pss :b g 1 y part2




త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 27: జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్యచ|
తస్మాద పరిహార్యే ఽ ర్థే న త్వం శోచితు మర్హసి||
(జీవాత్మ)

భావము:- పుట్టుట ఎప్పటికైన చచ్చుట కొరకే, చచ్చుట మరి పునర్జన్మమునకే, కనుక అనివార్యమైన ఈ సంగతిని గురించి దుఃఖించుట తగదు.
వివరము: ఒక చోట జన్మించినవాడు కొంతకాలమునకు మరణించి తీరవలసిందే, అలా మరణించినవాడు ధనికుని ఇంటగాని, పేదవాని ఇంటగాని తప్పని సరిగా ఎక్కడో ఒక చోట పుట్టవలసి ఉన్నది. అలా ఎందుకు చచ్చి మరియొక చోట పుట్టాలి? మొదట పుట్టినవాడు పుట్టిన చోటనే ఉంటే వానిని విడిపోయామను దుఃఖము మనకుండదు కదా! ఒక వ్యక్తి మరణము చేత మరియొక వ్యక్తి వియోగ దుఃఖము అనుభవించవలసి వస్తుంది కదా! అలా ఎందుకు జన్మల మార్పిడి జరగాలి, అని యోచించిన జనన మరణ పద్ధతి లేకుండ పోయినట్లయితే ఈ ప్రపంచ నాటకమే సాగకుండ సూత్రధారి ఎవరో, పాత్రధారి ఎవరో, తెలియకుండ పోగలదు. దేవుడు ఏర్పరచిన కర్మయను చట్టమును ఆచరింపజేయుటకు ప్రకృతి అను వ్యవస్థను దేవుడు నిర్మించాడు. ప్రకృతియను వ్యవస్థలో గుణములు, ఇంద్రియములు, వాటి మార్పులు ఎన్నో అమర్చి, చివరకు శరీరము మరణించడము తిరిగి ఇంకొక శరీరమును పొందడమను పద్ధతి కూడ అమర్చబడి ఉన్నది. ఆ పద్ధతి ప్రకారము అన్నియు యాంత్రికముగా జరుగుచున్నవి. దేవుడే మనిషిగా వచ్చినప్పటికి ప్రకృతిని అనుసరించి మెలగవలసిందే. ఆయన కూడ ఆ పద్ధతిని అతిక్రమించి నడుచుకొనుటకు వీలులేనట్లు ఆయనే గట్టి భద్రము చేసి ఉంచాడు. కావున జీవాత్మల చావు పుట్టుకలు అనివార్యమైనవి, దానిని ఎవరూ అతిక్రమించలేరు. కావున జీవుల చావుల గురించి దుఃఖించుట వ్యర్థమైన పని.

పుట్టిన తర్వాత చనిపోకుండ ఉండడము అనివార్యమైనదని తెలిసినప్పటికి, చనిపోయిన వానిని గురించి కొంతైనా దుఃఖము ఉండును. ఆ దుఃఖము కూడ లేకుండా పోవాలంటే వాడు ఎచట పుట్టాడని తెలిసిన, మనవాడు పలాన చోట ఉన్నాడులే అని బాధలేకుండా పోవును కదా అని కొందరనుకోవచ్చును. అట్లు తెలిసినప్పటికి దుఃఖముండడమే కాక, ఇంకను దుఃఖమధికమగుటకు అవకాశము గలదు. ఎందుకనగా! ఒక ధనికుడు చచ్చి మరియొక చోట దరిద్రుని ఇంట పుట్టాడనుకొనుము. అది తెలిసిన ధనికుని కుటుంబీకులు మనవాడు మరియొక చోట పుట్టాడులే అని దుఃఖపడకుండ ఉండరు. వాడు దరిద్రుని ఇంటిలో పుట్టాడు కదా! ఏమి సుఖము అనుభవిస్తాడని ఇంకను ఎక్కువ బాధపడుదురు. ఎక్కడ పుట్టాడని తెలియక పోవడము వలన చనిపోయిన దినము మరసటి దినము ఏడ్చి ఊరకుండి మర్చిపోతారు. కాని వాడు ఎక్కడ పుట్టినది తెలిస్తే వానిని గూర్చి వీరు చచ్చిపోయేంత వరకు ఏడ్వవలసి వస్తుంది. అందువలన తిరిగి వచ్చు జన్మ విషయము ఎవరికి తెలియకుండ పోవునట్లు, కర్మచట్టమును అమర్చి ప్రకృతిని పరమాత్మ నిర్మించాడు. దీని విషయమై క్రింది శ్లోకమున ఇలా ఉన్నది.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 28: అవ్యక్తా దీని భూతాని వ్యక్త మధ్యాని భారత|
అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా||
(జీవాత్మ)

భావము:-జీవ సంభవములెల్ల తెలియబడవు. అట్లే వాని మరణములు కూడ తెలియబడవు. కాని పుట్టుక చావుల మధ్యనగల జీవితము మాత్రము తెలియును. అట్టి జీవునకు నీవు శోకింపతగదు.
వివరము:- పుట్టుచున్న జీవాత్మలు ఎక్కడ నుండి వచ్చి పుట్టినవో ఎవరికి తెలియదు. పుట్టిన జీవాత్మ కొంతకాలము శరీరములో ఉండి చనిపోయినపుడు ఎక్కడికి పోవుచున్నది, అది తిరిగి ఎక్కడ శరీరము ధరిస్తున్నది తెలియదు. ఎక్కడి నుండి వస్తున్నది ఎక్కడికి పోవుచున్నది తెలియక పోవడము వలన, చనిపోయిన వ్యక్తి జీవితములో గల సంబంధములన్ని బ్రతికియున్న వారు తెంచుకోవలసి వస్తున్నది. ఉదాహరణకు మొగుడు చనిపోగా బ్రతికి ఉన్న భార్య అతని జీవిత సంబంధములన్ని కోల్పోయినదై , అతని జీవిత సంబంధమునకు గుర్తులైన తాళి, మెట్టెలను కూడ తీసి వేయుచున్నది. అదే తన భర్త చచ్చి ఎక్కడికి పోయినది, ఎక్కడున్నది తెలిస్తే మాత్రము ఏ భార్య తన తాళిని తీసివేయదు. అక్కడ ఇంకొకరిని పెళ్లిచేసుకోనివ్వదు. పుట్టిన వాడు పలానా చోట నుండి వచ్చి పుట్టాడని తెలిసిన ఇబ్బంది కలదు. ఎందుకనగా ఒక తగ్గు కులస్థుడు ఉన్నత కులమున పుట్టాడనుకొందాము. వాడు పలానా వాడని, ఎక్కడి నుండి వచ్చి పుట్టినది ప్రసవము జరిగిన ఇంట్లో తెలిస్తే వాడు పలానా రౌడీయనో, లేక నీచ కులస్థుడనో, వారు బాధపడుచు వారికి పుట్టినప్పటికి, వారి సంతతిగా చూచుకోకుండా పోవుటకు వీలున్నది.

 ఒక వేళ చచ్చినవానికి జ్ఞప్తి ఉండి, నేను పలానా చోట మరణించి ఇక్కడ పుట్టానని తెలియుట వలన, నాకు వీరా తల్లిదండ్రులని ఏవగించుకొను అవకాశములు కూడ కలవు. కర్మ సిద్ధాంతమునకే ముప్పువాటిల్లి ప్రపంచ మానవవ్యవస్థే ముందుకు సాగదు. కావున ప్రతి జీవరాసికి పుట్టుక మరణము యొక్క వెనుక రహస్యము తెలియకుండునట్లు ప్రకృతి చేత తీర్చిదిద్దబడినది. అందువలన ఒక జన్మ జ్ఞప్తి ఆ జన్మతోనే పోవుచుండుట వలన, బయటి వారికి కాని తనకు గాని పుట్టుక మునుపు, మరణము వెనుక, తెలియక చావు పుట్టుకల మధ్య గల జీవితము మాత్రమే తెలియుచున్నది. ముందు వెనుక సంబంధము లేక మధ్య మాత్రము తెలియు జీవితము అనుభూతులను బట్టి, తోటి జీవుల కోసము నీవు దుఃఖించవలదన్నారు.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 29: ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేన మాశ్ఛర్యవ ద్వదతి తథైవచాన్యః
ఆశ్చర్య వచ్చైన మన్య శ్శృణోతి శ్రుత్వా ప్యేనం వేద న చైవ కశ్ఛిత్||
(జీవాత్మ)

భావము:- మధ్య జీవితములో జరుగు పనులను ఒకడు ఆశ్చర్యముగా చూచుచున్నాడు. ఆ పనులను ఇంకొకడు ఆశ్చర్యముతో వినుచున్నాడు. మరియొకడు వింతగా చెప్పుకొనుచున్నాడు. కాని జీవాత్మ నిజస్థితిని గూర్చి ఎవడు తెలియడు.
వివరము:- పుట్టుక ముందు, చావు వెనుక గల విషయము తెలియక, మధ్య జీవితము మాత్రము తెలియు మానవులు ఇంకొకరి జీవితమును గురించి ఆశ్చర్యముగా చూచుచున్నారు. ఆశ్చర్యముగా వినుచున్నారు. అట్లే వింతగా చెప్పుకొనుచున్నారు. కాని వింతలు విడ్డూరములు గల జీవితము వెనుక ఉన్న జీవాత్మను ఏమాత్రము గుర్తించలేక పోవుచున్నారు. గుర్తించలేని జీవాత్మను చంపలేరని క్రింది శ్లోకమున చెప్పుచున్నారు చూడండి.

ముఖ్య గమనిక: ప్రచురింపబడిన భగవద్గీతలన్నిటిలో చాలామంది పెద్దలు ఇంత వరకు చెప్పిన అన్ని శ్లోకములలోను ఆత్మను గురించి వర్ణించి చెప్పారు. అట్లే పై శ్లోకములోని భావమునకు కూడ ఆత్మను గూర్చి చెప్పారు. దీని వలన భగవద్గీత భావమే తప్పుదారి పట్టిపోయిందని మేమంటున్నాము. జీవాత్మ ఆత్మల వివరము తెలియనపుడు తెల్లగయున్నవని అన్నము సున్నము రెండూ ఒకటే కదా! అన్నట్లు ఉంటుంది. వరి బియ్యము ఉడికి అన్నము, సున్నపు రాళ్లు ఉడికి సున్నముగా మారి తెల్లగున్నప్పటికి వాటి రుచియందు ఎంతో తేడా ఉండునట్లు, ఆత్మ జీవాత్మలు రెండు శరీరములందే నివసించినప్పటికీ వాటి వాటి విలువలు వేరై ఉన్నవి. దేహియంటే దేహమందు నివసించునదని అర్థము. ఆత్మ, జీవాత్మ రెండు దేహమునందు నివసించునవే, కావున దేహి అను పదము రెండిటికి వర్తించును. అందువలన ఆత్మ అనుభవమును, జీవాత్మ ఉనికిని తెలిసినవారైతే గాని వాటిని సందర్భానుసారము గుర్తించగలరు. వాచా వేదాంతము తెలిసి వేగముగా మాట్లాడినంత మాత్రమున అనుభవము రాదు. కనుక అనుభవంలో జీవాత్మ ఆత్మలు వేరని గ్రహించాలి. జీవాత్మకు చెప్పిన శ్లోకమును ఆత్మకు చెప్పినట్లు వివరము చెప్పుచు, ఒకడు ఆత్మను ఆశ్చర్యముగా చూచుచున్నాడని చాలా మంది వ్రాశారు. అట్లే వినుచున్నాడని, చెప్పుచున్నాడని కూడ వ్రాశారు. వారిమాట ప్రకారము పోయిన ఆత్మ విషయములను నోటితో చెప్పుకోవచ్చును, చెవులతో వినవచ్చును కాని కంటితో చూచుటకు సాధ్యము కాదు. ఆత్మ దృశ్యరూపము కాదు దానినెలా ఆశ్చర్యముగ చూడవచ్చునని తెలిపారు? మేము తెల్పు గీత సత్యమైనదిగా ఉండవలయునను భావముతో, ప్రక్క భావములకు పోయి అనర్థమై పోయిన వాటిని, సరియగు భావమున వ్రాయుటకు కొన్ని చోట్ల వాటిని విమర్శించి తెలుపవలసి వచ్చినది. కాని ఎవరిని వ్యక్తిగత విమర్శ చేయలేదని మనవి చేయుచున్నాము. సత్యమునకు అందరు విలువఇస్తారని తలచు చున్నాము.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 30: దేహీ నిత్య మవధ్యో ఽ యం దేహే సర్వస్య భారత!
తస్మా త్సర్వాణి భూతాని న త్వం శోచితు మర్హసి||
(జీవాత్మ)

భావము:-సర్వదేహములలోను నివశించు జీవాత్మలు ఎప్పటికీ చంపబడునవి కావు. కావున అన్ని జీవరాసుల గురించి నీవు బాధపడవలసిన పనిలేదు.
వివరము:- జీవాత్మకాని, ఆత్మకాని దేహములందే నివసించుటవలన 'దేహి' అను పేరు రెండింటికి వచ్చినది 'దేహే సర్వస్య' అనుటవలన అన్ని దేహములందు 'దేహీ నిత్య మవధ్యోయం' చంపబడని జీవాత్మగా ఉన్నందున అని తెలుసుకోవలను. 'అవధ్యోయః' అనుటలో మరణించదు అన్నప్పుడు అది జీవాత్మ అని తెలియనగును. భూతాని అనగా జీవరాసుల కోసము నీవు బాధపడవలదని శ్రీకృష్ణుడు తెలిపాడు.

