సిద్ధాంత కర్తలు 101 to 200 part2.

 ఎంతో దూరమున చనిపోవడము జరిగినది. ఆయన పుట్టినది ముఖ్యము,

ఆయన చనిపోయినది ముఖ్యము. చావుకు పుట్టుకకు మధ్య జరిగిన

జీవిత కాలము ముఖ్యము. ఈ మూడు మనకు తెలిసినది సత్యమే.


ప్రశ్న :- శంకరుడు సాధారణముగా చనిపోలేదు. చంపబడ్డాడు అని

మీరు చెప్పుట సత్యమే అయినా, ఆ విషయమును కొందరు జీర్ణించుకోలేక

మిమ్ములను తప్పుగా ఆరోపించవచ్చును కదా! అట్లుకాకపోయినా నేటికినీ

ఎందరో ఆర్యులున్నారు కదా! వారు తమ రహస్యమును బయటపెట్టు

చున్నారనియో, మమ్ములను హంతకులుగా చిత్రించుచున్నారనియో మీ

మీద కక్ష పెంచుకోవచ్చును కదా! ఆర్యులు తెలివైనవారని, విశిష్టాద్వైతము

వారిని ఎందరినో హింసించారని మీరే చెప్పారు. అటువంటప్పుడు శంకరుని

మరణమును గురించి చెప్పడము వలన మీకు కూడా వారి ద్వారా ఇబ్బంది

ఉండవచ్చును కదా!


జవాబు :- శంకరుని జీవిత చరిత్రంతయూ వ్రాసినవారు శంకరుని

మరణమును గురించి వ్రాయలేదు. కొందరు వ్రాసినా ఆయన కైలాసమునకు

పోయాడని వ్రాశారు. అట్లు ఎవరూ పోవుటకు వీలులేదు. ఎవరయినా

చనిపోయిన తర్వాత ఎక్కడికయినా పోవచ్చును. అంతేగానీ బ్రహ్మదేవుడు

వచ్చి కైలాసము ఖాళీగాయుంది ఇక భూలోక నివాసము చాలని శంకరున్ని

పిలిచినట్లు, అప్పుడు శంకరుడు తన వాహనమైన వృషభమును ఎక్కి

కైలాసమునకు పోయినట్లు వ్రాయడము అభూత కల్పన అని చెప్పవచ్చును.

ఇదంతా అసత్యమే అని తెలిసినా అలా కల్పించి చెప్పిన వారి మాటలను

నమ్మడము, మేము సత్యము చెప్పినా నమ్మకపోవడము చాలా విచిత్రము.

శంకరుడు కేదార్నాథ్ దొంగల చేతిలో చనిపోయినది చరిత్రకు తెలియని


సత్యము. అయితే ఆ దొంగలు ఎవరు? అన్నది ఆధారము లేని ప్రశ్నగా

నిలిచిపోయినది. దొంగల చేతిలో చనిపోయినది నూటికినూరుపాళ్ళు

సత్యమే. అయితే ఆ సమయములో ఆర్యులకుట్ర కూడా లేదని చెప్పుటకు

వీలులేదు. ఈ విషయములో మా నిర్ణయమే ఖచ్చితమయినదని మీరు

నమ్మవలసిన పనిలేదు. మీరు స్వయముగా ఆలోచించి ఒక నిర్ణయానికి

రమ్మని నేను చెప్పడము జరిగినది. అప్పుడున్న పరిస్థితులను బట్టి

ఇదంతయూ ఒక ఫతకము ప్రకారమే జరిగినదని చెప్పక తప్పదు.

జరిగిపోయిన విషయమును వదలి ఇప్పుడు ద్రావిడులు ఆర్యుల ఉచ్చులో

తగుల్కొనవద్దని చెప్పుచున్నాము. జరిగిన దానికంటే జరుగబోయేది

ముఖ్యము దానిని గురించి ఆలోచించండి.


ప్రశ్న : శంకరులు ధరించినది నొసలు మీద మూడు విభూతిరేఖలు.

శంకరాచార్యుల వారు కైలాసమునుండి దిగివచ్చిన శివుడేయని అందువలన

అతను విభూతినే ధరించాడని కొందరు చెప్పుచున్నారు. అంతేకాక ఆయన

మంత్రము కూడా పంచాక్షరి మంత్రమయిన 'ఓం నమఃశివాయ” అని

ఉన్నదని అంటున్నారు. దీనిని గురించి మీరేమంటారు?


జవాబు :- నేను ఒక సిద్ధాంతకర్తగా నా కర్తవ్యము ప్రకారము సత్యమునే

చెప్పవలసియున్నది. అందువలన ఈ విషయములో మేము చెప్పునదే

మనగా! శంకరున్ని శివుడని ఆర్యులన్నారు తప్ప మిగతా ఎవరూ అనలేదు.

మూడు విభూతి రేఖలు అద్వైతముతో వచ్చినవి కావు. కృతయుగములోని

జ్ఞానులు తయారుచేసినది మూడు విభూతిరేఖలు. మూడు విభూతి రేఖలకు

విశేషమైన జ్ఞానము కలదు. మూడు విభూతిరేఖలలో అద్వైతము గానీ,

విశిష్టాద్వైతముగానీ, ద్వైతముగానీ ఏదీలేదు. త్రైత సిద్ధాంతము విభూతి

రేఖలతో ముడిపడియున్నది. విభూతిరేఖలు మూడు గలవు. మూడు


రేఖలు మూడు ఆత్మలకు గుర్తుగా యున్నవి. ఆత్మ అనగా! పవిత్రతతో

కూడుకొనియున్నది. అందువలన ఆత్మల గుర్తులయిన మూడు రేఖలను

తెల్లని విభూతితో తీర్చిదిద్దడమైనది. తెలుపు కల్మషము లేనిది, పవిత్రతకు

గుర్తుగాయున్నది. అందువలన మూడు రేఖలను తెల్లని విభూతిలోనే

పెట్టడమయినది. మొదట ఈశ్వర లింగము మీద పెట్టిన విభూతి రేఖలకు

ఎంతో అర్థమును చేకూర్చడము జరిగినది.


ప్రశ్న :- శంకరాచార్యులవారు ధరించిన విభూతి రేఖలు ఈయన భూమిమీద

పుట్టకముందునుండి ధరించెడివనీ, శంకరాచార్యులవారు భూమిమీద

పుట్టకముందు త్రిమూర్తులలో ఒకరైన శివుడనీ, శివునిగా కైలాస పర్వతమున

నివసించుచూ విభూతి రేఖలను ధరించియుండెడివాడనీ, పార్వతీ

సమేతుడుగా యున్న శివుడు శంకరుడను పేరుతో భూమిమీద పుట్టి

అద్వైతమును స్థాపించాడనీ, 32 సంవత్సరములు భూమిమీదయున్న ఆయన

కేదార్నాథ్ యున్నప్పుడు సకలదేవతలు వచ్చి పిలువగా తన వృషభ

వాహనమును ఎక్కికైలాసమునకు పోయాడని కొన్ని గ్రంథములలో గలదు.

అట్లుండగా శివుని విభూతికి శంకరునికి సంబంధము లేదు అని మీరు

అనడములో సత్యము కలదా?


జవాబు :- శంకరుడు శివుడై వృషభ వాహనము మీద కైలాసమునకు

పోయాడని మీరు చెప్పు మాటలో సత్యము కలదా! యని మేము ప్రశ్నించు

చున్నాము. ప్రజలు అసత్యపు మాటలను నమ్ముచున్నారు, సత్యమును

చెప్పితే తిరిగి ప్రశ్నిస్తున్నారు. అసత్యమువద్ద ఎవరూ ఏమీ ప్రశ్నించక

చెప్పినదంతా విని తలూపుచున్నారు. త్రిమూర్తులలో శివునికి కేరళ

రాష్ట్రములో పుట్టిన శంకరునికి ఏమాత్రము సంబంధము లేదు. అంతేకాక


విభూతిరేఖలు కైలాసగిరిలోయున్న శివునికి సంబంధించినవి కూడా కావు.

సృష్ఠి తర్వాత దేవుడు ఇచ్చిన జ్ఞానముతో 'దేవునికి రూపములేదు' అని

చూపుటకు ముక్కు ముఖములేని ఒక గుండ్రని రాయిని దేవుని గుర్తుగా

చూపడము జరిగినది. అంతేకాక దేవుడు మూడు ఆత్మల రూపములో

త్రైతముగా యున్నాడని తెలుపు నిమిత్తము మూడు తెల్లని రేఖలను దేవుని

గుర్తుగా చూపబడిన రాతి లింగము మీద ఉంచడము జరిగినది. దేవుని

నిరాకార స్వరూపమునకు విభూతిరేఖలను, సాకార స్వరూపమైన

ఆకారమున్న ప్రతిమకు మూడు నిలువు నామములను ముఖము మీద

నొసలు భాగములో పెట్టడము జరిగినది. ఈ విధముగా విశ్వములోని

దైవము యొక్క స్థితిని తెలియజేయుటకు మూడు అడ్డరేఖలను, మూడు

నిలువు రేఖలను జ్ఞానులు తయారు చేసి పెట్టగా వాటినే అందరూ

ధరించారు. అంతేగానీ వాటిని ధరించిన వారివి అవి ఏమాత్రము కావు.

శివుని విభూతి రేఖలుగానీ, విష్ణువుకు త్రినామముగానీ ఏమాత్రము

స్వంతములు కావు. దేవుని యొక్క సాకార నిరాకారములకు ధరింపచేసిన

మూడు ఆత్మల గుర్తులుగా రెండు రకముల అడ్డనామములు, నిలువు

నామములు గలవని తెలియవలెను. కృతయుగమునుండి అందరూ

ధరించినట్లే కేరళ రాష్ట్రములో పుట్టిన శంకరుడు కూడా విభూతి రేఖలను

ధరించడము జరిగినది.


ప్రశ్న :- హిందూమతములోని శైవులు విభూతిరేఖలను ధరించడము,

వైష్ణవులు నిలువునామములు ధరించడము జరిగినది. శైవులు విభూతి

రేఖలను తమ స్వంత పార్టీ గుర్తుగా చెప్పుకోగా, వైష్ణవులు మూడు నిలువు

నామములను వైష్ణవ సాంప్రదాయ గుర్తుగా చెప్పుకోవడము జరిగినది.

శైవుల, వైష్ణవుల వేరువేరు సాంప్రదాయములకు సంబంధించినవే వేరువేరుగా


యున్న నిలువు, అడ్డనామములు అని చెప్పుచున్నారు. శైవులు, వైష్ణవులు

చెప్పుదానిలో సత్యమెంత గలదు?


జవాబు :- సత్యము రవ్వంతయు లేదని చెప్పవచ్చును. మొదటి

యుగమయిన కృతయుగములోనే ఆధ్యాత్మిక జ్ఞానములో సాకార,

నిరాకారములను తెలుపు గుర్తులుగా, మూడు ఆత్మలను ఉద్దేశించి పెట్టినవే

విభూతి రేఖలు, నిలువు నామములు. అయితే కాలము జరుగుకొలది

మనుషులలో మాయాప్రభావము పని చేయడము వలన త్రేతాయుగమునకు

విభూతిరేఖలు చంద్రవంశము వారు ధరించెడివనీ, నిలువు నామములు

సూర్యవంశము వారు ధరించెడివారని చెప్పుకోవడము, అలాగే ధరించడము

జరిగెడిది. ద్వాపరయుగములో మరికొంత మాయ పనిచేయగా

అజ్ఞానములో మునిగిన మనుషులు పూర్వము పెద్దలు పెట్టిన అర్థములను

మరచిపోయినవారై విభూతిరేఖలు శైవులవి, నిలువునామములు వైష్ణవులవి

అని చెప్పుకోవడము జరిగినది. ప్రస్తుతము కలియుగములో రెండు

నామములకు పూర్వమున్న అర్థమును పూర్తిగా మరచిపోయినవారై,

మరికొంత అజ్ఞానములోనికి దిగజారినవారై, మూడు విభూతిరేఖలు

అద్వైతులవనీ, మూడు నిలువు నామములు విశిష్టాద్వైతులవనీ

చెప్పుకోవడము జరుగు చున్నది. ఈ విధముగా యుగములు మారేకొద్దీ

రెండు నామముల మీద భావములు కూడా మారుతూవచ్చాయి. అయితే

పూర్వము కృత యుగములో ఆత్మజ్ఞానులు భావమే సరియైనదిగానీ, తర్వాత

వచ్చిన మూడు యుగములలోనూ విభూతిరేఖల మీద, మూడు నామముల

మీద ప్రజలలో గల భావము సరియైనది కాదని చెప్పవచ్చును. ద్వైతము

అంటే రెండని అర్థము గలదు. త్రైతము అంటే మూడని అర్థము కలదు.

అద్వైతము అంటే రెండుకానిదని అర్థము కలదు. అటువంటప్పుడు


అద్వైతమునకు నిజమైన భావమును ఖచ్చితముగా చెప్పలేము. ఎందుకనగా!

అద్వైతము అను పదములోనే సందిగ్ధావస్థ కలదు. అద్వైతము అన్నప్పుడు

రెండు కానిదను అర్థము వచ్చును. రెండు కానిది, రెండు తర్వాతయున్నది,

మూడని చెప్పవచ్చును. అట్లుకాకుండా అద్వైతము అంటే రెండుకానిది

ఒకటని చెప్పుట తప్పని చెప్పవచ్చును. శూన్యము అనగా సున్న అనియూ,

అశూన్యము అనగా సున్నా కానిది ఒకటియని చెప్పవచ్చును. అలాగే

'అనేకము' అన్నప్పుడు ఒకటికానిది రెండని చెప్పవచ్చును. అద్వైతము

అన్నప్పుడు రెండుకానిది మూడని చెప్పవచ్చును. అట్లు ముందుకు

చెప్పవలెనుగానీ, వెనక్కు చెప్పకూడదు. అందువలన అద్వైతము అంటే

ఒకటనడములో అర్థమేలేదు.


ప్రశ్న :- మూడు విభూతిరేఖలు, మూడు నిలువు నామములు ఇప్పటివికావు,

అద్వైతులకు, విశిష్టాద్వైతులకు సంబంధించినవి కావు. కృతయుగములోనే

జ్ఞానులు నిర్ణయించి పెట్టినవని మీరు చెప్పారు. మీరు చెప్పిన మాట

నిజమే యుండవచ్చును. కృతయుగ చరిత్రలో, త్రేతాయుగ చరిత్రలో,

ద్వాపరయుగ చరిత్రలోనూ విభూతిరేఖలు, నిలువు నామములు ధరించిన

వారున్నట్లు తెలియుచున్నది. శ్రీరాముని కాలములో రాముడు

సూర్యవంశము రాజయిన దానివలన నిలువు నామములు ధరించినట్లు,

రావణబ్రహ్మ విభూతిరేఖలను ధరించినట్లు చరిత్రలో తెలియుచున్నది.

నాలుగు యుగములలో తెల్లని విభూతి రేఖలు, మూడు నిలువు నామములను

ధరించిన వారున్నారు. అయితే యుగ యుగమునకు మనుషులలోని

భావము మారినదని మీరు చెప్పినది సత్యమే అనిపించుచున్నది. అయితే

నేడు అద్వైతమువారు, విశిష్టాద్వైతమువారు చెప్పుచున్న మంత్రములు ఇప్పటి


కాలములో వీరివేనా, లేక పూర్వకాలమునుండి నామములున్నట్లు వేరు

అర్ధముతో ఏమయినా ఉండెడివా అని అనుమానము వచ్చినది. నేడు

అద్వైతులు “ఓం నమఃశివాయ” అను పంచాక్షరి మంత్రమును,

విశిష్టాద్వైతులు “ఓం నమోనారాయణాయ" అను అష్టాక్షరి మంత్రమును

చెప్పుచున్నారు. ఈ పంచాక్షరీ, అష్టాక్షరీ మంత్రములు ఇప్పటివేనా లేక

పూర్వ కాలమునుండి ఉన్నాయా? మాకర్థమయ్యేలాగున వివరముగా

చెప్పండి.


జవాబు :- కృతయుగములోనే సూర్యుడు భూమిమీదకు దైవజ్ఞానమును

చేర్చిన తర్వాత జ్ఞానమును తెలిసిన జ్ఞానులు ప్రకృతిని దైవమును

వేరువేరుగా విడదీసి ప్రకృతికి సర్వము నాశనమయినా దేవుడు మాత్రము

నాశనము కానివాడని తెలుపు నిమిత్తము జ్ఞానార్థముతో పంచాక్షరి

మంత్రమును తయారు చేశారు. పంచాక్షరి మంత్రము ఆరు అక్షరములతో

కూడుకొనియున్నది. “ఓం నమఃశివాయ” అనునది పంచాక్షరి మంత్రమని

చెప్పబడుచున్నది. దేవుడు కనిపించనివాడు, కనిపించని దేవుని జ్ఞానము

కనిపించని సూక్ష్మమైన అర్ధముతో కూడుకొనియుండును. అయితే పంచాక్షరి

మంత్రమునకు స్థూలమైన కనిపించే అర్థము ఒకటి కలదు. అలాగే

సూక్ష్మముగా కనిపించని అర్థము మరొకటి కలదు. స్థూలమైన అర్థమును

గురించి చెప్పుకొంటే ఈ విధముగా కలదు. పంచ+అక్షరి=పంచాక్షరి.

పంచ అనగా ఐదుయని అర్థము. అక్షరి అనగా అక్షరములని చెప్పవచ్చును.

కనిపించే ఐదు అక్షరములని ప్రపంచ సంబంధముగా కనిపించే అర్థము

కలదు. ఇక కనిపించని సూక్ష్మమైన అర్థము కూడా కలదు. పంచ అనగా

ఐదు అనియూ, అక్షరీ అనగా నాశనము కానిదనియూ అర్థము. ఈ

కనిపించని సూక్ష్మ అర్థము ప్రకారము ఐదుకు నాశనము కానిదని అర్థము.


ఇంకా వివరముగా చెప్పుకొంటే ప్రకృతి ఐదు భాగములుగా కలదు.

దానినే పంచభూతములు అంటున్నాము. ఐదు సజీవ శక్తులతో కూడియున్నది

ప్రకృతి. ప్రకృతిలోని ఐదు శక్తులకు వరుసగా పేర్లు ఈ విధముగా కలవు.

1) ఆకాశము, 2) గాలి, 3) అగ్ని, 4) నీరు, 5) భూమి. ఈ ఐదు శక్తులు

ప్రపంచములో జీవరాశులకు పుట్టుకను, చావును కలుగ జేయుచున్నవి.

దేవుడు సాక్షిగాయుండగా ఐదు శక్తుల వలననే ప్రపంచములోని

కార్యములన్నియూ జరుగుచున్నవి. ఆత్మ చేయించగా ప్రకృతి చేయుచున్నది.


ప్రకృతియంతయూ పరమాత్మ ఆధీనములోయుండి పని చేయు

చున్నది. ప్రకృతిని పుట్టించినది పరమాత్మయే. అందువలన అన్నిటినీ

నాశనము చేయు ప్రకృతి పరమాత్మను ఏమియూ చేయక దేవునిపట్ల

వినయముగా ఉండును. దీనినిబట్టి ప్రకృతికి నాశనముకానిది పరమాత్మ

యని చెప్పవచ్చును. ప్రకృతియనగా పంచభూతములు కనుక 'పంచ'

అని అన్నారు. నాశనముకానిది కనుక 'అక్షరము' అన్నారు. అక్షరము

అనగా నాశనము లేనిది అని చెప్పుచూ పంచభూతములకు నాశనము

కానిది పరమాత్మయని అందరికీ తెలియజేయు నిమిత్తము దేవున్ని

“పంచాక్షరి” అన్నారు. పంచాక్షరిలో పంచముగానున్న ప్రకృతికి అనగా

ఐదు భూతములకు గుర్తుగా ఐదు బీజాక్షరములను వ్రాసి చూపారు. అలాగే

పరమాత్మకు గుర్తుగా ఒక బీజాక్షరమును వ్రాసి చూపారు. పరమాత్మకు

గుర్తుగాయున్న బీజాక్షరము “ఓం” అని వ్రాసి, పంచభూతముల బీజాక్షరము

లను వరుసగా న,మః, శి,వా,య అని వ్రాశారు. “ఓం” పరమాత్మ బీజాక్షర

మైనట్లు 'న' ఆకాశమునకు బీజాక్షరముగా నిలిచినది. అలాగే “మః”

గాలికి, “శి” అగ్నికి, “వా” నీరుకు, “య” భూమికి బీజాక్షరములైనవి. ఈ

విధముగా "ఓం నమఃశివాయ" అనునది ప్రకృతికి నాశనముకాని


పరమాత్మగా గుర్తింపబడినది. ఇది ఓం నమఃశివాయలోని సూక్ష్మమైన

అర్థముకాగా, స్థూలమైన అర్థము వ్రాయబడిన ఐదు అక్షరములని

చెప్పవచ్చును.


అలా చెప్పితే 'ఓం నమఃశివాయ' మొత్తము ఆరు అక్షరములు

గలవు. అప్పుడు దీనిపేరు షష్టాక్షరి అగును కదా! పంచాక్షరి కాదుకదా! యని

ప్రశ్న రాగలదు. ఆ ప్రశ్నకు కొందరు “ఓం” అనునది ప్రణవాక్షరము.

అది అన్ని మంత్రములకు ముందుండునది, అందువలన 'ఓం' ను వదలి

నమఃశివాయ అను ఐదు అక్షరములనే లెక్కించవలెను” అని అంటున్నారు.

ప్రతి మంత్రము ముందర 'ఓం' సర్వసాధారణముగా ఉచ్ఛరించబడుచున్నది.

కావున ఓం ను వదలి మంత్రములోని అక్షరముల సంఖ్యనే చెప్పవలెనని

కొందరి వాదన. ఇది ఇట్లుండగా కొందరి వాదనలో ఓంను కూడా కలిపి

లెక్కించవలెనని చెప్పుచున్నారు. "ఓం నమోనారాయణాయ" అను

మంత్రములో మొత్తము ఎనిమిది అక్షరములుండుట వలన దానిని అష్టాక్షరి

మంత్రమన్నారు. ఇక్కడ 'ఓం'ను కలిపి లెక్కించితే ఎనిమిది అక్షరములగు

చున్నవి. ఓంను వదలి ఎంచితే ఏడు అక్షరములే అగును. అష్టాక్షరి

మంత్రము దగ్గర 'ఓం' ను లెక్కించమని చెప్పినట్లు పంచాక్షరి మంత్రము

వద్ద చెప్పడము లేదు. అక్కడ ఓంను వదలి లెక్కించమని అంటున్నారు.

పంచాక్షరి, అష్టాక్షరి మంత్రముల విషయములో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా

చెప్పుట వలన రెండు మంత్రముల వద్ద ఏకాభిప్రాయము లేకుండా

పోయినది. ఆధ్యాత్మిక విద్యలో ఎంతో ప్రాముఖ్యతను పొందిన రెండు

మంత్రములు భిన్నముగా యుండుట వలన మనుషులు మొత్తము

ఆధ్యాత్మికమునే నమ్మకుండా అంతా బూటకము అంటున్నారు. వీటిలో

శాస్త్రబద్దత కనిపించని దానివలన కొందరు దేవున్నే నమ్మని నాస్తికులు

తయారయినారు.


ప్రశ్న :- పంచాక్షరి మంత్రము జ్ఞానమును తెలిసిన పెద్దలు తయారు

చేశారంటే అది కృతయుగములో తయారయినట్లే. అయితే అది స్థూల

అర్థముకంటే సూక్ష్మ అర్థమే జ్ఞానముతో కూడుకొన్నదైయుండగా, స్థూల

అర్థము ఐదు, ఆరు అక్షరములని లెక్కించబడుచూ అనుమానములనే

రేకెత్తించుచున్నది. దీనికి తోడు అష్టాక్షరి మంత్రము దేశములో ప్రసిద్ధిగాంచి

నది. పంచాక్షరి, అష్టాక్షరి మంత్రములు తెలియని జ్ఞానులు ఉండరు.

కొద్దిమాత్రము జ్ఞానము తెలిసిన వారికయినా ఈ రెండు మంత్రములు

సుపరిచయమే అని చెప్పవచ్చును. పంచాక్షరి మంత్రము ఒకటేయుండి

వుంటే అక్షరముల సముదాయములలో అంతపట్టింపు ఉండేది కాదు.

అష్టాక్షరి మంత్రము వచ్చిన తర్వాతనే అక్షరముల గొడవ ప్రారంభమయినది.

పంచాక్షరి కృతయుగమునుండి యున్నది. అయితే అష్టాక్షరి ఎప్పుడు

ప్రారంభమయినది. ఎవరు అష్టాక్షరిని కనిపెట్టి చెప్పారు?


జవాబు :- భూమిమీద ఎప్పుడు జ్ఞానము ప్రారంభమయినదో అప్పుడే

అజ్ఞానము కూడా ప్రారంభమయినది. మొదట జ్ఞానము ప్రకారము

పంచాక్షరి మంత్రము తయారయినది. మంత్రము అనగా జపించునది

కాదు. మంత్రము అనగా మహిమతో కూడుకొన్నదని అర్థము. మహిమ

అనగా శక్తియని జ్ఞానశక్తి అని అర్ధము. పంచాక్షరిలో జ్ఞానశక్తి ఇమిడి

యుండుట వలన దానిని 'పంచాక్షరి మంత్రము' అని అన్నారు. కృత

యుగములో పంచాక్షరి మంత్రముండగా అదే యుగములోనే కొంతకాలము

జరుగగా, నిరాకార, సాకార స్వరూపముగా తయారయిన లింగమును,

ప్రతిమను దేవతల క్రిందికి జమకట్టడము జరిగినది. అప్పటికి కొంత

అజ్ఞానము మనుషులలో తయారై పరమాత్మ నిరాకారమైన లింగమును


శివునిగా, సాకార ప్రతిమను విష్ణువుగా మనుషులు చెప్పుకోవడము

జరిగినది. అప్పుడు ఒకే దేవుడు నిరాకారముగా, సాకారముగా యున్నాడను

జ్ఞానము పోయి లింగమును శివుడని, ప్రతిమను విష్ణువని చెప్పుకోవడము

మొదలయినది. దానితో దేశములో శివభక్తులు కొందరు, విష్ణుభక్తులు

కొందరు ఏర్పడినారు. ఎప్పుడు విష్ణుభక్తులు ఏర్పడినారో అప్పుడు అష్టాక్షరి

మంత్రమును తయారు చేసుకొన్నారు. శివభక్తులు ముందునుండియున్న

'ఓం నమఃశివాయ' మంత్రమును తన మంత్రమని చెప్పుకోగా, దానికి

పోటీగా విష్ణుభక్తులు ‘ఓం నమోనారాయణాయ' అను అష్టాక్షరి మంత్రమును

తయారు చేశారు. అప్పటినుండి ఆ మంత్రములలో జ్ఞానశక్తి లేకుండా

పోయినది. అవి రెండు మంత్రములని పిలువబడినా అందులో మహత్యము

(శక్తి) లేదు. అవి చూపాకార మంత్రములైనవి.


ఆ విధముగా కృతయుగములోనే జ్ఞానము మొదట అజ్ఞానము

దానివెనుక తయారయినది. అప్పటినుండి కాలము మారుకొలది

యుగములు గడుచుకొలది అజ్ఞానము కూడా పెరుగుతూ వచ్చినది.

మంత్రములు అట్లేయుండగా, కలియుగములో అద్వైతులకు పంచాక్షరి

మంత్రము, విశిష్టాద్వైతులకు అష్టాక్షరి మంత్రము సొంతమైపోయినది.

అద్వైతులు కలియుగములో తయారయినా కృతయుగమునుండి ఉన్న నమః

శివాయ మంత్రము తమదేనని తామే కనిపెట్టినట్లు చెప్పుకోవడము

జరిగినది. అట్లే ముందునుండి యున్న విభూతిరేఖలను కబ్జాచేసి అవి

తమవే అన్నారు. అదే విధముగా అద్వైతము తయారైన తర్వాత దాదాపు

1500 సంవత్సరములకు తయారయిన విశిష్టాద్వైతము వారు కృతయుగము

లోనే తయారయిన అష్టాక్షరి మంత్రమును ఆక్రమించుకొని అది తమదే

అన్నారు. అట్లే ముందునుండియున్న మూడు నిలువు నామములను కూడా


తమవే అని చెప్పుకోవడము జరిగినది. ఈ విధముగా ఇప్పటికి అనగా

కలియుగములో అద్వైతులు, విశిష్టాద్వైతులు పోటాపోటీగా నామములను,

మంత్రములను కలిగియున్నారు.


ప్రశ్న:- అద్వైతమును ఆర్యులు ఆచార్య శంకరుని చేత చెప్పించి, ఆయనను

ప్రపంచమునకు అద్వైత సిద్ధాంతకర్తగా చూపారు. శంకరున్ని ముందుంచి

ఆయన వెనుక ఆర్యులు అద్వైతమును ప్రచారము చేసినట్లు మీరు తెలిపిన

దానినిబట్టి తెలిసినది. అయితే ఇప్పుడు మీరు చెప్పుచున్న విశిష్టాద్వైతము

అద్వైతము తర్వాత 1500 సంవత్సరములకు వచ్చినదన్నారు. కానీ దాని

సిద్ధాంతకర్త ఎవరు? అను విషయమును మీరు చెప్పలేదు. అద్వైతము

తర్వాత వచ్చిన విశిష్టాద్వైతమును సృష్టించినది ఒక్కరేనా, లేక శంకరునికి

ఆర్యులు వెనుకయుండి కథ నడిపినట్లు విశిష్టాద్వైతమునకు కూడా

ఎవరయినా ఉన్నారా?


జవాబు :- అద్వైతము ఆర్యులయొక్క కుట్రలతో, కుతంత్రములతో

తయారయినది. ఆనాడు బౌద్ధమును హిందువులనుండి వేరుచేసి,

హిందువులలో తమ ఆధిపత్య సామ్రాజ్యమును స్థాపించుకొనుటకు

తయారయినది అద్వైత సిద్ధాంతము. అది పేరుకు సిద్ధాంతమని చెప్పినా,

వాస్తవానికి సిద్ధాంతము కాదని కూడా చెప్పుకొన్నాము. అది అలా 1500

సంవత్సరములు సాగిపోగా, తర్వాత భక్తి ప్రవృత్తులతో పుట్టినది

విశిష్టాద్వైతము. అద్వైతము నిరాకార దైవమును తెల్పునదిగా చెప్పినా

అందులో శాస్త్రబద్ధత లేదు. ప్రత్యక్ష అనుభవము అంతకూలేదు. అద్వైతము

భగవద్గీతలో చెప్పబడినా అది మనిషి మోక్షము పొందిన తర్వాత పొందు

స్థితిగాయున్నది. మరణానంతరము పొందు మోక్షములో అనుభవమునకు


వచ్చు అద్వైతమును ప్రత్యక్ష జీవితములో చెప్పుకోవడము పెద్ద పొరపాటు,

కాదు తప్పు. అయినా అది ప్రజలలో నేడు ఎక్కువగా వ్యాపించిన

సిద్ధాంతము. బౌద్ధులమీద అసూయతో పుట్టిన అద్వైతము ఆ రోజులలో

ప్రజలయందు బాగా వ్యాపించునట్లు ఆర్యులు చేశారు. అద్వైతమునకు

ఎదురు లేకుండా దాదాపు 1500 సంవత్సరములు గడువగా, యుక్త

వయస్సుకు వచ్చిన బలిసిన సింహమువలె అద్వైతము తయారైనది. పూర్తి

బలిష్టముగా అద్వైతమున్నప్పుడు పురుడుపోసుకున్నది విశిష్టాద్వైతము.

విశిష్టాద్వైతము సాకార భక్తియే ధ్యేయముగా పుట్టినది.


క్రీస్తు తర్వాత 1017 సంవత్సరములకు తమిళనాడు రాష్ట్రములో

చెన్నైకి దక్షిణమున సుమారు 40 కిలోమీటర్ల దూరములో యున్న

పెరంబుదూరులో రామానుజాచార్యుల వారు జన్మించడము జరిగినది.

