహేశ్వరుడని తెలిసినవారు, మూఢత్వములేనివారై సర్వ కర్మలనుండి బయటపడగలరు. ఎందుకనగ వారియందు జ్ఞానాగ్ని తయారై వారి కర్మలను కాల్చివేయుచున్నది. జ్ఞానము పెరిగి మూఢత్వమును ప్రక్కకు త్రోయుచున్నది.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ విభూతి యోగము
☞
(9) శ్లో|| 4: బుద్ధి ర్జ్ఞాన మసమ్మోహః క్షమా సత్యం దమ శ్శమః |
సుఖం దుఃఖం భవో ఽభావో భయం చాఽభయ మేవ చ || (పరమాత్మ)
(9) శ్లో|| 5: అహింసా సమతా తుష్టి స్తపో దానం యశోఽయశః|
భవన్తి భావా భూతానాం మత్త ఏవ పృథ గ్విధాః ||
(పరమాత్మ)
భావము : బుద్ధి, జ్ఞానము, నిర్మోహము, ఓర్పు, సత్యము, ఇంద్రియనిగ్రహము, సుఖము, దుఃఖము కలుగుట కలుగకుండుట, భయము, నిర్భయము, అహింస, సమదృష్ఠి, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి అనేక విధ భావములు జీవరాసులకు నావలననే కల్గుచున్నవి.
☞
You are now Online
You are now Online
You are now Online
You are now Online
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ విభూతి యోగము
☞
(9) శ్లో|| 6: మహర్షయ స్సప్త పూర్వే చత్వారో మనవ స్తథా |
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః ||
(పరమాత్మ)
భావము : మొదట ప్రపంచములో సప్త మహర్షలు, చతుర్ మనవులు నా సంకల్పము చేత తయారైనాయి. తర్వాత వాటి వలన సమస్త జీవరాసులను సృష్ఠించాను.
వివరము : మొట్టమొదట సృష్ఠి ఎలా జరిగినది భగవంతుడు ఈ శ్లోకములో సూచన ప్రాయముగ తెలియజేశాడు. సైన్యములో సిగ్నల్ సెక్షన్ అను విభాగము ఒకటి కలదు. అందులో కొన్ని సిగ్నల్స్ కు(గుర్తులకు) కొన్ని అర్థములు నిర్ణయింపబడి ఉండును. ఆ విభాగములో శిక్షణ పొందిన వారికే ఆ సిగ్నల్స్ కు అర్థము తెలియును. వైర్ లెస్ ఆపరేటర్లు తాము మాట్లాడే విషయము శత్రువులకు అర్థము కాకుండ మాట్లాడుటకు ఒక పెద్ద విషయమునకు చిన్న కోడ్ ను(గుర్తును) పెట్టుకొని మాట్లాడుచుందురు. ఆ విధముగనే ఈ శ్లోకములో పెద్ద విషయమును తెలియజేయు చిన్న కోడ్ కనిపిస్తూయున్నది. అందువలన సూచన ప్రాయముగ తెలియజేశాడన్నాము. ఇందులోని గుప్తమైన విషయము తెలియక సప్త ఋషులు, నలుగురు సనకసనందాలు, నలుగురు మనువులు మొత్తము 15 మంది సృష్ఠాదిలో పుట్టారని కొందరు వ్రాశారు. మరి కొందరేమో ఏడుమంది ఋషులను, నలుగురు మనువులను మొత్తము 11 మందిని దేవుడు సృష్ఠించాడని వ్రాశారు. అట్లు తయారైన వారివలననే మిగతా మనుషులు జీవరాసులు పుట్టాయని వ్రాశారు. ఈ విషయమును చూచిన హేతువాదులు మొదట స్త్రీలే లేకుండ పురుషులకే మిగతా సంతతియంత ఎట్లు పుట్టినదని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి కొన్ని అర్థము కాని విషయములను పట్టుకొని భగవద్గీత భూటకమని, మనుషులు కల్పించుకొన్న గ్రంథమని హేళనగ మాట్లాడు చున్నారు. అటువంటి హేతువాదులను దృష్ఠిలో పెట్టుకొని వారికి నా జ్ఞానము యొక్క గట్టు కూడ దొరకకుండ చేస్తానని గీతలోనే దేవుడు చెప్పాడు. అటువంటివారు దేవుని జ్ఞానమునకు దూరముగ పోవునట్లు, వారికి అర్థము కాకుండునట్లు, ఇప్పటి వరకున్న గీతలలో కొంతవరకే వివరమును రచయితల చేత దేవుడే వ్రాయించాడను కొందాము.
