హిందూ ధర్మమునకు రక్షణ అవసరమా?. cloud text 5th Oct 24 Updated
హిందూ ధర్మమునకు రక్షణ అవసరమా?.
నేను ఒక మనిషిని, నేను ఏ మతమునకు సంబంధము లేనివాడను.
పరమాత్మయిన దేవుని వలన ప్రపంచము పుట్టినది. ప్రపంచములో
ఆత్మయను దేవుని వలన మనుషులు, జీవరాసులు సృష్ఠింపబడినారు. పంచ
మహా భూతములయిన ప్రపంచమును సృష్టించినవాడు ఒకటవ దేవుడు.
ప్రకృతిని సృష్టించినవాడు ఒక్క దేవుడే. అప్పుడు రెండవవాడు ఎవడూ
లేడు. ఒక పురుషుడే స్త్రీ తత్త్వమైన పంచభూతముల ప్రపంచమును
సృష్టించాడు. తర్వాత ఖాళీగాయున్న ప్రపంచములో జీవరాసులు లేవు,
మనుషులు లేరు. అప్పుడు మొదటి సృష్ఠికర్తయిన ఏకైక దేవుడు రెండవ
పురుషున్ని పుట్టించాడు. రెండవ పురుషున్ని సృష్టించినవాడు మొదటి
పురుషుడు. మొదటి పురుషుడు తెలియబడనివాడు అయినందున ఆయనను
'దేవుడు' అని అన్నారు. స్త్రీతత్త్వమైన ప్రకృతిని సృష్టించిన సృష్టికర్తను
'దేవుడు' అని అనుచున్నాము.
సృష్ఠింపబడిన ప్రకృతిని సృష్టికర్తయిన దేవుడు రెండు భాగములుగా
విభజించాడు. అందులో ఒక దానిని మార్పు చెందని ప్రకృతియని
అంటున్నాము. మరియొక దానిని మార్పు చెందే ప్రకృతియని అంటున్నాము.
ప్రపంచమును సృష్టించిన సృష్టికర్తయిన పరమాత్మ ప్రపంచములో మనుషు
లను, జీవరాసులను తయారు చేయదలచి జీవరాసులను సృష్టించుటకు
మరియొక పురుషున్ని తయారు చేశాడు. ఆ రెండవ పురుషున్నే 'ఆత్మ'
యంటున్నాము. సృష్టికర్తయినవానిని దేవుడు అని అన్నాము కదా! అదే
విధముగా జీవరాసులను సృష్టించిన సృష్టికర్తను కూడా దేవుడేయని
అంటున్నాము. ఆ విధముగా మొదటి దేవుడు, రెండవ దేవుడు అని
ఇద్దరు దేవుళ్లు తయారయినారు. రెండవ దేవుడు కూడా సృష్ఠింపబడిన
వాడే కావున సృష్ఠింపబడిన వానికి పేరున్నది. సృష్ఠింపబడినది ఏదయినా
దానికి పేరు, రూపము, పని ఉంటుంది. తయారు చేయబడిన దేనికయినా
ఒక శాస్త్రీయత కలదు. శాస్త్రీయతను అనుసరించి దానికి సిద్ధాంతమున్నది.
సిద్ధాంతమున్న దానికి నిర్ణయించబడిన ధర్మముండును.
సృష్ఠింపబడిన ప్రతీ దానికి ధర్మమును నిర్ణయించినవాడు మొదటి
దేవుడయిన పరమాత్మ. మొదటి సృష్ఠికర్తయిన దేవుడు ఎవరి చేతా సృష్ఠింప
బడలేదు. అందువలన ఆయనకు పేరు లేదు, ఆకారము లేదు, పనియూ
లేదు, ఆయనకు ఏ ధర్మములు లేవు. తన నుండి రెండవ ఆత్మను సృష్టించిన
మొదటి దేవుడు ఆత్మకంటే వేరుగా యుండువాడయిన దానివలన, ఆయనను
గుర్తింపు కొరకు, ఆత్మకంటే వేరయినవాడను అర్థము వచ్చునట్లు 'పరమాత్మ'
యని అనడమైనది. సృష్టికి పూర్వము సృష్టికర్తయిన వానికి పరమాత్మయను
గుర్తింపు కూడా లేదు. ఏ గుర్తింపు లేనివాడయిన మొదటి దేవుడు, మొదటి
సృష్ఠికర్త, ధర్మములు లేనివాడు. ఆయన ఎవరి చేతా సృష్టింపబడని
వాడైనందున ఆయన ధర్మాతీతుడు. ధర్మములకు అతీతుడుగా యున్న
మొదటి దేవుడయిన పరమాత్మ తన తలంపు చేత ఆత్మను సృష్ఠించాడు.
ప్రపంచములో ఆత్మకు ధర్మములు గలవు గానీ, సృష్ఠింపబడని పరమాత్మకు
ధర్మములు లేవు. పరమాత్మ చేత సృష్ఠింపబడినవాడు ఆత్మ. ఆత్మ
ధర్మయుక్తుడైయుండి తాను జీవరాసులను సృష్టించడము జరిగినది. సృష్ఠి
తర్వాత ప్రపంచములో మొదట పని చేసినవాడు ఆత్మయే. ఆత్మ
జీవరాసులను సృష్ఠించాడు. సృష్టించువాడు అయినందున ఆత్మను 'రెండవ
దేవుడు' అని అంటున్నాము.
ఆత్మ రెండవ పురుషుడై, మూడవ పురుషుడయిన జీవాత్మను
సృష్ఠించాడు. జీవాత్మ పురుషుని అంశయే అయినా, అతను ప్రకృతితో
కలిసి యున్నాడు. జీవుడు ఆత్మవలె పురుషుడైయున్నాడు. జీవుడు ఆత్మ
చేత సృష్టింపబడినాడు. కావున సృష్టింపబడిన వానికి ధర్మములు ఉండును.
జీవాత్మ ధర్మములు వేరు, ఆత్మ ధర్మములు వేరు. సృష్ఠింపబడిన దేనికయినా
రూపము, పేరు, క్రియలు ఉంటాయని చెప్పినట్లు ఆత్మకు రూప, నామ,
క్రియలు గలవు. అట్లే జీవాత్మకు కూడా రూప, నామ, క్రియలు గలవు.
ఆత్మను ప్రకృతి ఆవహించి లేదు. అందువలన ఆత్మలో పురుషతత్త్వమే
యున్నది గానీ, స్త్రీ లక్షణములయిన ప్రకృతి లక్ష్యణములు ఏవీ లేవు.
అయితే మూడవ ఆత్మయిన జీవాత్మ పురుషుడే అయినా, స్త్రీతత్త్వమైన ప్రకృతి
వేషమును ధరించియున్నాడు. పురుషుడు కనిపించే స్త్రీ దుస్తులు ధరించడము
వలన జీవున్ని పూర్తి పురుషుడు అని అనక నపుంసకుడు అని చెప్పవలసి
వచ్చినది. ప్రకృతి లేకముందు ప్రకృతిని సృష్టించిన దేవునికి సృష్ఠి తర్వాత
ఏ కార్యమును చేయక, తాను తయారు చేసిన ఆత్మకు జీవరాసులను తయారు
చేయు కార్యమును నియమించాడు. దేవుడు తనను సృష్టించాడు కనుక
ఆయన ఆజ్ఞ ప్రకారము, ఆయన ఇచ్చిన అధికారము ప్రకారము ఆత్మ
అనబడు రెండవ దేవుడు సర్వజీవరాసులను మార్పుచెందే ప్రకృతితో కలిపి
తయారు చేశాడు.
సృష్టించేవాడు అయినందున ఆయనను (ఆత్మను) కూడా దేవుడు
యనియే పిలుస్తున్నాము. అయితే 'సృష్టింపబడిన వానికి ధర్మములుంటాయి’
అను సిద్ధాంతము ప్రకారము ఆత్మకు రూప, నామ, క్రియలున్నాయి. అట్లే
సృష్ఠింపబడిన జీవాత్మకు కూడా రూప, నామ, క్రియలు గలవు. అంతేకాక
'చావు, పుట్టుకలు' అను ధర్మములను కూడా కలిగియున్నాడు. స్త్రీతత్త్వ
మయిన ప్రకృతిని మొదటి సృష్ఠికర్త అయినవాడు మార్పుచెందే ప్రకృతి,
మార్పు చెందని ప్రకృతియని రెండు భాగములుగా తయారు చేశాడు. ప్రకృతి
కూడా సృష్ఠింపబడినదే కావున, ప్రకృతి కూడా ధర్మములతో కూడుకొని
యున్నది. ధర్మములు సిద్ధాంతము మీద, సిద్ధాంతము శాస్త్రము మీద
ఆధారపడి యుంటుంది. అందువలన ఏ ధర్మమయినా శాసనములతో
కూడినదై, మార్పుచెందనిదై ఉంటుంది. పరమాత్మ సృష్ఠింపబడనివాడు
అయినందున ఆయన ధర్మములకు అతీతుడు.
ఈ విధముగా సృష్ఠింపబడినవారు ముగ్గురు ఒకటి ప్రకృతి, రెండు
ఆత్మ, మూడు జీవాత్మ. ఈ ముగ్గురిలో ప్రకృతిని, ఆత్మను సృష్టించినవాడు
మొదటి సృష్ఠికర్త పరమాత్మ కాగా, జీవాత్మను సృష్టించినవాడు రెండవ
సృష్టికర్త అయిన ఆత్మయని తెలియవలెను.
1) సృష్టికర్తలు ఇద్దరు ,
1) పరమాత్మ,
2) ఆత్మ.
2) పరమాత్మ సృష్ఠి,
1) ప్రకృతి,
2) ఆత్మ.
3) పురుషులు ఇద్దరు,
1) పరమాత్మ,
2) ఆత్మ.
4) పని చేయని పురుషుడు ,
పరమాత్మ.
5) పని చేయు పురుషుడు,
ఆత్మ.
4) పని చేయని పురుషుడు,
పరమాత్మ.
5) పని చేయు పురుషుడు,
ఆత్మ.
1) సృష్టింపబడినవారు ముగ్గురు,
1) ప్రకృతి,
2) ఆత్మ,
3) జీవాత్మ.
2) ఆత్మ సృష్టి,
1) జీవాత్మ.
3) పురుషులు కానివారు,
1) ప్రకృతి.
4)నపుంసకుడు ,
జీవాత్మ.
5) అనుభవించే వాడు,
జీవాత్మ.
6) ధర్మములున్నవారు,
1) ప్రకృతి,
2) ఆత్మ,
3) జీవాత్మ.
6) ధర్మములు ఉన్నవారు :
ప్రకృతి, ఆత్మ , జీవాత్మ .
7) కర్మలు లేని వాడు ,
పరమాత్మ ,ఆత్మ .
7) కర్మలున్నవాడు,
1) జీవాత్మ.
8)శాసనమైనది ,
ధర్మము .
8) కారణమైనది,
కర్మము.
ప్రశ్న :- మీరు ఇంతకు ముందు చెప్పిన సమాచారములో సృష్టికర్తలు
ఇద్దరు యనీ, ముగ్గురు సృష్ఠింపబడినవారనీ అందులో ఒకమారు సృష్టింప
బడిన ఆత్మ, తర్వాత సృష్ఠించబడు స్థోమత కల్గిన ఆత్మ, జీవాత్మలను
సృష్టించినది. జీవాత్మ పురుషుడే అయినప్పటికీ కొంత పురుష లక్షణములు
ఉన్నా, అతడు ప్రకృతితో కూడి మాయలో ఉండుట వలన అతనిని
‘నపుంసకుడు' యని అంటున్నారు. అయితే సృష్ఠింపబడి ఆ తర్వాత
సృష్ఠికర్తయిన ఆత్మకు ధర్మము కలదన్నారు. కేవలము సృష్టింపబడిన
జీవాత్మకు కర్మము కలదన్నారు. ముందు చెప్పిన సమాచారము ప్రకారము
ప్రకృతి పురుషులు తెలియబడినారు. అయితే ధర్మ, కర్మ అను మాటలు
ఇప్పుడు క్రొత్తగా వినిపించుచున్నవి. ధర్మము అనగానేమి? కర్మము
అనగానేమి వివరించి చెప్పగలరని అడుగుచున్నాము?
జవాబు :- ధర్మము, కర్మము అను రెండు పదములలో చివరి 'ము' అను
అక్షరము ముగింపు శబ్దముగా యున్నది. అందువలన ధర్మ, కర్మ అను
రెండు శబ్దముల అర్థమును మాత్రము తెలియవలసియున్నది. ముఖ్యముగా
చెప్పితే కర్మ అని అలవాటుగా వ్రాయుచున్న పదమును ఖర్మ యని పూర్వము
వ్రాసెడివారు. కాలక్రమమున ఎన్నో పదములు మారిపోయినట్లు 'ఖర్మ'
అనునది 'కర్మ' అని ప్రస్తుత కాలములో వ్రాయబడుచున్నది. 'ధర్మ' అనునది
పూర్వము నుండి నేటి వరకు మారకుండా పలుకబడుచున్నది. ఈ
పదములను విడదీసి చెప్పుకొంటే క్రింది విధముగా గలవు.
ద + మర్మ = ధర్మ అని చెప్పవచ్చును.
క + మర్మ = ఖర్మ అని చెప్పవచ్చును.
'ధర్మము'లో 'ద' ను ప్రక్కన బెట్టి, 'మర్మ' అను శబ్దమునకు అర్థము
చెప్పుకొంటే రహస్యమైనదియనీ, తెలియనిదియనీ చెప్పవచ్చును. అట్లే
ఖర్మములో 'క' ను ప్రక్కన పెట్టి మిగతా 'మర్మ' మను శబ్దము కూడా
రహస్యమైనదనీ, తెలియనిదనీ అర్థమును ఇచ్చుచున్నది. 'ద' అనగా మారని
దక్షత కలదియనీ, మారని నిర్ణయము గలదియనీ చెప్పుచూ, 'ధర్మము'
అనగా రహస్యమైన మారని నిర్ణయము అని చెప్పవచ్చును. క అనగా
మారని కారణము కలదియని చెప్పుచూ, కర్మము అనగా రహస్యమైన
మారని కారణము గలది యని చెప్పవచ్చును. జీవున్ని సృష్టించిన ఆత్మకు
ధర్మము కలదు, అనగా రహస్యమైన మార్పుచెందని నియమము గలది
ఆత్మయని చెప్పవచ్చును. అలాగే జీవునికి ఖర్మ గలదు. అనగా రహస్యమైన
మారని కారణము గలది ఖర్మయని చెప్పవచ్చును. సృష్ఠింపబడిన జీవుని
వెనుక ఖర్మము దాగియున్నది. సృష్ఠించిన ఆత్మ వెనుక ధర్మము
దాగియున్నది. సృష్ఠింపబడిన జీవాత్మకు ఖర్మయున్నప్పుడు ఆత్మ కూడా
సృష్ఠింపబడినవాడే కదా! అతనికి కర్మ ఎందుకు లేదు అని కొందరు
అడుగవచ్చును? దానికి మా జవాబు ఏమనగా! ఆత్మ సృష్ఠింపబడిన వాడైనా,
తాను జీవరూపమైన జగతిని యంతా సృష్టించువాడైయున్నాడు, కావున
ఆయనకు కర్మ అనుభవములు లేవు. సృష్టికర్త అగుట వలన కర్మ
అనుభవములు ఆత్మకు లేవుగానీ, ఆయన కూడా పరమాత్మ చేత
సృష్ఠింపబడినవాడు అయినందున, జీవునకున్న కర్మ ప్రకారము ఆత్మ
పనిచేయవలసి యున్నది. అయితే జీవాత్మ మాత్రము అనుభవించవలసి
యున్నది. కర్మముల ప్రకారము పని చేయువాడు ఆత్మయినందున అతనిని
సృష్ఠింపబడినవాడు అని చెప్పవచ్చును. జీవాత్మ ఆత్మ సృష్ఠింపబడినవారే
గానీ, జీవాత్మ దేనినీ సృష్టించలేదు. అందువలన జీవాత్మ కర్మలనన్నిటిలోని
అనుభవములను మాత్రము అనుభవించుచున్నాడు. ఈ విధముగా
ధర్మమునకు, ఖర్మమునకు వివరము గలదు. జీవుల సృష్టికర్త పరమాత్మ
కాడు, కావున పరమాత్మకు ధర్మములే లేవు. అయినా ప్రకృతిని, ధర్మములను
సృష్ఠించినందుకు ఆయన (పరమాత్మ), ఆత్మ యొక్క, జీవుని యొక్క
ధర్మములను విధి విధానములను తెలుపవలసిన కార్యము గలదు.
అందువలన దేవుడయిన పరమాత్మ అప్పుడప్పుడు అవతరించి ఆత్మ
ధర్మములను చెప్పిపోవుచుండును.
1)ప్రశ్న :- హిందూ ధర్మము అంటే ఏమిటి?
జవాబు :- ధర్మము అంటే రహస్యమైన నిర్ణయములతో కూడుకొన్నది
యని అర్ధము కదా! తెలియని ధర్మమును తెలియగలిగితే ధర్మము వెనుక
దాగియున్న నియమములు ఏవో తెలిసిపోవును. అప్పుడు ధర్మములు గల
ఆత్మగానీ, జీవాత్మగానీ తెలిసిపోవును. ధర్మమును తెలియుటకు మనిషికి
జ్ఞానము అవసరము. జ్ఞానము అనగా తెలియబడు విధానము గలదియని
చెప్పవచ్చును. జ్ఞానము వలన ధర్మమును తెలియవచ్చును. ధర్మము
మర్మముగా యున్నా మర్మమును ఛేదించునది జ్ఞానము. జ్ఞానము విచక్షణతో
కూడుకొనియుండును. జ్ఞానము మనిషికి ప్రకృతి నుండి లభించవలెను.
ప్రకృతిలోగల చంద్రుడు జ్ఞానమునకు అధిపతియని తెలియుచున్నది.
చంద్రుడు సర్వ జ్ఞానములకు నిధిలాంటివాడు. చంద్రుని ఆధీనములో
యున్న జ్ఞానమును చంద్రుడు ఇస్తే మనిషికి లభ్యమగును. మనిషిలోని
కర్మనుబట్టి ప్రపంచ జ్ఞానమును, మనిషిలోని శ్రద్ధనుబట్టి దేవుని జ్ఞానమును
చంద్రుడు ఇవ్వగలడు. అందువలన జ్ఞానమునకు చంద్రుని పేరే పెట్టారు.
మనిషికిగల జ్ఞానమును 'చందము' అని అంటారు. అట్లే మనిషికిగల
రూపమును 'అందము' అంటారు. అందము కనిపించేది. చందము
(జ్ఞానము) కనిపించనిది. రూపి అనగా అందము గలవాడు అని అర్థము,
కురూపి అనగా అందము లేనివాడు (అందహీనుడు) అని అర్థము. చందము
గలవాడు అంటే జ్ఞానము గలవాడు యని అర్థము. అచందము అంటే
జ్ఞానము లేనివాడు అజ్ఞాని అని అర్థము. చందము అను మాటను అందరూ
వాడేవారు కాదు. అంద, చందములు ప్రపంచ సంబంధమైనవని చెప్పుచూ,
దైవజ్ఞాన సంబంధమునకు మాత్రము చంద్రునికి మారు పేరయిన ‘ఇందు’
అను పదమును వాడేవారు. ఇందూ జ్ఞానము అంటే దైవజ్ఞానము
అని లెక్కించెడివారు. సృష్ఠించబడిన వానికి ధర్మము ఉండును అన్నట్లు,
జీవుడు సృష్టించబడినవాడు అయినందున జీవునికి కూడా ధర్మములు గలవు.
అవి అన్నియూ ప్రపంచ సంబంధ జ్ఞానము అయిన దానివలన దానిని
‘చంద ధర్మములు' అని చెప్పేవారు. దైవ ధర్మములను 'ఇందూ ధర్మములు'
అనెడివారు. ఇందూ ధర్మమును ఇందూ జ్ఞానముతోనే తెలియవలెననియు,
ప్రపంచ సంబంధ జీవుని ధర్మములను ప్రపంచ జ్ఞానముతోనే తెలియవలె
ననియు చెప్పెడివారు. ఇందూ జ్ఞానముతో తెలియబడు ఆత్మ ధర్మములను
ఇందూ ధర్మములని చెప్పెడివారు.
2) ప్రశ్న :- ఇందూ ధర్మములను దేవుని ధర్మములని
ఒకచోట, అట్లే ఆత్మ ధర్మములని మరొకచోట చెప్పియున్నారు.
దేవుని ధర్మములని చాలామార్లు చెప్పారు. వాస్తవముగా
ఇందూ ధర్మములు దేవుని ధర్మములా, ఆత్మ ధర్మములా?
జవాబు :- నేను ఇందూ ధర్మమును గురించి పూర్తి చెప్పకనే తిరిగి వేరొక
ప్రశ్న వేశారు. సరే నీవు అడిగిన దానికి కూడా వివరమును చెప్పెదను
విను. మనుషుల చేత ఆరాధింపబడు దేవుడు ఒక్కడే గలడు. ఎవడయితే
మనుషులను సృష్టించాడో అతడే మనుషులకు దేవుడు. మొదటి సృష్ఠికర్తయిన
పరమాత్మ ప్రకృతికి దేవుడు, అట్లే ఆత్మకు కూడా దేవుడే. పరమాత్మకు
ధర్మములు ఉండవు. ధర్మములు ఉంటే నియమములకు కట్టుబడియున్న
వాడగును. శాసనములతో కూడిన శాస్త్రమునకు బద్దుడై ఉండును. ఏ
సూత్రమునకు, ఏ శాసనమునకు, ఏ ధర్మమునకు సంబంధము లేనివాడు
ప్రకృతిని సృష్టించిన పరమాత్మ. అందువలన పరమాత్మను ధర్మాతీతుడు
అని అందురు. 'భక్తియోగము' అను దానిలో మొదటి దేవుడయిన
పరమాత్మను శరణువేడవచ్చును. ఆయనున్నాడని తెలిసినవాడు "సర్వధర్మాన్
పరిత్యజ్య మామేకం శరణం వ్రజ" అని ప్రథమ దైవగ్రంథము అయిన
భగవద్గీతలో మోక్షసన్న్యాస యోగము అను అధ్యాయమున 66వ శ్లోకములో
ఈ విషయమును చెప్పియున్నారు. అయితే మూడు ఆత్మల విషయమును
తెలిసినవాడు మొదటి దేవున్ని వినయముతో శరణుజొచ్చినా, అతడు రెండవ
ఆత్మను దేవునిగా తలచి ఆరాధించవలసియుండును. ఇదే విషయమునే
అంతిమ దైవగ్రంథము 16-51 లో కూడా ఇలా చెప్పారు. దేవుడు ఈ
విధముగా చెప్పుచున్నాడు. “ఇద్దరు దేవుళ్లని ఆరాధించకండి. ఆరాధ్య
దైవము ఆత్మ ఒక్కడే. ఆయనను ఆరాధించండి, నాకు భయ
పడండి.” భగవద్గీతలో చెప్పిన బ్రహ్మయోగము, కర్మయోగము రెండూ
ఆత్మను ఆధారముగా చేయవలసిందే.
మనుషులయినవారు ఏ మతములో పుట్టియున్నా వారు ఆత్మను
గురించిన ధర్మములను తెలియవలసిందే. భగవద్గీతలో చెప్పిన బ్రహ్మ,
కర్మ యోగములను మిగతా రెండు దైవగ్రంథములలో కూడా చెప్పియున్నారు.
మిగతా రెండు గ్రంథములయిన బైబిలు, ఖురాన్లలో వేరు భాషలో, వేరు
వ్రాతలో, వేరు పేర్లలో వ్రాసియుండుట వలన భగవద్గీతలో చెప్పిన బ్రహ్మ,
కర్మ, భక్తి యోగములున్నాయని ఎవరూ తెలియలేకపోయారు. ఏ మతములో
నయినా దేవున్ని గురించి తెలియాలంటే అతనికి ఆ మత గ్రంథమని
చెప్పుకొను దైవ గ్రంథములోని జ్ఞానము తెలియాలి. అంతేకాక గ్రంథము
లోని జ్ఞానము తెలిసిన జ్ఞాని అనిపించుకొన్న తర్వాత అతడు తెలిసిన
జ్ఞానము ప్రకారము నడువాలి. అలా నడిచినప్పుడు అతడు తనకు
తెలియకుండానే యోగములను ఆచరించినట్లగును. మూడు దైవగ్రంథము
లలోను దేవుని ధర్మములను గురించి చెప్పియున్నారు. భగవద్గీతలో
ఆత్మయని చెప్పిన పేరును ఒక గ్రంథములో తండ్రియనీ, మరొక గ్రంథములో
అల్లాహ్యనీ చెప్పియున్నారు. ఆత్మ అనినా, తండ్రియనినా, అల్లాహ్
అనినా మూడు శరీరములోని దేవుని పేర్లేయని చెప్పవచ్చును. అందువలన
దేవుని ధర్మములనినా, ఆత్మ ధర్మములనినా ఒక్కటేయనీ, ఆత్మ ధర్మములనే
హిందూ ధర్మములని అంటున్నామని తెలియవలెను. ఏ మతములో దేవుని
జ్ఞానమున్నా, ఏ మతములోని జ్ఞాని అయినా వాడు ఆత్మ ధర్మములను
తెలిసినవాడగుట వలన వానిని 'హిందువు' అని అనవలెను. హిందూ
ధర్మము అంటే దేవుని ధర్మము లేక ఆత్మ ధర్మము అయిన దానివలన,
ఆత్మ ధర్మమును హిందూ ధర్మములని చెప్పుట వలన, ప్రతి మతములోను
జ్ఞానము ద్వారా ధర్మములను తెలిసిన వానిని 'హిందూ ధర్మము తెలిసినవాడు'
యని చెప్పవచ్చును.
ప్రశ్న :- మీరు మొదట 'హిందూ' అను పదమును చెప్పి
తర్వాత 'ఇందూ' అను పదమును కూడా చెప్పారు. మీరు అలా
ఎందుకు చెప్పారు? రెండు పదములలో ఏది సత్యమైన పదము
ఇందువా? లేక హిందువా?
జవాబు :- పూర్వము ‘దృష్ఠి' యను పదమును కంటిచూపుకు చెప్పెడివారు.
కాలక్రమములో దృష్ఠియను పదము 'జిష్ఠి' అను శబ్దముగా మారిపోయినది.
రెండు అక్షరముల 'దృష్టి' అను పదములో మొదటి అక్షరము వేరుగా
మారిపోయి రెండవ అక్షరము అలాగే నిలిచియున్నది. దృష్ఠి మొదట,
తర్వాత జిష్ఠి. దృష్ఠి అనినా, జిష్ఠి అనినా రెండిటి అర్థము 'చూపు' అని
చెప్పుచున్నాము. అర్థములో మార్పు లేకున్ననూ, పదమును పలుకడములో
ఒక అక్షరము మారిపోయి దృష్ఠి కాస్త జిష్ఠిగా మారిపోయినది. అదే
విధముగా మొదట ఇందూ అను పేరు కాలక్రమమున ఒక అక్షరము
మార్పు చెంది, ఇందూ కాస్త హిందువుగా చెప్పబడుచున్నది. ఇందూ
అనినా, హిందువు అనినా రెండు శబ్దములు ఒకే విధముగా పలుకుచున్నా
అందులో ఒక అక్షరము మార్పుచెంది మరొక అక్షరము అలాగే ఉండి
పోయినది. 'దృష్టి' అను పదములో మొదటి అక్షరము పూర్తిగా వేరు
అక్షరముగా అయిపోయినది. ఇక్కడ ఇందూ శబ్దములో మొదటి అక్షరము
అచ్చు నుండి హల్లుకు మారినది. అందువలన అక్షర మార్పు జరిగినా,
శబ్దము మాత్రము మొదటిలాగే పలుకబడుచున్నది.