రామానుజాచార్యులవారి తండ్రి కేశవసోమయాజి, తల్లి కాంతిమతి. కేశవ

సోమయాజుల వారు విష్ణు భక్తుడు. ఆనాడు బహుకొద్ది మందిగా యున్న

విష్ణు భక్తులలో సోమయాజుల వారు ముఖ్యమైనవారు. ఆయన పేరు

కేశవ అయితే అనేక యజ్ఞములు చేసిన బ్రాహ్మణునిగా సోమయాజులను

బిరుదు వచ్చినది. రామానుజాచార్యుల వారు బ్రాహ్మణ కులములో పుట్టారు.

శంకరుడు కూడా బ్రాహ్మణ కులములోనే పుట్టాడని అందరికీ తెలుసు.

అయితే శంకరాచార్యుల వెనుక ఆర్యులున్నట్లు రామానుజాచార్యుల వారి

వెనుక ఎవరూ లేరు. రామానుజాచార్యుల వారు మాత్రమే స్వయముగా

విశిష్టాద్వైత సిద్ధాంతమును బోధించారు.

ప్రశ్న :- రామానుజాచార్యుల వారు వేదములను అనుసరించలేదా?

వేదపఠనమును ప్రోత్సహించలేదా?


జవాబు :- రామానుజాచార్యుల వారు శంకరాచార్యులు అద్వైతమునకు

వ్యతిరేఖముగా నడిచాడు. అందువలన ఆయన వేదములను విమర్శించనూ

లేదు, సమర్థించనూలేదు. రామానుజుల వారి విశిష్టాద్వైత సిద్ధాంతము

అద్వైత సిద్ధాంతమునకు కొంతమార్పుతోనే యున్నది. అద్వైతము

నిర్గుణమును సూచించగా, విశిష్టాద్వైతము సగుణమును బోధించుచున్నది.

అంతతప్ప వేరు ఏమీలేదు. అయినా ముందునుండి బలముగా తయారయిన

అద్వైతులు తమ పెత్తనమే చెలామణి కావాలను ఉద్దేశ్యముతో, తమ ముందర

తమకు పోటీగా ఎవరూ రాకూడదని ఉండుట వలన రామానుజాచార్యుల

సిద్ధాంతమును ప్రచారము కాకుండా తమకు చేతనయినంత చేశారు.

శంకరాచార్యుల వారు ఎక్కువగా వేదములతో సంబంధపడియుంటూ,

వేదపఠనమును ప్రోత్సహించారు. అయితే రామానుజుల వారు ఎక్కువ

సగుణోపాసనమీద దృష్టిని సారించారు.


ప్రశ్న :- అద్వైతమును, విశిష్టాద్వైతమునకు తేడా ఏమి కలదు?

జవాబు :- రెండూ అద్వైతమునే తెలుపుచున్నా రామానుజుల వారి

సిద్ధాంతములో కొంత విశేషతయుండుట వలన విశిష్టాద్వైతము అని

చెప్పవచ్చును. ఒక సాకార, నిరాకారములయందు మాత్రమే తేడాయుండుట

వలన అద్వైతము తెలిసినవారు, అద్వైతమును అనుసరించువారు

సులభముగా విశిష్టాద్వైతమును అనుసరించారు. అందువలన తమకు

పోటీగా వచ్చి తమ ఉనికికే ప్రశ్నార్థకమైన విశిష్టాద్వైతులను లేకుండా

చేయాలని అద్వైతులు ప్రయత్నించారు. అద్వైతములో అంతా పరబ్రహ్మ

స్వరూపమే, అందరమూ పరబ్రహ్మ స్వరూపులమే అను విధానము కలదు.

అయితే విశిష్టాద్వైతములో ఒక్కడే అయిన దేవుడు సాకారముగా


విష్ణురూపములో ఉన్నాడనీ, అతనిని భక్తితో ఆరాధించవలెననునది ముఖ్య

ఉద్దేశ్యముగా ఉన్నది. అద్వైతులు దేవుడు కనిపించని పరబ్రహ్మముగా

అందరిలో యున్నాడు, అందరిగా ఉన్నాడు, అందరము పరబ్రహ్మ

స్వరూపులమే అని చెప్పుచుందురు. ఒక్క సాకార నిరాకారములయందు

మాత్రమే అద్వైతమునకు విశిష్టాద్వైతమునకు తేడా కలదు. దేవుడు నిర్గుణుడు

అని అద్వైతులు, కాదు సగుణుడు అని విశిష్టాద్వైతులు అంటున్నారు.


ప్రశ్న :- 1500 సంవత్సరముల ముందుపుట్టి బలమైన సింహముగా యున్న

అద్వైతము ముందర అప్పుడే పుట్టిన గొర్రెపిల్లలాంటి విశిష్టాద్వైతము

నిలబడకల్గినదా?


జవాబు :- ఆర్యులు అద్వైతమును శంకరాచార్యులు పోయిన తర్వాత కూడా

కొనసాగించారు. క్రొత్తగా వచ్చిన విశిష్టాద్వైత సిద్ధాంతకర్తను చాలా

ఇబ్బందులపాలు చేశారు. కొన్ని సందర్భములలో అద్వైతులకు రామానుజా

చార్యులవారు భయపడుచూ బ్రతుకవలసి వచ్చినది. కొన్ని సమయములలో

దాచిపెట్టుకొని బ్రతుకవలసివచ్చినది. సింహము ఒకటియుండి గొర్రెలను

తినినా వేయి గొర్రెలున్నప్పుడు సింహము ప్రతి దినము ఒక గొర్రెను

తినుచున్నా గొర్రెల గుంపు పెరుగుచుండుట వలన గొర్రెలు అన్నీ లేకుండా

పోవు. ఒకవైపు హరించిపోవుచున్నా మరొకవైపు పెరుగుచుండుట వలన

సింహము గొర్రెలను లేకుండా చేయలేదు. గొర్రెలు ఉంటాయి, సింహము

ఉంటుంది. శంకరాచార్యుల వారు స్థాపించినది నాల్గు వేదములకు గుర్తుగా

నాలుగు అద్వైత పీఠములను స్థాపించగా, రామానుజాచార్యుల వారు

అద్వైతముతో పోటీపడుటకు 74 పీఠములను స్థాపించాడు.

సంవత్సరములు బ్రతికిన రామానుజాచార్యుల వారు తన జీవితములో


అత్యంత ఎక్కువగా తన పీఠములను స్థాపించి అక్కడ విశిష్టాద్వైతమును

ప్రచారము చేయుటకు గురువులను నియమించుట వలన రామానుజుల

వారి విశిష్టాద్వైతము అద్వైతము ముందర కొంతవరకు నిలువగల్గినది.

అద్వైతులు విశిష్టాద్వైతులను అణచివేస్తూ వచ్చినా, తిరిగి వెంటనే

పుంజుకుంటూ వచ్చారు. రామానుజుల వారి కాలములో యున్న ప్రతి

వైష్ణవ గుడి ఒక విశిష్టాద్వైత పీఠముగా తయారైనది. ప్రతి శైవుల గుడి

అద్వైతపీఠముగా తయారు కాలేదు. శంకరుడు స్థాపించిన నాలుగు మరియు

ఒకటి మొత్తము ఐదు పీఠములే గలవు. అందువలన అద్వైతము ముందర

విశిష్టాద్వైతము నిలువగల్గినది.


ప్రశ్న :- రామానుజుల వారి విశిష్టాద్వైతమును అనుసరించిన వారందరూ

త్రినామమును ధరించారు. మూడు విభూతి రేఖలకు అర్థమున్నట్లు, త్రి

నామమునకు ఆధ్యాత్మిక అర్థము కలదా? ఉంటే చెప్పండి?


జవాబు :- మూడు నిలువు నామములు విశిష్టాద్వైత సిద్ధాంతము

వచ్చినప్పుడు రాలేదు. అంతకుముందే కృతయుగములోనే మూడు

నామములు తయారయినవి. కృతయుగములో దైవజ్ఞానమును అనుసరించి

శరీరములో ఆత్మల విశేషతను, నాడుల విశేషతను తెల్పునట్లు మూడు

నామములను తయారు చేయగా, త్రేతాయుగములో సూర్యవంశపు

గుర్తుయని, ద్వాపర యుగములో వైష్ణవుల గుర్తుగా చెప్పబడుచున్న మూడు

నామములు కలియుగములో విశిష్టాద్వైత గుర్తుగా మారిపోయినది.

కృతయుగములో ఎంతో గొప్ప దైవజ్ఞాన చిహ్నముగాయున్న మూడు

నామములకు జ్ఞాన భావములో అర్థము ఈ విధముగా కలదు. నామము

రెండు రకముల ఆధ్యాత్మిక భావమును తెల్పుచున్నది. ప్రతి మనిషి


శరీరములో మూడు ఆత్మలు నివశించుచున్నవి. అయినా నేటివరకు ఆ

విషయము ఎవరికీ తెలియదు. అందరి శరీరములో జీవాత్మ ఒకటియుండగా,

ఆత్మ రెండవది కలదు. జీవాత్మ శరీరములోని తలయందు గల

గుణచక్రములోయుండగా, ఆత్మ బ్రహ్మనాడిలోయుంటూ శరీరమంతా

తనశక్తిని వ్యాపింపజేసినది. శరీరమంతా వ్యాపించియున్న ఆత్మను గురించి

సృష్ట్యాదిలో దేవుడు తెలియజేసినా, తర్వాత ద్వాపర యుగములో భగవంతుడు

భగవద్గీత రూపములో చెప్పిన జ్ఞానముయందు ఆత్మను గురించి

తెలియజేసినా నేటివరకు రెండవ ఆత్మను గురించి ఎవరికీ తెలియకుండా

పోయినది. కొందరు రెండవ ఆత్మనే పరమాత్మయని అనుకోవడము

జరిగినది. జీవుడు, జీవునితోపాటు దేవుడు శరీరములో ఉన్నారని

ఆధ్యాత్మికములో యున్న వారందరూ అనుకోవడము జరిగినా, ఇద్దరికి

మధ్యలో ఆత్మనునది మరొకటున్నదను విషయము పూర్తిగా ఎవరికీ

తెలియదనియే చెప్పాలి? ఆ లెక్కప్రకారము శరీరములో మూడు

ఆత్మలున్నాయని సృష్ట్యాదిలో చెప్పబడిన జ్ఞానములో చెప్పారు. తర్వాత

రెండవ మారు భగవద్గీతగా చెప్పబడినప్పుడు కూడా ఆత్మను గురించి

చెప్పారు. అయినప్పటికీ ఆత్మ విషయము ఎవరి ఊహకు రాలేదు.


శరీరములో జీవాత్మ ఆత్మ రెండు జోడు ఆత్మలుగా యున్నవి.

మూడవదయిన పరమాత్మ శరీరమంతా అణువణువునా వ్యాపించి

యుండడమే కాక శరీరము బయట కూడా అంతటా వ్యాపించియున్నది.

శరీరములోనూ, వస్తువులలోనూ, పదార్థములలోనూ, శూన్యములోనూ అది

ఇది అనకుండా విశ్వమంతయూ వ్యాపించియున్నది. ప్రపంచములో

మూడు ఆత్మలు తప్ప ఇతరత్రా ఆత్మంటు ఇంకొకటి లేదు. దైవజ్ఞానము

మొదటిలోనికి పోతే విశ్వమునంతటికీ ఆధారము పరమాత్మ ఒక్కడే. ఆయన


పని చేయని వాడయినందున కార్యములు జరుగుటకు ప్రకృతిని తయారు

చేశాడు. ఇప్పుడు కార్యరూపమైన విశ్వమునకంతటికీ ప్రకృతి పరమాత్మలే

ఆధారమని చెప్పవచ్చును. పరమాత్మ కారణము ప్రకృతి కార్యముగా

యున్నది. ప్రకృతి అన్ని విధములా పని చేయుటకు ప్రకృతిని ఐదు

భాగములుగా దేవుడు విభజించాడు. తాను ఏమీ చేయనివాడుగా

యుండుటకు, ప్రకృతి చేత చేయించుటకు తనను తాను మూడు

భాగములుగా విభజించుకొన్నాడు. ఒకడు పరమాత్మగా అట్లేయుండగా,

తననుండి విభజింపబడిన కొంత శక్తిని ఆత్మనీ, మరికొంత శక్తిని (అంశను)

జీవాత్మగా చెప్పాడు. ఈ విధముగా దేవుని అంశ మూడు భాగములుగా

యుండి, ఒకటి పరమాత్మ రెండు ఆత్మ, మూడు జీవాత్మ అని

చెప్పబడుచున్నవి.


ఈ మూడు ఆత్మలు అనేక రూపముల జీవకోటిలో యుండగా,

మిగతా ప్రకృతిలోని ఐదు భాగములు స్థూల ప్రపంచముగాయున్నది. స్థూల

రూపమైన ప్రపంచములో మన శరీరములు కూడా కలవు. కనిపించు

శరీరములలో కనిపించని మూడు ఆత్మలు కలవు. ఈ మూడు ఆత్మలను

గురించి కృతయుగములోనే ఆత్మజ్ఞానులు ఆత్మల విషయము తెలియునట్లు

మూడు విభూతి రేఖలను, మూడు నామములను తయారు చేసి చూపించారు.

వాటి ఆత్మ భావములు నేడు తెలియకుండా పోయి ఆత్మల చిహ్నములయిన

విభూతిరేఖలు, మూడు నామములు అద్వైత, ద్వైత పార్టీల జెండా గుర్తులుగా

మారిపోయాయి. విభూతిరేఖలంటే అద్వైతము, నామము లంటే ద్వైతము

అను ఈ కాలములో దేవుడు పూర్వమున్న జ్ఞానమును ఇప్పుడు తిరిగి

మనకు తెలియజేయుచూ, తన దారిని మనకు చూపించుట వలన మనము


నేడు మిగతావారికంటే ధన్యులమే అనుకోవాలి. మూడు ఆత్మల విషయము

ద్వాపరయుగములో భగవద్గీతయందు తెలిపి, అదే జ్ఞానమునే మిగతా

దేశములలో మిగతా గ్రంథరూపములో తెలియజేయడమైనది. అయినా

మనుషులయిన వారు మతముల మత్తులో పడిపోయి తమ శరీరములోని

ఆత్మలను తెలియలేకున్నారు. మూడు ఆత్మల విషయము కృతయుగము

నుండి నేటివరకు మన మధ్యలోనే యున్నా మనము వాటిని గ్రహించ

లేకపోవడము దురదృష్టము. మిగతా మత గ్రంథములయిన బైబిలు,

ఖురాన్లలో మూడు ఆత్మల విషయము చెప్పియున్నా అవి గుర్తింపబడనట్లు

దాగియున్నవి. అక్కడ చెప్పినది మూడు ఆత్మల విషయమేనా అన్నట్లున్నది.


అయితే భగవద్గీతలో మిగతా గ్రంథములకంటే స్పష్టముగా

కనిపించునట్లు మూడు ఆత్మల విషయము కలదు. ద్వాపరయుగములో

చెప్పిన భగవద్గీతా జ్ఞానమే సృష్ట్యాదిలో ఆకాశవాణి ద్వారా సూర్యునికి

చెప్పబడినది. సూర్యుడు భూమిమీద మనుషులకు తెలియజేయగా అప్పుడు

వారికి అర్థమయిన విధానమునుబట్టి మూడు నామములు తయారు

చేయడము జరిగినది. మూడు నామములు క్రిందినుండి పైకి దిద్దబడి

యున్నవి. మూడు నామముల ఆకారమును తర్వాత చూడవచ్చును.


మూడు ఆత్మల గుర్తు మూడు నామములు. మధ్యలో నామము

ఎరుపు రంగు కల్గియుండగా, ప్రక్క రెండు నామములు తెలుపు రంగు

కల్గియున్నవి. ఒకటవ నంబరు జీవాత్మకు మూడవ నంబరు పరమాత్మకు

మధ్యలో ఆత్మయున్నది. జీవున్ని నడిపించునది, ఆలనా పాలనా చేయునది

రెండవ ఆత్మయే. జీవుడు తెలియవలసినది రెండవ ఆత్మనే. మూడవ

ఆత్మ పరమాత్మ అయినా ఆయన ఏమీ చేయువాడు కాదు. అందువలన

జీవుడు రెండవ ఆత్మనే మొదట తెలియవలసియుండును. దేవుడయిన


మూడవ ఆత్మవద్దకు పోవాలంటే రెండవ ఆత్మ ద్వారానే జీవుడు దేవున్ని

చేరవలసియుంటుంది. అందువలన ప్రతి మనిషి అనగా ప్రతి జీవి తన

శరీరములో యున్న రెండవ ఆత్మను తప్పక తెలియవలెను. అందువలన

మూడు నామముల మధ్యలోయున్న ఆత్మ గుర్తును ఎరుపు రంగుగా

చూపడము జరిగినది. ఇది ఒక భావముకాగా రెండవ భావము ప్రకారము

మధ్యలో గల ఎరుపు రంగు నామమును పరమాత్మగా కూడా వర్ణించి

చెప్పవచ్చును. ఏమీ తెలియకముందు రెండవ ఆత్మను మధ్యలోగల ఎరుపు

రంగు నామముగా చెప్పుకోవలసియుండును. కొంత ఆత్మ విషయము

అర్థమయిన తర్వాత అతను మూడవ ఆత్మయిన పరమాత్మను చేరవలసి

యుండును. కావున ఆత్మను గుర్తించగలిగిన వాడు మూడవ ఆత్మయిన

పరమాత్మ గుర్తుగా ఎరుపురంగు మధ్య నామమును గురించి తెలియవలసి

యుండునను భావము రావలెను.


ఈ విధముగా ఆత్మజ్ఞానము తెలియనప్పుడు ఒక విధముగా,

ఆత్మజ్ఞానము తెలిసిన తర్వాత మరొక విధముగా ఒకే నామమును గురించి

తెలియవలసియున్నది. ఇదంతయూ భగవద్గీతలో సూచన ప్రాయముగా

చెప్పబడినది. మూడు ఆత్మల విషయము భగవద్గీతలో ఎక్కడాలేదే,

నీకొక్కనికి మూడని ఎలా అర్థమయినదని కొందరు నన్ను ప్రశ్నించవచ్చును?

ప్రశ్నించితే ఫరవాలేదు. ఎలాగయినా దానికి వివరమును చెప్పవచ్చును.

అలా నన్ను ఇంతవరకు ప్రశ్నించిన వారు లేరుగానీ, దూషించినవారు

ఎక్కువగా యున్నారు. మూడు ఆత్మల విషయము భగవద్గీతలోనిదే అయినా

అదే భగవద్గీత జ్ఞానము మిగతా రెండు గ్రంథములుగా రూపుదిద్దుకున్న

విషయము ప్రపంచములో ఎవరూ నమ్మలేని విషయము. అయినా ఎవరు

నమ్మలేకపోయినా జరిగిన సత్యము అంతే! దేవుడు ఏమి చేయుచున్నది


ఎవరికీ అర్థము కాదు. ఆయన సంకల్పముతోనే మిగతా రెండు మతముల

గ్రంథములలో సృష్ట్యాదిలో దేవుడు చెప్పిన జ్ఞానము చేరిపోయినది. మూడు

మత గ్రంథములలోనూ మూడు ఆత్మల గురించి ఉందని నేను చెప్పినప్పుడు

కొందరు ఇతర మతస్థులు తెలియని జ్ఞానము తెలిసినదని చెప్పి

సంతోషపడినారు. అయితే హిందువులే అర్థము చేసుకోలేకపోయి ముందు

నుండి ఉన్న అజ్ఞానమును వదలక నన్ను దూషించడము జరిగినది.

ఇప్పటికీ జరుగుచున్నది. మూడు ఆత్మలనినా, లేక నేను ప్రతిపాదించిన

త్రైత సిద్ధాంతము పేరు వినినా ఇది ఇందువులలోని ఒక సిద్ధాంతమని

అనుకోకుండా ఏకంగా పరమత ప్రచారమని నన్ను పరమతస్థుడని

అంటున్నారు. ఎప్పుడో పోయిన ఆర్యులు ఇంకా ఇప్పుడు కూడా

ఉన్నారని గుర్తు చేయుచున్నారు.


భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తి యోగమున "క్షరుడు, అక్షరుడు,

పురుషోత్తముడు” అని మూడు ఆత్మలను గురించి చెప్పగా, బైబిలు

గ్రంథములో మత్తయి సువార్తయందు 28వ అధ్యాయమున 19వ

వచనములో "కుమారుడు, తండ్రి, పరిశుద్దాత్మ" యని చెప్పియున్నారు.

అదే విషయమునే ఇస్లామ్ గ్రంథమయిన ఖురాన్లో సురా 50, ఆయత్

21లో “త్రోలబడేవాడు, త్రోలేవాడు, చూచేవాడు” అని ముగ్గురిని చూపుచూ

మూడు ఆత్మల గురించి తెలియజేయడమైనది. మూడు గ్రంథములలో

ముగ్గురిని గురించి చెప్పినా ఏమాత్రము ఒకదానితో మరొకటి సంబంధము

లేనట్లు వేరువేరు విధముల వ్రాయడము వలన ఇది మూడు ఆత్మల

విషయమని ఎవరూ గుర్తించలేక పోయారు. ఇప్పుడు నేను చెప్పినా

కొంచెము అర్థమయి, కొంచెము అర్థము కాని స్థితిలో యున్నారు. అంటే

పూర్తి అర్థము కాలేదనియే తెలియుచున్నది. దీనినిబట్టి కొంచెము


అర్థమయినదని తెలియుచున్నది. ఎవరు ఏమనుకొనినా పూర్వము

కృతయుగములోనే మూడు ఆత్మల విషయమును గురించి తెలుపు నిమిత్తము

మూడు నామములను తయారు చేసి, మధ్య గీతను (మధ్య నామమును)

ఎరుపుగా తీర్చిదిద్దారు. నామము సాకారమునకు పెట్టినదికాగా, విభూతి

రేఖలు నిరాకారమునకు పెట్టినా మధ్య రేఖకు ఎర్రని సింధూరము గుర్తును

పెట్టడము జరిగినది. నిలువు నామములలోనూ, అడ్డనామములలోనూ

ఎర్రని గుర్తును అందరూ గ్రహించినా ఇదెందుకున్నదని ఎవరూ ఆలోచించ

లేదు. ఈనాడు తిరుపతి వెంకటేశ్వర ప్రతిమ మీద పెద్ద నామములు

పెట్టడము జరిగినది. ఇప్పుడు పెట్టినా అది పూర్వపు భావమునే

తెలియజేయుచున్నది.


విశిష్టాద్వైతము అద్వైతమునకు దరిదాపులలోనే ఉన్నదయినా,

అద్వైతము నిర్గుణమును తెలియజేయగా, విశిష్టాద్వైతము సగుణమును

తెలియజేయుచున్నది. సిద్ధాంతమంతయూ దాదాపు ఒకటిగానే యుంటూ

చివరిలో అద్వైతమను పేరుకల్గియున్నది. అద్వైతము ముందర 'విశిష్ట'

అను ప్రత్యేకత కలదు. విశిష్ట అనినా విశేషత అనినా ప్రత్యేకమని అర్థము.

అద్వైతములో సాకార పూజను, సాకారభక్తిని కాదని చెప్పుచుండగా, విశిష్టా

ద్వైతములో సాకార భక్తిని, సాకార పూజను ఎక్కువగా బోధించడము జరుగు

చున్నది. అద్వైత, విశిష్టాద్వైతములను రెండిటినీ తెలిసినవారు రెండిటిలో

పెద్ద తేడాలేదని తెలిసి ముందునుండి అద్వైతములో యున్నవారు విశిష్టా

ద్వైతములోనికి రావడము జరిగినది. రామానుజులవారి ఒక గ్రంథములో

వ్రాసిన దానినిబట్టి అద్వైతులు ఎందరో అద్వైతమును వీడి విశిష్టాద్వైతములో

ప్రవేశించడము జరిగినదని తెలియుచున్నది. అక్కడ వ్రాసినది ఇలా కలదు

చూడండి.


“యాదవ ప్రకాశుడు రామానుజుని చేరుట, తన సందేహములను

తీర్చుకొనుట, రామానుజునకు శరణాగతుడగుట మొదలగు విషయము

లన్నియూ దేశ నలుమూలలా వ్యాపించుట చేత రామానుజుని ప్రతిభ

అందరికీ తెలిసిపోయినది. అప్పటి పండితులకు, భక్తులకు ఈ వార్త

అనుదిన సంభాషణ విషయమాయెను. అద్వితీయ పండితుడు, సాటిలేని

అద్వైత సిద్ధాంత వేదాంతి, రామానుజులకే గురువైన యాదవ ప్రకాశుడు

రామాను జునకే ప్రపత్తుడగుట సామాన్య విషయము కాదుకదా! బ్రహ్మము

నిర్గుణము, సర్వము మిథ్యయని వెల్లడించు అద్వైత సిద్ధాంత మహావృక్షము

యొక్క క్రుంకుటేరు తెగిపోయినట్లయినది. అద్వైత సిద్ధాంత మాయా

భవనము కంపింపసాగినది. ప్రస్థానత్రయము ప్రమాణమైననూ

సక్రమముగా భావన చేయనందున నిర్గుణ సిద్ధాంతము లేవనెత్తబడెను.

ఇప్పుడది నిలువలేక యున్నది. అదియే రామానుజుని ప్రతిభ. ఈ

రామానుజుని ప్రతిభనే యాదవ ప్రకాశుడు ప్రారంభమున ఊహించి

యుండెను. రామానుజుడు అద్వైత సిద్ధాంత వృక్షమునకు గొడ్డలి పెట్టు

కాగలడను యాదవ ప్రకాశుని ఊహ ఇప్పుడు నిజమయినది. ఒకప్పటి

అతని ద్వేషపూరిత ఊహ సత్యముగా మారినది. ఆయన కూడా (యాదవ

ప్రకాశుడు కూడా) తన అద్వైత మాయా సిద్ధాంతమును వీడి రామానుజుని

సగుణ సిద్ధాంతమునకు అంకితుడాయెను. గురువు శిష్యుడాయె, శిష్యుడు

గురువాయెను. రామానుజుని ప్రతిభ అటువంటిది. విద్యాకోవిదుడు,

ఏక సంథాగ్రాహి, గురువర్యుడు అయిన యాదవప్రకాశితుడట్టివారు

రామానుజాచార్యులకు శరణాగతులయినారంటే ఇక వారి శిష్యగణము

ఎంత ఘనముగా అభివృద్ధి చెందెనో ఊహించవచ్చును.” ఈ విధముగా

“రామానుజ దివ్యవైభవము” అను గ్రంథములో ఒక పేజీయందు వ్రాసిన


సమాచారమును బట్టి ఆనాడు చాలామంది అద్వైతులు రామానుజాచార్యుల

వారి సగుణబోధలకు ఆకర్షితులయి నిర్గుణ అద్వైతమును వదలి

విశిష్టాద్వైతములో చేరిపోయారు. ఇదంతయూ ఒకవైపు గమణించుచున్న

అద్వైతులయిన ఆర్యులు రామానుజుల వారిమీద కక్షను పెంచుకొన్నారు.


ప్రశ్న :- యాదవ ప్రకాశుడు రామానుజుల గురువు అని మీరు

చెప్పుచున్నారు. అద్వైత గురువు రామానుజులవారికి గురువెట్లయ్యాడు?

యాదవ ప్రకాశుడు ద్వేషపూరితుడని అన్నారు. ఎందుకు ద్వేషము వచ్చినది.

అంతకూ యాదవ ప్రకాశుడు ఎవరు?


జవాబు :- శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతకర్త, ఆ తర్వాత 1500

సంవత్సరములకు రామానుజాచార్యులు వచ్చారు. రామానుజులే విశిష్టాద్వైత

సిద్ధాంతకర్త అయినాడు. పుట్టుకతో ఎవరూ సిద్ధాంతకర్తలు కారు. పెరిగి

పెద్దవాడైన తర్వాత వ్యక్తిత్వ వికాసము వచ్చిన తర్వాత తమ జీవితములో

క్రొత్త సిద్ధాంతమును కనుగొనవచ్చును. పుట్టిన మనుషులందరూ

సిద్ధాంతమును కనుగొనలేరు. కొన్ని వందల సంవత్సరములకో, కొన్ని

వేల సంవత్సరములకో ఎవరో ఒకరు అరుదుగా సిద్ధాంతములను

కనుగొనవచ్చును. అదే విధముగా కలియుగము వచ్చిన తర్వాత దాదాపు

2500 సంవత్సరములకు శంకరాచార్యుల వారు పుట్టి అద్వైత సిద్ధాంతమును

ప్రతిపాదించడము జరిగినది. శంకరాచార్యుల వారు చనిపోయిన తర్వాత

దాదాపు 1500 సంవత్సరముల తర్వాత రామానుజాచార్యుల వారు పుట్టి

తన జీవితములో విశిష్టాద్వైత సిద్ధాంతమును కనుగొనడమైనది. రామానుజా

చార్యుల వారు 120 సంవత్సరములు విశిష్టాద్వైతమును ప్రచారము

చేయుచూ బ్రతికి చనిపోవడము జరిగినది. రామానుజుల తర్వాత


మధ్వాచార్యుల వారు దాదాపు 100 సంవత్సరములకు వచ్చి ఆయన ద్వైత

సిద్ధాంతమును కనుగొని ప్రతిపాదించడము జరిగినది. మధ్వాచార్యుల

ద్వైత సిద్ధాంతము తర్వాత దాదాపు 630 సంవత్సరముల తర్వాత త్రైత

సిద్ధాంతము వచ్చినది. అద్వైత సిద్ధాంతకర్త కేరళలో పుట్టగా, విశిష్టాద్వైత

సిద్ధాంతకర్త తమిళనాడులో పుట్టగా, ద్వైత సిద్ధాంతకర్తయిన మధ్వాచార్యుల

వారు కర్నాటక రాష్ట్రములో పుట్టడము జరిగినది. తర్వాత వచ్చిన ప్రస్తుతము

జీవించియున్న త్రైత సిద్ధాంతకర్త ఆంధ్రరాష్ట్రములో పుట్టడమైనది.


హిందూ (ఇందూ) మతములోని నలుగురు సిద్ధాంతకర్తలు దక్షిణ

భారతదేశములో పుట్టడము విశేషము. అంతేకాక క్రింది కేరళ నుండి

పుట్టుతూ రావడము మరీ విశేషము. మొదట మూడు సిద్ధాంతములు

ఒకదానితో మరొకటి కొంత సంబంధము కల్గియున్నవి. అయితే నాల్గవ

దయిన త్రైత సిద్ధాంతము ఏ దానితోను సంబంధపడక, ప్రత్యేకముగా

యున్నది. విశిష్టాద్వైత సిద్ధాంతము మంత్రములోనూ, ముఖముమీద

నామములోనూ అద్వైతమునకంటే ప్రత్యేకముగాయుండినా, అసలయిన

సిద్ధాంతము దగ్గర కొంత సంబంధపడియుండడము గమనించవచ్చును.

అద్వైత సిద్ధాంతములో నిర్గుణ, నిరాకారమును బోధించగా, విశిష్టాద్వైతములో

సగుణ, సాకారములను గురించి చెప్పడమైనది. ఒకే దేవున్నే అద్వైతములో

నిరాకారముగా చెప్పగా, విశిష్టాద్వైతములో సాకారముగా చెప్పుచున్నారు.

అందువలన అద్వైతము, విశిష్టాద్వైతము కొంత తేడాతో ఒకదానితో మరొకటి

కలిసియున్నవని చెప్పవచ్చును. నుదుటి మీద ధరించు నామముయందును,

నోటితో జపించు మంత్రముయందును ఏమాత్రము సంబంధము లేకుండా

యున్నవనియే చెప్పవచ్చును.