ఇప్పుడు ఇక్కడ మేము వ్రాయు విషయమును కూడ ఎందరో విమర్శించు వారుంటారు. ఏ ఆధారముతో చెప్పారని ప్రశ్నించువారుండవచ్చును. ముందే చెప్పానుగ కోడ్ తెలియక పోతే విషయము అర్థము కాదని. అందువలన ఈ విషయము కొందరికి మాత్రము అవగాహనకు రాగలదు. ఇక్కడ బుద్ధిని ఉపయోగించి అవగాహన కొరకు ప్రయత్నించండి. ఆదిలో సృష్ఠికి పూర్వము క్రింద భూమిగాని, పైన ఆకాశముగాని, మధ్యలో గాలి, అగ్ని, నీరుగాని ఏవిలేని కాలమది. ప్రపంచమను పంచభూతములు గాని, జగతి అను జీవరాసులు గాని లేనపుడు కూడ కాలమనునది ఉన్నది. ఆ కాలమునకు గంటలుగాని, ఘడియలుగాని లేవు. ఏమాత్రము ఎవరికి వ్యక్తముకాని ఆ సమయములో అవ్యక్తమైన, అగమ్యమైన, అగోచరమైన ఒకే ఒక పరమాత్మ మాత్రము మిగిలి ఉండెడిది. అటువంటి పరమాత్మ నుండి పరమాత్మ ఇష్టముతోనే దాదాపు పరమాత్మంత బలము కల్గిన ప్రకృతి అనబడునది పరమాత్మ చేతనే సృష్ఠింపబడినది. ఏమిలేని, ఏదికాని శూణ్యమునుండి మొట్టమొదట తయారైనది ప్రకృతి. ప్రకృతి పుట్టిన తర్వాత ఐదు భాగములుగ విడిపోయినది. ఆ ఐదు భాగములే ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అనబడునవి. ఈ ఐదింటిని ప్రపంచము అనుచున్నాము. ఈ విధముగ మొదట జీవరాసులు లేని ప్రపంచము ఏర్పడినది. మొదటనే పరమాత్మ పురుషునిగ ఉంటూ, తనచేత తయారుచేయబడిన ప్రకృతిని స్త్రీ తత్త్వము కల్గిన దానిగ పరమాత్మే(దేవుడే)ఉంచాడు. ఆడతనము గల ప్రకృతిని ఐదు భాగములుగ మార్చినవాడు పరమాత్మయే. పంచము వలన ఏర్పడిన దానిని ప్రపంచమనడము జరిగినది. ఏ జీవరాసి లేని ఆ ప్రపంచములో మొట్టమొదట పరమాత్మనుండి కొంత భాగము విడిపోయి వచ్చినది, అదియే ఆత్మ అని పిలువబడుచున్నది. మొదట ప్రకృతి ఒక్కటిగా తయారై ఐదుగ విడిపోయినట్లు, మొదట పరమాత్మనుండి వచ్చిన ఆత్మ ఏడు భాగములుగ విడిపోయినది. ఆత్మను సుఖ దుఃఖములకు అతీతమైన ఆనందమను చున్నాము. అందువలన బ్రహ్మనంద అనియు, మహర్ష అనియు ఆత్మకు పేరు కలదు. మొదట ఆత్మ పరమాత్మనుండి పుట్టుకొచ్చిన తర్వాత ఏడు భాగములుగ పరమాత్మ చేతనే విభజింపబడినది. విభజింపబడిన ఆత్మయొక్క ఏడు భాగములను మహర్షయ సప్త అని అన్నారు. మహర్షయ సప్త అనగా ఆత్మ యొక్క ఏడు భాగములని అర్థము. ఈ విధముగ మొదట పరమాత్మచేత ఏర్పడినవే సప్త మహర్షలు, ఇంతవరకు ఎవరికి అర్థముకాని విషయము ఇదియే. సప్త మహర్షలు అయిన ఆత్మ భాగములు సప్తమహర్షులను మనుషులుగ మనకు అర్థమైనది. మనకెట్లు అర్థమైన మొదట తయారైనది సప్తమహర్షులు కాదు సప్తమహర్షలని తెలియవలెను.
పరమాత్మ మొదట తనకు సమానముగ ఉండునట్లు ప్రకృతిని తయారు చేశాడని తెలుసుకొన్నాము. ప్రకృతి ఐదు భాగములుగ తయారై ప్రపంచము ఏర్పడిన తర్వాత ఆత్మ అనునది ఏర్పడినది. పరమాత్మకు తోడుగ ప్రకృతి ఉండగ, ఆత్మకు తోడుగ మరొక ప్రకృతి ఏర్పడినది. పరమాత్మ యొక్క అంశ ఆత్మకాగ, ప్రకృతి యొక్క అంశ మరొక ప్రకృతిగ విభజింపబడినది. పరమాత్మకు తోడుగ ఏర్పడిన మొదటి ప్రకృతికి మార్పు చెందని ప్రకృతి అని పేరు గలదు. దానినే అచర ప్రకృతి అంటున్నాము. ఆత్మకు తోడుగ ఏర్పడిన రెండవ ప్రకృతికి మార్పు చెందే ప్రకృతి అని పేరుగలదు. దానినే చర ప్రకృతి అంటున్నాము. ఈ విధముగ పరమాత్మ, ఆత్మ అను రెండు ఆత్మలు కాగ, అచర ప్రకృతి, చర ప్రకృతి అని రెండు ప్రకృతులు తయారైనవి.
పరమాత్మనుండి తయారై వచ్చిన ఆత్మ సప్త మహర్షలుగ, అనగా ఏడు ఆత్మ భాగములుగ విభజింపబడినదని చెప్పుకొన్నాము కదా! పరమాత్మ సప్త మహర్షలను తయారు చేసిన తర్వాత చర ప్రకృతిని ఆధారము చేసుకొని మొదట మనస్సును తర్వాత అహమును, చిత్తమును, బుద్ధిని వరుసగ తయారు చేశాడు. ఈ నాలుగింటిలో మొదట తయారైన మనస్సు మినహ అహము, చిత్తము, బుద్ధి మూడు కొంత ఆత్మ భాగమును చుట్టుకొని బంతిలాగ ఏర్పడినవి. మూడు పొరల మధ్యన కొంత ఆత్మ భాగము చిక్కుకొనగ అదియే జీవాత్మ అయినది. బుద్ధి, చిత్తము, అహము మధ్యన నిలిచిపోయిన ఆత్మ యొక్క అంశను జీవాత్మ అంటున్నాము. ఈ విధముగ జీవాత్మ తయారైన వెంటనే ప్రకృతి రెండవ భాగము వలన శరీరమంత ఏర్పడినది. ఇట్లు ఏర్పడిన శరీరమంత మనస్సు వ్యాపించినది. ఈ విధముగ ఒక మనిషి యొక్క నమూనా మొదట తయారైనది. ఆత్మయొక్క ఏడు భాగములను దేవుడు "మహర్షయ సప్త" అనగా మహర్షులు ఏడుగురను తప్పు భావము మనుషులకు వచ్చినట్లు, "చత్వారో మనవ" అనగానే నలుగురు మనువులు అని అర్థము చేసుకొన్నారు. ఇది పూర్తి తప్పు భావము. మొదట సప్త మహర్షులను గాని, నలుగురు మనువులను గాని దేవుడు తయారు చేయలేదు. ప్రపంచముతో పాటు ఏడు ఆత్మ భాగములను, వాటికి ఆధారముగ నాలుగు ప్రకృతి భాగములను తయారుచేశాడు. వీటినే మహర్షులుగ, మనువులుగ మనము తప్పు అర్థము చేసుకోవడము వలన సృష్ఠి విధానము అర్థము కాకుండపోయి రహస్యముగ మిగిలిపోయింది. అదియే సృష్ఠి రహస్యము.