 ఇప్పటి వరకు ఈఅధ్యాయములో 12వ శ్లోకము మొదలు కొని 30 వ శ్లోకము వరకు అనగ మొత్తము 19 శ్లోకములు జీవాత్మను, ఆత్మను, పరమాత్మలను గురించియే చెప్పబడినవి. ఈ 19 శ్లోకములలో జీవాత్మను, ఆత్మను, పరమాత్మను ముగ్గురిని కలిపి చెప్పడములో 'దేహీ' అను ఒక పదమును మాత్రమే ఉపయోగించారు. అన్నింటిని దేహీ అనడము వలన, ముగ్గురు పురుషుల వివరము పురుషోత్తమప్రాప్తి యోగమను అధ్యాయము వరకు విడదీసి చెప్పనందున, ఏ శ్లోకము ఏ ఆత్మకు చెప్పబడినదను వివరములు లేకుండా భగవద్గీత వ్రాయబడుట వలన, చదివెడి వారికి ఆత్మల యొక్క వివరణా జ్ఞానము తెలియ కుండా పోయినది. అందరివలె మేము వ్రాయక ఈ ఆత్మల వివరము తెలియజేయుటకు ఒక కారణము కలదు అదేమనగా! ఒక దినమున ఒక జిజ్ఞాసి ఒక గురువు దగ్గర ప్రశ్న వేయుట జరిగినది. ఆ ప్రశ్న ఏమనగా? భగవద్గీతలో సాంఖ్యయోగమున 20 వ శ్లోకములో ఒకచోట 'న జాయతే' పుట్టుకయే లేదనీ, ఒక చోట 27 శ్లోకములో 'ధ్రువం జన్మ మృతస్యచ' పుట్టవలసిందేనని చెప్పుటలో అర్థమేమి? రెండు మాటలు ఒకే ఆత్మకు వర్తించునా? అని అడిగాడు. ఈ ప్రశ్నకు ఆ గురువు గారు భగవద్గీతలో ఏమి వ్రాసుందో అదే చదువు కొమ్మని చెప్పాడు. అది చదివి అర్థముకాక అడుగుచున్నానని భక్తుడు అనడము, దానికి గురువుగారు సమాధానము చెప్పలేక పోవడము జరిగింది అదంతయు ప్రక్కనుండి గమనించిన మేము సమాధానములేని భగవద్గీత ఉండకూడదనుకొన్నాము. ఆసంఘటనే ఈనాటి మా రచనలో సరియైన సమాధాన మిచ్చునట్లు చేసినది. ఇంతవరకు ఎన్ని భగవద్గీతలు పరిశీలించి చూచిన దేనిలోనూ మూడు ఆత్మల వివరము లేకుండా పోవడము మన దురదృష్టకరము. సంస్కృత పండితులు, మేధావులు, స్వాములు, గురువులు ఎందరిచేతనో వ్రాయబడిన భగవద్గీతలలో ప్రశ్నలు పుట్టడము జవాబులు దొరకకుండా పోవడము మన దురదృష్టకరమే. ఇప్పటికైనా ఆ జిజ్ఞాసి అడుగు ప్రశ్నకు జవాబు దొరకడము మన అదృష్టమని తలచుకొందాము. 30 విధములుగా మూడు ఆత్మల వివరమును వరుసగ మూడు భాగములలో క్రింద వ్రాసిన దానిని పరిశీలించి చదివి జీవాత్మ, ఆత్మ, పరమాత్మల, వివరమును బాగుగ అర్థము చేసుకోగలరని ఆశిస్తున్నాము.
జీవాత్మ
ఆత్మ
పరమాత్మ
1. నాశనము కలది
నాశనము లేనిది
నాశనము లేనిది
2. మరణము కలది
మరణము కలది
మరణము లేనిది
3. అగ్నికి కాలదు
కత్తికి తెగదు
నీటికి తడువదు
అగ్నికి కాలును
కత్తికి తెగును
నీటికి తడుచును
అగ్నికి కాలదు
కత్తికి తెగదు
నీటికి తడువదు
4.జ్ఞానదృష్ఠికి తెలియును
జ్ఞానదృష్ఠికి తెలియును
జ్ఞానదృష్ఠికి కూడ తెలియదు
5.ఒక్క శరీరము లోపల ఒక్క చోట ఉండును
శరీరము లోపల అంతట ఉండును
అన్ని శరీరముల లోపల బయట కూడ ఉండును
6.శరీరము బయట లేదు
శరీరము బయట లేదు
శరీరము బయట కూడ ఉన్నది
7. ఆకారమున్నది
ఆకారమున్నది
ఆకారము లేదు.
8. పేరు ఉన్నది
పేరు ఉన్నది
పేరు లేనిది
9. జీవుల సంఖ్య అనేకము
జీవుల సంఖ్యను బట్టి ఆత్మలుండును
ఇది ఏకమైనది
10. కర్మనుభవించునది
కర్మననుభవించదు
కర్మననుభవించదు
11. శక్తిలేనివాడు
శక్తికలవాడు
శక్తియే తానైనవాడు
12. ముద్దాయి
సాక్షి
జీవాత్మకు ఆత్మకు భిన్నముగా ఉంటూ సాక్షికానివాడు
13. గుణవికారములున్నవి
గుణవికారములు లేవు
గుణవికారములు లేవు
14. విభూతి రేఖలలో క్రిందిది
విభూతి రేఖలలో మధ్యది.
విభూతి రేఖలలో పైది.
15. ఆరాధించువాడు
ఆరాధింపబడువాడు
ఆరాధనలకందువాడు కాదు.
16. సృష్ఠింపబడినవాడు.
సృష్ఠింపబడినవాడు
సృష్ఠించినవాడు
17. జీవుడు
ఆత్మ
దేవుడు
18. ప్రళయము తర్వాత లేనివాడు
ప్రళయము తర్వాత లేనివాడు
ప్రళయము తర్వాత కూడ ఉన్నవాడు.
19. ప్రకృతి మాత అగును
ప్రకృతి తోబుట్టువగును
ప్రకృతి భార్య అగును.
20. ఆత్మలో కలియువాడు
జీవాత్మను పరమాత్మలో కలుపు మధ్యవర్తి
జీవాత్మను కలుపుకొనువాడు.
21. శూణ్యములో లేనిది
శూణ్యములో లేనిది
శూణ్యములో ఉన్నది.
22. జగత్తులో ఒకచోట శరీరములో ఉన్నవాడు
జగత్తులో శరీరములలో శరీరమంతట ఉన్నవాడు.
విశ్వమంతయు ఉన్నవాడు.
23.బ్రతికి ఉన్నపుడు జీవాత్మ ఆత్మను తెలుసుకోవచ్చును.
బ్రతికి ఉన్నపుడు ఆత్మ జీవాత్మను కలుపుకోవచ్చును.
బ్రతికి ఉన్న ఎవరు తెలుసుకోలేనిది.
24. జీవున్ని పూజచే ఆరాధించవచ్చును
ఆత్మను యోగముచే ఆరాధించవచ్చును
ఏవిధ పూజ,ఏ యోగముచే ఆరాధించలేము
25. కర్మ ఆధీనములోని వాడు
కర్మను అనుసరించువాడు.
కర్మ సంబంధము లేనివాడు.
26. కర్మ కట్టెలను మోయువాడు
కర్మ కట్టెలను కాల్చువాడు
అగ్నియై ఉన్నవాడు.
27. క్షరుడు
అక్షరుడు
పురుషోత్తముడు
28. గ్రుడ్డివాడు
చూపుగలవాడు
చూపు రూపు లేనివాడు
29. వ్యక్తుడు
వ్యక్తుడు
అవ్యక్తుడు
30. కర్మబద్దుడు
జీవబద్దుడు
అబద్దుడు

 జీవితములో జీవుడైనవాడు జ్ఞానము ప్రకారము అరాధించవలసినది ఆత్మనే. ఈ విషయము తెలియజేయు నిమిత్తము ఈశ్వర లింగము మీద విభూతి రేఖలలోగాని, నుదుటి భాగములో ధరించు విభూతిరేఖలలో కాని, మధ్యనగల రేఖ మీద బొట్టు పెట్టి గుర్తించారు. యోగము చేయుట వలన తెలియబడునది శరీరములో రెండవ ఆత్మ. ఎంతకాలము యోగము చేత ఆత్మను చేరితే, అంతకాలము జ్ఞానాగ్ని లభించి కర్మకాలిపోవును. బ్రహ్మయోగ విధానములో జీవునికి ఆత్మయే దైవము. జీవునికి మూడవ ఆత్మయిన పరమాత్మతో ఏమాత్రము సంబంధముండదు. ఆధ్యాత్మికము ప్రకారము దేవాలయ పద్ధతులుకాని, సందేశములు కాని, ఆరాధన వివరములుకాని, యోగపద్ధతులుకాని అన్ని ఆత్మను సూచించునవేనని తెలియాలి. భక్తులు ధరించు నామము గాని, బొట్టుగాని, అట్లే చేయు పూజా విధాన అర్థములు గాని, అన్నియు రెండవదైన ఆత్మను తెలుసుకొనునట్లు నిర్మించబడి ఉన్నవేనని తెలియాలి. ఎన్నో ఆరాధనలు, ఆచరణలు, అర్థములన్ని మన దేహములో ఉన్న ఆత్మకోసమే. పెద్దలు తత్త్వరూపములో పాటలుగా, పద్యములుగా చెప్పిన జ్ఞానము కూడ ఆత్మను గురించి చెప్పినదేనని తెలియాలి. పరమాత్మ యొక్క వివరము ఏమాత్రము ఎవరికి తెలియదు. ఏ శాస్త్రములు తెలుపలేవు. పరమాత్మ, బ్రతికిన ఎవరికి తెలియదు. కావున మనము ఎంత చెప్పుకొనిన రెండవదైన ఆత్మకేనని తెలియాలి.

 ఇంతవరకు జీవాత్మ, ఆత్మల చావు పుట్టుకల సమస్య తెల్పిన భగవంతుడు ఇంతటితో ఆ విషయమును వదలి కర్మ విషయములను తెల్పుటకు పూనుకొని 'సుఖదుఃఖే సమేకృత్వా' అను శ్లోకము మొదలు పెట్టాడు. అయితే భగవద్గీతలో అ శ్లోకము వెంటనే కనిపించక ఏడు శ్లోకముల వెనుక కన్పిస్తూ ఉన్నది. మధ్యలో 7 శ్లోకములు వచ్చిపడినాయి. అవకాశము కోసము ఎదురు చూస్తున్న కొందరు పెద్దలు, మాది కూడ కొంత ఉండవలయునని వారి స్వబుద్ధిని ఉపయోగించి, సంస్కృత పాండిత్యము కలవారు కనుక శ్లోకములల్లి మధ్యలో ఇరికించారు. ఏనాడో అవి కలసిపోవుట వలన వాటిని ఎవరూ గుర్తించలేకపోయారు. మేము ఇంతకు ముందు తెల్పిన నాల్గు సూత్రముల ప్రకారము చూచితే, ఈ ఏడు శ్లోకములు శాస్త్రబద్ధము కాదని తెలియుచున్నది. కావున ఇవి కల్పితములని తేలిపోయినవి. శాస్త్రబద్ధము కానివని ఎట్లు నిర్ణయించారని కొందరడగవచ్చును. దానికి మా సమాధానమేమనగా! శాస్త్రము ఎప్పటికీ ఖండించబడదు. ఈ శ్లోకములలో యుద్ధము చేయుట స్వధర్మమని తెలుపబడినది. కర్మయోగము 35 వ శ్లోకమున చూచిన స్వధర్మమనునది స్వంతమైన ఆత్మధర్మమని, పరధర్మమనునది ఆత్మకంటే వేరైన ప్రకృతి ధర్మమని తెలియుచున్నది. యుద్ధము చేయుట ప్రకృతి విషయము ఆత్మ విషయము కాదు. కనుక యుద్ధము స్వధర్మము కాదు, ఆత్మాచరణ స్వధర్మమగును. కులములు జాతులను బట్టి స్వధర్మములను నిర్ణయించిన అసలు ఆత్మజ్ఞానమునకే ముప్పువాటిల్లును. వాటి విషయము రాబోవు అధ్యాయ శ్లోకములందు ప్రస్తావించెదను. అసలు గీతలో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అను నాల్గువర్ణముల ప్రసక్తే లేదు. కావున క్షత్రియులని పేరు పెట్టి చెప్పిన శ్లోకములు కల్పితములని వాటియందు ఆత్మ జ్ఞానపరమైన విషయములు ఎంత మాత్రములేవని గ్రహించాలి. పుణ్యమును అనుసరించి స్వర్గమనునది ఉండును. కాని యుద్ధమును అనుసరించి స్వర్గముండును అనుట శాస్త్రబద్ధము కాదు. అది కర్మసిద్ధాంతమునకే వ్యతిరిక్తము. కావున ఈ ఏడు శ్లోకములు కల్పితములని, చెప్పుటయే కాక, ఇటువంటి కల్పిత శ్లోకములు గీతయందు అక్కడక్కడ గలవని, వాటియందలి దోషము తెల్పి, అశాస్త్రీయమైన వాటిని తొలగించి, స్వచ్ఛమైన దైవవాక్కును మాత్రమే మీకందించగలము.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
1) శ్లో|| 31 : స్వధర్మమాపి చాపేక్ష్యనవికంపితు మర్హసి |
ధర్మ్యాద్ది యుద్ధాచ్ఛ్రే యో ఽ న్యత్ క్షత్రియస్య న విద్యతే||(x)

1) శ్లో|| 32 :యదృచ్ఛయా చోపపన్నం స్వర్గ ద్వారా మపావృతమ్, |
సుఖినఃక్షత్రియాః పార్థ! లభుతే యుద్ద మీ దృశమ్||(x)

1) శ్లో|| 33: అథ చేత్త్వం ధర్మ్యమిమం సంగ్రామం న కరిష్యసి,|
తతస్స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి,||(x)

1) శ్లో|| 34: అకీర్తిం చాపి భూతాని కథ ఇష్యంతి తేవ్యయాం, |
సమ్భావితస్య చాకీర్తి ర్మరణాదతిరిచ్యతే. || (X)

1) శ్లో|| 35: భయాద్రణాదుపరతం మన్యంతేత్వాం మహారథాః |
యేషాం చత్వం బహుమతో భూత్యా యాస్యసిలాఘవమ్ . || (X)

1) శ్లో|| 36: అవాచ్చ వాదాంశ్చబహూన్వదిష్యంతి తవాహితాః |
నిన్దన్త స్తవ సామర్థ్యం తతో దుఃఖ తరం స్నుకిమ్ || (X)

1) శ్లో|| 37: హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీం |
తస్మాదు త్తిష్టకౌంతేయ! యుద్దాయం కృతినిశ్చయః || (X)
పై శ్లోకములు కల్పితములని తెలియునట్లు వాటి ప్రక్కన(X) మార్కు గుర్తించి ఉంచాము. వాటి వివరము కూడ వ్రాయలేదు.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 38: సుఖదుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయాజయౌ |
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాప మవాప్స్యసి ||
(కర్మయోగము)

భావము : కష్టసుఖములు, లాభనష్టములు, జయాపజయములను సమముగ తలచి యుద్ధము చేయుము. అట్లు చేయుట వలన పాపకర్మములు పొందవు.
వివరము: మొదట అర్జునుడు యుద్ధము చేయక పోవడానికి ముఖ్యముగ రెండు కారణములు కనిపిస్తున్నవి. మొదటి కారణము తనవారిని చంపడమను మోహగుణము. రెండవది చంపితే పాపమొస్తుందను పాపభీతి. మొదటిదైన మోహగుణము తనవారను భావము కల్గించి, వీరంతా చనిపోతే వీరిని లేకుండా చేసినవాడనగుదును కదా! అలాకాక వారందరుండవలెనని, వారిని తనేమి చేయకూడదను భావము కల్గించినది. అంతేకాక చంపితే విపరీతమైన పాపము వస్తుందను భావము కూడ పుట్టించినది. అర్జునుని నుండి ముఖ్యముగ వెలువడిన చావు సమస్యకు శ్రీకృష్ణుడు వివరించి చావంటే ఏమిటి! చచ్చునదెవరు? మరణించు వారేమౌతారు? అను మొదలగు విషయములను ఇంతవరకు తెలియజేశాడు. ఇపుడు ఈ శ్లోకముతో పాపపుణ్య విషయములను తెలుపుటకు మొదలుపెట్టాడు. భగవద్గీతలో చావు పుట్టుకల విషయము కొద్దిగా ఉండగా, పాపపుణ్య వివరమే ఎక్కువగ తెలియబరచబడినది. యుద్ధములో తన బంధువులనైన వారిని చంపి హింసించుట ద్వార పాపమొచ్చునను అర్జునుని మాటకు మొదటి జవాబుగ ఈ శ్లోక వివరమిలా ఉన్నది చదవండి.