రామానుజుడు చిన్నవయస్సులో అద్వైత గురువును ఆశ్రయించి

ఆయన చెప్పు అద్వైత బోధలను ఇష్టపడక అప్పుడప్పుడు గురువునే

విమర్శించుచుండెను. అద్వైతమును విమర్శించుట వలన తాను ఆశ్రయించిన

గురువునే ఎదురించవలసి వచ్చెను. అలా ఎదురించి మాట్లాడుట వలన

రామానుజుల గురువుగారయిన యాదవ ప్రకాశుడు రామానుజున్ని హత్య

చేయాలని నిర్ణయించుకొన్నాడు. దానికి తోడుగా అద్వైతులయిన యాదవ

ప్రకాశుని అనుచరులు కూడా తయారగుట వలన రామానుజుడు

ప్రాణాపాయస్థితిలో చిక్కుకున్నాడు. ఈ విషయమంతా క్షుణ్ణముగా

అర్థమగుటకు రామానుజుల చరిత్రగల "రామానుజ దివ్య వైభవము” అను

గ్రంథములో ఏమున్నదో ఇప్పుడు చూస్తాము.


“రామానుజునకు పదహారవ ఏటనే వివాహము జరిగినది.

రామానుజునకు వివాహమయిన మరు మాసముననే తండ్రి కేశవాచార్యుడు

చనిపోయాడు. రామానుజుని తల్లి కాంతిమతి వైధవ్యమున స్వగ్రామములో

ఉండుటకు ఇష్టపడలేదు. కుమారుని విద్యాభ్యాసమునకు సంసారమును

కాంచీపురికి తరలించుట మంచిదని కాంతిమతి తలచెను. రామానుజుడు

ఆలోచించి తల్లి నిర్ణయము మంచిదని తలచి సంసారమును కంచికి

తరలించెను. కాంచీపురమందు దేశప్రఖ్యాతుడగు ఆధ్యాత్మికాచార్యుడు

యాదవప్రకాశుడు శిష్యులకు ఆధ్యాత్మిక విద్యను నేర్పుచుండెను.

రామానుజుడు యాదవప్రకాశునికి శిష్యుడాయెను. యాదవ ప్రకాశుడు

ఆధ్యాత్మిక వేదాంత నిధియేగాక, గొప్ప పండితుడు, తత్త్వవేత్తయు కూడా

అయివుండెను. రామానుజుని పినతల్లి కుమారుడు గోవిందాచార్యుడు

కూడా విద్యాభ్యాసమునకై కాంచీపురమునకు వచ్చి రామానుజునితో సహా

యాదవ ప్రకాశునివద్ద శిష్యులుగా చేరిరి. ప్రథమమున రామానుజుని


భక్తి ప్రపత్తులకు, తెలివి తేటలకు యాదవప్రకాశుడు సంతృప్తి చెంది

రామానుజున్ని ప్రేమతో చూచెడివాడు. రామానుజ సోదరుడు గోవిందుడు

రామానుజునకు నీడవలె వ్యవహరించెడివాడు.


శంకరాచార్యుల వారు ప్రతిపాదించిన అద్వైతమును యాదవ

ప్రకాశుడు సంపూర్ణముగా విశ్వసించినవాడై యుండెను. అద్వైతము “బ్రహ్మ

సత్యమ్ జగన్మిథ్యా-జీవో బ్రహ్మైవనాపరం:" అని తెల్పుచున్న “తత్త్వమసి”

అను బ్రహ్మ సూత్రము నాధారముగా చేసుకొనియున్నది. “అహం బ్రహ్మాస్మి”

(నేను బ్రహ్మను) అని బోధించుచున్నది. ఈ సూత్రము అప్పట్లో పండిత

జనులలో ఎక్కువ ప్రచారములో యుండెడిది. రామానుజునకు ఈ అద్వైత

సిద్ధాంతములు పరిచయములేగానీ, అతడు అద్వైతమును పూర్తి విశ్వసించు

వాడు కాదు. అయినను తన భావమును గుప్తముగా ఉంచుకొని, మొదట

సర్వ శాస్త్రజ్ఞానము అవసరము, తర్వాతనే వ్యక్తిగత పరిశీలన, పరిశోధనయని

తలచెడివాడు. ఇట్లు రామానుజుని విద్యాభ్యాసము పరిశోధన సహితమయి

నది. అతడు దేనినయినా మూఢముగా విశ్వసించేవాడు కాదు.


ఒక దినము యాదవ ప్రకాశుడు శిష్యులకు ఆధ్యాత్మిక బోధను

తెలియజేయు సందర్భములో తైత్తిరీయోపనిషత్తునందు గల ఒక విషయమగు

సత్యము, జ్ఞానము, అనంతము, బ్రహ్మ అను దానికి వివరమును చెప్పుచూ

"ఇవన్నియూ ఒక్కటే, సత్యమే బ్రహ్మ, జ్ఞానమే బ్రహ్మ, బ్రహ్మ అనంతము.

ఇవన్ని పదములకు బ్రహ్మ అను అర్థమే వచ్చును” అని అన్నాడు. అప్పుడు

నిశిత విమర్శనా జ్ఞానయుతుడు అయిన రామానుజుడు “ఇవన్నియూ ఒకటి

కాదు. సత్యము, జ్ఞానము, అనంతము అనునవి బ్రహ్మ యొక్క లక్షణములు.

పుష్పములలో వివిధ రంగులు, వివిధ సువాసనలు ఉన్నట్లు, అనంత కళ్యాణ


గుణములలో పరబ్రహ్మ కలడు." అని రామానుజుడు వివరించెను. ఈ

మాటలు విన్న యాదవ ప్రకాశుడు ఉగ్రుడాయెను. తాను చెప్పినది కాదనగల

పండితుడు అప్పటికీ లేడు. అట్టి పరిస్థితిలో శిష్యునిగా యున్న రామానుజుడు

తాను చెప్పిన వివరణను కాదని, అతడు వేరొక వ్యాఖ్యను తెలుపుటను

యాదవ ప్రకాశుడు ఓర్చుకోలేక పోయాడు. తనమాటను శిరసావహించి

ప్రవర్తించనిచో తన శిష్యవర్గమును వదలిపోవలెనని యాదవ ప్రకాశుడు

రామానుజుని హెచ్చరించెను. గురువుగారి కోపమును చూచిన

రామానుజుడు ఊరక మౌనమును వహించియుండెను. "శాంతే కలహో

నాస్తి” అన్నట్లు ఆ సమస్య అంతటితో అణిగిపోయెను. విద్యాభ్యాసమే

తన ధ్యేయమని రామానుజుడు మిన్నకుండెను.


ఒకనాడు ఛాందోగ్యోపనిషత్తులో కొన్ని విషయములను శిష్యులకు

బోధించుచుండెను. “తస్యయథాకప్యాసం పుండరీకమేవ రుక్షణి" అను

విషయము “కపి” అనగా కోతి, “కప్యాసం” అనగా కోతిపిర్ర, పురుషోత్తముని

నయనములు కోతి పిర్రవలె, ఎఱ్ఱగానున్న తామరరేకులవలెనున్నవి” అని

యాదవ ప్రకాశుడు వివరించెను. గురువుగారిచ్చిన వ్యాఖ్యను విని

రామానుజుడు దిగ్రమజెందెను. తన మనస్సుకు ముల్లు గ్రుచ్చు కొనినట్లయి

నది. మనఃక్లేశము భరింపరానిదయ్యెను. కన్నీరు ధారగా పడుచుండెను.

యాదవ ప్రకాశుడు ఇదిగని "రామానుజా! ఏలకంటి నీరు పెట్టుచున్నావు”

అని విచారించెను.


"స్వామీ క్షమింపుడు. మహా! పండితులరగు తమ నోటినుండియా,

ఇట్టి విపరీతపు మాటలు వెడలుట? భగవంతుని నయనారవిందముల

సౌందర్యమును వర్ణించుటకు ఇట్టి నీచపు ఉపమానమా? మీరిచ్చిన వివరము


సత్యదూరమేగాక, విపరీతముగాను, నీచముగాను, హీనముగాను ఉన్నది.”

అని రామానుజుడు కంటితడితో బల్కెను.


రామానుజుని వచనముల కాశ్చర్య ఆగ్రహములు బొందిన యాదవ

ప్రకాశుడు, "దీనికా, యేదో పోగొట్టుకొన్నవానివలె యేడ్చుచున్నావు.

వెర్రివాడవు! నీ వెర్రిభక్తినట్లుంచుము! విను అసలు పరబ్రహ్మ నిరాకారుడు

గాన బ్రహ్మమునకు కన్నులెక్కడివి? లేనట్టి కన్నులను వర్ణించుటకు ఏ

ఉపమానమైతేనేమి? అని హేళనగా, తర్కశాస్త్ర కౌశలమున చమత్కరించెను.


రామానుజుడు ఊరటజెందలేకపోయెను. కంపిత హృదయమున

కన్నీరురాల్చుచునే యుండెను. "ఆర్యా! కప్యాసం అను పదమునకు వేరొక

అర్థముండి తీరవలయును, ఆలోచింపుడు!" అనెను. యాదవ ప్రకాశుడు

కోపోద్రేకమున ఇట్లు గర్జించెను. "అట్లగునేని నాకు తెలియని యా

అర్థమేమిటో నీవు తెల్పుము. ఆలోచించుమని నన్ను హెచ్చరించు

వాడవయితివా? చాలా దూరము వచ్చినదే నీ నడవడి!


తదుపరి రామానుజుడు “కప్యాసం అనగా కం=జలమును,

పీబతీతి= త్రాగువాడు, కపి= సూర్యుడు. కప్యాసం = సూర్యకిరణ తాకిడిచే

వికసించిన అని భావము. కావున పురుషోత్తముని నయనములు సూర్య

కిరణ స్పర్శచే వికసించిన తామరవలె మనోహరముగానున్నవి అని భావము”

అని పలికెను. రామానుజుని ప్రతిభా విశేషములను శిష్యులెల్లరు

ప్రశంసించిరి. లోన అసూయాగ్నిచే దహింపబడుచున్న యాదవ ప్రకాశు

డు బాహ్యముగా రామానుజుని వివరణమును అంగీకరించినట్లు నటించెను.

“అద్వైత సిద్ధాంతము ప్రకారము నిరాకారుడైన పరబ్రహ్మను, సాకారునిగా

చెప్పుచూ, అట్టి భావమును కనుకూలమైన వ్యాఖ్యానము జేయు


రామానుజుడు భక్తియోగ విశిష్టతను పైకి దెచ్చి, అద్వైత సిద్ధాంతమును

వ్యతిరేఖించుచున్నాడు” అని యాదవ ప్రకాశుడు కినుక బూనెను.


"నేను బోధించునది నీకు సరిపోని పరిస్థితిలో నీ శిష్యత్వమున

కిచట తావులేదు, నీవే ఆచార్యుడవని భావించు లాగుననున్నావు! నీవు

ఇటునుండి వెడలి, మరియొక విద్యాపీఠమును స్థాపించి, నీ యిష్టము

వచ్చినరీతుల వక్రమార్గములను, వక్రభాష్యములను సూచింపుము" అని

ఆగ్రహావేశమున యాదవప్రకాశుడు రామానుజుని హెచ్చరించెను. పెద్దలను

నిరసించుట యెరుగని రామానుజుడు సానుభూతినెరుగని గురువుపై ఎట్టి

అసూయ బూనలేదు. మౌనముగా నుండి, వినయ విధేయలతో సాష్టాంగపడి

“క్షమింపుడని” ప్రార్థించెను. అసూయాపూరితుడగు, అహంభావయుతుడును

అయిన యాదవ ప్రకాశుడు చేయునదిలేక, అప్పటికి మిన్నకుండెను.


యాదవప్రకాశునకు రామానుజునిపై లోలోన అసూయ

ప్రజ్వరిల్లుచుండెను. రామానుజుని తన శిష్యునిగా భావింపలేకయున్నాడు.

ఆధ్యాత్మిక తత్త్వవాదమున రామానుజుడు తనకు ప్రత్యర్థియయిన

తార్కికుడుగా తయారగునని యాదవప్రకాశుడు భావించెను. “అద్వైత

సిద్ధాంతమును అనుసరించి, శంకర భగవత్పాదులు బోధనామృతము

ననుసరించి, సర్వులు విశ్వసించి, ఆమోదించిన రీతి, నేను పరబ్రహ్మను

నిరాకారుడుగను, నిర్గుణుడుగను భావించుచుండ, ఇతడు పరబ్రహ్మను

సాకారుడుగాను సగుణునిగాను భావించి, నూతన సిద్ధాంతమును లేవనెత్తు

వానివలె కన్పట్టుచున్నాడు. నేనిక మిన్నకున్న, వీనివలన అద్వైత

సిద్ధాంతమునకే ముప్పు గలుగును. ఆదిశంకరులకు, అద్వైత సిద్ధాంతమునకు

అపచారము జరుగనీయను” అని తనలోతాను కుములుచుండెను యాదవ

ప్రకాశుడు.


ఈ యసూయా భావముతో యాదవప్రకాశునకు మనశ్శాంతి లేదు

అరిషడ్వర్గములో మాత్సర్యము మిక్కిలి చెడ్డది. ప్రపంచమున అశాంతికి

అనైక్యమునకు, దుఃఖమునకు, విరోధములకు ఈ మాత్సర్యము మూల

కారణము. మాత్సర్యమునకు స్వార్థముతో గూడిన అహంభావము

మూలకారణము. “స్వార్థ భావము” సర్వదుర్గుణములకు మూలమైనట్లు

“నిస్స్వార్థము” సకల క్షేమకర స్థితికి కారణభూతము.


యాదవప్రకాశుని మనస్సు ఒక అగ్నిగుండముగా మారినది.

రామానుజుని తుదముట్టించుటెట్లు అనునది అతని తక్షణ సమస్య అయినది!

రామానుజుని మరణమను వర్షము వలననే తన అసూయాగ్ని చల్లారగలదు!

వేరుమార్గమికలేదు! అసూయ దినదిన ప్రవర్ధమానము. వేగము అగణితము!

అది నశించదు. అది గలవాడు నశించిన దనుక వైర విస్తరణకంటే

మిక్కిలి వేగము గలదికదా! అసూయారోగ బీజము.


యాదవప్రకాశుడు తన శిష్యులు కొందరిని రహస్యముగా పిలిచి

"శిష్యులారా! ఒకమాట, కడపటి మాట, తిరుగులేనిమాట మీరు వినడము,

తదనుగుణముగా కర్తవ్య నిర్వహణమునకు సంసిద్ధులు కావడం అంతే.

వినుడు రామానుజుడు మన శిష్యకూటమిలో నుండుట కనర్హుడు. ఈ

ప్రపంచము నతడుండుట ఆధ్యాత్మిక విద్యకు అపచారము జరుగుటకే.

అతనిని తుదముట్టింపవలసియున్నది.

మనము మన మతభక్తిని

నిరూపించుటకు ఇది అవశ్యము జరుగవలసినదే. కానీ ఒరులెరుంగరాదు

గదా! జాగరూకతను వహింపుడు. వాడు తెలివిగలవాడని పలుమారు

నేను వచించుచు, అతనిని బిడ్డగా ఆదరించుచు వచ్చుటవలన, అతనికి

అహంకార భావము బలసినది. నేను ఏ వ్యాఖ్యను వెల్లడించినను, అతడు

ప్రతి పర్యాయము ప్రతివ్యాఖ్య చేయుటకు ప్రయత్నము చేయుచున్నాడు.


మీరును వినుచునే యున్నారు గదా! వీనినిట్లు వదలిన ఆదిశంకరుని అద్వైత

సిద్ధాంతమునే తుడిచివేయుటకు ప్రయత్నింపగలడు. అట్టి యపచారము

జరుగకుండా చూడవలసిన బాధ్యత నాపైనున్నది. సరికదా! వీనిని

తుదముట్టించు మార్గమునన్వేషింపుడు, ఆలోచింపుడు” అని యాదవ

ప్రకాశుడు తన మనస్సులోని మర్మమును గ్రక్కెను.


మూర్ఖులయినట్టియు, మూఢవిశ్వాసముగలట్టియు, శిష్యులెల్లరు

గురువుగారి నిర్ణయమును బలపరచిరి. రామానుజుని అంతమొందించు

టకు ఒక్కొక్క శిష్యుడు మార్గమును సూచించినాడు. కడపట ఈ పద్ధతి

యేకగ్రీవముగా నామోదింపబడినది.


“ఉత్తరదేశమున వారణాసి, ప్రయాగ మొదలగు పుణ్యక్షేత్రముల

దర్శించుటకు యాత్ర సాగింపవలయును. మార్గమధ్యమున అటవీ

మధ్యమున విశ్రమించు రాత్రివేళ రహస్యముగా రామానుజుని, తుద

ముట్టించి, వాని కళేబరమును అదృశ్యము గావింపవలయును” ఇది వారి

పన్నాగము, పన్నాగము అతిగుప్తముగా నుంచబడినది.


యాదవప్రకాశుడు శిష్యవర్గముతో ఉత్తరదేశయాత్రకు బోవ

నిశ్చయింపబడినట్లు ప్రకటింపబడెను. సుముహూర్తము నిర్ణయింప

బడెను. శిష్యులెల్లరు పరమోత్సాహమున ప్రయాణ సన్నద్ధులగుచుండిరి.

మూటముల్లె సరిచేసికొనుచుండిరి. వారి దురుద్దేశము నెరుగని

అమాయకులు, నిరపరాధులు అయిన రామానుజుడు, వాని సోదరుడు

గోవిందుడును (పిన్నమ్మ కుమారుడు) పుణ్యక్షేత్రముల దర్శించి, పుణ్య

తీర్థముల స్నానములు జేసి పవిత్రులు గావలయుననెడి యుత్సాహముతో

పయనమయిరి. గురువుల వారి ఘాతుకాలోచన వీరిరువురికి తెలియదు.

తక్కిన వారందరు ఆ కూటమి సభ్యులే.


గురుశిష్యుల యాత్రామండలి క్రమముగా నడుచుచూ, ఒకనాటి

సాయంసమయమునకు పర్వత ప్రాంతములోని యొకదట్టమైన అరణ్యమును

జేరిరి. సమీపముననొక చెరువు ఉండుట వలన, ఆ రాత్రికచట విశ్రమింప

వలయునని నిర్ణయించుకొనిరి. కాసారమున నెల్లరు స్నానములాచరించి,

కొంతతడవు విశ్రమించిరి. యిక వంటలు జేయ నారంభించిరి. చీకటి

పడినది. శుక్లపక్షమగుటం జేసి సందవెన్నెలలో ప్రకృతి తన సౌందర్యమును

ప్రదర్శించుచుండినది. రామానుజుడును గోవిందుడును చేత బిందెల

బట్టుకొని, త్రాగెడు నీటికై కాసారమునకు పోయిరి. అచ్చట గోవిందుడు

రామానుజునితో, “అన్నా! ఒక ఘాతుక కార్యమును మన గురువుగారే

పన్నుచుండుట గ్రహించితిని. నిన్ను తుదముట్టింప వలయునని వారెల్లరు

నిర్ణయించుకొనియున్నారు. అది నేను గ్రహించితిని. దారిలో పలుమార్లు

గుసగుసలు విన్నాను. కాని ధృఢముగా విషయమును తెలియకనే చెప్పిన

అసత్యనేరారోపణ పాపమునబడుదునని తలచి, నీతో ఏమియుననక,

యింతవరకూ ఊరకుంటిని. కానీ నేను రహస్య వేదినిగానే ప్రవర్తించితిని.

ఈనాటి రాత్రి నిదురించు సమయమున నిన్ను మృత్యుపాలు జేయవలయు

నని వారు నిర్ణయించుకొని యున్నారు. నీవెటులనేని ఈ రాత్రికే అనగా

అర్థరాత్రికి పూర్వమే యిచట నుండి రహస్యముగా పారిపోవలయును”

అని గోవిందుడు రహస్యముగా జెప్పెను.



రామానుజుని మనస్సు పరిపరి విధముల పోయినది. తాను

చేసిన యపచారమేమో తనకు దోచలేదు. చిత్తశుద్ధితో వినయ విధేయతలతో

మెలగుచున్న తన్ను గురూత్తముడేల తుదముట్టింప దలచెనో వానికి తెలియుట

లేదు. గురువుగారి ఆగ్రహమునకు తానెట్టి నెపమును కలుగజేయలేదని

తన మనస్సున తలంచి, కడకు తేల్చుకొనలేక పోవుచున్నాడు. సరియే,


దీర్ఘాలోచనమునకు తడవుకాదది. ఇతరులతో చర్చించుటకు తనకు ఆప్తుడు

గోవిందుడొక్కడే. ఆ రాత్రి భోజనానంతరము ఎల్లరు నిద్రించువేళ

రహస్యముగా పారిపోదునని గోవిందునితో రామానుజుడనెను. "సోదరా!

భగవత్కటాక్షమున నీవు సురక్షితముగా స్వగృహము జేరగలందులకు

నేనెంతయో దైవమును ప్రార్థించుచున్నాడు. నన్ననుమానింపకుండుటకు

నేను మెల్లగా యేమియు నెరుగని వానివలె నటింతును. ఉత్తరదేశ యాత్ర

నుండి తిరిగి కాంచీపురి జేరినపుడు మనము మన స్వగృహమున

కలుసుకొందము గాక!" అని గోవిందుడు వాపోయెను. రామానుజుని

యాలింగనము గావించుకొని, కంటనీరు పెట్టెను. గోవిందునకు ధైర్యము

జెప్పి రామానుజుడు అంతటితో గుప్తముగా మెలగుమని గోవిందుని కోరెను.


అప్పటికి రాత్రియేడుగంటలయినది, రామానుజుడు గోవిందుడు

బిందెలతో త్రాగుటకు నీరుదీసికొనిపోయిరి. ప్రయాణ బడలికవలన త్వరగా

విశ్రమింపవలయునను తలంపుతో అందరును భోజనములు జేసి, రాత్రి

తొమ్మిది ఘంటల లోపలనే నిద్రించిరి. అది శుక్లపక్ష సప్తమి దినమగుటచే

రాత్రి పండ్రెండు ఘంట తరువాత వెన్నెలబోయి చీకటివచ్చును. గాఢనిద్ర

యందుండునపుడు అర్థరాత్రివేళ రామానుజుని తుదముట్టింప సమకట్టిన

దుష్టశిష్యచతుష్టయము లేచి సంసిద్దులగుచుండిరి. చంద్రుడు మరుగున

పడెను. పెను చీకటి నలుదిశల నలముకొన్నది. ఆకాశము మేఘావృతమై

యున్నందున కటిక చీకటిగానుండెను. రామానుజుడు మెల్లగా నిద్రలేచి,

ప్రక్కన పరుండియుండిన గోవిందుని గీరి సన్నజేసి, చీకటిలోబడి దక్షిణ

దిక్కుగా వెడలిపోయెను. అంధకార సముద్రమున దరిగానక ఈదుతూ

పోవుచున్నాడు.


కొలది నిముసములు గడచిన తరువాత దుష్టశిష్యచతుష్టయము

మెల్లగా రామానుజుడు గోవిందుడు పరుండిన స్థలమునకు వచ్చిరి.

రామానుజుడట లేడు. చీకటిలో మరొకతావున పరుండియున్నాడేమోనని

వెదకసాగిరి. తరువాత నిద్రించుచున్న అందరిని లెక్కించిరి. ఒక వ్యక్తి

తక్కువ, ఒక ఘంటకాలము వెదకిరి. రామానుజుడు లేడని నిర్ణయింప

బడినది. గోవిందుని లేవగొట్టి “రామానుజుడెక్కడ” అని ప్రశ్నించిరి.

తూగుననున్నట్లు నటించిన గోవిందుడు “అర్ధఘంటకు పూర్వము

అల్పాచమనమునకు రామానుజుడు లేచి అటు పదియడుగులు పోయినట్లు

జూచితిని. మరలా మరుక్షణమున నేను కన్నుమూసితిని. అయ్యో!

రామానుజునకేమైనదో! అని కేకలు వేయుచూ, గోవిందుడు తత్తరపాటు

నభినయించుచూ, తిరుగుచుండెను. అందరును నిద్రలేచిరి, యాదవ

ప్రకాశుడు కూడా. అందరును కలిసి సమీపమున నలుదిక్కుల కొంత

దూరము వెదికిరి. గాఢాంధకారము కావున ఎక్కువ దూరము చూడలేక

పోయిరి. ఈ లోపల తలవని తలంపుగా వర్షము పడెను. అందరు

గుమిగూడి, వారు విశ్రమించిన స్థలమును జేరి, మహావృక్షచ్ఛాయలో జేరిరి.

నాల్గవఝాము సమీపించుచున్నది. కోయిల, భరద్వాజ, శుకపిక పక్ష్యాదులు

మేల్కొలుపులు పాడుచున్నవి. వర్షము నిలిచినది. “రామానుజుడు

అల్పాచమనమునకు అటుపోయియుండవచ్చును. ఏదో క్రూరమృగము

వాతబడియుండును! పాపము! మనమింకేమి చేయగలము! విధివ్రాత

అట్లున్నది! గోవిందా! ఊరడింపుము! చెట్టునగాచిన కాయలన్నియు ఒకే

సమయమున పండిరాలవు కదా! ఏదిముందో, యేదివెనుకో, ఎవరికెరుక?

పాపము! మనము తిరిగి కాంచీపురము చేరినపుడు యేకైకపుత్రుని

వియోగమునకు రామానుజుని తల్లి యెట్లు చింతించునోకదా! కాని ఇట్టి


అకాల మరణమునకు అద్వైతులమగు మనము చింతింపరాదు. జగము

మిథ్య! మనము నిరుత్సాహపడి తిరోగమింపరాదు. మన యాత్ర

సాగించెదము”. అని యేమియు నెరుగనివానివలె యాదవప్రకాశుడు

శిష్యులకు తత్త్వబోధ గావించి, రామానుజుడు పంచత్వము నందెనని లోలోన

ఆనందించుచూ, ఆత్మకు ఊరటను దెచ్చుకొనెను. తరువాత, తెల్లవారి

అందరును యాత్రకై ఉత్తరాభిముఖులై పయనించిరి. అందరును

ఆనందముగా పయనించుచుండిరి, గోవిందుడొక్కడే యెల్లపుడు అవనత

వదనుడై ఆలోచించుచూ మౌనముగా నడుచువాడు. “రామానుజునకేమి

యిక్కట్లు సంభవించునో మార్గమధ్యమున", అని గోవిందుని భయము.

“దగ్గర బంధువును పోగొట్టుకున్న గోవిందుడు కొన్ని దినములు దిగులుగా

నుండుట సహజమే కదా!", అని యెల్లరు భావించిరి.


మరునాడుదయమున గురుశిష్యులు దారిన నడుచుచుండగా,

“మనలో నెవరు మరణించినను తక్కినవారు జీవయాత్ర చాలించేది లేదు

కదా! పుట్టకయెట్లు సహజమో గిట్టుటయునట్లే. ఎవరి కర్తవ్యము వారు

జీవమున్నంత వరకు నెరవేర్చుచుండవలసినదే. మనము కాశీయాత్ర

కర్తవ్యముననున్నారము, నడువుడు”, అని కుటిల మనస్కుడైన యాదవ

ప్రకాశుడు శిష్యుల నుత్సాహపరచుచూ పయనింపసాగెను. లోలోన పీడ

వదలినదని సంతసించువాడు. ఎంత చదువు చదివినను అవివేకి

తెరగిట్లుండును. స్వార్థరాహిత్య భావములేని చదువు మాత్సర్యమును

గర్వమును పెంపొందించును.


ఇక రామానుజుని పరిస్థితులు గమనింతుము. ప్రాణముల

గుప్పెటలో పెట్టుకొని పరుగెత్తిన రామానుజుడు అర్ధరాత్రి చీకటిలో

దారితెన్నులెరుగక, అడవియందు పరుగెత్తుచుండెను. భీతిల్లిన వారికి


ఇతరములు దోచునా? పరువిడి, పరువిడి ఆయాసము నొందెను. కాళ్ళు

గుంజుచుండెను. శరీరము చెమటచే తడిసెను. ఇక ఒక్క అడుగు

పెట్టుటకును శక్తిలేదు. నేలపై కూలబడెను. మరుక్షణము నేలపైవాలెను.

గాఢనిద్రనందెను. అది సుదీర్ఘనిద్ర. మరునాడు మిట్టమధ్నాహ్నమప్పటికి

నిద్రనుండి లేచెను. ఎండ తీవ్రముగా కాయుచున్నది. భయభ్రాంతుడయిన

రామానుజుడు కొంత ఆశ్చర్యమును పొందెను. తనయేకాకిత్వమునకు,

తనకష్టములకు అతడు చింతించలేదు. నిరపరాధియయిన తన్ను

గురువర్యుడేల ద్వేషించెనో గదా అని వాపోవుచుండెను. విషయ పరిశీలన

మునకు శాంతియుత ఆలోచనమునకు తరుణము కాదది. రామానుజుడు

లేచి, అచటి సెలయేటిలో స్నానమాచరించి కొంత స్వస్థత నందెను.

రామానుజుడు సహజముగా ఆరోగ్యవంతుడు, బలశాలి, సుందర విగ్రహుడు.

ఆజానుబాహుడు, తేజోరాశి. ఒక వృక్షమూలమున కొంతపేపు కూర్చొని,

తరువాత పయనింపనెంచెను. క్షుద్బాధ కలిగెను. కానీ, అచ్చట ఆహార

మెక్కడిది? ఫలవృక్షములున్నవేమో నిదానముగా చూచెదగాక -అని

ఆలోచించుచు వృక్షమూలమున నాసీనుడై శ్రీమన్నారాయణుని అనంతశక్తిని

తలంచుకొనుచుండెను. ఈ లోపల దంపతులైన భిల్లులు ఇరువురు ప్రక్కన

నడచుచూ, రామానుజుని నవలోకించి, సమీపించి, “నాయనా! నీవేల

ఒంటరిగా ప్రయాణము జేయుచున్నావు? ఎచ్చటికి పోవలయును?” అని

అడిగిరి.


“నా నివాసస్థలము కాంచీపురము, బహుదూరమున నున్నదని

భావించుచున్నాను”, అని రామానుజుడనెను.

“నీవు కాంచీపురమునకు పయనించుచున్నావా, నాయనా!,

ఉత్తరదేశ యాత్రను ముగించుకొని నిజస్థానమునకు మరలినావన్నమాట.


మంచిది మాకు కొంత తోడయినావు నాయానా, మేమిరువురము నూతన

దంపతులము. రామేశ్వరయాత్రకై పోవుచున్నాము. కంచిపట్టణము వరకు

నీతో కలిసిరాగలము నాయానా!" అని ఆ బిల్లు దంపతులనిరి. దారితోడు

దొరకినందులకు రామానుజుడు పరమానందభరితుడాయెను. సర్వమును

అదృష్టమయిన దైవశక్తి వలన సంభవించుచుండునని భావించు

రామానుజుడు భక్తి భావమున నారాయణుని మనమున ధ్యానించుకొనెను.

“నాయానా! అలసట జెందినట్లు కన్పట్టుచున్నావు. నీవు పై గుడ్డలతోనే

యున్నావు. నీ సామాగ్రి దారిన పోయినదేమో! సరే, యివిగో మా వద్ద

కొన్ని ఫలములున్నవి. ఆరగించి సెలయేటిలోని సలిలముల ద్రావి

సేదదీర్చికొనుము, నాయనా! తరువాత నడువసాగెదము,” అని

భిల్లుదంపతులనిరి. వారి జోలినుండి కొన్ని ఫలముల నివ్వగా,

రామానుజుడు వానినారగించి క్షుద్బాధ తీర్చుకొనెను.