మొదట దేవుడు మనిషి యొక్క నమూనాను ప్రకృతిని, ఆత్మను ఉపయోగించి తయారుచేశాడు. తర్వాత దాని ప్రకారము మిగతా జీవరాసులనన్నిటిని సృష్ఠించానన్నాడు. మొదట 108 ఆత్మలను ప్రపంచములోనికి దేవుడు పంపి 108 మంది మనుషులను తయారగునట్లు చేశాడు. ఆ 108 మందిలో 54 మంది పురుషులుగ, 54 మంది స్త్రీలుగ తయారగునట్లు చేశాడు. 54 మంది పురుషులలో 27 మందిని మంచి గుణములు కలవారిగ, 27 మందిని చెడు గుణములు కలవారిగ సృష్ఠించాడు. అదే విధముగ స్త్రీలలో కూడా 27 మంది మంచి గుణములు కలవారిగ, 27 మంది చెడు గుణములు కలవారిగ తయారు చేశాడు. ఈ లెక్కను మూడింతలు చేసి 108 సాత్త్వికులుగ, 108 రాజసులుగ, 108 మందిని తామసులుగ మొత్తము 324 మంది మనుష జాతిని తయారు చేశాడు. అందులో 162 మంది స్త్రీలుకాగ 162 మంది పురుషులని వారిలో 81 మంది మంచి స్త్రీలు, 81 మంది చెడు స్త్రీలని తెలుసుకోవలెను. అట్లే పురుషులలో కూడ మంచి చెడువారు గలరని తెలుసుకోవలెను. ఇది ఒక మానవజాతి గణితముకాగ ఇటువంటి మిగతా 323 జాతులను మొదట దేవుడు తయారు చేశాడు. ప్రతి జాతిలోను సగము సంఖ్య స్త్రీ, సగము సంఖ్య పురుషులుగ చేశాడు. మనుషులుకాక మిగతా 323 జాతులలో ఒక్కొక్క జాతికి 324 సంఖ్య ప్రకారము మొత్తము 1,04,652 జీవరాసులు తయారైనవి. ఈ లెక్కప్రకారము ఆదిలో పుట్టిన మొత్తము జీవరాసుల సంఖ్య 1,04,976 అని తెలియుచున్నది. ఈ సంఖ్యలన్నిటిని కలిపితే అంత్యములో 7 సంఖ్య మిగులుచున్నది. ఇది మొదట తయారైన ఆత్మకు గుర్తు అని తెలియవలెను. తర్వాత ఏ జాతికి ఆ జాతి సంతతిని పెంచుకొనునట్లు దేవుడు చేశాడు. సృష్ఠి ఆదిలో 162 మంది పురుషులతో, 162 మంది స్త్రీలతో మొదలైన మానవజాతి నేడు వందల కోట్లలోనికి చేరిపోయినది. అట్లే అన్ని జీవజాతులు పెరిగాయి. మొదట 324 జాతులతో మొదలైన జగతి నేడు వర్ణసంకరము వలన మరికొన్ని జాతులుగ పెరిగినదేమో చెప్పలేము. కొందరు 84 లక్షల జాతులు కలవని అంటున్నారు.
అయినప్పటికి 84 లక్షల జాతులు శాస్త్రబద్దము కాదేమోననిపిస్తుంది. మొదట తయారైన జీవరాసుల జాతులు 324 కాగ అందులో 108 అండజములుగ, 108 పిండజములుగ, 108 ఉద్భిజములుగ తయారు చేయబడినవి. అందులో పిండజములైన మానవులు నాలుగు జాతులుగ గలరు. మానవుల నాలుగు జాతులుపోగా 104 జాతులు పిండమునుండి పుట్టునవి. 108 జాతులు అండము నుండి పుట్టునవి, 108 జాతులు భూమి నుండి పుట్టునవి గలవు. పంచభూతములు కూడ 108 పదార్థములుగ తయారు చేయబడి, వాటిలో పుట్టు మూడు రకముల జాతులు 108 రకములుగనే ఉన్నవి. అంతేకాక పైకి పెరుగునవి, క్రిందికి పెరుగునవి, అడ్డముగ పెరుగునవి అని మూడు విధములుగ 324 జాతులు తయారు చేయబడినవి. 324 జాతులలో క్రిందికి పెరుగునవి మానవ జాతులు కేవలము నాలుగురకములు కాగ, 160 రకములు పైకి పెరుగు చెట్ల జాతులు కాగ, 160 రకములు ప్రక్కకు పెరుగు క్రిమి, కీటక, జంతు, మత్చ్య జాతులై ఉన్నవి. జాతుల సంఖ్య బ్రహ్మవిద్యా శాస్త్రబద్దముగ మొత్తము 324 జాతులేకాగ, ఒక్కొక్క జాతి ఎంత సంఖ్యలో ఉన్నది చెప్పలేము. జీవరాసుల సంఖ్య మార్పుచెందు ప్రకృతికి లేదా పదార్థమునకు సంబంధించి ఉండును. కావున భౌతిక శాస్త్రవేత్తలు ఆ సంఖ్యను చెప్పవచ్చును. జీవరాసుల జాతులను చెప్పగలది బ్రహ్మజ్ఞానము. జీవరాసుల సంఖ్యను చెప్పగలుగునది ప్రపంచ జ్ఞానము అని తెలుసుకోవలెను.