మొదట యున్న అచ్చు గల 'ఇందు' అను శబ్దమునకు 'జ్ఞాని' అని
అర్థము గలదు. అంతేగాక ఇందువు అంటే చంద్రుడు అని అర్థమును
సూచించుచున్నది. తర్వాత మారిన హిందు అను శబ్దమునకు ఏమాత్రము
అర్థము లేకుండా పోయినది. దృష్ఠి శబ్దము పూర్తి అక్షరముతో సహా
మారిపోయి దృష్ఠి, జిష్ఠి అయినా అర్థము మాత్రము మారకుండా రెండిటికీ
చూపు అనియే గలదు. ఇందూ శబ్దములో మొదటి అక్షరము హల్లుగా
మారి 'ఇందూ’ పోయి ‘హిందూ' అయినా పలికే శబ్దములో తేడా లేకపోయినా
అర్థములో మాత్రము సంబంధము లేకుండా పోయినది. ఇందూ అంటే
జ్ఞాని అనియు లేక చంద్రుడు అనియూ అర్థమున్నా హిందువు అను
పదమునకు ఏమాత్రము అర్థము లేకుండా పోయినది. అయినా నేడు
కొంతయినా విచక్షణ లేనివారు కొందరు తమను అర్థము లేని పేరుతో
హిందువులము అని చెప్పుకొంటున్నారు. ఇందూ అనే పదము హిందువుగా
దాదాపు 150 సంవత్సరముల నుండి పూర్తిగా మారిపోగా, 200
సంవత్సరముల క్రిందట ఆనాడు ఆంగ్ల పాలకులు ఇందూ అని సరిగా
పలుకలేక హిందువులు అని పలుకడములో కొద్దికొద్దిగా మారుచూ వచ్చి,
150 సంవత్సరములకు పూర్తిగా మారిపోయినది. అలా ఆంగ్లపాలకులు
పలుకుటకు కూడా ఒక కారణము గలదు. అది ఏమనగా! అప్పటికే
భారతదేశములో ప్రవేశించి నివాసము ఏర్పరచుకొన్న ముస్లీమ్లు తమ
అరబ్బీ భాషలో 'హిందూ అంటే దొంగ అనియూ, బేవకూబ్ అనియు,
తెలివి తక్కువవాడు' యని అర్థము వచ్చుట వలన ఆనాటి ముస్లీమ్లు
అదే పనిగా అచ్చు గల 'ఇందూ' అని వ్రాయక, హల్లు గల 'హి' తో
హిందువులు అని వ్రాయుట వలన అందరూ అట్లే వ్రాయుచున్నారు.
వాస్తవమైన విషయమును మేము చెప్పినా, నేడు వినే స్థితిలో ఇందువులు
(హిందువులు) లేరు. హిందూ అను పదమునకు అర్ధము ఏమి గలదు?
అని భారత ప్రభుత్వమును ఒక న్యాయవాది ప్రశ్నించగా దానికి ప్రభుత్వము
తరపున వచ్చిన జవాబును తర్వాత పేజీలో చూడవచ్చును.
'హిందూ పదానికి
నిర్వచనం తెలియదు'.
ఇండోర్:
రాజ్యాంగం, న్యాయపరంగా
హిందూ పదానికి నిర్వచనం తెలియదని కేంద్ర
హోంశాఖ తేల్చింది. హిందూ పదం నిర్వచనం
చెప్పాల్సిందిగా మధ్యప్రదేశ్కు చెందిన చంద్రశే
ఖర్ గౌర్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టానికి
చేసుకున్న దరఖాస్తుకు బదులిస్తూ హోంశాఖ
పై విధంగా స్పందించింది. ఆ పదానికి సంబం
ధీంచిన ఎలాంటి సమాచారంలేదని కేంద్ర
పౌరసంబంధాల శాఖ అధికారి పేర్కొన్నట్లుగా
కేంద్రం తెలిపింది. ఎలాంటి నిర్వచనం లేన
ప్పుడు ఫలానా వర్గంవారు హిందువులని ఎలా
నిర్ధారిస్తున్నారని, దేశంలో హిందువులు మెజా
రిటీగా ఉన్నారని ఎలా చెబుతున్నారని గౌర్
ప్రశ్నించారు. (తేది:12.10.2015, సాక్షి న్యూస్ పేపరు)
ఇవన్నియూ గమనించిన తర్వాత అర్థము లేని హిందూ అనే
దానికంటే, అర్థముగల ఇందూ అని వ్రాయడము మంచిది. సోమవారము
చంద్రుని వారమని చెప్పవచ్చును. ఆదివారమును సూర్యుని దినము అని
(తేది:21.01.2014, సాక్షి న్యూస్పేపరు)
ఇందు దేశమే ఇండియా!
హిమాలయాలకు, వింధ్యపర్వతాలకు మధ్యగా అప్పటి ఆర్యా
వర్తనం (ఆర్యుల భూభాగం) ఎక్కడ ఉండేదో మన దేశ
పటంలో నువ్వు చూశావు. అది బాల చంద్రాకారంగా ఉన్నట్లు
కనిపిస్తుంది. అందుకే ఆర్యావర్తానికి ఇందుదేశమని పేరు
వచ్చింది. ఇందు దేశమే హిందూదేశమయింది.
రామాయణం పుట్టిన చాలాకాలానికి మహాభారతం
పుట్టింది. అది రామాయణం కంటే పెద్ద గ్రంథం. దానిలో
చెప్పింది ఆర్యద్రావిడ యుద్ధం కాదు. ఆర్యుల మధ్య ఏర్పడిన
కుటుంబకలహమే భారతకథ. భారతంలో చెప్పిన కథలు,
ధర్మాలు ఇన్నీ అన్నీ కావు. అవి చాలా అందంగా, గంభీరంగా
ఉంటాయి. వీటి అన్నిటికంటే గొప్పదైన భగవద్గీత అనే మహా
గ్రంథం మహాభారతంలో ఉన్న కారణాన అది మనకందరికీ
ప్రియతమమైనది అయింది. వేల సంవత్సరాల క్రితమే మన
దేశంలో ఇలాంటి గొప్ప గ్రంథాలు పుట్టాయి. మహానుభావులే
వీటిని రాసి ఉంటారు. ఈ గ్రంథాలు పుట్టి ఇంతకాలం గడిచినా
వాటి గురించి తెలుసుకోని పిల్లలు, ప్రయోజనం పొందని
పెద్దలు అంటూ ఉండరు.
* నెహ్రూ ఇందిరకు రాసిన లేఖలోనుంచి
చెప్పడము సహజము. అందువలన పూర్వము నుండి ఆదివారమును
రవివారము అనీ, సోమవారమును ఇందువారము అని వ్రాసెడివారు. ఈ
మధ్య కాలములో 2017 డిసెంబర్ 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, హైదరాబాద్లో “ప్రపంచ తెలుగు
మహా సభలు - 2017” జరిగినప్పుడు స్వచ్ఛమయిన తెలుగు భాషను
అనుసరించి సోమవారమును 'ఇందూ వారము' అని వ్రాయడము జరిగినది.
వారములు -7
వారముల పేర్లు
1. ఆది వారము,
2. సోమ వారము,
3. మంగళ వారము,
4. బుద వారము,
5. గురు వారము,
6. శుక్ర వారము,
7. శని వారము
తెలుగు పేర్లు:
1. రవి వారము,
2. ఇందు వారము,
3. కుజ వారము,
4. బుద వారము,
5. బేస్త వారము,
6. శుక్ర వారము,
7. శని వారము.
ఇందు అనగా చంద్రుడని వారి భావము. జ్యోతిష్య శాస్త్రము
ప్రకారము జ్ఞానమునకు అధిపతి చంద్రుడు అని ఉండుట వలన జ్ఞానము
వలన తెలియు ధర్మములను ఇందూ ధర్మములని చెప్పుచున్నాము. ఇందూ
అని చెప్పితే అర్థము సరిపోతుంది. హిందూ అని చెప్పితే అర్థము లేకుండా
పోవును. పూర్వము ప్రపంచ దేశములలోకెల్లా జ్ఞానము గల దేశము
భారతదేశమే అయివుండుట వలన భారతదేశమును 'ఇందూ దేశము' అని
చెప్పెడివారు. అంతేకాక జ్ఞానమున్న స్త్రీని ఇందుమతి యని చెప్పెడివారు
గానీ, హిందుమతి యని చెప్పేవారు కాదు. ఇప్పుడు కూడా 'ఇందుమతి'
యని, ఇందిర అని పేరుండుటను మీరు అక్కడక్కడా చూడవచ్చును. ఎన్ని
విధముల చూచినా పూర్వము తెలుగు భాష యొక్క అర్థము ప్రకారము
'ఇందూ' అను పదమును చేర్చి ఇందూ ధర్మము అనియు, ఇందువు అనియు
చెప్పడము సరియైనది, హిందూ ధర్మము అనిగానీ, హిందువు అనిగానీ
అనడము తప్పు.
4) ప్రశ్న :- మీరు చెప్పునది సత్యమేయని మేము నమ్మ
గలము. అయితే ఒక స్వామీజీగారు హిందూ అను పదమే
సరియైనదనీ, ఇందూ అని పలుకడము తప్పయనీ చెప్పుచూ,
హిందూ అను పదమునకు అర్థమును చెప్పుచూ ఇలా అన్నారు.
హిం అనగా పాపము అనియు, దూ అనగా నాశనము
అనియు హిందూ అనగా పాపమును నాశనము చేయునది
అనియు, హిందువు అనగా పాపమును నాశనము చేయు
వాడు అనియు లేక పాపము నాశనమయినవాడు అనియు
చెప్పుచున్నాడు. ఈ అర్థమును వింటూనే ఇది సరియైన వివరణ
కాదనియు, శాస్త్రబద్ధమైన అర్థము కాదనియు, ఉన్న అర్థమును
వదలివేసి లేనిదానిని తెచ్చి అతికించినట్లున్నదని మాకు
తెలియుచున్నది. దీనికి మీరు ఏమంటారు?
జవాబు :- స్వామీజీలు ఎవరు చెప్పినా వినవలసిందే, దానిని తప్పు అని
వారితో చెప్పకూడదు. శాస్త్రబద్దమైనది కాకపోతే ఎవరు చెప్పినా దానిని
వదలి వేయవలసిందే. శాస్త్రబద్ధమైన సత్యమైన అర్థమైతే దానిని ఎవరు
చెప్పినా గ్రహించవలసిందే. ఇక్కడ స్వామీజీ చెప్పిన జవాబులో పాపమును
నాశనము అను అర్థమును హిందూ అను పదమునకు అతికించినట్లయినది.
పాపమును హరించునది హిందూ శబ్దమునకు అర్థమయితే, మనిషికి
పాపము ఒక్కటే యుండదు. పాపపుణ్యములు రెండూ కర్మ బంధనములే.
పాపము ఎట్లు జన్మమును కలిగించుచున్నదో అట్లే పుణ్యము కూడా జన్మకు
కారణమగుచున్నది. మనిషి జన్మరాహిత్యమునకు పాపము, పుణ్యము రెండూ
లేకుండా పోవలసియున్నది. అందువలన పాపమును లేకుండా చేయునది
అను అర్థమును హిందూ పదమునకు తెలివిగా జోడించినా, దానివలన
మనిషికి లాభము లేదని అటువంటి హిందువుకు జన్మలు లేకుండా పోయి
మోక్షము కలుగదనీ చెప్పవచ్చును. ఇందూ అను పదమునకే చెప్పిన
భావము ప్రకారము విలువ కలదని చెప్పవచ్చును. హిం అనగా పాపము
అని కల్పించి చెప్పవలసిందేగానీ వాస్తవముగా హిం అంటే హిమము,
మంచు అనీ లేక చల్లదనము అని అర్థము వచ్చును. ప్రక్కలో గల దూ కు
ఎటువంటి అర్థము లేదని చెప్పవచ్చును. అందువలన హిందూ అను
పదమునకు సరియైన అర్థము ఏదీ లేదని చెప్పవచ్చును.
మనిషి ఏ మతములో యున్నా ఆ మత గ్రంథము ప్రకారము
అతడు జ్ఞానమును తెలియవలసి యున్నది. జ్ఞానమును తెలిసినవానిని
‘ఇందువు' అని చెప్పడములో తప్పులేదు. జ్ఞానమునకు అధిపతి చంద్రుడే
అగుట వలన మనిషికి అతని జీవితములో చంద్రుని వలననే జ్ఞానము
లభించవలసియున్నది. కావున అన్ని విధముల అచ్చు 'ఇ' తో మొదలగు
ఇందువు అని చెప్పాలిగానీ, హిందువు అని చెప్పకూడదు. ఇందూ ధర్మము
ఎప్పటికయినా దైవధర్మముగా ఉండును.
5) ప్రశ్న :- దేవునికి ధర్మమున్నట్లు మనిషికి కూడా
ధర్మములుండునా? మనిషికి ధర్మమునకు సంబంధమున్నదా?
జవాబు :- సృష్ఠింపబడిన ప్రతి దానికి ధర్మముండును అని తేల్చి చెప్పాము.
మనిషికి ధర్మములున్నా శరీరమునకు వేరు ధర్మములు, జీవునికి వేరు
ధర్మములు ఉండును. మనిషి అయిన ప్రతి వానికి ధర్మములుండును.
హిందువుకు మాత్రము ధర్మములుండునని, ఇతర మతములవారికి
ఉండవనుటకు వీలులేదు. పుట్టినవాడు ఏ మతము వాడయినా వానికి
ధర్మములుండునని తెలియాలి.
6)ప్రశ్న :- హిందూ ధర్మములు నశిస్తాయా?
జవాబు :- ధర్మములు నశించునవి కావు. ధర్మములకు ఎప్పుడో ఒకప్పుడు
గ్లాని (అలసత్వము) ఏర్పడునుగానీ, పూర్తి నశించవు. ధర్మములు నీరసించి
పోయినప్పుడు వాటికి బలమును చేకూర్చి, ముందువలె పని చేయులాగా
చేయుటకు దేవుడు మనిషివలె అవతరించి తిరిగి ధర్మములను సంస్థాపన
చేయును. క్రొత్తగా బలము చేకూరిన ధర్మములు ముందువలె బలముగా
ఉండిపోవును.
7)ప్రశ్న :- ధర్మములు నశించునవి కాకపోతే ప్రపంచ
పుట్టుక నుండి మొదట యున్న ధర్మములే యున్నాయా?
జవాబు :- ప్రపంచము పుట్టుకలో యున్న ధర్మములే నేడు కూడా కలవని,
మొదట యున్న ధర్మములు పోయి వాటి స్థానములో క్రొత్త ధర్మములు
రావు. ఎందుకనగా! ధర్మములు మారునవి కావు, నశించునవి కావు.
అందువలన మిరపకాయ మొదట ఎట్లు కారముగా యున్నదో అట్లే ఇప్పుడు
కూడా కారముగానే యున్నది. మిరపకాయకు కారము ధర్మమైనప్పుడు
అది మారలేదు కదా! అట్లే నిమ్మకాయకు పులుపు ధర్మమైనప్పుడు అది
ప్రపంచ పుట్టుకలో యున్నట్లే నేడు కూడా పుల్లగనే యున్నది కదా! ఈ
విధముగా ప్రపంచములో దేనికున్న ధర్మములు దానికి ఉండును. అవి
ఎప్పటికీ మారలేదు, నశించనూ లేదు. ప్రకృతిలోని ధర్మములు ఏవీ
మారనప్పుడు ఆత్మకు సంబంధించిన ధర్మములు మారుటకు అవకాశమే
లేదు, అట్లే నశించుటకు వీలులేదు. ఆత్మ ధర్మములకు గ్లాని ఏర్పడుననీ,
దానిని తిరిగి ఉద్దరించి బలము చేకూర్చుదునని దేవుడే దైవ గ్రంథములలో
చెప్పియున్నాడు. దీనినిబట్టి ఏ ధర్మము నశించదు మరియు మార్పు చెందదు
అని చెప్పవచ్చును.
8)ప్రశ్న :- క్రైస్తవులు, ముస్లీమ్లు పుట్టుకొచ్చారు కదా!
వారి మతములో ప్రత్యేకమైన జ్ఞానమున్నప్పుడు ధర్మము కూడా
ప్రత్యేకముగా ఉండును కదా! వారి ధర్మములు ఏవి గలవు?
జవాబు :- మనిషి మొదట ఆవునుండి పాలు లభ్యమవుతాయని తెలియ
గలిగాడు. దూడలు ఆవుల యొద్ద పాలు త్రాగడము చూచి తాను కూడా
ఆవు నుండి పాలను సేకరించి త్రాగెడివాడు. మనిషి మొదట పాలను
తెలియగలిగినప్పుడు పాలను పాలుగానే త్రాగెడివాడు. కొంత కాలము
పోయిన తర్వాత పాలను పెరుగుగా తయారు చేసుకొని పెరుగును
త్రాగేవాడు. ఇట్లు కాలము జరుగుకొద్ది మానవుడు పాలనుండి పెరుగును,
పెరుగు నుండి వెన్నను, వెన్న నుండి నెయ్యిని తయారు చేసుకొని త్రాగెడి
వాడు. ఒకే పాల నుండి నాలుగు రకముల ఆహార పదార్థములు తయారయి
నట్లు ఒకే ధర్మమును పేర్లు మార్చి క్రైస్తవులు, ముస్లీమ్లు అని వేరు వేరు
మత ధర్మములుగా చెప్పుకొంటున్నారు. అయితే పాలను ఎట్లు వేరు వేరు
పేర్లు గల ఆహారములుగా తయారు చేసినట్లు, ఒకే ధర్మము నుండి వేరు
వేరు పేర్లు గల మతములను మనిషి తయారు చేసుకొన్నాడు. పాలు
పెరుగు, వెన్న, నెయ్యి అను భాగములుగా మారినా వాటిలో పాల ధర్మములే
యున్నట్లు, మనిషి ఒకే ధర్మము నుండి ఎన్ని మతములుగా చీలిపోయినా
వారి ధర్మముల పేర్లు వేరువేరుగా చెప్పుకొనినా, వారు అనేక పేర్లుగా
చెప్పు మత ధర్మములన్నియూ మొదటి ధర్మములోనివే యని చెప్పవచ్చును.
మొదట తయారయిన పాలలోని ధర్మము, పాల నుండి తయారయినా,
మిగతా ఎన్ని ఆహారములుగా మారినా, వాటిలో పాల ధర్మములే యున్నట్లు,
మొదట సృష్ట్యాదిలో తయారయిన “ఇందూ ధర్మము" ఎన్ని విధముల
ధర్మములుగా చీలిపోయినా, ఆ ధర్మములన్నిటిలో మొదటి ఇందూ ధర్మమే
యుండునని తెలియవలెను. అదే విధముగా నేడు ఎన్ని మతములు యున్నా,
వాటిలో ఎన్ని జ్ఞానములు యున్నా, అవన్నియు దేవుని ధర్మమునకు
సంబంధించినవే. దేవుడు ఒక్కడే, ధర్మము ఒక్కటే. ఎన్ని మతములున్నా
అవి పాల నుండి తయారయిన పెరుగు, వెన్న, నెయ్యిలాంటివే. అదే
విధముగా నేడు ఎన్ని మతములు తయారయినా అవన్నియు ఇందూ ధర్మము
నుండి తయారయి నవే. అన్ని మతములలోని ధర్మము ఒక్కటే, దేవుడు
ఒక్కడే. ఎట్లు పాలను గురించి సంపూర్ణముగా తెలిసినవాడు పెరుగును
గురించి, వెన్నను గురించి, నెయ్యిని గురించి సులభముగా చెప్పగలడో,
అట్లే ఇందూ ధర్మమును గురించి పూర్తి తెలిసినవాడు మిగతా ఏ మతములోని
ధర్మమును గురించి అయినా మాట్లాడగలడు. ఈ సూత్రము ప్రకారము
నాకు ఇందూ ధర్మమును గురించి పూర్తిగా తెలియును, గనుక నేను
సులభముగా మూడు మతములను గురించి మాట్లాడుచున్నాను. దీనినిబట్టి
దేశములో మిగతా మతములు ఎన్నియున్నా, వాటి ధర్మములు వేరువేరుగా
కనిపించినా, అన్నీ ఒకే ధర్మమునకు అనుసంధానమై యున్నవని
తెలియవలెను.
9)ప్రశ్న :- ఒక క్రొత్త పదార్థము తయారయితే దానికి
క్రొత్త ధర్మము తయారగునా?
జవాబు :- ప్రపంచములో ఏ క్రొత్త పదార్థము తయారయినా దానికి
సంబంధించిన ధర్మము ముందే నిర్ణయమై ఉండును. ఒక పదార్థము
తయారయితే అది ప్రకృతికయినా లేక ఆత్మకయినా సంబంధించినదై
ఉండును. ప్రపంచములో విభజించితే ప్రకృతి ధర్మములనీ, ఆత్మ ధర్మములనీ
రెండు రకముల ధర్మములు తయారైయున్నవి. పదార్థము ఏదయినా అది
ప్రకృతికి సంబంధించినదై యుండుట వలన దానికి సంబంధించిన
ధర్మము ఆదిలోనే తయారు చేయబడి యుండును. అందువలన క్రొత్త
పదార్థము తయారైనా క్రొత్త ధర్మము అప్పుడు తయారగునది ఏదీ లేదు.
దానికి సంబంధించిన ధర్మము ముందే యుండును అని తెలియవలెను.
10) ప్రశ్న: - దేవునికి, ధర్మమునకు సంబంధము ఏమి?
జవాబు :- నీ ప్రశ్న అసంపూర్ణముగా యున్నది. నీవు దేవున్ని గురించి
అడిగావు. దేవుడు అనువాడు ఇద్దరుగా ఉన్నాడు. ఆ ఇద్దరిలో నీవు ఏ
దేవున్ని అడుగుచున్నావో నాకు తెలిస్తే నీకు సరిగా జవాబును చెప్పుటకు
వీలగును. ప్రకృతిని మొట్టమొదట సృష్ఠించిన సృష్టికర్తయిన దేవుడు ఒక్కడు
గలడు. తర్వాత ఆ దేవుని చేత సృష్టింపబడిన ఆత్మయను దేవుడు గలడు.
నీవు సృష్ఠింపబడిన దేవున్ని గురించి అడుగుచున్నావా? లేక సృష్టించిన
దేవున్ని గురించి అడుగుచున్నావా? చెప్పితే నీకు జవాబు దొరుకుతుంది.
మనిషికి దగ్గరగా యున్న దేవుడూ, మనిషి ఆరాధనలను స్వీకరించు దేవుడూ,
మనుషులకు దేవుడై యున్నవాడు ఒక దేవుడు కాగా, మనిషితో సంబంధము
లేని దేవుడు మరొకడు గలడు. ఇద్దరు దేవుళ్లలో మనుషులను సృష్ఠించు
దేవుడయిన ఆత్మే మనుషులకు దేవుడుగా చెప్పబడుచున్నాడు. మనుషులను
సృష్టించని పరమాత్మ మనుషులకు దేవుడుగా లేడని చెప్పవచ్చును. పరమాత్మ
ఆత్మను సృష్ఠించిన దేవుడు. కావున ఆయన ఆత్మకు దేవుడు, ఆత్మ
మనుషులను సృష్టించాడు. కావున ఆయన మనుషులకు దేవుడు. ఆత్మకు
దేవుడయిన పరమాత్మ ప్రకృతిని సృష్టించాడు. తర్వాత ఆత్మను సృష్టించాడు.
ఆయన సృష్ఠికర్త అయిన దానివలన దేవుడేయని చెప్పబడినా, మనుషులకు
దేవుడు కాడుయని చెప్పవచ్చును. మనుషులను సృష్టించిన దేవున్ని సృష్టించిన
పరమాత్మను ఆత్మకు దేవుడనీ, ఆత్మ మనుషులకు దేవుడనీ చెప్పవచ్చును.
సృష్ఠికర్త అయిన పరమాత్మకు ధర్మములు లేవు. సృష్ఠింపబడిన
ఆత్మకు ధర్మములు గలవు. అందువలన నీవు అడిగినది ఆత్మకు
సంబంధించిన ప్రశ్నయేగానీ, పరమాత్మకు సంబంధించినది కాదు.
మనుషులను సృష్టించి, పాలించి, మరణింపచేయు ఆత్మ మనుషులకు దేవుడై
యుండుట వలన ఆయనకు ధర్మములున్నవి. దేవునికి, దేవుని ధర్మములకు
దేహికి, దేహమునకు ఉన్నంత సంబంధము ఉండును. ఆత్మ కర్మాతీతుడు
అయినా శరీరములో దూరి పని చేయవలసియున్నది. నిత్యము శరీరముతో
పాటు నివశించవలసి యున్నది. ఏ విధముగా శరీరమును వదలి ఆత్మ
లేదో, అదే విధముగా ధర్మములను వదలి ఆత్మ లేదు. ఆత్మకు ధర్మము
లోపలి పొరలాంటిది కాగా, జ్ఞానము పై పొరలాంటిదియని చెప్పవచ్చును.
ధర్మమును తెలియాలంటే జ్ఞానము ద్వారా తెలియవచ్చును. జ్ఞానము
ధర్మమును తెలియజేయగా, ధర్మము ఆత్మను తెలియజేయును. ఆత్మ
పరమాత్మను తెలియజేయును. పరమాత్మను తెలియజేసి పరమాత్మ లోనికి
జీవాత్మను కలుపును. జీవాత్మ పరమాత్మలో కలిసిపోవడమును మోక్షము
అని అంటున్నాము. జీవాత్మ పరమాత్మలో కలియుటకు ఆత్మ ధర్మములను
జీవాత్మ తెలియవలసియున్నది. రెండవ సృష్టికర్తయిన ఆత్మ యను దేవునికి
ధర్మములు గలవు. మొట్టమొదటి సృష్ఠికర్తయిన పరమాత్మ యనబడు
దేవునికి ధర్మములు ఉండవు.
11) ప్రశ్న: – ఇందూ ధర్మములు ఒక దేశమునకు గానీ, లేక
ఒక మతమునకు గానీ పరిమితమా?
జవాబు :- ఆహారము మనుషులకు అవసరమా లేక జంతువులకు కూడా
అవసరమా యని అడిగినట్లు నీ ప్రశ్న గలదు. ధర్మములు ఒక ప్రాంతము
నకు, ఒక దేశమునకు, ఒక మతమునకు పరిమితముగాక మనుషులయిన
వారందరికీ ధర్మములు అవసరమేయని చెప్పవచ్చును. ఒక దేశములోనే,
ఒక మతములోనే మనుషులు ఉన్నారని చెప్పలేము. అన్ని మతములలో
అన్ని దేశములలోను మనుషులున్నారు. కావున మనిషి అయిన ప్రతివాడు
ధర్మములు తెలియవలసి యున్నది. అందువలన ధర్మములు ఒక దేశము
నకు, ఒక మతమునకు పరమితియైనవి కావు. దైవజ్ఞానమున్న ప్రతీ
చోటా ఇందూ ధర్మములు గలవు. క్రైస్తవుల గ్రంథము బైబిలులోనూ,
ముస్లీమ్ల గ్రంథము అయిన ఖురాన్లోనూ, హిందువుల గ్రంథమయిన
భగవద్గీతలోనూ ఇందూ ధర్మములు గలవు. మూడు మతములలో, మూడు
గ్రంథములలో ఇందూ ధర్మములు ఇమిడియున్నవి. అందువలన 'ఇందూ
ధర్మములకు పరిమితి లేదు' అని చెప్పవచ్చును.