రామానుజుడు భిల్లుదంపతులతో కలిసి పయనింపసాగెను. వారి

స్నేహమున, వారి దివ్యదేశ పర్యటనావిశేషములు వినుచుండుట వలన,

రామానుజునకు ప్రయాణమెంతో సుఖకరముగా, ఆనంద యుక్తముగా

నుండెను. ఒకనాడు సూర్యాస్తమయముకాగా, ఒక తావునవారు మువ్వురును

శయనించిరి. మరునాడు వేకువననే వారు నిద్రనుండి లేచి, సమీప

ప్రవాహమున స్నానమాచరించి, చెంతనున్న ఫలములు దినిరి. సూర్యోదయ

మగుచుండెను. భిల్లు దంపతులు రామానుజుని వైపుజూచి, “నాయానా,

అదిగో చూడుము. మనమున్నత ప్రదేశమున నిలుచున్నాము గదా!

చూడుము, ఆకనబడు కనక శిఖరములు శ్రీవరదరాజస్వామి దేవాలయ

గోపుర శిఖరములే గదా! ఇక నీ మార్గమునుబట్టి నడువుము, త్వరలో నీ

స్వస్థలమును జేరగలవు. మేమిచట నుండి నేరుగా పయనించెదము”


అనిరి. రామానుజడు దూరమున నుండి దేవాలయ సువర్ణ శిఖరముల

దర్శించి, పరమానందమున సాష్టాంగపడి నమస్కరించెను. "అయ్యా,

అమ్మా నేనింత త్వరలో, ఇంతటి సురక్షితముగా స్వస్థలమును జేరగలనని

యూహింప లేదు. ప్రేమాతిశయమును జూపు మీ సహవాసమున మీరు

దారిని నాకు దెల్పుచున్న అనేక దివ్యక్షేత్ర విషయములు నేను వినుచుండుట

వలన నేను ప్రయాణకాలమునే మరచితిని. ప్రయాణశ్రమను బొందనైతిని.

నాయీ పరమానందభరిత ప్రయాణమున మిమ్ముల నేగలిసికొన్నది నిన్ననే

అని నేను భ్రమపడుచున్నాను. నేను మీకు కృతజ్ఞుడను. మీయెడ నాకు

పితృభక్తి మాతృభక్తి పొడముచున్నవి. మీరు నాకొనగూర్చిన సాయము,

సానుభూతి అనన్యము. మీరు నాతోగూడ వచ్చి, కంచి వరదరాజస్వామిని

దర్శించి, నాయాతిథ్యమును స్వీకరించి, తరువాత యాత్ర సాగింపుము”,

అని రామానుజుడు కోరెను. అందులకు భిల్లుడు, “నాయనా! నీ

ఆదరమునకు సంతోషము. కాని ఒక విషయమును వినుము. మాధ్యేయము

రామేశ్వర దర్శనము. ఇది దేశ దక్షిణాగ్రముననున్నది. ముందు

రామేశ్వరమును దర్శించి, అటనుండి తిరుగు పయనము గావించునపుడు

దారిలోని పుణ్యక్షేత్రములనన్నిటిని దర్శింతుముగాక. అట్టితరి

కాంచీపురమును గూడ దర్శించెదము” అని పల్కెను. విషయమును

గ్రహించిన రామానుజుడు వల్లెయని పలికి, కాంచీనగరమున తన

గృహమున్న తావును భిల్లులకు గుర్తుజెప్పి, వారిని తిరుగు ప్రయాణమున

తప్పక రమ్మని ఆహ్వానించి, వారికి కృతజ్ఞతను వెల్లడించి, కాంచీనగరము

వైపు అత్యానందముతో నడువసాగెను. వరదరాజాలయ స్వర్ణ శిఖరములు

దిక్సూచివలె కన్పడి దారిని చూపుచుండినవి.


మధ్యలో నొక కోనేటిలో దప్పిదీర్చుకొని, గట్టునున్న అరుగు పై

కూర్చొని విశ్రాంతిగా నాలోచింపదొడగినాడు రామానుజుడు “ఇక కొలది

ఘంటలలో నిజసదనమును చేరగలను. జరిగిన విషయముల రహస్యముగా

నుంచెదగాక! అట్లుకాదని గురువులవారిని దోషిగా ఎల్లరు భావింతురు

గదా! అట్టియెడ నేను గురువులవారికి అపచారమును జేసిన వాడనగుదును.

అది తగదు. అది గురుద్రోహమే కాగలదు. వారు నాపై అసూయపూనుట

నా దౌర్భాగ్యమనియే భావించెదగాక, అంతవరకే. కావున యాత్రాకాల

మధ్యమున జరిగిన ఘటనను నేనెవ్వరికిని చెప్పరాదు”, అని రామానుజుడు

నిర్ణయించుకొనెను.


మరియు ఆలోచనాపరుడయిన రామానుజుడు ఈ విధముగా విత

ర్కించుకొనదొడగెను. సృష్ఠి స్థితి లయముల దెలిసికొని, ఆ జ్ఞానమున

కనుగుణమైన నడవడిని నిర్ణయించుకొనుటయే మతమనబడును, ఇది లోక

కల్యాణము కొరకు. అందువలన ఏ జాతి ప్రజలయినను సృష్టిస్థితిలయ

విషయములను భిన్నముగా భావించినను, నడవడి విషయమున మాత్రము

సామ్యతను జూపవలసియున్నది, ఇట్టి పరిస్థితిలో మహాపండితుడనియు,

శాస్త్రకోవిదుడనియు, అద్వైత సిద్ధాంత ప్రచారకుడనియు కీర్తిగన్న యాదవ

ప్రకాశుడు, శిష్యుడనయిన నాపై ద్వేషముబూనుట విడ్డూరముగా కన్పట్టు

చున్నది. అదియునుగాక నన్ను తన శిష్యులచేతనే తుదముట్టింప

ప్రయత్నించుటలో వారి పాండిత్యమునకును, పాండిత్యసారమగు జ్ఞానము

నకును ఏలాంటి సంబంధము కన్పడుటలేదు. “విద్యాశాస్త్ర పురాణవేద

పఠనం కిం తేన జ్ఞానం వినా" అని పెద్దలిందులకే వచించిరేమో!

జ్ఞానమునకు సూచకము కరుణ, దయ, సానుభూతి మతమనునది

మానవులలో కరుణ, దయ సానుభూతులను జనింప జాలకున్ననది మతము


ఎట్లగును? నా గురువు యాదవప్రకాశునిదిట్టి మతాంధకారమున

నుండుటకు నేనెంతయో చింతించుచున్నాను. "ధీమహి థియో యోనః

ప్రచోదయాత్” అను గాయత్రీ మంత్ర తాత్పర్యమునకాయన యెంత దవ్వున

నున్నాడోకదా! (భగవచ్ఛక్తి నా హృదయమున వసించి, నాచే సత్కార్యములు

చేయించుగాక అని గాయత్రీమంత్రభావము). అనుదినము తాను జేయు

గాయత్రీ జపమేమైనట్లు? ఎంత వైపరీత్యము! శిష్యుడనుగాన నాకర్తవ్య

మొక్కటియే. గురువర్యుడెట్టివాడైనను వారి తప్పులెన్నుట నా కర్తవ్యము

కాదు. వారిని గౌరవించుటయే నా విధి. వారిని విమర్శించు అధికారము

నాకు లేదు. వారు దయార్ద్రహృదయుగా మారుటకు దైవశక్తిని

ప్రార్థించెదగాక. ఇదియే నా వాస్తవమైన గురుదక్షిణ కాగలదు!”, అని

రామానుజుడు నిర్ణయించుకొనెను. సర్వవేద సర్వశాస్త్ర పారంగతుడయిన

యాదవ ప్రకాశుడు సుగుణ సంపత్తి లేక సంపూర్ణ వ్యక్తి కాలేనందులకు

రామానుజుడు పరిపరివిధముల చింతించెను.


రామానుజుని మనమున గలిగిన ఈ వితర్క భావము ఆతని కరుణ

దయాగుణములకు నిదర్శనము. బాల్యము నుండియే అణుకువ, వినయము,

దయ, స్వార్థరాహిత్య భావము, నిశిత ఆలోచనాక్రమము రామానుజుని

యందు మెండుగా నుండినవి.


రామానుజుడు నడువసాగెను. కాంచీపురము సమీపమున కన్పట్టు

చుండెను. అన్నిటికంటే అత్యున్నతములయిన వరదరాజస్వామి ఆలయ

శిఖరములు అతనిని ఆకర్షించుచున్నవి. విలుకాడు తన లక్ష్యమునే చూస్తాడు,

ఇతర విషయముల జూడడు కదా!


మరియొకసారి భిల్లు దంపతుల దలచుకొని, “నేను వారికి

కృతజ్ఞుడను, వారి సాయము లేనిది నేను సురక్షితముగా అరణ్యముల


గుండా పయనించి యుండెడువాడను గాను. నన్ను మార్గమున రక్షించి,

యింతవరకు నడిపించిన ఈ భిల్లుదంపతులు నాపాలిటి పురాణ దంపతులే!

వారిని లక్ష్మీనారాయణులుగనే భావింపగలను. సాయము జేయువారు,

దయార్ద్ర హృదయులైనట్టివారు, దైవాంశ సంభూతులే. కృప దైవగుణము.

కృపగల మానవుడు దైవాంశ సంభూతుడు. మానవులలో రెండు వర్గములు,

సజ్జనులు దుర్జనులని, ఉండుటకు కారణములు కృపాసహితత్వము,

కృపారహితత్వములే”, అని రామానుజుడు మనమున వితర్కించుకొనెను.


త్వరలో స్వగృహము జేరి తల్లి పాదముల నమస్కరించెను.

గురువర్యుల ఇతర శిష్యులనందరిని వదలి రామానుజుడు ఇంత శీఘ్రముగా

ఇల్లు జేరుటకు తల్లి కాంతిమతి అచ్చెరువందెను. కాని, రామానుజుడేదో

నిజదేహారోగ్యకారణము దెల్పి, ఆ విషయమునంతటితో మరపింపజేసెను.


ఆ కాలమున కాంచీనగరము చోళ రాజధాని. రాజకుమార్తెకు

మానసిక వ్యాధి సంభవించెను. ఆమెకు పిశాచ మావరించినదని అందరు

భావించిరి. యాదవ ప్రకాశుడు ఆధ్యాత్మిక విద్యయందే గాక, మంత్ర

శాస్త్రమునందును నిపుణుడని ప్రసిద్ధి. ప్రభువు యొక్క ఆహ్వానముపై

యాదవప్రకాశుడు శిష్యులతోగూడి రాజభవనమును జేరి, రాజకుమార్తెను

పరీక్షించి, పిశాచమను దానిని వెడలగొట్టుటకు బిగ్గరగా మంత్రముల

వల్లింపసాగెను. ఆయన మంత్రోచ్ఛారణ మేఘగర్జనమువలె ప్రతిధ్వనించు

చుండెను. పిశాచ పీడిత యనబడు రాజకుమార్తె (తన మానసిక వ్యాధి

చాపల్యమున) తన యిష్టము వచ్చినట్లు పరిపరి విధముల ప్రలాపించు

చుండెను. మానసిక వ్యాధికి ఒక నిర్ణీత గతియనునదేమున్నది?

మంత్రోచ్ఛారణ ధాటిగా గావించుచున్న యాదవ ప్రకాశునితో రాకొమరిక


ఇట్లనియెను. "ఓయీ! నీ తెల్లగడ్డమును నీ ముఖతిలకములను, నీ

మంత్రగర్జనములును నన్నేమి చేయగలవు? పండితుడవయ్యును మూర్ఖుడవు,

క్రూరుడవు నీవు. కలుషితహృదయుడవగు నీ మంత్రములు నాపై పని

జేయునా? ఎందులకు వృథాప్రేలాపము?”


రాజకుమార్తె మాటలు విన్న సర్వులు ఆశ్చర్యపడిరి. యాదవ

ప్రకాశుడు కినుకబూన నవసరము లేదు! ఏలన ఆమె మాటలను పిచ్చి

దాని మాటలుగా త్రోసిపుచ్చిరి.


మరియు రాజకుమార్తె ఇట్లనెను, “నన్ను తరుమను నీశక్యము

గాదు! ఓ మాయావాదీ! మాయావీ! ద్రోహి! అడుగో, నీ వెనుకను

ముకుళితహస్తుడై నిలువబడియున్న యువక మహాత్ముడు, ఆయనను ఇటు

రప్పింపుము. రామానుజుడు గదా అతడు. నీకు అదృష్ట పూర్వకముగా

అతడు శిష్యుడుగా లభించినాడు. ఆ రామానుజుని, ఆ పరిశుద్ధాత్ముని, ఆ

దయా సముద్రుని, ఆ నిష్కళంక హృదయుని, అపరాధిని సైతము మన్నించి

ప్రేమించు ఆ యుదార స్వభావుని, ఆ గురుభక్తి పరాయణుని రప్పింపుము”.


రామానుజుడు సమీపింపగనే రాజకుమార్తె నోటినుండి ఈ

పలుకులు వెలువడెను. “మాయావాదము నంగీకరింపని ఓ మహాత్మా!

నన్నే గాదు, అసంఖ్యాక మానవాభ్యుదయమునకు పాటుపడగల మహాత్ముడవు

నీవు! నన్నాశీర్వదింపుము!


రామానుజుడు ప్రపత్తుడుగాన, సర్వం విష్ణుమయమ్ అని భావించు

వాడుగాన. శ్రీవరదరాజస్వామిని మనమున స్మరించి, త్రికరణ శుద్ధిగా

రాజకుమార్తె మూర్ధమును తన హస్త కమలద్వయముతో స్పర్శించి,

ఆశీర్వదించెను. వెంటనే రాజకుమార్తె స్వస్థతను జెంది, మేఘము తొలగిన


చంద్రబింబముఖియై లేచి, మందహాసమును సిగ్గున తల్లిదండ్రులయిన

రాజదంపతుల మ్రోలజేరెను. ఆ క్షణమున నెవ్వరేని రాజకుమార్తె ముఖమున

ఎట్టి వ్యాధి లక్షణమును గానీ తిలకింపలేకపోయిరి. ఆమె నడిజవ్వనమున

సంపూర్ణారోగ్య ముఖవర్చస్సుతో ప్రకాశించెను. రామానుజుని ఆశీర్వాద

బలమది!


ఒకనాడు యాదవప్రకాశులు ఛాందోగ్యోపనిషత్లోని “సర్వం

ఖల్విదం బ్రహ్మ” అను మంత్రమునకు అర్థమును వివరించు సందర్భమున

"విశ్వమంతయు బ్రహ్మము” అని బోధించెను. కఠోపనిషత్తులోని "నేహ

నా నాస్తికించన” అను మంత్రమును వ్యాఖ్యానించుతరి, "ఆత్మయును

బ్రహ్మమును ఒక్కటే" అని తెల్పెను.


ఈ వివరణముల వినిన రామానుజుడు గురునితో, "స్వామీ! తమరు

సెలవిచ్చిన వివరణములు సరియైనవికావని నాయుద్ధేశము. “సర్వం

ఖల్విదం బ్రహ్మ" అను మంత్రమునకు అర్థము ఇదిగా తోచుచున్నది.

"విశ్వమునకును, బ్రహ్మమునకును సంబంధమున్నది. కానీ అవి రెండును

ఒకటికాదు. దేని విశిష్టత దానికున్నది. నీటియందు పుట్టిన చేప, నీటియందే

పెరిగి, నీటియందే జీవించి, కడకు నీటియందే మరణించి, కడకు నీటియందే

కరిగిపోవును. కాని, చేప నీరు కాదు. అట్లనే విశ్వములో ప్రతియణువు

బ్రహ్మపదార్థముతో సంబంధపడియున్నను, విశ్వము బ్రహ్మము కానేరదు”

అని రామానుజుడు వివరించెను.


“నేహనా నాస్తికించన” అన్నప్పుడు సత్యవిషయము ఇట్లు

గోచరమగుచున్నది. “ఆత్మయు, బ్రహ్మమును ఒక్కటియే కాదు. బ్రహ్మము

ఆత్మల నావరించియున్నది. పూసలగుండా బోవుదారమువలె. దారము


నందు గ్రుచ్చబడిన ముత్యములు ఒకహారముగా కన్పడును. కానీ దారము

ముత్యము కాదు. ముత్యములన్నియు ఒకటికాదు, సారూపము ననున్నవి

అంతవరకే. సకల చరాచరముల గుండా సూత్రముగా వ్యాపించియున్న

బ్రహ్మము విశ్వమగుచున్నది. ఈయేకత్వమున వానివాని వైవిధ్యమున్నది.

అంతియేగానీ, బ్రహ్మము విశ్వముకాదు” అని తోచుచున్న దని రామానుజుడు

పల్కెను.


రామానుజుని యొక్క ఈ వ్యాఖ్యలు వినిన యాదవప్రకాశుని

శరీరము, భూమి కంపించినట్లు, వణకెను. తన మనస్సు అగ్నిపర్వతమువలె

దహింపదొడగెను. అగ్నిపర్వతములోని ఉష్ణద్రావకమువలె తన ముఖ

ద్వారము నుండి అసూయాద్వేషములు పొర్లి ప్రవహించినవి. వానికిక

అవధిలేదు, “రామానుజా! నీవు అద్వైత మతశత్రువువు. ప్రతి మంత్రమునకు

అద్వైత సిద్ధాంతమునకు వ్యతిరేఖమైన భావములు నీకు పొడముచున్నవి.

నాతో ఎదురువాదములాడు నీవు నాకెట్లు శిష్యుడుగా కొనసాగగలవు?

నీవు ఇక వెడలిపోయి మరియొక విద్యాపీఠమును స్థాపించుకొనుము.

ఒకయొర యందు రెండు ఖడ్గములెట్లు నిలుచును? అద్వైత సిద్ధాంతమునకు

శత్రువయిన నీవు నాకును, నా మఠమునకును, నా శిష్యులకును శత్రువువే.

ఇక వెడలిపొమ్ము, నీకిచట స్థానము లేదు. ఇక నాగడప త్రొక్కకుము”,

అని యాదవప్రకాశుడు వృద్ధసింహమువలె గర్జించెను.


రామానుజుడు మిన్నగా శాంతియుతముగా గురుదేవుని మాటలు

విని, మారుమాటాడుటకు నోరులేక, ఇక చేయునది వేరొండు లేక, తన

యెడబాటు ఇక అనివార్యమని గ్రహించి, గురువునకు నిశ్శబ్దముగా

నమస్కరించి, అవనత వదనుడై, బహిష్కరణా దుఃఖభారమును మోయుచూ,

మఠమును వదలి, నడచెను.


ప్రశ్న :- రామానుజుడు ప్రాణమును కాపాడుకొను నిమిత్తము అడవినుండి

పారిపోయి ఇల్లు చేరిన తర్వాత, తమ గురువు యాదవ ప్రకాశుని

ఉద్దేశ్యము తెలిసిన తర్వాత యాదవ ప్రకాశుడు చెప్పే బోధయంతయూ

అద్వైతమని తెలిసిన తర్వాత, యాదవప్రకాశుని తిరిగి గురువుగా

ఒప్పుకొనుచు అతనివద్దకు రామానుజుడు చేరవలసిన అవసరమే

మొచ్చినది?


జవాబు :- రామానుజుడు చిన్న వయస్సులోనే యాదవప్రకాశుని వద్ద

విద్యాభ్యాసమునకు చేరియుండెను. అప్పుడు గురువుగాయున్న యాదవ

ప్రకాశుడు రామానుజుని చంపాలనుకొన్నప్పుడు, అతడు ఆ ప్రమాదము

నుండి తప్పించుకొని పారిపోయినప్పుడు అతని వయస్సు దాదాపు 17

లేక 18 సంవత్సరములుండేవి. అంతచిన్న వయస్సులో యాదవ ప్రకాశు

ని వద్ద తిరిగి చేరాలా వద్దా! అను విషయమై ఎట్లు నిర్ణయము తీసుకోలేక

పోయాడు. రామానుజునికి 16వ సంవత్సరముననే తండ్రి చనిపోయిన

దానివలన ఆయనకు ఎవరూ సలహా చెప్పువారు లేకపోవడము వలన,

తన విద్యాభ్యాసము కొంతవరకైనా అవసరము అను ఉద్దేశ్యముండుట

వలన, పైగా తన గురువు బ్రాహ్మణుడే అయివుండవలెనను ఆలోచన

యుండుట వలన తప్పనిసరిగా యాదవ ప్రకాశునివద్దనే చేరాలని

రామానుజుడు నిర్ణయించుకోవడము జరిగినది.


ప్రశ్న :- రామానుజుడు తిరిగి తనవద్దకు వచ్చినప్పుడు గురువుగా యున్న

యాదవ ప్రకాశుడు తనకేమీ తెలియనట్లు తన శిష్యులలోనికి రామానుజున్ని

చేర్చుకోవడము జరిగినది. అయినా కొంతకాలములోనే గురువుగారు

అసూయతో రామానుజున్ని తనవద్దనుండి దూరముగా పంపి తన శిష్యుడు


కాదని చెప్పడము జరిగినది. అప్పుడు యాదవ ప్రకాశుని వద్దనుండి

వెలివేయబడిన రామానుజుడు కొన్ని సంవత్సరములకు ఇతర గురువుల

వద్ద విద్యనభ్యసించి, పరిపూర్ణ విద్యావంతుడయి అద్వైతమునకు వ్యతిరేఖ

భావముతోనేయుండెను. అటువంటి సమయములో యాదవ ప్రకాశుడు

ఒకప్పుడు తన శిష్యునిగాయున్న రామానుజుని వద్దకుపోయి రామానుజున్ని

గురువుగా చేసుకొని తాను శిష్యుడు కావలసిన అవసరమేమొచ్చినది?


జవాబు :- వృద్ధ వయస్సులో యాదవ ప్రకాశుడు రామానుజుని కీర్తిని,

సంపదను గురించి విని ఆశ్చర్యపడెను. రామానుజుని విశిష్ట బోధనా

మృతమును గూర్చి కూడా వినుచుండెను. యాదవ ప్రకాశునకు తన

అద్వైతతత్త్వ భావము శాంతిని, ఆనందమును ఇవ్వలేకపోయినది. జ్ఞాన,

ధ్యానములకంటే కర్మఫలత్యాగమే శ్రేష్ఠమయినదని ప్రవచించుచున్న

రామానుజుని మాటలు ఇప్పుడు యాదవప్రకాశునికి నచ్చినవి. తన అద్వైత

భావమున తాను ఒంటరివాడినయినట్లు భావించెను. వైష్ణవ శక్తి తనలో

యున్ననూ, అది విశిష్టముగాయున్నదని భావించిన భక్తుడే విష్ణు సంశ్లేష

భావమున విశ్వమానవ సౌభాత్రమున ఆనందమునొందగలడు. ఈ విషయ

సత్యమును గ్రహించిన యాదవ ప్రకాశుడు రామానుజునకు శరణాగతు

డగుటకు నిశ్చయించుకొనెను. కానీ ఒక విధమయిన జంకు, సిగ్గుతో

వెనుకాడుచుండెను.


ఇట్లు మనోవ్యాకులముతో ఒకనాటి సాయంకాలమున వీధిలో

నడచుచూ తిరుక్కచ్చినంబిని గాంచెను. తన ఆధ్యాత్మిక దీనావస్థను తిరుక్కచ్చి

నంబికి ఇట్లు తెలిపెను. "నా మనస్సున ఒక అభిప్రాయమున్నది. మీరు

ఈనాటి రాత్రి వరదరాజ స్వామిని సేవించునప్పుడు నా అభిప్రాయమును


గురించి స్వామివారు ఏమి తలచుచున్నాడో స్వామిని అడిగి తెలుసుకొని

నాకు తెల్పుము? ఆ మాటలను విన్న తిరుక్కచ్చినంబి ఆనాటి రాత్రి వరద

రాజస్వామితో "స్వామీ! యాదవ ప్రకాశుని మనస్సున ఒక అభిప్రాయము

కలదట. దానిని గూర్చి మీరు ఏమి అనుకుంటున్నారో మీ నిర్ణయము

మేమిటో? అడిగి తెలుసుకొని ఆయనకు తెలుపమన్నాడు, నీ ఆజ్ఞ ఏమిటో

తెల్పుడు” అని అన్నాడు. అంత స్వామి "ఓయీ! యాదవప్రకాశుడు

రామానుజుని ఆశ్రయింప తలచిననూ మనస్సున ఇంకనూ సంశయపడు

చున్నాడు. ఇక ఏమాత్రము సంశయింపక రామానుజుని ఆశ్రయింపుమని

నా మాటగా చెప్పుము" అని బదులిచ్చెను. తిరుక్కచ్చినంబి ఆ మాటను

మరుసటి రోజు యాదవప్రకాశునికి తెలియజేసెను. అప్పుడు యాదవ

ప్రకాశుడు ఒకప్పుడు రామానుజునికి నేను గురువుగాయుంటినను

భావమును వదలి శిష్యుడయిన రామానుజుని గురువుగా స్వీకరించెను.

అప్పటినుండి యాదవ ప్రకాశుడు "గోవింద దాసు" అను పేరుతో పిలువ

బడెను.


ఈ విధముగా రామానుజులవారు తన విశిష్టాద్వైత సిద్ధాంతముతో

అద్వైత సిద్ధాంతమును దాటిపోవుచూ అద్వైతమునకు విలువ లేకుండా

చేయుచుండెను. ఆ కాలములో చాలామంది అద్వైతులు తమ సిద్ధాంతమును

వదలి విశిష్టాద్వైతములో చేరిపోవుట అద్వైతులకు పెద్దకంటకముగా మారెను.

దానివలన రామానుజున్ని హత్య చేయాలని చాలామంది అద్వైతులు

చాలామార్లు ప్రయత్నము చేశారు. 18 సంవత్సరముల వయస్సులోనే

తన గురువే చేసిన హత్యాప్రయత్నమునుండి తప్పించుకొన్న రామానుజా

చార్యుల వారు జీవితమంతా అటువంటి ప్రయత్నములనుండి బయట

పడుచూ వచ్చాడు. ఆయన 120 సంవత్సరములు బ్రతికినా అప్పుడప్పుడు


అద్వైతుల దృష్ఠిలో అజ్ఞాతముగా బ్రతుకవలసి వచ్చినది. హత్యా

ప్రయత్నముల నుండి తప్పించుకొను అనుభవము రామానుజునకు

అందరికంటే ఎక్కువ కలదని చెప్పవచ్చును. అయినా ఒకమారు శరీరమును

ధరించి పుట్టిన తర్వాత తప్పనిసరిగా ఎప్పుడో ఒకప్పుడు శరీరమును వదలక

తప్పదు, అనగా మరణించక తప్పదు. అదే విధానమును అనుసరిస్తూ

క్రీ॥శ॥ 1137వ సంవత్సరము మాఘమాస శుద్ధ దశమిరోజు శరీరమును

వదలడము జరిగినది. సూర్యుడు అస్తమించిన తర్వాత రామానుజుడు

చనిపోవడము జరిగినది. శంకరాచార్యుల వారు కూడా అర్థరాత్రి దాటిన

తర్వాత చనిపోవడము జరిగినది.


రామానుజాచార్యులవారు విశిష్టాద్వైతమును స్థాపించిపోయారు. శంకరా

చార్యుల వారు వచ్చిపోయిన తర్వాత దాదాపు 1500 సంవత్సరములు

అద్వైతమునకు ఎదురులేకుండా జరిగిపోయినది. అంతేకాక ఆర్యులు

మొదటినుండి తెలివైనవారే అగుట వలన, అద్వైతము రామానుజులు పుట్టక

పూర్వమే భారతదేశములో బలముగా ప్రాకిపోయినది. అందువలన క్రొత్తగా

వచ్చిన రామానుజాచార్యుల వారు అద్వైతుల వలన 18 సంవత్సరముల

వయస్సులోనే హత్యాప్రయత్నమును ఎదుర్కోవలసి వచ్చినది. తమ

అద్వైతమునకు ఎదురు తిరిగిన ప్రతివారిని చంపివేయాలను నిర్ణయము,

లేక దాడిచేయాలను నిర్ణయమును అద్వైతులు మొదటినుండి కల్గియున్నారు.

అందువలన రామానుజాచార్యుల వారు తన జీవిత కాలమంతయూ

ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చినది. ఎంతో బలముగా మొదటినుండి

యున్న అద్వైతము నేడు కూడా హిందూమతములో ఎక్కువ శాతము

అద్వైతమే కలదని చెప్పవచ్చును. నేడు విశిష్టాద్వైతము భారతదేశములో


యున్నా అద్వైత బలముతో పోల్చుకొంటే చాలా తక్కువగా యున్నదని

చెప్పవచ్చును. నేటివరకు అందరికీ తెలిసిన సిద్ధాంతకర్తలు ముగ్గురు.


రామానుజుల వారు చనిపోయిన తర్వాత దాదాపు వంద

సంవత్సరములకు దక్షిణ దేశమయిన కర్నాటక రాష్ట్రములో మధ్వాచార్యుల

వారు రావడము జరిగినది. కర్నాటకలోని ఉడిపి దగ్గర 'పజక' అను

గ్రామములో బ్రాహ్మణ కుటుంబమున మధ్వాచార్యుల వారు నారాయణ

భట్టు, వేదవతి అను దంపతులకు పుట్టడము జరిగినది. మధ్వాచార్యుల

వారు ద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించి బోధించడము జరిగినది. ద్వైత

సిద్ధాంతము దేశములో ఎక్కడా ప్రచారము కాలేదు. అందువలన ఉడిపి

ప్రాంతములో పుట్టిన చోటున మాత్రము కొంత ప్రచారమయినది. ద్వైతము

బయటి ప్రపంచమునకు ప్రచారము కాకపోవడము వలన ఆ సిద్ధాంత

కర్తయిన మధ్వాచార్యుల వారు కూడా ఎక్కువగా ప్రచారము కాలేదు.

అందువలన చాలామంది హిందువులకే మధ్వాచార్యుల విషయము

తెలియకుండా పోయినది.


అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము హిందూమతములో ఉన్నా

అద్వైతము 70 పాళ్ళు, విశిష్టాద్వైతము 20 పాళ్ళు, ద్వైతము 10 పాళ్ళు

మాత్రమే ఉందని చెప్పవచ్చును. ఇప్పుడు హిందూమతములోని అందరికీ

తెలియని విషయమేమనగా! ఇప్పటికి దాదాపు 40 సంవత్సరముల క్రిందటే

త్రైత సిద్ధాంతము పుట్టినది. త్రైత సిద్ధాంత కర్త పుట్టినది 1950వ

సంవత్సరము. ఇప్పటికి 40 సంవత్సరముల క్రిందటే పుట్టిన త్రైతము

బయటికి తెలిసి 37 సంవత్సరములయినది. శాలివాహన శకము తర్వాత

క్రీస్తుశకము చెప్పబడుచున్నది. ఇప్పుడు త్రైత శకము కూడా ప్రారంభమయి


37 సంవత్సరములయినది. మధ్వాచార్యులు చనిపోయి ఇప్పటికి దాదాపు

700 సంవత్సరములగుచున్నది. రామానుజుల తర్వాత వంద సంవత్సరము

లకే మధ్వాచార్యుల వారు రాగా, ఆది శంకరాచార్యుల తర్వాత రామానుజా

చార్యుల వారు దాదాపు 1500 సంవత్సరములకు వచ్చాడు. మధ్వాచార్యులు

వచ్చిన తర్వాత దాదాపు 700 సంవత్సరములకు ఆచార్య ప్రబోధానంద

యోగీశ్వరుల వారు వచ్చారు.


ప్రశ్న :- మధ్వాచార్యుల వారు ప్రతిపాదించినది ద్వైత సిద్ధాంతము. ద్వైతము

ఎక్కువగా ప్రచారము కాలేదు కదా! దానిని సిద్ధాంతముగా స్వీకరించ

వచ్చునా?


జవాబు :- సిద్ధాంతము ప్రచారము కావచ్చును, కాకపోవచ్చును. అయితే

సిద్ధాంతమును సిద్ధాంతముగానే చూడాలి.


ప్రశ్న :- మధ్వాచార్యులు సన్న్యాసత్వమును ఎప్పుడు స్వీకరించారు?

జవాబు :- మధ్వాచార్యులకు 12 సంవత్సరముల వయస్సులోనే సన్న్యా

సత్వమును తల్లి అనుమతితో స్వీకరించడము జరిగినది.