ఈశ్లోకములో "మహర్షయ సప్త" అను పదమును ఏడు ఆత్మ భాగములుగ, "చత్వారో మనవ" అను పదమును మనస్సు మొదలగునవి నాలుగు అని అర్థము చేసుకోవలెను. అట్లు కాక సప్త ఋషులు అనిగాని, నలుగురు మనువులు అనిగాని అర్థము చేసుకొంటే శ్లోకములోని నిజ భావము అర్థము కాకుండ పోయి అనేక ప్రశ్నలుద్భవించును. వాటికి జవాబు దొరకదు. ఈ శ్లోకములో మొదట ఏడు, తర్వాత నాలుగు పుట్టిన పిదప అన్ని జీవరాసులు పుట్టాయనుట గ్రహించవలెను. మొదట జీవరాసులులేని పంచభూతములను ప్రపంచము అన్నాము. తర్వాత పుట్టిన జీవరాసినంతటిని జగతి అంటున్నాము. ప్రపంచమును జగతిని కలిపి విశ్వము అంటున్నాము. ప్రపంచము వేరు, జగతి వేరని తెలియవలెను. రెండు కలిసినది విశ్వమని తెలియవలెను. తర్వాత అధ్యాయములో ప్రపంచము జగతి కలిసిన విశ్వరూపమైన దేవున్ని గురించి తెలుసుకొందాము.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ విభూతి యోగము
☞
(9) శ్లో|| 7: ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః |
సో ఽవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః ||
(పరమాత్మ)
భావము : నా మహత్యమును, యోగమును, ఆత్మను ఎవడు తెలియగల్గునో, వాడు చలనములేని నాలో కూడుకొనును. దీనియందు అనుమానము లేదు.
వివరము : పరమాత్మ యొక్క గొప్పతనమేమిటో, ఆయన మహత్యమేమిటో, ఆయనను పొందుటకున్న యోగములేమిటో, ఆయనను పొందుటకు మార్గమై, ఆధారమైయున్న ఆత్మ ఏమిటో తెలుసుకొనినవాడు, చలనములేని మార్పులేని పరమాత్మను పొందగలడు. జ్ఞానము తెలిసినవాడు, ఆత్మను తెలిసినవాడు, పరమాత్మ విశేషము తెలిసినవాడు తప్పనిసరిగ పరమాత్మను పొందును. ఇందులో ఏ మాత్రము అనుమానము లేదు.
☞
You are now Online
You are now Online
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ విభూతి యోగము
☞
(9) శ్లో|| 8: అహం సర్వస్య ప్రభవో మత్త స్సర్వం ప్రవర్తతే |
ఇతి మత్వా భజన్తే మాం బుధా భావ సమన్వితాః ||
(పరమాత్మ)
భావము : నా వలననే సర్వము పుట్టుచున్నవి. నా వలననే సర్వము వర్తించుచున్నవి. ఈ విషయము తెలిసిన జ్ఞానులు, సమన్విత భావముతో నన్ను ఆరాధింతురు.
వివరము : సర్వప్రపంచము పరమాత్మనుండియే పుట్టినదని, ఈ సర్వ జగత్తు పరమాత్మ వలననే నడువగల్గుచున్నదని, ప్రపంచములో జరుగు ప్రతిదానికి పరమాత్మయే మూలకారణమని తెలిసిన జ్ఞానులు సమత్వముకల్గు స్థితియైన యోగముచే పరమాత్మను ఆరాధించెదరు.
☞
You are now Online
You are now Online
You are now Online
You are now Online
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ విభూతి యోగము
☞
(9) శ్లో|| 9: మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయన్తః పరస్పరమ్ |
కథయ న్త శ్చ మాం నిత్యం తుష్యన్తి చ రమన్తి చ ||
(పరమాత్మ)
భావము : నా భక్తులు చిత్తమును ప్రాణమును నాయందుంచి, నిత్యము నన్ను గూర్చిన విషయములను ఒకరికొకరు బోధించుకొనుచు తృప్తులై ఆనందముగ ఉందురు.
వివరము : పరమాత్మ మహత్యమును తెలిసిన భక్తులు ప్రపంచ విషయములలో లేని సంతోషము పరమాత్మ విషయములు మాట్లాడుటలో పొందుదురు. ఎంత పెద్ద ప్రపంచ విషయములున్నను వాటికి విలువనివ్వక పరమాత్మ విషయాలలోనే ఎక్కువ ధ్యాసనుంచి మాట్లాడుకొనుచుందురు. పరమాత్మ జ్ఞానవిషయములు మాట్లాడు సమయములోనున్న తృప్తి, ఆనందము, మిగతా విషయములలో వారికుండదు. అందువలన వారి ధ్యాసనంతయు పరమాత్మ విషయములలో లగ్నముచేసి, ఒకరికొకరు ఆ విషయములను గూర్చి చెప్పుకొనుచు ఆనందించుచుందురు.
☞
You are now Online
You are now Online
You are now Online
You are now Online
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ విభూతి యోగము
☞
(9) శ్లో|| 10: తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకమ్ |
దదామి బుద్ధి యోగం తం యేన మా ముపయాన్తితే ||
(పరమాత్మ)
భావము : ఎవడైతే ప్రీతికరముగ నన్నే ఆరాధిస్తు ఎల్లప్పుడు నాతో కూడుకొని ఉండవలెనని తలచునో, అట్టివానికి బుద్ధియోగము నేను కలుగజేయుచున్నాను. దానిచేత నన్ను తెలియగలరు, పొందగలరు.
వివరము : పరమాత్మ విషయాలే ఆనందదాయకముగ ఉన్నవాడు ప్రీతి పూర్వకముగ ఎల్లప్పుడు పరమాత్మతోనే సంబంధము పెట్టుకోవాలని తలచుచుండును. అట్టివానికి పరమాత్మ బుద్ధియోగమును కలుగజేయును. ఆ బుద్ధియోగముచే పరమాత్మను సులభముగ తెలియనగును. ఇచట బుద్ధియోగమని చెప్పబడివున్నది. బుద్ధి యోగమనగ బ్రహ్మయోగమని కొందరు, కర్మయోగమని కొందరు చెప్పుకొనుచున్నారు. దాని వివరమేమనగా! బ్రహ్మయోగమాచరించు సమయములో మనస్సు ఇతర ఆలోచనమీదికి పోయినపుడు బుద్ధియే మనస్సును హెచ్చరించి సక్రమమార్గములో ఉండమని మనస్సును ఆదేశించును. అదే విధముగ కర్మయోగము ఆచరించునపుడు అహము పనిచేసిన, బుద్ధియే గ్రహించి అహమును అణిగిపొమ్మని అదేశించును. రెండు యోగములలో బుద్ధియే మనస్సుకు, అహముకు హితము చెప్పుచుండుట వలన రెండిటిని బుద్ధియోగమే అంటున్నాము. పరమాత్మ బుద్ధియోగము ప్రసాదించాడంటే రెండు యోగములలో ఏదైన ఒకటి కావచ్చును. లేక రెండు యోగములైన కావచ్చును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ విభూతి యోగము
☞
(9) శ్లో|| 11: తేషా మేవానుకమ్పార్థ! మహ మజ్ఞానజం తమః |
నాశయా మ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా ||
(పరమాత్మ)
భావము : అట్టివారిని ఉద్ధరించుటకొరకు వారియందు ఆత్మగానున్న నేను జ్ఞాన దీపమును వెలుగజేసి అజ్ఞాన చీకటిని లేకుండ చేయుదును.