హింసతో కూడుకొన్న యుద్ధకార్యములో కనిపించని పాపమేకాక సుఖము దుఃఖములు కూడ ఉండును. గొప్ప శత్రువును సులభముగ చంపినపుడు సంతోషము కల్గును. లేక ఎదుటి శత్రువు చేత దెబ్బ తిన్నపుడు దుఃఖము కూడ కల్గును. అంతేకాక లాభము లేక నష్టము ఉండును. చివరిగ ఎదుటివారు నెగ్గి మనమోడడమో లేక మనము గెలిచి ఎదుటివారు ఓడిపోవడమను జయాపజయములు అను మూడు ఒకే యుద్ధకార్యము నుండి ఏర్పడుచున్నవి. యుద్ధము చేయువాడు తన మనస్సును చేయుచున్న కార్యమైన యుద్ధము మీద మాత్రము పెట్టి ఆ కార్యమునెలా నిర్వర్తించాలో అలానే చేయాలి. యుద్ధము చేయుటలో ఎన్ని మెలకువలు ఎన్ని విధానములు ఉన్నాయో, ఆ యుద్ధము ఏ నైపుణ్యతతో చేయాలో, వాటిని మాత్రమే తన మనస్సులో పెట్టుకొని యుద్ధము చేయుట వలన, దాని వెనుక వచ్చు పాపము ఏమాత్రము వానికంటదు. ఒక వేళ యుద్ధము చేయుచు, యుద్ధము నేను చేయుచున్నానని, ఆ యుద్ధములో కష్టసుఖములు కలుగునని, ఆ యుద్ధములో లాభనష్టములుండునని, అట్లే జయాపజయములు ఉండునను యోచనయుండి, అందులో సుఖమును లాభమును జయమును కావలెనను కాంక్ష గాఢముగ పెట్టుకొనిగాని, లేక నష్టము కష్టము అపజయము కావలెనను కాంక్ష పెట్టుకొనిగాని, యుద్ధము చేయుట వలన తప్పక కర్మయనెడి పాప పుణ్యములు వచ్చును.

ఒకే కార్యమైన యుద్ధమును చేయడములోనే పాపము రావడము లేక రాకుండా పోవడమను రెండు పద్దతులు కలవు. ఒకే కార్యము చేయడములో పాపమంటడము లేక అంటకుండ పోవడమను రెండు విధానములుండుట ఆశ్చర్యకర విషయమైనప్పటికి అది పూర్తి శాస్త్రబద్దమైన సత్యము. ఎవరైన కర్మ సిద్ధాంతమును తెల్పు ఈ మొదటి శ్లోకము యొక్క అర్థము అవగాహన చేసుకోవడముతోనే, ఇటు జ్ఞానములోనికో లేక అటు అజ్ఞానములోనికో అడుగు వేయడము జరుగుతుంది. భగవద్గీత యొక్క మూల ఉద్దేశ్యము ఈ శ్లోకముతోనే మొదలవుచున్నది. కావున ఆ ఉద్దేశ్యము అర్థము కాకపోతే అజ్ఞానములోనికి, అర్థమైతే జ్ఞానములోనికి మార్గము ఏర్పడుతుంది. భగవంతుని భావము అర్థము కాక అజ్ఞాన మార్గములోనికి అడుగువేయు అవకాశము ఎక్కువ ఈ శ్లోకములో ఉండుటవలన, జాగ్రత్తగ అర్థము చేసుకొని దీనిని గూర్చిన పూర్తి వివరము మిగతా గీతయందు శోధించవలసి ఉండును. అంతేకాక హింసతో కూడుకొన్న యుద్ధము చేయుట వలన పాపమురాదు అన్న మాటతో ఆశ్చర్యపడక, పాపము రాకుండా పోవడానికున్న కారణము లేమిటి? అని పూర్తి వివరము తెలుసుకొనుటకు ప్రయత్నించవలయును. అట్లు వెదకక ఇట్లయితే పాపము వచ్చును. అటులైతే పాపము రాదు అనడమేమిటి అని ప్రశ్నించుకొని కూర్చున్న వారికి, గీతను బోధించు శ్రీకృష్ణుని జీవితము కూడ పాపపు పనులతో కూడుకొన్నదిగానే కనిపించును. అట్లు కాకుండ గీత సందేశము జ్ఞానమార్గము కావాలంటే గీతను పూర్తిగా పరిశీలించి చూడవలెను. అర్థముకాని ఒక మాటతోనే తమ పూర్తి నిర్ణయమును తీసుకోకూడదని కోరుచున్నాము.

ఇంతవరకు చావు పుట్టుకల విషయము తెలుపుచు జీవాత్మ ఆత్మల వివరము తెల్పిన భగవంతుడు, ఈ శ్లోకముతో పాపపుణ్య విషయములు వివరిస్తూ కర్మయోగమును తెలుపడము మొదలు పెట్టాడు. ఇచటనుండి రాబోవు శ్లోకములలో రెండు యోగముల యొక్క వివరము వివరించబడుతుంది. రెండు యోగములలో ఒకటి కర్మయోగము (రాజయోగము), రెండు బ్రహ్మయోగము(జ్ఞానయోగము). పాపపుణ్య బంధనములకు సంబంధించిన విషయములన్నియు ఈ రెండు యోగములందే ఇమిడి ఉండును. కావున వాటి వివరము తెల్పు శ్లోకముల ప్రక్కన ఆయా యోగముల పేర్లు బ్రాకెట్లో గుర్తింపబడి ఉండుట గమనించాలి. ఇచటినుండి కర్మయోగ వివరము ప్రారంభమగుచున్నదని తెలియబరుస్తూ, ఈ క్రింది శ్లోకము చెప్పబడినదని గ్రహించాలి.



త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 39: ఏషా తే ఽభి హితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు |
బుద్ధ్యా యుక్తో యయా పార్థ! కర్మబంధం ప్రహాస్యసి ||
(కర్మయోగము)

భావము : ఇంతవరకు శరీరములందు ఆత్మల వివరముగల జ్ఞానము తెలియజేసాను. ఇకనుండి కర్మబంధములు కలగని జ్ఞానము తెలియజేతును వినుము.
వివరము : ఈ శ్లోకముకంటే ముందు కర్మయోగమునకు సంబంధించిన శ్లోకము చెప్పి, అది గుర్తించారో లేదోనని తలచి, ఇపుడు చెప్పునది కర్మను నాశనము చేయు కర్మయోగమని హెచ్చరిక చేయుచు ఈ శ్లోకము చెప్పాడు. ఈ మాటతో ప్రతి ఒక్కరు ఇంతకు ముందు విన్నది శరీర ఆత్మల సంబంధ సాంఖ్య వివరమని సులభమగ తెలుసుకోగలరు. ఆత్మలు వేరని, యోగములు వేరని తెలుసుకోమన్నట్లు ఈ శ్లోకము యొక్క ముఖ్య ఉద్దేశ్యము. మొదలు పెట్టినది కర్మయోగ వివరము కనుక, ఆ కర్మయోగమును గురించి భగవంతుడు ఈ విధముగ అంటున్నాడు.




త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 40: నేహాభిక్రమ నాశోఽ స్తి ప్రత్యవాయో న విద్యతే |
స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ||
(కర్మయోగము)

భావము :- కర్మయోగమును ఆరంభించి మానుకొనుట వలన ఏ దోషము లేదు. కొద్దిగ ఆచరించినప్పటికి గొప్ప కర్మభయమునుండి కాపాడగలదు.
వివరము : - కర్మయోగమును ఆరంభించిన తరువాత మానుకొనుట వలన ఏదైన దోషము కల్గుననుట ఏమాత్రము లేదు. పాపపుణ్య బంధముల నుండి తప్పించు కొనుటకు కర్మయోగమే సాధనము. కర్మయోగము కొంతకాలము ఆచరించినప్పటికి ఆ కాలములో కల్గు భయంకర కర్మబంధములనుండి కాపాడును. ఆచరించిన కర్మయోగము కొద్దిదైనప్పటికి ఆ సమయములో పెద్దకర్మలను పోగొట్టును. ఇక యోగ విషయము అర్థము కానివారు, యోగమంటే ఏమిటో తెలియని వారెట్లుందురు అనగా!




త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 41: వ్యవసాయాత్మికా బుద్ధి రేకేహ కురునన్దన! |
బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్ధయోఽవ్యవసాయినామ్ ||
(ప్రకృతి)

భావము :- యోగమునందు బుద్ధిగలవారు ఒకటే నిశ్చయముతో ఉందురు. వేరభిప్రాయములు కల్గువారికి బుద్ధి శాఖోపశాఖలైవుండును.
వివరము :- జ్ఞానమంటే ఏమిటని, యోగమంటే ఏమిటని, ఆత్మ జీవాత్మలంటే ఏమిటని తెలిసి పరమాత్మ సన్నిధి (మోక్షము) పొందాలనుకొన్న వారికి వారి నిశ్చయమును చెడకొట్టుటకు ఎన్ని ఆటంకములు ఏర్పడినప్పటికి, వారు ఆ మార్గమును వదలరు. దైవము యొక్క విలువ తెలిసి పరమాత్మను చేరాలను కొన్నవారు తమకు ప్రియాతి ప్రియమైన వారిని కూడ వదలుకొనుటకు ఇష్టపడుదురు, కాని తమ మార్గమును వదులుకొనుటకు ఇష్టపడరు. ప్రపంచ విషయములలో మునిగిన వారికి జ్ఞానమార్గము ఆశ్రయించిన వారి పట్టుదల అర్థముకాకపోగ, తమను మతిహీనులుగ లెక్కించినను వారు బాధపడక ఇతరులలో ఎంత అజ్ఞానము ఉన్నది కనిపిస్తుండగ, వారు ఆ అజ్ఞానములో పడకుండ జాగ్రత్తపడుచు, జ్ఞాన మార్గములో ఒకే పట్టుదల కలిగి ఉందురు. ఇక జ్ఞానమంటే ఏమిటో దాని వాసన కూడ తెలియనివారు వారి మనో నిశ్చయము నిజదైవము మీద లేకపోగా, ప్రపంచ సంబంధమగు అనేక విషయములలో అనేక విధములుగ లగ్నమై ఉందురు. ఇంకను కొందరెట్లుందురనగా!



త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 42: యామిమాం పుష్పితాం వాచం ప్రవద న్త్యవిపశ్చితః |
వేద వాదరతాః పార్థ! నాన్య దస్తీతి వాదినః ||
(ప్రకృతి)

భావము :- వేదములలోని విషయములను పుష్పములలోని తేనెవలె తియ్యని మాటల రూములలో చెప్పుకొందురు. అజ్ఞానులైనను జ్ఞానులవలె ఉండి ప్రజలకు లాభము వచ్చు పనులను, సుఖముకల్గు పనులను బోధించుచుందురు.
వివరము : - నేడు కొందరు గురువులమనిపించుకొన్నవారు, స్వాములనిపించు కొన్నవారు, తమ తమ ఉపన్యాసములలో ఎంతో మాటల పొందిక కల్గి, వినే వారికి కమ్మగ కనిపించునట్లు వేదములందు విషయములనే ఆసక్తిగ చెప్పుచుందురు. ఆత్మ పరమాత్మల విషయము వదలి మానవుల కోర్కెలు నెరవేరునట్లు, సుఖములు కలుగునట్లు, కష్టములు పోవునట్లు, అనేక విధములుగ బోధించి అవియే నిజజ్ఞాన మార్గమని కూడ చెప్పుచుందురు. అవి ఎట్లుండుననగ క్రింది శ్లోకములో చూడుము.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 43: కామాత్మాన స్స్వర్గ పరా జన్మ కర్మ ఫల ప్రదామ్ |
క్రియావిశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి||
(ప్రకృతి)