ప్రశ్న :- మధ్వాచార్యుల వారు దృఢకాయుడని కొందరన్నారు నిజమేనా?

జవాబు :- నిజమే. వాయుదేవుల ప్రథమ అవతారము హనుమంతుడు

అని అంటారు. వాయుదేవుని రెండవ అవతారము భీమసేనుడు అంటారు.

మూడవ అవతారము పూర్ణప్రజ్ఞులయిన మధ్వులని చెప్పుచుందురు.

ఆంజనేయుడు, భీముడువంటి దృఢకాయముకల్గి వృకోదరుడు అని పేరు

గాంచియున్నాడు.


ప్రశ్న :- వృకోదరుడు అనగా అర్థమేమిటి?


జవాబు : వృకోదరుడు అనగా 'తోడేలు వంటి పొట్ట గల్గినవాడు' అని

అర్థము. తోడేలు మంచి జీర్ణశక్తి కల్గియుండి జంతుకళేబరము నుండి

తినిన మాంసము ఎముకలను సులభముగా జీర్ణము చేసుకోగలదని

చెప్పుచుందురు. అటువంటి జీర్ణశక్తి మధ్వాచార్యులకున్నది. అందువలన

మధ్వాచార్యుల వారిని వృకోదరుడు అని పిలిచారు. ద్వాపర యుగములో

భీముడు కూడా గొప్ప జీర్ణశక్తికలవాడు అయినందున వృకోదరుడు అని

భీమున్ని కూడా పిలిచారు. కలియుగములో మధ్వాచార్యుల వారికి ఆ

పేరు రావడము జరిగినది. మధ్వాచార్యుల మొదటి పేరు 'వాసుదేవ' అని

కలదు. సన్న్యాసత్వము తర్వాత వాసుదేవ పోయి మధ్వాచార్యుల పేరు

వచ్చినది. అయినా ఆయన దృఢకాయుడే కాక, జీర్ణశక్తి కలవాడయిన

దానివలన భీముని అవతారమేనని తలచి 'వృకోదర' అని చెప్పడము

జరిగినది.


దక్షిణ దేశయాత్రలో శ్రీమధ్వులు 'విష్ణుమంగళం' అనే ఊరు

చేరుకొన్నాడు. అక్కడ ఆయన జీర్ణశక్తిని పరీక్షిద్దామని ఒక గృహస్థుడు

వారిని భిక్షకు ఆహ్వానించి షడ్రసోపేతముగా భోజనము పెట్టిన పిదప

రెండు వందల అరటిపళ్ళను ముందర పెట్టి ఆరగించమన్నాడట. అప్పుడు

శ్రీమధ్వులు అవలీలగా రెండువందల అరటిపళ్ళను ఆరగించి అందరినీ

ఆశ్చర్యపరిచాడట.


ప్రశ్న :- శంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతమునకు పూర్తి వ్యతిరేఖముగా

విశిష్టాద్వైత సిద్ధాంతమును రామానుజాచార్యుల వారు ప్రతిపాదించారు

కదా! మూడవ ఆచార్యునిగా వచ్చిన మధ్వాచార్యుల వారి ద్వైత సిద్ధాంతము

అద్వైతమునకు వ్యతిరేఖమా, లేక విశిష్టాద్వైతమునకు వ్యతిరేఖమా?


జవాబు :- ద్వైత సిద్ధాంతము ప్రధానముగా అద్వైతాన్ని పూర్తిగా

వ్యతిరేఖిస్తుంది. విశిష్టాద్వైత సిద్ధాంతముతో కొంత సారూప్యము ఉండడము

వలన శ్రీమధ్వులు ఆ సిద్ధాంతాన్ని ఎక్కడా విమర్శించలేదు. అద్వైతమునకు

వ్యతిరేఖముగా ద్వైతములోని ఐదు ప్రధానాంశములు కలవు. 1) జగత్తు

సత్యం, 2) జీవుడు బ్రహ్మము ఒకటికాదు, వేరువేరు తత్త్వాలు 3) పరమాత్మ

సగుణ సాకారుడు, 4) శ్రీమహా విష్ణువు పరమ దైవము, 5) మోక్షానికి

అచంచల విష్ణు భక్తిమాత్రమే ఏకైక మార్గము. ఇవన్నీ అద్వైతానికి పూర్తి

వ్యతిరేఖము. విశిష్టాద్వైతమునకు పూర్తి వ్యతిరేఖము కాదు.


ప్రశ్న :- విశిష్టాద్వైతమునకు ద్వైతము పూర్తి వ్యతిరేఖము కాదన్నారు.

అట్లయితే విశిష్టాద్వైతమునకు కొంత వ్యతిరేఖమే కదా! ద్వైతము విశిష్టా

ద్వైతమునకు ఎక్కడ వ్యతిరేఖముగా ఉన్నదో కొంత చెప్పగలరా?


జవాబు :- శంకరుని అద్వైతమునకు రామానుజుని విశిష్టాద్వైతము పూర్తి

వ్యతిరేఖము. అలాగే రామానుజుని విశిష్టాద్వైతమునకు కొంత మాత్రమే

వ్యతిరేఖము మధ్వాచార్యుల ద్వైతము. శంకరుని సిద్ధాంతములో దేవుడు

నిరాకారుడు అని కలదు. రామానుజాచార్యుల వారి సిద్దాంతములో దేవుడు

సాకారుడు అని కలదు. అందువలన రెండు సిద్ధాంతములు ఒకదానికొకటి

విరుద్ధమైనవి. అయితే మధ్వాచార్యుల సిద్ధాంతములో దేవునితోపాటు

జీవుని విషయము కూడా యున్నది. రామానుజాచార్యుల వారి

సిద్ధాంతములో దేవుడు సాకారుడనుట మాత్రము కలదు. జీవుని

విషయమంటూ ఏమీలేదు. అందువలన ద్వైత సిద్ధాంతములోని బోధలు

కొంత విశిష్టాద్వైతమునకు వ్యతిరేఖముగా ఉంటాయి. మధ్వ సిద్ధాంత

సారమును పూర్తిగా వ్యాసరాయలు అను మధ్వాచార్య భక్తుడు మరియు


ద్వైత సిద్ధాంత ప్రచారకుడు వ్రాసిన శ్లోకమును చూస్తే విశిష్టాద్వైతమునకు

ద్వైతము కొంత వ్యతిరేఖమని తెలియగలదు.


శ్లో॥ శ్రీమన్మధ్వమతే హరిః పరతరః సత్యం జగత్, తత్త్యతో

భిన్నా జీవగణాః హరేరనుచరాః నీ చోచ్ఛభావం గతాః !

ముక్తిర్నైజ సుఖానుభూతిః అమలా భకిశ్చ తత్సాధనం

హ్యక్షాదిత్రిత్రయం ప్రమాణం, అఖిలామ్నాయైక వేద్యోహరి॥


భావము :- 1) శ్రీమహావిష్ణువే సర్వ స్వతంత్రుడయిన పరమ దైవము.

2) విశ్వము సత్యము. 3) జీవాత్మ పరమాత్మ వేరు, అలాగే జీవాత్మలు

కూడా పరస్పరం వేరువేరుగా ఉన్నాయి. 4) జీవులు పరమాత్మయిన విష్ణువుకు

దాసులు. 5) వారిలో ముక్తి యోగ్యులు, నిత్యసంసారులు, తమోయోగ్యులు

అనే తారతమ్యములు గలవు. 6) మోక్షమనగా పరమాత్మ స్వరూపానందమ్,

7) దానికి నిర్మల భక్తి ఏకైక మార్గము. 8) ప్రత్యక్ష, అనుమాన, ఆగమ

అనబడే మూడు ప్రమాణాలు 9) వేదార్థం శ్రీహరి మాత్రమే. ఈ శ్లోక

భావములోని తొమ్మిది అంశములు, ద్వైతములోని ఒక్కొక్క ప్రధానమైన

విషయాన్ని తెలియజేస్తుంది. వీటినే ద్వైతములోని నవరత్నాలన్నారు.

ఇందులో అద్వైతమునకు అన్నీ పూర్తి వ్యతిరేఖముగా ఉండగా, విశిష్టాద్వైతము

నకు కొంత వ్యతిరేఖత కలదు.


ప్రశ్న :- అద్వైతములో దేవున్ని పరబ్రహ్మ స్వరూపము అని నిరాకారమును

చెప్పగా విశిష్టాద్వైతములో పరబ్రహ్మమును సాకారమని చెప్పారు. ద్వైతులు

కూడా సాకారమునే చెప్పారు. ఈ విషయములో ద్వైతులు సాకారరూపమును

విష్ణువనియే చెప్పారు. విష్ణువు త్రిమూర్తులలో ఒకడని అతను కూడా

సృష్ఠింపబడిన వాడేనని మీరంటున్నారు. ద్వైతుల భావములో విష్ణువే

సర్వమును సృష్టించాడని అంటున్నారు. దీనికి మీరేమంటారు?


జవాబు :- విష్ణువు త్రిమూర్తులలో ఒకడని అందరికీ తెలుసు. విష్ణువుకు

ఒక నిర్ధిష్టరూపము, నిర్ధిష్టమైన పేరు కలదు. దేవుడు త్రైత సిద్ధాంతము

ప్రకారము ఎల్లప్పుడు నిరాకారుడే అయినా అప్పుడప్పుడు అవసరమును

బట్టి సాకారునిగా భూమిమీద శరీరముతో కనిపించుచుండును. త్రైత

సిద్ధాంతము, అద్వైతము ప్రకారము దేవుడు నిరాకారుడే అని చెప్పుచూ,

విశిష్టాద్వైతము ప్రకారము దేవుడు అప్పుడప్పుడు సాకారముగా కూడా

ఉండునని చెప్పవచ్చును. కొంత అద్వైత, కొంత విశిష్టాద్వైత సిద్ధాంతములను

సమర్థించినా దేవుడు పూర్తి నిరాకారుడనుటలో అద్వైతమును, పూర్తి

సాకారుడనుటలో విశిష్టాద్వైతమును దానికి అనుగుణముగా యున్న

ద్వైతమును త్రైతము వ్యతిరేఖించుచున్నది. ద్వైత సిద్ధాంతకర్తయిన

మధ్వాచార్యుల వారు మహవిష్ణువును దేవునిగా పోల్చి ఈ విధముగా

చెప్పుచున్నారు.


ద్వైతములో శ్రీమహావిష్ణువే సర్వోత్తముడు. సర్వోత్తమత్వాన్ని శ్రీ

మధ్వులు ఇలా నిర్వచించారు. “ఏకః సర్వోత్తమో జ్ఞేయః ఏక ఏవ

కరోతియత్:" దీని అర్థము ప్రకారము సర్వోత్తముడే స్వతంత్రముగా

కార్యాలను చేయగలవాడు, చేయించగలవాడు. ఆయన ఎవరిమీద ఈ

విషయములో అధారపడవలసిన అవసరము లేదు. ఆయన ఏ పనియైనా

చేయగలడు, చేసిన దానిని వెనక్కు మరల్చగలడు. అదే పనిని ఇంకొక

విధముగా చేయగలడు. సర్వోత్తముడు అంటే ఆ బ్రహ్మమే. ఆయనలోనే

అన్ని తత్త్వాలు ఇమిడియున్నాయి. ఆయనే అన్నిటికీ అతీతుడు. ఈ

విశ్వం ఆయన సృష్ఠి. ఆయన అభివ్యక్తి. ఆయన అనంత కళ్యాణ గుణ

సమన్వితుడు. అజ్ఞానాది దోషరహితుడు, ఆయన ఎనిమిది కార్యాలకు

అధిష్ఠాత. అవి 1) సృష్ఠి 2) స్థితి 3) లయం 4) నియమనము



5) జ్ఞానము ఇచ్చుట 6) అజ్ఞానమును కల్గించుట 7) బంధము 8) మోక్షము.

ఆయన అనగా విష్ణువు ఒక్కడే ఈ కార్యాలన్నిటినీ స్వతంత్రముగా నిర్వర్తించు

చున్నాడు.


శ్లో॥ స్వతంత్ర మస్వతంత్రంచ, ద్వివిధం తత్వముచ్యతే,

స్వతంత్రో భగవాన్విష్ణుః, నిర్దిషో శేష సద్గుణః


భావము :- “స్వతంత్రుడు శ్రీమహావిష్ణువు ఒక్కడే. ఆయనకు భిన్నమైనవన్నీ

అస్వతంత్రాలే. ఆయన దోష రహితుడు, కళ్యాణ గుణాకారుడు అని

సర్వదర్శన సంగ్రహంలో సాయన మాధవాచార్యులన్నారు”. అంతేకాక

భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తియోగమున 19వ శ్లోకమందు ఇలా అన్నారు

చూడండి.


శ్లో॥14-19

యోమామేవ మసమ్మూడో జానాతి పురుషోత్తమమ్।

స సర్వ విద్భజతిమాం సర్వభావేన భారత॥


భావము :- ఓ అర్జునా జ్ఞానియైనవాడు ఈ విధముగా తత్త్వతః పురుషోత్తము

నిగా తెలుసుకొనును. శత్రువులు కూడా ఆయన పురుషోత్తముడని

కొనియాడారు. ఆయన శరీరము ప్రాకృత శరీరముకాదు. ఆయనలో

ప్రాకృత గుణములు లేవు. ఆయనలో ప్రాకృత (ప్రకృతి) సంబంధము

ఏదీలేదు. ఆపాద మస్తకం జ్ఞానానందకరమైన దివ్యశరీరము ఆయనకున్నది.

రూప, రస, గంథాలను గ్రహించే శక్తిగల ఇంద్రియాలున్నాయి. ఆయనలోని

కళ్యాణ గుణములు ఆయన దివ్యాత్మ స్వరూపముకంటే వేరుకావు. ఆయన

పరిపూర్ణులు. ఆయన అనేక అవతారాలను కూడా దాల్చాడు. ఈ విధముగా

మహా విష్ణువు పురుషోత్తముడని, ఆయన సాకార సగుణుడని నిరూపించి

శ్రీమధ్వులు విష్ణువే ఆరాధ్యుడని బోధించాడు.


ప్రశ్న :- విష్ణువును గురించి వారు చెప్పినది వాస్తవమేనా?

జవాబు :- ఎవరి భక్తి వారిది, వారు అలా చెప్పడములో తప్పులేదుగానీ,

దానిని మనము (వినేవారు) విచక్షణ కల్గి చూచుకోవలసియున్నది. దేవుడు

తన సృష్ఠిలో మనుషులను, దేవతలను రెండు రకముల వారిని సృష్టించాడు.

సృష్ఠించిన వాడు దేవుడు, సృష్ఠింపబడినవారు మనుషులు మరియు దేవతలు.

మనుషులు కనిపించే జాతికాగా, దేవతలు కనిపించని జాతిగాయున్నారు.

మనుషులలో అనేక రకములవారు, అనేక గుణములవారు, అనేక జ్ఞానము

గలవారున్నట్లు దేవతలలో కూడా అనేక తారతమ్యములు గలవు. దేవునికి

రూప, నామ, క్రియలు ఉండవు. అందువలన ఆయన పేరు విష్ణువు

కాదు, శివుడు కాదు. 'దేవుడు ప్రత్యేకమయిన శక్తి'. ఆయననే భగవద్గీతలో

'పురుషోత్తముడని' చెప్పారు. వాస్తవ జ్ఞానము ప్రకారము విష్ణువు దేవతలలో

మొదటివాడయి వుండవచ్చునుగానీ, దేవుడు కాదు. సృష్ఠికర్త అసలే

కాదు. మధ్వాచార్యుల వారు, ఆయనను అనుసరించిన వారు విష్ణువునే

గొప్పగా చెప్పినా అది వారి భావమేగానీ, ఆ భావము సత్యము కాదు.

యజమానికి పనివానికి ఎంత తేడా ఉండునో అంతతేడా దేవునికి,

దేవతలకు కలదు. విష్ణువు కూడా తన మోక్షము కొరకు దేవున్ని ధ్యానించు

చుండెను.


భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమున చెప్పిన 19వ శ్లోకము

లోని భావము పురుషులలో ఉత్తముడయిన పరమాత్మను గురించి చెప్పినదే

గానీ విష్ణువును గురించి చెప్పలేదు. విశ్వములో విశ్వమంతటికీ ముగ్గురు

పురుషులే కలరు. ఆ ముగ్గురు పురుషులను “క్షరుడు, అక్షరుడు,

పురుషోత్తముడని” 16, 17 శ్లోకములలో చెప్పడము జరిగినది. సృష్ఠిలో


ప్రకృతి, పరమాత్మలు రెండే గలవు. ప్రకృతి ఐదు భాగములుగా విభజింప

బడినది. అట్లే పరమాత్మ మూడు భాగములుగా విభజింపబడినాడు.

ప్రకృతిలోని భాగము 1) ఆకాశము, 2) గాలి, 3) అగ్ని, 4) నీరు,

5) భూమి కాగా, పరమాత్మయొక్క మూడు భాగములు ఒకటి జీవాత్మ,

రెండు ఆత్మ, మూడు పరమాత్మయని పురుషోత్తమప్రాప్తి యోగమను

అధ్యాయములో 16, 17 శ్లోకములలో చెప్పడమైనది. 19వ శ్లోకమునకు

పైన ద్వైతులు చెప్పిన భావము పూర్తి తప్పు. ఆ శ్లోకములో చెప్పిన దానికి

వాళ్ళు వ్రాసిన వివరమునకు ఏమాత్రము సంబంధములేదు. దాని నిజమైన

భావము ఈ విధముగా కలదు చూడండి.


“ఎవడయితే నన్నే పురుషోత్తమునిగా తెలిసి అజ్ఞానమునంతటినీ

వదలి నన్నే ఆరాధించునో అట్టివాడు అన్ని భావముల నన్నే ఆరాధించిన

సర్వజ్ఞుడని చెప్పవచ్చును” అని అన్నాడు. అంతతప్ప ఆ శ్లోకములో వేరు

అర్థమే లేదు. పురుషోత్తమ ప్రాప్తి యోగములోని 16, 17, 18, 19

శ్లోకములు అద్వైత సిద్ధాంతమునకుగానీ, విశిష్టాద్వైత సిద్ధాంతమునకుగానీ,

ద్వైత సిద్ధాంతమునకు సంబంధించినవిగానీ కాదని తెలియవలెను. శంకరా

చార్య, రామానుజాచార్య, మధ్వాచార్యులు ముగ్గురి సిద్ధాంతములకు

ఏమాత్రము సరిపోని భావములు భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగములో

16, 17, 18, 19 శ్లోకములందు గలవు. 1) సృష్ఠి, 2) స్థితి, 3) లయ,

4) నియమనము 5) జ్ఞానము ఇచ్చుట, 6) అజ్ఞానమును కల్గించుట

7) బంధము, 8) మోక్షము అను ఎనిమిది దేవుడు అనబడు పరమాత్మ

ఆధీనములో ఉన్నాయిగానీ, దేవతలయిన త్రిమూర్తుల చేతిలో ఏమాత్రము

లేవు.


ప్రశ్న :- అయితే దేవతలలో శ్రేష్ఠుడు, మొదటివాడు అని పేరుగాంచిన

వాడు విష్ణువు కాదంటారా?


జవాబు :- దేవతలలో శ్రేష్ఠుడు, మొదటివాడు విష్ణువు అనడములో

తప్పులేదు. వాస్తవానికి దేవతలలో అత్యంత గొప్పవాడు విష్ణువేనని అనేక

పురాణములు, నాల్గు వేదములు చెప్పుచున్నవి. దానిని మేము కూడా

ఒప్పుకుంటాము. ఆయన సృష్టింపబడిన దేవతా గుంపులో గొప్పవాడే,

అయితే సృష్టికర్తయిన దేవుడు కాదని చెప్పుచున్నాము. దేవుడు వేరు

దేవతలు వేరని మరువకూడదు.


ప్రశ్న :- ఆచార్య త్రయమని పేరుగాంచిన శంకరాచార్యుల వారికి,

రామానుజాచార్యుల వారికి, మధ్వాచార్యుల వారికి దేవుడు వేరు దేవతలు

వేరని తెలియదా?


జవాబు :- తెలియకనే దేవున్ని వదలి దేవతలయిన వారిలో విష్ణువును

గొప్పగా చెప్పుకోవడము జరిగినది. శంకరాచార్యుల వారు నిరాకారాన్ని

బోధిస్తే, రామానుజ, మధ్వాచార్యుల వారు ఇద్దరు సగుణ, సాకారమైన

విష్ణువును గొప్పగా చెప్పడమైనది. ముగ్గురు ఆచార్యుల సిద్ధాంతములు

వేరయినా వారు ముగ్గురు వైదిక ఆచార్యులయిన దానివలన వారు

దేవున్ని తెలియక దేవతలనే తెలిసినవారై యున్నారు. వేదములను వ్యాసుడు

రచించగా ఆయనకు వేదవ్యాసుడని పేరువచ్చినది. అయితే వ్యాసుడు

వేదములను రచించినప్పటి భావము, ఆయన జీవిత చరమాంకములో

లేదని చెప్పవచ్చును. ఆ విషయము ప్రపంచమునకు ఏమాత్రము తెలియదు.

వ్యాసుడు అర్జునుని ద్వారా యుద్ధరంగములో సంభాషణ రూపములో

చెప్పబడిన ఐదు నిమిషముల సమాచారమును విని తాను అంతవరకు


జీవించిన 360 సంవత్సరముల జీవిత కాలము వృథా అనుకొన్నాడు.

ఐదు నిమిషముల గీతాసారమును బోధించిన వాడు ఎవరయినది వ్యాసుడు

గ్రహించగలిగాడు. అప్పుడు తాను రచించిన రచనలలోని తప్పు తనకు

తెలిసిపోయినది. తాను రచించిన 18 పురాణములలో విష్ణువును చెప్పగా

దానినే అందరూ అనుసరిస్తున్నారని అనుకొన్నాడు. అదే విధముగా వ్యాసుడు

ద్వాపరయుగము చివరిలో చనిపోగా, ఆయన రచనలను కలియుగములో

వచ్చిన ఆచార్య త్రయమయిన శంకర, రామానుజ, మధ్వాచార్యుల వారు

ఆధారము చేసుకొన్నారు. అందువలన రామానుజుల వారు, మధ్వులవారు

విష్ణువునే దేవుడని చెప్పారు.


ప్రశ్న :- శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతము ప్రకారము నిరాకారమునే

చెప్పాడు కదా! ఆయన సాకారమయిన విష్ణువును గురించి చెప్పలేదు

కదా! ఆయన దృష్ఠిలో దేవుడు ఎవరు?


జవాబు :- శంకరుడు పరిపక్వత చెందని వయస్సులో ఆర్యులు చెప్పమన్నది

చెప్పాడు తప్ప తాను స్వయముగా తెలిసి ఏదీ చెప్పలేదు. శంకరునికి

దాదాపు 27 సంవత్సరముల వయస్సు వచ్చిన తర్వాత వ్యాసుడు వ్రాసిన

భగవద్గీతను సంస్కృతములో చదువగలిగాడు. అప్పుడు నిజమైన దేవుడు

ఎవరయినది ఆయనకు అర్థమయినది. అంతవరకు తాను తెలిసో,

తెలియకో చెప్పిన అద్వైతము యొక్క నిజస్వరూపము తెలిసినది.

అద్వైతములోని సత్యము భగవద్గీత చదివిన తర్వాత తెలిసిన శంకరుడు

దేవుడు నిజముగా నిరాకారుడే అయినా అవసరమునుబట్టి అప్పుడప్పుడు

సాకారుడగునని తెలియగలిగాడు. అయితే ఆయన (శంకరుని) భావము

ఎవరికీ తెలియదు. తనకు తెలిసిన భావమును బయటికి చెప్పితే, అది


అప్పటివరకు తనను పెంచి, పోషించి, సిద్ధాంతకర్తగా ప్రచారము చేసిన

ఆర్యులకు సరిపోదని తెలిసి శంకరుడు తన భావమును బయట పెట్టలేదు.

శంకరుడు తన భావమును జరుగబోవు కాలములో బయట పెట్టగలడని

భావించిన ఆర్యులు శంకరుల ద్వారా ఏ విషయము బయటికి పొక్కకుండా

ఆయనను లేకుండా చేశారని కొందరనుకోవడము జరిగినది. శంకరుడు

మొదట దేవుడెవరయినది తెలియని పరిస్థితిలో యున్నా, చివరకు

అసలయిన పరమాత్మే దేవుడని తెలియగలిగాడు. అయితే ఆ విషయమును

బయటికి చెప్పలేకపోయాడు. ముగ్గురు ఆచార్యులు వేదములనే ఆశ్రయించి

ముందుకుపోయినా శంకరుడు జీవిత చివరి భాగములో అసలయిన

జ్ఞానమును, అసలయిన దేవున్ని గుర్తించగలిగాడు. మిగతా ఇద్దరు

ఆచార్యులకంటే ఒక విధముగా శంకరుడే సత్యమును తెలియగలిగాడని

చెప్పవచ్చును.


ప్రశ్న :- ఆర్యుల వలన శంకరాచార్యుల వారు ప్రమాదములో చిక్కుకొని

చనిపోవడము జరిగినది. రామానుజుల వారు కూడా చిన్నవయస్సులోనే

ఆర్యులు చేసిన హత్యాప్రయత్నమునుండి బయటపడినాడు. ప్రమాదమును

గురించిన సమాచారము తెలియకపోయివుంటే అతడు కూడా హత్య

కావింపబడేవాడే. ఆర్యులు తమకు అడ్డము వచ్చిన వారిని, తమ అద్వైత

సిద్ధాంతమునకు వ్యతిరేఖముగా బోధించిన వారిని మట్టుపెట్టాలని చూచారు.

అటువంటి ఆర్యుల మధ్య మధ్వాచార్యులు అద్వైతమునకు విరుద్ధముగా

యున్న ద్వైత సిద్ధాంతమును ఎలా బయటికి చెప్పాడు? ద్వైతమును చెప్పిన

మధ్వాచార్యుల వారిని ఆర్యులు ఏమీ చేయలేకపోయారా?


జవాబు :- మధ్వాచార్యుల వారు కర్నాటక రాష్ట్రములో 'ఉడిపి' దగ్గర


నివసించుచుండెను. మధ్వులు అప్పుడప్పుడు అద్వైతమునకు వ్యతిరేఖముగా

మాట్లాడుచుండెను. అయినా ఆయన వ్యతిరేఖత ఆర్యుల వరకు తెలియ

లేదు. మధ్వులు ఉడిపి ప్రాంతము కాకుండా మిగతా ప్రాంతములలో

ఎక్కడా ప్రచారము కాలేదు. శంకరాచార్యులు, రామానుజాచార్యులతో

పోల్చిచూస్తే వారు బయటి ప్రపంచమునకు తెలిసినట్లు మధ్వాచార్యులు

ఏమాత్రము బయటికి ప్రచారము కాలేదు. అందువలన మధ్వాచార్యుడు

ఎవడో ఆర్యులకు తెలియదు. అందువలన మధ్వులు అద్వైత వ్యతిరేఖులు

అను విషయము ఎవరికీ తెలియదు కావున ఆర్యుల వలన ఆయనకు

ముప్పులేకుండా పోయినది. మధ్వులు బయట ప్రపంచమునకు తెలియక

పోవడమే అతనికి రక్ష అయినది.


ప్రశ్న :- “బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య" అను శంకరాచార్యుల వారి మాటలో

ఎంతవరకు సత్యమున్నది?


జవాబు :- శంకరాచార్యుల వారు "బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య" అను

మాటను చెప్పినది వాస్తవమే అయినా, వాస్తవ జ్ఞానమేదో శంకరునికి

తెలియని స్థితిలో ఆ మాటను ఆయన చెప్పడమైనది. 27 సంవత్సరముల

వయస్సులో భగవద్గీతను చదువగల్గిన తర్వాత 'జగత్ మిథ్య' అనుమాట

సరియైనది కాదని తెలియగలిగాడు. అయితే ఆ విషయము శంకరుడు

బయటికి చెప్పకనే చనిపోయాడు. కనుక నేటికినీ అద్వైతమును చెప్పువారు

"బ్రహ్మసత్యం, జగత్ మిథ్య" అని అంటున్నారు. అయితే ఆ మాట పూర్తి

సత్యముకాదని వారికి తెలియదు. అందువలన అట్లే చెప్పుచున్నారు.


ప్రశ్న :- అద్వైతులు “ఓం నమఃశివాయ” అను మంత్రమును చెప్పుచూ

తమ దేవుడు నిరాకారమైనవాడని గుర్తుగా శివలింగమును చూపుచుందురు.


విశిష్టాద్వైతులు, ద్వైతులు తమ దేవుడు సాకారమైన విష్ణువని మూడు

నామములనే ధరించుచుందురు. అద్వైతులు విష్ణువునుగానీ, మూడు

నామములనుగానీ పూర్తి వ్యతిరేఖించుచుందురు. ద్వైతులు, విశిష్టాద్వైతులు

శివున్ని, విభూతి రేఖలను ఎంతవరకు వ్యతిరేఖిస్తారు?

జవాబు :- అద్వైతులు విశిష్టాద్వైతులు ఒకరి దేవున్ని మరొకరు పూర్తిగా

వ్యతిరేఖించుచుందురు. విష్ణువంటే అద్వైతులకు, శివుడంటే విశిష్టాద్వైతులకు

ఏమాత్రము సరిపోదు. అయితే విశిష్టాద్వైతులవలె మధ్వులకు శివుడంటే

వ్యతిరేఖ భావము లేదు. శివునకు భారతములో అపారమైన ఆదరణ

ఉన్న విషయము మధ్వులు గ్రహించారు. దీనికి తోడు మధ్వాచార్యులు

స్వయంగా షివల్లి శైవకుటుంబములో జన్మించాడు. దక్షిణ కన్నడ దేశములో

చంద్రమౌళీశ్వరుడుగా, అనంతేశ్వరుడుగా, శివుడు అనేక దేవాలయాలలో

ఆరాధింపబడడము శ్రీమధ్వుడు చూచాడు. అందుచేత ద్వైత సిద్ధాంతములో

శివునకు అత్యున్నత స్థానము కలదు. చతుర్ముఖ బ్రహ్మ, వాయుదేవుడు,

మిగతా దేవతలు శివుని తర్వాత వారే. అందుచేత శివునకు వ్యతిరేఖముగా

మధ్వుల ద్వైతములో ఎక్కడా, ఏ రచనలలోనూ లేదు. మధ్వులు వాయు

దేవుని పుత్రుడయిన హనుమంతున్ని, ప్రహ్లాదుని అవతారమైన రాఘవేంద్ర

స్వామిని ఎక్కువ ఆరాధిస్తారు. ఇప్పటికీ హనుమంతుని దేవాలయములలో

మధ్వులే అర్చకులుగా ఉంటారు.


ప్రశ్న :- 'సిద్ధాంతము' అంటే అది ఒక శాస్త్రములోని అంశముగా

ఉండవలెను. త్రిమతాచార్యులు ముగ్గురు వేదములనే ఆశ్రయించారు. ఒకరు

దేవుడు నిరాకారుడు అంటే మరొకరు 'కాదు సాకారుడు' అని అన్నారు.

అటువంటప్పుడు రెండుమాటలు సత్యము కావు కదా! అందులో ఏదో


ఒకటి మాత్రము సత్యముగాయుండి మిగతా మరొకటి అసత్యముకాగలదు.

ఏది అసత్యమయినా అది సిద్ధాంతముకానేరదు. శాస్త్రము అంటే సత్యము

అని, శాసనము అని చెప్పబడుచున్నది. అటువంటప్పుడు శాస్త్రములోని

ఏ సిద్ధాంతము అసత్యముగా ఉండదు. అద్వైత, విశిష్టాద్వైతములలో ఒకటి

మాత్రము సత్యమైనప్పుడు రెండవది సిద్ధాంతమే కాదు. ఇప్పుడు అద్వైత,

విశిష్టాద్వైతములలో ఎవరిది సిద్ధాంతము? ఎవరిది సిద్ధాంతము కాదు?