వివరము : తనను ఇష్ట పూర్వకముగ చేరవలెనని కోరికగలవారికి, యోగము లభ్యమగునట్లు చేసిన పరమాత్మ, వారిలో దాగియున్న అజ్ఞాన సంశయములు ఏవి యోగభంగము చేయకుండునట్లు, ఆ సంశయములకు జవాబులు వాని శరీరమందే పుట్టునట్లు చేయుచున్నాడు. అజ్ఞానాంధకారమను సంశయములకు జ్ఞానదీపకాంతి యగు జవాబులు కలుగజేయుచున్నాడు. వెలుగుతో చీకటెట్లు మాయమగునో అట్లే సంశయములన్ని జ్ఞానముతో పటాపంచలగును. సంశయములులేనివారు నిరాటంకముగా ముక్తి పొందవచ్చును. ఈ మాటలు విన్న అర్జునుడు ఈ విధముగ అంటున్నాడు.
☞
You are now Online
You are now Online
You are now Online
You are now Online
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ విభూతి యోగము
☞
అర్జునుడిట్లనియె : -
(9) శ్లో|| 12: పరం బ్రహ్మ పరంధామ పవిత్రమ్ పరమం భవాన్ |
పురుషం శాశ్వతం దివ్య మాదిదేవ మజం విభుమ్ ||
(9) శ్లో|| 13: ఆహు స్త్వా మృషయ స్సర్వే దేవర్షి ర్నారద స్తథా |
అసితో దేవలో వ్యాస స్స్వయం చైవ బ్రవీషి మే ||
(9) శ్లో|| 14: సర్వ మేత దృతం మన్యే యన్మాం వదసి కేశవా! |
నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవా: ||
(9) శ్లో|| 15: స్వయమే వాఽ త్మనాఽ త్మానం వేత్థత్వం పురుషోత్తమ! |
భూత భావన! భూతేశ ! దేవదేవ! జగత్పతే! ||
ఈ మాటలువిన్న అర్జునుడు ఈ విధముగ అంటున్నాడు
భావము : పరబ్రహ్మవు, పరంధామము, పవిత్రుడవు, శ్రేష్ఠుడవు, పురుషుడవు, శాశ్వతుడవు,దివ్యుడవు, ఆది దేవుడవు, అజుడవు, విభుడవు అనుచు నారదుడు, అసితుడు, దేవలుడు, సప్తఋషులు, వ్యాసుడు చెప్పుచుండిరి. ఇపుడు నీవే స్వయముగ చెప్పగ వినుచున్నాము.
ఏది నాకు చెప్పితివో అదియంతయు సత్యమైనదని మనసులో తలచు చున్నాను. నీ యొక్క అసలు స్వరూపము దేవతలు, దానవులు కూడ తెలియలేకున్నారు.
సకల భూతములను సృజించువాడవు, సకల జీవులను పాలించు వాడవు, దేవతలకు దేవుడవు, జగమునకు భర్తవైన ఓ పురుషోత్తమా! నిన్ను నీవే తెలుసుకోగలవు.
వివరము : పూర్వము పెద్దలైన సప్తఋషులు, నారదుడు మొదలైన వారందరు పరమాత్మను గూర్చి పెద్దగ చెప్పియున్నారు. ఆయనను గూర్చి ఎవరు ఎంత చెప్పిన అది పూర్తి విషయముకాదనియే చెప్పవచ్చును. వారు చెప్పినదానికంటే కూడ ఎన్నో రెట్లు గొప్పవాడు పరమాత్మ. అందువలన అర్జునుడు కూడ నిన్ను గూర్చి నీకే తెలియును. నిన్ను గూర్చి నీవు చెప్పవలసిందే అన్నాడు. వాస్తవముగ ఎవరికి అర్థముగానంత మహిమ, గొప్పతనము కలవాడు పరమాత్మ. ఆయన విషయమును గురించి ఆయననే అడుగవలసిందే కాని ఎవరినడిగిన లాభములేదు. అందువలన అర్జునుడు కూడ ఇదే విషయము అడుగుచున్నాడు.
☞
You are now Online
You are now Online
You are now Online
You are now Online
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ విభూతి యోగము
☞
(9) శ్లో|| 16: వక్తు మర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మ విభూతయః |
యా భిర్విభూతి భిర్లోకా నిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి ||
(9) శ్లో|| 17: కథం విద్యా మహం యోగిన్ త్వాం సదా పరిచిన్తయన్ |
కేషు కేషు చ భావేషు చిన్త్యో ఽసి భగవ న్మయా ||
(9) శ్లో|| 18: విస్తరే ణాత్మనో యోగం విభూతిం చ జనార్దన! |
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతోనాస్తి మేఽ మృతమ్ ||
భావము : ఏ మహిమల చేత ఎల్లలోకములను వ్యాపించివున్నావో, ఆ దివ్య మహిమలను సశేషముగ చెప్పుటకు నీవే అర్హుడవు.
నేను ఎల్లపుడు నీ చింతయే చేయుచు యోగినై నిన్ను తెలుసుకొనుట ఎట్లు? ఏయే భావముల నిన్ను చింతింపవలెనో తెలియచెప్పుము.
విస్తరించివున్న ఆత్మను, దానిని పొందు విధానమును, దాని మహిమను మరల చెప్పుము. ఆ అమృతవాక్కులు ఎన్నిమార్లు విన్నను తృప్తిలేదు.