భావము: సుఖములు చేకూర్చు వారిమాటలు జన్మ కర్మ ఫలములొసగు అనేక క్రియలను ప్రేరేపించునవై ఉండును. అట్టి పనులు చేయుట వలన ఇహలోక సుఖములు భోగములు వచ్చుచుండును.
వివరము: కొందరు వేద విషయములనే బోధచేయుచు, ఆ బోధలలో వ్రత క్రతువులు యజ్ఞ యాగముల విషయములను తెల్పుచు, ఫలానా వేదములో తెలిపినట్లు యజ్ఞము చేయుట వలన ఫలానా ఫలితము కల్గునని, పలాన వ్రతము చేయుట వలన వచ్చిన కష్టములు పోయి సుఖములు కల్గునని బోధించి, మనుజులను ఆ పనులు చేయుటకు పూనుకొనునట్లు చేయుదురు. అట్లు చేయుట వలన ఇహలోక సౌఖ్యములు కల్గును. మరియు ఆ పనులు చేయుట వలన మనకు తెలియకనే కర్మకూడ వచ్చి జన్మలకు కారణమగును. అట్టి పనుల వలన కర్మలు కల్గునేకాని దైవసన్నిధియైన మోక్షప్రాప్తి కలుగదు. ఏది మంచిదని తెలియక సహజముగ ప్రపంచ సుఖములనే కాంక్షించు ప్రజలకు, ఆ సుఖముల గూర్చియే చెప్పి అందుకు అవసరమైన పనులనే చేయునట్లు బోధించువారికి కూడ కర్మగల్గి జన్మలు కల్గునని, పై శ్లోకము యొక్క వివరముకాగా, అట్టి బోధలువిన్న ప్రజల గురించి భగవంతుడు ఈ విధముగా క్రింది శ్లోకమున చెప్పుచున్నాడు.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 44: భోగైశ్వర్య ప్రసక్తానాం తయా ఽ పహృత చేతసామ్|
వ్యవసాయాత్మికా బుద్ధి స్సమాధౌ న విధీయతే ||
(ప్రకృతి)

భావము: కోర్కెల చేత ఆకర్షింపబడిన మనస్సు గలవారు అటువంటి సుఖములనే ఆశ్రయించుదురు. వారి మనస్సుకు ఆత్మ విజ్ఞానదాయకమైనట్టి జ్ఞానము ఎప్పటికి పట్టుబడదు.
వివరము:మానవులకు కోర్కెలుండడము, కష్టములు లేకుండా పోయి సుఖములు కల్గవలెనను ఆశ ఉండడము సహజము. సహజముగ అటువంటి మనస్సు గలవారికి వారి పనులు నెరవేరునట్లు , ఫలానా శ్లోకము ఇన్నిమార్లు చదివితే ఈ కోర్కె నెరవేరునని, ఈ మంత్రము వలన ఈ కోర్కె పలాన వ్రతము వలన ఫలానా కష్టము పోవునను స్వాముల మాటలు బాగా కనిపించగ, అట్టి వారినే ఎక్కువ మంది ఆశ్రయించి అటువంటి పనులనే చేయపూనుదురు. ఆ పనులు చేయుట వలన అనేక జీవిత సుఖములందే వారి మనస్సు చిక్కుకొని, ఒకదాని కొకటి సంబంధములేని భిన్నమైన పనులు చేయుచు, ప్రకృతి సుఖములకు అతీతమైన మరియు జప, తప, వ్రత, క్రతువుకు తెలియని ఆత్మ పరమాత్మల గూర్చి తెలుసుకోలేరు. ఆత్మజ్ఞాన విషయములు ఏమాత్రము వారికి పట్టుబడవు, అర్థము కావు.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 45: త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భ ఽవార్జున! |
నిర్ద్వంద్వో నిత్య సత్త్వ స్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్||
(బ్రహ్మయోగము, కర్మయోగము)

భావము: మూడు గుణముల విషయములే వేదములు. వేద భూయిష్టమైన ఆ మూడు గుణములను పూర్తిగ వదలివేయుము. సుఖదుఃఖములు, లాభనష్టములు మొదలగు ద్వంద్వములను వదలి వేసినట్లే యోగక్షేమము అనుదానిని కూడ వదలి నిత్యమైన దైవమును చేరుము.
వివరము: ముందు శ్లోకములో చెప్పినట్లు భోగైశ్వర్యములను ఆశ్రయించక దైవమును తెలుసుకొమ్మని హితము చెప్పుచు భగవంతుడిట్లన్నాడు. ప్రతి మనిషికి తలలో ఎన్నో గుణములు మెదలుచుండును. ఆ గుణ సంకల్పముల వలననే మానవులందరు అనేక కార్యములు చేయుచున్నారు. అనేక కార్యములకు కారణమైన తలలోని గుణములను వివరించి చూచితే మూడు రకములుగ ఉన్నవి. 1) తామసము 2) రాజసము 3) సాత్వికము. ఈ మూడు గుణములనే భగవంతుడు మాయ అని విజ్ఞానయోగములో చెప్పాడు. మాయారూపమైన గుణముల విషయములే వేదములందున్నాయి. కావున వేదములలోని కార్యాచరణలైన యజ్ఞయాగాదులు, వ్రతక్రతువులు మొదలుకొని అన్నీ వదలి ఏ గుణసంకల్పము లేకుండ అనగా తలలో చిన్న యోచన కూడ రాకుండ చేసుకొని, బ్రహ్మయోగమాచరించి దైవమును తెలియుము.

అట్లు బ్రహ్మయోగము వీలుకాక పోయినప్పటికి ద్వంద్వములైన లాభ నష్టములు, సుఖదుఃఖములు వదలి కర్మయోగమాచరించి దైవమును చేరుము. ఈ శ్లోకమునందు మరియు 44వ శ్లోకములో చెప్పినట్లు భోగైశ్వర్యములను ఆశించి, వాటికి సంబంధించిన వ్రతక్రతువులు మొదలైన పనులు చేయక దైవత్వమును చేరు రెండే రెండు మార్గములైన బ్రహ్మయోగము, కర్మయోగమును ఆశ్రయింపుమని హితము చెప్పడమైనది. ఇందులో మా మనవిగ చెప్పడమేమంటే, ఇంతవరకు ఆధ్యాత్మికములో అతిరథ మహారథులైన స్వాములెందరో గీతను గురించి వ్రాసినారు. అందులో ఈ శ్లోకమునందు ముందు వాక్యము బ్రహ్మయోగమునకు సంబంధించినదని, రెండవ వాక్యము కర్మయోగమునకు సంబంధించినదని గుర్తించి వ్రాయలేక పోయారు. కావున మేమిపుడు చెప్పిన వివరమును తప్పుగ తలువ కూడదని, యోచించితే గుణ సంకల్పములు లేనిది బ్రహ్మయోగమని, సుఖదుఃఖ, లాభనష్ట, యోగక్షేమముల ధ్యాస లేకుండ పనిచేయడము కర్మయోగమని వాటి ద్వార దైవమును తెలియుమని భగవంతుడు చెప్పినట్లు సులభముగ అర్థము కాగలదు. 44వ శ్లోకములో భోగైశ్వర్యముల గురించి చెప్పి 45వ శ్లోకములో వాటికి సంబంధములేని మార్గమును సూచించాడని తెలియాలి. ఇది దైవ విషయము కావున అర్ధశూణ్యము, భావశూణ్యము కాకుండ భగవంతుడు ఏ భావము తెల్పాడో, ఆ భావమునే మేము పొందుపరచుచున్నామని తెలుపు కొనుచున్నాము.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 46: యావా నర్థ ఉదాపానే సర్వత స్సంప్లుతోదకే |
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః||
(కర్మ యోగము)

భావము: బావి నిండుగవున్న నీరు ఏ విధముగ నిత్యము త్రాగుటకు స్నానము చేయుటకు ఉపయోగపడుచున్నదో, ఆ విధముగనే సర్వ వేదముల నుండి కూడ మనకు నిత్యము ఉపయోగము గలదని బ్రహ్మజ్ఞానియైన వానికి తెలియును.
వివరము: మనకు నిత్యము స్నానము చేయుటకు త్రాగుటకు ఉపయోగపడు నీరు బావియందు కాని లేక చెరువుయందుగాని పూర్తిగా నిండి సమృద్ధిగా ఉన్నప్పటికి ఆ నీరంతయు ఒక్క మారుగ ఉపయోగపడదు. దాని నుండి నిత్యము కొద్ది కొద్దిగా నీరును మనము ఉపయోగించుకుంటాము. అలాగే మన శిరస్సను బావియందు గుణములను నీరు నిండి సమృద్ధిగ ఉన్నది. బావినుండి నీరు ఉపయోగపడునట్లే మన తలలోని గుణములన్నియు ఒకే మారు ఏ మనిషికి ఉపయోగపడక నిత్యము కొన్ని గుణములు మాత్రము ఉపయోగపడుచున్నవి. ఒక్క మారుగ బావిలోని నీరంతయు ఎట్లు ఉపయోగపడదో, అట్లే తలలోని గుణములన్నియు ఒకే మారు ఏ మానవునికి ఉపయోగపడవు. నిత్య జీవితములో మానవుడు పనులు చేయుటకు గుణములు అవసరము. అవి శిరస్సులోని గుణచక్రమందు 36 గుణములుగ ఉండి, ఒక్కొక్క గుణమునకు అనేక ఉప గుణములుండి చాలా పెద్ద సంఖ్యగ ఉన్నవి. ఆ మొత్తము గుణములన్ని మనిషికి నిత్యము ఒకే విధముగ ఉపయోగపడక ఒకరోజు కొద్దిగ, మరియొక రోజు ఎక్కువగ, ఇంకొక రోజు చాలా కొద్దిగ ఉపయోగపడుచుండును. ఉదాహరణకు ఒక మనిషి స్నానము చేసి బట్టలుతుకుకొన్న రోజు కొంత నీరు అధికముగ ఖర్చగును. స్నానము చేయని దినము, బట్టలుతకని దినము, నీటి ఖర్చు కొద్దిగ తగ్గును. అట్లే మనిషికి కూడ తీవ్ర యోచన చేసిన దినమున ఎక్కువ గుణములు, యోచన చేయక విరామముగ నిద్రలో గడిపిన దినమున గుణములు తక్కువగ, అట్లే ఇతరులతో పోట్లాడిన దినమున కొద్దిగ ఎక్కువ, సౌమ్యముగ గడచిపోయిన దినమున తక్కువగ గుణములుపయోగపడుచున్నవి. ప్రతి మానవునకు తలలోని గుణముల ఉపయోగము నిత్యము హెచ్చు తగ్గులుగ జరుగుచున్నదను విషయము బ్రహ్మజ్ఞానము తెలిసిన వారికి బాగుగా తెలియును. బ్రహ్మజ్ఞానము తెలియని వారికి బావిలోని నీటివలె గుణములు ఉపయోగపడు చున్నవను మాట తెలియదు. నిత్యము గుణముల ప్రభావము తమయందున్నప్పటికి, వాటిని గుర్తించలేక, యోచన చేయునది కూడ తామేనని తలచుచుందురు.

వేదములనగ త్రిగుణములని 45వ శ్లోకమున భగవంతుడు చెప్పాడు, కావున 46వ శ్లోకమున కూడ వేదములన్న చోట గుణములనియే భావించాలి. అట్లుకాక అన్యదా వేరే భావమును ఉపయోగించితే భగవంతుని మాటనే మభ్య పెట్టినట్లగును.



త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 47: కర్మణ్యే వాధి కార స్తే మాఫలేషు కదాచన|
మా కర్మఫల హేతుర్భూ ర్మాతే సంజ్గోఽ స్త్వ కర్మణి ||
(కర్మయోగము)

భావము: కర్మ సంపాదించుటయందే నీకు అధికారము కలదు. కర్మఫలము లందు ఆశపడవలదు. కర్మయగు పాపపుణ్య ఫలములైన కష్టసుఖములకు కారకుడవు కావద్దు. అట్లే కర్మ వచ్చునని దానికి సంబంధించిన పనులు మానవద్దు.
వివరము: ముందు శ్లోకములో ప్రతి మనిషికి గుణముల వలన యోచన లొస్తున్నవని, వాటివలన పనులు జరుగుచున్నవని తెలుసుకున్నాము. గుణముల వలన జరుగు కార్యములలో కర్మ అనునదొకటున్నది. దానినే పాపపుణ్యములు అంటాము. అగ్నికి పొగ అనుబంధమైవున్నట్లు కార్యములకు కర్మ, కర్మకు కార్యములు అనుబంధమై ఉన్నవి అనగ పనులకు పాపపుణ్యములు వచ్చుట, వచ్చిన పాప పుణ్యములను బట్టి తిరిగి పనులు జరుగుట ప్రతి జీవరాశికి ప్రకృతి సిద్దమైనది. ప్రకృతి సిద్ధముగ మానవుడు గత జన్మల పాపపుణ్యములగు ప్రారబ్ధకర్మను అనుభవిస్తు, ఈ జన్మలో కార్యములు చేయుచున్నాడు. ఆ కార్యములలో అనుసంధానమైన కర్మను తాను చేశానని అనుకొని తిరిగి కర్మను మూటగట్టుకొంటున్నాడు. తరువాత జన్మలో దానిని అనుభవించవలసివస్తున్నది. ఇది ప్రకృతి సిద్ధమైన పద్ధతియైతే దానికి వ్యతిరిక్తమైన పరమాత్మ పద్ధతి కూడ ఒకటున్నది. అది ఏమనగా! గతములో తనకు అంటుకొని ఉన్న కర్మ కార్యాచరణయైనపుడు, ఆ కార్యాచరణలో అనుసంధానమై వచ్చు క్రొత్త పాపపుణ్యములను(కర్మను), తనకు ఏమాత్రము సంబంధము లేకుండ చేసుకోవడము, అనగ క్రొత్త కర్మను తనయందు రాకుండ చేసుకోవడమనునది. క్రొత్తకర్మ లేనిది క్రొత్తగ వచ్చు కార్యములు ఉండవు. కావున జీవుడు క్రొత్తగ పుట్టి క్రొత్త పనులు అనుభవించవలసినది లేదు. కర్మాచరణలో ఉన్న కార్యముల ద్వార క్రొత్త కర్మ అంటకుండ చేసుకొని, క్రొత్త కార్యములు అమలు కాకుండ తప్పించుకోవడమే పరమాత్మ సిద్ధమైన పని. ప్రకృతి సిద్ధమైన పద్దతి అనగ'ప్రకృతినే చేరు పద్ధతి' అని, పరమాత్మ సిద్ధమైన పద్ధతనగ "పరమాత్మనే చేరు పద్ధతి" అని అర్థము చేసుకోవాలి.

