pss:BhaktiYogam

 




త్రైత సిద్ధాంత భగవద్గీత: అధ్యాయము 11: భక్తియోగము

Male voice


త్రైత సిద్ధాంత భగవద్గీత: అధ్యాయము 11: భక్తియోగము

శ్లోకం 1 : ఆ విధముగ ఎల్లపుడు ఆత్మతో కూడుకొన్నవాడు , భక్తితో నిన్ను ఉపాసించువాడు , కనిపించని నాశనములేని స్థానమును గురించి ఉపాసించువాడు గలరు.  వీరిలో బాగా యోగము తెలిసిన వారు ఎవరు? అని అర్జునుడు అడిగెను?

శ్రీ భగవన్తుడు ఇట్లు అనియే  :శ్లోకం 2 (బ్రహ్మయోగము , కర్మయోగము , భక్తియోగము):

పరమశ్రద్ధ కల్గినవారై నాయందు మనస్సునుంచి, నిత్యము నాతో యుక్తము కోరి ఉపాసించువారందరు ఉత్తమయోగులని నా ఒప్పుదల. 

శ్లోకం 3( మోక్షము) ,శ్లోకం 4: బ్రహ్మయోగము :

అక్షరమైనది, నిర్ధేశింపబడనిది, కనిపించనిది, ఆలోచనకందనిది, కూటస్థమైనది, అచలమైనది, శాశ్వతమైనది, అంతట వ్యాపించినదియైన పరమాత్మను ఉపాసించువారు.

ఇంద్రియములను నిగ్రహించి, అన్నిటియందు బుద్ధి సమముచేసి, సర్వభూత హితులైన వారు నన్ను పొందగల్గుదురు.

శ్లోకం 5 బ్రహ్మయోగము : అట్లు ఆత్మను ఉపాసించునట్టి బ్రహ్మయోగులు అనుసరించు మార్గము చాలా కష్టమైనది పార్థ! ఇంద్రియములకు తెలియని ఆత్మను పొందుట అతి కష్టమైన మార్గమని తెలియుము. 

శ్లోకం 6  కర్మయోగము: ఎవరైతే సర్వకర్మలు నాకే సమర్పణమొనర్చారో, వారు ఇతర ఏ కర్మలు అంటని రీతిలో కర్మయోగంబొనర్చి నన్ను ఉపాసించుచున్నారు. 

శ్లోకం 7 భక్తియోగము:  నాయందే వారి మనస్సును లగ్నము చేసివున్న నాభక్తపరులు కలరు. నేను శీఘ్రముగ వారినందరిని మృత్యు సంసార సముద్రమునుండి బయటపడ వేయుచున్నాను. 

శ్లోకం 8,9  బ్రహ్మయోగము: నాయందే మనసునుంచి ఎల్లపుడు నన్నే తలచుచుండుము. నాయందే బుద్ధినుంచుము. ఆ తరువాత నన్నే పొంది నాయందే నిలుతువు. ఈ విషయములో అనుమానము లేదు.

                                        నీ చిత్తమును స్థిరరీతి నాయందు నిలుపశక్తిలేని ఎడల ఓ అర్జునా! అట్టి శక్తి అభ్యాసయోగమున పొందగలవు.

శ్లోకం 10 భక్తియోగము: మనస్సు నిల్పు అభ్యాసమునకు సమర్థత లేనివాడవైతే నా పనులు చేయుము. నా కొరకు పనులు చేయుట వలన మోక్షమును పొందవచ్చును. (ధర్మ ప్రచారం ).

శ్లోకం 11 కర్మయోగము: భక్తియోగము చేత నాపనులు చేయుటకు కూడ సామర్థ్యములేని వాడవైతే అఖిల కర్మఫలత్యాగివగుము. అట్టికర్మ యోగమున నన్ను పొందగలవు.

శ్లోకం 12 బ్రహ్మ,కర్మయోగము: అభ్యాసముకంటే జ్ఞానము మేలు, ధ్యానము జ్ఞానముకంటే గొప్పది, ధ్యానమును మించినది కర్మఫలత్యాగము. మనిషికట్టి త్యాగముచే శాంతికల్గును.

శ్లోకం 13,14 కర్మయోగము: సర్వ జీవరాసులందు ద్వేషములేక, కరుణ స్నేహముకల్గి, మమత విడిచి, అహంకారములేకుండ, కల్గెడి సుఖదుఃఖములను సమముగ చూచుచు, ఓర్పుకల్గి వుండువాడు, 

                                        ఎల్లపుడు సంతృప్తికల్గిన కర్మయోగియై మనోబుద్ధియందు మోక్షము పొందవలెనను దృఢనిశ్చయము కల్గివుండు భక్తునియందు నాకధిక ప్రేమ. 

శ్లోకం 15 బ్రహ్మయోగము: అర్జునా! ఎవని వలన ప్రపంచమునకు భయములేదో, ప్రపంచముచే ఎవడు భయపడడో, వాడు కోపమును, భయమును, సంతోషమును మనో వ్యాకులతను పొందడు, వాడే నాకు పరమప్రియుడు. 

శ్లోకం 16 బ్రహ్మయోగము : దేనియందు ఆశలేనివాడును, మనో శుభ్రతకల్గినవాడును, పట్టుదల కల్గిన వాడును, ఎవరి పక్షము లేనివాడు, దేనిని ఆరంభించక వదలివేసిన బ్రహ్మయోగి అయిన భక్తుడు నాకధిక ప్రియుడు. 

శ్లోకం 17 కర్మయోగము: సంతోషపడక అట్లే దుఃఖమును పొందక, ద్వేషమందక, అభిలాషియు కాక, మంచిచెడు పుణ్యపాపములను పొందక, వాటిని పరిత్యజించినవాడు ఎవడో వాడు నాకు మిగులప్రియుడు. 

శ్లోకం 18 బ్రహ్మ,కర్మయోగము ,19 కర్మయోగము : మిత్రులయందు, శత్రువులయందు, మానావమానములందు, శీతోష్ణ సుఖదుఃఖములందు సమతకల్గినవాడు, పాపపుణ్యములను సమానముగ వర్జితము చేసినవాడు, 

                                                                        స్థుతియు, నిందయు సమముగ తలచి దొరికిన దానితో తృప్తిచెంది గృహములు మొదలగు నివాసస్థలముల మీద ఆశలేని స్థిర మనస్కుడగువాడు నాకు ప్రియుడు.

శ్లోకం 20 (బ్రహ్మ,కర్మయోగము): ఎవరు నా పరమపదము మీద శ్రద్ధగలిగి, ఈ మృతములేని ధర్మము లను ఏ విధముగ చెప్పియున్నారో, ఆ విధముగ ఉపాసించు భక్తుడు నాకు పరమప్రియుడు.

వివరము : మోక్షమే జీవితాశయముగ ఉన్నవాడు అన్నిటికంటే ఎక్కువ శ్రద్ధ కలిగి పరమాత్మ సంబంధమైన ధర్మములను పూర్తిగ తెలుసుకొనును. అమృతమైన ధర్మములు ఎలావున్నవో అలాగే ఆచరించి పరమాత్మను చేరవలెనని ప్రయత్నము చేయువారెవరైతే ఉన్నారో వారు పరమాత్మకు మిక్కిలి ప్రీతిపాత్రులుగనున్నారు. 




(బ్రహ్మయోగము , కర్మయోగము , భక్తియోగము

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024