వివరము : పరమాత్మ విషయములు పరమాత్మ తప్ప మరెవ్వరు తెల్పలేరను ఉద్దేశ్యముతో ఇలా పరమాత్మను, మహిమా విశేషములను తెల్పమని అర్జునుడు వేడుకొనగ, పరమాత్మ తన యొక్క మహిమను తెల్పను మొదలు పెట్టాడు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ విభూతి యోగము
☞
శ్రీ భగవంతుడిట్లనియె : -
(9) శ్లో|| 19: హన్త తే కథయిష్యామి దివ్యా హ్యాత్మ విభూతయః|
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ! నాస్త్యన్తో వి స్తరస్యమే ||
(పరమాత్మ, మహత్యములు)
భావము : నా విభూతులు (మహిమలు) అంత్యములేనట్టివి. వాటిలో ముఖ్యమైన కొన్నింటిని మాత్రము చెప్పెదను.
☞
You are now Online
You are now Online
You are now Online
You are now Online
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ విభూతి యోగము
☞
(9) శ్లో|| 20: అహ మాత్మా గుడాకేశ! సర్వభూతాశయస్థితః |
అహ మాదిశ్చ మధ్యంచ భూతానా మన్త ఏవ చ||
(పరమాత్మ, మహత్యములు)
భావము : నేను ఆత్మగవున్నవాడనై సర్వ జీవరాసులకు ఆధారముగనున్నాను. సర్వ జీవరాసులకు ఆదియు, మధ్యమును, అంత్యమును నేనే.
వివరము : సర్వజీవరాసుల శరీరములలో ఆత్మ అంటు ఒకటుంది. అది అన్ని శరీరములను కదిలించి నడిపించుచు, కర్మానుసారము పనులు చేయించుచూ, ప్రపంచ మనుగడకు కారణమైవున్నది. శరీరములలో ఆ విధముగనున్న ఆత్మ కూడ నేనేనని పరమాత్మ ఈ శ్లోకములో 'అహమాత్మ' అన్నాడు. జీవుడువేరు, ఆత్మవేరు, పరమాత్మవేరు అయినప్పటికి ఆత్మ పరమాత్మలోని భాగమే, అందువలన ఆత్మను నేను అన్నాడు. అంతేకాక జీవుడు కూడ ఆయనేనని చెప్పకనే మనము తెలుసుకోవలెను. జీవాత్మకు ఆధారమైనది ఆత్మ. ఆత్మకాధారమైనవాడు పరమాత్మ. పరమాత్మకు పరమాత్మే ఆధారము. ఆయనను మించినవాడు మరొకడు లేడు. పరమాత్మను గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఆయన ఇక్కడున్నాడు, అక్కడలేడు అనుటకు ఎట్లు వీలులేదో, ఆ విధముగనే ఇది పరమాత్మ అది పరమాత్మకాదనుటకు వీలులేదు. సర్వము ఆయనైవున్నాడు. ఏ దానిని పరిశీలించి చూడనవసరము లేదు. ప్రతిది ఆయనేనని తెలియవలయును ఆ విషయము తెలుపు నిమిత్తము జీవరాసుల మొదలు, నడుమ, చివర అంతయు నేనే అన్నాడు.
గమనిక : పరమాత్మ గొప్పతనమునుతెలియచేయు ఈ అధ్యాయములో సర్వము నేనే అను పరమాత్మ వాక్కును ఎన్నో విధములుగ వివరించి చెప్పడమైనది. ఎన్ని విధముల వివరించి చెప్పుకున్నను చివరకు మనకర్థమగునది పరమాత్మకు అతీతమైనదిగాని, పరమాత్మకు మినహాగాని ఏది లేదనుటయే. ఇక్కడ 21వ శ్లోకము నుండి 40వ శ్లోకము వరకు ఏకధాటిగ చెప్పిన విషయము కూడ అదియే. కావున మొత్తము 20 శ్లోకముల వరకు ఒకే విషయమైన దానివలన అన్నిటిని ఒక్కమారుగ కలిపి వ్రాయడము జరిగినది. శ్లోక శ్లోకము వేరువేరుగ వ్రాయక 21 నుంచి 40 వరకు వ్రాసి ఒకే భావము చెప్పడమైనదని గ్రహించాలి.
☞
You are now Online
You are now Online
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ విభూతి యోగము
☞
9) శ్లో|| 21: ఆదిత్యానా మహం విష్ణు ర్జ్యోతిషాం రవి రంశుమాన్ |
మరీచి ర్మరుతా మస్మి నక్షత్రాణా మహం శశీ ||
(9) శ్లో|| 22: వేదానాం సామవేదో ఽస్మి దేవానా మస్మి వాసవః |
ఇన్ద్రియాణాం మనశ్చాస్మి భూతానా మస్మి చేతనా ||
(9) శ్లో|| 23: రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ |
వసూనాం పావక శ్చాస్మి మేరు శ్శిఖరిణా మహమ్ ||
(9) శ్లో|| 24: పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ! బృహస్పతిమ్ |
సేనానీనా మహం స్కన్ద స్సరసా మస్మిసాగరః ||
(9) శ్లో|| 25: మహర్షీణాం భృగు రహం గిరా మస్మ్యేక మక్షరమ్ |
యజ్ఞానాం జ్ఞాన (జప) యజ్ఞోప్మి స్థావరాణాం హిమాలయః ||
(9) శ్లో|| 26: అశ్వత్థ స్సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః |
గంధర్వాణాం చిత్రరథ స్సిద్ధానాం కపిలో మునిః ||
(9) శ్లో|| 27: ఉచ్చైశ్శ్రవస మశ్వానాం విద్ధి మా మమృతోద్బవమ్ |
ఐరావతం గజేన్ద్రాణాం నరాణాం చ నరాధిపమ్ ||
(9) శ్లో|| 28: ఆయుధానా మహం వజ్రం ధేనూనా మస్మి కామధుక్ |
ప్రజన శ్చాస్మి కన్దర్ప స్సర్పాణా మస్మి వాసుకిః ||