భగవంతుడు ఇటువంటి రెండు పద్ధతులున్నాయని తెలుపుచు కర్మను ప్రకృతిసిద్ధముగ సంపాదించుకోవచ్చును, లేక పరమాత్మ సిద్ధముగ దానిని లేకుండ కూడ చేసుకోవచ్చును. ఈ రెండు పద్ధతులలో ఏదైన ఒక దానిని ఆచరించి కర్మను సంపాదించుకోవడములోనో, లేక సంపాదించుకోకుండ చేసుకోవడములోనో, మానవునికి అధికారమున్నదని తెల్పాడు. "కర్మణ్యేవాధి కారస్తే" అనగా కర్మను సంపాదించుట, సంపాదించకపోవుటలో నీకు అధికారము కలదని తెలియుచున్నది. అట్లే కర్మ ఫలములైన సుఖదుఃఖములను అనుభవించడములో ఎవరికి అధికారము లేదు. కర్మ ఒక మారు సంపాదించబడియుంటే అది కార్యరూపమై కష్టసుఖములుగ అనుభవమునకు వచ్చును. సంపాదించబడియున్న కర్మవలన కలుగు కష్ట సుఖములను ఎవరు నివారించలేరు. విష్ణు , ఈశ్వర, బ్రహ్మసహితము అనుభవించ వలసివుండును. కావున కర్మఫలమైన కార్యములందు ఎవరికి ఏ అధికారము లేదు. అవి ఎట్లు ఉంటే అట్లే చేయవలసియుండును, మరియు అట్లే అనుభవించవలసి ఉండును.

అసలు కర్మ విషయమిలాగున్నది, కావున కర్మఫలముల మీద ఆశపడి వాటికి కారణ భూతుడననుకొని క్రొత్తకర్మలు తెచ్చుకోకూడదు. అలాగే పనులుచేస్తే కర్మలు వచ్చునని ఆ కర్మలు రాకుండుటకు పనులు మానుకోవలయుననుకోకూడదు. ఎందుకనగ మొదటి కర్మాచరణే తర్వాత చేయబడు కార్యములు, కావున కార్యములు నీవు చేయకూడదను కొనుట పొరపాటు. ఎవరేమనుకొన్నను కర్మప్రకారము జరుగవలసినవి జరుగక మానవు. కాని నీకు కర్మ సంపాదించడమందు మాత్రమే అధికారమున్నదని , పనులు చేయడములో కాని, అనుభవించడములో కాని అధికారము లేదని తెలియాలి. ఇతరులు వ్రాసిన గీతలలో ఈ శ్లోక భావము పూర్తి తప్పుగ ఉన్నది. (పనులు చేయుటలో అధికారము గలదు, ఫలితము మీదనే లేదని వ్రాశారు. పనులు చేయుటలో అధికారము లేదు, ఫలితము మీదనే ఉన్నదని మేము వ్రాశాము.) పని మీద అధికారము లేదని, నీ ఇష్టమున్నా లేకున్నా బలవంతముగ నీచేత పని చేయించబడునని, నీవు నీ కర్మరీత్య యుద్ధము చేయవలసి ఉన్నదని, నీకిష్టము లేకున్నా నీచేత కర్మ చేయించి తీరునని భగవంతుడు చెప్పడము జరిగినది. దీనిని బట్టి పనిమీద అధికారము లేదనునది స్పష్టముగ తెలియుచున్నది. అందువలన మేము వ్రాసిన భావమే ఈ శ్లోకమునకు సరియైనదని జ్ఞప్తి చేయుచున్నాము. పనులు చేయడములో ఎవరికి అధికారములేనిదాని వలన, పనులు చేయుచు వాటి వలన కలుగు కర్మనుండి తప్పించుకొనుటకు క్రింది శ్లోకములో ఇలా అన్నాడు.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 48: యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ! |
సిద్ధ్యసిద్ధ్యో స్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే||
(కర్మయోగము)

భావము: చేయు పనులయందు కల్గు లాభనష్టముల ఎడల ధ్యాసలేక, మంచి చెడు పనులందు సమబుద్ధి గలవాడై, కార్యములాచరించినవాడు యోగనిష్ఠ ఆచరించిన వాడగును. ఈ విధముగనే నీవు కార్యములు చేయుము.
వివరము: జరుగు పనులయందు గల లాభనష్టములను సమముగా చూచుట వలన దానిని యోగమనబడును. అదియే కర్మయోగమగును. లాభనష్టములను సమముగా చూచుట వలన కర్మయోగమైతే, అందరు సులభముగా ఆచరించవచ్చునని తలచుటకు అవకాశము గలదు. కాని అలా చేయుట అనుకొన్నంత సులభము కాదు. ఎందుకనగా కార్యములకు సంబంధించిన పూర్తి వివరమంతయు తెలిసినపుడే లాభనష్టములపై ధ్యాసలేక పనులు చేయగల్గుదురు. అలాకాక కార్యములు ఏ కారణమున జరుగుచున్నవో, ఏ కారణమున క్రొత్తకర్మ వచ్చి చేరుచున్నదో, అసలుకు కార్యాచరణ యోగమగుటకు ముఖ్యమైన వివరమేమిటో తెలియనిది. లాభనష్టములు సమముగా తోచక వాటికి సంబంధించిన సుఖదుఃఖములు కలుగును. కావున 'సంగమ్ త్యక్త్వా' అని శ్లోకమున చెప్పబడియున్నది. 'సంగమ్' అను పదమునకే ఈ శ్లోకమున ముఖ్యమైన అర్థమున్నదని గ్రహించాలి. 'సంగమ్ త్యక్త్వా' అనగ కలసిపోక లేక కూడిపోక అని అర్థము. ఇక్కడ యోచించవలసినది దేనితో కలసిపోకూడదు? దేనితో కూడిపోకూడదు? ఎవరు ఎవరితో కలియకూడదు ? అను ప్రశ్నలకు జవాబులు కావాలి. దానికి సరైన జవాబు గీతయందు రాబోవు శ్లోకములలో పూర్తిగ ఉన్నది. అయినప్పటికి ఇపుడు సందర్భానుసారముగ ఆ జవాబు చెప్పుకొనుచున్నాము. మన శరీరములోని 25 భాగములలో అహము అను ఒక్క భాగముతో కలియకుండ కర్మలు ఆచరించిన క్రొత్త కర్మలు రావు.అలా క్రొత్త కర్మలు రాకుండ పోవడమే కర్మయోగమంటాము. శరీరములోని 25 భాగములలో ఒకటైన అహముతో ఎవరు కలియకూడదు అను ప్రశ్నకు జవాబు వెదకిన తెలియునదేమనగా! అన్నిటిని అనుభవించుటకు 25 భాగములలో తాను ఒక భాగమైయున్న జీవుడు, అహమను దానితో కలియకూడదు. అలా కలియక చేయు పనులనే కర్మయోగమంటాము. కావుననే 'సంగమ్ త్యక్త్వా ' 'కురుకర్మాణి' 'యోగస్థః' అన్నాడు. సంగమ్ త్యక్త్వా - అహముతో కలియకుండ, కురుకర్మాణి - కర్మ అమలు బరచిన కార్యములు చేయుము. యోగస్థః - యోగమందుగల వాడవౌదువు.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) 49: దూరేణ హ్య పరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ! |
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫల హేతవః ||
(కర్మయోగము)

భావము: కర్మనాశనము చేయు కర్మయోగమునకంటే, నీచస్థితిని కలుగజేయు కర్మ చాలా భేదమైనది. నీవు నీచస్థితిని కలుగజేయు కర్మను విడిచి, ఉన్నత స్థితిని కలుగజేయు కర్మయోగమునే ఆశ్రయింపుము.
వివరము: కర్మయోగమనునది జన్మ బంధముల నుండి జీవుని కాపాడి ఉన్నత మైన దైవత్వమును చేర్చునది. కర్మ అనునది జన్మ బంధములను కలుగజేసి, జీవున్ని జన్మల పాలు చేసి తగ్గుస్థితికి పంపుచున్నది. కావున ఫలితములలో కర్మకు, కర్మయోగమునకు చాలా దూరభేదమున్నదని చెప్పవచ్చును. కనుక నీవు జన్మలను, నీచస్థితిని కల్గించు కర్మను వదలి, ఉన్నత స్థితియైన దైవమును చేర్చు కర్మయోగమునే శరణుజొచ్చుమని చెప్పి తరువాత క్రింది శ్లోకమున కూడ ఆ మాటనే బలపరచునట్లు చెప్పుచున్నాడు.



త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 50: బుద్ధియుక్తో జహా తీహా ఉభే సుకృత దుష్కృతే|
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ||
(కర్మయోగము)

భావము: కర్మయోగముననుసరించిన వాడు కర్మయైన పాప పుణ్యములను నాశనము చేయుచున్నాడు. అందువలన నీవు కూడ కార్యములను చేయుచు ఆ పనులయందే ఇమిడిన పాపపుణ్యములను పొందని నేర్పరితనమును తెలియుము. అదియే కర్మయోగము.
వివరము: పరమాత్మయందైక్యమగుటకు గీతయందు సూచించిన రెండు యోగములలో ఒకటైన కర్మయోగమంటే ఏదోనని, ఎంత నిష్ఠతో కూడుకొని ఉండునోయని, ఎంతటి సాధన చేయవలసి ఉండునోయని యోచించనవసరము లేదు. అందరనుకొనులాగా కర్మయోగములో ఏ సాధనలు ఏ నిష్టలు లేవు. ఉన్నదంతా ఒకే పద్ధతి. నీ ద్వార జరుగు ఏ పనియైనను పరవాలేదు, కాని ఆ పనులు చేయడములో కర్మ అంటని యోగకుశలత తెలిసియుండాలి. అన్ని పనులు చేయుచు కార్యములందు వ్యత్యాసమును వదలి, కర్మ ప్రకారము సంభవించు మంచిచెడు కార్యములను ఆచరించుచు, అహమును పొందకుండిన కార్యములోని కర్మ అంటదు. అదియే కర్మనుండి తప్పించుకొను ప్రావీణ్యత దానినే 'కర్మసుకౌశలం' అని గీతయందన్నారు. ఏ నియమములు లేని కర్మయోగము అన్ని పనులు ఆచరించుచు కర్మనంటక పోవడమే, కావున యోగమాచరించువాడు సుకృత దుష్కృతములైన పుణ్యపాపములను నశింపజేసుకొనును, అనగా మంచిని చేయుట ఎడల సంభవించు సుకృతమైన పుణ్యమును, అట్లే చెడు పని చేయుట ఎడల సంభవించు దుష్కృతమైన పాపమును అంటకుండ చేసుకొనును. అదియే కర్మయోగము యొక్క ప్రావీణ్యతయని తెలియాలి.

ముఖ్య గమనిక: చెడుపనులను వదలి మంచి పనులను చేయమని అందరు బోధించుట మనకు తెలిసినదే. అయితే గీతయందు గత జన్మల కర్మ ప్రకారము మంచి చెడు పనులు జరుగుచుండునని, ఎవరి ఇష్టము ప్రకారము అవి జరగవని చెప్పాడు. కావున జరిగెడి పనులలోని క్రొత్త కర్మను రాకుండ చేసుకొమ్మన్నాడు. అట్లు కాక చెడుపనులని, మంచిపనులని భేదమును గూర్చి చెప్పలేదు. కర్మయోగములో కర్మప్రకారము మనయందు బలవంతముగా జరుగు అన్ని పనులను సమముగా తలచి, వాటినుండి వచ్చు క్రొత్త కర్మను రాకుండ చేసుకొనుట వలన, తిరిగి తన చేత అటువంటి పనులు జరుగకుండపోవునని బోధించాడు. కర్మ నిర్మితమైన కార్యములను ఎవరు వదలలేరు. కాని ఆ కార్యములు జరుగకుండ పోవలెనన్న ఆ పనులకు కారణమైన (బీజమైన) కర్మనే లేకుండా చేసుకోవాలి. దానినే కర్మయోగమంటారు.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 51: కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః|
జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్ఛన్త్య నామయమ్ ||
(కర్మయోగము)

భావము: జ్ఞానపరులు కర్మ ఫలములను వదలి, జన్మ బంధములను విడచి మోక్షమును పొందుచున్నారు.
వివరము: కర్మయోగమును ఆచరించు జ్ఞానులు ప్రారబ్ధకర్మ నుండి వచ్చు కష్టసుఖములు లాభనష్టముల ఫలమును వదలి, కర్మప్రకారము ఏ కార్యమొచ్చిన దానిని ఆచరించి, దానినుండి వచ్చు క్రొత్త ఆగామికర్మను రాకుండా చేసుకొని, జన్మ బంధములను కల్గించు సంచితకర్మను వీడి నాశనరహితమైన, పరమాత్మ స్వరూపమైన మోక్షమును పొందుచున్నారు. (ఒక జన్మలో పుట్టినప్పటి నుండి మరణించు వరకు అమలుకు వచ్చు కర్మను ప్రారబ్ధకర్మయని, పుట్టినప్పటినుండి మరణించు వరకు క్రొత్తగా వచ్చు కర్మను ఆగామికకర్మయని, జన్మబంధములను కల్గించు కర్మ నిలువను సంచితకర్మయని తెలియాలి)

ఈ శ్లోకమున ప్రారబ్ధమును ఆచరిస్తూ, క్రొత్తగా వచ్చు కర్మయైన ఆగామిక కర్మను రాకుండ చేసుకొని, తిరిగి జన్మలేని విధముగా సంచితకర్మను అసలే లేకుండా చేసి, మోక్షము పొందుమని ముఖ్యముగా తెలియజేశాడు. ఈ శ్లోకములో పూర్తి వెదకినప్పటికి "కర్మజం" అనగా ప్రారబ్ధకర్మని, "జన్మబంధం" అనగా ఆగామికకర్మని తెలియుచున్నది. కాని సంచితకర్మ లేదేయని కొందరికి అనుమానము రావచ్చును. దానికి సమాధానము పాతది ప్రారబ్ధరూపముగా అయిపోతూ క్రొత్తదైన ఆగామికర్మ రాకుండపోతే, నిలువయైన సంచితమే పూర్తి లేకుండా పోతుందని తెలియాలి. సంచితము లేకపోయినపుడే అందు నుండి వచ్చు ప్రారబ్ధముండదు. అప్పుడు పుట్టనవసరమేలేదు. అపుడే మోక్షమను దైవపథమును చేరుకోగలము.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 52: యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి|
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ||
(కర్మయోగము,బ్రహ్మయోగము)

భావము: ఎపుడైతే మోహగుణమను కల్మషమును దాటగలవో, అపుడే నీవు ఇంతవరకు వినిన, వినవలసి విషయముల కొరకు వైరాగ్యము పొందగలవు.
వివరము: మన శరీరములో 12 గుణములుండినను ముఖ్యముగా ఆరు గుణములు మాత్రమే పేరుగాంచి ఉన్నవి. అందులో అపుడు అర్జునినికి ఆవహించి బాణములు క్రిందవేయునట్లు చేసినది మోహగుణము. నాది నావారు అని, 'నా' అని ప్రేరేపించునది మోహగుణము. ఆ గుణమును వీడి నాది నావారు అను విషయము మరచిపోతే కాని, ఇంతవరకు చెప్పిన కర్మయోగ వివరము, ఇక చెప్పబోవు బ్రహ్మయోగ వివరము మీద ఆసక్తి రాగలదు. అట్లు ఆసక్తి కల్గినపుడు వేదములను గుణముల నుండి బయటపడగలవు. ఇచట నిర్వేదం అను పదమును మరువకూడదు.