జవాబు :- నేడు హిందూమతములో గొప్పగా చెప్పుకొను సిద్ధాంతములు

అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత అనునవి కాగా మూడు శాస్త్రబద్ధమైనవి

కానందున అవి సిద్ధాంతములనబడవు. అద్వైతముగానీ, విశిష్టాద్వైతము

గానీ, ద్వైతముగానీ మూడు బ్రహ్మవిద్యా శాస్త్రమునకు సంబంధించిలేవు.

శాస్త్రములు భూమిమీద మొత్తము ఆరు గలవు. ఆరు శాస్త్రములలో కేవలము

ఒక్కటే బ్రహ్మ విద్యాశాస్త్రము గలదు. దైవమునకు సంబంధించిన దానిని

బ్రహ్మవిద్యా శాస్త్రము అంటాము. బ్రహ్మవిద్య అనగా 'పెద్ద విద్య' అని

అర్థము. ఒకటి దైవ విద్య అయిన బ్రహ్మవిద్యకు సంబంధించినది కాగా,

మిగతా ఐదు ప్రపంచమునకు సంబంధించినవిగా యున్నవి. దేవునికి

సంబంధించిన విషయమగుట వలన ముగ్గురు ఆచార్యులు చెప్పిన

సిద్ధాంతములు బ్రహ్మవిద్యా శాస్త్రమునకు సంబంధించినవిగా ఉండవలెను.

అయితే అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము మూడు బ్రహ్మవిద్యకు

సంబంధము లేనివిగాయున్నవి. అందువలన ముగ్గురు ఆచార్యులు

ప్రతిపాదించినవి కేవలము ప్రతిపాదనలేగానీ అవి సిద్ధాంతములు కావు.

బ్రహ్మవిద్యాశాస్త్రమునకు ఈ మూడు సిద్ధాంతములకు ఎటువంటి

సంబంధము లేదు.


ప్రశ్న :- బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరించి చూస్తే అవి సిద్ధాంతములు

కావని తెలియుచున్నదని మీరు అంటున్నారు కదా! మీరు దేనిని బ్రహ్మ

విద్యా శాస్త్రముగా లెక్కించుచున్నారు.


జవాబు :- దేవుడు స్వయముగా చెప్పినదే దైవసిద్ధాంతములతో కూడిన

దైవశాస్త్రమని చెప్పవచ్చును. దేవుడు అనబడువాడు సృష్ట్యాదిలోనే తన

ధర్మములను గురించి సంపూర్ణముగా చెప్పడము జరిగినది.

అది దైవ

ధర్మములతో కూడుకొనియుండుట వలన దానినే బ్రహ్మవిద్యా శాస్త్రము

అని అంటున్నాము. సృష్ట్యాదిలో దేవుడు చెప్పిన జ్ఞానము గ్రంథరూపములో

వ్రాయబడలేదు. తర్వాత ద్వాపరయుగమున సృష్ట్యాదిలోని జ్ఞానమునే

కృష్ణుడు అర్జునునకు చెప్పగా వ్యాసుడు దానిని గ్రంథరూపముగా చేశాడు.

వ్యాసుడు వ్రాసిన బ్రహ్మవిద్యా శాస్త్రమే నేడు భగవద్గీతగా మనముందర

యున్నది. శాస్త్రము మన ముందరుండగా, దేనినయినా శాస్త్రముతో

పోల్చి చూడవచ్చును. అలా భగవద్గీతతో పోల్చి ముగ్గురి సిద్ధాంతములను

చూస్తే దేవుడు చెప్పిన ధర్మములకు అవి ఏమాత్రము సరిపోవు.

అందువలన అద్వైత, విశిష్టాద్వైత, ద్వైతములనబడునవి సిద్ధాంతములు

కావు. శంకరాచార్యుల వారు చెప్పిన అద్వైతము అనగా 'రెండు కానిది

మూడు' అని చెప్పితే అది సిద్ధాంతమగును. అయితే 'రెండుకానిది

ఒకటి' అని వెనక్కు చెప్పడము వలన అది సిద్ధాంతము నుండి

దిగజారిపోయినది. దేవుడు రూప, నామ, క్రియారహితుడు అన్న దైవ

ధర్మమునకు మిగతా రెండు విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతములుండుట వలన

వాటిని సిద్దాంతము లనుటకు వీలులేదు. అట్లు చెప్పితే ఇంతవరకు

సిద్ధాంతకర్తలనుకొన్నవారు సిద్ధాంతకర్తలే కారు.


ప్రశ్న :- ఊరంతా ఉత్తరమంటే మీరు ఒక్కరు మాత్రము దక్షిణమంటున్నారు.

మీరు అలా చెప్పవచ్చునా?


జవాబు :- సత్యప్రకటన ఎంత చెడుగా కనిపించినా సత్యము కావాలను

కొన్నప్పుడు తప్పక చెప్పవలసి వస్తుంది. అసత్యమును చెప్పినా ఫరవాలేదు

చెప్పండి అంటే అందరివీ సిద్ధాంతములేనని చెప్పవచ్చును. ఇతరుల ముఖ

స్తుతికి మాట్లాడుటకు, ఇతరులకు నచ్చునట్లు చెప్పుటకు మాట్లాడేమాట

ఇతరులను బట్టియే ఉండును. అప్పుడు సత్యము మాట్లాడవచ్చును

అసత్యము మాట్లాడవచ్చును. ఉదాహరణకు చెప్పితే ఒక పెద్దమనిషి

ఒకరోజు రెండు సభలలో హాజరయి అక్కడున్న వారికి ఏదో కొంత చెప్పి

రావాలి. మొదటి సభకు ఉపన్యాసకుడుగా పోయాడు. అక్కడ

సభలోయున్నవారంతా ఒక జైలులో ఖైదీలుగాయున్నవారు. వారు అందరు

దొంగతనములు చేసి దొంగలుగా పట్టుపడి జైలులో శిక్షలు అనుభవిస్తూ

యున్నవారు. వారిముందర నిలబడి వారికి నచ్చినట్లు చెప్పాలి అంటే

ఒక రకము చెప్పాలి. వారికి నచ్చకపోయినా, వారందరికీ విరుద్ధమైనా

ఫరవాలేదు అనుకొంటే మరొక రకము చెప్పాలి. అక్కడున్న దొంగల

ముఖస్తుతికి, వారికి నచ్చినట్లు మాట్లాడుటకు అసత్యమును మాట్లాడాలి.

వారికి వ్యతిరేఖముగా చెప్పినా ఫరవాలేదు అనుకొంటే సత్యమునే

మాట్లాడాలి.


ఉపన్యాసకుడుగాయున్న అతను మొదటి సభలోని వారిని చూచి

వారు అందరూ దొంగలే అని తెలిసియుండుట వలన వారితో మంచిగా

మాట్లాడుటయే బాగుండునని నిర్ణయించుకొన్నాడు. అప్పుడు దొంగలకు

నచ్చినట్లే చెప్పుచూ, మనిషి జీవితములో దొంగతనము చేయుట అత్యంత


తెలివైన పని. మంచి తెలివియున్నవారే దొంగతనము చేయగలరు. వారి

తెలివినిబట్టి వారి దొంగతనములో మెలుకువలు తెలిసియుందురు.

అంతేకాక లోకములో అందరినీ సమానముగా చూచు జ్ఞానము కలవాడే

దొంగతనము చేయును. అటువంటివాడు 'ఇతని సొమ్మును తీసుకోకూడదు,

అతని సొమ్ముని తీసుకోవచ్చును' అను బేధము ఉండదు. అటువంటివానికి

అందరూ సమానమే. సుఖ దుఃఖములను సమానముగా చూచువాడు’

వాని సొమ్మును దొంగిలిస్తే వాడు బాధపడునే అని అనుకోడు. అటువంటి

వానికి ఎటువంటి బేధ గుణము ఉండదు. సమయానికి ఎవరి సొమ్ము

దొరికినా వాడు తీసుకొనును. ఎదుటి వాని బాధతోగానీ, ఎదుటివాని

కర్మనుగానీ లెక్క చేయనివాడు జ్ఞాని అనబడును. అందువలన 'ఇతరుల

బాధను లెక్కచేయక తన కర్తవ్యమును చేయువాడు దొంగ అయినా, దొర

అయినా ఒక్కటే' అని అజ్ఞానమును జ్ఞానమును కలిపి లేని అబద్దము

మాటలన్నిటిని చెప్పడము వలన అక్కడున్న వారి మనోభావములను

గౌరవించినట్టయినది. ఆ సభలోయున్న దొంగలందరికీ అతను చెప్పిన

మాటలు పూర్తి నచ్చాయి. అప్పుడు అక్కడున్న వారందరూ అతను బాగా

చెప్పాడని పొగడడము జరిగినది.


ఎవరి మనోభావములు వారికి మంచిగాయుండును. 'దొంగకు

దొంగచింత, వ్యభిచారికి వ్యభిచారము చింత' అన్నట్లు దొంగకు దొంగతనమే

మనోభావముగా ఉండును. అయితే వాని ముఖస్తుతికి అక్కడ దొంగతనమూ

మంచిదని చెప్పితే అసత్యమును చెప్పినట్లగును. సత్యమును దాచిపెట్టి

నట్లగును. అట్లుకాకుండా సత్యమునే చెప్పితే వాని మనోభావములను

దెబ్బతీసినట్లగును. వారి భావములను అగౌరవపరచినట్లుగును. శాస్త్రపద్ధతి

ప్రకారమైతే సత్యమును చెప్పవలసి యుండును. అశాస్త్రీయతను చెప్పితే,


అసత్యమును చెప్పినట్లగును. ఇప్పుడు ఉపన్యాసకుడు రెండవ సభలోనికి

పోయాడు. అక్కడందరూ నీతి నిజాయితీ కలవారుండుట వలన

సభలో నీతిని గురించి, జ్ఞానమును గురించి శాస్త్రబద్దముగా చెప్పడము

జరిగినది. చెప్పిన మాటలలో దొంగతనము, వ్యభిచారము ఇతరుల

దుఃఖముల మీద ఆధారపడియుండుట వలన ఆ పనులు చేయడము

వలన పాపము సంభవించును. పాపము వస్తే దాని కారణమున తర్వాత

జన్మలలో పాపమును దుఃఖరూపములో, కష్ట రూపములో, రోగరూపములో

అనుభవించవలసి వచ్చును. అందువలన అన్యాయము, అవినీతి పనులకు

మనిషి దూరముగా యుండవలెనని చెప్పాడు. ఇక్కడ చెప్పినది ఒకరకమైన

మాటలుకాగా, దొంగల సభలో చెప్పినది మరొక రకమైన మాటలు.

విధముగా మాట్లాడువానిని 'కపటుడు' అని అంటారు. ఇంకా అలా రెండు

రకముల మాట్లాడువానిని ఊసరవెల్లి అని కూడా అంటారు. ఒక పద్ధతి

లేని మనిషిగా చెప్పబడును. దేవుని లెక్కలో అతడు మంచివాడు కాడు.

అందువలన ఏమీ మాట్లాడవద్దు, మాట్లాడితే సాధ్యమున్నంత వరకు

సత్యమే చెప్పాలి అనునది పెద్దలమాట. పెద్దల మాటను అనుసరించి

సమాజమునకు మంచి చేయాలనుకొంటే తాను చెడ్డవానిగా కనిపించినా

ఫరవాలేదు, సమాజానికి మంచిని చేకూర్చు మాటలనే చెప్పాలి. “నిజము

నిష్ఠూరము, సత్యము లోకవిరుద్ధము” అను మాటలను లెక్కచేయక ఒక

నిజాయితీగా నేను నడుచుకొంటే నన్ను చూచి రేపు సమాజము కూడా

నిజాయితీగా నడువగలదను ఉద్దేశ్యముతోనే మాట్లాడు మాటగానీ, చేసే

పనిగానీ ఉండవలెనని కోరుకొంటున్నాను. అందువలన సిద్ధాంతకర్తల

విషయములో బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారము చూస్తే ‘వారివి ప్రతిపాదనలే

గానీ, వాస్తవానికి సిద్ధాంతములు కావని చెప్పవచ్చును. నా మాటలోని


సత్యము తెలియనివారికి లోక విరుద్ధముగానే కనిపించినా 'సత్యమునే

చెప్పాలి' అను ఉద్దేశ్యముతోనే చెప్పుచున్నాను.


ప్రశ్న :- మీరు చెప్పునది మీకు సత్యమే అయినా, ఎదుటివారికి అసూయతో

చెప్పు మాటలుగా కనిపించుచుండవచ్చును కదా! అటువంటప్పుడు వారు

మిమ్ములను విమర్శించవచ్చును కదా! దానికి మీరేమంటారు?

జవాబు :- మేము ఎవరి తప్పులు ఎంచకుండా మాకు తెలిసిన

దైవజ్ఞానమును మేము చెప్పుచూ పోవునప్పుడు అద్వైత సిద్ధాంతమును,

ద్వైత సిద్ధాంతమును అనుసరించువారు మా భక్తులను ఎంతోకాలముగా

వేధించడము, దాడులు చేయడము చేయుచున్నారు. మేము మా సిద్ధాంత

భగవద్గీతను ఇల్లిల్లూ తిరిగి ప్రచారము చేయుచుయుంటే సంతోషపడవలసి

నది పోయి అసూయతో చూస్తున్నారు. బౌద్ధులను, జైనులను, సిక్కులను

హిందూమతమునుండి విడదీసి, వారు వేరు మతము వారని చెప్పిన

సూత్రమునే ఉపయోగించి హిందూమతములోనే అసలయిన సిద్ధాంతముగా

యున్న త్రైత సిద్ధాంతమును హిందూ మత సిద్ధాంతమే కాదనుచూ, పర

మతమని పేరుపెట్టి దూషించడమే కాకుండా, భౌతికదాడులు కూడా చేయు

చున్నారు. అన్నిటికంటే సులభమయిన ఆరోపణ పరమత ప్రచారమని

పేరుపెట్టి నిందించడము, దాడి చేయడము నేడు హిందువులలో యున్న

కొందరు అజ్ఞానులకు సులభమయిపోయినది. ఏమాత్రము ఆత్మజ్ఞానము

గానీ, భగవద్గీత జ్ఞానముగానీ తెలియనివారు ఆర్యుల మోచేతి క్రింద నీరు

త్రాగువారు, తాము హిందూమతమును ఉద్ధరించు హిందూమత రక్షకులమని

పేరు పెట్టుకొన్నవారు, మేము చెప్పు జ్ఞానమును ఏమాత్రము వినకుండా,

చదువకుండా, అటువంటి ప్రయత్నము కూడా చేయకుండా తనకు

అవసరము లేకున్నా తనకు గుర్తింపుకొరకు మా జ్ఞానమును


వ్యతిరేఖించడము, నేడు ఇంటింటికీ తిరిగి ప్రచారము చేయుచున్న మా

భక్తులను తన్ని తరిమేయడమే పనిగా పెట్టుకొన్నారు.


భగవద్గీత ప్రచారం చేస్తుంటే

దాడి చేశారు.


కోవూరు, జనవరి 1, 2016 ప్రభాతవార్త

కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో శుక్రవారం శ్రీకృష్ణ మందిరం

హిందూ జ్ఞానవేధిక సభ్యులు భగవద్గీతపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటే ఆ

ప్రాంతానికి చెందినే అశోక్, అతని అనుచరులు తమపై దాడి చేశారంటూ జ్ఞా

నవేధిక సభ్యులు వెంకటసుబ్బయ్య, క్రిష్ణ, సుబ్బానాయుడు తదితరులు కోవూరు

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాము ఇనమడుగు గ్రామంలో శుక్రవారం

ఇంటింటికీ వెళ్లి భగవద్గీపై ప్రజలకు వివరిస్తుంటే అశోక్ అతని అనుచరులు తమను

ఆకారణంగా తూలనాడడమే కాకుండా దాడి చేయడం.. తమ వాహనాన్ని పెట్రోల్

పోసి తగలబెడుతామని బెదిరించారన్నారు. భగవద్గీత పుస్తకాలను లాక్కొని విసిరి

వేశారన్నారు. తమకు న్యాయం చేయాలని వారు ఎస్ఐను వేడుకున్నారు.


అటువంటి అజ్ఞానుల వెనుక ముఖ్యముగా ఆర్యుల గాలితో

నింపబడిన వారున్నారని మాకు అర్థమయినది. మేము ఈ గ్రంథమును

వ్రాయుచున్నప్పుడే మేము చెప్పునది సత్యమని అందరికీ తెలియు సంఘటన

జరిగినది. నేడు క్రీ.శ. 2016వ సంవత్సరము యొక్క మొదటి దినము

అనగా జనవరి ఒకటవ తేదీ. ఇప్పుడు జనవరి ఒకటవ తేదీ

సాయంకాలము ఆరు గంటలప్పుడు ప్రస్తుత విషయమును వ్రాయు

చున్నాము. ఇదే రోజు ఉదయము దాదాపు పదకొండు లేక పన్నెండు

గంటల సమయములో నెల్లూరు దగ్గర నెల్లూరుకు కేవలము ఐదు కిలోమీటర్ల

దూరములో యున్న ఇనమడుగు అను ఊరిలో భగవద్గీతను మరియు


మేము వ్రాసిన మిగతా ఆధ్యాత్మిక సంబంధమైన 73 గ్రంథములను గురించి

చెప్పుచూ హిందూ మతము యొక్క ఔన్నత్యమును కాపాడుటకు

ప్రయత్నించుచుండగా, నేను హిందూ రక్షక సంస్థలో పని చేయుచున్నానని

చెప్పుకొను వ్యక్తి, ఇది పరమత ప్రచారమని ఆరోపించి అక్కడున్న వారిని

కూడా ప్రేరేపించి మా ప్రచారకులను నలుగురిని కొట్టడము జరిగినది.

ఇప్పటికి ఇది పదవ దాడికాగా, దూషించి పంపినవి పదుల సంఖ్యలో

యున్నాయి. ఇవన్నియూ ఒక హిందూరక్షకులమను వారు మాత్రమే

చేయుచున్నారు. ఒకటి లేక రెండు గ్రంథములు చదివిన వారు ఎంతో

గొప్ప జ్ఞానమని పొగడుచూ మిగతా గ్రంథములను కూడా తీసుకొని

చదువుచున్నారు. ఈ మధ్య కాలములో మా జ్ఞానము అత్యంత వేగముగా

ప్రచారము కాజొచ్చినది.


మా గ్రంథములు చదివిన వారందరూ ఎంతో సంతోషపడుచూ

ఇంతవరకు హిందూమతములో తెలియని జ్ఞానము నేడు తెలిసినదని

ఎందరో హిందువులు సంతోషపడుచుండగా అది చూచి ఓర్వలేని ఆర్య

సాంప్రదాయములలో మునిగి తేలుచున్న 'హిందూ రక్షణ' అని పేరు

పెట్టుకొన్నవారు ఏమాత్రము ఆలోచించకుండా, ఏమాత్రము మా

గ్రంథములను చదువకుండా, మేము చెప్పు బోధలను వినకుండా కేవలము

అసూయతో మాట్లాడడము, దాడులు చేయడము జరుగుచున్నది.

ఇదంతయూ చూచిన మేము నేడు వారికి తెలియకుండానే ఆర్యుల

ఉచ్చులో చిక్కుకొని, హిందూమతమును ఉద్ధరించువారమని చెప్పుకొను

మూర్ఖ హిందువులకు, నిజమైన హిందూజ్ఞానము తెలియుటకు, మేము

సిద్ధాంతకర్తల యొక్క విషయమును బయటపెట్టి మాట్లాడుచున్నాము.

హిందువుల వ్రేలితో హిందువుల కన్నుపొడుచు ఆర్యుల ఆంతరంగిక


కుట్రలను బయట పెట్టుచున్నాము. పూర్వమునుండి ఎంతో తెలివిని

ఉపయోగించిన ఆర్యులు ద్రావిడులలో కూడా తమ భావమును, తమ

జ్ఞానమును నింపి, తమ సాంప్రదాయములే నిజమైన జ్ఞానమన్నట్లు చేసి,

భవిష్యత్తులో వారికి వ్యతిరేఖులు రాకుండా ఒక ఫతకము ప్రకారము,

'హిందూ రక్షణ' అను పేరును ముందు పెట్టి తమ మతమును కాపాడు

కొనుటకు పరమతము వారిని తరిమివేయాలను ఉద్దేశ్యమును హిందూ

రక్షణ సంస్థలలో నింపి తమకు వ్యతిరేఖముగాయున్న హిందువులను

పరమతమను ఆరోపణతో వేధించను, హింసించను మొదలుపెట్టారు.

కనిపించని ఆర్యుల వ్యూహములో చిక్కుకొన్న హిందూమత అభిమానులు

ఆర్యులచేతిలో కీలుబొమ్మలై, వారి వెనుక నడిచే బకరాలై (గొర్రెలై) మనము

ఏమి చేయుచున్నామను ఆలోచన లేకుండా తమతోటి హిందువులను

మీరు హిందువులు కాదంటున్నారు. ఇది పూర్వమునుండి ఆర్యులు అమలు

చేయు ఫతకమని వారికి తెలియదు. ఎవరో ఎక్కడో క్రైస్తవునిగానో,

ముస్లీమ్లోనో మతము మారితే దానిని భూతద్దములో చూపి "హిందూ

మతమంతయు క్షీణించి పోవుచున్నది” అని గొంతు చించుకొను హిందూ

సంస్థలకు హిందువులే అయిన బౌద్ధులను, జైనులను, సిక్కులను 70 లేక

80 కోట్లమందిని హిందువులు కాదని పరమతముగా చిత్రించిన రోజు

హిందూమతము క్షీణించినదని తెలియలేదా?


మూడు యుగములనుండి ఇందువులు (హిందువులు) 'శాంతి

కాములు” అని పేరుగాంచియుండగా, కలియుగములో ఆర్యుల కనిపించని

ఆగడాల వలన హిందువులు దౌర్జన్యముగా ప్రవర్తించువారను చెడ్డపేరు

వచ్చినది. నేడు జరుగుచున్న సంఘటనలనుబట్టి హిందువులయిన మేము

కూడా అదేమాటను అనవలసి వచ్చినది. ఇప్పటినుండి మా జోలికి


వచ్చినవారిని సులభముగా వదలిపెట్టమని మేము గొప్ప జ్ఞానులుగా

నిరూపించుకుంటామని చెప్పుచున్నాము. మమ్ములను గురించి మీకేమయినా

తెలియకపోతే మీరు మమ్ములను సంప్రదించి ప్రశ్నించవచ్చును. దానికి

కావలసిన వివరణ మేము ఇవ్వగలము. అట్లుకాకుండా మేము చెప్పునది

ఏమాత్రము వినకుండా దౌర్జన్యము చేస్తే, మేము కూడా మా రక్షణ నిమిత్తము

ప్రతిఘటించవలసి వస్తుంది.


మాకు ఎన్నో ఆటంకములు కల్గినా ఎంతో ఓర్పుగా ఇంత

కాలమున్నాము. ఇంతవరకు డెబ్బయి (73) గ్రంథములను వ్రాశాము.

కొన్ని గ్రంథములలో హిందువులే మా మీద చేయు అరాచకములను

వ్రాశాము. అయినా హిందువులలో హిందూధర్మములు తెలియనివారు

హిందూరక్షకులుగా యుండుటవలన ఎవరు మంచి చేయుచున్నారో, ఎవరు

చెడు చేయుచున్నారో తెలియనివారు ఆర్యుల ఆధీనములోయుండి గొర్రెలవలె

ఎటు తోలితే అటుపోతున్నారు. నేడు హిందూ రక్షకులమను వారిలో

ఎవరికీ హిందూ ధర్మములంటే ఏమిటో తెలియదు. అటువంటి వారిని

ఆసరాగా చేసుకొని ఆర్యులు మొదటినుండి చేయు పన్నాగమునే

చేయుచున్నారు. శంకరాచార్యులను చిన్నవయస్సులోనే పొట్టన పెట్టు

కొన్నారు. అదే శంకరాచార్యుని పేరుతో నేడు కూడా హిందూ మతములో

వెనుకనుండి పెత్తనము చేయుచున్నారు. తమను మొదటి నుండి వ్యతిరేఖించు

రామానుజాచార్యులను చంపాలని చూచారు. అది విఫలమైనది. అది

జరిగియుంటే ముగ్గురు సిద్ధాంతకర్తలలో ఇద్దరిని వారే మ్రింగివేసినట్లయి

వుండేది. ద్వైతమును చెప్పిన మధ్వుడు ప్రచారములో లేడు కావున

బ్రతికిపోయాడు. నేడు ఆర్యుల అద్వైతమునకు పూర్తి వ్యతిరేఖముగా యున్న

త్రైతసిద్ధాంతము వలన నిజమైన జ్ఞానము ప్రజలకు తెలిసిపోయి తమ


ఉనికే లేకుండా పోగలదని తలచిన ఆర్యులు మా ఎడల ఎంతో అసూయ,

ఆవేశము కల్గియున్నారు. దాని ఫలితమే నేడు మా మీద జరుగు

అరాచకములని తెలియుచున్నది. వారు అంత చేస్తే తప్పుగానిది మేము

ఆర్యులను గురించి వారి చరిత్రను గురించి వ్రాస్తే తప్పగునా? దేవుడు

భగవంతునిగా వచ్చి చెప్పిన భగవద్గీతా జ్ఞానమును బ్రహ్మవిద్యా శాస్త్రబద్దమైన

భగవద్గీతను మేము బోధించుచున్నాము. భగవద్గీతా జ్ఞానములో ద్వైత,

అద్వైతములు రెండూ కొట్టుకుపోవుచున్నవి. మేము చెప్పు సిద్ధాంతము

భగవద్గీతలో బలముగా యున్నదని అందరికీ తెలియుచున్నది. మా దృష్ఠి

అంతయూ అసలయిన దైవజ్ఞానమును ప్రజలకు తెల్పడమే. మేము మా

జ్ఞాన ప్రచారములో ఇతర మతముల వలన కొంత ఇబ్బందులను

ఎదుర్కొంటున్నాము. అయినా వారు సంప్రదింపుల ద్వారా సత్యమును

తెలుసుకొని తటస్థముగా ఉండిపోతున్నారు. అయితే హిందువులలో

కొందరు మాత్రము పూర్తి మమ్ము వ్యతిరేఖించుచున్నారు. వారు

సంప్రదింపులు జరుపరు, మా మనోభావమును తెలియరు. అందువలన

మేము ఎదురు దాడిగా మిగతా సిద్దాంతములను ముఖ్యముగా ఆర్యులను

విమర్శించవలసి వచ్చినది.


ప్రశ్న :- మీరు 73 గ్రంథములను వ్రాశారా?

జవాబు :- అవును వ్రాశాము. ఇంకా వ్రాయబోతాము. దాదాపు వంద

గ్రంథముల వరకు మా రచనలు ఆగవు.


ప్రశ్న :- హిందువులలోనే వ్యతిరేఖత యున్నదని మీరు చెప్పుచున్నారు.

కదా! అటువంటప్పుడు మీ రచనలకు సమాజములో ఆదరణ యున్నదా?

జవాబు :- మాకు హిందువులందరూ వ్యతిరేఖులు కారు. తమకు


తెలియకుండానే ఆర్యుల ఉచ్చులో తగులుకొని హిందూ సంస్థలలో ఏదో

ఒక స్థానములోయున్న కొందరు హిందువులు వారి ఉనికిని బయటికి

తెలియునట్లు మమ్ములను గురించి మాట్లాడడము మరియు ఇబ్బంది

పెట్టడము జరుగుచున్నది. అదియూ హిందూ రక్షణ సంస్థలలో పనిచేయు

వారు మాత్రమే మాకు వ్యతిరేఖము కావున హిందువులందరిలో పది

శాతము మందికి మేము, మా జ్ఞానము సరిపోకపోవచ్చును. మిగతా 90

శాతము మందికి మా జ్ఞానము గొప్పగా కనిపించుచున్నది. అందువలన

మా గ్రంథములకు మంచి ఆదరణ గలదు. మా గ్రంథములలో ఏ ఒక్క

గ్రంథము చదివినవారయినా తప్పక మిగతా గ్రంథములను చదువాలని

ప్రయత్నము చేసి చదువడము జరుగుచున్నది. అలా చదివిన వారిలో 25

శాతము మంది మా గ్రంథములను గురించి ఇతరులకు చెప్పి వారిచేత

కూడా చదివించుచున్నారు. ఈ విధముగా మా గ్రంథములకు ప్రజలలో

ఎక్కువ ఆదరణ కలదు. పోతులూరు వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో

దాదాపు నాలుగు వందల సంవత్సరముల క్రిందటే "ప్రబోధాశ్రమము

ఉన్నతమైన జ్ఞానము కలది" అని వ్రాసియున్నారు. అంతేకాక

"ప్రబోధాశ్రమము యొక్క జ్ఞానము నందన నామ సంవత్సరము నుండి బాగా

ప్రచారమవుతుందని" చెప్పియున్నారు. ఆయన మాట ప్రకారమే ఈ మధ్య

నాలుగు సంవత్సరములనుండి మా జ్ఞానము చాలా వేగముగా ప్రాకి

పోయినది. శంకరాచార్యుని అద్వైతముగానీ, మధ్వాచార్యుల ద్వైతముగానీ,

రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైతముగానీ ప్రచారమయిన దానికంటే

రెండింతల వేగముగా ప్రజలలోనికి ప్రాకిపోయినది.



ప్రశ్న :- దాదాపు నాలుగు వందల సంవత్సరములప్పుడున్న వీరబ్రహ్మము

గారు మీ జ్ఞానమును గురించి ఎందుకు వ్రాశారు?


జవాబు :- ఈ ప్రశ్న వీరబ్రహ్మముగారినే అడుగవలసి యుంటుంది. అయితే

మేము చెప్పునది "సాంద్రసింధు జ్ఞానమని” చెప్పడమే కాకుండా చాలా

విషయములను ముందస్తు సమాచారముగా తెలియజేశాడు.


ప్రశ్న :- మీరు "డెబ్బయి (73) గ్రంథములను వ్రాశాము” అని చెప్పారు.

మీ జ్ఞానములో ముఖ్యమైన సిద్ధాంతమేది, అద్వైతమా, విశిష్టాద్వైతమా?

లేక ద్వైతమా?


జవాబు :- మీరు అడిగే ప్రశ్న ఎలాగుందంటే, “నీవు రారాజయిన చక్రవర్తివే

గానీ నీవు అడుక్కుతిన్నది చిప్పలోనా, బోకిలోనా, ఆకులోనా? అని

అడిగినట్లున్నది. రారాజుకు అడుక్కుతినే అవసరము లేదు. అదియూ

చిప్పలోనా, బోకిలోనా, ఆకులోనా అని అడగడము మరీ విచిత్రముగా

యున్నది. అంతేకాక రామాయణమంతా విన్న తర్వాత సీతకు రాముడు

ఏమవుతాడు? అని ప్రశ్నించినట్లు మేము అద్వైతముకంటే, విశిష్టాద్వైతము

కంటే, ద్వైతముకంటే భిన్నముగా త్రైత సిద్ధాంతమును బోధిస్తున్నామని

దానివలననే హిందూమతములో క్రొత్త సిద్ధాంతమును ఆర్యులు

వ్యతిరేఖిస్తున్నారని, వారి ప్రేరణతో కొందరు హిందువులు మా భక్తులమీద

దాడులు చేయడము వరకు వచ్చినదని ఇంతకుముందే చెప్పాము కదా!


ప్రశ్న :- అయితే మీరు హిందూమతములో నాల్గవ సిద్ధాంతకర్తలా?