12) ప్రశ్న :- ఇందూ ధర్మములలో వేరు వేరు రకములు
ఉన్నాయా?
జవాబు :- ఇందూ అంటే దేవునికి సంబంధించిన జ్ఞానము అని అర్థము.
ధర్మములు అంటే ముందే చెప్పియున్నాము. ఇందూ ధర్మములు అనగా
దేవునికి సంబంధించిన ధర్మములే గానీ వేరు ఏమీలేదు. మనుషులను
సృష్టించిన దేవుడు, సృష్ఠింపబడి యుండుట చేత ఆయనకున్న ధర్మములనే
ఇందూ ధర్మములు అని అంటున్నాము. మనుషులను సృష్టించిన దేవుడు
ఒక్కడే, మనుషులను సృష్ఠించుటకు సృష్ఠింపబడిన దేవుడు ఒక్కడే.
అందువలన మనుషులందరికీ ఆరాధ్యదైవము ఒక్కడే అయినదానివలన
ఇందూ ధర్మములు ఒక్కటే. మనుషులను పుట్టించిన దేవుడు ఒకచోట
పరమాత్మనీ, మరొకచోట తండ్రియనీ, ఇంకొక చోట అల్లాహ్యనీ చెప్ప
బడుచున్నాడు. మతములు అనేక రకములయినా అందరికీ దేవుడు
అనువాడు ఒక్కడే. సృష్ఠింపబడి, అందరినీ సృష్టించిన దేవుడయిన ఆత్మను
గురించి అందరూ తెలియాలని, అన్ని మతములలో బోధింపబడు
సారాంశము ఒక్కటే అయినందున, ఎక్కడ ఏ మతములో దేవున్ని గురించి
చెప్పుచున్నా, అక్కడ ఇందూ ధర్మములు తప్ప ఏమీ లేవు. అందువలన
సమస్త మానవులకు ధర్మములు వేరు వేరు పేర్లతో కనిపించినా, మతముల
పేరుతో పిలువబడుచున్నా, దేవున్ని గురించి చెప్పబడునవన్నీ ఇందూ
ధర్మములేయని తెలియవలెను.
13) ప్రశ్న :- చావు పుట్టుకలు కర్మములా? ధర్మములా?
జవాబు :- చావు పుట్టుకలు సమస్త జీవరాసులకు సంబంధించినవి. అవి
ఒక కులమునకు గానీ, ఒక మతమునకు గానీ పరిమితమైనవి కావు.
చావు పుట్టుకలు కర్మములు కావు, ధర్మములని తెలియవలెను. కర్మములున్నా
కర్మములు లేకున్నా చావు పుట్టుకలు సహజముగా వచ్చును. చావు పుట్టుకలు
కర్మను అనుసరించి వచ్చునవి కావు. అవి జీవరాసులకున్న ధర్మములను
బట్టి వచ్చునవియని తెలియవలెను. జీవుడు కూడా ఆత్మలో భాగముగానే
యుండుట వలన జీవునికి కూడా ధర్మములు కలవని చెప్పవచ్చును.
పరమాత్మ చేత ఆత్మ సృష్ఠింపబడగా, ఆత్మ చేత జీవాత్మ సృష్ఠింపబడినాడు.
సృష్ఠింపబడిన వారికి ధర్మములు ఉండును. జీవునికి గల ధర్మములలో
జీవుని చావు పుట్టుకలు గలవు. అందువలన చావు పుట్టుకలు ధర్మములే
గానీ, కర్మములు కావని చెప్పవచ్చును. మనిషి బ్రతికియున్నంత వరకు
కర్మలు వచ్చుచుండును, అట్లే అయిపోవుచుండును. ధర్మమునకు
సంబంధించిన మరణము వచ్చు వరకు జీవుడు కర్మలను అనుభవించు
చుండును. అలా అనుభవిస్తున్నప్పుడే ఒక్కమారు మరణము వచ్చును.
మరణము జీవునికున్న ధర్మము వలన వచ్చుచున్నది కానీ, అతనికున్న
కర్మము వలన కాదు. కర్మ వలన కష్టసుఖ అనుభవములు వచ్చుచుండును.
అట్లే జీవుని కర్మవలన వచ్చునట్లే మరణము కూడా వచ్చుచున్నది.
ధర్మము విషయము తెలియని వారందరూ మరణమును కర్మమే అని
అనుకుంటున్నారు. అట్లు అనుకోవడము అజ్ఞానమే యగును.
14) ప్రశ్న :- మీరు ఏ ధర్మములో యున్నారు?
జవాబు :- మీ ప్రశ్న విచిత్రముగా యున్నది. నేను మీ లెక్కలో ఒక
గురువునో, స్వామినో, బాబానో లేక ఇంకా ఏమయినా, చివరకు నేను ఒక
మనిషినే అనునది మాత్రము సత్యము. మనిషిలో రెండు ఆత్మలు గలవు.
ఒకటి ఆత్మ, రెండు జీవాత్మ. ఈ రెండు ఆత్మలలో మొదటి ఆత్మను
దేవుడు అనియు, రెండవ జీవాత్మను జీవుడు అనియు చెప్పవచ్చును.
సత్యమును చెప్పితే నేను బయటికి ఎవరయినా, లోపల జీవుడను మాత్రమే.
అందువలన జీవుని ధర్మములు నాకు ఉన్నవి. అయినా నేను ప్రస్తుతము
నా ధర్మములలోనే యుండి బ్రతుకుచున్నా, నేను ఆత్మ ధర్మములను తెలిసి
ఆత్మలో చేరిపోవడము నా కర్తవ్యము. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు
జవాబును చెప్పితే “నా ధర్మములలో నేను యున్నాను”. చాలామందికి
వారి ధర్మములు వారికి తెలియవు. తెలిసినా తెలియకపోయినా వారి
ధర్మముల ప్రకారము వారు బ్రతుకుచున్నారు. నా ధర్మము ప్రకారము
చేప నీళ్లను కోరినట్లు, జీవాత్మనయిన నేను ఆత్మను కోరుకొంటున్నాను.
15) ప్రశ్న :- ధర్మములకు, శాస్త్రములకు సంబంధ
మున్నదా?
జవాబు :- శాసనములతో కూడుకొన్నవే ధర్మములని ముందే చెప్పి
యున్నాము. సిద్ధాంతము శాస్త్రమునకు ఆధారము. శాస్త్రము ధర్మమునకు
ఆధారము. శాసనము లేని ధర్మము లేదు. కావున ధర్మములకు,
శాస్త్రములకు దారమునకు దూదికి ఉన్నంత సంబంధము గలదు. దూది
శాసనములయితే దారము ధర్మములాగ ఉన్నది. అందువలన ధర్మము
అనగా కొట్టివేయబడునది గానీ, సవరించబడునది గానీ, మార్పుచెందునది
గానీ కాదని చెప్పవచ్చును.
16) ప్రశ్న :- నేడు హిందువులను వారికి వారి ధర్మములు
తెలుసునా?
జవాబు :- నేడు 'దేవుని జ్ఞానమును తెలిసిన వారిని ఇందువులని’
అనవచ్చును. దేవుని జ్ఞానము (ఆత్మ జ్ఞానము) తెలిసిన ఏ మతస్థుడయినా
ఇందువేయగును. అట్లు ధర్మములు తెలియకుండా నేను హిందువునని
చెప్పుకొనినా, లేక క్రైస్థవుడననినా, ముస్లీమ్నని చెప్పినా వారు మతమును
అనుసరించి చెప్పువారేగానీ, ధర్మములను అనుసరించి చెప్పువారు కాదు
యని చెప్పవచ్చును. నేడు అందరూ మతమును అనుసరించే పోతున్నారు
గానీ, ధర్మమును అనుసరించి పోవడము లేదు. అందువలన హిందువులకు
వారి ధర్మములు తెలియునని చెప్పలేము. ఎక్కడయినా ధర్మము తెలిసిన
హిందువు ఉంటే వాడు తనను 'హిందువు' అని చెప్పుకోక 'ఇందువు'నని
చెప్పుకొనును. ఏ మతము వారికయినా ఇదే సూత్రము వర్తించును.
17) ప్రశ్న :- దేవతా పూజలు చేయువారు హిందువులా?
(ఇందువులా?)
జవాబు :- దేవతల పూజ చేయువారికి ఆత్మ ధర్మములు ఏమాత్రము
తెలియవు. ఆత్మ ధర్మములు తెలిసియుంటే దేవతల పూజలు చేయరు.
కావున దేవతా పూజలు చేయువారిని 'ఇందువులు' (జ్ఞానులు) అనుటకు
అవకాశము లేదు.
18) ప్రశ్న :- నేడు ఒక సమాజములో పేరుపొందిన
స్వామీజీలందరూ దేవతా పూజలు చేయుచున్నారు. వారు
ఎందుకు అలా చేయుచున్నారు?
జవాబు :- 'మేము మంచివారము' అని బోర్డు పెట్టుకొన్నవారు కూడా
తప్పు చేయుచున్నారంటే మంచి ఏదో వారికి తెలియదనియే చెప్పాలి.
మనిషికి మంచి, చెడు తెలియకున్నా సమాజములో ఇది మంచి, ఇది
చెడుయని ముందే నిర్ణయించబడియుండును. అదే విధముగా ఇది ధర్మము,
ఇది అధర్మము అని దేవుని మార్గములో నిర్ణయింపబడియున్నవి. ధర్మము
ప్రకారము మనిషి ఆత్మను ఆరాధించవలెనుగానీ, ఆత్మ తయారు చేసిన
మనుషులను, దేవతలను ఆరాధించడము అధర్మము అగును. నేడు
కేవలము ఒక మతమునకు సంబంధించిన వారే దేవతలను ఆరాధించడము
జరుగుచున్నది. దేవతలు మనుషుల చేత ఆరాధింపబడుటకు వారు ఎవరు?
వారు అర్హులా, అని వివరించుకొని చూస్తే కొంత విషయము తెలియగలదు.
అది ఏమనగా! దేవుడు అయిన ఆత్మ, పరమాత్మ చేత అధికారమును పొంది
మానవ సమాజము మరియు జీవరాసులతో నిండిన జగతిని తయారు
చేయడము జరుగుచున్నది. 'జగతి' అనగా పుట్టి చస్తూ యుండునదని
అర్థము. జగతిలో 'జ' అనగా పుట్టడము అనియూ, ‘గతి’ అనగా గతించి
పోవడము (చనిపోవడము) అని అర్థము గలదు.
ఆత్మయిన దేవుడు జగతిని సృష్ఠించుచున్నాడు. అయితే జగతి
ఒకటి కనిపించు స్థూల జగతి, రెండు కనిపించని సూక్ష్మ జగతియని రెండు
రకములు గలదు. స్థూల జగతిగా మనుషులు, జంతువులు, పక్షులు,
సర్పములు మొదలగునవి ఎన్నో గలవు. అట్లే కనిపించని సూక్ష్మ జగతిగా
దేవతలు మొదలగు జీవరాసులు గలరు. దేవతలను కనిపించని ఒక
మనుషు జాతిగా చెప్పుచున్నాము. మనిషిని కనిపించే రెండవ రక మనిషి
జాతిగా చెప్పుచున్నాము. కనిపించని వానిని దేవతయని అంటున్నాము.
దేవతా జాతిలో మనుషుల వలె ఆడ, మగ (స్త్రీ, పురుషులు) గలరు. కనిపించే
మనిషిని, కనిపించని దేవతలను దేవుడు సృష్టించగా, మనిషి సృష్టించిన
దేవున్ని తెలియక, ఆయననే ఆరాధించక, అధర్మమార్గములో తనవలె సృష్ఠింప
బడిన దేవతలను ఆరాధించుచున్నాడు. యజమానివలె యున్న ఆత్మను
ఆరాధించక, బజారులో భిక్షాటన చేయువారి దగ్గరికి పోయి భిక్షమడిగి
నట్లున్నది. మనిషికి దేవుడు ఏమయినా ఇవ్వగలడు గానీ, దేవతలు ఏమీ
ఇవ్వలేరు. మనిషి ఆ విషయమును తెలియక దేవతలు తాము కోరినవి
ఇవ్వగలరని నమ్మి దేవతలను ఆరాధించుచున్నాడు. మనిషి ఆధ్యాత్మిక
మార్గములో ఆత్మను తెలియవచ్చునుగానీ, అట్లుకాకుండా దేవతలను
ఆరాధించడము పెద్ద పొరపాటు యని చెప్పవచ్చును. మనిషికున్న ధర్మముల
ప్రకారము దేవుని ధర్మములను జ్ఞానము ద్వారా తెలిసి ఆరాధించవలెను.
దేవతాపూజ చేయువారు ఎంత పెద్ద స్వాములుగాయున్నా, వారికి
దేవుడు భగవద్గీతలో చెప్పిన జ్ఞానము తెలియదనియే చెప్పవచ్చును. “ఎవడు
అన్య దేవతారాధన చేయుచున్నాడో వాడు దారితప్పి నడచిన
వాడుయని” భగవద్గీతలో రాజవిద్యా రాజగుహ్య యోగమున 23వ శ్లోక
మందు "యజ్యన్య విధిపూర్వకమ్" అని చెప్పియున్నారు. దేవుని విషయము
తెలిసినవాడు దేవుని చేత సృష్ఠింపబడిన దేవతలను ఆరాధించడు. అలా
దేవతలను ఆరాధించాడు అంటే వానికి దేవుని విలువగానీ, దేవుని
జ్ఞానముగానీ తెలియదనియే చెప్పాలి. ఇంట్లో తండ్రిని గౌరవించక వీధిలో
అడుక్కొనేవానిని గౌరవిస్తే అప్పుడు వాడు తండ్రికి విలువనివ్వనట్లే కదా!
అదే విధముగా సృష్ఠించిన దేవున్ని వదలి, సృష్ఠింపబడిన దేవతలను ఆరాధిస్తే
దేవున్ని అగౌరవపరచినట్లే కదా! “అన్య చింతన లేకుండా నన్నే
ఆరాధించుము” అని భగవద్గీతలో దేవుడు చెప్పితే దేవుని మాటను
కాదని, అన్యచింతతో దేవతలను ఆరాధించువారు దేవుని విషయము
తెలియనివారేయని చెప్పవచ్చును.
19) ప్రశ్న :- భగవద్గీతను బోధించు ఒక స్వామీజీ ఒక ఆడ
దేవతను ఎక్కువగా పూజిస్తా ఉంటాడు. అతనిని అడిగితే
దేవతలనందరినీ పూజించడము హిందువుల కర్తవ్యము.
అలా దేవతలను ఆరాధించనివాడు హిందువే కాడు అని
అన్నాడు. మీరు దేవతలను ఆరాధిస్తే వానిలో అజ్ఞానమున్న
దనీ, అట్టివాడు జ్ఞాని కాడు అనీ అంటున్నారు. వారు
భగవద్గీతను చెప్పచున్నారు. దేవతలను ఆరాధించుచున్నారు.
దేవతలను ఆరాధించే వారిది తప్పా? ఆరాధించని మీది
తప్పా?
జవాబు :- ఎవడు చేసే పనిని వాడు సమర్థించుకోవచ్చును. అయినా ఆ
పనిని గూర్చి అది మంచిదో, చెడ్డదో ముందే నిర్ణయము జరిగియుండును.
మనిషి దైవభక్తియని చేయు పనులను మంచి చెడుయని తేల్చి చెప్పునది
బ్రహ్మవిద్యా శాస్త్రము. బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రకారము మూడు దైవ
గ్రంథములు దేవుని చేత చెప్పబడియున్నవి. ఆ మూడు గ్రంథములలో
మనిషిని సృష్ఠించిన దేవున్ని ఆరాధించవలెనని, మనిషితో సమానముగా
సృష్ఠింపబడిన దేవతలను ఆరాధించరాదనీ, అలా ఆరాధించినా, ప్రార్థించినా
దేవున్ని అగౌరవపరచినట్లని, సృష్టికర్తయిన వానినే ఆరాధించవలెనని
మూడు దైవ గ్రంథములలో చెప్పడమేకాక, దేవున్ని ఎలా ఆరాధించవలెనో
తెలియుటకు కావలసిన ధర్మములన్నిటినీ జ్ఞానరూపములో ఆ గ్రంథముల
యందు చెప్పియున్నారు. ప్రతి మనిషి దైవగ్రంథమును చదివి, అందులోని
ధర్మములను తెలిసి, దేవున్నే ఆరాధించవలెనని అట్లుకాకుండా దేవతలను
ఆరాధిస్తే అది అజ్ఞాన మార్గమగునని చెప్పియున్నారు. ప్రథమ దైవ
గ్రంథమయిన భగవద్గీతను ప్రజలకు బోధించు స్వామీజీయే దేవతలను
ఆరాధిస్తున్నాడంటే అతనికి భగవద్గీతలోని సారాంశము అర్థమయినట్లు
లేదు అని తెలియుచున్నది. దేవతలను పూజించువారు, వారి నామ స్మరణ
చేయువారు తపస్వీకులు కావచ్చునుగానీ, యోగులు కాలేరు. యోగి అయిన
వాడు మాత్రము సృష్టికర్త అయిన దేవున్ని చేరవచ్చునుగానీ, తపస్వీకులు
గానీ, వేదాధ్యయణము చేయువారుగానీ, యజ్ఞములు చేయువారుగానీ
దేవున్ని చేరలేరని దైవగ్రంథమయిన భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము
అను అధ్యాయమందు 48, 53 శ్లోకములలో చెప్పియున్నారు. దేవున్ని
చేరుటకు యోగము తప్ప వేరు మార్గము లేదని తెలియుచున్నది.
యోగములు బ్రహ్మ, కర్మ, భక్తి యోగములు అని మూడు యోగములు
గలవు. దేవతలను పూజించడము ఈ మూడు యోగములకు సంబంధము
లేదు. అటువంటప్పుడు దేవతారాధన వలన మనిషికి వచ్చే ప్రయోజనము
ఏమీ లేదు. అందువలన ఇందువు (జ్ఞాని) అయినవాడు యోగమును
ఆచరిస్తాడు గానీ, దేవతా పూజలో ఉండడు. బ్రహ్మవిద్యా శాస్త్రము వలన
దేవతారాధన చేయువాడు ఇందువే కాడు అని చెప్పవచ్చును. మూడు
దైవ గ్రంథములలో ఇదే విషయమునే చెప్పుచుంటే, భగవద్గీతను బోధించు
స్వామీజీ దేవతారాధన చేయుచున్నాడు అంటే అతడు ప్రజల దృష్టిలో స్వామీజీ
అయి యుండవచ్చును గానీ, దేవుని దృష్ఠిలో అజ్ఞానిగా ఉండును.
20) ప్రశ్న :- స్వామీజీలు గానీ, బోధకులు గానీ ధర్మము
లను గురించి బోధించడము లేదా?
జవాబు :- భూమిమీద పన్నెండు మతములుండగా అందులో పెద్దవి
మరియు ముఖ్యమైనవి మూడు గలవు. అవియే హిందూ, క్రైస్తవ, ముస్లీమ్
మతములని చెప్పుచున్నారు. మూడు మతములవారు దేవుడు చెప్పిన
మూడు దైవ గ్రంథములను ఇది మాది, అది మీదియని పంచుకొని చెప్పు
కొంటున్నారు. వాస్తవముగా మూడు దైవ గ్రంథములు ఏ మతమునకు
సంబంధించినవి కావు. అవి మానవులందరికీ ధర్మములను బోధించుటకు
మూడు కాలములలో, మూడు దేశములలో బయటికి వచ్చాయి. అయితే
ముస్లీమ్లు అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్ను మా గ్రంథము అని
అంటున్నారు. అట్లే క్రైస్థవులు ద్వితీయ దైవ గ్రంథమయిన ఇంజీలు
(బైబిలు) గ్రంథమును మాది అని అంటున్నారు. చివరిగా మిగిలిన ప్రథమ
దైవ గ్రంథమయిన తౌరాత్ (భగవద్గీత) గ్రంథమును హిందువులు మాది
అంటున్నారు. మూడు మతములలో బోధకులు గలరు. అయినా మూడు
గ్రంథములలోని దైవ ధర్మములను (ఆత్మ ధర్మములను) సరిగా తెలియక
సరియైన భావమును చెప్పుకోలేక పోవుచున్నారు. దేవుడు చెప్పిన
ధర్మములను వదలివేసి, ధర్మములు కాని వాటిని ధర్మములని చెప్పుకోవడము
జరుగుచున్నది. తాము బోధకులుగా యున్నవారు ఎందరో దైవ గ్రంథము
లోని ధర్మములను తెలియలేకపోవడము వలన ప్రజలకు కూడా వారు
బోధించు బోధలలో ధర్మములు లేకుండా పోవుచున్నవి. దానివలన బోధించు
బోధకుల వద్ద, బోధలు వినే ప్రజల వద్ద 'ధర్మము' అనునది లేకుండా
పోయి భక్తి, ఆరాధనలు, ప్రార్థనలు మిగిలిపోయాయి. ధర్మములు లేని
ఏ ఆరాధన వలనా దేవుడు తెలియబడడు. కావున సమాజములోని
స్వామీజీలు గానీ, ప్రజలుగానీ అజ్ఞానము చేత దేవునికి దూరముగా
పోవుచున్నారు గానీ, దేవునికి దగ్గరగా పోవడము లేదు. బోధకులందరూ
ధర్మములను జ్ఞానమును బోధించుచున్నామని కాలము గడుపుచున్నారు
గానీ, దానివలన బోధకులకుగానీ, ప్రజలకు గానీ ఎటువంటి ప్రయోజనము
లేదని చెప్పవచ్చును.
21) నేడు హిందువులకు వారి ధర్మములు తెలుసునా?
జవాబు :- హిందువు అను పదము మారిన పదముగా చెప్పుకొంటే 150
సంవత్సరముల పూర్వము నేడుగల 'హిందూ' అను పదము 'ఇందూ' అను
పదముగా ఉండేది. ఇందూ అను పదము ఒక మతమును సూచించునది
కాకుండా జ్ఞానమును సూచించుచూ జ్ఞానము అను అర్థముగా ఉండేది.
ఇందువులు అని చెప్పుకొంటే జ్ఞానులు అని అర్థము. నేడు గల మూడు
మతములలో గానీ లేక పన్నెండు మతములలో గానీ జ్ఞానము కల్గిన
వారందరినీ ఇందువులు అనవచ్చును. ఇందు అనునది ఒక మతము
కాదు జ్ఞానము. అన్ని మతముల జ్ఞానులను ఇందువులు అన్నప్పుడు మీ
ప్రశ్న అన్ని మతముల జ్ఞానులకు ధర్మములు తెలుసునా? అని అడిగి
నట్లున్నది. నీవు అడిగినది సంకుచితముగా ఒక మతమును గురించి
అడగలేదు. ఈ ప్రశ్న అన్ని మతములకు సంబంధిత ప్రశ్నగా యుండుట
వలన అన్ని మతములను కలిపి జవాబు చెప్పవలసి యున్నది.
ముఖ్యముగా ఉన్న మతములు మూడే అగుట వలన మూడు
మతములను గురించి చెప్పితే అది అన్ని మతములకు సరిపోవును. మూడు
మతములలో దేవునికి సంబంధించిన జ్ఞానమును తెలియు జ్ఞానులను చూస్తే
వారిలో కొంతవరకు జ్ఞానమున్నా, పూర్తి దేవునికి సంబంధించిన ధర్మములు
తెలియవు అని చెప్పవలసిందే. దేవుడు భూమిమీదికి వచ్చి ధర్మములను
తెలియజేసినప్పుడు మాత్రము కొందరికి ధర్మములు తెలిసిన మాట వాస్తవమే.
అయితే కాలము గడిచేకొద్దీ మనుషులలో ధర్మములు తెలియకుండా
పోవుచున్నవి. ధర్మముల స్థానములో అధర్మములు వచ్చి చేరుచున్నవి.
ఉదాహరణకు వాస్తవముగా 'యజ్ఞములు' అధర్మముగా యున్నది. అట్లే
వేదములను ఆధ్యాయణము చేయుట, ద్యానము (తపస్సు) చేయుట,
దానములు చేయుట అధర్మములు అని ప్రథమ దైవగ్రంథము భగవద్గీతలో
తేల్చి భగవంతుడుగా వచ్చిన కృష్ణుడు చెప్పడమైనది. అంతకుముందు
త్రేతాయుగములో దేవుడు రావణబ్రహ్మగా వచ్చినప్పుడు “యజ్ఞములు
అధర్మములని” చెప్పడమైనది. దేవుడు మనిషి రూపములో వచ్చి,
అధర్మములను ఖండించి ధర్మములను చెప్పిపోతే అప్పుడు కొంతకాలము
అధర్మములు అణిగిపోయి ధర్మములు ఆచరణలోనికి వచ్చును. తర్వాత
కొంతకాలమునకు క్రమేపీ ధర్మముల స్థానములో అధర్మములు వచ్చి
చేరుచున్నవి.
ద్వాపర యుగము చివరిలో కృష్ణుడు భగవంతునిగా వచ్చి, ధర్మ
సంస్థాపన చేసి, “అధర్మముల వలన దేవుడు తెలియబడడు” అని భగవద్గీత
విశ్వరూప సందర్శన యోగము అను అధ్యాయమున 48, 53 శ్లోకములలో
అధర్మము లను గురించి చెప్పడము జరిగినది. అంతేకాక ధర్మములయిన
మూడు యోగములను గురించి కూడా చెప్పడమైనది. అప్పటి నుండి
మూడు వేల సంవత్సరములు గడచిన తర్వాత, కలియుగములో ధర్మములు
తెలియకుండా పోయి అధర్మములు ఆచరణకు వచ్చినప్పుడు దేవుడు
మనిషిగా అవతరించి, తిరిగి ధర్మములను తన జ్ఞానములో చెప్పాడు.
అప్పుడు కొంతమంది ధర్మములను తెలియగలిగి ఆచరించగా అధర్మముల
స్థానము తగ్గిపోయినది. కృష్ణుని తర్వాత మూడు వేల సంవత్సరములకు
అనగా ఇప్పటికి రెండువేల సంవత్సరముల పూర్వము ఏసుగా వచ్చిన
అవతారములో ధర్మ సంస్థాపన జరిగినది. అప్పటి నుండి ఇప్పటికి రెండు
వేల సంవత్సరములు గడిచినది కదా! ఇప్పుడు తిరిగి అధర్మములు
చెలరేగిపోయి ధర్మములకు స్థానము లేకుండా పోయినది. అధర్మవరులు
ఎక్కువయిపోయారు. దానికి తోడు పూర్వమున్న నాలుగు అధర్మములకు
తోడుగా 'మతము' అను ఐదవ అధర్మము వచ్చి చేరినది. 'మతము'
అను ఐదవ అధర్మము ముందున్న నాలుగు అధర్మములకంటే ఎక్కువ
బలమైనదిగా ఉన్నది. పూర్వము నాలుగు అధర్మములుండగా, నేడు ఐదు
అధర్మముల మధ్యలో ధర్మములకు స్థానము లేకుండా పోయినది. ధర్మములు
ఇవి అని చెప్పలేని పరిస్థితి మనుషులలో ఏర్పడినది. అనగా ఏ మతములో
గానీ ధర్మములనునవి తెలియకుండా పోయినవి. ఇట్టి పరిస్థితిలో దేవుడు
తిరిగి తన ధర్మములను ప్రచారము చేయవలసి యున్నది. దేవుడు
భగవంతుడను మనిషిగా వచ్చి ఇంతకు ముందు చెప్పిన వాటికంటే ఎక్కువగా
చెప్పవలసి యున్నది. అట్లయితే గానీ ఈ కాలములో మనుషులకు
దేవుని ధర్మములు తెలియునని అనుకొంటున్నాను.