జ్ఞానము తెలుసుకోకుండ ఆటంకపరచువారు నీవారే. అందువలన నావారను మోహగుణము వదలి దానికి వ్యతిరేఖమైన వైరాగ్యమును పొంది శ్రద్ధగా వింటే గాని జ్ఞానము అర్థము కాదని, జ్ఞానము అర్థమైన తరువాతనే యోగమును పొందుటకు అవకాశము గలదని చెప్పాడు. గీత మొదలైనపుడు చెప్పినది ఆత్మ జీవాత్మల వివరము, తరువాత చెప్పినది కర్మయోగము. ఇక చెప్పబోవు విషయము బ్రహ్మయోగము.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 53: శృతి విప్రతి పన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా|
సమాధా వచలా బుద్ధిస్తదా యోగ మవాప్స్యసి||
(బ్రహ్మ యోగము)

భావము: వివిధ శ్రుతుల వలన కలత చెందిన నీ బుద్ధి చలింపనిదై స్థిరమైన సమాధియందు నిలిచినపుడు నీవు యోగము పొందిన వాడవగుదువు.
వివరము: గీతయందు మూడు ఆత్మలను గూర్చి చెప్పడములో ఆత్మయను పదమును, అట్లే రెండు యోగముల గురించి చెప్పడములో కూడ యోగము అను పదమును వాడారు. కావున ఆత్మ అన్నప్పుడు ఏ ఆత్మ అన్న విషయము, యోగము అన్నప్పుడు ఏ యోగము అన్న విషయము శ్రద్ధగా పరిశీలించి చూడవలసి ఉండును. ఇపుడు పై శ్లోకమున యోగమన్నారు కావున బ్రహ్మయోగమును గురించి చెప్పాడని తెలియాలి. ఏమి చెప్పాడనగా !

అనేక విధముల జ్ఞానమును గురించి విని కలత చెందిన నీ బుద్ధి మాత్రము చలింపనిదై, స్థిరముగా ఎల్ల జీవరాసులయందు సమముగా ఉన్న ఆత్మయందు ఎపుడు లగ్నము కాగలదో, అపుడే బ్రహ్మయోగమును పొందిన వాడవగుదువు. సర్వజీవరాసులలో సమముగా నివసించు ఆత్మయందు బుద్ధి లగ్నము కావడమును 'సమాధి' అని తెలియాలి. ఈ శ్లోకముకంటే ముందు అన్ని విషయములలో ఉంటూ, అన్ని పనులు చేస్తూ కర్మ అంటని కర్మయోగమును విన్న అర్జునుడు, ఈ శ్లోకములో శరీరములోని ఏ భాగము ఏ పని చేయక బుద్ధి కూడ స్థంభించి పోయినపుడు బ్రహ్మయోగమవునను మాటవిని, ఆశ్చర్యచకితుడై మొదటి సారిగా నోరు విప్పి బ్రహ్మయోగము యొక్క వివరమును గురించి ఇలా అడిగాడు.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
అర్జునుడిట్లనియె:-

(1) శ్లో|| 54: స్థిత ప్రజ్ఞస్య కా భాషా? సమాధిస్థస్య కేశవ !
స్థితధీః కిం ప్రభాషేత? కి మాసీత ? వ్రజేత కిమ్?
(బ్రహ్మయోగము)

భావము: ఓ కృష్ణా! బుద్ధి నిలిచిపోయి సమాధి స్థితిలో ఉన్నవాడు ఏ భాషలో మాట్లాడును? ఏమి మాట్లాడును? ఏ విధముగా కూర్చుండును? ఏమి ఆచరించును?
వివరము: ప్రజ్ఞ స్థిరమైనవాడు అనగా బుద్ధి నిలిచిపోయినవాడు ఏ భాష మాట్లాడును? మామూలుగా మనము నోరు కదిపి మాట్లాడు భాషకాక మూగగా మాట్లాడు భాష ఏమైనా ఉన్నదా ? అట్లు ఏదైనా భాష ప్రత్యేకించి ఉంటే బుద్ధి ఏ పని చేయనపుడు అతను ఏ విధముగా మాట్లాడును? బుద్ధి పనిచేయని వాడు ఏ విధముగా కూర్చొనును? మొత్తము మీద బుద్ధి పనిచేయని అతని ప్రవర్తన ఎట్లుండును? వివరమంతా తెలుపవలెనని అర్జునుడు అడుగగా, బుద్ధి నిశ్చలత పొందిన వానిని గూర్చి భగవంతుడిలా చెప్పాడు.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
శ్రీ భగవంతుడిట్లనియె:-

(1) శ్లో|| 55: ప్రజహాతి యదా కామాన్ సర్వాన్పార్థ! మనోగతాన్|
ఆత్మన్యే వాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞ స్తదోచ్యతే ||
(బ్రహ్మయోగము)

భావము: ఎప్పుడైతే సర్వ ఆశలు మరియు మనోగతములైనవన్ని ప్రయత్న పూర్వకముగా వదలి ఆత్మయందే జీవాత్మ తృప్తిబొందుచున్నదో అపుడే వానిని స్థిత ప్రజ్ఞుడని చెప్పవచ్చును.
వివరము: ఇక్కడ "మనోగతాన్" అన్నది విశేష పదము. మనస్సులో లగ్నమైయున్న అనగా మనసులో దాగియున్న గడిచిన విషయములన్ని అని అర్థము. ఇంతకు ముందు చూచినవి, విన్నవి, తిన్నవి, తాకినవి, వాసన చూచిన విషయములేవైన మనోగతములే. అవేవి మనస్సుకు జ్ఞప్తికి రాకుండాపోయి మరియు భవిష్యత్తును గురించిన ఆశలు జ్ఞప్తికి రాకుండాపోయినపుడు, ఆ శరీరములోని జీవాత్మ ఆ శరీరమునందే ఉన్న ఆత్మతో కలసి పోవును. బ్రహ్మయోగము ఆచరించుటకు మూలకారణమైనది మనస్సు. మనస్సు శరీరము లోపలి అవయవములకు బయటి అవయవములకు మధ్యవర్తిలాంటిది. అది స్థంభించినపుడే లోపలి బుద్ధి మరియు దానికి సంబంధిత గుణములు పనిచేయవు. అట్లే లోపలి నుండి మనస్సు ద్వార వచ్చు ఆజ్ఞలు నిలిచిపోవుట వలన బయటి అవయవములు పని చేయవు. అట్టి స్థితిని పొందిన వానినే స్థితప్రజ్ఞుడు అందురు. ఇంకనూ స్థిత ప్రజ్ఞుడు ఎట్లుండుననిన.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 56: దుఃఖే ష్వనుద్విగ్న మనాస్సుఖేషు విగత స్పృహః |
వీతరాగ భయక్రోధ స్థ్సిత ధీర్మునిరుచ్యతే ||
(బ్రహ్మయోగము)

భావము: దుఃఖమందు బాధపడని వానిని, సుఖములందు సంతోషించని వానిని, మరియు ప్రేమ, కోపము, భయములేని వానిని మౌనము వహించిన బుద్ధిగల వాడందురు.
వివరము: బ్రహ్మయోగము ఆచరించు వాని శరీరములో ఏ అవయవములు పనిచేయక స్థంభించియుండును. అవయవములు కదలి పనిచేయుటకు గుణముల ప్రకారము బుద్ధి యోచించితే, జరిగిన నిర్ణయమును మనస్సు ద్వారా పనులుగా జరుగునట్లు, శరీర యంత్రాంగము ప్రతి జీవరాసిలో ఉండును. బుద్ధి స్థంభించిన వాని శరీరములో ఏ యోచనలు జరుగవు. యోచనల ప్రకారము పనులు నిర్ణయింపబడవు. మనస్సు పూర్తిగా తన పనిని నిలిపి వేసియుండును. కావున అవయవములకు ఎటువంటి ఆదేశములు రావు. అందువలన పనిచేయు అవయవములు ఏ పనిని నిర్వర్తించక స్థంభించివుండును. ఇక జ్ఞానేంద్రియము లైన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము వాటి వాటి పనిని అవి చేసి వాటి వాటి విషయ జ్ఞానమును తెలుపు స్థితిలో ఉన్నప్పటికి,మనస్సు వాటిని గ్రహించకున్న దానివలన, ఆ విషయజ్ఞానము శరీరములోని జీవునికి, బుద్ధికి చేరదు. కావున వాడు ఏ విషయమునకు బాధపడడు. అట్లే బయట జరుగు సుఖములు కూడ తెలియవు, కావున సుఖములకు పరవశుడు కాడు. వానికి బయటి సమాచారము అందించు మనస్సులేని కారణమున భయము, ప్రేమ, కోపము ఏవియు ఉండవు. మనస్సు మౌనము వహించియుండును కావున అట్టి వానిని 'ముని' అంటున్నాము. ఇంకనూ అట్టివాడు ఎలా ఉండుననగా!


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 57: యస్సర్వత్రానభి స్నేహస్తత్త త్ప్రాప్య శుభా శుభమ్ |
నాభినందతి న ద్వేష్ఠి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||
(బ్రహ్మయోగము)

భావము: ఎవరైతే అన్నిటియందు సంబంధము లేక, శుభాశుభములయందు మనోధ్యాస ఏమాత్రము లేకుండా, సుఖదుఃఖములు అనుభవించకుండునో, అట్టివాని ప్రజ్ఞ గొప్పది.
వివరము: శరీరములోని మనస్సుకు మొత్తము 12 మంది స్నేహితులున్నారు. వారెవరనగా లోపలయున్న బుద్ధి, చిత్తము బయటనున్న జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము మరియు కర్మేంద్రియములైన కాళ్ళు, చేతులు, నోరు, గుదము, గుహ్యము. 'సర్వత్రానభిస్నేహ' అనగా ఎల్లప్పుడు స్నేహ సంబంధము కల్గి ఉండడమని అర్థము. ఎల్లప్పుడు బయటి ప్రపంచములోని మనుషులతో ఏ మానవునికి స్నేహము ఉండదు. కావున బయటి మనుషుల స్నేహమనుకోకూడదు. ఎల్లప్పుడు స్నేహము కల్గినది మనస్సు ఒకటే అదెలా స్నేహము కల్గి ఉన్నదనగా ! క్రింది పటములో చూడుము. బయటి జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము వాటి వాటి విషయములను మనస్సుకు సర్వత్ర అందించుట వలన ఈ బయటి ఐదు ఇంద్రియములతో మనస్సు ఎడతెగని స్నేహము కలిగియున్నది. మరియు బయటి ఇంద్రియములు అందించిన సమాచారమును మనస్సు లోపలి బుద్ధికి అందిస్తూ బుద్ధితోను, బుద్ధి యోచించిన విషయములను నిర్ణయించి బయటి కర్మేంద్రియములకు తెలుపమని చిత్తము మనస్సుకు తెల్పుచుండుట వలన చిత్తముతోను సర్వత్ర స్నేహము ఉన్నది. సర్వత్ర స్నేహ సంబంధము ఒక్క మనస్సుకు తప్ప మరి ఏ ఇతరమునకు లేదు.

లోపలయున్న బుద్ధి, చిత్తము బయటనున్న కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మములతో మనస్సు స్నేహ సంబంధము ఎప్పుడైతే వదలివేయునో అది నిద్ర అవుతుంది. నిద్రలో మనస్సు తన మీద జ్ఞప్తిని కోల్పోవును. అలా కాకుండా చేసుకోవడమును బ్రహ్మయోగమంటాము. మనస్సు తన్ను తాను మరువక సర్వత్ర కలిగిన 12 ఇంద్రియముల స్నేహమును ఎంతసేపు లేకుండునో అంతసేపు బ్రహ్మయోగమగును. బయటి విషయము లోపలికి లోపలి విషయము బయటికి చలించకపోవడము వలన బ్రహ్మయోగములో మానవ శరీరము నిద్రలాగ స్థంభించి ఉండును. అందువలన బయట కల్గు శుభాశుభములు, ప్రేమ అసూయలు అట్టివానికి ఉండవు, వానినే నిజమైన బ్రహ్మయోగి అంటాము.

ఏ ఇంద్రియమునకు, ఏ ఇంద్రియములతో స్నేహమున్నది క్రింద గల పట్టికలో చూడుము.

1. జీవునికి
:
అహము, బుద్ధి, (2)
2. మనస్సుకు
:
ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, బుద్ధి, చిత్తము,(12)
3. బుద్ధికి
:
మనస్సు, చిత్తము, జీవుడు (3)
4. చిత్తమునకు
:
బుద్ధి, మనస్సు, అహము (3)
5. అహమునకు
:
జీవుడు, చిత్తము (2)
6. కన్నుకు
:
మనస్సు (1)
7. ముక్కుకు
:
మనస్సు (1)
8. చెవికి
:
మనస్సు (1)
9. నాలుకకు
:
మనస్సు (1)
10. చర్మమునకు
:
మనస్సు (1)
11. చేతులకు
:
మనస్సు (1)
12: కాళ్లకు
:
మనస్సు (1)
13. నోరుకు
:
మనస్సు (1)
14: గుదమునకు
:
మనస్సు (1)
15: గుహ్యమునకు
:
మనస్సు (1)

మనస్సుకు ఎల్లప్పుడు ఇంద్రియములతో కల్గిన స్నేహమును ఏ విధముగా లేకుండా చేసుకోవలయునో, ఉదాహరించి భగవంతుడు క్రింది శ్లోకమున ఈ విధముగా అంటున్నాడు.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 58: యదా సంహరతే చాయం కూర్మో ఽజ్ఞానీవ సర్వశః|
ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా||
(బ్రహ్మయోగము)

భావము: తాబేలు ఏ విధముగా తన అవయవములను ముడుచుకొనుచున్నదో , ఆ విధముగా మనస్సును ఇంద్రియముల నుండి మరలింపవలెను.
వివరము: తాబేలు ఉన్నచోటనే ఉండి బయటవున్న తన నాల్గు కాళ్ళను మరియు తలను వీపు చిప్ప క్రిందికి ముడుచుకొని, బయటి సంబంధము అనగా బయటికి కనిపించకుండ చేసుకొనుచున్నది. ఆ విధముగానే మనిషి తన శరీరమును కదల్చకుండా బయటి ఇంద్రియములైన జ్ఞానకర్మేంద్రియముల నుండి మనస్సు యొక్క సంబంధము లేకుండా చేసుకోవలయును. అట్లు చేసుకోవడమే బ్రహ్మయోగము నందున్న పనితనము.