జవాబు :- ఇందులో మీకేమయినా అనుమానమున్నదా? దక్షిణ భారత

దేశము కృతయుగములోగానీ, త్రేతాయుగములోగానీ ఆత్మజ్ఞానులలో

మంచిపేరుగాంచిన ప్రాంతము. దక్షిణ దేశము త్రేతాయుగములో నేడు

కర్నాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రములుగా యున్న నాలుగు

ప్రాంతములు రావణబ్రహ్మ పాలనలో యుండేవి. రావణబ్రహ్మ


వారసత్వముగా, ఈ నాలుగు రాష్ట్రములలో జ్ఞానము ప్రజ్వరిల్లగలదని

కాలములోనే (త్రైతాయుగములోనే) కొందరు జ్ఞానులు అనుకొనెడివారు.

వారి అంచనా అప్పుడు నెరవేరలేదుగానీ, కలియుగములో నెరవేరినదని

చెప్పవచ్చును. కలియుగములోనే చివరి కేరళ రాష్ట్రములో మొదట అద్వైత

సిద్ధాంతకర్తగా పేరు పొందిన ఆదిశంకరాచార్యుల వారు జన్మించగా, రెండవ

సిద్ధాంతకర్తయిన రామానుజాచార్యుల వారు తమిళనాడు రాష్ట్రములో

జన్మించగా, మూడవ సిద్ధాంతకర్తయిన ద్వైత సిద్ధాంతకర్త మధ్వాచార్యులు

కర్నాటక రాష్ట్రమందు జన్మించెను. ఇక నాలుగు రాష్ట్రములలో ఆంధ్రప్రదేశ్

రాష్ట్రము చివరిగా మిగిలియుండగా, ఆ ప్రాంతములో కూడా ఒక సిద్ధాంతకర్త

పుట్టడము జరిగినది. ఆ సిద్ధాంతమే "త్రైత సిద్ధాంతము”.


త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించిన సిద్ధాంతకర్త పేరు ఆచార్య

ప్రబోధానందయోగీశ్వరులు. అయితే కలియుగములో ముందు పుట్టిన

ముగ్గురు ఆచార్యులు బ్రాహ్మణ కులజులు కాగా, ప్రబోధానంద యోగ్వీరులు

మాత్రము బ్రాహ్మణ కులమునకు చెందినవాడు కాదు. అలా పుట్టడము

వలన వారందరిదీ ఒక దారియైతే ప్రబోధానందది మాత్రము మరియొక

దారి అన్నట్లున్నది. అంటే ఆ మూడు దారులకంటే విభిన్నమైన దారియని

అర్థము. ఆంధ్రప్రదేశ్లో ప్రబోధానంద స్వామి అనబడే వ్యక్తి పుట్టడములో

కూడా గమనించితే కొంత ప్రత్యేకత గలదు. ఆంధ్రప్రదేశ్లో ఆయన

పుట్టిన ప్రాంతమునకు ప్రత్యేకమయిన పేరు కలదు. ఆ పేరు “రాయలసీమ”

'సీమ' అంటే ప్రాంతమని అర్థము. 'రాయల' అనగా 'నాశనము లేనిదని’

అర్థము. 'రామ' అను పదమునుండి “రాయ” అను పదము పుట్టినది.

రామ అనగా 'నాశనము లేనిదని' అర్థము. రాయల సీమ ప్రాంతములోనే

యోగీశ్వరులు పుట్టడము జరిగినది. రాయల సీమలో పుట్టిన వారు పేరుకు

తగినట్లు నాశనములేని బోధనే బోధించగలడని చెప్పకనే తెలియుచున్నది.


ప్రశ్న :- ప్రబోధానంద యోగీశ్వరులు అంటే మీరే కదా?


జవాబు :- నీవు అలా అనుకుంటావనే ఈ గ్రంథము ప్రారంభములోనే

అన్నీ చేయునది ఆత్మేనని ముందే చెప్పాను. ప్రబోధానంద యోగీశ్వరులు

అని మీ భావములో మీరు అనుకొంటే నీది సరియైన భావము అవునో

కాదో? జీవాత్మగాయున్న ఒక వ్యక్తి అని మీరు అనుకొంటే, ఆ జీవుడు

నేను లోపల చిక్కుకొని కదలలేక కట్టివేయబడిన కుక్కవలెయున్నాను.

బయట 'నేను లేను' అని అనగలడు. దానితో నీ అంచనా తప్పగును.

లోపలయుండే వాడేనని అనుకొనినా, లోపల వానిది (జీవునిది) ఏమీ లేదు.

వాడు ఏమీ లేనివాడు, అంతా నేనే గలను, అంతా నేనే చేయగలనని

అనువాడు గలడు. అందువలన ఎటూ పోల్చుకోలేని స్థితిలో మనిషి

యున్నాడు. నేను ఇప్పుడు మనిషే అయినా, నాకు తెలిసినది నేను

చెప్పగలను విను. యోగీశ్వరులు 'రాయలసీమ' అను ప్రత్యేక ప్రాంతములో

పుట్టి నాశనము లేని బోధను చెప్పగలవాడినని ప్రకటించుకొన్నాడు.

అంతేకాక ఆయన పుట్టిన ఊరు పేరు “అనంతపురము”. 'పురము” అనగా

పౌరులు నివశించునదని అర్థము. తర్వాత 'అనంత' అనగా 'అంతము

లేనిదనీ, ఎల్లలు లేనిదనీ' చెప్పవచ్చును. అనంతమైన వానిని గురించి

అనంతమైన బోధను చెప్పువాడను విషయము తెలియునట్లు ప్రబోధానంద

యోగీశ్వరులు అనంత.... పురములోనే పుట్టడము జరిగినది.

సీమలో, అనంతపురములో పుట్టిన యోగీశ్వరుల పేరులో కూడా ప్రత్యేకత

కలదు. పుట్టినవాడు అన్నిటికంటే పెద్దవాడు అనునట్లు యోగీశ్వరుల

వారి పేరు “పెద్దన్న” అని పిలువబడినది. పెద్ద+అన్న= పెద్దన్న యగును.

ప్రాంతము రాయలు, పట్టణము అనంత అయినట్లు అన్నలలో 'పెద్ద' అని

ప్రత్యేకత కల్గిన పేరుంచబడినది. కొంత ఆలోచించువారికి ఎంతో కొంత

రాయల


అర్థము కాగలదు. ఇంతకుముందు పుట్టిన సిద్ధాంతకర్తలలో ఎవరికీ

ఇటువంటి విశేషత దక్కలేదు. అందువలన యోగీశ్వరుల యొక్క విలువను

తెలిసి ఆయన ద్వారా సత్యమైన జ్ఞానమును, శాస్త్రబద్ధమైన జ్ఞానమును,

అనుభవానికి వచ్చే జ్ఞానమును, ప్రతి ప్రశ్నకు జవాబుగల జ్ఞానమును

తెలియవచ్చును.


ప్రశ్న :- మీరు చెప్పేది కొంత అర్థమయినట్లున్నది, అయినా ఏమీ అర్థము

కాలేదు. ఇప్పుడు మిమ్ములను ఏమనుకోవాలి?


జవాబు :- ప్రపంచ విషయములో అందరితో సమాన మనిషిననే

అనుకోవాలి. ఒక్క దైవ విషయములో మాత్రము సాధారణ మనిషిగా

అనుకోకుండా అసాధారణ మనిషిగా లెక్కించవలెను. చెప్పెడి జ్ఞానమంతా

సత్యమైనదని తెలియవలెను. అలా గొప్ప జ్ఞానము తెలియబడుట చేత

మా జ్ఞానము విన్న ప్రతి ఒక్కరూ ముక్తిని పొందగలరు. మాయను

జయించి జ్ఞానమార్గములో ముందుకు పోగలరు. మమ్ములను అసూయతో

చూచువారికి ఏమి గతిపట్టునో వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో

వ్రాసియుంచారు. అందువలన ప్రపంచ విషయములో మీకంటే తక్కువ

వానిగా తలచినా ఫరవాలేదు. దైవజ్ఞాన విషయములో తప్పనిసరిగా

గొప్పగనే భావించవలెనని తెలుపుచున్నాము.


ప్రశ్న :- అద్వైత సిద్ధాంతమును తెల్పిన ఆదిశంకరాచార్యుల వారు,

విశిష్టాద్వైతమును తెల్పిన రామానుజులవారు, ద్వైతమును తెల్పిన

మధ్వాచార్యుల వారు ముగ్గురు మూడు దక్షిణ రాష్ట్రములలో పుట్టగా,

ముగ్గురు బ్రాహ్మణ కులమునకు చెందినవారుగా యుండెడివారు. ముగ్గురు

ఒకే కులమునకు చెందినవారయినా ముగ్గురిది మూడు రకముల జ్ఞానమయి


నందున శంకరుని తర్వాత వచ్చిన రామానుజుల వారు శంకరులను

విమర్శించి శంకరులు చెప్పిన దైవము నిర్గుణము, నిరాకారము కాదని

తన విశిష్టాద్వైత సిద్ధాంతము ప్రకారము సగుణము సాకారము అని చెప్పినట్లు

కలదు. అయితే తర్వాత వచ్చిన మధ్వాచార్యుల వారు శంకరుని

అద్వైతమును, రామానుజుని విశిష్టాద్వైతమును రెండిటినీ విమర్శించి

మాట్లాడడము జరిగినది. వచ్చిపోయిన వారిని ఎవరయినా విమర్శించగలరు

గానీ, రాబోయే వానిని గురించి ఎవరూ విమర్శించలేరు. ముందు

వచ్చిపోయిన వానిని జ్ఞానము తెలిసినవాడుగానీ, తెలియనివాడు గానీ

విమర్శించుట సులభము. రామానుజులవారు శంకరున్ని, మధ్వాచార్యుల

వారు రామానుజులను విమర్శించినట్లు మీరు కూడా మధ్వాచార్యుల వారిని

విమర్శించగలరా?


జవాబు :- నేను అనవసరముగా విమర్శించుటకు రాలేదు. శాస్త్రబద్దమైన

జ్ఞానమును తెల్పుట, శాస్త్రబద్దముకాని జ్ఞానమును ఖండించుట మాత్రమే

నా పని. అంతేగానీ ముందు వచ్చిన వారిని విమర్శించడము నా పని

కాదు. నేను ముగ్గురు ఆచార్యులకంటే వెనుకవచ్చిన వాడిని. అందువలన

ముగ్గురు ఆచార్యులు నన్ను విమర్శించుటకు అవకాశము లేదు. అయితే

నాకంటే ముందువచ్చిన ముగ్గురు ఆచార్యుల తప్పు ఒప్పులను గురించి

చెప్పు అవకాశము గలదు. అసూయా గుణముతో ఎంతో గొప్ప వానిని,

ఎంత చిన్నవాడయినా విమర్శించి మాట్లాడవచ్చును.


మేము తప్పులను తప్పులుగా, ఒప్పులను ఒప్పులుగా గ్రహించ

గలము. కావున మేము మంచిని మంచిగానే, చెడును చెడుగానే

చెప్పగలము. అనవసరముగా చెడును మంచిగాగానీ, మంచిని చెడుగాగానీ


చెప్పే అవసరము మాకు లేదు. నేను ఆదిశంకరాచార్యుల వారిని ఎప్పుడూ

అనవసరముగా విమర్శించలేదు. మొదటినుండి శంకరుని మీద ఎంతో

సానుభూతితో మాట్లాడుచున్నాను. "ఆర్యులు చేసిన కుట్రకు ఆయన

బలియైపోయాడు” అని చెప్పాము. అద్వైతమును ఎటు చూచినా శాస్త్రబద్దము

కాదు. అయినా శంకరుడు దానికి బాధ్యుడు కాడనియే చెప్పాము. అద్వైత

సిద్ధాంతము ఆర్యులదికాగా బినామీగా శంకరున్ని ఆర్యులు చూపడము

జరిగినది. కొంతవయస్సు వచ్చి వ్యక్తిత్వము ఏర్పడిన తర్వాత శంకరుడు

క్రమేపీ ఆర్యుల కుట్రను గ్రహించగలిగాడు. ఆర్యులు ఎంతో తెలివైనవారు,

తమ ఆలోచనను నిశ్శబ్దముగా ఎవరికీ తెలియనట్లు ద్రావిడ బ్రాహ్మణుడయిన

శంకరుని ద్వారా నెరవేర్చగలిగారు. భవిష్యత్తులో ద్రావిడ బ్రాహ్మణులు

ఎవరూ ఆర్యులను ఎదిరించకుండా ఉండునట్లు ఏమి విమర్శించి

మాట్లాడినా అదంతయూ శంకరునికే అన్నట్లు తెలివిగా శంకరుని చేత

అద్వైత సిద్ధాంతమును ప్రయోగించారు.


శ్రీ శంకరాచార్యుల వారు కూడా ఆర్యులను మించిన తెలివైనవాడు.

కొంతకుకొంత ఆర్యుల కుట్రలను గ్రహించగలిగాడు. తాను వేరు మార్గమున

ప్రయాణించాలనుకొన్నాడు. వ్యాసుడు వ్రాసిన భగవద్గీతను చదువగలిగాడు.

వ్యాసుడు వ్రాసిన భగవద్గీతను ప్రచారము చేయాలనుకొన్నాడు. అద్వైతమును

అంతటితో ఆపేయాలనుకొన్నాడు. భగవద్గీతలోని కొన్ని శ్లోకముల వలన

శంకరుడు పూర్తిగా తనదారిని మార్చుకొన్నాడు. దానిప్రకారము చూస్తే

శంకరుడు ఎంతో గొప్పవాడని అర్థమగుచున్నది. భగవద్గీతలోని భావమును

అర్థము చేసుకోగలిగాడు. ఎప్పుడు భగవద్గీతకు దగ్గరయినాడో అప్పుడే

వేదములకు దూరమవుతూవచ్చాడు. "త్రైగుణ్యా విషయావేదా” అను

వాక్యము, "గుణమయీ మమ మాయా” అను భగవద్గీతా వాక్యముల


వలన మారిపోయిన శంకరుడు తన మార్పును బహిరంగముగా

ప్రకటించకనే, ఆయనలోని మార్పు ఎవరికీ తెలియకముందే అకాలమృత్యువు

ఆయనను పెకలించింది. శంకరాచార్యులను విమర్శించుటకు ఆయనలో

ఏ తప్పు కనిపించడము లేదు. ఆయన తల్లిచాటున పిల్లవలె, ఆకుచాటున

పిందెవలె బ్రతికాడు. చివరిలో ఆయనకు తెలిసిన భావములు మనుషులకు

తెలిసియుంటే ప్రజలకు ఆధ్యాత్మిక విద్యలో ఎంతో మేలు జరిగియుండెడిది.


ప్రశ్న :- మీరు ఇప్పుడు ఆచార్య శంకరులను ఎంతో పొగడుచున్నారు.

ఇంతకుముందు అతను సిద్ధాంతకర్తయే కాదనీ, ఆయన చెప్పిన అద్వైత

సిద్ధాంతము శాస్త్రబద్దము కానిదని చెప్పారు. అక్కడేమో శంకరాచార్యుల

వారిని విమర్శించిన మీరు ఇక్కడేమో ఎంతగానో సమర్థించుచున్నారు.

ఈ రెండింటిలో మేము ఏ మాట సత్యమైనదని అనుకోవాలి?


జవాబు :- మీరు మేము చెప్పు విషయమును అర్థము చేసుకోలేక మేము

రెండు రకముల మాట్లాడినట్లు చెప్పుచున్నారు. అక్కడ శంకరులను

విమర్శించినది నిజమే అయినా, అది పరోక్షముగా ఆర్యులను

విమర్శించడము జరిగినది. శంకరున్ని ముందుంచి కథను నడిపిన వారు

ఆర్యులు. ఆ విషయమును మేము ముందునుండి చెప్పుచున్నాము. అలా

చేయడము వారికి వెన్నతోపెట్టిన విద్య. అప్పుడుగానీ, ఇప్పుడుగానీ అలాగే

వ్యవహరించుచున్నారు. ఎవరి ఊహకు కూడా అందని విధముగా ఆర్యులు

తమ ఉద్దేశ్యమును నెరవేర్చుకోగల ధీశాలురు. నేడు ఎక్కడగానీ

కనిపించకుండా వంద సంవత్సరముల ముందే బ్రిటీషు వారి పాలనలో

భారత దేశమున్నప్పుడే, అదే అదనుగా తలచిన ఆర్యులు ప్రజలలో దేశభక్తి

బీజములను నాటి ఎంతో మంచివారుగా దేశము కొరకు పోరాడువారిగా


ప్రజల గౌరవమును పొందారు. ఆ దేశభక్తి సూత్రము కొద్దిరోజులలోనే

దేశములోని ప్రజలలో పూర్తిగా ప్రాకిపోయినది. తర్వాత వారు ఎక్కడా

కనిపించకుండా కనుమరుగైపోయారు.


సైకిలు త్రొక్కేటప్పుడు ఆ విద్య రానివానికి మొదట వచ్చేవాడు

నేర్పిస్తాడు. సైకిల్ మీద ఎక్కించి వెనకల సీటును పట్టుకొని సైకిలు క్రింద

పడకుండా ఎక్కినవానితో సైకిల్ త్రొక్కునట్లు చేయును. వెనుక సైకిల్

పట్టుకొన్నవాడు ఉన్నాడను ధైర్యముతో సైకిల్ ఎక్కినవాడు త్రొక్కుటకు

మొదలిడును. అలా కొన్ని గంటలు సాధన చేయించిన తర్వాత నేనున్నానని

చెప్పి వాని చేత నడిపించువాడు కొన్ని గంటల తర్వాత సైకిల్ను వదలి

పెట్టును. అప్పుడు సైకిల్ ఎక్కినవాడు స్వయముగా సైకిల్ త్రొక్కుటకు

అలవాటు పడును. అట్లే మొదట దగ్గరుండి దేశభక్తిని నేర్పించిన వారు

ప్రజలలో స్వయముగా దేశభక్తి ఏర్పడిన తర్వాత ప్రజల చేతనే ఆ

నినాదమును కొనసాగించారు. అలా ప్రజలకు దేశభక్తిని నేర్పించి ప్రజల

వద్దయున్న దేహిభక్తిని లేకుండా చేయడమే ఆర్యుల ముఖ్య ఉద్దేశ్యము.

అది వంద సంవత్సరముల ముందే నెరవేరింది. అంతకుముందు దేశభక్తి

అంటే ఏమిటో తెలియని ప్రజలలో దేశభక్తి బయటికి వచ్చినది. అంతవరకు

ప్రజల వద్ద యున్న దేహిభక్తి (ఆత్మభక్తి) ఏమాత్రము కనిపించకుండా

పోయినది. వంద, రెండు వందల సంవత్సరముల ముందు అంతో ఇంతో

ఉన్న ఆత్మజ్ఞానము దేశభక్తితో లేకుండా పోవడము జరిగినది.


నేడు హిందూ ధర్మసంస్థలని పేరుపెట్టుకొన్న ఏ సంస్థను కదిలించి

చూచినా అందులోని ప్రజలు దేశభక్తిని గురించే చెప్పుదురుగానీ

ఆత్మజ్ఞానమును (దేహిభక్తిని) గురించి చెప్పరు. పూర్వము ఆర్యులు అల్లిన


ఫతకమును అనుసరించి నేడు హిందూసంస్థలలో గల ప్రజలు ఆర్యులు

కాకపోయినా ఆర్యులవలె మాట్లాడుటకు మొదలుపెట్టారు. ఆర్యులు

ఉన్నా లేకపోయినా పది కాలాలపాటు ఆర్యుల ఫతకము నెరవేరునట్లు

నేడు గల హిందూ సంస్థలను తయారు చేసిపెట్టారు. నేడు దక్షిణ భారత

దేశములోనే ఎక్కువగా హిందూమతమునకు సంబంధించిన అనేక

సంస్థలున్నాయి. అందులో పనిచేయు వారందరూ ద్రావిడులే. అయినా

వారు ఆర్యుల మాటనే మాట్లాడుచున్నారు తప్ప తాము ద్రావిడులమను

స్పృహ కూడా లేకుండా పోయినది. పూర్వము ద్రావిడ రాజ్యము

ఆత్మజ్ఞానములో ఎంతో ముందుండగా నేడు ఆత్మజ్ఞానము అంటే ఏమిటో

అర్థముకాని స్థితిలో యున్నారు. హిందూసంస్థలలో పనిచేయుచున్నా

హిందూ ధర్మములేవో తెలియని స్థితిలో యున్నారు. దేశభక్తి తప్ప దేహి

భక్తి ఏమాత్రము లేకుండా యున్నారు. ఈ విధముగా ద్రావిడులు నేడు

ఆర్యుల చేతిలో కీలుబొమ్మలైనారు. ఈనాడు కూడా తమకు ద్రావిడులలోనే

అనుకూల వాతావరణమున్నట్లు చేసుకోవడము జరిగినది.

ద్రావిడులయిన వారే ద్రావిడులనే నిందించుచున్నారంటే దీనికి కారణము

ఆర్యులని అర్థమగుచున్నది. ఆనాడు శంకరున్ని కూడా అలాగే తయారు

చేశారు. అయితే ఆనాడు శంకరాచార్యుల వారు కొంత విచక్షణతో ఆర్యుల

ఉద్దేశ్యమును కనుగొన్నాడు. అయితే నేడు హిందూ సమాజములో హిందూ

రక్షకులుగా తయారయిన ద్రావిడులు ఆర్యుల సృష్ఠి అయిన దానివలన

వారు ఆర్యులుగానే తయారైనారు. మేము ద్రావిడులుగానేయుండి

ఆత్మజ్ఞానము చెప్పుచున్ననూ మమ్ములను వ్యతిరేఖించి మాట్లాడుచున్నారు.

భగవద్గీత జ్ఞానమును కాదని వేద జ్ఞానమును బోధించమని వత్తిడి

తెస్తున్నారు. తమమాట వినని వారిమీద దాడులు చేయుచున్నారు.

నేడు


పూర్వము శంకరుడు ఆర్యుల సృష్టే అయినా ఆయన చివరిలో

మారగలిగాడు. నేడు ద్రావిడులు ఎందరో హిందూ రక్షణ సంఘములలో

యుండి అంధులైపోయి చివరకు ద్రావిడులు ద్రావిడులనే బాధించు స్థితికి

వచ్చారు. అలా తయారు చేసింది ఆర్యులయినందున ఇక్కడ ముఖ్యముగా

ఆర్యులదే తప్పని చెప్పవచ్చును. ద్రావిడులను నిందించు ద్రావిడులది

తప్పని చెప్పినా అట్లు తయారు చేసినది ఆర్యులే అయినందున ప్రత్యక్ష

కుట్రలకంటే కనిపించని పరోక్ష కుట్రలే ఎక్కువ అపాయకరమైనవి.

అందువలన పైకి మేము శంకరున్ని తప్పులెంచినా, దానికి బాధ్యులు ఆర్యులే

అయినందున పరోక్షముగా ఆర్యులనే విమర్శించినట్లగును. అర్థము

చేసుకోలేనివారు శంకరున్ని ఒకచోట విమర్శించినట్లు, మరొకచోట

పొగడినట్లు అర్థము చేసుకొన్నారు. నేడు అనేక హిందూ సంస్థలలో

యున్నవారు మేము ఎంత పెద్ద జ్ఞానమును చెప్పినా, దానిని గ్రహించక

మాకు వ్యతిరేఖముగా మాట్లాడుచున్నారంటే అది అంతయూ ఆర్యుల

పనియని తెలిసిన మేము ప్రత్యక్షముగా హిందూ సంస్థలను నిందించినా

అది పరోక్షముగా యున్న ఆర్యులనేనని అర్థము చేసుకోవలెను.


ప్రశ్న :- నేడు హిందూ ధర్మరక్షణ సంస్థలలోయున్న ద్రావిడులు విచక్షణ

లేకుండా నడుచుకొనుచున్నారని మీరు చెప్పువరకు మాకు కూడా తెలియదు.

ఎవరి వ్రేలుతో వారి కళ్ళను పొడిచే రకము ఆర్యులదని మాకు ఇప్పుడు

కొంత అర్థమయినది. మనిషి దేహిభక్తితో జీవితమే సాఫల్యమగును

దేశభక్తితో ఒరిగేది ఏమీలేదు. అది పేరుకు మాత్రమే! దేశ సరిహద్దులలో

చలికి, వానకు, ఎండకు కాపలాకాయుచున్న సైనికులకు అంతో ఇంతో

దేశభక్తి యుండవచ్చును గానీ, దేశములో కూర్చొని తాము దేశమునకు

ఏమీ చేయకున్నా వారు దేశభక్తి అనడము విడ్డూరముగా ఉంటుంది. దేశభక్తి


యున్నట్లు కనిపించు సైనికులలో కూడా నేడు దేశభక్తి కరువైపోయింది

నిజమేకదా?


జవాబు :- వాస్తవముగా అది ఎవరిలోనూ లేదు. మాట్లాడే దానికి మాత్రము

దేశభక్తి పనికి వస్తుంది. నేను ఒకప్పుడు మిలటరీలో ఒక భాగమయిన

ఆర్మీలో (భూ సైన్యములో) పని చేసినప్పుడు మా ఆఫీసర్ ఒక ప్రశ్న

అడిగేవాడు. మీరు దేనికొరకు సైన్యములోనికి వచ్చారని అడిగాడు. అప్పుడు

ఒక్కొక్కరు లేచి "దేశ్ సేవాకేలియే!" అని హిందీలో అనేవారు. దాని అర్ధము

“దేశ సేవకొరకు వచ్చామని" చెప్పేవారు. చివరిగా నాకు చెప్పేవంతు వచ్చినది.

అప్పుడు నేను ఇలా చెప్పాను. 'ఉచితముగా ప్రతి ఫలితమును ఆశించక

చేసేది సేవ అవుతుంది. మేము డబ్బు కొరకు గవర్నమెంటు ఇచ్చే నెల

జీతము కొరకు వచ్చాము. ఇంటివద్దయున్న తల్లితండ్రులను పోషించే

నిమిత్తము సైన్యములోనికి వచ్చాము. దేశము యొక్క సేవ అంటే ఏమిటో

మాకు ఏమాత్రము తెలియదు. ఫలానా పని దేశసేవ అనేది ఎవరికీ

తెలియదు. అందువలన నేను దేశసేవ కొరకు వచ్చాను అనడము

అసత్యము. సత్యము చెప్పాలంటే “దేశ్ సేవాకేలియే నహీ ఆయాహు!

హమ్ పేట్కా సేవాకేలియే ఆయాహు!" అని చెప్పాను. అప్పుడు అందరూ

చప్పట్లు కొట్టి “ఏ సహీ హై!” అన్నారు. నేను చెప్పిన మాటలో "నేను

దేశసేవ కొరకు రాలేదు, మా కడుపు సేవ కొరకు వచ్చాను" అని అన్నాను.

అప్పుడు “ఇది సత్యము” అని చప్పట్లు కొట్టి చెప్పారు. మా కమాండర్

కూడా నేను సత్యము చెప్పానని మెచ్చుకొని మీటింగ్లో ఇలా అన్నాడు.

"దేశసేవ కొరకు నేను కూడా రాలేదు. మనమంతా ఎవరూ దానికొరకు

రాలేదు. దేశసేవ అంటే ఏమిటో ఎవరూ చెప్పలేదు. ఏ గ్రంథములోనూ

ఇది దేశసేవ అని వ్రాయలేదు. ఒక మనిషి స్వచ్ఛందముగా పని


చేస్తున్నాడంటే అందులో కూడా పైకి కనిపించని స్వార్ధము ఏదో ఒకటి

ఉండనే ఉండును. అటువంటప్పుడు దేశము యొక్క సొమ్ము తింటూ

దేశసేవ చేస్తున్నామనడము ఆసత్యమగును” అన్నాడు. అప్పుడు ఒక జవాన్

లేచి "కర్తవ్య నిర్వహణలో యుద్ధము వస్తే మేము ప్రాణాలను లెక్కచేయక

పోరాడుచున్నాము, యుద్ధములో చనిపోతున్నాము. ప్రాణము

పోగొట్టుకొన్నా అది దేశసేవకాదని చెప్పితే దేశసేవ అంటే ఏమిటో చెప్పండి”

అని అన్నాడు. దానికి ఆఫీసర్ “నవ్వి నువ్వు నెల జీతము తీసుకోకుండా

యుద్ధములో పాల్గొంటే దేశసేవ అవుతుంది. డబ్బుకొరకు పని చేయడము

సేవకాదు. అలా కర్తవ్య నిర్వహణలో చనిపోయిన వారిదంతా దేశసేవ

అయితే, ఒక దొంగకు దొంగతనము చేయడమే పనిగా ఉండును. తాను

దొంగతనము చేయుచూ ప్రమాదవశాత్తు చనిపోయాడను కొనుము.

అప్పుడు వాడు వాని కర్తవ్య నిర్వహణలో చనిపోయినట్లే కదా! కోటివిద్యలు

కూటి కొరకేయని మన పెద్దలు చెప్పినట్లు దొంగ వానికొరకు వాడు పని

చేయుచూ చనిపోయాడు. అట్లే ఎవడయినా వానికొరకు వాడు పనిచేయుచూ

చనిపోయినప్పుడు అది దేశసేవ ఎట్లగును? కోటివిద్యలు కూటికొరకే

అన్నట్లు, కోటి పనులు (ఉద్యోగాలు) కడుపుకొరకే అని తెలియుచున్నది.

అటువంటప్పుడు దేనినీ దేశసేవ అని చెప్పుటకు వీలులేదు. ఒక ప్రాణమున్న

జీవికి అనగా మనిషికిగానీ, జంతువుకుగానీ, పక్షికిగానీ దేనికయినా గానీ

దానికొరకు స్వార్థము లేకుండా, ఏ ఫలకాంక్ష లేకుండా పనిచేస్తే అది

సేవ అవుతుంది. అలా చేయుటకు దేశము ఒక మనిషికాదు, ఒక జంతువు

కాదు, ఒక పక్షికాదు. అలాంటి ప్రాణములేని దానికొరకు సేవ చేయడము

అనేదే లేదు. ప్రాణమున్న మనిషి సంతోషము కొరకు ఇంకొకడు పాటు

పడితే అది సేవయగును. దేశము విశాలమయినది దానికి ప్రాణము


లేదు కావున అది సంతోషపడేది లేదు. అటువంటప్పుడు దేశసేవ అనే

దానికి అర్థమేలేదు. అటువంటప్పుడు దేశభక్తి అనడము పూర్తి తప్పగును.

ప్రపంచములో దేశభక్తి అనునది లేదు.” “దేహిభక్తిని” సృష్ట్యాదిలోనే దేవుడు

తన జ్ఞానములో బోధించాడు. అదే జ్ఞానమునే ద్వాపరయుగములో చెప్పిన

భగవద్గీతలో క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము, పురుషోత్తమప్రాప్తి యోగములో

చెప్పడమైనది. అయితే మనుషులను దేహిభక్తి (ఆత్మభక్తి) నుండి దారి

మళ్ళించుటకు ఆర్యులు 'దేశభక్తి' అను పేరును బయటికి తెచ్చారు.

భగవద్గీతకు వ్యతిరేఖులయిన ఆర్యుల పన్నాగమును తెలియని మనుషులు

వారి ప్రభావమునకులోనై వారి మాటలనే మాట్లాడుచున్నారు.

మాట్లాడువారి మాటలు దేవునికి, దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖమని వారికి

తెలియదు.


ప్రశ్న :- ఇదంతా మాకు కూడా బాగా అర్థమయినది. మీ గ్రంథములు

చదువకపోతే మాకు తెల్లనివన్నీ పాలే అనుకొనే వాళ్ళము. మీ గ్రంథములు

చదివిన దానివలన తెల్లనివన్నీ పాలుకాదు, అలా తెల్లగ కనిపించువాటిలో

మజ్జిగ ఉన్నాయి, సున్నపు నీళ్ళు ఉన్నాయి, జెముడు చెట్టు పాలు

ఉన్నాయని తెలిసినట్లు, నేడు దేశములోగల జ్ఞానము ఎన్ని రకములున్నదో

తెలిసిపోయినది.


ప్రస్తుతము భారతదేశములో ఆర్యులు పూర్వము అమలు చేసిన

ప్రణాళిక చేత నేడు భారతదేశములో అద్వైతము ఎక్కువ శాతము గలదు.