22) మీరు “దేవుని ధర్మములు తెలియకుండా పోయాయి
అని వాటిని రక్షించుటకు దేవుడు అవతరిస్తాడని" చెప్పు
చున్నారు కదా! నేడు చాలామంది మనుషులు గుంపులుగా
తయారయి 'సంఘములు' అని పేరు పెట్టుకొని మేము హిందూ
ధర్మములను రక్షిస్తాము అని చెప్పుకొంటున్నారు కదా! ధర్మము
లను రక్షించువాడు దేవుడా? మనుషులా? అని అడుగు
చున్నాము?
జవాబు :- “ధర్మములను రక్షించువాడు దేవుడేయని, దేవుడు తప్ప
ధర్మములను ఎవరూ రక్షింపలేరని” దేవుడే చెప్పినట్లు మూడు దైవగ్రంథము
లలో గలదు. దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ ఇతర మానవునికి
తెలియదని, అందువలన దేవుడే ధర్మములను రక్షించునని చెప్పియున్నారు.
అయితే దేవుని మాటను కాదని కొందరు “ధర్మో రక్షతి రక్షితః" అను
పదమును కనిపెట్టి చెప్పుచున్నారు. దాని ప్రకారము "ధర్మములను రక్షించితే
ధర్మము మిమ్ములను రక్షించును” అని చెప్పుచున్నారు. దీని ప్రకారము
మొదట మనుషులు ధర్మములను రక్షించవలెనని చెప్పుకోవడము జరుగు
చున్నది. ధర్మములను రక్షింపవలెనని చెప్పడము మంచి మాటేగానీ, ముందు
ధర్మములు ఫలానాయని తెలిసినప్పుడు కదా! మనిషి ధర్మములను రక్షించేది.
ధర్మములు ఫలానాయని తెలియనప్పుడు మనిషి ఎలా రక్షించగలడు? నేడు
ధర్మములకు గ్లాని ఏర్పడి అధర్మములే అంతటా యున్నప్పుడు, ధర్మములు
తెలియకుండా కనుమరుగై పోయినప్పుడు, మనుషులు తమకు తెలిసిన
వాటినే రక్షిస్తారు గానీ, తెలియని వాటిని రక్షించలేరు కదా! ప్రస్తుత కాలములో
ధర్మములు తెలియకుండా పోయి, అధర్మములే అంతటా ఆచరింప
బడుచున్నవి. అటువంటప్పుడు ధర్మ రక్షణ చేస్తామని గుంపుగా తయారై
సంఘములను ఏర్పరచుకొన్నా, అధర్మములనే ధర్మములని తలచి, వాటినే
వారు ఆచరించుచూ ధర్మములను రక్షించుచున్నామని చెప్పుకొంటున్నారు.
వారు ఆచరించునవి ఇతరుల చేత ఆచరింపజేయునవి అధర్మములని వారికి
నిజముగా తెలియదు. తాము ఏమి చేస్తున్నామో తెలియని స్థితిలో యున్న
వారు ధర్మములను రక్షిస్తామనుకోవడము హాస్యాస్పదముగా యున్నది.
నేడు హిందూ ధర్మమును రక్షిస్తామను వారు అనేక గుంపులుగా
ఏర్పడి తమ గుంపులను సంఘములని చెప్పుకొనుచూ, ఆ సంఘములకు
పేర్లు పెట్టుకొని ఒకరుమించి మరొకరు మేము హిందూ ధర్మమును
రక్షిస్తామంటున్నారు. అటువంటి హిందూ ధర్మ రక్షణ సంస్థలు లేక
సంఘములు ఒక్క హిందూ మతములో దాదాపు ఇరువది వరకు గలవు.
అందులో నాకు తెలిసినవి ఇలా గలవు.
1)హిందూ వాహిని,
2)భజరంగదళ్,
3)విశ్వహిందూ పరిషత్,
4) ఆర్. యస్. యస్ (R.S.S),
5)పరుశురామ్ పరివార్,
6)హిందూ జాగరణ సమితి (H.J.S),
7)శివశక్తి,
8)హిందూ యువశక్తి దల్,
9)హిందూ జనశక్తి,
10)శివసేన,
11)సమరసత సేవ ఫౌండేషన్,
12)హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్,
13)రాష్ట్రీయ హిందూ సేన,
14)హిందూ ప్రస్థానము,
15)విశ్వ ధర్మ పరిరక్షణ,
16)ప్రజా హిందూ దళము,
17)హిందూ రక్షక దళ్,
18)హిందూ జాగృతి,
19)హిందూ చైతన్య సమితి.
ఈ విధమైన పేర్లతో కొన్ని హిందూ సంఘములు పని చేయు
చుండగా, భవిష్యత్తులో ఇంకా కొన్ని సంఘములు తయారు కాగలవు.
ఒక విధముగా వీరందరి ఉద్దేశ్యము మంచిదే. హిందూ ధర్మమును
రక్షించాలనునది మంచి ఉద్దేశ్యమే అయినా ఆ ఉద్దేశ్యమును అనుసరించి
పని చేయలేక పోతున్నాయని చెప్పవచ్చును. దీనికి అంతటికీ కారణము
'హిందూ ధర్మములు ఫలానాయని తెలియకపోవడమే' యని చెప్పవచ్చును.
వీటిలో కొన్ని సంఘములవారు తటస్థముగా ఉండగా, కొన్ని సంఘముల
వారు చురుకుగా పని చేయుచున్నారు. చురుకుగా పని చేయువారు హిందూ
ధర్మమును రక్షించుచున్నారా? యని ప్రశ్నించుకొని చూస్తే, తెలియని
ధర్మమును ఎలా రక్షించగలరు? అందువలన వారు రక్షించేది వారికి తెలిసిన
అధర్మములను మాత్రమే యని తెలియుచున్నది. అధర్మములను రక్షిస్తూ,
ఆచరించుట వలన అధర్మములకు బలము చేకూరుచున్నది. దానివలన
అసలయిన ధర్మములకు ఇంకా హాని చేసినవారమగుచున్నాము అని వారికి
తెలియకుండా పోయినది. "కొట్టబోయి కొట్టించుకొన్న” సామెతవలె
ధర్మములను రక్షించను బోయి ధర్మములను భక్షించినట్లయినది. దీనినిబట్టి
హిందూ ధర్మములను మనుషులు రక్షించలేరు, రక్షించువాడు దేవుడేయని
తెలిసిపోవుచున్నది.
23) ప్రశ్న: - మీ లెక్కలో హిందూ ధర్మములను ఉద్ధరించు
వాడు ఎవరు?
జవాబు :- ఈ ప్రశ్నకు సూటిగా సమాధానమును చెప్పితే ధర్మములను
రక్షించువాడు దేవుడుయని చెప్పక తప్పదు. ఈ మాట చెప్పుటకు ప్రథమ
దైవగ్రంథములో ఆధారము గలదు. భగవద్గీతలో జ్ఞానయోగము అను
అధ్యాయమందు 7, 8 శ్లోకములను చూడుము.
యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత! |
అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్॥।
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతామ్ ।
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే ॥
భావము :- “ఎప్పుడెప్పుడు ధర్మమునకు ముప్పు గలిగి భూమిమీద అధర్మము
వృద్ధి చెందునో అప్పుడు నేను భూమిమీద అవతరించి సాధుజనులను
వృద్ధి చేయుట, అధర్మవరులను లేకుండా చేయుట పనిగా పెట్టుకొని దాని
కొరకు ప్రతి యుగములో ధర్మములను తిరిగి తెలియజేయుచుందును.”
ఈ విధముగా దేవుడు ప్రథమ దైవగ్రంథములో తెలియజేశాడు.
"భూమిమీద ధర్మములు తెలియకుండా పోయినప్పుడు, ధర్మములను తెలియ
జేయు నిమిత్తము నేనే వస్తానని” దేవుడే చెప్పియున్నాడు. దానిప్రకారము
దేవుడు మనుషులలో సాధారణ మనిషిగా వచ్చి, తనను ఎవరూ గుర్తించనట్లు
యుండి, తన ధర్మములను తాను తెలిపిపోవును. దేవుడు వచ్చి స్వయముగా
ధర్మములను తెలిపినా, ఆయన ఎక్కడా గుర్తింపబడడు. తాను ధర్మములను
తెలియజేయుదునని గానీ, ధర్మములను రక్షింతునని గానీ, ఎక్కడా తెలుపడు.
తాను ఏ సంఘమును స్థాపించి గుర్తింపు పొందలేదు. తాను దొంగవలె
వచ్చి దొంగవలె పోయినట్లు, దేవుడు భూమిమీదికి ఎవరికీ తెలియకుండా
వచ్చి, ఎవరికీ తెలియకుండా పోవుచున్నాడు. దేవుడు మనిషిగా వచ్చి
ధర్మములను విపులముగా తెలిపి పోయినా, మనుషులు వాటిని సరిగా
అర్థము చేసుకోలేని స్థితిలో యున్నారు. అటువంటిది సాధారణ మనుషులు
చెప్పితే మనుషులకు అర్థమగునా? అర్థము కాదు.
దేవుడు స్వయముగా చెప్పినా గ్రహించుకొను శక్తిలేని మనుషులు
మేము ధర్మములను ఉద్ధరిస్తాముయని అనడము, రక్షిస్తాము అని చెప్పడము
మనిషిలోని అహము తప్ప ఏమీ కాదు. మనిషి ధర్మములను ఉద్ధరించు
స్థోమతలో యుంటే దేవుడు భూమిమీదికి రావలసిన పనే లేదు. నేడు
'హిందూ మతము' అను వారికి ప్రత్యేకముగా భగవద్గీత గలదని చెప్పు
కొంటున్నారు. ఆ భగవద్గీతలో ఇందూ ధర్మములను గురించి బాగా
బోధించినారు. అందులో “ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే
యుగే” అని దేవుడు చెప్పిన మాటను వ్యతిరేఖించినట్లు, మేమే ధర్మములను
ఉద్దరిస్తాము నీవు రావలసిన పని లేదు అని చెప్పినట్లున్నది. "మనిషి
ఏమీ చేయలేడు, మనిషిని ఆడించునది నేనేయని” దేవుడు గ్రంథములో
చెప్పియుండగా, నేనే చేస్తానని మనిషి అనడము ధర్మవిరుద్ధము కాదా!
నేడు ధర్మములు అడుగంటిపోయి అధర్మములు రాజ్యమేలుచుండగా,
అధర్మములను పట్టుకొని ధర్మములలాగా భావించి వాటినే పెద్దగా చెప్పు
కొనుచూ, ఒకవైపు అధర్మ ఆచరణ చేస్తూ, నేను ధర్మములను రక్షిస్తానని
చెప్పడము విడ్డూరముగా యున్నది.
ఉదాహరణకు చెప్పితే మనిషి యజ్ఞములను ఆచరించుచూ అది
ధర్మాచరణ అని అంటున్నాడు. ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలో
“యజ్ఞముల వలన దేవుడు తెలియబడుట శక్యము కాదు” అని
భగవంతుడుగా వచ్చిన దేవుడు చెప్పియున్నాడు. అంతేకాక అటువంటివి
నాలుగు ఆచరణలు కలవని, వాటి వలన దేవుడు తెలియబడడని చెప్పడము
జరిగినది. దేవుడు తన గ్రంథములో ఏవి వద్దని చెప్పాడో వాటినే మనిషి
చేయుచున్నాడు. “దేవుడు తెలియబడడు” అని చెప్పినవి అధర్మములని
మనిషి గ్రహించలేకపోయాడు. అధర్మ ఆచరణగా యజ్ఞ ఆచరణ
చేయుచున్నాడు. “యజ్ఞము శరీరములో జరుగుచున్నదనీ, శరీరములో
జరుగు యజ్ఞములకు నేనే అధిపతినని" చెప్పుచూ, భగవద్గీతలో అక్షర
పరబ్రహ్మయోగమున నాల్గవ శ్లోకమున "అధి యజ్ఞోహమే వాత్ర దేవా
దేహభృతాం వర" అని చెప్పాడు. దీనిప్రకారము యజ్ఞము అనునది
దేహములో జరుగుచుండగా, బయట యజ్ఞములను చేయడము అధర్మము
కాదా! అంతేకాక భగవద్గీతలో జ్ఞానయోగమను అధ్యాయమున
“యజ్ఞములు రెండు రకములనీ, అందులో ఒకటి ద్రవ్య యజ్ఞము
అనీ, రెండవది జ్ఞానయజ్ఞమనీ, ద్రవ్యయజ్ఞముకంటే జ్ఞానయజ్ఞమే
శ్రేష్టమైనదని” చెప్పుచూ జ్ఞానయోగమను అధ్యాయమున 33వ శ్లోకములో
ఈ విధముగా చెప్పాడు చూడండి.
శ్రేయాన్ ద్రవ్యమయా ద్యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞః పరంతప |
సర్వం కర్మాఖిలం పార్థ! జ్ఞానే పరిసమాప్యతే ||
ఈ శ్లోకములో "బయట జరుగు ద్రవ్యముల యజ్ఞముకంటే
శరీరము లోపల జరుగు జ్ఞానయజ్ఞమే శ్రేష్ఠమని” చెప్పియున్నాడు కదా!
దీనిప్రకారము శరీరములో జ్ఞానమను అగ్నితో కర్మలను కాల్చు యజ్ఞమును
చేయక, శరీరము బయట ద్రవ్యములను కాల్చు అగ్నితో యజ్ఞములను
చేయడము దేవుని మాటను ధిక్కరించినట్లు కాదా! ఈ విధముగా అధర్మ
ఆచరణగా బాహ్య యజ్ఞములను చేయుచూ, దానిని ధర్మమని చెప్పడము
ధర్మ రక్షణ అగుతుందా? యజ్ఞ ఆచరణ అధర్మమని త్రేతా యుగమున
రావణ బ్రహ్మ చెప్పడమేకాక, ఎక్కడ యజ్ఞ ఆచరణ జరుగుచున్నదో అక్కడికి
పోయి యజ్ఞములను ధ్వంసము చేసి, యజ్ఞములను చేయువారిని
దండించడము, శిక్షించడము జరిగినది. ప్రథమ దైవ గ్రంథమయిన
భగవద్గీతలో యజ్ఞముల నిజ తత్త్వమును చెప్పుచూ బాహ్య యజ్ఞములు
అధర్మములని, అంతర్ యజ్ఞములు ధర్మములని చెప్పడమైనది. మిగతా
రెండు దైవగ్రంథములలో యజ్ఞములను ధర్మములని ఎక్కడా చెప్పలేదు.
అయినా త్రేతాయుగములోని రావణబ్రహ్మ మాటనుగానీ, ద్వాపర యుగము
నాటి కృష్ణుని మాటను గానీ లెక్కచేయక ఇదే ధర్మమన్నట్లు యజ్ఞ ఆచరణ
చేయుచున్నారు. ఇది మంచిది కాదు, అధర్మాచరణయని మేము
యజ్ఞములను చేయవద్దండి అని చెప్పితే, మమ్ములను హిందువే కాదు అని
కొందరు అంటున్నారు. ఇందూ ధర్మములను తెలియనివారు 'ఇందూ’ను
'హిందూ' అని పలుకుచూ, తమది 'జ్ఞానమా, అజ్ఞానమా' అని తెలియని
వారు మమ్ములను విమర్శించడము, సూర్యుని మీద ఉమ్మినట్లుంటుంది
అని తెలియవలెను.
ముందు మీరు ఏ స్థితిలో యున్నారో చూచుకోండి. కాషాయ
దుస్తులను ధరించి, కషాయము అంటే ఏమో తెలియకపోతే అది బాహ్య
వేషమే అయినట్లు, మేము హిందూ ధర్మములను రక్షిస్తాము అని అవి
ఏవో తెలియక అధర్మములను ఆసరాగా చేసుకొని మాట్లాడువారు
ఇందువులా? యని నేను ప్రశ్నిస్తున్నాను. మిగతా పదకొండు మతములలో
గానీ, ప్రక్కనే కనిపించు క్రైస్థవ మతములోగానీ, ముస్లీమ్ మతములోగానీ
ఎక్కడా వారి మత రక్షణ సంస్థలు లేవు. వారు వారి జ్ఞానమును ప్రచారము
చేయు చున్నారు. వారి గ్రంథములలో చెప్పినట్లు నడుచుకొనుచున్నారు.
ఎవరూ వారి గ్రంథములలోని ఒక్క వాక్యమును కూడా అతిక్రమించి
నడువలేదు. హిందూమతములో భగవద్గీత ప్రకారము నడువకుండా,
భగవద్గీతలో చెప్పిన దానికి విరుద్ధముగా ప్రవర్తించుచూ, మేము ధర్మ
రక్షకులము అని సంఘములను స్థాపించుకోవడము అజ్ఞానము కాదా!
నేడున్న హిందూ సంస్థలలో కొన్ని పెద్ద సంస్థలు ఉండగా, కొన్ని ఒకడు
లేక ఇద్దరికే పరిమితముగా యున్న సంఘములు కూడా కలవు. పనీ
పాట లేని కొందరు ఏదో ఒక పేరు పెట్టుకొని నేను ఈ సంఘమునకు
పెద్దయనీ, రాష్ట్ర ప్రెసిడెంటునని చెప్పుకోవడము జరుగుచున్నది. తీరా ఆ
సంఘమును చూస్తే వాడు తప్ప వాని వెనుక ఒక్కడు కూడా లేని సంఘములు
కొన్ని ఉన్నాయి.
కొందరు అదే పనిగా మాది ఫలానా సంఘము అని పేరు పెట్టుకొని
ఇతర స్వామీజీలను బెదిరించుచూ, మీరు సరైన హిందువులు కాదని
బెదిరించి వారితో డబ్బులు లాగుచున్నారు. కొన్ని ప్రాంతములలో
వ్యాపారస్థులను, పారిశ్రామికవేత్తలను మేము మావోయిస్టులమని చెప్పుచూ
మీలో ఈ లోపములున్నవి యని బెదిరించి డబ్బులు అడిగి వారినుండి
వసూల్లు చేసినట్లు, నేడు ఆధ్యాత్మిక స్వాములపట్ల నక్సలైట్లుగా నేటి
హిందూసంస్థలు కొన్ని బెదిరింపులకు పాల్పడుచూ ధనార్జన చేయుచున్నవి.
నాకు తెలిసినంతలో ఒక 'ధర్మరక్షణ దళము' అని పేరు పెట్టుకొన్న వారికి
ఇందూ ధర్మములేవో తెలియవు. అంతేకాకుండా ఆ పేరు పెట్టుకొన్న
సంఘములోని వారు పదిమంది మాత్రమే ఉన్నారు. ఆ పదిమంది 20
నుండి 25 సంవత్సరపు యువకులు. ఆ యువకులు ఒక గుంపుగా చేరి,
రౌడీలుగా ప్రవర్తించుచూ పని చేయకుండా బ్రతకాలని చూచేవారు. వీధి
రౌడీలుగా ప్రవర్తించు వారు తెలివిగా ఒక 'హిందూ ధర్మముల రక్షణ’
అను పేరుతో చెలామణి అగుచూ, ఆధ్యాత్మిక స్వాములకు లేఖలు వ్రాసి,
మీరు హిందూ ధర్మములను బోధించడము లేదు, ఇతర మతముల
జ్ఞానమును చెప్పుచున్నారు. మీరు హిందూ మత ముసుగులో యున్న
క్రైస్థవులనియో లేక ముస్లీమ్లనియో బెదిరించెడివారు. 'హిందూ రక్షణ
దల్' అను పేరుతో కొంత డబ్బున్న స్వామీజీని బెదిరించెడివారు. మీ
ఆశ్రమము మీద దాడి చేస్తామనియో, నీవు ఇతర మతముల నుండి తీసుకొన్న
డబ్బును గురించి అందరికీ చెప్పి, నీ ఆశ్రమమును మూసివేస్తామని
బెదిరించడముతో స్వామీజీలుగా యున్నవారు ఎవరయినా గొడవలకు
దూరముగా ఉండవలెనని భయపడుట సహజము. తనకు తెలిసిన
జ్ఞానమును చెప్పుచూ, భగవద్గీతనే బోధించు స్వామీజీ వారు అడిగిన
డబ్బును ఇచ్చి, వారి నుండి దూరముగా ఉండవలెననుకొనుట సహజమే.
హిందూ జ్ఞానమే బోధించు హిందువుల స్వాములే వీరికి ఎరలుగా యుండుట
వలన వారు అడిగిన డబ్బు వారికి అందేది.
ఈ విధముగా వారు హిందూ స్వాములనే మీరు అన్య మత బోధ
చేయుచున్నారని ఆరోపించడము వలన హిందూ స్వాములు కూడా కొంత
భయపడేవారు. మేము 'హిందూ రక్షణ దళము' అని వారు చెప్పగానే
అదేదో సైన్యము అనుకొని స్వాములు భయపడేవారు. వారు పదిమంది
మాత్రమే ఉన్నారని ఎవరికీ తెలియదు. హిందువులలో కొన్ని పెద్ద సంస్థలు
విశ్వహిందూ పరిషత్, శివసేన, ఆర్.యస్.యస్, భజరంగదల్ మొదలగునవి
గలవు. ఐదు ఆరు పెద్ద సంస్థలు హిందువులు ఇతర మతములలోనికి
పోకుండా చూచుకొనుటకు మాత్రము గలవు. పెద్ద సంస్థలుగా యున్నవారు
ఇతర హిందూ స్వామీజీలను బెదిరించడము లేదు. అయినా అవికాక
మిగతా అనేక పేర్లతో గల కొన్ని సంస్థలు వేరు వేరు పేర్లతో చెలామణి
అగుచూ, వారికి ఏమాత్రము హిందూ ధర్మములు తెలియకున్నా, హిందు
రక్షకులమని చెప్పుకొనుచూ, హిందువులనే బెదిరించి హిందూ స్వాముల
నుండి అక్రమముగా డబ్బును పిండుకొంటున్నారు. ఇటువంటి దొంగ
హిందూ సంఘముల మీద ఎవరికీ అజమాయిషీ లేదు. పోలీస్ వారు
కూడా మత సంబంధ సంఘముల మీద దృష్టి పెట్టరు. 'మతము' అంటే
సున్నితమైనదని పోలీస్ వారు కూడా పట్టించుకోకపోవడముతో అక్రమముగా
హిందూ రక్షణ పేరుతో తయారయిన వారు, హిందూ స్వాముల మీదనే
దాడులు చేయుచూ, కొన్నిచోట్ల బెదిరించుచూ, హిందువులనే నాశనము
చేయు చున్నారు. ఇటువంటి చీడ పురుగుల వలన హిందూ సమాజమే
క్షీణించి పోవుచున్నది.
హిందూ జ్ఞానము తెలియదు, హిందూ ధర్మములు ఏవో, ఎన్ని
యున్నాయో తెలియదు. అటువంటి వారు హిందూ రక్షకులా? హిందూ
ధర్మ పరిరక్షకులా? అనేక ప్రాంతములలో తయారయిన చిన్న చిన్న హిందూ
సంఘములు హిందువులను ఉద్దరించడము లేదు. అటువంటి వారు
హిందూ ధర్మమును నాశనము చేయుచూ, అధర్మముల ప్రకారము ప్రవర్తించు
చున్నారు. ఒకడు ఒక గుంపును తయారు చేసుకొని దానికి నాయకుడుగా
ఉంటూ ఒక 'హిందూ రక్షణ' పేరుతో ఒక సంఘము పేరు పెట్టుకొని,
హిందూ మతములో సక్రమముగా యున్న స్వామీజీలను బెదిరించుచున్నారు.
బెదిరింపులకు భయపడకపోతే పదిమంది ఇంకా కొంతమంది కిరాయి
మనుషులను తీసుకొని పోయి వారి మాట వినని స్వామీజీల మీద మీరు
అన్యమత ప్రచారము చేయుచున్నారని ఆరోపణతో దాడులు చేయుచున్నారు.
అలా దాడులు చేస్తే ఏ స్వామీజీ అయినా భయపడక తప్పదు కదా!
దానివలన హిందూ ధర్మములు నాశనముకాక అభివృద్ధి ఎలా కాగలవు?
ఇతర మతములలో లేని రక్షణ సంస్థలు ఒక్క హిందూ మతములోనే
ఎందుకు వచ్చాయి? అని ఎవరూ ప్రశ్నించడము లేదు. హిందువులు
ఇతర మతములలోనికి పోవుచున్నారు. అందువలన హిందూ మతము
క్షీణించి పోవుచున్నదనీ, దాని కొరకే హిందూ రక్షణ సంస్థలని కొందరు
చెప్పుచున్నారు. ఇతర మతముల వారు వారి జ్ఞానమును ప్రచారము
చేయుచున్నారు. కావున చాలామంది హిందువులు ఇతర మతములలోనికి
పోవడము జరిగినది. అలా వారు ఇతర మతములలోనికి పోవడానికి
ముఖ్య కారణము హిందూ మతములో యున్న “కుల వివక్ష" మొదటి
కారణము కాగా, హిందూ మతములో దేవుని జ్ఞానమును భగవద్గీత
ప్రకారము బోధించక పోవడము రెండవ కారణముగా యున్నది. జ్ఞానము
మీద ఆసక్తి గలవారు హిందూ మతములో జ్ఞానము లభించదు, పూజలు
తప్ప ఏమీ లేదని విసిగి ఇతర మతములలోనికి చాలామంది పోవడము
జరిగినది.
నేడు హిందూ రక్షణ సంస్థలుగా పేరు పెట్టుకొన్న వారు ఎవరయినా
భగవద్గీతా జ్ఞానమును ప్రజలకు బోధిస్తున్నారా? ఎంతసేపూ ఇతర మతముల
మీద ద్వేషమును ప్రజలకు నూరిపోయడము తప్ప, మన మతములోని
జ్ఞానమును ఎంతవరకు బోధిస్తున్నామని కొద్దిగా అయినా ఆలోచిస్తున్నారా?
నా అనుభవములో మేము స్వచ్ఛమయిన హిందూ ధర్మములను బోధించుచూ
వంద గ్రంథములను శాస్త్రబద్ధమైన జ్ఞానముతో వ్రాశాము. అద్వైత, విశిష్టా
ద్వైత, ద్వైత సిద్ధాంతములలాగా త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించి ఒకే
సిద్ధాంతము మీద వంద గ్రంథములను వ్రాశాము. ఇందూ జ్ఞానము,
ఇందూ ధర్మము గొప్పదని అన్ని మతముల వారిని ఒప్పించగలిగాము.
వారికి కూడా వారి ధర్మములను తెలియజేసి, ఇవి ఇందూ ధర్మములని
తెలియజేశాము. మమ్ములను మూడు మతములవారు గౌరవించుచున్నారు.