ఇక్కడ ముఖ్యముగా గమనించవలసినదేమనగా! తాబేలు చలించునపుడు చిప్ప క్రిందికి అవయవములను ముడుచుకోదు. ముడుచుకుంటే ముందుకు కదలలేదు. తాబేలు చలించనపుడే తన కాళ్ళు తలను ముడుచుకొన్నట్లు, మనిషి కూడ ఒక చోట స్థిరముగా కూర్చున్నప్పుడే తన మనస్సును ఇంద్రియముల సంబంధము లేకుండా చేసుకోగలడు. కాళ్ళను ముడుచుకొని తాబేలు ఎలా ముందుకు పోలేదో, అలాగే మనిషి మనోధ్యాసను ఇంద్రియముల నుండి మరల్చుకొని ఏ చిన్న కార్యమునైన చేయలేడు. కొందరు పనులు చేయుచు మనస్సును మరల్చుకోవాలని చెప్పుచుందురు. అది శుద్ధ అసత్యమని తెలియాలి. బ్రహ్మయోగమనబడు మనోనిశ్చలతను పొందిన వాడు బాహ్య సంబంధమైన అన్ని ఇంద్రియ చలనములు లేనివాడై ఉండును.



త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో| 59: విషయా విని వర్తన్తే నిరాహారస్య దేహినః
రసవర్జం రసో ఽ ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే||
(బ్రహ్మయోగము)

భావము: బ్రహ్మయోగమాచరించు యోగి ఇంద్రియములకు ఆహారమైనట్టి విషయములయందు మనోధ్యాసలేకుండా చేసుకొన్నప్పటికి, వాని తలలోని విషయముల మీద ఆశ అనుగుణము వీడకయుండును. ఆ ఆశయు కొంత కాలము ఆత్మను దర్శించుట వలన నశించిపోవును.
వివరము: ఒక రోగి పథ్యముండి ఒక రుచిగల పదార్థము తినకుండినప్పటికి ఆ పదార్థము మీద ఆశ ఉండినట్లు, యోగి విషయములను అనుభవించక పథ్యమైన బ్రహ్మయోగము ఆచరించినప్పటికి, వాని తలలో విషయాసక్తిగల ఆశ అను గుణము దాగియుండి, అపుడపుడు విషయముల మీద ఆసక్తిని కలుగజేయుచు, మనస్సును చలింపజేసి యోగభంగము కల్గించుచుండును. అందువలన బ్రహ్మయోగి ఒక గంటకాలము యోగసాధనయందు గడిపితే, కొన్ని నిమిషముల కాలమైన మనస్సు చలించి యోగభంగము జరుగుచుండును. ఈ విధముగా జరుగుచుండినప్పటికి బ్రహ్మయోగమాచరించు వానికి కొంతకాలమునకు అట్టి మనో చంచలమైన కోర్కెలు కూడ రాకుండా పోవును. బ్రహ్మయోగమాచరించు ఏ యోగికైన మనో చంచలము యోగ సమయములో కల్గుట సహజమే. దానిని గురించి క్రింది శ్లోకమున ఈ విధముగా చెప్పుచున్నాడు.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 60: యతతోహ్యపి కౌన్తేయ! పురుషస్య విపశ్చితః|
ఇంద్రియాణి ప్రమాథీని హరన్తి ప్రసభం మనః ||
(బ్రహ్మయోగము)

భావము: జ్ఞానియైనవాడు యోగ సమయమందు మనస్సు చలించకుండునట్లు ఎంత ప్రయత్నము చేయుచుండిన, యోగభ్రష్టతయను ప్రమాదము కలుగునట్లు ఇంద్రియములు వాని మనస్సును చలింపజేయుచున్నవి.
వివరము: బ్రహ్మయోగమాచరించు వాడు ఎంతటి జ్ఞానియైన, అతను యోగము చేయు సమయమున బయటి జ్ఞానేంద్రియములు ఐదు, వాటి వాటి విషయములను మనస్సుకు చేరవేయు సామర్థ్యము కల్గి, మనస్సును ఏకాగ్రతగా లేకుండా విషయ సంబంధము కలుగునట్లు చేయుచున్నవి. బ్రహ్మయోగమాచరించుటకు ఆశీనుడైన ప్రతి యోగి యొక్క శరీరములోని జ్ఞానేంద్రియములు శత్రువులవలె పనిచేసి, వాని యోగమును విఘ్నపరచుచున్నవి. ఇంద్రుడు పురాణాలలో అగ్ని, వరుణుడు, వాయువు మొదలగు వారిని పంపి తపస్సు చేయువారిని విఘ్నపరచినట్లు, నిజ జీవితములో యోగమాచరించువారికి అగ్ని, నీరు, వాయువు, భూమి చేత తయారైన ఇంద్రియముల ద్వారా యోగము భంగమగునట్లు ప్రకృతి చేయుచున్నది.

గమనిక: జ్ఞాన జిజ్ఞాసులైన పాఠకులకు తెలియజేయడమేమనగా! పండితులుగా ఉన్నవారు. మేధావులు శ్లోకము భావము చదివి వివరము చదివిన పరవాలేదు. అలాకాక మాకు సంస్కృతము అర్థము కాదు, మాకు గీతలో జ్ఞానము మాత్రమే అవసరము, భావము, వివరము ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఏమిటి మాకు అర్థము కావడము లేదు అనుకొనువారికి సులభముగా గీత యొక్క జ్ఞానము అర్థము కావలయునంటే శ్లోకము భావము వదలివేసి కేవలమొక్క వివరము మాత్రమే చదువుచుపోండి. అలా వివరము మాత్రము చదువుట వలన గీతలోని జ్ఞానము సులభముగా అర్థము కాగలదని మా నమ్మకము. మీరు ఏది చదివినప్పటికి ఆ వివరము ఏ విషయమును గురించి చెప్పినది సూచనగా శ్లోకము ప్రక్కన బ్రాకెట్లో సూచించింది తప్పక చూడండి.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 61: తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః|
వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా||
(బ్రహ్మయోగము)

భావము: ఇంద్రియములనెల్ల అణచివేసి మనస్సును నాయందు ఎవడుయుంచునో, ఇంద్రియములెవనికి స్వాధీనమైయుండునో అట్టి వాని ప్రజ్ఞ గట్టిది.
వివరము: బయటి జ్ఞానేంద్రియములు వాటి వాటి సమాచారమును మనస్సుకు చేరవేసినప్పటికి, మనస్సు వాటిని స్వీకరింపని స్థితిలో ఉన్నపుడు జ్ఞానేంద్రియములు ఏమి చేయలేవు. మనస్సు యొక్క ధ్యాస జ్ఞానేంద్రియముల మీద లేకుండా చేస్తే దాని ధ్యాస ఆత్మ మీద ఏర్పడగలదు. జ్ఞానేంద్రియముల విషయ ధ్యాస మనస్సుకు లేనపుడు కర్మేంద్రియములకు మనస్సు ద్వారా ఎట్టి పనియు ఆదేశింపబడదు. కావున కర్మేంద్రియములు వశీకరణ మంత్రము ప్రయోగించినట్లు కదలక నిలిచిపోయి ఉండును. అట్టి స్థితి కల్గిన వానినే నిలకడ మనస్సు గలవాడని చెప్పవచ్చును.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 62: ధ్యాయతో విషయాన్ పుంస స్సంగస్తేఘాపజాయతే|
సంగాత్సంజాయతే కామః కామాత్క్రోధో ఽ భిజాయతే||
(ప్రకృతి)

భావము: విషయముల ధ్యాసలో వాటి సంగమము మానవునకు ఏర్పడుచున్నది. అట్టి సంగమము వలన మానవునకు కోర్కె పుట్టుచున్నది. దాని వలన క్రోధము పుట్టుచున్నది.
వివరము: జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము యొక్క విషయముల మీద మనస్సుకు ధ్యాస కల్గుట వలన, వాని తలలోని గుణముల గుంపులతో ఆ విషయముపోయి చేరుచున్నది. జ్ఞానేంద్రియముల నుండి వచ్చు విషయము గుణముల గుంపులో కలియుట వలన, ఆ విషయమును బట్టి మొదట గుణముల గుంపు నుండి కోర్కె ఏర్పడుచున్నది. ఆ కోర్కె నెరవేరక పోతే దాని వలననే కోపము గుణసంగము నుండి వచ్చుచున్నది. ఇంకనూ ఆ గుణములు కల్గుట ఎట్లున్నదనగా!


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 63: క్రోధాద్భవతి సమ్మోహ స్సమ్మోహాత్ స్మృతి విభ్రమః|
స్మృతి భ్రంశా ద్భుద్ధినాశో బుద్ధి నాశా త్ప్రణశ్యతి ||
(ప్రకృతి)

భావము: క్రోధము వలన సమ్మోహము గల్గును. సమ్మోహము వలన స్మృతి భ్రమించుట, స్మృతి భ్రమించుట వలన బుద్ధి నాశనము, బుద్ధి నాశనము వలన భ్రష్టత్వము పొందుట కల్గును.
వివరము: గుణచక్రమందుగల గుణములలోనికి మనస్సు ద్వారా విషయము పోయి చేరిన వెంటనే అందులోని గుణములు కదలను మొదలు పెట్టును. మొదటిది కోర్కె, రెండవది కోపము అట్లే ఇతర లోభ,మోహ, మధ, మాత్సర్యములను గుణములు కల్గుచుండును. విషయమునకు తగిన గుణము వచ్చిన వెంటనే ఇతర గుణమును ఆలోచించుట మాని ఆ వచ్చిన గుణమందే సమ్మోహుడై నిలుచును. కొద్దిసేపటికి ఆ గుణమందు యోచించు జ్ఞప్తి కూడ లేకుండ చిత్తము నిర్ణయించును. యోచించు జ్ఞప్తి కూడ లేనందువలన బుద్ధి యొక్క పనితనమేమి లేకుండ పోవును. బుద్ధి పనితనం లేకుండ పోయిన దాని వలన మానవుడు విచక్షణారహితుడై కర్మ ప్రకారము పనులు చేయుచు కర్మబద్దుడగుచున్నాడు.

ఒక విషయము జ్ఞానేంద్రియముల ద్వారా లోపలికి పోయినపుడు, మనస్సు ద్వారా బుద్ధికి చేరును, బుద్ధి గుణముల ద్వారా యోచించును. బుద్ధి యోచించిన విషయమే కర్మప్రకారము చిత్తముచే నిర్ణయింపబడుచున్నది. పై రెండు శ్లోకములు సాధారణ మానవునియందు జరుగు వివరమును తెలియజేసినవి. యోగిగ మారు వాని విషయము క్రింది శ్లోకమున ఇలా ఉన్నది.




త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో||64: రాగ ద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ |
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాద మధిగచ్ఛతి||
(బ్రహ్మయోగము)

భావము: రాగద్వేషములను వదలి అట్లే ఇంద్రియ విషయములను వదలి స్వాధీనపడిన మనస్సుగలవాడెపుడైతే అపుడు ప్రసాదంబు కలుగును.
వివరము: లోపలి నుండి వచ్చు ప్రేమ అసూయ అను రెండు రకముల గుణములను వదలి వేసి, బయటినుండి వచ్చు ఇంద్రియ విషయములను వదలి వేసి, ఏ ధ్యాసలులేని వశమైన మనస్సు గలవానికి ఆత్మదర్శనము కల్గును.

ఇక్కడ రాగద్వేషములు(ప్రేమ అసూయలు) అను మాట వచ్చినది. కావున గుణముల గురించి పూర్తిగ తెలియవలసి ఉన్నది. మన శరీరమందు షట్ వర్గము అను ఆరుగుణముల గుంపు పేరుగాంచి ఉన్నది. అవియే 1) కామ 2) క్రోధ 3) లోభ 4) మోహ 5) మధ 6) మత్సరమను గుణములు. ఇవి ఆరు చెడును సూచించు గుణములు. ఈ గుణములున్న వారిని అసురులని, ఈ గుణములకంటే వ్యతిరేఖ గుణములున్న వారిని దేవతలని గీతయందు తర్వాత అధ్యాయములలో తెల్పబడియున్నది. చెడును(పాపమును) కల్గించు కామ, క్రోధ, లోభ,మోహ, మధ, మత్సరములను గుణములను అందరికి తెలియునట్లు పెద్దలు ఎక్కువ ప్రచారము చేశారు. ఎందుకనగా అవి తెలిసియుంటే వాటియందు ఎరుక కల్గి ఉందురను భావముతో అందరికి తెలియనట్లు చేశారు. ఇక మంచిని(పుణ్యము) కల్గించు ఆరు గుణములున్నవి. అవి మొదటి ఆరు గుణములకు వ్యతిరేఖమైనవి. ఏ దానికి ఏది వ్యతిరేఖమైనది క్రింద తెలుసుకొందాము.

1) కామము X దానము 2) క్రోధము X దయ
3) లోభము X ఔధార్యము 4) మోహము X వైరాగ్యము
5) మధము X వినయము 6) మత్సరము X ప్రేమ


ఇలా ఉన్న చెడు, మంచి గుణములందు ఏ గుణము లేకుండా పోవడము బ్రహ్మయోగమగును. ద్వేషము, ప్రేమ అని రెండు గుణములు చెప్పడములో మంచివి చెడువి అను రెండు రకముల గుణములు వదలి, అట్లే బయటి ఇంద్రియముల విషయములు వదిలినవాడు బ్రహ్మయోగి అగును. వానికే ఆత్మదర్శనమగునని ఈ శ్లోకమున తెలియజెప్పబడినది. అట్టి వానికి ఇంకనూ ఎలా ఉండునది క్రింది శ్లోకములో తెలియబరచబడినది.