తర్వాత పుట్టిన రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైతము రెండవ స్థానములో

యున్నది. మధ్వాచార్యుల ద్వైతము మూడవ స్థానములో యున్నది.

ద్వైతముగానీ, విశిష్టాద్వైతముగానీ రెండూ అద్వైతమునకు వ్యతిరేఖమే కదా!


వారి వెనుక ఎవరూ లేకున్నా రామానుజులు, మధ్వులు ఇద్దరూ ద్రావిడ

బ్రాహ్మణులే అయినందున వారు ఇరువురూ అద్వైతమునకు వ్యతిరేఖులే.

ఇక్కడ ద్రావిడులు ఆర్యులు అను భేదము లేకపోయినా, అద్వైత సిద్ధాంతము

తప్పు అను ఉద్దేశ్యముతో రామానుజుడు, మధ్వులు అద్వైతమును

వ్యతిరేఖించగా, సిద్ధాంతమూలముగా రామానుజున్ని, మధ్వులు

వ్యతిరేఖించారు. ఇంతవరకు చెప్పిన దానిలో అద్వైతమునకు శంకరుడు

బాధ్యుడు కాడు, అద్వైతమంతా ఆర్యులదే అని చెప్పారు. దానితో శంకరా

చార్యులవారు ఈ సిద్ధాంతముల సమస్యనుండి బయటపడినట్లే! శంకరా

చార్యుల వారి దోషము ఏమీలేనట్లే. అయితే శంకరాచార్యుల వారు ఇరవై

(20) గ్రంథములను వ్రాసినట్లున్నది. శంకరాచార్యులు చెప్పాడు అన్న

అద్వైతమే ఆర్యుల సృష్ఠి అయినప్పుడు తన సిద్ధాంతమే లేనప్పుడు శంకరుడు

ఇరవై గ్రంథములు వ్రాసియుంటాడా? అని అనుమానము కల్గుచున్నది.

దీనిని గురించి మీరేమంటారు?


జవాబు :- నా జవాబుకంటే నీ ప్రశ్నే చాలా పొడవుగా యున్నది. ఏది

ఏమయినా ప్రశ్నించడము ముఖ్యము. అందులో పద్ధతిగా హేతువు కొరకు

ప్రశ్నించడము మంచిది. అలా ప్రశ్నించడము వలన వచ్చే జాబు అడిగిన

వానికే కాకుండా, మిగతా వారికి కూడా జవాబుగా యుండును. దానివలన

ఎందరికో సత్యము తెలిసినట్లగును. నీవడిగిన ప్రశ్నకు జవాబు కావాలంటే

ముందు శంకరుడు వ్రాసిన గ్రంథములు ఏవని తెలుసుకొందాము. ఇరవై

గ్రంథములు వరుసగా ఇలా ఉన్నవి చూడండి.


1)గీతాభాష్యము

2)వివేక చూడామణి

3)అపరోక్షానుభూతి

4)వాక్యసుధ

5)వాక్యమిత్ర

6)శివానంద లహరి

7)నిర్గుణ మానసపూజ

8)భజగోవిందము.

9)నిర్వాణ శతకము.

10)శివమాస పూజ

11)బ్రహ్మసూత్రభాష్యము

12)ఉపదేశ సహస్ర

13)ఆత్మబోధ

14)తత్వబోధ

15)పంచీకరణము

16)సౌందర్యలహరి

17)కనకధార స్తోత్రము.

18)భవాని అష్టకము.

19)సాధనా పంచకము.

20)సిద్ధాంత తత్వవిందు.


నేడు పూర్వముకంటే ఎక్కువగా విద్యావంతులున్నారు. పూర్వము

చదువు వచ్చిన వారు చాలా తక్కువగాయుండేవారు. ప్రస్తుత కాలములో

విశేషముగా చదివి ఎన్నో రంగములలో ఎంతో తెలివిగాయున్నవారు గలరు.

కొన్ని విషయములలో అతి తెలివిగా మాట్లాడువారూ గలరు. అయితే

దేవుని విషయములో మాత్రము ఏమాత్రము విచక్షణ లేనివారిగా, పూర్తి

గ్రుడ్డివారుగా ప్రవర్తించుచున్నారు. ఎవరు ఏది చెప్పితే దానిని నిజమని

నమ్ముచున్నారు. ప్రపంచములోయున్న విచక్షణా బుద్ది పరమాత్మ

విషయములలో లేకుండా పోవుచున్నది. అట్లు కాకుండా ప్రపంచ

విషయములో విచక్షణ లేకపోయినా ఫరవాలేదు. అదియంతయూ కర్మను

బట్టి జరుగును. మనిషి విచక్షణ ప్రపంచ విషయములో ఉన్నా ఒక్కటే

లేకున్నా ఒక్కటే. ప్రపంచ విషయములు మనిషి విచక్షణనుబట్టి జరుగవు.

కర్మ ఎట్లు నిర్ణయింపబడివుండునో అట్లే జరుగును. అయితే దేవుని జ్ఞానము

మనిషి విచక్షణనుబట్టి యుండును. మనిషి తన విచక్షణతో జ్ఞానము

మీద ఆసక్తిని పెంచుకోవచ్చును. మనిషిలోయున్న ఆసక్తినిబట్టి (శ్రద్ధనుబట్టి)

మనిషికి జ్ఞానము లభించును. అందువలన జ్ఞాన విషయములలో విచక్షణ

లేకుండా ఏ మనిషి ఉండకూడదు.


ఇప్పుడు శంకరాచార్యుల వారు ఇరవై (20) గ్రంథములు వ్రాశారను

విషయము మన ముందుకు వచ్చినది. ఈ విషయములో విచక్షణ లేకపోతే

వారు చెప్పినట్లు శంకరుడు ఇరవై గ్రంథములను వ్రాశాడని మనము కూడా

తలూపవలసిందే. అట్లుకాకుండా మనిషిలో కొంత విచక్షణ కల్గి పరిశీలనా

దృష్ఠితో చూస్తే శంకరాచార్యుల వారు ఇరవై గ్రంథములను వ్రాయలేదని

చెప్పవలసిందే! శంకరుడు అన్ని గ్రంథములు వ్రాయలేదని చెప్పుటకు

ఎన్నో ఆధారములు గలవు. విచక్షణతో ఆలోచన చేయనప్పుడు ఇతరులు

ఏమి చెప్పినా వినవలసి వచ్చును. అట్లుకాకుండా ఇది జ్ఞాన విషయమై

నందున మనము ఆలోచనతో ప్రశ్న రూపమున ప్రశ్నించుకొంటే దానికి

జవాబులు లేనప్పుడు అసత్యమనీ, జవాబులున్నప్పుడు సత్యమనీ

నమ్మవచ్చును. ఏ మనిషి అయినా విచక్షణా బుద్దితోనే సత్యాసత్యములు

తెలియును.


ఆదిశంకరాచార్యుల వారు చిన్నవయస్సులోనే ఆర్యుల చేత ఉత్తర

దేశయాత్రను 15 లేక 16వ సంవత్సరమే ప్రారంభించడము జరిగినది.

కేరళ రాష్ట్రమునుండి కాలినడకన ప్రయాణించుచూ 18 సంవత్సరముల

వయస్సులో గుజరాత్ రాష్ట్రమును చేరి, అక్కడ ద్వారకలో ద్వారకాపీఠమును

స్థాపించడము జరిగినది. తర్వాత అక్కడనుండి యాత్రను ప్రారంభించి

దాదాపు ఐదు సంవత్సరముల కాలినడక తర్వాత శంకరుని వయస్సు

23 సంవత్సరములప్పుడు హిమాలయములలోని ఉత్తరాఖండ్ రాష్ట్రములో

గల బద్రిలో జ్యోతిర్ పీఠమును స్థాపించి, తిరిగి అక్కడనుండి చాలా

తొందరగా ఒక సంవత్సర వ్యవధిలోనే కాలినడకన ఒరిస్సా రాష్ట్రములోని

పూరి పట్టణమునకు రావడము జరిగినది. అక్కడ జగన్నాథ పీఠమును

స్థాపించడము జరిగినది. అప్పటికి శంకరుని వయస్సు 24 సంవత్సరములు,


అక్కడనుండి శంకరాచార్యుల వారు కర్నాటక రాష్ట్రములోని శృంగేరికి

రావడము జరిగినది. అక్కడ శారదాపీఠమును తన 25వ సంవత్సరము

స్థాపించడము జరిగినది. అక్కడనుండి తన స్వంత రాష్ట్రమయిన కేరళలో

తాను పుట్టిన ఊరికి వచ్చి అక్కడనుండి తమిళనాడు రాష్ట్రమును చేరి

కంచి పట్టణములో తన 27వ సంవత్సమున కామకోటి పీఠమును

స్థాపించడము జరిగినది. ఈ విధముగా 15 సంవత్సరముల వయస్సు

నుండి ఏకధాటిగా కాలినడకన దేశ నలుమూలలా తిరిగి చివరికి 27

సంవత్సరములకు తనకు స్వంత స్థానమును కంచిలో ఏర్పాటు

చేసుకోవడము జరిగినది. ఇదంతయూ మనకు తెలిసిన విషయమే. కంచి

పీఠములో దాదాపు సంవత్సరము లేక ఒకటిన్నర సంవత్సరములు యున్న

శంకరాచార్యుల వారు భగవద్గీతకు వివరమును వ్రాయడము జరిగినది.


భగవద్గీతా వివరమును వ్రాసిన తర్వాత 29వ సంవత్సరమే తిరిగి

ఉత్తరదేశ యాత్ర ప్రారంభించడము జరిగినది. 30, 31వ సంవత్సరము

లలో యాత్రలోయున్న శంకరుడు తన 32వ సంవత్సరము బద్రి చేరుకొని

అక్కడనుండి కేదార్నాథ్కు వచ్చి అకాల మరణమును పొందడము జరిగినది.

ఈ విధముగా ఆయన జీవితమంతా కాలినడకన నడువడమే జరిగినది.

ఒక సంవత్సర కాలవ్యవధిలో తన కంచిపీఠమున ఉన్నప్పుడు భగవద్గీతా

భాష్యము వ్రాయడము జరిగనది. భగవద్గీతను వ్రాయుటకు దాదాపు

ఆరు నెలల నుండి సంవత్సర కాలము పట్టియుండును. ఒక గ్రంథమును

వ్రాయాలంటే అక్షర అక్షరముతో లెక్కించితే కొన్ని కోట్ల అక్షరములు

వ్రాయవలసియుండును. ఒక అక్షరమునకు కొన్ని సెకండ్ల లెక్కన చూచినా

ఒక గ్రంథము వ్రాయుటకు కొంతకాలము పట్టును. అయితే ఇక్కడ

శంకరుడు అన్ని గ్రంథములు వ్రాయుటకు ఆయనకు వ్యవధి ఎక్కడిది?


ఈ ప్రశ్నకు జవాబును ఎవరూ చెప్పలేరు. ఎంత వేగముగా వ్రాసినా

ఇరవై గ్రంథములు వ్రాసేదానికి కనీసము ఐదు సంవత్సరముల కాలమైనా

పట్టును. మనిషి ఒక గ్రంథమును వ్రాయాలంటే ఎంతో ఆలోచించి

వ్రాయడము జరుగును. వదలక వ్రాసినా ఐదు సంవత్సరముల కాలము

పట్టితే వాటిని గురించి ఆలోచించేదానికి కనీసము రెండు సంవత్సరముల

కాలమైనా పట్టును. కనీసము ఏడు సంవత్సరముల కాలమయినా లేనిది

ఇరవై గ్రంథములు వ్రాయుటకు వీలుపడదు. శంకరుని జీవితములో

అంతకాలమును శంకరుడు ఎప్పుడు ఉపయోగించాడు అని చూస్తే

శంకరుడు గ్రంథములు వ్రాశాడు అన్నది శుద్ధ అబద్దము. అయన వ్రాసినది

భగవద్గీత ఒక్కటేనని చెప్పుచున్నాము.


ప్రస్తుత కాలములో సులభముగా వ్రాసే పెన్నులు, వేగముగా జరిగే

కొనలుగల జెల్ పెన్నులు, వ్రాసేకొద్దీ వ్రాతపడే పలుచని పేపర్లు, ఏ పెన్నుతో

తేలికగా వ్రాసినా వ్రాయబడే తెల్లని పేపర్లు, కూర్చొనేదానికి కుర్చీలు,

పేపరును పొందికగా పెట్టుకొనేదానికి టేబుల్లు, దానిమీద అద్దము

టేబులాప్లు ఉండగా, రెండువందల పేజీలు వ్రాయుటకు ఒక నెలరోజుల

కాలము పట్టుచున్నది. 200 పేజీల గ్రంథమును చూచి వ్రాసినా దాదాపు

15 రోజుల కాలము పట్టును. ఇదంతయూ ఇప్పటి కాలములోని పరిస్థితి.

అప్పుడు శంకరుడు గ్రంథమును వ్రాసినరోజు పేపర్లు లేవు, పెన్నులుగానీ

పెన్సిల్లుగానీ లేవు. రాత్రిపూట కనిపించే కరెంటు లైట్లు లేవు. ఆ

దినములలో తాటి ఆకులమీద ఇనుప వస్తువుతో గీతలు పెట్టుచూ

వ్రాయవలసి యుండును. మొనతేలిన ఇనుపముక్కను అరచేతిలో అదిమిపట్టి

మందముగా యున్న తాటిఆకు మీద వ్రాయవలసియుండును.

కాలములో ఒక్క పేజీలో అచ్చువేయు వ్రాతను ఆ కాలములో కనీసము


20 లేక 25 తాటి ఆకుల మీద వ్రాయవలసియుండును. ఆనాడు

భగవద్గీతకు వివరము వ్రాసిన శంకరుడు ఎంతో కష్టపడితేగానీ గీతను

వ్రాయుటకు కనీసము ఒక సంవత్సర కాలము పట్టియుండును. తాటి

ఆకులు 15 వేల నుండి 20 వేల ఆకుల వరకు పట్టియుండును. ఏ

భాషలో వ్రాసినా ఆకుమీద వ్రాయు అక్షరము కనీసము కందిబేడంత (కంది

గింజంత) పెద్దదిగా యుండవలెను. దానికంటే చిన్నగా వ్రాయుటకు

ఆకుమీద వీలుపడదు. ఒక అక్షరము వ్రాయుటకు ఇప్పటికాలములో ఎంత

వేగముగా వ్రాసినా కనీసము రెండు సెకండ్ల కాలమైనా పట్టును. రెండు

సెకండ్లలో నున్నటి పేపరుమీద, మెత్తని పెన్నుతో వ్రాయబడు అక్షరము,

అదే తాటిఆకుమీద, ఇనుప కుంచెముతో వ్రాయుటకు కనీసము 30 సెకండ్ల

కాలమునుండి 50 లేక 60 సెకండ్ల కాలము పట్టవచ్చును. అటువంటి

వసతియున్న ఆ కాలములో ఎంతో నేర్పుగా, ఎంతో ఓర్పుగా శంకరాచార్యుల

వారు భగవద్గీతను వ్రాయుటకు కనీసము ఒక సంవత్సర కాలము పట్టినది.

ఒక గ్రంథమును వ్రాయుటకే ఆయనలోని ఓర్పు నేర్పు రెండూ అయిపోయి

వుండును. తిరిగి రెండవ గ్రంథమును వ్రాయుటకు మొదట కల్గిన గ్లాని

నుండి తేరుకొని పూనుకొనుటకు కనీసము మూడు నెలల కాలమయినా

ఉండవలెను. లేకపోతే మెదడులో ఏర్పడిన గ్లాని వలన వ్రాయబోయే

గ్రంథము యొక్క నడక మారిపోవును. వ్రాయాలనుకొన్నంత వ్రాయలేరు.

కొంత విశ్రాంతి తర్వాత సులభముగా వ్రాయుటకు మానసిక శక్తి వచ్చును.

ఇదంతయూ మేము గ్రంథములు వ్రాసిన అనుభవముతో చెప్పుచున్నాము.

ఇప్పుడు మేము ఈ గ్రంథమును వ్రాయుచున్న సమయము 4.1.2016

రాత్రి 1.40 నిమిషములు. రాత్రి 12.30 నిమిషములకు లేచి పూర్తిగా

తయారై కూర్చొనుటకు అరగంట సమయము పట్టగా ఒంటిగంటనుండి


వ్రాస్తున్నాము. ఇప్పటికి 40 నిమిషములనుండి వ్రాయుచున్నా ఒకటిన్నర

పేజీకంటే ఎక్కువ వ్రాయలేదు. అన్ని సౌకర్యములున్న ఈ కాలములోనే

ఈ గ్రంథము వ్రాయుటకు కనీసము ఒక నెలకాలము పట్టుచున్నది. ఏ

సౌకర్యములేని ఆ కాలములో ఇదే గ్రంథమును వ్రాయుటకు కనీసము

నాలుగు నెలల నుండి ఆరు నెలల కాలమయినా పట్టవచ్చును. దీనినిబట్టి

ఆయన జీవితములో 20 గ్రంథములు వ్రాశారని మీరు చెప్పగలరా?


శంకరాచార్యుల వారు భగవద్గీతా గ్రంథమును మాత్రము తన

జీవితములో వ్రాయగలిగారు. మిగతా గ్రంథములు వ్రాశాడు అని చెప్పుట

పూర్తి అసత్యముగా కనిపించుచున్నది. భగవద్గీతా జ్ఞానమును చెప్పినవాడు

పరమాత్మ (దేవుడు). అయితే దేవుడు స్వయముగా ఎవరితోను నేరుగా

మాట్లాడడు. కనుక భగవంతునిగా వచ్చి భగవంతునిగా మాట్లాడి చెప్పిన

బోధ భగవద్గీత. భగవద్గీత నిజమైన దేవుని జ్ఞానము. నిజమైన దేవుడు

భగవంతునిగా చెప్పిన జ్ఞానము. భగవద్గీత ముందర మిగతా మనుషులు

చెప్పిన గ్రంథములన్నియూ తక్కువ అనియే చెప్పవచ్చును. భగవద్గీతను

తేనెగా పోల్చితే, మిగతా గ్రంథములను బెల్లముతో తయారు చేసిన

పానకముగా చెప్పవచ్చును. తేనెను త్రాగినవాడు పానకమును త్రాగితే

'పానకము తేనెకంటే ఎన్నోరెట్లు తక్కువ' అని చెప్పగలడు. అటువంటి

భగవద్గీతకు వివరము వ్రాసినవాడు దానికంటే భిన్నముగాయున్న దానిని

ఒప్పుకోడు, వ్రాయడు. అటువంటివాడు ఏ గ్రంథమును వ్రాసినా భగవద్గీతను

ఆధారముగా చూపుచూ, భగవద్గీతా శాస్త్రమునకు అనుగుణముగాయున్న

గ్రంథములనే వ్రాయును.


శంకరాచార్యుల వారు భగవద్గీతకు వివరము వ్రాశాడు అనుట

సత్యము. అయితే అదే శంకరుడే భగవద్గీతకు కొంచెము భిన్నముగా


యున్న దానిని వ్రాయునా అంటే భగవద్గీత విలువ తెలిసిన తర్వాత దానికి

భిన్నముగా వ్రాయడు. అంతేకాక భగవద్గీతలో లేని విషయములను కల్పించి

వ్రాయడు. భగవద్గీత తర్వాత శంకరుల "వివేక చూడామణి” అను

గ్రంథమును వ్రాశాడని చెప్పుచున్నారు. వివేక చూడామణి అను గ్రంథములో

అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞాన

మయ కోశము, ఆనందమయ కోశము అను ఐదు కోశములను వ్రాశారు.

అయితే భగవద్గీతలో ఈ ఐదు కోశములు చెప్పలేదు. భగవద్గీతలో చెప్పని

భగవద్గీతకు కొంత భిన్నముగాయున్న విషయములను శంకరుడు ఎలా

చెప్పగలడు? దీనినిబట్టి 'వివేక చూడామణి' అను గ్రంథమును శంకరుడు

వ్రాయలేదని చెప్పవచ్చును. మరియొక విషయమును తీసుకొని చూచిన

యెడల అదే గ్రంథములో శరీరమును రెండు భాగములుగా విభజించి

చెప్పినప్పుడు, స్థూల, సూక్ష్మ భాగములని పేరుపెట్టి శరీరభాగములను

వ్రాసియున్నారు. అలా శంకరుడు వ్రాసియుండడు. యోగా చూడామణి

ఉపనిషత్తులో ఒక శ్లోకము ఇలా కలదు. "జ్ఞాన కర్మేంద్రియైః, ప్రాణాది

పంచవాయు మనోబుద్ధిశ్చ సూక్ష్మ లింగ మిత్యుచ్యతే” అని చెప్పారు.

దీనినిబట్టి ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ప్రాణాది

పంచవాయువులు ఐదు, మనస్సు, బుద్ధి మొత్తము పదియేడు (17) సూక్ష్మ

శరీరమని అంటారు అని కలదు. ఈ శ్లోకమును యోగచూడామణి

ఉపనిషత్తులో వ్యాసుడు వ్రాసియుండగా అదే విషయమునే శ్లోకమును

మార్చి చెప్పినట్లు కలదు. భగవద్గీత తేనెలాగ యున్నప్పుడు, పానకములాంటి

విషయములను శంకరుడు వ్రాసియుండడు. భగవద్గీత 701 శ్లోకములు

యుండగా, 'వివేక చూడామణి' గ్రంథము ఒకటవ భాగములో 581

శ్లోకములు, రెండవ భాగములో 267 శ్లోకములు గలవు. రెండు భాగముల


గ్రంథములలో మొత్తము శ్లోకములు 848 శ్లోకములు ఉన్నాయి.

భగవద్గీతలోని 700 శ్లోకములకు వివరమును వ్రాయుటకు శంకరాచార్యుల

వారికి ఒక సంవత్సర కాలము పట్టియున్నప్పుడు 848 శ్లోకములను

మరియు వాటి వివరమును వ్రాయుటకు ఎంతకాలము పట్టునో మీరు

ఊహించుకోవచ్చును. భగవద్గీతలోని 700 శ్లోకములు వ్యాసుడు ముందే

ఛందోబద్దముతో (వ్యాకరణ రీత్యా) వ్రాసియుండగా, వాటికి వివరమును

మాత్రము శంకరుడు వ్రాశాడు. వివేక చూడామణిలో అట్లుకాక మొత్తము

శ్లోకములను క్రొత్తగా వ్రాయడము జరిగినది. ఒక శ్లోకమును వ్రాసి దాని

ఛందస్సును చూచుటకు తప్పక కొంత సమయము పట్టును. 848

శ్లోకములను ఛందోబద్ధముగా వ్రాయుటకు, తర్వాత వాటి వివరమును

వ్రాయుటకు ఎంతకాలము పట్టునో మీరే చూడండి. ఇదంతయూ

గమనించితే విచక్షణయున్నవాడు శంకరుడు వివేక చూడామణి వ్రాయుటకు

వ్యవధి లేదని చెప్పగలడు. రెండవ గ్రంథమును వ్రాయుటకే వ్యవధి లేనట్లు

కనిపించుచుండగా, మిగతా 18 గ్రంథములను వ్రాయలేదని నిర్ణయము

చేయవచ్చును.


శంకరుడు ముందే తన 28వ సంవత్సరముల వయస్సులోనే

భగవద్గీతను వ్రాశాడు. తేనెలాంటి గ్రంథమును వ్రాసిన తర్వాత

పానకములాంటి మిగతా గ్రంథములను వ్రాయవలసిన అవసరము

ఆయనకు లేదు. మిగతా 19 గ్రంథములను ఆర్యులు ముందే వ్రాసినవనీ,

శంకరుడు చనిపోయిన తర్వాత తాము వ్రాసిన 19 గ్రంథములను శంకరుడే

వ్రాశాడని ప్రచారము చేశారనీ, అలా శంకరుని పేరు చెప్పడము వలన

శంకరునికి ప్రజలలో తాము కల్పించిన గౌరవమునుబట్టి తమ బోధలు

శంకరుని పేరుతో ప్రజలలో చేరిపోగలవని అనుకొన్నారు. ఈ విధముగా


ఆర్యులు తెలివిగా చేసిన ఎన్నో పనులలో ఇదొక పనియని చెప్పవచ్చును.

ఎప్పుడో పూర్వము ఆర్యులు చేసిన పనుల వలన వారి గ్రంథములు

ప్రజలలో వ్యాపించిపోయాయి, వారి భావములు ప్రజలలో వ్యాపించిపోయిన

వని చెప్పవచ్చును. ఎంతో కాలమునుండి ఫతకము ప్రకారము ప్రజలలో

చొప్పించిన ఆర్యుల భావములు ద్రావిడులలో చేరిపోయాయి. ద్రావిడులు

కూడా ఆర్యుల భావములలో చిక్కుకొని పోవడము వలన 'మేము

ద్రావిడులము' అను ధ్యాసను మరచిపోయి మేము మొదటినుండి యున్న

భగవద్గీత జ్ఞానమును చెప్పితే మమ్ములను వ్యతిరేఖించుచున్నారు.


క్రీ.శ. 1824 నుండి 1883 వరకు పూర్వము దయానంద సరస్వతి

అను ఒక గురువు ఉండెడివాడు. ఆయన స్వచ్ఛమయిన ఆర్యుడని

చాలామందికి తెలియదు. ఆర్యులు పూర్వము కొన్ని వేల సంవత్సరముల

పూర్వము వేసిన పునాదికి తిరిగి బలమును చేకూర్చినవాడు దయానంద

సరస్వతి. ఇంతవరకు 'ఆర్యులు' అను గుంపు పదమును వాడుచూ వచ్చాము

గానీ, ఫలానా అని ఎవరి పేరు పెట్టి మేము చెప్పలేదు. పూర్వము ఆర్యులు

తమ పనులకు ప్రాధాన్యత నిచ్చారుగానీ, వారి పేర్ల గుర్తింపుకుగానీ, వ్యక్తిగత

ప్రచారముగానీ చేసుకోలేదు. ఏ పనిలో అయినా ఫలానా ఆర్యులున్నారని

తెలియనట్లు ప్రవర్తించి ప్రతి దానిని వెనుకయుండి కనిపించక నడిపారు.

త్రేతాయుగమునుండే ఆర్యుల అలజడి భారత దేశములో కనపడినది.

త్రేతాయుగములోనే మధ్య ఆసియా ప్రాంతమునుండి భారతదేశమునకు

వలస వచ్చిన ఆర్యులు మహా మేథావులు. భారతదేశములో వారి

ఆధిపత్యము కొరకు ఏమి చేయాలో అవి అన్నీ చేశారు. చివరకు

భారతదేశములో వారి ఆధిపత్యమును చాటుకొన్నారు. అయినా ఆర్యులు

ఎవరి దృష్టిలో పడలేదు. ప్రజల దృష్టిలో పడితే జిష్ఠి తగులుతుందని


వారికి తెలుసు. అందువలన ఇది ఆర్యుల పనియని ఎవరూ గుర్తించనట్లు

వారు ముందే ఫతకము ప్రకారము తమ పనులను చేయుచూవచ్చారు.

భారతదేశము 'ఇందూదేశము'గా యుంటే దానిపేరును 'హిందూదేశము’గా

మార్చివేశారు. జ్ఞానులందరినీ అజ్ఞానులను చేసి, వారి భావములు

అందరిలోనికి ప్రాకునట్లు చేశారు.


పూర్వము ముందస్థుగా ఆర్యులు చేసిన పనివలన భగవద్గీతయొక్క

జ్ఞానము భారతదేశములో ఇప్పటికీ ప్రాకలేదు. భగవద్గీతకు వ్యతిరేఖమయిన

పనులు చేయుచున్నా ఇది దైవ విరుద్ధమైన పని కదా!యని ఎవరి

జ్ఞాపకమునకు రానట్లు ఆర్యులు చేశారంటే వారి మేథాశక్తి గొప్పదనియే

చెప్పవచ్చును. ఇట్లు తమ భావములకు, తమ జ్ఞానమునకు ఎదురు లేకుండా

చేసుకొన్నవారు ఎవరూ గుర్తించనట్లు ఉండిపోయారు. ఈ పనులు చేసినది

ఆర్యులని మేము తప్ప ఎవరూ చెప్పలేదు. వారికి వ్యతిరేఖముగా మాట్లాడితే

హిందువులలోనే మిళితమైయున్న ఆర్యుల ద్వారా మాకు వ్యతిరేఖత తప్పదని

మాకు తెలిసినా, ఇప్పటికే ఎన్నో వ్యతిరేఖతలు వచ్చినా పట్టువదలక

సత్యమునే చెప్పుచున్నాము. ఇప్పటికయినా ద్రావిడులు కళ్ళు తెరచి

ప్రవర్తించాలని తెలుపుచున్నాము. మీరు చేయు భక్తి భగవద్గీతకు

వ్యతిరేఖమేమో ఒకమారు వెనుతిరిగి చూచుకోండి.


దాదాపు వంద సంవత్సరముల పూర్వము గుజరాత్లో తంకర

గ్రామములో పుట్టిన మూల్ శంకర్ అను బ్రాహ్మణుడు కాలక్రమమున

దయానంద సరస్వతిగా మారిపోయాడు. దయానంద సరస్వతి ఆర్యుల

వారసుడయినందున ఆయన ఆర్యసమాజమను ఒక సంస్థను తయారు

చేశాడు. తమ పూర్వీకులు ఎలా చేశారో ఆయన అలాగే చేశాడు. అయితే

పూర్వపు ఆర్యులు ఎక్కడా కనిపించకుండా చేశారు. దయానంద సరస్వతి


పూర్తి కనిపించి చేశాడు. గతములోని ఆర్యులు శంకరాచార్యులను ముందుకు

పెట్టి తాము వెనుకయుండి చేశారు. దయానంద సరస్వతి అలా కాకుండా

తానే ముందుండి చేశాడు. ఎక్కడా శంకరాచార్యులను ముందుకు

చూపలేదు. తానే స్వయముగా ఆర్యసమాజమును దేశమంతా స్థాపించాడు.

అప్పటినుండి అవి పెరుగుచూపోయి నేడు దేశమంతా ఆర్యసమాజములు

ఎక్కడ చూచినా ఉన్నాయి. హైదరాబాద్లో మరియు సికింద్రాబాద్లోనే

దాదాపు పదిచోట్ల ఆర్యసమాజ సంఘములున్నట్లు వినికిడి.


ప్రశ్న :-:- దయానంద సరస్వతి శంకరాచార్య అద్వైతమునే ప్రచారము చేశాడు

కదా! అద్వైతమును ప్రచారము చేయడమే ఆయన పనికదా!

జవాబు :- ఆయన అద్వైతమునే ప్రచారము చేసినా పూర్వపు ఆర్యులవలె

కనిపించకుండా చేయలేదు. ప్రతిచోట ఆర్యుల సంస్కృతికి అద్దము

పట్టేలాగున ప్రవర్తించాడు. పూర్వపు ఆర్యులకు హిందువులు ఒక్కరే గురిగా

యుండేవారు. వారు హిందువులలోనే అన్ని గందరగోళములు చేశారు.

అయితే దయానంద సరస్వతి హిందువులనే కాకుండా క్రైస్తవులను,

ముస్లీమ్లను కూడా విమర్శించాడు. అందువలన ఆయన బయటికి బాగా

కనిపించాడు. దయానంద ఆర్య సమాజములను స్థాపించినా ఆయన

ఆర్యుడని ఎవరూ గ్రహించలేదు. సాధారణ గురువుగానే లెక్కించారు.


ప్రశ్న :-:- ఒక మతమువారు మరియొక మతమును విమర్శించుకోవడము

అందరికి అలవాటైపోయినది. దయానంద సరస్వతి హిందువు అయినందున

క్రైస్తవులను, ముస్లీమ్లను విమర్శించియుండవచ్చును. అయితే ఆయన

హిందువుగా కనిపించుచూ హిందువులను ఎట్లు విమర్శించాడు. ఎవరిని

విమర్శించాడో తెలుపగలరా?


Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024