అయితే కొన్ని హిందూ సంస్థలకు మేము అన్యమత ప్రచారకులుగా
కనిపిస్తున్నాము. వారి బెదిరింపులకు లొంగలేదని దాడులు కూడా చేశారు.
అయినా భయపడలేదని సోషల్ మీడియా ఫేస్బుక్లో అనేక రకమైన
ఆరోపణలు చేయుచూ, మేము హిందువులము కాము అని ప్రచారము
నేటికీ చేయుచున్నారు. వారు ఎంత దుష్ప్రచారము చేసినా మేము
ఏమాత్రము పట్టించుకోవడము లేదు. నేను చెప్పునది హిందూ జ్ఞానము
అయినందున అనేకమంది హిందువులు నన్ను గౌరవించునప్పుడు ప్రక్కన
కుక్కలవలె మొరుగువారిని పట్టించుకోనవసరము లేదు.
24) ప్రశ్న :- మీరు రామున్ని దేవుడు కాదన్నారని వారు
ఫేస్బుక్లో పోస్టులు పెట్టుచున్నారు కదా! దానికి మీరు
ఏమంటారు?
జవాబు : - నేను చెప్పునది ఆధ్యాత్మికము. ఆత్మకు సంబంధించిన
విషయములను చెప్పడమే నా పనిగానీ రామునితో నాకు పని లేదు. ఈ
మధ్యకాలములో "ద్రావిడ బ్రాహ్మణ” అను గ్రంథమును వ్రాసినప్పుడు
సందార్భనుసారము జరిగిన చరిత్రను చెప్పుచూ 'రాముడు వాలిని చంపాడు’
అని వ్రాశాము. అది అందరికీ తెలిసిన చరిత్ర కావున ఆ మాటలో తప్పు
లేదు కదా! అన్ని రామాయణములలో రాముడు వాలిని చంపినది ఉన్న
విషయమే కదా! తర్వాత “రావణ బ్రహ్మ” గ్రంథము వ్రాసినప్పుడు
అందులో 'రాముడు రావణున్ని చంపాడు' అని వ్రాశాము. అది కూడా
చరిత్రలోని విషయమే. అందరూ చెప్పు విషయమే. అంతేగానీ రామున్ని
దేవుడని గానీ, దేవుడు కాదు అనిగానీ నేను ఎక్కడా వ్రాయలేదు. అలా
వ్రాసే అవసరము నాకు లేదు. రాముడు ధర్మవరుడని గానీ, అధర్మవరుడని
గానీ ఎక్కడా వ్రాయలేదు. జరిగిన చరిత్రను వ్రాశాము తప్ప, రాముని
ప్రస్థావన ఏమీలేదు. అయినా అదే పనిగా ఆరోపణ చేయవలెనని
అనుకొనువారు ఉన్నవి కాకపోయినా, లేనివాటిని కల్పించి చెప్పడము
పరిపాటిగా యున్నది.
ఒక విషయమును గమనించండి. నేను ఒక సందర్భములో
మాట్లాడుచూ “నేను స్నానము చేయనిదే గుడికి పోను ఏ దేవునికి మ్రొక్కను”
అని అన్నాను అనుకోండి. దానినే గ్రంథములో కూడా వ్రాశాను అనుకోండి.
అప్పుడు నన్ను తప్పుగా ఆరోపణ చేయువారు “నేను స్నానము చేయనిదే”
అను మాటను తీసివేసి "నేను గుడికి పోను ఏ దేవునికి మ్రొక్కను” అని
మాత్రము చూపిస్తే అది తప్పుగానే కనిపించును, నేను నాస్తికునిగానే
కనిపించవచ్చును. “నేను స్నానము చేయనిదే” అనుమాటను చెప్పకుండా
“గుడికి పోను, దేవునికి మ్రొక్కను” అని మాత్రము చెప్పినట్లు చూపించడము
అదే పనిగా దుష్ప్రచారము చేసినట్లు కాదా! అదే విధముగా కొందరు
అల్లరి మూకలు యువకులుగా యుండి, అన్ని దురలవాట్లకు అలవాటు
పడినవారు ఇతరులను బ్లాక్మెయిల్ చేసి, వారి పరువు తీస్తే సులభముగా
డబ్బులు వస్తాయనుకొనువారు ఏదో ఒక 'ధర్మరక్షణ సంఘము' అని పేరు
పెట్టుకొని, ఆరోపణలు చేయడము నేడు అక్కడక్కడా జరుగుచున్నది.
అలాంటివారు నన్ను తప్పుగా ఆరోపించు నిమిత్తము అదే పనిగా నేను
రామున్ని దేవుడుకాడు యని చెప్పినట్లు ప్రచారము చేయుచున్నారు తప్ప,
అందులో ఏమాత్రము సత్యము లేదు. నేను ఒక సిద్ధాంతకర్తను. అందరివలె
బోధకుడను కాను. నా సిద్ధాంతమును గురించి నేను చెప్పుచుందును
తప్ప రామున్ని గురించి దేవుడనిగానీ, దేవుడు కాడు అనిగానీ చెప్పనవసరము
లేదు. నేను అలా చెప్పాననడము పూర్తి అసత్యము. నేను అలా వ్రాసియుంటే
నేను వ్రాసిన వంద (100) గ్రంథములలో ఎక్కడయినా చూపి నిరూపించ
వచ్చును. అలా వ్రాసే అవసరము నాకు లేదు. కావున అది నన్ను
బ్లాక్మెయిల్ చేయాలనుకోవడము తప్ప వేరు ఉద్దేశ్యము ఏమీ లేదు. ప్రతీ
నెల దాదాపు ఇరవై వేలమంది నా భక్తులు వచ్చి, నా ఉపన్యాసమును
వినిపోవుచుందురు. ఇప్పటికి నా భక్తులు లక్షకు పైబడి యున్నారు. రాబోయే
కాలములో ఇంకా ఎక్కువ కాగలరు. వారందరికీ కనిపించని లోపము
'ధర్మ రక్షణ సంఘము' అను పేరు పెట్టుకొన్న త్రాగుబోతులకు కనిపించింది
అనడము విచిత్రము కాదా!
మా బోధల వలన ఇందుత్వము (హిందుత్వము) బలపడి, అందరూ
జ్ఞానులు అగుటకు అవకాశము గలదు. మా బోధల వలన ఇతర మతముల
వారు వారి మతములలో కూడా మేము చెప్పు జ్ఞానము గలదని, భగవద్గీత
జ్ఞానము అన్ని మతములలో కూడా ఉన్నదని తెలిసి, అన్ని మతముల
వారు ఐకమత్యముగా ఉండుటకు, మతసామరస్యముగా ప్రవర్తించుటకు
అవకాశము గలదు. మేము చెప్పు జ్ఞానము వలన మా “త్రైత సిద్ధాంతము”
భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగము అను అధ్యాయమున 16, 17వ
శ్లోకములందు క్షర, అక్షర, పురుషోత్తములు గా యున్నదని హిందువులు
గ్రహించుచున్నారు. అట్లే ఇంజీలు (బైబిలు) గ్రంథములో మత్తయి సువార్తలో
28వ అధ్యాయమున 19వ వచనమున తండ్రి, కుమారుడు, పరిశు
ద్ధాత్మ యను పేరుతో భగవద్గీతలోని త్రైత సిద్ధాంతము కలదని గ్రహించు
చున్నారు. అట్లే ఖుర్ఆన్ గ్రంథమున సూరా 50, ఆయత్ 21లో
త్రోలబడేవాడు, త్రోలేవాడు, సాక్షిగా చూచేవాడు అని భగవద్గీతలో
మరియు బైబిలులో చెప్పిన ముగ్గురు పురుషుల త్రైత సిద్ధాంతము గలదని
గ్రహించుచున్నారు. అలా గ్రహించిన వారు అన్ని మతములలో ఒకే
జ్ఞానమున్నదని తెలిసి, మత సామరస్యమును ప్రదర్శించుచున్నారు. హిందూ
ధర్మరక్షణ సంస్థలని పేరు పెట్టుకొన్నవారు ఇతర మతములను
దూషించడము, ద్వేషించడము వలన మత కలహాలు ఏర్పడుచున్నవి. ధర్మ
రక్షణ యనుచూ అన్యమతములను వేరుగా చెప్పుచూ, వారి దేవుడు వేరు,
మా దేవుడు వేరని చెప్పుట వలన మత కలహాలు వస్తున్నవి. మా బోధల
వలన అందరి దేవుడు ఒక్కడే, అన్ని మతముల జ్ఞానము ఒక్కటేయని
తెలిసి అందరూ ఐకమత్యముగా, ప్రేమగా ఉండుట మంచిదో, కాదో
ఆలోచించండి. మత రక్షణ అను పేరుగల్గిన యువ సంఘముల వలన,
అధర్మములను, అజ్ఞానమును ప్రేరేపించు మూర్ఖ సముదాయము వలన,
ఇతర మతములను దూషించి సమాజములో గుర్తింపు తెచ్చుకోవాలనుకొను
అనామకుల వలన, ఏమాత్రము ధర్మములను తెలియని అధర్ముల వలన,
సమ సమాజముగా యున్న మనుషులలో మతము అను చిచ్చును రేపి,
సమాజములో హింసను రేకిత్తించు వారివలన మనుషులందరికీ, అన్ని
మతముల వారికీ ప్రమాదము కల్గుచున్నది. ఒకచోట మతము అను
పేరుతో చిచ్చురేపి, చిచ్చు పెట్టినవారు హాయిగా ఇంటిలో ఉండగా, ఆ
చిచ్చుకు అమాయక ప్రజలు బలియగుచున్నారు. అందువలన ఇకనైనా
చిల్లరగా పుట్టుకొచ్చిన 'ధర్మ రక్షణ' అను వారికి హిందువులు దూరముగా
ఉండండి.
(ఒకప్పుడు జరిగిన మత ఘర్షణలలో ఘోరముగా దెబ్బతిని, చావక బ్రతికి
యుండి బాధను అనుభవించు ఒక హిందువు తన బాధను ఇలా
వెలిబుచ్చాడు. ఆ విషయమును క్రింద పొందుపరుస్తున్నాము చూడండి.)
మనము హిందువులమా?.
పేరుకు మనము భారతీయులమే అయినా కొందరు భారతీయు
లుగా బ్రతుకుతుంటే, కొందరు మాత్రము ఆ పేరుకు ఏమాత్రము
సరిపోకుండా బ్రతుకుచున్నారు. వివరముగా చెప్పితే అనేక మతములు,
అనేక జాతులతో కూడుకొని ఎటువంటి భేదము లేకుండా బ్రతుకుతున్నది
భారతీయ సమాజము. అటువంటి వారినే భారతీయులనాలి. కానీ కొందరు
భారతీయులుగా బ్రతకడము లేదు. మత భేదములతో, జాతి భేదములతో
నాది ఫలానా మతము, నాది ఫలానా వర్గము అని గొప్పగా చెప్పుకొని
బ్రతుకుచున్నారు. మతమను ముసుగును అనేక పేర్లతో తగిలించుకొని,
సాటి సమాజమునూ, అందులోని అమాయక ప్రజలనూ బలి పశువులను
చేయుచున్నారు. ఏ మతద్వేషము లేని ప్రజలు ఎందరో మతఛాందసవాదుల
కారణముగా ప్రాణాలను పోగొట్టుకున్నారు. మరెందరో కాళ్ళను, చేతులను,
కళ్ళను పోగొట్టుకొని బాధపడుచూ బ్రతుకుచున్నారు. తాము అలా మారుటకు
ఈ మధ్య కాలములో గోకుల్చాట్లోనూ, లుంబినీ పార్కులోనూ క్షతగాత్రులై,
ఏ పనీ చేయలేని స్థితిలో ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుచున్న వారిలో
కొందరిని కలిసి మాట్లాడితే, వారి జీవితాలు ఈ విధముగా మారిపోవుటకు
కారణమైన వారిమీద, వారు వెలిబుచ్చిన అభిప్రాయమును వింటే మనము
'మతము' అను మత్తులో ఎంత అనాగరికముగా మారిపోయామో అర్థమగు
చున్నది. గోకుల్చాట్ వద్ద బాంబు పేలుడులో వెన్నెముక దెబ్బతిని
మంచములో కదలలేకయున్న ఒక హిందువు ఇలా అంటున్నాడు. నేను
ఎవరికీ శత్రువును కాను, నాకు ఎవరూ శత్రువులు లేరు. కానీ నేను,
నాలాంటి అమాయకులెందరో బాంబు పేలుడులో బలియైపోయారు.
బాంబు పెట్టింది ముస్లీమ్లో, అయినా వారు కౄరంగా మారిపోయి వారికి
ఏ విధముగాను శత్రువులు కాని అమాయక ప్రజలను బలికొనునట్లు ప్రేరేపణ
చేసినది హిందువులలోని కొంతమందే? ఈ దినము కొందరు హిందువులు,
వారు నాయకులుగా కనిపించుటకు 'మత రక్షణ' అని పేరు పెట్టుకొని
ఇతర మతస్థులను నీచముగా మాట్లాడడము వలనా, ఇతర మతస్థుల
మీద శత్రు భావము చూపడము వలనా, మేము ఈ దినము ఇలా అయి
పోయాము. పాపము చేసింది హిందూతములోని పరిషత్లు, దళ్లు,
సేనలు, సేవకులు అనువారు. అనుభవించేది అమాయకులమైన మేము.
మేము ఈ విధముగా బాధలను అనుభవించుటకు కారణము బాంబు
పెట్టిన ముస్లీమ్లు కాదు! వారినలా ప్రేరేపించిన హిందూ సంస్థలు.
దీనినిబట్టి మాకు నిజమైన శత్రువులు హిందూ సంస్థలే. నేను ఒక్కడినే
ఈ మాట అనడము లేదు. అన్నిటినీ ఆలోచించిన ప్రతీ హిందువూ వీరిని
ద్వేషిస్తున్నాడు. హిందువులు ఎందరో తమను ద్వేషిస్తున్నారని తెలిసినా,
మేమే నిజమైన దేశభక్తులమనీ, మా వలననే హిందూ మతము రక్షింప
బడుతున్నదని చెప్పడము విడ్డూరము కాదా!
దేశానికి స్వాతంత్ర్యమును తెచ్చి యిచ్చి జాతిపిత అని పేరుగాంచిన
మహాత్మా అని అందరిచేత పిలువబడిన గాంధీని ఆనాడు కాల్చి చంపిన
వారు మతరక్షకులా? ఈనాడు నాలాంటి అమాయకులైన ఎందరో ప్రజలను
దాడులకు గురి చేయించిన వీరా, హిందూమత రక్షకులు? ఉన్నతమైన
ధర్మాలకు నిలయమైన హిందూ మతములో ధర్మములేవో తెలియక, దైవ
జ్ఞానము అర్థముకాని స్థితిలో ఉండిన కొందరు హిందువులు, ఇతర
మతములలోని జ్ఞానమునకు ఆకర్షితులై మతమును మార్చుకొన్నారు. వారు
అలా మారుటకు ముఖ్యకారణము ఏమి? అని చూడకుండా మన మతములో
జ్ఞానము తెలియనప్పుడు ప్రక్క మతములోని జ్ఞాన ప్రచారమునకు మనవారు
ఆకర్షితులైనారని ఏమాత్రమూ తెలియక, ఇతర మతస్తులను ద్వేషించడము
వలన, హిందూమతము అభివృద్ధి కాకుండా క్షీణించి పోయే ప్రమాదము
కలదని ఈ సంస్థలు గ్రహించడము లేదు. అటువంటి ప్రమాదమును
గ్రహించిన కొందరు స్వామీజీలు, హిందూ మతములోని సూత్రములను
బోధిస్తుంటే, హిందూధర్మములేవో తెలియకనే హిందూ సంస్థలుగా పేరు
పెట్టుకొన్న వారు హిందూ ధర్మములనే గుర్తించలేని గ్రుడ్డివారై, స్వచ్ఛమైన
హిందూ గురువులను కూడా పరమతస్తులుగా భావించి, వారిమీద కూడా
దాడి చేయుచున్నారు.
'ఇందు' అంటే పరమతమనీ, స్వచ్ఛమయిన ఇందువును చంపిన
వారు, హిందూ గురువుల మీదే దాడిచేసిన వారు, అమాయక హిందువులు
దాడులకు గురి అగుటకు కారకులైన వారు, సామాజిక న్యాయమును చెప్పిన,
పేరుగాంచిన ఒక హిందూ దర్శకుని మీదే ధర్నాలు చేసి, క్షమాపణ
చెప్పమనిన వారు, దేశమునుండే వెలివేస్తామని చెప్పువారు వాస్తవానికి
హిందువులేనా? అని ప్రశ్నించక తప్పదు.
ఈనాడు ఒక సినిమా ద్వారా మంచి సందేశమిచ్చిన ఒక బాధ్యతగల
దర్శకుడు చేసిన తప్పేమిటి? ఒకచోట అన్నాచెల్లెలు కలిసి మాట్లాడినా
మీరు ప్రేమికులే అని వారికి బలవంతముగా తాళి కట్టించడము హిందూ
ధర్మములో కలదా? సమాజమునకు మంచి సందేశమిచ్చిన దర్శకుడు
కృష్ణవంశీని ప్రజలు పొగడుచుంటే, వెలివేస్తామన్న వారికి గానీ, ఆ సంస్థ
పెద్దలకుగానీ అసలు హిందూ ధర్మములు ఏమిటో తెలుసా? అని
ప్రశ్నిస్తున్నాము. ఈ మూర్ఖులతో ఎందుకులే అని చాలామంది హిందువులు
ఈ విషయము మీద నోరు విప్పకున్నారు. కానీ అందరూ అలాగే ఉంటే
హిందూమతము ఇంకా నాశనమై పోతుంది. కావున నేనొక హిందువుగా,
హిందువుల కొరకు నోరు విప్పి చెప్పాలనిపించింది. 'హిందూ మతము’
అను ముసుగు వేసుకొని, హిందూ రక్షణ సంస్థలుగా పేరు పెట్టుకొన్న
మిమ్ములను హిందూ భక్షణ సంస్థలుగా హిందువులు భావిస్తున్నారు. అలా
భావించడము వలననే మీరు రాజకీయములో ఎదుగుటకు ఏ హిందువూ
ఇష్టపడడము లేదు.
హిందూ గ్రంథమైన భగవద్గీతలోని ధర్మములను తెలియకుండా,
మీరు హిందువులమని చెప్పుకోవడమునకు అర్హులే కాదు! ఇలాగే
అజ్ఞానముతో ప్రవర్తిస్తూ, హిందువులకే వ్యతిరేఖులుగా మారిపోతే
హిందువులు కలిసికట్టుగా మీ ఉనికినే లేకుండా చేసే కాలమొస్తుందని
ఒక హిందువుగా చెప్పుచున్నాను.
ఇప్పటికైనా గాంధీని చంపినందుకు భారతదేశమునకు క్షమాపణ
మీడియా ద్వారా చెప్పండి. అమాయక ప్రజలను దాడులకు గురి
చేసినందుకు ప్రజలకు, హిందూ గురువులనే అవమానించినందుకు
హిందువులకు, సామాజిక న్యాయమును చెప్పిన హిందూ దర్శకున్ని
వ్యతిరేఖించి బహిష్కరిస్తామన్నందుకు, మొత్తము హిందూ సమాజమునకు
క్షమాపణ చెప్పండి! లేకుంటే మీ పాపములకు నిష్కృతి లేదు!!
ఇట్లు
ఒక హిందువు
తేదీ : అక్టోబర్ 2, 2009
శ్రీకాంత్ నటించిన (మహాత్మ) సినిమా విడుదలప్పుడు
డైరెక్టర్ కృష్ణవంశీ మీద దాడి గురించి ఒక హిందువు చెప్పిన విషయము.
25) ప్రశ్న: - హిందూ వాహిని, భజరంగదళ్, విశ్వహిందూ
పరిషత్, ఆర్. యస్. యస్ (R.S.S), పరశురామ్ పరివార్,
హిందూ జాగరణ సమితి (H.J.S), శివశక్తి, హిందూ
యువశక్తి దళ్, హిందూ జనశక్తి, శివసేన, సమరసత సేవ
ఫౌండేషన్, హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్, రాష్ట్రీయ హిందూ
సేన, హిందూ ప్రస్థాక్, విశ్వ ధర్మ పరిరక్షణ, ప్రజా హిందూ
దళము, హిందూ రక్షక దళ్ మరియు మొదలగు హైందవ
ధార్మిక పరిరక్షణ సంస్థలకు మరియు రాముడిని ఆరాధ్య
దైవముగా పూజించే ప్రతీ హైందవ సోదరులకు నా విన్నపము.
రామున్ని అధర్మపరునిగా చిత్రిస్తూ, లేని విషయాలను
చొప్పిస్తూ, రాముని పై నిందలు వేస్తూ, భారతదేశ
అంశములో ఉత్తరము, దక్షిణము అను వివక్ష రేపుతూ, యజ్ఞ
యాగాది క్రతువులు వేస్ట్ యని బోధిస్తూ, భగవద్గీతను 17
అధ్యాయములకు కుదిస్తూ, సొంత భాష్యముతో గీతను
అవమానిస్తూ, ఫెయిల్ అయిన ఆర్య ద్రావిడ సిద్ధాంతమును
రుద్దుతూ, కార్తీకదీపాలు మూర్ఖత్వము అంటూ,
రావణాసురుడు దేవుడు అని ప్రచారము చేస్తూ, సనాతన
ధర్మమును అవమానిస్తూ త్రైత సిద్ధాంతమును ప్రచారము
చేస్తున్న ప్రబోధానంద స్వామిని ఎదిరించండి అని కొందరు
అన్నారు. దీనికి మీరేమంటారు?
జవాబు :- ఇది పనీపాట లేకుండా బజారులో వృథాగా తిరిగే పదిమంది
గుంపుగా యున్న అల్లరిమూక 'హిందూ రక్షకదళ్' అను పేరు పెట్టుకొన్న
వారు ఫేస్బుక్లో పెట్టిన సమాచారము. ఇందులో ఎదుటి వ్యక్తిని అనగా
మమ్ములను తప్పుగా చూపించు ఉద్దేశ్యముతో వ్రాసినది తప్ప వేరు ఏమీ
లేదని చెప్పుచున్నాము. వీరు వ్రాసిన ప్రతీమాటకు సమాధానము
ఇస్తున్నాము ఎవరిది తప్పో మీరే చూడండి!
ఇది వ్రాసినది పదిమంది యువకులకు నాయకుడుగా యుండి
ఇలాంటి కార్యకలాపాలే పనిగా పెట్టుకొన్న ఒక వ్యక్తి. ఇతని పేరును నేను
చెప్పదలచుకోలేదు గానీ, ఇతని ఆకారమును చెప్పితే భూమినుండి కొలిస్తే
మూడు అడుగుల అంత పొడువు ఉంటాడు. అయినా ఆరు అడుగుల
మనిషివలె మాట్లాడుతుంటాడు. వేషములో అప్పుడప్పుడు కాషాయము
దుస్తులు ధరించి, విభూది ముఖాన దిద్దియుంటాడు. ఇతనిని చూస్తే
జాలివేస్తుంది, చూడకపోతే కోపము వస్తుంది. ఇతడు ఆరు నెలల క్రితమే
మా మీద కొన్ని ఆరోపణలతో ఫేస్బుక్లో ప్రచారము చేసి ఒక మధ్యవర్తి
ద్వారా డబ్బును డిమాండ్ చేశాడు. మేము అప్పుడు పలుక లేదని మా
శత్రువులుగా యున్నవారి చెంతకు చేరి, శత్రువులతో చేతులు కలిపి ఎనిమిది
లక్షల డబ్బు తీసుకొని అప్పటినుండి ఇప్పటికి ఆరు నెలల కాలము నుండి
ప్రతీ దినము ఏదో ఒక ఆరోపణ చేయడమే పనిగా పెట్టుకొన్నాడు.
శత్రువులు ధనికులు, రాజకీయ బలమున్న వారు అయినందున వారితో
మొదట కొంత మొత్తము డబ్బు తీసుకోవడమే కాక ప్రతీ నెల 28 వేలు
జీతము తీసుకొంటూ, నన్ను విమర్శించడమే ఉద్యోగముగా పెట్టుకొని
ప్రతి దినము అతను ఆరోపణలు చేయుచునే యున్నాడు.
అతని ఆరోపణలలో మేము 'రామున్ని అధర్మపరునిగా
చిత్రిస్తున్నామని చెప్పి వ్రాశాడు. వ్రాయవలసిన పదమును కూడా సరిగా
వ్రాయలేనివాడు రామున్ని అధర్మపరుడుగా అని వ్రాశాడు. 'అధర్మ పరుడు'
అంటే అధర్మములకు పరాయిగా యున్నవాడు అని అర్థము వచ్చును.
దానిలో రాముడు ధర్మములు గలవాడనియే అర్థము వచ్చును. అతను
వ్రాయవలసినది ‘అధర్మవరుడు' అని అట్లు వ్రాస్తే రాముడు ధర్మములు
లేనివాడు, ధర్మములు తెలియనివాడని అర్థము రాగలదు. నేను రామున్ని
చెడుగా చెప్పుచూ అధర్మవరుడు అని చెప్పినట్లు వ్రాశాడు. నేను ఎప్పుడూ
రాముని వ్యక్తిత్వమును గురించిన వివరమే చెప్పలేదు. అలాంటప్పుడు
ఇది అసత్య ఆరోపణ తప్ప ఏమీ కాదని తెలియవలెను. నేను ఒక మాటను
అడుగుచున్నాను. ఇవి అధర్మములు, ఇవి ధర్మములు అని మొదట నీకే
తెలియదే, నేను రామున్ని గురించి అధర్మములు గలవాడని చెప్పినట్లు,
ధర్మములు ఏవో తెలియని నీకు ఎలా తెలుసు?
'యజ్ఞములు వృథాయని' చెప్పినట్లు వ్రాశాడు. నేను చెప్పినది
బయటి యజ్ఞముల వలన దేవుడు తెలియబడడు, లోపలి యజ్ఞములను
చేయమని భగవద్గీతలోని మాటను చెప్పాను గానీ, యజ్ఞములే చేయకూడదు
అని చెప్పలేదు. చేతనయితే శరీరము లోపలి యజ్ఞములు చేయమని
చెప్పాను. "అది యజ్ఞోహమే వాత్ర దేవా దేహ భృతాంవర" అను గీతా వాక్యమును
అనుసరించి “దేహములో జరుగు యజ్ఞము చేయమన్నాను.” అంతేకాక
"శ్రేయాన్ ద్రవ్య మయా ద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప" అను గీతా వాక్యము
ప్రకారము “బయట చేయు ద్రవ్యయజ్ఞములకంటే శరీరములో చేయు
జ్ఞాన యజ్ఞము శ్రేష్టమని” చెప్పాను. ఈ మాట నాది కాదు ప్రథమ దైవ
గ్రంథమయిన భగవద్గీతలోనిది. ఇందులో తప్పుపట్టితే “మీరు దేవున్నే
తప్పు పట్టినట్లగును.” ఎందుకనగా! బాహ్య యజ్ఞములు ద్రవ్యములతో
చేయునవి యని భగవంతుడే భగవద్గీతలో చెప్పాడు. అంతేకాక "బాహ్య
యజ్ఞముల వలన దేవున్ని తెలియుటకు శక్యము కాదు” అని
“న శక్యో” యని విశ్వరూప సందర్శన యోగము అను అధ్యాయములో
48, 53 శ్లోకములయందు చెప్పియున్నాడని తెలియగలిగితే నేను చెప్పినది
సత్యమేయని తెలియగలదు.