(9) శ్లో|| 29: అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసా మహమ్ |
పితౄణా మర్యమాచాస్మి యమ స్సంయమతా మహమ్ ||
(9) శ్లో|| 30: ప్రహ్లాద శ్చాస్మి దైత్యానాం కాలఃకలయతా మహమ్ |
మృగాణాంచ మృగేన్ద్రో ఽ హంవైనతేయశ్చ పక్షిణామ్ ||
(9) శ్లో|| 31: పవనః పవతా మస్మి రామశ్శస్త్రభృతా మహమ్ |
ఝషాణాం మకర శ్చాస్మి స్రోతసా మస్మి జాహ్నవీ ||
(9) శ్లో|| 32: సర్గాణా మాది రన్తశ్చ మధ్యం చైవాహ మర్జున! |
ఆధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతా మహమ్ ||
(9) శ్లో|| 33: అక్షరాణా మకా రోఽస్మి ద్వన్ద్వ స్సామాసికస్య చ |
అహమే వాక్షయఃకాలో ధాతాఽహం విశ్వతో ముఖః ||
(9) శ్లో|| 34: మృత్యు స్సర్వహర శ్చాహ ముద్బవ శ్చ భవిష్యతాం |
కీర్తి శ్శ్రీ ర్వాక్చ నారీణాం స్మృతి ర్మేధా ధృతిఃక్షమా ||
(9) శ్లో|| 35: బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛన్దసా మహమ్ |
మాసానాం మార్గశీర్షోఽహ మృతూనాం కుసుమాకరః ||
(9) శ్లో|| 36: ద్యూతం ఛలయతా మస్మి తేజన్తేజస్వినా మహమ్ |
జయోఽ స్మి వ్యవసా యోస్మి సత్త్వం సత్త్వవతా మహమ్ ||
(9) శ్లో|| 37: వృష్ణీనాం వాసుదేవోఽస్మి పాణ్డవానాం ధనంజయః |
మునీనా మ ప్యహం వ్యాసః కవీనా ముశనా కవిః ||
(9) శ్లో|| 38: దణ్డో దమయతా మస్మి నీతి రస్మి జిగీషతామ్ |
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతా మహమ్ ||
(9) శ్లో|| 39: యచ్చాపి సర్వభూతానాం బీజం తదహ మర్జున! |
న త ద స్తి వినా యత్స్యా న్మయా భూతం చరాచరమ్ ||
(9) శ్లో|| 40: నాన్తోఽస్తి మమ దివ్యానాం విభూతీనాం పరన్తప! |
ఏషతూద్దే శతః ప్రోక్తో విభూతే ర్విస్తరో మయా ||
భావము : సూర్యులందరిలోన విష్ణువును నేను. ప్రకాశముగల జ్యోతులలో సూర్యుడను. వాయువులలో మరీచి వాయువును నేను, నక్షత్రములలో చంద్రుడను నేను. వేదములలో సామవేదమును, దేవతలలో దేవేంద్రుడను, ఇంద్రియములలో మనస్సును నేనే. జీవరాసులలోని చైతన్యము(ఆత్మ)ను నేనే. రుద్రులలో శంకరుడను, యక్షరాక్షసులలో కుబేరుడను నేనే. వసువులలో అగ్నిని నేనే, శిఖరములలో మేరు శిఖరమును నేను, పురోహితులందు బృహస్పతిని నేనని తెలియుము. సర్వ సేనాదులందు షణ్ముఖుండనగుదు, సరస్సులలో నేను సాగరుండనగుదు.
ఋషులలోన నేనగుదు భృగుమహర్షిని, శబ్దములలో ఓంకార శబ్దమునేను. యజ్ఞములందు నేను జ్ఞాన(జప)యజ్ఞమగుదును. పర్వతములలో హిమాలయమును అగుదు నేను.
25వ శ్లోకములో 'యజ్ఞానాం జపయజ్ఞోస్మి' అను వాక్యము కలదు. యజ్ఞములలో జపయజ్ఞము నేనని దీని అర్థము. అన్నిటిలోను పేరుపేరున గొప్పవాటినే చెప్పి అవియన్ని నేనన్నవాడు. ఇక్కడ యజ్ఞములన్నిటికంటే గొప్పదైన జ్ఞానయజ్ఞము నేననక జపయజ్ఞము నేనన్నాడు. ఇది నిజమా! అవి మనము ఆలోచించవలసివున్నది. ద్రవ్యయజ్ఞముకంటే జ్ఞానయజ్ఞమే శ్రేష్ఠమైనదని జ్ఞానయోగమను అధ్యాయములో తెలియజేసి ఆ శ్రేష్ఠమైన యజ్ఞము నేననక జపయజ్ఞమని చెప్పడమేమిటి? కావున ఇక్కడేదో పొరపాటు జరిగినదని తెలియుచున్నది. వాస్తవముగ అన్నిటియందు శ్రేష్ఠమైన వాటినే సూచించిన భగవంతుడు ఇక్కడ మాత్రము శ్రేష్ఠమైన జ్ఞానయజ్ఞమును వదలి జపయజ్ఞమని చెప్పివుండడు. శ్లోకములో జ్ఞానయజ్ఞము స్థలములో జపయజ్ఞమని పొరపాటుగ మారిపోయి ఉండవచ్చును. కావున అక్కడ జ్ఞానయజ్ఞమనియే చదువుకోవాలని కోరుచున్నాము. అన్నిటికంటే గొప్పది, కర్మ నిర్మూలణము చేయునది జ్ఞానయజ్ఞము. కావున 'యజ్ఞానం జ్ఞాన యజ్ఞోస్మి' అని తెలుసుకోవలెను.
సర్వ వృక్షంబులందు అశ్వర్థవృక్షమును, దేవర్షులందు నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిలమునిని నేను.
అశ్వములలో నేను ఉచ్ఛైశ్రవమును, అమృతములో బుట్టినందువలన ఏనుగులలో ఐరావతమును నేను. నరులలో రాజును నేను.
ఆయుధములలో వజ్రాయుధమును నేను, ఆవులయందు కామధేనువును. పుట్టించువారలలో కందర్పుడను, సర్పములలో వాసుకి సర్పమును నేనే అగుదును.
నాగులలో వేయి శిరస్సుల అనంతుడగుదును. జలచరములకు వరుణ దేవుడను, పితరులందు ఆర్యముడను. దండించువారిలో యముడను నేను.
రాక్షసులలో ప్రహ్లాదుడను, వేచివున్న వారికి కాలమును నేను, మృగములలో సింహమునేను. పక్షులలో వైనతేయుండను పక్షిని నేను.