త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 65: ప్రసాదే సర్వదుఃఖానాం హాని రస్యోపజాయతే |
ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే||
(బ్రహ్మయోగము)

భావము: ఆత్మదర్శనము కల్గినపుడే సర్వదుఃఖములకు హాని ఏర్పడును. బుద్ధి సుస్థిరత చెందును. మనస్సు నిర్మలత్వము పొందును.
వివరము: బ్రహ్మయోగమున మనస్సు లోపలి గుణముల, బయటి ఇంద్రియముల ధ్యాస లేకుండ పోయినపుడు ఆత్మదర్శనమగును. ఒక్కమారు ఆత్మదర్శనము కల్గిన వానికి తరువాత ఎన్ని దుఃఖములు తటస్థించినను వాడు వాటిని లెక్కచేయడు. ఆత్మానుభూతి ముందర ఏ దుఃఖము కనిపించదు. ఒక్కమారు ఆత్మదర్శనము కల్గిన వానికి మనస్సు కూడ మొదటివలె చలించక నిలుచుట అనుకూలపడును, బుద్ధియు స్థిరపడును. ఇట్టి స్థితి పొందని మనిషికెలా ఉండుననిన క్రింద ఇలా చెప్పబడినది.




త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 66: నాస్తి బుద్ధి రయుక్తస్య న చాయుక్తస్య భావనా |
న చా భావాయత శ్శాన్తి రశా న్తస్య కుత స్సుఖమ్||
(బ్రహ్మయోగము)

భావము: యోగహీనునికి బుద్ధి నిలకడగ ఉండదు. దైవభావము అతనికి కలుగదు. దైవభావములేని వానికి శాంతి లేదు. శాంతిలేని వానికి సుఖముండదు.
వివరము: మనస్సు నిలకడలేని వానికి బుద్ధికూడ నిలకడగ ఉండదు. ఎందుకనగ మనస్సు అందించు విషయములను ఆలోచించవలసిన పని బుద్ధికున్నది. కనుక మనస్సు నిలకడకానంత వరకు బుద్ధి స్థిరపడదు . ఎల్లప్పుడు బయటి విషయములనే యోచించు బుద్ధికి దైవభావము ఏమాత్రము పట్టుబడదు. దైవభావము లేనివాడు రాజకీయవేత్తగాని, ఉన్నత ఉద్యోగి కాని, పెద్ద జమీందారుడుకాని వానికి అన్ని ఉండినప్పటికి మనోశాంతి ఉండదు. శాంతిలేనివాడు సుఖముల మధ్యవున్నను సుఖమేమిటో వానికి తెలియదు. లోపల ఏదో తీరని లోటుతో అసంతృప్తితో బాధపడుచుండును.




త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 67: ఇంద్రియాణాం హి చరతాంయన్మనో ఽ నువిధీయతే|
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ మివాంభసి||
(ప్రకృతి)

భావము: ఏ మనుష్యుని మనస్సు ఇంద్రియముల వెంట తిరుగుచుండునో వాని బుద్ధియు గాలి వలన నావ కదిలినట్లు చలించుచుండును.
వివరము: శరీరము ఒక యంత్రములాంటిది. యంత్రములలో ఒక భాగము నుండి ఇంకొక భాగమునకు అనుబంధమున్నట్లు, శరీర బయటి ఇంద్రియములైన జ్ఞానేంద్రియములకు లోపలి మనస్సుకు సంబంధమున్నది. మనస్సు బయటి జ్ఞానేంద్రియ విషయములను గ్రహించవచ్చును. లేక గ్రహించకుండ జారిపోవచ్చును. మోటారుబండ్ల గేర్ బాక్స్ లోని సిస్టమ్ వలె మనసున్నది. ఇటు లోపలి విషయముల తోను సంబంధపడవచ్చును, అటు బయటి విషయములతోను సంబంధపడవచ్చును. ఎటూ కాకుండ ఊరకవుండవచ్చును. మోటార్ బండ్ల గేర్ బాక్స్ లోని 'మెయిన్ రాడ్' ఇటు ముందుకు నడుచు చక్రముతోను, అటు వెనుకకు నడుచు చక్రముతోను సంబంధపడవచ్చును. ఎటూలేక న్యూట్రల్ గా ఏ చక్రముతోను సంబంధములేక ఉండవచ్చును. అలాగే మనస్సు ఇటు బయటకు అటు లోపలికి సంబంధము కల్గిఉన్నది. బయటి సంబంధము కల్గి విషయములను గ్రహించి వెంటనే లోపలి సంబంధముకల్గి లోపలి బుద్ధికి తెలియజేయుచున్నది. లోపలికి వచ్చిన విషయములను బుద్ధి యోచించడము దాని సహజ కర్తవ్యము. మనస్సు అందించు కొలది బుద్ధి యోచించవలసి ఉన్నది. కావున గాలి వలన పడవ కదిలినట్లు మనోవిషయముల వలన బుద్ధి కదలుచుండును. ఈ యంత్రాంగమంతయు సహజముగా ప్రకృతిలోని మానవునియందు జరుగుచుండును. మానవుడు ప్రయత్నించి బ్రహ్మయోగిగా మారవలెనంటే క్రింది శ్లోకము చూడుము.




త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 68: తస్మాదస్య మహా బా హో! నిగృహీతాని సర్వశః|
ఇంద్రియాణీంద్రియార్థేభ్య స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా||
(బ్రహ్మయోగము)

భావము: ఎవడు ఇంద్రియముల యొక్క సర్వ విషయములను నిగ్రహించుచున్నాడో అట్టివాని ప్రజ్ఞ నిలకడగా నిలిచినదగును.
వివరము: ఎవని మనస్సు ఐదు జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మముల యొక్క సర్వ విషయములను వీడి ఎటూ కాక నిలకడగాయుండునో, అపుడు బయటి విషయములు చేరని దానివలన బుద్ధి ఏ గుణముతో యోచించక నిలిచిపోవును. అట్టి స్థితినే బ్రహ్మయోగమంటాము. బ్రహ్మయోగమును గురించి ఇంకనూ చెప్పడమేమనగా! క్రింది శ్లోకమున చూడుము.




త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 69: యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ|
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః||
(బ్రహ్మయోగము, ప్రకృతి)

భావము: సర్వ జీవరాసులకు రాత్రివలె నిద్రించు అజాగ్రత్త ఎందుగలదో అందే బ్రహ్మయోగి జాగ్రత్త కల్గియుండును. ఏదైతే బ్రహ్మయోగికి రాత్రివలె స్థంభించి ఉన్నదో అందే సర్వ జీవరాసులు జాగ్రత్తగానున్నవి.
వివరము: సర్వజీవరాసులు (మానవులందరు) ప్రపంచ విషయమములలో ఉదయము నుండి లగ్నమై వారివారి ఉద్యోగములందునో, వారివారి వ్యాపారములందునో బహు జాగ్రత్తగా ఎచట ఏ నష్టము రాకూడదను భావముతో ఉండి, పూర్తి ఎరుకగ వారి కర్తవ్యములను నిర్వర్తించుచున్నారు. ప్రపంచ విషయములలో జాగ్రత్తగ ఉన్న ప్రజలు ఆత్మజ్ఞాన విషయములలో పూర్తి నిద్రావస్థయందుండిపోయారు. ఆత్మ విషయము చీకటితో నిండిన రాత్రివలె వారికి ఉన్నది. ఆత్మజ్ఞానమంటే ఏమిటో అర్థముకాని అంధకారంలో వారు నిలిచిపోయారు. మామూలు ప్రజలు ఆ విధముగా ఉండగ, ఆత్మదర్శనము కోరు బ్రహ్మయోగులు మాత్రము ప్రజలు ఏ ఆత్మ విషయములలో అజాగ్రత్త కలిగి అంధకారంలో ఉన్నారో, ఆ ఆత్మ విషయములలో పూర్తి ఎరుకకల్గి ఆత్మజ్ఞానము గ్రహించుటలో జాగ్రత్త కల్గియున్నారు. ఆ విధముగనే సర్వులు ఏ ప్రపంచ విషయములలో శ్రద్ధకల్గి జాగ్రత్తగా వర్థిస్తున్నారో, ఆ ప్రపంచ విషయములలో బ్రహ్మయోగులు అజాగ్రత్త కలిగియున్నారు. అందువలన ఈ శ్లోకములో అజ్ఞానులకు చీకటైనది జ్ఞానులకు పగలుయని, అజ్ఞానులకు పగలైనది జ్ఞానులకు చీకటియని తెలియాలి.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
1) శ్లో|| 70: అపూర్వమాణ మచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్|
తద్వత్కామాయం ప్రవిశన్తి సర్వే సశాన్తి మాప్నోతి న కామకామీ||
(బ్రహ్మయోగము)

భావము: నిండి నిబిడీకృతముగా ఉన్న సముద్రమునందు నదుల నీరు ఎంత చేరినప్పటి పొంగిపోనట్లు, బ్రహ్మయోగనిష్ఠయందున్న వానికి ఎన్ని కోర్కెలున్నను వాటి ప్రభావమేమి లేకపోవును. బ్రహ్మయోగి కాక కోర్కెలు కోరువానికి ఎప్పటికి ఆత్మదర్శనము లభించదు, శాంతిరాదు.
వివరము: సముద్రము ఎప్పటికి ఒకే విస్తీర్ణము కలదియైయుంటు, తన లోనికి ఎన్ని నదీ ప్రవాహములు వచ్చి చేరుచున్ననూ ఏమాత్రము పొంగి పోవునది కాక మొదటివలె ఉంటున్నది. అట్లే బ్రహ్మయోగి అయినవాడు సముద్రముతో సమానముగా ఉన్నాడు. బ్రహ్మయోగమనబడు ఒకే పరిధిలోవుండు యోగికి బయటి నుండి ఎన్నో కోర్కెల సంబంధిత విషయములు జ్ఞానేంద్రియములనబడు ఐదు నదుల ద్వారా వచ్చినప్పటికి చలించకయుండును. అప్పుడు వాని మనస్సు ఆత్మయందు లగ్నమైనది గనుక ఆ విషయముల తాకిడి వానినేమి చేయలేక పోయినది. అట్లుకాక విషయ తాకిడికి మనస్సు చలించుచున్నదైతే వానికి లోపలి గుణములలో మొదటిదైన పెద్దదైన కామము(ఆశ) అనుగుణము తప్పక యోగభ్రష్ఠుని చేయును. కోర్కెలు గలవాడు, గుణములు పనిచేయువాడు ఆత్మను దర్శించలేడు. అందువలన బ్రహ్మయోగి ఎట్లుండవలయునంటే.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 71: విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః |
నిర్మమో నిరహంకార స్స శాంతి మధిగచ్ఛతి||
(బ్రహ్మయోగము, కర్మయోగము)

భావము: సర్వ కోర్కెలను విడనాడి వాటి ధ్యాస ఏమాత్రము లేకుండు వాడును, అట్లే మోహమును, అహంకారమును లేనివాడును తప్పక శాంతి పొందును.
వివరము: ఈ శ్లోకము ఇటు బ్రహ్మయోగులకు, అటు కర్మయోగులకు ఇరువురకు చెప్పినదిగా తెలియవలయును. ఈ రెండు యోగములను గూర్చి ఈ అధ్యాయము నందు తెలియజేశారు. విషయధ్యాసలు లేక మనస్సును అణచియేయునది బ్రహ్మయోగమని, అట్లే విషయధ్యాసలు కల్గి కార్యాచరణ చేస్తు అహంకారమును అణచివేయునది కర్మయోగమని వివరింపబడినది. ఇప్పుడు ఈ శ్లోకమున ఎవని మనస్సు అన్ని కోర్కెలు విడనాడి వాటి ధ్యాసకు ఏమాత్రము పోకుండునో వానిని బ్రహ్మయోగియని, అట్లే అహంకారము ఎవనికి లేకుండునో వానిని కర్మయోగియని తెలియజేస్తూ వీటియందు ఏ యోగమాచరించిన వానికైనను మోక్షము పొందు అవకాశము కలదని తెలియబరచబడినది. ఇక ఈ అధ్యాయములో చివరిగా చెప్పునది ఏమనగా!


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ సాంఖ్య యోగము  
   ☞
(1) శ్లో|| 72: ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ! నైనాం ప్రాప్య విముహ్యతి|
స్థిత్వా ఽ స్యా మన్తకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి ||
(బ్రహ్మయోగము,కర్మయోగము)

భావము: ఇది దైవమును పొందుస్థితి. ఈ స్థితి పొందినవాడు నాది నావారు అను మోహమును పొందడు. ఈ స్థితి పొందిన వాడు మరణకాలమున మోక్షమును పొందును.
వివరము: ఇంత వరకు చెప్పిన రెండు యోగములు మూడవ పురుషుడైన పరమాత్మను పొందు మార్గములు.ఈ రెండు యోగములను ఆచరించిన వానికి నా అను మోహగుణము రాదు. ఈ యోగములు పూర్తి ఆచరించినవాడు మరణకాలమున శరీరము వదలి ఏ జన్మపొందక పరమాత్మను చేరగల్గుచున్నాడు. ఇంతటితో భగవద్గీతయందు సాంఖ్యయోగమనబడు ఈ అధ్యాయము అయిపోయినది. ఈ అధ్యాయములో భగవంతుడు చెప్పిన శ్లోకములు మొత్తము 54 కాగా, అర్జునుడు అడిగిన శ్లోకము బ్రహ్మయోగమును గూర్చి అడిగినది కాగా, భగవంతుడు చెప్పిన శ్లోకములలో 13 జీవాత్మ సంబంధితమైనవి. ఆత్మ సంబంధిత మైనవి 2 శ్లోకములు, పరమాత్మ 4, ఆత్మ పరమాత్మ 1 శ్లోకములున్నవి. కర్మయోగమును గూర్చి ఉన్నవి 9 శ్లోకములు, బ్రహ్మయోగమును గూర్చినవి 13, అట్లే బ్రహ్మయోగము కర్మయోగము కలిపియున్నవి 4 శ్లోకములు. ప్రకృతిలోని సహజత్వాన్ని బోధించినవి 8 శ్లోకములు. బ్రహ్మయోగమును ప్రకృతిని కలిపి చెప్పినది ఒక్క శ్లోకము. మొత్తము ఈ అధ్యాయములో 55 శ్లోకములు. 7 శ్లోకములు కల్పితములైనవిగ కొట్టివేయబడగా మరియు 10 శ్లోకములు అర్జునుడు బాధపడినవిగా లెక్కించి, భగవంతుడు చెప్పినవి కానందున తీసివేయబడినవి.

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024