భగవద్గీతను నేను "త్రైత సిద్ధాంత భగవద్గీత” యను పేరుతో
వివరించి వ్రాశాము. నేడు నేను చెప్పిన త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రజలలో
మంచి పేరు తెచ్చుకొన్నది. అంతేకాక రష్యా దేశములో భగవద్గీతను
నిషేధించవలెనను వారి ఉద్దేశ్యమును మార్చి, ఇది ఉండవచ్చును అనునట్లు
చేసినది త్రైత సిద్ధాంత భగవద్గీతయని, ఆ దేశము నుండి ఈ మధ్యనే
మాకు సమాచారము అందినది. భారతదేశములో వివరము వ్రాయబడిన
భగవద్గీతలు దాదాపు మూడువందల ముప్పది (330) ఉండగా, అందులో
అన్నిటినీ అధిగమించి వివరమును చెప్పినది త్రైత సిద్ధాంత భగవద్గీత యని,
ఎన్నో భగవద్గీతలు చదివినవారు తేల్చి చెప్పారు. దానిని అర్థము చేసుకోలేని
పరిస్థితిలో లేక అదే పనిగా ఆరోపణ చేయవలెనను ఉద్దేశ్యముతో
భగవద్గీతను వక్రీకరించి వ్రాశాడనడము తెలివి తక్కువ కాదా! ఎలుక
సింహమును వెక్కిరించినట్లున్నది! నేను 'భగవద్గీతను పదిహేడు (17)
అధ్యాయములకు కుదించాను' అని అన్నారు. నేను ఒక వ్యక్తిని గురించి
అతను ధరించిన అంగీ వరకే చెప్పాను, లుంగీవరకు చెప్పలేదు. అంత
మాత్రమున అతనికి క్రింద లుంగీ లేదని ఎందుకు అనుకోవాలి? అట్లే
భగవద్గీతలో నేను వివరించి చెప్పినది 17 అధ్యాయములే, ఒక అధ్యాయము
నకు వివరము చెప్పలేదు. అంతమాత్రమున భగవద్గీతలో ఒక అధ్యాయము
లేదని నీవెందుకు అనుకోవాలి? అట్లు అనుకోవడము అంగీ ఉంది, లుంగీ
లేదు అనుకొన్నట్లుంటుంది. సొంత భాష్యముతో గీతను అవమానిస్తూ
వ్రాశారు అన్నారు. నేను ఎక్కడ వక్రీకరించి వ్రాశానో చూపగలరా?
చాలామంది వ్రాసిన దానిలోని తప్పులు సరిదిద్ది చెప్పాము.
“చాతుర్వర్ణము” అను శ్లోకమునకు అందరూ కులములను అంటగట్టి
వ్రాశారు. దేవుడు తన గ్రంథములో కులాలను, మతాలను గురించి ఎక్కడా
చెప్పలేదు. అందువలన ఆ శ్లోకమునకు గుణములున్నట్లు చెప్పాము.
అందరూ వ్రాసినది శాస్త్రబద్దముగా లేదని, దాని నిజ భావమును
శాస్త్రీయముగా వ్రాశాను. అది అర్థము చేసుకొను శక్తిలేని మీరు గీతను
వక్రీకరించి వ్రాశాడు అనడము బుద్ధి తక్కువ పనికాక ఏమగును! గీత
సర్వమానవులకు చెప్పినదిగానీ, కులాలకు, మతాలకు చెప్పినది
కాదు. భగవద్గీతలోనికి కులాలను తీసుకొచ్చినవారు సక్రమముగా
వ్రాసినట్లా? యని నేను అడుగుచున్నాను.
“ద్రావిడ బ్రాహ్మణ” అను గ్రంథములో గత చరిత్రలో ఏమి
జరిగిందో దానినే వ్రాశాము. దక్షిణ భారతదేశములోని గిరిజనులయిన
ఆజానుబాహుడుగా, అందముగాయున్న ఆంజనేయున్ని కోతిగా చిత్రించిన
ఆర్యులు తప్పు చేశారుయనీ, వివక్షతో అలా చిత్రించి చూపారు అని
చెప్పాము. మేము చెప్పినది యదార్థము. ఆర్యులు దక్షిణ దేశ గిరిజనులను
వారి పని నిమిత్తము వాడుకొని, చివరకు గిరిజనులను కోతులుగా, ఎలుగు
బంట్లుగా ఎందుకు చూపించారు? అని అడిగాము. అలా చూపడము
ప్రాంతీయ వివక్ష కాదా! రాముని తరపున యుద్ధము చేసిన మనుషులు
చివరకు జంతువులుగా కనిపించారా? యని అడిగాము. ఆనాడు నల్లమల
అడవులలోని గిరిజనులు కోతులు, ఎలుగుబంట్లు అయితే రాముని తరపున
యుద్ధము ఎలా చేశారని అడిగాము? చివరకు సహాయము చేసిన
ఆంజనేయున్ని మనిషి ఆకారము నుండి కోతి ఆకారముగా మార్చి రాముని
కాళ్ల దగ్గర చూపడము తప్పుకాదా? యని అడిగాము. జరగని చరిత్రను
జరిగినట్లు చూపి వ్రాయడము, దక్షిణ దేశ రాజు అయిన రావణబ్రహ్మను
అనుచిత కార్యములు చేసినట్లు చెప్పడము ప్రాంతీయ వివక్ష కాదా? ఆర్యుల
అహంకారము కాదా?యని అడిగాము. ఆర్యులు నేటికినీ కొందరున్నారనీ,
ద్రావిడులను చిన్నచూపు చూస్తున్నారని సత్యమును చెప్పాము. ఆర్యులకు
పుట్టి, దక్షిణ దేశములోయున్న ఆర్యులకయితే నేను చెప్పిన మాటలు నచ్చవు.
అందువలన నన్ను విమర్శించు నీవు, నీలో ఆర్యుల గాలి ఏమయినా
ఉందేమో చూచుకోమని చెప్పుచున్నాను.
“దేవాలయ రహస్యములు" అను గ్రంథములో ధ్వజస్థంబమును
గురించి చెప్పునప్పుడు కార్తీక దీపములను గురించి చెప్పాము. హిందువులు
కార్తీకమాసములో కార్తీక దీపమును జ్ఞానజ్యోతిగా భావించి ధ్వజస్థంభము
మీద పెట్టేవారని చెప్పాము. అంతేగానీ కార్తీక దీపము పెట్టుట మూర్ఖత్వమని
నేను ఎక్కడా చెప్పలేదు. మీరు నా మీద అసూయతో చెప్పుమాట తప్ప
వేరు లేదు అని అంటున్నాను. “రావణ బ్రహ్మ" అను గ్రంథములో
దేవుని (పరమాత్మ) మొదటి అవతారము రావణబ్రహ్మగా వచ్చినదని
యదార్థమును చెప్పాము. అలా చెప్పుటకు కారణము ఎక్కడయితే ధర్మములు
చెప్పబడుచున్నవో అక్కడ దేవుడు అవతరించాడు అను సూత్రము ప్రకారము
చెప్పాము తప్ప, నేను గ్రుడ్డిగా చెప్పలేదు. దేవుని అవతారమైన రావణబ్రహ్మ
నేడు దుర్మార్గునిగా చిత్రీకరించబడి యున్నాడు. నిన్న మొన్నటి వరకు
రావణబ్రహ్మను దుర్మార్గుడని నేను కూడా అనుకొన్నాను. సత్యశోధన
చేసిన తర్వాత ఆయన సాక్ష్యాత్తూ దేవుని అవతారమని అందువలననే
యజ్ఞములను, తపస్సులను వ్యతిరేఖించాడని తెలిసినది. ఇంతవరకు
రావణబ్రహ్మను అర్థము చేసుకోనందుకు, ఇతరుల మాటలు విని ఆయనను
చెడ్డవానిగా భావించినందుకు చింతించుచున్నాము. మీరు ఒకమారు
కళ్లు తెరిచి చూడండి. ఆయనెవరో అర్థమవుతుంది.
సనాతన ధర్మమును అవమానిస్తూ, త్రైత సిద్ధాంతమును ప్రచారము
చేస్తున్నారని నన్ను ఆరోపించారు. నోరుందని మాట్లాడితే అర్థము లేని
అరుపు అరిచే గాడిదకు కూడా నోరుంటుంది. అర్థము లేకుండా మాట్లాడే
వాడు గాడిదతో సమానమని మేము అనుకోకతప్పదు. సనాతన ధర్మము
అంటే ఏమిటో తెలుసా? కనీసము దాని అర్థమయినా తెలుసాయని అడుగు
చున్నాను. ధర్మము అంటే ఏమిటో తెలియని వారు “సనాతన ధర్మము”
అని అనడము ఆశ్చర్యము. సనాతన ధర్మము ఏమిటో కనీసము దాని
అర్థము కూడా తెలియకుండా మాట్లాడడము ఒక హిందువు చేయవలసిన
పని కాదు. హిందువులలో 'ధర్మ రక్షణ దళ్' అని పేరు పెట్టుకొన్న వారికి
ధర్మములే తెలియకపోతే వాటిని రక్షించడమెలా యని అడుగుచున్నాము.
ధర్మములను గురించి అహర్నిశలు జ్ఞానముతో శోధించు యోగులకు,
గురువులకు తెలుసు. దేవుడు తన గ్రంథములలో చెప్పిన ధర్మములను
వివరముగా ప్రజలకు చెప్పువారు యోగులు, గురువులు. ఇందూ ధర్మ
(హిందూ ధర్మ) ప్రబోధికులు గురువులు. ఆధ్యాత్మిక గురువులు చెప్పితే
మీలాంటి వారికి ధర్మములు తెలియబడుతాయి. అంతేగానీ బజారు
రౌడీలకు, గురువులను బెదిరించుకొను వారికి ధర్మములు తెలియవు, వారు
వాటిని రక్షించలేరు. ధర్మములను వివరముగా బోధించువారు గురువులు,
ధర్మములను ఉద్ధరించువాడు, రక్షించువాడు దేవుడు. దేవుడు చెప్పిన
ధర్మములను ప్రజలకు వివరముగా చెప్పువారినే మీరు అవమానిస్తున్నారంటే
మీరు హిందూ జాతియే కాదని తెలియుచున్నది.
సనాతన ధర్మములోని అర్థమును వివరించుకొని చూస్తే సనాతన
అనగా ఎల్లప్పుడు అని అర్థము. సృష్ట్యాదినుండి నేటి వరకు చెక్కు చెదర
కుండా ఉండు ధర్మమును 'సనాతన ధర్మము' అని అంటాము. మేము
ధర్మములను ఉద్ధరించువారము అని చెప్పుకొను వారందరూ సనాతన
ధర్మము అని అంటూవుంటారు. వారిని అడిగితే కాలమును బట్టి ధర్మములు
మారుతుండును అని కూడా అనుచున్నారు. సనాతన ధర్మము అంటే
ఎల్లప్పుడు ఒకటే ఉండునదా లేక ఎల్లప్పుడు మారుతూ ఉండునదా! అని
వారికే తెలియకుండా పోయినది. అది కృతయుగములోని ధర్మము, ఇది
కలియుగములోని ధర్మము అని చెప్పువారికి సనాతన ధర్మమును గురించి
తెలియదనియే చెప్పవచ్చును. 'సనాతన ధర్మము' అనగా సృష్టి ఆదినుండి
నేటి వరకు ఒకే విధముగా, ఒకే బలముగా నిలబడియున్నది సనాతన
ధర్మము. మొదట ప్రారంభమయినది ఎప్పటికీ మారకుండా ఉండడమే
కాక, అది తప్ప వేరే ధర్మము లేనిది సనాతన ధర్మమగును. మధ్యలో
ఇంకొక ధర్మము వచ్చి మొదటి దానిని లేకుండా చేసినా, బలహీనపరచినా
మొదటిది సనాతనము కాకుండా పోవును. అందువలన సృష్టి ఆదిలో
దేవుడు ఏ ధర్మములను బోధించాడో అదే ధర్మములు ఇంతవరకు యున్నాయి.
సృష్ట్యాది నుండి ఒకే దేవుడున్నాడు. అట్లే సృష్ట్యాది నుండి ఒకే ధర్మము
గలదు. మధ్యలో ఎప్పుడయినా వేరే దేవుడు వస్తే, వేరే ధర్మము వచ్చును.
మధ్యలో ఇంతవరకు ఏ దేవుడు రాలేదు, అందువలన ఇతర ధర్మము
రాలేదు. సృష్ట్యాది నుండి ఒకే దేవుడు, ఒకే ధర్మము గలదు, దానినే సనాతన
ధర్మము అని అంటాము.
26) ప్రశ్న :- రెండువేల సంవత్సరముల పూర్వము “క్రైస్థవ
మతము" వచ్చినది. దానితో క్రైస్తవ ధర్మము వచ్చినది
“యెహోవా” దేవుడు వచ్చాడు. అప్పుడు దేవుడు వేరే
రావడము, ధర్మము వేరే రావడము జరిగినది కదా! అట్లే
1400 సంవత్సరముల ముందు “ఇస్లామ్ మతము" వచ్చినది.
“అల్లాహ్” దేవుడు వచ్చాడు వారికి, ఇస్లామ్ ధర్మము వచ్చినది.
అప్పుడు కూడా వేరొక దేవుడు రావడము, వేరొక మతము
రావడము జరిగినది కదా! దీనినిబట్టి మీరు చెప్పిన ప్రకారమైతే
సనాతన ధర్మము ఒక్కటే ఎల్లప్పుడు లేదు కదా! అప్పుడు
సనాతన ధర్మము అనుమాటే లేదు కదా! అటువంటప్పుడు
హిందువులు మాత్రము మాది 'సనాతన ధర్మము' అని ఎందుకు
అనాలి? ఇతర మతముల రాకతో హిందూ మతము
క్షీణించిపోయినా, పోకున్నా అది ఒక్కటే 'సనాతన ధర్మము'
అని ఎందుకు చెప్పాలి? మిగతా మత ధర్మములు కూడా
పుట్టినప్పటి నుండి ఉన్నాయి కదా! అప్పుడు అవి కూడా సనాతన
ధర్మములే అగును కదా! దీనికి మీరేమంటారు?
జవాబు :- మధ్యలో వేరే దేవుడు వచ్చినా, వేరే ధర్మము వచ్చినా అప్పటి
నుండి వచ్చిన ధర్మము గుర్తింపబడును. కావున మొదట యున్నది
సనాతనము అనిపించుకోదు. ఒక దేశానికి ఎప్పటికీ ఒకే చక్రవర్తి
యుండవలెను. అలా ఉంటే అతనిని శాశ్విత చక్రవర్తి యని చెప్పవచ్చును.
అట్లుకాక మధ్యలో ఆ దేశమునకు ఇంకొక చక్రవర్తి వచ్చినప్పుడు మొదటి
చక్రవర్తి రాజుగా మారిపోవును, చక్రవర్తి పదవి పోవును. వేరే చక్రవర్తి
రానంత వరకు వాడు శాశ్విత చక్రవర్తి అని అనిపించుకొనును. వేరే
చక్రవర్తి వస్తే అతడు రాజుగా మారిపోవును. అదే విధముగా ఒకే
దేవుడు, ఒకే ధర్మము ఉన్నంతవరకు దానిని శాశ్విత ధర్మము లేక సనాతన
ధర్మము అని అందుము. దేవున్ని బట్టి ధర్మము ఉండును. కనుక దేవుడు
మారితే ధర్మము మారును, కనుక సనాతన ధర్మము ఉండదు అనుమాట
వాస్తవమే అయినా సృష్ఠి ఆది నుండి దేవుడు మారలేదు, ధర్మము మారలేదు.
కనుక ఎప్పటికీ ఒకే ధర్మము గలదు కావున ఉన్నది ఒకే శాశ్విత ధర్మమని
దానినే సనాతన ధర్మమని చెప్పుచున్నాము. సృష్ట్యాదిలో నుండి హిందూ
ధర్మము యున్న మాట వాస్తవమే. ఇందూ (హిందూ) ధర్మమును ‘శాశ్విత
ధర్మము లేక సనాతన ధర్మము' అనడము జరుగుచున్నది.
మధ్యలో క్రైస్థవము అను పేరు (మతము) వచ్చినా, తర్వాత ఇస్లామ్
అను పేరు (మతము) వచ్చినా అందులో కూడా మొదట యున్న దేవుడే
యున్నాడు, కావున మొదట యున్న ధర్మమే యున్నది. కావున అప్పటికీ
ఇప్పటికీ ఒకే ధర్మము, ఒకే దేవుడు ఉన్నాడని చెప్పవచ్చును. మధ్యలో
మతముల పేరు మారినా, దేవుని పేరు మారినా దేవుడు ఒక్కడే గలడు.
ధర్మము ఒక్కటే గలదు. మొదట సృష్ఠి జరిగిన తర్వాత అదే విధానమే
ఇంతవరకు జరుగుచూ వచ్చుచున్నది. మనిషికి దేవుని విధానము
అర్థమగుటకు క్రొత్త పేరుతో దేవుడు, క్రొత్త పేరుతో ధర్మము వచ్చినా,
వచ్చిన దేవుడు మొదటివాడే, వచ్చిన ధర్మము మొదటి ధర్మమే. అందువలన
సృష్ట్యాది నుండి ఒకే దేవుడు, ఒకే ధర్మమే ఉన్నదని చెప్పవచ్చును. దానినే
సనాతన దేవుడు, సనాతన ధర్మము అని చెప్పవచ్చును. అయినా నేడు
ధర్మము యొక్క వాసన కూడా తెలియనివారు మమ్ములను ఆరోపించడము
ఏనుగును చూచి కుక్కలు మొరిగినట్లేయని తెలియుము.
27) ప్రశ్న :- మీకు సంస్కృతము రాదు, మీరు వేదములు
చదవలేదు అటువంటి వారు గురువులు ఎలా అవుతారు అని
కొందరు అంటున్నారు. దానికి మీరేమంటారు?
జవాబు :- సంస్కృతము ఒక భాష. భావమును తెల్పునది భాష. అంతేకాక
సంస్కృత భాషకు లిపిలేదు. లిపిలేని భాష లిపియున్న భాషకంటే
తక్కువదే యగును. ఆధ్యాత్మికము అనగా ఆత్మను ఆధ్యాయనము
చేయడము. ఆధ్యాత్మికమునకు, భాషకు ఏమాత్రము సంబంధము లేదు.
బుద్ధి గ్రాహితశక్తి మీద ఆధ్యాత్మికము ఆధారపడియుండును గానీ, భాష
మీద ఆధారపడి యుండదు. అదియూ లిపిలేని భాష పెద్దదా? లిపి యున్న
భాష పెద్దదా? కొంచెము బుద్ధిని ఉపయోగించి ఆలోచించండి. ఎవరో
ఏదో చెప్పితే దానినే నీవు చెప్పడము, నీ బుద్ధి యొక్క గొప్పతనము ఏమీ
కాదు. నీవు స్వయముగా ఆలోచించి తెలుసుకో, ఆధ్యాత్మికమునకు, సంస్కృత
భాషకు ఎటువంటి సంబంధము లేదు. అందువలన నేడు సంస్కృతమును
నేర్చిన ఒక్కరికి కూడా ఆధ్యాత్మికము తెలియదు. వేదముల విషయమునకు
వస్తే ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతయే వేదములను గురించి చెప్పుచూ
"త్రైగుణ్య విషయా లేదా" అని చెప్పినది. అందులో “వేదాలలో మూడు
గుణ విషయములు తప్ప ఏమీ లేదు” అని చెప్పి “మూడు గుణములను
విసర్జించినప్పుడే ఆధ్యాత్మికము తెలుసును” అని కూడా చెప్పడము జరిగినది.
అంతే కాకుండా "గుణమయి మమ మాయా" అని కూడా చెప్పారు. 'నా
మాయ అనునది గుణములతో కూడుకొనియున్నది' అని చెప్పారు. అప్పుడు
వేదములు మాయ అనీ, గుణముల కలయిక అనీ తెలుస్తున్నది కదా!
“మూడు గుణముల విషయములే వేదములలో యున్న
వని” భగవద్గీత సాంఖ్యయోగములో 45వ శ్లోకమందును “గుణములే
మాయ యని, మాయను జయించడము దుస్సాధ్యమని” విజ్ఞాన
యోగములో 14వ శ్లోక మందును చెప్పియుండడమే కాకుండా, భగవద్గీత
యందే విశ్వరూప సందర్శన యోగమున 48, 53 శ్లోకములలో
“వేదాధ్యయణము వలన దేవున్ని తెలియుటకు శక్యము కాదు
యని” చెప్పియుండగా, మూడుచోట్ల చెప్పిన దేవుని మాటను అతిక్రమించి
వేదములను చదవడము, దేవుని మాటను లెక్కచేయక వ్యతిరేఖముగా
ప్రవర్తించినట్లు కాదా! మనుషులు చెప్పుమాటలు విని వేదములను చదివితే
దేవుని మాటను ఎట్లు విన్నట్లగును? దేవుని ధర్మమును ఎట్లు ఆచరించి
నట్లగును? వేదాలు చదివితే దేవునికి వ్యతిరిక్త భావములో పోయినట్లగును.
అందువలన మేము వేదములకు దూరముగా ఉందుము. వేదములను
చదివేవారిని దేవుని మాటను వినని వారుగా లెక్కింతుము. మేము వేదములు
చదవలేదు, కావున మా దగ్గర దైవశక్తి సంపూర్ణముగా యున్నది. మీ
దగ్గరేముందో చెప్పండి చూద్దాము. ప్రజలు ప్రశ్నిస్తే మీరేమి చెప్పుతారు?
28) ప్రశ్న :- నేడు హిందూ ధర్మరక్షణ సంస్థలు రెండు
పదుల సంఖ్యలో గలవు గదా! వారు మతమార్పిడి జరుగ
కుండా చూస్తున్నారు కదా! అది అవసరము లేదంటారా?
జవాబు :- మత మార్పిడి జరుగకుండా చూస్తున్న సంస్థలకు, మత రక్షణ
సంస్థలని పేరు పెట్టుకోవడము మంచిది. దానిని నేను ఒప్పుకుంటాను.
'మతమును రక్షిస్తూ, ధర్మ రక్షణ' అని పేరు పెట్టుకోవడము, మేము హిందూ
ధర్మ రక్షణ చేస్తున్నాననడము, ఒకటి చేస్తూ మరొకటిని చెప్పినట్లు కాదా!
ఎండు చేపలు అమ్మేవాడు 'ఎండు మిరపకాయలమ్మో' అన్నట్లున్నది. చేసేది
ఒకటి, చెప్పేది మరొకటా? మతము ప్రపంచ సంబంధమైనది, ధర్మము
అనునది దైవ సంబంధమైనది. మీరు మీ మతాన్ని ప్రేమిస్తున్నారు, సరే
మీరు మతము క్షీణించకుండా, మతమార్పిడి జరుగకుండా చూస్తున్నారు.
మీరు చేయునది ప్రపంచ సంబంధముగా మంచి పనే. అయితే మీరు
చేయుచున్న పనిని ధైర్యముగా చెప్పుకోండి అందులో తప్పు లేదు.
అట్లుకాకుండా చేసేది మత రక్షణ, చెప్పేది ధర్మ రక్షణ ఇది ఏమన్నా
న్యాయమంటారా?
నేను ధర్మములను రక్షించలేదు గానీ, దేవుడు చెప్పిన ధర్మములను
వివరించి ప్రజలకు చెప్పుచున్నాను. నా లెక్కలో మతమునకు, ధర్మమునకు
సంబంధము వేరు. అందువలన “సమస్త మానవులకు నేను ధర్మములను
తెల్పుచున్నాను.” అందువలన మా వద్దకు హిందూ, క్రైస్తవ, ముస్లీమ్ మూడు
మతముల వారు వస్తున్నారు. మూడు దైవ గ్రంథములయిన భగవద్గీత,
బైబిలు, ఖుర్ఆన్ గ్రంథములలో ఒకే ధర్మమును వారికి చూపించుచున్నాను.
ఒకే దేవున్ని తెలియునట్లు చేయుచున్నాను. అందువలన నా వద్దకు వచ్చిన
మూడు మతముల వారు ఒకే దేవుని ముద్రను ధరించుచున్నారు. దేవుని
ముద్రను గురించి ముస్లీమ్లు తమ గ్రంథములో సూరా 22లో, ఆయత్
32 నందు “దేవుని చిహ్నము (దేవుని ముద్ర)” ఉందని తెలియగలిగారు.
అట్లే క్రైస్థవులు తమ బైబిలు యందు యోహాను ప్రకటనలో 9వ అధ్యాయము,
4వ వచన మందుగల 'దేవుని ముద్ర'ను గ్రహించగలిగారు. మేము వివరించి
చెప్పిన దేవుని చిహ్నము అయిన నాలుగు చక్రముల ఆకారమును మూడు
మతముల వారు ధరించి, ఒకే వేదిక మీద మేమంతా ఒక్కటేయను
భావమును తెల్పుచూ కనిపించుచున్నారు. మా వద్ద 'మతము' అను ప్రసక్తి
లేకుండా, ‘మత మార్పిడి' యను ఆలోచనే లేకుండా ధర్మముల మీద దృష్ఠితో
యున్నారు. మేము హిందూ ధర్మ రక్షకులము అనువారు ఇతర మతముల
వారికి ఒకే ధర్మమును గురించిన జ్ఞానమును చెప్పగలరా? ముస్లీమ్ల
నుదిటి మీదగానీ, క్రైస్థవుల నుదిటిమీద గానీ వారి ఇష్టప్రకారము దేవుని
ముద్రను ధరింప చేయగలరా? ఎవరూ చేయలేరు. ఎవరూ చేయలేని
పనిని నేను చేసి చూపిస్తూ, అందరి దేవుడు ఒక్కడే, అందరి ధర్మము
ఒక్కటేయని చెప్పుచున్నాము. మీరు మత రక్షకులు, మేము ధర్మ
బోధకులము. ఇది గ్రహించక నన్ను అధర్మములు ప్రచారము చేయువానిగా,
హిందూ ధర్మములను నాశనము చేయువారిగా చిత్రించి ఆరోపణలు
చేయడమును దేవుడు కూడా ఓర్చుకోడు.
మతానికి ధర్మానికి, నక్కకు నాగలోకమునకు ఉన్నంత తేడా గలదు.
అటువంటి మత ప్రచారమును చేయుచూ, మా మతమే గొప్పదను
భావములో మత మార్పిడి జరుగకుండా ఇన్ని సంస్థలు చూస్తున్నా, నిత్యము
మతమార్పిడి జరుగుచునేయున్నది. హిందువులు క్రైస్తవులుగా, ముస్లీమ్లుగా
మారుచునే ఉన్నారు. అటువంటప్పుడు మీరు ఏమి చేయుచున్నారు?
జ్ఞానమును బోధించి ధర్మమును తెలియజేయడము వలన అన్ని మతముల
లోనూ ఒకే ధర్మము, ఒకే దేవుడున్నాడని తెలిసి ఎవరూ మతమును మారరు.
నేను “మత మార్పిడి దైవ ద్రోహము" అను గ్రంథమును వ్రాశాను.
అది చదివినవారు ఎవరూ మతము మారాలని అనుకోలేదు. హిందూ
మతములోని భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమున గల “ముగ్గురు
పురుషుల ధర్మమే” బైబిలులోను, ఖుర్ఆన్లోను చూపించడము వలన
ఇక్కడున్నదే అక్కడున్నదని ఉన్న మతములోనే జ్ఞానమును తెలియగల్గు
చున్నారు గానీ, మతము మారాలను ఆలోచనే వారిలో లేకుండా పోయినది.