వేగముగ చరించువారిలో గాలిని. శస్త్రములు ధరించిన వారిలో రామ చంద్రుడను, చేపలలో మొసలిని, పుణ్యజలములలో గంగానదిని నేను.
పుట్టెడు వాటికంతయు ఆది, మధ్య, అంత్యములు నేను. విద్యలయందు ఆధ్యాత్మిక విద్యనగుదును. వాదించువారి వాదము నేను.
అక్షరములలో 'అ ' కారమును, సమాసములలో ద్వంద్వసమాసమును, నాశనములలో అక్షయమును, విశ్వముఖుడైన విధిని నేనే.
ఎల్లవారిని సంహరించుటలో మృత్యువును. పుట్టువారికి భవిష్యత్తును, స్త్రీలలో లక్ష్మిని, కీర్తి, స్మృతి, మేధస్సు, ఓర్పు అన్నియు నేను.
సామగానంబులలో బృహత్సామమును, ఛందస్సులో గాయత్రిని, మాసములలో మార్గశిరమాసమును, ఋతువులలో వసంతఋతువును నేనే అయివున్నాను.
మోసములలో జూదము నేను. సర్వతేజస్సులందు తేజము నేను. సాత్త్వికులలోగల సత్యమును నేను. అట్లే ప్రయత్నించువారిలో ప్రయత్నమును, గెలుపొందువారిలో జయమును నేనే. యాదవులలో వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, సకల మునులలో వ్యాసమునిని, అట్లే సర్వకవులలో శుక్రకవిని నేనే.
దండన చేయువారి దండన నేనగుదు. రాజులలో రాజనీతియును రహస్యములలో మౌనమును, జ్ఞానులలోని జ్ఞానమును నేనేయగుదును.
సర్వజీవులకు బీజమునేను. నేను లేనట్టి జీవరాసి ఏదియులేదు. సర్వ చరాచర భూతములు నావలననే పుట్టును.
ఈ విధముగ చెప్పుచుపోతే నాశుభకరమైన విభూతులకు అంత్యము లేదు, కావున వర్ణింపనలవి కాదు. విస్తరించక ముఖ్యమైన వాటిలో కొన్నిటిని మాత్రము నీకు చెప్పితిని.
వివరము : పరమాత్మ విషయమును ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అది అను భేదము లేకుండ అంతట అన్నియు తానై ఉన్నవాడని చెప్పవచ్చును. ఇక్కడ మీరు నన్నొక ప్రశ్న అడుగవచ్చును. అదేమనగా పరమాత్మ అన్నియు తానైయున్నప్పుడు మృగములలో సింహమును, రాక్షసులలో ప్రహ్లాదుడను, శబ్దములలో ఓంకారమును నేననడములో అర్థమేమిటి? మృగములలో సింహము తప్ప మిగతా జంతువులు కాదా? శబ్దములలో 'ఓం ' కారము తప్ప మిగతా శబ్దములేవి కాదా? అని ప్రశ్నించవచ్చును.
మా జవాబేమనగా! అంతయు నేనే అను ఒక చిన్న మాటకు ఇంత వివరముగ చెప్పనవసరములేదు. అయినప్పటికి వివరముగ చెప్పదలచి ఇన్ని శ్లోకములుగ చెప్పారు. అలా చెప్పినప్పటికి వివరముగ అర్థము కాలేదు. కాని అనుమానాలు పెరుగునట్లు చేశారు. మీరడిగిన ప్రశ్న ఇక్కడ అడుగుటకు యోగ్యమైనదే. ఈ శ్లోకములు వ్రాసిన వారు ఒక జాతిలో పేరు పొందినది చెప్పితే మిగతావన్ని చెప్పినట్లేనగునని వారనుకోవడము పొరపాటేనని ఒప్పుకోవచ్చును. చివరకు ఏది ఏమైన ఈ శ్లోకముల ఉద్దేశ్యము అన్నియు పరమాత్మేయని తెలియుటకేనని గ్రహించవలెను.
☞
You are now Online
You are now Online
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ విభూతి యోగము
☞
(9) శ్లో|| 41: యద్య ద్విభూతి మత్సత్త్వం శ్రీ మదూర్జిత మేవ వా |
తత్త దే వావగచ్ఛ త్వం మమ తేజోఽంశ సమ్భవమ్ ||
(పరమాత్మ)
భావము : సర్వ జీవరాసులందు మహిమగలది, శుభకరమైనది, పేరు పొందినదేది కలదో అది ఎల్ల నా తేజము వలన పుట్టినదేనని తెలియుము.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ విభూతి యోగము
☞
(9) శ్లో|| 42: అథవా బహునై తేన కిం జ్ఞాతేన త వార్జున! |
విష్టభ్యాహ మిదం కృత్స్న మేకాంశేన స్థితో జగత్ ||
(పరమాత్మ)
భావము : అట్లు కాకున్న ఇన్ని విధములుగ నేను చెప్పి ఏమి ప్రయోజనము! నాయొక్క ఎన్నో అంశములలో ఒక్క అంశచేతనే జగత్తంతయునున్నదని తెలియుము.
వివరము : అన్నిటికంటే మిన్నగ చెప్పుచున్నానని చివరగ ఒకమాట చెప్పాడు. ఆయనకున్న అనంతమైన అంశలలో ఒకే అంశచేత ఈ చరాచర ప్రపంచమంతయు నిలిచివున్నదన్నాడు. ఈ చివరి మాటతో ఆయనెంత గొప్పవాడో గ్రహించవచ్చును. విశ్వమును గూర్చి యోచించిన అంతుచిక్కనిదిగనున్నది. ఎన్నో గోళములు నక్షత్రములతో నిండివున్న ప్రపంచములో మనమున్న భూమియే చిన్నది. ఈ భూమి మీదనే సమస్త జీవరాసులున్నవి. ఈ జీవరాసులు అనంత విశ్వము అంతయు "ఏకాంశేన స్థితో " ఒక్క అంశలోనే వున్నాయంటే ఆకాశము గగనం శూణ్యం అన్నట్లు పరమాత్మ అనంతము, అనిర్వచనీయం అనవలసిందే.
☞
You are now Online
You are now Online