ధర్మము తెలిస్తే ఏ మతములో అయినా ఒకే దేవుడు ఒకే ధర్మము గలదని
తెలియగలదు. మీరు అలా ధర్మములను బోధించి ధర్మ రక్షకులమను
పేరును సార్థకము చేసుకోండి. అట్లుకాకుండా మత రక్షణ చేయుచూ
ధర్మరక్షణ అని చెప్పుకోవడము తప్పు.
“తాను చెడ్డ కోతి వనమెల్ల చెరిసె” అన్నట్లు ఎవడో వాక్ చాతుర్యము
గల స్వామీజీ మతమును గురించి బోధించి, మనము మన మతమును
రక్షించుకోవాలని రెచ్చగొట్టితే దానిప్రకారము రెచ్చిపోయి, మత ఘర్షణల
వరకూ పోవద్దండి. దేవుడు ధర్మములను రక్షించగలడు, ఉద్ధరించగలడు.
నీవు ధర్మములను తెలియు పని మాత్రము చేసుకో. నీవే ధర్మములను
రక్షించితే దేవుడు భూమిమీద ధర్మ సంరక్షణార్థము పుట్టవలసిన పనే లేదు.
నీవు ధర్మములను తెలుసుకో, ధర్మములను ఆచరించు. అదే నీ పని.
దేవుని పని ధర్మములను రక్షించుతాడు, తెలియజేస్తాడు. అట్లుకాకుండా
ధర్మరక్షణ యని మత రక్షణ చేయుటకు పూనుకోకు. ఎవడో మత
ఉన్మాది నిన్ను రెచ్చగొట్టితే నీవు రెచ్చిపోకు. మతద్వేషములను పెంచేవారు,
మత రక్షణ అను పేరుతో అన్యమతములను ద్వేషించునట్లు చేయువారు
బోధకులుగా, గురువులుగా యున్నా వారి మాటను నీవు వినవద్దు. వారికున్న
వాక్ చాతుర్యముతో మతద్వేషమును వెళ్ళగక్కుచూ బస్టాండులోను,
రైల్వేస్టేషన్లోను, రైలుపెట్టెలోను ఎక్కడ దొరికితే అక్కడ మతమును
బోధించుచూ, మన ధర్మమును మనము కాపాడుకోవాలని చెప్పు ఒక
వ్యక్తి ఎలా చెప్పుచున్నాడో, ఎలా మనుషులను రెచ్చగొట్టుచున్నాడో చూడండి.
ఆయన వేషము పరమ భక్తునిగా, మూరెడు పిలక కల్గి, బెత్తెడు నామము
కల్గియున్న వాడు చెప్పితే ఎవరయినా వినగలరు. ఆయన ఏమి
చెప్పుచున్నాడో చూడండి!
ప్రస్తుతం ఉన్న సమాజం పూర్తిగా 'మతము' అనే అధర్మములో
కూరుకుపోయి ఉన్నది. దైవజ్ఞాన, ధర్మము ప్రచారము చేయు ఆధ్యాత్మిక
సంస్థలు, వాటి ప్రచారకులు మూల దైవ గ్రంథములలోని వాస్తవ దైవజ్ఞానాన్ని
సత్యముగా, సశాస్త్రీయముగా, హేతబద్దముగా ప్రజలకు వివరించాల్సిన
అవసరము ఉంది. కానీ 99.99% ఆధ్యాత్మిక సంస్థలు జనాల మనస్సును
కావాలని ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి, సమాజాన్ని
మరింత క్రిందకు దిగజార్చుతున్నాయి. స్వమతం మీద వీరాభిమానం
పెంచుకుని, పరమతములపై అంతులేని ద్వేషాన్ని పెంచుకుని తాము
చెడిపోవడమే కాకుండా, తమ తోటి జనాలను కూడా చెడగొడ్తున్నారు.
'ఇస్కాన్' అనే సంస్థలో భగవద్గీత ఉపన్యాసకుడిగా ఉన్న రాధా
మనోహర్ దాస్ స్వామి (రాధా మనోహరం) అను ఒక మత ప్రచారకుడు
చూడడానికి ఒక పండితునిగా, భక్తునిగా, మంచివానిలా కనిపిస్తున్నా లోపల
స్వమతాభి మానం, పరమతద్వేషంతో తాను ఎక్కడికి వెళితే, అక్కడే మత
ద్వేషాన్ని కక్కి, తోటి ప్రజలలో మత విష బీజాలను నాటి, మతసామరస్యాన్ని,
దేశ సమగ్రతను, రాజ్యాంగ సెక్యులర్ భావజాలాన్ని, విశ్వమానవ
సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీసే విధంగా ఏ పాపము తెలియని చిన్నపిల్లల దగ్గర
నుండి, పెద్ద వయస్సు వారి వరకు ప్రతి ఒక్కరిని ఎందరు దొరికితే అందరినీ
(కనీసం ఒక్కరు దొరికినా సరే) తన వాక్చాతుర్యంతో ఆకర్షించి, విషమత
ప్రచారం చేసి తోటి మనిషిని, తోటి మతాన్ని అగౌరవపరుస్తున్నాడు. తద్వారా
తానే కాకుండా తన బారిన పడినవారిని కూడా దేవుని జ్ఞానానికి దూరం
చేస్తున్నాడు. అతని ఉద్దేశ్యపూర్వక, మత ద్వేష, కుళ్లు కుతంత్ర కుటిల
బుద్ధిని అతని వ్యాఖ్యలలో క్రింద చూడండి.
ఒక రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం మీద మతద్వేష వ్యాఖ్యలు.
పంతులుగా, పండితునిగా, భక్తునిగా కనిపిస్తున్న రాధా మనోహర్
స్వామి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్తో వేరొకచోట తాను రైలులో మాట్లాడిన
ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ, గుమికూడిన జనంతో క్రింది విధంగా
రెచ్చగొడుతున్నాడు.
"అన్ని మతాలు సమానమా? అన్ని దేవుళ్లు సమానమా? మరి
అన్ని మత గ్రంథాలలో ఒక్కటే వుందా?" అని అడిగాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్
“అవును! ఒకటే ఉంది” అన్నాడు. పంతులు “సాఫ్ట్వేర్ పిల్లవాడు, సాఫ్ట్ఫేలో”
అని అంటూ “అన్నిట్లో ఒక్కటే ఉంది. అన్ని మతాలు ఒకటే అంటున్నావు.
మరి నేను నీకు ఒక అవార్డు ఇద్దామనుకుంటున్నాను. ఏమి ఆ అవార్డు!
'నువ్వు వెధవవు'. అది పద్మశ్రీ కాదు, పద్మ భూషణ్ అవార్డు కాదు” అని
అన్నాడు. అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంతోసేపటినుండి పంతులుగారితో
మాట్లాడుతున్నా 'నువ్వు వెధవ్వి' అని అనడంతో తాను ఎంతో ఆశ్చర్య
పోయాడట. అప్పుడు పంతులు “నేను నిన్ను ఎందుకు తిట్టానో తెలుసా?
నువ్వు ఏమీ తెలియకుండా స్టేట్మెంట్లు ఇస్తున్నావు” అని రైలులో ఎవరినో
ముగ్గురిని చూపిస్తూ (గతంలో) పంతులు “వీళ్ల నాన్న, వీళ్ల నాన్న, వాళ్ల
నాన్న అని చూపిస్తూ, వీళ్ల ముగ్గురి నాన్నలు త్రాగుబోతులు. ఇప్పుడు
నీవేమంటావ్" అని పంతులు అడిగాడట. అలాగే “ఇప్పుడు వాళ్లసలు
ఎవరో తెలియదు. 'వాళ్ల నాన్న త్రాగుబోతు' అని నేనెవరో తెలియనోన్ని
చెబితే, నువ్వు అవునండి' అని అన్నావంటే నీకు బుర్ర ఉన్నట్టా, లేనట్టా.”
“నువ్వు భగవద్గీత చదివావా చదవలేదు, నువ్వు బైబిలు చదివావా,
చదవలేదు, మరి ఖురాన్ చదివావా, చదవలేదు. మరి ఏమీ చదవకుండా,
అన్నీ ఒక్కటే అని ఎలా చెప్తావ్? నువ్వు వెధవవా కాదా!” అని పంతులు
అన్నాడట.
“కాబట్టి మన దేశానికి ప్రమాదం క్రైస్థవులతో లేదు, ముస్లీమ్లతో
లేదు. ప్రమాదం ఎవరితో వుందంటే, ఏమీ చదవకుండా, అన్నీ ఒక్కటే
అనే అడ్డగాడిదలున్నారే, సెక్యులర్ కుక్కలు హిందువులు, ఈ కుక్కలతోనే
ప్రాబ్లమ్! చదివి కదా మాట్లాడాలి. నువ్వెవరో నాకు తెలీదు, మీ నాన్న
గురించి నేను కామెడీ చేయవచ్చా? నీ గురించి కామెంట్ చేయవచ్చా?
కాబట్టి 'అన్ని ఒక్కటే' అనే అడ్డగాడిదలు చదివి మాట్లాడండి.”
చాలా క్లియర్గా మనకొక పాట సంకరం చేశాడు గాంధీ. ఏంటది?
అది “రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం. 'ఆ తర్వాత
ఏంటి? ఈశ్వర్ అల్లా తేరేనామ్ సబ్కో సన్మతి హే భగవాన్'. కానీ అది
వాస్తవానికి “గంగా తులసి సాలగ్రామ్. రఘుపతి రాఘవ రాజారాం” అది
ఒరిజినల్ పాట. మన గాంధీ దానిని సంకరణం చేసి, “ఈశ్వర్ అల్లా
తేరేనామ్” అన్నాడు. దాని మీనింగ్ (అర్థం) ఏంటి? "ఏ దేవుడైనా ఒకటే,
అల్లా అయితే ఏమిటి, ఈశ్వరుడయితే ఏమిటి?” కానీ ఈశ్వరుడయినా,
అల్లా అయినా ఒక్కటే అని ఎవడు చెబుతాడు. ఈశ్వరున్ని నమ్మినవాడు
చెబుతాడు. అల్లాను నమ్మినవాడు చెబుతాడా? జీసస్ నన్ను నమ్మినోడు
చెబుతాడా? చెప్పడు. జీసస్ ను నమ్మినోడు ఏమి చెబుతాడు “ఏసే మీ
బాసు, నమ్మకపోతే లాసు, ఇదే మేమిచ్చే క్లాసు" అని అంటాడు “పగిలిపోతది
గ్లాసు, వెధవ".
అందరూ ఏసీ (A/C) లోనే వెళతారా, అందరూ ఏసీ (A/C) నే
నమ్ముతారా? వాడికి ముసలమ్మ ఇష్టం, వీడికి శివుడు ఇష్టం, వాడికి రాముడు
ఇష్టం, వాడికి కృష్ణుడు ఇష్టం, వాడికి దుర్గమ్మ ఇష్టం, ఒకడికి వెంకటేశ్వర
స్వామి ఇష్టం. అందరూ బజ్జీలే తినాలి, కుదురుతుందా? అందరూ కారమే
తినాలి, కుదురుతుందా? అందరూ స్వీటే తినాలి, కుదురుద్దా? ఒక్కొక్కరికి
ఒక్కొక్క టేస్టు ఉంటది.
అందరు ఏసుప్రభువుకు మ్రొక్కాలి. మ్రొక్కకపోతే నరకానికి
పోతారు. ' అల్లాహు అక్బర్, ఇల్లిల్లా హు' ఏంటి దానర్థం 'అల్లాహ్ మాత్రమే
అద్వితీయుడు, ఆయనకంటే గొప్పోడు ఎవడూ లేడు. వాడు రోజుకు
ఐదుసార్లు చెబుతాడు 'అల్లాహ్ మాత్రమే దేవుడు' అని. వీడేమో 'ఏసే
దేవుడు!' అని చెబుతాడు. వీళ్లతో ఒప్పిస్తారా, “అన్ని మతాలు సమానమే”
అని, ఈ సిగ్గులేని గాడిదలు.
అందుకని ఈ దేశానికి ప్రమాదం ముస్లీమ్లు కాదు, క్రైస్తవులు
కాదు. ముసుగేసుకున్న దొంగలు హిందువులు. అన్నీ సమానమే అనే
దొంగలు. వీళ్ల కొంపల్లో టీవీ ఉంటది, ఫ్రిడ్జ్ ఉంటది, వాషింగ్ మెషీన్
ఉంటది. కానీ భగవద్గీత ఉండదు. ఎంతో ప్రమాదం ఈ దేశానికి (ఈ
హిందువులు).
హిందీలో చెబుతుంటా నేను "హిందూస్థాన్ కి శత్రు కిర్ణానీ
నహీ, పాకిస్తానీ నహీ, సిర్ఫ్ హిందూస్థానీ. ఉస్కో మార్తో సబ్ ఠీక్
హోజాతా హై”. మన బంగారం బాగోలేదు. మన బంగారం బాగాలేదు.
వాన్నెవనో అంటానికి వీళ్లేదు. అందువలన మన బంగారం సరి
చేసుకుందాం.
మనవాళ్లు ఏదైతే ఈ అజ్ఞానంలో వున్నారో, వీళ్లని గైడ్ చేద్దాం.
గాడిదలను (హిందువులను) గైడ్ చేసి, దారిలోకి తీసుకువద్దాం. అందరూ
చేత్తులెత్తి చెప్పండి “హరేకృష్ణ, హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. హరేరామ
హరేరామ, రామ రామ హరే హరే”. శివారామ్ దాస్ ఆశ్రమ్ భక్తబృంద్
జై, వల్లూరు బర్త్ బృంద్ కీ జై, పరందాస్ ఆశ్రమ్ భక్త బృంద్ కీ జై.
గోవిందా.... గో...వింద, గోవిందా.... గో... వింద! హరేకృష్ణ!! జై శ్రీరామ్!!!
హిందూ రక్షణా! హిందూ భక్షణా!!
‘భగవద్గీత'యే చదవనివాడు హిందూ రక్షకుడా?
హిందూ ధర్మమే తెలియనివారు హిందూ రక్షకులా?
హిందువులు నేడు కులాలుగా చీల్చబడి, అందులో హెచ్చుతగ్గు
కులములుగా వర్ణించబడియున్నారు అనుట అందరికీ తెలిసిన సత్యమే.
దేవుడు మనుషులందరినీ సమానముగా పుట్టించితే, కొందరు మనుషులు
తమ స్వార్థ బుద్ధితో హిందూ (ఇందూ) సమాజమును ముక్కలు ముక్కలుగా
చీల్చి బలహీనపరచి హిందూసమాజమునకంతటికీ తామే గొప్పవారమనీ,
తాము చెప్పినట్లే అందరూ విని అన్ని కార్యములు చేసుకోవాలని ప్రచారము
చేసుకొన్నారు. ఎన్నో కులములుగా యున్న హిందూ సమాజములో తమ
కులమే అగ్రకులమని చెప్పుకోవడమే కాకుండా, ఇతర కులముల వారందరికీ
తామే మార్గదర్శకులమనీ, గురువులమనీ ప్రకటించుకొన్నారు. భవిష్యత్తులో
తమకు ఎవరూ అడ్డురాకుండునట్లు, అన్ని కులములను అంటరాని
కులములను చేసి, హిందూ సమాజమునకు తీరని అన్యాయము చేశారు.
అంతటితో ఆగక నేటికినీ హిందూ సమాజ రక్షకులుగా చెప్పుకొనుచూ,
హిందూ సమాజమును సర్వనాశనము చేయుచూ, హిందూ సమాజము
ఇతర మతములుగా మారిపోవుటకు మొదటి కారకులగుచున్నారు.
అటువంటివారు హిందూ సమాజమునకు చీడ పురుగులుగాయున్నా,
మిగతా కులముల వారందరూ వారి నిజ స్వరూపమును తెలియక, వారు
చెప్పినట్లే వినుట వలన హిందూ సమాజమును పూర్తిగా అజ్ఞాన దిశవైపుకు,
అధర్మ మార్గమువైపుకు మళ్ళించి, ప్రజలకు ఏమాత్రము దైవజ్ఞానమును
తెలియకుండా చేసి, తాము చెప్పునదే దైవబోధయని నమ్మించారు.
అటువంటి స్థితిలో నేడు త్రైతసిద్ధాంతకర్తగా శ్రీ ఆచార్య ప్రబోధానంద
యోగీశ్వరులవారు అజ్ఞాన దిశవైపు నిలిచి పోయిన హిందూసమాజమును
సరియైన దారిలో పెట్టుటకు, భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తి యోగమను
అధ్యాయమున బోధింపబడిన క్షర, అక్షర, పురుషోత్తమ అను ముగ్గురు
పురుషుల సమాచారమును "త్రైత సిద్ధాంతము” అను పేరుతో
ప్రతిపాదించి దైవజ్ఞానమును అందరికీ అర్థమగులాగున గ్రంథరూపములో
వ్రాయడము, బోధించడము జరుగుచున్నది. దానివలన నేడు ప్రజలు
అసలైన జ్ఞానము తెలియుచున్నదని సంతోషపడుచున్నారు. అగ్రకులముగా
నున్న వారిలో కూడా ఎందరో తమ అజ్ఞాన చీకటులను వదలి, ఇంతవరకూ
తమకు తెలియని జ్ఞానము యోగీశ్వరుల ద్వారా ఇప్పుడు తెలియుచున్నదని
సంతోషపడి శిష్యులుగా చేరిపోవుచున్నారు. అయితే అగ్రకులములో
కొందరు మాత్రము యోగీశ్వరులు తెలియజేయు జ్ఞాన విషయములను
చూచి ఈ జ్ఞానము వలన ప్రజలు జ్ఞానములో చైతన్యులై, జ్ఞానము తెలియని
తమను గౌరవించరని భావించి, దానివలన సమాజము మీద తమ
ఆధిపత్యము లేకుండా పోవునని తలచి, యోగీశ్వరులు తెలుపుచున్న త్రైత
సిద్ధాంతము గానీ, త్రైత సిద్ధాంత భగవద్గీతగానీ హిందువుల జ్ఞానమే కాదనీ,
అది క్రైస్థవ మతమునకు సంబంధించినదనీ, దానిని ఎవరూ చదవకూడదనీ
ప్రచారము చేయను మొదలుపెట్టారు. అంతేకాక తాము హిందూ ధర్మ
రక్షకులమని, కొంత రాజకీయరంగు పూసుకొని, మా జ్ఞాన ప్రచారము
నకు అక్కడక్కడ అడ్డుపడడము జరుగుచున్నది. తమ మాట విను ఇతర
కులముల వారికి కూడా ప్రబోధానందయోగీశ్వరులు చెప్పు జ్ఞానము హిందూ
జ్ఞానము కాదు, క్రైస్థవుల జ్ఞానమనీ హిందువుల ముసుగులో క్రైస్తవ మత
ప్రచారము చేయుచున్నారని చెప్పడమేకాక, అటువంటివారిని ప్రేరేపించి
మా ప్రచారమునకు అడ్డు తగులునట్లు చేయుచున్నారు.
యోగీశ్వరుల వారు నెలకొల్పిన హిందూ (ఇందూ) జ్ఞాన వేదిక
ఇటువంటి ఆగడాలను కొంతకాలముగా ఓర్పుతో చూడడము జరిగినది.
మాలో ఓర్పు నశించి, మమ్ములను అన్యమత ప్రచారకులుగా వర్ణించి చెప్పు
అగ్రకులము వారిని, వారి అనుచరులను మేము ఎదురుదిరిగి ప్రశ్నించడము
జరిగినది. మేము ప్రశ్నించిన ఒక్క ప్రశ్నకు కూడా వారు సరియైన
సమాధానము ఇవ్వలేదు. ఆ జవాబులు ఎలా ఉన్నాయో పాఠకులుగా
మీరే చూడండి.
మా ప్రశ్న :- ఇంతవరకు ఏ హిందువూ చేయని విధముగా ఊరూరు
తిరిగి, ఊరులో ఇల్లిల్లూ తిరిగి హిందూ ధర్మములను ప్రచారము
చేయుచున్నాము కదా! అటువంటి మమ్ములను మీరు అన్యమత
ప్రచారకులుగా ఎందుకు చెప్పుచున్నారు?
వారి జవాబు :- హిందూమతములో ఎందరో స్వామీజీలు ఉన్నారు. వారు
ఎవరూ ఇల్లిల్లూ తిరిగి ప్రచారము చేయలేదు. హిందువులు అట్లు ఎవరూ
ప్రచారము చేయరు. క్రైస్థవులయితేనే బజారు బజారు, ఇల్లిల్లూ తిరిగి
ప్రచారము చేస్తారు. మీరు హిందువుల ముసుగులో ఇల్లిల్లూ తిరిగి
క్రైస్థవమును ప్రచారము చేయుచున్నారు.
మా ప్రశ్న :- మేము క్రైస్థవులమయితే భగవద్గీతను ఎందుకు ప్రచారము
చేస్తాము?
వారి జవాబు :- మీరు ప్రచారము చేయునది 'త్రైత సిద్ధాంత భగవద్గీత'.
అది క్రైస్థవులది. బైబిలుకే మీరు అలా పేరు పెట్టారు.
మా ప్రశ్న :- క్రైస్థవులు తమను క్రైస్తవులుగానే చెప్పుకుంటారు. అలాగే
బైబిలును బైబిలుగానే చెప్పుకొంటారు. వారి ప్రచారము క్రైస్థవము, బైబిలు
అయినప్పుడు అదే పేరుమీద ప్రచారము చేస్తారు తప్ప, హిందువులుగా
భగవద్గీత పేరుతో ఎందుకు ప్రచారము చేస్తారు? ఇంతవరకు అట్లు ఎక్కడా
జరుగలేదు. ఏ మతమువారు ఆ మతము పేరు చెప్పుకొంటారు గానీ
ఇతర మతము పేరు చెప్పరు. అంతెందుకు మీరు మా భగవద్గీతను తెరచి
చూచారా? అందులో భగవద్గీత శ్లోకములున్నాయా? బైబిలు వాక్యము
లున్నాయా?
వారి జవాబు :- త్రైత సిద్ధాంతమని యున్నది కదా! త్రైతము అంటే త్రిత్వము
అని త్రినిటి అని మాకు బాగా తెలుసు.
మా ప్రశ్న :- హిందూ ధర్మములలో అద్వైత సిద్ధాంతమును ఆదిశంకరా
చార్యుడు ప్రతిపాదించాడు. విశిష్టాద్వైతమును రామానుజాచార్యులు
ప్రతిపాదించాడు, ద్వైతమును మధ్వాచార్యులు ప్రకటించాడు. ఇప్పుడు
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు 'త్రైత సిద్ధాంతము'ను ప్రతి
పాదించాడు. సిద్ధాంతకర్తలు, సిద్ధాంతములు వేరయినా అందరూ హిందువు
లని మీరు ఎందుకు అనుకోలేదు?
వారి జవాబు :- మీ త్రైతసిద్ధాంత భగవద్గీతలో యజ్ఞములను చేయకూడదని
వ్రాశారు కదా! నిజముగా భగవద్గీతలో అలా లేదు కదా!
మా ప్రశ్న :- మీరు హిందువులలో ముఖ్యులుగా వుండి అంత మూర్ఖముగా
మాట్లాడితే ఎలా? ప్రపంచమునకంతటికీ ఒకే భగవద్గీత యుంటుంది గానీ,
మీ భగవద్గీత, మా భగవద్గీతయని వేరుగా ఉండదు. భగవద్గీతకు వివరము
ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా వారికి అర్థమయినట్లు చెప్పియుండవచ్చును
గానీ, అందరికీ భగవద్గీత మూల గ్రంథమొక్కటేనని గుర్తుంచుకోండి. త్రైత
సిద్ధాంత భగవద్గీత అన్నిటికంటే సరియైన భావముతో యున్నదనీ, చదివిన
జ్ఞానులందరూ పొగడుచూయుంటే, మీ కులములో ఎందరో ప్రశంసించు
చూయుంటే, మీకు కొందరికి మాత్రము వ్యతిరేఖముగా కనిపించిందనడము
అసూయతోనే అని మాకు అర్థమగుచున్నది. యజ్ఞములు చేయవద్దని
మేము ఎక్కడా చెప్పలేదు. యజ్ఞముల వలన పుణ్యము వస్తుంది, స్వర్గము
వస్తుంది అని చెప్పాము. యజ్ఞముల వలన మోక్షము రాదు, దేవుడు
తెలియడని చెప్పాము. అంతెందుకు మీరు మేము అన్ని కులములకంటే
స్వచ్ఛమయిన హిందువులమని చెప్పుకొంటున్నారు కదా! భగవద్గీతలో
చెప్పిన ఒక్క హిందూ ధర్మమును చెప్పండి.
వారి జవాబు :- అవన్నీ మాటలు వద్దు... మీరు హిందువులు కాదు.
మా ప్రశ్న :- మొండిగా మాట్లాడవద్దండి. మీరు అగ్రకులము వారమని
ఇష్టమొచ్చినట్లు మాట్లాడకండి. మేము హిందువులము కాము అనుటకు
ఆధారము ఏమైనా చూపగలరా? మా కథ అట్లుంచి మీరు సరియైన
హిందువులే అయితే భగవద్గీతలో విశ్వరూప సందర్శనయోగమను
అధ్యాయములో 48వ శ్లోకములోనూ, 53వ శ్లోకములోనూ భగవంతుడు
ఏమి చెప్పాడో మీరే చెప్పండి.
వారి జవాబు :– మేము ఇంతవరకు భగవద్గీత చదువలేదు. మీకు కావలసి
వస్తే సంపూర్ణానందస్వామితో చెప్పిస్తాము.
మా ప్రశ్న :- కనీసము భగవద్గీతను కూడా చదువని మీరు యోగీశ్వరులయిన
ప్రబోధానందస్వామిని దూషించడము మంచిదా? ఒక్క హిందూ ధర్మమును
కూడా తెలియని మీరు హిందూ ధర్మ రక్షకులమని చెప్పడము మంచిదా?
యోగీశ్వరుల వారు వ్రాసిన ఒక్క గ్రంథము కూడా చదువకుండా మేము
తప్ప పూజ్యులుగా, గురువులుగా ఎవరూ ఉండకూడదను అసూయతో
ఇలాగ మాట్లాడితే దేవుడు ఓర్చుకోడని చెప్పుచున్నాము.
వారి జవాబు :- హిందూ మతములో ఎందరో దేవుళ్ళున్నారు. శివుడు
దేవుడే, శివుని కొడుకు గణపతి దేవుడే, రాముడు దేవుడే, రాముని సేవకుడు
ఆంజనేయుడు దేవుడే. అలాంటి హిందూ మతములో 'దేవుడు ఒక్కడే’
అని చెప్పడము మీది తప్పు కాదా?
మా మాట :- మేము మతమును గురించి చెప్పలేదు. హిందూ మతములో
ఎందరో దేవుళ్ళుండడము నిజమే, అయితే హిందూ జ్ఞానములో, హిందూ
ధర్మము ప్రకారము విశ్వమునకంతటికీ ఒకే దేవుడని చెప్పాము. భగవద్గీతలో
దేవుడు చెప్పినదే చెప్పాము తప్ప మేము దేవతలను గురించి లేరని చెప్పలేదే!
దేవతలకందరికీ అధిపతియైన దేవుడు ఒక్కడున్నాడని, ఆయనే దేవదేవుడనీ,
అతనిని ఆరాధించమని చెప్పాము.
వారి జవాబు :- మీరు రాముని పేరు చెప్పరు, శివుని పేరు చెప్పరు,
వినాయకుని పేరు చెప్పరు. ఎవరి పేరూ చెప్పకుండా దేవుడు అనీ,
'సృష్ఠికర్త’యనీ అనేకమార్లు పేర్కొన్నారు. 'దేవుడు' అను పదమునుగానీ,
'సృష్టికర్త' యను పదమునుగానీ క్రైస్థవులే వాడుతారు. హిందువులు వాడరు.
అందువలన మిమ్ములను హిందువులు కాదు క్రైస్థవులు అంటున్నాము.
మా ప్రశ్న :- క్రైస్థవ మతము పుట్టి రెండువేల సంవత్సరములయినది.
సృష్ఠిపుట్టి ఎన్ని కోట్ల సంవత్సరములయినదో ఎవరూ చెప్పలేరు. సృష్ట్యాది
నుండి 'సృష్ఠికర్త' అను పదమును 'దేవుడు' అను పదమును హిందూ
సమాజము వాడుతూనే యున్నది. మొదటి నుండి హిందూసమాజములో
యున్న దేవుడు, సృష్ఠికర్త అను పేర్లను హిందువులు క్రైస్తవులకేమయినా
లీజుకిచ్చారా? లేక పూర్తిగా వారికే అమ్మేశారా? అని అడుగుచున్నాము.
సృష్టికర్త అనిగానీ, దేవుడు అనిగానీ హిందువులయినవారు అనకూడదని
ఎక్కడయినా ఉన్నదా అని అడుగుచున్నాము?
వారి జవాబు :- మీరు హిందూమతమును కాకుండా అన్యమతమును
బోధించుచున్నారనుటకు, మిమ్ములను మీరు హిందువులుగా చెప్పుకో
లేదు. హిందువులుగా కాకుండా ఇందువులుగా చెప్పుకొంటున్నారు.
అటువంటప్పుడు మీరు హిందూమతమును చీల్చినట్లు కాదా! ప్రత్యేకించి
'ఇందూ మతము' అను దానిని ప్రచారము చేసినట్లు కాదా! మీరు హిందువులే
అయినప్పుడు మీ గ్రంథములలోగానీ, మీ బోధలలో గానీ ప్రత్యేకించి
'ఇందువులు' అని ఎందుకు చెప్పుచున్నారు?
మా మాట :- మేము సూటిగా ఒక ప్రశ్నను అడుగుతాము జవాబు చెప్పండి.
'హిందువు, ఇందువు' అను పదములో కొద్దిపాటి శబ్దము తప్ప ఏమి
తేడాయుందో మీరే చెప్పండి. తెలుగు భాషను వ్రాసే వారందరూ
హిరణ్యకశ్యపున్ని చంపినది నరశింహస్వామి అని చెప్పుచుందురు, అలాగే
వ్రాయుచుందురు. ప్రస్తుత కాలములో నరశింహులు అని పేరున్నవాడు
కూడా వాని పేరును నరశింహులు అని వ్రాయడము అందరికీ తెలుసు.
అయితే ఆ మాట తప్పు అలా వ్రాయకూడదు దానిని నరసింహ అని
వ్రాయవలెను అని చెప్పుచున్నాము. అడవిలో మృగరాజును సింహము
అని అంటాము తప్ప శింహము అని అనము అని కూడా చెప్పుచున్నాము.
'సింహము' అంటే అర్థమున్నది గానీ, 'శింహము' అంటే అర్థము లేదు
అని కూడా చెప్పాము. అలా ఉన్నది ఉన్నట్లు చెప్పితే 'ఇందువు' అనే
దానికి అర్థమున్నదిగానీ 'హిందువు' అనే దానికి అర్థములేదు అని చెప్పాము.
సృష్ట్యాదిలో పుట్టినది ఇందూ సమాజమనీ, అది మధ్యలో పేరుమారి దృష్ఠి
జిష్ఠి అయినట్లు, ‘ఇందూ' అను శబ్ధము 'హిందూ' అని పలుకబడుచున్నదని
చెప్పాము. 'ఇందూ' పదము ఎందుకు వాడాలి, 'హిందూ' పదమును
ఎందుకు వాడకూడదని కూడా వివరముగా మా గ్రంథములలో గలదు.
ఉన్న సత్యము మీకు తెలిసినా, మీరు మాకంటే పెద్ద ఎవరూ ఉండకూడదను
అసూయతో మాట్లాడుచున్నారు.
అగ్రకులములో ఎందరో పెద్దలు మా జ్ఞానమును తెలిసి
సంతోషించుచుండగా, కొందరు మాత్రము వీధి రౌడీలలాగా తంతాము,
పొడుస్తాము, కాలుస్తాము మీరు ప్రచారము చేయవద్దండని చెప్పడము
మంచిది కాదు. మా గ్రంథములు ఏదీ చదువకుండా మాట్లాడడమూ,
మేము చెప్పిన మాటలను వినకుండా ఇవన్నీ డ్రామాలు, నాటకాలు అనడము
మంచిది కాదు. మీరు ఎవరైనా మా గ్రంథములలో ఇతర మతములను
ప్రచారము చేసినట్లుగానీ, ఫలానా మతములోనికి చేరమని చెప్పినట్లుగానీ
ఉంటే నిరూపణ చేయండి, అలా నిరూపించినవారికి ఇందూ జ్ఞానవేదిక
తరపున పది లక్షల రూపాయలను ఇవ్వగలము. నిరూపించ లేకపోతే
మీరు లక్ష రూపాయలు ఏ ఊరిలోనయినా శ్రీకృష్ణుని గుడికి ఇవ్వవలెను.
ఈ షరతుకు ఎవరైనా ముందుకు వస్తారా? అని అడుగుచున్నాము.
ఇట్లు,
ఇందూ జ్ఞానవేదిక.
చరిత్రలో జరిగిన అన్యాయము.
హిందువులలో జరుగుచున్న యదార్థము.
నాలుగువందల సంవత్సరముల క్రిందట ఆధ్యాత్మిక రంగములో
మెరిసిన వజ్రము వేమనయోగి. ఆధ్యాత్మికమను పాలను చిలికి, దైవజ్ఞానము
అనే వెన్నను తీసి ఇచ్చినవాడు వేమన. వేమన తన పద్యములలో చెప్పిన
ఒక్కొక్క జ్ఞాన విషయము విపులముగా వ్రాసుకొంటే ఒక్కొక్క గ్రంథము
కాగలదు. వేమన స్వచ్ఛమైన తెలుగు భాషలో పద్యమును వ్రాసి చెప్పాడు.
సంస్కృతము జోలికి పోలేదు. ఒక ప్రక్క పద్యములు వ్రాసి కవిగా
కనిపించినా, ఒక ప్రక్క అంతు తెలియని ఆధ్యాత్మికవేత్త వేమనయోగి.
అయితే ఆయన పుట్టినది రెడ్డి కులమున. చరిత్రలో మాకంటే ఎవరూ
పెద్దగా ప్రశంసింపబడకూడదనే గర్వములో యున్న అగ్రకులములోని కొందరు
పనిగట్టుకొని వేమన యోగిని పిచ్చివానిగా జమకట్టి, అతను చెప్పింది
జ్ఞానమేకాదని ప్రజలలో ప్రచారము చేశారు. పిచ్చివాని మాటలు పిచ్చివారే
వింటారు అని హేళనగా మాట్లాడడము జరిగినది. అనేక కులములుగా
యున్న హిందువులకు జ్ఞాన విషయములో పరిచయము లేనిదానివలన,
అగ్రకులము వారు వేమన చెప్పినది జ్ఞానమే కాదనడము వలన, వేమన
తన జ్ఞానమునకు తగినట్లుగా ప్రకాశింప లేకపోయాడు. తాము
అగ్రకులమువారమనీ, మిగతా వారందరూ తగ్గు కులమువారనీ విభజించి,
తాము చెప్పినట్లు వినవలెననీ, అట్లు వింటేనే మిగతా కులముల వారందరూ
సుఖముగా బ్రతుకగలరనీ, అగ్రకులమువారు ప్రచారము చేసుకొన్నారు.
అలా తమను తాము గొప్పగా ప్రకటించుకోవడమేకాక హిందువుల ఇళ్ళలో
జరుగు ప్రతి మంచి పనికీ, చెడు పనికీ, చావుకూ పుట్టుకకూ, పెళ్ళికీ
పేరంటానికీ ప్రతి కార్యమునకూ తాము చెప్పునట్లు చేయాలనీ, తాము
నిర్ణయించు కాలములోనే చేయాలనీ, అట్లు చేయకపోతే నష్టము, కష్టము
కలుగుతుందని భయపెట్టడము వలన, భయముతో జ్ఞానము తెలియని
మిగతా కులముల వారందరూ వారు చెప్పిన దానిని నమ్మడము జరిగినది.
ఈ విధముగా హిందూమతములో అగ్రకులము వారు 'భయము' అను
బ్లాక్మెయిల్ చేసి, తగ్గు కులము వారందరినీ తమమాట వినునట్లు
చేసుకొన్నారు. ఆనాటినుండి హిందూ సమాజమును మోసము చేస్తూ,
ఎవరికీ హిందూ జ్ఞానమును తెలియకుండా చేసి, తాము హిందూ
సమాజమును అనేక పేర్లతో దోచుకొంటూ బ్రతకడమే కాక, మిగతా
కులములలో ఎవరు జ్ఞానులుగా పుట్టినా, వారిని హేళన చేయడమూ,
అజ్ఞానిగా వర్ణించడమూ జరిగినది.
చరిత్రలో నాలుగు వందల సంవత్సరముల క్రితము వచ్చిన
వేమనను పిచ్చివానిగా వర్ణించి, శాస్త్రము తెలియనివాడని వర్ణించారు.
తర్వాత మూడు వందలయాభై సంవత్సరముల క్రిందట వచ్చిన పోతులూరు
వీరబ్రహ్మముగారు గొప్ప జ్ఞానిగా తయారై, భవిష్యత్తు కాలములో జరుగు
సంఘటనలను ముందే తెలియజేసి గొప్ప కాలజ్ఞానమునే వ్రాశాడు. ఆయన
వ్రాసిన భవిష్యత్తు కాలక్రమమున నేటికినీ జరుగుచునేయున్నది. అంతటి
గొప్ప జ్ఞాని అయిన వీరబ్రహ్మముగారు అగ్రకులమువాడు కాకపోవుట వలన,
విశ్వకర్మ (ఆచారుల) కులమున పుట్టుట వలన, అగ్రకులము వారు బ్రహ్మము
గారు బ్రతికియున్న కాలములోనే, తమ ఊరిలోనికి రాకుండా, ఆయన
జ్ఞానమును ప్రచారము చేయకుండా అడ్డుకొన్నారు. ఆ రోజు ఇతరులు
జ్ఞానులు కాకూడదను అసూయ అను గుణముతోనూ, మేమే తెలిసిన
వారమను గర్వముతోనూ ఆ పని చేశారు. హిందూ సమాజములో
ఇటువంటి వారుండుట వలన విసిగిపోయిన హిందువులు హిందూ
మతమును వీడి ఇతర మతములలోనికి పోవుచున్నారు. ఇందూమతములో
దేవునికి గుడికి అంటరాని వారిగా ఉండలేని వారందరూ కొందరు జ్ఞానము
కొరకు, కొందరు కులవివక్ష లేని స్వతంత్రము కొరకు మతమును
మారజొచ్చారు. ఈ విధముగా హిందూమతములోని వారు ఇతర మతముల
లోనికి పోవుటకు మొదటి కారకులు హిందూమతములోని అగ్రకులముల
వారేనని అనుమానము లేకుండా చెప్పవచ్చును.
తమ వలననే హిందువులు ఇతర మతములలోనికి పోవుచున్నారని
అగ్రకులమువారికి కూడా తెలుసు. అయితే తమ తప్పును ఎవరూ
గుర్తించనట్లు తాము హిందూమతమును ఉద్ధరించువారిగా, హిందూధర్మ
రక్షకులుగా వర్ణించుకొని హిందూ ధర్మ భక్షకులుగా నేటికినీ సమాజములో
కొనసాగుచున్నారు. వారిని హిందూ ధర్మ భక్షకులు, హిందూ ధర్మ నాశకులు
అని చెప్పుటకు అనేక ఆధారములు గలవు. అటువంటి వాటిని పరిశీలించితే,
హిందువులలోని మిగతా కులములవారివద్ద భగవద్గీతను బోధించు కృష్ణుడు
అర్జునుడు యున్న చిత్రపటము (ఫోటో) యుంటే దానిని ఇంటిలో ఉంచు
కోకూడదనీ, ఆ పటము ఇంటిలో ఉంటే ఇంటిలో కూడా యుద్ధాలు
వస్తాయనీ, అనేక కష్టాలు వచ్చి పాండవులు అరణ్యవాసము పోయినట్లు
బాధపడవలసి వస్తుందనీ అగ్రకులమువారు నేటికినీ చెప్పుచూనే యున్నారు.
అటువంటి భగవద్గీత ఫోటోలను గుడులలో ఉంచవలెననీ లేకపోతే ఏటిలోని
నదీ ప్రవాహములో పారవేయాలని చెప్పడము, చేయించడము కూడా
జరిగినది. అంతేకాక భగవద్గీతను ఇంటిలో ఉంచుకోకూడదనీ, భగవద్గీతను
ఎవరూ చదువకూడదనీ, చదివితే కష్టాలు వస్తాయనీ, భగవద్గీతను ఎవరి
ఇంటిలోనూ లేకుండునట్లు చేయుచున్నారు. భగవద్గీత అర్జునునికి యుద్ధ
రంగములో యుద్ధము చేయుటకు చెప్పినది, అందువలన చదువకూడదు,
చదివితే చదివినవారు కూడా అనేక తగాదాల లోనూ, కోర్టు వ్యవహారముల
లోనూ చిక్కుకోవలసి వస్తుందని చెప్పడము జరుగుచున్నది. ఇంకనూ
హిందువులకు వేదములు ముఖ్యమైనవనీ, వాటిని అన్ని కులముల వారు
చదువకూడదని, వేదములను తామే చదువవలెననీ చెప్పడము కూడా
జరుగుచున్నది. ఈ విధముగా భగవద్గీతకు వ్యతిరేఖముగా మాట్లాడు
వారు హిందూ సమాజమునకు చీడపురుగులుకాక ఏమవుతారో మీరే
ఆలోచించండి!
ఇదంతయూ గతములో జరిగిన విషయములు, అవి చాలక ప్రస్తుత
కాలములో వీరి 'ఓర్వలేనితనము, మేమే పెద్ద' అను గర్వము ఎలాగుందో
చూడండి. వేమనయోగిని, పోతులూరి వీరబ్రహ్మముగారిని అగ్రకులము
వారు ఎంత హేళన చేసినా వేమనయోగిని రెడ్డి కులస్థులు వేమారెడ్లుగా
గుర్రముల నెక్కి ప్రచారము చేయుట వలన, వీరబ్రహ్మముగారిని విశ్వకర్మ
(ఆచారి) కులమువారు కాలజ్ఞానమును ప్రచారము చేయుట వలన, వేమన
సంఘములు, విశ్వకర్మ సంఘములు తయారై వేమనను, బ్రహ్మముగారిని
ప్రచారము చేయుట వలన, కొంతమంది ప్రజలకు వేమనయోగి పద్యములు,
వీరబ్రహ్మము గారి కాలజ్ఞానము కొంతవరకు తెలియును. వేమనయోగి
ఆ కాలములోనే తన పద్యములలో అగ్రకులమువారు చేయు తప్పులను
ఎండబెట్టడము జరిగినది. వీరబ్రహ్మముగారి చరిత్రలో కూడా బ్రహ్మము
గారికి అగ్రకులము వారు చేసిన ఆటంకములను వ్రాయడము జరిగినది.
వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో "ప్రబోధాశ్రమము
ఉన్నతమైన జ్ఞానముకలది” అని మూడువందల యాభై సంవత్సరము
లప్పుడే వ్రాసియుంచాడు. కాలజ్ఞానములో ప్రబోధాశ్రమము యొక్క
పేరుండడము ఈ మధ్యన ఆరు సంవత్సరముల క్రితము మాకు తెలిసినది.
తర్వాత బ్రహ్మముగారు వ్రాసిన కాలజ్ఞానములో ప్రబోధాశ్రమమునకు,
ప్రబోధానంద యోగీశ్వరులకు సంబంధించిన చాలా విషయములు వ్రాసినట్లు
తెలిసినది. ఎంతో గొప్ప జ్ఞాని, కాలజ్ఞాని అయిన పోతులూరి వీరబ్రహ్మము
గారు ప్రబోధాశ్రమాధిపతియైన ప్రబోధానందయోగీశ్వరుల వారిని గొప్పగా
చెప్పుచూ “ప్రబోధాశ్రమమువారు శయనాధిపతి గుణములు
కల్గియున్నారు. శయనాధిపతియే ఆనందగురువు. ఆనంద
గురువే నాకు గురువు, మీకు గురువు" అని వ్రాయడము జరిగినది.
ప్రబోధానందయోగీశ్వరుల జ్ఞానమేమిటో, ఎంత శక్తివంతమైనదో జ్ఞాన
జిజ్ఞాసులకు కూడా తెలియుచున్నది. ఎందరో జ్ఞానులయిన వారు
యోగీశ్వరులు చెప్పుచున్న జ్ఞానము ఎంతో గొప్పదని ప్రశంసించుచున్నారు.
బ్రహ్మముగారే స్వయముగా 'తన గురువు'గా చెప్పుకొన్న వ్యక్తి ఎంతటి
వాడయివుంటాడో మనము కూడా ఆలోచించ వలసియున్నది. అయినా
ప్రబోధానందయోగీశ్వరులవారు ఒక్క దైవ జ్ఞానములో తప్ప మిగతా
అన్నిటిలో సాధారణ వ్యక్తిగానే కనిపిస్తాడు. ఎదురుగా చూస్తే ఇతనికి
జ్ఞానము తెలియునా! అన్నట్లు కనిపించినా, అవును ఆయన ఎవరికీ
తెలియని గొప్పవాడే అన్నట్లు ఆయన వ్రాసిన గ్రంథములే గొప్ప శక్తులుగా
నిరూపించుకొన్నాయి. ఒక గ్రంథము దగ్గరకు వస్తూనే కొందరిలో మార్పు
కనిపించడమూ, కొందరు గ్రంథమును చదివిన వెంటనే అంతవరకు
నయముగాని రోగములు పోవడము జరుగుచున్నది.
పైకి కనిపించని శక్తి యోగీశ్వరులలో నిక్షిప్తమైయుండుట బయటికి
కనిపించకపోయినా ఆయన చెంతకు పోయినవారికి దేహములో నయము
కాని, మందులులేని ఎయిడ్స్, క్యాన్సర్, డెంగీ జ్వరములు సహితము
శాంతించి పోవడము జరుగుచుండుట వలన యోగీశ్వరులు ఎంతటివారో
ఎవరికయినా సులభముగా అర్థమయిపోగలదు.
వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో "ఆనంద యోగిని
దూషించిన వారు చాలా ఇబ్బందుల పాలవుతారని” వ్రాయడము
జరిగినది. అలాగే ఆయనను గానీ, ఆయన గ్రంథములనుగానీ దూషించిన
వారు ఇంతవరకు ఎవరూ సురక్షితముగా లేరు. తెలియని రోగములతో,
అర్థముకాని బాధలతో కొందరుండగా, కొందరు చిత్రహింసలపాలై
చనిపోవడము జరిగినది. అలా ఎందుకు జరుగుచున్నదో తెలియనివారు,
పాపమును మూటగట్టుకొనుటకు యోగీశ్వరులవారి జ్ఞానమునకు
అక్కడక్కడ ఆటంకములను కలుగజేయుచున్నారు. హిందూమతములో
ఆది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించాడు. తర్వాత
కొంత కాలమునకు విశిష్టాద్వైత సిద్ధాంతమును రామానుజాచార్యులు ప్రతి
పాదించాడు. మరికొంత కాలమునకు ద్వైత సిద్ధాంతమును మధ్వాచార్యులు
ప్రకటించాడు. వీరు ముగ్గురూ అగ్రకులము వారు కావడము విశేషము.
గత ముఫ్ఫైతొమ్మిది సంవత్సరముల నుండి "త్రైత సిద్ధాంతము”ను ఆచార్య
ప్రబోధానంద యోగీశ్వరులవారు, ప్రకటించి ఆ సిద్ధాంతమునే ప్రచారము
చేయుచూ త్రైత సిద్ధాంతము ప్రకారము భగవద్గీతను వివరించి వ్రాయడము
జరిగినది. హిందూమతములోని సిద్ధాంతముల వివరము తెలియని
ప్రజలకు, అగ్రకులమువారు "త్రైతము అంటే క్రైస్తవులకు సంబంధించినదనీ,
త్రైత సిద్ధాంత భగవద్గీతయని పైకి చెప్పుచూ లోలోపల క్రైస్తవ మతమును
బోధించుచున్నారని” యోగీశ్వరులకు, యోగీశ్వరుల జ్ఞానమునకు
వ్యతిరేఖముగా చెప్పడము జరిగినది. హిందుత్వమును ఒక వైపు సర్వ
నాశనము చేయుచున్న అగ్రకులములవారు హిందూమతమును కాపాడువారి
వలె నటించుచూ, యోగీశ్వరుల జ్ఞానమునకు కొన్నిచోట్ల ఆటంకము
కల్గించడము జరిగినది. మూడుచోట్ల అన్యమతప్రచారమని, భగవద్గీతను
ప్రచారము చేయు యోగీశ్వరులు శిష్యుల మీద కేసులు పెట్టడము కూడా
జరిగినది. కొన్నిచోట్ల ప్రత్యక్ష దాడులకు దిగడము జరిగినది. అయినా
ప్రబోధానంద శిష్యులు అన్నిటికీ ఓర్పు వహించి జ్ఞానప్రచారము చేయు
చున్నారు. ఈ మధ్యకాలములో నల్గొండ జిల్లా భువనగిరిలో దేవేంద్ర అను
మా సంఘ సభ్యునిమీద అన్యమత ప్రచారము చేయుచున్నాడని ఆరోపించి
కేసు పెట్టడము జరిగినది. అంతేకాకుండా మా ప్రచార వాహనము
భువనగిరిలోనికి పోయినప్పుడు మా ఊరిలో ప్రచారము చేయవద్దని అడ్డుపడి
పంపించడము జరిగినది. కరీంనగర్లో గోడమీద "త్రైత సిద్ధాంత
భగవద్గీతను చదవండి” అని వ్రాస్తే, అగ్రకులము వారువచ్చి ఇది క్రైస్తవ
మతప్రచారము దానిని తుడిపివేయమని చెప్పడము జరిగినది. రెండు
రోజుల క్రిందట ఆర్లగడ్డలో ప్రచార వాహనముండగా అక్కడికి ఒక అగ్ర
కులస్థుడు వచ్చి ఇది క్రైస్తవ ప్రచారము, ఈ ప్రచారమును నిలిపివేయండని
ఘర్షణపడగా ఆ సమయానికి మా గ్రంథములు చదివిన వారు అక్కడుండుట
వలన వారే అగ్రకులమువారికి బుద్ధిచెప్పి పంపడము జరిగినది. అక్కడున్న
ప్రజలు అనిన మాటలు "ఇది ఎంతో గొప్ప జ్ఞానము. ఇంతకాలానికి
గొప్ప జ్ఞానము దొరికిందని మేము సంతోషపడుచుంటే, సమాజాన్ని సర్వ
నాశనము చేసిన మీరు దీనిని జ్ఞానము కాదంటారా? ఇట్లే మాట్లాడితే
ఊరిలో లేకుండా మిమ్ములను మేమే పంపుతాము” అని అనడము జరిగినది.
ఈ విధముగా ప్రజలే తిరగబడి బుద్ధిచెప్పు సమయము అన్నిచోట్లా వస్తుంది.
గౌతమబుద్ధుడు జ్ఞానము చెప్పితే అతను అగ్రకులమువాడు కాదని,
ఆయనది వేరు మతమని ప్రచారము చేశారు. ఆ దినము గౌతముడు
హిందువే కదా! తమ ఆధిపత్యము కొరకు హిందూమతమునుండి బుద్ధున్ని
చీల్చి అతనిది బౌద్ధమతమని చెప్పి హిందూమతమునుండి వేరు చేశారు.
ఈ దినము బౌద్ధమతము విదేశాలలో వ్యాపించియున్నా స్వదేశములో
లేకుండా చేసినది అగ్రకులము వారు కాదా! ఈ దినము బుద్ధుడు మావాడే
బౌద్ధము హిందూమతమే అని చెప్పుకోలేని పరిస్థితి మనకు ఏర్పడినది.
అలాగే ప్రబోధానంద యోగీశ్వరులు చెప్పు త్రైత సిద్ధాంతమును హిందూ
మతములోని భాగము కాదనడమూ, త్రైత సిద్ధాంత భగవద్గీతను భగవద్గీతే
కాదనడమును ఒకవైపు ప్రజలు గమనిస్తున్నారు. ప్రబోధానంద యోగీశ్వరులు
గత 39 సంవత్సరములుగా బోధించుచున్న బోధ హిందుత్వములోనే ఎంతో
గొప్పదని అన్ని మతములవారు ఒప్పుకొనుచుండగా, తగ్గుకులము వారని
అగ్రకులముచే అనబడినవారందరూ హిందూ (ఇందూ) జ్ఞానమును తెలుసు
కొని చైతన్యవంతులై అగ్రకులమువారికి తిరగబడి జ్ఞానము చెప్పు స్థితికి
ఎదిగారు. తగ్గుకులము వారి మీద ఆధారపడి బ్రతుకుచున్న అగ్రకులము
వారిని తగ్గుకులము వారందరూ ఒక్కమారు వెలివేస్తే, మీతో మాకు
సంబంధము వద్దు అంటే ఏమవుతుందో చెప్పనవసరము లేదు. అటువంటి
స్థితి రాకుండుటకు మా జ్ఞానమునకు అడ్డురావద్దని అగ్రకులము వారికి
మరీమరీ చెప్పుచున్నాము.
ఇట్లు,
ప్రబోధ సేవాసమితి.
అసత్యమును వేయిమంది చెప్పినా, అది సత్యము కాదు,
సత్యమును వేయిమంది కాదనినా, అది అసత్యము కాదు.
సనాతనమైనది ఇందూ ధర్మము
శాశ్వితమైనది ఇందూ ధర్మము
దేవుడు ధర్మములను ఉద్దరిస్తాడు
మనిషి ధర్మములను తెలుసుకొంటాడు
దేవుడు ధర్మములను తెలుపుటకు దిగి వస్తాడు
మనిషి ధర్మములను తెలిస్తే ముక్తికి పోతాడు.
నీవు ఆది నుండి ఉన్నావు, కానీ నీకు తెలియదు.
ధర్మము ఆది నుండి ఉన్నది, కానీ నీకు తెలియదు.
నీవు సనాతనమైన వాడివే. కానీ నీకు తెలియదు.
ధర్మము సనాతనమైనదే, కానీ నీకు తెలియదు.
తెలియని దానిని తెలిస్తే తెలిసినవాడు ఉండడు.
ధర్మమును తెలిస్తే కర్మము అంతరించుతుంది.